Practice the AP 9th Class Social Bits with Answers 14th Lesson 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 9th Class Social Bits 14th Lesson 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు
I. బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు :
కింది వానిలో సరియైన జవాబును ఎన్నుకొని బ్రాకెట్లో వ్రాయండి.
1. ‘రాజ్యం’ అన్న పదానికి ఫ్రెంచి విప్లవం ఇచ్చిన అర్థం.
A) ప్రభువులు
B) మతాధిపతులు
C) ప్రజలు
D) భూస్వాములు
జవాబు:
C) ప్రజలు
2. గణతంత్ర ప్రభుత్వం ప్రజల నుంచి అధికారం పొంది వీరికి జవాబుదారీగా ఉంటుంది.
A) ప్రజలకు
B) ప్రభుత్వానికి
C) రాచరికానికి
D) మతానికి
జవాబు:
A) ప్రజలకు
3. నిజానికి అమలులోకి రాకపోయినప్పటికీ చరిత్రలో మొదటి అసలైన ప్రజాస్వామిక రాజ్యాంగం
A) గణతంత్ర రాజ్యాంగం
B) జాతీయవాద రాజ్యాంగం
C) జాకొఱన్ రాజ్యాంగం
D) ప్రజా రాజ్యాంగం
జవాబు:
C) జాకొఱన్ రాజ్యాంగం
4. మధ్య ప్రాంతాలలో పెద్ద పెద్ద ఎస్టేట్ లో పనిచేసేవారు
A) మహిళలు
B) రైతులు
C) శ్రామికులు
D) బానిస పనివాళ్ళు (సెర్ఫ్‌లు)
జవాబు:
D) బానిస పనివాళ్ళు (సెర్ఫ్‌లు)
5. ఫ్రాన్స్, జర్మనీలో కొన్ని ప్రాంతాలలో ఈ శతాబ్దంలో పారిశ్రామికీకరణ జరిగింది.
A) 17 శతాబ్దం
B) 18 శతాబ్దం
C) 19 శతాబ్దం
D) 20 శతాబ్దం
జవాబు:
C) 19 శతాబ్దం
6. 19వ శతాబ్దపు ఉదారవాదులు దీనికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు.
A) మతానికి
B) జాతికి
C) వ్యక్తిగత ఆస్తికి
D) సంపద
జవాబు:
C) వ్యక్తిగత ఆస్తికి
7. చట్టం ముందు సమానత్వం అంటే
A) అందరికీ ఓటు హక్కు ఉండాలి.
B) అందరికీ న్యాయం కావాలి.
C) అందరికీ డబ్బు ఉండాలి.
D) అందరికీ ధైర్యం ఉండాలి.
జవాబు:
A) అందరికీ ఓటు హక్కు ఉండాలి.
8. నేపోలియన్ కాలంలో వస్త్ర కొలతకు ఉపయోగించే కొలమానం
A) మీటర్
B) ఎల్లే
C) గజం
D) మల్లే
జవాబు:
B) ఎల్లే
9. నెపోలియన్ ఓటమి
A) 1815
B) 1816
C) 1817
D) 1818
జవాబు:
A) 1815
10. వియన్నా కాంగ్రెస్ ద్వారా ఫ్రాన్స్ సింహాసనం అధిష్టించిన బోర్బన్ వంశపు లూయీ
A) XVI లూయీ
B) XVII లూయీ
C) XVIII లూయీ
D) X లూయీ
జవాబు:
C) XVIII లూయీ
11. చివరి వరకు పోరాడి ఆ పిదప రష్యాలో విలీనమైన దేశం
A) పోలెండ్
B) బెల్జియం
C) జపాన్
D) స్పెయిన్
జవాబు:
A) పోలెండ్
12. సింహాసనాన్ని అధిష్టిస్తున్నప్పుడు లూయీ ఫిలిప్ ని ఇలా వర్ణించారు.
A) పరాక్రమ రాజు
B) పౌరరాజు
C) ఘనమైన రాజు
D) యుద్ధ రాజు
జవాబు:
B) పౌరరాజు
13. ఉదారవాద ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించినది
A) రైతాంగం
B) శ్రామికులు
C) రాజులు
D) మహిళలు
జవాబు:
D) మహిళలు
14. ‘యంగ్ ఇటలీ’ అన్న ఒక రహస్య సంఘాన్ని ఏర్పాటుచేసినది
A) మాజిని
B) కవూర్
C) విలియం-1
D) విక్టర్ ఇమాన్యుయెల్
జవాబు:
A) మాజిని
15. ఇటాలియన్ ప్రజానీకంలో అధిక శాతం ప్రజలు
A) అక్షరాస్యులు
B) పేదవారు
C) ధనవంతులు
D) నిరక్షరాస్యులు
జవాబు:
D) నిరక్షరాస్యులు
16. 1861లో ఏకీకృత ఇటలీకి ………. ను రాజుగా ప్రకటించారు.
A) విక్టర్ ఇమాన్యుయెల్ – II
B) కవూర్
C) గారిబాల్డి
D) విలియం – 1
జవాబు:
A) విక్టర్ ఇమాన్యుయెల్ – II
17. ఇటలీ ప్రాంతాలను కలిపి ఉద్యమానికి నాయకత్వం వహించిన ప్రధాని
A) గారిబాల్డి
B) కపూర్
C) విలియం
D) విక్టర్ ఇమాన్యుయెల్
జవాబు:
B) కపూర్
18. సర్ప్రైజ్ అనగా ……
A) ఒక రకమైన శిక్ష
B) పన్ను
C) సార్వజనీన ఓటుహక్కు
D) ఆస్తులు
జవాబు:
C) సార్వజనీన ఓటుహక్కు
19. ఫ్రాన్స్ లో కట్టుబానిసను ఇలా పిలుస్తారు ….
A) ఫితేదార్లు
B) జంకర్
C) ఎస్టేటు
D) సెర్ఫ్‌లు
జవాబు:
D) సెర్ఫ్‌లు
20. 1848 తరువాత ప్రజాస్వామ్యం, విప్లవాల నుంచి …. వాదం .దూరమయింది.
A) జాతీయవాదం
B) ప్రజాస్వామ్యం
C) నియంతృత్వం
D) ఉదారవాదం
జవాబు:
A) జాతీయవాదం
21. ఫిలిప్ తన సోదరుడు లూయీ – XIV మాదిరిగానే …… కి పారిపోయాడు.
A) రోమ్
B) ఇంగ్లాండ్
C) ఫ్రాన్స్
D) పోర్చుగల్
జవాబు:
B) ఇంగ్లాండ్
22. ప్రష్యాలోని బడా భూస్వాములను …. అనేవారు.
A) కాంగ్రెస్
B) సెనేట్
C) జంకర్లు
D) బూర్జువా
జవాబు:
C) జంకర్లు
23. ఫ్రెంచి గణతంత్రపు చక్రవర్తిగా తనను తాను ప్రకటించుకున్న వ్యక్తి
A) చార్లెస్
B) విలియం – II
C) బిస్మార్క్
D) నెపోలియన్
జవాబు:
D) నెపోలియన్
24. ఈ రాజ్యాంగం ప్రజలందరికి ఓటుహక్కు తిరుగుబాటు హక్కు కల్పించినది
A) జాకోబిన్ రాజ్యాంగం
B) వీమర్ రాజ్యాంగం
C) ఇటలీ రాజ్యాంగం
D) జర్మనీ రాజ్యాంగం
జవాబు:
A) జాకోబిన్ రాజ్యాంగం
25. ఈ దేశంలో పారిశ్రామికీకరణ మొదలైనది ……
A) ఫ్రాన్స్
B) ఇంగ్లాండ్
C) జర్మనీ
D) ఇటలీ
జవాబు:
B) ఇంగ్లాండ్
26. నెపోలియన్ 1815లో ఈ యుద్ధంలో ఓడిపోయాడు.
A) జర్మనీ
B) పారిస్
C) వాటర్లూ
D) స్పెయిన్
జవాబు:
C) వాటర్లూ
27. “ప్రజల రాజు”గా ప్రసిద్ధినొందిన ఫ్రాన్స్ చక్రవర్తి ……….
A) విలియం – 1
B) హ్యుగో
C) చార్లెస్
D) లూయీ ఫిలిప్
జవాబు:
D) లూయీ ఫిలిప్
28. “Blood & Iron Policy” సిద్ధాంతాన్ని బలపర్చిన వ్యక్తి ………….
A) బిస్మార్క్
B) హిట్లర్
C) నెపోలియన్
D) ఇమాన్యుయెల్
జవాబు:
A) బిస్మార్క్
29. ఆస్ట్రియా ఛాన్సలర్ ………
A) మెక్ లాండ్
B) డ్యూక్ మెటర్నిచ్
C) చార్లెస్
D) కపూర్
జవాబు:
B) డ్యూక్ మెటర్నిచ్
30. ఐరోపా ఖండంలో కులీనవర్గం దౌత్య అవసరాల రీత్యా ఉన్నత సమాజంలో …… భాష మాట్లాడేవారు.
A) ఆంగ్లం
B) స్పానిష్
C) ఫ్రెంచి
D) ఇటాలియన్
జవాబు:
C) ఫ్రెంచి
31. నెపోలియన్ కాలంలో సరుకులపై సుంకాలు వీటి ఆధారంగా విధించేవాళ్ళు
A) కొలతలు లేదా బరువు
B) విలువ
C) సరుకులు ఉన్న ప్రదేశాన్ని బట్టి
D) పైవేవీకావు
జవాబు:
A) కొలతలు లేదా బరువు
32. 1834లో ప్రష్యా చొరవతో సుంకాల సమాఖ్య లేదా …… ఏర్పడినది.
A) జోల్వెవెరిన్
B) గోడౌన్ సమాఖ్య
C) పన్నుల సంఘం
D) టాక్స్ మీట్
జవాబు:
A) జోల్వెవెరిన్
33. కొత్త సాంప్రదాయ విధానాన్ని విమర్శించే ఉదారవాద జాతీయవాదుల కోరికలలో …… ఒకటి.
A) ప్రయాణం
B) పత్రికా స్వేచ్ఛ
C) వాక్ స్వేచ్ఛ
D) ఓటు
జవాబు:
B) పత్రికా స్వేచ్ఛ
34. ఫ్రాన్స్ లో కాల్పనిక వాదం తెచ్చిన ఉద్యమం
A) కార్మిక
B) రహస్య
C) సాంస్కృతిక ఉద్యమం
D) సాంప్రదాయం
జవాబు:
C) సాంస్కృతిక ఉద్యమం
35. స్వేచ్ఛ అనే అర్థం ఉన్న లిబర్ అన్న పదం ….. నుండి పుట్టినది.
A) గ్రీకు
B) స్పెయిన్
C) పర్షియన్
D) లాటిన్
జవాబు:
D) లాటిన్
36. జర్మనీ ఏకీకరణ ఇతని నాయకత్వంలో జరిగింది.
A) బిస్మార్క్
B) నేపోలియన్
C) ఆర్చిడ్యూక్
D) విలియం
జవాబు:
A) బిస్మార్క్
37. ఫ్రాన్స్ లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న విప్లవం …… సం||లో జరిగింది.
A) 1920
B) 1848
C) 1830
D) 1780
జవాబు:
B) 1848
38. ఇటాలియన్ ప్రజానీకంలో అధిక శాతం ……
A) శ్రామికులు
B) విప్లవకారులు
C) నిరక్షరాస్యులు
D) విద్యావంతులు
జవాబు:
C) నిరక్షరాస్యులు
39. ఇటాలియన్ రాజ్యాలను ఒకటిగా చేసే బాధ్యత తీసుకున్న సార్డీనియా రాజు
A) గారిబాల్డి
B) కవూర్
C) హ్యుగో
D ) విక్టర్ ఇమాన్యుయెల్-II
జవాబు:
D ) విక్టర్ ఇమాన్యుయెల్-II
40. “జర్మనీ ఏకీకరణ” ప్రసంగాలతో, ఉత్సవాలతో సాధ్యం కాదని “క్రూరమైన బలప్రయోగం ద్వారానే సాధ్యం” అని చెప్పినది
A) బిస్మార్క్
B) నెపోలియన్
C) కవూర్
D) ఇమాన్యుయెల్
జవాబు:
A) బిస్మార్క్
41. జర్మనీ ఏకీకరణ తర్వాత జర్మన్ చక్రవర్తిగా 1871లో ప్రకటింపబడినది.
A) బిస్మార్క్
B) విలియం – I
C) విక్టర్ ఇమాన్యుయెల్
D) విక్టర్ హ్యుగో
జవాబు:
B) విలియం – I
42. ఆస్ట్రియా, డెన్మార్క్, ఫ్రాన్స్ పై జరిగిన 3 యుద్ధాలలో ……….. విజయం సాధించింది.
A) ఇంగ్లండ్
B) సార్డీనియా
C) ప్రష్యా
D) ఇటలీ
జవాబు:
C) ప్రష్యా
43. ఫ్రాన్సులో నిరంకుశం, అధిక పన్నులు కారణంగా జాతీయ రాజ్యం ఏర్పడటానికి ఈ వర్గం ఉద్యమం చేసింది.
A) రాజకుటుంబీకులు
B) మతాధిపతులు
C) సంపన్నులు
D) మధ్యతరగతి
జవాబు:
D) మధ్యతరగతి
44. హంగరీలో సగం మంది జనాభా ……………. భాష మాట్లాడేవారు.
A) మాగ్యార్
B) స్పానిష్
C) ఇటాలియన్
D) జర్మనీ
జవాబు:
A) మాగ్యార్
45. ఫ్రాన్స్, జర్మనీ దేశాలలోని కొన్ని ప్రాంతాలలో ఈ శతాబ్దంలో పారిశ్రామికీకరణ జరిగింది.
A) 18వ శతాబ్దం
B) 18వ శతాబ్దం చివర
C) 19వ శతాబ్దం
D) 20వ శతాబ్దం
జవాబు:
C) 19వ శతాబ్దం
46. ఒక దేశానికి ఉమ్మడి చరిత్ర, సంస్కృతి ………… ఉద్యమాలుగా మారాయి.
A) కులీన
B) విప్లవ
C) జాతీయ
D) నియంత
జవాబు:
C) జాతీయ
47. చరిత్రలో మొదటి అసలైన ప్రజాస్వామిక రాజ్యాంగం
A) ఫ్రెంచి
B) రష్యా
C) జర్మనీ
D) జాకోబిన్
జవాబు:
D) జాకోబిన్
48. ఉదారవాద ప్రజాస్వామ్యంలో మొదటి రాజకీయ ప్రయోగం ……………
A) ఫ్రెంచి విప్లవం
B) రష్యా విప్లవం
C) స్పానిష్ అంతర్యుద్ధం
D) ఇటలీ వార్
జవాబు:
A) ఫ్రెంచి విప్లవం
49. రాజ్యం అంటే దానికి చెందిన ప్రజలు నివసించే ప్రాంతం కాదు. రాజ్యం అంటే
A) శ్రామికులు
B) అందులోని ప్రజలు
C) కూలీలు
D) బానిసలు
జవాబు:
B) అందులోని ప్రజలు
50. చరిత్రలో మొదటి రాజ్యాంగమైన జాకోబిన్ రాజ్యాంగంఫ్రెంచి వలస ప్రాంతాలలో…….. రద్దు చేసింది.
A) ప్రజాస్వామ్యం
B) వలసవాదాన్ని
C) బానిసత్వాన్ని
D) నియంతృత్వాన్ని
జవాబు:
C) బానిసత్వాన్ని
51. వియన్నా ఒప్పందం యొక్క ప్రధాన ఉద్దేశం ……..
A) యూరప్ నందు ఉదారవాద ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడం.
B) స్వేచ్ఛా, స్వాతంత్ర్యపు భావనలను యూరప్లో వ్యాప్తి , చేయడం
C) ఫ్రాన్సను యూరప్ నందలి రాజకీయ విప్లవానికి నాయకత్వం వహించేలా చేయడం
D) యూరప్ లో కొత్త సంప్రదాయ వాదాన్ని స్థాపించడం.
జవాబు:
D) యూరప్ లో కొత్త సంప్రదాయ వాదాన్ని స్థాపించడం.
52. 1830 లలో ఇటాలియన్ నగర రాజ్యా లను ఏకీకృతం చేయడానికి మరియు ఇటాలియన్ గణతంత్రాన్ని ఏర్పరచటానికి ‘యంగ్ ఇటలీ’ అన్న ఒక రహస్య సంఘం ఏర్పాటు చేశారు. ‘యంగ్ ఇటలీ’ని స్థాపించింది ఎవరు?
A) గిస్సెప్పి మాజిని
B) కవూర్
C) గినెప్పీ గారిబాల్డి
D) రాజు విక్టర్ ఇమాన్యుయల్
జవాబు:
A) గిస్సెప్పి మాజిని
53. రాజ్యమంటే అందులోని ప్రజలే’ అన్న కొత్త అర్థాన్నిచ్చిన విప్లవం
A) ఇంగ్లాండ్ విప్లవం
B) ఫ్రెంచి విప్లవం
C) అమెరికా విప్లవం
D) బ్రెజిల్ విప్లవం
జవాబు:
B) ఫ్రెంచి విప్లవం
54. ‘ఉదారవాద జాతీయ వాదం’కి సంబంధించి “సరైన అంశము
1) వ్యక్తిగత ఆస్తిహక్కుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం
2) స్వేచ్ఛా మార్కెట్లను కోరుట
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2 సరైనవే
D) రెండూ సరికావు
జవాబు:
A) 1 మాత్రమే
55. 1815 లో నెపోలియన్ ఓటమి తర్వాత యూరప్ పునర్నిర్మాణం కొరకు జరిగిన సమావేశం
A) వెర్సెయిల్స్ సమావేశం
B) టెన్నిస్ కోర్ట్ శపథం
C) వియన్నా సమావేశం
D) న్యూరెంబర్గ్ సమావేశం
జవాబు:
C) వియన్నా సమావేశం
56. జర్మనీ ఏకీకరణ పూర్తయిన తర్వాత జర్మనీకి రాజుగా ప్రకటింపబడినవారు.
A) విలియం – I
B) విలియం – X
C) ఛార్లెస్ – I
D) ఛార్లెస్ – X
జవాబు:
A) విలియం – I
57. ప్రష్యా రాజ్యం స్థానంలో ఏర్పాటైన దేశాన్ని ప్రస్తుతం ఇలా పిలుస్తున్నారు
A) పాలస్తీనా
B) ఇటలీ
C) జర్మనీ
D) ఇజ్రాయెల్
జవాబు:
C) జర్మనీ
ఇవ్వబడిన మ్యాపును పరిశీలించి 58 – 60 ప్రశ్నలకు జవాబులు గుర్తించండి
58. పై పటాన్ని ఉపయోగించి మనం ఏ విషయాన్ని వివరించవచ్చు?
A) నెపోలియన్ రాజ్యాలు
B) ప్రష్యా నాయకత్వంలో జర్మనీ ఏకీకరణ
C) సార్డీనియా నాయకత్వంలో ఇటలీ ఏకీకరణ
D) ప్రపంచ యుద్ధాలు – కూటములు
జవాబు:
C) సార్డీనియా నాయకత్వంలో ఇటలీ ఏకీకరణ
59. ద్వీపానికి ఉదాహరణ :
A) రోమ్
B) కోర్సికా
C) వెనీషియా
D) సార్డీనియా
జవాబు:
B) కోర్సికా, D) సార్డీనియా
60. ఇటలీ రాజధాని నగరం పేరు :
A) సార్డీనియా
B) నేపుల్స్
C) రోమ్
D) సిసిలీ
జవాబు:
C) రోమ్
61. ఇటలీ ఏకీకరణకు కృషి చేసిన ప్రముఖులు
A) నెపోలియన్ – మేటర్ నిచ్
B) కపూర్ – మాజిని – గారిబార్లీ
C) హిట్లర్ – ముస్సోలిని
D) బిస్మార్క్ – చార్లెస్ – X
జవాబు:
B) కపూర్ – మాజిని – గారిబార్లీ
62. 1834 లో ప్రష్యా, చొరవతో సరుకులు, ప్రజలు, పెట్టుబడి ఎటువంటి ఆటంకాలు లేకుండా తరలించ బడేలా ఏకీకృత ఆర్థిక ప్రాంతం జోల్వెరిన్ ఏర్పాటు చేశారు. ఇది ఒక :
A) ప్రభువుల సమాఖ్య
B) సుంకాల సమాఖ్య
C) కార్మికుల సమాఖ్య
D) రైతుల సమాఖ్య
జవాబు:
B) సుంకాల సమాఖ్య
63. ఇటలీ ఏకీకరణ కోసం ‘యంగ్ ఇటలీ’ అన్న రహస్య సంఘాన్ని స్థాపించిన వారు
A) ఇమాన్యుయెల్ – II
B) కవూర్
C) మాజిని
D) గారిబాల్డి
జవాబు:
C) మాజిని
64. ఇటలీ ఒక ద్వీపకల్ప దేశం. ఆ దేశానికి మూడు వైపుల ఆవరించబడిన సముద్రం ఏది ?
A) నల్ల సముద్రము
B) మధ్యధరా సముద్రము
C) ఉత్తర సముద్రము
D) కాస్పియన్ సముద్రము
జవాబు:
B) మధ్యధరా సముద్రము
65. క్రింది వాక్యాలు ఈ దేశానికి చెందినవి
i) జాతిని ఏకం చేసే ఉద్యమానికి ప్రష్యా నాయకత్వం వహించసాగింది.
ii) విలియం – 1 చక్రవర్తిగా ప్రకటించబడ్డాడు.
A) బ్రిటన్
B) జర్మనీ
C) ఇటలీ
D) అమెరికా
జవాబు:
B) జర్మనీ
66. ఈ క్రింది ఏ విప్లవం “రాజ్యమంటే దానికి చెందిన ప్రజలు నివసించే ప్రాంతం కాదు. రాజ్యమంటే అందులోని ప్రజలే” అని నూతన అర్థాన్నిచ్చింది?
A) ఇంగ్లాండ్ విప్లవం
B) అమెరికా విప్లవం
C) ఫ్రెంచి విప్లవం
D) రష్యా విప్లవం
జవాబు:
C) ఫ్రెంచి విప్లవం
67. ‘రాజ్యం’ అన్న పదానికి ఫ్రెంచి విప్లవం ఇచ్చిన కొత్త అర్ధము
A) రాజ్యం అనేది ప్రజలు నివసించే ఒక భౌగోళిక ప్రాంతం
B) రాజ్యం అంటే అందులోని ప్రజలే
C) రాజ్యం అంటే రాజు యొక్క సంపద
D) సైన్యమే దేశము
జవాబు:
B) రాజ్యం అంటే అందులోని ప్రజలే
II. జతపరచుము :
i)
గ్రూపు – ఎ | గ్రూపు – బి |
1. ఉమ్మడి చరిత్ర, సంస్కృతి, ఆర్థిక జీవనం | A) సంప్రదాయవాదం |
2. చట్టం ముందు సమానత్వం | B) కాల్పనికవాదం |
3. సాంస్కృతిక ఉద్యమం | C) యంగ్ ఇటలీ |
4. రహస్య విప్లవ సంఘం | D) ప్రజాస్వామ్య జాతీయతావాద ఉద్యమాలు |
5. రాచరికం చర్చి, ఆస్తి, కుటుంబం | E) అందరికీ ఓటుహక్కు |
జవాబు:
గ్రూపు – ఎ | గ్రూపు – బి |
1. ఉమ్మడి చరిత్ర, సంస్కృతి, ఆర్థిక జీవనం | D) ప్రజాస్వామ్య జాతీయతావాద ఉద్యమాలు |
2. చట్టం ముందు సమానత్వం | E) అందరికీ ఓటుహక్కు |
3. సాంస్కృతిక ఉద్యమం | B) కాల్పనికవాదం |
4. రహస్య విప్లవ సంఘం | C) యంగ్ ఇటలీ |
5. రాచరికం చర్చి, ఆస్తి, కుటుంబం | A) సంప్రదాయవాదం |
ii)
గ్రూపు – ఎ | గ్రూపు – బి |
1. నెపోలియన్ | A) 1834 |
2. సుంకాల సమాఖ్య | B) 1815 |
3. యూరపులో విప్లవాలు | C) 1824 |
4. చార్లెస్ సింహాసన అధిష్టాపన | D) 1821 |
5. గ్రీకుల స్వతంత్ర పోరాటం ఆరంభం | E) 1848 |
జవాబు:
గ్రూపు – ఎ | గ్రూపు – బి |
1. నెపోలియన్ | B) 1815 |
2. సుంకాల సమాఖ్య | A) 1834 |
3. యూరపులో విప్లవాలు | E) 1848 |
4. చార్లెస్ సింహాసన అధిష్టాపన | C) 1824 |
5. గ్రీకుల స్వతంత్ర పోరాటం ఆరంభం | D) 1821 |