Practice the AP 9th Class Physical Science Bits with Answers 9th Lesson తేలియాడే వస్తువులు on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 9th Class Physical Science Bits 9th Lesson తేలియాడే వస్తువులు

1. సాంద్రత : \(\frac{\mathrm{kg}}{\mathrm{m}^{3}}\) :: సాపేక్ష సాంద్రత : ……….
C) పాస్కల్ / మీ
D) ప్రమాణాలు లేవు
జవాబు:
D) ప్రమాణాలు లేవు

2. పాలతో కలసిన నీటిని గుర్తించుటకు వాడు పరికరం
A) బారోమీటరు
B) లాక్టోమీటరు
C) హైడ్రోమీటర్
D) థర్మామీటరు
జవాబు:
B) లాక్టోమీటరు

3. హైడ్రాలిక్ జాక్ నిర్మాణానికి సంబంధించి భిన్నమైనది
A) ముషలకాలకు ఘర్షణ ఉండరాదు.
B) ఓటు పోని (leak proof) ముషలకాలుండాలి.
C) ముషలకాలకు ఒకే వైశాల్యం ఉండాలి.
D) జాక్ లోని ప్రవాహి సంపీడ్యం చెందనిదిగా ఉండాలి.
జవాబు:
C) ముషలకాలకు ఒకే వైశాల్యం ఉండాలి.

4. ఒక పాస్కల్ కు సమానమైన విలువ
A) 1.01 × 10 న్యూ. మీ.-2
B) 1.01 × 10 న్యూ.మీ.-2
C) 1 న్యూ. మీ.-2
D) 76 న్యూ.మీ.-2
జవాబు:
C) 1 న్యూ. మీ.-2

5. పాల స్వచ్చతను కనుగొనుటకు ఉపయోగించు పరికరం
A) భారమితి
B) హైడ్రోమీటర్
C) పొటెన్షియోమీటర్
D) లాక్టోమీటర్
జవాబు:
D) లాక్టోమీటర్

6. 2 సెం.మీ. వ్యాసార్థం గల గోళం యొక్క ద్రవ్యరాశి 0.05 కి.గ్రా. అయితే దాని సాపే సాంద్రత ఎంత?
A) 1.39
B) 1.39 కి.గ్రా/మీ³
C) 1.49
D) 1.46 కి.గ్రా/మీ³
జవాబు:
C) 1.49

7. ఉత్సవనం గురించి తెలియజేయు నియమం ఏది
A) పాస్కల్ నియమం
B) ఆర్కిమెడిస్ నియమం
C) బాయిల్ నియమం
D) న్యూటన్ నియమం
జవాబు:
B) ఆర్కిమెడిస్ నియమం

AP 9th Class Physical Science Bits 9th Lesson తేలియాడే వస్తువులు

8. పాలకు నీరు కలిపినపుడు …………
A) మిశ్రమం సాంద్రత పాల సాంద్రత కన్నా ఎక్కువ
B) మిశ్రమం సాంద్రత పాల సాంద్రత కన్నా తక్కువ
C) మిశ్రమం ఘన పరిమాణం పాల ఘనపరిమాణం కన్నా ఎక్కువ
D) మిశ్రమం ఘన పరిమాణం పాల ఘనపరిమాణం కన్నా తక్కువ
జవాబు:
B) మిశ్రమం సాంద్రత పాల సాంద్రత కన్నా తక్కువ

I. సరియైన సమాధానమును రాయుము.

9. కిరోసిన్ నీటిలో …………
A) తేలును
B) మునుగును
C) తేలియాడును
D) ఏమీ చెప్పలేము
జవాబు:
A) తేలును

10. కిందివాటిలో నీటిలో మునిగేది.
A) చెక్క ముక్క
B) మైనం ముక్క
C) గాజు గోళీ
D) ప్లాస్టిక్ బంతి
జవాబు:
C) గాజు గోళీ

11. సాంద్రత అనగా …………..
A) ద్రవ్యరాశి / లీటర్లు
B) ద్రవ్యరాశి ఘనపరిమాణం
C) ద్రవ్యరాశి వైశాల్యం
D) ద్రవ్యరాశి / అడ్డుకోత వైశాల్యం
జవాబు:
B) ద్రవ్యరాశి ఘనపరిమాణం

12. ఒకే పరిమాణం గల ఇనుప ముక్కను, చెక్కముక్కను తూచినపుడు, ఇనుపముక్క ఎక్కువ బరువుగా ఉంటుంది. కారణం ఏమనగా
A) ఇనుము సాంద్రత చెక్క సాంద్రత కన్నా తక్కువ
B) ఇనుము బరువు చెక్క బరువు కన్నా ఎక్కువ
C) ఇనుము వైశాల్యం చెక్క వైశాల్యం కన్నా ఎక్కువ
D) ఇనుము సాంద్రత చెక్క సాంద్రత కన్నా ఎక్కువ
జవాబు:
D) ఇనుము సాంద్రత చెక్క సాంద్రత కన్నా ఎక్కువ

13. సాంద్రతకు ప్రమాణాలు …………
A) కి.గ్రా/సెం.మీ.
B) గ్రా/మీ
C) కి.గ్రా/మీ
D) మీ/కి.గ్రా
జవాబు:
C) కి.గ్రా/మీ

14. ఒక వస్తువు ద్రవం ఉపరితలంపై తేలాలంటే
A) ఆ వస్తువు సాంద్రత ద్రవం సాంద్రత కంటె ఎక్కువ ఉండాలి
B) ఆ వస్తువు సాంద్రత ద్రవం సాంద్రత కంటె తక్కువ ఉండాలి
C) ఆ వస్తువు బరువు ద్రవం బరువు కంటే ఎక్కువ ఉండాలి
D) ఆ వస్తువు బరువు ద్రవం బరువు కంటే తక్కువ ఉండాలి
జవాబు:
B) ఆ వస్తువు సాంద్రత ద్రవం సాంద్రత కంటె తక్కువ ఉండాలి

15. వస్తువు యొక్క సాపేక్ష సాంద్రత =
A) వస్తువు సాంద్రత / నీటి బరువు
B) నీటి సాంద్రత / వస్తువు సాంద్రత
C) వస్తువు బరువు/ నీటి బరువు
D) వస్తువు ద్రవ్యరాశి / అంతే ఘనపరిమాణం గల నీటి ద్రవ్యరాశి
జవాబు:
D) వస్తువు ద్రవ్యరాశి / అంతే ఘనపరిమాణం గల నీటి ద్రవ్యరాశి

16. పాల స్వచ్ఛతను తెలుసుకోవడానికి వాడేది
A) భారమితి
B) హైడ్రోమీటరు
C) డెన్సిట్ మీటరు
D) లాక్టోమీటరు
జవాబు:
D) లాక్టోమీటరు

17. లాక్టోమీటరు ……. సూత్రంపై పనిచేస్తుంది.
A) సాంద్రత
B) సాపేక్ష సాంద్రత
C) ఉత్సవనము
D ఘనపరిమాణము
జవాబు:
B) సాపేక్ష సాంద్రత

AP 9th Class Physical Science Bits 9th Lesson తేలియాడే వస్తువులు

18. సాపేక్ష సాంద్రత 1 కన్నా ఎక్కువ ఉన్న వస్తువులు నీటిపై (లో) ………….
A) తేలును
B) మునుగును
C) వేలాడును
D) చెప్పలేము
జవాబు:
D) చెప్పలేము

19. వాతావరణ పీడనాన్ని కొలవడానికి వాడేది ………….
A) లాక్టోమీటరు
B) హైడ్రోమీటరు
C) భారమితి
D) హైగ్రోమీటరు
జవాబు:
C) భారమితి

20. సాధారణ వాతావరణ పీడనం వద్ద పాదరస స్తంభం ఎత్తు ………….
A) 76 సెం.మీ.
B) 7.6 సెం.మీ
C) 76 మి. మీ
D) 100 సెం.మీ.
జవాబు:
A) 76 సెం.మీ.

21. 1 అట్మాస్ఫియర్ పీడనము, అనగా ……….
A) 1.01 × 10³ న్యూ మీ²
B) 1.01 × 104 న్యూ మీ²
C) 1.01 × 106 న్యూ మీ²
D) 1.01 × 105 న్యూ మీ²
జవాబు:
D) 1.01 × 105 న్యూ మీ²

22. వాతావరణ పీడనానికి ప్రమాణాలు ………..
A) పాస్కల్
B) న్యూ మీ²
C) A లేదా B
D) ఏదీకాదు
జవాబు:
C) A లేదా B

23. ద్రవంలో మునిగిన ఏ వస్తువు పైనైనా పనిచేసే ఊర్ధ్వ బలాన్ని ………… అంటారు.
A) గురుత్వ బలం
B) ఉత్సవనము
C) పీడనం
D) సాంద్రత
జవాబు:
B) ఉత్సవనము

AP 9th Class Physical Science Bits 9th Lesson తేలియాడే వస్తువులు

24. హైడ్రాలిక్ జాక్స్ ………. నియమంపై పనిచేస్తాయి.
A) ఆర్కిమెడీస్ నియమం
B) ఉత్సవనము
C) పాస్కల్ నియమం
D) గాలి పీడనం
జవాబు:
C) పాస్కల్ నియమం

II. ఈ క్రింది ఖాళీలను పూరింపుము.

1. ప్రమాణ ఘనపరిమాణము గల వస్తువు యొక్క ద్రవ్యరాశిని ……………… అంటారు.
2. MKS పద్ధతిలో సాంద్రతకు ప్రమాణాలు ………..
3. ఒక వస్తువు యొక్క సాపేక్ష సాంద్రత = …………
4. ఒక ద్రవం యొక్క సాపేక్ష సాంద్రత = …………
5. సాపేక్ష సాంద్రతకు ప్రమాణాలు ……………
6. లాక్టోమీటరును ………… కనుగొనుటకు వాడుతారు.
7. లాక్టోమీటరు పనిచేయుటలో ఇమిడియున్న సూత్రం
8. ఒకే ద్రవ్యరాశి గల రెండు వస్తువుల సాంద్రతలు ρ1, ρ2 అయిన ఆ మిశ్రమం యొక్క ఫలిత సాంద్రత ……………..
9. ఒకే ఘనపరిమాణం గల రెండు వస్తువుల సాంద్రతలు ρ1 ρ2 అయిన ఆ మిశ్రమం యొక్క ఫలిత సాంద్రత
10. ఏ ద్రవం యొక్క సాంద్రతనైనా ………….. నుపయోగించి కనుగొనవచ్చును.
11. ఒక వస్తువు యొక్క సాపేక్ష సాంద్రత 1 కన్నా ఎక్కువైన ఆ వస్తువు నీటిపై (లో) …………..
12. ఒక ద్రవంలో ముంచబడిన వస్తువుపై పనిచేసే ఊర్ధ్వ బలాన్నే ……………… అంటారు.
13. 1 అట్మాస్ఫియర్ = …………….
14. పాదరసం సాంద్రత = …………..
15. ఒక ద్రవంలో h లోతులో పీడనం ……………….
16. ఉత్సవన బలం ఆ వస్తువు యొక్క ………………కు సమానము.
17. బ్రాహప్రెస్ లో కుడి ముషలకముపై పనిచేసే బలం = …………….
18. ఒక వస్తువును ద్రవంలో ముంచినపుడు దానిపై పనిచేసే ఉత్సవన బలం ………………. కు సమానం.
19. ఓడలు …… సూత్రం ఆధారంగా నిర్మింపబడతాయి.
జవాబు:

  1. సాంద్రత
  2. కి.గ్రా / మీ³
  3. వస్తువు సాంద్రత / నీటి సాంద్రత (లేదా) వస్తువు బరువు / వస్తువు ఘనపరిమాణమునకు సమాన ఘనపరిమాణము గల నీటి బరువు
  4. ద్రవం బరువు / అంతే ఘనపరిమాణం గల నీటి బరువు
  5. ప్రమాణాలు లేవు
  6. పాల స్వచ్ఛత
  7. సాపేక్ష సాంద్రత
  8. \(\frac{2 \rho_{1} \rho_{2}}{\rho_{1}+\rho_{2}}\)
  9. \(\frac{1}{2}\)(ρ1 + ρ2)
  10. హైడ్రోమీటరు లేదా డెన్సిటోమీటరు
  11. మునుగును
  12. ఉత్సవనము
  13. 1.01 × 105 న్యూ/మీ²
  14. 13.6 గ్రా/సి.సి.
  15. P = P0 + ρhg
  16. కోల్పోయినట్లనిపించు బరువు
  17. \(\mathrm{F}_{2}=\frac{\mathrm{A}_{2} \times \mathrm{F}_{1}}{\mathrm{~A}_{1}}\)
  18. వస్తువుచే తొలగింపబడిన ద్రవం బరువుకు సమానం
  19. ఉత్సవన సూత్రం

III. జతపరచుము.

i)

Group – A Group – B
1. ఉత్సవన నియమం A) పాల స్వచ్ఛత
2. హైడ్రాలిక్ జాక్స్ B) నీటిలో మునుగును
3. లాక్టోమీటరు C) ఆర్కిమెడీస్
4. హైడ్రోమీటరు D) నీటిపై తేలును
5. సాపేక్ష సాంద్రత 1 కన్నా తక్కువ E) పాస్కల్ సూత్రం
F) ఏదైనా ద్రవం యొక్క సాంద్రత
G) నీటిలో వేలాడును

జవాబు:

Group – A Group – B
1. ఉత్సవన నియమం C) ఆర్కిమెడీస్
2. హైడ్రాలిక్ జాక్స్ E) పాస్కల్ సూత్రం
3. లాక్టోమీటరు A) పాల స్వచ్ఛత
4. హైడ్రోమీటరు F) ఏదైనా ద్రవం యొక్క సాంద్రత
5. సాపేక్ష సాంద్రత 1 కన్నా తక్కువ D) నీటిపై తేలును

ii)

Group – A Group – B
1. 1 అట్మాస్ఫియర్ A) P2 – P1 = hρg
2. పాదరసం సాంద్రత B) 1.01 × 105 పాస్కల్
3. భారమితిలో పాదరస స్తంభం ఎత్తు C) P = P0 + ρ h g
4. వాతావరణ పీడనం P0 = D) 13.6 గ్రా/సి.సి
5. ఒక ద్రవంలో స్త్రీ లోతులో పీడనం E) ρ h g
F) 76 సెం.మీ

జవాబు:

Group – A Group – B
1. 1 అట్మాస్ఫియర్ B) 1.01 × 105 పాస్కల్
2. పాదరసం సాంద్రత D) 13.6 గ్రా/సి.సి
3. భారమితిలో పాదరస స్తంభం ఎత్తు F) 76 సెం.మీ
4. వాతావరణ పీడనం P0 = E) ρ h g
5. ఒక ద్రవంలో స్త్రీ లోతులో పీడనం C) P = P0 + ρ h g