SCERT AP 7th Class Science Study Material Pdf 9th Lesson ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి Textbook Questions and Answers.

AP State Syllabus 7th Class Science 9th Lesson Questions and Answers ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి

7th Class Science 9th Lesson ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి Textbook Questions and Answers

Improve Your Learning (అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం)

I. ఖాళీలను పూరింపుము.

1. మానవ శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి డాక్టర్ …… ……… అనే ధర్మామీటర్ ను ఉపయోగిస్తారు. (జ్వరమానిని)
2. ఉత్తమ ఉష్ణమాపక ద్రవం …………. ( పాదరసం)
3. ఏదైనా ఉపరితలంపై గాలి ప్రయోగించే బలాన్ని …………… అంటారు. (పీడనం )
4. చాలా కాలం పాటు తీసుకున్న సగటు వాతావరణ సరళిని ఈ ప్రదేశం యొక్క ……. అంటారు. (శీతోష్ణస్థితి)
5. గాలిలో ఉన్న నీటి ఆవిరి పరిమాణాన్ని ………………… అంటారు. (ఆర్ధత)

II. సరైన జవాబు సూచించు అక్షరమును బ్రాకెట్లో రాయండి.

1. ఒక విద్యార్థి వాతావరణం యొక్క రోజువారీ పరిస్థితులను వరుసగా మూడు రోజులపాటు గమనించి, ఆ పరిశీలనలను నమోదు చేసింది. ఆమె గ్రాఫ్ ఉపయోగించి సమాచారాన్ని చూపించాలనుకుంటుంది. ఏ గ్రాఫ్ ఆమెకు అనుకూలంగా ఉంటుంది?
a) శీతోష్ణస్థితి గ్రాఫ్
b) వాతావరణ గ్రాఫ్
c) ఉష్ణోగ్రత గ్రాఫ్
d) ఆర్ధత గ్రాఫ్
జవాబు:
b) వాతావరణ గ్రాఫ్

2. ఉష్ణ వహనం ………………. లో జరుగుతుంది.
a) లోహాలు
b) ద్రవాలు
c) వాయువులు
d) గాలి
జవాబు:
a) లోహాలు

AP Board 7th Class Science Solutions Chapter 9 ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి

3. మానవ శరీర సగటు ఉష్ణోగ్రత …………
a) 0°C
b) 20°C
c) 37°C
d) 100°C
జవాబు:
c) 37°C

4. ఫారెన్హీట్ స్కేల్ లోని విభాగాల సంఖ్య …………….
a) 180
b) 100
c) 50
d) 200
జవాబు:
a) 180

III. జతపరచండి.

గ్రూపు – A గ్రూపు – B
A) మంచు ద్రవీభవన స్థానం 1) పాదరసం (వర్షం)
B) అవపాతం 2) బారోమీటర్
C) వాయు పీడనం 3) 100°C
D) నీటి మరుగు స్థానం 4) 0°C
E) థర్మామీటర్ లో ఉపయోగించే లోహం 5) రెయిన్ గేజ్
6) ఆల్కహాల్

జవాబు:

గ్రూపు – A గ్రూపు – B
A) మంచు ద్రవీభవన స్థానం 4) 0°C
B) అవపాతం 5) రెయిన్ గేజ్
C) వాయు పీడనం 2) బారోమీటర్
D) నీటి మరుగు స్థానం 3) 100°C
E) థర్మామీటర్ లో ఉపయోగించే లోహం 1) పాదరసం (వర్షం)

IV. ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రశ్న 1.
ప్రయోగశాల ఉష్ణమాపకం మరియు జ్వరమానిని మధ్య పోలికలు మరియు భేదాలేమిటి?
జవాబు:
పోలికలు :

  1. ప్రయోగశాల ఉష్ణమాపకం మరియు జ్వరమానిని రెండు కూడ ఉష్ణోగ్రత కొలవటానికి ఉపయోగిస్తారు. కావున ఈ రెండు థర్మామీటర్లు.
  2. రెండింటిలోనూ పాదరసము ఉంటుంది.
  3. రెండూ క్రింద భాగంలో పాదరస బల్బులు కల్గి ఉంటాయి.
  4. వ్యాకోచించిన పాదరసం విస్తరించటానికి సన్నని నాళం ఉంటుంది.
  5. నిర్మాణం పని చేయు విధానము ఒకే విధంగా ఉంటుంది.

భేదాలు :

ప్రయోగశాల ఉష్ణమాపకం జ్వరమానిని
1) పదార్థాల ఉష్ణోగ్రత కొలవటానికి వాడతారు. 1) శరీర ఉష్ణోగ్రత కొలవటానికి వాడతారు.
2) సాధారణంగా ప్రయోగశాలలో వాడతారు. 2) ఆసుపత్రుల్లో వాడతారు.
3) నిర్మాణంలో పాదరసం వెంటనే వెనుకకు రాకుండా నొక్కు ఉండదు. 3) నిర్మాణంలో నొక్కు ఉంటుంది.
4) దీనిలో స్కేలు – 10°C నుండి 110°C వరకు ఉండును. 4) దీనిలో స్కేలు 35°C నుండి 42°C వరకు ఉంటుంది.
5) తక్కువ సునిశితమైనది. 5) ఎక్కువ సునిశితమైనది.

ప్రశ్న 2.
జ్వరమానిని యొక్క రేఖా చిత్రాన్ని గీచి, దాని భాగాలను గుర్తించండి.
జవాబు:
AP Board 7th Class Science Solutions Chapter 9 ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి 1

ప్రశ్న 3.
ఉత్తమ ఉష్ణ వాహకాలు, అధమ ఉష్ణ వాహకాలకు రెండేసి ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:

ఉత్తమ ఉష్ణవాహకం అధమ ఉష్ణవాహకం
1) తమ గుండా ఉష్ణాన్ని ప్రసరింపనిస్తాయి. 1) ఉష్ణాన్ని ప్రసరింపనీయవు.
2) ఉష్ణములో ఉంచినపుడు వేడెక్కుతాయి. 2) వేడెక్కవు.
3) ఉదా : లోహాలు అయిన ఇనుము, రాగి, వెండి, స్టీలు. 3) అలోహాలు అయిన చెక్క, ప్లాస్టిక్, రాయి, గాలి, ఇత్తడి, నీరు.

ప్రశ్న 4.
బుచ్చన్న వాతావరణం మరియు శీతోష్ణస్థితి ఒకటే అన్నాడు. మీరు అతనితో అంగీకరిస్తున్నారా? ఎందుకు?
జవాబు:

  1. బుచ్చన్నతో నేను అంగీకరించను. వాతావరణము శీతోష్ణస్థితి కంటే భిన్నమైనది.
  2. వాతావరణంలో ఉష్ణోగ్రత, తేమ, గాలివేగం, వర్షపాతం వంటి అనేక అంశాలు ఉంటాయి.
  3. వాతావరణం మారుతూ ఉంటుంది. ఈ మార్పులు చాలా త్వరగా జరుగుతాయి.
  4. వాతావరణం ఒక రోజు పొడిగాను మరో రోజు వరంతో ఉండవచ్చు.
  5. కాని శీతోష్ణస్థితి ఒక ప్రాంతం యొక్క సుదీర్ఘ అంశము.
  6. 25 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం యొక్క సగటు వాతావరణ నమూనాను ఆ ప్రదేశం యొక్క శీతోష్ణస్థితి అంటారు.
  7. శీతోష్ణస్థితిలో మార్పులు అంత త్వరగా రావు.
  8. శీతోష్ణస్థితి ఒక ప్రాంతం, జీవులు మరియు మనుషుల జీవన విధానాన్ని ప్రభావితం చేస్తుంది.

AP Board 7th Class Science Solutions Chapter 9 ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి

ప్రశ్న 5.
వాతావరణ మార్పులపై రైతుల ప్రశ్నపత్రం కోసం రెండు ప్రశ్నలను సిద్ధం చేయండి.
జవాబు:

  1. ఈ ఏడాది వర్షపాతం ఎలా ఉంటుంది?
  2. ఋతుపవనాలు ఏ నెలలో ప్రవేశిస్తాయి?
  3. ఏ నెలల్లో అధిక వర్షపాతం ఉండవచ్చు?
  4. తక్కువ వర్షపాతానికి అనువైన పంటలు ఏమిటి?

ప్రశ్న 6.
జ్వరమానిని ఉపయోగిస్తున్నప్పుడు తీసుకోవలసిన రెండు జాగ్రత్తలు వ్రాయండి.
జవాబు:

  1. జ్వరమానిని విదిలించేటప్పుడు గట్టిగా పట్టుకోవాలి.
  2. వాడిన ప్రతిసారి జ్వరమానిని శుభ్రం చేయాలి.
  3. అధిక వేడి, శీతల ప్రాంతాలలో ఉంచరాదు.
  4. చిన్న పిల్లలకు దూరంగా ఉంచాలి.
  5. చిన్న పిల్లలు నోటిలో ఉంచినప్పుడు కొరికే ప్రమాదం ఉంది కావున చంకలలో ఉంచి ఉష్ణోగ్రతను నమోదు చేయాలి.
  6. కాంతిపడే ప్రదేశానికి ఎదురుగా ఉండి రీడింగ్ చూడరాదు.

ప్రశ్న 7.
ఉష్ణ వహనాన్ని నిర్వచించండి. మీ స్వంత ఉదాహరణతో ఉష్ణవాహన ప్రక్రియ ద్వారా ఉష్ణాన్ని బదిలీ చేయడాన్ని వివరించండి.
జవాబు:
ఉష్ణవహనం : వాహకం ద్వారా వేడి కొన నుండి చల్లని కొనవైపు ఉష్ణం బదిలీ చేసే ప్రక్రియను ఉష్ణవహనం అంటారు. ఇది ప్రధానంగా ఘన వాహకాలలో జరుగుతుంది.
ఉదాహరణ :

  1. ఇనుప కడ్డీని మంటలో ఉంచినపుడు కాసేపటికి రెండవ చివర వేడెక్కును. అనగా ఉష్ణం ఆ చివర నుండి ఈ చివరకు వహనం వలన ప్రయాణించినది.
  2. వంట చేస్తున్నప్పుడు లోహపు గరిటెలు, స్పూన్లు వేడెక్కటం మనం గమనిస్తూనే ఉంటాము.
  3. వంట పాత్ర హ్యాండిల్ కు, వేడికి కాలకుండా ఉష్ణనిరోధక పదార్థాలను తొడుగుతూ ఉంటారు.

ప్రశ్న 8.
వాతావరణం యొక్క కొలవగలిగే అంశాలేమి, వాటి గురించి వివరించండి.
జవాబు:
వాతావరణంలో కొలవగలిగిన అంశాలు :
1. తేమ :
వాతావరణంలోని తేమను అర్హత అంటారు. దీనిని హైగ్రోమీటర్ సహాయంతో కొలుస్తారు. సాధారణంగా ఉష్ణోగ్రతలు పెరిగినపుడు గాలిలో తేమ శాతం కూడా పెరుగుతుంది.

2. కనిష్ట ఉష్ణోగ్రత :
ఒక రోజులో నమోదైన అతి తక్కువ ఉష్ణోగ్రతను ఆ రోజు కనిష్ట ఉష్ణోగ్రత అంటారు. సాధారణంగా ఇది ఉదయం పూట 4 నుండి 5 గంటల ప్రాంతంలో నమోదు అవుతుంది. దీనిని సిక్స్ గరిష్ట – కనిష్ట ఉష్ణమాపకంతో నమోదు చేస్తారు.

3. గరిష్ట ఉష్ణోగ్రత :
ఒక రోజులోని అతి ఎక్కువ ఉష్ణోగ్రతను ఆ రోజు యొక్క గరిష్ట ఉష్ణోగ్రత అంటారు. సాధారణంగా ఇది మధ్యాహ్నం వేళ 12 గంటల నుండి 1 గంట ప్రాంతంలో నమోదు అగును. దీనిని కూడా సిక్స్ గరిష్ట – కనిష్ట ఉష్ణమాపకంతో నమోదు చేస్తారు.

4. గాలివేగం :
నిర్దిష్ట దిశలో గాలి ప్రవహించే వేగాన్ని గాలి వేగం అంటారు. దీనిని ఎనిమో మీటర్లో కొలుస్తారు. సాధారణంగా గాలి వేగం, ఉదయం మరియు సాయంత్ర వేళల్లో, అధికంగాను వర్షాలు వచ్చే సమయంలో విపరీతంగాను ఉంటుంది.

5. వర్షపాతం :
ఒక ప్రదేశంలో నమోదయిన వర్షాన్ని వర్షపాతం అంటారు. వర్షపాతాన్ని వర్షమాపకం అనే పరికరంతో కొలుస్తారు. ఒక ఏడాదిలో వర్షపాతం విలువ ఒక ఏడాదిలో 250 ml కన్నా తక్కువగా ఉంటే వాటిని ఎడారులుగా పరిగణిస్తారు. ఇండియాలో సాధారణ వర్షపాతం విలువ 120 cm.

AP Board 7th Class Science Solutions Chapter 9 ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి

ప్రశ్న 9.
గాలి పీడనాన్ని కలుగజేస్తుందని చూపే కృత్యాన్ని వివరించండి. (కృత్యం 13)
AP Board 7th Class Science Solutions Chapter 9 ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి 2
జవాబు:
ఉద్దేశ్యం : గాలిపీడనాన్ని కలుగజేస్తుందని నిరూపించుట.
కావలసిన పరికరాలు : గ్లాసు, పోస్ట్కర్డ్, నోట్‌బుక్.

పద్దతి :
ఒక గ్లాసును తీసుకొని దానిపై ఒక పోస్ట్ కార్డును ఉంచాలి. నోట్ బుక్ ను ఒక దానిని తీసుకొని, పోస్ట్ కార్డుపైన ఉన్న గాలి కదిలేటట్లు అటు, ఇటు ఊపాలి.

పరిశీలన :
పోస్ట్ కార్డు పైకి లేవడాన్ని గమనిస్తాము.

వివరణ :

  1. నోటు పుస్తకాన్ని కదిలించడం వలన పోస్ట్కర్డ్ పై ఉన్న గాలిలో కదలిక వస్తుంది.
  2. ఇలా కదులుతున్న గాలి అల్పపీడనాన్ని సృష్టిస్తుంది.
  3. అందువల్ల గ్లాస్ లోపల అధిక పీడనంతో ఉన్న గాలి వల్ల పోస్టర్లు పైకి లేస్తుంది.

నిరూపణ :
గాలిపీడనాన్ని కలుగు చేస్తుందని నిరూపణ అవుతుంది.

ప్రశ్న 10.
సిక్స్ గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణమాపక నిర్మాణం మరియు పనితీరును వివరించండి.
జవాబు:
సిక్స్ యొక్క గరిష్ట మరియు కనిష్ట ఉష్ణమాపకం :
వాతావరణ సూచనలో ఉపయోగించే వాతావరణ పరికరమైన సిక్స్ యొక్క గరిష్ట కనిష్ట ఉష్ణ మాపకం, ఒక ప్రాంతంలో, రోజు యొక్క గరిష్ట (అత్యధిక) మరియు కనిష్ట (అత్యల్ప) ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగిస్తారు. 1780లో జేమ్స్ సిక్స్ దీనిని (గరిష్ట కనీస థర్మామీటర్) (MMT) కనుగొన్నారు.
AP Board 7th Class Science Solutions Chapter 9 ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి 3

నిర్మాణం :

  1. ‘U’ ఆకారపు గాజు గొట్టం, ఒక భుజానికి స్థూపాకార బల్పు ఉంటుంది. దీనిని ‘A’ తో సూచిస్తాము.
  2. మరొక భుజానికి గోళాకార గాజు బల్పు ఉంటుంది. దీనిని ‘B’ తో సూచిస్తాము.
  3. బల్బు A లో ఆల్కహాల్ ఉంటుంది. అలాగే బల్బు B లో ఆల్కహాల్ మరియు దాని ఆవిరులు ఉంటాయి. ‘U’ గొట్టంలో పాదరసం ఉంటుంది.
  4. పాదరసం ఆల్కహాలు కలిసే ప్రాంతంలో ఒక భుజంలో I అనే సూచిక మరొక భుజంలో 1,, అనే సూచిక ఉంటాయి. వీటి వెనుక, స్కేలు ఉంటుంది.

పనిచేయు విధానం :

  1. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, బల్క్ A లోని ఆల్కహాల్ వ్యాకోచించి, U ట్యూబ్ లోని పాదరసాన్ని నెట్టుతుంది.
  2. ఇది సూచిక (1) పైకి కదిలేలా చేస్తుంది. ఇది రోజులో గరిష్ట ఉష్ణోగ్రతను సూచిస్తుంది.
  3. ఉష్ణోగ్రత తగ్గినప్పుడు, బల్క్ A లోని ఆల్కహాల్ సంకోచించి పాదరసాన్ని వెనక్కి లాగుతుంది.
  4. ఇది సూచిక (1) పైకి కదలడానికి చేస్తుంది. ఇది రోజులో కనిష్ట ఉష్ణోగ్రతను సూచిస్తుంది.
  5. రీడింగులను తీసుకున్న తరువాత I, మరియు I, సూచికలను అయస్కాంతం ఉపయోగించి వాటి అసలు స్థానాలకు తీసుకువస్తారు.
  6. ఉష్ణమాపకాన్ని వేడి నీటిలో ఉంచి ఉష్ణోగ్రత రీడింగ్ ను నమోదు చేస్తారు.

7th Class Science 9th Lesson ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి InText Questions and Answers

7th Class Science Textbook Page No. 73

ప్రశ్న 1.
ఉష్ణోగ్రత అంటే ఏమిటి?
జవాబు:
ఉష్ణము యొక్క తీవ్రతను ఉష్ణోగ్రత అంటారు.

ప్రశ్న 2.
ఉష్ణము, ఉష్ణోగ్రత మధ్యగల భేదాలు ఏమిటి?
జవాబు:

ఉష్ణము ఉష్ణోగ్రత
1. ఉష్ణము ఒక శక్తి స్వరూపము. 1. ఉష్ణము యొక్క తీవ్రతను ఉష్ణోగ్రత అంటారు.
2. దీనిని కెలోరీ లేదా జో లలో కొలుస్తారు. 2. దీనిని సెంటిగ్రేడ్ లేదా ఫారన్‌హీట్లలో కొలుస్తారు.
3. కెలోరిమీటరు ఉపయోగించి ఉష్ణాన్ని కొలుస్తారు. 3. థర్మామీటరు వాడి ఉష్ణాన్ని కొలుస్తారు.
4. ఇది పనిచేసే సామర్థ్యం కల్గి ఉంటుంది. 4. దీనిలో ఉష్ణం యొక్క స్థాయిని కొలుస్తారు.
5. ఇది వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ప్రవహిస్తుంది. 5. వస్తువు ఉష్ణం పెరగటం వలన ఉష్ణోగ్రత కూడ పెరుగుతుంది.

7th Class Science Textbook Page No. 79

ప్రశ్న 3.
స్నానం చేయటానికి నీటిని వేడి చేసినపుడు, నీటి ఉపరితలం ఎలా వేడెక్కుతుంది?
జవాబు:
ద్రవాలలో ఉష్ణం సంవహనం వలన ప్రసారమౌతుంది. నీటి క్రింద ఉన్న ఉష్ణం వలన వేడెక్కే నీరు పైకి కదిలి ఉపరితలం వేడిగా ఉంటుంది.

AP Board 7th Class Science Solutions Chapter 9 ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి

7th Class Science Textbook Page No. 81

ప్రశ్న 4.
మానవ శరీరాన్ని తాకకుండానే థర్మల్ స్కానర్ ఏ విధంగా పని చేస్తుంది?
జవాబు:
ఉష్ణ వికిరణ రూపంలో ఉష్ణాన్ని గ్రహించటం ద్వారా థర్మల్ స్కానర్ పని చేస్తుంది.

ప్రశ్న 5.
థర్మోస్ ఫ్లాస్క్ ఎలా పనిచేస్తుంది?
జవాబు:
AP Board 7th Class Science Solutions Chapter 9 ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి 4

  1. థర్మోస్ ప్లాను సర్ జేమ్స్ డేవర్ కనిపెట్టారు.
  2. దీనిలో రెండు పొరలు గల గాజు పాత్ర ఉంటుంది. ఈ పొరల మధ్య గాలిని తొలగించి శూన్యాన్ని ఏర్పరుస్తారు.
  3. ఫ్లాలో పోయబడిన పదార్థాలు (పాలు, టీ, కాఫీ) వికిరణ రూపంలో ఉష్ణాన్ని కోల్పోకుండా ఫ్లాస్క్ లోపలి వెండిపూత కాపాడుతుంది.
  4. ఫ్లాస్క్ గోడల మధ్య యానకం లేకపోవడం వల్ల ఉష్ణవాహకం లేదా ఉష్ణసంవహనం జరగదు.
  5. ఫలితంగా, ఉష్ణం బయటికి బదిలీ చేయబడక కొన్ని గంటల పాటు ఫ్లాస్క్ లోపల వేడిగానే ఉంటుంది.

ప్రశ్న 6.
ఏ పరికరం ద్వారా ఉష్ణ నష్టాన్ని తగ్గించవచ్చు?
జవాబు:
థర్మాస్ ప్లాస్క్ పరికరం ఉష్ణ నష్టాన్ని బాగా తగ్గిస్తుంది.

7th Class Science Textbook Page No. 83

ప్రశ్న 7.
ప్లాలో టీ యొక్క ఉష్ణాన్ని ఎప్పటికీ కాపాడగలమా?
జవాబు:
ఇది సాధ్యం కాదు, మూత ద్వారా సంవహన ప్రవాహాల వల్ల, గాజు ద్వారా ఉష్ణ వహనం వల్ల స్వల్ప మొత్తంలో ఉష్ణం బయటకు పోతూ ఉంటుంది. అందువల్ల టీ ఎక్కువకాలం పాటు లేదా ఎప్పటికీ ఉష్ణాన్ని నిలుపుకోలేదు.

ప్రశ్న 8.
లోహపు ముక్కను వేడిచేసినపుడు ఏమి జరుగుతుంది?
జవాబు:
లోహపు ముక్కను వేడిచేసినపుడు అది వ్యాకోచిస్తుంది.

ప్రశ్న 9.
వేడి చేసినపుడు లోహపు ముక్క ఆకారం, పరిమాణం ఏమౌతుంది?
జవాబు:
వేడి వలన లోహపు ముక్క ఆకారం, పరిమాణం పెరుగుతుంది.

ప్రశ్న 10.
రైల్వే ట్రాక్ లో పట్టాల మధ్య కొద్దిగా ఖాళీ వదులుతారు ఎందుకు?
జవాబు:

  1. రైలు పట్టాలు ఇనుముతో తయారవుతాయి.
  2. వేసవిలోని వేడికి ఇనుము వ్యాకోచిస్తుంది.
  3. ఈ వ్యాకోచము రెండవ పట్టాను నెట్టకుండా, రెండు రైలుపట్టాల మధ్య ఖాళీ వదులుతారు.
  4. లేకుంటే రైలు పట్టాలు వ్యాకోచించి పైకి లేచే ప్రమాదం ఉంది.

ప్రశ్న 11.
జ్వరంతో బాధపడుతున్న వ్యక్తి నోటిలో థర్మామీటరు ఉంచినపుడు, దాని పాదరసమట్టంలో కలిగే మార్పు ఏమిటి?
జవాబు:

  1. జ్వరమానిని వ్యక్తి నోటిలో ఉంచినపుడు, దాని బల్బులోని పాదరసం వ్యాకోచిస్తుంది.
  2. వ్యాకోచించిన పాదరస పొడవు ఆధారంగా వ్యక్తి శరీర ఉష్ణోగ్రతను కొలుస్తారు.
  3. అధిక ఉష్ణోగ్రత కల్గిన వ్యక్తికి పాదరస వ్యాకోచం అధికంగా ఉంటుంది.
  4. దాని ఆధారంగా వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడా, జ్వరం కల్గి ఉన్నాడా అని చెప్పవచ్చు.

AP Board 7th Class Science Solutions Chapter 9 ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి

ప్రశ్న 12.
వేడి నూనెలో వేసిన పూరి ఎందుకు ఉబ్బుతుంది?
జవాబు:

  1. పూరి పిండిలో ఉన్న తేమ నూనె వేడికి ఆవిరిగా మారుతుంది.
  2. ఆవిరి, పూరిని రెండు పొరలుగా చేసి మధ్యభాగం ఆక్రమిస్తుంది.
  3. అందువలన వేడి నూనెలో పూరి వేసినపుడు అది లావుగా ఉబ్బుతుంది.
  4. ఇది వాయువ్యాకోచానికి మంచి ఉదాహరణ.

ప్రశ్న 13.
ఉష్ణాన్ని ప్రసరింపజేసినపుడు పదార్థ పరిమాణంలో ఎటువంటి మార్పులు గమనిస్తాము?
జవాబు:
ఉష్ణాన్ని ప్రసరింపజేసినపుడు పదార్ధ పరిమాణంలో పెరుగుదల కనిపిస్తుంది. దీనినే వ్యాకోచం అంటారు.

7th Class Science Textbook Page No.93

ప్రశ్న 14.
ఒక ప్రదేశంలో గాలి వ్యాకోచించి పైకి కదిలినపుడు, ఏం జరుగుతుంది?
జవాబు:
ఒక ప్రదేశంలో గాలి వ్యాకోచించి పైకి కదిలితే, ఆ ప్రాంతంలో పీడనం తగ్గుతుంది.

ప్రశ్న 15.
వేడి గాలి ఖాళీ చేసిన ప్రదేశాన్ని ఎవరు ఆక్రమిస్తారు?
జవాబు:
వేడి గాలి ఖాళీ చేసిన ప్రదేశాన్ని చల్లగాలి ఆక్రమిస్తుంది.

ప్రశ్న 16.
వేడి గాలి ఖాళీ చేసిన ప్రదేశంలోకి చల్లగాలి ఎందుకు వస్తుంది?
జవాబు:
వేడిగాలి కంటే చల్లగాలి ఎక్కువ పీడనం కల్గి ఉంటుంది. కావున తక్కువ పీడనం ఉన్న ప్రదేశానికి చల్లగాలి విస్తరిస్తుంది.

ప్రశ్న 17.
పొగ ఎప్పుడు ఎందుకు పైకి వెళుతుందో చెప్పగలరా?
జవాబు:

  1. వేడిగా ఉన్న వస్తువుల నుండి పొగ వస్తుంది. వేడికి పొగ వ్యాకోచిస్తుంది.
  2. వేడిగాలి చల్లని గాలికంటే తేలికగా ఉంటుంది.
  3. పొగ కూడా వేడిగా ఉండటం వలన తేలికై పైకి లేస్తుంది.

AP Board 7th Class Science Solutions Chapter 9 ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి

ప్రశ్న 18.
మనకు వెంటిలేటర్లు మరియు ఎగ్జాస్ట్ ఫ్యాన్లు గోడ పై భాగంలోనే ఎందుకు ఉంటాయి?
జవాబు:

  1. పొగ మరియు వేడిగాలి వ్యాకోచించటం వలన తేలిక అవుతుంది.
  2. తేలికైన గాలి పైకి కదులుతుంది.
  3. అందువలన వేడిగాలినీ, పొగను తొలగించటానికి గోడపై భాగంలో వెంటిలేటర్స్, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఉంటాయి.

7th Class Science Textbook Page No. 97

ప్రశ్న 19.
వడదెబ్బ కలగడంలో ఆర్ధత పాత్ర ఏమిటి?
జవాబు:
చెమట బాష్పీభవనం చెందడం వల్ల మన శరీరం చల్లబడుతుంది. వేసవిలో గాలి యొక్క ఆర్ధత ఎక్కువగా ఉంటుంది. ఈ అధిక ఉష్ణోగ్రత మరియు తేమ కారణంగా, మన శరీరం నుండి చెమట ఆవిరై అది చల్లబరచడం మరింత కష్టమవుతుంది. అయినప్పటికీ శరీరం నీటిని కోల్పోతుంది. అధిక ఉష్ణోగ్రతలతో పాటు, అధిక ఆర్థత కొన్నిసార్లు వడదెబ్బకు కారణం కావచ్చు.

7th Class Science Textbook Page No. 99

ప్రశ్న 20.
ఒక ప్రదేశం యొక్క వాతావరణ వివరాలను ఎలా పొందగలం?
జవాబు:

  1. వాతావరణ శాఖ ఆ ప్రాంతం యొక్క వాతావరణ వివరాలను సేకరిస్తుంది.
  2. దీనికోసం వారు వివిధ పరికరాలు, శాటిలైట్ల సహకారం తీసుకుంటారు.
  3. వాతావరణం వివిధ అంశాల కలయిక కాబట్టి వివిధ పరికరాలు వాడకం తప్పనిసరి.
  4. పీడనానికి – బారోమీటర్, తేమకు హైగ్రోమీటర్, గాలి వేగానికి ఎనిమో మీటరు, ఉష్ణోగ్రతకు – సిక్స్ గరిష్ట – కనిష్ట ఉష్ణమాపకాలు వాడతారు.

ఆలోచించండి – ప్రతిస్పందించండి

7th Class Science Textbook Page No. 77

ప్రశ్న 1.
ఒకే పరిమాణం గల రెండు మంచు ముక్కలను చెక్క మరియు అల్యూమినియం వస్తువులపై ఉంచండి. ఏమంచు ముక్క త్వరగా కరుగుతుంది?
జవాబు:

  1. ఒకే పరిమాణం గల రెండు మంచు ముక్కలను చెక్క మరియు అల్యూమినియం వస్తువులపై ఉంచినపుడు అల్యూమినియం వస్తువుపై ఉంచిన మంచు ముక్క త్వరగా కరుగుతుంది.
  2. అల్యూమినియం ఉత్తమ ఉష్ణవాహకం. ఇది త్వరగా ఉష్టాన్ని గ్రహించటం వలన మంచు ముక్క త్వరగా కరుగుతుంది.
  3. చెక్క అడమ ఉష్ణవాహకం. ఇది మంచు ముక్క నుండి ఉష్టాన్ని గ్రహించదు. కావున, మంచు నెమ్మదిగా కరుగుతుంది.

ప్రశ్న 2.
ధృవ ప్రాంతంలో నివసించే జంతువులకు ఎక్కువ వెంట్రుకలు మరియు చర్మం క్రింద మందపాటి క్రొవ్వు పొరను కలిగి ఉంటాయి. ఎందుకు?
జవాబు:

  1. ధృవ ప్రాంతపు వాతావరణం చాలా చలిగా ఉంటుంది.
  2. ఈ ప్రాంతంలో నివసించే జంతువులు శరీరం ఉష్ణం త్వరగా కోల్పోతాయి.
  3. కావున అవి ఉష్ణ నష్టం తగ్గించుకోవటానికి అధమ ఉష్ణవాహకాలనే రోమాలను శరీరంపై కల్గి ఉంటాయి.
  4. చర్మం నుండి ఉష్ణ నష్టం కలుగకుండా చర్మం క్రింద మందపాటి క్రొవ్వు పొరను కల్గి ఉంటాయి.

ప్రశ్న 3.
శీతాకాలంలో ఉన్ని దుస్తులను ఎందుకు ధరిస్తారు?
జవాబు:

  1. ఉన్ని అధమ ఉష్ణవాహకం. ఇది ఉష్ణనష్టాన్ని నివారిస్తుంది.
  2. శీతాకాలంలో పరిసరాలు చల్లగా ఉంటాయి.
  3. కావున శరీరం నుండి ఉష్ణ నష్టం ఉంటుంది.
  4. దీనిని నివారించటానికి మనం ఉన్ని దుస్తులు ధరిస్తాము.
  5. ఇవి శరీరం నుండి ఉష్ణాన్ని బయటకు పోనివ్వకుండా వెచ్చగా ఉంచుతాయి.

AP Board 7th Class Science Solutions Chapter 9 ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి

ప్రశ్న 4.
ఎడారిలో నివశించే జంతువులు ఎందుకు బొరియలలో నివశిస్తాయి?
జవాబు:

  1. ఎడారి అధిక ఉష్ణ ప్రాంతం.
  2. జీవులు పరిసరాల నుండి ఉష్ణోగ్రతలను పొందుతాయి.
  3. కావున జీవులు ఈ వేడికి తట్టుకోవడం కష్టము.
  4. ఎడారి వేడి నుండి తట్టుకోవడానికి ఎడారి జీవులు భూమిలోపలికి బొరియలు చేసి నివసిస్తాయి.
  5. అందువలన అవి ఎడారి అధిక ఉష్ణం నుండి తప్పించుకొంటాయి.

7th Class Science Textbook Page No. 79

ప్రశ్న 5.
వేసవి కాలంలో చెరువు లేదా సరస్సులోని క్రింది పొరలలో నీటికంటే పై పొరలలో నీరు ఎక్కువ వేడిగా ఎందుకు ఉంటుంది?
జవాబు:

  1. ద్రవాలలో ఉష్ణము సంవహన ప్రక్రియ ద్వారా ప్రసరిస్తుంది.
  2. చెరువు లేదా సరస్సులలో నీరు సూర్యుని వలన వేడెక్కుతాయి.
  3. సూర్మరశ్మి నీటి ఉపరితలంపై పడటం వలన, పై పొరలు వేడెక్కుతాయి.
  4. సంవహనం వలన వేడినీరు ఆవిరి అవుతుంది కాని క్రిందకు ప్రసరించదు.
  5. అందువలన సరస్సు, చెరువులలో పై పొరలు ఎండకు వేడెక్కినప్పటికి క్రింది పొరలు చల్లగా ఉంటాయి.

7th Class Science Textbook Page No. 83

ప్రశ్న 6.
విద్యుత్ స్తంభాలపై లైన్లు ఎందుకు వదులుగా ఉంటాయి?
జవాబు:

  1. విద్యుత్ స్తంభాలపై వైర్లు వదులుగా వ్రేలాడుతుంటాయి.
  2. ఇవి లోహాలతో నిర్మితమవుట వలన వేడికి సాగుతాయి.
  3. అందువలన వేసవి కాలంలో ఇవి మరింత క్రిందకు ఉన్నట్లు కనిపిస్తాయి.
  4. వీటిని వదులుగా ఉంచకపోతే చలికాలం సంకోచం వలన దగ్గరకు లాగబడతాయి.
  5. అందువలన తీగెలు తెగిపోవటం లేదా స్తంభాలు పడిపోవటం జరుగుతుంది.

ప్రశ్న 7.
లోహపు వంతెనల బీమ్ కింద రోలర్స్ ఉంచుతారు. ఎందుకు?
జవాబు:

  1. లోహపు వంతెనల బీమ్ లు వేసవి కాలంలో వేడికి వ్యాకోచిస్తాయి.
  2. ఈ వ్యాకోచంలో బీమ్లు పొడవు పెరుగుతాయి.
  3. అందువలన బీమ్ క్రింద రోలర్స్ అమర్చటం వలన ఇవి సులువుగా ముందుకు జరుగుతాయి.
  4. బీమ్ ల మధ్య ఖాళీ వదలటం వలన వ్యాకోచం వలన ఈ ఖాళీ భర్తీ చేయబడుతుంది.
  5. రోలర్స్ లేకుండా బోల్టులతో బిగించినట్లయితే వ్యాకోచానికి ఆటంకం ఏర్పడి బోల్టులు ఊడిపోయే ప్రమాదం ఉంది.

కృత్యాలు, ప్రాజెక్ట్ పనులు

7th Class Science Textbook Page No. 107

ప్రశ్న 1.
మీ పరిసరాలలో వివిధ రకాల పదార్థాలను సేకరించి వాటి వాహకత్వాన్ని బట్టి ఉత్తమ, అధమ వాహకంగా వర్గీకరించి, ప్రాజెక్టు నివేదికను తయారు చేయండి.
జవాబు:

ఉత్తమ వాహకాలు అధమ వాహకాలు
రాగి, ఇనుము, ఇత్తడి, స్టీలు, వెండి, బంగారం, అల్యూమినియం, కంచు. చెక్క ప్లాస్టిక్, రంపపు పొట్టు, ఎండుగడ్డి, ధాన్యపు పొట్టు, గాలి, నీరు.

 

  1. ఉష్టాన్ని తమగుండా ప్రసరింపజేసే పదార్థాలను ఉష్ణవాహకాలు అంటారు. సాధారణంగా లోహాలన్ని ఉత్తమ వాహకాలుగా ఉన్నాయి.
  2. ఉష్ణాన్ని తమగుండా ప్రసరింపనీయని పదార్థాలను అధమ వాహకాలు అంటారు. చెక్క, ప్లాస్టిక్ వీటికి ఉదాహరణలు.
  3. మన నిత్య జీవితంలో వాహకాలు మరియు అవాహకాలు రెండూ అవసరం.
  4. కొన్ని సందర్భాలలో ఈ రెండింటిని కలిపి వస్తువులు చేస్తారు.
    ఉదా : దోశె పెనం, ఉష్ణవాహకం కాగా, దాని హ్యాండిల్ అవాహకం.

ప్రశ్న 2.
పశువైద్యుడిని సందర్శించండి. పెంపుడు జంతువులు మరియు పక్షుల సాధారణ శరీర ఉష్ణోగ్రతను కనుగొనండి.
జవాబు:

జంతువు శరీర ఉష్ణోగ్రత
1. కుక్క 39°C
2. పిల్లి 39°C
3. చిలుక 38.5°C
4. పావురము 38.9°C
5. గేదె 39°C

AP Board 7th Class Science Solutions Chapter 9 ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి

ప్రశ్న 3.
దగ్గరలో ఉన్న తహసిల్దార్ ఆఫీసు లేదా మెట్రోలాజికల్ డిపార్ట్ మెంట్ ఆఫీసును సందర్శించి, వాతావరణంలో కొలవగలిగిన అంశాలను, కొలిచే పరికరాలను పరిశీలించి, నమోదు చేయండి.
జవాబు:

వాతావరణ అంశం పరికరాలు
1. గాలి వేగం అనిమో మీటరు
2. గాలిలో తేమ హైగ్రో మీటరు
3. కనిష్ట ఉష్ణోగ్రత సిక్స్ గరిష్ట – కనిష్ట ఉష్ణమాపకం
4. గరిష్ట ఉష్ణోగ్రత సిక్స్ గరిష్ట – కనిష్ట ఉష్ణమాపకం
5. వాయు పీడనం బారోమీటరు
6. గాలి వీచే దిశ ఎనిమో మీటరు.

ప్రశ్న 4.
కనీసం పదిమంది మీ స్నేహితుల శరీర ఉష్ణోగ్రతను లెక్కించి నివేదిక తయారు చేయండి.
జవాబు:

మిత్రులు శరీర ఉష్ణోగ్రత
శ్రీను 38.6°C
రవి 38.7°C
మల్లి 38.9°C
లక్ష్మి 38.2° C
సీత 38.1°C
నేహా 38.4°C
నిరుపమ 38.6°C
ప్రకాష్ 39°C
వివేక్ 38.9°C
లిఖిత 38.7°C

ప్రశ్న 5.
సిక్స్ గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణమాపకం సహాయంతో ఈ రోజు నుండి వరుసగా వచ్చే ఐదు రోజుల గరిష్ఠ మరియు కనిష్ఠ ఉష్ణోగ్రతలను నమోదు చేయండి.
జవాబు:

కృత్యాలు

కృత్యం – 1

ప్రశ్న 1.
ఒక గాజు సీసా, ఒక రూపాయి నాణెం తీసుకోండి. సీసా మూతిని తడిపి దానిపై నాణెమును ఉంచండి. మీ. చేతులను కలిపి రుద్దడం ద్వారా వేడిని ఉత్పత్తి చేయండి. ఇప్పుడు వాటిని సీసా చుట్టూ ఉంచండి.
ఎ) మీరు ఏమి గమనించారు? అది ఎలా జరిగింది?
జవాబు:
గాజు సీసాపై రూపాయి నాణెం కదలటం గమనించాను. సీసాలోని గాలి వ్యాకోచించి బయటకు రావటం వలన నాణెం కదిలింది.

బి) ఒక కప్పులోని గోరువెచ్చని పాలను తాకితే నీకు వేడిగా ఎందుకు అనిపిస్తుంది?
జవాబు:
చేతిని పాలలో ఉంచినపుడు పాల నుండి ఉష్ణము శరీరానికి ప్రసరిస్తుంది. కావున పాలు వేడిగా అనిపిస్తాయి.

సి) ఒక గ్లాసు లస్సీని తాగితే మీకు ఎందుకు చల్లగా అనిపిస్తుంది?
AP Board 7th Class Science Solutions Chapter 9 ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి 5
జవాబు:
లస్సీ తక్కువ ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది. అందువలన శరీరం ఉష్ణాన్ని కోల్పోతుంది. కావున లస్సీ చల్లగా ఉంటుంది.

పై పరిశీలనల నుంచి, మీ చేతుల నుంచి గాజు సీసాకు సరఫరా అయిన ఉష్ణం వల్లే నాణెంలో చలనం కలుగుతుంది. కాబట్టి, ఉష్ణం ఒక శక్తిరూపం అని చెప్ప వచ్చు .

కృత్యం – 2

ప్రశ్న 2.
ఉష్ణోగ్రత అనగా ఏమిటో వివరించండి.
జవాబు:
AP Board 7th Class Science Solutions Chapter 9 ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి 6

  1. ఒక గ్లాసులో కొంత గోరువెచ్చని నీటిని, మరో గ్లాసులో వేడి నీటిని తీసుకోండి. (దీనిని మీరు భరించగలిగేంత). రెండింటి వేడిని అనుభూతి చెందండి.
  2. ఒక గ్లాసు చల్లని నీటిని, మరో గ్లాసులో మంచు ముక్కను తీసుకోండి. రెండింటి చల్లదనాన్ని అనుభూతి చెందండి.
  3. గోరువెచ్చని నీటికంటే వేడి నీరు వేడిగా ఉండటాన్ని, చల్లని నీటికంటే ఐస్ ముక్క చల్లగా ఉండటాన్ని మీరు అనుభూతి చెందుతారు. ,
  4. ఈ వెచ్చదనం, చల్లదనాలలోని వ్యత్యాసాలను చల్లదనపు స్థాయిగా, వెచ్చదనపు స్థాయిగా చెప్పవచ్చు. ఈ వెచ్చదనం లేదా చల్లదనం యొక్క స్థాయిని ఉష్ణోగ్రత అని అంటారు.
  5. ఉష్ణోగ్రతను డిగ్రీ సెల్సియస్, డిగ్రీ ఫారెన్హీట్ లేదా కెల్విన్లలో కొలుస్తారు.

కృత్యం – 3

ప్రశ్న 3.
ఒక గాజు బీకరును తీసుకొని అందులో కొంత వేడినీటిని పోయండి. ఇప్పుడు ఒక లోహపు చెంచా, ప్లాస్టిక్ చెంచా, చెక్కముక్క గాజుకడ్డీ, పొడవాటి ఇనుపమేకులను పటంలో చూపినటు ఉంచండి. కొన్ని నిమిషాలపాటు వేచి ఉండండి. ప్రతి వస్తువును తాకి చూడండి, దిగువ ఇవ్వబడిన టేబుల్ ని నింపండి.
AP Board 7th Class Science Solutions Chapter 9 ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి 7
జవాబు:

ఉష్ణాన్ని ప్రవహింపజేసే వస్తువులు వేడిని ప్రవహింపచేయని వస్తువులు
1. లోహపు చెంచా ప్లాస్టిక్ చెంచా
2. ఇనుప మేకులు చెక్కముక్క
3. రాగి తీగె గాజుకడ్డీ

కృత్యం – 4

ప్రశ్న 4.
ఉష్ణవహనాన్ని ఎలా నిరూపిస్తావు?
జవాబు:
ఉద్దేశం : ఉష్ణ వహనాన్ని నిరూపించటం.

పరికరాలు : స్టీలు స్పూన్, మైనం, గుండుసూదులు, కొవ్వొత్తి.

విధానం :

  1. ఒక లోహపు, చెంచాను తీసుకొని, దానిపై ఒకదానితో మరొకటి సమాన దూరంలో ఉండేటట్లు కొవ్వొత్తి మైనంతో నాలుగు పిన్నులు అతికించాలి.
  2. చెంచా ఒక చివరను కొవ్వొత్తి మంటపై ఉంచి రెండవ చివరను గుడ్డముక్కతో పట్టుకొని పరిశీలించాలి.

AP Board 7th Class Science Solutions Chapter 9 ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి 8
పరిశీలన :
మంటలో ఉంచిన వైపు నుండి ఒకదాని తరువాత మరొకటిగా పిన్నులు క్రిందకు పడటాన్ని గమనించవచ్చు.

వివరణ :
ఉష్ణము లోహపు చెంచా ద్వారా, మంటలో ఉంచిన వైపు నుండి చేతివైపుకు ప్రయాణించటం వలన ఇది జరిగింది.

నిరూపణ :
ఉష్ణము వేడి కొన నుంచి చల్లని కొనవైపుకు ప్రయాణించడాన్ని ఉష్ణవహనము అంటారు.

AP Board 7th Class Science Solutions Chapter 9 ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి

కృత్యం – 5

ప్రశ్న 5.
ద్రవ పదార్థాల్లో ఉష్ణసంవహనాన్ని ఎలా నిరూపిస్తావు?
జవాబు:
ఉద్దేశ్యం :
ద్రవపదార్థాలలో ఉష్ణసంవహనాన్ని ప్రదర్శించుట.

ఏం కావాలి? :
గుండ్రని గాజుకుప్పె, స్టాండ్, నీరు, పొటాషియం పర్మాంగనేట్, స్ట్రా, కొవ్వొత్తి / సారా దీపం.

ఎలా చేయాలి :
గుండ్రని గాజు కుప్పె తీసుకొని దానిని స్టాండుకు బిగించండి. ఇప్పుడు ఈ కుప్పెను నీటితో నింపండి. నీరు నిశ్చలంగా ఉండేవరకు కొంత సమయం వేచి ఉండండి. పొటాషియం పర్మాంగనేట్ స్పటికాలను ఒక సా ఉపయోగించి కుప్పె యొక్క దిగువ భాగానికి నెమ్మదిగా పోయండి. ఇప్పుడు నెమ్మదిగా, కుప్పెను కొవ్వొత్తితో గాని సారాదీపం క్రింద గాని వేడి చేయండి, ఏం జరుగుతుందో జాగ్రత్తగా పరిశీలించండి.

AP Board 7th Class Science Solutions Chapter 9 ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి 9
ఏం చూశావు? :
కొన్ని నిమిషాల తరువాత పొటాషియం పర్మాంగనేట్ స్పటికాలు నీటిలో కరిగి, రంగు నీరు పైకి కదులుతుంది. ఎందుకంటే అడుగున ఉన్న నీరు వేడెక్కి వ్యాకోచిస్తుంది. అందువలన, నీరు తేలికై పైకి కదులుతుంది. వేడి నీటి కంటే బరువుగా ఉండే చల్లని నీరు కుప్పె యొక్క భాగాల వెంట పై నుండి కిందకు వస్తుంది. ఇలా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అందువల్ల, వేడి ఒక ప్రదేశం (దిగువ) నుంచి మరో ప్రదేశాని(పై)కి బదిలీ అవుతుంది.

ఏం నేర్చుకున్నావు :
కణాల చలనం ద్వారా ఉష్ణజనకం నుంచి ఉపరితలానికి ఉష్ణాన్ని బదిలీ చేసే ప్రక్రియను ఉష్ణసంవహనం అని అంటారు. ఇక్కడ ఉష్ణం సంవహన ప్రవాహాలు అని పిలవబడే ప్రవాహాల ద్వారా బదిలీ చేయబడుతుంది. ద్రవాలు మరియు వాయువులలో ఉష్ణము, ఉష్ణసంవహనం ద్వారా ప్రసారం అవుతుంది.

కృత్యం – 6

ప్రశ్న 6.
వేడికి ఘనపదార్థాలు వ్యాకోచిస్తాయని ఎలా నిరూపిస్తావు?
జవాబు:
ఉద్దేశం :
వేడికి ఘన పదార్థాలు వ్యాకోచిస్తాయని నిరూపించుట.

పరికరాలు :
రెండు చెక్క దిమ్మలు, సైకిల్ చువ్వ, ప్లాస్టిక్ టేప్, స్టా, సూది, క్రొవ్వొత్తులు లేదా దీపాలు.

AP Board 7th Class Science Solutions Chapter 9 ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి 10
విధానం :

  1. ఒకే ఎత్తుగల రెండు చెక్క దిమ్మలను మరియు ఒక సైకిల్ చువ్వను తీసుకోండి.
  2. దాని ఒక చివరను చెక్క దిమ్మకు ప్లాస్టిక్ టేప్ సహాయంతో కదలకుండా బిగించండి.
  3. సైకిల్ చువ్వ యొక్క రెండవ కొనను రెండవ చెక్క దిమ్మపై ఉంచండి.
  4. ఒక స్ట్రా తీసుకుని దానికి ఒక సూది గుచ్చండి.
  5. ఈ సూదిని సైకిల్ చువ్వ మరియు చెక్క దిమ్మల మధ్య ఉంచండి.
  6. 4 లేదా 5 కొవ్వొత్తులు లేదా దీపాలను చెక్క దిమ్మల మధ్య సైకిల్ చువ్వ కింద ఉంచండి.

పరిశీలన :
సూదికి గుచ్చిన స్ట్రా కొంచెం పైకి తిరిగింది.

వివరణ :
వేడి చేయటం వలన సైకిల్ చువ్వ వ్యాకోచించి ముందుకు జరగటం వలన సూది తిరిగి, స్ట్రాను పైకి తిప్పింది.

ఎ) మీరు స్ట్రాలో ఏదైనా కదలికను గమనించారా?
జవాబు:
స్టా కొంచెం పైకి తిరిగింది.

బి) అలా అయితే, దాని వెనుక కారణం ఏమిటి?
జవాబు:
సైకిల్ చువ్వ క్రింద ఉన్న సూది జరగటం వలన ఇది జరిగింది. వేడికి సైకిల్ చువ్వ వ్యాకోచించటం వలన సూది జరిగింది.

సి) దీపాలను తీసివేస్తే ఏమి జరుగుతుంది?
జవాబు:
సైకిల్ చువ్వ సంకోచించి స్ట్రా యథాస్థానానికి చేరును.

నిరూపణ :
వేడి చేయటం వలన ఘనపదార్థ పొడవు పెరిగింది. దీనినే వ్యాకోచం అంటారు.

AP Board 7th Class Science Solutions Chapter 9 ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి

కృత్యం – 7

ప్రశ్న 7.
వేడి చేయటం వలన ద్రవాలు వ్యాకోచిస్తాయని ఎలా నిరూపిస్తావు?
జవాబు:
ఉద్దేశం :
ద్రవాల వ్యాకోచాన్ని నిరూపించుట.

పరికరాలు :
పరీక్షనాళిక, కేశనాళిక, బీకరు స్టాండ్, సారాదీపం, నీరు.

AP Board 7th Class Science Solutions Chapter 9 ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి 11
విధానం :

  1. ఒక పరీక్షనాళిక తీసుకొని దానిని రంగు నీటితో నింపండి.
  2. ఒక కేశనాళికను దాని రబ్బరు బిరడా గుండా అమర్చండి.
  3. ఈ నాళికపై నీటి మట్టాన్ని గుర్తించండి..
  4. పరీక్షనాళికను వేడినీటిలో ఉంచి నీటి మట్టంలో మార్పు గమనించండి.

పరిశీలన :
కేశనాళికలోని నీటి మట్టం పెరిగింది.

వివరణ :
వేడినీటిలో ఉంచటం వలన పరీక్షనాళికలోని నీరు వేడెక్కి వ్యాకోచించి కేశనాళికలోనికి చేరింది. అందువలన నాళికలో నీటి మట్టం పెరిగింది.

నిరూపణ :
వేడిచేయటం వలన ద్రవాలు వ్యాకోచిస్తాయి.

వేడి చేసిన తరువాత నీటి మట్టంలో ఏమైనా మార్పు కనిపించిందా?
జవాబు:
వేడి చేయటం వలన గాజు నాళికలో నీటి మట్టం పెరిగింది.

బి) వేడి చేయడాన్ని ఆపండి, నీటి మట్టంలో ఏ మార్పు గమనించారు?
జవాబు:
వేడి చేయటం ఆపటం వలన గాజు నాళికలో నీటి మట్టం యథాస్థానానికి చేరింది.

కృత్యం – 8

ప్రశ్న 8.
వేడి చేసినపుడు వాయువులు వ్యాకోచిస్తాయని ఎలా నిరూపిస్తావు?
జవాబు:
ఉద్దేశం :
వేడి చేసినపుడు వాయువులు వ్యాకోచిస్తాయని నిరూపించుట.

పరికరాలు :
చిన్న మూతిగల సీసా, బెలూన్, నీటితో కూడిన పాత్ర

విధానం :

  1. ఒక చిన్న మూతిగల సీసాను తీసుకోండి.
  2. సీసా మూతికి బెలూను అమర్చండి.
  3. దీనిని నీటితో ఉన్న పాత్రలో ఉంచి నెమ్మదిగా వేడి చేయండి.

పరిశీలన :
బెలూన్ పరిమాణం క్రమేణా పెరిగింది. వివరణ : సీసాను వేడినీటిలో ఉంచటం వలన సీసా లోపలి గాలి వేడెక్కి బెలూన్ లోనికి విస్తరించింది. అందువలన బెలూన్ పరిమాణం పెరిగింది.

నిరూపణ : వేడికి వాయువులు వ్యాకోచిస్తాయి.

AP Board 7th Class Science Solutions Chapter 9 ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి 12
బెలూన్ పరిమాణం పెరగడానికి కారణం ఏమిటి?
జవాబు:
బెలూన్ పరిమాణం పెరగడానికి కారణం సీసా లోపల గాలి వేడెక్కి వ్యాకోచించడం.

ఇప్పుడు వేడి చేయడం ఆపి, సీసాను వేడి నీటి నుండి తొలగించండి. అవసరమైతే చల్లటి నీటిలో ఉంచండి, బెలూన్ పరిమాణాన్ని గమనించండి.

చల్లబడినప్పుడు బెలూన్ పరిమాణంలో ఏం మార్పు నీవు గమనించావు?
జవాబు:
చల్లబరిచినప్పుడు బెలూన్ పరిమాణం తగ్గుతుంది. వేడిని కోల్పోగానే గాలి సంకోచిస్తుంది. ఈ కృత్యం ద్వారా వాయువులు (గాలి) వేడెక్కినపుడు వ్యాకోచించి ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయని, చల్లబడినప్పుడు సంకోచించి తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయని తెలుస్తుంది.

కృత్యం – 9

ప్రశ్న 9.
రెండు గిన్నెలు తీసుకోండి. ఒక గిన్నెలో చల్లని నీరు, మరో గిన్నెలో వేడి నీళ్ళు తీసుకోవాలి. థర్మామీటర్ యొక్క పాదరస బల్బని చల్లటి నీటిలో పూర్తిగా మునిగే విధంగా ఉంచండి. పాదరస మట్టం స్థిరంగా ఉండేవరకు కొంతసేపు వేచి ఉండండి. ఆ రీడింగును నమోదు చేయండి.
AP Board 7th Class Science Solutions Chapter 9 ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి 13
ఎ) చల్లటి నీటి ఉష్ణోగ్రత ఎంత?
జవాబు:
చల్లని నీటి ఉష్ణోగ్రత 28°C.

బి) ఇవ్వబడ్డ వేడి నీటి ఉష్ణోగ్రత ఎంత?
జవాబు:
వేడి నీటి ఉష్ణోగ్రత 42° C.

AP Board 7th Class Science Solutions Chapter 9 ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి

ప్రశ్న 10.
క్లినికల్ థర్మామీటర్ ఎలా ఉపయోగించాలి?
జవాబు:
AP Board 7th Class Science Solutions Chapter 9 ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి 14

  1. యాంటీ సెప్టిక్ ద్రావణంతో క్లినికల్ థర్మామీటర్ ని సరిగ్గా కడగండి. పాదరస స్థాయిని క్రిందకు తీసుకురావడానికి జ్వరమానిని గట్టిగా పట్టుకొని కొన్నిసార్లు విదిలించండి.
  2. 35 డిగ్రీల సెల్సియస్ కంటే దిగువకు వచ్చే విధంగా చేయండి. ఇప్పుడు థర్మామీటరు ఉపయోగించండి.
  3. ఒకటి రెండు నిమిషాల తర్వాత, థర్మామీటర్ బయటకు తీసి రీడింగ్ నోట్ చేయండి. ఇది మీ శరీర ఉష్ణోగ్రత.
  4. రీడింగులను చూసేటప్పుడు జ్వరమాని బల్బ్ ని పట్టుకోవద్దు.
  5. మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత 37°C లేదా 98.4°E.

కృత్యం – 11

ప్రశ్న 11.
వేడిగాలి తేలికైనదని ఎలా నిరూపిస్తావు?
జవాబు:
ఒకే సైజులో ఉన్న రెండు చిన్న ఖాళీ పేపర్ కప్పులు తీసుకోండి. ఒక చీపురుపుల్ల తీసుకోండి. రెండు కప్పులనూ తలక్రిందులుగా చీపురుపుల్ల యొక్క రెండు చివర్లకూ దారం సహాయంతో వేలాడదీయండి. పుల్ల మధ్యలో దారం ముక్కను కట్టండి. చీపురుపుల్లను దారంతో తక్కెడలా పట్టుకోండి. పటంలో చూపించిన విధంగా ఒక కప్పు క్రింద వెలుగుతున్న క్యాండిల్ ని ఉంచండి. ఏమి జరుగుతుందో పరిశీలించండి.
• ఏ పేపర్ కప్పు పైకి వెళుతుంది, ఎందుకు?
జవాబు:
ఉష్ణ సంవహనం అనే దృగ్విషయం వల్ల క్యాండిల్ పైన ఉన్న గాలి వేడెక్కి తేలికయి పైకి పోతుంది. ఈ పైకి పోతున్న గాలి పేపర్ కప్పును పైకి నెట్టుతుంది. మరోవైపు రెండో పేపర్ కప్పు కింద గాలి అలాగే ఉంటుంది.
అందువల్ల, మనం “వేడి చేసినప్పుడు, గాలి వ్యాకోచించి తేలిక అవుతుందని” చెప్పవచ్చు.
AP Board 7th Class Science Solutions Chapter 9 ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి 15

• ఒక ప్రదేశంలో గాలి వ్యాకోచించి పైకి కదలినపుడు ఏం జరుగుతుంది?
జవాబు:
గాలి వ్యాకోచించి పైకి కదిలినపుడు అక్కడ పీడనం తగ్గుతుంది.

• వేడి గాలి ఖాళీ చేసిన ఆ ప్రదేశాన్ని ఎవరు ఆక్రమిస్తారు?
జవాబు:
వేడి గాలి ఖాళీ చేసిన ప్రదేశాన్ని చుట్టూ ఉన్న చల్లని గాలి ఆక్రమిస్తుంది.

• ఆ ప్రదేశంలోనికి చల్లని గాలి ఎందుకు వస్తుంది?
జవాబు:
చల్లని గాలి వేడిగాలి కంటే బరువు. కావున తక్కువ పీడనం లోనికి విస్తరిస్తుంది.

కృత్యం – 12

ప్రశ్న 12.
ఖాళీ సీసా, బెలూన్ తీసుకోండి. సీసాలోనికి బెలూను చొప్పించండి. పటంలో చూపించిన విధంగా బెలూనన్ను సాగదీసి సీసా మూతికి అమర్చండి. ఇప్పుడు సీసా లోపల ఉన్న బెలూన్ లోనికి గాలి ఊదడానికి ప్రయత్నించండి. గాలిని దానిలోకి ఊదడం సాధ్యమేనా?
జవాబు:
బెలూన్లోనికి గాలి ఊదడం తేలిక, కానీ సీసాలో ఉన్న బెలూన్లోనికి గాలి ఊదడం కష్టం.

• ఎందుకు అలా జరుగుతుంది?
జవాబు:
సీసాలో ఉన్న ఏదో బలం ఇలా చేయకుండా ఆపుతుంది. దీనికి కారణం సీసా లోపల ఉన్న గాలి ద్వారా ప్రయోగించబడే బలం. ఏదైనా ఉపరితలంపై గాలి ద్వారా ప్రయోగించబడే బలాన్ని గాలి పీడనం అని అంటారు.
AP Board 7th Class Science Solutions Chapter 9 ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి 16
గాలి సంపీడనం చెందినప్పుడు దాని పీడనం బాగా ఎక్కువగా ఉంటుంది. గాలి వ్యాకోచించి పైకి వెళ్ళినప్పుడు అక్కడ అల్ప పీడనం ఏర్పడుతుంది. ఇది దాని పరిసర ప్రాంతాల నుండి అధిక పీడనం గల గాలిని కదిలించి ఆ ప్రదేశాన్ని ఆక్రమించేలా చేస్తుంది. గాలి పీడనాన్ని పాదరస మట్టం యొక్క ఎత్తు సెంటీమీటర్లలో లెక్కిస్తారు. దీనిని బారోమీటర్తో కొలుస్తారు.

AP Board 7th Class Science Solutions Chapter 9 ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి

కృత్యం – 14

ప్రశ్న 13.
గత 7 రోజులలో ఏదైనా ప్రాంతం (మీ గ్రామానికి సమీపంలో) యొక్క వాతావరణ నివేదికలను వార్తాపత్రిక లేదా టెలివిజన్ నుండి సేకరించండి. క్రింద ఇచ్చిన పట్టికలో సమాచారాన్ని నమోదు చేయండి.
జవాబు:
AP Board 7th Class Science Solutions Chapter 9 ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి 17

కృత్యం – 15

ప్రశ్న 14.
కింది వాక్యాలను వర్గీకరించండి, పట్టికలో వ్రాయండి.
ఇది మారుతూనే ఉంటుంది.
చాలాకాలం పాటు ఉండే ఒక ప్రాంతం యొక్క సాధారణ వాతావరణం.
ఇది మన జీవనశైలిని ప్రభావితం చేస్తుంది.
ఇది 25 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం స్థిరంగా ఉంటుంది.
ఒక నిర్దిష్ట సమయంలో ఒక ప్రాంతం యొక్క వాతావరణ పరిస్థితులు.
ఇది మన దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది.
జవాబు:

వాతావరణం శీతోష్ణస్థితి
1. ఇది మారుతూనే ఉంటుంది. ఇది 25 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం స్థిరంగా ఉంటుంది.
2. ఒక నిర్దిష్ట సమయంలో ఒక ప్రాంతం యొక్క వాతావరణ పరిస్థితులు చాలాకాలం పాటు ఉండే ఒక ప్రాంతం యొక్క సాధారణ వాతావరణం.
3. ఇది మన దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది మన జీవన శైలిని. ప్రభావితం చేస్తుంది.