SCERT AP Board 7th Class Telugu Guide Answers 6th Lesson మన విశిష్ట ఉత్సవాలు Textbook Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu 6th Lesson Questions and Answers మన విశిష్ట ఉత్సవాలు

7th Class Telugu 6th Lesson మన విశిష్ట ఉత్సవాలు Textbook Questions and Answers

ప్రశ్నలు – జవాబులు

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
గుణదల మేరీమాత ఉత్సవానికి మాతృక ఏమిటో తెలపండి.
జవాబు:
లూర్థు నగర శివారులో కొండ దిగువకు వంటచెరుకు కోసం బెర్నాడెప్ అనే బాలిక వెళ్లింది. ఆమెకు మేరీమాత కనబడింది. మాట్లాడింది. ఆమె ఆ విషయాన్ని తల్లికి, ఇతరులకు చెప్పింది. అది ఫిబ్రవరి 11వ తేది. దానిని మాతృకగా చేసుకొని 1924 నుండి. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11వ తేదీన గుణదలలో మేరీమాత ఉత్సవాలు జరుగుతాయి.

ప్రశ్న 2.
కోటప్పకొండ తిరునాళ్ళలో గల మానవీయ కోణం ఏమిటి?
జవాబు:
వ్యవసాయంలో ముఖ్య భూమిక పోషించేవి ఎద్దులు. ఆ ప్రాంత రైతులు ఎద్దులను కన్నబిడ్డలవలే చూసుకొంటారు. కోడె దూడలు, ఎద్దులు, తమ ఇళ్లలోని బిడ్డలు క్షేమంగా ఉండాలని మొక్కు కొంటారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ మొక్కులు తీర్చుకొంటారు.

AP Board 7th Class Telugu Solutions 6th Lesson మన విశిష్ట ఉత్సవాలు

ప్రశ్న 3.
అహిబిలం పార్వేట ఉత్సవం ప్రత్యేకత ఏమిటి?
జవాబు:
పరి అనగా గుర్రం, వేట అనగా దుష్టశిక్షణ. ఇది దుష్ట శిక్షణ గురించి జరిగేది. కనుమనాడు అహోబిల నృసింహ స్వామి ఉత్సవమూర్తిగా బయటకు వస్తారు. చుట్టుప్రక్కల 35 గ్రామాలకు వెళతారు. 41వ రోజు ఆ ఊరేగింపు ఉంటుంది. పాల్గుణ శుద్ధ పౌర్ణమినాడు జరిగే తన వివాహానికి 35 గ్రామాల ప్రజలను ఆయనే ఆహ్వానిస్తారు.

ప్రశ్న 4.
లేపాక్షి ఉత్సవాల గురించి మీ సొంతమాటలలో వ్రాయండి.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో లేపాక్షి ఉంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో రెండు రోజులు ఉత్సవాలు జరుగుతాయి. వీటిలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారు. యక్షగానాలు, హరికథలు కూడా ఉంటాయి. నృత్య, గాన, సంగీత ప్రదర్శనలు ఆకట్టుకొంటాయి. ఆలయాలనలంకరిస్తారు.

ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
సిరిమానోత్సవం జాతర గురించి వ్రాయండి.
జవాబు:
సిరిమాను అంటే సంపదలిచ్చే పెద్ద చెట్టు అని అర్థం. ఈ సిరిమానోత్సవం విజయనగరంలో జరుగుతుంది. లక్షలాదిగా భక్తులు వస్తారు.

ఒకసారి విజయనగర రాజు’ విజయ రామరాజు యుద్ధానికి వెడతాడు. ఆయన చెల్లెలు పైడిమాంబ వెళ్లవద్దంటుంది. ఆయన వినడు. యుద్ధానికి వెడతాడు. ఆయనను చూడడానికి ఆమె వెనకనే బయల్దేరుతుంది. తన అన్నను తాండ్ర పాపారాయుడు చంపేశాడని దారిలోనే తెలుస్తుంది. తట్టుకోలేక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకొంటుంది. కొంతకాలానికి స్నేహితురాళ్ల కలలో కనబడి చెరువులో విగ్రహమైనట్లు చెప్పింది. గుడి కట్టాలంది. బెస్తవారు వలలతో గాలించారు. విగ్రహం తీశారు. గుడి కట్టారు. విజయదశమి తరువాతి మంగళవారం విగ్రహం ప్రతిష్ఠించారు.

అందుకే ప్రతి ఏటా దసరా తర్వాత వచ్చే మంగళవారం సిరిమానోత్సవం చేస్తారు. పూజారి చెప్పిన సిరిమానును 15 రోజుల ముందు సేకరిస్తారు. సిరిమానుపై పూజారిని కూర్చోపెట్టి ఉత్సవం చేస్తారు. ఆ ఉత్సవంలో పైడిమాంబ పూజారిపై వాలి అన్ని విషయాలూ చెబుతుంది. పూజారి ధాన్యం ఇస్తాడు. ఆ ధాన్యపుగింజలు తమ పొలంలో వేసుకొంటే పంటలు బాగా పండుతాయని నమ్మకం.

ప్రశ్న 2.
“మత సామరస్యానికి ప్రతీక రొట్టెల పండుగ” ఎందుకో వ్రాయండి.
జవాబు:
హిందూ, ముస్లింలు ఐకమత్యంతో జరుపుకొనే పండుగలలో రొట్టెల పండుగ ఒకటి. ఇది నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్ద జరుగుతుంది. ఈ పండుగలో మహిళలు అత్యధికంగా పాల్గొంటారు.

ఒకప్పుడు గండవరం ‘వద్ద జరిగిన యుద్ధంలో 12 మంది ఇస్లాం వీరులు మరణించారు. వారి మొండేలను వారి గుర్రాలు దుర్గామిట్ట చెరువు వద్దకు చేర్చాయి. అక్కడే సమాధులు నిర్మించారు. దానికి ‘బారహ్ షహీద్’ అని పేరు.

నెల్లూరును పాలించిన ఆర్కాటు నవాబు భార్యకు తీవ్రమైన అనారోగ్యం వచ్చింది. దర్గామిట్ట చెరువు వద్ద రజక దంపతులున్నారు. వారికి కలలో 12 మంది వీరులు కనిపించారు. తమ సమాధులపై మట్టి ఆమెకు లేపనంగా పూస్తే అనారోగ్యం తగ్గుతుందన్నారు. అది రాజగురువు ద్వారా రాజుకు తెలిసింది. .అలాగే చేశారు. నవాబు భార్యకు అనారోగ్యం తగ్గింది.

దీనికి కృతజ్ఞతగా ఆయన భార్యతో వచ్చారు. ‘బారాషహీద్’ సందర్శించారు. ప్రార్థనలు చేశారు. రొట్టెలను పంచారు. దర్గాను అభివృద్ధి చేశారు.

అప్పటి నుండి తమ కోరికలు తీరినందుకు జాతరనాడు రొట్టెలు పంచుతారు. మరునాడు గంధోత్సవం జరుగుతుంది. 3వ రోజు స్వర్ణాల చెరువులో దిగి రొట్టెలు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకొంటారు.

AP Board 7th Class Telugu Solutions 6th Lesson మన విశిష్ట ఉత్సవాలు

ప్రశ్న 3.
సంస్కృతి సంప్రదాయాలను మన వారసత్వ సంపదగా తరువాతి తరానికి ఎలా అందించాలో తెలియజేయండి.
జవాబు:
మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే జాతరలు, ఉత్సవాలు, పండుగలు చాలా జరుగుతాయి. వీటి వెనుక ఉన్న మూలసూత్రం ఒకటే, జాతి, కుల, మత, లింగ, వర్గ, వయో భేదాలేవీ లేకుండా అందరూ కలిసి మెలిసి ఉండాలి.

పిండివంటలతో భుజించాలి.. ఇరుగుపొరుగు వారికి వాటిని ఇచ్చి, వారిచ్చినవి తీసుకోవాలి. దీని వలన అందరూ మనవాళ్లే అనే భావన కలుగుతుంది. దీనిని పిల్లలకు అలవాటు చేయాలి.

సిరిమానోత్సవం, రొట్టెల పండుగ, ప్రభల తీర్థం ఏదైనా సరే, అందరూ తలో చేయ్యీ వేయనిదే అవ్వదు. . పెద్దలు ప్రారంభించిన దానిని వారి పర్యవేక్షణలో తర్వాతి తరంవారు ( పిల్లలు) ఆచరించాలి. ఇలాగే తరతరాలు అంతరాలు లేకుండా అందరూ పాల్గొనాలి. అప్పుడే మన వారసత్వ సంస్కృతి, సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లుతాయి.