SCERT AP 10th Class Social Study Material Pdf 14th Lesson ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 14th Lesson ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

10th Class Social Studies 14th Lesson ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
రష్యన్ విప్లవం ఆ సమాజంలో ఎన్నో మార్పులను తెచ్చింది. అవి ఏమిటి ? వాళ్ళు ఎదుర్కొన్న సవాళ్ళు ఏమిటి? (AS1)
జవాబు:
రష్యన్ విప్లవం సమాజంలో ఎన్నో మార్పులను తెచ్చింది. 1917లో ప్రారంభమైన రష్యన్ విప్లవం ఫలితంగా 1920 నాటికి అనేక మార్పులు జరిగాయి.

  1. జార్ చక్రవర్తుల పాలన దూరమై ఉదారవాదులు, రాచరిక కుటుంబాల వాళ్ళు పరిపాలన చేపట్టారు.
  2. రష్యాలో “బోల్షివిక్”లు లెనిన్ నాయకత్వంలో అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు.
  3. షరతులు లేని శాంతిని నెలకొల్పి, భూమినంతటినీ జాతీయం చేసి దానిని రైతులందరికీ పంచిపెట్టడం జరిగింది.
  4. ధరలను నియంత్రించి కర్మాగారాలు, బ్యాంకులను జాతీయం చేశారు.
  5. స్టాలిన్ ఆధ్వర్యంలో రష్యాను బలమైన శక్తిగా మార్చి, పంచవర్ష ప్రణాళికలతో ప్రణాళికాబద్ధ ఆర్థిక వ్యవస్థను చేపట్టారు.

ఎదుర్కొనే సవాళ్ళు :

  1. భూముల ఏకీకరణ సందర్భంగా పెద్ద రైతులు వ్యతిరేకించగా హింస, మరణశిక్షలు అమలుచేశారు.
  2. 1929-30 లో తీవ్ర కరవు ఎదురై, చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు చనిపోయారు.
  3. స్వేచ్ఛా మార్కెట్ కి అనుమతి లేకుండాపోయింది.
  4. ప్రపంచ ఆర్థిక మాంద్యం సమయంలో కర్మాగారాలు మూతబడి, వేలాదిమంది నిరుద్యోగులుగా మారారు.
  5. సాధారణ ప్రజాస్వామిక స్వేచ్ఛ లేదు.

AP Board 10th Class Social Solutions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

ప్రశ్న 2.
తీవ్ర మాంద్యానికి కారణాల గురించి భిన్న వాదనలను పోల్చండి. వాటిల్లో దేనితో మీరు ఏకీభవిస్తారు ? కారణాలు పేర్కొనండి. (AS1)
జవాబు:
1929 చివరలో మొదలైన తీవ్ర ఆర్థికమాంద్యం 1939 వరకు కొనసాగింది.

  1. మొదటి ప్రపంచయుద్ధం అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఆర్థికవ్యవస్థ ఛిన్నాభిన్నం అయింది.
  2. అమెరికాలో స్టాక్ మార్కెట్ కుప్పకూలడం వలన దాని పరిణామాలు అనతికాలంలోనే అన్ని దేశాలను ప్రభావితం చేశాయి.
  3. నిరుద్యోగం పెరిగి ఆదాయాలు తగ్గి ప్రపంచవ్యాప్తంగా సాధారణ ప్రజలు, ప్రభుత్వాలు కూడా ప్రభావితం అయ్యాయి.
  4. గిరాకీ తగ్గడంతో కర్మాగారాలు మూతబడి, ప్రజల కొనుగోలు శక్తి క్షీణించింది.

ప్రశ్న 3.
నాజీ జర్మనీల చేతిలో యూదులు ఏ విధమైన వేధింపులకు గురయ్యారు? ప్రతి దేశంలోనూ కొంతమంది తమ ప్రత్యేక గుర్తింపు కారణంగా వేరుగా చూడబడుతున్నారా? (AS4)
జవాబు:
నాజీ జర్మనీల చేతిలో యూదులు అనేక వేధింపులకు గురయ్యారు.

  1. అల్పసంఖ్యాక వర్గ ప్రజలైన యూదులను అరెస్టు చేసి హింసించేవాళ్ళు.
  2. అంతకు ముందెన్నడు లేనంతగా దారుణాలకు ఒడిగట్టారు.
  3. నిర్బంధ శిబిరాలకు తరలించి, వారిని దేశం నుంచి బహిష్కరించారు.
  4. రెండవ ప్రపంచయుద్ధం నీడలో అమాయకులైన ఆరు కోట్ల మంది యూదులను నిర్దాక్షిణ్యంగా చంపించారు.
  5. ఆష్విట్జ్ వంటి హత్యాకేంద్రాలలో యూదులను గదులలోకి పంపి, దాంట్లోకి గ్యాసు పంపించడం ద్వారా చంపేసేవాళ్ళు.

ప్రతి దేశంలోనూ కొంతమంది తమ ప్రత్యేక గుర్తింపు కారణంగా వేరుగా చూడబడుతూ వివక్షతకు, అన్యాయాలకు, బలవంతపు చావులకు బలౌతున్నారు.

ప్రశ్న 4.
తీవ్ర మాంద్య పరిస్థితులలో సంక్షేమ రాజ్యం అన్న భావన కింద చేపట్టిన వివిధ చర్యలను పేర్కొనండి. రష్యాలో చేపట్టిన సంస్కరణలకూ, వీటికీ ఉన్న పోలికలు, తేడాలను పేర్కొనండి. (AS1)
జవాబు:
తీవ్ర మాంద్య పరిస్థితులలో సంక్షేమ రాజ్యం అనే భావన కింద చేపట్టిన చర్యలు :

  1. సామాజిక భద్రతా విధానాన్ని అమలుచేశారు.
  2. అందరికీ వర్తించే పదవీ విరమణ, పింఛను, నిరుద్యోగ బీమా, వికలాంగులకు సంక్షేమ ప్రయోజనాలు సమకూర్చాయి.
  3. తండ్రిలేని కుటుంబాలలో అవసరమున్న పిల్లలకు ప్రయోజనం చేకూర్చే పనులు చేపట్టారు.
  4. కనీస జీవనస్థాయి, ఆహారం, గృహవసతి, ఆరోగ్యం , విద్య, శిశు, వృద్ధాప్య సంరక్షణ వంటి మౌలిక అంశాలకు హామీ ఇచ్చింది.

పోలికలు :
రష్యాలో కూడా రష్యన్ విప్లవం తరువాత

  1. ధరలను నియంత్రించి, కర్మాగారాలు, బ్యాంకులను జాతీయం చేశారు.
  2. భూమిని పునః పంపిణీ చేసి
  3. అసమానతలు, పుట్టుక, లింగం, భాష వంటి ప్రాతిపదికన వివక్షతలేని సమాజాన్ని ఏర్పాటు చేయడానికి రష్యా ప్రయత్నించింది.

తేడాలు:

  1. రష్యాలో దీర్ఘ కాలికంగా లాభం చేకూర్చి పథకాలు అమలు చేయగా, సంక్షేమ రాజ్యంలో తక్షణం లబ్ధి చేకూర్చే పథకాలు అమలుచేసారు.
  2. ఫ్యూడల్ భూస్వాములు, రాజులు, పెట్టుబడిదారులు వంటి దోపిడీదారులు లేని దేశాన్ని నిర్మించడానికి రష్యా ఒక బృహత్ ప్రయోగం చేపట్టగా, సంక్షేమ రాజ్యంలో భాగంగా ప్రజలందరికీ కనీస జీవనస్థాయి, మౌళిక అంశాలకు ప్రాధాన్యత.

AP Board 10th Class Social Solutions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

ప్రశ్న 5.
తీవ్ర మాంద్యంతో జర్మనీ ఎదుర్కొన్న సవాళ్ళు ఏమిటి? నాజీ పాలకులు, హిట్లర్ వాటిని ఎలా ఉపయోగించుకున్నారు? (AS1)
(లేదా)
జర్మనీలో నాజీజం ప్రాబల్యం పెరగడానికి దారితీసిన పరిస్థితులేవి?
జవాబు:
తీవ్ర మాంద్యంతో జర్మనీ అన్నిటికంటే ఎక్కువగా ప్రభావితం అయింది.

  1. పారిశ్రామిక ఉత్పత్తి 40% పడిపోయింది.
  2. నిరుద్యోగుల సంఖ్య ముందెన్నడూ లేని విధంగా 60 లక్షలకు చేరింది.
  3. పురుషులు “ఏ పని చేయడానికైనా సిద్ధం” అనే బోర్డులు మెడలో వేసుకొని తిరిగేవాళ్ళు.
  4. తమ పిల్లల కడుపులు నింపలేని మహిళలు తీవ్ర నిస్పృహకు లోనయ్యారు.
  5. ప్రభుత్వం కుప్పకూలి స్థిరమైన పాలన లేకుండాపోయింది.

పై పరిస్థితులను, నాజీ పాలకులు, హిట్లర్ తమకు అనుకూలంగా మలచుకున్నారు. తీవ్ర నిరాశ, నిస్పృహలతో . ఉన్న దేశ ప్రజలను నాజీలు, హిట్లర్ ఉద్వేగ ప్రసంగాలతో అందరినీ ఆకర్షించారు.

  1. కుదేలైన ఆర్థికవ్యవస్థను పునరుద్ధరించి తిరిగి యథాస్థితికి తెస్తామని మాట ఇచ్చారు.
  2. పని కావాలి అనుకుంటున్న వాళ్ళకి పని, యువతకు బంగారు భవిష్యత్తు కల్పిస్తామని వాగ్దానం చేశారు.
  3. ప్రజల మధ్య ఐకమత్యం పెంచడానికి, సభలు, సమావేశాలు, బహిరంగ సభలు, ప్రదర్శనల ద్వారా ప్రజలను మంత్రముగ్ధుల్ని చేశారు.

ఈ విధంగా జర్మనీలో నాజీజం ప్రాబల్యం పెరిగింది.

ప్రశ్న 6.
నాజీ పాలనలో తీసుకొచ్చిన రాజకీయ మార్పులు ఏమిటి? ఒక బలమైన నాయకుడు ఉంటే చాలు దేశ సమస్యలు తీరిపోతాయని తరచు ప్రజలు వాదిస్తూ ఉంటారు. నాజీ జర్మనీలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఈ వాదనకు ఎలా స్పందిస్తారు? (AS4)
జవాబు:
నాజీ, పాలనలో, హిట్లర్ నాయకత్వంలో రాజకీయంగా అనేక మార్పులు తీసుకొచ్చారు.

  1. రాజకీయాలలో నాజీలు ఒక కొత్త శైలిని ప్రవేశపెట్టారు.
  2. పెద్ద ఎత్తున జన సమీకరణ చెయ్యటంలో ఆచారాలు, అద్భుత దృశ్యాల ప్రాముఖ్యతను వివరించారు.
  3. స్వస్తిక్ గుర్తుతో ఎర్ర జెండాలు, నాజీ వందనం, ఉపన్యాసాల తరువాత చప్పట్లు కొట్టడం వంటివెన్నో పెనుమార్పులు చేశారు.
  4. ప్రపంచంపై జర్మనీ ఆర్యజాతి ఆధిపత్యాన్ని నెలకొల్పుతామన్న వాగ్దానంతో ఆకర్షించారు. బలమైన నాయకుడు ఉంటే దేశ సమస్యలు తీరుతాయి అనే ప్రజల వాదనలో వాస్తవముంది.

హిట్లర్ నాయకత్వం పట్ల ప్రజలకు నమ్మకం కలిగి మెరుగైన భవిష్యత్తునాశిస్తూ ఆ పార్టీకి తిరుగులేని నాయకుడిగా అతడిని నిలబెట్టారు. అయితే 1928 లో జర్మనీ పార్లమెంటు రీచ్ స్టాగ్ లో నాజీ పార్టీకి 2.6 శాతం ఓట్లు కూడా రాలేదు. కాని హిట్లర్ ను బలమైన నాయకుడిగా ప్రజలు గుర్తించిన పిదప 1937 నాటికి 37 శాతం ఓట్లతో నాజీ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించింది.

10th Class Social Studies 14th Lesson ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II InText Questions and Answers

10th Class Social Textbook Page No.192

ప్రశ్న 1.
సమానత్వం, స్వేచ్ఛ, సంపదలతో కూడిన ప్రపంచాన్ని నిర్మించటంలో సోవియట్ ప్రయోగం ఏ మేరకు విజయం సాధించిందో అంచనా వేయండి.
జవాబు:
సమానత్వం, స్వేచ్ఛ, సంపదలతో కూడిన ప్రపంచాన్ని నిర్మించటంలో సోవియట్ చాలా వరకు విజయం సాధించి బలమైన శక్తిగా ఎదిగింది. భూమినంతటినీ జాతీయం చేసి, దానిని రైతులందరికీ పంచిపెట్టి, బ్యాంకులను జాతీయం చేసి, ఫ్యూడల్ భూస్వాములు, రాజులు, పెట్టుబడిదారులు వంటి దోపిడీదారులు లేని దేశాన్ని నిర్మించటానికి ఒక బృహత్తర ప్రయోగం అమలుచేశారు.

AP Board 10th Class Social Solutions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

ప్రశ్న 2.
ఇటువంటి ప్రయోగాల కోసం వేలాదిమందిని చంపటం సమర్థనీయమేనా?
జవాబు:
సమర్ధనీయం కాదు. జార్జ్ ఆర్వెల్ అన్న రచయిత “యానిమల్ ఫాం” అన్న తన ప్రఖ్యాత వ్యంగ్య నవలలో రష్యన్ విప్లవంలోని ఆదర్శాలను USSR ఎలా నీరు కార్చిందో వివరించాడు. ప్రతిపక్షాన్ని హింసాత్మకంగా నిర్మూలించడం. ఎదురు తిరిగిన వారిని నిర్దాక్షిణ్యంగా చంపడం హేతుబద్ధం కాదు. ప్రజలలో మార్పు తెచ్చి, ప్రజలకు విశ్వాసపాత్రులుగా వ్యవహరించాలి.

ప్రశ్న 3.
కమ్యూనిస్టు విధానాలపై వచ్చిన విమర్శలు ఏమిటి?
జవాబు:
సమానత, జాతి స్వేచ్ఛ వంటి ఆదర్శాల పట్ల నిబద్ధత గల ప్రపంచవ్యాప్త ప్రజలందరిలో కమ్యూనిస్టు విధానాలు కొంతకాలం ఆమోదం పొందినప్పటికీ కమ్యూనిస్టులు విప్లవాల కోసం కృషి చేశారు. ప్రతిపక్ష రాజకీయ పార్టీలను అణచివెయ్యడం, హింసాత్మకంగా నిర్మూలించడం, బహుళపార్టీ ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ లేకపోవడం వంటి దారుణమైన కమ్యూనిస్టు విధానాలు విమర్శలపాలైనాయి. భూముల ఏకీకరణను వ్యతిరేకించిన పెద్ద రైతులను జైలుపాలు చేసి, విదేశాలకు పంపించడమే కాకుండా, మరణశిక్షలు కూడా వేసి విమర్శలపాలైనారు.

ప్రశ్న 4.
భారతదేశంలో ఈనాడు సంక్షేమ రాజ్యంలోని ఏ ఏ అంశాలు అమలులో ఉన్నాయి?
జవాబు:
భారతదేశంలో ఈనాడు సంక్షేమ రాజ్యంలోని అనేక అంశాలు అమలులో ఉన్నాయి.

  1. అందరికీ వర్తించే పదవీ విరమణ పింఛను.
  2. వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు నెలసరి పింఛను.
  3. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర
  4. ఆరోగ్య పథకాలు
  5. శిశుసంరక్షణ పథకాలు
  6. ఆహారం, గృహవసతి, విద్య, వైద్య సహాయాలు
  7. ప్రజలందరికీ కనీస జీవనస్థాయి

10th Class Social Textbook Page No.197

ప్రశ్న 5.
నాజీ సిద్ధాంతం అధికస్వామ్య సూత్రాలపై ఆధారపడి ఉంది. జర్మనీ జనాభాలో యూదులు 0.75 శాతం మాత్రమే. యూదులనే కాకుండా నాజీలను వ్యతిరేకించే వాళ్ళను కూడా శిక్షించే వాళ్ళు. పాస్టర్ నీ మొల్లర్ తన కవితలో దీనిని ఎలా చూపించాడు?
జవాబు:
నాజీ సామ్రాజ్యంలో పాలకశక్తులు సాధారణ ప్రజలపై, యూదులపై దారుణమైన హింసను, దమనకాండను సాగించాయి. అందుకనే కవితలో పాస్టర్ నీ మొల్లర్ ఇలా చెప్పాడు. “కమ్యూనిస్టులు, సోషల్ డెమోక్రాట్లు, కార్మిక సంఘాలు, యూదులు కోసం వచ్చి, వెతికి చివరకు పైవారెవరు కాని నన్ను కూడా తీసుకెళ్ళారు. పై వారి కోసం వచ్చినపుడు నేను నిరసన తెలియజేశాను. కానీ నా కోసం నాజీలు వచ్చినపుడు నాకు నిరసన తెలిపేవారు మిగలలేదని” రాసుకొచ్చాడు.

AP Board 10th Class Social Solutions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

10th Class Social Textbook Page No.199

ప్రశ్న 6.
జర్మను ప్రజల శత్రువులుగా హిట్లర్ యూదులను ఎందుకు ఎంపిక చేసుకున్నాడు?
జవాబు:
మొదటి ప్రపంచయుద్ధం, ఆర్ధికమాంద్యం వలన జర్మనీ ఆర్థికంగా, సామాజికంగా అణగదొక్కబడింది. జర్మనీలో ఎదురైన అన్ని సమస్యలకు మూలం యూదులని హిట్లర్ ప్రగాఢ నమ్మకం. కమ్యూనిజం, పెట్టుబడిదారీ విధానం రెండింటినీ యూదుల కుట్రగా పేర్కొంటూ, ఆ రెండింటినీ తిప్పికొట్టే క్రమంలో యూదులను తుదముట్టించడానికి హిట్లర్ పూనుకొన్నాడు.

ప్రశ్న 7.
హెలోకాస్ట్ గురించి, ఆష్విల్ట్ తరహా శిబిరాల గురించి మరింత తెలుసుకుని వాటి ఆధారంగా ఒక నివేదిక తయారు చేయండి.
జవాబు:
రెండవ ప్రపంచయుద్ధం నీడలో జర్మనీ మానవ మారణహోమాన్ని చేపట్టింది. దీని ఫలితంగా అమాయకులైన ఎంపిక చేయబడ్డ పౌరులు పెద్ద సంఖ్యలో చంపివేయబడ్డారు. ప్రజలను చంపటానికి నాజీలు అంతకు ముందెన్నడూ లేని విధానాలను కనుగొన్నారు. ఉదాహరణకు “ఆష్విట్జ్” వంటి హత్యాకేంద్రాలలో ప్రజలను గదులలోనికి పంపి దాంట్లోకి గ్యాస్ పంపించడం ద్వారా చంపేసే వాళ్ళు.

10th Class Social Textbook Page No.200

ప్రశ్న 8.
యుద్ధం, తీవ్రమాంద్యం తరువాత జాతీయ అభివృద్ధికి అనేక నమూనాలు ముందుకు వచ్చాయి. వాటిని పేర్కొని, వాటి పరిమితులను కూడా పేర్కొనండి.
జవాబు:
నమూనాలు :
యుద్ధం, తీవ్ర మాంద్యం తరువాత జాతీయ అభివృద్ధికి అనేక కొత్త నమూనాలు ముందుకు వచ్చాయి.

అవి:

  1. రాజ్యం, ప్రజలందరూ గౌరవంగా బ్రతకడానికి అవసరం అయిన కనీస మౌలిక అవసారాలను కల్పించాలి.
  2. రాజ్యం, ప్రజల ప్రాథమిక అవసరాలైన ఆహారం, నివాసం, ఆరోగ్యం, పిల్లలు, వృద్ధుల పరిరక్షణ, విద్య వంటి వాటికి ప్రాధాన్యతను ఇవ్వాలి.
  3. రాజ్యం విశాలమైనది. సమర్థులైన పౌరులందరికి ఉద్యోగాలు కల్పించవలసిన బాధ్యత రాజ్యానిదే.

పరిమితులు :
ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా సాధారణ పరిస్థితులలో మాత్రమే అమలు చేయుటకు వీలవుతాయి.

AP Board 10th Class Social Solutions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

10th Class Social Textbook Page No.190

ప్రశ్న 9.
విప్లవం గురించి గ్రామీణ ప్రాంతంలో రెండు పక్షాలను పాఠ్యాంశంలోనిది చదవండి. ఆ ఘటనలకు మీరు కూడా సాక్షిగా ఊహించుకోండి. 1) ఎస్టేట్ యజమాని 2) చిన్న రైతు 3) పత్రికా విలేఖరిగా ఆనాటి ఘటనల గురించి క్లుప్తంగా రాయండి.
జవాబు:
1) ఎస్టేట్ యజమాని :
గ్రామాలలో ఉద్రిక్త పరిస్థితులు కానవస్తున్నాయి. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియదు. ఈ ఆస్తి, భూములు మాకు చెందుతాయో, కోల్పోతామో తెలియడం లేదు. కాని ప్రజల అంతరాత్మ సజీవంగా ఉందని మాకు సంతోషంగా ఉంది.

2) చిన్న రైతు :
నిశ్శబ్దంగా, శాంతియుతంగా ఎటువంటి బాధ లేకుండా తిరుగుబాటు జరిగిపోయింది. మాకు రెండు ఆవులు, రెండు గుర్రాలను ఉంచారు. పనివాళ్ళను ప్రశాంతంగా బ్రతకనివ్వమని, మానవత్వంతో చూడమని వేడుకున్నారు.

3) పత్రికా విలేఖరి :
1917 అక్టోబర్ 25 విప్లవం గ్రామీణ ప్రాంతాలలో పెనుమార్పులకు నాంది పలికింది. ప్రజలు ఉత్సాహంతో స్వాగతించారు. ఉచితంగా భూమి లభించి, ఆనందంగా బ్రతకవచ్చని తలచారు. జార్ భవనాలను కూలగొట్టి శిథిలాలుగా వదిలేశారు.

10th Class Social Textbook Page No.194

ప్రశ్న 10.
ప్రపంచాన్ని జయించాలన్న భావనను హిట్లర్ ఇక్కడ ప్రతిపాదిస్తున్నాడా? బలం, శక్తి ఉన్న వాళ్ళకే ఈ ప్రపంచం చెందాలని మీరు అనుకుంటున్నారా?
జవాబు:
బలం, శక్తి ఉన్న వాళ్ళకే ఈ ప్రపంచం చెందాలని నేను అనుకోవడం లేదు. ప్రపంచాన్ని జయించాలన్న ఆలోచన హిట్లర్కు బలీయంగా ఉంది. ఆనాటి పరిస్థితులు, వర్సయిల్స్ సంధి షరతులతో పాటు అన్నిటికంటే బలమైన జాతికి ప్రపంచాన్ని ఓడించే హక్కు ఉందని ఈ సందర్భంగా హిట్లర్ అభిప్రాయం. తన ఉపన్యాసాలతో, నాజీ పార్టీ సిద్ధాంతాలతో పాటు దురహంకారపూరిత జాతీయతావాదం ద్వారా, సైనికవాదం అమలుచేయడం ద్వారా సిద్ధాంత బోధనతో ప్రజలను మైమరపించి, ప్రపంచంలో గల దేశాలను భయపెట్టి ప్రపంచాన్ని జయించాలన్న భావన ఈ సందర్భంగా హిట్లర్ ప్రతిపాదిస్తున్నాడు.

ప్రశ్న 11.
ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోయి, కొన్ని సంవత్సరాలపాటు ఉద్యోగం దొరకని కార్మికులుగా మిమ్మల్ని మీరు ఊహించుకోండి. మీ జీవితంలోని ఒక రోజు గురించి రాయండి.
జవాబు:
ఉద్యోగం కోల్పోయి కొన్ని సంవత్సరాలపాటు ఉద్యోగం దొరకని కార్మికుల జీవనం దుర్భరం. మాటల్లో వర్ణించలేము.

ఒక రోజు :
ఆ రోజు ఉదయం నుండి వెతలే. మంచాన పడిన తండ్రి, నా వంక దీనంగా చూసి, వైద్యం’ చేయించమనే మాటతో నా కళ్ళు చెమర్చాయి. నాన్నా ! స్కూల్ కు ఫీజు కట్టడానికి ఈ రోజు ఆఖరు, అన్న 10 సం||రాల రేవతి ఏడుపు ఓదార్చలేనిది. ఏమండీ ! ఈ రోజు వంటకి దినుసులు లేవన్న భార్య మాటలు ఇంకా చెప్పనలవి కాదు. ఉద్యోగ ప్రయత్నం చేయడానికి బయటకు వెళ్ళడానికి కూడా చార్జీలు లేని స్థితిని నేను చెప్పలేను.

ప్రశ్న 12.
పండించిన పంట ధర సగానికంటే తక్కువకు పడిపోయిన రైతుగా మిమ్మల్ని ఊహించుకోండి. మీ స్పందనను మూడు వందల పదాలలో రాయండి.
జవాబు:
పంట చేతికి రాగానే మార్కెట్లో అప్పటివరకు ఉన్న ధర అమాంతం సగానికి పడిపోగా నా కళ్ళు చెమర్చాయి. అప్పుచేసి వ్యవసాయం చేసి, వడ్డీలకు ఎరువులు, పురుగుమందులు కొన్న నాకు ఈ ధరతో చేసిన రుణం ఎలా తీర్చగలను ? వారికి ఎలా సమాధానం చెప్పగలను? పండిన పంట ధరతో వచ్చిన డబ్బుతో పండగకి పిల్లలకు బట్టలు తీసి, ఆనందంగా జీవితం గడుపుదామనుకుంటే, ఎందుకీ దుస్థితి దాపురించింది ? నేనెవరికి ద్రోహం చేశాను అని మదనపడుతున్నాను. ” వ్యవసాయం జూదంలా పరిణమించడం ఈ పరిస్థితికి కారణం.

10th Class Social Textbook Page No.195

ప్రశ్న 13.
పిల్లల్ని పెంచే శ్రమ, బాధలకే మహిళలు పరిమితం కావాలన్న దృక్పథంతో మీరు ఏకీభవిస్తారా?
జవాబు:
నేను ఏకీభవించను. సమాజంలో కుటుంబానికి గుర్తింపు, పిల్లల భవిష్యత్తుకై మార్గదర్శకత్వం చేసి వీటికోసం తన శక్తి నంతటినీ ఒడి, భర్తకు చేదోడువాదోడుగా ఉండి, అనునిత్యం కుటుంబ పురోభివృద్ధికి ఆధారంగా ఉండేది మహిళలు. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు తన కుటుంబ అభివృద్ధికి దిక్సూచి వంటివారు మహిళలు.

AP Board 10th Class Social Solutions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

ప్రశ్న 14.
పిల్లల పెంపకం, కర్మాగారాలు, కార్యాలయాలు, పొలాల్లో పనిచెయ్యటం వంటి జీవితానికి సంబంధించిన అంశాలలో స్త్రీ, పురుషులు సమానంగా భాగస్వాములు కాగలరని మీరు అనుకుంటున్నారా?
జవాబు:
పిల్లల పెంపకం, కర్మాగారాలు, కార్యాలయాలు, పొలాల్లో పనిచెయ్యటం వంటి జీవితానికి సంబంధించిన అంశాలలో సీ, పురుషులు సమాన భాగస్వాములు. ఎందుకంటే పిల్లల పెంపకం, అమ్మ ప్రేమ, నాన్న లాలన పిల్లలకు ఎంతో అవసరం. పిల్లల పెంపకంలోనూ, పిల్లలను సన్మార్గంలో నడిపించుటలోను ఇరువురూ బాధ్యులే. కార్యాలయాల్లో స్త్రీ, పురుషులు ఇరువురు తమ మేధాశక్తితో సమానంగా పనిచేయగలరు. కర్మాగారాలు, పొలాల్లో తమతమ శక్తి మేరకు ఇరువురు కూడా పనిచేసి ఆయా పనులకు న్యాయం చేస్తారు.

10th Class Social Textbook Page No.199

ప్రశ్న 15.
హిట్లర్ సిద్ధాంతం, ఆర్థిక విధానాల ఫలితంగా రెండవ ప్రపంచ యుద్ధం సంభవించిందని ఎలా చెప్పవచ్చు?
జవాబు:
హిట్లర్ అద్భుతమైన వక్త. తన పదునైన ప్రసంగాలతో ప్రజలను ఉత్తేజితులను చేశాడు. మొదటి ప్రపంచయుద్ధం తరువాత యుద్ధ నష్టాల చెల్లింపులు వంటి వాటి భారం వల్ల జర్మనీ ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో పడింది. కార్మికులు ఉపాధి కోల్పోయారు. వేతనాలు తగ్గాయి. జర్మనీ వీధులలో పురుషులు “ఏ పని చేయడానికైనా సిద్ధం” అని రాసి ఉన్న కారులు మెడలో తగిలించుకొనేవారంటే ఆనాటి పరిస్థితిని అంచనా వేయవచ్చు.

ఇటువంటి పరిస్థితులలో హిట్లర్ తన సిద్ధాంతం ద్వారా ఇటు ప్రజలలో ఆత్మవిశ్వాసం పెంచి, మరో ప్రక్క ప్రపంచ దేశాలలో అభద్రతాభావం, సైనికవాదాలు, జాత్యహంకారాలతో ప్రపంచం భయపడేటట్టు చేసి, పోలెండ్ పై నిర్దాక్షిణ్యంగా దాడి చేసి రెండవ ప్రపంచ యుద్ధానికి కారకుడయ్యాడు.

AP Board 10th Class Social Solutions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

10th Class Social Textbook Page No.200

ప్రశ్న 16.
మొదటి ప్రపంచ యుద్ధం తరువాత రష్యా, జర్మనీల అనుభవాలను పోల్చండి. వాటిల్లో పోలికలు, తేడాలు ఏమిటి?
జవాబు:
పోలికలు :

  1. మొదటి ప్రపంచయుద్ధం తరువాత జర్మనీ, రష్యా రెండు దేశాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి.
  2. రష్యాలో లెనిన్, స్టాలిన్ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ రాజ్య కార్యక్రమాలు అమలు జరుగగా, జర్మనీలో కూడా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక ప్రజారంజక కార్యక్రమాలు రూపొందించారు.
  3. ప్రపంచంలో అగ్రదేశాలుగా ఉండడానికి జర్మనీ, రష్యా దేశాలు ప్రయత్నించాయి.

తేడాలు :

  1. మొదటి ప్రపంచ యుద్ధంలో ఈ రెండు దేశాలలో జర్మనీ ఆర్థికంగా మరియు బలీయమైన ప్రాంతాలను రష్యా కంటే – ఎక్కువగా పోగొట్టుకుంది.
  2. రష్యాలో భూముల ఏకీకరణ ద్వారా సామూహిక క్షేత్రాలకు, వ్యవసాయానికి ప్రాధాన్యతనీయగా, జర్మనీ వ్యవసాయ రంగాన్ని విస్మరించింది.
  3. రష్యా ప్రపంచంలో కార్మికులకు అధిక ప్రాధాన్యం ఇవ్వగా, సౌజీ పార్టీ సిద్ధాంతాలకు జర్మనీ ప్రాధాన్యం ఇచ్చింది.
  4. ఆర్ధికమాంద్యం సమయంలో జర్మనీ కంటే రష్యా బాగా చితికిపోయింది.
  5. జర్మనీ ప్రతీకార చర్యలతో సౌగగా, రష్యాదేశం అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చింది.
  6. మొదటి ప్రపంచయుద్ధం తర్వాత రష్యా అగ్రదేశం కాగా, జర్మనీ కుదేలైంది.