These AP 8th Class Social Important Questions 23rd Lesson క్రీడలు : జాతీయత, వాణిజ్యం will help students prepare well for the exams.
AP Board 8th Class Social 23rd Lesson Important Questions and Answers క్రీడలు : జాతీయత, వాణిజ్యం
ప్రశ్న 1.
కింది పేరాను చదివి, అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి.
క్రికెట్ మ్యాచ్ చూడటం అంటే ఏదో ఒక పక్షానికి మద్దతు కవ్వటం అని అభిమానులకు తెలుసు. రంజీ ట్రోఫీలో ఢిల్లీ, ముంబయి తలపడుతుంటే అభిమానులు ఏ పట్టణం నుంచి వచ్చారు. దీనికి మద్దతునిస్తారు అన్నదాన్ని బట్టి ఒక పక్షం వహిస్తారు. భారతదేశం, ఆస్ట్రేలియాల మధ్య క్రికెట్టు మ్యాచ్ జరుగుతుంటే హైదరాబాదు లేదా చెన్నెలలో టీ.వీలో మ్యాచ్ చూస్తున్న వాళ్లు భారతీయులుగా తమ దేశం వైపున నిలబడతారు. అయితే భారతదేశ తొలి రోజులలో బృందాలు ప్రాంతీయ ప్రాతిపదికన ఏర్పడలేదు. 1932 దాకా టెస్ట్ మ్యాచ్ లో భారతదేశ బృందానికి అవకాశం ఇవ్వలేదు. మరి బృందాలను ఎలా ఏర్పాటు చేసేవాళ్లు? ప్రాంతీయ, జాతీయ బృందాలు లేనప్పుడు అభిమానులు తమ మద్దతు తెలపటానికి బృందాన్ని దేని ప్రాతిపదికగా ఎంచుకునేవాళ్లు?
1. అభిమానులకు ఏమి తెలుసు?
జవాబు:
క్రికెట్ మ్యాచ్ చూడటం అంటే ఏదో ఒక పక్షానికి మద్దతు ఇవ్వటం అని అభిమానులకు తెలుసు.
2. రంజీ ట్రోఫీ దేనికి సంబంధించిన పోటీ?
జవాబు:
క్రికెట్‌కు సంబంధించినది.
3. భారతదేశానికి టెస్ట్ మ్యా చ్ లో అవకాశం ఎప్పటి దాకా రాలేదు.
జవాబు:
1932 దాకా.
4. అభిమానులు ఎవరికి మద్దతు తెలియచేస్తారు?
జవాబు:
అభిమానులు తమ ప్రాంతం వారికి మద్దతు తెలియచేస్తారు.
ప్రశ్న 2.
కింది పేరాను చదివి, అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి.
‘మీ బాలురకు ఎటువంటి ఆటలు లేవంటే నాకు బాధతో కూడిన ఆశ్చర్యం కలుగుతుంది. జాతీయ క్రీడలు, సంప్రదాయ ఆటలను పునరుద్ధరించటంలో మీ సంస్థ ముందు ఉండాలి. మనదేశంలో ఎన్నో సంప్రదాయ ఆటలు ఉన్నాయి. ఇవి ఆసక్తికరమూ, ఉత్సాహభరితంగా ఉండటమే కాకుండా వీటికి అయ్యే ఖర్చు చాలా తక్కువ.’
– మహీంద్ర కళాశాలలో 1927 నవంబరు 24న ఇచ్చిన ఉపన్యాసం, మహాత్మాగాంధీ సంకలిత రచనలు.
‘ఆరోగ్యకరమైన శరీరం అంటే మనసుకి తగినట్టుగా ఉండి, ఎల్లప్పుడూ దాని సేవకు సిద్ధంగా ఉండేది. నా దృష్టిలో ఇటువంటి శరీరాలు ఫుట్ బాల్ మైదానంలో తయారుకావు. అవి మొక్కజొన్న, పంటపొలాల్లో తయారవుతాయి. దీని గురించి ఆలోచిస్తే, ఇందుకు రుజువుగా మీకు అనేక ఉదాహరణలు దొరుకుతాయి. వలస పాలకుల మోజులో ఉన్న భారతీయులకు ఫుట్ బాల్, క్రికెట్టు పిచ్చి పట్టుకుంది. కొన్ని సందర్భాలలో ఈ ఆటలకు చోటు ఉండవచ్చు… శారీరకంగా, మానసికంగా చురుకుగా ఉండే మానవాళిలోని అధికశాతం రైతులకు ఈ ఆటలు తెలియవన్న వాస్తవాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోవటం లేదు … ?’
– లాజరస్ కి లేఖ, 1915 ఏప్రిల్ 17, మహాత్మాగాంధీ సంకలిత రచనలు, సంపుటి 14.
1. ఉపన్యాసం ఎవరు, ఎక్కడ ఇచ్చారు?
జవాబు:
ఉపన్యాసం మహీంద్ర కళాశాలలో గాంధీజీ ఇచ్చారు.
2. మన దేశంలో ఏ ఆటలు ఉన్నాయి?
జవాబు:
మన దేశంలో ఎన్నో సాంప్రదాయ ఆటలున్నాయి.
3. ఆరోగ్యకరమైన శరీరం అంటే ఏమిటి?
జవాబు:
ఆరోగ్యకరమైన శరీరం అంటే మనసుకు తగినట్టుగా ఉండి, ఎల్లప్పుడూ దాని సేవకు సిద్ధంగా ఉండేది.
4. ఆరోగ్యకరమైన శరీరాలు ఎక్కడ తయారు అవుతాయి?
జవాబు:
మొక్కజొన్న, పంట పొలాల్లో తయారు అవుతాయి.
5. ఈ లేఖ ఎవరికి రాశారు?
జవాబు:
లాజరు రాశారు.
ప్రశ్న 3.
శరీరం, మనసుల మధ్య సమతుల్యానికి క్రీడలు అవసరమని “మహాత్మాగాంధీ” నమ్మారు. క్రీడలు వ్యక్తిగతంగా మరియు జాతీయ సమైక్యతను పెంపొందించడంలో ఏ విధంగా సహాయం చేస్తాయో వివరించండి.
జవాబు:
వ్యక్తిగతంగా క్రీడలు, ఆటలు ఎలా ఉపయోగకరం.
- ఆటలు ఆడటం సంతోషానిస్తుంది.
- ఆటలు స్నేహాన్ని పెంపొందిస్తాయి.
- ఆటలు ఆడడం వల్ల శారీరక ఆరోగ్యం కాపాడబడుతుంది.
- ఆటలు క్రమశిక్షణ, ఆత్మ విశ్వాసాన్ని నేర్పుతాయి.
క్రీడలు జాతీయ ఐక్యతను పెంపొందిస్తాయి :
- జాతీయ జట్టులో వివిధ ప్రాంతాల, మతాలవారు ఉండటం ద్వారా జాతీయ సమగ్రత సాధ్యం అవుతుంది.
- ఒలంపిక్ గేమ్స్ లాంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రీడలలో పతకాలు సాధించడం ద్వారా పౌరులలో దేశభక్తి, గౌరవం, పెంపొందుతాయి.