SCERT AP Board 6th Class Telugu Solutions 6th Class Telugu లేఖలు Notes, Questions and Answers.
AP State Syllabus 6th Class Telugu లేఖలు
స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం అవసరమని తెలియజేస్తూ పత్రికా సంపాదకునికి లేఖ
తిరుపతి, గౌరవనీయులైన అయ్యా , ఇట్లు, చిరునామా : |
మీ ఊరిలో చూడదగిన ప్రదేశాల గురించి మిత్రునికి లేఖ
అమలాపురం, మిత్రుడు రవిరాజాకు, ఇక్కడ మేమంతా క్షేమం. మీ ఇంట్లో అంతా క్షేమం అని తలుస్తాను. నీవు మా ఊరు వేసవి సెలవుల్లో తప్పక రా. మా ఊళ్ళో చూడవలసిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. మా ఊరిలో కొబ్బరి తోటలు ఎంతో ఆకుపచ్చగా అందంగా ఉంటాయి. తోటల ప్రక్కన వరిచేలు గాలికి ఊగుతూ మనల్ని రమ్మని పిలుస్తూ ఉంటాయి. పనస చెట్లు పళ్ళతో నిండి ఉంటాయి. మా ఊరికి దగ్గరలోనే గౌతమీ నది ఉంది. ఆ నదిలో పడవ ప్రయాణం, లాంచి ప్రయాణం కూడా మంచి మజాగా ఉంటాయి. కాలువలు అందులో పడవలు, బాతుల విహారం చూడ్డానికి ఎంతో బాగుంటాయి. నీవు తప్పక రా. నీకోసం మా ఇంట్లో అంతా ఎదురుచూస్తూ ఉంటాము. నీకు కోనసీమ అందాలు చూపిస్తా. ఇట్లు, చిరునామా: |
విహారయాత్రను గూర్చి స్నేహితునికి / స్నేహితురాలికి లేఖ
నిడదవోలు, ప్రియమైన విరజకు, శుభాకాంక్షలతో కల్పన వ్రాయునది. నేను వేసవి సెలవులలో హైదరాబాదు విహారయాత్రచేసి వచ్చాను. అక్కడ చూడాల్సిన వింతలు, విశేషాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా సాలార్జంగ్ మ్యూజియం, పబ్లిక్ గార్డెన్స్, నెహ్రూ జంతుప్రదర్శనశాల (జూ), చార్మినార్, బిర్లామందిర్, అసెంబ్లీహాల్, గోలకొండ మొదలైనవి చూసి నేను పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. హైదరాబాదు, సికిందరాబాదు జంటనగరాల సౌందర్యాన్ని అందరూ తప్పక చూడవలసిందే. కాబట్టి హైదరాబాదును నీవు కూడా దర్శించవలసిందిగా కోరుతున్నాను. ఇట్లు, చిరునామా : |
సెలవు కోరుతూ ప్రధానోపాధ్యాయుడికి లేఖ
విజయవాడ, ప్రధానోపాధ్యాయుడు, అయ్యా, ఇట్లు, |
పండుగను గురించి స్నేహితురాలికి లేఖ
శ్రీకాకుళం, ప్రియ స్నేహితురాలు శైలజకు, నేను బాగా చదువుతున్నాను. నీ చదువు ఎలా సాగుతున్నది ? నేను ఈ లేఖలో నాకు బాగా నచ్చిన దీపావళి పండుగను గురించి వ్రాస్తున్నాను. దీపావళి పండుగకు మా నాన్నగారు రకరకాల మతాబులు, చిచ్చుబుడ్లు, తారాజువ్వలు ఎన్నో తీసుకువస్తారు. నేను, మా అన్నయ్య, మా తమ్ముడు ముగ్గురం కలిసి సరదాగా కాలుస్తాం. మేము – పువ్వొత్తులు కాలుస్తుంటే మా తల్లిదండ్రులు చూసి ఎంతో ఆనందిస్తారు. కాంతులను విరజిమ్మే ఈ పండుగ అంటే నాకెందుకో చెప్పరానంత ఇష్టం. ఇట్లు, చిరునామా : |
సోదరి వివాహానికి మిత్రుడిని ఆహ్వానిస్తూ లేఖ
అమలాపురం, xxxxxxxప్రియ మిత్రమా,నేను క్షేమంగా ఉన్నాను. నీవు కూడా క్షేమంగా ఉన్నావని తలుస్తాను. ఈ నెల 28వ తారీఖున మా సోదరి వివాహం తిరుపతిలో జరుగుతుంది. కాబట్టి నీవు తప్పక రావలసిందిగా కోరుతున్నాను. మీ నాన్నగారికి అమ్మగారికి నా నమస్కారములు. ఇట్లు, చిరునామా : |
రిపబ్లిక్ దినోత్సవ లేఖ (గణతంత్ర దినోత్సవం)
అనంతపురం, ప్రియ స్నేహితుడు క్రాంతికుమార్‌కు, గడచిన జనవరి 26న మా పాఠశాలలో రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు బ్రహ్మాండంగా జరుపుకొన్నాం. నాటి సమావేశానికి మా జిల్లా విద్యాశాఖాధికారి గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాం. ఆయన భారత రిపబ్లిక్ దినోత్సవ ప్రాముఖ్యాన్ని గూర్చి చక్కగా ఉపన్యసించారు. సభా ప్రారంభానికి ముందు జాతీయ జెండాను ఎగురవేసి జెండాగీతాన్ని పాడాం. ‘జనగణమన’తో సభాకార్యక్రమం ముగిసింది. చివరిలో అందరికి స్వీట్సు పంచిపెట్టబడ్డాయి. ఇట్లు, చిరునామా : |
6వ తరగతి చదువును గురించి వివరిస్తూ నాన్నగారికి లేఖ
శ్రీకాకుళం, పూజ్యులైన నాన్నగారికి, మీ కుమారుడు రవి నమస్కరించి వ్రాయు విశేషాలు. నేను 6వ తరగతి బాగానే చదువుతున్నాను. గత పరీక్షలలో అన్ని సబ్జెక్టులలో కూడా మంచి మార్కులే వచ్చాయి. ఒక్క గణితశాస్త్రం తప్ప మిగిలిన వాటిలో 80% మార్కులు సంపాదించాను. గణితంలో మటుకు నూటికి 67 మార్కులు వచ్చాయి. అందువల్ల గణితంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాను. ఇటు, చిరునామా : |
గురుపూజోత్సవం (ఉపాధ్యాయ దినోత్సవం) గురించి మిత్రునికి లేఖ
గుంటూరు, ప్రియమిత్రుడు పుష్పరాజ్ కు, గడచిన సెప్టెంబర్ 5న మా పాఠశాలలో గురుపూజోత్సవం బ్రహ్మాండంగా జరుపుకున్నాం. ఆ రోజు మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. ఆయన జయంతినే ప్రభుత్వం గురుపూజోత్సవం దినంగా ప్రకటించింది కదా ! మేము మా పాఠశాలలోని ఉపాధ్యాయులందరిని ఆ రోజున ప్రత్యేకంగా సన్మానించాం. వారి ఆశీర్వచనాలు పొందాం. మనకు విద్య నేర్పుతున్న గురువులను గౌరవించి సన్మానించడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. ఇట్లు, చిరునామా : |
వృద్ధులపట్ల పిల్లలు ఆదరాభిమానాలు చూపాలనే ఆలోచనను కల్గించే విధంగా చైతన్యాన్ని పెంపొందించాలని కోరుతూ పత్రికా – సంపాదకునికి లేఖ
విజయవాడ, గౌరవనీయులైన అయ్యా, ‘ఈనాటి సమాజంలో ఎంతోమంది వృద్ధులు నిరాదరణకు గురవుతున్నారు. వివిధ కారణాలతో వృద్ధాశ్రమాల్లో చేరుతున్నారు. ఇది విచారింపదగిన విషయం. పిల్లలు తమ తల్లిదండ్రులపట్ల, తాతయ్య, నాయనమ్మ, అమ్మమ్మలపట్ల ఆధారం చూపాలి. వారికి అవసరమైన సపర్యలు చేయాలి. మానవీయ విలువలను కాపాడాలి. ఈతరం విద్యార్థుల్లో వృద్ధులపట్ల ఆదరం చూపించాల్సిన బాధ్యతను పెంపొందించాల్సి ఉంది. ఉపాధ్యాయులు, పెద్దలు, విద్యార్థుల్లో పరివర్తనను సాధించాలి. మీ పత్రిక ద్వారా నేటి యువతలో వృద్ధులపట్ల సేవాదృక్పధం అలవడే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. ఇట్లు, చిరునామా : |
శతక పద్యాలు మానవీయ విలువలను పెంచుతాయి. దీన్ని సమర్థిస్తూ మిత్రునికి లేఖ
శ్రీకాకుళం, ప్రియమైన మిత్రుడు సతీష్ చంద్రకు, శుభాకాంక్షలు. నేను బాగానే ఉన్నాను. నీవు కూడా బాగానే ఉన్నావని ఆశిస్తున్నాను. నేను ఈ లేఖలో శతక పద్యాల ప్రాధాన్యాన్ని గురించి తెలియజేస్తున్నాను. శతక పద్యాలు విద్యార్థుల్లో సత్ప్రవర్తనను కలిగిస్తాయి. మానవీయ సంబంధాలను పరిపుష్టం చేస్తాయి. సమాజం పట్ల గౌరవాన్ని, సేవాదృక్పధాన్ని కలిగిస్తాయి. అందువల్ల శతక పద్యాలను అందరు చదువాలి. ఆదర్శవంతులుగా తయారవ్వాలి. నీవు కూడా శతక పద్యాలను చదివి అందరికి ఆదర్శంగా నిలిచే గుణాలను పెంపొందించుకుంటావని ఆశిస్తున్నాను. ఇట్లు, చిరునామా : |
చదువు ప్రాధాన్యతను తెలియజేస్తూ మిత్రునికి లేఖ
నెల్లూరు, ప్రియమైన మిత్రుడు రామారావుకు, శుభాకాంక్షలు. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా వ్రాయునది మన రాష్ట్రంలో మారుమూల ప్రాంతంలో ఎంతోమంది పిల్లలు బడికి దూరంగా ఉంటున్నారు. వివిధ పరిశ్రమల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు. చదువుకోవలసిన వయస్సులో పనులు చేస్తున్నారు. నేను ఈ విషయాన్ని గుర్తించి బాలకార్మికులుగా ఉన్నవారిని బడిలో చేర్పించాను. చదువు అవసరాన్ని వివరించి చెప్పాను. చదువు వల్ల కలిగే ప్రయోజనాలు వివరించాను. నీవు కూడా బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించు. వారందరికి చదువు ప్రాధాన్యతను వివరించు. పెద్దలకు నమస్కారాలు తెలుపు. ఇట్లు, చిరునామా : |
పుస్తక విక్రేతకు లేఖ
బొబ్బిలి, మేనేజర్, అయ్యా ! నాకు ఈ క్రింద తెలియజేసిన పుస్తకాలను సాధ్యమైనంత త్వరలో రిజిష్టర్డ్ పోస్టు ద్వారా పంపించవలసినదిగా ప్రార్థన. పుస్తకాలపై ఇచ్చు కమీషన్ తగ్గించి మిగతా పైకమును చెల్లించగలవాడను. ఇట్లు, చిరునామా : |
వార్షికోత్సవమును గూర్చి మిత్రునికి లేఖ
జగ్గయ్య పేట, ప్రియ మిత్రుడు రమేష్ కు, ఇక్కడ మేమంతా కుశలంగా ఉన్నాం. అక్కడ అందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తాను. గత శనివారం మా పాఠశాల వార్షికోత్సవం బ్రహ్మాండంగా జరిగింది. పాఠశాలంతా రంగురంగుల తోరణాలతో అలంకరించాం. సాయంత్రం 6 గం||లకు సభ ప్రారంభింపబడింది. ఆ సభకు మా ప్రాంత ఎం.ఎల్.ఏ. గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ప్రధానోపాధ్యాయుడు పాఠశాల నివేదిక చదివి వినిపించారు. ముఖ్య అతిథిగారు విద్యార్థులంతా బాగా చదువుకోవాలని చక్కని సందేశం ఇచ్చారు. ఆటల పోటీలలోనూ, వ్యాసరచన, వక్తృత్వ పోటీలలోనూ గెలుపొందినవారికి బహుమతులు పంచిపెట్టబడ్డాయి. ఆ తరువాత పిల్లలచే నాటికలు వేయబడ్డాయి. ఈ మీ పాఠశాలలో జరిగిన వార్షికోత్సవం గూర్చి వ్రాయగలవు. ఇట్లు, చిరునామా: |