Practice the AP 9th Class Social Bits with Answers 10th Lesson ధరలు – జీవనవ్యయం on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 9th Class Social Bits 10th Lesson ధరలు – జీవనవ్యయం
I. బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు :
కింది వానిలో సరియైన జవాబును ఎన్నుకొని బ్రాకెట్ లో వ్రాయండి.
1. ప్రజల ఆందోళనకు ప్రధాన కారణం
A) ధరల పెరుగుదల
B) ఆహార ఉత్పత్తుల పెరుగుదల
C) వంటనూనెల పెరుగుదల
D) పైవన్నీ
జవాబు:
A) ధరల పెరుగుదల
2. వచ్చే ఆదాయాన్ని చేయబోయే వ్యయాన్ని వివరించే నివేదికను ఈ విధంగా పిలుస్తారు.
A) బడ్జెట్
B) ఆర్థిక నివేదిక
C) ఆర్థిక విశ్లేషణ
D) ఆర్థిక వృద్ధి
జవాబు:
A) బడ్జెట్
3. మధ్య తరగతి కుటుంబాల వారు బడ్జెట్ ను సర్దుబాటు చేసుకొనుటకు అవలంబించు మార్గం
A) ఖర్చులను కొంత తగ్గించుకోవడం
B) మొబైల్ ఫోన్లపై తక్కువ ఖర్చు చేయడం
C) ఆహార పదార్థాల వినియోగం తగ్గించుకొనడం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
4. ద్రవ్యోల్బణ ప్రభావం వీరిపై ఉంటుంది.
A) స్థిరమైన ఆదాయం కలిగిన పెన్షనర్లు
B) రోజువారి వేతన దారులు
C) చేతిపని వారు, చిన్న అమ్మకం దారులు
D) పై వారందరు
జవాబు:
D) పై వారందరు
5. పెరుగుతున్న ధరల ప్రభావం వీరిపై పడదు.
A) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేసే ఉద్యోగులు
B) వ్యాపార కార్యకలాపాలు చేసే ప్రజలు
C) డ్రైక్లీనర్లు, కర్షకులు, లాయర్లు, డాక్టర్లు
D) పై వారందరు
జవాబు:
D) పై వారందరు
6. ధరలలో వచ్చిన మార్పులను కొలుచుటకు ఉపయోగపడే గణాంక సాధనం
A) ధరల సూచిక
B) ద్రవ్యోల్బణం
C) వస్తు మార్పిడి
D) ధరల పెరుగుదల
జవాబు:
A) ధరల సూచిక
7. ఆధార సంవత్సర ధరలు అని వేటిని అంటారు?
A) ప్రస్తుత సంవత్సర ధరలు
B) ఎంపిక చేసిన మొదటి సంవత్సరంలో అన్ని వస్తు సేవల సరాసరి ధరలు
C) ఏదైనా సంవత్సరం ధరలు
D) ఏదీకాదు
జవాబు:
B) ఎంపిక చేసిన మొదటి సంవత్సరంలో అన్ని వస్తు సేవల సరాసరి ధరలు
8. మనం ఎక్కువగా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే వస్తువులు
A) పెట్రోల్
B) డీజిల్
C) కిరోసిన్
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
9. ధరలను నియంత్రించుటలో ప్రభుత్వ పాత్ర ఈ విధంగా ఉంటుంది.
A) ధరల పెరుగుదలను అరికడుతుంది
B) రైతులు ఉత్పత్తులకు కనీస ధరను ప్రకటిస్తుంది,
C) నిత్యావసర వస్తువుల అక్రమ నిల్వలను నిరోధిస్తుంది
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
10. భారత ప్రభుత్వం ఈ సంస్థ ద్వారా గోధుమ, వరి పంటలకు కనీస మద్దతు ధరలను ప్రకటిస్తుంది.
A) భారత ఆహార సంస్థ
B) వ్యవసాయ కార్పొరేషన్
C) వ్యవసాయ ఉత్పత్తి కమిటీ
D) ఆర్థిక కమిషన్
జవాబు:
A) భారత ఆహార సంస్థ
11. ధరలు పెరిగినప్పుడు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నిర్వహించే పని
A) బ్యాంకులపై నియంత్రణ
B) ధన ప్రవాహాన్ని తగ్గించుట
C) వడ్డీరేటును పెంచుట
D) వడ్డీరేటులను తగ్గించుట
జవాబు:
B) ధన ప్రవాహాన్ని తగ్గించుట
12. నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఒక
A) సహకార సంస్థ
B) ఆర్థిక సంస్థ
C) సామాజిక సంస్థ
D) ఏదీకాదు
జవాబు:
A) సహకార సంస్థ
13. ధన ప్రవాహాన్ని తగ్గించడానికి అధికారం ఉన్న సంస్థ
A) S.B.I
B) R.B.I
C) అపెక్స్ బ్యాంక్
D) ఆర్థిక సంస్థ
జవాబు:
B) R.B.I
14. నిరంతరం ధరలు పెరగడాన్ని ఈ విధంగా పిలుస్తారు
A) ద్రవ్యోల్బణం
B) టోకుధరలు
C) మార్కెటు పెరుగుదల
D) ధరలు ఆకాశాన్నంటడం
జవాబు:
A) ద్రవ్యోల్బణం
15. ప్రజలు నిత్యావసర వస్తువుల కొనుగోలు శక్తి కల్గి ఉండే స్థితిని ఇలా పిలుస్తారు
A) శక్తివంతులు
B) జీవన ప్రమాణం
C) ఉన్నత వంతులు
D) మధ్యతరగతివారు
జవాబు:
B) జీవన ప్రమాణం
16. వ్యాపార కార్యకలాపాలు చేసే ప్రజలు వారు అమ్మే వస్తువుల ధరలు పెంచడం ద్వారా ……… ను రాబట్టుకుంటారు.
A) డబ్బులు
B) లాభాలను
C) అధిక జీవన వ్యయము
D) తక్కువ వేతనాలను
జవాబు:
C) అధిక జీవన వ్యయము
17. ధరల పెరుగుదల వల్ల ప్రజలు ……………… ను ప్రదర్శిస్తున్నారు.
A) ఆదాయాన్ని
B) నష్టాన్ని
C) ఆనందాన్ని
D) వ్యతిరేకత
జవాబు:
D) వ్యతిరేకత
18. ప్రజలు తమ దగ్గర ఉన్న డబ్బుతో వ్యయాన్ని భరించుటకు కొంత …… సిద్ధం చేసుకొని ఉంటారు.
A) ప్రణాళికను
B) లాభాన్ని
C) నష్టాన్ని
D) డబ్బులను
జవాబు:
A) ప్రణాళికను
19. ప్రజలు సుఖమైన జీవనాన్ని గడుపుటకు వారు ఉపయోగించే వస్తు, సేవల సంఖ్యపైన వారి ………… ఆధారపడి ఉంటుంది.
A) బడ్జెట్
B) జీవన ప్రమాణం
C) డబ్బు
D) నష్టాలు
జవాబు:
B) జీవన ప్రమాణం
20. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలో కొన్ని సంస్థలలో పనిచేసే ఉద్యోగులు ……. ను అదనంగా పొందుతారు.
A) జీతాలు
B) బోనస్లు
C) కరవుభత్యం
D) ఇంక్రిమెంట్లు
జవాబు:
C) కరవుభత్యం
21. తమ నిత్యావసరాల కొరకు ప్రజలు చేసే ఖర్చును …… అంటారు.
A) కరవుభత్యం
B) వ్యయం
C) ఖర్చులు
D) జీవనవ్యయం
జవాబు:
D) జీవనవ్యయం
22. అన్ని వస్తువులు అనగా ఉత్పాదక వస్తువులు, వినియోగ వస్తువులు …… ధరల సూచికలోకి వస్తాయి.
A) టోకు
B) మౌలిక
C) ఆధార
D) మాధ్యమిక
జవాబు:
A) టోకు
23. భారతదేశంలో వినియోగదారుల ధరల సూచికలను ప్రకటిస్తుంది.
A) రిజర్వు బ్యాంకు
B) ప్రభుత్వం
C) స్వచ్ఛంద సంస్థలు
D) ప్రపంచ బ్యాంకు
జవాబు:
B) ప్రభుత్వం
24. ఆహార పదార్థాల ధరలలో పెరుగుదలను అంచనా వేయుటకు ఉపయోగించే దానిని …… ద్రవ్యోల్బణం అంటారు.
A) ఉత్పత్తి
B) వినియోగదారుల
C) ఆహార
D) కొనుగోలుదారుల
జవాబు:
C) ఆహార
25. సాధారణ ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు టోకు ధరల సూచిక
A) సాధారణంగా పెరుగుతుంది
B) నిలకడగా పెరుగుతుంది
C) పెరగకపోవచ్చు
D) వేగంగా పెరుగుతుంది
జవాబు:
D) వేగంగా పెరుగుతుంది
26. వినియోగదారులైన శ్రామికుల వేతనంలో పెరుగుదల లేకుంటే వారు …… వస్తువులను కొనలేరు.
A) మార్కెట్లో
B) ప్రభుత్వం నుండి
C) దళారీల నుండి
D) పైవేవీకావు
జవాబు:
A) మార్కెట్లో
27. కేంద్ర, రాష్ట్ర స్థాయిలలోని ప్రభుత్వాలు, చెరకు ధరను నిర్ణయించి పంచదార తయారు చేయుటకు ….. పంచదార మిల్లులకు సహాయపడతాయి.
A) ప్రభుత్వ
B) సహకార
C) ప్రైవేటు
D) ఏదీకాదు
జవాబు:
B) సహకార
28. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసే వస్తువుల ధరలు మార్కెట్ లోని ధరల కన్నా …….. ఉంటాయి.
A) ఎక్కువగా
B స్థిరంగా
C) తక్కువగా
D) విపరీత లాభాలుగా
జవాబు:
C) తక్కువగా
29. ప్రభుత్వం ఎగుమతి దిగుమతుల విధానం ద్వారా ఆహార పదార్థాల ధరలు పెరిగినపుడు ఆ వస్తువుల ….. పూర్తిగా నిషేధిస్తుంది.
A) ఉత్పత్తిని
B) పంపిణీని
C) లాభాలను
D) ఎగుమతిని
జవాబు:
D) ఎగుమతిని
30. మన రాష్ట్రంలో …… చౌక ధరల దుకాణాలున్నాయి.
A) 4.5 లక్షలు
B) 6 లక్షలు
C) 7 లక్షలు
D) 8 లక్షలు
జవాబు:
A) 4.5 లక్షలు
31. ద్రవ్యోల్బణ కాలంలో ఈ వ్యక్తుల ఆదాయం మారదు.
A) ప్రభుత్వ ఉద్యోగులు
B) పెన్షనర్లు
C) ప్రభుత్వ లాయర్లు
D) ప్రభుత్వ డాక్టర్లు
జవాబు:
B) పెన్షనర్లు
32. ద్రవ్యోల్బణం ప్రజల జీవన ప్రమాణస్థాయిని ………. చేస్తుంది.
A) నష్టాలు
B) లాభాలు
C) పెంచుతుంది
D) స్థిరంగా
జవాబు:
C) పెంచుతుంది
33. ఆర్థిక గణాంకాల డైరక్టరేట్ వివిధ మార్కెట్లలో …..ను సేకరిస్తుంది.
A) ఉత్పత్తిని
B) శాంపిల్స్‌ని
C) వస్తువులను
D) ధరలను
జవాబు:
D) ధరలను
34. పేద ప్రజల ఆహార భద్రతకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఖ్యమైన పథకం
A) ప్రజా పంపిణీ వ్యవస్థ
B) ధరల నియంత్రణ వ్యవస్థ
C) ఉత్పత్తుల నియంత్రణ వ్యవస్థ
D) కొనుగోలు నియంత్రణ వ్యవస్థ
జవాబు:
A) ప్రజా పంపిణీ వ్యవస్థ
35. ఏ సంవత్సరములో పప్పుదినుసుల ధరలు అధికంగా పెరిగాయి?
A) 2005-06
B) 2006-07
C) 2008-09
D) 2010-11
జవాబు:
B) 2006-07
36. ద్రవ్యోల్బణం వలన, జీవనవ్యయం పెరిగితే ఇది ఏర్పడుతుంది.
A) నష్టం
B) లాభం
C) స్థిరత్వం
D) పేదరికం
జవాబు:
D) పేదరికం
37. వీరిపైన పెరిగిన ధరల ప్రభావం చూపలేవు
A) కార్పొరేట్ రంగంలో పనిచేసే వారిపై
B) దినసరి కూలీలు
C) పెన్షనర్లు
D) ఎవరూ కాదు
జవాబు:
A) కార్పొరేట్ రంగంలో పనిచేసే వారిపై
38. ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగులకు D.A (కరవు భత్యం) ఇవ్వాలంటే దీనిని బట్టి ఇస్తుంది.
A) జీతాలు
B) రాష్ట్ర బడ్జెట్
C) వినియోగదారుల ధరల సూచిక
D) కేంద్రబడ్జెట్
జవాబు:
C) వినియోగదారుల ధరల సూచిక
39. భారతదేశంలో, సాధారణంగా ద్రవ్యోల్బణాన్ని ఇలా లెక్కిస్తారు.
A) ధరలను బట్టి
B) ఉద్యోగుల జీతాలను బట్టి
C) ఆదాయ వనరులను బట్టి
D) టోకు ధరల సూచికలలో వచ్చిన మార్పులను బట్టి
జవాబు:
D) టోకు ధరల సూచికలలో వచ్చిన మార్పులను బట్టి
40. 2011-12 సంవత్సరంలో ఇవి భారతదేశంలో అత్యధిక ద్రవ్యోల్బణాన్ని నమోదుచేశాయి.
A) వంటనూనెలు
B) ఆహారపదార్థాలు
C) వ్యవసాయ ఉత్పత్తులు
D) ఎగుమతులు
జవాబు:
A) వంటనూనెలు
41. 2011-12 సంవత్సరంలో భారతదేశంలో వంటనూనెల అవసరాలను ముడి పామాయిల్, సఫ్లవర్ నూనె, సోయాబీన్ నూనెలు, ఇంతశాతం దిగుమతి చేసుకోవటం ద్వారా తీర్చుకున్నాము.
A) 20%
B) 50%
C) 100%
D) 70%
జవాబు:
B) 50%
42. భారతదేశం ఇతర దేశాల నుండి అధికంగా దిగుమతి చేసుకుంటున్నది
A) విద్యుత్ పరికరాలు
B) ఎలక్ట్రానిక్స్
C) పెట్రోలియం ఉత్పత్తులు
D) రసాయనిక వస్తువులు
జవాబు:
C) పెట్రోలియం ఉత్పత్తులు
43. నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో ఉంచడానికి ప్రభుత్వం చేపట్టిన పథకం పేరు
A) తూనికలు కొలతలు
B) సేల్స్ టాక్స్
C) ప్రజాపంపిణి
D) మార్కెటు సిస్టమ్
జవాబు:
C) ప్రజాపంపిణి
44. రిజర్వ్ బ్యాంకు వడ్డీరేట్లను నియంత్రించడం ద్వారా ఇది జరుగును
A) బ్యాంకులు సరిగా పనిచేయును.
B) వడ్డీ వ్యాపారస్తులు ఉండరు.
C) ధరలు పెరగవు.
D) ధన ప్రవాహం తగ్గుతుంది.
జవాబు:
D) ధన ప్రవాహం తగ్గుతుంది.
45. చలామణిలో ఉన్న ద్రవ్య సరఫరాను తగ్గించాలనుకున్నపుడు భారత ప్రభుత్వం ఈ వర్గాలపై అధిక పన్నులు విధిస్తుంది.
A) సంపన్న ఆదాయ వర్గాలు
B) ప్రభుత్వ ఉద్యోగులు
C) కార్మికులు
D) సామాన్య వర్గం
జవాబు:
A) సంపన్న ఆదాయ వర్గాలు
46. ప్రభుత్వం సంపన్న ఆదాయ వర్గాలపై ఈ వస్తువులపై అధిక పన్నులు విధిస్తారు.
A) విలాస వస్తువులు
B) వినియోగ వస్తువులు
C) ఉత్పాదక వస్తువులు
D) ఏవీకావు
జవాబు:
B) వినియోగ వస్తువులు
47. అవసరమైన మేరకు డిపాజిట్లను అంగీకరించమని RBI క్రిందిస్థాయి బ్యాంకులకు నిబంధనలు సూచించుట వలన ….. జరుగును.
A) బ్యాంకుల సంక్షేమం
B) దేశక్షేమం
C) ధరలు అదుపుచేయుట
D) ఏదీకాదు
జవాబు:
C) ధరలు అదుపుచేయుట
48. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఈ సంవత్సరం నుండి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి.
A) 2000 నుండి
B) 2001 నుండి
C) 2005 నుండి
D) 2009-12 మధ్యకాలం
జవాబు:
D) 2009-12 మధ్యకాలం
49. ఈ క్రింది వస్తువుల ధరలు వేగంగా పెరగవు. ఉత్పత్తి కూడా ఒక్కసారిగా పడిపోదు.
A) నూలు వస్త్రాలు, ఎరువులు
B) సిమెంటు, ఇనుము
C) రసాయనికాలు
D) ఎలక్ట్రానిక్ వస్తువులు
జవాబు:
A) నూలు వస్త్రాలు, ఎరువులు
50. శ్రామికుల వేతనంలో …….. లేకుంటే వారు మార్కెట్లో వస్తువులను కొనలేరు.
A) తగ్గుదల
B) పెరుగుదల
C) స్థిరత్వం
D) ప్రమోషన్స్
జవాబు:
B) పెరుగుదల
51. పెరుగుతున్న ధరల యొక్క ప్రభావం ఈ క్రింది వారిమీద అంతగా ఉండదు
i) కార్పొరేట్ ఉద్యోగులు
ii) వ్యవసాయ కూలీలు
iii) బాగా ధనవంతులు
A) i మాత్రమే
B) ii మాత్రమే
C) i మరియు ii
D) i మరియు iii
జవాబు:
D) i మరియు iii
II. జతపరచుట:
i)
గ్రూపు – ఎ | గ్రూపు – బి |
1. ధరల పెరుగుదల | A) కిరాణా సరుకులు |
2. కుటుంబ బడ్జెట్ | B) జీవన వ్యయం |
3. జీవన ప్రమాణం | C) ద్రవ్యోల్బణం |
4. ధరలలో వచ్చిన మార్పులను కొలుచునది | D) ఎంపిక చేసిన మొదటి సంవత్సరంలో అన్ని వస్తు సేవల సరాసరి ధరలు |
5. ఆధార సంవత్సరం | E) ధరల సూచిక |
జవాబు:
గ్రూపు – ఎ | గ్రూపు – బి |
1. ధరల పెరుగుదల | C) ద్రవ్యోల్బణం |
2. కుటుంబ బడ్జెట్ | A) కిరాణా సరుకులు |
3. జీవన ప్రమాణం | B) జీవన వ్యయం |
4. ధరలలో వచ్చిన మార్పులను కొలుచునది | E) ధరల సూచిక |
5. ఆధార సంవత్సరం | D) ఎంపిక చేసిన మొదటి సంవత్సరంలో అన్ని వస్తు సేవల సరాసరి ధరలు |
ii)
గ్రూపు – ఎ | గ్రూపు – బి |
1. ఆహార పదార్థాల ధరలలో పెరుగుదల | A) కనీస మద్దతు ధర |
2. నిత్యావసర వస్తువులు | B) సహకార సంఘం |
3. ఉన్నత బ్యాంక్ | C) రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా |
4. నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా | D) వరి, గోధుమ |
5. భారత ఆహార సంస్థ | E) ఆహార ద్రవోల్బణం |
జవాబు:
గ్రూపు – ఎ | గ్రూపు – బి |
1. ఆహార పదార్థాల ధరలలో పెరుగుదల | E) ఆహార ద్రవోల్బణం |
2. నిత్యావసర వస్తువులు | D) వరి, గోధుమ |
3. ఉన్నత బ్యాంక్ | C) రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా |
4. నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా | B) సహకార సంఘం |
5. భారత ఆహార సంస్థ | A) కనీస మద్దతు ధర |