These AP 8th Class Social Important Questions 20th Lesson లౌకికత్వం – అవగాహన will help students prepare well for the exams.
AP Board 8th Class Social 20th Lesson Important Questions and Answers లౌకికత్వం – అవగాహన
ప్రశ్న 1.
ఈ క్రింది పేరాను చదివి రెండు ప్రశ్నలను తయారు చేయండి.
లౌకికవాదంలో ముఖ్యమైన అంశం ప్రభుత్వ అధికారం నుంచి మతాన్ని వేరుచేయటం. ఒక దేశం ప్రజాస్వామికంగా పనిచేయాలంటే ఇది ముఖ్యం. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో ఒకటికంటే ఎక్కువ మతాల ప్రజలు నివసిస్తుంటారు. ఈ మతాలలో ఏదో ఒకటి అధిక ప్రజలను కలిగి ఉంటుంది. అధిక సంఖ్యలో ఉన్న మత బృందం ప్రభుత్వాధికారంలోకి వస్తే, ఈ అధికారాన్ని, ఆర్థిక వనరులను వినియోగించుకుని ఇతర మతాలకు చెందిన వ్యక్తులను వేధించవచ్చు, వివక్షతకు గురిచేయవచ్చు. అధిక సంఖ్యాకుల ఆధిపత్యం వల్ల ఈ అల్పసంఖ్యాక ప్రజలు వివక్షత, ఒత్తిడికి గురికావచ్చు. ఒక్కొక్కసారి చంపబడవచ్చు. అధిక సంఖ్యలో ఉన్నవాళ్లు తేలికగా తక్కువ సంఖ్యలో ఉన్నవాళ్ళని వాళ్ల మతాన్ని పాటించకుండా చేయవచ్చు. మతంలో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికీ ప్రజాస్వామిక సమాజం ఇచ్చే హక్కులు మత ఆధిపత్యం వల్ల ఉల్లంఘింపబడతాయి. అంటే అధిక సంఖ్యాకుల పెత్తనాన్ని ప్రాథమిక హక్కులు ఉల్లంఘింపబడకుండా” చూడాలన్నా ప్రజాస్వామిక సమాజాలలో ప్రభుత్వాధికారం నుంచి మతాన్ని వేరుచేయటం చాలా ముఖ్యమవుతుంది.
వ్యక్తులకు వారి మతాన్ని విడిచిపెట్టి మరొక మతాన్ని స్వీకరించడానికి, మత బోధనలను భిన్నంగా విశ్లేషించ డానికి, స్వేచ్ఛను కాపాడటానికి కూడా ప్రజాస్వామ్య సమాజంలో ప్రభుత్వాధికారం నుంచి మతాన్ని వేరుచేయటం ముఖ్యమవుతుంది.
జవాబు:
- మత మార్పిడులు ‘అధిక సంఖ్యాకుల మతం నుండి ఎక్కువగా ఉన్నాయా? అల్ప సంఖ్యాకుల మతం నుండి ఎక్కువగా ఉన్నాయా?
- ప్రభుత్వాధికారం నుండి మతాన్ని వేరు చేయటం ఎందుచే ముఖ్యమవుతుంది?
ప్రశ్న 2.
ఈ క్రింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులిమ్ము.
2004 ఫిబ్రవరిలో ముస్లిం ఆడపిల్లలు కట్టుకునే తలగుడ్డ, యూదుల టోపీ, క్రైస్తవ శిలువలు వంటి మత, రాజకీయ చిహ్నాలను పాఠశాల విద్యార్ధులు ధరించకుండా ఫ్రాన్స్ ఒక చట్టం చేసింది. ఫ్రాన్స్ కింద ఒకప్పుడు వలస దేశాలుగా ఉన్న అల్జీరియా, ట్యునీసియా, మొరాకో దేశాల నుంచి వచ్చి ఫ్రాన్స్ లో నివసిస్తున్న వాళ్లు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. 1960లలో ఫ్రాన్స్ లో కార్మికుల కొరత తీవ్రంగా ఉండటంతో ఆ దేశాల నుంచి వలస వచ్చి పనిచేయటానికి వీసాలు ఇచ్చింది. ఈ వలస కుటుంబాల ఆడపిల్లలు బడికి వెళ్లేటప్పుడు తలకి గుడ్డ కట్టుకుంటారు. ఈ చట్టం చేసిన తరువాత తలకి గుడ్డ కట్టుకున్నందుకు ఈ పిల్లలు బడి నుంచి బహిష్కరించబడ్డారు.
అ) ఫ్రాన్స్ ఏమి చట్టం చేసింది?
జవాబు:
మత, రాజకీయ చిహ్నాలను పాఠశాల విద్యార్థులు ధరించకుండా ఫ్రాన్స్ ఒక చట్టం చేసింది.
ఆ) ఈ చట్టాన్ని ఎవరు వ్యతిరేకించారు?
జవాబు:
ఫ్రాన్సుకు వలస వచ్చినవారు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు.
ఇ) చట్టం ఎప్పుడు చేయబడింది?
జవాబు:
2004 ఫిబ్రవరిలో
ప్రశ్న 3.
లౌకికవాదం అంటే ఏమిటి?
జవాబు:
ప్రభుత్వంలో మతపరమైన జోక్యం లేకపోవడాన్ని లౌకికవాదం అంటారు.
ప్రశ్న 4.
ఇతర ప్రజాస్వామిక దేశాలతో పోలిస్తే లౌకికవాదం ఏ విధంగా భిన్నమైనది?
జవాబు:
ఇతర ప్రజాస్వామిక దేశాలతో పోలిస్తే ప్రభుత్వాలు మతంతో ఏమాత్రం జోక్యం చేసుకోవు. కానీ భారత లౌకిక విధానం మతాలతో జోక్యం చేసుకుంటుంది. ఈ విధంగా ఇది ఇతర ప్రజాస్వామిక దేశాలతో భిన్నమైనది.
ప్రశ్న 5.
బౌద్ధమతంలో ఎన్ని రకాల దృక్పథాలు ఉన్నాయి? అవి ఏవి?
జవాబు:
బౌద్ధమతంలో 3 రకాల దృక్పథాలు ఉన్నాయి. అవి
- తేరవాదం
- మహాయానం
- వజ్రాయానం
ప్రశ్న 6.
ఏ దేశంలో ముస్లింలు కానివాళ్ళను దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు కట్టుకోవడానికి అనుమతించరు?
జవాబు:
సౌదీ అరేబియాలో ముస్లింలు కానివాళ్ళను దేవాలయాలు, ప్రార్ధనా మందిరాలు కట్టుకోవడానికి అనుమతించరు.