SCERT AP State 7th Class Telugu Textbook Solutions 4th Lesson మేలిమి ముత్యాలు Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu Solutions 4th Lesson మేలిమి ముత్యాలు

7th Class Telugu 4th Lesson మేలిమి ముత్యాలు Textbook Questions and Answers

ఆలోచించండి – మాట్లాడండి
AP Board 7th Class Telugu Solutions Chapter 4 మేలిమిAP Board 7th Class Telugu Solutions Chapter 4 మేలిమి ముత్యాలు 5 ముత్యాలు 5

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
చిత్రాన్ని చూడండి. చిత్రంలో ఎవరెవరున్నారు? – ఏం చేస్తున్నారు?
జవాబు:
చిత్రంలో ఇద్దరు ఉపాధ్యాయులూ, కొందరు విద్యార్థులూ, కొందరు విద్యార్థినులూ ఉన్నారు.

ప్రశ్న 2.
చిత్రంలో మాట్లాడుతున్నది ఎవరు ? ఆయన ఏం చెప్తున్నారు? దాని భావం ఏమిటి?
జవాబు:
చిత్రంలో అధ్యాపకుడు మాట్లాడుతున్నాడు. ఆయన వేమన పద్యం పిల్లలకి చెపుతున్నాడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 4 మేలిమి ముత్యాలు

పై పద్య భావం :
ఓ వేమనా ! విను మేడిపండు చూస్తే, పైకి ఎఱ్ఱగా బాగా ఉంటుంది. కాని దాన్ని బద్దలు కొట్టి చూస్తే, లోపల పురుగులు ఉంటాయి. మేడిపండులాగే పిరికివాడు పైకి ధైర్యంగా కనిపిస్తాడు కాని, వాడిలో ధైర్యం ఏమాత్రమూ ఉండదు.

ప్రశ్న 3.
ఇలాంటి ‘పద్యాలు మీకు తెలిసినవి చెప్పండి.
జవాబు:
“అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ ! వినుర వేమ !” (వేమన శతకం నుండి)

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
పాఠంలోని పద్యాలను రాగంతో పాడండి. అలాగే భావం అర్థమయ్యేలా చదవండి.
జవాబు:
మీ అధ్యాపకుని సాయంతో సాధన చేయండి. పద్యాలు – భావాలు చూచి చదవండి.

ప్రశ్న 2.
మీ తరగతిలో ఇద్దరు జతగా కూర్చోండి. ఒకరు పద్యం చదివితే, ఇంకొకరు భావం చెప్పండి.
జవాబు:
పద్యాలు – తాత్పర్యాలు చూచి పైన చెప్పినట్లు సాధన చెయ్యండి.

AP Board 7th Class Telugu Solutions Chapter 4 మేలిమి ముత్యాలు

ప్రశ్న 3.
ఈ పాఠానికి మేలిమి ముత్యాలు అనే పేరు తగిన విధంగా ఉందా? ఎందువల్ల?
జవాబు:
ఈ పాఠమునకు “మేలిమి ముత్యాలు” అన్న పేరు తగిన విధంగానే ఉంది. ఈ పద్యాలలో నీతి వచనాలు అంటే సూక్తులు ఉన్నాయి. సూక్తులు అంటే మంచి మాటలు. మంచి మాటలు, మంచి ముత్యాల వంటివి. కాబట్టి ఈ పద్యాలకు ‘మేలిమి ముత్యాలు’ అన్న పేరు తగిన విధంగానే ఉంది.

II. చదవడం – 8యడం

ప్రశ్న 1.
పాఠంలోని ఏ ఏ పద్యాలలో ప్రాస పదాలు ఎక్కువగా ఉన్నాయి? వాటిని గుర్తించండి.
జవాబు:
1) ప్రాస అంటే వచ్చిన పదమే తిరిగి తిరిగి రావడం,
ఈ పద్యాలలో ఏడవ పద్యంలో ‘పత్రిక’ అన్న పదం మూడుసార్లు తిరిగి తిరిగి వచ్చింది. చూడండి.

ఆ. “పత్రికొకటియున్న పదివేల సైన్యము
పత్రికొక్కటున్న మిత్రకోటి
ప్రజకు రక్షలేదు పత్రికలేకున్న
వాస్తవమ్ము నార్లవారి మాట.”

అలాగే మొదటి పద్యంలో ‘ల’ అనే హల్లు పెక్కు పర్యాయములు తిరిగి తిరిగి వచ్చింది.

క. కలిమిగల లోభికన్నను
విసితముగఁ బేద మేలు వితరణి యైనన్
లిచెమ మేలు కాదా
కునిధి యంభోధి కన్న గువ్వలచెన్నా !

అలాగే రెండవ పద్యంలో ‘వ’ అనే ప్రాసాక్షరము చాలాసార్లు తిరిగి తిరిగి వచ్చింది. గమనించండి.

క. అవయవహీనుని, సౌంద
ర్యవిహీను, దరిద్రు, విద్యరానియతని, సం
స్తవనీయు, దేవు, శ్రుతులన్
భువి నిందింపఁ దగదండ్రు బుధులు కుమారా!

AP Board 7th Class Telugu Solutions Chapter 4 మేలిమి ముత్యాలు

ప్రశ్న 2.
పాఠం ఆధారంగా క్రింది విషయాలకు తగిన పద్యాలను చదవండి. పద్యభావాన్ని సొంతమాటల్లో చెప్పండి.
అ) కష్టపడితే ఫలితం ఉంటుంది.
జవాబు:
పై భావానికి తగిన పద్యం ఇది.
“సానఁబెట్టిన వజ్రంబు లీను కాంతి
పొలము జక్కగ దున్నిన ఫలమునిచ్చు
నటులే యజ్ఞానియైనను నవనిపైని
విద్య నేర్చినయేని వివేకియగును”

భావం :
సానబెడితేనే వజ్రం కాంతులను వెదజల్లుతుంది. చక్కగా దున్నితేనే, పొలం పండుతుంది. విద్య నేర్చుకుంటే, అజ్ఞాని సైతం వివేకం కలవాడు అవుతాడు. కాబట్టి కష్టపడితేనే ఫలితం ఉంటుందని ఈ పద్యం చెబుతోంది.

ఆ) ఎవర్నీ చిన్నచూపు చూడగూడదు.
జవాబు:
పై భావానికి తగిన పద్యం ఇది.
“అవయవహీనుని, సౌంద
ర్యవిహీను, దరిద్రు, విద్యరానియతని, సం
స్తవనీయు, దేవు, శ్రుతులన్
భువి నిందింపఁ దగదండ్రు బుధులు కుమారా!”

భావం :
అవయవాలులేని వాళ్ళనూ, అందంగా లేనివాళ్ళనూ, బీదవాళ్ళనూ, చదువురాని వాళ్ళనూ, గొప్పవాళ్ళనూ, దైవాన్నీ, వేదాలనూ నిందించకూడదు. కాబట్టి ఎవర్నీ చిన్నచూపు చూడడం తగదు అని ఈ
పద్యం చెపుతోంది.

ఇ) “మంచివాళ్ళతో సావాసం మేలు చేస్తుంది”.
జవాబు:
పై భావానికి తగిన పద్యం ఇది.
“సత్యసూక్తి ఘటించు ధీజడిమ మాన్చు
గౌరవమొసంగు జనులకు గలుషమడఁచు
గీర్తిఁ బ్రకటించు చిత్తవిస్ఫూర్తిఁ జేయు
సాధుసంగంబు సకలార్థ సాధనంబు.”

భావం :
మంచి వాళ్ళతో స్నేహం, సత్యాన్ని మాట్లాడేలా చేస్తుంది. మందగొడితనాన్ని పోగొడుతుంది. మనస్సును బాగుచేస్తుంది. కీర్తిని వ్యాపింపజేస్తుంది. మంచివారితో స్నేహం, అన్ని కార్యాలనూ. సాధిస్తుంది. కాబట్టి మంచివాళ్ళతో సావాసం చెయ్యాలి.

ఈ) పుస్తకాలను పువ్వుల్లా చూడాలి.
జవాబు:
ఆ. పుస్తకముల నీవు పూవువలెను జూడు
చింపఁబోకు మురికి చేయఁబోకు
పరుల పుస్తకముల నెరవు తెచ్చితి వేని
తిరిగి యిమ్ము వేగ, తెలుఁగు బిడ్డ !
భావం :
ఓ తెలుగు బిడ్డా ! పుస్తకాలను పువ్వుల్లా జాగ్రత్తగా చూడు. వాటిని చింపవద్దు. మురికి చేయవద్దు. ఇతరుల పుస్తకాలు అడిగి తెచ్చుకుంటే, వాటిని త్వరగా ఇచ్చి వేయాలి.

3. పాఠంలోని పద్యాలు ఆధారంగా కింద తెలిసినవాటిని దేనితో పోల్చారో చెప్పండి.
అ) ధనికుడైన పిసినారి
జవాబు:
ధనికుడైన పిసినారిని, (అంభోధితో) ఉప్పునీటి సముద్రంతో పోల్చాడు.

ఆ) పేదవాడు
జవాబు:
దాన గుణముగల పేదను, ‘చలిచెలమ’తో పోల్చాడు.

ఇ) చెడ్డవాళ్ళ స్నేహం
జవాబు:
చెడ్డవాళ్ళ స్నేహాన్ని ఉదయం పూట నీడతో పోల్చాడు.

ఈ) మంచివాళ్ళ స్నేహం
జవాబు:
మంచి వాళ్ళ స్నేహాన్ని సాయంకాలపు నీడతో పోల్చాడు.

ఉ) డబ్బు సంపాదించి కూడబెట్టడం
జవాబు:
డబ్బు సంపాదించి కూడబెట్టడాన్ని, తేనెటీగలు తేనెను కూడబెట్టడంతో పోల్చాడు.

ఊ) కోటిమంది మిత్రులు
జవాబు:
పత్రికను కోటి మంది మిత్రులతో పోల్చాడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 4 మేలిమి ముత్యాలు

4. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

అ) ఎవరెవరిని చులకనగా చూడగూడదు?
జవాబు:
అవయవ లోపం ఉన్నవాళ్ళనూ, అందంగా లేనివాళ్ళనూ, పేదవాళ్ళనూ, చదువురాని వాళ్ళనూ, గొప్పవాళ్ళనూ, దైవాన్నీ, వేదాలనూ చులకనగా చూడరాదు.

ఆ) పుస్తకాలను మనం ఎలా జాగ్రత్తగా ఉంచుకోవాలి?
జవాబు:
పుస్తకాలను పువ్వుల్లా చూడాలి. వాటిని చింపకూడదు, మురికి చేయకూడదు. ఇతరుల పుస్తకాలు అడిగి తెచ్చుకుంటే, వాటిని తొందరగా తిరిగి వారికి ఇచ్చివేయాలి.

ఇ) చదువుకుంటే ఎవరైనా ఎలా మారతారు?
జవాబు:
చదువుకుంటే అజ్ఞాని అయినా సరే, వివేకిగా మారతాడు.

ఈ) మంచివారి సహజ గుణాలేవి?
జవాబు:
ఆపదలు వచ్చినప్పుడు ధైర్య గుణం, ఐశ్వర్యం వచ్చినపుడు ఓర్పు, సభలో వాక్చాతుర్యం, యుద్ధంలో శౌర్యం చూపడం, కీర్తి యందు ఆసక్తి, విద్య నేర్చుకోవాలనే అనురాగం అన్నవి, మంచివారికి సహజ గుణాలు.

5. పాఠంలోని పద్యాలు ఆధారంగా చేసుకొని తప్పొప్పులు గుర్తించండి.

అ) ఎవరి దగ్గర నుంచి అయినా పుస్తకాలు తెచ్చుకుంటే వాళ్ళు అడిగిన వెంటనే ఇవ్వాలి.
జవాబు:
తప్పు

ఆ) కష్టపడ్డ తరువాత పొందే సుఖం ఎంతో గొప్పగా ఉంటుంది.
జవాబు:
ఒప్పు

ఇ) పత్రికలు లేకుంటే ప్రజలకు రక్షణ లేదు.
జవాబు:
ఒప్పు

ఈ) ధనవంతుడి విషయాలు తొందరగా ప్రచారం కావు.
జవాబు:
తప్పు

ఉ) మంచివాళ్ళతో స్నేహం చేస్తే, వాళ్ళ కీర్తి కూడా వ్యాప్తి చెందుతుంది.
జవాబు:
ఒప్పు

ఊ) ఎవరైనా అన్నం తింటారేకాని బంగారం తినరు.
జవాబు:
ఒప్పు

ఎ) సంపాదించిన సొమ్మును అనుభవించకుండా దాచి పెట్టాలి.
జవాబు:
తప్పు

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.

అ) ధనికుడైన పిసినారిని సముద్రంతో, దానగుణమున్న పేదవాడిని మంచి నీటి మడుగుతోనూ పోల్చడాన్ని గురించి మీ అభిప్రాయం తెలపండి.
జవాబు:
ధనికుడైన పిసినారి వద్దగల ధనం; ఎవరికీ ఉపయోగపడదు. ఎందుకంటే అతడు ఎవరికీ ఇవ్వడు. అతడు దాన్ని అనుభవించడు. అతని వద్ద ధనం ఉన్నా వ్యర్థమే. అలాగే సముద్రంలో నీరు ఎంతో ఉన్నా, ఉప్పుగా ఉండడం వల్ల అది ఎవరికీ ఉపయోగపడదు. దానగుణం ఉన్న పేదవాడు కొంచెమే ఇవ్వగలడు. . అలాగే చలిచెలమలో నీళ్ళు కొంచెమే ఉన్నా, అవి దాహం తీరుస్తాయి. పేదవాడు ఇచ్చేది కొంచెమైనా అది అవసరానికి పనికి వస్తుంది.

ఆ) అవయవలోపం ఉన్నవాళ్ళనూ, అందంగా లేనివాళ్ళనూ చులకనగా చూడగూడదని తెలుసుకున్నారు కదా! కాబట్టి వాళ్ళను కూడా అందరితో సమానంగా చూడటానికి ఏం చేయాలి?
జవాబు:
అందంగా ఉండడం అనేది, భగవంతుడు మనకు ఇచ్చిన వరం. అలాగే అవయవాలన్నీ ఏ లోపం లేకుండా ఉండడం కూడా దేవుడు మనపై చూపిన అనుగ్రహమే. దేవుడు అన్నీ అందరికీ ఇవ్వడు. డబ్బు కొందరికి ఇస్తాడు. కొందరికి ఇవ్వడు. అందుచేత మంచి మనస్సుతో, అవయవ లోపం ఉన్నవారిపై దయ చూపించాలి. వారికి సాయం చేయాలి. అంతేకాని వారిని చులకనగా చూడరాదు. అవయవ లోపం కలవారికి చదువుకోవడానికి, ఉద్యోగాలకు రిజర్వేషనులు ఇవ్వాలి. వారికి దానధర్మాలు చేయాలి.

ఇ) ఎంతటి అజ్ఞాని అయినా చదువుకొంటే వివేకి అవుతాడనే విషయాన్ని సమర్థిస్తూ రాయండి.
(లేదా)
“విద్యనేర్చినయేని వివేకియగును” అన్న విషయాన్ని సమర్థిస్తూ రాయండి.
జవాబు:
దేశంలో ఎందరో విజ్ఞానవంతులు ఉన్నారు. వారు అందరూ పాఠశాలల్లోనో, గురువుల వద్దనో చదువుకున్నవారే. చదువుకోకపోతే ఎవరూ జ్ఞానం సంపాదించలేరు. పుట్టగానే తెలివైన వారిగా ఎవరూ పుట్టరు. ఎంత రత్నమైనా సాన పెట్టనిదే ప్రకాశించదు. దున్నకపోతే పొలంలో పంటలు పండవు. కాబట్టి ఎంత అజ్ఞాని అయినా, చదువుకొంటే తప్పక వివేకి అవుతాడు.

ఈ) “సుభాషిత రత్నావళి” పద్యంలో కవి, స్నేహాన్ని నీడతో పోల్చాడుకదా ! ఇది సరైనదేనా ? దీని మీద మీ అభిప్రాయం తెలపండి.
జవాబు:
సుభాషిత రత్నావళి పద్యంలో చెడ్డవాళ్ళ స్నేహం ఉదయం పూట నీడలాగా, మంచివాళ్ళతో స్నేహం సాయంకాలం నీడలాగా ఉంటుందని చెప్పాడు. ఈ పోలిక బాగుంది. ఉదయం పూట మననీడ, మనం ఉన్నదానికంటే పెద్దదిగా పడుతుంది. క్రమంగా ఆ నీడ చిన్నది అవుతుంది. దానిని బట్టి చెడ్డవాళ్ళతో స్నేహం మొదట ఎక్కువగా ఉండి, తర్వాత క్రమంగా తగ్గిపోతుందని తెలుస్తుంది.

మంచివారితో స్నేహం సాయంకాలం నీడలాగా మొదట చిన్నదిగా ఉండి, క్రమంగా పెరుగుతుందని తెలుస్తుంది. కాబట్టి పద్యంలో మంచి, చెడ్డ వారలతో స్నేహాల్ని, ఉదయ, సాయంత్రపు నీడలతో పోల్చడం సరి అయినదే, అని నా అభిప్రాయం.

ఉ) “ధనవంతులు చేసే చిన్న పనికి కూడా గొప్ప ప్రచారం లభిస్తుంది. అదే పేదవాళ్ళ గొప్పపనికి కూడా ఎలాంటి – ప్రచారం ఉండదు” అని వేమన ఎన్నో వందల సంవత్సరాల క్రిందట అన్నాడు కదా ! ఈ పరిస్థితే నేడు కూడా ఉందా? ఇలా ఎందుకు ఉంటుంది?
జవాబు:
ధనవంతుడికి చిన్న కురుపు వేసినా అందరూ దాన్ని గూర్చి పెద్దగా చెప్పుకుంటారు. ఆయన యోగక్షేమాలను అడుగుతారు. ధనవంతుడి అవసరం అందరికీ ఉంటుంది కాబట్టి ధనవంతుడికి ప్రచారం ఎక్కువ అవుతుంది. అదే బీదవాడి ఇంట్లో పెళ్ళి అయినా, అతడు పదిమందికీ భోజనాలు పెట్టలేడు కాబట్టి, ఆ వార్తకు ప్రచారం ఉండదు. కాబట్టి వేమన చక్కగా ఈ విషయాన్ని గమనించి చెప్పాడు. ఈ పరిస్థితి నేడు కూడా ఉంది. ధనవంతుడు ఊరిలో గుడి కట్టిస్తే అందరూ చెప్పుకుంటారు. బీదవాడు రక్తదానం చేసినా, ఎవరూ దాన్ని. గూర్చి చెప్పుకోరు.

ఊ) కింది వాటిలో ఏది సరైనదని భావిస్తున్నారు? ఎందుకో వివరించండి.
1. డబ్బు సంపాదిస్తే పొదుపు చేసి, అనుభవించాలి.
2. డబ్బు సంపాదిస్తే పొదుపు చేసి దానం చేయాలి.
3. డబ్బు సంపాదిస్తే దానం చేయాలి, అనుభవించాలి.
4. దానం చేయడం కోసం, అనుభవించడం కోసం డబ్బు సంపాదించక పోవడం మేలు.
జవాబు:
“డబ్బు సంపాదిస్తే దానం చేయాలి, అనుభవించాలి” అన్న 3వ వాక్యం సరిఅయినది.. డబ్బు దాస్తే అది దొంగలపాలు అవుతుంది. లేదా రాజునకు వశం అవుతుంది.

AP Board 7th Class Telugu Solutions Chapter 4 మేలిమి ముత్యాలు

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

అ) పుస్తకాలను పువ్వుల్లాగ జాగ్రత్తగా చూడాలని తెలుసుకున్నారు .కదా ! పుస్తకాల గొప్పతనం ఏమిటి? వాటిని గురించి ఎందుకు జాగ్రత్త తీసుకోవాలి?
జవాబు:
పూర్వం విజ్ఞానాన్ని అంతా మెదడులోనే గుర్తుపెట్టుకొనేవారు. పుస్తకాలు వచ్చిన తరువాత ప్రపంచ విజ్ఞానం అంతా పుస్తకాలలోకి చేరింది. మనకు జ్ఞాపకం లేకపోతే పుస్తకాలు చూచి గుర్తు చేసుకొంటాము. మన ప్రాచీన విజ్ఞానం భారత భాగవత రామాయణాలలోనూ, నేటి సైన్సు లెక్కల విజ్ఞానం, నేటి శాస్త్ర గ్రంథాలలోనూ ఉంది. పుస్తకాలు, మనం విజ్ఞానం సంపాదించడానికి ముఖ్యమైన ఆధారాలు. కాబట్టి పుస్తకాలను పువ్వుల్లా చూడాలి. చింపరాదు, ఎరవు ఇవ్వరాదు. ఎరువు తెస్తే, వెంటనే ఇచ్చేయాలి. పుస్తకాలు ప్రపంచ విజ్ఞానాన్ని తమ గుప్పిటలో పెట్టుకున్న పెన్నిధులు.

ఆ) మంచివాళ్ళతో స్నేహం చేస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటి?
జవాబు:
మంచివారితో స్నేహం వలన, వారు మనలను పాపకార్యాల నుండి మళ్ళిస్తారు. మనచే మంచి పనులు చేయిస్తారు. మన రహస్యాన్ని రక్షిస్తారు. మన సద్గుణములను ప్రకటిస్తారు. ఆపత్కాలంలో – మన వెంట ఉంటారు. మనకు లేనప్పుడు సాయం చేస్తారు. మంచివారు మనకు అన్నివిధాల సాయం చేస్తారు. శ్రీరాముడు సుగ్రీవుడు, విభీషణులనే మంచివారితో స్నేహం చేశాడు. వారి సాయంతో రావణుని సంహరించాడు.

ఇ) ‘పత్రికలు పదివేల సైన్యంతో, కోటిమంది మిత్రులతో సమానం’ అని తెలుసుకున్నారు కదా ! పత్రికలవల్ల ఉపయోగాలు వివరించండి.
(లేదా)
నిత్యజీవితంలో పత్రికల ఉపయోగాలను మీ సొంతమాటలలో రాయండి.
జవాబు:
సహజంగా పత్రికలను చదివితే, మనకు ఎన్నో తెలియని విషయాలు తెలుస్తాయి. దేశ విదేశాలలో, మన – రాష్ట్రంలో జిల్లాలో జరిగే విషయాలన్నీ పత్రికల వల్ల తెలుస్తాయి. విషయం పత్రికలో ప్రకటిస్తే ఆ పత్రిక చూచే వారందరికీ తెలుస్తుంది. ప్రభుత్వం చేసే కార్యక్రమాలు, వారి అభిప్రాయాలు పత్రికల ద్వారానే ప్రజలకు తెలుస్తాయి. పత్రికలు ప్రజాభిప్రాయానికి గీటురాళ్ళు.

ఎవరైనా కష్టదశలో ఉండి, ఇతరుల సాయం కోరి పత్రికలో ప్రచురిస్తే ప్రజలు వారిని ఆదుకుంటారు. ఈ ధరవరల సమాచారం, పెండ్లి కావలసిన యువతీయువకుల సమాచారం, వగైరా తెలుస్తుంది. కాబట్టి ఒక్క పత్రిక, 10 వేల సైన్యంతో, కోటిమంది మిత్రులతో సమానం.

IV. పదజాలం

1. కింది పేరాలోని గీత గీసిన పదాలకు అర్థాలు తెలుసుకోండి. అవే అర్థాలనిచ్చే పదాలతో, పేరాను తిరిగి రాయండి.

“ఒక ఊళ్ళో ఒక లోభి ఉండేవాడు. అతను ఎంతో   కూడబెట్టాడు. ఆ సొమ్ము తాననుభవించడు, ఎవరికీ ధర్మం చేయడు. పుత్తడితో నగలు చేయించుకొని వాటిని చూసుకొని విర్రవీగేవాడు. చదువు నేరిస్తే వివేకం కలుగుతుందని ఎంతమంది చెప్పినా, అజ్ఞానం వల్ల వినలేదు. తుదకు ఆ సంపాదన దొంగలపాలైంది. సత్యాన్ని గ్రహించాడు. చదువు మొదలుపెట్టాడు. అందరూ హర్షించారు.
జవాబు:
ఒక ఊళ్ళో ఒక పిసినారి ఉండేవాడు. అతను ఎంతో డబ్బు కూడబెట్టాడు. ఆ సొమ్ము తాననుభవించడు, ఎవరికీ దానం చేయడు. బంగారంతో నగలు చేయించుకొని వాటిని చూసుకొని గర్వపడేవాడు. చదువు నేరిస్తే విజ్ఞానం కలుగుతుందని ఎంతమంది చెప్పినా అవివేకం వల్ల వినలేదు. చివరకు ఆ సంపాదన దొంగల పాలైంది. యథార్థాన్ని గ్రహించాడు. చదువు మొదలుపెట్టాడు. అందరూ సంతోషించారు.

2. కింది పదాలను మీరు మాట్లాడే భాషలోకి మార్చి రాయండి.
ఉదా : వృక్షంబు – వృక్షము – వృక్షం
అ) వజ్రంబు – వజ్రము – వజ్రం,
ఆ) ప్రాణంబు – ప్రాణము – ప్రాణం
ఇ) సంగంబు – సంగము – సంగం
ఈ) సాధనంబు – సాధనము – సాధనం
ఉ) బంగారంబు – బంగారము – బంగారం

3. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు సమానార్థకాలు రాయండి.
ఉదా : సంపదతో గర్వపడకూడదు. (కలిమి)

అ. సముద్రం మీద ఓడలు ప్రయాణిస్తాయి. (అంభోధి)
ఆ. పున్నమి రాత్రి చంద్రుడు ప్రకాశిస్తాడు. (రేయి)
ఇ. భూమి మీద ఎవరూ శాశ్వతంగా ఉండరు. (ధరణి)
ఈ. వికలాంగులను నిందించగూడదు. (దూషించడం)

AP Board 7th Class Telugu Solutions Chapter 4 మేలిమి ముత్యాలు

4. కింది వాక్యాలలోని గీత గీసిన పదాలను చదివి, ఖాళీలలో వాటికీ వ్యతిరేక పదాలు రాయండి.

అ) కలిమిలో గర్వపడకూడదు ………. కుంగిపోకూడదు.
జవాబు:
లేమి

ఆ) సజ్జనులతో స్నేహం చేయాలి. ………. దూరంగా ఉండాలి.
జవాబు:
దుర్జనులకు

ఇ) సత్యాన్ని పలకడం అలవరచుకోవాలి. ……….. అనర్థాలకు దారితీస్తుంది.
జవాబు:
అసత్యం

ఈ) కీర్తి రావాలంటే కష్టపడాలి. ………. మాత్రం అరక్షణంలో వస్తుంది.
జవాబు:
అపకీర్తి

ఉ) ఆకలి, దప్పికా, నిద్రా దరిద్రుడికీ, ………. కీ ఒకేలా ఉంటాయి.
జవాబు:
ధనవంతుడి

ఎ. వ్యతిరేకపదములు

లోభి × వితరణి
గౌరవము × అగౌరవము
మేలు × కీడు
వివేకి × అవివేకి
పరులు × స్వజనులు
ధైర్యము × అధైర్యము
జ్ఞాని × అజ్ఞాని
అనురక్తి × విరక్తి
మొదలు × తుది
వృద్ధి × హాని
పూర్వము × పరము
మిత్రుడు × శత్రువు
వాస్తవము × అవాస్తవము
పేద × ధనికుడు

5. కింది ప్రకృతి పదాలు చదవండి. వాటికి సంబంధించిన వికృతి పదాలు రాయండి.

ప్రకృతి – వికృతి
(అ) పుస్తకం – పొత్తం
(ఆ) సుఖం – సుగము
(ఇ) భూమి – బూమి
(ఈ) ధర్మం – దమ్మము
(ఉ) శ్రీ – సిరి
(ఊ) గౌరవం – గారవము
(ఎ) భృంగారం – బంగారము
(ఏ) ప్రాణం – పానము

బి. ఈ పదాలకు ప్రకృతి – వికృతులు వ్రాయండి.
ప్రకృతి – వికృతి
(అ) వ్యర్థము – వమ్ము
(ఆ) విద్య – విద్దె
(ఇ) భూ – బువి
(ఈ) శాణము – సాన
(ఉ) ఫలము – పండు
(ఊ) పుత్తళి, పుత్తళిక – పుత్తడి
(ఋ) గుణము – గొనము
(ఋ) యశము – అసము
(ఎ) శక్తి – సత్తి
(ఏ) ఛాయ – చాయ
(ఐ) కీర్తి – కీరితి
(ఒ) గర్భము కడుపు
(ఓ) స్వము – సొమ్ము

V. సృజనాత్మకత

1. పాఠంలోని పద్యాలను ఆధారంగా చేసుకొని మంచి సూక్తులను, నినాదాలను తయారుచేయండి. వాటిని ప్రదర్శించండి.
(లేదా)
“మేలిమి ముత్యాలు” పాఠం ఆధారంగా మీకు నచ్చిన నాలుగు సూక్తులను రాయండి.
జవాబు:

 1. “కలిమిగల లోభికంటె వితరణియైన పేద మేలు”.
 2. పుస్తకములను పువ్వుల్లా, చూడు.
 3. సానపెడితేనే వజ్రం. శోభిస్తుంది.
 4. విద్యనేరిస్తే వివేకి అవుతాడు.
 5. పేదవాడి యింట్లో పెళ్ళెనా ఎవరికీ తెలియదు.
 6. పత్రికొకటి యున్న పదివేల సైన్యము.
 7. ప్రజకు రక్షలేదు పత్రికలేకున్న.
 8. సాదుసంగంబు సకలార్థసాధనంబు.
 9. లక్షాధికారైన లవణమన్నమెకాని, మెఱుగు బంగారంబు మింగబోడు.

VI. ప్రశంస

1. ఇతర భాషలలోని మంచి సూక్తులను తెలుసుకోండి. వాటిని గురించి చర్చించండి.
జవాబు:
1) “విభూషణం మౌన .మపండితానామ్” (సంస్కృత సూక్తి) (చదువురాని వారికి మౌనమే అలంకారం)
2) ‘మూర్బస్య నాస్యౌషధమ్’ (సంస్కృత సూక్తి) (మూర్ఖుడికి మందులేదు)
3) ‘విద్యావిహీనః పశుః’ (సంస్కృత సూక్తి) (విద్యరాని వాడు వింత పశువు)

2. కింది పట్టికలోని అంశాలను చదవండి. మీరు చేసేవి, చేయనివి గుర్తించండి.
జవాబు:
అ) నేను ఎవరి దగ్గరయినా పుస్తకం తీసుకొంటే, వెంటనే చదివి తిరిగి ఇస్తాను. (✓)
ఆ) నా తరగతిలో కొద్దిమందితోనే మర్యాదగా ఉంటాను. (✗)
ఇ) నేను డబ్బు ఖర్చుపెట్టకుండా దాచుకుంటాను. (✗)
ఈ) నేను కేవలం మంచివాళ్ళతో మాత్రమే స్నేహం చేస్తాను. (✓)
ఉ) నా పుస్తకాలను నేను జాగ్రత్తగా ఉంచుకొంటాను. (✓)
ఊ) అవయవలోపం ఉన్నవాళ్ళకు నేను సహయం చేస్తాను. (✓)
ఎ) నేను బాగా చదువుకొని గొప్ప కవిలా ఎదుగుతాననే నమ్మకం ఉంది. (✓)

VII. ప్రాజెక్టు పని

1. శతక కవులకు సంబంధించిన విషయాలను సేకరించి కింది పట్టికలో రాయండి.

AP Board 7th Class Telugu Solutions Chapter 4 మేలిమి ముత్యాలు 2
AP Board 7th Class Telugu Solutions Chapter 4 మేలిమి ముత్యాలు 3

VIII. భాషను గురించి తెలుసుకుందాం

1. కింది మాటలను చదవండి. మార్పును గమనించండి.

 1. ఎండవానలు – ఎండా, వానా
 2. తల్లిదండ్రులు – తల్లీ, తండ్రీ
 3. రేయింబవళ్ళు – రేయీ, పగలూ
 4. గంగాయమునలు – గంగా, యమునా

వీటిని “ద్వంద్వ సమాసాలు” అంటారు. ద్వంద్వ సమాసాల్లో రెండూ నామవాచకాలే ఉంటాయని, ఇవి “కలిసినప్పుడు బహువచన రూపం ఏర్పడుతుంది. ఈ విషయాలు మీరు ఆరవ తరగతిలో నేర్చుకున్నారు.

2. కింది విగ్రహవాక్యాలను సమాస పదాలుగా మార్చండి.
ఉదా : రాముడూ, లక్ష్మణుడూ – రామలక్ష్మణులు
అ) కుజనుడూ, సజ్జనుడూ – కుజనసజ్జనులు
ఆ) కూరా, కాయా – కూరగాయలు
ఇ) అన్నా, తమ్ముడూ – అన్నదమ్ములు
ఈ) కష్టమూ, సుఖమూ – కష్టసుఖములు
ఉ) ,మంచి, చెడూ – మంచిచెడులు

3. క్రింది సమాస పదాలను ఉదాహరణలో చూపిన విధంగా వివరించండి.
ఉదా : నవరసాలు – నవ (9) సంఖ్య గల రసాలు
ఊ) రెండు జడలు – రెండు (2) సంఖ్యకల జడలు
ఎ) నాలుగు వేదాలు – నాలుగు (4), సంఖ్యకల వేదాలు
ఏ) దశావతారాలు – దశ (10) సంఖ్యకల అవతారాలు
ఐ) చతుషష్టి కళలు – చతుషష్టి (64) సంఖ్యగల కళలు
ఒ) ఏడు రోజులు – ఏడు (7) సంఖ్యగల రోజులు

గమనిక :
పైన పేర్కొన్న సమాసాల్లో మొదటి (పూర్వ) పదంలో, ‘సంఖ్య’ ఉండటాన్ని గమనించారు కదా. ఇలా సమాసంలో మొదటి పదం సంఖ్యావాచకంగాను, రెండవ పదం నామవాచకం ఉంటే దానిని సంఖ్యగల సమాసాన్ని, ‘ద్విగు సమాసం’ అంటారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 4 మేలిమి ముత్యాలు

4. కింద పేర్కొన్న సమాసాలకు విగ్రహవాక్యాలు రాసి, అవి ఏ సమాసాలో గుర్తించండి. కారణాలు చర్చించండి.

సమాస పదం విగ్రహవాక్యం సమాస నామం
అ) అక్కాచెల్లెళ్ళు అక్కా చెల్లెలు ద్వంద్వ సమాసం
ఆ) పంచపాండవులు పంచ(5) సంఖ్యగల పాండవులు ద్విగు సమాసం
ఇ) రాబర్ట్ రహీమ్ లు రాబర్టూ, రహీమూ ద్వంద్వ సమాసం
ఈ) త్రిమూర్తులు త్రి (3) సంఖ్యగల మూర్తులు ద్విగు సమాసం
ఉ) వందపరుగులు వంద (100) సంఖ్యగల పరుగులు ద్విగు సమాసం
ఊ) సూర్యచంద్రులు సూర్యుడూ, చంద్రుడూ ద్వంద్వ సమాసం
అవయవ హీనుడు అవయవముల చేత హీనుడు తృతీయా తత్పురుష సమాసం
సౌందర్య విహీనుడు సౌందర్యం చేత విహీనుడు తృతీయా తత్పురుష సమాసం
సభాంతరాళము సభ యొక్క అంతరాళము షష్ఠీ తత్పురుష సమాసం
సాధు సంగము సాధువుల యొక్క సంగము షష్ఠీ తత్పురుష సమాసం
తల్లి గర్భము తల్లి యొక్క గర్భము షష్ఠీ తత్పురుష సమాసం
లక్షాధికారి లక్షలకు అధికారి షష్ఠీ తత్పురుష సమాసం
వాక్చతురత్వము వాక్కు నందు చతురత్వము సప్తమీ తత్పురుష సమాసం
కుజన సజ్జనులు కుజనుడూ, సజ్జనుడూ ద్వంద్వ సమాసం
దానధర్మములు దానమూ, ధర్మమూ ద్వంద్వ సమాసం

గమనిక :
ఎ) 1, 4, 5, 10 ప్రశ్నలలోని సమాసాలలో రెండు పదాలూ నామవాచకములు, అవి కలసి బహువచన రూపాలు ఏర్పడ్డాయి. కాన అవి ద్వంద్వ సమాసాలు.

బి) 2, 3, 6, 7, 8, ‘9, ప్రశ్నలలోని సమాసాలలో మొదటి పదంలో సంఖ్య ఉంది. అందువల్ల అవి ‘ద్విగు సమాసాలు’

AP Board 7th Class Telugu Solutions Chapter 4 మేలిమి ముత్యాలు

5. కింది పదాలను విడదీసి సంధి పేర్లు రాయండి.

1. బాధైనను = బాధ + ఐనను = (అ + ఐ = ఇ) – అకారసంధి
2. పత్రికొకటి = పత్రిక + ఒకటి = (అ + ఒ = ఒ) – అకారసంధి
3. పెండ్లి = పెండ్లి + ఐన = (ఇ + ఐ = ఐ) – ఇకారసంధి
4. జుంటీగ = జుంటి + ఈగ = (ఇ + ఈ = ఈ) – ఇకారసంధి
5. తెచ్చితివేని = తెచ్చితివి + ఏని = (ఇ + ఏ = ఏ) – ఇకారసంధి
6. వారకెక్కు = వార్తకు + ఎక్కు = (ఉ + ఎ = ఎ) – ఉకారసంధి
7. జనితమైన = జనితము + ఐన = (ఉ + ఐ + ఐ) – ఉకారసంధి
8. గౌరవమొసంగు = గౌరవము + ఒసంగు = (ఉ + ఒ = ఒ) – ఉకారసంధి
9. కలుషమడచు = కలుషము + అడచు = (ఉ + అ = అ) – ఉకారసంధి
10. దొంగలకిత్తురు = దొంగలకు + ఇత్తురు = (ఉ + ఇ = ఇ) – ఉకారసంధి
11. పూవువోలె = పూవు + పోలె – గసడదవాదేశ సంధి
12. పుత్తడిగలవాని – పుత్తడి + కలవాని – గసడదవాదేశసంధి
13. కూడఁబెట్టూ = కూడన్ + పెట్టు – సరళాదేశసంధి (లేక) ద్రుతప్రకృతిక సంధి
14. చింపఁబోకు = చింపన్ + పోకు – సరళాదేశసంధి (లేక) ద్రుతప్రకృతిక సంధి
15. చేయఁబోకు = చేయన్ + పోకు – సరళాదేశసంధి (లేక) ద్రుతప్రకృతిక సంధి
16. సానఁబెట్టిన = సానన్ + పెట్టిన – సరళాదేశసంధి (లేక) ద్రుతప్రకృతిక సంధి
17. విస్ఫూర్తిఁజేయు = విస్ఫూర్తిన్ + చేయు – సరళాదేశసంధి (లేక) ద్రుతప్రకృతిక సంధి
18. విశ్వదాభిరామ = విశ్వద + అభిరామ = (అ + అ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
19. సభాంతరాళము = సభా + అంతరాళము = (ఆ + అ = అ) – సవర్ణదీర్ఘ సంధి
20. సజ్జనాళి = సజ్జన + ఆళి = (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘసంధి
21. లక్షాధికారి = లక్ష + అధికారి = (అ + అ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి
22. సకలార్థములు = సకల + అర్థములు = (అ + అ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి

కవి పరిచయాలు

కవి కాలం రచన
1. గువ్వల చెన్నడు 16వ శతాబ్ది గువ్వల చెన్న శతకం
2. పక్కి అప్పల నర్సయ్య 16వ శతాబ్ది కుమార శతకం
3.  నార్ల చిరంజీవి 20వ శతాబ్ది తెలుగుపూలు శతకం
4. అజ్ఞాత కవి
5. వేమన 17వ శతాబ్ది వేమన శతకం
6. నార్ల వెంకటేశ్వరరావు 20వ శతాబ్ది నార్లవారి మాట
7. ఏనుగు లక్ష్మణకవి 17వ శతాబ్ది సుభాషిత రత్నావళి
8. శేషప్పకవి 18వ శతాబ్ది నరసింహ శతకం

కొత్త పదాలు-అర్గాలు

అంతరాళము = నడిమిచోటు
అంభోధి = సముద్రం
అడచు = అణచు
అనురక్తి = ఇష్టం
అవని = భూమి
ఆజి = యుద్ధం
ఆది = మొదలు
ఈను = బయలు పటచు
ఎరవు = అప్పు
కలిమి = సంపద
కలుషము = మురికి, పాపం
కుఱుచ = పొట్టి
కుజనుడు = చెడ్డవాడు
గర్భం = పొట్ట, కడుపు
చెలమ = ఎండిపోయిన ఏరు మొదలగు వాటిలో నీటి కోసం చేసిన గొయ్యి
ఛాయ = నీడ
జుంటీగలు = తేనెటీగలు
తాల్మి = ఓర్పు
తెరువరులు = బాటసారులు
దురితము = పాపం
ధీజడిమ = బుద్ధిమాంద్యం
పుత్తడి = బంగారం
ప్రకృతి సిద్ధము = సహజ సిద్ధం
పరులు = ఇతరులు
భూపసభ = రాజసభ
భూషణములు = ఆభరణాలు
భూమి = భూలోకము
బుధులు = పండితులు
పిదప = తరువాత
మిత్రకోటి = కోటి మంది స్నేహితులు
మైత్రి = స్నేహం
మేలు = మంచి, ఉపకారం
మఱుగు = దాపరికం
యశము = కీర్తి
లవణము = ఉప్పు
వాస్తవము = నిజం
వితరణి = దానశీలి
విత్తము = ధనము
విస్ఫూర్తి = మిక్కిలి తెలివి
లోభి = పిసినారి
వివేకి = విచారణ చేయువాడు
వసుధ = భూమి
వాక్చతురత్వము = మాటనేర్పు
వారకెక్కు = ప్రచారాన్ని పొందు
వాంఛ = కోరిక
శ్రుతులు = వేదాలు
సజ్జనులు = మంచివారు
సాధుసంగము = మంచివారితో స్నేహము
సంస్తవనీయుడు = పొగడదగిన వాడు
సాన = సానరాయి (పదను పెట్టే రాయి, గంధం తీసే రాయి)
సత్యసూక్తి = మంచి మాట
సొమ్ము = ధనము

పద్యాలు – ప్రతి పదార్థాలు – భావాలు

1వ పద్యం : కంఠస్థ పద్యం

* క. కలిమిగల లోభికన్నను
విలసితముగఁ బేద మేలు వితరణి యైనన్
చలిచెలమ మేలు కాదా అని
కులనిధి యంభోధికన్న గువ్వలచెన్నా! – గువ్వల చెన్న శతకం
ప్రతిపదార్థం :
గువ్వల చెన్నా! = ఓ గువ్వల చెన్నా !
కలిమి = సంపద
కల = కలిగిన
లోభి కన్నను = పిసినారివాడి కంటె
వితరణియైనన్ వితరణి + ఐనన్ = దాత అయితే (దానము చేసేవాడు అయితే)
విలసితముగ = ఒప్పుగా
పేద = బీదవాడు
మేలు = మంచిది
కులనిధి = అంతులేని జలరాశిగల
అంభోధి కన్నన్ = సముద్రము కంటె
చలి = చల్లని
చెలమ = ఎండిపోయిన ఏఱు మొదలయిన వాటిలో నీటి కోసం చేసిన నీటి గొయ్యి.
మేలు కాదా ! = మంచిదే కదా !

భావము :
ఓ గువ్వల చెన్నా ! ధనికుడైన పిసినారి కంటె, దానగుణము ఉన్న పేదవాడే మంచివాడు. అంతులేని జలరాశి గల సముద్రుడి కంటె, మంచి నీరు ఉన్న గొయ్యి మేలు కదా !

2వ పద్యం : కంఠస్థ పద్యం

* క. అవయవహీనుని, సౌంద
ర్యవిహీను, దరిద్రు, విద్యరానియతని, సం
స్తవనీయు, దేవు, శ్రుతులన్
భువి నిందింపఁ దగదండ్రు బుధులు కుమారా ! – కుమార శతకం
ప్రతిపదార్థం :
కుమారా ! = ఓ కుమారా !
అవయవ హీనునిన్ = అవయవ లోపం ఉన్న వాడినీ
సౌందర్య విహీనునిన్ = అందము లేని వాడినీ
దరిద్రున్ = పేదవాడినీ
విద్యరాని + అతనిన్ = చదువురాని నిరక్షరాస్యునీ,
సంస్తవనీయున్ = కొనియాడదగిన వాడినీ (గొప్పవాడినీ)
దేవున్ = దేవుడినీ
శ్రుతులన్ = వేదాలనూ
భువిన్ = భూలోకంలో
బుధులు = పండితులు
నిందింపన్ = నిందించడం
తగదు + అండ్రు = తగదని చెపుతారు.

భావము :
కుమారా ! భూమిపైన అవయవలోపం ఉన్నవారినీ, అందంగా లేనివారినీ, పేదవారినీ, చదువురాని వారినీ, గొప్పవారినీ, దైవాన్నీ, వేదాలనూ నిందించరాదని పెద్దలు చెబుతారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 4 మేలిమి ముత్యాలు

3వ పద్యం : – కంఠస్థ పద్యం

* ఆ. పుస్తకముల ‘నీవు పూవువలెను జూడు
చింపఁబోకు-మురికి చేయఁబోకు
పరుల పుస్తకముల నెరవు తెచ్చితి వేని
తిరిగి యిమ్ము వేగ, తెలుఁగు బిడ్డ ! – తెలుగుపూలు శతకం
ప్రతిపదార్థం :
తెలుగు బిడ్డ = ఓ తెలుగు బాలుడా!
పుస్తకములన్ = పుస్తకాలను
నీవు = నీవు
పూవు వలెను = పువ్వువలె (జాగ్రత్తగా)
చూడు = చూడు
చింపఁబోకు (చింపన్ + పోకు) = వాటిని చింపవద్దు
మురికి = మురికి
చేయఁబోకు (చేయన్+పోకు) = చేయవద్దు (పాడు చేయ వద్దు)
పరుల = ఇతరుల యొక్క
పుస్తకములన్ = పుస్తకములను
ఎరవు = కొంత కాలం వాడుకొని తిరిగి ఇచ్చే పద్దతిలో
తెచ్చితివి + ఏని = తీసుకువస్తే
వేగ = వేగంగా (తొందరగా)
తిరిగి + ఇమ్ము = వాటిని తిరిగి వారికి ఇచ్చి వెయ్యి.

భావము :
ఓ తెలుగు బిడ్డా ! పుస్తకాలను పువ్వుల్లా జాగ్రత్తగా చూడు. వాటిని చింపవద్దు. మురికి చేయవద్దు. ఇతరుల పుస్తకాలు అడిగి తెచ్చుకుంటే, వాటిని త్వరగా ఇచ్చి వేయాలి.

4వ పద్యం : కంఠస్థ పద్యం

* తే. సానఁబెట్టిన వజ్రంబు లీను కాంతి
పొలము జక్కగ దున్నిన ఫలమునిచ్చు
నటులె యజ్ఞానియైనను నవనిపైని
విద్య నేర్చినయేని వివేకియగును. – అజ్ఞాత కవి
ప్రతిపదార్థం :
సానఁబెట్టినన్ (సానన్ + పెట్టినన్) = సాన మీద అరగదీస్తే
వజ్రంబులు = వజ్రాలు
కాంతి = కాంతిని
వేమ = ఓ వేమనా ఈను = వెదజల్లుతాయి (బయలు పరుస్తాయి)
చక్కగన్ = బాగుగా
దున్నినన్ = (నాగలితో) దున్నినట్లయితే
పొలము = పొలము
ఫలమున్ = పంటను
ఇచ్చున్ = ఇస్తుంది.
అటులె (అటులు + ఎ) = అలాగే
అవనిపైని = భూమి మీద
అజ్ఞాని + ఐనను = జ్ఞానము లేని వాడయినా
విద్యన్ = విద్యను
నేర్చిన + ఏనిన్ = నేర్చుకుంటే
వివేకి = వివేకముగలవాడు (మంచి చెడులు తెలిసికొనే తెలివి కలవాడు)
అగును = అవుతాడు.

భావము :
సాన పెడితేనే వజ్రాలు కాంతిని వెద జల్లుతాయి. చక్కగా దున్నితేనే పొలం పంటను ఇస్తుంది. అలాగే భూమి మీద ఎంత అజ్ఞాని అయినా సరే, చదువుకొంటే వివేకి అవుతాడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 4 మేలిమి ముత్యాలు

5వ పద్యం : – కంఠస్థ పద్యం

* ఆ. పుత్తడిగలవాని పుండుబాధైనను
వసుధలోన చాల వారకెక్కు
పేదవాని యింట పెండైన యెరుగరు
విశ్వదాభిరామ ! వినుర వేమ! – వేమన పద్యం
ప్రతిపదార్థం :
విశ్వదా = ఓ విశ్వదా
అభిరామ = ఓ అభిరాముడు అనే శిష్యుడా
వినుర = వినుము
పుత్తడి = బంగారము (ధనము)
కలవాని = ఉన్నవాడి యొక్క
పుండు = చిన్న కురుపు
బాధైనను బాధ + ఐనను = నొప్పి పెడితే
వసుధలోన = భూమిలో (లోకంలో అది)
చాల = మిక్కిలి
వార్తకెక్కు (వార్తకు + ఎక్కు) = పెద్దగా ప్రచారం అవుతుంది
పేదవాని = బీదవాడి
ఇంటన్ = ఇంటిలో
పెండ్లైన = పెండ్లి + ఐన = పెళ్ళి జరిగినా కూడా
ఎరుగరు = ఎవరికీ తెలియదు.

భావము :
ఓ వేమనా ! భూమి మీద ధనవంతుడు చిన్న కురుపుతో బాధపడినా. కూడా పెద్దగా ప్రచారం అవుతుంది. కాని పేదవాడి ఇంట్లో పెళ్ళి జరిగినా కూడా, ఎవరికీ తెలియదు.

6వ పద్యం : – కంఠస్థ పద్యం

* ఉ. ఆపదలందు ధైర్యగుణ, మంచిత సంపదలందుఁ దాల్మియున్,
భూపసభాంతరాళమునఁ బుష్కలవాక్చతురత్వ, మాజి బా
హాపటుశక్తియున్, యశమునం దనురక్తియు, విద్యయందు వాం
ఛాపరివృద్ధియున్, బ్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ – సుభాషిత రత్నావళి
ప్రతిపదార్థం :
ఆపదలంధున్ = ఆపదలు వచ్చినప్పుడు
ధైర్యగుణము = ధైర్యము కలిగియుండుటయును;
అంచిత = చక్కని
సంపదలందున్ = సంపదలు కలిగినపుడు;
తాల్మియున్ = ఓర్పు కలిగియుండుటయును;
భూప సభా = రాజసభ యొక్క
అంతరాళమునన్ = మధ్యలో
పుష్కల = సంపూర్ణమైన
వాక్చతురత్వము = మాటనేర్పునూ
ఆజిన్ = యుద్ధంలో
బాహా = బాహువులయందు
పటు = సమర్ధమైన
శక్తియున్ = శక్తియునూ
యశమునందున్ = కీర్తిని సంపాదించుట యందు;
అనురక్తియున్ = ఆసక్తియూ
విద్యయందున్ = చదువునందు
వాంఛా = కోరిక యొక్క
పరివృద్ధియున్ = అభివృద్ధియును (అధికమగు కోరికయూ)
సజ్జనాళికిన్ (సజ్జన+ఆళికిన్) = సత్పురుషుల సమూహమునకు
ప్రకృతి సిద్ధ = సహజ సిద్ధమైన
గుణంబులు = గుణములు

భావము :
ఆపదలు వచ్చినప్పుడు ధైర్యం, ఐశ్వర్యం వచ్చినప్పుడు ఓర్పు, సభల్లో వాక్పాటవం, యుద్ధంలో శౌర్యం చూపడం, కీర్తిమీద ఆసక్తి, విద్య నేర్చుకోవాలనే కోరిక – ఇవి ఉత్తములకు సహజ గుణాలు.

AP Board 7th Class Telugu Solutions Chapter 4 మేలిమి ముత్యాలు

7వ పద్యం : -కంఠస్థ పద్యం

* ఆ. పత్రికొకటియున్న పదివేల సైన్యము
పత్రికొక్కటున్న మిత్రకోటి
మైత్రి ప్రజకు రక్షలేదు పత్రికలేకున్న
వాస్తవమ్ము నార్లవారి మాట – నార్లవారి మాట
ప్రతిపదార్థం :
పత్రిక = వార్తాపత్రిక
ఒకటి + ఉన్న = ఒక్కటి ఉంటే
పదివేల = పదివేల మంది
సైన్యము = సైన్యముతో సమానము
పత్రిక = వార్తాపత్రిక
ఒక్కటి + ఉన్నన్ = ఒకటి ఉంటే
మిత్రకోటి = కోటి మంది మిత్రులతో సమానం
పత్రిక = పత్రిక
లేక + ఉన్నన్ = లేకపోతే
ప్రజకు = ప్రజలకు
రక్షలేదు = రక్షణ ఉండదు
నార్లవారిమాట = నార్ల వెంకటేశ్వరరావు గారు చెప్పిన ఈ మాట
వాస్తవమ్ము = నిజము

భావము :
ఒక పత్రిక వేలాది సైన్యంతో, సమానం; ఎంతోమంది, మిత్రులతో సమానం. పత్రిక లేకపోతే ప్రజలకు రక్షణ ఉండదు. సమాజంలోని మంచి, చెడులను భయంలేకుండా పత్రికలు తెలియజేస్తాయి. అందువల్ల
సమాజంలో పత్రికలు ఉండాలి

8వ పద్యం : – కంఠస్థ పద్యం

* తే. మొదలఁ జూచినఁ గడు గొప్ప పిదపఁ గుఱుచ
యాది గొంచెము తర్వాత నధికమగుచుఁ
దనరు, దినపూర్వ, పరభాగజనితమైన
ఛాయపోలికఁ గుజనసజ్జనుల మైత్రి. – సుభాషిత రత్నావళి
ప్రతిపదార్థం :
దినపూర్వ = ఉదయం పూట
పరభాగ = సాయంత్రము వేళ
జనితము + ఐన = పుట్టిన
ఛాయపోలికన్ = నీడవలె
కుజన త = చెడ్డవారి యొక్క
మైత్రి = స్నేహము
మొదలన్ = మొదట.
చూచినన్ = చూస్తే
కడుగొప్ప = చాలా గొప్పగా ఉంటుంది
పిదపన్ = తరువాత
కుఱుచ = చిన్నదిగా ఉంటుంది
సజ్జనమైత్రి = మంచివారితో స్నేహము
ఆది = మొదట
కొంచెము = తక్కువగానూ
తర్వాతన్ = రాను రాను
అధికము + అగుచున్ = ఎక్కువ అవుతూ
తనరు = ఒప్పుతుంది.

భావము :
చెడ్డవాళ్ళ స్నేహం ఉదయం పూట నీడలాగ, మొదట ఎక్కువగా ఉండి క్రమక్రమంగా తగ్గిపోతుంది. మంచివాళ్ళ స్నేహం సాయంకాలం నీడలాగ మొదట చిన్నదిగా ఉండి క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. బుద్ధిమంతుడు ఈ రెంటిలో ఏది మంచిదో తెలిసికోవాలి.

AP Board 7th Class Telugu Solutions Chapter 4 మేలిమి ముత్యాలు

9వ పద్యం : – కంఠస్థ పద్యం

* తే. సత్యసూక్తి ఘటించు ‘ధీజడిమ మాన్చు
గౌరవమొసంగు జనులకు గలుషమడఁచు
గీర్తిఁ బ్రకటించు చిత్తవిస్ఫూర్తిఁ జేయు
సాధుసంగంబు సకలార్థ సాధకంబు. – సుభాషిత రత్నావళి
ప్రతిపదార్థం :
సాధు సంగంబు = మంచివాళ్ళతో స్నేహం
జనులకున్ = మనుష్యులకు
సత్యసూక్తిన్ = సత్యమైన మంచిమాటను
ఘటించున్ = చేకూరుస్తుంది (సత్యాన్ని మాట్లాడిస్తుంది)
ధీజడిమన్ = బుద్ధిమాంద్యమును
మాన్చున్ = పోగొడుతుంది
గౌరవము = గౌరవమును
ఒసంగున్ = ఇస్తుంది
కలుషము = పాపాలను
అడచున్ = పోగొడుతుంది
కీర్తిన్ = కీరిని
ప్రకటించున్ = వ్యాపింపజేస్తుంది
చిత్త = మనస్సు, యొక్క
విస్ఫూర్తిన్ = ప్రకాశాన్ని
చేయున్ = చేస్తుంది
సకల + అర్థ సాధకంబు = సమస్తమైన కార్యాలను సాధిస్తుంది

భావము :
మంచి వారితో స్నేహం అన్ని కార్యాలనూ సాధిస్తుంది. సత్యాన్ని మాట్లాడేలా చేస్తుంది. మందకొడి తనాన్ని పోగొడుతుంది. గౌరవాన్ని ఇస్తుంది. పాపాలను పోగొడుతుంది. మనస్సును బాగుచేస్తుంది. కీర్తిని వ్యాపింప జేస్తుంది. లోకంలో అది చేయలేని మంచిపని అంటూ ఉండదు.

10వ పద్యం : – కంఠస్థ పద్యం

*సీ. తల్లిగర్భమునుండి ధనము తేడెవ్వఁడు,
వెళ్ళిపోయెడినాడు వెంట రాదు
లక్షాధికారైన లవణమన్నమె కాని
మెఱుగు బంగారంబు మ్రింగఁ బోడు
విత్తమార్జన చేసి విజ్ఞవీగుటె కాని,
కూడఁ బెట్టిన సొమ్ముఁ గుడువఁ బోడు
పొందుగా మఱుగైన భూమిలోపల పెట్టి
దానధర్మము లేక దాచి దాచి

తే. తుదకు దొంగలకిత్తురో ? దొరలకవునో ?
తేనె జుంటీగ లియ్యవా తెరువరులకు ?
భూషణ వికాస ! శ్రీ ధర్మపుర నివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురిత దూర ! – నరసింహ శతకం
ప్రతిపదార్థం :
శ్రీ ధర్మపుర నివాస = సంపదలను ఇచ్చే, ధర్మపురం నందు నివసించువాడా!
భూషణ, వికాస = అలంకారములచే, ప్రకాశించేవాడా!
దుష్టసంహార = పాపులను సంహరించువాడా!
దురిత దూర = పాపాలను దూరం చేసేవాడా !
తల్లిగర్భము నుండి = తల్లి కడుపు నుండి పుట్టేటప్పుడు
ధనము = ధనాన్ని
ఎవ్వడు = ఎవడూ
తేడు = తన వెంట తీసుకురాడు
వెళ్ళిపోయెడినాడు = ఈ లోకాన్నుండి వెళ్ళిపోయే మరణ సమయములో
వెంటరాదు = ఆ ధనము అతనికి తోడుగా రాదు
లక్షాధికారి + ఐనన్ = లక్షలు సంపాదించినవాడైన
లవణము + అన్నమె కాని = ఉప్పు, అన్నమే కాని
మెఱుగు బంగారంబు = పదునాఱు వన్నె బంగారాన్ని
మ్రింగబోడు = తినడు
విత్తము + ఆర్జన చేసి = ధనమును సంపాదించి
విఱ్ఱవీగుటె కాని = గర్వంగా ఉండడమే కాని
కూడబెట్టిన సొమ్ము = దాచిన ధనము
కుడువన్ + పోడు = తినడు
పొందుగా = బాగుగా
మఱుగు + ఐన = చాటైన
భూమిలోపలన్ + పెట్టి = భూమి యందు ఉంచి
దానధర్మము లేక = దాన ధర్మాలు చేయకుండా
దాచిదాచి = ఆ ధనమును దాచి
తుదకున్ = చివరకు
దొంగలకు = దొంగవాళ్ళకు
ఇత్తురో = ఇస్తారో
దొరలకున్ = ప్రభువులకు
అవును + ఒ = సంక్రమిస్తుందో (చట్టం ప్రకారంగా భూమిలో దాచిన సొమ్ములు సర్కారుకు చేరతాయి)
జుంటీగలు = తేనెటీగలు
తేనెన్ = తేనెను
తెరువరులకున్ = బాటసారులకు (దారిని పోయేవారికి)
ఇయ్యవా = ఇస్తాయికదా !

భావము :
శ్రీ ధర్మపురి నివాసుడా ! దుష్ట సంహార ! నరసింహా ! పాపాలను దూరం చేసేవాడా ! ఆభరణాలచే ప్రకాశించేవాడా! తల్లి కడుపులో నుండి పుట్టినప్పుడు, ఎవ్వడూ ధనాన్ని తన వెంట తీసుకొని రాడు. పోయేటప్పుడు వెంట తీసుకొని వెళ్ళలేడు. లక్షాధికారైనా, ఉప్పుతో కూడిన ఆహారాన్నే కాని, బంగారాన్ని తినలేడు. డబ్బు సంపాదించి గర్వం పెంచుకోవడమే కాని, తాను దాచిన సొమ్మును తాను తినడు. ఆ సొమ్మును దానధర్మాలు చేయకుండా, భూమిలో పాతి పెడుతూ ఉంటాడు. చివరకు అతడు దాన్ని అనుభవించకుండానే, తేనెటీగలు తేనెను బాటసారులకు సమర్పించుకొన్నట్లు, దొంగలకో, రాజులకో సమర్పించు కుంటాడు.