SCERT AP 10th Class Social Study Material Pdf 13th Lesson ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 13th Lesson ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

10th Class Social Studies 13th Lesson ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
తప్పు వాక్యాలను సరిచేయండి. (AS1)
1) 20వ శతాబ్ది ఆరంభంలో ప్రపంచదేశాల మధ్య తేడాలు పాశ్చాత్య దేశాలు, మిగిలిన దేశాలుగా వ్యక్తమయ్యాయి.
2) ప్రజాస్వామ్యం పుంజుకోవటంతో పాటు కొన్ని నియంతృత్వ ధోరణులను, కొత్త సామ్రాజ్యాలు ఏర్పడటాన్ని 20వ శతాబ్దం చూసింది.
3) సమానత్వం, సౌభ్రాతృత్వం అన్న సిద్ధాంతాల పునాదిపై సోషలిస్టు సమాజాలు ఏర్పడ్డాయి.
4) యుద్ధంలో పాల్గొన్న దేశాల సైనికులే కాకుండా వివిధ దేశాల సైనికులు పోరాటాలలో ఉన్నారు.
5) మొదటి ప్రపంచయుద్ధ కాలంలో, లేదా ఆ తరువాత అనేక దేశాలు రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య దేశాలుగా మారాయి.
జవాబు:

 1. 20వ శతాబ్ద ఆరంభంలో ప్రపంచంలోని దేశాలు పాశ్చాత్య దేశాలుగాను, వీటి వలన దోపిడీలతో మరింత వెనుకబడిన దేశాలుగా విభజింపబడ్డాయి.
 2. ప్రజాస్వామ్యం పుంజుకోవటంతోపాటు అందరికీ అక్షరాస్యతాస్థాయి, సగటు జీవితకాలం అపారంగా పెరిగాయి.
 3. సమానత్వం, సౌభ్రాతృత్వ సిద్ధాంతాలతో, రాజకీయ స్వేచ్ఛ, ఉగ్రవాద, సామ్యవాద, పెట్టుబడిదారీ సమాజాలు ఏర్పడ్డాయి.
 4. యుద్ధంలో పాల్గొన్న దేశాల సైనికులే కాకుండా వివిధ దేశాల సైనికులు పోరాడి వీరమరణం పొందారు.
 5. మొదటి ప్రపంచయుద్దాల అనంతరం అనేక దేశాలు రాచరిక, వలస పాలన నుండి విముక్తి పొంది ప్రజాస్వామ్య దేశాలుగా మారాయి.

ప్రశ్న 2.
ప్రపంచ యుద్ధాలలో మిత్ర రాజ్యాల, అక్ష రాజ్యాల, కేంద్ర రాజ్యాల కూటములలో భాగస్వాములైన దేశాలతో కూడిన “పట్టికను తయారుచేయడం : ఆస్ట్రేలియా, యు.ఎస్.ఎస్.ఆర్ (రష్యా), జర్మనీ, బ్రిటన్, జపాన్, ఫ్రాన్స్, ఇటలీ, యు.ఎస్.ఎ. (AS3)
జవాబు:

మిత్రదేశాలు అక్ష/ కేంద్రరాజ్యాల కూటమి
రష్యా జపాన్
ఫ్రాన్స్ జర్మనీ
బ్రిటన్ ఇటలీ
అమెరికా ఆస్ట్రియా
చైనా
సెర్బియా
పోలెండ్

AP Board 10th Class Social Solutions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

ప్రశ్న 3.
ప్రపంచ యుద్ధాలలో జాతీయ రాజ్యాలు, జాతీయతా భావం యుద్ధకాంక్షను ఎలా ప్రభావితం చేశాయి? (AS1)
జవాబు:
జాతీయ రాజ్యాలలో జాతీయతా భావం ఒక ప్రముఖ ప్రేరేపణ. నూతన శక్తికి అంకురార్పణ. ఆధునిక రాజ్యాలు ఏర్పడడానికి, జర్మనీ, ఇటలీ వంటి దేశాలు ఏకీకరణ సాధించడానికి ఇది మూలమైంది. జాతీయతా భావం ఆయా దేశాల అహంకారానికి, గర్వానికి పరాకాష్ఠ. అంతేకాకుండా ఇతరుల పట్ల ద్వేషాన్ని కలిగించడానికి కూడా ఈ దేశస్థులు జాతీయభావాన్ని ఉపయోగించుకున్నారు. ఈ ద్వేషం, అహంకారం యూరపులోని దేశాల మధ్య వైరం పెరగడానికి, అభద్రతాభావం ఏర్పడడానికి మూలమైంది.

మరో ప్రక్క ఇటలీలో ఫాసిజం, జర్మనీలో నాజీయిజం రెండూ కూడా విధ్వంసకర రూపంలో దురహంకారపూరిత జాతీయవాదాన్ని రెచ్చగొట్టి, జర్మనీయే ప్రపంచానికి మార్గదర్శకత్వం వహిస్తుందని, విజేతయై ప్రపంచాన్ని పాలిస్తుందని, పుకార్లు షికార్లు చేయించి, ప్రపంచంలోని దేశాల మధ్య ద్వేషాలు, అభద్రతాభావం పెంచి యుద్ధకాంక్షను పురిగొల్పడానికి కారణమైంది.

ప్రశ్న 4.
రెండు ప్రపంచయుద్ధాల కారణాల మీద క్లుప్తంగా రాయండి. ప్రపంచంలో ఏదైనా దేశాలలో ఈనాటికీ ఈ అంశాలు ఏమైనా ఉన్నాయా? ఏ రూపంలో? (AS4)
జవాబు:
రవి అస్తమించని సామ్రాజ్యం బ్రిటన్ పారిశ్రామికంగా అగ్రగామిగా ఉండడమే కాకుండా ప్రపంచమంతటా విశాల వలస సామ్రాజ్యాలు విస్తరింపచేసింది. ముడిపదార్థాల కొరకు, నూతన మార్కెట్ల అన్వేషణ కొరకు, పాశ్చాత్య దేశాలు దోపిడీ పాలనతో వెనుకబడిన దేశాలను తన ఆధీనంలోనికి తెచ్చుకున్నాయి. ఏకీకరణ భావనతో ఫాసిజం, నాజీయిజం అనుచరులు అహంకారాన్ని ప్రేరేపించడమే కాకుండా ప్రపంచాన్నంత ద్వేషభావంతో చూశారు. పారిశ్రామిక అభివృద్ధి దేశాలుగా బ్రిటన్, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్ వలసపాలిత దేశాలపై ఆధిపత్యం చెలాయించాయి. రానురాను వలసపాలిత దేశాలు స్వాతంత్ర్యం కొరకు పోరాటాలు మొదలు పెట్టాయి. ప్రపంచ ఆధిపత్యం కొరకు పారిశ్రామిక దేశాలు కూడా గొడవలు పడటం ప్రారంభించాయి. దురహంకారపూరిత జాతీయతావాదం, సామ్రాజ్యవాదం, రహస్య ఒప్పందాలు, సైనికవాదం వంటి కారణాలు మొదటి ప్రపంచయుద్ధానికి కారణమవ్వగా, రెండవ ప్రపంచయుద్ధానికి కారణం వర్సయిల్స్ సంధిలో ఉన్న అవమానకర చర్యలు జర్మనీలో ద్వేషాలు పెరగడానికి కారణమయ్యాయి. అభద్రతాభావం విద్వేషాలు, అనుమానాలు యుద్దాలు సంభవించడానికి దోహదం చేశాయి. అయితే ఈ నాటికీ పై అంశాలు ప్రపంచంలో చాలా తక్కువగా కనిపిస్తుండగా పాకిస్థాన్, ఇరాన్, ఇరాక్ వంటి దేశాలలో పై లక్షణాలు, కారణాలు అప్పుడప్పుడూ ప్రస్ఫుటమవుతున్నాయి.

AP Board 10th Class Social Solutions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

ప్రశ్న 5.
20వ శతాబ్దపు ప్రథమ అర్ధభాగంలో యుద్ధాల యొక్క వివిధ ప్రభావాలు ఏమిటి? (AS1)
(లేదా)
20 శతాబ్దపు మొదటి సగంలో సంభవించిన ముఖ్యమైన పరిణామాలను పేర్కొని ఏవేని రెండింటిని వివరించండి.
జవాబు:
చరిత్రకారుడైన “ఎరిక్ హాబ్స్ బామ్” పేర్కొన్నట్లు 20వ శతాబ్దం “తీవ్ర సంచలనాల యుగం”. జాతీయతాభావంతో ప్రపంచంలోని ఇతర ప్రజల పట్ల ద్వేషం, అవధులు లేని అధికారంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

1914-18 సం||రాల మధ్య జరిగిన మొదటి ప్రపంచయుద్ధం తదుపరి నాజీ, ఫాసిజం పార్టీలు భావజాలంతో ప్రపంచదేశాలను తక్కువగా చూడనారంభించారు. 1929-30 సం||రాల మధ్య తీవ్ర ఆర్థికమాంద్యం సంభవించి, ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నం అయింది. రెండు ప్రపంచయుద్ధాలు సంభవించి, లక్షలాదిమంది చనిపోయారు. ఇంకా ఎన్నో లక్షలమంది నిర్వాసితులయ్యారు. ఎన్నో ఆశలు, ప్రయోగాలు, ప్రమాదకర పరిణామాలు సంభవించాయి. ప్రపంచంలో చాలాదేశాలు చిన్నాభిన్నం కాగా, జర్మనీ, జపాన్ దేశాలు తుడిచిపెట్టుకుపోయాయి. ప్రథమార్ధంలో సంభవించిన యుద్ధాల వల్ల ల్యుకేమియా, క్యాన్సర్ వంటి సమస్యలు దశాబ్దాలపాటు కొనసాగాయి. మాయామర్మం తెలియని 60 లక్షల యూదులు, ఒక్క నాగసాకి, హిరోషిమాలపై అమెరికా వేసిన అణుబాంబు వల్ల 1,50,000 నుంచి 2,46,000 మంది పౌరులు చనిపోయారు. మిత్రదేశాలు, కేంద్ర దేశాలుగా విడివడి ఒక దేశం మరో దేశం మీద ద్వేషాలు పెంచుకొనే స్థితికి చేరుకున్నాయి. యుద్ధంలో పాల్గొన్న దేశాలతో పాటు యుద్ధ ప్రభావం ఆర్ధిక సామాజిక రంగాలపై పడింది.

10th Class Social Studies 13th Lesson ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I InText Questions and Answers

10th Class Social Textbook Page No.181

ప్రశ్న 1.
దురహంకారపూరిత జాతీయతావాదం, సామ్రాజ్యవాదం, అధికార కేంద్రాలు, మిలటరీవాదం ఇప్పుడు కూడా ఉన్నాయా ? ఉదాహరణలతో తరగతిలో చర్చించండి.
జవాబు:
పై లక్షణాలు అప్పుడప్పుడూ అగ్రదేశాలలో కనిపిస్తాయి. అమెరికా, ఇంగ్లండ్, రష్యా వంటి దేశాలలో అప్పుడప్పుడూ ప్రస్ఫుటమవుతుంది.

10th Class Social Textbook Page No.181

ప్రశ్న 2.
గత పది సంవత్సరాలలో జరిగిన కొన్ని యుద్దాల గురించి తెలుసుకొని వాటికి పై నాలుగు కారణాలు ఎంతవరకు దోహదం చేశాయో చూడండి.
జవాబు:
గత 10 సం||లలో యుద్ధాలు సంభవించలేదు.

10th Class Social Textbook Page No.176&177

ప్రశ్న 3.
ఇక్కడ కొన్ని బొమ్మలు ఉన్నాయి. వీటికీ పైన పేర్కొన్న అంశాలకీ సంబంధం గుర్తించి వాటి మీద చిన్న వ్యాసం రాయండి.
అ) నర్స్ బెర్గ్ వద్ద 1934లో హిట్లర్ నాజీ పార్టీ ప్రదర్శన. మీరు చూసిన రాజకీయపార్టీల ప్రదర్శనలతో దీనిని పోల్చండి.
AP Board 10th Class Social Solutions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 1
జవాబు:
మొదటి ప్రపంచయుద్ధం తర్వాత జరిగిన అవమానకర ఒప్పందాలతో కృంగిపోయి, ప్రతీకార కాంక్షతో రగిలిపోయే నాజీపార్టీ స్థాపకుడు హిట్లర్, ప్రపంచానికి తమ అవధులు లేని భావజాలం ప్రదర్శిస్తూ నిర్వహించిన ర్యాలీ. ప్రస్తుతం రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఓట్లడిగే క్రమంలో ఇలా ర్యాలీగా వెళ్ళడం చూస్తుంటాం.

ఆ) మాంద్య కాలంలో పోలిష్ వలస కార్మికురాలు ఫ్లోరెన్స్ ఓవెన్స్ ఫోటో, దారితియా లాంజ్ తీసిన ఈ ఫోటో ఎంతో ప్రఖ్యాతి గాంచింది. 1936 మార్చి సమయంలో కాలిఫోర్నియాలో బఠానీ కోసేవాళ్ళ తీవ్ర పరిస్థితిని ఇది సూచిస్తుంది. ఆమె ఏమి ఆలోచిస్తూ ఉంటుంది?
AP Board 10th Class Social Solutions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 2
జవాబు:
20వ శతాబ్దంలో ప్రపంచంలో పెనుమార్పులు సంభవించాయి. గొప్ప ప్రయోగాలు కూడా చోటు చేసుకున్నాయి. 1929-30 సం||లో తీవ్ర ఆర్థికమాంద్యం సంభవించి ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నం అయింది. ఫోటోలో కనిపిస్తున్న “ఫ్లోరెన్స్ ఓవెన్స్” ఆలోచిస్తూ నిరుద్యోగం పెరిగి, ఆర్థిక అవకాశాలు లేక, ఆకలితో అలమటించే పిల్లలకు ఆహారం తినిపించే మార్గం ఏదీ లేదా ? పిల్లల రోదనలను ఆపే మార్గం ఎలా ? అని ఆలోచిస్తుంది.

ఇ) నాగసాకి మీద ‘అణుబాంబు : ఈ బాంబు ప్రభావాన్ని తెలియజేసే ఫోటోలు ఈ అధ్యాయం చివరలో ఉన్నాయి.
AP Board 10th Class Social Solutions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 3
జవాబు:
రెండవ ప్రపంచయుద్ధంలో దూసుకుపోతున్న జపానను అడ్డుకట్ట వేసి, యుద్ధాన్ని ముగించే క్రమంలో అమెరికా జపాన్లోని శక్తివంతమైన, పురోభివృద్ధిలో ముందున్న నాగసాకి, హిరోషిమాపై అణుబాంబులు ప్రయోగించి తునాతునకలు చేయగా, ఆ సందర్భంగా వెలువడు విధ్వంస దృశ్యాలు అవి.

ఈ) రష్యాలో బోల్షివిక్ విప్లవాన్ని సూచిస్తూ 1920 లో కుస్తోదీప్ వేసిన చిత్రం. చిత్రకారుడు ఏం చెప్పటానికి ప్రయత్నిస్తున్నాడు? పెద్ద ఆకారంలో ఉన్న వ్యక్తి ఎవరు?
AP Board 10th Class Social Solutions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 4
జవాబు:
రష్యాలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రష్యా విప్లవంలో భాగంగా జార్ చక్రవర్తులను, వారి కోటల నివాసాలను తుదముట్టించే క్రమంలో “పెట్రోగ్రాడ్” నగరంలో లెనిన్ నాయకత్వం వహిస్తూ విప్లవంలో పాల్గొన్న దృశ్యం చూడవచ్చు.

ఉ) 1929లో జర్మనీలో వెలువడిన వ్యంగ్య చిత్రం. దాని కింద ‘యూదుల నుంచి కొనండి, మీ ప్రజలకు ద్రోహం చెయ్యండి’ అనే వ్యాఖ్యానం ఉంది. ఇది ఏ వివక్షతా ధోరణిని చూపిస్తోంది?
AP Board 10th Class Social Solutions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 5
జవాబు:

 1. యూదుల వద్ద నుండి ఏ రకమైన వస్తువులనైనా, జర్మనీ ప్రజలు కొనుగోలు చేయకూడదనే వివక్షత ధోరణిని ఈ వ్యంగ్య చిత్రం చూపిస్తుంది.
 2. యూదుల నండి ఏ వస్తువునైనా కొన్నట్లయితే అది జర్మనీకి ద్రోహం చేసినట్లుగా భావించబడుతుంది అని ఆ చిత్రం తెలుపుతుంది.
 3. హిట్లర్ కాలంలో జర్మనీ ప్రజల ‘సోర్డిక్ జాతి’ ఆధిక్యతను తెలుపుతుంది.
 4. యూదుల మీద అపరిమితమైన ద్వేషమును పెంచుకున్నారు.
 5. ఆ తరువాత రోజులలో హిట్లరు అనుచరులచే దాదాపు 60 లక్షల యూదులు చంపబడినారు.

10th Class Social Textbook Page No.179

ప్రశ్న 4.
తెలుసుకోండి : భారతదేశం-పాకిస్తాన్ల మధ్య 1971లో యుద్ధం ఎంతకాలం కొనసాగింది? ఈ యుద్ధంలో ఎంతమంది చనిపోయారు?
జవాబు:

 1. 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో ఇండియా – పాకిస్థాన్లు ప్రత్యక్ష సైనిక యుద్ధానికి దిగినాయి.
 2. ఈ యుద్ధం 3-12-1971న ప్రారంభమై 16-12-1971న ముగిసినది.
 3. ఈ యుద్ధం మొత్తం 13 రోజులలో ముగిసినది. ఇది చరిత్రలోని చిన్న యుద్ధాలలో ఒకటిగా భావించబడుతుంది.
 4. ఈ యుద్ధంలో 3,843 భారత సైనికులు, 9,000 పాకిస్థానీ సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
 5. 9,861 మంది భారత సైనికులు, 4,350 పాకిస్తానీ సైనికులు గాయాలపాలైనారు.
 6. 97,368 పాకిస్థానీ సైనికులు ఈ యుద్ధంలో ఖైదు చేయబడినారు.

AP Board 10th Class Social Solutions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

10th Class Social Textbook Page No.181

ప్రశ్న 5.
పారిశ్రామికీకరణ ఆధునిక యుద్ధాలకు ఎలా దారి తీసింది?
జవాబు:
ప్రపంచం పాశ్చాత్య పారిశ్రామిక అభివృద్ధి దేశాలుగా కీర్తింపబడి, గుర్తింపబడిన బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, అమెరికా, జపాన్, జర్మనీలు పారిశ్రామికీకరణ వలన ముడిపదార్థాల కొరకు, నూతన మార్కెట్ల కొరకు అన్వేషణ చేసి చాలా దేశాలను వలసపాలిత ప్రాంతాలుగా చేసుకొనే క్రమంలో తీవ్ర పోటీ ఏర్పడింది. ఒక దేశం మరో దేశం మీద ఆధిపత్యం చెలాయిస్తూ ఉండటం వలన తరచు గొడవలు జరుగుచుండేవి. తద్వారా అభద్రతాభావం, జాత్యహంకారం, సామ్రాజ్యవాద రూపాలు అత్యున్నత దశకు చేరుకోవడంతో ఆధునిక యుద్ధాలకు దారితీసింది.

10th Class Social Textbook Page No.181

ప్రశ్న 6.
తమ దేశం పట్ల ప్రజలకు ఉన్న ప్రేమ ఇతర దేశాలతో యుద్ధానికి దారి తీస్తుందా?
జవాబు:
ప్రపంచ ఆధిపత్య క్రమంలో ప్రజలలో తమ దేశం పట్ల ప్రేమ. మితిమీరింది. అభివృద్ధి క్రమంలో, ఆర్ధిక పురోభివృద్ధిలో ముందుండాలనే ఆశతో పాటు, ఇతర దేశాల పట్ల, ప్రజల పట్ల ద్వేషాన్ని రగిల్చింది. తమ దేశం పట్ల ఉన్న ప్రేమ, ఇతర దేశ ప్రజలను రెచ్చగొట్టే విధానంలో ఆలోచనలు ఎక్కువయ్యాయి. తమ దేశమే విశ్వనాయకత్వం వహిస్తుందనే అహంకార పూరిత ప్రేమ యుద్ధాలకు దారితీస్తుంది.

10th Class Social Textbook Page No.183

ప్రశ్న 7.
నానాజాతి సమితిలో ఏర్పడిన అంతర్జాతీయ కార్మిక సంఘం (ILO), ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వంటివి ఈ నాటికీ పనిచేస్తున్నాయి. వాటి కార్యక్రమాల గురించి తెలుసుకొని వాటిల్లో ఒకదాని గురించి ఒక నివేదిక తయారుచేయండి.
జవాబు:
మొదటి ప్రపంచయుద్ధం అనంతరం, మరో ప్రపంచయుద్ధం జరగకుండా, ప్రపంచ శాంతిని నెలకొల్పే క్రమంలో అమెరికా అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్ 1920లో నానాజాతి సమితిని ఏర్పాటుచేసి, అందులో అనుబంధ సంస్థలుగా అంతర్జాతీయ కార్మికసంఘం (ILO), ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) లను ఏర్పాటు చేయగా అవి ఈనాటికీ అద్భుతంగా పనిచేస్తున్నాయి.

అంతర్జాతీయ కార్మిక సంఘం గూర్చి ఒక నివేదిక : అంతర్జాతీయ కార్మిక సంఘం ఈనాటికీ దిగ్విజయంగా పనిచేస్తుంది. నానాజాతి సమితిలోని సభ్యదేశాలలోని కార్మికుల స్థితిగతులు, జీవన విధానాన్ని మెరుగుపరచింది. చైనా, ఇంగ్లాండ్ దేశాల మధ్య యుద్ధాలకు కారణమైన నల్లమందు రవాణాను ఆపి, స్నేహపూర్వక వాతావరణాన్ని నెలకొల్పింది. కార్మికుల, స్త్రీల స్థితిగతులలో మార్పుచేసి, విదేశాలకు స్త్రీలను ఎగుమతి చేయడాన్ని నిషేధించింది. బానిసత్వాన్ని, వెట్టిచాకిరీని నిషేధించి, సమానత్వాన్ని అందించి, కార్మికులలో ఆత్మస్టెర్యాన్ని పెంచింది.

10th Class Social Textbook Page No.181

ప్రశ్న 8.
ఒక దేశం రెండవ దేశంతో దురహంకారపూరితంగా ప్రవర్తిస్తే, రెండవ దేశం కూడా అదే విధంగా స్పందించాలా ? సమస్య పరిష్కారానికి ఇతర మార్గాలు ఏమున్నాయి?
జవాబు:
దురహంకారంతో కూడిన జాతీయతావాదం ప్రమాదకరం. ప్రతీకారేచ్ఛతో రగిలిపోయే దేశాలు అదనుకోసం ఎదురుచూస్తుంటే మరో ప్రక్క విద్వేషాలు పెరిగి, యుద్ధ వాతావరణాన్ని తలపించే ఏర్పాట్లు దేశాల మధ్య అంతరాన్ని సృష్టించాయి. ప్రతీ దేశం కూడా మేమే ప్రపంచ విజేత కాబోతున్నాం, ఇతరుల మీద ఆధిపత్యం చెలాయించబోతున్నామంటూ ప్రకటించుకున్నాయి. గర్వం, ఇతరుల పట్ల ద్వేషం వీటివల్ల ప్రపంచం యావత్తు అభద్రతాభావంతో మునిగిపోయింది. తద్వారా ప్రతీ దేశం కూడా ఆ దేశం కంటే మేమేం తక్కువ కాదు అన్నట్లు దురహంకారపూరిత చర్యలకు పూనుకున్నాయి.

వేరే పరిష్కార మార్గాలున్నప్పటికీ “ప్రతీకారం” ఒక్కటే సరైన మార్గంగా దేశాలు భావించాయి. నానాజాతి సమితి వంటి అంతర్జాతీయ శాంతి సంస్థ ఉండి కూడా ప్రతీకారాన్ని ఆపి, మరో ప్రపంచయుద్ధాన్ని నివారించలేకపోయింది.

AP Board 10th Class Social Solutions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

10th Class Social Textbook Page No.183

ప్రశ్న 9.
1919లో గెలిచిన దేశాలు జర్మనీ పట్ల అంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించి ఉండకపోతే రెండవ ప్రపంచ యుద్ధం వచ్చి ఉండేదా?
జవాబు:
1919లో గెలిచిన దేశాలు జర్మనీ పట్ల అంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించి ఉండకపోతే రెండవ ప్రపంచయుద్ధం వచ్చి ఉండేది కాదు. బ్రిటన్, ఫ్రాన్లు గెలిచిన పిదప వర్సయిల్స్ శాంతి సమావేశంలో పెట్టిన అవమానకర షరతులు జర్మనీని అథఃపాతాళానికి నెట్టాయి. వర్సయిల్స్ శాంతి సంధికి కూడా విజేతలైన అమెరికా, బ్రిటన్లు, ఫ్రాన్స్, ఇటలీ, జపానులను ఆహ్వానించాయి. కానీ, జర్మనీని ఆహ్వానించలేదు. ప్రపంచ భవిష్యత్తుపై చర్చలు జరుపుతున్న వాళ్ళు జర్మనీ సలహాలు, భావాలను పరిగణనలోకి తీసుకోలేదు. దీనివల్ల వర్సయిల్స్ ఒప్పందం తమపై బలవంతంగా రుద్దబడిందని జర్మనీ భావించింది. జర్మనీ భూభాగాలను ఆక్రమించడమే కాకుండా సైనిక బలగాన్ని తగ్గించి ఆల్వాస్, లోరైన్ వంటి ఐరోపా, ప్రాంతాలను జర్మనీ నుండి ఆక్రమించుకున్నాయి. ఈ విధంగా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడం వలన రెండవ ప్రపంచయుద్ధం రావడానికి మూలమైంది.