SCERT AP 10th Class Social Study Material Pdf 21st Lesson సమకాలీన సామాజిక ఉద్యమాలు Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 21st Lesson సమకాలీన సామాజిక ఉద్యమాలు

10th Class Social Studies 21st Lesson సమకాలీన సామాజిక ఉద్యమాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
సామాజిక ఉద్యమాలపై ఒక పట్టిక తయారు చెయ్యటానికి ఇక్కడ కొన్ని అంశాలు ఉన్నాయి. వీటి ఆధారంగా పట్టిక తయారుచేసి వివిధ ఉద్యమాల మధ్య పోలికలు, తేడాలను గుర్తించండి.
ఉద్యమం దృష్టి పెట్టిన ప్రధాన అంశం; ఎక్కడ జరిగింది; ప్రధాన కోరికలు; నిరసన తెలియచేసిన పద్ధతులు; ముఖ్యమైన నాయకులు, ప్రభుత్వం స్పందించిన తీరు; సమాజంపై ఉండే ప్రభావం. (AS3)
జవాబు:

ప్రశ్న 2.
కన్నయ్య, రమ్య, సల్మా ఒక విషయాన్ని చర్చిస్తున్నారు. వాళ్ల కోరికలు వేరు. మానవ హక్కుల కోణం నుంచి మీరు ఎవరితో ఏకీభవిస్తారో పేర్కొని మీ కారణాలను తెలియచెయ్యండి.
ప్రజలు పేదరికంలో మగ్గకుండా చూడాలి, అందుకు అవసరమైతే పత్రికా స్వేచ్ఛను కొంతవరకు నియంత్రించినా ఫర్వాలేదని రమ్య అంటుంది. ఆహారం ఒక్కటే ఉంటే చాలదని, పత్రికా స్వేచ్ఛ కూడా ఉండటం ముఖ్యమని లేకపోతే దేశ వివిధ ప్రాంతాలలో మానవ హక్కులు ఎక్కడైనా ఉల్లంఘింపబడుతున్నాయేమో తెలిసే మార్గమే ఉండదన్నది సల్మా వాదన. పత్రికలు ధనికులు, శక్తిమంతుల చేతుల్లో ఉన్నప్పుడు ప్రయోజనం ఏమిటి, అవి సాధారణ ప్రజలకు సంబంధించిన అంశాలను ఎందుకు ప్రచురిస్తాయని కన్నయ్య అంటాడు. (AS2)
జవాబు:
నేను సల్మా వాదనతో ఏకీభవిస్తాను. ఎందుకనగా

  1. ప్రతివ్యక్తికి ఆహారం ముఖ్యమే, అయినా స్వేచ్ఛ కూడా ముఖ్యమే.
  2. పత్రికా స్వేచ్ఛ అనేది ప్రతి వ్యక్తికి అవసరమే. పత్రికా స్వేచ్ఛ అనగా, భావ ప్రకటన స్వేచ్ఛ. ఇది ఒక ప్రాథమిక హక్కు
  3. ప్రతీ వ్యక్తికి ప్రాథమిక హక్కులు అవసరం. ప్రజలకు ఆహారం ఒక్కటే ముఖ్యం కాదు. పత్రికా స్వేచ్ఛతో ప్రపంచం నలుమూలలా ఏం జరిగినా తెలుసుకోగలుగుతారు. అదే విధంగా మానవ హక్కులు ఎక్కడైనా ఉల్లంఘించ బడుతున్నాయేమో తెలుసుకోవచ్చు.
  4. ప్రపంచీకరణ జరుగుతున్న నేపథ్యంలో పత్రికా స్వేచ్ఛ చాలా అవసరం.
  5. సమాజంలో జరిగే విషయాలు తెలుసుకొని, పాల్గొనడానికి పత్రికా స్వేచ్ఛ ఉండాలి.
  6. మానవ హక్కులకు రక్షణ చాలా అవసరం.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

ప్రశ్న 3.
సామాజిక ఉద్యమాల మౌలిక అంశాలు ఏమిటి?
జవాబు:

  1. వివక్షతతో కూడిన చట్టాలను శాంతియుతంగా ఉల్లంఘించడం.
  2. ప్రజలకు స్వేచ్ఛాపూరిత, భావ ప్రకటన వంటివి.
  3. పర్యావరణ ఉద్యమాలలో – నష్టపరిహారం, పునరావాసం.
  4. సారా వ్యతిరేక ఉద్యమాలు.
  5. మైరా పైబీ ఉద్యమంలో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దుచేయాలని కోరటం జరిగింది.
  6. సామాజిక ఉద్యమాలన్నీ రాజకీయ పార్టీలకు దూరంగా ఉండి ఒక ఆశయం కోసం పనిచేస్తాయి.
  7. కొన్ని సందర్భాలలో తమపై రుద్దిన మార్పులను ఈ ఉద్యమాలు ప్రతిఘటించాయి.
  8. మార్టిన్ లూథర్ కింగ్, మైరా పైబీ వంటి కొన్ని ఉద్యమాలు మార్పును కోరుకున్నాయి.

ప్రశ్న 4.
పైన ఇచ్చిన ఉదాహరణలో సాధారణ ప్రజల పాత్రను ఎలా పేర్కొన్నారు?
జవాబు:

  1. సాధారణ ప్రజలు ముందుగా వారి సమస్యల పరిష్కారం కోసం ఆలోచిస్తారు.
  2. ప్రభావిత ప్రజలు, వారి సమస్యలను తీర్చే నాయకుల వద్ద వెలిబుచ్చుతారు.
  3. ప్రజలు, వారి అభిప్రాయాలను ప్రజా ప్రతినిధుల ద్వారా వినిపిస్తారు.
  4. ప్రజలు వారి నాయకులు ప్రారంభించిన ఉద్యమాలు, ఊరేగింపులు, ప్రదర్శనలు, పికెటింగ్ వంటి వాటిలో ఎంతో ఉత్సాహంతో పాల్గొంటారు.
  5. ఈ మధ్యకాలంలో ప్రజలు, ఇంటర్నెట్, సాంఘిక ప్రచార సాధనాల వల్ల చైతన్యవంతులవుతున్నారు. వారి సమస్యల సాధన కొరకు పోరాడుతున్నారు.
  6. ప్రస్తుత కాలంలో ప్రజలు వారి సమస్యలే కాకుండా సమాజ సమస్యలు అనగా పర్యావరణం, కాలుష్యం, పునరావాసం, నష్టపరిహారం వంటి సమస్యల పట్ల మరియు మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతున్న ప్రజలకు కూడా సహకారం అందిస్తూ, ఆయా ఉద్యమాలలో భాగస్వాములు అవుతున్నారు.
  7. సామాన్య ప్రజల సహకారం, భాగస్వామ్యం లేనిదే సాంఘిక ఉద్యమాలు విజయం సాధించలేవు.

ప్రశ్న 5.
అమెరికాలోని నల్లజాతీయులు, మైరా పైబీ ఉద్యమాల మధ్య పోలికలు, తేడాలు ఏమిటి? (AS1)
జవాబు:
అమెరికాలోని నల్లజాతీయులు, మైరా పైబీ ఉద్యమాల మధ్య ఉన్న తేడాలు :

అమెరికాలోని నల్లజాతీయులు మైరా పైబీ ఉద్యమం
1) ఉపాధి కల్పనకు కార్యక్రమాలు పూర్తి న్యాయమైన ఉపాధి. 1) సాయుధ ధళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చెయ్యాలని మైరా పైబీ ఉద్యమం కోరుతుంది.
2) మంచి గృహ వసతి. 2) మహిళలు మాత్రమే ఉద్యమంలో పాల్గొన్నారు.
3) స్త్రీ, పురుషులందరూ పాల్గొన్నారు. 3) ఎన్నికలను బహిష్కరించారు.
4) ఓటు హక్కు 4) వీరు కేవలం కిరోసితో తడిపి వెలిగించిన కాగడాలు మాత్రమే ఉపయోగించారు.
5) శ్వేతజాతి, నల్లజాతి పిల్లలు కలిసి చదువుకునే విద్యా సదుపాయాలు వంటివి నల్లజాతీయుల కోరికలు. 5) రాత్రిళ్లు కాపలా కాసేవారు.
6) ప్రదర్శనలు, నిరసనలు, ఊరేగింపుల ద్వారా ఉద్యమాన్ని నడిపారు.

పోలికలు:

అమెరికాలోని నల్లజాతీయులు మైరా పైబీ ఉద్యమం
1) పౌరహక్కుల చట్టాన్ని చేయవల్సిందిగా కోరారు. 1) మానవ హక్కుల ఉద్యమంగా మారింది.
2) తమను పట్టించుకొనుటలేదని మహిళలు భావించారు. 2) మహిళలు మాత్రమే ఉద్యమం చేశారు.
3) మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. 3) మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది.

ప్రశ్న 6.
ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక రాజకీయ వ్యవస్థలుగా ప్రజాస్వామ్యాలే ఉన్నాయి. ఇవి ప్రజల ఆకాంక్షలకు పూర్తి న్యాయం చేశాయా? ఈ అధ్యాయంలో ఇచ్చిన ఉదాహరణల ఆధారంగా ‘ప్రజాస్వామ్యం సామాజిక ఉద్యమాలు’ అన్న అంశంపై చిన్న వ్యాసం రాయండి. (AS4)
AP Board 10th Class Social Solutions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు 1
జవాబు:
“ప్రజాస్వామ్యం – సామాజిక ఉద్యమాలు” :
ప్రపంచంలో చాలా దేశాలలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలే ఉన్నాయి. ఇవి ప్రజల ఆకాంక్షలను పూర్తిగా న్యాయం చేయలేదనడానికి నిదర్శనమే సామాజిక ఉద్యమాలు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలే ప్రజలను వివక్షతతో చూస్తున్నాయి. కొందరికి మానవ హక్కులను – ఉల్లంఘిస్తున్నాయి, సామాజిక న్యాయాన్ని చేకూర్చుట లేదు.
ఉదా :
అమెరికా పౌరహక్కుల ఉద్యమం. (నల్లజాతి వారిని ప్రభుత్వం వివక్షతతో చూడడం) దక్షిణాఫ్రికాలోని జాతి వివక్షత చాలాకాలం సమాన హక్కులకు దూరంగా ఉన్నవారు సామాజిక ఉద్యమాలను లేవనెత్తుతారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత వలస పాలన నుండి అనేక దేశాలు స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్నాయి. ఇటువంటి దేశాల ప్రజలు వలస పాలనతో ఇబ్బందులను అనుభవించి, తమ కష్టాలను తీర్చే ప్రభుత్వాలను ఆశించారు. కాని ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ప్రజల ఆశలను పరిగణనలోకి తీసుకోకుండా అణుయుద్ధాలు చేశాయి. ఆయుధసమీకరణ చేసి, ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేశాయి. ప్రచ్ఛన్న యుద్ధం తరువాత అణ్వాయుధాలను నిషేదించినప్పటికి ప్రజలకు శాంతి, భద్రతలను కల్పించలేకపోయాయి. ఇటువంటి తరుణంలోనే ప్రజలు ప్రభుత్వాలను వ్యతిరేకించారు. అనేక ఉద్యమాలను లేవదీశారు. ముఖ్యంగా పర్యావరణ కాలుష్యం, సామాజిక న్యాయం కల్పించకపోవడం, వివక్షతను పాటించటం వంటి సమస్యలు ఉద్యమాలకు కారణాలని చెప్పవచ్చు. ఇటువంటి సమస్యల సాధనలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు విఫలం అయ్యాయని చెప్పవచ్చు.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

ప్రశ్న 7.
భోపాల్ గ్యాస్ దుర్ఘటన వంటి వాటి నేపథ్యంలో నిరసనలు, ఉద్యమాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ఎలా సమీకరిస్తారో తెలుసుకుని, చర్చించండి. (AS3)
జవాబు:
వివిధ ఉద్యమాలలో ప్రజలను వివిధ రకాలుగా సమీకరించుట జరిగింది. వాటిలో నుండి కొన్ని :
1) భోపాల్ గ్యాస్ దుర్ఘటన చాలా తీవ్రమైనది. ఇది భోపాల్ లోని యూనియన్ కార్బైడ్ కంపెనీ తరువాత దీనిని ‘డౌ’ కంపెనీకి అమ్మేశారు. ఏమీ తెలియని ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతుంటే ఒకరాత్రి కంపెనీ నుండి విషవాయువు వెలువడి వేలాదిమంది చనిపోయారు. దాని ప్రభావం వల్ల ఇప్పటికి వేలాది మంది బాధపడుతున్నారు. అయితే ఈ కంపెనీ బహుళజాతి కంపెనీ. ఇది అమెరికాలో ఉంది. ఈ దుర్ఘటనలో బాధితులకు సరైన నష్టపరిహారం, వైద్య సదుపాయాలు కల్పించలేదు. ఈ కంపెనీ మీద పోరాటానికి అంతర్జాతీయ చట్టాలను ఉపయోగిస్తున్నారు. లండన్ ఒలింపిక్స్ క్రీడలకు ‘ఔ’ కంపెనీ స్పోన్సరు చెయ్యటానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజల సంతకాలు సేకరిస్తున్నారు.

2) ‘నర్మదా బచావో’ ఉద్యమంలో నిర్వాసితులైన ప్రజలకోసం ఉద్యమ నాయకులు. ‘బావా మహలియా’, మేధాపాట్కర్ వంటి నాయకులు పోరాడుతూ ప్రజలను చైతన్యవంతులను చేసి ఉద్యమంలోకి భాగస్వాములను చేశారు. దీని కొరకు తీవ్ర నిరసనలు, ప్రదర్శనలు, నిరాహారదీక్షలు అంతర్జాతీయ ఉద్యమాల ద్వారా ప్రజలను సమీకరించారు.

3) కేరళలోని ‘సైలెంట్ వ్యాలీ’ ఉద్యమం విషయంలో అరుదైన జంతువులు, మొక్కలు అంతరించిపోతాయని అనేకమంది విద్యావంతులు గ్రహించారు. వీటి రక్షణ కొరకు పెద్ద ఉద్యమం ఏర్పడింది. ప్రజలలో విజ్ఞాన శాస్త్ర ప్రచారానికీ, విద్యకోసం పనిచేస్తున్న కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ (కెఎఎపి) రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను సమీకరించింది.

4) అమెరికా పౌరహక్కుల ఉద్యమంలో వివక్షతకు గురి అవుతున్న నల్లజాతీయులే ఈ ఉద్యమాన్ని లేవదీసారు.

5) యూరపులో గ్రీన్ పీస్ ఉద్యమంలో అణు పరీక్షలకు వ్యతిరేకంగా ఈ గ్రీన్ పీస్ ఉద్యమం ప్రారంభమైనది. దీనిలో స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఉద్యమం 40 దేశాలకు విస్తరించింది.

6) సారా వ్యతిరేక ఉద్యమంలో పేదవారు, ఈ సమస్యకు ప్రభావితమవుతున్నా మహిళలు పాల్గొన్నారు. ‘సాక్షరతా’ పుస్తకాల ద్వారా ఉద్యమ విషయాలు తెలుసుకుని అనేక గ్రామాలలోని మహిళలు ఈ ఉద్యమంలోకి వచ్చారు.

7) మైరా పైబీ ఉద్యమం తీసుకువచ్చింది మణిపూర్ మహిళలు. సాయుధ దళాలకు ఉన్న ప్రత్యేక అధికారాల చట్టం మూలంగా తరచు మానవహక్కుల ఉల్లంఘన జరుగుతుంది. మహిళలు లైంగిక వేధింపులకు గురి అవుతున్నారు. ఇందుకు నిరసనగా సాయుధ దళాలకు ప్రత్యేక అధికార చట్టాలను రద్దుచేయాలని మహిళలు స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొన్నారు.

8) ప్రస్తుత కాలంలో నిరసనలు, ఉద్యమాలకు ప్రజలను ఫేస్ బుక్, ట్విట్టర్, ఇ-మెయిల్, ఇంటర్నెట్, వార్తాపత్రికలు వంటి వాటి ద్వారా సమీకరిస్తున్నారు.

10th Class Social Studies 21st Lesson సమకాలీన సామాజిక ఉద్యమాలు InText Questions and Answers

10th Class Social Textbook Page No.300

ప్రశ్న 1.
గ్రీన్‌పీస్ ఉద్యమం వెబ్ సైట్ చూసి (http:/www.greenpeace.org/international) అది పనిచేస్తున్న అంశాల గురించి, ఎంచుకున్న పోరాట పద్ధతుల గురించి తెలుసుకోండి. ఈ ఉద్యమంపై ఉన్న చర్చలు, విమర్శల గురించి కూడా తెలుసుకోండి.
జవాబు:

10th Class Social Textbook Page No.302

ప్రశ్న 2.
పెంటగావ్ వద్ద కాపలా ఉన్న సైనికుడికి నిరసనకారులలోని ఒక మహిళ ఒక పువ్వు ఇస్తోంది. ఈ బొమ్మలోని భావనలను చర్చించండి.
AP Board 10th Class Social Solutions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు 2
జవాబు:
అమెరికా, వియత్నాంతో అన్యాయంగా యుద్ధం చేస్తుందనే భావన అమెరికా సైనికులలో, ప్రజలలో ఉంది. ఆ యుద్ధాన్ని నిరసిస్తూ ప్రజలు ఉద్యమం కూడా చేశారు. అయితే అమెరికా చేస్తున్న యుద్ధం పట్ల వ్యతిరేకత సైనికులలో గమనించిన, నిరసన తెలియజేయడానికి వచ్చిన వారిలో నుండి ఒక మహిళ ఆ సైనికుడిని అభినందిస్తూ ఒక పువ్వును ఇస్తుందని పై చిత్రం ద్వారా తెలుస్తుంది.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Textbook Page No.299

ప్రశ్న 3.
డా|| మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ దా! కింగ్ ఇచ్చిన ఈ ప్రఖ్యాత ఉపన్యాసాన్ని చదివి, అమెరికా సమాజానికి అతడు.. ఉంచిన ఆదర్శాల గురించి, వాటిని సాధించటానికి అతడు రూపొందించుకున్న ప్రణాళిక గురించి ఒక వ్యాసం రాయంది.
AP Board 10th Class Social Solutions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు 3
జవాబు:
ఉద్యమాలలో అమెరికాలోని పౌరహక్కుల ఉద్యమం చాలా ముఖ్యమైనది. ఈ ఉద్యమాన్ని డా|| మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ డా॥ కింగ్ ముందుకు నడిపించారు. అయితే ఈ ఉద్యమమనేది “పౌర నిరాకరణ” ధ్యేయంగా నడిచింది. (వివక్షతతో కూడిన చట్టాలను శాంతియుతంగా ఉల్లంఘించటం). డా॥ కింగ్ అమెరికా సమాజంపై ఉంచిన ఆదర్శాలు. పాఠశాలల్లో, బస్సుల్లో, బహిరంగ ప్రదేశాలలో నల్లజాతి వారిని వేరుగా ఉంచడానికి, ఉద్యోగాలలో, గృహవసతిలో, ఓటు హక్కులలో నల్లవారిని వివక్షతతో చూడకుండా వీరికి కూడా తెల్లవారితో సమానంగా హక్కులు కల్పించాలి.

ఒక సంవత్సరం పాటు డా॥ కింగ్ అధ్యక్షతన మాంటగోయెరిలో నల్లజాతీయులు బస్సులను బహిష్కరించారు. ఈయన పౌరహక్కుల చట్టాన్ని చేయాల్సిందిగా కోరారు. ఉపాధి కల్పనకు కార్యక్రమాలు పూర్తి న్యాయమైన ఉపాధి, మంచి గృహవసతి, ఓటు హక్కు శ్వేతజాతి, నల్లజాతి పిల్లలు కలిసి చదువుకునే సమ్మిళిత విద్యా సదుపాయాలు కావాలని కోరాడు. మనుషులను శరీర రంగును బట్టి కాకుండా వాళ్ల వ్యక్తిత్వ లక్షణాలను బట్టి అంచనావేసే దేశంగా అమెరికా మారాలని డా॥ కింగ్ తన ఉపన్యాసంలో తెలియచేశాడు.

10th Class Social Textbook Page No.300

ప్రశ్న 4.
పౌర హక్కుల ఉద్యమ కోరికల జాబితా తయారుచేసి, వాటికి మీరు సూచించే పరిష్కారాలు ఏమిటో రాయండి.
జవాబు:
పౌరహక్కుల ఉద్యమంలోని కోరికలు, వాటికి నేను సూచించే పరిష్కారాలు

పౌరహక్కుల ఉద్యమ కోరికలు పరిష్కార సూచనలు
1) ఉపాధి కల్పనకు కార్యక్రమాలు 1) ప్రభుత్వమే వివిధ పరిశ్రమలను స్థాపించాలి, సమానత్వాన్ని పాటించాలి.
2) పూర్తి న్యాయమైన ఉపాధి కల్పించడం. 2) తెల్లవారు, నల్లవారు అనే విచక్షణ చూపించకుండా అందరికీ సమాన ఉపాధి కల్పించాలి.
3) మంచి గృహవసతి 3) ప్రభుత్వం గృహవసతి కల్పించాలి. లేదా నల్లవారు ఇళ్లు కట్టుకోవడానికి సహాయం చేయాలి.
4) ఓటు హక్కు కల్పించాలి. 4) తెల్లవారితో సమానంగా నల్లవారందరికీ ఓటు హక్కు కల్పించాలి.
5) శ్వేతజాతి, నల్లజాతి పిల్లలు కలిసి చదువుకునే సమ్మిళిత విద్యా సదుపాయాలు. 5) నల్లవారు కూడా తెల్లవారితో కలిసి చదువుకునేలా చట్టాలు చేయాలి. వాటిని సక్రమంగా అమలుచేయాలి.
6) పౌర హక్కుల చట్టాన్ని చేయాలి. 6) పౌరహక్కుల ఉద్యమంలోని కోరికలు అమలు జరగాలంటే పౌరహక్కుల చట్టాన్ని చేయాలి, చట్టం అమలు కొరకు యంత్రాంగాన్ని కూడా నియమించాలి.

10th Class Social Textbook Page No.300

ప్రశ్న 5.
ప్రజాస్వామిక దేశమని అమెరికా చెప్పుకుంటుంది. కానీ గత శతాబ్దం మధ్యకాలం వరకు కొంతమంది ప్రజలను వేరుగా ఉంచింది. భారతదేశ నేపథ్యంలో ప్రజాస్వామ్య భావన అందరినీ కలుపుకునేలా ఎలా ఉండాలో చర్చించండి.
జవాబు:
భారతదేశ నేపధ్యంలోని ప్రజాస్వామ్యం వలె అమెరికాలో ప్రజాస్వామ్యం అమలు కావాలంటే ఈ క్రింది విధంగా చేయాలి.

  1. జాతి, మత, వర్గ విచక్షణ, పేద, ధనిక అనే తారతమ్యాలు ప్రత్యేకించి నల్లవారు, తెల్లవారు అనే విచక్షణ చూపకుండా అందరినీ సమాన ప్రాతిపదికన చూడాలి.
  2. మన దేశంలో స్త్రీ, పురుష, జాతి, వర్గ, కుల, మత, భాషా తారతమ్యాలు పాటించకుండా అందరికీ ఓటు హక్కును కల్పించినట్లు అమెరికా కూడా దేశంలోని ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించాలి.
  3. మనదేశంలో అల్పసంఖ్యాకులకు రాజ్యాంగ పరంగా రక్షణ కల్పించినట్లు అమెరికా కూడా అల్పసంఖ్యాకులైన నల్లవారికి కూడా రాజ్యాంగ పరంగా రక్షణ కల్పించాలి.
  4. భారత రాజ్యాంగం ప్రకారం మనదేశ పౌరులందరికీ పౌరసత్వం ఉన్నట్లే అమెరికాలో కూడా నల్లవారనే తేడాలు లేకుండా అందరికీ పౌరసత్వం ఇవ్వాలి.
  5. భారత ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరునికి స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు ఉన్నట్లు అమెరికాలో కూడా ప్రతి పౌరునికి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను కల్పించాలి.
  6. మనదేశంలో పౌరుల శరీర రంగుకు ప్రాధాన్యత లేనట్లే అమెరికాలో కూడా నల్లవారిని రంగును బట్టి విచక్షణ చూపరాదు.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Textbook Page No.300

ప్రశ్న 6.
ఒక ఉద్యమంలో భిన్న గొంతుకలు ఎందుకు వినపడుతుంటాయి ? వాటిల్లోని అభిప్రాయభేదాలను గుర్తించండి.
జవాబు:
అమెరికాలో పౌరహక్కుల చట్టం కోసం ఉద్యమం బలపడుతున్న సమయంలో భిన్నభిన్న అభిప్రాయాలు వెలుగులోకి వచ్చాయి. అందులో కొన్ని :

  1. చాలామంది శాంతియుత మార్గాల ద్వారా ప్రజలందరికి సమానత్వం సాధించటం వీలవుతుందని అన్నారు. అందుకు అవసరం అయిన చట్టాలు ప్రభుత్వం చేసేలా చెయ్యవచ్చని అనేకమంది మరియు డా|| కింగ్ కూడా అన్నారు.
  2. “మాల్కం ఎక్స్” వంటి వారు అనేకమంది నల్లవాళ్లు వేరేజాతి అని శ్వేత జాతీయుల పాలన నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాడాలని భావించారు.
  3. అధికారాన్ని చేజిక్కించుకోటానికి సాయుధ ఘర్షణలతో సహా అన్ని మార్గాలను వినియోగించుకోవాలని ‘మాల్కం ఎక్స్’ వంటివారు భావించారు.
  4. ఈ ఉద్యమంలో పురుషుల ఆధిపత్యం ఉందని, తమని ఎవరూ పట్టించుకోవటం లేదని నల్లజాతి మహిళలు భావించసాగారు.
    ఈ విధంగా అభిప్రాయభేదాలు వెలువడ్డాయి.

10th Class Social Textbook Page No.300

ప్రశ్న 7.
అమెరికా, యుఎస్ఎస్ఆర్‌లోని రాజకీయ వ్యవస్థలో పోలికలు, తేడాలు గుర్తించండి. ప్రజల హక్కులకు అవి ఎలా స్పందించాయి?
జవాబు:
అమెరికా, యుఎస్ఎస్ఆర్‌లోని రాజకీయ వ్యవస్థలోని పోలికలు, తేడాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
తేడాలు :

అమెరికా రాజకీయ వ్యవస్థ యుఎస్ఎస్ఆర్ లోని రాజకీయ వ్యవస్థ
1) సెన్సారు లేని స్వేచ్ఛాపూరిత పత్రికలున్నాయి. 1) సెన్సారులేని స్వేచ్ఛాపూరిత పత్రికలు లేవు.
2) స్వేచ్ఛాపూరిత ప్రసార సాధనాలను అనుమతించారు. 2) స్వేచ్ఛాపూరిత ప్రసారసాధనాలను అనుమతించలేదు.
3) సాధారణ ప్రజల స్వేచ్ఛాపూరిత భావ ప్రకటనలను అనుమతించలేదు. 3) సాధారణ ప్రజల స్వేచ్ఛాపూరిత భావ ప్రకటనలను అనుమతించారు.
4) ప్రజల కదలికలు, చర్యల మీద పూర్తి స్వేచ్చ ఉంది. నియంత్రణ లేదు. 4) ప్రజల కదలికలు, చర్యల మీద స్వేచ్ఛ లేదు. నిరంతరం ప్రజల చర్యల మీద నియంత్రణ ఉంది.
5) ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉంది. 5) సోషలిస్ట్ ప్రభుత్వం ఉంది.
6) నల్లవారు, తెల్లవారనే విచక్షణ చాలాకాలం పాటించారు. 6) ఎటువంటి విచక్షణ లేదు. అందరూ సమానమే అనే భావన ఉంది.
7) పౌరహక్కుల చట్టంను అనుమతించారు. సక్రమంగా అమలుచేయుట జరుగుతుంది. 7) గోర్బచేవ్ ప్రజలకు స్వేచ్ఛను కల్పించటానికి “గ్లాస్ నోస్” అనే సంస్కరణలు చేశాడు.

పోలికలు :
ఈ రెండు దేశాలలో మానవ హక్కుల కోసం ఉద్యమాలు జరిగాయి.

10th Class Social Textbook Page No.301

ప్రశ్న 8.
వీళ్లు దేశభక్తి లేని వాళ్లని కొంతమంది భావించగా, అన్యాయమైన యుద్ధంలో పాల్గొనాలనుకోకపోవటం సమర్ధనీయమే అని మరికొంతమంది భావించారు. ఈ రెండు దృష్టి కోణాలను తరగతిలో చర్చించి మీ దృష్టికోణంతో పాటు రెండు వైపుల వాదనలను క్లుప్తంగా రాయండి.
జవాబు:

  1. అమెరికాలోని చట్టం ప్రకారం సైన్యంలో చేరే వయసున్న యువకులందరూ కొంతకాలం సైన్యంలో పనిచేయాలనేది చట్టం. చట్టంను అందరూ పాటించాలి. అయినప్పటికీ వారు, మేము సైన్యంలో చేరం, అని సైన్యంలో చేరడానికి నిరాకరించడమనేది చట్ట వ్యతిరేకం అవుతుంది.
  2. వియత్నాం ‘ యుద్ధంలో వియత్నాంకి చెందిన 8,00,000 సైనికులు, 30,00,000 పౌరులు కాకుండా అధిక సంఖ్యలో కంబోడియన్లు, లావోషియన్లు చనిపోయారు. అమెరికాకు ఎటువంటి పౌరనష్టం జరగలేదు.
  3. అమాయకులైన వియత్నాం ప్రజలపై బాంబులు వేసి, చంపడం అనేది అన్యాయం, అమానుషం. ఇటువంటి అన్యాయానికి పూనుకున్న అమెరికా సైన్యంలో చేరకపోవడం సమర్థనీయమే అని చాలామంది భావించారు.

అమాయకులైన వియత్నాం ప్రజల చావుకు కారణమవుతున్న అమెరికా సైన్యంలో యువకులు చేరకపోవడం సమర్థనీయమే అని నా అభిప్రాయం.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Textbook Page No.303

ప్రశ్న 9.
ఆయుధీకరణకు వివిధ రకాల స్పందనలు ఏమిటి?
జవాబు:
అమెరికా, యుఎస్ఆర్, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి అగ్రరాజ్యాలు ఇతర దేశాలు అణుబాంబులను ఉపయోగించకుండా నిరోధిస్తుందన్న నమ్మకంతో అణ్వాయుధాల నిల్వలను పెంచుకుంటూ పోయాయి. ఈ విధంగా పెంచుకోవడానికి ఆ – దేశాలు రకరకాల కారణాలు తెలియచేశాయి.

  1. అణ్వాయుధాల నిల్వలలో పోటీ తీవ్రరూపం దాల్చింది.
  2. ఆయుధాలను ఉత్పత్తిచేసే కంపెనీలు (వీటిని సైనిక పారిశ్రామిక కంపెనీలంటారు). ప్రభుత్వాలు సాధారణ ప్రజలలో యుద్ధ భయాన్ని కలిగించి, అణ్వాయుధాల మీద డబ్బును మరింతగా ఖర్చు పెట్టటానికి మద్దతు పొందేవి.
  3. ప్రజా నిరసనల మూలంగా అమెరికా 1975లో వియత్నాంతో యుద్ధాన్ని ఆపేసి, వియత్నాం నుంచి బయటకు వచ్చేసింది.
  4. యూరపులో అనేకమంది ప్రజలు యుద్ధం గురించి భయపడసాగారు.
  5. ఆయుధపోటీ వల్ల ప్రపంచమంతా ముప్పులో పడుతుందని, ప్రపంచమంతా నాశనమయ్యే యుద్ధం సంభవించవచ్చని గుర్తించసాగారు.
  6. పెద్ద ఎత్తున ప్రజా నిరసనలు చోటుచేసుకున్నాయి.
  7. ఇతర దేశాల ప్రభుత్వాలతో అణ్వాయుధాల నిల్వలను తగ్గించుకోవటానికి, శాంతి దిశగా కృషి చెయ్యటానికి చర్చలు ప్రారంభించవలసిందిగా ప్రజలు ఒత్తిడి చెయ్యసాగారు.

10th Class Social Textbook Page No.303

ప్రశ్న 10.
పరస్పర విధానాలను ఆయా దేశాల ప్రభుత్వాలు నిర్ణయించటం మాత్రమే కాక వివిధ దేశాల ప్రజలు ఒకరినొకరు కలుస్తుంటే యుద్ధ అవకాశాలు తక్కువగా ఉంటాయి. దీంతో మీరు ఏకీభవిస్తారా? మీ సమాధానానికి కారణాలు పేర్కొనండి.
జవాబు:
దీంతో నేను ఏకీభవించను. కారణాలేమిటనగా …… .

  1. ప్రతి దేశానికి స్వంత ప్రభుత్వ విధానం ఉంటుంది.
  2. వివిధ దేశాల ప్రజలు ఒకరినొకరు కలుస్తుంటే సంస్కృతి వ్యాప్తి చెందుతుంది. అంతేకాని ప్రజలు యుద్ధాలు జరగకుండా ఆపలేరు.
  3. ప్రపంచంలోని చాలా దేశాలు ప్రజాస్వామ్య దేశాలు, కావున ప్రజాస్వామ్యబద్దంగా కార్యక్రమాలు నిర్వహిస్తాయి.
  4. అణుశక్తిని ఉపయోగించటంలోని ప్రమాదాలు ప్రజలకు తెలిశాయి. ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని దేశాలు నిరాయుధీకరణకు ముందుకు వచ్చి, యుద్ధ భయాన్ని తగ్గించాయి.

10th Class Social Textbook Page No.303

ప్రశ్న 11.
అణు కర్మాగారాలను, కాలుష్య పరిశ్రమలను ఎక్కడ పెట్టాలన్న నిర్ణయాలతో సంబంధం లేని దేశాల ప్రజలు కూడా పర్యావరణ కాలుష్య ప్రభావానికి ఎలా గురవుతారో వివరించండి. ఇటువంటి పరిస్థితులను ఎలా పరిష్కరించాలి?
జవాబు:
కాలుష్య ప్రభావం:

  1. కొన్ని సమయాలలో అణు కర్మాగారాలలో ప్రమాదాలు జరిగి కార్మికులు పెద్ద సంఖ్యలో చనిపోతారు.
    ఉదా : రష్యాలోని చెర్నోబిల్ అణుకర్మాగార ప్రమాదం.
  2. యూరప్లో అణు కర్మాగారాలు ఎక్కువవటం వలన యూరప్లో అధిక ప్రాంతం అణు కాలుష్యానికి కారణమయి, ప్రజలను కాలుష్యానికి గురిచేశాయి.
  3. కాలుష్య పరిశ్రమల స్థాపన మూలంగా అమాయకులైన ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.
    ఉదా : భోపాల్ లో ఒకరాత్రి యూనియన్ కార్బైడ్ కంపెనీ నుండి విషవాయువు వెలువడింది. దీనివల్ల వేలాదిమంది చనిపోయారు. చాలా మంది ఇంకా బాధపడుతున్నారు.
  4. కాలుష్యం మూలంగా ఓజోను పొర దెబ్బతింటుంది.
  5. భూగోళం వేడెక్కుతుంది. తద్వారా ధృవాల వద్ద ఉన్న మంచు కరిగి సముద్రాలలోని నీటిమట్టం పెరిగి తీరప్రాంతాలు ముంపుకు గురి అవుతాయి.

కాలుష్య పరిస్థితుల పరిష్కారానికి సూచనలు :

  1. అణు కర్మాగారాలను ప్రభుత్వాలు నిషేధించాలి. ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అణు కాలుష్యానికి గురైన ప్రజలకు ప్రభుత్వాలు సరైన వైద్య సదుపాయాలు కల్పించాలి.
  2. పరిశ్రమల స్థాపనలో ప్రభుత్వం మెలకువగా ఉండి, కాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమలకు అనుమతులు ఇవ్వకూడదు.
  3. కాలుష్యానికి గురయ్యే ప్రజలకు ప్రభుత్వం ప్రాతినిధ్యం వహించి, ఆయా పరిశ్రమల నుండి ప్రజలకు పరిహారాలు ఇప్పించాలి.
  4. ఆయా పరిశ్రమలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Textbook Page No.307

ప్రశ్న 12.
రైతులను, గిరిజనులను నిర్వాసితులను చెయ్యకుండా కర్మాగారాలు కట్టడం, గనుల తవ్వకం, విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను చేపట్టడం సాధ్యంకాదా? ఎటువంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి? ఈ అంశాలపై మీ ఇంటిలోనూ, తరగతిలోనూ చర్చించండి.
జవాబు:

  1. కర్మాగారాలు నిర్మించడానికి అనువైన పరిస్థితులు ఉన్నప్పుడు అనగా ముడిసరుకులు అందుబాటులో ఉన్న ప్రాంతాలలోనే కర్మాగారాలు నిర్మిస్తారు. ఈ పరిస్థితులలో ప్రజల గురించి ఆలోచించలేకపోతున్నారు.
  2. గనుల తవ్వకం వల్ల దేశం అభివృద్ధి చెందుతుంది మరియు గనులు ఉన్నచోటులో ఉన్న ప్రజలకు ప్రభుత్వం పునరావాసం కల్పించాలి.
  3. విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు కూడా ముడి సరుకులు (నీరు, బొగ్గు) లభించే ప్రాంతాలలోనే, నిర్మించవలసి వస్తుంది.
  4. అయితే ఆనకట్టల నిర్మాణంలో మాత్రం, ఆనకట్టల నిర్మాణం మూలంగా వచ్చే ఉపయోగం, నష్టాలను అంచనా వేసుకుని ఆనకట్టలను నిర్మించవచ్చు. లేదా ఆపివేయవచ్చు.
    ఉదా : కేరళలోని సైలెంట్ వ్యాలీలోని ఆనకట్ట (1973-83)

10th Class Social Textbook Page No.308

ప్రశ్న 13.
సామాజిక ఉద్యమాలు ఉపయోగించిన వివిధ’ వ్యూహాలను పేర్కొనండి.
జవాబు:

  1. అమెరికా పౌరహక్కుల ఉద్యమంలో నల్లజాతి ప్రజలు నిరసన తెలుపుతూ ఒక సంవత్సరం పాటు ‘బస్సులను’ బహిష్కరించారు.
  2. యుఎస్ఎస్ఆర్ లో గోర్బచేవ్, ప్రజలకు మరింత స్వేచ్ఛను కల్పించటానికి “గ్లాస్ నోస్తే” అన్న సంస్కరణల ప్రక్రియను ఆరంభించాడు.
  3. వియత్నాంతో యుద్ధం చేస్తున్న అమెరికా సైన్యంలోకి అమెరికా పౌరులు చాలామంది “మేము వెళ్లం” అని సైన్యంలో చేరడానికి నిరాకరించి, నిరసన తెలియచేశారు.
  4. అణ్వాయుధాల ఉత్పత్తిని తగ్గించుకొమ్మని, శాంతి దిశగా ప్రయాణం చేయమని అనేకమంది సైంటిస్టులు, ప్రజలు, అధికారులు చేసిన ఒత్తిడి కారణంగా అణ్వాయుధాలను తగ్గించుకోవడానికి స్ట్రాటెజిక్ ఆర్ట్స్ రిడక్షన్ ట్రీటి (START) మీద సంతకాలు చేశారు.
  5. గ్రీన్ పీస్ ఉద్యమం అనగా అలస్కా దగ్గర సముద్రంలో అమెరికా 1971లో చేపట్టిన అణు పరీక్షలకు వ్యతిరేకంగా నిరసనకర్తలు ఒక చిన్న పడవలో ప్రయోగశాలకు బయలుదేరినారు. ఆ పడవ పేరు “గ్రీన్ పీస్”. ఆ పడవ పేరు మీదుగా ఆ ఉద్యమానికి గ్రీన్ పీస్ అని పేరు వచ్చింది.
  6. సమానత్వం కోసం అమెరికాలో మహిళలు ఉద్యమం చేశారు.
  7. భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో నష్టపోయిన కార్మికులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చెయ్యటానికి అంతర్జాతీయ చట్టాలను ఉపయోగించవలసి వచ్చింది.
  8. ‘నర్మదా బచావో’ ఆందోళనలో ఆనకట్టల నిర్మాణాన్నే వ్యతిరేకించారు.
  9. సర్దార్ సరోవర్ ఆనకట్ట నిర్మాణ సమయంలో చేసిన ఉద్యమంలో తీవ్ర నిరసనలు, ప్రజల సమీకరణ, ప్రదర్శనలు, నిరాహార దీక్షలు, అంతర్జాతీయ ఉద్యమాలు చేయుట జరిగింది.
  10. “నర్మదా బచావో” ఉద్యమంలో – మూలవాసీ ప్రజల ఉద్యమం, సయా – ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమం, పట్టణీకరణకు ఆనకట్టలు, పరిశ్రమలు, గనులు వంటి వాటికోసం భూములు లాక్కోబడుతున్న నేపధ్యంలో తమ భూములు కాపాడుకొనుటకు రైతులు చేస్తున్న ఉద్యమాలు మొదలైన వ్యూహాలు ఉపయోగించబడ్డాయి.

10th Class Social Textbook Page No.308

ప్రశ్న 14.
పునరావాసాన్ని కల్పిస్తామన్న వాగ్దానాలను ఉద్యమంలోని ప్రజలు ఎలా పరిగణిస్తున్నారు?
జవాబు:
పథకాల వల్ల నిర్వాసితులయ్యే ప్రజలు సరైన పునరావాసం కల్పించాలని కోరసాగారు. అయితే త్వరలోనే ప్రజలు కొన్ని విషయాలు గుర్తించారు. అవి :

  1. భూమి కోల్పోయిన వారికి నష్టపరిహారంగా భూమిని ఇవ్వటానికి తగినంత భూమి లేదు.
  2. నిర్వాసితులైన ప్రజలందరికీ సరైన పునరావాసం కల్పించటం సాధ్యం కాదు అని తెలుసుకున్నారు.
  3. ఇది నష్టపరిహారం, పునరావాసానికి సంబంధించిన సమస్యకాక అభివృద్ధికి సంబంధించిన లోపభూయిష్ట దృక్పథమని ప్రజలు గుర్తించసాగారు.
  4. ఈ రకమైన అభివృద్ధి వ్యవసాయాన్ని, గిరిజన ప్రజలను పణంగా పెట్టి పరిశ్రమలు, వాణిజ్య వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేయటం, సహజ వనరులను సుస్థిరంకాని పద్ధతులలో వినియోగించటం పైన ఆధారపడి ఉంది.
  5. ఇది పేద రైతులు, గిరిజనుల జీవన ప్రమాణాన్ని ఏ రకంగాను మెరుగుపరచకుండా వాళ్లని నైపుణ్యం లేని కూలీలుగా మారుస్తుంది.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Textbook Page No.310

ప్రశ్న 15.
ఇటీవల కాలంలో పశ్చిమబెంగాల్ (నందిగ్రాం), ఒడిశా (నియమగిరి), ఆంధ్రప్రదేశ్ (పోలవరం, సోంపేట, మొదలైనవి)లో జరిగిన ఇటువంటి పోరాటాల గురించి మరింత తెలుసుకోండి. ఈ పోరాటాల్లో ముఖ్యమైన అంశాలను వివరిస్తూ ఒక పోస్టరు తయారు చేయండి
జవాబు:
ఇటీవల కాలంలో కట్టబడిన ఆనకట్టల సందర్భాలలో ఎన్నో పోరాటాలు జరిగాయి. అటువంటి పోరాటాలలో కొన్ని నందిగ్రాం – పశ్చిమ బెంగాల్, నియమగిరి – ఒడిశా, పోలవరం, సోంపేట – ఆంధ్రప్రదేశ్,

1. నందిగ్రాం (పశ్చిమ బెంగాల్) :
ఎ) ఇది హాల్దియాలోది. కోల్ కతాకు దూరంగా ఉంటుంది.
బి) పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 2001 మార్చిలో ఈ స్థలాన్ని ప్రత్యేక ఆర్థిక స్థలంగా ప్రకటించింది.
సి) నందిగ్రాం ప్రజలకు కోపం వచ్చి ఊరేగింపులు నిర్వహించారు. పోరాటం చేశారు. ఈ పోరాటంలో 14 మంది చనిపోయారు.

2. నియమగిరి (ఒడిశా):
ఎ) ఒడిశాలో ఈ నియమగిరి కొండలు బాక్సైట్ నిల్వలకు ప్రఖ్యాతిగాంచాయి.
బి) బ్రిటిష్ మైనింగ్ కంపెనీకి, ఒడిశా ప్రభుత్వం బాక్సైట్ ను వెలికి తీయడానికి అనుమతినిచ్చింది.
సి) ప్రజలు ఆగ్రహించి ముఖ్యంగా గిరిజనులు అనేక ఊరేగింపులు నిర్వహించారు. కోర్టుకు కూడా ఫిర్యాదు చేసినారు. న్యాయస్థానం స్పందించి బ్రిటిష్ కంపెనీకి ఇచ్చిన అనుమతిని జనవరి, 2014లో రద్దు చేసింది.

3. సోంపేట (శ్రీకాకుళం – ఆంధ్రప్రదేశ్) : .
ఎ) సోంపేట అనేది ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలోని మండలం.
బి) ఇక్కడ ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మించుటకు ప్రభుత్వం “నాగార్జున కంపెనీ లిమిటెడ్”కు అనుమతినిచ్చింది.
సి) రాజకీయ పార్టీల అండతో ప్రజలు దీనిని వ్యతిరేకించి ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.

4. పోలవరం (ఆంధ్రప్రదేశ్) :
ఎ) పోలవరం ప్రాజెక్టు గోదావరి నదిమీద నిర్మించబడుతుంది.
బి) ఈ ప్రాజెక్టు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి మరియు ఖమ్మం జిల్లాలకు వ్యాపించి ఉంది.
సి) ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం 2006లో అనుమతినిచ్చింది.
డి) దీని మూలంగా ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా ఛత్తీస్ గఢ్, ఒడిశాలలోని ప్రాంతాలు కూడా ముంపుకు గురి అవుతాయి. అందువల్ల ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి అనేక ఆటంకాలు ఏర్పడుతున్నాయి.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Textbook Page No.310

ప్రశ్న 16.
మానవ హక్కులలోని కొన్ని అధికరణాలు కింద ఉన్నాయి. ఈ భాగాన్ని రెండుసార్లు చదవంది. మొదటిసారి అంతా చదివి మానవులందరికీ, ఉండాల్సిన మానవ హక్కులను గుర్తించండి. తరువాత కింద ఇచ్చిన మానవ హక్కుల ఉల్లంఘన గురించి ఏ పేరా, ఏ వాక్యంలో ఉందో గుర్తించండి. (ప్రతిదానికి దొరకక పోవచ్చు, దానిని ఖాళీగా ఉంచెయ్యండి.)
అధికరణం 3 : ప్రతి ఒక్కరికీ జీవితం, స్వేచ్ఛ, వ్యక్తిగత భద్రతలకు హక్కు ఉంది. పేరా …………. వాక్యం ………….
అధికరణం 5 : ఎవరిని హింసకు లేదా క్రూర, అమానవీయ, అవమానకర వ్యవహారానికి లేదా శిక్షకు గురిచేయ్యకూడదు. పేరా ………….. వాక్యం ………….
అధికరణం 7 : చట్టం ముందు అందరూ సమానులే, ఎటువంటి వివక్షతకు లోనుకాకుండా అందరికి చట్టం ద్వారా సమాన రక్షణ లభించాలి. ఈ ప్రకటనకు భంగం కలిగిస్తూ వివక్షతకు గురికాకుండా అందరికీ సమాన రక్షణ లభించాలి, ఇటువంటి వివక్షతకు రెచ్చగొట్టబడటం నుంచి కూడా రక్షణ లభించాలి. పేరా ………. వాక్యం …………..
అధికరణం 9 : ఎవరినీ అకారణంగా అరెస్టు చెయ్యకూడదు, నిర్బంధించకూడదు, బహిష్కరించగూడదు. పేరా ………….. వాక్యం ……………….
అధికరణం 10 : ఒక వ్యక్తిపై మోపబడిన నేరాలకు అతడు / ఆమె హక్కులు, బాధ్యతలు నిర్ణయించటానికి స్వతంత్ర, నిష్పక్షపాత ట్రిబ్యునల్ ద్వారా బహిరంగ విచారణకు పూర్తి సమానతతో కూడిన హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. పేరా – ………….. వాక్యం ………..
అధికరణం 12 : అకారణంగా ఎవరి ఏకాంతానికి, కుటుంబానికి, నివాసానికి లేదా ఉత్తర ప్రత్యుత్తరాలకు అడ్డుపడకూడదు, జోక్యం చేసుకోకూడదు, వ్యక్తి పరువు, మర్యాదలకు భంగం కలిగించకూడదు. ఈ విధమైన దాడుల, జోక్యం చేసుకోవడాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరికీ చట్టం ద్వారా రక్షణ పొందే హక్కు ఉంటుంది. పేరా ……………. వాక్యం …………..
అధికరణం 13 : (1) దేశ సరిహద్దులకు లోబడి ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛగా సంచరించే హక్కు, నివాసం ఏర్పరుచుకునే హక్కు ఉంటాయి. పేరా …………… వాక్యం …………..
(2) ప్రతి ఒక్కరికీ సొంత దేశంతో సహా ఏ దేశాన్నైనా వీడే హక్కు తిరిగి సొంత దేశానికి చేరే హక్కు ఉంటాయి. పేరా ……….. వాక్యం ……………
జవాబు:
అధికరణం 3 : ప్రతి ఒక్కరికీ జీవితం, స్వేచ్ఛ, వ్యక్తిగత భద్రతలకు హక్కు ఉంది. పేరా 3 వాక్యం 13
అధికరణం 5 : ఎవరిని హింసకు లేదా క్రూర, అమానవీయ, అవమానకర వ్యవహారానికి లేదా శిక్షకు గురిచెయ్యకూడదు. పేరా 3 వాక్యం 6 మరియు 7.
అధికరణం 9 : ఎవరినీ అకారణంగా అరెస్టు చెయ్యకూడదు, నిర్బంధించకూడదు, బహిష్కరించగూడదు. పేరా 3 వాక్యం 4.
అధికరణం 12 : అకారణంగా ఎవరి ఏకాంతానికీ, కుటుంబానికి, నివాసానికి లేదా ఉత్తర ప్రత్యుత్తరాలకు అడ్డుపడకూడదు, జోక్యం చేసుకోకూడదు, వ్యక్తి పరువు, మర్యాదలకు భంగం కలిగించకూడదు. ఈ విధమైన దాడుల, జోక్యం చేసుకోవడాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరికీ చట్టం ద్వారా రక్షణ పొందే హక్కు ఉంటుంది. పేరా 3 వాక్యం 10.