AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు – శక్తి వనరు

SCERT AP 8th Class Social Study Material Pdf 2nd Lesson సూర్యుడు – శక్తి వనరు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 2nd Lesson సూర్యుడు – శక్తి వనరు

8th Class Social Studies 2nd Lesson సూర్యుడు – శక్తి వనరు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
తప్పు వాక్యాలను సరిచేయండి. (AS1)
జవాబు:
అ) ఒక ప్రదేశం సముద్రానికి దగ్గరగా ఉంటే, భూమధ్యరేఖ నుంచి ఎంత దూరంలో ఉంది అన్నదానితో సంబంధం లేకుండా ఎప్పుడూ చల్లగా ఉంటుంది.
జవాబు:
(ఒప్పు)

ఆ) భూమి నుంచి పైకి వెళుతున్న కొద్దీ సూర్యుడికి దగ్గరగా వెళతారు కాబట్టి బాగా వేడిగా ఉంటుంది. (తప్పు)
భూమి నుంచి పైకి వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రత తగ్గి చల్లగా ఉంటుంది.
జవాబు:
(ఒప్పు)

ఇ) సూర్యుడు ముందుగా గాలిని వేడిచేసి, తరవాత భూమిని వేడి చేస్తాడు. (తప్పు)
సూర్యుడు ముందుగా భూమిని, తద్వారా గాలిని వేడి చేస్తాడు.
జవాబు:
(ఒప్పు)

ఈ )భూగోళం వేడెక్కటానికి ప్రాణవాయువు (ఆక్సిజన్)తో సంబంధం ఉంది. (తప్పు)
భూగోళం వేడెక్కడానికి కార్బన్-డై-ఆక్సైడ్ తో సంబంధం ఉంది.
జవాబు:
(ఒప్పు)

ప్రశ్న 2.
పట్టిక 2లో అత్యధిక ఉష్ణోగ్రతకు, పట్టిక 1లో అతి తక్కువ ఉష్ణోగ్రతకు ఎంత తేడా ఉంది? (AS3)
జవాబు:
పట్టిక 2లో అత్యధిక ఉష్ణోగ్రత = 33°C
పట్టిక 1లో అతి తక్కువ ఉష్ణోగ్రత = 17°C
ఈ రెండింటి మధ్య తేడా = 16°C

ప్రశ్న 3.
డిసెంబరు 6న ఉదయం 10 గంటలకు మాస్కోలో ఉష్ణోగ్రత – 8°C అనుకుందాం. ఇరవై నాలుగు గంటల తరవాత ఉష్ణోగ్రత 12°C ఎక్కువ ఉంది. డిసెంబరు 7న ఉదయం 10 గంటలకు అక్కడ ఉష్ణోగ్రత ఎంత? (AS5)
జవాబు:
డిసెంబరు 7న ఉదయం 10 గంటలకు అక్కడ ఉష్ణోగ్రత 4°C గా ఉంటుంది.

AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు

ప్రశ్న 4.
ఢిల్లీ, ముంబయి మైదాన ప్రాంతంలో ఉన్నాయి, సముద్ర మట్టం నుంచి వాటి ఎత్తు 300 మీటర్ల లోపు ఉంటుంది. వాటి నెలసరి సగటు ఉష్ణోగ్రతలలో అంత తేడా ఎందుకు ఉంది? ఈ రెండు నగరాలలో ఏ నెలల్లో సగటు ఉష్ణోగ్రతలు దాదాపు ఒకటిగా ఉంటాయి? వాటికి కారణాలు వివరించండి. (AS1)
జవాబు:
ముంబయి సముద్ర ప్రభావిత శీతోష్ణస్థితిని, ఢిల్లీ ఖండాంతర్గత శీతోష్ణస్థితిని కలిగి ఉంది. ముంబయి సముద్రతీర ప్రాంతంలో ఉండటం మూలంగా సంవత్సరం పొడుగునా ఒకే రకమైన శీతోష్ణస్థితిని కలిగి ఉంది. ఢిల్లీ సముద్రానికి దూరంగా ఉండటం మూలంగా ఇక్కడి ఉష్ణోగ్రతలో అత్యధిక హెచ్చు తగ్గులున్నాయి. ఈ రెండు ప్రాంతాల ఉష్ణోగ్రతలు ఆగస్టు, సెప్టెంబరు నెలలలో కొంచెం దగ్గరగా ఉన్నాయి.

ప్రశ్న 5.
జోధ్ పూర్ (రాజస్థాన్)లో నెలసరి సగటు గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు కింద పట్టికలో ఉన్నాయి. వాటితో రేఖాచిత్ర పటం (గ్రాఫ్) గీయండి. సంవత్సరంలో చాలా వేడిగా, చాలా చలిగా ఉండే నెలలు ఏవి?
జోధ్ పూర్ లో నెలసరి సగటు గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు (AS3).
AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు 1
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు 2
a) ఏప్రియల్, మే మరియు జూన్ నెలలు వేడిగా ఉంటుంది.
b) డిసెంబరు, జనవరి మరియు ఫిబ్రవరి నెల చలిగా ఉంటుంది.

ప్రశ్న 6.
ఎ, బి, సి అనే మూడు ప్రదేశాల సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు కింద పట్టికలో ఉన్నాయి. వాటి రేఖా చిత్రపటం (గ్రాఫ్) తయారు చేయండి. పట్టిక, రేఖా చిత్రపటాలు చూసి ఆ ప్రదేశాల గురించి మీరు ఏమి ఊహిస్తారు. (AS3)
AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు 3
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు 4
A&C ప్రాంతాలు వేడి ప్రాంతాలు
B శీతల ప్రాంతము

ప్రశ్న 7.
జనవరిలో సిమ్లా, తిరువనంతపురం సగటు ఉష్ణోగ్రతలలో తేడాలకు మూడు కారణాలను ఇవ్వండి. అట్లాస్ చూడండి. (AS3)
జవాబు:
1. తిరువనంతపురం సముద్రతీర ప్రాంతం.
2. సిమ్లా ఎత్తైన ప్రదేశంలో ఉన్నది.
3. తిరువనంతపురం భూమధ్యరేఖకు దగ్గరగాను, సిమ్లాకు దూరంగానూ ఉన్నాయి.

ప్రశ్న 8.
భోపాల్, ఢిల్లీ, ముంబయి, సిమ్లాలలో ఏ రెండు ప్రదేశాలు ఒకే రకమైన ఉష్ణోగ్రత తీరును కలిగి ఉంటాయి. ఈ రెండు ప్రదేశాల మధ్య పోలికలకు కారణాలు వివరించండి. (AS1)
జవాబు:
భోపాల్, ఢిల్లీలలో ఉష్ణోగ్రతలు ఒకే తీరును కలిగి ఉంటాయి. ఈ రెండు ప్రాంతాలు సముద్రానికి దూరంగా ఉండటమే దీనికి కారణము.

ప్రశ్న 9.
కింద ఉన్న రేఖా చిత్రపటం (గ్రాఫ్) చూసి కింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.
AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు 5
అ) జులైలో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత ఎంత?
ఆ) డిసెంబరు నెలలో సాధారణంగా ఎంత వేడిగా ఉంటుంది?
ఇ) జూన్ నెలలో సాధారణంగా ఎంత చలిగా ఉంటుంది?
ఈ) పగటి, రాత్రి ఉష్ణోగ్రతలలో తేడా మే నెలలో ఎక్కువగా ఉంటుందా లేక ఆగస్టులోనా?
ఉ) వేసవి నెలలు ఏవి?
జవాబు:
అ) 28°C
ఆ) 26°C
ఇ) 20°C
ఈ) మే నెలలో
ఉ) మార్చి, ఏప్రిల్, మే నెలలు

ప్రశ్న 10.
నితిన్ థర్మల్ విద్యుత్తు మంచిదని అంటున్నాడు. కాని పద్మజ సౌర విద్యుత్తు మంచిదని అంటున్నది. వీరిలో ఎవరిని సమర్ధిస్తారు? ఎందుకు?
జవాబు:
నేను పద్మజను సమర్థిస్తాను. కారణం :
సౌరశక్తి, ధర్మల్ శక్తి కంటే మెరుగైనది. ఎందుకంటే సౌరశక్తి పరిశుభ్రమైనది. నిరంతరం లభ్యమయ్యేది. అంతేకాక ఇది పునరావృతమయ్యే సహజ వనరు. ఎంతవాడినా తరగని వనరు. మన శరీరానికి కావలసిన విటమిన్-డి ని కూడా ఇది అందిస్తుంది.

AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు

ప్రశ్న 11.
పేజి నెం. 27లోని ‘ఎత్తు – ఉష్ణోగ్రత’ అంశాన్ని చదివి వ్యాఖ్యానించంది.
మండు వేసవిలో మైదాన ప్రాంతాలలోని కొంతమంది ఎండల నుంచి తప్పించుకోటానికి ఊటీ, సిమ్లా వంటి పర్వత ప్రాంత ప్రదేశాలకు వెళుతుంటారు. ఎత్తుగా ఉండే పర్వతాలలో వేసవి నెలల్లో కూడా ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. పర్వతాలలో ఎత్తైన ప్రాంతాలలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఎత్తు ప్రదేశాలకు వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతుంటాయి.

ప్రతినెలలోనూ ఢిల్లీలో కంటే సిమ్లాలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నాయని స్పష్టమవుతుంది.

సముద్ర మట్టం నుంచి ఢిల్లీ 200 మీటర్ల ఎత్తులో ఉంది. అదే సిమ్లా 2200 మీటర్ల ఎత్తులో ఉంది. సాధారణంగా సముద్ర మట్టం నుంచి ప్రతి వెయ్యి మీటర్ల పైకి వెళితే ఉష్ణోగ్రతలు 6°C మేర తగ్గుతాయి. ఎత్తైన కొండలు, పర్వతాలలో తక్కువ ఉష్ణోగ్రతల వల్ల అక్కడ పెరిగే చెట్లు, మొక్కలలో కూడా తేడా ఉంటుంది.
జవాబు:
సముద్ర మట్టం నుండి ప్రతి 1000 మీటర్లు ఎత్తుకు పోయిన కొలది 6°C ఉష్ణోగ్రత తగ్గుతుంది. కాబట్టి సిమ్లా, డార్జిలింగ్, హార్సిలీ హిల్స్, ఊటీ వంటి ప్రాంతాలలో వేసవిలో కూడా చల్లగా ఉండి వేసవి విడిది కేంద్రాలుగా ప్రసిద్ధి పొందాయి.

8th Class Social Studies 2nd Lesson సూర్యుడు – శక్తి వనరు InText Questions and Answers

8th Class Social Textbook Page No.18

ప్రశ్న 1.
మీరు నివసించే ప్రాంతం కంటే భిన్నమైన వాతావరణం ఉండే ప్రదేశానికి ఎప్పుడైనా వెళ్లారా ? తరగతి గదిలో వివరించండి.
జవాబు:
నేను విజయవాడ నివసిస్తాను. ఇక్కడి వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. క్రిందటి వేసవి సెలవులలో నేను ఊటీ వెళ్ళాను. అది నీలగిరి కొండల పై, ఎత్తైన ప్రదేశంలో ఉన్నది. చాలా చల్లగా ఉంది. మేము రామగుండం నుండి కోయంబత్తూరు వెళ్ళి అక్కడి నుండి ఊటీకి చేరుకున్నాము. దీనిని కొండలలో రాణి అని అంటారు. అందమైన జలపాతాలు అక్కడి ప్రకృతి వరాలు. మేము అక్కడ హారేస్ కోర్సు ఎదురుగా ఉండే హోటల్ లో బస చేశాము. బొటానికల్ గార్డెన్స్, లేక్, దొడబెట్ట, లవ్ డేల్ మొదలైన ప్రదేశాలన్నీ సందర్శించాము. మండు వేసవిలో అక్కడ స్వెట్టర్లు వేసుకుని తిరగటం నాకు ఆశర్యంగాను, అద్భుతంగాను అనిపించింది. ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళాలని కూడా అనిపించింది.

ప్రశ్న 2.
భూమి మీద వేడిమికి సూర్యుడు కారణమని మీకు తెలుసు. అయితే ఈ వేడిమి ఉదయం నుంచి సాయంత్రానికి, కాలాలను బట్టి, ప్రదేశాలను బట్టి మారటానికి కారణం ఏమిటి? ఇక్కడ ఉష్ణోగ్రతలలో కొన్ని తేడాలను ఇచ్చాం . వీటికి కారణాలను ఊహించి, తరగతి గదిలో చర్చించిన తరవాత ముందుకు వెళ్ళండి.
1. ఉదయం పూట చల్లగానూ, మధ్యాహ్నం వేడిగానూ ఉంటుంది.
2. వేసవిలో వేడిగానూ, శీతాకాలంలో చలిగానూ ఉంటుంది.
3. కొండలపై చల్లగానూ, మైదాన ప్రాంతంలో వేడిగానూ ఉంటుంది.
4. భూమధ్యరేఖా ప్రాంతంలో వేడిగానూ, ధృవప్రాంతంలో చలిగానూ ఉంటుంది. Page No. 18)
జవాబు:
భూమి మీద ఉష్ణోగ్రతలో మార్పులకు అనేక కారణాలున్నాయి. అవి :

  1. అక్షాంశము
  2. ఎత్తు
  3. సముద్రం నుండి దూరము
  4. సముద్ర తరంగాలు
  5. పర్వతాలు
  6. గాలులు మొ||నవి.

1. కారణం :
ఉదయం పూట భూభ్రమణం కారణంగా సూర్యకిరణాలు ఏటవాలుగాను, మధ్యాహ్నం పూట నిట్టనిలువుగా పడతాయి. అందువలన ఉదయం పూట చల్లగాను, మధ్యాహ్నం వేడిగాను ఉంటుంది.

2. కారణం :
వేసవిలో కిరణాలు భూమి మీద లంబంగా ప్రసరిస్తాయి. చలికాలంలో ఏటవాలుగా ప్రసరిస్తాయి. ఇది భూపరిభ్రమణం కారణంగా జరుగుతుంది.

3. కారణం :
సముద్రతీరం నుండి ఎత్తుకు పోయే కొలదీ ప్రతి 1000 మీ||లకు 6°C ఉష్ణోగ్రత తగ్గుతుంది. అందువలన మైదానాలలో కంటే కొండలపై చల్లగా ఉంటుంది.

4. కారణం :
భూమధ్యరేఖా ప్రాంతంలో సూర్యకిరణాలు నిట్టనిలువుగా (90°C) పడతాయి. ధృవాలవైపు ఏటవాలుగా పడతాయి. ఇది భూమి యొక్క ఆకృతి మూలంగా జరుగుతుంది.

8th Class Social Textbook Page No.19

ప్రశ్న 3.
సౌరవికిరణం (రేడియేషన్), సూర్యపుటం (ఇన్సోలేషన్) మధ్య తేడాలను పేర్కొనండి.
జవాబు:
1. సౌరవికిరణం : సూర్యుడు విడుదల చేసే శక్తిని సౌర వికిరణం అని అంటారు.
AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు 6
2. సూర్యపుటం : సూర్యుడు విడుదల చేసే దాని నుండి భూమి ఉపరితలం గ్రహించే శక్తిని సూర్యపుటం అని అంటారు.

ప్రశ్న 4.
పొగ, ధూళితో వాతావరణం మరింత కలుషితమైతే ఏమవుతుంది?
జవాబు:
సౌరశక్తిలోని కొంత భాగాన్ని వాతావరణంలోని పొగ, ధూళి పరావర్తనం చేస్తాయి లేదా గ్రహిస్తాయి. ఇవి ఎక్కువై సౌరశక్తిని ఎక్కువ పరావర్తనం చేస్తే భూమి మీద వేడి ఉండదు. ఇవి ఎక్కువై సౌరశక్తిని ఎక్కువ గ్రహిస్తే భూమి మీద వేడిమి పెరుగుతుంది. ఈ రెండింటి వల్ల కూడా భూమి మీద జీవం ప్రమాదంలో పడుతుంది.

8th Class Social Textbook Page No.20

ప్రశ్న 5.
సూర్యకిరణాలు ఎక్కడ ఎక్కువ ఏటవాలుగా పడతాయి – జపాన్లోనా, ఉత్తర ధృవం వద్దా?
జవాబు:
సూర్యకిరణాలు ఉత్తర ధృవం వద్ద ఎక్కువ ఏటవాలుగా పడతాయి.

ప్రశ్న 6.
సూర్యకిరణాల సాంద్రత ఎక్కడ ఎక్కువగా ఉంటుంది – ఆంధ్రప్రదేశ్ లోనా, రాజస్థాన్లోనా?
జవాబు:
సూర్యకిరణాల సాంద్రత ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది.

ప్రశ్న 7.
భూమి గుండ్రంగా కాకుండా బల్లపరుపుగా ఉంటే జపాన్ ఎక్కువ వేడి ఎక్కుతుందా, భూమధ్యరేఖా ప్రాంతమా? లేక రెండూ సమంగా వేడి ఎక్కుతాయా?
జవాబు:
రెండూ సమానంగా వేడెక్కుతాయి.

AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు

ప్రశ్న 8.
గ్లోబును చూసి ఏ దేశాలు ఎక్కువ వేడిగా ఉంటాయో, ఏ దేశాలు చల్లగా ఉంటాయో చెప్పండి.
జవాబు:
వేడి దేశాలు : ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, తైవాన్, బర్మా, ఇండియా, సూడాన్, అరేబియా, జింబాబ్వే, చిలీ, బ్రెజిల్, గ్వాటియాలా మొదలగునవి. చల్లని దేశాలు : ఉత్తర అమెరికా, ఐర్లాండ్, స్కాండినేవియా, రష్యా మొదలగునవి.

8th Class Social Textbook Page No.21

ప్రశ్న 9.
భూమి, సముద్రం వేడెక్కడంలో తేడా ఎందుకు ఉంది?
జవాబు:
భూమి, నీటితో పోలిస్తే మంచి ఉష్ణవాహకం. కాబట్టి సముద్రం కన్నా భూమి త్వరగా వేడెక్కి త్వరగా చల్లబడుతుంది.

8th Class Social Textbook Page No.23

ప్రశ్న 10.
వేర్వేరు ఉష్ణోగ్రతలు తెలుసుకోడానికి ఈ కింద పేర్కొన్న, వాటి ఉష్ణోగ్రతలు కొలవండి. కొలవటానికి ముందు వాటి ఉష్ణోగ్రత ఎంత ఉంటుందో ఊహించి అంచనా వేయండి.
జవాబు:

వస్తువు ఉష్ణోగ్రత
అంచనా కొలత
బక్కెటులో నీళ్ళు 25°C 35°C
ఐసుగడ్డ 0°C 0°C
గ్లాసులోని చల్లటి నీళ్లు 15°C 10°C
స్నానానికి పెట్టుకున్న వేడినీళ్లు 70°C 76°C

ప్రశ్న 11.
10°C నుంచి 110°C వరకు కొలవగల ఉష్ణమాపకం ఉపయోగించటం మంచిది. ఇటువంటి ఉష్ణమాపకం ఉపయోగించి మరుగుతున్న నీళ్ళు, వేడిగా ఉన్న టీ ఉష్ణోగ్రతలను కొలవండి.
జవాబు:
మరుగుతున్న నీళ్ళు = 100°C; వేడిగా ఉన్న టీ = 95°C

ప్రశ్న 12.
రాబోయే వారం రోజులపాటు ప్రతిరోజూ ఒకే ప్రదేశం, ఒకే సమయంలో వాతావరణ ఉష్ణోగ్రతలు తీసుకోండి. (ఇందుకు నీడలో వుండే ప్రాంతాన్ని ఎన్నుకోండి). ప్రతిరోజూ ఉష్ణోగ్రత కొలవటానికి ముందు దానిని ఊహించి అంచనా వేయండి. – వీటిని ఒక పుస్తకంలో నమోదు చేయండి.
జవాబు:
ప్రదేశం : బెంగళూరు
సమయం : 12 గంటలు
నెల : జనవరి

తేదీ వాతావరణ ఉష్ణోగ్రతలు
అంచనా కొలత
18.1.19 28°C 29°C
19.1.19 27°C 30°C
20.1.19 29°C 30°C
21.1.19 29°C 30°C
22.1.19 28°C 30°C
23.1.19 27°C 30°C
24.1.19 28°C 30°C

1) ఇలా వారం రోజులపాటు వేర్వేరు నెలల్లో ఉష్ణోగ్రతలు నమోదు చేయండి.
జవాబు:
ఈ విధంగా నేను వేర్వేరు నెలలలో 5 వారాల పాటు ఉష్ణోగ్రతలు నమోదు చేశాను.

2) మీరు నమోదు చేసిన వారం రోజుల ఉష్ణోగ్రతల సగటును కనుక్కోండి.
జవాబు:

  1. జనవరి 3వ వారం – 29°C
  2. మార్చి 2వ వారం – 32°C
  3. జులై 1వ వారం – 28°C
  4. అక్టోబరు 2వ వారం – 28°C
  5. డిసెంబరు 4వ వారం – 28°C

3) వివిధ వారాల ఉష్ణోగ్రతలలో తేడాల గురించి చర్చించండి.
జవాబు:
ఈ ఉష్ణోగ్రతల గురించి తరగతి గదిలో చర్చించిన తరువాత బెంగళూరు శీతోష్ణస్థితి సాధారణ శీతోష్ణస్థితి అని, అధిక ఉష్ణోగ్రతలు లేవు అని నిర్ధారించినాము.

AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు

8th Class Social Textbook Page No.24

ప్రశ్న 13.
ఈ సంఖ్యారేఖపై గుర్తించిన ధన, ఋణ సంఖ్యలను గమనించండి. వీటి ఆధారంగా దిగువ ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు 7
1. ఏ ఉష్ణోగ్రత ఎక్కువ : 5°C లేక – 5°C?
జవాబు:
– 5°C

2. ఈ రెండు ఉష్ణోగ్రతలలో దేని దగ్గర మనకు ఎక్కువ చలిగా అనిపిస్తుంది?
జవాబు:
5°C

3. – 5°C నుండి 5°C వరకు ఎన్ని డిగ్రీల తేడా ఉంది?
జవాబు:
10°C (5° – (-59) = 5 + 5 = 10°C]

4. కింద పేర్కొన్న ఉష్ణోగ్రతలను క్లుప్తంగా రాయండి.
సున్నాకి దిగువన 88°C, నీరు గడ్డ కట్టుకోవటానికి 38°C ఎగువన, నీరు గడ్డకట్టుకోటానికి 32°C దిగువన.
జవాబు:
– 88°C, 38°C, – 32°C

5. ఈ రోజున మీ తరగతి గదిలో ఉష్ణోగ్రతని కొలిచారా? సున్నాకి దిగువున 88°C అంటే మీరు కొలిచిన ఉష్ణోగ్రత కంటే ఎంత తక్కువ?
జవాబు:
తరగతి గది ఉష్ణోగ్రత 28°C. నేను కొలిచిన ఉష్ణోగ్రత కంటే 116°C తక్కువ.

6. మనిషి శరీర ఉష్ణోగ్రత సాధారణంగా 37°C ఉంటుంది. ఉష్ణోగ్రత 50°C ఉంటే మనిషి సాధారణ ఉష్ణోగ్రత కంటే ఎంత ఎక్కువ ఉన్నట్టు?
జవాబు:
13°C

7. ఉష్ణోగ్రత – 5°C ఉంటే మనిషి సాధారణ ఉష్ణోగ్రత కంటే ఎంత తక్కువ ఉన్నట్టు?
జవాబు:
42°C

8. ఈ ఉష్ణోగ్రతలను ఎక్కువ నుంచి తక్కువకు క్రమంలో రాయండి.
12°C, – 16°C, 29°C, 0°C, – 4°C.
జవాబు:
29°C, 12°C, 0°C, – 4°C, – 16°C

9. పైన ఇచ్చిన ఉష్ణోగ్రతలలో దేని దగ్గర అన్నిటికంటే ఎక్కువ వేడిగా ఉంటుంది?
జవాబు:
29°C వద్ద

10. పైన ఇచ్చిన ఉష్ణోగ్రతలలో దేని దగ్గర అన్నిటికంటే ఎక్కువ చలిగా ఉంటుంది?
జవాబు:
– 16°C వద్ద

8th Class Social Textbook Page No.25

ప్రశ్న 14.
గ్రాఫ్ – 1 (అనంతపురం నెలసరి సగటు ఉష్ణోగ్రతలు)
AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు 8
పట్టిక-1లోని వివరాలను ఉపయోగించుకుని అదే గ్రాలోనే అనంతపురం నెలవారీగా సగటు కనిష్ఠ ఉష్ణోగ్రతల రేఖను గీయండి. మొదటి రెండు నెలలకు చేసిన గ్రాఫ్ పైన ఉంది.
పట్టిక-1 : అనంతపురం నెలసరి సగటు ఉష్ణోగ్రతలు
AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు 9
నెల కనిష్ఠం నెల గరిష్ఠ కనిష్ఠ జనవరి 30 17 జులై 24 ఫిబ్రవరి 33 1 9 ఆగసు 33 మార్చి 3722 సెప్టెంబరులో ఏప్రిల్ 39 అక్టోబరు 32 39 26 నవంబరు 30 జూన్ 35 డిసెంబరు
ఇచ్చిన గ్రాఫ్, పట్టిక -1 పరిశీలించి అనంతపురముకు సంబంధించి కింది ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి.
1. అనంతపురంలో నవంబరులో ఎంత చలిగా ఉంటుంది?
జవాబు:
చలి తక్కువుగా ఉంటుంది. 20°C

2. అనంతపురంలో ఏ నెలలో గరిష్ఠ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది?
జవాబు:
మే నెల

3. సంవత్సరంలో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత, అతి తక్కువ కనిష్ఠ ఉష్ణోగ్రతకి మధ్య తేడా ఎంత?
జవాబు:
సంవత్సరంలో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత = 39°C
సంవత్సరంలో అతి తక్కువ కనిష్ఠ ఉష్ణోగ్రత = 17°C
తేడా = 39° – 17°C = 22°C.

4. అనంతపురంలో బాగా వేడిగా ఉండే మూడు నెలలు ఏవి?
జవాబు:
మార్చి, ఏప్రిల్, మే.

5. బాగా చలిగా ఉండే మూడు నెలలు ఏవి?
జవాబు:
డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి.

6. జూన్ నుండి డిసెంబరు వరకు అనంతపురంలో సగటు కనిష్ఠ ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంది. సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత కూడా తగ్గుతూ ఉందా?
జవాబు:
తగ్గుతూ ఉంది.

7. మే నెలలో గరిష్ట, కనిష్ఠ సగటు ఉష్ణోగ్రతలలో తేడా ఎంత?
జవాబు:
39° – 26° = 13°C

8. ఆగస్టు నెలలో గరిష్ఠ, కనిష్ట సగటు ఉష్ణోగ్రతలలో తేడా ఎంత?
జవాబు:
33 – 24° = 9°C

9. పై రెండు ప్రశ్నలకు మీ సమాధానాల ఆధారంగా గరిష, కనిష్ట సగటు ఉష్ణోగ్రతల తేడా అనంతపురంలో వేసవిలో ఎక్కువగా ఉందా లేక వానాకాలంలో ఎక్కువగా ఉందా?
జవాబు:
రెండింటి మధ్య వేసవిలో ఎక్కువగా ఉంది.

8th Class Social Textbook Page No.26

ప్రశ్న 15.
పట్టిక-2 : (విశాఖపట్టణం నెలసరి సగటు ఉష్ణోగ్రత)
AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు 10
AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు 11
గరిష్ఠ°C – కనిష్ఠ నెల గరిష్ఠ కనిష్ఠ నెల జనవరి ఫిబ్రవరి ఆగస్టు 10006 మార్చి సెప్టె బరు అక్టోబరు ఏప్రిల్ 25 32 33 నవంబరు జూన్ 30 2 4 డిసెంబరు 32 21
జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జులై ఆగ సెప్టె అక్టో నవ డిసె

పై గ్రాలో విశాఖపట్టణం సగటు గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలను గుర్తించారు.
1. విశాఖలో ఏ నెలలో కనిష్ఠ ఉష్ణోగ్రత అతి తక్కువగా ఉంది? అది ఎంత?
జవాబు:
జనవరి నెలలో కనిష్ఠ ఉష్ణోగ్రత ఉంది. అది 19°C.

2. విశాఖలో చాలా వేడిగా ఉండే నెల ఏది? ఆ నెలలో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత ఎంత?
జవాబు:
ఏప్రిల్, మే, నవంబరు నెలలు చాలా వేడిగా ఉంటాయి. 33 °C.

8th Class Social Textbook Page No.27

ప్రశ్న 16.
గ్రాఫ్-3 (ఢిల్లీ నెలవారీ సగటు ఉష్ణోగ్రతలు)
AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు 12
అనంతపురం, విశాఖల ఉష్ణోగ్రతలను పోల్చి కింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
1. జనవరిలో ఏ ప్రదేశంలో ఎక్కువ చలిగా ఉంటుంది?
జవాబు:
అనంతపురం

2. జూన్లో ఏ ప్రదేశంలో ఎక్కువ వేడిగా ఉంటుంది?
జవాబు:
విశాఖపట్టణం

3. ఏ ప్రదేశంలో సంవత్సరం పొడవునా ఉష్ణోగ్రత ఇంచుమించు ఒకే రకంగా ఉంటుంది?
జవాబు:
విశాఖపట్టణం

8th Class Social Textbook Page No.27, 28

ప్రశ్న 17.
గ్రాఫ్-4 (సిమ్లా నెలవారీ సగటు ఉష్ణోగ్రతలు)
AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు 13
1. ఉష్ణోగ్రత ఇలా ఉండటానికి గల ఇతర కారణాలను ఊహించండి.
జవాబు:
ఉష్ణోగ్రతా విలోమానికి మరే కారణము ఊహించలేము.

2. విలోమనం జరిగితే ఏమవుతుంది?
జవాబు:
విలోమనం జరిగితే భూమికి దగ్గరగా ఉష్ణోగ్రత తగ్గుతుంది.

3. ఢిల్లీ కంటే సిమ్లా ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది?
జవాబు:
ఢిల్లీ కంటే సిమ్లా 1900 మీ. ఎత్తులో ఉంది.

4. సముద్ర మట్టం నుంచి రెండు ప్రదేశాల ఎత్తులో గల తేడాల ఆధారంగా ఆ రెండింటి ఉష్ణోగ్రతలలో ఎంత తేడా ఉంటుందో లెక్కకట్టండి.
జవాబు:
సుమారుగా 12°C

5. సిమ్లాలో ఏ నెలలో గరిష్ఠ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది? అది ఎంత?
జవాబు:
మే నెలలో గరిష్ఠ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. 22°C.

6. ఢిల్లీలో ఏ నెలలో గరిష్ఠ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది? అది ఎంత?
జవాబు:
మే నెలలో ఎక్కువగా ఉంటుంది. 40°C.

7. సెప్టెంబరులో సిమ్లాలో సగటు ఉష్ణోగ్రత ……. °C కాగా ఢిల్లీలో …… °C.
జవాబు:
17°C-34°C

8. ఏది ఎక్కువ చలిగా ఉంటుంది. జనవరిలో ఢిల్లీనా లేక జులైలో సిమ్లానా?
జవాబు:
ఢిల్లీలో జనవరిలో చలిగా ఉంటుంది.

AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు

8th Class Social Textbook Page No.29

ప్రశ్న 18.
గ్రాఫ్-5 (సింగపూర్, షాంఘై, బ్లాడివోస్టాల నెలవారీ సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు)
AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు 14
1. రేఖా చిత్రపటంలో ఇచ్చిన మూడు ప్రదేశాలలో భూమధ్యరేఖకు దగ్గరగా ఏది ఉంది?
జవాబు:
సింగపూర్

2. ఆ ప్రదేశంలో సగటు వార్షిక ఉష్ణోగ్రత ఎంత?
జవాబు:
27°C

3. అక్కడ శీతాకాలంలో కంటే వేసవికాలంలో సాధారణంగా చాలా వేడిగా ఉంటుందా?
జవాబు:
లేదు, కొంచెం వేడిగా ఉంటుంది.

4. సింగపూర్ లో చలికాలంలో ఉన్నంత వేడిగా ఫ్లాడివోస్టా లో వేసవిలో ఉంటుందా?
జవాబు:
లేదు. రెండింటి మధ్యలో తేడా ఉన్నది.

5. జులైలో సాధారణంగా సింగపూర్ లో ఎక్కువ వేడిగా ఉంటుందా, లేక షాంఘైలోనా?
జవాబు:
రెండింటి మధ్యలో కొద్దిపాటి తేడా ఉన్నది. సింగపూర్ లో వేడిగా ఉంటుంది.

6. రేఖాచిత్ర పటంలో చూపించిన మూడు ప్రదేశాలలో తీవ్ర ఉష్ణోగ్రతలు ఎక్కడ నమోదైనాయి?
జవాబు:
బ్లాడివోస్టోక్ లో

7. షాంఘైలో అత్యంత వేడిగా ఉండే నెల ఏది?
జవాబు:
జులై, ఆగష్టు నెలలు

8. అక్కడ సగటు వార్షిక ఉష్ణోగ్రత ఎంత?
జవాబు:
15.3°C

9. ఈ ప్రదేశంలో సగటు వార్షిక ఉష్ణోగ్రత అతి తక్కువగా ఉన్న నెల ఏది?
జవాబు:
జనవరి, ఫిబ్రవరి

ప్రశ్న 19.
అట్లాస్ లోని పటాల ద్వారా ఈ ప్రదేశాల అక్షాంశాలు, జనవరిలో సగటు ఉష్ణోగ్రతలు తెలుసుకోండి. మొదటిది నింపి ఉంది. Page No.29,30

ప్రదేశం అక్షాంశం ఉష్ణోగ్రత (జనవరిలో)
ఆంధ్రప్రదేశ్, విజయవాడ 16.59 ఉ. అ. 22°C – 25°C మధ్య
ఆగ్రా, ఉత్తరప్రదేశ్ 27.18 ఉ. అ. 22.3°C-8°C
మధురై, తమిళనాడు 9.93 ఉ. అ. 30°C-20°C
నాగపూర్, మహారాష్ట్ర 21, 14 ఉ. అ. 28°C – 12°C

ఈ పటం ప్రకారం భారతదేశంలో జనవరిలో 30°C సగటు ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉన్న ప్రదేశాలు ఏవీ లేవు. (ఇది సగటు అన్న విషయం గుర్తుంచుకోండి. కొన్ని ప్రదేశాలలో, జనవరిలో 30°C కంటే వేడెక్కే రోజులు కొన్ని ఉండే ఉంటాయి. )
1. పటం చూసి (జనవరిలో) సాధారణంగా సగటు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే ప్రదేశాలు ఏవో చెప్పండి.
జవాబు:
మధురై, నాగపూర్.

2. ఈ ప్రదేశాలకు ఉత్తరంగా వెళితే జనవరిలో సగటు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందా, తక్కువగా ఉంటుందా?
జవాబు:
తక్కువగా ఉంటుంది.

8th Class Social Textbook Page No.30

ప్రశ్న 20.
ఉత్తరాన ఉన్న పట్టణాలలో పగటికాలం, దక్షిణాది పట్టణాల కన్న, ఎక్కువా? తక్కువా? ఎందుకు?
జవాబు:
ఉత్తర భారతదేశంలో ఉన్న పట్టణాలలో పగటి కాలం దక్షిణాది పట్టణాల కన్నా తక్కువ. ఉత్తర భారతదేశం – దక్షిణ భారతదేశం కంటే భూమధ్యరేఖకు దూరంగా ఉండుటయే యిందులకు కారణం.

ప్రశ్న 21.
పై సమాధానం ఆధారంగా శీతాకాలంలో భారతదేశంలో దక్షిణాదికంటే ఉత్తరాన ఎందుకు చల్లగా ఉంటుందో కారణం చెప్పగలవా?
జవాబు:
శీతాకాలంలో ఉత్తర భారతదేశం పగటి కాలం కంటే రాత్రి కాలం ఎక్కువ. అందుచే ఉత్తర భారతదేశంలో దక్షిణాది కంటే చలి ఎక్కువ.

పట నైపుణ్యా లు

8th Class Social Textbook Page No.28

ప్రశ్న 22.
AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు 15
పై చిత్రంలో సింగపూర్, షాంఘై, బ్లాడివోస్టాళ్లను గుర్తించంది.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు 16

ప్రశ్న 23.
ప్రపంచ పటములో ఈ క్రింది వాటిని గుర్తించుము.
1. భూమధ్యరేఖ 2. ధృవాలు 3. రష్యా 4. ఆస్ట్రేలియా
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు 17

ప్రశ్న 24.
AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు 18
పై పటం పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
1. భూమధ్యరేఖకు దక్షిణాన ఉన్న రేఖ ఏది?
జవాబు:
మకరరేఖ.

2. ఈ పటం ఏ ప్రక్షేపణకు చెందినది?
జవాబు:
రాబిన్సన్ ప్రక్షేపణకు చెందినది.

3. భూమధ్యరేఖకు ఆనుకుని ఉన్న ఖండాలేవి?
జవాబు:
దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా.

AP Board 6th Class Science Solutions Chapter 3 జంతువులు – ఆహారం

SCERT AP 6th Class Science Study Material Pdf 3rd Lesson జంతువులు – ఆహారం Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Science 3rd Lesson Questions and Answers జంతువులు – ఆహారం

6th Class Science 3rd Lesson జంతువులు – ఆహారం Textbook Questions and Answers

Improve Your Learning (అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం)

I. ఖాళీలను పూరించండి.

1. సీతాకోక చిలుకలు పుష్పాల నుండి తేనెను పీల్చుకొనుటకు …… ను ఉపయోగిస్తాయి. (ప్రోబోస్సిస్ (తుండము)
2. పులులు మాంసాన్ని మాత్రమే తింటాయి. కావున అవి …………. (మాంసాహారులు)
3. విచ్ఛిన్నకారులను ………………… అని కూడా అంటారు. (రీసైక్లర్)

II. సరైన సమాధానాన్ని గుర్తించండి.

1. ఆహారపు గొలుసులో శక్తికి మూల వనరు …….
A) ఉత్పత్తిదారులు
B) వినియోగదారులు
C) సూర్యుడు
D) విచ్ఛిన్న కారులు
జవాబు:
C) సూర్యుడు

2. కింది వాటిలో ఉభయాహారిని గుర్తించండి.
A) సింహం
B) ఆవు
C) కుక్క
D) పులి
జవాబు:
C) కుక్క

AP Board 6th Class Science Solutions Chapter 3 జంతువులు – ఆహారం

3. మానవుడ్ని ఆహారపు గొలుసులో ఏ స్థానంలో ఉంచుతావు?
A) ప్రాథమిక వినియోగదారుడు
B) ద్వితీయ వినియోగదారుడు
C) తృతీయ వినియోగదారుడు
D) పైవన్నీ
జవాబు:
C) తృతీయ వినియోగదారుడు

III. ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రశ్న 1.
మీ పరిసరాలలో ఉన్న ఒకే రకమైన ఆహారపు అలవాట్లు గల జంతువులను పేర్కొనండి.
జవాబు:
ఆవు, గేదె, మేక మరియు గొర్రెలు ఒకే రకమైన ఆహారపు అలవాటును కలిగి ఉంటాయి. ఎందుకంటే ఇవి శాకాహారులు. ఆహారం కోసం మొక్కల పై ఆధారపడతాయి.

ప్రశ్న 2.
కుక్కకూ, కోడికీ ఉండే కాళ్ళు, గోర్లను పోల్చండి. అవి వేరుగా ఉండటానికి గల కారణాలు రాయండి.
జవాబు:

కుక్క కోడి
1. కుక్క కాళ్ళు పొడవుగా ఉంటాయి. మరియు నాలుగు కాళ్ళు ఉంటాయి. 1. కోడి కాళ్ళు పొడవు తక్కువగా ఉంటాయి మరియు రెండు కాళ్ళు ఉంటాయి.
2. కుక్క కాళ్ళు కండరాలతో మరియు బలంగా ఉంటాయి. 2. కోడి కాళ్ళు కుక్క కాళ్ళ కంటే సన్నగా ఉంటాయి.
3. ఇది కఠినమైన మరియు కొద్దిగా వంగిన గోర్లు కలిగి ఉంటుంది. 3. ఇది సన్నని, పదునైన మరియు కొద్దిగా పొడవుగా ఉన్న గోర్లు కలిగి ఉంటుంది.
4. ఇది జంతువును తరమటానికి మరియు పట్టుకోవడానికి దాని కాళ్ళను ఉపయోగిస్తుంది. 4. ఇది ఆహారాన్ని కనుగొనడానికి భూమిని తవ్వటానికి కాళ్ళను ఉపయోగిస్తుంది.
5. మాంసాన్ని చీల్చటానికి గోర్లు ఉపయోగించబడతాయి. 5. పురుగులను తీయటానికి నేలను గోకడం కోసం గోర్లు ఉపయోగపడతాయి.

ప్రశ్న 3.
ఆహారం తీసుకోవడానికి నాలుకను అవయవంగా ఉపయోగించే కొన్ని జంతువుల పేర్లు రాయండి.
జవాబు:
కప్పలు, బల్లులు, తోటబల్లి, ఊసరవెల్లి, ఎకిడ్నా నాలుకను ఆహారాన్ని తీసుకోవడానికి ఒక సాధనంగా ఉపయోగిస్తాయి.

ప్రశ్న 4.
కిందివాటిలో తప్పుగా ఉన్న వాక్యాలను గుర్తించి, కారణాలు రాయండి.
ఎ) నీటిలో నివసించే జంతువులన్నీ మొక్కలను మాత్రమే తింటాయి.
బి) ఏనుగులు, జింకలు అడవిలో నివసించే శాకాహారులు.
సి) పక్షుల ముక్కులు అవి వాటి ఆహారాన్ని తీసుకోవడానికి అనుకూలంగా ఏర్పడ్డాయి.
డి) వాడి అయిన గోర్లు (పంజా) వేటాడడానికి ఉపయోగపడతాయి.
ఇ) చాలావరకు ఆహారపు గొలుసులు శాకాహారులతో ముగుస్తాయి.
జవాబు:
ఎ) నీటిలో నివసించే జంతువులన్నీ మొక్కలను మాత్రమే ఆహారంగా తింటాయి.
ఈ వాక్యం తప్పు. నీటిలో చాలా జంతువులు ఇతర జంతువులను తింటూ నివసిస్తున్నాయి.
ఉదా :
సముద్రంలో నీలి తిమింగలం క్రిల్ అనేక చిన్న జంతువులను తింటుంది.

బి) ఏనుగులు, జింకలు అడవిలో నివసించే శాకాహారులు.
ఏనుగులు మరియు జింకలు అడవిలో నివసించే శాకాహారులు కాబట్టి ఈ వాక్యం సరైనది.

సి) పక్షుల ముక్కులు అవి వాటి ఆహారాన్ని తీసుకోవడానికి అనుకూలంగా ఏర్పడ్డాయి.
పక్షి ముక్కులు వాటి ఆహారపు అలవాట్లకు రూపకల్పన చేయబడినందున ఈ వాక్యం సరైనది.

డి) వాడి అయిన గోర్లు (పంజా) వేటాడడానికి ఉపయోగపడతాయి.
మాంసాహారులు పదునైన పంజాలు కల్గి ఇతర జీవులను వేటాడతాయి. కావున ఈ వాక్యం సరైనది.

ఇ) చాలావరకు ఆహార గొలుసులు శాకాహారులతో ముగుస్తాయి.
ఈ వాక్యం తప్పు.
ఆహార గొలుసు శాకాహారులతో మొదలై అగ్ర మాంసాహారులతో ముగుస్తుంది.

AP Board 6th Class Science Solutions Chapter 3 జంతువులు – ఆహారం

ప్రశ్న 5.
ఆహారపు గొలుసు యొక్క ప్రాధాన్యతను తెలపండి.
జవాబు:

  1. ఆహార గొలుసు ఒక జీవి నుండి మరొక జీవికి ఆహారము ఎలా బదిలీ అవుతుందో చూపిస్తుంది.
  2. ఇది ఆవరణ వ్యవస్థలో శక్తి పోషకాల రవాణాను సూచిస్తుంది.
  3. ఇది ఉత్పత్తిదారులు మరియు వినియోగదారుల మధ్య సంబంధాన్ని చూపుతుంది.
  4. ఇది ప్రకృతిలో విభిన్న జీవులు పరస్పరం ఆధారపడటాన్ని వివరిస్తుంది.

ప్రశ్న 6.
ఈ కింది వాటిని సరైన క్రమంలో అమర్చటం ద్వారా ఆహారపు గొలుసును రూపొందించండి.
1. కుందేలు → క్యారెట్ → గ్రద్ద → పాము
2. మానవుడు → కీటకం → శైవలం → చేప
జవాబు:

  1. క్యారెట్ → కుందేలు → పాము → గ్రద్ద
  2. శైవలం → కీటకము → చేప → మానవుడు

ప్రశ్న 7.
ఆహారపు గొలుసుల గురించి ఇంకా వివరంగా తెలుసుకోవడానికి ఎలాంటి ప్రశ్నలు అడిగి మీ సందేహాన్ని తీర్చుకోగలరు?
జవాబు:

  • ఆహార గొలుసు అంటే ఏమిటి?
  • జంతువులు మరియు మొక్కలు ఒకదానిపై ఒకటి ఎలా ఆధారపడి ఉంటాయి?
  • పర్యావరణ వ్యవస్థలో శక్తి ఎలా ప్రవహిస్తుంది?
  • జీవావరణ వ్యవస్థకు, జంతువుల ఆహార అలవాట్లకు ఏదైనా సంబంధం ఉందా?
  • ప్రకృతి పర్యావరణ వ్యవస్థను ఎలా సమతుల్యం చేస్తుంది?
  • ఆహార గొలుసు ఎప్పుడూ మొక్కలతో ఎందుకు మొదలవుతుంది?

ప్రశ్న 8.
భూమిపై విచ్ఛిన్నకారులే లేకుంటే ఏమౌతుంది?
జవాబు:

  • చనిపోయిన మొక్కలు మరియు జంతువులను విచ్చిన్నం చేయడం ద్వారా బాక్టీరియా మరియు శిలీంధ్రాలు ఆహారము పొందుతాయి. కాబట్టి వాటిని విచ్ఛిన్నకారులు అంటారు.
  • పర్యావరణంలోని పదార్థాలు తిరిగి భూమిని చేరటానికి ఇవి సహాయపడతాయి.
  • విచ్ఛిన్నకారులు లేనట్లయితే చనిపోయిన మరియు వ్యర్థ పదార్థాలు భూమిపై ఉంటాయి.
  • పోషకాలు తిరిగి నేలను చేరవు.
  • నేలలోని పోషకాలు భర్తీ చేయబడవు.
  • చనిపోయిన జీవులు భూమిపైనే ఉండడం వల్ల, భూమిపై జీవ మనుగడ అసాధ్యం.

ప్రశ్న 9.
మీకిష్టమైన ఏదో ఒక ఆహారపు గొలుసును గీయండి.
జవాబు:
AP Board 6th Class Science Solutions Chapter 3 జంతువులు – ఆహారం 1

AP Board 6th Class Science Solutions Chapter 3 జంతువులు – ఆహారం

ప్రశ్న 10.
ఆహారపు గొలుసులో ఉత్పత్తిదారుల పాత్రను నీవు ఎలా అభినందిస్తావు?
జవాబు:

  • మొక్కలను ఉత్పత్తిదారులు అని పిలుస్తారు. ఎందుకంటే అవి తమ ఆహారాన్ని సొంతంగా తయారు చేసుకుంటాయి. పర్యావరణ వ్యవస్థలోని అన్ని జీవులకు ఆహారాన్ని అందించే ఏకైక జీవులు ఈ మొక్కలే.
  • పర్యావరణ వ్యవస్థలో, ఉత్పత్తిదారులు అన్నీ ఆహార గొలుసు యొక్క ఆధారం.
  • మొక్కలు ఆహారాన్ని మాత్రమే కాకుండా భూమికి ఆక్సిజన్‌ను కూడా అందిస్తాయి.
  • భూమిపై జీవితాన్ని కొనసాగించడానికి మొక్కలు విలువైనవి.

కృత్యాలు

కృత్యం – 1

6th Class Science Textbook Page No. 22

ప్రశ్న 1.
పట్టికలో వివిధ జంతువుల జాబితా ఇవ్వబడింది. వాటిలో కొన్నింటికి అవితినే ఆహారం కూడా ఇవ్వడం జరిగింది. మిగిలిన పట్టికను నింపండి.

జంతువు పేరు అది తినే ఆహారం
గేదె పచ్చిగడ్డి, గానుగ పిండి, ఎండుగడ్డి, ధాన్యం.
పిల్లి చిన్న జంతువులు, పక్షులు, పాలు.
ఎలుక
సింహం
పులి
బల్లి
సాలె పురుగు
ఆవు
మానవుడు
సీతాకోకచిలుక
కాకి
ఇతరాలు

జవాబు:

జంతువు పేరు అది తినే ఆహారం
గేదె పచ్చిగడ్డి, గానుగ పిండి, ఎండుగడ్డి, ధాన్యం.
పిల్లి చిన్న జంతువులు, పక్షులు, పాలు.
ఎలుక విత్తనాలు, కీటకాలు, చిన్న జంతువులు.
సింహం దుప్పి, జిరాఫీ, నక్క మొదలైనవి.
పులి జింక, కుందేలు, లేడి, ఇతర జంతువులు.
సాలె పురుగు కీటకాలు.
బల్లి పురుగులు, కీటకాలు.
ఆవు గడ్డి, ఆయిల్ కేక్, ఎండుగడ్డి, ధాన్యాలు.
మానవుడు వరి, గుడ్లు, పాలు, మాంసం మొదలైనవి.
సీతాకోకచిలుక పువ్వులలోని మకరందం (తేనె).
కాకి చిన్న జంతువులు, కీటకాలు.
ఇతరాలు ఆకుపచ్చని మొక్కలు మరియు మాంసం.

పట్టిక ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.
1. ఆహారం కోసం మొక్కలు వాటి ఉత్పత్తుల పైన మాత్రమే ఆధారపడే జంతువులేవి?
జవాబు:
గేదె, ఆవు, సీతాకోకచిలుక.

2. జంతువులు, వాటి ఉత్పత్తులను మాత్రమే ఆహారంగా తీసుకునే జంతువులేవి?
జవాబు:
పిల్లి, సింహం, పులి, బల్లి, సాలీడు.

3. ఆహారం కోసం మొక్కలు, జంతువులు రెండింటిపై ఆధారపడే జంతువులేవి?
జవాబు:
ఎలుక, కాకి, మానవులు మరియు ఇతరాలు.

కృత్యం – 2

6th Class Science Textbook Page No. 23

ప్రశ్న 2.
పట్టికలో ఇచ్చిన జంతువులు ఆహారాన్ని గుర్తించడానికి, సేకరించడానికి ఉపయోగించే శరీర భాగాలను రాయండి.

జంతువు ఆహారాన్ని గుర్తించటానికి ఉపయోగించు జ్ఞానము ఆహార సేకరణలో ఉపయోగపడే శరీర భాగం
1. కుక్క వాసన పదునైన దంతాలు, నాలుక
2. ఆవు
3. కోడి
4. కప్ప
5. పాము
6. గబ్బిలం
7. బల్లి
8. గ్రద్దలు
9. సింహం
10. హమ్మింగ్ బర్డ్ (తేనె పిట్ట)

జవాబు:

జంతువు ఆహారాన్ని గుర్తించటానికి ఉపయోగించు జ్ఞానము ఆహార సేకరణలో ఉపయోగపడే శరీర భాగం
1. కుక్క వాసన పదునైన దంతాలు, నాలుక
2. ఆవు వాసన దృష్టి, నోరు, నాలుక
3. కోడి దృష్టి ముక్కు, గోర్లు
4. కప్ప దృష్టి నాలుక
5. పాము రుచి నాలుక, దంతాలు, నోరు
6. గబ్బిలం వినికిడి నోరు,చెవులు
7. బల్లి నాలుక, దృష్టి నాలుక
8. గ్రద్దలు దృష్టి, వాసన ముక్కు, గోర్లు
9. సింహం దృష్టి, వినికిడి కాళ్ళు, పంజాలు, నోరు
10. హమ్మింగ్ బర్డ్ (తేనె పిట్ట) వాసన, రుచి ముక్కు

• ఆహారం తినడానికి ఏయే జంతువులు ఒకే రకమైన భాగాలను ఉపయోగిస్తాయి?
జవాబు:
1) కప్ప 2) పాము 3) బల్లి 4) కుక్క 5) ఆవు ఆహారం తినడానికి నాలుకను ఉపయోగిస్తాయి.

• ఆహారం కొరకు కుక్క ఉపయోగించిన భాగాలను, కప్ప ఉపయోగించిన భాగాలతో పోల్చండి. వాటి మధ్య మీరు, గమనించిన పోలికలు, భేదాలను నమోదు చేయండి.
జవాబు:

  • కుక్క, కప్ప ఆహారం తీసుకోవడానికి నాలుకను అవయవంగా ఉపయోగించుకుంటాయి.
  • కుక్క నాలుకనుపయోగించి నీరు త్రాగుతుంది. కప్ప నాలుకను ఉపయోగించి కీటకాలను పట్టుకొని మింగుతుంది.
  • వాసన ఆధారంగా కుక్క తన ఆహారాన్ని పసిగడుతుంది. కప్ప తన నోటితో గాని, నాలుకతో గాని కీటకాలను పట్టుకొని తింటుంది.

• కోడి, పిచ్చుక ఆహారం తీసుకోవడంలో ఉపయోగించే భాగాలను పోల్చండి. మీరు గమనించిన పోలికలు, వ్యత్యాసాలు రాయండి.
జవాబు:

  • కోడి, పిచ్చుక రెండూ పురుగులు మరియు గింజలను ఆహారంగా తీసుకుంటాయి.
  • ఆహార సేకరణలో కోడి తన శరీర భాగాలైన ముక్కు, కాళ్ళు ఉపయోగిస్తుంది. పిచ్చుక ఆహారాన్ని చూసి ముక్కుతో ఏరుకుని తింటుంది.

• కుక్క, సింహం ఆహార సేకరణలో ఉపయోగించే భాగాలలో పోలికలేమైనా గుర్తించారా?
జవాబు:

  • కుక్క, సింహం రెండూ కూడా మాంసం తింటాయి.
  • రెండింటికి చూపు బాగుంటుంది. అవి పదునైన వాటి గోర్లతో ఆహారాన్ని పట్టి ఉంచుతాయి.
  • మాంసాన్ని చీల్చడంలో పదునైన వాటి పళ్ళను ఉపయోగిస్తాయి.
  • సింహం ఒంటరిగా వేటాడుతుంది. ఆహారం దొరికిన చోట తింటుంది.
  • కుక్క శాకాహారం కూడా తింటుంది.

• ఆహారం తీసుకునే విధానంలో గ్రద్దకూ, సింహానికి ఉండే పోలికలు, వ్యత్యాసాలు రాయండి.
జవాబు:

  • సింహం, గ్రద్ద రెండూ మాంసాహారులే.
  • ఈ రెండూ పదునైన వాటి కాలి గోళ్లతో మాంసాన్ని చీల్చుతాయి.
  • సింహం నేలమీద జంతువులను వేటాడుతుంది.
  • గ్రద్ద ఆకాశంలో ఎగురుతూ నేలమీది ఆహారాన్ని చూసి కిందకు దిగి తింటుంది.

AP Board 6th Class Science Solutions Chapter 3 జంతువులు – ఆహారం

కృత్యం – 3

6th Class Science Textbook Page No. 25

ప్రశ్న 3.
ఇవ్వబడిన పటాన్ని పరిశీలించండి. వివిధ రకాల పక్షుల ముక్కులు వివిధ రకాలుగా ఉన్నాయి. పక్షుల ముక్కుల్లో వైవిధ్యానికి కారణమేమిటో మీకు తెలుసా?
AP Board 6th Class Science Solutions Chapter 3 జంతువులు – ఆహారం 2
జవాబు:

  • ముక్కులు భిన్నంగా ఉంటాయి ఎందుకంటే పక్షులు వివిధ రకాల ఆహారాన్ని తింటాయి.
  • కాబట్టి, ముక్కుల రకం వాటి ఆవాసాలు, పర్యావరణం మరియు ఆహార అలవాట్లపై కూడా ఆధారపడి ఉంటుంది.
  • పక్షుల ముక్కులు ఎరను చంపడానికి, పోరాడటానికి, ఆహారాన్ని పొందడానికి మరియు వారి పిల్లలను పోషించడానికి వాటికి సహాయపడతాయి.
  • వాటి ఆహారపు అలవాట్ల ఆధారంగా పక్షులు బలమైన కొక్కెము ముక్కు పొడవైన ముక్కు పొడవైన, సన్నని ముక్కు మొదలైన రకాల ముక్కులను కలిగి ఉంటాయి.

కృత్యం – 4

6th Class Science Textbook Page No. 26

ప్రశ్న 4.
బల్లి ఆహారాన్ని ఎలా పట్టుకుంటుంది? మీ పరిశీలనలను వివరంగా రాయండి.
జవాబు:

  • ఆహారాన్ని వేటాడటానికి బల్లి తన దృష్టిని ఉపయోగిస్తుంది.
  • బల్లి తన దృష్టిని కీటకాల కదలికలపై కేంద్రీకరిస్తుంది.
  • బల్లి, పురుగు వైపు చాలా వేగంగా కదులుతుంది.
  • ఇది నాలుకను ఉపయోగించడం ద్వారా కీటకాన్ని పట్టుకుని తింటుంది.

• కప్ప, బల్లి ఆహారం తీసుకునే విధానంలో భేదాలు తెలుసుకోండి. ఈ జంతువులు నాలుకను ఎలా ఉపయోగిస్తాయి?
జవాబు:

కప్పు బల్లి
కప్ప నాలుక పొడవుగా, జిగటగా ఉంటుంది. బల్లి నాలుక పొట్టిగా ఉంటుంది.
స్థిరంగా ఉండి కీటకంపై నాలుకను విసురుతుంది. కీటకము వైపు కదులుతూ నాలుక విసురుతుంది.
పెద్ద పెద్ద కీటకాలను వేటాడుతుంది. చిన్న కీటకాలను వేటాడుతుంది.
నెమ్మదిగా వేటాడుతుంది. వేగంగా కదులుతుంది.
ఇంటి బయటి పరిసరాలలో ఆహారం సేకరిస్తుంది. ఇంటి పరిసరాలలో వేటాడుతుంది.

కృత్యం – 5

6th Class Science Textbook Page No. 26

ప్రశ్న 5.
ఆవు లేదా బర్రె (గేదె) ఆహారం తీసుకునేటప్పుడు గమనించి మీ పరిశీలనలు నోటుపుస్తకంలో రాయండి.
• ఆవు ఆహారాన్ని ఎలా సేకరిస్తుంది?
జవాబు:
వాసనను చూడడం ద్వారా ఆవు తన ఆహారాన్ని కనుగొంటుంది.

• అందుకోసం ఏయే శరీర భాగాలను ఉపయోగిస్తుంది?
జవాబు:
ఆవు ఆహారం తీసుకోవటానికి నోరు, దంతాలు మరియు నాలుకను ఉపయోగిస్తుంది.

• ఆవు తినడం ఎలా మొదలు పెడుతుంది?
జవాబు:
వాసన, చూపు ఆధారంగా ఆవు ఆహారం సేకరిస్తుంది. ఆహారం కోసం ఆవు దవడలు, పళ్ళు నాలుక, నోరు ఉపయోగిస్తుంది. ఆహారాన్ని ఆవు గబగబా నమిలి మింగుతుంది. దానిని తన జీర్ణాశయంలో ఒక భాగంలో నిలవ చేస్తుంది.

• ఆవులకు దంతాలుంటాయా? రెండు దవడలకూ దంతాలుంటాయా?
జవాబు:
అవును. ఆవులకు రెండు దవడలపై దంతాలు ఉంటాయి. కానీ ముందు పళ్ళు ఉండవు.

AP Board 6th Class Science Solutions Chapter 3 జంతువులు – ఆహారం 3
• ఆవు శాకాహారి అని నీవు ఏ విధంగా నిర్ణయిస్తావు?
జవాబు:
ఆవు ఆహారం కోసం మొక్కలు మరియు మొక్కల ఉత్పత్తులపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఇవి ఆకుపచ్చ / పొడిగడ్డి, ఆకులు, కొమ్మలు మరియు పండ్లు వంటి మొక్కల యొక్క వివిధ భాగాలను తింటాయి. తద్వారా ఆవు శాకాహారి అని చెప్పగలను.

• ఆవులు, గేదెలు చెట్ల క్రింద కూర్చొని దవడలు కదిలించడం చూసే ఉంటారు. అలా ఎందుకు చేస్తాయో మీకు తెలుసా?
జవాబు:
ఆవు మరియు గేదె ఆహారాన్ని చాలా త్వరగా నమిలి, మింగిన తరువాత వాటి కడుపులో ఒక భాగంలో నిల్వ చేసుకొంటాయి. కొంత సమయం తరువాత, ఇవి కడుపు నుండి నోటికి ఆహార పదార్థాన్ని తిరిగి తెచ్చి, మళ్ళీ తీరికగా నములుతాయి. దీనినే నెమరు. వేయటం అంటారు.

కృత్యం – 6

6th Class Science Textbook Page No. 27

ప్రశ్న 6.
మీ పరిసరాలలో కుక్కను గమనించండి. ఆహారం ఎలా సేకరిస్తుందో గమనించండి. పరిశీలనలను రాయండి.
AP Board 6th Class Science Solutions Chapter 3 జంతువులు – ఆహారం 4
• కుక్క ఆహారాన్ని ఎలా పసిగడుతుంది?
జవాబు:
కుక్క వాసన ద్వారా తన ఆహారాన్ని కనుగొంటుంది. కుక్కల ముక్కు మన కంటే వెయ్యి రెట్లు ఎక్కువ సున్నితమైనది.

• ఆహారం తీసుకోవటంలో ఏ భాగాలు సహాయపడతాయి?
జవాబు:
నోరు మరియు నాలుక ఆహారాన్ని తీసుకోవడంలో పాల్గొంటాయి.

• కుక్క మాంసాన్ని ఎలా తింటుంది?
జవాబు:
కుక్క ఇతర జంతువులను తన కాళ్ళతో పట్టుకుంటుంది. ఇది పదునైన దంతాలను ఉపయోగించి మాంసాన్ని చీల్చి తింటుంది. ఇది మాంసాన్ని, దంతాల సహాయంతో నమిలి, నాలుకను మింగడానికి ఉపయోగిస్తుంది.

• కుక్క నీరు ఎలా త్రాగుతుంది?
జవాబు:
కుక్క తన నాలుకతో నీటిని లాక్కుని త్రాగుతుంది.

• కుక్క నాలుకను ఉపయోగించే విధానానికి, కప్ప లేదా ఆవు నాలుకను ఉపయోగించే విధానానికి ఏమైనా తేడా ఉందా? కింద ఇవ్వబడిన ఖాళీల్లో రాయండి.

జంతువు నాలుక ఉపయోగం
కప్ప
ఆవు
కుక్క

జవాబు:

జంతువు నాలుక ఉపయోగం
కప్ప ఆహారాన్ని పట్టుకోవటానికి
ఆవు గడ్డిని మింగడానికి
కుక్క నీరు త్రాగడానికి

కృత్యం – 7

6th Class Science Textbook Page No. 28

AP Board 6th Class Science Solutions Chapter 3 జంతువులు – ఆహారం 5
ప్రశ్న 7.
చిత్రాన్ని గమనించండి మరియు క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.
• ఆహారపు గొలుసులో శక్తికి మూలవనరు ఏమిటి?
జవాబు:
సూర్యకాంతి ఆహారపు గొలుసులో శక్తికి మూలం.

• మిడత దాని శక్తిని ఎలా పొందుతుంది?
జవాబు:
ఆహార గొలుసులో మిడత ఒక ప్రాథమిక వినియోగదారు. కాబట్టి ఇది ఆహారం కోసం గడ్డిపై ఆధారపడి ఉంటుంది.

• ఆహారపు గొలుసు నుండి కప్ప తొలగించబడితే కాకికి ఏమవుతుంది.?
జవాబు:
ఈ ఆహార గొలుసులో కప్ప, మిడతను తినే ద్వితీయ వినియోగదారు. ఈ ఆహార గొలుసులో కప్ప తొలగించబడితే, మిడత జనాభా పెరుగుతుంది. కాకి, కప్పలను తినే తృతీయ వినియోగదారు. ఈ ఆహార గొలుసులో కప్పను తొలగించినట్లయితే, కాకులు ఆకలితో చనిపోతాయి మరియు వాటి జనాభా తగ్గుతుంది.

• ఇచ్చిన చిత్రంలో పుట్టగొడుగు పాత్ర ఏమిటి?
జవాబు:
పుట్టగొడుగు ఒక శిలీంధ్రము. చనిపోయిన పదార్థం విచ్ఛిన్నం చేయడం ద్వారా పుట్టగొడుగు ఆహారాన్ని పొందుతుంది.

ఇవి వ్యర్థ పదార్థాలను విచ్ఛిన్నం చేస్తూ విచ్ఛిన్నకారులుగా పని చేస్తాయి.

ప్రాజెక్ట్ పనులు

6th Class Science Textbook Page No. 31

ప్రశ్న 1.
కొంగలు ఎక్కువగా కనిపించే సమీపంలోని కొలను దగ్గరకు వెళ్ళండి. అవి చేపలు పట్టే విధానాన్ని గమనించి రాయండి. (నీటి తావుల దగ్గరకు వెళ్ళినపుడు జాగ్రత్తగా ఉండాలి. అలాంటి చోట్లకు వెళ్లినప్పుడు పెద్దవారి సహాయం తీసుకోండి.)
జవాబు:

  • కొంగలు సాధారణంగా సరస్సులలో కనిపిస్తాయి మరియు చేపలు దానికి ఆహారం.
  • దానికి ఉన్న పొడవాటి సన్నని కాళ్ళు నీటిలో ఇబ్బంది కలగకుండా కదలడానికి సహాయపడతాయి.
  • చేపలను పట్టుకునేటప్పుడు కొంగ చాలా నెమ్మదిగా కదలడానికి ప్రయత్నిస్తుంది.
  • కాబట్టి చేపలకు దాని ఉనికి తెలియదు.
  • ఒక్కోసారి అది చేపల వేట కోసం చాలా కాలం పాటు నిలబడవలసి వస్తుంది దీనినే కొంగ జపం అంటారు.
  • కొంగ దాని పొడవైన ముక్కు సహాయంతో చేపలను వేగంగా పట్టుకుంటుంది.

AP Board 6th Class Science Solutions Chapter 3 జంతువులు – ఆహారం

ప్రశ్న 2.
ఒకటి లేదా రెండు వానపాములను సేకరించి తడిమట్టి గల సీసాలో వేయండి. రంధ్రాలు గల మూతతో సీసాను మూయండి. వానపాము ఆహారం ఎలా తీసుకుంటుందో గమనించండి. మీ పరిశీలనలను నమోదు చేయండి.
జవాబు:
లక్ష్యం :
తడి నేలలో వానపాములు ఆహారం తీసుకొనే చర్యను గమనించడం.

మనకు కావలసినది :
రెండు వానపాములు, ఒక గాజు సీసా, తడి మట్టి.

ఏమి చేయాలి :
ఒక గాజు సీసా తీసుకొని కొంత తడి మట్టితో నింపండి. ఇప్పుడు మట్టితో నిండిన సీసాలో రెండు వానపాములను ఉంచండి. కొంతకాలం వాటిని గమనించండి.

మనం ఏమి చూస్తాము :
వానపాములు తక్కువ పరిమాణంలో మట్టిని తినడం ప్రారంభించాయని మనం గమనించవచ్చు.

మనం నేర్చుకున్నవి :
పై పరిశీలనలతో వానపాములు పోషకాలను కలిగి ఉన్న తేమతో కూడిన మట్టిని తింటాయని మనం నిర్ధారించాము.

ప్రశ్న 3.
కింది పట్టికను పూరించండి.

ఆహార సేకరణకు ఉపయోగించే శరీర భాగం ఉదాహరణలు
ముక్కు కోడి ……….
నాలుక
పళ్ళు
చూషకం
బలమైన గోర్లు గల కాళ్ళు

జవాబు:

ఆహార సేకరణకు ఉపయోగించే శరీర భాగం ఉదాహరణలు
ముక్కు కోడి, కొంగ, చిలుక
నాలుక కప్ప, బల్లి, ఊసరవెల్లి
పళ్ళు మానవుడు, కుక్క, పులి
చూషకం జలగ
బలమైన గోర్లు గల కాళ్ళు పులి, సింహం, కుక్క

ప్రశ్న 4.
మీ సొంత ఆహారపు గొలుసును తయారుచేసి, మీ తరగతి గదిలో ప్రదర్శించండి.
జవాబు:
విద్యార్థి కృత్యం : మొక్క → గొంగళీ → ఊసరవెల్లి → పాము → ముంగిస
(ఈ ఆహార గొలుసు ఆ జంతువుల రేఖాచిత్రాలతో తయారు చేయవచ్చు).

AP Board 6th Class Science Solutions Chapter 3 జంతువులు – ఆహారం

ప్రశ్న 5.
జంతువుల చిత్రాలు సేకరించి వాటిని శాకాహార, మాంసాహార, ఉభయాహార జంతువులుగా వేరుచేసి పుస్తకంలో అంటించి స్క్రిప్ బుక్ తయారుచేయండి.
జవాబు:
ఉదా :
AP Board 6th Class Science Solutions Chapter 3 జంతువులు – ఆహారం 6

AP Board 8th Class Social Solutions Chapter 8 జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం

SCERT AP 8th Class Social Study Material Pdf 8th Lesson జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 8th Lesson జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం

8th Class Social Studies 8th Lesson జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
సాంకేతిక విజ్ఞానం అవసరం లేని పనులు అంటూ నరహరి కింద ఇచ్చిన జాబితా తయారుచేశాడు. మీరు అతడితో ఏకీభవిస్తారా ? ఏకీభవించకపోతే అతడు తప్పు అని నిరూపించండి. (AS1)
అ) పాటలు పాడటం
ఆ) ఇడ్లీలు చేయడం
ఇ) రంగస్థలం మీద నాటకం వేయడం
ఈ) అమ్మకానికి దండ తయారు చేయడం
జవాబు:
నేను నరహరితో ఏకీభవించను. అతడు చెప్పినది తప్పు అని నా భావన. ఏదైనా పని విధానం మెరుగుపరచుట లేదా ఏదైనా ఎలా చేయబడింది అనే జ్ఞానాన్ని రోజువారీ జీవితావసరాలకు ఉపయోగించుకుంటే అది సాంకేతిక విజ్ఞానం అవుతుంది. అది ఈ పని, ఆ పని అని లేదు. అన్ని పనులలోనూ ఉపయోగపడుతుంది.

ప్రశ్న 2.
నూలు మిల్లులు, మరమగ్గాలలో కార్మికుల పరిస్థితి ఎలా మారిందో వివరించండి. ఈ మార్పువల్ల కూలీలకు మేలు జరిగిందా లేదా యజమానులకా? మీ సమాధానానికి కారణాలు ఇవ్వండి.
జవాబు:
నూలు మిల్లులు పెద్దవిగా ఉండి, ఎక్కువ కార్మికులను కలిగి ఉంటాయి. కాబట్టి వీరికి సంఘాలు, హక్కులు, హక్కుల కోసం పోరాటాలు ఉంటాయి. మరమగ్గాలు చిన్నవిగా ఉండి, తక్కువ కార్మికులను కలిగి ఉంటాయి. కాబట్టి వీరికి సంఘం లాంటివి ఉండవు. వీరు యజమాని నిర్ణయానికి లోబడి పని చేయాలి. ఇచ్చిన కూలిపుచ్చుకోవాలి. నెల జీతాలుండవు. ఇతర సామాజిక భద్రతలుండవు. విద్యుత్ కోత సమయంలో వీరి జీతాలు లభించవు. కాబట్టి ఈ మార్పువల్ల యజమానులకే మేలు జరిగిందని చెప్పవచ్చు.

AP Board 8th Class Social Solutions Chapter 8 జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం

ప్రశ్న 3.
వరికోత యంత్రాలు వినియోగించటంలో ప్రయోజనాలు ఏమిటి? ఎవరికి ఎక్కువ ప్రయోజనం? వరికోత యంత్రాలను రైతులు ఎందుకు వినియోగిస్తున్నారు? (AS1)
(లేదా)
వరికోత యంత్రాన్ని ఇటీవల కాలంలో ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ యంత్రం వరిని కోస్తుంది. ధాన్యం నూర్పిడి చేస్తుంది. పోతపోసి గింజ – పొల్లును వేరు చేస్తుంది. ఈ యంత్రాన్ని వాడటం రైతులకు లాభమా? నష్టమా? వ్యాఖ్యానించండి.
జవాబు:
వరికోత యంత్రాలు వినియోగించటంలో ప్రయోజనాలు :

  1. ఇది సకాలంలో పంటను కోస్తుంది.
  2. ధాన్యం నూర్పిడి చేసి, పోత పోసి గింజ – పొల్లును వేరుచేస్తుంది.
  3. పంటకోత తక్కువ కాలంలో పూర్తవుతుంది.
  4. పంట వృథా అవ్వదు.
  5. పని ఒత్తిడి సమయంలో కూలీల కొరతను ఎదుర్కొనవచ్చు.
  6. వాతావరణ అనిశ్చితిని ఎదుర్కొనవచ్చు.
  7. దీనిని అద్దెకు ఇచ్చి ఆదాయాన్ని పొందవచ్చు.
  8. దీని వినియోగం ఎక్కువగా పెద్ద రైతులకు ప్రయోజనం.
  9. దీనికున్న అధిక ప్రయోజనాల వలన రైతులు వీటినుపయోగిస్తున్నారు.

ప్రశ్న 4.
సాంకేతిక విజ్ఞానంలో మార్పుల వల్ల ఉపాధి అవకాశాల్లో మార్పులు వస్తాయి. ఈ వాక్యంతో మీరు ఏకీభవిస్తారా? ఎందుకు? (AS4)
(లేదా)
సాంకేతిక విజ్ఞాన ప్రభావం వల్ల జీవనోపాధులలో వస్తున్న మార్పులను కొన్నింటిని పేర్కొనండి.
జవాబు:
ఈ వాక్యంతో నేను ఏకీభవిస్తున్నాను.

కారణం :
సాంకేతిక విజ్ఞానం, కొత్త నైపుణ్యాలు వీటి వలన కొత్త ఉద్యోగాలు పెరుగుతాయి. ఉదా : అనేక మొబైల్, ల్యాండ్ లైన్ కంపెనీలు భారతదేశంలో నెలకొల్పబడుతున్నాయి. ఈ కంపెనీలు అనేక దేశాలకు వీటిని ఎగుమతి చేస్తున్నాయి. బహుళజాతి కంపెనీలలో మొబైల్ ఫోనుల తయారీలు, టెలిఫోన్ బూతులలో, మొబైల్ ఫోనుల అమ్మకాలు, మరమ్మతులలో, రీచార్జ్ / టాప్-అప్ సేవలలో యువతకు కొత్త ఉపాధులు ఏర్పడ్డాయి.

ప్రశ్న 5.
టెలిఫోనులో సాంకేతిక విజ్ఞానం మారిందని ప్రభావతి భావిస్తోంది. కొత్త ఉద్యోగాలు చదువుకున్న వాళ్లకే వస్తాయని ఆమె అభిప్రాయం. భారతదేశంలో నిరక్షరాస్యులు ఎక్కువమంది ఉన్నారని, ఆధునిక సాంకేతిక జ్ఞానం చదువుకున్నవాళ్లకే ఎక్కువ ప్రయోజనకరంగా ఉందని ఆమె అంటుంది. మీరు ఆమెతో ఏకీభవిస్తారా? మీ కారణాలను పేర్కొనండి. (AS4)
జవాబు:
నేను ప్రభావతితో ఏకీభవించను. ప్రభావతి చెప్పినట్లుగా సాంకేతిక విజ్ఞానం మారింది. కానీ అది అందరికీ ఉపయోగ పడుతోంది.
ఉదా :

  1. ఇదివరకు సముద్రంలోకి చేపలు పట్టడానికి వెళ్ళినవాళ్ళు తిరిగి వస్తే కాని వారి వివరాలు యింట్లో వాళ్ళకి – తెలిసేవి కావు. కాని సెల్ ఫోన్లు వచ్చాక, వారు కూడా ఎప్పటికప్పుడు ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నారు.
    రిక్షా తొక్కేవాళ్ళకి చాలామందికి అంతంత మాత్రం చదువులే. వారు కూడా ఫోనులు ఉపయోగిస్తున్నారు.

కొద్దిపాటి చదువుతో చాలామంది ఫోను మెకానిక్ లుగా పనిచేస్తున్నారు. కొన్ని పనులకు, సాంకేతిక విజ్ఞానానికి, చదువు కన్నా ఎక్కువ నిపుణత అవసరం అని నా అభిప్రాయం.

ప్రశ్న 6.
ఈ అధ్యాయంలో మూడు రంగాలలో వచ్చిన మార్పులను చర్చించాం. కింది పట్టికలో ప్రతి ఒక్కదానికి పుస్తకంలో ఇచ్చింది కాకుండా ఒక కొత్త ఉదాహరణను పేర్కొనండి. (AS3)
AP Board 8th Class Social Solutions Chapter 8 జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం 1
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 8 జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం 2

ప్రశ్న 7.
కొత్త నైపుణ్యాలు, కొత్త ఉద్యోగాలు అనే పేరాను చదివి కింది ప్రశ్నకు జవాబు ఇవ్వండి. మీ ప్రాంతంలో యువతకు కొత్తగా సృష్టించబడిన ఉద్యోగాలు ఏవి? (AS2)
జవాబు:
బహుళజాతి కంపెనీలలో ఉద్యోగాలు, టెలిఫోన్ బూత్ లలో ఆపరేటర్లు, మొబైల్ ఫోన్ల అమ్మకందారులు, మరమ్మతుదారులు, రీచార్జ్ / టాప్-అప్ చేయువారు మొదలైన కొత్త ఉద్యోగాలు ఏర్పడ్డాయి.

ప్రశ్న 8.
ప్రపంచ పటంలో కింది వాటిని గుర్తించండి. (AS5)
ఎ) ఇంగ్లండ్ బి) అమెరికా సి) ఇండియా
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 8 జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం 3

ప్రశ్న 9.
అడవులు, అడవుల చుట్టుప్రక్కల నివసించేవారు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించలేని స్థితిలో ఉంటారు. అలాంటి వారి మెరుగైన జీవనానికి మీరిచ్చే సలహాలు ఏమిటి? (AS6)
జవాబు:
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడమే మెరుగైన జీవితం అని భావించరాదు అని నా అభిప్రాయం. అడవులలోను, అడవుల చుట్టుప్రక్కల నివసించేవారు ప్రకృతి ఒడిలో జీవిస్తారు. వీరంతా ఒక గుంపుగా జీవిస్తారు. సాధారణంగా వీరి సంబంధీకులు అంతా ఒక సమూహంలోనే జీవిస్తారు. కాబట్టి వీరికి ఫోనులాంటి సౌకర్యాలు ఎక్కువ అవసరం ఉండక పోవచ్చు. అలాగే వీరికి పెద్దపెద్ద యంత్రాలతో కూడా పని ఉండకపోవచ్చు. అయితే వీరికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వమే అందించాలి. మెరుగైన వసతులను కల్పించాలి. తద్వారా వీరికి మెరుగైన జీవనం లభిస్తుంది.

8th Class Social Studies 8th Lesson జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం InText Questions and Answers

8th Class Social Textbook Page No.90

ప్రశ్న 1.
ఈ పారిశ్రామిక విప్లవానికి దోహదం చేసిన వాళ్ళు ఎవరు?
జవాబు:

ఆవిష్కరణలు ఆవిష్కరించినవారు
1. స్పిన్నింగ్ జెన్నీ జేమ్స్ హార్ గ్రీవ్స్
2. స్టీమ్ యింజన్ జేమ్స్ వాట్
3. ఉక్కు తయారీ హెన్రీ బెస్మర్
4. టెలిగ్రాఫ్ సామ్యూల్ ఎఫ్.బి. మోర్స్
5. టెలిఫోన్ అలెగ్జాండర్ గ్రాహంబెల్
6. విద్యుత్తు, బల్బు థామస్ ఆల్వా ఎడిసన్

మొదలైనవి వీరందరూ ఈ ఆవిష్కరణలను ప్రపంచానికందించి పారిశ్రామిక విప్లవానికి దోహదం చేశారు.

8th Class Social Textbook Page No.91

ప్రశ్న 2.
మొదటి ఆవిరి యంత్రం ఆవిర్భావం గురించి తెలుసుకోండి. భారతదేశంలో రైల్వేమార్గాల నిర్మాణానికి ఇది ఎలా దారి తీసింది?
జవాబు:
జేమ్స్ వాట్ జన్మించే నాటికి ‘ఆవిరియంత్రం’ నాటి ఇంగ్లండ్ బొగ్గుగనుల్లో నీటిని బయటికి తోడడానికి ఉపయోగించేవారు. అంతకన్నా ముందే పురాతన గ్రీసు దేశస్థులు పాత నమూనా ఆవిరి యంత్రాలను ఉపయోగించేవారు. ఇప్పుడున్న ఆవిరి యంత్రం నమూనాను మొట్టమొదటగా జేమ్స్ వాట్ తయారుచేశారు. ఇది భారతదేశ రైల్వేలో చెప్పుకోదగిన ప్రగతిని చూపించింది. 1850 నాటికి భారతదేశంలో రైలుమార్గాలు లేవు. అప్పటికి బ్రిటిషు వారు మనదేశంలో వలసలు స్థాపించి సుమారు 100 సం||లు అయింది. వారికి రవాణా సౌకర్యాలు అవసరమయ్యాయి. ఈ ఆవిరియంత్రాన్ని ఉపయోగించి రైలుబండ్లను, రైలుమార్గాలను ప్రారంభించారు. 1853లో మొట్టమొదటి రైలుబండిని బాంబే నుండి రానాకు నడిపించారు. అప్పటి నుండి భారతదేశం దగ్గరయ్యింది.

AP Board 8th Class Social Solutions Chapter 8 జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం

ప్రశ్న 3.
మీ చుట్టుప్రక్కల జీవితాలను కంప్యూటర్లు ఎలా మార్చివేశాయి?
జవాబు:
కంప్యూటర్లు మన జీవితాన్ని చాలా రకాలుగా మార్చివేశాయి. పిల్లలు పాటలు వినటం దగ్గర నుండి, పెద్దల బ్యాంకు వ్యవహారాలు, రిజర్వేషన్లు ఇవీ, అవీ అనికాక అన్నింటికీ వీటి మీదే ఆధారపడుతున్నారు. చివరికి షాపింగ్ కు కూడా బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీటింగ్లు, టెలీకాన్ఫరెన్లు కూడా వీటి ద్వారానే నడుస్తున్నాయి.

ప్రశ్న 4.
వినోదాన్ని సాంకేతిక విజ్ఞానం మార్చివేసిందా? ఎలా?
జవాబు:
వినోదాన్ని సాంకేతిక విజ్ఞానం మార్చివేసింది. ఇది ఎలా మారిందో తెలుసుకోవాలంటే టి.వి.ని ఉదాహరణగా తీసుకోవచ్చు. వీటిలో ఎన్ని ఛానెల్స్ వచ్చేవి వస్తున్నాయి, కథలు, కథాగమనం, సమాజానికి అందించే నీతి ఇవన్నీ కూడా చాలా మారాయి.

  1. ఒకప్పుడు చదరంగం, గుర్రపు పందాలు మొదలైనవి వినోదాలుగా ఉండేవి.
  2. సాంకేతిక విజ్ఞానం మూలంగా వినోదం ఇంతకు ముందుకన్నా మంచి భూమిక పోషిస్తోంది.
  3. అనేక పద్ధతుల ద్వారా వినోదం అందించబడుతోంది.
  4. అడ్వయిజర్లు వారి నూతన సృష్టితో కొత్త పుంతలు తొక్కుతున్నారు.
  5. చిత్రాలు కూడా మొదట చిన్న చిన్న ప్రదర్శనలుగా చూపిస్తున్నారు.
  6. పాటలు కూడా రాగాల రూపంలో ప్రజలకి అందిస్తున్నారు. మ్యూజిక్ హాళ్ళు రకరకాల ఆటపాటలకి, పోటీలకు నిలయాలవుతున్నాయి.

ఈ విధంగా వినోదాన్ని సాంకేతిక విజ్ఞానం మార్చివేసిందని చెప్పవచ్చు.

ప్రశ్న 5.
మీ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో, పట్టణాల్లో, నగరాల్లో సౌరశక్తిని దేనికైనా వినియోగించటం మీరు చూశారా? వాటి జాబితా తయారుచేయండి. ఈ ఇంధనాన్ని ఇంకా ఎక్కువగా ఎందుకు వినియోగించుకోవటం లేదు? చర్చించండి.
జవాబు:
మాది విజయవాడ నగరం. మేము పటమటలోని సాయి అపార్టుమెంట్ లో నివసిస్తున్నాము. మా అపార్టుమెంట్ లో వేడినీరు కోసం సౌరశక్తిని వినియోగిస్తున్నారు. మా అపార్ట్ మెంట్ పై భాగాన సగం మేర సోలార్ ప్యానల్స్ ఉన్నాయి. ఉదయం నుండి సాయంత్రం రాత్రి వరకు వేడి నీరు వస్తూనే ఉంటాయి. కాని వేడి నీరు రావటానికి ముందు కొంతనీరు వృథా చేయాల్సి వస్తుంది. ఇంకా ఈ కింది వస్తువులను మా ఇరుగుపొరుగు వాడతారు.

  1. సోలార్ హీటర్లు.
  2. సోలార్ లాంతర్లు
  3. సోలార్ కుక్కర్లు
  4. సోలార్ పొయ్యిలు
  5. సోలార్ బ్యాటరీలు, ఇన్వర్టర్లు

కాని ఈ ఇంధనాన్ని అందరూ వినియోగించుకోవడం లేదు. ఇందుకు కారణాలు.

  1. దీనికి ప్రారంభ వ్యయం ఎక్కువ.
  2. సౌరశక్తి సంవత్సరం పొడుగునా ఒకే విధంగా ఉండకపోవడం.
  3. కొంతమందికి సోలార్ ప్యానలను అమర్చటం అనేది నచ్చకపోవటం
  4. పగటి పూటే ఉపయోగించాల్సి రావడం.
  5. మబ్బుగా ఉన్నప్పుడు తక్కువ సౌరశక్తి ఉండటం మొదలగునవి.

8th Class Social Textbook Page No.94

ప్రశ్న 6.
వ్యవసాయ ఉత్పత్తిలో వరికోత యంత్రాన్ని ఉపయోగించటం వల్ల లాభాలు ఏమిటి ? పైన పేర్కొన్న దానినుంచి ఒక జాబితా తయారుచేయండి.
జవాబు:
వ్యవసాయ ఉత్పత్తిలో వరికోత యంత్రాన్ని ఉపయోగించటం వల్ల లాభాలు :

  1. దీనిని ఉపయోగించడం వలన సకాలంలో వరిని కోయవచ్చు. ధాన్యం సూర్చవచ్చు, పోతపోసి గింజ పొల్లును వేరు చేయవచ్చును.
  2. వరికోతకు తక్కువ సమయం పడుతుంది.
  3. పంట నష్టం కాదు. దీనినుపయోగించి కోయడం వలన ఎకరాకు ఒక క్వింటాలు ధాన్యం అదనంగా వస్తుంది.
  4. రైతులు పని వత్తిడి సమయంలో కూలీల కొరతను ఎదుర్కోగలుగుతారు.
  5. తీరప్రాంతాలలో ఇది వాతావరణ అనిశ్చితిని ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది.
  6. దీనివల్ల రైతులు రెండవ పంటను నాట గలుగుతున్నారు.
  7. కూలీల మీద ఆధారపడటం కూడా తగ్గుతుంది.

AP Board 8th Class Social Solutions Chapter 8 జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం

ప్రశ్న 7.
వరికోత యంత్రాన్ని ఉపయోగించటం వల్ల వ్యవసాయ కూలీలు కోల్పోయే పనులను రాయండి.
జవాబు:
వరికోత యంత్రాన్ని ఉపయోగించటం వల్ల వ్యవసాయ కూలీలు వరికోత, ధాన్యం నూర్పిడి, పోతపోసే పనులను కోల్పోతున్నారు.

ప్రశ్న 8.
భారతదేశంలో చాలామంది పేద వ్యవసాయ కూలీలు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగం తీవ్రంగా ఉంది. , ఇటువంటి పరిస్థితులలో వరికోత యంత్రాన్ని వినియోగించడం సరియైనదేనా?
జవాబు:
ఈ సమస్య గురించి మనం రెండు కోణాలలో ఆలోచించవచ్చు.

  1. గ్రామీణ నిరుద్యోగం, వ్యవసాయంపై ఆధారపడ్డ పేద కూలీలు అధికంగా ఉండటం మొదలైన అంశాలను బట్టి చూస్తే ఇది సరియైనది కాదని చెప్పవచ్చు. వీరికి జీవనోపాధి లేకుండాపోతుంది. తిండి దొరకటమే కష్టమైపోతుంది.
  2. భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే వీటి వినియోగం సమంజసమే. అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యవసాయం ఎక్కువగా యంత్రాల ద్వారానే జరుగుతుంది. దాని ద్వారా మిగిలిపోయిన మానవ వనరులను ఇతర రంగాలలో ఉపయోగించుకుని వారికి ఉపాధి కల్పించవచ్చు. దీని ద్వారా దేశప్రగతి ముందుకు సాగుతుంది.

ప్రశ్న 9.
మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పనులు కల్పించవచ్చన్న వాదన ఉంది. కూలీలు అవసరమయ్యే పథకాల ద్వారా లింకురోడ్లు, చెరువులు, కట్టలు వంటి నిర్మాణాత్మక క్రియల ద్వారా పని కల్పించవచ్చు. మీరు గ్రామీణ ప్రాంతంలో ఉంటున్నట్లయితే ఇటువంటి పనులు ఏమైనా జరుగుతున్నాయేమో తెలుసుకోండి. అక్కడి ప్రజల జీవనోపాధికి సరిపోతాయేమో తెలుసుకోండి. Page No. 94)
జవాబు:
కొద్దికాలం క్రితం అప్పటి ప్రభుత్వం ‘పనికి ఆహార పథకం’ను ప్రారంభించి, అమలు చేసింది. ఆ పథకంలో ఇటువంటి పనులే మా గ్రామంలో జరిగాయి. వేసవికాలంలో చెరువులు పూడిక తీయించేవారు. ఆ మట్టిని రోడ్లపై వేసి, పైన క్వారీ డస్టు పోసేవారు. ఆవిధంగా రెండు రకాల పనులు జరిగేవి. రోడ్డు ప్రక్క కాలువలు తవ్వించడం మొ||వి చేసేవారు. ఆ పనికి డబ్బులు కాక బియ్యంను కూలీగా ఇచ్చేవారు. అయితే ఒక్క బియ్యంతో వారికి జీవనం గడవటం కష్టమయ్యేది. వచ్చిన బియ్యంలో కొంత భాగాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకోవలసి వచ్చేది. దీని మూలంగా ఈ పథకం ప్రక్కత్రోవ పట్టింది. అయితే ఈ పథకం ప్రజలకు కొంతవరకు జీవనోపాధిని అందించింది. పొలం పనులు లేని రోజులలో ఇవి ‘వీరికి ఉపయోగపడతాయి.

ప్రశ్న 10.
అనేక గ్రామాలలో వ్యవసాయ కూలీలు, ప్రత్యేకించి మహిళా కూలీలు వరికోత యంత్రం వినియోగంతో ఆందోళన చెందుతున్నారు. ఎందుకు?
జవాబు:
వరికోత యంత్రం వినియోగంతో వ్యవసాయ కూలీలకు పనులు తగ్గి, ఆదాయం తగ్గిపోతుంది. అందువలన వీరు ఆందోళన చెందుతున్నారు.

ప్రత్యేకించి మహిళా కూలీలకు :
మహిళలు ఎక్కువగా ఇంత పెద్ద యంత్రాల దగ్గర పనిచేయలేరు. ముఖ్యంగా ఈ యంత్రం చేసే పనులు ఎక్కువగా మహిళలే చేస్తారు. యంత్రాలుంటే వీరికి అసలు పనులు ఉండవు. కాబట్టి మహిళా కూలీలు ఎక్కువ ఆందోళన చెందుతున్నారు.

8th Class Social Textbook Page No.96

ప్రశ్న 11.
ఈ కింది పట్టికను పరిశీలించి, కింది ప్రశ్నలకు జవాబులిమ్ము.

చేనేత యూనిట్లలో మార్పు
రాష్టం 1988 2009
ఆంధ్రప్రదేశ్ 5,29,000 1,24,700
గుజరాత్ 24,000 3,900
కర్నాటక 1,03,000 40,500
మహారాష్ట్ర 80,000 4,500
మధ్య ప్రదేశ్ 43,000 3,600
పంజాబ్ 22,000 300
తమిళనాడు 5,56,000 1,55,000

1. ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన మార్పు ఏమిటి?
జవాబు:
చేనేత యూనిట్లు తగ్గాయి.

2. అన్ని రాష్ట్రాలలోకి ఎక్కువ ఏ రాష్ట్రంలో తగ్గాయి?
జవాబు:
పంజాబ్ రాష్ట్రంలో ఎక్కువ తగ్గాయి.

3. అన్ని రాష్ట్రాలలోకి ఏ రాష్ట్రాలు 2009 నాటికి కూడా అధికంగా ఉన్నాయి?
జవాబు:
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు.

4. దక్షిణ భారతదేశంలో ఎక్కువ మార్పులు చోటుచేసుకున్నాయా? ఉత్తర భారతదేశంలోనా?
జవాబు:
ఉత్తర భారతదేశంలో ఎక్కువ మార్పులు చోటు చేసుకున్నాయి.

5. ఈ పట్టిక ఏ యూనిట్లకు సంబంధించినది?
జవాబు:
చేనేత యూనిట్లకు సంబంధించినది.

8th Class Social Textbook Page No.97

ప్రశ్న 12.
క్రింది ఖాళీలను పూరించండి.
a) 1988లో …………… రాష్ట్రంలో చేనేత మగ్గాలు అత్యధికంగా ఉన్నాయి, 2009 ……….., ……….. రాష్ట్రాలలో ఇవి ఎక్కువగా ఉన్నాయి. 2009లో అతి తక్కువ చేనేత మగ్గాలు ఉన్న రాష్ట్రం ఏది? b) మిల్లు కార్మికులకు నెల జీతం ఇస్తే, కార్మికులకు …………. బట్టి కూలీ చెల్లిస్తున్నారు.
c) వస్త్ర ఉత్పత్తిని నాలుగు ప్రధాన వర్గాలుగా విభజించారు, మిల్లు, చేనేత, ………………, ………………
జవాబు:
a) తమిళనాడు, తమిళనాడు, పంజాబ్
b) మర మగ్గాలలో ఉత్పత్తి చేసిన బట్టను
c) బనీన్లు, మర మగ్గాలు

8th Class Social Textbook Page No.99

ప్రశ్న 13.
ప్రస్తుత రేట్లు ఎలా ఉన్నాయో కనుక్కోండి. ఒక కంపెనీకి మరో కంపెనీకి రేట్లలో తేడాలు ఎందుకున్నాయో, అవి ఎందుకు తగ్గుతున్నాయో తెలుసుకోండి.
జవాబు:
ప్రస్తుత రేట్లు చాలా తక్కువ ఉన్నాయి. ఉదా : లోకల్ కాల్స్ కి 30 పైసలు, ఎస్.టి.డి. కాల్స్ కి 50 పైసలు నిమిషానికి ఉన్నాయి. ఇంకా కొన్ని ఫోన్లు కొన్ని నంబర్లకు ఉచిత ఆఫర్లు కూడా ఇస్తున్నాయి. అయితే ప్రతి కంపెనీ తన కస్టమర్లను పెంచుకునే ఉద్దేశ్యంతో పోటీల మీద రేట్లు తగ్గిస్తున్నారు. అందుకే రేట్లలో తేడాలు వస్తున్నాయి.

ప్రాజెక్టు

శ్రీపురం అనే గ్రామంలో మల్లయ్య ఒక రైతు. ఆ గ్రామంలో 100 ఇళ్లు ఉన్నాయి. ప్రస్తుతం నాటటం, కలుపుతీయటం, పంటకోయటం, రసాయనిక ఎరువులు వేయటం, పురుగుమందులు చల్లటం వంటి అన్ని పనులు యంత్రాలతో జరుగుతున్నాయి. గతంలో ఈ పనులన్నింటినీ మన్గుషులు చేసేవారు. ఆ గ్రామంలో 33 ట్రాక్టర్లు, 15 వరికోత యంత్రాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని అదె (బాదుగుకు ఇస్తారు. పొలం దున్నటానికి ట్రాక్టరు యజమానులు గంటకు 300 రూపాయలు తీసుకుంటున్నారు. తమ పొలాల్లో ఈ యంత్రాలను ఉపయోగించే వాళ్ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ సమాచారం ఆధారంగా చిత్రాలతో, గ్రామంలోని వివిధ వర్గాల మధ్య జరిగే చర్చలతో ఒక గోడ పత్రిక తయారుచేయండి.
జవాబు:
గోడ పత్రిక

ధనిక వర్గం మధ్య జరిగే చర్చ :
మల్లయ్య : శేషయ్యా ! మనం ఇలా విడివిడిగా ఎవరికి వారుగా కాక అందరం కలిసి ఈ యంత్రాలను ఉపయోగిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.

రాజయ్య : అందరం కలిసి యంత్రాలను ఎలా ఉపయోగించగలం? ఇవి వ్యక్తిగతమైనవి కదా !

శేషయ్య : మల్లయ్య చెప్పిన అంశం బాగానే ఉంది. కానీ దీనికి తగిన మార్గమే ఆలోచించాలి.

రాంబాబు : మనం వీటిని విడివిడిగా అద్దెకు ఇవ్వడం మూలంగా అద్దె రేట్లలో తేడాలు వస్తున్నాయి. ఖాళీగా ఉంటే మనకే నష్టం వస్తోంది. అందుకే వీటిని మనం ఉపయోగించుకోవడమే కాక అందరూ ఉపయోగించేలా చూడాలి.

వీరాస్వామి : నేనొక మంచి ఆలోచన చెబుతాను. మనం అందరం కలిసి ఒక సంఘం కింద ఏర్పడి వీటిని బాడుగకు ఇద్దాము. వచ్చిన లాభాన్ని అందరం సమానంగా పంచుకోవచ్చు. రేట్లలో తేడాలుండవు. అద్దె నష్టం ఉండదు. ఏమంటారు. మిగిలిన వారందరూ ; భేషుగ్గా ఉంది నీ ఆలోచన వీరాస్వామి ! మంచిది అలాగే చేద్దాం ! పదండి. రేపు లాయర్ని కలిసి మన సంఘం వివరాలు చెప్పి రిజిస్టరు చేయించుకుందాం !

మధ్యతరగతి వర్గం:

సుబ్బయ్య : ఓ చింతయ్యా ! ఇది విన్నావా ! మన ఊళ్ళో ఆసాములంతా ఒక సంఘం కింద ఏర్పడుతున్నారుట. ఇక మనం ట్రాక్టరుగాని, వరికోత యంత్రంగాని తెచ్చుకోవాలంటే అక్కడి నుండేనట.

చింతయ్య : అయ్యో ! ఇంతవరకు మా నాయన మీద ఉండే అభిమానం కొద్దీ మల్లయ్య నాకు నామమాత్రపు అద్దెకే వరికోత యంత్రం ఇచ్చేవాడు. ఇపుడు ఇక ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుందో?

ప్రసాదు : నిజమేగా ఇక బాడుగ రేటు సంఘం ఎంత చెప్తే అంతే ఇవ్వాలిగా ! మన మొహమాటాలు ఇక ఉండవు. ఇప్పటికే ట్రాక్టరుకు గంటకు రూ. 300 తీసుకుంటున్నారు. ఇక అది ఎంతకు పెరుగుతుందో.

రామయ్య : ఎందుకురా ! అంత కంగారు పడతారు. వాళ్ళు మనని దాటి ఎక్కడికి వెళతారు. మన స్థాయిని బట్టే వాటి. అద్దెని నిర్ణయిస్తారు. లేదంటే వాళ్ళకే లాభాలుండవు.

మిగిలిన
వారందరూ : అమ్మయ్య ! అంతేనంటావా ! అంతేలే మంచి మాట చెప్పి మా భారం దించావు సుమీ !

పేదవర్గం మధ్య చర్చ :
శిఖామణి : ఏరా ! సామిదాసూ ! మీ దొర మల్లయ్య గారు, అందరూ కలిసి అదేదో సంఘం పెడుతున్నారంటగా ! నిజమేనా !

సామిదాసు : మా దొర, మీ దొర ఏందిరా? అందరూ పెద్దాళ్ళు కలిసే ఈ పనిసేత్తున్నారు. విడివిడిగా ఉండటం వలన వాళ్ళు అద్దెలు నట్టపోతున్నారంట. అందుకే కలిసి సంఘం పెడుతున్నారంట.

పుల్లయ్య : అయితే మన సంగతి ఏంటంట. మన పనులు పోయినట్టేనా? వాళ్ళందరూ కలిసి ఒకమాట మీదుంటే మనకి కూలీ గిడుతుందా అంటా? ఇప్పటికే ఇవన్నీ వచ్చాక మనకు పని తగ్గిపోయింది.

రామారావు : అదేం లేదులే బాబాయి ! ఎన్ని యంత్రాలున్నా వాటిని పని చేయించేవాళ్ళు మనుషులేగా, ఇప్పుడున్న పనులన్నీ అలాగే ఉంటాయి. వాళ్ళు వాళ్ళ లాభాలకోసం చూసుకుంటున్నారు అంతే!

పేరయ్య (రాజకీయ నాయకుడు): మనం కూడా ఒక సంఘర్ కింద ఏర్పడదాం.! కూలి ఇంతకన్నా తక్కువైతే కుదరదు అని చెబుదాం.

రామారావు : నువ్వు ఊరుకోవయ్యా ! కూలోళ్ళకేమన్నా కరువా ఏంటి, రేట్లు నిర్ణయించడానికి, మనం కూడా వ్యవసాయం మీదే ఆధారపడకుండా ఇతర పనులను నేర్చుకుని చేసేలా చూసుకోవాలి. అప్పుడే ఈ సమస్య నుండి గట్టెక్కగలం.

మిగిలిన వారందరూ : అంతేరా రామూ ! నువ్వే ఏదో ఆలోచించి దీనికి పరిష్కారం చూడయ్యా ! పదం మళ్ళీ రేపు కలుద్దాం!

AP Board 8th Class Social Solutions Chapter 12 భారత ఎన్నికల వ్యవస్థ

SCERT AP 8th Class Social Study Material Pdf 12th Lesson భారత ఎన్నికల వ్యవస్థ Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 12th Lesson భారత ఎన్నికల వ్యవస్థ

8th Class Social Studies 12th Lesson భారత ఎన్నికల వ్యవస్థ Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం యొక్క ఆవశ్యకతను వివరించండి. (AS1)
జవాబు:
ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం యొక్క ఆవశ్యకత :

  • ప్రజాస్వామ్యంలో అత్యున్నత అధికారం ప్రజలదే, నిర్ణయాలు తీసుకోవాల్సింది ప్రజలే.
  • భారతదేశంలాంటి సువిశాలమైన దేశంలో కోట్లాది మంది పౌరులు తమ అధికారాన్ని వినియోగించుకోవాలంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో సాధ్యమవుతుంది.
  • అలాగే ప్రజలందరూ సమావేశం కావడం, చర్చించడం, నిర్ణయాలు తీసుకోవడం జనాభా అత్యధికంగా ఉన్న దేశాలలో సాధ్యపడదు. అలాంటి చోట ప్రాతినిధ్య ప్రజాస్వామ్య పద్ధతి ఉత్తమ పద్ధతి.
  • పాలనా నిర్ణయాలు తీసుకోవడంలో, ప్రజా సంక్షేమ విధానాల రూపకల్పనలో ప్రజల తరఫున ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు.
  • ఆధునిక ప్రజాస్వామ్యాలన్నీ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాలే.

ప్రశ్న 2.
“ప్రజాస్వామ్యానికి ఎన్నికల వ్యవస్థ ఆధారభూతం” – ఈ వ్యాఖ్యతో మీరు ఏకీభవిస్తారా ? వివరించండి. (AS2)
జవాబు:
ప్రజాస్వామ్యానికి ఎన్నికల వ్యవస్థ ఆధారభూతం అనే ఈ వ్యాఖ్యతో నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే

  • పరిపాలన నిర్వహణ కోసం ప్రజలు తమ ప్రతినిధులను ఎంపిక చేసుకోవాలంటే స్వతంత్రమైన, న్యాయమైన ఎన్నికల వ్యవస్థ అవసరం.
  • నిష్పక్షపాతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగినపుడే ప్రజాస్వామ్యం వికసిస్తుంది. అలాంటి వాతావరణంను ఎన్నికల వ్యవస్థ కల్పిస్తుంది. అలాగే నిర్ణీత కాల వ్యవధులలో ఎన్నికలు నిర్వహిస్తుంది.
  • ప్రజాస్వామ్యం అంటే పాలనలో ప్రజల భాగస్వామ్యం. అలా ప్రజలందరిని ఎన్నికలలో భాగస్వామ్యం అయ్యేలా చూసేది ఎన్నికల వ్యవస్థ.

AP Board 8th Class Social Solutions Chapter 12 భారత ఎన్నికల వ్యవస్థ

ప్రశ్న 3.
ఎన్నికల సంఘం విధులను వివరించండి. (AS1)
జవాబు:
రాజ్యాంగంలోని 15వ భాగంలోని 324వ నిబంధన ఎన్నికల సంఘం నిర్మాణం, విధుల గురించి వివరిస్తుంది.

ఎన్నికల సంఘం విధులు :

  1. నియోజకవర్గాల భౌగోళిక పరిధిని నిర్ణయించడం.
  2. ఓటర్ల జాబితాలను రూపొందించడం.
  3. ప్రతి సాధారణ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాలలో అవసరమైన సవరణలు చేయడం.
  4. నిర్ణీత కాలవ్యవధిననుసరించి ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం.
  5. ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా నిర్వహించుటకు అవసరమైన నియమావళిని రూపొందించడం.
  6. వివిధ రాజకీయ పార్టీలకు గుర్తింపునివ్వడం, గుర్తులు కేటాయించడం.
    పోలింగ్ తేదీలను, ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడం, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన చేయడం.
  7. దేశవ్యాప్తంగా ఎన్నికల యంత్రాంగాన్ని నియమించడం.
  8. ఎన్నికలలో జరిగే అక్రమాల పరిశీలనకు విచారణా అధికారులను నియమించడం

ప్రశ్న 4.
ఓటుహక్కు ప్రాధాన్యతను తెలుపుతూ ఒక కరపత్రం తయారుచేయండి. (AS6)
జవాబు:
కరపత్రం
భారతదేశంలో 18 సం||రాలు నిండిన ప్రతి ఒక్కరు కుల, మత, వర్గ, లింగ వివక్షత లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.

మార్పుకు ఓటుహక్కు నాంది. భారతదేశంలో ప్రభుత్వాన్ని సరిగా నడపలేని రాజకీయ నాయకత్వాన్ని దేశ ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా మార్చేస్తారు. ఎన్నికలలో ప్రతి ఒక్క ఓటు ముఖ్యమైనదే. ఎవరైనా తమ ఓటు హక్కును సరిగా వినియోగించుకోకపోతే తర్వాత రాబోయే ఐదు సంవత్సరాలు దాని ఫలితం అనుభవించాల్సి ఉంటుంది. చివరగా బాధితులు ఓటర్లే అవుతారు.

ప్రతి పౌరుడు తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచే అవకాశాన్ని ఓటు కల్పిస్తుంది. మన దేశం లాంటి పెద్ద, వైవిధ్యం ఉన్న దాంట్లో భిన్న మతాలు, భిన్న ప్రాముఖ్యతలను కలిగి ఉన్నాయి.

ఓటు హక్కు మాత్రమే కాక ఒక బాధ్యత కూడా. అది పౌరులకివ్వబడిన ఒక అరుదైన గౌరవం. ఈ హక్కుని ఉపయోగించుకుని, పౌరులు, దేశ చరిత్రలు వారి గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.

గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశం లంచగొండితనం, అనిశ్చిత ఆర్థికరంగం, అనిర్దిష్ట విదేశీ విధానాలు మొదలైన వాటితో పోరాటం సలుపుతోంది. ఒక్కో ఎన్నిక మంచి ప్రభుత్వాలకు బదులు అసమర్థ ప్రభుత్వాలను అధికారంలోనికి తెస్తే మంచికి బదులు చెడు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోవడం పౌరులుగా మన కర్తవ్యం. మంచి ప్రభుత్వాలకు పునాది మంచి ఓటర్లే.

ప్రశ్న 5.
భారతదేశంలో ఎన్నికల విధానాన్ని వివరించండి. (AS1)
(లేదా)
ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎందుకు ముఖ్యమైనవి? భారతదేశంలోని ఎన్నికల ప్రక్రియను వివరించండి.
జవాబు:
ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎందుకు ముఖ్యమైనవి.

  • ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం కలిగి ఉంటారు.
  • ఎన్నికలు అధికార పార్టీ పని తీరును మదింపు చేయడానికి అవకాశాన్ని కల్పిస్తాయి.

AP Board 8th Class Social Solutions Chapter 12 భారత ఎన్నికల వ్యవస్థ 1

1) చట్టసభల పదవీకాలం పూర్తికాగానే ఎన్నికల సంఘం లోక్ సభకు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికల తేదీలను, ఎన్నికల కార్యక్రమాన్ని ప్రకటిస్తుంది.
2) రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఉంటారు. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ ముఖ్య ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు.
3) నియోజకవర్గం స్థాయిలో ఒక ప్రభుత్వాధికారి రిటర్నింగ్ అధికారిగా ఎన్నికలను నిర్వహిస్తారు.
4) ఆసక్తిగల అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తారు.
5) రిటర్నింగ్ అధికారులు తమకు సమర్పించబడిన నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు.
6) సరిగా ఉన్న నామినేషన్ల జాబితాను ప్రకటిస్తారు. నిర్ణీత గడువులో నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం కూడా అభ్యర్థులకు ఉంటుంది.
7) ఉపసంహరణల గడువు ముగిసిన తర్వాత తుది అభ్యర్థుల జాబితాను ప్రతి నియోజకవర్గంలో ప్రకటిస్తారు.
8) అప్పుడు EVM (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్)లను సిద్ధం చేస్తారు. రాష్ట్రాల శాసనసభలకు, స్థానిక సంస్థలకు నిర్వహించే ఎన్నికలలో కూడా దాదాపు ఇవే విధివిధానాలు, నిబంధనలను పాటిస్తారు. ఉదాహరణకు అన్ని రాజ్యాంగబద్ద సంస్థలకు నిర్వహించే ఎన్నికలకు ఒకే ఓటర్ల జాబితాను ఉపయోగిస్తారు.

ఓటింగ్ ప్రక్రియ:

9) పోలింగ్ కేంద్రంలో విధులను నిర్వర్తించడానికి ప్రిసైడింగ్ అధికారిని, పోలింగ్ అధికారులను జిల్లా ఎన్నికల అధికారి నియమిస్తారు.
10) పోలింగ్ సామాగ్రిని తీసుకొని ఎన్నికల సిబ్బంది ముందురోజే పోలింగ్ కేంద్రానికి చేరుకుంటారు.
11) పోలింగ్ రోజున ఓటర్ల జాబితాలో పేర్లున్న, తగిన గుర్తింపు కార్డు కలిగిన ఓటర్లందరినీ ఓటు వేయడానికి అనుమతిస్తారు.
12) ఈ ప్రక్రియలో ఓటర్లను గుర్తించడానికి పోలింగ్ ఏజెంట్లు సహాయపడతారు.
13) ప్రిసైడింగ్ అధికారి ఓటరు గుర్తింపును నిర్ధారించుకొని చూపుడు వేలిపై ఇండెలిబుల్ సిరాతో గుర్తు పెట్టి అభ్యర్థుల పేరు, గుర్తు వివరాలతో ఉన్న బ్యాలెట్ పత్రాన్ని అందజేస్తాడు.
14) ఓటరు తాను ఓటు వేయదలుచుకున్న గుర్తుపై స్వస్తిక్ ముద్రతో ఓటువేస్తాడు. బ్యాలెట్ పత్రాన్ని బ్యాలెట్ బాక్స్ లో వేస్తాడు.
15) ఓటరు తాను ఎవరికి ఓటు వేసిందీ బహిరంగపరచకూడదు.
16) ప్రస్తుతం బ్యాలెట్ బాక్స్ స్థానంలో EVM ల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
17) పోలింగ్ పూర్తయిన తరువాత EVM లకు సీలు వేసి ఓట్ల లెక్కింపు కేంద్రాలకు తరలిస్తారు. అక్కడ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థి ఎన్నికైనట్లుగా ప్రకటిస్తారు.

AP Board 8th Class Social Solutions Chapter 12 భారత ఎన్నికల వ్యవస్థ

ప్రశ్న 6.
ప్రస్తుత ఎన్నికల విధానంలో ఏవైనా లోపాలు గమనించారా? వాటిని అధిగమించడానికి కొన్ని సూచనలు తెల్పండి. (AS1)
జవాబు:
ప్రస్తుత ఎన్నికల విధానంలో గమనించిన లోపాలు

  • ఓటర్లు ధనం మరియు ‘కానుకలు వంటి ప్రలోభాలకు లొంగడం.
  • మద్యం, ఇతర పానీయాల ప్రలోభాలకు తలవంచడం.
  • భర్త చెప్పాడనో, యజమాని చెప్పాడనో, కుల నాయకుడు లేదా మత గురువు ఆదేశించారనో ఓటు వేయడం, సరైన అభ్యర్థిని ఎన్నుకోకపోవడం.
  • మీడియా (పత్రికలు, TV ఛానళ్ళు)ను మితిమీరి ఉపయోగించుకోవడం, ఓటర్లను అయోమయానికి గురిచెయ్యటం.
  • పౌరులందరూ ఎన్నికలలో పాల్గొనకపోవడం. మరీ ముఖ్యంగా పట్టభద్రులు ఎన్నికలలో ఓటు వేయడానికి రాకపోవడం.

సూచనలు:

  • ఓటర్లను ఏ విధమైన ప్రలోభాలకు లొంగకుండా ఉండేలా జాగృతి చేయడం. అలా ప్రలోభ పెట్టేవారిని కఠినంగా శిక్షించడం.
    ఎన్నికల్లో మితిమీరిన డబ్బు ప్రవాహంను కట్టడి చేయడం.
  • పత్రికలు, ఛానళ్ళ పై నిఘా ఉంచడం, పనితీరును పరిశీలించడం.
  • పౌరులందరిని ఎన్నికల్లో పాల్గొనేటట్లు మేల్కొలపడం.

ప్రశ్న 7.
ఓటుహక్కు దుర్వినియోగం కాకుండా ప్రజలను చైతన్యపరిచేందుకు నీవు ఏ ఏ కార్యక్రమాలను నిర్వహిస్తావు? (AS6)
జవాబు:
ఓటుహక్కు దుర్వినియోగం కాకుండా ప్రజలను చైతన్యపరిచేందుకు నేను చేపట్టే కార్యక్రమాలు :

  • ఓటుహక్కు విలువను తెలియజేసే కరపత్రం ముద్రించి, పౌరులకు సరఫరా చేస్తాను.
  • ఓటుహక్కు గురించి, దాని ప్రాధాన్యతపై చర్చా కార్యక్రమం ఏర్పాటు చేస్తాను.
  • ఓటుహక్కుకు ఎలా సద్వినియోగం చేసుకోవాలో (పౌరులకు) ఇంటింటా ప్రచారం చేసి తెలియజేస్తాను.
  • ఓటుహక్కును ఎలా సద్వినియోగం చేసుకోవాలో వ్యాసరచనలు, వక్తృత్యం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తాను.
  • ఒక చిన్న స్కిట్ (నాటిక)ను ప్రదర్శించి ఓటుహక్కు ప్రాధాన్యతను తెలియజేస్తాను.
  • ఏ విధమైన ప్రలోభాలకు, బలహీనతలకు ఓటర్లు లొంగకుండా ఉండేలా వారిని చైతన్యపరుస్తాను.
  • 18 సం||రాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయిస్తాను.
  • అందరిచే ఓటరు ప్రతిజ్ఞ చేయిస్తాను.

ప్రశ్న 8.
ఈ మధ్యకాలంలో జరిగిన ఎన్నికల గురించిన సమాచారాన్ని సేకరించి పాల్గొన్న పార్టీలు, అభ్యర్థులు, గుర్తులు, పోలైన ఓట్లు మొదలైన వివరాలను విశ్లేషించి మీ అభిప్రాయాలు రాయండి. (AS3)
జవాబు:

  1. 2014 సంవత్సరంలో జరిగిన 16వ లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 543 లోక్ సభ సీట్లకుగాను 8251 మంది అభ్యర్థులు పోటీ చేశారు.
  2. భారతదేశ సాధారణ ఎన్నికల చరిత్రలోనే అత్యధికంగా ఈ ఎన్నికల్లో 66.38% ఓటింగ్ నమోదయింది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ 272 సీట్లు.
రాజకీయ పార్టీ గెలుపొందిన సీట్లు
1) భారతీయ జనతా పార్టీ 282
2) కాంగ్రెస్ 44
3) ఎఐఎడిఎమ్ కె. 37
4) తృణమూల్ కాంగ్రెస్ 34
5) బిజెడి 20
6) శివసేన 18
7) తెలుగుదేశం పార్టీ 16
8) టిఆర్ఎస్ పార్టీ 11
9) సిపిఐ (యం) 9

2014 లోకసభ ఎన్నికల్లో విజయం సాధించిన టాప్ 9 పార్టీల జాబితా ఇది. ఈ ఎన్నికల్లో బిజెపి మొత్తం 543 సీట్లలో 282 సీట్లు గెలుచుకొని కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అర్హత సాధించింది.

ప్రశ్న 9.
పోలింగ్ కేంద్రం నమూనా చిత్రాన్ని గీసి, ప్రిసైడింగ్ అధికారి చేసే పనులకు గురించి రాయండి. (AS5)
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 12 భారత ఎన్నికల వ్యవస్థ 2
ప్రిసైడింగ్ అధికారి చేసే పనులు :

  • పోలింగ్ కేంద్రంలో విధులను నిర్వర్తించడానికి ఎన్నికల సంఘం ప్రిసైడింగ్ అధికారి (P-O) ని నియమిస్తుంది.
  • ‘ఎన్నికల నిర్వహణ’పై జరిగే శిక్షణ కార్యక్రమంకు హాజరయ్యి శిక్షణ పొందుతారు.
  • ఎన్నికల ముందురోజు ఓటింగ్ యంత్రాన్ని, ఎన్నికల సామగ్రిని తీసుకుంటారు.
  • EVMల పనితీరు చెక్ చేసుకుంటారు. పోలింగు కేంద్రాలకు ముందురోజే చేరుకుంటారు.
  • పోలింగు స్టేషన్ల వద్ద అవసరమయిన ఏర్పాట్లను చేస్తారు. (బూత్ ఏర్పాటు, భద్రత మొ||)
  • పోలింగు బూతు నియమించిన ఇతర అధికారులను, పోలింగు ఏజెంట్లను సమన్వయపర్చుకుంటారు.
  • పోలింగు ప్రారంభానికి ముందే ఓటింగ్ యంత్రాలను సిద్ధం చేసుకుంటారు.
  • ‘మాదిరి’ (Mockpole) ఏజెంట్ల సమక్షంలో నిర్వహిస్తారు.
  • ముందుగా అధికారులు నిర్ణయించిన సమయానికి పోలింగ్ ను ప్రారంభించుట.
  • ఓటరు గుర్తింపును నిర్ధారించుకుని చూపుడువేలిపై ఇండెలిబుల్ సిరాతో గుర్తు పెట్టి బ్యాలెట్ ను అందజేస్తారు.
  • ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగటానికి అవసరమైన చర్యలు చేపడతారు.
  • పోలింగ్ స్టేషన్ లోపలా, పరిసర ప్రాంతాల్లో ఎన్నికల చట్టం అమలుచేయటం. .
  • నిర్ణీత సమయంలో పోలింగ్ ముగించుట.
  • ప్రిసైడింగ్ అధికారి డైరీని తయారుచేయుట.
  • పోలింగ్ ముగిసిన తర్వాత సదరు ఓటింగ్ యంత్రాలను రిటర్నింగ్ అధికారికి అప్పజెప్పటం మొదలైనవి చేస్తారు.

ప్రశ్న 10.
ప్రధాన ఎన్నికల కమీషనర్‌ను తొలగించడం కష్టతరం. కారణాలను విశ్లేషించండి. (AS4)
జవాబు:
భారత ఎన్నికల సంఘం యొక్క ప్రధాన కమీషనర్‌ను తొలగించడం కష్టతరం కారణం :

  • భారత ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగబద్ధ సంస్థ.
  • భారత రాజ్యాంగంలోని 324(2) నిబంధన ప్రకారం భారత రాష్ట్రపతి ప్రధాన ఎన్నికలు అధికారివీ, ఇతర అధికారులను నియమిస్తారు.
  • సర్వోన్నత, స్వతంత్ర అధికారాలు గల ప్రధాన ఎన్నికల అధికారిని “అభిశంసన తీర్మానం” ద్వారానే తొలగించగలరు.
  • ఈ ‘అభిశంసన తీర్మానం’ అమోదించాలంటే పార్లమెంటులోని ఉభయ సభలలో 2/3వంతు సభ్యుల అంగీకారం అవసరం.
  • దీనినిబట్టి ప్రధాన ఎన్నికల కమీషనర్ ను తొలగించడం ఎంత కష్టమో అవగతమవుతుంది.

8th Class Social Studies 12th Lesson భారత ఎన్నికల వ్యవస్థ InText Questions and Answers

8th Class Social Textbook Page No.141

ప్రశ్న 1.
మీ కుటుంబంలో ఎవరిదైనా ఓటరు గుర్తింపు కార్డును సేకరించి దానిలోని వివరాలను పరిశీలించండి.
AP Board 8th Class Social Solutions Chapter 12 భారత ఎన్నికల వ్యవస్థ 3
జవాబు:
ఓటరు గుర్తింపు కార్డులోని వివరాలు :

  • గుర్తింపుకార్డు నెంబరు
  • ఓటరు పేరు, వయస్సు, లింగం
  • ఓటరు చిరునామా
  • ఓటరు యొక్క నియోజక వర్గం
  • ఓటరు యొక్క ఎన్నికల ఋతు వివరం
  • ఎలక్టోరేలో ఏ భాగంలో, ఏ క్రమ సంఖ్యలో ఉందో తెలిపే సంఖ్య
  • ఓటరు రిజిస్ట్రేషన్ అధికారి సంతకము

ప్రశ్న 2.
మీకు 18 సంవత్సరాల వయస్సు నిండిన తరువాత ఓటరుగా నమోదు కావడానికి అనుసరించవలసిన పద్ధతులను గురించి మీ ఉపాధ్యాయుణ్ణి అడిగి తెలుసుకోండి.
జవాబు:
18 సం||రాలు వయస్సు నిండినవారు ఓటరుగా నమోదు కావడానికి అనుసరించవల్సిన పద్దతులు :

  • ఫారం – 6ను పూర్తిచేసి, ఆధార పత్రాల నకళ్ళను జతపరచి మీ బూతులెవల్ అధికారి (BLO) కి అందించటం ద్వారా
  • మీ సేవలో ఆన్లైన్లో అప్లై చేయుట ద్వారా
  • మనమే స్వంతంగా ఎన్నికల సంఘం వెబ్ సైట్ నందు Form-6ను పూర్తిచేసి, సదరు నింపిన ఫారంలను, ఆధార పత్రాలను జతపరచి రిజిస్ట్రేషన్ అధికారికి అందజేయటం ద్వారా

AP Board 8th Class Social Solutions Chapter 12 భారత ఎన్నికల వ్యవస్థ

ప్రశ్న 3.
సార్వత్రిక వయోజన ఓటుహక్కు మన ప్రజాస్వామ్యానికి ఏ విధంగా మేలు చేకూర్చింది? నిరక్షరాస్యులకు ఓటుహక్కు ఇవ్వడం మంచిది కాదని కొందరు భావిస్తారు. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? తరగతి గదిలో చర్చించండి.
జవాబు:
ఓటు హక్కు మన ప్రజాస్వామ్యానికి చేకూర్చిన మేలు

  • ప్రతి ఓటరు రాష్ట్రం లేదా దేశంలో పాలన తన చేతిలోనే ఉందని భావిస్తాడు.
  • ప్రజాస్వామ్యం అంటే ప్రజాపాలన, ప్రజలు పాలనలో భాగస్వామ్యం కావటానికి సార్వత్రిక వయోజన ఓటుహక్కు ఎంతో తోడ్పడుతుంది.
  • పౌరులందరిని పాలనలో భాగస్వామ్యం చేస్తుంది.

నిరక్షరాస్యులకు ఓటుహక్కు ఇవ్వడం మంచిదనే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రజలందరూ పాలనలో భాగస్వామ్యం కావాలంటే ఇటువంటి ఆంక్షలు ఉండరాదు. అయితే నిరక్షరాస్యులకు ఓటుహక్కు గురించి, పాలన గురించి, ఎన్నికల
గురించిన అవగాహన కల్పించాలి.

8th Class Social Textbook Page No.144

ప్రశ్న 4.
వార్తా పత్రికలను పరిశీలించండి మన రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు, వాటి గుర్తుల జాబితా తయారుచేయండి. వాటిలో ప్రాంతీయ, జాతీయ పార్టీలను గుర్తించండి.
జవాబు:
జాతీయ పార్టీలు :
AP Boarad 8th Class Social Solutions Chapter 12 భారత ఎన్నికల వ్యవస్థ 4
ప్రాంతీయ పార్టీలు :
AP Board 8th Class Social Solutions Chapter 12 భారత ఎన్నికల వ్యవస్థ 5

8th Class Social Textbook Page No.145

ప్రశ్న 5.
పై నియమాలలో ఒక్కొక్క నియమాన్ని తీసుకుని ఆ నియమం యొక్క ఉపయోగాన్నీ అది లేకుంటే సంభవించగల నష్టాన్ని చర్చించండి.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 12 భారత ఎన్నికల వ్యవస్థ 6 AP Board 8th Class Social Solutions Chapter 12 భారత ఎన్నికల వ్యవస్థ 7

ప్రశ్న 6.
రాజకీయ పార్టీలు సభలు, సమావేశాల ద్వారా మాత్రమే కాకుండా ఇంకా ఏయే పద్ధతులలో ప్రచారం చేయవచ్చు?
జవాబు:
రాజకీయ పార్టీలు ప్రచారం చేయు పద్ధతులు :

  • వివిధ వార్తా పత్రికల్లో తమ మ్యానిఫెస్టోలను చర్చించటం ద్వారా
  • వివిధ TV ఛానెళ్ళల్లో ప్రచారం నిర్వహించుకోవటం.
  • కరపత్రాలు, (స్కీక్కర్లు) ముద్రించి, సరఫరా చేయటం ద్వారా
  • ఇంటింటికి (గడపగడపకు) ప్రచారం నిర్వహించటం ద్వారా
  • పాదయాత్రలు, రోడ్ షోలు నిర్వహించటం ద్వారా చర్చలు నిర్వహించటం ద్వారా
  • సోషల్ మీడియా (Facebook, Whatsapp, youtube, Twitter etc…]

8th Class Social Textbook Page No.147

ప్రశ్న 7.
NOTA అభ్యర్థి యొక్క గెలుపు / ఓటమిని ప్రభావితం చేయగలుగుతుంది? ఒకవేళ NOTAకు మెజారిటీ ఓట్లు వస్తే అప్పుడేం చేయాలి?
జవాబు:
NOTA అభ్యర్థి యొక్క గెలుపు / ఓటములను ప్రభావితం చేస్తుంది. ఎలా అంటే గతంలో (NOTA లేనపుడు) ఓటరు తప్పకుండా ఎవరో ఒక అభ్యర్థికి ఖచ్చితంగా (నచ్చినా, నచ్చకపోయినా) ఓటువేసి తీరాల్సి ఉంటుంది. ఇపుడు NOTAకు వేయవచ్చు.

NOTAకు మెజారిటీ ఓట్లు వస్తే, అంటే ఎన్నికలో పాల్గొన్న అభ్యర్థులెవరు ఓటర్లకు నచ్చలేదని భావించవచ్చు, కనుక అభ్యర్థులను మార్చి ఎలక్షన్లు జరిపించాలి. అయితే ప్రస్తుతం NOTAకు వచ్చిన ఓట్లను పరిగణలోకి తీసుకోవటం లేదు. కావున అభ్యర్థులకు (ఎంత తక్కువ వచ్చిన) వచ్చిన ఓట్లను మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారు.

AP Board 8th Class Social Solutions Chapter 12 భారత ఎన్నికల వ్యవస్థ

ప్రశ్న 8.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఎందుకు అవసరం? దీనిలో ఇంకా ఏయే నియమాలుండాలని మీరు భావిస్తున్నారు?
జవాబు:
ఎన్నికల ప్రవర్తనా నియమావళి :
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అనగా షెడ్యూలు ప్రకటించిన తేదీ నుండి ఎన్నికలు జరిగే తేదీ వరకు పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు పాటించవలసిన నియమ నిబంధనలను ‘ఎన్నికల ప్రవర్తనా నియమావళి’ అంటారు. వీటిని అతిక్రమిస్తే ఎన్నికల అనుచిత ప్రవర్తన (ఎలక్షన్ మాల్ ప్రాక్టీస్)గా పరిగణించి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు.

అధికారంలో ఉన్న పార్టీ తమ అధికారాన్ని దుర్వినియోగం చేయవచ్చు. ప్రభుత్వం కొత్త పథకాలను ప్రకటించవచ్చు. ప్రత్యర్థి పార్టీలు ఓటర్లను మభ్యపెట్టటానికి ఇతర అనైతిక, అప్రజాస్వామిక పద్ధతులను అనుసరించవచ్చు. లొంగటానికి అవకాశం ఉంటుంది.. ఇవన్నీ ఎన్నికల కమిషను ప్రవర్తనా నియమావళి ద్వారా వీటిని అరికడుతుంది. కాబట్టి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అవసరం.

దీనిలో ఇంకా ఉండాల్సిన నియమాలు :

  • TVలు, వార్తా పత్రికలలో చేసే విపరీతమైన ప్రచారాన్ని తగ్గించాలి.
  • ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చని నాయకులను అనర్హులుగా ప్రకటించాలి. అప్పుడే సాధ్యమయ్యే వాగ్దానాలు చేస్తారు.
  • కుల సంఘాలను నిషేధించాలి.
  • నేర చరిత్ర కల్గిన అభ్యర్థులను పోటీ చేయకుండా నిషేధించుట.

AP Board 6th Class Science Solutions Chapter 2 మొక్కల గురించి తెలుసుకుందాం

SCERT AP 6th Class Science Study Material Pdf 2nd Lesson మొక్కల గురించి తెలుసుకుందాం Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Science 2nd Lesson Questions and Answers మొక్కల గురించి తెలుసుకుందాం

6th Class Science 2nd Lesson మొక్కల గురించి తెలుసుకుందాం Textbook Questions and Answers

Improve Your Learning (అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం)

I. ఖాళీలను పూరించండి.

1. తల్లివేరు వ్యవస్థ …………. మొక్కలలో ఉంటుంది. (ద్విదళ బీజ)
2. కాండం అగ్ర భాగంలో ఉండే మొగ్గను ……………. అంటారు. (అగ్రకోరకం)
3. మొక్క పత్రాలలో వాయు మార్పిడి కోసం ఉపయోగపడే భాగాలు ……….. (పత్రరంధ్రాలు)
4. కిరణజన్య సంయోగక్రియ జరిపే మొక్కలలోని ప్రధాన భాగాలు ………….. (పత్రాలు)

II. సరైన సమాధానాన్ని గుర్తించండి.

1. పత్రరంధ్రాల ముఖ్య విధి
A) ప్రసరణ
B) బాష్పోత్సేకం
C) కిరణజన్య సంయోగక్రియ
D) శోషణ
జవాబు:
B) బాష్పోత్సేకం

2. నీరు, ఖనిజ లవణాల శోషణలో ఉపయోగపడే మొక్క భాగం
A) వేరు
B) కాండం
C) పత్రం
D) పుష్పం
జవాబు:
A) వేరు

3. మొక్కలో పత్రాలు ఉద్భవించే కాండ భాగం
A) కణుపు
B) కోరకం
C) బీజదళం
D) కణుపు నడిమి భాగం
జవాబు:
A) కణుపు

III. ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రశ్న 1.
మొక్కలలో ముఖ్యమైన భాగాలు ఏవి?
జవాబు:
మొక్కలలో ముఖ్యమైన భాగాలు :
ఎ) వేర్లు
బి) కాండం
సి) ఆకులు
డి) పువ్వులు
ఇ) పండ్లు

AP Board 6th Class Science Solutions Chapter 2 మొక్కల గురించి తెలుసుకుందాం

ప్రశ్న 2.
మొక్కకు కాండం ఏ విధంగా సహాయపడుతుంది?
జవాబు:
మొక్క కాండం,

  • కొమ్మలు, ఆకులు, పువ్వులు మరియు పండ్లకు ఆధారం ఇస్తుంది.
  • నీరు మరియు ఖనిజాలను మొక్కల వేర్ల నుండి ఎగువ భాగాలకు రవాణా చేస్తుంది.
  • ఆహారాన్ని ఆకుల నుండి ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తుంది.
  • కొన్ని మొక్కలలో ఇది ఆహారాన్ని నిల్వ చేస్తుంది, తద్వారా వాటిని నిల్వ కాండం అని పిలుస్తారు.
  • ఉదా : బంగాళదుంప, పసుపు, అల్లం, వెల్లుల్లి మరియు చెరకు.

ప్రశ్న 3.
వేరు వ్యవస్థకు, పత్రంలోని ఈనెల వ్యాపనానికి గల సంబంధం ఏమిటి?
జవాబు:
వేరు వ్యవస్థ మరియు పత్రంలోని ఈనెల వ్యాపనంనకు మధ్య సంబంధం కలదు.
ఎ) తల్లి వేరు వ్యవస్థ కలిగిన మొక్కలు జాలాకార ఈనెల వ్యాపనం కల్గి ఉంటాయి.
బి) గుబురు వేరు వ్యవస్థ కలిగిన మొక్కలు సమాంతర ఈనెల వ్యాపనం కల్గి ఉంటాయి.

ప్రశ్న 4.
రజని “శ్వాసక్రియ పత్రాలలో జరుగుతుంది” అన్నది. ఈమె చెప్పినది సరైనదేనా? నీవు ఏ విధంగా ఈమె మాటను సమర్థిస్తావు?
జవాబు:

  • రజనీ చెప్పినది సరైనది.
  • మొక్కల ఆకులు వాటి ఉపరితలంపై చిన్న రంధ్రాలను కలిగి ఉంటాయి. వీటిని పత్ర రంధ్రాలు అంటారు.
  • పత్ర రంధ్రము ఆకుకు ముక్కులా పనిచేస్తుంది.
  • కాబట్టి ఆకులు వాయువుల మార్పిడి స్థావరాలు.
  • అందువలన శ్వాసక్రియ మొక్కలలో పత్ర రంధ్రము ద్వారా జరుగుతుంది.

ప్రశ్న 5.
మొక్కలలో పత్రాలు లేకుంటే ఏమి జరగవచ్చు?
జవాబు:

  • మొక్కలలో పత్రాలు ఆహారం తయారీకి కిరణజన్య సంయోగక్రియ యొక్క ప్రదేశాలు.
  • మొక్కలలో వాయు మార్పిడి మరియు శ్వాస ప్రక్రియ ఆకుల ద్వారా జరుగుతుంది.
  • మొక్కలోని అధిక నీరు ఆకు ఉపరితలం ద్వారా ఆవిరి రూపంలో తొలగించబడుతుంది.
  • మొక్కకు ఆకులు లేకపోతే అది దాని స్వంత ఆహారాన్ని తయారు చేయదు మరియు శ్వాసక్రియ మరియు బాష్పోత్సేకము అనే విధులను నిర్వహించదు.
  • ఆకులు లేని మొక్కలలో కాండం ఈ విధులను నిర్వర్తించగలదు.

ప్రశ్న 6.
మొక్కలు వేర్ల ద్వారా నీటిని గ్రహిస్తాయని ఏ విధంగా ఋజువు చేయగలవు? కృత్యం – 3
జవాబు:
లక్ష్యం :
మొక్కలు వేరు ద్వారా నీటిని పీల్చుకోవడాన్ని గమనించడం.

మనకు కావలసింది :
ఒక క్యారెట్, ఒక గ్లాసు నీరు మరియు నీలం సిరా.

ప్రయోగ విధానం :

  • ఒక గ్లాసు నీరు తీసుకొని దానికి కొన్ని చుక్కల నీలం సిరా జోడించండి.
  • ఇప్పుడు గ్లాసులో క్యారెట్ ఉంచండి.
  • క్యారెట్ ను 2 లేదా 3 రోజులు నీటిలో ఉంచండి.
  • అప్పుడు క్యారెట్ ను నిలువుగా కత్తిరించండి. దాని లోపలి భాగం గమనించండి.

పరిశీలన :
నీలం రంగు నీరు క్యారెట్ లో పైకి ప్రసరించటము గమనిస్తాము.

నిర్ధారణ :
క్యారెట్ లో నీలం రంగు కనిపిస్తుంది.

AP Board 6th Class Science Solutions Chapter 2 మొక్కల గురించి తెలుసుకుందాం

ప్రశ్న 7.
పటం సహాయంతో మొక్కలోని వివిధ భాగాలను వివరించండి.
AP Board 6th Class Science Solutions Chapter 2 మొక్కల గురించి తెలుసుకుందాం 1
జవాబు:
మొక్క ముఖ్య మైన భాగాలు :
ఎ) వేరు బి) కాండం సి) ఆకు డి) పువ్వు ఇ) పండు

ఎ) వేరు :

  • మొక్క ప్రధాన అక్షం యొక్క భూగర్భ భాగం వేరు.
  • వేర్లు నేల నుండి నీరు మరియు ఖనిజాలను గ్రహిస్తాయి.

బి) కాండం : భూమి పైన ఉన్న మొక్క యొక్క వాయుగత భాగం కాండం.

  • ఇది కొమ్మలు, ఆకులు, పువ్వులు మరియు పండ్లను కలిగి ఉంటుంది.
  • ఇది నీరు, ఖనిజాలు మరియు పోషకాలను వివిధ భాగాలకు రవాణా చేస్తుంది.

సి) ఆకు :

  • కణుపు నుండి ఉత్పన్నమయ్యే మొక్క యొక్క చదునైన, ఆకుపచ్చ భాగం ఆకు.
  • ఇది కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ మరియు బాష్పోత్సేకమునకు సహాయపడుతుంది.

డి) పువ్వు :

  • మొక్క యొక్క ప్రకాశవంతమైన మరియు అందమైన భాగం.
  • ఇది ఒక మొక్కలో పునరుత్పత్తి భాగం.

ఇ) పండు :

  • ఇది విత్తనాలను కలిగి ఉన్న మొక్క యొక్క తినదగిన భాగం.
  • ఇది పువ్వు నుండి అభివృద్ధి చెందుతుంది.

ప్రశ్న 8.
పటం సహాయంతో పత్రభాగాలను వివరించండి.
జవాబు:
ఆకు యొక్క ప్రధాన భాగాలు :
AP Board 6th Class Science Solutions Chapter 2 మొక్కల గురించి తెలుసుకుందాం 2
ఎ) పత్ర పీఠం బి) పత్ర వృంతము సి) పత్ర దళం డి) మధ్య ఈనె ఇ) ఈనెలు

ఎ) పత్ర పీఠం : కణుపు దగ్గర కాండాన్ని ఆకుతో కలిపే ఆకు యొక్క దిగువ భాగం.
బి) పత్ర వృంతము : మొక్క యొక్క కాండంతో ఆకును కలిపే కాడ వంటి నిర్మాణం.
సి) పత్ర దళం : ఆకు యొక్క.సన్నని, చదునైన, ఆకుపచ్చ భాగం పత్ర దళం
డి) మధ్య ఈనె : పత్ర దళం మధ్యలో ఉండే పొడవైన ఈనె.
ఇ) ఈనెలు : మధ్య ఈనె నుండి ఉత్పన్నమయ్యే సన్నని నిర్మాణాలు మరియు ఇవి పత్రదళంపై వ్యాపించి ఉంటాయి.

ప్రశ్న 9.
జాన్ ఇంటి పరిసరాలలో మొక్కలను పెంచేందుకు చాలినంత స్థలం లేదు. కానీ తను తన ఇంటివద్ద టమాట, వంగ వంటి కూరగాయల మొక్కలను పెంచాలనుకుంటున్నాడు. అతనికి మొక్కలను పెంచడానికి కొన్ని మార్గాలను సూచించండి.
జవాబు:
టెర్రస్ గార్డెన్, కిచెన్ గార్డెన్, నిలువు తోటలు పరిమిత స్థలంలో మొక్కలను పెంచడానికి కొన్ని పద్ధతులు.

ఎ) టెర్రస్ గార్డెన్ :
ఇది టెర్రస్ మీద పెంచుకొనే సాధారణ తోట. ఈ ప్రక్రియలో మొక్కలను పెంచడానికి నీటి డబ్బాలూ, మొక్కల కుండలు, మరియు ఇతర వ్యర్థ పాత్రలను ఉపయోగిస్తారు.

బి) కిచెన్ గార్డెన్ :
వంటగదిలో వంట కోసం మొక్కలను పండించే తోట వంటిది.

సి) నిలువు తోటలు :
మొక్కలను నేల మీద కాకుండా నిలువుగా ముఖ్యంగా, గోడల వెంట నిలువుగా నీటి గొట్టాలు అమర్చి పెంచే ఏర్పాటు.

కృత్యాలు

కృత్యం – 1

6th Class Science Textbook Page No. 13

ప్రశ్న 1.
మీరు సేకరించిన మొక్కలను పరిశీలించండి. మొక్కభాగాలను గుర్తించడానికి ప్రయత్నించండి. మీ పరిశీలనను పట్టికలో నమోదు చేయండి. నమోదు చేసిన పరిశీలనలు ఆధారంగా కింది ప్రశ్నలను చర్చిద్దాం.
AP Board 6th Class Science Solutions Chapter 2 మొక్కల గురించి తెలుసుకుందాం 3
జవాబు:
AP Board 6th Class Science Solutions Chapter 2 మొక్కల గురించి తెలుసుకుందాం 4
• మీరు సేకరించిన వాటిలో వేర్లు లేని మొక్కలను పరిశీలించారా?
జవాబు:
లేదు. వేర్లు లేని మొక్కను కనుగొనలేదు.

• అన్ని మొక్కల, పత్రాలు ఒకే పరిమాణంలో ఉన్నాయా?
జవాబు:
అన్ని మొక్కల ఆకులు పరిమాణంలో సమానంగా లేవు.

• పుష్పాలు లేని మొక్కలు ఉన్నాయా?
జవాబు:
నేను గమనించిన మొక్కలలో పుష్పాలు లేని మొక్క లేదు.

• అన్ని మొక్కలలో ఉమ్మడిగా ఉండే భాగాలేమిటి?
జవాబు:
వేర్లు, కాండం, ఆకులు మరియు పువ్వులు అన్ని మొక్కలలో నేను గమనించిన సాధారణ భాగాలు.

• మీరు సేకరించిన మొక్కల వేర్లను పటం – 2 మరియు పటం-3లతో పోల్చండి. ఆ మొక్కల వేర్లు తల్లివేర్లా లేక గుబురు వేర్లా అనేది వేరు వ్యవస్థ అనే గడిలో రాయండి.
AP Board 6th Class Science Solutions Chapter 2 మొక్కల గురించి తెలుసుకుందాం 5
జవాబు:

మొక్క పేరు వేరు వ్యవస్థ రకం
1. వరి గుబురు వేరు వ్యవస్థ
2. తులసి తల్లి వేరు వ్యవస్థ
3. మామిడి తల్లి వేరు వ్యవస్థ
4. గులాబి తల్లి వేరు వ్యవస్థ
5. వేప తల్లి వేరు వ్యవస్థ
6. గడ్డి గుబురు వేరు వ్యవస్థ

• తల్లి వేరు వ్యవస్థలో, మధ్యలోని వేరు ఏ విధంగా కనిపిస్తోంది?
జవాబు:
మధ్య ప్రధాన వేరు మందంగా ఉంది మరియు సన్నని నిర్మాణాలు కలిగి ఉంది.

• ఈ మధ్య వేరును తల్లి వేరు వ్యవస్థలోని మిగిలిన వేర్లతో పోల్చండి.
జవాబు:
మధ్య వేరు మందంగా ఉంటుంది, దీనినే తల్లి వేరు అని పిలుస్తారు. మిగిలిన వేర్లు సన్నగా ఉంటాయి, వీటిని పార్శ్వ వేర్లు అంటారు.

• గుబురు వేరు వ్యవస్థలో ఇటువంటి ప్రధానమైన వేరు ఉన్నదా? ఈ వేర్లు ఏ విధంగా ఉన్నవి?
జవాబు:
గుబురు వేరు వ్యవస్థలో ప్రధాన వేరు లేదు. ఇక్కడ అన్ని వేర్లు పరిమాణంలో సమానంగా ఉంటాయి.

• తల్లి వేరు వ్యవస్థకు, గుబురు వేరు వ్యవస్థకు మరేమయినా భేదాలను గమనించారా?
జవాబు:
తల్లి వేరు వ్యవస్థలో వివిధ పరిమాణాలలో తల్లి వేరు మరియు పార్శ్వ వేర్లు ఉంటాయి. గుబురు వేరు వ్యవస్థలో అన్ని వేర్లు సన్నగా మరియు పరిమాణంలో ఏకరీతిలో ఉంటాయి.

AP Board 6th Class Science Solutions Chapter 2 మొక్కల గురించి తెలుసుకుందాం

కృత్యం – 2

6th Class Science Textbook Page No. 14

ప్రశ్న 2.
చిక్కుడు విత్తనం వేర్లను రాగుల వేరు వ్యవస్థలతో పోల్చండి.
జవాబు:
లక్ష్యం :
చిక్కుడు విత్తనం వేర్లును రాగుల వేరు వ్యవస్థలతో పోల్చడం.

కావలసిన పరికరాలు :
రెండు పేపర్ కప్పులు, మట్టి, చిక్కుడు విత్తనాలు, రాగుల విత్తనాలు, నీరు.

ప్రయోగ విధానం :
రెండు పేపర్ కప్పులు తీసుకొని సారవంతమైన మట్టితో నింపండి. ఒక కప్పులో 2 లేదా 3 చిక్కుడు విత్తనాలు మరియు మరొక కప్పులో కొన్ని రాగులను విత్తండి. వాటిపై నీరు చల్లండి. కొన్ని రోజుల తరువాత, మనం మొలకలు చూస్తాము. ఆ మొలకలకు కొత్తగా పుట్టుకొచ్చే ఆకులను గమనించండి. నేల నుండి మొక్కలను జాగ్రత్తగా తీసివేసి వాటి వేర్లను గమనించండి.

పరిశీలన :
చిక్కుడు విత్తనం నుండి రెండు ఆకులు వెలువడతాయి మరియు రాగుల మొలకల నుండి ఒక ఆకు మాత్రమే ఉద్భవించింది. ఇవి బీజదళాలు. చిక్కుడు గింజకు రెండు బీబీ దళాలు ఉన్నాయి కాబట్టి ఇది ద్విదళ బీజ దళాల మొక్క రాగులలో ఒక బీజ దళం ఉంది కాబట్టి ఇది ఏకదళ బీజ మొక్క చిక్కుడు విత్తనంలో తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది. అయితే రాగులలో గుబురు వేరు వ్యవస్థ ఉంటుంది.

నిర్ధారణ :
ద్విదళ బీజం మొక్కలకు తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది. ఏక దళ బీజం మొక్కలు గుబురు వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి.

కృత్యం – 4

6th Class Science Textbook Page No. 16

ప్రశ్న 3.
ఒక కాండం ద్వారా నీటి ప్రసరణను గమనించడం.
జవాబు:
AP Board 6th Class Science Solutions Chapter 2 మొక్కల గురించి తెలుసుకుందాం 6
లక్ష్యం :
ఒక కాండం ద్వారా నీటి ప్రసరణను గమనించడం.

కావలసినవి :
బాల్సమ్ మొక్క యొక్క చిన్న కొమ్మ, ఒక గ్లాసు నీరు, ఎరుపు సిరా.

ఏమి చేయాలి :
ఒక గ్లాసు నీరు తీసుకొని దానికి కొన్ని చుక్కల సిరా కలపండి. ఇప్పుడు నీటిలో చిన్న కొమ్మ ఉంచండి.

ఏమి గమనిస్తావు :
కాండం ఎర్రగా మారుతుంది. ఏమి నేర్చుకొంటావు : ఎర్రని రంగు కాండం పైకి ప్రసరించటం వలన కాండం ఎర్రగా మారింది.

కృత్యం – 5

6th Class Science Textbook Page No. 17

ప్రశ్న 4.
కృత్యం-1లో సేకరించిన మొక్కల పత్రాలను పరిశీలించండి. అవి ఏ విధంగా ఉన్నాయి? అన్నింటికీ ఒకే పరిమాణం, ఆకారం ఉన్నాయా? కృత్యం-1లో సేకరించిన మొక్కల పత్రాలను పోల్చి చూడండి. పట్టికలో పరిశీలనలను నమోదు చేయండి. పత్రపు ఆకారం, పత్రపు అంచు వివరించటం ఇబ్బందిగా ఉన్నప్పుడు వాటి బొమ్మలను పట్టికలో గీయండి.
AP Board 6th Class Science Solutions Chapter 2 మొక్కల గురించి తెలుసుకుందాం 7
జవాబు:
AP Board 6th Class Science Solutions Chapter 2 మొక్కల గురించి తెలుసుకుందాం 8

• పత్రాలన్నింటిలోను సాధారణంగా ఉండే భాగాలు ఏవి?
జవాబు:
పత్రపీఠం, పత్ర వృంతము, పత్రదళం అన్ని ఆకులలో నేను గమనించిన సాధారణ భాగాలు.

• పత్రాలన్నీ ఒకే విధమైన ఆకారాన్ని కలిగి ఉంటాయా?
జవాబు:
అన్ని ఆకులు ఒకే ఆకారంలో ఉండవు.

6th Class Science Textbook Page No. 18

ప్రశ్న 5.
ఒక పత్రాన్ని తీసుకుని దానిని నీ నోటుపుస్తకంలోని ఒక పేజీ లేదా ఒక తెల్లకాగితం కింద ఉంచండి. పెన్సిల్ ములుకును అడ్డంగా ఉంచి, కాగితంపై రుద్దండి. కాగితంపై చిత్రం ఏర్పడిందా?
AP Board 6th Class Science Solutions Chapter 2 మొక్కల గురించి తెలుసుకుందాం 9
• మీకు ఏమైనా ముద్ర వచ్చిందా?
జవాబు:
అవును. నేను ఆకు యొక్క ముద్రను పొందాను.

• ఈ నమూనా ఆకు మాదిరిగానే ఉందా?
జవాబు:
అవును. ఇది ఆకు మాదిరిగానే ఉంది.

6th Class Science Textbook Page No. 18

ప్రశ్న 6.
కృత్యం-1లో సేకరించిన పత్రాలలోని ఈ నెల వ్యాపనాన్ని పరిశీలించండి. ఈ నెలన్నీ నడిమి ఈనెకు ఇరువైపులా వల వలె వ్యాపించి ఉన్నట్లయితే దానిని జాలాకార ఈ నెల వ్యాపనం అని, ఈ నెలన్నీ ఒకదానికొకటి సమాంతరంగా వ్యాపించి ఉన్నట్లయితే దానిని సమాంతర ఈనెల వ్యాపనమని అంటారు. మీ పరిశీలనలను కింది పట్టిక నందు నమోదు చేయండి.
AP Board 6th Class Science Solutions Chapter 2 మొక్కల గురించి తెలుసుకుందాం 10
జవాబు:

మొక్క పేరు ఈనెల వ్యాపనం (జాలాకార / సమాంతరంగా)
1. వరి సమాంతర ఈనెల వ్యాపనం
2. తులసి జాలాకార ఈనెల వ్యాపనం
3. మామిడి జాలాకార ఈనెల వ్యాపనం
4. గులాబి జాలాకార ఈనెల వ్యాపనం
5. వేప జాలాకార ఈనెల వ్యాపనం

• సమాంతర ఈనెల వ్యాపనం కలిగిన మొక్కలలో ఏ రకమైన వేర్లు ఉంటాయి?
జవాబు:
ఆకులలో సమాంతర ఈనెల వ్యాపనం ఉన్న మొక్కలలో గుబురు వేర్లు ఉన్నాయి.

• జాలాకార ఈనెల వ్యాపనం కలిగిన మొక్కలలో ఏ రకమైన వేర్లు ఉంటాయి?
జవాబు:
ఆకులలో వల లాంటి ఈ నెల వ్యాపనం ఉన్న మొక్కలలో తల్లి వేరు వ్యవస్థ ఉంది.

• ఈనెల వ్యాపనానికి, వేరు వ్యవస్థకూ మధ్య ఏదైనా సంబంధం ఉందా?
జవాబు:
అవును. ఈనెల వ్యాపనం మరియు వేరు వ్యవస్థ మధ్య సంబంధం ఉంది. తల్లి వేరు వ్యవస్థ కలిగిన మొక్కలకు వల లాంటి లేదా జాలాకార ఈనెల వ్యాపనం కలిగి ఉంటే, గుబురు వేర్లు కలిగిన మొక్కలు సమాంతర ఈనెల వ్యాపనం కలిగి ఉంటాయి.

AP Board 6th Class Science Solutions Chapter 2 మొక్కల గురించి తెలుసుకుందాం

కృత్యం – 8

6th Class Science Textbook Page No. 19

ప్రశ్న 7.
ఆకులో పత్ర రంధ్రమును గమనించండి.
జవాబు:
AP Board 6th Class Science Solutions Chapter 2 మొక్కల గురించి తెలుసుకుందాం 11
లక్ష్యం :
ఆకులో పత్ర రంధ్రమును గమనించడం.

మనకు కావలసింది :
కండగల ఆకు, నీరు, సూక్ష్మదర్శిని, సైడ్.

ఏమి చేయాలి :
కండకలిగిన ఆకు తీసుకోండి. ఆకు యొక్క బయటి పొరను తీసి రక్షక కణాలు సై లో ఉంచండి. దానిపై ఒక చుక్క నీరు వేసి సూక్ష్మదర్శిని క్రింద గమనించండి.

ఏమి గమనిస్తావు :
మనం కొన్ని చిక్కుడు గింజ ఆకారపు భాగాలను కనుగొంటాము.

ఏమి నేర్చుకొంటావు :
చిక్కుడు గింజ ఆకారపు భాగాలు పత్ర రంధ్రములు. ఇవి మానవులకు ముక్కు మాదిరిగా మొక్కల్లో వాయు మార్పిడికి ఉపయోగపడతాయి.

కృత్యం – 9

6th Class Science Textbook Page No. 19

ప్రశ్న 8.
ఎండలో పెరిగే ఆరోగ్యవంతమైన మొక్కను ఎంపిక చేయాలి. పత్రాలు కలిగిన కొమ్మను ఒక పాలిథీన్ సంచిలో బంధించి మూతిని గట్టిగా దారంతో కట్టాలి. మరొక ఖాళీ పాలిథీన్ సంచిని తీసుకుని కొమ్మ లేకుండా మూతిని గట్టిగా దారంతో కట్టాలి. రెండు పాలిథీన్ సంచులను ఎండలో ఉంచండి. కొన్ని గంటల తరవాత పాలిథీన్ సంచుల లోపలి భాగాన్ని పరిశీలించండి. ఏ పాలిథీన్ సంచి లోపలనైనా నీటి బిందువులు ఏర్పడినవా? ఎలా ఏర్పడ్డాయి?
జవాబు:
లక్ష్యం :
అదనపు నీరు ఆకు ఉపరితలం నుండి ఆవిరి రూపంలో తొలగించబడుతుందని గమనించడం.

మనకు కావలసింది :
బాగా నీరు పోసిన మొక్క పాలిథీన్ సంచి, దారం.
AP Board 6th Class Science Solutions Chapter 2 మొక్కల గురించి తెలుసుకుందాం 12

ఏమి చేయాలి :
బాగా నీరు పోసిన మొక్కను తీసుకోండి. మొక్క యొక్క కొమ్మను పాలిథీన్ సంచిలో పెట్టి, దాని మూతిని కట్టండి. మరొక పాలిథీన్ బ్యాగ్ తీసుకొని, ఏ మొక్కను ఉంచకుండా మూతిని కట్టండి. రెండు పాలిథీన్ సంచులను సూర్యుని క్రింద ఉంచండి. కొన్ని గంటల తరువాత రెండు సంచుల లోపలి ఉపరితలాన్ని గమనించండి.

ఏమి గమనిస్తావు :
మొక్క ఉన్న పాలిథీన్ సంచిలో కొన్ని నీటి బిందువులు కనిపిస్తాయి. మరొక పాలిథీన్ సంచిలో బిందువులు లేవు.

ఏమి నేర్చుకొంటావు :
మొక్కలు ఆకుల పత్ర రంధ్రము ద్వారా దేహంలోని అదనపు నీటిని విడుదల చేస్తాయి. దీనినే బాష్పోత్సేకం అంటారు. మొక్కలు నీటిని ఆవిరి రూపంలో విడుదల చేసే ఈ ప్రక్రియను బాష్పోత్సేకము అంటారు.

ప్రాజెక్ట్ పనులు

6th Class Science Textbook Page No. 21

ప్రశ్న 1.
నీ పరిసరాల నుండి ఏదైనా ఒక మొక్కను సేకరించండి. దాని వేరు వ్యవస్థను పటం గీయండి. ఈ వేరు వ్యవస్థను గూర్చి ఏమి చెప్పగలవు?
జవాబు:
AP Board 6th Class Science Solutions Chapter 2 మొక్కల గురించి తెలుసుకుందాం 13

  • మొక్కలో సేకరించిన వేరు వ్యవస్థ తల్లి వేరు వ్యవస్థను చూపుతుంది.
  • ఈ మొక్కలో, ప్రధాన వేరు మందంగా ఉంటుంది మరియు భూమిలోకి నేరుగా పెరుగుతుంది.
  • మరియు తల్లి వేరు నుండి ఉత్పన్నమయ్యే చిన్న వేర్లు (పార్శ్వ వేర్లు) ఉన్నాయి.
  • నేల లోతైన పొరల్లోకి చొచ్చుకుపోవడానికి ఈ వేరు వ్యవస్థ మొక్కకు సహాయపడుతుంది.
    (లేదా)
    AP Board 6th Class Science Solutions Chapter 2 మొక్కల గురించి తెలుసుకుందాం 14
  • మొక్కలో సేకరించిన వేరు వ్యవస్థ గుబురు వేరు వ్యవస్థను ప్రదర్శిస్తుంది.
  • ఈ మొక్కలో అన్ని వేర్లు సన్నగా మరియు పరిమాణంలో ఏకరీతిలో ఉంటాయి.
  • ఈ వేరు వ్యవస్థ కాండం యొక్క పునాది నుండి ఉత్పన్నమయ్యే వేర్లు – సమూహాన్ని కలిగి ఉంటుంది.
  • వేరు వ్యవస్థ మొక్కను మట్టికి గట్టిగా పట్టుకోవటానికి మరియు నేల కోతను నివారించడానికి సహాయపడుతుంది.

ప్రశ్న 2.
వివిధ మొక్కల పత్రాలను సేకరించి, హెర్బేరియం తయారుచేయండి. వాటి ఆకారం, పరిమాణం, ఈ నెల వ్యాపనం గురించి రాయండి.
జవాబు:
విద్యార్థి కృత్యం :
విద్యార్థులు వివిధ ఆకారాలు మరియు ఆకుల పరిమాణాలను సేకరిస్తారు.
AP Board 6th Class Science Solutions Chapter 2 మొక్కల గురించి తెలుసుకుందాం 15

  • హెర్బేరియంలో మొక్కల భాగాల నమూనాలు సేకరించి, ఎండబెట్టి, కాగితముపై అంటిస్తారు.
  • సేకరించిన పత్రాలు వివిధ ఆకారాలు కలిగి వేరు వేరు అంచులు కలిగి ఉన్నాయి.
  • సేకరించిన ఆకులలో కొన్ని జాలాకార ఈనెల వ్యాపనం మరియు సమాంతర ఈ నెల వ్యాపనం కల్గి ఉన్నాయి.

ప్రశ్న 3.
ఎండుటాకులతో ఒక గ్రీటింగ్ కార్డును తయారుచేయండి.
జవాబు:
AP Board 6th Class Science Solutions Chapter 2 మొక్కల గురించి తెలుసుకుందాం 16

  • వివిధ ఆకారాలు మరియు పరిమాణంలో ఉన్న ఎండిన ఆకులు సేకరించుకోవాలి.
  • ఈ ఆకులను అంటించటానికి ఒక అట్ట ముక్కను సిద్ధం చేసుకోవాలి.
  • అట్ట ముక్క మీద ఎండిన ఆకులను నిర్దిష్ట ఆకారంలో అంటించుకోవాలి.
  • అందువలన ఆకులతో అందమైన బొమ్మ ఏర్పడుతుంది.
  • అట్టముక్కకు అందమైన అంచును అతికించటం వలన మనకు కావలసిన అందమైన గ్రీటింగ్ తయారౌతుంది.

AP Board 6th Class Science Solutions Chapter 2 మొక్కల గురించి తెలుసుకుందాం

ప్రశ్న 4.
పచ్చని పత్రాలు, అందమైన పుష్పాలున్న ఏదైనా మొక్కను పరిశీలించండి. ఆ మొక్కను గురించి నీ అనుభూతిని మీ నోటు పుస్తకంలో రాయండి.
జవాబు:

  • ఆరోగ్యకరమైన ఆకుపచ్చ ఆకులు మరియు అందమైన పువ్వులతో కూడిన మొక్కను చూసినప్పుడు మనసు ఉల్లాసభరితమౌతుంది.
  • ఆకుల ఆకుపచ్చ రంగు దృశ్యం ప్రకృతి అందానికి ఆనవాలు.
  • ఆకుపచ్చ రంగు మన కళ్ళకు ఆహ్లాదకరంగా ఉంటుంది. తద్వారా ఇది మన కళ్ళకు చాలా ఆరోగ్యంగా ఉంటుంది.
  • ఆరోగ్యకరమైన మొక్కను చూసినప్పుడు, మన మనస్సు రిఫ్రెష్ అవుతుంది మరియు అన్ని బాధలను మరచి పోవడానికి సహాయపడుతుంది.
  • రంగుల పువ్వులు, వాటి అందం మనకు విశ్రాంతినిస్తాయి. మరియు దాని సువాసన మనకు ఆనందాన్ని ఇస్తుంది.

AP Board 8th Class Social Solutions Chapter 7 ద్రవ్యం, బ్యాంకింగ్

SCERT AP 8th Class Social Study Material Pdf 7th Lesson ద్రవ్యం, బ్యాంకింగ్ Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 7th Lesson ద్రవ్యం, బ్యాంకింగ్

8th Class Social Studies 7th Lesson ద్రవ్యం, బ్యాంకింగ్ Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
కొన్ని లావాదేవీల ఉదాహరణలతో కింది పట్టిక నింపండి. (AS1)
జవాబు:

రూపాయి నోట్లు, నాణాలతో జరిగే లావాదేవీలు రూపాయలు, నాణాలు లేకుండా జరిగే లావాదేవీలు.
1) రైలు ప్రయాణం 1) పల్లెటూర్లలో బల్లకట్టుదాటుట
2) విద్యుత్తు పరికరాల కొనుగోలు 2) ఉప్పు, ముగ్గు కొనుట

ఉదా :

  1. నేను విజయవాడ నుండి హైదరాబాదుకు టిక్కెట్టు కొనుక్కుని రైలులో ప్రయాణం చేశాను.
  2. మా ఇంట్లో 45 రూ||లు ఇచ్చి ట్యూబ్ లైట్ కొన్నాము.
  3. మా ఊరు లక్ష్మీ పోలవరం బల్లకట్టు వానికి, కాలవ దాటించినందుకు సంవత్సరానికి ఒకసారి 2 బస్తాల ఒడ్లు ఇస్తారు మా తాతగారు.
  4. మా అమ్మమ్మ దోసెడు బియ్యానికి శేరు ఉప్పు, దోసెడు బియ్యానికి శేరు ముగు కొంటుంది.

ప్రశ్న 2.
బ్యాంకులో డబ్బు పెట్టడం వల్ల ఏమైనా నష్టాలు, సమస్యలు ఉంటాయా? ఆలోచించి రాయండి. (AS1)
జవాబు:
బ్యాంకులో డబ్బు పెట్టడం వలన సమస్యలు ఎక్కువగా ఉండవు. కాని ఒక్కోసారి యంత్రాల వల్ల, ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల సమస్యలు ఉంటాయి.
ఉదా :

  1. ATM లో డబ్బు తీసుకునేటప్పుడు అనేక సమస్యలు వస్తాయి.
  2. లోన్లు తీసుకున్న వారి అకౌంట్ల నుండి ఒకేసారి 2 ఇన్‌స్టాలుమెంట్లు తీసుకోవడం.
  3. అకౌంట్లను బ్లాక్ చేయడం వంటివి.

AP Board 8th Class Social Solutions Chapter 7 ద్రవ్యం, బ్యాంకింగ్

ప్రశ్న 3.
డబ్బు మార్పిడిని చెక్కులు ఏ విధంగా సులభతరం చేశాయి? (AS1)
జవాబు:
ప్రస్తుతం డబ్బులు చెల్లించటానికి, తీసుకోటానికి చెక్కులను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే ఆ వ్యక్తి పేరుతో చెక్కు ఇస్తారు. వేరే ఊళ్లో ఉన్న వ్యక్తికి డబ్బు పంపించాలంటే ఆమె పేరుమీద చెక్కు రాసి దానిని పోస్టులో పంపించవచ్చు. బ్యాంకు ద్వారా మరొకరి ఖాతాలోకి డబ్బుని బదిలీ చేయటానికి కూడా చెక్కును ఉపయోగించవచ్చు. వ్యాపారాలలో డబ్బులు తీసుకోవటం, చెల్లించటానికి సంబంధించి అనేక లావాదేవీలు ఉంటాయి. ఈ లావాదేవీలలో మాధ్యమంగా చెక్కులు ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఈ విధంగా డబ్బు మార్పిడిని చెక్కులు సులభతరం చేశాయి.

ప్రశ్న 4.
బ్యాంకు తన దగ్గర కొంత డబ్బును మాత్రమే నగదుగా ఉంచుకుంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? దీని వల్ల బ్యాంకుకు లాభం ఏమిటి? (AS1)
జవాబు:
బ్యాంకు తన దగ్గర కొంత డబ్బులు మాత్రమే నగదుగా ఉంచుకుంటుంది. బ్యాంకు ఖాతాదారులు తమ సేవింగ్ ఖాతాలనుండి డబ్బులు తీస్తుంటారు. అలాగే ఫిక్స్ డిపాజిట్ కాలపరిమితి పూర్తయిన వారికి డబ్బులు చెల్లించవలసి ఉంటుంది. కొత్తగా కొందరికి రుణాలు ఇస్తారు. ఐతే తమ దగ్గర ఉంచిన డిపాజిట్ మొత్తాలు ఒకేసారి ఖాతాదారులు తీసుకోరు. అదే సమయంలో వివిధ రూపాలలో బ్యాంకుకు జమలు కూడా వస్తాయి. అందువలన వీరు కొంత డబ్బును మాత్రమే నగదుగా ఉంచుకుంటారు.

ప్రశ్న 5.
ఖాతాదారులలో చాలామంది బ్యాంకులో డబ్బు ఉంచాలని అనుకోకపోతే అది బ్యాంకు పనితీరును ఏ రకంగా ప్రభావితం చేస్తుంది? (AS1)
జవాబు:
ఖాతాదారులలో చాలామంది బ్యాంకులో డబ్బు ఉంచాలని అనుకోకపోతే బ్యాంకులో సొమ్ములు నిల్వ ఉండవు. అపుడు బ్యాంకు ఇతరులకు , అప్పు ఇవ్వలేదు., వారి నుండి వడ్డీలు సేకరించలేదు. దీని మూలంగా బ్యాంకు నిర్వహణ అసాధ్యమైపోతుంది.

ప్రశ్న 6.
బ్యాంకులు అప్పులలో చాలా వాటిని మాఫీ చేస్తే (అంటే అప్పు తీసుకున్న వాళ్లు తిరిగి డబ్బు కట్టాల్సిన అవసరం లేదు) అది బ్యాంకు పని తీరును ఏ రకంగా ప్రభావితం చేస్తుంది? (AS1)
జవాబు:
బ్యాంకు అనేది ఒక వాణిజ్య సంస్థ. డబ్బులు జమ చేసిన వారికి అది వడ్డీ ఇవ్వాలి. ఉద్యోగస్థులకు జీతాలు ఇవ్వాలి, , పరికరాలు కొని, నిర్వహించాలి, అద్దెలు చెల్లించాలి. బ్యాంకు నడపటానికి అయ్యే ఇతర ఖర్చులు భరించాలి. అంతిమంగా లాభాలు సంపాదించాలి.

మరి అప్పులు మాఫీ చేస్తే బ్యాంకు వీటినన్నింటిని చేయలేదు. కావున బ్యాంకులు ఋణాలను మాఫీ చేయలేవు. – ఒకవేళ ప్రభుత్వం మాఫీ చేసినట్లయితే ఆ లోటును ప్రభుత్వం భరించాల్సి వస్తుంది.

ప్రశ్న 7.
ఒక కాలానికి చేసిన ఫిక్స్ డిపాజిట్టుపై ప్రజలకు లభించే వడ్డీ కంటే అదే కాలానికి తీసుకున్న అప్పు పై ఎక్కువ వడ్డీచెల్లించాలి. ఇలా ఎందుకు ఉండాలి? (AS1)
జవాబు:
బ్యాంకుకి ‘ఫిక్స్ డిపాజిట్టు’పై ఇచ్చే వడ్డీ ఖర్చు క్రింద లెక్క అప్పుపై వచ్చే వడ్డీ ఆదాయం. ఖర్చు కన్నా ఆదాయం ఎక్కువైతేనే లాభాలుంటాయి. లేకుంటే బ్యాంకులు నష్టపోతాయి.

AP Board 8th Class Social Solutions Chapter 7 ద్రవ్యం, బ్యాంకింగ్

ప్రశ్న 8.
ఈ సంవత్సరం వర్షాలు ఆశించనంతగా కురవలేదు. ఇలా జరిగినప్పుడు రైతులు తీసుకున్న అప్పులో సగమే తిరిగి చెల్లించాలని కొంతమంది అంటారు. వచ్చే సంవత్సరం పంటను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న అప్పు మొత్తం తిరిగి చెల్లించాలని కొంతమంది అంటారు. మీ అభిప్రాయం ప్రకారం బ్యాంకులు ఏం చేయాలి? మీ కారణాలు పేర్కొనండి. (AS1)
జవాబు:
వానలు తక్కువ పడినా పంటలు బాగానే పండి ఉండవచ్చు. ఒకవేళ పంటలు సగమే పండి ఉంటే రైతులు తీసుకున్న అప్పులో సగమే చెల్లించనివ్వాలి. మిగతా సగాన్ని మరుసటి పంట అప్పుతోపాటు కలిపి తీర్చమనాలి. లేదంటే వీరు వడ్డీ వ్యాపారస్తుల దగ్గరకు, ఇతర మార్వాడీల దగ్గరకు అప్పుకు వెళతారు. వారి చేతుల్లో పడినవారు వారి పొలాన్ని మిగుల్చుకోలేరు.

ప్రశ్న 9.
“అప్పులు రకాలు” శీర్షిక కింద ఉన్న పేరాను చదివి దిగువ ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. మీ ప్రాంతంలో తీసుకున్న రుణాల రకాలను పేర్కొనండి. (AS2)
జవాబు:

  1. పంట ఋణాలు
  2. గృహనిర్మాణ ఋణాలు
  3. స్వయం సహాయక సంఘ ఋణాలు

ప్రశ్న 10.
స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు పొందిన సభ్యులకు రుణాలు ఉపయోగకరంగా ఉన్నాయా? ఎలా? (AS6)
జవాబు:
ఇవి వారికి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి.

  1. ఈ ఋణాలకు వారు హామీ చూపించనవసరం లేదు.
  2. వీటి లావాదేవీలన్నింటికి సంఘం బాధ్యత తీసుకుంటుంది.
  3. వడ్డీ కూడా నామ మాత్రంగానే ఉంటుంది.
  4. నెలనెలా సులభ సమాన వాయిదాలలో చెల్లించవచ్చు.

కృత్యం

మీకు రెండు వేల రూపాయలు అవసరం ఉందనుకోండి. ఒక చెక్కు రాసి మీ చెల్లెలికిచ్చి నగదు తీసుకురమ్మని పంపించండి.
జవాబు:
Self Cheque:

  1. నేను Cheque నా చెల్లి పేరు మీద వ్రాస్తాను. మరియు నాకు 2000 కావాలి అన్నట్లుగా amount ను వ్రాస్తాను.
  2. నేను ఆ చెక్కు క్రింద భాగంలోనూ మరియు వెనుక భాగంలోనూ సంతకం చేసి మా చెల్లెలికి ఇచ్చి బ్యాంకుకు వెళ్ళి నగదు తీసుకురమ్మని పంపిస్తాను. ఆమెకు చెక్కు ఎక్కడ ఇవ్వాలి నగదు ఎక్కడ తీసుకోవాలో నేను చెప్పి పంపిస్తాను.
  3. ఇలా చెక్కును నగదుగా మార్చడానికి మా చెల్లికి బ్యాంకులో ఎలాంటి account ను maintain చేయనవసరం లేదు.

Cross Cheque :
ఒకవేళ నేను amount cross cheque మీద వ్రాస్తే మా చెల్లికి ఈ Cheque ని Cash గా మార్చడానికి ఏదో ఒక Bank లో account ఉండి తీరాలి.

8th Class Social Studies 7th Lesson ద్రవ్యం, బ్యాంకింగ్ InText Questions and Answers

8th Class Social Textbook Page No.77

ప్రశ్న 1.
డబ్బులు లేకుండా జరిగే మార్పిడులు ఏమైనా మీకు తెలుసా?
జవాబు:
“బార్టరు విధానం” గురించి నాకు తెలుసు. వస్తువులను వస్తువులతోనే మార్చుకొనే విధానమే ఇది.

ప్రశ్న 2.
పాతబట్టలు, ప్లాస్టిక్ సామాను, దిన పత్రికలు, వెంట్రుకలు, ధాన్యం ఇచ్చి ఏమైనా వస్తువులు మీరు కొని ఉండవచ్చు. ఈ లావాదేవీలు ఎలా జరిగాయో చర్చించండి.
జవాబు:
పాతబట్టలు : వీటిని మార్చి మేము స్టీలు సామాను తీసుకుంటాము. ఇది సామానులు అమ్మేవారి ఇష్టం పైనే ఎక్కువగా ఆధారపడి ఉంది.

ప్లాస్టిక్ సామాన్లు, దిన పత్రికలు : వీటిని ఇచ్చి మేము ఉల్లిపాయలు తీసుకుంటాము. 1 కే.జీ.కి 1½ కే.జీ ఉల్లిపాయలు ఇస్తారు.

వెంట్రుకలు : వెంట్రుకలు ఇస్తే డబ్బులు ఇస్తారు.

ధాన్యం : మా ఊళ్ళో ధాన్యం చాకలివాళ్ళకు, మంగలి వాళ్ళకు ఇచ్చి వారిచే పనులు చేయించుకుంటాము.

8th Class Social Textbook Page No.78

ప్రశ్న 3.
ఖాళీలు పూరించండి.
గోపాల్ తన మేకను …………… ఇచ్చి …………… తీసుకుంటే అప్పుడు గోపాల్ ఈ డబ్బును ఉపయోగించి ………. నుంచి బియ్యం కొంటాడు. ఇప్పుడు ….. ఈ డబ్బుతో శీను నుంచి …… కొంటాడు.
జవాబు:
శీనుకు, డబ్బులు, రాము, రాము, గోధుమలు

AP Board 8th Class Social Solutions Chapter 7 ద్రవ్యం, బ్యాంకింగ్

ప్రశ్న 4.
గ్రామాలలో, పట్టణాలలో బట్టలు ఉతికే వాళ్లు, జుట్టు కత్తిరించేవాళ్లు, నీరటి వారు (చెరువు నీటిని కావలి కాసేవారు) మొదలగువారి పనికి వేతనం ఎలా చెల్లిస్తారా? మీ తల్లిదండ్రులను అడిగి తెలుసుకోండి.
జవాబు:
ఈ రోజుల్లో మా తల్లిదండ్రులు వారి పనికి డబ్బు రూపంలోనే వేతనాలు చెల్లిస్తున్నారు. కాని, 15 సం||రాల క్రితం వరకు వారికి ధాన్యం రూపంలోనే డబ్బులు చెల్లించేవారట.

ప్రశ్న 5.
ఈ పట్టిక పూరించండి :
AP Board 8th Class Social Solutions Chapter 7 ద్రవ్యం, బ్యాంకింగ్ 1
1. పై పట్టిక నుంచి మీరు ఏ నిర్ధారణకు వస్తారు?
జవాబు:
వీరి మధ్యలో అమ్మకం కష్టసాధ్యం

2. గోపాలకు, శీనుకు మధ్య వస్తుమార్పిడికి ఎందుకు వీలుకాదో మీ సొంతమాటల్లో వివరించండి.
జవాబు:
గోపాలుకు బియ్యం కావాలి. శీనుకు మేక అవసరం లేదు, గోధుమలు కావాలి.

3. డబ్బు వినియోగం దీనికి సహాయపడుతుందా?
జవాబు:
డబ్బు వినియోగం వీటికి సహాయపడుతుంది.

ప్రశ్న 6.
గోపాల్, శీను, రాముల మధ్య లావాదేవీలో డబ్బు ఎలా ఉపయోగపడుతుంది? ఫ్లో చార్ట్ సహాయంతో వివరించండి.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 7 ద్రవ్యం, బ్యాంకింగ్ 2

ప్రశ్న 7.
పైన వివరించిన విధంగా డబ్బు మార్పిడి మాద్యమంగా పనిచేయటం అనే దానితో మీరు ఏకీభవిస్తారా. కారణాలతో వివరించండి.
జవాబు:
డబ్బు పాత్ర మార్పిడి మాధ్యమంగా పనిచేయడంతో నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే వస్తుమార్పిడిలో వస్తువుల విలువలలో తేడా ఉంటుంది. కాబట్టి అది సరియైన విధంగా ఉండదు. అందువలన నేను ఈ విషయంతో ఏకీభవిస్తున్నాను.

8th Class Social Textbook Page No.79

ప్రశ్న 8.
తన మేకను గోపాల్ ఎంత బియ్యంతో మార్చుకోవాలి?
జవాబు:
ఇది మేకకున్న డిమాండ్ ను బట్టి ఉంటుంది. ఆ రోజు మేకను కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఎక్కువమంది ఉంటే అది గోపాల్ చెప్పిన తూకంలో బియ్యం ఇవ్వాలి. లేదంటే బియ్యం అమ్మకందారు చెప్పిన లెక్కలోనే మార్చుకోవాలి.

ప్రశ్న 9.
వస్తు మార్పిడి వ్యవస్థలో మీ జుట్టు కత్తిరించిన వ్యక్తికి ఎలా చెల్లిస్తారు? చర్చించండి.
జవాబు:
వస్తు మార్పిడిలో నా జుట్టు కత్తిరించిన వ్యక్తికి ఒక కిలో బియ్యం ఇస్తాను. ఒక కిలో బియ్యం ఖరీదు రూ. 30/- అలాగే జుట్టు కత్తిరింపుకు కూడా 30/- ఇవ్వవచ్చు.

ప్రశ్న 10.
పైన ఇచ్చిన ఉదాహరణలతో లావాదేవీ పూర్తయ్యేలా సంభాషణను పూర్తిచేయండి.
జవాబు:
గోపాల్ : ఈ మేకకు ఎన్ని బస్తాల బియ్యం ఇస్తావు?

సీతయ్య : నాలుగు బస్తాలు.

గోపాల్ : నాకు రెండు బస్తాల బియ్యం, రెండు బస్తాల గోధుమలు ఇవ్వు.

సీతయ్య : నా దగ్గర గోధుమలు లేవు. కావాలంటే వంటనూనె, పప్పుధాన్యాలు ఇస్తాను.

గోపాల్ : నాకు పప్పుధాన్యాలు అవసరం లేదు చెక్కర కావాలి.

సీతయ్య : అయితే మేకను ఇచ్చి తీసుకొని వెళ్లు.

గోపాల్ : తీసుకో

ప్రశ్న 11.
మీరు, వ్యాపారస్తులు సంతలలో డబ్బు వినియోగించకపోతే ఏమవుతుంది? ఒక పేరాలో వివరించండి.
జవాబు:
ప్రస్తుత కాలంలో డబ్బు మంచి మాధ్యమంగా ఉపయోగపడుతుంది. ఇదే గనక లేకపోతే మార్కెట్టు మొత్తం అస్తవ్యస్తం అవుతుంది. కనీసం ఒక్కో వస్తువుకు, లేదా సరుకుకు విలువ నిర్ణయించాలన్నా కష్టసాధ్యమవుతుంది. పైగా యిపుడందరూ రైతులు కూడా కాదు. ఉద్యోగస్థుల దగ్గర మార్పిడికి డబ్బు తప్ప ఏమీ ఉండదు. కనుక అమ్మకం, కొనుగోళ్ళు మొత్తం అయోమయంలో పడిపోతాయి.

ప్రశ్న 12.
సరుకులు, సేవల విలువను డబ్బుతో అంచనా వేయవచ్చా? వివరించండి.
జవాబు:
వస్తువుల విలువను డబ్బుతో అంచనా వేయవచ్చు. ప్రభుత్వ సేవలు, ప్రైవేటు సేవలను కూడా డబ్బుతో అంచనా వేయవచ్చు. కాని తల్లిదండ్రులు, ఇతర రక్త సంబంధీకులు చేసిన సేవలను డబ్బుతో అంచనా వేయలేము. వేయరాదు.
ఉదా :
ప్రభుత్వ సేవలు : 1) రవాణా – (APSRTC), 2) వైద్యం – ప్రభుత్వ ఆసుపత్రులు.

ప్రైవేటు సేవలు : 1) రవాణా – ప్రైవేటు బస్సులు, 2) వైద్యం – ప్రైవేటు ఆసుపత్రులు.

AP Board 8th Class Social Solutions Chapter 7 ద్రవ్యం, బ్యాంకింగ్

ప్రశ్న 13.
i) హరి టమాటాలు, బెండకాయలు, ఆకుకూరలు వంటి కూరగాయలు పండిస్తాడు. మూడు నెలల తరవాత అతడు ఎరువులు కొనుక్కోవాలి. కూరగాయలు ఇచ్చి ఎరువులు తీసుకోటానికి అప్పటిదాకా వాటిని నిలవ ఉంచలేదు. డబ్బు ఉపయోగించకపోతే ఎరువులు సరఫరా చేసే వ్యక్తితో హరి ఎటువంటి ఒప్పందం చేసుకుంటాడు?
జవాబు:
హరి తను పండించిన కూరగాయలు అప్పటి ధరకు ఎరువుల అమ్మకందారుకు ఇచ్చివేయాలి. 3 నెలల తరువాత ఆ విలువకు సరిపడా ఎరువులను ఇమ్మని ఒప్పందం చేసుకోవాలి.

ii) మీ చుట్టుపక్కల గ్రామాల్లో ఇటువంటి ఏర్పాట్లు ఇంకా ఉన్నాయా?
జవాబు:
మా చుట్టుపక్కల గ్రామాల్లో ఇటువంటి ఏర్పాట్లు లేవు.

iii) ఇటువంటి ఏర్పాట్లు చాలాసార్లు రైతులకు లాభసాటిగా ఉండకపోవచ్చు. చర్చించంది.
జవాబు:
ఇవి రైతులకు లాభసాటివి అయినవి కావు. కాలాన్ని బట్టి విలువలలో తేడా వస్తాయి. కాబట్టి వీటికి ప్రత్యామ్నాయాన్ని ఆలోచించాలి.

8th Class Social Textbook Page No.80

ప్రశ్న 14.
డబ్బుగా లోహాలను ఎందుకు ఎంచుకున్నారు?
జవాబు:
రాగి, ఇత్తడి, వెండి, బంగారం వంటి లోహాలు పాడవ్వకుండా చాలాకాలం ఉంటాయి. వీటిని చిన్నభాగాలుగా చేయవచ్చు. తేలికగా రవాణా చేయవచ్చు. ఇది కొరతవస్తువు కాబట్టి అందరూ దీనిని ఆమోదిస్తారు. అందువలన డబ్బుగా లోహాలను ఎంచుకున్నారు.

ప్రశ్న 15.
నాణాలను ముద్రించటం మంచి ఆలోచనేనా?
జవాబు:
వాటి నాణ్యత, తూకం, మన్నిక సరిగా ఉండాలి. అపుడు నాణాలను ముద్రించటం మంచి ఆలోచనే అవుతుంది.

ప్రశ్న 16.
నాణాలను ముద్రించటం వల్ల పాలకులకు ఎటువంటి ప్రయోజనం ఉంటుంది? మూడు విభిన్న కారణాలను పేర్కొనండి.
జవాబు:
నాణాలను ముద్రించడం వల్ల పాలకులకు కలిగే ప్రయోజనాలు :

  1. వీరి రాజ్యంలో క్రయ, విక్రయాలు, ఇతర లావాదేవీలు సక్రమంగా జరుగుతాయి. దాంతో రాజుల ఖజానాలు, నిండుతాయి.
  2. వీటి తయారీ వలన కూడా వీరికి ఆదాయం లభిస్తుంది. టంకశాల వారికి ఒక ఆదాయ వనరు.
  3. ఈ నాణేల మీద వీరి అభిరుచుల ప్రకారం డిజైన్లు ముద్రిస్తారు. వీటిని చూసిన భవిష్యత్తు తరాల వారికి, వీరి వివరాలు తెలుస్తాయి.
    ఉదా :
    వాయిద్యాల బొమ్మలుంటే సంగీత ప్రియులని, దేవాలయాల బొమ్మలుంటే దైవ భక్తులని అర్థం చేసుకోవచ్చు.

8th Class Social Textbook Page No.82

ప్రశ్న 17.
స్వర్ణకారులపై నమ్మకం విఫలమయ్యే సందర్భాలు ఏమిటి?
జవాబు:
స్వర్ణకారుడు నాణ్యమైన నాణేలను ఇవ్వకపోయినా, లేదా అడిగిన వెంటనే ఇవ్వకపోయినా, విలువను తగ్గించి ఇచ్చినా లేదా ఏదైనా మోసంచేసే ప్రయత్నం చేసినా వారిపై నమ్మకం విఫలమవుతుంది.

ప్రశ్న 18.
ఆమ్ స్టర్ డాంలో వర్తకులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు? వాటికి వాళ్ళు ఏ పరిష్కారం కనుగొన్నారు?
జవాబు:
1606లో యూరప్ లో ఆమ్ స్టడాం ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేది. ఇక్కడ మార్పిడికి ప్రభుత్వం ఆమోదించిన 846 రకాల బంగారు, వెండి నాణాలు ఉండేవి. అయితే వ్యాపారస్తులు ఒకరినొకరు అనుమానిస్తూ ఉండేవాళ్లు – ఈ నాణాల బరువు, నాణ్యతల పట్ల ఎవరికీ నమ్మకం ఉండేది కాదు. ఆమ్ స్టడాం వర్తకులందరూ సమావేశమై ఈ సమస్యకు ప్రత్యేక పరిష్కారాన్ని కనుగొన్నారు. ఆ నగర యాజమాన్యంలో ఉండే ఒక బ్యాంకును వాళ్లు స్థాపించారు.

ప్రశ్న 19.
మీరు ఎప్పుడైనా బ్యాంకు లోపలకు వెళ్లారా? మీకు తెలిసిన కొన్ని బ్యాంకుల పేర్లు చెప్పండి.
జవాబు:
బ్యాంకుల పేర్లు : –

  1. సిండికేట్ బ్యాంక్
  2. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
  3. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైద్రాబాద్
  4. ఇండియన్ బ్యాంక్
  5. విజయా బ్యాంక్
  6. దేనా బ్యాంక్
  7. కనకదుర్గా గ్రామీణ బ్యాంక్

ప్రశ్న 20.
మీరు బ్యాంకు లోపలికి వెళితే వివిధ కౌంటర్ల దగ్గర ఖాతాపుస్తకాలు కంప్యూటర్ల సహాయంతో ఖాతాదారులతో వ్యవహరించే ఉద్యోగస్తులు కనపడతారు. కొన్ని కౌంటర్ల దగ్గర ఖాతాదారులు డబ్బులు జమ చేయటం, కొన్నింటి దగ్గర డబ్బు తీసుకోవటం కూడా చూసి ఉంటారు. ఒక క్యాబిన్లో బ్యాంకు మేనేజరు కూర్చుని ఉంటారు. ఈ బ్యాంకు ఉద్యోగస్టులు ఏం చేస్తారు?
జవాబు:
నా పేరు సురేష్ నేను ఒకసారి మా అమ్మగారితో కామారెడ్డిలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు వెళ్ళాను. అక్కడ ఉన్న అద్దాల గదిలో ఒక పెద్దాయన కూర్చుని ఉన్నారు. ఆయన ముందు బల్లమీద

అనసింగరాజు వేంకట నర్సయ్య
బ్రాంచి మేనేజరు

అని రాసి ఉన్న చెక్క పలక ఉన్నది. ఆయన ఎవరితోనో మాట్లాడుతూ, పేపర్లు చూస్తూ ఉన్నారు. మా అమ్మగారు శ్యామల గారు బ్యాంకు నుండి డబ్బులు తీయడానికి వచ్చారు. బ్యాంకులో “విత్ డ్రాయల్ కాగితాన్ని” అడిగి తీసుకుని దాన్ని పూర్తిచేసారు. ఆ కాగితాన్ని, బ్యాంకు పాస్ పుక్కును కౌంటరు ‘2’ వ నంబరులో ఇచ్చారు. ఆ కౌంటర్లో ఉద్యోగి దానిని పరిశీలించి, సంతకం చేసి ఒక ‘టోకెన్’ను (4వ నంబరు) మా అమ్మగార్కి ఇచ్చారు. మేము అక్కడే ఉన్న సోఫా మీద కూర్చున్నాము. ఇంతలో మాకు తెలిసిన ఒకాయన యజ్ఞయ్యగారు వచ్చి “డిపాజిట్ కాగితం”ను తీసుకుని కొంతసొమ్మును జమచేసి, మమ్మల్ని పలకరించి వెళ్ళిపోయారు. మా అన్నయ్య వాళ్ళ స్నేహితుడు రామకృష్ణ కొత్త అకౌంటు తెరవటానికి బ్యాంకుకి వచ్చి వివరాలు తెలుసుకుంటున్నాడు. బ్యాంకువారు అతనికి ఏమేం కావాలో వివరాలు చెబుతున్నారు.

బ్యాంకు ఉద్యోగస్తులు డి.డి.లు రాయటం, అకౌంట్లను పరిశీలించటం, కొత్త ఖాతాల వివరాలను నమోదుచేసుకోవడం, ఎవరైనా లాకర్లు తెరవాలని వస్తే వారికి సహకరించడం మొదలైన పనులన్నీ చేస్తున్నారు. ఇంతలో 6వ నంబరు కౌంటరు నుండి “నంబరు 4” అన్న పిలుపు వినపడింది. మా అమ్మగారు, నేను ఆ కౌంటరుకు వెళ్ళి టోకెన్ ఇచ్చి డబ్బులు తెచ్చుకున్నాము. మేనేజరుగారు బ్యాంకు విధి, విధానాలను పరిశీలిస్తూ, సమస్యలేమైనా ఉంటే వాటిని తీరుస్తారని మా అమ్మగారు చెప్పారు.

AP Board 8th Class Social Solutions Chapter 7 ద్రవ్యం, బ్యాంకింగ్

ప్రశ్న 21.
ప్రస్తుత కాలంలో రూపాయల నోట్ల మీద ఉండే హామీని చదవండి. ఎవరు హామీ ఇస్తున్నారు? ఎవరికి? ఇది ఎందుకు ముఖ్యం? చర్చించండి.
జవాబు:
100 రూపాయల నోటు మీద ఈ క్రింది హామీ ఉంది. “I promise to pay the bearer the sum of one Hundred Rupees”.
Governor.

ఈ హామీని రిజర్వు బ్యాంకు గవర్నరుగారు ఇస్తున్నారు. ఈ హామీ ఆ నోటు స్వంతదారునికి ఇస్తున్నారు. ఇది లేకపోతే ఈ నోటు కాగితంతో సమానం. కాబట్టి ఇది చాలా ముఖ్యం.

ప్రశ్న 22.
రెండు శతాబ్దాల తరవాత ఆమ్ స్టర్ డాం బ్యాంకు కుప్పకూలిపోయింది. దానికి కారణాలు ఏమై ఉంటాయి? చర్చించండి.
జవాబు:
‘ఆమ్ స్టర్ డాం బ్యాంకు యొక్క అనుబంధ బ్యాంకులు నాడు అన్ని ఐరోపా దేశాలలోనూ ఉండేవి. అది డలో విసెల్ – బ్యాంకుగా ఉండేది. ఇక్కడ తరుచు డబ్బు విలువ పడిపోతూ ఉండేది. దీనివలన బ్యాంకులో దాచుకున్నవారు తాము ఆశించిన దానికంటే తక్కువ నాణేలు పొందేవారు. వీరు నిరుత్సాహానికి గురయ్యేవారు. ఇది చిన్నదేశం కావడం మూలాన తరచూ విలువ పడిపోతూ ఉండేది. దీని మూలంగా ‘ఆమ్ స్టర్ బ్యాంకు’ పేరు దెబ్బతిన్నది.

4వ ఆంగ్లో – డచ్ యుద్ధం తరువాత, బ్రిటను ఆసియా ఖండంలో వలసలను ఏర్పాటు చేసుకుంది. దీనివలన డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తకం దెబ్బతింది. వీరికి అందరికీ అప్పులు ఇచ్చిన బ్యాంకు ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నది. 4 సం||రాల వ్యవధిలో బ్యాంకులోని ఇరవై మిలియన్ల నాణేల సంఖ్య ఆరు మిలియన్లకు పడిపోయింది. ఫ్రెంచి విప్లవం దీనిని పూర్తిగా దెబ్బతీసింది. చివరికి 1819లో ఈ బ్యాంకు మూతపడింది.

ప్రశ్న 23.
గీత ATM కి వెళ్ళి డబ్బు ఎలా తీసుకోవచ్చు?
AP Board 8th Class Social Solutions Chapter 7 ద్రవ్యం, బ్యాంకింగ్ 6
జవాబు:
(1)గీత ATM ఉన్న గదిలోకి వెళ్ళి స్క్రీన్ సరిగా ఉందో లేదో సరిచూసుకుని, కార్డుని లోపలకి ఉంచాలి. (2) తరువాత స్క్రీన్ మీద వచ్చే వివరాలను చదువుతూ తన పిన్ నంబరు, కావలసిన సొమ్ము వివరాలను టైపు చెయ్యాలి. (3) తరువాత బయటకు వచ్చిన సొమ్మును తీసుకోవాలి. (4) దాని తరువాత వచ్చే రశీదును తీసుకుని ‘clear’ అనే మాటని నొక్కి వచ్చేయాలి.

ప్రశ్న 24.
ఆమె తన ఖాతా ఉన్న బ్యాంకుకు వెళ్లి డబ్బు ఎలా తీసుకోవచ్చు?
జవాబు:
ఆమె తన ఖాతా ఉన్న బ్యాంకుకి వెళితే ‘విత్ డ్రాయల్ స్లిప్’ తీసుకుని, తనకు కావలసిన సొమ్ము రాసి సంతకం చేసి పాసు తో కలిపి కౌంటర్లో ఇస్తుంది. తర్వాత వరుస ప్రకారం వారు పిలిచినప్పుడు వెళ్ళి డబ్బులు తీసుకుంటుంది.

8th Class Social Textbook Page No.84

ప్రశ్న 25.
మీ నోట్ పుస్తకంలో బ్యాంకు చెక్కు చిత్రాన్ని గీసి మీ ప్రక్కన కూర్చున్న స్నేహితుని పేరు మీద 1,50,000 రూపాయలకు ఒక చెక్కు రాయండి.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 7 ద్రవ్యం, బ్యాంకింగ్ 3

ప్రశ్న 26.
కంచర్ల సుజాత ఖాతాకు సురేష్ 1,75,000/- రూపాయలను ఎలక్ట్రానిక్ పద్దతిలో డిపాజిట్ చేయాలి. అది ఎలా జరుగుతుంది. అందుకు అతనికి ఏ సమాచారం అవసరం ? బ్యాంకును సందర్శించి వివరాలు రాయండి.
జవాబు:

  1. ఇలా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా జరుగుతుంది.
  2. దీనికొరకు ఇద్దరికీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అవసరం.
  3. కంచర్ల సుజాత ఖాతా నెంబరు, సురేష్ కు తెలిసి ఉండాలి.

ప్రశ్న 27.
చెక్కు ఉపయోగించకుండా ఎలక్ట్రానిక్ పద్ధతిలో బ్యాంకు ద్వారా నేరుగా ఏఏ చెల్లింపులు చేస్తారో చర్చించి, వాటి జాబితా తయారుచేయండి.
జవాబు:
ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెక్కునుపయోగించకుండా బ్యాంకు ద్వారా నేరుగా అనేక చెల్లింపులు చేయవచ్చు. అవి:

  1. వస్తువుల కొనుగోలు, అమ్మకం
  2. పెట్టుబడులు పెట్టుట
  3. అప్పులు చెల్లించుట
  4. కరెంటు, ఫోను బిల్లుల చెల్లింపు
  5. డబ్బులు బదిలీ చేయుట
  6. ఇన్‌కంటాక్స్ చెల్లించుట
  7. ఇంటిపన్నులు మొ||నవి చెల్లించుట

ప్రశ్న 28.
పొదుపు ఖాతా, కరెంటు ఖాతాల మధ్య తేడాలు ఏమిటి?
జవాబు:
పొదుపు ఖాతా :
ఉద్యోగస్టులు మొ||న వారు ఈ ఖాతాని కలిగి ఉంటారు. పొదుపు ఖాతాలోని సొమ్ముపై కొంత వడ్డీ వస్తుంది. డబ్బు క్షేమంగా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు తీసుకోవచ్చు. అడిగినప్పుడు డబ్బు చెల్లిస్తానన్న హామీ బ్యాంకు ఇస్తుంది.

కరెంటు ఖాతా :
వ్యాపారస్థులు మొ||న వారు ఈ ఖాతాను కలిగి ఉంటారు. ఈ ఖాతా నుంచి ఎన్నిసార్లయినా డబ్బులు తీయవచ్చు. జమ చేయవచ్చు. ప్రత్యేకమైన పరిమితి ఏమీలేదు. అయితే దీనిలో ఉన్న సొమ్ముకు వడ్డీ రాదు. అదనంగా సేవా రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

AP Board 8th Class Social Solutions Chapter 7 ద్రవ్యం, బ్యాంకింగ్

ప్రశ్న 29.
స్వర్ణకారులు ఇచ్చిన రశీదులు డబ్బుగా ఎందుకు పనిచేస్తాయి?
జవాబు:
స్వర్ణకారుడు తగిన రుసుము తీసుకుని, వాటిని భద్రపరచి వారు కోరినపుడు వాటిని అందుబాటులో ఉంచేవాడు. ఈ విధానం ప్రాచుర్యం పొందింది. స్వర్ణకారుల మీద, అకౌంటెంట్ల మీద నమ్మకం పెరిగింది. వీరికి అనేక పట్టణాలలో శాఖలుండేవి. ఈ విధానం ‘కాగితపు డబ్బు’ లేదా ‘హుండీ’ లకు దారి తీసింది. వీరి మీద ఉన్న నమ్మకం కొద్దీ ఈ రశీదులు కూడా డబ్బుగా పనిచేస్తాయి.

ప్రశ్న 30.
క్రాస్ చేసిన చెక్కు ఇవ్వటం ఎందుకు మంచిది? చర్చించండి.
(లేదా)
బ్యాంకు లావాదేవీలు జరిపేటప్పుడు చెక్కులను క్రాస్ చేసి ఇవ్వడం మంచిది. ఎందుకు?
జవాబు:
చెక్కును ఎడమచేతి వైపు పై భాగాన మూలంగా, ఆ చెక్కు ఇవ్వబడిన వారి పేరు మీద అకౌంటు ఉంటేనే అది డబ్బుగా మార్చి ఆ అకౌంటులో వేస్తారు. ఇది ఇచ్చేవారికి, పుచ్చుకునే వారికి కూడా నమ్మకం కలిగించే అంశం. లేదంటే దీనిని , దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది.

8th Class Social Textbook Page No.86

ప్రశ్న 31.
వరుస-ఎ లో ఉన్న వాటిని వరుస-బి లోని వాటితో జతపరచండి.
జవాబు:

వరుస -ఎ వరుస – బి
అ) మనం నగదు తీసుకువెళ్లాల్సిన అవసరం లేకుండా మన ఖాతాలోంచి చెల్లింపులు చేయటానికి వీలు కల్పించే బ్యాంకింగ్ సౌకర్యం i) ఎటిఎం
ఆ) రోజులో 24 గంటలలో ఎప్పుడైనా డబ్బులు జమ చేయటానికి, తీసుకోటానికి వీలు కల్పించే బ్యాంకింగ్ సౌకర్యం ii) ఫోన్ బ్యాంకింగ్
ఇ) ఇంటర్నెట్ ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించటానికి iii) క్రెడిట్ కార్డ్
ఈ) ఈ సౌకర్యం ఉపయోగించి మొబైల్ ఫోను ద్వారా మన ఖాతాలో ఎంత సొమ్ము ఉందో తెలుసుకోవచ్చు iv) డెబిట్ కార్డ్
ఉ) ఈ సౌకర్యం ఉపయోగించి రకరకాల చెల్లింపులు చేయవచ్చు. v) నెట్ బ్యాంకింగ్

జవాబు:
అ – iv, ఆ – i, ఇ – V, ఈ – ii, ఉ – iii

ప్రశ్న 32.
పొదుపు కోసం ఫిక్స్ డిపాజిట్టును ఎపుడు ఎంచుకోవాలి?
జవాబు:
డిపాజిట్లు చేసిన పొదుపు మొత్తాన్ని నిర్ణీత గడువు లోపల తీయరాదు. అలాంటి అవకాశం ఉన్నప్పుడే పొదుపు కోసం ఫిక్స్ డిపాజిట్ ను ఎంచుకోవాలి.

ప్రశ్న 33.
వడ్డీ 8% అయితే, 5 సం||రాల తరవాత మనస్వినికి ఎంత డబ్బు వస్తుంది?
జవాబు:
వడ్డీ 8% అయితే, 5 సం||రాల తరవాత మనస్వినికి దాదాపు 15,000 రూ||లు వస్తుంది.

ప్రశ్న 34.
వైద్య ఖర్చుల కోసం ఆమెకు అత్యవసరంగా డబ్బులు అవసరమయ్యాయని అనుకుందాం. బ్యాంకులో ఉన్న ఫి’ డిపాజిట్ నుంచి ఆ మొత్తాన్ని ఆమె తీసుకోవచ్చా? ఏమవుతుంది?
జవాబు:
మనస్విని ఆ మొత్తాన్ని తీసుకోవచ్చు. కాని ఆమెకు 8% వడ్డీ రాదు. బ్యాంకు నిబంధనల ప్రకారం తక్కువ శాతం వడ్డీతో తీసుకోవాలి.

8th Class Social Textbook Page No.87

ప్రశ్న 35.
బ్యాంకు నుంచి అప్పు తీసుకునే వాళ్లందరి నుంచి ఒకే రకమైన వడ్డీ వసూలు చేస్తారా?
జవాబు:
బ్యాంకు నుంచి అప్పు తీసుకునే వాళ్లందరి నుంచి ఒకే రకమైన వడ్డీ వసూలు చేయరు. గృహ ఋణాలకు ఒకరకం, విద్యా ఋణాలకు, వ్యక్తిగత ఋణాలకు మరోరకంగా వసూలు చేస్తారు.

ప్రశ్న 36.
అప్పు తీసుకున్నవాళ్ళు ఎవరైనా తిరిగి బ్యాంకుకు చెల్లించకపోతే ఏమవుతుంది?
జవాబు:
వారు బ్యాంకుకి హామీ ఇచ్చిన దాని నుండి, లేదా ఇచ్చిన బ్యాంకు నుండి బ్యాంకు వసూలు చేసుకుంటుంది.
ఉదా :
గృహఋణం తీసుకున్నవారు తిరిగి చెల్లించకపోతే, వారి ఇంటిని వేలంవేసి తన బాకీని చెల్లించి, మిగతా సొమ్మును వారికిస్తుంది.

8th Class Social Textbook Page No.88

ప్రశ్న 37.
వ్యక్తిగతంగా తీసుకునే అప్పుకు, స్వయం సహాయక సంఘంగా తీసుకునే అప్పుకు తేడా ఏమిటి?
జవాబు:
వ్యక్తిగతంగా అప్పు తీసుకునే వారు బ్యాంకుకి తగిన హామీని చూపించాలి.
స్వయం సహాయక సంఘం తీసుకునే అప్పుకు హామీకోసం ఎటువంటివి చూపించాల్సిన అవసరం లేదు.

AP Board 8th Class Social Solutions Chapter 7 ద్రవ్యం, బ్యాంకింగ్

ప్రశ్న 38.
అప్పు తీసుకోవడానికి బ్యాంకులు మంచివా, వడ్డీ వ్యాపారస్తులా? ఎందుకు?
(లేదా)
ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకుల ద్వారా ఋణాలు పొందడం మంచిదా? వడ్డీ వ్యాపారస్తుల ద్వారా ఋణం పొందడం మంచిదా? మీ సమాధానాన్ని సమర్థిస్తూ 4 వాక్యాలు రాయండి.
జవాబు:
అప్పు తీసుకోవడానికి బ్యాంకులే మంచివి. కారణాలు :

  1. బ్యాంకు వారి వడ్డీ సులభతరంగా ఉంటుంది.
  2. నెలవారీ వాయిదాలలో చెల్లించవచ్చు.
  3. తిరిగి చెల్లించలేని పక్షంలో వీరు ఋణగ్రహీతలకు ఎక్కువ సమయం ఇస్తారు.

పట నైపుణ్యాలు

ప్రశ్న 39.
దిగువనీయబడిన భారతదేశ పటంలో తొలి బ్యాంకర్ల ప్రదేశాలను గుర్తించుము.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 7 ద్రవ్యం, బ్యాంకింగ్ 5

ప్రాజెక్టు

బ్యాంకుకు వెళ్లండి, లేదా బ్యాంకు అధికారిని మీ బడికి ఆహ్వానించి ఈ కింది విషయాలు తెలుసుకోండి.
అ) మీ పేరుతో పొదుపు ఖాతా తెరిచే విధానం
ఆ) బ్యాంకులు చెక్కుల మొత్తాలను ఎలా చెల్లిస్తాయి?
ఇ) నెస్ట్ (NEFT) బదిలీలను బ్యాంకులు ఎలా చేస్తాయి? (National Electronic Funds Transfer)
ఈ) ఎటిఎం పనిచేయటానికి భద్రతాపరంగా ఎటువంటి జాగ్రత్తలు అవసరం?
ఉ) చెక్కుల ద్వారానే కాకుండా డ్రాఫ్టులు / ఆన్లైన్ లావాదేవీల ద్వారా కూడా డబ్బులు బదిలీ చేయవచ్చు. ఆ వివరాలు తెలుసుకోండి.
ఊ) డబ్బులు పొందవలసిన వ్యక్తికి చెక్కుతో పోలిస్తే ఆన్ లైన్ లావాదేవీ వల్ల ప్రయోజనం ఏమిటి?
ఋ) వివిధ రకాల అప్పులకు వర్తించే వడ్డీ

పొదుపు డిపాజిట్లపై చెల్లించే వడ్డీ
ఫిక్స్ డిపాజిట్టుపై చెల్లించే వడ్డీ
రైతులకు ఇచ్చే అప్పులపై వడ్డీ
గృహ ఋణాలపై వసూలు చేసే వడ్డీ
విద్యా ఋణాలపై వసూలు చేసే వడ్డీ

జవాబు:
అ) రెండు ఫోటోలు, నివాస గృహానికి సంబంధించిన ఋజువు, గుర్తింపు పత్రంతో బ్యాంకుకి వెళ్ళి దరఖాస్తును నింపాలి. బ్యాంకులో అంతకుముందే ఖాతా ఉన్నవారిచే పరిచయ సంతకం తీసుకోవాలి. తర్వాత బ్యాంకులో ఈ పత్రాలు ఇస్తే అకౌంటు ఓపెన్ చేస్తారు.

ఆ) బ్యాంకులు చెక్కుల మొత్తాలను ‘క్లియరింగ్ బ్యాంక్’లో ఇచ్చి దాని ద్వారా చెల్లింపులు జరుపుతాయి.

ఇ) దేశంలో అన్ని బ్యాంకులు ఇప్పుడు కంప్యూటర్‌తో అనుసంధానం చేయబడి ఉన్నాయి. అంతేకాక Internet ద్వారా పనిచేస్తున్నాయి. ఒక వ్యక్తి ‘X’ అనే బ్యాంక్ లోని తన అకౌంటు నుండి, ‘Y’ అనే బ్యాంక్ లోని తన మిత్రుడు అకౌంట్ కి డబ్బులు పంపాలంటే NEFT ద్వారా పంపవచ్చు. 2,00,000/- రూ||ల వరకు బ్యాంకు ఎటువంటి చార్జి తీసుకోదు. (దేశంలోనే)

ఈ) ATM కు కావలసిన జాగ్రత్తలు :

  1. ATM లోని కంప్యూటర్ సరిగా పనిచేస్తోందో లేదో జాగ్రత్త తీసుకోవాలి.
  2. రశీదు వచ్చే ఏర్పాటును చూసుకోవాలి.
  3. వినియోగదారులు ఇచ్చే ఆజ్ఞలను సరిగా అర్థం చేసుకోవాలి.
  4. నోట్ల సంఖ్య సరిగా ఉండేలా చూడాలి.
  5. ATM వద్ద కాపలాదారు ఉండాలి.
  6. ATM లో camera ఉండాలి.
  7. ATM లో పిన్ నంబరుతో బాటు వేలిముద్ర ఫడే పద్ధతి కూడా ఉండాలి. కంప్యూటర్ పిన్ నంబరును, బ్యాలెనన్ను సరిచూస్తుంది.

ఉ) అవును. డ్రాఫ్టులు / ఆన్లైన్ లావాదేవీలు కూడా ఉంటాయి. ‘డ్రాప్టు’ డబ్బు కట్టిన వ్యక్తికి కాగితం రూపంలో ఇస్తే వారు డబ్బు చేరవల్సిన వారికి పంపుతారు. వారు అక్కడ బ్యాంకులో దానిని చూపించి డబ్బు తీసుకుంటారు. ఆన్లైన్లో అయితే కౌంటర్లో డబ్బు ఇస్తే అది మనం ఇవ్వవలసిన వారి అకౌంటుకు వెళ్ళిపోతుంది.

ఊ) డబ్బులు పొందవలసిన వ్యక్తికి చెక్కు ద్వారా అయితే సమయం ఎక్కువ పడుతుంది. అదే ఊళ్ళో ఉన్న వ్యక్తి అయితే 2 రోజులు పడుతుంది. వేరే ఊరి వ్యక్తి అయితే చెక్కు పోస్టులో అంది బ్యాంక్ లో వేసేటప్పటికే 3, 4 రోజులు పడుతుంది. అదే ‘ఆన్‌లైన్’ ద్వారా అయితే ఇక్కడ డబ్బులు వేసిన వెంటనే అక్కడ డ్రా చేసుకోవచ్చు. సమయం ఆదా అవుతుంది. అవసరం తీరుతుంది.

ఋ)

పొదుపు డిపాజిట్లపై చెల్లించే వడ్డీ 3 నెలలు – 6.50%, 6 నెలలు – 6.50%
ఫిక్స్ డిపాజిట్టుపై చెల్లించే వడ్డీ 1 సంవత్సరం – 8.50%, 1 సంవత్సరం 4%
రైతులకు ఇచ్చే అప్పులపై వడ్డీ 8% 1 సంవత్సరం మరియు 2 సంవత్సరం 9%
గృహ ఋణాలపై వసూలు చేసే వడ్డీ 10.50%
విద్యా ఋణాలపై వసూలు చేసే వడ్డీ 13.50% – 14%

AP Board 8th Class Social Solutions Chapter 11B జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947

SCERT AP 8th Class Social Study Material Pdf 11Bth Lesson జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947 Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 11Bth Lesson జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947

8th Class Social Studies 11Bth Lesson జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947 Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
జాతీయ ఉద్యమంలోని వివిధ ప్రయత్నాలలో గాంధీజీ కృషిని తెలియచేసే పట్టిక తయారు చేయండి. (AS3)
AP Board 8th Class Social Solutions Chapter 11B జాతీయోద్యమం మలి దశ 1919 – 1947 1
(లేదా)
భారత స్వాతంత్ర్యోద్యమంలో గాంధీజీ పాత్రను వివరించండి.
జవాబు:
భారత స్వాతంత్ర్యోద్యమంలో గాంధీజీ పాత్ర :

సంఘటన గాంధీ పాత్ర
1917 – రైతాంగ పోరాటం చంపారన్, భేదాలలో అధిక పన్నులు, దోపిడీ చేసే విధానాలకు వ్యతిరేకంగా రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించాడు.
1918 – నేత కార్మికుల సమ్మె 1918లో అహ్మదాబాద్ నేత కార్మికుల సమ్మెకు విజయవంతంగా నాయకత్వం వహించాడు. ఔడా నిరసనలు.
1919 – రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా 1919లో రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా సత్యాగ్రహానికి పిలుపునిచ్చాడు. గౌరవభంగ దినంకు పిలుపునిచ్చాడు.
1920-పంజాబ్ తప్పులు ఖిలాఫత్ తప్పులకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టి స్వరాజ్యం కోరాలని కాంగ్రెసుపై ఒత్తిడి తెచ్చాడు.
1920-22 ఖాదీ ఉద్యమాన్ని చేపట్టాడు. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అర్థాంతరంగా ఆపివేశాడు.
1930 – ఉప్పు సత్యాగ్రహం శాసనోల్లంఘన ఉద్యమం అహ్మదాబాదులోని సబర్మతి ఆశ్రమం నుండి దండి యాత్ర మొదలు పెట్టి దండి వరకు నడిచి బ్రిటిషు చట్టాలను ఉల్లంఘించాడు.
1942 – క్విట్ ఇండియా తీర్మానం క్విట్ ఇండియా తీర్మానం చేసి అందరినీ స్వతంత్రులుగా భావించమన్నాడు.
1947, ఆగష్టు 15 దేశం స్వాతంత్ర్యం పొందేంతవరకు అవిశ్రాంత కృషి జరిపాడు.

ప్రశ్న 2.
ప్రజలకు ప్రజాస్వామిక హక్కులు, స్వేచ్చ ఇవ్వటానికి నిరాకరించిన బ్రిటిషు ప్రభుత్వ అన్ని ప్రయత్నాలను జాతీయోద్యమం వ్యతిరేకించింది. ప్రభుత్వం ఏ హక్కులను కాలరాయటానికి ప్రయత్నించిందో, దానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం ఏమిటో ఉదాహరణలు ఇవ్వండి. (AS1)
జవాబు:
1. 1919లో రౌలట్ చట్టంను అమలులోకి తెచ్చి, భారతీయుల భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాసారు. ఈ చట్టం ప్రకారం ఎవరైనా ఉగ్రవాది అని పోలీసులు అనుమానిస్తే వాళ్ళను అరెస్టు చేసి ఎటువంటి విచారణ లేకుండా జైల్లో పెట్టవచ్చు. విచారణ జరిగినా రుజువుల గురించి నిందితుడికి కూడా తెలియవు.

దీనికి వ్యతిరేకంగా ఆనాటి జాతీయోద్యమ నాయకులు 1919 ఏప్రిల్ 6న గౌరవభంగ దినంగా పిలుపునిచ్చారు. సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. బ్రిటిషు వారికి వ్యతిరేకంగా ఈ రౌలట్ సత్యాగ్రహాన్ని పేర్కొనాలి.

2. 1920లో బ్రిటన్ కఠినమైన ఒప్పందాన్ని టర్కీ సుల్తాన్ పై రుద్దింది. దీనిని భారతీయ ముస్లింలు వ్యతిరేకించారు. వారికి మద్దతుగా జాతీయవాదులు సహాయ నిరాకరణోద్యమాన్ని చేపట్టారు.

3. బ్రిటిషువారు చీరాల-పేరాల వారికి పన్ను పెంచగా, దానిని నిరసిస్తూ అక్కడి ప్రజలందరూ ఊళ్ళు వదిలి పెట్టి రాంనగర్ కాంప్ ను ఏర్పాటు చేసుకుని 11 నెలలు కాలం గడిపారు.

4. సామాన్యుడు నిత్యం ఉపయోగించే ఉప్పు తయారీపై బ్రిటిష్ ప్రభుత్వం నిషేధం విధించింది. దీనికి వ్యతిరేకంగా శాసనోల్లంఘన ఉద్యమాన్ని జాతీయవాదులు చేపట్టి బ్రిటిషు వారి అధికారాన్ని తోసి రాజన్నారు.

ఈ విధంగా బ్రిటిషువారి భారత వ్యతిరేక నిర్ణయాలను జాతీయవాదులు వ్యతిరేకించారు. నిరసించారు. ధిక్కరించారు.

AP Board 8th Class Social Solutions Chapter 11B జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947

ప్రశ్న 3.
ఉప్పు సత్యాగ్రహం తన ఉద్దేశాలలో ఏ మేరకు విజయవంతం అయ్యింది? మీ అంచనా ఏమిటి? (AS2)
జవాబు:
ఉప్పు సత్యాగ్రహం దేశమంతటా నూతనోత్తేజం రగిల్చింది. దేశంలో పలుప్రాంతాలలో ఉప్పు చట్టాలను ఉల్లంఘించారు. దీనిలో మహిళలు కూడా పాల్గొన్నారు. ఎంతోమంది’ అరెస్టయ్యారు. ఈ ఉద్యమం కేవలం దీనికే పరిమితంకాక విదేశ వస్త్ర, మద్యం, దుకాణాల వద్ద పికెటింగ్ చేశారు, ఆ వస్తువులను తగులబెట్టారు. బ్రిటిషు పాఠశాలలు, కళాశాలలు, ఉద్యోగాలను బహిష్కరించారు. ఇది దేశమంతా పాకింది. కొద్దిమంది బ్రిటిషు కాల్పుల్లో మరణించారు. చివరికి 1935 భారత ప్రభుత్వ చట్టం ఏర్పడింది.

వీటన్నింటిరీత్యా ఉప్పు సత్యాగ్రహం తన ఉద్దేశాలలో అధిక మేరకు విజయవంతం అయ్యింది.

ప్రశ్న 4.
ఈ దిగువ పేర్కొన్న వాటిల్లో జాతీయోద్యమంలో భాగమైనవి ఏవి? (AS1)
అ. విదేశీ వస్త్రాలు అమ్మే దుకాణాల వద్ద పికెటింగ్
ఆ. బట్టలు వేయటానికి చేతితో నూలు వడకటం
ఇ. దిగుమతి చేసుకున్న బట్టలను తగలబెట్టటం
ఈ. ఖద్దరు వేసుకోవటం
ఉ. పైన పేర్కొన్నవన్నీ
జవాబు:
ఉ. పైన పేర్కొన్నవన్నీ

ప్రశ్న 5.
దేశ విభజనకు దారితీసిన వివిధ ఘటనలు ఏవి? (AS1)
జవాబు:

  1. 1930 సం|| నుంచి హిందువులకు భిన్నంగా ముస్లింలు ప్రత్యేక జాతిగా ముస్లింలీగ్ పరిగణించసాగింది. కాంగ్రెసు ముస్లింల మద్దతు కూడగట్టుకోలేకపోయింది.
  2. ముస్లింలు ఎప్పటికీ భారతదేశంలో ద్వితీయ స్థానంలోనే ఉంటామని భావించారు.
  3. 1937లో ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్- లీగ్ ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటును కాంగ్రెసు తిరస్కరించడం కూడా వారిని ఇబ్బంది పెట్టింది.
  4. 1940లో కాంగ్రెస్ నాయకులు జైలులో ఉన్నప్పుడు ముస్లింల మద్దతు లీగ్ కూడగట్టుకోగలిగింది.
  5. 1945లో బ్రిటిషువారు స్వాతంత్ర్యం విషయమై కాంగ్రెసు-ముస్లింలీగ్ ని సమర్థించడంలో విఫలమైంది.
  6. 1946 రాష్ట్రాల ఎన్నికలలో కాంగ్రెసు-ముస్లింలీగ్ రెండూ ఘన విజయాలు సాధించాయి. దీంతో ముస్లింలీగ్ ప్రత్యేక పాకిస్థాన్‌ను కోరింది.
  7. 1946లో క్రిప్పు రాయబారం జరిగింది. ఇందులో కాంగ్రెస్ వారు ముస్లింలీగ్ వారు ఐకమత్యంగా ఉండటానికి ససేమిరా ఒప్పుకోలేదు.
  8. 1946లో బ్రిటిషు క్యాబినేట్ సంఘం దీర్ఘకాలంలో భారతదేశం సమాఖ్యను ఏర్పరచి అధినివేశ ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని ప్రతిపాదించింది. ఇది విఫలం అవ్వటంతో ఆగస్టు 16న ‘ప్రత్యక్ష కార్యాచరణ దినం’ గా ముస్లిం లీగ్ ప్రకటించింది.
  9. ఇది 1947 నాటికి హింసాత్మకంగా మారింది. వీటిని సరిదిద్దలేక దేశ విభజనకు నిర్ణయం చేశారు.

ప్రశ్న 6.
మన సరిహద్దు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ లను పటంలో గుర్తించి రంగులు నింపండి. (AS5)
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 11B జాతీయోద్యమం మలి దశ 1919 – 1947 2

ప్రశ్న 7.
1922-29 మధ్య ఘటనలు మొదటి పేరాను చదివి క్రింది ప్రశ్నకు జవాబు రాయండి. (AS2)

మహాత్మా గాంధీ హింసాత్మక ఉద్యమాలకు వ్యతిరేకి అని మీకు తెలుసు. 1922లో చౌరి చౌరాలో రైతుల గుంపు పోలీసు స్టేషనుకు నిప్పు పెట్టినందుకు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అతడు అర్ధాంతరంగా ఆపేశాడు. ఆ రోజు ఘటనలో 22 మంది పోలీసులు చనిపోయారు. శాంతియుతంగా జరుగుతున్న ప్రదర్శనపై పోలీసులు కాల్పులు జరపటంతో ప్రజలు ఆగ్రహావేశాలకు గురయ్యారు.
“హింసానంతరం గాంధీజీ ఉద్యమాన్ని అర్ధాంతరంగా ఆపివేశాడు. దీనిని మీరు ఎలా సమర్థిస్తారు?
జవాబు:
గాంధీజీ అనుసరించిన అహింస, సత్యాగ్రహాలకు ఈ హింస వ్యతిరేకం కాబట్టి నేను దీనిని సమర్థిస్తాను.

ప్రశ్న 8.
సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా మన రాష్ట్రంలో జరిగిన సంఘటనలు ఏమిటి? (AS1)
జవాబు:
జాతీయతా కార్యక్రమాలకు గుంటూరు జిల్లా కేంద్రంగా మారింది. ఇందులో విద్యార్థులే కాకుండా వ్యాపారస్తులు, పల్లెటూళ్లలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొనసాగారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో చెప్పుకోదగింది. చీరాల-పేరాల ఉద్యమం. ఈ పట్టణాన్ని నగరపాలికగా మార్చి ప్రభుత్వం ప్రజల మీద భారీగా పన్నులు వేసింది. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో 15,000 మంది ప్రజలు పన్ను కట్టటానికి నిరాకరించి ఊరు వదిలి పెట్టారు. ఊరి బయట రాంనగర్ పేరుతో కొత్త నివాసం ఏర్పాటు చేసి పదకొండు నెలలు అక్కడే ఉండిపోయారు. రైతులు భూమి శిస్తులు కట్టకుండా సహాయ నిరాకరణోద్యమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. అధిక సంఖ్యలో గ్రామ అధికారులు రాజీనామా చేశారు. “గాంధీజీ స్వరాజ్యం వస్తోంది. ఈ ప్రభుత్వానికి పన్నులు కట్టం”, అని ప్రజలు ప్రకటించారు.

మరొక ముఖ్యమైన పరిణామం గుంటూరు జిల్లా పల్నాటి తాలుకాలోనూ, కడపజిల్లా రాయచోటి తాలూకాలోనూ జరిగిన అటవీ సత్యాగ్రహం. అటవీశాఖకు పుల్లరీ చెల్లించకుండానే రైతులు పశువులను అడవిలో మేపటానికి పంపించసాగారు. పల్నాడులోని అనేక గ్రామాలలో ప్రజలు గాంధీ రాజ్యాన్ని ప్రకటించి, పోలీసు బృందాలపై దాడులు చేయసాగారు. వలస పాలన అంతం అవుతోందని, అడవులు తిరిగి గ్రామప్రజల ఆధీనంలోకి వస్తాయని ప్రజలు నమ్మారు. ఈ రెండు తాలూకాలలో ఆందోళన జరుగుతున్న సమయంలో అటవీశాఖ పనిచేయటం దాదాపుగా సాధ్యం కాలేదు.

ఇవి సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా మన రాష్ట్రంలో జరిగిన సంఘటనలు.

AP Board 8th Class Social Solutions Chapter 11B జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947

ప్రశ్న 9.
క్విట్ ఇండియా ఉద్యమం ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుంది? (AS1)
జవాబు:
స్వాతంత్ర్యం కోసం మనదేశంలో ఎన్నో ఉద్యమాలు జరిగాయి. వాటినన్నింటిని బ్రిటిషువారు అణగట్టారు. కానీ క్విట్ ఇండియా ఉద్యమం ముందు వీరు మోకరిల్లారు. అందువలన ఇది ప్రాధాన్యతను సంతరించుకుంది.

ప్రశ్న 10.
1885-1947 మధ్య స్వాతంత్ర్యోద్యమ ఘట్టాలను తెలిపే కాలమాన పట్టిక తయారు చేయండి. (AS3)
జవాబు:

సంవత్సరం ఘట్టాలు
1. 1885 భారత జాతీయ కాంగ్రెసు స్థాపన
2. 1886 స్థానిక సంస్థలు కాంగ్రెసు ప్రతినిధులు ఎన్నిక (436 మంది)
3. 1885-1905 మితవాద యుగం
4. 1903 స్వదేశీ ఉద్యమం
5. 1905 బెంగాలు విభజనకు వ్యతిరేకంగా వందేమాతరం
6. 1905-1920 అతివాద యుగం
7. 1907 కాంగ్రెస్లో చీలిక.
8. 1915 తిలక్, అనిబిసెంట్ హోంరూల్ ఉద్యమం
9. 1916 లక్నో ఒప్పందం ద్వారా కాంగ్రెస్ ఐక్యత
10. 1915 (1915లో దక్షిణాఫ్రికా నుండి గాంధీజీ రాక) గాంధీజీ స్వాతంత్ర్యోద్యమంలో చేరిక
11. 1917 చంపారన్ ఆందోళన
12. 1918 అహ్మదాబాదు కార్మికుల సమ్మె, ఔడా నిరసనలు
13. 1919 రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా సత్యాగ్రహం
14. 1920 ఖిలాఫత్ ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం
15. 1922 చౌరీ-చౌరా సంఘటన, సహాయ నిరాకరణం నిలిపివేత
16. 1930 శాసనోల్లంఘనోద్యమం, ఉప్పు సత్యాగ్రహం
17. 1935 భారత ప్రభుత్వ చట్టం
18. 1937 శాసన సభలకు ఎన్నికలు
19. 1940 నుండి 1945 వరకు విప్లవవాదుల యుగం
20. 1942 క్విట్ ఇండియా ఉద్యమం
21. 1942-44 మిడ్నాపూర్ ప్రజల సమాంతర ప్రభుత్వం ఆ సమాంతర పడుత్యం
22. 1946 ఎన్నికలు, ప్రత్యేక పాకిస్తాన్ కోసం ముస్లింలీగ్ పట్టుపట్టడం
23. 1946 క్రిప్పు రాయబారం, ముస్లింల ప్రత్యక్ష కార్యాచరణ దినం.
24. 1947 దేశమంతా హింసాపూరితం
25.  1947 ఆగస్టు 14 పాకిస్తాన్ స్వాతంత్ర్యం
26. 1947 ఆగస్టు 15 భారత్ స్వాతంత్ర్యం

ప్రశ్న 11.
ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న స్వాతంత్ర్యఫలాలు నేడు అందరికి అందాయా? దీనిపై మీ అభిప్రాయం తెలపండి. (AS6)
జవాబు:
భారతదేశం బ్రిటిష్ వారి పాలన నుండి విముక్తి సాధించడం ద్వారా దేశం ముందంజ వేయగలదని భావించారు. భారతదేశం
అనేక రంగాలలో ముందంజలో ఉన్న సామాన్య ప్రజలు నేటికీ కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదు. ప్రతి విషయంలో మితిమీరడంతో సమన్యాయం జరగడం లేదు. అవినీతి వలన ప్రభుత్వ పథకాలు సామాన్యునికి చేరడం లేదు. ప్రజలు సబ్సిడీలు, ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడక తప్పడం లేదు.

8th Class Social Studies 11Bth Lesson జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947 InText Questions and Answers

8th Class Social Textbook Page No.131

ప్రశ్న 1.
తీవ్రవాదాన్ని అణిచివేయటానికి, పోలీసులకు ఇటువంటి అధికారాలు ఇవ్వటం సరైనదేనా?
జవాబు:
తీవ్రవాదం, నిరసన తెలియచేయటం అనేవి రెండూ సున్నితమైన అంశాలు. వీటి మధ్య ఉండే తేడాని పోలీసులు గ్రహించగలిగి ఉండాలి. అపుడు వారికి ఇలాంటి అధికారాలు ఇవ్వవచ్చు. లేనిచో ఇవ్వరాదు.

AP Board 8th Class Social Solutions Chapter 11B జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947

ప్రశ్న 2.
స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో ఇటువంటి చట్టాలను ప్రజలు. అంతగా ఎందుకు వ్యతిరేకించారు?
జవాబు:

  1. నాటి స్వాతంత్ర్యోద్యమ కాలంలో అధిక శాతం పోలీసులు, వారి ఉన్నతాధికారులు అందరూ బ్రిటిషువారే.
  2. అప్పటికే వారి నిరంకుశాధికారాన్ని తట్టుకోవటం ప్రజలకు కష్టసాధ్యమవుతోంది.
  3. అలాంటి సమయంలో ఇలాంటి చట్టాలు చేయటం అనేది అగ్నిలో ఆజ్యం పోయటం లాంటిది.

అందువలన ఇలాంటి చట్టాలను ప్రజలు వ్యతిరేకించారు.

8th Class Social Textbook Page No.132

ప్రశ్న 3.
చీరాల-పేరాల ఉద్యమం గురించి, అటవీ సత్యాగ్రహం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి. వాటిపై ఒక నాటిక తయారుచేసి తరగతిలో ప్రదర్శించండి.
జవాబు:
స్వాతంత్ర్యోద్యమకాలం – 1919
రామ్ నగర్ కాంప్ (చీరాల-పేరాల)

రాముడు : ఓరేయ్ రాజా ! ఏంటిరా, మీరు కూడా మన ఊరు వదిలి వచ్చేశారా?

రాజా : నేనేంటిరా ! మొత్తం మన చీరాల-పేరాల వాళ్ళందరూ ఊళ్ళు వదిలి వచ్చేశారా !

శేఖర్ : ఏరా ! మనందరం మన ఇళ్ళు, వాకిళ్ళు వదిలి రావాల్సిన ఖర్మ ఏం పట్టిందిరా !

యశ్వంత్ : అది మన ఖర్మ కాదురా ! మనల్ని బాధ పెట్టాలని చూసే ఆ బ్రిటిషు వారి ఖర్మ. లేకపోతే మనం 4000/- కట్టే పన్ను 40,000/- కట్టాలా? ఎంత దారుణం?

రాముడు : అయితే అయింది కానీ, గాంధీగారు మహాబాగైన సలహా చెప్పారా !

రాజా : అవునురా ! ఆయన సలహా చెప్పడం, మన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య మన వెనకే ఉండి నడిపించడం చాలా బాగుందిరా !
ఇలా అయితే ఈ బ్రిటీషోడి పీడ మనకు త్వరలోనే వదిలిపోతుందిరా !

యశ్వంత్ : అయితే బ్రిటిషు వాళ్ళు మనల్ని ఇలాగే వదిలేస్తారంటావా?

శేఖర్ : ఎందుకు వదులుతారంట ! మనల్నందరినీ శ్రీకృష్ణ జన్మస్థానంలో పెట్టరూ !

రాజా : పెడితే పెట్టనీరా ! ప్రాణాలిచ్చి అయినా సరే వాళ్ళ భరతం పట్టందే వదిలి పెట్టొద్దు.

మిగిలిన వారందరు : -అంతేరా ! అలాగే చేద్దాం.

గాంధీజీకి – జై
దుగ్గిరాల గోపాలకృష్ణయ్యకు – జై
భారతమాతకు – జై
జై – జై

అటవీ సత్యాగ్రహం – 1921
కన్నెగంటి హనుమంతు – పల్నాటి వీరబిడ్డ (వయస్సు 30 సం||రాలు)

ఏకపాత్రాభినయము

అడవిలో తిరుగుతూ :

ఒరేయ్ తెల్లోడా ! ఎవడురా నా వాళ్ళని పుల్లరి పన్ను కట్టమని అడిగిన మొనగాడు ! ఈ గడ్డమీద పుట్టిన మేము ఈ గడ్డను అడ్డం పెట్టుకున్న నీకు శిస్తు కట్టాల్నా ! ఏమి న్యాయమురా యిది ! ఏమి ధర్మమురా యిది ! ఈ పల్నాట బుట్టిన ఎవడైననూ యిటువంటి పని చేస్తారనే అనుకున్నార్రా! ఇంగ్లీషు కుక్కల్లారా !
ఒరేయ్ రూథర్ ఫర్డ్ !
ఈ అడవి తల్లి మాదిరా ! మా తల్లిరా !
మా అమ్మ పెట్టే తిండికే నీకు శిస్తు కట్టాలిరా?
నీరు పెట్టావా ! నాటు వేశావా ! కోత కోశావా !
కుప్ప నూర్చావా ! ఎందుకు కట్టాలిరా శిస్తు.
ఎందుకు కట్టాలిరా నీకు శిస్తు. ఎందుకు …………..
అమ్మా ! అమ్మా ! నన్ను చంపితే ……………………….
అబ్బా ! నాలాంటి వాళ్ళు వేలమంది పుడతారురా ! అమ్మా !
మిమ్మల్ని ఈ గడ్డ నుండి తరిమి, తరిమి, వేటాడి, వెంటాడి గెంటుతారురా ! ఇది నిజం.
అమ్మా !
వందేమాతరం
వందేమాతరం
అమ్మా !
భరతమాతా శెలవు తల్లీ !
మళ్ళీ జన్మంటూ ఉంటే నీ బిడ్డగానే
పుట్టి స్వేచ్ఛగా ఆడుకుంటాను
తల్లీ !
………….వం…………………………మా …………..రం
(మరణించాడు)

ప్రశ్న 4.
పల్నాడు ప్రాంతంలో కన్నెగంటి హనుమంతు పుల్లరి సత్యాగ్రహం గురించి మీ ఉపాధ్యాయుల ద్వారా అడిగి తెలుసుకోండి?
జవాబు:
కన్నెగంటి హనుమంతుకి జన్మనిచ్చింది మించాలపాడు అనే ఓ కుగ్రామం. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని దుర్గికి సమీపంలోని కోలెకుట్ట శివారు ప్రాంతమే మించాలపాడు. అది 1920వ సంవత్సరం ప్రాంతం. దేశమంతా గాంధీగారి పిలుపుతో సహాయ నిరాకరణోద్యమంలో చురుగ్గా పాల్గొంటోంది. 1921లో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలోని నాయకుల పిలుపునందుకొని ఆంధ్రదేశం కూడా సహాయ నిరాకరణోద్యమంలోకి దూకింది. సహాయ నిరాకరణోద్యమంలో పన్నుల నిరాకరణ ఓ భాగం. గుంటూరు జిల్లాలో ఉన్న లక్ష్మీనారాయణగారు దీనికి నాయకులు.

పల్నాడు ప్రాంతంలోని మాచర్ల, వెల్దుర్తి, ‘ జట్టిపాలెం, రెంటచింతల వంటి ప్రాంతాల్లో ప్రజాజీవనం ఆ ప్రాంతపు అడవులతో ముడిపడి ఉంది. 1921 సంవత్సరం ప్రాంతంలో పల్నాడులో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. పరాయి పాలనలో సామాన్య ప్రజలకు కూడు, గుడ్డ వంటి కనీసావసరాల మాట దేవుడెరుగు కనీసం పశువులకు గ్రాసం, గ్రామ జీవితంలో భాగమైన కట్టెలు కొట్టుకోవడం, ఆకూ అలమూ పోగుచేసుకోవడం వంటి వాటికి సైతం బ్రిటిష్ ప్రభుత్వం ప్రజలపై ఆంక్షలు విధించింది.

అడవిలో పశువుల్ని మేపుకోవడానికీ, కట్టెలు కొట్టుకోవడానికి ప్రజలు బ్రిటిష్ ప్రభుత్వానికి పుల్లరి చెల్లించాలనే నిబంధన విధించింది. దరిమిలా ప్రభుత్వాధికారులు మేతకు వచ్చిన పశువుల్ని బందెలదొడ్డికి తోలడం, ప్రజలు వాటిని విడిపించుకోవడానికి నానా అవస్థలు పడటం పరిపాటి అయింది. ఈ క్రమంలో ప్రజలను సంఘటితపరచి ప్రభుత్వంపై పోరాటం చేయడానికి నాయకత్వం వహించాడు కన్నెగంటి. ప్రభుత్వానికి ప్రజలు పుల్లరి చెల్లించరాదనే ఉద్యమాన్ని లేవదీశాడు.

ప్రజలు పుల్లరి కట్టడం మానేశారు. పైపెచ్చు ప్రజలు కన్నెగంటి నాయకత్వంలో అటవీ అధికారులను, రెవెన్యూ అధికారులనూ సాంఘిక బహిష్కారానికి గురిచేశారు. దీన్ని అణచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం కుట్రపన్నింది.

అది 1922వ సంవత్సరం, ఫిబ్రవరి 22వ తారీఖు ఆదివారం, అమావాస్య మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలు. భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఓ దుర్దినం. మరో బ్రిటిష్ దౌష్ట్యం రూపుదిద్దుకోబోతున్న వేళ. గుంటూరు జిల్లా కలెక్టర్ వార్నరు పల్నాడు గ్రామం చేరుకున్నాడు. దుర్గి సబ్ ఇన్స్పెక్టర్ రాఘవయ్య నాయుడిని పిలిచాడు. అతనికి తోడు మరికొంత మంది సైన్యాన్ని ఇచ్చాడు. పుల్లరి కట్టని మించాలపాడు గ్రామస్తుల పశువులను నిర్బంధించవలసిందిగా ఆదేశించాడు. అంతే… బ్రిటిష్ సైన్యం మించాలపాడు గ్రామంపై విరుచుకు పడింది. పశువుల్ని నిర్బంధించడం మొదలు పెట్టింది. కన్నెగంటి నాయకత్వంలో గ్రామస్తులంతా తిరగబడ్డారు. సుమారు రెండు నుంచి మూడు వందల మంది గ్రామీణ స్త్రీలు, పురుషులు ఈ తిరుగుబాటులో పాల్గొన్నారు. బ్రిటిష్ సైన్యం ప్రజలపై దమనకాండ జరిపింది. ఈ పోరాటంలో తుది వరకూ పోరాడిన కన్నెగంటి పోలీసుల తూటాలకు నేలకొరిగాడు. ఈ యోధుడితో పాటు మరో ఇద్దరు పోలీసులు ఆ దమనకాండలో ప్రాణాలు పోగొట్టుకున్నారు.

పల్నాటి పుల్లరి సత్యాగ్రహంలో వీరమరణం పొందిన కన్నెగంటి త్యాగాన్ని జాతీయ కాంగ్రెస్ సంఘం గుర్తించింది. బ్రిటిష్ అధికారుల పట్ల పల్నాటి ప్రజలు అనుసరించిన సాంఘిక బహిష్కరణ విధానం తక్కిన దేశానికంతటికీ దారిచూపింది. హనుమంతు త్యాగనిరతిని శ్లాఘిస్తూ మించాలపాడు గ్రామ ప్రజలు అతని సమాధిపై ఏర్పాటు చేసిన శిలాశాసనం నేటికీ ఆ వీరుని పోరాట స్ఫూర్తికి మౌన సాక్షిగా నిలుస్తుంది.

8th Class Social Textbook Page No.135

ప్రశ్న 5.
“బ్యాంకాక్ నుంచి టోక్యో 1945 ఆగస్టు 23న విమాన ప్రయాణం చేస్తుండగా జరిగిన ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ చనిపోయాడని చెబుతారు.” సుభాష్ చంద్రబోస్ మరణాన్ని ఎందుకు ధృవీకరించలేదు?
జవాబు:
సుభాస్ చంద్రబోస్ మరణం నేటికీ అందరికీ ఒక పజిల్ వంటిది. ఆ రోజు ఆయన మరణించలేదని అందరూ నమ్ముతారు. ఆయన మరణం గురించి భారత ప్రభుత్వం 3 కమీషన్లను నియమించింది. కానీ అది ఇంతవరకు నిర్ధారణకు రాలేదు. కాబట్టి ఆయన మరణాన్ని ధృవీకరించలేదు.

AP Board 8th Class Social Solutions Chapter 11B జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947

ప్రశ్న 6.
ఈ క్రింది పేరాను చదివి, ప్రశ్నలకు సమాధానమిమ్ము.

సుభాష్ చంద్రబోస్, ఐఎన్ఏ

సుభాష్ చంద్రబోస్ స్వరాజ్య ఉద్యమకారుడు, విప్లవవాద జాతీయవాది. అతడు రాస్ బిహారీ బోస్ సహకారంతో బర్మా, అండమాన్లలో భారత జాతీయ సైన్యాన్ని (ఐఎన్ఏ) ఏర్పాటు చేశాడు. ఐఎన్ఏలో 60,000కు పైగా సైనికులు ఉండేవారు. ఈ పోరాటంలో జపాన్ అతడికి సహాయం చేసింది. 1943 అక్టోబరు 21న సింగపూర్ లో స్వతంత్ర భారత (ఆజాద్ హింద్) తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1944 మార్చి 18న ‘ఢిల్లీకి పదండి’ నినాదంతో ఐఎన్ఏ బర్మా సరిహద్దులు దాటి భారతదేశంలో ప్రవేశించింది.

1944 మార్చిలోనే నాగాల్యాండ్ ని కోహిమాలో భారత జెండాను ఎగరవేశారు. అయితే యుద్ధ పరిస్థితులు మారి 1944-45 శీతాకాలంలో బ్రిటన్ ప్రతిఘటనకు దిగటంతో, రెండవ ప్రపంచ యుద్ధంలో అంతిమంగా జపాను ఓడిపోవటంతో ఐఎన్ఏ ఉద్యమం కుప్పకూలిపోయింది. బ్యాంకాక్ నుండి టోక్యోకి 1945 ఆగష్టు 23న విమాన ప్రయాణం చేస్తుండగా జరిగిన ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ చనిపోయాడని చెబుతారు.

1. సుభాష్ చంద్రబోస్ ఎవరు?
జవాబు:
ఆయన స్వరాజ్య ఉద్యమకారుడు, విప్లవవాద జాతీయవాది.

2. ఐఎన్ఏ ఏర్పాటుకు ఎవరి సహకారం తీసుకున్నాడు?
జవాబు:
రాస్ బిహారీ బోస్ సహకారం తీసుకున్నాడు.

3. ఈ పోరాటంలో బోనకు ఎవరి సహకారం ఉంది?
జవాబు:
జపాన్ సహకారం ఉంది.

4. ‘ఆజాద్ హింద్’ అంటే అర్థం ఏమిటి?
జవాబు:
స్వతంత్ర్య భారతం అని అర్థం.

5. కోహిమాలో భారత జెండాను ఎప్పుడు ఎగురవేశారు?
జవాబు:
1944 మార్చిలోనే ఎగురవేశారు.

AP Board 8th Class Social Solutions Chapter 15 చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం

SCERT AP 8th Class Social Study Material Pdf 15th Lesson చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 15th Lesson చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం

8th Class Social Studies 15th Lesson చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
తప్పు వాక్యాలను సరిచేయండి. (AS1)
1) ఎఫ్.ఐ.ఆర్ ను కోర్టులో దాఖలు చేస్తారు. (తప్పు)
జవాబు:
ఎఫ్.ఐ.ఆర్ ఆధారంగా పోలీసు స్టేషనులోని రిజిస్టరులో నేరం వివరాలను పొందుపరచాలి. (ఒప్పు)

2) పోలీసులు అరెస్టు చేయడమంటే శిక్షింపబడటంతో సమానం. (తప్పు)
జవాబు:
పోలీసులు అరెస్టు చేయడమంటే విచారణకు తీసుకెళ్ళారని అర్ధం. (ఒప్పు)

3) హామీల ఆధారంగా బెయిలు మంజూరు చేస్తారు. (ఒప్పు)
4) దేశంలో అత్యున్నత కోర్టు సుప్రీంకోర్టు. (ఒప్పు)

ప్రశ్న 2.
రవి విషయంలో మొదటి విచారణ నుంచి హై కోర్టులో తుది తీర్పు వరకు ఏం జరిగిందో ఈ పట్టికలో వివరించండి. (AS1)
AP Board 8th Class Social Solutions Chapter 15 చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం 1
జవాబు:

సాక్షుల పాత్ర ఇచ్చిన శిక్ష రవి హాజరు కావలసిన అవసరం
వాయిదాకు కొద్దిమందిని 4 సం||లు.
విచారించేవారు.
తప్పనిసరి జైలుశిక్ష
హాజరు కానవసరం లేదు 1 సం|| జైలుశిక్ష ఒకసారి హాజరయితే చాలు.
హాజరు కానవసరం లేదు 1 సం|| జైలుశిక్ష అసలు హాజరు కానవసరం లేదు.

ప్రశ్న 3.
క్రిమినల్, సివిల్ కేసుల మధ్య తేడాల దృష్ట్యా వీటి గురించి ఒక్కొక్క వాక్యం రాయండి.
అ) శిక్ష, జైలు ఆ) ప్రభుత్వ న్యాయవాదులు ఇ) ఎఫ్.ఐ. ఆర్. నమోదు (AS1)
జవాబు:

అంశాలు క్రిమినల్ సివిల్
అ) శిక్ష, జైలు సాధారణంగా దోషులకు జైలు శిక్ష విధిస్తారు. సివిల్ వాదాలలో జైలు శిక్ష వేయకపోవచ్చు.
ఆ) ప్రభుత్వ న్యాయవాదులు ప్రజల పట్ల జరిగిన అపరాధంగా నమోదు చేస్తారు. ప్రభుత్వం తరఫున వాదనలు చేస్తారు. వీరి పాత్ర ఏమీ ఉండదు
ఇ) ఎఫ్. ఐ. ఆర్. నమోదు FIR ను పోలీసువారి రిజిష్టరులో నమోదుచేయాలి. FIR ఉండదు.

AP Board 8th Class Social Solutions Chapter 15 చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం

ప్రశ్న 4.
హైకోర్టు నిర్ణయాన్ని సెషన్సు లేదా జిల్లా కోర్టు మార్చగలవా? ఎందుకు? (AS1)
జవాబు:
హైకోర్టు నిర్ణయాన్ని దాని కన్నా క్రిందస్థాయి కోర్టులైన సెషన్సు లేదా జిల్లా కోర్టులు మార్చలేవు. ఎందుకంటే క్రిందస్థాయిలో జరిగిన వాదనలు, విచారణలు సంతృప్తి చెందకపోతే పై కోర్టుకు వెళ్ళవచ్చుగాని క్రింద కోర్టుకు వెళ్ళలేరు. హైకోర్టు తీర్పు సంతృప్తిగా లేకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళవచ్చుగాని క్రింద కోర్టుకు వెళ్ళలేరు.

ప్రశ్న 5.
సెషన్సు కోర్టు, హైకోర్టు తీర్పులతో ఎవరైనా సంతృప్తి చెందకపోతే వాళ్లు ఏం చేయవచ్చు? (AS1)
జవాబు:
సెషన్సు కోర్టు తీర్పుతో ఎవరైనా సంతృప్తి చెందకపోతే వాళ్ళు హైకోర్టుకు అప్పీలు చేసుకోవచ్చు. హైకోర్టు తీర్పుతో ఎవరైనా సంతృప్తి చెందకపోతే వాళ్ళు సుప్రీంకోర్టుకు అప్పీలు చేయవచ్చు.

ప్రశ్న 6.
ఎస్. హెచ్.ఓ, మెజిస్ట్రేట్ల పాత్రలలో తేడాలు ఏమిటి? (AS1)
జవాబు:
ఎస్. హెచ్.ఓ పోలీసు స్టేషను స్థాయి అధికారి. మేజిస్ట్రేట్ అంతకన్నా పై స్థాయి అధికారి. S.I తాను అరెస్టు చేసిన వ్యక్తిని విచారణ చేసి 24 గం||ల లోపు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి.

ప్రశ్న 7.
మీ అభిప్రాయంలో రవి విషయంలో తీర్పు ఎలా ఉండాలి? (AS2)
జవాబు:
రవి విషయంలో తీర్పును నేను సమర్థిస్తున్నాను. కానీ విచారణ మరింత వేగవంతంగా జరిగితే బాగుండేదని భావిస్తున్నాను.

ప్రశ్న 8.
ఒక వ్యక్తి పోలీసు స్టేషనులో తన నేరాన్ని ఒప్పుకున్నాడు. పోలీసులు అతడిని ఆరు నెలలపాటు నిర్బంధంలో ఉంచారు. ఇది సరైన విధానమేనా? మీ సమాధానానికి కారణాలు పేర్కొనండి. (AS1)
జవాబు:
ఇది సరైన విధానం కాదు. తన నేరాన్ని ఒప్పుకున్నాక అతనిని కోర్టుకు అప్పచెప్పాలి. అంతేకాని తమ నిర్బంధంలో ఉంచుకోకూడదు. అది న్యాయవిరుద్ధం అవుతుంది.

AP Board 8th Class Social Solutions Chapter 15 చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం

ప్రశ్న 9.
ఈ అధ్యాయంలో ఇచ్చిన కార్యనిర్వాహక, న్యాయవర్గాల భిన్న పాత్రలను గుర్తించండి. (AS1)
జవాబు:
పోలీసువారు కార్యనిర్వాహక వర్గంలోకి వస్తారు. కేసును నమోదు చేసుకోవడం, ప్రాథమిక విచారణ చేయడం మొదలైన పనులన్నీ వీరిచే నిర్వహించబడ్డాయి.
న్యాయవిచారణ, సాక్షుల విచారణ, తీర్పు మొదలైన అంశాలన్నీ న్యాయవర్గాలు నిర్వహిస్తాయి.
ఈ విధంగా వీరిరువురూ ఒకరి అధికారాలలో ఒకరు జోక్యం చేసుకోకుండా వ్యవహరిస్తారు.

8th Class Social Studies 15th Lesson చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం InText Questions and Answers

8th Class Social Textbook Page No.173

ప్రశ్న 1.
పోలీసుస్టేషనులో రవిపై క్రాంతి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో క్రింద పేర్కొన్న వివరాలు ఉండాలి :
1. పోలీసు స్టేషను అధికారి (ఎసీహెచ్ఓ)ని సంభోదిస్తూ ఫిర్యాదు రాయాలి.
జవాబు:
S.H.O గారికి,

2. ఫిర్యాదు వివరాలు.
జవాబు:
క్రిమినల్ కేసు.

3. నేరం జరిగిన తేదీ, సమయం, స్థలం.
జవాబు:
10.8.2013 గం|| 8.30 ని॥లు రవి ఇంటివద్ద.

4. ఏం జరిగింది?
జవాబు:
రవి సాంబను అనగా నన్ను కొట్టాడు.

5. నిందితుల పేరు, లింగం, చిరునామా, మొ||నవి.
జవాబు:
రవి, పురుషుడు, x x x x

6. సాక్షుల పేర్లు (నేరం ఎవరి సమక్షంలో జరిగింది?)
జవాబు:
రవి పక్కింటి వ్యక్తి, రవి స్నేహితుడు సాంబ కొడుకు క్రాంతి.

7. విన్నపం (నిందితులను చట్టం ప్రకారం శిక్షించమని కోరటం, తెలిసి ఉంటే వర్తించే సెక్షన్ సంఖ్యను సూచించాలి).
జవాబు:
చట్ట ప్రకారం అతనిని తగినవిధంగా శిక్షించవలసిందిగా విన్నపం.

8. ఫిర్యాదుదారు సంతకం, చిరునామా, ఇతర వివరాలు.
జవాబు:
సాంబ, x x x x సహకార సంఘంలో ప్యూను.

8th Class Social Textbook Page No.174

ప్రశ్న 2.
ప్రతి పోలీసు స్టేషను కింద కొంత ప్రాంతము ఉంటుంది. మీ యిల్లు ఏ పోలీసుస్టేషను పరిధిలోకి వస్తుందో తెలుసుకోండి.
జవాబు:
మా ఇల్లు తిరుపతి, వటౌన్ పోలీసుస్టేషను పరిధిలో ఉన్నది.

ప్రశ్న 3.
ఎస్ హెచ్ఓ/ఎస్ఎ వచ్చే వరకు వాళ్లు ఎందుకు వేచి ఉన్నారు? ఇటువంటి నివేదిక మీరు రాయాల్సి వస్తే అందులో మీరు ఏమి రాస్తారు?
జవాబు:
ఎహెచ్ఓ ను స్టేషనుకు పెద్ద అధికారి. ఎఐఆర్ నమోదు చేయాలంటే ఆయన తప్పనిసరిగా ఉండాలి. అందుకే వేచి ఉన్నారు. నేను ఇటువంటి నివేదిక రాయాల్సి వస్తే జరిగిన విషయాలన్నీ వివరిస్తాను. గొడవ ఎలా జరిగింది, ఎవరెవరికి జరిగింది, సాక్షులు ఎవరు, చిరునామాలు మొదలైనవి రాస్తాను.

AP Board 8th Class Social Solutions Chapter 15 చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం

ప్రశ్న 4.
ఎఫ్.ఐ.ఆర్ ఇచ్చిన వ్యక్తి దాని ప్రతిని తీసుకోవడం ఎందుకు ముఖ్యం?
జవాబు:
ఎఫ్.ఐ.ఆర్ ఇచ్చిన వ్యక్తి తాను ఫిర్యాదు ఇచ్చినట్లు ఋజువుగా దాని ప్రతిని తీసుకోవాలి. దానిని దాఖలు చేసిన తరువాత కేసుని పరిశోధించి, పరిష్కరించాల్సిన బాధ్యత పోలీసులది.

8th Class Social Textbook Page No.175

ప్రశ్న 5.
నేరాన్ని ఎవరు విచారించారు? ఎలా విచారించారు?
జవాబు:
నేరాన్ని ఎస్.ఐ విచారించారు.

ఈ కేసులో ఎస్.ఐ ఆ ఊరికి వెళ్లి విచారణ మొదలుపెట్టాడు. ముందుగా సాంబకి అయిన గాయాలు చూశాడు. దెబ్బలు బాగానే తగిలాయని ఆసుపత్రి నివేదిక తెలుపుతుంది. తరవాత అతడు రవి ఇంటి చుట్టుపక్కల ఉంటున్న వాళ్లను విచారించాడు. జరిగిన ఘటన గురించి పూర్తి వివరాలను చుట్టుపక్కలవాళ్లు ఇచ్చారు. సాంబ మీద రవి దాడి చేసి, గాయపరిచాడని ఎటువంటి అనుమానానికి తావులేకుండా స్పష్టమయ్యింది.

అప్పుడు ఎస్.ఐ రవి వాళ్ల ఇంటికి వెళ్లి సాంబ అనే వ్యక్తిని తీవ్రంగా గాయపరిచిన ఆరోపణపై అతడిని అరెస్టు చేస్తున్నామని చెప్పాడు. అతడు రవిని అరెస్టు చేసి మండల పోలీసు స్టేషనుకి తీసుకెళ్లి అక్కడ అతన్ని ప్రశ్నించాడు. సాంబను కొట్టానని రవి ఒప్పుకోలేదు. రవితోటి అతడి నేరాన్ని అంగీకరింపచేయటానికి ఎస్.ఐ ప్రయత్నించాడు కానీ అతడు ఒప్పుకోలేదు. మరునాడు మెజిస్ట్రేటు ముందు హాజరుపరచటానికి రవిని పోలీసు లాకప్లో నిర్బంధించాడు.

ప్రశ్న 6.
నిందితుడు అంటే ఏమిటి ? ఈ కథలో నిందితుడు ఎవరు?
జవాబు:
నేరం మోపబడిన వ్యక్తిని నిందితుడు అంటారు. ఈ కథలో నిందితుడు రవి.

ప్రశ్న 7.
నిందితుడిపై మోపిన ఆరోపణలు ఏమిటి?
జవాబు:
నిందితుడిపై

  1. ప్లాటుకు డబ్బు కట్టించుకుని అదివేరే వారికి ఇచ్చి మోసం చేసాడని.
  2. డబ్బు తిరిగి ఇవ్వడానికి నిరాకరించాడని మరియు
  3. సాంబపై తీవ్రంగా దాడి చేసి, గాయపరిచాడని ఆరోపణలు చేశారు.

AP Board 8th Class Social Solutions Chapter 15 చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం

ప్రశ్న 8.
రవిని శిక్షించడానికి ఎస్.ఐ అతడిని నిర్బంధించాడని సాంబ అనుకున్నాడు. అది నిజమేనా?
జవాబు:
అది నిజం కాదు. శిక్ష వేసే అధికారం కోర్టులకే తప్ప పోలీసులకు లేదు.

8th Class Social Textbook Page No.176

ప్రశ్న 9.
1) సాంబ ప్లాటుని రవి మరొక వ్యక్తికి అమ్మినపుడు అది సివిల్ నేరం. (క్రిమినల్ లేదా సివిల్)
2) సాంబని రవి కొట్టినపుడు అది క్రిమినల్ నేరం. (క్రిమినల్ లేదా సివిల్)

8th Class Social Textbook Page No.177

ప్రశ్న 10.
నేర, పౌర చట్టాల గురించి మీరు అర్థం చేసుకున్నదాని ఆధారంగా కింది పట్టికను పూరించండి.
జవాబు:

ఘటన వివరణ ఏ చట్టం అనుసరించే విధానం
1. బడికి వెళుతున్న దారిలో బాలికల బృందాన్ని ఒక బాలుర బృందం నిత్యం వేధిస్తూ ఉంది. నేరచట్టం పోలీసులు బాలుర బృందంపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతారు. బాలురు దోషులు అని ఋజువు అయినట్లయితే వారికి జరిమానాతోపాటు జైలుశిక్ష కూడా ఉంటుంది.
2. ఖాళీ చేయమని బలవంతం చేయబడుతున్న కిరాయిదారు దావా వేయటం. పౌరచట్టం కిరాయిదారు న్యాయస్థానంలో దావా వేస్తారు. కోర్టు నష్టానికి గురి అయిన వారికి ఉపశమనం కలిగిస్తుంది.

8th Class Social Textbook Page No.178

ప్రశ్న 11.
న్యాయమైన విచారణ అంటే ఏమిటి? అది అవసరమా? ఎందుకు? చర్చించండి.
జవాబు:
చట్టం ముందు అందరూ సమానులే అని చట్టం చెబుతోంది. ఒకరు దోషులో కాదో నిర్ణయించటానికి అతడు/ ఆమెపై న్యాయమైన, నిష్పాక్షికమైన బహిరంగ విచారణ జరుపుతారు. నేర విచారణ ‘అమాయకులు అన్న భావన’తో మొదలవుతుంది. ఎటువంటి అనుమానానికి తావులేకుండా నేరం నిరూపింపబడాలి.

ఈ విధంగా విచారించడాన్నే న్యాయమైన విచారణ అంటారు.

న్యాయమైన విచారణ అవసరమే. బాధితులకు సరియైన న్యాయం జరుగకపోతే ప్రజలలో న్యాయం పట్ల విశ్వాసం సన్నగిల్లుతుంది. అరాచకం పెరిగిపోతుంది. తమకు న్యాయం జరుగుతుంది అని నమ్మకం ఉంటేనే ప్రజలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు.

8th Class Social Textbook Page No.179

ప్రశ్న 12.
స్వతంత్ర్య న్యాయ వ్యవస్థ అంటే ఏమిటి?
జవాబు:
న్యాయ రంగంలో శాసన, కార్యనిర్వాహక రంగాలు జోక్యం చేసుకోలేవు. న్యాయస్థానాలు ప్రభుత్వ ఆధీనంలో లేవు. ప్రభుత్వం తరఫున పనిచేయవు. పోలీసులు కూడా న్యాయరంగంలో భాగం కాదు. ఇలా న్యాయశాఖ స్వతంత్రంగా , ఉండే విధానాన్నే స్వతంత్ర్య న్యాయవ్యవస్థ అంటారు.

AP Board 8th Class Social Solutions Chapter 15 చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం

ప్రశ్న 13.
తీర్పును ప్రభావితం చేయడంలో రాజకీయ నాయకులకు ఏమైనా ఆస్కారం ఉందా? ఎందుకని?
జవాబు:
తీర్పును ప్రభావితం చేయడంలో రాజకీయ అధికారులకు ఆస్కారం లేదు. ఎందుకంటే మన రాజ్యాంగం న్యాయవ్యవస్థకు – స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చినది. కాబట్టి ఇందులో ఎవరూ కలిగించుకోలేరు. న్యాయమూర్తి కూడా విచారణను నిష్పక్షపాతంగా బహిరంగంగా నిర్వహిస్తాడు.

ప్రశ్న 14.
రవి కేసును ఏ న్యాయస్థానం విచారిస్తోంది?
జవాబు:
రవి కేసును జ్యుడీషియల్ మేజిస్ట్రేటు కోర్టు విచారిస్తోంది.

ప్రశ్న 15.
మొదటి వాయిదాలో ఏమయ్యింది?
జవాబు:
చాలాసేపు వేచి ఉన్న తరువాత రవి, సాంబలను విచారణకు పిలిచారు. జ్యుడీషియల్ మెజిస్ట్రేటు ముందు ఇదే మొదటి వాయిదా.

ఎస్ఎఆర్ ప్రతిని, పోలీసుల నివేదికను రవి న్యాయవాదికి ఎస్ఎ ఇచ్చాడు. దీనివల్ల తన క్లయింటుపై మోపబడిన ఆరోపణలు ఏమిటో అతడికి తెలుస్తాయి. ఈ నివేదికల ద్వారా రవికి వ్యతిరేకంగా పోలీసులు సేకరించిన సాక్ష్యాలు ఏమిటో కూడా అతడికి తెలుస్తాయి. ఈ కేసులో నిందితుడైన రవి తరపున అతని న్యాయవాది వాదించటానికి ఇదంతా దోహదపడుతుంది.

మొదటి వాయిదాలో తీవ్రంగా గాయపరిచాడంటూ రవిపై జ్యుడీషియల్ మెజిస్టేటు నేరారోపణ చేశాడు. ఈ నేరం రుజువైతే 4 సంవత్సరాల దాకా జైలుశిక్ష పడవచ్చు. రవి నేరాన్ని అంగీకరించలేదు. దాంతో మెజిస్ట్రేటు తరవాత విచారణను 15 రోజులకు వాయిదా వేశాడు.

ప్రశ్న 16.
ప్రభుత్వం తరఫున వాదించే న్యాయవాదిని ఏమంటారు?
జవాబు:
పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేదా ప్రభుత్వ న్యాయవాది అంటారు.

8th Class Social Textbook Page No.180

ప్రశ్న 17.
ఏ కేసులోనైనా సాక్షులు చెప్పే వాటిని వినాల్సిన అవసరం ఏమిటో చర్చించండి.
జవాబు:
ఏ కేసులోనైనా నిందితులు, బాధితులు ఎవరికి అనుకూలంగా వారే మాట్లాడుతారు. కావున సత్యం తెలియదు. సాక్షులు చెప్పేవాటిని వింటే సత్యం తెలుస్తుంది. అందుకే వారు చెప్పినది వినాలి.

8th Class Social Textbook Page No.181

ప్రశ్న 18.
మీ టీచరు సహాయంతో మీ ప్రాంతానికి సంబంధించి ఈ న్యాయస్థానాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోండి?
జవాబు:
మా ప్రాంతానికి సంబంధించి జిల్లా కోర్టులు విజయవాడలోను, హైకోర్టు మచిలీపట్నంలోను ఉన్నాయి.

ప్రశ్న 19.
ఒక పెద్ద కంపెనీ అడవిని నరికివేస్తోందనీ, ఒక గిరిజనుడు కట్టెపుల్లల కోసం కొమ్మలు నరుకుతున్నాడని ఊహించుకోండి. – నిష్పక్షపాతంగా వ్యవహరించటం మంచిదేనా? చర్చించండి.
జవాబు:
గిరిజనులకు అడవిమీద అధికారం ఉంటుంది. వారి నిత్యావసరాలకు, వారు అడవిమీద ఆధారపడతారు. అడవికి – హానిచేయరు. దీనిని సమర్థించవచ్చు.

ఒక పెద్ద కంపెనీ అడవిని నరికివేయడం. అనేది చట్ట విరుద్ధమైన చర్య. ఇది పర్యావరణానికి ముప్పు, కాబట్టి ఇది సమర్థనీయం కాదు.

AP Board 8th Class Social Solutions Chapter 15 చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం

ప్రశ్న 20.
కింది నుంచి పై వరకు న్యాయస్థానాల వ్యవస్థ పిరమిడ్ ఆకారాన్ని పోలి ఉంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఒక బొమ్మలో నింపండి.
(లేదా)
కింద ఇవ్వబడిన ఫ్లోచార్టలోని సమాచారం ఆధారంగా దిగువ ప్రశ్నలకు జవాబులు రాయండి.
జవాబు:
i) మనదేశంలో ఎన్ని స్థాయిలలో న్యాయస్థానాలు ఉన్నాయి?
ii) దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం ఏది?
iii) “సబార్డినేట్” న్యాయస్థానాలని వేటిని అంటారు?
iv) భారతదేశంలోని అన్ని న్యాయస్థానాలు ఏ న్యాయస్థానానికి లోబడి ఉండాలి?
జవాబు:
i) మనదేశంలో మూడు స్థాయిలలో న్యాయ స్థానాలు ఉన్నాయి.
ii) దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు
iii) కింది స్థాయి న్యాయస్థానాలను సబార్డినేట్ న్యాయస్థానాలు అంటారు.
iv) అన్ని న్యాయస్థానాలు సుప్రీంకోర్టుకు లోబడి ఉంటాయి.

8th Class Social Textbook Page No.182

ప్రశ్న 21.
“మా నాన్నకి న్యాయం జరిగింది, కానీ చాలా ఆలస్యం అయింది” అని క్రాంతి అన్నాడు. మీరు అతడితో ఏకీభవిస్తారా? Page No.182)
జవాబు:
నేను క్రాంతితో ఏకీభవిస్తాను. ఎందుకంటే న్యాయం జరగడానికి సుమారు 3 సం||రాల కాలం తీసుకుంది. ఇది తక్కువ సమయమేమీ కాదు.

ప్రశ్న 22.
రవి శిక్షను సెషన్స్ కోర్టు తగ్గించటానికి కారణాలను ఊహించండి.
జవాబు:
ఏ దేశంలోనైనా శిక్షా స్మృతి దోషుల మనసు మార్చడానికే రాయబడి ఉంటుంది. రవికి మేజిస్ట్రేట్ కోర్టు 4 సం||రాల జైలు శిక్ష విధించింది. ఆ తీర్పుపై అభ్యంతరంతో రవి సెషన్సు కోర్టుకు అప్పీలు చేసుకున్నాడు. సెషన్సు కోర్టులో కేసు తేలడానికి రెండు సంవత్సరాలు పట్టింది. అంటే అతని శిక్షాకాలంలో సగం కోర్టు నిర్ణయానికే వేచి ఉండాల్సి వచ్చింది. ఇంత కాలంలో మనిషిలో మార్పు రావడానికి అవకాశం కచ్చితంగా ఉంటుంది. ఈ భావనను పరిగణనలోనికి తీసుకుని కోర్టు రవికి శిక్ష తగ్గించి ఉండవచ్చు.

ప్రశ్న 23.
నిందితులను కానీ, సాక్షులను కానీ హైకోర్టు తన ముందుకు రమ్మని అడగదు. ఎందుకని?
జవాబు:
క్రిందిస్థాయి కోర్టులో నిందితులను, సాక్షులను విచారిస్తారు. కాబట్టి హైకోర్టు మరలా విచారించాల్సిన అవసరం లేదు అని హైకోర్టు భావిస్తుంది. అందుకే వారిని తన ముందుకు రమ్మని అడగదు.

ప్రాజెక్టు

వీస్ ల్యాండ్ అనే పట్టణం ఉంది. దానికి 40 కిలోమీటర్ల దూరంలోని ఆటస్థలంలో ఫియస్టా, జుబిలీ అనే ఫుట్ బాల్ టీముల మధ్య తుది పోటీ జరగాల్సి ఉంది. అయితే మరునాడు మైదానాన్ని జుబిలీ బృందం మద్దతుదారులు పాడుచేశారని తెలిసింది. పీల్యాండ్ లో ఫియస్గా మద్దతుదారులు జుబిలీ మద్దతుదారుల ఇళ్లపై మారణాయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో 10 మంది పురుషులు చనిపోయారు. అయిదుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. 50 మందికి పైగా ప్రజలు గాయాలపాలయ్యారు.

మీరు, మీ మిత్రులు నేర న్యాయవ్యవస్థలో భాగమని ఊహించుకోండి. ముందుగా తరగతిలోని విద్యార్థులను ఈ కింది రకంగా విభజించండి.

  1. పోలీసు
  2. ప్రభుత్వ న్యాయవాది
  3. నిందితుల తరపు న్యాయవాది
  4. న్యాయమూర్తి

పాఠం నుండి ప్రతి జట్టు చేయవలసిన విధులను, ఫియస్గా అభిమానులచే హింసకు గురైన బాధితులకు న్యాయం జరిగేలా కేటాయించండి. ఈ విధులు ఏ క్రమంలో పూరించాలో సూచించండి.

ఇదే పరిస్థితిని తీసుకుని ఫియస్గా అభిమానియైన ఒక విద్యార్ధిని పైవిధులన్నీ నిర్వర్తించమనండి. నేర న్యాయవ్యవస్థలోని అన్ని విధులూ ఒక్కరే నిర్వర్తించినప్పుడు బాధితులకు న్యాయం జరుగుతుందా? మీ సమాధానానికి కారణాలు పేర్కొనండి.

నేర న్యాయవ్యవస్థలో వివిధ పాత్రలను వివిధ వ్యక్తులు పోషించాలనటానికి రెండు కారణాలను పేర్కొనండి.
జవాబు:
న్యాయవ్యవస్థలోని అన్ని విధులూ ఒకరే నిర్వహించితే కచ్చితంగా -ఒక వర్గానికి అన్యాయం జరుగుతుంది.
ఉదా :
ఫియస్గా అభిమాని విచారణ జరిపితే జూబిలీ వారికి అన్యాయం జరుగుతుంది.

రెండు కారణాలు :

  1. నేరవ్యవస్థలో ప్రాథమిక ఆధారాలని బట్టి మాత్రమే విచారణ చేసి కేసు పెడతారు.
  2. న్యాయ వ్యవస్థలో వాటిని కూలంకషంగా పరిశీలించి తీర్పునిస్తారు. కాబట్టి రెండు వ్యవస్థలు వేరువేరుగా ఉండాలి.

AP Board 8th Class Social Solutions Chapter 11A జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919

SCERT AP 8th Class Social Study Material Pdf 11Ath Lesson జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919 Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 11Ath Lesson జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919

8th Class Social Studies 11Ath Lesson జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919 Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
తప్పు వాక్యాలను సరిచేయండి. (AS1)
అ. భారత జాతీయ కాంగ్రెస్ తొలిరోజుల్లో బొంబాయి ప్రజలు మాత్రమే పాల్గొనేవారు.
ఆ. దేశంలో వివిధ ప్రాంతాలలో భారత పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు నెలకొల్పసాగారు.
ఇ. మొదటి ప్రపంచ యుద్ధం తరవాత భారతదేశం ప్రజాస్వామిక దేశంగా మారుతుందని ఇక్కడి ప్రజలు ఆశించారు.
జవాబు:
అ. భారత జాతీయ కాంగ్రెస్ తొలిరోజుల్లో వివిధ రాష్ట్రాల మేధావులు పాల్గొనేవారు. ఆ
ఆ. స్వదేశీ ఉద్యమం వల్ల దేశంలో భారతీయ పరిశ్రమలకు మంచి ప్రోత్సాహం లభించింది.
ఇ. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత భారతదేశంలో సంస్కరణలు అమలు అవుతాయని ఇక్కడి ప్రజలు ఆశించారు.

ప్రశ్న 2.
భారత జాతీయ కాంగ్రెస్ మితవాద, అతివాద నాయకుల మధ్య అ) ప్రధాన కోరికలు ఆ) ప్రజల సమీకరణాల దృష్ట్యా జరిగే సంభాషణ ఊహించి రాయండి.
జవాబు:
భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం – లక్నో
మితవాదులు : ఇంపీరియల్ విధానసభలో మనవారికి మరికొంతమందికి ప్రాతినిధ్యం ఇవ్వాలని కోరుదాం.

అతివాదులు : అవకాశం అనేది మనది వారివ్వటమేమిటి, మనం పుచ్చుకోవడమేమిటి అసలు వారిని మనదేశం నుండి తరిమికొట్టాలి.

మితవాదులు : దానిని ఒప్పుకుందాం ! కాని వారు వదిలిపోయేదాకా మనం కాలం గడపాలిగా ! మన ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలంటే మనవారు అధికారంలో ఉండాలి. అందుకే దీనికి అనువుగా సివిల్ సర్వీసెస్ మన దేశంలోనే నిర్వహించాలని కోరుతున్నాం.

అతివాదులు : కోరికలు, విన్నపాలు, అర్జీలు, ఆందోళనలతో మనకు స్వాతంత్ర్యం రాదు. వీటివల్ల మనకు ప్రజల మద్దతు కూడా ఉండదు. మనమందరం కలుద్దాం. ఐక్యపోరాటం చేద్దాం. సమస్యను ప్రజల్లోకి తీసుకువెళదాం. వాళ్ళ మద్దతు కూడగడదాం ! బ్రిటిషువారిని తరిమికొడతాం.

మితవాదులు : సరే ! మా పంథాను, మీ పంథాను కలిపి ప్రజల పంథాగా మారుద్దాం ! వారితో చేతులు కలిపి స్వాతంత్ర్యాన్ని సాధిద్దాం !

అందరూ : “వందేమాతరం, వందేమాతరం”

AP Board 8th Class Social Solutions Chapter 11A జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919

ప్రశ్న 3.
ఈ అధ్యాయం చదివిన తరవాత జాతీయోద్యమం తొలిదశలో ఎక్కువగా చదువుకున్న భారతీయులు పాల్గొన్నారని మరియమ్మ అభిప్రాయపడింది. వాళ్ల భావాలు చాలావరకు పాశ్చాత్య ప్రభావం వల్ల ఏర్పడ్డాయి అని కూడా అనుకుంటోంది. ఆమెతో మీరు ఏకీభవిస్తారా? మీ కారణాలు పేర్కొనండి. (AS2)
జవాబు:
మరియమ్మతో నేను ఏకీభవిస్తాను.

కారణాలు :

  1. పెద్ద నగరాలలో ఆంగ్ల విద్యావ్యాప్తితో ఒక కొత్త చైతన్యం రూపుదిద్దుకుంది
  2. వీరు పాత సామాజికవ్యవస్థలోని అన్యాయాలను, అసమానతలను ఎత్తి చూపారు.
  3. చదువుకున్న భారతీయులు బ్రిటిషు పాలన స్వభావాన్ని, భారతదేశం మీద దాని ప్రభావాన్ని అర్థం చేసుకుని, బ్రిటిషు విధానాలను తీవ్రంగా విమర్శించారు.
  4. వీరి విమర్శలు, ఉపన్యాసాలు విన్న తరువాతే సామాన్య ప్రజానీకం జాతీయోద్యమంలో అడుగిడింది.

ప్రశ్న 4.
భారతదేశంపై బ్రిటిషు పాలన ఆర్థిక ప్రభావాన్ని ఎందుకు అర్థం చేసుకోవాలి? (AS1)
జవాబు:
భారతదేశంలో బ్రిటిషు పాలన ఆర్థిక ప్రభావాన్ని అర్థం చేసుకోకపోతే వనరుల తరలింపు ఎలా జరుగుతోందో అర్థం కాదు. మన చేతివృత్తులు ఎందుకు క్షీణిస్తున్నాయో తెలియదు. పేదరికానికి కారణాలు కానరావు. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఆర్థిక ప్రభావాన్ని అర్థం చేసుకోవాలి.

ప్రశ్న 5.
‘స్వదేశీ’ అంటే మీరు ఏం అర్థం చేసుకున్నారు? దానివల్ల ప్రభావితమైన ముఖ్యమైన రంగాలు ఏమిటి? (AS1)
జవాబు:
‘స్వదేశీ’ అంటే ‘మనదేశంలో తయారయినవి లేదా మనదేశంలోనివి’ అని నేను అర్థం చేసుకున్నాను.

ఇది ప్రభావితం చేసిన ముఖ్యమైన రంగాలు :

  1. రాజకీయ రంగం
  2. సామాజికరంగం
  3. వ్యాపార రంగం (జాతీయ)
  4. పారిశ్రామికరంగం
  5. విదేశీ వ్యాపార రంగం
  6. ఆధ్యాత్మికరంగం
  7. విద్యారంగం
  8. సాంస్కృతికరంగం
  9. న్యాయరంగం

ప్రశ్న 6.
బెంగాల్ విభజనకు దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఎలా స్పందించారు? (AS1)
జవాబు:
1903లో కర్ణన్ బెంగాల్ ను తూర్పు, పశ్చిమబెంగాల్ గా విభజించాలని చేసిన ప్రతిపాదన జాతీయ భావాలను పెద్ద ఎత్తున రగిల్చింది. బెంగాలీ ప్రజలను విడదీసి, జాతీయోద్యమాన్ని బలహీనపరిచే ప్రభుత్వ రాజకీయ కుట్రగా జాతీయవాదులు బెంగాల్ విభజనను నిరసించారు. కాని ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా 1905లో బెంగాల్ ను విభజించింది. దానికి నిరసనగా అనేక సమావేశాలు జరిగాయి. ఉప్పు, విదేశీ వస్త్ర బహిష్కరణకు పిలుపు ఇచ్చారు. ఈ పిలుపుతో ప్రజలు పెద్ద ఎత్తున స్పందించారు. దేశమంతటా ప్రధాన పట్టణాలు, నగరాలలో, బెంగాల్ మారుమూల ప్రాంతాల్లో విదేశీ వస్త్ర బహిష్కరణ, దహనం, విదేశీ వస్తువులు అమ్మే దుకాణాల పికెటింగ్ వంటివి సర్వసాధారణమైపోయాయి. విదేశీ గాజులు వేసుకోటానికీ, విదేశీ వంట పాత్రలను ఉపయోగించటానికి మహిళలు నిరాకరించారు. విదేశీయుల బట్టలను ఉతకటానికి బట్టలు ఉతికే వాళ్లు నిరాకరించారు. విదేశీ పంచదార ఉన్న నైవేద్యాన్ని తీసుకోటానికి పూజారులు కూడా నిరాకరించారు. ప్రభుత్వ సంస్థలైన పాఠశాలలు, కళాశాలలు, న్యాయస్థానాలు వంటి వాటిని బహిష్కరించమని కూడా పిలుపునిచ్చారు. ప్రజలు స్వదేశీ పాఠశాలలు, కళాశాలలు స్థాపించారు. తమ తగాదాలను పరిష్కరించుకోటానికి సమాంతర న్యాయ స్థానాలను ఏర్పాటుచేశారు. ప్రజలు బెంగాలు విభజనకు ఈ విధంగా స్పందించారు.

AP Board 8th Class Social Solutions Chapter 11A జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919

ప్రశ్న 7.
భారతదేశ పటంలో కింది వాటిని గుర్తించండి. (AS5)
1. కలకత్తా (కోల్ కతా)
2. మద్రాసు (చెన్నై)
3. బొంబాయి (ముంబయి)
4. లక్నో
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 11A జాతీయోద్యమం తొలి దశ 1885 – 1919 1

ప్రశ్న 8.
ప్రపంచ పటంలో కింది వాటిని గుర్తించండి. (AS5)
1) బ్రిటన్ 2) ఫ్రాన్స్ 3) రష్యా 4) జర్మనీ
AP Board 8th Class Social Solutions Chapter 11A జాతీయోద్యమం తొలి దశ 1885 – 1919 2

ప్రశ్న 9.
మన దేశం కోసం తిలక్, భగత్ సింగ్, గాంధీజీ, సుభాష్ చంద్రబోస్ వంటి నాయకులు జీవితాలను త్యాగం చేశారు. వారు తమ జీవితాలను దేశం కోసం త్యాగం చేయకుండా ఉన్నట్లయితే ఏమి జరిగేది? (AS6)
జవాబు:
వీరి త్యాగమే లేకపోతే మనం ఇంకా బ్రిటిషు పాలనలో నరకయాతనలు పడుతూ, బానిస జీవితం గడుపుతూ ఉండేవాళ్లము.

AP Board 8th Class Social Solutions Chapter 11A జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919

ప్రశ్న 10.
ఈ మధ్యకాలంలో మీ ప్రాంతంలో ఏవైనా ఉద్యమాలు జరిగాయా? అవి ఎందుకు జరిగాయి? (AS4)
జవాబు:
ఈ మధ్యకాలంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు ఉద్యమాలు జరిగాయి. తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రం కావాలని మా ప్రాంతీయులు ఉద్యమం చేసారు. తెలంగాణ ప్రాంత సంస్కృతి, ప్రత్యేక యాసల పరిరక్షణ, వెనుకబాటుతనం నుండి బయటపడటం, సత్వర అభివృద్ధి, యువతకు విద్య, ఉద్యోగ అవకాశాలు వంటి ప్రధాన డిమాండ్లతో ఈ ఉద్యమం సాగింది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం ప్రకటించగానే ఆంధ్రప్రదేశ్ విభజన వద్దంటూ సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమైంది. అభివృద్ధి చెందిన హైదరాబాదును లక్ష్యంగా ఈ ఉద్యమం సాగింది.

8th Class Social Studies 11Ath Lesson జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919 InText Questions and Answers

8th Class Social Textbook Page No.122

ప్రశ్న 1.
మీ ఊళ్లో లేదా పట్టణంలో (ఒక కులం లేదా ఒక మతానికి సంబంధించికాక) మొత్తం అందరి సమస్యల గురించి మాట్లాడే ఏదైనా సంఘం గురించి తెలుసా? వాళ్లు ఏం చర్చిస్తారు? ఈ సమస్యల పరిష్కారానికి వాళ్ల సలహాలు ఏమిటి? కొన్ని ఉదాహరణలను మీ తరగతిలో చర్చించండి.
జవాబు:
మా ఊళ్ళో అందరి సమస్యల గురించి మాట్లాడే సంఘం ఒకటుంది. అదే ‘మైత్రీ సంఘం’. దీనిలో అన్ని స్థాయిల నుండి, అన్ని రంగాల నుండి సభ్యులను నియమిస్తారు. వీరందరూ కలిసి గ్రామంలోని శాంతిభద్రతల వ్యవహారాలను పరిరక్షిస్తారు. ఏదైనా సమస్య వస్తే బాధితులతోను, దానికి కారణమైన వారితోనూ చర్చిస్తారు. పరిష్కారాలు సూచిస్తారు. దానిని వినక పోతే పోలీసు అధికారులకు తెలియచేస్తారు. పోలీసు వారినుండి తగిన న్యాయం, రక్షణ అందకపోతే వారిని కూడా ప్రశ్నిస్తారు. అందరికీ మేలు జరిగేలా చూస్తారు.

ఈ సమస్యల పరిష్కారానికి వాళ్ళు చెప్పిన సలహా :
శత్రువు బలవంతుడు, మూర్ఖుడు అయినపుడు, వాడిని మంచి మాటలతో లొంగదీసుకుని మన మాట వినేలా చేయాలి. మనం బలం కూడగట్టుకుని, సమయం చూసి వాడిని బయటకు పంపాలి. అంతేకాని బలం తెలుసుకోక, సమయం కాని సమయంలో ఎదురు తిరిగితే మనమే వెనక్కి తగ్గాలి.
ఉదా :
తొలిరోజులలో కాంగ్రెస్ మేధావులకే పరిమితమైంది. రానురాను విద్యావంతులు, ప్రజలు దీనిలో చేరటంతో ఇది బలాన్ని పుంజుకుంది. రెండు ప్రపంచ యుద్ధాలతో బ్రిటిషు కొంచెం బలహీనమైంది. అదే సమయంలో మనం ఎక్కువ – ఎదురు తిరగటంతో స్వాతంత్ర్యం పొందాము. 1857లో బలంలేక, సరియైన సమయం కాక వెనుతిరిగాము.

8th Class Social Textbook Page No.124

ప్రశ్న 2.
భారతదేశంలో పేదరికం, కరవులకు బ్రిటిషు పాలకులు కారణమని తొలి జాతీయవాదులు ఎందుకు విశ్వసించారు? (Page No. 124)
జవాబు:
తొలి జాతీయవాదులు అందరూ విద్యావంతులు, మేధావులు. వారు బ్రిటిషు పరిపాలన ఆర్థిక ప్రభావాన్ని అధ్యయనం చేసి పన్నులు, ఇతర మార్గాల ద్వారా బ్రిటిషు వాళ్ళు భారతదేశ సంపదను దోచుకుంటున్నారనీ, భారతదేశం నానాటికీ పేద దేశంగా మారుతోందని నిర్ధారించారు. దేశసంపదను బ్రిటన్‌కు తరలించారు. వారి వస్తువులను ఇక్కడ తక్కువ ధరలకు అమ్ముతూ స్వదేశీ పరిశ్రమలను కుంటుపరిచారు.

అధిక భూమిశిస్తు, ఆహారధాన్యాల ఎగుమతి వంటి బ్రిటిషు విధానాల వల్లనే కరువు, పేదరికం వంటి సమస్యలు ఎదురౌతున్నాయని అర్థం చేసుకున్నారు. అందువల్ల భారతదేశంలో పేదరికం, కరవులకు బ్రిటిషు పాలకులు కారణమని విశ్వసించారు.

AP Board 8th Class Social Solutions Chapter 11A జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919

ప్రశ్న 3.
భారతదేశపు పురాతన రాజుల పాలనను తిరిగి స్థాపించాలని తొలి జాతీయవాదులు ఎందుకు అనుకోలేదు? బ్రిటిషు పాలన కంటే అది మెరుగ్గా ఉండేది కాదా?
జవాబు:
అది కచ్చితంగా మెరుగ్గా ఉండదు. కారణాలు:

  1. జాతీయవాదులు భారత జాతిని ఐక్యజాతిగా భావించారు. పురాతన రాజులు చిన్న చిన్న రాజ్యాలుగా విభజించారు.
  2. బ్రిటిషు వారి పాలన పెనం లాంటిది, రాజుల పాలన పొయ్యి లాంటిది.
  3. రాజులు చాలామంది విదేశీయులే. స్వదేశీ పాలన వీరి లక్ష్యం.

8th Class Social Textbook Page No.126

ప్రశ్న 4.
విదేశీ బట్టలు తగులబెడుతున్న దాంట్లో పాల్గొంటున్న విద్యార్థిగా మిమ్మల్ని మీరు ఊహించుకోండి. ఆరోజు ఏమి జరిగి ఉంటుంది? అప్పుడు మీ ఉద్వేగాలు ఎలా ఉంటాయో వివరించండి.
జవాబు:
నా పేరు శరత్ చంద్ర ఛటర్జీ. కలకత్తాలోని కళాశాలలో బి.ఎ. మొదటి సంవత్సరం చదువుతున్నాను. బ్రిటిషు వారు మన దేశాన్ని ఆక్రమించి, ఇన్నేళ్ళు పాలించటమే కాక ఇప్పుడు దీన్ని ముక్కలు చేయటానికి ప్రయత్నిస్తున్నారు. ఇన్నాళ్ళూ భారతీయులందరూ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుని జీవించారు. ఇక ఊరుకునేది లేదని మేము వారికి చెప్పదలిచాము. నాతోటి విద్యార్థులు, మా ఇరుగుపొరుగు వారు ఈ రోజు ‘విదేశీ వస్తువుల, దహనకాండ’ను జరపాలని నిశ్చయించుకున్నాము. . సమయం మధ్యాహ్నం 2 గంటలయింది. అప్పటి దాకా నిర్మానుష్యంగా ఉన్న మా వీధి కూడలి ఒక్కసారిగా జన కడలిగా మారింది. కూడలి మధ్యలో నిప్పు రాజేశాము. మా ఇళ్లల్లోని విదేశీ వస్త్రాలు, వస్తువులు ఒకటేమిటి అన్నీ తెచ్చి నిప్పుల్లో వేశాము. మంట ఆకాశాన్నంటింది. ‘వందేమాతరం’ నినాదం ‘ఓం’కారనాదంలా మ్రోగింది. మా కళ్ళమ్మట నీరు ఉప్పొంగి ఎగసింది. ఆ అగ్ని తన నాలుకలను నలుదిక్కులా చాచింది. ఆ కాంతి మా స్వాతంత్ర్యకాంక్షను ప్రపంచానికి తెలియచెప్పింది. ఆవేశంతో కూడిన మా ఆగ్రహం బ్రిటిషు వారి గుండెల్లో నగారాలు మోగించింది. మా ప్రాణాలు యిచ్చి అయినా సరే మా స్వరాజ్యాన్ని సాధిస్తామని ప్రమాణం చేశాము.
“వందేమాతరం”
“వందేమాతరం”.

ప్రశ్న 5.
ప్రజల న్యాయమైన కోరికలను అధికారులు ఒప్పుకోకపోతే ప్రజలు ఏం చేయాలి?
జవాబు:
కోరికలు న్యాయమైనవే కాక చట్టపరంగా కూడా అధికారులు చేయగలిగేలా ఉండాలి. అలాంటి కోరికలను అధికారులు ఒప్పుకోకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా వారిని ఎదిరించి పోరాడి సాధించాలి.

8th Class Social Textbook Page No.127

ప్రశ్న 6.
ఆ సమయంలో యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ, ఇతర దేశాలతో శాంతిని పునరుద్ధరించమని తమ ప్రభుత్వాన్ని కోరుతూ ప్రజలు పెద్దఎత్తున ఉద్యమించారు. అలా చేయడం సరైనదేనా? పెద్దఎతున ఉద్యమించారు. అలా చేయడం సరైనదేనా?
జవాబు:
సరైనదే. ఎందుకంటే, జర్మనీతో కాని, దాని మిత్రదేశాలతో కాని భారతదేశానికి ఎటువంటి వైరం లేదు. బ్రిటిషు వారినే మనం దేశం వదిలి పొమ్మంటుంటే, వారి కోసం ఇతరులతో యుద్ధం చేయడం హాస్యాస్పదం. కాబట్టి అలా చేయడం సరైనదే.

AP Board 8th Class Social Solutions Chapter 11A జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919

ప్రశ్న 7.
మొదటి ప్రపంచ యుద్ధం గురించి, సామాన్య ప్రజలపై దాని ప్రభావం గురించి మరింత తెలుసుకోండి.
జవాబు:
మొదటి ప్రపంచ యుద్ధం పెట్టుబడిదారులకు, కమ్యూనిస్టులకు మధ్య జరిగింది అని చెప్పవచ్చును. ఇది ఆరునెలలనుకున్నది. 5 ఏళ్ళు సాగింది. ప్రపంచంలోని ప్రజలందరూ దీనిలో పాల్గొన్నారు. అన్ని రంగాల్లోనూ దాదాపు 1,00,00,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 65,00,000 మంది గాయపడ్డారు. 60,00,000 మంది కనబడకుండా పోయారు. లేదా యుద్ధ ఖైదీలయ్యారు. అందరికీ ఆహారం, ఆరోగ్యం కరువయ్యింది. ప్రపంచం మొత్తం అభద్రతా భావంతో అల్లల్లాడారు.

ప్రాజెక్టు పని

ప్రశ్న 1.
భారత జాతీయోద్యమంలో పాల్గొన్న జాతీయ నాయకుల చిత్రాలను సేకరించి ఆల్బమ్ తయారుచేయండి. దానిపై ఒక నివేదిక తయారు చేసి ప్రదర్శించండి.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 11A జాతీయోద్యమం తొలి దశ 1885 – 1919 3 AP Board 8th Class Social Solutions Chapter 11A జాతీయోద్యమం తొలి దశ 1885 – 1919 4

  1. భారతదేశంలో జాతీయోద్యమం ఒక చారిత్రాత్మక ఘటన.
  2. ఇది సమాజంలోని విభిన్న ప్రజలు, వర్గాలను ఒక్కతాటి కిందకు తెచ్చి బ్రిటిషు పాలనకు వ్యతిరేకంగా పోరాడటమే కాకుండా ఒక నూతన దేశ నిర్మాణానికి కృషి సలిపేలా చేసింది.
  3. 19వ శతాబ్దపు ద్వితీయార్ధంలో కొత్త చైతన్యానికి పునాదులు పడ్డాయి.
  4. చదువుకున్న భారతీయులు బ్రిటిషుపాలన స్వభావాన్ని అర్థం చేసుకుని బ్రిటిషువారి మీద పోరాడటానికి స్వాతంత్ర్యోద్యమంలో చేరడం జరిగింది.
  5. భారతదేశ సమస్యను చర్చించడానికి దాదాబాయ్ నౌరోజి, W.C. బెనర్జీ, ఫిరోజ్ షా మెహతాలాంటివారు కొన్ని సంఘాలను ఏర్పాటు చేసి, అన్ని కులాల, మతాల వారిని ఒక గొడుగు క్రిందకు తీసుకురావడానికి ఇది ప్రయత్నించాయి.

AP Board 6th Class Science Solutions Chapter 1 మనకు కావలసిన ఆహారం

SCERT AP 6th Class Science Study Material Pdf 1st Lesson మనకు కావలసిన ఆహారం Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Science 1st Lesson Questions and Answers మనకు కావలసిన ఆహారం

6th Class Science 1st Lesson మనకు కావలసిన ఆహారం Textbook Questions and Answers

Improve Your Learning (అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం)

I. ఖాళీలను పూరించండి.

1. ఉప్పు ………. నుండి లభ్యమవుతుంది. (సముద్రపు నీరు)
2. ఆహారం తయారు చేయడానికి కావలసిన పదార్థాలను …………… అంటాం. (దినుసులు)
3. ఆహారాన్ని కొంతకాలం నిల్వ చెయ్యడానికి ……………… ఉపయోగిస్తాం. (ఆహార నిల్వ పదార్థాలు)
4. కాలం చెల్లిన ఆహార పదార్థాలను తినడం వలన మన ………. పాడవుతుంది. (ఆరోగ్యం)

II. సరైన సమాధానాన్ని గుర్తించండి.

1. ఇడ్లీ తయారీ పద్ధతి
A) నూనెలో కాల్చడం
B) పులియ బెట్టుట
C) ఆవిరిపై ఉడికించుట
D) ఉడికించుట
జవాబు:
C) ఆవిరిపై ఉడికించుట

AP Board 6th Class Science Solutions Chapter 1 మనకు కావలసిన ఆహారం

2. చక్కెర లభించే వనరు
A) మొక్క
B) జంతువు
C) సముద్రం
D) పైవన్నీ
జవాబు:
A) మొక్క

III. జతపరచండి.

గ్రూపు – A గ్రూపు – B
A) రాగులు 1) పెరల్ మిల్లెట్
B) సజ్జలు 2) ప్రోసో మిల్లెట్
C) జొన్నలు 3) ఫాక్స్ టైల్ మిల్లెట్
D) కొర్రలు 4) ఫింగర్ మిల్లెట్
E) సామలు 5) గ్రేట్ మిల్లెట్

జవాబు:

గ్రూపు – A గ్రూపు – B
A) రాగులు 4) ఫింగర్ మిల్లెట్
B) సజ్జలు 1) పెరల్ మిల్లెట్
C) జొన్నలు 5) గ్రేట్ మిల్లెట్
D) కొర్రలు 3) ఫాక్స్ టైల్ మిల్లెట్
E) సామలు 2) ప్రోసో మిల్లెట్

IV. ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రశ్న 1.
జంతువులు, మొక్కల నుండి లభించే కొన్ని ఆహార పదార్థాలకు ఉదాహరణలు రాయండి.
జవాబు:
మొక్కల నుండి లభించే ఆహార పదార్థాలు :
ధాన్యాలు, తృణధాన్యాలు, కూరగాయలు, ఆకు కూరలు మరియు పండ్లు.

జంతువుల నుండి లభించే ఆహార పదార్థాలు :
మాంసం, గుడ్డు, పాలు మరియు తేనె.

ప్రశ్న 2.
క్రింది ఆహార పదార్థాలలోని దినుసులను కనుగొనండి.
a) బంగాళదుంప కూర b) కొబ్బరి చట్నీ c) గులాబ్ జామ్ d) పొంగలి
జవాబు:

ఆహార అంశం కావలసిన దినుసులు
a) బంగాళదుంప కూర బంగాళదుంప, ఉల్లిపాయ, మిరపకాయలు, ఉప్పు, నూనె.
b) కొబ్బరి చట్నీ కొబ్బరి, మిరపకాయలు, నూనె, ఉప్పు, చింతపండు.
c) గులాబ్ జామ్ గులాబ్ జామ్ పిండి, నీరు, నూనె, చక్కెర, ఏలకులు.
d) పొంగలి బియ్యం , బెల్లం, నీరు, పాలు, ఏలకులు, జీడిపప్పు, కిస్ మిస్.

ప్రశ్న 3.
ఆహారం ఎలా పాడవుతుంది? మానవ ఆరోగ్యంపై దాని ప్రభావమేమిటి?
జవాబు:
ఆహారాన్ని సరిగ్గా భద్రపరచకపోతే, దానిపై సూక్ష్మక్రిములు దాడి చేయటం వలన చెడిపోతుంది.

  • ఇలాంటి చెడిపోయిన ఆహారం తినడం వల్ల ఆహారం విషతుల్యం అవుతుంది.
  • ఇలాంటి విషపూరిత ఆహారం తినడం వల్ల కడుపు నొప్పి, విరేచనాలు, వాంతులు వస్తాయి.
  • మరియు కొన్నిసార్లు ఇది మరణానికి కూడా దారితీస్తుంది.

ప్రశ్న 4.
మీరు ఒక పాకశాస్త్ర నిపుణుడిని కలిసినప్పుడు రుచికరమైన ఆహారం తయారీ కోసం మెలుకువలు నేర్చుకొనుటకు ఏయే ప్రశ్నలు అడుగుతారు?
జవాబు:

  1. తినడానికి చౌకైన మరియు ఆరోగ్యకరమైన ఆహారం ఏమిటి?
  2. మీరు ఆహారాన్ని సిద్ధం చేస్తున్నప్పుడు, మీరు దానికి రంగులు వేస్తున్నారా?
  3. ఆహారానికి అదనపు రుచిని ఇవ్వడానికి మీరు ఏ పదార్థాలను జోడిస్తారు?
  4. స్వీట్స్ తయారీలో రుచిని జోడించడానికి ఏ పదార్థాలను ఇష్టపడతారు?

ప్రశ్న 5.
నీకు నచ్చిన ఒక ఆహార పదార్థం తయారీ ప్రక్రియను రాయండి.
జవాబు:
జవాబు:
నాకు వెజిటబుల్ రైస్ అంటే ఇష్టం.

కావలసిన పదార్థాలు : బియ్యం, ఉల్లిపాయ, టమోటా, పచ్చి బఠానీలు, క్యారెట్, దాల్చిన చెక్క లవంగాలు, పసుపు పొడి, కారం పొడి, మసాలా పొడి, కొత్తిమీర, నూనె, నెయ్యి, ఉప్పు మరియు నీరు.

విధానం :

  1. బియ్యం కడిగి 10 నుండి 15 నిమిషాలు నానబెట్టండి.
  2. మంట మీద పాత్రను ఉంచండి. అందులో రెండు చెంచాల నెయ్యి, నూనె పోయాలి.
  3. దాల్చిన చెక్క, లవంగం మరియు ఉల్లిపాయ వేసి గోధుమ రంగు వచ్చేవరకు వేడి చేయాలి.
  4. తరిగిన టమోటా, గ్రీన్ బఠానీలు, క్యారెట్ జోడించండి.
  5. కదిలిస్తూ రెండు లేదా మూడు నిమిషాలు వేయించాలి.
  6. నానబెట్టిన బియ్యం, గరం మసాలా పొడి, పసుపు పొడి, కారం పొడి మరియు ఉప్పు కలపండి.
  7. కదిలిస్తూ 2 లేదా 3 నిమిషాలు వేయించాలి.
  8. తరువాత 1 లేదా 2 కప్పులు నీరు వేసి బాగా కలపాలి.
  9. కుక్కర్ ను మూతతో మూసివేసి, 2 విజిల్స్ కోసం మీడియం మంట మీద ఉడికించాలి.
  10. మంటను ఆపివేయండి. గది ఉష్ణోగ్రత వద్ద చల్లబరచండి.
  11. మూత జాగ్రత్తగా తెరిచి, వడ్డించే గిన్నెకు బదిలీ చేసి, తాజా కొత్తిమీరతో అలంకరించండి.

ప్రశ్న 6.
నీకు నచ్చిన కొన్ని పండ్లు, కూరగాయల బొమ్మలు గీయండి.
జవాబు:
విద్యార్థి కృత్యం :
విద్యార్థులు తమకు కావాల్సిన పండ్లు ఆపిల్, మామిడి, పైనాపిల్, అరటి మరియు కూరగాయలైన టమోటా, వంకాయ, బీన్స్ మరియు క్యారెట్ యొక్క రేఖాచిత్రాలను గీయవలెను.
AP Board 6th Class Science Solutions Chapter 1 మనకు కావలసిన ఆహారం 1

ప్రశ్న 7.
‘ఆహార వృథా’ పై కొన్ని నినాదాలు రాయండి.
జవాబు:

  1. ఆహారం విలువైనది – ఆహారాన్ని వృథా చేయవద్దు.
  2. మీ ఆహారాన్ని డస్ట్ బిన్లో విసిరే ముందు ఆకలితో ఉన్నవారి కోసం ఆలోచించండి.
  3. ఆకలితో ఎవరూ చనిపోకుండా ఆహారాన్ని భద్రపరచండి.
  4. నేటి వ్యర్థం – రేపటి కొరత.

ప్రశ్న 8.
ఒకవేళ నీకు చేప/ మామిడికాయ/ నిమ్మకాయలు ఇస్తే నీవు వాటిని ఎలా నిల్వచేస్తావు?
జవాబు:

ఆహార పదార్థం సంరక్షణ పద్దతి
1. చేప సూర్యకాంతిలో ఎండబెట్టడం, ఉప్పు కలపటం, శీతలీకరించటం.
2. మామిడి ఉప్పు, కారం పొడి, మెంతి పొడి, ఆవ పిండి, వెల్లుల్లి మరియు నూనె జోడించడం, ఎండబెట్టడం.
3. నిమ్మకాయ ఉప్పు మరియు కారం పొడి కలిపి ఊరగాయ పెట్టడం.

6th Class Science 1st Lesson మనకు కావలసిన ఆహారం InText Questions and Answers

6th Class Science Textbook Page No. 9

ప్రశ్న 1.
ప్రస్తుత రోజుల్లో మనం ఆహార వృథాను అనేక చోట్ల చూస్తున్నాం. ఆహార వృథా మన ఇళ్ళల్లో పాఠశాలల్లో, ఇతర ప్రదేశాలలో ప్రతినిత్యం, ప్రత్యేక సందర్భాలలో కూడా జరుగుతుంది. దీన్ని ఎలా నివారించవచ్చు? మీ ఉపాధ్యాయునితో చర్చించండి.
జవాబు:
అన్నం పరబ్రహ్మ స్వరూపం. ప్రస్తుత రోజుల్లో ఆహార వృథా సర్వ సాధారణమైపోయింది. ప్రతి నిత్యం, వివాహ మహోత్సవాలు, ఇతర వేడుకలలో ఆహార వృథా జరుగుతోంది.

క్రింది సూచనలు పాటిస్తే ఆహార వృథాను అరికట్టవచ్చు :

  • వివాహాలు, ఇతర వేడుకలకు అవసరమైన మేరకు ఆహారం వండించాలి.
  • వేడుకల్లో మిగిలిపోయిన ఆహార పదార్థాలను పేదవారికి, అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు ఫుడ్ బ్యాంకు పంచిపెట్టాలి.
  • ఆహార పదార్థాలు ఎంతవరకు అవసరమో ఆలోచించి, ప్రణాళిక ప్రకారం కొనుగోలు చేయాలి.
  • ఆహార పదార్థాలను ఎక్కువ కాలం మన్నేందుకుగాను సరైన పద్ధతిలో నిల్వచేయాలి.
  • మిగిలిపోయిన ఆహార పదార్థాలను ఫ్రిజ్ లో నిల్వ ఉంచి ఉపయోగించాలి.
  • ఆహార ఉత్పత్తుల తయారీ తేదీ అవి ఎంత కాలం నిల్వ ఉంటాయి అన్నవి అవగాహన చేసుకొని ఎక్స్పెరీ తేదీలోపు వాటిని వినియోగించడం మంచిది. తద్వారా వాటిని పారవేయకుండా జాగ్రత్త పడవచ్చు.
  • కంపోస్టు ఎరువుగా ఉపయోగించవచ్చు.
  • సామాజిక స్పృహ, ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండి ఆహారం వృథా అయ్యే పనులకు స్వస్తి చెప్పాలి.

AP Board 6th Class Science Solutions Chapter 1 మనకు కావలసిన ఆహారం

ప్రశ్న 2.
మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి సరిపడా ఆహారం లభిస్తుందా? లేదా?
జవాబు:

  • లేదు. చాలామంది ప్రజలకు తినడానికి సరిపడినంత ఆహారం లభించడం లేదు.
  • పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా ఆహారోత్పత్తి జరగడం లేదు.
    చాలామంది ఆహార ప్రాధాన్యతను పట్టించుకోవడం లేదు. దైనందిన జీవితంలో నిర్వహించబడే వేడుకలకు అధిక మోతాదులో ఆహారం వండించి అందులో చాలా భాగం పారవేస్తూ వృథా చేస్తున్నారు.
  • ఆహారం ఎంతో విలువైనది. దానిని వృథా చేయరాదు.

కృత్యాలు

కృత్యం – 1

6th Class Science Textbook Page No. 2

ప్రశ్న 1.
స్టాల్స్ లో ఉన్న ఆహార పదార్థాలను చూడండి.
AP Board 6th Class Science Solutions Chapter 1 మనకు కావలసిన ఆహారం 2
పైన చూపిన ఆహార పదార్థాల పేర్లను కింది పట్టికలోని అంశాల వారీగా రాయండి.
AP Board 6th Class Science Solutions Chapter 1 మనకు కావలసిన ఆహారం 3
జవాబు:
AP Board 6th Class Science Solutions Chapter 1 మనకు కావలసిన ఆహారం 4

కృత్యం – 2

6th Class Science Textbook Page No. 3

ప్రశ్న 2.
నీవు, నిన్న ఏ ఆహార పదార్థాలు తిన్నావు? వాటి పేర్లు రాయండి. మీ తరగతిలోని మీ స్నేహితులను అడిగి వారు – నిన్న తిన్న ఆహార పదార్థాలను కింది పట్టికలో రాయండి.

విద్యార్థి పేరు తిన్న ఆహారం
1. కీర్తన దోశ, చట్ని
2.
3.
4.

జవాబు:
నిన్న నేను ఈ క్రింది ఆహార పదార్థాలను తిన్నాను.

  • అల్పాహారం – పాలు మరియు గుడ్డు.
  • భోజనం – అన్నం, పప్పు, వంకాయ కూర, రసం, పెరుగు.
  • సాయంత్రం – బిస్కెట్లు మరియు పండ్లు.
  • విందు – అన్నం, బంగాళదుంప కూర, పెరుగు.
విద్యార్థి పేరు తిన్న ఆహారం
1. కీర్తన దోశ, చట్ని, అన్నం, పప్పు, కూరగాయలు, పెరుగు.
2. రవి ఇడ్లీ, పచ్చడి, అన్నం, కూరగాయలు, గుడ్డు.
3. అశోక్ చపాతి, బంగాళదుంప, అన్నం, సాంబార్, పెరుగన్నం.
4. వివేక్ బ్రెడ్; ఆమ్లెట్, అన్నం, టమోటా కూర, పెరుగు.

• అందరు విద్యార్థులు ఒకే రకమైన ఆహారాన్ని తిన్నారా?
జవాబు:
లేదు. అందరు విద్యార్థులు ఒకే రకమైన ఆహారాన్ని తినలేదు.

• పై పట్టికలో ఒకే రకమైన ఆహార పదార్థాలు ఏమైనా ఉన్నాయా?
జవాబు:
ఉన్నాయి. పై పట్టికలో అన్నం, పప్పు, గుడ్లు, పాలు, కూరగాయలు, పెరుగు సాధారణ ఆహార పదార్థాలు.

• మీ పాఠశాలలో వారం రోజుల పాటు మధ్యాహ్న భోజనంలో వడ్డించిన ఆహార పదార్థాల చార్టు తయారు చేయండి.
జవాబు:
రోజువారి మెనూ :

రోజు మెనూ
సోమవారం అన్నం, సాంబార్, గుడ్డు కూర, వేరుశనగ చిక్కి
మంగళవారం పులిహోర, టొమాటో పప్పు, ఉడికించిన గుడ్డు
బుధవారం వెజిటబుల్ రైస్, కుర్మా, ఉడికించిన గుడ్డు, వేరుశనగ చిక్కి
గురువారం కిచిడి, టొమాటో పచ్చడి, ఉడికించిన గుడ్డు
శుక్రవారం రైస్, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కి
శనివారం రైస్, సాంబార్, స్వీట్ పొంగలి

• మనం ప్రతిరోజు వివిధ రకాల ఆహార పదార్థాలను తీసుకుంటుంటాం. అన్నం, పప్పు, కూరగాయలలాంటి ఆహార పదార్థాలు సర్వసాధారణం. ప్రత్యేక సందర్భాలలో మనం ఎన్నో రకాల ఆహార పదార్థాలను తింటాం. ఆహార పదార్థాలు దేనితో తయారవుతాయి?
జవాబు:
వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేయటానికి అనేక రకాల పదార్థాలు కావాలి. ఆహారాన్ని తయారుచేయడానికి ఉపయోగించే పదార్థాలను ‘దినుసులు’ అంటారు. ఇవి మనకు మొక్కలు, జంతువులు మరియు ఇతర వనరుల నుండి లభిస్తాయి.

కృత్యం – 3

6th Class Science Textbook Page No. 4

ప్రశ్న 3.
కొన్ని ఆహార పదార్థాలు, వాటి తయారీకి కావలసిన దినుసుల జాబితాను కింది పట్టికలో రాయండి. కొన్ని ఆహార పదార్థాలలోని దినుసులు :

ఆహార పదార్థం కావలసిన దినుసులు ఇడ్లీ
1.
2.
3.
4.

జవాబు:

ఆహార పదార్థం కావలసిన దినుసులు ఇడ్లీ
1. పులిహోర రైస్ చింతపండు, ఆవాలు, నూనె, కరివేపాకు, వేరుశనగ పప్పులు, ఉప్పు, పసుపు పొడి
2. టొమాటో కూర టమోటా, ఉల్లిపాయ, మిరపకాయలు, నూనె, ఉప్పు, ఆవాలు, పసుపు పొడి
3. ఇడ్లీ మినుములు, బియ్యం రవ్వ, నీరు; ఉప్పు
4. ఆలు కుర్మా బంగాళదుంప, నూనె, ఉప్పు, కారం పొడి, గరంమసాలా, అల్లం మరియు వెల్లుల్లి పేస్ట్, పసుపు పొడి

6th Class Science Textbook Page No. 5

ఎ) కొన్ని ఆహార పదార్థాలు, వాటి తయారీకి ఉపయోగించే దినుసులు పట్టికలో ఇవ్వబడినవి. దినుసులు లభించే వనరులను రాయండి.

ఆహార పదార్థం దినుసులు వనరులు (మొక్కలు, జంతువులు, ఇతరాలు)
1. అన్నం బియ్యం మొక్క
నీరు
2. పాయసం సేమియా
(ఎండిన) శుష్క ఫలాలు
చక్కెర
పాలు
3. చట్నీ వేరుశెనగ గుళ్ళు/కొబ్బరి కాయ
నూనె
మిరపకాయలు
ఉప్పు
4.
5.

జవాబు:

ఆహార పదార్థం దినుసులు వనరులు (మొక్కలు, జంతువులు, ఇతరాలు)
1. అన్నం బియ్యం మొక్క
నీరు ఇతరములు
2. పాయసం సేమియా మొక్క
ఎండుద్రాక్ష మొక్క
చక్కెర మొక్క
పాలు జంతువులు
3. చట్నీ వేరుశెనగ గుళ్ళు/కొబ్బరి కాయ మొక్క
నూనె మొక్క
మిరపకాయలు మొక్క
ఉప్పు ఇతరములు
4. పులిహోర బియ్యం మొక్క
పసుపు, నిమ్మకాయ మొక్క
గోధుమ పిండి మొక్క
5. పూరి నూనె మొక్క

6th Class Science Textbook Page No. 6

బి) పట్టికను పరిశీలించి మొక్కలలోని ఏయే భాగాలు తినదగినవో గుర్తించగలరా? మీరు మీ స్నేహితులతో చర్చించి మొక్కలలోని తినదగిన భాగాల పేర్లను పట్టికలో రాయండి.

మొక్క పేరు మనం తినే భాగం
1. మామిడి
2. పుదీనా
3. చెరకు
4. బంగాళదుంప
5. ఉల్లి
6. క్యాలీఫ్లవర్
7. వేరుశనగ
8. టమోటా
9. బియ్యం
10. పెసర
11. క్యాబేజీ
12. యాపిల్

జవాబు:

మొక్క పేరు మనం తినే భాగం
1. మామిడి పండు
2. పుదీనా ఆకులు
3. చెరకు కాండం
4. బంగాళదుంప కాండం
5. ఉల్లి కాండం
6. క్యాలీఫ్లవర్ పుష్పము
7. వేరుశనగ విత్తనాలు
8. టమోటా కాయ
9. బియ్యం గింజలు
10. పెసర విత్తనాలు
11. క్యాబేజీ ఆకులు
12. యాపిల్ కాయ

* మనము సాధారణంగా మొక్కలోని ఏయే భాగాలు తింటాం.?
జవాబు:
మొక్కలలోని ఆకులు, విత్తనాలు మరియు పండ్లు సాధారణంగా మనం తింటాం. కాండం మరియు పువ్వులు అంతగా విస్తృతంగా ఉపయోగించబడవు.

* మనం పుష్పాలను కూడా ఆహారంగా తీసుకుంటామా?
జవాబు:
అవును. మనం పువ్వులను ఆహారంగా ఉపయోగిస్తాము.
ఉదా :
అరటి పువ్వు, కాలీఫ్లవర్ మొదలైనవి.

AP Board 6th Class Science Solutions Chapter 1 మనకు కావలసిన ఆహారం

6th Class Science Textbook Page No. 7

సి) పట్టికలో కొన్ని ఆహార తయారీ పద్ధతులు మరియు ఆహార పదార్థాలు ఉన్నవి. తయారీ పద్దతి ఎదురుగా ఆ పద్ధతి వినియోగించి తయారయ్యే ఆహార పదార్థాల పేర్లు పట్టికలో రాయండి.

ఆహార తయారీ పద్ధతి ఆహార పదార్థాలు
1. ఉడికించటం అన్నం, పప్పు
2. ఆవిరిలో ఉడికించడం
3. పులియబెట్టడం బ్రెడ్
4. ఎక్కువ నూనెలో వేయించటం చికెన్
5. ముక్కలుగా కోసి కలపటం
6. మైక్రోవేవింగ్

జవాబు:

ఆహార తయారీ పద్ధతి ఆహార పదార్థాలు
1. ఉడికించటం అన్నం, పప్పు
2. ఆవిరిలో ఉడికించడం ఇడ్లీ, కుడుము, కేక్
3. పులియబెట్టడం బ్రెడ్, జిలేబీ, కేక్
4. ఎక్కువ నూనెలో వేయించటం చికెన్, మాంసం, చేప
5. ముక్కలుగా కోసి కలపటం కలపటం నిమ్మకాయ, మామిడి కాయ వంటి పచ్చళ్ళు
6. మైక్రోవేవింగ్ చికెన్ తందూరి, కేక్, బిస్కెట్లు

కృత్యం – 4

6th Class Science Textbook Page No. 7

1. ఉద్దేశ్యం : ఉప్మా తయారీ.
2. కావలసినవి : ఉప్మారవ్వ, ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు, నూనె, టమాట, ఉప్పు, నీరు, ఆవాలు, కరివేపాకు, పాత్ర మొ||.
3. ఎలా చేయాలి : కూరగాయలను శుభ్రం చేసి ముక్కలుగా కోయాలి. పొయ్యి వెలిగించి పాత్రను ఉంచాలి. పాత్రలో 3 చెంచాల నూనె వేసి దానిలో ఆవాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాట ముక్కలు వేసి వేయించాలి. దీనిలో సరిపడా నీళ్ళు మరియు ఉప్పు వేయాలి. కొద్ది సేపు వీటిని మరగనివ్వాలి. అప్పుడు రవ్వ వేస్తూ కలపాలి.
4. ఏమి గమనిస్తావు : కొద్ది నిమిషాల తరవాత రుచికరమైన ఉప్మా తయారవుతుంది.
5. ఏమి నేర్చుకుంటావు : వివిధ పదార్థాలను ఉపయోగించి రుచికరమైన ఉప్మా తయారు చేయవచ్చు.

* మీకు ఇష్టమైన ఆహార పదార్థం చేసి, తయారీ విధానం రాయండి.
జవాబు:
నాకు ఇష్టమైన ఆహార పదార్థం టమాటా కూర.
1) టమాటా కూర వండుటకు కావలసిన పదార్ధములు :
a) రెండు టమాటాలు
b) ఒక ఎండు మిరపకాయ
c) ఒక పచ్చి మిరపకాయ
d) ఉల్లిపాయ
e) పసుపు పొడి
f) ఉప్పు
g) నూనె
h) ఆవాలు
i) మినపప్పు
j) జీలకర్ర.

2) తయారుచేయు విధానము :
a) ముందుగా కూరగాయలను నీటితో కడిగి, చిన్న ముక్కలుగా తరగాలి. అందుకు సం బంధువుల
b) పాత్రను మంటపైన ఉంచి మూడు చెంచాల నూనె వేయాలి.
c) నూనె వేడెక్కిన తరువాత కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు అందులో వేయాలి.
d) తరువాత పచ్చి మిరపకాయలు, ఎండు మిర్చి ముక్కలు, చిటికెడు పసుపు పొడి చేర్చాలి.
e) అర నిముషం తరువాత ఉల్లిపాయ, టమాటా ముక్కలు వేయాలి.
f) తగినంత ఉప్పు వేసి మూతపెట్టి ఉంచాలి.
g) అయిదు నిముషాల తరువాత రుచికరమైన టమాటా కూర తయారయి ఉంటుంది.

కృత్యం – 5

6th Class Science Textbook Page No. 8

ప్రశ్న 5.
మీ తల్లిదండ్రులనడిగి వారు అవలంబించే ఇంకొన్ని నిల్వ పద్ధతుల గురించి కూడా పట్టికలో నమోదు చేయండి.

నిల్వచేయు పదార్థం రకం ఉదాహరణలు
1. ఉప్పు, కారం, నూనె చేర్చుట ఊరగాయలు
2. ఉప్పు మాత్రమే చేర్చుట
3. చక్కెర పాకం చేర్చుట

జవాబు:

నిల్వచేయు పదార్థం రకం ఉదాహరణలు
1. ఉప్పు, కారం, నూనె చేర్చుట ఊరగాయలు
2. ఉప్పు మాత్రమే చేర్చుట చేపలు
3. చక్కెర పాకం చేర్చుట గులాబ్ జామ్
4. శీతలీకరించుట చేప, మాంసం, కూరగాయలు
5. ఎండబెట్టుట మాంసం, వడియాలు
6. తేనె చేర్చటం పండ్లు, జామ్

ప్రాజెక్ట్ పనులు

6th Class Science Textbook Page No. 11

ప్రశ్న 1.
ఆహార పదార్థాలను ప్యాక్ చేసిన ఏదైనా ఒక రాపరను సేకరించండి. దానిపై ఉన్న సమాచారాన్ని చదివి ఈ కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
అ) అది ఎప్పుడు ప్యాక్ చెయ్యబడినది? ఎప్పటి వరకు దానిని ఉపయోగించవచ్చు?
ఆ) దానిలో వినియోగించిన పదార్థాలేమిటో పేర్లు రాయండి.
జవాబు:
అ) ప్యాకేజీ చేసిన ఆహారం పేరు : బ్రిటానియా 50 : 50
తయారీ తేది : 19-05-2020
మనం దీన్ని ఎంతకాలం ఉపయోగించగలం : ప్యాకేజింగ్ తేదీ నుండి ఆరు నెలల ముందు వాడటం ఉత్తమము.

ఆ) ఇందులో వినియోగించిన పదార్థాలు :

దినుసులు 100 గ్రాముల విలువ
పిండి పదార్థాలు 60
చక్కెరలు 10
ప్రోటీన్ 7
ఫ్యాట్ 26
మోనో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు 10.2
పాలీ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు 2.7
కొలెస్ట్రాల్ 4
శక్తి 502 కేలరీలు

AP Board 6th Class Science Solutions Chapter 1 మనకు కావలసిన ఆహారం

ప్రశ్న 2.
మీ గ్రామంలో పెరిగే కొన్ని మొక్కల పేర్లు రాయండి. వాటిలోని ఏ భాగాలను ఆహారంగా ఉపయోగిస్తాం?
జవాబు:

మొక్క ఆహారంగా వాడే భాగం
1. అరటి పండ్లు, పువ్వులు
2. మామిడి పండ్లు
3. బచ్చలి కూర ఆకులు
4. కొత్తిమీర ఆకులు
5. చెరకు కాండం
6. ఉల్లిపాయ కాండం
7. క్యా రెట్ వేరు
8. బియ్యం గింజలు

ప్రశ్న 3.
ఉపాధ్యాయుని సహాయంతో 5 లేదా 6 గురు విద్యార్థులు సమూహాలుగా ఏర్పడండి. ఒక ఫ్రూట్ చాట్ లేక వెజిటబుల్ సలాడ్ తయారుచేసి తినండి. మీ అనుభవం గురించి నాలుగు వాక్యాలను రాయండి.
జవాబు:
మా ఉపాధ్యాయుని సహాయంతో మా క్లాస్ మేట్స్ అందరూ 5 గ్రూపులుగా విడిపోయాము.

  1. ఫ్రూట్ సలాడ్ చేయడానికి బొప్పాయి, ద్రాక్ష, పైనాపిల్, మామిడి, ఆపిల్, అరటి, నారింజ వంటి పండ్లను సేకరించాము.
  2. మేము అన్ని పండ్లను కత్తిరించి ఒక గిన్నెలో కలిపాము.
  3. మిశ్రమ పండ్లకు తేనె మరియు తాజా నారింజ రసం మరియు నిమ్మరసం రెండు లేదా మూడు చెంచాలు జోడించాము.
  4. ఇప్పుడు అన్నింటిని చెంచాతో బాగా కలిపాము.
  5. మేమందరం ఫ్రూట్ సలాడ్ రుచి చూశాము.
  6. వివిధ పండ్ల ముక్కల మిశ్రమం కావున అది చాలా రుచికరంగా ఉంది.
  7. సలాడ్ రుచి తీపిగా, పుల్లగా మరియు జ్యూసీగా ఉంది.

ప్రశ్న 4.
మీ తల్లిదండ్రుల నడిగి వివిధ రకాల ఆహార నిల్వ పద్ధతుల గురించి తెలుసుకొని రాయండి.
జవాబు:
నేను నా తల్లిదండ్రుల నుండి ఆహారాన్ని సంరక్షించే వివిధ పద్ధతులను సేకరించాను.

ఆహార నిల్వ విధానం. ఆహార పదార్థాలు
పొగ పెట్టడం చేప మరియు మాంసం
ఉప్పు చేర్చటం చేప, పచ్చళ్లు
ఎండ బెట్టడం ధాన్యం, వడియాలు, అప్పడాలు
డబ్బాలలో నిల్వ చేయటం శీతల పానీయాలు
కత్తిరించటం, కలపటం ఊరగాయ
చక్కెర పాకంలో కలపటం జిలేబి, పండ్లు
పాశ్చరైజేషన్ పాలు

 

  1. ఆహార నిల్వ, ఆహారం చెడిపోవడానికి కారణమయ్యే సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధిస్తుంది.
  2. ఆహారాన్ని సంరక్షించడానికి రూపొందించిన మరిన్ని ప్రక్రియలలో ఒకటి కంటే ఎక్కువ ఆహార సంరక్షణ పద్ధతులు ఉంటాయి.
  3. జామ్ గా మార్చడం ద్వారా పండ్లను సంరక్షించడం, పండ్లలో తేమను తగ్గించడానికి ఎండ బెట్టడం మరియు తిరిగి సూక్ష్మజీవుల యొక్క పెరుగుదలను నివారించడానికి గాలి చొరబడని డబ్బాలలో ఉంచటాన్ని క్యానింగ్ అంటారు.

ప్రశ్న 5.
భారతదేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజల ఆహారపుటలవాట్ల గురించి సమాచారాన్ని సేకరించండి. మీ పాఠశాల
గ్రంథాలయ పుస్తకాలు పరిశీలించి మీ ఉపాధ్యాయులతో చర్చించి ఒక రిపోర్టు రాయండి.
జవాబు:
భారతదేశంలో వివిధ రాష్ట్రాల ప్రజలు వివిధ రకాల వాతావరణ మరియు భౌగోళిక పరిస్థితులు మరియు సహజ వృక్షసంపద కారణంగా వివిధ రకాల ఆహార అలవాట్లను కలిగి ఉన్నారు.

రాష్ట్రం ఆహార అలవాట్లు
1. ఆంధ్రప్రదేశ్ అన్నం, కూర, పాలు, ఇడ్లీ, దోస మొదలైనవి.
2. తెలంగాణ అన్నం, కూర, పాలు, ఇడ్లీ, దోస మొదలైనవి.
3. కర్ణాటక జొన్న మరియు గోధుమ రొట్టె, రాగి ముద్ద, కూరలు.
4. కేరళ ఆహార పదార్థాలలో కొబ్బరి ప్రధానమైన ఆహారం.
5. గుజరాత్ తాలి, రోటీ, పప్పు, అన్నం.
6. మహారాష్ట్ర రోటీ, కుర్మా, పానీపూరి.
7. పంజాబ్ రోటీ, చపాతి, కుర్మా.
8. ఒడిశా అన్నం మరియు కూర

AP Board 6th Class Science Solutions Chapter 1 మనకు కావలసిన ఆహారం

ప్రశ్న 6.
మీ అమ్మమ్మ, తాతల నుండి సాంప్రదాయ ఆహారం గురించిన విషయాలు సేకరించండి.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ లో విస్తారమైన వర్షాలు మరియు విభిన్న ఉష్ణమండల ప్రాంతాల కారణంగా చాలా ఆహార వైవిధ్యమున్నది.

  • అన్నం, పప్పు, టమోటా, గోంగూర, చింతపండు వంట కూరలకు ఎక్కువగా ఉపయోగిస్తారు.
  • అధిక మసాలా దినుసులు గల ఘాటైన కూరలు, ఊరగాయ పచ్చళ్ళు ఆంధ్ర ప్రాంత ప్రజలు ఇష్టంగా తింటారు.
  • వివిధ ప్రాంత ప్రజలు వారి స్వంత విభిన్నమైన ఆహార అలవాట్లు కలిగి ఉన్నారు మరియు గ్రామీణ ప్రాంతాలు ఇప్పటికీ శతాబ్దాల నాటి వంట అలవాట్లను మరియు వంటకాలను అనుసరిస్తున్నారు.
  • పెరుగు అన్నం, ఉల్లిపాయతో దోస, ఇడ్లీ అల్పాహార వంటకాలుగా ప్రసిద్ది.
  • ఏడాది పొడవునా కొన్ని కూరగాయలు మరియు పండ్లను నిల్వ చేయటానికి అనేక రకాల ఊరగాయలను ఉపయోగిస్తారు.
  • పకోడి, జంతికలు, బఠానీ, గుగ్గిల్లు, బజ్జీలను స్నాక్స్ గా ఉపయోగిస్తారు.
  • పండుగ మరియు పవిత్ర సందర్భాలలో తయారుచేసిన పొంగలికి ప్రత్యేక స్థానం ఉంది.
  • తెలుగు సంస్కృతిలో రుచికరమైన స్వీట్లు మన సంప్రదాయాలలో ఒక ముఖ్యమైన భాగం.

AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం

SCERT AP 8th Class Social Study Material Pdf 14th Lesson పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 14th Lesson పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం

8th Class Social Studies 14th Lesson పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
మొదటి ఎన్నికలు నిర్వహించటం ఎందుకు కష్టమయ్యింది? సాధ్యమైనన్ని కారణాలు పేర్కొనండి. (AS1)
జవాబు:
స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశారు. మొదటి ఎన్నికలకు ఏర్పాట్లు చేయటం చాలా పెద్ద, సంక్లిష్టమైన పని. ముందుగా అర్హులైన ఓటర్లను నమోదు చేయటానికి ఇంటింటికి సర్వే చేశారు.

రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళు, స్వతంత్రులు ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఎన్నికల గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ గుర్తులను ఓటు వేయాల్సిన బ్యాలెట్ పెట్టెల పై అతికించారు. ఎవరికైతే ఓటు వేయాలనుకుంటున్నారో ఆ బ్యాలెట్ పెట్టెలో ఓటరు బ్యాలెట్ పేపర్ ను వేయాలి. ఈ ఓటింగు ప్రక్రియ రహస్యంగా ఉంచటానికి తెరలు ఏర్పాటు చేశారు.

దేశ వ్యాప్తంగా 2,24,000 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 25,00,000కు పైగా ఉక్కు బ్యాలెట్ పెట్టెలు చేశారు. సుమారు 62,00,00,000 బ్యాలెట్ పత్రాలు ముద్రించారు. ఇంచుమించు 10 లక్షల అధికారులు ఎన్నికలు పర్యవేక్షించారు. దేశం మొత్తం మీద 17,500 అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. అంతిమంగా మొదటి లోక్ సభకు 489 సభ్యులు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలను స్వేచ్ఛగా, స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా, చాలా క్రమశిక్షణతో నిర్వహించారు. హింసాత్మక ఘటనలు నామమాత్రంగా జరిగాయి. ఇంత పెద్ద ఎత్తున ఎన్నికలు నిర్వహించడం సంక్లిష్టమైన పని అయింది.

ప్రశ్న 2.
ఎన్నికలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఎందుకుండాలి? (AS1)
జవాబు:
ఎన్నికలల్లో గెలిచిన వ్యక్తులు ఈ దేశ భవితవ్యాన్ని నిర్ణయిస్తారు. వారి ఎన్నికను ఏ ఆకర్షణీయమైన అంశాలు లేదా ఒత్తిళ్ళు ప్రభావితం చేయరాదు. కాబట్టి ఎన్నికలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉండాలి.

AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 3.
క్రింది విషయాలలో వేటికి పార్లమెంటు చట్టాలు చేస్తుంది. వేటికి రాష్ట్ర శాసనసభలు చేస్తాయి. వీటికి రెండూ చేయవచ్చు: వ్యవసాయం, రైల్వేలు, గ్రామ ఆసుపత్రులు, పోలీసు, తంతి తపాలా, విద్యుత్తు, కర్మాగారాలు. (AS1)
జవాబు:

  1. వ్యవసాయం – రాష్ట్రం
  2. రైల్వేలు – కేంద్రం
  3. గ్రామ ఆసుపత్రులు – రాష్ట్రం
  4. పోలీసు – రాష్ట్రం
  5. తంతి తపాలా – కేంద్రం
  6. విద్యుత్తు – ఉమ్మడి జాబితా
  7. కర్మాగారాలు – ఉమ్మడి జాబితా

ప్రశ్న 4.
పార్లమెంటు రెండు సభలను పేర్కొనంది. కింది విషయాలలో రెండింటికీ మధ్య తేడాలు / పోలికలు చూపిస్తూ పట్టిక తయారు చేయండి. సభ్యత్వకాలం, సభ్యుల సంఖ్య, అధికారాలలో ఎక్కువ, తక్కువ, ఎన్నికయ్యే విధానం, రాష్ట్రపతికి ఎన్నికల్లో ఓటింగు. (AS3)
జవాబు:
పార్లమెంటులో లోకసభ, రాజ్యసభ అని రెండూ ఉంటాయి.

విషయాలు లోకసభ రాజ్య సభ
1) సభ్యత్వ కాలం 5 సం||లు 6 సం||లు
2) సభ్యుల సంఖ్య 545 250
3) అధికారంలో ఎక్కువ, తక్కువ ఎక్కువ తక్కువ
4) ఎన్నికయ్యే విధానం ప్రత్యక్ష ఎన్నిక పరోక్ష ఎన్నిక
5) రాష్ట్రపతికి ఎన్నికల్లో ఓటింగ్ ఎన్నికైన వారందరికీ ఉంటుంది ఎన్నికైన వారందరికీ ఉంటుంది.

ప్రశ్న 5.
2009 పార్లమెంటు ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి మెజారిటీ రాలేదు. ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేశారు? మీ టీచరు సహాయంతో చర్చించి దాని గురించి కొన్ని వాక్యాలు రాయండి. (AS1)
జవాబు:
2009 పార్లమెంటు ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి మెజారిటీ రాలేదు. దాంతో వారు భావస్వారూప్యం కలిగిన ఇతర పార్టీలను కలుపుకుని యునైటెడ్ ప్రోగ్రసివ్ అలయన్స్ గా ఏర్పడి ముందుకొచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఫ్రంట్లో కాంగ్రెస్ కు అత్యధిక మెజారిటీ కలదు.

ప్రశ్న 6.
దేశం మొత్తానికి వర్తించే చట్టాలు చేసే బాధ్యత ఎవరిది? (AS1)
జవాబు:
దేశం మొత్తానికి వర్తించే చట్టాలు చేసే బాధ్యత పార్లమెంటుది.

ప్రశ్న 7.
కింద ఇచ్చిన పట్టికలో కొన్ని ఖాళీలు ఉన్నాయి. మీ టీచరుతో చర్చించి ఖాళీలను పూరించండి. (AS3)
AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం 1
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం 2

ప్రశ్న 8.
ఎన్నికలలో రాజకీయ పార్టీలు ఇంకా ఎక్కువ మహిళా అభ్యర్థులను పోటీకి నిలిపేలా చేయాలా? ఎందుకు? (AS1)
జవాబు:
అవును. ఎక్కువ మహిళా అభ్యర్థులను పోటీకి నిలపాలి. ఎందుకంటే చట్ట సభలలో మహిళలకు ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా దేశ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, హత్యలు, మానభంగాలు, వేదింపులు, సమాజం చూస్తున్న వివక్షతను ఎదిరించేందుకు ఎక్కువ మహిళా అభ్యర్ధులను నిలపాలి.

ప్రశ్న 9.
భారతదేశంతో పాటు మరికొన్ని దేశాల పార్లమెంటు సభలలో మహిళల ప్రాతినిధ్యంపై జరిగిన అధ్యయనం ఇది. (AS3)
AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం 3
పై సమాచారం ఆధారంగా దిగువ అంశాలను విశ్లేషిస్తూ ఒక వ్యాసం రాయండి.
ఎ. మన చట్ట సభలలో మహిళలకు తగినంత ప్రాతినిధ్యం ఉందా?
జవాబు:
లేదు.

బి. ప్రజాస్వామ్య భావనకు ప్రాతినిధ్య భావన ఎందుకు ముఖ్యమైనది?
జవాబు:
ప్రజాస్వామ్యమంటే ప్రజల పరిపాలన అని అర్థం. అందుకే దీనికి వారి ప్రాతినిధ్య భావన ముఖ్యమైనది. ప్రజలు అంటే ప్రత్యేకించి ఏ ఒక్కరూ కారు. అందరూ అని అర్ధం.

సి. మీరు పార్లమెంటు సభ్యులైతే ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు? కొన్ని దేశాలు పార్లమెంటులో మహిళలకు అధిక ప్రాతినిధ్యాన్ని ఎలా సాధించగలిగాయి?
జవాబు:
నేనే పార్లమెంటు సభ్యురాల్నైతే మహిళలకు రిజర్వేషన్లు కల్పించి దాని ద్వారా ఈ సమస్యను సాధిస్తాను. రాజకీయాలలో మహిళలను ప్రోత్సహించి అవకాశాలు కల్పించడమే దీనికి పరిష్కారం. కొన్ని దేశాలు పార్లమెంటులో మహిళలకు అధిక ప్రాతినిధ్యాన్ని ఈ విధంగానే సాధించగలిగాయి అని నేను భావిస్తున్నాను.

8th Class Social Studies 14th Lesson పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం InText Questions and Answers

8th Class Social Textbook Page No.161

ప్రశ్న 1.
పార్లమెంటు చేసిన కొన్ని ముఖ్యమైన చట్టాలు, విధానాల గురించి తెలుసుకోండి. వాటి గురించి తరగతిలో వివరించండి. Page No. 161
జవాబు:
పార్లమెంటు చేసిన కొన్ని ముఖ్యమైన చట్టాలు :

  1. వరకట్న నిషేధ చట్టం – 2 1961
  2. తీవ్రవాద కలాపాల నిరోధ చట్టం – 2002 (POTA) మొదలైనవి.

చట్టాలు చేసే విధానం :
AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం 6

8th Class Social Textbook Page No.162

ప్రశ్న 2.
పార్లమెంటుకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వంతో కూడుకున్న పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం వల్ల ప్రయోజనాలు ఏమిటి? Page No.162
జవాబు:
ప్రయోజనాలు : ఈ విధానంలో

  1. చట్టాలు చేయటం వేగవంతం మరియు తేలిక.
  2. అధికార విభజన జరుగుతుంది.
  3. ప్రధానమంత్రిని పదవి నుండి తప్పించే విధానం చాలా సులభతరం.
  4. జవాబుదారీతనం అధికంగా ఉంటుంది.

ప్రశ్న 3.
పార్లమెంటు చట్టాలు మాత్రం చేసి ప్రభుత్వాన్ని నియంత్రించకుండా ఉంటే సరిపోతుందా? తరగతిలో చర్చించండి.
జవాబు:
పార్లమెంటు చేసిన చట్టాలు సరిగ్గా అమలు జరగాలంటే ప్రభుత్వంపై నియంత్రణ ఉండాలి. లేనిచో వాటి అమలు ప్రశ్నార్థకమవుతుంది. అందుకే తన చర్యలకు పార్లమెంటు ఆమోదాన్ని ప్రభుత్వం పొందాలని నియమం రూపొందించడమైనది.

AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 4.
పార్లమెంటుకి కానీ, శాసనసభకు కానీ, జవాబుదారీ కానీ ఇతర ప్రభుత్వ రూపాలు ఉన్నాయేమో తెలుసుకోండి. Page No 162)
జవాబు:
రాచరికము, నిరంకుశత్వము మొదలైన ప్రభుత్వ రూపాలు పార్లమెంటుకి కానీ, శాసనసభకు కానీ, జవాబుదారీ కానీ వహించవు.

8th Class Social Textbook Page No.163, 164

ప్రశ్న 5.
క్రింది పటం మరియు పట్టిక చూసి కింది ప్రశ్నలకు సమాధానాలు యివ్వంది.
AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం 7
1. మీ రాష్ట్రంలో, పొరుగునున్న రెండు రాష్ట్రాలలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి?
జవాబు:
మా రాష్ట్రంలో 25, తెలంగాణలో 17 ఒడిశా 21 నియోజక వర్గాలున్నాయి.

2. 30 కంటే ఎక్కువ లోకసభ నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రాలేవి?
జవాబు:
బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్.

3. చాలా రాష్ట్రాలకు ఎక్కువ నియోజకవర్గాలు ఎందుకు ఉన్నాయి?
జవాబు:
చాలా రాష్ట్రాలలో జనాభా ఎక్కువగా ఉన్నారు. అందువల్ల నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్నాయి.

4. కొన్ని నియోజకవర్గ ప్రాంతాలు చిన్నగా ఉండగా, కొన్ని పెద్దగా ఎందుకున్నాయి?
జవాబు:
కొన్ని నియోజక వర్గాలు విస్తీర్ణంలో పెద్దవి, కొన్ని చిన్నవి.

5. షెడ్యూల్డు కులాలు, తెగలకు రిజర్వు చేసిన నియోజకవర్గాలు దేశమంతా సమంగా విస్తరించి ఉన్నాయా, లేదా కొన్ని ప్రాంతాలలో ఎక్కువగా ఉన్నాయా?
జవాబు:
షెడ్యూల్ కులాలు దేశమంతా దాదాపు సమానంగా విస్తరించి ఉన్నాయి. షెడ్యూల్ తెగలు మాత్రం కొన్ని ప్రాంతాలలోనే ఎక్కువగా ఉన్నాయి.

8th Class Social Textbook Page No.164

ప్రశ్న 6.
రాజ్యసభ, లోక్ సభల మధ్య మౌలిక తేడాలను గుర్తించండి.
జవాబు:

లోకసభ రాజ్య సభ
1) దీనిని దిగువసభ అని కూడా అంటారు. 1) దీనిని ఎగువసభ అని కూడా అంటారు.
2) దీంట్లో 545 సీట్లు ఉన్నాయి. 2) దీంట్లో 250 సీట్లు ఉన్నాయి.
3) ఈ సభ్యులను ప్రత్యక్ష ఓటింగ్ విధానం ద్వారా ఎన్నుకుంటారు. 3) కొంతమంది ఎన్నుకోబడతారు, కొంతమంది నియమించ బడతారు.
4) వీరి పదవీ కాలం 5 సం||లు 4) వీరి పదవీకాలం 6 సం||లు.
5) ఈ సభ 5 సం||ల కొకసారి రద్దయి తిరిగి ఎన్నుకోబడుతుంది. 5) ఇది నిరంతర సభ. ఇందులో సభ్యులు ప్రతి రెండు సం||ల కొకసారి 1/3 వంతు రిటైరై తిరిగి ఎన్నుకోబడతారు.

ప్రశ్న 7.
వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మేధావులు రాజ్యసభలో ఉంటారు కాబట్టి దానికి ఎక్కువ అధికారాలు ఉండాలని , అజహర్ భావిస్తాడు. రాజ్యసభ సభ్యులను ప్రజలు నేరుగా ఎన్నుకోరు కాబట్టి వాళ్లకి అంతకంటే ఎక్కువ అధికారాలు ఇవ్వగూడదని ముంతాజ్ అంటుంది. మీరు ఎవరి వైపున వాదిస్తారు? వీరి భావనలపై మీ అభిప్రాయమేమిటి?
జవాబు:
నేను యిరువురి వాదనలను సమర్థిస్తాను. మేధావుల ఆలోచనలు ఎల్లప్పుడూ సమర్థనీయమే. వారికి ఎక్కువ అధికారాలు ఉండాలని భావిస్తాను. అలాగే వారిని ప్రజలు నేరుగా ఎన్నుకోరన్న మాట కూడా యథార్థమే. కాబట్టి మేధావులనే ఎన్నికలలో ఓట్లేసి ప్రజలు గెలిపించుకోవాలని నా వాదన.

ప్రశ్న 8.
కింది చిత్రంలో పార్లమెంట్ ఒకవైపు, ప్రజలు మరోవైపు ఎందుకు ఉన్నారో ఊహించగలరా?
AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం 5
జవాబు:
ప్రజల సంఖ్య, పార్లమెంటు సభ్యుల సంఖ్య నిష్పత్తిలో ఉంటాయి. ప్రజల మద్దతు లేకపోతే పార్లమెంటు బలహీనమయి పైకి పోతుంది అని దీని అర్థం.

8th Class Social Textbook Page No.165

ప్రశ్న 9.
మీరు ఆ సమయంలో ఉండి ఉంటే పై వాదనలలో దేనితో ఏకీభవించి ఉండేవారు? అందరికీ ఓటు హక్కు ఉండి, ఎన్నికలు నిర్వహించటానికి భారతదేశం ప్రయత్నించటం సరైన ఆలోచన అనే భావించేవారా? కారణాలు ఇవ్వండి.
జవాబు:
నేను ఆ సమయంలో ఉండి ఉంటే ఆశాభావం వ్యక్తపరచిన వారితో ఏకీభవిస్తాను.

ఎలాంటి కార్యానికైనా ఏవో కొన్ని యిబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. ఏవో కొన్ని సమస్యలుంటాయని మనం మంచికి దూరం కారాదు. అందువలన నేను వారితోనే ఏకీభవిస్తాను. భారతదేశానికి ఎన్నికలు నిర్వహించడానికి ప్రయత్నించడం సరైన ఆలోచనే అంటాను.

8th Class Social Textbook Page No.166

ప్రశ్న 10.
క్రింది వాటి అర్థాలను మీ టీచరుతో చర్చించండి.
1) అభ్యర్థి, 2) నియోజక వర్గం, 3) బ్యాలెట్, 4) ఈ.వి.ఎం, ‘5) ఎన్నికల ప్రచారం, 6) ఎన్నికల సంఘం, 7) ఓటర్ల జాబితా, 8) ఓటింగు విధానం, 9) స్వేచ్చగా స్వతంత్రంగా ఎన్నికలు.
జవాబు:
1) అభ్యర్థి : ఎన్నికలలో పోటీ చేసినవారు.

2) నియోజక వర్గం : రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను నియోజక వర్గాలుగా విభజిస్తారు.

3) బ్యా లెట్ : ఓటరు ఓటు వేసే ఎన్నికల గుర్తులున్న పేపరు.

4) ఈ.వి.ఎం : ఎలక్ట్రానిక్ ఓటింగు మిషను.

5) ఎన్నికల ప్రచారం : ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థి తనకు ఓటు వేయమని అభ్యర్థించడం.

6) ఎన్నికల సంఘం : ఎన్నికలను నిర్వహించు స్వతంత్ర ప్రతిపత్తి గల సంఘం.

7) ఓటర్ల జాబితా : ఒక నియోజక వర్గంలోని ఓటర్ల పేర్లు రాయబడ్డ జాబితా.

8) ఓటింగ్ విధానం : ఎన్నికల రోజున ఓటర్లు తమ పోలింగ్ బూత్ లలో ఓటు వేసే విధానం.

9) స్వేచ్చగా స్వతంత్రంగా ఎన్నికలు : ఓటర్లు ఎటువంటి ఒత్తిళ్ళకూ (ధన, కులత, రాజకీయాలకు) లోనుకాకుండా స్వేచ్ఛగా ఓటు వేసే విధానంతో కూడిన ఎన్నికలు.

AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 11.
ప్రస్తుతం ఎన్నికలను ఎలా నిర్వహిస్తున్నారో మీ తల్లిదండ్రులు, టీచర్లతో చర్చించండి.
జవాబు:
ప్రస్తుతం ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, ప్రజాస్వామ్య బద్ధంగా నిర్వహిస్తున్నారు.
ఎన్నికలు:
AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం 4
పైన చెప్పిన పద్ధతిలో ప్రస్తుత ఎన్నికలు జరుగుతున్నాయి.

ప్రశ్న 12.
మొదటి ఎన్నికలు, ప్రస్తుత ఎన్నికల మధ్య తేడాలు రాయండి – బ్యాలెట్ పెట్టె, బ్యాలెట్ పత్రాలు, ఓటు హక్కు వయసు.
జవాబు:

అంశాలు మొదటి ఎన్నికలు ప్రస్తుత ఎన్నికలు
1. బ్యా లెట్ పెట్టె ఇనుప పెట్టెలను సీలు వేసి ఉపయోగించారు. పెట్టెలు లేవు. ఈ.వి.ఎం.లు ఉపయోగిస్తున్నారు.
2. బ్యాలెట్ పత్రాలు కాగితంపై గుర్తులు, పేర్లు ముద్రించి బ్యాలెట్ పత్రంగా ఉపయోగించేవారు. నేడు బ్యా లెట్ పత్రాలు లేవు. ఈ.వి.ఎం.లోనే ఓట్లు నమోదు అయి ఉంటాయి.
3. ఓటు హక్కు వయస్సు 21 సం||లు 18 సం||లు

ప్రశ్న 13.
మీ ప్రాంతం నుంచి ఎన్నికైన లోక్ సభ సభ్యులు ఎవరు? మీ రాష్ట్రం నుంచి, లేదా పొరుగు రాష్ట్రాల నుంచి ఎన్నికైన కొంతమంది లోక్ సభ సభ్యుల పేర్లు చెప్పండి. వాళ్లు ఏ రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళో తెలుసుకోండి.
జవాబు:
మా ప్రాంతం నుంచి ఎన్నికైన లోకసభ సభ్యులు :
AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం 8

ప్రశ్న 14.
ప్రస్తుత రాజకీయ పార్టీల ఎన్నికల గుర్తుల గురించి తెలుసుకోండి.
జవాబు:

  1. తెలుగుదేశం – సైకిలు గుర్తు
  2. వై.ఎస్.ఆర్. సి.పి. – ఫ్యాను గుర్తు
  3. తెలంగాణ రాష్ట్ర సమితి – కారు గుర్తు
  4. కాంగ్రెసు పార్టీ – హస్తం గుర్తు
  5. భారతీయ జనతా పార్టీ. – కమలం గుర్తు
  6. బహుజన్ సమాజ్ వాదీ పార్టీ – ఏనుగు గుర్తు
  7. కమ్యూనిస్టులు – సుత్తి, కొడవలి / కంకి, కొడవలి

ప్రశ్న 15.
ఓటింగు రహస్యంగా ఎందుకుండాలి?
జవాబు:
ఓటర్ల ఆత్మస్టెర్యం స్థిరంగా ఉండాలంటే ఓటింగు రహస్యంగా ఉండాలి.

8th Class Social Textbook Page No.167

ప్రశ్న 16.
లోకసభకు ఎన్నిసార్లు ఎన్నికలు జరిగాయి?
జవాబు:
లోక్ సభకు 2014 వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి.

ప్రశ్న 17.
ఎంతశాతం ఓటర్లు ఓటు వేశారో తెలుసుకోవడం ఎందుకు ముఖ్యం? ఇది మనకు ఏం చెబుతుంది?
జవాబు:
ఎంతశాతం ఓటర్లు ఓటువేశారో తెలుసుకోవడం వలన ఎంతమందికి వారు ఎన్నుకోబోయే ప్రభుత్వం యొక్క పని తీరు మీద నమ్మకం ఉందో తెలుస్తుంది. దీనివలన పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలోని వారు ఎవరు ఎక్కువగా ప్రభుత్వ పథకాలను ఆదరిస్తున్నారు మరియు వాటి వలన ఎంతమంది ప్రయోజనం పొందుతారో తెలుస్తుంది. ఓటువేసే వారు వారి అభ్యర్థులను గురించి ఆలోచిస్తున్నారో లేదో కూడా తెలుస్తుంది. ఎక్కువమంది అత్యున్నత కులస్తులైన ఉద్యోగస్తులు, సంపన్నులు, కులీనులుగా భావించేవారు. పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో ఉండేవారు ఓటువేయడానికి ఆసక్తి కనపరచరు. వారు ప్రభుత్వ పథకాల వలన తమకు ప్రయోజనం ఉండదని భావిస్తారు.

AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 18.
ఓటు ఉన్న వాళ్ళల్లో చాలా మంది తమ హక్కును ఎందుకు ఉపయోగించుకోవటం లేదు. కారణాలు ఏమై ఉండవచ్చో చర్చించండి.
జవాబు:
ఓటు ఉన్న వారు చాలామంది ఓటు పట్ల నిరాసక్తతతో ఉన్నారు అని చెప్పవచ్చు. ఎవరు గెలిచినా తమ స్థితి యింతే అని భావించి ఓటు వేయకపోయి ఉండవచ్చు.

ప్రశ్న 19.
మొదటి ఎన్నికల సమయంలో వివిధ వ్యక్తులు వ్యక్తపరచిన అభిప్రాయాలు ఏమిటి?
జవాబు:
వివిధ వ్యక్తులు వ్యక్తపరచిన అభిప్రాయాలు : “ఈ ఎన్నికలు ‘చీకటిలో ముందుకు దూకటం’ వంటిది. భారతదేశంలాంటి దేశానికి ఇది అనువైనది కాదు. భారతదేశం కుల ప్రాతిపదికన ఏర్పడిన సమాజం, అందరూ సమానమనే భావనను – అధికశాతం ప్రజలు ఒప్పుకోరు. కాబట్టి ప్రజాస్వామికంగా ఎన్నికలు జరపటం సాధ్యం కాదు,” అని కొంతమంది అన్నారు.

ఆశాభావం వ్యక్తపరచిన వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లు, “బ్రిటిష్ వాళ్ళనుంచి విముక్తం చేయటానికి భారతీయులు స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. తమకు కావలసిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని వాళ్ళనుకుంటున్నారు. అందరినీ సమానంగా చూసే సమాజం కోసం కృషి చేసే ప్రభుత్వాన్ని వాళ్లు కోరుకుంటున్నారు. ప్రజల జీవన ప్రమాణాలను ప్రభుత్వం మెరుగుపరచాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి తమకు కావలసిన ప్రభుత్వాన్ని ఎన్నుకోటానికి ప్రతి ఒక్కరికి సమాన అవకాశం ఉండాలి” అని అన్నారు. ఇటువంటి వాళ్లకు ఎన్నికలు ‘విశ్వాసంతో కూడిన చర్య’ అవుతాయి.

8th Class Social Textbook Page No.168

ప్రశ్న 20.
1996 ఎన్నికల్లో నిరక్షరాస్యులు, పేదలు అయిన ప్రజల్లో 61 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారని ఒక సర్వే ద్వారా తెలిసింది. అయితే పట్టభద్రులలో ఇది 53 శాతం మాత్రమే. ఈ తేడాకు కారణాలు ఏమై ఉంటాయి? చర్చించండి.
జవాబు:
ఎన్నికలలో నెగ్గిన వారు ఆ తర్వాత ప్రజలకు ఏమీ చేయటం లేదు. చాలావరకు మంత్రులు, ఎమ్.పి. లు వారి బంధుప్రీతిని చూపించి, అధికార దుర్వినియోగాన్ని చేస్తున్నారని పట్టభద్రుల భావన అయి వుండవచ్చు. ఆ నైరాశ్యమే ఈ తేడాకు కారణమై ఉండవచ్చు.

8th Class Social Textbook Page No.169

ప్రశ్న 21.
గత సం||రం చదివిన చట్టాలను గుర్తు చేసుకోండి. రాష్ట్ర శాసనసభలలో లేదా పార్లమెంటు గత సమావేశంలో చర్చించిన కొత్త చట్టాల గురించి తెలుసుకోండి.
జవాబు:

  1. పార్లమెంటు గత సమావేశంలో మహిళా కోర్టుల ఏర్పాటు బిల్లు.
  2. లైంగిక వేధింపులకు పాల్పడిన వారు మైనర్లు అయితే వారిలో పదహారు సం||రములు దాటిన వారిని జువెనైల్ కోర్టులు లేక, మామూలు క్రిమినల్ కోర్టులు విచారించే విషయమై బిల్లు.

ఈ రెండు విషయాలపై, ఇంకా యితర విషయాలపై పార్లమెంటు చర్చించింది.

AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 22.
తప్పు వాక్యాలను సరిచేయండి.
1) రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని ఒకే రకం వ్యక్తులు ఎన్నుకుంటారు.
2) దేశంలో ప్రతి ఓటరు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు.
3) రాష్ట్రపతి ఎన్నికలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు పాల్గొంటారు.
4) అన్ని శాసనసభల సభ్యులు (ఢిల్లీ, పాండిచ్చేరిలతో సహా) రాజ్యసభ, లోకసభ సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు.
జవాబు:
1) అన్ని రాష్ట్రాల శాసనసభ్యులు, పార్లమెంటు ఉభయసభల ఎన్నికైన సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు.
2) దేశంలో ఓటువేసిన ప్రతి ఓటరు పరోక్షంగా రాష్ట్రపతిని ఎన్నుకుంటారు.
3) రాష్ట్రపతి ఎన్నికలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు పాల్గొంటారు.
4) అన్ని శాసనసభల సభ్యులు రాజ్యసభ, లోకసభ సభ్యులు ఎన్నికైన వారు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు.

8th Class Social Textbook Page No.170

ప్రశ్న 23.
కింద పేర్కొన్న వారికి సంబంధించిన ప్రస్తుత ఫోటోలను సేకరించి ఆయా డబ్బాలలో అతికించండి.
AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం 9
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం 11 a

ప్రశ్న 24.
ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరు ? అంతకు ముందు ప్రధానమంత్రుల నుంచి కొంతమంది పేర్లు చెప్పండి.
జవాబు:
ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతకు ముందు వారు –

  1. డా|| మన్మో హన్ సింగ్
  2. శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి
  3. శ్రీ రాజీవ్ గాంధీ
  4. శ్రీమతి ఇందిరాగాంధీ
  5. శ్రీ జవహర్‌లాల్ నెహ్రూ
  6. శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి

ప్రశ్న 25.
మీ రాష్ట్రం నుంచి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవాళ్ల పేర్లు చెప్పండి.
జవాబు:
మా రాష్ట్రం నుండి కేంద్ర మంత్రులుగా ఉన్నవాళ్లు సుజనా చౌదరి, వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్ మరియు అశోక గజపతి రాజు.

ప్రశ్న 26.
కొన్ని ముఖ్యమైన మంత్రిత్వ శాఖలను, కేంద్ర ప్రభుత్వంలో వాటి మంత్రులను పేర్కొనంది.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం 11

8th Class Social Textbook Page No.170, 171

ప్రశ్న 27.
ప్రభుత్వ ఏర్పాటుకి సంబంధించి ఈ కింది వాటిల్లో సరైనది ఏది?
1) రాష్ట్రపతి మద్దతు ఉన్న పార్టీ లేదా సంకీర్ణం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.
2) పార్లమెంటులో అధిక సీట్లు ఉన్న పార్టీ లేదా సంకీర్ణం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.
3) పార్లమెంటులో సగానికి పైగా సీట్లు ఉన్న పార్టీ లేదా సంకీర్ణం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.
4) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీని ఎన్నికల కమిషన్ ఎంపిక చేస్తుంది.
5) లోక్ సభ ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలిచిన వ్యక్తి ప్రధానమంత్రి అవుతారు.
జవాబు:
2) పార్లమెంటులో అధిక సీట్లు ఉన్న పార్టీ లేదా సంకీర్ణం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.

పట నైపుణ్యాలు

28. క్రింద ఈయబడిన పటమును గమనించి సమాధానములు రాయుము.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం 12
1. మొత్తం నియోజక వర్గాలు ఎన్ని?
జవాబు:
543

2. SC, ST లలో ఏవి ఎక్కువగా ఉన్నాయి?
జవాబు:
SC ఎక్కువగా ఉన్నాయి.

3. SC ఎక్కడ తక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు?
జవాబు:
ఈశాన్య ప్రాంతం

4. ST లు ఎక్కడ అస్సలు లేవని చెప్పవచ్చు?
జవాబు:
తమిళనాడు, కేరళ, కర్ణాటక.

ప్రాజెక్టు

పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు రేడియో లేదా టెలివిజన్ లో వార్తలు విని లేదా దినపత్రికలు చదివి జరిగిన ఘటనల జాబితా తయారుచేయండి. పార్లమెంటులో చర్చ జరిగిన అంశంపై ఒక వ్యాసం రాయండి లేదా దానిని చర్చిస్తున్నప్పుడు పార్లమెంటులోని దృశ్యాన్ని గీయండి.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం 13

AP Board 8th Class Social Solutions Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు

SCERT AP 8th Class Social Study Material Pdf 10th Lesson బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 10th Lesson బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు

8th Class Social Studies 10th Lesson బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
అధ్యాయంలోని ఒక్కొక్క భాగం ఆధారంగా చిన్న చిన్న ప్రశ్నలు తయారుచేసి ఒకరినొకరు అడగండి. సమాధానాలు సరిగానే ఉన్నాయేమో చూడండి. (AS4)
1. ‘ఖుదా ఖాన్’ అంటే ఏమిటి?
జవాబు:
‘ఖుద్ ఖాన్’ అంటే సొంతంగా సాగుచేసుకునే భూమి.

2. శాశ్వతశిస్తు నిర్ణయ పద్ధతిని ఎవరు, ఎప్పుడు ప్రవేశపెట్టారు?
జవాబు:
1793లో కారన్‌వాలీస్ ప్రవేశపెట్టాడు.

3. జమీందారులు శిస్తు కట్టలేకపోతే ఏమి జరిగేది?
జవాబు:
వారు జమీని కోల్పోవలసి వచ్చేది.

4. సీడెడ్ జిల్లాలు అంటే ఏవి?
జవాబు:
బళ్లారి, అనంతపురం, కర్నూలు, కడప.

5. ప్రకాశం బ్యారేజీని నిర్మించినవారు ఎవరు?
జవాబు:
సర్ ఆర్థర్ కాటన్

6. రైత్వారీ శిస్తును ఎన్ని సంవత్సరాలను ఆధారం చేసుకుని నిర్ణయిస్తారు?
జవాబు:
20, 30 సంవత్సరాలు

7. అమెరికాలో అంతర్యుద్ధం ఎప్పుడు తలెత్తింది?
జవాబు:
1861

8. బలవంతంగా, డబ్బులు ఇవ్వకుండా చేయించుకునే పనిని ఏమంటారు?
జవాబు:
వెట్టిచాకిరి

9. జమీందారులు ఏ ఏ రూపాలలో రైతుల నుండి ఉచితంగా రాబడిని ఆశించేవారు?
జవాబు:
నెయ్యి, పాలు, కూరగాయలు, బెల్లం, గడ్డి, పిడకలు మొ||నవి.

10. పాత భూస్వాములకు నష్టపరిహారంగా ఏమి చెల్లించేవాళ్ళు? (హైదరాబాదులో)
జవాబు:
‘రుసుం’ అనే వార్షిక మొత్తాన్ని చెల్లించేవాళ్ళు.

11. తీవ్రమైన కరవు ఏది?
జవాబు:
గంజాం కరవు

12. రైతాంగ ఉద్యమాలను రెండింటిని పేర్కొనండి.
జవాబు:
డెక్కన్ తిరుగుబాటు, రంపా ఫితూరీలు మొఫా పోరాటం మొ||నవి.

ప్రశ్న 2.
స్వాతంత్ర్యానికి ముందు కౌలు రైతుల పరిస్థితిని నేటి రైతుల పరిస్థితితో పోల్చండి. ఏయే తేడాలు, పోలికలు ఉన్నాయి? (AS1)
జవాబు:
తేడాలు :
ఆ రోజులలో రైతులు భూమి కౌలు చెల్లించలేక కొన్ని సందర్భాలలో భూములు వదిలి పారిపోయేవారు. కౌలు చెల్లించడానికి రైతు వడ్డీ వ్యాపారస్తుని వద్ద అప్పు తీసుకోవాల్సి వచ్చేది. చెల్లించలేని వారి నుండి భూమిని లాక్కునేవారు. శిస్తుకు 3 నుండి 7 రెట్లు కౌలు ఉండేది. నేటి రైతులు కౌలును సాంకేతికత ఆధారంగా నిర్ణయించి చెల్లిస్తారు. చెల్లించలేని పక్షంలో బ్యాంకుల నుండి అప్పు తీసుకుని చెల్లిస్తారు.

పోలికలు :
నాడు, నేడు కూడా కాలుదారుల పరిస్థితి దయనీయంగానే ఉంది. కౌలుకిచ్చిన రైతుల తరువాతి కాలంలో దాని అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. కౌలుదారులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.

AP Board 8th Class Social Solutions Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు

ప్రశ్న 3.
స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో జమీందారులు సాధారణంగా బ్రిటిషు ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. కారణాలు ఏమై ఉంటాయో తెలియచేయండి. (AS1)
జవాబు:
కొంతమంది జమీందారులు వారు అనుసరించిన విధానాల వలన ప్రజలకు దూరమయ్యారు. బ్రిటిషు వారి ఆధ్వర్యంలో వీరు ఆస్తులు బాగా సంపాదించుకున్నారు. ఈ కారణాల వల్ల కొంతమంది జమీందారులు బ్రిటిషు ప్రభుత్వానికి మద్దతునిచ్చారు.

ప్రశ్న 4.
రైతాంగ జీవితాలలో వడ్డీ వ్యాపారస్తుల పాత్ర ఏమిటి? వాళ్ళకు బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా ఏ విధమైన మద్దతు లభించింది? (AS1)
జవాబు:
శిస్తులు కట్టడానికి రైతులు వడ్డీ వ్యాపారస్థుల నుంచి చాలాసార్లు అప్పులు చేయాల్సి వచ్చేది. అయితే వాళ్ళు సకాలంలో అప్పులు చెల్లించకపోతే వడ్డీ వ్యాపారస్తులు కోర్టుకు వెళ్ళి భూములు వేలం వేయించి తమ అప్పులు వసూలు చేసుకునే వాళ్ళు, శిస్తు వసూలుకు, బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త విధానం వల్ల అనేక మంది రైతులు అప్పుల ఊబిలో కూరుకు పోయారు. తమ పట్టులోకి వచ్చే రైతుల సంఖ్య పెరుగుతుండటంతో వడ్డీ వ్యాపారస్తుల సంపద కూడా పెరుగుతూ వచ్చింది.

బ్రిటిష్ ప్రభుత్వం శిస్తు వసూలు మీద చూపించిన శ్రద్ధ, రైతుల సంక్షేమంలో చూపించలేదు. వడ్డీ వ్యాపారస్థులకు ఈ విధంగా మద్దతు లభించినట్లయింది.

ప్రశ్న 5.
తెలంగాణ దొరలు, అవధ్ జమీందారుల మధ్య తేడాలు, పోలికలు ఏమిటి? (AS1)
జవాబు:
తేడాలు :

  1. తెలంగాణ దొరలు నిజాం పాలనలో, అవధ్ జమీందారులు బ్రిటిష్ పాలనలో ఉండేవారు.
  2. దొరలు వసూలు చేసిన శిస్తును నిజాంకు చెల్లిస్తే, జమీందారులు బ్రిటిష్ వారికి చెల్లించేవారు.
  3. దొరలు మనుషుల్ని బానిసలుగా చూశారు. జమీందారులు కేవలం ఆర్థికంగానూ, శ్రమపరంగాను దోచుకున్నారు.

పోలికలు :

  1. ఇరువురూ రైతులను అక్రమంగా దోచుకున్నారు.
  2. అధిక మొత్తంలో భూములను కలిగి ఉన్నారు.
  3. వేరే వారి ఆధీనంలో ఉంటూనే స్వతంత్రంగా వ్యవహరించారు.

AP Board 8th Class Social Solutions Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు

ప్రశ్న 6.
వ్యవసాయాన్ని అభివృద్ధి చేయటానికి బ్రిటిష్ వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? వాళ్ళు ఆశించిన ఫలితాలు వచ్చాయా? మీ కారణాలు తెలియచేయండి. (AS1)
జవాబు:
వ్యవసాయాభివృద్ధికి బ్రిటిష్ వారు భారీ నీటి సాగు పథకాలలో పెట్టుబడులు పెట్టడం ప్రభుత్వ విధి అని భావించారు. ఆనకట్టలు, కాలువలు నిర్మించారు. భూమికి చట్టబద్ధ యజమానులు ఎవరో నిర్ణయించారు. దిగుబడులు, ధరలు, మార్కెట్ పరిస్థితులు, సాగుచేసే పంటలు వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఎకరాకు చెల్లించాల్సిన శిస్తుని నిర్ణయించారు. పంటల సాగు మొదలుకాక ముందు విత్తనాలు, పరికరాలు, ఎడ్లు కొనడానికి, పాత బావులు మరమ్మతు చేయటానికి, కొత్త బావులు తవ్వటానికి రైతులకు అప్పులు ఇప్పించారు. ఈ చర్యల వల్ల ఆ సంవత్సరం పంటలు బాగా పండి శిస్తు, వసూళ్ళు బాగా జరిగాయి. కాబట్టి వారు అనుసరించిన విధానం సరైనదేనని నేను చెప్పగలను.

ప్రశ్న 7.
రైత్వారీ వ్యవస్థ కూడా భూస్వామ్యానికి ఎలా దోహదం చేసింది? (AS1)
జవాబు:
రైత్వారీ ప్రాంతాలలో కూడా భూమిశిస్తుని చాలా ఎక్కువగా నిర్ణయించారు. జమీందారీ ప్రాంతాలలో మాదిరి కాకుండా దీనిని 20, 30 సంవత్సరాలకు ఒకసారి నిర్ణయిస్తారు. ఈ కాలం ముగిసిన తరవాత మారిన పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని శిస్తును తిరిగి నిర్ణయించేవాళ్లు. భూమిశిస్తు చాలా ఎక్కువగా ఉండి మొదట్లో దానిని బలవంతంగా వసూలు చేయాల్సి వచ్చేది. అయితే కొంతకాలానికి భూమిశిస్తు కంటే ధరలు వేగంగా పెరగటంతో రైతులు’ తమ భూములను సాగు చేయడానికి కౌలుదారులకు ఇచ్చి వారినుంచి పంట వసూలు చేయటం సైతం లాభసాటిగా ఉండేది. అనతికాలంలోనే రైత్వారీ ప్రాంతాలలో కూడా భూస్వాములు ఏర్పడి తమ భూములను నిస్సహాయులైన కౌలుదారులకు అధిక మొత్తం కౌలుకు ఇవ్వసాగారు. ‘రైతులు’ ప్రభుత్వానికి చెల్లించే భూమిశిస్తు కంటే కౌలుదారులు మూడునుంచి ఏడు రెట్లు ఎక్కువ కౌలు చెల్లించేవాళ్ళు. (అంటే రైతు కొంత భూమికి వంద రూపాయలు భూమిశిస్తుగా ప్రభుత్వానికి చెల్లిస్తుంటే అదే భూమి నుంచి కౌలుగా 300 నుంచి 700 రూపాయలు కౌలుగా లభించేది. ) ఫలితంగా వాళ్లకు కూడా వ్యవసాయాన్ని మెరుగుపరచటానికి పెట్టుబడులు పెట్టడంలో ఆసక్తి లేకుండా పోయింది. ఎక్కువ మొత్తాలకు భూమిని కౌలుకు ఇవ్వటంపైనే దృష్టి పెట్టారు. ఈ విధంగా రైత్వారీ వ్యవస్థ కూడా భూస్వామ్యానికి దోహదం చేసింది.

ప్రశ్న 8.
బ్రిటిషు పాలనలో కరవులు ఎందుకు సంభవించాయి? అవి వరదలు లేక వర్షాలు పడకపోవటం వల్ల వచ్చాయని మీరు భావిస్తున్నారా? (AS1)
జవాబు:
కరవులు వరదలు, వర్షాలు పడకపోవడం వల్ల అతి తక్కువగా సంభవించాయి. అధిక శాతం కరవులు బ్రిటిషు వారి . నిరంకుశ విధానాల వల్ల తలెత్తేవి. ఇక్కడ ప్రజలకు తిండిలేని సమయంలో వారు ఆహారధాన్యాలను విదేశాలకి ఎగుమతి చేసేవారు. వ్యాపారస్తులు కృత్రిమ కొరతను సృష్టించినప్పుడు జోక్యం చేసుకునేవారు కాదు. వీరు ప్రజల సంక్షేమం కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అందువలన కరవులు సంభవించాయి.

ప్రశ్న 9.
పంటలు పండనప్పుడు కూడా కరవు రాకుండా ప్రభుత్వం ఎలా సహాయపడగలదు? (AS1)
జవాబు:

  1. ప్రభుత్వం తాను కొనుగోలు చేసిన వ్యవసాయ ఉత్పత్తులను ప్రజలకు అందించటం ద్వారా
  2. నీటి వసతులు కల్పించటం ద్వారా
  3. రైతుల ఋణాల చెల్లింపును వాయిదా వేయటం ద్వారా
  4. మిగులు పంటలను, ఎండబెట్టి నిలువచేయటం ద్వారా
    పంటలు పండనప్పుడు కరవు రాకుండా సాయపడగలదు.

AP Board 8th Class Social Solutions Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు

ప్రశ్న 10.
బ్రిటిషు ప్రభుత్వ విచారణ సంఘానికి ఒక వినతిపత్రాన్ని ఇవ్వబోతున్నారని ఊహించుకోండి; కౌలు రైతుల సమస్యలను పేర్కొంటూ ఒక వినతిపత్రాన్ని తయారుచేయండి. (AS6)
జవాబు:
వినతిపత్రం

అయ్యా !
భారతదేశంలో స్థానికులమైన మేము మా పొలాలకే అధిక కౌలు ఇవ్వాల్సిన పరిస్థితిని తలుచుకుని సిగ్గుపడుతూ మీకు ఈ విన్నపాలను అందిస్తున్నాము. రైతులు, భూస్వాములు, జమీందారులు మాకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదు. తద్వారా మాకు నీటిపారుదల వసతులు, ఇతరములు ఏవీ అందడం లేదు. వసతులు లేకుండా మామూలు దిగుబడి కూడా మేము పొందలేకపోతున్నాము. మీరు అమలుపరిచే శిస్తు విధానాలు కూడా మాకు అనుసరణీయంగా లేవు. కౌలు రేట్లు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అవి శిస్తుకు ఏడు రెట్లుగా ఉన్నాయి. వడ్డీ వ్యాపారస్తులు మా పొలాలను, ఇండ్లను వేలం వేయడానికి సిద్ధంగా ఉన్నారు. తమరు వీటినన్నింటిని దృష్టియందుంచుకుని మాకు తగిన మేలు చేయవలసినదిగా ప్రార్థిస్తున్నాము.

కృతజ్ఞతలతో ….

ఇట్లు
ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం

ప్రశ్న 11.
భారతదేశ పటంలో ఈ కింది వానిని గుర్తించండి. (AS5)
1. గంజాం 2. అవధ్ 3. హైదరాబాద్ 4. గోదావరి నది
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు 1

ప్రశ్న 12.
“అంతులేని వసూళ్ళు, శిస్తులు, చెల్లింపులు” శీర్షిక కింద గల పేరాను చదివి కింది ప్రశ్నకు జవాబు రాయండి.

రకరకాల సాకులతో రైతుల నుంచి సాధ్యమైనంత డబ్బు వసూలు చేయటానికి జమీందారులు ప్రయత్నించారు. జమీందారు ఇంటికి నెయ్యి, పాలు, కూరగాయలు, బెల్లం, గడ్డి, పిడకలు వంటివి రైతులు ఉచితంగా నిత్యం సరఫరా చేయాలి. భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో ఇదే పరిస్థితి ఉండేది. బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ లో పెద్ద పెద్ద భూస్వాములు చాలామంది ఉండేవాళ్లు. ఒక్కొక్కరి కింద డజన్లు, వందల గ్రామాలు ఉండేవి. జమీందారుల ఆగడాలను ప్రతిఘటించటానికి రైతులు ప్రయత్నించేవాళ్లు.
ప్రస్తుత రోజులలో శిస్తును ఏ విధంగా చెల్లిస్తున్నారు? (AS2)
జవాబు:
ప్రస్తుత రోజులలో శిస్తును డబ్బు రూపేణా మాత్రమే చెల్లిస్తున్నారు.

8th Class Social Studies 10th Lesson బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు InText Questions and Answers

8th Class Social Textbook Page No.111

ప్రశ్న 1.
మొఘల్ కాలంలో గ్రామాల్లోని భూములన్నీ జమీందారుల కింద ఉండేవా?
జవాబు:
మొఘలుల కాలంలో భూముల మీద శిస్తు వసూలు అధికారం జమీందారుల కింద ఉండేది. భూములు జమీందారుల కింద కొంత, రైతాంగం కింద కొంత, ఇతరుల కింద కొంత భూమి ఉండేది.

ప్రశ్న 2.
మొఘల్ ప్రభుత్వానికి జమీందారులు ఏం చేసేవాళ్లు, దానికి ప్రతిఫలంగా వాళ్లకు ఏం లభించేది?
జవాబు:
మొఘల్ చక్రవర్తుల పాలనలో రైతాంగం నుంచి జమీందారులు శిస్తు వసూలు చేసి మొఘల్ అధికారులకు అందచేసేవారు. శిస్తు వసూలు చేసినందుకు జమీందారులకు అందులో కొంత వాటా, ఒక్కొక్కసారి స్థానికంగా చిన్న చిన్న పన్నులు వసూలు చేసే అధికారం ఇవ్వబడినది.

8th Class Social Textbook Page No.112

ప్రశ్న 3.
స్వంతంగా వ్యవసాయం చేసుకుంటున్న వాళ్లకు జమీందారులు ఏ విధంగానైనా సహాయపడి ఉంటారా? మీ సమాధానానికి – కారణాలు ఇవ్వండి.
జవాబు:
జమీందారులు మొఘలుల కాలంలో కొంతవరకు మధ్యవర్తులుగా వ్యవహరించి సహాయం చేశారని చెప్పవచ్చు. బ్రిటిష్ వారి కాలంలో వారు ఏమీ సాయం చేయలేదు. అలా చేసి ఉంటే వారు శిస్తు చెల్లించలేక జమీలు కోల్పోయేవారు కాదు. వీరి జమీలు వేలాల్లో ఇంకొకరికి పోయేవి కాదు. తరచూ జమీందారులు మారే వారు కాదు.

AP Board 8th Class Social Solutions Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు

ప్రశ్న 4.
జమీందారులు చిన్న కోటల్లాంటి ఇళ్లల్లో ఉంటూ, సైన్యాన్ని ఎందుకు కలిగి ఉండేవాళ్లు?
జవాబు:
జమీందారుల అజమాయిషీలో కొన్ని గ్రామాలుండేవి. వీరు ఆ గ్రామాల ప్రజలకు పైనున్న పాలకులకు మధ్యవర్తులుగా ఉండేవాళ్ళు. వారికి చాలా ఆదాయం ఉండేది. వారి జమీ మొత్తానికి వాళ్ళు రాజుల్లాంటి వారు కాబట్టి చిన్నకోటల్లాంటి ఇంట్లో ఉండేవారు.

తమ జమీలోని గ్రామాల ప్రజలను దోపిడీలు, దాడుల నుండి కాపాడాలన్నా, భయట్టి శిస్తు వసూలు చేయాలన్నా వీరికి అంగబలం కావాలి. అందువల్ల సైన్యాన్ని కలిగి ఉండేవాళ్ళు.

8th Class Social Textbook Page No.113

ప్రశ్న 5.
అనేక తరాలుగా భూమిని సాగు చేస్తున్న రైతు స్థితిని ఈ మార్పులు ఎలా ప్రభావితం చేశాయి?
జవాబు:

  1. ఈ సెటిల్మెంట్ వల్ల రైతాంగం కాస్తా కౌలుదారులుగా మారిపోయింది.
  2. శిస్తు కంటే కౌలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల రైతులు ఆ మొత్తాలు చెల్లించలేక కొన్ని సందర్భాలలో భూమిని వదిలి పారిపోయేవారు.

రైతు స్థితిని ఈ మార్పులు పై విధంగా ప్రభావితం చేశాయి.

ప్రశ్న 6.
శిస్తుకు, కౌలుకు మధ్య తేడా ఏమిటి?
జవాబు:
శిస్తు :
వ్యక్తులు రైతులు తమ స్వంత భూమిలో పంట పండించి దానికిగాను జమిందార్లకు ప్రభుత్వానికి చెల్లించే దానిని శిస్తు అంటారు.

కౌలు :
వ్యక్తులు రైతులు ఇతరుల భూములను తీసుకుని పంట పండించుతారు. దీనికి గాను వారు భూమి యజమానికి చెల్లించే దానిని శిస్తు అంటారు.

ప్రశ్న 7.
శాశ్వతశిస్తు నిర్ణయ పద్ధతి ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం, జమీందారులు, రైతాంగాల్లో ఎవరు ఎక్కువ లాభపడ్డారు ? కారణాలు పేర్కొనండి.
జవాబు:
ఈ పద్ధతి ద్వారా జమీందారులు ఎక్కువ లాభపడ్డారు.

కారణాలు :

  1. బ్రిటిష్ వారికి కేవలం 10 శాతం మాత్రమే శిస్తు కట్టేవారు. ఇది ముందే నిర్ణయించబడినది. అధిక వసూళ్ళలో వారికి వాటా ఇవ్వలేదు.
  2. రైతాంగం ఎక్కువ శిస్తులను చెల్లించాల్సి వచ్చింది. శిస్తులు చెల్లించలేనివారు వారి. భూములను పోగొట్టుకునేవారు. వీరు మొత్తం కౌలుదారులుగా మారిపోయారు.

8th Class Social Textbook Page No.114

ప్రశ్న 8.
భూమి మీద ఎటువంటి పెట్టుబడులు పెట్టకుండా తమ ఆదాయాలను పెంచుకోవడం జమీందారులకు ఎలా సాధ్యమయ్యింది?
జవాబు:
మార్కెట్టులో ఆహారధాన్యాల ధరలు పెరుగుతుండటంతో సాగు మెల్లగా విస్తరించింది. దీనివల్ల పెట్టుబడులు లేకుండానే జమీందారుల ఆదాయం పెరిగింది.

AP Board 8th Class Social Solutions Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు

ప్రశ్న 9.
బ్రిటిష్ పాలనను జమీందారులు సమర్థించారా, వ్యతిరేకించారా? మీ కారణాలు పేర్కొనండి.
జవాబు:
బ్రిటిష్ పాలనను జమీందారులు సమర్ధించారు.

కారణాలు:

  1. వీరు బ్రిటిష్ వారిని వ్యతిరేకించలేదు.
  2. బ్రిటిష్ వారు చెప్పినదానికన్నా ఎక్కువ శిస్తు వసూలు చేశారు.
  3. శిస్తు కట్టలేని వారిని నిర్దయగా తొలగించారు.
  4. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టలేదు.

ప్రశ్న 10.
బ్రిటిషు ప్రభుత్వం జమీందారీ వ్యవస్థను ప్రవేశపెట్టిన ఉద్దేశాలు ఎందుకు నెరవేరలేదు?
జవాబు:

  1. జమీందారులు భూమిని అభివృద్ధిపరచలేదు.
  2. జమీందారులు ఎటువంటి పెట్టుబడులు పెట్టలేదు.
  3. శిస్తు చాలా ఎక్కువగా ఉండేది.
  4. పంట నష్టపోయినప్పుడు, కరవు సమయాలలోనూ ఎటువంటి మినహాయింపులు ఉండేవి కావు.
  5. కంపెనీ వేలం పాటల్లో జమీందారులను ఇట్టే మార్చేసేది.
  6. వచ్చిన జమీందారులు తాము సంపాదించుకోవడానికే చూశారు కానీ వ్యవస్థను కాపాడలేదు.
  7. భూస్వాములు వడ్డీ వ్యాపారస్తుల పాలుపడ్డారు.

ఈ కారణాలన్నింటి రీత్యా జమీందారీ వ్యవస్థ ఉద్దేశాలు నెరవేరలేదు.

8th Class Social Textbook Page No.115

ప్రశ్న 11.
బ్రిటిష్ పాలన ఆరంభంలో వ్యవసాయంలో ప్రభుత్వం ఏ విధమైన పెట్టుబడులు పెట్టింది? ఈ పనిని రైతులు స్వయంగా చేయగలిగి ఉండేవాళ్లా?
జవాబు:

  1. పంటల సాగు మొదలుకాక ముందు విత్తనాలు, పరికరాలు, ఎడ్లు కొనటానికి, పాత బావులు మరమ్మతు చేయటానికి, కొత్త బావులు తవ్వటానికి అప్పులు ఇప్పించారు.
  2. భారీ నీటిసాగు పథకాలలో పెట్టుబడులు పెట్టారు.
  3. కాలువలు నిర్మించారు.

ఇంత పెద్ద మొత్తాలను ఖర్చు పెట్టి రైతులు స్వయంగా చేయలేరు.

ప్రశ్న 12.
రైత్వారీ స్థిరీకరణను ప్రవేశపెట్టే కంటే ముందు పాలెగార్లను ఎందుకు ఓడించాల్సి వచ్చింది?
జవాబు:
పాలెగార్లు బ్రిటిష్ వారిని వ్యతిరేకిస్తూ సాయుధ అనుచరులను కలిగి ఉండేవారు. దోపిడీలు, దాడులు సాగించేవారు. వీరున్నంతకాలం భూమికి అసలు యజమానులెవరో గుర్తించడం కష్టం. వీరిని అణిచివేస్తే తప్ప రైత్వారీ స్థిరీకరణం కష్టం. అందువలన ముందు పాలెగార్లను ఓడించాల్సి వచ్చింది.

ప్రశ్న 13.
జమీందారులు చిన్న కోటల్లాంటి ఇళ్ళల్లో ఉంటూ సైన్యాన్ని ఎందుకు కలిగి ఉండేవాళ్ళు?
జవాబు:
జమీందారుల అజమాయిషీలో కొన్ని గ్రామాలుండేవి. వీరు ఆ గ్రామాల ప్రజలకు పైనున్న పాలకులకు మధ్యవర్తులుగా ఉండేవాళ్ళు. వారికి చాలా ఆదాయం ఉండేది. వారి జమీ మొత్తానికి వాళ్ళు రాజుల్లాంటి వారు కాబట్టి చిన్నకోటల్లాంటి ఇంట్లో ఉండేవారు.

తమ జమీలోని గ్రామాల ప్రజలను దోపిడీలు, దాడుల నుండి కాపాడాలన్నా, భయ పెట్టి శిస్తు వసూలు చేయాలన్నా వీరికి అంగబలం కావాలి. అందువల్ల సైన్యాన్ని కలిగి ఉండేవాళ్ళు.

AP Board 8th Class Social Solutions Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు

ప్రశ్న 14.
‘శాశ్వత స్థిరీకరణ’ను ప్రవేశపెట్టినప్పుడు పెద్ద ఎత్తున భూసర్వే చేపట్టలేదు. ‘రైత్వారీ స్థిరీకరణ’ సమయంలో ఇది ఎందుకు అవసరమయ్యిందని మీరు భావిస్తున్నారు?
జవాబు:
శాశ్వత స్థిరీకరణలో బ్రిటిషు వారు జమీందారులను మధ్యవర్తులుగా ఉంచి సరియైన ఆదాయాన్ని పొందలేకపోయారు. రైతులకు అభివృద్ధి కార్యక్రమాలు లేక కుంటుపడ్డారు. అందుకని అధిక ఆదాయం కోసం నేరుగా రైతుల నుండే శిస్తు వసూలు చేయాలని భావించారు. కాబట్టి పెద్ద ఎత్తున భూ సర్వే చేపట్టడం అవసరమయింది.

8th Class Social Textbook Page No.116

ప్రశ్న 15.
రైత్వారీ స్థిరీకరణ వల్ల రైతులు, భూస్వాములు, బ్రిటిష్ పాలకులలో ఎవరు లబ్ది పొందారు? మీ సమాధానానికి కారణాలు ఇవ్వండి.
జవాబు:
రైత్వారీ స్థిరీకరణ వల్ల భూస్వాములు ఎక్కువ లబ్ధి పొందారని చెప్పవచ్చు.

కారణాలు :

  1. రైత్వారీ ప్రాంతాలలో భూస్వాములు ఎక్కువ ఏర్పడ్డారు.
  2. వ్యవసాయం చేయడం కన్నా కౌలుకి ఇవ్వడం పైనే ఎక్కువ ఆసక్తి కనబర్చారు.

ప్రశ్న 16.
మీరు ఊహించిన దానినీ, వాస్తవంగా జరిగిన దానిని పోల్చండి. మీ అంచనాలు ఎంతవరకూ నిజమయ్యాయి?
జవాబు:
రైత్వారీ పద్ధతి వల్ల రైతుల పరిస్థితి మెరుగుపడుతుందని భావించాను. అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని భావించాను. కాని అవన్నీ తలకిందులయ్యాయి. రైతులు భూస్వాముల కింద, కౌలుదారులు కూలీల కింద మారిపోయారు.

ప్రశ్న 17.
వ్యవసాయాన్ని విస్తరించడంలో గానీ, మెరుగుపరచడంలో కానీ రైతులు పెట్టుబడులు ఎందుకు పెట్టలేదు?
జవాబు:
భూమిశిస్తు కంటే ధరలు వేగంగా పెరగటంతో రైతులు తమ భూములను సాగు చేయడానికి కౌలుదారులకు ఇచ్చి వారి నుంచి పంట వసూలు చేయడం లాభసాటిగా ఉండేది. అందువలన వారు వ్యవసాయాన్ని విస్తరింపచేయకుండా, మెరుగు పరచకుండా, పెట్టుబడులు పెట్టకుండా కౌలుకివ్వడం మీద దృష్టిపెట్టారు.

ప్రశ్న 18.
భూమిలేని కౌలు రైతుల స్థితిగతులను ఊహించి ఒక వ్యాసం రాయండి.
జవాబు:
భూమి ఉన్న కౌలు రైతులు తాము కౌలు తీసుకున్న భూమికి ఎక్కువ శిస్తు చెల్లించినా, కొంత లాభం వారి భూమి నుండి పొందుతారు. కాని భూమిలేని కౌలు రైతుల జీవితం దుర్భరం. వారు పండిన పంటకు ఎన్నో రెట్లు కౌలు చెల్లించాల్సి వస్తుంది. శిస్తు కూడా చెల్లించాల్సి ఉంటుంది. వ్యవసాయానికి మెరుగుపరచటానికి, పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి, వీలు ఉండదు. శిస్తు, కౌలు చెల్లింపులకు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయిస్తారు. వాటిని చెల్లించలేక ఆస్తులు వేలం వేయించుకుంటారు. ఇంత కష్టపడినా ధర నిర్ణయం వీరి ఆధీనంలో ఉండదు. ధర అంతర్జాతీయ మార్కెట్ ను అనుసరించి ఉంటుంది. ఇది వీరిని మరింత నష్టపరుస్తుంది. లాభం కోసం వాణిజ్య పంటలు పండిస్తే, అది ప్రజలకు ఆహార కొరత నేర్పరుస్తుంది. కొన్ని సంవత్సరాల తరువాత వీరు శిస్తును, కౌలును చెల్లించలేక ఊరు విడిచి పారిపోతారు. అలాగే ‘గంజాం కరవు’ వల్ల అనేకమంది మారిషస్, ఫిజిలాంటి ఇతర దూరప్రాంతాలకు కూలీలకు వలస వెళ్ళారు.

8th Class Social Textbook Page No.117

ప్రశ్న 19.
ఎగుమతి కోసం ఉత్పత్తి చేపట్టినందువల్ల అంతిమంగా ఎవరు లాభపడ్డారు? వాళ్లు ఏ విధంగా లాభపడ్డారు?
జవాబు:
ఎగుమతి కోసం ఉత్పత్తి చేపట్టినందువల్ల అంతిమంగా వడ్డీ వ్యాపారస్తులు లాభపడ్డారు. వీరు రైతులకు ఎక్కువ మొత్తాలను, అధిక వడ్డీలకు అప్పులిచ్చి లాభపడ్డారు.

ప్రశ్న 20.
భూమిశిస్తు వల్ల రైతుల భూములు ఏ విధంగా వడ్డీ వ్యాపారస్తులపరం చేయబడ్డాయి ? వడ్డీ వ్యాపారస్తులు ఆ భూమితో ఏమి చేసి ఉంటారు?
జవాబు:
భూమిశిస్తులు అధికం కావడంవల్ల రైతులు వాటిని కట్టలేక వడ్డీలకు అప్పులు తీసుకునేవారు. వాటిని చెల్లించలేక వారి భూముల్ని, ఆస్తుల్ని వేలం వేయించుకుని, అప్పులు తీర్చేవారు. ఈ విధంగా వడ్డీ వ్యాపారస్తులు అనేక ఆస్తులు సంపాదించుకుని లాభపడ్డారు.

AP Board 8th Class Social Solutions Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు

ప్రశ్న 21.
ప్రస్తుత కాలంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు వేగంగా పెరిగి, పడిపోయిన సందర్భం గురించి విన్నారా ? దాని ప్రభావం రైతులపై ఎలా ఉంటుంది?
జవాబు:
గత కాలంలో బియ్యం, కందిపప్పు ధరలు అమాంతం పెరిగిపోయి, తర్వాత ప్రభుత్వంచే తగ్గించబడ్డాయి. రైతులు ఎక్కువ ఆదాయం వస్తుందని భావించి ఒక పంటను పండిస్తారు. దాని ధర పడిపోతే వారు దాని మీద పెట్టిన పెట్టుబడిని తిరిగి పొందలేరు. వారికి ఆ సంవత్సరం ఆదాయం ఉండదు. వారు కోలుకోలేని దెబ్బతింటారు.

ప్రశ్న 22.
అధిక శిస్తు రేట్ల వల్ల భూస్వాములు, రైతులు వ్యవసాయాన్ని అభివృద్ధి చేసే పనులను ఎందుకు చేపట్టలేకపోయారు?
జవాబు:
భూస్వాములు, రైతులు తమ పంటల మీద వచ్చే ఆదాయంలో అధిక శాతం శిస్తులు చెల్లించేవారు. కొంత వారి కుటుంబ జీవనానికి వాడుకునేవారు. ఇంక వ్యవసాయాన్ని అభివృద్ధి చేసే. పనులకు వారికి సొమ్ములెక్కడ ఉంటాయి. అందుకే వాటిని చేపట్టలేకపోయేవారు.

ప్రశ్న 23.
అమెరికాలో యుద్ధం వల్ల భారతదేశంలో ప్రత్తి ధరలు ఎందుకు పెరిగాయి?
జవాబు:
అమెరికా నుండి బ్రిటిష్ వారు ప్రతిని దిగుమతి చేసుకునేవారు. ఇది కారు చౌక రకం ప్రత్తి. అమెరికా అంతర్యుద్ధం వల్ల అక్కడి నుండి బ్రిటనకు ప్రత్తి లోటు ఏర్పడింది. అందువల్ల భారతదేశం నుండి ప్రత్తిని కొనుగోలు చేయటం మొదలు పెట్టారు. దానితో ప్రత్తికి గిరాకీ పెరిగి, ధరలు పెరిగాయి.

8th Class Social Textbook Page No.118

ప్రశ్న 24.
కౌలుదారులు ఉత్పత్తులను జమీందారులు ఏయే రూపాలలో కొల్లగొట్టేవారు?
జవాబు:

  1. జమీందారులు వాళ్ళ భూములలో రైతుల చేత బలవంతంగా ‘వెట్టి’ చేయించుకునేవారు.
  2. రకరకాల సాకులతో రైతుల నుంచి సాధ్యమైనంత డబ్బు వసూలు చేయటానికి జమీందారులు ప్రయత్నించారు.
  3. జమీందారు ఇంటికి నెయ్యి, పాలు, కూరగాయలు, బెల్లం, గడ్డి, పిడకలు వంటివి సరఫరా చేయాల్సివచ్చింది.

ఈ విధంగా కౌలుదారుల ఉత్పత్తులను శ్రమరూపంలోనూ, ధనరూపంలోనూ, వస్తురూపంలోనూ కొల్లగొట్టారు.

ప్రశ్న 25.
గ్రామ కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తిదారుల జీవితాల్లో వస్తున్న మార్పుల గురించి చర్చించండి.
జవాబు:
గ్రామ కళాకారులు పూర్వం ప్రజల ఆదరణ, రాజుల, జమీందారుల అండ పొందేవారు. కాని ఇప్పుడు చాలావరకు ఈ కళలు అడుగంటి పోయాయి. సంప్రదాయ చేతివృత్తిదారులు తమ వృత్తులలో సంప్రదాయంతో పాటు సాంకేతికతను కూడా జోడిస్తున్నారు. ప్రజలలో వీరి ఉత్పత్తులకు ఆదరణ ఉన్నా, ధరలు ఎక్కువవ్వడం మూలంగా అంత గిరాకీ ఉండటం లేదు. దాంతో వీరి జీవితాలు దుర్భరంగా ఉంటున్నాయి.

AP Board 8th Class Social Solutions Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు

ప్రశ్న 26.
రైతులు తమ భూములపై పెట్టుబడులు పెట్టటానికి ఎందుకు ఆసక్తి చూపేవారు కాదు?
జవాబు:
రైతులు ఎంత పండించినా అది శిస్తుల కిందే పోయేది. అందుకని కౌలుకు ఇవ్వడానికి ఆసక్తి చూపేవారు. వచ్చిన కౌలును అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తే వారికి జీవన వ్యయం ఉండదు. అందువలన వారు తమ భూములపై పెట్టుబడి పెట్టటానికి ఆసక్తి చూపేవారు కాదు. అంతేకాక వారు భూమిని అభివృద్ధిపరచిన వెంటనే జమీందారు కౌలును పెంచేస్తాడు లేదా దానిని వారి దగ్గర నుండి వెనుకకు లాక్కుంటాడు. భూమి మీద హక్కుల కోసం పోరాడతారని – జమీందారులు కూడా భయపడి అభివృద్ధి పనులు చేపట్టనిచ్చేవారు కారు.

8th Class Social Textbook Page No.119

ప్రశ్న 27.
నిజాం రాష్ట్రంలో శిస్తు వసూలు చేసేవాళ్ల పరిస్థితి ఎలా మారుతూ వచ్చింది?
జవాబు:
నిజాం రాష్ట్రంలో జాగీర్దారులు, సంస్థానాలు, ఇనాందారులు వంటి మధ్య స్థాయి పెత్తందారులు చాలామంది ఉండేవాళ్ళు. వీళ్ళ కింద ఉన్న ప్రాంతానికి వీళ్ళే స్వతంత్ర అధిపతులు. వీళ్ళు భూమిశిస్తు వసూలు చేసి అందులోంచి కొంత మొత్తం ‘పేష్ కష్’గా నిజాంకి చెల్లించి మిగిలిన సొమ్ము మొత్తం తాము ఉంచేసుకునేవాళ్ళు. తమ ప్రాంతాల పరిపాలనకు వాళ్ళే బాధ్యత వహించేవారు. ఈ పెద్ద భూస్వాములను దొరలని వ్యవహరించేవారు. వీళ్ళు ‘గడీ’లనే కోటల్లాంటి పెద్ద పెద్ద ఇళ్ళల్లో, పెద్ద సంఖ్యలో సేవకులు, సైనికులతో ఉండేవారు. గ్రామంలోని వడ్డీ వ్యాపారులు కూడా వీళ్ళే. గ్రామంలో తీర్పు వీళ్ళే చెప్పేవారు. అందరూ వీరి ఆదేశాలను పాటించాల్సివచ్చేది. ఆ విధంగా శిస్తు వసూలు చేసే వారి పరిస్థితి ఉన్నత స్థాయికి చేరింది.

ప్రశ్న 28.
దొరకు, మామూలు భూస్వామికి తేడా ఏమిటి?
జవాబు:
పెద్ద పెద్ద భూస్వాములను దొరలు అంటారు. వీరు గ్రామానికి పెద్ద దిక్కులు. అన్ని రకాల హంగులు, ఆర్భాటాలు వీరికి ఉండేవి. అయితే భూస్వాములు ఈ దొరల అధికారానికి లోబడి పని చేసేవారు. భూస్వాములు దొరల మాటని విని తీరవలసిందే. అదే వీరిద్దరికీ తేడా.

ప్రశ్న 29.
వివిధ దోపిడీలలో రైతాంగం ‘వెట్టి’ని తీవ్రంగా ద్వేషించేవాళ్లు. కారణాలు పేర్కొనండి.
జవాబు:
వలస పాలనలో భూస్వాములు వారి స్వంత భూములలో రైతాంగంతో బలవంతంగా డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకునే వాళ్లు. దీనినే వెట్టి అంటారు. రోడ్ల మీద వెళ్ళే వాళ్ళను కూడా బలవంతంగా తీసుకొచ్చి వెట్టి చేయించేవారు.

  1. దీనివల్ల వారు తమ పొలాల్లో సరిగా పని చేయలేరు.
  2. వారికి ఎటువంటి ఆదాయం ఉండదు.
  3. ఇది రాక్షసత్వ చర్య అని చెప్పుకోవచ్చు.
    ఇందువలన రైతులు దీనిని తీవ్రంగా వ్యతిరేకించేవారు.

ప్రాజెక్టులు

ప్రశ్న 1.
అయిదుగురు విద్యార్థులతో ఒక బృందంగా ఏర్పడండి. గ్రామంలో అయిదుగురు పెద్దవాళ్ళను ఇంటర్వ్యూ చేసి బ్రిటిషు కాలంలో పరిసితులు ఎలా ఉండేవో తెలుసుకోండి. వీరిలో కనీసం ఇద్దరు మహిళలు ఉండాలి. కనీసం ఒకరు చేతివృత్తులకు చెందిన వాళ్లే ఉండాలి. వాళ్ళతో సుదీర్ఘంగా మాట్లాడి, వాళ్ళు చెప్పిన దాని ఆధారంగా ఒక నివేదిక తయారుచేయండి.
జవాబు:
నివేదిక
బ్రిటిషువారు వారి స్వార్థం కోసం పనిచేసినా వారు భారతదేశంలో అభివృద్ధికి కారణమయ్యారు. కొంతమంది వారి పాలనను సమర్థించారు. కొంతమంది వ్యతిరేకించారు. భారతీయులు వీరి హయాంలో కొంతమంది అధికారాన్ని కొంత మంది హీనత్వాన్ని అనుభవించారు. మొత్తం మీద మనదేశంలో మనమే 2వ తరగతి పౌరులుగా చూడబడ్డాము. మహిళలకు విద్యావకాశాలు, స్వతంత్రత బ్రిటిషు వారి హయాంలో లభించాయి. బాల్య వివాహాల నిషేధం, వితంతు పునర్వివాహాలు మొదలగునవి వీరి వలనే వచ్చాయని చెప్పవచ్చు. కాని చేతివృత్తులు అడుగంటి పోయాయి. వీరి యంత్రాల పరిచయం, వాడకం భారతదేశంలో చేతివృత్తులను క్షీణింపచేశాయి. అవి ఇప్పటివరకూ కోలుకోలేదంటే అతిశయోక్తి కాదు అని చెప్పవచ్చును. మొత్తం మీద బ్రిటిషు వారి పాలన మనకు మిశ్రమ ఫలితాలను కలుగచేసింది.

ప్రశ్న 2.
మీ ప్రాంతంలో సంభవించిన కరవుల గురించి తెలుసుకోండి. ఆ సమయంలో ప్రజలు ఏం చేశారు?
జవాబు:
మాది గుంటూరు జిల్లాలో మంగళగిరి. బ్రిటిషువారి కాలంలో మా ఊరిలో 1832లో ఒక ‘భయంకరమైన తుపాను వచ్చిందట. 1833లో కరవు విలయతాండవం చేసిందట. ఒంగోలు నుండి మచిలీపట్నం వరకు శవాలు గుట్టలు గుట్టలుగా పడి ఉండేవట. గుంటూరు జిల్లా 5 లక్షల మంది జనాభాలో 2 లక్షల మంది మరణించారు. బ్రిటిషు ఈస్టిండియా కంపెనీవారు దీని తీవ్రతను గమనించకపోవడంతో మృతులు ఎక్కువయ్యారు. దీనిని పెద్ద కరవు, డొక్కల – కరవు అని పిలుస్తారు. 20 సంవత్సరాలకి గాని ఈ ప్రాంతంలో పరిస్థితి ఒక కొలిక్కి రాలేదట. ఈ సమయంలో ప్రజలు ఆకలి భరించలేక ఒకరినొకరు చంపుకున్నారని చెబుతారు. చాలా మంది ఇతర ప్రాంతాలకు వలసపోయారు.

AP Board 8th Class Social Solutions Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు

ప్రశ్న 3.
మీ ప్రాంతం నుండి కువైట్, సౌదీ అరేబియా వంటి దూరప్రాంతాలకు వలస వెళ్ళిన కుటుంబాల గురించి తెలుసుకోండి.
జవాబు:
మాది తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది పాలెం గ్రామం. ఇది సఖినేటిపల్లి మండలంలో ఉన్నది. ఒకప్పుడు మా ప్రాంతంలోని చారంతా పొలాలలో పనిచేసుకుని జీవనం సాగించేవారు. కాని వీరిలో చాలామంది కువైట్, సౌదీ అరేబియాకు వలస వెళ్ళిపోయారు. అక్కడ వారు ఇంటిపనులు, కర్మాగారాల్లో పనులు చేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. వాటితో ఇక్కడ ఆస్తులను సమకూర్చుకుంటున్నారు. నేడు మా ప్రాంతంలో అధిక సంపన్నులు కువైట్, సౌదీ వెళ్ళి సంపాదించుకున్న వారేనని చెప్పవచ్చును.