AP SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు Notes, Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

అలంకారం :
చెప్పదలచిన విషయాన్ని అందంగా మలిచేది.
అలంకారాలు రెండు రకాలు : –
అ) శబ్దాలంకారాలు
ఆ) అర్థాలంకారాలు

అ) “శబ్దాలంకారాలు” :
శబ్ద చమత్కారంతో పాఠకునికి ఆనందాన్ని కల్గించేవి “శబ్దాలంకారాలు.”
కింది గేయాన్ని గమనించండి.
“అది గదిగో మే
మేడకున్నది గో
గోడ పక్కని నీ
నీడలో కోడె దూ
దూడ వేసింది పే

పై కవితలో ప్రతివాక్యం చివర ‘డ’ అనే అక్షరం, మళ్ళీ మళ్ళీ వచ్చింది. (అంటే పునరావృతమయ్యింది) ఇది ఆ కవితకు అందం తెచ్చింది. వినడానికి సొంపుగా తయారయ్యింది. ఈ అందం, వినసొంపు ‘డ’ అనే శబ్దం మళ్ళీ మళ్ళీ ప్రయోగించడం వల్ల వచ్చింది. కాబట్టి దీనిని “శబ్దాలంకారం” అంటారు.

AP SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

1) అంత్యానుప్రాసాలంకారం :
ఒకే అక్షరం లేదా రెండు మూడు అక్షరాలు, వాక్యం చివర మాటి మాటికి వస్తే దాన్ని ‘అంత్యానుప్రాస’ అలంకారం అంటారు.
ఉదా :
1) భాగవతమున భక్తి
భారతమున యుక్తి
రామకథయే రక్తి
ఓ కూనలమ్మ

గమనిక :
పై కవితలో ప్రతివాక్యం చివర ‘క్తి’ అనే అక్షరం తిరిగి తిరిగి వచ్చింది. కాబట్టి ఈ ‘కవితలో ‘అంత్యానుప్రాస’ అనే శబ్దాలంకారం ఉంది.
2) గుండెలో శూలమ్ము
గొంతులో శల్యమ్ము

పై కవితలో ‘మ్ము’ అనే అక్షరం ప్రతి పాదం చివరా వచ్చింది. కాబట్టి దీనిలో ‘అంత్యానుప్రాస’ అనే శబ్దాలంకారం ఉంది.

అంత్యానుప్రాసాలంకారం : (లక్షణం) :
పాదాంతంలో లేదా పంక్తి చివరలో, ఒకే ఉచ్చారణతో ముగిసే పదాలు లేదా అక్షరాలు ఉంటే దాన్ని “అంత్యానుప్రాసాలంకారం” అంటారు.

కింది గేయాలు గమనించండి :
1) వేదశాఖలు వెలసె నిచ్చట
ఆదికావ్యం బలరె నిచ్చట

గమనిక :
ఈ గేయంలోని మొదటి పంక్తి చివర, ‘ఇచ్చట’ అనీ, అలాగే రెండవ పాదం చివర కూడా ‘ఇచ్చట’ అనీ ఉంది. కాబట్టి “అంత్యానుప్రాసాలంకారం” దీనిలో ఉంది.
2) తలుపు గొళ్ళెం
హారతి పళ్ళెం
గుర్రపు కళ్ళెం

పై మూడు పాదాల్లోనూ చివర ‘ళ్ళెం’ అనే అక్షరం వచ్చింది కాబట్టి దీనిలో కూడా ‘అంత్యానుప్రాసాలంకారం’ ఉంది.

2) వృత్త్యనుప్రాసాలంకారం :
అక్షరం అనేకసార్లు తిరిగి రావడాన్ని ‘వృత్త్యనుప్రాసాలంకారం’ అంటారు. ‘వృత్తి’ అంటే ఆవృత్తి అని అర్థం. ఆవృత్తి అంటే మళ్ళీ మళ్ళీ రావడం.
ఉదా :
నాయనా ! నేను నిన్నే మన్నా అన్నానా ? నీవు నన్నే మన్నా అన్నావా ?

గమనిక :
పై వాక్యంలో ‘న’ అనే అక్షరం, అనేకమార్లు వచ్చింది. కాబట్టి ఇది “వృత్త్యనుప్రాస” అనే శబ్దాలంకారం.

అభ్యాసం :

  1. కా కి కో కికా దు దా !
  2. లచ్చి పుచ్చకాయలు తెచ్చి ఇచ్చింది.

వృత్త్యనుప్రాసాలంకారం (లక్షణం) :
మొదటి వాక్యంలో ‘క’, రెండో వాక్యంలో ‘చ్చ’ అనే అక్షరం ఆవృత్తి అయ్యింది. కాబట్టి ఇది “వృత్త్యనుప్రాసాలంకారం”.

ఈ కింది వాక్యాలు చూడండి.

  1. ఆమె కడవతో వడి వడి అడుగులతో గడపను దాటింది.
  2. చిట పట చినుకులు టపటపమని పడుతున్నవేళ

గమనిక :
మొదటివాక్యంలో ‘డ’ అనే హల్లు, రెండవ వాక్యంలో ‘ఓ’ అనే హల్లు చాలాసార్లు వచ్చాయి.

ఈ క్రింది ఉదాహరణలు కూడా చూడండి.
అ) బాబు జిలేబి పట్టుకొని డాబా పైకి ఎక్కాడు.
ఆ) గట్టు మీది చెట్టు కింద కిట్టు రొట్టెను లొట్టలేస్తూ తింటున్నాడు.
ఇ) లక్ష భక్ష్యాలు తినేవాడికి, ఒక భక్ష్యం లక్ష్యమా.

లక్షణం :
ఒక హల్లు గాని, రెండు మూడు హల్లులు గాని, వేరుగా ఐనా, కలిసి ఐనా, మళ్ళీ మళ్ళీ వచ్చినట్లయితే, దాన్ని ‘వృత్త్యనుప్రాస అలంకారం’ అంటారు.

AP SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

3. ఛేకానుప్రాసాలంకారం : కింది వాక్యం చదవండి.
ఉదా :
“నీకు వంద వందనాలు”.

పై వాక్యంలో వంద అనే హల్లుల జంట, వెంట వెంటనే అర్థ భేదంతో వచ్చింది. ఇక్కడ మొదట వచ్చిన ‘వంద’ – నూరుసంఖ్యను తెలుపుతుంది. రెండోసారి వచ్చిన ‘వంద’, వందనాలు అంటే నమస్కారాలు అని తెలుపుతోంది.

ఛేకానుప్రాస (లక్షణం) :
హల్లుల జంట అర్థ భేదంతో వెంట వెంటనే వస్తే, దానిని ‘ఛేకానుప్రాస’ అలంకారం అంటారు.

ఛేకానుప్రాసకు మరికొన్ని ఉదాహరణలు :
1) పాప సంహరుడు హరుడు
2) మహా మహీభారము

4. ముక్తపదగ్రస్త అలంకారం : ఇది శబ్దాలంకారం.
లక్షణం :
ఒక పద్యపాదం గాని, వాక్యం కాని ఏ పదముతో పూర్తి అవుతుందో, అదే పదంతో తర్వాత పాదం / వాక్యం మొదలవుతుంది. దీన్ని “ముక్తపదగ్రస్త అలంకారం” అంటారు.
ఉదా :
జనకుడుండెడి యనుష్ఠాన వేదిక జూచు
చూచి క్రమ్మర బోయి జూడవచ్చు

గమనిక :
మొదటి పాదం చివర ‘చూచు’ అనే పదం ఉంది. రెండవ పాదం ‘చూచి’ అని ‘చూచు’తో మొదలయ్యింది. కాబట్టి ఇది ‘ముక్తపదగ్రస్త అలంకారం.
అ) ఉదా :
అది గదిగో మేడ
మేడ పక్కన నీడ
నీడలో ఉన్నది దూడ
దూడ వేసింది పేడ

గమనిక :

  1. మొదటి పాదం చివర ఉన్నది ‘మేడ’ అనే పదం. రెండవ పాదం మొదట తిరిగి ‘మేడ’ అనే అదే పదం వచ్చింది.
  2. అలాగే రెండవ పాదం చివర ‘నీడ’ అనే పదం ఉంది. మూడవ పాదం మొదటలో తిరిగి ‘నీడ’ అనే పదం వచ్చింది.
  3. మూడవ పాదం చివర ‘దూడ’ అనే పదం వచ్చింది. నాల్గవ పాదం మొదట్లో తిరిగి ‘దూడ’ అనే పదమే వచ్చింది.

వివరణ :
పాదం చివర విడిచిన పదం తిరిగి తరువాత పాదం మొదట్లో రావడం జరిగింది. కాబట్టి. ఇది “ముక్తపదగ్రస్త అలంకారం.”

అభ్యాసం :
కింది ఉదాహరణలు ఏయే అలంకారాలకు చెందినవో గుర్తించండి. సమన్వయం రాయండి.

ఆ) సుదతీ నూతన మదనా
మదనా గతురంగ పూర్ణమణిమయ సదనా
సదనామయ గజరదనా!
రదనాగేంద్ర నిభకీర్తిరస నరసింహా!

సమన్వయం :
పై పద్యంలో “ముక్తపదగ్రస్తం” అనే అలంకారం ఉంది.

ముక్తపదగ్రస్తాలంకారం (లక్షణం) :
ఒక పద్యపాదం గాని, వాక్యంకాని ఏ పదంతో పూర్తి అవుతుందో అదే పదంతో తర్వాత పాదం / వాక్యం మొదలవుతుంది. దీన్ని “ముక్తపదగ్రస్త అలంకారం” అంటారు.

గమనిక : పై పద్యంలో

  1. మొదటి పాదం చివర ‘మదనా’ అని ఉంది. రెండవ పాదం మొదట్లో తిరిగి ‘మదనా’ అని మొదలయ్యింది.
  2. రెండవ పాదం చివర ‘సదనా’ అని ఉంది. మూడవ పాదం మొదట్లో ‘సదనా’ అని మొదలయ్యింది.
  3. మూడవ పాదం చివర ‘రదనా’ అని ఉంది. నాల్గవ పాదం తిరిగి ‘రదనా’ తో మొదలయ్యింది. ఈ విధంగా పాదం చివర ఉన్న శబ్దంతోనే, తిరిగి తరువాతి పాదం మొదలవుతోంది. కాబట్టి ఇది “ముక్తపదగ్రస్త అలంకారం”.

5. యమకం : ఇది శబ్దాలంకారం.
లక్షణం : ఒకే పదం అర్థభేదంతో ప్రయోగించడాన్ని ‘యమకాలంకారం’ అంటారు.
ఉదా :
మన సైనిక కాయము కాయము మరచి పోరాడుతున్నది.

గమనిక :
పై ఉదాహరణలో ‘కాయము’ అనే పదం, రెండుసార్లు వచ్చింది. ‘కాయము’ అనే శబ్దం ఇక్కడ అర్థభేదంతో ప్రయోగింపబడింది.

మొదటి ‘కాయము’ అనేది ‘నికాయము’ = బృందము అనే పదంలోని భాగం. రెండవ ‘కాయము’ అనగా ‘శరీరం’ అని అర్థం.

సమన్వయం :
ఇక్కడ ‘కాయము’ అనే శబ్దం అర్థభేదంతో తిరిగి ప్రయోగింపబడింది. కాబట్టి ఇది “యమకం” అనే శబ్దాలంకారం.

అభ్యాసం :
ఈ కింది వాక్యాలలోని అలంకారాన్ని గుర్తించి సమన్వయించండి.

ఆ) ఆ తోరణం శత్రువుల తోరణానికి కారణమైంది.
సమన్వయం :
‘తోరణం’ అనే శబ్దం, ఈ వాక్యంలో రెండు సార్లు వచ్చింది. మొదటి ‘తోరణం’ అనే శబ్దానికి ద్వారానికి కట్టే అలంకారం అని అర్థం. రెండవ తోరణ శబ్దంలోని ‘రణం’, అంటే యుద్ధం అని అర్థం. ఈ విధంగా తోరణ శబ్దం అర్థం భేదంతో రెండుసార్లు వచ్చింది. కాబట్టి ‘యమకం’ అనే శబ్దాలంకారం పై వాక్యంలో ఉంది.

యమకం (లక్షణం) :
ఒకే పదం అర్థభేదంతో ప్రయోగించడాన్ని “యమకాలంకారం” అంటారు.

AP SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

6. లాటానుప్రాస : ఇది శబ్దాలంకారం.
లక్షణం :
ఒకే పదాన్ని అర్థం ఒకటే అయినా, తాత్పర్య భేదంతో ప్రయోగించడాన్ని ‘లాటానుప్రాసాలంకారం’ అంటారు.
ఉదా :

  1. హరి భజియించు చేయు హస్తములు హస్తములు
  2. దీనమానవులకు సేవ సేవ

గమనిక :
పై వాక్యాలలో హస్తములు, హస్తములు, సేవ, సేవ అని ఒకే పదం. అర్థంలో తేడా లేకున్నా, భావంలో తేడా ఉండేటట్లు ప్రయోగించారు.

వివరణ :

  1. ‘హస్తములు’ అనగా చేతులు, రెండవ సారి వచ్చిన ‘హస్తములు’ అనగా సార్థకమైన ‘హస్తములు’ అని అర్థం.
  2. ‘సేవ’ అనగా సేవ చేయడం . రెండవసారి వచ్చిన ‘సేవ’ అనగా ‘నిజమైన సేవ’ అని భావం.

అభ్యాసం :
ఈ కింది వాక్యంలో అలంకారాన్ని పేర్కొని సమన్వయించండి.
1) కమలాక్షునర్చించు కరములు కరములు.

సమన్వయం :
పై వాక్యంలో ‘కరములు’ అనే పదం రెండుసార్లు వచ్చింది. అర్థంలో భేదం లేదు. తాత్పర్యం మాత్రమే భేదం. కాబట్టి ఈ వాక్యంలోని శబ్దాలంకారం “లాటానుప్రాసం”.

లాటానుప్రాస అలంకారం (లక్షణం) :
ఒకే పదాన్ని అర్థం ఒకటే అయినా, తాత్పర్య భేదంతో ప్రయోగించడాన్ని “లాటానుప్రాస అలంకారం” అంటారు.

అర్థాలంకారాలు :
అర్థ చమత్కారంతో పాఠకునికి ఆనందాన్ని కలిగించేవి “అర్థాలంకారాలు.”

1. ఉపమాలంకారం :

  1. ఆమె ముఖం అందంగా ఉంది.
  2. అమె ముఖం చంద్రబింబంలాగ అందంగా ఉన్నది.

గమనిక :
పై వాక్యాలలోని తేడాను గమనించండి. ఆమె ముఖం చంద్రబింబంలాగా అందంగా ఉంది, అనే వాక్యం మనలను ఆకట్టుకుంటుంది. ఈ విధంగా ఒక విషయాన్ని ఆకట్టుకొనేలా చెప్పడానికిగాను అందమైన పోలికను చెప్పడాన్ని ‘ఉపమాలంకారం’ అంటారు.
ఉదా :
సోముడు భీముడివలె బలవంతుడు.

గమనిక :
ఈ వాక్యంలో సోముణ్ణి భీముడితో పోల్చారు. ఇలా చెప్పినపుడు వాక్యంలో ఉండే పదాలను, కొన్ని ప్రత్యేకమైన పేర్లతో పిలుస్తాము.
1) సోముడు – ఉపమేయం – (అంటే ఎవరిని గురించి చెప్పుతున్నామో ఆ పదం)
2) భీముడు – ఉపమానం – (ఎవరితో పోలుస్తున్నామో ఆ పదం)
3) బలవంతుడు – సమానధర్మం – (పోల్చడానికి వీలయిన సమాన గుణం)
4) వలె – ఉపమావాచకం – (ఉపమానాన్ని సమానధర్మంతో కలపడానికి వాడే పదం)

ఉపమాలంకారం :
ఉపమానోపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే “ఉపమాలంకారం.”

2. ఉత్ప్రేక్షాలంకారం :
ఉపమేయాన్ని మరొక దానిలా ఊహించి చెప్పడం, “ఉత్ప్రేక్షాలంకారం.”
ఉదా :
ఆమె ఇంటి ముందున్న పెద్ద కుక్కను చూసి, సింహం ఏమో అని భయపడ్డాను.

గమనిక :
పై వాక్యంలో ఒక దాన్ని చూసి మరొకటి అనుకోవడం లేదా ఊహించుకోవడం జరిగింది. ఇలా అనుకోవడం లేదా ఊహించుకోవడం కూడా అలంకారమే. ఇలా ఉన్నదాన్ని లేనట్లుగా, లేనిదాన్ని ఉన్నట్లుగా ఊహించి చెప్పడాన్ని ‘ఉత్ప్రేక్షాలంకారం’ అంటారు.
ఉదా :

  1. ఆ మేడలు ఆకాశాన్ని ముద్దాడుతున్నాయో అన్నట్లు ఉన్నవి.
  2. ఆ ఏనుగు నడగొండా అన్నట్లు ఉంది.

పై వాక్యంలో 1) ఉపమేయం – ఏనుగు
2) ఉపమానం – నడకొండ (నడిచే కొండ)
అంటే ఏనుగును, నడిచే కొండలా ఊహించాము. కాబట్టి “ఉత్ప్రేక్షాలంకారం.”

AP SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

3. రూపకాలంకారం :
ఉపమాన ధర్మాన్ని ఉపమేయంలో ఆరోపించి, వీటి రెంటికీ అభేదాన్ని (భేదం లేదని) చెప్పడమే, ‘రూపకాలంకారం’ అంటారు.
ఉదా :
‘ఆయన మాట కఠినమైనా మనసు వెన్న’ ఇందులో
1) ‘మనస్సు’ – అనేది ఉపమేయం.
2) వెన్న – ఉపమానం (పోల్చినది)

ఉపమానమైన ‘వెన్న’ లక్షణాలను, ఉపమేయమైన ‘మనస్సు’తో భేదం లేకుండా పోల్చడం జరిగింది. అంటే వెన్నకూ, మనస్సుకూ భేదం లేదు. రెండూ ఒకటే అనే భావాన్ని ఇస్తోంది.

అభ్యాసం :
కింది వాక్యాలను పరిశీలించి అలంకారాన్ని గుర్తించండి.

  1. మా అన్న చేసే వంట నలభీమపాకం
  2. కుటుంబానికి తండ్రి హిమగిరి శిఖరం

గమనిక :
మొదటి వాక్యంలో అన్న చేసే వంటకూ, నలభీమపాకానికి భేదం లేనట్లు చెప్పబడింది. అలాగే రెండవ వాక్యంలో కుటుంబంలోని తండ్రికీ, హిమగిరి శిఖరానికి భేదం లేనట్లు చెప్పబడింది. కాబట్టి పై రెండు వాక్యాలలో ‘రూపకాలంకారాలు’ ఉన్నాయి.

ఈ కింది ఉదాహరణలు కూడా చూడండి.

  1. లతాలలనలు రాజు పై కుసుమాక్షతలు చల్లారు.
  2. రుద్రమ్మ చండీశ్వరీదేవి జలజలా పారించే శాత్రవుల రక్తమ్ము.
  3. ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే.
  4. మా నాన్నగారి మాటలే వేదమంత్రాలు.
  5. మౌనిక తేనె పలుకులు అందరికీ ఇష్టమే.

గమనిక : పై పాదాల్లో రూపకాలంకారాలు ఉన్నాయి.

4. స్వభావోక్తి అలంకారం :
ఏదైనా విషయాన్ని ఉన్నదున్నట్లుగా వర్ణిస్తే దాన్ని “స్వభావోక్తి” అలంకారం అంటారు.
ఉదా :
జింకలు బిత్తరి చూపులు చూస్తూ, చెవులు నిగిడ్చి చెంగుచెంగున గెంతుతున్నాయి.

స్వభావోక్తికి మరియొక ఉదాహరణం :
1) ఆ లేళ్లు బెదురుచూపులతో నిక్కపొడుచుకున్న చెవులతో భయభ్రాంత చిత్తములతో అటూ ఇటూ చూస్తున్నాయి.

సమన్వయం :
ఇక్కడ లేళ్ల యొక్క సహజ గుణాన్ని ఉన్నది, ఉన్నట్లుగా, కళ్లకు కట్టినట్లుగా వర్ణించడం వల్ల ఇది స్వభావోక్తి’ అలంకారం.

5. “అతిశయోక్తి” అలంకారం.
లక్షణం :
ఉన్న విషయాన్ని, ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పటాన్ని ‘అతిశయోక్తి’ అలంకారం అంటారు.
ఉదా :

  1. మా చెల్లెలు తాటి చెట్టంత పొడవుంది.
  2. దేవాలయ గోపురాలు ఆకాశానికి అంటుతున్నాయి.
  3. ఆ పట్టణంలోని భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

సమన్వయం :
పై వాక్యాలలో చెల్లెలు ఎత్తును, గోపురం ఎత్తును, ఉన్న ఎత్తుకంటె ఎక్కువ చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారంతో చెప్పడం అంటారు.

భవనాలు ఎంత ఎత్తుగా ఉన్నా, ఆకాశాన్ని తాకడం అసంభవం. అంటే మామూలు విషయాన్ని అతిగా చేసి చెప్పడం పై మూడవ వాక్యంలో గమనిస్తున్నాము.

అభ్యాసం :
ఈ కింది లక్ష్యాలను పరిశీలించండి. అలంకారం గుర్తించండి.
1) కం|| “చుక్కలు తలపూవులుగా
అక్కజముగ మేను పెంచి యంబరవీధిన్
వెక్కసమై చూపట్టిన
అక్కోమలి ముదము నొందె ఆత్మస్థితికిన్”

సమన్వయం :
పై పద్యంలో ‘అతిశయోక్తి’ అనే అలంకారం ఉంది.

భావం :
నక్షత్రాలు తన తలపై ధరించే పువ్వులుగా ఉండేటట్లు ఆశ్చర్యంగా హనుమంతుడు శరీరాన్ని పెంచాడు.

ఎంత ఎత్తు పెరిగినా ఆకాశంలో నక్షత్రాలను తాకేటట్లు పెరగడం జరగదు. కాబట్టి ఇది ‘అతిశయోక్తి’ అలంకారం.

AP SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

2) మా పొలంలో బంగారం పండింది.
సమన్వయం :
పై వాక్యంలో ‘అతిశయోక్తి’ అలంకారం ఉంది.

భావం :
పొలంలో బాగా పంట పండింది అని చెప్పడానికి, ‘బంగారం’ పండిందని అతిశయోక్తిగా చెప్పబడింది. కాబట్టి పై వాక్యంలో “అతిశయోక్తి” అనే అర్థాలంకారం ఉంది.

6. శ్లేషాలంకారం :

అ) 1) మిమ్ము మాధవుడు (విష్ణువు) రక్షించుగాక !
2) మిమ్ము ఉమాధవుడు (శివుడు) రక్షించుగాక !

ఆ) మానవ జీవనం సుకుమారం
అర్థం :
1)మానవ (ఆధునిక) జీవితం సుకుమారమైనది.
2) మానవ (మనిషి) జీవితం సుకుమారమైనది.

పై అర్థాలను గమనించారు కదా ! ఒకే శబ్దం, రెండు వేరు వేరు అర్థాలను ఇస్తుంది. అంటే విభిన్న అర్థాలు ఆశ్రయించి ఉన్నాయి. ఇలా ఉంటే ‘శ్లేషాలంకారం’ అంటారు.

శ్లేషాలంకారం (లక్షణం) :
నానార్థాలను కలిగి ఉండే అలంకారం శ్లేష..

అభ్యాసం :
కింది అలంకారాలలో ఉన్న అలంకారాన్ని గుర్తించి సమన్వయం చేయండి.
1) రాజు కువలయానందకరుడు
అర్థం :

  1. చంద్రుడు కలువలకు ఆనందాన్ని ఇస్తాడు.
  2. రాజు భూమండలానికి సంతోషాన్ని ఇస్తాడు.

ఇక్కడ నానార్థాలు వచ్చాయి కాబట్టి ఈ వాక్యంలో శ్లేషాలంకారముంది.

2) నీవేల వచ్చెదవు?
అర్థం :
1) నీవు ఎందుకు వస్తావు?
2) నీవు ఏలడానికి వస్తావు.
ఇక్కడ నానార్థాలు వచ్చాయి. కాబట్టి శ్లేషాలంకారం ఉంది.

అలంకారములపై ప్రశ్నలు

1) ‘కుముదినీ రాగ రసబద్ద గుళిక యనగ చంద్రుడు దయించె’ ఈ వాక్యంలో ఉన్న అలంకారాన్ని గుర్తించండి.
A) ఉపమ
B) ఉత్ప్రేక్ష
C) రూపకము
D) స్వభావోక్తి
జవాబు:
B) ఉత్ప్రేక్ష

2) “అనుచున్ జేవురు మీఱు కన్నుగవతో, నాస్పందదోష్ణంబుతో, ఘనహుంకారముతో, నటద్ర్భుకుటితో గర్జిల్లు నా ఫోన్ సలేశుని” ఈ వాక్యంలో అలంకారాన్ని గుర్తించండి.
A) ఉపమ
B) ఉత్ప్రేక్ష
C) స్వభావోక్తి
D) వృత్త్యనుప్రాస
జవాబు:
C) స్వభావోక్తి

3) ‘నగారా మోగిందా, నయాగరా దుమికిందా’ ఈ వాక్యంలో అలంకారాన్ని గుర్తించండి.
A) అంత్యానుప్రాస
B) వృత్త్యనుప్రాస
C) ఛేకానుప్రాస
D) యమకము
జవాబు:
A) అంత్యానుప్రాస

AP SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

4) ‘హరిభజియించు హస్తములు హస్తములు’ ఈ వాక్యంలో గల అలంకారాన్ని గుర్తించండి.
A) వృత్త్యనుప్రాస
B) ఛేకానుప్రాస
C) లాటానుప్రాస
D) ముక్తపదగ్రస్తము
జవాబు:
C) లాటానుప్రాస

5) ‘ఆ తోరణం శత్రువులతో రణానికి కారణమైంది’ ఈ వాక్యంలో గల అలంకారం గుర్తించండి. (B)
A) శ్లేష
B) యమకము
C) ఛేకానుప్రాస
D) ఉపమ
జవాబు:
B) యమకము

6) ‘మా పొలంలో బంగారం పండింది’ ఈ వాక్యంలో అలంకారాన్ని గుర్తించండి.
A) స్వభావోక్తి
B) ఉపమ.
C) అతిశయోక్తి
D) రూపకము
జవాబు:
C) అతిశయోక్తి

7) ‘హనుమంతుడు సముద్రాన్ని దాటాడు. మహాత్ములకు సాధ్యము కానిది లోకమున లేదుకదా’ ఈ వాక్యాలలో అలంకారం గుర్తించండి.
A) అర్ధాంతరన్యాస
B) ఉపమ
C) స్వభావోక్తి
D) యమకము
జవాబు:
A) అర్ధాంతరన్యాస

AP SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

8) ‘నీ కరుణాకటాక్షవీక్షణములకై నిరీక్షించుచున్నారము’ ఈ వాక్యంలోని అలంకారాన్ని గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
ఈ వాక్యంలో ‘వృత్త్యనుప్రాస’ అలంకారం ఉంది.
లక్షణం : ఒకే అక్షరము పలుమార్లు ఆ వృత్తియగుట వృత్త్యనుప్రాస.

9) “లేమా! దనుజుల గెలువగ లేమా?” ఈ వాక్యంలోని అలంకారాన్ని గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
యమకము : లక్షణం : ఒకే పదం, అర్థభేదంతో ప్రయోగించడం యమకము.

10) ‘దేవాలయ గోపురాలు ఆకాశాని కంటుతున్నాయి. ఈ వాక్యంలో గల అలంకారాన్ని గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
అతిశయోక్తి : విషయాన్ని ఉన్నదానికంటె ఎక్కువ చేసి చెప్పడం.

11) ‘మానవా? నీ ప్రయత్నం మానవా?’ ఈ వాక్యంలో అలంకారం గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
యమకము : ఒకే పదం, అర్థభేదంతో ప్రయోగించడం యమకం.

12) ‘మిమ్ము మాధవుడు రక్షించుగాక!’ ఈ వాక్యంలో అలంకారాన్ని గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
శ్లేష : నానార్ధములను కలిగి ఉండే అలంకారం శ్లేష.

13) “శివాజీ కళ్యాణి దుర్గాన్ని సాధించాడు. వీరులకు సాధ్యము కానిది లోకమున లేదు కదా” ఈ వాక్యాలలో గల అలంకారాన్ని గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
అర్ధాంతర న్యాసాలంకారము : సామాన్యమును విశేషముచే కాని, విశేషమును సామాన్యముచే కాని సమరించుట.

14) ‘వాడు తాటిచెట్టంత పొడవున్నాడు’ ఈ వాక్యంలో అలంకారం గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
అలంకారము : అతిశయోక్తి అలంకారం.
లక్షణం : విషయాన్ని ఉన్నదాని కంటే ఎక్కువ చేసి చెప్పడం.

15) అభినుతేందు చంద్రికాంభోధి యఖిలంబు నీట నిట్టలముగ నిట్టవొడిచె – అలంకారాన్ని గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
అలంకారము : రూపకాలంకారము.
లక్షణం : ఉపమానోపమేయములకు, భేదము లేదని చెప్పడం రూపకము.

AP SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

16) ‘అడిగెదనని కడువడి జను, నడిగినఁదను మగుడ నుడుగడని నడయుడుగున్’, ఈ వాక్యంలో అలంకారం గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
అలంకారము : వృత్త్యనుప్రాసాలంకారం.
లక్షణం : ఒకే అక్షరం, పలుమార్లు ఆవృత్తి అవడం.

17) ‘మకరందబిందు బృందరసస్యందన మందరమగు మాతృభాషయే’ – ఈ వాక్యంలో అలంకారం గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
అలంకారము : వృత్త్యనుప్రాసాలంకారం.
లక్షణం : ఒకే అక్షరం, పలుమార్లు ఆవృత్తి అవడం.

18) ‘తండ్రి హరిజేరుమనియెడి తండ్రి తండ్రి’ – ఈ వాక్యంలో అలంకారం గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
అలంకారము : ఈ పద్యంలో లాటానుప్రాసాలంకారము ఉంది.
లక్షణం : ఒకే పదాన్ని అర్థం ఒకటే అయినా, తాత్పర్య భేదంతో ప్రయోగించడం.

19) 1. ‘రాజు కవలయానందకరుడు’
2. నీవేల వచ్చెదవు- ఈ వాక్యాలలో అలంకారం గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
అలంకారము : శ్లేషాలంకారం
లక్షణం : నానార్థాలను కలిగి ఉండే అలంకారము శ్లేష.

20) ‘హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు. మహాత్ములకు సాధ్యం కానిది లోకమున లేదుకదా’ – ఈ వాక్యంలో అలంకారం గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
అలంకారము : అర్థాంతరన్యాసాలంకారం.
లక్షణం : విశేష విషయాన్ని సామాన్యంతో కాని, సామాన్య విషయాన్ని విశేష విషయంతో కాని సమర్థించడం.

AP SSC 10th Class Telugu కరపత్రాలు, ఇంటర్వ్యూలు

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 10th Class Telugu కరపత్రాలు, ఇంటర్వ్యూలు Notes, Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu కరపత్రాలు, ఇంటర్వ్యూలు

ప్రశ్న 1.
ఒక ప్రముఖ స్త్రీ వాద రచయిత్రి మీ పాఠశాల వార్షికోత్సవంలో ముఖ్య అతిధిగా పాల్గొనడానికి వస్తున్నారు. వారిని మీరు ఏమి ప్రశ్నించుతున్నారో ఆ ప్రశ్నల జాబితా వ్రాయండి.
జవాబు:

  1. స్త్రీ వాదము యొక్క ప్రాముఖ్యం ఏమిటి?
  2. స్త్రీలకు నేడు నిజంగానే స్వాతంత్ర్యం లేదా?
  3. స్త్రీలు నేడు సంఘంలో ఎదుర్కొంటున్న సమస్యలేమిటి?
  4. స్త్రీలకు పార్లమెంటులో రిజర్వేషన్లు ఇవ్వవలసిన అవసరం ఉందా?
  5. ‘స్త్రీలను స్త్రీలే కించపరుస్తున్నారు’ అంటే మీరు అంగీకరిస్తారా?
  6. స్త్రీలకు ఆర్థిక స్వాతంత్ర్యం వస్తే స్త్రీల సమస్యలు పోతాయా?
  7. స్త్రీలపై అత్యాచారాలకు స్త్రీల వేషభాషలు కారణమా?
  8. పురుషులు వంటగరిట చేతబడితే సమస్య పరిష్కారం అవుతుందా?
  9. స్త్రీలకు ఎటువంటి స్వాతంత్ర్యం కావాలి?
  10. స్త్రీలను భారతీయులు అనాదికాలం నుండి గౌరవిస్తున్నారని మీరు అంగీకరిస్తారా?

ప్రశ్న 2.
అనేక వ్యాధులకు కారణమవుతున్న దోమలను నివారించాలని తెలియజేస్తూ కరపత్రం తయారు చేయండి.
జవాబు:

దోమలపై దండయాత్ర
యువతీ యువకులారా ! ఆలోచించండి !

ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన ఆలోచనలు వస్తాయి. దోమలను నివారిద్దాం. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం. మురుగునీరు దోమలకు నిలయం. మురుగునీరు నిలవ ఉండకుండా చూద్దాం. నీటిలో కుళ్లిన ఆకులు, చెత్తా చెదారం వలన దోమలు వృద్ధి అవుతాయి. రోగాలు వ్యాపిస్తాయి. క్యూలెక్స్ జాతికి చెందిన ఆడదోమ వలన ఫైలేరియా వస్తుంది. ఆడ ఎనాఫిలస్ దోమ వలన మలేరియా వ్యాపిస్తుంది. డెంగ్యూ కూడా దోమల వలన వస్తుంది. అందుచేత దోమల నివారణకు నడుం బిగిద్దాం – రండి – తరలిరండి.

ఇట్లు,
ఆరోగ్య శాఖ

AP SSC 10th Class Telugu కరపత్రాలు, ఇంటర్వ్యూలు

ప్రశ్న 3.
స్త్రీల అభ్యున్నతికి తీసుకోవలసిన చర్యలను గూర్చి వివరిస్తూ “కరపత్రం” తయారు యండి.
జవాబు:

మహిళాభ్యుదయం – కర్తవ్యం

సోదరులారా ! ఒక్కమాట ! –
మన సమాజంలో అనాది నుండి మహిళలకు సమున్నతమైన గౌరవం ఉంది. స్త్రీలను దేవతలగా భావిస్తాం. కాని రోజులు మారాయి. మనుషుల మనసులు మారాయి. పురుషాధిక్య సమాజంలో స్త్రీలకు తగిన గుర్తింపు దొరకడం లేదు. అన్ని విధాలుగా వారిని అణగదొక్కడానికి పురుషులు ప్రయత్నిస్తున్నారు. ఇది మంచిది కాదు. మనం స్త్రీల అభ్యున్నతికి కృషి చేయాలి. వాని కోసం మనం కొన్ని చర్యలు తీసుకోవాలి అవి :

  • స్త్రీలను అక్షరాస్యులుగా చేయాలి.
  • ఉద్యోగాల్లోను, రాజకీయ పదవుల్లోను తగిన రిజర్వేషన్ కల్పించాలి.
  • వృత్తి విద్యల శిక్షణను అందించాలి. సాంకేతిక విద్య పట్ల ప్రోత్సాహం కల్పించాలి.
  • స్త్రీలను చులకనగా చూడటం మానుకోవాలి.

ఇట్లు,
మహిళా రక్షణ సమితి,
కర్నూలు.

ప్రశ్న 4.
మరుగుదొడ్లు నిర్మించి, వినియోగించాలని కోరుతూ ఒక కరపత్రం రాయండి.
జవాబు:

మరుగుదొడ్లు నిర్మిద్దాం – రోగాలు నివారిద్దాం

సోదరీసోదరీమణులారా !
మన గ్రామంలో మరుగుదొడ్ల వసతి లేక ఎంతోమంది బహిరంగ మలవిసర్జన చేస్తున్నారు. దానిపై ఈగలు, దోమలు, సూక్ష్మజీవులు వాలతాయి. ఆ ఈగలు, దోమలు మనం తినే ఆహారంపై వాలతాయి. ఆ ఆహారం తినడం వల్ల మన ” ఆరోగ్యాలు పాడైపోతున్నాయి.

అందుకే బహిరంగ మలవిసర్జన వద్దని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు పేర్కొంటున్నాయి. అవి ప్రజలను బాగా చైతన్యపరుస్తున్నాయి. మరుగుదొడ్లు నిర్మించుకొనేందుకు ప్రభుత్వం కూడా మినహాయింపుతో కూడిన ఋణం మంజూరు చేస్తుంది. కాబట్టి అందరు తమ ఇండ్లలో మరుగుదొడ్లను నిర్మించుకొని, వాటిని వినియోగించాలని కోరుతున్నాం. ఆ విధంగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకొన్నవారమవుతాం. ‘మరుగుదొడ్లు నిర్మించుకొందాం – మంచి ఆరోగ్యంగా బ్రతుకుదాం’.
తేది : x x x x x

ఇట్లు,
ప్రజా ఆరోగ్య పరిరక్షణ సమితి,
పాములపాడు.

ప్రశ్న 5.
బాలికల విద్య ఆవశ్యకతను వివరిస్తూ ఒక కరపత్రం రాయండి.
జవాబు:

బాలికల విద్య – సమాజానికి ప్రగతి

తల్లిదండ్రులారా !
బాలికలు విద్యావంతులైనచో సమాజం వివేకవంతమవుతుంది. బాలికలు విద్యావంతులైనచో ప్రయోజనం ‘ఇంత’ అని చెప్పటానికి వీలులేదు.

ఇటీవలి కాలంలో రాజకీయ దాస్యంతోను, భావ దాస్యంతోను సంఘం మునిగి ఉంది. అందువల్ల బాలికల విద్య , చాలావరకు వెనుకబడి ఉంది.

‘ మనదేశానికి స్వాతంత్ర్యం సంపాదించుటకు గాంధీ ‘మహాత్ముడు తన నిర్మాణ కార్యక్రమంలో మహిళాభ్యుదయం: ప్రధానంగా చేర్చారు. బాలికల విద్యకు ప్రాముఖ్యం ఇచ్చారు. ఆధునిక కాలంలో వీరేశలింగం పంతులుగారు స్త్రీ విద్యక మొట్టమొదటిగా ఒక పాఠశాలను పెట్టి కృషి చేశారు.

సాంకేతిక విద్యలో నైపుణ్యం సంపాదించుటకై బాలికలకు ప్రత్యేకంగా ‘పాలిటెక్నిక్’ కళాశాలను ఏర్పరిచారు. కనుక స్త్రీలు గృహకృత్యాలను నిర్వహించుటలో విద్యావంతులైనచో బహుముఖ ప్రజ్ఞను వెల్లడించి దేశ సేవలోను, సంఘసేవలోను రాణించగలడు. తమ సంతానానికి విద్యాబుద్ధులు నేర్పుటలో శ్రద్ధ వహించి వారిని సత్పురుషులుగా తీర్చిదిద్దుతారు. కనుక బాలికల విద్యను ఇతోధికంగా ప్రోత్సహించినచో దేశానికి, సమాజానికి శ్రేయస్సు కల్గుతుంది.

ఇట్లు,
బాలికల విద్యా ప్రోత్సాహక సంఘము
శ్రీకాకుళం.

ప్రశ్న 6.
వందేమాతరానికి వందేళ్ళు పూర్తయిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఒక కరపత్రాన్ని తయారు చేయండి.
జవాబు:

“వందేమాతరం” కరపత్రం

సోదర భారతీయులారా ! మనమందరం, పవిత్ర భారతమాత కన్నబిడ్డలం. మన దేశ స్వాతంత్ర్య పరిరక్షణకై మనమంతా మన ప్రాణాల్ని సైతం ధారపోయడానికి సిద్ధం కావాలి.

మన భారతదేశానికి స్వాతంత్ర్యం సంపాదించడానికై జరిగిన స్వాతంత్ర్య పోరాటానికి ‘వందేమాతరం’ గీతం శంఖారావం చేసింది. బంకించంద్ర ఛటర్జీ ఆ వందేమాతరం గీతం రాసి నేటికి నూరు సంవత్సరాలు అయ్యింది. ఆనాడు దేశమంతా ఆ గీతాన్ని అంది పుచ్చుకొని, “వందేమాతరం మందే రాజ్యం” అంటూ గొంతెత్తి నినాదం చేసింది. బ్రిటిష్ వారిని తరిమికొట్టి స్వాతంత్ర్యాన్ని సాధించి పెట్టింది.

ఆనాడు గాంధీజీ, నెహ్రూ, తిలక్, పటేలు వంటి నాయకులు దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి మనకు స్వాతంత్ర్యం భిక్ష పెట్టారు. ఈనాడు మనం హాయిగా వందేమాతరం గీతాన్ని జాతీయగీతంగా గొంతెత్తి పాడుకుంటున్నాము. ఆనాడు ‘వందేమాతరం’ అంటే నేరం.

మనకు స్వాతంత్ర్యాన్ని సంపాదించి పెట్టిన ‘వందేమాతరం గేయం యొక్క స్ఫూర్తిని కాపాడుకుందాం” మనతో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా, పాకిస్తాన్ దేశాల పొగరును అణచివేద్దాం. మనమంతా ఒక్కొక్క సైనికునిలా ‘కదంతొక్కుదాం. దేశభక్తియే మనకు జీవం. మరువకండి. మనమంతా భరతమాత వీరపుత్రులం. వీర పుత్రికలం.

‘జైహింద్’.

AP SSC 10th Class Telugu కరపత్రాలు, ఇంటర్వ్యూలు

ప్రశ్న 7.
ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా మానవాళి నీటిని ఎంతో జాగ్రత్తగా వాడుకోవలసిన అవసరం ఉంది. నీటిని దుర్వినియోగం చేయకుండా తీసికోవలసిన జాగ్రత్తలు, ఆవశ్యకతను తెలియజేస్తూ ఒక కరపత్రాన్ని తయారు చేయండి.
జవాబు:

నీటి పొదుపు – తీసుకోవలసిన జాగ్రత్తలు (కరపత్రం)

సోదర సోదరీమణులారా!
నేడు మన దేశంలో జనాభా పెరిగిపోతోంది. వాతావరణ కాలుష్యం వల్ల, వర్షాల రాక తగ్గింది. ప్రతి నీటి బిందువును మనం సద్వినియోగం చేసుకోవలసిన అవసరం ఎంతో ఉంది.

అడవులు తగ్గిపోతున్నాయి. వర్షాలు బాగా తగ్గాయి. భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. నదీ జలాలు సముద్రాల పాలవుతున్నాయి. మనం నీటిని జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి.

వ్యవసాయదారులు బిందు సేద్యాన్ని చేయాలి. ప్రతి ఇంటిలో ఇంకుడు కుంటలు ఏర్పాటు చేయాలి. వృథాగా కారిపోతున్న కుళాయిలను కట్టివేయాలి. నదులు, చెరువులు, కుంటలు లోని నీటిని కలుషితం చేయరాదు. వర్షపు నీటిని సైతం నేలలో ఇంకేటట్లు చేయాలి.

ఒక నీటి చుక్కను పొదుపు చేస్తే, అది మరో ప్రాణి ప్రాణాన్ని నిలుపుతుంది. అనవసరంగా నీటిని వదలి పెట్టరాదు. స్నానం చేసిన నీటిని, మొక్కలకు పోయాలి. ఆ నీటితో అంట్లు తోముకొని, శుభ్రం చేసుకోవాలి. నీటిని పొదుపుగా వాడుకోవాలి. దుర్వినియోగం చేయవద్దు. మరువకండి.

ఇట్లు,
యువజన విద్యార్థి సంఘం.

ప్రశ్న 8.
మీ పాఠశాల వార్షికోత్సవానికి ప్రముఖులు వస్తున్నారు. వారిని ఇంటర్వ్యూ చేయడానికి ప్రశ్నావళిని తయారు చేయండి
(లేదా )
మీ పాఠశాలను సందర్శించిన కవి/ కవయిత్రిని ఇంటర్వ్యూ చేయడానికి తగిన ప్రశ్నావళిని రూపొందించండి.
జవాబు:
‘ప్రశ్నావళి’ – ప్రముఖులతో ఇంటర్వ్యూ : –

  1. పూజ్యులయిన మీకు వందనాలు. సుస్వాగతము.
  2. నేటి పాఠశాల విద్యపై మీ అభిప్రాయం చెప్పండి.
  3. నేటి పాఠశాల విద్యలో మీరు గమనించిన లోపాలను చెప్పండి.
  4. నేటి బాలబాలికల విద్యాభివృద్ధికి మీరిచ్చే సూచనలు చెప్పండి.
  5. మా విద్యార్థులలో మంచి అలవాట్లు పెంపొందడానికి మీరిచ్చే సలహాలు ఏమిటి ?
  6. నిరుద్యోగ సమస్య పై మీ అభిప్రాయాలు చెప్పండి.
  7. పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టవలసిన చర్యలను సూచించండి.
  8. మీరు నేడు గొప్ప వారయ్యారు. మీ అభివృద్ధికి కారణమైన సంఘటనలు తెల్పండి.
  9. విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి పెంపొందడానికి, మీరిచ్చే సూచనలు తెలపండి.
  10. విద్యార్థులను ఆశీర్వదిస్తూ రెండు మాటలు చెప్పండి.

ప్రశ్న 9.
పాఠశాలలో జరిగే భాషోత్సవాన్ని తిలకించడానికి ప్రముఖ శతక కవులు వస్తున్నారు. వారి ద్వారా శతకాల గురించి, వారి రచనల గురించి, తెలిసికోడానికి పిల్లలు ఇంటర్వూ చేయాలనుకున్నారు. మీరైతే ఏమని ఇంటర్వ్యూ చేస్తారు? ప్రశ్నావళి రూపొందించండి. ..
జవాబు:
ఇంటర్వ్యూ ప్రశ్నావళి

  1. శతక కవులకు స్వాగతం. ‘శతకాలు’ ఎన్ని రకాలు?
  2. తెలుగులో మొదటి శతకకర్త ఎవరు?
  3. శతకాల్లో ఎన్ని రకాలున్నాయి?
  4. మకుటం లేని శతకాలు ఏమైనా ఉన్నాయా?
  5. నీతి శతకాల ప్రాముఖ్యత ఏమిటి?
  6. భక్తి శతకాలు మీరు ఏమైనా రాశారా?
  7. ‘కాళహస్తీశ్వర శతకం’లో భక్తి ఎక్కువగా ఉందా? రాజదూషణ ఉందా?
  8. ‘సుమతి శతకం’ ప్రత్యేకత ఎటువంటిది?
  9. వసురాయకవి గారి భక్త చింతామణి శతకం గూర్చి చెప్పండి.
  10. మీకు నచ్చిన శతకం ఏమిటి?
  11. మీరు మాకు ఇచ్చే సందేశం ఏమిటి?
  12. ఛందోబద్దం కాని శతకాలు ఏమైనా ఉన్నాయా?

ప్రశ్న 10.
మహిళల పట్ల చూపుతున్న వివక్షలను, వారి మీద జరుగుతున్న దాడులను ఖండిస్తూ, మహిళలందరూ ధైర్యంగా మెలగాలని తెలియజేసేలా ఒక కరపత్రాన్ని తయారు చేయండి.
జవాబు:

“ధైర్యే సాహసే లక్ష్మీ”

మహిళామణులారా! ‘పదండి ముందుకు, పదండి తోసుకు పోదాం పోదాం, పైపైకి’ అన్న శ్రీశ్రీ మాట మరచిపోకండి. ఈనాడు మనపట్ల సంఘం ఎంతో వివక్షత చూపిస్తోంది. ఆడపిల్ల గర్భాన పడిందని తెలిస్తే, తల్లిదండ్రులు విలవిల లాడుతున్నారు. కొందరు భ్రూణహత్యలకు దిగుతున్నారు.

తండ్రి ఆస్తిలో స్త్రీలకు మగవారితో సమాన వాటాలు ఇవ్వడం లేదు. పేపరు తిరగవేస్తే, స్త్రీల మానభంగాల వార్తలు, టి.వి. పెడితే స్త్రీలకు జరిగిన అన్యాయాలు, అత్తవారింట స్త్రీల కష్టాలు, వరకట్నాల చావులు కనబడతాయి. వినబడతాయి. — పసిపిల్లల నుండి పండు ముదుసళ్ళు వరకు అత్యాచారాలకు గురి అవుతున్నారు.

స్త్రీలంతా కరాటే నేర్చుకోవాలి. అల్లరి చేసే మగవారి చెంపలు పగుల కొట్టాలి. నిర్భయంగా పోలీసు వారికి రిపోర్టు చెయ్యాలి. మీరు పొరపాటున అన్యాయానికి గురి అయితే, సిగ్గుతో చితికిపోవద్దు. ధైర్యంగా నిలవండి. అన్యాయాన్ని ఎదిరించి పోరాడండి. బాగా చదవండి. ఉద్యోగాలు చేయండి. మనం ఈ దురాచారాల్ని ఖండిద్దాం.

అన్యాయం జరిగిన తోటి స్త్రీలకు, మనం అండగా నిలవాలి. ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి అని, ఆనందించే రోజు రావాలి. అందుకు మనమంతా చేయి చేయి కలిపి పోరాడుదాం. ఝాన్సీ లక్ష్మీబాయిలా, సరోజినీ దేవిలా దుర్గాబాయమ్మలా తలలెత్తి నిలుద్దాం. ధైర్యమే మనకు శ్రీరామరక్ష.

ఇట్లు,
వనితా సంఘం.

AP SSC 10th Class Telugu కరపత్రాలు, ఇంటర్వ్యూలు

ప్రశ్న 11.
‘మహిళల రక్షణ మన కర్తవ్యం’ అనే అంశముపై కరపత్రం రాయండి..
జవాబు:

‘మహిళల రక్షణ – మన కర్తవ్యం’

సోదర సోదరీమణులారా ! చెప్పడానికి సిగ్గువేస్తోంది. దేశంలో ఎక్కడో అక్కడ రోజూ స్త్రీలపట్ల అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పసిపాపలపై, యువతులపై, ముసలి స్త్రీలపై సైతం అత్యాచారాలు జరుగుతున్నాయి. స్త్రీలపై యాసిడ్ దాడులు, ఈవ్ టీజింగ్, మానభంగాలు, హింసాకృత్యాలు నిత్యం జరుగుతున్నాయి.

మన ఇంట్లో మన తల్లిని అక్కచెల్లెళ్ళను మనం కాపాడుకుంటున్నాం. అలాగే ప్రతి స్త్రీని మనం కాపాడాలి. మహిళలకులు అన్యాయం జరిగితే ఎవరూ సహించరు అనే విషయం దుండగులకు గట్టిగా తెలియపరచాలి.

మహిళలపట్ల అకృత్యం జరిగితే మీరు ఉగ్రనరసింహరూపం ధరించి దుండగులను చీల్చిచెండాడండి. పోలీసువారికి కబురు అందించండి. ప్రక్కవారి సాయం తీసుకోండి. మన సోదరీమణులను మనమే రక్షించుకుందాం.

స్త్రీలు భారతదేశ భాగ్య కల్పలతలు. ప్రతి ఒక్కడూ స్త్రీల రక్షణకు ఉద్యమిస్తే ఎవరూ వారిపట్ల దుర్మార్గానికి సిద్ధం కారు. లెండి ఉద్యమించండి. దుర్మార్గులను చీల్చి చెండాడండి. మన అక్క చెల్లెండ్రను మనమే కాపాడుకుందాం.

ఇట్లు,
యువజన సంఘం.

12. ఉపాధ్యాయులను గౌరవించాలని ప్రబోధిస్తూ ఒక కరపత్రాన్ని సిద్ధం చేయండి.
జవాబు:

“ఆచార్య దేవో భవ”

సంఘములో మానవుల అభివృద్ధికి తల్లిదండ్రుల తర్వాత గురువులే ప్రధానపాత్ర వహిస్తారు. అందుకే మన ఉపనిషత్తులు ‘ఆచార్య దేవోభవ’ అని గురువును దైవంగా సేవించమని చెప్పాయి.

గురువులు తమకు అప్పగించిన విద్యార్థులకు ఎంతో కష్టపడి విద్యను బోధించి, వారిని విజ్ఞానవంతులుగా తీర్చి దిద్దుతారు. అందువల్ల విద్యార్థులు, వారి తల్లితండ్రులూ గురువులను గౌరవించాలి. అందుకే సర్.యస్. రాధాకృష్ణన్ గారు తన పుట్టిన రోజును, అధ్యాపక దినోత్సవంగా జరుపుకోమని చెప్పారు. ఆనాడు ఉత్తమ ఉపాధ్యాయులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్మానిస్తాయి.

ఉపాధ్యాయులను ఆ రోజు ప్రతి గ్రామంలో, నగరంలో పెద్దలు సన్మానించాలి. విద్యార్థులు సైతం కృతజ్ఞతా పూర్వకంగా గురువులను అభినందించి సత్కరించాలి. పూర్వకాలంలో సైతం మహారాజులు గురువులకు ఈనాములిచ్చి పెద్ద గౌరవమిచ్చి, వారిని పోషించేవారు. మనది ప్రజా ప్రభుత్వము. అందువల్ల ప్రజలే అధ్యాపకులను “గురుభ్యోనమః” అని వారిని సత్కరించాలి.

ప్రశ్న 13.
‘మొక్కల పెంపకం’ ఆవశ్యకతను వివరిస్తూ ఒక కరపత్రం తయారు చేయండి.
జవాబు:

“వృక్షముల పెంపకం”

చెట్లు జీవన సౌభాగ్యానికి మెట్లు. నేడు నగరాలు, గ్రామాలు కూడా, పర్యావరణ కాలుష్యంతో సతమతమవుతున్నాయి. ప్రజలంతా రోగాలతో డాక్టర్ల వెంట తిరుగుతున్నారు. దీనికి కారణం దేశంలో పచ్చని చెట్లు తక్కువ కావడమే.

చెట్లు బొగ్గుపులుసు వాయువును పీల్చి, ప్రాణవాయువును మనకు అందిస్తాయి. పూలను, పండ్లను ఇస్తాయి. చల్లని నీడను, గాలిని ఇస్తాయి. పర్యావరణ కాలుష్యం నుండి మనలను కాపాడతాయి.

కాబట్టి ప్రతి వ్యక్తి ఒక్కొక్క చెట్టును పాతి పెంచాలి. ప్రభుత్వము మంచి మొక్కలను ప్రజలకు ఉచితంగా ఇచ్చి వాటిని పాతించాలి. మొక్కలను పెంచి, వాటికి రక్షణ కల్పించాలి. దేశంలో సహితం అడవుల విస్తీర్ణం నేడు తగ్గిపోయింది. అందుకే మనకు వర్షాలు లేవు.

ప్రతి పంచాయితీ వారు మునిసిపాలిటీ వారు, మొక్కలను ఖాళీ ప్రదేశాల్లో పెంచాలి. మొక్కలను పెంచిన వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. గిరిజనులను ప్రోత్సహించి అడవులలో మొక్కలు పెంచాలి. మనమంతా మొక్కలను పెంచుదాం. మన దేశాన్ని సస్యశ్యామలం చేద్దాం.

ఇట్లు,
నగర రక్షణ సమితి.

ప్రశ్న 14.
అనాథ బాలబాలికలను ఆదుకోవాలని ప్రబోధిస్తూ ఒక కరపత్రం సిద్ధం చేయండి.
జవాబు:

“అనాథ రక్షణ”

మిత్రులారా ! దిక్కులేని వారిని మనం అనాథలు అంటున్నాము. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటారు. ఈనాడు ఎన్నో కారణాల వల్ల కొంతమంది, అనాథలు అవుతున్నారు. తల్లిదండ్రులు ప్రమాదాల్లో మరణించడం జరుగుతుంది. భయంకర వ్యాధుల వల్ల తల్లిదండ్రులు మరణించవచ్చు.

మానవ సేవయే మాధవ సేవ. మనకు భగవంతుడే సంపదలు ఇస్తున్నాడు. మనకు ఉన్నదానిలో కొంత మొత్తం దీన జన సేవకు వినియోగిద్దాం. మన నగర ప్రజలంతా అనాథ రక్షణ సంఘంగా ఏర్పడదాం.

మనం అన్నం వండుకునే ముందు, రెండు గుప్పిళ్ళు బియ్యం వేరే పాత్రలో ఉంచుదాం. ఆ బియ్యాన్ని పోగుచేసి అనాథలకు భోజనాలు పెడదాం. వారికి ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేద్దాం. డబ్బున్న వారి నుండి చందాలు వసూలు చేద్దాం. మన నగరం చైర్మెన్ గారి సాయం తీసుకుందాం. అనాథలకు చదువులు చెప్పిదాం. వారికి పుస్తకాలు, బట్టలు ఇద్దాం.

మనం అనాథలను ఆదుకుంటే, భగవంతుడు మనలను రక్షిస్తాడు. సిరిసంపదలిస్తాడు. అనాథలకు మనమంతా తల్లిదండ్రులు అవుదాం. కదలండి. ఒక మంచి పని చేద్దాం.
విజయవాడ,
x x x x x

ఇట్లు,
అనాథ పరిరక్షణ సమితి.

AP SSC 10th Class Telugu కరపత్రాలు, ఇంటర్వ్యూలు

ప్రశ్న 15.
‘చెట్టు – నీరు’ పథకం గురించి, ప్రజలందరూ దానిలో పాల్గొనాలని ప్రబోధిస్తూ కరపత్రం సిద్ధం చేయండి.
జవాబు:

‘చెట్టు – నీరు పథకం’

ఈనాడు దేశం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ‘నీరు’ యొక్క కొరత. మనకు చాలాకాలంగా మహారాజులు, దాతలు గ్రామాల్లో చెరువులు త్రవ్వించి, వర్షం నీటిని దానిలో నిల్వ చేసి ప్రజలకు నీటి సదుపాయం కల్పించారు. దేశ విస్తీర్ణంలో మూడవ వంతు అడవులు ఉంటే మంచి వర్షాలు పడతాయి. ఇప్పుడు అడవుల విస్తీర్ణం తగ్గిపోయింది. దానితో వర్షాలు లేవు. దానితో నదులు నిండుగా ప్రవహించడం లేదు.

ఇప్పుడు రోడ్లు, ఇళ్ళు అన్నీ కాంక్రీట్ అయిపోయాయి. దానితో నీరు భూముల్లోకి ఇంకడం లేదు. అందువల్ల ప్రతి ఇంటివారు ఇంకుడు గుంటలు ఏర్పాటు చేయాలి. చెరువులను బాగా త్రవ్వించి నీరు నిలువ చేయాలి. చెరువులలో, కాలువల్లో నీరు నిండుగా ఉంటే భూగర్భజలాలు పుష్కలంగా ఉంటాయి.

ప్రతి ఒక్కరు ఖాళీ ప్రదేశాల్లో చెట్లు పెంచాలి. అందువల్ల వాతావరణం చల్లబడుతుంది. పరిశుభ్రమవుతుంది. మంచి వర్షాలు పడతాయి. ప్రభుత్వం ఇందుకే చెట్టు – నీరు పథకం మొదలు పెట్టింది. దీనిలో ప్రజలంతా పాల్గొవాలి. తమ ఊరిలో చెరువు వారు బాగు చేసుకోవాలి. ప్రజలందరికీ నీరు పుష్కలంగా లభించేలా చూడాలి. నీటి వనరులను కలుషితం కాకుండా కాపాడుకోవాలి.

ప్రశ్న 16.
మహిళల పట్ల చూపుతున్న వివక్షలను, వారిమీద జరుగుతున్న దాడులను ఖండిస్తూ, మహిళలందరూ ధైర్యంతో మెలగాలని తెలియజేసేలా ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:

“ధైర్యే సాహసే లక్ష్మీ”

మహిళలారా! “పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పైపైకి” అన్న శ్రీశ్రీ మాట మనం మరచి పోకూడదు. ఈనాడు స్త్రీల విషయంలో సంఘం ఎంతో వివక్ష చూపిస్తోంది. ఆడపిల్ల గర్భాన పడిందంటేనే తల్లిదండ్రులు అతలాకుతలం అయిపోతున్నారు. కొందరు భ్రూణహత్యలకు దిగుతున్నారు. ‘స్త్రీలను గౌరవిద్దాం’ అనే బోర్డులు మాత్రమే కాని, బస్సుల్లో సహితం ఆడవాళ్ళకు సీట్లు దొరకడం లేదు.

స్త్రీలకు ఉద్యోగాల్లోనూ, చదువుకోడానికి సీట్లు ఇవ్వడంలోనూ రిజర్వేషన్లు సక్రమంగా అమలుకావడం లేదు ‘అభయ’ చట్టం వచ్చినా పసిపిల్లలు సహితం అత్యాచారాలకు గురి అవుతున్నారు.

ఆడపిల్లలందరూ కరాటే నేర్చుకోవాలి. అల్లరి చేస్తున్న మగవాడి చెంప పగులకొట్టండి. అవమానం జరిగితే నిర్భయంగా అధికారులకు రిపోర్టు ఇవ్వండి. పొరపాటున అన్యాయానికి గురయితే సిగ్గుతో చితికిపోకండి. ధైర్యంగా నిలబడండి. అన్యాయాన్ని ఎదిరించి పోరాడండి.

ఒక స్త్రీ అన్యాయానికి గురయితే, మిగిలిన ఆడవాళ్ళంతా ఆమెకు అండగా నిలవండి. ఆడపిల్ల పుడితే ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్లు అని తల్లిదండ్రులు ఆనందించేలా చేయండి. ఉద్యోగం సంపాదించండి. తల్లిదండ్రులకు అండగా నిలవండి. సంఘబలం కూడగట్టి, దుర్మార్గులను శిక్షించండి. ప్రభుత్వం ఆదుకోకపోతే, వనితా సంఘాల, స్వచ్ఛంద సంస్థల సాయం తీసుకోండి. ఝాన్సీలక్ష్మీబాయిలా, రాణి రుద్రమలా, సరోజినీ దేవిలా, దుర్గాబాయమ్మలా తలలెత్తి నిలవండి.

దివి. x x x x x

ఇట్లు,
గుంటూరు వనితా సంఘం.

ప్రశ్న 17.
మీ పాఠశాల గురించి లేదా ఒక పర్యాటక క్షేత్రాన్ని గురించి వర్ణిస్తూ కరపత్రం రాయండి.
జవాబు:

మా పాఠశాల

మా పాఠశాల ఐదు ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. పాఠశాల భవనంలో 12 గదులున్నాయి. గదులన్నింటిలో పంఖాలు, ట్యూబ్ లైట్లు ఉన్నాయి. పిల్లలకు కావలసిన బెంచీలున్నాయి. ప్రతి తరగతి గదిలో గోడమీద నల్లబల్లలు ఉన్నాయి. మా అధ్యాపకులకు వేరుగా ఒక గది ఉంది. అక్కడ మంచినీటి ఫిల్టరు ఉంది. దాని ప్రక్క గదిలో మా ప్రధానోపాధ్యాయులు ఉంటారు. ప్రధానోపాధ్యాయుల గదిలో దేశనాయకుల, దేవుళ్ళ చిత్రపటాలు ఉన్నాయి.

పాఠశాల ఆఫీసు వారికి వేరే గది ఉంది. అక్కడ గుమాస్తాలు కూర్చుంటారు. పిల్లలందరికీ మంచినీటి సదుపాయం, పాయిఖానా ఏర్పాట్లు ఉన్నాయి. తూర్పు వైపున మంచి పూలతోట ఉంది. ఆ తోటలో మల్లి, మొల్ల, కనకాంబరం, చేమంతి పూలచెట్లున్నాయి. ఈ మధ్యనే గులాబీ మొక్కలు కూడా నాటారు.

ఆటస్థలంలో అన్నిరకాల కోర్టులూ ఉన్నాయి. క్రికెట్ ఆడుకొనే సదుపాయాలు ఉన్నాయి. పాఠశాలకు వేరుగా గ్రంథాలయం ఉంది. అక్కడకు రోజూ 2, 3 పత్రికలు వస్తాయి. విశ్రాంతి సమయంలో మేము అక్కడ కూర్చుని వాటిని చదువుతాము.

మా గ్రామ ప్రజలు పాఠశాల అభివృద్ధికి బాగా సాయం చేస్తారు. మేము పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుతాం. ఆ పాఠశాల మాకు రెండవ తల్లి వంటిది.

ప్రశ్న 18.
మీ పరిసరాల్లోని ఏదైనా పక్షి/ జంతువు గురించి మీరు ఒక కథనాన్ని రాయండి.
జవాబు:

“ధోని” (కుక్కపిల్ల)

మా పక్క ‘ఇంటివాళ్ళకూ కుక్కపిల్లలంటే మహాప్రేమ. ‘తనను పెంచుకుంటున్న యజమానిపై విశ్వాసం చూపడంలో కుక్కను మించిన జంతువు కనబడదు. మా పక్కింటి అబ్బాయి ఒక కుక్కను పెంచుకోవాలని ఆశపడుతున్నాడు.

వాళ్ళింట్లో ఒక కుక్క, గర్భవతిగా ఉంది. ఒక రోజున దానికి మూడు పిల్లలు పుట్టాయి. అందులో ఒక పిల్ల అందంగా. తెల్లగా పాలరంగులో ఉంది. దానికి మంచి బొచ్చు ఉంది. దాన్ని చూస్తే ముద్దుగా ఉంది. దానికి ధోనీ అని పేరు పెట్టాలని ఆ పిల్లవాడి ఆశ. ఆ పిల్లాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. క్రికెట్ అంటే బాగా ఇష్టం. అందుకే ముద్దు వచ్చే ఆ కుక్క పిల్ల ధోనీగా మారింది.

ఆ ధోనీ అంటే దాని తల్లికి బాగా ఇష్టం. ధోనీకి, దాని తల్లి కుక్క, కడుపునిండా పాలిచ్చేది. ధోనీ తోకను ఊపుతూ కులాసాగా మా వీథిలో తిరుగుతూ ఉంటుంది. ‘ధోనీ’ అంటే మా వీధి వాళ్ళంతా ఇష్టపడతారు. దానికి మా పక్కింటబ్బాయి స్నానం చేయించి పాలు, బిస్కట్లు, కోడిగుడ్లు, మాంసం పెడతాడు. ధోనీ క్రమంగా టైగర్ లా పెరిగింది.

ఒక రోజున ‘ధోనీ’ వాళ్ళింట్లోకి అడుగుపెడుతూ ఉన్న దొంగపైకి దూకి వాడి పిక్క పట్టుకొంది. అది చూసిన మా పక్కింటి అబ్బాయి ‘ధోనీ’ అని ప్రేమగా పిలిచాడు. అంతే! దొంగను వదలి తోక ఊపుకుంటూ, ఆ అబ్బాయి దగ్గరకు అది పరుగుపెట్టింది. ‘ధోనీ’ని పోలీసు కుక్కగా చేయాలని మా పక్కింటి అబ్బాయి చూస్తున్నాడు.

AP SSC 10th Class Telugu కరపత్రాలు, ఇంటర్వ్యూలు

ప్రశ్న 19.
‘శాంతి’ ఆవశ్యకతను తెలియజేస్తూ ఒక కరపత్రం రాయండి. .
జవాబు:

ప్రపంచశాంతి

మిత్రులారా ! ఈ విషయాన్ని గూర్చి ఒక్కసారి ఆలోచించండి. చిన్న చిన్న విషయాలకోసం దెబ్బలాటలకు దిగి, తలలు బద్దలుకొట్టుకోకండి. న్యాయస్థానాలకు వెళ్ళి డబ్బు తగులబెట్టకండి. మనది గాంధీ, బుద్ధుడు, జవహర్‌లాల్ నెహ్రూ పుట్టిన దేశం. ఎందరో మహర్షులు, ప్రవక్తలు పుట్టిన దేశం. వారి శాంతి బోధలు తలకు ఎక్కించుకోండి.

ప్రపంచంలో ఇప్పటికే రెండు ప్రపంచయుద్ధాలు జరిగాయి. ఇంకా ఎన్నో చిన్న చిన్న తగవులు జరిగాయి. యుద్ధాలవల్ల ఎంతో ధనవ్యయం, ప్రాణనష్టం జరుగుతుంది. యుద్ధాల్లో పాల్గొన్న దేశాలు, అభివృద్ధి లేకుండా వెనుకబడతాయి.

కాబట్టి యుద్ధాలు వద్దు. శాంతి మనకు ముద్దు. ప్రపంచ పౌరులంతా సోదరుల వలె మెలగుదాం. స్నేహం, ప్రేమ, కరుణ, వాత్సల్యం మనకు మంచిదారిని చూపిస్తాయి. శాంతి మంత్రాన్ని అంతా జపిద్దాం. సరేనా?

ఇట్లు
ప్రపంచ బాలబాలికల సంఘం.

ప్రశ్న 20.
ధనము ఉన్నవాళ్ళు దానం చేయాలని విజ్ఞప్తి చేస్తూ అనాథశరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు, బీదలకు విరాళాలు ప్రకటించమని ధనవంతులకూ, వదాన్యులకూ ఒక కరపత్రం ద్వారా విజ్ఞప్తి చేయండి.
జవాబు:

విజ్ఞప్తి

సోదర సోదరీమణులారా ! మనం అందరం భగవంతుని బిడ్డలం. మనలో కొందరు బీదవారుగా, దిక్కులేనివారుగా ఉన్నారు. వారికి మనతోపాటు బతికే హక్కు ఉంది. మనలో డబ్బు ఉన్నవారు ఉన్నారు. మనం పుట్టినపుడు ఈ డబ్బును మన వెంట తేలేదు. రేపు చనిపోయినపుడు ఈ ధనాన్ని మనం వెంట తీసికొని పోలేము.

మనం ఎంత లక్షాధికారులమైనా బంగారాన్ని తినము. డబ్బున్నవారమని గర్వపడడమే కాని, కూడబెట్టిన దాన్ని అంతా మనం తినలేము – ఎవరికీ దానధర్మాలు చేయకుండా బ్యాంకుల్లో దాస్తే ఆదాయం పన్ను వాళ్ళు తీసుకుపోతారు.

కాబట్టి మనతోటి దరిద్రనారాయణులకూ, దిక్కులేని ముసలివారికీ తోడ్పడండి. మీ డబ్బును విరివిగా వృద్ధాశ్రమాలకు చందాలుగా ఇవ్వండి. లేదా మీరే అనాథశరణాలయాలు స్థాపించండి.

‘మానవసేవయే మాధవసేవ’ అని గుర్తించండి. తోటివారికి మనం డబ్బు ఇచ్చి తోడ్పడితే, దైవకృప మనకు తప్పక లభిస్తుంది. లోభిత్వం విడువండి. వదాన్యులై విరివిగా విరాళాలు ప్రకటించండి. భగవంతుడు నాకు మంచిబుద్ధిని ప్రసాదించాలి.

ఇట్లు,
మీ తోడి సోదరసోదరీమణులు.

ప్రశ్న 21.
వివాహాల్లో చేయవలసిన సంస్కరణల గూర్చి కరపత్రం తయారుచేయండి.
జవాబు:

వివాహాలలో చేయవలసిన సంస్కరణలు

మిత్రులారా ! ఈ రోజుల్లో పెండ్లి ఏర్పాట్లు చాలా ఘనంగా బాగా ఖర్చు పెట్టి చేస్తున్నారు. వేలమందికి విందులు చేస్తున్నారు. కల్యాణ మండపాల అలంకరణలకు, దీపాల అమరికకు, చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారు. కట్నాలు, . బహుమతులు పెరిగిపోయాయి. వధూవరులను వెతకడం, జాతకాలు చూపించడం వంటి వాటికి, ఖర్చులు పెరిగిపోయాయి.

  1. పెండ్లిళ్ళు దేవుని మందిరాలలో అలంకరణల ఖర్చు లేకుండా చేయాలి.
  2. ఎవరింట వారు భోజనాలు చేసి ముహూర్తానికి గుడికి వచ్చి పెళ్ళి పూర్తి చేయాలి. విందులు ఏర్పాటు చేయరాదు.
  3. కట్నాలూ, బహుమతులూ పూర్తిగా మానివేయాలి. ఊరేగింపులు మానుకోవాలి.
  4. విలాసాలకు ఖర్చు చేయరాదు. పెళ్ళికి మంగళసూత్రం, వధూవరులు ముఖ్యం అని గుర్తించాలి.
  5. రిజిష్టర్డు వివాహాలు చేసుకుంటే మరింత కలిసి వస్తుంది. వధూవరులూ వారి తల్లిదండ్రులూ రిజిస్ట్రార్ వద్దకు చేరి, అవసరమైన ఏర్పాట్లతో పెండ్లి తంతు ముగించాలి. పెళ్ళి పేర దుర్వ్యయం చేయకండి.

ఇట్లు,
మిత్ర సమాజం.

ప్రశ్న 22.
మీ పాఠశాలలో ప్రపంచ శాంతి అనే అంశంపై మండలస్థాయి వ్యాసరచన పోటీ, నిర్వహణకు, విద్యార్థులను ఆహ్వానిస్తూ – కరపత్రం తయారుచేయండి.
జవాబు:

ప్రపంచశాంతి మిత్రులారా !

“తన సొంతమె తనకు రక్ష’ అని సుమతీశతకకారుడు చెప్పాడు. ఇది వ్యక్తులకే కాదు దేశాలకు అంటే దేశ ప్రజలకు కూడా వర్తిస్తుంది.

మనది గాంధీ, బుద్ధుడు, జవహర్ లాల్ నెహ్రూ వంటి శాంతమూర్తులు పుట్టిన దేశం. ఎందరో మహర్షులు, ప్రవక్తలు పుట్టిన దేశం. వారి శాంత బోధలు తలకు ఎక్కించుకోండి.

ప్రపంచంలో ఇప్పటికే రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ఇంకా దేశాల మధ్య ఎన్నో చిన్న చిన్న తగవులు జరిగాయి. యుద్ధాలవల్ల ఎంతో ధనవ్యయం, ప్రాణనష్టం జరుగుతుంది. యుద్ధాల్లో పాల్గొన్న దేశాలు అభివృద్ధి లేకుండా వెనుకబడతాయి.

కాబట్టి యుద్ధాలు వద్దు. శాంతి మనకు ముద్దు. ప్రపంచ పౌరులందరం సోదరులవలె మెలగుదాం. స్నేహం, ప్రేమ, కరుణ, వాత్సల్యం కలిగి ప్రజలందరం శాంతియుత జీవనం సాగిద్దాం. అందరం ప్రపంచ శాంతికై పాటుపడదాం.

ఇట్లు,
ప్రపంచ శాంతి మండలి.

AP SSC 10th Class Telugu కరపత్రాలు, ఇంటర్వ్యూలు

ప్రశ్న 23.
ఆదర్శ రైతు రామయ్యను అభినందిస్తూ అభినందన పత్రాన్ని తయారుచేయండి.
జవాబు:

అభినందన పత్రం

అభ్యుదయ రైతురాజు రామయ్య మహాశయా !
మీకు అభినందన మందారాలు. భారతదేశ సౌభాగ్యం పల్లెలపై ఆధారపడియుంది. పల్లెల్లో రైతులు పండించే పంటలపైనే మన వర్తక పరిశ్రమలు ఆధారపడియున్నాయి. మేం కడుపునిండా అన్నం తింటున్నామంటే అది మీ వంటి కర్షకోత్తముల హస్తవాసి అనే చెప్పాలి.

కర్షకోత్తమా !
మీరు మన ప్రభుత్వ వ్యవసాయశాఖ వారు సూచించిన సూచనలను అందిపుచ్చుకొని, మీ పొలాల్లో ఈ సంవత్సరం ఎకరానికి 60 బస్తాల ధాన్యం పండించారు. చేల గట్లపై కంది మొక్కలు పాతి 20 బస్తాల కందులు పండించారు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల జోలికి పోకుండా, మీ తోటలో 10 గేదెలను పెంచి, పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తూ, ఆ పశువుల పేడతో సేంద్రియ ఎరువుల్ని తయారు చేసి వాటినే ఉపయోగించి మంచి పంటలు పండించారు. మీ కృషికి ప్రభుత్వ పక్షాన అభినందనలు అందిస్తున్నాము.

రైతురత్న రామయ్య గారూ!
నమస్కారం. ప్రభుత్వం మీకు ‘రైతురత్న’ అనే బిరుదునిచ్చి సత్కరిస్తోంది. మీరే ఈ జిల్లాలో రైతులకు ఆదర్శం. మీరు వ్యవసాయంలో మరిన్ని నూతన పద్ధతులు పాటించి, మన జిల్లాలో, రాష్ట్రంలో రైతులకు ఆదర్శంగా నిలవాలని కోరుతున్నాము. ఈ సందర్భంగా మీకు మన ముఖ్యమంత్రిగారి తరపున రూ. 25,000లు బహుమతి ఇస్తున్నాము. మీకు మా శుభాకాంక్షలు. మా నమస్సులు.
అభినందనములు.

ఇట్లు,
జిల్లా వ్యవసాయాధికారి,
ఏలూరు,
ప|గో|| జిల్లా,

ప్రశ్న 24.
ప్రభుత్వ పాఠశాలల్లోని సౌకర్యాలను వివరిస్తూ కరపత్రాన్ని తయారుచేయండి.
జవాబు:
తల్లిదండ్రులారా !
మీరు మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించండి. ప్రభుత్వ పాఠశాలలో మీరు ఏ విధమైన ఫీజు కట్టనవసరం లేదు. పాఠ్యపుస్తకాలు ఉచితంగా ఇస్తారు. అక్కడ పాఠం చెప్పే ఉపాధ్యాయులు, మెరిట్ ప్రాతిపదికపై ఎన్నిక చేయబడినవారు. చక్కని అర్హతలు కలవారు. మధ్యాహ్నం మీ పిల్లలకు భోజన సదుపాయం ఉంటుంది. హాస్టలు సదుపాయం ఉంటుంది. హాస్టలులో మీ పిల్లలకు కావలసిన సదుపాయాలు ఉచితంగా సమకూరుస్తారు.

ప్రభుత్వ పాఠశాలలకు మంచి భవనాలు ఉంటాయి. ఆటలు ఆడుకొనే ఆటస్థలము, పరికరాలు ఉంటాయి. ఆటలు ఆడించే శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉంటారు. ప్రభుత్వ పాఠశాలలు మంచి అనుభవజ్ఞులయిన ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో నడుస్తాయి. ప్రభుత్వము అక్కడి ఉపాధ్యాయులకు చక్కని జీతాలు ఇస్తోంది. అందువల్ల ప్రభుత్వం కల్పించే సదుపాయాలను చక్కగా వినియోగించుకొని మీ బాలబాలికలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించండి. అక్రమంగా ఫీజులు పిండే ప్రయివేటు కాన్వెంటులలో చేర్చకండి. ప్రభుత్వం ఇచ్చే ఉపకారవేతనాలను మీరు పొందండి. ప్రెయివేటు పాఠశాలల్లో పై సదుపాయాలు ఏమీ ఉండవు. దయతో మేల్కోండి.. జాగ్రత్త పడండి.
దివి. x x x x x

ఇట్లు,
ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయ సంఘం.

ప్రశ్న 25.
స్వచ్ఛభారత్ లో అందరూ పాల్గొనాలని ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:

‘స్వచ్ఛభారత్’

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అని మన పెద్దలు ఏనాడో మనకు ఉపదేశించారు. భారతదేశ స్వచ్చతయే, దేశ సౌభాగ్యానికి మొదటిమెట్టు. స్వచ్ఛమైన ప్రదేశంలోనే లక్ష్మీదేవి నిలుస్తుంది. నీ ఇల్లు శుభ్రంగా ఉంటే నీ ఇంట లక్ష్మి తాండవిస్తుంది. దేశమంతా స్వచ్ఛంగా ఉంటే, దేశంలో మహాలక్ష్మి వెల్లివిరుస్తుంది. అందుకే మన దేశాన్నీ నదులనూ, పరిశుభ్రంగా ఉంచుకుందాం. ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో సుఖ సంపదలతో మనం వర్ధిల్లుదాం.

మన ప్రధాని నరేంద్రమోడీ గారు భారతదేశాన్ని స్వచ్ఛంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారు. నీ ఇంటితో పాటు, నీ పరిసరాలను, నీ గ్రామాన్ని, నగరాన్ని, దేశాన్ని నిర్మలంగా తీర్చిదిద్దుకోండని మనదేశ ప్రజలకు ఆయన పిలుపును ఇచ్చారు.

కేంద్రమంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు దేశాన్ని కాలుష్యరహితంగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఇది కేవలము ప్రభుత్వం వల్ల కాదు. దేశంలోని 130 కోట్ల ప్రజానీకం ఇందుకు నడుం కట్టుకోవాలి. దీని కోసం . ప్రభుత్వం, ఎంతో ధన సహాయం చేస్తోంది. ఉపయోగించుకుందాం.

ముఖ్యంగా ప్రతి విద్యార్థి, విద్యార్థిని, యువకుడు, యువతి, స్వచ్ఛభారత్ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని, ఎక్కడా దేశంలో చెత్త లేకుండా అందంగా ఆరోగ్యవంతంగా మనదేశాన్ని తీర్చిదిద్దుకొందాం. కదలిరండి. నడుం బిగించండి. లేవండి. మనదేశం “స్వచ్ఛభారత్” అయ్యేదాకా, పట్టు విడువకండి. మరువకండి.
దివి. x x x x x

ఇట్లు,
పట్టణ విద్యార్థినీ, విద్యార్థుల సంఘం,
కర్నూలు.

ప్రశ్న 26.
‘ప్రసార మాధ్యమాలు (టి.వి., సినిమాలు) నేటి సమాజాన్ని పెడదారి పట్టిస్తున్నాయి’ అనే విషయం గూర్చి ఇద్దరు మిత్రుల మధ్య జరిగిన చర్చను సంభాషణ రూపంలో రాయండి.
జవాబు:
రవి : ఏరా ! ఈ రోజు సెలవు కదా ! ఏం చేద్దాం?
కృష్ణ : చక్కగా చదువుకుందాం ! ప్రాజెక్టువర్కులు పూర్తి చేద్దాం.
హరి : కాదురా ! ఈ రోజు సెలవు కదా ! మంచి సినిమాకు వెళ్లాం.
కృష్ణ : వద్దురా ! ఈనాటి సినిమాలు సమాజాన్ని పెడదోవ పట్టిస్తున్నాయి.
ప్రసాద్ : కనీసం టీ.వీ. నైనా చూద్దాం.
కృష్ణ : ఈనాడు టీ.వీలో వచ్చే కార్యక్రమాలు బాగుండటంలేదు.
రవి : ఎందుకలా చెప్తున్నావు? సమాజాన్ని ఎలా చెడగొడుతున్నాయి?
కృష్ణ : ఈనాడు టీ.వీ.లు గాని, సినిమాలు గాని జనానికి ఉపయోగకరంగా లేవు. టీవీల్లో ప్రసారమయ్యే కార్యక్రమాలు ఉపదేశాత్మకంగా లేవు.
ప్రసాద్ : మరి సినిమాల సంగతేమిటి?
కృష్ణ : ఈనాడు సినిమాలు కూడా హింసను, అకృత్యాలను చూపిస్తున్నాయి.
రవి : నీవు చెప్పింది నిజమేరా ! నీవు చెప్పినట్లుగానే చక్కగా చదువుకుందాం.
ప్రసాద్ : మనం సమాజానికి ఆదర్శంగా ఉండాలి కదా ! సరే మనకు సినిమాలు వద్దు, టీ.వీ.లు వద్దు. చదువే ముద్దు.

AP SSC 10th Class Telugu కరపత్రాలు, ఇంటర్వ్యూలు

ప్రశ్న 27.
మీ చుట్టూ ఉండే పరిసరాలను వర్ణిస్తూ పది పంక్తులు మించకుండా ఒక కవిత రాయండి.
జవాబు:
మా చుట్టూ ఉండే పరిసరాలు
మా పల్లెవాసులకు ఆనంద నిలయాలు
ఎటు చూసినా ఏపుగా పెరిగిన పచ్చని చెట్లు
చెట్లపై పక్షుల కిలకిలారావాలు
కొండ కోనల్లో
నవ్వుతూ, తుళ్ళుతూ
పరుగెడుతున్న సెలయేటి గలగలలు
చెఱువులలో విరబూసిన అరవిందాలు
తలలాడిస్తూ ఆహ్వానించే పచ్చని పైరులు
జోరుజోరుగా వినిపించే
పశుకాపర్ల జానపద గీతాలు
ప్రకృతి శోభతో కళకళలాడుతుంది మా పరిసరం.

AP SSC 10th Class Telugu లేఖలు

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 10th Class Telugu లేఖలు Notes, Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu లేఖలు

ప్రశ్న 1.
మీ పాఠంలో హనుమంతుని శక్తి యుక్తులను వర్ణించిన కవిని ప్రశంసిస్తూ, అతని రచనలు చదవమని సలహా ఇస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

మిత్రునికి లేఖ

విశాఖపట్టణం,
x x x x x.

మిత్రుడు ప్రసాద్ కు,

మిత్రమా ! నీవు మన పదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో 8వ పాఠం ‘సముద్రలంఘనం’ చదివావని అనుకుంటున్నాను. మాకు ఈ మధ్యనే మా తెలుగు పండితులు ఈ పాఠం చెప్పారు. ఈ పాఠం ‘అయ్యలరాజు రామభద్రుడు’ అనే మహాకవి రచించిన “రామాభ్యుదయము” అనే గ్రంథంలోనిది. రామాభ్యుదయంలోని కథ, సీతారామ కథయే. మన పాఠంలో హనుమంతుడు సముద్రం దాటిన ఘట్టమును కవి “అద్భుతంగా” వర్ణించాడు.

రామభద్రుడు సాహితీసమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవులలో ఒకడు. రామాయణము ఒక తియ్యని కావ్యము. ఈ రామాభ్యుదయంలో కవి హనుమంతుని శక్తిని, పరాక్రమాన్ని గొప్పగా వర్ణించాడు. ఈ కవి ‘సకల కథాసార సంగ్రహం’ అనే మరో గ్రంథం కూడా రచించాడట. నేను ఈ రోజే “రామాభ్యుదయం” కావ్యం కొన్నాను. నీవు కూడా రామభద్రుని రచనలు తప్పక చదువు. ఆ కవిని గూర్చి, నీ అభిప్రాయం నాకు రాయి. ఉంటా.

ఇట్లు,
నీ మిత్రుడు,
పి. రఘునాథ్ బాబు,
మునిసిపల్ ఉన్నత పాఠశాల.

చిరునామా :
టి. ప్రసాద్,
S/o టి. రామయ్యగారు,
ఇంటి నెం. 4-1-3/A, గాంధీపురం,
కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా,

ప్రశ్న 2.
మీ పాఠశాలను గురించి మీ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:

తెనాలి,
x x x x x.

పి. రామచంద్ర,
10వ తరగతి, శారదా కాన్వెంట్,
రాజావీధి, తెనాలి,
గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.

మిత్రుడు రవికాంత్ కు,

నేను కొత్తగా చేరిన శారదా కాన్వెంట్ అందాల బృందావనంలా ఉంది. మా కాన్వెంట్ 5 ఎకరాల స్థలంలో ఉంది. ఎత్తైన భవనాలు ఉన్నాయి. ప్రతి తరగతి గదిలోనూ ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు ఉన్నాయి. ముఖ్యంగా మా సైన్సు ప్రయోగశాలలు చక్కగా అన్ని పరికరాలతో అందంగా తీర్చిదిద్దినట్లుంటాయి.

నిత్యం అసెంబ్లీ జరిగేచోట సరస్వతీ దేవి విగ్రహం రంగురంగుల అలంకరణలతో అద్భుతంగా ఉంటుంది. మా కాన్వెంటు అందం అంతా క్రీడా మైదానంలో ఉంది. అన్ని ఆటలకూ కోర్సులు ఉన్నాయి. మైదానం అంతా శుభ్రంగా ఉంటుంది.

కాన్వెంటులో పూలతోట ఉంది. అక్కడ అన్ని రకాల పూల మొక్కలు ఉన్నాయి. కుళాయి నీరు 24 గంటలు వస్తుంది. బాలబాలికలకు వేరువేరుగా మరుగుదొడ్లు ఉన్నాయి.

మా ప్రధానోపాధ్యాయుల గది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కాన్వెంట్ లో చేరినందులకు సంతోషంగా ఉంది. ఉంటా.

ఇట్లు,
నీ మిత్రుడు,
పి.రామచంద్ర.

చిరునామా:
యస్. రవికాంత్,
C/O. యస్. వెంకట్రావుగారు,
తాశీల్దార్, అమలాపురం,
తూ. గో. జిల్లా, ఆంధ్రప్రదేశ్.

AP SSC 10th Class Telugu లేఖలు

ప్రశ్న 3.
‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమం ఆవశ్యకతను వివరిస్తూ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:

అమలాపురం
ది. x x x x x.

 

ప్రియమైన మిత్రుడు అనంత్ కు,

నీకు శుభాక్షాంక్షలు – నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుచున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా వ్రాయునది. మనం మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనే భావనతో మన ప్రధాని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. పరిసరాలు బాగుంటేనే మనదేశం ఆదర్శంగాను, ఆరోగ్యవంతంగాను ఉంటుంది. దాని కోసం మనమంతా పచ్చని చెట్లను నాటాలి. ఇంటిని, గ్రామాలను, నగరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ కార్యక్రమం ద్వారానే మనం దేశాన్ని ముందుకు నడిపించగలుగుతాం. మన పాఠశాలల్లో ముందుగా ఈ కార్యక్రమాన్ని చేపడదాం. మనం దీని కోసం సంకల్పం తీసుకుందాం ! పెద్దలకు నమస్కారాలు తెలుపగలవు.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
x x x x x.

చిరునామా:
వి. అనంత్, 10వ తరగతి,
వివేకానంద బాలుర ఉన్నత పాఠశాల,
వినుకొండ, గుంటూరు జిల్లా.

ప్రశ్న 4.
పల్లెటూరులోని ప్రకృతి అందాలను, మానవ సంబంధాలను వివరిస్తూ మీ మిత్రుడు / మిత్రురాలికి ఒక లేఖ రాయండి.
జవాబు:

రాజమండ్రి,
x x x x x.

మిత్రుడు రంగారావుకు / మిత్రురాలు కవితకు,

నీ లేఖ అందింది. ఈ మధ్య నేను మా అన్న పెళ్ళికి ‘కొమరగిరి పట్టణం’ అనే తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలంలోని ఒక పల్లెటూరికి వెళ్ళాను. ఆ పల్లెటూరిలో సుమారు 16 వేల మంది జనాభా ఉన్నారట. సుమారు 20 వేల ఎకరాలలో వరిపంట, ఐదు-ఆరు వేల ఎకరాలలో కొబ్బరి తోటలు ఆ ఊరిలో ఉన్నాయట.

ఊళ్ళో అన్ని కులాల వారూ, అన్ని వృత్తుల వారూ ఉన్నారు. ఆ పెళ్ళి చేయించే పురోహితుణ్ణి, ఆ ఊరి కాపుగారు “బాబయ్యగారూ” అని ప్రేమగా పిలిచేవాడు. ప్రజలు ఎక్కువగా పేర్లు పెట్టికాక, పెద్దమ్మ, పిన్నమ్మ, అక్క బావ, మొదలయిన వరుసలు పెట్టి ప్రేమగా పిలుచుకున్నారు. ఆ గ్రామస్తుల ఐక్యత చూస్తే ఆనందం వేసింది. రామేశ్వరం, లక్ష్మణేశ్వరంలలో అందమైన శివాలయాలు ఉన్నాయి.

ఆ పల్లెటూరిలో ప్రకృతి శోభ, మహాద్భుతం. ఊళ్ళో పంటకాలువలూ, చెరువులూ ఉన్నాయి. ఫంటచేలు గాలికి తలలాడిస్తూ, మనల్ని పిలుస్తున్నట్లుంటాయి. కొబ్బరి తోటల్లో చెట్లు, నిండుగా గెలలతో కలకలలాడుతుంటాయి. కొబ్బరిచెట్టు, కల్పవృక్షం లాంటిది. పెళ్ళిలో అతిథులందరికీ చల్లని కొబ్బరి బొండాలు ఇచ్చారు.

అదీగాక ఈ ఊరి ప్రక్కనే కౌశికీ నది, దాని పక్కగా బంగాళాఖాతం ఉంది. ఆ సముద్ర కెరటాల శోభ వర్ణించడం అసాధ్యం. సముద్రతీరాన సరుగుడు తోటలు, ఏవో పాటలు పాడుతూ తలలు ఊపుతూ మనలను రమ్మని పిలుస్తూ ఉంటాయి.

పల్లెలు, దేశ సౌభాగ్యానికి పుట్టిళ్ళు. ప్రశాంత జీవితానికి నట్టిళ్ళు. ఉంటాను. లేఖ రాయి.

ఇట్లు,
నీ మిత్రుడు, / మిత్రురాలు,
గోపాలరావు. / రాధ.

చిరునామా :
పి. రంగారావు, / పి. కవిత,
S/o/ D/o పి. వరప్రసాద్,
గాంధీరోడ్డు, వరంగల్లు (ఆంధ్రప్రదేశ్).
పామర్రు, కృష్ణా జిల్లా.

ప్రశ్న 5.
మీ పాఠశాలలో జరిగిన గురుపూజోత్సవం కార్యక్రమాన్ని వివరిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

గుంటూరు,
x x x x x.

ప్రియమిత్రుడు పుష్పరాజ్ కు,

గడచిన సెప్టెంబర్ 5న మా పాఠశాలలో గురుపూజోత్సవం బ్రహ్మాండంగా జరుపుకున్నాం. మా జిల్లా విద్యాశాఖాధికారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాం. ఆ రోజు మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి. ఆయన జయంతినే ప్రభుత్వం గురుపూజోత్సవం దినంగా ప్రకటించింది కదా ! ఆ రోజు ఉదయం 8 గంటలకు ముఖ్య అతిథిగారిచే జాతీయ పతాకావిష్కరణతో ఉత్సవాన్ని ప్రారంభించాం. మేము మా పాఠశాలలోని ఉపాధ్యాయులందరిని ప్రత్యేకంగా సన్మానించాం. వారి ఆశీర్వచనాలు పొందాం. మనకు విద్య నేర్పుతున్న గురువులను గౌరవించి సన్మానించడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది.

ఇట్లు,
నీ మిత్రుడు,
జయరాజ్.

చిరునామా :
ఎస్. పుష్పరాజ్, 10వ తరగతి,
నవోదయ హైస్కూలు,
నాయుడుపేట,
నెల్లూరు.

ప్రశ్న 6.
మీ పాఠశాలలో గ్రంథాలయ వసతి కల్పించమని కోరుతూ సంబంధిత అధికారికి లేఖ రాయండి.
జవాబు:

ఏలూరు,
x x x x x

చింతా రవిశంకర్,
పదవ తరగతి, ‘ఏ’ సెక్షన్,
మునిసిపల్ హైస్కూలు,
పవర్ పేట, ఏలూరు.

ఆర్యా ,
విషయము : గ్రంథాలయ వసతి కల్పించమని వినతి.

నమస్కారములు. మా పాఠశాలలో సుమారు 2 వేలమంది విద్యార్థినీ విద్యార్థులు చదువుతున్నారు. మా పాఠశాలలో మంచి గ్రంథాలయము లేదు. ఈ సంవత్సరము పాఠ్యప్రణాళికలు బాగా మారిపోయాయి. గ్రంథాలయంలోని పుస్తకాలు – చదివితే కానీ, పరీక్షలలో సరయిన జవాబులు వ్రాయలేము. నిత్యమూ వచ్చే రోజువారీ పత్రికలు చదివితే, మాకు దేశకాల పరిస్థితులు అర్థం అవుతాయి.

కాబట్టి మీరు తప్పక మా మునిసిపల్ కమిషనర్ గారికి చెప్పి, మీరు కూడా మంచి గ్రాంటు ఇచ్చి, మా పాఠశాలలో మంచి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయించవలసిందిగా మా విద్యార్థుల తరుపున ప్రార్థిస్తున్నాను.

నమస్కారాలతో,

ఇట్లు,
తమ విధేయుడు,
చింతా రవిశంకర్,
పదవ తరగతి, ఎ. సెక్షన్ నెంబర్ : 26.

చిరునామా :
జిల్లా విద్యాశాఖాధికారి గార్కి,
పశ్చిమగోదావరి జిల్లా,
ఏలూరు.

AP SSC 10th Class Telugu లేఖలు

ప్రశ్న 7.
‘ఎదుటి వారిలో తప్పులు వెతకటం కన్నా, వారి నుండి మంచిని స్వీకరించడం మేలు’ అని తెలియజేస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

చిత్తూరు,
x x x x x

స్నేహితుడు రంగనాకు,
స్నేహితురాలు శారదకు,

నీ లేఖ చేరింది. మీ నగరంలోని “సాయీ సేవామండలి” వారు మీ పాఠశాల విద్యార్థులకు పెన్నులు, నోట్సు పుస్తకాలు, వగైరా ఉచితంగా పంచి పెట్టారని రాశావు. ఆ సంస్థవారు నగరంలో చందాలు బాగా వసూలు చేస్తున్నారనీ, వాటికి రశీదులు మాత్రం ఇవ్వడం లేదని రాశావు. నీవు సేవామండలి వారు చేస్తున్న సేవా కార్యక్రమాల్ని ప్రశంసించాలి. వారి తప్పులు వెదకరాదు.

ఆ సేవామండలి వారు దేవాలయాల వద్ద నిలబడి భక్తులను క్యూ లైన్లలో పంపడం, వారి చెప్పులను కాపాడి, తిరిగి వారికి అప్పగించడం, మజ్జిగ, మంచినీరు అందించడం వగైరాలు చేస్తున్నారు. దొంగతనాలు జరుగకుండా కాపాడుతున్నారు.

వారు బీదపిల్లలకు విద్యా సదుపాయాలు కల్పిస్తున్నారు. పండుగరోజుల్లో బీదలకు అన్నదానం, వస్త్రదానం చేస్తున్నారు. రోగులకు పాలు పండ్లు ఇస్తున్నారు.

నీవు ఆ సేవామండలి వారు చేస్తున్న పరోపకారం, మానవసేవ, ధర్మకార్యాలు మెచ్చుకోవాలి. వారిని అభినందించాలి. అంతేకాని వారు వసూలు చేసే చందాలకు రశీదులు ఇవ్వడం లేదని వారిని తప్పు పట్టరాదు. రశీదు పొరపాటున ఇచ్చి ఉండకపోవచ్చు గదా !

మనం ఎదుటివారి తప్పులను వెతికి చూపిస్తాము. దానికంటే వారు చేసే మంచిని గ్రహించి, వారిని అభినందించడం మంచిది. వారు చేసే పనిలోని లోపాలను వారి దృష్టికి తేవాలి.

మంచిపని చేసేవారిని ప్రశంసించడం, మన ధర్మం. ఉంటా.

ఇట్లు,
నీ ప్రియ స్నేహితుడు,
నీ స్నేహితురాలు,
కె. జయ / కె. జయరాజు.

చిరునామా :
కె. రంగనాధ్, / యస్. శారద,
గాంధీ మునిసిపల్ హైస్కూలు,
గుంటూరు, ఆంధ్రప్రదేశ్.

ప్రశ్న 8.
నాటితో పోలిస్తే నేటి వివాహ వేడుకల్లో వచ్చిన మార్పులను గురించి విమర్శనాత్మకంగా మిత్రులకు లేఖ రాయండి.
జవాబు:

తిరుపతి,
x x x x x

మిత్రుడు ప్రసాద్ కు,

శుభాభినందనలు. మీ అక్క పెళ్ళి శుభలేఖను నీవు నాకు పంపించావు. సంతోషం. ఈ మధ్య మా అన్నయ్య స్నేహితుడి పెళ్ళికి వెళ్ళాను. పూర్వపు పెళ్ళిళ్ళకూ, ఇప్పటి పెళ్ళిళ్ళకూ ఎన్నో తేడాలున్నాయి.

కోపం వల్ల చాలా అనర్దాలు వస్తాయి. కోపంతో మనకు వివేకం నశిస్తుంది. సీతారామ్ తో నీకు వచ్చిన తగవు విషయం, మీ పెద్దలతో చెప్పు. వారు మీ తగవును పరిష్కరిస్తారు. కోపం తగ్గించుకొని శాంతంగా ఉండమని నిన్ను కోరుతున్నాను. త్వరలో నీవూ, సీతారామ్ మిత్రులుగా మారుతారని ఆశిస్తున్నా.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
అవసరాల వెంకట్రావు,
10వ తరగతి,
మునిసిపల్ హైస్కూలు,
విజయవాడ.

చిరునామా:
కె. రఘునందన్,
S/O కె. రాజారావు గారు,
ఇంటి నెం. 4.1. 104,
మహారాణీ పేట,
విశాఖపట్టణం, ఆంధ్రప్రదేశ్.

ప్రశ్న 9.
నీ సైకిలు పోయిందని తెలుపుతూ,వెతికించమని కోరుతూ పోలీసు అధికారికి లేఖ రాయండి.
జవాబు:

కర్నూలు,
x x x x x x

కె. జవహర్ రెడ్డి,
పదవ తరగతి, సెక్షన్ ‘ఎ’
మునిసిపల్ హైస్కూల్,
గాంధీనగర్, కర్నూలు.
గాంధీనగర్ పోలీసు ఇన్ స్పెక్టర్ గారికి, కర్నూలు,

అయ్యా ,

విషయము : సైకిలు దొంగతనం – చర్య తీసుకోవలసిందిగా విజ్ఞప్తి.

నమస్కారములు,
నిన్న అనగా 9 – 4 – 2016 నాడు, నేను మిత్రులతో కలసి గవర్నమెంటు హాస్పిటల్ కు, నా మిత్రుని పలకరించుటకు వెళ్ళాను. మా మిత్రులము అందరమూ, మా సైకిళ్ళను గేటు వద్ద చెట్టు క్రింద తాళం వేసి ఉంచి లోపలకు వెళ్ళాము. తిరిగి వచ్చేటప్పటికి నా సైకిలు కనబడలేదు. మిగిలిన వారి సైకిళ్ళు మాత్రం ఉన్నాయి. నా సైకిలు వివరాలు క్రింద ఇస్తున్నాను.

హీరో కొత్త సైకిలు, 24, నెంబరు హెచ్ 26723. దయచేసి నా సైకిలు వెతికించవలసినదిగా మిమ్మల్ని కోరుతున్నాను.
నమస్కారాలతో,

ఇట్లు,
మీ విశ్వసనీయుడు,
కె. జవహర్ రెడ్డి,
10వ తరగతి, సెక్షన్ – ‘ఎ’.

ప్రశ్న 10.
తోటి స్త్రీలను సోదరీమణుల్లా, మాతృమూర్తుల్లా భావించాలని గుర్తు చేస్తూ మీ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:

రాజమండ్రి,
x x x x x

ప్రియమైన అభిలేష్ కు,

నేను బాగా చదువుతున్నాను. నీవు బాగా చదువుతున్నావని భావిస్తాను. ఈ మధ్య నేను చిన్న సాహసం చేశాను. మా పాఠశాలలో నాతో చదివే జలజను ఒక దుర్మార్గుడు నిత్యం తన్ను ప్రేమించమని ఏడిపిస్తూ ఉండేవాడు. నేను వాడితో తగువు పెట్టుకొని వాడిని తన్నాను. పోలీసులకు వాణ్ణి అప్పగించాను.

మనం మనతోటి స్త్రీలను మన అక్కా చెల్లెళ్ళలా, మన తల్లుల్లా భావించి వారికి రక్షణగా నిలబడాలి. నిజానికి స్త్రీలు ఈ భూమిమీద తిరిగే పుణ్యదేవతలు. స్త్రీలపట్ల అపచారం చేస్తే వారు నాశనం అవుతారు. సమూలంగా వారి వంశం నశిస్తుంది. స్త్రీలు పూజింపదగినవారు.

స్త్రీలకు ఎటువంటి అవమానం జరుగకుండా, మనం చూడాలి. తోటి స్త్రీలను కన్నతల్లుల్లా, మన సోదరీమణుల్లా చూడాలి. నేను చేసిన సాహసాన్ని నీవు తప్పక అభినందిస్తావని నమ్ముతున్నా.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
రాజేష్.

చిరునామా :
పి. అఖిలేష్,
10వ తరగతి , జె.పి. హైస్కూల్,
కుప్పం, చిత్తూరు జిల్లా,

ప్రశ్న 11.
మీ ఊరికి బస్సు సదుపాయం కల్పించమని కోరుతూ సంబంధిత రోడ్డు రవాణా సంస్థ అధికారికి లేఖ రాయండి.
జవాబు:

చామర్రు,
x x x x x

ఆర్.టి.సి. జనరల్ మేనేజర్ గారికి,
చామర్రు నివాసియైన అగ్గరాజు శ్రీరామమూర్తి వ్రాయు విన్నపము.

అయ్యా ,

మాది అచ్చంపేట మండలంలోని చామర్రు అనే గ్రామం. మా గ్రామ జనాభా ఎనిమిదివందలు. ఇచ్చటి ప్రజలు నిత్యావసర సరకులు అచ్చెంపేట వెళ్ళి తెచ్చుకోవాలి. అలాగే విద్యార్థులు హైస్కూలు చదువుకు అచ్చెంపేట, కాలేజి చదువుకు సత్తెనపల్లి వెళ్ళి రావలసియున్నది. పిల్లలు, పెద్దలు, విద్యార్థులు అందరూ కూడా మండల కేంద్రానికి వెళ్ళటానికి నానా బాధలు పడుతున్నారు. కారణం మా ఊరికి ఎటువంటి బస్సు సౌకర్యం లేకపోవడమే. ‘ప్రజా సేవయే కర్తవ్యం’గా భావించే మీరు మా గ్రామానికి బస్సు సౌకర్యాన్ని కలిగించి మా కష్టాలను గట్టెక్కించవలసిందిగా కోరుతున్నాను.

ఇట్లు,
తమ విధేయుడు,
ఎ.ఎస్.ఆర్. మూర్తి.

చిరునామా :
జనరల్ మేనేజర్,
ఆర్.టి.సి. ఆఫీసు,
గుంటూరు రేంజి, గుంటూరు.

ప్రశ్న 12.
ఉపకార వేతనాన్ని మంజూరు చేయమని కోరుతూ జిల్లా సంక్షేమశాఖాధికారికి లేఖ రాయండి.
జవాబు:

ఉపకార వేతనం కోరుతూ జిల్లా సంక్షేమశాఖాధికారికి లేఖ.

పటమట,
x x x x x

కృష్ణాజిల్లా సంక్షేమశాఖాధికారి గారి దివ్య సముఖమునకు,

ఆర్యా !
నేను పటమట జిల్లా పరిషత్ హైస్కూలులో పదవ తరగతి చదువుచున్నాను. నేను ఆర్థికముగా వెనుకబడిన కుటుంబమునకు చెందినవాడను. 9వ తరగతి పరీక్షలలో నాకు 600 మార్కులకు 530 మార్కులు వచ్చినవి. పై చదువులు చదువుటకు ఆర్థికశక్తి లేకపోవుటచే మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పవలసి వచ్చుచున్నది. కనుక తమరు నా యందు దయయుంచి ఉపకార వేతనమును మంజూరు చేయవలసినదిగా ప్రార్థించుచున్నాను.

జతపరచినవి :

  1. ఆదాయ ధృవీకరణ పత్రం,
  2. మార్కుల ధృవీకరణ పత్రం,
  3. కుల ధృవీకరణ పత్రం.

ఇట్లు,
తమ విధేయుడు,
అగ్గిరాజు శ్రీహర్ష,
10వ తరగతి, జిల్లా పరిషత్ హైస్కూలు,
పటమట, కృష్ణాజిల్లా.

చిరునామా :
జిల్లా సంక్షేమశాఖాధికారి గారికి,
జిల్లా సంక్షేమశాఖాధికారి కార్యాలయం,
మచిలీపట్నం, కృష్ణాజిల్లా.

AP SSC 10th Class Telugu లేఖలు

ప్రశ్న 13.
మీ పాఠశాలలో జరిగిన ఒక ఉత్సవాన్ని గూర్చి మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:

శ్రీకాకుళం,
x x x x x

ప్రియ స్నేహితురాలు,
మధుప్రియకు శుభాకాంక్షలు,

గడచిన జనవరి 26న మా పాఠశాలలో రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు బ్రహ్మాండంగా జరిగాయి. మా జిల్లా విద్యాశాఖాధికారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాం. ఆ రోజు ఉదయం గం. 8 – 00 లకు ముఖ్య అతిథిగారిచే జాతీయ పతాకావిష్కరణ కావించబడింది. రిపబ్లిక్ దినోత్సవ ప్రాముఖ్యాన్ని గురించి ముఖ్య అతిథిగారు చక్కని సందేశమిచ్చారు. కొందరు ఉపాధ్యాయులు, విద్యార్థులు కూడా ఆ రోజు గొప్పతనాన్ని గురించి ఉపన్యాసమిచ్చారు. రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు పంచిపెట్టబడ్డాయి. తరువాత విద్యార్థులకు స్వీట్సు పంచిపెట్టబడ్డాయి. ‘జనగణమన’ జాతీయ గీతంతో నాటి కార్యక్రమం ముగిసింది.

ఇట్లు,
నీ ప్రియ స్నేహితురాలు,
టి. హరిప్రియ.

చిరునామా :
కె. మధుప్రియ,
10వ తరగతి,
మున్సిపల్ గరల్స్ హైస్కూలు,
రాజమండ్రి, తూర్పు గోదావరి జిల్లా.

ప్రశ్న 14.
అమరావతిలో అద్భుత శిల్ప సంపదను సృష్టించిన శిల్పులను అభినందిస్తూ ఒక లేఖ రాయండి.
జవాబు:

మిత్రునకు శిల్పులను అభినందిస్తూ లేఖ

విజయవాడ,
x x x x x

మిత్రుడు శ్రీకాంత్ కు, / మిత్రురాలు రాధకు,

మిత్రమా ! శుభాకాంక్షలు. ఈ మధ్య నేను మన నవ్యాంధ్ర రాజధాని నగరం, అమరావతికి వెళ్ళి అక్కడి శిల్ప సంపదను చూసి, ఆ శిల్పాలను చెక్కిన కళా తపస్వులయిన శిల్పులకు జోహార్లు సమర్పించాను. అక్కడ బుద్ధ విగ్రహాలు, జైన మందిరము, అమరేశ్వరాలయము, స్తూపాలు అన్నీ చూశాను. ఆ శిల్పాలు చెక్కిన శిల్పులకు అభినందనలు అందించాను. ఆ శిల్పాలు ప్రపంచ శిల్ప సంపదలోనే అగ్రశ్రేణివని డా|| ఫెర్గూసన్ పొగిడాడు.

జాషువా మహాకవి చెప్పినట్లు శిల్పి చేతి సుత్తె నుండి ఎన్నో దేవాలయాలు వెలిశాయి. అర్థం లేని బండరాయికి శిల్పి జీవం పోస్తాడు. రాళ్ళను దేవుళ్ళుగా మార్చి, వాటికి మనచే పూజలు చేయిస్తాడు. శిల్పి శాశ్వతుడు. రాళ్ళలో నిద్రపోయే బొమ్మల్ని ఉలి తగిలించి అతడు లేపుతాడు. శిల్పి చిరంజీవి. పుణ్యాత్ముడు. ప్రపంచ ప్రఖ్యాతిని పొందిన మహాశిల్పులకు మనం అభినందనలు అందించాలి. నీవు కూడా అమరావతి వచ్చి, మత తెలుగు శిల్పుల కళానైపుణ్యానికి జోహార్లు అందిస్తావని విశ్వసిస్తున్నాను.

‘అమరావతీ నగర అపురూప శిల్పాలు’ అని మనం నిత్యం తెలుగుతల్లి పాటలో పాడుతున్నాము. ఆ శిల్పులకు జోహార్లు అందించడం మన విధి. ఉంటా.

ఇట్లు,
నీ మిత్రుడు, / మిత్రురాలు,
శ్రీహర్ష. / రజని.

చిరునామా :
పి.శ్రీకాంత్, / పి.రాధ,
S/o/ D/o పి.వరప్రసాద్,
విశాఖపట్టణం,
అక్కయ్యపాలెం, ఆంధ్రప్రదేశ్.

ప్రశ్న 15.
పేదలకు దానం చేయుట వలన మనం పొందే మేలును గురించి తెలియజేస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

మిత్రుడికి లేఖ

తిరుపతి,
x x x x x

మిత్రుడు శశిభూషణకు, / మిత్రురాలు కమలకు,

ఉభయ కుశలోపరి. నీవు రాసిన లేఖ చేరింది. మనం నైతిక విలువలను పాటించాలని రాశావు. సంతోషము. మన ఇరుగు పొరుగువారిలో ఎందరో పేదలు ఉంటారు. భగవంతుడు మానవులు అందరిలోనూ ఉంటాడు. కాబట్టి మనుషులు అంతా దైవంతో సమానం.

ముఖ్యంగా పేదవారికి, మనకు ఉన్నంతలో దానం చేయాలి. మన తరగతిలోని పేదవారికి పుస్తకాలు, పెన్నులు, నోట్సులు దానం చెయ్యాలి. పరీక్ష ఫీజులు కట్టడానికి వారికి డబ్బు సాయం చెయ్యాలి. వైద్య సహాయం కోసం డబ్బులు అడిగే వారికి తప్పక ఇవ్వాలి.

పేదలకు దానం చేస్తే మరుసటి జన్మలో మనకు భగవంతుడు మరింతగా ఇస్తాడు. పేదల ముఖాల్లో ఆనందం కనబడేలా చేస్తే, మన జీవితాలు సుఖసంతోషాలకు నిలయం అవుతాయి. నేను నాకు ఉన్నంతలో పేదలకు దాన ధర్మాలు చేస్తున్నాను.

నీవు కూడా చెయ్యి.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు, / మిత్రురాలు,
సాయికుమార్. / శశికళ.

చిరునామా:
కె. శశిభూషణ్, / కె. కమల,
S/o వెంకటేష్, | D/o వెంకటేష్,
ఆర్యాపురం, రాజమహేంద్రవరం,
తూర్పుగోదావరి జిల్లా.

AP SSC 10th Class Telugu లేఖలు

ప్రశ్న 16.
విద్వాన్ విశ్వం కవితను ప్రశంసిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

మిత్రునకు లేఖ

గుంటూరు,
x x x x x

మిత్రుడు రామారావునకు,

శుభాభినందనలు. నీ లేఖ అందింది. నేను ఈ మధ్య విద్వాన్ విశ్వంగారి ‘మాణిక్యవీణ’ వచన కవిత చదివాను. విశ్వంగారు గొప్ప కవి పండితుడు. ఆయన ‘విశ్వరూపి నా హృదయం’ అని ప్రకటించుకున్నాడు. ఈ కవితలో చక్కని అభ్యుదయ భావాలు వెలిబుచ్చాడు.

మానవులు కేన్సరుతో బాధపడుతూ ఉంటే, దానికి మందులు కనుక్కోకుండా, రోదసిలోకి ఉపగ్రహాలు పంపడం వల్ల ప్రయోజనం ఏముంటుందని శాస్త్రజ్ఞులను ప్రశ్నించాడు.

తంత్రాలతో సమాజ సమస్యలు దారికి రావని హెచ్చరించాడు. శాస్త్రజ్ఞులు నిప్పునూ, చక్రాన్ని కనిపెట్టినరోజు నిజంగా, మానవ చరిత్రలో పండుగరోజు అని గుర్తు చేశాడు.

మానవ జీవితాన్ని కళలూ, కవిత్వం, విజ్ఞానం నడిపిస్తాయన్న యథార్థాన్ని విశ్వంగారు చెప్పాడు.

వచన కవితా రచనలో ఆయన చిన్న చిన్న పదాలతో లోతైన భావాలను తేలికగా అందించాడు.

విశ్వంగారు మాణిక్యవీణను మీటి, మానవీయ రాగాల్ని పలికించాడు. చక్కని లలిత పదాలతో, అనుప్రాసలతో కవిత మనోహరంగా చెప్పాడు.

తప్పక నీవు ఈ కవిత చదువు. ఉంటా.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
యన్. శ్రీకాంత్.

చిరునామా :
యస్. రామారావు,
S/o యస్: కృష్ణారావుగారు,
రామారావు పేట,
కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా.

ప్రశ్న 17.
వ్యక్తిత్వ బదిలీ ధృవీకరణ పత్రాలను ఇప్పించవలసినదిగా ప్రధానోపాధ్యాయులకు లేఖ రాయండి.
జవాబు:

ప్రధానోపాధ్యాయులకు లేఖ

విజయవాడ,
x x x x x

గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులవారికి,
మహాత్మాగాంధీ మునిసిపల్ ఉన్నత పాఠశాల,
గాంధీనగరం, విజయవాడ.

ఆర్యా !
విషయం : వ్యక్తిత్వ విద్యా, దిలీ ధృవీకరణ పత్రాలకై విజ్ఞప్తి.

నేను మీ పాఠశాలలో 10వ తరగతి చదివి, మంచి మార్కులతో పరీక్షలో ఉత్తీర్ణుడను అయ్యాను. దయచేసి నేను ఇంటర్‌లో చేరేందుకు వీలుగా నా వ్యక్తిత్వ, విద్యా, బదిలీ ధృవీకరణ పత్రములు ఇప్పించవలసినదిగా ప్రార్ధన.
నమస్కారాలతో,

ఇట్లు,
మీ విశ్వసనీయుడు,
x x x
10వ తరగతి – 24వ నెంబరు.

ప్రశ్న 18.
కోపం తగ్గించుకోవడం మంచిదని తెలుపుతూ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:

విశాఖపట్టణం,
x x x x x

మిత్రుడు రఘునందన్ కు,

నీ లేఖ అందింది. నేనూ, మా తల్లిదండ్రులూ క్షేమంగా ఉన్నాము. నీ లేఖలో, నీకు ప్రియ మిత్రుడైన సీతారామ్ తో నీకు తగవు వచ్చిందనీ, మీరిద్దరూ దెబ్బలాడుకున్నారని రాశావు. మీ ఇద్దరికీ దెబ్బలు తగిలాయని కూడా రాశావు.

నీ ఉత్తరం చూసి నేను చాలా బాధపడ్డాను. సహజంగా నీవు శాంత స్వభావుడవు. నీకు కోపం ఎందుకు వచ్చిందో రాశావు. అయినా దెబ్బలు తగిలే వరకూ మీరు తగవు లాడడం బాగోలేదు. ‘తన కోపమె, తన శత్రువు’ అని సుమతీ శతకకర్త రాశాడు. క్రోధం మనకు శత్రువని భర్తృహరి కూడా చెప్పాడు. అయినా నీకు అన్ని విషయాలు తెలుసు.

కోపం వల్ల చాలా అనర్థాలు వస్తాయి. కోపంతో మనకు వివేకం నశిస్తుంది.. సీతారామ్ తో నీకు వచ్చిన తగవు విషయం, మీ పెద్దలతో చెప్పు. వారు మీ తగవును పరిష్కరిస్తారు. కోపం తగ్గించుకొని శాంతంగా ఉండమని నిన్ను కోరుతున్నాను. త్వరలో నీవూ, సీతారామ్ మిత్రులుగా మారుతారని ఆశిస్తున్నా.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
అవసరాల వెంకట్రావు,
10వ తరగతి,
మునిసిపల్ హైస్కూలు,
విజయవాడ.

చిరునామా:
కె. రఘునందన్,
S/O కె. రాజారావు గారు,
ఇంటి నెం. 4.1.104,
మహారాణీ పేట,
విశాఖపట్టణం, ఆంధ్రప్రదేశ్.

AP SSC 10th Class Telugu వ్యాసాలు

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 10th Class Telugu వ్యాసాలు Notes, Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu వ్యాసాలు

ప్రశ్న 1.
‘ఆరుబయట మలవిసర్జన’ ఎంతటి ప్రమాదకరమో వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
అత్యంత ప్రమాదం

మలవిసర్జన అంటే మన శరీరంలోని మలినాలను బయటకు వదలడం.

మలవిసర్జన వలన వచ్చే మలినాలు చాలా దుర్వాసనతో కూడుకొని ఉంటాయి. అంతేకాకుండా వాటిపై అత్యంత ప్రమాదకరమయిన సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు వ్యాపించినట్లయితే కలరా వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. ఇవి వృద్ధులకు, బలహీనులకు, చిన్న పిల్లలకు, అనారోగ్యవంతులకు, గర్భిణీలకు, బాలింతలు మొదలైన వారికి తొందరగా వ్యాపిస్తాయి.

బహిరంగ మలవిసర్జన చేసినపుడు దానిపై ఈగలు, దోమలు వాలతాయి. వాటిపైకి అక్కడి సూక్ష్మజీవులు చేరతాయి. ఆ ఈగలు, దోమలు మనం తినే ఆహారంపై వాలతాయి. ఈ సూక్ష్మజీవులు ఆహారంతోబాటు మనలోపలికి ప్రవేశిస్తాయి. ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి.

అందుకే బహిరంగ మలవిసర్జన వద్దని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు పేర్కొంటున్నాయి. ప్రజలను చైతన్యపరుస్తున్నాయి. మరుగుదొడ్లు నిర్మించుకొందుకు ప్రభుత్వం కూడా మినహాయింపుతో కూడిన ఋణం మంజూరు చేస్తోంది.
బహిరంగ మలవిసర్జన మానేద్దాం – నాగరికతను చాటుదాం.
మరుగుదొడ్డి వాడదాం – రోగాలు నివారిద్దాం.
పరిశుభ్రత పాటిద్దాం – పదికాలాలు చల్లగా ఉందాం.

AP SSC 10th Class Telugu వ్యాసాలు

ప్రశ్న 2.
‘స్వచ్ఛభారత్’ కార్యక్రమం గురించి ఒక వ్యాసం రాయండి.
జవాబు:
‘స్వచ్ఛభారత్’ అంటే భారతదేశం అంతా పరిశుద్ధంగా ఉండాలి అనే నినాదం. మనదేశ ప్రధాని నరేంద్రమోడీ గారు, దేశంలోని కాలుష్యమును గమనించి, నదీజలములు అన్నీ కలుషితం కావడం చూసి, ఈ ‘స్వచ్ఛభారత్’ అనే నినాదాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమ ప్రచారకులుగా దేశంలోని ప్రసిద్ధులయిన వ్యక్తులను మోడీ గారు నియమించారు. అమితాబ్ బచ్చన్, రామోజీరావు వంటి వారు, ఈ కార్యక్రమానికి చేయూత నిస్తున్నారు. మన విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, నగరాలలోని మురికిపేటలు, గంగ, గోదావరి వంటి నదుల జలాలు నేడు కాలుష్యంతో నిండిపోతున్నాయి. విద్యార్థులూ, ఆఫీసులలో ఉద్యోగులూ తమ పాఠశాలలనూ, కార్యాలయాలనూ “పరిశుభ్రంగా ఉంచుకోవాలి.” ప్రజలు తమ గృహాలనూ, పరిసరాలనూ శుభ్రంగా ఉంచుకోవాలి.

నదులు, చెరువులలోని నీటిని కలుషితం చేయరాదు. ఈ కాలుష్యం వల్ల రోగాలు పెరిగిపోతున్నాయి. దోమలు, క్రిములు పెరిగిపోతున్నాయి. ప్రజలందరూ స్వచ్ఛతను కాపాడితే, దేశం ఆరోగ్యవంతం అవుతుంది. ప్రజలకు కావలసిన మంచినీరు లభిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఏనాడో చెప్పారు.

స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని దేశం అంతా ప్రచారం చేయాలి. దీన్ని ప్రజల కార్యక్రమంగా తీర్చిదిద్దాలి. దేశంలోని పత్రికల వారు, దూరదర్శనా వారు స్వచ్ఛభారత్ గురించి మంచి ప్రచారం చేయాలి. దానివల్ల దేశం సుభిక్షంగా, ఆరోగ్యంగా ఉంటుంది.

ప్రశ్న 3.
అధిక జనాభా వల్ల మన పర్యావరణం దెబ్బ తింటోంది. పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియజేస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
భూమి, నీరు, గాలి మొదలైన వాటితో మనిషికి ఉండే అవినాభావ సంబంధమే పర్యావరణం. కాబట్టి పర్యావరణం అంటే పరిసరాల వాతావరణం అని అర్థం. పరిసరాల వాతావరణం కలుషితం కాకుండా కాపాడుకోవడమే పర్యావరణ సంరక్షణ అనబడుతుంది.

ప్రాణులు నివసించేది నేలపైన గదా ! ఆ నేలతల్లిని సరిగా చూసుకోవాలి. భూమిపై చెత్త, చెదారమేకాదు ఓషధులుంటాయి. చెట్లుంటాయి. జంతువులుంటాయి. మనం జీవించటానికి ఆహారం లభించేది భూమి వల్లనే గదా ! రసాయనిక ఎరువుల వాడకం వల్ల భూమి నిస్సారమైపోతోంది. భూమిని ఆరోగ్యంగా ఉంచాలి. భూమి సమతౌల్యాన్ని పోషించాలి.

జలకాలుష్యం మిక్కిలి భయంకరమైనది. రసాయనిక పదార్థాలు, పరిశ్రమల వల్ల విడుదలయ్యే ద్రవపదార్థాలు సాగునీటిని, త్రాగేనీటిని కాలుష్యపరుస్తాయి. మురుగునీరు, త్రాగేనీరు అనే భేదం లేకుండా పోతోంది. డ్రైనేజి వ్యవస్థ అరొకరగా వుంది. దీనివల్ల కలరా, మలేరియా, ఫ్లోరోసిస్, విషజ్వరం, టైఫాయిడ్ వంటివేకాక వైద్యులకి అంతుపట్టని కొత్త రోగాలు కూడా బయలుదేరాయి.

ఇక వాయు కాలుష్యం, గాలివల్లనే మనం జీవిస్తున్నాం. అటువంటి గాలి స్వచ్ఛంగా వుండాలి. కాని ఆధునిక పారిశ్రామికత పేరుతో గాలి కూడా కలుషితమైపోతోంది. విషపూరితమైన గాలి పీల్చటం వలన ఊపిరితిత్తులు, జీర్ణకోశం, గుండెకాయ, కళ్ళు అనారోగ్యానికి గురై ప్రమాదాలు సంభవిస్తున్నాయి. జీవితం రోగాలమయం అవుతోంది.

యంత్రాలవల్ల, వాహనాలవల్ల ధ్వనికాలుష్యం వ్యాపిస్తోంది. అణుశక్తి పరీక్షల వల్ల కూడా వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది.

1970లో అమెరికాలో పర్యావరణ పరిరక్షణ ఉద్యమం బయలుదేరింది. వాటి నుంచి శాస్త్రజ్ఞులు పర్యావరణ కాలుష్యనివారణకు విశేషమైన కృషి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీని పర్యావరణ దినోత్సవంగా పాటిస్తున్నారు. పర్యావరణ వ్యవస్థలోని సమతౌల్యాన్ని కాపాడుకోవటానికి అందరూ కృషి చేయాలి.

ప్రశ్న 4.
నేటి సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను విశ్లేషిస్తూ “వ్యాసం” రాయండి.
జవాబు:
పవిత్ర భారతదేశంలో స్త్రీలకు సమున్నతమైన గౌరవం ఉంది. స్త్రీలు భూమిపై కదిలే దేవతామూర్తులుగా భావిస్తాము. స్త్రీలు ఎక్కడ ఉంటే అక్కడ దేవతలు ఆనందిస్తారని మనం భావిస్తాము. కాని వర్తమాన సమాజంలో పరిస్థితులు పూర్తిగా మారాయి. స్త్రీల ప్రగతి నానాటికి దిగజారుతున్నది. స్త్రీలు ఎన్నో సమస్యలను, కష్టాలను ఎదుర్కొంటున్నారు.

స్త్రీలు ఇప్పటికీ స్వేచ్ఛగా జీవించలేకపోతున్నారు. కొందరు స్త్రీలను పైకి రానీయకుండా అడ్డుపడుతున్నారు. రాజకీయాల్లో రిజర్వేషన్ కోసం జరుగుతున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రాలేదు. చట్టసభల్లో మహిళా సభ్యులను చులకనగా చూస్తున్నారు.

ప్రేమ పేరుతో స్త్రీలపై దాడులు జరుగుతున్నాయి. అకృత్యాలు జరుగుతున్నాయి. కులాంతర వివాహాలు చేసుకున్న మహిళలపై వివక్షను చూపిస్తున్నారు. పరువు కోసం తండ్రులు కన్న కూతుర్లనే చంపడం మనం చూస్తున్నాం. దీన్ని నాగరిక సమాజం హర్షించదు. దీన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి.

గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీలు అక్షరాస్యతకు దూరంగా ఉంటున్నారు. కొందరు కట్నాల పేరుతో మహిళలను వేధిస్తున్నారు. ఆరోగ్యపరంగా స్త్రీలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. బాలింతలకు తగిన పౌష్టికాహారం దొరకడం లేదు. ఈ రకంగా స్త్రీలు సమాజంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిని మన ప్రభుత్వాలు పరిష్కరించాలి. స్త్రీల జీవితాల్లో వెలుగులను నింపాలి.

AP SSC 10th Class Telugu వ్యాసాలు

ప్రశ్న 5.
మీకు నచ్చిన సన్నివేశాన్ని లేదా ప్రకృతి దృశ్యాన్ని వర్ణిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
సూర్యోదయం
తూర్పువైపు ఆకాశంలోకి ఉదయమే చూస్తే ఎర్రగా కనిపిస్తుంది. అప్పటి వరకూ కోళ్ళు కూస్తూ ఉంటాయి. నక్షత్రాలు ఆకాశంలో వెలవెలపోతాయి. అప్పుడు పక్షులు తమ గూళ్ళ నుండి బయలుదేరి ఆహారం కోసం బారులు కట్టి ప్రయాణం చేస్తూ ఉంటాయి. పక్షులు రెక్కలు ఆడిస్తూ నేరుగా దూసుకుపోతూ ఉంటే, ఆ దృశ్యం చూడ్డానికి కళ్ళకు పండుగలా కనిపిస్తుంది.

అదే సమయానికి సూర్యకిరణాలు నేరుగా వచ్చి నేలకు తాకుతాయి. మా ఇంటి పక్క గుళ్ళో గంటలు మోగుతూ ఉంటాయి. గుడి పక్క చెరువులో సూర్యకిరణాలు పడి, తామర పూలు విచ్చుకుంటాయి. తుమ్మెదలు ఆ పద్మాలపై ఏదో రొద చేస్తూ తిరుగుతూ ఉంటాయి.. సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం. సూర్యోదయం కాగానే ప్రకృతి అంతా మేలుకొని తమ తమ పనుల్లో మునిగిపోతుంది.

ప్రశ్న 6.
‘నవ సమాజంలో విద్యార్థుల పాత్ర అనే అంశం మీద వ్యాసము వ్రాయండి.
జవాబు:
విద్యార్థులు అంటే విద్యను కోరి వచ్చినవారు. విద్యార్థుల ముఖ్య కర్తవ్యం, శ్రద్ధగా చదివి, మంచి మార్కులు సాధించడం. ఈనాడు మన చుట్టూ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారానికి దేశ నాయకులతో పాటు, ప్రజలు కూడా బాబాధ్యత వహించాలి. విద్యార్థులు చదువుకుంటున్న దేశ పౌరులు. కాబట్టే భావి భారత పౌరులయిన విద్యార్థులు కూడా, నవ సమాజంలో పెరిగిపోతున్న అవినీతి, అపరిశుభ్రత, దురాగతాలు, రాజకీయ నాయకుల వాగ్దాన భంగాలు వంటి వాటిపై తప్పక తిరుగబడాలి.

విద్యార్థులు ‘స్వచ్ఛభారత్’ వంటి కార్యక్రమాలు చేపట్టాలి. అంటువ్యాధుల నిర్మూలనకు దీక్ష చేపట్టాలి. అవినీతి ఎక్కడ కనబడినా, సామూహికంగా. ఎదిరించాలి. విద్యార్థులు నీతినియమాలు పాటించాలి. వృద్ధులను గౌరవించాలి. తోడి వారికి సాయం చేయాలి.

విద్యార్థినీ విద్యార్థులు, క్రమశిక్షణను పాటించాలి. దేశభక్తిని కలిగియుండాలి. మంచి అలవాట్లను అలవరచుకోవాలి. గురువులనూ, తల్లిదండ్రులనూ గౌరవించాలి. బాగా ఆటలు ఆడి, వ్యాయామం చేసి ఆరోగ్యం కాపాడుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రచారం చేయాలి.

విద్యార్థులు రాజకీయాలలో ప్రత్యక్షంగా పాల్గొనరాదు. కాని దేశం కోసం తమ శక్తియుక్తులనన్నింటినీ ధారపొయ్యాలి.

ప్రశ్న 7.
కాలుష్యంతో నిండిపోతున్న నేటి నగర వాతావరణాన్ని గురించి వ్యాసం రాయండి.
జవాబు:
కవి అలిశెట్టి ప్రభాకర్ “నగరం అర్థంకాని రసాయనశాల” అన్నమాట యదార్థము. నేడు పల్లెలను వీడి ప్రజలంతా పట్టణాలకు వలస పోతున్నారు. నగరాలు అన్నీ మురికివాడలుగా మారి పోయాయి.

నగరాల్లో జనాభా పెరిగిపోతోంది. ప్లాస్టిక్ సంచుల వాడకం పెరిగింది. ప్రజలు పారవేసే చెత్త, వాడి పారవేసిన ఇంజక్షను సూదులు, ఫ్యాక్టరీలవారు విడిచిపెట్టే రసాయనిక వ్యర్థాలు , పందులు, కుక్కలు వంటి జంతువుల మాలిన్యాలు, నగరంలో పోగుపడుతున్నాయి.

నగరాలలో ప్రజలకు త్రాగడానికి సరిపడ మంచినీరు దొరకడం లేదు. నగరాన్ని శుభ్రంగా ఉంచాలన్న దీక్ష, ప్రజలకు ఉండడం లేదు. నగరంలో తిరిగే వాహనాలు ఎంతో కాలుష్యాన్ని గాలిలోకి విడిచిపెడుతున్నాయి. నదులలో కాలువలలో, చెరువులలో మురికినీరు వదలుతున్నారు. జలాశయాల్లో బట్టలు ఉతుకుతున్నారు. చెత్త దూరంగా పారవేసేందుకు నగరాల్లో చోటు దొరకడం లేదు. అందువల్ల నగరాలు కాలుష్య నిలయాలుగా, రోగాలకు పుట్టుక స్థలాలుగా మారుతున్నాయి.

నివారణ :
ప్రతి నగర పౌరుడు తమ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. మొక్కలు నాటాలి. జలాశయాల్లోకి మురికినీరు విడువరాదు. పరిశుభ్రతకూ, మంచి నీటికి మంచి వాతావరణానికి నగరాధికారులతో పాటు అందరూ కృషి చేయాలి.

AP SSC 10th Class Telugu వ్యాసాలు

ప్రశ్న 8.
నగర జీవనంలోని అనుకూల అంశాలపై ఒక వ్యాసం రాయండి.
జవాబు:
నగర జీవనం – అనుకూల అంశాలు :
‘నగరం’ అంటే పట్టణము. పల్లెలలో కన్న నగరాలలో ప్రజలకు అవసరమయ్యే సదుపాయాలు ఎక్కువగా లభ్యమవుతున్నాయి. అందువల్ల ప్రజలు గ్రామాల నుండి నగరాలకు వలసపోతున్నారు.

నగరాలలో ప్రజలకు విద్యా, వైద్య, ప్రయాణ సౌకర్యాలు హెచ్చుగా దొరుకుతాయి. ప్రజలకు మంచి విద్య నగరాల్లో లభిస్తుంది. కార్పొరేట్ కళాశాలలు, వైద్యశాలలు నగరాల్లో ఉంటాయి. నగరాల్లో పరిశ్రమలు ఉంటాయి. అందువల్ల ప్రజలకు ఉద్యోగ వసతి లభిస్తుంది. నగరాల్లో ప్రయాణాలకు సిటీ బస్సులు, రైళ్ళు, ఆటోలు, టాక్సీలు దొరుకుతాయి.

చేతి వృత్తుల వారికి సైతము, నగరాల్లో వారికి తగ్గ పని లభిస్తుంది. ప్రజలు ఏదోరకంగా నగరాల్లో బ్రతుకగలరు. వారికి కావలసిన పాలు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు నగరాల్లో దొరుకుతాయి. కుళాయిల ద్వారా మంచి నీరు దొరుకుతుంది. రైతు బజార్లలో చౌకగా కావలసిన వస్తువులు దొరుకుతాయి. రోగం వస్తే, చిన్న పెద్ద వైద్యశాలలు నగరంలో ఉంటాయి. నగరాల్లో 24 గంటలు విద్యుచ్ఛక్తి సరఫరా అవుతుంది.

ఈ విధమైన అనుకూలములు ఉన్నందు వల్లే ప్రజలు పల్లెలను వదలి నగరాలకు వలసపోతున్నారు.

ప్రశ్న 9.
మాతృభాషా ప్రాముఖ్యాన్ని గూర్చి ఒక వ్యాసం రాయండి.
జవాబు:
మాతృభాష అంటే తల్లి భాష అని అర్థం. మనం పుట్టిన చోట జనవ్యవహారంలో ఉండే భాష మాతృభాష. మానవుడు పుట్టింది మొదలు గిట్టేవరకు మాతృభాషలోనే ఎక్కువగా మాట్లాడటం జరుగుతుంది. మనం ఏ భాషలో మాట్లాడతామో, ఏ భాషలో కలలు కంటామో ఆ భాషలోనే విద్యను నేర్చుకోవడం ఎంతైనా అవసరం.

పరాయి భాషలో విద్యాభ్యాసం చేస్తే చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముందుగా పరాయి భాషను అర్థం చేసుకోవడానికే చాలా ప్రయాస పడాల్సివస్తుంది. అందులో తగినంత పరిజ్ఞానం అలవడనిదే విషయ గ్రహణంగానీ, విషయ వ్యక్తీకరణగానీ సాధ్యపడదు. మాతృభాషలో విద్యాభ్యాసం వల్ల విద్యార్థి ఉపాధ్యాయులు చెప్పిన విషయాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. గుర్తుంచుకొని పరీక్షలు బాగా వ్రాయవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ విజ్ఞానాన్ని పొందవచ్చు.

మాతృభాషలో విద్యను నేర్చుకోవడం తల్లిపాలు త్రాగి పెరగడం వంటిది. పరభాషలో విద్యను నేర్చుకోవడం దాది పాలు త్రాగడం వంటిది. ఆంగ్లం వంటి పరాయిభాషలో విద్యార్థికి సరైన పరిజ్ఞానం లేనందువల్ల విద్యార్థికి ఆ భాషరాక బట్టీపట్టి ఏదోవిధంగా కృతార్థుడవుతున్నాడు. ఉపాధ్యాయులు చెప్పేది అర్థం కాక గైడ్సు (Guides) వెంట పడుతున్నాడు. కాబట్టి కనీసం సెకండరీ విద్యాస్థాయి వరకు మాతృభాషలోనే విద్యను బోధించడం, విద్యను నేర్చుకోవడం అవసరం.

ప్రశ్న 10.
‘వాతావరణ కాలుష్యం’ లేదా ‘పర్యావరణ పరిరక్షణ’ అన్న విషయంపై వ్యాసం రాయండి.
జవాబు:
ఆరోగ్యమే మహాభాగ్యం. వాతావరణం పరిశుభ్రంగా ఉంటే, మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అతడి జీవితం, ఆనందంగా సాగుతుంది. మానవుల ఆరోగ్యానికి హానిని కల్గించే హానికారక పదార్థాలు వాతావరణంలో కలిసిపోతే, దానిని వాతావరణ కాలుష్యం అంటారు.

మన చుట్టూ ఉండే గాలి, నీరు, భూమి వంటి వాటిని పర్యావరణం అంటారు. పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి.

వివిధ కర్మాగారాలు, పరిశ్రమలు, లెక్కలేనన్ని మోటారు వాహనాలు, మురికి నీరు, మొ||నవి. వాతావరణ కాలుష్యాన్ని కల్గిస్తున్నాయి. కర్మాగారాలు వదిలే వ్యర్థ పదార్థాల వల్ల, నదుల జలాలు కలుషితం అవుతున్నాయి. దానితో జలకాలుష్యం ఏర్పడుతోంది. మోటారు వాహనాల ధ్వనులతో ధ్వని కాలుష్యం ఏర్పడుతోంది.

వాతావరణ కాలుష్యం వల్ల, మానవుని మనుగడకు ప్రమాదం ఏర్పడుతోంది. దీనివల్ల ఉదరకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, కేన్సర్ రోగాలు, గుండె జబ్బులు వస్తున్నాయి.

వాతావరణ కాలుష్య నివారణకూ, పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు తయారు చేసి అమలు పరచాలి. కర్మాగారములు పరిశుభ్రము చేసిన తరువాతే వ్యర్థాలను విడిచి పెట్టాలి. ఫ్యాక్టరీల వారు మొక్కలు బాగా పెంచాలి. అవకాశం ఉన్న చోట ప్రజలు మొక్కలను బాగా పెంచాలి. ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థలు, పరిశోధనలు చేసి, వాతావరణ కాలుష్య నివారణకు తగు సూచనలు అందించాలి.

AP SSC 10th Class Telugu వ్యాసాలు

ప్రశ్న 11.
నీకు నచ్చిన మహిళ గుణగణాలు (శ్రీమతి ఇందిరాగాంధీ) గురించి వ్యాసం రాయండి.
జవాబు:
నాకు నచ్చిన మహిళ (శ్రీమతి ఇందిరా గాంధీ) :
భరత మాత ముద్దుబిడ్డలలో, ఇందిరాగాంధీ ఒకరు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మహిళామణులలో, ఇందిర సుప్రసిద్ధురాలు. ఈమె 1917వ సంవత్సరము నవంబరు 19వ తేదీన ఆమె అలహాబాదులో జవహర్ లాల్ నెహ్రూ – కమలా నెహ్రూ దంపతులకు జన్మించింది.

ఇందిర శాంతినికేతన్లో రవీంద్రుని వద్ద చదివింది. ఈమె గొప్ప దేశ భక్తురాలు.. ఈమె భర్త ఫిరోజ్ గాంధీ, మహమ్మదీయుడు. ఆ వివాహం ఈమెకు మత సహనాన్ని నేర్పింది. ఈమె తండ్రితో పాటు దేశ విదేశాలు పర్యటించి, రాజనీతి చతురజ్ఞ అయ్యింది.

ఈమె భారతదేశ ప్రధానమంత్రిగా 15 సంవత్సరాలు పనిచేసింది. ఆ కాలంలో ఈమె బ్యాంకులను జాతీయం చేసింది. రాజభరణాలను రద్దు చేసింది. భూ సంస్కరణలను చేపట్టింది. ‘గరీబీ హఠావో’ అని ఈమె ఇచ్చిన నినాదం భారతదేశం అంతటా మారుమ్రోగింది.

ఈమె బడుగువర్గాల ఆశాజ్యోతిగా, దళిత వర్గాల కన్నతల్లిగా పేరు తెచ్చుకొంది. ఈమె గొప్ప సాహసురాలు. గొప్ప రాజనీతిజ్ఞురాలు.

ప్రశ్న 12.
నీకు నచ్చిన జాతీయ నాయకుని గూర్చి వ్యాసం రాయండి.
జవాబు:
మహాత్మాగాంధీ అసలు పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. కానీ భారత ప్రజలు ఆత్మీయంగా ‘బాపూజీ’ అని పిలిచేవారు. ‘మహాత్మా’ అని గౌరవించేవారు. భారత జాతి మహాత్మాగాంధీని ‘జాతిపిత’ గా గౌరవించి కృతజ్ఞత ప్రకటించుకుంది.

గాంధీజీ దక్షిణాఫ్రికా వెళ్ళినప్పుడు అక్కడున్న భారతీయుల దాస్య వృత్తిని చూసి చలించిపోయాడు. ఆంగ్లేయుల ప్రవర్తన సహించలేక ఎదురుతిరిగాడు. ఎన్నో కష్టాలకు లోనయ్యాడు.

స్వదేశానికి తిరిగి వచ్చిన గాంధీజీ భారతీయుల బానిస బ్రతుకుల్ని చూసి సహించలేకపోయాడు. భారతమాత పరాయి పాలకుల సంకెళ్ళలో బందీగా ఉన్నందుకు గాంధీ తల్లడిల్లాడు. ఆంగ్లేయులపై స్వాతంత్ర్య సమరం ప్రకటించాడు. శాంతి, సత్యం, అహింస అనే ఆయుధాలతో స్వాతంత్ర్య సమరం చేపట్టాడు. స్వరాజ్య ఉద్యమానికి కాంగ్రెసు సంఘం స్థాపించాడు.

ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా, విదేశీ వస్తు బహిష్కరణ, సహాయ నిరాకరణ, ఖద్దరు ఉద్యమాలను చేపట్టి ఆంగ్లేయులను గుక్క తిప్పుకోనీకుండా గడగడలాడించాడు. సత్యాగ్రహం, నిరాహారదీక్షల ద్వారా భారత జాతిని జాగృతం చేసి ఆంగ్లేయుల గుండెలు దద్దరిల్లజేశాడు.

అనేక జాతులు, కులాలు, మతాలు, భాషలు గల దేశ ప్రజల్ని ఒకే త్రాటి మీద నడిపించి, సమైక్యంగా పోరాటం సాగించాడు. గాంధీ నడిపించిన ఉద్యమం వల్ల 1947, ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం లభించింది. దుడ్డు కర్ర, అంగవస్త్రం, కిర్రు చెప్పులు గల గాంధీ ప్రపంచ దేశాల చేత జేజేలు అందుకున్నాడు.

ప్రశ్న 13.
ప్రశాంతతకు, పచ్చదనానికి నిలయమైన పల్లెల గొప్పదనాన్ని వర్ణిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
గ్రామాలు దేశ సౌభాగ్యానికి మూలకందములు. పల్లెలలో జీవితం ప్రశాంతంగా, హాయిగా ఉంటుంది. చక్కని ఎండ, గాలి, ప్రతి ఒక్కరికీ పల్లెలలో లభిస్తుంది. పల్లెలు ప్రకృతి రమణీయతకు నిలయాలు. పల్లెలలో పచ్చని చెట్లు, పొలాలు, ఆ చెట్టుపై పక్షుల కలకూజితాలు మనోహరంగా ఉంటాయి. చెట్లు చల్లని గాలిని ఇస్తూ, గ్రామ ప్రజలను సుఖసంతోషాలతో ముంచెత్తుతాయి.

ప్రజలందరికీ పల్లెలలో పాడిపంటలు ఉంటాయి. తాజా కూరగాయలు, పళ్ళు, పూలు వారికి దొరుకుతాయి. గ్రామాలలో ప్రజలందరూ ఒకరితో నొకరు అన్నదమ్ముల్లాగా మెలగుతారు. వారు “అక్కా! బావా” అంటూ ఆప్యాయంగా పలకరించుకుంటారు. కష్టసుఖాల్లో అందరూ కలిసి పాలుపంచుకుంటారు. గ్రామాలలో తీర్థాలు, సంబరాలు మహావేడుకగా జరుగుతాయి.

పల్లెలలో ఒకరింట్లో పెండ్లి అంటే, గ్రామంలో అందరికీ వేడుకే. పల్లెలలో సంక్రాంతికి ముగ్గులు, పూలతోరణాలు, గొబ్బిళ్ళు, భోగిమంటలు, సంక్రాంతి ప్రభలు మహావైభవంగా ఉంటాయి. హరిదాసులు, గంగిరెద్దులు, పగటి వేషధారులు, వారి చక్కని పాటలు ఆనందంగా ఉంటాయి. గ్రామాల్లో పంటలు పండి ఇంటికి వస్తే, ఇళ్ళు కలకలలాడుతాయి. అందమైన పాడి పశువులు, దుక్కిటెడ్లు, ఎడ్ల బళ్ళు మహావైభవంగా ఉంటాయి.

అందుకే పల్లెలు ప్రకృతి రమణీయతకు నట్టిళ్ళు. ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు అని చెప్పగలము.

ప్రశ్న 14.
అవినీతి నిర్మూలనమునకు మీరిచ్చే సలహాలేమిటి?
జవాబు:
మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక అనేక రంగాలలో దేశం ముందంజ వేసింది. దురదృష్టవశాత్తూ మనదేశంలో అవినీతి కూడ పెచ్చుపెరిగింది. అక్రమ సంపాదన ప్రజల లక్ష్యమయిపోయింది. ఏదోరకంగా తప్పుచేసి అయినా డబ్బు సంపాదించడం, తన పని పూర్తిచేసుకోవడం, ఆశ్రితులకు మేలు చేయడం, నీతికి సమాధి కట్టడం జరుగుతోంది. ముఖ్యంగా దేశ రాజకీయ నాయకులలో ఈ అవినీతి జాడ్యము విస్తరించిపోతోంది. చిన్న పంచాయతీ మెంబరు నుండి దేశ ప్రధాని వరకు అందరూ అవినీతి ఆరోపణలకు గురియగుచున్నారు. ఇది దేశానికి పట్టిన దౌర్భాగ్యం. దీనిని అరికట్టడంలో భావిభారత పౌరులైన యువతీయువకులు ముఖ్యంగా విద్యార్థినీ విద్యార్థులు ముందడుగు వేయాలి.

ముందుగా దేశంలో జరిగే అవినీతి కార్యాలను గూర్చి చూద్దాము. వర్తకులు సరకులలో కలీ చేయడం, ప్రభుత్వము పంపిణీ చేసిన నిత్యావసర వస్తువులను దాచి, బ్లాక్ మార్కెట్లో అమ్మడం, ధరలు పెంచివేయడం, ప్రభుత్వానికి పన్నులు ఎగవేయడం వంటి పనులు చేస్తున్నారు. ప్రభుత్వోద్యోగులు ప్రభుత్వము ప్రజలకు ఇచ్చే సదుపాయాలు ప్రజలకు లభించేలా చూడ్డానికి భారీగా లంచాలు మింగుతున్నారు. రేషన్ కార్డులు ఇవ్వడానికి, ఇళ్ళ స్థలాలు మొదలైనవి పంచడానికి లంచాలు తీసికొంటూ అర్హులయిన వారికి అన్యాయం చేసి వారికి ఇష్టమైన వారికి ఇస్తున్నారు. చౌకధరల దుకాణంలో సరుకులను దాచివేసి అక్రమ లాభాలు ఆర్జిస్తున్నారు. బ్యాంకుల అప్పులకు లంచాలు తీసికొంటున్నారు. విద్యాలయాలలో సీట్లకు లంచాలు, పాస్ చేయించడానికి లంచాలు ముట్టచెప్పవలసివస్తోంది. ఇట్లా దేశంలో అవినీతి అన్ని రంగాలలో తాండవిస్తోంది.

ఈ అవినీతిని అరికట్టడానికి యువతీయువకులు ముందుకు రావాలి. పత్రికలకు లేఖలు వ్రాసి లంచగొండుల గూర్చి అవినీతి శాఖ వారికి తెలియజేయాలి. అవినీతి శాఖ ఉద్యోగులు కూడా మరింత చురుకుగా పనిచేసి లంచగొండులను నిర్బంధించాలి.

రోజుకొక లంచగొండిని, కలీ వ్యాపారిని, దుష్ట రాజకీయవేత్తను ప్రభుత్వానికి యువత అప్పగిస్తే, కొద్దిరోజులలో దేశములో అవినీతి దానంతట అదే అంతరిస్తుంది. అవినీతిపరులకు ప్రభుత్వం కూడ గట్టి శిక్షలు విధించాలి. వారి ఉద్యోగాలు తీసివేయాలి. కలీ వ్యాపారులకు జరిమానాలు, జైలు శిక్షలు వేయాలి.

అవినీతి నిర్మూలన ప్రజలందరి లక్ష్యం కావాలి. లేనిచో ఈ అవినీతి చెదపురుగు దేశాన్నే కొరికి తినివేస్తుంది.

AP SSC 10th Class Telugu వ్యాసాలు

ప్రశ్న 15.
‘స్వచ్ఛభారత్’ గురించి ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
‘స్వచ్ఛభారత్’ అంటే భారతదేశం అంతా పరిశుద్ధంగా ఉండాలి అనే నినాదం. మనదేశ ప్రధాని నరేంద్రమోడీ గారు, దేశంలోని కాలుష్యమును గమనించి, నదీజలములు అన్నీ కలుషితం కావడం చూసి, ఈ ‘స్వచ్ఛభారత్’ అనే నినాదాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమ ప్రచారకులుగా దేశంలోని ప్రసిద్ధులయిన వ్యక్తులను మోడీ గారు నియమించారు. అమితాబ్ బచ్చన్, రామోజీరావు వంటి వారు, ఈ కార్యక్రమానికి చేయూత నిస్తున్నారు. మన విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, నగరాలలోని మురికి పేటలు, గంగా, గోదావరి వంటి నదులజలాలు నేడు కాలుష్యంతో నిండిపోతున్నాయి. విద్యార్థులూ, ఆఫీసులలో ఉద్యోగులూ తమ పాఠశాలలనూ, కార్యాలయాలనూ “పరిశుభ్రంగా ఉంచుకోవాలి.” ప్రజలు తమ గృహాలనూ, పరిసరాలనూ శుభ్రంగా ఉంచుకోవాలి.

నదులు, చెరువులలోని నీటిని కలుషితం చేయరాదు. ఈ కాలుష్యం వల్ల రోగాలు పెరిగిపోతున్నాయి. దోమలు, క్రిములు పెరిగిపోతున్నాయి. ప్రజలందరూ స్వచ్ఛతను కాపాడితే, దేశం ఆరోగ్యవంతం అవుతుంది. ప్రజలకు కావలసిన మంచినీరు లభిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఏనాడో చెప్పారు.

స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని దేశం అంతా ప్రచారం చేయాలి. దీన్ని ప్రజల కార్యక్రమంగా తీర్చిదిద్దాలి. దేశంలోని పత్రికల వారు, దూరదర్శన్ వారు స్వచ్ఛభారత్ గురించి మంచి ప్రచారం చేయాలి. దానివల్ల దేశం సుభిక్షంగా, ఆరోగ్యంగా ఉంటుంది.

ప్రశ్న 16.
నీ చుట్టూ ఉన్న పరిసరాలలో కనిపించే బాలకార్మిక వ్యవస్థపై ఒక వ్యాసం రాయండి.
జవాబు:
నిరక్షరాస్యత, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, కరవు కాటకాల కారణంగా లక్షలాది పిల్లలు చిన్న వయస్సులోనే కార్మికులుగా చేరుతున్నారని అంతర్జాతీయ కార్మిక నిర్వహణ సంస్థ (ఐ.ఎల్.ఒ) తన సర్వేలో వెల్లడించింది.

ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతగా భారతదేశంలో బాలకార్మిక వ్యవస్థ ఉందని ఐ.ఎల్.ఒ. నిర్వహించిన సర్వేలో తెలియజేసింది. దేశంలో ఆంధ్రప్రదేశ్ లోనే అత్యధికంగా బాల కార్మికులు ఉన్నారని ఆ నివేదికలో పేర్కొన్నారు.

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పలు సందర్భాలలో చేస్తున్న ప్రకటనలు కేవలం ప్రకటనలుగానే మిగిలిపోతున్నాయి. కాబట్టి నిర్దిష్టమైన ప్రణాళికను ఏర్పాటు చేసి అది అమలు జరిగేటట్లు చూడాలి. ప్రభుత్వం రూపొందించిన బాల కార్మిక నియంత్రణ చట్టం సరిగా అమలు అయ్యేట్లు చూడాలి. .

భారతదేశంలో 8.7 కోట్ల మంది బాలలు పాఠశాలలకు వెళ్ళడం లేదని, వీరంతా ఇళ్ళలోను, కర్మాగారాల్లోను, పొలాల్లోను పని చేస్తున్నారని ‘గ్లోబల్ మార్చ్ ఎగనెస్ట్ చైల్డ్ లేబర్’ అనే అంతర్జాతీయ సంస్థ పేర్కొంది. కాబట్టి బాల కార్మికుల కోసం ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పాలి. వాళ్ళు చదువుకొనే అవకాశం కల్పించాలి.

బాల కార్మికులను కూలివారుగానే చూస్తే వారు కార్మికులుగానే మిగిలిపోతారు. వారిలో ఉన్న యోగ్యతను, ప్రతిభను వెలికి తీసేందుకు సహకారం అందజేస్తే భవిష్యత్తులో ఒక మంచి నిపుణుడిని అందించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

AP SSC 10th Class Telugu Grammar Samasalu సమాసాలు

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 10th Class Telugu Grammar Samasalu సమాసాలు Notes, Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Grammar Samasalu సమాసాలు

సమాసాలు

సమాసం :
వేరు వేరు అర్థాలు కల రెండు పదాలు కలసి, ఏకపదంగా ఏర్పడితే దాన్ని ‘సమాసం’ అంటారు.

గమనిక :
అర్థవంతమైన రెండు పదాలు కలిసి, కొత్త పదం ఏర్పడడాన్ని సమాసం అంటారు. సమాసంలో మొదటి పదాన్ని పూర్వ పదం అంటారు. రెండవ పదాన్ని ఉత్తర పదం అంటారు.
ఉదా :
‘రామ బాణము’ అనే సమాసంలో, ‘రామ’ అనేది పూర్వ పదం. ‘బాణము’ అనేది ఉత్తర పదం.

1. ద్వంద్వ సమాసం :
రెండు కాని, అంతకంటే ఎక్కువ కాని నామవాచకాల మధ్య ఏర్పడే సమాసాన్ని, “ద్వంద్వ సమాసం” అంటారు.

ఈ కింది వాక్యాల్లోని ద్వంద్వ సమాస పదాలను గుర్తించి రాయండి.

1) ఈ అన్నదమ్ములు ఎంతో మంచివాళ్ళు,
జవాబు:
అన్నదమ్ములు

2) నేను మార్కెట్ కు వెళ్ళి కూరగాయలు తెచ్చాను.
జవాబు:
కూరగాయలు

3) ప్రమాదంలో నా కాలుసేతులకు గాయాలయ్యాయి.
జవాబు:
కాలుసేతులు

అభ్యాసం:

AP SSC 10th Class Telugu Grammar Samasalu సమాసాలు

I. ఈ కింది ద్వంద్వ సమాసాలకు విగ్రహవాక్యాలు రాయండి.

సమాసపదం విగ్రహవాక్యం
1) ఎండవానలు ఎండయు, వానయు ద్వంద్వ సమాసాలు
2) తల్లిదండ్రులు తల్లియు, తండ్రియు
3) గంగాయమునలు గంగయు, యమునయు

II. ఈ కింది విగ్రహవాక్యాలను సమాసపదాలుగా మార్చండి.

సమాసపదం విగ్రహవాక్యం
1) కుజనుడూ, సజ్జనుడూ కుజనసజ్జనులు
2) మంచి, చెడూ మంచిచెడులు
3) కష్టమూ, సుఖమూ కష్టసుఖములు

2. ద్విగు సమాసం :
సమాసంలో మొదటి (పూర్వ) పదంలో సంఖ్య గల సమాసాన్ని ద్విగు సమాసం అంటారు.

అభ్యాసం :
కింది సమాస పదాలను ఉదాహరణలో చూపిన విధంగా వివరించండి.
ఉదా : నవరసాలు – నవ (9) సంఖ్య గల రసాలు
1) రెండు జడలు – రెండు (2) సంఖ్య గల జడలు
2) దశావతారాలు – దశ (10) సంఖ్య గల అవతారాలు
3) ఏడు రోజులు – ఏడు (7) సంఖ్య గల రోజులు
4) నాలుగువేదాలు – నాలుగు (4) సంఖ్య గల వేదాలు

గమనిక :
పైన పేర్కొన్న సమాసాలలో సంఖ్యావాచకం పూర్వ పదంగా ఉండటాన్ని గమనించండి. ఇలా మొదటి పదంలో సంఖ్య గల సమాసాలు ద్విగు సమాసాలు.

3. తత్పురుష సమాసం :
విభక్తి ప్రత్యయాలు విగ్రహవాక్యంలో ఉపయోగించే సమాసాలు “తత్పురుష సమాసాలు.” అభ్యాసము : కింది పదాలను చదివి, విగ్రహవాక్యాలు రాయండి.

సమాసపదం విగ్రహవాక్యం
1) రాజభటుడు రాజు యొక్క భటుడు
2) తిండి గింజలు తిండి కొఱకు గింజలు
3) పాపభీతి పాపము వల్ల భీతి

గమనిక :
‘రాజభటుడు’ అనే సమాసంలో ‘రాజు’ పూర్వ పదం. ‘భటుడు’ అనే పదం ఉత్తర పదం. ‘రాజభటుడు’ కు విగ్రహవాక్యం రాస్తే ‘రాజు యొక్క భటుడు’ అవుతుంది. దీంట్లో యొక్క అనేది షష్ఠీ విభక్తి ప్రత్యయం. భటుడు రాజుకు చెందినవాడు అని చెప్పడానికి షష్ఠీ విభక్తి ప్రత్యయాన్ని వాడారు. ఈ విధంగా ప్రత్యయాలు విగ్రహవాక్యంలో ఉపయోగించే సమాసాలు తత్పురుష సమాసాలు.

గమనిక :
పూర్వ పదం చివర ఉండే విభక్తిని బట్టి తత్పురుష సమాసాలు వస్తాయి.

తత్పురుష సమాసం రకాలు విభక్తులు ఉదాహరణ, విగ్రహవాక్యం
1) ప్రథమా తత్పురుష సమాసం డు, ము, వు, లు మధ్యాహ్నము – అహ్నము యొక్క మధ్య
2) ద్వితీయా తత్పురుష సమాసం ని, ను, ల, కూర్చి, గురించి జలధరం – జలమును ధరించినది
3) తృతీయా తత్పురుష సమాసం చేత, చే, తోడ, తో బుద్ధిహీనుడు – బుద్ధిచేత హీనుడు
4) చతుర్డీ తత్పురుష సమాసం కొఱకు, కై వంట కట్టెలు – వంట కోఱకు కట్టెలు
5) పంచమీ తత్పురుష సమాసం వలన (వల్ల), కంటె, పట్టి దొంగ భయం – దొంగ వల్ల భయం
6) షష్ఠీ తత్పురుష సమాసం కి, కు, యొక్క, లో, లోపల రామబాణం – రాముని యొక్క బాణం
7) సప్తమీ తత్పురుష సమాసం అందు, న దేశభక్తి – దేశము నందు భక్తి

 

8) నఞ్ తత్పురుష సమాసం నఞ్ అంటే వ్యతిరేకము అసత్యం – సత్యం కానిది

అభ్యాసం :
కింది సమాసాలు చదివి, విగ్రహవాక్యాలు రాయండి. అవి ఏ తత్పురుష సమాసాలో తెలపండి.

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
1) రాజ పూజితుడు రాజుచే పూజితుడు తృతీయా తత్పురుషం
2) ధనాశ ధనము నందు ఆశ సప్తమీ తత్పురుషం
3) పురజనులు పురమందు జనులు సప్తమీ తత్పురుషం
4) జటాధారి జడలను ధరించినవాడు ద్వితీయా తత్పురుషం
5) భుజబలం భుజముల యొక్క బలం షష్ఠీ తత్పురుషం
6) అగ్నిభయం అగ్ని వల్ల భయం పంచమీ తత్పురుషం
7) అన్యాయం న్యాయం కానిది తత్పురుష సమాసం

తత్పురుష సమాసాలు :
విభక్తులు ఆధారంగా ఏర్పడే తత్పురుష సమాసాలను గూర్చి తెలిసికొన్నారు. కింది వాటిని కూడా పరిశీలించండి.
1) మధ్యాహ్నము – అహ్నము యొక్క మధ్యము (మధ్య భాగం)
2) పూర్వకాలము – కాలము యొక్క పూర్వము (పూర్వ భాగం)

గమనిక :
పై వాటిలో మొదటి పదాలైన మధ్య, పూర్వ అనే పదాలకు ‘ము’ అనే ప్రథమా విభక్తి ప్రత్యయం చేరడం వల్ల
‘మధ్యము’, ‘పూర్వము’గా మారతాయి. ఇలా పూర్వపదానికి ప్రథమా విభక్తి ప్రత్యయం రావడాన్ని ‘ప్రథమా తత్పురుష సమాసం’ అంటాము. కింది వాటిని పరిశీలించండి.
1) నఞ్ + సత్యం = అసత్యం – సత్యం కానిది
2) నఞ్ + భయం = అభయం – భయం కానిది
3) నఞ్ + అంతము = అనంతము – అంతము కానిది
4) నఞ్ + ఉచితం = అనుచితం – ఉచితము కానిది

గమనిక :
సంస్కృతంలో ‘నఞ్’ అనే అవ్యయం, వ్యతిరేకార్థక బోధకం. దీనికి బదులు తెలుగులో అ, అన్, అనే ప్రత్యయాలు వాడతారు. పై ఉదాహరణల్లో వాడిన ‘నం’ అనే అవ్యయాన్ని బట్టి, దీన్ని “నః తత్పురుష సమాసం” అంటారు.

AP SSC 10th Class Telugu Grammar Samasalu సమాసాలు

అభ్యాసము :
కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాస నామము పేర్కొనండి.

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
1) అర్థరాత్రి రాత్రి యొక్క అర్ధము ప్రథమా తత్పురుషం
2) అనూహ్యము ఊహ్యము కానిది నఞ్ తత్పురుషం
3) అక్రమం క్రమము కానిది నఞ్ తత్పురుషం
4) అవినయం వీనయం కానిది నఞ్ తత్పురుషం

4. కర్మధారయ సమాసం :
‘నల్లకలువ’ అనే సమాస పదంలో ‘నల్ల’, ‘కలువ’ అనే రెండు పదాలున్నాయి. మొదటి పదం ‘నల్ల’ అనేది, విశేషణం. రెండో పదం ‘కలువ’ అనేది నామవాచకం. ఇలా విశేషణానికీ, సామవాచకానికీ (విశేష్యానికీ) సమాసం జరిగితే, దాన్ని కర్మధారయ సమాసం అంటారు.

4. అ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం :
విశేషణం పూర్వపదంగా (మొదటి పదంగా) ఉంటే, ఆ సమాసాన్ని “విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం’ అంటారు.
ఉదా :
1) తెల్ల గుర్రం – తెల్లదైన గుర్రం.
తెలుపు (విశేషణం) (పూర్వపదం) – (మొదటి పదం) గుర్రం – (నామవాచకం) (ఉత్తరపదం)- (రెండవ పదం)

ఆ) విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం :
మామిడి గున్న’ అనే సమాసంలో మామిడి, గున్న అనే రెండు పదాలున్నాయి. మొదటి పదం (పూర్వపదం) ‘మామిడి’ సోమవాచకం, రెండో పదం (ఉత్తరపదం) గున్న అనేది విశేషణం. ఇందులో విశేషణమైన ‘గున్న’ అనే పదం ఉత్తరపదంగా – అంటే రెండో పదంగా ఉండడం వల్ల, దీన్ని ‘విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం’ అంటారు. అభ్యాసము : కింది పదాలను చదివి, విగ్రహవాక్యాలు రాసి, ఏ సమాసమో రాయండి.

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
1) పుణ్యభూమి పుణ్యమైన భూమి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
2) మంచిరాజు మంచి వాడైన రాజు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
3) కొతపుస్తకం కొత్తదైన పుస్తకం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
4) పురుషోత్తముడు ఉత్తముడైన పురుషుడు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

ఇ) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం :
‘తమ్మివిరులు’ అనే సమాసంలో, మొదటి పదమైన ‘తమ్మి’, ఏ రకం విరులో తెలియజేస్తుంది. ఇలా పూర్వపదం, నదులు, వృక్షాలు, ప్రాంతాలు మొదలైన వాటి పేర్లను సూచిస్తే దాన్ని సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం అంటారు.
ఉదా : మట్టి చెట్టు – మట్టి అనే పేరు గల చెట్టు – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
గంగానది – గంగ యనే పేరు గల నది – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
భారతదేశం – ‘భారతం’ అనే పేరు గల దేశం – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం

AP SSC 10th Class Telugu Grammar Samasalu సమాసాలు

ఈ) ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం :
‘కలువ కనులు’ అనే సమాసంలో కలువ, కనులు అనే రెండు పదాలున్నాయి. దీనికి ‘కలువల వంటి కన్నులు’ అని అర్థం. అంటే కన్నులను కలువలతో పోల్చడం జరిగింది. సమాసంలోని మొదటి పదం (పూర్వపదం) ఇక్కడ ‘ఉపమానం’ కాబట్టి దీన్ని ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం అంటారు.

ఉ) ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం :
‘పదాబ్దము’ అనే సమాసంలో పద (పాదం) మరియు, అబ్జము (పద్మం) అనే రెండు పదాలున్నాయి. వీటి అర్థం పద్మము వంటి పాదము అని. ఇక్కడ పాదాన్ని పద్మం (తామరపూవు)తో పోల్చడం జరిగింది. కాబట్టి పాదం ఉపమేయం. పద్మం ఉపమానం. ఉపమానమైన అబ్జము అనే పదం, ఉత్తరపదంగా (రెండవపదం) ఉండడం వల్ల దీన్ని ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం అంటారు.

అభ్యాసం :
కింది సమాసాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాస నామాలు పేర్కొనండి.

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
1) తేనెమాట తేనె వంటి మాట
తేనె – ఉపమానం, మాట – ఉపమేయం
ఉపమాన పూర్వపద కర్మధారయం
2) తనూలత లత వంటి తనువు
తనువు – ఉపమేయం, లత – ఉపమానం
ఉపమాన ఉత్తరపద కర్మధారయం
3) చిగురుకేలు చిగురు వంటి కేలు
చిగురు – ఉపమానం, కేలు – ఉపమేయం
ఉపమాన పూర్వపద కర్మధారయం
4) కరకమలములు కమలముల వంటి కరములు
కరములు – ఉపమేయం
కమలములు – ఉపమానం
ఉపమాన పూర్వపద కర్మధారయం

5. రూపక సమాసం :
‘విద్యాధనం’ – అనే సమాసంలో విద్య, ధనం అనే రెండు పదాలున్నాయి. పూర్వపదమైన విద్య, ధనంతో పోల్చబడింది. కాని ‘విద్య అనెడి ధనం’ అని దీని అర్థం కనుక, ఉపమాన, ఉపమేయాలకు భేదం లేనంత గొప్పగా చెప్పబడింది. ఈ విధంగా ఉపమాన, ఉపమేయాలకు భేదం లేనట్లు చెబితే అది ‘రూపక సమాసం’.

సమాస పదం విగ్రహవాక్యం
ఉదా : 1) హృదయ సారసం హృదయం అనెడి సారసం
2) సంసార సాగరం సంసారం అనెడి సాగరం
3) జ్ఞాన జ్యోతి జ్ఞానము అనెడి జ్యోతి
4) అజ్ఞాన తిమిరం అజ్ఞానము అనెడి తిమిరం
5) సాహితీ జగత్తు సాహిత్యమనెడి జగతు – రూపక సమాసం

6. బహుప్రీహి సమాసం :
అన్య పదార్థ ప్రాధాన్యం కలది. కింది ఉదాహరణను గమనించండి. ”
చక్రపాణి – చక్రం పాణియందు (చేతిలో) కలవాడు. ‘విష్ణువు’ అని దీని అర్థం. దీంట్లో సమాసంలోని రెండు పదాలకు అనగా “చక్రానికి” కాని “పాణికి” కాని ప్రాధాన్యం లేకుండా, ఆ రెండూ మరో అర్థం ద్వారా “విష్ణువును” సూచిస్తున్నాయి. ఇలా సమాసంలో ఉన్న పదాల అర్థానికి ప్రాధాన్యం లేకుండా, అన్యపదముల అర్థాన్ని స్ఫురింపజేసే దాన్ని బహుప్రీహి సమాసం అంటారు. అన్య పదార్థ ప్రాధాన్యం కలది. ‘బహుబ్లి హి సమాసం’. అభ్యాసం : కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసం పేరు రాయండి.

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
1) నీలవేణి నల్లని వేణి కలది బహుబీహి సమాసం
2) నీలాంబరి నల్లని అంబరము కలది బహుబీహి సమాసం
3) ముక్కంటి మూడు కన్నులు గలవాడు బహుథీహి సమాసం
4) గరుడవాహనుడు గరుత్మంతుడు వాహనంగా కలవాడు బహుబీహి సమాసం
5) దయాంతరంగుడు దయతో కూడిన అంతరంగము కలవాడు బహుప్రీహి సమాసం
6) చతుర్ముఖుడు నాలుగు ముఖములు కలవాడు బహుప్రీహి సమాసం

7. అవ్యయీభావ సమాసం :
అవ్యయం పూర్వపదముగా ఉన్న సమాసాలను, “అవ్యయీభావ సమాసాలు” అంటారు.

అవ్యయం :
అవ్యయాలు అనగా లింగ, వచన, విభక్తి లేని పదాలు. ఈ విధమైన భావంతో ఉన్న సమాసాలను అవ్యయీభావ సమాసాలు అంటారు. ఈ క్రింది సమాస పదాలను, వాటికి రాయబడిన విగ్రహవాక్యాలను పరిశీలించండి.

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
అ) ప్రతిదినము దినము దినము అవ్యయీభావ సమాసం
ఆ) యథాశక్తి శక్తి ఎంతో అంత (శక్తిననుసరించి) అవ్యయీభావ సమాసం
ఇ) ఆబాలగోపాలం బాలుడి నుండి గోపాలుడి వరకు అవ్యయీభావ సమాసం
ఈ) మధ్యాహ్నం అహ్నం మధ్యభాగం అవ్యయీభావ సమాసం
ఉ) అనువర్షం వర్షముననుసరించి అవ్యయీభావ సమాసం

గమనిక : ‘మధ్యాహ్నము” అనే సమాస పదానికి, విగ్రహం ‘మధ్యము – అహ్నము’ అని చెప్పాలి. ఇది ‘ప్రథమా తత్పురుష సమాసం’ అవుతుంది. అవ్యయీభావ సమాసం కాదు.

AP SSC 10th Class Telugu Grammar Samasalu సమాసాలు

పాఠ్యపుస్తకంలోని ముఖ్య సమాసాలు – విగ్రహవాక్యాలు :

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
1)  నలుదెసలు నాలుగైన దెసలు ద్విగు సమాసం
2) సూర్యచంద్రులు సూర్యుడును,చంద్రుడును ద్వంద్వ సమాసం
3) చంపకవతి పట్టణం ‘చంపకవతి’ అనే పేరు గల పట్టణం సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
4) మహాభాగ్యం గొప్పదైన భాగ్యం విశేషణ పూర్వపద కర్మధారయం సమాసం
5) సేవావృత్తి సేవ అనెడి వృత్తి రూపక సమాసం
6) పదాబ్దములు పద్మముల వంటి పదములు ఉపమాన ఉత్తరపద కర్మధారయం
7) కలువ కన్నులు కలువల వంటి కన్నులు ఉపమాన పూర్వపద కర్మధారయం
8) మామిడి గున్న గున్నయైన మామిడి విశేషణ ఉత్తరపద కర్మధారయం
9) మృదుమధురము మృదువును, మధురమును విశేషణ ఉభయపద కర్మధారయం
10) సత్యదూరము సత్యమునకు దూరము షష్ఠీ తత్పురుష సమాసం
11) అమెరికా రాయబారి అమెరికా యొక్క రాయబారి షష్ఠీ తత్పురుష సమాసం
12) వాదనాపటిమ వాదన యందు పటిమ సప్తమీ తత్పురుష సమాసం
13) అసాధ్యం సాధ్యము కానిది నఞ్ తత్పురుష సమాసం
14) నెలతాల్పు నెలను తాల్చువాడు ద్వితీయా తత్పురుష సమాసం
15) గురుదక్షిణ గురువు కొఱకు దక్షిణ చతుర్డీ తత్పురుష సమాసం
16) వయోవృద్ధుడు వయస్సు చేత వృద్ధుడు తృతీయా తత్పురుష
17) దొంగభయము దొంగ వలన భయము పంచమీ తత్పురుష సమాసం
18) ధూపదీపములు ధూపమును, దీపమును ద్వంద్వ సమాసం
19) శివభక్తి శివుని యందు భక్తి సప్తమీ తత్పురుష సమాసం
20) రుద్రాక్షభూషలు ‘రుద్రాక్షలు’ అనే పేరు గల భూషలు సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
21) వితంతు వివాహం వితంతువు యొక్క వివాహం షష్ఠీ తత్పురుష సమాసం
22) విద్యాధికులు విద్యచేత అధికులు తృతీయా తత్పురుష సమాసం
23) భారతదేశం భారతం అనే పేరు గల దేశం సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
24) ముప్పయి సంవత్సరాలు ముప్ఫై సంఖ్య గల సంవత్సరాలు ద్విగు సమాసం
25) స్త్రీ పురుషులు స్త్రీయును, పురుషుడును ద్వంద్వ సమాసం
26) ప్రముఖదినం ప్రముఖమైన దినం విశేషణ పూర్వపద కర్మధారయం
27) నాలుగు గీతలు నాలుగు సంఖ్య గల గీతలు ద్విగు సమాసం
28) అసాధారణం సాధారణం కానిది నఞ్ తత్పురుష సమాసం
29) మానవచరిత మానవుల యొక్క చరిత షష్ఠీ తత్పురుష సమాసం

AP SSC 10th Class Telugu Grammar Sandhulu సంధులు

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 10th Class Telugu Grammar Sandhulu సంధులు Notes, Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Grammar Sandhulu సంధులు

తెలుగు సంధులు

నా చిన్నప్పుడు చేసిన పనులు గుర్తుకు వచ్చాయి.

గమనిక :
పై వాక్యంలో “చిన్నప్పుడు” అనే పదం, చిన్న + అప్పుడు అనే రెండు పదాలు కలవడం వల్ల వచ్చింది. దీనినే “సంధి పదం” అంటారు. ఉచ్చరించడంలో సౌలభ్యం కోసం రెండు పదాలను వెంట వెంటనే కలిపి మాట్లాడవలసినప్పుడు, లేదా రాయవలసినప్పుడు “సంధి పదం” ఏర్పడుతుంది.

సంధి :
వ్యాకరణ పరిభాషలో రెండు స్వరాల (అచ్చుల) కలయికను “సంధి” అని పిలుస్తారు.

తెలుగు సంధులు :
రెండు తెలుగుపదాల మధ్య జరిగే సంధులను “తెలుగు సంధులు” అంటారు.

సంధి కార్యం : రెండు అచ్చుల మధ్య జరిగే మార్పును “సంధి కార్యం” అని పిలుస్తారు.

పూర్వ స్వరం :
సంధి జరిగే మొదటి పదం చివరి అక్షరంలోని అచ్చును (స్వరాన్ని) “పూర్వ స్వరం” అని పిలుస్తారు.

పర స్వరం :
సంధి జరిగే రెండవ పదం మొదటి అక్షరంలోని అచ్చును (స్వరాన్ని) “పర స్వరం” అని పిలుస్తారు.

ఉదా :
రామ + అయ్య : ‘రామ’ లోని ‘మ’ లో ‘అ’ పూర్వ స్వరం, ‘అయ్య’ లోని ‘అ’ పర స్వరం.

AP SSC 10th Class Telugu Grammar Sandhulu సంధులు

1. అత్వ సంధి సూత్రం
అత్తునకు సంధి బహుళంగా వస్తుంది.

ఈ కింది పదాలను విడదీయండి.

ఉదా : మేనల్లుడు = మేన + ‘అల్లుడు – (న్ +) అ + అ = అ) = (అత్వ సంధి)
1) ఒకప్పుడు : ఒక అప్పుడు = (అత్వ సంధి)
2) వచ్చినందుకు – వచ్చిన అందుకు : (అత్వ సంధి)
3) రాకుంటే ఉంటే (అత్వ సంధి)
4) లేకేమి = లేక + ఏమి = (అ + ఏ = (అత్వ సంధి)
5) పోవుటెట్లు : పోవుట + ఎట్లు = (అ + ఎ (అత్వ సంధి)
6) కొండంత = కొండ + అంత = (అ + ఎ (అత్వ సంధి)

గమనిక :
పై సంధి పదాలలోని పూర్వ స్వరం ‘అ’. అది పర స్వరంలోని అచ్చుతో కలిస్తే, పూర్వ స్వరం ‘అ’ లోపిస్తుంది. పై ఉదాహరణలలో ‘అ’ లోపించింది కాబట్టి ఇది ‘అత్వ సంధి’.

దీనిని అత్వ సంధి లేక ‘అకార సంధి’ అంటారు. పొట్టి ‘అ’ అనే అక్షరానికి, అచ్చు పరమైతే ‘అత్వ సంధి’ వస్తుంది.

2. ఇత్వ సంధి సూత్రం
ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికంగా వస్తుంది.
ఏమ్యాదులు = ఏమి మొదలగునవి.

ఏమి, మణి, కి (షష్ఠి, అది, అవి, ఇది, ఇవి, ఏది, ఏవి మొదలైనవి ఏమ్యాదులు. (కి షష్ఠి అంటే ‘కిన్’)

ఈ కింది పదాలను విడదీయండి.
ఉదా :
అ) ఏమంటివి = ఏమి + అంటివి = (ఇ + అ = అ) = (ఇత్వ సంధి)
సంధి జరుగనప్పుడు “య” కారం ఆగమంగా వస్తుంది. దానినే ‘యడాగమం’ అని పిలుస్తారు.

ఆ) ఏమియంటివి = ఏమి + య్ + అంటివి = ఇ + (య్ + అ) = య (ఇకార సంధి రాని యడాగమ రూపం)

గమనిక :
ప్రథమ, ఉత్తమ పురుష బహువచన క్రియల ఇకారానికి, సంధి వైకల్పికంగా జరుగుతుంది.

వచ్చిరిపుడు = వచ్చిరి + ఇపుడు – (ఇ + ఇ + ఇ) = (ఇత్వ సంధి)
వచ్చిరియిపుడు = వచ్చిరి + య్ + ఇపుడు – (ఇ + ఇ + యి) (యడాగమం వచ్చిన రూపం)

గమనిక :
పై ఉదాహరణలలో హ్రస్వ ‘ఇ’ కారానికి అచ్చు కలిసినపుడు సంధి జరిగింది. దీనిని “ఇత్వ సంధి” అంటారు. ఇత్వ సంధి తప్పక జరగాలన్న నియమం లేదు.

వైకల్పికం :
సంధి జరుగవచ్చు లేక జరుగకపోవచ్చు. వ్యాకరణంలో ఈ పరిస్థితిని “వైకల్పికం” అని పిలుస్తారు.

అభ్యాసం :
ఉదా : 1) ఏమంటివి = ఏమి + అంటివి : (మ్ + ఇ + అ = మ) : ఇత్వ సంధి
2) పైకెత్తినారు : పైకి + ఎత్తినారు : (ఇ + ఎ = ఎ) : ఇత్వ సంధి
3) మనిషన్నవాడు = మనిషి + అన్నవాడు – (ఇ + అ = అ) – ఇత్వ సంధి

3. ఉత్వ సంధి సూత్రం
ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి నిత్యంగా వస్తుంది.

ఈ కింది పదాలను విడదీయండి.
ఉదా : రాముడతడు = రాముడు + అతడు = (డ్ + ఉ + అ = డ) : (ఉత్వ సంధి)
1) అతడెక్కడ = అతడు + ఎక్కడ = (A + ఎ = ఎ) : (ఉత్వ సంధి)
2) మనమున్నాము = మనము + ఉన్నాము : (ఉ + ఉ = ఉ) : (ఉత్వ సంధి)
3) మనసైన . మనసు + ఐన = (A + ఐ = ఐ) : . (ఉత్వ సంధి)

గమనిక :
హ్రస్వ ఉ కారానికి, అనగా ఉత్తునకు, అచ్చు కలిసినప్పుడు, పూర్వ స్వరం ‘ఉ’ కారం లోపించి, పర స్వరం కనిపిస్తుంది. లోపించిన పూర్వ స్వరం ‘ఉ’ కాబట్టి, ఇది “ఉత్వ సంధి” అని పిలువబడుతుంది.

నిత్యం :
నిత్యం అంటే, తప్పక సంధికార్యం జరుగుతుందని అర్థం.

4. యడాగమ సంధి సూత్రం
సంధి లేనిచోట అచ్చుల మధ్య “య్” వచ్చి చేరడాన్ని “యడాగమం” అని పిలుస్తారు.

ఈ కింది పదాలను విడదీయండి.
ఉదా :
అ) మాయమ్మ = మా + అమ్మ – మాయమ్మ
ఆ) మాయిల్లు = మా + ఇల్లు = మాయిల్లు
ఇ) హరియతడు = హరి + అతడు = హరియతడు
గమనిక :
పై ఉదాహరణలలో సంధి జరుగలేదు. కాని కొత్తగా ‘య్’ వచ్చి చేరింది. అలా చేరడం వల్ల ఈ కింది విధంగా మార్పు జరిగింది.

అ) మా + య్ + అమ్మ : మా ‘య’ మ్మ
ఆ) మా + య్ . + ఇల్లు : మా ‘ఋ’ ల్లు
ఇ) హరి + య్ + అతడు = హరి ‘య’ తడు

5. ఆమ్రేడిత సంధి సూత్రం
అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగా వస్తుంది.

ఆమ్రేడితం :
ఒక పదాన్ని రెండుసార్లు ఉచ్చరిస్తే, రెండోసారి ఉచ్చరింపబడిన పదాన్ని ‘ఆమ్రేడితం’ అంటారు.
ఉదా :
1) ఆహాహా = ఆహా + ఆహా – ‘ఆహా’ అనే పదం రెండుసార్లు వచ్చింది. అందులో రెండవ ‘ఆహా’ అనే దాన్ని ఆమ్రేడితం అని పిలవాలి.
2) అరెరె : అరె అరె : రెండవసారి వచ్చిన ‘అరె’ ఆమ్రేడితం.
3) ఔరౌర – ఔర + . ఔర = రెండవసారి వచ్చిన ‘ఔర’ ఆమ్రేడితం.

గమనిక :
పై ఉదాహరణలలో ఒక్కొక్క పదం రెండుసార్లు వచ్చింది. రెండవసారి వచ్చిన పదాన్ని ‘ఆమ్రేడితం’ అంటారు.

ఆమ్రేడిత సంధికి ఉదాహరణములు :
ఔర + ఔర = (ఔర్ + అ)
ఆహా + ఆహా = (ఆహ్ + ఆ)
ఓహో + ఓహో = (ఓహ్ + ఓ)

గమనిక :
పై ఉదాహరణలలో పూర్వ పదం అనగా మొదటి పదం చివర, అ, ఆ, ఓ వంటి అచ్చులున్నాయి. ఈ అచ్చులకు ఆమ్రేడితం పరమైతే, సంధి వస్తుంది.
ఔర + ఔర = ఔరౌర = (అ + ఔ = ఔ)
ఆహా + ఆహా = ఆహాహా = (ఆ + ఆ = ఆ)
ఓహో + ఓహో = ఓహోహో = (ఓ + ఓ = ఓ)
ఏమి + ఏమి = ఏమేమి = (ఇ + ఏ = ఏ)
ఎట్లు + ఎట్లు = ఎట్లెట్లు = (ఉ + ఎ = ఎ)
ఏమిటి + ఏమిటి = ఏమిటేమిటి = (ఇ + ఏ = ఏ)
అరె + అరె = అరెరె = (ఎ + అ = ఎ)

గమనిక :
ఆమ్రేడిత సంధి, ఈ కింది ఉదాహరణలలో వికల్పంగా జరుగుతుంది. వీటిని గమనిస్తే, సంధి జరిగిన రూపం ఒకటి, సంధిరాని రూపము మరొకటి కనబడతాయి.
ఉదా :
ఏమి + ఏమి = ఏమేమి, ఏమియేమి (సంధి వైకల్పికం)
ఎట్లు + ఎట్లు – ఎబ్లెట్లు, ఎట్లుయెట్లు (సంధి వైకల్పికం)
ఎంత + ఎంత = ఎంతెంత, ఎంతయెంత (సంధి వైకల్పికం)

AP SSC 10th Class Telugu Grammar Sandhulu సంధులు

6. ఆమ్రేడిత ద్విరుక్తటకారాదేశ సంధి సూత్రం
ఆమ్రేడితం పరమైనపుడు, కడాదుల తొలి యచ్చు మీది వర్ణాల కెల్ల అదంతమైన ద్విరుక్తటకారం వస్తుంది.
కడాదులు (కడ + ఆదులు) = కడ, ఎదురు, కొన, చివర, తుద, తెన్ను, తెరువు, నడుము, పగలు, పిడుగు, బయలు, మొదలు, మొదలైనవి కడాదులు.

కింది ఉదాహరణలను గమనించండి.
1) పగలు + పగలు = పట్టపగలు
2) చివర + చివర = చిట్టచివర
3) కడ + కడ = కట్టకడ

గమనిక :
1) పగలు + పగలు – పట్టపగలు అవుతోంది. అంటే ‘ప’ తర్వాత ఉన్న ‘గలు’ అన్న అక్షరాలకు బదులుగా, ‘ఋ’ వచ్చింది. ‘మీ’ వచ్చి, ‘పట్టపగలు’ అయింది.
2) చివర + చివర అన్నప్పుడు ‘చి’ తర్వాత రెండక్షరాల మీద ‘జ’ వచ్చి, ‘చిట్టచివర’ అయింది.
3) కడ + కడ అన్నప్పుడు ‘డ’ స్థానంలో ‘జ’ వచ్చి ‘కట్టకడ’ అయింది. ఇప్పుడు కిందివాటిని కలిపి రాయండి.
ఎదురు + ఎదురు = ఎట్టయెదురు
కొన + కొన = కొట్టకొన
మొదట + మొదట = మొట్టమొదట
బయలు + బయలు = బట్టబయలు
తుద + తుద : తుట్టతుద

గమనిక :
ఆమ్రేడితం పరంగా ఉంటే, కడ మొదలైన శబ్దాల మొదటి అచ్చు మీద ఉన్న అన్ని అక్షరాలకు, ‘ఋ’ (ద్విరుక్తటకారం) వస్తుండడం గమనించాం.

7. ద్రుతప్రకృతిక సంధి సరళాదేశ సంధి
ద్రుతప్రకృతికం మీది పరుషాలకు సరళాలు వస్తాయి.

ఈ కింది పదాలు చదివి, పదంలోని చివర అక్షరం కింద గీత గీయండి. 1) పూచెను 2) చూచెన్ 3) తినెను 4) చేసెన్ 5) ఉండెన్

గమనిక :
పై పదాలను గమనిస్తే పదాల చివర, ను, న్ లు కనిపిస్తాయి. అంటే పదాల చివర నకారం ఉంది. ఈ నకారాన్ని ‘ద్రుతం’ అంటారు. ద్రుతము చివర గల పదాలను, “ద్రుతప్రకృతికాలు” అంటారు.

గమనిక :
పూచెను, చూచెన్, తినెను, చేసెన్, ఉండెన్ – అనేవి ద్రుతప్రకృతికాలు

కింది ఉదాహరణములను గమనించండి.
ఉదా:
అ) పూచెన్ + కలువలు = పూచెన్ + గలువలు
ఆ) దెసన్ + చూచి = దెసన్ + జూచి
ఇ) చేసెన్ + టక్కు = చేసెన్ + డక్కు
ఈ) పాటిన్ + తప్ప : పాటిన్ + దప్ప
ఉ) వడిన్ + పట్టి = వడిన్ + బట్టి
ఊ) చేసెను + తల్లీ : ‘ ‘ చేసెను + దల్లీ
ఋ) దెసను + చూసి : దెసను + జూసి

గమనిక :
ద్రుతప్రకృతికానికి ‘క’ పరమైతే ‘గ’, ‘చ’ పరమైతే ‘జ’, ‘ట’ పరమైతే ‘డ’, ‘త’ పరమైతే ‘ద’, ‘ప’ పరమైతే ‘బ’ ఆదేశంగా వస్తాయి.
1) క – ‘గ’ గా
2) చ – ‘జ’ గా
3) ట – ‘డ’ గా
4) త – ‘ద’ గా
5) ప – ‘బి’ గా మార్పు వచ్చింది.

ఇందులో ‘క చ ట త ప’ లకు, ‘పరుషాలు’ అని పేరు, ‘గ జ డ ద బ’ లకు, ‘సరళాలు’ అని పేరు.

దీనిని బట్టి సరళాదేశ సంధి సూత్రం ఇలా ఉంటుంది.

ద్రుత ప్రకృతిక సంధి సూత్రం (1):
ద్రుత ప్రకృతికం మీది పరుషాలకు, సరళాలు వస్తాయి.

గమనిక :
ఇప్పుడు పై ఉదాహరణలలో మార్పు గమనించండి.
ఉదా :
పూచెఁ గలువలు (ద్రుతం అరసున్నగా మారింది)
1) పూచెను + కలువలు (పూచెం గలువలు (ద్రుతం సున్నగా మారింది)
2) పూచెనలువలు (ద్రుతం మీద హల్లుతో కలిసి సంశ్లేష రూపం అయ్యింది)
3) పూచెను గలువలు. (ద్రుతం మార్పు చెందలేదు) దీనికి సూత్రం చెపితే సూత్రం ఇలా ఉంటుంది.

ద్రుత ప్రకృతిక సంధి సూత్రం (2) : ఆదేశ సరళాలకు ముందున్న ద్రుతానికి, బిందు, సంశ్లేషలు విభాషగా వస్తాయి.
గమనిక :
అంటే ఒక్కోసారి బిందువు వస్తుంది. ఒక్కోసారి సంశ్లేష వస్తుంది.

8. గసడదవాదేశ సంధి సూత్రం
ప్రథమ మీది పరుషాలకు గ,స,డ,ద,వ లు బహుళంబుగా వస్తాయి.

కింది పదాలను ఎలా విడదీశారో గమనించండి.
1) గొప్పవాడు = గదా – గొప్పవాడు + కదా (డు + క)
2) కొలువుసేసి = కొలువు + చేసి (వు + చే)
3) వాడు డక్కరి = వాడు + టక్కరి (డు + ట)
4) నిజము దెలిసి = నిజము + తెలిసి (ము + తె)
5) పాలువోయక = పాలు + పోయక (లు + పో)

గమనిక : పై ఉదాహరణలలో పూర్వపదం చివర, ప్రథమా విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి. పరపదం మొదట క, చ, ట, త, ప, లు ఉన్నాయి. ఈ విధంగా ప్రథమావిభక్తి మీద ప్రత్యయాలు, క, చ, ట, త, ప లు పరమైతే, వాటి స్థానంలో గ, స, డ, ద, వ లు ఆదేశంగా వస్తాయి. అంటే
1) క – గ గా మారుతుంది.
2) చ – స గా మారుతుంది.
3) ట – డ గా మారుతుంది.
4) త – ద గా మారుతుంది.
5) ప – వ గా మారుతుంది.

అంటే క, చ, ట, త, ప లకు గ, స, డ, ద, వ లు ఆదేశంగా వస్తాయి.

ద్వంద్వ సమాసంలో : గసడదవాదేశ సంధి

కింది పదాలను గమనించండి.

కూరగాయలు = కూర + కాయ + లు
కాలుసేతులు = కాలు + చేయి + లు
టక్కుడెక్కులు = టక్కు + టెక్కు + లు
తల్లిదండ్రులు = తల్లి + తండ్రి + లు
ఊరువల్లెలు : ఊరు + పల్లె + లు

గమనిక :
పై ఉదాహరణలు ద్వంద్వ సమాసపదాలు. పై ఉదాహరణలలో కూడా క చట త ప లకు, గసడదవ లు వచ్చాయి. దీన్నే గసడదవా దేశం అంటారు.

గసడదవాదేశ సంధి సూత్రం:
ద్వంద్వ సమాసంలో మొదటి పదం మీద ఉన్న క చట త ప లకు గసడదవలు క్రమంగా వస్తాయి.

కింది పదాలను కలపండి.
1) అక్క , చెల్లి : అక్కసెల్లెండ్రు
2) అన్న తమ్ముడు – అన్నదమ్ములు

9. టుగాగమ సంధి సూత్రం
కర్మధారయములందు ఉత్తునకు, అచ్చుపరమైతే టుగాగమం వస్తుంది.

ఈ కింది పదాలను పరిశీలించండి.
నిలువు + అద్దం = నిలువుటద్దం
తేనె + ఈగ = తేనెటీగ
పల్లె + ఊరు = పల్లెటూరు

గమనిక :
వీటిలో సంధి జరిగినపుడు ‘ట్’ అదనంగా చేరింది. ఇలా ‘ట్’ వర్ణం అదనంగా వచ్చే సంధిని, ‘టుగాగమ సంధి’ అంటారు. అలాగే కింది పదాలు కూడా గమనించండి. తేనె, పల్లె అనే పదాల చివర ‘ఉ’ లేక పోయినా, టుగాగమం వచ్చింది.
1) చిగురు + ఆకు = చిగురుటాకు / చిగురాకు
2) పొదరు + ఇల్లు : పొదరుటిల్లు / పొదరిల్లు

గమనిక :
వీటిలో ‘ట్’ అనే వర్ణం సంధి జరిగినపుడు రావచ్చు. ‘ట్’ వస్తే “టుగాగమం” అవుతుంది. ‘ట్’ రాకుంటే ‘ఉత్వ సంధి’ అవుతుంది.

సూత్రం :
కర్మధారయమునందు పేర్వాది శబ్దాలకు అచ్చు పరమైనపుడు, టుగాగమం విభాషగా వస్తుంది.
ఉదా :
1) పేరు + ఉరము = పేరు టురము / పేరురము
2) చిగురు + ఆకు = చిగురుటాకు / చిగురాకు
3) పొదరు + ఇల్లు = పొదరుటిల్లు / పొదరిల్లు

AP SSC 10th Class Telugu Grammar Sandhulu సంధులు

10. లులన సంధి సూత్రం
లు, ల, న లు పరమైనపుడు ఒక్కొక్కప్పుడు ‘ము’ గాగమానికి లోపమూ, దాని పూర్వ స్వరానికి దీర్ఘమూ విభాషగా వస్తాయి.

ఈ కింది ఉదాహరణములు గమనించండి.
1) పుస్తకములు – పుస్తకాలు
2) దేశముల – దేశాల
3) జీవితమున – జీవితాన
4) గ్రంథములు – గ్రంథాలు
5) రాష్ట్రముల – రాష్ట్రాల
6) వక్షమున – వృక్షాన

పై పదాల్లో మార్పును గమనించండి.

పుస్తకములు, గ్రంథములు, దేశములు, రాష్ట్రములు, జీవితమున, వృక్షమున – వీటినే మనం పుస్తకాలు, గ్రంథాలు, దేశాలు, రాష్ట్రాలు, జీవితాన, వృక్షాన అని కూడా అంటాం.

గమనిక :
ఈ మార్పులో, లు,ల, న అనే అక్షరాల ముందున్న ‘ము’ పోయింది. ‘ము’ కంటే ముందున్న అక్షరానికి దీర్ఘం వచ్చింది.

11. పడ్వాది సూత్రం
పడ్వాదులు పరమైనపుడు ‘ము’ వర్ణకానికి లోప పూర్ణబిందువులు విభాషగా వస్తాయి.

ఈ కింది ఉదాహరణలు గమనించండి.
1) భయము + పడు = భయంపడు, భయపడు

విడదీసిన పదాలకూ, కలిపిన పదాలకూ తేడా గమనించండి. కలిపిన పదంలో ‘ము’ కు బదులుగా సున్న(0) వచ్చింది. మరో దానిలో ‘ము’ లోపించింది.

గమనిక :
పడ్వాదులు = పడు, పట్టె, పాటు అనేవి.

12. త్రిక సంధి సూత్రం
1. ఆ, ఈ, ఏ అనే సర్వనామాలు త్రికం అనబడతాయి.
2. త్రికం మీది అసంయుక్త హల్లుకు ద్వితం బహుళంగా వస్తుంది.
3. ద్విరుక్తమైన హల్లు పరమైనపుడు, ఆచ్చికమైన దీర్ఘానికి హ్రస్వం వస్తుంది.

ఈ కింది ఉదాహరణ చూడండి.
అక్కొమరుండు = ఆ + కొమరుండు
ఆ + కొమరుండు = అనే దానిలో, ‘ఆ’, త్రికంలో ఒకటి. ఇది ‘అ’ గా మారింది. సంయుక్తాక్షరం కాని హల్లు ‘కొ’ ద్విత్వంగా ‘క్కొ’ గా మారింది.

అలాగే ఈ, ఏ లు అనే త్రికములు కూడా, ఇ, ఎ లుగా మారతాయి.
ఉదా :
ఈ + కాలము = ఇక్కాలము
ఏ + వాడు = ఎవ్వాడు

త్రిక సంధి సూత్రం (1):
త్రికము మీది అసంయుక్త హల్లుకు ద్విత్వం బహుళంగా వస్తుంది.
ఉదా :
ఈ + క్కాలము
ఏ + వ్వాడు

త్రిక సంధి సూత్రం (2) : ద్విరుక్తమైన హల్లు పరమైనపుడు అచ్ఛిక దీరానికి హ్రస్వం అవుతుంది.
ఉదా : 1) ఇక్కాలము 2) ఎవ్వాడు

AP SSC 10th Class Telugu Grammar Sandhulu సంధులు

13. రుగాగమ సంధి
సూత్రం : పేదాది శబ్దాలకు ‘ఆలు’ శబ్దం పరమైతే, కర్మధారయంలో రుగాగమం వస్తుంది.
పేదాదులు = (పేద + ఆదులు) పేద మొదలైనవి.

పేద, బీద, ముద్ద, బాలెంత, కొమ, జవ, అయిదువ, మనుమ, గొడ్డు మొదలైనవి పేదాదులు.
ఉదా : పేద + ఆలు = పేద + ర్ + ఆలు = పేదరాలు

పై రెండు పదాలకు మధ్య ‘5’ అనేది వచ్చి, ప్రక్కనున్న ‘ఆ’ అనే అచ్చుతో కలిస్తే ‘రా’ అయింది. అదెలా వస్తుందంటే, పేద, బీద, బాలెంత ఇలాంటి పదాలకు ‘ఆలు’ అనే శబ్దం పరమైతే, ఇలా ‘రుగాగమం’ అంటే ‘5’ వస్తుంది. ఆగమం : రెండు పదాలలో ఏ అక్షరాన్ని కొట్టివేయకుండా, కొత్తగా అక్షరం వస్తే “ఆగమం” అంటారు.

మనుమ + ఆలు = మనుమరాలు
బాలెంత + ఆలు = బాలెంతరాలు

రుగాగమ సంధి సూత్రం (2) :
కర్మధారయంలో తత్సమ పదాలకు, ఆలు శబ్దం పరమైతే, పూర్వ పదం చివరనున్న అత్వానికి ఉత్వమూ, రుగాగమమూ వస్తాయి.
ఉదా :
ధీరురాలు = ధీర + ఆలు
గుణవంతురాలు = గుణవంత + ఆలు
విద్యావంతురాలు = విద్యావంత + ఆలు

14. పుంప్వాదేశ సంధి సూత్రం
కర్మధారయ సమాసాల్లో “ము” వర్ణకానికి బదులు “పుంపులు” ఆదేశంగా వస్తాయి.

గమనిక :
“ము” అనే వర్ణకానికి బదులుగా “పు” కాని, “ఎపు” కాని వస్తుంది. దీన్ని వ్యాకరణ దృష్టిలో “ఆదేశం” అని పిలుస్తారు. కింది పదాలు విడదీసి చూడండి. మార్పును గమనించండి.
ఉదా :
అచ్చపు పూలతోట = అచ్చము + పూలతోట

అ) నీలపుఁగండ్లు = నీలము + కండ్లు
ఆ) ముత్తెపుసరులు = ముత్తెము + సరులు
ఇ) సరసపుమాట = సరసము + మాట

గమనిక :
పైన పేర్కొన్న ఉదాహరణలలో రెండు మార్పులను మనం గమనించవచ్చు.

అ) మొదటి పదాల్లో ‘ము’ వర్ణకం లోపించింది.
ఆ) ప్రతి సంధి పదంలోనూ మొదటి పదం విశేషణాన్ని తెలుపుతుంది.

గమనిక :
సమాసంలో మొదటి పదం విశేషణం, రెండవ పదం విశేష్యం అయితే, ఆ సమాసాలను “విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం” అంటారని మనకు తెలుసు. అంటే ఈ పుంప్వాదేశ సంధి, కర్మధారయ సమాసాల్లో ఏర్పడుతుందని గ్రహించాలి.

అభ్యాసం :
కింది పదాలను విడదీసి, సంధి సూత్రాన్ని సరిచూడండి.

అ) సింగపు కొదమ
జవాబు:
సింగపుకొదమ : సింగము + ‘కొదమ = పుంప్వాదేశ సంధి

గమనిక :
ఇక్కడ సింగము అనే మొదటి పదం చివర ఉన్న “ము” వర్ణకం పోయి, “పు” ఆదేశంగా వచ్చింది. కాబట్టి ఇది “పుంప్వాదేశ సంధి.”

ఆ) ముత్యపుచిప్ప
జవాబు:
ముత్యపుచిప్ప = ముత్యము + చిప్ప + పుంప్వాదేశ సంధి
గమనిక :
ఇక్కడ ముత్యము అనే మొదటి పదం చివర ఉన్న “ము” వర్ణకం పోయి, “పు” ఆదేశంగా వచ్చింది. కాబట్టి ఇది “పుంప్వాదేశ సంధి.”

ఇ) కొంచెపు నరుడు
జవాబు:
కొంచెపునరుడు = కొంచెము + నరుడు = పుంప్వాదేశ సంధి
గమనిక :
ఇక్కడ కొంచెము అనే పూర్వపదం చివర ఉన్న “ము” వర్ణకం పోయి, “పు” ఆదేశంగా వచ్చింది. కాబట్టి ఇది పుంప్వాదేశ సంధి.

15. ప్రాతాది సంధి సూత్రం
సమాసాలలో ప్రాతాదుల తొలి అచ్చు మీది వర్ణాలకెల్ల లోపం బహుళంగా వస్తుంది.

కింద గీత గీసిన పదాలను విడదీయండి. మార్పులు గమనించండి.

అ. పూరెమ్మ అందంగా ఉన్నది.
జవాబు:
పూరెమ్మ : పూవు + రెమ్మ – ప్రాతాది సంధి

ఆ. గురుశిష్యులు పూదోటలో విహరిస్తున్నారు.జవాబు:
పూదోట : పూవు + తోట = ప్రాతాది సంధి

ఇ) కొలనులో కెందామరలు కొత్త శోభను వెదజల్లుతున్నాయి.
జవాబు:
కెందామరలు – కెంపు + తామరలు = ప్రాతాది సంధి

ఈ) ఆ ముసలివానిలాగే అతని ప్రాయిల్లు జీర్ణమైయున్నది.
జవాబు:
ప్రాయిల్లు : పాత + ఇల్లు = ప్రాతాది సంధి

పై సంధి పదాల విభజనను సరిచూడండి. వచ్చిన మార్పు గమనించండి.
అ) పూవు + రెమ్మ = పూరెమ్మ = ప్రాతాది సంధి
ఆ) పూవు + తోట = పూఁదోట = ప్రాతాది సంధి
ఇ) కెంపు + తామరలు = కెందామరలు = ప్రాతాది సంధి
ఈ) ప్రాత + ఇల్లు = ప్రాయిల్లు = ప్రాతాది సంధి
ఉ) మీదు + కడ = మీఁగడ = ప్రాతాది సంధి

గమనిక :
1) ఈ ఐదు సందర్భాలలోనూ మొదటి పదంలోని మొదటి అక్షరం తరువాత ఉన్న వర్ణాలన్నీ లోపిస్తాయి.
2) రెండవ పదం మొదట ఉన్న పరుషా (త, క) లు, సరళా (ద, గ) లుగా మారాయి.

పై మార్పులను బట్టి, ప్రాతాది సంధి నియమాలను ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు.

ప్రాతాది సంధి

ప్రాతాది సంధి సూత్రము (1):
సమాసాలలో ప్రాతాదుల తొలి అచ్చు మీది వర్ణాలకెల్ల లోపం బహుళంగా వస్తుంది.
1) పూవు + తోట = పూ + తోట
2) కెంపు + తామర = కెల + తామర
3) మీదు + కడ = మీ + కడ

ప్రాతాది సంధి సూత్రము (2) :
లోపింపగా మిగిలిన (సంధిలోని) మొదటి అక్షరానికి పరుషాలు పరమైతే నుగాగమం (‘న్’ ఆగమంగా) వస్తుంది.
1) పూ + న్ + తోట = పూదోట
2) కె +న్ + తామర = కెందామర
3) మీ + 5 + కడ = మీగడ

గమనిక :
నుగాగమంలోని ‘స్’ అనేది, పూర్ణబిందువుగా గాని, అర్థబిందువుగా గాని, సరళాదేశ సంధి వల్ల మారుతుంది.
ఉదా : 1) పూఁదోట
2) కెందామర
3) మీఁగడ

గమనిక :
ప్రాతాదులు అంటే ‘పాత’ మొదలయిన కొన్ని మాటలు. అవి
1) ప్రాత
2) లేత
3) క్రొత్త
4) క్రిందు
5) కెంపు
6) చెన్ను మొ||నవి.

AP SSC 10th Class Telugu Grammar Sandhulu సంధులు

16. నుగాగమ సంధి సూత్రం
ఉదంతమగు తద్ధర్మార్థక విశేషణానికి అచ్చు పరమైనపుడు నుగాగమం వస్తుంది.

అభ్యాసం :
కింది పదాలను విడదీయండి. మార్పును గమనించండి.

అ) నుగాగమ సంధి:

అ) చేయునతడు = చేయు + అతడు
ఆ) వచ్చునపుడు = వచ్చు + అపుడు

గమనిక :
చేయు, వచ్చు వంటి క్రియలు చివర ‘ఉత్తు’ను, అనగా హ్రస్వ ఉకారాన్ని కల్గి ఉంటాయి. కాబట్టి వీటిని ‘ఉదంతాలు’ అంటారు. ఇవి తద్ధర్మార్థక క్రియలు. అంటే ఏ కాలానికైనా వర్తించే క్రియలు. ఈ ఉదంత, తద్ధర్మార్థక క్రియలకు అచ్చు కలిసింది. అప్పుడు ‘న్’ అనే అక్షరం కొత్తగా వస్తుంది. ‘న్’ ఆగమంగా అనగా ఉన్న అక్షరాలను కొట్టి వేయకుండా వస్తుంది. కాబట్టి ఇది “నుగాగమ సంధి’.
ఉదా :
చేయు + అతడు = చేయు +న్ + అతడు = చేయునతడు
వచ్చు + అప్పుడు = వచ్చు + న్ + అప్పుడు = వచ్చునప్పుడు

గమనిక :
అతడు, అప్పుడు అనే పదాలలోని ‘అ’ అనే అచ్చు పరంకాగా, కొత్తగా ‘న్’ ఆగమంగా వచ్చి, నుగాగమం అయింది.

ఉదా :
1) వచ్చునప్పుడు
2) చేయునతడు

ఆ. నుగాగమ సంధి:

గమనిక :
ఈ పై సందర్భాలలోనే కాక, మరికొన్ని చోట్ల కూడా నుగాగమం వస్తుంది. కింది పదాలు విడదీసి, పరిశీలించండి.
అ) తళుకుం గజ్జెలు
ఆ) సింగపుం గొదమ

పై సంధి పదాలను విడదీస్తే
అ) తళుకుం గజ్జెలు – తళుకు + గజ్జెలు
ఆ) సింగపుం గొదమ = సింగము + కొదమ

గమనిక :
‘తళుకు గజ్జెలు’ అనే సంధి పదంలో ‘తళుకు’ అనే పదం, ఉత్తు చివర గల స్త్రీ సమశబ్దం. ఇటువంటి ఉదంత స్త్రీ సమపదాలకు, పరుషాలుగాని, సరళాలుగాని పరమైతే నుగాగమం వస్తుంది.
ఉదా :
తళుకు + 5 + గజ్జెలు = ద్రుతానికి సరళ స్థిరాలు పరమైతే పూర్ణబిందువు వస్తుంది. తళుకుం గజ్జెలు అవుతుంది.

అలాగే పుంపులకు, పరుష సరళాలు పరమైతే, నుగాగమం వస్తుంది.

గమనిక :
సింగపు + కొదమ అనే చోట ‘సింగపు’ అన్న చోట చివర ‘పు’ ఉంది. దానికి ‘కొదమ’ లో మొదటి అక్షరం ‘అ’ అనేది పరుషం పరమైంది. పుంపులకు పరుషం పరమైంది. కాబట్టి ‘నుగాగమం’ అనగా ‘5’ వస్తుంది.
ఉదా :
సింగపు + 5 + కొదమ సరళాదేశం రాగా సింగపుఁగొదమ అవుతుంది.

అభ్యాసం :
కింది ఉదాహరణలు పరిశీలించి, లక్షణ సమన్వయం చేయండి.
ఉదా :
తళుకుంగయిదువు – తళుకు + 5 + కయిదువు = సరళాదేశ సంధి రాగా, తళుకుం గయిదువు అవుతుంది.

గమనిక :
తళుకు అన్నది (ఉదంత స్త్రీ సమం); ‘కయిదువు’ పదంలో మొదట ‘క’ అనే పరుషము ఉంది. కాబట్టి నుగాగమం వస్తుంది.

1. చిగురుం గయిదువు
జవాబు:
చిగురుం గయిదువు = చిగురు + కయిదువు
గమనిక :
‘చిగురు’ అనేది ఉదంత స్త్రీ సమశబ్దం. దానికి కయిదువు అనే పదం పరమయ్యింది. కయిదువులో ‘క’ అనే పరుషం పరమైంది.

ఉదంత స్త్రీ సమశబ్దాలకు పరుషం పరమయింది కాబట్టి ‘నుగాగమం’ వచ్చింది.
ఉదా :
చిగురు + న్ + కయిదువు , తరువాత సరళాదేశం రాగా చిగురుఁగయిదువు అవుతుంది.

2. సరసపుఁదనము
జవాబు:
సరసము + తనము
గమనిక :
‘సరసముతనము’ అనేది కర్మధారయ సమాసం. అందువల్ల కర్మధారయాలలోని ‘ము’ వర్ణకానికి పు, ంపులు వస్తాయి.
ఉదా : సరసపు + తనము

ఇక్కడ పుంపులకు పరుష సరళాలు పరమైతే నుగాగమం వస్తుంది. ‘సరసపు’ లోని పుంపులకు ‘తనము’లోని ‘త’ పరుషం పరమైంది. కాబట్టి నుగాగమం (న్) వచ్చింది.
ఉదా :
సరసపు + న్ + తనము – చివరకు సరళాదేశం రాగా ‘సరసపుఁదనము’ అవుతుంది.

ఇ) నుగాగమ సంధి:
గమనిక :
ఇంకా మరికొన్ని సందర్భాల్లోనూ నుగాగమం వస్తుంది. కింది పదాలను విడదీయండి.

అ) విధాతృనానతి = విధాతృ + ఆనతి
ఆ) రాజునాజ్ఞ = రాజు + ఆజ్ఞ
విధాతృ + ఆనతి = విధాత యొక్క ఆనతి
రాజు + ఆజ్ఞ = రాజు యొక్క ఆజ్ఞ

విగ్రహవాక్యాలను అనుసరించి, పై సంధి పదాలు షష్ఠీ తత్పురుష సమాసానికి చెందినవి.

పూర్వపదం చివర స్వరాలు అనగా అచ్చులు “ఋ” కారం, “ఉత్తు” ఉన్నాయి.

గమనిక :
ఈ విధంగా షష్ఠీ తత్పురుష సమాసపదాల్లో, “A” కార, “ఋ” కారములకు అచ్చుపరమైతే నుగాగమం (5) వస్తుంది.
ఉదా :
1) విధాతృ + ఆనతి (విధాత యొక్క ఆనతి) = విధాతృ + న్ + ఆనతి
2) రాజు + ఆజ్ఞ (రాజు యొక్క ఆజ్ఞ = రాజు + న్ + ఆజ్ఞ

ఈ) నుగాగమ సంధి సూత్రం :
షష్ఠీ తత్పురుష సమాసంలో “ఉ” కార, “బు” కారాలకు అచ్చుపరమైనపుడు నుగాగమం వస్తుంది.
ఉదా :
విధాతృ + న్ + ఆనతి = విధాతృనానతి
రాము + న్ + ఆజ్ఞ = రామునాజ్ఞ

షష్ఠీ తత్పురుషంలో నుగాగమ సంధి సూత్రం :
షష్ఠీ సమాసమందు “ఉ” కార, ‘ఋ” కారాలకు అచ్చుపరమైతే నుగాగమం వస్తుంది.

AP SSC 10th Class Telugu Grammar Sandhulu సంధులు

పాఠ్యపుస్తకంలోని ముఖ్యమైన తెలుగు సంధులు

సంధి పదము విడదీత సంధి పేరు
1) వంటాముదము = వంట + ఆముదము = అత్వ సంధి
2) ఏమనిరి = ఏమి + అనిరి = ఇత్వ సంధి
3) అవ్విధంబున = ఆ + విధంబున = త్రిక సంధి
4) సింగపుకొదమ = సింగము + కొదమ = పుంప్వాదేశ సంధి
5) ముత్యపుచిప్ప = ముత్యము + చిప్ప = పుంప్వాదేశ సంధి
6) కొంచేపునరుడు = కొంచెము + నరుడు = పుంప్వాదేశ సంధి
7) బంధమూడ్చి = బంధము + ఊడ్చి = ఉత్వ సంధి
8) అవ్వారల = ఆ + వారల = త్రిక సంధి
9) భక్తురాలు = భక్త + ఆలు = రుగాగమ సంధి
10) బాలెంతరాలు = బాలెంత + ఆలు = రుగాగమ సంధి
11) గుణవంతురాలు = గుణవంత + ఆలు = రుగాగమ సంధి
12) దేశాలలో = దేశము + లలో = లులన సంధి
13) పుస్తకాలు = పుస్తకము + లు = లులన సంధి
14) సమయాన = సమయము + న = లులన సంధి
15) చిగురుంగయిదువు = చిగురు + కయిదువు = నుగాగమ సంధి
16) సరసపుఁదనము = సరసము + తనము = నుగాగమ సంధి
17) ఆనందాన్నిచ్చిన = ఆనందాన్ని + ఇచ్చిన = ఇత్వ సంధి
18) మేమంత = మేము + అంత = ఉత్వ సంధి
19) ఇవ్వీటిమీద = ఈ + వీటిమీద = త్రిక సంధి
20) భిక్షయిడదయ్యే = భిక్ష + ఇడదయ్యె = యడాగమ సంధి
21) ఆగ్రహముదగునె = ఆగ్రహము + తగునె = గసడదవాదేశ సంధి
22) ఉన్నయూరు = ఉన్న + ఊరు = యడాగమ సంధి
23) అందుఁ జూడాకర్ణుడు = అందున్ + చూడాకర్ణుడు = సరళాదేశ సంధి
24) చూడాకర్ణుడను = చూడాకర్ణుడు + అను = ఉత్వ సంధి
25) పరివ్రాజకుడు గలడు = పరివ్రాజకుడు + కలడు = గసడదవాదేశ సంధి

సంస్కృత సంధులు

1. సవర్ణదీర్ఘ సంధి సూత్రం
అ, ఇ, ఉ, ఋ లకు అవే అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి.

గమనిక :
‘అ’ వర్ణానికి – ‘అ’, ‘ఆ’ లు సవర్ణాలు
‘ఇ’ వర్గానికి – ‘ఇ’, ‘ఈ’ లు సవర్ణాలు
‘ఉ’ వర్గానికి – ‘ఉ’, ‘ఊ’ లు సవర్ణాలు
‘ఋ’ వర్గానికి – ‘ఋ’, ‘బూ’ లు సవర్ణాలు

1. ఉదా :
1) రామానుజుడు = రామ + అనుజుడు = (అ + అ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
2) రామాలయం = రామ + ఆలయం = (అ + ఆ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
3) గంగాంబ = గంగ + అంబ = (అ + అ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి

2. ఉదా :
4) కవీంద్రుడు = కవి + ఇంద్రుడు – (ఇ’ + ఇ = ఈ), = సవర్ణదీర్ఘ సంధి
5) శ్రీకాళహస్తీశ్వరా = శ్రీకాళహస్తి + ఈశ్వర – (ఇ + ఈ = ఈ) = సవర్ణదీర్ఘ సంధి

3. ఉదా :
6) భానూదయం . = భాను + ఉదయం = (ఉ + ఉ = ఊ) = సవర్ణదీర్ఘ సంధి
7) వధూపేతుడు : వధూ + ఉపేతుడు = (ఊ + ఉ = ఊ) – సవర్ణదీర్ఘ సంధి

4. ఉదా :
8) పిత్రణం : పితృ + ఋణం = (ఋ + ఋ = ఋ) = సవర్ణదీర్ఘ సంధి
9) మాతణం = మాతృ + ఋణం = (బ + ఋ – ఋ) = సవర్ణదీర్ఘ సంధి

2. గుణ సంధి సూత్రం
అకారానికి ఇ, ఉ, ఋ లు పరమైతే, ఏ, ఓ, అర్ లు క్రమంగా ఏకాదేశంగా వస్తాయి.
1. ఉదా :
రాజేంద్రుడు = రాజ + ఇంద్రుడు = (అ + ఇ = ఏ) = గుణ సంధి
మహేంద్రుడు = మహా + ఇంద్రుడు = (ఆ + ఇ = ఏ) = గుణ సంధి
నరేంద్రుడు – నర + ఇంద్రుడు = (అ + ఇ = ఏ) = గుణ సంధి
రామేశ్వర = రామ + ఈశ్వర (అ + ఇ = ఏ) = గుణ సంధి

2. ఉదా :
పరోపకారం = పర + ఉపకారం = (అ + ఉ = ఓ) = గుణ సంధి
మహోన్నతి = మహా + ఉన్నతి = (అ + ఉ = ఓ) = గుణ సంధి
దేశోన్నతి = దేశ + ఉన్నతి = (అ + ఉ = ఓ) = గుణ సంధి
గృహోపకరణం = గృహ + ఉపకరణం = (అ + ఉ = ఓ) = గుణ సంధి

3. ఉదా :
రాజర్షి = రాజ + ఋషి = (అ + ఋ = అర్) = గుణ సంధి
మహర్షి = మహా + ఋషి = (అ + ఋ = అర్) = గుణ సంధి

పై ఉదాహరణలు పరిశీలిస్తే
1) అ, ఆ లకు ఇ, ఈ లు కలిసి ‘ఏ’ గా మారడం
2) అ, ఆ లకు ఉ, ఊ లు కలిసి ‘ఓ’ గా మారడం
3) అ, ఆ లకు ఋ, ౠలు కలిసి ‘అర్’ గా మారడం – గమనించగలం.

పై మూడు సందర్భాల్లోనూ, పూర్వ స్వరం అంటే, సంధి వీడదీసినపుడు, మొదటి పదం చివరి అచ్చులు, అ, ఆ లుగానూ, పర స్వరం, అంటే విడదీసిన రెండవ పదంలో మొదటి అచ్చులు ఇ, ఉ, ఋ – లుగానూ ఉన్నాయి.

గమనిక :
1) అ, ఆ లకు – ‘ఇ’ కలిస్తే ‘ఏ’ గా మారుతుంది.
2) అ, ఆ లకు – ‘ఉ’ కలిస్తే ‘ఓ’ గా మారుతుంది.
3) అ, ఆ లకు – ‘ఋ’ కలిస్తే ‘అర్’ గా మారుతుంది.
ఏ, ఓ, అర్ అనే వాటిని గుణాలు అంటారు. ఇలా గుణాలు వచ్చే సంధిని “గుణ సంధి” అంటారు.

AP SSC 10th Class Telugu Grammar Sandhulu సంధులు

3. యణాదేశ సంధి సూత్రం
ఇ, ఉ, ఋ లకు అసవర్ణాచ్చులు పరమైతే, య, వ, రలు ఆదేశంగా వస్తాయి.
ఈ కింది పదాలను విడదీయండి. మార్పును గమనించండి.
1. ఉదా :
అ) అత్యానందం = అతి + ఆనందం – (త్ + ఇ + ఆ = యా) = యణాదేశ సంధి
1) అత్యంతం = అతి + అంతం = (త్ + ఇ + అ = య) = యణాదేశ సంధి
2) అభ్యంతరం = అ + అంతరం = (త్ + ఇ + అ = య) = యణాదేశ సంధి

2. ఉదా :
ఆ) అణ్వస్త్రం = అస్త్రం (ణ్ + ఉ + అ = వ) = యణాదేశ సంధి
2) గుర్వాజ్ఞ = (ర్ + ఉ + ఆ = వ) = యణాదేశ సంధి

3. ఉదా :
ఇ) పిత్రాజ్ఞ = పితృ + ఆజ్ఞ = (ఋ + ఆ = రా) = యణాదేశ సంధి
3) మాత్రంశ = మాతృ + అంశ = (ఋ + అ = ర) = యణాదేశ సంధి

గమనిక :
ఇ, ఉ, ఋ లకు అసవర్ణాచ్చులు (వేరే అచ్చులు) పక్కన వచ్చినపుడు, క్రమంగా వాటికి య – వ -రలు వచ్చాయి. యవరలను ‘యణులు’ అంటారు. యజ్ఞులు చేరితే వచ్చే సంధిని ‘యణాదేశ సంధి అంటారు. యణాదేశ సంధిలో ‘ఇ’ కి బదులుగా “య్”, ‘ఉ’ కి బదులుగా ‘ప్’, ‘ఋ’ కి బదులుగా ‘5’ వచ్చాయి.

4. వృద్ధి సంధి సూత్రం
అకారానికి ఏ, ఐలు పరమైతే ‘ఐ’ కారమూ, ఓ, ఔ లు పరమైతే ‘ఔ’ కారమూ వస్తాయి.

ఈ కింది పదాలను విడదీయండి.
1. ఉదా :
వసుధైక = వసుధా + ఏక = = (ఆ + ఏ = ఐ) = వృద్ధి సంధి
అ) రసైక = రస + ఏక = (అ + ఏ = ఐ) = వృద్ధి సంధి
ఆ) సురైక = సుర + ఏక = (అ + ఏ = ఐ) = వృద్ధి సంధి

2. ఉదా :
సమైక్యం = సమ + ఐక్యం = (అ + ఐ = ఐ) = వృద్ధి సంధి
ఇ) అప్లైశ్వర్యం = అష్ట + ఐశ్వర్యం = (అ + ఐ = ఐ) = వృద్ధి సంధి
ఈ) దేవైశ్వర్యం =దేవ + ఐశ్వర్యం = (అ + ఐ = ఐ) = వృద్ధి సంధి

3. ఉదా :
పాపౌఘము = పాప + ఓఘము = (అ + ఓ = ఔ) = వృద్ధి సంధి
ఉ) వనౌకసులు = వన + ఓకసులు = (అ + ఓ = ఔ) = వృద్ధి సంధి
ఊ) వనౌషధి = వన + ఓషధి = (అ + ఓ = ఔ) = వృద్ధి సంధి

4. ఉదా :
రనౌచిత్యం = రస + ఔచిత్యం = (అ + ఔ – ఔ) = వృద్ధి సంధి
ఋ) దివ్యౌషధం = దివ్య + ఔషధం = (అ + ఔ – ఔ) = వృద్ధి సంధి
ఋ) దేశోన్నత్యం = దేశ + ఔన్నత్యం = (అ + ఔ – ఔ) = వృద్ధి సంధి

గమనిక :
పైన పేర్కొన్న పదాలను విడదీసినపుడు మీరు గమనింపదగిన విషయం ఇది
1. వృద్ధి సంధి ఏర్పడేటప్పుడు ప్రతిసారీ పూర్వ స్వరంగా ‘అ’.వచ్చింది.
2. పర స్వరం స్థానంలో వరుసగా “ఏ, ఏ, ఐ, ఔలు ఉన్నాయి.
3. అకారానికి ఏ, ఐలు కలిపినపుడు ‘బి’ వచ్చింది.
4. అకారానికి ఓ, ఔ లు కలిపినపుడు ‘&’ వచ్చింది.

వృద్ధులు = ఐ, ఔలను ‘వృద్ధులు’ అంటారు.

5. జశ్వ సంధి సూత్రం
పరుషాలకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు, శష స లు తప్ప, మిగిలిన హల్లులు కానీ, అచ్చులు కానీ, పరమైతే వరుసగా సరళాలు ఆదేశమవుతాయి.
ఉదా :
సత్ + భక్తులు = సద్ + భక్తులు = సద్భక్తులు

పై సంధి పదాలను పరిశీలించండి. మొదట విడదీసిన పదాలలోని ‘త’ కార స్థానములో, ‘ద’ కారం ఆదేశంగా వచ్చి, ‘సద్భక్తులు’ అనే రూపం వచ్చింది.

గమనిక :
ఈ విధంగా మొదటి పదం చివర, క, చ, ట, త, ప (పరుషాలు),లలో ఏదైనా ఒక అక్షరం ఉండి, రెండవ పదం మొదట క ఖ, చ ఛ, ట ఠ, త థ, ప ఫ, లు మరియు శ ష స లు తప్ప, మిగిలిన హల్లులూ, అచ్చులలో ఏ అక్షరం ఉన్నా ‘గ, జ, డ, ద, బ’ లు వరుసగా ఆదేశం అవుతాయి.

కింది పదాలను విడదీయండి.
1) దిగంతము = దిక్ + అంతము = జశ్వ సంధి (క్ – గ్ గా మారింది)
2) మృదటము = మృత్ + ఘటము = జశ్వ సంధి (త్ -ద్ గా మారింది)
3) ఉదంచద్భక్తి = ఉదంచత్ + భక్తి = జత్త్వ సంధి (త్ -ద్ గా మారింది)
4) వాగీశుడు = వాక్ ఈశుడు = జత్త్వ సంధి (క్ – గ్ గా మారింది)
5) వాగ్యుద్ధం = వాక్ + యుద్ధం = జశ్వ సంధి (క్ – గ్ గా మారింది)
6) వాగ్వాదం = వాక్ + వాదం = జశ్వ సంధి (క్ – గ్ గా మారింది)
7) తద్విధం = తత్ + విధం = జశ్వ సంధి (త్ -ద్ గా మారింది)

AP SSC 10th Class Telugu Grammar Sandhulu సంధులు

6. అనునాసిక సంధి సూత్రం
వర్గ ప్రథమాక్షరాలకు (కటతలకు) ‘న’ గాని, ‘మ’ గాని పరమైనప్పుడు అనునాసికములు ఆదేశంగా వస్తాయి.

ఈ కింది పదాలను విడదీయండి.
అ) వాజ్మయం = వాక్ + మయం = అనునాసిక సంధి
ఆ) రాణ్మహేంద్రవరం = రాట్ + మహేంద్రవరం = అనునాసిక సంధి
ఇ) జగన్నాథుడు = జగత్ + నాథుడు = అనునాసిక సంధి

గమనిక :
పై సంధులు జరిగిన తీరు గమనించండి.
అ) వాక్ + మయం = వాజ్మయం = ‘క్’ స్థానంలో ‘జ’ వచ్చింది.
ఆ) రాట్ + మణి = రాణ్మణి = ‘ట్’ స్థానంలో ‘ణ’ వచ్చింది.
ఇ) జగత్ + నాథుడు = జగన్నాథుడు = ‘త్’ స్థానంలో ‘న’ వచ్చింది.

గమనిక :
1) పై మూడు సంధి పదాలలోనూ మొదటి పదం చివర వరుసగా క, ట, త, లు ఉన్నాయి.
2) వాటికి ‘మ’ గాని, ‘న’ గాని పరమయినాయి. అంటే తరువాత కలిశాయి.
3) 1) అప్పుడు పూర్వపదం చివర గల ‘క’ కారం, ‘క’ వర్గకు అనునాసికమైన ‘జ’ గా మారుతుంది. (క, ఖ, గ, ఘ, ఙ)
2) అప్పుడు పూర్వపదం చివర గల ‘ట’ కారం, ‘ట’ వర్గకు అనునాసికమైన ‘ణ’ గా మారింది. (ట, ఠ, డ, ఢ, ణ)
3) అప్పుడు పూర్వపదం చివర గల ‘త’ కారం, దాని అనునాసికమైన ‘న’ (త థ ద ధ న) గా ఆదేశం అవుతాయి.
దీనినే ‘అనునాసిక సంధి’ అంటారు.

అభ్యాసము :
1) తన్మయము = తత్ + మయము = అనునాసిక సంధి
2) రాణ్మణి = రాట్ + మణి , – అనునాసిక సంధి
3) వాజ్మయము = వాక్ + మయము = అనునాసిక సంధి
4) మరున్నందనుడు = మరుత్ + నందనుడు = అనునాసిక సంధి

7.అ) విసర్గ సంధి సూత్రం
అకారాంత పదాల మీద ఉన్న విసర్గకు, వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు (క, చ, ట, త, ప, ఖ, ఛ, ఠ, థ, ఫ, శ, ష, సలు కాక, మిగతా అక్షరాలు) కలిసినపుడు, విసర్గ లోపించి “అ” కారం ‘ఓ’ కారంగా మారుతుంది.

ఉదాహరణలు చూడండి :
అ) నమోనమః = నమః + నమః
ఆ) మనోహరం : మనః + హరం
ఇ) పయోనిధి : పయః + నిధి
ఈ) వచోనియమం = వచః + నియమం

గమనిక :
ఈ నాలుగు ఉదాహరణలలో అకారాంత పదాల మీద ఉన్న విసర్గ లోపించి, ‘అ’ కారం ‘ఓ’ కారంగా మారింది.

ఆ) విసర్గ సంధి సూత్రం
విసర్గకు శ,ష,సలు కలిసినపుడు, విసర్గ శ,ష,స,లుగా మారి శ,ష,సలు ద్విత్వాలుగా మారుతాయి.
ఉదాహరణలు :
అ) మనశ్శాంతి : మనః + శాంతి
ఆ) చతుషష్టి : చతుః + షష్టి
ఇ) నభస్సుమం : నభః + సుమం

గమనిక :
విసర్గము, ప్రక్కనున్న శ, ష, స లుగా మారి, ద్విత్వాలుగా అయ్యింది. ఆయా పదాలను కలుపగా, వరుసగా మనశ్శాంతి, చతుషష్టి, నభస్సుమం అనే రూపాలు ఏర్పడ్డాయి.

ఇ) విసర్గ సంధి సూత్రం
విసర్గకు క,ఖ,ప,ఫ,లు కలిస్తే విసర్గమారదు. (సంధి ఏర్పడదు.)
ఉదాహరణలు :
అ) ప్రాతఃకాలము = ప్రాతః + కాలము = విసర్గ సంధి
ఆ) తపఃసలము = తపః + ఫలము = విసర్గ సంధి

గమనిక :
పై ఉదాహరణలలో విసర్గకు క, ఫ లు పరం అయ్యాయి. కాబట్టి విసర్గ మారకుండా యథాప్రకారంగానే ఉంది.

AP SSC 10th Class Telugu Grammar Sandhulu సంధులు

ఈ) విసర్గ సంధి సూత్రం
అంతః, దుః, చతుః, ఆశీః, పునః మొదలయిన పదాల తరువాత ఉండే విసర్గ, రేఫ (‘ర్’)గా మారుతుంది.
ఉదా :
అంతః + ఆత్మ : అంతర్ – + ఆత్మ = అంతరాత్మ
అ) దుః + అభిమానం = దుర్ + అభిమానం = దురభిమానం
ఆ) చతుః + దిశలు = చతుర్ + దిశలు = చతుర్దశలు
ఇ) ఆశీః + వాదము = ఆశీర్ + వాదము = ఆశీర్వాదము
ఈ) పునః + ఆగమనం = పునర్ + ఆగమనం = పునరాగమనం
ఉ) అంతః + మథనం = అంతర్ + మథనం = అంతర్మథనం

ఉ) విసర్గ సంధి సూత్రం
ఇస్, ఉర్ల విసర్గకు, క, ఖ, ప, ఫ, లు కలిస్తే, విసర్గ ‘ష’ కారంగా మారుతుంది.\
ఉదా :
ధనుష్కోటి : ధనుస్ట్ + కోటి = ధనుష్ + కోటి = ధనుష్కోటి
అ) నిష్ఫలము = నిస్ + ఫలము = నిష్, + ఫలము = నిష్ఫలము
ఆ) దుష్కరము = దుస్ + కరము – దుష్ – + కరము = దుష్కరము

గమనిక :
ఇస్ (ఇజి), ఉస్ (43) ల విసర్గలకు క,ఖ,ప,ఫ లు కలిసినపుడు, విసర్గ అనగా ‘స్’ కారము ‘ష’ కారంగా మారుతుంది.

ఊ) విసర్గ సంధి సూత్రం
విసర్గకు (అనగా ‘స్’ కు) చ ఛ లు పరమైతే ‘శ’ కారం, ట ఠలు పరమైతే ‘ష’ కారం, త థ
లు పరమైతే ‘స’ కారం వస్తాయి.
ఉదా :
అ) దుశ్చేష్టితము = దుః + చేష్టితము (విసర్గము – శ్ గా మారింది)
ఆ) ధనుష్టంకారం = ధనుః + టంకారము (విసర్గము ష్ గా మారింది)
ఇ) మనస్తాపము = మనః + తాపము (విసర్గము ‘స’గా మారింది)
ఈ) నిస్తేజము = నిః + తేజము (విసర్గము ‘స’గా మారింది)

గమనిక :
పై ఉదాహరణలలో విసర్గకు చ ఛలు పరమైతే ‘శ’ కారం, ట ఠలు పరమైతే ‘ష’ కారం త థలు పరమైతే ‘స’ కారం వస్తుంది.

పై ఉదాహరణలు గమనిస్తే విసర్గ సంధి ఆరు విధాలుగా ఏర్పడుతోందని తెలుస్తోంది.

8. శ్చుత్వ సంధి సూత్రం
‘స’ కార, ‘త’ వర్గాలకు, ‘శ’ కార ‘చ’ వర్గా (చ ఛ జ ఝ) లు పరమైతే, ‘శ’ కార ‘చ’ వర్గాలే వస్తాయి.

కింది ఉదాహరణలను పరిశీలించండి.
అ) తప + శక్తి → తపస్ + శక్తి → తపశ్శక్తి
ఆ) నిః + శంక → నిస్ + శంక → నిశ్శంక
ఇ) మనః + శాంతి → మనస్ + శాంతి → మనశ్శాంతి

గమనిక :
పై ఉదాహరణలలో పూర్వపదాలలో ఉన్న విసర్గ సంధి కార్యంలో విసర్గను ‘స’ గా తీసుకుంటున్నాం. విసర్గకు ‘స్’ కారం వస్తుంది. అలా విసర్గ స కారం కాగా, ఆ ‘స’ కారానికి ‘శ’ వర్ణం పరం అవుతుంది. ఇలా పరం అయినపుడు ఆ ‘స’ కారం, ‘శ’ కారంగా మారుతుంది. అనగా ‘శవర్ణ ద్విత్వం వస్తుంది.
ఆ) నిస్ + చింత → నిశ్చింత
సత్ + ఛాత్రుడు → సచ్ఛాత్రుడు
శరత్ + చంద్రికలు → శరచ్చంద్రికలు
జగత్ + జనని → జగజ్జనని
శార్జిన్ + జయః → శారిఞ్జయః

గమనిక :
పై పదాల్లో ‘స’ కార, ‘త’ వర్గాలు పూర్వపదాంతంగా ఉన్నాయి. ‘శ’ కార, ‘చ’ వర్గాలు (త, న) పరమైనాయి. అలా పరమైనప్పుడు ‘శ’ కార, చ వర్గాలుగా మారుతాయి.

అనగా

1) స్ + చి = శ్చి
2) త్ + జ = జ్జ
3) త్ + శా = చ్చా
4) న్ + జ = ఞ్జ
5) త్ + చ = చ్చ

ఈ విధంగా ‘స’ కార ‘త’ వర్గాలకు (తథదధన) లకు, ‘శ’ కార, ‘చ’ వర్గాలు వస్తే అది “శ్చుత్వ సంధి” అవుతుంది.

AP SSC 10th Class Telugu Grammar Sandhulu సంధులు

పాఠ్యపుస్తకంలోని ముఖ్యమైన సంస్కృత సంధులు

1) అత్యంత = అతి + అంత = యణాదేశ సంధి
2) పుణ్యవాసము = పుణ్య + ఆవాసము = సవర్ణదీర్ఘ సంధి
3) స్నిగ్గాంబుదము = స్నిగ్ధ + అంబుదము = సవర్ణదీర్ఘ సంధి
4) పురాతనాపాదితము = పురాతన + ఆపాదితము = సవర్ణదీర్ఘ సంధి
5) సహస్రాబ్దం = సహస్ర + అబ్దం = సవర్ణదీర్ఘ సంధి
6) వేదోక్తము = వేద + ఉక్తము = గుణ సంధి
7) మదోన్మాదము = మద + ఉన్మాదము = గుణ సంధి
8) సరభసోత్సాహం = సరభస + ఉత్సాహం = గుణ సంధి
9) జీవనోపాధి = జీవన + ఉపాధి = గుణ సంధి
10) మహోపకారం = మహా + ఉపకారం = గుణ సంధి
11) గుణౌద్ధత్యం = గుణ + ఔద్ధత్యం = వృద్ధి సంధి
12) రసైకస్థితి = రస + ఏకస్థితి = వృద్ధి సంధి
13) తన్మయము = తత్ + మయము = అనునాసిక సంధి
14) వాజ్మయము = వాక్ + మయము = అనునాసిక సంధి
15) రాణ్మణి = రాట్ + మణి = అనునాసిక సంధి
16) మరున్నందనుడు = మరుత్ + నందనుడు = అనునాసిక సంధి
17) రాణ్మహేంద్రపురం = రాట్ + మహేంద్రపురం = అనునాసిక సంధి
18) జగన్నాథుడు = జగత్ + నాథుడు = అనునాసిక సంధి
19) నమోనమః = నమః . + నమః = విసర్గ సంధి
20) మనోహరం = మనః . + హరం = విసర్గ సంధి
21) పయోనిధి = పయః + నిధి = విసర్గ సంధి
22) వచోనిచయం = వచః + నిచయం = విసర్గ సంధి
23) ప్రాతఃకాలము = ప్రాతః + కాలము = విసర్గ సంధి
24) తపఃఫలము = తపః + ఫలము = విసర్గ సంధి
25) నిష్ఫలము = నిస్ + ఫలము = విసర్గ సంధి
26) దుష్కరము = దుస్ + కరము = విసర్గ సంధి
27) ధనుష్టంకారము = ధనుః + టంకారము = విసర్గ సంధి
28) మనస్తాపము = మనః + తాపము = విసర్గ సంధి
29) దురభిమానం = దుః + అభిమానం = విసర్గ సంధి
30) నిరాడంబరం = ఆడంబరం = విసర్గ సంధి
31) దుర్భేద్యము = దుః + భేద్యము = విసర్గ సంధి
32) తపోధనుడు = తపః + ధనుడు = విసర్గ సంధి
33) నిరాశ = నిస్ + ఆశ = విసర్గ సంధి
34) దుశ్చేష్టితము = దుస్ + చేష్టితము = శ్చుత్వ సంధి
35) నిశ్చింత = నిస్ + చింత = శ్చుత్వ సంధి
36) సచ్ఛాత్రుడు = సత్ + ఛాత్రుడు = శ్చుత్వ సంధి
37) శరచ్చంద్రికలు = శరత్ + చంద్రికలు = శ్చుత్వ సంధి
38) జగజ్జనని = జగత్ + జనని = శ్చుత్వ సంధి
39) శారిజ్జయః = శార్జిన్ + జయః = శ్చుత్వ సంధి

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం 6th Lesson యుద్ధకాండ Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions ఉపవాచకం 6th Lesson యుద్ధకాండ

10th Class Telugu ఉపవాచకం 6th Lesson యుద్ధకాండ Textbook Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

సంఘటనా క్రమం

సంఘటనల ఆధారంగా వరుస క్రమంలో వాక్యాలను అమర్చడం

1. అ) వంద యోజనాల పొడవు, పది యోజనాల వెడల్పు గల సేతువును కట్టడం ఐదు రోజుల్లో పూర్తయింది.
ఆ) శ్రీరాముడు యుద్ధనీతిని అనుసరించి సైన్యాన్ని వివిధ భాగాలుగా విభజించాడు.
ఇ) విశ్వకర్మ కుమారుడైన ‘నలుడు’ శిల్పకళా నిపుణుడు, ఉత్సాహం, శక్తి ఉన్నవాడు. సేతువు నిర్మించడానికి అతడే యోగ్యుడని సముద్రుడు తెలిపాడు.
ఈ) శ్రీరాముడు సముద్రతీరంలో దర్భాసనం మీద కూర్చుని సముద్రుణ్ణి ఉపాసించాడు.
జవాబులు
ఈ) శ్రీరాముడు సముద్రతీరంలో దర్భాసనం మీద కూర్చుని సముద్రుణ్ణి ఉపాసించాడు.
ఇ) విశ్వకర్త కుమారుడైన ‘నలుడు’ శిల్పకళా నిపుణుడు. ఉత్సాహం, శక్తి ఉన్నవాడు. సేతువు నిర్మించడానికి అతడే యోగ్యుడని సముద్రుడు తెలిపాడు.
అ) వందయోజనాల పొడవు, పది యోజనాల వెడల్పు గల సేతువును కట్టడం ఐదు రోజుల్లో పూర్తయింది.
ఆ) శ్రీరాముడు యుద్ధనీతిని అనుసరించి సైన్యాన్ని వివిధ భాగాలుగా విభజించాడు.

2. అ) లంకను నాలుగువైపుల నుండీ సైన్యంతో ముట్టడించాడు శ్రీరాముడు.
ఆ) సీతను అప్పగించకపోతే శ్రీరాముడి చేతిలో మరణం తథ్యమని, లంకకు విభీషణుడు రాజు కాగలడని శ్రీరాముని వాక్యంగా రావణునికి వినిపించాడు అంగదుడు.
ఇ) అంగదుని చేతిలో రావణ కుమారుడు ఇంద్రజిత్తు ఓడిపోయాడు.
ఈ) రామలక్ష్మణులను మూర్ఛపోయేటట్టు చేసి నాగాస్త్రంతో బంధించాడు.
జవాబులు
ఆ) సీతను అప్పగించకపోతే శ్రీరాముడి చేతిలో మరణం తథ్యమని, లంకకు విభీషణుడు రాజు కాగలడని శ్రీరాముని వాక్యంగా రావణునికి వినిపించాడు అంగదుడు.
అ) లంకను నాలుగువైపుల నుండీ సైన్యంతో ముట్టడించాడు శ్రీరాముడు.
ఇ) అంగదుని చేతిలో రావణకుమారుడు ఇంద్రజిత్తు ఓడిపోయాడు.
ఈ) రామలక్ష్మణులను మూర్చపోయేటట్టు చేసి నాగాస్త్రంతో బంధించాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

3. అ) సుషేణుని సూచన మేరకు హనుమంతుడు ఓషధులు తేవడానికి వేగంగా వెళ్లాడు.
ఆ) ఆకాశానికి ఆకాశం, సముద్రానికి సముద్రమే సమానమైనట్లు రామరావణ యుద్దానికి రామరావణ యుద్ధమే సమానమన్నట్లు సాగుతున్నది.
ఇ) ఐంద్రాస్త్రంతో కుంభకర్ణుని శిరస్సును ఖండించి శాశ్వత నిద్రలోకి పంపాడు శ్రీరాముడు.
ఈ) ఐంద్రాస్త్రమును ప్రయోగించి ఇంద్రజిత్తు తలను నేలరాల్చాడు లక్ష్మణుడు.
జవాబులు
ఇ) ఐంద్రాస్త్రంతో కుంభకర్ణుని శిరస్సును ఖండించి శాశ్వత నిద్రలోకి పంపాడు శ్రీరాముడు.
ఈ) ఐంద్రాస్త్రమును ప్రయోగించి ఇంద్రజిత్తు తలను నేలరాల్చాడు లక్ష్మణుడు.
అ) సుషేణుని సూచన మేరకు హనుమంతుడు ఓషధులు తేవడానికి వేగంగా వెళ్లాడు.
ఆ) ఆకాశానికి ఆకాశం, సముద్రానికి సముద్రమే సమానమైనట్లు రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే సమానమన్నట్లు సాగుతున్నది.

4. అ) ఆమె శీలం యొక్క గొప్పదనాన్ని ముల్లోకాలకు చాటడానికే అగ్నిప్రవేశం చేస్తున్నా ఊరుకున్నానన్నాడు.
ఆ) అగ్నిదేవుడు స్వయంగా సీతాదేవిని తీసుకువచ్చి ఆమె గొప్పదనాన్ని వెల్లడించాడు.
ఇ) ‘నా వంశ ప్రతిష్ఠ నిలుపుకోడానికి దుష్ట రావణుని చెరనుండి నిన్ను విడిపించాను. ఇంతకాలం పరుడి పంచన ఉన్నందువల్ల నీ ప్రవర్తన గురించి నాకు సందేహముంది. కనుక నువ్వు నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్లవచ్చునని’ శ్రీరాముడు అన్నాడు.
ఈ) శ్రీరామునికి విశ్వాసం కలిగించడానికి ‘అగ్నిప్రవేశం’ ఒక్కటే శరణ్యమని భావించింది.
జవాబులు
ఇ) ‘నా వంశ ప్రతిష్ఠ నిలుపుకోవడానికి దుష్ట రావణుని చెరనుండి నిన్ను విడిపించాను. ఇంతకాలం పరుడి పంచన . ఉన్నందువల్ల నీ ప్రవర్తన గురించి నాకు సందేహముంది. కనుక నువ్వు నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్లవచ్చు’నని శ్రీరాముడు అన్నాడు.
ఈ) శ్రీరామునికి విశ్వాసం కలిగించడానికి ‘అగ్నిప్రవేశం’ ఒక్కటే శరణ్యమని భావించింది.
ఆ) అగ్నిదేవుడు స్వయంగా సీతాదేవిని తీసుకువచ్చి ఆమె గొప్పదనాన్ని వెల్లడించాడు.
అ) ఆమె శీలం యొక్క గొప్పదనాన్ని ముల్లోకాలకు చాటడానికే అగ్నిప్రవేశం చేస్తున్నా ఊరుకున్నానన్నాడు.

5. అ) అంగరంగ వైభవంగా శ్రీరామపట్టాభిషేక మహోత్సవం జరిగింది.
ఆ) పరమశివుడు శ్రీరాముణ్ణి ప్రశంసించాడు.
ఇ) పుష్పక విమానంలో నందిగ్రామం చేరుకున్న సీతారామలక్ష్మణులకు భరతుడు, ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ) శ్రీరాముడి కోరిక మేరకు ఇంద్రుడు మృతులైపడి ఉన్న వానరులను మళ్లీ బతికించాడు.
జవాబులు
ఆ) పరమశివుడు శ్రీరాముణ్ణి ప్రశంసించాడు.
ఈ) శ్రీరాముడి కోరిక మేరకు ఇంద్రుడు మృతులైపడి ఉన్న వానరులను మళ్లీ బతికించాడు.
ఇ) పుష్పక విమానంలో నందిగ్రామం చేరుకున్న సీతారామలక్ష్మణులకు భరతుడు, ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు.
అ) అంగరంగ వైభవంగా శ్రీరామపట్టాభిషేక మహోత్సవం జరిగింది.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

6. అ) రావణుడు ప్రయోగించిన శక్తి అనే ఆయుధం లక్ష్మణుడి గుండెలో నాటుకుంది.
ఆ) అంగదుని చేతిలో రావణుని కుమారుడు ఇంద్రజిత్తు ఓడిపోయాడు.
ఇ) సముద్రుడిని ప్రార్థించడం వల్ల అది సాధ్యపడదన్నాడు విభీషణుడు.
ఈ) రావణుడి బాణ శక్తికి సుగ్రీవుడు మూర్ఛపోయాడు.
జవాబులు
ఇ) సముద్రుడిని ప్రార్థించడం వల్ల అది సాధ్యపడదన్నాడు విభీషణుడు.
ఆ) అంగదుని చేతిలో రావణుని కుమారుడు ఇంద్రజిత్తు ఓడిపోయాడు.
ఈ) రావణుడి బాణ శక్తికి సుగ్రీవుడు మూర్చపోయాడు.
అ) రావణుడు ప్రయోగించిన శక్తి అనే ఆయుధం లక్ష్మణుడి గుండెలో నాటుకుంది.

7. అ) యజ్ఞయాగాది క్రతువులను శ్రీరాముడు నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడు.
ఆ) విభీషణుడు రావణునికి ఉత్తర క్రియలను నిర్వర్తించాడు.
ఇ) అతికాయుడు లక్ష్మణుని బ్రహ్మాస్తానికి బలైనాడు.
ఈ) విభీషణుని లంకారాజుగా లక్ష్మణుడు పట్టాభిషిక్తుణ్ణి చేశాడు.
జవాబులు
ఇ) అతికాయుడు లక్ష్మణుని బ్రహ్మాస్త్రానికి బలైనాడు.
ఆ) విభీషణుడు రావణునికి ఉత్తర క్రియలను నిర్వర్తించాడు.
ఈ) విభీషణుని లంకారాజుగా లక్ష్మణుడు పట్టాభిషిక్తుణ్ణి చేశాడు.
అ) యజ్ఞయాగాది క్రతువులను శ్రీరాముడు నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడు.

8. అ) కుంభకర్ణుడు యుద్ధంలో వానరులను చావుదెబ్బ తీస్తున్నాడు.
ఆ) శ్రీరామచంద్రాదులు వానర సైన్యంతో సువేల పర్వతానికి చేరుకున్నారు.
ఇ) రావణుని వద్దకు అంగదుడిని రాయబారిగా పంపాడు రాముడు.
ఈ) శ్రీరాముడు యుద్ధనీతిని అనుసరించి సైన్యాన్ని వివిధ భాగాలుగా విభజించాడు.
జవాబులు
ఈ) శ్రీరాముడు యుద్ధనీతిని అనుసరించి సైన్యాన్ని వివిధ భాగాలుగా విభజించాడు.
ఆ) శ్రీరామచంద్రాదులు వానర సైన్యంతో సువేల పర్వతానికి చేరుకున్నారు.
ఇ) రావణుని వద్దకు అంగదుడిని రాయబారిగా పంపాడు రాముడు.
అ) కుంభకర్ణుడు యుద్ధంలో వానరులను చావుదెబ్బ తీస్తున్నాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

9. అ) శ్రీరాముడు సముద్రతీరంలో దర్భాసనం మీద కూర్చొని సముద్రుడిని ఉపాసించాడు.
ఆ) సుషేణుని చేతిలో విద్యున్మాలి మరణించాడు.
ఇ) వందయోజనాల పొడవు పది యోజనాల వెడల్పు గల సేతువును కట్టడం ఐదురోజుల్లో పూర్తి అయింది.
ఈ) ఉత్సాహం ఉరకలు వేస్తుంటే అందరు సముద్రతీరాన్ని చేరుకున్నారు.
జవాబులు
ఈ) ఉత్సాహం ఉరకలు వేస్తుంటే అందరు సముద్రతీరాన్ని చేరుకున్నారు.
అ) శ్రీరాముడు సముద్రతీరంలో దర్భాసనం మీద కూర్చొని సముద్రుడిని ఉపాసించాడు.
ఇ) వందయోజనాల పొడవు పది యోజనాల వెడల్పు గల సేతువును కట్టడం ఐదురోజుల్లో పూర్తి అయింది.
ఆ) సుషేణుని చేతిలో విద్యున్మాలి మరణించాడు.

10. అ) పుష్పక విమానంలో సీతా రామలక్ష్మణులు నందిగ్రామం చేరుకున్నారు.
ఆ) అగ్నిదేవుడు స్వయంగా సీతను తీసుకొని వచ్చి ఆమె గొప్పతనాన్ని కొనియాడాడు.
ఇ) శ్రీరాముడు హనుమంతుని సాహసాన్ని ప్రశంసించాడు.
ఈ) లంకలో రావణుడు మంత్రులతో సమావేశమయ్యాడు.
జవాబులు
ఇ) శ్రీరాముడు హనుమంతుని సాహసాన్ని ప్రశంసించాడు.
ఈ) లంకలో రావణుడు మంత్రులతో సమావేశమయ్యాడు.
ఆ) అగ్నిదేవుడు స్వయంగా సీతను తీసుకొనివచ్చి ఆమె గొప్పతనాన్ని కొనియాడాడు.
అ) పుష్పక విమానంలో సీతా రామలక్ష్మణులు నందిగ్రామం చేరుకున్నారు.

పాత్ర స్వభావాలు

1. రావణుడు :
కైకసీ విశ్రవసుల కుమారుడు. లంకా నగరానికి అధిపతి. వేదాధ్యాయనం చేసినవాడు. శివభక్తుడు. కోపం ఎక్కువ. మూర్ఖత్వం ఎక్కువ. మంచి చెబితే వినడు. చెప్పిన వారిపై కక్ష కడతాడు. సీతాపహరణ చేశాడు. స్త్రీ వ్యా మోహం ఎక్కువ. శ్రీరాముని ఆగ్రహానికి గురి అయ్యాడు. తన వంశ నాశనానికి కారకుడయ్యాడు.

2. విభీషణుడు :
రావణుని తమ్ముడు. రావణుడు పరాయి స్త్రీలను తీసుకుని వచ్చినపుడు అది తప్పని చెప్పేవాడు. సీతాదేవిని అపహరించడం తప్పని చెప్పిన ధర్మాత్ముడు. అనేక ధర్మసూక్ష్మాలు తెలిసినవాడు. రావణునిచేత అనేక అవమానాలు పడ్డాడు. ధర్మ రక్షణకోసం శ్రీరాముని పక్షంలో చేరాడు. రాక్షస నాశనానికి కారకుడయ్యాడు. రావణ సంహారం తర్వాత లంకా నగరానికి రాజయ్యాడు.

3. ఇంద్రజిత్తు :
రావణుని పెద్ద కుమారుడు. ఇతని అసలు పేరు మేఘనాథుడు. ఇంద్రుని ఓడించడం వల్ల ఇంద్రజిత్తు అని పేరు వచ్చింది.

రావణుడు తన తమ్ముడైన కుంభకర్ణుణ్ణి, కొడుకైన అతికేయుని పోగొట్టుకొని తల్లడిల్లుతుంటే ఇంద్రజిత్తు ఆయనను ఓదార్చాడు. తాను యుద్ధ రంగానికి వచ్చి రామలక్ష్మణుల మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. వాళ్ళు స్పృహ కోల్పోయినట్లు నటిస్తే మరణించారని భావించి ఆ వార్తను తన తండ్రికి తెలియచేశాడు. శత్రుపక్షాన్ని మానసికంగా దెబ్బతీయాలనే ఆలోచన కలవాడు ఇంద్రజిత్తు. అందుకే మాయ సీతను సృష్టించి ఆమెను సంహరించాడు. చివరికి లక్ష్మణుని చేతిలో ఇంద్రజిత్తు మరణించాడు.

సంఘటన ద్వారా గ్రహించుట

ప్రశ్న 1.
“ఏ దేశంలోనైనా భార్య దొరకవచ్చు, బంధువులు దొరకవచ్చు, కాని లక్ష్మణుని వంటి తమ్ముడు దొరకడు.” అన్న శ్రీరాముని మాటలను బట్టి మీరేం గ్రహించారు?
జవాబు:
రావణుడు ప్రయోగించిన “శక్తి” అనే ఆయుధం కారణంగా నేలకూలిన లక్ష్మణుడిని చూసి విలవిలలాడిపోతూ శ్రీరాముడు అన్న మాటలివి.

ఈ మాటలు రామలక్ష్మణులకు గల అనుబంధాన్ని సోదరప్రేమను చాటుతున్నాయి. అన్నకోసం అన్ని సుఖాలు . వదులుకొని అడవులకు వచ్చినవాడు లక్ష్మణుడు. అతడు లేనిచో తాను జీవించలేనని భావించినందున రాముడు ఈ మాటలు అన్నాడు. ఇవి రాముడికి లక్ష్మణునిపై గల ప్రేమాభిమానాలను సూచిస్తున్నాయి. శ్రీరామునికి లక్ష్మణుడు తలలోని నాలుకలాంటివాడని, ఆరోప్రాణమని ఈ మాటల ద్వారా నేను గ్రహించాను. లక్ష్మణుడి వంటి సోదరుడు ఎవరికీ దొరకడని గ్రహించాను.

ప్రశ్న 2.
“వ్యక్తులు జీవించి వున్నంత వరకే వైరముండాలి. తరువాత దానిని వదలి వేయాలి” అని విభీషణుడితో శ్రీరాముడు పలికిన మాటలను బట్టి మీరేం గ్రహించారు?
జవాబు:
1. వ్యక్తులు జీవించి ఉన్నంత వరకే వైరముండాలి, తరువాత దానిని వదిలివేయాలి అని విభీషణునితో శ్రీరాముడు పలికిన మాటలను బట్టి రాముడు గొప్ప వ్యక్తిత్వం కలవాడని నేను గ్రహించాను.
2. ఏ వ్యక్తి అయినా మరణించిన తర్వాత అతనితో పూర్వము ఉన్న వైరము మరచిపోవాలని, మరణముతోనే వైరము పోవాలని గ్రహించాను.
3. రావణుని మరణానంతరము శ్రీరాముడు విభీషణునితో “రావణుడు నీకు ఎటువంటి వాడో నాకు కూడా అటువంటివాడే” అని చెప్పి తన విశాల హృదయాన్ని చాటుకొన్నాడని గ్రహించాను.
4. రాముడు దుష్టశిక్షణ, శిష్టరక్షణ, మరణించిన శత్రువు పట్ల గౌరవ భావం కలవాడని గ్రహించాను.

ప్రశ్న 3.
“నీవు యుద్ధంలో అలసిపోయావు. సేద దీర్చుకొనిరా” అని రాముడు రావణాసురునితో చెప్పిన మాటలను బట్టి, మీరు ఏమి గ్రహించారు?
జవాబు:
రామరావణుల యుద్ధం మహాఘోరంగా సాగుతోంది. శ్రీరాముని పరాక్రమం ముందు రావణుని ధనుస్సు ముక్కలయ్యింది. రావణుని కిరీటం నేలపై పడింది. అప్పుడు కావాలంటే రాముడు రావణుని సంహరింపవచ్చు. కాని ధర్మాత్ముడయిన, కరుణా సముద్రుడయిన రాముడు రావణుడు తనకు శత్రువయినా అతనిపై దయతలచాడు. రావణునితో రాముడు “నీవు యుద్ధంలో అలసిపోయావు, విశ్రాంతి తీసుకొని మరునాడు యుద్దానికి రా” అని చెప్పి రావణుని దయతలచి విడిచిపెట్టాడు.

దీనిని బట్టి రాముడు శత్రువుపట్ల కూడా దయచూపే కరుణాంతరంగుడని గ్రహించాను. ధనుస్సు చేతపట్టిన ఆయుధం చేతిలో ఉన్న వీరునితోనే రాముడు యుద్ధం చేసేవాడని, రాముడు మహావీరుడని గ్రహించాను.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

ప్రశ్న 4.
“వానరా! భళా, నాకు శత్రువువే అయినా, నీ శక్తిని మెచ్చుకుంటున్నాను” అని రావణుడు హనుమంతునితో అన్న – మాటలను బట్టి, మీరేమి గ్రహించారో తెల్పండి.
జవాబు:
యుద్ధంలో హనుమంతుడిని రావణుడు తన అరచేతితో చరచాడు. హనుమంతుడు తిరిగి కోపంతో రావణుడిని తన అరచేతితో ఒక్క దెబ్బ వేశాడు. ఆ దెబ్బకు రావణుడు కంపించి పోయి, హనుమంతుడి దెబ్బ వేశాడు. ఆ దెబ్బకు రావణుడు కంపించి పోయి, హనుమంతుడి బలపరాక్రమాలనూ, శక్తినీ, మెచ్చుకుంటూ పై విధంగా మాట్లాడాడు.

ఈ రావణుని మాటలను బట్టి, హనుమంతుడు మహాబలశాలి, ధైర్యశాలి, శక్తివంతుడు అనీ, రావణుడంతటి వీరునిచే ప్రశంసలు పొందిన గొప్ప బలపరాక్రమ సంపన్నుడనీ, నేను గ్రహించాను. శత్రువుచే మెచ్చుకోబడిన హనుమంతుడే నిజమైన వీరుడని నేను అభిప్రాయపడ్డాను.

ప్రశ్న 5.
“సీతను శ్రీరామునికి అప్పగించడమే, అన్ని విధాలా మంచిది. అనవసరంగా కలహం తెచ్చుకోవడం దేనికి? శ్రీరాముని పంటి మహావీరునితో యుద్ధం తగదు” అని విభీషణుడు అన్న రావణునకు చెప్పిన మాటలను బట్టి, మీరేమి గ్రహించారు?
జవాబు:
విభీషణుడు రావణాసురునికి తమ్ముడయినా, రాక్షసుడయినా, అతడు ధర్మాత్ముడనీ, విభీషణునికి రావణుడు చేసిన సీతాపహరణం ఇష్టం లేదనీ, సీతమ్మను రామునికి తిరిగి అప్పగించడం శ్రేయస్కరమని విభీషణుడు భావించాడనీ గ్రహించాను. శ్రీరాముడు మహావీరుడని గ్రహించాను. పరస్త్రీహరణం పాపకార్యం అనీ, అది ఎంత బలవంతునికైనా చేటు తెస్తుందనీ గ్రహించాను. విభీషణుడు రాక్షస జాతిలో పుట్టిన రత్నమాణిక్యం వంటివాడని, బుద్ధిమంతుడనీ గ్రహించాను. విభీషణుడు ధైర్యవంతుడనీ, అందుకే అన్నకు ఇష్టం లేకపోయినా, అన్నకు హితమైన మాటను ధైర్యం చేసి చెప్పాడనీ గ్రహించాను.

ప్రశ్న 6.
“సీతను అప్పగించకపోతే శ్రీరాముని చేతిలో మరణం తథ్యం” అని అంగదుడు పలికిన తీరును బట్టి మీరేమి గ్రహించారు?
జవాబు:
శ్రీరాముడు వానర సైన్యంతో కలిసి లంకను చేరాడు. అంగదుడిని రావణుని వద్దకు రాయబారిగా పంపించాడు. అంగదుడు రావణుని సమీపించి హితోపదేశం చేశాడు. సీతను శ్రీరామునికి అప్పగించకపోతే మరణం తప్పదని రావణుని హెచ్చరించాడు.

అంగదుని మాటల వల్ల శ్రీరాముడి పరాక్రమం, ధైర్యం, సాహసం అసమానమైనదని గ్రహించాను. అంగదుడిని రాయబారిగా రాముడు పంపించడం వల్ల శ్రీరాముడు రాజనీతిజ్ఞుడని గ్రహించాడు. శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలనే ఆలోచన శ్రీరామునికి ఉందని గ్రహించాను. అంతేగాదు శ్రీరాముని యుద్ధనీతిని కూడా గ్రహించాను.

ప్రశ్న 7.
యుద్ధరంగంలో అగస్త్యుడు శ్రీరామునికి ఆదిత్య హృదయాన్ని బోధించడం ద్వారా మీరేమి గ్రహించారు?
జవాబు:
రామరావణ యుద్ధం భీకరంగా సాగుతున్నది. ఆ సమయంలో అగస్త్యుడు శ్రీరాముడిని సమీపించాడు. ఆ మహర్షి శ్రీరామునికి ఆదిత్య హృదయాన్ని బోధించాడు. రామునిలో విజయకాంక్షను పెంచాడు. చక్కని విజయాన్ని అందించాడు. అగస్త్యుడు చేసిన ఉపదేశం ద్వారా ఆదిత్య హృదయం సర్వ విజయప్రదమని, శత్రువులను జయించు సామర్థ్యాన్ని అందించగలదని, యుద్ధరంగంలో శక్తిని సమకూర్చగలదని గ్రహించాను. ఆదిత్య హృదయాన్ని చదివితే ఆరోగ్యం కూడా కలుగుతుందని, అందువల్లనే శ్రీరాముడు రావణుని జయించగలిగాడని గ్రహించాను.

విషయాత్మక ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
సముద్రానికి వారధిని ఎవరు కట్టారు? ఎలా?
జవాబు:
విశ్వకర్మ కుమారుడు నలుడు. శిల్పకళా నిపుణుడు. ఉత్సాహవంతుడు. శక్తియుక్తులున్నవాడు. సేతువును భరిస్తానని శ్రీరామునకు సముద్రుడు మాట ఇచ్చాడు. నలుడు నిర్మిస్తానన్నాడు. వానరుల సహకారంతో నలుడి సూచనలననుసరించి సేతువు నిర్మాణం 5 రోజులలో పూర్తయింది. అది వంద యోజనాల పొడవు. పది యోజనాల వెడల్పు కలది.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

ప్రశ్న 2.
రావణ మరణాన్ని వర్ణించండి.
జవాబు:
ఇంద్రుడు పంపిన రథాన్ని శ్రీరాముడు అధిరోహించాడు. రాముడు యుద్ధ నైపుణ్యం ముందు రావణుడు ఆగలేకపోతున్నాడు. అగస్త్యుడు రామునికి ‘ఆదిత్య హృదయం’ ఉపదేశించాడు. రామబాణ ధాటికి రావణ శిరస్సులు నేలరాలుతున్నాయి. మళ్ళీ మొలుస్తున్నాయి. మాతలి సూచనతో బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు శ్రీరాముడు. రావణుడు అంతమయ్యాడు.

ప్రశ్న 3.
శ్రీరామ పట్టాభిషేకాన్ని వివరించండి.
జవాబు:
రావణ మరణానంతరం శ్రీరామ విజయం సీతకు హనుమ చెప్పాడు. అగ్ని ప్రవేశానంతరం సీతాదేవి శ్రీరాముని చేరింది. పుష్పక విమానంలో అయోధ్యకు చేరారు. పౌరులు ఘనస్వాగతం పలికారు. గురువులకు, పెద్దలకు నమస్కరించారు. శ్రీరామ పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. భరతుణ్ణి యువరాజుగా పట్టాభిషిక్తుడిని చేశాడు. రామరాజ్యం ఏర్పడింది. ప్రజలకు శ్రీరామరక్ష కలిగింది.

ప్రశ్న 4.
శ్రీరాముడు శరణుకోరిన విభీషణుని ఆదరించిన విధానాన్ని వివరించండి.
జవాబు:
శ్రీరాముడు శరణుకోరిన విభీషణునితో “నేను రావణుణ్ణి బంధుమిత్ర సమేతంగా హతమారుస్తాను. నిన్ను రాజును చేస్తా” నని తమ్ముల మీద ఒట్టేసి చెప్పాడు. ఈ పనిలో తాను యథాశక్తి సహాయపడగలనని విభీషణుడు మాట ఇచ్చాడు. రాముడు విభీషణుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. రాముని ఆజ్ఞపై లక్ష్మణుడు సముద్రజలం తెచ్చి లంకారాజుగా విభీషణుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేయటం జరిగింది. అందరూ ఆనందాన్ని ప్రకటించారు.

వ్యాసరూప ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
శ్రీరాముడు సముద్రునిపై అస్త్ర ప్రయోగానికి సిద్ధపడటానికి కారణం ఏమిటి? దాని పర్యవసానమేమిటి?
జవాబు:
లంకకు వెళ్ళాలంటే రాముడు సముద్రం దాటాలి. సముద్రాన్ని దాటే ఉపాయం ఏమిటని సుగ్రీవుడిని రాముడు అడిగాడు. సముద్రుడిని ప్రార్థించమని విభీషణుడు సలహా చెప్పాడు. శ్రీరాముడు సముద్రతీరంలో దర్భాసనం మీద కూర్చుని సముద్రుడిని ప్రార్థించాడు. మూడు రాత్రులు గడచినా సముద్రుడు ఎదుట కనబడలేదు.

కోపముతో శ్రీరాముడి కళ్ళు ఎరుపు ఎక్కాయి. సముద్రుడి అహంకారాన్ని పోగొట్టాలనీ, సముద్రంలో నీటిని ఇంకిపోయేటట్లు చేయాలనీ రాముడు అనుకున్నాడు. అప్పుడు శ్రీరాముడు బ్రహ్మాస్తమును స్మరించాడు.

దానితో ప్రకృతి అంతా అల్లకల్లోలమయ్యింది. సముద్రుడు భయపడి పారిపోతున్నాడు. పరుగెత్తేవాడిపై బాణం ప్రయోగించరాదని, శ్రీరాముడు ఆగాడు. సముద్రుడు దారికి వచ్చాడు. లంకకు వెళ్ళడానికి తాను దారి ఇస్తానన్నాడు.

ఎక్కుపెట్టిన బాణం వృథాకారాదని, రాముడు సముద్రుడి మాటపై పాపాత్ములు ఉండే ద్రుమకుల్యంపై దాన్ని ప్రయోగించాడు. సేతువు నిర్మించడానికి నలుడు సమర్థుడనీ, సేతువును తాను భరిస్తాననీ, సముద్రుడు రామునికి చెప్పాడు. సేతు నిర్మాణం జరిగింది.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

ప్రశ్న 2.
అంగద రాయబారాన్ని వివరించండి.
జవాబు:
అంగదుడు వాలి కుమారుడు. మహాశక్తిమంతుడు. రావణుడితో యుద్ధానికి దిగేముందు, రాముడు రావణుని దగ్గరకు అంగదుని రాయబారిగా పంపాడు. అంగదుడు రావణుడి దగ్గరకు వెళ్ళి, సీతను రామునికి అప్పగించకపోతే, శ్రీరాముడి చేతిలో రావణుడి మరణం తథ్యమనీ, లంకకు విభీషణుడు రాజు కాగలడనీ, రావణుడిని హెచ్చరించాడు.

దానితో రావణుని సభ అంతా అట్టుడికిపోయింది. నలుగురు రాక్షసులు అంగదుడి మీద విరుచుకుపడ్డారు. అంగదుడు ఆ రాక్షసులను తన చంకలో ఇరికించుకొని, మేడపైకి ఎగిరాడు. అంగదుడు మేడపై నుండి ఆ రాక్షసులను నేలపైకి విసిరాడు.

తరువాత అంగదుడు సింహనాదం చేసి, ఆకాశమార్గంలో శ్రీరాముడిని చేరాడు. ఈ విధంగా శ్రీరాముడు రావణుని భావాన్ని గ్రహించాడు. ఇక రావణుడితో యుద్ధం చేయక తప్పదని రాముడు నిశ్చయించాడు.

ప్రశ్న 3.
రావణుని శక్తి ఆయుధ ప్రయోగం వలన కలిగిన పరిణామాలను వివరించండి.
జవాబు:
రావణుడు తనతో యుద్ధం చేస్తున్న లక్ష్మణుడి పై ‘శక్తి’ అనే ఆయుధాన్ని ప్రయోగించాడు. ఆ శక్తి ఆయుధం, లక్ష్మణుడి హృదయంలో గుచ్చుకుంది. దానితో లక్ష్మణుడు స్పృహ తప్పాడు. రావణుడు లక్ష్మణుడిని ఎత్తుకొని వెళ్ళాలని అనేక విధాల ప్రయత్నించాడు. కాని రావణుడు లక్ష్మణుడిని పైకి ఎత్తలేకపోయాడు.

అప్పుడు ఆంజనేయుడు రావణుడి మీద దాడి చేశాడు. హనుమంతుడు రావణుడి వక్షఃస్థలం మీద తన పిడికిలితో గట్టిగా గుద్దాడు. దానితో రావణుడు కూలిపోయాడు. హనుమంతుడు లక్ష్మణుడిని శ్రీరాముడి వద్దకు చేర్చాడు. శ్రీరాముడు హనుమంతుడి భుజాలపై కూర్చుండి, రావణునితో యుద్ధం చేశాడు. రాముడి పరాక్రమం ముందు, రావణుడి ధనుస్సు ముక్కలయ్యింది. రావణుని కిరీటం నేలకూలింది.

శ్రీరాముడు రావణునిపై దయతలచి “రావణా ! నీవు యుద్ధంలో అలసిపోయావు.. విశ్రాంతి తీసుకొనిరా” అని చెప్పాడు. రావణుడు యుద్ధం నుండి తిరుగుముఖం పట్టాడు.

ప్రశ్న 4.
రామరావణ సంగ్రామాన్ని వివరించండి.
జవాబు:
రాముడు హనుమంతుడి భుజాలపై కూర్చుండి, రావణునితో యుద్ధం చేశాడు. రాముని పరాక్రమంతో రావణుని ధనుస్సు ముక్కలయ్యింది. రావణుడి కిరీటం నేలకూలింది. రాముడు రావణునిపై దయతలచి అప్పటికి విడిచి పెట్టాడు.

తరువాత రామలక్ష్మణులతో రావణుడు భయంకరంగా యుద్ధం చేశాడు. రావణుడు శక్తి అనే ఆయుధాన్ని లక్ష్మణుడిపై వేశాడు. రాముడు శక్తిని వేడుకున్నాడు. శక్తి తన ప్రాణశక్తిని కోల్పోయింది. శక్తి లక్ష్మణుడికి తగిలింది. రాముడు శక్తిని విరిచివేశాడు. రాముడు విజృంభించాడు. దానితో రావణుడు పరుగుపెట్టాడు.

హనుమ తెచ్చిన ఓషధీ ప్రభావంతో లక్ష్మణుడు లేచాడు. ఇంద్రుడు తన సారధి మాతలిని, తన దివ్యరథాన్ని, రాముని కోసం పంపాడు. రాముడు ఇంద్ర రథం ఎక్కి రావణుడితో యుద్ధం చేశాడు. రామరావణులు సమానంగా పోరాడారు.

రాముడు విజృంభించడంతో, రావణుడి రథసారధి రావణుని రథాన్ని ప్రక్కకు మరలించాడు. రావణుడు తన సారధిని మందలించాడు. తిరిగి రావణ రథం, రాముని ముందు నిలిచింది. అగస్త్య మహర్షి దేవతలతో వచ్చి, రామునికి ఆదిత్యహృదయ మంత్రం ఉపదేశించాడు.

రాముని బాణానికి రావణుడి తలలు నేలపై రాలి తిరిగి మొలుస్తున్నాయి. అప్పుడు మాతలి రావణునికై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించమని రామునికి చెప్పాడు. రాముని బ్రహ్మాస్త్రంతో, రావణ సంహారం జరిగింది.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

ప్రశ్న 5.
శ్రీరాముడు సైన్యంతో లంకానగరాన్ని చేరిన వృత్తాంతాన్ని తెలపండి.
జవాబు:
సీతాదేవిని చూసి వచ్చి కుశల వార్తను అందించిన హనుమను శ్రీరాముడు ఆలింగనం చేసికొన్నాడు. మహోపకారం చేసిన హనుమకు తాను ఇయ్యగల సత్కారం అదే అన్నాడు. రాముడికి దుఃఖం వచ్చింది. సుగ్రీవుడు రాముడిని ఓదార్చాడు. క్రోధం చూపించాలి అని రామునికి సుగ్రీవుడు సలహా ఇచ్చాడు. సముద్రానికి సేతువు కడితేకాని, లంకను జయించలేము అన్నాడు. హనుమ లంకానగర రక్షణ వ్యవస్థను గూర్చి తెలిపాడు.

విజయ ముహూర్తంలో లంకకు బయలుదేరాలని రాముడు అన్నాడు. నీలుడు సైన్యానికి మార్గం చూపించాలని, రాముడు హనుమంతుని భుజం మీద, లక్ష్మణుడు అంగదుని భుజం మీద కూర్చొని వెళ్ళాలని, సుగ్రీవుడు పల్లకిపై రావాలని, రాముడు నిర్ణయించాడు. అందరూ సముద్రతీరాన్ని చేరుకున్నారు.

విభీషణుడు ధర్మం విడిచిన రావణుని విడిచి పెట్టి, తన నలుగురు అనుచరులతో రామలక్ష్మణులు ఉన్న చోటికు చేరాడు. విభీషణుడు రాముని శరణు కోరగా, రాముడు అంగీకరించాడు. రాముడు రావణుని చంపి విభీషణుణ్ణి రాజును చేస్తానని ప్రమాణం చేశాడు. ఆ పనిలో రామునికి తాను సహాయం చేస్తానని విభీషణుడన్నాడు. రాముడు విభీషణుణ్ణి లంకకు పట్టాభిషిక్తుణ్ణి చేయమని లక్ష్మణుడికి చెప్పాడు. లక్ష్మణుడు ఆ పని చేశాడు. సముద్రుణ్ణి ప్రార్థిస్తే సముద్రాన్ని దాటగలవని విభీషణుడు రామునికు చెప్పాడు. శ్రీరాముడు సముద్రుణ్ణి ఉపాసించాడు. మూడు రోజులు అయినా, సముద్రుడు ప్రసన్నుడు కాలేదు. రాముడు బ్రహ్మాస్త్రాన్ని స్మరించాడు. సముద్రుడు పరుగుపెట్టాడు. లంకకు వెళ్ళడానికి దారి ఇస్తానని సముద్రుడు చెప్పాడు. రాముడు ఎక్కుపెట్టి అస్త్రం వ్యర్థం కాకుండా, పాపాత్ములు ఉండే “ద్రుమకుల్యం” పై ప్రయోగించాడు. నలుడు సేతువు నిర్మించడానికి తగినవాడని సముద్రుడు చెప్పాడు. సేతువును భరిస్తానని సముద్రుడు మాట ఇచ్చాడు.

రాముడు సేతువు నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. వానరులు వృక్షాలు తెచ్చి సముద్రంలో పడవేశారు. 100 యోజనాల పొడవు, 10 యోజనాల వెడల్పు గల సేతువు 5 రోజుల్లో కట్టబడింది. రామలక్ష్మణ సుగ్రీవులు ముందు నడుస్తున్నారు. సైన్యం వారి వెంట నడిచింది. వానరులు కొందరు సముద్రంలో దూకి ఈదుతూ వచ్చారు.

ఈ విధంగా శ్రీరాముడు, సుగ్రీవుడు మొదలయిన వానర నాయకులతో లంకా నగరానికి చేరాడు.

ప్రశ్న 6.
వానర సైన్యానికీ, రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధం వివరాలను తెలపండి.
జవాబు:
రాముడు సైన్యాన్ని విభాగించి, ఎవరి బాధ్యతలు వారికి అప్పగించాడు. రావణుని మంత్రులైన శుకసారణులు రాముని బలం తెలిసికోడానికి గూఢచారులుగా వచ్చి వానరులలో చేరారు. విభీషణుడు వారిని గుర్తించి, రాముని ముందు పెట్టాడు. రాముడు వారిని క్షమించి, సీతను అప్పగించకపోతే రావణుడి మరణం తప్పదని హెచ్చరించాడు. శుకసారణులు రావణునికి ఆ విషయం తెలిపారు.

రావణుడు అశోకవనం వెళ్ళి రాముడు తన చేతిలో మరణించాడని సీతకు అబద్దం చెప్పాడు. విద్యుజిహ్వుడిచే రామునివి అనిపించే మాయా శిరస్సునూ, ధనుర్భాణాలనూ తెప్పించి, సీతకు చూపించాడు. సీతను తన్ను ఆశ్రయించమని కోరాడు. సీత విచారించింది. విభీషణుడి భార్య “సరమ” సీతను ఊరడించి రాముడు క్షేమంగా ఉన్నాడనీ, అదంతా రాక్షసమాయ అనీ సీతకు తెలిపింది.

శ్రీరామ చంద్రాదులు సువేల పర్వతానికి చేరారు. లంకానగర శోభను చూశారు. రావణుడు ఠీవిగా మేడపై ఉన్నాడు. సుగ్రీవుడు రావణునిపై కోపంతో ఎగిరి రావణ భవనంపై వాలాడు. తన నుండి రావణుడు తప్పించుకోలేడని, రావణుడి కిరీటాన్ని తీసి నేలపై కొట్టాడు. రావణుడు రెచ్చిపోయాడు. ఇద్దరికీ బాహాబాహీ యుద్ధం జరిగింది. సుగ్రీవుడు రావణుడిని ముప్పుతిప్పలు పెట్టి, తిరిగి సువేల పర్వతం చేరాడు. శ్రీరాముడు సుగ్రీవుణ్ణి మందలించాడు.

అంగదుడిని రాముడు రావణుడి దగ్గరకు రాయబారిగా పంపాడు. రాముడి చేతిలో రావణుడు మరణిస్తాడని, విభీషణుడు రాజు అవుతాడని రాముని వాక్యంగా, అంగదుడు రావణునికి తెలిపాడు. అంగదుడిని నలుగురు రాక్షసులు చంపబోయారు. అంగదుడు వారిని చంపి వచ్చాడు. రాముడు యుద్ధానికి సిద్ధం అయ్యాడు.

లంకపై దండయాత్ర :
వానరసైన్యం లంకను నాల్గువైపుల నుండి ముట్టడించింది. ఆంజనేయుడి చేతిలో జంబుమాలి, సుషేణుడి చేతిలో విద్యున్మాలి మరణించారు. అంగదుడి చేతిలో ఇంద్రజిత్తు ఓడిపోయాడు. దానితో ఇంద్రజిత్తు కపట యుద్దానికి దిగాడు. ఇంద్రజిత్తు నాగాస్త్రంతో రామలక్ష్మణులను బంధించాడు. రామలక్ష్మణులు మరణించారని ఇంద్రజిత్తు రావణుడితో చెప్పాడు. రావణుడు ఆజ్ఞాపించగా “త్రిజట మొదలయిన రాక్షస స్త్రీలు సీతను పుష్పక విమానంలో యుద్ధభూమికి తీసుకువచ్చి, నేలపై ఉన్న రామలక్ష్మణులను చూపించారు. సీత ఏడ్చింది. త్రిజట సీతను ఓదార్చింది. రామలక్షణులు బతికి ఉన్నారని ఆమె సీతకు ఆధారాలు చూపింది. సీత మనస్సు కుదుట పడింది.

గరుత్మంతుడి రాకతో నాగాస్త్ర ప్రభావం నుండి రామలక్ష్మణులు విముక్తి పొందారు. హనుమంతుడు అకంపనుణ్ణి, ధూమ్రాక్షుణ్ణి చంపాడు. అంగదుడు వజ్రదంష్ట్రుడిని, నీలుడు ప్రహస్తుడిని చంపాడు. రావణుడి చేతిలో సుగ్రీవుడు మూర్ఛపోయాడు. లక్ష్మణుడు రావణుడిని ఎదిరించాడు. రావణుడు బాణవర్షం కురిపించాడు. హనుమ అడ్డుకున్నాడు. రావణుడి అరచేతి దెబ్బకు హనుమ చలించి, తిరిగి తేరుకొని, రావణుడిని అరచేతితో కొట్టాడు. దశగ్రీవుడు కంపించిపోయి, ‘భళా! వానరా’ అని హనుమశక్తిని మెచ్చుకున్నాడు.

రావణుడు ‘శక్తి’ అనే ఆయుధాన్ని లక్ష్మణుడి పై వేశాడు. లక్ష్మణుడు స్పృహ కోల్పోయాడు. రావణుడు లక్ష్మణుడిని ఎత్తుకొని పోవడానికి విఫలయత్నం చేశాడు. ఆంజనేయుడు పిడికిలితో పొడిచి రావణుడిని కూలగొట్టి, లక్ష్మణుడిని రాముని దగ్గరకు చేర్చాడు. శ్రీరాముడు హనుమంతుని భుజాలపై కూర్చుండి రావణునితో యుద్ధం చేశాడు. రావణుని కిరీటం, ధనుస్సు నేలపై పడ్డాయి. రాముడు కరుణించి, అలసిపోయిన రావణుడిని విశ్రాంతి తీసుకొని తిరిగి యుద్ధానికి రమ్మన్నాడు.

ప్రశ్న 7.
రామరావణ యుద్ధాన్ని గురించి రాయండి.
జవాబు:
హనుమంతుని భుజాలపై కూర్చుండి, రాముడు రావణునితో యుద్ధం చేశాడు. రాముని పరాక్రమం ముందు, రావణుని ధనుస్సు, కిరీటం దాసోహం అన్నాయి. రాముడు రావణునిపై దయతలచి, “నీవు యుద్ధంలో అలసిపోయావు. విశ్రాంతి తీసుకొని రేపురా, నా బలం తెలుస్తుంది” అన్నాడు.

రావణుడు అంతఃపురానికి వెళ్ళి తమ్ముడు కుంభకర్ణుని నిద్ర నుండి లేపించాడు. కుంభకర్ణుడు ఆరునెలలు నిద్రపోయి, ఒకరోజు భోజనం చేస్తూ ఉంటాడు. రావణుడు కుంభకర్ణుడికి విషయం వివరించాడు. కుంభకర్ణుడు యుద్ధానికి సిద్ధమయి, వానరులను చావగొడుతున్నాడు. వానరులు తలో దారి పట్టారు. రాముడు కుంభకర్ణుని ఐంద్రాస్త్రంతో సంహరించాడు. కుంభకర్ణుని తల, లంకలో పడి రాజవీధులలోని భవనాల, ఇంటి కప్పులు, ప్రాకారాలు కూలిపోయాయి. కుంభకర్ణుని మరణవార్త విని రావణుడు విచారించాడు.

రావణ పుత్రుడైన “అతికాయుడు” లక్ష్మణుని బ్రహ్మాస్త్రానికి బలయ్యాడు. ఇంద్రజిత్తు తండ్రిని ఓదార్చాడు. ఇంద్రజిత్తు యుద్ధరంగానికి వచ్చి, రామలక్ష్మణులపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. రామలక్ష్మణులు స్పృహ కోల్పోయినట్లు పడియున్నారు. అదిచూసి రామలక్ష్మణులు మరణించారని ఇంద్రజిత్తు తండ్రికి చెప్పాడు.

వానరులు అలజడి చెందడంతో, విభీషణుడు వారికి ధైర్యం చెప్పాడు. రామలక్ష్మణులు బ్రహ్మపై గౌరవంతో అస్త్ర బాధను అనుభవించారని విభీషణుడు వానరులకు చెప్పాడు. బ్రహ్మాస్త ప్రభావంతో 67 కోట్ల మంది మరణించారు. హనుమ, విభీషణుడు జాంబవంతుడి కోసం వెతుకుతున్నారు. జాంబవంతుడు ధ్వనిని బట్టి విభీషణుడిని గుర్తించాడు. హనుమ క్షేమమా ? అని జాంబవంతుడు విభీషణుడిని అడిగాడు. హనుమ జీవిస్తే వానరులంతా జీవించినట్లే అన్నాడు. హనుమ సర్వౌషధి పర్వతాన్ని పెల్లగించి తెచ్చాడు. ఓషధుల వాసనకు రామలక్ష్మణుల గాయాలు మాయం అయ్యాయి. వానరులు లేచి కూర్చున్నారు. వానరులు లంకకు నిప్పు పెట్టారు.

ఇంద్రజిత్తు మాయా. సీతను సంహరించాడు. అందరూ చనిపోయింది నిజం సీత అనుకున్నారు. ఈ వార్త తెలిసి రాముడు విచారించాడు. అది ఇంద్రజిత్తు మాయ అని విభీషణుడు తెలిపాడు. శత్రువుల సంహారానికి ఇంద్రజిత్తు నికుంభిలా అభిచార హోమాన్ని తలపెట్టాడు. ఇంద్రజిత్తు యజ్ఞాన్ని భంగం చేయడానికి లక్ష్మణుడు వెళ్ళాడు. లక్ష్మణ ఇంద్రజిత్తులు ఘోరయుద్ధం చేశారు. లక్ష్మణుడు ఇంద్రజిత్తు తలను ఐంద్రాస్త్రంతో నేల రాల్చాడు.

రావణుని యుద్ధం :
రావణుడు ప్రళయకాల రుద్రుడిలా విజృంభించాడు. వానరులు పారిపోతున్నారు. సుగ్రీవుడు విరూపాక్షుడిని, మహోదరుడిని సంహరించాడు. రామలక్ష్మణులతో రావణుడి యుద్ధం భయంకరంగా సాగుతోంది. రావణుడు విభీషణుడిని చంపడానికి బల్లెము ఎత్తాడు. అప్పుడు లక్ష్మణుడు రావణునిపై బాణాలను వేశాడు. రావణుడు లక్ష్మణునిపై ‘శక్తి’ అనే ఆయుధాన్ని ప్రయోగించాడు. శ్రీరాముడు ‘శక్తి’ని వేడుకొన్నాడు. శక్తి తన ప్రాణశక్తిని కోల్పోయింది. శక్తి లక్ష్మణుని మాత్రం తాకింది. అతడు నేలపై పడ్డాడు. రాముడు ఆ శక్తిని లాగి విరచివేశాడు. రాముడు విజృంభించాడు. దానితో రావణుడు పరుగుపెట్టాడు.

పడిపోయిన లక్ష్మణుడిని చూసి, రాముడు విలవిలలాడాడు. సుషేణుడు లక్ష్మణుడు చనిపోలేదని చెప్పాడు. సుషేణుడి సూచన ప్రకారంగా హనుమ ఓషధులు తెచ్చాడు. ఓషధీ ప్రభావంతో లక్ష్మణుడు లేచాడు. ఇంద్రుడు మాతలితో పాటు తన దివ్య రథాన్ని రాముని కోసం పంపాడు. రాముడు రథం ఎక్కాడు. రామరావణులు సమంగా యుద్ధం చేశారు. రాముడు విజృంభించాడు. దానితో రావణుడి రథసారథి రావణుడి రథాన్ని పక్కకు మరలించాడు. రావణుడు సారథిని మందలించాడు. తిరిగి రావణరథం రాముని ముందు నిలిచింది. అగస్త్యుడు దేవతలతో అక్కడకు వచ్చి, రాముడికి ‘ఆదిత్య హృదయ మంత్రం’ ఉపదేశించాడు.

రాముని బాణానికి రావణుడి తలలు నేలరాలి తిరిగి మొలుస్తున్నాయి. రావణునిపై బ్రహ్మాస్త్రాన్ని వేయమని మాతలి రామునికి చెప్పాడు. రాముడి బ్రహ్మాస్త్రంతో రావణ సంహారం జరిగింది.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

ప్రశ్న 8.
రావణుని చంపి శ్రీరాముడు పట్టాభిషిక్తుడై రాజ్యాన్ని పాలించిన విధానాన్ని తెలపండి.
జవాబు:
మాతలి సూచనతో శ్రీరాముడు రావణునిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. రావణ సంహారం జరిగింది. రాముడి ఆదేశం మేరకు విభీషణుడు తన అన్న రావణునికి ఉత్తర క్రియలను నిర్వహించాడు. రాముని ఆజ్ఞ ప్రకారం, లక్ష్మణుడు విభీషణుడిని లంకారాజుగా పట్టాభిషేకం చేశాడు. హనుమ సీతమ్మకు రావణసంహారం గురించి చెప్పాడు. సీతను బాధించిన స్త్రీలను చంపుతానన్న హనుమను, సీతమ్మ వారించింది.

విభీషణుడు సీతను పల్లకిలో రాముని వద్దకు తీసుకువచ్చాడు. సీత భర్తను చేరుకుంది. రాముడు సీతతో తన వంశ ప్రతిష్ఠను నిలుపుకోడానికి రావణుడి చెర నుండి సీతను విడిపించాననీ, సీత పరుల పంచన ఉన్నందువల్ల తనకు ఆమెపై సందేహం ఉందనీ, ఆమె ఇష్టం వచ్చినచోటుకు వెళ్ళవచ్చునని అన్నాడు. శ్రీరాముడి మాటలు సీతకు బాణాల్లా గుచ్చుకున్నాయి. రాముడికి తనపై విశ్వాసం కల్గించడానికి ‘అగ్నిప్రవేశం’ ఒక్కటే దిక్కని సీత భావించింది. లక్ష్మణుడు చితిని సిద్ధం చేశాడు. సీత అగ్నిప్రవేశం చేసింది. అగ్నిదేవుడు సీతను స్వయంగా తీసుకువచ్చి ఆమెను స్వీకరించమని రాముని కోరాడు.

సీత శీలాన్ని ముల్లోకాలకూ చాటడానికే, సీత అగ్ని ప్రవేశం చేస్తున్నప్పటికీ, తాను ఊరుకున్నానన్నాడు. సీతను రాముడు స్వీకరించాడు. శివుడు రాముని ప్రశంసించాడు. ఇంద్రుడు చనిపోయిన వానరులను బ్రతికించాడు. విభీషణుడు రాముడిని మరికొంతకాలం లంకలో ఉండమన్నాడు. కాని భరతుని కోసం రాముడు పుష్పకవిమానంలో అయోధ్యకు బయలుదేరాడు. రాముడు తాను తిరిగి వస్తున్న విషయాన్ని భరతుడికి హనుమ ద్వారా కబురంపాడు.

పుష్పకవిమానంలో నందిగ్రామం చేరుకున్న సీతారామలక్ష్మణులకు, భరతాదులు స్వాగతం చెప్పారు. సీతారాములు తల్లులకూ, వశిష్ఠుడికి నమస్కరించారు. భరతుణ్ణి రాముడు దగ్గరకు తీసుకొన్నాడు. శ్రీరామ పట్టాభిషేకం మహా వైభవంగా జరిగింది. రాముడు లక్ష్మణుడిని యువరాజుగా ఉండమన్నాడు. లక్ష్మణుడు అంగీకరించలేదు. భరతుణ్ణి యువరాజుగా చేశాడు.

రాముడు ప్రజలను కన్నబిడ్డలవలె చూశాడు. ప్రజలు ధర్మబద్ధంగా నడచుకున్నారు. రాముడు 11 వేల సంవత్సరాలు పాలించాడు. ప్రజలకు ఈతిబాధలు లేవు. అందుకే రామరాజ్యం ‘ అనేమాట ప్రసిద్ధం అయ్యింది.

ప్రశ్న 9.
సేతువు నిర్మాణం గురించి రాయండి.
జవాబు:
శ్రీరాముడు సముద్రాన్ని దాటే ఉపాయమేమిటని సుగ్రీవుణ్ణి ప్రశ్నించాడు. సముద్రుణ్ణి ప్రార్థించడం వల్ల ఇది సాధ్యపడుతుందని విభీషణుడు చెప్పాడు. శ్రీరాముడు సముద్రతీరంలో దర్భాసనం మీద కూర్చొని సముద్రుణ్ణి ఉపాసించాడు. మూడు రాత్రులు గడిచాయి. సముద్రుడు ఎదుట నిలువలేదు. శ్రీరాముడికి కోపం వచ్చింది. సముద్రుడి అహంకారాన్ని అణగదొక్కాలనుకున్నాడు. బ్రహ్మాస్త్రాన్ని స్మరించాడు. సముద్రుడు పరుగెత్తాడు. లంకకు వెళ్ళడానికి దారి ఇస్తానన్నాడు.

విశ్వకర్మ కుమారుడైన ‘నలుడు’ శిల్పకళా నిపుణుడు. సేతువు (వంతెన)ను నిర్మించడానికి అతడే యోగ్యుడని సముద్రుడు తెలిపాడు. ఆ సేతువును తాను భరిస్తానని మాట ఇచ్చాడు. సేతువు నిర్మాణానికి వానర నాయకులకు ఆజ్ఞ ఇచ్చాడు శ్రీరాముడు. అందరూ మహారణ్యం దారి పట్టారు. పెద్ద పెద్ద చెట్లను బండరాళ్ళను మోసుకువచ్చారు. సముద్రంలో పడేశారు. వాటి దెబ్బకు సముద్రంలోని నీరు ఆకాశానికి ఎగిసిపడింది. నీలుని సూచనలను అనుసరించి కొలతల ప్రకారం సేతువు నిర్మాణం జరిగింది. వంద యోజనాల పొడవు, పది యోజనాల వెడల్పు గల సేతువును కట్టడం ఐదురోజుల్లో పూర్తయింది.

అదనపు ప్రశ్నలు

ప్రశ్న 1.
‘రామాయణం” ఆధారంగా అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉండాలో వివరించండి. –
జవాబు:
రామాయణం ఆధారంగా అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో తెలుసుకొనే అవకాశం ఉంది.

  1. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల మధ్య ఉండే అనుబంధం ఆదర్శప్రాయమైనది. ఆప్యాయతానురాగాలకు నిలయమైనది.
  2. వనవాసంలో అన్న సేవకు అడ్డు కాకూడదని ఊర్మిళను అయోధ్యలోనే విడిచి వచ్చిన లక్ష్మణుడు సోదరప్రేమకు, త్యాగానికి నిదర్శనంగా నిలిచాడు. శ్రీరామ సేవాభాగ్యము ముందు “త్రిలోకాధిపత్యం” కూడా చిన్నదేనని భావించి, వనవాసంలో సకలోపచారాలు చేసే అవకాశం తన కిమ్మని శ్రీరాముణ్ణి కోరిన ఆదర్శమూర్తి లక్ష్మణుడు.
  3. లక్ష్మణుడు రామునికి ఆరోప్రాణం. యుద్ధరంగంలో నేలమీద పడిపోయిన లక్ష్మణుడిని చూచి శ్రీరాముడు విలవిల లాడిపోవటం అతనికి తమ్మునిపై గల ప్రేమానురాగాలను చాటుతోంది.
  4. భరతుడు కూడా ఆదర్శ సోదరుడే. రామునివలే తానూ వనవాస నియమాలు పాటించి 14 ఏళ్ళు శ్రీరామ పాదుకలపై పాలనాభారం ఉంచి, రాజభోగాలకు దూరంగా నగరం వెలుపల గడిపిన ఆదర్శమూర్తి.
  5. వాలి సుగ్రీవుల అనుబంధం ఆదర్శవంతమైనది కాదు. అపోహలకు, అపార్థాలకు, అధర్మానికి నిలయమైనట్టిది.
  6. రావణ కుంభకర్ణ విభీషణుల అనుబంధం కూడ ఆదర్శనీయమైనది కాదు. రావణుని అధర్మమును పూర్తిగా తెలిసికొని కూడ సహాయపడిన వ్యక్తి కుంభకర్ణుడు. ధర్మం వీడిన రావణుని, వీడినవాడు విభీషణుడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

ప్రశ్న 2.
రామ లక్ష్మణులు సిద్ధాశ్రమం చేరుకొన్న ప్రయాణ విశేషాలు వివరించండి.
జవాబు:
దశరథ పుత్రులు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు, వేదశాస్త్రాలు, ధనుర్విద్య నేర్చారు. లక్ష్మణుడు రాముడికి బహిః ప్రాణం. తన కుమారులను దశరథుడు వివాహం చేద్దామనుకుంటున్నాడు. ఆ సమయంలో విశ్వామిత్రుడు దశరథుని దగ్గరకు వచ్చాడు. ఆ ఋషి చెప్పిన కార్యాన్ని చేస్తానన్నాడు దశరథుడు.

విశ్వామిత్రుడు తన యజ్ఞానికి రాక్షసులు విఘ్నం కలుగజేస్తున్నారనీ, యజ్ఞం చేసేటప్పుడు తాను శపించకూడదనీ, యజ్ఞరక్షణకు శ్రీరాముణ్ణి తనతో 10 రోజులు పంపమనీ దశరథుని కోరాడు. దశరథుడు మహర్షితో రాముడికి ఇంకా 16 ఏళ్ళు నిండలేదనీ రాముడికి యుద్ధం తెలియదనీ, రాముణ్ణి విడిచి తాను ఉండలేననీ, తానే యజ్ఞరక్షణకు వస్తానని చెప్పాడు.

తన యజ్ఞానికి రావణుని ఆజ్ఞపై మారీచ సుబాహులు విఘ్నాలు కల్గిస్తున్నారని విశ్వామిత్రుడు చెప్పాడు. అప్పుడు దశరథుడు రాముణ్ణి పంపనని చెప్పగా, విశ్వామిత్రునకు కోపం వచ్చింది. ‘వశిష్ట మహర్షి దశరథునికి నచ్చచెప్పి, రామలక్ష్మణుల్ని విశ్వామిత్రుని వెంట పంపాడు.

విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ‘బల’, ‘అతిబల’ అనే విద్యలు ఉపదేశించాడు. ఆ విద్యల మహిమవల్ల అలసట, ఆకలిదప్పులు ఉండవు. రాముడు విశ్వామిత్రునికి గురుసేవ చేశాడు. రామలక్ష్మణులు మహర్షితో ‘మలద’ , ‘కరూశ’ గ్రామాలకు చేరారు. అక్కడ తాటక అనే యక్షిణి విధ్వంసం చేసేది. ఆమె కొడుకు మారీచుడు జనపదాలను అతలాకుతలం చేసేవాడు. తాటకను చంపమని విశ్వామిత్రుడు రామునికి చెప్పాడు. రాముడు వాడి బాణాలతో తాటక బాహువులను ఖండించాడు. లక్ష్మణుడు తాటక ముక్కు చెవులు కోశాడు. రాముడు శబ్దవేధి విద్యతో, బాణం వేసి తాటకను చంపాడు. విశ్వామిత్ర మహర్షి సంతోషించి, అనేక దివ్యాస్త్రాలను రాముడికి అనుగ్రహించాడు.

విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో తన సిద్ధాశ్రమం చేరి, యజ్ఞదీక్ష చేపట్టాడు. ఆ యజ్ఞం, ఆరురోజులు. రామలక్ష్మణులు యజ్ఞాన్ని జాగ్రత్తగా రక్షిస్తున్నారు. ఇంతలో మారీచ సుబాహులు అనే రాక్షసులు, యజ్ఞకుండంలో రక్తం కురిపించారు. మారీచుడి పై రాముడు ‘శీతేషువు’ అనే మానవాస్త్రాన్ని వేసాడు. మారీచుడు సముద్రంలో పడ్డాడు. రాముడు ఆగ్నేయాస్త్రంతో సుబాహుణ్ణి చంపాడు. మిగిలిన వారిని, ‘వాయవ్యాస్త్రం’తో రామలక్ష్మణులు తరిమారు. మహర్షి యజ్ఞం పూర్తయ్యింది.

ప్రశ్న 3.
రామాయణం ఎందుకు చదవాలి?
(లేదా)
‘రామాయణం వంటి ఆదర్శకావ్యం న భూతో న భవిష్యతి” దీనిని సమర్థిస్తూ రామాయణం గొప్పదనాన్ని రాయండి.
జవాబు:
మానవ జీవన మూలాలకు రామాయణం మణిదర్పణం. అందువల్లనే కొండలు, సముద్రాలు ఉన్నంతవరకూ రామాయణము లోకంలో ఉంటుందని బ్రహ్మగారు చెప్పారు. రామాయణం శాశ్వతత్వాన్ని సంపాదించుకున్న కావ్యము.

రామాయణం’ అంటే రాముని మార్గము. శ్రీరాముడు సత్యవాక్య పరిపాలకుడై ధర్మమార్గంలో ప్రజారంజకంగా పరిపాలించాడు. శ్రీరాముడు నడచిన నడత ధర్మబద్దం.

మానవ జీవితాన్ని సంస్కరించగల కావ్యం రామాయణం. మానవ హృదయాల నుండి ఎన్నటికీ చెరగని కథ రామాయణం. , ఇందులో అమ్మానాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురువుపై భక్తి, శిష్యులపై ప్రేమ, స్నేహఫలం, ధర్మబలం వంటి జీవిత సంబంధాలను రామాయణం పట్టి చూపిస్తుంది.

వినయంతో ఒదగడం, వివేకంతో ఎదగడం, జీవనకారుణ్య భావం, ప్రకృతి లాలన వంటి జీవిత పార్శ్వాలకు రామాయణం మణిదర్పణం.

రామాయణం ఆచరణ ప్రధానమైన కావ్యం. సీతారాముల వంటి ఆదర్శనాయికానాయకుల చరిత్ర ఇది. “రామో విగ్రహవాన్ ధర్మః” అనే గొప్పమాట మారీచుని వంటి దుష్ట రాక్షసుని నోటి నుండి మహర్షి వాల్మీకి పలికించాడు. రామాయణం ఆదికావ్యం. ఇటువంటి కావ్యం ప్రపంచ సాహిత్యంలో “నభూతో నభవిష్యతి”.

ప్రశ్న 4.
రామాయణములోని స్నేహాల గురించి రాయండి.
జవాబు:
రామాయణంలో రామసుగ్రీవుల స్నేహం, రామవిభీషణుల స్నేహాలు, సుప్రసిద్ధమైనవి. సుగ్రీవుడు రామునితో స్నేహం చేశాడు. సుగ్రీవుడికీ అతని అన్న వాలికీ విరోధం ఉంది. వాలి, కిష్కింధకు రాజు. సుగ్రీవుడు రామునితో స్నేహం చేసి, రామునిచేత తన అన్న వాలిని చంపించి, తాను కిష్కింధకు రాజు అయ్యాడు. రాముడే సుగ్రీవుడిని కిష్కింధకు రాజును చేశాడు. రావణుని చంపి, సీతను తిరిగి తెచ్చుకోడానికి సుగ్రీవుడు తన వానర సైన్యంతో రామునికి సాయపడ్డాడు. ఈ విధంగా రామసుగ్రీవుల స్నేహం వల్ల వారిద్దరికీ మేలు జరిగింది.

రామాయణంలో రామవిభీషణుల స్నేహం కూడా ప్రసిద్ధమైనది. విభీషణుడు. లంకా నగరాధిపతి, రావణుడికి తమ్ముడు. రావణుడు సీతను అపహరించి తీసుకురావడం, విభీషణుడికి ఇష్టం లేదు. అందుకే విభీషణుడు తన అన్న రావణుని విడిచి, రాముని స్నేహాన్ని ఆశ్రయించాడు. రాముడు విభీషణుని ఆదరించాడు. రామ విభీషణుల స్నేహం గొప్పది.

విభీషణుని మాట సాయంతో రాముడు రావణుని జయించాడు. విభీషణుని లంకా నగరానికి రాజును చేశాడు. విభీషణుడు సీతను రామునకు అప్పగించాడు. ఈ విధంగా రామవిభీషణులు స్నేహం వల్ల ఒకరికి ఒకరు మేలు చేసుకున్నారు. రామవిభీషణుల స్నేహం వల్ల వారిద్దరికీ మేలు జరిగింది.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

ప్రశ్న 5.
రామాయణంలో సీత – కైకల పాత్రల భేదాలను విశ్లేషించండి.
జవాబు:
సీత, శ్రీరామచంద్రునికి ధర్మపత్ని. ఈమె మహాపతివ్రత. మహా సౌందర్యవతి. ఈమె జనకమహారాజు కుమార్తె. రామునితో పాటు సీత కూడా వనవాసానికి వెళ్ళి ఎన్నో బాధలు పడింది. రావణుడు ఈమెను అపహరించి లంకకు తీసుకువెళ్ళాడు. రాముడు సీతాదేవి జాడను తెలిసికోడానికి హనుమంతుడిని దూతగా పంపాడు. హనుమ సీతను కలిసి, రాముని ఉంగరాన్ని ఆమెకు ఇచ్చాడు. సీత ఇచ్చిన చూడామణిని తెచ్చి రామునకు ఇచ్చాడు.

రాముడు సీత కోసం సముద్రానికి వారధిని కట్టి యుద్ధంలో రావణుని సంహరించి సీతను తీసుకువచ్చాడు. రామాయణంలోని పాత్రలలో రాముని తరువాత సీత పాత్ర ప్రధానమైనది.

కైక దశరథ మహారాజునకు ముద్దుల భార్య. ఈమెకు రాముడంటే మంచి ప్రేమ. మంథర చెప్పిన చెప్పుడు మాటలు విని, కైక తన మనస్సును మార్చుకొని దుష్టురాలయ్యింది. పుత్ర ప్రేమతో భరతుడిని రాజును చేయ్యమనీ, రాముడిని అడవులకు పంపమనీ ఈమె పట్టుపట్టింది. దశరథుడు బ్రతిమాలి చెప్పినా ఈమె వినలేదు. కైక మొండిది.

కైక పట్టుదల వల్లనే దశరథుడు రాముడిని వనవాసానికి పంపవలసి వచ్చింది. రామునిపై బెంగతో దశరథుడు మరణించాడు. రాముని వనవాసానికి, దశరథుని మరణానికి కైక యొక్క మూర్ఖపు పట్టుదలయే కారణము.

‘సీత’ భర్త రామునికి తోడుగా ఉండి అరణ్యానికి వెళ్ళింది. కైక, భర్త దశరథుని మరణానికి కారణం అయ్యింది. సీత మహాపతివ్రత కాగా, కైక గయ్యాళి భార్య. కైక భర్త మాటను లెక్కచేయలేదు. సీత రాముని కోసం, తన ప్రాణాలను కూడా ఇవ్వగల ఉత్తమ సతి.

రామాయణ కావ్యంలో సీత – కైక పాత్రలు రెండూ ప్రధానమైనవే. రామాయణ కథ, ఈ రెండు పాత్రల వల్లనే సాగింది. సీత మహాసాధ్వి. కైక గయ్యాళి గంప.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 5 సుందరకాండ

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం 5th Lesson సుందరకాండ Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions ఉపవాచకం 5th Lesson సుందరకాండ

10th Class Telugu ఉపవాచకం 5th Lesson సుందరకాండ Textbook Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

సంఘటనా క్రమం

సంఘటనల ఆధారంగా వరుస క్రమంలో వాక్యాలను అమర్చడం

1. అ) సీతాన్వేషణను సఫలం చేయగల సమర్థుడు హనుమంతుడేనని సుగ్రీవుడి నమ్మకం. హనుమంతుడు అదే విశ్వాసంతో ఉన్నాడు. శ్రీరాముడి భావన కూడా అదే.
ఆ) హనుమంతుడు (రెట్టించిన ఉత్సాహంతో బలాన్ని పుంజుకున్నాడు.
ఇ) సంపాతి తన సోదరుడి మరణానికి ఎంతో విలపించాడు. లంకలో సీత ఉన్న పరిస్థితులను దివ్యదృష్టితో చూసి కళ్లకు కట్టినట్లు వివరించాడు.
ఈ) అందుకే తనపేరు చెక్కబడిన ఉంగరాన్ని హనుమంతుడికి ఇచ్చాడు శ్రీరాముడు. సీత దీన్ని చూస్తే హనుమను రామదూతగా నమ్ముతుందన్నాడు.
జవాబులు
అ) సీతాన్వేషణను సఫలం చేయగల సమర్ధుడు హనుమంతుడేనని సుగ్రీవుని నమ్మకం. హనుమంతుడూ అంతే విశ్వాసంతో ఉన్నాడు. శ్రీరాముడి భావన కూడా అదే.
ఈ) అందుకే తన పేరు చెక్కబడిన ఉంగరాన్ని హనుమంతుడికి ఇచ్చాడు శ్రీరాముడు. సీత దీన్ని చూస్తే హనుమను రామదూతగా నమ్ముతుందన్నాడు.
ఇ) సంపాతి తన సోదరుడి మరణానికి ఎంతో విలపించాడు. లంకలో సీత ఉన్న పరిస్థితులను దివ్యదృష్టితో చూసి కళ్లకు కట్టినట్లు వివరించాడు.
ఆ) హనుమంతుడు రెట్టించిన ఉత్సాహంతో బలాన్ని పుంజుకున్నాడు.

2. అ) సీతాదేవిని చూడగానే హనుమంతుని కన్నుల నుండి ఆనందాశ్రువులు జారాయి. శ్రీరాముని స్మరించుకుని నమస్కరించాడు.
ఆ) హనుమంతుడు మహానాదం చేస్తూ ఎడమచేతితో లంకిణి పై ఒకదెబ్బవేశాడు.
ఇ) హనుమంతుని పరీక్షించడానికి వచ్చిన ‘సురస’ అనే నాగమాత అతని సూక్ష్మబుద్ధిని, సమయస్ఫూర్తిని చూసి ఆనందించి ఆశీర్వదించింది.
ఈ) శ్రీరామ కార్యమునకు వెళుతున్న హనుమంతునికి సూర్యుడు తాపాన్ని కలిగించలేదు.
జవాబులు
ఈ) శ్రీరామ కార్యమునకు వెళుతున్న హనుమంతునికి సూర్యుడు తాపాన్ని కలిగించలేదు.
ఇ) హనుమంతుణ్ణి పరీక్షించడానికి వచ్చిన ‘సురస’ అనే నాగమాత అతని సూక్ష్మబుద్ధిని, సమయస్ఫూర్తిని చూసి ఆనందించి ఆశీర్వదించింది.
ఆ) హనుమంతుడు. మహనాదం చేస్తూ ఎడమ చేతితో లంకిణిపై ఒక్కదెబ్బవేశాడు.
అ) ఒక వానరుడు వచ్చి లంకిణిని జయించినప్పుడు రాక్షసులకు కీడుమూడుతుందని బ్రహ్మ చెప్పాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

3. అ) శ్రీరాముడి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని హెచ్చరించింది.
ఆ) రావణునిలో ఆవేశం పెల్లుబికింది. రెండు నెలల గడువు విధించాడు.
ఇ) రావణుని తేజస్సు చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు హనుమంతుడు.
ఈ) సీత దగ్గరికి వచ్చి రావణుడు నయానా భయాన సీత మనసుమార్చే ప్రయత్నం చేశాడు.
జవాబులు
ఇ) రావణుని తేజస్సు చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు హనుమంతుడు.
ఈ) సీత దగ్గరకి వచ్చి రావణుడు నయానా భయాన సీత మనసుమార్చే ప్రయత్నం చేశాడు.
అ) శ్రీరాముడి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని హెచ్చరించింది.
ఆ) రావణునిలో ఆవేశం పెల్లుబికింది. రెండు నెలలు గడువు విధించాడు.

4. అ) శ్రీరాముడు రావణుణ్ణి సంహరించి తనను తీసుకుపోవడమే ఆయన స్థాయికి తగినదన్నది.
ఆ) సీతాదేవికి వినబడేటట్లు రామకథను వర్ణించాడు.
ఇ) హనుమంతుడు శ్రీరాముడి రూపగుణాలను వివరించాడు. శ్రీరాముడి ముద్రికను సమర్పించాడు.
ఈ) కొంగుముడి విప్పి అందులోని దివ్యచూడామణిని హనుమంతునికిచ్చింది.
జవాబులు
ఆ) సీతాదేవికి వినబడేటట్లు రామకథను వర్ణించాడు.
ఇ) హనుమంతుడు శ్రీరాముడి రూపగుణాలను వివరించాడు. శ్రీరాముడి ముద్రికను సమర్పించాడు.
ఈ) కొంగుముడి విప్పి అందులోని దివ్య చూడామణిని హనుమంతునికిచ్చింది.
అ) శ్రీరాముడు రావణుణ్ణి సంహరించి తనను తీసుకుపోవడమే ఆయన స్థాయికి తగినదన్నది.

5. అ) ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి హనుమంతుణ్ణి బంధించాడు.
ఆ) విభీషణుని భవనం తప్ప లంకంతా నిప్పుపెట్టాడు.
ఇ) హనుమంతుని తోకకు నిప్పంటించి లంకంతా కలియదిప్పమన్నాడు రావణుడు.
ఈ) మహేంద్రగిరికి చేరుకోబోతుండగా మహానాదం చేశాడు. జాంబవంతుడు దానిని విని పొంగిపోయాడు. హనుమంతుడు విజయుడై తిరిగివస్తున్నాడని ప్రకటించాడు.
జవాబులు
అ) ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి హనుమంతుణ్ణి బంధించాడు.
ఇ) హనుమంతుణి తోకకు నిప్పంటించి లంకంతా కలియదిప్పమన్నాడు రావణుడు.
ఆ) విభీషణుని భవనం తప్ప లంకంతా నిప్పు పెట్టాడు.
ఈ) మహేంద్రగిరికి చేరుకోబోతుండగా మహానాదం చేశాడు. జాంబవతుడు దానిని విని పొంగిపోయాడు. హనుమంతుడు విజయుడై తిరిగి వస్తున్నాడని ప్రకటించాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

6. అ) అంగద హనుమదాదాలు శ్రీరాముడు సుగ్రీవుడున్న చోటుకు చేరారు.
ఆ) ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ సీతకు శుభశకునాలు తోచాయి.
ఇ) రాత్రి కాగానే పిల్లి ప్రమాణంలోకి తన శరీరాన్ని కుదించుకొని లంకలోకి ప్రవేశించాడు.
ఈ) సముద్రంపై సాగిపోతున్న హనుమంతుని చూసి సాగరుడు సహాయపడదలచాడు.
జవాబులు
ఈ) సముద్రం పై సాగిపోతున్న హనుమంతుని చూసి సాగరుడు సహాయపడదలచాడు.
ఇ) రాత్రి కాగానే పిల్లి ప్రమాణంలోకి తన శరీరాన్ని కుదించుకొని లంకలోకి ప్రవేశించాడు.
ఆ) ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ సీతకు శుభశకునాలు తోచాయి.
అ) అంగద హనుమదాదాలు శ్రీరాముడు సుగ్రీవుడున్న చోటుకు చేరారు.

7. అ) వానరులు మధువనాన్ని ధ్వంసం చేశారు.
ఆ) శ్రీరాముడికి దూరమై బతకడం కన్నా శరీరాన్ని విడవడమే మేలన్నది సీత.
ఇ) సీత కోరికపైన హనుమంతుడు రాముడి గుణరూపాలను వివరించాడు.
ఈ) ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ సీతకు శుభశకునాలు తోచాయి.
జవాబులు
ఆ) శ్రీరాముడికి దూరమై బతకడం కన్నా శరీరాన్ని విడవడమే మేలన్నది.
ఈ) ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ సీతకు శుభశకునాలు తోచాయి.
ఇ) సీత కోరికపైన హనుమంతుడు రాముడి గుణరూపాలను వివరించాడు.
అ) వానరులు మధువనాన్ని ధ్వంసం చేశారు.

8. అ) రావణుని తేజస్సును చూచి హనుమంతుడు ఆశ్చర్యపోయాడు.
ఆ) శ్రీరామునికి దూరమై బ్రతకడం కన్నా శరీరాన్ని విడవడం మంచిదని సీత తలచింది.
ఇ) హనుమంతుడు సీతతో తాను శ్రీరామదూతనని చెప్పుకున్నాడు.
ఈ) అంతఃపురంలో ఎందరో స్త్రీలు చెల్లాచెదురుగా నిద్రపోవడం హనుమంతుడు చూశాడు.
జవాబులు
ఈ) అంతఃపురంలో ఎందరో స్త్రీలు చెల్లాచెదురుగా నిద్రపోవడం హనుమంతుడు చూశాడు.
అ) రావణుని తేజస్సును చూచి హనుమంతుడు ఆశ్చర్యపోయాడు.
ఆ) శ్రీరామునికి దూరమై బ్రతకడం కన్నా శరీరాన్ని విడవడం మంచిదని సీత తలచింది.
ఇ) హనుమంతుడు సీతతో తాను శ్రీరామదూతనని చెప్పుకున్నాడు.

9. అ) లంకను కాల్చాక హనుమంతుడు సముద్రంలో చల్లార్చుకున్నాడు.
ఆ) హనుమంతుడు మహేంద్రగిరి శిఖరం మీద అడుగుపెట్టాడు.
ఇ) హనుమంతుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.
ఈ) హనుమంతుని తోకకు నిప్పు అంటించి లంకంతా కలయదిప్పమన్నాడు రావణుడు.
జవాబులు
ఇ) హనుమంతుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.
ఈ) హనుమంతుని తోకకు నిప్పు అంటించి లంకంతా కలయదిప్పమన్నాడు రావణుడు.
అ) లంకను కాల్చాక హనుమంతుడు సముద్రంలో చల్లార్చుకున్నాడు.
ఆ) హనుమంతుడు మహేంద్రగిరి శిఖరం మీద అడుగుపెట్టాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

10. అ) హనుమంతుడు లంకలో చిత్రవిచిత్రమైన ఇళ్ళను చూశాడు.
ఆ) అంతవరకు వెతకని అశోకవనాన్ని వెతకాలనుకున్నాడు హనుమంతుడు.
ఇ) సీత హనుమంతునితో వెళ్ళడానికి నిరాకరించింది.
ఈ) హనుమ లంకిణిని చంపి లంకలో ప్రవేశించాడు.
జవాబులు
ఈ) హనుమ లంకిణిని చంపి లంకలో ప్రవేశించాడు.
అ) హనుమంతుడు లంకలో చిత్రవిచిత్రమైన ఇళ్ళను చూశాడు.
ఆ) అంతవరకు వెతకని అశోకవనాన్ని వెతకాలనుకున్నాడు హనుమంతుడు.
ఇ) సీత హనుమంతునితో వెళ్ళడానికి నిరాకరించింది.

11. అ) హనుమంతుడు మందహాసం చేస్తూ లంకిణిపై బలంగా కొట్టాడు.
ఆ) హనుమంతుడు అశోకవనంలో ప్రవేశించాడు.
ఇ) హనుమంతుడు ముఖద్వారం గుండా లంకలోకి వెళ్ళలేదు.
ఈ) త్రికూట పర్వతంపై ఉన్న లంకను చేరాడు హనుమంతుడు.
జవాబులు
ఈ) త్రికూట పర్వతంపై ఉన్న లంకను చేరాడు హనుమంతుడు.
అ) హనుమంతుడు మందహాసం చేస్తూ లంకిణిపై బలంగా కొట్టాడు.
ఇ) హనుమంతుడు ముఖద్వారం గుండా లంకలోకి వెళ్ళలేదు.
ఆ) హనుమంతుడు అశోకవనంలో ప్రవేశించాడు.

12. అ) నిద్రలేచిన రావణుడు అశోకవనం వైపు అడుగులు వేస్తున్నాడు.
ఆ) ప్రాణత్యాగానికి సిద్ధపడిన సీతకు శుభశకునాలు తోచాయి.
ఇ) సీతాదేవిని చూడగానే హనుమంతుని కళ్ళల్లో ఆనందాశ్రువులు వచ్చాయి.
ఈ) రాక్షస స్త్రీలు ఎన్నో రకాలుగా సీతకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
జవాబులు
ఇ) సీతాదేవిని చూడగానే హనుమంతుని కళ్ళల్లో ఆనందాశ్రువులు వచ్చాయి.
అ) నిద్రలేచిన రావణుడు అశోకవనం వైపు అడుగులు వేస్తున్నాడు.
ఈ) రాక్షస స్త్రీలు ఎన్నో రకాలుగా సీతకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
ఆ) ప్రాణత్యాగానికి సిద్ధపడిన సీతకు శుభశకునాలు తోచాయి.

పాత్ర స్వభావాలు

1. త్రిజట :
త్రిజట విభీషణుని కూతురు. రాక్షస స్త్రీలను అదలించింది. తనకు వచ్చిన కలను చెప్పింది. ‘వేయి హంసలతో కూడిన పల్లకిమీద లక్ష్మణుడితో శ్రీరాముడు కూర్చునట్లు చూశాను. సముద్రం మధ్య ఒక తెల్లని పర్వతంమీద సీత కూర్చోవడం చూశాను. నూనెపూసిన శరీరంతో రావణుడు నేలమీద పడి ఉండటం చూశాను. ఒక నల్లని స్త్రీ శరీరమంతా బురద పూసుకొని ఎర్రని వస్త్రములు కట్టి, రావణుని మెడకు తాడుకట్టి దక్షిణంవైపుగా ఈడ్చుకువెళ్ళడం చూశాను. వరాహం మీద రావణుడు, మొసలిమీద ఇంద్రజిత్తూ, ఒంటిమీద కుంభకర్ణుడు దక్షిణదిశగా వెళ్ళడం చూశాను. లంక చిన్నాభిన్నం కావడం చూశాను’ అన్నది. స్వప్నంలో విమానదర్శనం కావడాన్ని బట్టి సీత సిద్ధిస్తుందని, రావణునికి వినాశం తప్పదని, శ్రీరాముడికి జయం కలుగుతుందనీ చెప్పింది.

సంఘటన ద్వారా గ్రహించుట

ప్రశ్న 1.
‘దూతను చంపడం రాజనీతి కాదు’ అని పలికిన విభీషణుని మాటలను బట్టి మీరేమి గ్రహించారు?
జవాబు:
హనుమంతుడు రావణునికి హితోపదేశం చేశాడు. అది రావణునికి నచ్చలేదు. హనుమంతుడిని సంహరించమని ఆదేశించాడు. అది విని విభీషణుడు దూతను చంపడం రాజనీతి కాదని, రావణునికి సూచించాడు.

ఈ విభీషణుని మాటల ద్వారా విభీషణుడు రాక్షస వంశంలో జన్మించినా గొప్ప రాజనీతి కలవాడని గ్రహించాను. ఆవేశంతో కాకుండా ఆలోచనతో మంచి నిర్ణయాలు తీసుకోవాలని గ్రహించాను. రాజు ఎల్లప్పుడు రాజనీతిని అనుసరించి పాలించాలని, మంచి మాటలు చెప్పే మంత్రులు రాజుకు అవసరమని గ్రహించాను.

ప్రశ్న 2.
త్రిజట సీతను ఓదార్చిన విధానం ద్వారా మీరేమి గ్రహించారు?
జవాబు:
రావణుడు అశోకవనంలో ఉన్న సీతను సమీపించాడు. అనేక రకాలుగా ప్రలోభ పెట్టాడు. తీవ్రంగా భయపెట్టాడు. చంపుతానని బెదిరించాడు. ఆ సమయంలో దుఃఖిస్తున్న సీతను విభీషణుని కుమార్తె అయిన త్రిజట ఓదార్చింది. ఆమెలో ధైర్యాన్ని నింపింది.

త్రిజట సీతను ఓదార్చడం ద్వారా ఎన్నో విషయాలను గ్రహించాను. త్రిజట రాక్షస వంశంలో జన్మించినా ఉత్తమ గుణములు కల మహిళగా గుర్తించాను. ఆపదల్లోను, దుఃఖంలో ఉన్నవారిని ఆదుకోవాలని, వారిలో ధైర్యం నింపాలనిగ్రహించాను. త్రిజట మాటల వల్లనే సీత ధైర్యంగా జీవించగలిగిందని గ్రహించాను.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

ప్రశ్న 3.
మైనాకుడు హనుమంతుడిని విశ్రాంతి తీసుకొనమని ప్రార్థించిన తీరును బట్టి మీరేమి గ్రహించారు?
జవాబు:
మైనాకుడు వాయుదేవుని అనుగ్రహం వల్ల సముద్రంలో దాగియున్నాడు. హనుమంతుడు సముద్రాన్ని దాటడానికి ప్రయత్నించాడు. మార్గమధ్యలో మైనాకుడు హనుమంతునికి ఆతిథ్యం ఇవ్వడానికి ప్రయత్నించాడు. హనుమంతుడు మైనాకుడిని స్పృశించి ముందుకు వెళ్ళాడు.

ఈ సన్నివేశం ద్వారా చేసిన ఉపకారాన్ని మరువకూడదని, దూరప్రయాణం చేసేవారికి విశ్రాంతిని ఇచ్చి, అతిథి మర్యాదలతో సత్కరించాలని గ్రహించాను. అంతేగాక కార్యరంగంలో దిగినవాడు అవిశ్రాంతంగా పనిచేయాలని, మార్గమధ్యలో కలిగే అంతరాలకు లోనుకాకూడదని కూడా గ్రహించాను.

ప్రశ్న 4.
ఆత్మహత్య కన్నా బతికి యుండటమే ఎన్నో విధాల మంచిదని, బాధల్లో నిరుత్సాహ పడకూడదనే విషయం ద్వారా మీరేమి గ్రహించారు?
జవాబు:
హనుమంతుడు లంకలో సీతను అన్వేషించాడు. ఎక్కడా కనిపించలేదు. నిరాశతో హనుమంతుడు ఆత్మహత్య చేసుకోవాలని ముందుగా అనుకొని తరువాత మనసు మార్చుకున్నాడు. ఆత్మహత్య కన్నా బతికి యుండటమే మంచిదని హనుమంతుడు నిశ్చయించుకున్నాడు.

ఈ సన్నివేశం ద్వారా ఆత్మహత్య ఎన్నటికీ మంచిదికాదనీ గ్రహించాను. మానవుడు ఆలోచనాపరుడు, వివేకవంతుడు. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంతో ఎదుర్కోవాలని, సమస్యలకు పరిష్కారాలను అన్వేషించాలని గ్రహించాను. కష్టాలకు, దుఃఖాలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని గ్రహించాను.

ప్రశ్న 5.
హనుమంతుడుపిల్లి ప్రమాణంలో తన శరీరాన్ని కుదించుకుని ఎడమకాలును పెట్టి లంకలో ప్రవేశించిన హనుమంతుని ప్రవర్తన ద్వారా మీరేమి గ్రహించారు?
జవాబు:
హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు చేరాడు. పిల్లి ప్రమాణంలోకి తన శరీరాన్ని కుదించుకొని లంకలో ప్రవేశించాడు. ఎడమకాలిని ముందుగా లంకలో పెట్టి ప్రవేశించాడు.

దీని ద్వారా హనుమంతుని సమయస్ఫూర్తిని గుర్తించాను. పిల్లి అపశకునానికి ప్రతీక అని, ఎడమకాలు ముందుగా పెడితే ఆ ప్రాంతానికి అనర్థం కలుగుతుందని గ్రహించాను. హనుమంతుని రాక లంకా నగర వినాశనానికి కారణమైందని గ్రహించాను. శత్రువుల ప్రాంతంలోనికి వెళ్ళేముందు ఎడమకాలు ముందుగా పెట్టడం శ్రేష్ఠమని కూడా గ్రహించాను.

ప్రశ్న 6.
హనుమంతుడు రావణునితో “ఓయీ ! సీతను రామునికి అప్పగించు లేనిచో అనర్ధం తప్పదు” అని హెచ్చరించాడు. దీని ద్వారా మీరేమి గ్రహించారు?
జవాబు:
హనుమంతుడు అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. చివరకు హనుమంతుడు రావణుని సమీపానికి వచ్చాడు. సీతను రామునికి అప్పగించి క్షేమంగా ఉండమని హెచ్చరించాడు. లేకపోతే అనర్హం కలుగుతుందని హెచ్చరించాడు.

ఈ హనుమంతుని మాటలనుబట్టి శ్రీరాముడు అమిత పరాక్రమవంతుడని, శ్రీరామునితో వైరం అన్ని విధాలుగా అనర్ధం కలుగుతుందని గ్రహించాను. రామదూతగా చక్కగా వ్యవహరించాడని కూడా గ్రహించాను. శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకుంటే యుద్ధాలు తప్పుతాయని కూడా గ్రహించాను.

విషయాత్మక ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నకు నాలుగైదు వాక్యాలలో సమాధానం రాయండి.

ప్రశ్న 1.
హనుమంతుడు మొట్టమొదట చూసినప్పుడు సీతాదేవి ఎలా ఉంది?
జవాబు:
హనుమంతుడు లంకంతా వెదికాడు. సీత కనబడలేదు. శింశుపావృక్షం ఎక్కాడు. దానికింద మలినమైన వస్త్రాలతో సీత ఉంది. ఆమె కృశించి ఉంది. దీనావస్థలో ఉంది. ఆమె ఆభరణాలను బట్టి హనుమ ఆమెను సీతగా నిర్ధారించుకొన్నాడు.

వ్యాసరూప ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
శ్రీరామ కార్యం నిమిత్తం హనుమంతుడు లంకకు యే విధంగా చేరాడు?
జవాబు:

  1. సుగ్రీవుని ఆజ్ఞమేరకు హనుమంతుడు మిగిలిన వానర వీరులతో దక్షిణ దిక్కుకు శ్రీరామ కార్యం నిమిత్తం బయలుదేరి సముద్రపు ఒడ్డుకు చేరాడు.
  2. జాంబవంతుడు, అంగదుడు మొదలగు వానర ప్రముఖుల ప్రోత్సాహంతో హనుమంతుడు సముద్ర లంఘనానికి పూనుకున్నాడు.
  3. హనుమంతుడు దేవతలందరికి నమస్కరించి తన శరీరాన్ని పెంచి, తోకను ఆకాశము పైకి రిక్కించి నడుం మీద చేతులు ఆనించి, గట్టిగా గర్జించి, పాదాలతో పర్వతాన్ని తొక్కి పైకి లంఘించాడు.
  4. హనుమంతుడు ఆ విధంగా సముద్రం మీద ఎగురుతుండగా సముద్ర గర్భంలోనున్న మైనాకుడు హనుమకు సాయం చేయాలన్న కోరికతో పైకి వచ్చి హనుమంతుని మార్గానికి అడ్డము వచ్చాడు.
  5. హనుమంతుడు మైనాకుణ్ణి చేతితో తాకి తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాడు.
  6. హనుమంతుణ్ణి పరీక్షించాలని “సురస” అనే నాగమాత ప్రయత్నించి అతని సూక్ష్మబుద్ధిని మెచ్చుకుంది.
  7. “సింహిక” అనే రాక్షసి హనుమంతుణ్ణి మింగాలని చూసి అతని చేతిలో మరణించింది.
  8. హనుమంతుడు సముద్రాన్ని లంఘించి, లంకలో కాలుపెట్టాడు.
  9. రాత్రివేళ అన్వేషణకు అనువయిన సమయమని చీకటి పడేదాకా వేచియున్నాడు.
  10. చీకటి పడగానే లంకలో ప్రవేశించబోగా లంకిణి అడ్డగించింది.
  11. లంకిణిని ఒక దెబ్బతో నేలకూల్చాడు.
  12. లంకిణి హనుమంతుని చేతిలో ఓడింపబడి అతనికి దారి వదిలింది.
  13. ఈ విధంగా హనుమంతుడు సీత కొరకు అన్వేషించాలని లంకకు చేరాడు.

ప్రశ్న 2.
హనుమ సముద్రలంఘనం చేసిన విధానం వివరించండి.
జవాబు:
మహాబలవంతుడైన హనుమ, సముద్రం దాటడానికి ముందు దేవతలు అందరికీ నమస్కరించాడు. తన శరీరాన్ని పెంచాడు. పెద్దగా గర్జించాడు. చేతులు నడుముపై పెట్టాడు. అంగదాది వీరులతో తాను రామబాణంలా లంకకు వెడతానన్నాడు.

సముద్రం పై నుండి వెడుతున్న హనుమంతుడికి సాయం చేద్దామని సముద్రుడు అనుకున్నాడు. రామకార్యం మీద వెడుతున్న హనుమకు శ్రమ కలుగకూడదని, సముద్రంలోని మైనాకుణ్ణి సముద్రుడు బయటకు రమ్మన్నాడు. మైనాకుడి శిఖరాలపై హనుమ కొంచెం విశ్రాంతి తీసికొంటాడని సముద్రుడు అనుకున్నాడు.

మైనాకుడు పైకి లేచాడు. మైనాకుడు తనకు అడ్డు వస్తున్నాడని హనుమ అనుకొని, తన వక్షంతో అతడిని గెంటివేశాడు. మైనాకుడు మానవరూపంతో పర్వత శిఖరంపై నిలబడి, సముద్రుడి కోరికను హనుమకు చెప్పాడు. హనుమ, సంతోషించాడు. తనకు సమయం లేదని, చేతితో మైనాకుణ్ణి హనుమ తాకి వెళ్ళాడు.

తరువాత హనుమంతుడిని పరీక్షించడానికి సురస అనే నాగమాత వచ్చి, హనుమ సూక్ష్మబుద్ధిని మెచ్చుకొని, అతడిని ఆశీర్వదించింది. సింహిక అనే రాక్షసి, హనుమను మ్రింగాలని చూసింది. కాని హనుమంతుడు గోళ్ళతో సింహికను చీల్చివేశాడు.

ఇలా హనుమ నూరు యోజనాల సముద్రాన్ని దాటి లంకకు చేరాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

ప్రశ్న 3.
సీతాదేవిని హనుమంతుడు తొలిసారి సందర్శించినపుడు అతడు పొందిన ఆనందాన్ని విశ్లేషించండి.
జవాబు:
హనుమంతుడు సీతను వెతుకుతూ, రావణుడి అంతఃపురంలోకి వెళ్ళాడు. అక్కడ గొప్ప అందంతో ఉన్న రావణుడి భార్య మండోదరిని చూసి, సీత అని భ్రాంతిపడ్డాడు. తాను సీతను చూశానని హనుమ ఆనందంతో గంతులు వేశాడు. కొద్దిసేపటికే తన ఆలోచన తప్పు అనుకున్నాడు.

తరువాత హనుమ అశోకవనం అంతా, సీతకోసం వెతికాడు. శింశుపా వృక్షం ఎక్కాడు. ఆ చెట్టు క్రింద మాసిన బట్టలు కట్టుకొన్న ఒక స్త్రీని హనుమ చూశాడు. ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు ఉన్నారు. ఆమె దీనావస్థలో ఉంది. ఆమె సీతయే అని, హనుమ అనుకున్నాడు.

అతడు ఆమె ధరించిన ఆభరణాలు చూశాడు. రాముడు చెప్పిన వాటితో అవి సరిపోయాయి. దానితో ఆమె సీతయే అని హనుమంతుడు గట్టిగా నిశ్చయించాడు.

సీతాదేవిని చూడగానే హనుమంతుడి కళ్ళ నుండి ఆనందభాష్పాలు జారాయి. శ్రీరాముడిని మనస్సులో స్మరించుకొని, హనుమంతుడు నమస్కరించాడు.

ప్రశ్న 4.
త్రిజటా స్వప్నం గురించి రాయండి.
జవాబు:
‘త్రిజట’ విభీషణుని కూతురు. రావణుడు సీతను అశోకవనంలో ఉంచి, రాక్షస స్త్రీలను ఆమెకు కాపలాగ పెట్టాడు. వారిలో ‘త్రిజట’ కూడ ఉంది. రావణుని భర్తగా అంగీకరించడానికి సీతను ఒప్పించమని రావణుడు రాక్షస స్త్రీలకు చెప్పాడు. రాక్షస స్త్రీలు సీతకు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. లేకపోతే చంపుతామని వారు సీతను బెదిరించారు. సీత ఎంతో ఏడ్చింది.

అంత వరకూ నిద్రపోతున్న త్రిజట లేచి తనకు కల వచ్చిందని అక్కడున్న రాక్షస స్త్రీలకు చెప్పింది. కలలో వేయి హంసల పల్లకిపై రామలక్ష్మణులు కనబడ్డారని, సీత తెల్లని పర్వతం మీద కూర్చుందనీ వారికి చెప్పింది. రావణుడు నూనె పూసిన శరీరంతో నేలపై పడి ఉన్నాడని, ఒక నల్లని స్త్రీ రావణుని మెడకు తాడు కట్టి దక్షిణం వైపు ఈడ్చుకువెడుతోందని కూడా చెప్పింది. రావణుడు పందిమీద దక్షిణ దిశగా వెళ్ళడం తాను కలలో చూశానని, లంకానగరం చిన్నాభిన్నం కావడం తాను చూశానని త్రిజట తోడి రాక్షస స్త్రీలకు చెప్పింది.

తనకు కలలో విమానం కనబడింది. కాబట్టి సీత కోరిక సిద్ధిస్తుందనీ, రావణుడికి వినాశం, రాముడికి జయం కలుగుతుందనీ త్రిజట చెప్పింది. త్రిజట ఉత్తమురాలు.

ప్రశ్న 5.
లంక దహనానికి అసలు కారకులెవరు? ఎలా? విశ్లేషించండి.
జవాబు:
హనుమంతుడు సీత జాడను తెలుసుకున్నాక, రావణుడి శక్తి సామర్థ్యాలు తెలుసుకోవాలనుకున్నాడు. అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. రావణుడు పంపిన రాక్షస వీరులను అందరినీ హనుమ చంపాడు. చివరకు ఇంద్రజిత్తు హనుమను బ్రహ్మాస్త్రంతో బంధించి, రావణుడి వద్దకు తీసుకువెళ్ళాడు.

రావణుడు హనుమంతుడిని చంపమని ఆజ్ఞాపించాడు. దూతను చంపడం భావ్యం కాదని, ఇతర పద్ధతులలో దండింపవచ్చునని విభీషణుడు అన్న రావణునికి చెప్పాడు.

హనుమంతుడి తోకకు నిప్పు అంటించి, లంక అంతా తిప్పమని రాక్షసులకు రావణుడు చెప్పాడు. వారు బట్టలు హనుమంతుడి తోకకు చుట్టారు. దానిని నూనెతో తడిపారు. హనుమ తోకకు నిప్పు అంటించి, వారు లంక అంతా ఊరేగిస్తున్నారు. హనుమంతుడు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరాడు. విభీషణుడి భవనం తప్ప, లంకనంతా కాల్చాడు. ఈ విధంగా రాముడు సీతను చూసి రమ్మని హనుమంతుడిని పంపితే, హనుమ లంకను కాల్చి వచ్చాడు.

దీనినిబట్టి లంకను కాల్చడానికి అసలు కారకుడు రావణుడు అని మనకు తెలుస్తుంది. హనుమంతుడు రాముడి పరాక్రమాన్ని గుర్తుచేసి, సీతను రాముడి వద్దకు పంపమని రావణుడికి చెప్పడానికే వెళ్ళాడు. కాని రావణుడు, తెలివి తక్కువగా హనుమ తోకకు నిప్పు పెట్టించాడు. కాబట్టి లంకా దహనానికి రావణుడే అసలు కారకుడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

ప్రశ్న 6.
హనుమంతుడు లంకలో ప్రవేశించి సీతను చూసి మాట్లాడిన వృత్తాంతాన్ని తెలపండి.
జవాబు:
హనుమంతుడు దేవతలకు నమస్కరించాడు. తన శరీరాన్ని పెంచాడు. పెద్ద ధ్వని చేస్తూ, చేతులను నడుం మీద ఉంచి, తోకను విదల్చాడు. సీతను చూసి వస్తానని, అంతరిక్షంలోకి ఎగిరాడు. హనుమ సముద్రంపై వెడుతుండగా, సముద్రుడు హనుమకు సాయం చేద్దామని తనలో దాగిన మైనాకుణ్ణి పైకి రమ్మన్నాడు. హనుమ ఆ గిరిశిఖరాలపై విశ్రాంతి తీసికొంటాడని సాగరుడు అనుకున్నాడు. పైకి లేచిన మైనాకుణ్ణి చూసి తనకు అడ్డంగా ఉన్నాడని, హనుమ తన వక్షస్థలంతో నెట్టివేశాడు. మైనాకుడు మనిషి రూపంలో గిరి శిఖరంపై నిలిచి, సముద్రుడి కోరికను హనుమకు తెలిపాడు. హనుమ తనకు మధ్యలో ఆగడం కుదరదని, మైనాకుని చేతితో తాకి ముందుకు సాగాడు.

హనుమను పరీక్షించాలని ‘సురస’ అనే నాగమాత యత్నించి హనుమ సూక్ష్మబుద్దిని మెచ్చుకుంది. ‘సింహిక’ అనే రాక్షసి హనుమను మింగాలని చూసి, తానే హనుమ చేతిలో మరణించింది. హనుమ లంకను చూశాడు. రాత్రి కాగానే పిల్లి ప్రమాణంలో తన శరీరాన్ని తగ్గించుకొని, లంకలో ప్రవేశించాడు. లంకాధిదేవత (లంకిణి) లంకలోకి వెళ్ళడానికి హనుమంతుని అడ్డగించింది. హనుమ లంకను చూసి వస్తానన్నాడు. లంకిణి హనుమను అరచేతితో కొట్టింది. హనుమ లంకిణిని ఒక్క దెబ్బ వేశాడు. లంకిణి కూలిపోయింది. వానరుడు వచ్చి లంకిణిని జయించినపుడు రాక్షసులకు కీడు కల్గుతుందని బ్రహ్మ చెప్పాడని హనుమకు లంకిణి చెప్పింది. హనుమను లంకలోకి వెళ్ళమంది.

హనుమ ప్రాకారం నుండి లంకలోకి దూకాడు. లంకలో ఎడమపాదం పెట్టాడు. హనుమ లంకలో రాక్షస భవనాలన్నీ వెదికాడు. రావణుని భార్య మండోదరిని చూసి సీత అని భ్రమపడ్డాడు. తరువాత ఆమె సీత కాదని నిశ్చయించాడు. చివరకు సీత చనిపోయి ఉంటుందని అనుకున్నాడు. హనుమ తాను కూడా మరణిద్దాం అనుకున్నాడు. చివరకు బతికి ఉంటే శుభాలు పొందవచ్చుననుకున్నాడు.

హనుమ అశోకవనంలోకి వెళ్ళాడు. సీతారాములకు నమస్కరించాడు. హనుమ ఆ వనంలో శింశుపావృక్షం ఎక్కాడు. దానికింద మలిన వస్త్రాలు ధరించిన ఒక స్త్రీని చూశాడు. ఆమె సీత అయి ఉంటుందని నిశ్చయించాడు. హనుమ చెట్టుమీదే ఉన్నాడు. తెల్లవారుతోంది. రావణుడు వచ్చి, సీత మనస్సును మార్చబోయాడు. సీత లొంగలేదు. రావణుడు సీతకు రెండు నెలలు గడువు ఇచ్చి, సీతను తన దారికి తెమ్మని రాక్షస స్త్రీలకు చెప్పాడు. రావణుడు వెళ్ళిపోయాక, రాక్షస స్త్రీలు సీత మనస్సు మార్చడానికి యత్నించారు. సీత రాముడిని విడిచి ఉండలేక చనిపోదామనుకుంది.

విభీషణుడి కూతురు త్రిజట నిద్ర నుండి లేచింది. త్రిజట తనకు కల వచ్చిందనీ ఆ కలలో వేయి హంసల పల్లకిలో రాముడూ, తెల్లని పర్వతంపై సీత కనబడ్డారని, రావణుడు నూనె పూసిన శరీరంతో నేలపై పడి ఉన్నాడని లంక చిన్నాభిన్నం అయ్యిందని, రాముడికి జయం కల్గుతుందని చెప్పింది.

సీతకు శుభశకునాలు కనబడ్డాయి. హనుమంతుడు రామకథను గానం చేశాడు. సీత చెట్టు మీద హనుమను చూసి ఆశ్చర్యపడింది. హనుమ చెట్టుదిగి, ఆ స్త్రీని “నీ వెవరవు ? నీవు సీతవైతే నీకు శుభం అవుతుంది” అన్నాడు. తన పేరు సీత అని, ఆ స్త్రీ చెప్పింది. హనుమ తాను శ్రీరామ దూతనని చెప్పాడు. హనుమను చూసి సీత మొదట రాక్షసుడు అనుకుంది. రామదూతవయితే రాముణ్ణి గురించి చెప్పు అన్నది. హనుమ రాముని రూపాన్ని వర్ణించాడు. రాముడిచ్చిన అంగుళీయకాన్ని సీత గుర్తుగా ఇచ్చాడు.

రాముణ్ణి త్వరగా లంకకు తీసుకురమ్మని హనుమకు సీతమ్మ చెప్పింది. వెంటనే సీతను రాముని వద్దకు తీసుకు వెడతాననీ, తన వీపుపై కూర్చోమనీ, హనుమ చెప్పాడు. అందుకు సీత నిరాకరించింది. తాను పరపురుషుడిని తాకననీ, రాముడు రావణుని చంపి నన్ను తీసుకువెళ్ళడం ధర్మం అనీ చెప్పింది. హనుమంతుడు రాముడు గుర్తించే ఆనవాలును ఇమ్మని సీతను అడిగాడు. సీత కాకాసురుని కథ చెప్పింది. ఆమె తన దివ్య చూడామణిని హనుమకు ఇచ్చింది. ఈ విధంగా హనుమ లంకలో సీతను కలిసి వెళ్ళాడు.

ప్రశ్న 7.
సీతాన్వేషణ వృత్తాంతం రాయండి.
(లేదా)
హనుమ లంకను కాల్చి వచ్చి, సీత జాడను రామునికి నివేదించిన వృత్తాంతాన్ని వివరించండి.
జవాబు:
సీతాదేవిని దర్శించడంతో హనుమకు ఒక ముఖ్యకార్యం పూర్తి అయ్యింది. రావణుడి శక్తిసామర్థ్యాలు హనుమ తెలుసుకుందామనుకున్నాడు. అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. అశోక వన ధ్వంసం గురించి రాక్షస స్త్రీలు, రావణునకు చెప్పారు. రావణుడు ఎనభైవేల మంది రాక్షసులను పంపాడు. హనుమ వాళ్ళను చంపాడు. రావణుడు పంపిన జంబుమాలిని, ఏడుగురు మంత్రి పుత్రులను, ఐదుగురు సేనాపతులను, అక్షకుమారుణ్ణి హనుమ చంపాడు. చివరకు రావణుడు తన కుమారుణ్ణి ఇంద్రజిత్తును పంపాడు. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో హనుమను బంధించాడు. అది హనుమపై స్వల్పకాలమే పని చేసింది.

రాక్షసులు హనుమను రావణుని ముందు ప్రవేశపెట్టారు. హనుమ తాను రామదూతనని చెప్పి, రాముని పరాక్రమాన్ని చాటాడు. దూతను చంపడం తగదని రావణుని తమ్ముడు విభీషణుడు చెప్పడంతో, రావణుడు హనుమంతుని తోకకు నిప్పంటించి లంకలో తిప్పమన్నాడు. రాక్షసులు రావణుని తోకకు బట్టలు చుట్టి, నూనెతో తడిపి, నిప్పు ముట్టించి ” లంకానగరంలో ఊరేగించారు. హనుమ ఆకాశంలోకి ఎగిరి, విభీషణుని భవనం తప్పించి, మిగిలిన లంకంతా తగులబెట్టాడు.

తరువాత హనుమ లంకను అంటించి తాను తప్పు చేశానని, సీతామాత ఆ మంటలలో కాలిపోయిందేమో అని, సందేహించాడు. తన తోకను కాల్చని అగ్ని, సీతను దహింపదని చివరకు ధైర్యం తెచ్చుకున్నాడు. సీత క్షేమంగా ఉందని చారణుల ద్వారా తెలుసుకొని సంతోషించాడు. హనుమ సీత వద్దకు వెళ్ళి ఆమెను నమస్కరించి తిరుగు ప్రయాణం అయ్యాడు.

హనుమ ‘అరిష్టం’ అనే పర్వతాన్నుండి ఆకాశంలోకి ఎగిరాడు. మహేంద్రగిరికి చేరుతూ మహానాదం చేశాడు. జాంబవంతుడు ఆ ధ్వనిని విని హనుమ విజయం సాధించి వస్తున్నాడని వానరులకు చెప్పాడు.

హనుమ మహేంద్రగిరి చేరాడు. పెద్దలకు నమస్కరించాడు. ‘చూశాను సీతమ్మను’ అని చెప్పాడు. ప్రయాణ విషయాలు వారికి చెప్పాడు. అంగదుడు లంకకు వెళ్ళి, రావణుని చంపి సీతను తీసుకొని వచ్చి రాముని వద్దకు వెడదాం అన్నాడు. జాంబవంతుడు, అది సరికాదన్నాడు. రామసుగ్రీవులు సీతమ్మను చూసి రమ్మన్నారు. రాముడు రావణుని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. రామునికి విషయం తెలుపుదాం అన్నాడు.

దారిలో మధువనాన్ని వానరులు ధ్వంసం చేశారు. మధువనాన్ని రక్షిస్తున్న దధిముఖుడు, వానరుల చేతిలో దెబ్బతిని, ఆ విషయం సుగ్రీవుడికి చెప్పాడు. సుగ్రీవుడు ఇదంతా శుభసూచకంగా భావించాడు. అంగద హనుమదాదులు సుగ్రీవుల దగ్గరకు వెళ్ళారు. హనుమ, రాముడికి నమస్కరించి ‘చూశాను సీతమ్మను’ అని చెప్పి, సీత ఇచ్చిన చూడామణిని రాముడికి ఇచ్చి సీతాన్వేషణ వృత్తాంతాన్ని రామునకు వివరించాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

ప్రశ్న 8.
లంకా దహనం వర్ణించండి.
జవాబు:
సీతాదేవి దర్శనంతో ప్రధాన కార్యం ముగిసింది హనుమంతునికి. రావణుడు, అతని సైన్యపు. శక్తి సామర్థ్యాలను కూడా తెలుసుకోవాలనిపించింది. అందుకు అశోకవనాన్ని ధ్వంసం చేయడమే మార్గంగా భావించాడు. అనుకున్నంతా చేశాడు. ఆ కపివీరుడు. రాక్షస స్త్రీలు పరుగుపరుగున వెళ్ళి లంకేశునికీ విషయం చెప్పారు. రావణుడు ఎనభై వేల మంది రాక్షసులను ఈ పంపాడు. హనుమంతుడు వాళ్ళను మట్టుపెట్టాడు. తనపైకి వచ్చిన జంబుమాలిని, మంత్రిపుత్రులేడుగురిని రావణుడి సేనాపతులైదుగురిని, అక్షకుమారుణ్ణి అంతమొందించాడు. చివరకు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి హనుమంతుణ్ణి బంధించాడు. బ్రహ్మవరంచేత అది హనుమంతునిమీద క్షణకాలమే పనిచేస్తుంది. అయినా తాను దానికి కట్టుబడి ఉన్నట్లు నటించాడు హనుమంతుడు. రావణుని ముందు ప్రవేశపెట్టారతన్ని. రావణుడడుగగా తాను రామదూతనని చెప్పాడు. శ్రీరాముని పరాక్రమమెలాంటిదో సభాముఖంగా చాటాడు. సహించలేని రావణుడు హనుమంతుణ్ణి చంపమని ఆజ్ఞ ఇచ్చాడు. దూతను చంపడం భావ్యం కాదన్నాడు విభీషణుడు. ఇతర పద్ధతుల్లో దూతను దండించవచ్చునన్నాడు.

హనుమంతుని తోకకు నిప్పంటించి లంకంతా కలయ దిప్పమన్నాడు రావణుడు. బట్టలతో హనుమంతుని తోకను చుట్టారు. నూనెతో తడిపారు. తోకకు నిప్పు పెట్టి ఊరంతా ఊరేగిస్తున్నారు. హనుమంతుడు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరాడు. విభీషణుని భవనం తప్ప లంకంతా నిప్పుపెట్టాడు. అందుకే ‘(సీతను) చూసిరమ్మంటే (లంకను) కాల్చివచ్చాడని’ సామెత
పుట్టింది. లంకలో హాహాకారాలు మిన్నుముట్టాయి.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం 4th Lesson కిష్కింధ కాండ Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions ఉపవాచకం 4th Lesson కిష్కింధ కాండ

10th Class Telugu ఉపవాచకం 4th Lesson కిష్కింధ కాండ Textbook Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

సంఘటనా క్రమం

సంఘటనల ఆధారంగా వరుస క్రమంలో వాక్యాలను అమర్చడం

1. అ) ఋష్యమూక పర్వతం నుంచి రామలక్ష్మణులను చూశాడు సుగ్రీవుడు.
ఆ) ఈయన మాట్లాడే తీరు చూస్తే చంపడానికి కత్తి ఎత్తిన శత్రువుు కూడా చేతులు రావు అని మెచ్చుకున్నాడు.
ఇ) సుగ్రీవుని ఆనతి మీద రామలక్ష్మణులున్న చోటికి ఒక్క గంతు వేశాడు హనుమంతుడు.
ఈ) హనుమంతుని మాటతీరు శ్రీరాముణ్ణి ఆకట్టుకుంది.
జవాబులు
అ) ఋష్యమూక పర్వతం నుంచి రామలక్ష్మణులను చూశాడు సుగ్రీవుడు.
ఇ) సుగ్రీవుని ఆనతి మీద రామలక్ష్మణులున్న చోటికి ఒక్క గంతు వేశాడు.
ఈ) హనుమంతుని మాటతీరు శ్రీరాముణ్ణి ఆకట్టుకుంది.
ఆ) ఈయన మాట్లాడే తీరు చూస్తే చంపడానికి కత్తి ఎత్తిన శత్రువుకు కూడా చేతులు రావు అని మెచ్చుకున్నాడు.

2. అ) శ్రీరామసుగ్రీవులు స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటున్న సమయంలోనే సీతాదేవికి, వాలికి, రావణాసురునికి ఎడమకన్ను ఒక్కసారిగా అదిరింది.
ఆ) శ్రీరామ, సుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులైనారు.
ఇ) సుగ్రీవుడు గతంలో తాను నలుగురు మంత్రులతో కొండమీద ఉన్నప్పుడు ఒక రాక్షసుడు స్త్రీని బలవంతంగా తీసుకుపోవడం చూశామన్నాడు.
ఈ) శ్రీరాముడు మందహాసాన్ని చిందిస్తూ ‘సుగ్రీవా! ఆపదలో ఆదుకునేవాడే గదా మిత్రుడు. నీ భార్యను అపహరించిన
వాలిని తప్పక వధిస్తాన’ని మాట ఇచ్చాడు.
జవాబులు
ఆ) శ్రీరామ, సుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులైనారు.
ఈ) శ్రీరాముడు మందహాసాన్ని చిందిస్తూ ‘సుగ్రీవా! ఆపదలో ఆదుకునేవాడే గదా మిత్రుడు. నీ భార్యను అపహరించిన వాలిని తప్పక వదిస్తాన’ని మాట ఇచ్చాడు.
అ) శ్రీరామసుగ్రీవులు స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటున్న సమయంలోనే సీతాదేవికి, వాలికి, రావణాసురునికి ఎడమ కన్ను ఒక్కసారిగా అదిరింది.
ఇ) సుగ్రీవుడు గతంలో తాను నలుగురు మంత్రులతో కొండమీద ఉన్నప్పుడు ఒక రాక్షసుడు స్త్రీని బలవంతంగా తీసుకుపోవడం చూశామన్నాడు.

3. అ) తమ్ముడి భార్యను చెరబట్టడం వంటి అధర్మాలకు ఒడిగట్టినందువల్ల నేను నీకు మరణదండన విధించానన్నాడు శ్రీరాముడు.
ఆ) శ్రీరాముడు కాలి బొటనవేలితో అక్కడ పడి ఉన్న దుందుభి అస్థిపంజరాన్ని పదియోజనాల దూరం పడేటట్లు చిమ్మివేశాడు. ఒకే బాణంతో ఏడు మద్దిచెట్లను చీల్చాడు.
ఇ) విషసర్పంతో సమానమైన బాణాన్ని అతడు వాలి మీదకు వదిలాడు.
ఈ) వానరుడివి గనుక చాటుగా ఉండి చంపడంలో తప్పులేదన్నాడు.
జవాబులు
ఆ) శ్రీరాముడు కాలి బొటనవేలితో అక్కడ పడి ఉన్న దుందుభి అస్థిపంజరాన్ని పదియోజనాల దూరం పడేటట్లు చిమ్మివేశాడు. ఒకే బాణంతో ఏడు మద్దిచెట్లను చీల్చాడు.
ఇ) విషసర్పంతో సమానమైన బాణాన్ని అతడు వాలి మీదకు వదిలాడు.
అ) తమ్ముడి భార్యను చెరబట్టడం వంటి అధర్మాలకు ఒడిగట్టినందువల్ల నేను నీకు మరణదండన విధించానన్నాడు శ్రీరాముడు.
ఈ) వానరుడివి గనుక చాటుగా ఉండి చంపడంలో తప్పులేదన్నాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

4. అ) ప్రాయోపవేశానికి సిద్ధపడిన తారసు హనుమంతుడు ఓదార్చాడు.
ఆ) ఒకనాటి అర్ధరాత్రి మాయావి కిష్కింధకు వచ్చి వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు.
ఇ) సంపాతి తన సోదరుని మరణానికి ఎంతో విలపించాడు.
ఈ) సుగ్రీవుడు వివిధ ప్రాంతాలలో గల వానర వీరులను రావలసిందిగా చెప్పమని హనుమంతుడిని ఆజ్ఞాపించాడు.
జవాబులు
ఈ) సుగ్రీవుడు వివిధ ప్రాంతాలలో గల వానర వీరులను రావలసిందిగా చెప్పమని హనుమంతుడిని ఆజ్ఞాపించాడు.
ఇ) సంపాతి తన సోదరుని మరణానికి ఎంతో విలపించాడు.
ఆ) ఒకనాటి అర్థరాత్రి మాయావి కిష్కింధకు వచ్చి వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు.
అ) ప్రాయోపవేశానికి సిద్ధపడిన తారను హనుమంతుడు ఓదార్చాడు.

5. అ) శ్రీరాముని బలమెంతో తెలుసుకోవాలనుకున్నాడు సుగ్రీవుడు.
ఆ) శ్రీరాముడి శోకాన్ని పోగొట్టే ప్రయత్నం చేశాడు సుగ్రీవుడు.
ఇ) లక్ష్మణ హనుమాదులతో కలిసి సుగ్రీవుడిని సమీపించాడు శ్రీరాముడు.
ఈ) సుగ్రీవుని ఆనతితో హనుమంతుడు రామలక్ష్మణులను సమీపించాడు.
జవాబులు
ఈ) సుగ్రీవుని ఆనతితో హనుమంతుడు రామలక్ష్మణులను సమీపించాడు.
ఆ) శ్రీరాముడి శోకాన్ని పోగొట్టే ప్రయత్నం చేశాడు సుగ్రీవుడు. అ) శ్రీరాముని బలమెంతో తెలుసుకోవాలనుకున్నాడు సుగ్రీవుడు.
ఇ) లక్ష్మణ హనుమాదులతో కలిసి సుగ్రీవుడిని సమీపించాడు శ్రీరాముడు.

6. అ) సుగ్రీవుడు రామునితో సమావేశమై వానరుల రాకను చెప్పాడు.
ఆ) భర్త విషయం తెలుసుకున్న తార పరుగున వచ్చింది.
ఇ) సీతాన్వేషణ కార్యభారాన్ని గుర్తుచేశాడు హనుమంతుడు.
ఈ) సుగ్రీవ హనుమదాదులు శ్రీరాముని దగ్గరకు వెళ్ళారు.
జవాబులు
ఆ) భర్త విషయం తెలుసుకున్న తార పరుగున వచ్చింది.
ఈ) సుగ్రీవ హనుమదాదులు శ్రీరాముని దగ్గరకు వెళ్ళారు.
ఇ) సీతాన్వేషణ కార్యభారాన్ని గుర్తుచేశాడు హనుమంతుడు.
అ) సుగ్రీవుడు రామునితో సమావేశమై వానరుల రాకను చెప్పాడు.

7. అ) హనుమంతుడు దక్షిణ దిక్కుకు ప్రయాణమయ్యాడు.
ఆ) హనుమంతుడు నమస్కరించి రామ ముద్రికను గ్రహించాడు.
ఇ) హనుమంతుని మాటలకు జాంబవంతుడు ఆనందించాడు.
ఈ) ఉవ్వెత్తున లేచే అలల అలజడి భయాన్ని కల్గిస్తున్నది.
జవాబులు
అ) హనుమంతుడు దక్షిణ దిక్కుకు ప్రయాణమయ్యాడు.
ఆ) హనుమంతుడు నమస్కరించి రామ ముద్రికను గ్రహించాడు.
ఈ) ఉవ్వెత్తున లేచే అలల అలజడి భయాన్ని కల్గిస్తున్నది.
ఇ) హనుమంతుని మాటలకు జాంబవంతుడు ఆనందించాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

8. అ) సుగ్రీవుడు భయంకరంగా గర్జిస్తూ వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు.
ఆ) యుద్ధానికి వెళ్ళడం మంచిదికాదని తార బోధించింది.
ఇ) హనుమంతుని మాటతీరు రాముడిని ఆకట్టుకుంది.
ఈ) వాలితో వైరం ఎందుకు వచ్చిందో తెలుపమన్నాడు శ్రీరాముడు.
జవాబులు
ఇ) హనుమంతుని మాటతీరు రాముడిని ఆకట్టుకుంది.
ఈ) వాలితో వైరం ఎందుకు వచ్చిందో తెలుపమన్నాడు శ్రీరాముడు.
అ) సుగ్రీవుడు భయంకరంగా గర్జిస్తూ వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు.
ఆ) యుద్ధానికి వెళ్ళడం మంచిది కాదని తార బోధించింది.

9. అ) రక్తపు మడుగులో పడియున్న వాలి కొంతసేపటికి తేరుకున్నాడు.
ఆ) శ్రీరాముని తమ వల్లనే తాను ఈ స్థితిలో ఉన్నానని సుగ్రీవుడు చెప్పాడు.
ఇ) వాలి సుగ్రీవుల మధ్య యుద్ధం భీకరంగా జరుగుతున్నది.
ఈ) శ్రీరాముని మాటలు విని వాలి తన తప్పు తెలుసుకున్నాడు.
జవాబులు
ఇ) వాలి సుగ్రీవుల మధ్య యుద్ధం భీకరంగా జరుగుతున్నది.
అ) రక్తపు మడుగులో పడియున్న వాలి కొంత సేపటికి తేరుకున్నాడు.
ఈ) శ్రీరాముని మాటలు విని వాలి తన తప్పు తెలుసుకున్నాడు.
ఆ) శ్రీరాముని తమ వల్లనే తాను ఈ స్థితిలో ఉన్నానని సుగ్రీవుడు చెప్పాడు.

10. అ) హనుమంతుని అభిప్రాయాలకు సమ్మతి తెలుపుతూ రామలక్ష్మణులు తమ వృత్తాంతాన్ని చెప్పారు.
ఆ) అగ్నిసాక్షిగా రామసుగ్రీవులు మిత్రులయ్యారు.
ఇ) వాలి భయంతో సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం చేరాడు.
ఈ) హనుమంతుడు సన్యాసి రూపంలో రామలక్ష్మణులను సమీపించాడు.
జవాబులు
ఈ) హనుమంతుడు సన్యాసి రూపంలో రామలక్ష్మణులను సమీపించాడు.
అ) హనుమంతుని అభిప్రాయాలకు సమ్మతి తెలుపుతూ రామలక్ష్మణులు తమ వృత్తాంతాన్ని చెప్పారు.
ఆ) అగ్నిసాక్షిగా రామసుగ్రీవులు మిత్రులయ్యారు.
ఇ) వాలి భయంతో సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం చేరాడు.

పాత్ర స్వభావాలు

1. సుగ్రీవుడు :
వాలి యొక్క తమ్ముడు. రాజనీతి బాగా తెలిసినవాడు. వారిని ఓడించడానికి శ్రీరామునితో స్నేహం చేశాడు. ఓడించాడు. శ్రీరామునకు సీతాదేవి జాడను తన మంత్రి అయిన హనుమంతుని ద్వారా కనుగొన్నాడు. రామరావణ సంగ్రామంలో తన బలగాలను వినియోగించాడు. శ్రీరాముని విజయానికి కారకుడయ్యాడు.

2. హనుమంతుడు :
అంజనకు వాయుదేవుని అనుగ్రహం వల్ల జన్మించాడు. సుగ్రీవుని మంత్రి, సుగ్రీవునకు రామలక్ష్మణులతో స్నేహం ఏర్పాటు చేశాడు. సీత ఉన్న అశోకవనం తప్ప లంకంతా కాల్చాడు. సీత జాడ రామునకు చెప్పాడు. సీతకు ధైర్యం చెప్పాడు. తన బలం తనకు తెలియదు. ఎవరైనా తన బలాన్ని గుర్తు చేయాలి. మహాబలవంతుడు. శ్రీరాముని బంటు. చక్కగా మాట్లాడగల నేర్పు ఉన్నవాడు.

3. వాలి :
ఆలోచన తక్కువ. ఆవేశం ఎక్కువ. మహాబలవంతుడు. బలగర్వం ఎక్కువ. తమ్ముడైన సుగ్రీవుని బాధించాడు. భయపెట్టాడు. అతని భార్యను అపహరించాడు. శ్రీరాముని చేతిలో మరణించాడు.

సంఘటన ద్వారా గ్రహించుట

ప్రశ్న 1.
“కాలి అందెలు మాత్రం, మా వదినెగారివే. ఆమెకు నిత్యం పాదాభివందనం చేయడం వల్ల గుర్తుపట్టాను” అని రామునికి లక్ష్మణుడు చెప్పిన మాటను బట్టి, మీరేమి గ్రహించారో తెల్పండి.
జవాబు:
ఒక రాక్షసుడు స్త్రీని బలవంతంగా తీసుకుపోవడం తాను చూశానని, ఆమె రామా ! లక్ష్మణా ! అని అరిచిందనీ, ఒక నగల మూటను విసిరిందనీ చెప్పి సుగ్రీవుడు ఆ నగలను రామునికి చూపించాడు. శ్రీరాముడు సీత నగలను చూసి ఏడ్చాడు. లక్ష్మణుడు ఆ నగలను చూసి తాను ఆ నగల మూటలోని కేయురాలను, కుండలాలను గుర్తుపట్టలేనని అందులోని కాలి అందెలు మాత్రం సీతాదేవివని చెప్పాడు.

ఈ మాటలను బట్టి లక్ష్మణుడు తన వదిన సీతను, ఆ 14 సంవత్సరాలలో ఒక్కసారి కూడా తలపైకి ఎత్తి ఆమె ముఖాన్ని చూడలేదని గ్రహించాను. లక్ష్మణుడు మహాభక్తుడని వదినకు నిత్యం నమస్కరించే వాడనీ గ్రహించాను. లక్ష్మణుని వంటి సుగుణవంతుడు, సచ్చీలుడు మరొకరుండరని గ్రహించాను.

ప్రశ్న 2.
‘లక్ష్మణా ! ఈ హనుమంతుని మాటల్లో ఒక్క వ్యాకరణ దోషం లేదు’ అని రాముడు పలికిన మాటల వల్ల మీరేమి గ్రహించారు?
జవాబు:
హనుమంతుడు సన్యాసి వేషంలో రామలక్ష్మణులను సమీపించాడు. సుగ్రీవుని దూతగా వచ్చాడు. హనుమంతుని మాటల తీరు రామునికి నచ్చింది. హనుమంతుని మాటల్లో వ్యాకరణ దోషాలు లేవని లక్ష్మణుడితో చెప్పాడు.

శ్రీరాముని మాటల తీరును బట్టి హనుమంతుడు మంచి వాక్చాతుర్యం కలవాడని, ఉచ్ఛారణపరమైన, భాషాపరమైన, వ్యాకరణపరమైన దోషాలు లేకుండా మాట్లాడగలిగే సామర్థ్యం కలవాడని గ్రహించాను. మాటల్లో ఎలాంటి దోషాలు లేకుండా మాట్లాడాలని, అది అందరిని ఆకట్టుకుంటుందని గ్రహించాను.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

ప్రశ్న 3.
“తమ్ముడి భార్యను చెరబట్టడం వంటి అధర్మాలకు ఒడిగట్టినందువల్ల నేను నీకు మరణదండన విధించాను” అని రాముడు పలికిన మాటలను బట్టి మీరేమి గ్రహించారు?
జవాబు:
శ్రీరాముడు వాలిని సంహరించాడు. వాలి రామునితో “నన్ను ఎందుకు సంహరించావు?” అని అడిగాడు. దానికి సమాధానంగా రాముడు “తమ్ముని భార్యను చెరబెట్టడం వంటి అధర్మాలకు ఒడిగట్టినందువల్ల నేను నీకు మరణదండన విధించాను” అని చెప్పాడు.

శ్రీరాముని మాటల వల్ల పరస్త్రీని చెరబెట్టడం అన్యాయమని గ్రహించాను. సోదరుని భార్యను కూతురుగా భావించాలని, ధర్మాన్ని అతిక్రమించకూడదని గ్రహించాను. శ్రీరాముడు ధర్మాత్ముడు కాబట్టి అధర్మపరుడైన వాలిని సంహరించాడని గ్రహించాను. అధర్మపరులను శిక్షించడమే ధర్మాత్ముల లక్షణంగా గ్రహించాను.

ప్రశ్న 4.
శ్రీరాముడు తన కాలిబొటనవేలితో దుందుభి కళేబరాన్ని దూరంగా పడవేయడం, ఒకే బాణంతో మద్దిచెట్లను చీల్చడం ద్వారా మీరేమి గ్రహించారు?
జవాబు:
రామలక్ష్మణులు సుగ్రీవుడిని సమీపించారు. పరస్పరం స్నేహం చేసుకోవాలనుకున్నారు. శ్రీరాముడు సుగ్రీవునికి తన పరాక్రమంపై నమ్మకాన్ని కల్గించడానికి దుందుభి కళేబరాన్ని కాలిబొటనవేలితో దూరంగా పడవేశాడు. ఒకే బాణంతో మద్ది చెట్లను చీల్చాడు.

దీనివల్ల శ్రీరాముడు అమిత పరాక్రమవంతుడని, అసాధ్యమైన పనులను కూడా సుసాధ్యం చేయగల సమర్థుడని గ్రహించాను. దీనివల్ల శ్రీరాముని బలపరాక్రమాలపై సుగ్రీవునికి నమ్మకం కల్గియుంటుందని గ్రహించాను. విశ్వాసంతోనే మైత్రి చిరకాలం నిలుస్తుందని గ్రహించాను.

ప్రశ్న 5.
“సుగ్రీవా ! ఆపదలో ఆదుకున్నవాడే గదా మిత్రుడు” అని రాముడు పలకడం వల్ల మీరేమి గ్రహించారు?
జవాబు:
రామలక్ష్మణులు సుగ్రీవుడిని సమీపిరచారు. పరస్పరం సహకారం అందించుకోవాలనుకున్నారు. అగ్నిసాక్షిగా స్నేహం చేశారు. రాముడు సుగ్రీవుని బాధలను విని ‘మిత్రమా ! ఆపదలో ఆదుకున్నవాడే గదా మిత్రుడు’ అని మిత్ర ధర్మాన్ని గురించి పలికాడు.

శ్రీరాముని మాటల ద్వారా ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన మిత్రుడని గ్రహించాను. మిత్రుని కోసం అవసరమైతే ప్రాణాలను కూడా అర్పించడానికి సిద్ధపడాలని గ్రహించాను. మిత్రుని యొక్క సుఖాల్లోనే కాదు, అతనికి అనుకోని ఆపదలు వచ్చినప్పుడు కూడా. ఆదుకోవాలని గ్రహించాను.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

ప్రశ్న 6.
సంపాతి తన సోదరుడైన జటాయువు మరణవార్త విని బాధపడి వానరులకు సీత జాడను తెలియజేశాడు. దీనిని బట్టి మీరేమి గ్రహించారు?
జవాబు:
సంపాతి జటాయువు సోదరుడు. వానరుల ద్వారా జటాయువు మరణవార్త విని దుఃఖించాడు. ఆ దుఃఖంలోనే వానరులకు సీత జాడను తెలిపాడు. లంకకు వెళ్ళే మార్గాన్ని చెప్పాడు. తరువాత రెక్కలు రావడంతో సంపాతి గగనమార్గంలో వెళ్ళాడు.

జటాయువులాగే ఇతడు కూడా పరోపకారబుద్ధి కలవాడని, శ్రీరాముని సేవలో పరోక్షంగా సహకరించాడని గ్రహించాను. అతని పరోపకారబుద్ధి వల్లే రెక్కలు వచ్చాయని గ్రహించాను. శ్రీరాముని సేవలో తరించిన సంపాతి నిజంగా ధన్యజీవి అని గ్రహించాను.

విషయాత్మక ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
ఒకడు సన్యాసి రూపంలో వచ్చిచెడు చేశాడు. మరొకడు సన్యాసి రూపంలోనే వచ్చి మంచి చేశాడు. వారెవరు? అవేమిటి?
జవాబు:
రావణుడు సన్యాసి రూపంలో వచ్చి, సీతాదేవిని ఎత్తుకెళ్లాడు. సీతారాములకు ఎడబాటు కలిగించి వారి దుఃఖానికి కారకుడయ్యాడు. తన వంశ నాశనానికి కారకుడయ్యాడు. –
హనుమంతుడు సన్యాసి వేషంలో రామలక్ష్మణుల దగ్గరికి వచ్చాడు. సుగ్రీవునితో స్నేహం కుదిర్చాడు. సీతారాముల కలయికకు మార్గం చూపించాడు. తన జన్మ ధన్యం చేసుకొన్నాడు.

ప్రశ్న 2.
వాలి వధలో అధర్మం ఉందా? లేదా? ఎందుకు?
జవాబు:
వాలి వధలో అధర్మం లేదు. వాలి తన తమ్ముని భార్యను అపహరించాడు. అధర్మంగా ప్రవర్తించాడు. ధర్మ స్వరూపుడైన శ్రీరాముడు అధర్మాన్ని సహించలేడు. అధర్మంగా ప్రవర్తిస్తే ఎవరినైనా శిక్షిస్తాడు. అందుకే మరణదండన విధించాడు. వాలి వానరుడు కనుక జంతువులను చెట్ల చాటు నుండి వేటాడడం వేట ధర్మం, కనుక వాలి వధలో అధర్మం లేదు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

ప్రశ్న 3.
‘సుగ్రీవాజ్ఞ’ అంటే మీకు ఏమి అర్థమైంది?
జవాబు:
‘సుగ్రీవాజ్ఞ’ అంటే తిరుగులేని ఉత్తరువు (శాసనం) అని అర్థం. ఆయన చెప్పింది తలవంచి చేయాల్సిందే. సుగ్రీవుడు సీతాన్వేషణ విషయంలో శ్రీరాముడికి సహాయపడాలనుకున్నాడు. ఆయన వివిధ ప్రాంతాలలో గల వానర వీరులను రావలసిందిగా చెప్పమని హనుమంతుణ్ణి ఆజ్ఞాపించాడు. పదిరోజుల్లోగా రాకపోతే వాళ్ళకు మరణదండన తప్పదని హెచ్చరించాడు. హనుమంతుడు ఈ వార్తను అన్ని దిక్కులకూ వేగంగా పంపాడు. ఫలితంగా కోట్లమంది వానరయోధులు కిష్కింధకు చేరుకున్నారు. సుగ్రీవుని ఆజ్ఞ అటువంటిది. అందుకే సుగ్రీవాజ్ఞ అనేది జాతీయంగా స్థిరపడ్డది.

వ్యాసరూప ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
వాలి సుగ్రీవుల విరోధం గురించి రాయండి.
(లేదా)
వాలి, సుగ్రీవుల మధ్య విరోధానికి గల కారణాలను తెలపండి.
జవాబు:
వాలి సుగ్రీవులు అన్నదమ్ములు. వాలి మహాబలశాలి. తండ్రి తరువాత ‘కిష్కింధ’ కు వాలి రాజు అయ్యాడు. మాయావి రాక్షసుడికీ, వాలికీ విరోధం ఉంది. మాయావి వాలిని యుద్దానికి పిలిచాడు. వాలిసుగ్రీవులు మాయావి వెంటబడ్డారు. మాయావి గుహలో ప్రవేశించాడు. వాలి, సుగ్రీవుడిని బిలద్వారం దగ్గర ఉండమని చెప్పి, తాను బిలంలోకి వెళ్ళి మాయావితో సంవత్సర కాలం పోరాడాడు.

ఆ గుహలోంచి రక్తం బయటకు వచ్చింది. గుహలోపల రాక్షసుడివి, వాలివి అరుపులు వినబడ్డాయి. సుగ్రీవుడు వాలి చనిపోయాడని భావించి, రాక్షసుడు పైకి రాకుండా గుహద్వారం మూసివేసి, కిష్కింధకు వచ్చాడు. మంత్రులు సుగ్రీవుని కిష్కింధకు రాజును చేశారు. తర్వాత వాలి వచ్చి, సుగ్రీవుడు రాజుగా ఉన్నందున కోపించి, సుగ్రీవుడిని రాజ్యభ్రష్టుణ్ణి చేసి, సుగ్రీవుని భార్య రుమను తాను అపహరించాడు.

సుగ్రీవుడు ప్రాణభీతితో పారిపోయి భూమండలం అంతా తిరిగి, ఋష్యమూక పర్వతం చేరుకున్నాడు. మతంగముని శాపం వల్ల వాలి ఆ పర్వతానికి రాలేడు. వాలి ఋష్యమూకంపై కాలుపెడితే మరణిస్తాడని మతంగ మహర్షి శపించాడు.

రామలక్ష్మణులు’ సీతాదేవిని వెదకుతూ, ఋష్యమూక పర్వత సమీపానికి వచ్చారు. ధనుర్భాణాలు ధరించిన రామలక్ష్మణులను చూసి, వారు వాలి పంపితే తన్ను చంపడానికి వచ్చారని అనుకున్నాడు. హనుమంతుడు సుగ్రీవుని మంత్రి. హనుమ రామలక్ష్మణులను కలిసి, సుగ్రీవుని వృత్తాంతాన్ని వారికి చెప్పాడు. లక్ష్మణుడు సీతాపహరణం గురించి చెప్పాడు. హనుమ, రామలక్ష్మణులకూ, సుగ్రీవునికీ మైత్రిని చేకూర్చాడు. వాలిని చంపుతానని రాముడు మాట ఇచ్చాడు. వానరులను పంపి, సీతను వెదికిస్తానని సుగ్రీవుడు మాట ఇచ్చాడు.

రాముని మాటపై సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిచాడు. వాలి సుగ్రీవులు ఇద్దరూ ఒకే పోలిక. అందువల్ల రాముడు సుగ్రీవుని మెడలో “నాగకేసరపులత”ను వేయించాడు. ఓడిపోయిన సుగ్రీవుడు తిరిగి వాలిని యుద్ధానికి పిలిచాడు. రాముడు విషసర్పం వంటి బాణాన్ని వాలిపై వేశాడు. వాలి తన మెడలోని సువర్ణమాలను సుగ్రీవుడికి ఇచ్చాడు. తార, అంగదుల బాధ్యతను సుగ్రీవునికి అప్పచెప్పి వాలి మరణించాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

ప్రశ్న 2.
శ్రీరామ సుగ్రీవుల మైత్రి జరిగిన తీరును వివరించండి.
జవాబు:

  1. సీతాన్వేషణలో భాగంగా ఋష్యమూక పర్వత ప్రాంతానికి చేరుకొన్న రామలక్ష్మణులను చూసి వాలి పంపిన వీరులని భయపడిన సుగ్రీవుడు హనుమంతుడిని పంపి వివరాలు తెలుసుకొమ్మని కోరాడు.
  2. సన్యాసిరూపంలో వెళ్ళిన హనుమంతుడు రామలక్ష్మణుల రూపలావణ్యాలను పొగిడి పరిచయం కోరాడు. మౌనముద్ర దాల్చిన రామలక్ష్మణులకు తన వివరాలు తెల్పి సుగ్రీవుడు పంపగా వచ్చినట్లు చెప్పాడు.
  3. సుగ్రీవుని గుణగణాలు తెల్పి, అన్నయైన వాలి అతడికి చేసిన అన్యాయాన్ని చెప్పి, రక్షణ కోసం సుగ్రీవుడు జాగ్రత్త పడుతున్నాడని వివరించాడు.
  4. సుగ్రీవుడు మీ స్నేహాన్ని కోరుతున్నాడని చాకచాక్యంగా చెప్పాడు. విషయాన్ని చెప్పే పద్ధతిలో ఎంతో నేర్పు ప్రదర్శించాడు. హనుమంతుని మాట తీరు శ్రీరాముడిని ఎంతగానో ఆకట్టుకొంది.
  5. శ్రీరాముడు హనుమంతుణ్ణి ప్రశంసిస్తూ మాట్లాడి తమ వృత్తాంతం చెప్పవలసినదిగా లక్ష్మణుణ్ణి ఆదేశించాడు. లక్ష్మణుడు శ్రీరాముని ఆదేశాన్ని అనుసరించి తమ వృత్తాంతం హనుమంతుడికి తెల్పి సుగ్రీవుని సహాయం కావాలని కోరాడు.
  6. సన్యాసి రూపం వదిలి రామలక్ష్మణులను తన భుజాలపై ఎక్కించుకొని ఋష్యమూక పర్వతానికి చేరిన హనుమంతుడు ప్రాణభయంతో మలయగిరికి చేరిన సుగ్రీవుణ్ణి పిలుచుకు వచ్చాడు. శ్రీరామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు.

ప్రశ్న 3.
ఒకడు సన్యాసి వేషంలో వచ్చి అపకారం చేశాడు. మరొకడు ఉపకారం చేశాడు. వారెవరు? వాటి ఫలితాలేమిటి?
జవాబు:
రావణుడు అనే రాక్షసుడు, సన్యాసి వేషంలో వచ్చి పంచవటిలో పర్ణశాలలో ఒంటరిగా ఉన్న సీతను బలవంతంగా అపహరించి లంకకు తీసుకుపోయాడు. ఈ విధంగా సస్యాసి వేషంలో వచ్చిన రావణుడు రామలక్ష్మణులకు అపకారం చేశాడు.

రామలక్ష్మణులు సుగ్రీవుడితో స్నేహం చేయాలని సుగ్రీవుడు ఉన్న ఋష్యమూక పర్వతం దగ్గరకు వచ్చారు. రామలక్ష్మణులను చూసి వారు తన్ను చంపడానికి అన్న వాలి పంపిన వీరులని సుగ్రీవుడు భయపడ్డాడు. రామలక్ష్మణుల వివరాలు తెలిసికోమని, అంజనేయుడు అనే తన మంత్రిని సన్యాసి వేషంలో సుగ్రీవుడు పంపాడు. హనుమంతుడు సన్యాసి రూపంలో వచ్చి, రామలక్ష్మణులను గూర్చి తెలిసికొని, రామసుగ్రీవులకు మైత్రిని కల్పించాడు. వానర సహాయంతో రాముడు రావణుడిని చంపి, సీతను తీసుకువచ్చాడు.

ఈ విధంగా సన్యాసి రూపంలో వచ్చి ఉపకారం చేసినవాడు హనుమంతుడు. హనుమంతుని సాయంతోనే సీతను అపహరించిన రావణుడిని సంహరించి, రాముడు సీతను తిరిగి తీసుకువచ్చాడు.

ప్రశ్న 4.
రామసుగ్రీవుల స్నేహం గూర్చి విశ్లేషించండి.
జవాబు:
వాలిసుగ్రీవులు అన్నదమ్ములు. సుగ్రీవుడిని రాజ్యం నుండి తరిమి, సుగ్రీవుని భార్య రుమను వాలి చేపట్టాడు. సుగ్రీవుడు ఋష్యమూక పర్వతంపై ఉంటున్నాడు. హనుమంతుడు సుగ్రీవునకు మంత్రి. సుగ్రీవుడితో స్నేహం చేయాలని రామలక్ష్మణులు, ఋష్యమూక పర్వతం దగ్గరకు వచ్చారు. సుగ్రీవుడు ధనుర్ధారులయిన రామలక్ష్మణులను చూసి వారు తన్ను చంపడానికి వాలి పంపించిన వీరులని, భయపడ్డాడు. రామలక్ష్మణులను గూర్చి తెలిసికొని రమ్మని తన మంత్రి హనుమంతుడిని సుగ్రీవుడు పంపాడు.

హనుమంతుడు సన్యాసి రూపంలో రామలక్ష్మణుల వద్దకు వచ్చాడు. రామలక్ష్మణులకు సుగ్రీవుడిని గూర్చి చెప్పి తాను సుగ్రీవుని మంత్రిననీ, పేరు హనుమంతుడనీ చెప్పాడు. హనుమంతుని మాటల్లోని నేర్పును రాముడు మెచ్చుకున్నాడు. లక్ష్మణుడు తమకు సుగ్రీవుని సాయం కావాలన్నాడు. హనుమంతుడు రామలక్ష్మణులను తన భుజాలపై ఎక్కించుకొని సుగ్రీవుని దగ్గరకు తీసుకువచ్చాడు. అక్కడ శ్రీరామ సుగ్రీవులు, అగ్నిసాక్షిగా స్నేహితులయ్యారు.

సుగ్రీవుడు రామునితో ప్రాణమిత్రులుగా ఉందామని చెప్పి తనకు వాలి నుండి అభయం కావాలని కోరాడు. వాలిని చంపుతానని రాముడు మాట ఇచ్చాడు. సుగ్రీవుడు సీత విడిచిన నగల మూటను రామునికి చూపించాడు. సుగ్రీవుడు సీతను వెదికించడానికీ, రావణుని చంపడానికీ, రామునికి సాయం చేస్తానన్నాడు. రాముడు తన కాలి బొటనవ్రేలితో దుందుభి శరీరాన్ని 10 యోజనాల దూరం విసరివేశాడు. ఒక బాణంతో ఏడు తాడిచెట్లను పడగొట్టాడు. దానితో సుగ్రీవునికి రాముడి బలంపై నమ్మకం కుదిరింది. రామసుగ్రీవులు ప్రాణమిత్రులు అయ్యారు.

ప్రశ్న 5.
వాలి సుగ్రీవుల యుద్దానికి కారణాలను విశ్లేషించండి.
జవాబు:
వాలి సుగ్రీవులు అన్నదమ్ములు. వాలి మహాబలశాలి. వాలి, తండ్రి తర్వాత కిష్కింధకు రాజు అయ్యాడు. మాయావి అనే రాక్షసుడు, వాలిని యుద్దానికి పిలిచాడు. వాలి సుగ్రీవులు మాయావి వెంటపడ్డారు. మాయావి ఒక గుహలో ప్రవేశించాడు. వాలి, తన తమ్ముడు సుగ్రీవుడిని బిలద్వారం దగ్గర కాపలా ఉండమని, తాను బిలంలోకి వెళ్ళి, మాయావితో సంవత్సర కాలం పోరాడాడు.

ఆ గుహాద్వారం నుండి రక్తం బయటకు వచ్చింది. గుహలో వాలి, మాయావి యొక్క అరపులు వినిపించాయి. సుగ్రీవుడు వాలి చనిపోయాడని అనుకొని, మాయావి పైకి రాకుండా గుహాద్వారం మూసివేసి, కిష్కింధకు తిరిగి వచ్చాడు. మంత్రులు వాలి చచ్చిపోయాడనుకొని, సుగ్రీవుడిని కిష్కింధకు రాజును చేశారు. తర్వాత వాలి మాయావిని చంపి, గుహాద్వారాన్ని తెరిచి, కిష్కింధకు వచ్చాడు. సుగ్రీవుడు రాజుగా ఉన్నందుకు వాలి కోపించి, సుగ్రీవుడిని రాజ్యభ్రష్టుడిని చేసి, సుగ్రీవుడి భార్య రుమను తాను అపహరించాడు.

సుగ్రీవుడు ప్రాణభయంతో పారిపోయి, భూమండలం అంతా తిరిగి, ఋష్యమూక పర్వతంపై ఉన్నాడు. మతంగముని శాపం వల్ల వాలి, ఆ పర్వతానికి రాలేడని, సుగ్రీవుడు ఆ పర్వతంపై ఉన్నాడు. ఈ విధంగా అన్నదమ్ములయిన వాలి సుగ్రీవులకు విరోధం వచ్చింది. సుగ్రీవుడు రాముని సహాయంతో వెళ్ళి, వాలితో యుద్ధం చేశాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

ప్రశ్న 6.
శ్రీరాముడు వాలిని చంపడం ధర్మమా? కాదా? చర్చించండి.
జవాబు:
రామ సుగ్రీవులకు స్నేహం కుదిరింది. సుగ్రీవుడు తనకు తన అన్న వాలి వల్ల భయం ఉందనీ, రాముడి అభయం కావాలనీ రాముడిని అడిగాడు. రాముడు సుగ్రీవుని భార్యను అపహరించిన వాలిని, తప్పక వధిస్తానని సుగ్రీవుడికి మాట ఇచ్చాడు.

వాలిసుగ్రీవుల యుద్ధం భయంకరంగా సాగింది. సుగ్రీవుడి శక్తి తగ్గిపోయింది. అప్పుడు రాముడు వాలి మీదికి బాణం వేశాడు. ఆ బాణం తగిలి వాలి తెలివి తప్పాడు. తరువాత వాలి తెలివి తెచ్చుకుని రాముడు అధర్మంగా ప్రవర్తించాడని తప్పు పట్టాడు.

రామునికి కాని, రాముని దేశానికి కాని వాలి అపచారం చేయలేదు. అదీగాక వాలి సుగ్రీవుడితో యుద్ధం చేస్తున్నప్పుడు రాముడు వాలిపై దొంగదెబ్బ తీశాడు. అందువల్ల రాముడు వాలిని చంపడం అధర్మమని, వాలి రాముడిని తప్పు పట్టాడు.

వాలి మాటలకు రాముడు జవాబు చెష్పాడు. తమ్ముడి భార్యను చెరబట్టడం వంటి అధర్మాలు చేయడం వల్ల తాను వాలికి మరణదండన విధించానన్నాడు. వాలి, వానరుడు కాబట్టి తాను చాటున ఉండి కొట్టడం, తప్పు కాదన్నాడు.

రాముడు మహారాజు కాబట్టి, తప్పు చేసిన వాలిని చంపడం ధర్మమే అవుతుంది.

ప్రశ్న 7.
శ్రీరామ సుగ్రీవుల మైత్రి ఎలా ఏర్పడింది?
జవాబు:
వాలి సుగ్రీవులు అన్నదమ్ములు. రామలక్ష్మణులు సుగ్రీవునితో మైత్రి చేయాలని సుగ్రీవుడు ఉంటున్న ఋష్యమూక పర్వతం దగ్గరకు వచ్చారు. సుగ్రీవుడు రామలక్ష్మణులను చూసి, వాలి తన్ను చంపడానికి పంపిన వీరులని భయపడ్డాడు. రామలక్ష్మణులను గురించి తెలుసుకోమని తనమంత్రి హనుమంతుని సుగ్రీవుడు పంపాడు.

హనుమ సన్న్యాసి రూపంలో రామలక్ష్మణుల దగ్గరికి వచ్చాడు. హనుమంతుడు సుగ్రీవుని గూర్చి రామలక్ష్మణులకు చెప్పి, తాను సుగ్రీవుని మంత్రిననీ, తన పేరు హనుమంతుడనీ చెప్పాడు. హనుమ మాటల్లోని నేర్పును రాముడు మెచ్చుకున్నాడు. హనుమతో లక్ష్మణుడు తమకు సుగ్రీవుని సాయం కావాలని చెప్పాడు. హనుమ రామలక్ష్మణులను తన భుజాలపై ఎక్కించుకొని, సుగ్రీవుని వద్దకు తీసుకువచ్చాడు. శ్రీరామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా స్నేహితులయ్యారు.

సుగ్రీవుడు రామునితో “ప్రాణమిత్రులుగా ఉందాం” అని చెప్పి, తనకు వాలి భయం లేకుండా అభయం కావాలి అన్నాడు. వాలిని చంపుతానని రాముడు మాట ఇచ్చాడు. సుగ్రీవుడు రామునితో “ఒక రాక్షసుడు స్త్రీని బలవంతంగా తీసుకుపోవడం తాను చూశాననీ, ఆమె “రామా! లక్ష్మణా!” అని గట్టిగా అరుస్తుండగా తాను విన్నానని చెప్పి ఆమె జారవిడిచిన నగల మూటను తెప్పించి రాముడికి చూపించాడు. రాముడు ఆ నగలను చూసి ఏడ్చాడు. లక్ష్మణుడు ఆ నగలలోని కాలి అందెలు తన వదిన సీతమ్మవే అన్నాడు.

సుగ్రీవుడు సీతను వెదికించడానికీ, రావణుని చంపడానికీ, రాముడికి సాయం చేస్తానన్నాడు. రామ సుగ్రీవులు ప్రాణమిత్రులు అయ్యారు. శ్రీరాముడు కాలి బొటన వ్రేలుతో దుందుభి శరీరాన్ని 10 యోజనాల దూరం చిమ్మివేశాడు. ఒక్క బాణంతో ఏడు తాడిచెట్లను కూల్చి రాముడు సుగ్రీవుడికి తన బలంపై నమ్మకం కల్గించాడు.

సుగ్రీవుడు రామలక్ష్మణులతో కలిసి కిష్కింధకు వెళ్ళి వాలిని యుద్దానికి పిలిచాడు. వాలి సుగ్రీవులు ఒకే పోలికగా ఉన్నారు. అందువల్ల రాముడు వారిని గుర్తించలేక, బాణం వేయలేదు. సుగ్రీవుడు ఓడిపోయాడు.

రాముడు, సుగ్రీవుడి మెడలో “నాగకేసరపులత”ను గుర్తుగా వేయించాడు. సుగ్రీవుడు తిరిగి వాలిని యుద్ధానికి రమ్మని కవ్వించాడు. రాముని సాయంతో సుగ్రీవుడు వచ్చాడనీ, యుద్ధానికి వెళ్ళవద్దనీ, వాలికి అతడి భార్య తార చెప్పింది. వాలి సుగ్రీవులకు భయంకర యుద్ధం జరిగింది. రాముడు విషసర్పం వంటి బాణం వేసి, వాలిని సంహరించాడు.

సుగ్రీవుడు కిష్కింధకు రాజయ్యాడు. సుగ్రీవుడు సీతను వెదికించడానికి వానరవీరులను పిలిచాడు. అన్ని దిక్కులకూ వానరులను సీతాన్వేషణ కోసం పంపాడు. దక్షిణ దిశకు అంగదుని నాయకత్వంలో హనుమంతుడు, జాంబవంతుడు మొదలయిన వానరులను పంపాడు.

దక్షిణ దిశకు వెళ్ళిన వానరులకు ‘సంపాతి’ పక్షి కనబడింది. సంపాతి పక్షి, దివ్యజ్ఞానంతో రావణుని వృత్తాంతాన్ని వానరులకు చెప్పింది. జాంబవంతుడు హనుమంతునికి ఉత్సాహం కలిగించాడు. హనుమ తాను సముద్రాన్ని దాటి వెళ్ళి లంకలోని సీత జాడను తెలుసుకుంటానని మహేంద్రగిరిపైకి చేరాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

ప్రశ్న 8.
హనుమంతుడు సీతాన్వేషణకై బయలుదేరిన విధమెట్టిది?
జవాబు:
సుగ్రీవుడు సీతాన్వేషణకై వానరులను అన్ని దిశలకూ పంపాడు. అంగదుని నాయకత్వంలో హనుమ, జాంబవంతుడు మొదలయిన వీరులను దక్షిణ దిక్కుకు పంపాడు. తూర్పు, పడమర, ఉత్తర దిక్కులకు వెళ్ళిన వానరులు, వట్టి చేతులతో తిరిగివచ్చారు.

అంగదుని నాయకత్వంలో దక్షిణ దిశకు బయలుదేరి వచ్చిన వానర వీరులు అణువణువూ వెదకుతున్నారు. సుగ్రీవుడు ఇచ్చిన గడువు నెలపూర్తి అయ్యింది. అంగదుడు ఉత్సాహంతో ముందుకు కదలుదాము అన్నాడు. వారు ‘ఋక్షబిలము’ అనే గుహ దగ్గరికి వచ్చారు. వానరులకు ఆకలి, దాహము పట్టుకొంది. అక్కడ ‘స్వయంప్రభ’ అనే యోగిని దయతో, వానరులు ఆకలిదప్పులు తీర్చుకొన్నారు. ఆమె ప్రభావంతో, వారు సముద్రతీరానికి చేరారు. వానరులు సీత జాడ తెలిశాకే సుగ్రీవుని కలుద్దాం అనుకున్నారు.

వానరుల మాటలో ‘జటాయువు’ మాట వచ్చింది. ఈ జటాయువు సోదరుడు ‘సంపాతి’. సంపాతి తన దివ్యదృష్టితో లంకను గురించి వానరులకు చెప్పాడు. లంకకు వెళ్ళాలంటే సముద్రాన్ని దాటాలి. అది ఎవరివల్ల ఔతుందో అని వానరులు చర్చించుకున్నారు. హనుమంతుడు ఒక్కడే సముద్రాన్ని దాటగలడని చివరకు వారు నిశ్చయించారు.

జాంబవంతుడు హనుమంతుడికి, అతని శక్తియుక్తులను గురించి తెలిపాడు. హనుమ బలాన్ని పుంజుకున్నాడు. దానితో హనుమ వానరులతో “నేను వేయి పర్యాయాలు మేరు పర్వతాన్ని చుట్టి రాగలను. సముద్రాలను దాటగలను” అని చెప్పాడు.

హనుమ మాటలకు జాంబవంతుడు ఆనందించాడు. “నీ ధైర్యోత్సాహాలకు తగు విధంగా మాట్లాడావు. నీవు ఋషులు, గురువుల అనుగ్రహంతో సముద్రాన్ని దాటు. నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మన వానరుల ప్రాణాలన్ని నీపై ఆధారపడి యున్నాయి” అని జాంబవంతుడు హనుమకు చెప్పాడు.

హనుమ, తాను ఎగరడానికి ‘మహేంద్రగిరి’ తగినదని, నిశ్చయించి అక్కడకు చేరాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 అరణ్యకాండ

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం 3rd Lesson అరణ్యకాండ Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions ఉపవాచకం 3rd Lesson అరణ్యకాండ

10th Class Telugu ఉపవాచకం 3rd Lesson అరణ్యకాండ Textbook Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

సంఘటనా క్రమం

సంఘటనల ఆధారంగా వరుస క్రమంలో వాక్యాలను అమర్చడం.

1. అ) దండకారణ్యం పవిత్ర ప్రదేశం. ప్రశాంత ప్రదేశం.
ఆ) ఆశ్రమ సముదాయాన్ని చూడగానే అల్లెతాడును ధనుస్సు నుండి వేరుచేశాడు శ్రీరాముడు.
ఇ) పక్షులు, మృగాలు – సకల ప్రాణులకు సురక్షితమైన ప్రాంతం అది.
ఈ) అక్కడ లోకక్షేమం కోసం యజ్ఞయాగాలు జరుగుతున్నాయి.
జవాబులు
అ) దండకారణ్యం పవిత్ర ప్రదేశం, ప్రశాంత ప్రదేశం.
ఇ) పక్షులు, మృగాలు, సకల ప్రాణులకు సురక్షితమైన ప్రాంతం అది.
ఈ) అక్కడ లోకక్షేమం కోసం యజ్ఞయాగాలు జరుగుతున్నాయి.
ఆ) ఆశ్రమ సముదాయాన్ని చూడగానే అల్లెతాడును ధనుస్సు నుండి వేరుచేశాడు.

2. అ) తన తండ్రికి ఆత్మీయుడైన జటాయువునకు సీత రక్షణ బాధ్యత అప్పగించాడు. శ్రీరాముడు.
ఆ) కష్టాలతో కూడిన వనవాసానికి సీత కోరిరావడం.సాహసమని అభినందించాడు.
ఇ) శ్రీరాముడి రాకను గమనించి అగస్త్యుడు శిష్యసమేతంగా ఎదురువెళ్లాడు.
ఈ) అగస్త్యుడు శ్రీరామునకు దివ్యధనుస్సు, అక్షయతూణీరాలు, అమోఘమైన ఖడ్గాన్ని బహుకరించాడు.
జవాబులు
ఇ) శ్రీరాముడి రాకను గమనించి అగస్త్యుడు శిష్యసమేతంగా ఎదురువెళ్లాడు.
ఈ) అగస్త్యుడు శ్రీరామునకు దివ్యధనుస్సు, అక్షయతూణీరాలు, అమోఘమైన ఖడ్గాన్ని బహుకరించాడు.
ఆ) కష్టాలతో కూడిన వనవాసానికి సీత కోరిరావడం సాహసమని అభినందించాడు.
అ) తన తండ్రికి ఆత్మీయుడైన జటాయువునకు సీత రక్షణ బాధ్యత అప్పగించాడు శ్రీరాముడు.

3. అ) సీతాదేవి అడ్డు తొలగించుకోవాలని ఆమెపై దాడికి దిగింది.
ఆ) ఇంతలో ‘శూర్పణఖ’ అనే రాక్షసి అక్కడికి వచ్చింది.
ఇ) ఆలస్యం చేయకుండా శూర్పణఖను విరూపిని చేయమన్నాడు శ్రీరాముడు.
ఈ) శ్రీరాముని సౌందర్యానికి ముగ్ధురాలైంది శూర్పణఖ.
జవాబులు
ఆ) ఇంతలో ‘శూర్పణఖ’ అనే రాక్షసి అక్కడికి వచ్చింది.
ఈ) శ్రీరాముని సౌందర్యానికి ముగ్ధురాలైంది శూర్పణఖ.
అ) సీతాదేవి అడ్డు తొలగించుకోవాలని ఆమెపై దాడికి దిగింది.
ఇ) ఆలస్యం చేయకుండా శూర్పణఖను విరూపిని చేయమన్నాడు శ్రీరాముడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 అరణ్యకాండ

4. అ) ఖరదూషణ త్రిశరులు, పద్నాలుగు వేల మంది రాక్షసవీరులు రాముడి ధాటికి నిలువలేక యముడి ఇంటికి పోవడాన్ని భరించలేకపోయింది శూర్పణఖ.
ఆ) రావణుడు మళ్లీ మారీచుని వద్దకు వెళ్లాడు. సీతాపహరణకు బంగారులేడిగా మారి సహకరించమన్నాడు.
ఇ) ‘సౌందర్యవతి అయిన సీతకు తగిన భర్తవు నీవే’నని రావణుడిలో కొత్త ఆశలను రేకెత్తించింది. .
ఈ) శ్రీరాముని బలంతో తన బలాన్ని పోల్చుకున్నాడు రావణుడు.
జవాబులు
అ) ఖరదూషణ త్రిశరులు, పద్నాలుగు వేల మంది రాక్షస వీరులు .రాముడి ధాటికి నిలువలేక యముడి ఇంటికి పోవడాన్ని భరించలేకపోయింది శూర్పణఖ.
ఇ) ‘సౌందర్యవతి అయిన సీతకు తగిన భర్తవు నీవే’నని రావణుడిలో కొత్త ఆశలను రేకెత్తించింది.
ఈ) శ్రీరాముని బలంతో తన బలాన్ని పోల్చుకున్నాడు రావణుడు.
ఆ) రావణుడు మళ్లీ మారీచుని వద్దకు వెళ్లాడు. సీతాపహరణకు బంగారు లేడిగా మారి సహకరించమన్నాడు.

5. అ) మారీచుని కంఠధ్వనిని రామునిదిగా భావించి సీత ఆందోళన చెందింది.
ఆ) మారీచుడు బంగారులేడిగా మారి శ్రీరాముని ఆశ్రమ ప్రాంతంలో తిరుగుతున్నాడు.
ఇ) సీత ఇష్టాన్ని తోసివేయలేక ఆ మాయలేడిని చంపి అయినా సరే తేవడానికి సంసిద్ధుడయ్యాడు శ్రీరాముడు.
ఈ) తనకు అదెంతో నచ్చిందని, తీసుకురావాలని కోరింది సీత.
జవాబులు
ఆ) మారీచుడు బంగారులేడిగా మారి శ్రీరాముని ఆశ్రమ ప్రాంతంలో తిరుగుతున్నాడు.
ఈ) తనకు అదెంతో నచ్చిందని, తీసుకురావాలని కోరింది సీత.
ఇ) సీత ఇష్టాన్ని తోసివేయలేక ఆ మాయాలేడిని చంపి అయినా సరే తేవడానికి సంసిద్ధుడయ్యాడు శ్రీరాముడు.
అ) మారీచుని కంఠధ్వనిని రామునిదిగా భావించి సీత ఆందోళన చెందింది.

6. అ) చివరకు రావణుడు ఖడ్గంతో జటాయువు రెక్కలను, కాళ్లను నరికివేశాడు.
ఆ) సన్యాసి వేషాన్ని వదిలి పదితలలతో భయంకరమైన నిజస్వరూపంతో సీత ఎదుట నిలిచాడు.
ఇ) యతి రూపంలో వచ్చిన రావణుణ్ణి ఆసనం మీద కూర్చుండబెట్టి సముచితంగా అతిథి మర్యాదలు చేసింది సీత.
ఈ) రావణుడు సీతాదేవిని తీసుకుని ఆకాశమార్గం పట్టాడు.
జవాబులు
ఇ) యతి రూపంలో వచ్చిన రావణుణ్ణి ఆసనంమీద కూర్చుండబెట్టి సముచితంగా అతిథి మర్యాదలు చేసింది సీత.
ఆ) సన్యాసి వేషాన్ని వదిలి పదితలలతో భయంకరమైన నిజస్వరూపంతో సీత ఎదుట నిలిచాడు.
అ) చివరకు రావణుడు ఖడ్గంతో జటాయువు రెక్కలను, కాళ్లను నరికివేశాడు.
ఈ) రావణుడు సీతాదేవిని తీసుకొని ఆకాశమార్గం పట్టాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 అరణ్యకాండ

7. అ) మారీచుణ్ణి వధించి శ్రీరాముడు వెనుదిరిగాడు.
ఆ) రావణుడు సీతాదేవిని తీసుకొని ఆకాశమార్గం పట్టాడు.
ఇ) జటాయువు రావణుణ్ణి ఎదిరించాడు.
ఈ) లక్ష్మణుడు వెళ్ళడాన్ని గమనించాడు రావణుడు.
జవాబులు
ఈ) లక్ష్మణుడు వెళ్ళడాన్ని గమనించాడు రావణుడు.
ఆ) రావణుడు సీతాదేవిని తీసుకొని ఆకాశమార్గం పట్టాడు.
ఇ) జటాయువు రావణుణ్ణి ఎదిరించాడు.
అ) మారీచుణ్ణి వధించి శ్రీరాముడు వెనుదిరిగాడు.

8. అ) మారీచుడు బంగారు లేడిగా మారి సీత నివాసం ఉండే ప్రాంతానికి వచ్చాడు.
ఆ) శ్రీరాముని రాకను గమనించి అగస్త్యుడు శిష్య సమేతంగా ఎదురువెళ్ళాడు.
ఇ) ఒకనాడు శ్రీరాముడు పురాణకథా ప్రసంగంలో ఉన్నాడు.
ఈ) విరాధుని మాట ప్రకారం శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి బయల్దేరాడు.
జవాబులు
ఈ) విరాధుని మాట ప్రకారం శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి బయల్దేరాడు.
ఆ) శ్రీరాముని రాకను గమనించి అగస్త్యుడు శిష్య సమేతంగా ఎదురువెళ్ళాడు.
ఇ) ఒకనాడు శ్రీరాముడు పురాణకథా ప్రసంగంలో ఉన్నాడు.
అ) మారీచుడు బంగారులేడిగా మారి సీత నివాసం ఉండే ప్రాంతానికి వచ్చాడు.

9. అ) రావణుడు సీతను తీసుకొని ఆకాశమార్గంలో వెళ్ళాడు.
ఆ) లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోశాడు.
ఇ) పంచవటిలో జీవనం ప్రశాంతంగా గడుస్తున్నది.
ఈ) సీతారామలక్ష్మణులకు మహర్షులు సాదర స్వాగతం పలికారు.
జవాబులు
ఈ) సీతారామలక్ష్మణులకు మహర్షులు సాదర స్వాగతం పలికారు.
ఇ) పంచవటిలో జీవనం ప్రశాంతంగా గడుస్తున్నది.
ఆ) లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోశాడు.
అ) రావణుడు సీతను తీసుకొని ఆకాశమార్గంలో వెళ్ళాడు.

పాత్ర స్వభావాలు

1. శరభంగ మహర్షి :
శరభంగుడు మహాతపస్వి. దైవసాక్షాత్కారం పొందినవాడు. శ్రీరాముని చూసి శ్రీరామదర్శనం కోసమే తాను వేచివున్నానన్నాడు. తన తపఃఫలాన్నంతా శ్రీరామునికి ధారపోశాడు.

2. అగస్త్యుడు :
అగస్త్యుడు తపశ్శక్తి సంపన్నుడు. ఆకాశాన్ని తాకిన వింధ్య పర్వత గర్వాన్ని అణచినవాడు. ‘అగమ్ స్తంభయతీతి అగస్త్యః’ పర్వతాన్ని స్తంభింపజేసినవాడు కనుక అగస్త్యుడయ్యాడు.

3. జటాయువు :
ఒక పెద్ద గ్రద్ద. సంపాతికి తమ్ముడు. దశరథునికి మిత్రుడు. శ్రీరాముడు ఇతనికి సీత సంరక్షణ బాధ్యతను అప్పగించాడు. రావణాసురుడు సీతను అపహరించి తీసుకొని వెడుతుంటే నిరోధించాడు. గాయాల పాలయ్యాడు. శ్రీరామునికి విషయాన్ని వివరించాడు. శ్రీరాముని చేతిలో కన్నుమూశాడు.

4. కబంధుడు :
ఒక రాక్షసుడు. ఇతని చేతిలో చిక్కితే ఎవ్వరూ తప్పించుకోలేరు. రావణుడు అపహరించిన సీతాదేవి దొరికే ఉపాయాన్ని శ్రీరామునకు చెప్పాడు.

5. మారీచుడు :
మారీచుడు తాటకి అనే రాక్షసికి కుమారుడు. విశ్వామిత్రుడి యజ్ఞవేదికపై రక్తం కురిపించిన దుష్టుడు.

సీతాపహరణకై తనకు సాయం చేయమని రావణుడు మారీచుని కోరాడు. రాముడు సింహం వంటివాడని రాముణ్ణి కవ్వించడం కొరివితో తలగోక్కోడం వంటిదని, రావణునికి మారీచుడు హితవు చెప్పాడు.

రావణుడు తన మాట వినకపోతే చంపుతానని మారీచుని బెదిరించాడు.

రావణుని చేతిలో చావడం కంటే రాముని చేతిలో చస్తే తన జన్మ తరిస్తుందని మారీచుడు భావించాడు. బంగారు లేడిగా మారి సీతాపహరణకు రావణునికి సాయం చేశాడు. శ్రీరాముని బాణం దెబ్బకు మారీచుడు మరణించాడు. వేటకు వచ్చే రాజులను మాయలేడి రూపంలో మారీచుడు చంపేవాడు.

6. శబరి :
శబరి తపస్సిద్ధురాలు, జ్ఞానవయోవృద్ధురాలు. శ్రీరామదర్శనంతో ఆమె తనువు పులకించింది. పంపాతీరంలో దొరికే పండ్లను స్వామికి సమర్పించింది. తన జన్మ ధన్యమైనట్లు భావించింది. శ్రీరాముడి అనుమతిని పొంది తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసి అగ్నికాంతితో ఊర్ధ్వలోకాలకు వెళ్ళింది.

సంఘటన ద్వారా గ్రహించుట

ప్రశ్న 1.
“అన్నా! ఈ దైన్యాన్ని వదులు. అదే మనకు మేలుచేస్తుంది” అను లక్ష్మణుని మాటలను బట్టి, మీరేం గ్రహించారో తెలుపండి.
జవాబు:
రావణుడు సీతాదేవిని అపహరించాడు. రాముడు సీతావియోగంతో బాధపడుతున్నాడు. రామలక్ష్మణులు సీతను వెదకుతూ, అందమైన పంపాసరస్సు దగ్గరకు వచ్చారు. ఆ అందమైన ప్రకృతిని చూచి, శ్రీరాముడు మరింతగా విరహ బాధపడ్డాడు.

అప్పుడు రాముడు దైన్యాన్ని విడిచిపెడితే, మేలు కలుగుతుందని చెప్పి, లక్ష్మణుడు రాముని ఊరడించాడు. లక్ష్మణుడు చెప్పినట్లు, కష్టాలు వచ్చినపుడు అధైర్యపడకుండా ప్రయత్నం చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ, ఉత్సాహం ఉన్న వాడికి అసాధ్యం ఏమీ ఉండదనీ, ఉత్సాహం ఉన్న వాళ్ళు ఎలాంటి కష్టాలు వచ్చినా, వెనుకడుగు వేయరనీ, నేను గ్రహించాను.

ప్రశ్న 2.
‘నీ చేతిలో చావడం కన్నా, శ్రీరాముని చేతిలో చావడమే నయం’ అన్న మారీచుని మాటలను బట్టి, మీరు ఏమి గ్రహించారు?
జవాబు:
రావణుడు మారీచుని దగ్గరకు వచ్చి, సీతను అపహరించడానికి తనకు సాయం చేయుమని కోరాడు. రాముడి జోలికి వెళ్ళడం మంచిది కాదని, మారీచుడు రావణునికి హితువు చెప్పి పంపాడు.

కాని రావణుడు మళ్ళీ మారీచుడి దగ్గరకు వచ్చి, బంగారు లేడి రూపం ధరించి, సీతాపహరణానికి తనకు సాయం చెయ్యమని కోరాడు. తాను చెప్పినట్లు చెయ్యకపోతే, మారీచుని చంపుతానని రావణుడు చెప్పాడు.

రావణుడు చెప్పినట్లు చేసినా చెయ్యకపోయినా, మారీచుడికి మరణం తప్పని పరిస్థితి వచ్చింది.

అందుకే మారీచుడు మూర్ఖుడయిన రావణుడి చేతిలో చావడం కన్నా, ధర్మాత్ముడూ, మహావీరుడూ అయిన రాముడి చేతిలో చావడమే మంచిదని నిశ్చయించుకున్నాడు. రాముడి చేతిలో మరణిస్తే తన జన్మ తరిస్తుందని, మారీచుడు అనుకున్నాడు. దీనిని బట్టి దుర్మార్గుని చేతిలో చావడం కన్న, మంచివాడి చేతిలో మరణం పొందడం మంచిదని నేను గ్రహించాను. మారీచుడు రాక్షసుడయినా, మంచి చెడ్డలు తెలిసిన వాడని గ్రహించాను.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 అరణ్యకాండ

ప్రశ్న 3.
‘క్రూరులైన దుష్టులతో పరిహాసం పనికి రాదు’ అని శూర్పణఖ విషయంలో రాముడు పలికిన దానిని బట్టి మీరేమి గ్రహించారు?
జవాబు:
క్రూరులు అత్యంత ప్రమాదకారులు. వారితో పరిహాసం ఎన్నటికీ పనికిరాదు. దానివల్ల ఎన్నో అనర్థాలు కలుగుతాయి. వారు ఎదుటివారిని చులకనగా చూస్తారు. చనువుగా ప్రవర్తిస్తారు. మన సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేస్తారు.

క్రూరులతో సహవాసం చేయడం వల్ల వ్యక్తిత్వం నశిస్తుంది. సమాజంలో గౌరవం. అందువల్ల రాముడు చెప్పినట్లుగా క్రూరులతో సహవాసం పనికిరాదు.

ప్రశ్న 4.
“మహాత్ములారా! మీరు నన్ను ప్రార్థించడం తగదు. ఆజ్ఞాపించాలి. మీ ఆజ్ఞలను నేను శిరసా వహిస్తాను” అని రాముడు మునులతో అన్న మాటను బట్టి, మీరు ఏమి గ్రహించారో రాయండి.
జవాబు:
శ్రీరాముడు వనవాస కాలంలో సుతీక్ష మహర్షిని కలిశాడు. తరువాత అక్కడి మునులు అందరూ రాముడిని కలిసి, రాక్షసులు చేసే అకృత్యాలను గూర్చి చెప్పారు. రాక్షసుల బారినుండి తమ్ము రక్షింపుమని వారు రాముని ప్రార్థించారు.

అప్పుడు రాముడు ఆ మునులతో తన్ను ప్రార్థించడం తగదనీ, ఆజ్ఞాపించమనీ మునులు చెప్పినట్లు రాక్షసులను తాను సంహరిస్తాననీ, మునులకు అభయం ఇచ్చాడు.

దీనిని బట్టి శ్రీరాముడు మునుల మాటలను చాలా గౌరవించేవాడని, మునుల మాటలను ఆజ్ఞగా గ్రహించి వారు చెప్పినట్లు చేసేవాడని గ్రహించాను.

శ్రీరామునకు మునీశ్వరులపై భక్తి గౌరవములు హెచ్చుగా ఉండేవని గ్రహించాను. రాముడు మహావీరుడని గ్రహించాను.

ప్రశ్న 5.
“నన్ను అపహరించి నీ చావును నీవే కొని తెచ్చుకోకు” అని సీత, రావణుని హెచ్చరించిన మాటలను బట్టి, నీవేమి గ్రహించావో చెప్పు.
జవాబు:
రావణుడు సన్న్యాసి వేషంతో సీతవద్దకు వచ్చి, తనను భర్తగా స్వీకరిస్తే, గొప్ప భోగభాగ్యాలు అనుభవించవచ్చునని సీతకు ఆశచూపాడు.

రావణుని మాటలకు, సీత మండిపడింది. సీత మహా పతివ్రత. రావణుడు సీతను అపహరించి తీసుకొని వెడితే, అతడు తన చావును తాను కోరి తెచ్చుకున్నట్లే అని, సీత నిజాన్ని చెప్పిందని గ్రహించాను. రావణుడు సీతాపహరణం చేయకపోతే అతనికి మరణమే లేదని గ్రహించాను.

సీత మాటలను బట్టి ఆమె మహా ధైర్యం కలదనీ, నిర్భయంగా రావణుని వంటి రాక్షసుణ్ణి తిరస్కరించి మాట్లాడగలదనీ, , సత్యమూ హితమూ ఆమె బోధించిందనీ, నేను అర్థం చేసుకున్నాను.

ప్రశ్న 6.
రావణుడు సీతను అపహరించే సందర్భంలో జటాయువు చేసిన ప్రయత్నం నుండి మీరు ఏమి గ్రహించారు?
జవాబు:
రామలక్ష్మణులు లేని సమయంలో రావణుడు సన్యాసి వేషంలో సీతాదేవి సమీపానికి వచ్చాడు. నిజ స్వరూపాన్ని ప్రదర్శించాడు. లొంగిపొమ్మని బెదిరించాడు. కోపంతో రావణుడు సీతను తీసికొని రథంలో కూర్చుండబెట్టుకొని ఆకాశ మార్గంలో ప్రయాణిస్తున్నాడు.

అది గమనించిన జటాయువు రావణుని ఎదిరించాడు. వారిద్దరి మధ్య పోరాటం జరిగింది. చివరకు రావణుని చేతిలో మరణించాడు. మిత్రధర్మం కోసం అవసరమైతే ప్రాణాలను అర్పించడానికి సిద్ధపడాలని గ్రహించాను. ఆపదల్లో ఉన్న వారిని, ముఖ్యంగా స్త్రీలను తప్పక రక్షించాలని గ్రహించాను.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 అరణ్యకాండ

ప్రశ్న 7.
శ్రీరాముడిని భక్తితో సేవించి తరించిన శబరి వ్యక్తిత్వం నుండి మీరేమి గ్రహించారు?
జవాబు:
సీతను అన్వేషిస్తూ రామలక్ష్మణులు అరణ్యమార్గంలో ప్రయాణిస్తున్నారు. మార్గమధ్యలో శబరి ఆశ్రమానికి వచ్చారు. శబరి శ్రీరాముని రాకకై ఎదురుచూస్తున్నది. శ్రీరాముని దర్శనంతో ఆనందాన్ని పొందింది. ఫలాలతో శ్రీరాముడిని సేవించింది. పండ్లను పరిశుభ్రం చేసి అందించింది. అగ్నిలో తన శరీరాన్ని దహింపజేసుకొంది. ఊర్ధ్వ లోకాలకు వెళ్ళింది. శబరి వ్యక్తిత్వం వల్ల దైవాన్ని భక్తి, శ్రద్ధలతో సేవించాలని, ఇంటికి వచ్చిన వారిని అతిథి మర్యాదలతో సేవించాలని గ్రహించాను.

విషయాత్మక ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి. .

ప్రశ్న 1.
‘క్రూరులైన దుష్టులతో పరిహాసం పనికిరాదు’ ఈ మాట ఎవరు ఎవరితో ఎప్పుడు అన్నారు?
జవాబు:
పంచవటిలో శూర్పణఖ విషయంలో శ్రీరాముడు లక్ష్మణునితో అన్నాడు. ఆమె రావణుడి చెల్లెలు. శ్రీరాముడి సౌందర్యానికి ముగ్ధురాలైంది. తనను చేపట్టమంది. తమకు అడ్డుగా ఉన్న సీతాలక్ష్మణులను చంపి తింటానన్నది. శ్రీరాముడు పరిహాసంగా లక్ష్మణుని వద్దకు వెళ్లమన్నాడు. లక్ష్మణుడు కూడా పరిహాసం చేశాడు. సీతపై దాడికి దిగింది.

అప్పుడు క్రూరులైన దుష్టులతో పరిహాసం పనికిరాదు. శూర్పణఖను విరూపిని చేయమని లక్ష్మణుని రాముడు ఆజ్ఞాపించాడు. లక్ష్మణుడు తన అన్న ఆజ్ఞను అమలుపరిచాడు.

ప్రశ్న 2.
మారీచుని పరిస్థితి ‘ముందు నుయ్యి, వెనుక గొయ్యి’గా ఎందుకు మారింది?
జవాబు:
సీతాపహరణం చేయాలనుకొన్నాడు రావణుడు. మారీచుని బంగారులేడిగా మారమన్నాడు. రామబాణం రుచి తెలిసిన మారీచుడు తిరస్కరించాడు. రావణుడు చంపుతానన్నాడు. బంగారులేడిగా మారితే రాముడు చంపుతాడు. మారకపోతే రావణుడు చంపుతాడు. అప్పుడు మారీచుని పరిస్థితి ‘ముందు నుయ్యి వెనుక గొయ్యి’గా మారింది. శ్రీరాముని చేతిలో మరణిస్తే జన్మ ధన్యమవుతుందని భావించి బంగారు లేడిగా మారడానికి అంగీకరించాడు. అతని కోరిక తీరింది.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 అరణ్యకాండ

ప్రశ్న 3.
‘ఉత్సాహమున్న వానికి అసాధ్యం లేదు’ అని ఎవరు ఎవరితో ఏ సందర్భంలో అన్నారు?
జవాబు:
సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్లాడు. ఆమె జాడ తెలియక రామలక్ష్మణులు వెతుకుతున్నారు. వెతుకుతూ, వెతుకుతూ పంపా సరోవర ప్రాంతాన్ని చేరుకొన్నారు. ఆ ప్రాంతం చాలా అందంగా ఉంది. దానితో శ్రీరాముని బాధ పెరిగింది. అప్పుడు లక్ష్మణుడు అన్నగారి దైన్యాన్ని పోగొట్టడానికి పలికిన వాక్యమిది.

ప్రశ్న 4.
శూర్పణఖ ఎవరు? ఆమె అవమానం పొందడానికి కారణమేమిటో తెల్పండి.
జవాబు:
శూర్పణఖ ఒక రాక్షసి. ఈమె రావణునికి చెల్లెలు. శ్రీరాముని అందానికి మురిసిపోయి తనను పెళ్ళి చేసుకోమన్నది. అందుకు అడ్డంగా ఉన్న సీతను, లక్ష్మణుని చంపితింటానన్నది. రాముడు ఆమెను పరిహాసంగా లక్ష్మణుని వద్దకు పంపించాడు. లక్ష్మణుడు తాను అన్నగారి సేవకుణ్ణని, తనను పెళ్ళాడితే ఆమెకూడా తనతోబాటే అన్నకు దాస్యం చేయాల్సి వస్తుందని చెప్పి రాముణే పెళ్ళాడమని పంపాడు. సీత ఉండటం వల్లే రాముడు తనను నిరాకరించాడనుకొని సీతను చంపడానికి దాడి చేసింది. ప్రమాదాన్ని గుర్తించిన లక్ష్మణుడు అన్న ఆదేశంపై శూర్పణఖ ముక్కు, చెవులు కోసి ఆమెను విరూపిని చేశాడు. అలా తన రాక్షసత్వం వలన శూర్పణఖ రామలక్ష్మణులను కోరి అవమానం పొందింది.

వ్యాసరూప ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
పంచవటిలో సీతారామలక్ష్మణుల జీవితం ఎలా సాగిందో వివరించండి.
జవాబు:
అగస్త్య మహర్షి మాటపై, సీతారామలక్ష్మణులు, పంచవటికి చేరారు. లక్ష్మణుడు పంచవటిలో పర్ణశాలను నిర్మించాడు. సీత రక్షణ బాధ్యతను రాముడు, జటాయువుకు అప్పగించాడు. పంచవటిలో వారి జీవితం సుఖంగా సాగుతోంది. రావణుని చెల్లెలు శూర్పణఖ అక్కడకు వచ్చి, రాముడిని తనను చేపట్టమంది. లక్ష్మణుడు అన్న ఆజ్ఞతో శూర్పణఖ ముక్కు చెవులు కోశాడు. శూర్పణఖ సోదరుడైన ఖరుడి వద్దకు వెళ్ళి చెప్పింది. ఖరుడు 14 వేల మంది రాక్షసులతో రాముడి చేతిలో యుద్ధంలో మరణించాడు.

అకంపనుడు అనే గూఢచారి ఖరుడి మరణవార్త రావణుడికి అందించి రాముని భార్య సీతను అపహరించమని రావణుడికి సలహా చెప్పాడు. శూర్పణఖ వెళ్ళి రావణుడిని రెచ్చగొట్టింది.

రావణుడు మారీచుడిని మాయలేడిగా సీతారాములు ఉన్న పర్ణశాల వద్దకు పంపాడు. సీత ఆ లేడిని తెచ్చి ఇమ్మని రాముడిని కోరింది. రాముడు వెళ్ళి మాయలేడిని చంపాడు. మాయలేడి ‘సీతా! లక్ష్మణా! అంటూ అరచి రాముడి చేతిలో మరణించింది.

రాముడు ఆపదలో ఉన్నాడని సీత లక్ష్మణుడిని రాముని వద్దకు పంపింది. అదే సమయంలో సన్యాసి వేషంలో రావణుడు పర్ణశాలలో ఒంటరిగా ఉన్న సీతను బలాత్కారంగా తన రథంలో కూర్చోబెట్టి తీసుకువెడుతున్నాడు. సీత, ‘రామా, రామా’ అని కేకలు వేసింది. జటాయువు రావణుడిని ఎదిరించి, అతడి చేతిలో దెబ్బతింది. రావణుడు సీతను తన లంకా నగరానికి తీసుకువెళ్ళాడు.

రామలక్ష్మణులు ఆశ్రమానికి తిరిగి వచ్చారు. సీత జాడ తెలియక వారు దుఃఖించారు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 అరణ్యకాండ

ప్రశ్న 2.
మాయలేడి వలన సీతారాములకు కష్టాలు వచ్చాయని ఎలా చెప్పగలవు?
జవాబు:
రావణుడు పంచవటిలో ఉన్న సీతాదేవిని అపహరించాలనుకున్నాడు. రావణుడు మారీచుడిని బెదరించి, బంగారులేడి రూపంలో అతడిని రాముడి ఆశ్రమ ప్రాంతానికి పంపాడు. సీత ఆ జింకను చూసి ఇష్టపడింది. లక్ష్మణుడు అది మాయా మృగం అని చెప్పాడు. సీత ఆ లేడిని తెచ్చి ఇమ్మని పట్టుపట్టింది.

సీత ఇష్టాన్ని కాదనలేక, ఆ మాయలేడిని చంపి అయినా తేడానికి రాముడు వెళ్ళాడు. రాముడు ఎంత ప్రయత్నించినా లేడి అందకుండా పరుగుదీసింది. దానితో రాముడు లేడిపై బాణాన్ని వేశాడు. ఆ లేడి ‘సీతా! లక్షణా!’ అని అరుస్తూ చచ్చింది.

మాయలేడి కంఠ ధ్వని రాముడిది అని, సీత కంగారుపడి, రాముడికి సాయంగా లక్ష్మణుడిని పంపింది. లక్ష్మణుడు తప్పనిసరి పరిస్థితులలో సీతను విడిచి, రాముడి దగ్గరకు వెళ్ళాడు.

అదే అదనుగా రావణుడు సన్యాసి వేషంలో పర్ణశాలకు వచ్చి సీతను బలవంతంగా తీసుకుపోయాడు. కాబట్టి సీతారాముల కష్టానికి మాయలేడియే కారణం అని చెప్పగలము.

ప్రశ్న 3.
కబంధుడు అనే రాక్షసుడు శ్రీరామునకు ఉపకారం చేశాడని ఎలా చెప్పగలవు?
జవాబు:
కబంధుడు క్రౌంచారణ్యంలో ఉన్న ఒక రాక్షసుడు. ఇతడికి తల, మెడ లేవు. ఇతడి కడుపు భాగంలో ముఖం ఉండేది. రొమ్ము భాగంలో ఒకే కన్ను ఉండేది. ఇతనికి యోజనం పొడవు వ్యాపించిన చేతులు ఉండేవి. ఆ చేతులతో వాడు పక్షులను, మృగాలను పట్టి తినేవాడు.

కంబంధుడు రామలక్ష్మణులను తన చేతులతో పట్టుకొని తినబోయాడు. కబంధుడి చేతులకు చిక్కితే, ఎవరూ తప్పించుకోలేరు. కాని రామలక్ష్మణులు ఖడ్గాలతో కబంధుడి చేతులు నరికారు. అప్పుడు కబంధుడు తనకు శాపం వల్ల రాక్షసరూపం వచ్చిందనీ, తన శరీరాన్ని దహిస్తే తనకు దివ్యజ్ఞానం వస్తుందనీ రామలక్ష్మణులకు చెప్పాడు.

రామలక్ష్మణులు కబంధుడి శరీరాన్ని దహనం చేశారు….ఆ జ్వాలల నుండి కబంధుడు దివ్యదేహంతో వచ్చి, సీత దొరికే ఉపాయాన్ని రామలక్ష్మణులకు చెప్పాడు. సుగ్రీవుడితో స్నేహం చెయ్యమని వారికి చెప్పాడు. సుగ్రీవుని స్నేహంతో రాముడు సీతను తిరిగి తెచ్చుకున్నాడు. దీనినిబట్టి కబంధుడు రామలక్ష్మణులకు ఉపకారం చేశాడని చెప్పగలం.

ప్రశ్న 4.
సీతారాముల దండకారణ్యవాస వృత్తాంతాన్ని తెలపండి. (సీతారాములు పంచవటిని చేరిన వృత్తాంతం)
జవాబు:
సీతారామలక్ష్మణులు దండకారణ్యంలో ప్రవేశించారు. అక్కడ ఎన్నో మునుల ఆశ్రమాలు ఉన్నాయి. అక్కడ యజ్ఞయాగాలు జరుగుతున్నాయి. మునులు వీరికి స్వాగతం పలికారు.

వీరు దండకవనం మధ్యకు చేరారు. ‘విరాధుడు’ అనే రాక్షసుడు సీతారామలక్ష్మణులపై పడ్డాడు. రామలక్ష్మణులను తన భుజాలపై వేసుకొని వాడు తీసుకుపోతున్నాడు. సీత ఏడ్చింది. రామలక్ష్మణులు విరాధుని భుజాలు నరికివేశారు. విరాధుడు కుప్పకూలాడు. విరాధుణ్ణి గోతిలో పాతిపెడదామని వారు అనుకున్నారు. విరాధుడు తాను తుంబురుడిననీ, శాపంవల్ల రాక్షసుడుగా అయ్యానని చెప్పి, శరభంగమహర్షిని దర్శించమనీ, తనను గోతిలో పూడ్చమనీ రామలక్ష్మణులకు చెప్పాడు.

రామలక్ష్మణులు విరాధుణ్ణి పూడ్చి, శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. శరభంగ మహర్షి రామదర్శనం కోసం వేచి చూస్తున్నాడు. తన తపః ఫలాన్ని రాముడికి ధారపోశాడు. సుతీక్ష మహర్షిని దర్శించమని ఆయన చెప్పాడు.

సీతారామలక్ష్మణులు సుతీక్ష మహర్షిని దర్శించారు. ఆయన రామదర్శనం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ మహర్షి తన తపస్సును రామునికి ధారపోశాడు. ఈ విధంగా దండకారణ్యంలోని మునుల ఆశ్రమాలను దర్శిస్తూ, సీతారామలక్ష్మణులు పదిసంవత్సరాలు వనవాసం చేశారు. వారు తిరిగి సుతీక్ష.. మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. ఆయన అగస్త్యుని సోదరునీ, అగస్త్య మహర్షినీ దర్శనం చేసుకోమని రామలక్ష్మణులకు చెప్పాడు.

సీతారామలక్ష్మణులు అగస్త్య భ్రాత (సోదరుడు) ఆశ్రమాన్ని దర్శించారు. తరువాత అగస్త్యుని దర్శించారు. అగస్త్య మహర్షి శిష్యులతో రామునికి స్వాగతం పలికాడు. ఆయన రామునికి దివ్య ధనుస్సు, అక్షయ తూణీరాలు, ఖడ్గమును ఇచ్చాడు. రామునకు జయం కల్గుతుందని ఆశీర్వదించాడు.

రాముడు తాము నివసించడానికి తగిన ప్రదేశాన్ని సూచించమని అగస్త్యుణ్ణి కోరాడు. ఆ మహర్షి గోదావరీ తీరంలో ఉన్న ‘పంచవటి’ లో ఉండమని వారికి సూచించాడు. రామలక్ష్మణులకు మార్గమధ్యంలో ‘జటాయువు’ కనబడింది. దానికి సీత రక్షణ బాధ్యతను వారు అప్పగించారు. పంచవటిలో ఆశ్రమం నిర్మించుకొని వారు అక్కడ నివసించారు.

ప్రశ్న 5.
సీతాపహరణం గురించి రాయండి.
(లేదా)
రావణుడు మారీచుని సాయంతో సీతాదేవిని అపహరించిన వృత్తాంతాన్ని రాయండి.
జవాబు:
‘సీతారాములు పంచవటిలో సుఖంగా జీవిస్తున్నారు. రావణుని చెల్లెలు శూర్పణఖ అక్కడకు వచ్చి రాముడి అందానికి మోహపడి తన్ను భార్యగా స్వీకరించమని రాముణ్ణి కోరింది. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు, చెవులు కోశాడు. శూర్పణఖ దండాకారణ్యంలో ఉన్న సోదరుడు ఖరుడికి ఆ విషయం చెప్పింది. ఖరుడు పంపిన యోధులనూ, ఖరదూషణులనూ మొత్తం 14 వేల మంది రాక్షసులను రాముడు గడియలో చంపాడు.

‘అకంపనుడు’ అనే గూఢచారి దండకలో రాక్షససంహారం జరిగిందని రావణునకు వార్త చేర్చాడు. రావణుడు రాముణ్ణి చంపుతానన్నాడు. రాముణ్ణి చంపడం దేవాసురులకు కూడా అసాధ్యం అని అకంపనుడు చెప్పాడు. సీతను అపహరించమని సూచించాడు. రావణుడు మారీచుని సాయం అడిగాడు. మారీచుడు రాముణ్ణి కవ్వించవద్దని రావణునికి సలహా చెప్పాడు. శూర్పణఖ, తన అన్న రావణుడికి, సీతను అపహరించమని చెప్పింది.

రావణుడు తిరిగి మారీచుడి దగ్గరకు వెళ్ళి, సీతాపహరణకు బంగారు లేడిగా మారి తనకు సాయం చెయ్యమని అడిగాడు. మారీచుడు హితం చెప్పినా, రావణుడు వినలేదు. తనకు సాయపడకపోతే మారీచుని చంపుతానన్నాడు రావణుడు.

దానితో మారీచుడు బంగారు లేడిగా మారి రాముని ఆశ్రమ ప్రాంతంలో తిరిగాడు. సీత బంగారు లేడిని చూసి ముచ్చటపడింది.

ఆ బంగారు లేడిని పట్టి తెమ్మని, సీత రాముని కోరింది. అది మాయలేడి అని లక్ష్మణుడు చెప్పాడు. రాముడు, సీత మాట కాదన లేక లక్ష్మణుణ్ణి సీతకు కాపలాగా ఉంచి, తాను లేడి కోసం వెళ్ళాడు. మాయలేడి రామునికి దొరకలేదు. రాముడు దానిపై బాణం వేశాడు. మాయలేడి చస్తూ “హా సీతా ! హా లక్ష్మణా !” అని అరిచింది.

ఆ ధ్వని విని సీత రాముడు ఆపదలో చిక్కుకున్నాడని లక్ష్మణుడిని రామునికి సాయంగా వెళ్ళమని చెప్పింది. లక్ష్మణుడు కాదంటే, అతణ్ణి సీత నిందించింది. లక్ష్మణుడు సీతను విడిచి వెళ్ళాడు. ఇదే అదనుగా రావణుడు సన్యాసి వేషంలో సీత ఉన్న ఆశ్రమానికి వచ్చి, తాను రావణుడిని అని చెప్పి సీతను బలవంతంగా తన లంకా నగరానికి తీసుకుపోయాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 అరణ్యకాండ

ప్రశ్న 6.
రామలక్ష్మణులు సీతను అన్వేషిస్తూ పంపా సరస్సు తీరానికి చేరిన వృత్తాంతాన్ని రాయండి.
జవాబు:
మారీచుణ్ణి చంపి, శ్రీరాముడు వెనుకకు ఆశ్రమానికి బయలుదేరాడు. దారిలో లక్ష్మణుడు కనబడ్డాడు. సీతను ఒంటరిగా విడిచి వచ్చావేమిటని రాముడు అడిగాడు. లక్ష్మణుడు జరిగిన విషయం చెప్పాడు. రామలక్ష్మణులు ఆశ్రమానికి వెళ్ళి, సీతను వెదికారు. వనమంతా వెదికారు. సీత జాడ కనబడలేదు. సీత జాడ చెప్పమని రాముడు ప్రకృతిని ప్రార్థించాడు. శ్రీరాముడు సీతా వియోగాన్ని భరించలేక ఏడ్చాడు. లక్ష్మణుడు రాముడిని ఓదార్చాడు.

రామలక్ష్మణులకు రక్తంతో తడిసిన జటాయువు కనిపించాడు. అతడిని చూసి గద్ద రూపంలో ఉన్న రాక్షసుడనీ, అతడే సీతను తిని ఉంటాడని వారు భ్రాంతి పడ్డారు. జటాయువు జరిగినది చెప్పాడు. రావణుడు సీతను అపహరించాడనీ, రావణుడే తనను దెబ్బ తీశాడనీ, జటాయువు వారికి చెప్పాడు. జటాయువు మరణించాడు. రాముడు జటాయువుకు అంత్యక్రియలు చేశాడు.

రామలక్ష్మణులు “క్రౌంచారణ్యం” చేరుకున్నారు. అక్కడ వారికి ఒక రాక్షసుడు కనబడ్డాడు. వాడికి తల, మెడ లేదు. వాడి ముఖం వాడి కడుపులో ఉంది. రొమ్ముమీద ఒకే కన్ను ఉంది. వాడి చేతులు యోజనం పొడుగున్నాయి. ఆ చేతులతో వాడు పక్షులను, మృగాలను పట్టి తింటాడు. అతడి పేరు ‘కబంధుడు’.

‘కబంధుడు’ రామలక్ష్మణులను చేతులతో పట్టుకున్నాడు. వాడి చేతుల్లో చిక్కితే, ఎవడూ తప్పించుకోలేడు. వాడు రామలక్ష్మణుల్ని తినడానికి నోరు తెరచాడు. వారు కబంధుని భుజాలు నరికిపారవేశారు. కబంధుడు కుప్పకూలాడు. శాపం వల్ల తనకు వికృత రూపం వచ్చిందని కబంధుడు వారికి చెప్పాడు.

రామలక్ష్మణులు రావణుని గురించి కబంధుణ్ణి అడిగారు. కబంధుడు తన శరీరాన్ని దహిస్తే తనకు దివ్యజ్ఞానం వస్తుందనీ, అప్పుడు రావణుడి గురించి చెప్పగలననీ చెప్పాడు. రామలక్ష్మణులు కబంధుడి శరీరానికి అగ్ని సంస్కారం చేశారు. కబంధుడు దివ్యదేహంతో వచ్చి, సీతాదేవి దొరికే ఉపాయాన్ని వారికి చెప్పాడు. సుగ్రీవుడితో స్నేహం చేయమన్నాడు. కబంధుడు స్వర్గానికి వెళ్ళాడు.

రామలక్ష్మణులు శబరి ఆశ్రమానికి వెళ్ళారు. శబరి రాముడికి పండ్లు పెట్టింది. తరువాత శబరి తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసి ఊర్థ్వలోకాలకు వెళ్ళింది. రామలక్ష్మణులు ఈ విధంగా పంపా సరస్సుకు చేరారు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం రామాయణం

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం రామాయణం Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions ఉపవాచకం రామాయణం

10th Class Telugu ఉపవాచకం రామాయణం Textbook Questions and Answers

రామాయణం – కొన్ని వివరణలు

రామాయణం : సంస్కృతంలో వాల్మీకి మహర్షిచే రచింపబడింది. ఆదికావ్యం.

వాల్మీకి మహర్షి : సంస్కృత రామాయణ కర్త. ఆదికవి.

రామాయణానికి గల పేర్లు : రామాయణం, పౌలస్త్యవధ, సీతాయాశ్చరితం మహత్.

దశరథ మహారాజు : కోసలదేశానికి రాజు.

కోసలదేశం : సరయూ నదీ తీరంలో ఉంది.

అయోధ్య : కోసలదేశ రాజధాని

దశరథ మహారాజు భార్యలు : కౌసల్య, సుమిత్ర, కైక (కైకేయి).

రాముడు : కౌసల్య యందు దశరథ మహారాజుకు జన్మించాడు.

లక్ష్మణుడు : సుమిత్ర యందు దశరథ మహారాజుకు జన్మించాడు.

భరతుడు : కైక యందు దశరథ మహారాజుకు జన్మించాడు.

శత్రుఘ్నుడు : సుమిత్ర యందు దశరథ మహారాజుకు జన్మించాడు.

రామాయణంలోని శ్లోకాల సంఖ్య : 24 వేలు

రామాయణంలోని కాండములు : 1. బాలకాండ, 2. అయోధ్యాకాండ, 3. అరణ్యకాండ, 4. కిష్కింధ కాండ, 5. సుందరకాండ, 6. యుద్ధకాండ, 7. ఉత్తరకాండ

నారదుడు : దేవర్షి, తపస్వి, వాక్చతురుల్లో శ్రేష్ఠుడు.

వాల్మీకి ఆశ్రమం : తమసానదీ తీరంలో ఉంది.

వాల్మీకి నోట అప్రయత్నంగా వచ్చిన శ్లోకం : “మానిషాద ప్రతిషం…..”

ఋష్యశృంగుడు : విభాండక మహర్షి కుమారుడు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి.

పుత్రకామేష్టి : దశరథ మహారాజు సంతానం కోసం చేసిన యాగం.

మారీచసుబాహులు : తాటకాసునందనుల కుమారులు (రాక్షసులు). ఋషుల యజ్ఞయాగాలకు విఘ్నాలు కలిగించేవాళ్ళు.

మారీచుడు : ఇతడు తన రాక్షస మాయచేత బంగారు లేడి (మాయలేడి) రూపాన్ని ధరించాడు.

బల, అతిబల : విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ఉపదేశించిన విద్యలు. వీటి ప్రభావం వల్ల అలసట, ఆకలి దప్పులు ఉండవు. రూపకాంతులు తగ్గవు.

తాటక : యక్షిణి

సిద్ధాశ్రమం : వామనుడు (విష్ణువు) సిద్ధిపొందిన చోటు.

జనక మహారాజు : మిథిలానగరానికి ప్రభువు. సీతాదేవి తండ్రి.

కుశధ్వజుడు : జనకమహారాజు తమ్ముడు.

అహల్య : గౌతమ మహర్షి భార్య.

శతానందుడు : అహల్యా గౌతముల కుమారుడు.

సీత (జానకి) : శ్రీరాముని భార్య

ఊర్మిళ : లక్ష్మణుని భార్య

మాండవి : భరతుని భార్య

శ్రుతకీర్తి : శత్రుఘ్నుని భార్య

పరశురాముడు : రేణుకా జమదగ్నుల కుమారుడు. ఇరవై ఒక్కసార్లు భూప్రదక్షిణం చేసి ఎంతో మంది క్షత్రియులను సంహరించాడు.

కార్తవీర్యార్జునుడు : పరశురాముని తండ్రియైన జమదగ్నిని సంహరించాడు.

మంథర : కైకేయి అత్తవారింటికి వచ్చినప్పుడు ఆమె వెంట వచ్చిన అరణపు దాసి.

సుమంత్రుడు : దశరథుని మంత్రులలో ఒకడు. దశరథుని రథం తోలేవాడు. ఇతడే శ్రీరాముని రథసారథి.

గుహుడు : శృంగిబేరపురానికి రాజు. శ్రీరామభక్తుడు. దండకారణ్య వాసానికి పోతున్న సీతారామ లక్ష్మణులను గంగానది దాటించాడు.

భరద్వాజుడు : సప్త ఋషులలో ఒకడు. వనవాసం చేస్తున్న రాముడు ఈయన ఆశ్రమాన్ని దర్శించాడు.

భరద్వాజాశ్రమం : గంగాయమున సంగమ ప్రదేశంలో ఉంది.

చిత్రకూటం : ఒక పర్వతం. ఇక్కడే రాముని ఆదేశం ప్రకారం లక్ష్మణుడు నేరేడు కర్రలతో కుటీరాన్ని నిర్మించాడు.

అత్రిమహర్షి : సీతారామలక్ష్మణులు అరణ్యవాసం చేసేటప్పుడు ఈయన ఆశ్రమాన్ని దర్శించారు.

అనసూయ : అత్రి మహర్షి భార్య. ఈమె సీతాదేవికి దివ్య వస్త్రాభరణాలను ఇచ్చింది.

దండకారణ్యం : ఇక్కడ మునుల ఆశ్రమాలు చాలా ఉన్నాయి. వింధ్య పర్వతానికి దక్షిణాన ఉన్న అరణ్యం. దండునిపురం మట్టిలో కలిసిపోయి అక్కడ అరణ్యంగా ఏర్పడటం చేత దీనికి దండకారణ్యం అని పేరు వచ్చింది.

విరాధుడు : తుంబురుడనే గంధర్వుడు కుబేరుని శాపంవల్ల రాక్షసుడిగా మారాడు. శరభంగ మహర్షిని దర్శించుకుంటే శుభం జరుగుతుందని శ్రీరామునికి చెప్పాడు.

శరభంగ మహర్షి : మహాతపస్వి. దైవ సాక్షాత్కారం పొందినవాడు. తన తపఃఫలాన్నంతా శ్రీరామునికి ధారపోశాడు.

సుతీక్ష్య మహర్షి : సీతారామలక్ష్మణులు ఈయన ఆశ్రమాన్ని దర్శించాడు. ఈయన తన తపశ్శక్తినంతా శ్రీరామునికి ధారపోశాడు.

విశ్వామిత్రుడు : గాధి కుమారుడు. యాగరక్షణార్థం రామలక్ష్మణులను తన వెంట తీసుకువెళ్ళాడు.

అగస్త్య భ్రాత : అగస్త్యుని సోదరుడు. ఇతని పేరు రామాయణంలో చెప్పబడలేదు. అందుకే పేరు తెలియని వారిని ‘అగస్త్య భ్రాత’ అంటారు.

అగస్త్య మహర్షి : వింధ్యపర్వత గర్వాన్ని అణచినవాడు. ఈయన శ్రీరామునికి దివ్య ధనుస్సు, అక్షయ తూణీరాలు, అమోఘమైన ఖడ్గాన్ని బహూకరించాడు.

పంచవటి : గోదావరి తీరాన ఉన్న ఒక అరణ్యం. వనవాసం చేస్తున్న సీతారామలక్ష్మణులు ఇక్కడే పర్ణశాలను నిర్మించుకొని నివసించారు.

జటాయువు : ఒక పెద్ద గ్రద్ద. సంపాతికి తమ్ముడు. ఈ జటాయువు దశరథునికి మిత్రుడు. శ్రీరాముడు ఈయనకే సీత సంరక్షణ బాధ్యతను అప్పగించాడు. రావణాసురుడు సీతను అపహరించి తీసుకొని వెళ్ళాడని శ్రీరామునికి తెలిపింది ఇతడే.

శూర్పణఖ : ఒక రాక్షసి. రావణాసురుని చెల్లెలు, లక్ష్మణుడు ఈమె ముక్కు, చెవులను కోసి విరూపినిగా చేశాడు.

ఖరదూషణులు : శూర్పణఖ సోదరులు.

అకంపనుడు : రావణాసురుడి గూఢచారులలో ఒకడు.

రావణుడు : కైకసీ విశ్రవసుల కుమారుడు. లంకానగరానికి అధీశుడు. సీతను అపహరించి తీసుకొని వచ్చినవాడు.

లంకానగరం : త్రికూట పర్వతం మీద ఉంది.

కబంధుడు : ఒక రాక్షసుడు. ఇతని చేతుల్లో చిక్కి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. రావణునిచేత అపహరింపబడిన సీతాదేవి దొరికే ఉపాయాన్ని శ్రీరామునికి తెలియజేసినవాడు ఇతడే.

శబరి : ఒక బోయకాంత. తపస్సిద్ధురాలు. పంపాతీరంలో ఆశ్రమాన్ని ఏర్పరచుకొని నివసించింది. శ్రీరామ దర్శనంతో ఈమె తనువు పులకించింది. పంపాతీరంలో దొరికే పండ్లను రామునికి అర్పించింది.

ఋష్యమూక పర్వతం : కిష్కింధకు దగ్గరలో గల ఒక పర్వతం. సుగ్రీవుడు నివసించింది ఈ పర్వతం పైనే.

వాలి సుగ్రీవులు : వనరులు. అన్నదమ్ములు. వాలి సుగ్రీవులు శత్రువులుగా ఉన్నప్పుడే సుగ్రీవుడు రామునితో స్నేహం చేశాడు.

హనుమంతుడు : అంజనకు వాయుదేవుని అనుగ్రహం వల్ల జన్మించాడు. ఇతడు సుగ్రీవుని మంత్రి. ఇతడే సుగ్రీవునికి రామలక్ష్మణులతో స్నేహం ఏర్పాటు చేశాడు. సముద్రానికి వారధి కట్టి లంకలో ప్రవేశించాడు. సీత ఉన్న అశోకవనం తప్ప మిగిలిన లంక అంతా కాల్చాడు. కిష్కింధకు వెళ్ళి సీతను చూసిన వృత్తాంతాన్ని తెలియజేశాడు.

తార : వాలి భార్య.

రుమ : సుగ్రీవుని భార్య. అంగదుడు : వాలి కుమారుడు.

నీలుడు : ఒక వానరుడు. సుగ్రీవుని సేనలోనివాడు.

నలుడు : ఒక వానరుడు. విశ్వకర్మ యొక్క పుత్రుడు. సుగ్రీవుని సేనలోనివాడు. సముద్రానికి వారథి కట్టడానికి ఇతడే ప్రారంభించాడు.

జాంబవంతుడు : భల్లూకరాజు.

సుషేణుడు : వానరరాజు, తారతండ్రి.

సంపాతి : పక్షిరాజు. జటాయువుకు అన్న. లంకలో సీత ఉన్న పరిస్థితులను దివ్యదృష్టితో చూసి కళ్ళకు కట్టినట్లు వివరించాడు. లంకకు ఎలా వెళ్ళాలో చెప్పాడు.

మైనాకుడు : ఒక పర్వతం. మేనకా హిమవంతుల కుమారుడు. ఇంద్రుడు పర్వతాల రెక్కలు విరగగొడుతున్నప్పుడు ఇతడు భయపడి దక్షిణ సముద్రంలో దాక్కున్నాడు. హనుమంతుడు సముద్రం దాటేటప్పుడు మైనాకుడు పైకి వచ్చి తనపై విశ్రమింపమని కోరాడు. హనుమంతుడు కొంతసేపు విశ్రమించాడు.

సురస : నాగమాత. హనుమంతుని సూక్ష్మబుద్ధిని, సమయస్ఫూర్తిని చూసి ఆనందించి ఆశీర్వదించింది.

సింహిక : ఒక రాక్షసి. హనుమంతుని మింగాలని చూసింది. కాని హనుమంతుడే తన వాడి అయిన గోళ్ళతో సింహికను చీల్చేశాడు.

లంకిణి : లంకాధిదేవత.

కుంభకర్ణుడు : రావణుని తమ్ముడు. శ్రీరాముడు ఐంద్రాస్త్రంతో ఇతని శిరస్సును ఖండించాడు.

మహాపార్శ్వుడు : రావణుని సేనానాయకులలో ఒకడు.

వీభీషణుడు : రావణుని తమ్ముడు. రావణుడు పరాయి స్త్రీలను తీసుకొని వచ్చినప్పుడు అది తగదని బోధించాడు. ఇతడు రాముని పక్షంలో చేరాడు.

మహూదరుడు : ఒక రాక్షసుడు. రావణుని సేనలోనివాడు.

విరూపాక్షుడు : మాల్యవంతుని కుమారుడు. రావణుని పక్షాన పోరాడాడు. యుద్ధంలో ఇతనిని సుగ్రీవుడు సంహరించాడు.

విద్యుజిహ్వుడు : ఒక రాక్షసుడు. శూర్పణఖ భర్త.

త్రిజట : విభీషణుని కూతురు. లంకలో సీతకు కావలి ఉన్న రాక్షసి. తనకు వచ్చిన కలను బట్టి సీత కోరిక నెరవేరుతుందని, రావణునికి వినాశం తప్పదని, శ్రీరాముడికి జయం కలుగుతుందని చెప్పింది.

ఇంద్రజిత్తు : రావణుని పెద్ద కుమారుడు. ఇతని పేరు మేఘనాథుడు. ఇంద్రుని ఓడించడం వల్ల ఇంద్రజిత్తు. అని పేరు వచ్చింది. ఇతడు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి హనుమంతుణ్ణి బంధించాడు

ప్రహస్తుడు : రావణుని సేనానాయకులలో ఒకడు.

శుకసారణులు : రావణాసురుని మంత్రులు.

సరమ : విభీషణుని భార్య.

జంబుమాలి : ప్రహస్తుని కుమారుడు. రావణుని సేనలోనివాడు

అతికాయుడు : రావణుని కుమారుడు. ఇతనిని లక్ష్మణుడు సంహరించాడు.

మాతలి : ఇంద్రుని రథ సారథి.

పుష్పక విమానం : ఇది కుబేరుని విమానం. దీన్ని బ్రహ్మ కుబేరునికి ఇచ్చాడు. రావణుడు బలాత్కారంగా కుబేరుని వద్ద నుంచి తీసుకున్నాడు. రావణుని చంపిన తరువాత శ్రీరాముడు దీన్ని ఎక్కి లంక నుండి వచ్చాడు. తరువాత దీన్ని కుబేరునకు ఇచ్చాడు.

త్రికూట పర్వతం : లంకానగరం ఈ పర్వతం మీద ఉన్నది.

వ్యాసరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
రామాయణ ప్రాశస్త్యమును గురించి రాయండి.
(లేదా)
రామాయణాన్ని ఎందుకు చదవాలి?
(లేదా)
“రామాయణం భారతీయులకు ఒక ఆచరణీయ గ్రంథం” వివరించండి.
(లేదా)
మానవ సంబంధాల గొప్పతనాన్ని వివరించిన రామాయణం యొక్క ప్రాశస్త్యాన్ని విశ్లేషించండి.
జవాబు:
‘రామాయణం’ మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం. ఈ కథ మానవహృదయాల నుండి ఎప్పటికీ చెరగదు. రామాయణం జీవిత పార్శ్వాలను ఎన్నింటినో కనబరుస్తుంది.

రామాయణంలో అమ్మానాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురుభక్తి, శిష్యాను రక్తి, స్నేహఫలం ధర్మబలం, వినయంతో ఒదగడం, వివేకంతో ఎదగడం, జీవకారుణ్య భావన, ప్రకృతి లాలన వంటి జీవిత పార్శ్వా లు ఎన్నో కనబడతాయి.

రామాయణాన్ని చదవడం అంటే, జీవితాన్ని చదవడమే. ‘రామాయణం ఆచరణ ప్రధాన గ్రంథం. ఉత్తమమైన ధర్మాలను ఆచరిస్తే, మనిషి మనిషిగా ఎలా ఎదగగలడో, రామాయణం నేర్పుతుంది. చిన్న చిన్న పాత్రల ద్వారా రామాయణం గొప్ప సందేశాన్ని అందిస్తుంది.

రామాయణంలో వాల్మీకి మహర్షి మారీచుని వంటి రాక్షసుని నోటి నుండి, “రామో విగ్రహవాన్ ధర్మః, సత్యధర్మ పరాక్రమః” అనే గొప్పమాటను పలికించాడు.

రాముడి వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శకావ్యం ‘నభూతో నభవిష్యతి!” అంటే “పూర్వమందు లేదు, ముందు కాలంలో రాబోదు” మనిషి ఉన్నంత వరకూ రామాయణం ఉంటుంది.

రామాయణం ప్రపంచ సాహిత్యంలోనే ‘ఆదికావ్యం’. వాల్మీకి మహర్షి సంస్కృతంలో దీనిని 24 వేల శ్లోకాలతో రాశాడు. రామాయణం ముందు తరాల వారికి స్ఫూర్తిని ఇస్తుంది. అందువల్లనే మనం, రామాయణాన్ని తప్పక చదవాలి.

ప్రశ్న 2.
‘రామాయణం’ ఏ విధంగా విశ్వరూపాన్ని చూపిందో రాయండి.
జవాబు:
‘రామాయణం’ మానవ జీవిత మూల్యాలను చూపింపచేసే అక్షరమణుల అద్దం. అందుకే రామాయణం కొండలు, సముద్రాలు ఉన్నంత వరకూ ఉంటుందని బ్రహ్మ వాల్మీకి మహర్షికి చెప్పాడు. వాల్మీకి, రామాయణాన్ని రచించాడు. దీని తరువాత దేశ విదేశాలలో అనేక ప్రక్రియల్లో ఎన్నో రామాయణాలు వచ్చాయి. వీటన్నింటికీ మూలం “వాల్మీకి రామాయణం”. తరువాతి కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి. రచయితలు కొందరు వాల్మీకి రామాయణ మూలాన్ని అనుసరించారు. కొందరు స్వతంత్ర పోకడలు పోయారు.

సంస్కృత సాహిత్యం – రామకథ :
రామకథ వివిధ పురాణాల్లో కనబడుతుంది.

  1. ఆధ్యాత్మ రామాయణం
  2. కాళిదాసు రచించిన ‘రఘువంశం’- దీనిలో రామకథతోపాటు అతని పూర్వుల చరిత్ర కూడా రాయబడింది.
  3. చంపూ రామాయణం – భోజుడు దీనిని గద్యపద్యాలతో రచించాడు.
  4. “రావణవధ” దీనిని భట్టి కవి రాశాడు.
  5. “ప్రతిమా నాటకం’ పేరుతో రామకథను భాసుడు రాశాడు.
  6. ఉత్తర రామచరితం : భవభూతి నాటకంగా దీనిని రాశాడు.
  7. రాఘవ పాండవీయం : రెండర్థాల కావ్యంగా భారత రామకథలు మేళవించి, ధనంజయుడు దీనిని రాశాడు.

కాశ్మీరీ భాషలో దివాకర ప్రకాశభట్టు “రామావలోకచరిత”, “లవకుశ యుద్ధచరిత” ను రచించాడు. మరాఠీలో సమర్థరామదాసు ‘రామాయణం’, మోరోపంతు రాసిన “లవకుశాఖ్యానమ్’, ‘మంత్ర రామాయణమ్’ పేరు పొందాయి. వంగభాషలో కృత్తివాస ఓఝా “రామాయణానికి” మంచి పేరుంది. తమిళ భాషలో ‘కంబ రామాయణం’ మలయాళంలో ఎళుత్తచ్చన్ “అధ్యాత్మ రామాయణం”, కన్నడంలో నాగచంద్రుడు రాసిన “రామచంద్ర చరిత పురాణం’ చంపూ మార్గంలో సాగింది. ఒరియాలో సిద్ధేంద్రయోగి “విచిత్ర రామాయణం” రాశాడు.

తెలుగు భాషలో రామాయణాలు:
గోనబుద్ధారెడ్డి “రంగనాథ రామాయణం” తెలుగులో మొదటి రామాయణం. ఇందులో వాల్మీకి రాయని ఎన్నో కల్పనలు ఉన్నాయి. ఇది ద్విపద రామాయణం. తాళ్ళపాక అన్నమాచార్యుల రామాయణం, కట్టా వరదరాజు రామాయణం, ఏకోజీ రామాయణం ద్విపదలో సాగాయి.

తిక్కన ‘నిర్వచనోత్తర రామాయణం’ తెలుగుజాతిపై ముద్ర వేసింది. హుళక్కి భాస్కరుడు, అతని కుమారుడు మల్లికార్జున భట్టు, శిష్యుడు రుద్రదేవుడు, మిత్రుడు అయ్యలార్యుడు, “భాస్కర రామాయణం” రాశారు. ఇక మొల్ల సంక్షిప్తంగా సుందరంగా రామాయణాన్ని తీర్చిదిద్దింది. అయ్యలరాజు రామభద్రుడు ‘రామాభ్యుదయం’ మంచి ప్రబంధం. తంజావూరు రఘునాథ నాయకుడు ‘రఘునాథ రామాయణం’ వాల్మీకిని అనుసరించి రాశాడు. గోపీనాథ వేంకట కవి ‘గోపీనాథ రామాయణం’ రాశాడు. కంకంటి పాపరాజు ‘ఉత్తర రామాయణం’ రాశాడు.

కాణాదం పెద్దన “ఆధ్యాత్మ రామాయణం’ రాశాడు. గద్వాల సంస్థానాధీశులు, ఆరుగురు కవులచే రామాయణాన్ని ఆంద్రీకరింపజేశారు. వావిలికొలను సుబ్బారావుగారు “ఆంధ్రవాల్మీకి రామాయణం, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారి “శ్రీకృష్ణ రామాయణం” పేరు పొందాయి.

విశ్వనాథ సత్యనారాయణ గారి “శ్రీమద్రామాయణ కల్పవృక్షం” జ్ఞానపీఠ పురస్కారాన్ని సంపాదించింది. పింగళి సూరన ‘రాఘవ పాండవీయం’ ద్వ్యర్థి కావ్యాన్ని రాశాడు. నెల్లూరి రాఘవకవి. ‘యాదవ రాఘవ పాండవీయం’ అనే త్ర్యర్థి కావ్యం రాశాడు. కేశవయ్య “దాశరథి చరిత్ర” పేరుతో నిరోష్ఠ్యరామాయణం రాశాడు.

ఇవి కాక తెలుగులో రామాయణం పాటలు, నాటకాలు, హరికథలు, స్త్రీల రామాయణం పాటలు, వచన కావ్యాలు వచ్చా యి.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 అయోధ్యాకాండ

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం 2nd Lesson అయోధ్యాకాండ Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions ఉపవాచకం 2nd Lesson అయోధ్యాకాండ

10th Class Telugu ఉపవాచకం 2nd Lesson అయోధ్యాకాండ Textbook Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

సంఘటనా క్రమం

సంఘటనల ఆధారంగా వరుస క్రమంలో వాక్యాలను అమర్చడం

1. అ) గతంలో దశరథుడు ఇచ్చిన రెండు వరాలను ఇప్పుడు ఉపయోగించుకొమ్మని సూచించింది మంథర.
ఆ) కైకేయి రెండు వరాలను గురించి చెప్పింది.
ఇ) శ్రీరాముడి కోసం ఏర్పాటు చేసిన సన్నాహాలతో భరతుడికి పట్టాభిషేకం చేయాలి. శ్రీరాముడు నారచీరెలు, జింక చర్మం ధరించి జటాధారి అయి దండకారణ్యానికి వెళ్లి తాపసవృత్తిలో పదునాల్గు సంవత్సరాలు ఉండాలి.
ఈ) శ్రీరాముణ్ణి చూడాలనుంది. వెంటనే తీసుకురమ్మన్నాడు దశరథుడు.
జనాబులు
అ) గతంలో దశరథుడు ఇచ్చిన రెండు వరాలను ఇప్పుడు ఉపయోగించుకొమ్మని సూచించింది మంథర.
ఇ) శ్రీరాముడి కోసం ఏర్పాటు చేసిన సన్నాహాలతో భరతుడికి పట్టాభిషేకం చేయాలి. శ్రీరాముడు నారచీరెలు, జింక చర్మం ధరించి జటాధారి అయి దండకారణ్యానికి వెళ్లి తాపసవృత్తిలో పదునాలుగు సంవత్సరాలు ఉండాలి.
ఈ) శ్రీరాముణ్ణి చూడాలనుంది. వెంటనే తీసుకురమ్మన్నాడు దశరథుడు.
ఆ) కైకేయి రెండు వరాలను గురించి చెప్పింది.

2. అ) భరతుని అభ్యర్థన మేరకు శ్రీరాముడు పాదుకలను అనుగ్రహించాడు.
ఆ) మహర్షి సూచననుసరించి యమునానదిని దాటి చిత్రకూటం చేరుకున్నారు సీతారామలక్ష్మణులు.
ఇ) మంత్రులు భరతుణ్ణి రాజ్యాధికారం చేపట్టమన్నారు.
ఈ) భరతుడు నందిగ్రామం చేరుకుని పాదుకలకు పట్టాభిషేకం చేశాడు.
జవాబులు
ఆ) మహర్షి సూచననుసరించి యమునానదిని దాటి చిత్రకూటం చేరుకున్నారు సీతారామలక్ష్మణులు.
ఇ) మంత్రులు భరతుణ్ణి రాజ్యాధికారం చేపట్టమన్నారు. అ) భరతుని అభ్యర్థన మేరకు శ్రీరాముడు పాదుకలను అనుగ్రహించాడు.
ఈ) భరతుడు నందిగ్రామం చేరుకొని పాదుకలకు పట్టాభిషేకం చేశాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 అయోధ్యాకాండ

3. అ) శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా అత్రిమహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు.
ఆ) పుత్ర వ్యా మోహంతో కౌసల్య శ్రీరాముని వెంట వనవాసానికి సిద్ధపడింది.
ఇ) కైక తన రెండు వరాలను గురించి చెప్పింది. ,
ఈ) శ్రీరామ పట్టాభిషేకం కోసం అయోధ్య తనను తాను అలంకరించుకుంది.
జవాబులు
ఈ) శ్రీరామ పట్టాభిషేకం కోసం అయోధ్య తనను తాను అలంకరించుకుంది.
ఇ) కైక తన రెండు వరాలను గురించి చెప్పింది.
ఆ) పుత్ర వ్యా మోహంతో కౌసల్య శ్రీరాముని వెంట వనవాసానికి సిద్ధపడింది.
అ) శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా అత్రిమహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు.

4. అ) శ్రీరాముడు రథాన్ని ప్రజలు నీడలా అనుసరించారు.
ఆ) భరతుని కోరికపై శ్రీరాముడు పాదుకలను ఇచ్చాడు.
ఇ) అర్ధరాత్రి తరువాత దశరథుడు ప్రాణాలు విడిచాడు.
ఈ) శ్రీరాముడు లక్ష్మణునితో కలిసి కౌసల్యను దర్శించాడు.
జవాబులు
ఈ) శ్రీరాముడు లక్ష్మణునితో కలిసి కౌసల్యను దర్శించాడు.
అ) శ్రీరాముడు రథాన్ని ప్రజలు నీడలా అనుసరించారు.
ఇ) అర్ధరాత్రి తరువాత దశరథుడు ప్రాణాలు విడిచాడు.
ఆ) భరతుని కోరికపై శ్రీరాముడు పాదుకలను ఇచ్చాడు.

5. అ) కాలినడకన వస్తున్న శ్రీరాముడిని చూచి ప్రజలు బావురుమన్నారు.
ఆ) భరతుడు అయోధ్య వాసులతో అరణ్యానికి బయలుదేరాడు.
ఇ) శ్రీరాముని ఆదేశం మేరకు గుహుడు నావను సిద్ధం చేశాడు.
ఈ) శ్రీరాముని మాటలు విన్న దశరథుడు శోకభారంతో స్పృహ కోల్పోయాడు.
జవాబులు
ఈ) శ్రీరాముని మాటలు విన్న దశరథుడు శోకభారంతో స్పృహ కోల్పోయాడు.
అ) కాలినడకన వస్తున్న శ్రీరాముడిని చూచి ప్రజలు బావురుమన్నారు.
ఇ) శ్రీరాముని ఆదేశం మేరకు గుహుడు నావను సిద్ధం చేశాడు.
ఆ) భరతుడు అయోధ్య వాసులతో అరణ్యానికి బయలుదేరాడు.

6. అ) శ్రీరాముని ఎడబాటుకు దశరథుని మనసు కకావికలమైంది.
ఆ) దశరథుని మృతదేహాన్ని తైలద్రోణిలో ఉంచారు.
ఇ) ప్రజలు చేసేది లేక అయోధ్యకు వెనుతిరిగి వెళ్ళారు.
ఈ) సీత రాముని వెంట అరణ్యానికి వెళ్ళడానికి నిశ్చయించుకుంది.
జవాబులు
ఈ) సీత రాముని వెంట అరణ్యానికి వెళ్ళడానికి నిశ్చయించుకుంది.
ఇ) ప్రజలు చేసేది లేక అయోధ్యకు వెనుతిరిగి వెళ్ళారు.
అ) శ్రీరాముని ఎడబాటుకు దశరథుని మనసు కకావికలమైంది.
ఆ) దశరథుని మృతదేహాన్ని తైలద్రోణిలో ఉంచారు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 అయోధ్యాకాండ

7. అ) గుహుని ద్వారా సుమంత్రుడు శ్రీరాముని విషయాలను గ్రహించాడు.
ఆ) కైక వరాలను విన్న రాముని ముఖంలో ఎలాంటి మార్పులేదు.
ఇ) శ్రీరామ వనవాస సమయంలో భరతుడు తల్లిని తప్పు బట్టాడు.
ఈ) శ్రీరామ పట్టాభిషేకాన్ని సమర్ధిస్తూ హర్షధ్వానాలు చేశారు.
జవాబులు
ఈ) శ్రీరామ పట్టాభిషేకాన్ని సమర్థిస్తూ హర్షధ్వానాలు చేశారు.
ఆ) కైక వరాలను విన్న రాముని ముఖంలో ఎలాంటి మార్పులేదు.
అ) గుహుని ద్వారా సుమంత్రుడు శ్రీరాముని విషయాలను గ్రహించాడు.
ఇ) శ్రీరామ వనవాస సమయంలో భరతుడు తల్లిని తప్పు బట్టాడు.

8. అ) సీతారామలక్ష్మణులు దశరథుని దర్శనానికి బయలుదేరారు.
ఆ) రాముడిని తీసుకొని రావలసిందిగా కైక సుమంత్రుడిని ఆజ్ఞాపించింది.
ఇ) శ్రీరాముడు తండ్రి మరణవార్త విని విలపించాడు.
ఈ) శ్రీరామ పట్టాభిషేకం కోసం అయోధ్య తనను తాను అలంకరించుకుంటుంది.
జవాబులు
ఈ) శ్రీరామ పట్టాభిషేకం కోసం అయోధ్య తనను తాను అలంకరించుకుంటుంది.
ఆ) రాముడిని తీసుకొని రావలసిందిగా కైక సుమంత్రుడిని ఆజ్ఞాపించింది.
అ) సీతారామలక్ష్మణులు దశరథుని దర్శనానికి బయలుదేరారు.
ఇ) శ్రీరాముడు తండ్రి మరణవార్త విని విలపించాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 అయోధ్యాకాండ

9. అ) అద్రి అనసూయలు సీతారామలక్ష్మణులకు మర్యాదలు చేశారు.
ఆ) శ్రీరాముడు ప్రసంగవశాత్తు రాజనీతి ధర్మాలను బోధించాడు.
ఇ) శ్రీరాముడు వచ్చాడన్న వార్త విని గుహుడు రాముని వద్దకు వచ్చాడు.
ఈ) వశిష్ఠుని ఆజ్ఞ మేరకు దూతలు భరత శత్రుఘ్నులను తీసుకురావడానికి వెళ్ళారు.
జవాబులు
ఈ) వశిష్ఠుని ఆజ్ఞ మేరకు దూతలు భరత శత్రుఘ్నులను తీసుకురావడానికి వెళ్ళారు.
ఆ) శ్రీరాముడు ప్రసంగవశాత్తు రాజనీతి ధర్మాలను బోధించాడు.
ఇ) శ్రీరాముడు వచ్చాడన్న వార్త విని గుహుడు రాముని వద్దకు వచ్చాడు.
అ) అద్రి అనసూయలు సీతారామలక్ష్మణులకు మర్యాదలు చేశారు.

10. అ) భరతుడు నందిగ్రామం చేరుకొని పాదుకలకు పట్టాభిషేకం చేశాడు.
ఆ) గుహుని సహకారంతో భరద్వాజాశ్రమం చేరుకున్నాడు భరతుడు.
ఇ) భరతుడు అయోధ్యావాసులతో కలిసి శృంగిబేరిపురం చేరాడు.
ఈ) శత్రుఘ్నుడు శ్రీరాముని పాదాలపై పడ్డాడు.
జవాబులు
ఆ) గుహుని సహకారంతో భరద్వాజాశ్రమం చేరుకున్నాడు భరతుడు.
ఇ) భరతుడు అయోధ్యావాసులతో కలిసి శృంగిబేరిపురం చేరాడు.
ఈ) శత్రుఘ్నుడు శ్రీరాముని పాదాలపై పడ్డాడు. అ) భరతుడు నందిగ్రామం చేరుకొని పాదుకలకు పట్టాభిషేకం చేశాడు.

పాత్ర స్వభావాలు

1. శ్రీరాముడు :
రూపంలోనూ గుణంలోనూ శ్రేష్ఠుడు. మహావీరుడు. మృదువుగా మాట్లాడతాడు. శరణన్నవారిని కాపాడతాడు. కోపం, గర్వం లేనివాడు. సత్యం పలికేవాడు. పరుల సంపదను ఆశించనివాడు. దీనులను ఆదుకొనేవాడు. కాలాన్ని వృథా చేయకుండా జ్ఞానులతో, సజ్జనులతో వివిధ విషయాలను చర్చించేవాడు. వినయశీలి. తల్లిదండ్రుల పట్లా, గురువుల పట్లా నిశ్చలభక్తి కలవాడు. సోమరితనం, ఏమరుపాటు లేనివాడు, కళలలో ఆరితేరినవాడు, అసూయ, మాత్సర్యం లేనివాడు. ప్రజలపట్ల వాత్సల్యం కలవాడు.

2. మంథర :
కైకేయి అత్తవారింటికి వచ్చినపుడు వెంట వచ్చిన అరణపు దాసి మంథర. రాముని పట్టాభిషేక వార్త తెలిసి మంథర కైకకు చెప్పింది. ఆ వార్త విని కైక సంతోషిస్తూ ఉంటే ఆమె మనస్సును మార్చింది.

రాముడు రాజైతే కౌసల్య రాజమాత అవుతుందని అప్పుడు కైక కూడా దాసిలాగా ఉండాల్సి వస్తుందని చెప్పింది రాముడి సంతానానికే తరువాతి కాలంలో రాజ్యాధికారం వస్తుందని, భరతుని సంతానానికి రాదని తెలియజేస్తుంది. కాబట్టి భరతునికి రాజ్యాధికారం దక్కేటట్లు, రాముడు అడవులపాలయ్యేటట్లు చూడమని దుర్బోధ చేసింది. దశరథుడు ఇదివరలో ఇచ్చిన రెండు వరాలను ఇప్పుడు ఉపయోగించుకొమ్మని చూచించింది.

3. గుహుడు :
శృంగిబేరపురానికి రాజు. శ్రీరామభక్తుడు. దండకారణ్య వాసానికి వెడుతున్న సీతారామలక్ష్మణులను గంగా నదిని దాటించాడు. ధర్మాత్ముడు.

సంఘటన ద్వారా గ్రహించుట

ప్రశ్న 1.
‘పతిని అనుసరించుటయే సతికి ధర్మం, సుఖప్రదం, శుభప్రదం’. అన్న సీత మాటల ద్వారా మీరు ఏమి గ్రహించారు?
జవాబు:
సీతాదేవి పతివ్రత. పతిని సేవించనిదే జీవించలేదు. తన భర్తను మించిన లోకం లేదు. తన భర్తతోటే సకల సౌఖ్యాలు అనుకొనే ఉత్తమ ఇల్లాలు సీత అని గ్రహించాను.

ప్రశ్న 2.
“అమ్మా! నువ్వు చెప్పినట్లే చేస్తా” అని కైకేయితో రాముడు పలికిన సన్నివేశాన్ని బట్టి, మీరేం గ్రహించారు?
జవాబు:
రామునికి రాజ్యకాంక్ష లేదని, తండ్రి ఆజ్ఞను పాటించడం కన్న గొప్ప ధర్మం మరొకటి లేదని, రాముడు భావించేవాడనీ నేను గ్రహించాను.

రామునకు తల్లుల మాటపై పెద్ద గౌరవం అనీ, రామునికి తల్లులందరూ సమానమేననీ, వారి మాటను రాముడు బాగా గౌరవించేవాడని గ్రహించాను. అందుకే తనకు సవతి తల్లియైన కైక చెప్పగానే, తండ్రి స్వయంగా చెప్పకపోయినా, పినతల్లి కైక మాటను తండ్రి మాటగానే గౌరవించి రాముడు అడవికి ప్రయాణమాయ్యడు.

రాముడు మాతా పితృభక్తుడనీ, వారి మాటలకు జవదాటడనీ, రాజ్యకాంక్ష లేనివాడనీ పై మాటను బట్టి గ్రహించాను.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 అయోధ్యాకాండ

ప్రశ్న 3.
“కఠిన శిల కన్నీటికి కరుగుతుందా? కైకేయి మారలేదు”. కవి చెప్పిన ఈ మాటలను బట్టి, కైక మనః ప్రవృత్తిని నీవు ఏమి గ్రహించావో వివరించుము.
జవాబు:
కైక మంథర దుష్టబోధలను విని, రాముని 14 ఏండ్లు వనవాసానికి పంపమనీ, తన కుమారుడు భరతునికి రాజ్యపట్టాభిషేకం చేయమనీ దశరథుని కోరింది.

కైక మాటలు విని, దశరథుడు స్పృహ కోల్పోయాడు. కొంత సేపటికి తేరుకొని, దశరథుడు రాముని అడవులకు పంపవద్దని, కైకను బ్రతిమాలాడు. రాముణ్ణి విడిచి తాను ఒక్కక్షణమైనా బతకలేనని, చేతులు జోడించి కైకను ప్రార్థించాడు. కైక పాదాలను పట్టుకుంటానన్నాడు. రాముణ్ణి తనకు దూరం చేయవద్దని కైకను దశరథుడు బ్రతిమాలాడు.

కాని కైక మనస్సు కఠినమైన రాయి వంటిది. అందుకే భర్త బ్రతిమాలినా, ఆమె మనస్సు మార్చుకోలేదు. తన పట్టుదలను విడవలేదు. కైక మొండిదని, అందుకే భర్త తన కాళ్ళు పట్టుకొని బ్రతిమాలినా, తన మొండి పట్టు ఆమె విడిచి పెట్టలేదనీ గ్రహించాను.

ప్రశ్న 4.
“మీరు లేకుండా స్వర్గ సుఖాలు లభించినా, ఇష్టపడను” అని సీత రామునితో చెప్పిన మాటలను బట్టి, సీత స్వభావాన్ని గూర్చి నీవేమి గ్రహించావు?
జవాబు:
శ్రీరాముడు పితృవాక్య పాలనకై అడవికి వెడుతున్నాడు. రాముడు సీతకు ఆ విషయం చెప్పి, అయోధ్యలో సీత ఎలా మసలుకోవాలో ఆమెకు తెలిపాడు. సీత రాముని మాటలను కాదని, తాను రాముని వెంట వనవాసానికి వెళ్ళడానికే ఇష్టపడింది. అయోధ్యలో ఉంటే సుఖంగా ఉండవచ్చు. రాముని వెంట వెడితే అరణ్యాలలో బాధలు పడాలి.

సీత మహా పతివ్రత కాబట్టి, అయోధ్యలో రాముడు లేకుండా స్వర్గసుఖాలు తనకు లభించినా తనకు అవి అక్కరలేదనీ, భర్తను అనుసరించడమే భార్యకు ధర్మం అనీ, శుభప్రదం అనీ చెప్పింది.

దీనిని బట్టి సీత మహా పతివ్రత అని, ధర్మజ్ఞురాలని, ఉత్తమ స్త్రీయని, నేను గ్రహించాను.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 అయోధ్యాకాండ

ప్రశ్న 5.
“రాముడు పట్టాభిషిక్తుడు అవుతున్నాడంటే, అంతకన్నా నాకు ఆనందం ఏముంటుంది? అని కైక, మంథరతో అన్న మాటలను బట్టి, మీరు ఏమి గ్రహించారు?
జవాబు:
కైక మొదటిలో రాముడిని ఎంతో ప్రేమతో చూసేదనీ, తన పుత్రుడైన భరతునితో సమంగా ఆమె రాముని ప్రేమించేదనీ గ్రహించాను. అలాగే రాముడు కూడా తల్లులందరి దగ్గరా సమానమైన ఆదరాన్ని పొందేవాడనీ తెలుసుకున్నాను.

తన దాసి మంథర చేసిన దుష్టమైన ఉపదేశం వల్లనే కైక బుద్ధి మారిపోయిందనీ, రాముడిని ఆమె పట్టుపట్టి అడవులకు పంపిందనీ, నేను గ్రహించాను. చెడు మాటలు వింటే, మంచివారు సైతం పాడయిపోతారని గ్రహించాను.

ప్రశ్న 6.
“నా తండ్రే, నాకు పాలకుడు. గురువు. హితుడు. ఆయన ఆదేశించాలే కాని, విషాన్ని తాగడానికైనా, సముద్రంలో దూకడానికైనా నేను సిద్ధమే” అని రాముడు కైకతో పలికిన మాటలను బట్టి, మీరు ఏమి గ్రహించారు?
జవాబు:
రాముడు గొప్ప పితృభక్తి కలవాడని గ్రహించాను. తండ్రియే తనకు గురువనీ, పరిపాలకుడనీ రాముడు భావించేవాడని గ్రహించాను. అంతేకాదు. తండ్రి ఆజ్ఞాపిస్తే శ్రీరాముడు, విషమును సైతం శంకలేకుండా త్రాగుతాడని గ్రహించాను. తండ్రి ఆజ్ఞాపిస్తే శ్రీరాముడు సముద్రంలోనైనా దూకుతాడని గ్రహించాను.

రాముడు, పితృవాక్యపరిపాలకుడనీ, తండ్రి యంటే ఆయనకు గొప్ప భక్తి గౌరవములు ఉన్నాయని గ్రహించాను. రాముని వంటి పితృవాక్య పరిపాలకుడు చరిత్రలో మరొకడు ఉండడని తెలుసుకున్నాను.

ప్రశ్న 7.
“అన్నా ఈ పాదుకల మీదనే రాజ్యపాలనాభారాన్ని ఉంచుతాను. పదునాల్గవ సంవత్సరం కాగానే, నీ దర్శనం కాకుంటే, అగ్ని ప్రవేశం చేస్తాను” అని భరతుడు రామునితో చెప్పిన మాటలను బట్టి, నీవేమి తెలుసుకున్నావు?
జవాబు:
భరతుడు గొప్ప సోదర భక్తుడు. అతడు తనకు రాజ్యం లభించినా కాదని, అన్న పాదుకలకే పట్టాభిషేకం చేసి, అన్నకు సేవకునిగా తాను రాజ్యం పాలించాడు. అన్నగారు 14 సంవత్సరాల తర్వాత తనకు మాట ఇచ్చిన ప్రకారము అయోధ్యకు తిరిగి రాకపోతే, అగ్నిలో దూకి ప్రాణాలు వదలడానికి భరతుడు సిద్ధమైనాడని గ్రహించాను.

తల్లి తనకు రాజ్యం ఇప్పించినా కాదని, అన్న రామునిపై భక్తి గౌరవములు చూపించిన గొప్ప సోదర భక్తుడు, సోదర వాత్సల్యం కలవాడు, భరతుడని నేను గ్రహించాను.

ప్రశ్న 8.
శ్రీరాముని పాదుకలను తీసుకుని, నందిగ్రామం వెళ్ళి వాటికి పట్టాభిషేకం చేసిన భరతుని చర్యను బట్టి మీరు ఏమి గ్రహించారు?
జవాబు:
కైక కోరిన రెండు వరాల వల్ల శ్రీరాముడు వనవాసానికి వెళ్ళాడు. పుత్రశోకంతో దశరథుడు మరణించాడు. భరతుడు తన తల్లిని దూషించాడు. అరణ్యంలోకి వెళ్ళి శ్రీరాముడిని అయోధ్యకు వచ్చి రాజ్యాభిషేకం చేసుకోవాలని గ్రహించాడు. చివరకు భరతుడు రాముడు ఇచ్చిన పాదుకలను తీసుకొని అయోధ్యకు వెళ్ళకుండా నందిగ్రామం వెళ్ళి శ్రీరాముని పాదుకలకు పట్టాభిషేకం చేశాడు.

దీనివల్ల భరతునికి శ్రీరాముని పట్ల అపరిమితమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయని గ్రహించాడు. అన్నలేని అయోధ్యకు వెళ్ళకూడదని, నిశ్చయించుకున్నాడని గ్రహించాను. భరతునికి రాజ్యాధికారం పట్ల వ్యామోహం లేదని గ్రహించాను.

విషయాత్మక ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
శ్రీరాముడంటే తల్లిదండ్రులకే కాదు, ప్రజలందరికీ పరమ ప్రీతి ఎందుకు?
జవాబు:
శ్రీరాముడు సద్గుణాల రాశి. రూపంలోనూ, గుణంలోనూ శ్రేష్ఠుడు. మహావీరుడు. మృదువుగా మాట్లాడతాడు. కోపం లేదు. గర్వం లేదు. సత్యం పలికేవాడు. పరుల సంపద ఆశించడు. దీనులను ఆదుకుంటాడు. కాలాన్ని వృధా చేయడు. వినయశీలి. తల్లిదండ్రులు, గురువులు, పెద్దలపట్ల భక్తి కలవాడు. సోమరితనం లేనివాడు.

ప్రశ్న 2.
కైకేయికి దశరథుడిచ్చిన వరాల వలన ఏమయింది?
జవాబు:
దేవాసుర సంగ్రామంలో కైకకు దశరథుడు వరాలిస్తానన్నాడు. సమయం వచ్చినపుడు అడుగుతానంది. శ్రీరామ పట్టాభిషేకం ఏర్పాట్లలో ఉన్నపుడు ఆ వరాలను అడిగింది. ఒకటి శ్రీరామునికి బదులుగా భరతునికి పట్టాభిషేకం చేయాలి. శ్రీరాముని వనవాసానికి పంపాలనేది రెండవ వరం. ఈ వరాలు ఇవ్వడం వలన దశరథుడు మరణించాడు. సీతారాములు అడవుల పాలయ్యారు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 అయోధ్యాకాండ

ప్రశ్న 3.
పాదుకా పట్టాభిషేకం గురించి వ్రాయండి.
జవాబు:
తండ్రికి అంత్యక్రియలు జరిపాడు భరతుడు. తర్వాత చిత్రకూటం వైపు వెళ్లి శ్రీరాముని దర్శించాడు. అయోధ్యకు రమ్మన్నాడు. రాజువు కమ్మని వినయంగా ప్రార్ధించాడు. శ్రీరాముడు ఒప్పుకోలేదు. కనీసం పాదుకలనైనా ఇమ్మన్నాడు. రాముడు అనుగ్రహించాడు. పాదుకలతో నందిగ్రామం చేరాడు. ఆ పాదుకలను సింహాసనంపై ఉంచి పట్టాభిషేకం చేశాడు. ఆ పాదుకలకు ప్రతినిధి తాను సేవకుడిగా రాజ్య వ్యవహారాలు చూశాడు.

వ్యాసరూప ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
చెప్పుడు మాటలు చేటుకు కారణమని రామాయణం ఆధారంగా ఎలా సమర్థిస్తావు?
జవాబు:
రాముడికి పట్టాభిషేకం చేస్తారని కైక అరణపుదాసి అయిన మంథరకు తెలిసింది. ఆమె, ఆ విషయం కైకతో చెప్పింది. కైకకు రాముడంటే చాల ఇష్టం. అందుకే ఆ వార్త తెచ్చిన మంథరకు, ఆనందంతో కైక మంచి బహుమతిని ఇచ్చింది. కైక ప్రవర్తనకు మంథర ఆశ్చర్యపోయింది. ఏడ్వవలసిన సమయంలో ఎందుకు సంతోషిస్తున్నావని మంథర కైకను అడిగింది. తనకు రామభరతులు ఇద్దరూ సమానమే అని కైక చెప్పింది.

అప్పుడు మంథర కైకకు దుష్టబోధ చేసింది. “రాముడు రాజు అయితే కౌసల్య రాజమాత అవుతుంది. కైక దాసి అవుతుంది. రాముడికి భరతుడు దాస్యం చేయవలసి వస్తుంది. తరువాత రాముడి సంతానానికే రాజ్యాధికారం వస్తుంది. భరతుడి సంతానానికి రాజ్యం రాదు. కాబట్టి భరతుడికి రాజ్యాధికారం దక్కేటట్లు, రాముడు అడవులపాలు అయ్యేటట్లు చూడు” అని మంథర కైకకు చెప్పుడు మాటలు చెప్పింది. ఆ చెప్పుడు మాటలు విని, కైక మనస్సు మార్చుకుంది. రాముడిని అడవులకు పంపింది. అందుకే చెప్పుడు మాటలు, చేటుకు కారణం అని చెప్పాలి.

ప్రశ్న 2.
సీతారామలక్ష్మణులు వనవాసానికి వెళ్ళిన వృత్తాంతాన్ని తెలపండి.
జవాబు:
శ్రీరాముడు అంటే ప్రజలకు ఇష్టం. ప్రజల కోరిక మేరకు దశరథుడు రాముడికి యువరాజ పట్టాభిషేకం చేద్దామనుకున్నాడు. రాజాజ్ఞతో మంత్రులు, అధికారులూ రాముని యౌవరాజ్య పట్టాభిషేకానికి, ఏర్పాట్లు చేస్తున్నారు. దశరథుడు రాముని పిలిచి, పట్టాభిషేకం గూర్చి చెప్పి, రాజధర్మాలు బోధించాడు. సీతారాములు పట్టాభిషేకానికి ఉపవాస దీక్ష చేపట్టారు.

రాముడి పట్టాభిషేకం వార్త కైక దాసి మంథరకు తెలిసింది. ఆ వార్తను మంథర కైకకు చెప్పింది. కైక సంతోషించింది. కాని మంథర దుర్బోధతో, కైక మనస్సు మారింది. భరతుడికి పట్టాభిషేకం జరగడానికి, దశరథుడు వెనుక కైకకు ఇచ్చిన రెండు వరాలనూ ఉపయోగించుకోమని మంథర సలహా చెప్పింది. కైక కోపగృహానికి చేరింది. దశరథుడు కైకను బ్రతిమాలాడు. కైక దశరథుణ్ణి రెండు వరాలు కోరింది. 1) భరతుడికి పట్టాభిషేకం 2) రాముడి వనవాసం. దశరథుడు రాముణ్ణి అడవులకు పంపవద్దని కైకను బ్రతిమాలాడు. కాని కైక మనస్సు మారలేదు.

కైక రామునికి కబురంపింది. తండ్రిగారి విచారానికి కారణం ఏమిటని రాముడు అడిగాడు. కైక రాముడికి తాను కోరిన వరాలు గురించి చెప్పింది. తండ్రి మాటను పాటిస్తానని రాముడు చెప్పాడు. కైక మాటపై రాముడు దండకారణ్యానికి బయలుదేరతానన్నాడు. దశరథుడు దుఃఖించాడు. రాముడు తండ్రికీ, కైకకూ నమస్కరించాడు. రాముడు తల్లి కౌసల్యను దర్శించాడు. రాముని వనవాసం గూర్చి విని కౌసల్య దుఃఖించింది. రాముడిని అడవికి వెళ్ళవద్దని తల్లి, లక్ష్మణుడు చెప్పారు. కాని రాముడు తండ్రి మాటనే గౌరవిస్తానన్నాడు.

కౌసల్య రాముని వెంట వనవాసానికి వస్తానంది. అది ధర్మం కాదు, తండ్రిగారి సేవ చేయాలని రాముడు తల్లికి చెప్పాడు. సీత కూడా వనవాసానికి వస్తానంది. లక్ష్మణుడు కూడా రాముని వెంట వస్తానన్నాడు. సీతారామలక్ష్మణులు దశరథుని వద్దకు వెళ్ళారు. కైకేయి వారికి నారచీరలను ఇచ్చింది. వారు నారచీరలు ధరించారు. సుమిత్ర లక్ష్మణుడితో సీతారాములను తల్లిదండ్రులవలె సేవింపుమని చెప్పింది.
సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేశాడు. సీతారామలక్ష్మణులు రథం ఎక్కారు. పౌరులు వెంట బయలుదేరారు. ఈ విధంగా రాముడు భార్యాసోదరులతో అడవికి వెళ్ళాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 అయోధ్యాకాండ

ప్రశ్న 3.
శ్రీరాముడు వనవాసం వెళ్ళడానికి గల కారణమేమి?
(లేదా)
సీతారామలక్ష్మణులు అయోధ్యను వీడి, చిత్రకూటం చేరిన వృత్తాంతాన్ని తెలపండి. (వనవాసానికి వెళ్ళిన వృత్తాంతం)
జవాబు:
సీతారామలక్ష్మణులు సుమంత్రుడు తెచ్చిన రథాన్ని ఎక్కారు. శ్రీరాముడిని విడిచిపెట్టలేక, కొందరు పౌరులు రథానికి ప్రక్కలనూ, వెనుక భాగంలోనూ వేలాడారు. అయోధ్య ఆర్తనాదాలతో నిండింది. కౌసల్యను సుమిత్ర ఓదార్చింది.

రాముని రథాన్ని ప్రజలు నీడలా అనుసరిస్తున్నారు. అయోధ్యకు వెళ్ళిపొండని రాముడు వారికి ఎంతగానో చెప్పాడు. రాముడిని అయోధ్యకు తిరిగి రమ్మనీ లేక తమను వెంటరానిమ్మనీ ప్రజలు రాముణ్ణి వేడుకున్నారు. రథం తమసానది దగ్గరకు చేరింది. ఆ రాత్రి ప్రజలు నిద్రిస్తుండగా రాముడు రథంపై బయలుదేరాడు. ప్రజలు లేచి చూశారు. తాము నిద్రపోయినందుకు తమను తామే ప్రజలు నిందించుకొని అయోధ్యకు తిరిగి వెళ్ళారు.

రాముని రథం కోసల దేశం పొలిమేరకు చేరింది. రాముడు అయోధ్యవైపు తిరిగి నమస్కరించాడు. క్రమంగా వారు గంగాతీరానికి చేరారు. ఆ తీరంలో ‘శృంగిబేరపురం’ ఉంది. గుహుడు ఆ దేశానికి రాజు. అతడు శ్రీరాముని భక్తుడు. అతడు రాముని వద్దకు వచ్చాడు. రాముడు గుహుడికి ఎదురేగివెళ్ళి గుహుని ఆతిథ్యం తీసుకున్నాడు.

గుహుడు గంగను దాటడానికి నావను ఏర్పాటు చేశాడు. శ్రీరాముడు మర్రిపాలు తెప్పించి తనకూ, తమ్మునికీ జడలను సిద్ధం చేశాడు. అడవిలో ముందు లక్ష్మణుడు, వెనుక సీత, ఆ వెనుక రాముడు నడిచారు. వారు సాయంత్రానికి భరద్వాజాశ్రమానికి చేరారు. ముని, సీతారామలక్ష్మణులకు అతిథి సత్కారాలు చేశాడు. వనవాస కాలాన్ని తన ఆశ్రమంలో గడపమని భరద్వాజ మహర్షి వారిని కోరాడు.

జనులకు అందుబాటులో ఉండని, ఆశ్రమ వాసానికి తగిన ప్రదేశాన్ని సూచించండని రాముడు భరద్వాజ మహర్షిని కోరాడు. పది కోసుల దూరంలోని ‘చిత్రకూటం’ పవిత్రమైనదనీ, అది మహర్షుల నివాస స్థానం అనీ, భరద్వాజుడు చెప్పాడు. రామలక్ష్మణులు యమునను దాటి ‘చిత్రకూటం’ చేరుకున్నారు. లక్ష్మణుడు అన్న ఆదేశం ప్రకారం, అక్కడ కుటీరం నిర్మించాడు. సీతారామలక్ష్మణులు చిత్రకూటంలో వనవాసం చేశారు.

ప్రశ్న 4.
“భరతుని పాదుకా పట్టాభిషేకం” గురించి రాయండి.
జవాబు:
దశరథుడు శ్రీరాముని ఎడబాటును సహింపలేక ప్రాణాలు విడిచాడు. రామలక్ష్మణులు అడవికి వెళ్ళారు. భరత శత్రుఘ్నులు మేనమామ ఇంటిలో ఉన్నారు. వశిష్ఠుడి ఆజ్ఞమేరకు దశరథుని శరీరాన్ని తైలద్రోణిలో జాగ్రత్త చేశారు. దూతలు వెళ్ళి ఎనిమిదవరోజున భరత శత్రుఘ్నులను అయోధ్యకు తీసుకువచ్చారు. భరతుడు తండ్రికి అంత్యక్రియలు పూర్తి చేశాడు.

భరతుడు కైకను తప్పు పట్టాడు. శత్రుఘ్నుడు మంథరను చంపడానికి సిద్ధమయ్యాడు. మంత్రులు భరతుణ్ణి రాజ్యాధికారం స్వీకరించమన్నారు. పెద్దవాడైన రాముడే రాజు కావాలని భరతుడు పట్టుపట్టాడు. తాను వెళ్ళి రాముణ్ణి అయోధ్యకు తీసుకువస్తానని భరతుడు అయోధ్యాపురవాసులతో కలసి అడవికి బయలుదేరాడు.

భరతుడు శృంగిబేరపురం చేరాడు. గుహుడు భరతుడి మనస్సు తెలియక, తికమక పడ్డాడు. విషయం తెలిసి గుహుడు భరతుణ్ణి ఆహ్వానించాడు. భరతుడు గుహుడితో కలిసి, భరద్వాజాశ్రమం చేరి విందు స్వీకరించాడు. తరువాత చిత్రకూటం బయలుదేరాడు.

భరతుడు సేనలతో వస్తూ ఉండడం చూసి, లక్ష్మణుడు పొరపాటుపడ్డాడు. భరతుడు రాముని మీదికి యుద్ధానికి వస్తున్నాడని, లక్ష్మణుడు రామునికి చెప్పాడు. భరతుడు అటువంటివాడుకాడని రాముడు లక్ష్మణునకు చెప్పాడు.

భరత శత్రుఘ్నులు రాముని పాదాలపై పడ్డారు. రాముడు కన్నీళ్ళు పెట్టాడు. రాముడు భరతునికి రాజనీతులు చెప్పాడు. రాముణ్ణి అయోధ్యకు తిరిగి రమ్మని భరతుడు కోరాడు. రాముడు తండ్రి మాటే తనకు శిరోధార్యం అన్నాడు.

చివరకు భరతుని కోరికపై శ్రీరాముడు తన పాదుకలను భరతునికి ఇచ్చాడు. ఆ పాదుకల మీదనే రాజ్యభారం ఉంచి, తాను నారచీరలు ధరించి, నగరం వెలుపల ఉంటాననీ, పదునాల్గవ సంవత్సరం కాగానే, రామదర్శనం కాకపోతే అగ్ని ప్రవేశం చేస్తానని భరతుడు చెప్పాడు.

భరతుడు నందిగ్రామం చేరి రామపాదుకలకు పట్టాభిషేకం చేశాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 అయోధ్యాకాండ

ప్రశ్న 5.
శ్రీరామ పట్టాభిషేకాన్ని ప్రజలు ఎందుకు సమర్థించారు? విశ్లేషించండి.
జవాబు:
శ్రీరాముడు సకల గుణాభిరాముడు. శ్రీరాముడు సద్గుణాల రాశి. రాముడు రూపంలోనూ, గుణంలోనూ గొప్పవాడు. : . , రాముడు మహావీరుడు. రాముడు మృదువుగా మాట్లాడతాడు. శరణు అన్నవారిని రాముడు కాపాడతాడు.

శ్రీరాముడు కోపమూ, గర్వమూ లేనివాడు. సత్యమును పలికేవాడు. పరుల సంపదను ఆశించనివాడు. దీనులను ఆదుకొనేవాడు. కాలాన్ని వృథా చేయకుండా జ్ఞానులతో, సజ్జనులతో వివిధ విషయాలను చర్చించేవాడు. శ్రీరాముడు వినయము కలవాడు.

శ్రీరాముడు తల్లిదండ్రులపట్ల, గురువులపట్ల నిశ్చలభక్తి కలవాడు. రాముడు సోమరితనం, ఏమరుపాటు లేనివాడు. అన్ని కళలలోనూ ఆరితేరినవాడు. అసూయ, మాత్సర్యం లేనివాడు. ప్రజలపట్ల వాత్సల్యం కలవాడు.

శ్రీరాముడు ఇన్ని మంచి గుణాలు కలవాడు కాబట్టి తల్లిదండ్రులతోపాటు, ప్రజలు కూడా శ్రీరామ పట్టాభిషేకాన్ని సమర్థించారు.

ప్రశ్న 6.
శ్రీరాముడు వనవాసానికి ఎలా వెళ్ళాడు?
జవాబు:
ప్రజల కోరిక మేరకు దశరథుడు, శ్రీరాముడికి యువరాజ పట్టాభిషేకం చేద్దామనుకున్నాడు. దశరథుడు రామునికి పట్టాభిషేకం గూర్చి చెప్పి, రాజధర్మాలు బోధించాడు. సీతారాములు ఉపవాసదీక్ష చేపట్టారు.

రాముని పట్టాభిషేకం వార్త మంథరకు తెలిసింది. మంథర కైకకు చెప్పి, ఆమె మనస్సును మార్చింది. దశరథుడు వెనుక కైకకు ఇచ్చిన వరాలను ఉపయోగించుకోమని మంథర కైకకు దుర్బోద చేసింది. కైక కోపగృహానికి చేరింది. కైక దశరథుణ్ణి రెండు వరాలు కోరింది. 1) భరతుడికి పట్టాభిషేకం, 2) రాముడి వనవాసం.

దశరథుడు రాముణ్ణి అడవులకు పంపవద్దని కైకను బ్రతిమాలాడు. కైక మనస్సు మారలేదు. కైక భర్త అనుమతితో రామునికి కబురు చేసింది. రాముడు వచ్చి తండ్రి విచారానికి కారణం ఏమిటని కైకను అడిగాడు. కైక, తాను కోరిన వరాలను గూర్చి రాముడికి చెప్పింది. తండ్రి మాటను పాటిస్తానన్నాడు రాముడు. కైక మాటపై రాముడు దండకారణ్యానికి వెడతానన్నాడు.

రాముడు తల్లి కౌసల్య వద్దకు వెళ్ళాడు. రాముడిని అడవికి వెళ్ళవద్దని తల్లీ, లక్ష్మణుడు చెప్పారు. కాని రాముడు తండ్రి మాటనే గౌరవిస్తానన్నాడు.

రాముని వెంట సీతాలక్ష్మణులు వనవాసానికి వస్తానన్నారు. సీతారామలక్ష్మణులు తండ్రి వద్దకు వెళ్ళారు. కైకేయి వారికి నారచీరలను ఇచ్చింది. వారు నారచీరలు ధరించారు.

సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేశాడు. సీతరామలక్ష్మణులు రథం ఎక్కారు. ఈ విధంగా రాముడు సీతాలక్ష్మణ సమేతంగా వనవాసానికి వెళ్ళాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 అయోధ్యాకాండ

ప్రశ్న 7.
దశరథుని మరణవార్త విని, భరతుడెలా స్పందించాడు?
జవాబు:
రాముడు అడవికి వెళ్ళాడని దశరథుడు దుఃఖంతో మరణించాడు. దూతలు వెళ్ళి మేనమామ ఇంట్లో ఉన్న భరతుడిని అయోధ్యకు తీసుకువచ్చారు. భరతుడు, తండ్రికి అంత్యక్రియలు చేశాడు.

భరతుడు కైకను తప్పు పట్టాడు. మంత్రులు భరతుడిని రాజ్యాధికారం చేపట్టమన్నారు. పెద్దవాడైన రాముడే రాజు కావాలనీ, తాను రాముణ్ణి తీసుకు వస్తాననీ, భరతుడు అడవికి బయలుదేరాడు.

భరత శత్రుఘ్నులు అడవిలో రాముడిని కలిసి, ఆయన పాదాలపై పడ్డారు. రాముడు కన్నీరు పెట్టాడు. రాముడిని అయోధ్యకు తిరిగి వచ్చి రాజువు కమ్మని భరతుడు కోరాడు. రాముడు తండ్రి మాటయే తనకు శిరోధార్యం అన్నాడు.

చివరకు భరతుడు కోరగా, రాముడు తన పాదుకలను భరతుడికి ఇచ్చాడు. రాముని పాదుకల మీదనే రాజ్యభారం ఉంచి, భరతుడు నారచీరలు ధరించి, తాను అయోధ్యా నగరం బయట ఉంటానన్నాడు. భరతుడు నందిగ్రామం చేరి, రామపాదుకలకు పట్టాభిషేకం చేశాడు.