These AP 8th Class Social Important Questions 4th Lesson ధృవ ప్రాంతాలు will help students prepare well for the exams.

AP Board 8th Class Social 4th Lesson Important Questions and Answers ధృవ ప్రాంతాలు

ప్రశ్న 1.
ఈ పటాన్ని పరిశీలించి వ్యాఖ్యానించండి.
AP Board 8th Class Social Solutions Chapter 4 ధృవ ప్రాంతాలు 4
జవాబు:
ఈ పటం ఉత్తర ధృవమండలాన్ని చూపిస్తోంది. దీనిపైన వృత్తాలు అక్షాంశాలను, గీతలు రేఖాంశాలను సూచిస్తున్నాయి. ఈ రేఖాంశాలు కలిసిన స్థానమే ఉత్తర ధృవం. భూమి భూమధ్యరేఖ వద్ద ఉబ్బెత్తుగానూ, ధృవాల వద్ద నొక్కబడి ఉందని తెలుస్తుంది. దీనిపై గ్రీన్లాండ్ దక్షిణ భాగాన్ని, దానికి కొంచెం పై నున్న భూభాగాన్ని పటాన్ని దాటించి చూపించారు. దీనిని నేను తప్పుగా భావిస్తున్నాను.

ప్రశ్న 2.
ఇచ్చిన చిత్రంలో మీకు ఏమైనా చెట్లు కనపడ్డాయా?
AP Board 8th Class Social Solutions Chapter 4 ధృవ ప్రాంతాలు 5
జవాబు:
లేదు. గడ్డి, చిన్న చిన్న పొదలు లాంటివి కనపడుతున్నాయి తప్ప చెట్లు కనపడటం లేదు.

ప్రశ్న 3.
ధృవ ప్రాంతంలో పూచే పూవుల చిత్రాలను, జంతువుల చిత్రాలను సేకరించి ఆల్బమ్ తయారుచేయండి.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 4 ధృవ ప్రాంతాలు 6

ప్రశ్న 4.
ఒక ‘ఎస్కిమోను’ ఇంటర్వ్యూ చేసి వాటి వివరాలను రాయండి.
జవాబు:
నేను : మీ పేరు

ఎ : క్రిస్టోఫర్

నేను : మీరు ఏ ప్రాంతానికి చెందినవారు?

ఎ : కెనడా ఉత్తర ప్రాంతానికి చెందినవాణ్ణి.

నేను: మీ కుటుంబంలో ఎంతమంది సభ్యులున్నారు?

ఎ : మా కుటుంబంలో రక్తసంబంధీకులం 7,8 మంది ఉన్నా, మేము దాదాపు 70మంది ఒక సమూహంగా జీవిస్తాము. అన్నీ, అందరికీ అనేది మా సమూహ నియమం.

నేను: మీకు ఈ వాతావరణం నచ్చుతుందా?

ఎ : మేము పుట్టి పెరిగింది. ఈ వాతావరణంలోనే మాకు వేరే వాతావరణం తెలియదు. ఈ మంచు, తెల్లదనం, యిక్కడి కాంతులు, జంతువులు, మా ఇళ్ళు, మా బృందాలు యివన్నీ నాకు చాలా యిష్టం.

నేను: మీరు మా ప్రాంతానికి వచ్చే అవకాశం వస్తే ఏం చేస్తారు?

ఎ : కచ్చితంగా తిరస్కరిస్తాను. ఎందుకంటే మేము ప్రకృతి ఒడిలో, ప్రకృతిని అనుసరిస్తూ జీవిస్తాము. ఎప్పుడైనా దీనిని కాదన్నవారు మాలో చాలా మంది అనేక యిబ్బందులు పడ్డారు. ఈ సమాజంలో మేము జీవించలేము అన్నది నిజం. కాబట్టి నేను తిరస్కరిస్తాను.

నేను : కృతజ్ఞతలు.

ఎ : కృతజ్ఞతలు.

AP 8th Class Social Important Questions Chapter 4 ధృవ ప్రాంతాలు

ప్రశ్న 5.
క్రింద నీయబడిన పేరాను చదివి, ప్రశ్నలకు సమాధానములిమ్ము.

గ్లోబుమీద ఉత్తర ధృవం, దక్షిణ ధృవాలను చూశారు. ధృవాల దగ్గర ఉండే ప్రాంతాన్ని ‘ధృవ ప్రాంతం’ అంటారు. ఈ అధ్యాయంలో మీరు ఉత్తర ధృవ ప్రాంతం గురించి తెలుసుకుంటారు. ఇది ఉత్తర ధృవం, దాని చుట్టుపక్కల ప్రాంతాన్ని చూపిస్తుంది. ధృవప్రాంతం వేరే రంగులో చూపబడి ఉంది. ఈ ప్రాంత సరిహద్దును గమనించండి. దీనిని ‘ఆ టిక్ వృత్తం’ అంటారు.. ధృవ ప్రాంతంలో ఉన్న ఖండాల ఉత్తర భాగాలను టండ్రా ప్రాంతం అంటారు. టం అంటే చాలా చలిగా ఉండే ప్రాంతం అని అర్థం. టండ్రా ప్రాంతంలో చాలా తక్కువ సూర్యకాంతి పడుతుంది. కాబట్టి ఇక్కడ ప్రత్యేకమైన మొక్కల రకాలు ఉంటాయి. వీటిని ‘టండ్రా వృక్షజాలం’ అంటారు.

1. ధృవ ప్రాంతం అని దేనిని అంటారు?
జవాబు:
ధృవాల దగ్గర ఉండే ప్రాంతాన్ని ‘ధృవ ప్రాంతం’ అంటారు.

2. ఈ ప్రాంత సరిహద్దును ఏమంటారు?
జవాబు:
ఈ ప్రాంత సరిహద్దును ‘ఆర్కిటిక్ వృత్తం’ అంటారు.

3. టండ్రా ప్రాంతం అని దేనిని అంటారు?
జవాబు:
ధృవ ప్రాంతంలో ఉన్న ఖండాల ఉత్తర భాగాలను టండ్రా ప్రాంతం అంటారు.

4. టండ్రా అంటే అర్థం ఏమిటి?
జవాబు:
టండ్రా అంటే చాలా చలిగా ఉండే ప్రాంతం అని అర్థం.

5. టండ్రా వృక్షజాలం అని దేనిని అంటారు?
జవాబు:
టండ్రా ప్రాంతంలో చాలా తక్కువ సూర్యకాంతి పడుతుంది. కాబట్టి ఇక్కడ ప్రత్యేకమైన మొక్కల రకాలు ఉంటాయి. వీటిని ‘టండ్రా వృక్షజాలం’ అంటారు.

ప్రశ్న 6.
క్రింది పేరాను చదివి దిగువ నీయబడిన ప్రశ్నలకు సమాధానమునిమ్ము.
జవాబు:
మతపరమైన నమ్మకాలు :

జీవితం, ఆరోగ్యం , రోగాలు, ఆకలి, మరణాల పట్ల ఎస్కిమోల మతం ప్రత్యేక ఆసక్తి చూపిస్తుంది. వీటన్నింటినీ ఆత్మలు నియంత్రిస్తాయని ఎస్కిమోలు నమ్ముతారు. అన్ని ఎస్కిమో బృందాలు శిల అనే అతీత శక్తిని, ఆత్మలను (జీవనం, ఆరోగ్యం , ఆహార దేవత అయిన సెడ్నా వంటి దేవతలు) నమ్ముతాయి. మనుషులు, జంతువుల ఆత్మలు చనిపోయిన తరవాత కూడా జీవించి ఉంటాయని వాళ్లు నమ్ముతారు. అయితే ప్రతి బృందానికి తమదైన నమ్మకాలు, సంప్రదాయాలు ఉంటాయి. ప్రతి వ్యక్తి, కుటుంబం లేదా బృందానికి ఒక ‘నిషిధమైనది’ (టాబూ) ఉంటుంది. దీని ప్రకారం వాళ్లు ఫలానా ఆహారం తినకూడదు వంటి ఆచారాలు ఉంటాయి. జననం, మరణాల సమయంలో లేదా వేట బాగా దొరికినప్పుడు, లేదా అస్సలు దొరకనప్పుడు ప్రతిబ్బందం పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటాయి. ఈ ఆచారాలను నిర్వహించే వారిని షమాన్లు అంటారు. ఆత్మల ప్రపంచంతో అనుసంధానానికి ఈ షమాన్లు సహాయం చేస్తారని నమ్ముతారు. తమ ఆచారాలలో మాయాజాలాన్ని, నాటకీయతను, అచేతనను షమాన్లు ఉపయోగిస్తారు.

1. ఎస్కిమోల మతం వేటిపట్ల ఆసక్తి చూపుతుంది?
జవాబు:
జీవితం, ఆరోగ్యం , రోగాలు, ఆకలి, మరణాల పట్ల ఎస్కిమోల మతం ప్రత్యేక ఆసక్తి చూపిస్తుంది.

2. అందరు ఎస్కిమోలు వేటిని నమ్ముతారు?
జవాబు:
అన్ని ఎస్కిమో బృందాలు శిల అనే అతీత శక్తిని, ఆత్మలను (జీవనం, ఆరోగ్యం , ఆహార దేవత అయిన సెడ్నా వంటి దేవతలు) నమ్ముతాయి. మనుషులు, జంతువుల ఆత్మలు చనిపోయిన తరవాత కూడా జీవించి ఉంటాయని వాళ్లు నమ్ముతారు.

3. ‘టాబూ’ అంటే ఏమిటి?
జవాబు:
‘టాబూ’ అంటే నిషిద్ధమైనది అని అర్థం.

4. వీరు సంబరాలు ఎప్పుడు చేసుకుంటారు?
జవాబు:
జననం, మరణాల సమయంలో లేదా వేట బాగా దొరికినప్పుడు, లేదా అస్సలు దొరకనప్పుడు ప్రతి బృందం పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటాయి.

5. షమాన్లు ఏమి చేస్తారు?
జవాబు:
తమ ఆచారాలలో మాయాజాలాన్ని, నాటకీయతను, అచేతనను షమాన్లు ఉపయోగిస్తారు.

ప్రశ్న 7.
ఎస్కిమోల సామూహిక జీవనాన్ని ప్రశంసించండి.
జవాబు:
ఎస్కిమోలు బృందాలుగా జీవిస్తారు. వీరు సామూహికంగా సంచారం చేస్తూ జీవనం గడుపుతారు. వేట, వంట, ఆవాసం, నివాసం, కష్టం, సుఖం, దుఃఖం అన్నీ కలిసే పంచుకుంటారు. నేటి నాగరిక సమాజాలలో లేని ఐకమత్యం వీరిలో నేటికీ జీవించి ఉండటం నిజంగా ప్రశంసించదగిన అంశం.

ప్రశ్న 8.
ధృవ ప్రాంత సరిహద్దును ఏమంటారు?
జవాబు:
ధృవ ప్రాంత సరిహద్దును ‘ఆర్కిటిక్ వృత్తం’ అంటారు.

ప్రశ్న 9.
దిగ్మండలం అంటే ఏమిటి?
జవాబు:
భూమి, ఆకాశం కలసినట్టు అనిపించే ప్రదేశాన్ని క్షితిజం లేదా దిగ్మండలం అంటారు.

ప్రశ్న 10.
‘ఐర్స్’ అంటే ఏమిటి?
జవాబు:
పెద్ద పెద్ద మంచుగడ్డలు విడిపోయి నీటిలో తేలుతూ సముద్రంలోకి ప్రవేశిస్తాయి.. వీటిని ‘ఐస్ బెర్స్’ అంటారు.

ప్రశ్న 11.
ఎస్కిమోల ప్రధాన భాషలు ఏవి?
జవాబు:
ఎస్కిమోల ప్రధాన భాషలు 3. అవి : అల్యుయిట్, యుపిక్, ఇన్యుపిక్.

AP Board 8th Class Social Solutions Chapter 4 ధృవ ప్రాంతాలు

ప్రశ్న 12.
పర్కాలు అంటే ఏమిటి?
జవాబు:
ఎస్కిమోలు ముకులనే బూట్లు, ప్యాంట్లు, తలను కట్టే టోపీ ఉండే కోట్లు మొ||న వాటిని ప్కలు అంటారు.

ప్రశ్న 13.
ఎస్కిమోలు మొట్టమొదటి సారిగా చూసినదెవరు?
జవాబు:
ఎస్కిమోలు మొట్టమొదట చూసిన బయటివాళ్ళు ఐలాండ్ నుండి వచ్చి గ్రీన్లాండ్ లో నివాసం ఏర్పరుచుకున్న వైకింగ్లు.

ప్రశ్న 14.
ధృవప్రాంతాలు ఇతర ప్రాంతాలకంటే చాలా భిన్నమైనవి. మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసే ధృవప్రాంతాలకు సంబంధించిన వివిధ అంశాలను వివరించండి.
జవాబు:
మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసే విషయాలు

  1. ఈ ప్రాంతం ఆర్కిటిక్ వలయానికి, ఉత్తర ధృవానికి మధ్యలో ఉంది.
  2. ఇక్కడ పగటి సమయం 6 నెలలు, రాత్రి సమయం 6 నెలలకు ఒకసారి వస్తాయి.
  3. ఇక్కడ శీతాకాలం, వేసవికాలం మాత్రమే ఉంటాయి.
  4. వీరు వేటాడిన మాంసాన్ని, చేపలను తింటారు.
  5. ఆహారధాన్యాలు, కూరగాయలు చాలా తక్కువగా లభిస్తాయి.
  6. వీరు మంచుతో కట్టిన ఇళ్ళలో నివశిస్తారు.
  7. వీరు జంతువుల చర్మాన్ని దుస్తులుగా ధరిస్తారు.
  8. ఇక్కడ గడ్డి పొదలు మాత్రమే పెరుగుతాయి.
  9. ఇక్కడ ప్రజలు సంచార మరియు సామాహిక జీవితాన్ని గడుపుతారు.

ప్రశ్న 15.
క్రింద ఇవ్వబడిన సమాచారం చదివి, దిగువ ప్రశ్నలకు జవాబులివ్వండి.

ఎస్కిమోల ఆహారంలో ప్రధానంగా మాంసం, చేపలు, కొవ్వు పదార్థం ఉంటాయి. కూరగాయలు చాలా అరుదు. వాళ్లు ఆహారాన్ని ఏ మాత్రం వృధా చేయరు. వేటాడటం, చేపలు పట్టడం మీద ఎస్కిమోలు ఆధారపడి ఉన్నారు కాబట్టి చేపలు, జంతువులు తగినంతగా దొరకనప్పుడు ఆకలితో ఉండటం వాళ్ళకు పరిపాటి. నేలను శాశ్వతంగా గడ్డకట్టినంత వరకు మంచును తవ్వి వేసవిలో పట్టుకున్న చేపలు, జంతువులను పాతిపెట్టడం ద్వారా నిల్వ ఉంచుతారు. వాటిపైన రాళ్లు పెట్టడం ద్వారా ఇతర జంతువులు తినకుండా కాపాడుకుంటారు.
i) ఎస్కిమోల ఆహారంలో కూరగాయలు అరుదు. ఎందుకు?
ii) ఎస్కిమోలు తమ ఆహారాన్ని ఎలా సంపాదిస్తారు?
iii) ఎస్కిమోలు తమ ఆహారాన్ని ఎలా నిల్వ చేసుకుంటారు?
iv) ఆహార వినియోగం విషయంలో ఎస్కిమోల నుండి గ్రహించదగిన ఒక మంచి అంశాన్ని తెలపండి.
జవాబు:
i) ధృవ ప్రాంతాలలో మొక్కలు పెరిగే వాతావరణం లేదు. అందువలన కూరగాయలు అరుదు.
ii) ఎస్కిమోలు, వేటాడటం, చేపలు పట్టడం ద్వారా ఆహారాన్ని సంపాదిస్తారు.
iii) ఎస్కిమోలు నేలను శాశ్వతంగా గడ్డకట్టినంత వరకు మంచును తవ్వి వేసవిలో పట్టుకున్న చేపలు, జంతువులను పాతి పెట్టడం ద్వారా నిల్వ ఉంచుతారు.
iv) ఎస్కిమోలు ఆహారాన్ని ఏ మాత్రం వృథా చేయరు.