SCERT AP 7th Class Social Study Material Pdf 2nd Lesson అడవులు Textbook Questions and Answers.
AP State Syllabus 7th Class Social Solutions 2nd Lesson అడవులు
7th Class Social 2nd Lesson అడవులు Textbook Questions and Answers
కింది తరగతులలోని విషయ పునశ్చరణ
ప్రశ్న 1.
చిత్రంను పరిశీలించి అందులో ఏమి గమనించారో చెప్పండి.
జవాబు:
నేను గమనించిన అంశాలు :
- పెద్ద పెద్ద దట్టమైన వృక్షాలతో నిండి ఉంది.
- అనేక రకాల జంతువులు (ఏనుగు, జిరాఫీ, కోతులు)
- అనేక రకాల పక్షులు, సరీసృపాలు.
ప్రశ్న 2.
ఏఏ అంశాలను అడవులలో మీరు చూడగలిగారు? వాటిని క్రింది రేఖాచిత్రంలో వ్రాయండి.
జవాబు:
ప్రశ్న 3.
అడవి గురించి మీ సొంత మాటల్లో వ్రాయండి.
జవాబు:
- చెట్లతో ఉన్న విశాలమైన భూభాగాన్ని అడవి అంటారు.
- ఒక స్థలం యొక్క పరిసరాలు అన్ని వైపులా చెట్లతో ఆవరించబడి ఉంటాయి.
- పర్యావరణాన్ని అనేక రకాల చెట్లతో ప్రభావితం చేసే ప్రాంతం అడవి.
- ప్రకృతి సౌందర్యానికి అడవులు పేరుగాంచాయి.
- వివిధ రకాల జంతువులకు నిలయం ఈ అడవులు.
- వివిధ రకాల ఔషధాలు, వనమూలికలకు నిలయాలు.
- ఆహ్లాదకరమైన, ఆరోగ్యవంతమైన వాతావరణానికి ఆనవాలు.
Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)
I. క్రింది ప్రశ్నలకు జవాబులివ్వండి.
ప్రశ్న 1.
భారతదేశంలోని వివిధ రకాల అడవులను పేర్కొనండి.
జవాబు:
శీతోష్ణస్థితి, వర్షపాతం, నేల’ రకం అనే అంశాల ఆధారంగా అడవులను ఐదు రకాలుగా విభజించవచ్చు.
- సతతహరిత అరణ్యాలు
- ఆకు రాల్చు అడవులు
- ముళ్ళ అడవులు
- మడ అడవులు
- పర్వత ప్రాంత అడవులు
ప్రశ్న 2.
సతతహరిత అరణ్యాల గురించి క్లుప్తంగా వివరించండి.
జవాబు:
సతతహరిత అరణ్యాలు :
- అధిక సాంవత్సరిక వర్షపాతం మరియు ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో ఈ అరణ్యాలు పెరుగుతాయి.
- ఇక్కడి వృక్షాలు చాలా పొడవుగా వుండి విశాల పత్రాలను కలిగివుంటాయి.
- ఈ రకమైన వాతావరణ పరిస్థితుల వలన కొమ్మలు విస్తరించబడి గొడుగు లాగా కనిపిస్తాయి.
- ఈ అడవులు ఏడాది పొడవునా పచ్చగా ఉండటము వలన వీటిని సతతహరిత అరణ్యాలు అని పిలుస్తారు.
- ఈ ప్రాంతము దట్టమైన చెట్లు, మొక్కలు మరియు తీగలతో నిండి ఉంటుంది.
- హిమాలయ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ కనుమలు, కేరళలోను ఈ అడవులు పెరుగుతాయి.
- మహాగని, ఎబోని, రోజ్ వుడ్, ఐవరివుడ్ వంటి వృక్ష జాతులు ఈ అడవులలో పెరుగుతాయి.
- వివిధ రకాలైన జంతువులు ఉదా. లయన్ టయల్డ్ మకాక్ (సింహపు తోక కోతి), వివిధ రకాల సరీసృపాలు, అనేక రకాల కీటకాలు ఈ అడవులలో ఉంటాయి.
ప్రశ్న 3.
భారతదేశంలోని ఆకురాల్చు అడవుల లక్షణాలు, వృక్షజాలం మరియు జంతుజాలం గురించి వివరించండి.
జవాబు:
ఆకురాల్చు అడవులు :
- ఈ అడవులు 70-200 సెం.మీ. వర్షపాతము ఉన్న ప్రాంతాలలో విస్తరించి వున్నాయి.
- ఇక్కడి వృక్షాలు వేసవి నెలల్లో బాష్పోత్సేకాన్ని తగ్గించడానికి ఆకులు రాల్చుతాయి.
- ఈ అడవులు ద్వీప కల్ప పీఠభూమిలో ఎక్కువగా విస్తరించి వున్నాయి. టేకు, సాల్, వెదురు, రోజ్ వుడ్, చందనం మరియు వేప వంటి వృక్షాలు ఇక్కడ కనిపిస్తాయి.
- వివిధ రకాలైన జింకలు, కుందేళ్ళు, పులులు, చిరుతలు, నెమళ్ళు మరియు వివిధ రకాల పక్షులు ఇక్కడి ప్రధాన జంతుజాలం.
ప్రశ్న 4.
ముళ్ళ అడవులను గూర్చి వివరించండి.
జవాబు:
ముళ్ళ మరియు పొద అడవులు :
- ముళ్ళ మరియు పొద అడవులు తక్కువ వర్షపాతం వుండి అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి.
- శుష్క వాతావరణం కారణంగా ఈ అడవులలోని చెట్లు ముళ్లతోనూ, పొదలుగాను ఉంటాయి.
- ఎడారి మొక్కల మాదిరిగా ఇక్కడి మొక్కల ఆకులు ముళ్ళుగా మారి బాష్పోత్సేకాన్ని తగ్గించుకునే విధంగా వుంటాయి.
- దక్కన్ పీఠభూమి ప్రాంతములోను, భారతదేశములోని ఎడారి ప్రాంతములోను ఈ విధమైన అడవులు వున్నాయి.
- అకేషియా, బ్రహ్మజెముడు, నాగజెముడు, బబుల్ (తుమ్మ) మరియు రేగు ఇక్కడి వృక్ష జాతులు.
ప్రశ్న 5.
అటవీ సంరక్షణపై కొన్ని నినాదాలను రాయండి.
జవాబు:
- చెట్లను రక్షించండి – భూమిని సంరక్షించండి.
- మెరుగైన పర్యావరణం కోసం పచ్చదనం.
- పచ్చని చెట్లు – ప్రగతికి మెట్లు.
- “ఒక చెట్టును నాటండి – తద్వారా తరువాతి తరానికి ఉచితంగా గాలి లభిస్తుంది”.
- ప్రకృతిని రక్షిద్దాం – భవిష్య తరాలను కాపాడుదాం.
- వృక్షో రక్షతి రక్షితః
ప్రశ్న 6.
“అడవులు మనకు అత్యంత ఆవశ్యకం, కాని మనం వాటిని నాశనం చేస్తున్నాము”. దీనిపై వ్యాఖ్యానించండి.
జవాబు:
- అడవులు మనకు అత్యంత ఆవశ్యకం. పర్యావరణ వ్యవస్థల సమతౌల్యం ఇవి కాపాడుతాయి.
- మొక్కలు (చెట్లు) కార్బన్ డై ఆక్సైడ్ ను గ్రహించి ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి.
- అడవులు వాతావరణంలోని ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. వాయు కాలుష్యాన్ని అరికడతాయి.
- మృత్తికా క్రమక్షయాన్ని అరికడతాయి. అలాగే
- వాణిజ్యపరంగా, కలప, వెదురు, ఔషధాలను అడవులు అందిస్తున్నాయి. అయితే మనము ఈ అడవులను ఈ క్రింది వాని కారణంగా (నరికి) నాశనం చేస్తున్నాం.
- వ్యవసాయ భూముల కోసం.
- పారిశ్రామిక అవసరాలు, గనుల త్రవ్వకం మొదలైన ప్రయోజనాల కోసం.
- రోడ్లు మరియు ఆనకట్టల నిర్మాణం కోసం.
- గృహోపకరణాల కోసం, కలప కోసం మొదలైన వాటి కోసం అడవులను నాశనం చేస్తున్నాం. వీనిని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిది.
ప్రశ్న 7.
మీ దైనందిన జీవితంలో ఉపయోగించే అడవుల నుండి తయారైన వస్తువుల పట్టికను తయారుచేయండి.
జవాబు:
అడవుల నుండి తయారైన వస్తువులు:
- గృహోపకరణాలు : కుర్చీలు, మంచాలు, టేబుల్స్, టీపాలు, చాటలు మొదలైనవి.
- వెదురు నుండి (కలప గుజ్జు) కాగితం
- అగ్గిపెట్టెలు, ప్యాకింగ్ కాగితం తయారీకి
- సంగీత పరికరాలు (మృదంగం, తబలా)
- రైల్వే పరిశ్రమల్లో స్వీపర్స్ మొదలైన వాటికి
- గంపలు, బుట్టలు, చాటలు, నిచ్చెనలు మొదలైనవి.
- లక్క తయారీకి
- టిఫిన్ ఆకులు, విస్తళ్ళు
- పడవల తయారీకి
- వివిధ రకాల ఔషధాలు మొదలైనవి.
- సుగంధ ద్రవ్యాల (గంధపు చెట్లు) తయారీకి.
ప్రశ్న 8.
అటవీ విధానాలను చదివి క్రింది పట్టికను పూరించండి.
జవాబు:
సంవత్సరం | విధానం పేరు | లక్ష్యాలు |
1894 | భారతదేశ మొదటి జాతీయ అటవీ విధానం | వాణిజ్య, పారిశ్రామిక అవసరాల కోసం అడవులను ఉపయోగించుకోవటం (కొల్లగొట్టడం) చేసిన చట్టం. |
1952 | జాతీయ అటవీ విధానం (స్వాతంత్ర్యం వచ్చాక మొదటిది) |
సామాజిక అడవుల పెంపకం, 33% అడవుల పెంపకం. |
1980 | అటవీ (వన) సంరక్షణా చట్టం | అటవీ భూములను అడవుల పెంపకం కోసం మాత్రమే వాడాలి. ఇతర కార్యకలాపాలకు వినియోగించరాదు. |
1988 | జాతీయ అటవీ విధానం | అడవుల రక్షణ, పునరుద్ధరణ, అభివృద్ధిలో – గిరిజన ప్రజల భాగస్వామ్యం చేయడం ప్రధాన కర్తవ్యం. |
II. సరియైన సమాధానాలను ఎంపిక చేసుకోండి.
1. సంవత్సరం పొడవునా పచ్చగా కనుపించే అడవులు ఏవి?
అ) ఆకురాల్చు అడవులు
ఆ) సతతహరిత అడవులు
ఇ) తీరప్రాంత అడవులు
ఈ) మడ అడవులు
జవాబు:
ఆ) సతతహరిత అడవులు
2. క్రింది వాటిలో అటవీ సంరక్షణ నినాదం కానిదేది?
అ) చెట్లను రక్షించండి-భూమిని సంరక్షించండి
ఆ) ప్రకృతిని రక్షిద్దాం-భవిష్య తరాలను కాపాడుదాం
ఇ) మెరుగైన పర్యావరణం కోసం పచ్చదనం
ఈ) ఆరోగ్యవంతమైన ఆహారం – ఆరోగ్యవంతమైన జీవితం
జవాబు:
ఈ) ఆరోగ్యవంతమైన ఆహారం – ఆరోగ్యవంతమైన జీవితం
3. కింది వాటిలో ఏది అటవీ ఉత్పత్తి కాదు?
అ) కలప
ఆ) తేనె
ఇ) రేగు పండ్లు
ఈ) బ్రెడ్
జవాబు:
ఈ) బ్రెడ్
4. ఏ సంవత్సరంలో జాతీయ అటవీ పరిరక్షణ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది?
అ) 1984
ఆ) 1950
ఇ) 1952
ఈ) 1980
జవాబు:
ఈ) 1980
5. ఈ క్రింది ఏ అడవులలో రకరకాల పాములు, కీటకాలు ఉన్నాయి?
అ) సతతహరిత అడవులు
ఆ) ఆకురాల్చే అడవులు
ఇ) మడ అడవులు
ఈ) ముళ్ళ అడవులు
జవాబు:
అ) సతతహరిత అడవులు
III. జతపరచండి.
1.
గ్రూపు-ఎ | గ్రూపు-బి |
1. సతత హరిత అరణ్యాలు | అ) మంచు చిరుతపులి |
2. ఆకురాల్చు అడవులు | ఆ) వివిధ రకాల చేపలు |
3. పర్వత ప్రాంత అడవులు | ఇ) లయన్ టెయిల్డ్ మకాక్ |
4. మడ అడవులు | ఈ) రకరకాల దుప్పులు |
జవాబు:
గ్రూపు-ఎ | గ్రూపు-బి |
1. సతత హరిత అరణ్యాలు | ఇ) లయన్ టెయిల్డ్ మకాక్ |
2. ఆకురాల్చు అడవులు | ఈ) రకరకాల దుప్పులు |
3. పర్వత ప్రాంత అడవులు | అ) మంచు చిరుతపులి |
4. మడ అడవులు | ఆ) వివిధ రకాల చేపలు |
2.
గ్రూపు-ఎ | గ్రూపు-బి |
1. అధిక వర్షపాతం | అ) మడ అడవులు |
2. తక్కువ వర్షపాతం | ఆ) పర్వత ప్రాంత అడవులు |
3. తీర ప్రాంత రేఖ | ఇ) సతత హరిత అరణ్యాలు |
4. పర్వత ప్రాంతాలు | ఈ) ముళ్ళ అడవులు |
జవాబు:
గ్రూపు-ఎ | గ్రూపు-బి |
1. అధిక వర్షపాతం | ఇ) సతత హరిత అరణ్యాలు |
2. తక్కువ వర్షపాతం | ఈ) ముళ్ళ అడవులు |
3. తీర ప్రాంత రేఖ | అ) మడ అడవులు |
4. పర్వత ప్రాంతాలు | ఆ) పర్వత ప్రాంత అడవులు |
పదబంధము
ఇచ్చిన సూచనలకు సంబంధించిన పదాలతో పజిల్ ను పూరించండి.
అడ్డు వరుస:
1. ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్దకొండలు (4)
2. సతతహరిత అరణ్యాలలో వృక్షజాలం (4)
3. వీటిని సెల్వాలు అంటారు (10)
4. అటవీ ఉత్పత్తి (2)
5. కాగితం తయారీలో ముడిసరుకు (3)
నిలువు వరుస:
1. తమిళనాడులోని కొండలు (4)
2. అటవీ ఉత్పత్తి (3)
3. తీర ప్రాంతంలోని అడవులు (6)
4. అటవీ ఉత్పత్తి (2)
5. ఆకురాల్చు అడవులలోని వృక్షజాలం (2)
జవాబు:
7th Class Social Studies 2nd Lesson అడవులు InText Questions and Answers
7th Class Social Textbook Page No.41
ప్రశ్న 1.
ప్రపంచ పటములో వివిధ శీతోష్ణస్థితి ప్రాంతాలు గల ముఖ్యమైన దేశాలను గుర్తించండి.
జవాబు:
ప్రశ్న 2.
వివిధ శీతోష్ణస్థితి ప్రాంతాలలోని ముఖ్య దేశాలతో పట్టిక తయారు చేయండి.
జవాబు:
శీతోష్ణస్థితి ప్రాంతం | ముఖ్య దేశాలు |
1. భూమధ్యరేఖా/ఉష్ణమండల ప్రాంతం | బ్రెజిల్, బొలీవియా, పెరు, కొలంబియా, వెనిజులా, గయానా, కాంగో, జైరే, లైబేరియా, ఐవరికోస్ట్, CAR, గేబన్, సింగపూర్, శ్రీలంక, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, బ్రూనై, మలేషియా మొదలైనవి. |
2. సవన్నాలు | క్యూబా, జమైకా, పశ్చిమ ఇండీస్, హవాయి ద్వీపాలు, నైజీరియా, సెనెగాల్, గినియా, మాలీ, నైజర్, ఛాడ్, సుడాన్, ఘనా, టాగో, అంగాలా. |
3. ఎడారి ప్రాంతాలు | మారిటోనియా, మాలి, నైజర్, ఛాడ్, సుడాన్, మోరాకో, అల్జీరియా, లిబియా, ఈజిప్టు, ఇథోపియా, సోమాలియా, ఆస్ట్రేలియా, మెక్సికో, USA. సౌది అరేబియా, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయిల్, UAE, కువైట్, భారతదేశం, పాకిస్థాన్. |
4. మధ్యధరా శీతోష్ణస్థితి ప్రాంతాలు | పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్, మొనాకో, ఇటలీ, క్రోయేషియా, గ్రీసు, అల్బేనియా, యూకెయిన్, టర్కి సిరియా, లెబనాన్, ఇజ్రాయిల్, ట్యునీషియా, అల్జీరియా, మోరాకో, సిసిలి, అమెరికా, చిలీ మొదలైనవి. |
5. స్టెప్పీ శీతోష్ణస్థితి | స్పెయిన్, టర్కి అమెరికా, ఆస్ట్రేలియా, వాయవ్య చైనా, ఉక్రయిన్, అర్జెంటైనా, బోట్స్వా నా. |
6. టైగా ప్రాంతం | అలస్కా (USA), కెనడా, నార్వే, స్వీడన్, ఫిలాండ్, రష్యా, |
7. టండ్రా శీతోష్ణస్థితి | ఉత్తరగోళం మాత్రమే, ఉత్తర అమెరికా, కెనడా, గ్రీన్‌లాండ్, రష్యా మొదలైనవి. |
7th Class Social Textbook Page No.41
ప్రశ్న 3.
శీతోష్ణస్థితి ప్రాంతాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని అంతర్జాలం ద్వారా, గ్రంథాలయంలోని పుస్తకాల ద్వారా తెలుసుకోండి.
జవాబు:
ఈ క్రింద పేర్కొన్న విధంగా ప్రపంచాన్ని వివిధ ప్రకృతిసిద్ధ శీతోష్ణస్థితి మండలాలుగా విభజించవచ్చు. అవి :
- భూమధ్య రేఖా మండలం
- అయన రేఖా మండల ఎడారులు (లేదా) ఉష్ణమండల ఎడారులు
- ఉష్ణ మండల పచ్చిక బయళ్ళు (సవన్నాలు)
- ఋతుపవన మండలం
- మధ్యధరారీతి ప్రకృతిసిద్ధ మండలం
- సమశీతోష్ణ మండల ఎడారులు
- చైనారీతి ప్రకృతిసిద్ధ మండలం
- సముద్ర ప్రభావిత పశ్చిమ తీరప్రాంతం
- సమశీతోష్ణ మండల పచ్చిక బయళ్ళు (స్టెప్పీలు)
- లారెన్షియారీతి ప్రకృతిసిద్ధ మండలం
- ఉపధృవ లేదా టైగా మండలం
- టండ్రా మండలం
- ధృవ హిమాచ్ఛాదిత మండలం
ఒక ప్రదేశము యొక్క శీతోష్ణస్థితిని ఆ ప్రదేశపు ఎత్తు (Altitude) ఉపరితలం నిమ్నోన్నతాలు, గాలి వీచే దిశ మొదలగునవి స్థానికంగా ప్రభావితం చేస్తాయి. అక్షాంశ రేఖాంశాల ఆధారంగా ఈ ప్రకృతిసిద్ధ మండలాలను విభజించినప్పటికీ, నిజానికి ఇవి క్రమేపీ ఒకదానితో ఒకటి కలిసిపోతాయి.
ప్రశ్న 4.
మీ ఉపాధ్యాయుని సహాయముతో పోడుసాగును గురించి చర్చించండి.
జవాబు:
- దీనిని నరుకు కాల్చు పద్దతి, ఝూమ్ వ్యవసాయం, విస్థాపన వ్యవసాయం అని కూడా పిలుస్తారు.
- ఇది అత్యంత పురాతన వ్యవసాయ విధానం, కొండ ప్రాంతాలలోని (అటవీ ప్రాంతాలలో) గిరిజనులు ఈ రకమైన వ్యవసాయం చేస్తారు.
- అడవిలో కొంత ప్రాంతంలో చెట్లను నరికి, వాటిని కాల్చి చదును చేసి, ఆ ప్రాంతంలో కొన్ని సంవత్సరాలు సాగు చేస్తారు.
- తరువాత నిస్సారమైన ఆ ప్రాంతాన్ని విడచి మరొక ప్రాంతానికి వెళ్లి అక్కడ చెట్లు నరికి మళ్ళీ కొన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తారు.
- నరికిన చెట్లను వానాకాలంకు ముందు తగులబెడతారు, వర్షాలు ప్రారంభం కాగానే బూడిద మట్టిలో కలుస్తుంది. తర్వాత విత్తనాలు విత్తుతారు. వీరు ఎరువులు, పురుగు మందులు వాడరు.
7th Class Social Textbook Page No.41
ప్రశ్న 5.
వివిధ శీతోష్ణస్థితి ప్రాంతాల శీతోష్ణస్థితిని పోల్చండి.
జవాబు:
- భూమధ్య రేఖ/ఉష్ణ మండల శీతోష్ణస్థితి ప్రాంతాల్లో మరియు సవన్నా ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రత కల్గి ఉంటాయి. అధిక అవపాతాన్ని కల్గి ఉంటాయి.
- టండ్రా, టైగా ప్రాంతాల్లో చలి అధికముగా ఉంటుంది. భూమధ్య రేఖ, సవన్నా ప్రాంతాలు దట్టమైన వృక్షజాలం కల్గి ఉంటే ఇక్కడ (టండ్రా, టైగాల్లో) చెట్లు పెరగటానికి అననుకూలంగా ఉంటాయి.
- ఉష్ణ మండల గడ్డి భూములు సవన్నాలు, సమశీతోష్ణ గడ్డి భూములు స్టెప్పీలు.
- ఖండాలకు పశ్చిమం వైపున ఉన్న ఎడారులు భూమి మీద అత్యంత శుష్క / పొడి ప్రాంతాలు.
- వేసవిలో పొడి వాతావరణము, శీతాకాలములో ఒక మాదిరి నుండి అధిక వర్షపాతం మధ్యధరా శీతోష్ణ ప్రాంత ప్రధాన లక్షణము.
ప్రశ్న 6.
వివిధ శీతోష్ణస్థితి ప్రాంతాలలో గల శీతోష్ణస్థితి సహజ వృక్ష సంపదపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది?
జవాబు:
- ఒక ప్రదేశం యొక్క శీతోష్ణస్థితి ఆ ప్రాంతం యొక్క వృక్షజాల రకాలను నిర్ధారిస్తాయి. ఉదాహరణకు;
- బాగా చలిగా ఉండి, మంచు కూడా కురిసే ప్రాంతాలలో మాత్రమే కోనిఫెరస్ (శృంగాకార చెట్ల) జాతికి చెందిన దేవదారు చెట్లు పెరుగుతాయి.
- వేడిగా ఉండి, ఓ మాదిరి వర్షాలు పడే ప్రాంతాలలో ‘టేకు’ వంటి కొన్ని రకాల చెట్లు పెరుగుతాయి.
- చెట్ల సాంద్రత కూడా శీతోష్ణస్థితి అంశాలైన వర్షపాతం, ఉష్ణోగ్రతలపై ఆధారపడి ఉంటుంది.
ప్రశ్న 7.
అడవులలో ఔషధ విలువలు కలిగిన మొక్కల పేర్లను తెల్పండి.
జవాబు:
ఔషధ విలువలు కలిగిన మొక్కలు :
అత్తిపత్తి, అక్కలకర్ర, అశ్వగంధ, అవిసెచెట్టు, అశోకచెట్టు, ఆముదం, ఇప్పచెట్టు, ఉత్తరేణి, ఉసిరిక, ఉమ్మెత్త, ఊడుక, కరక్కాయ, కలబంద, కానుగ (గానుక), కుంకుడు, కొండపిండి, ఖర్జూరం, గంగారావి, గన్నేరు, గుమ్మడి, గుంటగలగర, చింత, జాజికాయ, జువ్విచెట్టు, తంగేడు, తాని చెట్టు, తిప్పతీగ, తులసి, నల్లతుమ్మ, మద్దిచెట్టు, దిరిసెన, నిమ్మ, నేరేడు, వెలగ, బాదం, బూరుగ, బొప్పాయి, మర్రిచెట్టు, మామిడి, మారేడు, మునగ, ముల్లంగి, మేడి, మోదుగ, రావిచెట్టు, వసచెట్టు, వాకుడు, వేప, సుగంధ, గంధం, సండ్రిచెట్లు, సునాముఖి మొదలైనవి.
7th Class Social Textbook Page No.43
ప్రశ్న 8.
భారతదేశ అవుట్లైన్ పటంలో సతతహరిత అరణ్యాలను గుర్తించండి.
జవాబు:
7th Class Social Textbook Page No.43
ప్రశ్న 9.
సతతహరిత అరణ్యాలు వివిధ రకాలైన వృక్ష, జంతు జాతులకు నిలయాలుగా ఎందుకు ఉన్నాయి?
జవాబు:
సతతహరిత అరణ్యాలు వివిధ రకాలైన వృక్ష, జంతు జాతులకు నిలయాలుగా ఎందుకు ఉన్నాయంటే,
- అధిక సాంవత్సరిక వర్షపాతం, ఉష్ణోగ్రతలుండుట వలన ఈ ప్రాంతాలలో వివిధ రకాల వృక్షాలు పెరుగుతాయి.
- ఇవి ఏడాది పొడవునా పచ్చగా ఉండుట వలన వివిధ రకాల జంతువులు కూడా ఉంటాయి.
- వివిధ రకాలైన వృక్ష జాతులు ‘పెరగటానికి కావలసిన శీతోష్ణస్థితులు ఉండటం.
7th Class Social Textbook Page No.45
ప్రశ్న 10.
భారతదేశ అవుట్లైన్ పటంలో ఆకురాల్చు అడవులు గల ప్రాంతాలను గుర్తించండి.
జవాబు:
ప్రశ్న 11.
భారతదేశ అవుట్లైన్ పటంలో ముళ్ళ పొద అడవులు గల ప్రాంతాలను గుర్తించండి.
జవాబు:
7th Class Social Textbook Page No.45
ప్రశ్న 12.
ఆకురాల్చు అడవులు ఏ కాలంలో, ఏ కారణంచే ఆకులు రాల్చుతాయి?
జవాబు:
ఆకురాల్చు అడవులు వేసవి నెలల్లో, బాష్పోత్సేకాన్ని తగ్గించటానికి ఆకులు రాల్చుతాయి.
ప్రశ్న 13.
ఆకురాల్చు అడవుల ప్రకృతి అందాన్ని ఎప్పుడైనా గమనించారా? అడవుల సౌందర్యాన్ని వర్ణించండి.
జవాబు:
- ఆకురాల్చు అడవుల ప్రకృతి అందాన్ని వేసవి సెలవుల్లో యాత్రకెళ్ళినపుడు గమనించాను.
- ఆకురాల్చు అడవుల్లో కొన్ని వృక్షాలు ఆకురాల్చి, కొన్ని పచ్చదనంతో వింత వర్ణాలలో ఉండి ఆకర్షిస్తుంటాయి.
- రాలిన ఆకుల మధ్యన నడక చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది.
- అడవుల మధ్యన అక్కడక్కడ సెలయేర్లు, వాటి ధ్వనులు రమణీయంగా ఉంటాయి.
- కుందేళ్ళు, నెమళ్ళు లాంటివి నన్ను ఎంతో ఆకర్షించినాయి.
- పచ్చని అటవీ ప్రాంతంలో నడక, అక్కడ ప్రకృతి రమణీయత నన్ను ఎంతో ముగ్ధుడ్ని చేసింది.
ప్రశ్న 14.
మడ అడవులు సముద్ర తీరం యొక్క సహజ రక్షకాలు – చర్చించండి.
జవాబు:
- మడ అడవులు ఎక్కువగా సముద్ర తీరాల్లో, చిత్తడి నేలల్లోనూ, సముద్ర అలల ప్రభావిత నేలల్లోనూ పెరుగుతాయి.
- సముద్ర తీరం అలల యొక్క తాకిడికి కోతకు గురికాకుండా ఈ అటవీ వృక్షాలు కాపాడతాయి.
- ఇక్కడి చెట్లు సముద్రపు లవణీయతను, అలల తాకిడిని తట్టుకునేలా ఉంటాయి.
- ఈ అడవుల్లోని వృక్షజాలం తీర ప్రాంత సహజ రక్షకాలుగా చెప్పవచ్చును.
7th Class Social Textbook Page No.47
ప్రశ్న 15.
భారతదేశ అవుట్లైన్ పటంలో పర్వత ప్రాంత అడవులు గల ప్రాంతాలు గుర్తించండి.
జవాబు:
ప్రశ్న 16.
క్రింది పట్టికను పూరించండి.
జవాబు:
7th Class Social Textbook Page No.49
ప్రశ్న 17.
పై పటాన్ని పరిశీలించి అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? కారణాలు తెలపండి.
జవాబు:
భారతదేశంలో విస్తీర్ణపరంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం అత్యధిక అటవీ ప్రాంతాన్ని కలిగి ఉంది. కారణం.
- ఈ రాష్ట్రంలో ఎక్కువగా గిరిజన తెగలుండుట వలన అడవులను సంరక్షించుకుంటూ ఉన్నారు.
- ఈ రాష్ట్రంలో ఎక్కువగా కొండ ప్రాంతాలుండటం, మైదానాలు తక్కువగా ఉండటం.
ఉదా : వింధ్య, సాత్పురా శ్రేణులు. - చారిత్రాత్మకముగా ఇవి అటవీ భూములుగానే ఉండిపోవటం, నగరాలు పెద్దగా అభివృద్ధి చెందకపోవటం.
- జనాభా తక్కువగా ఉండటం, పారిశ్రామికంగా వెనుకబడి ఉండటం.
ప్రశ్న 18.
ఏ రాష్ట్రంలో అడవులు తక్కువగా ఉన్నాయి? కారణాలు తెలపండి.
జవాబు:
భారతదేశంలో విస్తీర్ణపరంగా హర్యానా రాష్ట్రం అత్యల్ప అటవీ ప్రాంతాన్ని కల్గి ఉంది. కారణం.
- హర్యానా రాష్ట్రంలో మైదాన ప్రాంతం ఎక్కువగా ఉండటం (వ్యవసాయ భూమిగా మార్చడం).
- హర్యానా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి చెందడం.
- రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కువగా జరగడం.
- హర్యానా రాష్ట్రం అటవీ భూములను సరిగా సర్వే చేయకపోవడం.
ప్రశ్న 19.
పశ్చిమ కనుమల పశ్చిమ భాగం, తూర్పు భాగం కంటే దట్టమైన అడవులను కలిగి వుంది. కారణం తెలపండి.
జవాబు:
భారతదేశానికి అత్యధిక వర్షపాతంను ఇచ్చే నైరుతి ఋతుపవనాలు ముందుగా పశ్చిమ కనుమల యొక్క పశ్చిమ భాగాన్ని తాకి వర్షపాతంను ఇవ్వటం వలన అక్కడ (అడవులు) వృక్షాలకు కావలసినంత నీరు సమృద్ధిగా దొరుకుతుంది. – తూర్పు భాగం వర్షచ్ఛాయా ప్రాంతంలో ఉండుట వలన వర్షపాతం తక్కువగా ఉండుట వలన పశ్చిమ కనుమల తూర్పుభాగం అడవుల సాంద్రత తక్కువగా వుంది.
7th Class Social Textbook Page No.51
ప్రశ్న 20.
ఆంధ్రప్రదేశ్ పటాన్ని పరిశీలించి ఏయే జిల్లాల్లో అటవీ విస్తీర్ణం ఎక్కువగా, ఏయే జిల్లాల్లో తక్కువగా ఉందో తెలపండి.
జవాబు:
అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న జిల్లాలు :
YSR కడప, విశాఖపట్నం, తూర్పు గోదావరి, కర్నూలు, చిత్తూరు, శ్రీకాకుళం.
అటవీ విస్తీర్ణం తక్కువగా ఉన్న జిల్లాలు : కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు.
ప్రశ్న 21.
మీ జిల్లాలో ఏ రకమైన అడవులు ఉన్నాయి?
జవాబు:
మాది విశాఖపట్నం జిల్లా, మా జిల్లాలో తేమతో కూడిన ఆకురాల్చే అడవులున్నాయి.
7th Class Social Textbook Page No.55
ప్రశ్న 22.
ఈ క్రింది పట్టికను పూరించండి.
జవాబు:
అడవుల రకాలు | విస్తరణ | వక్షజాలం |
తేమతో ఆకురాల్చే అడవులు | శ్రీకాకుళం, విజయనగరం తూర్పు గోదావరి | వేగి, ఏగిస, వెదురు, మద్ది, బండారు, జిట్టెగి, సాల |
శుష్క ఆకురాల్చే అడవులు | YSR కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు | మద్ది, టేకు, బిల్ల, వెలగ, ఏగిస, వేప, బూరుగ, ఎర్రచందనం |
మడ అడవులు | తీర ప్రాంతమంతా | ఉప్పుపొన్న, బొడ్డుపొన్న, ఉరడ, మడ తెల్లమడ, పత్రితీగ, జలబండి తీగ |
7th Class Social Textbook Page No.59
ప్రశ్న 23.
సామాజిక అడవులపై కొన్ని నినాదాలు రాయండి.
జవాబు:
- పచ్చని చెట్లు – ప్రగతికి మెట్లు
- పచ్చని వనాలు – వచ్చే తరానికి వరాలు
- వనం కోసం మనం – మన కోసం వనం
- పచ్చని వనాలు – ప్రగతికి సోపానాలు
ప్రశ్న 24.
మీ పుట్టినరోజున ఒక చెట్టును నాటండి మరియు దానిని జాగ్రత్తగా చూసుకోండి.
జవాబు:
విద్యార్థి కృత్యము.
ప్రశ్న 25.
మీ స్నేహితులు మరియు బంధువులకు ముఖ్యమైన సందర్భాలలో ఒక మొక్కను బహుమతిగా ఇవ్వండి.
జవాబు:
విద్యార్థి కృత్యము.
7th Class Social Textbook Page No.61
ప్రశ్న 26.
గిరిజనుల సంస్కృతి మరియు వారి ఉత్పత్తులను గురించి ఒక పోస్టర్ తయారుచేయండి.
జవాబు:
ప్రశ్న 27.
మీ పాఠశాలలో/ స్థానికంగా వన మహోత్సవాన్ని జరుపుకొని అందులో భాగంగా కొన్ని మొక్కలు నాటి వాటి పెరుగుదలను గమనించండి.
జవాబు:
విద్యార్థి కృత్యము.
7th Class Social Textbook Page No.53
ప్రశ్న 28.
ఎర్ర చందనం మరియు గంధం చెక్కల ఉపయోగాలు ఏమిటి?
జవాబు:
ఎర్ర చందనం మరియు గంధం చెక్కల ఉపయోగాలు :
- సుగంధ ద్రవ్యాల తయారీలో వాడతారు.
- బొమ్మల తయారీకి వినియోగిస్తారు.
- సంగీత పరికరాల తయారీకి.
- సహజ రంగుల తయారీలో.
- అందమైన గృహోపకరణాల తయారీలో వీటిని ఉపయోగిస్తారు.
- వీటికి ప్రపంచ వ్యాప్తి మార్కెట్ కల్గి ఉండి, ఆర్థికంగా ఎంతో విశేష స్థానం ఉంది.
7th Class Social Textbook Page No.55
ప్రశ్న 29.
గిరిజనులు అటవీ ప్రాంతాలను వదలి వెళ్ళడానికి ఎందుకు తిరస్కరిస్తారు?
జవాబు:
గిరిజనులు అటవీ ప్రాంతాలను వదలి వెళ్ళడానికి ఎందుకు తిరస్కరిస్తారంటే :
- చారిత్రాత్మకంగా ప్రాచీన కాలం నుండి అడవులే గిరిజనుల ఆవాసాలుగా ఉన్నాయి.
- గిరిజనులకు జీవనాధార వనరులుగా అడవులున్నాయి.
- వీరికి వేట, ఆహార సేకరణ, (కొంత వ్యవసాయం) మాత్రమే చేయగలరు. ఇతర ప్రాంతాలకు వెళ్ళితే వీరి పోషణ కష్టమగును.
- వీరికి అటవీ జ్ఞానము మెండుగా ఉండును. ఈ జ్ఞానము వారి జీవనానికి సహాయపడును. బయటకు వస్తే జ్ఞానము వృథా.
- వీరికి అడవి, అడవిలోని జంతు, జీవ జాలములతో విడదీయరాని అనుబంధము ఉంది.
7th Class Social Textbook Page No.57
ప్రశ్న 30.
పర్యావరణ పరిరక్షణలో అడవుల పాత్ర ఏమిటి?
జవాబు:
- పర్యావరణ వ్యవస్థలో సమతౌల్యం కాపాడటంలో అడవుల పాత్ర అతి ప్రధానమైనది.
- వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడు చెట్లు గ్రహించి ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. దీనివలన గ్లోబల్ వార్మింగ్ తగ్గును.
- వేర్లు మృత్తికా క్రమక్షయాన్ని కాపాడి, (నేలసారంను కాపాడతాయి).
- వాయు కాలుష్యాన్ని అడవులు తగ్గిస్తాయి.
- వాతావరణంలో ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి.
ప్రశ్న 31.
నీ పరిసర ప్రాంతాలలో అటవీ ఉత్పత్తులతో చేసిన వస్తువుల జాబితాను తయారుచేయండి.
జవాబు:
అటవీ ఉత్పత్తులతో చేసిన వస్తువులు :
1) చెక్కబల్లలు, 2) చెక్క కుర్చీలు, 3) కిటికీలు, 4) తలుపులు, 5) చాటలు, 6) చెక్క బీరువాలు, 7) మంచాలు, , 8) సంగీత వాయిద్యాలు, 9) నిచ్చెనలు, 10) వెదురు ఇల్లు (పూరిల్లు), 11) పప్పు గుత్తి, చల్లగుత్తి, 12) కత్తిపీట, 13) చెక్కపీటలు, 14) విస్తరాకులు, 15) గృహోపకరణాలు, 16) కలప గుజ్జు ద్వారా కాగితము, అట్టపెట్టెలు, 17) కుంచె చీపుర్లు, 18) చెక్క బొమ్మలు, 19) దర్వాజాలు.
7th Class Social Textbook Page No.59
ప్రశ్న 32.
వన నిర్మూలనకు గల కారణాలేవి?
జవాబు:
అటవీ నిర్మూలనకు గల కొన్ని కారణాలను పరిశీలిద్దాం.
- అటవీ భూములను వ్యవసాయ భూములుగా మార్చడం
- రోడ్లు మరియు డ్యాంల నిర్మాణాలు
- కలప
- పారిశ్రామిక ప్రయోజనాలు
- కొంత మంది తుంటరితనంతో అటవీ ప్రాంతాలకు నిప్పు పెట్టటం చాలా నష్టాన్ని కలిగిస్తుంది.
ప్రశ్న 33.
వన నిర్మూలన వలన కలిగే పరిణామాలేవి?
జవాబు:
వన నిర్మూలన వలన భూగోళం వేడెక్కడం, కాలుష్యం, నేలల క్రమ క్షయం, వన్యప్రాణులు సహజ ఆవాసాలు కోల్పోవటం, ఆహార, అటవీ ఉత్పత్తుల కొరత పర్యావరణ అసమతౌల్యత వంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది వరదలు, కరువులు వంటి ప్రకృతి వైపరీత్యాలకు దారితీయొచ్చు.
ప్రశ్న 34.
వన నిర్మూలన అరికట్టడానికి కొన్ని సూచనలు తెలపండి.
జవాబు:
వన నిర్మూలన అరికట్టడానికి సూచనలు:
- గృహోపకరణాల కలపకు ప్రత్యామ్నాయాలను చూడటం.
- గనుల త్రవ్వకంను తగ్గించి, రీసైక్లింగ్ (లోహాలను)ను ప్రోత్సహించటం.
- తక్కువ ముంపు కలిగే ప్రాంతాలలో ఆనకట్టలు నిర్మించడం.
- విరివిగా ప్రభుత్వ భూముల్లో, రహదారుల వెంట చెట్లను నాటడం.
- ప్రజలకు అటవీ సంరక్షణ పథకాలపై చైతన్యం కల్గించడం.
- పోడు వ్యవసాయాన్ని అరికట్టడం.
- కాగితం తయారీకి కలప గుజ్జుకై వెదురుకు ప్రత్యామ్నాయాలను వాడటం. కాగితంను పొదుపుగా వాడటం.
ప్రశ్న 35.
మీ పరిసర ప్రాంతాలలో మొక్కలు నాటడాన్ని ఎప్పుడైనా గమనించావా?
జవాబు:
గమనించాను, మా పాఠశాలలో “వనం-మనం” కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడాన్ని గమనించాను.
ప్రశ్న 36.
మొక్కలు నాటడం వలన ఉపయోగాలు ఏమిటి?
జవాబు:
మొక్కలు నాటడం వలన ఉపయోగాలు: .
- ఇప్పుడు మొక్కలు నాటడం వలన భవిష్యత్ లో అవి వృక్షాలవుతాయి.
- మొక్కలు వాతావరణంలో ఉన్న CO2 పీల్చుకుని ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. ఆక్సిజన్ మనకు ప్రాణవాయువు.
- మొక్కలు వాతావరణంలోని కాలుష్యాన్ని తగ్గిస్తాయి. వాతావరణం సమతౌల్యాన్ని కాపాడతాయి.
- భూగోళం వేడెక్కడాన్ని తగ్గిస్తాయి.
- క్రమక్షయాన్ని తగ్గిస్తాయి.
- చెట్లు నీడని, పండ్లను, ఆకులను ఇస్తాయి.
7th Class Social Textbook Page No.59
ప్రశ్న 37.
చిప్కో ఉద్యమం గురించి సమాచారం అంతర్జాలం ద్వారా గాని లేదా లైబ్రరీ పుస్తకాల ద్వారా గాని తెలుసుకోండి.
జవాబు:
ఉత్తరాఖండ్ లోని గఢ్ వాల్ కొండలలో 1970 ఆరంభంలో మొదలైన చిప్కో ఉద్యమం మరొక ముఖ్యమైన పర్యావరణ ఉద్యమం. నర్మదా లోయలోని గిరిజన ప్రజలకు మాదిరిగానే ఇక్కడి కొండ ప్రాంతాల్లోని ప్రజల మనుగడకు అడవులు ఎంతో కీలకమైనవి. ఇవి ప్రత్యక్షంగా ఆహారం, కట్టెపుల్లలు, పశువుల మేత ఇవ్వటమే కాకుండా పరోక్షంగా నేల, నీటి వనరులను సుస్థిరపరచటంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. వ్యాపారం, పరిశ్రమల కోసం అడవులను నరికివేయటం తీవ్రరూపం దాల్చటంతో తమ జీవనోపాధులను కాపాడుకోవటానికి దీనిని అహింసాయుత పద్ధతిలో వ్యతిరేకించాలని ప్రజలు చెట్లను హత్తుకున్నారు. దీనినుంచే ఈ ఉద్యమం పేరు వచ్చింది. చిప్కో అంటే హత్తుకోవటం. చెట్లను పల్లెవాసులు హత్తుకొని గుత్తేదార్ల గొడ్డళ్ళకు అడ్డుగా నిలిచారు. ఈ ఉద్యమంలో గ్రామీణ మహిళలు ప్రధానంగా పాల్గొన్నారు. ఈ ఉద్యమం కారణంగా ఎంతోమంది పర్యావరణ సుస్థిరత గురించి ఆలోచించటం మొదలుపెట్టారు.