AP Board 7th Class Social Solutions Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం

SCERT AP 7th Class Social Study Material Pdf 9th Lesson భారత రాజ్యాంగం – పరిచయం Textbook Questions and Answers.

AP State Syllabus 7th Class Social Solutions 9th Lesson భారత రాజ్యాంగం – పరిచయం

7th Class Social 9th Lesson భారత రాజ్యాంగం – పరిచయం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

I. ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
ఒక ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగం ఎందుకు అవసరం?
జవాబు:

  1. ఉదయం పాఠశాలకు వచ్చినప్పటి నుండి సాయంత్రం పాఠశాలను విడిచి వెళ్లేవరకు పాఠశాలలో జరిగే వివిధ కార్యక్రమాలు అనగా అసెంబ్లీ, వివిధ పాఠ్యాంశాల బోధనాభ్యసన కార్యక్రమాలు, క్రీడలు మొదలైనవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో నిర్వహించబడతాయి.
  2. ఇవన్నీ కూడా మన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి రూపొందించుకున్న ఒక కాలక్రమ పట్టిక ప్రకారం జరుగుతున్నాయి. ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా పాఠశాలను నిర్వహించడమనేది కష్టం అనేది మనందరికీ తెలుసు.
  3. అదే విధంగా ఒక దేశాన్ని పరిపాలించాలంటే ఆ దేశాధినేత, ప్రభుత్వం, చట్టసభలు, న్యాయస్థానాలు మొదలగు అంశాలతో కూడిన ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకోవాల్సి ఉంటుంది.
  4. అందులోని అంశాల ఆధారంగా సక్రమ పరిపాలనను ప్రజలకు అందించడానికి అవకాశం కలుగుతుంది.

AP Board 7th Class Social Solutions Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం

ప్రశ్న 2.
భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఎన్ని? అవి ఏవి?
జవాబు:
భారత రాజ్యాంగ ఆవిర్భావ సమయంలో, మనకు ఏడు ప్రాథమిక హక్కులు ఉండేవి. కాని, 1978వ సంవత్సరంలో 44వ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కు తొలగించబడింది. కనుక ప్రాథమిక హక్కులు ఆరు అవి:

ప్రాథమిక హక్కులు

ప్రాథమిక హక్కు వివరణ
1) సమానత్వపు హక్కు
(ప్రకరణ 14-18)
భారత రాజ్యాంగం సమానత్వపు హక్కుకు హామీ ఇస్తుంది. ఇది చట్టం యొక్క సమాన రక్షణ, సామాజిక సమానత్వం, ఉపాధి మరియు విద్యలో సమాన అవకాశాలు, అంటరానితనం రద్దు మరియు బిరుదులు రద్దు అనే అంశాలను కలిగి ఉంది.
2) స్వేచ్ఛా హక్కు
(ప్రకరణ 19-22)
స్వేచ్ఛా హక్కు ఈ క్రింది ఆరు రకాలైన స్వేచ్ఛలకు హామీ ఇస్తుంది : వాక్ మరియు భావ ప్రకటనా స్వేచ్ఛ, ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశమయ్యే స్వేచ్ఛ, సంఘాలు లేదా వ్యవస్థలుగా ఏర్పడటానికి స్వేచ్ఛ, సంచరించడానికి స్వేచ్ఛ, భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా నివసించడానికి మరియు స్థిరపడటానికి స్వేచ్ఛ, ఏదైనా వృత్తిని చేపట్టడానికి స్వేచ్ఛ మరియు జీవించే హక్కు.
3) పీడనాన్ని నిరోధించే హక్కు
(ప్రకరణ 23-24)
ఈ హక్కు కింద, అన్ని రకాల “వెట్టిచాకిరి నిషేధించబడింది”. ఇది బాలకార్మిక వ్యవస్థను కూడా నిషేధిస్తుంది. “14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు
ఉన్న పిల్లలను ఏదేని కర్మాగారంలో లేదా గనులలో పని చేయించరాదు. ఏ ఇతర ప్రమాదకర ఉపాధిలో నియమించరాదు”. అని రాజ్యాంగం చెబుతోంది.
4) మత స్వాతంత్ర్యపు హక్కు
(ప్రకరణ 25-28)
వ్యక్తులు అందరూ తమ మనస్సాక్షిని అనుసరించడానికి మరియు ఏ మతాన్ని అయినా ఆచరించే స్వేచ్ఛను కలిగి ఉంటారు. మన దేశంలో హిందూ మతం, ఇస్లాం మతం, క్రైస్తవ మతం, సిక్కు మతం, బౌద్ధ మతం, జైన మతం వంటి అనేక మతాలు ఉన్నప్పటికీ రాజ్యా నికి అధికార మతం లేదు. మత వ్యవహారాలలో ప్రభుత్వం తటస్థంగా ఉంటుంది. కాబట్టి మన దేశాన్ని లౌకిక రాజ్యంగా పిలుస్తారు.
5) విద్యా సాంస్కృతికపు హక్కు
(ప్రకరణ 29-30)
రాజ్యాంగం ప్రకారం, మైనారిటీలందరు, మత ప్రాతిపదికన లేదా భాషా ప్రాతిపదికన, తమకు నచ్చిన విద్యా సంస్థలను స్థాపించడానికి, నిర్వహించు కోవడానికి హక్కు ఉంది. వారు తమ సంస్కృతిని పరిరక్షించుకునే హక్కు కలిగి ఉంటారు.
6) రాజ్యాంగ పరిహారపు హక్కు
(ప్రకరణ – 32)
ఈ హక్కు సుప్రీం కోర్టు మరియు హైకోర్టుల ద్వారా అన్ని ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తుంది.

ప్రశ్న 3.
ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు ఉదాహరణ :

  1. ఒక వ్యక్తిని కారణం తెలపకుండా నిర్బంధంలోకి తీసుకోవడం.
  2. ఒక వ్యక్తి బిరుదులు తన పేరు ముందు గాని, చివర గాని పెట్టుకోవడం.
  3. 14 సంవత్సరాల లోపు పిల్లలచే పని చేయించడం.
  4. ఒక వ్యక్తి తనకు ఆసక్తి గల మతాన్ని అనుసరించకుండా అడ్డుకోవటం,
  5. అంటరానితనంను ప్రోత్సహించడం.
  6. కుల ప్రాతిపదికన వ్యక్తులకు వేరే ప్రాంతాల్లో నివాసం ఏర్పాటు.
  7. ప్రభుత్వాలను సహేతుకంగా విమర్శించినను నిర్బంధించటం.
  8. శాంతియుతంగా సమావేశమవ్వడానికి అనుమతినివ్వకపోవటం.
  9. తనకు నచ్చిన వ్యాపారం, వృత్తిని చేసుకోకుండా అడ్డుకోవటం.

ప్రశ్న 4.
ప్రాథమిక విధులు దేశభక్తిని ఎలా పెంచుతాయి?
జవాబు:
ప్రాథమిక విధులలో రాజ్యాంగానికి బద్దుడై ఉండుట, జాతీయ పతాకమును, జాతీయ గీతమును గౌరవించుట, దేశమును రక్షించుట మరియు కోరినపుడు జాతికి సేవ చేయుట. దేశ సమగ్రతను సమైక్యతను కాపాడుట. స్వాతంత్ర్య పోరాట ఆదర్శాలను అనుసరించుట మొదలైన విధులు పాటించుట వలన దేశభక్తి కచ్చితంగా పెరుగుతుంది. ఎప్పుడైతే పై విధులను సక్రమంగా అనుసరిస్తారో అప్పుడు వారిలో దేశభక్తి పెరుగుతుందనుటలో సందేహం లేదు.

AP Board 7th Class Social Solutions Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం

ప్రశ్న 5.
భారత రాజ్యాంగ తయారీలో డా॥బి.ఆర్. అంబేద్కర్ పాత్రను అభినందించండి.
జవాబు:

  1. డా|| బి.ఆర్. అంబేద్కరను “భారత రాజ్యాంగ పిత” గా అభివర్ణిస్తారు.
  2. స్వతంత్ర భారతదేశపు ముసాయిదా రాజ్యాంగాన్ని రూపొందించడానికి బాధ్యత వహించారు.
  3. 1947లో స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి న్యాయశాఖా మంత్రిగా నియమించబడ్డారు.
  4. డా|| భీమ్ రావ్ రామ్ జీ అంబేద్కర్‌ను, బాబా సాహెబ్ అంబేద్కర్ అని కూడ పిలుస్తారు.
  5. వీరు న్యాయ శాస్త్రవేత్త. సామాజిక సంస్కర్త మరియు రాజకీయవేత్త.
  6. భీమ్ రావ్ అంబేద్కర్ భీమా బాయి మరియు రాంజీ దంపతులకు 14 ఏప్రిల్, 1891న సెంట్రల్ ప్రావిన్సెస్ (మధ్యప్రదేశ్) లోని మౌ ఆర్మీ కంటోన్మెంట్లో జన్మించారు.
  7. అంబేద్కర్ తండ్రి బ్రిటిష్ వారి భారత సైన్యంలో సుబేదార్‌గా పనిచేసి 1894 లో పదవీ విరమణ చేసిన తరువాత, కుటుంబంతో సెంట్రల్ ప్రావిన్సెస్లోని సతారాకు వెళ్లారు.
  8. తన బాల్యంలో అంబేద్కర్ అనేక సవాళ్ళను ఎదుర్కొన్నాడు. అవి తదుపరి జీవితంలో ఆయన రచనలను, సిద్ధాంతాలను ప్రభావితం చేసాయి.
  9. అంబేద్కర్ తన జీవితంలో ఎక్కువ భాగం రాజకీయ స్రవంతి వెలుపల పనిచేశారు. ముఖ్యంగా పేదలు మరియు అణగారిన వర్గాల సంక్షేమం కోసం పనిచేశారు.

ప్రశ్న 6.
మన రాజ్యాంగంలోని ప్రాథమిక విధులను పేర్కొనండి.
జవాబు:

  1. రాజ్యాంగానికి బద్దుడై ఉండుట, జాతీయ పతాకమును, జాతీయ గీతాన్ని గౌరవించుట.
  2. భారత సార్వభౌమత్వం, ఐక్యత, అఖండతను సమర్ధించుట, సంరక్షించుట.
  3. సామరస్యాన్ని, సోదర భావాన్ని పెంపొందించుట.
  4. సహజ పర్యావరణాన్ని కాపాడి, అభివృద్ధిపరుచుట.
  5. ప్రజల ఆస్తిని సంరక్షించుట, హింసను విడనాడుట.
  6. విద్యావకాశాలను కల్పించుట.
  7. స్వాతంత్ర్య పోరాట ఆదర్శాలను అనుసరించుట.
  8. దేశమును రక్షించుట మరియు కోరినపుడు జాతికి సేవ చేయుట.
  9. సుసంపన్నమైన మన సంస్కృతిని వారసత్వాన్ని రక్షించుట.
  10. శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతావాదాన్ని పెంపొందించుట.
  11. అభ్యున్నతి కోసం కృషి చేయడం.

ప్రశ్న 7.
“భారతదేశం సార్వభౌమాధికారం గల దేశం” వ్యాఖ్యానించుము.
జవాబు:

  1. బాహ్య మరియు అంతర్గత విషయాలపై నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారాన్ని సార్వభౌమాధికారం అంటారు.
  2. భారతదేశంపై ఏ ఇతర దేశం / సమాజం పెత్తనం లేదు. భారతదేశంలో బాహ్య, అంతర్గత విషయాల నిర్ణయాలు దేశ ప్రజలే తీసుకోగలరు (ప్రజాప్రతినిధులే).
  3. భారతదేశం బ్రిటిషు వారి వలస పాలన నుండి విముక్తి పొందినప్పటి నుండి సర్వసత్తాక అధికారం కల్గిన దేశంగా రూపొందింది.

ప్రశ్న 8.
మంచి పౌరునికి ఉండవలసిన లక్షణాలు వ్రాయండి.
జవాబు:
ఒక వ్యక్తిగాని, సమాజం గాని అభివృద్ధిని సాధించాలంటే విలువలు అనేవి అత్యంత ఆవశ్యకమైనవి. ముఖ్యంగా ప్రజాస్వామ్యం విజయవంతం కావడానికి ఇవి మరింత అవసరం. నీతి, నిజాయితీ, నిబద్ధత, పారదర్శకత, జవాబుదారీతనం, చిత్తశుద్ధి మొదలగు విలువలను పౌరులు కలిగి ఉన్నప్పుడు సమాజం అన్ని విధాలుగా ప్రగతి పధంలో పయనిస్తుంది.

బాధ్యతాయుతమైన పౌరులుగా భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను అనుభవిస్తూ, వ్యక్తిగత ప్రగతిని సాధిస్తూనే సమాజ శ్రేయస్సు కొరకు పౌర విధులను కూడా సక్రమంగా నిర్వర్తించాలి. మన దేశానికి స్వాతంత్ర్యం సంపాదించి పెట్టిన జాతీయ నాయకుల యొక్క దేశ భక్తిని ఆదర్శంగా తీసుకొని అన్ని సందర్భాలలో అదే స్ఫూర్తితో పనిచేయాలి. స్వీయ క్రమశిక్షణ కలిగి ఉండటంతో పాటుగా, పాఠ్యేతర కార్యకలాపాలు నిర్వహించేటప్పుడు క్రమశిక్షణ పాటించాలి. క్రీడా మైదానంలో ఆటలు ఆడేటప్పుడు, క్రీడా స్ఫూర్తితో మెలిగి, గెలుపు ఓటములనేవి ఆటలో భాగంగా భావించాలి.

వివిధ ఆచార సాంప్రదాయాలు గల మన దేశంలో తోటి వారి పట్ల సహనం, సోదర భావం కలిగి ఉండి వారి అభిప్రాయాలను గౌరవిస్తూ, మనం ఇతరుల నుండి ఏమి ఆశిస్తున్నామో, అలాగే ఇతరుల విషయాలలో కూడా మర్యాదపూర్వకంగా నడచుకోవాలి.

అదే విధంగా రాజ్యాంగం పట్ల గౌరవాన్ని, విధేయతను కనబరుస్తూ, విలువలను పాటిస్తూ, ఉత్తమ పౌరులుగా మెలిగినప్పుడు మన రాజ్యాంగ నిర్మాతల యొక్క ఆశయాలు, లక్ష్యాలు నెరవేరుతాయి.

AP Board 7th Class Social Solutions Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం

II. బహుళైచ్ఛిక ప్రశ్నలకు సమాధానాలు రాయుము.

1. రాజ్యాంగ సభ చైర్మన్
ఎ) డా. బి. ఆర్. అంబేద్కర్
బి) జవహర్ లాల్ నెహ్రూ
సి) మహాత్మా గాంధీ
డి) డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్
జవాబు:
డి) డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్

2. కింది వాటిలో భిన్నమైనది ఏది?
ఎ) స్వేచ్ఛ
బి) అసమానత
సి) న్యాయం
డి) సౌభ్రాతృత్వం
జవాబు:
బి) అసమానత

3. మన రాజ్యాంగంలో విద్యాహక్కు గురించి ఏ నిబంధన చెబుతోంది?
ఎ) 19
బి) 20-ఎ
సి) 21
డి) 21-ఎ
జవాబు:
డి) 21-ఎ

4. క్రింది వాటిలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఏది?
ఎ) చట్టం ముందు అందరూ సమానులే.
బి) టీ షాపులో 14 ఏళ్ల లోపు బాలుడు పని చేయుట.
సి) ఒక వ్యక్తికి ఏ మతాన్ని అయినా అనుసరించే హక్కు ఉంది.
డి) అన్నీ
జవాబు:
బి) టీ షాపులో 14 ఏళ్ల లోపు బాలుడు పని చేయుట.

5. మన రాజ్యాంగంలోని ప్రాథమిక విధుల గురించి ఏ నిబంధన తెలియచేస్తుంది?
ఎ) 51
బి) 51-ఎ
సి) 21
డి) 21-ఎ
జవాబు:
బి) 51

6. భారత రాజ్యాంగం యొక్క “లక్ష్యాల తీర్మానం” ను ఎవరు ప్రతిపాదించారు?
ఎ) డా|| బి.ఆర్ అంబేద్కర్
బి) సర్దార్ వల్లభాయ్ పటేల్
సి) జవహర్‌లాల్ నెహ్రూ
డి) హెచ్.సి. ముఖర్జీ
జవాబు:
సి) జవహర్‌లాల్ నెహ్రూ

III. జతవరుచుము.

గ్రూప్ – A గ్రూప్ – B 1. 42వ రాజ్యాంగ సవరణ (ఇ) ఎ) ప్రాథమిక హక్కులు 2. 44వ రాజ్యాంగ సవరణ ( సి ) బి) ప్రాథమిక విధులు 3. ,86వ రాజ్యాంగ సవరణ (డి) సి) ఆస్తి హక్కు తొలగింపు 4. 3వ భాగం (ఎ) డి) విద్యా హక్కు 5. భాగం – IVA ( బి , ఇ) పీఠికలో సామ్యవాదం, లౌకిక పదాలు చేర్చడం.

పద బంధము

ఇచ్చిన సూచనల ఆధారంగా, రాజ్యాంగ పీఠిక నుండి తీసుకోబడిన పదాలతో పదకోశం పూరించండి.
AP Board 7th Class Social Solutions Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం 1
నిలువు :
1. పౌరులందరి నైతిక బాధ్యతలు (3)
3. రాజ్యాంగ లక్ష్యాలను తెలియపరిచేది (4)
6. ప్రజల చేత ఏర్పడిన ప్రభుత్వం (4)

అడ్డం :
2. వ్యక్తుల సహేతుకమైన వాదనలు (3)
4. ప్రభుత్వం ఏ మతానికి అనుకూలం కాదు (6)
5. దేశాధినేత ప్రజలచే ఎన్నుకోబడతారు (4)
7. ప్రజలందరూ సోదరభావంతో కలిసిమెలిసి జీవించడం (5)
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం 2

7th Class Social Studies 9th Lesson భారత రాజ్యాంగం – పరిచయం InText Questions and Answers

7th Class Social Textbook Page No.63

ప్రశ్న 1.
రాజ్యాంగ సభ సభ్యులలో ఎవరైనా నలుగురు ప్రముఖులను గుర్తించండి మరియు వారి గురించి సంక్షిప్తంగా వ్రాయండి.
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం 4
1. డా|| బి.ఆర్.అంబేద్కర్ :
డా॥ భీమ్ రావు రామ్ జీ అంబేద్కర్‌ను, బాబాసాహెబ్ అంబేద్కర్ అని కూడా పిలుస్తారు. వీరు న్యాయ శాస్త్రవేత్త, సామాజిక సంస్కర్త మరియు రాజకీయవేత్త, భీమ్ రావు అంబేద్కర్ భీమా బాయి మరియు రాంజీ దంపతులకు 14 ఏప్రిల్, 1891న సెంట్రల్ ప్రావిన్సెస్ (మధ్యప్రదేశ్) లోని మౌ ఆర్మీ కంటోన్మెంట్లో జన్మించారు. అంబేద్కర్ తండ్రి బ్రిటీష్ వారి భారత సైన్యంలో సుబేదార్‌గా పనిచేసి 1894లో పదవీ విరమణ చేసిన తరువాత, కుటుంబంతో సెంట్రల్ ప్రావిన్సెస్లోని సతారాకు వెళ్ళారు. తన బాల్యంలో అంబేద్కర్ అనేక సవాళ్ళను ఎదుర్కొన్నారు. అవి తదుపరి జీవితంలో ఆయన రచనలను, సిద్ధాంతాలను ప్రభావితం చేశాయి. ఆయన “భారత రాజ్యాంగ పిత”గా పరిగణించబడ్డారు. స్వతంత్ర భారతదేశం కోసం ముసాయిదా రాజ్యాంగాన్ని సిద్ధం చేసే బాధ్యత ఆయనపై ఉండింది. ఆయన 1947లో భారతదేశపు న్యాయశాఖా మంత్రిగా నియమించబడ్డారు. అంబేద్కర్ తన జీవితంలో ఎక్కువ భాగం ప్రధాన రాజకీయ స్రవంతి వెలుపల పనిచేశారు. ముఖ్యంగా పేదలు మరియు అణగారిన వర్గాల సంక్షేమం కోసం పనిచేశారు.

AP Board 7th Class Social Solutions Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం 5
2. డా॥ బాబు రాజేంద్రప్రసాద్ :
వీరు రాజ్యాంగ సభ అధ్యక్షునిగా పనిచేశారు. ఆ తరువాత, 1950, జనవరి 24న . రాజ్యాంగ సభ చివరి సమావేశంలో స్వతంత్ర భారతదేశ మొదటి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రెండోసారి రాష్ట్రపతిగా ఎన్నికైన ఏకైక వ్యక్తి డా|| బాబూ రాజేంద్రప్రసాద్ (1950 – 1962)

AP Board 7th Class Social Solutions Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం 6
3. సర్దార్ వల్లభాయ్ పటేల్ :
వీరు గుజరాత్ లో అక్టోబర్ 31, 1875న జన్మించారు. భారతదేశానికి మొదటి ఉప ప్రధానిగా పనిచేసారు. ఈయన ఒక న్యాయవాది. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ప్రముఖ యోధుడు. స్వాతంత్ర్యానంతరం భారతదేశంలోని అనేక చిన్న చిన్న సంస్థానాలను (దాదాపు 566) ఏకం చేసిన ‘ఉక్కు మనిషి’ రాజ్యాంగ పరిషత్ సభలో ‘ప్రాథమిక హక్కుల’ సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు. భారతదేశపు బిస్మార్క్ గా ఉక్కు మనిషిగా పేరుగాంచిన పటేల్ 1950, డిశంబరు 15న మరణించారు.

AP Board 7th Class Social Solutions Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం 7
4. జవహర్‌లాల్ నెహ్రూ :
వీరు నవంబరు 14, 1889న ఉత్తరప్రదేశ్ లోని అహ్మదాబాద్ లో జన్మించారు. వలసవాద వ్యతిరేక జాతీయోద్యమంలో పాల్గొన్నారు. ప్రముఖ నాయకుడు, 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశ ప్రధానిగా పనిచేసారు. భారత జాతీయ కాంగ్రెస్లో ప్రముఖ పాత్ర పోషించారు. భారత రాజ్యాంగ పరిషత్ లో కేంద్ర రాష్ట్రాల కమిటీ, కేంద్ర అధికారాల కమిటీకి అధ్యక్షులుగా వ్యవహరించారు. 1964, మే 27న
మరణించారు.

7th Class Social Textbook Page No.77

ప్రశ్న 2.
క్రింద ఇవ్వబడిన ప్రకటనలలో ప్రాథమిక హక్కులేవో మరియు ప్రాథమిక విధులేవో గుర్తించి, సరియైన గడలో టిక్ మార్క్ ఉంచండి.
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం 8

7th Class Social Textbook Page No.79

ప్రశ్న 3.
మన జీవితంలో సమానత్వం మరియు సౌభ్రాతృత్వం సాధనపై ఒక నాటికను తయారుచేసి తరగతి గదిలో ప్రదర్శించండి.
జవాబు:
విద్యార్థులు నాటికను స్వయంగా తరగతి గదిలో ప్రదర్శించగలరు.

ఆలోచించండి – ప్రతిస్పందించండి

7th Class Social Textbook Page No.57

ప్రశ్న 1.
బ్రిటిషు ప్రభుత్వం చేసిన చట్టాలను మన జాతీయ నాయకులు ఎందుకు వ్యతిరేకించారు?
జవాబు:
బ్రిటిషు ప్రభుత్వం చేసిన చట్టాలను మన జాతీయ నాయకులు ఎందుకు వ్యతిరేకించారంటే,

  1. ఈ చట్టాలు భారతీయులకు అధికారం ఇచ్చినట్లుగానే ఉంటూ అసలు (పూర్తి) అధికారం బ్రిటిషు వారి చేతిలోనే ఉండేలా ఉంటాయి. ఉదా : రాష్ట్రాల శాసన సభలలో అనధికార సభ్యుల మెజారిటీని అనుమతించడం (1909 చట్టం ).
  2. విభజించు – పాలించు విధానమును ఈ చట్టాల ద్వారా అమలు చేసారు. ఉదా : 1909 చట్టంలో (హిందూ) ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలు కేటాయించడం.
  3. ఈ చట్టాలన్ని పరిమిత ఓటు హక్కు మాత్రమే ప్రతిపాదించాయి. భారతీయ పౌరులందరికీ ఓటు హక్కు లేదు.
  4. గవర్నర్ జనరలకు విశేషాధికారం కల్పించి, మన ప్రతినిధులకు, మంత్రులకు నామమాత్రపు అధికారం ఇవ్వటం.
  5. ద్వంద్వ పాలనలో భాగంగా ప్రాధాన్యత లేని, ఆర్థికపరంగా లాభం కాని శాఖలను భారతీయులకు ఇవ్వటం మొదలైనవి.

7th Class Social Textbook Page No.59

ప్రశ్న 2.
భారతదేశానికి ప్రత్యేక రాజ్యాంగాన్ని భారత జాతీయ కాంగ్రెస్ ఎందుకు డిమాండ్ చేసింది? దీని వెనుక గల కారణాలు ఏమిటి?
జవాబు:
భారతదేశానికి ప్రత్యేక రాజ్యాంగాన్ని INC డిమాండ్ చేయటానికి కారణం :

  1. క్విట్ ఇండియా ఉద్యమం : క్రిప్స్ (1942) ప్రతిపాదనలు విఫలమవ్వటంతో ఈ ఉద్యమంను చేపట్టారు. మొదటిసారిగా రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించి బ్రిటిషు ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసింది. అలాగే డొమీనియన్ స్టేటస్ గురించి చర్చ వచ్చినది.
  2. మంత్రిత్రయ రాయబారం : 1946లో పార్లమెంట్‌లో భారతదేశానికి అధికార బదిలీకి సంబంధించిన ప్రకటన “అట్లే’ చేసారు. భారత పాలనకై రాజ్యాంగాన్ని రూపొందించేందుకు రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేయాలని ప్రకటించారు.
  3. భారతదేశానికి ప్రత్యేక రాజ్యాంగం లేకపోతే భారతదేశ పాలన అంతా కూడా బ్రిటిషు పార్లమెంటు చేసే చట్టాల ద్వారా సాగుతుంది.
  4. భారత ప్రభుత్వ చట్టాలు (బ్రిటన్ పార్లమెంట్ చేసేవి) భారతీయుల శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని కాకుండా బ్రిటనకు లాభం చేకూర్చే విధంగా ఉండేవి.

AP Board 7th Class Social Solutions Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం

ప్రశ్న 3.
‘సార్వజనీన వయోజన ఓటు హక్కు’ అనగానేమి?
జవాబు:
జాతి, కులం, మతం, లింగం, విద్య, ఆర్థిక స్థితి, వర్గం ప్రాంతం వంటి ఏ అంశాలతో సంబంధం లేకుండా ఎలాంటి వివక్ష లేకుండా నిర్ణీత వయసు కలిగిన వయోజనులందరకూ ఓటుహక్కును కల్పించటాన్ని సార్వజనీన వయోజన ఓటుహక్కు అంటారు.

7th Class Social Textbook Page No.63

ప్రశ్న 4.
రాజ్యాంగ పరిషత్ లో కేవలం 9 మంది మహిళా సభ్యులు మాత్రమే ఉన్నారు. ఎక్కువ మంది మహిళా సభ్యులు ఉండి ఉంటే బాగుండేదని మీరు అనుకుంటున్నారా? ఎందుకు?
జవాబు:
అవును. రాజ్యాంగ పరిషత్ లో ఎక్కువ మంది (కనీసం సగం మంది మహిళా సభ్యులు ఉండి ఉంటే బాగుండేది అనుకుంటున్నాను. ఎందుకంటే, భారతదేశ జనాభాలో దాదాపు సగం మంది మహిళా జనాభా కలరు. కావున వారి యొక్క ప్రాతినిధ్యం ఎంతో అవసరం. మహిళా సమస్యలు మహిళలు మాత్రమే బాగా అర్థం చేసుకోగలరు.

7th Class Social Textbook Page No.65

ప్రశ్న 5.
మన రాజ్యాంగాన్ని 1949, నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదించింది. కాని ఇది 1950, జనవరి 26న ఎందుకు ఆలస్యంగా అమల్లోకి వచ్చింది? మీ ఉపాధ్యాయుని సహాయంతో కారణం తెలుసుకోండి.
జవాబు:
భారత జాతీయ కాంగ్రెసు 1929 డిసెంబరులో చారిత్రాత్మక ‘పూర్ణ స్వరాజ్’ తీర్మానాన్ని లాహోర్ సమావేశంలో ఆమోదించింది. 1930, జనవరి 26న భారతీయులను స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. అలా ప్రతి సంవత్సరం జనవరి 26న స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటూ వచ్చారు. మనకు స్వాతంత్ర్యం 1947, ఆగస్టు 15న ఇవ్వడం జరిగింది. అందువలన చారిత్రాత్మకమైన రోజుని మర్చిపోకుండా ఉండేందుకు రాజ్యాంగంను 1950, జనవరి 26న అమలుచేసారు.

ప్రశ్న 6.
మనం జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాము?
జవాబు:
భారత రాజ్యాంగం 1950, జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చినందుకు, అనగా భారతదేశాధినేత బ్రిటన్ రాజు లేదా రాణి లాగా వంశపారంపర్యంగా కాకుండా ప్రజల చేత ఎన్నుకోబడతాడు. అందుకని జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాము.

7th Class Social Textbook Page No.67

ప్రశ్న 7.
మన రాజ్యాంగ పీఠికను చాలా జాగ్రత్తగా చదవండి మరియు ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
AP Board 7th Class Social Solutions Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం 9
ఎ) మన రాజ్యాంగ పీఠిక ‘భారతదేశ ప్రజలమైన మేము’తో ప్రారంభమవుతుంది. దీని అర్థం ఏమిటి?
బి) పీఠికలో ఇవ్వబడిన తేదీని గుర్తించి దాని ప్రాముఖ్యతను రాయండి.
సి) పిరిక రాజ్యాంగంలో భాగమా? కాదా? మీ ఉపాధ్యాయుని సహాయంతో తెలుసుకోవటానికి ప్రయత్నించండి.
జవాబు:
ఎ) “భారత ప్రజలమైన మేము” అనే భావన రాజ్యాంగానికి ప్రజలే ఆధారమని తెల్పుతుంది. రాజ్యాంగాన్ని చర్చించి, శాసనం చేసుకుని, మాకు మేము సమర్పించుకుంటున్నాము అనే భావన రాజ్యాంగ పరిషత్తు దేశ – ప్రజలందరికి ప్రాతినిధ్యము వహించిందని తెలియజేస్తుంది. దీనిలో ప్రజాస్వామ్య భావన ఇమిడి ఉంది.
బి) పీఠికలో తేది : 1949 సంవత్సరం, నవంబరు 26. దీని ప్రాముఖ్యత భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తు ఆమోదించిన రోజు.
సి) ‘పీఠిక’ రాజ్యాంగంలో భాగమే. అయితే సుప్రీం కోర్టు ఈ అంశంపై భిన్న తీర్పులను వెలువరించింది.

7th Class Social Textbook Page No.69

ప్రశ్న 8.
భారతదేశాన్ని గణతంత్ర రాజ్యం అని ఎందుకు పిలుస్తారు?
జవాబు:
భారత దేశాధినేత, రాష్ట్రపతి ప్రజల చేత ఎన్నుకోబడటం వలన మన దేశాన్ని గణతంత్ర రాజ్యం అని పిలుస్తారు.

ప్రశ్న 9.
భారతదేశాన్ని లౌకిక దేశం అని మీరు ఎలా చెప్పగలరు?
జవాబు:
భారతదేశం లౌకిక దేశం. భారతదేశ ప్రభుత్వం ఏ మతాన్నీ ప్రోత్సహించదు, ఆటంకపరచదు అంటే ప్రజలకు మత స్వేచ్ఛ కలదు. ప్రభుత్వం కూడా మతం విషయంలో తటస్థంగా ఉంటుంది. కనుక భారతదేశంను లౌకిక దేశం అని చెప్పగలను.

7th Class Social Textbook Page No.73

ప్రశ్న 10.
ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుల నుండి తొలగించబడింది. ఎందుకు?
జవాబు:
ఆస్తి హక్కు థమిక హక్కుల నుండి తొలగించడానికి కారణం

  1. భారతదేశం ‘సామ్యవాదం’ అంటే సమ సమాజ స్థాపన అను ఆశయాన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రూపొందించుకుంది.
  2. సామ్యవాదంలో సాధ్యమైనంత వరకు సంపద కొద్దిమంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకరించబడకుండా, ప్రజలందరు ఆర్థిక సమానత్వాన్ని అందిపుచ్చుకోవటానికి అవసరమైన తోడ్పాటును కలిగించడం జరుగుతుంది.
  3. సమసమాజ స్థాపనకై ధనిక, పేద అంతరాలను తగ్గించుటకై అందరికీ సమాన అవకాశాలు కల్పించుటకై 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుండి తొలగించారు.
  4. ఆస్తిహక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించడానికి గల కారణాలు సహేతుకమైనవేనని నా అభిప్రాయం.

AP Board 7th Class Social Solutions Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం

ప్రశ్న 11.
మనకు స్వేచ్ఛా హక్కు ఎందుకు అవసరం?
జవాబు:
స్వేచ్ఛా హక్కు ఎందుకు అవసరం అంటే

  1. “స్వేచ్ఛగా జన్మించిన మానవుడు సర్వత్రా సంకెళ్ళతో బంధింపబడి ఉన్నాడు”, ఆ సంకెళ్ళను తొలగించడానికి స్వేచ్చ అవసరం.
  2. స్వేచ్ఛా హక్కు ప్రజాస్వామ్యానికి ఊపిరి లాంటిది, ప్రజాస్వామ్యం విజయవంతం అవ్వాలంటే స్వేచ్ఛాహక్కు అవసరం.
  3. పౌరులకు (వ్యక్తి) జీవించే హక్కును కల్పించేది స్వేచ్ఛా హక్కు.
  4. అనేక రకాల వేధింపులు, అత్యాచారాలు, అవినీతి నుండి రక్షణ కల్పించటానికి స్వేచ్ఛా హక్కు అవసరం.

ప్రశ్న 12.
బాలల అభివృద్ధికి “పీడనాన్ని నిరోధించే హక్కు” ఏ విధంగా దోహదపడుతుంది?
జవాబు:
బాలల అభివృద్ధికి “పీడనాన్ని నిరోధించే హక్కు’ క్రింది విధంగా దోహదపడుతుంది.

  1. వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించింది.
  2. ప్రమాదకర కర్మాగారాలలో కఠినమైన పని నుండి పిల్లలకు రక్షణనిస్తుంది.
  3. కఠినమైన గనులలో కష్టమైన పని నుండి పిల్లలకు రక్షణనిస్తుంది.
  4. బాలల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుంది.
  5. బాల కార్మిక వ్యవస్థ నుండి బాలలను బంధ విముక్తులను చేస్తుంది.

ప్రశ్న 13.
ప్రభుత్వ పరిపాలనలో సమాచార హక్కుఎలా పారదర్శకతను కలిగిస్తుందో తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
జవాబు:

  1. సమాచార హక్కు చట్టం ప్రకారం, ప్రతి పౌరునికి ప్రభుత్వం నుండి ఏదైనా సమాచారం తీసుకోవడానికి అధికారం కల్పిస్తుంది.
  2. ఈ చట్టం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పౌర సమాచార అధికారి, సహాయ సమాచార అధికారి, అప్పిలేట్ అధికారులను కల్పించింది. వీరు పౌరులు అడిగిన సమాచారంనకు బాధ్యులు.
  3. ఈ విధంగా ప్రభుత్వం సమాచారం అంతా ప్రజలకు తెలుస్తుంది. అవినీతి, నిబంధనలకు విరుద్ధమైన చర్యలు, చట్ట వ్యతిరేక చర్యలను ఈ సమాచారం ద్వారా తెలుసుకోవచ్చు.
  4. ప్రభుత్వ వ్యవస్థ పెద్దది. చాలా సంక్లిష్టమయినది. దీని గురించి సరైన సమాచారం ఉంటేనే అవినీతి నిరోధానికి అవకాశం ఉంటుంది.

ప్రశ్న 14.
మీ పరిసరాలలో ఏదైనా ప్రాథమిక హక్కుల ఉల్లంఘనను మీరు చూశారా? చూసి ఉంటే కొన్ని ఉదాహరణలు చెప్పండి.
జవాబు:
ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు ఉదాహరణ:

  1. ఒక వ్యక్తిని కారణం తెలపకుండా నిర్బంధంలోకి తీసుకోవడం.
  2. ఒక వ్యక్తి బిరుదులు తన పేరు ముందు గాని, చివర గాని పెట్టుకోవడం.
  3. 14 సంవత్సరాల లోపు పిల్లలచే పని చేయించడం.
  4. ఒక వ్యక్తి తన ఆసక్తి గల మతాన్ని అనుసరించకుండా అడ్డుకోవటం.
  5. అంటరానితనంను ప్రోత్సహించడం.
  6. కుల ప్రాతిపదికన వ్యక్తులకు వేరే ప్రాంతాల్లో నివాసం ఏర్పాటు.
  7. ప్రభుత్వాలను సహేతుకంగా విమర్శించినను నిర్బంధించటం.
  8. శాంతియుతంగా సమావేశమవ్వడానికి అనుమతినివ్వకపోవటం.
  9. తనకు నచ్చిన వ్యాపారం, వృత్తిని చేసుకోకుండా అడ్డుకోవటం.

7th Class Social Textbook Page No.75

ప్రశ్న 15.
మీ పాఠశాలలో మీరు అనుభవించిన హక్కులు మరియు ఆచరించిన విధులు ఏమిటి?
జవాబు:
మా పాఠశాలలో నేను అనుభవించిన హక్కులు :

  1. ఉచితంగా ప్రాథమిక విద్యను పొందటం (విద్యా హక్కు).
  2. స్వేచ్ఛగా ఆడుకోవటం, పాడుకోవటం (స్వేచ్ఛా హక్కు).
  3. అందరితో సమానంగా ఉండటం, అవకాశం పొందటం (సమానత్వ హక్కు).
  4. కావలసిన సమాచారంను పొందటం (సమాచార హక్కు).
  5. మంచి పోషకాహారం పొందటం (జీవించే హక్కు).
  6. విద్యార్థి క్లబ్ లను / సంఘాలను ఏర్పాటు చేసుకోవటం (స్వేచ్ఛా హక్కు) మొదలైన ఎన్నో హక్కులు పొందుతున్నాను.

మా పాఠశాలలో నేను ఆచరించిన విధులు :

  1. రోజు అసెంబ్లీలో జాతీయ గీతంను పాడటం, గౌరవ వందనం సమర్పించటం.
  2. తోటి విద్యార్థులందరితో సోదర భావంతో మెలగటం.
  3. పాఠశాల తోటను, చెట్లను సంరక్షిస్తూ పర్యావరణ హితానికి తోడ్పడటం.
  4. NCC, NSS లో నా సేవలు అందించటం.
  5. పాఠశాల బల్లలు, కుర్చీలు ఇతర సామగ్రిని భద్రంగా ఉంచటం.
  6. క్రమశిక్షణతో మెలగటం.

AP Board 7th Class Social Solutions Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం

ప్రశ్న 16.
“హక్కులు మరియు విధులు ఒకే నాణేనికి రెండు వైపుల లాంటివి.” చర్చించండి.
జవాబు:

  1. ప్రాథమిక హక్కులు మరియు విధులు ఒక దానిపైనొకటి ఆధారపడి ఉన్నాయి.
  2. హక్కులు వ్యక్తిగత అభివృద్ధికి తోడ్పడితే, ఇతరుల అభివృద్ధికి విధులు తోడ్పడతాయి.
  3. మనం హక్కులు పొందాలంటే కచ్చితంగా విధులు/బాధ్యతలను పాటించాలి.
  4. విధులను మనం చక్కగా అనుసరిస్తే ఇతరులు హక్కులు కూడా అంత చక్కగా అందిస్తారు.
  5. విధులు లేని హక్కులు అసంపూర్ణము. హక్కులు లేని విధులు అర్థరహితము.
  6. హక్కులను దబాయించి అడగాలంటే, విధులు పాటించి తీరాలి.

7th Class Social Textbook Page No.79

ప్రశ్న 17.
బాధ్యతాయుతమైన పౌరుడిగా మీరు ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించగలరు?
జవాబు:

  1. బాధ్యతాయుతమైన పౌరసత్వం సంఘంలో లేదా సమాజంలో మంచి పౌరులుగా ఉండటం. బాధ్యతాయుతమైన పౌరుడిగా ఉండటం.
  2. నిజాయితీకి, నైతికతకు విలువనివ్వటం, మా మాటలు చేతల ద్వారా తెలియజేయటం.
  3. చట్టాలను గౌరవించటం, జవాబుదారీతనం కల్గి ఉండటం.
  4. దేశం పట్ల భక్తి, జాతీయతా భావాన్ని కల్గి ఉండటం.
  5. స్వీయ క్రమశిక్షణతో, ఇతరులతో మర్యాదగా మెలుగుతూ, ఇతర జాతులు, మతాల పట్ల సహనంతో మెలగటం.

అన్వేషించండి

7th Class Social Textbook Page No.57

ప్రశ్న 1.
అంతర్జాలాన్ని లేదా లైబ్రరీని సందర్శించడం ద్వారా, భారతదేశాన్ని పాలించడం కోసం బ్రిటిష్ పార్లమెంట్ చేసిన ఇతర చట్టాల గూర్చి ఒక జాబితాను తయారు చేయండి. (అవసరమైతే మీ ఉపాధ్యాయుని సహాయం తీసుకోండి)
జవాబు:
బ్రిటిషు పార్లమెంట్ చేసిన చట్టాలు :

  1. భారత రాజ్యాంగ చట్టం – 1858
  2. భారత కౌన్సిల్ చట్టం – 1861
  3. భారత కౌన్సిల్ చట్టం – 1892
  4. భారత కౌన్సిల్ చట్టం – 1909 (మింటో – మార్లే సంస్కరణలు)
  5. భారత ప్రభుత్వ చట్టం – 1919 (మాంటేగు – ఛైమ్స్ ఫర్డ్ సంస్కరణలు)
  6. భారత ప్రభుత్వ చట్టం – 1935

7th Class Social Textbook Page No.65

ప్రశ్న 2.
మీ పాఠ్యాంశంలో రాజ్యాంగ పీఠిక ఎందుకు ముద్రించబడి ఉందో మీకు తెలుసా ? అది ఎక్కడ ఉందో గుర్తించి చదవండి.
జవాబు:
రాజ్యాంగ పీఠిక పాఠ్య పుస్తకం యొక్క ఉద్దేశ్యాలు, లక్ష్యాలను తెలియజేయడానికి ముద్రించబడి ఉంది. రాజ్యాంగ పీఠిక రాజ్యాంగ విలువల్ని ప్రతిబింబిస్తుంది. భారతదేశ ప్రజలు దేశంపై ఉంచుకున్న ఆశయాలు, ఆకాంక్షలు, అక్షర రూపంలో ఉన్నాయి. పీఠికలో పేర్కొన్న విలువలన్ని రాజ్యాంగంలో వ్యక్తీకరించబడ్డాయి.

ప్రాజెక్టు పని

ప్రశ్న 1.
రాజ్యాంగ సభలోని ప్రముఖుల యొక్క చిత్రాలను సేకరించి, ఒక ఆల్బమ్ ను తయారు చేయండి.
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం 3

ప్రశ్న 2.
మీ పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఎలా జరుపుకున్నారో ఒక నివేదికను సిద్ధం చేయండి.
జవాబు:
మా పాఠశాలలో నవంబరు 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయులు, సాంఘికశాస్త్రం మరియు ఇతర ఉపాధ్యాయులు ఘనంగా జరిపారు. ముఖ్య అతిధిగా పూర్వ విద్యార్థి ప్రముఖ లాయర్‌ను ఆహ్వానించారు. రాజ్యాంగ దినోత్సవ వేడుకలలో భాగంగా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు, నిర్మాణం, చరిత్ర పరిణామ క్రమం, ముఖ్యమైన రాజ్యాంగ అంశాలు ప్రస్తావించారు. తరువాత ముఖ్య అతిధిగా విచ్చేసిన లాయర్ గారు రాజ్యాంగంలోని వివిధ చట్టాల ఆర్టికల్స్, హక్కుల గురించి విపులంగా చర్చించారు. అలాగే రాజ్యాంగ సవరణ విధానం, జరిగిన సవరణల గురించి ఇలా ఎన్నో ముఖ్య విషయాలను తెలియజేసారు. చివరిగా రాజ్యాంగ ప్రతిజ్ఞతో ముగించారు.

AP Board 7th Class Social Solutions 2nd Lesson Forests

SCERT AP 7th Class Social Study Material Pdf 2nd Lesson Forests Textbook Questions and Answers.

AP State Syllabus 7th Class Social 2nd Lesson Questions and Answers Forests

7th Class Social 2nd Lesson Forests Textbook Questions and Answers

Observe the given picture.
AP Board 7th Class Social Solutions 2nd Lesson Forests 1

Answer the following questions.

Question 1.
Look at the above figure and say what do you observe in the figure?
Answer:
Forest, Birds and Wild animals habitation.

Question 2.
What are the components you can see in the forest ? Complete the given diagram.
Answer:
AP Board 7th Class Social Solutions 2nd Lesson Forests 2

Question 3.
Express your views about the forest in your own words.
Answer:
In my words, a forest is a piece of land with many trees. Many animals need forests to live and survive.

Forests are very important and grow in many places around the world. They are an ecosystem which includes many plants and animals.

We depend on forests for our survival.

Improve Your Learning

I. Answer the following questions.

1. A) Mention the types of forests in India.
Answer:
For -administrative convenience, the Government of India divided forests into three types. They are :

  1. Reserved forests
  2. Protected forests
  3. Unclassified forests.

B) Into how many types forests are classified?
Answer:
Forests are divided into five types based on climate, rainfall and types of soils. They are :

  1. Evergreen forests
  2. Deciduous forests
  3. Thorny forests
  4. Mangrove forests
  5. Montane forests

AP Board 7th Class Social Solutions 2nd Lesson Forests

Question 2.
Describe briefly about the Evergreen forests.
Answer:
Evergreen Forests :

  1. Evergreen forests are grown in the areas with high rainfall more than 200 cm.
  2. Trees in this area are very tall and they contain broad leaves.
  3. The trees in these forests remain green throughout the year. _
  4. These forests are located in Himalayan region, North-eastern states and Western ghats.
  5. Mahogany, Ebony, Rosewood trees etc. are found.
  6. Different types of snakes, Lion-tailed macaque and a variety of insects found here.

Question 3.
Describe the features of deciduous forests. Explain about flora and fauna of these forests in India.
Answer:

  1. The deciduous forest are grown in areas with rainfall between 70 cm and 200 cm.
  2. These forests are located in Peninsular plateau.
  3. The trees shed their leaves during very dry months to minimise transpiration.

Flora of this region :
Teak, Sal, Bamboo, Rosewood, Sandalwood, Neem, Shisham, Khair, Kusum, Arjun and Mulberry trees are found.

Fauna of this region :
The most common animals are found in this region like, Deers, Hares, Elephants, Tigers, Leopards, Peacocks, several species of Birds, etc.

Question 4.
Explain in detail about the thorn forests in India?
Answer:

  1. The thorn forests are found in regions with less than 70 cm of rainfall.
  2. Due to the arid climate most of the trees in these forests are sharp, thorny and bushy.
  3. This type of vegetation is found in the north-western parts of the country.
  4. Trees are scattered and have long roots penetrating deep into the soil in order to get moisture.
  5. The stems are succulent to conserve water.
  6. These forests are found in Madhya Pradesh, Uttar Pradesh, Rajasthan and Haryana.

Question 5.
Prepare some slogans on “conservation of forests”.
Answer:

  1. Save forests – Save the climate and wild life.
  2. Plant a tree – Keeps the flood away.
  3. Don’t destroy the greenery and don’t spoil the scenery. Save mother earth.
  4. Trees are Green Gold.
  5. Save trees now – They will save you in future.
  6. Plant a tree – Predict the mother earth.

AP Board 7th Class Social Solutions 2nd Lesson Forests

Question 6.
“Forests are essential for us, but yve destroy them.” Respond on this.
Answer:
The uses of forests.

  1. Forests play a major role in our life.
  2. Forests prevent soil erosion and floods.
  3. Trees help to regulate the climate of a place.
  4. We get more products which are needed to us from forests.

Even though the forests are useful for us, but we destroy them due to following relfeons.

  1. The ever-growing human consumption and population is the biggest cause of forest destruction.
  2. Along with population increase we need resources, products and services, so we destroy the forest.
  3. For the development of our nation for mining, for infrastructure projects, for agriculture purpose there is no other alternative so we destroy the forests.

Conclusion :
Governments will invent alternative resources for the development of our nation without destroying the forests.

Question 7.
List out the resources of the forests used by you in your daily life.
Answer:
The following resources are used by ourselves in our daily life from the forests.

  1. Notebooks → Wood pulp is used
  2. Furniture → Wood is used
  3. Medicines → Herbs are used
  4. Food & Fodder → Roots, tubers, bean sprouts, etc.
  5. Beedi leaves → Making beedis
  6. Bamboo is used for making fences
  7. Essential oils → Eucalyptus tree, camphor
  8. Fruits → Coconut, pear
  9. Cane → Walking sticks, etc.

Question 8.
Read about policies of forests and Fill in the following table.

Year Name of the policy Objectives
1894
1950
1952
1980
1988

Answer:

Year Name of the policy Objectives
1894 The Forest Law Meeting needs of local people and after meet­ing local needs maximum revenue collection.
1950 Forest Festival Vana Mahotsav – Create awareness on about saving forests, and bad effects of deforestation.
1952 National Forest Policy Should maintain 33% of forest cover.
1980 Forest Conservation Act 1) To protect the forest, its flora, fauna and other diverse ecological component.

2) To protect the integrity, territory, and individuality of the forests.,

1988 National Forest Policy Taking steps to create massive people’s move­ment with involvement of women to achieve the objectives and minimise pressure on exist­ing forest.

II. Choose the correct answer.

1. Which forests are green throughout the year?
a) Deciduous forests
b) Evergreen forests
c) Tidal forests
d) Mangrove forests
Answer:
b) Evergreen forests

2. Which of the following is not the slogan of conservation of forests?
a) Save the trees save the earth.
b) Save nature save future.
c) Greenery for better environment.
d) Good food good life.
Answer:
d) Good food good life.

3. Which of the following one is not a forest product?
a) Timber
b) Honey
c) Plums
d) Bread
Answer:
d) Bread

4. In which year was the National Conservation Policy enacted by the Central government?
a) 1984
b) 1950
c) 1952
d) 1980
Answer:
d) 1980

5. Which of the following forests have a variety of snakes and insects?
a) Evergreen forests
b) Deciduous forests
c) Mangrove forests
d) Thorny forests
Answer:
a) Evergreen forests

III. Match the following.

1.

Group-A Group-B
1. Evergreen forests A) Snow Leopard.
2. Deciduous forests B) Variety of fishes.
3. Montane forests C) Lion tailed macaque.
4. Mangrove forests D) Different kinds of deers.

Answer:

Group-A Group-B
1. Evergreen forests C) Lion tailed macaque.
2. Deciduous forests D) Different kinds of deers.
3. Montane forests A) Snow Leopard.
4. Mangrove forests B) Variety of fishes.

2.

Group-A Group-B
1. High rainfall A) Mangrove forest.
2. Little rainfall B) Montane forests.
3. Coastal line C) Evergreen forests.
4. Mountain region D) Thorny forests

Answer:

Group-A Group-B
1. High rainfall C) Evergreen forests.
2. Little rainfall D) Thorny forests
3. Coastal line A) Mangrove forest.
4. Mountain region B) Montane forests.

Puzzle

Solve the puzzle with the words related to given hints.
AP Board 7th Class Social Solutions 2nd Lesson Forests 3
Cross:
1. Largest hills in Andhra Pradesh (9).
2. Flora in evergreen forests (8).
3. These are known as Selvas (9).
4. Product of forest (4).
5. Raw material for Paper (6).

Down :
1. Hills in Tamilnadu (7).
2. Product of forest (6).
3. Forest in coastal region (8).
4. Product of forest (4).
5. Flora in deciduous forest (4).
Answer:
AP Board 7th Class Social Solutions 2nd Lesson Forests 4

7th Class Social 2nd Lesson Forests InText Questions and Answers

7th Class Social Textbook Page No. 20

Question 1.
Locate a few important countries in various climatic regions in the world map.
Answer:
AP Board 7th Class Social Solutions 2nd Lesson Forests 5

Question 2.
Prepare a table with various climatic regions and important countries in those regions.
Answer:

Climatic regions Countries
Equatorial / Tropical
Climatic Region
South America – Brazil
Asia – Indonesia
Africa – Kenya, etc.
The Savanna India-China
Australia                                                         ‘
Desert region Sahara – Egypt, Libya
Kalahari – Namibia
Australian Desert – Australia
Thar desert – India
Mediterranean Climate Europe – Spain, Italy, Turkey, Israel, Greece, etc.
Steppe Climate Ukraine, China, Uzbekistan, etc.
Taiga Region Alaska, Canada, Scandinavia, etc.
Tundra Region Russia, Greenland, Iceland – Sub – Antarctic islands

7th Class Social Textbook Page No. 21

Question 3.
Locate the Ever-green forests in an outline map of India.
Answer:

7th Class Social Textbook Page No. 22

Question 4.
Locate the areas of Deciduous forests in an outline map of India.
Answer:

AP Board 7th Class Social Solutions 2nd Lesson Forests

Question 5.
Locate the areas of Thorny and shrub forests in an outline map of India.
Answer:

7th Class Social Textbook Page No. 23

Question 6.
Locate the areas of Montane forests in an outline map of India.
Answer:

Question 7.
Fill up the following table.
AP Board 7th Class Social Solutions 2nd Lesson Forests 6
Answer:
AP Board 7th Class Social Solutions 2nd Lesson Forests 7

7th Class Social Textbook Page No. 25

AP Board 7th Class Social Solutions 2nd Lesson Forests 9
Question 8.
Observe the above Andhra Pradesh map. Which districts have more forest cover and which districts have less forest cover.
Answer:
YSR Kadapada, East Godavari, Visakhapatnam districts have more forest cover and Krishna and Anantapur districts have less forest cover.

AP Board 7th Class Social Solutions 2nd Lesson Forests

Question 9.
Witch type of forests do you find in your district?
Answer:
(Example : I am living in Krishna district. Mangrove forests are in Krishna district.)

7th Class Social Textbook Page No. 27

Question 10.
Fill up the following table.

Types of forest Extent Flora
Moist deciduous forests
Dry deciduous forests
Tidal forests

Answer:

Types of forest Extent Flora
Moist deciduous forests Srikakulam, Visakhapatnam and East Godavari Vegi, Egisa, Bamboo, Maddi, Bandaru, Jittegi and Sal.
Dry deciduous forests YSR Kadapa, Kurnooi, Ananthapur, and Chittoor. Maddi, Teak, Biliu, Velaga, Egisa, Neem, Buruga, Moduga and Red sandal.
Tidal forests Korangi region of East Godavari Uppu ponna, Boddu ponna, Urada, Mada, Tellamad-a, Patri Teega and Balabandi Teega.

7th Class Social Textbook Page No. 29

Question 11.
Prepare some slogans on social forestry.
Answer:
Slogans :

  1. A tree that stay, keep flood away
  2. Don’t cut a tree don’t cut a life.
  3. Don’t cut trees if you want cool air. ‘
  4. No Trees, No Mankind.
  5. Plant a tree today; make the life of the earth much longer.

Question 12.
Plant a tree on your birthday and take care of it.
Answer:

Question 13.
Gift a plant on important occasions to your friends and relatives.
Answer:

7th Class Social Textbook Page No. 30

Question 14.
Make a poster on tribal culture and tribal products.
Answer:
AP Board 7th Class Social Solutions 2nd Lesson Forests 8

Question 15.
Celebrate Vana Mahostav in your school/locality and plant a few plants and notice their growth.
Answer:

Think & Respond

7th Class Social Textbook Page No. 20

Question 1.
Compare the climate of the various climatic regions.
Answer:

Climatic regions Comparision of climatic condition
Tropical climatic region High temperature and heavy precipitation
The Savanna The climate is usually warm and temperature ranges from 20° to 30°C. Annual rainfall – 25 to 75 cm per year.
Desert Region Hot summers and cold winters, high diurnal range of temperatures.
Mediterranean Climate Pleasant climate with dry summer, and moderate to high rainfall in winter.
Steppe climate Extremes of heat & cold low amount of rajnfall.
Taiga climate Winters are extremely cold and long whereas summers are moderately hot and short.
Tundra climate The climate is cold and windy and rainfall is scanty.

If we compare the different regions through above table, equatorial region has high temperature & high rainfall compare with Taiga and Tundra regions. Desert regions have high temperature. Compare with mediterranean climate. Steppes have low amount of rainfall.

AP Board 7th Class Social Solutions 2nd Lesson Forests

Question 2.
What is the impact of climate on natural vegetation in climatic regions ?
Answer:

  1. The amount of temperature, rainfall, moist in air and soil determine the type of vegetation in forest.
  2. Ex : Evergreen forests in high temperature and rainfall regions – Bushy plants in arid regions.

Question 3.
Name the plants in forest which are having medicinal values.
Answer:
The commonly used plants in India are :

1) Sarpagandha :
Used to treat blood pressure, it is found only in India.

2) Jamun :
The powder of the seed is used for controlling diabetes.

3) Arjun
: The fresh juice of leaves is cure for ear ache.

4) Babool :
Leaves are used as a cure for eye sores.

5) Neem :
Has high antibiotic and antibacterial properties.

6) Tulasi plant :
Is used to cure cough and cold.

7) Kachnar :
Is used to cure asthma and ulcers.

7th Class Social Textbook Page No. 21

Question 4.
Why is a variety of flora and fauna found in evergreen forests ?
Answer:

  1. Evergreen forests are located in tropical regions.
  2. They receive a lot of sunlight and rainfall.
  3. There is a lot of energy in these forests.
  4. This energy is stored in plant vegetation, which is eaten by animals.
  5. The thick, dense forests are abode of Herbivorous and Carnivorous animals. So, a variety of flora and fauna is found in evergreen forests.

7th Class Social Textbook Page No. 22

Question 5.
Trees in deciduous forests shed their leaves. When and why ?
Answer:
The trees in deciduous forests shed their leaves during very dry months to minimise transpiration.

Question 6.
Have you ever seen the beauty of deciduous forests ? Describe the beauty of the forest.
Answer:
Yes. I have seen the beauty of deciduous forests.

  1. Forests are the nature gift to human beings. The deciduous forests shed leaves during the months of February and March.
  2. This is to reduce the consumption of water that it releases through leaves in the form of transpiration
  3. At that time the trees in the forest look completely dry.
  4. But when it starts budding of new leaves in spring, the forest looks very shiny and fresh. Later all the trees turned into very beautiful scenic view with shiny leaves and blossoms.
  5. One should watch and admire the picturesque marvel of deciduous forests.

AP Board 7th Class Social Solutions 2nd Lesson Forests

Question 7.
Mangrove forests are natural protectors of sea coast. Discuss.
Answer:
Mangrove swamps protect coastal areas from erosion, storm surge and tsunamis.

Mangroves act as shock absorbers. They reduce high tides and waves and help prevent soil erosion.

The mangroves massive root systems are efficient at dissipating wave energy.

7th Class Social Textbook Page No. 24

AP Board 7th Class Social Solutions 2nd Lesson Forests 10
Question 8.
Observe the above map. Which state has more forest cover. Give reasons.
Answer:
Madhya Pradesh state in India has more forest area.

The following reasons are responsible for more forest area in Madhya Pradesh.

Madhya pradesh has two horizontal mountain ranges from East to West. Vindya and Satpur mountains. These two ranges make a buffer of heavy clouds coming from South.

Hence, it results in longer period of rains and creates many seasonal rivers and ponds, which help dense forests.

Question 9.
Which state has less forest cover. Give reasons.
Answer:

  1. Punjab has the lowest forest cover with respect to total geographical area in India at 6.79 percent. It is a small state. Most of the people depended on agriculture only. As most of the land is under the cultivation there is less forest cover.
  2. Gujarath and Rajasthan states have less forest cover due to adverse conditions in most of their area.

Question 10.
The Western side of the Western Ghats is covered with thick forest than the Eastern side. Find the reason.
Answer:
Western Ghats are layered with thick evergreen forests because they receive more rainfall as compared to the Eastern Ghats that are covered with deciduous forests.

The Western Ghats get their rainfall from the monsoon winds that blow from Arabian sea.

7th Class Social Textbook Page No. 26

Question 11.
What are the uses of Red Sandalwood and Sandalwood?
Answer:
Uses of Red Sandalwood.

  1. Red Sandalwood is a tree.
  2. The wood at the centre of the trunk is used as medicine.
  3. Red Sandalwood is used for treating digestive tract problems, fluid retention, coughs, and for blood purification.
  4. In manufacturing, red Sandalwood is used as a flavoring in alcoholic beverages.

Uses of Sandalwood :

  1. Sandalwood is used as a fragrance in incense, cosmetics, perfumes and soaps.
  2. It is also used as a flavour for foods and beverages.
  3. The wood has been valued in carving because of its dense character.
  4. It is also used for medicinal purpose for headache, stomachache and urinary and genital disorders.

7th Class Social Textbook Page No. 27

Question 12.
Why do tribal people reject to leave the forests?
Answer:

  1. The tribal people lived in forest area for generations.
  2. They cleared the forests and follow agriculture.
  3. They worshipped nature gods.
  4. They domesticated animals.
  5. Their entire life depends on forests. ,

So they reject to leave the forests.

7th Class Social Textbook Page No. 28

Question 13.
What is the role of forests in conservation of environment?
Answer:
Role of forests in conservation of environment : „

  1. Prevent soilerosion and help in maintaining fertility of soil.
  2. They provide shelter to wild animals and are areas that sustain biodiversity.
  3. They reduce atmospheric pollution.
  4. They increase humidity and frequency of rainfall.
  5. They check the increase of atmospheric temperature.

AP Board 7th Class Social Solutions 2nd Lesson Forests

Question 14.
Write a list of items made from forest products in your surroundings.
Answer:
The following items we are using in our daily life.
Foods : Honey, Fruits, Palm oil, Mushroom, etc.
Wood : Furniture, paper, decorative items, etc.’
Medicines : Natural Aspirin and Acne medication.
Other items : Chewing Gum, Sponges, Carnauba wax, Henna Dye, Rubber, etc.

7th Class Social Textbook PageNo.29

Question 15.
What are the reasons for deforestation?
Answer:

  1. Agriculture
  2. Urbanization
  3. Industrialization
  4. Forest fires
  5. Mining
  6. Construction of Dams and Reservoirs etc. are the reasons for deforestation.

Question 16.
What are the consequences of deforestation?
Answer:

  1. Flooding
  2. Loss of soil
  3. Loss of biodiversity
  4. Climatic change
  5. Health problems and
  6. Displacement of the indigenous people are the consequences of deforestation.
  7. Imbalance of ecosystem causing natural calamities.
  8. Loss of habitat of wild life.

Question 17.
Suggest a few measures for afforestation!
Answer:
Methods that can be used to enhance afforestation are :

  1. Increase the number of planting trees and protect them.
  2. Choose the barron lands, waste lands to plant trees under social forestry.
  3. Road side areas, industrial areas can be enriched with thick growth of trees.
  4. Encourage the plants that provide forest products to the needy so that they pay interest to conserve them.

Question 18.
Do you observe any plantation of trees in your surroundings? What are the uses of plantation?
Answer:
Yes. I observed.

Uses of plantation :

  1. The more trees are there, the cleaner the air will be.
  2. Trees and forests can provide natural filtration, resulting in cleaner wafer.
  3. Planting trees can help to slow down the process of heat trapping of carbondioxide in our atmosphere.
  4. Trees are essentially nature’s wind-breakers, providing protection and shade during hot weather and dazzling sunshine.

Explore

7th Class Social Textbook Page No. 20

Question 1.
Go through library books or internet to know more about climatic regions.
Answer:

AP Board 7th Class Social Solutions 2nd Lesson Forests

Question 2.
Know about Podu cultivation with the help of your teacher.
Answer:
Podu is a traditional system of cultivation used by tribes in India, whereby different areas of jungle forest are cleared by burning each year to provide land for crops.

Podu is a form of shifting agriculture using slash-and-burn methods. Traditionally used on the hill-slopes of Andhra Pradesh. It is also known as Jhum cultivation.

7th Class Social Textbook Page No. 29

Question 2.
Go throiigh library books or browse internet to know more information about the given forest acts.
Answer:
The objectives of Forests Acts :

  1. To consolidate all the previous laws regarding forests.
  2. To give the Government the power td create different classes of forests for their effective usage for the colonial purpose.
  3. To regulate movement and transit of forest produce, and duty leviable on timber and other forest produce.
  4. To define the procedure to be followed for declaring an area as Reserved Forest, Protected Forest or Village Forest.
  5. To define forest offences acts prohibited inside the Reserved Forest, and penalties leviable on the violation.
  6. To make conservation of forests and wildlife more accountable.

Project Work

Prepare a model of forest use with natural material. Ans. Student’s own activity.

AP Board 7th Class Social Solutions Chapter 8 భక్తి – సూఫీ

SCERT AP 7th Class Social Study Material Pdf 8th Lesson భక్తి – సూఫీ Textbook Questions and Answers.

AP State Syllabus 7th Class Social Solutions 8th Lesson భక్తి – సూఫీ

7th Class Social 8th Lesson భక్తి – సూఫీ Textbook Questions and Answers

కింది తరగతులలోని విషయ పునశ్చరణ

AP Board 7th Class Social Solutions Chapter 8 భక్తి – సూఫీ 2
పటాన్ని పరిశీలించి ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రశ్న 1.
చిత్రంలో మీరేమి గమనించారు?
జవాబు:
హిందూ ధర్మ సాధువులు / సన్యాసులు మరియు ఇస్లాం మతబోధకులు ప్రజలకు ధర్మనిరతి గురించి, సత్ప్రవర్తన గురించి బోధ చేస్తున్నారు.

ప్రశ్న 2.
వారేమి బోధిస్తున్నారు?
జవాబు:
ప్రజలకు ధర్మ బోధన చేస్తున్నారు. అలాగే భగవంతుని చేరు మార్గము, సత్ప్రవర్తన విధానము, మోక్ష మార్గము, మానవ జీవిత సాఫల్యత, భూత దయ, దేవుని యందు ప్రేమ, భక్తి మొదలైనవి బోధిస్తున్నారు.

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

I. ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
భక్తి ఉద్యమం యొక్క ప్రధాన లక్షణాలేవి?
జవాబు:
భక్తి ఉద్యమ ప్రధాన లక్షణాలు :

  1. భగవంతుడు ఒక్కడే.
  2. మోక్షాన్ని సాధించే మార్గాలలో భక్తి ప్రముఖమైనది.
  3. భక్తి అనగా తనకు తాను దేవునికి సమర్పించుకోవడం.
  4. మానవులందరిలో సమానత్వాన్ని నొక్కి చెపుతుంది.
  5. కులం, తెగ, వర్గం వంటి వ్యత్యాసాలను తిరస్కరించింది.
  6. భక్తి ఉద్యమకారులు వివిధ ప్రదేశాలకు ప్రయాణం చేస్తూ, అక్కడి స్థానిక భాషలలో భక్తి భావనలను ప్రచారం చేస్తూ బోధనలు చేసేవారు.

AP Board 7th Class Social Solutions Chapter 8 భక్తి – సూఫీ

ప్రశ్న 2.
మీరాబాయి ఎవరు? భక్తి ఉద్యమానికి ఆమె చేసిన సేవలు ఏమిటి?
జవాబు:
మీరాబాయి :

  1. మధ్యయుగ కాలంలోని మరొక ముఖ్యమైన భక్తి ఉద్యమకారిణి మీరాబాయి.
  2. బాల్యం నుంచి ఆమె శ్రీకృష్ణుని భక్తురాలు. వివాహం తరువాత కూడా ఆమె శ్రీకృష్ణ భక్తిని కొనసాగిస్తూ గొప్ప గాయకురాలిగా పేరు పొందింది.
  3. రాజకుటుంబంలో జన్మించినప్పటికి చాలా సాధారణంగా జీవించింది. సమాజంలోని అన్ని వర్గాలలో కృష్ణ భక్తితత్వాన్ని ప్రచారం చేసింది.
  4. భక్తి పారవశ్యంతో ఆమె పాడే భజనలను వినడానికి అన్ని మతాలకు చెందిన సాధువులు రాజస్థాన్లోని చిత్తోడ్ ప్రాంతాన్ని సందర్శించేవారు.
  5. మీరాబాయి సంత్ రవిదాస్ శిష్యురాలు.
  6. శతాబ్దాలుగా మీరా భజనలు జనబాహుళ్యంలో చిరస్థాయిగా నిలిచిపోయాయి.

ప్రశ్న 3.
భక్తి ఉద్యమం మరియు సూఫీ ఉద్యమం నుండి ప్రస్తుత సమాజం ఏమి నేర్చుకోవచ్చు?
జవాబు:
భక్తి ఉద్యమం మరియు సూఫీ ఉద్యమం నుండి ప్రస్తుత సమాజం నేర్చుకోవలసినవి :

  1. కుల, మత అసమానతలను పారద్రోలాలని.
  2. శ్రామికులకు (శ్రమకు) గౌరవం ఇవ్వాలని.
  3. ప్రాంతీయ భాషలను అభివృద్ధి చేయాలని.
  4. నిరాడంబర పూజా విధానాన్ని, జీవన విధానాన్ని అనుసరించాలని.
  5. క్రమశిక్షణతో కూడిన జీవనం సాగించాలని.
  6. పరమత సహనం కలిగి ఉండాలని.
  7. తోటివారి పట్ల దయ, సోదరభావం కల్గి ఉండాలని.

ప్రశ్న 4.
పే సంఖ్య 47 లోని మధ్యయుగ భారతీయ సమాజంపై భక్తి ఉద్యమ ప్రభావం అనే అంశాన్ని చదివి మీ స్వంత మాటలలో వ్యాఖ్యానించండి.
జవాబు:

  1. నాటి సమాజంలో ఉన్న కులవివక్షతను పారద్రోలాలని భక్తి ఉద్యమకారులందరూ ప్రవచించారు.
  2. పరమత సహనం కల్గి ఉండటంను ప్రోత్సహించింది.
  3. ‘దేవుడు ఒక్కడే’ అనే భావన దాదాపు అందరు ఆమోదించి, బోధించారు.
  4. సమాజంలోని విభిన్న వర్గాల వారందరూ సమభావంతో, సోదర భావంతో మెలగాలని భక్తి ఉద్యమ సాధకులు బోధించారు.
  5. మానవ సేవే మాధవ సేవ అనే విశాల మానవతావాద దృక్పథాన్ని పెంపొందించింది.

ప్రశ్న 5.
సిక్కు మత స్థాపకులు ఎవరు? సిక్కుమతంలోని ప్రధాన సూత్రాలేవి?
జవాబు:
సిక్కు మత స్థాపకుడు – గురునానక్,

సిక్కు మత ప్రధాన సూత్రాలు :

  1. ఇతడు దేవుడు ఒక్కడే అని మరియు సోదర భావాన్ని కలిగి ఉండాలని విశ్వసించాడు.
  2. సాధారణ ప్రజల భాషలో తన బోధనలు చేశాడు. గురునానక్ అనుచరులను సిక్కులుగా పిలుస్తారు.
  3. దేవుడు ఒక్కడే, మానవులందరూ ప్రత్యక్షంగా దేవునితో అనుసంధానం కాగలరు అనేవి గురునానక్ బోధనలలో విశేష ప్రాచుర్యం పొందినవి.
  4. కుల వ్యవస్థను నిరసించడం, కులం మరియు లింగ భేదం లేకుండా అందరూ సమానమేనని బోధించడం గురునానక్ బోధనలలోని ప్రగతిశీల అంశాలు.

AP Board 7th Class Social Solutions Chapter 8 భక్తి – సూఫీ

ప్రశ్న 6.
భక్తి సాధువులు చేసిన సామాజిక సేవలను ప్రశంసిస్తూ ఒక వ్యాసం రాయండి.
జవాబు:
భక్తి సాధువులు చేసిన సామాజిక సేవలు :

  1. సమాజంలోని కుల, మత భేదాలను రూపుమాపడానికి భక్తి సాధువుల కృషి అభినందనీయం.
  2. సామాజిక, ఆర్థిక అంతరాలను తొలగించి సమతాభావాన్ని నెలకొల్పటంలో భక్తి సాధువులు వారికి వారే సాటి.
  3. ప్రజలలో ఆశావాదమును నింపి నిరాశ, నిస్పృహలను పారద్రోలారు.
  4. ప్రాంతాల ఐక్యతను గురించి ప్రజలకు వివరించారు.
  5. సోదరభావంను ప్రజలలో పెంపొందించారు.
  6. మానవతా వాదానికి పెద్ద పీట వేసారు.

ప్రశ్న 7.
దక్షిణ భారతదేశంలోని ప్రముఖ భక్తి సాధువులను గూర్చి వ్రాయండి.
జవాబు:
దక్షిణ భారతదేశంలోని ప్రముఖ భక్తి సాధువులు :
1) ఆదిశంకరాచార్య :
కేరళలోని ‘కాలడి’ గ్రామంలో జన్మించారు. వీరు అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించారు. వీరు దేశ నలుదిక్కులు అనగా ఉత్తరాన బదరీ, దక్షిణాన శృంగేరి, తూర్పున పూరీ, పడమర ద్వారకలలో నాలుగు శక్తి పీఠాలను ఏర్పాటు చేశారు.

2) రామానుజాచార్య :
వీరు దక్షిణ భారతదేశంలోని శ్రీపెరంబుదూలో క్రీ.శ. 1017లో జన్మించారు. విశిష్టాద్వైతాన్ని ప్రబోధించారు. “శ్రీభాష్యం”అనే పేరుతో బ్రహ్మ సూత్రాలను వ్యాఖ్యానించారు.

3) మధ్వాచార్యులు :
కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ తీరంలో జన్మించారు. వీరు ద్వైత సిద్ధాంతాన్ని ప్రాచుర్యం లోకి తెచ్చారు. ఈ సిద్ధాంతం ప్రకారం ఈ ప్రపంచం అనేది భ్రమ కాదు వాస్తవం. బ్రహ్మ, ఆత్మ మరియు పదార్థాలనేవి ప్రకృతిలో ప్రత్యేకమైనవి.

4) వల్లభాచార్య :
ముఖ్యమైన వైష్ణవ సన్యాసి. వీరు తెలుగు ప్రాంతానికి సంబంధించిన వారు. శుద్ధ అద్వైతంను ప్రబోధించారు. బ్రహ్మ సూత్రాలకు వీరు భాష్యం రచించారు. వీరి బోధనలను పుష్టి మార్గం లేదా భగవదనుగ్రహ మార్గంగా చెప్పవచ్చు.

5) బసవేశ్వరుడు :
కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజనీతిజ్ఞుడు, తత్వవేత్త, కవి మరియు సామాజిక సంస్కర్త. వీరు ‘వీరశైవ’ సంప్రదాయాన్ని ప్రచారం చేశారు. ఈయన రచనలను ‘వచనములు’ అంటారు.

6) మొల్ల :
ఈమెను మొల్లమాంబ అని కూడా పిలుస్తారు. రామాయణాన్ని తెలుగులో వ్రాసిన మొల్ల శ్రీకృష్ణదేవరాయలకి సమకాలీకురాలని పరిశీలకుల అభిప్రాయం.

7) అన్నమయ్య :
వీరు కడప జిల్లాలోని తాళ్ళపాక గ్రామంలో జన్మించారు. వీరిని పదకవితా పితా మహుడు అంటారు. ఈయన శ్రీవేంకటేశ్వరుడిని కీర్తిస్తూ 32 వేల సంకీర్తనలు రాశారని ప్రతీతి.

ప్రశ్న 8.
సూఫీ సాధువులు మరియు వారి బోధనల గురించి వ్రాయండి.
జవాబు:
ఎ) ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ :

  1. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ భారతదేశానికి చెందిన గొప్ప సూఫీ సాధువు.
  2. భారతదేశంలో చిస్తీ పద్ధతి వీరి ద్వారా స్థాపించబడింది.
  3. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ క్రీ.శ. 1143 లో పర్షియాలోని సీయిస్థాన్ లో జన్మించారు. వీరు క్రీ.శ. 1192లో భారతదేశాన్ని సందర్శించారు.
  4. ప్రేమ, విశ్వమానవ సౌభ్రాతృత్వం అనే అంశాలను ప్రచారం చేశారు.
  5. మొయినుద్దీన్ చిస్తీ దర్గా రాజస్థాన్ లోని అజ్మీర్ లో ఉన్నది. ఈ పవిత్ర స్థలంలో ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ పవిత్ర సమాధి ఉంది.

బి) నిజాముద్దీన్ ఔలియా (1235-1325) :

  1. నిజాముద్దీన్ ఔలియా చిస్తీ సాధువులలో అత్యంత ప్రసిద్ధి గాంచినవాడు.
  2. ఇతను బాబా ఫరీద్ యొక్క శిష్యుడు. భగవంతుని సాక్షాత్కారానికి దారితీసే ప్రేమకు ఆయన అధిక ప్రాధాన్యత ఇచ్చాడు.
  3. భగవంతుని యెడల ప్రేమ అనగా మానవత్వంతో కూడిన ప్రేమ అని చెప్పాడు.
  4. ఆ విధంగా ఇతను విశ్వవ్యాప్త ప్రేమ మరియు సోదరభావం అనే సందేశాన్ని వ్యాప్తి చేసాడు.
  5. ఫరీదుద్దీన్-గంజ్-ఇ-షకర్, షేక్ నిజ్మతుల్లా మరియు ఖ్వాజా పీర్ మహమ్మద్ మొదలగువారు ఇస్లాంలోని ఇతర ప్రముఖ సూఫీ సాధువులు.

AP Board 7th Class Social Solutions Chapter 8 భక్తి – సూఫీ

II. బహుళైచ్ఛిక ప్రశ్నలు

1. విశిష్టాద్వైతమును బోధించింది ఎవరు?
ఎ) రామానుజ
బి) శంకరాచార్య
సి) రామానందుడు
డి) కబీర్
జవాబు:
ఎ) రామానుజ

2. సగుణ భక్తిని వ్యాప్తి చేసినవారు
ఎ) మీరాబాయి
బి) శంకరదేవుడు
సి) బసవేశ్వరుడు
డి) పైవన్నీ
జవాబు:
డి) పైవన్నీ

3. సిక్కు మత స్థాపకుడు ఎవరు?
ఎ) గురునానక్
బి) శంకరాచార్య
సి) రామానందుడు
డి) అక్బర్
జవాబు:
ఎ) గురునానక్

4. “భగవంతుడు ఒక్కడే” అనే భావనకు అర్థం ఏమిటి?
ఎ) దేవుడు ఒక్కడే
బి) ఒకే దేవుని మీద నమ్మకం
సి) ఒకే దేవుని ప్రార్ధించడం
డి) పైవన్నీ
జవాబు:
డి) పైవన్నీ

5. భక్తి ఉద్యమం ఏ శతాబ్దంలో ప్రారంభమైనది?
ఎ) క్రీ.శ. 6వ
బి) క్రీ.శ. 7వ
సి) క్రీ.శ. 8వ
డి) క్రీ.శ. 9వ
జవాబు:
సి) క్రీ.శ. 8వ

II. జతపరుచుము.

గ్రూప్ -ఎ గ్రూప్-బి
1. ఆళ్వారులు అ) భగవత్ స్వరూపాన్ని ఆకారంలో పూజించడం
2. హిందూ రచనలు ఆ) విష్ణువుని పూజించడం
3. సగుణ భక్తి ఇ) నిరాకారంగా దైవాన్ని పూజించడం
4. నిర్గుణ భక్తి ఈ) నాయనార్లు
5. శైవము ఉ) రామాయణం, భగవద్గీత

జవాబు:

గ్రూప్ -ఎ గ్రూప్-బి
1. ఆళ్వారులు ఆ) విష్ణువుని పూజించడం
2. హిందూ రచనలు ఉ) రామాయణం, భగవద్గీత
3. సగుణ భక్తి అ) భగవత్ స్వరూపాన్ని ఆకారంలో పూజించడం
4. నిర్గుణ భక్తి ఇ) నిరాకారంగా దైవాన్ని పూజించడం
5. శైవము ఈ) నాయనార్లు

7th Class Social Studies 8th Lesson భక్తి – సూఫీ InText Questions and Answers

7th Class Social Textbook Page No.39

ప్రశ్న 1.
మీ తల్లిదండ్రులు/టీచర్ సాయంతో ఆదిశంకరాచార్యుల బోధనలను పాఠశాల లైబ్రరీ నుండి సేకరించి తరగతి గదిలో చర్చించండి.
జవాబు:
శ్రీ ఆదిశంకరాచార్యుల బోధనలు :

  1. వీరు అద్వైత సిద్ధాంతంను ప్రబోధించారు.
  2. జీవుడే బ్రహ్మం – బ్రహ్మమే జీవుడు. ఇద్దరికీ తేడా లేదు. చుట్టూ కనిపించేదంతా మాయ మాత్రమే (బ్రహ్మ సత్యం జగన్మిధ్య).
  3. అజ్ఞానం నుంచి బయటపడటానికి తనను తాను తెలుసుకోగలగాలి.
  4. శాస్త్రం, యుక్తి, అనుభవం, కర్మలు అనే విషయాలు అద్వైత వేదాంతానికి మూల స్తంభాలు.
  5. మనుషులందరూ ఒకటే అన్న విశాల మార్గంను బోధించారు.
  6. వీరిని అందుకే జగద్గురు శంకరాచార్యులు అని కూడా పిలుస్తారు.

7th Class Social Textbook Page No.45

ప్రశ్న 2.
గురునానక్ రాసిన గురుగ్రంథ సాహెబ్ గురించి సమాచారాన్ని సేకరించండి.
జవాబు:

  1. గురు గ్రంథ సాహెబ్ ను ‘ఆది గ్రంథ్’ అని కూడా అంటారు.
  2. సిక్కు మతస్తుల పవిత్ర గ్రంథం.
  3. గురునానక్ ఈ గ్రంథాన్ని రచించారు.
  4. పదవ సిక్కు గురు గోవింద్ సింగ్ ఆది గ్రంథను తన వారసురాలిగా ప్రకటించాడు. (మానవులను గురువుగా ప్రకటించే విధానానికి స్వస్తి పలికాడు)
  5. ఈ గ్రంథం పదిమంది గురువుల జీవన విధానంగా పరిగణించబడుతుంది.
  6. సిక్కు మత ప్రార్థనల కొరకు ఆధారముగా ఉంది.
  7. గురు గ్రంథ సాహెబ్ గ్రంథము 1430 పుటలు కలిగిన గ్రంథము.
  8. ఈ గ్రంథం స్తోత్రం రూపంలో ఉంటుంది.

AP Board 7th Class Social Solutions Chapter 8 భక్తి – సూఫీ

7th Class Social Textbook Page No.51

ప్రశ్న 3.
హిందూ మరియు ఇస్లాం మత సంస్కర్తల బోధనలలోని పోలికలతో జాబితా తయారు చేయండి.
జవాబు:
హిందూ, ఇస్లాం మతాలకు చెందిన సంస్కర్తలలోని పోలికలు :

  1. అప్పటి సమాజంలోని కుల, మత అసమానతలను హిందూ, ఇస్లాం సంస్కర్తలు ఇరువురూ తీవ్రంగా వ్యతి రేకించారు.
  2. సమాజంలోని అట్టడుగు వర్గాల వారిని, వివిధ కుల వృత్తుల వారు కూడా భగవత్ కృపకు అర్హులే అని చాటి చెప్పారు.
  3. భగవంతుడు ఒక్కడే అని, అన్ని మతాలు, అందరు సంస్కర్తలూ గొంతెత్తి చాటారు.
  4. ఏకేశ్వరోపాసన, నిరాడంబర పూజా విధానాన్ని ఇరువురూ ప్రచారం చేసారు.
  5. దైవాన్ని స్తుతించడంలో పాటలు, పద్యాలు, ఖవ్వాలీ మొ|| సంగీతానికి ప్రాధాన్యత ఇచ్చారు.
  6. సేవాభావాన్ని, మానవతా దృక్పథాన్ని పెంపొందించారు.
  7. ఆయా మతాలలోని మూఢ నమ్మకాలు, దురాచారాలను పారద్రోలారు.

ఆలోచించండి – ప్రతిస్పందించండి.

7th Class Social Textbook Page No.43

ప్రశ్న 1.
కబీర్ ప్రకారం “దేవుని ఎదుట అందరూ సమానమే” ఈ వాక్యాన్ని మీరు సమర్థిస్తారా? కారణాలు తెలపండి.
జవాబు:
“దేవుని ఎదుట అందరూ సమానమే” అన్న కబీర్ వాక్యాన్ని నేను సమర్ధిస్తాను, ఎందుకంటే

  1. మానవులందరి పుట్టుక / సృష్టి భగవంతుని ద్వారా చేయబడింది, భగవంతుని దృష్టిలో అందరూ సమానమే.
  2. ఏ వ్యక్తి కావాలని తనకు తానుగా ఆయా కులాల్లో, మతాల్లో జన్మించలేదు, జన్మించలేరు కూడా.
  3. దేవుడు ఒక్కడే అయినపుడు దేవుని చేత సృష్టించబడిన మానవులంతా కూడా సమానమే (ఒక్కటే).
  4. కులం, మతం అనేవి మనిషి పుట్టిన తరువాత ఏర్పడినవి. వీటిని మనుషులే సమాజంలో ఏర్పాటు చేసుకున్నారు.

7th Class Social Textbook Page No.47

ప్రశ్న 2.
నామ్ దేవ్ ప్రకారం దైవాన్ని పూజించడానికి విస్తృతమైన పూజా విధానం, క్రతువులను ఆచరించడం వంటివి అవసరం లేదు. ఆయన ఇలా అనడానికి కారణం ఏమై ఉండవచ్చు?
జవాబు:
దైవానికి ఏకాగ్రతతో మనస్సు సమర్పించటం ద్వారా మోక్షాన్ని సాధించవచ్చని, విస్తృతమైన పూజా విధానం, క్రతువులను ఆచరించడం అవసరం లేదని నామ్ దేవ్ బోధించారు. కారణం, దైవం స్వచ్ఛమైన మనస్సు, నిర్మలమైన ప్రేమ, నిశ్చలమైన బుద్దినే కోరుకుంటుంది కాని ఆడంబరంతో కూడిన పూజా తంతు కాదు. ప్రేమతో, నిర్మలమైన మనస్సుతో దైవాన్ని స్మరిస్తే చాలు. ఆ భగవంతుడు చలించిపోయి కరుణిస్తాడు. అంతేగాని ఖరీదైన వస్తువులు, నైవేద్యాలు కాదు. మనస్పూర్తిగా, ఆర్తితో నిండిన గొంతుతో స్వామిని పిలిస్తే చాలు, పిలిచే మనస్సు మనకుండాలి గాని తరలిరాడా భగవంతుడు.

7th Class Social Textbook Page No.49

ప్రశ్న 3.
“భక్తి అనేది నిజాయితీ, దయ, ప్రేమ మరియు సేవాతత్పరతలను పెంపొందిస్తుంది.” చర్చించుము.
జవాబు:

  1. భక్తి అనేది నిజాయితీ, దయ, ప్రేమ మరియు సేవాతత్పరత మొదలగు గుణాలను పెంపొందిస్తుందనుటలో ఏ మాత్రం సందేహం లేదు.
  2. దేవుని పట్ల నమ్మకం కల్గియున్నవారు కచ్చితంగా ప్రతి చోట భగవంతుడున్నాడని భావించి నిజాయితీతో వ్యవహరిస్తారు.
  3. దేవుని పట్ల భక్తి కల్గియున్నవారు ప్రతి జీవిలోను భగవంతుణ్ణి దర్శించి భూత దయ కల్గి ఉంటారు.
  4. జాలి, దయల యొక్క క్రియా రూపం ప్రేమను పంచటమే, భగవత్ భక్తుల హృదయాలు కచ్చితంగా ప్రేమతో నిండి ఉంటాయి.
  5. కొంతమంది భక్తులు, సాధువులు, గురువులు భగవంతుని చేరుటకు సేవా మార్గాన్ని ఎంచుకొని మానవాళికి ఎన్నో సేవలు అందిస్తున్నారు.

అన్వేషించండి

7th Class Social Textbook Page No.39

ప్రశ్న 1.
సామాజిక సమానత్వాన్ని సాధించడంలో రామానుజాచార్యులు చేసిన కృషి ఏమిటి?
జవాబు:
శ్రీ రామానుజాచార్యుల కృషి, సామాజిక సమానత్వాన్ని సాధించడంలో :

  1. వీరు విశిష్టాద్వైతాన్ని బోధించారు.
  2. సంపూర్ణ సమర్పణ భావంతో మోక్షాన్ని సాధించవచ్చునని ప్రతి ఒక్కరికి బోధించారు.
  3. తిరుక్కోట్టియార్ నుంచి ఆదేశాన్ని కాదని ఆలయ గోపురం పై నుంచి ‘తిరుమంత్రాన్ని’ అందరికి వినపడేలా ప్రకటించారు. అంటే మానవులందరూ ఎటువంటి వర్గ తారతమ్యం లేకుండా మోక్షం పొందాలని ఉదార భావనతో ప్రకటించాడు.
  4. అస్పృశ్యత లాంటి సాంఘిక దురాచారాలను తొలగించటానికి సంస్కరణాత్మక పద్ధతులను ప్రవేశపెట్టారు.
  5. సాంప్రదాయకంగా కొనసాగుతున్న ఆచార వ్యవహారాలు ఛాందసంగా మారి సామాజిక పురోగతికి అడ్డు రాక ముందే వాటిని మార్చటం ప్రథమ కర్తవ్యంగా భావించారు.
  6. సమాజ శ్రేయస్సు ముఖ్యం, కానీ వ్యక్తిగత శ్రేయస్సు కాదని భావించారు.

7th Class Social Textbook Page No.41

ప్రశ్న 2.
రామానందుడు వర్గ వాదాన్ని ఎందుకు వ్యతిరేకించాడు? మీ ఉపాధ్యాయుని ద్వారా తెలుసుకోండి.
జవాబు:
సమాజం వివిధ వర్గాలుగా విభజించబడి ఉండటాన్ని రామానందుడు వ్యతిరేకించాడు. ఎందుకనగా మానవులందరూ భగవంతుని దృష్టిలో సమానమేనని (బిడ్డలని), అయితే మనుషుల మధ్య ఈ తేడాలు అనవసరమని భావించాడు. మనుషులందరూ భగవంతునిచే సృష్టించబడ్డారని, అందరూ మోక్షార్హులని, కుల, మత, జాతి, లింగ భేదాలు మానవ సృష్టియేనని భావించాడు.

AP Board 7th Class Social Solutions Chapter 8 భక్తి – సూఫీ

ప్రశ్న 3.
బసవేశ్వరుని గూర్చి సమాచారాన్ని ఇంటర్నెట్ నుండి సేకరించండి. దానిని గూర్చి మీ ఉపాధ్యాయునితో చర్చించండి.
జవాబు:
బసవేశ్వరుడు కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజనీతిజ్ఞుడు, తత్వవేత్త, ‘ కవి మరియు సామాజిక సంస్కర్త. అతను వీర శైవ సంప్రదాయాన్ని ప్రచారం చేశాడు. ఆయన రచనలను వచనములు అంటారు. అతను పుట్టుకతో లేదా సామాజిక స్థితితో సంబంధం లేకుండా ప్రజలందరికి బోధించాడు. అతని ప్రసిద్ధ సూక్తి “మానవులంతా సమానమే, కులం లేదా ఉప కులం లేదు”.
బసవేశ్వరుడు

7th Class Social Textbook Page No.45

ప్రశ్న 4.
మీ ఉపాధ్యాయుల సహకారంతో సిక్కుమతంలో ఉండే పది మంది గురువుల పేర్లను సేకరించండి.
జవాబు:
సిక్కు మత గురువులు :

  1. గురునానక్
  2. గురు రామదాసు
  3. గురు హరరాయ్
  4. గురు గోవింద్ సింగ్
  5. గురు అంగద్
  6. గురు అర్జున్ సింగ్
  7. గురు హరకృష్ణ
  8. గురు అమరదాసు
  9. గురు హరగోవింద్
  10. గురుతేజ్ బహదూర్

ప్రాజెక్ట్ పని

ప్రశ్న 1.
భక్తి మరియు సూఫీ ఉద్యమాలకు చెందిన వివిధ సాధువుల యొక్క చిత్రాలను సేకరించండి.
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 8 భక్తి – సూఫీ 1

AP Board 7th Class Social Solutions Chapter 2 అడవులు

SCERT AP 7th Class Social Study Material Pdf 2nd Lesson అడవులు Textbook Questions and Answers.

AP State Syllabus 7th Class Social Solutions 2nd Lesson అడవులు

7th Class Social 2nd Lesson అడవులు Textbook Questions and Answers

కింది తరగతులలోని విషయ పునశ్చరణ

AP Board 7th Class Social Solutions Chapter 2 అడవులు 3
ప్రశ్న 1.
చిత్రంను పరిశీలించి అందులో ఏమి గమనించారో చెప్పండి.
జవాబు:
నేను గమనించిన అంశాలు :

  1. పెద్ద పెద్ద దట్టమైన వృక్షాలతో నిండి ఉంది.
  2. అనేక రకాల జంతువులు (ఏనుగు, జిరాఫీ, కోతులు)
  3. అనేక రకాల పక్షులు, సరీసృపాలు.

ప్రశ్న 2.
ఏఏ అంశాలను అడవులలో మీరు చూడగలిగారు? వాటిని క్రింది రేఖాచిత్రంలో వ్రాయండి.
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 2 అడవులు 4

ప్రశ్న 3.
అడవి గురించి మీ సొంత మాటల్లో వ్రాయండి.
జవాబు:

  1. చెట్లతో ఉన్న విశాలమైన భూభాగాన్ని అడవి అంటారు.
  2. ఒక స్థలం యొక్క పరిసరాలు అన్ని వైపులా చెట్లతో ఆవరించబడి ఉంటాయి.
  3. పర్యావరణాన్ని అనేక రకాల చెట్లతో ప్రభావితం చేసే ప్రాంతం అడవి.
  4. ప్రకృతి సౌందర్యానికి అడవులు పేరుగాంచాయి.
  5. వివిధ రకాల జంతువులకు నిలయం ఈ అడవులు.
  6. వివిధ రకాల ఔషధాలు, వనమూలికలకు నిలయాలు.
  7. ఆహ్లాదకరమైన, ఆరోగ్యవంతమైన వాతావరణానికి ఆనవాలు.

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

I. క్రింది ప్రశ్నలకు జవాబులివ్వండి.

ప్రశ్న 1.
భారతదేశంలోని వివిధ రకాల అడవులను పేర్కొనండి.
జవాబు:
శీతోష్ణస్థితి, వర్షపాతం, నేల’ రకం అనే అంశాల ఆధారంగా అడవులను ఐదు రకాలుగా విభజించవచ్చు.

  1. సతతహరిత అరణ్యాలు
  2. ఆకు రాల్చు అడవులు
  3. ముళ్ళ అడవులు
  4. మడ అడవులు
  5. పర్వత ప్రాంత అడవులు

AP Board 7th Class Social Solutions Chapter 2 అడవులు

ప్రశ్న 2.
సతతహరిత అరణ్యాల గురించి క్లుప్తంగా వివరించండి.
జవాబు:
సతతహరిత అరణ్యాలు :

  1. అధిక సాంవత్సరిక వర్షపాతం మరియు ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో ఈ అరణ్యాలు పెరుగుతాయి.
  2. ఇక్కడి వృక్షాలు చాలా పొడవుగా వుండి విశాల పత్రాలను కలిగివుంటాయి.
  3. ఈ రకమైన వాతావరణ పరిస్థితుల వలన కొమ్మలు విస్తరించబడి గొడుగు లాగా కనిపిస్తాయి.
  4. ఈ అడవులు ఏడాది పొడవునా పచ్చగా ఉండటము వలన వీటిని సతతహరిత అరణ్యాలు అని పిలుస్తారు.
  5. ఈ ప్రాంతము దట్టమైన చెట్లు, మొక్కలు మరియు తీగలతో నిండి ఉంటుంది.
  6. హిమాలయ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ కనుమలు, కేరళలోను ఈ అడవులు పెరుగుతాయి.
  7. మహాగని, ఎబోని, రోజ్ వుడ్, ఐవరివుడ్ వంటి వృక్ష జాతులు ఈ అడవులలో పెరుగుతాయి.
  8. వివిధ రకాలైన జంతువులు ఉదా. లయన్ టయల్డ్ మకాక్ (సింహపు తోక కోతి), వివిధ రకాల సరీసృపాలు, అనేక రకాల కీటకాలు ఈ అడవులలో ఉంటాయి.

ప్రశ్న 3.
భారతదేశంలోని ఆకురాల్చు అడవుల లక్షణాలు, వృక్షజాలం మరియు జంతుజాలం గురించి వివరించండి.
జవాబు:
ఆకురాల్చు అడవులు :
AP Board 7th Class Social Solutions Chapter 2 అడవులు 5

  1. ఈ అడవులు 70-200 సెం.మీ. వర్షపాతము ఉన్న ప్రాంతాలలో విస్తరించి వున్నాయి.
  2. ఇక్కడి వృక్షాలు వేసవి నెలల్లో బాష్పోత్సేకాన్ని తగ్గించడానికి ఆకులు రాల్చుతాయి.
  3. ఈ అడవులు ద్వీప కల్ప పీఠభూమిలో ఎక్కువగా విస్తరించి వున్నాయి. టేకు, సాల్, వెదురు, రోజ్ వుడ్, చందనం మరియు వేప వంటి వృక్షాలు ఇక్కడ కనిపిస్తాయి.
  4. వివిధ రకాలైన జింకలు, కుందేళ్ళు, పులులు, చిరుతలు, నెమళ్ళు మరియు వివిధ రకాల పక్షులు ఇక్కడి ప్రధాన జంతుజాలం.

ప్రశ్న 4.
ముళ్ళ అడవులను గూర్చి వివరించండి.
జవాబు:
ముళ్ళ మరియు పొద అడవులు :
AP Board 7th Class Social Solutions Chapter 2 అడవులు 6

  1. ముళ్ళ మరియు పొద అడవులు తక్కువ వర్షపాతం వుండి అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి.
  2. శుష్క వాతావరణం కారణంగా ఈ అడవులలోని చెట్లు ముళ్లతోనూ, పొదలుగాను ఉంటాయి.
  3. ఎడారి మొక్కల మాదిరిగా ఇక్కడి మొక్కల ఆకులు ముళ్ళుగా మారి బాష్పోత్సేకాన్ని తగ్గించుకునే విధంగా వుంటాయి.
  4. దక్కన్ పీఠభూమి ప్రాంతములోను, భారతదేశములోని ఎడారి ప్రాంతములోను ఈ విధమైన అడవులు వున్నాయి.
  5. అకేషియా, బ్రహ్మజెముడు, నాగజెముడు, బబుల్ (తుమ్మ) మరియు రేగు ఇక్కడి వృక్ష జాతులు.

ప్రశ్న 5.
అటవీ సంరక్షణపై కొన్ని నినాదాలను రాయండి.
జవాబు:

  1. చెట్లను రక్షించండి – భూమిని సంరక్షించండి.
  2. మెరుగైన పర్యావరణం కోసం పచ్చదనం.
  3. పచ్చని చెట్లు – ప్రగతికి మెట్లు.
  4. “ఒక చెట్టును నాటండి – తద్వారా తరువాతి తరానికి ఉచితంగా గాలి లభిస్తుంది”.
  5. ప్రకృతిని రక్షిద్దాం – భవిష్య తరాలను కాపాడుదాం.
  6. వృక్షో రక్షతి రక్షితః

ప్రశ్న 6.
“అడవులు మనకు అత్యంత ఆవశ్యకం, కాని మనం వాటిని నాశనం చేస్తున్నాము”. దీనిపై వ్యాఖ్యానించండి.
జవాబు:

  1. అడవులు మనకు అత్యంత ఆవశ్యకం. పర్యావరణ వ్యవస్థల సమతౌల్యం ఇవి కాపాడుతాయి.
  2. మొక్కలు (చెట్లు) కార్బన్ డై ఆక్సైడ్ ను గ్రహించి ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి.
  3. అడవులు వాతావరణంలోని ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. వాయు కాలుష్యాన్ని అరికడతాయి.
  4. మృత్తికా క్రమక్షయాన్ని అరికడతాయి. అలాగే
  5. వాణిజ్యపరంగా, కలప, వెదురు, ఔషధాలను అడవులు అందిస్తున్నాయి. అయితే మనము ఈ అడవులను ఈ క్రింది వాని కారణంగా (నరికి) నాశనం చేస్తున్నాం.
  6. వ్యవసాయ భూముల కోసం.
  7. పారిశ్రామిక అవసరాలు, గనుల త్రవ్వకం మొదలైన ప్రయోజనాల కోసం.
  8. రోడ్లు మరియు ఆనకట్టల నిర్మాణం కోసం.
  9. గృహోపకరణాల కోసం, కలప కోసం మొదలైన వాటి కోసం అడవులను నాశనం చేస్తున్నాం. వీనిని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిది.

AP Board 7th Class Social Solutions Chapter 2 అడవులు

ప్రశ్న 7.
మీ దైనందిన జీవితంలో ఉపయోగించే అడవుల నుండి తయారైన వస్తువుల పట్టికను తయారుచేయండి.
జవాబు:
అడవుల నుండి తయారైన వస్తువులు:

  1. గృహోపకరణాలు : కుర్చీలు, మంచాలు, టేబుల్స్, టీపాలు, చాటలు మొదలైనవి.
  2. వెదురు నుండి (కలప గుజ్జు) కాగితం
  3. అగ్గిపెట్టెలు, ప్యాకింగ్ కాగితం తయారీకి
  4. సంగీత పరికరాలు (మృదంగం, తబలా)
  5. రైల్వే పరిశ్రమల్లో స్వీపర్స్ మొదలైన వాటికి
  6. గంపలు, బుట్టలు, చాటలు, నిచ్చెనలు మొదలైనవి.
  7. లక్క తయారీకి
  8. టిఫిన్ ఆకులు, విస్తళ్ళు
  9. పడవల తయారీకి
  10. వివిధ రకాల ఔషధాలు మొదలైనవి.
  11. సుగంధ ద్రవ్యాల (గంధపు చెట్లు) తయారీకి.

ప్రశ్న 8.
అటవీ విధానాలను చదివి క్రింది పట్టికను పూరించండి.
AP Board 7th Class Social Solutions Chapter 2 అడవులు 7
జవాబు:

సంవత్సరం విధానం పేరు లక్ష్యాలు
1894 భారతదేశ మొదటి జాతీయ అటవీ విధానం వాణిజ్య, పారిశ్రామిక అవసరాల కోసం అడవులను ఉపయోగించుకోవటం (కొల్లగొట్టడం) చేసిన చట్టం.
1952 జాతీయ అటవీ విధానం
(స్వాతంత్ర్యం వచ్చాక మొదటిది)
సామాజిక అడవుల పెంపకం, 33% అడవుల పెంపకం.
1980 అటవీ (వన) సంరక్షణా చట్టం అటవీ భూములను అడవుల పెంపకం కోసం మాత్రమే వాడాలి. ఇతర కార్యకలాపాలకు వినియోగించరాదు.
1988 జాతీయ అటవీ విధానం అడవుల రక్షణ, పునరుద్ధరణ, అభివృద్ధిలో – గిరిజన ప్రజల భాగస్వామ్యం చేయడం ప్రధాన కర్తవ్యం.

II. సరియైన సమాధానాలను ఎంపిక చేసుకోండి.

1. సంవత్సరం పొడవునా పచ్చగా కనుపించే అడవులు ఏవి?
అ) ఆకురాల్చు అడవులు
ఆ) సతతహరిత అడవులు
ఇ) తీరప్రాంత అడవులు
ఈ) మడ అడవులు
జవాబు:
ఆ) సతతహరిత అడవులు

2. క్రింది వాటిలో అటవీ సంరక్షణ నినాదం కానిదేది?
అ) చెట్లను రక్షించండి-భూమిని సంరక్షించండి
ఆ) ప్రకృతిని రక్షిద్దాం-భవిష్య తరాలను కాపాడుదాం
ఇ) మెరుగైన పర్యావరణం కోసం పచ్చదనం
ఈ) ఆరోగ్యవంతమైన ఆహారం – ఆరోగ్యవంతమైన జీవితం
జవాబు:
ఈ) ఆరోగ్యవంతమైన ఆహారం – ఆరోగ్యవంతమైన జీవితం

3. కింది వాటిలో ఏది అటవీ ఉత్పత్తి కాదు?
అ) కలప
ఆ) తేనె
ఇ) రేగు పండ్లు
ఈ) బ్రెడ్
జవాబు:
ఈ) బ్రెడ్

4. ఏ సంవత్సరంలో జాతీయ అటవీ పరిరక్షణ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది?
అ) 1984
ఆ) 1950
ఇ) 1952
ఈ) 1980
జవాబు:
ఈ) 1980

5. ఈ క్రింది ఏ అడవులలో రకరకాల పాములు, కీటకాలు ఉన్నాయి?
అ) సతతహరిత అడవులు
ఆ) ఆకురాల్చే అడవులు
ఇ) మడ అడవులు
ఈ) ముళ్ళ అడవులు
జవాబు:
అ) సతతహరిత అడవులు

III. జతపరచండి.

1.

గ్రూపు-ఎ గ్రూపు-బి
1. సతత హరిత అరణ్యాలు అ) మంచు చిరుతపులి
2. ఆకురాల్చు అడవులు ఆ) వివిధ రకాల చేపలు
3. పర్వత ప్రాంత అడవులు ఇ) లయన్ టెయిల్డ్ మకాక్
4. మడ అడవులు ఈ) రకరకాల దుప్పులు

జవాబు:

గ్రూపు-ఎ గ్రూపు-బి
1. సతత హరిత అరణ్యాలు ఇ) లయన్ టెయిల్డ్ మకాక్
2. ఆకురాల్చు అడవులు ఈ) రకరకాల దుప్పులు
3. పర్వత ప్రాంత అడవులు అ) మంచు చిరుతపులి
4. మడ అడవులు ఆ) వివిధ రకాల చేపలు

2.

గ్రూపు-ఎ గ్రూపు-బి
1. అధిక వర్షపాతం అ) మడ అడవులు
2. తక్కువ వర్షపాతం ఆ) పర్వత ప్రాంత అడవులు
3. తీర ప్రాంత రేఖ ఇ) సతత హరిత అరణ్యాలు
4. పర్వత ప్రాంతాలు ఈ) ముళ్ళ అడవులు

జవాబు:

గ్రూపు-ఎ గ్రూపు-బి
1. అధిక వర్షపాతం ఇ) సతత హరిత అరణ్యాలు
2. తక్కువ వర్షపాతం ఈ) ముళ్ళ అడవులు
3. తీర ప్రాంత రేఖ అ) మడ అడవులు
4. పర్వత ప్రాంతాలు ఆ) పర్వత ప్రాంత అడవులు

పదబంధము

ఇచ్చిన సూచనలకు సంబంధించిన పదాలతో పజిల్ ను పూరించండి.
AP Board 7th Class Social Solutions Chapter 2 అడవులు 8
అడ్డు వరుస:
1. ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్దకొండలు (4)
2. సతతహరిత అరణ్యాలలో వృక్షజాలం (4)
3. వీటిని సెల్వాలు అంటారు (10)
4. అటవీ ఉత్పత్తి (2)
5. కాగితం తయారీలో ముడిసరుకు (3)

నిలువు వరుస:
1. తమిళనాడులోని కొండలు (4)
2. అటవీ ఉత్పత్తి (3)
3. తీర ప్రాంతంలోని అడవులు (6)
4. అటవీ ఉత్పత్తి (2)
5. ఆకురాల్చు అడవులలోని వృక్షజాలం (2)
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 2 అడవులు 9

7th Class Social Studies 2nd Lesson అడవులు InText Questions and Answers

7th Class Social Textbook Page No.41

ప్రశ్న 1.
ప్రపంచ పటములో వివిధ శీతోష్ణస్థితి ప్రాంతాలు గల ముఖ్యమైన దేశాలను గుర్తించండి.
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 2 అడవులు 1
AP Board 7th Class Social Solutions Chapter 2 అడవులు 2

ప్రశ్న 2.
వివిధ శీతోష్ణస్థితి ప్రాంతాలలోని ముఖ్య దేశాలతో పట్టిక తయారు చేయండి.
జవాబు:

శీతోష్ణస్థితి ప్రాంతం ముఖ్య దేశాలు
1. భూమధ్యరేఖా/ఉష్ణమండల ప్రాంతం బ్రెజిల్, బొలీవియా, పెరు, కొలంబియా, వెనిజులా, గయానా, కాంగో, జైరే, లైబేరియా, ఐవరికోస్ట్, CAR, గేబన్, సింగపూర్, శ్రీలంక, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, బ్రూనై, మలేషియా మొదలైనవి.
2. సవన్నాలు క్యూబా, జమైకా, పశ్చిమ ఇండీస్, హవాయి ద్వీపాలు, నైజీరియా, సెనెగాల్, గినియా, మాలీ, నైజర్, ఛాడ్, సుడాన్, ఘనా, టాగో, అంగాలా.
3. ఎడారి ప్రాంతాలు మారిటోనియా, మాలి, నైజర్, ఛాడ్, సుడాన్, మోరాకో, అల్జీరియా, లిబియా, ఈజిప్టు, ఇథోపియా, సోమాలియా, ఆస్ట్రేలియా, మెక్సికో, USA. సౌది అరేబియా, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయిల్, UAE, కువైట్, భారతదేశం, పాకిస్థాన్.
4. మధ్యధరా శీతోష్ణస్థితి ప్రాంతాలు పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్, మొనాకో, ఇటలీ, క్రోయేషియా, గ్రీసు, అల్బేనియా, యూకెయిన్, టర్కి సిరియా, లెబనాన్, ఇజ్రాయిల్, ట్యునీషియా, అల్జీరియా, మోరాకో, సిసిలి, అమెరికా, చిలీ మొదలైనవి.
5. స్టెప్పీ శీతోష్ణస్థితి స్పెయిన్, టర్కి అమెరికా, ఆస్ట్రేలియా, వాయవ్య చైనా, ఉక్రయిన్, అర్జెంటైనా, బోట్స్వా నా.
6. టైగా ప్రాంతం అలస్కా (USA), కెనడా, నార్వే, స్వీడన్, ఫిలాండ్, రష్యా,
7. టండ్రా శీతోష్ణస్థితి ఉత్తరగోళం మాత్రమే, ఉత్తర అమెరికా, కెనడా, గ్రీన్‌లాండ్, రష్యా మొదలైనవి.

7th Class Social Textbook Page No.41

ప్రశ్న 3.
శీతోష్ణస్థితి ప్రాంతాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని అంతర్జాలం ద్వారా, గ్రంథాలయంలోని పుస్తకాల ద్వారా తెలుసుకోండి.
జవాబు:
ఈ క్రింద పేర్కొన్న విధంగా ప్రపంచాన్ని వివిధ ప్రకృతిసిద్ధ శీతోష్ణస్థితి మండలాలుగా విభజించవచ్చు. అవి :

  1. భూమధ్య రేఖా మండలం
  2. అయన రేఖా మండల ఎడారులు (లేదా) ఉష్ణమండల ఎడారులు
  3. ఉష్ణ మండల పచ్చిక బయళ్ళు (సవన్నాలు)
  4. ఋతుపవన మండలం
  5. మధ్యధరారీతి ప్రకృతిసిద్ధ మండలం
  6. సమశీతోష్ణ మండల ఎడారులు
  7. చైనారీతి ప్రకృతిసిద్ధ మండలం
  8. సముద్ర ప్రభావిత పశ్చిమ తీరప్రాంతం
  9. సమశీతోష్ణ మండల పచ్చిక బయళ్ళు (స్టెప్పీలు)
  10. లారెన్షియారీతి ప్రకృతిసిద్ధ మండలం
  11. ఉపధృవ లేదా టైగా మండలం
  12. టండ్రా మండలం
  13. ధృవ హిమాచ్ఛాదిత మండలం

AP Board 7th Class Social Solutions Chapter 2 అడవులు 20
ఒక ప్రదేశము యొక్క శీతోష్ణస్థితిని ఆ ప్రదేశపు ఎత్తు (Altitude) ఉపరితలం నిమ్నోన్నతాలు, గాలి వీచే దిశ మొదలగునవి స్థానికంగా ప్రభావితం చేస్తాయి. అక్షాంశ రేఖాంశాల ఆధారంగా ఈ ప్రకృతిసిద్ధ మండలాలను విభజించినప్పటికీ, నిజానికి ఇవి క్రమేపీ ఒకదానితో ఒకటి కలిసిపోతాయి.

ప్రశ్న 4.
మీ ఉపాధ్యాయుని సహాయముతో పోడుసాగును గురించి చర్చించండి.
జవాబు:

  1. దీనిని నరుకు కాల్చు పద్దతి, ఝూమ్ వ్యవసాయం, విస్థాపన వ్యవసాయం అని కూడా పిలుస్తారు.
  2. ఇది అత్యంత పురాతన వ్యవసాయ విధానం, కొండ ప్రాంతాలలోని (అటవీ ప్రాంతాలలో) గిరిజనులు ఈ రకమైన వ్యవసాయం చేస్తారు.
  3. అడవిలో కొంత ప్రాంతంలో చెట్లను నరికి, వాటిని కాల్చి చదును చేసి, ఆ ప్రాంతంలో కొన్ని సంవత్సరాలు సాగు చేస్తారు.
  4. తరువాత నిస్సారమైన ఆ ప్రాంతాన్ని విడచి మరొక ప్రాంతానికి వెళ్లి అక్కడ చెట్లు నరికి మళ్ళీ కొన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తారు.
  5. నరికిన చెట్లను వానాకాలంకు ముందు తగులబెడతారు, వర్షాలు ప్రారంభం కాగానే బూడిద మట్టిలో కలుస్తుంది. తర్వాత విత్తనాలు విత్తుతారు. వీరు ఎరువులు, పురుగు మందులు వాడరు.

7th Class Social Textbook Page No.41

ప్రశ్న 5.
వివిధ శీతోష్ణస్థితి ప్రాంతాల శీతోష్ణస్థితిని పోల్చండి.
జవాబు:

  1. భూమధ్య రేఖ/ఉష్ణ మండల శీతోష్ణస్థితి ప్రాంతాల్లో మరియు సవన్నా ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రత కల్గి ఉంటాయి. అధిక అవపాతాన్ని కల్గి ఉంటాయి.
  2. టండ్రా, టైగా ప్రాంతాల్లో చలి అధికముగా ఉంటుంది. భూమధ్య రేఖ, సవన్నా ప్రాంతాలు దట్టమైన వృక్షజాలం కల్గి ఉంటే ఇక్కడ (టండ్రా, టైగాల్లో) చెట్లు పెరగటానికి అననుకూలంగా ఉంటాయి.
  3. ఉష్ణ మండల గడ్డి భూములు సవన్నాలు, సమశీతోష్ణ గడ్డి భూములు స్టెప్పీలు.
  4. ఖండాలకు పశ్చిమం వైపున ఉన్న ఎడారులు భూమి మీద అత్యంత శుష్క / పొడి ప్రాంతాలు.
  5. వేసవిలో పొడి వాతావరణము, శీతాకాలములో ఒక మాదిరి నుండి అధిక వర్షపాతం మధ్యధరా శీతోష్ణ ప్రాంత ప్రధాన లక్షణము.

ప్రశ్న 6.
వివిధ శీతోష్ణస్థితి ప్రాంతాలలో గల శీతోష్ణస్థితి సహజ వృక్ష సంపదపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది?
జవాబు:

  1. ఒక ప్రదేశం యొక్క శీతోష్ణస్థితి ఆ ప్రాంతం యొక్క వృక్షజాల రకాలను నిర్ధారిస్తాయి. ఉదాహరణకు;
  2. బాగా చలిగా ఉండి, మంచు కూడా కురిసే ప్రాంతాలలో మాత్రమే కోనిఫెరస్ (శృంగాకార చెట్ల) జాతికి చెందిన దేవదారు చెట్లు పెరుగుతాయి.
  3. వేడిగా ఉండి, ఓ మాదిరి వర్షాలు పడే ప్రాంతాలలో ‘టేకు’ వంటి కొన్ని రకాల చెట్లు పెరుగుతాయి.
  4. చెట్ల సాంద్రత కూడా శీతోష్ణస్థితి అంశాలైన వర్షపాతం, ఉష్ణోగ్రతలపై ఆధారపడి ఉంటుంది.

ప్రశ్న 7.
అడవులలో ఔషధ విలువలు కలిగిన మొక్కల పేర్లను తెల్పండి.
జవాబు:
ఔషధ విలువలు కలిగిన మొక్కలు :
అత్తిపత్తి, అక్కలకర్ర, అశ్వగంధ, అవిసెచెట్టు, అశోకచెట్టు, ఆముదం, ఇప్పచెట్టు, ఉత్తరేణి, ఉసిరిక, ఉమ్మెత్త, ఊడుక, కరక్కాయ, కలబంద, కానుగ (గానుక), కుంకుడు, కొండపిండి, ఖర్జూరం, గంగారావి, గన్నేరు, గుమ్మడి, గుంటగలగర, చింత, జాజికాయ, జువ్విచెట్టు, తంగేడు, తాని చెట్టు, తిప్పతీగ, తులసి, నల్లతుమ్మ, మద్దిచెట్టు, దిరిసెన, నిమ్మ, నేరేడు, వెలగ, బాదం, బూరుగ, బొప్పాయి, మర్రిచెట్టు, మామిడి, మారేడు, మునగ, ముల్లంగి, మేడి, మోదుగ, రావిచెట్టు, వసచెట్టు, వాకుడు, వేప, సుగంధ, గంధం, సండ్రిచెట్లు, సునాముఖి మొదలైనవి.

7th Class Social Textbook Page No.43

ప్రశ్న 8.
భారతదేశ అవుట్లైన్ పటంలో సతతహరిత అరణ్యాలను గుర్తించండి.
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 2 అడవులు 10

7th Class Social Textbook Page No.43

ప్రశ్న 9.
సతతహరిత అరణ్యాలు వివిధ రకాలైన వృక్ష, జంతు జాతులకు నిలయాలుగా ఎందుకు ఉన్నాయి?
జవాబు:
సతతహరిత అరణ్యాలు వివిధ రకాలైన వృక్ష, జంతు జాతులకు నిలయాలుగా ఎందుకు ఉన్నాయంటే,

  1. అధిక సాంవత్సరిక వర్షపాతం, ఉష్ణోగ్రతలుండుట వలన ఈ ప్రాంతాలలో వివిధ రకాల వృక్షాలు పెరుగుతాయి.
  2. ఇవి ఏడాది పొడవునా పచ్చగా ఉండుట వలన వివిధ రకాల జంతువులు కూడా ఉంటాయి.
  3. వివిధ రకాలైన వృక్ష జాతులు ‘పెరగటానికి కావలసిన శీతోష్ణస్థితులు ఉండటం.

7th Class Social Textbook Page No.45

ప్రశ్న 10.
భారతదేశ అవుట్లైన్ పటంలో ఆకురాల్చు అడవులు గల ప్రాంతాలను గుర్తించండి.
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 2 అడవులు 11

ప్రశ్న 11.
భారతదేశ అవుట్లైన్ పటంలో ముళ్ళ పొద అడవులు గల ప్రాంతాలను గుర్తించండి.
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 2 అడవులు 12

7th Class Social Textbook Page No.45

ప్రశ్న 12.
ఆకురాల్చు అడవులు ఏ కాలంలో, ఏ కారణంచే ఆకులు రాల్చుతాయి?
జవాబు:
ఆకురాల్చు అడవులు వేసవి నెలల్లో, బాష్పోత్సేకాన్ని తగ్గించటానికి ఆకులు రాల్చుతాయి.

ప్రశ్న 13.
ఆకురాల్చు అడవుల ప్రకృతి అందాన్ని ఎప్పుడైనా గమనించారా? అడవుల సౌందర్యాన్ని వర్ణించండి.
జవాబు:

  1. ఆకురాల్చు అడవుల ప్రకృతి అందాన్ని వేసవి సెలవుల్లో యాత్రకెళ్ళినపుడు గమనించాను.
  2. ఆకురాల్చు అడవుల్లో కొన్ని వృక్షాలు ఆకురాల్చి, కొన్ని పచ్చదనంతో వింత వర్ణాలలో ఉండి ఆకర్షిస్తుంటాయి.
  3. రాలిన ఆకుల మధ్యన నడక చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది.
  4. అడవుల మధ్యన అక్కడక్కడ సెలయేర్లు, వాటి ధ్వనులు రమణీయంగా ఉంటాయి.
  5. కుందేళ్ళు, నెమళ్ళు లాంటివి నన్ను ఎంతో ఆకర్షించినాయి.
  6. పచ్చని అటవీ ప్రాంతంలో నడక, అక్కడ ప్రకృతి రమణీయత నన్ను ఎంతో ముగ్ధుడ్ని చేసింది.

AP Board 7th Class Social Solutions Chapter 2 అడవులు

ప్రశ్న 14.
మడ అడవులు సముద్ర తీరం యొక్క సహజ రక్షకాలు – చర్చించండి.
జవాబు:

  1. మడ అడవులు ఎక్కువగా సముద్ర తీరాల్లో, చిత్తడి నేలల్లోనూ, సముద్ర అలల ప్రభావిత నేలల్లోనూ పెరుగుతాయి.
  2. సముద్ర తీరం అలల యొక్క తాకిడికి కోతకు గురికాకుండా ఈ అటవీ వృక్షాలు కాపాడతాయి.
  3. ఇక్కడి చెట్లు సముద్రపు లవణీయతను, అలల తాకిడిని తట్టుకునేలా ఉంటాయి.
  4. ఈ అడవుల్లోని వృక్షజాలం తీర ప్రాంత సహజ రక్షకాలుగా చెప్పవచ్చును.

7th Class Social Textbook Page No.47

ప్రశ్న 15.
భారతదేశ అవుట్లైన్ పటంలో పర్వత ప్రాంత అడవులు గల ప్రాంతాలు గుర్తించండి.
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 2 అడవులు 13

ప్రశ్న 16.
క్రింది పట్టికను పూరించండి.
AP Board 7th Class Social Solutions Chapter 2 అడవులు 14
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 2 అడవులు 15

7th Class Social Textbook Page No.49

AP Board 7th Class Social Solutions Chapter 2 అడవులు 19
ప్రశ్న 17.
పై పటాన్ని పరిశీలించి అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? కారణాలు తెలపండి.
జవాబు:
భారతదేశంలో విస్తీర్ణపరంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం అత్యధిక అటవీ ప్రాంతాన్ని కలిగి ఉంది. కారణం.

  1. ఈ రాష్ట్రంలో ఎక్కువగా గిరిజన తెగలుండుట వలన అడవులను సంరక్షించుకుంటూ ఉన్నారు.
  2. ఈ రాష్ట్రంలో ఎక్కువగా కొండ ప్రాంతాలుండటం, మైదానాలు తక్కువగా ఉండటం.
    ఉదా : వింధ్య, సాత్పురా శ్రేణులు.
  3. చారిత్రాత్మకముగా ఇవి అటవీ భూములుగానే ఉండిపోవటం, నగరాలు పెద్దగా అభివృద్ధి చెందకపోవటం.
  4. జనాభా తక్కువగా ఉండటం, పారిశ్రామికంగా వెనుకబడి ఉండటం.

ప్రశ్న 18.
ఏ రాష్ట్రంలో అడవులు తక్కువగా ఉన్నాయి? కారణాలు తెలపండి.
జవాబు:
భారతదేశంలో విస్తీర్ణపరంగా హర్యానా రాష్ట్రం అత్యల్ప అటవీ ప్రాంతాన్ని కల్గి ఉంది. కారణం.

  1. హర్యానా రాష్ట్రంలో మైదాన ప్రాంతం ఎక్కువగా ఉండటం (వ్యవసాయ భూమిగా మార్చడం).
  2. హర్యానా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి చెందడం.
  3. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కువగా జరగడం.
  4. హర్యానా రాష్ట్రం అటవీ భూములను సరిగా సర్వే చేయకపోవడం.

ప్రశ్న 19.
పశ్చిమ కనుమల పశ్చిమ భాగం, తూర్పు భాగం కంటే దట్టమైన అడవులను కలిగి వుంది. కారణం తెలపండి.
జవాబు:
భారతదేశానికి అత్యధిక వర్షపాతంను ఇచ్చే నైరుతి ఋతుపవనాలు ముందుగా పశ్చిమ కనుమల యొక్క పశ్చిమ భాగాన్ని తాకి వర్షపాతంను ఇవ్వటం వలన అక్కడ (అడవులు) వృక్షాలకు కావలసినంత నీరు సమృద్ధిగా దొరుకుతుంది. – తూర్పు భాగం వర్షచ్ఛాయా ప్రాంతంలో ఉండుట వలన వర్షపాతం తక్కువగా ఉండుట వలన పశ్చిమ కనుమల తూర్పుభాగం అడవుల సాంద్రత తక్కువగా వుంది.

7th Class Social Textbook Page No.51

AP Board 7th Class Social Solutions Chapter 2 అడవులు 16

ప్రశ్న 20.
ఆంధ్రప్రదేశ్ పటాన్ని పరిశీలించి ఏయే జిల్లాల్లో అటవీ విస్తీర్ణం ఎక్కువగా, ఏయే జిల్లాల్లో తక్కువగా ఉందో తెలపండి.
జవాబు:
అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న జిల్లాలు :
YSR కడప, విశాఖపట్నం, తూర్పు గోదావరి, కర్నూలు, చిత్తూరు, శ్రీకాకుళం.

అటవీ విస్తీర్ణం తక్కువగా ఉన్న జిల్లాలు : కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు.

AP Board 7th Class Social Solutions Chapter 2 అడవులు

ప్రశ్న 21.
మీ జిల్లాలో ఏ రకమైన అడవులు ఉన్నాయి?
జవాబు:
మాది విశాఖపట్నం జిల్లా, మా జిల్లాలో తేమతో కూడిన ఆకురాల్చే అడవులున్నాయి.

7th Class Social Textbook Page No.55

ప్రశ్న 22.
ఈ క్రింది పట్టికను పూరించండి.
AP Board 7th Class Social Solutions Chapter 2 అడవులు 17
జవాబు:

అడవుల రకాలు విస్తరణ వక్షజాలం
తేమతో ఆకురాల్చే అడవులు శ్రీకాకుళం, విజయనగరం తూర్పు గోదావరి వేగి, ఏగిస, వెదురు, మద్ది, బండారు, జిట్టెగి, సాల
శుష్క ఆకురాల్చే అడవులు YSR కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు మద్ది, టేకు, బిల్ల, వెలగ, ఏగిస, వేప, బూరుగ, ఎర్రచందనం
మడ అడవులు తీర ప్రాంతమంతా ఉప్పుపొన్న, బొడ్డుపొన్న, ఉరడ, మడ తెల్లమడ, పత్రితీగ, జలబండి తీగ

7th Class Social Textbook Page No.59

ప్రశ్న 23.
సామాజిక అడవులపై కొన్ని నినాదాలు రాయండి.
జవాబు:

  1. పచ్చని చెట్లు – ప్రగతికి మెట్లు
  2. పచ్చని వనాలు – వచ్చే తరానికి వరాలు
  3. వనం కోసం మనం – మన కోసం వనం
  4. పచ్చని వనాలు – ప్రగతికి సోపానాలు

ప్రశ్న 24.
మీ పుట్టినరోజున ఒక చెట్టును నాటండి మరియు దానిని జాగ్రత్తగా చూసుకోండి.
జవాబు:
విద్యార్థి కృత్యము.

ప్రశ్న 25.
మీ స్నేహితులు మరియు బంధువులకు ముఖ్యమైన సందర్భాలలో ఒక మొక్కను బహుమతిగా ఇవ్వండి.
జవాబు:
విద్యార్థి కృత్యము.

7th Class Social Textbook Page No.61

ప్రశ్న 26.
గిరిజనుల సంస్కృతి మరియు వారి ఉత్పత్తులను గురించి ఒక పోస్టర్ తయారుచేయండి.
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 2 అడవులు 18

ప్రశ్న 27.
మీ పాఠశాలలో/ స్థానికంగా వన మహోత్సవాన్ని జరుపుకొని అందులో భాగంగా కొన్ని మొక్కలు నాటి వాటి పెరుగుదలను గమనించండి.
జవాబు:
విద్యార్థి కృత్యము.

7th Class Social Textbook Page No.53

ప్రశ్న 28.
ఎర్ర చందనం మరియు గంధం చెక్కల ఉపయోగాలు ఏమిటి?
జవాబు:
ఎర్ర చందనం మరియు గంధం చెక్కల ఉపయోగాలు :

  1. సుగంధ ద్రవ్యాల తయారీలో వాడతారు.
  2. బొమ్మల తయారీకి వినియోగిస్తారు.
  3. సంగీత పరికరాల తయారీకి.
  4. సహజ రంగుల తయారీలో.
  5. అందమైన గృహోపకరణాల తయారీలో వీటిని ఉపయోగిస్తారు.
  6. వీటికి ప్రపంచ వ్యాప్తి మార్కెట్ కల్గి ఉండి, ఆర్థికంగా ఎంతో విశేష స్థానం ఉంది.

7th Class Social Textbook Page No.55

ప్రశ్న 29.
గిరిజనులు అటవీ ప్రాంతాలను వదలి వెళ్ళడానికి ఎందుకు తిరస్కరిస్తారు?
జవాబు:
గిరిజనులు అటవీ ప్రాంతాలను వదలి వెళ్ళడానికి ఎందుకు తిరస్కరిస్తారంటే :

  1. చారిత్రాత్మకంగా ప్రాచీన కాలం నుండి అడవులే గిరిజనుల ఆవాసాలుగా ఉన్నాయి.
  2. గిరిజనులకు జీవనాధార వనరులుగా అడవులున్నాయి.
  3. వీరికి వేట, ఆహార సేకరణ, (కొంత వ్యవసాయం) మాత్రమే చేయగలరు. ఇతర ప్రాంతాలకు వెళ్ళితే వీరి పోషణ కష్టమగును.
  4. వీరికి అటవీ జ్ఞానము మెండుగా ఉండును. ఈ జ్ఞానము వారి జీవనానికి సహాయపడును. బయటకు వస్తే జ్ఞానము వృథా.
  5. వీరికి అడవి, అడవిలోని జంతు, జీవ జాలములతో విడదీయరాని అనుబంధము ఉంది.

7th Class Social Textbook Page No.57

ప్రశ్న 30.
పర్యావరణ పరిరక్షణలో అడవుల పాత్ర ఏమిటి?
జవాబు:

  1. పర్యావరణ వ్యవస్థలో సమతౌల్యం కాపాడటంలో అడవుల పాత్ర అతి ప్రధానమైనది.
  2. వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడు చెట్లు గ్రహించి ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. దీనివలన గ్లోబల్ వార్మింగ్ తగ్గును.
  3. వేర్లు మృత్తికా క్రమక్షయాన్ని కాపాడి, (నేలసారంను కాపాడతాయి).
  4. వాయు కాలుష్యాన్ని అడవులు తగ్గిస్తాయి.
  5. వాతావరణంలో ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి.

AP Board 7th Class Social Solutions Chapter 2 అడవులు

ప్రశ్న 31.
నీ పరిసర ప్రాంతాలలో అటవీ ఉత్పత్తులతో చేసిన వస్తువుల జాబితాను తయారుచేయండి.
జవాబు:
అటవీ ఉత్పత్తులతో చేసిన వస్తువులు :
1) చెక్కబల్లలు, 2) చెక్క కుర్చీలు, 3) కిటికీలు, 4) తలుపులు, 5) చాటలు, 6) చెక్క బీరువాలు, 7) మంచాలు, , 8) సంగీత వాయిద్యాలు, 9) నిచ్చెనలు, 10) వెదురు ఇల్లు (పూరిల్లు), 11) పప్పు గుత్తి, చల్లగుత్తి, 12) కత్తిపీట, 13) చెక్కపీటలు, 14) విస్తరాకులు, 15) గృహోపకరణాలు, 16) కలప గుజ్జు ద్వారా కాగితము, అట్టపెట్టెలు, 17) కుంచె చీపుర్లు, 18) చెక్క బొమ్మలు, 19) దర్వాజాలు.

7th Class Social Textbook Page No.59

ప్రశ్న 32.
వన నిర్మూలనకు గల కారణాలేవి?
జవాబు:
అటవీ నిర్మూలనకు గల కొన్ని కారణాలను పరిశీలిద్దాం.

  1. అటవీ భూములను వ్యవసాయ భూములుగా మార్చడం
  2. రోడ్లు మరియు డ్యాంల నిర్మాణాలు
  3. కలప
  4. పారిశ్రామిక ప్రయోజనాలు
  5. కొంత మంది తుంటరితనంతో అటవీ ప్రాంతాలకు నిప్పు పెట్టటం చాలా నష్టాన్ని కలిగిస్తుంది.

ప్రశ్న 33.
వన నిర్మూలన వలన కలిగే పరిణామాలేవి?
జవాబు:
వన నిర్మూలన వలన భూగోళం వేడెక్కడం, కాలుష్యం, నేలల క్రమ క్షయం, వన్యప్రాణులు సహజ ఆవాసాలు కోల్పోవటం, ఆహార, అటవీ ఉత్పత్తుల కొరత పర్యావరణ అసమతౌల్యత వంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది వరదలు, కరువులు వంటి ప్రకృతి వైపరీత్యాలకు దారితీయొచ్చు.

ప్రశ్న 34.
వన నిర్మూలన అరికట్టడానికి కొన్ని సూచనలు తెలపండి.
జవాబు:
వన నిర్మూలన అరికట్టడానికి సూచనలు:

  1. గృహోపకరణాల కలపకు ప్రత్యామ్నాయాలను చూడటం.
  2. గనుల త్రవ్వకంను తగ్గించి, రీసైక్లింగ్ (లోహాలను)ను ప్రోత్సహించటం.
  3. తక్కువ ముంపు కలిగే ప్రాంతాలలో ఆనకట్టలు నిర్మించడం.
  4. విరివిగా ప్రభుత్వ భూముల్లో, రహదారుల వెంట చెట్లను నాటడం.
  5. ప్రజలకు అటవీ సంరక్షణ పథకాలపై చైతన్యం కల్గించడం.
  6. పోడు వ్యవసాయాన్ని అరికట్టడం.
  7. కాగితం తయారీకి కలప గుజ్జుకై వెదురుకు ప్రత్యామ్నాయాలను వాడటం. కాగితంను పొదుపుగా వాడటం.

ప్రశ్న 35.
మీ పరిసర ప్రాంతాలలో మొక్కలు నాటడాన్ని ఎప్పుడైనా గమనించావా?
జవాబు:
గమనించాను, మా పాఠశాలలో “వనం-మనం” కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడాన్ని గమనించాను.

AP Board 7th Class Social Solutions Chapter 2 అడవులు

ప్రశ్న 36.
మొక్కలు నాటడం వలన ఉపయోగాలు ఏమిటి?
జవాబు:
మొక్కలు నాటడం వలన ఉపయోగాలు: .

  1. ఇప్పుడు మొక్కలు నాటడం వలన భవిష్యత్ లో అవి వృక్షాలవుతాయి.
  2. మొక్కలు వాతావరణంలో ఉన్న CO2 పీల్చుకుని ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. ఆక్సిజన్ మనకు ప్రాణవాయువు.
  3. మొక్కలు వాతావరణంలోని కాలుష్యాన్ని తగ్గిస్తాయి. వాతావరణం సమతౌల్యాన్ని కాపాడతాయి.
  4. భూగోళం వేడెక్కడాన్ని తగ్గిస్తాయి.
  5. క్రమక్షయాన్ని తగ్గిస్తాయి.
  6. చెట్లు నీడని, పండ్లను, ఆకులను ఇస్తాయి.

7th Class Social Textbook Page No.59

ప్రశ్న 37.
చిప్కో ఉద్యమం గురించి సమాచారం అంతర్జాలం ద్వారా గాని లేదా లైబ్రరీ పుస్తకాల ద్వారా గాని తెలుసుకోండి.
జవాబు:
ఉత్తరాఖండ్ లోని గఢ్ వాల్ కొండలలో 1970 ఆరంభంలో మొదలైన చిప్కో ఉద్యమం మరొక ముఖ్యమైన పర్యావరణ ఉద్యమం. నర్మదా లోయలోని గిరిజన ప్రజలకు మాదిరిగానే ఇక్కడి కొండ ప్రాంతాల్లోని ప్రజల మనుగడకు అడవులు ఎంతో కీలకమైనవి. ఇవి ప్రత్యక్షంగా ఆహారం, కట్టెపుల్లలు, పశువుల మేత ఇవ్వటమే కాకుండా పరోక్షంగా నేల, నీటి వనరులను సుస్థిరపరచటంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. వ్యాపారం, పరిశ్రమల కోసం అడవులను నరికివేయటం తీవ్రరూపం దాల్చటంతో తమ జీవనోపాధులను కాపాడుకోవటానికి దీనిని అహింసాయుత పద్ధతిలో వ్యతిరేకించాలని ప్రజలు చెట్లను హత్తుకున్నారు. దీనినుంచే ఈ ఉద్యమం పేరు వచ్చింది. చిప్కో అంటే హత్తుకోవటం. చెట్లను పల్లెవాసులు హత్తుకొని గుత్తేదార్ల గొడ్డళ్ళకు అడ్డుగా నిలిచారు. ఈ ఉద్యమంలో గ్రామీణ మహిళలు ప్రధానంగా పాల్గొన్నారు. ఈ ఉద్యమం కారణంగా ఎంతోమంది పర్యావరణ సుస్థిరత గురించి ఆలోచించటం మొదలుపెట్టారు.

AP Board 7th Class Social Solutions Chapter 2 అడవులు 21

AP Board 7th Class Social Solutions Chapter 6 విజయనగర సామ్రాజ్యం

SCERT AP 7th Class Social Study Material Pdf 6th Lesson విజయనగర సామ్రాజ్యం Textbook Questions and Answers.

AP State Syllabus 7th Class Social Solutions 6th Lesson విజయనగర సామ్రాజ్యం

7th Class Social 6th Lesson విజయనగర సామ్రాజ్యం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

I. క్రింది ప్రశ్నలకు జవాబులివ్వండి.

ప్రశ్న 1.
విజయనగరము మరియు బహమనీ రాజ్యాల మధ్య సంఘర్షణను గురించి చర్చించుము.
జవాబు:

  1. బహమనీ సుల్తానులు, విజయనగర రాజులు మూడు ప్రాంతాలపై ఆధిపత్యం గురించి నిరంతరం ఘర్షణ పడేవారు.
  2. తుంగభద్ర మాగాణి ప్రాంతంపై, కృష్ణా గోదావరి డెల్టాలపై, మరట్వాడాపై ఆధిపత్యానికి ఈ పోరాటాలు జరిగాయి.
  3. ఈ రెండు రాజ్యాలు ఉన్నంత కాలం వీటి మధ్య సైనిక యుద్ధాలు జరుగుతుండేవి. ఈ యుద్ధాల వలన విపరీతమైన జన నష్టం, ఆస్తి నష్టం జరిగింది.
  4. ఒకటో బుక్కరాయల కాలంలో క్రీ.శ. 1367లో వీరి మధ్య మొదటిసారిగా పెద్ద యుద్ధం ప్రారంభమయింది.
  5. ‘జిహాద్’ పేరుతో విజయ నగర సామ్రాజ్యంపై మత యుద్ధం ప్రకటించిన బహమనీ సైన్యాలను మొట్టమొదటగా శ్రీకృష్ణ దేవరాయలు తిప్పికొట్టవలసి వచ్చింది.
  6. ఈ విధంగా నిరంతరము విజయనగరము మరియు బహమనీ రాజ్యాల మధ్య సంఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి.

ప్రశ్న 2.
విజయనగర రాజ్యంలో నాయంకర వ్యవస్థ గురించి రాయండి.
జవాబు:

  1. విజయనగర సామ్రాజ్యంలో కోటలను, సాయుధ దళాలను నియంత్రించే సైనిక అధికారులను అమర నాయకులు అంటారు.
  2. వీరు తరచూ ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సంచరిస్తూ అనేక సందర్భాల్లో రైతులు స్థిరపడటానికి కావలసిన సారవంతమైన భూమి కోసం రైతులతో కలసి వీరు అన్వేషిస్తుంటారు.
  3. వీరిని నాయక అని పిలుస్తారు.
  4. విజయనగర సామ్రాజ్యంలో అమర నాయక వ్యవస్థ ప్రధానమైన నూతన రాజకీయ వ్యవస్థ.
  5. అమర నాయకులు సైనిక కమాండర్లుగా ఉంటారు. వీరు పాలించడానికి రాజుచే కొంత భూభాగం ఇవ్వబడుతుంది.

AP Board 7th Class Social Solutions Chapter 6 విజయనగర సామ్రాజ్యం

ప్రశ్న 3.
విజయనగర పాలన కాలంలో వాణిజ్య అభివృద్ధిని గూర్చి వివరించండి.
జవాబు:

  1. విజయనగర సామ్రాజ్యం వాణిజ్యానికి గొప్ప కేంద్రంగా విలసిల్లింది. “వరాహ” అనునది ప్రధాన బంగారు నాణెం.
  2. రాజ్యం లోపల తీరప్రాంతాల ద్వారా సముద్రాలపై జరిగే వ్యాపారం వల్ల సామ్రాజ్యం సుసంపన్నంగా ఉండేది.
  3. మలబార్ తీరంలో అనేక నౌకాశ్రయాలు ఉండేవి. వాటిలో ప్రధానమైనది కన్ననూర్.
  4. పశ్చిమాన అరేబియా, పర్షియా, దక్షిణాఫ్రికా మరియు పోర్చుగల్ మరియు తూర్పున బర్మా, మలయా ద్వీపకల్పం మరియు చైనాతో వాణిజ్య సంబంధాలు వృద్ధి చెందాయి.
  5. పత్తి మరియు పట్టు, సుగంధ ద్రవ్యాలు, బియ్యం, ఇనుము, సురేకారం మరియు చక్కెర ఎగుమతులలో ప్రధాన వస్తువులు.
  6. విజయనగర రాజులు గుర్రాలు, ముత్యాలు, రాగి, పగడము, పాదరసం, చైనా పట్టు మరియు వెల్వెట్ వస్త్రాలను దిగుమతి చేసుకొన్నారు.
  7. ఓడల నిర్మాణ కళ అభివృద్ధి చెందింది.

ప్రశ్న 4.
ఈ పాఠంలోని “కళలు మరియు సంగీతం” అనే పేరాను చదివి ప్రస్తుత కళారూపాలతో పోల్చండి.
జవాబు:
కళలు మరియు సంగీతం :

  1. విజయనగర రాజుల కాలంలో కర్ణాటక సంగీత సాంప్రదాయం అభివృద్ధి చెందింది.
  2. విద్యారణ్యస్వామి సంగీత సర్వస్వం అనే గ్రంథాన్ని రాశారు.
  3. ప్రౌఢ దేవరాయలు రాసిన మహానాటక సుధానిధి అను రచన కూడా సంగీతానికి చెందినదే.
  4. కర్ణాటక సంగీత త్రయం దీక్షితార్, శ్యామశాస్త్రి మరియు త్యాగరాజస్వామి తంజావూరు ఆస్థానానికి చెందినవారు.

నృత్య రూపాలు :

  1. అత్యంత ప్రజాదరణ పొందిన నృత్య రూపమైన భరతనాట్యం భరతముని చేత పరిచయం చేయబడింది.
  2. భరతనాట్యం గురించి వివరణాత్మక సమాచారం కలిగి ఉన్న నాట్యశాస్త్ర పుస్తకాన్ని భరతముని రచించారు.
  3. సిద్ధేంద్ర యోగి ప్రవేశపెట్టిన కూచిపూడి ఇతర ప్రసిద్ధ నృత్య రూపాలు, కాకతీయుల యొక్క నృత్య రూపమైన పేరిణి నాట్యం కూడా ప్రాచుర్యం పొందింది.
  4. భాగవతం నుండి ప్రత్యేకంగా ఉద్భవించిన ఇతివృత్తాలతో యక్షగానమనే నృత్య రూపకం కూడా ప్రజాదరణ పొందింది.

ప్రశ్న 5.
శ్రీకృష్ణదేవరాయల పరిపాలనను గురించి వ్రాయుము.
జవాబు:
శ్రీ కృష్ణదేవరాయల పరిపాలన :

  1. వీరి కాలంలో పరిపాలనా వ్యవస్థ చక్కగా రూపుదిద్దుకుంది. ఇతడు సమర్థుడైన పాలకుడు.
  2. కార్యనిర్వాహక, న్యాయ మరియు శాసన విషయాలలో రాజు సంపూర్ణ అధికారాన్ని కల్గి ఉండేవాడు.
  3. రోజువారీ పరిపాలనలో సహాయంగా మంత్రిమండలి ఉంటుంది. తిమ్మరుసు తెలివైన మంత్రి.
  4. సామ్రాజ్యాన్ని మండలాలు, నాడులు, స్థలాలు, గ్రామాలుగా విభజించారు.
  5. పరిపాలనలో అధికారులకు ఎక్కువ అధికారాలు ఇచ్చారు.
  6. భూమి శిస్తు 1/6వ వంతు, ఎగుమతి – దిగుమతి పన్ను, వాణిజ్య పన్ను, వృత్తి పన్ను వసూలు చేసేవారు.
  7. సైనిక వ్యవస్థను పటిష్ఠపరచి, అశ్విక, పదతి, ఫిరంగులు మరియు ఏనుగులుండేవి.
  8. అమర నాయక విధానం అమలులో ఉంది. గొప్ప సైనిక సామర్థ్యం కలిగి ఉండేవాడు.
  9. సాహిత్యం మరియు కళలను పోషించి “ఆంధ్ర భోజుడు” అని పిలువబడ్డాడు.
  10. “దేశ భాషలందు తెలుగు లెస్స” అని పలికి, తన ఆస్థానంను అష్టదిగ్గజాలతో అలంకరించాడు.
  11. అనేక దేవాలయాలు, కట్టడాలు నిర్మించాడు.

ప్రశ్న 6.
శ్రీకృష్ణ దేవరాయల సాహితీ సేవను వివరించండి.
జవాబు:

  1. శ్రీకృష్ణ దేవరాయలు, సాహిత్యం మరియు కళలను గొప్పగా పోషించాడు. అతను ‘ఆంధ్ర భోజుడు’ అని పిలువబడ్డాడు.
  2. అతడు “దేశ భాషలందు తెలుగు లెస్స” అని పలికాడు. అష్టదిగ్గజములు అని పిలువబడే ఎనిమిది మంది ప్రముఖ పండితులు అతని ఆస్థానంలో ఉండేవారు.
  3. అందులో అల్లసాని పెద్దన గొప్పవాడు. అతనిని “ఆంధ్ర కవితా పితామహుడు” అని పిలిచేవారు. అతని రచనలలో మనుచరిత్ర మరియు హరికథాసారం ముఖ్యమైనవి.
  4. పింగళి సూరన, ధూర్జటి మరియు తెనాలి రామకృష్ణుడు ఇతర ముఖ్యమైన పండితులు.
  5. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి. తెలుగులో ‘ఆముక్తమాల్యద’, సంస్కృతంలో జాంబవతీ కళ్యాణం, ఉషాపరిణయం ఈయన ముఖ్యమైన రచనలు. ఈ విధంగా సాహిత్యానికి ఎనలేని సేవలనందించాడు.

AP Board 7th Class Social Solutions Chapter 6 విజయనగర సామ్రాజ్యం

ప్రశ్న 7.
భారతదేశ పటంలో విజయనగర సామ్రాజ్యం యొక్క సరిహద్దులను గుర్తించండి.
జవాబు:

ప్రశ్న 8.
విజయనగర వాస్తు శిల్పులకు స్ఫూర్తినిచ్చిన నిర్మాణ సాంప్రదాయాలు ఏమిటి?
జవాబు:

  1. విజయనగర పాలనలో ఆలయ నిర్మాణ కార్యకలాపాలు మరింతగా ఊపందుకున్నాయి.
  2. ఎత్తైన గోపురాలు లేదా ముఖద్వారాలు మరియు ఆలయ ప్రాంగణంలో చెక్కిన స్తంభాలతో కళ్యాణ మండప నిర్మాణాలు విజయనగర వాస్తు శిల్పం యొక్క ముఖ్య లక్షణాలు.
  3. స్తంభాలపై ఉన్న శిల్పాలను విలక్షణమైన లక్షణాలతో చెక్కారు.
  4. ఈ స్తంభాలలో కనిపించే సాధారణ జంతువు గుర్రం.
  5. కొన్ని దేవాలయాలలో పెద్ద మండపాలు ఉన్నాయి. కొన్ని పెద్ద దేవాలయాలలో వంద నుండి వెయ్యి స్తంభాలు ఉన్నాయి.
  6. విజయనగరం యొక్క శిల్పకళా శైలిలోని అతిముఖ్యమైన దేవాలయాలు విజయనగరంలోను, హంపి శిథిలాలలోను కనుగొనబడ్డాయి.
  7. విఠలస్వామి దేవాలయము మరియు హజార రామాలయం దేవాలయాలు ఈ శైలికి చెందినవే.
  8. కాంచీపురంలోని వరదరాజ దేవాలయము మరియు ఏకాంబరనాథ దేవాలయాలు విజయనగర రాజుల నిర్మాణ శైలి గొప్పతనానికి ఉదాహరణలుగా నిలుస్తాయి.
  9. తిరుపతిలో శ్రీకృష్ణదేవరాయలు మరియు అతని రాణుల యొక్క లోహ చిత్రాలు లోహాల పనితనానికి ఉదాహరణలు.
  10. విజయనగర రాజులు దేవాలయ నిర్మాణానికి అనుసరించిన పద్ధతులు ‘విజయనగర శైలిగా’ ప్రసిద్ధి చెందాయి.
  11. ఈ శైలిని ద్రవిడ పద్ధతిగా కొందరు పేర్కొన్నారు.
  12. విజయనగర రాజులు నిర్మించిన ఆలయాలలో చాళుక్య శైలి స్పష్టంగా కన్పిస్తుంది.
  13. క్రమముగా వీరి శైలిలో చోళ సాంప్రదాయాలు చోటు చేసికొన్నాయి.

ప్రశ్న 9.
బహమనీ రాజ్యం ఎందువలన విడిపోయింది? దాని పరిణామం ఏమిటి?
జవాబు:
బహమనీ రాజ్యం విడిపోవటానికి కారణం :

  1. సుల్తాను యొక్క అధికారాన్ని పెంచడం కోసం మహ్మద్ గవాన్ ప్రతి రాష్ట్రంలో అధికారులను నియమించాడు.
  2. ప్రభువుల ప్రాంతాలపై సుల్తాన్ నియంత్రణను పెంచడమే దీని ఉద్దేశం. చాలా కోటలు ఈ అధికారుల నియంత్రణలో ఉన్నాయి.
  3. బాధ్యతలు విస్మరించిన ప్రభువులకు వేతనాలు తగ్గించబడ్డాయి. ఇది ప్రభువులకు నచ్చలేదు.
  4. దక్కన్ ప్రభువులు గవాన కు వ్యతిరేకంగా కుట్ర పన్నినారు. మరణశిక్ష విధించవలసిందిగా సుల్తాన్ ను ప్రేరేపించారు.
  5. మూడవ మహమ్మద్ షా క్రీ.శ. 1482లో మరణించాడు.
  6. అతని తరువాత రాజ్యపాలన చేసినవారంతా బలహీనులు. అందువల్ల బహమనీ సామ్రాజ్యం
    1. అహ్మద్ నగర్,
    2. బీరార్,
    3. బీదర్,
    4. బీజాపూర్
    5. గోల్కొండ అనే ఐదు భాగాలుగా విడిపోయింది.

ప్రశ్న 10.
రెడ్డిరాజులు ప్రజలకు చేసిన సేవలను వివరించండి.
జవాబు:

  1. రెడ్డి రాజులు హిందూ మతాన్ని ఆదరించి రక్షించారు.
  2. రెడ్డి రాజుల పాలనలో తెలుగు సాహిత్యం బాగా వికసించింది.
  3. ఆంధ్ర మహాభారతమును రచించిన కవిత్రయంలో ఒకరైన ఎర్రాప్రగడ ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవిగా ఉండేవాడు. ఆయనకు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు ఉంది.
  4. రెడ్డి రాజులు సంస్కృతాన్ని కూడా ఆదరించారు.
  5. పరిపాలన “ధర్మ సూత్రాలు” ఆధారంగా జరిగింది.
  6. వ్యవసాయ మిగులులో ఆరింట ఒక వంతు (1/6) పన్ను విధించారు.
  7. అనపోతా రెడ్డి పాలనలో కస్టమ్ సుంకాలు మరియు వాణిజ్యంపై పన్నులు రద్దు చేయబడ్డాయి. ఫలితంగా వాణిజ్యం వృద్ధి చెందింది.
  8. మోటుపల్లి నౌకాశ్రయం ద్వారా సముద్ర వ్యాపారం జరిగింది.

AP Board 7th Class Social Solutions Chapter 6 విజయనగర సామ్రాజ్యం

II. సరియైన సమాధానాలను ఎంచుకోండి.

1. శ్రీకృష్ణదేవరాయలు ఈ విజయనగర రాజవంశానికి చెందినవాడు.
ఎ) సాళువ
బి) తుళువ
సి) అరవీడు
డి) సంగమ
జవాబు:
బి) తుళువ

2. ఎవరి కాలంలో విజయనగర సామ్రాజ్యం స్థాపించబడింది?
ఎ) అల్లాఉద్దీన్ ఖిల్జీ
బి) మహమ్మద్ బీన్ తుగ్లక్
సి) ఫిరోజ్ షా తుగ్లక్’
డి) గియాజుద్దీన్ తుగ్లక్
జవాబు:
బి) మహమ్మద్ బీన్ తుగ్లక్

3. ఏ సంవత్సరంలో రాక్షస తంగడి లేదా తళ్ళికోట యుద్ధం జరిగింది?
ఎ) క్రీ.శ. 1563
బి) క్రీ.శ. 1564
సి) క్రీ.శ. 1565
డి) క్రీ.శ. 1566
జవాబు:
సి) క్రీ.శ. 1565

4. ‘మధుర విజయం’ అను పుస్తకాన్ని రాసినవారు
ఎ) గంగాదేవి
బి) తిరుమలమ్మ
సి) హనుమాయమ్మ
డి) నాగలాంబ
జవాబు:
ఎ) గంగాదేవి

5. బహమనీ రాజ్య స్థాపకుడు
ఎ) అల్లాఉద్దీన్ ముజాహిద్ షా
బి) అహమ్మద్ షా
సి) అల్లాఉద్దీన్ బహమన్ షా
డి) ఫిరోజ్ షా
జవాబు:
సి) అల్లాఉద్దీన్ బహమన్ షా

III. జతపరుచుము.

గ్రూపు-ఎ గ్రూపు-బి 1. శ్రీకృష్ణదేవరాయలు (సి) ఎ) ముఖ్యమంత్రి 2. మహ్మద్ గవాన్ (ఎ) బి) బహమనీ రాజధాని నగరం 3. విజయనగర సామ్రాజ్యం (ఇ) సి) ఆంధ్ర భోజ 4. గుల్బర్గా (బి) డి) పర్షియన్ 5. అబ్దుల్ రజాక్ (డి) ఇ) తుంగభద్ర
జవాబు:

7th Class Social Studies 6th Lesson విజయనగర సామ్రాజ్యం InText Questions and Answers

7th Class Social Textbook Page No.157

ప్రశ్న 1.
మీ లైబ్రరీ లేదా ఇంటర్నెట్ నుండి భారతదేశపు మొదటి సర్వేయర్ జనరల్ గురించి సమాచారాన్ని సేకరించండి.
జవాబు:

  1. 1767లో బెంగాల్ ప్రెసిడెన్సీని సర్వే చేయడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ జేమ్స్ రన్నెల్ ను నియమించింది. లార్డ్ క్లైవ్ ఇతన్ని సర్వేయర్ జనరల్ గా నియమించాడు.
  2. తర్వాత 1810లో కొలిన్ మెకంజీ మద్రాసు ప్రెసిడెన్సీకి సర్వేయర్ జనరల్ గా నియమితులయ్యారు.
  3. అయితే ఈ పోస్టులు 1815లో రద్దు చేయబడ్డాయి మరియు మెకంజీని భారతదేశంలో మొదటి సర్వేయర్ జనరల్ గా నియమించారు.
  4. ఇతను దక్షిణ భారతదేశాన్ని సర్వే చేసాడు.
  5. వేలాది మాన్యుస్క్రిప్టు, శాసనాలు, నాణేలు (పెయింటింగ్లు), పురావస్తు ఆధారాల గమనికతో మొదటి మ్యాన్లను రూపొందించాడు.

7th Class Social Textbook Page No.167

ప్రశ్న 3.
చాలా మంది ప్రాచీన మరియు ఆధునిక భారతీయ మహిళలు మనకు ఆదర్శంగా ఉన్నారు. మీ ఉపాధ్యాయుడు లేదా తల్లిదండ్రుల సహాయంతో గొప్ప ఖ్యాతి గడించిన భారత మహిళల జాబితాను సిద్ధం చేయండి.
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 6 విజయనగర సామ్రాజ్యం 1
1. అనిబిసెంట్ :
లండన్లో జన్మించినటువంటి ఐరిష్ మహిళ. 1893వ సంవత్సరంలో భారతదేశానికి వచ్చినారు. ఈమె ప్రఖ్యాతి గాంచిన విద్యావేత్త, జర్నలిస్టు, సోషల్ వర్కర్, మరియు ఆధ్యాత్మిక వేత్త. ఈమె థియోసాఫికల్ సొసైటీ (దివ్య జ్ఞానసమాజము) ను స్థాపించారు. భారతదేశంలో స్వాతంత్ర్య పోరాటకాలంలో హోమ్ రూల్ లీగ్ ను ప్రారంభించారు. అంతేగాక, న్యూయిండియా’ కు సంపాదకత్వం వహించారు. భారతీయ బాలుర స్కౌట్ ఆసోసియేషన్‌ను కూడా ప్రారంభించారు. 86 సం||ల వయస్సులో ఈమె మరణించారు.

AP Board 7th Class Social Solutions Chapter 6 విజయనగర సామ్రాజ్యం 2
2. కరణం మల్లేశ్వరి :
భారతదేశ వెయిట్ లిఫ్టర్. ఒలింపిక్స్ లో భారతదేశం తరపున మెడల్ సాధించిన తొలి మహిళ. 2000సం||రం సిడ్నీ ఒలింపిక్స్ లో ఈమె పతకాన్ని సాధించింది. 1994 – 95 సం||రానికి రాజీవ్ ఖేల్ రత్న అవార్డును పొందింది. మహిళ అయివుండి పురుషులు ఎక్కువగా పాల్గొనే వెయిట్ లిఫ్టింగ్ లో ఒలింపిక్ పతకం గెలవడమంటే ఎన్ని కష్ట నష్టాలకు ఓర్చి ఉంటుందో ఊహించండి.

AP Board 7th Class Social Solutions Chapter 6 విజయనగర సామ్రాజ్యం 3
3. ఎమ్.ఎస్.సుబ్బులక్ష్మి:
మధురైషణ్ముఖ వడివు సుబ్బులక్ష్మి 16-09-1916లో మధురైలో జన్మించారు. కర్ణాటక సంగీతంలో నైటింగేలని అంటారు. ఈమె 1954లో ‘పద్మభూషణ్’, 1974లో రామన్ మెగ్ సేసే అవార్డు, 1975లో ‘పద్మ విభూషణ్’ లతో గౌరవించబడ్డారు. 1998లో భారతరత్న అవార్డును కూడా పొందారు. మహిళలు అంతగా బయటకి రాని రోజుల్లోనే. ఆమె సంగీత కచేరీలు చేశారు. 88 సం||రాల వయసులో ఈమె మరణించారు.

AP Board 7th Class Social Solutions Chapter 6 విజయనగర సామ్రాజ్యం 4
4. శశిప్రభ :
28 సంవత్సరాల యువతి మొట్టమొదటి బస్సు డ్రైవర్. భారతదేశ కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలో ఒక ప్రైవేటు ట్రాన్స్ పోర్టు కంపెనీ వారు ఈమెను బస్సు డ్రైవర్ గా నియమించారు.

AP Board 7th Class Social Solutions Chapter 6 విజయనగర సామ్రాజ్యం 5
5. ఇందిరాగాంధీ :
మొట్టమొదటి మహిళా ప్రధాని, అలహాబాదులో జన్మించారు. 13 సంవత్సరాల వయసులోనే ‘వానరసేన’ను స్థాపించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ధీరురాలు. ఆమె ప్రధాన మంత్రిగా ఉన్నపుడు బ్యాంకుల జాతీయకరణ, బంగ్లాదేశ్ కు స్వేచ్ఛ, 20 పాయింట్ ప్రోగ్రామ్ మొదలైనవి జరిపించారు. ఆమె భారతరత్న పురస్కారాన్ని 1971లో పొందారు. 31-10-1984లో ఇందిరాగాంధీ తన స్వంత గార్డులచే కాల్చి చంపబడ్డారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన మహిళ.

AP Board 7th Class Social Solutions Chapter 6 విజయనగర సామ్రాజ్యం 6
6. కల్పనాచావ్లా :
జననం 1 – 7 – 1961, మరణం 1 – 2 – 2003 ఇండియన్ అమెరికన్ వ్యోమగామి. కొలంబియా స్పేస్ షటిల్ లో మరణించిన ఏడుగురు వ్యోమగాములలో ఈమె కూడా ఒకరు. ఈమెకు నాసా అనేక మెడల్స్ యిచ్చింది. మరణం తథ్యమని తెలిసినా కూడా స్పేస్ షటిల్ లో ఆమె ప్రవర్తన, ధైర్యం చిరస్మరణీయం.

AP Board 7th Class Social Solutions Chapter 6 విజయనగర సామ్రాజ్యం 7
7. మేథాపాట్కర్ :
01-12-1954 లో జన్మించారు. సామాజిక వేత్త. ప్రముఖ పర్యావరణవేత్త, ముంబయి వాసి. ‘నర్మదా బచావో’ ఆందోళనలో పాలు పంచుకుంటున్నారు. 1991లో రైట్ లైవలీహుద్ అవార్డును పొందారు.

AP Board 7th Class Social Solutions Chapter 6 విజయనగర సామ్రాజ్యం 8
8. తస్లీమా నస్క్రీన్ :
25-08-1962 లో బంగ్లాదేశ్ లో జన్మించారు. ప్రముఖ ఫెమినిస్టు. మతాలకతీతంగా స్త్రీకి స్వేచ్ఛ, సమానత్వాలు ఉండాలని ‘అక్షర యుద్ధం’ చేస్తున్నారు. ఈమె వ్రాసిన ‘లజ్జా’ అనే పుస్తకం బాగా ప్రాచుర్యం పొందింది. దీని మూలంగా ఆమె అనేక దాడులకు గురయింది. ఆమె ప్రస్తుతం బంగ్లాదేశ్ ను వదిలి పెట్టి ప్రవాసంలో జీవితాన్ని గడుపుతున్నారు.

AP Board 7th Class Social Solutions Chapter 6 విజయనగర సామ్రాజ్యం 9
9. కిరణ్ బేడి :
09-06-1949లో జన్మించారు. విశ్రాంత ఐ.పి.యస్ ఆఫీసర్. మొట్టమొదటి మహిళా ఆఫీసర్, 1994లో రామన్ మెగసెసే అవార్డు గ్రహీత. పంజాబ్ అమృతసర్ లో జన్మించారు. తన విధి నిర్వహణలో అనేక యిబ్బందులు, ఒడిదుడుకులు ఎదుర్కొన్న మహిళ.

7th Class Social Textbook Page No.173

ప్రశ్న 4.
ఆంధ్రప్రదేశ్ పటంలో “కొండపల్లి, రాజమండ్రి, కొండవీడు, వినుకొండ మరియు అద్దంకి” ప్రాంతాలను గుర్తించండి.
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 6 విజయనగర సామ్రాజ్యం 10

ఆలోచించండి – ప్రతిస్పందించండి

7th Class Social Textbook Page No.155

ప్రశ్న 1.
విద్యారణ్యస్వామి వారు తుంగభద్రా నది ఒడ్డున విజయనగర సామ్రాజ్యాన్ని ఎందుకు స్థాపించారు?
జవాబు:
తుంగభద్రా నది ఒడ్డున విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడానికి కారణం.

  1. విద్యారణ్యస్వామి వారి ప్రోత్సాహంతో తుంగభద్రా నదికి దక్షిణం వైపు ‘విద్యానగరం’ అనే పేరుతో విజయనగర నిర్మాణాన్ని ప్రారంభించారు.
  2. ఆనాటి విపత్కర పరిస్థితులలో తుంగభద్ర తీరంలో ప్రకృతి సహజమైన ‘రక్షణ వలయంలో దీనిని నిర్మించారు.
  3. సారవంతమైన తుంగభద్రా మాగాణి ప్రాంతం సస్యశ్యామలంగా ఉండి, పంటలకు అనుకూలంగా ఉంటుంది.

AP Board 7th Class Social Solutions Chapter 6 విజయనగర సామ్రాజ్యం

ప్రశ్న 2.
ఏ రాజ వంశ పాలనలో మొదటి హరిహర రాయలు మరియు మొదటి బుక్కరాయలు పనిచేశారు?
జవాబు:
మొదటి హరిహర రాయలు మరియు మొదటి బుక్క రాయలు మొదటగా వరంగల్లుకు చెందిన కాకతీయ రాజు రెండవ ప్రతాప రుద్రుని ఆస్థానంలో క్రీ.శ. 1323లో పనిచేశారు. అంటే కాకతీయవంశంలో పనిచేశారు.

7th Class Social Textbook Page No.163

ప్రశ్న 3.
విజయ నగర రాజులకు సమకాలీన మహ్మదీయ రాజులకు యుద్ధాలు ఎందుకు జరిగాయి?
జవాబు:

  1. విజయనగర రాజులు మరియు మదురై సుల్తానుల మధ్య పోరాటం సుమారు నాలుగు దశాబ్దాలుగా కొనసాగింది.
  2. మొదటి బుక్కరాయల కుమారుడైన కుమార కంపన మదురై సుల్తాన్లను నాశనం చేసి అతని దుర్భర పాలన నుంచి ప్రజలను విముక్తులను చేసినాడు.
  3. ఫలితంగా విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారతదేశం మొత్తం మరియు రామేశ్వరం వరకు విస్తరించింది.
  4. విజయనగర రాజులు మరియు బహమనీ సుల్తానుల మధ్య సంఘర్షణలు చాలా సంవత్సరాలు కొనసాగాయి.
  5. కృష్ణ మరియు తుంగభద్ర నదుల మధ్య ఉన్న ప్రాంతం మరియు కృష్ణ – గోదావరి డెల్టా యొక్క సారవంతమైన ప్రాంతాలపై ఉన్న రాయచూరు దోఆబ్ పై వివాదం సుదీర్ఘ కాల సంఘర్షణలకు దారితీసింది.

ప్రశ్న 4.
తళ్ళికోట యుద్ధ ఫలితాల గురించి మీ ఉపాధ్యాయునితో చర్చించండి.
జవాబు:

  1. తళ్ళికోట యుద్ధము భారతదేశ చరిత్ర గతిని మార్చి వేసిన యుద్ధాలలో ఒకటి.
  2. ఈ యుద్ధం వలన తుళువ వంశం, విజయనగర సామ్రాజ్య వైభవం పతనమయ్యింది.
  3. విజయనగర పతనముతో దక్షిణ భారతములో ముస్లింల విజృంభణకు అడ్డుగోడ తొలగింది. కాని అంత: కలహాల వల్ల మొఘల్స్ వారిని లొంగదీశారు.
  4. తళ్ళికోట యుద్ధం వల్ల జరిగిన ఒక ముఖ్య పరిణామం పోర్చుగీసు వారి వర్తక వాణిజ్యాలు దెబ్బతిన్నాయి.
    (పోర్చుగీసు వారి వాణిజ్యంలో ఎక్కువ భాగము విజయనగరం గుండా జరిగేది).
  5. తుళువ వంశం తరువాత వచ్చిన అరవీటి వంశస్థులు తమ రాజధానిగా ‘పెనుగొండ’ను చేసుకోవటంతో విజయనగరం రాజకీయ ప్రాబల్యాన్ని కోల్పోయింది.

7th Class Social Textbook Page No.171

ప్రశ్న 5.
భారతీయ కళ మరియు వాస్తు శిల్పానికి విజయనగర సామ్రాజ్యం అందించిన సహకారం గురించి చర్చించండి.
జవాబు:

  1. విజయనగర రాజులు లలిత కళలన్నింటిని సమానముగా ఆదరించారు.
  2. వీరి ఆధ్వర్యములో హిందూ దేవాలయ వాస్తు కళ పరాకాష్టను అందుకున్నది.
  3. విజయనగర దేవాలయాలు ప్రఖ్యాత చారిత్రక నగరం, వారి రాజధాని నగరమైన హంపిలో కన్పిస్తాయి.
  4. హంపి విజయనగరంలోని విఠల ఆలయం, హజార రామాలయం, దసరా దిబ్బ, పద్మమహల్, ఏనుగుశాల, ఏకశిలారథం, ఇతర రాజప్రాసాద దుర్గ నిర్మాణాలు.
  5. పెనుగొండ, చంద్రగిరి, నెల్లూరు రాజ ప్రాసాదాలు : కంచి, తాడిపత్రి, శ్రీరంగం, కదిరి మొదలైనవి.
  6. ఆలయాలు, వాటి గోపురాలు, కళ్యాణ మంటపాలు, కుడ్య శిల్పాలు, చిత్రలేఖనం నాటి కళా వైభవానికి చిహ్నాలు (తిరుపతి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, ఆలయాలకు గోపురాలు సమకూర్చారు).
  7. దక్షిణ భారత వాస్తు శిల్పకళలను బహుళ వ్యాప్తంగా ప్రచారం చేసినవి విజయనగర రాజులచే నిర్మించబడిన ఆలయాలు.
  8. హంపి, లేపాక్షిలోని ఆలయాలు, శిల్పాలు నాటి శిల్పుల శిల్ప కళా చాతుర్యానికి తార్కాణాలు.
  9. విజయనగర రాజులు లలిత కళలను విశేషంగా ఆదరించారు.

AP Board 7th Class Social Solutions Chapter 6 విజయనగర సామ్రాజ్యం

ప్రాజెక్టు పని

విజయనగర శైలి ప్రభావంతో నిర్మించబడిన ఆంధ్రప్రదేశ్ లోని దేవాలయాల గురించి సమాచారాన్ని సేకరించండి.
జవాబు:
విజయనగర శైలి ప్రభావంతో నిర్మించబడిన దేవాలయాలు :

  1. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం మరియు తిరుపతిలోని ఆలయాలు.
  2. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయము.
  3. సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయము.
  4. లేపాక్షి దేవాలయం
  5. శ్రీశైలం శ్రీ మల్లికార్జుని దేవాలయం.
  6. అహోబిలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంపై ఆలయాల గోపురాలు (రాయగోపురాలు) విజయనగర శైలికి చెందినవి.

AP Board 7th Class Social Solutions Chapter 5 కాకతీయ రాజ్యం

SCERT AP 7th Class Social Study Material Pdf 5th Lesson కాకతీయ రాజ్యం Textbook Questions and Answers.

AP State Syllabus 7th Class Social Solutions 5th Lesson కాకతీయ రాజ్యం

7th Class Social 5th Lesson కాకతీయ రాజ్యం Textbook Questions and Answers

కింది తరగతులలోని విషయ పునశ్చరణ

AP Board 7th Class Social Solutions Chapter 5 కాకతీయ రాజ్యం 1
ప్రశ్న 1.
ఇవ్వబడిన పటములో ఏఏ రాజ వంశాలను మీరు గమనించారు?
జవాబు:
ఢిల్లీ సుల్తానులు, రాజపుత్ర రాజ్యాలు, తూర్పుగాంగులు, కాకతీయ రాజ్యం, హోయసాలులు, పాండ్యులు.

ప్రశ్న 2.
ఇచ్చిన పటము ఆధారంగా ఆంధ్ర ప్రాంతాన్ని ఏ రాజవంశము పాలించినదో చెప్పండి.
జవాబు:
ఆంధ్ర ప్రాంతాన్ని పాలించినది కాకతీయులు.

AP Board 7th Class Social Solutions Chapter 5 కాకతీయ రాజ్యం

ప్రశ్న 3.
ఇవ్వబడిన పటములోని దక్షిణ భారతదేశ రాజవంశముల పేర్లు తెలుపుము.
జవాబు:
కాకతీయులు, హోయసాలులు, పాండ్యులు దక్షిణ భారతదేశ రాజవంశములు.

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

I. క్రింది ప్రశ్నలకు జవాబులివ్వండి.

ప్రశ్న 1.
కాకతీయులు స్వతంత్ర పాలకులుగా ఏ విధముగా ఆవిర్భవించారు?
జవాబు:
కాకతీయులు మొదట్లో రాష్ట్ర కూటులకు మరియు పశ్చిమ చాళుక్యులకు సామంతులుగా పనిచేశారు. పశ్చిమ చాళుక్యుల పతన అనంతరం కాకతీయ రాజ్యం ఆవిర్భవించింది. నేటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మరియు తూర్పు కర్ణాటక మరియు దక్షిణ ఒడిశాలోని కొన్ని భాగాలతో కూడిన తూర్పు దక్కన్ ప్రాంతాన్ని వారు పరిపాలించారు.

ప్రశ్న 2.
కాకతీయుల పరిపాలనా విధానాన్ని గురించి వ్రాయండి.
జవాబు:
కాకతీయుల పాలన :
రాజ్యపాలన సైనిక ప్రాతిపదికగా నిర్వహించబడింది. కాకతీయులు సార్వభౌమాధికారం కలిగి తమ రాజ్య భూభాగాలను చిన్న విభాగాలుగా విభజించి నాయంకరులు అనే సైనిక నాయకులను వాటికి పరిపాలకులుగా నియమించారు.

నాయంకరుల వ్యవస్థ :
కాకతీయులకు సామంతులుగా పనిచేసిన నాయంకరులు వారి హోదా నిలబెట్టుకోవటానికి కాకతీయ చక్రవర్తుల నుండి భూములు పొందేవారు. నాయంకరులు తమ ఆధ్వర్యంలో చక్రవర్తి సేవల కోసం నిర్ణీత సంఖ్యలో దళాలను నిర్వహించవలసి వుంటుంది. వీరికి పన్ను వసూలు చేసుకొనేందుకు కొన్ని గ్రామాలు ఇవ్వబడినప్పటికి వారికి ఈ గ్రామాలను శాశ్వతంగా ఉంచలేదు. చక్రవర్తి తన’ అధికారముతో వారిని కొత్త ప్రదేశానికి బదిలీ చేయవచ్చు. ఈ నాయంకరులు చక్రవర్తిపై ఆధారపడటముతో పాటుగా వారికి విధేయులుగా ఉండేవారు. వీరి రాజ్యములో ఏదైనా తిరుగుబాటు జరిగిన సమయములో వాటిని అణచుటకు చక్రవర్తికి సహాయము అందించుటకు సిద్ధంగా వుండేవారు. ప్రతాప రుద్రుని పాలన నాటికి దాదాపు 72 నాయంకరులు వుండేవారు.

గ్రామ పరిపాలన :
గ్రామ పరిపాలనా విభాగాలను స్థల మరియు నాడు అనే రెండు ప్రధాన తరగతులుగా విభజించారు. పూర్వం పది నుండి అరవై వరకు గ్రామాల సమూహాన్ని స్లల అంటారు. కొన్ని స్థలాల కలయికతో ఏర్పాటు చేయబడిన ప్రాంతాన్ని నాడు అంటారు. ఆయగార్లు అని పిలువబడే గ్రామ అధికారులు గ్రామాల పాలనను పర్యవేక్షించేవారు. గ్రామము ప్రాథమిక పరిపాలనా విభాగము.

ప్రశ్న 3.
నాయంకరులు ఎవరు? వారు ఎందుకొరకు నియమించబడినారు?
జవాబు:
కాకతీయులు సార్వభౌమాధికారం కలిగి తమ రాజ్య భూభాగాలను చిన్న విభాగాలుగా విభజించి ‘నాయంకరులు’ అనే సైనిక నాయకులను వాటికి పరిపాలకులుగా నియమించారు. నాయంకరులు తమ ఆధ్వర్యంలో చక్రవర్తి సేవల కోసం నిర్ణీత సంఖ్యలో దళాలను నిర్వహించేవారు. వీరికి పన్ను వసూలు చేసుకొనేందుకు కొన్ని గ్రామాలు ఇవ్వబడినప్పటికీ వారికి ఈ గ్రామాలను శాశ్వతంగా ఉంచలేదు. వీరు రాజ్యములో ఏదైనా తిరుగుబాటు జరిగితే వాటిని అణుచుటకు చక్రవర్తికి సహాయము అందించుటకు సిద్ధంగా వుండేవారు.

AP Board 7th Class Social Solutions Chapter 5 కాకతీయ రాజ్యం

ప్రశ్న 4.
కాకతీయుల శిల్పకళా వైభవము ఆనాటి నిర్మాణ శైలిని గురించి వర్ణించండి.
జవాబు:
కళలు మరియు నిర్మాణాలు : వెయ్యి స్తంభాల ఆలయం మరియు రామప్ప దేవాలయాలు కాకతీయుల కాలం నాటి అద్భుతమైన నిర్మాణాలు. వెయ్యిస్తంభాల ఆలయాన్ని రుద్రేశ్వర ఆలయం అంటారు. ఇది హనుమకొండలో ఉంది. దీనిని రుద్రదేవుడు నిర్మించాడు. ఈ ఆలయం చక్కటి వాస్తుశిల్పం మరియు శిల్పకళలతో నిర్మించబడింది. రాతితో మలచిన ఏనుగులు మరియు డోలరైట్ శిలతో నిర్మించిన ఏకశిలా నంది ఈ ఆలయం యొక్క ప్రధాన ఆకర్షణ. ఈ ఆలయాన్ని స్థానికంగా “వేయి స్తంభాల గుడి” అని పిలుస్తారు.

వరంగల్ ప్రాంతంలోని పాలంపేట గ్రామానికి సమీపంలో ఉన్న రామప్ప ఆలయం చాలా ప్రసిద్ది చెందింది. ఇక్కడి దైవము రామలింగేశ్వరస్వామి. రేచర్ల రుద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఇతడు గణపతి దేవుని ముఖ్య సైనిక అధికారులలో ఒకడు. ఈ ఆలయంలో విష్ణువు మరియు శివులను ఒకే చోట ఆరాధించడం వలన ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో కాకతీయ కళ యొక్క వైభవాన్ని చూడవచ్చు. రామప్ప ఆలయాన్ని ఇటుకలతో నిర్మించారు. ఇది నక్షత్ర ఆకారపు వేదికపై నిర్మించబడింది. ఈ ఆలయ విగ్రహాలు నల్ల గ్రానైట్ రాయితో నిర్మించబడ్డాయి. వాటిపై పువ్వులు, లతలు, ఏనుగులు, గంధర్వులు, నర్తకీమణుల శిల్పాలు, ఇతిహాస కథలు మొదలైనవి చెక్కబడ్డాయి. వీటిలో యక్షిణి, నాగిని, శిల్పాలు చాలా ఆకర్షణీయమైనవి. ఇక్కడి నంది విగ్రహం చాలా అందంగా ఉంటుంది. ఈ ఆలయంలోని కొన్ని శిల్పాలు సప్తస్వరాలను ధ్వనింపచేస్తాయి. జాయప రాసిన నృత్య రత్నావళి ఆలయ శిల్పకళలో ప్రతిబింబించే నృత్య శైలులను వివరిస్తుంది.

కాకతీయ ఆలయ నిర్మాణ శైలిలోని ఈ నల్ల పాలరాతి శిల్పాలు అద్భుతంగా ఉండి మృదువైన వంపులతో చూపరులను ఆకట్టుకుంయి. స్తంభాలపైన చెక్కిన శిల్పాలతో మండప నిర్మాణము, అంతరాలయము మరియు గర్భగుడి నిర్మాణ నమూనాలను అనుసరించారు. ఈ శైలిని త్రికూట పద్ధతి అని కూడా అంటారు.

ప్రశ్న 5.
పాఠం నందలి ప్రారంభ పేరాగ్రాఫ్ (మధ్యయుగ కాలంలో దక్షిణ భారతదేశంలో…………….వాస్తు శిల్పాలను ప్రోత్సహించారు) చదివి వ్యాఖ్యానించుము.
జవాబు:
మధ్యయుగ కాలంలో దక్షిణ భారతదేశంలో ఐదు ముఖ్యమైన రాజ్యాలు’ ఆవిర్భవించాయి. అవి కళ్యాణి చాళుక్యులు, యాదవులు, కాకతీయులు, హోయసల మరియు పాండ్యరాజ్యాలు. ఈ ఐదు రాజ్యాలలో కాకతీయులు తెలుగు నేలకు చెందినవారు. ఈ రాజ్యాలు సాధారణంగా పొరుగురాజ్యాల నుండి మరియు ఢిల్లీ సుల్తాన్ల నుండి దండయాత్రలను ఎదుర్కొన్నప్పటికీ, ఎవరకి వారే తమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించారు. తమ అధీనములోని ప్రాంతంలో ఐక్యతను పెంపొందించడానికి ప్రయత్నించారు. స్థానిక భాషలు, కళలు మరియు వాస్తు శిల్పాలను ప్రోత్సహించారు.

ప్రశ్న 6.
క్రింది కాకతీయ పాలకులను చారిత్రకంగా పాలనా కాలమును అనుసరించి వరుసలో అమర్చండి.
(రుద్రమదేవి, గణపతి దేవుడు, రెండవ ప్రోలరాజు, మహాదేవుడు, రుద్రదేవుడు)
జవాబు:

  1. రెండవ ప్రోలరాజు,
  2. రుద్రదేవుడు,
  3. మహాదేవుడు,
  4. గణపతిదేవుడు,
  5. రుద్రమదేవి.

ప్రశ్న 7.
రుద్రమదేవి పాలనా కాలములో కాకతీయ సామ్రాజ్యాన్ని సందర్శించిన యూరోపియన్ యాత్రికుడు ఎవరు? అతడు ఏ దేశం నుండి వచ్చినాడు?
జవాబు:

  1. రుద్రమదేవి పాలనా కాలములో కాకతీయ సామ్రాజ్యాన్ని సందర్శించిన యూరోపియన్ ‘మార్కోపోలో’.
  2. ఇతను ఇటలీ దేశం నుంచి వచ్చినాడు.
  3. రుద్రమదేవి పరిపాలనా సామర్థ్యాన్ని ప్రశంసించినాడు.

ప్రశ్న 8.
కాకతీయుల కాలములోని ప్రజల సామాజిక, ఆర్థిక జీవనము గూర్చి సంక్షిప్తంగా వ్రాయండి.
జవాబు:
ఆర్థిక మరియు సామాజిక జీవితం :
భూమి శిస్తు రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు. ప్రతి గ్రామంలో కొంత భూమి రాజు ఆస్తి క్రింద ఉంచబడింది. దీనిని “రాచపొలం” అని పిలిచారు. ఈ భూమిని రైతులకు కౌలు సాగు కోసం ఇచ్చారు. ప్రభుత్వ భూమిని కౌలు ప్రాతిపదికన సాగు చేసిన రైతులు అర్ధశిరి అని పిలవబడ్డారు. భూమికి సంబంధించిన సర్వే రికార్డులను అధికారులు చాలా జాగ్రత్తగా భద్రపరిచేవారు.

కాకతీయులు అధిక విస్తీర్ణములో అటవీ భూములను సాగులోకి తెచ్చినారు. వీరు వ్యవసాయం కోసం జలాశయాలను నిర్మించారు మరియు అనేక చెరువులను త్రవ్వించారు. వాటిలో కొన్ని ఈ రోజు వరకు కూడా అందుబాటులో ఉన్నాయి. ఉదా: పాకాల, లక్కవరం, ఘనాపురం చెరువులు మొదలైనవి. ఈ కాలంలో వివిధ రకాల పన్నులు విధించబడ్డాయి. అవి ప్రధానంగా వాణిజ్య పన్ను, ఇల్లరి అని పిలువబడే గృహ పన్ను, అటవీ ఉత్పత్తులపై పుల్లరి మరియు గొర్రెల మందపై విధించిన అడ్డపట్టు సుంకంతో పాటు చేతివృత్తుల వారి నుండి వృత్తిపరమైన పన్ను వసూలు చేశారు.

వీరు పన్నుల వసూలు కోసం సుంకాధికారి అని పిలువబడిన అధికారులను నియమించారు. కాకతీయ రాజులు విదేశీ వాణిజ్యానికి చాలా ప్రాముఖ్యతనిచ్చారు. విదేశీ వాణిజ్యాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశ్యంతో వారు మోటుపల్లి నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేశారు. ఆ కాలంలో ముప్పమాంబ, మైలమాంబ వంటి రాజ కుటుంబానికి చెందిన చాలా మంది మహిళా సభ్యులు భూదానములు చేశారు. ఇతర ధనవంతులు అయిన మహిళలు కూడా భూములు, చెరువులు, ధనం, పశువులు, నగలు మొదలైన సంపదలను దేవాలయాలతో పాటు బ్రాహ్మణులకు విరాళంగా ఇచ్చారు.

ప్రశ్న 9.
మధ్యయుగములో దక్షిణ భారతదేశములో ఏఏ రాజవంశాలు ఆవిర్భవించినాయి?
జవాబు:
మధ్యయుగ కాలంలో దక్షిణ భారతదేశంలో ఐదు ముఖ్యమైన రాజ్యాలు ఆవిర్భవించాయి. అవి

  1. కల్యాణి చాళుక్యులు (బసవ కల్యాణి రాజధాని నగరం)
  2. యాదవులు (దేవగిరి రాజధాని నగరం)
  3. కాకతీయులు (ఓరుగల్లు రాజధాని నగరం)
  4. హోయసాలులు ( ద్వార సముద్రం రాజధాని నగరం)
  5. పాండ్య రాజ్యాలు (మదురై రాజధాని నగరం)

ఈ అయిదు రాజ్యాలలో కాకతీయులు తెలుగు నేలకు చెందినవారు.

AP Board 7th Class Social Solutions Chapter 5 కాకతీయ రాజ్యం

ప్రశ్న 10.
దిగువన ఇవ్వబడిన ప్రదేశాలను భారతదేశ పటము నందు గుర్తించుము.
అ) గోదావరి నది
ఆ) మోటుపల్లి
ఇ) వరంగల్
ఈ) దేవగిరి
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 5 కాకతీయ రాజ్యం 2

II. సరియైన సమాధానాలను ఎంచుకోండి.

1. కాకతీయ వంశ స్థాపకుడు
ఎ) గుండ్యన
బి) రేచర్ల రుద్రుడు
సి) గణపతి దేవుడు
డి) జాయప
జవాబు:
ఎ) గుండ్యన

2. కాకతీయులు ఆరాధించిన దేవత ………
ఎ) అమ్మతల్లి
బి) కాకతి
సి) త్రిపుర సుందరి
డి) మైసమ్మ
జవాబు:
బి) కాకతి

3. శివతత్వ సారం అను గ్రంథం వ్రాసినది
ఎ) మల్లికార్జున పండితారాధ్యుడు
బి) జాయప
సి) పాల్కురికి సోమనాథుడు
డి) నన్నెచోడుడు
జవాబు:
ఎ) మల్లికార్జున పండితారాధ్యుడు

4. ప్రతీ గ్రామములోను చక్రవర్తి ఆస్తిగా వుంచబడిన భూమి ………
ఎ) వెలిపొలం
బి) రాచ పొలం
సి) తోట పొలం
డి) పైవన్నీ
జవాబు:
బి) రాచ పొలం

5. మోటుపల్లి శాసనం జారీ చేసిన వారు
ఎ) రుద్రమదేవి
బి) రుద్రదేవుడు
సి) ప్రతాపరుద్రుడు
డి) గణపతి దేవుడు
జవాబు:
డి) గణపతి దేవుడు

III. జతపరుచుము.

గ్రూపు-ఎ గ్రూపు-బి
1. బసవ పురాణం ఎ) విద్యానాథుడు
2. కుమార సంభవం బి) పాల్కురికి సోమనాథుడు
3. నృత్య రత్నావళి సి) నన్నె చోడుడు
4. ప్రతాప రుద్రీయము డి) తిక్కన్న
5. శ్రీమదాంధ్ర మహాభారతం ఇ) జాయప

జవాబు:

గ్రూపు-ఎ గ్రూపు-బి
1. బసవ పురాణం బి) పాల్కురికి సోమనాథుడు
2. కుమార సంభవం సి) నన్నె చోడుడు
3. నృత్య రత్నావళి ఇ) జాయప
4. ప్రతాప రుద్రీయము ఎ) విద్యానాథుడు
5. శ్రీమదాంధ్ర మహాభారతం డి) తిక్కన్న

IV. క్రింది ఖాళీలను పూర్తి చేయుము.

1. రామప్ప ఆలయము గల ప్రాంతము …………
2. విలస రాగి శాసనము ……………………. నాయకను గూర్చి తెలుపును.
3. రేకపల్లి …………………… నది పరీవాహక ప్రాంతంలో కలదు.
4. ఘటికలు అని పిలవబడిన విద్యాసంస్థలను స్థాపించిన రాజవంశము ……….
5. యాదవుల రాజధాని ………
జవాబు:

  1. పాలంపేట,
  2. ముసునూరి,
  3. శబరి,
  4. కల్యాణి చాళుక్యులు,
  5. దేవగిరి.

పద బంధము

ఇచ్చిన ఆధార పదాల సహాయంతో బాక్సులను గీయండి.
AP Board 7th Class Social Solutions Chapter 5 కాకతీయ రాజ్యం 3
1. కాకతీయుల తొలి రాజధాని (5)
2. కాకతీయ సామ్రాజ్యంను పాలించిన మహిళ (5)
3. కాకతీయుల కొత్త రాజధాని (4)
4. ఇతని దండయాత్ర ఫలితముగా ప్రతాప రుద్రుడు సింహాసమును కోల్పోయినాడు (4)
5. నృత్య రత్నావళి గ్రంథము వ్రాసినది (6)
6. రాజు యొక్క స్థావరము (2)
7. మహిళా పాలకురాలను ఇలా పిలుస్తారు (2)
8. అటవీ ఉత్పత్తుల పైన విధించబడిన పన్ను (3)
9. ఇంటి పన్నును ఇలా పిలిచిరి (3)
10. ఓడలు నిలుపు చోటు (4)
11. చాళుక్య వంశ స్థాపకుడు (4)
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 5 కాకతీయ రాజ్యం 4

  1. హనుమ కొండ
  2. రుద్రమదేవి
  3. ఓరుగల్లు
  4. ఉల్గుఖాన్
  5. జాయపసేనాని
  6. కోట
  7. రాణి
  8. పుల్లరి
  9. ఇల్లరి
  10. ఓడరేవు
  11. తైలపుడు

7th Class Social Studies 5th Lesson కాకతీయ రాజ్యం InText Questions and Answers

7th Class Social Textbook Page No.145

ప్రశ్న 1.
పురావస్తుత్రవ్వకాలు మరియు పురాతన వస్తువులు బయల్పడిన వార్తలు మీరు ఏమైనా విన్నారా? వాటిని గురించి తరగతిలో చర్చించండి.
జవాబు:

  1. ఇటీవల 1 ఆగష్టు, 2021లో ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం జిల్లాలో కాకతీయుల కాలం నాటి (14వ శతాబ్దం నాటీ) శాసనాన్ని కనుగొన్నారు.
  2. శ్రీకాకుళం నగర సమీపంలోని నాగావళి నదీతీరాన ప్రాచీన కాలం నాటి ‘శివలింగం’ మరియు కోటేశ్వరస్వామి దేవాలయ ఆనవాళ్ళను పురావస్తుశాఖ మరియు పర్యాటక శాఖ బృందం కనుగొన్నారు. (మార్చి 28, 2021)

ఆలోచించండి – ప్రతిస్పందించండి

7th Class Social Textbook Page No.137

ప్రశ్న 1.
రుద్రమదేవి అంతటి ధైర్య సాహసాలను ఎలా ప్రదర్శించిందని నీవు అనుకుంటున్నావు?
జవాబు:

  1. రుద్రమదేవి నిస్సందేహంగా ఆంధ్రా ప్రాంతంలోని గొప్ప పాలకులలో ఒకరు.
  2. చాలా సందర్భాలలో సైన్యాన్ని ధైర్యంగా ముందుకు నడిపించింది.
  3. ఈమె ఇంతటి ధైర్యసాహసాలను ప్రదర్శించటానికి కారణము ఆమె చిన్నతనము నుంచి యుద్ధ విద్యలలో మంచి శిక్షణ పొందడం.
  4. ఆమె తల్లిదండ్రులు ప్రత్యేకంగా తండ్రి ఆమెకు ఇచ్చిన ప్రోత్సాహము అన్ని విద్యలలో శిక్షణ పొందటం ఆమెలో ఆత్మ విశ్వాసమును, ధైర్యసాహసాలను నింపింది.

7th Class Social Textbook Page No.139

ప్రశ్న 2.
కాకతీయ చక్రవర్తులు తమ నాయంకరులను ఎందుచేత బదిలీ చేసేవారు?
జవాబు:
కాకతీయ చక్రవర్తులు తమ నాయంకరులను ఎందుకు బదిలీ చేసేవారంటే ఒకే స్థానంలో ఎక్కువ కాలం పనిచేసినట్లయితే ఆ ప్రదేశములోని వారితో సంబంధాలు ఏర్పడతాయి. వారి ప్రాభవము పెరుగుతుంది. ఒకే స్థానంలో వున్నట్లయితే ఆ ప్రాంతం మీద పట్టు సాధించి చక్రవర్తులకు ఎదురు తిరిగే ప్రమాదముంది. అలాగే చక్రవర్తుల అధీనంలో తాము పనిచేస్తున్నామని (ఈ బదిలీ) తెలియజేస్తుంది. ఒకే స్థానంలో ఎక్కువ కాలం ఉంటే అక్కడి వారిపై పక్షపాతం పెరిగే అవకాశం ఉంది. అవినీతి చర్యలకు పాల్పడే అవకాశం ఉంది.

AP Board 7th Class Social Solutions Chapter 5 కాకతీయ రాజ్యం

7th Class Social Textbook Page No.143

ప్రశ్న 3.
దేవాలయాన్ని సందర్శించేటప్పుడు మీరు ఏ అంశాలను గమనిస్తారు?
జవాబు:
నేను దేవాలయాన్ని సందర్శించినపుడు క్రింది అంశాలను గమనిస్తాను.

  1. ప్రధానంగా నేను దర్శించుకునే దేవుడు / దేవతపై శ్రద్ధ పెడతాను.
  2. దేవాలయ వాతావరణం / పరిసరాలను పరిశీలిస్తాను.
  3. దేవాలయ నిర్మాణం, వానిలో ప్రత్యేకతలు ఏమన్నా ఉన్నాయేమో చూస్తాను.
  4. దర్శించిన దేవుని / దేవత విగ్రహాన్ని మనస్సులో నిలుపుకుంటాను.
  5. ఆ దేవాలయానికి ఉన్న చరిత్ర గురించి అడిగి తెలుసుకుంటాను.
  6. దేవాలయ గోపుర నిర్మాణం, శిల్పాలు ఏమైనా ఉంటే వాటిని పరికిస్తాను.

7th Class Social Textbook Page No.147

ప్రశ్న 4.
స్థానిక రాజులు ఎందుకోసం కూటమిగా ఏర్పడినారు?
జవాబు:
స్థానిక రాజులు కూటమిగా ఏర్పడుటకు ప్రధాన కారణం ముస్లిం దండయాత్రల నుండి తమను తాము రక్షించుకోవటానికి. ముస్లింల పెద్ద, ఆధునిక ఆయుధాలు కల్గిన సైన్యమును చిన్న సైన్యములు కలిగిన స్థానిక రాజులు ఒంటరిగా పోరాడి గెలవడం అసాధ్యము. అలాగే సుశిక్షితులైన సైనికులు, ఆధునిక ఆయుధాలు, అశ్వదళము కల్గిన ముస్లిం దండయాత్రలు ఎదుర్కోవాలంటే స్థానిక రాజులు ఐకమత్యంగా పోరాడవలసి వచ్చింది.

అన్వేషించండి

7th Class Social Textbook Page No.129

ప్రశ్న 1.
మధ్యయుగ కాలం గురించి మీ ఉపాధ్యాయుని సహాయంతో మరింత తెలుసుకోండి.
జవాబు:

  1. 8 నుండి 18వ శతాబ్దం వరకు కాలాన్ని భారతదేశంలో మధ్యయుగంగా పేర్కొంటారు.
  2. భారతదేశంలో ఇస్లామిక్ ప్రభావం మరియు పాలనతో చాలా ముడిపడి ఉన్న కాలము, మధ్యయుగ భారతీయ చరిత్ర.
  3. మధ్యయుగ మొదటి భాగంలో దేశీయ పాలకులు (రాజపుత్రులు) అయిన చాళుక్యులు, పల్లవులు, పాండ్యులు, రాష్ట్ర కూటులు, చోళులు ఉన్నారు.
  4. అలాగే రాజపుత్రులలో పాలాస్, సేనా, ప్రతీహార, చౌహాన్లు, హోయసాలులు, పశ్చిమ గాంగులు పరిపాలించారు.
  5. దక్షిణ భారతంలో చోళలు, కాకతీయ, పల్లవ, విజయనగర రాజ్యా లు ప్రముఖమైనవి.
  6. మొదటి తైమూర్ దండయాత్రలతో భారతదేశంలో ఇస్లాం రాజ్య స్థాపనకు నాంది పలికిందని చెప్పవచ్చు.
  7. మధ్యయుగ భారతదేశ సాంస్కృతిక చరిత్రలో ఒక ముఖ్యమైన మైలు రాయి సమాజంలో నిశ్శబ్ద విప్లవం, భక్తి ఉద్యమం.
  8. ఉప ఖండంలోని హిందువులు, ముస్లింలు, సిక్కులు దేవుని ఆరాధనతో సంబంధం ఉన్న అనేక ఆచారాలకు ఈ ఉద్యమం సంబంధం కలిగి ఉంది.
  9. ఢిల్లీ సుల్తానుల పాలనా కాలం నుంచి మొఘల్ సామ్రాజ్య పతనం వరకు ఇస్లాం పాలనగా పేర్కొంటారు. ఈ కాలాన్నే తొలి ఆధునిక యుగంగా పేర్కొంటారు.
  10. మధ్యయుగంలో చాలావరకు భూస్వామ్య వ్యవస్థ అమలులో ఉంది.
  11. భూమి శిస్తు ప్రధాన ఆదాయ వనరు.
  12. మతం ప్రాధాన్యత సంతరించుకున్నది.
  13. కళలు, వాస్తు, శిల్పం, ఇతర కట్టడాలు, నిర్మాణాలు పతాక స్థాయికి చేరినాయి.

7th Class Social Textbook Page No.135

ప్రశ్న 2.
కాకతీయ కళాతోరణం గురించి మరిన్ని విషయాలు అంతర్జాలం నుండి తెలుసుకొనండి.
జవాబు:

  1. కాకతీయుల కళాతోరణం వరంగల్ కోటలోని ఒక భాగం.
  2. నల్లరాయితో చెక్కబడింది.
  3. నాలుగు పిల్లర్లు ధర్మం నాలుగు పాదాల మీద నడిచిందనటానికి నిదర్శనం, చివరి రెండు పిల్లర్ల మీద సింహాలు కాకతీయుల ఎదురు లేని నాయకత్వానికి చిహ్నం, తల పైకెత్తిన మొసలి జలకళకు ప్రతీతి. (కాకతీయుల కాలంలో చెరువులు, కుంటలు కాలువల్లో నీరు పుష్కలంగా ఉండేది). రెండు హంసలు కాకతీయుల పారదర్శక పాలనకు నిదర్శనం. హంస కింద ఇరువైపుల చేతులు పైకెత్తిన కుబేరుల విగ్రహాలు ఆర్థిక పరిపుష్టికి సంకేతం. బోర్లించిన ఏడు పూర్ణ కుంభాలు గ్రామ దేవతల ప్రతిబింబాలు. వాటినే సప్త మాతృకలు అని కూడా పిలుస్తారు. స్తంభం మధ్యలో చేపల బొమ్మలు మత్స్య పరిశ్రమకు చిహ్నం.
  4. రాతి వంపు ద్వారాలు చాలా బాగా నిర్మించబడ్డాయి.
  5. కాకతీయులు నిర్మించిన శివాలయానికి ద్వారంగా ఈ తోరణం ఉంది.
  6. దీనిని శక్తివంతమైన వరంగల్ గేట్ అని పిలుస్తారు.
  7. కాకతీయుల వైభవానికి చిహ్నంగా నిలిచిన ఈ తోరణం ప్రపంచ వారసత్వ సంపదగా, తెలంగాణ ప్రభుత్వ (రాజముద్ర) చిహ్నంగా గుర్తించబడింది.
  8. ఈ తోరణం కాకతీయుల కళా, వాస్తు, శిల్పుల ప్రతిభకు దర్పణంగా ఉంది.
  9. కాకతీయుల ఏలుబడిలో ఏయే అంశాలకు ప్రాధాన్యమిచ్చారో ఈ తోరణం తెలియజేస్తుంది.

AP Board 7th Class Social Solutions Chapter 5 కాకతీయ రాజ్యం

7th Class Social Textbook Page No.147

ప్రశ్న 3.
చర్చిద్దాం:
చరిత్ర నుండి మనం ఏమి నేర్చుకుంటాము?
మనం గతం నుండి నేర్చుకొన్న అంశాలతో భవిష్యత్తులో తెలివిగా నడుచుకోవాలి.
మన సంస్కృతి మరియు వారసత్వాలను చరిత్ర నుండి నేర్చుకోవాలి, మీ అభిప్రాయాన్ని జోడించండి.
జవాబు:

  1. చరిత్ర నైతికపరమైన అవగాహనకు మరియు తదాత్మైకతకు దోహదం చేస్తుంది.
  2. మంచి పౌరసత్వం కోసం చరిత్రను అధ్యయనం చేయడం చాలా అవసరం.
  3. అందమైన భవిష్యత్ నిర్మాణానికి చరిత్ర పునాదిలా ఉపయోగపడుతుంది.
  4. గతంలోని (చరిత్రలోని) తప్పులను పునరావృతం కాకుండా పాలకులు జాగ్రత్త పడతారు.

AP Board 7th Class Social Solutions Chapter 4 ఢిల్లీ సుల్తానులు

SCERT AP 7th Class Social Study Material Pdf 4th Lesson ఢిల్లీ సుల్తానులు Textbook Questions and Answers.

AP State Syllabus 7th Class Social Solutions 4th Lesson ఢిల్లీ సుల్తానులు

7th Class Social 4th Lesson ఢిల్లీ సుల్తానులు Textbook Questions and Answers

కింది తరగతులలోని విషయ పునశ్చరణ

AP Board 7th Class Social Solutions Chapter 4 ఢిల్లీ సుల్తానులు 1
పటమును పరిశీలించి క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు స్పందించండి.

ప్రశ్న 1.
ఇవ్వబడిన పటానికి ఒక శీర్షికను సూచించండి.
జవాబు:
పూర్వ మధ్యయుగం నాటి భారతదేశంలోని రాజ్యాలు.

ప్రశ్న 2.
దక్షిణ భారతదేశంలోని వివిధ రాజ్యాలను గుర్తించి, వాటి జాబితా తయారు చేయండి.
జవాబు:
విజయనగర సామ్రాజ్యం, (కాకతీయ సామ్రాజ్యం), కళింగ రాజ్యము, చోళ రాజ్యము, పాండ్య రాజ్యము, పల్లవ సామ్రాజ్యము మొదలైనవి.

ప్రశ్న 3.
పటంలో ప్రస్తుత కాలానికి చెందిన ఏవేని రెండు నగరాలను గుర్తించండి.
జవాబు:
అమరావతి, పాటలీపుత్ర, బెంగాల్, ప్రయాగ, సాంచి, సారనాథ్ మొదలైనవి.

AP Board 7th Class Social Solutions Chapter 4 ఢిల్లీ సుల్తానులు

ప్రశ్న 4.
పటంలో ఢిల్లీని గుర్తించండి. ఢిల్లీ ప్రాధాన్యతను చర్చించండి.
జవాబు:
ఢిల్లీ భారతదేశానికి రాజధాని నగరంగా మధ్య యుగం నాటి నుండి ఉంటోంది.

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

I. క్రింది ప్రశ్నలకు సమాధానం వ్రాయండి.

ప్రశ్న 1.
ఇల్ టుట్ మిష్ ప్రవేశపెట్టిన బందగాన్ పద్ధతి గురించి వ్రాయండి.
జవాబు:
ఇల్ టుట్ మిష్ సైనిక అవసరాల కోసం బానిసలను కొనుగోలు చేసేవాడు. పర్షియాలో ఈ పద్ధతిని ‘బందగాన్’ అని పిలుస్తారు. శత్రువులను అణచివేయడానికి ఇతను నిరంతరం యుద్ధాలు చేయాల్సి వచ్చింది. శూన్యం నుంచి ప్రారంభం చేసి మహత్తర సామ్రాజ్యాన్ని స్థాపించటానికి ఇల్ టుట్ మిష్ తన సైన్యాన్ని పటిష్ఠపరచుకొనుటకు ఈ ‘బందగాన్’ పద్ధతిని అనుసరించాడు.

ప్రశ్న 2.
క్రింది వాటిని మీకివ్వబడిన భారతదేశ పటంలో గుర్తించండి.
ఎ) ఢిల్లీ
బి) నేపాల్
సి) ఆఫ్ఘనిస్తాన్
డి) దౌలతాబాద్
ఇ) గుజరాత్
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 4 ఢిల్లీ సుల్తానులు 2

ప్రశ్న 3.
ఢిల్లీ సుల్తానుల పాలనలోని ఐదుగురు పాలకుల చిత్రాలను సేకరించి వారి పాలన గురించి చార్టులో రాయండి.
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 4 ఢిల్లీ సుల్తానులు 3
1) ఇల్-టుట్ మిష్ (క్రీ.శ. 1211-1236):
కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత ఢిల్లీని పాలించాడు. ఇతని కాలంలోనే రాజధాని లాహోర్ నుండి ఢిల్లీకి మార్చబడింది. ఇతను ఢిల్లీకి తొలి సర్వ స్వతంత్ర పాలకునిగా, ఢిల్లీ సామ్రాజ్యానికి అసలైన స్థాపకునిగా పరిగణింపబడతాడు. ఇతని పాలనలోనే రాజ్యమును ఇకాలను ఏర్పాటు చేసాడు. సైనిక అవసరాల కోసం బానిసలను కొనుగోలు చేసాడు. పర్షియాలో ఈ పద్దతిని బందగాన్ అని పిలుస్తారు. ఇతని కాలంలో చిహల్ గని సర్దారులు కీలకపాత్ర పోషించారు. ఢిల్లీ సుల్తానుల వాస్తు నిర్మాణానికి గీటు రాయి లాంటి కుతుబ్ మీనార్ నిర్మాణం ప్రారంభించాడు.

AP Board 7th Class Social Solutions Chapter 4 ఢిల్లీ సుల్తానులు 4
2) సుల్తానా రజియా (క్రీ.శ. 1236-1239):
సుల్తానా రజియా ఢిల్లీని పాలించిన ఏకైక మహిళ. మహిళా పాలకురాలిగా వజీరులు, చిహల్గనుల నుండి కూడా వ్యతిరేకత ఎదుర్కొన్నది. కేవలం స్వల్పకాలం పరిపాలన చేసినప్పటికీ ఢిల్లీ సామ్రాజ్య స్థాపన తొలినాటి కాలంలో ఆమె తనదైన ముద్ర వేయగలిగింది. టర్కీ ప్రభువుల నుండి, స్వంత అన్నదమ్ముల నుండి ఆమె తీవ్ర ప్రతిఘటనలు ఎదుర్కొనవలసి వచ్చింది.

AP Board 7th Class Social Solutions Chapter 4 ఢిల్లీ సుల్తానులు 5
3) అల్లావుద్దీన్ ఖిల్జీ (క్రీ.శ. 1296-1316):
ఇతను జలాలుద్దీన్ ఖిల్జీ తరువాత రాజ్యానికి వచ్చాడు. తన ప్రత్యర్థులను అణచివేయడానికి, మంగోలుల దండయాత్రలను నియంత్రించడానికి శక్తివంతమైన చర్యలు చేపట్టాడు. ఇతడు కుట్రపూరితమైన ప్రభువులను నియంత్రించుటకు బలమైన మరియు సమర్ధవంతమైన గూఢచారి వ్యవస్థను స్థాపించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ ఉత్తర భారతదేశంపై దండయాత్రలు నిర్వహించి గుజరాత్, రణతంభోర్, చిత్తోర్ మరియు మాల్వా మొదలగు వాటిని జయించాడు. కాని అతడు చిత్తూరు కోటను ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయినాడు. 1316వ సంవత్సరంలో అతడు మరణించిన వెంటనే శిశోడియాలు దానిని తిరిగి, ఆక్రమించినారు. ఉత్తర భారతదేశ దండయాత్రలు పూర్తయిన తర్వాత, దక్షిణ భారతదేశాన్ని జయించడానికి మాలిక్ కాఫర్ ఆధ్వర్యంలో సైన్యాన్ని పంపించాడు.

AP Board 7th Class Social Solutions Chapter 4 ఢిల్లీ సుల్తానులు 6
4) ఫియాజుద్దీన్ తుగ్లక్ (క్రీ.శ. 1320-1324):
అల్లా ఉద్దీన్ ఖిల్జీ మరణానంతరం ఢిల్లీ సింహాసనమధిష్టించెను. ఇతని పాలనాకాలంలో భూమిశిస్తును తగ్గించెను. వ్యవసాయాభివృద్ధికి పంట కాలువలు త్రవ్వించి, అధికోత్పత్తిని సాధించెను. నూతన రహదారులను నిర్మించి, దొంగల బారి నుండి ప్రజలను రక్షించుటకు మార్గ మధ్యమున సైనిక దుర్గములు నిర్మించెను. గుర్రములపై వార్తలను పంపు తపాలా విధానమును ప్రవేశపెట్టెను. ఘియాజుద్దీన్ నిరాడంబర జీవి. ప్రజాహిత సంస్కరణలు గావించి, మంగోలుల దండయాత్రలను విజయవంతముగ ఎదుర్కొని, ఢిల్లీ సుల్తాన్ ఔన్నత్యమునకు ఎటువంటి మచ్చ రాకుండా కాపాడెను.

AP Board 7th Class Social Solutions Chapter 4 ఢిల్లీ సుల్తానులు 7
5) మహ్మద్ బీన్ తుగ్లక్ (క్రీ.శ. 1324-1351):
మహ్మద్ బీన్ తుగ్లక్ గొప్ప విద్వాంసుడు మరియు వింతైన పాలకుడు. ఇతడు తత్వశాస్త్రం, గణితశాస్త్రం మరియు ఖగోళశాస్త్రాలలో ప్రావీణ్యం కలవాడు. ఇతడు గొప్ప యుద్ధ వీరుడు మరియు నూతన పరిపాలనా పద్దతులు ప్రవేశపెట్టిన పరిపాలనాదక్షుడు. కాని, నిజానికి ఈ సంస్కరణలను ఆచరణలోకి తీసుకురావడంలో విఫలమయ్యాడు. మహ్మద్, తురుష్క ప్రభువులు మరియు రాజపుత్రులపై యుద్ధాలు చేసి విశాల సామ్రాజ్యాన్ని స్థాపించాడు. వ్యూహాత్మక ప్రాధాన్యత మరియు దక్షిణ భారతదేశానికి దగ్గరగా ఉండాలనే కారణాలతో రాజధానిని ఢిల్లీ నుండి దేశం మధ్యలో ఉన్న దేవగిరి (దౌలతాబాద్)కి మార్చాడు.

అతడు తన ప్రజలందరిని వారి సామానుతో సహా దేవగిరికి తరలి రావలసినదిగా ఆదేశించాడు. ఈ ప్రయాణంలో అనేక మంది మరణించారు. దేవగిరికి చేరిన తరువాత మరికొందరు మరణించారు.

ఇతడు రాగి నాణేలను, వ్యవసాయ సంస్కరణలను ప్రవేశపెట్టాడు. ఈ ప్రయోగాత్మక సంస్కరణలు విఫలమై చివరకు మహ్మద్ బిన్ తుగ్లక్ యొక్క ఘోర వైఫల్యాన్ని ఋజువు చేశాయి.

ప్రశ్న 4.
ఢిల్లీ సుల్తానుల పాలన గురించి క్లుప్తంగా వివరించండి.
జవాబు:
ఢిల్లీ సుల్తానుల పరిపాలన :

  1. రాజ్యంలో సుల్తాన్ సర్వాధికారి.
  2. షరియత్ లేదా ఇస్లామిక్ నిబంధనల ప్రకారం పరిపాలన జరుగుతుంది.
  3. రాజ్యాన్ని ఇక్షాలు, పరగణాలు, షికు మరియు గ్రామాలుగా విభజించారు.
  4. గ్రామ పరిపాలనలో కేంద్రం జోక్యం చేసుకోదు.
  5. పరిపాలనలోని అన్ని విషయాల్లో చక్రవర్తికి అత్యున్నత అధికారం ఉంటుంది.
  6. రాజకీయ, న్యాయ, సైనిక, మత విషయాలకు చెందిన అధికారం సుల్తాన్ దే.
  7. ఇల్ టుట్ మిష్ సైనిక అవసరాల కోసం బానిసలను కొనుగోలు చేసేవాడు. పర్షియాలో ఈ పద్ధతిని బందగాన్ అని పిలుస్తారు.
  8. ఖిల్జీ, తుగ్లక్ పాలకులు ఈ పద్దతిని కొనసాగించేవారు.
  9. బందగా లోని వారిలో సుల్తానకు నమ్మకస్తులైన వారిని గవర్నర్లు మరియు సైనికాధికారులుగా నియమించేవారు.
  10. ఇల్ టుట్ మిష్ కాలంలో, చిహల్ గని సర్దారులు కీలక పాత్ర పోషించారు.

AP Board 7th Class Social Solutions Chapter 4 ఢిల్లీ సుల్తానులు

ప్రశ్న 5.
తుగ్లక్ ల కాలంలో రాగి, ఇత్తడి నాణేలను ప్రవేశపెట్టడంపై మీ అభిప్రాయం ఏమిటి?
జవాబు:

  1. తుగ్లక్ యొక్క అతిసాహసిక పరిపాలనా చర్యలలో రాగి నాణెములు ప్రవేశపెట్టడం అత్యంత ప్రధానమైన చర్య.
  2. సైనిక ఖర్చు పెరుగుట, రాజధాని మార్పిడి ఖర్చు, కరువుకాటకాల కారణంగా ఈ సంస్కరణను అమలు జరిపెను.
  3. అయితే ఆనాటి పరిస్థితులకు అనగా వెండి కొరతగా ఉండటం వలన ఈ చర్య సమంజసమైనదే.
  4. చైనా కుబ్లయి ఖాన్, మంగోలు పాలకుడు గైఖాతులు అప్పటికే ఈ నామమాత్రపు కరెన్సీని అమలు చేయటంలో విజయం సాధించారు.
  5. తుగ్లక్ విఫలమవ్వటానికి కారణం, తన మంత్రులను సంప్రదించక అధికార దాహంతో ఈ సంస్కరణను అమలు చేయాలని తాపత్రయపడుట, ప్రజలు స్వార్థపరులగుట, ప్రభుత్వము నాణెముల ముద్రణను గుత్తాధికారముగ అమలు జరపకపోవుట.

ప్రశ్న 6.
ఇకా పద్ధతి గురించి వ్రాయండి.
జవాబు:
ఇకా పద్ధతి:

  1. ఢిల్లీ సుల్తానులు తమ రాజ్యాన్ని ఇక్తాలుగా విభజించి సైనికాధికారులను నియమించారు.
  2. వీరిని ఇకాదార్లు లేదా ముక్తిలు అని అంటారు.
  3. వీరు తమ ఇక్తాలలో శాంతి భద్రతలు కాపాడటంతో పాటుగా సుల్తానుకు సైనిక, రెవెన్యూ సేవలు అందించేవారు.
  4. ఇకాల నుండి వసూలు చేసిన రెవెన్యూ ఆదాయమును పరిపాలన అవసరాలు, సైన్యం నిర్వహణ వంటి వాటికి వినియోగించేవారు.
  5. ఇకాదార్ పదవి వారసత్వముగా వుండేది కాదు. పైగా వారికి తరుచుగా ఒక ఇక్తా నుండి మరొక చోటికి బదిలీ వుండేది.

ప్రశ్న 7.
ఢిల్లీ సుల్తానుల కాలం నాటి సామాజిక మరియు ఆర్థిక జీవనం గురించి క్లుప్తంగా వ్రాయండి.
జవాబు:
సామాజిక జీవనము:

  1. విదేశీ ఇస్లామీయులు సమాజములో ప్రముఖ స్థానంలో వుంటూ అనేక సదుపాయాలు పొందుతూ, పాలనను ప్రభావితము చేయగలిగేవారు.
  2. భారతీయ ముస్లింలు భోదకులుగాను, న్యాయాధికారులుగాను, ఇతర వృత్తులు చేసుకుంటూ ద్వితీయ స్థానములో వుండేవారు.
  3. ఇతర ప్రజలలో చేతివృత్తుల వారు, కళాకారులు, వ్యాపారస్తులు, దుకాణదారులు మొదలగు వారు శ్రామికవర్గంగా పరిగణించబడేవారు.
  4. విదేశీ ముస్లింలు, స్థానిక ముస్లింలు అనే రెండు శాఖలు వుండేవి.

ఆర్ధిక జీవనము:

  1. వ్యవసాయము ప్రధాన వృత్తి.
  2. రైతులు పండిన పంటలో 1/3వ వంతు భాగాన్ని శిస్తు రూపములో చెల్లించవలసి వచ్చేది.
  3. వస్త్ర పరిశ్రమ ప్రధానమైన పరిశ్రమ.
  4. వివిధ ఉత్పత్తులకు సంబంధించిన కార్యానాలను సుల్తానులు స్థాపించారు.
  5. దేశీయ మరియు అంతర్జాతీయ వాణిజ్యం అమలులో వుండేది.
  6. ఢిల్లీ, దౌలతాబాద్, లక్నో, లాహోర్, ముల్తాన్ మొదలైనవి దేశీయ వాణిజ్యములో ముఖ్య నగరాలు.
  7. ఇరాన్, అరేబియా, ఆఫ్రికా, చైనా, యూరోపియన్ దేశాలతో అంతర్జాతీయ వాణిజ్యము కొనసాగింది.
  8. పత్తి, ముత్యాలు, ధాన్యం, నీలిమందు, సముద్ర ముత్యాలు మొదలైనవి ప్రధాన ఎగుమతులు.
  9. టంకా (వెండి) నాణేలు, జిటాల్ (రాగి) నాణేలు ప్రామాణిక నాణేలుగా వాడుకలో ఉండేవి.

ప్రశ్న 8.
మహ్మద్ బీన్ తుగ్లక్ పరిపాలనా వైఫల్యాలను వివరించండి.
జవాబు:
మహ్మద్ బీన్ తుగ్లక్ పరిపాలనా వైఫల్యాలు :

  1. సాహసోపేతమైన ప్రయోగాల్లో, దేశ రాజధానిని ఢిల్లీ నుంచి దౌలతాబాద్ కు మార్చడం.
  2. గంగా-మైదాన ప్రాంతాల్లో భూమిశిస్తు పెంచడంతో సహా అనేక రెవెన్యూ సంస్కరణలు.
  3. కరెన్సీ సంస్కరణల్లో భాగంగా రాగి నాణేలను ప్రవేశపెట్టడం.
  4. కులీన వంశాల్లో కొత్తవారిని చేర్చడం మొదలైనవి.

II. సరియైన సమాధానాలను ఎంచుకోండి.

1. ఢిల్లీ సుల్తానులు తమ రాజ్యాన్ని ఇలా విభజించారు.
ఎ) మండలాలు
బి) ఇకాలు
సి) నాడులు
డి) పలనాడులు
జవాబు:
బి) ఇకాలు

2. ప్రజలు వీరి కాలంలో తమ ఇండ్లలో నాణేలను ముద్రించారు.
ఎ) అల్లావుద్దీన్ ఖిల్జీ
బి) బాల్బన్
సి) మహమ్మద్ బీన్ తుగ్లక్
డి) ఇబ్రహీం లోడి
జవాబు:
సి) మహమ్మద్ బీన్ తుగ్లక్

3. ఈ క్రింది సంఘటన అల్లావుద్దీన్ ఖిల్జీకి చెందినది.
ఎ) గుర్రాలకు ముద్ర వేయించడం
బి) రాజధాని మార్పు
సి) ఖిల్జీ వంశస్థాపన
డి) పైవన్నీ
జవాబు:
ఎ) గుర్రాలకు ముద్ర వేయించడం

4. అలై దర్వాజాను నిర్మించినవారు
ఎ) మహమ్మద్ బీన్ తుగ్లక్
బి) అల్లావుద్దీన్ ఖిల్జీ
సి) ఘియాజుద్దీన్ బాల్బన్
డి) సికిందర్ లోడి
జవాబు:
బి) అల్లావుద్దీన్ ఖిల్జీ

5. ఇకాలు వీరి పాలనలో ఉండేవి.
ఎ) ముక్తి
బి) గవర్నర్
సి) వజీరులు
డి) క్వా జీ
జవాబు:
ఎ) ముక్తి

AP Board 7th Class Social Solutions Chapter 4 ఢిల్లీ సుల్తానులు

III. జతపరచండి.

విభాగం-ఎ విభాగం-బి
1. బానిస వంశం ఎ) బహలాల్ లోడి
2. తుగ్లక్ వంశం బి) కిజర్ ఖాన్
3. ఖిల్జీ వంశం సి) గియాజుద్దీన్
4. లోడి వంశం డి) కుతుబుద్దీన్ ఐబక్
5. సయ్యద్ వంశం ఇ) జలాలుద్దీన్

జవాబు:

విభాగం-ఎ విభాగం-బి
1. బానిస వంశం డి) కుతుబుద్దీన్ ఐబక్
2. తుగ్లక్ వంశం సి) గియాజుద్దీన్
3. ఖిల్జీ వంశం ఇ) జలాలుద్దీన్
4. లోడి వంశం ఎ) బహలాల్ లోడి
5. సయ్యద్ వంశం బి) కిజర్ ఖాన్

IV. క్రింద ఇవ్వబడిన వివరాలతో సంబంధం ఉన్న పాలకులను గుర్తించి వ్రాయండి.

ప్రసిద్ధ మహిళా పాలకురాలు
బానిస వంశ స్థాపకుడు
తుగ్లక్ కాలంలో దోహా (ద్విపదలు) రచించినవారు
రాజధాని తరలింపు చేసినవారు
ఢిల్లీ సుల్తానులలో చివరి పాలకుడు
మొఘలు పాలనలో మొదటివాడు

జవాబు:

ప్రసిద్ధ మహిళా పాలకురాలు రజియా సుల్తానా
బానిస వంశ స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్
తుగ్లక్ కాలంలో దోహా (ద్విపదలు) రచించినవారు అమీర్ ఖుస్రూ
రాజధాని తరలింపు చేసినవారు మహ్మద్ బీన్ తుగ్లక్
ఢిల్లీ సుల్తానులలో చివరి పాలకుడు ఇబ్రహీం లోడి
మొఘలు పాలనలో మొదటివాడు బాబర్

పదకోశం

ఇచ్చిన సూచనలకు సంబంధించిన పదాలతో పజిల్ ను పూరించండి.
AP Board 7th Class Social Solutions Chapter 4 ఢిల్లీ సుల్తానులు 8

నిలువు
2. ప్రసిద్ధ ముస్లిం పాలకురాలు (6)
3. మామ్లుక్ వంశానికి గల ఇంకో పేరు (5)
4. ఢిల్లీ సుల్తానులలో చివరివాడు (5)

అడ్డం
1. పరిపాలన ఈ ఇస్లాం నిబంధనలకు లోబడి ఉండేది (4)
5. దౌలతాబాద్ ఈ రాష్ట్రంలో ఉంది (4)
6. ఢిల్లీ సుల్తానుల మొదటి రాజధాని (3)
7. దోహా (ద్విపదలు) రచించిన వారు (5)
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 4 ఢిల్లీ సుల్తానులు 9

7th Class Social Studies 4th Lesson ఢిల్లీ సుల్తానులు InText Questions and Answers

7th Class Social Textbook Page No.101

ప్రశ్న 1.
మధ్యయుగ సాహిత్యానికి చెందిన కొన్ని రచనల పేర్లను సేకరించి చార్టులో వ్రాయండి.
జవాబు:
విద్యార్థులు స్వయంగా చార్టుపై వ్రాయగలరు. ఉదా:

  1. అబుల్ ఫజల్ – అక్బర్నామా, ఐనీ అక్బరీ
  2. అల్ బెరూని – తారిక్-ఉల్-హిందూ
  3. అమీరుఖుస్రూ – ఖాజీ ఇన్ ఉల్ ఫిల్
  4. జియాఉద్దీన్ బరానీ – తారిఖ్ ఇ ఫిరోజ్ షాహి
  5. జాయపసేనాని – నృత్యరత్నాకరము.
  6. అల్లసాని పెద్దన – మను చరిత్ర
  7. శ్రీనాథుడు – పల్నాటి వీర చరిత్రము
  8. విద్యానాథుడు – ప్రతాపరుద్ర యశోభూషణం
  9. నంది తిమ్మన – జైమినీ భారతము
  10. తెనాలి రామకృష్ణుడు – పాండురంగ మహత్యము
  11. బదేని – ముంతాక్వా ఉల్ తవారిక్
  12. శ్రీకృష్ణదేవరాయలు – ఆముక్తమాల్యద మొదలైనవి.

AP Board 7th Class Social Solutions Chapter 4 ఢిల్లీ సుల్తానులు

ప్రశ్న 2.
ఏదైనా చారిత్రక ప్రదేశాన్ని సందర్శించారా? దానికి సంబంధించిన యాత్రా కథనాన్ని వ్రాయడానికి ప్రయత్నించండి.
జవాబు:

  1. నేను మా దగ్గరలో ఉన్న ‘కొండవీడు’ కోటను సందర్శించాను.
  2. నేను మరియు మా పాఠశాల ఉపాధ్యాయులు, ఇతర మిత్రులమంతా కలిసి చారిత్రక ప్రదేశమయిన ఈ కోటను సందర్శించాము.
  3. నాటి రెడ్డి రాజుల కోట గురించి, వారి చరిత్ర గురించి మా ఉపాధ్యాయులు చక్కగా వివరించారు.
  4. కోట గోడలు, బావి కొన్ని కట్టడాలు మమ్ములను చాలా ఆశ్చర్యపరచినవి.
  5. అక్కడి శిథిలాలు చూస్తూ నాటి రాజుల పాలనను గుర్తుచేసుకున్నాం.

ప్రశ్న 3.
మీ పరిసరాలలోని చారిత్రక ప్రదేశాల వివరాలను క్రింద తెలిపిన విధంగా పట్టిక రూపంలో వ్రాయండి.
జవాబు:

చారిత్రక ప్రదేశం పేరు జిల్లా మరియు మండలం చారిత్రక ప్రాధాన్యం
కొండవీడు గుంటూరు రెడ్డిరాజుల కాలం నాటి శిథిలమైన కోట కలదు.
ఉండవల్లి గుహలు గుంటూరు ప్రాచీన కాలం నాటి గుహాలయాలు కలవు.

7th Class Social Textbook Page No.107

ప్రశ్న 4.
పటం 4.2 ఆధారంగా, అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశంలో దండయాత్రలు జరిపిన ప్రదేశం మరియు , సంవత్సరమును పట్టిక రూపంలో రాయండి.
AP Board 7th Class Social Solutions Chapter 4 ఢిల్లీ సుల్తానులు 10
జవాబు:

సంవత్సరము దండయాత్ర జరిపిన ప్రదేశం
1299 గుజరాత్ ఆక్రమణ
1301 రణతంబోర్ పై దాడి
1303 చిత్తోడి పై దాడి
1305 మాండుపై దాడి
1296/1305 దేవగిరిపై దాడి
1311 యాదవరాజ్యంపై దాడి
1311 వరంగల్‌పై దాడి
1311 ద్వార సముద్రంపై దాడి
1311 మధులపై దాడి

7th Class Social Textbook Page No.113

ప్రశ్న 5.
వివిధ రాజ వంశాలకు చెందిన నాణేల చిత్రాలను సేకరించండి.
జవాబు:
విద్యార్థులు స్వయంగా చేయగలరు. ఈ క్రింది ఉదాహరణ ఆధారంగా
AP Board 7th Class Social Solutions Chapter 4 ఢిల్లీ సుల్తానులు 11 AP Board 7th Class Social Solutions Chapter 4 ఢిల్లీ సుల్తానులు 12

7th Class Social Textbook Page No.117

ప్రశ్న 6.
“ఢిల్లీ సుల్తానుల నిర్మాణ శైలికి కుతుబ్ మినార్ మచ్చుతునక,” చర్చించండి.
AP Board 7th Class Social Solutions Chapter 4 ఢిల్లీ సుల్తానులు 13
జవాబు:

  1. ‘యునెస్కో’ ఈ మినారు ప్రపంచ వారసత్వంగా ప్రకటించింది. అంటే దీని నిర్మాణ శైలి అద్భుతం.
  2. ఈ నిర్మాణం కువ్వత్-ఉల్-ఇస్లాం ఆవరణలో నిర్మించి సూఫీ సన్యాసి అయిన భక్తియార్ ఖాకీకి అంకితం ఇచ్చారు.
  3. 74.1 మీ|| ఎత్తులో ఉన్న నాలుగు అంతస్తుల చలువరాయి, ఇసుకరాయితో కూడిన ఈ నిర్మాణం ప్రత్యేక నిర్మాణ నిపుణతతో కూడిన అంతస్తులతో విలక్షణంగా ఉంది.
  4. కుతుబుద్దీన్ ఐబక్ ఈ నిర్మాణాన్ని ప్రారంభించి మొదటి అంతస్తు పూర్తి చేయగా, తర్వాత ఇల్-టుట్-మిష్ – నిర్మాణాన్ని పూర్తి చేసాడు.

ప్రశ్న 7.
ఢిల్లీ సుల్తానులలో ప్రముఖ పాలకుల వివరాలు మరియు వారి పాలనలోని ముఖ్యమైన అంశాలను పట్టిక రూపంలో తయారుచేయండి.
జవాబు:

ప్రముఖ పాలకుడు పాలనలోని ముఖ్యమైన అంశాలు
1) కుతుబుద్దీన్ ఐబక్
(క్రీ.శ. 1206-1210)
1) ఢిల్లీ సల్తానత్, బానిస వంశాన్ని క్రీ.శ. 1206లో స్థాపించాడు.
2) లాహోర్ రాజధానిగా ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు.
3) అనేక దానధర్మములు గావించి ‘లక్ బక్ష’ అని కీర్తి గడించెను.
4) కుతుబ్ మినార్ నిర్మాణం ప్రారంభించెను.
2) ఇల్‌టుట్-మిష్
(క్రీ.శ. 1211-1236)
1) నిజమైన బానిస వంశ స్థాపకుడు.
2) రాజ్యమును ‘ఇకా’లనే సైనిక రాష్ట్రములుగా విభజించాడు.
3) ఢిల్లీలో తురుష్క సామ్రాజ్యమునకు నిజమైన పునాదులు వేసినాడు.
4) కుతుబ్ మినార్ నిర్మాణమును పూర్తి చేసాడు.
5) బంద్ గాన్ పద్ధతిని ప్రవేశపెట్టాడు.
3) రజియా సుల్తానా
(క్రీ.శ. 1236-1240)
1) భారతదేశమును పాలించిన మొదటి ముస్లిం పాలకురాలు.
2) ఢిల్లీ సర్దారులు (చిహల్గని) ప్రాబల్యమును అణచివేసెను.
3) ఢిల్లీని పాలించిన ఏకైక మహిళ.
4) బాల్బన్
(క్రీ.శ. 1266-1287)
1) తన కొలువులో అనేక పారశీక సాంప్రదాయాలను ప్రవేశపెట్టెను.
2) రాజు ముందు సాష్టాంగ దండ ప్రమాణము మొదలైనవి ప్రవేశపెట్టెను.
3) మంగోలుల దండయాత్రకు గురయ్యెను.
5) జలాలుద్దీన్ ఖిల్జీ
(క్రీ.శ. 1290-1296)
1) ఖిల్జీ వంశ స్థాపకుడు.
2) దగ్గుల ప్రాబల్యమును అణచివేసెను.
3) మంగోలుల దాడినరికట్టెను.
6) అల్లావుద్దీన్ ఖిల్జీ (క్రీ.శ. 1296-1316) 1) సమర్థవంతమైన గూఢఛారి వ్యవస్థను స్థాపించెను.
2) సిద్ధ సైన్యాన్ని నియమించెను.
3) సైనికులకు నగదు రూపంలో జీతాలు చెల్లించెను.
4) మార్కెట్ సంస్కరణలు చేపట్టెను. ధరలను నియంత్రించెను.
5) గుర్రాలపై ముద్ర వేసే పద్ధతిని ప్రవేశపెట్టెను.
6) అలైదర్వాజాను నిర్మించెను.
7) ఘియాజుద్దీన్ తుగ్లక్
(క్రీ.శ. 1320-1324)
1) భూమిశిస్తును తగ్గించెను.
2) వ్యవసాయాభివృద్ధికి పంట కాలువలు త్రవ్వించెను.
3) నూతన రహదారులను నిర్మించెను.
4) గుర్రములపై వార్తలను పంపు తపాలా విధానమును ప్రవేశపెట్టెను.
8) మహ్మద్ బీన్ తుగ్లక్
(క్రీ.శ. 1324-1351)
1) గంగ-యమున అంతర్వేదిలో పన్నులు పెంచుట.
2) రాజధానిని ఢిల్లీ నుండి దౌలతాబాదు మార్చెను.
3) రాగి నాణెములను చెలామణిలోకి తీసుకువచ్చెను.
4) వ్యవసాయాభివృద్ధికై చర్యలు తీసుకోవటం.
5) సతీ సహగమనము తొలగించుటకు ప్రయత్నించెను.
9) ఫిరోజ్ షా తుగ్లక్
(క్రీ.శ. 1351-1388)
1) నిరుద్యోగ సమస్యను పరిష్కరించుటకు ‘ప్రత్యేక ఉద్యోగశాఖ’ను రూపొందించెను.
2) వృద్ధులకు, వితంతువులకు, అనాథల కొరకు ప్రత్యేక ధర్మ సంస్థను ఏర్పాటు చేసెను.
3) వ్యవసాయాభివృద్ధికై కాలువలు త్రవ్వించెను.
4) సైనికులకు జీతాల బదులు జాగీరులిచ్చు విధానము ప్రవేశపెట్టెను.
5) ప్రత్యేక బానిస శాఖను ఏర్పాటు చేసెను.
10) కిజర్ ఖాన్
(క్రీ.శ. 1414-1421)
1) సయ్యద్ వంశ స్థాపకుడు.
2) కొన్ని తిరుగుబాట్లను అణచివేసెను.
11) బహలు లోడి
(క్రీ.శ. 1451-1489)
1) లోడి వంశ స్థాపకుడు.
2) సమర్థవంతమైన న్యాయవ్యవస్థను ఏర్పరచెను.
12) ఇబ్రహీం లోడి
(క్రీ.శ. 1517-1526)
1) ఢిల్లీ సల్తనత్ చివరి పాలకుడు.
2) సర్దారులను సామాన్యులుగా పరిగణించెను.
3) బాబర్ తో 1526లో మొదటి పానిపట్టు యుద్ధం చేసెను.

ఆలోచించండి & ప్రతిస్పందించండి

7th Class Social Textbook Page No.101

ప్రశ్న 1.
చరిత్ర అధ్యయనానికి పురావస్తు ఆధారాలు ఏ విధంగా సహాయపడతాయి?
జవాబు:
చరిత్రను విపులముగా తెలుసుకొనుటకు లిఖిత ఆధారముల కంటే పురావస్తు ఆధారములు అత్యంత విశ్వాస యోగ్యములు. పురావస్తు ఆధారాలు ప్రధానంగా నాలుగు రకాలుగా కలవు. అవి :
ఎ) శాసనములు,
బి) నాణెములు,
సి) స్మారకాలు,
డి) కళాఖండములు. ఇవి చరిత్ర అధ్యయనానికి క్రింది విధంగా సహాయపడతాయి.

ఎ) శాసనములు :
చరిత్ర పునర్నిర్మాణమునకు శాసనములు చాలా ముఖ్యమైన ఆధారాలు. ఈ శాసనములు సామాన్యముగా రాజులు గావించిన దానధర్మములనుగాని, వారి విజయములను గురించి గానీ, వారి వారి పాలనలో జరిగిన ముఖ్య సంఘటనలనుగానీ, వివిధ ఉత్తర్వులు, ఆజ్ఞల గురించి గానీ తెలియజేయును. సాధారణంగా ఈ శాసనములు కొండశిలల మీద, శిలా స్తంభముల మీద, ఇనుప స్తంభాల మీద, కొండ గుహలలో, దేవాలయ గోడల మీద, రాగి, కంచు ఫలకముల మీద వ్రాయబడెను.

బి) నాణెములు :
శాసనముల తర్వాత ప్రామాణికమైనవి నాణెములు. ఇవి ఆయా రాజుల పాలనా కాలమంధు చలామణిలో యున్నట్లు తెలియును. ఈ నాణెములు పాలకుల సామ్రాజ్య పరిధిని, రాజకీయ, సాంఘిక, ఆర్థిక, మత విషయములను గురించి వారి అభిరుచుల గురించి తెలియజేయును. విదేశీ వ్యాపారం గురించి తెలియజేయును.

సి) స్మారకాలు, కళాఖండములు :
స్మారకాలు, కళాఖండములు అంటే శిథిల భవనములు, ప్రాచీనులు ఉపయోగించిన సామానులు, పనిముట్లు, కుండ పాత్రలు, శిల్పాలు, చిత్రలేఖనము మొదలైనవి. వీటి ద్వారా గతించిన ప్రాచీన
భారతదేశ చరిత్రను పునర్నిర్మింపవచ్చును.

7th Class Social Textbook Page No.105

ప్రశ్న 2.
ఆకాలంలో పాలనాధికారం వారసత్వంగా సంక్రమించేది. కానీ కొన్ని సమయాల్లో అల్లుళ్ళు మరియు మామలు కూడా రాజ్యాన్ని ఆక్రమించేవారు. ఇందుకు గల కారణాలను ఊహించండి.
జవాబు:
కొన్ని సమయాల్లో అల్లుళ్ళు మరియు మామలు రాజ్యాన్ని ఆక్రమించటానికి కారణాలు:

  1. రాజుకు వారసులు లేకపోవడం ప్రధాన కారణం.
  2. వారసులు అసమర్ధులగుట వలన.
  3. అధికార దాహం, అధికారం పట్ల వ్యామోహం, స్వార్థపరత్వం.
  4. చెప్పుడు మాటలు వినటం, వీరిని ప్రక్కవారు ప్రభావితం చేయటం మొదలైనవి.

AP Board 7th Class Social Solutions Chapter 4 ఢిల్లీ సుల్తానులు

ప్రశ్న 3.
ఓ మహిళా పాలకురాలిగా రజియా సుల్తానా వివక్షను, కుట్రలను భరించవలసి వచ్చింది. ప్రస్తుత కాలంలో మహిళలు పురుషుల్లా తమకు నచ్చినట్లు తాము వ్యవహరించగలుగుతున్నారా?
జవాబు:
ప్రస్తుత కాలంలో మహిళలు పురుషుల్లా తమకు నచ్చినట్లు తాము వ్యవహరించలేకపోతున్నారు. కారణం, మహిళకు సంబంధించిన (భర్త, కుమారుడు లేదా తండ్రి) పురుషుల ప్రభావం వారి మీద ఉంది. వారు మహిళలకు నీడ లాగా ఉంటూ నిర్ణయాలు తీసుకోవటంలో ప్రభావితం చేస్తున్నారు మరియు మన సంప్రదాయాలు, ఆచారాలు, మూఢవిశ్వాసాలు కూడా వీనికి తోడై మహిళలు స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నారు.

7th Class Social Textbook Page No.107

ప్రశ్న 4.
అవినీతి అనగా ఏమి? దీనిని ఎలా నియంత్రిస్తావు?
జవాబు:
1) అవినీతి :
అక్రమ మార్గాల ద్వారా లేదా అక్రమ పద్ధతుల ద్వారా డబ్బును సంపాదించడాన్ని ‘అవినీతి’ అంటారు.

2) నియంత్రణ :

  1. ప్రజలకు ఉపయోగపడే ఆర్థిక సంస్కరణలు చేయడం ద్వారా
  2. పరిపాలనలో ఖచ్చితత్వాన్ని పెంచడం ద్వారా
  3. ప్రభుత్వానికి, పరిపాలనను ప్రత్యక్షముగా అనుసంధానం చేయడం ద్వారా
  4. కొన్ని సంస్థల పర్యవేక్షణలో జవాబుదారీతనాన్ని పెంచడం ద్వారా అవినీతిని నియంత్రించవచ్చు.

ప్రశ్న 5.
రాజులు లేదా పాలకులు ఇతర రాజ్యాలు లేదా ప్రాంతాలపై దండయాత్రలు చేయుటకు కారణాలు తెలుసుకోండి.
జవాబు:
రాజులు లేదా పాలకులు ఇతర రాజ్యాలపై దండయాత్రలు చేయుటకు కారణాలు:

  1. రాజ్యకాంక్ష, తమ రాజ్యాన్ని విస్తరింపచేయాలని అనుకోవటం.
  2. ప్రక్క రాజ్యాలలోని సంపదను కొల్లగొట్టుటకు.
  3. వ్యాపారాభివృద్ధికి, (ప్రక్క రాజులతో వ్యాపారం చేయుటకు, ఆ రాజు అనుమతినివ్వకపోవటం)
  4. పన్నులు, కప్పంల రూపంలో ధనాన్ని ప్రోగుచేసుకొనేందుకు.

7th Class Social Textbook Page No.109

ప్రశ్న 6.
రాజధానిని ఢిల్లీ నుండి దౌలతాబాదు తరలించడానికి గల కారణాలు ఏమై ఉండవచ్చు?
జవాబు:
రాజధానిని ఢిల్లీ నుండి దౌలతాబాదు తరలించడానికి గల కారణాలు:

  1. నాటి సువిశాల తుగ్లక్ సామ్రాజ్యానికి రాజధానియైన ఢిల్లీ మారుమూలలో గలదు.
  2. రాజ్యములోని వివిధ ప్రాంతాలను పాలించుటకు తగిన రవాణా, వార్తా సౌకర్యాలు కూడా లేవు.
  3. దీనికి తోడు సరిహద్దు ఢిల్లీ సమీపములో ఉండుటచే తరచు మంగోలులు దాడి చేయుచూ, అపార నష్టము కల్గించుచుండిరి.
  4. ఢిల్లీకి సుదూరంలో గల దక్షిణాది రాష్ట్రాలు తరచూ తిరుగుబాటు జేయుచుండిరి. వారిని అణచివేయుటకు.
  5. బలవంతులైన ఢిల్లీ సర్దారుల ప్రాబల్యము నుండి విముక్తి పొందాలని ఆశించుట.

AP Board 7th Class Social Solutions Chapter 4 ఢిల్లీ సుల్తానులు

ప్రశ్న 7.
ఢిల్లీ నుండి దౌలతాబాద్ ప్రయాణములో అనేక మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణాలు తెలుసుకోండి.
జవాబు:
తుగ్లక్ ఢిల్లీలోని కార్యాలయాలు, సిబ్బందినే కాక ఢిల్లీలోని పౌరులందరిని తమ ఆస్తిపాస్తులతో బాటు దౌలతాబాద్ తరలివెళ్ళమని ఆజ్ఞాపించెను. ఢిల్లీ నుండి దౌలతాబాద్ మధ్య దూరము సుమారు 700 మైళ్ళు. ఇంతటి సుదీర్ఘమైన ప్రయాణంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.

అన్వేషించండి

7th Class Social Textbook Page No.117

ప్రశ్న 1.
ఢిల్లీ సుల్తానుల కళలు, వాస్తు నిర్మాణాల గురించి తెలుసుకోవడానికి ఇంటర్నెట్లో సందర్శించండి.
జవాబు:
కళలు-వాస్తు శిల్పం :

  1. ఢిల్లీ సుల్తానుల కాలంలో అరబిక్ మరియు ఇస్లాం శైలుల మిశ్రమంతో కూడిన వాస్తు నిర్మాణాలు, కళలు అభివృద్ధి చెందాయి.
  2. హిందూ వాస్తు శైలిలోని అలంకరణల స్థానంలో రేఖాగణిత ఆకారాలు, కాలీగ్రఫీ మొదలైనవి వచ్చి చేరాయి.
  3. స్వదేశీ నిర్మాణాలలో ట్రూబీట్ పద్దతిని పాటించేవారు. తర్వాత అర్క్యుట్ పద్ధతి’ ప్రవేశపెట్టబడింది.
  4. భవనాల నిర్మాణంలో భారతీయ హస్తకళల వారిని, నిపుణులను, శిల్పకళాకారులను నియమించారు.
  5. ఆవిధంగా ఇండో – ఇస్లామిక్ శైలి అనే నవీన శైలి అవతరించింది. కుతుబ్ మినార్, అలై దర్వాజ, అలై మినార్, తుగ్లకాబాద్, కువ్వత్ ఉల్ ఇస్లాం మసీద్ ఈ కాలంలో ప్రసిద్ది చెందిన నిర్మాణాలు.

AP Board 7th Class Social Solutions Chapter 4 ఢిల్లీ సుల్తానులు 13
కుతుబ్ మినార్ :

  1. కువ్వత్ – ఉల్ – ఇస్లాం మసీదు ఆవరణలో ఈ నిర్మాణం చేయబడినది.
  2. కుతుబుద్దీన్ ఐబక్ మరియు ఇల్ టుట్ మిష్ కుతుబ్ మినారను కట్టించి సూఫీ సన్యాసి అయిన కుతుబుద్దీన్ భక్తియార్ ఖాకీకి అంకితం ఇచ్చారు.
  3. 74.1 మీటర్ల ఎత్తులో ఉన్న నాలుగు అంతస్తుల చలువరాయి, ఇసుకరాయితో కూడిన ఈ నిర్మాణం ప్రత్యేక నిర్మాణ నిపుణతతో కూడిన అంతస్తులతో విలక్షణంగా ఉంది.

అలై దర్వాజ :

  1. అల్లావుద్దీన్ ఖిల్జీ దీనిని ‘కువ్వత్ – ఉల్ – ఇస్లామ్’ మసీదుకు దక్షిణ ద్వారం వలే నిర్మించాడు.
  2. దీనిలో మొదటిసారిగా గోపురాలు మరియు తోరణాలు నిర్మించబడ్డాయి.

AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం

SCERT AP 7th Class Social Study Material Pdf 3rd Lesson పటాల ద్వారా అధ్యయనం Textbook Questions and Answers.

AP State Syllabus 7th Class Social Solutions 3rd Lesson పటాల ద్వారా అధ్యయనం

7th Class Social 3rd Lesson పటాల ద్వారా అధ్యయనం Textbook Questions and Answers

కింది తరగతులలోని విషయ పునశ్చరణ

AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 1
పటమును పరిశీలించి ప్రతిస్పందించండి.

ప్రశ్న 1.
పటంలో మీరేమి గమనించారు?
జవాబు:
ఈ పటం విజయవాడ, న్యూఢిల్లీ మధ్య దారిని చూపుతుంది.

ప్రశ్న 2.
పటంలో ఉన్న నీలిరంగు గీత దేనిని సూచిస్తుంది?
జవాబు:
పటంలో నీలిరంగు గీత నదులను చూపుతుంది.

ప్రశ్న 3.
భారతదేశానికి పొరుగున ఉన్న దేశాలను వ్రాయండి.
జవాబు:
పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, టిబెట్, చైనా.

ప్రశ్న 4.
పటంలో చూపిన మార్గంలోని ఏవేని రెండు రాష్ట్రాల పేర్లను చెప్పగలరా?
జవాబు:
తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర.

ప్రశ్న 5.
పటంలో చూపబడిన వివిధ రవాణా మార్గాలు ఏవి?
జవాబు:
రోడ్డు, రైలు మరియు వాయు మార్గాలు.

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

I. క్రింది ప్రశ్నలకు జవాబులివ్వండి.

ప్రశ్న 1.
పటంలో దిక్కులను ఎలా గుర్తిస్తారు?
జవాబు:
సాధారణంగా ఉత్తర దిక్కుకు పైన ఉండే విధంగా పటాలు తయారుచేయబడతాయి. పటంలో కుడివైపున పై భాగంలో ఉన్న బాణం గుర్తు ఆధారంగా దిక్కును తెలుసుకోవచ్చు.

AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం

ప్రశ్న 2.
“దూరాలను అధ్యయనం చేయడానికి పటంలోని స్కేలు ఉపయోగపడుతుంది.” చర్చించండి.
జవాబు:
స్కేలు :
భూ ఉపరితలంపై వాస్తవ దూరాన్ని పటంలో సవరించి చూపడాన్ని స్కేలు తెలియచేస్తుంది. స్కేలును మూడు రకాలుగా చూపవచ్చు.

1) వాక్యరూప స్కేలు :
ఇది వాక్య రూపంలో ఉండి సులువుగా చదివి, అర్థం చేసుకునే విధంగా ఉంటుంది.
ఉదా : 1 సెం.మీ. = 10 కి.మీ.

2) గ్రాఫ్ రూపంలోని స్కేలు :
పటం యొక్క పరిమాణం పెంచినా, తగ్గించినా తదనుగుణంగా స్కేలు మారునట్లుగా రూపొందించబడి ఉంటుంది.
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 2

3) నైష్పత్తిక స్కేలు (RF) :
పటంలో ఇవ్వబడిన స్కేలు పట అధ్యయనం చేసే వారికి అనుకూలమైన ప్రామాణిక కొలతలలో ఉపయోగించుకునేందుకు వీలుగా నిష్పత్తి రూపంలో రూపొందించబడి ఉంటుంది. ప్రామాణిక కొలత ఏదైనా నిష్పత్తి మారదు. ఉదా : 1 :10,000 (1 అంగుళం : 10,000 అంగుళం),

ప్రశ్న 3.
భౌతిక పటాలను అధ్యయనం చేయడానికి ఏఏ అంశాలు అవసరం అవుతాయి?
జవాబు:

  1. పర్వత శ్రేణులు, పీఠభూములు, మైదానాలు, నదులు, ఎడారులు, సరస్సులు, మెట్టభూములు మొదలైన భౌథిక స్వరూపాలకు సంబంధించిన సమాచారాలను తెలిపే పటాలను భౌతిక పటాలు అంటారు.
  2. పట సూచికలో తెలుసుకున్న అంశాలను అన్వయించడం ద్వారా భౌతిక పటాలను చదవవచ్చు. భారతదేశ భౌతిక పటములో ఆకుపచ్చని రంగు ఉన్న భాగాలను గమనించండి, అవి మైదానాలు.
  3. ఉత్తర భారతదేశంలోని ప్రాంతాలు, తీరప్రాంతాలు ఈ కోవలోకి వస్తాయి.
  4. నారింజ రంగు నుండి గోధుమ రంగు వరకు ఉన్న షేడ్స్ (ఛాయలు) సముద్రమట్టం నుండి వివిధ భూస్వరూపాలైన మెట్ట భూములు, పీఠభూములు, కొండ ప్రాంతాలు మొదలగు వాటి ఎత్తును తెలియజేస్తాయి.
  5. ఉదా రంగు పర్వత శిఖరాల ఉన్నతిని, తెలుపు రంగు మంచుతో కప్పబడి ఉన్న హిమాలయ పర్వతాలను తెలియజేస్తాయి.
  6. పటంలో ఉన్న నీలిరంగు జలభాగాలను తెలియజేస్తుంది.
  7. సాంప్రదాయక చిహ్నాలను ఉపయోగించి నదులు, పర్వత శ్రేణులు / శిఖరాలు, సరస్సులు మొదలైన వాటిని పటంలో గుర్తించవచ్చు.

ప్రశ్న 4.
భారతదేశ ఉనికిని వివరించండి.
జవాబు:
భారతదేశ ఉనికి-విస్తరణ :

  1. భారతదేశం 3.28మి. చ.కి.మీ. విస్తీర్ణంతో ప్రపంచంలో ఏడవ అతి పెద్ద దేశంగా గుర్తించబడినది.
  2. మన దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలవు.
  3. భారతదేశం ఆసియా ఖండపు దక్షిణ భాగంలో ఉంది.
  4. అక్షాంశ రీత్యా 8°4′ – 37°6 ఉత్తర అక్షాంశాల మధ్య మరియు 68°7′ 97°25′ తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది.
  5. కర్కటరేఖ దేశ మధ్య భాగం గుండా పోతున్నది.

AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం

ప్రశ్న 5.
అట్లాస్ సహాయంతో ఆసియా ఖండంలోని దేశాల పట్టికను తయారుచేయండి.
జవాబు:
ఆసియా ఖండంలోని దేశాల పట్టిక :
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 3
ఆసియా ఖండంలోని ఇతర దేశాలు :

  1. బహైన్
  2. జార్జియా
  3. కువైట్
  4. UAE(యునైటెడ్ అరబ్ ఎమిరట్స్)
  5. సైప్రస్
  6. ఇజ్రాయెల్
  7. లెబనాన్
  8. మారిషస్
  9. తూర్పుతీమోర్
  10. జోర్డాన్
  11. మంగోలియా

ప్రశ్న 6.
భారత దేశ సరిహద్దులేవి?
జవాబు:
భారత దేశ సరిహద్దులు :
తూర్పున : బంగాళాఖాతం, బంగ్లాదేశ్, మయన్మార్
పశ్చిమాన : అరేబియా సముద్రం, పాకిస్తాన్
ఉత్తరాన : హిమాలయ పర్వతాలు, పాకిస్తాన్, టిబెట్, నేపాల్, భూటాన్, చైనా
దక్షిణాన : హిందూ మహా సముద్రం మరియు శ్రీలంక

ప్రశ్న 7.
భారతదేశం యొక్క గ్రిడ్ ను తయారుచేయండి.
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 4

ప్రశ్న 8.
భారతదేశం యొక్క అవుట్ లైన్ పటంలో క్రింది ప్రదేశాలను గుర్తించండి.
ఎ) చెన్నై బి) ఢిల్లీ సి) విజయవాడ డి) విశాఖపట్నం
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 5

II. సరియైన సమాధానాలను ఎంచుకోండి.

1. సరైన వాక్యాన్ని గుర్తించండి.
ఎ) గంగానది హిమాలయాలలో జన్మిస్తుంది.
బి) కావేరి నది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ప్రవహిస్తుంది.
సి) కృష్ణా నది అరేబియా సముద్రంలో కలుస్తుంది.
డి) పెన్నానది మహారాష్ట్రలో ప్రవహిస్తుంది.
జవాబు:
ఎ) గంగానది హిమాలయాలలో జన్మిస్తుంది.

2. భారతదేశం పూర్వార్ధగోళంలో ఈ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది.
ఎ) 14 27′ నుండి 19-07
బి) 77° నుండి 84-40
సి) 68°7′ నుండి 97 25′
డి) 8-4′ నుండి 376′
జవాబు:
సి) 68°7′ నుండి 97 25′

3. నదుల ఉనికి ఆధారంగా భిన్నంగా ఉన్న దానిని గుర్తించండి.
ఎ) కృష్ణానది
బి) పెన్నానది
సి) బ్రహ్మపుత్రానది
డి) కావేరి
జవాబు:
సి) బ్రహ్మపుత్రానది

AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం

4. అ) కేరళ రాష్ట్రం పశ్చిమ తీరంలో ఉన్నది.
ఆ) అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం పాకిస్తాన్ తో సరిహద్దును పంచుకుంటుంది.
‘అ’, ‘ఆ’, లకు సంబంధించి క్రింది వానిలో సరైన సమాధానాన్ని ఎన్నుకోండి.
ఎ) “అ” సత్యము “ఆ” అసత్యము
బి) “అ” అసత్యము “ఆ” సత్యము
సి) “అ” మరియు “ఆ” రెండూ అసత్యము
డి) “అ” మరియు “ఆ” రెండూ సత్యము
జవాబు:
ఎ) “అ” సత్యము “ఆ” అసత్యము

5. సరికాని జతను గుర్తించండి.
ఎ) చెన్నై – తమిళనాడు
బి) భోపాల్ – గుజరాత్
సి) జైపూర్ – రాజస్థాన్
డి) తిరువనంతపురం – కేరళ
జవాబు:
బి) భోపాల్ – గుజరాత్

7th Class Social Studies 3rd Lesson పటాల ద్వారా అధ్యయనం InText Questions and Answers

7th Class Social Textbook Page No.71

ప్రశ్న 1.
పటంలోని అంశాలను గుర్తించి, పటము – 3.2లో వాటి పేర్లను వ్రాయండి.
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 7
భారతదేశ రాష్ట్రాలు – రాజధానులు
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 10'

7th Class Social Textbook Page No.73

ప్రశ్న 2.
ప్రక్కన ఇవ్వబడిన చిత్రంలో దిక్కులు, మూలలను గుర్తించండి.
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 11
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 12

ప్రశ్న 3.
నీవు బెంగుళూరు నుండి ఈటానగర్ వెళ్ళాలనుకున్నప్పుడు, ఏ దిక్కు నుండి ప్రయాణిస్తావు?
జవాబు:
నైరుతి దిక్కు నుండి ఈశాన్యం వైపుకు ప్రయాణిస్తాను.

ప్రశ్న 4.
పటము – 3.2 లోని స్కేలు ఆధారంగా క్రింది పట్టికను పూరించండి.

ప్రదేశాలు: నుండి – వరకు పై పటంలో దూరం వాస్తవ దూరం
చెన్నై నుండి హైదరాబాద్ 3 సెం.మీ.
ముంబాయి నుండి భువనేశ్వర్ 5 సెం.మీ.
పంజాబ్ నుండి తిరువనంతపురం 2.5 సెం.మీ.
గాంధీనగర్ నుండి జైపూర్ 2 సెం.మీ.
కోల్‌కతా నుండి రాంచి 3000 కి.మీ.
న్యూఢిల్లీ నుండి కోహిమా 2200 కి.మీ.

జవాబు:

ప్రదేశాలు: నుండి – వరకు పై పటంలో దూరం వాస్తవ దూరం
చెన్నై నుండి హైదరాబాద్ 3 సెం.మీ. 600 కి.మీ.
ముంబాయి నుండి భువనేశ్వర్ 5 సెం.మీ. 1000 కి.మీ.
పంజాబ్ నుండి తిరువనంతపురం 2.5 సెం.మీ. 500 కి.మీ.
గాంధీనగర్ నుండి జైపూర్ 2 సెం.మీ. 400 కి.మీ.
కోల్‌కతా నుండి రాంచి 15 సెం.మీ. 3000 కి.మీ.
న్యూఢిల్లీ నుండి కోహిమా 11 సెం.మీ. 2200 కి.మీ.

7th Class Social Textbook Page No.77

ప్రశ్న 5.
పటసూచికలోని అంశాలను ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ భౌతిక పటమును తయారుచేయండి.
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 13
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 14

7th Class Social Textbook Page No.81

ప్రశ్న 6.
పటము-3.4 ఆధారంగా భారతదేశంలో భూభాగ సరిహద్దులను పంచుకునే దేశాలు-ఆయా దేశాలతో సరి హద్దులు కలిగి ఉన్న రాష్ట్రాలను పట్టికలో వ్రాయండి.
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 15
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 16

ప్రశ్న 7.
భారతదేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను, వాటి రాజధానులతో పట్టికను తయారుచేయండి.
జవాబు:
మన దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు గలవు. అవి :

రాష్ట్రం రాజధాని
1. ఆంధ్రప్రదేశ్ అమరావతి
2. ఒడిశా భువనేశ్వర్
3. పశ్చిమబెంగాల్ కోల్‌కతా
4. జార్ఖండ్ రాంచి
5. బీహార్ పాట్నా
6. ఉత్తరప్రదేశ్ లక్నో
7. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్
8. హిమాచల్ ప్రదేశ్ సిమ్లా
9. పంజాబ్ చండీగఢ్
10. హరియాణా చండీగఢ్
11. రాజస్థాన్ జైపూర్
12. గుజరాత్ గాంధీనగర్
13. మహారాష్ట్ర ముంబయి
14. మధ్య ప్రదేశ్ భోపాల్
15. ఛత్తీస్గఢ్ రాయపూర్
16. కర్ణాటక బెంగళూర్
17. తెలంగాణ హైద్రాబాద్
18. కేరళ తిరువనంతపురం
19. తమిళనాడు చెన్నై
20. గోవా పనాజి
21. సిక్కిం గాంగ్ టక్
22. అరుణాచల్ ప్రదేశ్ ఈటానగర్
23. అస్సాం డిస్పూర్
24. మేఘాలయ షిల్లాంగ్
25. నాగాలాండ్ కోహిమా
26. మణిపూర్ ఇంఫాల్
27. మిజోరామ్ ఐజ్వాల్
28. త్రిపుర అగర్తల

 

కేంద్రపాలిత ప్రాంతం రాజధాని
1. అండమాన్ & నికోబార్ దీవులు పోర్టుబ్లెయిర్
2. పుదుచ్చేరి పుదుచ్చేరి
3. లక్షద్వీప్ కవరత్తి
4. దాద్రానగర్ హవేలి & డామన్ & డయ్యూ డామన్
5. చండీగఢ్ చండీగఢ్
6. న్యూఢిల్లీ న్యూఢిల్లీ
7. జమ్ము&కాశ్మీర్ జమ్ము&కాశ్మీర్
8. లఢక్ లెహ్

ప్రశ్న 8.
భారతదేశ అవుట్లైన్ పటమునందు రాష్ట్రాల సరిహద్దులను గీసి, రాజధానులను గుర్తించండి.
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 17

7th Class Social Textbook Page No.85

ప్రశ్న 9.
పటం 3.5 ఆధారంగా ఖండాలను పేర్కొని, ప్రతి ఖండంలోని కొన్ని ముఖ్యమైన దేశాలతో పట్టికను తయారుచేయండి.
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 18
జవాబు:
అంటార్కిటికా ఖండం నందు దేశాలు ఏమీ లేవు. మిగతా ఆరు ఖండాల (కొన్ని దేశాలు) వివరాలు పట్టికలో ఇవ్వబడినవి.
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 19 AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 20

ప్రశ్న 10.
ఏ ఏఖండాల గుండా భూమధ్య రేఖ ప్రయాణిస్తుందో తెలపండి.
జవాబు:
భూమధ్య రేఖ క్రింది ఖండాల గుండా ప్రయాణిస్తుంది.

  1. ఆఫ్రికా
  2. దక్షిణ అమెరికా
  3. ఆసియా

7th Class Social Textbook Page No.87

ప్రశ్న 11.
మీ ఉపాధ్యాయుని మార్గనిర్దేశకత్వంలో, భారతదేశ ఉత్తెత్తు భౌతిక పటాన్ని తయారుచేయండి.
జవాబు:
విద్యార్థులు స్వయంగా (self) చేయగలరు.

ప్రశ్న 12.
భారతదేశ భౌతిక పటం 3.6 సహాయంతో క్రింది ఇచ్చిన మైండ్ మా లోని అంశాలను పూరించండి.
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 21
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 22
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 23

7th Class Social Textbook Page No.91

ప్రశ్న 13.
పటము 3.7 ఆధారంగా నేలల విస్తరణను చూపే పట్టికను తయారుచేయండి
(నేల రకాలు, అవి విస్తరించి ఉన్న జిల్లాలను పరిగణలోకి తీసుకోండి).
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 24
జవాబు:
క్ర.సం.

నేల రకాలు విస్తరించి ఉన్న జిల్లాలు
1. తీర ప్రాంత ఇసుక నేలలు (మృత్తికలు) శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు.
2. ఎర్ర నేలలు విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు.
3. పర్వత నేలలు తూర్పు గోదావరి, విశాఖపట్టణం.
4. నల్లరేగడి నేలలు తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు.

ప్రశ్న 14.
ఒక ఆంధ్రప్రదేశ్ పటాన్ని తీసుకుని దిగువ తెలిపిన ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత పట్టిక వివరాలతో విషయాత్మక పటాన్ని తయారు చేయండి.
జన గణన-2011: చదరపు కి.మీ.కు జనసాంద్రత
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 25
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 26

ప్రశ్న 15.
పటం-3.9 ఆధారంగా అశోకునికి సంబంధించిన వివిధ రకాల శాసనాలు ప్రస్తుతం ఏ ఏ రాష్ట్రాలలో ఉన్నవో తెలుపుతూ పట్టికను తయారుచేయండి.
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 27
అశోకుని శాసనాలు గల ప్రదేశాలు
జవాబు:

  1. ఎర్రగుడి, అమరావతి – ఆంధ్రప్రదేశ్
  2. కౌగది, ఉలి – ఒడిషా
  3. సోపారా – మహారాష్ట్ర
  4. సన్నతి – కర్ణాటక
  5. గిర్నార్ – గుజరాత్
  6. రాంపూర్వ, లారియాఆరాజ్, లారియానందపర్ – బీహార్
  7. లుంబిని – నేపాల్
  8. కౌశంబి, మీరట్ – ఉత్తరప్రదేశ్
  9. ఢిల్లీ తోప్రా – హర్యానా
  10. కాల్ సి – ఉత్తరాఖండ్
  11. మన్ సేరా, పాబాజ్ షరి – పాకిస్తాన్
  12. కాందహార్ – ఆఫ్ఘనిస్తాన్

ఆలోచించండి ప్రతిస్పందించండి

7th Class Social Textbook Page No.73

ప్రశ్న 1.
పటములో స్కేలు యొక్క ఉపయోగమేమి?
జవాబు:
భూమిపై కల వాస్తవ దూరానికి పటంలో చూపబడిన దూరానికి కల నిష్పత్తినే స్కేలు అని పిలుస్తాం. పటంలో రెండు ప్రాంతాల మధ్య కల దూరాన్ని లెక్కించడానికి స్కేలు ఉపయోగిస్తాం.

AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం

7th Class Social Textbook Page No.75

ప్రశ్న 2.
పటాల తయారీలో చిహ్నాలను ఎందుకు ఉపయోగిస్తాం?
జవాబు:
పటంలో భవనాలు, రహదారులు, వంతెనలు, చెట్లు, రైలు మార్గాలు, బావులు మొదలైన వివిధ అంశాలను వాటి వాస్తవ పరిమాణం మరియు ఆకారంలో చూపలేం. కాబట్టి వాటిని అక్షరాలు, రంగులు, చిత్రాలు, గీతలు చిహ్నాలతో సూచిస్తారు. ఇవి తక్కువ స్థలంలో ఎక్కువ సమాచారాన్ని ఇస్తాయి, పటాలు గీయడం, చదవడం సులభమవుతుంది.

7th Class Social Textbook Page No.79

ప్రశ్న 3.
వివిధ రకాల పటాలను పేర్కొనండి ;
జవాబు:
పటములోని స్కేలు, అంశాలు మరియు విషయాల ఆధారంగా పటాలను వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు. రాజకీయ, భౌతిక, విషయాత్మక పటాలతో పాటుగా చారిత్రక పటాలు.

ప్రశ్న 4.
అవి (పటాలు) దేనిని తెలియజేస్తాయి?
జవాబు:
పటాలు దేనిని తెలియజేస్తాయంటే ;

1) రాజకీయ పటాలు :
ఒక ప్రదేశం యొక్క పాలనా పరిధిని, పొరుగు దేశాలను, సరిహద్దులను, దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామాలు, రాజధానులను తెలియజేస్తాయి.

2) భౌతిక పటాలు :
వివిధ భూ స్వరూపాలను (మైదానాలు, పీఠభూములు, పర్వతాలు మొదలైన) నిర్దిష్ట రంగులు, ఎత్తు పల్లములతో సూచిస్తారు.

3) విషయ నిర్దేశిత పటాలు :
ఏదేని ప్రత్యేక లేదా నిర్దిష్ట అంశము లేదా విషయాలను తెలుపును. ఉదా : మృత్తికలు చూపే పటం, జనసాంద్రత చూపే పటం.

4) చారిత్రక పటాలు :
గడచిపోయిన కాలం యొక్క వివరాలను చూపిస్తాయి.
ఉదా : అశోకుని శాసనాలు గల ప్రదేశాలు.

7th Class Social Textbook Page No.81

→ పటము-3.4 ను పరిశీలించి, సమాధానాలు ఇవ్వండి.
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 17
భారతదేశ రాజకీయ పటం
ప్రశ్న 5.
భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న రాష్ట్రం పేరును తెలపండి.
జవాబు:
తమిళనాడు (రాష్ట్రం) అండమాన్ నికోబార్ దీవులు (కేంద్రపాలిత ప్రాంతాలు).

ప్రశ్న 6.
కర్కటరేఖ అనగానేమి?
జవాబు:
23½° ఉత్తర అక్షాంశంను కర్కటరేఖ అంటారు.

ప్రశ్న 7.
భారతదేశంలోని ఏయే రాష్ట్రాల మీదుగా కర్కటరేఖ వెళుతుందో రాయండి.
జవాబు:
భారతదేశంలోని

  1. రాజస్థాన్,
  2. ఛత్తీస్ గఢ్,
  3. గుజరాత్,
  4. మధ్యప్రదేశ్,
  5. జార్ఖండ్,
  6. పశ్చిమబెంగాల్,
  7. త్రిపుర,
  8. మిజోరం రాష్ట్రాల మీదుగా కర్కాటక రేఖ వెళుతుంది.

7th Class Social Textbook Page No.87

ప్రశ్న 8.
పశ్చిమ కనుమలలో పుట్టిన నదులు తూర్పుగా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. మీ ఉపాధ్యాయునితో చర్చించండి.
జవాబు:
పశ్చిమ కనుమలలో పుట్టి తూర్పుగా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తున్న నదులు :
గోదావరి, కృష్ణా, కావేరి, తుంగభద్ర, పెన్నా, ఘటప్రభ, మాలప్రభ, భీమ, వైగై, తాంబ్రపరిణి, పెరియార్ మొదలైనవి.

AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం

ప్రశ్న 9.
నదులను అవి కలిసే సముద్రం ఆధారంగా వర్గీకరించి పేర్లను రాయండి.
జవాబు:
నదులు, అవి కలిసే సముద్రం ఆధారంగా వర్గీకరణ :

బంగాళాఖాతంలో కలిసే నదులు అరేబియా సముద్రంలో కలిసే నదులు
గంగా, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణానది, పెన్నానది, లాంగుల్యా నది, వంశధార, మహానది, కావేరినది మొదలైనవి. సింధూనది, నర్మదానది, తపతినది, సబర్మతి (గిరికర్ణిక) శరావతి, మహానది మొదలైనవి.

ప్రశ్న 10.
ఆంధ్రప్రదేశ్ లోని భూస్వరూపాలను పేర్కొనండి.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ భూ స్వరూపాలు:

1) తూర్పు కనుమలు :
వెలికొండ, నల్లమల, శేషాచలం, పెనుకొండ, యారాడ మొదలైన కొండలు.

2) తూర్పు తీర మైదానం :
కృష్ణా, గోదావరి డెల్టాలు, కొల్లేరు, పులికాట్ సరస్సులు కలవు.

3) దక్కన్ పీఠభూమి (రాయలసీమ పీఠభూమి) : రాయలసీమ ప్రాంతం.

అన్వేషించండి

7th Class Social Textbook Page No.75

ప్రశ్న 1.
అట్లాస్/ ఇంటర్నెట్ సహాయంతో భారత్ సర్వేక్షణ శాఖ ఉపయోగించే మరికొన్ని సాంప్రదాయక చిహ్నాలను గురించి అన్వేషించండి.
జవాబు:
భారత్ సర్వేక్షణ శాఖ ఉపయోగించే సాంప్రదాయక చిహ్నాలు :
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 28
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 29

7th Class Social Textbook Page No.81

ప్రశ్న 2.
అట్లాస్ సహాయంతో ఆంధ్రప్రదేశ్ ఉనికిని తెలుసుకోండి.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ ఉనికి
12°41 – 1907′ ఉత్తర అక్షాంశాలు
77 – 84°40′ తూర్పు రేఖాంశాలు

7th Class Social Textbook Page No.87

ప్రశ్న 3.
అట్లాస్ సహాయంతో వివిధ పర్వత శ్రేణుల విస్తరణ, వాటిలో ఎత్తైన శిఖరాలను తెలుసుకోండి.
జవాబు:
ప్రపంచంలోని పర్వత శ్రేణులు, ఎత్తైన శిఖరాలు :

  1. హిమాలయ పర్వత శ్రేణులు (ఎవరెస్ట్) పామీరు శ్రేణి – (కొంగుర్)
  2. కారకోరం శ్రేణి (K)
  3. అండీస్ పర్వతాలు (అకాంగ్వా)
  4. కాకసస్ (ఎల్బర్స్) ఆర్ట్స్ పర్వతాలు – (మాంట్ బ్లాంక్)
  5. రాకీ పర్వతాలు – (ఎల్బర్ట్) అపలేచియన్ పర్వతాలు – (మిచెల్)
  6. యూరల్ పర్వతాలు – (నారోదయ) ఆరావళి పర్వతాలు – (గురుసికార్)
  7. వింధ్య, సాత్పూరా పర్వతాలు
  8. వాస్ పర్వతాలు
  9. బ్లాక్ ఫారెస్ట్ పర్వతాలు
  10. డ్రాకెన్బర్గ్ పర్వతాలు మొదలైనవి.

AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం

ప్రశ్న 4.
అట్లాస్ అంతర్జాలం సహాయంతో భారతదేశం యొక్క భౌతిక స్వరూపాలను గురించి తెలుసుకోండి.
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 30

7th Class Social Textbook Page No.93

ప్రశ్న 5.
ప్రాచీన, మధ్యయుగ భారతదేశానికి చెందిన వివిధ రాజవంశాల పటాలను గురించి తెలుసుకోండి.
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 31

ప్రాజెక్టు పని

ట్రేసింగ్ టెక్నిక్ (అచ్చుగుద్దడం)ను ఉపయోగించి వివిధ ఖండాలు, భారతదేశం, ఆంధ్రప్రదేశ్ మరియు మీ జిల్లా రాజకీయ పటాలతో స్వయంగా అట్లాసు తయారు చేయండి.
జవాబు:
1.
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 6
2.
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 7
3.
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 8
4.
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 9

AP Board 7th Class Social Solutions Chapter 7 మొఘల్ సామ్రాజ్యం

SCERT AP 7th Class Social Study Material Pdf 7th Lesson మొఘల్ సామ్రాజ్యం Textbook Questions and Answers.

AP State Syllabus 7th Class Social Solutions 7th Lesson మొఘల్ సామ్రాజ్యం

7th Class Social 7th Lesson మొఘల్ సామ్రాజ్యం Textbook Questions and Answers

కింది తరగతులలోని విషయ పునశ్చరణ

AP Board 7th Class Social Solutions Chapter 7 మొఘల్ సామ్రాజ్యం 1
పటాన్ని పరిశీలించి ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రశ్న 1.
మీరు ఎప్పుడైనా ఈ పై చిత్రాన్ని చూశారా?
జవాబు:
ఈ చిత్రం ఎర్రకోట. నేను చూసాను.

ప్రశ్న 2.
ఈ చిత్రం గురించి కొన్ని విషయాలు చెప్పగలరా?
జవాబు:

  1. ఈ కోటను మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించాడు.
  2. అంత:పుర భవనంగా ఎర్రకోట నిర్మించబడింది.
  3. దివాన్-ఇ-ఆమ్, దివాన్-ఇ-ఖాస్ వంటి ఇతర నిర్మాణాలున్నాయి.

AP Board 7th Class Social Solutions Chapter 7 మొఘల్ సామ్రాజ్యం

ప్రశ్న 3.
చరిత్రలో ఈ కోట యొక్క ప్రాముఖ్యత మీకు తెలుసా?
జవాబు:
స్వాతంత్ర్య దినోత్సవం రోజు భారత ప్రధానమంత్రి, ఇక్కడి నుండే జాతినుద్దేశించి ప్రసంగిస్తారు.

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

I. క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
మొఘల్ చక్రవర్తులలో అక్బర్ ప్రముఖ స్థానం పొందుటకు గల కారణాలను విశ్లేషించండి.
జవాబు:
మొఘల్ చక్రవర్తులలో అక్బర్ ప్రముఖ స్థానం పొందుటకు గల కారణాలు :

  1. అక్బర్ సువిశాల సామ్రాజ్యాన్ని నిర్మించాడు. దాదాపు భారతావనినంతటిని సమైక్యపరచి ఒకే అధికారము క్రిందకి తెచ్చినాడు.
  2. అక్బర్ గొప్ప పరిపాలనాదక్షుడు – విశాల సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
  3. అక్బర్ ప్రజా సంక్షేమాభిలాషి – సంక్షేమ పాలనను అందించాడు.
  4. సారస్వత కళాభిమాని – ఇతని ఆస్థానములో అనేక మంది ప్రముఖ కవులు కలరు.
  5. అక్బర్ పరమత సహనాన్ని చాటినాడు – దీన్-ఇ-ఇలాహి అనే నూతన మతాన్ని స్థాపించాడు.
  6. గొప్ప సాంఘిక సంస్కర్త – ఆనాటి సమాజంలోని సాంఘిక దురాచారాలను అక్బర్ నిషేధించినాడు.
  7. అక్బర్ గొప్ప భవన నిర్మాత – ఫతేపూర్ సిక్రి నగరం, బులంద్ దర్వాజా, పంచమహల్, ఇబాదత్ ఖానా మొదలైన కట్టడాలు అక్బర్ వాస్తు కళాభిమానానికి తార్కాణాలు.
  8. అక్బర్ ప్రవేశపెట్టిన పాలనా సంస్కరణలు – రాజ్యాన్ని సుబాలుగా, సర్కారులుగా, పరగణాలుగా విభజించుట, భూమిని సర్వే చేయించి, పంట ఆధారంగా శిస్తు నిర్ణయం, జట్జ్ విధానం, మన్సబ్ దారీ విధానం మొదలైనవి అక్బర్ పాలనలో అగ్రస్థానంలో నిలిపినాయి.

ప్రశ్న 2.
వాస్తు మరియు శిల్పకళలకు మొఘలులు చేసిన కృషిని అభినందించండి.
జవాబు:
కళ మరియు వాస్తు శిల్పం :

  1. మొఘలుల కాలంలో వాస్తు శిల్పంలో కొత్త సాంప్రదాయం ప్రారంభమైంది.
  2. స్మారక చిహ్నాలు ఎత్తైన స్తంభాలపై నిర్మించబడ్డాయి.
  3. కట్టడాలలో పాలరాయిని ఎక్కువగా ఉపయోగించారు. నీరు ప్రవహించే ఫౌంటేన్లను విస్తృతంగా నిర్మించారు.
  4. పాలరాళ్ళతో పాటు భవనాలను అలంకరించడానికి అపురూపమైన రంగు రాళ్ళను ఉపయోగించారు. ఫతేపూర్ సిక్రి
  5. చిత్తోర్ మరియు రణతంబోర్ మీద సైనిక విజయాల తరువాత అక్బర్ తన మత గురువు షేక్ సలీం చిస్తి గౌరవార్థం రాజధానిని ఆగ్రా నుండి సిక్రీకి మార్చాలనుకొన్నాడు. అందుకోసం ప్రణాళికాబద్దమైన నగరాన్ని నిర్మించాడు.
  6. ఆ నగరానికి ‘ఫతేబాద్’ అని పేరు పెట్టాడు. ఫతే అనగా ‘విజయం ‘ అని అర్థం. తర్వాత కాలంలో ఇది ఫతే పూర్ సిక్రీగా పిలువబడింది.
  7. భారతదేశంలో మొఘలుల నిర్మాణాలలో ఇప్పటికీ మిగిలి వున్న కట్టడాలలో ఫతేపూర్ సిక్రీ ఒకటి.

ప్రశ్న 3.
“శివాజీ ” వ్యక్తిత్వం ఎందువలన కీర్తించదగినదో వివరించండి.
జవాబు:

  1. శివాజీ హిందూ మతస్తుడైనప్పటికీ ఇతర మతాలను కూడా గౌరవించాడు.
  2. అతను స్త్రీలను, ఇతర మత గ్రంథాలను, గౌరవించవలసిందిగా తన సైన్యాన్ని ఆదేశించాడు.
  3. అతడు ఎక్కువ విద్యావంతుడు కాకపోయినప్పటికీ ఎన్నో తెలివితేటలు, పరిపాలనా సామర్థ్యాలు, యుద్ధ వ్యూహాలలో నేర్పరి.
  4. తన సైన్యానికి గెరిల్లా యుద్ధవిద్యలో శిక్షణనిచ్చి వారిని గొప్ప యోధులుగా తయారుచేశాడు.
  5. నావికా బలాన్ని కూడా అభివృద్ధి చేసాడు. ఎంతగానో ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు.
  6. ప్రజలకు ఒక ఆదర్శప్రాయునిగా నిలిచాడు.
  7. కొండజాతి ప్రజలైన మావళీలతో స్నేహం చేసి వారిలో జాతీయ భావనను నింపాడు.
  8. శివాజీ యొక్క దేశ భక్తి, జాతీయ భావన ఆ తరువాత కాలంలో జాతీయ నాయకులైన తిలక్, సావర్కర్ మొదలైన వారికి ఎంతో ప్రేరణగా నిలిచాయి.

AP Board 7th Class Social Solutions Chapter 7 మొఘల్ సామ్రాజ్యం

ప్రశ్న 4.
షేర్షా సూర్ గురించి క్లుప్తంగా తెల్పండి.
జవాబు:
షేర్షా (క్రీ.శ. 1540-1545) :

  1. షేర్షా సూర్ ఒక ఆఫ్ఘన్ నాయకుడు. అతను స్వశక్తితో అభివృద్ధి చెందాడు. హుమాయూన్ ను రెండు సార్లు ఓడించి ఢిల్లీలో ‘సూర్’ రాజవంశాన్ని స్థాపించాడు.
  2. ఢిల్లీపై నియంత్రణ సాధించిన తర్వాత అతడు అనేక ఇతర ముఖ్యమైన యుద్ధాలలో విజయం సాధించాడు. తన సామ్రాజ్యాన్ని కాబూల్ నుండి బెంగాల్ మరియు మాళ్వా వరకు విస్తరించాడు.
  3. అతడు గొప్ప యుద్ధ వీరుడే కాక పరిపాలనాదక్షుడు కూడా. ఐదు సంవత్సరాల పరిపాలనలో అతడు భూమిశిస్తు పద్ధతి, నూతన ద్రవ్య విధానం, తపాలా సేవలు వంటి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాడు. క్రీ.శ. 1545లో ఫిరంగి ప్రేలుడు కారణంగా అతడు చనిపోయాడు.
  4. షేర్షా తరువాతి వారసుల అసమర్థత కారణంగా హుమాయూన్ క్రీ.శ. 1555లో ఢిల్లీని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు.

ప్రశ్న 5.
భారతదేశ పటంలో ఈ క్రింది ప్రదేశాలు గుర్తించండి.
1) ఆగ్రా 2)ఢిల్లీ 3) పంజాబ్ 4) ఫతేపూర్ సిక్రీ
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 7 మొఘల్ సామ్రాజ్యం 2

ప్రశ్న 6.
మొఘల్ సామ్రాజ్యం యొక్క కాలక్రమ చార్టును తయారుచేయండి.
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 7 మొఘల్ సామ్రాజ్యం 3

II. సరియైన సమాధానాన్ని ఎంచుకోండి.

1. అక్బర్ ఆస్థానంలోని గొప్ప సంగీత విద్వాంసుడు
ఎ) తాన్ సేన్
బి) అబుల్ ఫజల్
సి) రాజా బీర్బల్
డి) రాజా తోడర్మల్
జవాబు:
ఎ) తాన్ సేన్

2. భిన్నమైన దానిని గుర్తించండి.
ఎ) అక్బర్
బి) హుమాయూన్
సి) షేర్షా
డి) జహంగీర్
జవాబు:
సి) షేర్షా

3. ఇబాదత్ ఖానా ఎక్కడ ఉంది? (ఎ )
ఎ) ఫతేపూర్ సిక్రి
బి) ఢిల్లీ
సి) జహంగీరాబాద్
డి) ఔరంగాబాద్
జవాబు:
ఎ) ఫతేపూర్ సిక్రి

4. సరి కాని జతను గుర్తించండి.
ఎ) కుతుబ్ మీనార్ – హుమాయూన్
బి) తాన్సె న్ – రాగ్ దీపక్
సి) అబుల్ ఫజల్ – అక్బర్నామా
డి) శివాజీ – రాయగఢ్
జవాబు:
ఎ) కుతుబ్ మీనార్ – హుమాయూన్

5. శివాజీకి సమకాలీన మొఘల్ రాజు ఎవరు?
ఎ) అక్బర్
బి) బాబర్
సి) జహంగీర్
డి) ఔరంగజేబు
జవాబు:
డి) ఔరంగజేబు

AP Board 7th Class Social Solutions Chapter 7 మొఘల్ సామ్రాజ్యం

III. కింది వాటిని జతపరచండి.

గ్రూపు-ఎ గ్రూపు-బి
1. రాగి నాణెం ఎ) షాజహాన్
2. మన్నబాదార్ బి) స్వీయ చరిత్ర
3. తాజ్ మహల్ సి) మంత్రి
4. తోడర్మ ల్ డి) దామ్
5. తుజుక్-ఇ- జహంగీరీ ఇ) ర్యాంక్

జవాబు:

గ్రూపు-ఎ గ్రూపు-బి
1. రాగి నాణెం డి) దామ్
2. మన్నబాదార్ ఇ) ర్యాంక్
3. తాజ్ మహల్ ఎ) షాజహాన్
4. తోడర్మ ల్ సి) మంత్రి
5. తుజుక్-ఇ- జహంగీరీ బి) స్వీయ చరిత్ర

7th Class Social Studies 7th Lesson మొఘల్ సామ్రాజ్యం InText Questions and Answers

7th Class Social Textbook Page No.11

ప్రశ్న 1.
అక్బర్ – బీర్బల్ గురించి కొన్ని కథలను సేకరించండి.
జవాబు:
1. అరచేతిలో వెంట్రుకలు
ఒకనాడు అక్బర్ పాదుషా వారికి బీర్బల్ తో హాస్యమాడాలనిపించింది. నిండు సభలో బీర్బల్ నుద్దేశించి “బీర్బల్ మాకొక సందేహం ఉంది, అది నువ్వే తీర్చాలి” అన్నారు. “ప్రభువులకు సందేహమా, అది సామాన్యుడైన విదూషకుడు తీర్చడమా ? అదేమిటో సెలవియ్యండి జహాపనా” అన్నాడు వినమ్రంగా, మరేం లేదు మనందరకు తెలిసున్న విషయమే, అది ఎందువల్ల జరుగుతుందో తెలియక నిన్నడుగుతున్నాను, అని. ‘మన శరీరము అంతటా వెంట్రుకలు కొంతగాక కొంతయినా ఉన్నాయి కాని నా అరచేతుల్లో మాత్రము ఎందుకు లేవన్నది మా సందేహం అని ప్రశ్నించాడు అక్బర్. దానికి బీర్బల్ ఏమున్నది ప్రభూ ! మీరు చేసే దానధర్మాల వల్ల తమ అరచేతులలో వెంట్రుకలు మొలవడం లేదు’ అన్నాడు. అప్పుడు అక్బర్-బీర్బలను తికమక పెట్టాలని “మరి నీ అరచేతిలో ఎందుకు మొలవలేదని” ప్రశ్నించాడు. ఏమున్నది ప్రభూ మీరిచ్చే కానుకలు, ధర్మాలు అందుకోవడంలో అరచేతులు అరిగిపోయి వెంట్రుకలు మొలవలేదు ప్రభూ” అంటూ చమత్కారంగా సమాధానమిచ్చాడు తీర్బల్.

2. మామిడి పళ్ళ విందు
ఒకనాడు అక్బర్ చక్రవర్తి మామిడి పళ్ళు ఆరగిస్తున్న సమయంలో బీర్బల్ అంతఃపురంలోకి వచ్చాడు. బీర్బలను చూసిన అక్బర్ ఆప్యాయంగా ఆహ్వానించి మామిడిపళ్ళను తినమని అందించాడు. బీర్బల్ కూడా వాటి యందు ఆసక్తి కలి, అందుకుని తినసాగాడు. అయితే అక్బర్ తాను తిన్న మామిడి టెంకలను బీర్బల్ ముందున్న టెంకలలో వేయసాగాడు. కొంత సేపటి తర్వాత ఏమయ్యా బీర్బల్ అంత ఆకలితో ఉన్నావా, చాలా కాయలు తిన్నట్లున్నావు” అన్నాడు. అందుకు బీర్బల్ కొంచెం మొహమాటంగా అవును ప్రభు అన్నాడు !” అప్పుడు అక్బర్, బీర్బల్లో బాగా ఆకలితో ఉన్నట్లున్నావు మరికొన్ని పళ్ళు తినమని పరాచకమాడాడు. దానికి బీర్బల్ “ప్రభు నాకు కడుపు నిండి పోయింది, ఇక ఒక్క పండును కూడా తినలేను, కాని మీరు నా కన్నా ఎక్కువ ఆకలితో ఉన్నట్లున్నారు. నేను టెంకలనయినా వదలివేసాను, తమరు ఒక్క టెంకను కూడా వదలకుండా, టెంకలను సైతం తిన్నారు, కావున మీరే నాలుగు పళ్ళు తినండి” అంటూ చమత్కరించాడు. బీర్బల్ చమత్కారానికి అక్బర్ చక్రవర్తి ఆనందించాడు.

7th Class Social Textbook Page No.13

ప్రశ్న 2.
ఔరంగజేబు తన గురువుకి రాసిన లేఖను గ్రంథాలయం / ఇంటర్నెట్ నుండి సేకరించండి. తరగతి గదిలో చర్చించండి.
జవాబు:
ఔరంగజేబు తన ఉపాధ్యా యునికి వ్రాసిన లేఖ

అయ్యా ! మీరు నా నుండి ఏమి ఆశిస్తున్నారు? ఒక ప్రసిద్ధ ముస్లిం పాలకుడి హోదాలో నేను మిమ్మల్ని నా కోర్టు లోకి తీసుకోవాలని మీరు అడగడంలో ఏదైనా సమర్థత ఉందా.? మీరు నాకు సరైన రీతిలో విద్యను అందించి ఉంటే మీ అభ్యర్ధన సహేతుకంగా ఉండేది. మంచి విద్యను పొందిన విద్యార్థి తన తండ్రిని గౌరవించినట్లే గురువును గౌరవించాలి. కానీ, మీరు నాకు ఏమి నేర్పించారు? మొదటగా, యూరప్ అంటే పోర్చుగల్ అనే చిన్న దీవి అని, ఆ దేశ రాజు ఒక్కడే గొప్పవాడని, తర్వాత స్థానం పోలండ్ రాజు, ఆ తర్వాత ఇంగ్లండ్ రాజు వస్తాడని మీరు నేర్పారు. ఫ్రాన్స్ మరియు స్పెయిన్ రాజులు మన దేశంలో చిల్లర పాలకుల లాంటి వారని, హిందుస్తాన్ రాజు ఆ రాజులందరి కంటే గొప్పవాడని, వారు మొత్తం ప్రపంచాన్ని జయించిన చక్రవర్తులు మరియు పర్షియా, ఉజ్బెక్, టార్టార్, రాజులని కూడా మీరు చెప్పారు. చైనా, తూర్పు చైనా, పెరూ, మచినా, హిందుస్థాన్ రాజుల పేర్లు చెబితేనే వణుకు పుడుతుంది.

ఆహ్ ! మీరు అద్భుతమైన చరిత్ర మరియు భౌగోళిక శాస్త్రాన్ని నేర్పించారు. నిజానికి ! బదులుగా, మీరు నాకు ప్రపంచంలో వివిధ దేశాల గురించి మరియు వారి విభిన్న ఆసక్తులు ఆ రాజుల బలాలు మరియు బలహీనతలు, వారి యుద్ధ వ్యూహాలు, వారి ఆచారాలు, మతాలు, ప్రభుత్వ విధానాలు, ప్రయోజనాలు చరిత్ర, పురోగతి, పతనం, ఎలాంటి విపత్తులు గురించి నాకు నేర్పించి ఉండాలి. మరియు పొరపాట్లు గొప్ప మార్పులకు మరియు విప్లవాలకు దారితీశాయి. మీరు నాకు ఈ విషయాలన్నీ నేర్పించి ఉండాలి. మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప వ్యక్తుల గురించి నేను మీ నుండి ఏమీ నేర్చుకోలేదు. మీరు వారి జీవిత చరిత్రల గురించి నాకు ఏమీ బోధించలేదు. అద్భుతమైన విజయాలు సాధించేందుకు వారు అనుసరించిన విధానాలు, వ్యూహాల గురించి మీరు బోధించలేదు.

నేను అరబిక్ చదవడం మరియు వ్రాయడం ఎలాగో నేర్చుకోవాలని మీరు కోరుకున్నారు. మీరు నా సమయాన్ని చాలా వరకు వృథా చేసారు. నేను పది నుండి పన్నెండేళ్లు కష్టపడితే తప్ప ప్రావీణ్యం పొందలేదు. బహుశా, మీ అభిప్రాయం ప్రకారం ఒక యువరాజు గొప్ప భాషావేత్త మరియు పరిపూర్ణ వ్యాకరణవేత్తగా మారడం చాలా గొప్ప విషయం. తన మాతృభాష, తన ప్రజల భాష మరియు పొరుగు రాష్ట్రాల భాషలను నేర్చుకోకుండా ఇతర భాషలు మరియు విదేశీ భాషలను నేర్చుకోవడం వల్ల ఈ గౌరవం పెరుగుతుందని మీరు అనుకోవచ్చు ! నిజానికి అతనికి ఈ భాషలు అవసరం లేదు.

రాజకుటుంబానికి చెందిన నా లాంటి వారికి చిన్నతనంలో సమయం చాలా విలువైనది. ఎందుకంటే మనం చాలా బాధ్యతలను మోయవలసి ఉంటుంది. మనకు అందుబాటులో ఉన్న పరిమిత సమయంలో చాలా విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చాలాకాలం పాటు అరబిక్ బోధించడంలో నా సమయాన్ని వృథా చేసారు. ఇది విసుగు పుట్టించింది. అరబిక్ అధ్యయనం నా జీవితంలో విషాదకరమైన సంఘటన. ఇది పనికిరాని అన్వేషణ. విపరీతమైన అయిష్టతతో నేర్చుకోవలసి వచ్చింది. అది నా తెలివిని కూడా మట్టుబెట్టింది. (అప్పట్లో పర్షియన్ అధికార భాష)

సంతోషకరమైన చిన్ననాటి జ్ఞాపకాలు శాశ్వతంగా భద్రపరచబడతాయని యువ మనస్సులపై శాశ్వత ముద్ర వేసే వేలకొద్దీ విషయాలు నేర్చుకోవచ్చని మరియు వారి ప్రభావం అతను గొప్ప బాధ్యతలను స్వీకరించడానికి మానసికంగా సిద్ధమవుతాడని మీకు తెలియదా? చట్టాలు ప్రార్ధనలు, శాస్త్రాలు అరబిక్ లో నేర్చుకునే బదులు మన మాతృభాషలో నేర్చుకోవడం సాధ్యం కాదా?

మీరు నాకు తత్వం బోధిస్తానని మా నాన్న షాజహాన్ కి చెప్పారు. నాకు అది స్పష్టంగా గుర్తుంది చాలా సంవత్సరాలుగా మీరు నాకు సంతృప్తిని కలిగించని అనేక విషయాల గురించి సగం జ్ఞానంతో మనస్సును పోషించారు. ఆ కల్పిత విషయాలన్నీ మానవ సమాజానికి ఏమాత్రం ఉపయోగపడవు. వాటిని అర్థం చేసుకోవడం చాలా కష్టం కానీ మర్చిపోవడం చాలా సులభం.

ఆ రకమైన ఊహాజనిత జ్ఞానాన్ని మీరు నాకు ఎంతకాలం నేర్పించారో నేను చెప్పలేను. చాలా తెలివైన వ్యక్తులను కూడా ఆశ్చర్యపరిచే మరియు గందరగోళానికి గురిచేసే వికారమైన మరియు భయంకరమైన పదజాలం మాత్రమే నాకు గుర్తుంది. మీ లాంటి అజ్ఞానాహంకారులు తమ చెడు గుణాలను దాచుకోవాలనుకునే వారు ఇలాంటి మాటలు సృష్టించి ఉండాలి. ఇలాంటి బొంబాయి మాటలు వింటూ, మీరు జ్ఞాన సర్వజ్ఞుడని భావించాలి! ఆ అద్భుతమైన పదాలు మీ లాంటి పండితులకే అర్ధమయ్యే కొన్ని అద్భుతమైన అంతర్గత అర్ధాలను కలిగి ఉన్నాయని భావించాలి !

మీరు నాకు విశ్లేషణాత్మక ఆలోచన ఉన్న వ్యక్తిగా శిక్షణ ఇచ్చి ఉండాలి. స్థిమిత మరియు చంచలమైన మనస్సు ఉన్న వ్యక్తిగా ఉండటానికి మీరు నాకు మెళకువలు నేర్పించారు ! మీరు నాకు విశ్వం యొక్క చట్టాలు మరియు గొప్పతనాన్ని మరియు జీవితం యొక్క ప్రాథమిక సూత్రాలను చెప్పాలి. మీరు నా మనస్సును ఈ రకమైన ఆచరణాత్మక తత్వశాస్త్రంతో నింపాలి. మీరు ఈ పనులు చేసి ఉంటే, అలెగ్జాండర్ తన గురువు అరిస్టాటిల్ పై చూపించిన గౌరవాన్ని నేను మీకు చూపించి ఉండేవాడిని. నేను మీకు అంతకంటే ఎక్కువ సహాయం చేసి ఉండేవాడిని.

ముఖస్తుతితో నన్ను ఆకాశానికి ఎత్తే బదులు, మంచి రాజుగా ఉండడానికి అవసరమైన విషయాలను మీరు నాకు నేర్పించి ఉండాలి. రాజుకు తన పౌరుల పట్ల ఉండే బాధ్యతల గురించి మరియు రాజు పట్ల వారి బాధ్యతల గురించి మీరు నాకు జ్ఞానాన్ని అందించాలి. నా సోదరుడితో యుద్ధంలోను కత్తిని ఉపయోగించాల్సిన రోజు వస్తుందని మీరు ముందే ఊహించి ఉండాలి. ఒక పట్టణాన్ని ఎలా ముట్టడించాలో మరియు గందరగోళంలో చెల్లాచెదరుగా ఉన్న సైనికులను ఎలా సమీకరించాలో మీరు నాకు నేర్పించి ఉండాలి. అయితే, నేను ఈ విషయాలన్నీ ఇతరుల నుండి నేర్చుకున్నాను, కానీ మీ నుండి కాదు.

కాబట్టి, ఇప్పుడు మీరు మీ గ్రామానికి వెళ్లాలి. నేను మీకు ఏ విధంగానూ సహాయం చేయను. మీరెవ్వరో ప్రజలకు తెలియదు. మీ జీవితాంతం ఒక సాధారణ పౌరుడిగా జీవించండి.

AP Board 7th Class Social Solutions Chapter 7 మొఘల్ సామ్రాజ్యం

ప్రశ్న 3.
ప్రస్తుత భారతదేశ అవుట్ లైన్ మ్యాప్ లో ఈ క్రింది ప్రదేశాలను గుర్తించండి.
ఢిల్లీ, ఆగ్రా, ఫతేపూర్ సిక్రి, చిత్తోర్ గఢ్, అహ్మద్ నగర్
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 7 మొఘల్ సామ్రాజ్యం 6

7th Class Social Textbook Page No.17

ప్రశ్న 4.
మొఘలుల కాలంలో వ్యవసాయ పన్ను విధించే విధానాన్ని గూర్చి మీ ఉపాధ్యాయునితో చర్చించండి.
జవాబు:
మొఘలుల కాలంలో వ్యవసాయ పన్ను విధించే విధానం :

  1. మొఘలులు రైతులకు అనుకూలంగా. రాజ్యానికి లాభదాయకంగా ఉండే పన్ను విధానాన్ని అభివృద్ధి చేసి అమలు చేసారు.
  2. గడచిన 10 సం||రాల ఉత్పత్తి, ధరల హెచ్చు తగ్గుల వివరాలను సేకరించి, వాటి ధరలను సగటున లెక్క కట్టి 1/3వ వంతు నుండి సగం వరకు శిస్తుగా నిర్ణయించారు.
  3. ఈ శిస్తును దామ్ లో చెల్లించేవారు.

7th Class Social Textbook Page No.21

ప్రశ్న 5.
అక్బర్ – బీర్బల్ కథల నుండి మీకు నచ్చిన కథను తీసుకుని ఆ కథలో అక్బర్ – బీర్బల్ మధ్య జరిగిన సంభాషణను మీ ఉపాధ్యాయుని సహాయంతో పాత్రపోషణ చేయండి.
జవాబు:
విద్యార్థి కృత్యం

7th Class Social Textbook Page No.23

ప్రశ్న 6.
అక్బర్ ఆస్థానంలోని ‘నవరత్నాల’ పేర్లు సేకరించండి.
జవాబు:

  1. అబుల్ ఫజల్,
  2. రాజా తోడర్మల్,
  3. అబ్దుల్ రహీం ఖాన్-ఇ-ఖానా,
  4. రాజా బీర్బల్ (మహేష్ దాస్),
  5. ఫైజీ,
  6. ఫకీర్ అజియోద్దీన్,
  7. తాన్ సేన్,
  8. రాజా మాన్ సింగ్,
  9. ముల్లాదో పియాజ.

ఆలోచించండి – ప్రతిస్పందించండి

7th Class Social Textbook Page No.7

ప్రశ్న 1.
మొఘలు సామ్రాజ్యం ఉత్తర భారతదేశంలోనే మొదట స్థాపించబడటానికి కారణాలు విశ్లేషించండి.
జవాబు:
మొఘలు సామ్రాజ్యం ఉత్తర భారతదేశంలోనే మొదట స్థాపించబడటానికి కారణాలు :

  1. భారతదేశంలో (మొదట) మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించినది ఆఫ్ఘన్ పాలకుడైన బాబర్.
  2. బాబర్ దండయాత్ర సమయమున ఉత్తర భారతము అనేక చిన్న చిన్న స్వతంత్ర రాజ్యాలుగా విభజింపబడి, – అంతఃకలహాలతో, అనైక్యతతో ఉండెను.
  3. నాడు రాజకీయ సుస్థిరత చేకూర్చే, విదేశీ దాడులను ప్రతిఘటించే రాజులెవ్వరూ లేకపోవడం.
  4. ఆప్షన్ నుండి ఉత్తర భారతదేశంనకు సైన్యంను నడుపుటకు, పాలనకు అనుకూలంగా ఉండటం.
  5. స్థానిక (ఉత్తర భారత) పాలకులు బాబర్‌ను ఆహ్వానించటం.
  6. నాటి ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడి అసమర్థుడవ్వటం.

7th Class Social Textbook Page No.11

ప్రశ్న 2.
అక్బర్ జీవితంలో బైరాం ఖాన్ లేకపోతే మొఘల్ సామ్రాజ్యంలో ఏమి జరిగి ఉండేది?
జవాబు:

  1. అక్బర్ తండ్రి హుమాయూన్ చనిపోయేనాటికి అక్బర్ వయస్సు కేవలం 13 సంవత్సరాలు. అతని సంరక్షకుడు బైరాం ఖాన్ అక్బర్ తరపున పరిపాలనా వ్యవహారాలు సాగించాడు.
  2. బైరాం ఖాన్ మార్గదర్శకత్వంలో అక్బర్ రెండవ పానిపట్టు యుద్ధం, గ్వాలియర్, జోధ్ పూర్, అజ్మీర్, మాల్వా మరియు చునార్ దుర్గములు ఆక్రమణలు జరిగాయి.
  3. బైరాం ఖాన్ సంరక్షకుడుగా లేకపోతే అక్బరు ఈ విజయాలు, మొఘల్ సామ్రాజ్యం కైవసం అయ్యేవి కావు.
  4. మొఘల్ సామ్రాజ్యం హేము పరమయ్యేది, మొఘల్స్ పాలన అంతమై ఉండేది.

AP Board 7th Class Social Solutions Chapter 7 మొఘల్ సామ్రాజ్యం

ప్రశ్న 3.
చాలామంది రాజపుత్ర రాజులు అక్బర్ ఆస్థానంలో చేరారు. కాని రాణాప్రతాప్ చేరలేదు. ఎందువలన?
జవాబు:

  1. అనేక మంది రాజపుత్రులు తమ కుమార్తెలను అక్బర్ కు ఇచ్చి వివాహం చేసి లొంగిపోయారు.
  2. కాని మేవాడ్ పాలకుడైన మహారాణా ప్రతాప్ అక్బర్ తో జీవితాంతం పోరాటం చేసాడే తప్ప, అక్బర్ ఆస్థానంలో చేరలేదు.
  3. మహారాణా ప్రతాప్ ధైర్యసాహసములు కల్గి ఉండుట.
  4. హైందవ సంస్కృతి పరిరక్షణకు పూనుకొనుట.
  5. స్వతంత్రంగా పాలన కొనసాగించాలని భావించుట, స్వేచ్ఛా పిపాసి అగుట.
  6. రాణా ప్రతాప్ సైన్యంలో అనేక మంది వీరులు కలరు. దేశభక్తి (రాజ్యభక్తి) కల్గిన సైనికులు విరివిగా కలరు.

7th Class Social Textbook Page No.19

ప్రశ్న 4.
ప్రస్తుత భూమి శిస్తు పద్ధతిని మొఘలుల కాలం నాటి భూమి శిస్తు పద్దతితో పోల్చండి.
జవాబు:
మొఘల్ కాలం నాటి భూమిశిస్తు పద్ధతి, ప్రస్తుత భూమి శిస్తు పద్ధతికి పోలికలు :

  1. నాడు భూమిశిస్తును రైతులు ప్రత్యక్షంగా రాజుకు చెల్లించేవారు. నేడు కూడా రైత్వారీ పద్ధతి అమల్లో ఉంది.
  2. నాడు భూమిశిస్తు దామ్ లో (ద్రవ్యరూపంలో) చెల్లించేవారు. నేడు కూడా ద్రవ్యరూపంలోనే చెల్లిస చెలిస్తుంటారు.
  3. భూమి శిస్తును నిర్ణయించడానికి భూమిసారంను అంచనా వేసి నిర్ణయించేవారు. నేడు కూడా అలాగే నిర్ణయిస్తున్నారు.
  4. కరువు, కాటకాల సమయంలో భూమి శిస్తు తగ్గించడం లేదా రద్దు చేయటం జరుగుతుండేదానాడు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది.

అన్వేషించండి

7th Class Social Textbook Page No.9

ప్రశ్న 1.
షేర్షా అధికారంలోకి రావడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి?
జవాబు:
షేర్షా అధికారంలోకి రావడానికి దారి తీసిన పరిస్థితులు :

  1. షేర్షా యుద్ధ నిర్వహణలో నాటి సమకాలీన చక్రవర్తులలో అగ్రగణ్యుడు కావటం.
  2. నాటి సమకాలీన మొఘల్ చక్రవర్తి అతనిని ఎదుర్కోలేకపోవటం.
  3. షేర్ షా సూర్ జాగీర్దారుగ, బీహార్ కొలువులో సంపాదించిన అనుభవం.
  4. షేర్షా రాజనీతి చతురత, నాటి పాలకులలో లోపించుట.
  5. నాటి రాజులలోని అనైక్యత.

7th Class Social Textbook Page No.17

ప్రశ్న 2.
“దీన్-ఇ-ఇలాహి మతం ప్రజాదరణ పొందలేకపోయింది” – ఎందువలన? మీ ఉపాధ్యాయుణ్ణి అడిగి తెలుసుకోండి.
జవాబు:
దీన్-ఇ-ఇలాహి మతం ప్రజాదరణ పొందలేకపోవటానికి కారణం :

  1. ఈ మతమును స్వీకరించమని ఎవ్వరిని నిర్బంధము చేయలేదు.
  2. మత సూత్రముల వ్యాప్తికి అశోకుని వలె ప్రత్యేక కృషి గావింపలేదు.
  3. మత సూత్రములు సామాన్య మానవులకు అందుబాటులో లేకపోవుట వలన.
  4. అక్బరు మరణముతో దీనిని ముందుకు తీసుకువెళ్ళేవారు లేకపోవటంతో ఈ మతము అదృశ్యమయ్యెను.
  5. ఈ మతము సమకాలికులైన సాంప్రదాయ ముస్లిమ్ కు, క్రైస్తవ మిషనరీలకు సంతృప్తి నొసంగలేదు. కావున వారు ఈ దీన్-ఇ-ఇలాహి మతమును పరిహసించిరి.

7th Class Social Textbook Page No.23

ప్రశ్న 3.
అంతర్జాలం లేదా గ్రంథాలయ పుస్తకాలలో శోధించి, మొఘలుల కాలం నాటి మినియేచర్ చిత్రలేఖనం మరియు దాని ప్రత్యేక లక్షణాలను గూర్చి తెలుసుకోండి.
జవాబు:

  1. మొఘల్ చిత్రలేఖనంకు దక్షిణాసియాలో ఒక ప్రత్యేక శైలి ఉంది. ఇది పర్షియన్ సూక్ష్మ చిత్రలేఖనం నుండి ఉద్భవించింది.
  2. మొఘల్ (సూక్ష్మ) మినియేచర్ చిత్రలేఖనం చిత్రకారులు ఇష్టపడే బోల్డ్, స్పష్టమైన రంగుల మిశ్రమం.
  3. ఈ సూక్ష్మ చిత్రాలు చాలా చిన్నవి, (కొన్ని అంగుళాలు మించి ఉండవు) ముదురు రంగులో ఉంటాయి మరియు మాన్యు లు మరియు ఆర్ట్ పుస్తకాలు వివరించే పెయింటింగ్లు.
  4. కొన్ని పంక్తులకు ఒకే వెంట్రుకతో చేయబడిన బ్రష్ ను ఉపయోగించారు.
  5. ఫరూఖ్ బేగ్, బసవద్ హిందూ, ఉస్తాద్ మన్సూర్, బిషందాస్ మొ|| వారు ప్రసిద్ధ చిత్రకారులు.

AP Board 7th Class Social Solutions Chapter 7 మొఘల్ సామ్రాజ్యం

ప్రాజెక్ట్ పని

ప్రశ్న 1.
మొఘల్ పరిపాలనా కాలానికి చెందిన నీకు నచ్చిన ఒక వారసత్వ కట్టడాన్ని గూర్చి సంక్షిప్తంగా వ్రాసి, దానికి సంబంధించిన చిత్రాన్ని సేకరించండి.
జవాబు:
నాకు నచ్చిన మొఘల్ కట్టడాలు ఎర్రకోట మరియు తాజ్ మహల్.

AP Board 7th Class Social Solutions Chapter 7 మొఘల్ సామ్రాజ్యం 4
ఎర్రకోట :
మొఘల్ చక్రవర్తి షాజహాన్ రాజధాని అయిన షాజహానాబాద్లో రాజ కుటుంబం నివసించే అంతఃపుర భవనంగా ఎర్రకోట నిర్మించబడింది. ఎర్రకోట షాజహాన్ కాలం నాటి మొఘలుల సృజనాత్మక నిర్మాణ శైలికి తార్కా ణం. ఇది దివాన్-ఇ-ఆమ్, దివాన్-ఇ-ఖాస్, మోతీ మసీదు, హయత్ బక్షి బాగ్ మరియు రంగ మహల్ వంటి ఇతర ముఖ్యమైన నిర్మాణాలను కలిగి ఉంది.

AP Board 7th Class Social Solutions Chapter 7 మొఘల్ సామ్రాజ్యం 5
తాజ్ మహల్ :
తాజ్ మహల్ తెల్ల పాలరాతితో కట్టబడిన సమాధి. ఇది భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నందు ఆగ్రాలో ఉంది. దీనిని షాజహాన్ తన భార్య అయిన ముంతాజ్ ప్రేమకు గుర్తుగా నిర్మించాడు. తాజ్ మహల్ మొఘలుల వాస్తు శిల్పానికి చక్కటి ఉదాహరణ. ఇది ప్రపంచ ఏడు వింతలలో ఒకటిగా పేరు పొందింది. తాజ్ మహల్ మొఘలుల యొక్క ఆభరణంగా విస్తృతంగా గుర్తించబడింది మరియు ప్రపంచ వారసత్వ సంపదలో ఒకటిగా కీర్తించబడటమే కాకుండా మొఘలుల కళావైభవంలో కలికితురాయి వంటిదిగా గుర్తింపు పొందినది.

AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు

These AP 9th Physical Science Important Questions and Answers 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు will help students prepare well for the exams.

AP Board 9th Class Physical Science 12th Lesson Important Questions and Answers ప్రమాణాలు మరియు గ్రాఫులు

9th Class Physical Science 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
ప్రమాణం అనగానేమి?
జవాబు:
కొలతలను పోల్చుటకు ఉపయోగించే ఏ ప్రామాణిక కొలతనైనా ప్రమాణం అంటారు.

ప్రశ్న 2.
వివిధ వస్తువులను కొలవడానికి వివిధ ప్రమాణాలను ఎందుకు వినియోగిస్తాము?
జవాబు:
పదార్థాల పరిమాణాలను అనుసరించి వివిధ ప్రమాణాలను వినియోగిస్తాము.

ప్రశ్న 3.
MKS పద్ధతిలో ప్రాధమిక రాశులను రాయుము.
జవాబు:
ద్రవ్యరాశి (m), పొడవు (l) మరియు కాలం (t).

ప్రశ్న 4.
ప్రాథమిక రాశులు అనగానేమి?
జవాబు:
మరే ఇతర పరిమాణాలలోనూ వ్యక్తపరచడానికి వీలులేని భౌతిక రాశులను ప్రాథమిక రాశులు అంటారు.

ప్రశ్న 5.
ప్రాథమిక ప్రమాణం అనగానేమి?
జవాబు:
ప్రాథమిక రాశులను వ్యక్తపరచడానికి వినియోగించే ప్రమాణాలను ప్రాథమిక ప్రమాణాలు అంటారు.

AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు

ప్రశ్న 6.
MKS లో ప్రాథమిక ప్రమాణాలను రాయుము.
జవాబు:
మీటరు, కిలోగ్రాము మరియు సెకను.

ప్రశ్న 7.
CGS పద్ధతి అనగానేమి?
జవాబు:
సెంటీమీటరు, గ్రాము మరియు సెకను.

ప్రశ్న 8.
SI పద్ధతి అనగానేమి? అది ఎప్పుడు ప్రవేశపెట్టబడింది?
జవాబు:
SI పద్దతి అనగా అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతి. ఇది 1971లో ప్రవేశపెట్టబడింది.

ప్రశ్న 9.
SI పద్ధతికి జోడించిన కొన్ని ప్రాథమిక రాశులను రాయుము.
జవాబు:
విద్యుత్, కాంతి తీవ్రత, పదార్ధ పరిమాణం, ఉష్ణోగ్రత మరియు సమతల కోణం.

ప్రశ్న 10.
MKS, SI పద్దతులలో తేడా ఏమిటి?
జవాబు:

  1. MKS పద్ధతిలో మూడు ప్రాథమిక రాశులు మాత్రమే ఉన్నవి. అవి పొడవు, ద్రవ్యరాశి, కాలం.
  2. SI పద్ధతిలో ఎనిమిది ప్రాథమిక రాశులు ఉన్నాయి. అవి పొడవు, ద్రవ్యరాశి, కాలం, విద్యుత్, కాంతి తీవ్రత, పదార్థ పరిమాణం, ఉష్ణోగ్రత మరియు సమతల కోణం.

ప్రశ్న 11.
ఉత్పన్న రాశి అనగానేమి?
జవాబు:
ఏ రాశులైతే ప్రాథమిక రాశులను గుణించడం లేదా భాగించడం లేదా రెండూ చేయడం ద్వారా ఏర్పడతాయో వాటిని ఉత్పన్న రాశులు అంటారు.

ప్రశ్న 12.
ఉత్పన్న ప్రమాణాలు అనగానేమి?
జవాబు:
ప్రాథమిక ప్రమాణాల నుండి ఉత్పన్నమయ్యే ప్రమాణాలను ఉత్పన్న ప్రమాణాలు అంటారు.

AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు

ప్రశ్న 13.
వైశాల్యం, ఘనపరిమాణాలకు ఉత్పన్న ప్రమాణాలను రాయుము.
జవాబు:
వైశాల్యం = m² (మీటరు²) ; ఘనపరిమాణం = m³ (మీటరు)

ప్రశ్న 14.
బలం యొక్క ప్రమాణాలను ఏఏ ప్రాథమిక ప్రమాణాల ద్వారా వ్యక్తపరచవచ్చును?
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 1
కావున బలం ప్రమాణాలను కి.గ్రా., మీటరు, సెకను అనే మూడు ప్రాథమిక ప్రమాణాలను ఉపయోగించి వ్యక్తపరచ వచ్చును.

ప్రశ్న 15.
కిలోమీటరును మీటరుగా మార్చుటకు వినియోగించు మార్పిడి గుణకం ఏది?
జవాబు:
1000.

ప్రశ్న 16.
మీటరను కిలోమీటర్ లోకి మార్చుటకు వినియోగించు మార్పిడి గుణకం ఏది?
జవాబు:
10-3

ప్రశ్న 17.
కి.మీ./గం. ను మీ./సె. లలోకి మార్చుటకు మార్పిడి గుణకాన్ని రాయుము.
జవాబు:
[latex]\frac{8}{18}[/latex]

ప్రశ్న 18.
శాస్త్రవేత్తల పేర్ల మీద గల కొన్ని ప్రమాణాలను రాయుము.
జవాబు:
న్యూటన్ (N), పాస్కల్ (Pa), జౌల్ (J), వాట్ (W) మొదలగునవి.

ప్రశ్న 19.
గ్రాఫు అనగానేమి?
జవాబు:
రెండు రాశుల మధ్య సంబంధాన్ని తెలియజేసే పటమే గ్రాఫు.

ప్రశ్న 20.
స్వతంత్ర రాశులు, ఆధారిత రాశులు అనగానేమి?
జవాబు:

  1. ప్రయోగంలో ఏ రాశి విలువలు మనచేత నియంత్రించబడతాయో లేదా నిర్ణయించబడతాయో ఆ రాశులను స్వతంత్ర రాశులు అంటారు.
  2. ప్రయోగంలో ఏ రాశి విలువలు స్వతంత్ర రాశి విలువలకు అనుగుణంగా మార్పు చెందుతాయో ఆ రాశులను ఆధారిత రాశులు అంటారు.

ప్రశ్న 21.
X- అక్షంపై ఎటువంటి రాశిని తీసుకుంటారు?
జవాబు:
స్వతంత్ర రాశిని.

AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు

ప్రశ్న 22.
గ్రాఫు పేపర్ పై ‘గళ్ళు’ అనగానేమి?
జవాబు:
గ్రాఫు పేపర్ పై మందపాటి మరియు సన్నని, అడ్డంగా మరియు నిలువుగా గీయబడిన రేఖలు ఉంటాయి. ఈ రేఖలు ఖండించుకోవడం వలన ఏర్పడినవే గళ్ళు లేదా చదరాలు.

ప్రశ్న 23.
‘వ్యాప్తి’ అనగానేమి?
జవాబు:
గరిష్ట మరియు కనిష్ట విలువల మధ్య భేదాన్ని ‘వ్యాప్తి’ అంటారు.
వ్యాప్తి = గరిష్ట విలువ – కనిష్ట విలువ

ప్రశ్న 24.
‘స్కేలింగ్’ అనగానేమి?
జవాబు:
X – అక్షం మరియు Y – అక్షం పై విలువలను గుర్తించడాన్ని ‘స్కేలింగ్’ అంటారు.

ప్రశ్న 25.
‘స్కేలు’ అనగానేమి?
జవాబు:
అక్షాలపై తీసుకున్న విలువల అవధిని స్కేలు అంటారు.

ప్రశ్న 26.
X – అక్షం స్కేలును ఎలా కనుగొంటారు?
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 2

ప్రశ్న 27.
వక్రరేఖా గ్రాఫు అనగానేమి?
జవాబు:
గ్రాఫు వక్ర ఆకారంలో ఉంటే ఆ గ్రాఫును వక్రరేఖా గ్రాఫు అంటారు.

ప్రశ్న 28.
హుక్ సూత్రం రాయుము.
జవాబు:
ఒక స్ప్రింగ్ యొక్క సాగుదల, దానిపై ప్రయోగించిన ద్రవ్యరాశికి అనులోమానుపాతంలో ఉంటుంది.

ప్రశ్న 29.
సరళరేఖా గ్రాఫు వాలు అనగానేమి?
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 3

ప్రశ్న 30.
గ్రాఫు వాలు అనగానేమి?
జవాబు:
గ్రాఫు X – అక్షంతో చేసే కోణం యొక్క tan విలువను గ్రాఫు వాలు అంటారు.
[latex]\tan \theta=\frac{\Delta \mathrm{y}}{\Delta \mathrm{x}}[/latex]

ప్రశ్న 31.
గ్రాఫు వైశాల్యం అనగానేమి?
జవాబు:
X – అక్షం, Y – అక్షం పై గల భౌతిక రాశుల లబ్ధం వలన ఏర్పడే మరొక భౌతిక రాశిని వివరించేదే గ్రాఫు వైశాల్యం.

ప్రశ్న 32.
స్థానభ్రంశం – కాలం గ్రాఫు వాలు (m) దేనిని వివరిస్తుంది?
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 4

ప్రశ్న 33.
త్వరణం కాలం గ్రాఫు వైశాల్యం దేనిని వివరిస్తుంది?
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 5

ప్రశ్న 34.
ఒక స్వేచ్ఛాపతన వస్తువు యొక్క కాలం-వేగం గ్రాఫు ఎలా ఉంటుందో ఊహించండి.
జవాబు:
సరళరేఖా గ్రాఫు.

ప్రశ్న 35.
బస్సు ప్రయాణం యొక్క దూరం-కాలం గ్రాఫు ఆకారం ఎలా ఉంటుంది?
జవాబు:
వక్రరేఖా గ్రాఫు.

ప్రశ్న 36.
నల్లబల్లపై రిత్విక్ ‘3 kgs పంచదార’ అని రాశాడు. ఒక ప్రశ్నను అడిగి పై వాక్యాన్ని సరిచేయుము.
జవాబు:
ప్రమాణాలు రాయాల్సినపుడు kg లను బహువచనంలో kgs గా రాయవచ్చా?

AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు

ప్రశ్న 37.
కార్తీక్ కి ‘3 న్యూటన్లు’ అనే పదాన్ని చూసి ఒక సందేహం కలిగింది. ఆ సందేహం ఏమై ఉంటుంది?
జవాబు:
న్యూటన్లలో ఏ భౌతికరాశిని కొలుస్తారు?

ప్రశ్న 38.
హుక్ సూత్రాన్ని నిరూపించడానికి చేసే ప్రయోగంలో ఏఏ పరికరాలు అవసరమవుతాయి?
జవాబు:
1) స్ప్రింగ్, 2) బరువులు, 3) స్కేలు, 4) స్టాండ్

ప్రశ్న 39.
వైశాల్యం, ఘనపరిమాణం, సాంద్రత, ద్రవ్యరాశి
a) పై వానిలో ప్రాథమిక రాశులేవి?
b) పై వానిలో ఉత్పన్న రాశులేవి?
జవాబు:
a) ద్రవ్యరాశి,
b) వైశాల్యం, ఘనపరిమాణం, సాంద్రత.

ప్రశ్న 40.
‘ధీరజ్ తన ప్రయాణించిన దూరాన్ని ప్రతి 10 ని||లకు లెక్కించి నమోదు చేసుకున్నాడు.
పై దత్తాంశం నుండి స్వతంత్రరాశి, ఆధారిత రాశిని రాయండి.
జవాబు:
కాలం (ని॥) స్వతంత్ర రాశి మరియు దూరం ఆధారిత రాశి.

ప్రశ్న 41.
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 6
పై గ్రాలో (6, 4), (0, 0) దత్తాంశ బిందువులను గుర్తించుము.
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 7

ప్రశ్న 42.
ప్రమాణాల ద్వారా శాస్త్రజ్ఞులను ఎలా గుర్తుకు తెచ్చుకుంటావో రాయుము.
జవాబు:

  1. కొన్ని ప్రమాణాలు శాస్త్రవేత్తల పేర్లతో వ్యక్తపరచబడ్డాయి. ఉదా : న్యూటన్ (N), జాల్ (J), కెల్విన్ (K) మొదలగునవి.
  2. పై ప్రమాణాలను వినియోగించినపుడు ఆయా శాస్త్రవేత్తలు గుర్తుకు వస్తారు.

ప్రశ్న 43.
గ్రాఫు యొక్క ఉపయోగమేమి?
జవాబు:

  1. చాలా సమస్యలను గ్రాఫు ద్వారా సాధించవచ్చును.
  2. రెండు రాశుల మధ్య సంబంధాన్ని గ్రాఫు ద్వారా తెలుసుకోవచ్చును.

ప్రశ్న 44.
5, 7, 3, 8, 18, 4, 2, 6 విలువల వ్యాప్తి ఎంత?
జవాబు:
వ్యాప్తి = గరిష్ట విలువ – కనిష్ట విలువ
= 18 – 2 = 16

ప్రశ్న 45.
వ్యాప్తి 10 మరియు అడ్డంగా 20 గళ్ళు ఉన్నప్పుడు X – అక్షంపై ‘స్కేలు’ ఎలా తీసుకుంటావు?
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 8

ప్రశ్న 46.
స్థానభ్రంశం-కాలం గ్రాఫు ఎలా ఉపయోగపడుతుంది?
జవాబు:
స్థానభ్రంశం-కాలం గ్రాఫు వాలును కనుగొని తద్వారా వేగంను లెక్కించవచ్చును.

ప్రశ్న 47.
వేగం-కాలం గ్రాఫు యొక్క వైశాల్యం ఎలా ఉపయోగపడుతుంది?
జవాబు:
ఒక వస్తువు యొక్క స్థానం (position) ను గుర్తించడానికి వేగం కాలం గ్రాఫు యొక్క వైశాల్యం ఉపయోగపడుతుంది.

ప్రశ్న 48.
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 9
‘B’ వద్ద త్వరణం ఎంత?
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 10

ప్రశ్న 49.
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 11
‘A’ వద్ద త్వరణం ఎంత?
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 12

ప్రశ్న 50.
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 13
గ్రాఫులో A నుండి B కి వస్తువు ప్రయాణించిన దూరం ఎంత? ఎందుకు?
జవాబు:
సున్న. ఎందుకనగా కొలం మారినప్పటికీ దూరంలో మార్పులేదు.

9th Class Physical Science 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
ప్రమాణం (యూనిట్) అనగానేమి? దీనిని ఎక్కడ ఉంచుతారు?
జవాబు:

  1. కొలతలను పోల్చుటకు ఉపయోగించే ఏ ప్రామాణిక కొలతనైనా ప్రమాణం అంటారు.
  2. ఈ ప్రమాణాలను భౌతిక రాశుల పరిమాణాలకు కుడివైపున రాయాలి.
    ఉదా : 2 కి.గ్రా., 10 మీ.

ప్రశ్న 2.
ప్రాథమిక రాశులు, ఉత్పన్న రాశుల మధ్య తేడాలు రాయుము.
జవాబు:

ప్రాథమిక రాశులు ఉత్పన్న రాశులు
1) ప్రాథమిక రాశులు అనేవి మరే ఇతర పరిమాణాల లోనూ వ్యక్తపరచడానికి వీలులేని భౌతిక రాశులు. 1) ఏ రాశులైతే ప్రాథమిక రాశులను గుణించడం లేదా భాగించడం లేదా రెండూ చేయడం ద్వారా ఏర్పడతాయో వాటిని ‘ఉత్పన్న రాశులు’ అంటారు.
2) ఇవి స్వతంత్ర రాశులు. 2) ఇవి ప్రాథమిక రాశులపై ఆధారపడతాయి.
3) ఉదా : ద్రవ్యరాశి, పొడవు, కాలం. 3) ఉదా : వైశాల్యం , ఘనపరిమాణం, సాంద్రత

ప్రశ్న 3.
సాంద్రత ప్రమాణాలను ఉత్పన్నం చేయుము.
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 14

ప్రశ్న 4.
వివిధ రకాల కొలత పద్దతులను రాయుము.
జవాబు:
1) FPS : అడుగు (F), పౌండు (P), సెకను (S).
2) CGS : సెంటీమీటరు (C), గ్రాము (G), సెకను (S).
3) MKS : మీటరు (M), కిలోగ్రాము (Kg), సెకను (S).
4) SI : మీటరు, కిలోగ్రాము, సెకను, ఆంపియర్, కాండెలా, మోల్, కెల్విన్, రేడియన్.

AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు

ప్రశ్న 5.
క్రింది వానికి ప్రమాణాలను ఉత్పాదించుము.
a) త్వరణం b) బలం
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 15

ప్రశ్న 6.
క్రింది వానిలో ఏవి సరైనవి? ఎందుకు?
A) m/s B) m/s/s C) m-s2 D) 10 – kgs E Pascal joule
జవాబు:
A మరియు F లు సరైనవి.
B) రెండు సార్లు | గుర్తు వినియోగించబడినది. తప్పు.
C) ‘-‘ ఉపయోగించబడినది. తప్పు.
D) ‘.’ మరియు kg లను kgs గా బహువచనంలో వినియోగించబడినది. తప్పు.
E) ‘P’ కేపిటల్ అక్షరం వినియోగించబడినది. తప్పు.

ప్రశ్న 7.
క్రింది ప్రమాణాలను సరిచేసి రాయుము.
(i) DB (ii) mhz (iii) 20 – m (iv) kg.m-s-2
జవాబు:
(i) dB
(ii) MHz
(iii) 20 m
(iv) Kg.m.s-2

ప్రశ్న 8.
క్రింది గ్రాఫుల ఆకారాన్ని ఊహించి రాయండి.
(a) a ∝ b (b) a ∝ [latex]\frac{1}{b}[/latex]
జవాబు:
a) a ∝ b గ్రాఫు సరళరేఖా గ్రాఫుగా ఉండవచ్చును.
b) a ∝ [latex]\frac{1}{b}[/latex] గ్రాఫు వక్రరేఖా గ్రాఫుగా ఉండవచ్చును.

ప్రశ్న 9.
ప్రక్క గ్రాఫు నుండి
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 16
a) OA, OB, OC రేఖల వాలులు దేనిని సూచిస్తాయి?
b) ఏ రేఖ ఎక్కువ వడిని సూచిస్తుంది?
జవాబు:
a) OA, OB, OC రేఖల వాలులు ‘వడి’ లను సూచిస్తాయి.
b) OA రేఖ అధిక వడిని సూచిస్తుంది. కారణం OB, OC రేఖల కన్నా ఎక్కువ ‘వాలు’ ని OA కలిగి ఉంది.

ప్రశ్న 10.
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 17
a) పై వానిలో ఏది స్వతంత్ర రాశి?
b) పై వానిలో ఏది ఆధారిత రాశి?
c) గ్రాఫు ఎలా ఉంటుందో ఊహించుము.
d) Y – అక్షంపై వ్యాప్తిని కనుగొనుము.
జవాబు:
a) ద్రవ్యరాశి
b) భారం
c) సరళరేఖా గ్రాఫు
d) Y – అక్షంపై విలువలు = 98, 196, 294, 392, 490.
వ్యాప్తి = గరిష్ట విలువ – కనిష్ట విలువ = 490 – 98 = 392

ప్రశ్న 11.
క్రింది బిందువులను గ్రాఫు పేపర్ పై గుర్తించి కలుపుము.
(8, 10) (20, 15) (40, 22.5) (48, 0)
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 18
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 19

ప్రశ్న 12.
సమవేగాన్ని సూచించు చిత్తు గ్రాఫును గీయుము.
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 20

ప్రశ్న 13.
ఒక వస్తువు కొంతదూరం ప్రయాణం చేసిన తర్వాత నిశ్చలంగా ఉంది. దీనిని సూచించు గ్రాఫును గీయుము.
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 21

ప్రశ్న 14.
సమస్యా సాధనలో గ్రాఫుల యొక్క పాత్రను నీవెలా అభినందిస్తావు ?
జవాబు:

  1. కాలం-స్థానభ్రంశం, కాలం-వేగం, పీడనం-ఘనపరిమాణం మొదలగు గ్రాఫులు వాటిలోని భౌతిక రాశుల మధ్య సంబంధాన్ని తెలియజేస్తాయి. తద్వారా వాటి మధ్య గల సమస్యలను సాధించుటకు ఉపయోగపడతాయి.
  2. గ్రాఫులలో వస్తువు ప్రయాణ మార్గం, దిశలను సులువుగా తెలుసుకోవచ్చును. సంబంధిత సమస్యలను సాధించవచ్చును.
  3. గ్రాఫులలోని రేఖల వాలు, వైశాల్యంలను తెలుసుకొనుట ద్వారా వేగం, త్వరణం, స్థానం మొదలగు భౌతిక రాశుల సమస్యలను సాధించవచ్చును.
  4. గ్రాఫులు గరిష, కనిష్ట విలువలను కనుగొనుటకు ఉపయోగపడతాయి.
    ఉదా : పట్టకం కనిష్ట విచలన కోణం.
  5. ప్రయోగ విలువలను గ్రాఫులలో చూపి సమస్యలను సాధించవచ్చును.
  6. ఈ విధంగా గ్రాఫులు సమస్యా సాధనలో అభినందించదగ్గ పాత్రను పోషిస్తున్నాయి.

AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు

ప్రశ్న 15.
ప్రక్క ఇవ్వబడిన గ్రాఫులో ‘B’ బిందువు వద్ద వాలును, వైశాల్యాన్ని కనుక్కోండి.
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 22

ప్రశ్న 16.
3 మీ/సె.ను కి.మీ./గం. లలోకి మార్చుము.
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 23

ప్రశ్న 17.
ఒక 100 గ్రా. బంతిని 0.01 కి.మీ./సె. తొలివేగంతో విసిరిన, ఆ సమయంలో బంతి ద్రవ్యవేగం ఎంత?
జవాబు:
ద్రవ్యవేగం = ద్రవ్యరాశి × వేగం
బంతి ద్రవ్యరాశి = 100 గ్రా. = 0.1 కి.గ్రా.
బంతి తొలివేగం = 0.01 కి.మీ./సె. = 0.01 × 1000 మీ./సె. = 10 మీ./సె.
ద్రవ్యవేగం = m × v = 0.1 కి.గ్రా, × 10 మీ.సె-1 = 1 కి.గ్రా. మీ.-1

ప్రశ్న 18.
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 24
గ్రాఫు గీయడం ద్వారా రోజు-4 ఉష్ణోగ్రతను కనుగొనుము.
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 25
గ్రాఫు నుండి రోజు – 4న 43 °C ఉష్ణోగ్రత ఉంది.

ప్రశ్న 19.
పట్టికను పరిశీలించి క్రింది వానికి జవాబులిమ్ము.
AP Board 9th Class Physical Science Solutions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 2
జవాబు:
i) 12 cm = ……………….m
ii) 2nm = ……………. om
జవాబు:
i) 12 సెం.మీ. = 12 × 10-2 మీ.
ii) 2 nm = 2 × 10-7 cm
[∵ 1 నానోమీటరు = 10-9 మీ.; 1 సెం.మీ. = 10-2మీ.
నానోమీటరును సెంటిమీటర్లలోకి మార్చడానికి = 10-9/ 10-2 = 10-7 మార్పిడి గుణకంతో గుణించాలి.]

ప్రశ్న 20.
క్రింది వానికి మార్పిడి గుణకాలను కనుగొనుము.
a) పికోమీటరు నుండి మీటరు
b) గిగాబైట్ నుండి కిలోబైట్లకు
జవాబు:
a) 1 పికోమీటరు = 10-12 మీ.; 1 మీ. = 100 మీ.
పికోమీటరు – మీటరు మార్పిడి గుణకం ⇒ 10-12 – (0) = 10-12

b) 1 GB = 109 బైట్లు, 1 KB = 10³ బైట్లు
మార్పిడి గుణకం (GB నుండి KBB) = 109-3 = 106

ప్రశ్న 21.
క్రింది వానికి మార్పిడి గుణకాన్ని కనుక్కోండి.
a) మెగావాట్స్ నుండి కిలోవాట్స్
b) కిలోవాట్స్ నుండి మెగావాట్స్
జవాబు:
a) 1 మెగావాట్ = 106 వాట్స్; 1 కిలోవాట్ = 10³ వాట్స్
1 మెగావాట్ నుండి కిలోవాట్ = 106-3 = 10³ (మార్పిడి గుణకం)
1 మెగావాట్ = 10³ కిలోవాట్

b) 1 కిలోవాట్ నుండి 1 మెగావాట్ = 103-6 = 10-3 (మార్పిడి గుణకం)
1 కిలోవాట్ = 10-3 మెగావాట్

9th Class Physical Science 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
కొలత ప్రమాణాలు రాయడానికి నాలుగు నిబంధనలు రాయుము.
జవాబు:

  1. ప్రమాణాన్ని రాసేటప్పుడు సంఖ్యకి మరియు ప్రమాణానికి మధ్య ఖాళీ ఇవ్వాలి.
    ఉదా : 24 kg, 2 cm, 5 s.
  2. గుణించడం వలన ఏర్పడే ఉత్పన్న ప్రమాణాలను చుక్క (. )తో గాని, ఖాళీతోగాని సూచించాలి.
    ఉదా : N.m లేదా N m
  3. ఒక ప్రమాణాన్ని రాసేటప్పుడు దాని మధ్యలో (. )గాని, ఫుల్ స్టాప్ గాని ఉంచరాదు.
    ఉదా : 4 k.g. కి బదులు 4 kg అని రాయాలి.
  4. ఒక వ్యక్తి పేరుమీద ఉన్న ప్రమాణాలు పొట్టి రూపంలో అయితే ఆంగ్ల పెద్ద అక్షరాలతోను పూర్తి పేరు రూపంలో అయితే ఆంగ్ల చిన్న అక్షరాలతోనూ సూచించాలి.
    ఉదా : N, J, Pa (లేదా) newton, joule, pascal.

AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు

ప్రశ్న 2.
పట్టిక రూపంలో ఇచ్చిన దత్తాంశానికి గ్రాఫును నిర్మించడానికి కావలసిన సోపానాలు రాయుము.
జవాబు:
1) ఒక గ్రాఫు పేపరును తీసుకొని, దానిపై X – అక్షం మరియు Y- అక్షంను గీయుము.

2) పట్టికలో దత్తాంశంనుబట్టి స్వతంత్ర రాశి, ఆధారిత రాశులను గుర్తించుము. స్వతంత్ర రాశిని X – అక్షం మీద, ఆధారిత రాశిని Y – అక్షం మీద తీసుకోవాలి.

3) X – అక్షం మీద తీసుకున్న విలువలకు మరియు Y- అక్షం మీద తీసుకున్న విలువల వ్యాప్తులను కనుగొనాలి.
వ్యాప్తి = గరిష్ట విలువ – కనిష్ట విలువ

4) అక్షాలపై తీసుకోవలసిన స్కేలును లెక్కించాలి.
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 26
స్కేలు ప్రకారం అక్షాలపై స్కేలింగ్ చేయాలి.

5) X – అక్షం, Y – అక్షంపై తీసుకున్న భౌతిక రాశుల పేర్లు వాటి ప్రమాణాలతో కలిపి రాయాలి.

6) పట్టికలో ఇచ్చిన దత్తాంశాన్ని (x1 yx1) (xx2 yx2) …….. వలె దత్తాంశ బిందువులుగా రాయాలి.

7) ఈ దత్తాంశ బిందువులను సంబంధిత క్షితిజ సమాంతర (అడ్డం), క్షితిజ లంబం (నిలువు) ఖండిత బిందువుల వద్ద గుర్తించాలి.

8) ఈ బిందువులన్నింటినీ కలిపితే గ్రాఫు తయారవుతుంది.

ప్రశ్న 3.
క్రింది పట్టికను సరియైన జవాబులతో నింపుము.
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 27
జవాబు:
a) N/m²
b) Pa (పాస్కల్)
c) s-1
d) బలం
e) m. kg.s-2
f) m². kg. s-2
g) J/s (or) [latex]\frac{\mathrm{N} \cdot \mathrm{m}}{\mathrm{s}}[/latex]
h) W (వాట్)

ప్రశ్న 4.
క్రింది పట్టికను పూరించుము.

ఉత్పన్న రాశి ప్రాథమిక, ఉత్పన్న రాశులతో సంబంధం ప్రమాణం
వైశాల్యం
ఘనపరిమాణం
సాంద్రత
వడి
వేగం
త్వరణం
పని
ద్రవ్య వేగం

జవాబు:

ఉత్పన్న రాశి ప్రాథమిక, ఉత్పన్న రాశులతో సంబంధం ప్రమాణం
వైశాల్యం పొడవు X వెడల్పు m2
ఘనపరిమాణం పొడవు X వెడల్పు X ఎత్తు m3
సాంద్రత ద్రవ్యరాశి /ఘనపరిమాణం kg m-3
వడి దూరం / కాలం m s-1
వేగం స్థానభ్రంశం / కాలం m s-1
త్వరణం వేగం / కాలం m s-2
పని బలం / దూరం kg m2 s-2
ద్రవ్య వేగం ద్రవ్యరాశి X వేగం kg m s-1

ప్రశ్న 5.
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 28
1) ప్రయాణంలో ఎవరు విశ్రాంతి తీసుకున్నారు?
2) 100 నిమిషాల తర్వాత పద్మ, భవానీల స్థానాలు ఏమిటి?
3) ఎవరు సమవడిలో వెళ్ళారు?
4) భవాని వడి ఎంత?
జవాబు:
1) పద్మ విశ్రాంతి తీసుకుంది.
2) 100 నిమిషాల తర్వాత పద్మ 700 మీ. దూరంలోనూ, భవాని 600 మీటర్ల దూరంలోనూ ఉన్నారు.
3) భవాని సమవడిలో ప్రయాణించింది.
4) భవాని వడి = [latex]\frac{600}{100}[/latex] = 6 మీ. / నిమిషం .

ప్రశ్న 6.
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 29
a) ఏ భౌతికరాశి స్వతంత్ర రాశిగా తీసుకోబడింది?
b) X. అక్షంపై స్కేలు ఎంత?
c) Y- అక్షంపై స్కేలు ఎంత?
d) గ్రాఫు ఆకారం ఏమిటి?
జవాబు:
a) దూరం స్వతంత్ర రాశిగా తీసుకోబడింది.
b) 1 cm = 100 m
c) 1 cm = 2 నిమిషాలు
d) గ్రాఫు వక్రరేఖా గ్రాఫు.

ప్రశ్న 7.
ఇచ్చిన దత్తాంశానికి గ్రాఫు గీయుము.
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 30
జవాబు:
1) గ్రాఫు పేపరుపై X- అక్షం, Y- అక్షాలను గీయాలి.

2) దత్తాంశం ప్రకారం కాలం స్వతంత్ర రాశి, స్థానభ్రంశం ఆధారిత రాశి. కావున, X – అక్షంపై కాలం, Y – అక్షంపై స్థానభ్రంశాలను తీసుకోవాలి.

3) X – అక్షం, Y – అక్షంపై తీసుకుంటున్న విలువల వ్యాప్తులను లెక్కించాలి.
X – అక్షంపై వ్యాప్తి = 24 – 4 = 20
Y- అక్షంపై వ్యాప్తి = 15 – 2 = 13

4) X – అక్షం, Y – అక్షం పై తీసుకుంటున్న విలువల వ్యాప్తులను లెక్కించాలి.
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 31
X – అక్షంపై స్కేలు 1 cm = 2 ని.
Y – అక్షంపై స్కేలు 1 cm = 1 కి.మీ.
తీసుకొని అక్షాలపై గుర్తించాలి.
5) X – అక్షంపై కాలం (ని.), Y – అక్షంపై స్థానభ్రంశం. (కి.మీ.) అని రాయాలి.

6) దత్తాంశ బిందువులను (4, 2) (8, 3) (12, 7) (16, 11) (20, 13) (24, 15) గా తీసుకోవాలి.

7) పై బిందువులను గ్రాఫు పేపరుపై గుర్తించాలి.

8) ఆయా బిందువులను కలుపుతూ రేఖను గీయాలి.
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 32

ప్రశ్న 8.
వేగం-కాలం (v – t) గ్రాఫును గీయుము.
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 33
జవాబు:
1) గ్రాఫు పేపరుపై X – అక్షం, Y – అక్షాలను గీయాలి.

2) దత్తాంశం ప్రకారం బలం స్వతంత్ర రాశి, వేగం ఆధారిత రాశి, కావున X – అక్షంపై కాలంను, Y – అక్షంపై వేగంను తీసుకోవాలి.

3) X – అక్షం, Y – అక్షంపై తీసుకున్న విలువల వ్యాప్తులను లెక్కించాలి.
X- అక్షంపై వ్యాప్తి = 180 – 20 = 160
Y- అక్షంపై వ్యాప్తి = 20 – 5 = 15

4) X – అక్షం, Y – అక్షంపై స్కేలును అంచనా వేయాలి.
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 34
X- అక్షంపై స్కేలు 1 cm = 8s; Y – అక్షంపై స్కేలు 1 cm = 1 m/s

5) X – అక్షంపై కాలం (సె), Y- అక్షంపై వేగం (మీ./సె.) అని రాయాలి.

6) దత్తాంశ బిందువులు (20, 5), (40, 10), (60, 15), (80, 20), (100, 20), (120, 20), (140, 20), (160, 20), (180, 15) గా తీసుకోవాలి.

7) పై బిందువులను గ్రాఫు పేపర్ లో గుర్తించాలి.

8) గుర్తించిన బిందువులను కలుపుతూ రేఖను గీయాలి.
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 35

ప్రశ్న 9.
i) v = u + at, ii) s = ut + ½ at² అని గ్రాఫు పద్ధతిలో నిరూపించుము.
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 36
i) 1) కాలాన్ని X – అక్షంపై, వేగాన్ని Y – అక్షంపై తీసుకొని పటంలో చూపినట్లు గ్రాఫును గీయాలి.

2) పై గ్రాఫు నుండి,
t విలువ “O” వద్ద వస్తు వేగం = 4
t విలువ “t” వద్ద వస్తు వేగం = v

3) వేగంలో మార్పు = v – u

4) గ్రాఫు నుండి x1 = 0, x2 = t, y1 = u, y2 = v
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 37

ii) 1) పై గ్రాఫు యొక్క వైశాల్యం ట్రెపీజియం ఆకారంలో ఉంది. ఇది ABCD దీర్ఘ చతురస్రం మరియు DCE త్రిభుజం కలిపి యుంది.
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 38

ప్రశ్న 10.
క్రింది గ్రాఫును పరిశీలించి 12 సెకన్ల వద్ద వస్తు స్థానభ్రంశాన్ని లెక్కించంది.
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 39
జవాబు:

  1. స్థానభ్రంశం (s) ⇒ గ్రాఫు వైశాల్యం = ABDO దీర్ఘచతురస్ర వైశాల్యం + BDC త్రిభుజ వైశాల్యం.
  2. ABDO దీర్ఘచతురస్ర వైశాల్యం = 8 × 20 = 160.
  3. BDC త్రిభుజ వైశాల్యం = ½ × 20 × (12 – 8) = ½ × 20 × 4 = 40.
  4. స్థానభ్రంశం(S) = 160 + 40 = 20oమీ.
  5. 12 సెకన్ల వద్ద వస్తువు 200 మీ. స్థానభ్రంశం చెందింది.

ప్రశ్న 11.
గ్రాఫు నుండి 4 వద్ద వేగాన్ని లెక్కించండి.
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 40
జవాబు:

  1. త్వరణం – కాలం (a – t) గ్రాఫు యొక్క వైశాల్యం వేగం (v) ను సూచిస్తుంది.
  2. AB లను కలుపుము.
  3. వేగం (v) = ∆ ABO వైశాల్యం = ½ × 60 × 120 = 3600 మీ./సె.

ప్రశ్న 12.
క్రింది గ్రాఫులో ‘B’ వద్ద బలాన్ని లెక్కించుము.
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 41
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 42

9th Class Physical Science 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 1 Mark Bits Questions and Answers

1. భౌతికరాశుల ప్రమాణాల స్థానము
A) పరిమాణాలకు ఎడమవైపు
B) పరిమాణాలకు కుడివైపు
C) పరిమాణాల క్రింద
D) పరిమాణాల పైన
జవాబు:
B) పరిమాణాలకు కుడివైపు

2. ఈ క్రింది వానిలో ప్రాథమిక రాశి కానిదేది?
A) కాంతి తీవ్రత
B) పొడవు
C) పీడనము
D) ద్రవ్యరాశి
జవాబు:
C) పీడనము

AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు

3. SI పద్ధతిలో ఉష్ణోగ్రతకు ప్రమాణాలు
A) °C
B) కెల్విన్
C) కెలోరి
D) A లేదా B
జవాబు:
B) కెల్విన్

4. SI పద్ధతి అనగా
A) Standard International Measures
B) State Implement Units
C) International System of Units
D) International Standards of Measurements
జవాబు:
C) International System of Units

5. ‘సెకండ్లు’ అనే ప్రమాణాలు ఈ పద్దతికి చెందినవి.
A) CGS పద్ధతి
B) MKS పద్ధతి
C) SI పద్ధతి
D) పైవన్నియూ
జవాబు:
D) పైవన్నియూ

6. జతపరచండి.
a) విద్యుచ్ఛక్తి ( ) i) మోల్
b) కాంతి తీవ్రత ( ) ii) కాండెలా
c) పదార్థ పరిమాణము ( ) iii) ఆంపియర్
A) a – iii, b – ii, c – i
B) a – i, b – ii, c – iii
C) a – i, b – iii, c – ii
D) a – ii, b-iii, c – i
జవాబు:
A) a – iii, b – ii, c – i

7. ప్రమాణాల నిర్వచనం ప్రకారం పీడనానికి ఉపయోగించే ప్రమాణాలు ఏవి?
a) మీటరు b) కిలోగ్రామ్ c) సెకండు
A) a & c
B) b & c
C) a & b
D) a, b & c
జవాబు:
D) a, b & c

8. 1 పీకో మీటరు =
A) 10-9 మీటర్లు
B) 10-8 మీటర్లు
C) 10-12 మీటర్లు
D) 10-10 మీటర్లు
జవాబు:
C) 10-12 మీటర్లు

9. ఈ క్రింది వానిలో అసత్యమైనది
A) 10-9 m = 1 నానోమీటర్
B) 10-6 m = 1 మైక్రోమీటర్
C) 10-3 m = 1 కిలోమీటర్
D) పైవేవీకావు
జవాబు:
C) 10-3 m = 1 కిలోమీటర్

10. 5 × 10-3 కి.మీ. = 0.005 కి.మీ.
పై వాక్యంలో మార్పిడి గుణకం
A) 5
B) 10-3
C) 0.005
D) 5 x 10-3
జవాబు:
B) 10-3

11. km/hr లను m/sగా మార్చడానికి మార్పిడి గుణకం
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 43
జవాబు:
A

12. వేగం = 10 మీ/సె. SI పద్ధతిలో వేగము
A) 0.1 m/s
B) 0.01 m/s
C) 1 ms.
D) 10³ m/s
జవాబు:
A) 0.1 m/s

AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు

13. ప్రమాణాలను తెలియజేసే సరైన పద్ధతి ఈ క్రింది వానిలో ఏది?
A) 2 Kg
B) 2kg
C) 2 kg
D) 2 kgs
జవాబు:
C) 2 kg

14. ఈ క్రింది వానిలో సరైనది కానిది ఏది?
A) 4 joules
B) 4 j
C) 4 J
D) ఏదీకాదు
జవాబు:
B) 4 j

15. ఈ క్రింది వానిలో సరైనది ఏది?
A) MW
B) kW
C) Watts
D) K.W
జవాబు:
A) MW

16. 1మీ, 2మీ, 3మీ ….. ఖచ్చితమైన దారపు పొడవుతో ప్రమీల లోలకం యొక్క కంపనాలను లెక్కిస్తుంది.
పై సమాచారంలో స్వతంత్ర రాశి
A) పౌనఃపున్యాల సంఖ్య
B) పొడవు
C) కాలము
D) గోళ ద్రవ్యరాశి
జవాబు:
B) పొడవు

17. 1, 1.1, 0.5, 1.6, 1.01, 1.5 ల వ్యాప్తి
A) 1.1
B) 0.5
C) 1.01
D) 0.1
జవాబు:
A) 1.1

18. X – అక్షంపైనున్న గళ్ళ సంఖ్య 24 మరియు వ్యాప్తి 12 అయిన X – అక్షంపై స్కేలు
A) 2
B) 6
C) 0.5
D) 1
జవాబు:
C) 0.5

19. లంబాక్షము మరియు సమాంతర అక్షములు వరసగా
A) X – అక్షము, Y – అక్షము
B) Y – అక్షము, X – అక్షము
C) X – అక్షము, X – అక్షము
D) Y- అక్షము, Y – అక్షము
జవాబు:
B) Y – అక్షము, X – అక్షము

20. స్వేచ్ఛగా పడే వస్తువు యొక్క వేగము మరియు కాలముల గ్రాఫు
A) వక్రరేఖా గ్రాఫు
B) సరళరేఖా గ్రాపు
C) A లేదా B
D) బార్ గ్రాఫ్
జవాబు:
B) సరళరేఖా గ్రాపు

21. s – t గ్రాఫు వాలు సూచించునది
A) వడి
B) వేగం
C) త్వరణం
D) స్థానం
జవాబు:
B) వేగం

22. v – t గ్రాఫు వాలు సూచించునది
A) వడి
B) వేగం
C) త్వరణం
D) స్థానభ్రంశం
జవాబు:
C) త్వరణం

23. v – t గ్రాఫు వైశాల్యం సూచించునది
A) వడి
B) వేగం
C) త్వరణం
D) స్థానభ్రంశం
జవాబు:
D) స్థానభ్రంశం

24. a – t గ్రాఫు వైశాల్యం సూచించునది
A) వడి
B) వేగం
C) త్వరణం
D) స్థానభ్రంశం
జవాబు:
B) వేగం

25. స్ప్రింగ్ లో సాగుదలకు, స్ప్రింగ్ కు వేలాడదీసిన ద్రవ్యరాశికి గల సంబంధాన్ని తెలిపే గ్రాఫు ఆకారం
A) మూలబిందువు గుండా వెళ్ళే సరళరేఖ
B) X – అక్షానికి సమాంతరంగా ఉండే సరళరేఖ
C) Y- అక్షానికి సమాంతరంగా ఉండే సరళరేఖ
D) వక్రరేఖ
జవాబు:
A) మూలబిందువు గుండా వెళ్ళే సరళరేఖ

AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు

26. F ∝ [latex]\frac{1}{\mathbf{d}^{2}}[/latex]. F – d గ్రాఫు ఆకారము
A) సరళరేఖ
B) పరావలయం
C) వక్రరేఖ
D) A లేదా B
జవాబు:
B) పరావలయం

27. a) y, x కు విలోమానుపాతంలో ఉంది.
b) y, x² కు అనులోమానుపాతంలో ఉంది.
c) y, √x కు అనులోమానుపాతంలో ఉంది.
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 44
గ్రాఫులను జతపరచండి.
A) a – i, b – ii, c – iii
B) a – ii, b – iii, c – i
C) a – iii, b – i, c – ii
D) a – iii, b – ii, c – i
జవాబు:
A) a – i, b – ii, c – iii

28. బలం మరియు కాలం గ్రాఫు వైశాల్యము
A) పీడనం
B) స్థానభ్రంశం
C) ప్రచోదనం
D) ఏదీకాదు
జవాబు:
C) ప్రచోదనం

29. హుక్ సూత్రము యొక్క గ్రాఫు ఆకారం
A) మూలబిందువు గుండా వెళ్ళే సరళరేఖ
B) X – అక్షానికి సమాంతరంగా ఉండే సరళరేఖ
C) Y- అక్షానికి సమాంతరంగా ఉండే సరళరేఖ
D) వక్రరేఖ
జవాబు:
A) మూలబిందువు గుండా వెళ్ళే సరళరేఖ

30.
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 45
మంచు యొక్క విశిష్టోషాన్ని సూచించే భాగం
A) AB
B) BC
C) CD
D) DE
జవాబు:
B) BC

మీకు తెలుసా?

కొలత పద్దతులు వాటి ప్రమాణాలు ఏమిటో క్రింది పట్టికలో చూడండి.
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 46

మీటరు :
శూన్యంలో కాంతి 1/299, 792,458 సెకన్లలో ప్రయాణించిన దూరాన్ని మీటరు కొలతగా నిర్ధారించారు.

కొన్ని ప్రమాణాలను శాస్త్రవేత్తల పేర్లతో సూచిస్తాము. న్యూటన్, పాస్కల్, బౌల్, వాట్, కులూంబ్, వోల్టు, ఫారడే, ఓమ్, వైబర్, హెన్రీ మొదలగునవి.

విలోమానుపాత నియమం :
రెండు రాశులు విలోమానుపాతంలో ఉండాలి అంటే అవి క్రింది నిబంధనలను పాటించాలి.

  1. ఒక రాశి విలువ ‘0’ గా ఉండాలి. ఇప్పుడు రెండో రాశి విలువను నిర్వచించలేము. అంటే అనంతంగా చెప్పవచ్చు.
  2. ఏ జత విలువల లబ్దం లెక్కించినా విలువ స్థిరంగా ఉండాలి.
  3. ఒక రాశి పెరుగుతూ ఉంటే రెండవ రాశి తగ్గుతూ ఉండాలి.

AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు

అనులోమానుపాత నియమం :
రెండు రాశులు అనులోమానుపాతంలో ఉండాలి అంటే కింది నిబంధనలు పాటించాలి.

  1. ప్రారంభ విలువలు ‘0’గా ఉండాలి.
  2. ఏ జత విలువల నిష్పత్తిని లెక్కించినా స్థిరంగా ఉండాలి.
  3. ఒక రాశి విలువ పెరుగుతూ ఉంటే రెండవ రాశి విలువ కూడా పెరుగుతూ ఉండాలి.

పై నిబంధనలు పాటిస్తేనే ఆ రెండు రాశులు అనులోమ / విలోమ సంబంధాన్ని కలిగి ఉన్నాయి అని చెప్పగలం. అంతే తప్ప ఒక రాశి పెరుగుతూ ఉంటే రెండో రాశి కూడా పెరుగుతూ ఉన్నంత మాత్రాన అవి అనులోమ సంబంధం – కలిగి ఉన్నట్లు కాదు.

AP 9th Class Physical Science Important Questions 11th Lesson ధ్వని

These AP 9th Physical Science Important Questions and Answers 11th Lesson ధ్వని will help students prepare well for the exams.

AP Board 9th Class Physical Science 11th Lesson Important Questions and Answers ధ్వని

9th Class Physical Science 11th Lesson ధ్వని 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
ధ్వని యొక్క అనుభూతిని మనం ఎలా పొందుతాము?
జవాబు:
ఒకచోట ఉత్పత్తి అయిన ధ్వని గాలిలో ప్రయాణించి చెవిని చేరి, చెవిలో కర్ణభేరిని కదిలించడం ద్వారా ధ్వని యొక్క
అనుభూతిని కల్పిస్తుంది.

ప్రశ్న 2.
శృతిదండం యొక్క పిచ్ దేనిపై ఆధారపడి ఉంటుంది?
జవాబు:
శృతిదండం యొక్క పిచ్ దాని భుజాల పొడవుపై ఆధారపడి ఉంటుంది.

ప్రశ్న 3.
ధ్వని ఏ రూపంలో ప్రసరిస్తుంది?
జవాబు:
ధ్వని తరంగ రూపంలో ప్రసరిస్తుంది.

ప్రశ్న 4.
అనుదైర్ఘ్య తరంగాలంటే ఏమిటి?
జవాబు:
యానకంలో కణాలు తరంగ చలన దిశలోనే కంపిస్తే, ఆ తరంగాలను అనుదైర్ఘ్య తరంగాలు అంటారు.

ప్రశ్న 5.
యానకం సాంద్రతలో మార్పునకు కారణమయ్యే తరంగాలు ఏవి?
జవాబు:
అనుదైర్ఘ్య తరంగాలు.

AP 9th Class Physical Science Important Questions 11th Lesson ధ్వని

ప్రశ్న 6.
అనుదైర్ఘ్య తరంగాలలో ఏర్పడే ప్రదేశాలను ఏమంటారు?
జవాబు:
యానక సాంద్రతలో మార్పువల్ల అనుదైర్ఘ్య తరంగాలలో సంపీడన, విరళీకరణములనబడే ప్రదేశాలు ఏర్పడతాయి.

ప్రశ్న 7.
తిర్యక్ తరంగాలనగానేమి?
జవాబు:
యానకంలో కణాలు తరంగచలన దిశకు లంబంగా కంపిస్తే ఆ తరంగాలను తిర్యక్ తరంగాలు అంటారు.

ప్రశ్న 8.
ప్రతిధ్వని అనగానేమి?
జవాబు:
అసలు ధ్వని వినబడిన 0.1 సె॥ తర్వాత శ్రోతకు పరావర్తన ధ్వని వినబడితే దానిని ప్రతిధ్వని అంటారు.

ప్రశ్న 9.
ప్రతినాదం అనగానేమి?
జవాబు:
అసలు ధ్వని వినబడిన 0.1 సె॥ కంటే తక్కువ కాలంలో నిజధ్వనితో కలిసి పరావర్తన ధ్వని వినిపిస్తే దానిని ప్రతినాదం అంటారు.

ప్రశ్న 10.
సాధారణ మానవుని సగటు శ్రవ్య అవధి ఎంత?
జవాబు:
20 హెర్ట్ నుండి 20,000 హెర్ట్.

ప్రశ్న 11.
పరశ్రావ్యాలను ఉత్పత్తి చేసే జంతువులకు ఉదాహరణలివ్వండి.
జవాబు:
ఏనుగులు, తిమింగలాలు, ఖడ్గమృగాలు మొదలైనవి.

ప్రశ్న 12.
సోనార్ (SONAR) అనగానేమి?
జవాబు:
సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్.

ప్రశ్న 13.
ఒక సంగీత స్వరం, మరొక సంగీత స్వరం కంటే భిన్నమైనదని తెలిపే అఖిలక్షణాలను వ్రాయుము.
జవాబు:
అభిలక్షణాలు :
i) పిచ్ (స్థాయి) ii) తీవ్రత iii) నాణ్యత

ప్రశ్న 14.
నీకు దగ్గరలో గల కాంపౌండర్ గారి వద్దకు వెళ్ళి స్టెతస్కోప్ ఎలా గుండె చప్పుళ్లను తెలుపుతుందో సమాచారాన్ని అడిగి క్లుప్తంగా వ్రాయుము.
జవాబు:
శరీర అంతర్భాగాల ద్వారా వచ్చే శబ్దాలు స్టెతస్కోప్ కుండే గొట్టంలో అనేక పర్యాయాలు పరావర్తనం చెందుతూ, దానికి ఉండే గ్రాహకంలో కూడా అభివృద్ధి చెందబడి ధ్వని వైద్యుని చెవికి చేరుతుంది.

AP 9th Class Physical Science Important Questions 11th Lesson ధ్వని

ప్రశ్న 15.
SONAR వ్యవస్థలో ఉపయోగించే రెండు ముఖ్యమైన పరికరాలను తెలుపండి.
జవాబు:
SONAR వ్యవస్థలో క్రింది ముఖ్యమైన పరికరాలు వినియోగిస్తారు. అవి :
1) ప్రసారిణి 2) గ్రాహకం

9th Class Physical Science 11th Lesson ధ్వని 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
0.6 సెం.మీ. తరంగ దైర్ఘ్యము గల ధ్వని గాలిలో 300 మీ/సె. వేగంతో ప్రయాణిస్తుంది. ఈ ధ్వనిని వినగలమా?
జవాబు:
vani అని మనకు తెలుసు.
n: v. 300 : 50,000 Hz
0.6×10-2
ఇది శ్రవ్య అవధిలో లేదు. కావున మనము వినలేము.

ప్రశ్న 2.
తరంగ స్వభావము వివరించే తరంగపు లక్షణాలు ఏవి?
జవాబు:
ఒక తరంగ స్వభావాన్ని వివరించే తరంగ లక్షణాలు :

  1. తరంగ దైర్ఘ్యం (wavelength)
  2. కంపన పరిమితి (amplitude)
  3. పౌనఃపున్యం (frequency)
  4. తరంగ వేగం (wave speed)

ప్రశ్న 3.
ధ్వనులను ఎన్ని రకాలుగా విభజించవచ్చును? అవి ఏవి? వాటిని వ్రాయుము.
జవాబు:
ధ్వనులను రెండు రకాలుగా విభజించవచ్చును. అవి : i) సంగీత స్వరాలు ii) చప్పుళ్లు.

  1. వినుటకు చెవికి ఇంపుగా ఉన్న శబ్దాలను సంగీత స్వరాలు అని అంటారు.
  2. వినుటకు చెవికి కఠోరంగా ఉన్న శబ్దాలను చప్పుళ్లు అంటారు.

ప్రశ్న 4.
“ధ్వని చరిత్ర”ను వ్రాయుము.
జవాబు:

  1. పైథాగరస్ అనే గ్రీకు తత్త్వవేత్త ధ్వని గాలిలో అణువులు ముందుకు, వెనుకకు కదలడం ద్వారా ప్రయాణించి చెవిని చేరి గ్రహణ సంవేదనను కలిగిస్తుందని వివరించాడు.
  2. ఈ విషయాన్ని గెలీలియో మరియు బెకన్లు సమర్థించారు.
  3. ఆ తర్వాత న్యూటన్ మొట్టమొదటగా గాలిలో ధ్వని ప్రసారాన్ని పూర్తిగా వివరించాడు.

AP 9th Class Physical Science Important Questions 11th Lesson ధ్వని

ప్రశ్న 5.
పౌనఃపున్యము మరియు ఆవర్తన కాలాల మధ్య సంబంధమును రాబట్టుము.
జవాబు:
యానకంలో ఒక కణం ‘n’ డోలనాలు చేయుటకు పట్టిన కాలము ‘1’ సెకను అనుకొనుము.
ఒక డోలనానికి పట్టిన కాలం = 1/n సెకన్లు. దీనినే ఆవర్తన కాలం అంటారు.
కావున ఆవర్తన కాలం (T) = 1/n సెకన్లు.

ఒక సెకనులో చేసిన డోలనాల సంఖ్య పౌనఃపున్యం (n) కావున ఆవర్తన కాలం (T) = 1/η అగును.

ప్రశ్న 6.
“సోనిక్ బూమ్” గురించి వ్రాయుము. (లేదా) సూపర్ సానిక్ వేగము, షాక్ తరంగాలు మరియు సోనిక్ బూమ్ ల గూర్చి వ్రాయుము.
జవాబు:

  1. ఒక వస్తువు గాలిలో ధ్వని వేగం కంటే ఎక్కువగా ప్రయాణిస్తున్నప్పుడు ఆ వస్తువు వేగాన్ని సూపర్ సానిక్ వేగమంటారు.
  2. ఒక ధ్వని జనకం నుండి ఉత్పత్తైన ధ్వని సూపర్ సానిక్ వేగంతో ప్రయాణిస్తున్నపుడు అది గాలిలో “షాక్ తరంగాలను” ఉత్పత్తి చేస్తుంది. ఇటువంటి అధికశక్తి గల తరంగాలను ఉత్పత్తి చేసే అధిక తీవ్రత గల ధ్వనులనే “సోనిక్ బూమా” అంటారు.
  3. ఈ “సోనిక్ బూమ్” వలన విడుదలయ్యే షాక్ తరంగాల వలన అద్దాలకు మరియు భవనాలకు నష్టం వాటిల్లును

ప్రశ్న 7.
రాజు తన స్నేహితుని ఊరికి ఒక ఫంక్షన్ నిమిత్తం వెళ్లాడు. అక్కడ అతను కొన్ని రకాల శబ్ద జనకాలను గమనించాడు అవి వివిధ ఆకృతులలో ఉండటంతో అతనికి కొన్ని సందేహాలు తలెత్తాయి. అవి ఏమిటో కొన్నింటిని వ్రాయండి.
జవాబు:

  1. ఆ శబ్దజనకాల ఆకృతి పేరేమిటి?
  2. వాటిని ఆ ఆకృతిలోనే తయారుచేయాలా?
  3. వాటిని పొడవైన గొట్టాల లాగా ఉంచకూడదా?
  4. ఆ ఆకృతి వలన ఏమైనా ఉపయోగముందా?

ప్రశ్న 8.
సిరి ప్రతిరోజూ “నేషనల్ జాగ్రఫిక్ ఛానల్”ను చూస్తూ ఉంటుంది. ఒక రోజు ఆ ఛానల్ లో ట్యూనా చేపలు పట్టే కార్యక్రమం చూపిస్తున్నారు. ఆ చేపలు పట్టేవారు, వారి పడవలో చేపలు ఎక్కడ ఉన్నాయో, ఎంత దూరంలో ఉన్నాయో అని కచ్చితముగా చెప్పగలుగుచున్నారు. ఇది చూసిన సిరికి కొన్ని రకాల ప్రశ్నలు తలెత్తాయి. అవి ఏమిటో మీరు ఊహించగలరా? అయితే వాటిని కొన్నింటిని వ్రాయుము.
జవాబు:

  1. ఆ చేపలు పట్టే వారు వాడే సాధనం పేరేమిటి?
  2. ఆ సాధనం ఏ విధముగా పనిచేస్తుంది?
  3. వారు కచ్చితముగా చేపల దూరాన్ని ఎలా చెప్పగలుగుచున్నారు?
  4. ఈ పరికరము చేపలు పట్టేందుకు మాత్రమేనా ఇంకా దేనికైనా వినియోగిస్తారా?

AP 9th Class Physical Science Important Questions 11th Lesson ధ్వని

ప్రశ్న 9.
నీకు దగ్గరగా ఉన్న పారిశ్రామికవాడకు వెళ్ళి మోడరన్ టెక్నాలజీ సహాయంతో వారు లోహపు వస్తువులకు రంధ్రాలు చేయడంగాని, పెళుసైన పదార్ధాలను కావలసిన ఆకృతులలో ఎలా రంధ్రాలు మరియు కట్ చేయుచున్నారో వారిని అడిగి సమాచారాన్ని వ్రాయండి.
జవాబు:

  1. లోహపు వస్తువులకు రంధ్రాలను చేయడానికి ‘హర్న్” అనే సన్నని, దృఢమైన లోహపు కొనను కంపింపచేయటం వల్ల జనించే అతిధ్వనులను వాడతారు.
  2. ఇది ఒక సుత్తిలాగా పనిచేసి సెకనుకు సుమారు 10 లక్షల సార్లు లోహపు పలకపై కొట్టడం వలన కావలసిన ఆకృతులలో రంధ్రాలు చేస్తుంది.
  3. అట్లాగే గాజు వంటి పెళుసైన పదార్థాలను సైతం కోరిన ఆకృతులలో రంధ్రాలు చేయడం, కట్ చేయడం సులభంగా చేయవచ్చు.

ప్రశ్న 10.
సాధారణ పద్ధతిలో శుభ్రపరచబడిన వస్తువులపై మురికిని పూర్తిగా కొన్ని ప్రదేశాలలో తొలగించలేము. ఈ సమస్యకు నీవు ఏ విధమైన పరిష్కారమివ్వగలవో మీ పెద్దలనడిగి సమాచారాన్ని సేకరించి వ్రాయుము.
జవాబు:

  1. ఇటువంటి మురికిని అతిధ్వనులను ఉపయోగించి సులభంగా శుభ్రపరచవచ్చు.
  2. వస్తువులను శుభ్రపరిచే ద్రావణంలోకి అత్యధిక పౌనఃపున్యం కలిగిన తరంగాలను పంపించి వస్తువులకు వివిధ ప్రదేశాలలో అంటిన మురికి కణాలను కదిలిస్తారు.
  3. వాటిని తిరిగి నీటితో సులభంగా శుభ్రపరుస్తారు.

ప్రశ్న 11.
ప్రస్తుత రోజులలో కాలేయం, పిత్తాశయం, గర్భాశయం మొదలగు వాటిల్లో ఏర్పడే రాళ్ళను, కణితులను గుర్తించుటకు ఏ పద్ధతులను పాటిస్తున్నారో ప్రముఖ వైద్యుని ఇంటర్వ్యూ ద్వారా సమాచారాన్ని సేకరించండి.
జవాబు:

  1. అతిధ్వనులు వైద్యుల చేతికి అందిన శక్తివంతమైన మరియు సురక్షితమైన పరికరము.
  2. ఇకోకార్డియోగ్రఫి అనే పద్ధతిలో గుండెలోని వివిధ భాగాల నుండి పరావర్తనం చెందిన అతిధ్వనులు గుండె చిత్రాల్ని ఏర్పరుస్తాయి.
  3. అల్ట్రాసోనోగ్రఫి అనే పద్ధతిని రోగి శరీరంలోని అవయవాలలో ఏర్పడ్డ కణితులను, రాళ్ళను గుర్తించడానికి ఉపయోగిస్తారు.
  4. ఇదే పద్ధతిని తల్లి గర్భంలోని భ్రూణము యొక్క పెరుగుదలను పరిశీలించుటకు కూడా వాడతారు.

ప్రశ్న 12.
స్వరము యొక్క పిచ్ ను నిర్ధారించే నమూనాను తయారు చేయండి.
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 11th Lesson ధ్వని 3

ప్రశ్న 13.
ప్రక్క పటంను గమనించి దాని గురించి రెండు వాక్యాలు వ్రాయుము.
AP Board 9th Class Physical Science Solutions 11th Lesson ధ్వని 9
జవాబు:

  1. ఇచ్చిన పటం ధ్వని పరావర్తనంను తెలియజేయుచున్నది.
  2. ధ్వని పరావర్తనం చెందిన తర్వాత అన్ని మూలలకు సమానంగా చేరుకునేటట్లు సమావేశ మందిరంను నిర్మించారు.

ప్రశ్న 14.
శృతిదండంను కనుగొన్న సంగీత విద్వాంసుడు అయిన “జాన్‌ షోర్” కృషిని ఎలా అభినందిస్తారు?
జవాబు:

  1. జాన్ షోర్ కనుగొన్న శృతిదండము లేకుంటే ప్రస్తుతము మనము వింటున్న సంగీత సాధనాలుగాని, ఇంపైన సంగీతముగాని ఉండేది కాదు.
  2. శృతిదండంను ఉపయోగించి సంగీత వాయిద్యాలను శృతి చేస్తారు.
  3. ఈ విధంగా మనకు ఉపయోగకరమైన శృతిదండంను కనుగొనుటలో జాషోర్ కృషిని ఏ విధంగా అభినందించినా అది తక్కువే.

AP 9th Class Physical Science Important Questions 11th Lesson ధ్వని

ప్రశ్న 15.
X – కిరణాలు మరియు కాంతి తరంగాలకు బదులుగా అతిధ్వనులను ఉపయోగించడం వలన కలిగే ప్రయోజనాలేమిటి?
జవాబు:

  1. అల్ట్రాసోనోగ్రఫి అతిధ్వనులపై ఆధారపడి పనిచేస్తుంది. అల్ట్రాసోనోగ్రఫి అనునది X – కిరణాలతో పరీక్షించడం వంటి పాత పద్ధతుల కంటే సురక్షితమైనది.
  2. ఎందుకనగా తరచుగా X – కిరణాలు వాడటం వలన శరీర కణజాలాలకు ముఖ్యంగా, గర్భంలోని భ్రూణాలకు అపాయం కలిగే అవకాశం ఉంటుంది.

9th Class Physical Science 11th Lesson ధ్వని 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
శృతిదండం గురించి వ్రాయుము.
జవాబు:

  1. శృతిదండం ఒక శబ్ద అనునాదకము. దీనిని “జాన్ షోర్” అనే సంగీత విద్వాంసుడు కనుగొనెను.
  2. ఇది U – ఆకారములో వంచబడిన ఉక్కు ముక్క.
  3. దీనిని పట్టుకునేందుకు U – ఆకారపు వంపు వద్ద కడ్డీ అతుకబడి ఉంటుంది.
  4. ఇది నిర్దిష్ట పి’ అనునాదం చెందును.
  5. దీని పిచ్ దాని భుజాల పొడవులపై ఆధారపడును.
  6. సంగీత వాయిద్యాలను శృతిచేయడంలో దీని పిచ్ ను ప్రామాణికంగా తీసుకుంటారు.

ప్రశ్న 2.
కంపన తరంగాలలోని రకాలు ఎన్ని? అవి ఏవి? వాటిని వివరింపుము.
జవాబు:
కంపన తరంగాలు రెండు రకాలు. అవి:

  1. అనుదైర్ఘ్య తరంగాలు,
  2. తిర్యక్ తరంగాలు.

అనుదైర్ఘ్య తరంగాలు:

  1. యానకంలోని కణాలు తరంగ చలనదిశలో (తరంగ చలనదిశకు సమాంతరంగా)నే కంపిస్తే, ఆ తరంగాలను అనుదైర్ఘ్య తరంగాలు అంటారు.
  2. అనుదైర్ఘ్య తరంగాలు యానకం సాంద్రతలో మార్పుకు కారణమవుతాయి.
  3. అనుదైర్ఘ్య తరంగాలలో వరుసగా సంపీడన మరియు విరళీకరణములు ఏర్పడును.
  4. అనుదైర్ఘ్య తరంగాలకు ఉదాహరణ : ధ్వని తరంగాలు.

తిర్యక్ తరంగాలు:

  1. యానకంలోని కణాలు తరంగ చలనదిశకు లంబంగా కంపిస్తే ఆ తరంగాలను తిర్యక్ తరంగాలు అంటారు.
  2. తిర్యక్ తరంగాలు యానకపు ఆకృతిలో మార్పునకు. కారణమవుతాయి.
  3. తిర్యక్ తరంగాలలో వరుసగా శృంగాలు మరియు ద్రోణులు ఏర్పడును.
  4. తిర్యక్ తరంగాలకు ఉదాహరణ : నీటిలో ఏర్పడే తరంగాలు

ప్రశ్న 3.
సాంద్రత – దూరం గ్రాఫులో తరంగ దైర్ఘ్యం, కంపన పరిమితులను చూపే పటంను గీయుము.
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 11th Lesson ధ్వని 2

ప్రశ్న 4.
పౌనఃపున్యం యొక్క ఉన్నత ప్రమాణాలను చూపు నమూనాను తయారు చేయండి.
జవాబు:
పౌనఃపున్యం యొక్క ఉన్నత ప్రమాణాలు

కిలో హెర్ట్ (KHz) 103 Hz
మెగా హెర్జ్ (MHz) 106Hz
గిగా హెర్ట్ (GHz) 109 Hz
టెరా హెర్జ్ (THz) 1012 Hz

ప్రశ్న 5.
ఒక సంగీత స్వరం యొక్క పిచను తెలిపే పటాలను గీయుము.
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 11th Lesson ధ్వని 4

9th Class Physical Science 11th Lesson ధ్వని 1 Mark Bits Questions and Answers

1. క్రింది జతలలో సరైనది కానిది
A) పిచ్, పౌనఃపున్యం
B) ప్రతిధ్వని, వక్రీభవనం
C) గుణం, తరంగరూపం
D) తీవ్రత, కంపన పరిమితి
జవాబు:
B) ప్రతిధ్వని, వక్రీభవనం

2. వేగం (V), పౌనఃపున్యం (υ) మరియు తరంగదైర్ఘ్యం (λ)ల మధ్య సంబంధం
A) V = υλ
B) υ = Vλ
C) λ = Vυ
D) [latex]\mathrm{V}=\frac{\mathrm{U}}{\lambda}[/latex]
జవాబు:
A) V = υλ

AP 9th Class Physical Science Important Questions 11th Lesson ధ్వని

3. భూమిపై వాతావరణం లేదనుకుంటే ధ్వని తరంగవేగం
A) 3 × 108ms-1
B) 331.2ms-1
C) 3 × 10-8 ms-1
D) వ్యాప్తి చెందదు
జవాబు:
D) వ్యాప్తి చెందదు

4. కింది వానిలో సంగీత ధ్వనుల లక్షణం కానిది
A) తరంగదైర్ఘ్యం
B) కీచుదనం
C) తీవ్రత
D) నాణ్యత
జవాబు:
C) తీవ్రత

5. ట్రాఫిక్ పోలీస్ రోడ్డుపై వెళుతున్న కారు యొక్క వడిని తన వద్ద ఉన్న రాదాగతో కొలిచాడు. అతడు ఆ క్షణంలో కొలిచినది
A) తక్షణ త్వరణం
B) తక్షణ వేగం
C) సరాసరి త్వరణం
D) సరాసరి వేగం
జవాబు:
B) తక్షణ వేగం

6. ఏ స్వరం యొక్క పిచ్ ఎక్కువగా ఉంటుందో తెల్పండి.
A) స
C) గ
D) మ
జవాబు:
D) మ

I. సరియైన సమాధానమును రాయుము.

1. వాతావరణ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ప్రభావితమయ్యే ధ్వని లక్షణం
A) తరంగ దైర్ఘ్యం
B) పౌనఃపున్యము
C) వేగం
D) కంపన పరిమితి
జవాబు:
C) వేగం

2. ఈ క్రింది వానిలో …….. లోధ్వని వేగము అధికము.
A) ఘనపదార్ధములు
B) ద్రవపదార్ధములు
C) వాయు పదార్ధములు
D) శూన్యము
జవాబు:
A) ఘనపదార్ధములు

AP 9th Class Physical Science Important Questions 11th Lesson ధ్వని

3. సోనార్ వ్యవస్థలో ఉపయోగించు తరంగాల రకము
A) నీటి తరంగాలు
B) రేడియో తరంగాలు
C) ధ్వని తరంగాలు
D) పరశ్రావ్యాలు
జవాబు:
C) ధ్వని తరంగాలు

4. కింది వానిలో పరశ్రావ్యాలను వినగలిగేది.
A) కుక్క
B) గబ్బిలం
C) ఖడ్గమృగం
D) మానవుడు
జవాబు:
C) ఖడ్గమృగం

5. 20°C వద్ద ఒక వ్యక్తి ప్రతిధ్వనిని వినుటకు పరావర్తన తలంకు, అతనికి మధ్యగల కనీస దూరము
A) 12.2మీ.
B) 17.2మీ.
C) 15.2మీ.
D) 134.4మీ.
జవాబు:
B) 17.2మీ.

6. ఒక యానకములో తరంగము ప్రయాణించేటపుడు, ఈ కింది వానిలో ఒక కణము నుండి వేరొక కణానికి బదిలీ అగునది.
A) శక్తి
B) ద్రవ్యవేగం
C) రెండూనూ
D) ఏదీకాదు
జవాబు:
A) శక్తి

7. అనుదైర్ఘ్య తరంగము కింది వానిలో ప్రయాణిస్తుంది.
A)ఘనపదార్థాలు
B) ద్రవాలు
C) వాయువులు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

8. ఒక వస్తువు కంపిస్తుంటే స్థిరంగా ఉండే భౌతిక రాశి
A) కంపన పరిమితి
B) వేగం
C)త్వరణము
D) దిశ
జవాబు:
A) కంపన పరిమితి

AP 9th Class Physical Science Important Questions 11th Lesson ధ్వని

9. ఈ క్రింది వానిలో దేనిలో మార్పునకు ధ్వని వేగం ప్రభావితం కాదు?
A) ఉష్ణోగ్రత
B) యానకము
C) పీడనము
D) తరంగదైర్ఘ్యం
జవాబు:
C) పీడనము

10. ధ్వని యొక్క పిచ్ ప్రాథమికముగా ఆధారపడునది.
A) తీవ్రత
B) పౌనఃపున్యము
C) లక్షణము
D) అన్నియూ
జవాబు:
B) పౌనఃపున్యము

11. సితార మరియు వీణల నుండి వచ్చే ధ్వనులను వేరుపరచునది.
A) తీవ్రత
B) పిచ్
C) లక్షణము
D) B మరియు C
జవాబు:
C) లక్షణము

12. స్ప్రింగులో ఏర్పడే తరంగాలు …… రకపు తరంగాలు.
A) అనుదైర్ఘ్య
B) తిర్యక్
C) రెండూనూ
D) ఏవీకావు
జవాబు:
A) అనుదైర్ఘ్య

13. ఒక వస్తువు ధ్వనిని మాత్రమే ఉత్పత్తి చేయు స్థితి
A) నిశ్చల
B) కంపన
C) చలన
D) శూన్యము
జవాబు:
B) కంపన

14. Hz ప్రమాణముగా గలది ……….
A) పౌనఃపున్యం
B) అవధి
C) కంపన పరిమితి
D) ఏదీకాదు
జవాబు:
A) పౌనఃపున్యం

AP 9th Class Physical Science Important Questions 11th Lesson ధ్వని

15. కంపన పరిమితికి S.I ప్రమాణము
A) మి.మీ.
B) సెం.మీ.
C) మీ.
D) Å
జవాబు:
C) మీ.

II. ఈ క్రింది ఖాళీలను పూరింపుము.

1. ధ్వని ఉత్పత్తి అగు స్థితి ……………….
2. ధ్వని తరంగంలో అధిక పీడనంగల ప్రాంతములు ……………
3. ధ్వని ……………….. గుండా ప్రయాణించదు.
4. ధ్వని ఒక ……………….. స్వరూపము.
6. ధ్వని తరంగంలో అల్ప సాంద్రత గల ప్రాంతములు ……………….
7. కీచుదనం మరియు బొంగురు స్వరాల మధ్య తేడాకు కారణం …….
8. 1 కిలో హెర్ట్జ్ = ……………… హెర్ట్జ్‌లు.
9. అనుదైర్ఘ్య తరంగాలు యానకపు …………….. లో మార్పునకు కారణమవుతాయి.
10. మొట్టమొదటగా గాలిలో ధ్వని ప్రసారాన్ని పూర్తిగా వివరించినవాడు ………………
11. శృతిదండాన్ని కనుగొన్న సంగీత విద్వాంసుడు ………………
12. తిర్యక్ తరంగాలు యానకపు ………… లో మార్పునకు కారణమవుతాయి.
13. నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద గాలి పీడనం …………….. కు అనులోమానుపాతంలో ఉంటుంది.
14. రెండు వరుస శృంగాలు లేదా ద్రోణుల మధ్య దూరంను ……………….. అంటారు.
15. యానకంలోని కణాలు వాని. మధ్యస్థ స్థానానికి ఇరువైపులా పొందే గరిష్ఠ అలజడిని ………………. అంటారు.
16. కణాలు ఒక పూర్తి డోలనం చేయుటకు పట్టిన కాలాన్ని …………… అంటారు.
17. 20°C వద్ద పొడిగాలిలో ధ్వ నివేగం ……………..
18. 20°C వద్ద నీటిలో ధ్వని వేగం గాలిలో ధ్వని వేగానికి ……………… రెట్లు అధికం.
19. ఇనుములో ధ్వని వేగం ……….
20. చెవికి ఇంపుగా ఉన్న శబ్దాలను ………… అంటారు.
21. శబ్ద తరంగపు పౌనఃపున్యం ఎక్కువైతే దాని. ………… ఎక్కువ అని చెప్పవచ్చు.
22. మానవుని చెవులు …………………. dB నుండి ……………… dB వరకు గల శబ్దాలను వినగలవు.
23. విమానపు జెట్ ఇంజన్ శబ్ద తీవ్రత …………….. dB ఉంటుంది.
24. ధ్వని పరావర్తనం కూడా … …………….. పరావర్తన నియమాలను పాటిస్తుంది.
25. మానవుని శ్రవ్య అవధి 5. శృతిదండం ఒక
26. వృద్ధులకు గరిష్టంగా ధ్వనులను వినే అవధి ………..
27. ఖడ్గమృగాలు వినగల పరశ్రావ్య ధ్వనుల పౌనఃపున్యము
28. డాల్ఫిన్లు వినగల ధ్వనుల పౌనఃపున్యం ……………..
29. కొన్ని రకాల చేపలు ………………… పౌనఃపున్యం గల ధ్వనులను వినగలవు.
30. సోనార్ అనగా …………….
జవాబు:

  1. ప్రకంపన స్థితి
  2. సంపీడనాలు
  3. శూన్యం
  4. శక్తి
  5. శబ్ద అనునాదకం
  6. విరళీకరణాలు
  7. పిచ్
  8. 10
  9. సాంద్రత
  10. న్యూటన్
  11. జాన్ స్టోర్
  12. ఆకృతి
  13. సాంద్రత
  14. తరంగదైర్ఘ్యం
  15. కంపన పరిమితి
  16. ఆవర్తనకాలం
  17. 343.2 మీ/సె
  18. 4.3
  19. 1487 మీ/సె
  20. సంగీత స్వరములు
  21. పిచ్
  22. 9 – 180
  23. 120
  24. కాంతి
  25. 20 Hz – 20 KHz
  26. 10 KHz – 12 KHz
  27. 5 Hz
  28. 1 లక్షకు పైగా
  29. 1 – 25 Hz
  30. సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్

III. జతపరచుము.

i)

Group – A Group – B
1. పరశ్రావ్యాలు A) 20 Hz కంటే తక్కువ పౌనఃపున్యం
2. అతిధ్వనులు B) 1,00,000 Hz లు
3. శ్రవ్య అవధి C) 1-25 Hz
4. గబ్బిలం D) 20 Hz కంటే తక్కువ పౌనఃపున్యం
5. ఏనుగులు E) 20 Hz – 20,000 Hz
F) 20 KHz కంటే ఎక్కువ పౌనఃపున్యం

జవాబు:

Group – A Group – B
1. పరశ్రావ్యాలు A) 20 Hz కంటే తక్కువ పౌనఃపున్యం
2. అతిధ్వనులు F) 20 KHz కంటే ఎక్కువ పౌనఃపున్యం
3. శ్రవ్య అవధి E) 20 Hz – 20,000 Hz
4. గబ్బిలం B) 1,00,000 Hz లు
5. ఏనుగులు D) 20 Hz కంటే తక్కువ పౌనఃపున్యం

ii)

Group – A Group – B
1. శబ్ద తీవ్రత A) మీటరు
2. కంపన పరిమితి B) సెకను
3. పౌనఃపున్యం C) డెసిబెల్స్
4. తరంగ దైర్ఘ్యం D) హెర్టర్లు
5. ఆవర్తన కాలం E) పాస్కల్
F) υ

జవాబు:

Group – A Group – B
1. శబ్ద తీవ్రత C) డెసిబెల్స్
2. కంపన పరిమితి E) పాస్కల్
3. పౌనఃపున్యం D) హెర్టర్లు
4. తరంగ దైర్ఘ్యం A) మీటరు
5. ఆవర్తన కాలం B) సెకను

AP 9th Class Physical Science Important Questions 10th Lesson పని మరియు శక్తి

These AP 9th Physical Science Important Questions and Answers 10th Lesson పని మరియు శక్తి will help students prepare well for the exams.

AP Board 9th Class Physical Science 10th Lesson Important Questions and Answers పని మరియు శక్తి

9th Class Physical Science 10th Lesson పని మరియు శక్తి 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
ఒక జౌల్ పని అనగానేమి?
జవాబు:
ఒక వస్తువుపై 1 న్యూటన్ బలం పని చేసి ఆ వస్తువును బల ప్రయోగదిశలో 1 మీ. దూరం కదిలిస్తే అపుడు 1 జౌల్ పని జరిగింది అంటాం.

ప్రశ్న 2.
ఒక బంతిని పైకి విసిరితే అది పైకి వెళుతున్నప్పుడు దాని వది ఏమవుతుంది?
జవాబు:
బంతి పైకి వెళుతున్న కొద్దీ దానిపై గురుత్వాకర్షణ బలము వ్యతిరేకదిశలో పని చేయటం వల్ల ఆ బంతి వడి క్రమేపి తగ్గును.

ప్రశ్న 3.
పైకి విసిరిన బంతి చేరుకున్న గరిష్ట ఎత్తు వద్ద దాని వడి ఎంత?
జవాబు:
పైకి విసిరిన బంతి చేరుకున్న గరిష్ట ఎత్తు వద్ద దాని వడి శూన్యము.

ప్రశ్న 4.
పైకి విసిరిన బంతి తిరిగి కిందికి పడుతున్నప్పుడు దాని వది ఏమవుతుంది?
జవాబు:
పైకి విసిరిన బంతి తిరిగి కిందికి పడుతున్నపుడు దాని వడి క్రమేపి ‘పెరుగును.

ప్రశ్న 5.
శక్తి అనగానేమి?
జవాబు:
పని చేయగల సామర్థ్యాన్ని శక్తి అంటారు.

AP 9th Class Physical Science Important Questions 10th Lesson పని మరియు శక్తి

ప్రశ్న 6.
ఒక వ్యక్తి ఒక ప్రదేశంలో ఎక్కువ సేపు నిలుచున్నా, అలసిపోతాడు. ఎందుకు?
జవాబు:
నిలచున్న వ్యక్తి ఏ పని చేస్తున్నట్లు మనకు కనిపించకపోయినా, అతని శరీరంలో కండరాలు సంకోచవ్యాకోచాలు చెందుతాయి. అదే విధంగా గుండె వివిధ అవయవాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఇటువంటి అనేక పనుల వలన శరీరంలోని శక్తి తరిగిపోతుంది. కాబట్టి ఆ వ్యక్తి అలసిపోతాడు.

ప్రశ్న 7.
గతిశక్తి అనగానేమి?
జవాబు:
ఒక వస్తువుకు దాని గమనం వల్ల లభించే శక్తిని ‘గతిశక్తి’ అంటారు.

ప్రశ్న 8.
గతిశక్తిని కొలవడానికి సూత్రం వ్రాయుము.
జవాబు:
గతిశక్తి KE = [latex]\frac{1}{2}[/latex] mv².

ప్రశ్న 9.
స్థితిశక్తి అనగానేమి?
జవాబు:
ఒక వస్తువుకు దాని ఆకారం లేదా స్థానం వల్ల పొందే శక్తి ‘స్థితిశక్తి’ అంటారు.

ప్రశ్న 10.
స్థితిశక్తిని కొలవడానికి సూత్రం రాయుము.
జవాబు:
స్థితిశక్తి PE = mgh.

ప్రశ్న 11.
శక్తి నిత్యత్వం అనగానేమి?
జవాబు:
శక్తి సృష్టించబడదు, నాశనం చేయబడదు. అది ఒక రూపం నుండి మరొక రూపంలోకి మార్చబడుతుంది. దీనినే శక్తి నిత్యత్వ నియమము అంటారు.

ప్రశ్న 12.
ప్రక్కన ఇవ్వబడిన పటం ద్వారా నీవేమి సమాచారాన్ని గ్రహించితివో వ్రాయండి.
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 10th Lesson పని మరియు శక్తి 5
పళ్ళెంలో నిశ్చలస్థితిలో ఉన్నప్పుడు గోళీ ‘పని’ చేయలేకపోయింది. కానీ దానిని కొంత ఎత్తు వరకు పైకి ఎత్తినపుడు గోళీ పని చేయగలిగింది.

ప్రశ్న 13.
మీ ఇంటిలో వాడే లైట్లు (బల్బులు) ఏ విధంగా శక్తి పరివర్తనను జరుపుచున్నాయో వ్రాయుము.
జవాబు:
ఎలక్ట్రిక్ బల్బు, విద్యుత్ శక్తిని మొదటగా ఉష్ణశక్తిగాను, తర్వాత కాంతిశక్తిగాను మారుస్తుంది.
∴ విద్యుత్ శక్తి → ఉష్ణశక్తి → కాంతి శక్తి

AP 9th Class Physical Science Important Questions 10th Lesson పని మరియు శక్తి

ప్రశ్న 14.
25 కిలోల బియ్యం బస్తాను పిల్లలు పైకెత్తలేకపోవచ్చు. కానీ పెద్దవారు ఎత్తగలుగుతారు. ఎందుకు?
జవాబు:
పిల్లవాడు ప్రయోగించిన బలం కన్నా, పెద్దవారు ప్రయోగించిన బలం అధికము కావున.

9th Class Physical Science 10th Lesson పని మరియు శక్తి 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
‘పని’ భావనను శాస్త్రీయంగా చెప్పాలంటే క్రింది రెండు షరతులు పాటింపబడాలి.
1. వస్తువుపై ఏదైనా బలం పనిచేయాలి.
2. ఆ వస్తువు స్థానంలో లేదా స్థితిలో మార్పు జరగాలి.
క్రింది పట్టికను పూరించండి.
AP 9th Class Physical Science Important Questions 10th Lesson పని మరియు శక్తి 1
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 10th Lesson పని మరియు శక్తి 2

ప్రశ్న 2.
అ)
AP Board 9th Class Physical Science Solutions 10th Lesson పని మరియు శక్తి 2
ఆ)
AP Board 9th Class Physical Science Solutions 10th Lesson పని మరియు శక్తి 21
పై పటములలో చూపబడిన వస్తువులు ఏ శక్తులను కలిగి ఉంటాయో తెలపండి.
జవాబు:
i) వస్తువు స్థితిశక్తిని కలిగియుంది.
ii) వస్తువు గతిశక్తిని కలిగియుంది.

ప్రశ్న 3.
సామర్థ్యమును వివరించుము. ఇది అదిశ రాశా? సదిశ రాశా?
జవాబు:
పని జరిగే రేటును సామర్ధ్యం అంటారు. (లేక) శక్తి మార్పు రేటును సామర్థ్యం అంటారు. ఒక శక్తి ‘W’ పనిని ‘t’
కాలములో చేసిన దాని సామర్థ్యము (P) = పని / కాలము
⇒ P = [latex]\frac{W}{t}[/latex]
పని మరియు కాలములు అదిశ రాశులు కావున సామర్ధ్యము కూడా అదిశ రాశి అగును.

ప్రశ్న 4.
క్రింది పటంను గమనించి, దాని గురించి వ్రాయుము.
AP 9th Class Physical Science Important Questions 10th Lesson పని మరియు శక్తి 3
జవాబు:
ఒక సమతలం పైన కదులుతున్న బంతిపై ఘర్షణ బలం బంతి కదిలే దిశకు వ్యతిరేక దిశలో పనిచేయడం వలననే ఆ బంతి కొంత సేపటికి ఆగిపోతుంది.

ప్రశ్న 5.
పని జరగటానికి కావాల్సిన షరతులు ఎన్ని? అవి ఏవి?
జవాబు:
విజ్ఞానశాస్త్రం ప్రకారం పని జరిగిందని చెప్పాలంటే క్రింద తెలిపిన రెండు షరతులు సంతృప్తి పరచబడాలి.

  1. వస్తువుపై ఏదైనా బలం పని చేయాలి.
  2. ఆ వస్తువు స్థానంలో లేదా స్థితిలో మార్పు జరగాలి.

ప్రశ్న 6.
సామర్థ్యమునకు SI పద్ధతిలో ప్రమాణము వ్రాయుము. దాని యొక్క ఉన్నత ప్రమాణాలను తెలుపుము.
జవాబు:
1) SI పద్ధతిలో సామర్ధ్యమునకు ప్రమాణము వాట్. వాట్ అనగా 1 జోల్ పనిని 1 సెకను కాలము చేయుట అని అర్ధము.

2) సామర్ధ్యం యొక్క టన్నుల విలువను కిలోవాట్లలో కొలుస్తారు.
1 కిలోవాట్ = 1000 వాట్లు = 1000 వోళ్ళు / సెకను
1 మెగావాట్ = 106 వాట్లు

ప్రశ్న 7.
ఒక బొమ్మ కారుకు ‘కీ’ ఇవ్వకుండా నేలపై ఉంచాం. తర్వాత ‘కీ’ ఇచ్చి నేలపై ఉంచబడిన పటం ఇవ్వబడినది. దానిపై ఒక వాక్యమును వ్రాయుము.
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 10th Lesson పని మరియు శక్తి 4
‘కీ’ ఇవ్వబడని కారు నిశ్చల స్థితిలోనే ఉంటుంది. కాని ‘కీ’ ఇచ్చిన తర్వాత అదే బొమ్మకారు కదిలేందుకు కావలసిన శక్తిని స్ప్రింగు ద్వారా పొందుతుంది.

ప్రశ్న 8.
గతిశక్తికి కొన్ని ఉదాహరణలిచ్చు సందర్భాలను వ్రాయుము.
జవాబు:

  1. వేగంగా కదిలే క్రికెట్ బంతి వికెట్లను పడగొట్టడం.
  2. అదే బంతి బ్యాట్ కు తగిలితే వేగంగా మరొక దిశలో కదలడం.
  3. వేగంగా కదిలే తుపాకి గుండు, లక్ష్యం గుండా దూసుకొని పోవడం.
  4. కదిలే గాలి (పవనం) గాలిమరను తిప్పడం.

ప్రశ్న 9.
మానవ శరీరంలోని శక్తిని గురించి రాయుము.
జవాబు:

  1. మానవ శరీరం వివిధ రకాల శక్తి మార్పులు జరిగే ఒక సంక్లిష్ట వ్యవస్థ.
  2. మానవ శరీరంలోని శక్తికి మూలాధారం ఆహారం.
  3. పనిని చేసేటపుడు కండరాల సంకోచ, వ్యాకోచాల సందర్భంలో గుండె రక్తాన్ని “పంప్” చేయడానికి శక్తి వినియోగించ బడుతుంది.
  4. మన శరీరంలో వివిధ జీవక్రియలు జరగడానికి పనిచేసే బలం మన శరీర శక్తిని తగ్గిస్తుంది. అటువంటి సందర్భంలో మనం అలసిపోతాం.

AP 9th Class Physical Science Important Questions 10th Lesson పని మరియు శక్తి

ప్రశ్న 10.
సోను ఈ మధ్య జరిగిన ఇండియా – ఆస్ట్రేలియా మ్యాచ్ ను వీక్షించాడు. అతనికి క్రికెట్లోని బంతి, బ్యాట్ పై మరియు దాని చలనాలపై కొన్ని సందేహాలు తలెత్తాయి. అవి ఏమిటో వ్రాయండి.
జవాబు:

  1. బంతిని బౌలర్ వేగంగా ఎందుకు వేస్తున్నాడు?
  2. వేగంగా కదిలే క్రికెట్ బంతి వికెట్లను పడగొట్టడంలో ఇమిడివున్న నియమమేమిటి?
  3. అదే బంతి బ్యాట్ కు తగలగానే దిశ ఎందుకు మార్చుకోగలిగినది?

ప్రశ్న 11.
వెంకట్ వాలీబాల్ తో ఆడుచున్నాడు. అతను బంతిని పైకి వేసిన సందర్భంలో దానిలో కలిగే మార్పులను గమనించాడు. అతనికి కొన్ని ప్రశ్నలు (సందేహాలు) వచ్చాయి. అవి ఏమైవుంటాయో మీరు ఊహించగలరా?
జవాబు:

  1. బంతి పైకి వెళుతుంటే దాని వేగం ఏమవుతుంది?
  2. బంతి చేరుకున్న గరిష్ట ఎత్తు వద్ద దాని వేగం ఎంత?
  3. బంతి తిరిగి కిందకి వస్తున్నప్పుడు దాని వడి ఏమవుతుంది?

9th Class Physical Science 10th Lesson పని మరియు శక్తి 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
సితిజ, గతిజ శక్తుల మధ్య పోలికలు, తేడాలను వ్రాయండి.
జవాబు:

స్థితిజ శక్తి గతిజ శక్తి
1) ఒక వస్తువుకు దాని ఆకారం లేదా స్థానం వలన పొందే శక్తిని స్థితిజశక్తి (P.E) అని అంటారు. 1) ఒక వస్తువుకు దాని గమనం వలన పొందే శక్తిని గతిజ శక్తి (K.E) అని అంటారు.
2) ఇంటిపై గల నీటి ట్యాంక్ లో నీటికి గల శక్తి స్థితిజ శక్తి. సాగదీసి ఉంచబడిన రబ్బరు బ్యాండ్‌కు గల శక్తి స్థితిజ శక్తి. 2) ప్రవహించే నీటికి గల శక్తి గతిజ శక్తి. ప్రయాణించే వాహనానికి గల శక్తి గతిజ శక్తి.
3) P.E = mgh 3) K.E = [latex]\frac{1}{2}[/latex] mv2
4) ఇది ఎత్తుపై ఆధారపడి ఉంటుంది.
(కొన్ని సందర్భాలలో)
4) ఇది వేగంపై ఆధారపడి ఉంటుంది.

ప్రశ్న 2.
యాంత్రిక శక్తి అనగానేమి? దాని యొక్క రూపాలను రాయుము. ఒక ఉదాహరణతో వివరింపుము.
జవాబు:
ఒక వస్తువునకు యాంత్రిక బలము వలన వచ్చు శక్తినే యాంత్రిక శక్తి అంటారు.

యాంత్రిక శక్తి రెండు రకాలు. అవి : 1) గతిశక్తి ii) స్థితిశక్తి

ఉదాహరణ:

  1. ఒక విమానం నిశ్చలస్థితిలో ఉన్నప్పుడు దాని గతిశక్తి విలువ శూన్యం. అదే విధంగా అది నేలపై ఉన్నప్పుడు దాని స్థితిశక్తి విలువ కూడా శూన్యమే.
  2. అనగా నేలపై నిశ్చలస్థితిలో ఉన్న విమానం యొక్క యాంత్రికశక్తి శూన్యం.
  3. అదే విమానం కొంత ఎత్తులో ఎగురుతున్నప్పుడు దానికి గతిశక్తి మరియు స్థితిశక్తి ఉంటాయి కనుక యాంత్రిక శక్తి ఉండదు.

ప్రశ్న 3.
ప్రకృతిలో జలచక్రం ఏర్పడడాన్ని నీవెలా అభినందిస్తావు?
జవాబు:

  1. సముద్రాలు, నదులు, సరస్సులు మరియు కొలనులలోని నీరు ఆవిరిగా భాష్పీభవనం చెందును.
  2. ఈ ఆవిరి నీటి మేఘములను ఏర్పరచును.
  3. ఈ మేఘములు వర్షములు కురిసేందుకు దోహదపడును.
  4. వర్షం ద్వారా వచ్చిన నీరు డ్యాములలో నిల్వ చేయబడును. వీటికి స్థితిశక్తి వుండును.
  5. మరలా ఈ నీరు తిరిగి సముద్రంలోకి కలియును.
  6. ఈ కలిసే నీటిని మనము విద్యుత్ శక్తి వనరుగా ఉపయోగిస్తాము.
  7. ఈ విధముగా ప్రకృతిలో గల జలచక్రం మానవాళికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ జలచక్రంను నేను అభినందిస్తున్నాను.

9th Class Physical Science 10th Lesson పని మరియు శక్తి 1 Marks Bits Questions and Answers

1. బంతి వడి రెట్టింపైన దాని గతిజశక్తి
A) మారదు.
B) రెట్టింపగును.
C) సగమవుతుంది.
D) నాలుగురెట్లగును.
జవాబు:
D) నాలుగురెట్లగును.

2. చైతన్య 5 నిమిషాల కాలంలో 3000 ల పని చేసిన ఆమె సామర్థ్యం
A) 60 W
B) 1/60 W
C) 1 W
D) o W
జవాబు:
C) 1 W

AP 9th Class Physical Science Important Questions 10th Lesson పని మరియు శక్తి

3. ‘పని’కి
A) దిశ మాత్రమే ఉంది, కాని పరిమాణం లేదు.
B) పరిమాణం మాత్రమే ఉంది, కాని దిశ లేదు.
C) పరిమాణం, దిశ రెండూ కలవు.
D) పరిమాణం, దిశ రెండూ లేవు.
జవాబు:
B) పరిమాణం మాత్రమే ఉంది, కాని దిశ లేదు.

4. సామర్థ్యానికి నిర్వచనం
P) పని జరిగే రేటు
Q) శక్తి బదిలీ రేటు
R) స్థితిశక్తి, గతిశక్తిల మొత్తం
A) P మాత్రమే
B) Q మరియు R
C) P మరియు Q
D) P, Q మరియు R
జవాబు:
C) P మరియు Q

5. ఒక పుస్తకంపై 4.5 న్యూటన్స్ బలాన్ని ప్రయోగించి, దానిని 30 సెం.మీ. కదిలించిన జరిగిన పని ఎంత?
A) 1.55 J
B) 1.35 J
C) 1.53 J
D) 1.3 J
జవాబు:
B) 1.35 J

I. సరియైన సమాధానమును రాయుము.

1. వస్తువుపై పనిచేసే బలం దాని వడికి విలోమాను పాతంలో ఉంటే గతిశక్తి …..
A) స్థిరం
B) కాలానికి విలోమానుపాతం
C) కాలానికి అనులోమానుపాతం
D) ఏదీకాదు
జవాబు:
C) కాలానికి అనులోమానుపాతం

2. 1కి.గ్రా. ద్రవ్యరాశి, 2 N – S ద్రవ్యవేగం గల వస్తువు గతిశక్తి ……..
A) 2 J
B) 4 J
C) 8 J
D) 16 J
జవాబు:
A) 2 J

3. 15 కి.గ్రా. సూట్‌కేస్ ని పట్టుకొని 15 ని|| బస్సు కొరకు వేచి ఉండుటలో జరిగిన పని
A) ఎక్కువ
B) తక్కువ
C) శూన్యం
D) అనంతం
జవాబు:
A) ఎక్కువ

4. 1 k Wh = ……….. ఎర్గులు.
A) 3.6 × 1018
B) 3.6 × 1011
C) 3.6 × 1012
D) 3.6 × 1013
జవాబు:
D) 3.6 × 1013

AP 9th Class Physical Science Important Questions 10th Lesson పని మరియు శక్తి

5. క్రింది వానిలో ఏది మిగతా వాటితో విభేదించును?
A) వాట్ – సెకను
B) కూలుంబు – ఫారడే
C) న్యూటన్ – మీటరు
D) కూలుంబు – వోల్టు
జవాబు:
B) కూలుంబు – ఫారడే

6. 100 కి.గ్రా. నీటిని 100 మీ. ఎత్తుకి 10 సె॥లలో తోడగల పంపు సామర్థ్యం …………
A) 9800 W
B) 980 W
C) 98 W
D) శూన్యం
జవాబు:
A) 9800 W

7. 2 కి.గ్రా ద్రవ్యరాశి గల వస్తువు 20 మీ ఎత్తు నుండి క్రింద పడిత స్థితిశక్తిలో నష్టం ……..
A) 400 J
B) 300 J
C) 200 J
D) 100 J
జవాబు:
A) 400 J

8. 1 కి.గ్రా ద్రవ్యరాశి గల వస్తువుకి 1 కౌలు శక్తి ఉండడానికి కావల్సిన వేగం ……
A) 1 మీ/సె
B) 4 మీ/సె
C) 1.414 మీ/సె
D) 9.8 మీ/సె
జవాబు:
C) 1.414 మీ/సె

9. రెండు ఎలకానను ఒకదానికొకటి దగ్గరగా జరిపితే వ్యవస్థ స్థితిశక్తి ……
A) శూన్యం
B) 1 J
C) 2 J
D) 4 J
జవాబు:
A) శూన్యం

10. స్వేచ్ఛాపతనంలో గతిశక్తి …………….
A) ఎత్తుకి అనులోమానుపాతంలో
B) తగ్గును
C) పెరుగును
D) A మరియు C
జవాబు:
D) A మరియు C

AP 9th Class Physical Science Important Questions 10th Lesson పని మరియు శక్తి

11. ఒక రాయిని నిట్టనిలువుగా పైకి విసిరితే అది తిరిగి నేలను చేరింది. దాని స్థితి గరిష్టమయ్యేది
A) పైకి ప్రయాణించినపుడు
B) గరిష్ఠ ఎత్తు వద్ద
C) తిరుగు ప్రయాణంలో
D) అడుగు భాగంలో
జవాబు:
B) గరిష్ఠ ఎత్తు వద్ద

II. ఈ క్రింది ఖాళీలను పూరింపుము.

1. పని ఒక ……………. రాశీ.
2. పనికి ప్రమాణాలు ……………
3. పైకి వెళ్ళే వస్తువు వడి క్రమేపి …..
4. పని ధనాత్మకమైన ఆ వస్తువు శక్తిని …………
5. పని ఋణాత్మకమైన ఆ వస్తువు శక్తిని ……………..
6. వివిధ వస్తువుల పనిచేయగల సామర్థ్యం వాటి ………………. పై ఆధారపడుతుంది.
7. మానవ శరీరం ఒక ………. వ్యవస్థ.
8. సముద్ర అలలు …………… శక్తి వనరు.
9. చెట్టుపై నుండి పడే కొబ్బరికాయకు ఉండు శక్తి.
10. పారుతున్న నీటికి ఉండే శక్తి ………
11. గతిశక్తికి సమీకరణము ……….
12. బొమ్మకారులో ‘కీ’ ని తిప్పినపుడు దానిలో ఉన్న శక్తి ……………..
13. స్థితిశక్తికి సమీకరణము ……………..
14. యాంత్రిక శక్తి = ………….. + …………..
15. నేలపై ఆగి ఉన్న విమానపు గతిశక్తి విలువ ………….
16. ఇస్త్రీ పెట్టెలో ……………… శక్తి, …………….. శక్తిగా మారుతుంది.
17. టార్చ్ లైట్ లో ………….. శక్తి, ……….. గా మారును.
18. సామర్ధ్యమనేది ……………… కు కొలమానము.
19. సామర్థ్యంకు ప్రమాణం …………….
20. ఒక వస్తువుకు దాని చలనం వలన కలిగే శక్తిని …………….. అంటాము.
21. ఒక వస్తువు దాని స్థానం, ఆకారం వలన పొందే శక్తిని ……………. అంటాము.
22. ఒక వస్తువు యొక్క స్థితిశక్తి, గతిశక్తుల మొత్తం ………… శక్తి అగును.
జవాబు:
1) అదిశ
2) N- m లేదా జోల్
3) తగ్గును
4) గ్రహించును
5) కోల్పోవును
6) స్థితి, స్థానాల
7) సంక్లిష్ట
8) సూర్యునిపై ఆధారపడని
9) గతిశక్తి
10) గతిశక్తి
11) K.E = [latex]\frac{1}{2}[/latex]mv²
12) స్థితిశక్తి
13) P.E = mgh
14) స్థితిశక్తి, గతిశక్తి
15) శూన్యం
16) విద్యుత్, ఉష్ణ
17) రసాయన, కాంతిశక్తి
18) పనిచేసే వేగం
19) వాట్
20) గతిశక్తి
21) స్థితిశక్తి
22) యాంత్రిక

III. జతపరచుము.

Group – A Group – B
1. పని A) mgh
2. సామర్థ్యం B) [latex]\frac{1}{2}[/latex] mv²
3. స్థితిశక్తి C) Fs
4. గతిశక్తి D) [latex]\frac{W}{t}[/latex]

జవాబు:

Group – A Group – B
1. పని C) Fs
2. సామర్థ్యం D) [latex]\frac{W}{t}[/latex]
3. స్థితిశక్తి A) mgh
4. గతిశక్తి B) [latex]\frac{1}{2}[/latex] mv²

ii)

Group – A Group – B
1. ఎలక్ట్రిక్ హీటరు A) రసాయన శక్తి → విద్యుత్ శక్తి
2. ఎలక్ట్రిక్ మోటరు B) విద్యుత్ శక్తి → ధ్వని శక్తి
3. ఎలక్ట్రిక్ బ్యాటరీ C) విద్యుత్ శక్తి → యాంత్రిక శక్తి
4. హెడ్ ఫోను D) విద్యుత్ శక్తి → ఉష్ణ శక్తి

జవాబు:

Group – A Group – B
1. ఎలక్ట్రిక్ హీటరు D) విద్యుత్ శక్తి → ఉష్ణ శక్తి
2. ఎలక్ట్రిక్ మోటరు C) విద్యుత్ శక్తి → యాంత్రిక శక్తి
3. ఎలక్ట్రిక్ బ్యాటరీ A) రసాయన శక్తి → విద్యుత్ శక్తి
4. హెడ్ ఫోను B) విద్యుత్ శక్తి → ధ్వని శక్తి

పునరాలోచన

AP 9th Class Physical Science Important Questions 10th Lesson పని మరియు శక్తి 6