SCERT AP 7th Class Social Study Material Pdf 11th Lesson రహదారి భద్రత Textbook Questions and Answers.

AP State Syllabus 7th Class Social Solutions 11th Lesson రహదారి భద్రత

7th Class Social 11th Lesson రహదారి భద్రత Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

I. క్రింది ప్రశ్నలకు సమాధానం రాయండి.

ప్రశ్న 1.
రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించే నినాదాలు తయారుచేయండి.
జవాబు:

  1. ట్రాఫిక్ నియమాలు – ప్రాణాలను రక్షించే సాధనాలు.
  2. ఈరోజు హెచ్చరిక – రేపటి జీవితానికి పునాది.
  3. వేగంగా నడపటం – మృత్యువుకు దగ్గరవటం.
  4. సురక్షితంగా నడుపు – ప్రాణాలు కాపాడు.
  5. ఆగండి, చూడండి, వినండి – అప్పుడు రోడ్డు దాటండి.
  6. Speed thrills but kills.
  7. నిదానమే – ప్రధానం
  8. నిదానంగా నడపండి – సురక్షితంగా గమ్యం చేరండి.
  9. అతివేగం – అనర్థం, ప్రమాదకరం.

ప్రశ్న 2.
మీరు ఒక ట్రాఫిక్ ఆఫీసర్ అయితే, స్కూల్ విద్యార్థులు సురక్షితంగా పాఠశాలకు చేరుకోవడానికి మీరు ఏమి చర్యలు సూచిస్తారు?
జవాబు:
నేనే ట్రాఫిక్ ఆఫీసర్ అయితే, స్కూల్ విద్యార్థులు సురక్షితంగా పాఠశాలకు చేరుకోవడానికి తీసుకునే చర్యలు :

  1. స్కూలు విద్యార్ధులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించటం.
  2. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించినచో కౌన్సిలింగ్ ఇవ్వటం.
  3. జీబ్రా క్రాసింగ్ వద్దనే రోడ్డు దాటేటట్లు చూడటం.
  4. ఎదురుగా, ఎడమ, కుడి వైపుల గమనించి రోడ్డు దాటడం వంటి చర్యలను సూచిస్తాను.

AP Board 7th Class Social Solutions Chapter 11 రహదారి భద్రత

ప్రశ్న 3.
రహదార్లను ఉపయోగిస్తున్నప్పుడు మీరు ఏ ట్రాఫిక్ నియమాలను పాటించాలి?
జవాబు:
రహదార్లను దాటేటప్పుడు మనం పాటించవలసిన నియమ నిబంధనలు :

  1. రహదారులపై నడిచేటపుడు ఎల్లప్పుడు ఫుట్ పాత్ లను వినియోగించడం వలన పాదచారులు రోడ్డు అంచుల నుండి దూరంగా ఉండటం తద్వారా ఏదైనా వాహనం ఢీకొట్టి వెళ్ళే ప్రమాదాన్ని నివారించవచ్చు.
  2. ఎదురుగా వాహనాలు వచ్చే విధంగా ఉన్న రోడ్డు వైపున పూర్తిగా చివరి అంచున నడవడం వలన పొరపాటున జరగబోయే ప్రమాదాల నుండి తప్పించుకునే అవకాశం ఉంటుంది.
  3. తెరిచి వున్న డ్రైనేజీ కాలువలు, గుంతలు, పండ్లు మరియు కూరగాయల తొక్కల వంటి వాటిని గుల.
  4. వేగంగా వెళ్లే వాహనాల వలన ప్రమాదం ఉంటుంది కాబట్టి, రహదారులపై ఆడుకోకూడదు. ఇతరులకు అసౌకర్యం కలగవచ్చు కాబట్టి ఫుట్ పాత్ లపై ఆడుకోరాదు.
  5. అపరిచితుల వాహనాలు ఎక్కకూడదు. కిడ్నాప్ కు గురికావడం, గాయపరచబడడం వంటి రూపాల్లో ఇది మీకు ప్రమాదకరం కావచ్చు.
  6. జీబ్రా క్రాసింగ్ వద్ద మాత్రమే రోడ్డు దాటాలి. జీబ్రా క్రాసింగ్ లేని సమయాల్లో రెండు వైపుల రోడ్డు కనిపించే విధంగా ఉన్న సురక్షిత ప్రదేశం వద్ద రోడ్డు దాటాలి. ప్రమాదకర మలుపు వద్ద రోడ్డు దాటకూడదు.
  7. రైల్వే ట్రాక్ పై ఎప్పుడూ నడవరాదు. ఎల్లప్పుడూ ఓవర్ బ్రిడ్జిలను ఉపయోగించాలి. ఒకవేళ ఓవర్ బ్రిడ్జి లేకపోయినట్లయితే గేటు తెరుచుకునే వరకు ఎదురుచూసి గేటు దాటాలి.

సైక్లిస్టుల కోసం నియమాలు :

  1. రోడ్డుకు ఒకవైపున అంచు వెంబడి సైకిల్ నడపండి. సైకిల్ ట్రాక్ ఉంటే తప్పనిసరిగా ఉపయోగించండి.
  2. సైకిల్ నడిపేవారు రోడ్డుకు ఎడమవైపున ఫుట్ పాత కు దగ్గరగా ఉండేట్టు చూడటంతో పాటు కాలువలు, మూసి వుంచని డ్రైనేజి గుంతలను గమనించుకుంటూ జాగ్రత్తగా ప్రయాణం చేయాలి.
  3. ఎక్కువగా రద్దీ ఉన్న మార్గాలను వదిలేయాలి.
  4. రహదారులపై భారీ వాహనాలకు తగిన దూరంలో ప్రయాణించాలి. లేనిచో ఆ వాహనాల వేగం వలన కలిగే పీడనం వలన సైకిల్ నడిపేవారు సమతుల్యతను కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
  5. వేగంగా సైకిల్ నడపరాదు. ప్రత్యేకించి రహదారులు తడిగా ఉన్నపుడు అస్సలు వేగంగా ఉండరాదు.
  6. ప్రయాణం మొదలు పెట్టేముందు, ఆగడం, మలుపు తీసుకోవడం వంటి సమయాల్లో చేతి సంజ్ఞలు ఇవ్వడం ద్వారా మీ కదలికలు ఇతరులకు తెలియజేయాలి. సురక్షితంగా ఉన్నప్పుడు మాత్రమే ముందుకు కదలాలి.
  7. రహదారి కూడళ్ళలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ ని తప్పనిసరిగా పాటించాలి. ఎరుపు రంగు సిగ్నల్ ని దాటి వెళ్ళరాదు. రహదారులు కలిసేచోట సైకిలను నిదానంగా నడపాలి.
  8. కూడళ్ళు, రహదారులు కలిసేచోట వాహనాల కదలికలను గమనిస్తూ తగిన అవకాశం ఉన్నపుడు మాత్రమే రోడ్డును దాటాలి.
  9. రాత్రిపూట ప్రయాణంలో లైట్ లేదా రిఫ్లెక్టర్ ఉండేట్లు చూసుకోవాలి.
  10. అన్ని రహదారుల సంజ్ఞల గురించి అవగాహన కలిగి ఉండటం, రోడ్డుపై ప్రయాణించే సమయంలో నియమాలను తప్పనిసరిగా ఆచరించడం వంటివి అత్యంత ముఖ్యమైన అంశాలు.

సురక్షిత ప్రయాణం :

  1. కదులుతున్న ఆటో, కారు, బస్సు నుండి ఎక్కడం / దిగడం చేయకూడదు.
  2. ఎల్లప్పుడు ఎడమ వైపున ఫుట్ పాత్ పైకి దిగేలా చూసుకోవాలి.
  3. వాహన చోదకుని ఏకాగ్రతకు ఆటంకం కలిగించకూడదు.
  4. పరిమితికి మించి ఎక్కువ మంది ఉన్న ఆటో, బస్సులలో ప్రయాణం చేయరాదు.
  5. వాహనానికి ఉన్న అన్ని డోలు సరిగా వేసి ఉన్నది లేనిది గమనించాలి.
  6. చేతులు / తల కిటికి నుండి బయట పెట్టరాదు.
  7. ప్రయాణ సమయంలో తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాలి.
  8. బస్సు కోసం వేచి వున్న సమయంలో ఎల్లపుడు క్యూలో నిలబడాలి. రోడ్డుపై కాకుండా ఫుట్ పాత్ లపై మాత్రమే నిలబడాలి. బస్సులో సీటు పొందడం కొరకు ఒకరినొకరు తోసుకోకూడదు.
  9. బస్సు దిగిన వెంటనే అది దాటుకుని వెళ్ళే వరకు వేచి వుండి తరువాత కదలాలి.
  10. సురక్షిత ప్రదేశం వద్దనే రోడ్డు దాటాలి. కెర్చ్ డ్రిల్ (సురక్షితంగా రహదారి దాటడానికి చిన్నారులకు ఇచ్చే శిక్షణ)ను తప్పనిసరిగా తీసుకోవడం మర్చిపోవద్దు.
  11. కదులుతున్న బస్సును ఎక్కడం లేదా దిగడం వంటివి చేయరాదు.

ప్రశ్న 4.
ట్రాఫిక్ పోలీసు యొక్క విధులు ఏవి?
జవాబు:

  1. రహదారి వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించటం.
  2. రహదారీ రద్దీని క్రమబద్ధీకరించటం.
  3. ప్రమాదాలు జరగకుండా నిరంతరం ప్రజలను అప్రమత్తం చేయటం.
  4. క్షత్రగాత్రులకు అత్యవసర సహాయాన్ని అందించటం.
  5. రహదారి నియమాలను ఉల్లంఘించిన వారికి జరిమానా విధించటం.

AP Board 7th Class Social Solutions Chapter 11 రహదారి భద్రత

ప్రశ్న 5.
రహదారి పమాదాలను నివారించడానికి సూచనలు ఇవ్వండి.
జవాబు:
రహదారి ప్రమాదాల నివారణకు సూచనలు :

  1. రోడ్డు వినియోగదారులందరికి కచ్చితంగా రహదారి భద్రతా నియమాలపై అవగాహన కల్పించాలి.
  2. వాహనాలను అతివేగంగా మరియు నిర్లక్ష్యంగా నడపకూడదు.
  3. మద్యం సేవించి వాహనాలను నడపకూడదు.
  4. సీట్ బెల్ట్ మరియు హెల్మెట్లు ధరించి వాహనాలను నడపాలి.
  5. ముఖ్యంగా వాహనం నడుపునపుడు సెల్ ఫోన్ వాడకం నిషేధించాలి.
  6. వాహనాలను ఓవర్ టేక్ చేసేటపుడు అప్రమత్తంగా ఉండాలి.
  7. ట్రాఫిక్ సిగ్నల్స్ ని కచ్చితంగా అనుసరించాలి.

II. సరియైన సమాధానాలను ఎంచుకోండి.

1. ఈ క్రింది వాటిలో వాహనాలు ఆగడానికి సూచించే రంగు ఏది?
ఎ) ఆరెంజ్
బి) ఆకుపచ్చ
సి) ఎరుపు
డి) పసుపు
జవాబు:
సి) ఎరుపు

2. భిన్నమైనది ఏది?
ఎ) ఫుట్ పాత్
బి) వంతెన
సి) డివైడర్
డి) జీబ్రా క్రాసింగ్
జవాబు:
బి) వంతెన

3. రహదారి భద్రతకు అడ్డంకి ఏది?
ఎ) పాదచారులు ఫుట్ పాత్ ను ఉపయోగించడం
బి) ట్రాఫిక్ సంకేతాలు అనుసరించడం
సి) పాదచారులు జీబ్రా క్రాసింగ్ వద్ద రోడ్డు దాటడం
డి) ఏదీ కాదు
జవాబు:
డి) ఏదీ కాదు

III. జతపరుచుము.

గ్రూప్ – ఎగ్రూప్ -బి
1. ఫుట్పాత్ఎ) రహదారిపై గల సంకేతాలు
2. ఎరుపు రంగు లైట్బి) ముందుకు వెళ్ళుటకు సిద్ధం
3. ఆకుపచ్చ రంగు లైట్సి) పాదచారులు
4. ఆరంజ్ రంగు లైట్డి) వాహనం ముందుకు వెళ్ళడం
5. రహదారి డివైడర్ఇ) గీత ముందు ఆగటం

జవాబు:

గ్రూప్ – ఎగ్రూప్ -బి
1. ఫుట్పాత్సి) పాదచారులు
2. ఎరుపు రంగు లైట్ఇ) గీత ముందు ఆగటం
3. ఆకుపచ్చ రంగు లైట్డి) వాహనం ముందుకు వెళ్ళడం
4. ఆరంజ్ రంగు లైట్బి) ముందుకు వెళ్ళుటకు సిద్ధం
5. రహదారి డివైడర్ఎ) రహదారిపై గల సంకేతాలు

7th Class Social Studies 11th Lesson రహదారి భద్రత InText Questions and Answers

7th Class Social Textbook Page No.115

ప్రశ్న 1.
క్రింద ఇచ్చిన చిత్రాలను పరిశీలించి, వాటిలో ప్రమాదాలకు దారితీసే చిత్రాలను టిక్ (✓) మా తో సూచించండి.
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 11 రహదారి భద్రత 1

7th Class Social Textbook Page No.127

ప్రశ్న 2.
ట్రాఫిక్ పోలీసులను కలిసి రోడ్డు నియమాలు గురించి చర్చించండి.
జవాబు:
రోడ్డు నియమాలు :

  1. ట్రాఫిక్ సిగ్నలను కచ్చితంగా పాటించాలి.
  2. లైసెన్స్ లేకుండా వాహనం నడపరాదు.
  3. జీబ్రా క్రాసింగ్ వద్దనే రోడ్డును దాటాలి.
  4. పాదచారులు ఫుట్పలను వినియోగించాలి.
  5. పరిమితికి మించి వాహనంలో ఎక్కువ మంది ప్రయాణం చేయరాదు.
  6. ద్విచక్ర వాహనాలను నడిపేటపుడు హెల్మెట్ విధిగా ధరించాలి.
  7. నాలుగు చక్రాల వాహనాలను నడిపేటపుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి.
  8. రోడ్డు చిహ్నాలను అనుసరించాలి.
  9. మద్యం తాగి వాహనాలు నడపరాదు.
  10. పరిమితికి మించి వేగంగా వాహనం నడపరాదు.
  11. సెల్ ఫోన్ ఉపయోగిస్తూ వాహనం నడపరాదు.

AP Board 7th Class Social Solutions Chapter 11 రహదారి భద్రత

7th Class Social Textbook Page No.135

ప్రశ్న 3.
రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్లకార్డులను పట్టుకొని మీ గ్రామంలో / పట్టణంలో ర్యాలీ చేయండి.
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 11 రహదారి భద్రత 2
విద్యార్థులు పై ప్లకార్డులను ఉపయోగించుకోగలరు.

7th Class Social Textbook Page No.137

ప్రశ్న 4.
రహదారిని ఉపయోగిస్తున్నప్పుడు చేయదగినవి మరియు చేయకూడని వాటితో నింపండి.
జవాబు:

చేయదగినవిచేయకూడనివి
1. నెమ్మదిగా, రోడ్డుకు ఇరువైపులా చూస్తూ రోడ్డును దాటాలి. లేదా జీబ్రా క్రాసింగ్ వద్ద దాటాలి.1. రోడ్డు ఎక్కడ పడితే అక్కడ దాటకూడదు.
2. పరధ్యానం, కబుర్లాడుతూ వెళ్ళరాదు.2. సరైన డ్రైవింగ్ లైసెన్స్ కల్గి ఉండాలి.
3. హెల్మెట్ లేకుండా ప్రయాణించరాదు.3. హెల్మెట్ ధరించాలి.
4. మద్యం సేవించి వాహనం నడపరాదు.4. కారు సీట్ బెల్ట్ ధరించాలి.
5. వేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడపరాదు.5. ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాలి.
6. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించరాదు.

ఆలోచించండి & ప్రతిస్పందించండి

7th Class Social Textbook Page No.115

ప్రశ్న 1.
పట్టణీకరణ వలన ట్రాఫిక్ సమస్య పెరిగిందని నీవు ఎలా చెప్పగలవు?
జవాబు:

  1. పట్టణ జనాభా పెరుగుదల (పట్టణీకరణ) వలన ట్రాఫిక్ సమస్య చాలా పెరిగిందని చెప్పవచ్చు.
  2. పట్టణంలో వివిధ వృత్తులు చేయువారు తమ కార్యస్థానాలకు చేరుటకు వివిధ వాహనాలు వినియోగించటం.
  3. పట్టణీకరణలలోని పారిశ్రామికీకరణ కూడా ట్రాఫిక్ సమస్యకు కారణం. పరిశ్రమల నుండి జరుగు రవాణా ట్రాఫిక్ సమస్యకు కారణం.
  4. పట్టణ జనాభా సహజంగా కొనుగోలు శక్తి కలవారై ఉండి, వాహనాల కొనుగోలు పెరిగి, వాడకం పెరిగింది.
  5. పట్టణాలలో వాహన దుకాణదారులు వాహనాల కొనుగోలును ప్రోత్సహించటం.
  6. పట్టణ జనాభా చేయు ఉద్యోగాలకు సమయానికి చేరుకోవాలనే ఆరాటం.

7th Class Social Textbook Page No.121

ప్రశ్న 2.
రహదారి ప్రమాదాలకు ఇతర కారణాలను గుర్తించండి.
జవాబు:
రోడ్డు ప్రమాదాలకు కారణాలు :

  1. రోడ్డు ప్రమాదాలకు అతిముఖ్య కారణం వాహనం వేగంగా నడపటం.
  2. వాహనం నడపడంలో నిర్లక్ష్యం.
  3. మత్తు పానీయాలు సేవించి వాహనం నడపడం.
  4. రోడ్డు సిగ్నల్స్ ని అతిక్రమించి వాహనం నడపడం.
  5. ఓవర్ లోడింగ్ మరియు ఓవర్ టేకింగ్ వలన.
  6. వాహనం నడిపే సమయం, రోడ్డు దాటే సమయంలో సెల్‌ఫోన్‌ను ఉపయోగించటం.
  7. సీట్ బెల్ట్, హెల్మెట్ మొ||నవి సక్రమంగా వాడకపోవటం.
  8. డ్రైవర్ యొక్క పరధ్యానం లేక కబుర్లు చెప్పటం మరియు విశ్రాంతి లేకుండా డ్రైవింగ్ చేయడం.
  9. రోడ్డు సంకేతాలను పట్టించుకోకపోవటం.
  10. రహదారులపై గేదెలు, మేకలు, గొర్రెలు వంటి జంతువులను యథేచ్ఛగా వదిలివేయుట.
  11. దమ్ము చక్రాలతో ట్రాక్టర్లను నడుపుట.
  12. ప్రొక్లెనర్ వంటి భారీ వాహనాల వినియోగం వలన ఏర్పడే గుంటలు.

AP Board 7th Class Social Solutions Chapter 11 రహదారి భద్రత

ప్రశ్న 3.
ఒక వ్యక్తి రహదారి ప్రమాదానికి గురైతే, అతని/ఆమె కుటుంబం ఎలా ఇబ్బంది పడుతుంది?
జవాబు:
ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురైతే అతని / ఆమె కుటుంబం చాలా తల్లడిల్లిపోతుంది. వారి బాధ వర్ణనాతీతం. వారి కుటుంబం దాదాపుగా ఒంటరి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే వారు ఇంటి ఆదాయ వనరు అయితే వారికి ఆర్థికపరమైన సమస్యలు కూడా చుట్టుకుంటాయి. పెద్దవారయితే ఇంటి పెద్దని / యజమానిని కోల్పోతే ఆ కుటుంబం దాదాపుగా అనాథ లాగా మారుతుంది.

ప్రశ్న 4.
ఎవరైనా ప్రమాదానికి గురైతే నీవు ఎలా స్పందిస్తావు?
జవాబు:
నా కళ్ల ఎదుట ఎవరైనా ప్రమాదానికి గురైతే ముందుగా ప్రమాద తీవ్రతని బట్టి అంబులెన్స్ (108)కి ఫోన్ చేస్తాను. ఈలోగా – ప్రథమ చికిత్స ఏమైనా అందించవచ్చేమో చూసి అందిస్తాను. అలాగే ప్రమాదానికి గురైన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులకు ఈ విషయంను తెలియజేస్తాను.

ప్రశ్న 5.
ఎక్కువ శాతం యువత ప్రమాదాలలో చనిపోతే ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి ప్రభావం పడుతుందో చర్చించండి.
జవాబు:

  1. ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నవారు యువతే.
  2. యువత ఇలా ప్రమాదాలలో చనిపోతే దేశ ఆర్థిక వ్యవస్థపై దుష్ప్రభావం కలిగిస్తుంది.
  3. యువత అంటే శ్రామిక జనాభా, అత్యధిక ఉత్పత్తి సామర్థ్యం కల్గి ఉంటారు. GDP అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారు. వారిని కోల్పోతే దేశాభివృద్ధి కుంటుపడుతుందనుటలో సందేహం లేదు.
  4. కుటుంబాలకు కూడా ఆధారం కోల్పోయి, పేదరికంలోకి నెట్టబడతారు. జీవనాధారం కోల్పోతారు.
  5. అలాగే వారిపై పెట్టిన విద్య, ఆహారం మొదలైన ఖర్చులు నష్టపోయినట్లే.

7th Class Social Textbook Page No.135

ప్రశ్న 6.
ఈ రోజుల్లో ట్రాఫిక్ వేగంగా పెరుగుతోంది. దీనికి పరిష్కారాలు తెలపండి.
జవాబు:

  1. వాహనాల వినియోగం తగ్గించాలి. అవకాశం ఉన్నప్పుడు కాలి నడక, సైకిల్ ను వినియోగించాలి.
  2. విశాలమైన రహదారుల నిర్మాణం చేపట్టాలి. ట్రాఫిక్ ను దారి మళ్ళించాలి.
  3. సరి, బేసి పద్ధతులలో వాహనాల వాడకానికి అనుమతినివ్వాలి.
  4. వాహనాలపై భారీగా పన్ను విధించాలి.
  5. ట్రాఫిక్ సమస్యలు, రద్దీ, గందరగోళం గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి.

ప్రశ్న 7.
ఎవరైనా ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించకపోతే ఏమి జరుగుతుంది?
జవాబు:

  1. ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించకపోతే ఆ వ్యక్తి ప్రమాదానికి గురికావచ్చు. అతనితో పాటు ప్రక్కవారు ప్రమాదానికి గురి కావచ్చు.
  2. ట్రాఫిక్ జామ్ / గందరగోళంలు ఏర్పడవచ్చు.

AP Board 7th Class Social Solutions Chapter 11 రహదారి భద్రత

ప్రశ్న 8.
మీ పాఠశాల పరిసరాలలో ఎటువంటి రహదారి చిహ్నాలు ఉండాలి?
జవాబు:
మా పాఠశాల పరిసరాలలో క్రింది రహదార్ చిహ్నాలు ఉండాలి :

  1. హారన్ నిషేధం అనే తప్పనిసరి చిహ్నం.
  2. పాఠశాల ప్రాంతం అనే హెచ్చరిక గుర్తు.
  3. పాదచారుల దారి అనే హెచ్చరిక గుర్తు.

అన్వేషించండి

7th Class Social Textbook Page No.125

ప్రశ్న 1.
మీ ఉపాధ్యాయుని సహాయంతో మిగిలిన సంకేతాలను ఆర్టీఏ కార్యాలయం/ట్రాఫిక్ పోలీసుల నుండి సేకరించండి. తరగతి గదిలో వాటి గురించి చర్చించండి. లేదా సందర్శించండి.
జవాబు:
మోటారు వాహనాలు నిషేధం
ఎడమకు తిరుగుము
సైక్లింగ్ నిషేధం
కలుపు
కుడివైపుకు తిరుగుము

ప్రాజెక్ట్ పని

ప్రశ్న 1.
ఇంటి నుండి పాఠశాలకు వెళ్ళేటప్పుడు, పాఠశాల నుండి ఇంటికి వచ్చేటప్పుడు రోడ్డు మీద ఏమేమి జాగ్రత్తలు పాటించాలో తెలుపుతూ మీ మిత్రునికి ఒక లేఖ రాయండి.
జవాబు:

తేది XXX XX
గుంటూరు.ప్రియమైన మిత్రుడు రఘుపతి సాయికి,నేను ఇక్కడ క్షేమమే. నువ్వు క్షేమమేనని తలుస్తున్నాను. నేటి రోజుల్లో రోడ్డు ప్రమాదాలు బాగా పెరిగిపోతున్నాయి. కనుక నీవు ఈ క్రింది జాగ్రత్తలు పాఠశాల నుండి ఇంటికి, ఇంటి నుండి పాఠశాలకు వెళ్ళేపుడు పాటించగలవని ఆశిస్తున్నాను.

  1. రోడ్డు పూర్తి ఎడమ వైపునే నడవాలి. అవకాశం వుంటే ఫుట్ పాత్ వినియోగించగలవు.
  2. తెరిచి ఉన్న డ్రైనేజీ కాలువలు, గుంతలు, పండ్ల తొక్కలు లాంటి వాటిని గమనిస్తూ నడవాలి.
  3. రహదారులపై ఆడుకోవటం, కబుర్లు చెబుతూ నడవటం లాంటివి చేయరాదు.
  4. జీబ్రా క్రాసింగ్ వద్దనే రోడ్డును దాటాలి. డివైడర్స్ ఎక్కరాదు.
  5. రైల్వే ట్రాక్స్ దగ్గర చాలా అప్రమత్తంగా ఉండాలి.
  6. అపరిచితుల వాహనాలు ఎక్కరాదు. (కిడ్నాప్ కు గురికావచ్చు)
  7. కూడళ్ళు రహదారులు కలిసే చోట వాహనాల కదలికలను చూసుకుని నిదానంగా వెళ్ళాలి.
  8. నీవు ఆటో గాని, బస్సు గాని ఎక్కితే చేతులు తల బయటికి పెట్టవద్దు.
  9. క్యూలో నిలబడే బస్సు ఎక్కాని. బస్సులో కూడా తోపులాట కూడదు.
  10. కదులుతున్న బస్సు, ఆటోలు ఎక్కవద్దు.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
శ్రీనివాస్.