SCERT AP 7th Class Social Study Material Pdf 3rd Lesson పటాల ద్వారా అధ్యయనం Textbook Questions and Answers.

AP State Syllabus 7th Class Social Solutions 3rd Lesson పటాల ద్వారా అధ్యయనం

7th Class Social 3rd Lesson పటాల ద్వారా అధ్యయనం Textbook Questions and Answers

కింది తరగతులలోని విషయ పునశ్చరణ

AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 1
పటమును పరిశీలించి ప్రతిస్పందించండి.

ప్రశ్న 1.
పటంలో మీరేమి గమనించారు?
జవాబు:
ఈ పటం విజయవాడ, న్యూఢిల్లీ మధ్య దారిని చూపుతుంది.

ప్రశ్న 2.
పటంలో ఉన్న నీలిరంగు గీత దేనిని సూచిస్తుంది?
జవాబు:
పటంలో నీలిరంగు గీత నదులను చూపుతుంది.

ప్రశ్న 3.
భారతదేశానికి పొరుగున ఉన్న దేశాలను వ్రాయండి.
జవాబు:
పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, టిబెట్, చైనా.

ప్రశ్న 4.
పటంలో చూపిన మార్గంలోని ఏవేని రెండు రాష్ట్రాల పేర్లను చెప్పగలరా?
జవాబు:
తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర.

ప్రశ్న 5.
పటంలో చూపబడిన వివిధ రవాణా మార్గాలు ఏవి?
జవాబు:
రోడ్డు, రైలు మరియు వాయు మార్గాలు.

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

I. క్రింది ప్రశ్నలకు జవాబులివ్వండి.

ప్రశ్న 1.
పటంలో దిక్కులను ఎలా గుర్తిస్తారు?
జవాబు:
సాధారణంగా ఉత్తర దిక్కుకు పైన ఉండే విధంగా పటాలు తయారుచేయబడతాయి. పటంలో కుడివైపున పై భాగంలో ఉన్న బాణం గుర్తు ఆధారంగా దిక్కును తెలుసుకోవచ్చు.

AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం

ప్రశ్న 2.
“దూరాలను అధ్యయనం చేయడానికి పటంలోని స్కేలు ఉపయోగపడుతుంది.” చర్చించండి.
జవాబు:
స్కేలు :
భూ ఉపరితలంపై వాస్తవ దూరాన్ని పటంలో సవరించి చూపడాన్ని స్కేలు తెలియచేస్తుంది. స్కేలును మూడు రకాలుగా చూపవచ్చు.

1) వాక్యరూప స్కేలు :
ఇది వాక్య రూపంలో ఉండి సులువుగా చదివి, అర్థం చేసుకునే విధంగా ఉంటుంది.
ఉదా : 1 సెం.మీ. = 10 కి.మీ.

2) గ్రాఫ్ రూపంలోని స్కేలు :
పటం యొక్క పరిమాణం పెంచినా, తగ్గించినా తదనుగుణంగా స్కేలు మారునట్లుగా రూపొందించబడి ఉంటుంది.
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 2

3) నైష్పత్తిక స్కేలు (RF) :
పటంలో ఇవ్వబడిన స్కేలు పట అధ్యయనం చేసే వారికి అనుకూలమైన ప్రామాణిక కొలతలలో ఉపయోగించుకునేందుకు వీలుగా నిష్పత్తి రూపంలో రూపొందించబడి ఉంటుంది. ప్రామాణిక కొలత ఏదైనా నిష్పత్తి మారదు. ఉదా : 1 :10,000 (1 అంగుళం : 10,000 అంగుళం),

ప్రశ్న 3.
భౌతిక పటాలను అధ్యయనం చేయడానికి ఏఏ అంశాలు అవసరం అవుతాయి?
జవాబు:

 1. పర్వత శ్రేణులు, పీఠభూములు, మైదానాలు, నదులు, ఎడారులు, సరస్సులు, మెట్టభూములు మొదలైన భౌథిక స్వరూపాలకు సంబంధించిన సమాచారాలను తెలిపే పటాలను భౌతిక పటాలు అంటారు.
 2. పట సూచికలో తెలుసుకున్న అంశాలను అన్వయించడం ద్వారా భౌతిక పటాలను చదవవచ్చు. భారతదేశ భౌతిక పటములో ఆకుపచ్చని రంగు ఉన్న భాగాలను గమనించండి, అవి మైదానాలు.
 3. ఉత్తర భారతదేశంలోని ప్రాంతాలు, తీరప్రాంతాలు ఈ కోవలోకి వస్తాయి.
 4. నారింజ రంగు నుండి గోధుమ రంగు వరకు ఉన్న షేడ్స్ (ఛాయలు) సముద్రమట్టం నుండి వివిధ భూస్వరూపాలైన మెట్ట భూములు, పీఠభూములు, కొండ ప్రాంతాలు మొదలగు వాటి ఎత్తును తెలియజేస్తాయి.
 5. ఉదా రంగు పర్వత శిఖరాల ఉన్నతిని, తెలుపు రంగు మంచుతో కప్పబడి ఉన్న హిమాలయ పర్వతాలను తెలియజేస్తాయి.
 6. పటంలో ఉన్న నీలిరంగు జలభాగాలను తెలియజేస్తుంది.
 7. సాంప్రదాయక చిహ్నాలను ఉపయోగించి నదులు, పర్వత శ్రేణులు / శిఖరాలు, సరస్సులు మొదలైన వాటిని పటంలో గుర్తించవచ్చు.

ప్రశ్న 4.
భారతదేశ ఉనికిని వివరించండి.
జవాబు:
భారతదేశ ఉనికి-విస్తరణ :

 1. భారతదేశం 3.28మి. చ.కి.మీ. విస్తీర్ణంతో ప్రపంచంలో ఏడవ అతి పెద్ద దేశంగా గుర్తించబడినది.
 2. మన దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలవు.
 3. భారతదేశం ఆసియా ఖండపు దక్షిణ భాగంలో ఉంది.
 4. అక్షాంశ రీత్యా 8°4′ – 37°6 ఉత్తర అక్షాంశాల మధ్య మరియు 68°7′ 97°25′ తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది.
 5. కర్కటరేఖ దేశ మధ్య భాగం గుండా పోతున్నది.

AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం

ప్రశ్న 5.
అట్లాస్ సహాయంతో ఆసియా ఖండంలోని దేశాల పట్టికను తయారుచేయండి.
జవాబు:
ఆసియా ఖండంలోని దేశాల పట్టిక :
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 3
ఆసియా ఖండంలోని ఇతర దేశాలు :

 1. బహైన్
 2. జార్జియా
 3. కువైట్
 4. UAE(యునైటెడ్ అరబ్ ఎమిరట్స్)
 5. సైప్రస్
 6. ఇజ్రాయెల్
 7. లెబనాన్
 8. మారిషస్
 9. తూర్పుతీమోర్
 10. జోర్డాన్
 11. మంగోలియా

ప్రశ్న 6.
భారత దేశ సరిహద్దులేవి?
జవాబు:
భారత దేశ సరిహద్దులు :
తూర్పున : బంగాళాఖాతం, బంగ్లాదేశ్, మయన్మార్
పశ్చిమాన : అరేబియా సముద్రం, పాకిస్తాన్
ఉత్తరాన : హిమాలయ పర్వతాలు, పాకిస్తాన్, టిబెట్, నేపాల్, భూటాన్, చైనా
దక్షిణాన : హిందూ మహా సముద్రం మరియు శ్రీలంక

ప్రశ్న 7.
భారతదేశం యొక్క గ్రిడ్ ను తయారుచేయండి.
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 4

ప్రశ్న 8.
భారతదేశం యొక్క అవుట్ లైన్ పటంలో క్రింది ప్రదేశాలను గుర్తించండి.
ఎ) చెన్నై బి) ఢిల్లీ సి) విజయవాడ డి) విశాఖపట్నం
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 5

II. సరియైన సమాధానాలను ఎంచుకోండి.

1. సరైన వాక్యాన్ని గుర్తించండి.
ఎ) గంగానది హిమాలయాలలో జన్మిస్తుంది.
బి) కావేరి నది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ప్రవహిస్తుంది.
సి) కృష్ణా నది అరేబియా సముద్రంలో కలుస్తుంది.
డి) పెన్నానది మహారాష్ట్రలో ప్రవహిస్తుంది.
జవాబు:
ఎ) గంగానది హిమాలయాలలో జన్మిస్తుంది.

2. భారతదేశం పూర్వార్ధగోళంలో ఈ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది.
ఎ) 14 27′ నుండి 19-07
బి) 77° నుండి 84-40
సి) 68°7′ నుండి 97 25′
డి) 8-4′ నుండి 376′
జవాబు:
సి) 68°7′ నుండి 97 25′

3. నదుల ఉనికి ఆధారంగా భిన్నంగా ఉన్న దానిని గుర్తించండి.
ఎ) కృష్ణానది
బి) పెన్నానది
సి) బ్రహ్మపుత్రానది
డి) కావేరి
జవాబు:
సి) బ్రహ్మపుత్రానది

AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం

4. అ) కేరళ రాష్ట్రం పశ్చిమ తీరంలో ఉన్నది.
ఆ) అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం పాకిస్తాన్ తో సరిహద్దును పంచుకుంటుంది.
‘అ’, ‘ఆ’, లకు సంబంధించి క్రింది వానిలో సరైన సమాధానాన్ని ఎన్నుకోండి.
ఎ) “అ” సత్యము “ఆ” అసత్యము
బి) “అ” అసత్యము “ఆ” సత్యము
సి) “అ” మరియు “ఆ” రెండూ అసత్యము
డి) “అ” మరియు “ఆ” రెండూ సత్యము
జవాబు:
ఎ) “అ” సత్యము “ఆ” అసత్యము

5. సరికాని జతను గుర్తించండి.
ఎ) చెన్నై – తమిళనాడు
బి) భోపాల్ – గుజరాత్
సి) జైపూర్ – రాజస్థాన్
డి) తిరువనంతపురం – కేరళ
జవాబు:
బి) భోపాల్ – గుజరాత్

7th Class Social Studies 3rd Lesson పటాల ద్వారా అధ్యయనం InText Questions and Answers

7th Class Social Textbook Page No.71

ప్రశ్న 1.
పటంలోని అంశాలను గుర్తించి, పటము – 3.2లో వాటి పేర్లను వ్రాయండి.
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 7
భారతదేశ రాష్ట్రాలు – రాజధానులు
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 10'

7th Class Social Textbook Page No.73

ప్రశ్న 2.
ప్రక్కన ఇవ్వబడిన చిత్రంలో దిక్కులు, మూలలను గుర్తించండి.
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 11
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 12

ప్రశ్న 3.
నీవు బెంగుళూరు నుండి ఈటానగర్ వెళ్ళాలనుకున్నప్పుడు, ఏ దిక్కు నుండి ప్రయాణిస్తావు?
జవాబు:
నైరుతి దిక్కు నుండి ఈశాన్యం వైపుకు ప్రయాణిస్తాను.

ప్రశ్న 4.
పటము – 3.2 లోని స్కేలు ఆధారంగా క్రింది పట్టికను పూరించండి.

ప్రదేశాలు: నుండి – వరకు పై పటంలో దూరం వాస్తవ దూరం
చెన్నై నుండి హైదరాబాద్ 3 సెం.మీ.
ముంబాయి నుండి భువనేశ్వర్ 5 సెం.మీ.
పంజాబ్ నుండి తిరువనంతపురం 2.5 సెం.మీ.
గాంధీనగర్ నుండి జైపూర్ 2 సెం.మీ.
కోల్‌కతా నుండి రాంచి 3000 కి.మీ.
న్యూఢిల్లీ నుండి కోహిమా 2200 కి.మీ.

జవాబు:

ప్రదేశాలు: నుండి – వరకు పై పటంలో దూరం వాస్తవ దూరం
చెన్నై నుండి హైదరాబాద్ 3 సెం.మీ. 600 కి.మీ.
ముంబాయి నుండి భువనేశ్వర్ 5 సెం.మీ. 1000 కి.మీ.
పంజాబ్ నుండి తిరువనంతపురం 2.5 సెం.మీ. 500 కి.మీ.
గాంధీనగర్ నుండి జైపూర్ 2 సెం.మీ. 400 కి.మీ.
కోల్‌కతా నుండి రాంచి 15 సెం.మీ. 3000 కి.మీ.
న్యూఢిల్లీ నుండి కోహిమా 11 సెం.మీ. 2200 కి.మీ.

7th Class Social Textbook Page No.77

ప్రశ్న 5.
పటసూచికలోని అంశాలను ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ భౌతిక పటమును తయారుచేయండి.
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 13
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 14

7th Class Social Textbook Page No.81

ప్రశ్న 6.
పటము-3.4 ఆధారంగా భారతదేశంలో భూభాగ సరిహద్దులను పంచుకునే దేశాలు-ఆయా దేశాలతో సరి హద్దులు కలిగి ఉన్న రాష్ట్రాలను పట్టికలో వ్రాయండి.
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 15
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 16

ప్రశ్న 7.
భారతదేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను, వాటి రాజధానులతో పట్టికను తయారుచేయండి.
జవాబు:
మన దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు గలవు. అవి :

రాష్ట్రం రాజధాని
1. ఆంధ్రప్రదేశ్ అమరావతి
2. ఒడిశా భువనేశ్వర్
3. పశ్చిమబెంగాల్ కోల్‌కతా
4. జార్ఖండ్ రాంచి
5. బీహార్ పాట్నా
6. ఉత్తరప్రదేశ్ లక్నో
7. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్
8. హిమాచల్ ప్రదేశ్ సిమ్లా
9. పంజాబ్ చండీగఢ్
10. హరియాణా చండీగఢ్
11. రాజస్థాన్ జైపూర్
12. గుజరాత్ గాంధీనగర్
13. మహారాష్ట్ర ముంబయి
14. మధ్య ప్రదేశ్ భోపాల్
15. ఛత్తీస్గఢ్ రాయపూర్
16. కర్ణాటక బెంగళూర్
17. తెలంగాణ హైద్రాబాద్
18. కేరళ తిరువనంతపురం
19. తమిళనాడు చెన్నై
20. గోవా పనాజి
21. సిక్కిం గాంగ్ టక్
22. అరుణాచల్ ప్రదేశ్ ఈటానగర్
23. అస్సాం డిస్పూర్
24. మేఘాలయ షిల్లాంగ్
25. నాగాలాండ్ కోహిమా
26. మణిపూర్ ఇంఫాల్
27. మిజోరామ్ ఐజ్వాల్
28. త్రిపుర అగర్తల

 

కేంద్రపాలిత ప్రాంతం రాజధాని
1. అండమాన్ & నికోబార్ దీవులు పోర్టుబ్లెయిర్
2. పుదుచ్చేరి పుదుచ్చేరి
3. లక్షద్వీప్ కవరత్తి
4. దాద్రానగర్ హవేలి & డామన్ & డయ్యూ డామన్
5. చండీగఢ్ చండీగఢ్
6. న్యూఢిల్లీ న్యూఢిల్లీ
7. జమ్ము&కాశ్మీర్ జమ్ము&కాశ్మీర్
8. లఢక్ లెహ్

ప్రశ్న 8.
భారతదేశ అవుట్లైన్ పటమునందు రాష్ట్రాల సరిహద్దులను గీసి, రాజధానులను గుర్తించండి.
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 17

7th Class Social Textbook Page No.85

ప్రశ్న 9.
పటం 3.5 ఆధారంగా ఖండాలను పేర్కొని, ప్రతి ఖండంలోని కొన్ని ముఖ్యమైన దేశాలతో పట్టికను తయారుచేయండి.
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 18
జవాబు:
అంటార్కిటికా ఖండం నందు దేశాలు ఏమీ లేవు. మిగతా ఆరు ఖండాల (కొన్ని దేశాలు) వివరాలు పట్టికలో ఇవ్వబడినవి.
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 19 AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 20

ప్రశ్న 10.
ఏ ఏఖండాల గుండా భూమధ్య రేఖ ప్రయాణిస్తుందో తెలపండి.
జవాబు:
భూమధ్య రేఖ క్రింది ఖండాల గుండా ప్రయాణిస్తుంది.

 1. ఆఫ్రికా
 2. దక్షిణ అమెరికా
 3. ఆసియా

7th Class Social Textbook Page No.87

ప్రశ్న 11.
మీ ఉపాధ్యాయుని మార్గనిర్దేశకత్వంలో, భారతదేశ ఉత్తెత్తు భౌతిక పటాన్ని తయారుచేయండి.
జవాబు:
విద్యార్థులు స్వయంగా (self) చేయగలరు.

ప్రశ్న 12.
భారతదేశ భౌతిక పటం 3.6 సహాయంతో క్రింది ఇచ్చిన మైండ్ మా లోని అంశాలను పూరించండి.
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 21
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 22
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 23

7th Class Social Textbook Page No.91

ప్రశ్న 13.
పటము 3.7 ఆధారంగా నేలల విస్తరణను చూపే పట్టికను తయారుచేయండి
(నేల రకాలు, అవి విస్తరించి ఉన్న జిల్లాలను పరిగణలోకి తీసుకోండి).
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 24
జవాబు:
క్ర.సం.

నేల రకాలు విస్తరించి ఉన్న జిల్లాలు
1. తీర ప్రాంత ఇసుక నేలలు (మృత్తికలు) శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు.
2. ఎర్ర నేలలు విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు.
3. పర్వత నేలలు తూర్పు గోదావరి, విశాఖపట్టణం.
4. నల్లరేగడి నేలలు తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు.

ప్రశ్న 14.
ఒక ఆంధ్రప్రదేశ్ పటాన్ని తీసుకుని దిగువ తెలిపిన ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత పట్టిక వివరాలతో విషయాత్మక పటాన్ని తయారు చేయండి.
జన గణన-2011: చదరపు కి.మీ.కు జనసాంద్రత
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 25
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 26

ప్రశ్న 15.
పటం-3.9 ఆధారంగా అశోకునికి సంబంధించిన వివిధ రకాల శాసనాలు ప్రస్తుతం ఏ ఏ రాష్ట్రాలలో ఉన్నవో తెలుపుతూ పట్టికను తయారుచేయండి.
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 27
అశోకుని శాసనాలు గల ప్రదేశాలు
జవాబు:

 1. ఎర్రగుడి, అమరావతి – ఆంధ్రప్రదేశ్
 2. కౌగది, ఉలి – ఒడిషా
 3. సోపారా – మహారాష్ట్ర
 4. సన్నతి – కర్ణాటక
 5. గిర్నార్ – గుజరాత్
 6. రాంపూర్వ, లారియాఆరాజ్, లారియానందపర్ – బీహార్
 7. లుంబిని – నేపాల్
 8. కౌశంబి, మీరట్ – ఉత్తరప్రదేశ్
 9. ఢిల్లీ తోప్రా – హర్యానా
 10. కాల్ సి – ఉత్తరాఖండ్
 11. మన్ సేరా, పాబాజ్ షరి – పాకిస్తాన్
 12. కాందహార్ – ఆఫ్ఘనిస్తాన్

ఆలోచించండి ప్రతిస్పందించండి

7th Class Social Textbook Page No.73

ప్రశ్న 1.
పటములో స్కేలు యొక్క ఉపయోగమేమి?
జవాబు:
భూమిపై కల వాస్తవ దూరానికి పటంలో చూపబడిన దూరానికి కల నిష్పత్తినే స్కేలు అని పిలుస్తాం. పటంలో రెండు ప్రాంతాల మధ్య కల దూరాన్ని లెక్కించడానికి స్కేలు ఉపయోగిస్తాం.

AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం

7th Class Social Textbook Page No.75

ప్రశ్న 2.
పటాల తయారీలో చిహ్నాలను ఎందుకు ఉపయోగిస్తాం?
జవాబు:
పటంలో భవనాలు, రహదారులు, వంతెనలు, చెట్లు, రైలు మార్గాలు, బావులు మొదలైన వివిధ అంశాలను వాటి వాస్తవ పరిమాణం మరియు ఆకారంలో చూపలేం. కాబట్టి వాటిని అక్షరాలు, రంగులు, చిత్రాలు, గీతలు చిహ్నాలతో సూచిస్తారు. ఇవి తక్కువ స్థలంలో ఎక్కువ సమాచారాన్ని ఇస్తాయి, పటాలు గీయడం, చదవడం సులభమవుతుంది.

7th Class Social Textbook Page No.79

ప్రశ్న 3.
వివిధ రకాల పటాలను పేర్కొనండి ;
జవాబు:
పటములోని స్కేలు, అంశాలు మరియు విషయాల ఆధారంగా పటాలను వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు. రాజకీయ, భౌతిక, విషయాత్మక పటాలతో పాటుగా చారిత్రక పటాలు.

ప్రశ్న 4.
అవి (పటాలు) దేనిని తెలియజేస్తాయి?
జవాబు:
పటాలు దేనిని తెలియజేస్తాయంటే ;

1) రాజకీయ పటాలు :
ఒక ప్రదేశం యొక్క పాలనా పరిధిని, పొరుగు దేశాలను, సరిహద్దులను, దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామాలు, రాజధానులను తెలియజేస్తాయి.

2) భౌతిక పటాలు :
వివిధ భూ స్వరూపాలను (మైదానాలు, పీఠభూములు, పర్వతాలు మొదలైన) నిర్దిష్ట రంగులు, ఎత్తు పల్లములతో సూచిస్తారు.

3) విషయ నిర్దేశిత పటాలు :
ఏదేని ప్రత్యేక లేదా నిర్దిష్ట అంశము లేదా విషయాలను తెలుపును. ఉదా : మృత్తికలు చూపే పటం, జనసాంద్రత చూపే పటం.

4) చారిత్రక పటాలు :
గడచిపోయిన కాలం యొక్క వివరాలను చూపిస్తాయి.
ఉదా : అశోకుని శాసనాలు గల ప్రదేశాలు.

7th Class Social Textbook Page No.81

→ పటము-3.4 ను పరిశీలించి, సమాధానాలు ఇవ్వండి.
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 17
భారతదేశ రాజకీయ పటం
ప్రశ్న 5.
భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న రాష్ట్రం పేరును తెలపండి.
జవాబు:
తమిళనాడు (రాష్ట్రం) అండమాన్ నికోబార్ దీవులు (కేంద్రపాలిత ప్రాంతాలు).

ప్రశ్న 6.
కర్కటరేఖ అనగానేమి?
జవాబు:
23½° ఉత్తర అక్షాంశంను కర్కటరేఖ అంటారు.

ప్రశ్న 7.
భారతదేశంలోని ఏయే రాష్ట్రాల మీదుగా కర్కటరేఖ వెళుతుందో రాయండి.
జవాబు:
భారతదేశంలోని

 1. రాజస్థాన్,
 2. ఛత్తీస్ గఢ్,
 3. గుజరాత్,
 4. మధ్యప్రదేశ్,
 5. జార్ఖండ్,
 6. పశ్చిమబెంగాల్,
 7. త్రిపుర,
 8. మిజోరం రాష్ట్రాల మీదుగా కర్కాటక రేఖ వెళుతుంది.

7th Class Social Textbook Page No.87

ప్రశ్న 8.
పశ్చిమ కనుమలలో పుట్టిన నదులు తూర్పుగా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. మీ ఉపాధ్యాయునితో చర్చించండి.
జవాబు:
పశ్చిమ కనుమలలో పుట్టి తూర్పుగా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తున్న నదులు :
గోదావరి, కృష్ణా, కావేరి, తుంగభద్ర, పెన్నా, ఘటప్రభ, మాలప్రభ, భీమ, వైగై, తాంబ్రపరిణి, పెరియార్ మొదలైనవి.

AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం

ప్రశ్న 9.
నదులను అవి కలిసే సముద్రం ఆధారంగా వర్గీకరించి పేర్లను రాయండి.
జవాబు:
నదులు, అవి కలిసే సముద్రం ఆధారంగా వర్గీకరణ :

బంగాళాఖాతంలో కలిసే నదులు అరేబియా సముద్రంలో కలిసే నదులు
గంగా, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణానది, పెన్నానది, లాంగుల్యా నది, వంశధార, మహానది, కావేరినది మొదలైనవి. సింధూనది, నర్మదానది, తపతినది, సబర్మతి (గిరికర్ణిక) శరావతి, మహానది మొదలైనవి.

ప్రశ్న 10.
ఆంధ్రప్రదేశ్ లోని భూస్వరూపాలను పేర్కొనండి.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ భూ స్వరూపాలు:

1) తూర్పు కనుమలు :
వెలికొండ, నల్లమల, శేషాచలం, పెనుకొండ, యారాడ మొదలైన కొండలు.

2) తూర్పు తీర మైదానం :
కృష్ణా, గోదావరి డెల్టాలు, కొల్లేరు, పులికాట్ సరస్సులు కలవు.

3) దక్కన్ పీఠభూమి (రాయలసీమ పీఠభూమి) : రాయలసీమ ప్రాంతం.

అన్వేషించండి

7th Class Social Textbook Page No.75

ప్రశ్న 1.
అట్లాస్/ ఇంటర్నెట్ సహాయంతో భారత్ సర్వేక్షణ శాఖ ఉపయోగించే మరికొన్ని సాంప్రదాయక చిహ్నాలను గురించి అన్వేషించండి.
జవాబు:
భారత్ సర్వేక్షణ శాఖ ఉపయోగించే సాంప్రదాయక చిహ్నాలు :
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 28
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 29

7th Class Social Textbook Page No.81

ప్రశ్న 2.
అట్లాస్ సహాయంతో ఆంధ్రప్రదేశ్ ఉనికిని తెలుసుకోండి.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ ఉనికి
12°41 – 1907′ ఉత్తర అక్షాంశాలు
77 – 84°40′ తూర్పు రేఖాంశాలు

7th Class Social Textbook Page No.87

ప్రశ్న 3.
అట్లాస్ సహాయంతో వివిధ పర్వత శ్రేణుల విస్తరణ, వాటిలో ఎత్తైన శిఖరాలను తెలుసుకోండి.
జవాబు:
ప్రపంచంలోని పర్వత శ్రేణులు, ఎత్తైన శిఖరాలు :

 1. హిమాలయ పర్వత శ్రేణులు (ఎవరెస్ట్) పామీరు శ్రేణి – (కొంగుర్)
 2. కారకోరం శ్రేణి (K)
 3. అండీస్ పర్వతాలు (అకాంగ్వా)
 4. కాకసస్ (ఎల్బర్స్) ఆర్ట్స్ పర్వతాలు – (మాంట్ బ్లాంక్)
 5. రాకీ పర్వతాలు – (ఎల్బర్ట్) అపలేచియన్ పర్వతాలు – (మిచెల్)
 6. యూరల్ పర్వతాలు – (నారోదయ) ఆరావళి పర్వతాలు – (గురుసికార్)
 7. వింధ్య, సాత్పూరా పర్వతాలు
 8. వాస్ పర్వతాలు
 9. బ్లాక్ ఫారెస్ట్ పర్వతాలు
 10. డ్రాకెన్బర్గ్ పర్వతాలు మొదలైనవి.

AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం

ప్రశ్న 4.
అట్లాస్ అంతర్జాలం సహాయంతో భారతదేశం యొక్క భౌతిక స్వరూపాలను గురించి తెలుసుకోండి.
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 30

7th Class Social Textbook Page No.93

ప్రశ్న 5.
ప్రాచీన, మధ్యయుగ భారతదేశానికి చెందిన వివిధ రాజవంశాల పటాలను గురించి తెలుసుకోండి.
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 31

ప్రాజెక్టు పని

ట్రేసింగ్ టెక్నిక్ (అచ్చుగుద్దడం)ను ఉపయోగించి వివిధ ఖండాలు, భారతదేశం, ఆంధ్రప్రదేశ్ మరియు మీ జిల్లా రాజకీయ పటాలతో స్వయంగా అట్లాసు తయారు చేయండి.
జవాబు:
1.
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 6
2.
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 7
3.
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 8
4.
AP Board 7th Class Social Solutions Chapter 3 పటాల ద్వారా అధ్యయనం 9