SCERT AP 7th Class Maths Solutions Pdf Chapter 4 రేఖలు మరియు కోణాలు Ex 4.2 Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 7th Class Maths Solutions 4th Lesson రేఖలు మరియు కోణాలు Exercise 4.2
ప్రశ్న 1.
ఇచ్చిన పటాన్ని గమనించండి మరియు 2 రేఖీయ కోణాల జతలను రాయండి.
సాధన.
రేఖీయ కోణాల జతలు:
(i) ∠POQ, ∠QOK, (ii) ∠QOK, ∠KOL
(లేదా)
(i) ∠QOP, ∠POL, (ii) ZPOM, MOK
(లేదా)
(i) ∠KOL, ∠LOP, (ii) ∠KOM, ∠MOP
ప్రశ్న 2.
ఒకదానికొకటి పూరక కోణాలయ్యే ఆసన్న కోణాల జతను గీయండి.
∠AOB = 90° మరియ ∠AOC, ∠COB లు ఆసన్న కోణాలు.
ప్రశ్న 3.
ఒకదానికొకటి సంపూరక కోణాలయ్యే ఆసన్న కోణాల జతను గీయండి.
సాధన.
∠POQ = 180° మరియ ∠POR, ∠ROQ లు ఆసన్న కోణాలు.
ప్రశ్న 4.
మీ పరిసరాలలో నీవు గమనించే ఆసన్న కోణాలకు సంబంధించి ఏవైనా రెండు ఉదాహరణలు ఇవ్వండి.
సాధన.
1. గడియారంలో మూడు ముల్లుల మధ్య ఆసన్న కోణాలు ఏర్పడుతాయి.
2. పుస్తకాన్ని మూడు భాగాలు తెరచినపుడు ఆసన్న కోణాలు ఏర్పడుతాయి.
3. మొక్కలలో ఒకే చోట చిగురులు పెట్టిన రెమ్మల మధ్య ఆసన్న కోణాలు ఏర్పడుతాయి.
ప్రశ్న 5.
పటంను పరిశీలించండి. వీలయ్యే ఆసన్న కోణాల జతలను రాయండి.
సాధన.
ఆసన్న కోణాలు :
(i) ∠AOC, ∠COD
(ii) ∠AOD, ∠DOB
(iii) ∠AOC, ∠COB
(iv) ∠COD, ∠DOB
ప్రశ్న 6.
ఇచ్చిన కోణాల జత రేఖీయ ద్వయం అయ్యే అవకాశం వుందా? ఒకవేళ అవును అయితే, వాటిని గీయండి. ఒకవేళ కానట్లయితే, కారణం ఇవ్వండి.
(i) 120°, 60°
సాధన.
120° + 60° = 180° కావున, 120° మరియు 60° లు రేఖీయద్వయం అయ్యే అవకాశం కలదు.
∠AOC = 120°, ∠COB = 60° మరియు ఆ రెండు రేఖీయద్వయం.
(ii) 98°, 102°
సాధన.
98° + 102° = 200°. 200° ఒక సరళకోణము కాదు. కావున 989, 102°లు రేఖీయద్వయం అయ్యే అవకాశం లేదు.
ప్రశ్న 7.
క్రింది కోణాలను రేఖీయద్వయంగా గీయండి. అందులో గల సరళరేఖను మరియు ఉమ్మడి భుజాన్ని వ్రాయండి.
సాధన.
సరళరేఖ \(\overleftrightarrow{B C}\),
ఉమ్మడి భుజం OA.
ప్రశ్న 8.
ఇచ్చిన పటంలో \(\overleftrightarrow{A B}\) ఒక సరళరేఖ. \(\overleftrightarrow{A B}\) పై o ఒక బిందువు. X విలువ కనుక్కోండి.
సాధన.
(2x + 30) + x = 180° (రేఖీయద్వయం)
⇒ 3x + 30 = 180°
⇒ 3x = 180° – 30° = 150°
⇒ x = \(\frac{150^{\circ}}{3}\) = 50°
∴ x = 50°
ప్రశ్న 9.
40° మరియు 140° కోణాలు రేఖీయ ద్వయంను ఏర్పరుస్తాయో, లేదో పటం గీచి సరిచూడమని ఒక టీచరు తన విద్యార్థులకు చెప్పేను. ఆ విద్యార్థులు 14007 క్రింది విధంగా పటం గీచెను. అయిన ఎవరికి సరియైన సమాధానం వచ్చును?
సాధన.
రోషితకు సరైన సమాధానం వచ్చును.
ఎందుకనగా, ఇవ్వబడిన కోణాలు ∠XOZ = 140°, ∠ZOY = 40° లు ప్రక్కప్రక్క కోణాలు మరియు సరళ జతలు.