SCERT AP 9th Class Social Studies Guide Pdf 6th Lesson భారతదేశంలో వ్యవసాయం Textbook Questions and Answers.
AP State Syllabus 9th Class Social Solutions 6th Lesson భారతదేశంలో వ్యవసాయం
9th Class Social Studies 6th Lesson భారతదేశంలో వ్యవసాయం Textbook Questions and Answers
Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)
ప్రశ్న 1.
ఏదైనా ఒక పానీయపు పంటను పేర్కొనీ దాని పెరుగుదలకు కావలసిన భౌగోళిక అంశాలను పేర్కొనండి. (AS1)
జవాబు:
పానీయపు పంట – తేయాకు :
భౌగోళిక అంశాలు :
- అయన, ఉప అయన ప్రాంతపు పంట.
- లోతైన, సారవంతమైన ఏటవాలు నేలలు ఉండి నీటి పారుదల వసతులు కలిగి హ్యూమస్, సేంద్రియ పదార్థం అధికంగా గల మృత్తికలు అత్యంత అనుకూలం.
- వెచ్చని, ఆర్ధ శీతోష్ణస్థితితో పాటు హిమరహిత వాతావరణం సంవత్సరం పొడవునా ఉండాలి.
- తరచుగా పడే వర్షపు జల్లులు సంవత్సరం పొడవునా విస్తరించి ఉంటే నాణ్యమైన తేయాకు పెరుగును.
- తేయాకు పంటకు అత్యధిక శ్రామికులు అవసరం.
- తేయాకు పండించే రాష్ట్రాలు అసోం, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ.
ప్రశ్న 2.
సాగుభూమి యొక్క విస్తీర్ణం రోజు రోజుకు తగ్గుతున్నది. దీని పరిణామాలను ఊహించి రాయండి. (AS4)
జవాబు:
సాగుభూమి యొక్క విస్తీర్ణం రోజు రోజుకు తగ్గుతున్నది దీనికి కారణం :
- రియల్ ఎస్టేట్ రంగం విస్తరించడం.
- పంటలకన్నా ఇంటి నిర్మాణాలకు భూములను మారిస్తే ఎక్కువ ఆదాయం వస్తుంది అనే భావం.
- పారిశ్రామిక ప్రాంతాలుగా మార్చటం.
ప్రశ్న 3.
భారతదేశంలో చిరుధాన్యాలు పండే ప్రాంతాలను గుర్తించండి. (AS5)
జవాబు:
భారతదేశంలో చిరుధాన్యాలు పండే ప్రాంతాలు.
జొన్నలు : | మహారాష్ట్ర |
కర్ణాటక | |
ఆంధ్రప్రదేశ్ | |
తెలంగాణ | |
మధ్యప్రదేశ్ | |
సజ్జలు : | రాజస్థాన్ |
ఉత్తరప్రదేశ్ | |
మహారాష్ట్ర | |
గుజరాత్ | |
హర్యానా | |
రాగులు : | కర్ణాటక |
తమిళనాడు |
ప్రశ్న 4.
కనీస మద్దతు ధర (MSP) అంటే ఏమిటి? దీని అవసరం ఏమిటి? (AS1)
జవాబు:
- రైతు పండించిన పంటను వ్యాపారస్థులు చెప్పిన రేటుకు అమ్మవలసి ఉంటుంది.
- అలాంటి పరిస్థితులలో ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రకటిస్తుంది.
- కారణం : ఒక్కొక్కసారి రైతు పండించటానికి అయిన ఖర్చు కూడా పరిగణనలోనికి తీసుకోకుండా, వ్యాపారస్థులు చాలా తక్కువ రేటు అడగడం.
అందువల్ల ప్రభుత్వం పంటను పండించటానికి రైతుకు ఎంత ఖర్చు అవుతుంది. ఎంత దిగుబడి వస్తుంది. అనే అంశాన్ని పరిగణనలోనికి తీసుకుని పండిన పంటకు కనీస మద్దతు ధర ప్రకటిస్తుంది.
ప్రశ్న 5.
భారత ప్రభుత్వం హరిత విప్లవానికి అన్ని రకాలుగా ఎందుకు సహకారాన్ని అందించినదో తెలపండి. (AS1)
జవాబు:
భారత ప్రభుత్వం హరిత విప్లవానికి అన్ని రకాలుగా సహకారాన్ని అందించడానికి గల కారణం :
- భారత దేశ జనాభా నానాటికి రెట్టింపు అవుతుంది.
- రెట్టింపు అవుతున్న జనాభాకు సరిపడ ఆహారధాన్యాల ఉత్పత్తి జరగడం లేదు.
- ప్రజలకు పూర్తి స్థాయిలో వ్యవసాయం ద్వారా ఉపాధి కల్పించలేకపోతున్నారు.
- వ్యవసాయం లాభసాటిగా ఉండటం లేదు.
- వ్యవసాయ విస్తీర్ణ భూమి శాతం రోజు రోజుకు తగ్గిపోతుంది.
- నీటి పారుదల సదుపాయాలు లేకపోవడం వలన పూర్తి స్థాయిలో వ్యవసాయం జరగడం లేదు.
- రసాయన ఎరువులను అందించవలసిన అవసరం ఏర్పడినది.
- రైతులకు ఋణసదుపాయం కల్పించవలసి వచ్చింది.
- పండిన పంటకు గిట్టుబాటు రేటు కల్పించవలసి వచ్చింది.
- తగిన మార్కెట్ సదుపాయం ఏర్పాటు చేయవలసివచ్చింది.
అందువల్ల భారత ప్రభుత్వం హరిత విప్లవానికి అన్ని రకాలుగా సహకారాన్ని అందజేసినది.
ప్రశ్న 6.
భారతదేశం ఆహారధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించాల్సిన అవసరం ఉందని మీరు భావిస్తారా? చర్చించండి. (AS1)
జవాబు:
- ఆహారధాన్యాల విషయంలో దేశం స్వయం సమృద్ధిని సాధించింది.
- ఆహారధాన్యాల ఉత్పత్తి పెరగడం వలన ఇతర దేశాల నుండి ఆహారధాన్యాలను దిగుమతి చేసుకోవల్సిన అవసరం లేకుండా పోయింది.
- ప్రస్తుతం భారతదేశ దిగుమతిలో ఆహార పదార్థాల వాటా కేవలం 3% మాత్రమే.
- గడిచిన 7 దశాబ్దాలలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 51 మిలియన్ టన్నుల నుండి 242 మిలియన్ టన్నులకు పెరిగింది.
- భారత, ఆహార సంస్థ ద్వారా భారత ప్రభుత్వం భారీగా ఆహార ధాన్యాలు నిల్వ చేస్తుంది.
- వీటిని కరవు కాటకాలు వచ్చినపుడు గాని, ఆహార ధాన్యాల కొరత ఏర్పడినపుడు గాని ఉపయోగిస్తారు.
- ఇలా సేకరించిన ధాన్యాన్ని దేశంలో ధాన్యం అందుబాటులో లేని ప్రాంతాలకు సరఫరా చేస్తారు.
- 1967లో ప్రభుత్వం దగ్గర ఉన్న మొత్తం ఆహారధాన్యాలు 19 లక్షల టన్నులు. 2010 – 11 సంవత్సరం నాటికి ఇది 220 లక్షల టన్నులకు పెరిగింది.
- మొత్తం ప్రపంచ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 1/10 వంతు మన దేశంలో ఉత్పత్తి అవుతుంది.
ప్రశ్న 7.
ఇతర ప్రాంతాలలోని వ్యవసాయానికి, వర్షాధార వ్యవసాయానికి తేడా ఏమిటి? (AS1)
జవాబు:
- ఇతర ప్రాంతాలలో నీటి పారుదల సదుపాయం ఉంటుంది. కాబట్టి పంటలు అన్ని రకాల అన్ని వేళలా పండించవచ్చును.
- కానీ వర్షాధార ప్రాంతంలో వ్యవసాయం వర్షం పై ఆధారపడటం వలన అన్ని రకాల పంటలు. పండించలేము.
- జొన్న, సజ్జ, వేరుశనగ, రాగులు, పత్తి, సోయాబీన్, కంది, శనగ మొ||న పంటలను మాత్రమే పండించగలము.
- వర్షాధార ప్రాంతంలో నీటిని వర్షం పడినపుడు వేగంగా ప్రవహించనీయకుండా చూడాలి.
- దీని వలన నీరు భూమికి ఇంకడానికి అవకాశం లభించి భూగర్భ జలం వృద్ధి చెందుతుంది.
- వనీకరణ, కరకట్టల నిర్మాణం, చెక్ డ్యామ్ లు, చెరువుల నిర్మాణం మొదలయిన కార్యక్రమాలు అమలు చేసి పంటలను పండించవచ్చును.
- అదే నీటిపారుదల కలిగిన ప్రాంతాలలో అంతగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. అన్ని రకాల పంటలు పండించుకోవచ్చు.
ప్రశ్న 8.
‘శీతల పానీయాలలో క్రిమి సంహారకాలు కనబడ్డాయి.’ వంటి సంఘటనను గుర్తుకు తెచ్చుకున్నారా? ఇది క్రిమిసంహారకాల వాడకంతో ఏ సంబంధాన్ని కలిగి ఉంది? చర్చించండి. (AS4)
జవాబు:
- శీతల పానీయాలు నిల్వ ఉండటానికి ఉత్పత్తిదారులు క్రిమిసంహారకాలు వాడుతున్నారు. దాని వలన మానవులు వాటిని తాగినపుడు అనేక సమస్యలకు లోనౌతున్నారు.
- బయట పంటలపై క్రిమి సంహారకాలు ఉపయోగించినపుడు కూడా క్రిములు చావడంతో పాటు మొక్కలు కూడా ఆ మందులను కొంత వరకు గ్రహిస్తున్నాయి.
- మొక్కలు గ్రహించినది వాటి పంటలకు పంపిస్తున్నది అందువలన వాటిని తినడం వలన మానవులు అనేక రకాల జబ్బులకు లోనుకావలసి వస్తుంది.
- అలాగే శీతల పానీయాలలో కూడా పురుగుమందులను వాడటం వలన అనేక సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది.
ప్రశ్న 9.
నూతన వ్యవసాయ పద్ధతులలో రసాయనిక ఎరువులను ఎందుకు వాడుతున్నారు? వీటి వాడకం వల్ల నేల సారం ఎలా తగ్గుతుంది? నేలను సారవంతం చేయడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమిటి? (AS1)
జవాబు:
నూతన వ్యవసాయ పద్ధతులలో రసాయనిక ఎరువులను వాడటానికి కారణం.
- రసాయనిక ఎరువులు (సాధారణంగా నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి ఖనిజాలను నీటిలో కరిగే రూపంలో కలిగి ఉండటం వల్ల ఇవి మొక్కలకు వెంటనే అందుబాటులోకి వస్తాయి.
- కానీ ఇవి నేలలో ఎక్కువ కాలం అందుబాటులో ఉండవు.
- ఇవి మట్టిలో నుండి నీటి ద్వారా లోపలి పొరలకు ఇంకి భూగర్భ జలాలను, నదులను, చెరువులను కలుషితం చేస్తాయి. వీటి వాడకం వల్ల నేలసారం తగ్గడానికి కారణం : రసాయనిక ఎరువులు నేలలోని బాక్టీరియా ఇతర సూక్ష్మజీవులను చంపేస్తాయి.
ప్రశ్న 10.
హరిత విప్లవం ఎందుకు కొన్ని ప్రాంతాలలో రైతులకు స్వల్పకాలంలో లాభాన్ని, దీర్ఘకాలంలో నష్టాన్ని ఎలా కలిగించింది?
జవాబు:
హరిత విప్లవం వలన అధిక దిగుబడి విత్తనాలు ప్రవేశపెట్టడం.
1. దీని వలన వ్యవసాయ సాగుభూమి విస్తీర్ణం పెరగలేదు. కానీ వ్యవసాయ ఉత్పత్తి పెరిగింది.
2. రసాయనిక ఎరువుల వినియోగం
వీటిని ఉపయోగించడం వలన తాత్కాలికంగా మెరుగైన ఉత్పత్తులు సాధించాము. కానీ దీర్ఘకాలికంగా భూములు నిస్సారవంతమైనవి.
3. డాక్టర్ మొదలైన యాంత్రాల వినియోగం.
యంత్రాలను ఉపయోగించడం వలన వ్యవసాయరంగంపై ఆధారపడిన కార్మికులు ఉపాధిని కోల్పోయారు.
4. నీటి పారుదల సదుపాయాలను కలిగించడం.
నీటి కొరత ఏర్పడింది. వివిధ ప్రాంతాల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి.
5. క్రిమి సంహార మందుల వినియోగం
వీటి వలన జీవన సమతుల్యత దెబ్బతింది.
పై విధంగా హరితవిప్లవం వల్ల రైతులకు స్వల్పకాలంలో లాభించినా దీర్ఘకాలంలో కొన్ని ప్రాంతాలలో నష్టాలు వచ్చాయి.
ప్రశ్న 11.
వ్యవసాయదారుల ఆదాయంపై విదేశీ వర్తక ప్రభావం ఏమిటి? (AS1)
జవాబు:
- ప్రస్తుతం భారతదేశ వ్యవసాయ విధానాలలో చాలా గమనించదగిన మార్పులు వచ్చాయి.
- గతం కంటే ఎక్కువగా ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్నాయి.
- అభివృద్ధి చెందిన దేశాలు విదేశీ వ్యాపారాన్ని అనుమతించమని చేసే ఒత్తిడి.
- ఈ అభివృద్ధి చెందిన దేశాలు వారి వ్యవసాయ మిగులు ఉత్పత్తిని ఎక్కువ సంఖ్యలో కొనుగోలుదారులున్న అభివృద్ధి చెందుతున్న దేశాలలో విక్రయించాలని కోరుకుంటున్నాయి.
- విదేశీ వ్యాపార విధానంలో వచ్చిన మార్పుల వలన ప్రస్తుతం అనేక పంటల క్రయ విక్రయాలు అంతర్జాతీయంగా జరుగుతున్నాయి.
ఉదా : రైతులు కూరగాయలు, పండ్లు, పంచదార, బెల్లాన్ని ఎగుమతి చేయగలుగుతున్నారు. - పై విధంగా అభివృద్ధి చెందిన దేశాలు తమ ఉత్పత్తులను అమ్ముకోవడం వలన అభివృద్ధి చెందుతున్న భారతదేశం వంటి దేశాలు నష్టపోతున్నాయి.
ప్రశ్న 12.
కింది తరగతుల్లో భూమి పంపిణీ గురించి చదివియున్నారు. ఆ భావాన్ని ఈ చిత్రం ఎలా ప్రతిబింబిస్తుంది? భారతీయ వ్యవసాయం దృష్టికోణంలో దీనిపై ఒక పేరా రాయండి. (AS1)
జవాబు:
ఒంటరిగా నిలిచియున్న వ్యక్తి ఒక పెద్ద రైతు అయి ఉండవచ్చు. అయితే భూమి పంపిణీ కార్యక్రమం ద్వారా ఎక్కువ మంది నిలిచియున్న వారికి కొంత భూమిని పంచిపెట్టి ఉండవచ్చును. కానీ వారికి ఆ భూమి కేటాయించబడి ఉండదు. ఒక వేళ అది కేటాయించిన భూమి అయిన్నటికి బీడు భూమి అయి ఉండవచ్చును. దానితో వారంతా మా భూమి ఏది అని అడగటానికి వచ్చి ఉండవచ్చును. అప్పుడు ఆ పెద్ద రైతు వారికి మొహం చూపించకుండా పక్కకు నిలబడి ఉన్నాడు. (లేదా) వారికి కేటాయించిన భూమి బీడు భూమి కావడంతో మాకు ఇలాంటి భూమి ఎందుకు అని అడగటానికి వచ్చి ఉండవచ్చును. అప్పుడు వారికి సరైన సమాధానం చెప్పక పక్కకు తిరిగి ఉండవచ్చును.
ప్రశ్న 13.
పేజీ నెం. 70లోని “ఎరువుల సమస్యలు” అంశం చదివి, వ్యాఖ్యానించండి.
జవాబు:
నేల సారం, భూగర్భజలం వంటి పర్యావరణ వనరులు ఏర్పడడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. ఒకసారి వీటిని కోల్పోయామంటే తిరిగి పునరుద్ధరించడం కష్టం. రసాయనిక ఎరువులు నేలలోని బాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులను చంపేస్తాయి. ఈ ఎరువులను వాడటం మొదలు పెట్టిన కొంత కాలానికి నేల మునుపటి కంటే తక్కువ సారాన్ని కలిగి ఉంటుంది. ఎక్కువ మోతాదులో రసాయనిక ఎరువులు వాడకం వలన మిత్ర కీటకాలు, మేలు చేసే జీవులు అంతరించి, భూసారం నిస్సారమౌతుంది.
దీనికి బదులుగా సేంద్రియ ఎరువు, పెంటకుప్పలో హ్యూమస్, సూక్ష్మజీవులు ఉంటాయి. సంప్రదాయ ఎరువులు వాడకం వలన ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు దూరమౌతున్నాయి.
వ్యవసాయం ప్రధానంగా సహజ వనరులపై ఆధారపడిన నేపథ్యంలో భవిష్యత్తులో కూడా వ్యవసాయం ప్రగతి సాధించేలా పర్యావరణాన్ని కాపాడుకోవడానికి రసాయనిక ఎరువుల స్థానంలో సేంద్రియ ఎరువులు ఉపయోగించడం హర్షదాయకం.
ప్రశ్న 14.
ఓ నెం. 74లోని పటాన్ని పరిశీలించి, భారతదేశంలో అవుట్ లైన్ పటంలో వరి పండించే రాష్ట్రాలను గుర్తించండి. (AS5)
జవాబు:
9th Class Social Studies 6th Lesson భారతదేశంలో వ్యవసాయం InText Questions and Answers
9th Class Social Textbook Page No.59
ప్రశ్న 1.
మన దేశంలో సాంద్ర జీవనాధార వ్యవసాయ విధానం అమలులో గల రాష్ట్రాలను పేర్కొనండి.
జవాబు:
సాంద్ర జీవనాధార వ్యవసాయం అమలులో గల రాష్ట్రాలు :
- పంజాబ్
- హర్యానా
- ఉత్తరప్రదేశ్
- పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో అమలులో ఉంది.
9th Class Social Textbook Page No.60
ప్రశ్న 2.
ఒక ప్రాంతంలో వాణిజ్య పంటగా, మరొక ప్రాంతంలో జీవనాధార వ్యవసాయంగా పండించే మరికొన్ని పంటలకు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
వరి హర్యానా, పంజాబలో వాణిజ్య పంట కాగా ఒడిశాలో జీవనాధార పంటగా పండిస్తున్నారు.
9th Class Social Textbook Page No.62
ప్రశ్న 3.
కందులు, బఠాణి, పెసలు, మసూర్, శనగలు, మినుములు, వేరుశనగ మొదలైన పప్పు ధాన్యాలలో ఖరీఫ్, రబీలలో పండే వాటిని వేరుచేయండి.
జవాబు:
ఖరీఫ్ కాలంలో పండే పప్పుధాన్యాలు కందులు, పెసలు, మినుములు, వేరుశనగ.
రబీ కాలంలో పండే పప్పు ధాన్యాలు బఠాణి, మసూర్, శెనగలు.
9th Class Social Textbook Page No.64
ప్రశ్న 4.
1. కింది పట్టికలో ముఖ్యమైన పంటలు, అవి పండే రాష్ట్రాల సమాచారం ఇవ్వబడింది. పూర్తి సమాచారం ఇవ్వలేదు. వాటి పూర్తి సమాచారాన్ని అట్లాస్, మీ టీచర్ సహాయంతో చర్చించి పట్టికను పూర్తిచేయండి.
2. ప్రతి పంటకు ప్రత్యేకమైన గుర్తును ( ⋅0⋅⋅) కేటాయించి, దానిని భారతదేశ రాజకీయ పటంలో గుర్తించి, ఆయా రాష్ట్రాలలో ఆయా పంటలు పండుటకు కారణాలను తరగతి గదిలో చర్చించండి.
జవాబు:
అధిక వాటాకు సహజమైన ఇతర కారణాలు :
1. వరి :
- అత్యధిక ఉష్ణోగ్రత, అధిక ఆర్ధతను కలిగి 100 సెం.మీ.ల సాంవత్సరిక వర్షపాతం పడే ప్రాంతాలలో బాగా పండుతుంది.
- తక్కువ వర్షపాతం ఉన్నప్పటికీ నీటి పారుదల బాగా ఉంటే వరి పండించవచ్చును.
- మన దేశంలో ఉత్తర మైదానాలు, ఈశాన్యప్రాంత మైదానాలు, తీరప్రాంతాలు, డెల్టా ప్రాంతాలు వరి పంటకు ప్రసిద్ధి.
- అందువల పశ్చిమ బెంగాల్,పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాలలో అధికంగా పండుతుంది.
2. గోధమ :
- పంట కాలమంతా సమానంగా విస్తరించి ఉండే 50 నుండి 70 సెం.మీ వర్షపాతం అనుకూలం.
- మిత ఉష్ణోగ్రత ఉండి కోతకు వచ్చే సమయంలో వాతావరణం ప్రకాశవంతంగా ఉండాలి.
- గంగా సట్లెజ్ మైదాన ప్రాంతం, దక్కన్ పీఠభూమిలోని నల్లరేగడి ప్రాంతం, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమైన గోధుమ ఉత్పత్తి రాష్ట్రాలు.
3. చిరుధాన్యాలు :
- జొన్న, సజ్జ, రాగులు వంటి వాటిని చిరు ధాన్యాలు అంటారు. ఇవి ప్రధానంగా వర్షాధార పంటలు.
- జొన్నను అత్యధికంగా పండిస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర, తరువాత కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్ ఇతర వరుస స్థానాలలో ఉన్నాయి.
- సజ్జ, ఇసుక నేలల్లోనూ, తేలికపాటి నల్లరేగడి నేలల్లో పండుతుంది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా సజ్జ పండించే రాష్ట్రాలు.
రాగి పంట శుష్క వాతావరణం గల అన్ని రకాల నేలల్లో పండుతుంది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో బాగా పండుతుంది.
4. మొక్కజొన్న :
1. ఈ పంటకు 21°C నుండి 27°C ల ఉష్ణోగ్రత అవసరం.
పురాతన ఒండ్రునేలలు అత్యంత అనుకూలం.
బీహార్ లో రబీ కాలంలో పండిస్తారు.
అధిక దిగుబడి విత్తనాలు, రసాయనిక ఎరువులు, నీటిపారుదల సదుపాయాలు ఈ పంటకు బాగా అనుకూలమైనవి.
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, బీహార్‌లో అధికంగా పండుతుంది.
5. పప్పుధాన్యాలు :
1. భారత దేశంలో పండే ముఖ్యమైన పప్పు ధాన్యాలు, కందులు, మినుములు, పెసలు, బఠాణి, మసూర్, శెనగలు.
తక్కువ వర్షపాతం గల శుష్క ప్రాంతాలలో సైతం పప్పు ధాన్యాలు పండుతాయి. లెగ్యూమినేసి కుటుంబానికి చెందిన ఈ మొక్కలన్నీ కూడా వాతావరణం నుండి నత్రజని గ్రహించి నేలలో, ప్రతిష్టాపన చేసి భూసారాన్ని పెంచుతాయి.
6. చెరకు :
- అధిక ఉష్ణోగ్రతలు (21°C నుండి 27°C), ఆర్ధత, 75 నుండి 100 సెం.మీ.ల సాంవత్సరిక వర్షపాతం నమోదు చేసే ప్రాంతాలు చెరకు పంటకు అనుకూలం.
- అల్ప వర్షపాతం గల ప్రాంతాలలో నీటి పారుదల తప్పనిసరి.
- మన దేశంలో ప్రధానంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్,చెరకు పండించే రాష్ట్రాలు.
7. నూనెగింజలు :
- నూనె గింజలను అత్యధికంగా మన దేశంలోనే పండిస్తున్నారు. ప్రధానంగా వంట నూనెలుగా ఉపయోగిస్తారు.
- మరికొన్నింటిని సబ్బులు, సౌందర్య లేపనాలు, ఔషధ లేపనాలతో ముడిపదార్థాలుగా ఉపయోగిస్తారు.
8. ప్రత్తి :
- ప్రపంచంలో పత్తిని సాగు చేసిన మొదటి దేశం భారతదేశం.
- శుష్క వాతావరణం గల దక్కన్ పీఠభూమిలోని నల్లరేగడి నేలలు పత్తి పంటకు అత్యంత అనుకూలం.
- అధిక ఉష్ణోగ్రతలు, మిత వర్షపాతం కనీసం 210 రోజులు ‘మంచురహిత వాతావరణం ప్రత్తి పంటకు అనుకూలం.
- ఖరీఫ్ పంట అయినప్పటికీ పంట కాల వ్యవధి 6 నుండి 8 నెలలుగా ఉంటుంది.
9th Class Social Textbook Page No.65
ప్రశ్న 5.
‘1971 – 2001 లలో వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు ఎంత శాతం ఉన్నారో పై ‘దిమ్మ చిత్రం పూరించండి.
జవాబు:
1971 లో వ్యవసాయదారులు – 62% 1971 లో వ్యవసాయ కూలీల శాతం – 38%
2001 లో వ్యవసాయదారులు – 54% 2001 లో వ్యవసాయ కూలీల శాతం – 46%
ప్రశ్న 6.
స్వయం ఉపాధి పొందేవారికి, పని కోసం చూసేవారి మధ్యగల తేడాలను మీ ప్రాంతంలో గల ఉదాహరణల ద్వారా చర్చించండి.
జవాబు:
- స్వయం ఉపాధి పొందే వారికి ఆదాయం వస్తుంది. ఉపాధి కల్పించబడుతుంది.
- వారు ఉపాధి పొందడం మాత్రమే కాక మరికొంత మందికి ఉపాధి కల్పించిన వారు అవుతారు.
- వారికి వారే యజమానులు కాబట్టి వారి శక్తియుక్తుల మేరకు పనిచేసి ఎక్కువ ఆదాయం పొందడానికి అవకాశం ఏర్పడుతుంది.
- పనికోసం చూసేవారికి ఉపాధి ఉండదు.
- ఆదాయం రాదు.
- ఎవరు పని కల్పిస్తారా అని ఎదురు చూస్తారు కాబట్టి పని అంతగా చేయలేరు.
- పనికోసం చూసే వారు ఎవరి కిందో పనిచేయవలసి ఉంటుంది.
ప్రశ్న 7.
ఒకప్పటి వ్యవసాయదారుల కుటుంబాలు కొన్ని ఇప్పుడు వ్యవసాయ కూలీలు అవుతున్నాయని భావిస్తున్నావా? చర్చించండి.
జవాబు:
ఒకప్పటి వ్యవసాయదారుల కుటుంబాలు కొన్ని ఇప్పుడు వ్యవసాయ కూలీలు అవుతున్నాయని భావించటం లేదు. ఎందుకనగా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి ఒకప్పటి వ్యవసాయ కూలీలు కూడా నేడు వ్యవసాయ దారులుగా మారారు. కానీ ఒకప్పటి వ్యవసాయదారులు నేడు వ్యవసాయ కూలీలుగా మారలేదు. భూములు లేని వారికి కూడా భూ పంపిణీ చేసి భూ యజమానులుగా మార్చుతున్నారు.
9th Class Social Textbook Page No.67
ప్రశ్న 8.
అట్లాస్ సహాయంతో పైన పేర్కొన్న డ్యామ్ ను అవి నిర్మించబడిన నదులను భారతదేశ పటంలో గుర్తించండి.
జవాబు:
- భాక్రానంగల్ ప్రాజెక్టు – సట్లెజ్ నదిపై కలదు. – పంజాబ్ రాష్ట్రం
- దామోదర లోయపథకం – దామోదర్ నదిపై కలదు. – పశ్చిమ బెంగాల్ రాష్ట్రం
- హీరాకుడ్ ప్రాజెక్టు – మహానదిపై కలదు. – ఒడిషా రాష్ట్రం
- నాగార్జున సాగర్ ప్రాజెక్టు – కృష్ణానదిపై కలదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు
- గాంధీ సాగర్ – నర్మదానదిపై కలదు. మధ్యప్రదేశ్ రాష్ట్రం
9th Class Social Textbook Page No.68
ప్రశ్న 9.
నూతన వ్యవసాయ విధానాలను ఏ ప్రాంతంలో మొట్టమొదటిడా అమలుచేయ ప్రయత్నించారు? దేశం మొత్తం ఎందుకు వర్తింపచేయలేదు?
జవాబు:
నూతన వ్యవసాయ విధానాలను మొట్టమొదట పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలలో అమలు చేశారు. అవి మైదాన ప్రాంతాలు కావడం వలన, మరియు సారవంతమైన నేలలు కావడం వలన ముందుగా అక్కడ అమలుచేయ ప్రయత్నించారు. అక్కడ విజయవంతం అయిన తరువాత మిగిలిన ప్రాంతాలలో ప్రవేశపెడదాం అనే భావనతో ఉండటం వలన దేశం మొత్తం వర్తింపచేయలేదు.
ప్రశ్న 10.
వర్షాధార వ్యవసాయానికి విభిన్న పద్దతులు ఎందుకు అవసరం?
జవాబు:
- నీటి పారుదల కలిగిన భూములలో అధిక దిగుబడి విత్తనాలే కాకుండా ఈ ప్రాంతాలు మనకు అనేక సవాళ్లు విసురుతున్నాయి.
- ఈ ప్రాంతాలలో పడిన వర్షపాతాన్ని సంరక్షించుకోవడం మొదటి బాధ్యత.
- పడిన వర్షపు నీరు వేగంగా ప్రవహించనీయకుండా చూడగలగాలి.
- దీని వలన నీరు భూమిలోకి ఇంకడానికి అవకాశం లభించి భూగర్భజలం వృద్ధి చెందుతుంది.
- వనీకరణ, కరకట్టల నిర్మాణం, చెక్ డ్యామ్ లు, చెరువుల నిర్మాణం మొదలైన కార్యక్రమాలు నీటి యాజమాన్య విధానంలో కలిసి ఉన్నాయి.
9th Class Social Textbook Page No.69
ప్రశ్న 11.
కరవు కాటకాలను అధిగమించడానికి అదనపు ఆహార నిల్వలు ఎలా సహకరిస్తాయి?
జవాబు:
- భారత ఆహార సంస్థ ద్వారా భారత ప్రభుత్వం గిడ్డంగులలో భారీగా ఆహార ధాన్యాలను నిల్వ చేస్తుంది.
- వీటిని కరవు కాటకాలు వచ్చినపుడుగాని, ఆహారధాన్యాల కొరత ఏర్పడినపుడు గాని ఉపయోగిస్తారు.
- ఇలా సేకరించిన ధాన్యాన్ని దేశంలో ధాన్యం అందుబాటులో లేని ప్రాంతాలకు సరఫరా చేస్తారు.
ప్రశ్న 12.
రైతులు తమకు గల కొద్దిపాటి విస్తీర్ణంలో ఆహార ధాన్యాల దిగుబడిని ఎలా పెంచుకోగలిగారు?
జవాబు:
రైతులు అధిక మొత్తంలో ఆహార ధాన్యాలు, ఆహారేతర పంటలను ఒకే పొలంలో సాగు చేయడానికి హరితవిప్లవం తోడ్పడింది.
ప్రశ్న 13.
ఏ దశాబ్దాలలో ఆహార ధాన్యాల దిగుబడి వేగంగా పెరిగింది? దానికి సరైన కారణం ఏమై ఉండవచ్చు?
జవాబు:
- 1980 – 81 – 1990 – 91 దశాబ్దకాలంలో ఆహార ధాన్యాల దిగుబడి ఎక్కువగా ఉంది.
- కారణం హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టడం.
- హరిత విప్లవంలో భాగంగా వివిధ అంశాలకు ప్రాధాన్యమివ్వడం.
9th Class Social Textbook Page No.71
ప్రశ్న 14.
హరిత విప్లవ సమయంలో రైతులు ఆహార ధాన్యాన్ని ఎగుమతి చేయడానికి భారత ప్రభుత్వం ఎందుకు అనుమతించలేదు?
జవాబు:
- భారతదేశ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి.
- కొరత ఏర్పడిన సందర్భంలో కేవలం ప్రభుత్వానికి మాత్రమే దిగుమతి చేసుకునే హక్కు ఉండేది.
- ప్రభుత్వం రైతాంగానికి కావలసిన ఉత్పాదకాలను చౌకగా అందజేయడం.
- వ్యవసాయ ఉత్పత్తులను కనీస మద్దతు ధరతో కొనడం.
- స్వదేశీ మార్కెట్ సదుపాయాన్ని కల్పించడం.
- వ్యవసాయం ద్వారా ఏదైన ఆదాయాన్ని కల్పించుట కొరకు.
ప్రశ్న 15.
ప్రభుత్వం ఎగుమతులను / దిగుమతులను ఎందుకు నిషేధించినది? ఈ విధానం భారతీయ రైతులకు ఏ విధంగా ఉపయోగపడింది?
జవాబు:
- భారతీయ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి
- భారతీయ రైతులు తమ ఉత్పత్తులు పెంచుకున్నారు.
- మార్కెట్లో గిట్టుబాటు రేటు లభించింది. తద్వారా ఆదాయం పెరిగింది.
ప్రాజెక్టు
ప్రశ్న 1.
మీ ప్రాంతంలో పండే పంటలు ఏవి ? వీటిలో ఏవి HYV వంగడాల ద్వారా, సాంప్రదాయ వంగడాల ద్వారా పెరుగుతాయి? ఈ క్రింది అంశాలను HYV వంగడాలు, సాంప్రదాయ వంగడాలతో పోల్చి చూడండి. (T.Q.)
అ) పంటకాలం ఆ) ఎన్నిసార్లు నీరందిస్తారు. ఇ) ఉత్పతి ఈ) ఎరువులు ఉ) వ్యాధులు ఊ) క్రిమి సంహారకాలు
జవాబు:
మా ప్రాంతంలో పండే పంటలు :
వరి, పెసర, మినుము, మొక్కజొన్న, జొన్న, సజ్జ మొదలగునవి. వీటిలో ఏవి HYV వంగడాల ద్వారా, సాంప్రదాయ వంగడాల ద్వారా పెరుగుతాయి అనగా ప్రస్తుతం అన్నియు HYV వంగడాల ద్వారా మాత్రమే పెరుగుతున్నాయి.
వరి :
HYV వంగడాలను ప్రవేశపెట్టడం ద్వారా తక్కువ పంటకాలంలో అధిక దిగుబడిని సాధించటానికి అవకాశమేర్పడు తుంది. ప్రాచీన సంప్రదాయ వంగడాలైతే పంటకాలం 6 నెలలు ఉంటుంది. తక్కువ దిగుబడి (ఉదా : 10 బస్తాల కన్నా తక్కువ) వస్తుంది. పెసర, మినుము, మొక్కజొన్న, జొన్న, సజ మొదలైన పంటల విషయంలో కూడా HYV వంగడాలను ప్రవేశపెట్టడం ద్వారా తక్కువ పంటకాలం అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. మరియు అన్ని కాలాలయందు ఆయా పంటలను పండించడానికి అవకాశం ఏర్పడుతుంది.
ప్రశ్న 2.
విద్యార్థులను రెండు జట్లుగా చేసి ఒక జట్టు వారు వ్యవసాయంలో సేంద్రియ ఎరువుల వాడకాన్ని సమర్థిస్తూ, ఇంకొక జట్టు వారు రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని సమర్థిస్తూ వాదనలు వినిపించండి. (డిబెట్ నిర్వహించండి.)
జవాబు: