AP Board 6th Class Telugu Solutions Chapter 12 ఎంత మంచివారమ్మా….!

SCERT AP Board 6th Class Telugu Solutions 12th Lesson ఎంత మంచివారమ్మా….! Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Telugu Solutions 12th Lesson ఎంత మంచివారమ్మా….!

6th Class Telugu 12th Lesson ఎంత మంచివారమ్మా….! Textbook Questions and Answers

ప్రశ్నలు – జవాబులు

అ) లఘు ప్రశ్నలు:

ప్రశ్న 1.
యానాది రూపాన్ని వర్ణించండి.
జవాబు:
యానాదుల కళ్లు నిర్మలంగా ఉంటాయి. వీరి కనుబొమ్మలు విల్లుల వలె ఒంపులు తిరిగి ఉంటాయి. వీరిది ఉంగరాల జుట్టు. వీరి పెదవులు సన్నగా ఉంటాయి. వీరు సన్నగా ఉంటారు. వీరు చాలా వేగంగా పరుగెత్తడానికి అనువైన లేసైన కాలిపిక్కలు కలిగి ఉంటారు. సన్నని నడుములు కలిగి ఉంటారు. చిరునవ్వుతో జీవిస్తారు. ఆదివాసులందరిలో యానాదులే అందగాళ్లని కొంతమంది పరిశోధకుల అభిప్రాయం.

ప్రశ్న 2.
యానాదులు నిరాడంబర భక్తులు – సమర్థించండి.
జవాబు:
వీరు భజనలు, మౌనధ్యానాలు, మంత్రతంత్రాలు ఇష్టపడరు,” యానాదుల దైవం వేంకటేశ్వరస్వామి, ఆయన కొబ్బరి కాయలతో, తులసిదళాలతో సులభంగా తృప్తిపడతాడని వీరి ఉద్దేశం. వీళ్లు వేటకు వెళ్లేముందు కాట్రాయుడికి మొక్కుతారు. అంటువ్యాధులు వస్తే మహాలక్ష్మమ్మ, పోలేరమ్మ వెలసియుండే చెట్ల దగ్గర, గ్రామవావిళ్ల దగ్గర ప్రార్థిస్తుంటారు. వీరు యక్షగానం ప్రదర్శిస్తారు.

AP Board 6th Class Telugu Solutions Chapter 12 ఎంత మంచివారమ్మా....!

ప్రశ్న 3.
యానాదుల భాషణం ఏ విధంగా ఉంటుంది?
జవాబు:
యానాదులు మాట్లాడేటపుడు స్వచ్ఛమైన అచ్చ తెలుగు మాటలు ముత్యాల్లా జారుతాయి. ఒత్తులు లేని పదాలకు ఒత్తులు కల్పించి, భాషకు కొత్త అందాలను తెస్తారు. బావను భావ అని పలికినట్లు. వీరు తక్కువగా మాట్లాడే మిత భాషులు.

ఆ) వ్యాసరూప ప్రశ్నలు:

ప్రశ్న 1.
యానాదులను చూసి మనం ఎందుకు గర్వపడాలి?
జవాబు:
యానాదులు కష్టజీవులు. కష్టపడి బతుకుతారు. వనమూలికలు, కషాయాలతో వైద్యం చేసుకొంటారు. చిరునవ్వుతో ఆదరిస్తారు. అల్ప సంతోషులు, నిబ్బరంగా జీవిస్తారు. బాహ్య ప్రపంచానికి నీతిని నేర్పగలవారు. నేటి తరంలో యానాదులు సగౌరవంగా జీవిస్తున్నారు. వారి భాషను అభివృద్ధి చేసుకొన్నారు. విద్యావంతులయ్యారు. ఆంధ్ర దేశాభివృద్ధిలో వారూ భాగస్వాములయ్యారు. పరస్పర సహకారంతో జీవిస్తున్నారు. మన తెలుగు వారి పట్ల అభిమానంగా అందరూ నావాళ్లే అనే భావంతో ఉంటారు. సంఘశక్తిని పెంచడంలో భాగస్వాములయ్యారు. అత్యున్నత పదవులను పొందడంలో పౌరుషం, పట్టుదల, దీక్ష చూపించారు. ఇవన్నీ యానాదుల నుండి నేర్చుకొనతగినవి. గర్వించతగిన లక్షణాలు.

ప్రశ్న 2.
“యానాది వేదాంతి” – దీనిని సమర్థిస్తూ రాయండి.
జవాబు:
ఒక విధంగా ఆలోచిస్తే యానాదిని వేదాంతిగానే భావించవచ్చు. వారికి ఆస్తి మీద ఆశ ఉండదు. వారి కాయ కష్టం మీద వారు ఆధారపడి జీవిస్తారు. వీరు ఇంటిని కూడా చెట్లకొమ్మలు, చిట్టి వెదుళ్లు, వెదురు బొంగులతో ‘ వలయాకారంగా నిర్మిస్తారు. ఇంటిని తాటాకులతో నేల నుండి పై వరకు నారతో కుట్టేస్తారు. వారి ఇంటికి కుడి ప్రక్కన గుంటపొయ్యి, నీళ్లకుండలు, చెంబు ఉంటాయి. ఎడమ పక్క తట్టలు, బుట్టలు ఉంటాయి. మధ్యలో రోకటి గుంట ఉంటుంది. నెత్తి మీద తగిలేటట్టు కట్టి పెట్టిన తప్పెట ఉంటుంది. వాకిలి వెనుక జాజి చెక్కల పెట్టె ఉంటుంది. దానిపై వేలాడ గట్టిన ఈతాకుల చాప ఉంటుంది. చూరులో దూపిన గెసిక కర్ర ఉంటుంది. ఇంత నిరాడంబరంగా జీవిస్తాడు. జీవితం అశాశ్వతం, ఐశ్వర్యం నిలబడదు అనే సందేశం తన జీవన విధానం ద్వారా ఇస్తాడు కనుకనే యానాదిని వేదాంతి అనవచ్చు.

పాఠ్యభాగ సారాంశం

మనదేశంలో ఉన్న ప్రాచీన జాతుల్లో యానాదులు ఒకరు. వీరందరూ నిరాడంబరంగా జీవిస్తారు. కష్టజీవులు. అనాది అనే పదం నుంచి యానాది పదం పుట్టి ఉండొచ్చు. అడవుల్లో దొరికే తేనె, మూలికలు, కలప, వెదురు తెచ్చి గ్రామాల్లో అమ్మి తమకు అవసరమైన వస్తువులను కొనుక్కుంటారు.

యానాదులు నిర్మలమైన కళ్ళు, అందమైన కనుబొమ్మలు, సన్నని పెదవులు, గట్టి శరీరంతో అందంగా ఉంటారు. వీరు జంతువుల జాడలను, మనుషుల జాడలను పసిగట్టడంలో నేర్పరులు. పులులు, చిరుతలు మొదలైన జంతువుల జాడలు తెలుసుకుంటారు. వీళ్ళకు పాములంటే భయం లేదు. మూలికలు వీళ్ళకు బాగా తెలుసు. కుండ కషాయాలు, మూలికలే వీరికి ఔషధాలు.

యానాదులు గొప్ప వేదాంతులు. వీరికి. ఆస్తులు ఉండవు. వీళ్ళ ఇళ్ళు ప్రత్యేకంగా, నిరాడంబరంగా ఉంటాయి. వీళ్ళు అల్ప సంతోషులు అయినందువల్ల వీరికి నిరాశానిస్పృహ, ఈర్షాద్వేషాలు, అసూయలు ఉండవు. మితభాషులు. వీరికి పండుగకు, పస్తుకు తేడా తెలియదు. వీళ్ళు మాంసాహారంతో పాటు శాకాహారం తీసుకుంటారు. మద్యపానం చేయరు. మంచి, మర్యాద వంటి సుగుణాలు వారి పెదవుల పైన చిరునవ్వులో కనిపిస్తాయి. వీరి తెలుగుమాటల్లో ఒత్తులు ఎక్కువగా ఉంటాయి.

యానాదులు తిరునాళ్ళు, తోలుబొమ్మలాటకు ఇంటిల్లిపాది వెళతారు. యక్షగానాలు వీరు ప్రదర్శిస్తారు. యానాదుల భాగవతాలు, యువతుల గొబ్బిపాటలు ఎంతో మధురంగా ఉంటాయి. వీరు వెంకటేశ్వర్లును పూజిస్తారు. వేటకు వెళ్ళేటప్పుడు కాట్రాయుడికి మొక్కుతారు. మహాలక్ష్మమ్మను, పోలేరమ్మను ప్రార్థిస్తారు.

యానాదులు అందగాళ్ళేకాదు అమాయకులు, నీతిమంతులు. నేటి తరంలో యానాదులు కూడా చదువుకొని జనంతో జేరి పురోగమిస్తున్నారు. సంఘాభిమానం, సహకారం, పౌరుషం మొదలైన లక్షణాలతో ఉన్నత పదవులు పొందుతున్నారు.

AP Board 6th Class Telugu Solutions Chapter 12 ఎంత మంచివారమ్మా....!

కవి పరిచయం

రచయిత పేరు : వెన్నెలకంటి రాఘవయ్య

కాలం : 4.6.1897 నుండి 24.11.1981.

ప్రత్యేకతలు : 1. వారు నెల్లూరు గాంధీగా ప్రసిద్ధులు
2. వారు స్వాతంత్ర్య సమరయోధులు, సంఘసేవకులు, చరిత్రకారులు.
3. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని 21 నెలలు జైలుశిక్ష అనుభవించారు.

పురస్కారాలు : 1973లో భారత ప్రభుత్వం ‘పద్మభూషణ్’ పురస్కారంతో గౌరవించింది.

రచనలు : ‘యానాదులు’, ‘భారతదేశంలో ఆదివాసులు’ మొదలైన 22 పుస్తకాలు రాశారు.

అడవిపూలు, నాగులు, చెంచులు, సంచార జాతులు వంటి 10 తెలుగు పుస్తకాలు రచించారు.

AP Board 6th Class Telugu Solutions Chapter 11 డూడూ బసవన్న

SCERT AP Board 6th Class Telugu Solutions 11th Lesson డూడూ బసవన్న Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Telugu Solutions 11th Lesson డూడూ బసవన్న

6th Class Telugu 11th Lesson డూడూ బసవన్న Textbook Questions and Answers

వినడం – ఆలోచించి మాట్లాడడం
AP Board 6th Class Telugu Solutions Chapter 11 డూడూ బసవన్న 1

ప్రశ్న 1.
పై సన్నివేశాలు ఏ పండుగరోజు కనిపిస్తుంటాయి?
జవాబు:
సంక్రాంతి పండుగ రోజులలో పై సన్నివేశాలు కనిపిస్తుంటాయి.

ప్రశ్న 2.
ఏ పండుగ సందర్భంలో హరిదాసు మీ ఇంటికి వస్తాడు?
జవాబు:
సంక్రాంతి పండుగ రోజులలో సుమారు నెలరోజులు హరిదాసు మా ఇంటికి వస్తాడు.

AP Board 6th Class Telugu Solutions Chapter 11 డూడూ బసవన్న

ప్రశ్న 3.
సంక్రాంతి పండుగరోజు ఇంకా మన ఇంటి ముంగిళ్ళ ముందు ఎవరు కనిపిస్తారు?
జవాబు:
సంక్రాంతి పండుగరోజులలో హరిదాసులు, గంగిరెద్దులవాళ్లు, పాములనాడించే వారు, పగటివేషగాళ్లు, చిలక జ్యోతిష్యం చెప్పేవారు, సోదమ్మలు మొదలైన వాళ్లంతా మన ముంగిట కనిపిస్తారు.

అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
మీరు చూసిన లేదా విన్న ఏదైనా కళారూపం గురించి చెప్పండి.
జవాబు:
మేము బుర్రకథను చూశాం. బుర్రకథలో ముగ్గురు ఉంటారు. ముగ్గురిలో మధ్య కథకుడు. అతని చేతిలో తంబూరా ఉంటుంది. తంబూరా మీటుతూ కథను నడుపుతాడు. అతనికి అటు, ఇటు ఇద్దరు ఉంటారు. వారిని వంతలు అంటారు. వారిద్దరి చేతిలో డోలకు ఉంటాయి. వారిలో ఒకరు రాజకీయం చెబుతారు. మరొకరు హాస్యం పండిస్తారు. ముగ్గురికి గజ్జెలు ఉంటాయి. తందాన ….. తాన తందనాన… అంటూ సాగుతుంది.

ప్రశ్న 2.
గంగిరెద్దుల వాళ్ళను చూసినప్పుడు రచయితకు ఎందుకు బాధ కలిగిందో రాయండి.
జవాబు:
పాత ఆచారాలు పోతున్నందుకు రచయిత బాధపడ్డాడు. అందచందాలు ఉన్నది గంగిరెద్దాట. ఎంతోమంది రాజులూ, రాణులూ కూడా ఆదరించినది గంగిరెద్దాట. సామాన్య జనాన్ని కూడా సంతోషపెట్టిన ఆట గంగిరెద్దాట. అటువంటి గంగిరెద్దాట కనుమరుగవుతున్నందుకు రచయిత బాధపడ్డాడు.

ప్రశ్న 3.
బసవయ్య గంగిరెద్దులు ఆడించడం ఎలా నేర్చుకున్నాడు?
జవాబు:
బసవయ్య చిన్నతనం నుండీ తండ్రితో ఊరూరా తిరిగాడు. తండ్రిని గమనిస్తూ ఉండేవాడు. ఆయన మాటల్ని, మన పద్ధతుల్ని అనుకరించేవాడు. అలా చిన్నతనం నుండీ గంగిరెద్దాటలోని మెలుకువలన్నీ నేర్చుకొన్నాడు. తన తండ్రి ఎద్దుచేత మోళీ చేయిస్తుంటే బసవయ్య రాండోలు వాయించేవాడు. అలా పూర్తిగా గంగిరెద్దులను ఆడించడం నేర్చుకొన్నాడు.

ప్రశ్న 4.
కింది గద్యాన్ని చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

సమాజ వినోదం కోసం ఏర్పడినవే జానపద కళారూపాలు. ఇవి కొండ గ్రామాలలో పుట్టి క్రమక్రమంగా ద్రావిడ దేశాలన్నింటా విస్తరించాయి. వీటిలో ప్రత్యేకమైనది కురవంజి. ఆటవికుల నుండి పుట్టిన ప్రాచీన జానపద కళారూపం కురవంజి. కురవలు అనేవారు ఏదో వినోదం కోసం ఆరంభించినా క్రమంగా అదే జీవనోపాధి అయింది. వీరు పుణ్యక్షేత్రాల దగ్గర వాటి స్థలపురాణాలను, పవిత్ర కథలు, గాథల్ని ఆశువుగా చెప్పి యాత్రికులను మంత్రముగ్ధులుగా చేసేవారు. యాత్రికులు వారి ప్రదర్శనకు మెచ్చి బహుమతులిచ్చేవారు. కురవంజి కాలానుగుణంగా అనేక రూపాంతరాలు చెందింది. ఏకపాత్రగా మారి ఎఱుక చెప్పే సోదెగా నేడు మిగిలింది. వారు సోదె చెప్పే విధానం అద్భుతంగా, ఆశ్చర్యంగా ఉంటుంది.

అ) జానపద కళారూపాలు ఎందుకు ఏర్పడ్డాయి?
జవాబు:
సమాజ వినోదం కోసం జానపద కళారూపాలు ఏర్పడ్డాయి.

ఆ) కురవంజి ప్రదర్శనలో వేటి గురించి కురవలు చెప్పేవారు?
జవాబు:
పుణ్యక్షేత్రాల స్థల పురాణాలు, పవిత్ర కథలు, గాథలను గురించి కురవంజి ప్రదర్శనలో కురవలు చెప్పేవారు.

ఇ) కురవంజి ప్రస్తుతం ఏ కళారూపంగా మారింది?
జవాబు:
కాలక్రమేణా కురవంజి ఏకపాత్రగా మారింది. ప్రస్తుతం ఎఱుక చెప్పే సోదెగా మారింది.

ఈ) పై గద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
జానపద కళారూపాలు ఎక్కడ విస్తరించాయి ?

వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
“ఎక్కడ ధర్మప్రభువులుంటే అదే మా ఊరు” అని బసవయ్య ఎందుకు అని ఉంటాడు?
జవాబు:
బసవయ్య దృష్టిలో ధర్మప్రభువులు అంటే దానగుణం కలవారు. కళాపోషణ చేసేవారు. అటువంటి వారున్నచోట గంగిరెద్దాట ఆడేవారికి లోటుండదు. బియ్యం ఇస్తారు. డబ్బులు ఇస్తారు. బట్టలు ఇస్తారు. గంగిరెద్దుకు మేత పెడతారు. తమకు నివాసం చూపిస్తారు. గంగిరెద్దాట చూసి ఆనందిస్తారు. బహుమతులిస్తారు. కనుక ధర్మప్రభువులున్న ఏ ఊరైనా తమ ఊరేనన్నాడు. గుప్పెడన్నం ఎక్కడ దొరికితే అదే తన ఊరని బసవయ్య ఉద్దేశం. అందుకే అలా అన్నాడు.

AP Board 6th Class Telugu Solutions Chapter 11 డూడూ బసవన్న

ప్రశ్న 2.
గంగిరెద్దాట ప్రాచీనమైనదని ఎలా చెప్పగలవు?
జవాబు:
దేవతలలో ఆదిదేవుడు పరమేశ్వరుడు. ఆయన వాహనం నందీశ్వరుడు. ఆ పరమేశ్వరుడే నందీశ్వరుడిచేత గంగిరెద్దాట ఆడించాడంటారు.

ఒకసారి శివలింగాన్ని గజాసురుడు మింగేస్తాడు. శివుడి గురించి పార్వతీదేవి, వినాయకుడు, మొదలైన వారు ఆందోళన చెందుతారు. విష్ణువును ఆశ్రయిస్తారు. విష్ణువు గంగిరెద్దుల నాడించేవానిగా మారతాడు. నందీశ్వరుని చేత గజాసురుని ముందు గంగిరెద్దాటను ఆడిస్తాడు. గజాసురుడు ఏం కావాలో కోరుకోమంటాడు. ఆనందంతో పరమేశ్వరుడు కావాలంటాడు. సరే అంటాడు. గజాసురుని పొట్టను నందీశ్వరుడు తన కొమ్ములతో చీల్చాడు. శివుని తెచ్చాడు.

అలాగే రాజులు, రాణులు కూడా గంగిరెద్దాటను ఆస్వాదించారు. అందుచేత గంగిరెద్దాట చాలా ప్రాచీన కాలం నుండీ ఉంది. గంగిరెద్దును నందీశ్వరునిగా, గంగిరెద్దును ఆడించేవాసిని విష్ణువుగా, అతని భార్యను లక్ష్మీదేవిగా పూర్వం భావించేవారు. గంగిరెద్దు గుమ్మంలో ఆడితే ఐశ్వర్యం పెరుగుతుందని నమ్మకం.

ప్రశ్న 3.
గంగిరెద్దుల వాళ్ళ దగ్గర ఏ వాయిద్యాలుంటాయి? వాటిని ఎలా ఉపయోగిస్తారు?
జవాబు:
గంగిరెద్దుల వాళ్ళ దగ్గర డోలు, సన్నాయి ఉంటాయి. డోలును రాండోలు అని కూడా అంటారు.

ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
గంగిరెద్దుల ఆట ఎలా ఉంటుందో వర్ణిస్తూ రాయండి.
జవాబు:
ఒక వ్యక్తి గంగిరెద్దు చేత మోళీ చేయిస్తుంటాడు. మరొక వ్యక్తి రాండోలు వాయిస్తుంటాడు. రాండోలు వాయించడ మంటే రెండుచేతులతోనూ రెండు కర్రలు పట్టుకొంటారు. ఒక కర్రతో డోలు చర్మాన్ని రాపాడిస్తారు. మరో కర్రతో రెండోవైపున వరసలు వాయిస్తారు. ఇది గంగిరెద్దు మోళీకి తగినట్లుగా ఉండాలి.

గంగిరెద్దు మోళీ చేస్తుంది. ముంగాళ్లు వంచి ముందుకు నడుస్తుంది. వెనక్కు జరుగుతుంది. ఒంటికాలితో దండం పెడుతుంది. కాదు, ఔను అని తలలో సైగలు చేస్తుంది. రాండోలు వాయిద్యానికి అనుగుణంగా గంతులు వేస్తుంది. అలుగుతుంది. కోపగించుకొంటుంది. ఆనందంతో చిందులు వేస్తుంది. కోపంతో కాలు దువ్వుతుంది. తోక ఎగబెట్టి రంకెలు వేస్తుంది. ఇలా ఏ పని చెబితే ఆ పనిని చేస్తుంది.

ప్రశ్న 2.
గంగిరెద్దుల వాళ్ళు పల్లెటూళ్ళలోనే ఉండిపోవడానికి కారణాలు రాయండి.
జవాబు:
మారుమూల పల్లెటూళ్లలో కళాపోషణ ఉంటుంది. తోటివారిని ఆదుకొనే మనస్తత్వం ఉంటుంది. ఎక్కువమంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తారు. వారి దగ్గర పశువులు కూడా ఉంటాయి. అందుచేత పశువుల మేత కూడా ఉంటుంది. తిండిగింజలకు లోటుండదు. భక్తి ఎక్కువ, ఆదరణ ఎక్కువ. గంగిరెద్దుకు, తమ కుటుంబానికి తిండికీ సౌకర్యానికీ, ఆదరణకూ లోటుండదు కనుక గంగిరెద్దుల వాళ్లు పల్లెటూళ్లలోనే ఉంటున్నారు. సాయంత్రం అయితే అందరూ ఇళ్లకు చేరతారు. గంగిరెద్దాటంటే పల్లెటూరి జనానికి ఇష్టం కూడా.

AP Board 6th Class Telugu Solutions Chapter 11 డూడూ బసవన్న

ప్రశ్న 3.
మీకు నచ్చిన లేదా మీరు మెచ్చిన జానపద కళారూపాన్ని ప్రశంసిస్తూ రాయండి.
జవాబు:
నాకు గొరవయ్యల నృత్య ప్రదర్శన ఇష్టం. ఇది మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురాలలో ప్రసిద్ది చెందిన జానపద కళారూపం. దీనిని మాదాసి కురవలు అనేవారు ప్రదర్శిస్తారు. ఒక చేత్తో పిల్లనగ్రోవి వాయిస్తారు. మరో చేత్తో జగ్గు లేదా డమరుకం వాయిస్తూ మధ్యమధ్యలో వచనాలు పాడుతూ సామూహిక నృత్యం చేస్తారు. వీరు పెట్టుకొనే టోపీ ఖండాంతరాల కావల గల ఆదివాసీ పురాతన సంప్రదాయ నమూన కలిగి ఉంటుంది. వీరు కన్నడంలోనూ తెలుగులోనూ కూడా వచనాలు చెబుతూ అదరకొట్టేస్తారు. మన జానపద కళలకు ఇటువంటి వారే వారసులు.

భాషాంశాలు

అ) కింద గీతగీసిన పదాలకు అర్ధాలు రాయండి. వాటితో సొంత వాక్యాలు రాయండి.
ఉదా : ఆరిఫ్ కుటుంబం శ్రీకాకుళంలో మకాం ఉంటుంది.
మకాం = నివాసం
ఎలుకలు బొరియలలో నివాసం ఉంటాయి.

1. రాబర్ట్ వాళ్ళ బామ్మ నన్ను ఎప్పుడూ ఆప్యాయంగా పలకరిస్తుంది.
జవాబు:
ఆప్యాయం = వాత్సల్యం
మా ఉపాధ్యాయులు మమ్ము వాత్సల్యంతో చూస్తారు.

2. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మనం నడచుకోవాలి.
జవాబు:
అనుగుణం = తగినట్లు
ప్రశ్నకు తగినట్లు జవాబు ఉండాలి.

3. కాలుష్యం ఎక్కువైతే ప్రకృతి అందాలు కనుమరుగు అవుతాయి.
జవాబు:
కనుమరుగు = నాశనం
మానవులలో మంచితనం నాశనం అవుతోంది.

ఆ) కింది పదాలకు సమానార్థక పదాలు (పర్యాయపదాలు) వెతికి రాయండి.
ఉదా : నదులలో నీరు తియ్యగా, సముద్రంలో జలం ఉప్పగా ఉంటుంది.
జవాబు:
ఉదకం : నీరు, జలం

1. సునీల తండ్రి గురవయ్య. వినయ్ జనకుడు స్వామి.
జవాబు:
నాన్న = తండ్రి, జనకుడు

2. వృషభం, ఎద్దు, గోవు, ధేనువు, పాదపం.
పై వాటిలో ‘బసవయ్య’ అనే పదానికి సమానార్థక పదాలు గుర్తించి రాయండి.
జవాబు:
బసవయ్య = వృషభం, ఎద్దు

3. మా విజ్ఞానయాత్ర మాకు ఆనందాన్ని, మా ఉపాధ్యాయులకు సంతసాన్ని పంచింది.
జవాబు:
సంతోషం = ఆనందం, సంతసం

AP Board 6th Class Telugu Solutions Chapter 11 డూడూ బసవన్న

ఇ) కింది పదబంధాలకు విశేషార్థాలు చదవండి. వాటితో సొంత వాక్యాలు రాయండి.
ఉదా : రూపుమాపు = నాశనం చేయు
మనం వరకట్న దురాచారాన్ని రూపుమాపాలి.

1. పట్టుకొని వేలాడు = వదిలిపెట్టకుండా ఉండు
మూఢనమ్మకాలను పట్టుకొని వేలాడకూడదు.

2. కాలుదువ్వు = తగవుకు సిద్ధపడడం.
అయినదానికీ, కాని దానికి అందరి మీదా కాలుదువ్వడం మంచిదికాదు.

3. తిలోదకాలివ్వడం = సంబంధం లేదా అనుబంధం తెంచుకోవడం.
దుర్మార్గానికి తిలోదకాలివ్వడం మంచిది.

వ్యాకరణాంశాలు

అ) కింది పదాలను విడదీసినప్పుడు వచ్చిన మార్పును గమనించండి.

1. మహేశ = మహా + ఈశ = ఆ + ఈ = ఏ
2. మహోదధి = మహా + ఉదధి = ఆ + ఉ = ఓ
3. రాజర్షి = రాజ + ఋషి = అ + ఋ = అర్

పై పదాలను పరిశీలించినప్పుడు పూర్వపదం చివర అ ఆ అనే అచ్చులు ఉన్నాయి. పరపదంలో మొదటి అచ్చులుగా ఇ, ఉ, ఋ లు ఉన్నాయి. వాటి స్థానంలో క్రమంగా ఏ, ఓ, అర్ లు ఏకాదేశంగా వచ్చాయి కదా !

అలాగే కిందనున్న పదాలను విడదీసి రాయండి.
1. రాజేంద్ర = రాజ + ఇంద్ర = అ + ఇ = ఏ
2. తిలోదకాలు = తిల + ఉదకాలు = అ + ఉ = ఓ
3. మహర్షి = మహా + ఋషి = ఆ + ఋ = అర్

పరిశీలించండి.

AP Board 6th Class Telugu Solutions Chapter 11 డూడూ బసవన్న 2

ఏ, ఓ, అర్ లను గుణములు అంటారు. ఇలా అకారానికి (అ, ఆ) “ఇ, ఉ, ఋ” లు (ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ఋ) పరమైతే క్రమంగా ఏ, ఓ, అర్ లు వస్తాయి. దీనినే గుణ సంధి అంటారు.

ఆ) కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి.

1. పరోపకారం = పర + ఉపకారం – గుణ సంధి
2. రమేశ = రమ + ఈశ = గుణ సంధి
3. జాతీయోద్యమం = జాతీయ + ఉద్యమం – గుణ సంధి
4. దేవర్షి = దేవ + ఋషి = గుణ సంధి

ఇ) కింది సంధి పదాలను విడదీసి సంధి పేరు రాయండి.

1. సత్యాగ్రహం = సత్య + ఆగ్రహం = సవర్ణదీర్ఘ సంధి
2. గిరీశుడు = గిరి + ఈశుడు = సవర్ణదీర్ఘ సంధి
3. గురూపదేశం – గురు + ఉపదేశం = సవర్ణదీర్ఘ సంధి
4. పిత్రణం = పితృ + ఋణం = సవర్ణదీర్ఘ సంధి

ఈ) కింది పదాలను కలిపి సంధి పేరు రాయండి.
1. శైల + అగ్రం = శైలాగ్రం = సవర్ణదీర్ఘ సంధి
2. ముని + ఇంద్రుడు = మునీంద్రుడు = సవర్ణదీర్ఘ సంధి
3. మధు + ఉదయం = మధూదయం = సవర్ణదీర్ఘ సంధి

AP Board 6th Class Telugu Solutions Chapter 11 డూడూ బసవన్న

ఉ) కింది ద్వంద్వ సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాయండి.

1. అందచందాలు : అందమును, చందమును
2. కాలుసేతులు : కాళ్ళును, చేతులును
3. అన్నదమ్ములు : అన్నయును, తమ్ముడును

కింది విగ్రహ వాక్యాలను ద్విగు సమాస పదాలుగా మార్చి రాయండి.

1. రెండైన చేతులు = రెండు చేతులు
2. మూడైన మాసాలు = మూడు మాసాలు
3. ఐదుగురైన పిల్లలు = ఐదుగురు పిల్లలు

ఎ) కింది వాక్యాలను పరిశీలించండి.

1. మీరు లోపలికి రావచ్చు.
2. నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు.
3. మీరు సెలవు తీసుకోవచ్చు.

ఇలా ఒక పనిని చేయడానికి అనుమతి ఇచ్చే, అర్థాన్ని సూచించే వాక్యాన్ని అనుమత్యర్థక వాక్యం అంటారు. ఉదాహరణకు “మీరు పరీక్ష రాయవచ్చు”. ఇలాంటి వాక్యాలు సేకరించి రాయండి.

1. మీరు ఆటలు ఆడుకోవచ్చు – అనుమత్యర్థక వాక్యం
2. మీరు భోజనాలు చేయవచ్చు – అనుమత్యర్థక వాక్యం
3. నీవు లోపలికి రావచ్చు – అనుమత్యర్థక వాక్యం అలాగే

1. నీకు శుభం కలుగుగాక !
2. నిండు నూరేళ్ళూ వర్దిల్లు
3. నీకు మంచి బుద్ధి కలుగుగాక !

ఈ విధంగా ఆశీస్సులను తెలియజేసే వాక్యాలను ఆశీరర్థక వాక్యాలు అంటారు. ఆంటోనీ ! నీకు దైవానుగ్రహము కలుగుగాక ! – ఇలాంటి వాక్యాలు సేకరించి రాయండి.

1. నీవు కలకాలం చల్లగా ఉండుగాక ! – ఆశీరర్థక వాక్యం
2. నీవు ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడవగు గాక ! – ఆశీరర్థక వాక్యం
3. నీవు ఉన్నత స్థితికి వచ్చుగాక ! ఆశీరర్థక వాక్యం

ఏ) కింది వాక్యాలు చదివి అవి ఏరకం వాక్యాలో రాయండి.
1. నాయనా ! వర్ధిల్లు !
2. రహీమ్ నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు.
3. సరోజా! సద్విద్యా ప్రాప్తిరస్తు !
4. ఎల్విన్ ! నువ్వు పాఠశాలకు వెళ్ళవచ్చును.
5. నీకు ఎల్లెడలా శుభం కలుగుగాక !
6. నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిరావచ్చును.

వాక్యంవాక్యపు రకం
1. నాయనా ! వర్ధిల్లు !ఆశీరర్థక వాక్యం
2. రహీమ్ నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు.అనుమత్యర్థక వాక్యం
3. సరోజా! సద్విద్యా ప్రాప్తిరస్తు !ఆశీరర్థక వాక్యం
4. ఎల్విన్ ! నువ్వు పాఠశాలకు వెళ్ళవచ్చును.అనుమత్యర్థక వాక్యం
5. నీకు ఎల్లెడలా శుభం కలుగుగాక !ఆశీరర్థక వాక్యం
6. నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిరావచ్చును.అనుమత్యర్థక వాక్యం

AP Board 6th Class Telugu Solutions Chapter 11 డూడూ బసవన్న

ఐ) జతపర్చండి.

1. నువ్వు పద్యం చదివావా?అ) ఆశీరర్థకం
2. అల్లరి చేయకండి.ఆ) ఆశ్చర్యార్థకం
3. అబ్బో! పువ్వు ఎంత బాగుందో !ఇ) ప్రశ్నార్థకం
4. సుభాష్ నీకు శ్రేయస్సు కలుగుగాక !ఈ) నిషేధార్థకం

జవాబు:

1. నువ్వు పద్యం చదివావా?ఇ) ప్రశ్నార్థకం
2. అల్లరి చేయకండి.ఈ) నిషేధార్థకం
3. అబ్బో! పువ్వు ఎంత బాగుందో !ఆ) ఆశ్చర్యార్థకం
4. సుభాష్ నీకు శ్రేయస్సు కలుగుగాక !అ) ఆశీరర్థకం

చమత్కార పద్యం

కప్పను చూసి పాము వణికింది అని సమస్యను ఒక కవికి ఇవ్వడం జరిగింది. కప్పను చూసి పాము వణకదు. ఈ సమస్యకు కవి కింది విధంగా పరిష్కారం చూపాడు.

కుప్పలు కావలిగాయగ
చెప్పులు కర్రయును బూని శీఘ్రగతిం దా
జప్పుడగుచు వచ్చెడి వెం
కప్పను గని ఫణివరుండు గడగడ వణికెన్.

భావం :
పద్యం చివరిపాదంలో కప్ప దాని ముందరి అక్షరంతో కలిసి వెంకప్ప అయింది. ఆ వెంకప్ప కుప్పలు కాయడానికి చెప్పులు వేసుకొని కర్రతో బయలుదేరాడు. ఆ వెంకప్పను చూసి ఒక పాము గడగడ వణికిందట.

డూడూ బసవన్న – రచయిత పరిచయం

రచయిత పేరు : రావూరి భరద్వాజ

జననం : 1927 జూలై 5వ తేదీన గుంటూరు జిల్లాలోని తాడికొండలో జన్మించారు.

తల్లిదండ్రులు : మల్లికాంబ, కోటయ్య దంపతులు.

ఉద్యోగం : వ్యవసాయం, ప్రెస్సులో ఉద్యోగం, జమీన్ రైతు పత్రికా సంపాదక వర్గంలోనూ, జ్యోతి, సమీక్ష మొదలైన పత్రికలో పనిచేశారు.

రచనలు : విమల – తొలికథ, అపరిచితులు, కథాసాగరం వంటి 37 కథా సంపుటాలు, ఉడుతమ్మ ఉపదేశం, కీలుగుర్రం వంటి 43 పిల్లల కథలు, కరిమ్రింగిన వెలగపండు, జలప్రళయం వంటి 17 నవలలు రచించారు.

అవార్డులు : పాకుడు రాళ్లు నవలకు జ్ఞానపీఠ పురస్కారం, సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం, రాజాలక్ష్మీ పౌండేషన్ అవార్డు, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం, కళారత్న (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం), లోకనాయక్ ఫౌండేషన్ పురస్కారం వంటివి పొందారు. ప్రస్తుత పాఠ్యభాగం ‘జీవన సమరం’ అనే వ్యథార్త జీవుల యథార్థ గాథల పుస్తకం నుండి తీసుకొన్నారు.

కఠినపదాలు – అర్థాలు

ప్రభువు = పరిపాలకుడు
దణ్ణం = దండం
కనుమరుగు = నశించు
చందము = విధము
ప్రాచీనం= పూర్వకాలం
పుడక = పుల్ల
గొడ్డుమోతు = సంతానం లేనిది
ముంగాళ్లు = ముందరి కాళ్లు
సుబ్బరంగా = శుభ్రంగా
సాదిక = సారధ్య
మకాం = నివాసం
ఉడకేసుకొని = వండుకొని
ఉత్తరీయం = పైబట్ట (తువ్వాలు, కండువా)
దాటిపోయింది = వెళ్లిపోయింది

AP Board 6th Class Telugu Solutions Chapter 11 డూడూ బసవన్న

గడి = గంగిరెద్దాడే ప్రదేశం
దేదీప్యమానంగా = ప్రకాశవంతంగా
ఘట్టం = సంఘటన
తిలోదకాలివ్వడం = వదిలేయడం
గొడ్డు = పశువు
చిందులు = గంతులు
మాసం = నెల
గంగడోలు = ఆవు మెడ దగ్గర మెత్తటి చర్మం
క్రీడ = ఆట

AP Board 6th Class Telugu Solutions Chapter 10 త్రిజట స్వప్నం

SCERT AP Board 6th Class Telugu Solutions 10th Lesson త్రిజట స్వప్నం Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Telugu Solutions 10th Lesson త్రిజట స్వప్నం

6th Class Telugu 10th Lesson త్రిజట స్వప్నం Textbook Questions and Answers

వినడం – ఆలోచించి మాట్లాడడం
AP Board 6th Class Telugu Solutions Chapter 10 త్రిజట స్వప్నం 1

ప్రశ్న 1.
చిత్రంలో ఎవరెవరు ఉన్నారు?
జవాబు:
చిత్రంలో అన్నాచెల్లెలు ఉన్నారు.

ప్రశ్న 2.
పాప ఎందుకు బాధపడుతుంది?
జవాబు:
పాప తన తండ్రి గురించి బాధపడుతోంది.

ప్రశ్న 3.
అన్నయ్య చెల్లికి ఎలాంటి మాటలు చెబుతున్నాడు?
జవాబు:
అన్నయ్య చెల్లికి ఓదార్పు మాటలు చెబుతున్నాడు.

అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
పాఠంలోని పద్యాల భావం సొంత మాటలలో చెప్పండి.
జవాబు:
ఓ స్త్రీలారా ! వినండి. అని త్రిజట చెప్పింది. తను కలగన్నది. ఆ కలలో లంకాద్వీపం సముద్రంలో మునిగిపోయినట్లు, రావణుని రత్న కిరీటాలు నేలపడినట్లు, రాముడు మదించిన ఏనుగు నెక్కి సీతాదేవిని తీసుకొని వెడుతున్నట్లు కలగన్నది. రాముడు, సీత పవిత్రులు. సీతాదేవితో కఠినంగా మాట్లాడవద్దన్నది. ఇటుపైన ఆమె వలన రక్షణ పొందాలన్నది. సీతమ్మను తప్పక రాముడు తీసుకొని వెడతాడని చెప్పింది. తమను కాపాడమని ప్రార్థించింది. రాక్షస స్త్రీలు నిద్రపోయేరు. సీతాదేవి దుఃఖించింది. శ్రీరాముడు బాగున్నాడు. సీతాదేవిని తప్పక తీసుకొని వెడతాడని ‘హనుమ సీతతో చెప్పాడు.

AP Board 6th Class Telugu Solutions Chapter 10 త్రిజట స్వప్నం

ప్రశ్న 2.
త్రిజటకు లంకను గురించి ఏమని కల వచ్చిందో రాయండి.
జవాబు:
త్రిజటకు కల వచ్చింది. ఆ కలలో లంకాద్వీపం సముద్రంలో మునిగిపోతున్నట్లు కనిపించింది. రావణుని తలలపై ప్రకాశించే రత్న కిరీటాలు నేలపై పడినట్లు ఆమెకు కలలో కనిపించింది.

ప్రశ్న 3.
త్రిజట స్వప్నం పాఠ్యభాగ నేపథ్యం రాయండి.
జవాబు:
రావణుడు సీతను అపహరించాడు. సీతతో లంకకు చేరాడు. అశోకవనంలో శింశుపా వృక్షం కింద ఆమెను ఉంచాడు. తనకు అనుకూలంగా సీత మనసును మార్చమని రాక్షస స్త్రీలను ఆదేశించాడు. రాక్షస స్త్రీలు ఎన్నో రకాలుగా సీతకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. చివరకు చంపుతామని భయపెట్టారు. ఆ సమయంలో అంతవరకు నిదురించిన త్రిజట మేల్కొంది. తనకు వచ్చిన కలను గురించి కాపలాగా ఉన్న తోటి రాక్షస స్త్రీలతో చెప్పింది. అశోకవనంలో కష్టాలలో ఉన్న సీతకు త్రిజట చెప్పే ఓదార్పు మాటలే ఈ పాఠ్యభాగ నేపథ్యం.

ప్రశ్న 4.
కింది పద్యాన్ని చదివి, అడిగిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
తనవారు లేనిచోటను
జనవించుక లేనిచోట, జగడము చోటన్
అనుమానమైనచోటను
మనుజుడచట నిలువదగదు మహిలో సుమతీ !

అ) తనవారు అంటే ఎవరు?
జవాబు:
తనవారు అంటే తన బంధువులు, తన మిత్రులు.

ఆ) జగడం అంటే ఏమిటి?
జవాబు:
జగడం అంటే గొడవ.

ఇ) ఈ పద్యం ఏ శతకంలోనిది?
జవాబు:
ఈ పద్యం సుమతీ శతకంలోనిది.

ఈ) మనిషి ఎక్కడెక్కడ నివసించకూడదు?
జవాబు:
తనవారు లేనిచోట, చనువు లేనిచోట, గొడవలు జరిగేచోట, అనుమానించే చోట మనిషి నివసించకూడదు.

వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
త్రిజట తోటి రాక్షస స్త్రీలతో సీతాదేవిపట్ల ఎలా నడచుకోవాలని చెప్పింది?
జవాబు:
రాముడు పవిత్రాత్మ గలవాడు. సీతాదేవి ఆయన రాణి. కనుక సీతాదేవిని రక్షిస్తున్న రాక్షస స్త్రీలెవ్వరూ కఠినంగా మాట్లాడకూడదు. ఇటుపైన సీతాదేవి వల్లనే రాక్షస స్త్రీలందరూ రక్షించబడాలి. కనుక సీతాదేవిని జాగ్రత్తగా చూడాలని త్రిజట రాక్షస స్త్రీలకు చెప్పింది.

AP Board 6th Class Telugu Solutions Chapter 10 త్రిజట స్వప్నం

ప్రశ్న 2.
కవయిత్రి మొల్ల గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి.
జవాబు:
మొల్ల పూర్తి పేరు ఆత్కూరి మొల్ల. ఆమె 16వ శతాబ్దపు కవయిత్రి. ఆమె రామాయణం తెలుగులో రచించారు. ఆమె పద్యాలు సరళంగా, రమణీయంగా ఉంటాయి.

ప్రశ్న 3.
తనను రక్షించేవారు లేరని బాధపడుతున్న సీతాదేవిని హనుమంతుడు ఏమని ఓదార్చాడు?
జవాబు:
శ్రేష్ఠుడైన శ్రీరాముడు సీతాదేవిని రక్షించడానికి ఉన్నాడు. వానరులతో కలిసి వస్తాడు. తప్పనిసరిగా ఆమెను తీసుకొని వెడతాడు. అది నిజమని సీతాదేవిని హనుమంతుడు ఓదార్చాడు.

ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
త్రిజట తన కలలో వచ్చిన అంశాలను తోటి వారితో ఎలా వివరించిందో మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
అశోకవనంలో సీతాదేవికి కాపలాగా ఉన్న రాక్షస స్త్రీలతో త్రిజట తన కలలో వచ్చిన అంశాలను వివరించింది. తను కల కనినట్లు చెప్పింది. ఆ కలలో లంకాద్వీపం సముద్రంలో మునిగిపోయింది. తమ ప్రభువు తలలపై ప్రకాశించే రత్న కిరీటాలు నేలపై పడ్డాయి. రాముడు ఆనందంగా ఉన్నాడు. మదించిన ఏనుగును శ్రీరాముడు ఎక్కాడు. కాంతితో ప్రకాశిస్తున్న సీతను శ్రీరాముడు తీసుకొని వెడుతున్నాడు. అని వివరించింది.

ప్రశ్న 2.
త్రిజట సీతను ఎలా ఓదార్చింది? ఆ తరువాత ఏం జరిగిందో వివరించండి.
జవాబు:
త్రిజట “అమ్మా ! మీరు భయపడవద్దు. మనసులో ఆనందం నింపుకో ! నీ భర్త వచ్చి నిన్ను త్వరలో తీసుకొని వెళతాడు. నీవే మమ్ములనందరిని రక్షించాలి” అని సీతను ఓదార్చింది. ఆ తరువాత రాక్షస స్త్రీలందరూ నిద్రపోయారు. అప్పుడు హనుమంతుడు మానవ భాషలో “సీతమ్మ తల్లీ ! రాముడు క్షేమంగా ఉన్నాడు. వానర సైన్యంతో త్వరలో వస్తాడు. నిన్ను తీసుకొని వెళతాడు. ఈ మాటలు నిజం” అని చెప్పి సీతను ఓదార్చాడు.

ప్రశ్న 3.
రాష్ట్రస్థాయి ఆటలపోటీకి ఎన్నికై గెలుపు గురించి ఆందోళన చెందుతున్న మీ మిత్రుడికి ధైర్యం చెబుతూ లేఖ రాయండి.
జవాబు:

లేఖ

కర్నూలు,
XXXXX.

ప్రియమైన
శ్రీధర్ కు, శ్రీకర్ వ్రాయు లేఖ

ఇక్కడంతా క్షేమం. అక్కడ మీరంతా క్షేమమని తలచెదను.

నీవు రాష్ట్రస్థాయి ఆటలపోటీకి ఎన్నికైనందుకు అభినందనలు. జిల్లాస్థాయిలో నెగ్గినవాడికి రాష్ట్రస్థాయిలో నెగ్గడం పెద్ద కష్టమేం కాదు. దీని గురించి ఆందోళన చెందకు. నీ పట్టుదల, కృషి మాకు తెలుసు. పట్టుదలతో కృషి చేస్తే దేనినైనా సాధించవచ్చనే మన తెలుగు ఉపాధ్యాయుల మాటలు మరచిపోకు. మన వ్యాయామ ఉపాధ్యాయులు జాతీయస్థాయి క్రీడా విజేత. ఆయన పర్యవేక్షణలో అపజయం ఉండదు. నీ ఆత్మవిశ్వాసమే నిన్ను గెలిపిస్తుంది. ధైర్యంతో ఆడు. విజయం సాధించు. నీ పేరు టి.వి.లోనూ, పేపర్లలోనూ మార్ర్మోగాలి. ఉంటాను. నీ విజయగాథతో రిప్లై రాయి.

ఇట్లు,
నీ స్నేహితుడు,
సి. శ్రీకర్ వ్రాలు.

చిరునామా:
టి. శ్రీధర్, 6వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
పేరుసోముల, కర్నూలు జిల్లా.

భాషాంశాలు

అ) కింద గీతగీసిన మాటలకు అర్థాలు రాయండి. వాటితో సొంతవాక్యం రాయండి.
ఉదా : ఆ చెట్టు కింద ఉన్న ఇంతి సీతాదేవి.
ఇంతి = స్త్రీ
మసం స్త్రీలను గౌరవించాలి.

1. రావణుని తల పైనున్న కోటీరం నేలపై పడింది.
కోటీరం = కిరీటం
ప్రజాస్వామ్యంలో రాచరికాలు కిరీటాలు లేవు.

2. ఈ ఉర్వి పై మనమంతా నివసిస్తున్నాము.
ఉర్వి = భూమి
భూమిని జాగ్రత్తగా కాపాడాలి.

3. సీతాదేవి భర్త అయిన రాఘవుడు వస్తాడు.
రాఘవుడు = శ్రీరాముడు
శ్రీరాముడు ధర్మ స్వరూపుడు.

4. శ్రీరాముడు లెస్సగా ఉన్నాడు,
లెస్స = బాగు
అన్ని భాషలలోకీ తెలుగుభాష బాగుగా ఉంటుంది.

AP Board 6th Class Telugu Solutions Chapter 10 త్రిజట స్వప్నం

ఆ) కింది వాక్యాలను చదవండి. ప్రతి వాక్యంలోను ఒక పదానికి అదే అర్ధం వచ్చే మరొక పదం ఉన్నది. ఆ పదాలను గుర్తించి రాయండి.
ఉదా :
భూమిపై మనం నివసిస్తున్నాం. ఈ ధరణిలో మనతోపాటు అనేక ప్రాణులున్నాయి.

1. సీతను చూడగానే హనుమంతుడు సంతోషించాడు. శ్రీరాముని గురించి వినగానే సీతమనసు ఎలమితో పొంగిపోయింది.
జవాబు:
సంతోషం , ఎలమి

2. గురువు చెప్పిన మాట వినాలి. ఆ ఉక్తి మనకు మేలు చేస్తుంది.
జవాబు:
మాట, ఉక్తి

3. చంద్రుడి కాంతి మనకు ఆనందాన్నిస్తుంది. ఆ వెలుగు ప్రకృతిని కూడా పరవశింప జేస్తుంది…
జవాబు:
కాంతి, వెలుగు

4. ఎవరైనా బాధలో ఉన్నప్పుడు వారిపై కరుణ చూపాలి. మనం చూపే దయ వారికి ఆ బాధను తగ్గిస్తుంది.
జవాబు:
కరుణ, దయ

ఇ) కింది పదాలకు ప్రకృతి, వికృతులను జతపరచి రాయండి.
భాష, అమ్మ, నిద్ర, బాస, అంబ, నిదుర
జవాబు:
ప్రకృతి – వికృతి
ఉదా : భాష – బాస
అంబ – అమ్మ
నిద్ర – నిదుర

వ్యాకరణాంశాలు

ఈ) కింది పదాలను విడదీయండి.
ఉదా : శుద్ధాత్ముడు = శుద్ధ + అత్ముడు
రామాలయం = రామ + ఆలయం

ఉదా : రవీంద్రుడు = రవి + ఇంద్రుడు
2. కవీంద్రుడు = కవి + ఇంద్రుడు

ఉదా : భానూదయం = భాను + ఉదయం
3. గురూపదేశం = గురు + ఉపదేశం

ఉదా : పితౄణం = పితృ + ఋణం
4. మాతౄణం = మాతృ + ఋణం

పై మాటలలో ఈ కింది మార్పు జరిగింది.
1. అ + ఆ = ఆ
2. ఇ + ఇ = ఈ
3. ఉ + ఉ = ఊ
4. ఋ + ఋ = ఋ
‘అ-ఇ-ఉ-ఋ’ అనే వర్ణాలకు అవే వర్ణాలు (సవర్ణాలు) కలిసినప్పుడు తప్పనిసరిగా దీర్ఘం రావడాన్ని ‘సవర్ణదీర్ఘ సంధి’ అంటారు.
‘అ’ వర్ణానికి ‘అ ఆ’ లు సవర్ణాలు.
‘ఇ’ వర్ణానికి ‘ఇ ఈ’ లు సవర్ణాలు .
‘ఉ’ వర్ణానికి ‘ఉ-ఊ’ లు సవర్ణాలు.
‘ఋ’ వర్ణానికి ‘ఋ ఋ’ లు సవర్ణాలు.

పైన సంధి జరిగిన పదాలు సంస్కృత పదాలు / సంస్కృత పదాల మధ్య జరిగే సంధులను ‘సంస్కృత సంధులు’ అంటారు.

AP Board 6th Class Telugu Solutions Chapter 10 త్రిజట స్వప్నం

ఉ) కింది పదాలను విడదీయండి.

ఉదా : విద్యార్థి = విద్యా + అర్థి = (ఆ + అ = ఆ)
1. కవీశ్వరుడు = కవి + ఈశ్వరుడు = (ఇ + ఈ = ఈ)
2. కోటీశ్వరుడు = కోటి + ఈశ్వరుడు = (ఇ + ఈ = ఈ)
3. వధూపేతుడు = వధూ + ఉపేతుడు = (ఊ + ఉ = ఊ)
4. దేవాలయం = దేవ + ఆలయం = (అ + ఆ = ఆ)

ఊ) కింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చండి.

1. సీతకు ఆనందం కలిగింది.
రామునికి ఆనందం కలిగింది.
సంయుక్త వాక్యం : సీతారాములకు ఆనందం కలిగింది.

2. త్రిజట బాధపడింది.
ద్విజట బాధపడింది.
సంయుక్త వాక్యం : త్రిజట, ద్విజటలు బాధపడ్డారు.

3. మీరు కఠినంగా మాట్లాడకండి.
మీరు కోపంగా మాట్లాడకండి.
సంయుక్త వాక్యం : మీరు కఠినంగానూ, కోపంగానూ మాట్లాడకండి.

4. హనుమంతుడు గొప్పవాడు.
హనుమంతుడు మంచి భక్తుడు.
సంయుక్త వాక్యం : హనుమంతుడు గొప్పవాడు మరియు మంచి భక్తుడు.

5. అపర్ణ సంగీతం నేర్చుకుంది.
అపర్ణ నృత్యం నేర్చుకుంది.
సంయుక్త వాక్యం : అపర్ణ సంగీతం మరియు నృత్యం నేర్చుకుంది.

AP Board 6th Class Telugu Solutions Chapter 10 త్రిజట స్వప్నం

ఎ) ప్రశ్నార్థక వాక్యం :
వాక్యంలో ప్రశ్నను సూచించే అర్థం ఉంటే దానిని ప్రశ్నార్థక వాక్యం అంటారు.
ఉదా : 1. త్రిజట ఏం మాట్లాడుతుంది ?
2. సీత ఎందుకు బాధపడింది?

మీరు కొన్ని ప్రశ్నార్థక వాక్యాలు రాయండి.
1. హనుమంతుడు ఎవరిని చూశాడు?
2. త్రిజట తన కల గురించి ఎవరికి చెప్పింది?
3. సీతాదేవి భర్త పేరేమిటి?

ఏ) ఆశ్చర్యార్థక వాక్యం :
వాక్యంలో ఏదైనా ఆశ్చర్యం కలిగించే అర్థం వచ్చినట్లైతే దాన్ని ఆశ్చర్యార్థక వాక్యం అంటారు.
ఉదా :
1. ఆహా ! ఎంత బాగుందో !
2. ఔరా ! సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో !

మీరు కొన్ని ఆశ్చర్యార్థక వాక్యాలను రాయండి.
1. ఆహా ! అరణ్యం ఎంత పచ్చగా ఉందో !
2. అబ్బ ! హనుమ ఎంత బలవంతుడో !
3. ఓహో ! ఇది ఇల్లా ! నందనవనమా !

త్రిజట స్వప్నం కవయిత్రి పరిచయం

కవయిత్రి పేరు : ఆత్కూరి మొల్ల
కాలం : 16వ శతాబ్దం
జన్మస్థలం : కడప జిల్లాలోని గోపవరం
రచనలు : 871 గద్య పద్యాలతో మొల్ల రామాయణం రచించారు. చక్కని పద్యాలతో సరళంగా,రమణీయంగా రాశారు. తెలుగు సాహితీవనంలో పద్యాలనే మల్లెల పరిమళాలను వెదజల్లి చిరకీర్తిని మూటకట్టుగొన్న రచయిత్రి. ఈ పాఠం మొల్ల రాసిన రామాయణంలోని సుందరకాండలోనిది.

పద్యాలు – అర్థాలు – భావాలు

1. మ! కలగంటిన్ వినుఁడింతులార! మన లంకాద్వీప మీయబి లో
పల వ్రాలన్, మన రావణేశ్వరుని శుంభద్రత్నకోటీరముల్
కలనన్ గూల రఘూద్వహుండెలమితో గంధిద్విపం బెక్కి, యు
జ్జ్వలకాంతిన్ విలసిల్లుసీతఁ గొనిపోవన్ మిన్నకే నిప్పుడే
అర్థాలు :
కంటిన్ = చూచితిని
ఇంతులు = స్త్రీలు
అబ్ధి = సముద్రం
ఈశ్వరుడు = ప్రభువు
శుంభత్ = ప్రకాశించే
కోటీరములు = కిరీటాలు
ఎలమి = సంతోషం
ద్విపం = ఏనుగు
ఉజ్జ్వలము = వెలుగునది
విలసిల్లు = ప్రకాశించు

భావం :
“ఓ స్త్రీలారా! వినండి. నేను కలగన్నాను. ఆ కలలో లంకాద్వీపం సముద్రంలో మునిగి పోయింది. రావణుని తలలపై ప్రకాశించే రత్నకిరీటాలు నేలపై రాలిపడ్డాయి. రాముడు ఆనందంతో ఉన్నాడు. మదించిన ఏనుగును ఎక్కాడు. కాంతితో ప్రకాశిస్తున్న సీతాదేవిని తీసుకుని వెళుతున్నాడు” అని అప్రయత్నంగా తనకు కలిగిన కలను త్రిజట వివరించింది.

AP Board 6th Class Telugu Solutions Chapter 10 త్రిజట స్వప్నం

2. క॥ శుద్దాత్ముఁడైన రాముఁడు
శుద్దాంతపుదేవిఁ గానశుభసూచకముల్
శుద్ధమయి తోఁచుచున్నవి
సిద్ధం బీమాట వేదసిద్ధాంతముగాన్
అర్థాలు :
శుద్ధాత్ముడు = పవిత్రమైన ఆత్మ గలవాడు
శుద్ధాంతము = అంతఃపురము
శుద్ధమయి = పవిత్రమయి
సిద్ధాంతము = స్థిరమైన నిర్ణయం
సిద్ధము = న్యాయమైనది

భావం :
రాముడు పవిత్రమైన ఆత్మ కలవాడు. ఆయన అంతఃపుర రాణి సీతాదేవి కనుక అన్నీ పవిత్రమైన శుభసూచకాలే కనిపిస్తున్నాయి. వేదం యొక్క స్థిరమైన నిర్ణయం లాగా నా మాట న్యాయమైనది.

3. క॥ కావున నిక్కోమలియెడఁ
గావలి యున్నట్టిమీరు కఠినోక్తులు గా
నేవియు నాడకుఁ, డిఁక నీ
దేవియ రక్షింప మనకు దిక్కగు మీఁదన్
అర్థాలు :
కావున = కనుక కావలి = కాపలా
కఠిన + ఉక్తులు – పరుషమైన మాటలు
ఆడకుడు = మాట్లాడకండి
దిక్కు = శరణు
మీదన్ = ఇటుపైన

భావం :
అందువల్ల సీతాదేవిని రక్షిస్తున్న మీరు కఠినంగా మాట్లాడవద్దు. ఇకమీదట ఈ సీతాదేవి వల్లనే మనం రక్షింపబడతాము.

4. వ|| అని చెప్పి మటియును
భావం : అని చెప్పి ఇంకా ఇలా అంది.

5. క॥ అమ్మా వెఱవకు మదిలో
నిమ్ముగ మటి వేడ్క నుండు మిఁక, నీ మగఁడున్
నెమ్మిగ నినుఁ గొనిపోవును
మమ్మందఱ మనుపు మమ్మ! మఱవక కరుణన్
అర్థాలు :
వెఱవకు = భయపడకు
మది = మనస్సు
ఇమ్ముగ = ఆనందంగా
నెమ్మిగ = ప్రేమగ
మునుపు = ముందు, పూర్వం
మనుపుము = బ్రతికించుము
కరుణన్ = దయతో రక్షించుము

భావం :
“అమ్మా! భయపడవద్దు. మనసులో ఆనందాన్ని నింపుకుని సుఖంగా ఉండు. నీ భర్త ప్రేమతో నిన్ను తీసుకొని వెళతాడు. తప్పక దయతో మమ్మల్ని కాపాడు.”

6. ఆ|| అనుచు దనుజకాంత లంతంత నెడఁబాసి
నిదుర వోయి రంత నదరి సీత
తనకు దిక్కు లేమిఁ దలపోసి దుఃఖింపఁ
బవనసుతుఁడు మనుజ భాషఁ బలికె
అర్థాలు :
దనుజకాంతలు = రాక్షస స్త్రీలు
ఎడబాసి = విడిచి
అదరి = భయపడి, ఉలిక్కిపడి
లేమి = లేకపోవడం
తలపోసి = ఆలోచించి
పవనము = గాలి, వాయువు
సుతుడు = కొడుకు
పవనసుతుడు = హనుమంతుడు

భావం :
అంటూ రాక్షస స్త్రీలు దూరంగా జరిగి నిద్ర పోయారు. సీత తనకు సమీపంలో రక్షించేవారు ఎవరూ లేరనే భావనతో దుఃఖించింది. అప్పుడు ఆంజనేయుడు మానవ భాషలో ఇలా పలికాడు.

AP Board 6th Class Telugu Solutions Chapter 10 త్రిజట స్వప్నం

7. క॥ ఉన్నాఁడు లెస్స రాఘవుఁ
డున్నాఁ డిదె కపులఁ గూడి, యురుగతి రానై
యున్నాఁడు, నిన్నుఁ గొని పో
నున్నాఁ డిది నిజము నమ్ము ముర్వీతనయా!
అర్థాలు :
లెస్స = బాగుగా
రాఘవుడు = రాముడు
కపులన్ = కోతులతో
కొనిపోవుట = తీసుకొని వెళ్లుట
ఉరుగతి = వేగంగా, గొప్పగా
ఉర్వి = భూమి
తనయ = కుమార్తె
ఉర్వీతనయ : సీతాదేవి

భావం : ఓ సీతమ్మా! శ్రేష్ఠుడైన రాముడు నిన్ను రక్షించడానికి ఉన్నాడు. ఇప్పుడే వానరులతో కలిసి తగిన మార్గంలో వస్తాడు. నిన్ను తీసుకొని వెళతాడు. ఇది నిజం.

AP Board 6th Class Telugu Solutions Chapter 9 ధర్మ నిర్ణయం

SCERT AP Board 6th Class Telugu Solutions 9th Lesson ధర్మ నిర్ణయం Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Telugu Solutions 9th Lesson ధర్మ నిర్ణయం

6th Class Telugu 9th Lesson ధర్మ నిర్ణయం Textbook Questions and Answers

వినడం – ఆలోచించి మాట్లాడడం
AP Board 6th Class Telugu Solutions Chapter 9 ధర్మ నిర్ణయం 1

ప్రశ్న 1.
చిత్రాలను చూసి కథ చదవండి, మాట్లాడండి.
జవాబు:
కథ :
ఒక జింక ఒక పులికి చిక్కింది. తనను చంపవద్దని పులిని ప్రార్థించింది. తన బిడ్డకు పాలిచ్చి వస్తానని నమ్మబలికింది. పులికి దయకలిగింది. జింకను విడిచిపెట్టింది. జింక బిడ్డకు పాలిచ్చి, బిడ్డకు మంచి మాటలు చెప్పి తిరిగి వచ్చింది. పులి ఆశ్చర్యపోయింది. అన్నమాట నిలబెట్టుకొన్న జింకను చంపకుండా విడిచి పెట్టింది.

జింక యొక్క నిజాయితీయే దాని ప్రాణాలు కాపాడింది. మాట తప్పకుండా వచ్చిన జింక, క్రూరమైన పులి స్వభావాన్ని కూడా మార్చింది. సత్యమునకు తప్పక విజయం లభిస్తుంది.

అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
మాధవవర్మ వంటి ధర్మాత్ములు ఇప్పుడు మనల్ని పరిపాలిస్తే ఎలా ఉంటుంది? మాట్లాడండి. చెప్పండి.
జవాబు:
మాధవవర్మ వంటి ధర్మాత్ములు పరిపాలిస్తే ప్రజలంతా ధర్మపరాయణులై ఉంటారు. ఎవరూ అబద్దం ఆడరు. మోసం చేయరు. పెద్దలను ఎదిరించరు. తమది కాని దానిని ఆశించరు. తమకు కేటాయించిన పనిని సకాలంలో పూర్తి చేస్తారు. హత్యలు, ఆత్మహత్యలు ఉండవు. ప్రమాదాలు జరుగవు. సుభిక్షంగా ఉంటుంది.

ప్రశ్న 2.
రాజకుమారుడు చేసిన పొరపాటు ఏమిటి?
జవాబు:
అతివేగంగా పరిగెత్తే గుజ్రాలను కట్టిన రథాన్ని ప్రజలు తిరిగే కోటవీధిలో వేగంగా నడపడం తప్పు. అతని మితిమీరిన ఉత్సాహం వలన ఆ రథ చక్రాల కిందపడి ఒక యువకుడు మరణించాడు. అది రాజకుమారుడు చేసిన పొరపాటు.

AP Board 6th Class Telugu Solutions Chapter 8 మేలుకొలుపు

ప్రశ్న 3.
దుర్గాదేవి ఎందుకు ప్రసన్నురాలైంది?
జవాబు:
ఒక వృద్ధురాలి కొడుకు మరణానికి తన కుమారుడు కారణమయ్యాడని మాధవవర్మకు తెలిసింది. మాధవవర్మ ధర్మాత్ముడు. వివేకి. తన కుమారునికి మరణశిక్ష విధించాడు. ఆ సాయంకాలమే అమలు జరిపాడు. ఆయన ధర్మనిరతికి దుర్గాదేవి ప్రసన్నురాలయింది. బంగారు వర్షం కురిపించింది. మరణించిన వారిద్దరినీ బ్రతికించింది.

ప్రశ్న 4.
కింది సంభాషణ చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

కెజియా : సుప్రజా ! సెలవుల్లో ఎక్కడి కెళ్ళావ్?
సుప్రజ : నేనా ! మా కుటుంబంతో యాగంటి క్షేత్రం చూడటానికి వెళ్ళాను.
కెజియా : ఓహెూ ! అలాగా ఆ పుణ్యక్షేత్రం ప్రత్యేకత ఏమిటో !
సుప్రజ : ఒకటేమిటి? అనేక ప్రత్యేకతల నిలయమది.
కెజియా : నిజమా ! అవేమిటో చెప్పు.
సుప్రజ : ‘యాగంటి’ కర్నూలు జిల్లా నల్లమల కొండల్లో ఉంది. అత్యంత రమణీయ ప్రదేశం, సాధారణంగా శివాలయాల్లో శివుడు లింగరూపంలో ఉంటాడు. కానీ ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు విగ్రహరూపంలో దర్శనం ఇస్తారు.
కెజియా : అలాగా !
సుప్రజ . : ఔను ! ఆలయం వెలుపల ‘అగస్త్య పుష్కరిణి’ అనే కొలను ఉంది. అందులో నీళ్ళు ఎంతో స్వచ్ఛంగా ఉన్నాయి. అంతేకాదు అక్కడ ఉన్న నంది విగ్రహం రోజు రోజుకూ పెరుగుతూ ఉండటం ముఖ్యమైన విశేషం. అక్కడ మూడు సహజసిద్ధంగా ఏర్పడిన గుహలున్నాయి. వీరబ్రహ్మంగారు ఆ గుహల్లోనే కూర్చుని కాలజ్ఞానం రాశారట !
పర్వీన్ : ఏంటి ? మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండిపోయారు. పదండి. బడికి వెళ్తాం ! (ముగ్గురూ నిష్క్రమిస్తారు)

ప్రశ్నలు – జవాబులు :
అ) యాగంటిలోని ఉమామహేశ్వరాలయానికి, మిగిలిన శివాలయాలకు తేడా ఏమిటి?
జవాబు:
సాధారణంగా శివాలయాలలో శివుడు లింగరూపంలో ఉంటాడు. కాని యాగంటిలో పార్వతీ, పరమేశ్వరులు విగ్రహరూపంలో ఉంటారు.

ఆ) అగస్త్య పుష్కరిణి ప్రత్యేకత ఏమిటి?
జవాబు:
అగస్త్య పుష్కరిణిలో నీరు ఎప్పుడూ నిర్మలంగా ఉంటుంది.

ఇ) కాలజ్ఞానం ఎవరు రాశారు?
జవాబు:
వీరబ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు.

ఈ) పై సంభాషణ ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
యాగంటి క్షేత్రం ఏ జిల్లాలో ఉంది?

వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
దుర్గాదేవిని కనకదుర్గగా ప్రజలెందుకు పిలుస్తున్నారు?
జవాబు:
మాధవవర్మ కుమారుని రథం క్రింద పడి ఒక యువకుడు మరణించాడు. ధర్మాత్ముడైన మాధవవర్మ తన కుమారుడు చేసిన తప్పుకు మరణశిక్ష విధించి అమలు జరిపాడు. అతని ధర్మనిరతికి దుర్గాదేవి ఆనందించింది. విజయవాడ నగరమంతా బంగారుకాసుల వర్షం కురిపించింది. అలా కనకవర్షం కురిపించిన దుర్గాదేవిని ఆనాటి నుంచి కనకదుర్గగా ప్రజలంతా పిలుస్తున్నారు.

AP Board 6th Class Telugu Solutions Chapter 8 మేలుకొలుపు

ప్రశ్న 2.
మాధవవర్మ దృష్టిలో అందరూ సమానులేనని ఎట్లా చెప్పగలవు?
జవాబు:
మాధవవర్మ రాజ్యంలో ఎవరు తప్పుచేసినా తగిన శిక్ష విధించేవాడు. తప్పు చేసిన వారిపట్ల తనవాళ్ళు, పరాయివాళ్ళు అనే భావన ఉండేది కాదు. అతని రాజ్యంలో వ్యక్తిని చంపినవాడికి మరణశిక్ష విధించేవాడు. రథాన్ని వేగంగా నడిపి ఒక యువకుని మరణానికి మాధవవర్మ కొడుకే కారణమయ్యాడు. ఆ నేరానికి తన కుమారునికి కూడా
మరణశిక్ష విధించి అమలు జరిపాడు. అందుచేత మాధవవర్మ దృష్టిలో అందరూ సమానులే అని చెప్పగలను.

ప్రశ్న 3.
పుత్రవాత్సల్యం అంటే ఏమిటి?
జవాబు:
తల్లిదండ్రులకు తమ పిల్లల పట్ల ఉండే ప్రేమను పుత్రవాత్సల్యం అంటారు.

ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
విజయవాడలో బంగారు వర్షం ఎందుకు కురిసిందో వివరంగా రాయండి.
జవాబు:
విజయవాడను పరిపాలించే మహారాజు పేరు మాధవవర్మ. ఆయన ధర్మాత్ముడు. ఒకసారి ఆయన కుమారుడు రథం మీద చాలావేగంతో కోట వీధిలో ప్రయాణించాడు. ఒక యువకుడు రథం కిందపడి మరణించాడు.

అతని తల్లి వృద్ధురాలు. తనకు న్యాయం చేయమని రాజును అర్థించింది. ఆ నేరం చేసినవాడు తన కుమారుడే అని తెలిసింది. న్యాయం ప్రకారం అతనికి మరణశిక్ష విధించాడు. ఆ సాయంత్రమే అతనిని ఉరి తీయించాడు.

అతని ధర్మనిరతికి దుర్గాదేవి ఆనందించింది. ఘడియసేపు బంగారు వర్షం కురిపించింది. ప్రజలంతా వీథులలోకి వచ్చి, బంగారు కాసులు ఏరుకొన్నారు. మరణించిన వారిద్దరిని బతికించింది.

ప్రశ్న 2.
ధర్మపరాయణుడైన మాధవవర్మ గురించి సొంత మాటల్లో రాయండి.
జవాబు:
మాధవవర్మ ధర్మ పరాయణుడు. ధర్మం, న్యాయం విషయంలో ఆయనకు తనవారు, పరాయివారు అనే భేదం లేదు. ఒకరోజు తన కుమారుని రథచక్రాల కిందపడి ఒక యువకుడు మరణించాడు. ధర్మనిర్ణయం చేయమని, న్యాయాధికారులను ఆదేశించాడు మాధవవర్మ. దానికి మరణశిక్ష తప్ప మరో దారి లేదని న్యాయాధికారులు చెప్పారు. రాజకుమారుడైనా, సామాన్యుడైనా న్యాయదేవతకు సమానమేనని చెప్పారు. బంధుప్రీతికి చోటులేదని చెప్పారు. తీర్పు వింటున్నంతసేపూ మాధవవర్మ మౌనంగా ఉన్నాడు. గంభీరంగా ఉన్నాడు. ఆయన ధర్మాన్ని కాదనలేడు. పుత్రవాత్సల్యం, ధర్మ నిర్ణయం రెండింటికీ ఘర్షణ ఏర్పడినపుడు ధర్మ నిర్ణయమే గెలిచింది. అందుకే మాధవవర్మ పట్ల దుర్గాదేవి కూడా ప్రసన్నురాలైంది.

AP Board 6th Class Telugu Solutions Chapter 8 మేలుకొలుపు

ప్రశ్న 3.
కింద ఇవ్వబడిన పదాల ఆధారంగా కథను రాయండి.

శిబిచక్రవర్తి – కొలువు – పావురం-డేగ – ప్రవేశించడం – శరణు – అభయం – ఇవ్వడం – తక్కెడ – తేవడంతూచడం – సరితూగకపోవడం – సిద్ధమవడం – త్యాగనిరతి – ప్రజలు – మెచ్చుకోవడం – అగ్ని – ఇంద్రుడు – ప్రత్యక్షమవడం – ప్రవేశించడం.
జవాబు:
త్యాగం
ఒకనాడు శిబిచక్రవర్తి కొలువుతీరి ఉన్నాడు. ఆయన కొలువులోనికి ఒక పావురం ప్రవేశించింది. దానిని తరుముకొంటూ ఒక డేగ వచ్చింది. పావురం .శిబి చక్రవర్తిని శరణు వేడింది. తనను కాపాడమని ప్రార్థించింది. శిబి అభయం ఇచ్చాడు. అది తన ఆహారం కనుక తనకు మాంసం కావాలని డేగ అడిగింది. శిబి చక్రవర్తి తక్కెడ తెమ్మన్నాడు. తన శరీరం నుండి మాంసం కోసి తక్కెడలో వేసి పావురంతో తూచాడు. ఎంత మాంసం వేసినా సరిపోలేదు. చివరకు తానే కూర్చున్నాడు. ఆయన త్యాగనిరతిని ప్రజలు మెచ్చుకొన్నారు. అగ్ని, ఇంద్రుడు ప్రత్యక్షమయ్యారు. తామే డేగ, పావురం రూపంలో వచ్చినట్లు చెప్పారు. శిబి చక్రవర్తిని ఆశీర్వదించారు.

భాషాంశాలు

అ) కింద గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. వాటితో సొంత వాక్యాలు రాయండి.
ఉదా : శ్రీకృష్ణుని చేతిలో కంసుడు అసువులు వదిలాడు.
అసువులు = ప్రాణాలు
సమయానికి సరైన వైద్యం అందడంచేత ఒక వ్యక్తి ప్రాణాలు నిలిచాయి.

1. ఘడియ మాత్రంలోనే సత్య వంటపని ముగించింది.
ఘడియ = 24 నిముషాలు.
ఈ రోజు 24 నిముషాల్లోనే 20 కిలోమీటర్లు వెళ్లాను.

2. పర మతాన్ని గౌరవించడం ధర్మం.
పర = ఇతర
ఇతర విషయాలు పట్టించుకోకుండా చదువుకోవాలి.

3. పూర్వం అశ్వాన్ని వాహనంగా ఉపయోగించేవారు.
అశ్వం = గుర్రం
దూరం పరుగెత్తినా గుఱ్ఱం తొందరగా అలసిపోదు.

4. సువర్ణ భూషణాలంటే అందరికీ ప్రీతి.
సువర్ణం = బంగారం
బంగారం ధర నానాటికీ పెరిగిపోతోంది.

ఆ) కింది వాక్యాలలో సమానార్థక పదాలు (పర్యాయ పదాలు) గుర్తించి రాయండి.

1. వాసు గుర్రం ఎక్కి ఊరు బయలుదేరాడు.. ఆ అశ్వం వేగవంతమైంది. గంట లోపలే హయం వల్ల ఊరు చేరిపోయాడు.
జవాబు:
1) గుర్రం
2) అశ్వం
3) హయం

2. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఆదిత్యుని రశ్మి సోకి ప్రకృతి నిదుర లేచింది. రవి తాపాన్ని భరించడం సాధ్యం కాదు.
జవాబు:
1) సూర్యుడు
2) ఆదిత్యుడు
3) రవి

3. అద్రి శిఖరం నుండి సెలయేరు జాలువారుతోంది. కొండపైన నగరం విస్తరించింది. ఆ పర్వతం మీదనే . దేవాలయం వెలసింది.
జవాబు:
1) అది
2) కొండ
3) పర్వతం

AP Board 6th Class Telugu Solutions Chapter 8 మేలుకొలుపు

ఇ) కింది ప్రకృతులను వికృతులతో జతపర్చండి.

1) రథంఅ) ఆన
2) కుమారుడుఆ) అరదం
3) ఆజ్ఞఇ) కొమరుడు

జవాబు:

1) రథంఆ) అరదం
2) కుమారుడుఇ) కొమరుడు
3) ఆజ్ఞఅ) ఆన

ఈ) కింది ఖాళీలను వ్యతిరేక పదాలతో పూరించండి.

1) న్యాయం 2) అసామాన్యం  3) అస్తమిస్తాడు 4) దుఃఖం

1. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. పడమరన …………… (అస్తమిస్తాడు)
2. నా కుమారునికి అన్యాయం జరిగిందని అనుకుంటే ……………….. జరిగింది. (న్యాయం)
3. సుఖం …………….. కావడి కుండలు అంటారు. (దుఃఖం)
4. ప్రతి సామాన్య విషయం ఒక్కోసారి ……………… గా మారుతుంది. (అసామాన్యం)

వ్యాకరణాంశాలు

అ) కింది పదాలను గమనించండి.

1) నాలుగు ముఖాలు
2) మూడు కన్నులు
3) పంచ పాండవులు
4) ముల్లోకాలు
5) ఏడు ద్వారాలు

పై పదాలన్నీ సమాస పదాలే. వాటిలో పూర్వపదం సంఖ్యను సూచిస్తోంది. ఉత్తరపదం నామవాచకాన్ని సూచిస్తోంది. సంఖ్యాపదం పూర్వపదంగా ఉండే సమాసాలను ద్విగు సమాసాలంటారు.

కింది వాక్యాల్లో ద్విగు సమాస పదాలున్నాయి. గుర్తించి రాయండి.
1. వ్యాసుడు వేదాలను చతుర్వేదాలుగా విభజించాడు.
జవాబు:
చతుర్వేదాలు

2. శంకుస్థాపనలో నవధాన్యాలు వాడతారు.
జవాబు:
నవధాన్యాలు

3. ఇంద్రధనుస్సులో సప్తవర్ణాలు ఉంటాయి.
జవాబు:
సప్తవర్ణాలు

ఆ) ముందటి పాఠాలలో అత్వ సంధి పదాలను తెలుసుకున్నారు కదా! కింద ఇచ్చిన అత్వ సంధి పదాలను విడదీయండి.
1. చిన్నప్పుడు
2. తిరగకేమి
3. రామయ్య
4. జరగకేమి
5. రామక్క
6. సీతమ్మ
జవాబు:
1. చిన్నప్పుడు = చిన్న + అప్పుడు – అత్వ సంధి
2. తిరగకేమి = తిరగక + ఏమి – అత్వ సంధి
3. రామయ్య = రామ + అయ్య అత్వ సంధి
4. జరగకేమి జరగక + ఏమి – అత్వ సంధి
5. రామక్క = రామ + అక్క – అత్వ సంధి
6. సీతమ్మ = సీత + అమ్మ – అత్వ సంధి

AP Board 6th Class Telugu Solutions Chapter 8 మేలుకొలుపు

ఇ) ఈ కింది సంధి పదాలను కలిపి రాయండి.
1. రవ్వ + అంత 2. చింత + ఆకు 3. వెంక + అప్ప
జవాబు:
1. రవ్వ + అంత = రవ్వంత – అత్వ సంధి
2. చింత + ఆకు = చింతాకు – అత్వ సంధి
3. వెంక + అప్ప = వెంకప్ప – అత్వ సంధి

ఈ) సంయుక్త వాక్యం :

సమప్రాధాన్యం గల ‘రెండుగాని, అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిస్తే సంయుక్తవాక్యం ఏర్పడుతుంది. ఇందులో అన్నీ ప్రధానవాక్యాలే ఉంటాయి. కాబట్టి, కాని, మరియు వంటి పదాలు వాక్యాలను కలుపుతాయి.

కింద ఇచ్చిన వాక్యాలను గమనించండి. సంయుక్త వాక్యాలుగా మార్చండి.
ఉదా :
మధు బడికి వెళ్లాడు. రహీమ్ బడికి వెళ్ళాడు. జాన్ బడికి వెళ్ళాడు.
మధు, రహీమ్, జాన్ బడికి వెళ్ళారు.

1. సీత అక్క. గీత చెల్లెలు.
2. శారద సంగీతం నేర్చుకుంది. శారద నాట్యం నేర్చుకుంది.
3. నగీస్ స్టేషన్ కి వెళ్లింది. రైలు వెళ్ళిపోయింది.
4. మాధవి పరుగెత్తింది. బస్సు అందలేదు.
5. వర్షాలు వచ్చాయి. చెరువులు నిండలేదు.
జవాబు:
1. సీత, గీత అక్కాచెల్లెళ్ళు.
2. శారద సంగీతం, నాట్యం నేర్చుకుంది.
3. నగీస్ స్టేషనుకు వెళ్ళింది కానీ రైలు వెళ్ళిపోయింది.
4. మాధవి పరుగెత్తింది కానీ బస్సు అందలేదు.
5. వర్షాలు వచ్చాయి కానీ చెరువులు నిండలేదు.

AP Board 6th Class Telugu Solutions Chapter 8 మేలుకొలుపు

ప్రాజెక్టు పని (నాలుగవ నిర్మాణాత్మక మూల్యాంకనం కోసం)

* మీ ప్రాంతంలోని దర్శనీయ స్థలాలను గూర్చిన వివరాలు సేకరించి రాయండి.
జవాబు:
మేము విజయవాడలో నివసిస్తాం.

విజయవాడ కృష్ణానది ఒడ్డున ఉన్నది. లెనిన్ విగ్రహం నాకు చాలా నచ్చింది. విక్టోరియా మ్యూజియం కూడా చాలా బాగుంటుంది.

గాంధీ కొండపై మహాత్ముడి సంస్మరణార్థం ఒక స్మారక స్తూపం ఉంది. ఈ స్తూపం 52 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇక్కడ గాంధీ స్మారక గ్రంథాలయం, నక్షత్రశాల చూడతగినవి. ప్రకాశం బ్యారేజీ కూడా దర్శనీయ ప్రాంతమే. రాజీవ్ గాంధీ పార్కులో చాలా పూలమొక్కలు ఉన్నాయి. సంగీతాన్ని వినిపించే ఫౌంటేను, మినీ జూపార్కు ఇక్కడ ప్రత్యేకాకర్షణ. విజయవాడకు 4 కిలోమీటర్ల దూరంలో భవానీ ద్వీపం చక్కటి పర్యాటక క్షేత్రం. విజయవాడలో ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉన్న కనకదుర్గమ్మ గుడి, చాలా బాగుంటుంది. గుణదల మేరీమాత గుడి కూడా చూడదగిన ప్రాంతం.

కఠిన పదాలు – అర్ధాలు

కోలాహలం = హడావిడి
సువర్ణం = బంగారం
అశ్వం = గుఱ్ఱం
రథం = తేరు
ధ్వని = శబ్దం
అసువులు = ప్రాణాలు
ఆకస్మికంగా = హఠాత్తుగా
వదనం = ముఖం
మూర్తీభవించిన = రూపుదాల్చిన
ఆశ్రితులు = ఆశ్రయించినవారు
ఆపన్నులు = ఆపదలో ఉన్నవారు
మృతదేహం = శవం
సొమ్మసిల్లుట = స్పృహ తప్పుట
సపర్యలు = సేవలు
ఆనతి = ఆజ్ఞ
శాసనం = చట్టం
సూక్తి = మంచిమాట
శోకము= ఏడ్పు

AP Board 6th Class Telugu Solutions Chapter 8 మేలుకొలుపు

SCERT AP Board 6th Class Telugu Solutions 8th Lesson మేలుకొలుపు Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Telugu Solutions 8th Lesson మేలుకొలుపు

6th Class Telugu 8th Lesson మేలుకొలుపు Textbook Questions and Answers

వినడం – ఆలోచించి మాట్లాడడం
AP Board 6th Class Telugu Solutions Chapter 8 మేలుకొలుపు 1

ప్రశ్న 1.
చిత్రం గురించి మాట్లాడండి.
జవాబు:
చిత్రంలో ఒక చక్రవర్తి, భరతమాత, ఒక కవి, ఒక ఋషి ఉన్నారు. ప్రజలకు జీవన విధానాన్ని తెలిపినవాడు ఋషి. కవి ఆ జీవితాలను చక్కగా జీవించడం, మంచిచెడులు తెలుసుకోవటం చెబుతాడు. రాజు ప్రజలందరికీ రక్షణ కల్పిస్తాడు. భారతదేశంలోని అన్ని జీవులను ప్రకృతిని కాపాడేది భరతమాత. భరతమాత చేతిలోని జెండా ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధులు ప్రాణార్పణ చేస్తే వచ్చింది. ఆ జెండాను పింగళి వెంకయ్యగారు రూపొందించారు.

AP Board 6th Class Telugu Solutions Chapter 8 మేలుకొలుపు

ప్రశ్న 2.
రాజుల కాలం నాటికి, ఇప్పటికి మన దేశంలో వచ్చిన మార్పు ఏమిటి?
జవాబు:
రాజుల కాలంలో రాజు మాటే శాసనం. తనకు తోచింది చేసేవాడు. ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ రాజుగారి అధికారాన్ని ప్రజలు భరించవలసిందే. అతని తర్వాత అతని కొడుకు రాజయ్యేవాడు. ఇలా అనువంశిక పాలన కొనసాగేది. ఇప్పుడు మన దేశంలో రాచరికం లేదు. రాజుల పాలన అంతమయ్యింది. ఇప్పుడు ప్రజలే పాలకులను ఓటు ద్వారా ఎన్నుకుంటారు. ప్రజాప్రతినిధుల పరిపాలన నచ్చకపోతే తర్వాత ఎన్నికలలో వారిని దింపేస్తారు. ప్రజల హక్కులను కాపాడడానికి రాజ్యాంగం ఉంది. న్యాయస్థానాలు ఉన్నాయి. ఇపుడు మనదేశంలో ప్రజలకు చాలా హక్కులు ఉన్నాయి.

అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
ఈ పాఠంలో మీకు నచ్చిన పద్యం గురించి చెప్పండి.
జవాబు:
ఈ పాఠంలో ‘కాళిదాసాది’ అనే పద్యం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఆ పద్యంలో భరతమాత యొక్క సమగ్ర స్వరూపాన్ని వర్ణించారు. . ఆమెను కాళిదాసాది మహాకవులను కన్న విద్యావంతురాలిగా వర్ణించారు. కృష్ణదేవరాయల వంటి మహావీరులను, చక్రవర్తులను కన్న వీరమాత భరతమాత అన్నారు. కాశీ వంటి పుణ్యక్షేత్రాలు కలిగిన పుణ్యాత్మురాలన్నారు. కోహినూరు వంటి వజ్రాలు గల రత్నగర్భగా వర్ణించారు. సద్గుణవతి, పుణ్యవతి, తేజోవతి, దాతృత్వం కలది భరతమాత అని వర్ణించారు కనుక ఈ పద్యం అంటే నాకిష్టం.

ప్రశ్న 2.
హక్కులకై పోరాడటం గురించి నాలుగు వాక్యాలలో రాయండి.
జవాబు:
హక్కులకై పోరాడాలి. సమయము దాటిపోకుండా పోరాడాలి. ఈ దేశంలో పుట్టిన ప్రతీ వ్యక్తికీ అన్నిటి పైనా అందరిలాగే హక్కులున్నాయి. హక్కుల కోసం పోరాటంలో ప్రాణం పోయినా ఫరవాలేదు. హక్కులను సాధించాలి.

AP Board 6th Class Telugu Solutions Chapter 8 మేలుకొలుపు

ప్రశ్న 3.
కుసుమ ధర్మన్న కవి గురించి రాయండి.
జవాబు:
కుసుమ ధర్మన్న కవి రాజమండ్రిలోని లక్ష్మీవారపు పేటలో జన్మించారు. నాగమ్మ, వీరస్వామి ఆయన తల్లిదండ్రులు. వైద్య విద్వాన్ చదివారు. సంస్కృతం, తెలుగు, ఆంగ్లం, హిందీ, ఉర్దూలలో ఆయన పండితుడు. నిమ్నజాతి ముక్తి తరంగిణీ, నల్లదొరతనం, హరిజన శతకం, మాకొద్దీ నల్లదొరతనం మొదలైనవి రచించారు. అస్పృశ్యత నిర్మూలనకు కృషి చేశారు.

ప్రశ్న 4.
ఈ కింది అపరిచిత పద్యాన్ని చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
అన్నమయములైన వన్నిజీవమ్ములు
కూడులేక జీవకోటి లేదు
కూడు తినెడికాడ కులభేదమేలకో
కాళికాంబ హంసకాళికాంబ

అ) జీవులు దేనిమీద ఆధారపడి బ్రతుకుతాయి?
జవాబు:
జీవులు అన్నం మీద ఆధారపడి బ్రతుకుతాయి.

ఆ) కూడు లేకపోతే ఏమి లేదు?
జవాబు:
కూడు లేకపోతే జీవకోటి లేదు.

ఇ) అన్నం తినేదగ్గర ఏ భేదం చూపించరాదని కవి అంటున్నాడు?
జవాబు:
అన్నం తినేదగ్గర కుల భేదం చూపించరాదని కవి అంటున్నాడు.

ఈ) పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
పై పద్యంలోని అమ్మవారి పేరేమిటి?

వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
దీనజనుల హక్కుల కోసం పోరాడటం నిజమైన స్వర్గమని పిలుపునిచ్చిన కవి గురించి రాయండి.
జవాబు:
కుసుమ ధర్మన్న కవి రాజమండ్రిలోని లక్ష్మీవారపు పేటలో జన్మించారు. నాగమ్మ, వీరస్వామి ఆయన తల్లిదండ్రులు. వైద్య విద్వాన్ చదివారు. సంస్కృతం, తెలుగు, ఆంగ్లం, హిందీ, ఉర్దూలలో ఆయన పండితుడు. నిమ్నజాతి ముక్తి తరంగిణీ, నల్లదొరతనం, హరిజన శతకం, మాకొద్దీ నల్లదొరతనం మొదలైనవి రచించారు. అస్పృశ్యత నిర్మూలనకు కృషి చేశారు.

ప్రశ్న 2.
కవి, తన కవితను ఎవరికి అంకితమిస్తానన్నాడు? ఎందుకు?
జవాబు:
పరుల ధనాన్ని అపహరించడం మహాపాపం. ఇతరుల గౌరవాన్ని పాడుచేయడం తప్పు. ఇతరుల ప్రాణాలను తీయడం మహాపాతకం. ఇలా ఆలోచించేవారికే కుసుమ ధర్మన్న కవి తన కవితను అంకితమిస్తానన్నాడు.

ఎందుకంటే అటువంటి వారు ధన్యులు. ఇతరులను పీడించకుండా ఉండే అటువంటి వారి వలన దేశంలో శాంతి పెరుగుతుంది.

AP Board 6th Class Telugu Solutions Chapter 8 మేలుకొలుపు

ప్రశ్న 3.
భరతమాత దుఃఖానికి కారణం వివరించండి.
జవాబు:
భరతమాత తన సంతానం యొక్క దీనత్వాన్ని చూసి దుఃఖిస్తోంది. వారి బాధలను చూసి బాధపడుతోంది. ఆమె దుఃఖానికి కారణం దీనుల కన్నీరు, అంటరానితనం, జాతి భేదాలు, విద్యా గర్వం, ధన గర్వం, కుల గర్వం అనే మూడు గర్వాలు కలవారు.

ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
భరతమాత గొప్పతనాన్ని కవి ఏమని వర్ణించాడు?
జవాబు:
భరతమాత సకల సద్గుణరాశి. ఆమె అందరి పాపాలను దూరం చేస్తుంది. అందరిచేత పొగడ్తలందుకొంటుంది. గొప్ప తేజస్సు కలది. అనేక విధాలుగా కీర్తి కలది. కోరిన వరాలనిచ్చే పారిజాత వృక్షం వంటిది. కాళిదాసు మొదలైన గొప్ప కవులను కన్న విద్యావతి. కృష్ణదేవరాయలు వంటి వీరులను కన్న వీరమాత. కాశీ వంటి పుణ్యక్షేత్రాలు ఉన్న పుణ్యభూమి. కోహినూరు వజ్రం వంటి మణులను కన్న రత్నగర్భ మన భరతభూమి. అటువంటి భరతమాత మనకు భద్రతను కల్గిస్తోంది.

ప్రశ్న 2.
స్వరాజ్య రథం ఎప్పటిదాకా సాగాలని కవి భావించాడు?
జవాబు:
దీనులైన తన సంతానాన్ని చూసి భరతమాత బాధపడుతున్నది. ఆ బాధ తగ్గేవరకు శుభప్రదమైన స్వరాజ్య రథాన్ని ధైర్యంతో నడపాలి. అణగారిన ప్రజల కన్నీటి సముద్రం ఇంకిపోయేదాకా నడపాలి. అంటరానితనం అనే బడబాగ్ని చల్లారేదాకా సాగించాలి. జాతి భేదాలు పోయి, భరతమాత శరీరంలోని అవయవాలన్నీ సరిగ్గా రూపుదిద్దు కొనేవరకు సాగాలి. ధర్మానికి అడ్డుపడే మదత్రయం (విద్యాగర్వం, ధనగర్వం, కులగర్వం) నాశనమయ్యే వరకు భారతీయుల మేలును కోరేవారు స్వరాజ్య రథాన్ని నడపాలి.

ప్రశ్న 3.
కింది కవితను పొడిగించండి.
జవాబు:
భరతమాత మా మాత
జగతినామె పరమ దేవత
నేత వైరము మాకు రోత
గాంధీజీ మాకు తాత
ఆయన స్వాతంత్ర్యోద్యమ
మారుస్తాం దేశపు తల రాత

భాషాంశాలు

అ) కింద గీతగీసిన పదాలకు అర్థాలు రాయండి. వాటితో సొంత వాక్యాలు రాయండి.
ఉదా : మగవానితో సమానంగా వెలది ని గౌరవించాలి.
వెలది = స్త్రీ
స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం.

1. రణం నాశనానికి దారితీస్తుంది.
రణం = యుద్ధం
యుద్ధం వలన అనర్థాలెక్కువ.

2. అఘం చేయకూడదు.
అఘం = పాపం
ఏ జీవినైన బాధపెట్టడం పాపం.

3. సన్నుతం విని పొంగిపోకు.
సన్నుతం = పొగడ్త
పొగడ్తలన్నీ నిజమనుకొంటే గర్వం పెరుగుతుంది.

4. తలపోటు దుర్భరంగా ఉంటుంది.
దుర్భరం = భరింపరానిది
భరింపరాని బాధనైనా ఒక్కొక్కసారి భరించాలి.

AP Board 6th Class Telugu Solutions Chapter 8 మేలుకొలుపు

ఆ) కింద ఇచ్చిన పదానికి సమానార్ధక పదాలు వాక్యాలలో ఉన్నాయి. వాటిని గుర్తించి రాయండి.

1. జనని ప్రేమకు వెలకట్టలేము. బ్రహ్మయైనా మాతకు కొడుకే.
జవాబు:
తల్లి = జనని, మాత

2. వెలదిని దేవతగా భావించి ఆ పొలతిని గౌరవించాలి.
జవాబు:
నారి = వెలది, పొలతి

3. తగిన సమయంలో కాలమును అనుసరించి మాట్లాడాలి.
జవాబు:
తరుణము = సమయం, కాలం

4. పాతకం చేసేటపుడు ఆ దురితం వల్ల వచ్చే నష్టాలను ఊహించుకోవాలి.
జవాబు:
పాపము = పాతకం, దురితం

ఇ) కింది వానిలో ప్రకృతి, వికృతులను జతపర్చండి.

1. కవిఅ) విద్య
2. విద్దెఆ) కృష్ణుడు
3. కన్నడుఇ) కయి

జవాబు:

1. కవిఇ) కయి
2. విద్దెఅ) విద్య
3. కన్నడుఆ) కృష్ణుడు

ఈ) కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి.

1. విద్య × అవిద్య
2. పుణ్యం × పాపం
3. సద్గుణం × దుర్గుణం

వ్యాకరణాంశాలు

అ) కింది ఖాళీలను పూరించండి.

సమాస పదంవిగ్రహ వాక్యంసమాసం పేరు
1. అక్కాచెల్లెళ్లు……………………………ద్వంద్వ సమాసం
2. ……………………………తల్లియును తండ్రియును……………………………
3. తండ్రీకొడుకులు…………………………………………………………
4. ……………………………ధర్మమును, అధర్మమునుద్వంద్వ సమాసం
5. పాపపుణ్యాలు……………………………ద్వంద్వ సమాసం

జవాబు:

సమాస పదంవిగ్రహ వాక్యంసమాసం పేరు
1. అక్కాచెల్లెళ్లుఅక్కాచెల్లెళ్లు అక్కయునుద్వంద్వ సమాసం
2. తల్లిదండ్రులుతల్లియును తండ్రియునుద్వంద్వ సమాసం
3. తండ్రీకొడుకులుతండ్రియును, కొడుకులునుద్వంద్వ సమాసం
4. ధర్మాధర్మములుధర్మమును, అధర్మమునుద్వంద్వ సమాసం
5. పాపపుణ్యాలుపాపమును, పుణ్యమునుద్వంద్వ సమాసం

ఆ) కింది వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.

1. భరతమాత కవులను కన్నది. భరతమాత కవులను పెంచింది.
జవాబు:
భరతమాత కవులను కని, పెంచింది.

2. హక్కులకై పోరాడాలి. హక్కులను సాధించాలి.
జవాబు:
హక్కులను పోరాడి, సాధించాలి.

3. దేశభక్తి కలిగి ఉండాలి. దేశభక్తితో జీవించాలి.
జవాబు:
దేశభక్తిని కలిగి, జీవించాలి.

AP Board 6th Class Telugu Solutions Chapter 8 మేలుకొలుపు

ఇ) సంధులు:

రెండు పదాల మధ్య సంధి జరిగినపుడు మొదటి పదం చివర ఉండే అచ్చు పేరుతో ఆ సంధిని పిలుస్తాం. మొదటి పదం చివర ‘ఉ’ ఉంటే అది ఉత్వ సంధి. ‘అ’ ఉంటే అత్వ సంధి, ‘ఇ’ ఉంటే ఇత్వ సంధి.

అత్వ సంధి బహుళం కాబట్టి నాలుగు విధాలుగా సంధిరూపాలు ఏర్పడతాయి.
ఉదా :
చూసినప్పుడు = చూసిన + అప్పుడు = న్ + అ + అ = అ
AP Board 6th Class Telugu Solutions Chapter 8 మేలుకొలుపు 2
జవాబు:
AP Board 6th Class Telugu Solutions Chapter 8 మేలుకొలుపు 3

ఈ) కింది అభ్యాసాలు పరిశీలించి రాయండి.
1. తగినంత = తగిన + అంత
2. చూసినప్పుడు = చూసిన + అప్పుడు
3. ఇచ్చినంత = ఇచ్చిన + అంత
4. చిన్నప్పుడు = చిన్న + అప్పుడు

చమత్కార పద్యం

వంగతోటనుండు వరిమళ్ళలోనుండు
జొన్నచేలనుండు చోద్యముగను
తలుపుమూల నుండు తలమీదనుండును
దీని భావమేమి తిరుమలేశ !

పద్యం చదవగానే – వంగతోటలో, వరిమళ్ళలో, జొన్నచేలలో, తలుపు మూలలో, తల పైన ఉండేది ఏది? అనే ప్రశ్న ఉదయిస్తుంది. కానీ సమాధానం అక్కడే ఉంది. వంగ – తోటలోనే ఉంటుంది. వరి – ‘మళ్ళ’ లోనే ఉంటుంది. జొన్న – ‘చేల’ లోనే ఉంటుంది. తలుపు – ఇంటికి, ‘మూల’నే ఉంటుంది. తల – శరీరానికి ‘మీద’ నే ఉంటుంది.

మేలుకొలుపు కవి పరిచయం

కవి పేరు : కుసుమ ధర్మన్న

జననం : 17.3. 1900న రాజమహేంద్రవరంలోని లక్ష్మివారపు పేటలో జన్మించారు.

తల్లిదండ్రులు : నాగమ్మ, వీరాస్వామి గార్లు.

చదువు : వైద్య విద్వాన్, సంస్కృతం, తెలుగు, ఆంగ్లం, హిందీ, ఉర్దూలలో పాండిత్యం కలవారు.

రచనలు : నిమ్నజాతి ముక్తి తరంగిణి, నల్ల దొరతనం, హరిజన శతకం, మాకొద్దీ నల్ల దొరతనం మొదలైనవి.

ప్రత్యేకత : దళిత వర్గం నుంచి అతికష్టం మీద చదువుకొని, పైకొచ్చి, ఆ చదువును తన జాతి మేలు కోసం వెచ్చించారు. చదువుకొనే రోజులలోనే సంఘసంస్కరణాభిలాష గల కందుకూరి వారిచే ప్రభావితం అయ్యారు. భారతరత్న, డా|| బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా స్ఫూర్తి పొంది, అంటరానితనాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో తపించిన తొలితరం తొలి దళిత కవి. ప్రస్తుత పాఠ్యభాగం ఆయన రచించిన హరిజన శతకం అనుబంధం నుండి గ్రహించబడింది. 1946లో ఆయన స్వర్గస్థులయ్యారు.

పద్యాలు – అర్థాలు – భావాలు

1. సీ॥ కాళిదాసాది సత్కవి పుంగవుల గాంచి
విద్యావతి యన నేవెలది యొప్పె ?
రణశూరులగు కృష్ణరాయాదులను గని
వీరమాత యన నేనారి తనరె?
నతుల కాశ్యాది పుణ్యక్షేత్రములు గల్గి
పుణ్యవతియన నేపొలతి నెగడె ?
కొహినూరు మొదలగు మహిత మణులనీని
రత్నగర్భయన నేరామ వెలసె ?

తే॥గీ|| నట్టి సద్గుణసంఘాత యఘ విదూర
సన్నుతవ్రాత విపుల తేజస్సమేత
బహుళ విఖ్యాత యాచక పారిజాత
భద్రముల మీకొసగుగాత భరతమాత.
అర్థాలు :
సత్కవి పుంగవుడు = మంచి కవులలో శ్రేష్ఠుడు
పుంగవము = ఎద్దు
ఆది = మొదలైన
వెలది = స్త్రీ
రణము = యుద్ధము
శూరుడు = వీరుడు
వీరమాత = వీరులను కన్న తల్లి
నారి = స్త్రీ
తనరు = ఒప్పు
అతుల = సాటిలేని
పొలతి = స్త్రీ
నెగడు = అతిశయించు
మహిత = గొప్పదైన
రామ = స్త్రీ
సంఘాత = సమూహం
అఘము = పాపము
విదూర = దూరముగా నెట్టునది
సన్నుతి = పొగడ్త
వ్రాత = సమూహము
సమేత = కూడినది
విఖ్యాతి = కీర్తి
యాచకులు = భిక్షువులు

భావం :
సకల సద్గుణ రాశి మన భరతమాత. ఈమె అందరి పాపాలను దూరం చేస్తుంది. అందరూ పొగడ దగినది. గొప్ప తేజస్సు కలది. అనేక విధాలుగా కీర్తి కలది. కోరిన వరాలనిచ్చే పారిజాత వృక్షం వంటిది. కాళిదాసు మొదలైన గొప్ప కవులను కన్న విద్యావతి. కృష్ణదేవరాయలు వంటి వీరులను కన్న వీరమాత. కాశీ వంటి పుణ్యక్షేత్రాలు ఉన్న పుణ్యభూమి. కోహినూరు వజ్రం వంటి మణులను కన్న రత్నగర్భ మన భరతభూమి. అటువంటి భరతమాత మీకు భద్రతను కల్గిస్తోంది.

AP Board 6th Class Telugu Solutions Chapter 8 మేలుకొలుపు

2. సీ॥ దీన జాతుల దుర్గతిగని ఘోషిలు భార
తాంబ దుర్భర దుఃఖమణగు వఱకు
నిమ్నులు కురియు కన్నీటి మున్నీరు సం
పూర్ణంబుగా నింకిపోవువలకు
అస్పృశ్యతాబాడబానల జ్వాల ది
గంత భూములకు జల్లారువఱకు
జాతిభేద చ్చిన్న సకలాంగకంబులు
సంచితాకృతి ధరియించు వఱకు

తే॥గీ॥ ధర్మమున కడ్డుపడెడు మదత్రయంబు
హైందవుల డెందముల నాశమందు
వఱకు ప్రథిత మంగళదత్త స్వరాజ్యరథము
తెంపు సాగింతురే భారతీయ హితులు
అర్థాలు :
దుర్గతి = చెడ్డ స్థితి
దుర్భరము = భరింపరానిది
అణగు = నశించు
మున్నీరు = సముద్రము
బడబానలము = సముద్రంలో ఉండే అగ్ని
జ్వాల = మంట
అంగకములు = అవయవాలు
మదత్రయము = కుల, ధన, విద్యా గర్వములు మూడూ
డెందము = హృదయము
ప్రధిత = కీర్తి గల
దత్త = ఇవ్వబడిన
ఆకృతి, = ఆకారము
హితులు = మిత్రులు

భావం :
దీనులైన తన సంతానాన్ని చూసి బాధపడుతున్నది భరతమాత. ఆ బాధ తగ్గేవరకు శుభప్రదమైన స్వరాజ్య రథాన్ని ధైర్యంతో నడపాలి. అణగారిన ప్రజల కన్నీటి సముద్రం ఇంకిపోయేదాకా నడపాలి. అంటరానితనం అనే బడబాగ్ని చల్లారేదాకా సాగించాలి. జాతి భేదాలు పోయి, భరతమాత శరీరంలోని అవయవాలన్నీ సరిగ్గా రూపుదిద్దు కొనేవరకు సాగాలి. ధర్మానికి అడ్డుపడే మదత్రయం (విద్యాగర్వం, ధనగర్వం, కులగర్వం) నాశనమయ్యే వరకు భారతీయుల మేలును కోరేవారు స్వరాజ్య రథాన్ని నడపాలి.

3. తే॥గీ॥ మేలుకొనుమయ్య తరుణము మించకుండ
జన్మహక్కులకై పోరుసల్పు మిపుడె
హక్కుకై ప్రాణమిడుట ద్రోహంబు కాదు
స్వర్గపదమని నమ్ముము స్వాంతమందు
అర్థాలు :
తరుణము = సమయము
పోరు = రణము

భావం :
ఓ దీనజనుడా! మేలుకో! సమయం దాటిపోనివ్వకు. ఈ దేశంలో పుట్టిన నీకు అన్నింటిపై అందరిలా హక్కులున్నాయి. ఆ హక్కుల కోసం పోరాడు. హక్కుల కోసం పోరాటంలో ప్రాణం పోయినా పరవాలేదు. అదే స్వర్గం. దీనిని హృదయంలో నమ్ము.

AP Board 6th Class Telugu Solutions Chapter 8 మేలుకొలుపు

4. తే॥గీ|| పరుల ధన మాన ప్రాణ సంపదల ద్రుంచి
మనుచునుండుట పాతకంబని దలంచు
వారలెందున ధన్యులు వారికెల్ల
నంకితమొనర్తు దానినేనధికభక్తి
దేశమున శాంతి చేకూరి తేజరిలగ
అర్థాలు :
మనుట = జీవించుట
పాతకము = పాపము

భావం :
ఇతరుల ధనాన్ని, గౌరవాన్ని, ప్రాణాలు, ఐశ్వర్యాన్ని నాశనం చేసి బతకడం మహాపాపం అనుకొనేవారు ధన్యులు. మన దేశానికి శాంతి కలిగేలాగా నేనటు వంటి వారికే నా కవిత్వం అంకితం చేస్తాను. కవి జీవించిన కాలంలో స్వాతంత్ర్య పోరాటం దేశమంతా తీవ్రంగా వ్యాపించింది. త్వరలోనే స్వాతంత్ర్యం వస్తుందని కవి నమ్మకం. అయితే ఈ పోరాట స్ఫూర్తి అధికారం మార్పుతో ఆగిపోకుండా దేశంలో వేళ్ళూనుకుని ఉన్న అసమానతలు అంతమయ్యేవరకు కొనసాగాలని కవి ఈ విధంగా కోరుకున్నాడు.

AP Board 6th Class Telugu Solutions Chapter 7 మమకారం

SCERT AP Board 6th Class Telugu Solutions 7th Lesson మమకారం Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Telugu Solutions 7th Lesson మమకారం

6th Class Telugu 7th Lesson మమకారం Textbook Questions and Answers

వినడం – ఆలోచించి మాట్లాడడం
AP Board 6th Class Telugu Solutions Chapter 7 మమకారం 1

ప్రశ్న 1.
చిత్రంలో ఎవరెవరు ఉన్నారు?
జవాబు:
ఇద్దరు పిల్లలు, ఒక తల్లి ఈ చిత్రంలో ఉన్నారు.

ప్రశ్న 2.
చిత్రంలోని అమ్మాయి అమ్మకు తన స్నేహితురాలిని ఎలా పరిచయం చేస్తుంది?
జవాబు:
తన స్నేహితురాలు పేరు చెప్పింది. ఆ అమ్మాయి చదువుతున్న తరగతి చెప్పింది. ఏ బెంచీలో కూర్చుంటారో చెప్పింది. వారిద్దరి స్నేహం గురించి చెప్పి పరిచయం చేసింది.

AP Board 6th Class Telugu Solutions Chapter 7 మమకారం

ప్రశ్న 3.
మీ స్నేహితులు మీ అమ్మానాన్నలను ఏమని పిలుస్తారు?
జవాబు:
కొంతమంది స్నేహితులు మా అమ్మానాన్నలను ఆంటీ, అంకుల్ అంటారు. కొంతమంది పిన్నిగారూ, బాబాయి గారూ అంటారు. కొంతమంది అత్తయ్యగారూ, మామయ్యగారూ అంటారు.

అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
మీ భాష అంటే మీకు ఎందుకు ఇష్టమో చెప్పండి.
జవాబు:
మా భాష తెలుగుభాష. అది మా మాతృభాష. మా ఇంట్లో అందరం మాట్లాడుకొనే భాష. మా స్నేహితులంతా మాట్లాడుకొనే భాష. మా చుట్టుప్రక్కల వారంతా మాట్లాడే భాష. రోజూ నేను మా తాత దగ్గర కథలు వినేది మా మాతృభాషలోనే, రోజూ మా మామ్మ దగ్గర మా భాష (తెలుగు)లోనే ఎన్నో పాటలు, పద్యాలు, పొడుపు కథలు, సామెతలు, జాతీయాలు, చమత్కారాలు వింటాను. నేర్చుకుంటాను. అందుకే మా (తెలుగు) భాషంటే మాకు చాలా చాలా ఇష్టం.

ప్రశ్న 2.
ఏది స్వర్గంతో సమానమైనదని రచయిత అన్నాడో రాయండి.
జవాబు:
పిల్లల కేరింతలూ, ఆటలూ, వాళ్ల మధ్య చిట్టి పొట్టి తగవులూ, కొట్లాటలూ, ఏడుపులూ ఒకవైపు కొనసాగుతుండాలి. మరొక వైపు వదిన మరదళ్ల సరసాలూ, విరసాలు, బావ బావమరుదుల వెక్కిరింతలూ, జాణతనాలూ సాగుతుండాలి. అక్కా చెల్లెళ్లూ, తమ్ముళ్లూ వాళ్ల ఒద్దికలూ, ప్రేమలూ, ఆప్యాయతానురాగాలూ ఉండాలి. ఇలా ఎక్కడయితే ఇల్లంతా సందడిగా ఉంటుందో ఆ ఇల్లు స్వర్గంతో సమానమని రచయిత అన్నారు. తమ అత్తగారిల్లు అటువంటి స్వర్గతుల్యం అని ఆయన అభిప్రాయం.

ప్రశ్న 3.
బంధువుల ఇంట్లో రచయితకు కనిపించిన కొత్త వాతావరణం ఏమిటో రాయండి.
జవాబు:
రచయిత ఒక ఆదివారం బళ్లారిలోని అత్తవారింటికి వెళ్లాడు. అక్కడ వదిన, మరదళ్ల సరసాలు, పిల్లల అల్లరి, పెద్దల హడావిడీ అంతా రచయితకు చాలా ఇష్టం.

కాని, అక్కడ వాతావరణం అలా లేదు. కొత్త వాతావరణం కనిపించింది. అదేమిటా అని పరిశీలించాడు. గతంలో లాగా వాళ్ల సంబోధనలు లేవు. చిన్నాయనా-పిన్నీ, మామా-అత్తా పిలుపులను ఆంటీ, అంకుల్ తో సరిపెడుతున్నారు. అట్లా పిలుస్తున్నది రచయిత మరదళ్ల పిల్లలే.

రచయితకు తెలుగులో పిలవడం, పిలిపించుకోవడం అలవాటు, ఇష్టం. తెలుగు సంస్కృతి కూడా ఇష్టం. కానీ, అక్కడ ఆ వాతావరణం లేదు. అదే విషయం మరదళ్ళకు చెబితే వాళ్లు మొగాలు మాడ్చుకొన్నారు. తన భార్య తనకు అలా ప్రవర్తించకూడదని కూడా చెప్పింది.

AP Board 6th Class Telugu Solutions Chapter 7 మమకారం

ప్రశ్న 4.
కింది కరపత్రాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.

ఆలయ పరిరక్షణ అందరి బాధ్యత

భక్తులారా !
ఆంధ్ర మహావిష్ణువు తెలుగువారి ఆరాధ్య దైవం. కృష్ణాజిల్లా శ్రీకాకుళంలో ఆంధ్ర విష్ణు దేవాలయం ఉంది. శ్రీకృష్ణదేవరాయలు ఈ దేవుణ్ణి దర్శించుకొని స్వామి ఆదేశం మేరకు తాను ఆముక్తమాల్యద గ్రంథం రాసినట్లు చెప్పారు. నేను తెలుగు వల్లభుణ్ణి. నా భాష తెలుగు భాష, అది అన్ని భాషలకన్నా గొప్పది అని స్వామి స్వయంగా తనకు చెప్పినట్లు కూడా పేర్కొన్నారు. అటువంటి అరుదైన ఆంధ్ర విష్ణు దేవాలయాన్ని పరిరక్షించుకుందాం. మరింత అభివృద్ధి చేద్దాం. ఇది మనందరి బాధ్యత.

ఇట్లు,
అఖిలాంధ్ర ఆలయ పరిరక్షణ సంఘం,
అమరావతి

అ) ఆంధ్ర విష్ణు దేవాలయం ఎక్కడ ఉంది?
జవాబు:
కృష్ణాజిల్లా శ్రీకాకుళంలో ఆంధ్ర విష్ణు దేవాలయం ఉంది.

ఆ) ఈ కరపత్రం ప్రచురించింది ఎవరు?
జవాబు:
అమరావతిలోని అఖిలాంధ్ర ఆలయ పరిరక్షణ సంఘంవారు ఈ కరపత్రం ప్రచురించారు.

ఇ) నా భాష తెలుగు భాష – అని చెప్పింది ఎవరు?
జవాబు:
నా భాష తెలుగు భాష అని శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు.

ఈ) ఆముక్తమాల్యద గ్రంథం రాసింది ఎవరు?
జవాబు:
ఆముక్తమాల్యద గ్రంథాన్ని శ్రీకృష్ణదేవరాయలు రచించారు.

వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
అత్త-మామ, పిన్ని-బాబాయి, బావ బావమరిది…. ఇలా మీకు తెలిసిన బంధువాచక పదాలు పది రాయండి.
జవాబు:
అమ్మ – నాన్న, అన్న – వదిన, తమ్ముడు – మరదలు, అక్క – బావ, చెల్లి – బావ, పెద్దమ్మ – పెదనాన్న, తాత – మామ్మ, తాతయ్య – అమ్మమ్మ, పెద్దత్త – పెద్ద మామయ్య, చిన్నత్త – చిన్న మామయ్య.

ప్రశ్న 2.
‘సత్యం’ కుటుంబాన్ని చూసి రచయితకు ‘మమకారం’ ఎందుకు కలిగింది?
జవాబు:
సత్యం ఇంటికి వెళ్లగానే వాళ్లబ్బాయి ఆరేళ్ళవాడు ‘మామా’ అని అభిమానంగా పలకరించాడు. “నువ్వు రాజు మామవని మా నాన్న చెప్పాడు”, అని ఆ అబ్బాయి అనడంతో వారి అభిమానానికి, చక్కటి వరస పెట్టి పిలవడం . చూసి రచయిత పొంగిపోయేడు. ఆ పిల్లలు, తండ్రిని ప్రశ్నలు వేయడం, సత్యం వాటికి విసుక్కోకుండా జవాబులు చెప్పడం చూసి రచయితకు ముచ్చటేసింది. మళయాళీ అయిన సత్యం భార్య కూడా చక్కగా తెలుగు మాట్లాడుతుందని తెలుసుకొని చాలా ఆనందించాడు. తను కోరుకొనే తెలుగు కుటుంబాన్ని సత్యం ఇంట చూసిన రచయితకు ఆ కుటుంబంపై మమకారం కలిగింది.

AP Board 6th Class Telugu Solutions Chapter 7 మమకారం

ప్రశ్న 3.
ఈ కథ “ఎందుకో నా కళ్లల్లో నీటి పొర…” అని ముగుస్తుంది. ఆనందంతో వచ్చే కన్నీటిని ఏమంటాం? అవి ఎప్పుడు వస్తాయి?
జవాబు:
ఆనందంతో వచ్చే కన్నీటిని ఆనందబాష్పాలు అంటారు. విపరీతమైన ఆనందం కలిగినపుడు ఆనంద బాష్పాలు వస్తాయి. తరగతిలో అందరికంటే ఎక్కువ మార్కులు వస్తే ఆనందబాష్పాలు వస్తాయి. పాఠశాల సమావేశంలో . మెచ్చుకొంటే వస్తాయి. ఏదైనా పోటీలో రాష్ట్రస్థాయి విజయం సాధిస్తే ఆనందబాష్పాలు వస్తాయి. కోటి రూపాయల లాటరీ తగిలితే ఆనందబాష్పాలు వస్తాయి. ఈ విధంగా మనం ఊహించిన దానికంటే చాలా ఎక్కువ ఫలితం వచ్చినపుడు ఆనందబాష్పాలు వస్తాయి.

ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
భాష విషయంలో రచయిత అభిప్రాయాలను వివరించండి.
జవాబు:
రచయితకు తెలుగుభాష అంటే చాలా ఇష్టం. సాధ్యమైనంతవరకూ తెలుగులో మాట్లాడాలి. తెలుగులోనే చక్కటి వరసలు పెట్టి పిలుచుకోవాలి. పిల్లలకు చిన్నతనం నుండి తెలుగు భాష మాధుర్యాన్ని రుచి చూపించాలి.

తెలుగు కుటుంబాల గొప్పతనమంతా తెలుగులో మాట్లాడుకోవడంలోనే ఉంది. అమ్మా-నాన్న, అత్త-మామా ఇలా తెలుగులో పిలుచుకోవడంలోనే ఆనందం ఉంది. తప్పనిసరి పరిస్థితులలో ఆంగ్లం ఉపయోగించాలి. కానీ, ఇంట్లో కూడా ఆంగ్లం మాట్లాడడం రచయితకు నచ్చదు. బంధుత్వాలను కూడా ఆంగ్లంలోకి మార్చడం రచయితకు అస్సలు నచ్చదు.

ప్రశ్న 2.
“ఇంగ్లీష్ భాష మనకు అవసరమే ! అంతవరకే దాన్ని వాడుకుంటాం. మన భాషనీ, సంస్కృతినీ ఎందుకు వదిలేసుకుంటాం ?” దీనిపై మీ అభిప్రాయం రాయండి.
జవాబు:
ఉన్నత చదువులకు ఆంగ్లభాష అవసరం. ఉద్యోగాలలో కూడా ఆంగ్లభాష అవసరమే. ఎక్కువ విజ్ఞానాన్ని సంపాదించాలంటే ఆంగ్ల గ్రంథాలు కూడా చదవాలి. అర్థం చేసుకోవాలి. దీని కోసం ఆంగ్లభాషా పాండిత్యం అవసరమే. ఇతర దేశాలకు వెళ్లినా ఆంగ్లం తప్పదు.

కానీ, మన ఇంట్లో ఆంగ్లం మాట్లాడక్కరలేదు. తెలుగువాళ్ళం తెలుగులోనే మాట్లాడుకోవాలి. తెలుగులోని తీపిని మరచిపోకూడదు. మన తెలుగు భాషలాగే మన సంస్కృతి కూడా చాలా గొప్పది. ఎవరినైనా ఆప్యాయంగా పలకరించే సంస్కృతి మనది. శత్రువునైనా ఆదరించే సంస్కారం మనది.. అడిగిన వారికి లేదనకుండా దానం చేసే స్వభావం తెలుగువారిది.

అందుకే ఎన్ని భాషలు నేర్చినా మన తెలుగు భాషను వదలకూడదు. ఎన్ని దేశాలు తిరిగినా మన సంస్కృతిని విడిచిపెట్టకూడదు. మనం సంపాదించిన ఆంగ్ల భాషా జ్ఞానంతో మన భాషను సుసంపన్నం చేసుకోవాలి.

AP Board 6th Class Telugu Solutions Chapter 7 మమకారం

ప్రశ్న 3.
మీరు బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు పిల్లలంతా ఒకచోట చేరి ఉండటంతో కనుల పండుగగా ఉంటుంది కదా ! ఆ పిల్లల కేరింతలు, ఆటలు, వాళ్ల మధ్య చిన్న చిన్న తగాదాలు…. వీటిని గురించి మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

కాకినాడ,
xxxxx.

ప్రియమైన రజనీకి,

నీ స్నేహితురాలు జ్యోత్స్న వ్రాయు లేఖ.
ఇక్కడంతా క్షేమం. అక్కడ మీరంతా క్షేమమని తలచెదను.

మొన్న వేసవి సెలవులు వచ్చాయి కదా ! ఆ సెలవులలో మా కుటుంబం, మా పెదనాన్న గారి కుటుంబం, మా బాబయ్యగారి కుటుంబం కలిసి అమలాపురంలోని మా. మేనత్త గారింటికి వెళ్లాం.

వాళ్లది పెద్ద పెంకుటిల్లు. ఇంటి ముందు బోలెడంత స్థలం. ఇంటి వెనక పెద్ద కొబ్బరితోట ఉంది. అక్కడ మామిడి, జామ, సపోటా లాంటి చెట్లు చాలా ఉన్నాయి.

మేము మొత్తం 12 మంది పిల్లలం పోగయ్యాం . చాలా అల్లరి చేశాం. పెరట్లోని చెట్లెక్కేశాం. చెరువులో ఈతలు కొట్టాం. కోతి కొమ్మచ్చి, వాలీబాల్, కుంటాట, తొక్కుడు బిళ్ల ఎన్నో ఆటలు ఆడాం. ట్రాక్టరు, ఎడ్లబండి ఎక్కి ఊళ్లన్నీ తిరిగేశాం. ఈ సారి మీ కుటుంబం కూడా రండి. కోనసీమకు భూతల స్వర్గం అని పేరు. చూద్దురుగాని, ఉంటామరి.

నీ స్నేహితురాలు,
కె. జ్యోత్స్న వ్రాలు.

చిరునామా :
సి. రజని, 6వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
కర్నూలు, కర్నూలు జిల్లా,

భాషాంశాలు

అ) కింది సూచనల ఆధారంగా ‘కారం’ తో అంతమయ్యే పదాలు రాయండి.
1. ఈ పాఠం పేరు మమకారం.
2. ఎదుటివారికి మేలు చేయడం …………………….. కారం.
3. ఎదుటివారిని గేలి చేయడం …………………… కారం.
4. దట్టమైన చీకటి …………………….. కారం.
5. గర్వం , అహంభావం …………………….. కారం.
జవాబు:
1. మమకారం
2. ఉపకారం
3. వెటకారం
4. అంధకారం
5. అహంకారం

ఆ) కింది వాక్యాలను చదవండి. గీత గీసిన పదాల అర్థాలు తెలుసుకొని సొంతవాక్యాలు రాయండి.
ఉదా :
విహారయాత్రకు వెళ్లాలన్న మా ఉబలాటం చూసి మా ఉపాధ్యాయులు ముచ్చటపడ్డారు.
ఉబలాటం = కోరిక
మా మిత్రులందరూ సినిమాకు వెళ్ళాలని ఉబలాటపడుతున్నారు.

1. బాపు, రమణలు ఒద్దిక గా ఉండి జీవితాంతం స్నేహితులుగా ఉన్నారు.
ఒద్దిక = అనుకూలం
ఒకరికొకరు అనుకూలంగా ఉంటే స్నేహం నిలబడుతుంది.

2. మదర్ థెరిసా చూపే వాత్సల్యం చాలామంది జీవితాల్లో వెలుగులు నింపింది.
వాత్సల్యం = ప్రేమ
రోగులకు ప్రేమతో సేవ చేయాలి.

3. ఆ నగరంలోని అధునాతన కట్టడాలు నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి.
అధునాతన = ఆధునికమైన
ఆధునికమైన జీవితాలలో మానవత్వం దూరమౌతోంది.

AP Board 6th Class Telugu Solutions Chapter 7 మమకారం

ఇ) కింది వాక్యాలలో సమానార్ధక పదాలు ఉన్నాయి. గుర్తించి గీత గీయండి.
1. వచ్చీరాని మాటలతో ఆ బుడతడు చేసే అల్లరి అందరికీ ఆనందాన్నిస్తోంది. ఆ పిల్లవాడు అందరి దృష్టినీ ఆకర్షించాడు.
జవాబు:
బుడతడు, పిల్లవాడు

2. మనిషికి అసలైన ధనం విద్యాధనమే ! అని తేటతెల్లం చేశారు పూర్వికులు. దీంతో మనం సంపాదించు కోవాల్సింది ఏమిటో స్పష్టమైంది కదా !
జవాబు:
తేటతెల్లం, స్పష్టం

3. మహాత్ముల జీవనశైలి నన్ను ఆకర్షిస్తుంది. వారు బతికే పద్ధతి నిరాడంబరంగా ఉంటుంది.
జవాబు:
శైలి, పద్ధతి

ఈ) కింది వ్యతిరేక పదాలను జతపరచండి.

1. పండితుడుఅ) దురదృష్టం
2. సరసంఆ) పామరుడు
3. అదృష్టంఇ) విరసం

జవాబు:

1. పండితుడుఆ) పామరుడు
2. సరసంఇ) విరసం
3. అదృష్టంఅ) దురదృష్టం

ఉ) కింది ప్రకృతి – వికృతులను జతపరచండి.

1. ఆశ్చర్యంఅ) బయం
2. భయంఆ) ఇంతి
3. స్త్రీఇ) అచ్చెరువు

జవాబు:

1. ఆశ్చర్యంఇ) అచ్చెరువు
2. భయంఅ) బయం
3. స్త్రీఆ) ఇంతి

వ్యాకరణాంశాలు

అ) సామాన్య – సంక్లిష్ట వాక్యాలు :
సామాన్య వాక్యం :
అసమాపక క్రియలు లేకుండా ఒక ‘సమాపక క్రియ’ తో ముగిసే వాక్యాన్ని సామాన్య వాక్యమంటారు.
ఉదా :
సురేష్ గుడికి వెళ్ళాడు.
మేరీ పుస్తకం తీసింది.
చందు కలం పట్టుకున్నాడు.

సంక్లిష్ట వాక్యం :
ఒకటి కాని అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉండి, చివరకు ఒక సమాపక క్రియతో ముగిసిన వాక్యాన్ని సంక్లిష్ట వాక్యమంటారు.
ఉదా :
పద్మ నిద్రలేచింది. (సామాన్య వాక్యం)
పద్మ స్నానం చేసింది. (సామాన్య వాక్యం)
పద్మ బడికి వెళ్ళింది. (సామాన్య వాక్యం)

ఈ మూడు వాక్యాలనూ కలిపితే …….
AP Board 6th Class Telugu Solutions Chapter 7 మమకారం 2
అలా రెండు వాక్యాలను కూడా ‘కలపవచ్చు.

* రమేష్ సైకిల్ తొక్కుతున్నాడు. రమేష్ బడికి వెళ్తున్నాడు.
AP Board 6th Class Telugu Solutions Chapter 7 మమకారం 3

AP Board 6th Class Telugu Solutions Chapter 7 మమకారం

ఆ) కింది సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.
1. గురువుగారు పాఠం చెబుతున్నారు. గురువుగారు నవ్వుతున్నారు.
జవాబు:
గురువుగారు పాఠం చెబుతూ, నవ్వుతున్నారు.

2. అమ్మ బుజ్జగించింది. అమ్మ అన్నం పెట్టింది.
జవాబు:
అమ్మ బుజ్జగించి, అన్నం పెట్టింది.

3. ఎలుక అక్కడకు వచ్చింది. ఎలుక గుడ్లగూబను చూసింది.
జవాబు:
ఎలుక అక్కడకు వచ్చి, గుడ్లగూబను చూసింది.

ప్రాజెక్టు పని (మూడవ నిర్మాణాత్మక మూల్యాంకనం కోసం)

1. పది పొడుపు కథలు సేకరించి ప్రదర్శించండి.
1) తండ్రి గరగరా,
తల్లి పీచు పీచు
బిడ్డలు రత్న మాణిక్యాలు
మనుమలు బొమ్మరాళ్లు.
జవాబు:
పనసపండు :
తండ్రి – పైభాగం, తల్లి – లోపల పీచు, బిడ్డలు – తొనలు, మనుమలు – లోపలి గింజలు

2) అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది. మా ఇంటికి వచ్చింది. తైతక్కలాడింది.
జవాబు:
రోకలి

3. మా తాతకు జత ఎడ్లున్నాయి.
వాటికి నీళ్లంటే భయం. అవేమిటి?
జవాబు:
(లెదర్) చెప్పులు

4. గుడినిండా నీళ్లు గుడికి తాళం.
జవాబు:
కొబ్బరి కాయ

5. ఇంటి వెనకాతల ఇంగువ చెట్టు. ఎంత కోసినా తరగదు.
జవాబు:
పొగ

6. తోకలేని పిట్ట తొంభై ఆమడలు తిరిగింది.
జవాబు:
ఉత్తరం

7. అమ్మ అంటే కలుస్తారు. నాన్న అంటే విడిపోతారు? ఎవరూ?
జవాబు:
పెదవులు

8. తెల్లటి పొలంలో విత్తనాలు. చేత్తో వేస్తాం. కళ్లతో ఏరతాము?
జవాబు:
అక్షరాలు

9. నాలుగు కాళ్ళు ఉంటాయి గాని, నడవలేదు.
జవాబు:
కుర్చీ

10. తోకతో తాగే పిట్ట.
జవాబు:
దీపం

AP Board 6th Class Telugu Solutions Chapter 7 మమకారం

చమత్కార పద్యం

ఒడలినిండ కన్నులుండు నింద్రుడుకాడు
కంఠమందు నలుపు కాడు శివుడు
ఫణులబట్టి చంపు పక్షీంద్రుడా ? కాదు
దీనిభావమేమి తెలుసుకొనుడు
అర్థాలు :
ఒడలు = శరీరం
కంఠం = గొంతు
ఫణి = పాము
పక్షీంద్రుడు = గరుత్మంతుడు

ఇంద్రునిలాగా శరీరం నిండా కన్నులుంటాయి. శివుని లాగా గొంతు నల్లగా ఉంటుంది. గరుత్మంతుని లాగా పాములను చంపుతాడు. అది ఏమిటి?
జవాబు:
నెమలికి శరీరం నిండా నెమలి కన్నులుంటాయి. దాని మెడ నల్లగా ఉంటుంది. అది పాములను చంపుతుంది. కనుక ఈ చమత్కార పద్యానికి జవాబు ‘నెమలి’.

మమకారం కవి పరిచయం

రచయిత పేరు : చిలుకూరి దేవపుత్ర

జననం : అనంతపురం జిల్లా కాల్వ పల్లెలో 24.4.1952న జన్మించారు.

తల్లిదండ్రులు : సోజనమ్మ, ఆశీర్వాదం గార్లు

విద్య : 12వ తరగతి

ఉద్యోగం : జైళ్ల శాఖలో ఉద్యోగం, డిప్యూటీ తహసీల్దారు.

రచనలు : ఏకాకి నౌక చప్పుడు, చివరి మనుషులు, బందీ, వంకర టింకర, ఆరుగ్లాసులు మొదలైనవి కథా సంపుటాలు. అద్దంలో చందమామ, పంచమం నవలలు.

పురస్కారాలు : పంచమం నవలకు 1996లో ఆటా (అమెరికా తెలుగు అసోసియేషన్) వారి నవలల పోటీలో తృతీయ బహుమతి, 2000 సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం, 2001 లో చా.సో. స్ఫూర్తి సాహితీ సత్కారం, ఆంధ్రప్రదేశ్ గుర్రం జాషువా పురస్కారం పొందారు.

ప్రస్తుత పాఠ్యాంశం : వీరు రచించిన ‘ఆరుగ్లాసులు’ అనే కథా సంపుటిలోనిది. ఆయన 18. 10, 2016న స్వర్గస్తులయ్యారు.

AP Board 6th Class Telugu Solutions Chapter 7 మమకారం

కఠిన పదాలు అర్థాలు

జాంతణాలు = జాణతనాలు (తెలివిగా ప్రవర్తించడాలు)
ఒద్దిక = అనుకూలం
తుల్యం = సమానం
మునుపు = గతం
ప్రతీక = గుర్తు
వాత్సల్యం = పెద్దలకు పిల్లల పట్ల ఉండే ఆప్యాయత
శైలి = విధానం
కొలీగ్ = సహోద్యోగి
వార్నింగ్ = హెచ్చరిక
అనర్గళంగా = ధారాళంగా
దొరసాని = దొరగారి భార్య, పరిపాలకు రాలు
ఉబలాటం = ఆత్రుత
వీథి మొగదల = వీథి చివర, వీథి ప్రారంభం
తేటతెల్లం = పూర్తిగా అర్థం కావడం
తొణుకూబెణుకూ = తొట్రుబాటు, జంకు
కరచాలనం = చేతులు కలపడం (షేక్ హాండ్)

AP Board 6th Class Telugu Solutions Chapter 6 సుభాషితాలు

SCERT AP Board 6th Class Telugu Solutions 6th Lesson సుభాషితాలు Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Telugu Solutions 6th Lesson సుభాషితాలు

6th Class Telugu 6th Lesson సుభాషితాలు Textbook Questions and Answers

వినడం – ఆలోచించి మాట్లాడడం
AP Board 6th Class Telugu Solutions Chapter 6 సుభాషితాలు 1

ప్రశ్న 1.
చిత్రంలో ఎవరున్నారు?
జవాబు:
చిత్రంలో గురువుగారు, శిష్యులు ఉన్నారు.

ప్రశ్న 2.
గురువుగారు శిష్యులకు ఎటువంటి పద్యాలు చెబుతున్నారు?
జవాబు:
నీతి పద్యాలు, భక్తి పద్యాలు, లోకజ్ఞానం కలిగించే పద్యాలను గురువుగారు శిష్యులకు చెబుతున్నారు.

AP Board 6th Class Telugu Solutions Chapter 6 సుభాషితాలు

ప్రశ్న 3.
ఇలాంటి నీతిపద్యాలు మీకు తెలిసినవి చెప్పండి.
జవాబు:
1. అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను
సజ్జనుండు పల్కు చల్లగాను
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ !

2. తల్లి దండ్రి మీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోని చెదలు పుట్టవా ! గిట్టవా !
విశ్వదాభిరామ వినురవేమ !

అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
పాఠంలోని పద్యాలను రాగంతో, భావానికి తగినట్లుగా పాడండి.
జవాబు:
పద్యాలను స్పష్టంగా, అర్థవంతంగా, భావయుక్తంగా ఉపాధ్యాయుని అనుసరిస్తూ చదవండి.

ప్రశ్న 2.
‘కాలం చాలా విలువైంది’ ఎందుకో చర్చించండి.
జవాబు:
నిజంగానే కాలం చాలా విలువైంది. ఎందుకంటే గడిచిపోయిన ఒక్క క్షణం కూడా తిరిగిరాదు. పోయిన డబ్బును తిరిగి సంపాదించవచ్చు. పోయిన పదవిని తిరిగి సంపాదించవచ్చు. పోయినదానిని దేనినైనా తిరిగి సంపాదించ * వచ్చు. కానీ కాలం మాత్రం తిరిగి సంపాదించలేం.

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. దీపం ఆరిపోతే చీకటిలో ఏ పనీ చేయలేం కదా ! కాలం దీపం వంటిది. కాలం ఉండగానే పనులు చేయాలి. కాలం వెళ్లిపోయాక ఏమీ చేయలేం. అంటే చిన్నతనంలో చదువుకోకపోతే, సరైన ఉద్యోగం దొరకదు, అందుకే సకాలంలోనే పనులు పూర్తిచేయాలి. ఎప్పటి పనులను అప్పుడు చేసేయాలి.

AP Board 6th Class Telugu Solutions Chapter 6 సుభాషితాలు

ప్రశ్న 3.
‘విద్య గొప్పతనం’ నాలుగు వాక్యాల్లో రాయండి.
జవాబు:
విద్య చాలా గొప్పదని నార్ల చిరంజీవిగారు చెప్పారు. విద్యను దొంగలెత్తుకు పోలేరు. ఎవ్వరూ దోచుకోలేరు. అన్నదమ్ములు విద్యను పంచుకోలేరు. విద్య వలననే ప్రపంచం అభివృద్ధి చెందుతుంది.

ప్రశ్న 4.
కింది పద్యాన్ని చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
చెలిమి శిలాక్షర మెప్పుడు
అలుక జలాక్షరము సుజనులగు వారలకున్
చెలిమి జలాక్షర మెప్పుడు
అలుక శిలాక్షరము కుజనులగు వారలకున్

అ) అలుక ఎవరికి జలాక్షరం?
జవాబు:
మంచివారికి అలుక జలాక్షరం.

ఆ) ‘చెరిగిపోనిది’ అనే అర్థంలో కవి ఏ పదాన్ని వాడాడు?
జవాబు:
శిలాక్షరం అనే పదాన్ని చెరిగిపోనిది అనే అర్థంలో కవిగారు వాడారు.

ఇ) ఈ పద్యంలో ఏ అక్షరం ఎక్కువ సార్లు వచ్చింది?
జవాబు:
ఈ పద్యంలో ‘లకారం’ ఎక్కువగా 12 సార్లు వచ్చింది.

ఈ) ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
సుజనులు – కుజనులు

వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
నీ దృష్టిలో స్నేహం అంటే ఏమిటి?
జవాబు:
స్నేహం అంటే, ఒకరిలో ఒకరు లోపాలు ఎంచుకోకూడదు. తప్పులుంటే సవరించాలి. ఆపదలో ఆదుకోవాలి. ఇద్దరి మధ్యా రహస్యాలను ఇతరులకు చెప్పకూడదు.

AP Board 6th Class Telugu Solutions Chapter 6 సుభాషితాలు

ప్రశ్న 2.
“కోపంగాని, ఆవేశంగాని మంచివి కావు” ఎందుకో వివరించండి.
జవాబు:
కోపం, ఆవేశం రెండూ మంచివి కావు. కోపం వచ్చినపుడు ఆవేశం పెరుగుతుంది. ఆవేశం వస్తే కోపం పెరుగుతుంది. వీటి వలన అనవసరమైన మాటలు మాట్లాడతాం. అసహ్యకరంగా ప్రవర్తిస్తాం. స్నేహాలు చెడిపోతాయి. శత్రువులు పెరిగిపోతారు. లేనిపోని చిక్కులలో ఇరుక్కొంటాం, ఒక్కొక్కసారి ఉపాధిని కోల్పోతాం. జీవితం కూడా నాశనం కావచ్చు.

ప్రశ్న 3.
మనం స్త్రీలను ఎలా గౌరవించాలి?
జవాబు:
స్త్రీల పట్ల మర్యాదగా ప్రవర్తించాలి. గౌరవంగా మాట్లాడాలి. వారి మాటకు విలువ నివ్వాలి. వారి పనులను మెచ్చుకోవాలి. స్త్రీల విద్యను ప్రోత్సహించాలి.

ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
ఎటువంటి వారికి సహాయం చేయాలి? ఈ విషయాన్ని కవి ఎలా తెలియజేశారు?
జవాబు:
పేదవారికి సహాయం చేయాలి. ఈ విషయాన్ని కవిగారు చాలా చక్కగా వివరించారు. ధనవంతునికి చేసిన సహాయం వలన ప్రయోజనం లేదు. పేదవారికి చేసిన సహాయం వలన మంచి ప్రయోజనం కలుగుతుంది. ఎండిపోతున్న చేలమీద వర్షం పడితే ప్రయోజనం ఉంటుంది. అదే వర్షం సముద్రంమీద పడితే ప్రయోజనం లేదు.

అంటే పేదవాడికి డబ్బు అవసరం. వాడిన చేనుకు వర్షం అవసరం. పేదవాడిని ఎండిపోతున్న చేనుతో పోల్చాడు. ధనవంతుని వంటి సముద్రంపై పడిన వాన వృథా అని ధనవంతుని సముద్రంతో పోల్చి చక్కగా చెప్పారు.

ప్రశ్న 2.
మంచి కుమారునికి ఉండవలసిన లక్షణాలేవి?
జవాబు:
మంచి నోములు నోచిన తల్లిదండ్రులకు మంచి కుమారుడొక్కడు చాలు. వాడు ఎక్కడా దేనికీ చేయి చాపకూడదు. ఎవరైన తనను చెయ్యిచాపి అడిగితే లేదనకూడదు. వాడు నోరువిప్పితే నిజమే చెప్పాలి. అబద్దాలు చెప్పకూడదు. యుద్ధంలో వెనుదిరగనివాడు కావాలి. ఈ విధంగా మంచి కుమారునికి మంచి లక్షణాలుండాలి.

AP Board 6th Class Telugu Solutions Chapter 6 సుభాషితాలు

ప్రశ్న 3.
పాఠంలోని పద్యాల ఆధారంగా మీరు నేర్చుకున్న మంచి గుణాలు రాయండి.
జవాబు:
సమయం వృథా చేయకూడదు. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసేయాలి. భూమిని నాది నాది అని పాకులాడ కూడదు. ధనాన్ని దానం చేయాలి. యుద్ధరంగంలో భయపడకూడదు.

చదువును దొంగలెత్తుకుపోలేరు, పరిపాలకులు దోచుకోలేరు, అన్నదమ్ములు పంచుకోలేరు. ప్రపంచం అభివృద్ధి చెందాలంటే విద్య కావాలి. విద్యకు సాటి వచ్చే ధనం లేదు. ఎవ్వరి మనసుకూ బాధ కలిగించేలా మాట్లాడకూడదు. కోపం, ఆవేశం పనికిరాదు. వాటివల్ల చాలా తప్పులు జరుగుతాయి. చెడును మరచిపోవాలి. మంచిని గుర్తుపెట్టు కోవాలి. అందరితోనూ మర్యాదగా ఉండాలి. పుస్తకాలు చదవడం కంటే ఇతరుల మనసులు తెలుసుకోవడం గొప్ప విద్య. పేదలకు సహాయం చేయాలి. ఎవరి దగ్గరా చేయి చాపకూడదు. అడిగితే ఇవ్వాలి, నిజాలే చెప్పాలి.

భాషాంశాలు

అ) కింది గీత గీసిన పదాలకు అర్ధాలు రాయండి. వాటితో సొంతవాక్యాలు రాయండి.
ఉదా :
సిరి కలిగి ఉండటం వలన గర్వించకూడదు.
సిరి = సంపద
సంపద ఎవరి వద్ద స్థిరంగా ఉండదు.

1. ఏ పనినైనా విచక్షణతో చేసేవారే బుధులు.
జవాబు:
బుధులు = పండితులు
పండితులు గౌరవింపదగినవారు.

2. రైతులు ధరణిని నమ్ముకొని జీవిస్తారు.
జవాబు:
ధరణి = భూమి
అన్ని జీవులకూ ఈ భూమిపై జీవించే హక్కు ఉంది.

3. అంబుధి లో నీరు త్రాగడానికి పనికిరాదు.
జవాబు:
అంబుధి = సముద్రం
సముద్రంలో ఓడలు ప్రయాణిస్తాయి.

ఆ) కింది వాక్యాలలో సమానార్థక పదాలను (పర్యాయపదాలు) గుర్తించి రాయండి.

1. వృక్షాలు మనల్ని రక్షిస్తాయి. తరువుల రక్షణ మనందరి బాధ్యత.
జవాబు:
వృక్షాలు, తరువులు

2. భాస్కరుడు తూర్పున ఉదయిస్తాడు. లోకానికి వెలుగు నిచ్చేవాడు సూర్యుడు.
జవాబు:
భాస్కరుడు, సూర్యుడు

3. యుద్ధం వలన అనేక నష్టాలు ఉన్నాయి. కాబట్టి రణం లేకుండా కలసిమెలసి ఉండాలి.
జవాబు:
యుద్ధం, రణం

AP Board 6th Class Telugu Solutions Chapter 6 సుభాషితాలు

ఇ) కింది గీత గీసిన పదాలకు వ్యతిరేకార్థక పదాలు రాయండి.

1. ఇతరుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలి.
జవాబు:
అమర్యాద

2. సంతోషం సగం బలం.
జవాబు:
విచారం

3. ఈ ప్రదేశం సహజ సుందరంగా ఉంది.
జవాబు:
అసహజం

కింది ప్రకృతి – వికృతి పదాలను జతపరచండి.

1. శ్రీఅ) రోసం
2. దీపముఆ) సిరి
3. రోషంఇ) దివ్వె

జవాబు:

1. శ్రీఆ) సిరి
2. దీపముఇ) దివ్వె
3. రోషంఅ) రోసం

వ్యాకరణాంశాలు

అ) కింది పదాలను పరిశీలించండి.

మాయమ్మ = మా + య్ + అమ్మ
మీ యిల్లు = మీ + య్ + ఇల్లు

పై పదాల మధ్య ‘య్’ అదనంగా వచ్చి చేరింది. అలా చేరడాన్ని ‘యడాగమం’ అంటారు.

కింది పదాలను విడదీయండి.

ఉదా : మేనయత్త = మేన + య్ + అత్త
ఉన్నయూరు = ఉన్న + య్ + ఊరు
సరియైన = సరి + య్ + ఐన
నాదియన్న = నాది + య్ + అన్న

ఆ) కింది పదాలను విడదీయండి.
ఏమంటివి = ఏమి + అంటివి (మ్ + ఇ + అ = మ) సంధి జరిగితే.
ఏమియంటివి = ఏమి + య్ + అంటివి (య్ + అ = య) సంధి జరగకపోతే.

పై పదాల వలె కింది పదాలను విడదీయండి.
వచ్చిరిపుడు = వచ్చిరి + ఇపుడు (ర్ + ఇ + ఇ = రి) సంధి జరిగితే.
వచ్చిరియిప్పుడు = వచ్చిరి + య్ + ఇప్పుడు (య్ + ఇ = యి) సంధి జరగకపోతే.

పై పదాలను విడదీసినప్పుడు మొదటిపదం చివరన ‘ఇ’ (ఇత్వం) ఉంది. రెండవ పదం మొదట అ, ఇ వంటి అచ్చులు వచ్చాయి. ఇత్వంపై సంధి తప్పక జరగాలనే నియమం లేదు. జరగవచ్చు, జరగకపోవచ్చు. వ్యాకరణంలో ఈ పరిస్థితిని ‘వైకల్పికం’ అంటారు.

కింది పదాలను విడదీసి రాయండి.

ఉదా : నాదన్న = నాది + అన్న
నాదియన్న = నాది + య్ + అన్న
అదొకటి = అది + ఒకటి
అదియొకటి = అది + య్ + ఒకటి
లేకున్న = లేక + ఉన్న
లేకయున్న = లేక + య్ + ఉన్న

కింది పదాలను కలిపి రాయండి.

ఉదా : మఱి + ఏమి = మఱేమి = మఱియేమి
ఇది + అంత = ఇదంత = ఇదియంత
రానిది + అని = రానిదని = రానిదియని
అది + ఎట్లు = అదెట్లు = అదియెట్లు

AP Board 6th Class Telugu Solutions Chapter 6 సుభాషితాలు

ఇ) కింద ఇచ్చిన పదాలను విడదీసి సంధి పేరు రాయండి.
కాలమూరక = కాలము + ఊరక – (య్ + ఉ + ఊ = మూ) – (ఉత్వ సంధి)
దీపమున్న = దీపము + ఉన్న – (య్ + ఉ + ఉ = ము) – (ఉత్వ సంధి)
నేరములెన్నడు = నేరములు + ఎన్నడు (ల్ + ఉ + ఎ = లె) – (ఉత్వ సంధి)

కింద ఇచ్చిన పదాలను కలిపి సంధి పేరు రాయండి.
జనములు + – అందరు = జనములందరు (ఉత్వ సంధి)
మేలు + అది = మేలది (ఉత్వ సంధి)
మేఘుడు + ఒక = మేఘుడొక (ఉత్వ సంధి)

ఈ) సమాసం :
అర్థవంతమైన రెండు పదాలు కలిసి, ఒకే పదంగా ఏర్పడటాన్నే సమాసం అంటారు. సమాసంలోని మొదటి పదాన్ని పూర్వపదమని, రెండవ పదాన్ని ఉత్తరపదమని అంటారు.
ఉదా : సరస్వతీ మందిరం – సరస్వతి యొక్క మందిరం

పై ఉదాహరణలో సరస్వతి పూర్వపదం, మందిరం ఉత్తరపదం ఇలా సమాసాలు ఏర్పడతాయి.

ఉ) ద్వంద్వ సమాసం :
సమాసంలో ఉన్న రెండు పదాలు సమాన ప్రాధాన్యం కలిగి ఉంటే అది ద్వంద్వ సమాసం.
ఉదా :
సూర్యచంద్రులు = సూర్యుడును, చంద్రుడును
తల్లిదండ్రులు = తల్లియును, తండ్రియును
రామలక్ష్మణులు = రాముడును, లక్ష్మణుడును
“ఉభయ పదార్థ ప్రధానంబు ద్వంద్వంబు” అని సూత్రం.

కింది పదాలకు విగ్రహవాక్యాలు రాయండి.
రాత్రింబవళ్ళు = రాత్రియు, పవలును
బంధుమిత్రులు = బంధువులును, మిత్రులును
బాలబాలికలు = బాలురును, బాలికలను

కింది విగ్రహవాక్యాలను సమాస పదాలుగా మార్చి రాయండి.

రోషమును, ఆవేశమును = రోషావేశములు
అన్నయు, తమ్ముడును = అన్నదమ్ములు
కూరయు, కాయయు = కూరగాయలు

AP Board 6th Class Telugu Solutions Chapter 6 సుభాషితాలు

ఊ) కింది వాక్యాలను గమనించండి.
1. స్నేహం ఉన్నప్పుడు తప్పులు కనబడవు.
2. మాధవి పూజ కొరకు పూలను కోసుకొచ్చింది.
3. జీవితంలో జయాపజయాలు ఉంటాయి.
4. రవితో రహీం బడికి వెళ్ళాడు.

పై వాక్యాల్లో గీత గీసిన అక్షరాన్ని లేదా పదాన్ని తొలగించి చదవండి. అర్థవంతంగా లేవు కదా !
ఉదా :
చెట్లు ఫలాల బరువెక్కాయి.

ఈ వాక్యంలో పదాల మధ్య సంబంధం సరిగా లేనట్లుగా అనిపిస్తుంది. ఇప్పుడు ‘చేత’ అనే ప్రత్యయం ఉపయోగించి చదవండి. చెట్లు ఫలాల చేత బరువెక్కాయి. ఇలా పదాల మధ్య అర్థసంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని విభక్తులు అంటారు.

కింది ప్రత్యయాలను విభక్తులను తెలుసుకోండి.

ప్రత్యయాలువిభక్తులు
డు,ము,వు,లుప్రథమా విభక్తి
ని(న్), ను(న్), ల(న్), కూర్చి, గురించిద్వితీయా విభక్తి
చేత(న్), చే(న్), తోడ(న్), తో(న్)తృతీయా విభక్తి
కొఱకు(న్), కై (కోసం)చతుర్థి విభక్తి
వలన(న్), కంటె(న్), పట్టిపంచమీ విభక్తి
కి(న్), కు(న్), యొక్క, లో(న్), లోపల(న్)షష్ఠీ విభక్తి
అందు(న్), న(న్)సప్తమీ విభక్తి
ఓ, ఓయి, ఓరి, ఓసిసంబోధన ప్రథమా విభక్తి

చమత్కార పద్యం

హరి కుమారుడై యొప్పెడునాతడు హరి
హరికి దక్షిణనేత్రమౌ నాతడు హరి
హరికి శిరముతోడ వరలు నాతడు హరి
హరికి వామాక్షమౌ యొప్పునాతడు హరి

నానార్థాలు :
హరి = కోతి, సూర్యుడు, సింహము, చంద్రుడు
1. సూర్యుని కొడుకు సుగ్రీవుడు.
2. శ్రీహరి కుడికన్ను సూర్యుడు.
3. సింహపు తలతో ఒప్పువాడు శ్రీహరి.
4. శ్రీహరికి ఎడమ కన్ను చంద్రుడు అని ఇలా చెప్పుకోవాలి.

సుభాషితాలు కవుల పరిచయాలు

1. నార్ల చిరంజీవి : 20వ శతాబ్దం
జననం : 1.1.1925, కృష్ణాజిల్లా, గన్నవరం తాలూకా కాటూరులో జన్మించారు.
రచనలు : ఎర్ర గులాబీ, తెలుగుపూలు, కర్రా చెప్పులు, పేనూ – పెసరచేనూ, భాగ్యనగరం (నాటిక) మొ||వి రచించారు. 16. 10. 1971న అనారోగ్యంతో మరణించారు. ఈ పాఠం తెలుగుపూలు శతకంలోనిది.

2. వేమన : 17వ శతాబ్దం
జననం : 1652, రాయలసీమ
వృత్తి : అచలయోగి, కవి, సంఘసంస్కర్త. 1730లో స్వర్గస్తులయ్యారు.

3. కరుణశ్రీ : 20వ శతాబ్దం
పేరు : జంధ్యాల పాపయ్యశాస్త్రి
జననం : 4.8. 1912, గుంటూరు జిల్లా, పెదనందిపాడు మండలం, కొమ్మూరు.
వృత్తి : లెక్చరర్,
తల్లిదండ్రులు : మహాలక్ష్మమ్మ, పరదేశయ్య
రచనలు : పుష్పవిలాపం, కుంతీకుమారి, ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, ఉమర్ ఖయ్యూం, ఆనందలహరి మొదలైనవి. 21.6. 1992న స్వర్గస్తులయ్యారు.

4. తిక్కన : 13వ శతాబ్దం
రచనలు : నిర్వచనోత్తర రామాయణం, ఆంధ్ర మహాభారతం 15 పర్వాలు.
బిరుదులు : కవిబ్రహ్మ, ఉభయకవి మిత్రుడు. మనుమసిద్ధి ఆస్థాన కవి.

5. పక్కి అప్పల నరసింహం : 17వ శతాబ్దం.
రచనలు : కుమారా, కుమారీ శతకాలు.

6. పోతులూరి వీరబ్రహ్మం : 17వ శతాబ్దం
జననం : 1610, కడప.
రచనలు : కాలజ్ఞానం, కాళికాంబా సప్తశతి. 1693లో స్వర్గస్తులయ్యారు.

7. మారద వెంకయ్య : 16వ శతాబ్దం
మారద వెంకయ్య – మారయ వెంకయ్య, మారవి వెంకయ్య అని పేర్లు ఉన్నాయి.
జననం : 1550 శ్రీకాకుళం, విశాఖలలో జీవించారు.
రచన : భాస్కరశతకం
1650లో స్వర్గస్తులయ్యారు.

8. కంచర్ల గోపన్న : 17వ శతాబ్దం.
ఇతర పేర్లు వృత్తి భక్త రామదాసు
జననం : 1620లో ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి.
వృత్తి : తహసిల్దారు – పాల్వంచ పరగణా
తల్లిదండ్రులు : కామాంబ, లింగన్న మూర్తి
భార్య : కమలమ్మ
పిల్లలు : రఘునాథ
రచనలు : రామ కీర్తనలు, దాశరథీ శతకం

పద్యాలు – అర్థాలు – భావాలు

1.ఆ.వె. కడచి పోయి నట్టి క్షణము తిరిగిరాదు
కాలమూర కెపుడు గడపబోకు
దీపమున్న యపుడె దిద్దుకోవలె నిల్లు
విలువ దెలిసి చదువు తెలుగుబిడ్డ !
అర్థాలు :
కడచి పోయిన = జరిగిపోయిన
గడపబోకు = కాలక్షేపం చేయకు

భావం :
తెలుగుబిడ్డా ! జరిగిపోయిన సమయం. తిరిగి రాదు. కాబట్టి కాలాన్ని వృథాగా గడపకూడదు. అవకాశం ఉన్నప్పుడే పనులను చక్కగా చేసుకోవాలి. కాలం విలువ తెలుసుకొని చదువుకోవాలి.

2.ఆ.వె. భూమి నాది యన్న భూమి ఫక్కున నవ్వు
దానహీను జూచి ధనము నవ్వు
కదన భీతు జూచి కాలుండు నవ్వును
విశ్వదాభిరామ వినుర వేమ !
అర్థాలు :
దానహీనుడు = దానము చేయనివాడు
కదనము = యుద్ధము
భీతుడు = భయపడేవాడు, పిరికివాడు
కాలుండు = యముడు

భావం :
ప్రపంచాన్ని సృష్టించి యిచ్చిన రామా ! వేమా ! ఎంతోమంది జన్మించి మరణించిన ఈ భూమి నాది అంటే వాడి అమాయకత్వానికి భూమి నవ్వుతుంది. దానం చేయకుండా ధనాన్ని దాచుకొనే అశాశ్వతుడైన మనిషిని చూసి ధనం నవ్వుతుంది. ఎప్పటికైనా మరణం తప్పదు కదా ! యుద్ధానికి భయపడే వాడిని చూస్తే యమధర్మరాజు నవ్వుతాడు.

AP Board 6th Class Telugu Solutions Chapter 6 సుభాషితాలు

3.ఆ.వె. దొరలు దోచలేరు, దొంగ లెత్తుక పోరు
భ్రాతృజనము వచ్చి పంచుకోరు
విశ్వవర్ధనంబు విద్యాధనంబురా
లలిత సుగుణజాల తెలుగుబాల !
అర్థాలు :
దొరలు = పరిపాలకులు
భ్రాతృజనము = అన్నదమ్ములు
విశ్వం = ప్రపంచం
వర్ధనంబు = అభివృద్ధి చేసేది
విద్యాధనంబు = విద్య అనెడు ధనం

భావం :
తెలుగుబాల ! విద్యా ధనాన్ని దొరలు దోచుకోలేరు. దొంగలు ఎత్తుకుపోలేరు. అన్నదమ్ములు వచ్చి పంచు కోలేరు. ఈ విద్యా ధనమే ప్రపంచ అభివృద్ధికి మూలం.

4.కం. తనువున విరిగిన యలుగుల
ననువున బుచ్చంగవచ్చు నతినిష్టురతన్
మనమున నాటిన మాటలు
వినుమెన్ని యుపాయములను వెడలునే యధిపా
అర్థాలు :
అలుగు = బాణపు చివరి మొన
అనువున = తగిన తెలివితో (ఉపాయంతో)
పుచ్చంగవచ్చు = తీయవచ్చు
మనమున = మనసులో
అతి = ఎక్కువ
నాటిన = దిగిన
తనువున = శరీరంలో
అధిపా = ఓ రాజా !

భావం :
ఓ రాజా ! శరీరంలో బాణాలు గుచ్చుకుంటే ఉపాయంతో వాటిని తొలగించుకోవచ్చు. కాని అతి పరుషంగా మాట్లాడిన మాటలు మనస్సులో గుచ్చు కుంటే వాటిని తొలగించడానికి మనం ఎన్ని ఉపాయాలు చేసినా లాభం లేదు. అవి తొలగిపోవు.

5.కం. రోషావేశము జనులకు
దోషము, తలపోయ విపుల దుఃఖకరము నౌ;
రోషము విడిచిన యెడ సం
చూస్తే యమధర్మరాజు నవ్వుతాడు.
తోషింతురు బుధులు హితము దోప కుమారా !
అర్థాలు :
రోషము = కోపం
ఆవేశం = ఉద్రేకం
దోషము = తప్పు
తలపోయ = ఆలోచించగా
విపుల = చాలా
దుఃఖకరము = బాధ కలిగించేది
బుధులు = పండితులు
హితము ఆ = మేలు

భావం :
ఓ కుమారా ! కోపం, ఉద్రేకం కలిగి ఉండడం చాలా తప్పు. ఆలోచించగా అవే బాధలను కలిగిస్తాయి. కోపం విడిచి పెడితే పండితులు సంతోషిస్తారు. మంచి జరుగుతుంది.

6.కం. మఱవ వలెఁ గీడు, నెన్నఁడు
మఱవంగా రాదు మేలు, మర్యాదలతో
దిరుగవలె సర్వ జనముల
దరి, బ్రేమ మెలంగవలయు ధరణి కుమారీ !
అర్థాలు :
కీడు = ఆపద
మేలు = మంచి
సర్వజనములు = అందరు జనులూ
దరి = సమీపంలో
మెలగుట = ప్రవర్తించుట
ధరణి = భూమి

భావం :
ఓ కుమారీ ! ఒకరు చేసిన కీడు మరచిపోవాలి. కాని ఇతరులు మనకి చేసిన మేలును ఎన్నడూ మరచిపోకూడదు. అందరి పట్ల అనురాగంతో, ప్రేమతో ప్రవర్తించాలి.

7.ఆ.వె. పుస్తకములు చదువ పూర్ణత్వమబ్బదు
హృదయసంపుటముల చదువవలయు
పారిశుధ్యమొకటే పరమాత్మ చేర్చును
కాళికాంబ ! హంస ! కాళికాంబ !
అర్థాలు :
పూర్ణత్వం = పరిపూర్ణత
అబ్బదు = కలగదు
సంపుటము = (భావాల) సమూహం

భావం :
ఓ కాళికాంబా ! పుస్తకాలు చదివినందు వల్ల పూర్ణత్వం లభించదు, మనసులో ఉండే భావాలను చదవాలి. పరిశుభ్రత మనలను పరమేశ్వరుని వద్దకు చేరుస్తుంది. పుస్తక జ్ఞానం కంటే ఎదుటివారి హృదయాలను చదవటం ముఖ్యం. మనిషి మనసు, వాక్కు, కర్మ పరిశుద్ధంగా ఉండాలని భావం.

8.చ. సిరిగలవాని కెయ్యెడలఁ జేసిన మేలది నిష్ఫలంబగున్
నెఱిగుఱిగాదు పేదలకు నేర్పునఁ జేసిన సత్పలంబగున్
వఱపున వచ్చి మేఘుఁడొక వర్షము వాడిన చేల మీఁదటం
గుఱిసినఁ గాక యంబుథులఁ గుర్వఁగ నేమి ఫలంబు భాస్కరా!
అర్థాలు :
సిరిగలవాడు = ధనవంతుడు
ఎయ్యెడల = ఏ పరిస్థితులలో నైనా
నిష్ఫలంబు = ఫలితం ఉండదు
నెఱి = నిండైన
గుఱి = లక్ష్యం
సత్పలంబు = మంచి ఫలితం
వఱపున = వర్షం లేనపుడు
అంబుధి = సముద్రం
భాస్కరా ! = ఓ సూర్యదేవా !

భావం : భాస్కరా ! ధనవంతునికి మనం చేసే మేలు వ్యర్థం. పేదవారికి మేలు చేస్తే ప్రయోజనం కలుగుతుంది. వానలు లేక ఎండిపోతున్న చేల మీద మేఘుడు వర్షిస్తే ఫలితం ఉంటుంది గాని సముద్రం మీద కురిస్తే ప్రయోజనం ఉండదు కదా !

AP Board 6th Class Telugu Solutions Chapter 6 సుభాషితాలు

9.ఉ. నోఁచిన తల్లిదండ్రికిఁ దనూభవుఁ డొక్కడే చాలు మేటి చే
చాఁచనివాడు వేడొకఁడు చాఁచిన లేదనకిచ్చువాఁడు నో
రాఁచి నిజంబకాని పలుకాడనివాఁడు రణంబులోన మేన్
దాఁచనివాడు భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!
అర్థాలు :
పయోనిధి = సముద్రం
కరుణాపయోనిధీ = దయాసముద్రుడా !
నోచిన – నోములు చేసిన
తనూభవుడు = కుమారుడు
మేటి = గొప్పవాడు
చేచాచడం = ఇతరులను అడగడం
నోరాచి = నోరు తెరచి
పలుకాడడం = మాట్లాడడం
రణంబు ఆ = యుద్ధము
మేన్ = శరీరం
దాశరథి = దశరథుని
కుమారుడు = రాముడు
గిరి = పర్వతం

భావం :
దయాసముద్రుడవైన ఓ రామా ! ఎవరి దగ్గరా చేయి చాపనివాడు, అడిగితే లేదనకుండా దానం ఇచ్చేవాడు, నోరు తెరచి నిజం తప్ప అబద్దం చెప్పనివాడు. యుద్ధంలో వెన్ను చూపనివాడు అదృష్ట వంతులైన తల్లిదండ్రులకు ఇటువంటి గొప్పవాడైన కొడుకు ఒక్కడుంటే చాలు గదా !

AP Board 6th Class Telugu Solutions Chapter 5 మన మహనీయులు

SCERT AP Board 6th Class Telugu Solutions 5th Lesson మన మహనీయులు Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Telugu Solutions 5th Lesson మన మహనీయులు

6th Class Telugu 5th Lesson మన మహనీయులు Textbook Questions and Answers

ప్రశ్నలు – జవాబులు

అ) లఘు ప్రశ్నలు:

ప్రశ్న 1.
పింగళి వెంకయ్యగారిని గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి.
జవాబు:
పింగళి వెంకయ్యగారు మన జాతీయ జెండాను తయారుచేశారు. అందుకే ఆయనను జెండా వెంకయ్య అంటారు.

ఆయన కృష్ణాజిల్లా భట్ల పెనుమర్రులో జన్మించారు. ఆయన పుట్టిన తేదీ 2.8.1878. ఆయన దేశభక్తితో 19వ ఏట సైన్యంలో చేరారు.

1906లో కలకత్తాలో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభలలో ఎగరేసిన బ్రిటిష్ జెండా చూసి, మన దేశానికి ‘జెండా తయారుచేయాలని సంకల్పించారు. 1921లో విజయవాడలో 3 గంటలలో జెండాను రూపొందించారు. త్రివర్ణ పతాకం, మధ్యలో రాట్నంతో తయారుచేశారు. ఆయన 4.7.1963న స్వర్గస్థులయ్యారు.

ప్రశ్న 2.
శంకరంబాడి గారి జ్ఞాపకార్థం తిరుపతిలో ఎటువంటి ఏర్పాటు జరిగింది?
జవాబు:
2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతిలో శంకరంబాడి సుందరాచారి గారి కాంస్య విగ్రహాన్ని నెలకొల్పింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన జ్ఞాపకార్థం ఆ విగ్రహం దగ్గర మైకు ద్వారా “మా తెలుగు తల్లికి మల్లెపూదండ” గేయం నిరంతరం ధ్వనించే ఏర్పాటు చేసింది.

AP Board 6th Class Telugu Solutions Chapter 5 మన మహనీయులు

ప్రశ్న 3.
ప్రతిజ్ఞ విద్యార్థులలో ఎటువంటి భావాలను కలిగిస్తుంది?
జవాబు:
బడి పిల్లలంతా బడి ఆవరణలో ఉదయం జరిగే ప్రార్థనా సమావేశంలో “భారతదేశం నా మాతృభూమి” అంటూ చేసే ప్రతిజ్ఞ అచంచలమైన దేశభక్తిని, అంతులేని జాతీయతా భావ చైతన్యాన్ని, ఎనలేని సోదర భావాన్ని కలుగజేస్తుంది.

ఆ) వ్యాసరూప ప్రశ్నలు:

ప్రశ్న 1.
తెలుగుభాష, సంస్కృతులపై ‘శంకరంబాడి సుందరాచారి’ సాధికారతను తెలిపే సంఘటనను సొంత మాటల్లో రాయండి.
జవాబు:
బెనారస్ విశ్వవిద్యాలయంలో సాయంత్రం 4 గంటలకు శంకరంబాడి వారి ఉపన్యాసం ఉంది. ఆయన 6 గంటలకు వచ్చారు. అప్పటికే ఎదురుచూసి చూసి పిల్లలు విసిగిపోయారు. “ఇప్పుడు మొదలెడితే ఎప్పటికి వదుల్తాడో” అని బరంపురం కుర్రాడు అన్నాడు. ఆయన విన్నారు. తన ఉపన్యాసం మొదలుపెట్టి, ముగించేలోగా లేచి వెళ్లమని ఆ అబ్బాయిని శంకరంబాడి వారు సవాల్ చేశారు.

తెలుగుభాష గురించి చక్కగా చెప్పారు. కోడికూతతో ప్రారంభమయ్యే తెలుగువారి జీవితం గురించి, పల్లె పడుచుల కూనిరాగాలు, పశువుల అరుపులూ, పిట్టలకూతలూ, జానపద గీతాలు, పల్లెసుద్దులు, అమ్మ పాడే భక్తి గీతాలు, పిల్లల ఆటలు, పాటలు వర్ణించారు. గంగిరెద్దులు, హరిదాసులు, రచ్చబండ కబుర్లు మొత్తం తెలుగు సంస్కృతిని, భాషను ఆడుతూ, పాడుతూ గంటన్నరపాటు చెప్పారు. ఆయన సాధికారతకు అందరూ మంత్రముగ్ధులై విన్నారు. ఇంకా ఇంకా చెప్పమన్నారు. అక్కడే ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ పాడారు. మరో అరగంట మాట్లాడారు.

AP Board 6th Class Telugu Solutions Chapter 5 మన మహనీయులు

ప్రశ్న 2.
ఆంధ్రరాష్ట్ర అవతరణలో పొట్టి శ్రీరాములు త్యాగం గురించి సొంత మాటల్లో రాయండి.
జవాబు:
ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం ప్రకటించే వరకు తన దీక్ష ఆమరణాంతం కొనసాగిస్తానని 19. 10. 1952న పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష ప్రకటించారు. 15. 12. 1952 వరకు ఆమరణ దీక్ష కొనసాగించారు. ఆ రోజు రాత్రి 11.30 కి ఆయన హృదయ స్పందన ఆగిపోయింది. మూడు రోజుల పాటు ఆంధ్ర అగ్నిగుండమయింది. ఆంధ్ర ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆంధ్రరాష్ట్రం గురించి తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు. ఆ అమరజీవి త్యాగాన్ని ఆంధ్రజాతి ఉన్నంతవరకు మరచిపోదు.

పాఠ్యభాగ సారాంశం

తెలుగు ప్రజలకు మేలు చేయడానికి శ్రమించిన కొందరు మహానుభావులున్నారు. వారు తెలుగు జాతి ఆత్మాభిమానాన్ని, తెలుగు భాషా సంస్కృతులను జాతీయ స్థాయిలో నిలిపినవారు. వారిలో పొట్టి శ్రీరాములు, పింగళి వెంకయ్య, పైడిమర్రి వెంకటసుబ్బారావు, శంకరంబాడి సుందరాచారి ముఖ్యులు. అమూల్యమైన వారి త్యాగాలను, కృషిని స్మరించుకుందాం.

1. అమరజీవి పొట్టి శ్రీరాములు :
కనిగిరి ప్రాంతానికి చెందిన శ్రీరాములు కుటుంబం వ్యాపారరీత్యా మద్రాసులో స్థిరపడింది. ఆయన బొంబాయిలో ఉద్యోగం చేస్తూ ప్రజా సేవ చేసేవారు. గాంధీజీ బోధనలకు ఆకర్షితులై స్వాతంత్ర్యోద్యమంలో అడుగు పెట్టారు. ఆరునెలలు జైలు శిక్ష అనుభవించారు. అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ఆమరణ నిరాహారదీక్ష చేశారు. రోజులు గడిచినా ప్రభుత్వం స్పందించలేదు. ఆయన మరణించడంతో ఆంధ్రదేశం ఆందోళనలతో అట్టుడికింది. అప్పుడు కేంద్రం ఆంధ్రరాష్ట్రం ఇస్తున్నామని ప్రకటించింది. కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది.

2. జాతీయ జెండా రూపశిల్పి – పింగళి వెంకయ్య :
– భారతీయుల ఆత్మాభిమానానికి, దేశ సార్వభౌమాధికారానికి గుర్తు అయిన జాతీయ జెండాను రూపొందించిన వారు పింగళి వెంకయ్య. కృష్ణాజిల్లాలో జన్మించిన వెంకయ్య గాంధీగారి ఆదేశంతో మూడుగంటల్లో జాతీయ జెండాను రూపొందించారు. అందులో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులుంటాయి. మొదట మధ్యలో రాట్నం ఉండేది. తరువాత దాని స్థానంలో అశోక చక్రం చేరింది. భారతీయులలో ఉద్యమస్ఫూర్తిని కలిగించి, భారతీయులందరిని ఏకతాటిపై నడిపిన జాతీయ జెండా రూపశిల్పి ఆంధ్రుడవడం మనకు గర్వకారణం.

AP Board 6th Class Telugu Solutions Chapter 5 మన మహనీయులు

3. “జాతీయ ప్రతిజ్ఞ” నిర్మాత పైడిమర్రి వెంకట సుబ్బారావు :
భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోని ప్రతి బడిలో ప్రార్థనా సమావేశంలో ‘భారతదేశం నా మాతృభూమి’ అనే ప్రతిజ్ఞ వినిపిస్తుంది. దానిని రాసిన సుబ్బారావుగారు ఆంధ్రుడే. పిల్లల్లో దేశభక్తిని కలిగించడానికి ఆయన రాసిన ఈ ప్రతిజ్ఞ అన్ని పాఠ్య గ్రంథాల్లో ఉంటుంది. నల్గొండ జిల్లాలో జన్మించిన ఆయన అనేక పుస్తకాలు రచించారు. కావ్య నాటకాలు రాశారు.

4. సుందరకవి – శంకరంబాడి సుందరాచారి :
నిరాడంబరంగా కనిపిస్తూ తెలుగు జీవనం గురించి అనర్గళంగా ఉపన్యసించే గొప్ప వక్త ‘సుందరాచారి. ఆయన రచించిన “మా తెలుగు తల్లికి మల్లెపూదండ” అనేది మన రాష్ట్ర గేయంగా స్వీకరించారు. చిత్తూరు జిల్లాలో జన్మించిన ఆయన అనేక గ్రంథాలు రాశారు. తిరుపతిలో ఆయన కాంస్య విగ్రహం ఉంది. ఇటువంటి గొప్పవారి చరిత్రలు తెలుసుకోవాలి. వారిని ఆదర్శంగా తీసుకొని సమాజాన్ని దిద్దుకోవాలి.

AP Board 6th Class Telugu Solutions Chapter 4 సమయస్పూర్తి

SCERT AP Board 6th Class Telugu Solutions 4th Lesson సమయస్పూర్తి Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Telugu Solutions 4th Lesson సమయస్పూర్తి

6th Class Telugu 4th Lesson సమయస్పూర్తి Textbook Questions and Answers

వినడం – ఆలోచించి మాట్లాడడం
AP Board 6th Class Telugu Solutions Chapter 4 సమయస్పూర్తి 1

ప్రశ్న 1.
చిత్రాలు చూడండి. కథను ఊహించి. చెప్పండి.
జవాబు:
అనగనగా ఒక నక్క కోడిని బుట్టలో పెట్టి తెచ్చింది. కొంచెంసేపు నిద్రపోయి లేచి, వండుకొని తినవచ్చు అనుకొంది. రక్షించాలనుకొంది, మెల్లిగా చెట్టు దిగింది. బుట్ట తెరిచింది. కోడి పారిపోయింది.

నక్క భార్య పొయ్యి వెలిగించింది. చలి కాచుకొంది. బుట్టలో చూసింది. కోడి లేదు. ఝల్లున ఏడ్చింది. ఎలా పారిపోయిందో తెలీక బుర్ర గోక్కుంది.

ప్రశ్న 2.
కోతి లేకపోతే కోడి ఎలా తప్పించుకొనేదో ఊహించి చెప్పండి.
జవాబు:
నక్క బుట్ట తెరిచేటప్పటికి కోడి చనిపోయినట్టు నటిస్తుంది. నక్క ఆలోచిస్తుంది. సమయం చూసి కోడి చెట్టెక్కిస్తుంది.

అవగాహన – ప్రతిస్పందన,

ప్రశ్న 1.
ఈ కథను మీ సొంత మాటల్లో చెప్పండి.
జవాబు:
అనగనగా ఒక అడవిలో 5 చెట్లు ఒక చోట ఉన్నాయి. అందులో ఒక చెట్టు తొర్రలో ఒక పిల్లి ఉంది. దాని పేరు రోమశుడు. ఆ చెట్టు కింద కన్నంలో ఎలుక ఉంది. దాని పేరు పలితుడు.

ఒకసారి ఒక వేటగాడి “వలలో పిల్లి చిక్కుకుంది. ఉదయమే తన శత్రువు వలలో చిక్కినందుకు పలితుడు సంతోషించింది. అంతలోనే ఒక గుడ్లగూబ ఎలుకను తినడానికి వచ్చింది. దాని పేరు చంద్రకుడు.

ఎలుక దానిని చూసి భయపడింది. పిల్లి దగ్గరకు వెళ్లి స్నేహం చేసింది. వల కొరికి రక్షిస్తానని, తనని . కాపాడమని కోరింది. రోమశుడు ఒప్పుకొంది. గుడ్లగూబ పారిపోయింది.

సరిగ్గా వేటగాడు సమీపిస్తుంటే పలితుడు వలను కోరికింది. పిల్లి చెట్టేక్కేసింది. పలితుడు కన్నంలో దూరేసింది. వేటగాడు నిరాశతో వెళ్ళిపోయాడు.

కొంత సేపటికి రోమశుడు చెట్టు దిగి, పలితునితో స్నేహం నటిస్తూ పిలిచింది. కానీ పలితుడు తెలివైంది, ఇందాకా ఇద్దరికీ అవసరం కనుక వలకొరికేను. నీకూ, నాకూ స్నేహం కుదరదని చెప్పింది.

నీతి : శత్రువుకైనా ఉపకారం చేసి ఆ శత్రువు ద్వారా మరో శత్రువు నుండి తెలివిగా తప్పించుకోవాలి.

AP Board 6th Class Telugu Solutions Chapter 4 సమయస్పూర్తి

ప్రశ్న 2.
గుడ్లగూబను చూసి భయపడిన ఎలుక తన మనసులో ఏమనుకొంది?
జవాబు:
చంద్రకుడు అనే గుడ్లగూబను తన సమీపంలో చూసి, ఎలుక చాలా భయపడింది. తనకు దాని చేతిలో మరణం తప్పదనుకొంది. ఏం చేయాలో తెలియక మనసులో దేవుడిని తలచుకొని ఏడ్చింది. రోమశుడు వలలో పడినందుకు ఆనందపడడం తప్పని తెలుసుకొని బాధపడింది. ఐనా తెలివైన వారికి ప్రమాదం ఎదురైతే ఏడవరు. భయపడరు. ధైర్యం తెచ్చుకొంటారనుకొని తనకు తాను ధైర్యం చెప్పుకొంది. ఒకే చోట నివసిస్తున్నాం కనుక రోమశుని ప్రార్థించి ప్రాణాలు నిలబెట్టుకోవాలని నిర్ణయించుకొంది. రోమశుని దగ్గరకు వెళ్లింది.

ప్రశ్న 3.
ఎలుక, పిల్లి నుండి ఎలా తప్పించుకొంది?
జవాబు:
చంద్రుకుడనే గుడ్లగూబ నుండి ప్రాణాలతో బయట పడడానికి ఎలుక (పలితుడు) పిల్లి (రోమశుడు)తో స్నేహం చేసింది. బయటపడింది.

అన్నమాట ప్రకారం వలను కొరికితే పిల్లి తనను తినేస్తుందని పలితుడికి తెలుసు. అందుకే వల కొరుకుతున్నట్లు నటించింది. వేటగాడు సమీపిస్తుంటే పిల్లికి ప్రాణభయం పెరిగిపోయింది. సరిగ్గా అప్పుడు వలతాడు కొరికింది. పిల్లి ప్రాణభయంతో ఎలుకను వదిలేసి చెట్టేక్కేసింది.

తర్వాత స్నేహం చేద్దామన్నా ఎలుక ఒప్పుకోకుండా తప్పించుకొంది. శత్రువును కూడా చక్కగా ఉపయోగించు కోగల నేర్పు ఎలుకకుంది.

ప్రశ్న 4.
కింది పేరా చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.

మనం మంచివారితో స్నేహం చేస్తే మంచి అలవాట్లు వస్తాయి. చెడ్డవారితో స్నేహం చేస్తే చెడు అలవాట్లు అబ్బుతాయి. అవి మన జీవితాన్ని మార్చేస్తాయి. అందుకనే స్నేహితులను ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఎంచుకోవాలి. చక్కగా చదువుకొని బుద్ధిగా ఉండే పిల్లలతో స్నేహం చేయడం వలన వారు కూడా జీవితంలో మంచి స్థానం సంపాదించుకుంటారు. చదువు మీద శ్రద్ధ లేని, బాధ్యత లేని పిల్లలతో స్నేహం చేయడం వల్ల చదువూ సంధ్యా లేకుండా సోమరుల్లా మిగిలిపోతూ ఉంటారు. మనం తిరిగే, మాట్లాడే స్నేహితుల వల్ల మన స్వభావం గుణగణాలు ఎదుటివారికి తెలుస్తాయి. కష్టసమయాల్లో మంచి స్నేహితులు మనకు తోడుగా ఉంటారు.

అ) మనం ఎటువంటి వారితో స్నేహం చేయాలి?
జవాబు:
మనం మంచివారితో స్నేహం చేయాలి. చక్కగా చదువుకొంటూ బుద్ధిగా ఉండే పిల్లలతో స్నేహం చేయాలి.

ఆ) మంచి స్నేహితులను ఎలా ఎంచుకోవాలి?
జవాబు:
మంచి అలవాట్లు ఉండి, చక్కగా చదువుకొంటూ బుద్ధిగా చదువుకొనే వారిని మంచి స్నేహితులుగా ఎంచుకోవాలి.

AP Board 6th Class Telugu Solutions Chapter 4 సమయస్పూర్తి

ఇ) బాధ్యత లేని పిల్లలతో స్నేహం చేయడం వలన ఏం జరుగుతుంది?
జవాబు:
బాధ్యత లేని పిల్లలతో స్నేహం చేయడం వలన చదువు సంధ్యలు ఉండవు, సోమరుల్లా తయారవుతాం.

ఈ) కష్ట సమయాలలో మనకు తోడుగా వచ్చేవారు ఎవరు?
జవాబు:
కష్ట సమయాలలో మంచి స్నేహితులు మనకు తోడుగా వస్తారు.

ఉ) పై రా దేని గురించి చెప్తుంది?
జవాబు:
పై పేరా స్నేహం గురించి చెబుతోంది.

వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
పిల్లి స్వభావం ఎలాంటిది?
జవాబు:
పిల్లిది మోసం చేసే స్వభావం. అవసరాన్ని బట్టి నటించే స్వభావం కలది. వలలో చిక్కుకున్నప్పుడు ఎలుక వలతాళ్లు కొరికి కాపాడతానంది. తను చివరి దశలో ఉన్నాను కనుక ఎలుకతో స్నేహంగా ఉంటానని అబద్దం చెప్పింది. వలతాళ్లు కొరికి ఎలుక కాపాడింది.

వేటగాడు వెళ్ళిన కొద్ది సేపటికే ఎలుక తనకు చేసిన ఉపకారం మరచిపోయింది. స్నేహం వంకతో ఎలుకను బైటకి రప్పించి, తినేయాలనుకొంది. ప్రాణభిక్ష పెట్టినవాడి ప్రాణం తీయడానికి కూడా వెనుకాడని దుష్ట స్వభావం పిల్లిది. కపటంతో దేనినైనా సాధించవచ్చు అనుకొనే స్వభావం పిల్లిది.

AP Board 6th Class Telugu Solutions Chapter 4 సమయస్పూర్తి

ప్రశ్న 2.
ఆపద కలిగినపుడు మనం ఎలా ఆలోచించాలి?
జవాబు:
ఆపద కలిగినపుడు ధైర్యంగా ఉండాలి. ప్రాణం పోతుందని భయపడకూడదు. ఏదో ఒక ఉపాయం ఆలోచించి, అపాయం నుండి గట్టెక్కే విధంగా చూచుకోవాలి.

ప్రశ్న 3
ఈ కథలో నీవు తెలుసుకున్న నీతి ఏమిటి?
జవాబు:
ఈ కథలో అపాయం కలిగినప్పుడు ఏదయినా ఉపాయం ద్వారా ఆపదను పోగొట్టుకోవాలని తెలుసుకున్నాను. అపాయం నుండి తప్పించుకోవడానికి శత్రువు సహాయం తీసుకోవచ్చని, కాని శత్రువు నుండి రక్షించుకొనే ఉపాయం కూడా ఉండాలని తెలుసుకున్నాను. జాతి వైరం ఉన్న వారితో శాశ్వతంగా స్నేహం చేయకూడదని తెలుసుకున్నాను.

ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
సమయస్ఫూర్తి కథను సొంతమాటలలో రాయండి.
జవాబు:
పంచవటం అనే ప్రాంతంలోని ఒక మర్రిచెట్టు తొర్రలో రోమశుడు అనే పిల్లి, ఆ చెట్టు కింద కన్నంలో పలితుడు అనే ఎలుక ఉండేవారు. ఒక రోజు రోమశుడు వేటగాడు పన్నిన వలలో చిక్కుకున్నాడు. పిల్లి వలలో పడినందుకు ఎలుక సంతోషించింది.

అదే సమయంలో చంద్రకుడు అనే గుడ్లగూబ ఎలుకను చూసి అక్కడికి వచ్చింది. గుడ్లగూబను చూచి ఎలుక భయపడింది. ప్రమాదం ఎదురైనప్పుడు భయపడకూడదు అనుకుంటూ పిల్లికి దగ్గరగా వెళ్ళాడు. “మనం శత్రువులమైనా ఇక్కడే ఉంటున్నాము. ఒకరికొకరు అపకారం చేసుకోలేదు. గుడ్లగూబ నుండి నువ్వు నన్ను కాపాడితే, నిన్ను వేటగాడి నుండి నేను కాపాడుతాను అని చెప్పింది. అందుకు సంతోషించిన పిల్లి సరేనంది.

పిల్లి, ఎలుక స్నేహంగా మాట్లాడుకోవడం చూసి గుడ్లగూబ భయపడి వెళ్ళిపోయింది. అంతలో వేటగాడు కుక్కలతో రావడం గమనించిన పిల్లి తనను తొందరగా రక్షించమని ఎలుకను అడిగింది. సరేనంటూ ఎలుక వలను కొరుకుతున్నట్లు నటించి, వేటగాడు దగ్గరకు వచ్చే వరకు ఆగి, అప్పుడు త్రాళ్ళు కొరికింది. పిల్లి చెట్టెక్కి వేటగాడి నుండి తప్పించుకుంది.

వేటగాడు వెళ్ళిన తరువాత పిల్లి ఎలుక కన్నం దగ్గరకు వచ్చి ఎలుకను పిలిచి స్నేహంగా ఉందామని కలిసిమెలిసి బతుకుదామని అంది. ఎలుక కొద్దిగా తల బయటకు పెట్టి “ఇందాక ఇద్దరికీ అవసరం ఉంది. నీ వలన నేను రక్షింపబడ్డాను. నేను నిన్ను కాపాడాను. ఇద్దరికీ లాభం జరిగింది. కాని మనది జాతి వైరం. నేను బయటకు వస్తే నన్ను నువ్వు చంపక మానవు. అది నాకు తెలుసు” అని కన్నంలో దూరింది. తన ఎత్తు పారకపోయేసరికి పిల్లి నిరాశపడింది.

AP Board 6th Class Telugu Solutions Chapter 4 సమయస్పూర్తి

ప్రశ్న 2.
ఎలుక తెలివితేటలను గురించి మీరేమనుకొంటున్నారో రాయండి.
జవాబు:
ఎలుక చాలా తెలివైంది. తనకు ప్రాణభయం ఏర్పడితే ఒక్కక్షణం భయపడింది. వెంటనే ఆలోచించింది. ప్రమాదం ఏర్పడినపుడు ఆలోచించి బైటపడే వారే నిజమైన తెలివైన వారని ఎలుక నిరూపించింది.

గుడ్లగూబ, పిల్లీ రెండూ తనకు శత్రువులే రెండూ తనను తినేసేవే. అయినా భయపడలేదు. ఒక శత్రువును తప్పించుకొనేందుకు మరొక శత్రువుతో స్నేహం చేసింది. గుడ్లగూబ వలన వెంటనే ప్రమాదం కానీ గుడ్లగూబకు పిల్లి అంటే భయం. పిల్లి వలలో ఉంది. నిజానికి పిల్లి గుడ్లగూబను కూడా ఏమీ చేయలేదు. కానీ గుడ్లగూబకు పగటివేళ కళ్ళు సరిగా కనిపించవు. అందుకే గుడ్లగూబను దివాంధము అంటారు. అది గమనించి పిల్లితో స్నేహపూర్వకమైన సంభాషణ దానికి వినపడేలా మాట్లాడింది. గుడ్లగూబ భయపడి పారిపోయింది.

వేటగాడు వస్తుంటే వలతాళ్లు కొరికింది. పిల్లి కూడా ప్రాణభయంతో పారిపోయింది. తర్వాత రమ్మన్నా – కలుగులోంచి రాలేదు. ఎలుక చాలా తెలివైనది కనుకనే రెండు ప్రమాదాల నుండీ అవలీలగా బైటపడింది.

ప్రశ్న 3.
ఎలుక – పిల్లి మాటలను సంభాషణ రూపంలో రాయండి.
జవాబు:
ఎలుక : నమస్కారమండీ ! పిల్లిగారూ !
పిల్లి : (గంభీరంగా) ఆ…… ఏంటీ?
ఎలుక : ఒకే చెట్టు కింద బతుకుతున్నాం కదండీ !
పిల్లి : ఔనౌను ! మనిద్దరం స్నేహితులం కదా !
ఎలుక : మీరన్నా, మీ మీసాలన్నా నాకు చాలా ఇష్టం.
పిల్లి : (నవ్వుతూ) నాకూ నువ్వుంటే చాలా ఇష్టం.
ఎలుక : ఆ గుడ్లగూబ భయపెడుతోంది.
పిల్లి : నీ జోలికి వస్తే, దాన్ని తినేస్తాను. నీకేం భయం లేదు.
ఎలుక : ధన్యవాదాలు.
పిల్లి : (మెల్లిగా) వలతాళ్ళు కొరికి కాపాడతావా? అదిగో ! వేటగాడు, కాపాడు ! కాపాడు !
ఎలుక : హమ్మయ్య ! కొరికేశాను. ఇక ఇద్దరం క్షేమమే.

భాషాంశాలు

అ) గీతగీసిన పదాలకు అర్థాలు రాయండి.
ఉదా : ఎలుక ఆహారం అన్వేషించడానికి బయలుదేరింది. = వెతకడానికి
1. చిలుక ప్రాణభీతితో గిజగిజలాడింది. = ప్రాణభయం
2. చిరకాల వైరం మంచిది కాదు = విరోధం
3. మంచివారితో మైత్రి గొప్ప జీవితానికి మంచిమార్గం చూపుతుంది. = స్నేహం
4. సదాలోచనలు చేయాలి. = మంచి ఆలోచనలు

AP Board 6th Class Telugu Solutions Chapter 4 సమయస్పూర్తి

ఆ) కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి.
1. అదృష్టం × దురదృష్టం
2. మంచి × చెడు
3. వెలుగు × చీకటి
4. అపకారం × ఉపకారం
5. ధర్మం × అధర్మం
6. సత్యం × అసత్యం

సూచన :
ప్రకృతి – వికృతి అంటే ఏమిటో ఉపాధ్యాయులు పిల్లలకు చెప్పండి.
ప్రకృతి : సంస్కృతంలో కొన్ని ప్రాకృత పదాలు తెలుగులోకి వచ్చాయి. వీటిని ప్రకృతులు అంటారు.
వికృతులు : కొన్ని పదాలు వర్ణలోప, వర్ణాగమ, వర్ణాధిక్య వర్ణ వ్యత్యయాది మార్పులతో వికృతులుగా మారతాయి.

ప్రకృతివికృతిమార్పు
రథంఅరదంఅకారం చేరింది.
అంగుళీయకంఉంగరంఅక్షరాలు పూర్తిగా మారడం
అప్సరఅచ్చరప, సలకు బదులు చకారం వచ్చింది
చంద్రుడుచందురుడుఅనే అక్షరాలు కొద్ది మార్పు
హితంఇతంహకార లోపం

AP Board 6th Class Telugu Solutions Chapter 4 సమయస్పూర్తి

ఇ) కింది ప్రకృతి వికృతులను జతచేయండి.

1. ఆహారముఅ) పానం
2. ధర్మముఆ) సంతసం
3. ప్రాణముఇ) కత
4. కథఈ) దమ్మం
5. సంతోషముఉ) ఓగిరం

జవాబు:

1. ఆహారముఉ) ఓగిరం
2. ధర్మముఈ) దమ్మం
3. ప్రాణముఅ) పానం
4. కథఇ) కత
5. సంతోషముఆ) సంతసం

వ్యాకరణాంశాలు

పిల్లలందరూ మైదానంలో ఆడుతున్నారు.

పై వాక్యంలో పిల్లలందరూ అనే పదం పిల్లలు + అందరూ అనే రెండు పదాల కలయిక వల్ల ఏర్పడింది. దీనినే సంధి అంటారు.

పిల్లలు అన్న పదం చివర ‘ఉ’ ఉంది. అందరూ అన్న పదం మొదట ‘అ’ ఉంది. రెండు పదాలూ కలిసినపుడు ఉ + అ అన్న రెండు అచ్చులకు బదులు ‘అ’ ఒక్కటే వచ్చింది.

ఇటువంటి మార్పును సంధి అంటారు. సంధి జరిగే సమయంలో మొదటి పదం చివరి అచ్చు పోతుంది. రెండవ పదంలో మొదటి అచ్చు మిగులుతుంది. – రెండు తెలుగు పదాల మధ్య జరిగే ఈ సంధులను తెలుగు సంధులు అంటారు.
ఉదా :
రాముడు + అతడు = రాముడతడు.

ఇందులో రాముడు మొదటి పదం అతడు రెండవ పదం. మొదటి పదమైన రాముడులోని చివరి ఉకారం పోయి రెండవ పదంలోని అకారం మిగిలింది.
రాముడు + అతడు = రాముడతడు అనే రూపం ఏర్పడింది.

అ) కింది పదాలను విడదీయండి:
1. వాడెక్కడ = వాడు + ఎక్కడ
2. మనమందరం = మనము + అందరం
3. ఎవరిక్కడ = ఎవరు + ఇక్కడ
4. వారందరూ = వారు + అందరూ
5. మహానీయులెందరో = ‘ మహనీయులు + ఎందరు + ఓ

ఆ) కింది పదాలను కలిపి రాయండి. మార్పును చర్చించండి.
ఉదా : ముసలివాళ్లు + అందరు = (ళ్ల్+) ఉ + అ = ళ్ల – ముసలివాళ్ళందరు
1. వీళ్లు + అందరూ = వీళ్లందరూ (ళ్ల్ + ఉ) + అ = ళ్ల
2. ఇల్లు + ఉంది = ఇల్లుంది (ల్ల్+ ఉ) + ఉ = ల్లు
3. ప్రజలు + అందరూ = ప్రజలందరూ (ల్ + ఉ) + అ = లు
4. డొక్కలు + ఎండిపోయిన = డొక్కలెండిపోయిన (ల్ + ఉ)
5. ముసలివారు + అంటే = ముసలివారుంటే (ర్ + ఉ) + ఉ = రు
6. పాఠాలు + ఎన్ని = పాఠాలెన్ని (ల్ + ఉ) + ఎ = లె

ఉపాధ్యాయులకు గమనిక :
వ్యాకరణ పరంగా ఉత్వసంధి రాని సందర్భాలు (ప్రథమేతర విభక్తి శత్రర్థక చువర్ణములందున్న ఉకారమునకు సంధి వైకల్పికముగా వస్తుంది) అక్కడక్కడ ఉన్నాయి. ఇవి గ్రాంథిక భాషకు పరిమితమైన విషయాలు కాబట్టి ఉపాధ్యాయునికి అవగాహన ఉంటే చాలు. పిల్లలకు ఈ స్థాయిలో వివరించాల్సిన అవసరం లేదు.

AP Board 6th Class Telugu Solutions Chapter 4 సమయస్పూర్తి

* ఈ పాఠంలోని ఉత్వసంధికి సంబంధించిన సంధి పదాలను వెతికి రాయండి.
జవాబు:
కాపురముంటోంది = కాపురము + ఉంటుంది
విహరిస్తున్న = విహరిస్తు + ఉన్న
గిజగిజలాడాడు = గిజగిజలు + ఆడాడు
ఏడుస్తున్నాడు = ఏడుస్తూ + ఉన్నాడు
రాదన్నది = రాదు + అన్నది
ఎదురైనప్పుడు = ఎదురు + ఐనప్పుడు
ధైర్యమొందుతారు = ధైర్యము + ఒందుతారు
బ్రతుకుతున్న = బ్రతుకుతు + ఉన్న
వైరమున్నా = వైరము + ఉన్న
మింగేస్తావేమో = మింగేస్తావు + ఏమో
ఉందామని = ఉందాము + అని
కాదంటే = కాదు + అంటే
పోదామని = పోదాము + అని
తహతహలాడుతూ = తహతహలు + ఆడుతూ
పరవశుడయ్యాడు = పరవశుడు + అయ్యాడు
నిన్నేమీ = నిన్ను + ఏమీ
వారిద్దరూ = వారు + ఇద్దరూ
పారదని = పారదు + అని
చెట్టెక్కాడు = చెట్టు + ఎక్కాడు
నిన్నాశ్రయించాను = నిన్ను + ఆశ్రయించాను
సత్యమే = సత్యము + ఏ
లాభమే = లాభము + ఏ
కాదనలేని = కాదు + అనలేని
వచ్చా ననుకో = వచ్చాను + అనుకో
తప్పదని = తప్పదు + అని
మాయమయ్యాడు = మాయము + అయ్యాడు
నిరాశపాలయ్యాడు = నిరాశపాలు + అయ్యాడు
అంతమయ్యింది = అంతము + అయ్యింది

ఇ) పారిభాషిక పదాల అభ్యాసాలు :

అడుగులో అడుగు వేశాము. – ఆటలు పాటలు పాడాము.
ఇరుగు పొరుగు కలిశాము. – ఈలలు వేస్తూ గెంతాము.
ఉరుకులు పరుగులు తీశాము. – ఊరిని శుభ్రం చేశాము.

పై గేయంలో అచ్చుల కింద గీత గీసి గుర్తించండి. హ్రస్వాచ్చులను దీర్ఘాచ్చులను విడివిడిగా రాయండి.

హ్రస్వాచ్చులుదీర్ఘాచ్చులు
1. అ1. ఆ
2. ఇ2. ఈ
3. ఉ4. ఊ

ఈ) కింది వాక్యాలలో పరుషాక్షరాలను గుర్తించండి, గీత గీయండి.

వాక్యంపరుషాక్షరాలు
1. న్నవారిని కొలుద్దాం.క, కొ
2. దువులు బాగా దువుదాం.
3. చిటపట చినుకులు డ్డాయి.చి, ట, ప, కు
4. తపాలవాడు. వచ్చాడు, తో జాబులు తెచ్చాడు.త, పా, చ్చా, తో, తె
5. రిమళమంటే మాకిష్టం.ప, టే, కి

AP Board 6th Class Telugu Solutions Chapter 4 సమయస్పూర్తి

ఉ) కింది వాక్యాలలో సరళాక్షరాలు గుర్తించండి.

వాక్యంసరళాక్షరాలు
1. చలికి గజగజ వణికారు వారు.గ, జ
2. ఆ అమ్మాయి జడ కుచ్చులు పెట్టుకుంది.జ, డ, ది
3. డబ్బు పొదుపు చేయడం మంచిది.డ, బ్బు, దు, డ, ది
4. సరా పండు వచ్చింది; సరదాలెన్నో తెచ్చింది.ద, గ, ది, దా
5. పలకా లపం మా ఆస్తి.

ఊ) కింది అక్షరాలు పరిశీలించండి. స్థిరాక్షరాల చుట్టూ ‘సున్న’ చుట్టండి.
AP Board 6th Class Telugu Solutions Chapter 4 సమయస్పూర్తి 2
AP Board 6th Class Telugu Solutions Chapter 4 సమయస్పూర్తి 3

ఎ) కింది వాక్యాలలోని స్పర్శాక్షరాలకు ‘సున్న’ చుట్టండి.
ఈ సంవత్సరం మీరు సెలవులకు ఎక్కడికి వెళుతున్నారు?
కిందటి సంవత్సరం సంపూర్ణ ప్రపంచయాత్ర చేశాం.
ఈ ఏడాది ఇంకేటయినా వెళ్లాలి.
జవాబు:
AP Board 6th Class Telugu Solutions Chapter 4 సమయస్పూర్తి 4

ఏ) కింది వాక్యాలు పరిశీలించండి. వర్గయుక్కులు గుర్తుపెట్టండి.
ఆయనకు కరమునకు ఖరమునకు తేడా తెలీదుట.
ఘనతకు మూలం వినయం.
భయపడితే జీవితంలో ముందుకు పోలేం.
జవాబు:
AP Board 6th Class Telugu Solutions Chapter 4 సమయస్పూర్తి 5

ఐ) కింది వాక్యంలో అనునాసికాక్షరాలు గుర్తించండి.
కరుణ నమస్కారం పెట్టింది.
జవాబు:
AP Board 6th Class Telugu Solutions Chapter 4 సమయస్పూర్తి 6

ఒ) కింది మాటలలో అంతస్థాలను గుర్తించండి.
యమున, కారం, పాలు, వంకర, వేళ
జవాబు:
AP Board 6th Class Telugu Solutions Chapter 4 సమయస్పూర్తి 7

ఓ) కింది వాక్యంలో ఊష్మాలను గుర్తించండి.
భాషను మాట్లాడే సహజ శక్తి .మనుషులందరికీ ఉంటుంది.
జవాబు:
AP Board 6th Class Telugu Solutions Chapter 4 సమయస్పూర్తి 8

ఔ) కింది వాక్యాలలో తాలవ్యాక్షరాలను గుర్తించండి.
ఈ ఇలలో చక్కగా చదువుకున్నవారే సుఖపడతారు.
జవాబు:
AP Board 6th Class Telugu Solutions Chapter 4 సమయస్పూర్తి 9

అం) కింది గడిలో మూర్ధన్యాక్షరాలను గుర్తించండి.
AP Board 6th Class Telugu Solutions Chapter 4 సమయస్పూర్తి 10
జవాబు:
AP Board 6th Class Telugu Solutions Chapter 4 సమయస్పూర్తి 11

* తాతకు దగ్గులు నేర్పడం సతీష్ కు సాధ్యమా
ఈ వాక్యంలో ఉన్న దంత్యాక్షరాల కింద గీత గీయండి.
జవాబు:
తాతకు గ్గులు నేర్పడం సతీష్ కు సాధ్యమా

* మహాత్మాగాంధీ పోర్బందర్ లో జన్మించాడు.
ఈ వాక్యంలో ఓష్ట్యాక్షరాలు గుర్తించండి.
జవాబు:
AP Board 6th Class Telugu Solutions Chapter 4 సమయస్పూర్తి 12

భాషాభాగాలు

కింది భాషాభాగాలను జతపరచండి.

అ) విశేషణం1. చదివాను
ఆ) నామవాచకం2. కాని
ఇ) క్రియ3. ఆమె
ఈ) అవ్యయం4. ఎర్రని
ఉ) సర్వనామం5. వనజ

జవాబు:

అ) విశేషణం4. ఎర్రని
ఆ) నామవాచకం5. వనజ
ఇ) క్రియ1. చదివాను
ఈ) అవ్యయం2. కాని
ఉ) సర్వనామం3. ఆమె

ఖాళీలను పూరించండి.

1. నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది (విశేషణం)
2. పేరుకు బదులుగా వాడేది ………… (సర్వనామం)
3. పనిని తెలిపే మాట ……………… (క్రియ)
4. లింగ వచన విభక్తులు లేనిది…………… (అవ్యయం)
5. పేరును తెలిపే పదం ………………. (నామవాచకం)

చమత్కార పద్యం

“ఎలుకలు తమ కలుగులోనికి ఏనుగునీడ్చెను” అని కవికి ఒక సమస్యను ఇచ్చారు. కవి దానిని ఎలా పూరించాడో చూడండి.
ఇలలో నిద్దరు రాజులు
మలయుచుఁ జదరంగమాడి మాపటివేళన్
బలమెత్తికట్ట మరచిన
నెలుకలు తమ కలుగులోనికేనుగునీడ్చెన్.

భావం :
ఇలలో ఇద్దరు రాజులు పట్టుదలతో చదరంగమాడుతున్నారు. రాత్రి అయింది చదరంగం మీద బలాన్ని (పావులను) ఎలా ఉన్నవి అలానే వదిలేసి వెళ్ళారు. రాత్రికి ఎలుకలు వచ్చి ఏనుగు (పావు)ను తమ రంధ్రంలోకి ఈడ్చుకొని పోయాయి.

సమయస్ఫూర్తి – కవి పరిచయం

జననం : 16-4-1848న రాజమండ్రిలో జన్మించారు.

తల్లిదండ్రులు : పున్నమ్మ, సుబ్బారాయుడుగార్లు.

భార్యపేరు : బాపమ్మ (రాజ్యలక్ష్మమ్మ)

రచనలు : రాజశేఖర చరిత్రము, సత్యరాజా పూర్వదేశ యాత్రలు, హాస్య సంజీవని, సతీహిత బోధిని, ఆంధ్రకవుల చరిత్ర మొదలైన 130 గ్రంథాలు రచించారు. అనేక ఆంగ్ల, సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదించారు.

ఉద్యోగం : రాజమండ్రిలోనూ, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలోనూ తెలుగు పండితునిగా పనిచేశారు.

బిరుదులు : గద్యతిక్కన, రావు బహద్దూర్. ప్రత్యేకతలు : రచయిత, కవి, సంఘ సంస్కర్త, నవయుగ వైతాళికుడు, విద్యావేత్త, ఆధునికాంధ్ర సమాజ పితామహుడు.

మొట్టమొదటగా చేసినవి, రచించినవి : వితంతు వివాహం, సహవిద్యా పాఠశాల స్థాపన, నాటకకర్త, దర్శకత్వం, నాటక ప్రదర్శన, నవల, స్వీయచరిత్ర, ప్రహసనం. వీరు 27-5-1919న స్వర్గస్తులయ్యా రు.

అర్థాలు

వటము = మఱ్ఱిచెట్టు
పంచవటం = ఐదు మఱ్ఱిచెట్లు
అన్వేషణ = వెతుకులాట
శత్రువు = విరోధి
గుండె గుభేలు మనడం = చాలా భయపడడం
భీతి = భయం
చంకలు కొట్టుకోవడం = ఆనందించడం
బుద్ధిమంతులు = తెలివైనవారు
అర్థించి = అడిగి
అడుగులు వేయడం = బయల్దేరడం
పరస్పరం = ఒకరికొకరు
ఆపద = ప్రమాదం
తహతహలాడడం = ఆత్రుత పడడం
సఖ్యంగా = స్నేహంగా
మైత్రి = స్నేహం
పథకం = పద్ధతి
కాలయముడు = యమధర్మరాజు
సంతోషం = ఆనందం
ఆశ్రయించడం = పంచన చేరడం, ప్రార్థించడం
కుట్ర = మోసం
సత్యం = నిజం
ఉభయులు = ఇద్దరూ
లక్షణం = స్వభావం పీడ
వైరం = విరోధం

AP Board 6th Class Telugu Solutions Chapter 4 సమయస్పూర్తి

ప్రాణగండం = ప్రాణానికి ప్రమాదం
పరవశం = ఒళ్ళు తెలియని స్థితి
చివరిదశ = ఆఖరిదశ
నడుచుకోవడం = ప్రవర్తించడం
త్యాగం = తను మానుకొని ఇతరులకుఇవ్వడం
కృతజ్ఞత = చేసినమేలు మరువకపోవడం
స్నేహం = చెలిమి
అజ్ఞానం = తెలియనితనం
పటాపంచలు = నాశనం
సఖ్యం = స్నేహం
సదాలోచన = మంచి ఆలోచన
కన్నం = రంధ్రం
విచారము = బాధ
స్వజాతి = తన జాతి
కపటం = మోసం

AP Board 6th Class Telugu Solutions Chapter 3 మాకొట్టి తెల్ల దొరతనము

SCERT AP Board 6th Class Telugu Solutions 3rd Lesson మాకొట్టి తెల్ల దొరతనము Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Telugu Solutions 3rd Lesson మాకొట్టి తెల్ల దొరతనము

6th Class Telugu 3rd Lesson మాకొట్టి తెల్ల దొరతనము Textbook Questions and Answers

వినడం – ఆలోచించి మాట్లాడడం
AP Board 6th Class Telugu Solutions Chapter 3 మాకొట్టి తెల్ల దొరతనము 1

ప్రశ్న 1.
చిత్రం చూడండి. చిత్రం గురించి మాట్లాడండి.
జవాబు:
చిత్రంలో మన జాతీయ పతాకం ఉంది. ఆ బొమ్మలోని వారు దేనికో గొడవపడుతున్నారు. పోలీసులు లాఠీలతో కొడుతున్నారు. అది బహుశా స్వాతంత్ర్యోద్యమం కావచ్చు. అందుకే స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ ఉద్యమంలో పాల్గొన్నారు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించారు. పోలీసులు ఆ ఉద్యమం చేసేవారిని అడ్డుకొంటున్నారు. కొడుతున్నారు.

ప్రశ్న 2.
పై చిత్రంలో ఎంతమంది రక్షకభటులున్నారు?
జవాబు:
పై చిత్రంలో ఆరుగురు రక్షకభటులున్నారు.

AP Board 6th Class Telugu Solutions Chapter 3 మాకొట్టి తెల్ల దొరతనము

ప్రశ్న 3.
పై చిత్రంలో ఉద్యమం చేసే వారి కళ్లల్లో ఏ భావాలు కనబడుతున్నాయి?
జవాబు:
పై చిత్రంలో ఉద్యమం చేసేవారు కొందరి కళ్లల్లో కోపం కనబడుతోంది. కొందరి కళ్లల్లో భయం కనబడుతోంది.

అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
ఈ గేయాన్ని రాగయుక్తంగా పాడండి. అభినయించండి.
జవాబు:
ఉపాధ్యాయుని అనుసరిస్తూ, స్పష్టమైన ఉచ్చారణతో పాడాలి. అభినయించాలి.

ప్రశ్న 2.
కింది వాక్యాలను చదవండి. వీటికి సంబంధించిన పంక్తులు గేయంలో ఎక్కడ ఉన్నాయో గుర్తించండి, రాయండి.

అ) మా ధనం మూటలు దోచుకున్నాడు.
జవాబు:
మాదు మూటాముల్లెలు దోచినాడు

ఆ) కీడుతో మమ్మల్ని చెడిపోమంటున్నాడు.
జవాబు:
చేటు తెచ్చుక మమ్ము చెడిపోవమంటాడు.

ఇ) ఈ దేశం మీద దాడి చేస్తున్నాడు.
జవాబు:
ధాటీ చేస్తాడీ దేశమున

ఈ) ఉప్పు తాకితే తప్పంట.
జవాబు:
ఉప్పు ముట్టుకుంటే దోషమండీ

AP Board 6th Class Telugu Solutions Chapter 3 మాకొట్టి తెల్ల దొరతనము

3. కింది ఖాళీలను సరైన గేయ భాగంతో పూరించండి.
గాంధీ టోపీ పెట్టి ………………………
రావద్దు ………………..
రాట్నం బడిలో ……………….
………………. వీపులు బాదుతాడు.
అయ్యో ! ……………….. రాట్నంలో ఉన్నదంట.
జవాబు:
గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు బోవ
రావద్దు రావద్దంటాడు.
రాట్నం బడిలో పెట్టవద్దంటాడు
టోపీ తీసి వీపులు బాదుతాడు.
అయ్యో! రాజద్రోహమంత రాట్నంలో ఉన్నదంట.

4. ఈ కింది కవితను చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
AP Board 6th Class Telugu Solutions Chapter 3 మాకొట్టి తెల్ల దొరతనము 2
ఏమి మహిమంబు గలదొ నీనామమందు
‘బాపు’ అని పేరు వీనులబడిన యంత
నిలువునను నాదు మేనెల్ల పులకరించు
జల్లుమని నాదు హృదయంబు జలదరించు
సర్వసారస్వత ప్రపంచంబు నందు
గాంధి యనియెడి వర్ణయుగంబు తోడ
సాటి వచ్చెడు వేక్కమాట గలదె – నాళం కృష్ణారావు

అ) ఎవరి నామం వినడం వలన మేను పులకరిస్తుందని కవి అంటున్నారు?
జవాబు:
బాపు (గాంధీ) గారి నామం వినడం వలన మేను పులకరిస్తుందని కవి అంటున్నారు.

ఆ) ఈ కవిత ఎవరిని గురించి తెలుపుతుంది?
జవాబు:
ఈ కవిత గాంధీ గారిని గురించి తెలుపుతుంది.

ఇ) ఈ కవితలో ‘అక్షరాల జంట’ అని అర్థం వచ్చే పదబంధం ఏది?
జవాబు:
ఈ కవితలో ‘అక్షరాల జంట’ అని అర్థం వచ్చే పదబంధం వర్ణయుగంబు.

ఈ) పై కవిత ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
హృదయం ఏమని జలదరించింది?

వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
భారతీయులు పట్టెడన్నం కోసం ఎటువంటి పాట్లు పడ్డారు?
జవాబు:
భారతదేశంలోని అన్ని ప్రాంతాలలోనూ పంటలు చక్కగా పండుతున్నాయి. కానీ, భారతీయులు పట్టెడన్నం కోసం పాట్లు పడుతున్నారు. ఎందుకంటే ఉప్పు పైన కూడా తెల్లవాడు పన్ను వేశాడు. ఉప్పులేనిదే వంట చేసుకోలేరు. అన్నిటిపైనా పన్నులు వేసి, భారతీయులకు తిండి లేకుండా చేశాడు. కుక్కలతో సమానంగా పోరాడి చెత్తకుప్పలపై మెతుకులు ఏరుకొని తినే నీచస్థితికి భారతీయులను తెల్లవాడు దిగజార్చాడు.

ప్రశ్న 2.
ఆంగ్లేయులు భారతీయులపై దాడి చేయడం అమానుషమని ఎలా చెప్పగలరు?
జవాబు:
ఆంగ్లేయులు భారతీయులు కారు. భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చారు. ఇక్కడి పరిపాలనా వ్యవహారాలలో తలదూర్చారు. పరిపాలనను ప్రారంభించారు. వాడి తాతగారి సొమ్మేమీ ఇక్కడ లేదు, ఈ దేశం మనది. ఈ సంపద మనది. కష్టపడి పండించుకొనేది మనం. ఐనా తెల్లవాడికి పన్ను కట్టాలట. వాడు చెప్పినట్లు వినాలట. వినకపోతే వాళ్ల పోలీసుల చేత కొట్టించాడు, ఇది కచ్చితంగా దారుణం. అమానుషం. రాక్షసత్వం.

AP Board 6th Class Telugu Solutions Chapter 3 మాకొట్టి తెల్ల దొరతనము

ప్రశ్న 3.
బడిలో చదువుకున్న ఆనాటి పిల్లల పరిస్థితి ఎలా ఉండేది? ఈనాటి పరిస్థితి ఎలా ఉంది? మీరు గమనించిన తేడాలు ఏమిటి?
జవాబు:
ఆనాడు బడిలో చదువుకొనే పిల్లలకు స్వేచ్ఛ లేదు. ఏ సదుపాయాలూ లేవు. పాలకులు చెప్పినట్లే చేయాలి. పిల్లలను చావబాదేవారు. అడిగే దిక్కు లేదు. అడిగినా ఎవ్వరూ పట్టించుకొనేవారు కాదు. గాంధీ టోపీ పాఠశాలల్లో ధరించకూడదు. రాట్నం ఉండకూడదు. స్వాతంత్ర్యం గురించి మాట్లాడకూడదు.

ఈనాడు పాఠశాలలో చదువుకునే పిల్లలకు స్వేచ్ఛ ఉంది. మధ్యాహ్న భోజనం ఉంది, బూట్లు, పుస్తకాలు, బట్టలు మొదలైనవన్నీ ఇస్తారు. నాడు – నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలలకు కొత్త భవనాలు, ప్రహారీలు, విద్యుత్తు, పంకాలు, మంచినీరు మొదలైన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. ఈనాడు బడిలో పిల్లలను దండించరు, అర్థం అయ్యేలా పాఠాలు చెబుతున్నారు.

ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
ఆంగ్లేయుల పాలనను భారతీయులు వద్దనడానికి గల కారణాలను గేయం ఆధారంగా వివరించండి.
జవాబు:
ఆంగ్లేయుల పాలన భారతీయులకెంత మాత్రమూ నచ్చలేదు. ఎందుకంటే వారు భారతీయుల ప్రాణాలను తీసేవారు. భారతీయులను తెల్లవారు గౌరవించేవారు కాదు. భారతదేశంలో చక్కగా పంటలు పండుతున్నా తిండి లేకుండా చేశారు. ఉప్పు పైన కూడా ఆంగ్లేయులు పన్ను వేశారు. తిండిలేక కుక్కలతో పోరాడి తినే పరిస్థితిని కల్పించారు.

తెల్లవారెప్పుడూ భారతీయుల బాగు గురించి పట్టించుకోలేదు. ధనం కోసం సారా అమ్మారు. అది తాగి అనేకమంది మరణించారు. గాంధీ టోపీతో బడులకు పిల్లలను రానిచ్చేవారు కాదు. టోపీ పెట్టుకొని ఎవరైనా వస్తే చావబాదేవారు. బడిలో రాట్నం పెడితే రాజద్రోహం నేరం మోపి జైలులో పెట్టేవారు.

సమావేశాలు పెడితే సెక్షన్ 144 కింద అరెస్టు చేసేవారు. వందేమాతరం పాడనిచ్చేవారు కాదు. తమ అధికారాన్ని ధిక్కరిస్తే జైల్లో పెట్టేవారు. భారతీయులను అన్ని విధాలుగా చెడిపోయేలా చేశాడు. వాడి తాత సొమ్మేదో ఇక్కడ దాచినట్లుగా భారతదేశంపై దండయాత్రలు చేశాడు. యుద్ధాలు చేశాడు. అందుకే ఆంగ్లేయుల పరిపాలనను భారతీయులు అంగీకరించలేదు. తిరుగుబాటు చేశారు.

AP Board 6th Class Telugu Solutions Chapter 3 మాకొట్టి తెల్ల దొరతనము

ప్రశ్న 2.
బానిసతనం అంటే ఎవరూ ఇష్టపడరు. అందరూ స్వేచ్చనే కోరుకొంటారు. ఎందుకు?
జవాబు:
బానిసత్వాన్ని ఎవ్వరూ ఇష్టపడరు. ఎందుకంటే బానిసతనంలో స్వేచ్ఛ ఉండదు. నచ్చినట్లుగా ఉండడం కుదరదు. ఏ పని చేయడానికి స్వతంత్రం ఉండదు. ప్రతిదానినీ ఇతరులు శాసిస్తారు.

స్వేచ్చ వలన బానిసత్వం పోతుంది. అందుకే స్వేచ్చను అందరూ ఇష్టపడతారు. స్వేచ్చగా ఉంటే మనకు నచ్చినట్లుగా మనం ఉండవచ్చు. మనకు నచ్చినట్లు చదువుకోవచ్చు. ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు, పరిపాలించు కోవచ్చు. మన చట్టాలను మనమే తయారుచేసుకోవచ్చు. మనకు నచ్చని చట్టాలను రద్దు చేసుకోవచ్చును. మనకు నచ్చిన వృత్తిని చేపట్టవచ్చు. మనపైన ఎవ్వరి పెత్తనం ఉండదు. ఇలా చాలా ప్రయోజనాలున్నాయి. కనుకనే అందరూ స్వేచ్ఛనే కోరుకొంటారు. ఇష్టపడతారు.

ప్రశ్న 3.
ఆంగ్లేయుల పాలనలో మగ్గిన సగటు భారతీయుని ఆవేదనను ఏకపాత్రగా రాయండి. ప్రదర్శించండి.
జవాబు:
భారతీయుడు
నేను భారతీయుడను. నా పేరు ఏదైతేనేం? నేను సగటు భారతీయుడిని, మా పాలకులు తెల్లవాళ్లు. నాకు స్వేచ్ఛ లేదు. నేను ఇష్టపడిన చదువును చదువుకోలేక పోయాను. నచ్చిన ఉద్యోగం చేయలేకపోయాను. నేను బడిలో చదివేటపుడు గాంధీ టోపీ పెట్టుకొని బడిలోకి వెళ్లాను. అంతే, చచ్చేలా కొట్టారు. ఎదిరించాను. ఇంకా గట్టిగా కొట్టారు. నాకు భయం వేయలేదు. పౌరుషం పెరిగింది. మరునాడు రాట్నం కూడా పట్టుకెళ్లాను. మళ్లీ కొట్టారు. జైలులో పెట్టారు. పది సంవత్సరాలు జైలులో గడిపాను. విడుదలయ్యాక స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాను. గొంతెత్తి బిగ్గరగా ‘వందేమాతరం’ పాడాను. ఊరూరా తిరిగాను. నన్ను భయపెట్టే కొద్దీ నాలో స్వాతంత్ర్య కాంక్ష పెరిగిపోయింది. తిండిలేదు, నీరసం. అనేక రోగాలు పట్టుకొన్నాయి. నాకు మరణ భయం లేదు. భారతమాత సేవను వదలను. అదిగో పోలీసులు వచ్చారు. జైలు నుంచి వస్తే మళ్లీ మాట్లాడతా.

భాషాంశాలు

అ) కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. వాటితో సొంత వాక్యాలు రాయండి.
ఉదా : విదేశీయుల దొరతనం లో స్వేచ్ఛ ఉండదు.
దొరతనం = పాలన
‘శ్రీరాముని పాలనలో అయోధ్య ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లారు.

1. కూడు లేని పేదలను ఆదరించాలి.
జవాబు:
కూడు = తిండి
తిండి తింటే కండ కలదోయ్.

2. సొంత లాభం సుంతైన మానుకొని పొరుగువారికి తోడుపడాలి.
జవాబు:
లాభం = ప్రాప్తి
ప్రతిదానిలోనూ ప్రాప్తిని ఆశించకూడదు.

3. ముల్లె సంపాదించినంత మాత్రాన గొప్పవాళ్ళం కాము.
జవాబు:
ముల్లె = ధనపు మూట
అన్నివేళలా మన ధనపు మూటలు మనల్ని కాపాడవు.

AP Board 6th Class Telugu Solutions Chapter 3 మాకొట్టి తెల్ల దొరతనము

ఆ) కింది వాక్యాలలో సమానార్థక పదాలు (పర్యాయపదాలు) గుర్తించి రాయండి.

1. చేటు కలిగించే పనులు చేయకూడదు. అవి జీవితానికి ఎంతో కీడు చేస్తాయి.
జవాబు:
చేటు, కీడు

2. విజయనగర రాజు కృష్ణదేవరాయలు. ఆ ప్రభువు తెలుగుభాషను ఎంతగానో ఆదరించాడు.
జవాబు:
రాజు, ప్రభువు

3. అధికారం కోసం పోరాటం, ఆస్తుల కోసం యుద్ధం చేయడం మంచిది కాదు.
జవాబు:
పోరాటం, యుద్ధం

ఇ) కింది పదాలను సరైన వ్యతిరేకార్థక పదాలతో జతపరచండి.

1. కావాలిఅ) చెడు
2. మంచిఆ) వినడు
3. వింటాడుఇ) వద్దు

జవాబు:

1. కావాలిఇ) వద్దు
2. మంచిఅ) చెడు
3. వింటాడుఆ) వినడు

వ్యాకరణాంశాలు

అక్షర విభాగం

అ) తెలుగు భాషలో 56 అక్షరాలున్నాయి. ఇవి అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలని మూడు విధాలు.
AP Board 6th Class Telugu Solutions Chapter 3 మాకొట్టి తెల్ల దొరతనము 3

ఆ) అచ్చులు – విభాగం
1. ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలు – అ, ఇ, ఉ, ఋ, ఇ, ఎ, ఒ – హ్రస్వాలు.
2. రెండు మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలు – ఆ, ఈ, ఊ, ఋ, 2, ఏ, ఐ, ఓ, ఔ – దీర్ఘాలు.

ఇ) హల్లులు – విభాగం
‘క’ నుండి ‘మ’ వరకు గల అక్షరాలను అయిదు వర్గాలుగా విభజించవచ్చు. అవి :
AP Board 6th Class Telugu Solutions Chapter 3 మాకొట్టి తెల్ల దొరతనము 4

1. కఠినంగా పలికే అక్షరాలు – క, చ, ట, త, ప – పరుషాలు
2. తేలికగా పలికే అక్షరాలు – గ, జ, డ, ద, బ – సరళాలు
3. వర్గములలో ఉండే ఒత్తు అక్షరాలు – ఖ, ఘ, ఛ, ఝ, ఠ, డ, ఢ, ధ, ఫ, భ – వర్గయుక్కులు
4. ముక్కు సాయంతో పలికే అక్షరాలు – జ, ఇ, ణ, న, మ – అనునాసికాలు
5. అంగిలి సాయంతో పలికే అక్షరాలు – య, ర, ఱ, ల, ళ, వ – అంతస్థాలు
6. గాలిని బయటికి ఊదుతూ పలికే అక్షరాలు – శ, ష, స, హ – ఊష్మాలు
7. పరుష, సరళాలు కాకుండా మిగిలిన హల్లులు – స్థిరాలు
8. ‘క’ నుండి ‘మ’ వరకు గల హల్లులు – స్పర్శాలు

AP Board 6th Class Telugu Solutions Chapter 3 మాకొట్టి తెల్ల దొరతనము

ఈ) వర్ణోత్పత్తి స్థానాలు
AP Board 6th Class Telugu Solutions Chapter 3 మాకొట్టి తెల్ల దొరతనము 5

ఉ) కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

1. కింది పదాలలో ఒక వర్గపు అక్షరాలు దాగి ఉన్నాయి. వాటిని గుర్తించండి.
వింత, పథం, వందనం, విధం, మనం
జవాబు:
ఇందులో త వర్గం అక్షరాలు – త, థ, ద, ధ, న లు ఉన్నాయి.

2. కింది వాక్యంలో పరుషాలను గుర్తించండి.
కలిసి చరించనిట హితము తెలుప.
జవాబు:
AP Board 6th Class Telugu Solutions Chapter 3 మాకొట్టి తెల్ల దొరతనము 6

3. కింది వాక్యంలో సరళాలను గుర్తించండి.
తగవు జరుగు నెడల నాదరి నిలబడరాదు
జవాబు:
AP Board 6th Class Telugu Solutions Chapter 3 మాకొట్టి తెల్ల దొరతనము 7

4. కింది పదాల్లో ఊష్మాలు గుర్తించండి.
దేశం, ఝషం, గ్రాసం, లోహం
జవాబు:
AP Board 6th Class Telugu Solutions Chapter 3 మాకొట్టి తెల్ల దొరతనము 8

ప్రాజెక్టు పని (ఇది రెండవ నిర్మాణాత్మక మూల్యాంకనం కోసం)

1. స్వాతంత్ర్యోద్యమ గీతాలను సేకరించండి. వాటిని చార్టుమీద ప్రదర్శించండి.
జవాబు:
దేశభక్తి – గురజాడ అప్పారావు

దేశమును ప్రేమించుమన్న
మంచియన్నది పెంచుమన్నా
వట్టిమాటలు కట్టి పెట్టోయ్
గట్టి మేల్ తల పెట్టవోయ్

పాడిపంటలు పొంగి పొర్లే
దారిలో నువు పాటు పడవోయ్
తిండి కలిగితే కండ కలదోయ్
కండ కలవాడేను మనిషోయ్!

దేశాభిమానము నాకు కద్దని
వట్టి గొప్పలు చెప్పుకోకోయ్
పూనియేదైనాను ఒక మేల్
కూర్చి జనులకు చూపవోయ్ !

సొంతలాభము కొంత మానుకు
పొరుగువాడికి తోడుపడవోయ్
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్
చెట్టపట్టాల్ పట్టుకొని
దేశస్థులంతా నడువవలెనోయ్

అన్నదమ్ములు వలెను జాతులు
మతములన్నీ మెలగవలెనోయ్ !
మతం వేరైతేను ఏమోయ్
మనసు ‘లొకటై మనుషులుంటే

జాతియన్నది లేచిపెరిగీ
లోకమున రాణించునోయ్ !
దేశమనియెడి దొడ్డ వృక్షం
ప్రేమలను పూలెత్త వలెనోయ్
నరుల చెమటను తడిసి మూలం
ధనం పంటలు పండవలెనోయ్ !

AP Board 6th Class Telugu Solutions Chapter 3 మాకొట్టి తెల్ల దొరతనము

2. జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి
జయ జయ జయ శతసహస్ర నర నారీ హృదయ నేత్రి
జయ జయ సశ్యామల సుశ్యామ చలశ్చేలాంచల
జయ వసంత కుసుమలతా చలిత లలిత చూర్ణకుంతల
జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా
జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ
జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ
జయ మదీయ మధురగేయ చుంబిత సుందర చరణా.

చమత్కార పద్యం

కరయుగంబు గలదు చరణంబు లా లేవు
కడుపు, నడుము వీపు మెడయుగలవు
శిరము లేదుగాని నరులబట్టుక మ్రింగి
సొగసు గూర్చు దీని సొగసు గనుడి

భావం :
రెండు చేతులుంటాయి. పాదాలు ఉండవు. పొట్ట, నడుము, వీపు, మెడ ఉంటాయి. తల ఉండదు. కాని ఇది మనుషులను మింగి అందాన్ని ఇస్తుంది. దాని అందాన్ని చూడండి.
(ఈ చమత్కారానికి జవాబు = చొక్కా)

మాకొదీ తెల దొరతనము – కవి పరిచయం

పేరు : గరిమెళ్ల సత్యనారాయణ
జననం : శ్రీకాకుళం జిల్లా నరసన్న పేట తాలూకా గోనెపాడులో 14.7.1893న జన్మించారు.
తల్లిదండ్రులు : సూరమ్మ, వేంకట నరసింహం గార్లు
నివాసం : ప్రియా అగ్రహారం
ఉద్యోగం : గంజాం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గుమాస్తాగా, విజయనగరంలో ఉపాధ్యాయుడుగా, గ్రంథాలయ కార్యదర్శిగా, జర్నలిస్టుగా, సంపాదకుడుగా పనిచేశారు.
ప్రసిద్ధి : స్వాతంత్ర సమరయోధుడు, కవి రచయిత.
రచనలు : 1921లో స్వరాజ్య, గీతాలు, 1923లో హరిజనుల పాటలు. 1926లో ఖండ కావ్యాలు, భక్తి గీతాలు, బాల గీతాలు రచించారు. దండాలు దండాలు భారతమాత, మాకొద్దీ తెల్లదొరతనము గేయాలతో సామాన్య ప్రజలలో కూడా స్వాతంత్ర్యోద్యమ ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించారు.
ప్రత్యేకతలు : జాతీయకవి, దేశభక్తి కవితలు రాసి జైలుశిక్ష అనుభవించిన వారిలో మొదటివారు ప్రజాపాటల త్యాగయ్యగా ప్రసిద్ధులు.
18. 12. 1952న స్వర్గస్తులయ్యా రు.

గేయ భాగాలు – అర్ధాలు- భావాలు

1&2 పద్యాలు
మాకొద్దీ తెల్ల దొరతనము, దేవ
మాకొద్దీ తెల్ల దొరతనము
మా ప్రాణాలపై పొంచి
మానాలు హరియించె | మాకొద్దీ ||

పన్నెండు దేశాలు పండుచున్నా గాని
పట్టెడన్నమె లోపమండీ
ఉప్పు ముట్టుకుంటే దోషమండీ
నోట మట్టిగొట్టి పోతాడండీ,
అయ్యో ! కుక్కలతో పోరాడి కూడూ తినమంటాడు. || మాకొద్దీ ||
అర్థాలు :
తెల్ల దొరతనము = ఆంగ్లేయుల పరిపాలన
మానము = అభిమానం
హరియించు = చంపు
ముట్టుకుంటె = తాకితే
దోషం = తప్పు
కూడు = అన్నం

భావం :
ఓ దేవా ! భారతీయులమైన మా మాన ప్రాణాలను తీయడానికి తెల్లవారు (ఆంగ్లేయులు) చూస్తున్నారు. వారి పరిపాలన మాకు. వద్దు. పన్నెండు దేశాలలో పంటలు పండుతున్నాయి కాని మాకు పట్టెడన్నం దొరకడం లేదు. ఉప్పును ముట్టుకుంటే తప్పు అంటున్నారు. నోట్లో మట్టి కొడుతున్నారు. కుక్కలకు అన్నం వేసి, ఆ అన్నం కోసం కుక్కలతో పోరాడి ఆకలి తీర్చుకోమంటున్నారు.

3&4 పద్యా లు
ధనము కోసము వాడు దారి చేసికోని
కల్లు సారాయమ్ముతాడు
మాదు మూటాముల్లెలు దోచినాడు
ఆలి మెళ్లో పుస్తెలు తెంచుతాడు
మాదు కళ్లల్లో దుమ్మేసి కొటికి దరిచేసాడు || మాకొద్దీ ||
గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు బోవ
రావద్దు రావద్దంటాడు
రాట్నం బడిలో పెట్టవద్దంటాడు
టోపి తీసి వీపులు బాదుతాడు
అయ్యో ! రాజద్రోహమంత రాట్నంలో ఉన్నదంట || మాకొద్దీ ||
అర్థాలు :
ధనము = డబ్బు
ముల్లె = ధనం / మూట
ఆలి = భార్య
సుంతైన = తాళిబొట్టు
కాడు = శ్మశానం
బాదు = కొట్టు
రాజద్రోహం = రాజుకు చేసే అపరాధం

భావం :
ఆంగ్లేయులు డబ్బు కోసం కల్లు, సారాయి అమ్ముతారు. ఆ నెపంతో మేము దాచుకున్న డబ్బంతా దోచుకుంటున్నారు. భార్యల మెడలలో తాళిబొట్లు ఉండనీయడం లేదు. మా కళ్ళలో దుమ్ముకొట్టి

గాంధీ టోపి పెట్టుకొని బడికి రావద్దు రావద్దు అంటారు. బడిలో రాట్నం పెట్టవద్దంటారు. తలపై టోపీ ఉంటే తీసి వీపులపై బాదుతారు. రాట్నం ఉపయోగిస్తే రాజద్రోహం అంటారు.

AP Board 6th Class Telugu Solutions Chapter 3 మాకొట్టి తెల్ల దొరతనము

5&6 పద్యాలు
నూటనలుబదినాలు నోటికి తగిలించి
మాటలాడ వద్దంటాడు
మమ్ము పాట పాడవద్దంటాడు
తనను దాటి వెళ్ళవద్దంటాడు
అయ్యో ! చేటు తెచ్చుక మమ్ము చెడిపోవమంటాడు || మాకొద్దీ ||

వాడి తాతగారి ముల్లె దాచి పెట్టినట్లు .
ధాటీ చేస్తాడీ దేశమున
పోరాటమాడుతాడు పైన
మోమాటము పడడు
వాడి పాటు పాడైపోను మాటచెపితే వినడు || మాకొద్దీ ||
అర్థాలు :
చేటు = కీడు, అనర్థం
ధాటి = దాడి
పోరాటం = యుద్ధం
మోమాటము = జంకు, సంకోచం
సుంత = కొంచెం మమ్ములను చంపుతున్నారు.
పాటు = ఆపద

భావం :
నూట నలభై నాలుగు చీటీని నోటికి తగిలించి మాట్లాడవద్దంటాడు. స్వాతంత్ర్యం గురించి పాటలు పాడవద్దంటాడు. తన అనుమతి లేకుండా ముందుకు వెళ్ళవద్దంటాడు. మాకు కీడు చేస్తూ మమ్ము బానిసలుగా బతకమంటాడు.

వారి తాతలు సంపాదించిన ధనం ఈ దేశంలో దాచి పెట్టినట్లు ఆంగ్లేయులు భారతీయుల మీద దాడి చేస్తారు. అనవసరంగా జగడాలు పెట్టుకుంటారు. ఏ మాత్రం జంకు లేకుండా ఉన్నారు. వారి వలన కలిగే ఆపద తొలగిపోవాలి. వారి పాలన అంతం కావాలి.

AP Board 6th Class Telugu Solutions Chapter 2 తృప్తి

SCERT AP Board 6th Class Telugu Solutions 2nd Lesson తృప్తి Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Telugu Solutions 2nd Lesson తృప్తి

6th Class Telugu 2nd Lesson తృప్తి Textbook Questions and Answers

వినడం – ఆలోచించి మాట్లాడడం
AP Board 6th Class Telugu Solutions Chapter 2 తృప్తి 1

ప్రశ్న 1.
చిత్రంలో ఎవరెవరు ఉన్నారు? ఏం చేస్తున్నారు?
జవాబు:
చిత్రంలో పిల్లలు (విద్యార్థులు) ఉన్నారు. వారు భోజనాలు చేస్తున్నారు.

ప్రశ్న 2.
పిల్లలు ఏం మాట్లాడుకొంటున్నారు?
జవాబు:
ఉదయం నుండి విశ్రాంతి సమయం వరకు పాఠశాలలో జరిగిన వాటి గురించి మాట్లాడుకుంటున్నారు.

AP Board 6th Class Telugu Solutions Chapter 2 తృప్తి

ప్రశ్న 3.
మీకు ఎప్పుడెప్పుడు సంతోషం కలుగుతుంది?
జవాబు:
మాకిష్టమైన పదార్థాలు తింటుంటే సంతోషం కలుగుతుంది. కొత్త బట్టలు ధరించినపుడు సంతోషం కలుగుతుంది. స్నేహితులతో హాయిగా ఆడుకొంటుంటే సంతోషం కలుగుతుంది. మామీద ఎవ్వరూ (టీచర్లు, పెద్దలు) అధికారం చెలాయించకపోతే సంతోషం కలుగుతుంది. మా ఇష్టం వచ్చినట్లు పిచ్చిపిచ్చిగా అరుస్తూ, గెంతుతూ, అల్లరి చేస్తుంటే సంతోషం కలుగుతుంది. కాలువలో ఈత కొడుతుంటే సంతోషం కలుగుతుంది. అమ్మ, నాన్నలతో ప్రయాణం చేస్తుంటే సంతోషం కలుగుతుంది. మంచి మంచి పొడుపుకథలు, కథలు, పాటలు వింటుంటే సంతోషం కలుగుతుంది. మమ్మల్ని ఎవ్వరూ అడ్డుకోకపోతే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. అమ్మ, నాన్నలు మమ్మల్ని న ‘లాలిస్తే, బుజ్జగిస్తే సంతోషం కలుగుతుంది. మా అభిప్రాయాల్ని స్వేచ్ఛగా చెప్పనిస్తే సంతోషం కలుగుతుంది.

అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
‘తృప్తి’ కథలో మీకు నచ్చిన అంశాల గురించి చెప్పండి.
జవాబు:
(ఇది చెప్పడానికి మాత్రమే. రాయడానికి కాదు)
తృప్తి కథలో బావ పాత్ర నాకు చాలా నచ్చింది. అందరితో కలుపుగోలుగా మాట్లాడే అతని స్వభావం నచ్చింది. వనభోజనాలలో అతని ఉత్సాహం నచ్చింది. వంటల గురించి చెబుతుంటే నిజంగానే మాకూ తినాలనిపించింది. అతను వడ్డింపచేసిన విధానం చాలా నచ్చింది. కొసరి కొసరి వడ్డిస్తే ఎంతైనా తినేస్తాం. కూరలు . అందరికీ చూపడం నచ్చింది. వాటి గురించి చెప్పిన తీరు చాలా బాగుంది. అందరినీ భోజనం చేయడానికి సిద్ధం చేసిన తీరు చాలా నచ్చింది. ప్రతి ఊళ్లోనూ బావగాడి వంటి వాడొక్కడుంటే ఏ గొడవలూ రావు. అందరూ కలిసి మెలిసి ఉంటారు. అందుకే నాకీ కథలోని ప్రతీ అంశం నచ్చింది. ఈ కథని ఎప్పటికీ మరచిపోలేం.

ప్రశ్న 2.
పూర్ణయ్య పాత్ర ద్వారా నిజమైన తృప్తిని తెలియజేసిన రచయిత గురించి రాయండి.
జవాబు:
ఈ పాఠాన్ని సత్యం శంకర మంచిగారు రచించారు.
పేరు : శంకరమంచి సత్యం

జననం : 3.3. 1937న గుంటూరు జిల్లా, అమరావతిలో జన్మించారు.

తల్లిదండ్రులు: శేషమ్మ, కుటుంబరావు గారు.

సాహిత్యా భివృద్ధికి కారకులు : అన్నలు రామారావు, రాధాకృష్ణమూర్తి, పూర్ణానందశాస్త్రిగార్లు.

నివాసం : విజయవాడ

ఉద్యోగం : ఆకాశవాణి, విజయవాడ కేంద్రంలో అధికారి.

కలం పేర్లు : షేక్ జాన్సన్ శాస్త్రి, శారదానాథ్, సాయిరాం

విద్య : బి.ఎ., ఎల్.ఎల్.బి.

రచనలు :
1) కథా సంపుటాలు : అమరావతి కథలు, కార్తీకదీపాలు
2) నవలలు : రేపటి దారి, సీత స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువపూలు మొదలైనవి
3) నాటకం : హరహర మహాదేవ
4) వ్యాసాలు : దినపత్రిక, వార పత్రికలలో చాలా వ్రాశారు.

అవార్డు : ‘అమరావతి కథలు’ కు 1979లో రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం. ప్రస్తుత పాఠ్యాంశం ‘అమరావతి కథలు’ లోనిది. 21. 5. 1987న స్వర్గస్తులయ్యారు.

AP Board 6th Class Telugu Solutions Chapter 2 తృప్తి

ప్రశ్న 3.
వనసంతర్పణలో జనాలకు ఆకలి ఎందుకు పెరిగిపోయింది?
జవాబు:
వనసంతర్పణలో అందరికీ ఆకలి పెరగడానికి కారణం బావగాడు చేసిన వంటకాల వర్ణన, వంకాయ మెంతికారం పెట్టిన కూర, అరటికాయ నిమ్మకాయ పిండిన కూర, పెసరపప్పుతో చుక్కకూర, వాక్కాయ కొబ్బరి పచ్చడి, అల్లం, ధనియాల చారు, మసాలా పప్పుచారు, జీడిపప్పు, పచ్చకర్పూరాలతో పాయసం, మామిడికోరుతో పులిహోర, గుమ్మడి వడియాలు, వూర మిరపకాయలు – ఇలా వంటకాల జాబితా చెప్పగానే అందరికీ భోజనం మీదకి దృష్టి మళ్లింది. ఆకలి మొదలైంది. వాక్కాయల రుచి, చుక్కకూర, పెసరపప్పు గురించి చెప్పగానే ఆకలి పెరిగిపోయింది. జనమంతా ఆవురావురుమంటూ వడ్డన కోసం ఎదురు చూశారు.

ప్రశ్న 4.
కింది టికెట్టులోని విషయాలను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
AP Board 6th Class Telugu Solutions Chapter 2 తృప్తి 2

అ) పై టికెట్టు ఏ ఆటకు సంబంధించింది? టికెట్టు వెల ఎంత?
జవాబు:
పై టికెట్టు క్రికెట్టు ఆటకు సంబంధించినది. దాని వెల ఏభై రూపాయలు.

ఆ) క్రికెట్ పోటీ ఎక్కడ జరుగుతుంది?
జవాబు:
జింఖానా మైదానం, విజయవాడలో క్రికెట్ పోటీ జరుగుతుంది.

ఇ) పై పోటీ ఎందుకు నిర్వహిస్తున్నారు?
జవాబు:
దివ్యాంగుల సహాయార్థం పై పోటీని నిర్వహిస్తున్నారు.

ఈ) పై టికెట్టు ఆధారంగా ఒక ప్రశ్న రాయండి.
జవాబు:
పై టికెట్టు నెంబరెంత?

వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
వనసంతర్పణలో వంటల కోసం పూర్ణయ్య ఎటువంటి ఏర్పాట్లు చేశాడు?
జవాబు:
వంట చేయడానికి గాడిపొయ్యి తవ్వించాడు. వంకాయ మెంతికారం పెట్టినకూర, అరటికాయ నిమ్మకాయ పిండిన కూర, పెసరపప్పుతో చుక్కకూర, వాక్కాయ కొబ్బరి పచ్చడి, పొట్లకాయ పెరుగు పచ్చడి, అల్లం, ధనియాల చారు, మసాలా పప్పుచారు, జీడిపప్పు, పచ్చకర్పూరాలతో పాయసం, మామిడికోరుతో పులిహోర, గుమ్మడి వడియాలు, వూర మిరపకాయలు వంటకాలుగా తయారు చేయించాడు. అవి కూడా అందరి సమ్మతితో చేయించాడు.

దగ్గరుండి నవనవలాడే లేత వంకాయలను కోయించుకొని వచ్చాడు. నిగనిగలాడే వాక్కాయలు చూపించాడు. అందరికీ రుచి చూపించాడు. పాయసంలో సరిపడా జీడిపప్పు వేయించాడు. వంటల గురించి, పులిహోర గురించి చెప్పి, అందరికీ భోజనాలపై ఆసక్తిని పెంచాడు.

ప్రశ్న 2.
వంకాయ గురించి జనాలు ఏమని చర్చించారు?
జవాబు:
నవనవలాడే వంకాయలు చూపించి, వంకాయ మెంతికూర వండిస్తున్నట్లు బావగాడు చెప్పాడు. దానితో వంకాయ కూర గురించి జనాలు చర్చ ప్రారంభించారు. వంకాయను ఎన్ని రకాలుగా వండవచ్చునో చర్చించుకొన్నారు. వంకాయలను కాయలుగా గుత్తివంకాయ కూర వండితే బాగుంటుందా? లేకపోతే ముక్కలుగా తరిగి వండితే బాగుంటుందా ? అనే దాని గురించి చర్చించుకొన్నారు. వంకాయ కూర చాలా రుచిగా ఉంటుంది కదా! ఆ రుచి అంతా వంకాయలో ఉంటుందా? వంకాయ తొడిమ (ముచిగ)లో ఉంటుందా ? అని చర్చించుకొన్నారు. ఈ విధంగా వంకాయ కూర గురించి జనం చర్చించుకొన్నారు.

AP Board 6th Class Telugu Solutions Chapter 2 తృప్తి

ప్రశ్న 3.
వనసంతర్పణలో పూర్ణయ్య తృప్తికి కారణం ఏమిటి?
జవాబు:
అందరి తృప్తిలోనూ తన తృప్తిని చూసుకొనే ఉత్తముడు పూర్ణయ్య. అందుకే తనకు కూరలు..మిగలలేదని బాధ పడలేదు. అందరూ కూరలు పూర్తిగా తినేశారంటే తను వండించిన కూరలు చాలా రుచిగా ఉండి ఉంటాయని గ్రహించి చాలా తృప్తి పడ్డాడు.

తనకు ఒక గరిటెడు పప్పు, కొద్దిగా పచ్చడి, గుప్పెడు పులిహోర మిగిలాయి. అంటే అవి కూడా చాలా రుచిగా ఉన్నాయి. అందుకే మిగలలేదు. అందరూ సంతృప్తిగా కడుపుల నిండా తిన్నారు. తను కొసరి కొసరి వడ్డించాడు. అంటే తన ఆప్యాయత, వంటల రుచి అందరికీ నచ్చిందన్నమాట. అందుకే పూర్ణయ్య తృప్తి పడ్డాడు.

ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘తృప్తి’ కథలో పూర్ణయ్య పాత్ర ద్వారా మీరు తెలుసుకొన్న విషయాలు ఏమిటి?
జవాబు:
తృప్తి కథలో పూర్ణయ్య పాత్ర చాలా గొప్పది. అతను ఊరందరికీ తలలో నాలుకలా ఉంటాడని తెలుసుకొన్నాను. అందుకే అతనిని అందరూ బావగాడని పిలుస్తారు. వన సంతర్పణలో అన్ని ఏర్పాట్లూ చేసినది పూర్ణయ్యే. ప్రతి పనినీ పూర్ణయ్య బాధ్యతగా చేస్తాడని గ్రహించాను. తను వండించే వంటల గురించి అందరికీ చెప్పి వారి అనుమతి తీసుకొన్నాడు. అంటే తనకు తానుగా నిర్ణయాలు తీసుకొన్నా, దానిని అందరిచేతా ఆమోదింప చేసే చాకచక్యం గలవాడని గ్రహించాను. వంటల రుచులను చెప్పడాన్ని బట్టి పూర్ణయ్య అందరినీ ఉత్సాహపరిచే స్వభావం కలవాడని తెలుసుకొన్నాను. పూర్ణయ్య చాలా చురుకైనవాడని తెలుసుకొన్నాను. అందరికీ ఆప్యాయంగా వడ్డించిన తీరు చూస్తే, ఇతరుల ఆనందంలో తన ఆనందాన్ని చూసుకొనే, ఉత్తముడు పూర్ణయ్య అని తెలిసింది. తనకు ఆహారపదార్థాలు మిగలకపోయినా బాధపడలేదు. అందరూ తృప్తిగా తిన్నారని, వారి తృప్తిలో తన తృప్తిని చూసుకొన్న మహోన్నత మానవుడు పూర్ణయ్య అని గ్రహించాను.

ప్రశ్న 2.
ఇతరుల మేలు కోసం మీరెప్పుడైనా ఏదైనా చేసి తృప్తి చెందిన సందర్భం చెప్పండి.
జవాబు:
నా పేరు సీత, నా స్నేహితురాలు పేరు గీత. మేమిద్దరం ప్రతిరోజూ సైకిళ్లపై పాఠశాలకు వెళ్తాం. మేము ఒకసారి పాఠశాలకు వెడుతున్నాం. దారిలో ఒక మలుపులో ఒక బండి వేగంగా వచ్చి గీత సైకిల్ ని ఢీ కొట్టింది. ఇద్దరం పడిపోయాం . గీతకు దెబ్బలెక్కువ తగిలాయి. అటుగా వెడుతున్న ఆటోను ఆపాను. గీత, నేనూ ఆటో ఎక్కాం అంతకుముందే ఒక అంకుల్ దగ్గర ఫోను అడిగి, ఇంటికి ఫోన్ చేశాను. దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెడుతున్నట్లు చెప్పాను. ప్రైమరీ హెల్త్ సెంటర్‌కు వెళ్లగానే మాకు ప్రాథమిక చికిత్స చేశారు. ఈ లోగా మా నాన్నగారు వచ్చారు. నా ధైర్యానికి మా నాన్నగారు మెచ్చుకొన్నారు. డాక్టరుగారు కూడా నన్ను మెచ్చుకొన్నారు. మర్నాడు పాఠశాల ఉపాధ్యాయులూ మెచ్చుకొన్నారు. ఇతరులకు సహాయం చేస్తే, ఆ సహాయం పొందిన వారే కాకుండా అందరూ మెచ్చుకొంటారని నాకప్పుడే తెలిసింది. చాలా ఆనందం కల్గింది.

AP Board 6th Class Telugu Solutions Chapter 2 తృప్తి

ప్రశ్న 3.
పూర్ణయ్య లాంటి వ్యక్తులు మీకు తెలిసినవారుంటే వారిని ప్రశంసిస్తూ రాయండి.
జవాబు:
మా గ్రామంలో రాంబాబుగారున్నారు.. వాళ్లు. చాలా. ధనవంతులు,, ఎవరికి ఏ అవసరం ఉన్నా తెలుసుకొని సహాయం చేస్తారు.

ఒకసారి మా ఎదురింటి మాస్టారు మూర్చ వచ్చి పడిపోయేరు. కొంత సేపటికి తేరుకొన్నారు. ఆయన వారంలో నాలుగుసార్లు అలా పడిపోయేవారు. వాళ్లు పెద్ద ధనవంతులు కాదు. అయినా మా గ్రామంలోని ఆర్. ఎమ్.పి. డాక్టరు గారిచేత వైద్యం చేయించుకొన్నారు. అయినా తగ్గడం లేదు. ఆ నోటా ఈ నోటా విషయం రాంబాబు గారికి తెలిసింది. వెంటనే ఆయన మాష్టారింటికి వచ్చారు. తనకు చెప్పనందుకు నొచ్చుకొన్నారు. విశాఖపట్నం కె.జి. హెచ్ డాక్టర్లతో ఫోన్లో మాట్లాడారు. వెంటనే కొంత డబ్బిచ్చారు. తమ కారులో విశాఖపట్టణం షంపారు. అక్కడ పూర్తిగా చెకప్ చేయించారు. ఖరీదైన వైద్యం చేయించారు. మందులు కొనిచ్చారు. ఇది ఉద్ఘాహరణ మాత్రమే. ఇలాగ ఆయన చాలామందికి ఉపకారాలు చేశారు. ఆయన. మా ఊరికి పెద్ద దిక్కు.

ఆయనను ప్రశంసించడానికి మాటలు చాలవు. ఆయన మా గ్రామానికి దైవంతో సశూనం. ఆయనంటే అందరికీ గౌరవం. అటువంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి. గౌరవించాలి. అదే వారికి నిజమైన ప్రశంస,

భాషాంశాలు

అ) 1. కింది గుణింతాక్షరాలు చదవండి. ఇచ్చిన అక్షరాలకు గుణింతాలు రాయండి.
AP Board 6th Class Telugu Solutions Chapter 2 తృప్తి 3
జవాబు:
AP Board 6th Class Telugu Solutions Chapter 2 తృప్తి 4

2. కింది గుణింతాక్షరాలను చదవండి. ఇచ్చిన అక్షరాలకు గుణింతాలు రాయండి.
AP Board 6th Class Telugu Solutions Chapter 2 తృప్తి 5
జవాబు:
AP Board 6th Class Telugu Solutions Chapter 2 తృప్తి 6

3. కింది గుణింతాక్షరాలను చదవండి. మిగతా గుణింతాలను పూరించండి.
AP Board 6th Class Telugu Solutions Chapter 2 తృప్తి 7
జవాబు:
AP Board 6th Class Telugu Solutions Chapter 2 తృప్తి 8

4. గుణింతాక్షరాలలో తేడాను గమనిస్తూ కింది పదాలు చదవండి. ఉక్తలేఖనం రాయండి. అర్ధాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి.
1. కలం – కాలం
2. చలి – చావిడి
3. టముకు – టామీ
4. తడి – తాడి
5. పదం – పాదం
6. కిటికి – కీటకం
7. చిరాకు – చీర
8. టింకు – టీకా
9. తిను – తీరు
10. పిత – పీత
11. కుదురు – కూతురు
12. చురుకు – చూరు
13. టుంగు – టూరు
14. తుల – తూము
15. పురి – పూరీ
జవాబు:
1. కలం = పెన్ను ; కాలం = సమయం
2. చలి = శీతలం ; చావిడి = పెద్ద గది
3. టముకు = చాటింపు ; టామీ = సంతోషం, తీవ్రమైన
4. తడి = చెమ్మ ; తాడి = తాళవృక్షం
5. పదం = శబ్దం, పాదం ; పాదం = చరణం, అడుగుభాగం, కాలు
6. కిటికీ = గవాక్షం; కీటకం = చిన్న పురుగు
7. చిరాకు = విసుగు ; చీర = స్త్రీలు ధరించే వస్త్రం (కోక)
8. టింకు = తెలివైనవాడు ; టీకా = వ్యాధి నిరోధకత పెంచే మందు (వ్యాక్సిన్)
9. తిను = ఆరగించు ; తీరం = దరి 10. పిత = తండ్రి ; పీత = ఎండ్రకాయ
11. కుదురు = స్థిరం, చెట్టు ; కూతురు = కుమార్తె
12. చురుకు = ఉత్తేజం ; చూరు = పెణక
13. టుంగు = తూగు (ధ్వన్యనుకరణం), ఊగు ; టూరు = ప్రయాణం
14. తుల = సాటి ; తూము = గొట్టం
15. పురి = నగరం ; పూరీ = అల్పాహారంగా తినేది (గోధుమపిండితో చేసేది)

AP Board 6th Class Telugu Solutions Chapter 2 తృప్తి

5. కింది పదాలలో గుణింతాక్షరాలలో తేడాను గమనిస్తూ చదవండి. అర్ధాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి. ఉక్తలేఖనం రాయండి.
1. గది – గాది
2. జలం – జాలం
3. డబడబ – డాబా
4. దడి – దాడి
5. బడి – బాడి
6. గిరి – గీత
7. జిలుగు – జీలుగు
8. డింకి – డీలా
9. దిన – దీన
10. బిరబిర – బీర
11. గుడి – గూడు
12. జులుం – జూలు
13. బుడుగు – గూడూరు
14. దుడుకు – దూకుడు
15. బురద – బూర
16. గృహం
17. విజృంభణ
18. కృపాణం
19. దృఢం
20. బృందం
జవాబు:
1. గది = ఇంటిలోని ఒక భాగం ; గాది = ధాన్యం నిలువ చేసేది
2. జలం = నీరు ; జాలం = సమూహం
3. డబడబ = ధ్వన్యనుకరణం ; డాబా = మిద్దె ఇల్లు
4. దడి = తాటి లేదా కొబ్బరాకులతో కట్టిన అడ్డం ; దాడి = దండయాత్ర
5. బడి = పాఠశాల ; బాడి = బురద
6. గిరి = కొండ ; గీత = భగవద్గీత, రేఖ
7. జిలుగు = మెరయు ; జీలుగు = తేలికైన ఒక రకపు కర్ర
8. డింకి = విఫలం, చిన్న పడవ ; డీలా = నిరాశ
9. దిన = రోజు, దీన = దైన్య
10. బిరబిర = తొందరగా ; బీర = ఒక రకపు కూరగాయ
11. గుడి = దేవాలయం ; గూడు = కులాయము
12. జులుం = ఇతరులను ఇబ్బంది పెట్టే బల ప్రదర్శన (హింసించడం) ; జూలు = కేసరము
13. బుడుగు = చిన్నవాడు ; గూడూరు = ఒక ఊరు (పక్షి గూళ్లు ఎక్కువ కలది)
14. దుడుకు = తొందర ; దూకుడు = తొందరపాటు
15. బురద = బాడి ; బూర = బాకా
16. గృహం = ఇల్లు
17. విజృంభణ = చెలరేగడం
18. కృపాణం = కత్తి
19. దృఢం = దట్టమైన; పుష్టి
20. బృందం = సమూహం

6. కింది పదాలలో గుణింతాక్షరాలలో తేడాను గమనిస్తూ చదవండి. అర్థాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి. ఉక్తలేఖనం రాయండి.
AP Board 6th Class Telugu Solutions Chapter 2 తృప్తి 9
జవాబు:
1. కెరటం = అల
కేతనం = జెండా
కైక = దశరథుని భార్య
కొడుకు = కుమారుడు
కోడలు = కొడుకు భార్య
కౌలు = అద్దె చెల్లించి భూమి లేదా ఆస్తిని కలిగి ఉండుట

2. చెద = చెద పురుగు
చేను = పొలం
చెైను = గొలుసు
చొరవ = చనువు
చోటు = స్థలం
చౌక = ధర తక్కువ

3. టెంక = విత్తనం (మామిడి మొదలైనవి)
టేకు = చేవగల కలప
టైరు = అలసట
టొంకు = అసహజమైన
టోపి = మోసం, తలపాగ
టౌను = పట్టణం

4. తెర = పరదా
తేరు = రథం
తైలం = నూనె
తొన = భాగం, ముక్క
తోట = వనము
తౌడు = మెత్తని చిట్టు

5. పెరుగు = దధి
పేరు = నామము
పైరు = పంట
పొర = పై చర్మం
పోరు = యుద్ధం
పౌడరు = పిండి

6. గెల = గుచ్ఛము
గేదె = బఱ్ఱె
గైడు = మార్గదర్శి
గొడవ = తగాదా
గోడ = రాతి నిర్మాణం
గౌను = బాలికలు ధరించే వస్త్రం

7. జెముడు = చెముడు
జేబు = చొక్కాయి సంచి
జైలు = కారాగారం
జొంపు = ఉత్సవము
జోల = లాలి
జాకు = బురద

8. డెందం = హృదయం
డేగ = శ్యేనము
డైరీ = దినచర్య
డొంక = నడిచి పల్లముగా ఏర్పడిన కాలిదారి
డోలు = వాద్య పరికరం
డౌను = దిగువ

9. దెస = దిక్కు
దేశం = ప్రదేశం
దైవం = దేవుడు
దొర = పరిపాలకుడు
దోమ = మశకము
దౌడు = పరుగు

10. బెడద = బాధ
బేరం = ఖరీదు
బైబిలు = క్రైస్తవ మతగ్రంథం
బొరుసు = కంతి
బోరు = విసుగు, నీటి పంపు
బౌలరు = బంతిని విసరువాడు

ద్విత్వాక్షరాల పదాల పునశ్చరణ

అ) 1. ఒక హల్లుకు దాని ఒత్తు చేరితే దాన్ని ‘ద్విత్వాక్షరం’ అంటారు. కింది ద్విత్వాక్షరాలను పదాలను చదవండి. కొత్త పదాలు రాయండి.
AP Board 6th Class Telugu Solutions Chapter 2 తృప్తి 10
జవాబు:
క – నక్క చుక్క
చ – పచ్చి పిచ్చి
ట – తట్ట, గట్టు
త – గిత్త, సత్త
ప – అప్పు, చెప్పు

2. ఉపాధ్యాయుడు ఇచ్చిన అక్షరాలకు ఒత్తులు చేర్చి గుణింతాలు రాయండి. చెప్పిన పదాలను ఉక్తలేఖనం రాయండి.
జవాబు:
AP Board 6th Class Telugu Solutions Chapter 2 తృప్తి 11

3. కింది ద్విత్వాక్షరాలను, పదాలను చదవండి. కొత్త పదాలు రాయండి.
AP Board 6th Class Telugu Solutions Chapter 2 తృప్తి 12
జవాబు:
గ – పగ్గం, మగ్గం, అగ్గగ్గలాడు
జ – సజ్జ, బొజ్జ, నుజ్జు
డ – అడ్డం, నడ్డి, లడ్డూ
ద – ముద్దు, పద్దు, ఎద్దు
బ = జబ్బ, అబ్బబ్బ, మురబ్బా

4. కింది అక్షరాల ఒత్తులు గమనించండి. మరల రాయండి.
AP Board 6th Class Telugu Solutions Chapter 2 తృప్తి 13
జవాబు:
AP Board 6th Class Telugu Solutions Chapter 2 తృప్తి 14

5. కింది వానిలో గీత గీసిన అక్షరాలకు ఒత్తులు చేర్చి ద్విత్వాక్షర పదాలతో వాక్యాలు రాయండి.
ఉదా : కొయబొమ నచింది – కొయ్యబొమ్మ నచ్చింది.
జవాబు:
1. అవ బువ తింటునది = అవ్వ బువ్వ తింటున్నది
2. అత సుదులు చెపింది = అత్త సుద్దులు చెప్పింది.
3. అక సనగా నవింది = అక్క సన్నగా నవ్వింది
4. బసు మెలగా వచింది = బస్సు మెల్లగా వచ్చింది.
5. అమ అనం ముదలు పెటింది = అమ్మ అన్నం ముద్దలు పెట్టింది.

సంయుక్తాక్షరాల పదాల పునశ్చరణ

1. ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తు చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటారు. కింది పదాలను చదవండి. సంయుక్తాక్షరాలను ‘O’ చుట్టి గుర్తించండి.
1. పగ్గ
2. పుణ్యము
3. అల్లం
4. చంద్రుడు
5. కీర్తి
జవాబు:
AP Board 6th Class Telugu Solutions Chapter 2 తృప్తి 15

AP Board 6th Class Telugu Solutions Chapter 2 తృప్తి

2. కింద ఇవ్వబడిన అక్షరాలను కలిపి సంయుక్తాక్షరంగా మార్చి పదాలను రాయండి.
ఉదా : 1. వ జ్ + ర్ + అ ము = వజ్రము
2. ఉల్ + ్ + అ లు = ఉల్కలు
3. ఖర్ + చ్ + ఉ = ఖర్చు
4. కుర్ + చ్ + ఇ = కుర్చి
5. బాల్ + య్ + అ ము = బాల్యము
6. చెట్ + ల్ + ఉ = చెట్లు

3. కింది పదాలను చదవండి. ఒక హల్లుకు రెండు ఒత్తులున్న పదాలను ( )’ చుట్టి గుర్తించండి. మొదట పలికే హల్లుకు మిగిలిన ఒత్తులు చేర్చి పలికే, రాసే క్రమాన్ని గమనించండి. ఉదాహరణ చూసి ఇచ్చిన పదాలలోని – అక్షరాలను విడివిడిగా రాయండి.
ఉదా :
AP Board 6th Class Telugu Solutions Chapter 2 తృప్తి 16
జవాబు:
AP Board 6th Class Telugu Solutions Chapter 2 తృప్తి 17

4. పాఠంలోని కింది పదాలను చదవండి. కింది పట్టికను పూరించండి. .

చాపలు కూర వంకాయ పెసరపప్పు అన్నం మెంతికారం పొట్లకాయ గరిటె పులిహోర చారు బుట్ట అరటికాయ వడియాలు మసాలా పసుపు వాక్కాయ గంట విస్తరి పాయసం ధనియాలు మామిడికాయ పొయ్యి మిరపకాయ పచ్చడి పచ్చకర్పూరం జారీ జీడిపప్పు నిమ్మకాయ
AP Board 6th Class Telugu Solutions Chapter 2 తృప్తి 18
జవాబు:

AP Board 6th Class Telugu Solutions Chapter 2 తృప్తి 19

ప్రాజెక్టు పని

ఇతరుల కోసం త్యాగం చేసిన మహాపురుషుల కథలు మూడింటిని గ్రంథాలయం నుంచి సేకరించి ప్రదర్శించండి. (ఉదా॥ శిబిచక్రవర్తి, రంతిదేవుడు మొ||నవి)

1. శిబి చక్రవర్తి

శిబి చక్రవర్తి గొప్పదాత. దయాగుణము కల చక్రవర్తి ఇతడు. ఉశీనరుడు అనే మహారాజు కుమారుడు.

ఒకసారి భృగుతుంగ పర్వతం మీద యజ్ఞం చేశాడు. విపరీతంగా దానధర్మాలు చేశాడు. ఇది ఇంద్రుడి వరకూ వెళ్లింది. శిబి చక్రవర్తి దానగుణాన్ని పరీక్షించాలి అనుకొన్నాడు.

యజ్ఞ వేదిక మీద ఉన్న శిబిచక్రవర్తి ఒడిలో ఒక పావురం వాలింది. ఒక డేగ బారి నుండి తనను కాపాడమని మనుష్య భాషలో ప్రార్థించింది. శిబి చక్రవర్తి అభయం ఇచ్చాడు. ఇంతలో డేగ వచ్చింది. పావురం తన ఆహారం కనుక వదిలి పెట్టమని అడిగింది. పావురమూ, డేగా మనుష్య భాషలో మాట్లాడడం విని సభలోని వారంతా ఆశ్చర్యపడ్డారు.

శిబి చక్రవర్తి పావురాన్ని వదలనన్నాడు. కావలిస్తే ఆహారం ఇస్తానన్నాడు. శిబి చక్రవర్తి శరీరంలోని మాంసం కావాలని డేగ అడిగింది. తన శరీరాన్ని తానే కత్తితో కోసుకొని త్రాసులో వేసి పావురంతో తూచాడు తన మాంసాన్ని. ఎంతకూ మాంసం సరిపోలేదు. చివరకు తానే త్రాసులో కూర్చున్నాడు.

అప్పుడు ఇంద్రుడు, అగ్ని ప్రత్యక్షమయ్యారు. తాము డేగగా, అగ్ని పావురంగా మారి శిబి చక్రవర్తి దానగుణం పరీక్షించినట్లు చెప్పారు. ఆశీర్వదించారు. అతని తేజోరూపాన్ని అతనికి ప్రసాదించారు. శిబి యొక్క దయాగుణాన్ని మెచ్చుకొన్నారు.

2. రంతిదేవుడు

ఈ కథ భాగవతంలో ఉంది. రంతిదేవుడు చంద్రవంశపు రాజు. చాలా దానగుణం కలవాడు. రాజ్యాన్ని విడిచి పెడతాడు. అడవిలో జీవితం గడుపుతుంటాడు.

ఒకసారి అడవిలో రంతిదేవుడికి 48 రోజులు ఆహారం దొరకదు. 49వ రోజున కొద్దిగా అన్నం వండు కొంటాడు. దానిని తినడానికి వడ్డించుకొంటాడు. ఇంతలో ఒక పేదవాడు వచ్చి ఆకలిగా ఉందని, అన్నం పెట్టమంటాడు. తన అన్నంలో కొంత వాడికి పెడతాడు. వాడు తినేసి వెళ్లిపోతాడు. తర్వాత మరో ఇద్దరు ఆకలిగా ఉందని వస్తారు. వాళ్లరూ కొంత తినేసి వెళ్లిపోతారు. ఇక కొంచెం అన్నం మాత్రమే మిగులుతుంది. పోనీ అదైనా తిని తన ఆకలి మంటను చల్లార్చుకొందాం అనుకొంటాడు. ఇంతలో ఆకలితో ఉన్న కుక్క వస్తుంది. దానికి ఆ అన్నం పెట్టేస్తాడు. పోనీ మంచినీళ్లినా తాగుదామనుకొంటాడు. ఒక వ్యక్తి దాహంతో వస్తాడు. నీళ్లు అడుగుతాడు. ఆ మంచినీళ్లు వాడికి ఇచ్చేస్తాడు. ఆ

తన ఆకలిని, దాహాన్ని లెక్కచేయకుండా అన్నం, నీరు దానం చేసిన రంతిదేవుని గొప్ప గుణానికి దేవతలు సంతోషిస్తారు. ఆ చక్రవర్తిని ఆశీర్వదిస్తారు.

3. సక్తుప్రస్థుడు

కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. ధర్మరాజు అశ్వమేధయాగం చేశాడు. చాలా దానధర్మాలు చేశాడు. ఆ యాగశాలలో ఒక ముంగిస దొర్లుతోంది. అది సగం బంగారురంగులో ఉంది. అది సక్తుప్రస్థుని దానం కంటె ఈ దానాలు గొప్పవి కావు అంది. సక్తుప్రస్థుని కథను వారికి చెప్పింది.

సక్తుప్రస్థుడు ఒక పేద బ్రాహ్మణుడు. ఒకప్పుడు చాలా కరువు వచ్చింది. తిండి లేదు. ఎలాగో కష్టపడి కుంచెడు పేలపిండి తెచ్చాడు. దానిని నాలుగు భాగాలు చేసుకొన్నారు. ఇంతలో ఒక అతిథి వచ్చాడు. అతని పూజించి లోపలికి రమ్మన్నారు. సక్తుప్రస్థుడు తన భాగం అతనికి పెట్టాడు. అది తినేశాడు. ఇంకా కావాలన్నాడు. భార్య తన భాగం ఇచ్చేసింది. అలాగే కొడుకు, కోడలూ భాగాలు కూడా అతిథి తినేశాడు.

కానీ సక్తుప్రస్థుని కుటుంబం ఆకలికి తట్టుకోలేకపోయింది. గిలగిలలాడారు. నలుగురూ మరణించారు. ఈ వారి దాన గుణాన్ని పరీక్షించడానికి మారువేషంలో వచ్చిన ధర్మదేవత చాలా ఆశ్చర్యపోయింది. తమ ప్రాణాలను లెక్కచేయకుండా దానం చేసిన మహానుభావులని వారిని ఆశీర్వదించింది. ధర్మదేవత కాళ్లు కడిగిన ప్రాంతంలో ఒక వైపు దొర్లిన ముంగిస శరీరం బంగారు రంగులోకి మారింది.

సక్తుప్రస్థుని వంటి మహాత్ములు సంచరించిన ప్రాంతం పరమ పవిత్రమని ముంగీస అక్కడి వారికి చెప్పి, వెళ్లిపోయింది.

తృప్తి – కవి పరిచయం

పేరు : శంకరమంచి సత్యం
జననం : 3.3. 1937న గుంటూరు జిల్లా, అమరావతిలో జన్మించారు.
తల్లిదండ్రులు: శేషమ్మ, కుటుంబరావు గారు.
సాహిత్యా భివృద్ధికి కారకులు : అన్నలు రామారావు, రాధాకృష్ణమూర్తి, పూర్ణానందశాస్త్రిగార్లు.
నివాసం : విజయవాడ
ఉద్యోగం : ఆకాశవాణి, విజయవాడ కేంద్రంలో అధికారి.
కలం పేర్లు : షేక్ జాన్సన్ శాస్త్రి, శారదానాథ్, సాయిరాం
విద్య : బి.ఎ., ఎల్.ఎల్.బి.
రచనలు :
1) కథా సంపుటాలు : అమరావతి కథలు, కార్తీకదీపాలు
2) నవలలు : రేపటిదారి, సీత స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువపూలు మొదలైనవి
3) నాటకం : హరహర మహాదేవ
4) వ్యాసాలు : దినపత్రిక, వార పత్రికలలో చాలా వ్రాశారు.

అవార్డు : ‘అమరావతి కథలు’ కు 1979లో రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం. ప్రస్తుత పాఠ్యాంశం “అమరావతి కథలు’ లోనిది. 21.5. 1987న స్వర్గస్తులయ్యారు.

AP Board 6th Class Telugu Solutions Chapter 2 తృప్తి

అర్థాలు

హంగు = హడావిడి
ధ్యాస = ఆలోచన
తోపు = తోట
పిచ్చాపాటి = కాలక్షేపం కబుర్లు
సమ్మతము = అంగీకారం
అగ్ని = నిప్పు
నవనవలాడు = తాజాగా ఉండు
దివ్యమైనది = శ్రేష్ఠమైనది
మేళవించడం = కలపడం
గాడిపొయ్యి = వంట కొరకు ఒక మూరలోతు, రెండు బారల వెడల్పున తవ్వే పొయ్యి
ప్రమాణం = కొలత
ఆవురావురుమనడం = బాగా ఆకలితో ఉండడం
ఎట్టకేలకు = చిట్టచివరకు
విస్తరి = అన్నం వడ్డించిన (అరటి) ఆకు
గంటె = గరిట

AP Board 6th Class Telugu Solutions Chapter 1 అమ్మ ఒడి

SCERT AP Board 6th Class Telugu Solutions 1st Lesson అమ్మ ఒడి Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Telugu Solutions 1st Lesson అమ్మ ఒడి

6th Class Telugu 1st Lesson అమ్మ ఒడి Textbook Questions and Answers

వినడం – ఆలోచించి మాట్లాడడం
AP Board 6th Class Telugu Solutions Chapter 1 అమ్మ ఒడి 1

ప్రశ్న 1.
చిత్రంలో ఎవరెవరున్నారు?
జవాబు:
ఒక టీచర్, పిల్లలు. (లేదా) తల్లి, పిల్లలు చిత్రంలో ఉన్నారు.

ప్రశ్న 2.
అమ్మ పిల్లలకు ఏమి చెబుతూంది?
జవాబు:
అమ్మ పిల్లలకు చదువు చెబుతూంది.

AP Board 6th Class Telugu Solutions Chapter 1 అమ్మ ఒడి

ప్రశ్న 3.
అమ్మ పిల్లల కోసం ఏమేమి చేస్తుంది?
జవాబు:
అమ్మ పిల్లల కోసం వంటచేస్తుంది. పిల్లలు అడిగినవి వండి పెడుతుంది. మారాం చేస్తే లాలిస్తుంది. భయపడితే ధైర్యం చెబుతుంది. బాధ కలిగితే ఓదారుస్తుంది. గెలిస్తే మెచ్చుకొంటుంది. కథలు చెబుతుంది. జోకొడుతుంది. బట్టలు ఉతుకుతుంది. పాఠాలలో అనుమానాలు తీరుస్తుంది. అల్లరి చేస్తే తిడుతుంది. ఎదిరిస్తే కొడుతుంది. నవ్విస్తుంది. అమ్మకు పిల్లలే లోకం.

ఇవి చేయండి

అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
అమ్మ ఒడి గేయాన్ని భావంతో, రాగంతో పాడండి.
జవాబు:
అమ్మ ఒడి గేయాన్ని మీకు నచ్చిన లయతో, రాగంతో, స్పష్టంగా, భావం తెలిసేలా పాడండి.

ప్రశ్న 2.
“అమ్మ ప్రేమ ఉత్తమమైనది”. దీనిని సమర్థిస్తూ చర్చించండి.
జవాబు:
(చర్చలో లత, రవి, కిరణ్, రాణి పాల్గొంటున్నారు)
లత : మా అమ్మ నాకెంతో ప్రేమగా చదువు చెబుతుంది.
రవి : మా అమ్మ చదువూ చెబుతుంది, భక్తిని, సంస్కారాన్ని నేర్పుతుంది.
కిరణ్ : మా అమ్మ కూడా అంతే, కాబట్టి మా అమ్మ ఒడి నాకు బడి, గుడి.
రాణి : నేను మాట్లాడే మాటలన్నీ మా అమ్మ నేర్పినవే.
లత : ఎంతో ప్రేమగా నాకు మంచి ఆలోచనలు మా అమ్మే నేర్పింది.
రవి : మా అమ్మ చిరునవ్వుతో నా తెలివిని ప్రోత్సహిస్తుంది.
కిరణ్ : మా అమ్మ చక్కగా మాట్లాడుతుంది. పాడుతుంది.
రాణి : మా అమ్మ మనసంతా అనురాగమే.
రవి : మన అల్లరిని చిరునవ్వుతో భరించే అమ్మ ప్రేమమూర్తి.
లత, కిరణ్, రాణి : (ఒక్కసారి) అందుకే అమ్మ ప్రేమ ఉత్తమమైనది.

ప్రశ్న 3.
పాఠం ఆధారంగా కింది వాక్యాలను జతపరచండి. .

1. అమ్మ చెప్పే మంచిమాటలుఅ) నిరంతరం తెలివినిస్తుంది
2. అమ్మ’ పెదవులపై చిరునవ్వుఆ) అమ్మ చల్లని చేతులు
3. దానధర్మాలకు నిలయాలుఇ) ఎల్లప్పుడూ ఉపకరించే తెలివితేటలు

జవాబు:

1. అమ్మ చెప్పే మంచిమాటలుఇ) ఎల్లప్పుడూ ఉపకరించే తెలివితేటలు
2. అమ్మ’ పెదవులపై చిరునవ్వుఅ) నిరంతరం తెలివినిస్తుంది
3. దానధర్మాలకు నిలయాలుఆ) అమ్మ చల్లని చేతులు

ప్రశ్న 4.
కింది కవిత చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
నాన్నంటే?
సంద్రమంత గాంభీర్యం,
కొండంత ధైర్యం,
నా పాలిట కల్పవృక్షం !

అ) కొండంత ధైర్యం ఇచ్చేది ఎవరు?
జవాబు:
నాన్న కొండంత ధైర్యం ఇస్తాడు.

ఆ) నాన్న గాంభీర్యం ఎలాంటిది?
జవాబు:
నాన్న గాంభీర్యం సముద్రం వంటిది.

ఇ) కల్పవృక్షంతో నాన్నను ఎందుకు పోల్చారు?
జవాబు:
కల్పవృక్షం దేవతా వృక్షం. అది కోరిన కోరికలను తీరుస్తుంది. అలాగే నాన్న కూడా పిల్లలకు కావల్సినవన్నీ ఇస్తాడు. కాబట్టి నాన్నను కల్పవృక్షంతో పోల్చారు.

ఈ) ఈ కవితకు తగిన ‘శీర్షిక’ రాయండి.
జవాబు:
ఈ కవితకు ‘నాన్న’ అనే శీర్షిక బాగుంటుంది.

వ్యక్తికరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.
1. ‘అమ్మ ఒడి’ గేయం కవి గురించి రాయండి.
జవాబు:
అమ్మ ఒడి గేయం బాడిగ వెంకట నరసింహారావుగారు రచించారు. ఆయన బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు-హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారిలోకం మొదలైన 17 పుస్తకాలు రచించారు. ఆయన అనార్కలి నరసింహారావుగా పేరు పొందారు. ఆయన 15.8.1913 నుండి 6.1. 1994 వరకు జీవించారు.

2. ‘అమ్మ ఒడి – చదువుల బడి’ అని కవి ఎందుకన్నారు?
జవాబు:
అమ్మ తన ఒడిలో పిల్లలను పెట్టుకొని అనేక విషయాలు చెబుతుంది. మాటలు నేర్పుతుంది. పాటలు నేర్పుతుంది. పద్యాలను నేర్పుతుంది. కథలు చెబుతుంది. ఏది తప్పో ! ఏది ఒప్పో చెబుతుంది. మనిషిని తీర్చిదిద్దడానికి తొలిబీజాలు వేస్తుంది. తెలివి వికసించడానికి తొలి ప్రయత్నం చేస్తుంది. కనుక ‘అమ్మ ఒడి – చదువుల బడి’ అని కవిగారన్నారు. ఎవరికైనా అమ్మే తొలి గురువు. అమ్మ ఒడి తొలి బడి.

AP Board 6th Class Telugu Solutions Chapter 1 అమ్మ ఒడి

3. అమ్మ మాటలు పిల్లలకు ఎలా ఉపకరిస్తాయి?
జవాబు:
శిశువుకు మొదట పరిచయమయ్యే వ్యక్తి అమ్మ. పిల్లలకు పసితనం నుండి అమ్మగొంతు, స్పర్శ పరిచయం. అమ్మ సత్యం. అమ్మ మాటలు నిజం. తల్లి చెప్పే మాటలతో పిల్లలకు మాటలు వస్తాయి. అమ్మ మాటలతో పిల్లలకు ఆనందం కలుగుతుంది. అమ్మ మాటలతో పిల్లలకు ధైర్యం కలుగుతుంది. అమ్మ మాటలతో పిల్లలకు ఓదార్పు కలుగుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే అమ్మ మాటల వలన పిల్లలు దేనినైనా సాధిస్తారు. ఎంతటి మహోన్నతులైనా ఔతారు.

ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.

1. అమ్మ గొప్పతనాన్ని పాఠం ఆధారంగా సొంతమాటల్లో రాయండి.
జవాబు:
అమ్మ ఒడిలోనే పిల్లలు మాటలు నేర్చుకొంటారు. ఏ జ్ఞానమైనా అమ్మ ఒడిలోనే నేర్చుకోవడం ప్రారంభిస్తారు. కాబట్టి అమ్మ ఒడి పిల్లలకు తొలి బడి. అమ్మ ఒడిలోనే జేజే పెట్టడం (నమస్కరించడం) నేర్చుకొంటారు. కాబట్టి అమ్మ ఒడి పిల్లలకు తొలి గుడి. అమ్మ దైవం కంటే గొప్పది. తన పిల్లలను తాను సృష్టించి, బ్రహ్మతో సమానమైంది. తను పెంచుతూ, రక్షిస్తూ విష్ణువుతో సమానమైంది. వారిలోని చెడు లక్షణాలను తొలగిస్తూ శివునితో సమానమైంది. అందుకే అమ్మ దైవం కంటె గొప్పది.

అమ్మ మాటలు నేర్పుతుంది. మంచి ఆలోచనలు నేర్పుతుంది. తన చిరునవ్వులతో పిల్లలలోని తెలివిని అభివృద్ధి చేస్తుంది. అమ్మ మృదువైన మాటలే పిల్లల చెవులకు ఆభరణాలు. అమ్మ మనసంతా అనురాగంతో నిండి ఉంటుంది.

అమ్మ చల్లని చేతులకు పెట్టడమే తెలుసు, అమ్మ పవిత్రపాదాలు తిరిగిన చోట అంతా మంచి జరుగుతుంది. అమ్మ చూపులు సోకినంత మేరా ఆనందం పెరుగుతుంది. అందుకే అమ్మ గొప్పది.

2. అమ్మ ఒడి గేయం ద్వారా అమ్మ గొప్పతనం తెలుసుకున్నారు కదా ! నాన్న / సంరక్షకుని గొప్పతనం రాయండి.
జవాబు:
అమ్మ పిల్లలకు అన్నీ సమకూర్చి దైవం కంటె గొప్పది అయింది. కాని, కష్టపడి డబ్బు సంపాదించి అమ్మకిచ్చే నాన్న అమ్మతో సమానమైన గొప్పవాడే.

తన భార్యా పిల్లల సుఖాలే తన సుఖాలుగా భావిస్తాడు. పిల్లలను చేయిపట్టి నడిపిస్తాడు నాన్న. చదివిస్తాడు. క్రమశిక్షణలో ఉంచుతాడు. పిల్లలు తప్పు చేస్తే మందలిస్తాడు. సరైన దారిలో పెడతాడు. పిల్లల ఆనందం కోసం ఎంత కష్టమైన భరిస్తాడు. పిల్లలకు కావలసిన బట్టలు, పెన్నులు, పుస్తకాలు మొదలైనవన్నీ కొనిస్తాడు. నాన్న భుజాలపై ఎక్కించుకొని మోస్తాడు. పిల్లల విజయానికే తపిస్తాడు. పిల్లలు విజయం సాధిస్తే తన విజయం కంటే ఎక్కువ ఆనందిస్తాడు. అందుకే నాన్నను బాధ పెట్టకూడదు. అమ్మ కడుపు నింపుతుంది. నాన్న మెదడు నింపుతాడు. . నాన్నే పిల్లలకు వెన్ను దన్ను.

(లేదా)

సంరక్షకులు :
తల్లిదండ్రులు దూరంగా ఉన్న పిల్లలను సంరక్షకులు రక్షిస్తారు. పిల్లల యోగక్షేమాలు చూస్తారు. కావలసినవి కొనిపెడతారు. చదువు చెప్పిస్తారు. ధైర్యం చెబుతారు. ఓదారుస్తారు. తల్లిదండ్రుల గురించి బెంగ పెట్టుకోకుండా పిల్లలను చాలా జాగ్రత్తగా చూస్తారు. లాలిస్తారు. మంచి, చెడు చెబుతారు. తాతయ్య, అమ్మమ్మ, మామయ్యల వంటివారైతే పిల్లలకు మంచి మంచి కథలు చెబుతారు. పాటలు, పద్యాలు నేర్పుతారు. పొడుపు కథలు చెబుతారు. ఆడిస్తారు. నవ్విస్తారు. ఎంత అల్లరి చేసినా నవ్వుతూ భరిస్తారు. కొట్టరు, తిట్టరు. భయపెట్టరు. తల్లిదండ్రుల కంటె కూడా ఎక్కువ భద్రత కల్పిస్తారు.

AP Board 6th Class Telugu Solutions Chapter 1 అమ్మ ఒడి

3. మీ పాఠశాల గొప్పతనం తెలిసేలా కింది గేయాన్ని పొడిగించండి.
జవాబు:
అందమైనది మా బడి
తెలివి నేర్పే మా గుడి
ఆటలు నేర్పే అమ్మ ఒడి
మంచిని చెప్పే తాత నుడి

చెడును రానివ్వని దడి
నేర్పుతుంది కలివిడి
అందుకే మాకిష్టం మా బడి
వడివడిగా నడిచి చేరాం మా బడి.

భాషాంశాలు

అ) 1. కింది పదాలను చదవండి. రాయండి. పదాలలోని అక్షరాలను వర్ణమాలలో ‘O’ చుట్టి గుర్తించండి.
AP Board 6th Class Telugu Solutions Chapter 1 అమ్మ ఒడి 2

1. ఆశ7. ఐర
2. కళ8. ఊయల
3. ఈక9. ఘనత
4. ఓడ10. అచట
5. ఉమ11. సహజ
6. ఎర12. ఔషధం

2. కింది వానిలో సరైన అక్షరాలను ఖాళీలలో ఉంచి పదాలను రాయండి.
AP Board 6th Class Telugu Solutions Chapter 1 అమ్మ ఒడి 3
జవాబు:

  1. బలపం
  2. కందం
  3. అరక
  4. ఆభరణం
  5. పథకం
  6. ఇంధనం
  7. శతకం
  8. సఫలం
  9. శంఖం
  10. ఢమరుకం

3. వర్ణమాలలోని అక్షరాలతో మరికొన్ని పదాలను రాయండి. ఉపాధ్యాయులు చెప్పిన పదాలను ఉక్తలేఖనం రాయండి.

1. కలప45. కణం89. బకం(కొంగ)
2. పలక46. చరఖా90. పగ
3. గడప47. చలం91. భయం
4. కడప48. చకచక92. పస
5. పడక49. గజగజ93. నస
6. నలక50. ఛట94. వస
7. మరక51. జడ95. అమలకం (ఉసిరికాయ)
8. జలగ52. జట96. మరణం
9. నడక53. జత97. మననం
10. నడత54. జగడం98. మతం
11. తడక55. జలజం99. మర
12. మడత56. జననం100. మడత
13. తడవ57. జఠరం101. మయసభ
14. వడ58. జపం102. మల (పర్వతం)
15. దడ59. ఝషం103. రసం
16. కల60. జర (ముసలితనం)104. రమ
17. నలక61. తబల105. రథం
18.  అలక62. తరక106. రకం
19. ఆట63. తమకం107. రసన (నాలుక)
20. అటక64. తమం108. లవంగం
21. అల65. తరం109. వరం
22. ఆనప66. తపం110. వశం
23. ఆబ67. తల111. వల
24. ఇల68. తలం112. వయనం (వాంతి)
25. ఉలవ69. దయ113. శరం (నీరు, బాణం )
26. ఊట70. ధనం114. శకం
27. ఊస71. ధర115. శతం
28. ఊక72. ధగధగ116. శలభం (మిడత)
29. ఊబ73. టపటప117. సంత
30. ఎద74. దబదబ118. సహనం
31. ఒర75. నరకం119. శపథం
32. ఓర76. నటన120. సరసం
33. ఔర77. నదం121. సకలం
34. కమల78. నరం122. శకలం (ముక్క)
35. కరప79. నయం123. శరణం
36. కలత80. పరక124. చరణం
37. కలకల81. పకపక125. హలం (నాగలి)
38. ఖరం82. పనస126. క్షమ (ఓర్పు, భూమి)
39. గలగల83. పలలం(మాంసం)127. క్షయం (ఒక వ్యాధి)
40. గరగ84. పటక128. అక్షయం
41. గరగర85. ఫణం (పాము పడగ)129. ఆకరం
42. ఘటం86. బలం130. ఆననం (ముఖం)
43. ఘనం87. బరకం
44. గజం88. బరబర

AP Board 6th Class Telugu Solutions Chapter 1 అమ్మ ఒడి

అ) 1. కింది పదాలను చదవండి. తేడాను గమనించండి. సున్న (0) ఉపయోగించి మరికొన్ని పదాలు రాయండి. చదవండి. ఉక్తలేఖనం రాయండి.
1. కల – కలం
2. పడగ – పండగ
3. జల – జలం
4. జట – జంట
5. కడ – కండ
6. జయ – జయం
7. జగం – జంగం
8. గడ – గండం
9. వందన – వందనం
జవాబు:
1. కత – కంత
2. జట – జంట
3. మదం – మందం
4. వదనం – వందనం
5. నందన – నందనం
6. కమల – కమలం
7. వశం – వంశం
8. లయ – లయం
9. కంద – కందం
10. కటకం – కంటకం

2. కింది అక్షరాలకు అవసరమైన చోట ‘o’ను చేర్చి సరైన పదాలు రాయండి. చదవండి.
AP Board 6th Class Telugu Solutions Chapter 1 అమ్మ ఒడి 4
ఉదా : అద : అందం
1. దత : దంతం
2. రగడ : రంగం
3. సగ : సగం
4. జగ : జగం
5. అహ : అహం
6. జయ : జయం
7. ఆనద : ఆనందం
8. ఇధన : ఇంధనం
9. అగన : అంగన
10. చదన : చందనం

3. కింది అక్షరాలలో ‘0’ ను సరైన చోట ఉంచి పదాలు రాయండి. చదవండి.
AP Board 6th Class Telugu Solutions Chapter 1 అమ్మ ఒడి 5
ఉదా : వంర : వరం
1. దడం : దండ
2. రంణ : రణం
3. జంన : జనం జనం
4. గంమన : గమనం
5. పంయన : పయనం
6. మడంపం : మండపం

4. కింది పదాలలో అక్షరాలలోని తేడాను గమనించి చదవండి. రాయండి. అర్థాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి. ఉక్తలేఖనం రాయండి.
AP Board 6th Class Telugu Solutions Chapter 1 అమ్మ ఒడి 6
1. కరం = చేయి
ఖరం = గాడిద

2. చలం = కదిలేది
ఛలం = నెపము, వెనుదీయుట

3. పతకం బిళ్ల
పథకం = ఎతుగడ

4. లత = తీగ
కథ = కత

5. పరం = ఇతరం
ఫలం = పండు, ప్రయోజనం

6. గజం = ఏనుగు
ఘనం = గొప్పది, మేఘం

7. జనం = మనుషులు
ఝషం = చేప

8. డంబం = ప్రగల్భం
ఢంక = పెద్ద డప్పు

9. దళం = ఆకు, సైన్య విభాగం
ధనం = డబ్బు

10. బలపం పలకపుల్ల
భరతం = భారతదేశం, సంగతి

5. కింది అక్షరాలను క్రమపరచి సరైన పదాలుగా రాయండి. చదవండి.
AP Board 6th Class Telugu Solutions Chapter 1 అమ్మ ఒడి 7
ఉదా : 1. రఅక : అరక
2. లబత = తబల
3. డవప = పడవ
4. జనవ = వనజ
5. రంగన = నగరం
6. రంగత = తగరం
7. ఆదంనం = ఆనందం
8. కంతసం = సంతకం
9. డరంకం = కండరం
10. పండమం = మండపం

6. కింది పట్టికలలోని పదాలను చదవండి. రెండేసి పదాలను కలిపి అర్థవంతమైన పదబంధం లేదా వాక్యంగా చదవండి. రాయండి. ఉక్తలేఖనం రాయండి.
AP Board 6th Class Telugu Solutions Chapter 1 అమ్మ ఒడి 8
జవాబు:
ఉదా : 1. శంఖం ఊదగలం.
2. అమల పలక
3. మర పడవ
4. హంస నడక
5. పడవ పయనం
6. దశరథ తనయ
7. శనగల గంప
8. ఘనత గల వంశం
9. మంగళకర మండపం
10. శనగ పంట

అమ్మ ఒడి కవి పరిచయం

పేరు : బాడిగ వెంకట నరసింహారావు గారు.
కాలం : 15-8-1913 నుండి 6-1-1994 వరకు జీవించారు.
స్వగ్రామం : కృష్ణాజిల్లాలోని కౌతారంలో జన్మించారు.
రచనలు : బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు-హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారిలోకం, పూలబాలలు, ఋతువాణి మొదలైనవి 17 పుస్తకాలు.
బిరుదు : బాలబంధు
ధ్యేయం : బాల సాహిత్యాన్ని ఉద్యమస్ఫూర్తితో ప్రచారం చేయడం.
విశేషం : వింజమూరి లక్ష్మీనరసింహారావు గారు రచించిన ‘అనార్కలి’ నాటకంలో ‘అనార్కలి’ పాత్ర ధరించి, అనార్కలి నరసింహారావుగా ఖ్యాతి గడించారు.

గేయ భాగాలు – అర్థాలు – భావాలు

1. అమ్మ ఒడి చదువుల బడి మా
యమ్మ ఒడి నా కొక గుడి
అమ్మ చూపును ఒరవడి, దై
వమ్ము కంటెను త్వరపడి
అర్థాలు :
ఒరవడి = విద్యార్థులకు అక్షరాలను కుదురుగా నేర్పడానికి గురువులు ముందుగా రాసే మేలు బంతి.
దైవమ్ము = దేవుడు

భావం :
మా అమ్మ తన ఒడిలోనే ఎన్నో సంగతులు నాకు నేర్పిన తొలి గురువు. అమ్మే ఎల్లప్పుడూ నన్ను కాపాడుతూ నా బాగోగులు చూసే దేవుడు. అందుకే మా అమ్మ ఒడే నాకు బడి, గుడి. అంటే అమ్మ భగవంతుని కంటే ముందే త్వరగా నా భవిష్యత్తుకు ఒరవడి చూపిస్తుంది.

2. అమ్మ చెప్పిన సుద్దులు, అని
శమ్ము ఒప్పిన బుద్ధులు
అమ్మ పెదవుల హాసము ని
త్యమ్ము మాకు వికాసము
అర్థాలు :
సుద్దులు = సూక్తులు, మంచిమాటలు
అనిశమ్ము = ఎల్లప్పుడు
హాసము = నవ్వు
నిత్యమ్ము = ఎల్లప్పుడు
వికాసము = తెలివి

భావం :
అమ్మ చెప్పే మంచి మాటలు ఎల్లప్పుడూ మాకు తెలివితేటలు కలిగిస్తాయి. అమ్మ పెదవుల మీది చిరునవ్వు మాకు నిరంతరం తెలివి ఇస్తుంది.

3. అమ్మ మంజుల భాషణం, శ్రా
వ్యమ్ము వీనుల భూషణం
అమ్మ హృది అనురాగము, ది
వ్యమ్ము భవ్యము యోగము
అర్థాలు :
మంజులం = అందం
భాషణం = మాట్లాడిన మాటలు
శ్రావ్యమ్ము = వినదగినవి
వీనులు = చెవులు
భూషణం = అలంకారం
హృది = మనస్సు
అనురాగం = ప్రేమ
దివ్యం = ఉత్తమము
భవ్యం = శుభకరమైనది
యోగం : అన్నింటినీ సమకూర్చేది

భావం :
అందంగా ఉండే అమ్మ మాటలు చెవికి ఇంపుగా ఉంటాయి. అవి మా చెవులకు అలంకారాలు. అమ్మ మనస్సు ప్రేమతో నిండి ఉంటుంది. ఆ ప్రేమ ఉత్తమమైనది, శుభకరమైనది. అన్నింటిని సమకూర్చేది.

AP Board 6th Class Telugu Solutions Chapter 1 అమ్మ ఒడి

4. అమ్మ చల్లని కరములు దా
నమ్మునకు ఆకరములు
అమ్మ చరణ తలమ్ములు క్షే
మమ్ము పండు పొలమ్ములు
అర్థాలు :
కరములు = చేతులు
ఆకరములు = నిలయమైనవి
చరణములు = పాదములు
తలమ్ములు = చోట్లు
క్షేమము = శుభం

భావం :
అమ్మ చల్లని చేతులు దానధర్మాలకు నిలయాలు. అమ్మ పాదాలు సోకిన నేల శుభాలు పండే పొలం వంటిది.

5. అమ్మ కన్నుల కాంతులు లో
కమ్మునకు సుఖశాంతులు
అమ్మయే నా సర్వము దై
ఆర్యమ్ము బలమూ గర్వము
అర్థాలు :
లోకం = జగత్తు
సర్వము = సమస్తం, సర్వస్వం