SCERT AP 9th Class Social Studies Guide Pdf 11th Lesson ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 11th Lesson ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు

9th Class Social Studies 11th Lesson ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
ప్రభుత్వానికి బడ్జెట్ ఎందుకు అవసరం ? బడ్జెట్ పన్నుల గురించి ఎందుకు మాట్లాడుతుంది? (AS1)
జవాబు:

  1. కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటులో ప్రవేశపెట్టే బడ్జెట్ రాబోవు ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం వివిధ కార్యక్రమాలపై చేయబోయే ఖర్చును తెలుపుతుంది.
  2. ఈ ఖర్చులను భరించటానికి ఏ విధంగా ఆదాయాలను సేకరిస్తుందో కూడా తెలుపుతుంది.
  3. అందువలన ప్రభుత్వం రానున్న ఆర్థిక సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుంది. ఎంత వ్యయం చేయడంలోను ఒక ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తుంది. దీనినే “బడ్జెట్” అంటారు.
  4. ప్రభుత్వం ఆదాయ వ్యయాలపై ముందుచూపు లేకుండా వ్యవహరించినట్లయితే తరువాత ఇబ్బంది పడాల్సి వస్తుంది.
  5. వివిధ విధుల నిర్వహణకై ప్రభుత్వానికి చాలినంత డబ్బు అవసరం.
  6. ఆయా విధుల నిర్వహణకై కావాల్సిన డబ్బును ప్రజల నుండి పన్నుల రూపంలో సేకరిస్తుంది.
  7. ప్రభుత్వం వివిధ రకాల పన్నులను వసూలు చేస్తుంది.
  8. ఈ విధంగా వసూలు చేసిన పన్నులే ప్రభుత్వ రెవెన్యూ (ఆదాయం ) అవుతుంది.
  9. అందుకనే బడ్జెట్ లో పన్నుల ప్రస్తావన ఉంటుంది.

ప్రశ్న 2.
ఆదాయపు పన్ను, ఎక్సైజ్ సుంకానికి మధ్య వ్యత్యాసాలు ఏమిటి? (AS1)
జవాబు:

ఆదాయపు పన్ను ఎక్సైజ్ పన్ను
1. ప్రత్యక్ష పన్నుకు ఉదా : ఆదాయపు పన్ను. 1. పరోక్ష పన్నుకు ఉదా : ఎక్సైజ్ పన్ను.
2. వ్యక్తుల యొక్క వ్యక్తిగత ఆదాయం పై ఆదాయపు పన్ను విధించబడుతుంది. 2. ఉత్పత్తి అయిన వస్తువులు ఫ్యాక్టరీ ద్వారాన్ని దాటక ముందే ఎక్సెజ్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
3. ఆదాయపు పన్ను కొంత పరిమితిని మించి ఆర్జించే వారికే విధిస్తారు. 3. ఆ కర్మాగారపు యజమాని లేదా మేనేజర్ ఉత్పాదిత వస్తువుల పరిమాణం మేరకు ప్రభుత్వానికి పన్ను డబ్బు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.
4. వ్యక్తిగత ఆదాయాలకు కూలీలు, వేతనాలు, పింఛన్ల వంటి వివిధ రకాల వనరులుంటాయి. వ్యక్తులు బ్యాంకు నగదు నిల్వలపై వడ్డీని ఆర్జిస్తారు. కొందరు భవనాల వంటి ఆస్తులపై అద్దెను ఆర్జిస్తారు. వీటన్నింటినీ ఆదాయంగానే పరిగణిస్తారు. కాబట్టి వీరు కూడా పన్ను చెల్లించవలసి ఉంటుంది. 4. ఎక్సైజ్ సుంకాన్ని కర్మాగారం చెల్లిస్తుంది. కానీ అది వస్తువులు కొన్నవారిపై బదలాయింప బడుతుంది. ఆ కర్మాగార యజమానులు వారు చెల్లించిన పన్నులను ధరలో కలుపుకునే అమ్ముతారు.

AP Board 9th Class Social Solutions Chapter 11 ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు

ప్రశ్న 3.
క్రింది వానిని జతపరచండి : (AS1)

గ్రూపు -ఎ గ్రూపు – బి
1. ఎక్సెజ్ సుంకం A) వ్యక్తుల వార్షిక ఆదాయంపై విధించేది.
2. అమ్మకపు పన్ను B) వ్యాపార, వాణిజ్య సంస్థల వార్షిక లాభాలపై విధించేది.
3. దిగుమతి సుంకం C) వస్తువు తయారీ లేదా ఉత్పత్తి మీద విధించేది.
4. ఆదాయపు పన్ను D) వస్తువుల అమ్మకం జరిగినపుడు విధించేది.
5. కార్పొరేట్ పన్ను E) విదేశాల నుండి వస్తువులు తీసుకురావడంపై విధించేది.

జవాబు:

గ్రూపు -ఎ గ్రూపు – బి
1. ఎక్సెజ్ సుంకం C) వస్తువు తయారీ లేదా ఉత్పత్తి మీద విధించేది.
2. అమ్మకపు పన్ను D) వస్తువుల అమ్మకం జరిగినపుడు విధించేది.
3. దిగుమతి సుంకం E) విదేశాల నుండి వస్తువులు తీసుకురావడంపై విధించేది.
4. ఆదాయపు పన్ను A) వ్యక్తుల వార్షిక ఆదాయంపై విధించేది.
5. కార్పొరేట్ పన్ను B) వ్యాపార, వాణిజ్య సంస్థల వార్షిక లాభాలపై విధించేది.

ప్రశ్న 4.
ఉక్కు, అగ్గిపెట్టెలు, గడియారాలు, వస్త్రం, ఇనుము వీటిలో వేటిమీద పన్నులు పెరిగితే అవి ఇతర వస్తువుల ధరలను . ఎక్కువ ప్రభావితం చేస్తాయి? ఎందుకు? (AS1)
జవాబు:
ఇనుము ధర పెరిగితే కింది పేర్కొన్న విధంగా ఇతర వస్తువుల ధరలు పెరుగుతాయి.

  1. వస్తువుల ధరలకు అన్ని రకాల పన్నులు కలుస్తూ ఉంటాయి.
  2. కానీ, కొన్ని ప్రత్యేక వస్తువులపై పన్నులు విధించడం వల్ల పెద్ద మొత్తంలో వస్తువుల ధరలు పెరుగుతాయి.
  3. ఉదా : సైకిళ్ల, తయారీకి ఉక్కు పైపులు కావాలి.
  4. ఉక్కు తయారీకిగాను ఉక్కు ఫ్యాక్టరీకి ఇనుము మరియు బొగ్గు కావాలి.
  5. ఒకవేళ ఇనుముపై ఎక్సెజ్ సుంకం పెరిగితే దాని ప్రభావం సైకిళ్ల ధరపై ఉంటుంది.
  6. ఇనుముతో తయారయ్యే వస్తువులన్నింటి ధరలూ పెరుగుతాయి.
  7. అంతేగాక ఉక్కును తయారు చేయడానికి ఇనుమునే వినియోగిస్తారు. కాబట్టి ఉక్కుతో తయారయ్యే వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి.
  8. ఈ విధంగా ఇనుముపై పెంచిన పన్ను వివిధ అంశాలపై ప్రభావం చూపుతుంది.

ప్రశ్న 5.
సాధారణ ఆహార పదార్థాలైన ధాన్యం, పప్పులు, నూనెలను ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తారు. ఈ వస్తువుల మీద పన్నులు విధించడం పేదవారి మీద చాలా ప్రభావం చూపుతుందని ఎలా చెప్పవచ్చు? (AS4)
జవాబు:

  1. వస్తువులు, సేవలపై పన్ను విధించే విధానంలో ధనికులు, పేదల మధ్య వ్యత్యాసం చూపడం కష్టమైన పని.
  2. అయినప్పటికీ కొన్ని వస్తువుల విషయంలో అవకాశం ఉంది.
  3. ఉదా : ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, గుడ్డలు, కిరోసిన్, వంటనూనెలు, వంటగ్యాస్ వంటి అత్యవసర వస్తువులు ధనవంతులైనా, పేదవారైనా ప్రతి ఒక్కరూ కొంటారు.
  4. కానీ పేదలు వారి మొత్తం ఆదాయాన్ని దాదాపు వీటికే వినియోగించాల్సి ఉంటుంది. అవి నిత్యావసర వస్తువులు కాబట్టి వాటిని కొనకుండా ఉండలేరు. అవి లేకపోతే జీవనం కష్టం అవుతుంది. అందువల్ల పేదవారు తమ ఆదాయం మొత్తాన్ని వీటికి కేటాయించడం వలన వారికి ఏ విధమైన ఇతర ఆదాయముండదు.

AP Board 9th Class Social Solutions Chapter 11 ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు

ప్రశ్న 6.
నలుగురు స్నేహితులు కలసి ఒక ఇంటిని అద్దెకు తీసుకుని ఆ అద్దెను నలుగురు కలసి చెల్లిద్దామనుకున్నారు. అద్దె నెలకు రూ. 2000. (AS1)
– వారి మధ్య ఆ అద్దె ఎలా పంచబడుతుంది?
– వారిలో ఇద్దరు నెలకు రూ. 3000, మరో ఇద్దరు రూ. 7000లు సంపాదిస్తున్నారని మనకు ముందే తెలుసు. ఈ వ్యయాన్ని వేరోక రకంగా వాటాలు వేస్తే, వారిలో ఒక్కొక్కరు అనుభవించే బాధ ఒకే విధంగా ఉంటుందా?
– అద్దె పంపకం ఎలా ఉంటే బాగుంటుందని నీవు భావిస్తున్నావు? ఎందుకు?
జవాబు:
సమానంగా పంచబడితే ఒక్కొక్కరికి రూ. 500 చొ||న వస్తుంది.
అలాగాక వారి ఆదాయం నిష్పత్తిని పరిగణనలోనికి తీసుకుంటే దాని ప్రకారం అద్దె పంచితే
(వారిలో ఇద్దరు నెలకు రూ. 3000, మరో ఇద్దరు రూ. 7000 లు సంపాదిస్తున్నారని మనకు ముందే తెలుసు.)
ఈ వ్యయాన్ని వేరొక రకంగా కాక వారి ఆదాయ నిష్పత్తి ప్రకారం పంచితే
3000 : 7000
రూ. 600 ‘లు రూ. 1400లు ప్రకారం పంచాలి.

అనగా 3000 రూపాయలు ఆదాయం పొందే ఇద్దరు (300 + 300) 600 రూపాయలు చెల్లిస్తే 7000 రూపాయలు ఆదాయం పొందేవారు (700 + 700) 1400 రూపాయలు చెల్లించాలి. ఆదాయ నిష్పత్తి ప్రకారం పంచితే బాగుంటుంది.

ప్రశ్న 7.
ఆదాయాలపై లేదా వస్తువులపై పన్ను, ఈ రెండింటిలో ధనికులు, పేదల మీద ఏది ఎక్కువ ప్రభావం చూపుతుంది? కారణాలతో వివరించండి. (AS1)
జవాబు:
ఆదాయాలపై లేదా’ వస్తువులపై పన్ను ఈ రెండింటిలో ధనికులు పేద మీద ఏది ఎక్కువ ప్రభావితం చూపుతుంది అనగా వస్తువులపై పన్ను ఎక్కువ ప్రభావం చూపుతుంది.

కారణం :
తక్కువ ఆదాయం వచ్చినా, ఎక్కువ ఆదాయం వచ్చినా తప్పనిసరిగా కొనవలసినది వస్తువులు.

వస్తువులపై పన్నులు తక్కువగా ఉంటే వస్తువులు చౌకగా లభిస్తాయి. పేదలు కూడా కొనడానికి తక్కువ ఆదాయం సరిపోతుంది. ఆదాయాలపై పన్నులు వేస్తే అధిక ఆదాయాలు పొందుతున్న కొంతమంది మీద మాత్రమే ఆ ప్రభావం పడుతుంది.

ప్రశ్న 8.
విలువ ఆధారిత పన్ను (VAT) వస్తువులపై పన్ను ఎగవేతను ఏ విధంగా తగ్గిస్తుంది? (AS1)
జవాబు:
VAT అనగా (Value Added Tax) విలువ ఆధారిత పన్ను.

  1. వ్యాట్ విధానంతో ఉన్న ప్రయోజనం వస్తువులపై పన్ను ఎగవేతను అరికట్టడం.
  2. అది ఎలా అనగా ఉత్పత్తిదారులు, వర్తకుల అమ్మకం, కొనుగోలుకు సంబంధించిన లావాదేవీల నమోదులో పారదర్శకత పెంపొందుతుంది.
  3. ప్రతి ఒక్కరూ సరైన రికార్డులను నిర్వహించడానికి కొనుగోలు సమయంలో బిల్లులను అడుగుతారు.
  4. ఎందుకంటే ముడి సరుకులపై ఇది వరకే పన్ను ‘చెల్లించామని వాటి ద్వారానే తెలియజేయవచ్చు.
  5. పన్నుల శాఖ అధికారులు కొనుగోలుదారులు, అమ్మకందారుల రికార్డులను పోల్చి చూడటానికి అవకాశం ఉంది. కాబట్టి సాధారణంగా జరిగే పన్ను ఎగవేత కష్టసాధ్యమవుతుంది.

ప్రశ్న 9.
ఎక్సెజ్ సుంకానికి, దిగుమతి సుంకానికి మధ్యగల వ్యత్యాసాలేమిటి? (AS1)
జవాబు:

ఎక్సైజ్ సుంకం దిగుమతి సుంకం
1. ఎక్సైజ్ సుంకాలను ఫ్యాక్టరీలనుండి వసూలు చేస్తారు. 1. కస్టమ్స్ సుంకాలను అంతర్జాతీయ విమానాశ్రయాలు, నౌకాశ్రయాల నుండి వసూలు చేస్తారు.
2. ఫ్యాక్టరీలు వస్తువులు కొన్నవారిపై ఈ పన్నును బదలాయిస్తారు. 2. విదేశాలలో వస్తువులను కొని మన దేశానికి తెచ్చే వారిపై, మన దేశం నుండి ఇతర దేశాలకు వస్తువులను సరఫరా చేసేవారిపై విధించపబడుతుంది.
3. ఇది దేశీయ ఉత్పత్తులపై విధించబడుతుంది. దేశీయ ఉత్పత్తి వస్తువులు కొన్నవారిపై విధించబడుతుంది. 3. ఇది అంతర్జాతీయ వర్తకంలో వస్తువుల విక్రయాలపై విధించబడుతుంది.

ప్రశ్న 10.
ఇటీవలి కాలంలో బస్సు చార్జీలు ఒక్కసారిగా పెరిగాయా? అయితే దానికి గల కారణాలు తెలుసుకోండి.
జవాబు:
ఇటీవలి కాలంలో బస్సు చార్జీలు ఒక్కసారిగా పెరిగాయి
కారణాలు : డీజిల్, పెట్రోలు, రేట్లు పెరగడం
ఉద్యోగుల, కార్మికుల వేతనాలు పెరగడం
నిర్వహణ ఖర్చులు పెరగడం
బస్సులలో ప్రయాణించే ప్రయాణికులు తగ్గడం
విద్యార్ధులకు, వృద్ధులకు రాయితీలు ఇవ్వడం

ప్రశ్న 11.
‘ప్రత్యక్ష పన్నులు’ శీర్షిక క్రింద గల వ్యక్తుల యొక్క వ్యక్తిగత ఆదాయంపై) పేరాను చదివి కింది ప్రశ్నకు సమాధానం రాయండి. (AS2)
ఎక్కువ ఆదాయం సంపాదించేవారు ఎక్కువ పన్ను ఎందుకు చెల్లించాలి?
జవాబు:

  1. వ్యక్తుల యొక్క వ్యక్తిగత ఆదాయంపై ఆదాయపు పన్ను విధించబడుతుంది.
  2. వ్యక్తిగత ఆదాయాలకు కూలీలు, వేతనాలు, పింఛన్లు వంటి వివిధ రకాల, వనరులుంటాయి.
  3. వ్యక్తులు బ్యాంకు నగదు నిల్వలపై వడ్డీని ఆర్జిస్తారు. కాబట్టి వీరు కూడా పన్ను చెల్లించవలసి ఉంటుంది.
  4. ఆదాయపు పన్నును కొంత పరిమితిని మించి ఆర్జించే వారికే విధిస్తారు.
  5. ఈ పన్నును ఆర్జించిన ఆదాయంలో పరిమితి పోగా మిగిలిన దానిలో కొంతశాతం విధిస్తారు.
  6. ఎక్కువ ఆదాయాన్ని సంపాదించే వారు వారి ఆదాయాన్ని అనుసరించి ఎక్కువ నిష్పత్తిలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

దానివల్ల తక్కువ ఆదాయం వచ్చేవారు తక్కువ పన్ను, ఎక్కువ ఆదాయం వచ్చే వారు ఎక్కువ పన్ను చెల్లించుతారు. తద్వారా -పేదవారు మరింత పేదవారు కాకుండా, ధనవంతులు మరింత ధనవంతులు కాకుండా నిరోధించవచ్చు.

AP Board 9th Class Social Solutions Chapter 11 ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు

ప్రశ్న 12.
మన ఆర్థిక వ్యవస్థపై నల్లధనం చూపే ప్రభావం ఏమిటి? (AS6)
జవాబు:
చాలా మంది ప్రజలు తమ మొత్తం ఆదాయాలను వెల్లడించకపోవడం లేదా ఉన్న దాని కంటే తక్కువ చూపి, ఆదాయాన్ని పైకి కనపడకుండా దాయడమే, ఆ దాచిన డబ్బును నల్లధనం (Black money) అంటారు. మన ఆర్థిక వ్యవస్థపై నల్లధనం విపరీత ప్రభావం చూపుతుంది. అది ఎట్లనగా ….

వాస్తవంగా ప్రజలు, ఫ్యాక్టరీ యజమానులు, వడ్డీ వ్యాపారస్తులు, వర్తకులు అధికంగా లాభాలు ఆర్జిస్తారు. కాని వాస్తవ లాభాలు చూపి, ప్రభుత్వానికి పన్నులు చెల్లించరు. వారికి వచ్చిన లాభాన్ని తక్కువ ఆదాయాలుగా చూపుతారు. ఈ విధంగా తమ వాస్తవ ఆదాయాన్ని చూపకుండా దాయడం వలన, ప్రభుత్వానికి ధనం చేకూరదు. వాస్తవంగా చెల్లించినట్లయితే ఆ ఆదాయంతో ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి, ధరలను తగ్గించి, సామాన్య ప్రజలకు చేయూతనందించవచ్చు. ఉత్పత్తి కన్నా తక్కువ ఉత్పత్తి జరిగినట్లు చూపి పన్ను నుండి తప్పించుకోవడం వలన ఆ వస్తువుల ధరలు పెరిగి ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతుంది. కొంతమంది వ్యాపారులు బిల్లులు సరిగ్గా ఇవ్వకుండా లేదా వాస్తవంగా అయిన వాటి కంటే తక్కువ అమ్మకాలు జరిగినట్లుగా చూపి ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తున్నారు.

9th Class Social Studies 11th Lesson ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు InText Questions and Answers

9th Class Social Textbook Page No.132

ప్రశ్న 1.
మీ నగరం/పట్టణం/గ్రామాల్లో ప్రభుత్వం ఏ పాత్రలను పోషిస్తుండడాన్ని మీరు గమనించారో చర్చించండి.
జవాబు:

  1. మా ప్రాంతాలలో పాఠశాలలు, కళాశాలలు, గ్రంథాలయాలు, ఆరోగ్య కేంద్రాలు తపాలా కార్యాలయాలు వంటి వివిధ ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వమే నెలకొల్పి నిర్వహిస్తున్నది.
  2. రోడ్డు, రైలు మార్గాల నిర్మాణం, ప్రభుత్వ రవాణా వ్యవస్థను ప్రభుత్వమే నిర్వహిస్తున్నది.
  3. నీటి సరఫరా, పారిశుద్ధ్యం, విద్యుత్ వంటి వాటి నిర్వహణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నది.
  4. ఆరోగ్య, సేవలు, పరిశుభ్రత, విద్యుత్, ప్రజా రవాణా, పాఠశాలలు వంటివి ప్రభుత్వం సదుపాయాలుగా అందిస్తున్నది.
  5. రైతులు తమ పంట భూముల్లో నీటి పారుదలకై మోటారు పంపుసెట్ల ఏర్పాటుకు ఫ్యాక్టరీలు, కార్యాలయాలు, దుకాణాలు, మార్కెట్ల వంటి వాటిని నిర్వహిస్తున్నది.

ప్రశ్న 2.
ప్రభుత్వ ఖర్చు వివరాలను, మీ ప్రాంత వార్తాపత్రికల్లో సేకరించి జాబితా రాయండి.
జవాబు:
ప్రభుత్వ ఖర్చు వివరాలు :

  1. విద్యారంగం – 1200 కోట్లు
  2. ఆరోగ్యరంగం – 400 కోట్లు
  3. వ్యవసాయరంగం – 1000 కోట్లు
  4. గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి – 300 కోట్లు
  5. గ్రామీణాభివృద్ధి – 400 కోట్లు
  6. విద్యుత్, నీటి పారుదల వరదల నియంత్రణ – 600 కోట్లు
  7. ఎరువుల సబ్సిడీ – 200 కోట్లు
  8. రైల్వేలు, రవాణా, కమ్యూనికేషన్స్ – 600 కోట్లు.
  9. రక్షణ రంగం – 700 కోట్లు
  10. పరిపాలన ఖర్చులు – 800 కోట్లు

ప్రశ్న 3.
ప్రజా సేవలకు, ఇతర కార్యకలాపాల నిర్వహణకు ప్రభుత్వానికి డబ్బు ఎక్కడ నుండి లభిస్తుందో ఊహించగలరా?
జవాబు:

  1. వివిధ విధుల నిర్వహణకై ప్రభుత్వానికి చాలినంత డబ్బు అవసరం.
  2. ఈ విధంగా ప్రభుత్వం యొక్క ఆయా విధుల నిర్వహణకై కావాల్సిన డబ్బును ప్రజల నుండి పన్నుల రూపంలో సేకరిస్తుంది.
  3. ప్రభుత్వం వివిధ రకాల పన్నులను వసూలు చేస్తుంది.

9th Class Social Textbook Page No.134

ప్రశ్న 4.
పై విభాగంలోని సమాచారాన్ని ఉపయోగించి ప్రభుత్వం ఆహార సబ్సిడీపై ఎంత ఖర్చు చేసిందో లెక్కించండి.
ఈ డబ్బు దేనిపై, ఎందుకోసం ఖర్చు చేయబడిందో చర్చించండి.
AP Board 9th Class Social Solutions Chapter 11 ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు 1
జవాబు:
ఆహార సబ్సిడీపై 3% ఖర్చు చేయడం జరిగింది.

ఆ డబ్బును పేదలకు కేటాయించిన బియ్యం, పప్పులు, గోధుమలు, చింతపండు, పంచదార వంటి నిత్యావసర ఆహార ధాన్యాలకు కేటాయించడం జరిగింది.

ప్రశ్న 5.
మీ ఉపాధ్యాయుల సహాయంతో పై (pie) చార్టులోని కొన్ని ఖర్చులను మొదటి విభాగంలో చర్చించిన ప్రభుత్వ పాత్రలకు అన్వయింపజేయండి.
జవాబు:
మొదటి విభాగంలో చర్చించిన ప్రభుత్వ పాత్ర

  1. ఆహారం సబ్సిడీ – 3%
  2. విద్య మొ||న విషయాలకు – 12%
  3. ఆరోగ్యం, పారిశుద్ధ్యం – 4%
  4. గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధికి – 3%
  5. వినోదం వంటి ఇతరములకు – 21 %
    కేటాయించి ఖర్చు చేయడం జరిగింది.

ప్రశ్న 6.
స్వాతంత్ర్యానంతరం మన దేశ మొదటి బడ్జెట్ 1947-48 రూ. 197 కోట్లు. 2011-12లో బడ్జెట్ 23 లక్షల కోట్లు. బడ్జెట్ లో ఇంత మొత్తం పెరగడానికి కారణాలు ఏమై ఉంటాయి?
జవాబు:

  1. జనాభా పెరుగుదల
  2. ఉద్యోగస్తుల వేతనాలు పెరుగుదల
  3. ప్రభుత్వరంగ సంస్థల నిర్మాణ, నిర్వహణ పెరుగుదల
  4. వడ్డీ చెల్లింపుల పెరుగుదల
  5. రక్షణ వ్యయం పెరుగుదల
  6. పరిపాలనా ఖర్చుల పెరుగుదల
    పై విధంగా అన్ని రంగాలలో ఖర్చులు పెరగడం వలన బడ్జెట్ కేటాయింపులు పెరిగాయి. తద్వారా బడ్జెట్ మొత్తం పెరిగింది.

AP Board 9th Class Social Solutions Chapter 11 ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు

ప్రశ్న 7.
ప్రభుత్వ బడ్జెట్ పై పార్లమెంట్ కు అధికారం, ఎందుకు ఇవ్వబడిందో ఆలోచించండి.
జవాబు:

  1. బడ్జెట్ అంశాలపై ప్రభుత్వాన్ని చట్టసభల ద్వారా నియంత్రించవచ్చు.
  2. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లోని వివిధ అంశాలపై చర్చలు జరిగిన అనంతరమే ప్రభుత్వ ప్రతిపాదనలను పార్లమెంటు ఆమోదించడం జరుగుతుంది.
  3. ప్రభుత్వ ఖర్చులకై డబ్బు విడుదలకు పార్లమెంటు అనుమతించాలి.
  4. అదే విధంగా పార్లమెంటు ఆమోదం లేనిదే ఏ రకమైన పన్నూ విధించరాదు. అందువలన బడ్జెట్ పై అధికారం పార్లమెంటుకు ఇవ్వబడింది.

ప్రశ్న 8.
రసాయన ఎరువులపై రాయితీలను తగ్గించడానికి ప్రభుత్వం వరుసగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దీని అర్థం ప్రభుత్వం ఇక ముందు వాటి ధరల అదుపు కొనసాగించకపోవచ్చు. రైతులు మార్కెట్ ధరలకు కొనుక్కోవలసి ఉంటుంది. ప్రస్తుతం ఎరువుల కంపెనీలకు తక్కువ ధరలకు అమ్మడం వల్ల వచ్చే నష్టాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. ఎరువులపై రాయితీ ఎత్తివేయాల్సి వస్తే ఆ డబ్బు ప్రభుత్వ బడ్జెట్లోని ఇతర ముఖ్య విషయాలకు మళ్లించడానికి అవకాశం కలుగుతుంది. మరో వాదం కూడా ఉంది. ఎరువులపై రాయితీలు చిన్న రైతులకు లాభదాయకంగా లేవు, కానీ పెద్ద రైతులు అవసరానికి మించి వాడేవిధంగా ప్రోత్సహిస్తున్నాయి.
ఎరువులపై రాయితీలు రైతులకు బాగా ఉపయోగపడుతున్నాయని నమ్మే రైతుగా మిమ్మల్ని మీరు భావించుకొని ఈ కేసును ఎలా వాదిస్తారు ? ఆర్థికశాఖ మంత్రికి ఒక లేఖ రాయండి.
జవాబు:

విజయవాడ,
5-8-20xx.

భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిగారికి,

అయ్యా,
మేము రైతులం. మాకు ఎరువులపై ఇచ్చే సబ్సిడీ వలన మేము వ్యవసాయకంగా ఎంతో లబ్దిని పొందుతున్నాం. అధునాతన పద్ధతులలో వ్యవసాయం చేసి, అధిక దిగుబడులు సాధించడానికి ఈ సబ్సిడీ కార్యక్రమం మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తుంది. ఇప్పటికే వాతావరణ పరిస్థితులు అనుకూలించక, విత్తనాల రేట్లు పెరిగిపోయి, పండిన పంటకు గిట్టుబాటు రేటు లేక ఇబ్బందులు పడుతున్న మాకు ఎరువులపై ఉన్న సబ్సిడీలు ఎత్తివేస్తే వాటి రేట్లు పెరిగిపోయి వాటిని సరైన మోతాదులో వాడుకోలేక పంట దిగుబడి తగ్గిపోయి సరైన ఉత్పత్తులు సాధించలేక రైతులుగా మేమేంతో నష్టపోవలసి వస్తుంది. అందువలన తమరు మాయందు దయ ఉంచి ఎరువుల సబ్సిడీలను కొనసాగించి మా వ్యవసాయ ఆర్థికాభివృద్ధికి తోడ్పడతారని మిమ్మల్ని సహృదయపూర్వకంగా ప్రార్థించుచున్నాము..

ఇట్లు
మీ విధేయుడైన రైతు

9th Class Social Textbook Page No.135

ప్రశ్న 9.
పెట్రోల్, డీజిల్ వంటి వాటిని రవాణా వాహనాలకు, మోటారు పంపులకు, జనరేటర్ల వంటి వాటికి వినియోగిస్తాం. ఒకవేళ డీజిల్, పెట్రోల్ పై పన్ను పెరిగితే ఏమవుతుంది?
జవాబు:
పెట్రోల్, డీజిల్ వంటి వాటిని రవాణా వాహనాలకు మోటారు పంపులకు జనరేటర్ల వంటి వాటికి వినియోగిస్తాం.

  1. డీజిల్, పెట్రోల్ పై పన్ను పెరగడం వలన వాటి రేటు పెరుగుతుంది.
  2. దానితో డీజిల్ పెట్రోల్ పై ఆధారపడిన అన్ని వస్తువుల రేట్లు పెరుగుతాయి.
  3. రవాణా చార్జీలు పెరగడం వలన రవాణాపై ఆధారపడిన వస్తువుల రేట్లు పెరుగుతాయి.

9th Class Social Textbook Page No.136

ప్రశ్న 10.
టి.వి. ఉదాహరణలో, దాని ఖరీదులో ఎంత భాగం వినియోగదారుడు పన్నుగా చెల్లిస్తున్నాడు?
జవాబు:
ఎక్సెజ్ సుంకం రూపంలో 1200 రూపాయలు
అమ్మకం పన్ను రూపంలో 1650 రూపాయలు
మొత్తం కలిపి 2850 రూపాయలు పన్ను చెల్లిస్తున్నాడు.

ప్రశ్న 11.
ఒకే రకమైన ఉత్పత్తులను తయారు చేసేవారి ఇద్దరిలో ఒకరు పన్ను ఎగవేసినా, మరొక వ్యక్తి కంటే ఏ విధంగా ప్రయోజనం పొందుతాడు?
జవాబు:

  1. పన్ను కట్టడం వలన తక్కువ లాభం పొందుతాడు.
  2. పన్ను ఎగవేయడం వలన దానిని కూడా తన లాభంగా పొందవచ్చును.
  3. అంతేగాక పన్ను వేయడం వల్ల ఇతరులు ఉత్పత్తి చేసిన వస్తువులకన్నా తక్కువ ధరకే అమ్మవచ్చును.
  4. అలాంటి పరిస్థితులలో పన్ను ఎగవేతదారుడు ఎక్కువ వస్తువులను అమ్ముకోవచ్చును. దానితో అతనికి మంచి లాభం రావచ్చును.

AP Board 9th Class Social Solutions Chapter 11 ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు

ప్రశ్న 12.
ఒకవేళ ఇనుముపై పన్ను పెంచితే దాని ప్రభావం ఇతర ఏ వస్తువులపై ఎలా పడుతుందో ఉదాహరణలివ్వండి.
జవాబు:

  1. ఇనుము రేటు పెరుగుతుంది.
  2. దానితో ఇనుముతో తయారయ్యే వస్తువులన్నింటి ధరలో పెరుగుతాయి.
  3. అంతేగాక ఉక్కును తయారు చేయడానికి ఇనుమునే వినియోగిస్తారు. కాబట్టి ఉక్కుతో తయారయ్యే వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి.

9th Class Social Textbook Page No.138

ప్రశ్న 13.
విలువ ఆధారిత పన్నులపై మీ అభిప్రాయం ఏమిటి? చర్చించండి.
జవాబు:

  1. విలువ ఆధారిత పన్ను విధానంలో ఉత్పత్తిదారు చెల్లించే పన్ను తక్కువగా ఉంటుంది.
  2. ఎందుకనగా ముడి పదార్థాల విలువపై పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.
  3. కర్మాగారాల్లో ఉత్పాదనాక్రమం ఇతర కర్మాగారాల్లో ఉత్పత్తి చేయబడిన ఎన్నో ఉత్పత్తులపై ఆధారపడి ఉంటుంది.
  4. ఈ పన్ను విధానం (వ్యాట్) లో ముడి పదార్థాలుగా ఉపయోగించే వాటిపై మళ్ళీ పన్ను విధించబడదు.
  5. ఉత్పత్తిదారులు, వర్తకుల అమ్మకం, కొనుగోలుకు సంబంధించిన లావాదేవీల నమోదులో పారదర్శకత పెంపొందుతుంది.
  6. ప్రతి ఒక్కరూ సరైన రికార్డులను నిర్వహించడానికి కొనుగోలు సమయంలో బిల్లులను అడుగుతారు. ఎందుకంటే ముడిసరుకులపై ఇదివరకే పన్ను చెల్లించామని వాటి ద్వారానే తెలియజేయవచ్చు.
  7. పన్నుల శాఖ అధికారులు. కొనుగోలుదారులు, అమ్మకందారుల రికార్డులను పోల్చి చూడటానికి అవకాశం ఉంది.

ప్రశ్న 14.
పూరించండి : తార, సాజీదా, ప్రీతిల కొనుగోళ్లపై పన్ను రేట్లు వేర్వేరు ఉన్నాయి. (ఒకే రకమైన / వేర్వేరు అలా ఎందుకు ఉన్నాయో తెలుసుకోండి.
జవాబు:
తార తన యొక్క పాఠశాల కంప్యూటర్ల కోసం సాయిరాం కంప్యూటర్స్ నుండి రెండు హార్డ్ డ్రైవ్ లను కొని తెచ్చింది. బిల్లులో విలువ ఆధారిత పన్ను కంటే ముందు రేటు రూ. 5,000 దీనికి 5% విలువ ఆధారిత పన్ను రూ. 250లు కలిపిన అనంతరం మొత్తం అమ్మకం ధర (వ్యాట్‌లతో) కలిపి రూ. 5,250 లు.

సాజీదా బ్యాటరీ రూ. 9,165లు కొనగా వ్యాట్ కలిపి 1,146 మొత్తం రూ 10,311లు చెల్లించెను.
ప్రీతి తన వంటగ్యాస్ సిలిండర్‌కు చెల్లించిన బిల్లులో వ్యాట్ లేదు.
ఎందుకంటే వంటగ్యాసు వ్యాట్ లేదు.
అందువలన పై వస్తువులపై పన్ను రేట్లు వేరువేరుగా ఉన్నాయి.

9th Class Social Textbook Page No.139

ఆదాయంపై పన్ను విధించడంలో సరైన విధానమేది?
ప్రశ్న 15.
ప్రతి ఒక్కరూ సమాన మొత్తాలను పన్నుగా చెల్లించడం సరైన విధానమని మీరు భావించి ఉంటారు. కింద పేర్కొన్న ముగ్గురు వ్యక్తులను గమనించండి.
AP Board 9th Class Social Solutions Chapter 11 ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు 2
పై ముగ్గురిలో ప్రతి ఒక్కరూ సమాన .మొత్తం (రూ.50) పన్ను చెల్లించే విధానం వాస్తవంగా సరైనదా? జ్యోతి తన ఆదాయంతో కనీసం తన పిల్లల్ని కూడా సరిగా పోషించలేదు. ఆమె కూడా అదే మొత్తంలో పన్ను చెల్లించడం సరైనదేనా?
జవాబు:
ఈ రకమైన పన్నుల విధానం సరియైనది కాదు.

ప్రశ్న 16.
ప్రతి ఒక్కరు తమ ఆదాయంలో కొంత మొత్తం పన్నుగా చెల్లించడం సరైన విధానమని భావిస్తున్నారు కదా! ఉదాహరణకు ప్రతి ఒక్కరు 10% పన్ను చెల్లించాల్సి ఉంటే ఎంత చెల్లించాలో కనుక్కోండి.

వ్యక్తి నెలలో సంపాదించినవి (రూ.లలో) 10% పన్ను (రూ.లలో)
జ్యోతి 1,500 150
ఆసిఫ్ 8,000 800
నితీష్ 30,000 3000

ఇది సరైనదా? అయినప్పటికీ జ్యోతికి జీవించడానికి చాలినంత ఆదాయం లేదు. ఆసిఫ్ కు తన ఇల్లు మరమ్మతులు చేయించడానికి సరిపడా డబ్బు కలిగి ఉండకపోవచ్చు. కానీ నితీష్ 20% పన్ను చెల్లించినా తన కనీస అవసరాలకు పెద్ద . మొత్తంలో డబ్బు ఉంటుంది.
జవాబు:
ఇది సరికాదు.

AP Board 9th Class Social Solutions Chapter 11 ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు

ప్రశ్న 17.
పన్నుల విధానాన్ని సరిచేయడానికి మరింత సరైన పద్ధతిని ఇప్పుడు మీరు చెప్పగల్గుతారు. కొంత పరిమితిని ఉదాహరణకు నెలకు రూ. 7,000 లకు మించి. సంపాదించే వారే పన్ను చెల్లించాలి. బాగా ఆర్జించేవారు వారి ఆదాయాల నుండి . ఎక్కువ నిష్పత్తిలో పన్ను చెల్లించాలని కూడా మీరు చెప్పగలుగుతారు.

మీరు సంపాదించే ఆదాయం (రూ.లలో) మీరు చెల్లించే పన్ను
7,000లు కన్నా తక్కువ 0%
7,001 నుండి 15,000 ల వరకు 10%
15,001 నుండి 25,000 ల వరకు 20%
25,000ల కన్నా ఎక్కువ 30%

కింది వారిలో ఒక్కొక్కరు ఎంత పన్ను చెల్లించాలో లెక్కించండి.

వ్యక్తి నెలలో సంపాదించినవి
(రూ. లలో)
నెలకు చెల్లించాల్సిన పన్ను
(రూ.లలో)
జ్యో తి 1,000
ఆసిఫ్ 6,000
నితీష్ 20,000 4000

ఇది సరైనదేనా?
1. సరైనది కాదు.

కారణం :

  1. మనిషి తన ప్రాథమిక అవసరాలు తీర్చుకోవడానికి కొంత డబ్బు అవసరం. దానిమీద పన్ను విధించరాదు.
  2. అందువలన ఒక స్థాయి ఆదాయం వరకు ఏ విధమైన పన్నూ విధించకుండా ఆ దశ దాటిన తరువాత పన్ను విధిస్తే బాగుంటుంది.
  3. కావున 3వ అంశంలో పేర్కొన్న విధంగా కొంత పరిమితి వరకు పన్ను విధించకుండా ఆ తరువాత విధిస్తూ ఉండాలి.
  4. అప్పుడు పన్నుల వలన పేదవారు ఇబ్బందిపడరు.

9th Class Social Textbook Page No.140

ప్రశ్న 18.
ప్రభుత్వం విధించే ప్రధానమైన పన్నుల గురించి మనం చదివాం. ఇచ్చిన సమాచారంతో కింద పట్టికను పూరించండి. ఆదాయం పన్ను 12%, కార్పొరేట్ పన్ను 24%, దిగుమతి సుంకం 10%, ఎక్సెజ్ పన్ను 16%, సేవాపన్ను 5%, అమ్మకపు పన్ను 23%, ఇతర పరోక్ష పన్నులు 10%.
ప్రభుత్వంచే వసూలు చేయబడే పన్నులు :

పన్నులు మొత్తం పన్ను యొక్క శాతం
ప్రత్యక్ష పన్నులు : 36%
ఆదాయం పన్ను 12%
కార్పొరేట్ పన్ను 24%
పరోక్ష పన్నులు : 64%
దిగుమతి పన్ను 10%
ఎక్సైజ్ పన్ను 16%
సేవా పన్ను 5%
అమ్మకం పన్ను 23%
ఇతర పన్నులు 10%
మొత్తం పన్నులు 100%

1. ఏ రకమైన పన్నులు ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి?
జవాబు:
పరోక్ష పన్నులు (64%)

2. క్రాంతికి సంవత్సరానికి రూ. 1,75,000ల ఆదాయం ఉంది. అతడు రూపాయలు రూ. 3000 పన్ను చెల్లించాలి. కమలేశ్ వార్షిక ఆదాయం 3,00,000 రూపాయలు. అతడు రూ. 5,500 ఆదాయం పన్ను చెల్లించాలి.
* ఎవరు ఎక్కువ. ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారు?
జవాబు:
క్రాంతికి సంవత్సరాదాయం – 1,75,000 రూపాయలు
క్రాంతి చెల్లిస్తున్న ఆదాయపు పన్ను – 3,000 రూపాయలు
క్రాంతి చెల్లిస్తున్న ఆదాయపు పన్ను శాతం – 1.71%
కమలేశ్ వార్షికాదాయం – 3,00,000
కమలేశ్ చెల్లిస్తున్న ఆదాయపు పన్ను – 5,
కమలేశ్ చెల్లిస్తున్న ఆదాయపు పన్ను శాతం – 1.83%
అందువలన కమలేశ్ ఎక్కువ ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారు.

* ఎవరు ఆదాయంలో ఎక్కువ భాగాన్ని పన్నుగా చెల్లించాలి?
జవాబు:
కమలేశ్

* ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ ఆదాయం ఉన్నవారు చెల్లించే పన్ను వారి ఆదాయంలో ……….. (తక్కువ/ఎక్కువ / సమానం) భాగం.
జవాబు:
ఎక్కువ

ప్రాజెక్టు

కొన్ని సబ్బులు, టూత్ పేస్టు, టాబ్లెట్స్ స్క్రిప్స్ లేదా ఎం.ఆర్.పి రాసి ఉన్న కొన్ని వస్తువుల ప్యాకింగ్ ను సేకరించి వాటిమీద రాసి ఉన్న ధరను, వాటిని అమ్ముతున్న ధరలను గురించి చర్చించండి. చిల్లర వర్తకుడు పొందుతున్న లాభాల గురించి మాట్లాడండి.
జవాబు:
లక్స్ – 20 రూ.
రెక్సోనా – 19 రూ
సంతూర్ – 16 రూ.
లిరిల్ – 25 రూ.
కోర్గెట్ 74-00 రూ.
పెప్సొడెంట్ – 70-00 రూ.
బబూల్ – 60-00 రూ.

వాటిపై ఎం.ఆర్.పి. పై విధంగా ఉండగా చిల్లర వర్తకుడు ఒక్కొక్కదానిపై దానిమీద ఉన్న ఎం.ఆర్.పి. రేటుకన్నా 2 లేదా 3 రూపాయలు ఎక్కువ రేటుకు అమ్ముతున్నాడు.

ప్రతి ఉత్పత్తి వస్తువుపైనా ఎం.ఆర్.పి. రేటుకన్నా 2 లేదా 3 రూపాయలు ఎక్కువ రేటుకు అమ్ముతున్నాడు.

ప్రతి ఉత్పత్తి వస్తువుల పైనా ఎం.ఆర్. పి. రేటుతోపాటు (అన్నిరకముల పన్నులను కలిపి) అని ఉంటుంది. కాబట్టి చిల్లర వర్తకుడు ఎం.ఆర్.పి. ఎక్కువ రేటుకు అమ్మవలసిన అవసరం లేదు. వారికి ఎం.ఆర్.పి రేటులోనే కొంత తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. ఆ లాభం సరిపోతుంది. కానీ చిల్లర వర్తకుడు మరికొంత అదనపు ఆదాయాన్ని రాబట్టడం కోసం ఆ విధంగా ఎక్కువ రేటుకు అమ్ముతున్నాడు.