Practice the AP 9th Class Physical Science Bits with Answers 8th Lesson గురుత్వాకర్షణ on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 9th Class Physical Science Bits 8th Lesson గురుత్వాకర్షణ
1. సమవృత్తాకార చలనంలో వస్తువు విషయంలో సరియైనది / సరియైనవి
i) వలిత బలం వస్తువు వేగదిశను మాత్రమే మారుస్తుంది.
ii) ఫలితబలం ఎల్లపుడూ కేంద్రంవైపు ఉంటుంది.
iii) ఫలితబలంను అభికేంద్రబలం అంటారు.
A) i, ii
B) ii, iii
C) i, iii
D) i, ii, iii
జవాబు:
D) i, ii, iii
2. భావన (A) : 10 కేజీల వస్తు భారం 98N
కారణం (R) : భారం W = mg
A) భావన (A) కారణం (R) రెండూ సత్యం మరియు R, A ను బలపరుస్తుంది.
B) భావన (A) కారణం (R) రెండు సత్యం మరియు R, A ను బలపరచదు.
C) భావన (A) సత్యం, కారణం (R) అసత్యం
D) భావన (A) అసత్యం , R సత్యం
జవాబు:
A) భావన (A) కారణం (R) రెండూ సత్యం మరియు R, A ను బలపరుస్తుంది.
3. విశ్వగురుత్వాకర్షణ స్థిరాంకం విలువ
A) 6.67 × 1011 Nm-2 kg²
B) 6.67 × 10-11 Nm² kg-2
C) 6.67 × 10-19 Nm² kg-2
D) 6.67 × 10-11Nm-2 kg²
జవాబు:
B) 6.67 × 10-11 Nm² kg-2
4. నీ తరగతిలో ఒకేసారి ఒకరాయిని, ఆకును ఒకే ఎత్తునుండి పడవేసినపుడు నీ పరిశీలన
A) రెండూ ఒకే కాలంలో భూమిని చేరుతాయి
B) గాలిలో ఘర్షణ వల్ల రాయి భూమిని త్వరగా చేరుతుంది.
C) ఆకు త్వరగా భూమిని చేరుతుంది.
D) రెండూ భూమిని చేరవు.
జవాబు:
B) గాలిలో ఘర్షణ వల్ల రాయి భూమిని త్వరగా చేరుతుంది.
5. సమ వృత్తాకార చలనంలో త్వరణ దిశ
A) స్పర్శ రేఖ వెంబడి
B) కేంద్రం వైపు
C) కేంద్రం వెలుపల
D) దిశ ఉండదు
జవాబు:
B) కేంద్రం వైపు
6. భూ ఉపరితలం నుండి దూరంగా వెళ్ళేకొలది గురుత్వ త్వరణం విలువ
A) తగ్గుతుంది
B) పెరుగుతుంది
C) మారదు
D) శూన్యం
జవాబు:
A) తగ్గుతుంది
7. భావన (A) : ఒక వస్తు భారం చంద్రునిపై భూమి కంటే తక్కువగా ఉంటుంది.
కారణం (R) : భూమి చంద్రుని కంటే బరువైనది.
A) A మరియు R రెండు సరైనవి మరియు R, Aకు సరైన వివరణ
B) A మరియు R రెండు సరైనవి మరియు R, Aకు సరైన వివరణ కాదు
C) A సరైనది, కానీ R సరైనది కాదు
D) A సరైనది కాదు, R సరైనది
జవాబు:
B) A మరియు R రెండు సరైనవి మరియు R, Aకు సరైన వివరణ కాదు
8. ఒక అర్థవంతమైన ప్రయోగం కొరకు కింది ఐచ్చికాల సరైన క్రమము
P) ఒక బిందువు నుండి ఒక వస్తువును వ్రేలాడదీసి, క్షితిజ లంబాన్ని గీయండి.
Q) రెండు రేఖల ఖండన బిందువు గురుత్వ కేంద్రం అవుతుంది.
R) స్టీలు ప్లేటుతో తయారు చేసిన భారతదేశ పటాన్ని తీసుకోండి.
S) మరొక బిందువు నుండి వస్తువును వ్రేలాడదీసి, క్షితిజ లంబరేఖను గీయండి.
A) P,Q, R, S
B) R, S, P,Q
C) R, P, S, Q
D) Q, R, P, S
జవాబు:
C) R, P, S, Q
9. ఒక వస్తువుపై భూమ్యాకర్షణ బలం మాత్రమే పనిచేస్తూ ఉంటే, ఆ వస్తువు తొలి వేగమెంత?
A) 9.8 మీ/సె.
B) 8.9 మీ/సె.
C) 0 మీ/సె.
D) 10 మీ/సె.
జవాబు:
C) 0 మీ/సె.
10. గురుత్వ త్వరణం ఏ దిశలో పనిచేస్తుంది?
A) ఎల్లపుడూ కిందికి
B) ఎల్లపుడూ పైకి
C) కొన్ని సందర్భాల్లో కిందికి, కొన్ని సందర్భాల్లో పైకి
D) వస్తువు కదిలే దిశలో
జవాబు:
A) ఎల్లపుడూ కిందికి
I. సరియైన సమాధానమును రాయుము.
11. త్రిభుజాకారపు ఆకృతి గరిమనాభి
A) లంబకేంద్రము
B) గురుత్వ కేంద్రం
C) అంతరవృత్త కేంద్రం
D) పరివృత్త కేంద్రం
జవాబు:
D) పరివృత్త కేంద్రం
12. ఒక వస్తువును నిట్టనిలువుగా పైకి విసిరిన, దాని గురుత్వ బలం పనిచేయు దిశ …… వైపు ఉండును.
A) వస్తు చలనదిశ
B) చలన దిశకు వ్యతిరేకదిశ
C) స్థిరముగా
D) వస్తువు పైకి వెళ్ళేటపుడు పెరుగును
జవాబు:
B) చలన దిశకు వ్యతిరేకదిశ
13. కొంత ఎత్తు నుండి పడుతున్న బంతిని
A) భూమి మాత్రమే ఆకర్షించును
B) బంతి మాత్రమే ఆకర్షించును
C) రెండూనూ ఒకదానికొకటి ఆకర్షించుకొనును
D) ఒకదానికొకటి వికర్పించుకొనును
జవాబు:
C) రెండూనూ ఒకదానికొకటి ఆకర్షించుకొనును
14. న్యూటన్ విశ్వగురుత్వాకర్షణ నియమం పనిచేయు సందర్భం …………….
A) సౌరవ్యవస్థలో మాత్రమే
B) భూమిపై వస్తువుల మధ్య
C) గ్రహాలందు మాత్రమే
D) విశ్వమంతయు
జవాబు:
D) విశ్వమంతయు
15. ‘g’ మరియు ‘G’ ల మధ్య సంబంధము
జవాబు:
D
16. భూమికి దగ్గరగా గురుత్వ త్వరణము విలువ
A) 8.9 ms-2
B) 9.8 ms-2
C) 8.9 cms-2
D) 9.8 cms-2
జవాబు:
D) 9.8 cms-2
17. శూన్యం నందు స్వేచ్ఛాపతన వస్తువులన్నీ …………… కలిగి ఉంటాయి.
A) ఒకే వేగాన్ని
B) ఒకే వడిని
C) ఒకే త్వరణాన్ని
D) ఒకే బలాన్ని
జవాబు:
C) ఒకే త్వరణాన్ని
18. కొంత ఎత్తు నుండి ఒక రాయిని విడిచారు. 20 mలు పడిన తర్వాత దాని వేగము …………
A) – 10 m/s
B) 10 m/s
C) – 20 m/s
D) 20 m/s
జవాబు:
C) – 20 m/s
19. 10కి.గ్రా ద్రవ్యరాశి గల వస్తు భారము
A) 98 న్యూటన్లు
B) 89 న్యూటన్లు
C) 9.8 న్యూటన్లు
D) 8.9 న్యూటన్లు
జవాబు:
A) 98 న్యూటన్లు
20. వస్తు భారమును వ్యక్తపరచని ప్రమాణాలు ……………….
A) కేజీ – భారము
B) న్యూటన్లు
C) డైన
D) కేజీ
జవాబు:
D) కేజీ
II. ఈ క్రింది ఖాళీలను పూరింపుము.
1. విశ్వంలోని ఏ రెండు ద్రవ్యరాశుల మధ్యనైనా ………… బలం ఉంటుందనే భావన న్యూటన్ అభివృద్ధి చెందించాడు.
2. ఏదైనా వస్తువు స్థిరవడితో వృత్తాకార మార్గంలో చలిస్తూ ఉంటే ఆ వస్తువు చలనాన్ని ………….. అంటారు.
3. వస్తువు వేగం ఎల్లపుడు వృత్తాకార మార్గానికి గీసిన ……….. దిశలో వుండును.
4. గమనంలో ఉన్న ఏ వస్తువైనా పనిచేసే ఫలిత బలదిశ ఆ వస్తువు యొక్క ………… దిశలోనే ఉంటుంది.
5. వస్తు వేగ దిశను మాత్రమే మార్చగల ఫలిత బలాన్ని ………. బలం అంటారు.
6. వేగ దిశలో మాత్రమే మార్పు తీసుకురాగల త్వరణాన్ని ………… అంటారు.
7. భూమి చుట్టూ చంద్రుని యొక్క చలనము ఇంచుమించు ………….. చలనమును పోలి వుంటుంది.
8. భూమి నుండి చంద్రునికి గల దూరము ……… కి.మీ.
9. భూమి చుట్టూ చంద్రుడు ఒక పూర్తి భ్రమణానికి పట్టు కాలం ……………………..
10. భూమిపై చంద్రుడి త్వరణం ………
11. భూ ఉపరితలానికి దగ్గరగా ఉండే వస్తువుల్లో త్వరణం
12. భూ వ్యా సార్ధం …………………..
13. విశ్వగురుత్వాకర్షణ స్థిరాంకము (G) విలువ ………
14. భూమికి దగ్గరగా భూమి చుట్టూ వృత్తాకార మార్గంలో చలించే ఉపగ్రహం తీసుకునే సమయం సుమారుగా ……………..
15. G, gల మధ్య సంబంధము ……………
16. వస్తువు సమతాస్థితిలో ఉన్నప్పుడు వస్తువుపై పనిచేసే ఆధారిత బలము
17. స్వేచ్ఛాపతన స్థితిలో వస్తువు …………. స్థితిగా వుంటుంది.
18. ఒక వస్తువుపై భూమ్యాకర్షణ బలం మాత్రమే పనిచేస్తూ ఉంటే ఆ వస్తువును …………….. వస్తువంటారు.
19. వస్తు స్థిరత్వం, ఆ వస్తువు ………………. పై ఆధారపడి ఉంటుంది.
జవాబు:
- గురుత్వాకర్షణ
- సమవృత్తాకార చలనం
- స్పర్శరేఖ
- త్వరణ
- అభికేంద్ర
- అభికేంద్ర త్వరణం
- సమవృత్తాకారం
- 3,84,400
- 27.3 రోజులు లేక 2.35 × 106 సెకనులు
- 0.27 సెం.మీ/సె²
- 981 సెం.మీ/సె²
- 6371 కి.మీ.
- 6.67 × 10-11 Nm²/kg²
- 1 గం|| 24.7 ని॥లు
- \(\left(g=\frac{G M}{R^{2}}\right)\)
- భారము
- భారరహిత
- స్వేచ్ఛాపతన
- గురుత్వ కేంద్రం
III. జతపరచుము.
i)
Group – A | Group – B |
1. భూమి ద్రవ్యరాశి | A) 9.8 m/se2 |
2. భూ వ్యాసార్ధం | B) 0.027 m/s2 |
3. భూమిపై చంద్రుని త్వరణం విలువ | C) 6.4 × 106 కి.మీ. |
4. భూమిపై గురుత్వ త్వరణం విలువ | D) 6 × 1024 కి.గ్రా. |
జవాబు:
Group – A | Group – B |
1. భూమి ద్రవ్యరాశి | D) 6 × 1024 కి.గ్రా. |
2. భూ వ్యాసార్ధం | C) 6.4 × 106 కి.మీ. |
3. భూమిపై చంద్రుని త్వరణం విలువ | B) 0.027 m/s2 |
4. భూమిపై గురుత్వ త్వరణం విలువ | A) 9.8 m/se2 |
ii)
Group – A | Group – B |
1. భారము | A) వస్తువుపై భూమ్యాకర్షణ బలం మాత్రమే పనిచేస్తూ ఉండటం |
2. అభికేంద్ర బలం | B) వస్తువు మొత్తం భారం ఏ బిందువు గుండా పని చేస్తుందో ఆ బిందువు |
3. అభికేంద్ర త్వరణం | C) భూమ్యాకర్షణ వల్ల కలిగే త్వరణం |
4. గురుత్వ కేంద్రం | D) వస్తువును సమవృత్తాకార చలనంలో ఉంచేందుకు ప్రయత్నించే బలం |
5. గురుత్వ త్వరణం | E) వస్తువు పై పనిచేసే భూమ్యాకర్షణ బలము |
6. స్వేచ్ఛాపతన వస్తువు | F) వస్తు వేగ దిశలో మాత్రమే నిరంతరంగా మార్పు తీసుకొని వచ్చే త్వరణం |
జవాబు:
Group – A | Group – B |
1. భారము | E) వస్తువు పై పనిచేసే భూమ్యాకర్షణ బలము |
2. అభికేంద్ర బలం | D) వస్తువును సమవృత్తాకార చలనంలో ఉంచేందుకు ప్రయత్నించే బలం |
3. అభికేంద్ర త్వరణం | F) వస్తు వేగ దిశలో మాత్రమే నిరంతరంగా మార్పు తీసుకొని వచ్చే త్వరణం |
4. గురుత్వ కేంద్రం | B) వస్తువు మొత్తం భారం ఏ బిందువు గుండా పని చేస్తుందో ఆ బిందువు |
5. గురుత్వ త్వరణం | C) భూమ్యాకర్షణ వల్ల కలిగే త్వరణం |
6. స్వేచ్ఛాపతన వస్తువు | A) వస్తువుపై భూమ్యాకర్షణ బలం మాత్రమే పనిచేస్తూ ఉండటం |