SCERT AP 10th Class Social Study Material Pdf 9th Lesson రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ Textbook Questions and Answers.
AP State Syllabus 10th Class Social Solutions 9th Lesson రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ
10th Class Social Studies 9th Lesson రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ Textbook Questions and Answers
Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)
ప్రశ్న 1.
భారతదేశంలోని ప్రతి గ్రామాన్ని ప్రతి పదేళ్ళకు ఒకసారి జనాభా గణనలో సర్వేచేసి కింద ఇచ్చిన విధంగా వివరాలను పొందుపరుస్తారు. రాంపురానికి సంబంధించిన సమాచారం ఆధారంగా కింది వివరాలను నింపండి. (AS3)
అ. ఎక్కడ ఉంది (ఉనికి) :
ఆ. గ్రామ మొత్తం విస్తీర్ణం :
ఇ. భూ వినియోగం హెక్టార్లలో :
జవాబు:
అ. ఎక్కడ ఉంది (ఉనికి) :
పశ్చిమ ఉత్తరప్రదేశ్ లోని సారవంతమైన గంగా మైదానపు ఒండ్రునేలల్లో రాంపురం, ఉంది.
ఆ. గ్రామ మొత్తం విస్తీర్ణం : 290 హెక్టార్లు
ఇ. భూ వినియోగం హెక్టార్లలో : సాగులో ఉన్న భూమి.
ప్రశ్న 2.
రాంపురంలోని వ్యవసాయ కూలీలకు కనీస కూలీ కంటే తక్కువ కూలీ ఎందుకు లభిస్తోంది? (AS1)
జవాబు:
రాంపురంలో పనికోసం వ్యవసాయ కూలీల మధ్య తీవ్ర పోటీ ఉంది, కాబట్టి తక్కువ కూలీకైనా పనిచేయ్యటానికి ప్రజలు సిద్ధపడతారు. పెద్దరైతులు ట్రాక్టర్లు, నూర్పిడి యంత్రాలు, పంటకోత యంత్రాలపై ఆధారపడటం పెరగటంతో గ్రామీణ “ప్రాంతాలలో కూలీలకు లభించే పని దినాలు తగ్గిపోతున్నాయి. అందుచే రాంపురంలోని వ్యవసాయ కూలీలకు కనీస కూలీ కంటే తక్కువ కూలీ లభిస్తుంది.
ప్రశ్న 3.
మీ ప్రాంతంలోని ఇద్దరు కూలీలతో మాట్లాడండి. ఇందుకు వ్యవసాయ కూలీలనుగానీ, భవన నిర్మాణంలో పని చేసేవాళ్ళనుగానీ ఎంచుకోండి. వాళ్ళకు ఎంత కూలీ లభిస్తోంది? వాళ్ళకు నగదు రూపంలో చెల్లిస్తారా, వస్తు రూపంలోనా? వాళ్ళకు క్రమం తప్పకుండా పని దొరుకుతుందా? వాళ్ళు అప్పుల్లో ఉన్నారా? (AS3)
జవాబు:
మా ప్రాంతంలో భవన నిర్మాణ కూలీలకు రోజుకు రూ. 300/- లభిస్తుంది. దీనిని నగదు రూపంలో చెల్లిస్తారు. వీరికి సుమారుగా క్రమం తప్పకుండా పని దొరుకుతుంది. మా ప్రాంతంలో కూలీ పనిచేసే ప్రతివారికి అప్పు ఉంటుంది.
ప్రశ్న 4.
ఒకే విస్తీర్ణం ఉన్న భూమి నుంచి ఉత్పత్తిని పెంచటానికి ఉన్న వివిధ పద్ధతులు ఏమిటి ? కొన్ని ఉదాహరణలతో వివరించండి. (AS1)
జవాబు:
ఒకే విస్తీర్ణంలో ఉన్న భూమి నుంచి ఉత్పత్తిని పెంచడానికి ఉన్న వివిధ పద్ధతులు :
- బహుల పంటల సాగు విధానంలో నిరంతరం పంటలు పండించడం.
- ఎల్లప్పుడూ నీరు అందుబాటులో ఉండేటట్లు సాగునీటి సదుపాయాలను మెరుగుపరచడం.
- భూమి సారాన్ని పోగొట్టకుండా ఉండేందుకు పంట మార్పిడి విధానం అమలు చేయటం.
- అధిక దిగుబడినిచ్చే వంగడాలు వినియోగం, సస్యరక్షణ చర్యలు చేపట్టడం.
- అనువైన చోట అంతర్ పంట సాగు చేయటం.
ప్రశ్న 5.
మధ్యతరగతి, పెద్ద రైతులకు వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడి ఎలా సమకూరుతుంది? చిన్న రైతులకూ, వీళ్ళకు మధ్య ఉన్న తేడా ఏమిటి? (AS1)
జవాబు:
మధ్య తరగతి, పెద్ద రైతులకు వ్యవసాయంలో మిగులు ఉంటుంది. దీనిని తదుపరి పంటలకు, ఆధునిక వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు కొనుగోలుకు ఖర్చు చేస్తారు. వీరు చిన్న రైతులకు వడ్డీకి అప్పులు యివ్వడం, ట్రాక్టర్లు అద్దెకు యివ్వడం, వ్యాపారాలు చేస్తూ అదనపు ఆదాయాన్ని పొందుతారు. అందుచే వీరికి పెట్టుబడి ఓ సమస్య కాదు. చిన్న రైతులు పండించే పంట తమ కుటుంబ అవసరాలకే సరిపోతుంది. అందుచే వీరు పెట్టుబడి కోసం అప్పులు చేస్తుంటారు.
ప్రశ్న 6.
ఏ షరతుల మీద తేజ్ పాల్ నుండి సవిత అప్పు పొందింది? తక్కువ వడ్డీకి బ్యాంకు నుంచి రుణం లభిస్తే సవిత పరిస్థితి . భిన్నంగా ఉండేదా? (AS1)
జవాబు:
సవిత అనే చిన్న రైతు గోధుమ పంట పండించడానికి పెట్టుబడికై తేజ్ పాల్ అనే రైతు వద్ద నాలుగు నెలల్లో తిరిగి యివ్వాలన్న షరతు మీద 36% వడ్డీకి 6000 రూపాయలు అప్పు తీసుకుంది. కోత సమయంలో రోజుకు వంద రూపాయల కూలీకి తేజ్ పాల్ పొలంలో పనిచేయడానికి కూడా ఈమె అంగీకరించింది. తక్కువ వడ్డీకి రుణం లభిస్తే సవిత తన మిగులు పంట నుండి అప్పు తీర్చేది. తాను చేసిన పనికి న్యాయమైన కూలీ లభించేది.
ప్రశ్న 7.
మీ ప్రాంతంలోని పెద్దవాళ్ళతో మాట్లాడి గత 30 సంవత్సరాలలో సాగునీటి విధానాలలోనూ, వ్యవసాయ పద్ధతులలోనూ వచ్చిన మార్పుల గురించి ఒక నివేదిక రాయండి. (AS3)
జవాబు:
గత 30 సంవత్సరాలుగా సాగునీటి విధానంలో కొత్తగా కాలువలు, చెరువులు సమకూరలేదు. అనేక వ్యవసాయ చెరువులు ఆక్రమణలకు గురై, మరమ్మతులు లేక నిరుపయోగంగా మారాయి. చెరువులలోకి రావలసిన వర్షపు నీరు రావలసిన మార్గాలు గృహ నిర్మాణాలు, రహదారుల నిర్మాణం మూలంగా మూతపడ్డాయి. భూగర్భ జలాలు తగ్గడంతో బోరుబావులు లోతుగా తీయవలసి వస్తోంది. దగ్గర దగ్గరగా బోరుబావులు త్రవ్యడంతో నీరు అందుబాటులోకి రావటం లేదు. నిరంతర విద్యుత్ కోతల మూలంగా సాగునీరు సరిగ్గా అందటంలేదు. అంతరాష్ట్ర జల వివాదాల కారణంగా వర్షాభావ స్థితిలో ఆనకట్టలు నిండక కాలువలు’ ప్రవహింపక కాలువ చివరి భూములకు సాగునీరు అందడం లేదు.
కొత్త రకం వంగడాలు, క్రిమి సంహారక మందులు రావటంతో ఉత్పత్తి పెరిగింది. కానీ వ్యవసాయం గిట్టుబాటు కాకపోవటం, వ్యవసాయేతర పనులలో ఆదాయం బాగుండటంతో చిన్న చిన్న రైతులు వ్యవసాయంపై శ్రద్ధ తగ్గించారు.
ప్రశ్న 8.
మీ ప్రాంతంలోని ప్రధాన వ్యవసాయేతర పనులు ఏమిటి? ఏదైనా ఒక కార్యక్రమాన్ని ఎంచుకుని ఒక చిన్న నివేదిక తయారు చేయండి. (AS3)
జవాబు:
మా ప్రాంతం పట్టణానికి సమీపంలో ఉన్నందున నిర్మాణ కార్యక్రమాలలో ఎక్కువ మంది శ్రామికులు పనిచేస్తున్నారు. చద్దన్నం తిని మధ్యాహ్న భోజనం కేరేజిలో పట్టుకొని కూలీలందరూ ఆటోలలో బయలుదేరి గుత్తేదారు సూచించిన స్థలానికి ఉదయం 9 గంటల భోజన విరామం తరువాత 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తారు. ఇంటికి కావలసిన సరుకులను కొనుగోలుచేసి తిరిగి శ్రామికులందరూ ఆటోలో ఇంటికి చేరుతారు. రోజు కూలీ రూ. 300/- చెల్లిస్తున్నారు. ఈ కార్మికులు ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాల లబ్ధిదారులుగా స్వగృహాన్ని ఏర్పరచుకొని పిల్లలను తమ గ్రామంలోని ప్రభుత్వ/ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్నారు. ఈ శ్రామికులలో చాలా మంది అక్షరాస్యులు. మహిళలు కూడా పురుషులతో సమానంగానే పనిచేస్తారు.
ప్రశ్న 9.
ఉత్పత్తికి భూమి కాకుండా శ్రమ కొరతగా ఉండే పరిస్థితిని ఊహించుకోండి. అప్పుడు రాంపురం కథ ఇందుకు భిన్నంగా ఉండేదా? ఎలా? తరగతిలో చర్చించండి. (AS1)
జవాబు:
ఉత్పత్తికి భూమి కాకుండా శ్రమ కొరతగా ఉంటే రాంపురం కథ ఇందుకు భిన్నంగా ఉండేది. వ్యవసాయ కూలీలకు ఇప్పటికంటే ఎక్కువ కూలీ లభించేది. చిన్న రైతులు తమ మిగులు కాలంలో వ్యవసాయకూలీ ద్వారా ఎక్కువ ఆదాయం పొంది దానిని తమ వ్యవసాయానికి పెట్టుబడిగా పెట్టేవారు. దీంతో పెద్దరైతుల నుండి అధిక వడ్డీలకు అప్పులు తేవడం, వారు చెప్పిన రేటుకు పనిచేయడం లాంటి సమస్యల నుండి బయటపడేవారు.
ప్రశ్న 10.
గోసాయిపూర్, మణాలి అనేవి ఉత్తర బీహార్‌లోని రెండు గ్రామాలు. రెండు గ్రామాలలోని 860 కుటుంబాల నుంచి 250 కంటే ఎక్కువ మగవాళ్ళు పంజాబ్ లేదా హర్యానా గ్రామీణ ప్రాంతాలలో, లేదా ఢిల్లీ, ముంబయి, సూరత్, హైదరాబాదు, నాగపూర్ వంటి నగరాలలో పనిచేస్తున్నారు. ఇలా వలస వెళ్ళటం భారతదేశమంతటా గ్రామాలలో సాధారణమే. ప్రజలు ఎందుకు వలస వెళతారు? (గత అధ్యాయానికి మీ ఊహను జోడించి) గోసాయిపుర్, మజాలి గ్రామల నుంచి వలస వెళ్ళినవాళ్లు ఆయా ప్రాంతాలలో ఏ పని చేస్తారో రాయండి. (AS4)
జవాబు:
ఉత్తర బీహార్‌లోని గోసాయిపూర్, మజాలి గ్రామాల నుండి వలసలు వెళ్ళుటకు బహుశా క్రింది కారణాలు కావచ్చును.
- ఆ గ్రామాలలో తగినంత పని దొరకపోవడం.
- పని దొరికినా తగినంత కూలీ లభించక పోవటం.
- సంవత్సరంలో ఎక్కువ భాగం పనిలేకుండా ఉండటం.
- గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలుకాకపోవటం.
- ప్రజలు అధిక ఆదాయాలు పొందాలనుకోవటం తద్వారా జీవన ప్రమాణాలను పెంచుకోవాలని ఆశించండం.
- సమీప పట్టణాలలో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు లేకపోవటం.
ఢిల్లీ, ముంబయి, సూరత్, హైదరాబాదు, నాగపూర్ వంటి నగరాల్లో వలస వెళ్లేవారు చేయుపనులు.
రవాణా, నిర్మాణరంగం, పెయింటింగ్స్, వాచ్ మెన్ వంటి ఉద్యోగాలు, తోపుడు బండ్లపై కూరగాయలు, పండ్లు, గృహోపకరణాలు అమ్మటం, కర్మాగారాలలో పనిచేయడం, కార్పెంటరీ, బొంతలు కుట్టడం వంటివి.
ప్రశ్న 11.
పట్టణ ప్రాంతాలలో వస్తువుల ఉత్పత్తికి కూడా భూమి అవసరం. గ్రామీణ ప్రాంతంలో భూ వినియోగానికీ, పట్టణ ప్రాంతాలలో భూ వినియోగానికి మధ్య గల తేడా ఏమిటి? (AS1)
జవాబు:
పట్టణ ప్రాంతంలో భూ వినియోగం | గ్రామీణ ప్రాంతంలో భూ వినియోగం |
1) పట్టణ ప్రాంతాలలో వస్తువుల ఉత్పత్తికి వినియోగించే భూమి రేట్లు అత్యధికం. | 1) గ్రామీణ ప్రాంతాలలో భూముల రేట్లు సాధారణంగా ఉంటాయి. |
2) పట్టణ ప్రాంతాలలో స్వంత భూమి లేకున్న అద్దెకు/లీజుకు భూమి తీసుకొని వస్తు ఉత్పత్తి చేస్తారు. | 2) గ్రామీణ ప్రాంతాలలో సాధారణంగా భూమి కొనుగోలు చేసి వినియోగిస్తారు. |
3) పరిమిత స్థలంలో ప్రణాళికాబద్ధంగా వస్తూత్పత్తి జరుపుకోవాలి. | 3) అవసరమైన స్థలం లభిస్తుంది. |
4) పట్టణ ప్రాంతాల్లో భూమి గృహ నిర్మాణాలకు, వ్యాపార సంబంధ నిర్మాణాలకు వినియోగిస్తారు. | 4) గ్రామీణ ప్రాంతాలల్లో భూమి పంటలు పండించడానికి, తోటల పెంపకానికి వినియోగిస్తారు. |
ప్రశ్న 12.
ఉత్పత్తి ప్రక్రియలో “భూమి” అన్న దాని అర్థం మరొకసారి చదవండి. వ్యవసాయం కాకుండా ఇతర ఉత్పత్తి ప్రక్రియలో భూమి ముఖ్యమైన అవసరంగా ఉన్న మరొక మూడు ఉదాహరణలు ఇవ్వండి. (AS1)
జవాబు:
వ్యవసాయం కాకుండా ఇతర ఉత్పత్తి ప్రక్రియలో భూమి ముఖ్యమైన అవసరం ఉన్న వాటికి ఉదాహరణలు.
- పౌల్టీల ఏర్పాటు నిర్వహణ.
- ఇటుక బట్టీల ఏర్పాటు, విక్రయం.
- ఈమూ పక్షుల పెంపక కేంద్రం ఏర్పాటు.
- ఐస్ ఫ్యాక్టరీ ఏర్పాటు.
- కుండీల తయారీ.
ప్రశ్న 13.
ఉత్పత్తికి, ప్రత్యేకించి వ్యవసాయానికి అవసరమైన నీరు ఒక సహజ వనరు. ఇప్పుడు నీటిని పొందటానికి దీని వినియోగానికి , ఎక్కువ పెట్టుబడి అవసరం అవుతోంది. ఈ వాక్యాలను వివరించండి. (AS2)
జవాబు:
ఉత్పత్తికి, ప్రత్యేకించి వ్యవసాయానికి అవసరమైన నీరు ఒక సహజ వనరు. ఇప్పుడు నీటిని పొందడానికి, దీని వినియోగానికి ఎక్కువ పెట్టుబడి అవసరం అవుతోంది. నీరు సహజ వర్షం నుండి లభిస్తుంది. అయితే కొండలులో చెట్లు నరికివేయటం, గ్రానైట్, క్వారీలకై వాటి రూపాలే లేకుండా చేయడంతో సహజంగా పడాల్సిన వర్షాలు తుఫానులు వస్తే కానీ రావటం లేదు. వర్షాలు సకాలంలో కురవకపోవటంతో విత్తులు నాటిన నుండి పంటకోసే వరకు సాగు నీటిపైన ఆధారపడాల్సి ఉంటుంది. వర్షాలు సరిగా కురవకపోవటంతో సహజ నీటివనరులైన నదీ కాలువలు, చెరువులు, బావుల నుండి సకాలంలో సాగునీరు లభించటం లేదు. దీంతో విద్యుత్ మోటర్లుతో నడిచే బోరుబావుల ద్వారా సాగునీరు పొందవలసి వస్తోంది. భూగర్భ జలాలు లోలోతుకు పోతుండటంతో వాటి త్రవ్వకం, నిర్వహణ ఖర్చుతో కూడినదైపోయింది.
10th Class Social Studies 9th Lesson రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ InText Questions and Answers
10th Class Social Textbook Page No.117
ప్రశ్న 1.
రాష్ట్ర లేక జిల్లా భౌగోళిక పటాలను చూసి బాగా సాగునీటి సదుపాయం ఉన్న ప్రాంతాలను గుర్తించండి. మీరు ఉంటున్న ప్రాంతం దీని కిందికి వస్తుందా?
జవాబు:
అట్లాసు చూసి సాగునీటి సదుపాయం గల ప్రాంతాలను గుర్తించగా, మేము నివాసం ఉంటున్న ప్రాంతం కూడా దీని కిందకే వచ్చింది. అనగా మా ప్రాంతం కూడా సాగునీటి సదుపాయం కలిగి ఉంది.
10th Class Social Textbook Page No.126
ప్రశ్న 2.
ఈ పనికి మిశ్రిలాలకు ఏ భౌతిక పెట్టుబడులు అవసరం అయ్యాయి?
జవాబు:
చెరకు తయారీకి మిశ్రిలాలకు బెల్లం తయారీ యూనిట్ (చెరకు రసం తీసే యంత్రం, చెరకు రసం వేడిచేసే పెద్ద పెనం, మట్టి కుండలు, షెడ్ మొదలైనవి)కు అయ్యే ఖర్చును భౌతిక పెట్టుబడిగా పేర్కొనవచ్చు.
ప్రశ్న 3.
దీనికి శ్రమ ఎవరిద్వారా అందుతోంది?
జవాబు:
దీనికి శ్రమ కూలీల ద్వారా అందుతుంది. విద్యుత్ తో యంత్రం నడుస్తుంది.
ప్రశ్న 4.
బెల్లాన్ని మిశ్రిలాల్ తన ఊళ్లో కాకుండా జహంగీరాబాదులోని వ్యాపారస్తులకు ఎందుకు అమ్ముతున్నాడు?
జవాబు:
మిశ్రిలాల్ గ్రామంలో బెల్లం పెద్ద మొత్తంలో ఒకేసారి కొనేవారుండరు. అందుచే ఆయన జహంగీరాబాదులోని వ్యాపారులకు బెల్లం అమ్ముతున్నాడు.
ప్రశ్న 5.
ఎవరి స్థలంలో దుకాణాలను నెలకొల్పుతారు?
జవాబు:
బస్టాండుకు దగ్గరగా ఉన్న ఇళ్లల్లో కొన్ని కుటుంబాల వారు తమకున్న స్థలంలో కొంత భాగాన్ని దుకాణాలు తెరవడానికి ఉపయోగిస్తారు.
ప్రశ్న 6.
తినే వస్తువులు అమ్మే ఈ దుకాణాలలో శ్రమ ఎవరిది?
జవాబు:
కుటుంబంలోని మహిళలు, పిల్లలు.
ప్రశ్న 7.
ఇటువంటి దుకాణాలకు ఎలాంటి నిర్వహణ పెట్టుబడి అవసరం అవుతుంది?
జవాబు:
ఇలాంటి దుకాణాలు సాధారణంగా స్వయం ఉపాధితో పెట్టినవే.
ప్రశ్న 8.
భౌతిక పెట్టుబడి కిందికి వచ్చే వాటిని పేర్కొనండి.
జవాబు:
భౌతిక పెట్టుబడి కింద వచ్చేవి – పిండిమర మొదలైనవి.
ప్రశ్న 9.
మీ ప్రాంతంలో బజారులో తిరుగుతూ సరుకులు అమ్మేవాళ్లల్లో ఒకరి నుంచి వాళ్ల రోజువారీ అమ్మకాలు ఎంతో తెలుసుకోండి. ఏమైనా పొదుపు చేస్తున్నారో, లేదో ఎలా తెలుస్తుంది ? టీచరుతో చర్చించండి.
జవాబు:
మా ప్రాంతంలో బజారులో తిరుగుతూ సరుకులు అమ్మేవారు తమ ఆదాయంలో కొంత మేరకు స్వయంశక్తి సంఘాల పొదుపుల్లోనో, గ్రామాల్లో వేసే చీటీ (చిట్స్)లోనో పొదుపు చేస్తున్నారు.
10th Class Social Textbook Page No.127
ప్రశ్న 10.
కిశోర్ స్థిర పెట్టుబడి ఏమిటి ? అతడి నిర్వహణ పెట్టుబడి ఏమై ఉంటుంది?
జవాబు:
గేదె, బండి – కిశోర్ యొక్క స్థిర పెట్టుబడి. గేదె దానా, బండి మరమ్మతులు, కందెన వంటివి నిర్వహణ పెట్టుబడి.
ప్రశ్న 11.
కిశోర్ ఎన్ని ఉత్పత్తి కార్యకలాపాలలో పాల్గొంటూ ఉన్నాడు?
జవాబు:
కిశోర్ పాల ఉత్పత్తి, రవాణా అనే రెండు రకాల ఉత్పత్తి కార్యకలాపాలలలో పాల్గొన్నాడు.
ప్రశ్న 12.
రాంపురంలో మెరుగైన రోడ్ల వల్ల కిశోర్ లాభపడ్డాడా?
జవాబు:
కిశోర్ తన గేదెతో నడిచే బండి సులువుగా నడపడానికి రాంపురంలోని మెరుగైన రోడ్లు ఉపయోగపడ్డాయి.
10th Class Social Textbook Page No.115
ప్రశ్న 13.
వ్యవసాయం గురించి మీకు ఏం తెలుసు ? వివిధ కాలాల్లో పంటలు ఎలా మారుతూ ఉంటాయి? వ్యవసాయం మీద ఆధారపడిన అధిక శాతం ప్రజలకు భూమి ఉందా, లేక వాళ్లు వ్యవసాయ కూలీలా?
జవాబు:
భూమి సాగుచేసి పంటలు పండించడాన్ని వ్యవసాయం అంటారు.. పంటలు కాలము, సాగునీటి సదుపాయం వంటి సౌకర్యాల ఆధారంగా పండుతాయి. ఉదా : వరి పంటకు 25°C ఉష్ణోగ్రత, మొదలలో నీరు నిలువ ఉండాలి. గోధుమ పంటకు తక్కువ ఉష్ణోగ్రత ఉండాలి. కాబట్టి కాలాన్ని, ప్రాంతాన్ని బట్టి పంటలు మారుతుంటాయి. వ్యవసాయం మీద ఆధారపడిన వారిలో అధిక శాతం మందికి భూమిలేదు. వారంతా వ్యవసాయ కూలీలు.
10th Class Social Textbook Page No.117
ప్రశ్న 14.
కింది పట్టిక భారతదేశంలో సాగుకింద ఉన్న భూమిని మిలియన్ హెక్టార్లలో చూపిస్తుంది. పక్కన ఉన్న గ్రాఫ్ లో వీటిని పొందుపరచండి. గ్రాఫ్ ఏం తెలియచేస్తోంది? తరగతి గదిలో చర్చించండి.
జవాబు:
గ్రాఫ్ ను పరిశీలించగా 1950లో భారతదేశంలో గల సాగుభూమి 120 మిలియన్ హెక్టార్లు, 1960లో 130, 1970లో 110 మిలియన్ హెక్టార్లకు పెరిగింది. అయితే గత 4 దశాబ్దాలుగా సాగుభూమి స్థిరంగా ఉండిపోయింది. ఏ మాత్రము పెరగలేదు. జనాభా మాత్రం దశాబ్దానికి దశాబ్దానికి పెరుగుతూనే ఉంది. కాబట్టి భవిష్యత్తులో తిండి గింజలు (ఆహార) కొరత ఏర్పడవచ్చు. కావునా, అందుబాటులో గల సాగుభూమికి సాగునీరందివ్వడానికి ప్రాజెక్టులను నిర్మించి బహుళ పంటల పద్ధతి అమలు చేయటం, పంట దిగుబడికి నూతన విధానాలు అమలు చేయటం వంటివి చేయాలి.
ప్రశ్న 15.
‘రాంపురంలో పండించిన పంటల గురించి తెలుసుకున్నారు. మీ ప్రాంతంలో పండించే పంటల ఆధారంగా కింది పట్టికను నింపండి.
జవాబు:
ప్రశ్న 16.
గ్రామీణ ప్రాంతాలలో ‘బహుళ పంటలు’ సాగు చెయ్యటానికి దోహదపడే కారణాలు ఏమిటి?
జవాబు:
గ్రామీణ ప్రాంతాలలో బహుళ పంటలు సాగుచేయుటకు దోహదపడే అంశాలు :
- వ్యవసాయ కూలీల అందుబాటు
- సాగునీరు లభ్యత
- సారవంతమైన నేల
- కాలానుగుణంగా పంటలు మార్చే నేర్పుగల అనుభవనీయులైన రైతులు.
10th Class Social Textbook Page No.119
ప్రశ్న 17.
ఈ క్రింది పటంలో చిన్న రైతులు సాగుచేసే భూమిని గుర్తించి రంగులు నింపండి.
పటం : ఆంధ్రప్రదేశ్ లోని ఒక గ్రామంలో సాగుభూమి పంపిణీ
ప్రశ్న 18.
అనేక మంది రైతులు ఇంత చిన్న కమతాలను ఎందుకు సాగుచేస్తున్నారు?
జవాబు:
అనేక మంది చిన్న చిన్న కమతాలను సాగుచేయుటకు గల కారణాలు.
- రైతుగా సామాజిక హోదా.
- తన పొలంలో పండే పంట తింటున్నాననే తృప్తి.
- ఈ భూమి రైతుకు పరపతినేర్పాటు చేస్తుంది.
- ఈ చిన్న కమతాలలో రెండు, మూడవ పంటలుగా వాణిజ్య పంటలు వేసి ఆర్థికంగా అవసరాలు తీర్చుకుంటాడు.
- చిన్న కమతాలలో వ్యవసాయం చేసుకుంటూ, మిగతా సమయాలలో ఇతరుల పనికి కూలీకి వెళ్లటం, వ్యాపారాలు చేయటం వంటివి చేస్తారు.
10th Class Social Textbook Page No.119
ప్రశ్న 19.
భారతదేశంలో రైతులు, వాళ్లు సాగుచేసే భూముల వివరాలు కింద ఇచ్చిన పట్టికలోనూ, ‘పై’ చార్టులోనూ ఉన్నాయి.
గమనిక : ఈ గణాంకాలు రైతులు సాగుచేస్తున్న భూమి వివరాలను తెలియజేస్తున్నాయి. ఈ భూమి సొంతం కావచ్చు లేదా కౌలుకు తీసుకున్నది కావచ్చు.
1) బాణం గుర్తులు ఏమి సూచిస్తున్నాయి?
2) భారతదేశంలో సాగుభూమి పంపిణీలో అసమానతలు ఉన్నాయని మీరు అంగీకరిస్తారా?
జవాబు:
- భారతదేశంలో సాగుభూమి పంపిణీలో అసమానతలను బాణం గుర్తులు సూచిస్తున్నాయి.
- రైతు జనాభాలో కేవలం 13% గల మధ్య తరగతి, భూస్వాముల చేతిలో మొత్తం భూమిలో సగం కంటే ఎక్కువ అనగా 52% భూమి ఉంది. 87%, చిన్న రైతుల వద్ద కేవలం 48% భూమి మాత్రమే ఉంది. అనగా దేశంలోని అత్యధిక సాగుభూమి కొద్ది మంది రైతుల చేతులలోనే ఉంది.
10th Class Social Textbook Page No.120
ప్రశ్న 20.
దళ లాంటి వ్యవసాయ కూలీలు పేదవారుగా ఎందుకు ఉన్నారు?
జవాబు:
దళ లాంటి వ్యవసాయ కూలీలు పేదవారుగా ఉండుటకు కారణాలు :
రాంపురంలో పనికోసం వ్యవసాయ కూలీల మధ్య తీవ్ర పోటీ ఉంది. కాబట్టి తక్కువ కూలీకైనా పని చేయుటకు ప్రజలు సిద్ధపడుతున్నారు. అందుచే దళ లాంటి వ్యవసాయ కూలీలు పేదవారుగా మిగిలిపోతున్నారు.
10th Class Social Textbook Page No.121
ప్రశ్న 21.
తమ కోసం వ్యవసాయ కూలీలు పనిచెయ్యటానికి రాంపురంలోని మధ్యతరగతి, పెద్ద రైతులు ఏం చేస్తారు? మీ ప్రాంతంలోని పరిస్థితిని దీనితో పోల్చండి.
జవాబు:
తమ కోసం వ్యవసాయ కూలీలు పనిచెయ్యటానికి రాంపురంలో మధ్యతరగతి పెద్ద రైతులు పేదవారికి, చిన్న రైతులకు అప్పులిచ్చి తామిచ్చే కూలీకి తమ పొలాల్లో తప్పనిసరిగా పనిచేయాలనే నిబంధన విధిస్తారు. మా ప్రాంతంలో అటువంటి పరిస్థితులు లేవు. వ్యవసాయేతర పనులు లభించడంతో వ్యవసాయ పనులపైనే ఆధారపడవలసిన అవసరం లేదు.
10th Class Social Textbook Page No.121
ప్రశ్న 22.
కింది పట్టికను నింపండి :
ఉత్పత్తి ప్రక్రియలో శ్రమ | ఒక్కొక్కదానికి మూడు భిన్నమైన ఉదాహరణలు ఇవ్వండి. |
యజమాని / కుటుంబం కూడా అవసరమైన పని చేస్తారు. | |
పని చెయ్యటానికి యజమాని కూలీలను నియమిస్తాడు. |
జవాబు:
ఉత్పత్తి ప్రక్రియలో శ్రమ | ఒక్కొక్కదానికి మూడు భిన్నమైన ఉదాహరణలు ఇవ్వండి. |
యజమాని / కుటుంబం కూడా అవసరమైన పని చేస్తారు. | తమ స్వంత పొలంలో వ్యవసాయ పనులు. ఇంటి మైనర్ రిపేర్లు, పంటలేని సమయంలో పొలాన్ని సిద్ధం చేయటం. |
పని చెయ్యటానికి యజమాని కూలీలను నియమిస్తాడు. | పొలానికి ఎరువు వేయించటం, పంట కాలంలో పనులు – ఉడుపు, కలుపుతీత, గొప్పు, కోత వంటివి. పొలానికి సాగునీరు రావలసిన కాలువలు త్రవ్వించుట మొదలైనవి. |
ప్రశ్న 23.
మీ ప్రాంతంలో వస్తువుల, సేవల ఉత్పత్తిలో ఏ ఏ రకాలుగా శ్రమను పొందుతారు?
జవాబు:
మా ప్రాంతంలో వస్తువుల, సేవల ఉత్పత్తిలో శ్రమను పొందు రకాలు:
- పనిచేసే కూలీలు
- పంటను సమీప మార్కెట్ కు తరలించే వాహనాల డ్రైవర్లుగా
- వాహనాలు నుంచి సరుకు దించే కూలీలుగా
- విత్తనాలు, ఎరువులు అమ్మే వ్యాపారులు
- పేపరు మిల్లుల ఏజంట్లుగా
10th Class Social Textbook Page No.122
ప్రశ్న 24.
క్రింది పట్టికను పరిశీలించండి.
1) పైన ఇచ్చిన కూలిరేట్లతో మీ ప్రాంతంలో ఏదైనా పనికి అమలులో ఉన్న కూలిరేట్లను పోల్చండి.
జవాబు:
మా ప్రాంతంలో రోజువారీ కూలీలు పైన పేర్కొన్న విధంగానే ఉన్నాయి. పురుషులకు కనీస కూలీ రూ. 200 కాగా, స్త్రీలకు రూ. 150. దత్తాంశంలో చాలా వ్యత్యాసాలున్నాయి.
2) కనీస కూలీరేట్ల గురించి తెలుసుకొని వాటితో పోల్చండి.
జవాబు:
1) నూర్పిడి చేసినందుకు స్త్రీలకు (పైన పేర్కొన్న విధంగా) కనీస కూలీ రూ. 118 లభిస్తుంది.
2) కాగా మా ప్రాంతంలో నూర్పిడి చేసినందుకు స్త్రీలకు రూ. 200ల కనీస కూలీ ఇస్తున్నారు.
3) ఒక పనికి ఆడవాళ్ల కంటే మగవాళ్లకు ఎక్కువ కూలీ ఎందుకు లభిస్తోంది? చర్చించండి.
జవాబు:
ఆడవారికంటే మగవారు ఎక్కువ పనిచేయగలరనే భావన వలన ఒక పనికి ఆడవారికంటే మగవారికి ఎక్కువ కూలి ఇస్తున్నారు.
10th Class Social Textbook Page No.126
ప్రశ్న 25.
మిశ్రిలాల్ తన లాభాన్ని ఎందుకు పెంచుకోలేకపోతున్నాడు? అతడికి నష్టాలు వచ్చే సందర్భాలు ఏమిటో ఆలోచించండి.
జవాబు:
మిశ్రిలాల్ బెల్లం తయారీని కుటీర పరిశ్రమగా నిర్వహిస్తున్నాడు. పెద్ద ఎత్తున చెరుకు కొని యంత్రాల సంఖ్య పెంచడం, శ్రామికులను వినియోగించడం ద్వారా ఆయన బెల్లం ఉత్పత్తిని పెంచి అధిక లాభాలను ఆర్జించగలడు. అయితే వ్యాపారంలో పోటీ, మార్కెట్ రిల మూలంగా నష్టాలు కూడా రావచ్చు.
10th Class Social Textbook Page No.124
ప్రశ్న 26.
ముగ్గురు రైతులను తీసుకోండి. ముగ్గురూ గోధుమలు పండించారు. అయితే వాళ్ళు ఉత్పత్తి చేసిన దానిలో తేడా ఉంది (రెండవ నిలువు వరుస). వివిధ రైతులు ఎదుర్కొనే పరిస్థితిని విశ్లేషించటానికి కొన్ని అంశాలు అందరికీ సమానమని అనుకోవాలి. తేలికగా లెక్క కట్టటానికి ఈ అంశాలను అనుకుందాం :
1) ప్రతి రైతు కుటుంబం వినియోగించే గోధుమల మొత్తం సమానం (మూడవ నిలువు వరుస).
2) ఈ సంవత్సరంలో మిగిలిన గోధుమనంతా వచ్చే సంవత్సరం విత్తనంగా రైతులందరూ ఉపయోగించుకుంటారు. అందుకు వాళ్లకు తగినంత భూమి ఉంది.
3) అందరికి ఉపయోగించిన విత్తనం కంటే రెట్టింపు దిగుబడి వస్తుందనుకుందాం. ఉత్పత్తిలో ఎటువంటి అకస్మాత్తు నష్టాలు లేవు.
పట్టికను పూర్తి చేయండి.
• మూడు సంవత్సరాలలో ముగ్గురు రైతుల గోధుమ ఉత్పత్తిని పోల్చండి.
• 3వ రైతు పరిస్థితి 3వ సంవత్సరంలో ఏమవుతుంది ? అతడు ఉత్పత్తిని కొనసాగించగలడా ? ఉత్పత్తిని కొనసాగించటానికి అతడు ఏం చెయ్యాలి?
జవాబు:
1వ రైతు
వినియోగం కంటే ఉత్పత్తి రెట్టింపుతో ప్రారంభించిన 2వ రైతు మిగులునే వచ్చే సంవత్సరానికి పెట్టుబడిగా పెట్టి పంట కొనసాగిస్తున్నాడు.
వినియోగానికి రెట్టింపు కంటే ఎక్కువ ఉత్పత్తితో ప్రారంభించిన 1వ రైతు పెట్టుబడిని పెంచుకుంటూ మిగులును పెంచుకుంటున్నాడు.
3వ రైతుకు 2వ సంవత్సరానికే మిగులు లేకపోవడంతో 3వ సంవత్సరం ఉత్పత్తి సాధ్యంకాని స్థితి నెలకొంది. కాబట్టి 3వ రైతు సాగుభూమిని పెంచి ఉత్పత్తిని పెంచుకోవలసి ఉంది.