AP State Syllabus AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం.
AP State Syllabus 8th Class Telugu Important Questions 9th Lesson సందేశం
8th Class Telugu 9th Lesson సందేశం Important Questions and Answers
I. అవగాహన – ప్రతిస్పందన
అ) కింది చుక్క గుర్తు గల పద్యాలకు భావాలను రాయండి.
1) చం. పరమ తపోనివేశనము బంగరుపంటలకు న్నివాస మ
బ్బురమగుశాంతిచంద్రికల భూమి ప్రపంచచరిత్రలోన బం
ధురతరకీర్తిగొన్న భరతోర్వర నాజనయిత్రియంచు పా
డర! శిరమెత్తరా! విజయఢంకను గొట్టుమురా! సహోదరా!
భావం :
ఓ సోదరా ! మనదేశం, తపోభూమి. ఇది బంగారు పంటలకు నిలయం. శాంతి వెన్నెలలు కురిసే పుణ్యభూమి. ప్రపంచంలో మనోహరమైన కీర్తిని పొందిన ఈ భరతభూమి, నా తల్లి అని గర్వంగా తల ఎత్తుకొని తిరుగుతూ, విజయఢంకాను మ్రోగిస్తూ నీ దేశం గురించి కీర్తించు.
2) ఉ. జాతి శిరస్సు నెత్తికొని క్ష్మాతలవీధిని గౌరవాన హుం
దాతన మొప్పగాఁ దిరిగినన్ గలుగున్ గడుకీర్తి భారత
క్ష్మాతలి కట్టి భాగ్యమును గల్గగ శాంతి సముద్ధరింప లే
రా! తరుణమ్మిదే మరలరాదు సుమీ! గతకాల మెన్నడున్
భావం :
భారత జాతి తల ఎత్తుకొని ప్రపంచ వీధిలో సగౌరవంగా, హుందాగా తిరిగినప్పుడే, గొప్ప కీరి కలుగుతుంది. మనదేశానికి అటువంటి సౌభాగ్యం కలిగే విధంగా, శాంతిని పెంపొందించడానికి, ఇదే సరైన సమయము. అందుకు సిద్ధంకండి. ఎందు కంటే, పోయిన కాలం తిరిగి రాదు కదా !
3) శా. ఈ గంగానది బ్రహ్మపుత్రయును నీ కృష్ణమ్మ కావేరియున్
ఈ గోదావరి సింధు నర్మదలు నీ యీదేశ సౌభాగ్య ధా
న్యాగారాలకు పట్టుగొమ్మలు నఖండంబైన నీ ధారుణీ
భాగ్యమ్మీ సకల ప్రపంచమునకున్ స్వామిత్వముం బూనెడిన్
భావం :
గంగ, బ్రహ్మపుత్ర, కృష్ణ, సింధు నర్మద అనే జీవనదులు, ఈ దేశ సౌభాగ్యమైన ధాన్యాగారాలకు ముఖ్యమైన ఆధారం. అఖండమైన సౌభాగ్య సంపదలు గలిగిన ఈ దేశం, ప్రపంచానికే ఆధిపత్యం వహిస్తుంది.
ఆ) కింది అపరిచిత పద్యాలను చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. మొదలు జూచినఁ గడు గొప్ప పిదపఁ గుఱుచ,
యాదిఁ గొంచెము తర్వాత నధిక మగుచుఁ
దనరు, దిన పూర్వ పరభాగ జనితమైన
ఛాయపోలిక గుజన సజ్జనుల మైత్రి
ప్రశ్నలు :
1. కుజనుల మైత్రి ఎటువంటిది?
జవాబు:
కుజనుల మైత్రి ఉదయకాలపు నీడవలె మొదట ఎక్కువగా ఉండి తరువాత తగ్గిపోతూ ఉంటుంది.
2. సజ్జనుల మైత్రి ఎటువంటిది?
జవాబు:
సజ్జనుల మైత్రి సాయంకాలపు నీడవలె మొదట తక్కువగా ఉండి తరువాత పెరుగుతూ ఉంటుంది.
3. కుజన, సజ్జనుల మైత్రిని కవి దేనితో పోల్చి చెప్పాడు?
జవాబు:
కవి కుజనుల మైత్రిని ఉదయకాలపు నీడతోను, సజ్జనుల మైత్రిని సాయంకాలపు నీడతోను పోల్చి చెప్పాడు.
4. ఈ పద్యం వల్ల మనకు ఏం తెలుస్తోంది?
జవాబు:
ఈ పదం వల్ల మనకు సజ్జనుల మైత్రి మంచిదని తెలుస్తోంది.
2. అఘము వలన మరల్చు, హితార్థ కలితుఁ
జేయుఁ గోష్యంబు దాచుఁ, బోషించుగుణము,
విడువ డాపన్ను, లేవడివేళ నిచ్చు,
మిత్రు డీలక్షణమ్ముల మెలగుచుండు
ప్రశ్నలు :
1. మిత్రుడు దేని నుండి మరలిస్తాడు?
జవాబు:
మిత్రుడు పాపం నుండి మరలిస్తాడు.
2. మిత్రుడు ఎట్టివారిని విడిచిపెట్టడు?
జవాబు:
మిత్రుడు ఆపదలో నున్నవారిని విడిచి పెట్టడు.
3. మిత్రుడు పోషించేది ఏది?
జవాబు:
మిత్రుడు సద్గుణాన్ని పోషిస్తాడు.
4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘మిత్ర లక్షణం’.
3. తివిరి యిసుమునఁ దైలంబుఁ దీయవచ్చు
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చుఁ
దిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చుఁ
జేరి మూర్ఖుల మనసు రంజింపరాదు
ప్రశ్నలు :
1. ఎవరి మనసు రంజింపచేయలేము?
జవాబు:
మూర్ఖుని మనసు రంజింపచేయలేము.
2. ఇసుక నుండి ఏమి తీయవచ్చును?
జవాబు:
ఇసుక నుండి తైలము తీయవచ్చు.
3. మృగతృష్ణలో ఏమి త్రాగవచ్చు?
జవాబు:
మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు.
4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక “మూర్ఖుని స్వభావం”.
4. కమలములు నీటఁ బాసినఁ
కమలాప్తుని రశ్మి సోఁకి కమలిన భంగిన్
తమ తమ నెలవులు తప్పినఁ
దమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ!
ప్రశ్నలు :
1. కమలములు నీటిని విడిచిపెట్టి బయటికి వస్తే ఏం జరుగుతుంది ?
జవాబు:
కమలములు నీటిని విడిచి పెట్టి బయటికి వస్తే సూర్యరశ్మి సోకి వాడిపోతాయి.
2. ఎప్పుడు మిత్రులు శత్రువులౌతారు?
జవాబు:
తమ తమ స్థానాలను విడిచిపెడితే మిత్రులు శత్రువు లౌతారు.
3. తామరలకు మిత్రుడెవరు?
జవాబు:
తామరలకు మిత్రుడు సూర్యుడు.
4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘స్థానబలం’.
5. ఎఱుక గలవారి చరితలు
గఱచుచు సజ్జనుల గోష్ఠి గదలక ధర్మం
బెఱుగుచు నెఱిగినదానిని
మఱువ కనుష్ఠించునది సమంజసబుద్ధిన్
ప్రశ్నలు :
1. ఎవరి చరిత్ర తెలుసుకోవాలి?
జవాబు:
జ్ఞానవంతుల చరిత్ర తెలుసుకోవాలి.
2. ధర్మాన్ని ఎక్కడి నుంచి తెలుసుకోవాలి?
జవాబు:
ధర్మాన్ని సజ్జనుల సమావేశం నుంచి తెలుసుకోవాలి.
3. దేనిని అనుష్ఠించాలి?
జవాబు:
ధర్మాన్ని అనుష్ఠించాలి.
4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యా నికి శీర్షిక ‘నీతిబోధ’.
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత
అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
‘సందేశం’ పాఠ్యభాగ రచయితను గురించి రాయండి.
(లేదా)
దేశం కోసం “సందేశం” ఇచ్చిన పాఠ్య రచయిత గురించి రాయండి. (S.A. II – 2018-19)
జవాబు:
‘సందేశం’ పాఠ్యభాగ : వయిత జ్ఞానానందకవి. ఈయన పూర్తి పేరు సురగాలి తిమోతి జ్ఞానానందకవి. బొబ్బిలి తాలూకా పెద పెంకి గ్రామంలో జన్మించారు. తెలుగు పండితులుగా పని చేశారు. ప్రాథమిక విద్యార్థి దశలోనే ఆశువుగా సీస పద్యాలు చెబుతూ ‘దీనబంధు శతకాన్ని’ రాశారు. ఆమ్రపాలి, పాంచజన్యం, క్రీస్తు శతకం, నాజీవిత గాథ, కూలీ నుండి కళాప్రపూర్ణ వరకు, పర్జన్యం, గోల్కొండ మొ||లగు వీరి రచనలు. 1975లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి అవార్డును పొందారు. రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. సరళమైన శైలితో సామాజిక చైతన్యాన్ని అందించారు.
ప్రశ్న 2.
భారతమాత గొప్పదనాన్ని వివరించండి.
జవాబు:
మనది విశాలమైన భారతదేశం. ఇది హిమాలయాలకు పుట్టినిల్లు. ఇలాంటి భారతదేశంలో ప్రజలందరూ విశాల దృక్పథంతో మెలగాలి. మన మతాలు, భాషలు వేరైనప్పటికీ మనమంతా భారతీయులం. మన భారతదేశం ఎంతో సుందరమైనది. ఎదుటివారిపై పగ, కోపం విడనాడి ప్రేమ, స్నేహభావాలతో జీవించాలి. బుద్ధుడు, గాంధీ చేసిన బోధనలు మనకు శాంతిని చేకూరుస్తాయి.
ప్రేమ అనే జెండాను చేతపట్టుకొని ఐకమత్యంతో పయనిద్దాం. త్యాగమనే శక్తిని ఆయుధంగా చేసుకొని శత్రువుల నెదిరిద్దాం. కూలీలు, రైతులు, మేధావులు కలిసిమెలిసి పనిచేసినపుడే పల్లెలు, పట్నాలు అభివృద్ధి చెందుతాయి. మనమంతా కలిసి అనారోగ్యం, అవిద్య, అసమానతలను తొలగించటానికి పాటుపడాలి. ప్రజాస్వామ్యం కాపాడుకుంటూ సామ్యవాదం సాధించుకోవాలి.
ప్రశ్న 3.
మనదేశం ఒకప్పటి పరిస్థితి, ఇప్పటి పరిస్థితి మధ్య తేడాను చర్చించండి.
జవాబు:
ఒకప్పుడు మన దేశం స్వతంత్ర రాజుల అధికారంలో ఉండేది. ఎక్కువమంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారు. కేవలం వర్షాధారంగా పంటలు పండించేవారు. బ్రిటిష్ వారు దేశాన్ని తమ అధికారంలోకి తెచ్చుకున్నప్పుడు, వారు కొన్ని సదుపాయాలు చేశారు. కాని దేశం బానిసత్వం అనుభవించింది. విద్యా, ఆరోగ్య సదుపాయాలు విస్తరించలేదు.
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశం పంచవర్ష ప్రణాళికల ద్వారా ఎంతో అభివృద్ధి చెందింది. విద్యా, ఆరోగ్య, రవాణా వసతులు పెరిగాయి. దేశంలో పేదరికం తగ్గింది. పల్లెల్లో సహితం విద్యా సదుపాయాలు, రోడ్లు, పాడి పంటలు పెరిగాయి. పరిశ్రమలు పెరిగాయి. రోదసీ విజ్ఞానరంగంలో మనం ప్రపంచంలోనే ఉన్నత స్థితిలో ఉన్నాం.
కానీ దేశంలో నాయకుల్లోనూ, ప్రజల్లోనూ అవినీతి, లంచగొండితనం పెరిగిపోయాయి. మోసాలు, అక్రమాలు, అన్యాయాలు అధికమయ్యాయి. ధరలు చుక్కలనంటుతున్నాయి. దేశసంపద కేవలం కొంతమంది గుప్పెటలో బందీ అయ్యింది. దేశం అనుకున్నంత వేగంగా ముందుకు పోవడం లేదు.
ఆ) కింది ప్రశ్నకు 10 లేక 12 వాక్యాల్లో సమాధానం రాయండి.
ప్రశ్న 1.
‘సందేశం’ పాఠం ద్వారా నీవేమి గ్రహించావో తెలుపుము.
జవాబు:
జ్ఞానానంద కవి ‘సందేశం’ అనే పాఠ్యభాగాన్ని రచించాడు. ఈ పాఠ్యభాగం ద్వారా మన భారతదేశము యొక్క గొప్పతనాన్ని, సంస్కృతీ వైభవాన్ని చక్కగా తెలియజేశాడు. ప్రపంచమంతా భారతదేశాన్ని గౌరవిస్తుంది. భారతీయులంతా శాంతిని కోరుతారు. అన్ని మతాలవారు అన్యోన్యంగా ఉంటారు. పరమత సహనాన్ని పాటిస్తారు.
భారతదేశంలో అసూయలు, దౌర్జన్యాలు, కులమత హింసలు లేవు. నానాటికీ పెరిగిపోతున్న దౌర్జన్యాలు తొలగిపోవాలి. లంచగొండితనాన్ని నిర్మూలించాలి. ప్రతినిధులు ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారు. ఇది మంచిది కాదు. ప్రజలంతా అన్నదమ్ముల్లా ఉండాలి. ఆనాడే భారతదేశ సమైక్యత వర్ధిల్లుతుంది.
మనదేశంలో గంగ, కృష్ణా, గోదావరి వంటి మహానదులు ప్రవహిస్తున్నాయి. దేశాన్ని సస్యశ్యామలం చేస్తున్నాయి. మహాత్ముల నీతి మార్గంతో పునీతమైన పుణ్యభూమి మనది. ఈ అహింసా సిద్ధాంతాన్ని అందరూ పాటించాలి. దేశ సమగ్రతకు అందరూ కృషి చేయాలి.
ఇ) కింది అంశం గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.
ప్రశ్న 1.
భారతమాత తన ఆత్మకథను ఎలా చెప్పుకుందో ఊహించి రాయండి.
జవాబు:
నేను భారతమాతను. నేను సిరిసంపదలు, పాడి పంటలు గలదానను. నా నేలపైననే, వేద వేదాంగాలు, రామాయణం వెలిశాయి. వ్యాసాది ఋషులు ఇక్కడే పుట్టారు. నాపై పెద్ద అరణ్యాలు ఏర్పడ్డాయి. ఉపనిషత్తులు నా నేలపైననే పుట్టాయి.
నన్ను పాలించిన రాజుల పరాక్రమ చరిత్రలు, నా ప్రజల బానిసత్వం వల్ల అంతరించాయి. నా ప్రజలు కిన్నెర మీటుతూ రాగాన్ని ఆలపిస్తూ నా భావిభాగ్యాన్ని గూర్చి పాడాలి. నవరసాలతో తేట తెలుగు పదాలతో వీనుల విందుగా కవితలు చెప్పిన కవులు నా నేలపై పుట్టారు. నన్ను కాపాడిన వీరులను గూర్చి గానం చేయాలి. నాపై పాండవేయులు చేసిన యుద్ధాన్ని గూర్చి పాడుకోవాలి. నన్ను పాలించిన కాకతీయుల యుద్ధనైపుణ్యాన్ని కీర్తించాలి. తుంగభద్రా తీరాన నన్ను పాలించిన తెలుగు రాజుల చరిత్రలను గానం చేయాలి.
ప్రశ్న 2.
మనదేశంలాగే మనం పుట్టిన ఊరు కన్నతల్లి వంటిది. మీ ఊరిని గురించి పొగుడుతూ ఒక గేయం రాయండి.
జవాబు:
మా ఊరు గురించి గేయం
“సిరులు పొంగిన సీమరాయది
పాడిపంటల భాగ్యసీమది
కన్నతల్లిర “కడియమూ”
“జామతోటలు జాజిపూవులు
వంగతోటలు పండ్ల తరువులు
మల్లెపూవులు మొల్ల తోటలు
నిండియున్నవి దండిగా”
“గలగలలతో కాల్వ జలములు
గాలి కూగే కలమ సస్యము
విందు చేసే ప్రేమ పాటలు
కలసి యుండెడి కడియమూ”
కూరగాయలు కోరినన్నియు
పాడిపంటలు వలసినంతయు
వర్త కమ్మున భాగ్యసంపద
మరపురానిది “మా పురం”.
ప్రశ్న 3.
మహాత్మాగాంధీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
మహాత్మాగాంధీ అసలు పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. కానీ భారత ప్రజలు ఆత్మీయంగా ‘బాపూజీ’ అని పిలిచేవారు. ‘మహాత్మా’ అని గౌరవించేవారు. భారతజాతి మహాత్మాగాంధీని ‘జాతిపిత’ గా గౌరవించి కృతజ్ఞత ప్రకటించుకుంది.
గాంధీజీ దక్షిణాఫ్రికా వెళ్ళినప్పుడు అక్కడున్న భారతీయుల దాస్య వృత్తిని చూసి చలించిపోయాడు. ఆంగ్లేయుల ప్రవర్తన సహించలేక ఎదురుతిరిగాడు. ఎన్నో కష్టాలకు లోనయ్యాడు.
స్వదేశానికి తిరిగి వచ్చిన గాంధీజీ భారతీయుల బానిస బ్రతుకుల్ని చూసి సహించలేకపోయాడు. భారతమాత పరాయి పాలకుల సంకెళ్ళలో బందీగా ఉన్నందుకు గాంధీ తల్లడిల్లాడు. ఆంగ్లేయులపై స్వాతంత్ర్య సమరం ప్రకటించాడు. శాంతి, సత్యం, అహింస అనే ఆయుధాలతో స్వాతంత్ర్య సమరం చేపట్టాడు. స్వరాజ్య ఉద్యమానికి కాంగ్రెసు సంఘం స్థాపించాడు.
ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా, విదేశీ వస్తు బహిష్కరణ, సహాయ నిరాకరణ, ఖద్దరు ఉద్యమాలను చేపట్టి ఆంగ్లేయులను గుక్క తిప్పుకోనీకుండా గడగడలాడించాడు. సత్యాగ్రహం, నిరాహారదీక్షల ద్వారా భారత జాతిని జాగృతం చేసి ఆంగ్లేయుల గుండెలు దద్దరిల్లజేశాడు.
అనేక జాతులు, కులాలు, మతాలు, భాషలు గల దేశ ప్రజల్ని ఒకే తాటి మీద నడిపించి, సమైక్యంగా పోరాటం సాగించాడు. గాంధీ నడిపించిన ఉద్యమం వల్ల 1947, ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం లభించింది. దుడ్డు కర్ర, అంగవస్త్రం, కిర్రు చెప్పులు గల గాంధీ ప్రపంచ దేశాలచేత జేజేలు అందుకున్నాడు.
8th Class Telugu 9th Lesson సందేశం 1 Mark Bits
1. నీ తనువు నిండా దేశభక్తి ఉండాలి. (అర్ధాన్ని గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) శరీరము
బి) అవయవము
సి) శరము
డి) మనసు
జవాబు:
ఎ) శరీరము
2. దేశ గౌరవమును పెంపొందించాలి (వికృతి గుర్తించండి.) (S.A.II – 2018-19)
ఎ) గౌవరము
బి) గవరం
సి) గారవము
డి) గౌవరం
జవాబు:
సి) గారవము
3. నా యీ దేశ సౌభాగ్య సంపద లీ విశ్వమునందు నెలకొల్పుదున్ (ఏ విభక్తి) (S.A.II – 2018-19)
ఎ) తృతీయ
బి) చతుర్థి
సి) సప్తమీ
డి) షష్టీ
జవాబు:
సి) సప్తమీ
4. భారతదేశం సకల సంపదలకు నిలయము (గురు లఘువులు గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) UII
బి) UIU
సి) IIU
డి) III
జవాబు:
డి) III
5. గాంధీజీ శాంతికి మారుపేరు. ఉగ్రవాదులు దేనికి మారుపేరు? (వ్యతిరేకపదం రాయండి) (S.A.II – 2017-18)
ఎ) ప్రేమ
బి) అశాంతి
సి) సహనం
డి) ఆప్యాయత
జవాబు:
బి) అశాంతి
6. వనముల్ – ఈ పదంలో ఉన్న గణం ఏది? (S.A.III – 2016-17)
ఎ) న గణం
బి) స గణం
సి) య గణం
డి) మ గణం
జవాబు:
బి) స గణం
భాషాంశాలు – పదజాలం
అర్థాలు :
1. కేతనం ఎగరాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) జెండా
బి) బాబిల్లి
సి) జాతర
డి) రథం
జవాబు:
ఎ) జెండా
2. వసుధ పై శాంతి నిలవాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ధిషణ
బి) వారిధి
సి) వారంగి
డి) భూమి
జవాబు:
డి) భూమి
3. శిరంపై కేశాలు ఉన్నాయి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) యశం,ఖ్యాతి
బి) విరించి, వివరణ
సి) ఖ్యాతి, ఖననం
డి) కిరీటం, కరుణ
జవాబు:
బి) విరించి, వివరణ
4. నవ్వ జీవనం కావాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) అనురాగం
బి) కొత్త
సి) పాత
డి) మధురం
జవాబు:
బి) కొత్త
5. మంచి తరుణంలో రావాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) సమయంలో
బి) సాధనలో
సి) యోధలో
డి) పోరాటంలో
జవాబు:
ఎ) సమయంలో
6. భగవంతుడు నిఖిలం అంతా ఉన్నాడు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) సంగరం
బి) సమస్తం
సి) సంజాతం
డి) సముద్భూతం
జవాబు:
బి) సమస్తం
7. జనయిత్రి ఉన్నది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ఆడపడుచు
బి) తల్లి
సి) చెల్లి
డి) అక్క
జవాబు:
బి) తల్లి
పర్యాయపదాలు :
8. కీర్తి పొందాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) అధరం
బి) తల
సి) నాశిక
డి) జిహ్వ
జవాబు:
ఎ) అధరం
9. కాను పాలించాలి – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) కీరితి, కిరీటి
బి) ధ్వజం, కేతనం
సి) భూమి, అవని
డి) ధాత్రి, జనని
జవాబు:
సి) భూమి, అవని
10. సౌభాగ్యం వృద్ధి చెందాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) కిరీటం,మకుటం
బి) సమృద్ధి, వైభవం
సి) విశదం, వైభవం
డి) జనని, ధరణి
జవాబు:
బి) సమృద్ధి, వైభవం
11. కేతనం ఎగరాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) ఝరి, స్యందనం
బి) పతాకం, జెండా
సి) కీలు, కెరటం
డి) జలధి, వారిధి
జవాబు:
బి) పతాకం, జెండా
12. జనయిత్రి – దీనికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) వారుణి, వసుధ
బి) తల్లి, మాత
సి) అవని, వసుధ
డి) జనక, జామాత
జవాబు:
బి) తల్లి, మాత
13. ప్రగతి సాధించాలి – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) పురోగతి, అభివృద్ధి
బి) జనని, జామాత
సి) పరిశీలన, పరిశోధన
డి) ఆరాటం, చైతన్యం
జవాబు:
ఎ) పురోగతి, అభివృద్ధి
ప్రకృతి – వికృతులు :
14. భృంగారం ధర పెరిగింది – గీత గీసిన పదానికి వికృతి పూరించండి.
ఎ) బండారం
బి) బంగారం
సి) శృంగారం
డి) భంగారం
జవాబు:
బి) బంగారం
15. విసయం తెలిసింది – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
ఎ) వివరం
బి) వివేసం
సి) విషయం
డి) విశయం
జవాబు:
బి) వివేసం
16. సహజంగా ఉంది – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) సాజం
బి) సామ్యం
సి) సాధారణం
డి) సాధేయం
జవాబు:
ఎ) సాజం
17. గృహంలో ఉన్నారు – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) గేహం
బి) గోహం
సి) గహం
డి) గోహము
జవాబు:
ఎ) గేహం
18. అచ్చెరువు పొందాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) ఆదరువు
బి) ఆశ్చర్యం
సి) అక్కరువు
డి) ఆచరువు
జవాబు:
బి) ఆశ్చర్యం
19. ఎదలో ఏమున్నది – గీత గీసిన పదానికి ప్రకృతి పదం పదం గుర్తించండి.
ఎ) జలధి
బి) అగ్రణి
సి) హవం
డి) ఆరుణి
జవాబు:
సి) హవం
20. కీర్తి పొందాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) కృతి
బి) కీరితి
సి) కేరితి
డి) కారితి
జవాబు:
బి) కీరితి
21. యజ్ఞము చేయాలి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) జైనము
బి) జన్నము
సి) జెన్నము
డి) జొన్నము
జవాబు:
బి) జన్నము
22. రూపు మనోహరం – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) రూపం
బి) రోగం
సి) రౌపం
డి) రైపం
జవాబు:
ఎ) రూపం
నానార్థాలు :
23. తనువును రక్షించాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) పుట్టుక, ప్రగతి
బి) నాడి, నాగరం
సి) ప్రజ, సంతానం
డి) శరీరం, పన్నము
జవాబు:
డి) శరీరం, పన్నము
24. నాడులు ఉన్నాయి – గీత గీసిన పదానికి నానార్థాలు పదం ఏది?
ఎ) నాశికలు, కర్ణములు
బి) నరములు, ఈనెలు
సి) ఈటెలు, ఈగలు
డి) ఆక్షితలు, మనుషులు
జవాబు:
బి) నరములు, ఈనెలు
25. ప్రజ వర్ధిల్లాలి – గీత గీసిన పదానికి నానార్థాలు ఏది?
ఎ) సంతానం, జనము
బి) జనని, జామాత
సి) జనక, జయం
డి) జనిత, వసుధ
జవాబు:
ఎ) సంతానం, జనము
వ్యుత్పత్త్యర్థాలు :
26. భారమును ఓర్చునది – అనే వ్యుత్పత్త్యర్థం గల పదాన్ని గుర్తించండి.
ఎ) వారిదం
బి) క్ష్మా
సి) జలధి
డి) వారుణి
జవాబు:
బి) క్ష్మా
27. వసుధ – దీనికి వ్యుత్పత్తిని గుర్తించండి.
ఎ) ఐశ్వర్యం ఇచ్చునది
బి) జనులను కాపాడునది
సి) ధనమును ధరించునది
డి) విశ్వాన్ని పొందునది
జవాబు:
సి) ధనమును ధరించునది
28. ముందుండి నడిపించేవాడు – అనే వ్యుత్పత్త్యర్థం గల గుర్తించండి.
ఎ) హేయం
బి) హారం
సి) అరుణ
డి) హృదయం
జవాబు:
బి) హారం
వ్యాకరణాంశాలు
సంధులు :
39. గుణసంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) ప్రత్యయం
బి) సహోదర
సి) మనోరధం
డి) తపోధనుడు
జవాబు:
బి) సహోదర
40. పట్టుగొమ్మ – ఇది ఏ సంధి?
ఎ) విసర్గ సంధి
బి) గసడదవాదేశ సంధి
సి) త్రికసంధి
డి) గుణసంధి
జవాబు:
బి) గసడదవాదేశ సంధి
41. కింది వానిలో యడాగమ సంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) కన్నయది
బి) ఆత్మానందం
సి) పంచకావ్యం
డి) నవ్యోదయం
జవాబు:
ఎ) కన్నయది
42. శివమెత్తరా – ఇది ఏ సంధి?
ఎ) త్రికసంధి
బి) ఉత్వసంధి
సి) అత్వసంధి
డి) గుణసంధి
జవాబు:
బి) ఉత్వసంధి
43. మొలకెతు – దీనిని విడదీయడం గుర్తించండి.
ఎ) మెలక + ఎత్తు
బి) మొలకి + ఎత్తు
సి) మొలకు + ఎత్తు
డి) మొలక + ఎత్తు
జవాబు:
డి) మొలక + ఎత్తు
44. నీయాదేశము – ఇది ఏ సంధి?
ఎ) ఉత్వసంధి
బి) యడాగమ సంధి
సి) త్రికసంధి
డి) అత్వసంధి
జవాబు:
బి) యడాగమ సంధి
45. కింది వానిలో వికల్ప సంధి ఏది?
ఎ) ఉత్వసంధి
బి) గుణసంధి
సి) ఇత్వసంధి
డి) అత్వసంధి
జవాబు:
సి) ఇంద్ర గణం
46. కింది వానిలో పొసగని సంధి ఏది?
ఎ) గుణసంధి
బి) అత్వసంధి
సి) ఇత్వసంధి
డి) త్రికసంధి
జవాబు:
ఎ) గుణసంధి
సమాసాలు :
47. ఉభయ పదార్థ ప్రాధాన్యం గల సమాసం ఏది?
ఎ) రూపక సమాసం
బి) ద్వంద్వ సమాసం
సి) బహు బ్రీహి సమాసం
డి) కర్మధారాయ సమాసం
జవాబు:
బి) ద్వంద్వ సమాసం
48. దేశభక్తి ఉండాలి – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) దేశమును భక్తి
బి) దేశము నందు భక్తి
సి) దేశమునకు భక్తి
డి) దేశము చేత భక్తి
జవాబు:
బి) దేశము నందు భక్తి
49. దేశ సమగ్రత పాటించాలి – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం ఏది?
ఎ) దేశము చేత సమగ్రత
బి) దేశము వలన సమగ్రత
సి) దేశము తెలుపు సమగ్రత
డి) దేశమందు సమగ్రత
జవాబు:
బి) దేశము వలన సమగ్రత
50. అన్యపదార్థ ప్రాధాన్యం గల సమాసం ఏది?
ఎ) బహువ్రీహి
బి) ద్వంద్వ
సి) కర్మధారయ
డి) తత్పురుష
జవాబు:
ఎ) బహువ్రీహి
51. వంచకుల యొక్క ఆవశి – దీనికి సమాస పదం ఏది?
ఎ) వంచకావశి
బి) వచికశ్రేణి
సి) వంచికాశ్రేణి
డి) అగ్రవంచక
జవాబు:
ఎ) వంచకావశి
52. అన్నదమ్ములు – ఇది ఏ సమాసం?
ఎ) ద్వంద్వ సమాసం
బి) కర్మధారయ సమాసం
సి) ద్విగు సమాసం
డి) రూపక సమాసం
జవాబు:
ఎ) ద్వంద్వ సమాసం
గణవిభజన:
53. న, జ, భ, జ, జ, జ, ర – ఇవి ఏ పద్య గణాలు (S.A. III – 2015-16)
ఎ) ఆటవెలది
బి) చంపకమాల
సి) ఉత్పలమాల
డి) మత్తేభం
జవాబు:
బి) చంపకమాల
54. IIIU – ఇది ఏ గణము?
ఎ) సూర్య గణం
బి) న గణం
సి) ఇంద్ర గణం
డి) హ గణం
జవాబు:
సి) ఇంద్ర గణం
55. రాతరు – ఇది ఏ గణము?
ఎ) త గణం
బి) భ గణం
సి) య గణం
డి) న గణం
జవాబు:
బి) భ గణం
56. ఉత్పలమాలలో పాదానికి అక్షరాలు గుర్తించండి.
ఎ) 20
బి) 23
సి) 24
డి) 21
జవాబు:
ఎ) 20
వాక్యాలు :
57. రవి ఇంటికి వెళ్ళి అన్నం తిన్నాడు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) హేత్వర్థక వాక్యం
బి) తుమున్నర్థక వాక్యం
సి) సందేహార్థక వాక్యం
డి) ప్రశ్నార్థక వాక్యం
జవాబు:
సి) సందేహార్థక వాక్యం
58. నీవు ఇంటికి వెళ్ళు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) నిశ్చయాత్మక వాక్యం
బి) కర్తరి వాక్యం
సి) విధ్యర్థక వాక్యం
డి) కర్మణి వాక్యం
జవాబు:
సి) విధ్యర్థక వాక్యం
59. మీరు భోజనం చేయవచ్చు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) అనుమత్యర్థక వాక్యం
బి) కర్తరి వాక్యం
సి) కర్మణి వాక్యం
డి) వ్యతిరేకార్థక వాక్యం
జవాబు:
ఎ) అనుమత్యర్థక వాక్యం
60. వంట చేసి వెళ్ళాను – గీత గీసిన పదం ఏ క్రియా పదం?
ఎ) క్వార్ధకం
బి) చేదర్థకం
సి) శత్రర్థకం
డి) ఆత్మార్థకం
జవాబు:
ఎ) క్వార్ధకం
61. వారు నడుస్తూ వెళ్తున్నారు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) ఆత్మార్థక వాక్యం
బి) శత్రర్థక వాక్యం
సి) కర్తరి వాక్యం
డి) ధాత్వర్థక వాక్యం
జవాబు:
బి) శత్రర్థక వాక్యం
62. వాల్మీకి చేత రామాయణం రచింపబడింది – ఇది ఏ రకమైన వాక్యం? (S.A.III – 2015-16)
ఎ) కర్తరి వాక్యం
బి) సామాన్య వాక్యం
సి) హేత్వర్థక వాక్యం
డి) కర్మణి వాక్యం
జవాబు:
డి) కర్మణి వాక్యం
63. వర్షాలు కురవడం వల్ల చెరువులు నిండాయి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) హేత్వర్థక వాక్యం
బి) భావార్థక వాక్యం
సి) తుమున్నర్ధక వాక్యం
డి) కర్తరి వాక్యం
జవాబు:
ఎ) హేత్వర్థక వాక్యం
64. వాడు వస్తాడో? రాడో? – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) నిశ్చయార్థక వాక్యం
బి) ఆత్మార్థక వాక్యం
సి) సంక్లిష్ట వాక్యం
డి) సంయుక్త వాక్యం
జవాబు:
సి) సంక్లిష్ట వాక్యం
అలంకారాలు :
65. ఇందు వదన కుంద రదన మంద గమన మధుర వచన ఇది ఏ అలంకారం?
ఎ) వృత్త్యనుప్రాస
బి) ఛేకానుప్రాస
సి) యమకం
డి) ముక్తపదగ్రస్తం
జవాబు:
ఎ) వృత్త్యనుప్రాస
66. కింది వానిలో పొసగని సంధిని గుర్తించండి.
ఎ) ఉపమ
బి) యమకం
సి) లాటానుప్రాస
డి) అంత్యానుప్రాస
జవాబు:
ఎ) ఉపమ
67. బింబ ప్రతిబింబ భావం గల అలంకారం గుర్తించండి.
ఎ) దృష్టాంతం
బి) ఉత్ప్రేక్ష
సి) అతిశయోక్తి
డి) లాటానుప్రాస
జవాబు:
ఎ) దృష్టాంతం
68. మానవా ! నీ ప్రయత్నం మానవా ! – ఇందలి అలంకారం గుర్తించండి.
ఎ) యమకం
బి) వృత్త్యనుప్రాన్
సి) లాటానుప్రాస
డి) అంత్యానుప్రాస
జవాబు:
ఎ) యమకం
సొంతవాక్యాలు :
29. కేతనము : అర్జునుని కేతనంపై కపీశ్వరుడుంటాడు.
30. నిఖిలం : నిఖిలమంతా దైవం నిండియున్నాడు.
31. అభ్యుదయం : ప్రజలు అభ్యుదయ మార్గంలో పయనించాలి.
32. సౌభాగ్యం : దేశ సౌభాగ్యం వర్ధిల్లాలి.
33. చంద్రిక : చంద్రుని చంద్రికలు ఆహ్లాదం కలిగిస్తాయి.
34. వసుధ : వసుధపై ప్రజలంతా సుఖంగా జీవించాలి.
35. వర్థిల్లు : జగతిపై శాంతి వర్థిల్లునట్లుగా కృషి చేయాలి.
36. ఉద్ధరించు : పేదలను ఉద్ధరించు కార్యక్రమాలు చేయాలి.
37. ధాన్యాగారం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ధాన్యాగారంగా కీర్తి పొందింది.
38. నిలబెట్టుట : వంశ ప్రతిష్ఠలను అందరు నిలబెట్టాలి.