SCERT AP 8th Class Social Study Material Pdf 8th Lesson జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 8th Lesson జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం

8th Class Social Studies 8th Lesson జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
సాంకేతిక విజ్ఞానం అవసరం లేని పనులు అంటూ నరహరి కింద ఇచ్చిన జాబితా తయారుచేశాడు. మీరు అతడితో ఏకీభవిస్తారా ? ఏకీభవించకపోతే అతడు తప్పు అని నిరూపించండి. (AS1)
అ) పాటలు పాడటం
ఆ) ఇడ్లీలు చేయడం
ఇ) రంగస్థలం మీద నాటకం వేయడం
ఈ) అమ్మకానికి దండ తయారు చేయడం
జవాబు:
నేను నరహరితో ఏకీభవించను. అతడు చెప్పినది తప్పు అని నా భావన. ఏదైనా పని విధానం మెరుగుపరచుట లేదా ఏదైనా ఎలా చేయబడింది అనే జ్ఞానాన్ని రోజువారీ జీవితావసరాలకు ఉపయోగించుకుంటే అది సాంకేతిక విజ్ఞానం అవుతుంది. అది ఈ పని, ఆ పని అని లేదు. అన్ని పనులలోనూ ఉపయోగపడుతుంది.

ప్రశ్న 2.
నూలు మిల్లులు, మరమగ్గాలలో కార్మికుల పరిస్థితి ఎలా మారిందో వివరించండి. ఈ మార్పువల్ల కూలీలకు మేలు జరిగిందా లేదా యజమానులకా? మీ సమాధానానికి కారణాలు ఇవ్వండి.
జవాబు:
నూలు మిల్లులు పెద్దవిగా ఉండి, ఎక్కువ కార్మికులను కలిగి ఉంటాయి. కాబట్టి వీరికి సంఘాలు, హక్కులు, హక్కుల కోసం పోరాటాలు ఉంటాయి. మరమగ్గాలు చిన్నవిగా ఉండి, తక్కువ కార్మికులను కలిగి ఉంటాయి. కాబట్టి వీరికి సంఘం లాంటివి ఉండవు. వీరు యజమాని నిర్ణయానికి లోబడి పని చేయాలి. ఇచ్చిన కూలిపుచ్చుకోవాలి. నెల జీతాలుండవు. ఇతర సామాజిక భద్రతలుండవు. విద్యుత్ కోత సమయంలో వీరి జీతాలు లభించవు. కాబట్టి ఈ మార్పువల్ల యజమానులకే మేలు జరిగిందని చెప్పవచ్చు.

AP Board 8th Class Social Solutions Chapter 8 జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం

ప్రశ్న 3.
వరికోత యంత్రాలు వినియోగించటంలో ప్రయోజనాలు ఏమిటి? ఎవరికి ఎక్కువ ప్రయోజనం? వరికోత యంత్రాలను రైతులు ఎందుకు వినియోగిస్తున్నారు? (AS1)
(లేదా)
వరికోత యంత్రాన్ని ఇటీవల కాలంలో ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ యంత్రం వరిని కోస్తుంది. ధాన్యం నూర్పిడి చేస్తుంది. పోతపోసి గింజ – పొల్లును వేరు చేస్తుంది. ఈ యంత్రాన్ని వాడటం రైతులకు లాభమా? నష్టమా? వ్యాఖ్యానించండి.
జవాబు:
వరికోత యంత్రాలు వినియోగించటంలో ప్రయోజనాలు :

 1. ఇది సకాలంలో పంటను కోస్తుంది.
 2. ధాన్యం నూర్పిడి చేసి, పోత పోసి గింజ – పొల్లును వేరుచేస్తుంది.
 3. పంటకోత తక్కువ కాలంలో పూర్తవుతుంది.
 4. పంట వృథా అవ్వదు.
 5. పని ఒత్తిడి సమయంలో కూలీల కొరతను ఎదుర్కొనవచ్చు.
 6. వాతావరణ అనిశ్చితిని ఎదుర్కొనవచ్చు.
 7. దీనిని అద్దెకు ఇచ్చి ఆదాయాన్ని పొందవచ్చు.
 8. దీని వినియోగం ఎక్కువగా పెద్ద రైతులకు ప్రయోజనం.
 9. దీనికున్న అధిక ప్రయోజనాల వలన రైతులు వీటినుపయోగిస్తున్నారు.

ప్రశ్న 4.
సాంకేతిక విజ్ఞానంలో మార్పుల వల్ల ఉపాధి అవకాశాల్లో మార్పులు వస్తాయి. ఈ వాక్యంతో మీరు ఏకీభవిస్తారా? ఎందుకు? (AS4)
(లేదా)
సాంకేతిక విజ్ఞాన ప్రభావం వల్ల జీవనోపాధులలో వస్తున్న మార్పులను కొన్నింటిని పేర్కొనండి.
జవాబు:
ఈ వాక్యంతో నేను ఏకీభవిస్తున్నాను.

కారణం :
సాంకేతిక విజ్ఞానం, కొత్త నైపుణ్యాలు వీటి వలన కొత్త ఉద్యోగాలు పెరుగుతాయి. ఉదా : అనేక మొబైల్, ల్యాండ్ లైన్ కంపెనీలు భారతదేశంలో నెలకొల్పబడుతున్నాయి. ఈ కంపెనీలు అనేక దేశాలకు వీటిని ఎగుమతి చేస్తున్నాయి. బహుళజాతి కంపెనీలలో మొబైల్ ఫోనుల తయారీలు, టెలిఫోన్ బూతులలో, మొబైల్ ఫోనుల అమ్మకాలు, మరమ్మతులలో, రీచార్జ్ / టాప్-అప్ సేవలలో యువతకు కొత్త ఉపాధులు ఏర్పడ్డాయి.

ప్రశ్న 5.
టెలిఫోనులో సాంకేతిక విజ్ఞానం మారిందని ప్రభావతి భావిస్తోంది. కొత్త ఉద్యోగాలు చదువుకున్న వాళ్లకే వస్తాయని ఆమె అభిప్రాయం. భారతదేశంలో నిరక్షరాస్యులు ఎక్కువమంది ఉన్నారని, ఆధునిక సాంకేతిక జ్ఞానం చదువుకున్నవాళ్లకే ఎక్కువ ప్రయోజనకరంగా ఉందని ఆమె అంటుంది. మీరు ఆమెతో ఏకీభవిస్తారా? మీ కారణాలను పేర్కొనండి. (AS4)
జవాబు:
నేను ప్రభావతితో ఏకీభవించను. ప్రభావతి చెప్పినట్లుగా సాంకేతిక విజ్ఞానం మారింది. కానీ అది అందరికీ ఉపయోగ పడుతోంది.
ఉదా :

 1. ఇదివరకు సముద్రంలోకి చేపలు పట్టడానికి వెళ్ళినవాళ్ళు తిరిగి వస్తే కాని వారి వివరాలు యింట్లో వాళ్ళకి – తెలిసేవి కావు. కాని సెల్ ఫోన్లు వచ్చాక, వారు కూడా ఎప్పటికప్పుడు ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నారు.
  రిక్షా తొక్కేవాళ్ళకి చాలామందికి అంతంత మాత్రం చదువులే. వారు కూడా ఫోనులు ఉపయోగిస్తున్నారు.

కొద్దిపాటి చదువుతో చాలామంది ఫోను మెకానిక్ లుగా పనిచేస్తున్నారు. కొన్ని పనులకు, సాంకేతిక విజ్ఞానానికి, చదువు కన్నా ఎక్కువ నిపుణత అవసరం అని నా అభిప్రాయం.

ప్రశ్న 6.
ఈ అధ్యాయంలో మూడు రంగాలలో వచ్చిన మార్పులను చర్చించాం. కింది పట్టికలో ప్రతి ఒక్కదానికి పుస్తకంలో ఇచ్చింది కాకుండా ఒక కొత్త ఉదాహరణను పేర్కొనండి. (AS3)
AP Board 8th Class Social Solutions Chapter 8 జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం 1
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 8 జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం 2

ప్రశ్న 7.
కొత్త నైపుణ్యాలు, కొత్త ఉద్యోగాలు అనే పేరాను చదివి కింది ప్రశ్నకు జవాబు ఇవ్వండి. మీ ప్రాంతంలో యువతకు కొత్తగా సృష్టించబడిన ఉద్యోగాలు ఏవి? (AS2)
జవాబు:
బహుళజాతి కంపెనీలలో ఉద్యోగాలు, టెలిఫోన్ బూత్ లలో ఆపరేటర్లు, మొబైల్ ఫోన్ల అమ్మకందారులు, మరమ్మతుదారులు, రీచార్జ్ / టాప్-అప్ చేయువారు మొదలైన కొత్త ఉద్యోగాలు ఏర్పడ్డాయి.

ప్రశ్న 8.
ప్రపంచ పటంలో కింది వాటిని గుర్తించండి. (AS5)
ఎ) ఇంగ్లండ్ బి) అమెరికా సి) ఇండియా
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 8 జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం 3

ప్రశ్న 9.
అడవులు, అడవుల చుట్టుప్రక్కల నివసించేవారు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించలేని స్థితిలో ఉంటారు. అలాంటి వారి మెరుగైన జీవనానికి మీరిచ్చే సలహాలు ఏమిటి? (AS6)
జవాబు:
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడమే మెరుగైన జీవితం అని భావించరాదు అని నా అభిప్రాయం. అడవులలోను, అడవుల చుట్టుప్రక్కల నివసించేవారు ప్రకృతి ఒడిలో జీవిస్తారు. వీరంతా ఒక గుంపుగా జీవిస్తారు. సాధారణంగా వీరి సంబంధీకులు అంతా ఒక సమూహంలోనే జీవిస్తారు. కాబట్టి వీరికి ఫోనులాంటి సౌకర్యాలు ఎక్కువ అవసరం ఉండక పోవచ్చు. అలాగే వీరికి పెద్దపెద్ద యంత్రాలతో కూడా పని ఉండకపోవచ్చు. అయితే వీరికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వమే అందించాలి. మెరుగైన వసతులను కల్పించాలి. తద్వారా వీరికి మెరుగైన జీవనం లభిస్తుంది.

8th Class Social Studies 8th Lesson జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం InText Questions and Answers

8th Class Social Textbook Page No.90

ప్రశ్న 1.
ఈ పారిశ్రామిక విప్లవానికి దోహదం చేసిన వాళ్ళు ఎవరు?
జవాబు:

ఆవిష్కరణలు ఆవిష్కరించినవారు
1. స్పిన్నింగ్ జెన్నీ జేమ్స్ హార్ గ్రీవ్స్
2. స్టీమ్ యింజన్ జేమ్స్ వాట్
3. ఉక్కు తయారీ హెన్రీ బెస్మర్
4. టెలిగ్రాఫ్ సామ్యూల్ ఎఫ్.బి. మోర్స్
5. టెలిఫోన్ అలెగ్జాండర్ గ్రాహంబెల్
6. విద్యుత్తు, బల్బు థామస్ ఆల్వా ఎడిసన్

మొదలైనవి వీరందరూ ఈ ఆవిష్కరణలను ప్రపంచానికందించి పారిశ్రామిక విప్లవానికి దోహదం చేశారు.

8th Class Social Textbook Page No.91

ప్రశ్న 2.
మొదటి ఆవిరి యంత్రం ఆవిర్భావం గురించి తెలుసుకోండి. భారతదేశంలో రైల్వేమార్గాల నిర్మాణానికి ఇది ఎలా దారి తీసింది?
జవాబు:
జేమ్స్ వాట్ జన్మించే నాటికి ‘ఆవిరియంత్రం’ నాటి ఇంగ్లండ్ బొగ్గుగనుల్లో నీటిని బయటికి తోడడానికి ఉపయోగించేవారు. అంతకన్నా ముందే పురాతన గ్రీసు దేశస్థులు పాత నమూనా ఆవిరి యంత్రాలను ఉపయోగించేవారు. ఇప్పుడున్న ఆవిరి యంత్రం నమూనాను మొట్టమొదటగా జేమ్స్ వాట్ తయారుచేశారు. ఇది భారతదేశ రైల్వేలో చెప్పుకోదగిన ప్రగతిని చూపించింది. 1850 నాటికి భారతదేశంలో రైలుమార్గాలు లేవు. అప్పటికి బ్రిటిషు వారు మనదేశంలో వలసలు స్థాపించి సుమారు 100 సం||లు అయింది. వారికి రవాణా సౌకర్యాలు అవసరమయ్యాయి. ఈ ఆవిరియంత్రాన్ని ఉపయోగించి రైలుబండ్లను, రైలుమార్గాలను ప్రారంభించారు. 1853లో మొట్టమొదటి రైలుబండిని బాంబే నుండి రానాకు నడిపించారు. అప్పటి నుండి భారతదేశం దగ్గరయ్యింది.

AP Board 8th Class Social Solutions Chapter 8 జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం

ప్రశ్న 3.
మీ చుట్టుప్రక్కల జీవితాలను కంప్యూటర్లు ఎలా మార్చివేశాయి?
జవాబు:
కంప్యూటర్లు మన జీవితాన్ని చాలా రకాలుగా మార్చివేశాయి. పిల్లలు పాటలు వినటం దగ్గర నుండి, పెద్దల బ్యాంకు వ్యవహారాలు, రిజర్వేషన్లు ఇవీ, అవీ అనికాక అన్నింటికీ వీటి మీదే ఆధారపడుతున్నారు. చివరికి షాపింగ్ కు కూడా బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీటింగ్లు, టెలీకాన్ఫరెన్లు కూడా వీటి ద్వారానే నడుస్తున్నాయి.

ప్రశ్న 4.
వినోదాన్ని సాంకేతిక విజ్ఞానం మార్చివేసిందా? ఎలా?
జవాబు:
వినోదాన్ని సాంకేతిక విజ్ఞానం మార్చివేసింది. ఇది ఎలా మారిందో తెలుసుకోవాలంటే టి.వి.ని ఉదాహరణగా తీసుకోవచ్చు. వీటిలో ఎన్ని ఛానెల్స్ వచ్చేవి వస్తున్నాయి, కథలు, కథాగమనం, సమాజానికి అందించే నీతి ఇవన్నీ కూడా చాలా మారాయి.

 1. ఒకప్పుడు చదరంగం, గుర్రపు పందాలు మొదలైనవి వినోదాలుగా ఉండేవి.
 2. సాంకేతిక విజ్ఞానం మూలంగా వినోదం ఇంతకు ముందుకన్నా మంచి భూమిక పోషిస్తోంది.
 3. అనేక పద్ధతుల ద్వారా వినోదం అందించబడుతోంది.
 4. అడ్వయిజర్లు వారి నూతన సృష్టితో కొత్త పుంతలు తొక్కుతున్నారు.
 5. చిత్రాలు కూడా మొదట చిన్న చిన్న ప్రదర్శనలుగా చూపిస్తున్నారు.
 6. పాటలు కూడా రాగాల రూపంలో ప్రజలకి అందిస్తున్నారు. మ్యూజిక్ హాళ్ళు రకరకాల ఆటపాటలకి, పోటీలకు నిలయాలవుతున్నాయి.

ఈ విధంగా వినోదాన్ని సాంకేతిక విజ్ఞానం మార్చివేసిందని చెప్పవచ్చు.

ప్రశ్న 5.
మీ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో, పట్టణాల్లో, నగరాల్లో సౌరశక్తిని దేనికైనా వినియోగించటం మీరు చూశారా? వాటి జాబితా తయారుచేయండి. ఈ ఇంధనాన్ని ఇంకా ఎక్కువగా ఎందుకు వినియోగించుకోవటం లేదు? చర్చించండి.
జవాబు:
మాది విజయవాడ నగరం. మేము పటమటలోని సాయి అపార్టుమెంట్ లో నివసిస్తున్నాము. మా అపార్టుమెంట్ లో వేడినీరు కోసం సౌరశక్తిని వినియోగిస్తున్నారు. మా అపార్ట్ మెంట్ పై భాగాన సగం మేర సోలార్ ప్యానల్స్ ఉన్నాయి. ఉదయం నుండి సాయంత్రం రాత్రి వరకు వేడి నీరు వస్తూనే ఉంటాయి. కాని వేడి నీరు రావటానికి ముందు కొంతనీరు వృథా చేయాల్సి వస్తుంది. ఇంకా ఈ కింది వస్తువులను మా ఇరుగుపొరుగు వాడతారు.

 1. సోలార్ హీటర్లు.
 2. సోలార్ లాంతర్లు
 3. సోలార్ కుక్కర్లు
 4. సోలార్ పొయ్యిలు
 5. సోలార్ బ్యాటరీలు, ఇన్వర్టర్లు

కాని ఈ ఇంధనాన్ని అందరూ వినియోగించుకోవడం లేదు. ఇందుకు కారణాలు.

 1. దీనికి ప్రారంభ వ్యయం ఎక్కువ.
 2. సౌరశక్తి సంవత్సరం పొడుగునా ఒకే విధంగా ఉండకపోవడం.
 3. కొంతమందికి సోలార్ ప్యానలను అమర్చటం అనేది నచ్చకపోవటం
 4. పగటి పూటే ఉపయోగించాల్సి రావడం.
 5. మబ్బుగా ఉన్నప్పుడు తక్కువ సౌరశక్తి ఉండటం మొదలగునవి.

8th Class Social Textbook Page No.94

ప్రశ్న 6.
వ్యవసాయ ఉత్పత్తిలో వరికోత యంత్రాన్ని ఉపయోగించటం వల్ల లాభాలు ఏమిటి ? పైన పేర్కొన్న దానినుంచి ఒక జాబితా తయారుచేయండి.
జవాబు:
వ్యవసాయ ఉత్పత్తిలో వరికోత యంత్రాన్ని ఉపయోగించటం వల్ల లాభాలు :

 1. దీనిని ఉపయోగించడం వలన సకాలంలో వరిని కోయవచ్చు. ధాన్యం సూర్చవచ్చు, పోతపోసి గింజ పొల్లును వేరు చేయవచ్చును.
 2. వరికోతకు తక్కువ సమయం పడుతుంది.
 3. పంట నష్టం కాదు. దీనినుపయోగించి కోయడం వలన ఎకరాకు ఒక క్వింటాలు ధాన్యం అదనంగా వస్తుంది.
 4. రైతులు పని వత్తిడి సమయంలో కూలీల కొరతను ఎదుర్కోగలుగుతారు.
 5. తీరప్రాంతాలలో ఇది వాతావరణ అనిశ్చితిని ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది.
 6. దీనివల్ల రైతులు రెండవ పంటను నాట గలుగుతున్నారు.
 7. కూలీల మీద ఆధారపడటం కూడా తగ్గుతుంది.

AP Board 8th Class Social Solutions Chapter 8 జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం

ప్రశ్న 7.
వరికోత యంత్రాన్ని ఉపయోగించటం వల్ల వ్యవసాయ కూలీలు కోల్పోయే పనులను రాయండి.
జవాబు:
వరికోత యంత్రాన్ని ఉపయోగించటం వల్ల వ్యవసాయ కూలీలు వరికోత, ధాన్యం నూర్పిడి, పోతపోసే పనులను కోల్పోతున్నారు.

ప్రశ్న 8.
భారతదేశంలో చాలామంది పేద వ్యవసాయ కూలీలు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగం తీవ్రంగా ఉంది. , ఇటువంటి పరిస్థితులలో వరికోత యంత్రాన్ని వినియోగించడం సరియైనదేనా?
జవాబు:
ఈ సమస్య గురించి మనం రెండు కోణాలలో ఆలోచించవచ్చు.

 1. గ్రామీణ నిరుద్యోగం, వ్యవసాయంపై ఆధారపడ్డ పేద కూలీలు అధికంగా ఉండటం మొదలైన అంశాలను బట్టి చూస్తే ఇది సరియైనది కాదని చెప్పవచ్చు. వీరికి జీవనోపాధి లేకుండాపోతుంది. తిండి దొరకటమే కష్టమైపోతుంది.
 2. భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే వీటి వినియోగం సమంజసమే. అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యవసాయం ఎక్కువగా యంత్రాల ద్వారానే జరుగుతుంది. దాని ద్వారా మిగిలిపోయిన మానవ వనరులను ఇతర రంగాలలో ఉపయోగించుకుని వారికి ఉపాధి కల్పించవచ్చు. దీని ద్వారా దేశప్రగతి ముందుకు సాగుతుంది.

ప్రశ్న 9.
మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పనులు కల్పించవచ్చన్న వాదన ఉంది. కూలీలు అవసరమయ్యే పథకాల ద్వారా లింకురోడ్లు, చెరువులు, కట్టలు వంటి నిర్మాణాత్మక క్రియల ద్వారా పని కల్పించవచ్చు. మీరు గ్రామీణ ప్రాంతంలో ఉంటున్నట్లయితే ఇటువంటి పనులు ఏమైనా జరుగుతున్నాయేమో తెలుసుకోండి. అక్కడి ప్రజల జీవనోపాధికి సరిపోతాయేమో తెలుసుకోండి. Page No. 94)
జవాబు:
కొద్దికాలం క్రితం అప్పటి ప్రభుత్వం ‘పనికి ఆహార పథకం’ను ప్రారంభించి, అమలు చేసింది. ఆ పథకంలో ఇటువంటి పనులే మా గ్రామంలో జరిగాయి. వేసవికాలంలో చెరువులు పూడిక తీయించేవారు. ఆ మట్టిని రోడ్లపై వేసి, పైన క్వారీ డస్టు పోసేవారు. ఆవిధంగా రెండు రకాల పనులు జరిగేవి. రోడ్డు ప్రక్క కాలువలు తవ్వించడం మొ||వి చేసేవారు. ఆ పనికి డబ్బులు కాక బియ్యంను కూలీగా ఇచ్చేవారు. అయితే ఒక్క బియ్యంతో వారికి జీవనం గడవటం కష్టమయ్యేది. వచ్చిన బియ్యంలో కొంత భాగాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకోవలసి వచ్చేది. దీని మూలంగా ఈ పథకం ప్రక్కత్రోవ పట్టింది. అయితే ఈ పథకం ప్రజలకు కొంతవరకు జీవనోపాధిని అందించింది. పొలం పనులు లేని రోజులలో ఇవి ‘వీరికి ఉపయోగపడతాయి.

ప్రశ్న 10.
అనేక గ్రామాలలో వ్యవసాయ కూలీలు, ప్రత్యేకించి మహిళా కూలీలు వరికోత యంత్రం వినియోగంతో ఆందోళన చెందుతున్నారు. ఎందుకు?
జవాబు:
వరికోత యంత్రం వినియోగంతో వ్యవసాయ కూలీలకు పనులు తగ్గి, ఆదాయం తగ్గిపోతుంది. అందువలన వీరు ఆందోళన చెందుతున్నారు.

ప్రత్యేకించి మహిళా కూలీలకు :
మహిళలు ఎక్కువగా ఇంత పెద్ద యంత్రాల దగ్గర పనిచేయలేరు. ముఖ్యంగా ఈ యంత్రం చేసే పనులు ఎక్కువగా మహిళలే చేస్తారు. యంత్రాలుంటే వీరికి అసలు పనులు ఉండవు. కాబట్టి మహిళా కూలీలు ఎక్కువ ఆందోళన చెందుతున్నారు.

8th Class Social Textbook Page No.96

ప్రశ్న 11.
ఈ కింది పట్టికను పరిశీలించి, కింది ప్రశ్నలకు జవాబులిమ్ము.

చేనేత యూనిట్లలో మార్పు
రాష్టం 1988 2009
ఆంధ్రప్రదేశ్ 5,29,000 1,24,700
గుజరాత్ 24,000 3,900
కర్నాటక 1,03,000 40,500
మహారాష్ట్ర 80,000 4,500
మధ్య ప్రదేశ్ 43,000 3,600
పంజాబ్ 22,000 300
తమిళనాడు 5,56,000 1,55,000

1. ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన మార్పు ఏమిటి?
జవాబు:
చేనేత యూనిట్లు తగ్గాయి.

2. అన్ని రాష్ట్రాలలోకి ఎక్కువ ఏ రాష్ట్రంలో తగ్గాయి?
జవాబు:
పంజాబ్ రాష్ట్రంలో ఎక్కువ తగ్గాయి.

3. అన్ని రాష్ట్రాలలోకి ఏ రాష్ట్రాలు 2009 నాటికి కూడా అధికంగా ఉన్నాయి?
జవాబు:
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు.

4. దక్షిణ భారతదేశంలో ఎక్కువ మార్పులు చోటుచేసుకున్నాయా? ఉత్తర భారతదేశంలోనా?
జవాబు:
ఉత్తర భారతదేశంలో ఎక్కువ మార్పులు చోటు చేసుకున్నాయి.

5. ఈ పట్టిక ఏ యూనిట్లకు సంబంధించినది?
జవాబు:
చేనేత యూనిట్లకు సంబంధించినది.

8th Class Social Textbook Page No.97

ప్రశ్న 12.
క్రింది ఖాళీలను పూరించండి.
a) 1988లో …………… రాష్ట్రంలో చేనేత మగ్గాలు అత్యధికంగా ఉన్నాయి, 2009 ……….., ……….. రాష్ట్రాలలో ఇవి ఎక్కువగా ఉన్నాయి. 2009లో అతి తక్కువ చేనేత మగ్గాలు ఉన్న రాష్ట్రం ఏది? b) మిల్లు కార్మికులకు నెల జీతం ఇస్తే, కార్మికులకు …………. బట్టి కూలీ చెల్లిస్తున్నారు.
c) వస్త్ర ఉత్పత్తిని నాలుగు ప్రధాన వర్గాలుగా విభజించారు, మిల్లు, చేనేత, ………………, ………………
జవాబు:
a) తమిళనాడు, తమిళనాడు, పంజాబ్
b) మర మగ్గాలలో ఉత్పత్తి చేసిన బట్టను
c) బనీన్లు, మర మగ్గాలు

8th Class Social Textbook Page No.99

ప్రశ్న 13.
ప్రస్తుత రేట్లు ఎలా ఉన్నాయో కనుక్కోండి. ఒక కంపెనీకి మరో కంపెనీకి రేట్లలో తేడాలు ఎందుకున్నాయో, అవి ఎందుకు తగ్గుతున్నాయో తెలుసుకోండి.
జవాబు:
ప్రస్తుత రేట్లు చాలా తక్కువ ఉన్నాయి. ఉదా : లోకల్ కాల్స్ కి 30 పైసలు, ఎస్.టి.డి. కాల్స్ కి 50 పైసలు నిమిషానికి ఉన్నాయి. ఇంకా కొన్ని ఫోన్లు కొన్ని నంబర్లకు ఉచిత ఆఫర్లు కూడా ఇస్తున్నాయి. అయితే ప్రతి కంపెనీ తన కస్టమర్లను పెంచుకునే ఉద్దేశ్యంతో పోటీల మీద రేట్లు తగ్గిస్తున్నారు. అందుకే రేట్లలో తేడాలు వస్తున్నాయి.

ప్రాజెక్టు

శ్రీపురం అనే గ్రామంలో మల్లయ్య ఒక రైతు. ఆ గ్రామంలో 100 ఇళ్లు ఉన్నాయి. ప్రస్తుతం నాటటం, కలుపుతీయటం, పంటకోయటం, రసాయనిక ఎరువులు వేయటం, పురుగుమందులు చల్లటం వంటి అన్ని పనులు యంత్రాలతో జరుగుతున్నాయి. గతంలో ఈ పనులన్నింటినీ మన్గుషులు చేసేవారు. ఆ గ్రామంలో 33 ట్రాక్టర్లు, 15 వరికోత యంత్రాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని అదె (బాదుగుకు ఇస్తారు. పొలం దున్నటానికి ట్రాక్టరు యజమానులు గంటకు 300 రూపాయలు తీసుకుంటున్నారు. తమ పొలాల్లో ఈ యంత్రాలను ఉపయోగించే వాళ్ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ సమాచారం ఆధారంగా చిత్రాలతో, గ్రామంలోని వివిధ వర్గాల మధ్య జరిగే చర్చలతో ఒక గోడ పత్రిక తయారుచేయండి.
జవాబు:
గోడ పత్రిక

ధనిక వర్గం మధ్య జరిగే చర్చ :
మల్లయ్య : శేషయ్యా ! మనం ఇలా విడివిడిగా ఎవరికి వారుగా కాక అందరం కలిసి ఈ యంత్రాలను ఉపయోగిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.

రాజయ్య : అందరం కలిసి యంత్రాలను ఎలా ఉపయోగించగలం? ఇవి వ్యక్తిగతమైనవి కదా !

శేషయ్య : మల్లయ్య చెప్పిన అంశం బాగానే ఉంది. కానీ దీనికి తగిన మార్గమే ఆలోచించాలి.

రాంబాబు : మనం వీటిని విడివిడిగా అద్దెకు ఇవ్వడం మూలంగా అద్దె రేట్లలో తేడాలు వస్తున్నాయి. ఖాళీగా ఉంటే మనకే నష్టం వస్తోంది. అందుకే వీటిని మనం ఉపయోగించుకోవడమే కాక అందరూ ఉపయోగించేలా చూడాలి.

వీరాస్వామి : నేనొక మంచి ఆలోచన చెబుతాను. మనం అందరం కలిసి ఒక సంఘం కింద ఏర్పడి వీటిని బాడుగకు ఇద్దాము. వచ్చిన లాభాన్ని అందరం సమానంగా పంచుకోవచ్చు. రేట్లలో తేడాలుండవు. అద్దె నష్టం ఉండదు. ఏమంటారు. మిగిలిన వారందరూ ; భేషుగ్గా ఉంది నీ ఆలోచన వీరాస్వామి ! మంచిది అలాగే చేద్దాం ! పదండి. రేపు లాయర్ని కలిసి మన సంఘం వివరాలు చెప్పి రిజిస్టరు చేయించుకుందాం !

మధ్యతరగతి వర్గం:

సుబ్బయ్య : ఓ చింతయ్యా ! ఇది విన్నావా ! మన ఊళ్ళో ఆసాములంతా ఒక సంఘం కింద ఏర్పడుతున్నారుట. ఇక మనం ట్రాక్టరుగాని, వరికోత యంత్రంగాని తెచ్చుకోవాలంటే అక్కడి నుండేనట.

చింతయ్య : అయ్యో ! ఇంతవరకు మా నాయన మీద ఉండే అభిమానం కొద్దీ మల్లయ్య నాకు నామమాత్రపు అద్దెకే వరికోత యంత్రం ఇచ్చేవాడు. ఇపుడు ఇక ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుందో?

ప్రసాదు : నిజమేగా ఇక బాడుగ రేటు సంఘం ఎంత చెప్తే అంతే ఇవ్వాలిగా ! మన మొహమాటాలు ఇక ఉండవు. ఇప్పటికే ట్రాక్టరుకు గంటకు రూ. 300 తీసుకుంటున్నారు. ఇక అది ఎంతకు పెరుగుతుందో.

రామయ్య : ఎందుకురా ! అంత కంగారు పడతారు. వాళ్ళు మనని దాటి ఎక్కడికి వెళతారు. మన స్థాయిని బట్టే వాటి. అద్దెని నిర్ణయిస్తారు. లేదంటే వాళ్ళకే లాభాలుండవు.

మిగిలిన
వారందరూ : అమ్మయ్య ! అంతేనంటావా ! అంతేలే మంచి మాట చెప్పి మా భారం దించావు సుమీ !

పేదవర్గం మధ్య చర్చ :
శిఖామణి : ఏరా ! సామిదాసూ ! మీ దొర మల్లయ్య గారు, అందరూ కలిసి అదేదో సంఘం పెడుతున్నారంటగా ! నిజమేనా !

సామిదాసు : మా దొర, మీ దొర ఏందిరా? అందరూ పెద్దాళ్ళు కలిసే ఈ పనిసేత్తున్నారు. విడివిడిగా ఉండటం వలన వాళ్ళు అద్దెలు నట్టపోతున్నారంట. అందుకే కలిసి సంఘం పెడుతున్నారంట.

పుల్లయ్య : అయితే మన సంగతి ఏంటంట. మన పనులు పోయినట్టేనా? వాళ్ళందరూ కలిసి ఒకమాట మీదుంటే మనకి కూలీ గిడుతుందా అంటా? ఇప్పటికే ఇవన్నీ వచ్చాక మనకు పని తగ్గిపోయింది.

రామారావు : అదేం లేదులే బాబాయి ! ఎన్ని యంత్రాలున్నా వాటిని పని చేయించేవాళ్ళు మనుషులేగా, ఇప్పుడున్న పనులన్నీ అలాగే ఉంటాయి. వాళ్ళు వాళ్ళ లాభాలకోసం చూసుకుంటున్నారు అంతే!

పేరయ్య (రాజకీయ నాయకుడు): మనం కూడా ఒక సంఘర్ కింద ఏర్పడదాం.! కూలి ఇంతకన్నా తక్కువైతే కుదరదు అని చెబుదాం.

రామారావు : నువ్వు ఊరుకోవయ్యా ! కూలోళ్ళకేమన్నా కరువా ఏంటి, రేట్లు నిర్ణయించడానికి, మనం కూడా వ్యవసాయం మీదే ఆధారపడకుండా ఇతర పనులను నేర్చుకుని చేసేలా చూసుకోవాలి. అప్పుడే ఈ సమస్య నుండి గట్టెక్కగలం.

మిగిలిన వారందరూ : అంతేరా రామూ ! నువ్వే ఏదో ఆలోచించి దీనికి పరిష్కారం చూడయ్యా ! పదం మళ్ళీ రేపు కలుద్దాం!