SCERT AP 6th Class Social Study Material Pdf 7th Lesson సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Social Solutions 7th Lesson సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

6th Class Social 7th Lesson సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
గణ అంటే ఏమిటి? రాజులు పాలించిన రాజ్యాలకు వీటికి తేడాలు ఏమిటి?
జవాబు:
గిరిజన సమూహాలు పాలించిన ప్రాంతాన్ని ‘గణ’ అంటారు. సాధారణంగా గణ పరిపాలనా కొంతమంది సభ్యుల చేతిలో ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమను ‘రాజ’ అని పిలుచుకునేవారు. ఉదా : వజ్జి
రాజ్యాలను రాజులు పరిపాలించేవారు. రాజువంశ పారంపర్యంగా వచ్చేవాడు. దీనినే రాజరికం అంటారు. పరిపాలనకు రాజు సర్వాధికారి. రాజుకి స్వంత సైన్యం ఉంటుంది. వీరు రాజు ఆజ్ఞలను పాటిస్తారు.

ప్రశ్న 2.
మహా జనపదాలలో రాజులు కోటలు ఎందుకు నిర్మించారు.?
జవాబు:
మహా జనపదాలలో రాజులు పెద్ద పెద్ద కోటలు నిర్మించారు. ఎందుకంటే :

  • శత్రు రాజ్యాల దాడుల నుండి తమ రాజ్యాన్ని కాపాడుకోటానికి
  • తమ సంపదను, అధికారాన్ని ప్రదర్శించడానికి
  • తమ ఖజానాను, (ధాన్యాగారాలను) రక్షించుకోవడానికి
  • తమ ప్రాంతమంతా సులభంగా, అందుబాటులో ఉండేందుకు.

ప్రశ్న 3.
నాటి మహాజన పదాల కాలంలో గ్రామ నిర్వహణకు, నేటి గ్రామాల నిర్వహణకు మధ్యగల తేడాలను తెలపండి.
జవాబు:
నాడు, నేడు కూడా గ్రామాల నిర్వహణ ఎన్నికైన వారిచే నిర్వహించబడింది, నిర్వహించబడుతోంది. అయితే ఆనాడు గ్రామానికి అధికారి రాజు. నేడు సర్పంచ్. నేడు గ్రామాలకు కావలసిన అవసరాలైన త్రాగునీరు, వీధిలైట్లు, లైబ్రరీ మొదలైన సౌకర్యాలు కలుగచేస్తారు. ఇంటి పన్ను మొదలైనవి వసూళ్ళు చేస్తారు. గ్రామానికి కావలసిన వసతుల కోసం పైస్థాయి వారితో మాట్లాడుతారు. కానీ నాటి గ్రామాల యొక్క నిర్వహణ, వీటితో పాటుగా గ్రామరక్షణ కూడా వారే చేసేవారు. గ్రామాధికారి పొలంలో సంవత్సరానికి ఒక రోజు గ్రామస్తులు ఉచితంగా పనిచేసేవారు. పన్నును ధన, వస్తు, జంతు రూపంలో కట్టేవారు. చివరగా చెప్పాలంటే నేటి నిర్వహణ ప్రజాస్వామికం, నాటి నిర్వహణ రాచరికం.

AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

ప్రశ్న 4.
ప్రస్తుతం ప్రభుత్వం వృత్తి పనులవారి మీద ఏవిధంగా పన్నులు వేస్తుంది? మహాజనపదాలలోని పన్నుల విధానం, ఇదీ ఒకటేనా?
జవాబు:
ప్రస్తుతం ప్రభుత్వం స్వంతగా చేతివృత్తులవారి మీద ఎటువంటి పన్నులు వేయడం లేదు. కొన్ని కొన్ని వృత్తులు చేసేటువంటి (ఉదా : ఉపాధ్యాయులు, ప్రభుత్వోద్యోగులు) వారి మీద వృత్తి పన్ను ప్రతినెలా కొద్దిమొత్తం వారి జీతం నుండి మినహాయిస్తుంది. మహాజనపదాలలోని పన్నుల విధానం, ఇదీ వేరు వేరు.

ప్రశ్న 5.
ఏ ఆధారాల సహాయంతో నీవు మహాజనపదాల గురించి తెలుసుకున్నావు?
జవాబు:

  • మహాజనపదాల గ్రామాలు, పట్టణాల గురించి రెండు రకాల ఆధారాల ద్వారా తెలుసుకోవచ్చు.
  • ఒకటి ఇక్కడ జరిగిన పురావస్తు తవ్వకాల ద్వారా, మరొకటి ఆ కాలంలో రాసిన పుస్తకాల ద్వారా గంగా లోయలో వందలాది ప్రాంతాలలో పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపి ప్రజల జీవన విధానాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించారు.
  • హస్తినాపుర (నేటి ఢిల్లీ), అత్రంజీ ఖేరా, కోశాంబి (అలహాబాద్ దగ్గర), పాటలీపుత్ర మొదలైనవి ముఖ్యమైన పురాతత్వ అన్వేషణ జరిగిన ప్రాంతాలు.
  • ఈ కాలానికి చెందిన పుస్తకాలు చాలా వరకూ మత సంబంధమైనవి. అవి మత సంబంధమైనవి అయినప్పటికీ ‘ కూడా అవి నాటి పట్టణాలు, గ్రామాలు, పాలకులు మరియు రాజుల గురించి తెలియపరిచాయి.
  • కొన్ని పుస్తకాలు సుదూర ప్రాంతాలయిన గ్రీకు వారిచే కూడా రాయబడ్డాయి.
  • ఉపనిషత్తులు, ధర్మ సూత్రాలు, దిగానికాయ, మధ్యమనికాయ, హెరిడోటస్ చరిత్ర మొదలైనవి ఈ కాలంలో రాయబడిన కొన్ని ముఖ్య గ్రంథాలు.

ప్రశ్న 6.
మహాజన పదాల కాలంలో వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు తోడ్పడిన వ్యవసాయ విధానాల గురించి రాయండి.
జవాబు:
మహాజన పదాల కాలంలో వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు తోడ్పడిన వ్యవసాయ విధానాలు :

  • ఇనుప నాగలిని వినియోగించటం.
  • వరి నారు పోసే పద్ధతిని ప్రారంభించటం.
  • అభివృద్ధి చెందిన సాగునీటి సౌకర్యాలు మొ||నవి.

AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

ప్రశ్న 7.
“మహాజనపదాలు పది తరాలలో అభివృద్ధి చెందాయి.” ఈ వ్యాఖ్యలతో నీవు ఏకీభవిస్తావా? నీ జవాబును సమర్థించుము.
జవాబు:
మహాజనపదాలు పదితరాలలో అభివృద్ధి చెందాయనే వ్యాఖ్యతో నేను ఏకీభవిస్తాను.

హిమాలయాలకు మరియు దక్కన్ పీఠభూమికి మధ్య గంగ, యమున నదులు ప్రవహిస్తున్నాయి. దీనిని గంగా నదీ లోయ అంటారు. ఈ మైదానంలో చాలా ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఇది అత్యంత సారవంతమైనది. హిమాలయాల నుండి ఒండ్రు మట్టిని తెచ్చే ఈ నదులు ఏడాది పొడవునా ప్రవహిస్తాయి. ప్రారంభంలో వివిధ తెగల ప్రజలు తమకు అనుకూలమైన ప్రాంతాల్లో వ్యవసాయం చేయుటకు ఈ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఈ తెగలలో ముఖ్యమైనవి శాక్య, లిచ్ఛవీ, మల్ల, వైదేహి మొదలైన తెగలు. ఈ తెగలనే సంస్కృతంలో ‘జన’ అని, వారు స్థిరపడిన ప్రాంతాన్ని ‘జనపదం’ అని పిలుస్తారు.

ఈ నదుల వెంట ప్రజలు 2700 సంవత్సరాలలో పెద్ద సంఖ్యలో స్థిరపడటం ప్రారంభించారు. వారు ఇనుప ఉపకరణాల సహాయంతో అడవులను నరికి వేసి, భూమిని వ్యవసాయానికి అనుకూలంగా మార్చుకుని వరి మరియు ఇతర పంటలు పండించారు. అనేక పెద్ద గ్రామాలు మరియు పట్టణాలూ ఈ ప్రాంతాలలో అభివృద్ధి చెందాయి. బహుశా ఆ ప్రాంతాలలో వేర్వేరు తెగలకు చెందిన చాలామంది వ్యక్తులు స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండవచ్చు. గంగా మైదానంలో ఇనుము యొక్క విస్తృతమైన ఉపయోగం పెద్ద ప్రాదేశిక ప్రాంతాలు ఏర్పడటానికి పరిస్థితులను సృష్టించింది. అటువంటి గ్రామాలు మరియు పట్టణాల యొక్క పెద్ద సమూహాలను “మహాజనపదాలు” లేదా ‘పెద్ద జనపదాలు’ పిలిచేవారు. మహాజనపదాలలో చాలా వరకు రాజధాని నగరం కలిగి ఉండి రక్షణ పరంగా పటిష్టంగా ఉండేవి.

ప్రశ్న 8.
జనపదాల కాలం నాటి వృత్తి పనివారి పనితనాన్ని నీవెలా ప్రశంసిస్తావు?
జవాబు:
చాలా గ్రామాలలో నైపుణ్యం గల వృత్తి పనివారు ఉండేవారు. కమ్మర్లు, వ్యవసాయానికి పనికి వచ్చే పనిముట్లు (నాగలి కర్రలు, గొడ్డళ్ళు, బాణాలు మొదలైనవి)ను, వంటకు ఉపయోగపడే కుండలు, ధాన్యం నిలవ ఉంచే పాత్రలను కుమ్మరి , బండ్లు, నాగళ్ళు, ఇతర గృహ సామగ్రిని వడ్రంగులు, దుస్తులను నేతపనివారు తయారు చేసేవారు.
AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 1

మహాజనపదం కాలంలో వృత్తి కార్మికులు నాటి కుమ్మరులు మట్టి కుండలను తయారు చేశారు. వీటిలో కొన్ని బూడిద రంగులో, మరికొన్ని ఎరుపు రంగులో ఉన్నాయి. ఒక రకమైన ప్రత్యేకమైన కుండలు ఈ ప్రాంతంలో కనుగొనబడ్డాయి. వీటిని “పెయింటెడ్ గ్రేవేర్” అని పిలుస్తారు. ఆ బూడిద రంగు కుండలపై చిన్న చిన్న గీతలు, రేఖా గణిత నమూనాలు చిత్రించబడి ఉన్నాయి.

ప్రశ్న 9.
మహా జనపదాల కాలంలో పరిపాలకులచే వసూలు చేయబడిన పన్నులేవి?
జవాబు:

  • వ్యవసాయం చేసే గృహపతుల నుంచి రాజులు పన్నులు వసూలు చేసేవారు. వారు తమ పంటను ఆరు భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకు ఇచ్చేవారు. దీనిని ‘భాగ’ అని పిలిచేవారు.
  • ప్రతీనెల ఒక రోజు ఉచితంగా పనిచేయడం ద్వారా వృత్తి పనివారు రాజుకు పన్నులు చెల్లించేవారు. పశువులు, గొర్రెల మందలు కాసేవారు జంతువులను లేదా జంతు ఉత్పత్తులను పన్నుగా రాజుకి చెల్లించేవారు.
  • వ్యాపారస్థులు కూడా వాళ్ళు అమ్మిన వస్తువులపై పన్ను చెల్లించేవారు.
  • వేటాడేవారు, సేకరణ చేసేవారు కూడా అటవీ ఉత్పత్తులైన తోళ్ళు కలప వంటివి ఇచ్చేవారు.
  • ఈ రకంగా రాజుకు పన్నుల రూపంలో వివిధ రకాల వస్తువులు లభించేవి.
  • ఈ కాలంలోనే నాణేలను ఉపయోగించడం ప్రారంభమైంది. కొన్ని రకాల పన్నులు నాణేల రూపంలో చెల్లించేవారు.

AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

ప్రశ్న 10.
మహా జనపదాల కాలంలో పాలకుల ఎన్నిక, ప్రస్తుత రోజులలో ఎన్నికల విధానం కన్నా ఏ విధంగా భిన్నమైనది?
జవాబు:
మహా జనపదాల కాలంలో పాలకులు (రాజులు) ఒక కుటుంబ వంశపారంపర్యంగా చాలాకాలంపాటు పాలించేవారు. అంటె ఎక్కువ జనపదాలలో రాచరికం అమల్లో ఉంది. కొన్ని గణ రాజ్యాలలో మాత్రమే ఒకే పరిపాలకుడు కాక, ఒక పరిపాలకుల బృందం ఉండేది. కొన్ని సందర్భాలలో వేలమంది కలసి పాలన చేసేవారు.

ప్రస్తుత రోజులలో పాలకుల ఎన్నిక విధానం ప్రజాస్వామ్యయుతంగా, పారదర్శకంగా జరుగుతుంది. అంటే వయోజనులైన (18 సం||లు పైబడినవారు) వారు తమ ఓటుహక్కు ద్వారా పాలకులను ఎన్నుకుంటున్నారు.

ప్రశ్న 11.
ప్రస్తుత కాలంలో పంటలు పండించే విధానాలు మహాజనపదాల కాలంలో విధానాలతో ఏ విధంగా సరిపోతాయి?
జవాబు:

  • ప్రస్తుతం, మహాజనపదాల కాలంలో ఇనప నాగలి వినియోగించడం జరిగింది.
  • ప్రస్తుతం, మహాజనపదాల కాలంలో వరి నారు పోసే పద్దతి. ఒకే విధంగా ఉంది.
  • ప్రస్తుతం, మహాజనపదాల కాలంలో సాగునీటి సౌకర్యాల కల్పన ఒకేలా ఉంది.
  • ప్రస్తుతం, మహాజనపదాల కాలంలో పాలకులు వ్యవసాయాభివృద్ధికి కావాల్సిన సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది.

ప్రశ్న 12.
మగధ బలమైన రాజ్యంగా ఆవిర్భవించడానికి తోడ్పడిన సహజ వనరుల పాత్రను ప్రశంసించుము.
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 2
మగధ రాజ్యం గంగానదికి ఇరువైపులా విస్తరించి ఉందని మీరు గమనించి ఉంటారు. నదులు, భూములను సారవంతం చేస్తాయి. గృహపతులు తమ భూములను సులభంగా సాగు చేసుకొనేవారు. నదుల మీద సరకు రవాణా చేసేవారు. సైనికులను తరిలించేవారు. మగధలోని కొంత ప్రాంతంలో అడవులున్నాయి. ఈ అడవుల నుంచి ఏనుగులను పట్టుకొని యుద్ధాలలో పోరాడటానికి వాటికి శిక్షణ ఇచ్చేవారు. అడవుల నుంచి లభించే కలపతో కోటలు, రాజభవనాలు, రథాలను నిర్మించటానికి ఉపయోగించేవారు. మగధ రాజ్యంలోని దక్షిణ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉండేవి. వాటిని ఉపయోగించి ఆయుధాలు తయారు చేసేవారు. వీటన్నింటి కారణంగా మగధ రాజ్యం బలమైన రాజ్యంగా ఎదిగింది. మొదటి రాజైన బింబిసారుడు, అతని కుమారుడు అజాత శత్రువు మగధను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దారు. ఈ రాజు కోట నుండి విధంగా సహజ వనరులు మగధను బలమైన రాజ్యంగా ఆవిర్భవించటానికి బయలుదేరుట తోడ్పడినాయి.

ప్రశ్న 13.
భారతదేశ అవుట్ లైన్ పటములో పదహారు మహాజనపదాలను, వాటి రాజధానులను గుర్తించుము.
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 3

ప్రశ్న 14.
ఈ పాఠ్యాంశంలో నేర్చుకున్న కొత్త పదాలతో కింది పదబంధ ప్రహేళికను పూరించండి. మీ ఉపాధ్యాయుని సహాయం తీసుకోండి.
AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 4
అడ్డం :
1. మహాజనపదాలలో శక్తివంతమైన రాజ్యం.
2. వారణాసికి మరొక పేరు.
3. కౌశాంబి ఈ మహాజన పదానికి రాజధాని.
4. మహాభారతం ఈ మహాజనపదానికి చెందిన రాజుల మధ్య జరిగిన యుద్ధం గురించి తెలుపుతుంది.
5. రైతులు పంట దిగుబడిలో 1/6 వంతుగా చెల్లించే పన్ను.
6. యజ్ఞాలు మరియు కుల వ్యవస్థని ఇవి ఖండిస్తున్నాయి.
7. ‘వజ్ర’లో ఈ రకమైన ప్రభుత్వం ఉన్నది.

నిలువు :
1. తూర్పు దిక్కున చిట్టచివరి మహాజనపదం
2. అవంతి రాజధాని నగరం.
3. నాగళ్ళు తయారు చేయడానికి రైతులు ఉపయోగించిన లోహం.
4. గోదావరీ నదీ తీరంలో కల మహాజనపదం.
5. గహపతులు నియమించుకున్న బానిసలు.
6. కుశివార ఈ రాజ్యానికి రాజధాని.
7. సూరసేనకి రాజధాని
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 5

6th Class Social Studies 7th Lesson సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం InText Questions and Answers

6th Class Social Textbook Page No.75

ప్రశ్న 1.
1) భారతదేశ పటంలో గంగా, యుమునా నదులు ఏమైదానాల గుండా ప్రవహిస్తున్నాయో గుర్తించండి.
2) భారతదేశ పటంలో నవీన నగరాలైన ఢిల్లీ, అలహాబాద్, వారణాసి, లక్నో, పాట్నాలను గుర్తించండి.
3) ఈ ప్రాంతం మీ గ్రామాలను పోలి ఉందా? కారణాలు తెల్పండి.
జవాబు:
1.
AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 6
2.
AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 7
3. ఈ ప్రాంతం మా గ్రామాలను పోలి లేదు. కారణం మా గ్రామం పీఠభూమి ప్రాంతంలో ఉంది. పై ప్రాంతం మైదాన ప్రాంతంలో ఉంది.

ప్రశ్న 2.
గంగా సింధు మైదానంలో మొదట్లో స్థిరపడ్డ తెగల పేర్లను మీ ఉపాధ్యాయుల సహాయంతో తెలుసుకోండి.
జవాబు:
గంగా, సింధు మైదానంలో భరత, పురు, కురు, పాంచాల, యదు, తుర్వాస, శాక్య, లిచ్ఛవీ, మల్ల, వైదేహీ మొ॥న తెగలు మొదట్లో స్థిరపడ్డ తెగలు.

AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

ప్రశ్న 3.
‘జనపదం’ అంటే అర్థం ఏమిటి? మహాజనపదాలకు, వీటికి గల తేడా ఏమిటి?
జవాబు:
మొదట్లో వివిధ తెగలు గంగా – సింధూ మైదానంలోని అనుకూల ప్రాంతాలలో వ్యవసాయం చేస్తూ స్థిరపడ్డాయి. ఈ తెగలనే సంస్కృతంలో “జన’ అని వారు స్థిరపడిన ప్రాంతాన్ని ‘జనపదం’ అని పిలిచేవారు.

గంగా మైదానంలో ఇనుము యొక్క విస్తృతమైన ఉపయోగం పెద్ద ప్రాదేశిక ప్రాంతాలు ఏర్పడటానికి పరిస్థితులను సృష్టించింది. అటువంటి గ్రామాలు మరియు పట్టణాల యొక్క పెద్ద సమూహాలను ‘మహా జనపదాలు’ లేదా ‘పెద్ద జనపదాలు’ అని పిలిచేవారు.

6th Class Social Textbook Page No.76

ప్రశ్న 4.
గంగ నదీ పరీవాహక ప్రాంతంలో గల మహాజన పదాలు మరియు పట్టణాలను ఒక పట్టిక రూపంలో రాయండి.
జవాబు:
గంగ నదీ పరీవాహక ప్రాంతంలో గల మహాజన పదాలు మరియు పట్టణాలు :
మహాజనపదాలు – పట్టణాలు
1. కురు – ఇంద్రప్రస్తము
2. కోసల – శ్రీవస్తి
3. వజ్జి – వైశాలి
4. వత్స – కౌశోంబి
5. కాశి – వారణాశి
6. మగధ – రాజ గృహ
7. అంగ – చంప
8. మల్ల – కుశీనగరం
9. ఛేది – శోతిమతి
10. సూరసేన – మధుర
11. పాంచాల – అహిచ్ఛత్ర

6th Class Social Textbook Page No.77

ప్రశ్న 5.
క్రింది పటంలో నాటి ముఖ్యమైన జనపదాలు చూపబడ్డాయి. పటాన్ని చూసి కింది ఖాళీలను పూరించండి.
1. యమునానదికి ఇరువైపులా విస్తరించిన జనపదం ……….. (కురు)
2. పాంచాల జనపదం ……………. నదికి ఇరువైపులా విస్తరించి ఉంది. (గోమతి (ఉత్తర గంగా)
3. సూరసేన జనపదానికి పశ్చిమ దిక్కున గల జనపదం ………. (మధుర)
4. అన్ని జనపదాల కంటే ఉత్తరాన గల జనపదం …….. (కాంభోజ)
5. గోదావరి నదీ తీరాన నెలకొన్న జనపదం ……….. (అస్మక)
6. గాంధార జనపదం ………….. నదీ తీరాన నెలకొంది. (జీలం)

ప్రశ్న 6.
ఒక ప్రసిద్ధి చెందిన ఇతిహాసంలో ఈ జనపదాల గురించి ప్రస్తావన ఉంది. దాని గురించి తెలుసుకోండి.
జవాబు:
భారతదేశ ప్రసిద్ది ఇతిహాసమైన ‘మహాభారతంలో’ ఈ జనపదాల ప్రస్తావన ఉంది. ముఖ్యంగా ‘కురు’ (హస్తినాపురం) మహాజనపదం ప్రధాన కేంద్రంగా ఉంది.

6th Class Social Textbook Page No.78

ప్రశ్న 7.
నేడు వరిని ఏ విధంగా సేద్యం చేస్తున్నారు?
జవాబు:
నేడు వరిని క్రింది విధంగా సేద్యం చేస్తున్నారు.

  • మొదటగా భూమిని చదును చేసి, గట్లు కడతారు.
  • తర్వాత నీరు పెట్టి, దమ్ము చేస్తారు. (మెత్తగా చేస్తారు)
  • తర్వాత నాట్లు వేస్తారు (కొన్ని ప్రాంతాలలో వెద పెట్టడం జరుగుతుంది)
  • తర్వాత కలుపు తీయటం, పంటకు అవసరమైన ఎరువులు వేయటం జరుగుతుంది.
  • అవసరమనుకుంటే పురుగు మందులు చల్లటం జరుగుతుంది.
  • తర్వాత వరి కంకులు రావడం జరుగుతుంది. కంకులు ముదిరిన తర్వాత పొలంలోని నీరు తీసేస్తారు.
  • తర్వాత వరికోతలు చేపట్టి, కుప్ప పోస్తారు. తర్వాత నూర్పిడి చేస్తారు.
  • తూర్పార బట్టి వడ్లను వేరు చేస్తారు. (కొన్ని ప్రాంతాలలో వరికోత యంత్రం ద్వారానే ఇవన్నీ చేస్తున్నారు.)

6th Class Social Textbook Page No.79

ప్రశ్న 8.
నాటి గ్రామాలలో గృహపతులకు మరియు వృత్తి పనివారికి మధ్యగల సంబంధం గురించి వివరించండి.
జవాబు:
గృహపతికి అవసరమైన పనిముట్లను వృత్తిపనివారు తయారుచేసి ఇచ్చేవారు. ఈ ఉత్పత్తులకు బదులుగా గృహపతులు వృత్తి పనివారికి ధాన్యం ఇచ్చి ఉండవచ్చు. ఈ ఉత్పత్తులు వ్యవసాయానికి అత్యవసరం. వాటిని సొంతంగా తయారు చేసుకోవటానికి గృహపతులకు నైపుణ్యం, సమయం ఉండవు. వ్యవసాయంలో మిగులు మరియు నైపుణ్యం గల వృత్తి పనివారిచే చేయబడిన వస్తువులు వాణిజ్యానికి మరియు మార్పిడి కేంద్రాల ఆవిర్భావానికి దారితీసాయి.

6th Class Social Textbook Page No.80

ప్రశ్న 9.
నగరాలలోని ప్రజలకు ధాన్యం, పాలు, మాంసం మొదలైనవి అవసరం. నగరంలో వ్యవసాయం లేకుండా అంతమంది ప్రజలు వాటిని ఎలా పొందగలిగేవారు?
జవాబు:
నగరాలకు చుట్టుప్రక్కల గ్రామాలుంటాయి. ధాన్యం అక్కడి నుండి నగరాలలోని రైస్ మిల్లర్లు కొనుగోలు చేసి ఇక్కడ అమ్ముతారు. డైరీ ఫారాల ద్వారా పాలు సేకరించి, పాశ్చురైజేషన్ ప్రక్రియ ద్వారా శుద్ధిచేసి, శీతలీకరించి ప్రజలకు సరఫరా జరుపుతారు. నగరాలలో కూడా పశువుల పెంపకం జరుగుతుంది. కాబట్టి మాంసం కూడా సులభంగానే లభ్యమవుతుంది.

AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

ప్రశ్న 10.
మీరు ఎప్పుడైనా టీవిలో కాని, ఆ ప్రాంతాన్ని సందర్శించి కానీ ఒక కోటను చూసారా?
జవాబు:
చూసాను. టీవిలో రాజస్థాన్లోని (జైపూర్) కోటలను, హైదరాబాద్ లోని గోల్కొండ కోటను చూసాను. ప్రత్యక్షంగా కొండవీడు కోటను, వరంగల్ కోటను సందర్శించాను.

ప్రశ్న 11.
కోట చుట్టూ అంత పెద్ద గోడలు ఎందుకు ఉంటాయి ? అవి వేటితో నిర్మింపబడి ఉంటాయి? వీటంతటికి అవసరమైన ధనాన్ని రాజులు ఎలా పొందేవారు?
జవాబు:

  • శత్రు దేశాల దాడుల నుండి రక్షణకై కోటచుట్టూ పెద్ద గోడలు ఉంటాయి. .
  • వీటిని పెద్ద పెద్ద కొండ రాళ్ళతో నిర్మింపబడి ఉంటాయి.
  • వీటంతటికి అవసరమైన ధనాన్ని రాజులు ప్రజల నుండి పన్నుల రూపంలో వసూలు చేసేవారు.

ప్రశ్న 12.
మహాజన పదాలలో రాజులకు సైన్యం ఎందుకు అవసరం?
జవాబు:
మహాజన పదాల రాజులు వారి తెగను, రాజ్యాన్ని కాపాడాల్సి వచ్చేది. ఇతరుల దండయాత్రల నుండి వారిని రక్షించాల్సి వచ్చేది. అంతేగాక పన్నులు చెల్లించడానికి నిరాకరించేవారిని శిక్షించడానికి, ప్రజలు రాజు ఆజ్ఞలను పాటించేలా చూడటానికి కూడా సైనికులు అవసరం.

6th Class Social Textbook Page No.81

ప్రశ్న 13.
వేటాడేవారు, సేకరణ చేసేవారు రాజుకు ఏ రూపంలో పన్నులు చెల్లించేవారు?
జవాబు:
వేటాడేవారు, సేకరణ చేసేవారు అటవీ ఉత్పత్తులైన తోళ్ళు కలప వంటివి ఇచ్చేవారు. అలాగే అటవీ ఉత్పత్తులైన కాయలు, పండ్లు, తేనె మొ|| న వాటిని కూడా బహుమతిగా ఇచ్చేవారు.

ప్రశ్న 14.
ప్రతి ఒక్కరూ తాము కష్టపడి సంపాదించినదానిలో కొంత చెల్లించాల్సి వస్తే అది వాళ్ళ జీవితాలపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది?
జవాబు:
ప్రతి ఒక్కరూ రాజ్యంలో తమ రక్షణ కొరకు ప్రభుత్వం తమకు కల్పించే సౌకర్యాలకు కొంత సొమ్మును చెల్లించాల్సి వస్తే అది సమంజసంగానే ఉంటుంది. కాని కష్టపడి సంపాదించిన దానిలో కొంత చెల్లించాల్సి వస్తే అది వారి జీవితాలపై దుష్ప్రభావాల్ని చూపిస్తుంది. దీనిని తప్పించుకోవడానికి ప్రజలు ప్రభుత్వాన్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తారు.

ప్రశ్న 15.
వాళ్ళు పన్నులు చెల్లించటానికి ఎందుకు అంగీకరించి ఉంటారు? కొత్త ఏర్పాట్ల వల్ల వాళ్ళు ఏరకంగా ప్రయోజనం పొందారు?
జవాబు:
తమ జీవితాల రక్షణ కోసం, నీటిపారుదల సౌకర్యాల కోసం, తెగ వృద్ధి కోసం పన్నులు చెల్లించడానికి అంగీకరించి ఉంటారు. కొత్త ఏర్పాట్ల వల్ల వాళ్ళు తమ దృష్టిని పూర్తిగా తమ వ్యవసాయంపైన, వ్యాపారం పైనా పెట్టి ఉంటారు. తద్వారా వారు మంచి ఆదాయం పొంది ఉంటారు.

ప్రశ్న 16.
‘భాగ’ అంటే ఏమిటి? రైతుల ఉత్పత్తి నుంచి ఇప్పటి ప్రభుత్వం కూడా ఇలా తీసుకుంటుందా?
జవాబు:
రాజులు వ్యవసాయం చేసే గృహపతుల నుండి పన్నులు వసూలు చేసేవారు. వారు తమ పంటను ఆరు భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకు ఇచ్చేవారు. దీనినే ‘భాగ’ అనేవారు. రైతుల ఉత్పత్తి నుంచి ఇప్పటి ప్రభుత్వం ఇలా తీసుకోదు.

6th Class Social Textbook Page No.82

ప్రశ్న 17.
వృత్తి ఉత్పత్తులను, వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి మహాజవపదాల రాజులు ఎందుకు ఆసక్తి చూపారు?
జవాబు:
రాజ్యంలో పన్నుల రూపంలో ఆదాయం పెంచుకోవడానికి రాజులు మహాజనపదాలలోని వ్యాపారులను దూరదేశాలతో వ్యాపారం చేయవలసినదిగా ప్రోత్సహించారు. అలాగే చేతి వృత్తుల వారు తమ ఉత్పత్తులు పెంచాలని, స్వయం సమృద్ధి కొరకే కాక ఎక్కువ పన్నులు వారి నుండి వసూలు చేయుటకుగాను – (రాజులు) ప్రోత్సహించిరి.

AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

ప్రశ్న 18.
రాజులు విధించే పన్నుల వల్ల గ్రామపెద్దలు ఏ విధంగా లాభపడేవారు?
జవాబు:
వ్యాపారస్తుల నుండి తమ తరఫున పన్నులు వసూలు చేయాలని గ్రామపెద్దని రాజులు కోరేవారు. ఈ పన్నులు వసూలు చేసినందుకు గాను రాజు వీరికి కొంత శాతం ముట్టచెప్పేవారు. ఈ విధంగా రాజులు విధించే పన్నుల వల్ల గ్రామ పెద్దలు తమ అధికారం, సంపద పెంచుకుని లాభపడేవారు.

6th Class Social Textbook Page No.83

ప్రశ్న 19.
అక్కడ సహజ సంపదను ఉపయోగించి మగధ రాజులు బలమైన మగధ రాజ్యాన్ని ఎలా నిర్మించారు?
జవాబు:
మగధ గంగానదికి రెండువైపులా విస్తరించి ఉన్నది. నదులు భూములను సారవంతం చేస్తాయి. గృహపతులు తమ భూములను సులభంగా సాగుచేసుకునేవారు. నదుల మీద సరుకు రవాణా చేసేవారు, సైనికులను తరలించేవారు. మగధలోని కొంత ప్రాంతంలో అడవులున్నాయి. ఈ అడవుల నుంచి ఏనుగులను పట్టుకొని వచ్చి యుద్ధాలలో పోరాడటానికి వాటికి శిక్షణ ఇచ్చేవారు. అడవుల నుండి లభించే కలపతో కోటలు, రాజభవనాలను, రథాలను నిర్మించడానికి ఉపయోగించేవారు. మగధ రాజ్యంలోని దక్షిణ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉండేవి. వాటిని ఉపయోగించి ఆయుధాలు మొదలైనవి తయారుచేసేవారు. వీటి కారణంగా మగధ రాజ్యంను బలమైన రాజ్యంగా మగధ రాజులు నిర్మించారు.

ప్రశ్న 20.
ప్రతి సహజ వనరులను గురించి, వాటిని ఉపయోగించి మగధ రాజులు బలమైన మగధ రాజ్యాలు ఎలా నిర్మించారు?
జవాబు:
మగధ రాజులు ఆ ప్రాంతంలోని సహజ వనరులను చక్కగా వినియోగించుకుని తమ సంపదను అధికారాన్ని పెంచుకున్నారు.

నదులు :
ఇచట ప్రవహించే నదులు ఈ ప్రాంతాన్ని సారవంతం చేసినవి. గృహపతులు తమ పంటలకు సమృద్ధిగా నీరు లభించుటవలన పంటలు బాగా పండించిరి. వస్తువులు మరియు సైన్యాన్ని రవాణా చేయడానికి ఇవి బాగా ఉపయోగపడినవి.

అడవులు :
మగధ చుట్టూ అడవులు గలవు. వీటిలోనుండి ఏనుగులను బంధించి తెచ్చి యుద్ధాలలో ఉపయోగపడే విధంగా శిక్షణ ఇచ్చేవారు. అడవులలో లభించే కలపనుపయోగించి కోటలను, రాజభవనాలను మరియు రథాలను నిర్మించేవారు.

ఇనుప ఖనిజం :
ఇనుప ఖనిజం నిల్వలు ఉండుట వలన వీటితో రాజులు యుద్ధాలకు అవసరమైన ఆయుధాలను మరియు వ్యవసాయ పనిముట్లు అయిన నాగటి కొర్రులు, కొడవళ్ళు మొదలగువాటిని తయారుచేశారు.

ఈ సహజ వనరులు మగధకు శక్తివంతమైన రాజ్యంగా ఎదగడానికి ఉపయోగపడినవి.

AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

ప్రశ్న 21.
వజ్జి మహాజనపదంలోని గణతంత్ర ప్రభుత్వాన్ని (పాల్గొనే అవకాశం లేని వారిని) ప్రస్తుత గణతంత్ర రాజ్య అసెంబ్లీతో పోల్చండి.
జవాబు:

  • వట్టి మహాజన పదంలో ప్రస్తుత గణతంత్ర రాజ్యంలో వలే ఒకే పరిపాలకుడు ఒక పరిపాలకుల బృందం ఉండేది. అయితే మహిళలకు,
  • బానిసలకు, సేవకులకు ఈ సమావేశాలలో పాల్గొనే అవకాశం లేదు.
  • కాని ప్రస్తుత గణతంత్ర వ్యవస్థలో ఇటువంటి తారతమ్యాలు లేవు. అసలు బానిస వ్యవస్థీ లేదు.

ప్రాజెక్టు పని

పదహారు మహాజనపదాలకు సంబంధించిన సమాచారం సేకరించండి. భారతదేశ రాజకీయ పటం సహాయంతో అవి ప్రస్తుతం ఏయే రాష్ట్రాల పరిధిలో ఉన్నవో గుర్తించండి. ఆ వివరాలతో ఈ కింది పట్టికను నింపండి.
AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 8
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 9