SCERT AP 6th Class Social Study Material Pdf 11th Lesson భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు Textbook Questions and Answers.
AP State Syllabus 6th Class Social Solutions 11th Lesson భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు
6th Class Social 11th Lesson భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు Textbook Questions and Answers
Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)
ప్రశ్న 1.
ముస్లింల పవిత్ర గ్రంథం పేరేమి?
జవాబు:
ముస్లింల పవిత్ర గ్రంథం పేరు ఖురాన్.
ప్రశ్న 2.
అష్టాంగ మార్గం అనగా నేమి?
జవాబు:
బుద్ధుని ప్రకారం, మోక్షం సాధించడమే జీవిత పరమార్థం. మోక్షాన్ని బలుల ద్వారా లేదా ప్రార్థనల ద్వారా సాధించలేము. (మధ్యేమార్గం) అష్టాంగ మార్గంను అనుసరించడం ద్వారా మోక్షం సాధించవచ్చని తెలిపాడు.
అష్టాంగ మార్గాలు | ||
1. సరైన దృష్టి | సత్యాన్ని తెలుసుకోవడం | సమ్యక్ దృష్టి |
2. సరైన ఉద్దేశం | మనసును చెడు నుండి విడిపించడం | సమ్యక్ సంకల్ప |
3. సరైన ప్రసంగం | ఇతరులను బాధపెట్టేలా మాట్లాడకపోవడం | సమ్యక్ వాక్కు |
4. సరైన క్రియ | ఇతరుల మంచికోసం పనిచేయడం | సమ్యక్ కర్మ |
5. సరైన, జీవితం | జీవితాన్ని గౌరవించడం | సమ్యక్ జీవన |
6. సరైన కృషి | చెడును ఎదిరించడం | సమ్యక్ సాధన |
7. సరైన ఏకాగ్రత | ధ్యానం సాధన చేయడం | సమ్యక్ సమాధి |
8. సరైన బుద్ధి | ఆలోచనలను నియంత్రించడం | సమ్యక్ స్మృతి |
ప్రశ్న 3.
మత సామరస్యాన్ని ప్రోత్సహించడానికి రెండు నినాదాలు రాయండి.
జవాబు:
- దేవుడు ఒక్కడే – మతం మార్గమే.
- మతము కన్నా – మానవత్వం మిన్న
- మతాలు వేరైనా – మాధవుడు ఒక్కడే
- మతతత్వం కాదు ముఖ్యం – మానవత్వం ముఖ్యం
- మతం మంచి నీళ్ళు ఇవ్వదు – మమకారమే మంచిని పంచుతుంది
ప్రశ్న 4.
యేసుక్రీస్తు ప్రధాన బోధనలు ఏవి?
జవాబు:
యేసుక్రీస్తు ప్రధాన బోధనలు :
- మానవులందరూ దేవుని పిల్లలు.
- పాపాలు చేయకుండా పవిత్రమైన జీవితాన్ని గడపండి.
- నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువారిని కూడా ప్రేమించండి.
- ఒక చెంపపై కొట్టినప్పుడు, మరొక చెంప చూపించు.
- మానవసేవే మాధవసేవ.
- శాంతి, ప్రేమ, కరుణ కల్గి ఉండాలి.
- తనను తాను తగ్గించుకొనువాడు దేవునిచే హెచ్చింపబడును.
- శత్రువును కూడా ప్రేమతో జయించవచ్చు.
ప్రశ్న 5.
ఇస్లాం మత ప్రధాన బోధనలు ఏవి?
జవాబు:
ఇస్లాం మత ప్రధాన బోధనలు :
- మానవులందరూ అల్లాచే సృష్టించబడ్డారు.
- మానవులందరూ దేవుని ముందు సమానం.
- దేవునికి ఆకారం లేదు కాబట్టి విగ్రహారాధన సరియైనది కాదు.
- ప్రతి ముస్లిం దేవుని సేవకునిగా మారి నిజాయితీగా ఉండాలి.
- మానవులంతా అన్నదమ్ముల్లా మెలగాలి.
ప్రశ్న 6.
ఆర్య సత్యా లు ఏవి?
జవాబు:
ఆర్య సత్యాలు నాలుగు:
- ప్రపంచం దుఃఖమయం.
- దుఃఖం కోరికల వల్ల కలుగుతుంది.
- కోరికలను త్యజించడం ద్వారా మోక్షం పొందవచ్చు.
- అష్టాంగ మార్గాన్ని పాటించడం ద్వారా మోక్షాన్ని సులభంగా పొందవచ్చు.
ప్రశ్న 7.
“భిన్నత్వంలో ఏకత్వం భారత ప్రధాన సాంస్కృతిక లక్షణం” – దీనితో మీరు ఏకీభవిస్తారా లేదా? వ్యాఖ్యానించుము.
జవాబు:
భారతదేశ ప్రధాన సాంస్కృతిక లక్షణం – “భిన్నత్వంలో ఏకత్వం” అని నేను ఏకీభవిస్తున్నాను.
భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ విశిష్ట లక్షణం :
భారతదేశం అనేక వైవిధ్యాలతో కూడిన ప్రాంతం. మతం, భాష, సంస్కృతి, జీవనశైలి, వేషధారణ, దేవునిపై విశ్వాసం, ఆరాధనా, విధానాలు, ఆహారపు అలవాట్లు వంటి వాటిలో కూడా వైవిధ్యత కనిపిస్తుంది.
చంద్రగుప్తుడు, అశోకుడు, గౌతమీపుత్ర శాతకర్ణి. సముద్రగుప్తుడు, అక్బర్ మొదలగు రాజులు, చక్రవర్తులు. దేశాన్ని రాజకీయంగా ఏకం చేయడానికి ప్రయత్నించారు.
దేశంలోని వివిధ ప్రాంతాలలో జన్మించిన మహావీరుడు. గౌతమ బుద్ధుడు, గురునానక్, కబీర్, నిజాముద్దీన్ ఔలియా, షేక్ సలీం చిస్తి, రవీంద్రనాథ్ ఠాగూర్, డాక్టర్ రాధా కృష్ణన్ వంటి మహానీయులను, సాధువులను, తత్వవేత్తలను భారతీయులందరూ గౌరవిస్తారు.
ప్రజలు హోలీ, దీపావళి, రంజాన్, క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, మహావీర్ జయంతి, బుద్ధ జయంతి వంటి పండుగలను ఇతర మతస్థులను ఇబ్బంది పెట్టకుండా చాలా ప్రశాంతంగా జరుపుకుంటారు. భారతదేశం బహుళ సంస్కృతుల మరియు జాతుల (కులాల) సంక్లిష్టతను సూచిస్తుంది. విభిన్న సంస్కృతులు మరియు మతాలు ఉన్న ప్రజలలో ఐక్యతను సూచించే భావననే “భిన్నత్వంలో ఏకత్వం” అని అంటారు. ఇది భారతదేశం యొక్క అత్యున్నత సాంస్కృతిక లక్షణం.
ప్రశ్న 8.
ప్రస్తుతం భారతదేశంలో జాతీయ సమైక్యతను భగ్నం చేసే అనేక సమస్యలు కలవు. దీనికి గల కారణాలు ఏమిటి? వీటిని ఎలా పరిష్కరించవచ్చు?
జవాబు:
ప్రస్తుతం భారతదేశంలో జాతీయ సమైక్యతను భగ్నంచేసే సమస్యలు (అంశాలు) :
- మతతత్వం
- కులతత్వం
- ప్రాంతీయ తత్వం
- స్వార్థ రాజకీయాలు
- సమాచార ప్రసార సాధనాల అత్యుత్సాహం
- భాషా దురాభిమానం
- సాంఘిక అసమానతలు.
కారణాలు :
- అధిక జనాభా, ఉండటం ప్రధాన కారణం. (అనేక కులాలు, మతాలు, ప్రాంతాల వారుండటం).
- బ్రిటిషు పాలనలో ఉండటం ; వీరు అనుసరించిన విభజించు పాలించు విధానం.
- సమాజంలోని అసమానతలు (ఆర్థిక, సామాజిక అంశాలు)
- స్వార్థ పర రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం (విభజించడం) విభజన రాజకీయాలు చేయడం.
పరిష్కారాలు :
- పౌరులకు దేశ సమైక్యత పట్ల అవగాహన కల్పించాలి. విద్యార్థి దశ నుంచే దేశభక్తిని పెంపొందించాలి.
- చట్టాలు నిర్దిష్టంగా, ఖచ్చితంగా ఉండాలి.
- రాజ్యాంగబద్ధంగా పాలన సాగాలి.
- కుల, మత, ప్రాంతీయ, భాషాతత్వాలనే సంకుచిత భావాలను పారద్రోలాలి.
ప్రశ్న 9.
భారతదేశ పటంలో క్రింద ఇవ్వబడిన ప్రాంతాలను గుర్తించండి.
సింధూ నది, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, బీహార్, భట్టిప్రోలు, కృష్ణానది, గంగా నది, యమునా నది, వింధ్య . పర్వత శ్రేణులు, ఉత్తర ప్రదేశ్.
జవాబు:
ప్రశ్న 10.
మత ఐక్యతను పెంపొందించేలా ఒక చిత్రాన్ని గీయండి.
జవాబు:
విద్యార్థులు స్వయంగా గీయగలరు. ఉదా :
(లేదా)
ప్రశ్న 11.
మత ఐక్యతను పెంపొందించడానికి నాలుగు నినాదాలు రాయండి.
జవాబు:
మత ఐక్యతను పెంపొందించే నినాదాలు :
- ఎన్ని మతాలున్నా – అసలైన మతం మానవత్వం మాత్రమే
- మతం గమ్యం కాదు – మార్గదర్శిని మాత్రమే
- మత విలువలు – పెంచాలి మనిషి నైతిక విలువని
- పరమత సహనం – కల్పించును పరమాత్మ దర్శనం
- మతాల మార్గదర్శకం – పరమాత్మక సన్నిధానం
- మతాలు వేరైనా – గమ్యం ఒక్కటే
- సర్వమత సారం – సర్వ మానవ సౌభాగ్యం
ప్రశ్న 12.
కింద ఇవ్వబడిన ఖాళీలను సరైన పదాలతో నింపండి.
I. మతం : హిందూమతం, సిక్కుమతం, క్రైస్తవ మతం, ఇస్లాం మతం, జైన మతం, బౌద్ధ మతం
II. దేవుడు ప్రవక్త : సిద్ధార్థుడు, యేసుక్రీస్తు, మహావీరుడు, మహమ్మద్ ప్రవక్త, శ్రీకృష్ణుడు, గురునానక్
III. పవిత్ర గ్రంథం : త్రిపీఠికలు, బైబిల్, భగవద్గీత, ఖురాన్, గురుగ్రంథ సాహిబ్, అంగాలు
IV. పూజ ప్రదేశం : మసీదు, ఆలయం, గురుద్వారా, చర్చి, మఠం, జైన దేవాలయం
జవాబు:
6th Class Social Studies 11th Lesson భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు InText Questions and Answers
6th Class Social Textbook Page No.123
ప్రశ్న 1.
భారతదేశంలో అనేక భాషలు కలవు. భాష అవసరం ఏమిటి? భాషలు ఎలా పరిణామం చెంది ఉంటాయి?
జవాబు:
భాష అవసరం ఏమిటంటే :
- భాష మనం ఆలోచించి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
- మన పనులన్నీ క్రమపద్ధతిలో ప్రణాళికాబద్ధంగా చేసుకోవడానికి మనకి భాషే ఉపయోగపడుతుంది.
- ఇతరుల దృష్టిని మనవైపు తిప్పుకోవడానికి మనకి భాష అవసరం.
- కొత్త విషయాలను సృష్టించడానికి కనిపెట్టడానికి, లేదా సరదాగా నవ్వించడానికి భాష అవసరం.
- అనేక విషయాలను ఊహించుకోవడానికి, బాహ్య ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి భాష అవసరం.
- మన భావాలను, అనుభవాలను పంచుకోవడానికి భాష అవసరం. ఈ రకంగా భాష మనకు ఎంతో ప్రముఖమైనది.
- తరతరాలుగా పెద్దలు తమ పిల్లలకు సమాచారాన్ని అందించటానికి భాష అవసరం.
భాష ఎలా పరిణామం చెందింది అని చెప్పటానికి ప్రత్యక్ష ఆధారాలు తక్కువ.
- ముందుగా అనేక (చేతి) గుర్తులను వాడారు (సంజ్ఞలను) తర్వాత శబ్దాలను వాడారు.
- ఒక తరం నుండి మరొక తరానికి, ఒక తెగ (జాతి) నుండి మరో తెగ (జాతి)కు
- ఒక భౌగోళిక ప్రాంతం నుండి మరొక భౌగోళిక ప్రాంతానికి, ఒక సమాజం నుండి మరొక సమాజంకు భాష ప్రసారం జరిగింది.
ప్రశ్న 2.
ఇతర భాషకు చెందిన మీ స్నేహితుడిని ఆహ్వానించండి మరియు అతనితో/ఆమెతో సంభాషించండి.
జవాబు:
విద్యార్థులు స్వయంగా చేయగలరు. ఉదాహరణ ఆధారంగా (కన్నడ స్నేహితునితో)
- నిన్న హెసరు ఏను? (నీ పేరు ఏమిటి)
- నన్న హెసరు రాము.’ (నా పేరు రాము)
- నీను పను కెలస మాడువి ? (నీవు ఏం పని చేస్తావు ?)
- నాను శాలియల్లి ఓదుత్తిదేన్. (నేను బడిలో చదువుతున్నాను.)
- నీను యావ తరగతియల్లి ఓదుత్తీ? (నీవు ఏ తరగతి చదువుచున్నావు?)
- నాను ఆరునే క్లాసివల్లి ఓదుత్తిద్దేనె (నేను ఆరవ క్లాస్ చదువుతున్నాను)
ఈ విధంగా ఏదైనా భాషలో రాయగలరు.
6th Class Social Textbook Page No.124
ప్రశ్న 3.
1516కాలం నాటి కృష్ణదేవరాయలు శాసనాన్ని చదవడానికి ప్రయత్నించండి. మీ ఉపాధ్యాయుని సహాయంతో శాసనంలో ఏముందో అర్థం చేసుకోండి.
జవాబు:
- శుభమస్తు : శ్రీమాన్ మహారాజాధిరాజ రాజపరమేశ్వర మూరురాయర
- గండ అరిరాయనిబాట భాషగెతపువ రాయరగండ యవన రాజ్య
- స్థాపనాచార్య శ్రీ వీరప్రతాప కృష్ణదేవ మహారాయలు విజయ
- నగరాన సింహాసనారూఢుడై పూవజీ దిగ్విజయ యాత్రకు విచ్చేశి
- ఉద్దగిరి, కొండవీడు, కొండపల్లి రాజమహేంద్రవరం మొదలైన
- దుగాజాలు సాధించి సింహ్యాద్రిక విచ్చేసి స్వస్తిశ్రీ జయాభ్యుదయ
- ఈ శాసనము శ్రీకృష్ణదేవరాయలు, దిగ్విజయయాత్ర గురించి వివరిస్తున్నది. అలాగే సింహాచలం విచ్చేసినట్లుగా తెలుస్తుంది.
6th Class Social Textbook Page No.125
ప్రశ్న 4.
భారత అధికార భాషలు హిందీ మరియు ఇంగ్లీష్, ప్రియమైన విద్యార్థులారా “ఇండియా” అనే పదాన్ని అనేక భారతీయ భాషలలో ఎలా రాయవచ్చో గమనించండి.
జవాబు:
ప్రశ్న 5.
ఇంగ్లీషులో 26, తెలుగులో 56 అక్షరాలు కలవు. తమిళం, కన్నడ, మలయాళం, ఒడియాలో ఎన్ని అక్షరాలు కలవు? Page No. 125
జవాబు:
తమిళంలో – 247, కన్నడంలో – 49, మలయాళంలో- 56 (57) ఒడియాలో – 64 అక్షరాలు కలవు.
ప్రశ్న 6.
భారతదేశాన్ని లౌకిక దేశం అంటారు. ఎందుకు?
జవాబు:
భారతదేశంలో ప్రభుత్వానికి ఎటువంటి మతం లేదు. అంటే ప్రభుత్వం ఏ మతాన్ని ప్రోత్సహించదు, ఏ మతాన్ని వ్యతిరేకించదు మత విషయాల్లో తటస్థంగా ఉంటుంది. అంటే మత విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదు. అలాగే దేశ పౌరులందరికి మత స్వాతంత్ర్యపు హక్కు ఉంది. అంటే పౌరులు ఏ మతాన్నైనా అనుసరించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు, ప్రోత్సహించుకోవచ్చును. కాబట్టి భారతదేశాన్ని లౌకిక దేశం అని అంటారు.
6th Class Social Textbook Page No.126
ప్రశ్న 7.
మన ఆరోగ్యం మరియు పరిశుభ్రతను పెంపొందించడంలో సహాయపడుతున్న మన పూర్వికులు ఆచారాలు మరియు సంప్రదాయాలపై చర్చించండి.
జవాబు:
- ఏదైనా శుభకార్యం (ఉత్సవం) జరిగేటపుడు మామిడి (పచ్చ) తోరణాలు కడుతారు. కారణం ఎక్కువమంది ఒకచోట చేరినపుడు ఎక్కువ ఆక్సిజన్ అవసరం కాబట్టి మామిడి ఆకులు ఎక్కువ (సేపు) సమయం పచ్చగా ఉండి, ఆక్సిజన్‌ను విడుదలచేస్తాయి.
- గ్రామీణ ప్రాంతాలలో ఇంటిముందు (పేడ) కళ్ళాపి చల్లుతారు, ఇల్లు అలుకుతారు. కారణం ఆవు పేడలో యాంటి బ్యాక్టీరియల్ గుణం ఉండి ఎటువంటి క్రిమి, కీటకాలు ఇంట్లోకి రావు. అలాగే గొబ్బిళ్ళు పెట్టడం, ముగ్గులు వేయడం కూడా.
- రాగి పాత్రలలో నీరు త్రాగటం. రాగి (పాత్రల్లో) రేకులో బ్యాక్టీరియా, వైరస్లు త్వరగా మృతుమవుతాయి కనుక.
- ఇంటిముందు తులసి, (ఇంటివెనుక కరివేపాకు) వేప వంటి ఔషధ గుణాలున్న మొక్కలు ఉంచడం. ఇవన్నీ క్రిమి, కీటకాలను చంపే ఔషధాలు వీటి యొక్క ఆవశ్యకతను తెల్పుటకు వీటిని పూజించమంటు అందుబాటులో ఉంచినారు.
- గడపకు పసుపు పూయటం, పసుపు యాంటీ బ్యాక్టీరియల్ ఔషధంగా పనిచేస్తుంది. అందుకనే వంటలలో కూడా వాడతారు. అలాగే పాములు చూడగలిగే రంగు పసుపు కనుక గడపకు పసుపుంటే అవి లోపలకి రావు.
- అలాగే ముఖానికి, కాళ్ళకు పసుపు రాసుకుంటారు కారణం ఇది యాంటి బ్యాక్టీరియల్.
ఉగాది పచ్చడి సేవనం, ఉగాది పచ్చడిలో అన్ని రకాల రుచులు ఉంటాయి. అవి ఔషధంగా ఉపయోగపడుతుంది. - సూర్యనమస్కారాలు చేయడం వలన విటమిన్ ‘డి’ లభిస్తుంది.
- ఉపవాసాలు ఉండటం వెనుక కారణం ఇది మన జీర్ణవ్యవస్థను అభివృద్ధి చేస్తుంది.
- ఉత్తర దిక్కున తల ఉంచి, నిద్రపోరాదు అని ఎందుకు చెబుతారంటే భూమి యొక్క అయస్కాంత క్షేత్రం వలన బిపి మొదలైన వ్యాధులు వస్తాయని.
- అయితే సంప్రదాయాలు మూఢాచారాలుగా, మూఢ విశ్వాసాలుగా రూపాంతరం చెందకుండా, వాటి యొక్క ఉద్దేశ్యమును గ్రహించాలి.