Practice the AP 9th Class Social Bits with Answers 4th Lesson వాతావరణం on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 9th Class Social Bits 4th Lesson వాతావరణం
I. బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు
కింది వానిలో సరియైన జవాబును ఎన్నుకొని బ్రాకెట్ లో రాయండి.
1. మానవుని జీవన మనుగడకు అవసరమైన వాయువు.
A) ప్రాణవాయువు
B) కార్బన్ డై ఆక్సైడ్
C) ఆర్గాన్
D) నియాన్
జవాబు:
A) ప్రాణవాయువు
2. మనం ఊపిరి బయటకు వదిలినపుడు వదిలే వాయువు.
A) ఆక్సిజన్
B) బొగ్గుపులుసు వాయువు
C) మీథెస్
D) అమ్మోనియా
జవాబు:
B) బొగ్గుపులుసు వాయువు
3. భూమి చుట్టూ ఉన్న వాయువుల సముద్రమే
A) వాతావరణం
B) జీవావరణం
C) శిలావరణం
D) జలావరణం
జవాబు:
A) వాతావరణం
4. వాతావరణంలోని నత్రజని శాతం
A) 21%
B) 78%
C) 70%
D) 60%
జవాబు:
B) 78%
5. వాతావరణంలో ఆక్సిజన్ శాతం
A) 21%
B) 29%
C) 32%
D) 25%
జవాబు:
A) 21%
6. సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో సూర్యుడు నారింజ రంగులో కనిపించడానికి కారణం
A) రేణువులు
B) వడగండ్లు
C) పారిశ్రామిక వ్యర్థాలు
D) అడవుల్లో మంటలు
జవాబు:
A) రేణువులు
7. సమరూప ఆవరణంలో ఉండే పొరలు
A) ట్రోపో ఆవరణం
B) స్ట్రాటో ఆవరణం
C) మీసో ఆవరణం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
8. బహురూప ఆవరణంలో ఉండే పొరలు
A) థర్మో ఆవరణం
B) ఎక్సో ఆవరణం
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
C) పై రెండూ
9. శీతోష్ణస్థితులు, వర్షపాతం వంటి వాతావరణ అంశాలన్నీ ఈ ఆవరణలోనే సంభవిస్తాయి.
A) ట్రోపో ఆవరణం
B) స్ట్రాటో ఆవరణం
C) మీసో ఆవరణం
D) థర్మో ఆవరణం
జవాబు:
A) ట్రోపో ఆవరణం
10. .జెట్ విమానాలు ఎగరటానికి అనువైన ఆవరణం
A) ట్రోపో ఆవరణం
B) స్ట్రాటో ఆవరణం
C) మీసో ఆవరణం
D) థర్మో ఆవరణం
జవాబు:
B) స్ట్రాటో ఆవరణం
11. విశ్వంలోని ఉల్కలు ఈ పొరలోకి ప్రవేశించగానే కాలిపోతాయి.
A) స్ట్రాటో ఆవరణం
B) మీసో ఆవరణం
C) థర్మో ఆవరణం
D) ఎక్సో ఆవరణం
జవాబు:
B) మీసో ఆవరణం
12. అయాన్లు అనే విద్యుదావేశం ఉండే కణాలు ఉండే ఆవరణం
A) ట్రోపో ఆవరణం
B) స్ట్రాటో ఆవరణం
C) మీసో ఆవరణం
D) థర్మో ఆవరణం
జవాబు:
D) థర్మో ఆవరణం
13. అత్యంత ఎత్తులో ఉండే ఆవరణం
A) ఎక్సో ఆవరణం
B) స్ట్రాటో ఆవరణం
C) మీసో ఆవరణం
D) థర్మో ఆవరణం
జవాబు:
A) ఎక్సో ఆవరణం
14. వేడెక్కిన గాలి పైకి వెళ్తున్న కొద్దీ భూమి ఉపరితలం నుంచి పొందిన శక్తిని వేడిమి రూపంలో
A) కోల్పోతుంది
B) గ్రహిస్తుంది
C) ఏ విధమైన మార్పు ఉండదు
D) ఏదీకాదు
జవాబు:
A) కోల్పోతుంది
15. గాలి నిదానంగా వీచి, హాయిగా ఉన్నప్పుడు దానిని ఈ విధంగా పిలుస్తారు.
A) సమీరం
B) ఈదురుగాలి
C) పెనుగాలి
D) తుపాను
జవాబు:
A) సమీరం
16. భూమధ్యరేఖ ఉపరితల ప్రాంతంలో పీడనం
A) పెరుగుతుంది
B) తగ్గుతుంది
C) మారదు
D) ఏదీకాదు
జవాబు:
B) తగ్గుతుంది
17. కొరియాలిస్ ప్రభావం భూమధ్యరేఖ వద్ద ఈ విధంగా ఉంటుంది.
A) శూన్యం
B) గరిష్ఠం
C) కనిష్ఠం
D) మార్పు ఉండదు
జవాబు:
A) శూన్యం
18. ప్రపంచ పీడన రేఖలలో నిరంతరాయంగా, క్రమబద్ధంగా వీచే గాలులను ఈ విధంగా పిలుస్తారు.
A) ప్రపంచ పవనాలు
B) ఋతుపవనాలు
C) స్థానిక పవనాలు
D) పైవన్నీ
జవాబు:
A) ప్రపంచ పవనాలు
19. మౌసమ్ అనేది
A) గ్రీకుపదం
B) అరబిక్ పదం
C) పార్శీపదం
D) చైనీ పదం
జవాబు:
B) అరబిక్ పదం
20. ఉత్తర అమెరికాలోని అమెరికా – కెనడా ప్రాంతంలోని రాకీ పర్వతాల కిందుగా వీచే పవనాలను ఈ విధంగా పిలుస్తారు.
A) చినూక్
B) లూ
C) మిస్ట్రాల్
D) ప్యూనా
జవాబు:
A) చినూక్
21. ఉత్తర భారతదేశంలో మే – జూన్ నెలల మధ్య పడమర నుంచి తూర్పుకు వీచే వేడి పొడి పవనాలను ఈ విధంగా పిలుస్తారు.
A) చినూక్
B) మిస్ట్రాల్
C) లూ
D) పాంపెరో
జవాబు:
C) లూ
22. వాతావరణంలోని అంశాలు
A) ఉష్ణోగ్రత
B) పీడనం
C) పవనాలు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
23. బాగా ఎత్తులో ఉన్న మేఘాలను ఈ విధంగా పిలుస్తారు.
A) సిర్రస్
B) క్యుములస్
C) స్ట్రాటస్
D) నింబస్
జవాబు:
A) సిర్రస్
24. మధ్యలో ఉండే మేఘాలను ఈ విధంగా పిలుస్తారు.
A) స్టాటస్
B) నింబస్
C) క్యుములస్
D) సిర్రస్
జవాబు:
C) క్యుములస్
25. భూమి ఉపరితలం వద్ద చల్లటి పొరగుండా వాన కురుస్తున్నప్పుడు వర్ష బిందువులు మంచుగా గడ్డ కట్టి కిందకు పడేవాటిని ఈ విధంగా పిలుస్తారు.
A) హిమపాతం
B) స్లీట్
C) వడగండ్లు
D) మంచు
జవాబు:
B) స్లీట్
26. వేడెక్కిన ఉపరితలం మీద తేమ కలిగిన గాలి కూడా వేడెక్కి పైకి లేచి చల్లబడినపుడు పడే వర్షం
A) సంవహన వర్షపాతం
B) పర్వతీయ వర్షపాతం
C) చక్రవాత వర్షపాతం
D) ఏదీకాదు
జవాబు:
A) సంవహన వర్షపాతం
27. ఓరెస్ అనగా
A) పర్వతం
B) మైదానం
C) పీఠభూమి
D) సముద్రం
జవాబు:
A) పర్వతం
28. దక్షిణ అమెరికాలోని గడ్డి మైదానాలను …… అంటారు.
A) పంపాలు
B) ఉష్ణమండల గడ్డిభూములు
C) వేసవి విడిది
D) ఏదీకాదు
జవాబు:
A) పంపాలు
29. దక్షిణ అమెరికాలోని గడ్డిమైదాన ప్రాంతంలో వేగంగా వీచే ధృవ పవనాలు
A) పాంపెరో
B) సైక్లోన్స్
C) తుఫానులు
D) ఏదీకాదు
జవాబు:
A) పాంపెరో
30. సమరూప ఆవరణం ……. కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది.
A) 100
B) 90
C) 180
D) 200
జవాబు:
B) 90
31. అవపాతంలో ప్రధానమైనది
A) వర్షపాతం
B) ఉష్ణోగ్రత
C) పీడనం
D) బాష్పీభవనం
జవాబు:
A) వర్షపాతం
32. వాతావరణంలోని అన్నింటికంటే చివరి పైపొర ……..
A) థర్మో ఆవరణం
B) ఎక్సో ఆవరణం
C) స్ట్రాటో ఆవరణం
D) ఐనో ఆవరణం
జవాబు:
B) ఎక్సో ఆవరణం
33. దక్షిణార్ధ గోళంలో వీచే ప్రపంచ పవనాలను ……. అంటారు.
A) ఈశాన్య
B) నైరుతి
C) ఆగ్నేయ వాణిజ్య
D) ఏదీకాదు
జవాబు:
C) ఆగ్నేయ వాణిజ్య
34. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ (తన అక్షం మీద) ఉంటే జనించే శక్తి
A) ఉష్ణ శక్తి
B) గాలి శక్తి
C) పవనాలు
D) కొరియాలిస్ ఎఫెక్ట్
జవాబు:
D) కొరియాలిస్ ఎఫెక్ట్
35. భూమధ్యరేఖ తక్కువ పీడన రేఖలను …… అంటారు.
A) అయనరేఖా అభిసరణ ప్రాంతం
B) ఉప అయనరేఖా మండలం
C) ఉష్ణమండల ప్రాంతం
D) అల్పపీడన మండలం
జవాబు:
A) అయనరేఖా అభిసరణ ప్రాంతం
36. భూమధ్యరేఖ ఉపరితల ప్రాంతంలో పీడనం ………
A) పెరుగుతుంది
B) తగ్గుతుంది
C) స్థిరంగా ఉంటుంది
D) అల్పపీడనం
జవాబు:
B) తగ్గుతుంది
37. భూగోళం అంతటా సంవత్సరం పొడవునా వీచే పవనాలు ……
A) ఋతుపవనాలు
B) స్థానిక పవనాలు
C) ప్రపంచ పవనాలు
D) ప్రచండగాలులు
జవాబు:
C) ప్రపంచ పవనాలు
38. ఆండీస్ ప్రాంతంలోని స్థానిక శీతల పవనాలను ……. అంటారు.
A) ప్యూనా
B) చినూక్
C) మిస్ట్రాల్
D) బోరా
జవాబు:
A) ప్యూనా
39. సైక్లోన్ అనే ఆంగ్లపదం “కైక్లోన్” అనే …… పదం నుండి వచ్చింది.
A) అరబిక్
B) గ్రీకు
C) లాటిన్
D) స్పానిష్
జవాబు:
B) గ్రీకు
40. ……. ఎక్కువ ఉంటే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
A) ఆర్థత
B) అవపాతం
C) వాయుపీడనం
D) పైవేవీకావు
జవాబు:
C) వాయుపీడనం
41. క్రిందివానిలో స్థానిక శీతల పవనము కానిది
A) మిస్ట్రాల్
B) ప్యూనా
C) పాంపెరో
D) చినూక్
జవాబు:
D) చినూక్
42. వర్షాన్నిచ్చే మేఘాలు, ఊర్ధ్వప్రసరణ మేఘాలను …… అంటారు.
A) సిర్రస్
B) నింబస్
C) ఆర్థత
D) అవపాతము
జవాబు:
B) నింబస్
43. నీటిఆవిరి ఘనీభవించి మంచు స్ఫటికాలుగా మారి కిందకు మంచు తునకలుగా పడుతుంటే దానిని ఇలా పిలుస్తారు
A) బాష్పోత్సేకం
B) ఆర్ధత
C) హిమపాతం
D) అవపాతం
జవాబు:
C) హిమపాతం
44. వాన కురుస్తున్నపుడు వర్షబిందువులు మంచుగా గడ్డకట్టి కిందకు పడతాయి. దీనిని ఇలా పిలుస్తారు.
A) పవనాలు
B) తుంపరలు
C) ఆర్ధత
D) స్లీట్
జవాబు:
D) స్లీట్
45. 10 రోజులకు మించని వాతావరణ పరిస్థితులను …… అంటారు.
A) స్థానిక వాతావరణం
B) స్థానిక పవనాలు
C) చినూక్
D) ఆర్థత
జవాబు:
A) స్థానిక వాతావరణం
46. జీవం గల ఆవరణం పేరు …..
A) స్ట్రాటో
B) ట్రోపో
C) ఐనో
D) థర్మో
జవాబు:
B) ట్రోపో
47. భూమి మీద 400 కిలోమీటర్లు ఎత్తులో వున్న ఆవరణం పేరు
A) మిసో
B) ఐనో
C) థర్మో
D) స్ట్రాటో
జవాబు:
C) థర్మో
48. …….. వలన జనించు శక్తిని కొరియాలిస్ ప్రభావం అంటారు.
A) ఉష్ణోగ్రత
B) శీతోష్ణస్థితి
C) భూపరిభ్రమణం
D) భూభ్రమణము
జవాబు:
D) భూభ్రమణము
49. గాలిలోని తేమను ఇలా పిలుస్తారు.
A) ఆర్ధత
B) అవపాతం
C) సమీరం
D) పవనము
జవాబు:
A) ఆర్ధత
50. మేఘాలు ఏర్పడే పొర లేదా ఆవరణము ……..
A) టో
B) ట్రోపో
C) ఐనో
D) మిసో
జవాబు:
B) ట్రోపో
51. ‘ఓజోన్ పొర’ ఎందుకు ముఖ్యమైనది?
A) పంట ఉత్పాదకతను మరియు అడవుల అభివృద్ధిని పెంచుతుంది.
B) ఇది సూర్యుని నుండి విడుదలైపోయిన అతి నీల లోహిత కిరణాల నుంచి జీవులను రక్షిస్తుంది.
C) ఇది వాయు కదలికలను నియంత్రిస్తుంది మరియు తుఫానులు ఏర్పడకుండా అరికడుతుంది.
D) ఇది ప్రపంచం వేడెక్కడాన్ని తగ్గిస్తుంది.
జవాబు:
B) ఇది సూర్యుని నుండి విడుదలైపోయిన అతి నీల లోహిత కిరణాల నుంచి జీవులను రక్షిస్తుంది.
52. కొరియాలిస్ ప్రభావానికి గల కారణం
A) సంవహన వర్షపాతము
B) భూమి తన అక్షంపై తాను తిరగడం
C) భూమి చుట్టూ చంద్రుడి పరిభ్రమణం
D) భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి
జవాబు:
B) భూమి తన అక్షంపై తాను తిరగడం
53. ప్రపంచ పవనాలకు ఉదాహరణ
A) పశ్చిమ పవనాలు
B) నైరుతి ఋతుపవనాలు
C) సముద్రపు గాలులు
D) లూ పవనాలు
జవాబు:
A) పశ్చిమ పవనాలు
54. నైఋతి ఋతుపవనాల వలన ఈ మధ్యకాలంలో వరదలు సంభవించిన రాష్ట్రం
A) రాజస్థాన్
B) కేరళ
C) ఆంధ్రప్రదేశ్
D) కర్ణాటక
జవాబు:
B) కేరళ
55. క్రింది వానిలో వాతావరణము యొక్క లక్షణము కానిది
A) వాతావరణంలో అనేక వాయువులు వుంటాయి.
B) వాతావరణం నిర్దిష్ట ఆకారాన్ని కలిగి ఉంటుంది.
C) వాతావరణం సంకోచం చెందుతుంది.
D) వాతావరణం వ్యాకోచం చెందుతుంది.
జవాబు:
B) వాతావరణం నిర్దిష్ట ఆకారాన్ని కలిగి ఉంటుంది.
56. స్ట్రాటో ఆవరణంలో ఎత్తుకు వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఇందుకు కారణం
A) అందులో ఉండే ఓజోన్ పొర సూర్యుని అతినీల లోహిత కిరణాలను శోషించుకోవడం.
B) అది అయాన్లను కలిగి ఉండటం.
C) అది పారదర్శకమైన మబ్బులను కలిగి ఉండటం.
D) అది భూమికి మరీ దూరంగా లేకపోవడం.
జవాబు:
A) అందులో ఉండే ఓజోన్ పొర సూర్యుని అతినీల లోహిత కిరణాలను శోషించుకోవడం.
57. భారతదేశంలో వర్షపాతం ప్రధానంగా ఏ పవనాల వల్ల సంభవిస్తుంది?
A) స్థానిక పవనాలు
B) ఋతు పవనాలు
C) ప్రపంచ పవనాలు
D) చక్రీయ పవనాలు
జవాబు:
B) ఋతు పవనాలు
58. చిత్రాన్ని పరిశీలించండి.
చిత్రంలో చూపబడినది ఏ రకమైన వర్షపాతం?
A) సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమించుట
B) పర్వతీయ వర్షపాతము
C) చక్రీయ వర్షపాతము
D) కేవలం హిమపాతము
జవాబు:
B) పర్వతీయ వర్షపాతము
59. దక్కన్ పీఠభూమి మధ్యభాగం తక్కువ వర్షపాతాన్ని పొందుతున్నది. ఇందుకు ప్రధాన కారణం
A) అక్కడ అటవీ విస్తీర్ణం తక్కువగా ఉండటం
B) అది వర్షచ్ఛాయా ప్రాంతంలో నెలకొని ఉండటం
C) అక్కడ భూగర్భజలాలు లేకపోవడం
D) అది ఎడారి అవుతుండడం
జవాబు:
B) అది వర్షచ్ఛాయా ప్రాంతంలో నెలకొని ఉండటం
6o. ప్రపంచ వర్షపాత విస్తరణకు సంబంధించి క్రింది వానిలో సరియైన వాక్యాన్ని గుర్తించండి.
A) ధృవప్రాంతాలలో భారీ వర్షాలు పడతాయి.
B) ఎడారులలో ఎక్కువ వర్షాలు పడతాయి.
C) భూమధ్యరేఖ ప్రాంతాలలో తక్కువ వర్షాలు పడతాయి.
D) ఖండాల మీద కంటే సముద్రాల మీద ఎక్కువ వర్షాలు పడతాయి.
జవాబు:
D) ఖండాల మీద కంటే సముద్రాల మీద ఎక్కువ వర్షాలు పడతాయి.
క్రింది చిత్రంలోని సమాచారం ఆధారంగా 61 నుండి 66 వరకూ గల ప్రశ్నలకు జవాబులివ్వండి.
61. అధిక పీడన ప్రాంతాన్ని A చేత, అల్పపీడన ప్రాంతాన్ని B చేత సూచిస్తే పవనాలు :
A) A నుండి B కి వీస్తాయి.
B) B నుండి A కి వీస్తాయి.
C) A నుండి A కి వీస్తాయి.
D) B నుండి B కి వీస్తాయి.
జవాబు:
A) A నుండి B కి వీస్తాయి.
62. పశ్చిమం నుండి తూర్పుకు వీచే పవనాలను ఏ పేరుతో పిలుస్తారు?
A) తూర్పు పవనాలు మాత్రమే
B) పశ్చిమ పవనాలు మాత్రమే
C) తూర్పు పవనాలు లేదా పశ్చిమ పవనాలు
D) తూర్పు మరియు పశ్చిమ పవనాలు
జవాబు:
B) పశ్చిమ పవనాలు మాత్రమే
63. ఉప అయనరేఖా అధిక పీడన ప్రాంతం నుండి భూమధ్య రేఖా అల్పపీడన ప్రాంతము వైపునకు వీచే పవనాలు :
A) ధృవ పవనాలు
B) తూర్పు పవనాలు
C) పశ్చిమ పవనాలు
D) వ్యాపార పవనాలు
జవాబు:
D) వ్యాపార పవనాలు
64. అంతర అయన రేఖా అభిసరణ ప్రాంతమని కింది వానిలో దేనిని పిలుస్తారు?
A) ధృవ అధిక పీడన ప్రాంతము
B) ఉపధృవ అల్పపీడన ప్రాంతము
C) ఉప అయన రేఖా అధిక పీడన ప్రాంతము
D) భూమధ్య రేఖా అల్ప పీడన ప్రాంతము
జవాబు:
D) భూమధ్య రేఖా అల్ప పీడన ప్రాంతము
65. పై చిత్రంలో చూపబడిన పవనాలన్నీ ఏ రకానికి చెందినవి?
A) స్థానిక పవనాలు
B) ఋతుపవనాలు
C) ప్రపంచ పవనాలు
D) చక్రీయ పవనాలు
జవాబు:
C) ప్రపంచ పవనాలు
66. కొరియాలిస్ ప్రభావం వల్ల పవనాలు కొద్దిగా పక్కకు ఇవి :
A) ఉత్తరార్ధ గోళంలో కుడివైపుకు, దక్షిణార్ధ గోళంలో ఎడమవైపుకు వీస్తాయి.
B) ఉత్తరార్ధ గోళంలో ఎడమవైపుకు, దక్షిణార్ధ గోళంలో కుడివైపుకు వీస్తాయి.
C) ఉతరార మరియు దకిణార గోళాలు రెంటిలో కుడి వైపుకే వీస్తాయి.
D) ఉత్తరార్ధ మరియు దక్షిణార్ధ గోళాలు రెంటిలో ఎడమ వైపుకే వీస్తాయి.
జవాబు:
A) ఉత్తరార్ధ గోళంలో కుడివైపుకు, దక్షిణార్ధ గోళంలో ఎడమవైపుకు వీస్తాయి.
67. జెట్ విమానాలు ప్రయాణించడానికి స్ట్రాటో ఆవరణం అత్యంత అనుకూలం ఎందుకనగా
A) వాతావరణ సంఘటనం అంతా ఈ ఆవరణలోనే జరుగుతుంది
B) ఈ ఆవరణంలో మేఘాలు ఉండవు
C) ఈ ఆవరణంలో విద్యుదావేశిత అయానులు ఉంటాయి
D) ఈ ఆవరణంలో ఉల్కలు దహనమవుతాయి
జవాబు:
B) ఈ ఆవరణంలో మేఘాలు ఉండవు
68. వాతావరణంలో ఈ పొర గురించి ఈనాటికీ మనకు తెలిసింది చాలా తక్కువ
A) స్ట్రాటో ఆవరణం
B) మీసో ఆవరణం
C) థర్మో ఆవరణం
D) ఎక్సో ఆవరణం
జవాబు:
D) ఎక్సో ఆవరణం
69. వేసవి కాలంలో మన ప్రాంతంలో ఎదురయ్యే ‘వడగాలులు’ ఏ రకం పవనాలు?
A) ప్రపంచ పవనాలు
B) ఋతుపవనాలు
C) స్థానిక పవనాలు
D) చక్రీయ పవనాలు
జవాబు:
C) స్థానిక పవనాలు
70. ఉత్తర భారతదేశంలో “మే మరియు జూన్” నెలల మధ్య వీచే వేడి, పొడి పవనాలు
A) చినూక్
B) లూ
C) సైమూన్
D) మిస్ట్రాల్
జవాబు:
B) లూ
71. ప్రపంచ పీడన మేఖలలో నిరంతరాయంగా, క్రమబద్ధంగా వీచే గాలులను ఈ విధంగా పిలుస్తారు
A) ఋతుపవనాలు
B) ప్రపంచ పవనాలు
C) స్థానిక ,పవనాలు
D) వడగాలులు వీస్తాయి.
జవాబు:
B) ప్రపంచ పవనాలు
72. వాతావరణ మార్పులు జరిగే ఆవరణం
A) మీసో ఆవరణం
B) ట్రోపో ఆవరణం
C) స్ట్రాటో ఆవరణం
D) ఎక్సో ఆవరణం
జవాబు:
B) ట్రోపో ఆవరణం
73. ద్రాక్షపళ్ళు త్వరగా పండడానికి యూరప్లో సహాయం చేసే పవనాలు
A) ఫోన్
B) చినూక్
C) పాంపేరో
D) లూ
జవాబు:
A) ఫోన్
74. భారతదేశంలో నైరుతీ రుతుపవనాల క్రియాశీలత దేని వలన ప్రభావితమవుతుంది?
A) ఎల్ నినో మాత్రమే
B) లానినో మాత్రమే
C) ఎల్ నినో మరియు లానినో
D) రెండింటిలో ఏదీకాదు
జవాబు:
C) ఎల్ నినో మరియు లానినో
II. జతపరచుము :
i)
గ్రూపు – ఎ | గ్రూపు – బి |
1. వాతావరణం | A) 21% |
2. ప్రాణవాయువు | B) 78% |
3. నత్రజని | C) శీతోష్ణస్థితి |
4. ట్రోపో ఆవరణం | D) జెట్ విమానాలు |
5. స్ట్రాటో ఆవరణం | E) వాయువుల పొర |
జవాబు:
గ్రూపు – ఎ | గ్రూపు – బి |
1. వాతావరణం | E) వాయువుల పొర |
2. ప్రాణవాయువు | A) 21% |
3. నత్రజని | B) 78% |
4. ట్రోపో ఆవరణం | C) శీతోష్ణస్థితి |
5. స్ట్రాటో ఆవరణం | D) జెట్ విమానాలు |
ii)
గ్రూపు – ఎ | గ్రూపు – బి |
1. మీసో ఆవరణం | A) అన్నిటికన్నా పై పొర |
2. థర్మో ఆవరణం | B) మౌసమ్ |
3. ఎక్సో ఆవరణం | C) ఉల్కలు కాలిపోతాయి |
4. వాయుపీడనం | D) విద్యుదావేశం’ ఉండే కణాలు |
5. మాన్సూన్ | E) వాయువుల ఒత్తిడి |
జవాబు:
గ్రూపు – ఎ | గ్రూపు – బి |
1. మీసో ఆవరణం | C) ఉల్కలు కాలిపోతాయి |
2. థర్మో ఆవరణం | D) విద్యుదావేశం’ ఉండే కణాలు |
3. ఎక్సో ఆవరణం | A) అన్నిటికన్నా పై పొర |
4. వాయుపీడనం | E) వాయువుల ఒత్తిడి |
5. మాన్సూన్ | B) మౌసమ్ |
iii)
గ్రూపు – ఎ | గ్రూపు – బి |
1. చినూక్ | A) ఐరోపా శీతలపవనం |
2. మిస్ట్రాల్ | B) భారతదేశ వేడిపవనం |
3. లూ | C) దక్షిణ అమెరికా శీతలపవనం |
4. ప్యూనా | D) పంపాల ప్రాంతంలో వీచే శీతల పవనం |
5. పాంపెరో | E) ఉత్తర అమెరికా ఉష్ణపవనం |
జవాబు:
గ్రూపు – ఎ | గ్రూపు – బి |
1. చినూక్ | E) ఉత్తర అమెరికా ఉష్ణపవనం |
2. మిస్ట్రాల్ | A) ఐరోపా శీతలపవనం |
3. లూ | B) భారతదేశ వేడిపవనం |
4. ప్యూనా | C) దక్షిణ అమెరికా శీతలపవనం |
5. పాంపెరో | D) పంపాల ప్రాంతంలో వీచే శీతల పవనం |