SCERT AP 8th Class Social Study Material Pdf 12th Lesson భారత ఎన్నికల వ్యవస్థ Textbook Questions and Answers.
AP State Syllabus 8th Class Social Solutions 12th Lesson భారత ఎన్నికల వ్యవస్థ
8th Class Social Studies 12th Lesson భారత ఎన్నికల వ్యవస్థ Textbook Questions and Answers
Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)
ప్రశ్న 1.
ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం యొక్క ఆవశ్యకతను వివరించండి. (AS1)
జవాబు:
ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం యొక్క ఆవశ్యకత :
- ప్రజాస్వామ్యంలో అత్యున్నత అధికారం ప్రజలదే, నిర్ణయాలు తీసుకోవాల్సింది ప్రజలే.
- భారతదేశంలాంటి సువిశాలమైన దేశంలో కోట్లాది మంది పౌరులు తమ అధికారాన్ని వినియోగించుకోవాలంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో సాధ్యమవుతుంది.
- అలాగే ప్రజలందరూ సమావేశం కావడం, చర్చించడం, నిర్ణయాలు తీసుకోవడం జనాభా అత్యధికంగా ఉన్న దేశాలలో సాధ్యపడదు. అలాంటి చోట ప్రాతినిధ్య ప్రజాస్వామ్య పద్ధతి ఉత్తమ పద్ధతి.
- పాలనా నిర్ణయాలు తీసుకోవడంలో, ప్రజా సంక్షేమ విధానాల రూపకల్పనలో ప్రజల తరఫున ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు.
- ఆధునిక ప్రజాస్వామ్యాలన్నీ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాలే.
ప్రశ్న 2.
“ప్రజాస్వామ్యానికి ఎన్నికల వ్యవస్థ ఆధారభూతం” – ఈ వ్యాఖ్యతో మీరు ఏకీభవిస్తారా ? వివరించండి. (AS2)
జవాబు:
ప్రజాస్వామ్యానికి ఎన్నికల వ్యవస్థ ఆధారభూతం అనే ఈ వ్యాఖ్యతో నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే
- పరిపాలన నిర్వహణ కోసం ప్రజలు తమ ప్రతినిధులను ఎంపిక చేసుకోవాలంటే స్వతంత్రమైన, న్యాయమైన ఎన్నికల వ్యవస్థ అవసరం.
- నిష్పక్షపాతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగినపుడే ప్రజాస్వామ్యం వికసిస్తుంది. అలాంటి వాతావరణంను ఎన్నికల వ్యవస్థ కల్పిస్తుంది. అలాగే నిర్ణీత కాల వ్యవధులలో ఎన్నికలు నిర్వహిస్తుంది.
- ప్రజాస్వామ్యం అంటే పాలనలో ప్రజల భాగస్వామ్యం. అలా ప్రజలందరిని ఎన్నికలలో భాగస్వామ్యం అయ్యేలా చూసేది ఎన్నికల వ్యవస్థ.
ప్రశ్న 3.
ఎన్నికల సంఘం విధులను వివరించండి. (AS1)
జవాబు:
రాజ్యాంగంలోని 15వ భాగంలోని 324వ నిబంధన ఎన్నికల సంఘం నిర్మాణం, విధుల గురించి వివరిస్తుంది.
ఎన్నికల సంఘం విధులు :
- నియోజకవర్గాల భౌగోళిక పరిధిని నిర్ణయించడం.
- ఓటర్ల జాబితాలను రూపొందించడం.
- ప్రతి సాధారణ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాలలో అవసరమైన సవరణలు చేయడం.
- నిర్ణీత కాలవ్యవధిననుసరించి ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం.
- ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా నిర్వహించుటకు అవసరమైన నియమావళిని రూపొందించడం.
- వివిధ రాజకీయ పార్టీలకు గుర్తింపునివ్వడం, గుర్తులు కేటాయించడం.
పోలింగ్ తేదీలను, ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడం, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన చేయడం. - దేశవ్యాప్తంగా ఎన్నికల యంత్రాంగాన్ని నియమించడం.
- ఎన్నికలలో జరిగే అక్రమాల పరిశీలనకు విచారణా అధికారులను నియమించడం
ప్రశ్న 4.
ఓటుహక్కు ప్రాధాన్యతను తెలుపుతూ ఒక కరపత్రం తయారుచేయండి. (AS6)
జవాబు:
కరపత్రం
భారతదేశంలో 18 సం||రాలు నిండిన ప్రతి ఒక్కరు కుల, మత, వర్గ, లింగ వివక్షత లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.
మార్పుకు ఓటుహక్కు నాంది. భారతదేశంలో ప్రభుత్వాన్ని సరిగా నడపలేని రాజకీయ నాయకత్వాన్ని దేశ ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా మార్చేస్తారు. ఎన్నికలలో ప్రతి ఒక్క ఓటు ముఖ్యమైనదే. ఎవరైనా తమ ఓటు హక్కును సరిగా వినియోగించుకోకపోతే తర్వాత రాబోయే ఐదు సంవత్సరాలు దాని ఫలితం అనుభవించాల్సి ఉంటుంది. చివరగా బాధితులు ఓటర్లే అవుతారు.
ప్రతి పౌరుడు తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచే అవకాశాన్ని ఓటు కల్పిస్తుంది. మన దేశం లాంటి పెద్ద, వైవిధ్యం ఉన్న దాంట్లో భిన్న మతాలు, భిన్న ప్రాముఖ్యతలను కలిగి ఉన్నాయి.
ఓటు హక్కు మాత్రమే కాక ఒక బాధ్యత కూడా. అది పౌరులకివ్వబడిన ఒక అరుదైన గౌరవం. ఈ హక్కుని ఉపయోగించుకుని, పౌరులు, దేశ చరిత్రలు వారి గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.
గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశం లంచగొండితనం, అనిశ్చిత ఆర్థికరంగం, అనిర్దిష్ట విదేశీ విధానాలు మొదలైన వాటితో పోరాటం సలుపుతోంది. ఒక్కో ఎన్నిక మంచి ప్రభుత్వాలకు బదులు అసమర్థ ప్రభుత్వాలను అధికారంలోనికి తెస్తే మంచికి బదులు చెడు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోవడం పౌరులుగా మన కర్తవ్యం. మంచి ప్రభుత్వాలకు పునాది మంచి ఓటర్లే.
ప్రశ్న 5.
భారతదేశంలో ఎన్నికల విధానాన్ని వివరించండి. (AS1)
(లేదా)
ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎందుకు ముఖ్యమైనవి? భారతదేశంలోని ఎన్నికల ప్రక్రియను వివరించండి.
జవాబు:
ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎందుకు ముఖ్యమైనవి.
- ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం కలిగి ఉంటారు.
- ఎన్నికలు అధికార పార్టీ పని తీరును మదింపు చేయడానికి అవకాశాన్ని కల్పిస్తాయి.
1) చట్టసభల పదవీకాలం పూర్తికాగానే ఎన్నికల సంఘం లోక్ సభకు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికల తేదీలను, ఎన్నికల కార్యక్రమాన్ని ప్రకటిస్తుంది.
2) రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఉంటారు. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ ముఖ్య ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు.
3) నియోజకవర్గం స్థాయిలో ఒక ప్రభుత్వాధికారి రిటర్నింగ్ అధికారిగా ఎన్నికలను నిర్వహిస్తారు.
4) ఆసక్తిగల అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తారు.
5) రిటర్నింగ్ అధికారులు తమకు సమర్పించబడిన నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు.
6) సరిగా ఉన్న నామినేషన్ల జాబితాను ప్రకటిస్తారు. నిర్ణీత గడువులో నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం కూడా అభ్యర్థులకు ఉంటుంది.
7) ఉపసంహరణల గడువు ముగిసిన తర్వాత తుది అభ్యర్థుల జాబితాను ప్రతి నియోజకవర్గంలో ప్రకటిస్తారు.
8) అప్పుడు EVM (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్)లను సిద్ధం చేస్తారు. రాష్ట్రాల శాసనసభలకు, స్థానిక సంస్థలకు నిర్వహించే ఎన్నికలలో కూడా దాదాపు ఇవే విధివిధానాలు, నిబంధనలను పాటిస్తారు. ఉదాహరణకు అన్ని రాజ్యాంగబద్ద సంస్థలకు నిర్వహించే ఎన్నికలకు ఒకే ఓటర్ల జాబితాను ఉపయోగిస్తారు.
ఓటింగ్ ప్రక్రియ:
9) పోలింగ్ కేంద్రంలో విధులను నిర్వర్తించడానికి ప్రిసైడింగ్ అధికారిని, పోలింగ్ అధికారులను జిల్లా ఎన్నికల అధికారి నియమిస్తారు.
10) పోలింగ్ సామాగ్రిని తీసుకొని ఎన్నికల సిబ్బంది ముందురోజే పోలింగ్ కేంద్రానికి చేరుకుంటారు.
11) పోలింగ్ రోజున ఓటర్ల జాబితాలో పేర్లున్న, తగిన గుర్తింపు కార్డు కలిగిన ఓటర్లందరినీ ఓటు వేయడానికి అనుమతిస్తారు.
12) ఈ ప్రక్రియలో ఓటర్లను గుర్తించడానికి పోలింగ్ ఏజెంట్లు సహాయపడతారు.
13) ప్రిసైడింగ్ అధికారి ఓటరు గుర్తింపును నిర్ధారించుకొని చూపుడు వేలిపై ఇండెలిబుల్ సిరాతో గుర్తు పెట్టి అభ్యర్థుల పేరు, గుర్తు వివరాలతో ఉన్న బ్యాలెట్ పత్రాన్ని అందజేస్తాడు.
14) ఓటరు తాను ఓటు వేయదలుచుకున్న గుర్తుపై స్వస్తిక్ ముద్రతో ఓటువేస్తాడు. బ్యాలెట్ పత్రాన్ని బ్యాలెట్ బాక్స్ లో వేస్తాడు.
15) ఓటరు తాను ఎవరికి ఓటు వేసిందీ బహిరంగపరచకూడదు.
16) ప్రస్తుతం బ్యాలెట్ బాక్స్ స్థానంలో EVM ల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
17) పోలింగ్ పూర్తయిన తరువాత EVM లకు సీలు వేసి ఓట్ల లెక్కింపు కేంద్రాలకు తరలిస్తారు. అక్కడ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థి ఎన్నికైనట్లుగా ప్రకటిస్తారు.
ప్రశ్న 6.
ప్రస్తుత ఎన్నికల విధానంలో ఏవైనా లోపాలు గమనించారా? వాటిని అధిగమించడానికి కొన్ని సూచనలు తెల్పండి. (AS1)
జవాబు:
ప్రస్తుత ఎన్నికల విధానంలో గమనించిన లోపాలు
- ఓటర్లు ధనం మరియు ‘కానుకలు వంటి ప్రలోభాలకు లొంగడం.
- మద్యం, ఇతర పానీయాల ప్రలోభాలకు తలవంచడం.
- భర్త చెప్పాడనో, యజమాని చెప్పాడనో, కుల నాయకుడు లేదా మత గురువు ఆదేశించారనో ఓటు వేయడం, సరైన అభ్యర్థిని ఎన్నుకోకపోవడం.
- మీడియా (పత్రికలు, TV ఛానళ్ళు)ను మితిమీరి ఉపయోగించుకోవడం, ఓటర్లను అయోమయానికి గురిచెయ్యటం.
- పౌరులందరూ ఎన్నికలలో పాల్గొనకపోవడం. మరీ ముఖ్యంగా పట్టభద్రులు ఎన్నికలలో ఓటు వేయడానికి రాకపోవడం.
సూచనలు:
- ఓటర్లను ఏ విధమైన ప్రలోభాలకు లొంగకుండా ఉండేలా జాగృతి చేయడం. అలా ప్రలోభ పెట్టేవారిని కఠినంగా శిక్షించడం.
ఎన్నికల్లో మితిమీరిన డబ్బు ప్రవాహంను కట్టడి చేయడం. - పత్రికలు, ఛానళ్ళ పై నిఘా ఉంచడం, పనితీరును పరిశీలించడం.
- పౌరులందరిని ఎన్నికల్లో పాల్గొనేటట్లు మేల్కొలపడం.
ప్రశ్న 7.
ఓటుహక్కు దుర్వినియోగం కాకుండా ప్రజలను చైతన్యపరిచేందుకు నీవు ఏ ఏ కార్యక్రమాలను నిర్వహిస్తావు? (AS6)
జవాబు:
ఓటుహక్కు దుర్వినియోగం కాకుండా ప్రజలను చైతన్యపరిచేందుకు నేను చేపట్టే కార్యక్రమాలు :
- ఓటుహక్కు విలువను తెలియజేసే కరపత్రం ముద్రించి, పౌరులకు సరఫరా చేస్తాను.
- ఓటుహక్కు గురించి, దాని ప్రాధాన్యతపై చర్చా కార్యక్రమం ఏర్పాటు చేస్తాను.
- ఓటుహక్కుకు ఎలా సద్వినియోగం చేసుకోవాలో (పౌరులకు) ఇంటింటా ప్రచారం చేసి తెలియజేస్తాను.
- ఓటుహక్కును ఎలా సద్వినియోగం చేసుకోవాలో వ్యాసరచనలు, వక్తృత్యం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తాను.
- ఒక చిన్న స్కిట్ (నాటిక)ను ప్రదర్శించి ఓటుహక్కు ప్రాధాన్యతను తెలియజేస్తాను.
- ఏ విధమైన ప్రలోభాలకు, బలహీనతలకు ఓటర్లు లొంగకుండా ఉండేలా వారిని చైతన్యపరుస్తాను.
- 18 సం||రాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయిస్తాను.
- అందరిచే ఓటరు ప్రతిజ్ఞ చేయిస్తాను.
ప్రశ్న 8.
ఈ మధ్యకాలంలో జరిగిన ఎన్నికల గురించిన సమాచారాన్ని సేకరించి పాల్గొన్న పార్టీలు, అభ్యర్థులు, గుర్తులు, పోలైన ఓట్లు మొదలైన వివరాలను విశ్లేషించి మీ అభిప్రాయాలు రాయండి. (AS3)
జవాబు:
- 2014 సంవత్సరంలో జరిగిన 16వ లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 543 లోక్ సభ సీట్లకుగాను 8251 మంది అభ్యర్థులు పోటీ చేశారు.
- భారతదేశ సాధారణ ఎన్నికల చరిత్రలోనే అత్యధికంగా ఈ ఎన్నికల్లో 66.38% ఓటింగ్ నమోదయింది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ 272 సీట్లు.
రాజకీయ పార్టీ | గెలుపొందిన సీట్లు |
1) భారతీయ జనతా పార్టీ | 282 |
2) కాంగ్రెస్ | 44 |
3) ఎఐఎడిఎమ్ కె. | 37 |
4) తృణమూల్ కాంగ్రెస్ | 34 |
5) బిజెడి | 20 |
6) శివసేన | 18 |
7) తెలుగుదేశం పార్టీ | 16 |
8) టిఆర్ఎస్ పార్టీ | 11 |
9) సిపిఐ (యం) | 9 |
2014 లోకసభ ఎన్నికల్లో విజయం సాధించిన టాప్ 9 పార్టీల జాబితా ఇది. ఈ ఎన్నికల్లో బిజెపి మొత్తం 543 సీట్లలో 282 సీట్లు గెలుచుకొని కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అర్హత సాధించింది.
ప్రశ్న 9.
పోలింగ్ కేంద్రం నమూనా చిత్రాన్ని గీసి, ప్రిసైడింగ్ అధికారి చేసే పనులకు గురించి రాయండి. (AS5)
జవాబు:
ప్రిసైడింగ్ అధికారి చేసే పనులు :
- పోలింగ్ కేంద్రంలో విధులను నిర్వర్తించడానికి ఎన్నికల సంఘం ప్రిసైడింగ్ అధికారి (P-O) ని నియమిస్తుంది.
- ‘ఎన్నికల నిర్వహణ’పై జరిగే శిక్షణ కార్యక్రమంకు హాజరయ్యి శిక్షణ పొందుతారు.
- ఎన్నికల ముందురోజు ఓటింగ్ యంత్రాన్ని, ఎన్నికల సామగ్రిని తీసుకుంటారు.
- EVMల పనితీరు చెక్ చేసుకుంటారు. పోలింగు కేంద్రాలకు ముందురోజే చేరుకుంటారు.
- పోలింగు స్టేషన్ల వద్ద అవసరమయిన ఏర్పాట్లను చేస్తారు. (బూత్ ఏర్పాటు, భద్రత మొ||)
- పోలింగు బూతు నియమించిన ఇతర అధికారులను, పోలింగు ఏజెంట్లను సమన్వయపర్చుకుంటారు.
- పోలింగు ప్రారంభానికి ముందే ఓటింగ్ యంత్రాలను సిద్ధం చేసుకుంటారు.
- ‘మాదిరి’ (Mockpole) ఏజెంట్ల సమక్షంలో నిర్వహిస్తారు.
- ముందుగా అధికారులు నిర్ణయించిన సమయానికి పోలింగ్ ను ప్రారంభించుట.
- ఓటరు గుర్తింపును నిర్ధారించుకుని చూపుడువేలిపై ఇండెలిబుల్ సిరాతో గుర్తు పెట్టి బ్యాలెట్ ను అందజేస్తారు.
- ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగటానికి అవసరమైన చర్యలు చేపడతారు.
- పోలింగ్ స్టేషన్ లోపలా, పరిసర ప్రాంతాల్లో ఎన్నికల చట్టం అమలుచేయటం. .
- నిర్ణీత సమయంలో పోలింగ్ ముగించుట.
- ప్రిసైడింగ్ అధికారి డైరీని తయారుచేయుట.
- పోలింగ్ ముగిసిన తర్వాత సదరు ఓటింగ్ యంత్రాలను రిటర్నింగ్ అధికారికి అప్పజెప్పటం మొదలైనవి చేస్తారు.
ప్రశ్న 10.
ప్రధాన ఎన్నికల కమీషనర్‌ను తొలగించడం కష్టతరం. కారణాలను విశ్లేషించండి. (AS4)
జవాబు:
భారత ఎన్నికల సంఘం యొక్క ప్రధాన కమీషనర్‌ను తొలగించడం కష్టతరం కారణం :
- భారత ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగబద్ధ సంస్థ.
- భారత రాజ్యాంగంలోని 324(2) నిబంధన ప్రకారం భారత రాష్ట్రపతి ప్రధాన ఎన్నికలు అధికారివీ, ఇతర అధికారులను నియమిస్తారు.
- సర్వోన్నత, స్వతంత్ర అధికారాలు గల ప్రధాన ఎన్నికల అధికారిని “అభిశంసన తీర్మానం” ద్వారానే తొలగించగలరు.
- ఈ ‘అభిశంసన తీర్మానం’ అమోదించాలంటే పార్లమెంటులోని ఉభయ సభలలో 2/3వంతు సభ్యుల అంగీకారం అవసరం.
- దీనినిబట్టి ప్రధాన ఎన్నికల కమీషనర్ ను తొలగించడం ఎంత కష్టమో అవగతమవుతుంది.
8th Class Social Studies 12th Lesson భారత ఎన్నికల వ్యవస్థ InText Questions and Answers
8th Class Social Textbook Page No.141
ప్రశ్న 1.
మీ కుటుంబంలో ఎవరిదైనా ఓటరు గుర్తింపు కార్డును సేకరించి దానిలోని వివరాలను పరిశీలించండి.
జవాబు:
ఓటరు గుర్తింపు కార్డులోని వివరాలు :
- గుర్తింపుకార్డు నెంబరు
- ఓటరు పేరు, వయస్సు, లింగం
- ఓటరు చిరునామా
- ఓటరు యొక్క నియోజక వర్గం
- ఓటరు యొక్క ఎన్నికల ఋతు వివరం
- ఎలక్టోరేలో ఏ భాగంలో, ఏ క్రమ సంఖ్యలో ఉందో తెలిపే సంఖ్య
- ఓటరు రిజిస్ట్రేషన్ అధికారి సంతకము
ప్రశ్న 2.
మీకు 18 సంవత్సరాల వయస్సు నిండిన తరువాత ఓటరుగా నమోదు కావడానికి అనుసరించవలసిన పద్ధతులను గురించి మీ ఉపాధ్యాయుణ్ణి అడిగి తెలుసుకోండి.
జవాబు:
18 సం||రాలు వయస్సు నిండినవారు ఓటరుగా నమోదు కావడానికి అనుసరించవల్సిన పద్దతులు :
- ఫారం – 6ను పూర్తిచేసి, ఆధార పత్రాల నకళ్ళను జతపరచి మీ బూతులెవల్ అధికారి (BLO) కి అందించటం ద్వారా
- మీ సేవలో ఆన్లైన్లో అప్లై చేయుట ద్వారా
- మనమే స్వంతంగా ఎన్నికల సంఘం వెబ్ సైట్ నందు Form-6ను పూర్తిచేసి, సదరు నింపిన ఫారంలను, ఆధార పత్రాలను జతపరచి రిజిస్ట్రేషన్ అధికారికి అందజేయటం ద్వారా
ప్రశ్న 3.
సార్వత్రిక వయోజన ఓటుహక్కు మన ప్రజాస్వామ్యానికి ఏ విధంగా మేలు చేకూర్చింది? నిరక్షరాస్యులకు ఓటుహక్కు ఇవ్వడం మంచిది కాదని కొందరు భావిస్తారు. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? తరగతి గదిలో చర్చించండి.
జవాబు:
ఓటు హక్కు మన ప్రజాస్వామ్యానికి చేకూర్చిన మేలు
- ప్రతి ఓటరు రాష్ట్రం లేదా దేశంలో పాలన తన చేతిలోనే ఉందని భావిస్తాడు.
- ప్రజాస్వామ్యం అంటే ప్రజాపాలన, ప్రజలు పాలనలో భాగస్వామ్యం కావటానికి సార్వత్రిక వయోజన ఓటుహక్కు ఎంతో తోడ్పడుతుంది.
- పౌరులందరిని పాలనలో భాగస్వామ్యం చేస్తుంది.
నిరక్షరాస్యులకు ఓటుహక్కు ఇవ్వడం మంచిదనే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రజలందరూ పాలనలో భాగస్వామ్యం కావాలంటే ఇటువంటి ఆంక్షలు ఉండరాదు. అయితే నిరక్షరాస్యులకు ఓటుహక్కు గురించి, పాలన గురించి, ఎన్నికల
గురించిన అవగాహన కల్పించాలి.
8th Class Social Textbook Page No.144
ప్రశ్న 4.
వార్తా పత్రికలను పరిశీలించండి మన రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు, వాటి గుర్తుల జాబితా తయారుచేయండి. వాటిలో ప్రాంతీయ, జాతీయ పార్టీలను గుర్తించండి.
జవాబు:
జాతీయ పార్టీలు :
ప్రాంతీయ పార్టీలు :
8th Class Social Textbook Page No.145
ప్రశ్న 5.
పై నియమాలలో ఒక్కొక్క నియమాన్ని తీసుకుని ఆ నియమం యొక్క ఉపయోగాన్నీ అది లేకుంటే సంభవించగల నష్టాన్ని చర్చించండి.
జవాబు:
ప్రశ్న 6.
రాజకీయ పార్టీలు సభలు, సమావేశాల ద్వారా మాత్రమే కాకుండా ఇంకా ఏయే పద్ధతులలో ప్రచారం చేయవచ్చు?
జవాబు:
రాజకీయ పార్టీలు ప్రచారం చేయు పద్ధతులు :
- వివిధ వార్తా పత్రికల్లో తమ మ్యానిఫెస్టోలను చర్చించటం ద్వారా
- వివిధ TV ఛానెళ్ళల్లో ప్రచారం నిర్వహించుకోవటం.
- కరపత్రాలు, (స్కీక్కర్లు) ముద్రించి, సరఫరా చేయటం ద్వారా
- ఇంటింటికి (గడపగడపకు) ప్రచారం నిర్వహించటం ద్వారా
- పాదయాత్రలు, రోడ్ షోలు నిర్వహించటం ద్వారా చర్చలు నిర్వహించటం ద్వారా
- సోషల్ మీడియా (Facebook, Whatsapp, youtube, Twitter etc…]
8th Class Social Textbook Page No.147
ప్రశ్న 7.
NOTA అభ్యర్థి యొక్క గెలుపు / ఓటమిని ప్రభావితం చేయగలుగుతుంది? ఒకవేళ NOTAకు మెజారిటీ ఓట్లు వస్తే అప్పుడేం చేయాలి?
జవాబు:
NOTA అభ్యర్థి యొక్క గెలుపు / ఓటములను ప్రభావితం చేస్తుంది. ఎలా అంటే గతంలో (NOTA లేనపుడు) ఓటరు తప్పకుండా ఎవరో ఒక అభ్యర్థికి ఖచ్చితంగా (నచ్చినా, నచ్చకపోయినా) ఓటువేసి తీరాల్సి ఉంటుంది. ఇపుడు NOTAకు వేయవచ్చు.
NOTAకు మెజారిటీ ఓట్లు వస్తే, అంటే ఎన్నికలో పాల్గొన్న అభ్యర్థులెవరు ఓటర్లకు నచ్చలేదని భావించవచ్చు, కనుక అభ్యర్థులను మార్చి ఎలక్షన్లు జరిపించాలి. అయితే ప్రస్తుతం NOTAకు వచ్చిన ఓట్లను పరిగణలోకి తీసుకోవటం లేదు. కావున అభ్యర్థులకు (ఎంత తక్కువ వచ్చిన) వచ్చిన ఓట్లను మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారు.
ప్రశ్న 8.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఎందుకు అవసరం? దీనిలో ఇంకా ఏయే నియమాలుండాలని మీరు భావిస్తున్నారు?
జవాబు:
ఎన్నికల ప్రవర్తనా నియమావళి :
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అనగా షెడ్యూలు ప్రకటించిన తేదీ నుండి ఎన్నికలు జరిగే తేదీ వరకు పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు పాటించవలసిన నియమ నిబంధనలను ‘ఎన్నికల ప్రవర్తనా నియమావళి’ అంటారు. వీటిని అతిక్రమిస్తే ఎన్నికల అనుచిత ప్రవర్తన (ఎలక్షన్ మాల్ ప్రాక్టీస్)గా పరిగణించి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు.
అధికారంలో ఉన్న పార్టీ తమ అధికారాన్ని దుర్వినియోగం చేయవచ్చు. ప్రభుత్వం కొత్త పథకాలను ప్రకటించవచ్చు. ప్రత్యర్థి పార్టీలు ఓటర్లను మభ్యపెట్టటానికి ఇతర అనైతిక, అప్రజాస్వామిక పద్ధతులను అనుసరించవచ్చు. లొంగటానికి అవకాశం ఉంటుంది.. ఇవన్నీ ఎన్నికల కమిషను ప్రవర్తనా నియమావళి ద్వారా వీటిని అరికడుతుంది. కాబట్టి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అవసరం.
దీనిలో ఇంకా ఉండాల్సిన నియమాలు :
- TVలు, వార్తా పత్రికలలో చేసే విపరీతమైన ప్రచారాన్ని తగ్గించాలి.
- ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చని నాయకులను అనర్హులుగా ప్రకటించాలి. అప్పుడే సాధ్యమయ్యే వాగ్దానాలు చేస్తారు.
- కుల సంఘాలను నిషేధించాలి.
- నేర చరిత్ర కల్గిన అభ్యర్థులను పోటీ చేయకుండా నిషేధించుట.