These AP 7th Class Social Important Questions 7th Lesson మొఘల్ సామ్రాజ్యం will help students prepare well for the exams.

AP Board 7th Class Social 7th Lesson Important Questions and Answers మొఘల్ సామ్రాజ్యం

ప్రశ్న 1.
మొఘల్ సామ్రాజ్య స్థాపన, సరిహద్దులను వివరిస్తూ బాబర్ గురించి తెల్పండి.
జవాబు:

 1. ఢిల్లీ సుల్తానులలో చివరి పాలకుడైన ఇబ్రహీం లోడిని క్రీ.శ. 1526లో పానిపట్టు యుద్ధంలో ఓడించి బాబరు మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
 2. దీనితో మొఘల్ సామ్రాజ్యం ప్రారంభమైంది.
 3. ఈ సామ్రాజ్యం పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్, ఉత్తరాన హిమాలయాలు, తూర్పున బెంగాల్, బంగ్లాదేశ్ యొక్క ఉన్నత భూములు మరియు దక్షిణాన గోల్కొండ వరకు విస్తరించి ఉంది.

బాబర్ (క్రీ.శ. 1526-1530) :

 1. బాబర్ మొదటి పానిపట్టు యుద్ధం తరువాత ఢిల్లీ, ఆగ్రాలను ఆక్రమించి క్రీ.శ. 1526లో భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
 2. యుద్ధ వ్యూహాలను రూపొందించడంలో గొప్ప మేధావి.

ప్రశ్న 2.
మొఘల్ పాలకుడు హుమాయూన్ గురించి వివరించండి.
జవాబు:
హుమాయూన్ (క్రీ.శ. 1530 – 1540 మరియు క్రీ.శ. 1555 – 1556) :

 1. హుమాయూన్ మొఘల్ పాలకులలో రెండవవాడు.
 2. అనుభవం లేకపోవడంతో తన సోదరుల నుండి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొనెను.
 3. షేర్షా హుమాయూనను చౌసా, కనౌజ్ (1540) లలో ఓడించి ఇరాను తరిమివేసెను.
 4. హుమాయూనకు ఇరాన్లో సఫావిదిషా యొక్క సహాయం లభించెను.
 5. అతడు క్రీ. శ. 1555లో తిరిగి ఢిల్లీని స్వాధీనం చేసుకొనెను.
 6. క్రీ.శ. 1556లో మరణించెను.

AP 7th Class Social Important Questions Chapter 7 మొఘల్ సామ్రాజ్యం

ప్రశ్న 3.
మొఘల్ పాలకులలో ప్రముఖుడు ‘అక్టర్ చక్రవర్తి’, ఇతని గురించి వివరించండి.
జవాబు:
అక్బర్ (క్రీ.శ. 1556-1605) :

 1. తన తండ్రి హుమాయూన్ చనిపోయేనాటికి అక్బర్ వయస్సు కేవలం 13 సంవత్సరాలు.
 2. అక్బర్ చిన్నవాడైనందున అతని సంరక్షకుడు బైరాం ఖాన్ అక్బర్ తరపున పరిపాలన సాగించాడు.
 3. బైరాం ఖాన్ మార్గదర్శకత్వంలో జరిగిన (క్రీ. శ. 1556) రెండవ పానిపట్టు యుద్ధంలో అక్బర్ హేముని ఓడించినాడు.
 4. ఆ తరువాత మొఘలులు విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించగలిగారు. రాజపుత్ర రాజ్యాలైన మాళ్వా, చూనార్, గోండ్వానాలను తన రాజ్యానికి జోడించాడు.
 5. రాజపుత్రులను ఉన్నత పదవులలో నియమించాడు.
 6. నిజాయితీ, ధైర్య సాహసాలు కలిగిన రాజపుత్ర రాజులతో మంచి సంబంధాలను కొనసాగించాడు.
 7. కాని మేవాడ్ పాలకుడైన మహారాణా ప్రతాప్ అక్బర్ అధికారాన్ని అంగీకరించకుండా పోరాటం చేసాడు.
 8. క్రీ. శ. 1605లో అతడు చనిపోయిన తరువాత జహంగీర్ సింహాసనాన్ని అధిష్టించాడు.

ప్రశ్న 4.
‘జహంగీర్’ గురించి వివరించండి.
జవాబు:
జహంగీర్ (క్రీ.శ. 1605-1627) :

 1. అక్బర్ వారసుడు సలీం. అతడు జహంగీర్ (ప్రపంచ విజేత) అనే బిరుదుతో సింహాసనం అధిష్టించాడు.
 2. ఈయనకు పక్షులంటే అమితమైన ప్రేమ. గొప్ప చిత్రకారుడు.
 3. అతను తన రాజ్య ఆర్థిక అభివృద్ధి కోసం వాణిజ్య, వ్యాపార మరియు స్థానిక పన్నులు ప్రవేశపెట్టాడు.
 4. చివరి కాలంలో అనారోగ్యానికి గురికావడం వల్ల భార్య నూర్జహాన్ పరిపాలన వ్యవహారాలను చూసుకున్నది.

ప్రశ్న 5.
షాజహాన్ గురించి నీకేమి తెలుసో వివరించండి.
జవాబు:
షాజహాన్ (క్రీ.శ. 1628 -1658) :

 1. షాజహాన్ జహంగీర్ కుమారుడు. ఇతనిని ఖుర్రం అని కూడా పిలుస్తారు. ఇతని పాలనలో మొఘల్ సామ్రాజ్యం, సాంస్కృతిక వైభవంలో ఉన్నత స్థాయికి చేరింది.
 2. ఇతని పాలనా కాలంలో నిర్మించిన గొప్ప స్మారక కట్టడాలు బాగా గుర్తుండిపోతాయి.
 3. ముఖ్యంగా ఆగ్రాలోని తాజ్ మహల్, ఢిల్లీలోని జామి మసీద్ (ముత్యాల మసీద్) మరియు ఎర్రకోట.
 4. ఇతని పాలనాకాలంలో దక్కన్ రాజ్యాలైన బీజాపూర్, గోల్కొండ, అహ్మద్ నగలను జయించాడు.
 5. క్రీ.శ. 1658లో షాజహాన్ కుమారుల మధ్య వారసత్వంపై వివాదం ఏర్పడింది. చివరకు ఔరంగజేబు సింహాసనాన్ని అధిష్టించాడు.

ప్రశ్న 6.
ఔరంగజేబు పాలనా కాలం గురించి వివరించండి.
జవాబు:
ఔరంగజేబు (క్రీ.శ. 1658-1707) :

 1. షాజహాన్ యొక్క చిన్న కుమారుడు ఔరంగజేబు.
 2. అతడు ముస్లిం మతాచారముల పట్ల శ్రద్ధా భక్తులు కలిగియుండి, ఖురాన్ బోధనలకు అనుగుణంగా తన జీవితాన్ని గడిపాడు.
 3. భారతదేశానికి చక్రవర్తి అయినప్పటికీ, టోపీలు కుట్టడం ద్వారా సంపాదించిన డబ్బుతో (ఆహారము మరియు దుస్తులతో సహా) తన స్వంత ఖర్చులను భరించేవాడు.
 4. ఇతర మతాల యెడల సహనాన్ని పాటించలేదు.
 5. ప్రధానంగా తనకు మత సహనం లేని కారణంగా అస్సాం, రాజస్థాన్, పంజాబ్, డెక్కన్ మొదలగు ప్రాంతాలలో పెద్దసంఖ్యలో తిరుగుబాట్లను ఎదుర్కొన్నాడు.
 6. గురుతేజ్ బహదూర్, గురు గోవింద్ సింగ్ మరియు శివాజీ మొదలగువారు తిరుగుబాట్లు చేశారు.
 7. శివాజీ స్వతంత్ర మరాఠా రాజ్యాన్ని స్థాపించుటలో విజయవంతం అయ్యాడు.
 8. శివాజీ మరణం తర్వాత ఔరంగజేబు దక్కన్‌పై దండెత్తాడు.
 9. ఔరంగజేబు 1685లో జాపూర్, 1687లో గోల్కొండను జయించాడు.
 10. అతని మరణం తర్వాత అతని కొడుకుల మధ్య వారసత్వ పోరాటం జరిగింది.

ప్రశ్న 7.
మొఘలులు ఇతర పాలకులతో గల సంబంధాలను తెల్పండి.
జవాబు:
ఇతర పాలకులతో మొఘలుల సంబంధాలు :

 1. మొఘలులు తమకు విధేయత చూపని పాలకులపై దాడి చేసినారు.
 2. వీరు దౌత్యంలో భాగంగా, రాజపుత్ర స్త్రీలను వివాహం చేసుకున్నారు.
 3. వారి ఆస్థానంలో రాజపుత్రులకు ఉన్నత పదవులను ఇచ్చారు.
 4. రాజపుత్రులలోని శిశోడియా వంశస్తులు మొఘలుల అధికారాన్ని అంగీకరించలేదు.
 5. అక్బర్ కాలంలో రాజపుత్రులు, సిక్కులు, ఇతర పరిపాలకులతో ఉన్న సంబంధాలు షాజహాన్ కాలంలో క్షీణించడం ప్రారంభమయ్యాయి.
 6. ఔరంగజేబు కాలంలో ఈ సంబంధాలు అత్యంత క్షీణ దశకు చేరాయి.
 7. ఇతని కాలంలో సామ్రాజ్యంలోని అన్ని భాగాలలో తిరుగుబాట్లు జరిగాయి.
 8. ఔరంగజేబు మరణానంతరము సామ్రాజ్యం విచ్ఛిన్నమైంది.

AP 7th Class Social Important Questions Chapter 7 మొఘల్ సామ్రాజ్యం

ప్రశ్న 8.
మొఘలుల కాలం నాటి మత జీవనం తెల్పుతూ, అక్బర్ మతంను గురించి వివరించండి.
జవాబు:
మతం :

 1. మొఘలులు సున్ని మతస్తులు.
 2. అక్బర్ మత సహనాన్ని పాటించాడు.
 3. హిందువులపై విధించే జిజియా పన్ను మరియు యాత్రికుల పన్నులను రద్దు చేసాడు.
 4. అక్బర్ ప్రజలు మతపరమైన వేడుకలను బహిరంగంగా జరుపుకునేందుకు అనుమతించాడు.
 5. సమాజంలో ఎక్కువ మంది ప్రజలు హిందువులు. ఆనాటి సమాజంలో హిందువులు, ముస్లింలు మాత్రమే కాకుండా బౌద్ధులు, జైనులు, సిక్కులు మరియు పార్శీలు కూడా ఉండేవారు.
 6. ఔరంగజేబు షరియత్ ఇస్లాం సిద్ధాంతాలను అనుసరించి ప్రజల నైతిక జీవనాన్ని పరిశీలించడానికి ‘ముతావాసిటీ’ అనే మతాధికారులను నియమించాడు.
 7. అక్బర్ క్రీ. శ. 1575 లో ఫతేపూర్ సిక్రీ వద్ద ఇబాదత్ ఖానా అనే ప్రార్థనా మందిరాన్ని నిర్మించాడు.
 8. 1582లో ‘దీన్-ఇ-ఇలాహి’ అనే నూతన మతాన్ని ప్రకటించాడు.
 9. “దీన్-ఇ-ఇలాహి” అంటే “అందరితో శాంతి” లేదా “విశ్వజనీనశాంతి”.
 10. ఇది విభిన్న మతాల మధ్య శాంతియుత, సమన్వయ సంబంధాలను తెలియజేస్తుంది.
 11. దీన్-ఇ-ఇలాహి మతంలో 18 మంది మాత్రమే చేరారు.
 12. ఇది ఆస్థాన మతంగానే మిగిలిపోయింది.

ప్రశ్న 9.
మొఘలుల కాలం నాటి ఆర్థిక జీవనంను వివరించండి.
జవాబు:
మొఘలుల కాలం నాటి ఆర్థిక జీవనం :

 1. మొఘల్ సామ్రాజ్యంలో భారతీయ ఆర్థిక వ్యవస్థ సుసంపన్నమైనది.
 2. వాణిజ్యం, వ్యవసాయం కూడా అభివృద్ధి చెందినవి. వ్యవసాయం ప్రజల ముఖ్య వృత్తి.
 3. విస్తృతమైన రహదారి వ్యవస్థను నిర్మించడం, దేశమంతా ఒకే రకమైన కరెన్సీని సృష్టించడం మరియు దేశం యొక్క సమగ్రతకు మొఘలులు బాధ్యత వహించారు.
 4. మొఘలులచే నియమింపబడిన ప్రజా పనుల విభాగం ఈ సామ్రాజ్యంలో విస్తృతమైన రహదారి వ్యవస్థను రూపొందించింది.
 5. ఇది సామ్రాజ్యం అంతట పట్టణాలను మరియు నగరాలను కలిపే రహదారులను రూపకల్పన చేసి, నిర్మించి, నిర్వహించింది.
 6. వాణిజ్యం విస్తరించడానికి ఇది కూడా ఒక కారణం.
 7. వ్యవసాయ పన్ను ద్వారా వచ్చే ఆదాయం ముఖ్యమైన ఆదాయ వనరుగా ఉండేది.

ప్రశ్న 10.
మొఘలుల పాలనలో వ్యవసాయము గురించి తెల్పుతూ, జాబ్ విధానమును గురించి వివరించండి.
జవాబు:
వ్యవసాయము :

 1. మొఘలుల పాలనలో భారత వ్యవసాయ ఉత్పత్తి పెరిగింది. గోధుమ, వరి, బార్లీ వంటి ఆహార పంటలతో పాటుగా నగదు. పంటలైన ప్రత్తి, గంజాయి, నీలిమందు కూడా పండించారు.
 2. వ్యాపార పంటలయిన మొక్కజొన్న, పొగాకు పంటలను భారతీయ రైతులు విస్తృతంగా పండించడం ప్రారంభించారు.

జల్ట్ :

 1. మొఘల్ వ్యవస్థలో చెప్పుకోదగినది అక్బర్ కాలం నాటి రెవెన్యూ పాలన.
 2. ఇది అతని ప్రఖ్యాత రెవెన్యూ మంత్రి అయిన రాజా తోడర్మల్ పర్యవేక్షణలో బాగా అభివృద్ధి చేయబడినది.
 3. రైతులకు అనుకూలంగా, రాజ్యానికి లాభదాయకంగా ఉండే రెవెన్యూ పద్ధతిని అభివృద్ధి చేసి అమలు చేయడానికి అక్బరు రెండు దశాబ్దాల కాలం పట్టింది.
 4. క్రీ. శ. 1580లో గడచిన 10 సంవత్సరాల ఉత్పత్తి, ధరల హెచ్చు తగ్గులు, స్థానిక రెవెన్యూ వివరాలను సేకరించాడు.
 5. వివిధ పంటలు, వాటి ధరల సగటును లెక్క కట్టి ఉత్పత్తిలో 1/3 వ వంతు నుండి సగం వరకు శిస్తుగా నిర్ణయించారు.
 6. ఈ శిస్తును దామ్ లలో చెల్లించాలి. ఈ విధానాన్ని జఖ్ పద్ధతి అంటారు.

ప్రశ్న 11.
మొఘలుల కాలంలో శివాజీ స్వరాజ్ స్థాపించటానికి కారణమైన పరిస్థితులు ఏమిటి?
జవాబు:

 1. 15, 16 శతాబ్దములలో మహారాష్ట్రలో విజృంభించిన భక్తి ఉద్యమము ప్రజల భాషా, మత, సంస్కృతులలో చైతన్యము పెంపొంది మహారాష్ట్రులనందరిని సమైక్యపరచినది.
 2. మహారాష్ట్రములోని అనేక మంది వ్యక్తులు బీజాపూర్, గోల్కొండ, అహ్మద్ నగర్ సుల్తానుల దర్బారులలో అనేక పదవులు నిర్వహించి అపార అనుభవము గడించిరి.
 3. ఔరంగజేబు అనుసరించిన మత దురహంకార విధానము.
 4. దక్కన్లో పెరిగిపోతున్న సుల్తానుల బలహీనతలు.
 5. షాజీ భోంస్లే స్వతంత్ర మహారాష్ట్రము అనే భావమునకు అంకురార్పణ గావించెను.
 6. మహారాష్ట్ర ప్రజలకు స్వతహాగా ధైర్యసాహసములు, శ్రమకోర్చు గుణముండుట.
 7. ఈ పరిస్థితులన్నింటిని తనకు అనుకూలముగా మలచుకొని శివాజీ మహారాష్ట్ర రాజ్యమును స్థాపించెను.

ప్రశ్న 12.
భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి ఆధునిక, తొలి ఆధునిక భారతదేశ చరిత్రలో మొఘల్ సామ్రాజ్య పాత్ర ఏమిటి?
జవాబు:
భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి ఆధునిక, తొలి ఆధునిక భారతదేశ చరిత్రలో మొఘల్ సామ్రాజ్య పాత్ర ప్రధానమైనది.

 1. పర్షియన్ కళ సాహిత్యాలు భారతీయ కళతో సమ్మిళితం కావడం.
 2. మొఘలుల దుస్తులు, ఆభరణాలు, వస్త్రధారణల అభివృద్ధి జరిగింది. మస్లిన్, సిల్క్ వెల్వెట్ మొదలగు గొప్పగా అలంకరించబడిన వస్త్రాల వినియోగం జరిగింది.
 3. మొఘల్, భారతీయ కట్టడాల అభివృద్ధి మరియు ఉన్నతీకరణ.
 4. యువకులకు ఖురాన్, ఫత్వా-ఇ-ఆలంగిరీ మొదలైన ఇస్లామిక్ చట్టాలను స్వదేశీ భాషలలో బోధించడానికి మక్తాబ్ పాఠశాలల నిర్మాణము.

ప్రశ్న 13.
శివాజీ బాల్యం గురించి వివరించండి.
జవాబు:

 1. ఉత్తర భారతదేశంలో మొఘలుల అధికారం ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు దక్షిణ భారతదేశంలో మహారాష్ట్రులు మొఘలులకు వ్యతిరేకంగా ఎడతెగని పోరాటం చేశారు.
 2. మారాఠా రాజ్య స్థాపకుడు శివాజీ.
 3. శివాజీ పూనే సమీపంలోని శివనేరి కోటలో జన్మించాడు. అతని తండ్రి షాజీ భోంస్లే. అతను బీజాపూర్ సుల్తాన్ ఆస్థానంలో ఉన్నత పదవిలో ఉండేవాడు.
 4. శివాజీ తన తల్లి జిజియా బాయి సంరక్షణలో పెరిగాడు.
 5. అతడు సమర్థ రామదాస్ మరియు ఇతర మహారాష్ట్ర సాధువుల బోధనలచే ప్రభావితుడైనాడు.
 6. దాదాజీ కొండదేవ్, తానాజీమాల్ సురే వద్ద యుద్ధ విద్యలను అభ్యసించాడు.
 7. మరాఠా – వీరులతోను, మావళి అనే పశ్చిమ కనుమలలో నివసించే కొండజాతి తెగ ప్రజలతో సైన్యాన్ని తయారు చేశాడు.

AP 7th Class Social Important Questions Chapter 7 మొఘల్ సామ్రాజ్యం

ప్రశ్న 14.
మొఘల కాలం నాటి సాహిత్య, చిత్రకళ, సంగీతాభివృద్ధి గురించి విశదీకరించండి.
జవాబు:
సాహిత్యం :

 1. పర్షియన్ భాష అత్యున్నతమైన మరియు అధికార భాషగా చలామణి అయినది.
 2. బాబర్ “బాబర్‌నామాను” రచించాడు. అబుల్ ఫజల్ అక్బర్ పాలనా కాలంలోని గొప్ప పండితుడు.
 3. ఇతను అయిన్-ఇ-అక్బరీ, అక్బర్నామా అనే గ్రంథాలను రచించాడు.
 4. తుజుక్-ఇ-జహంగీరీ అనే గ్రంథం జహంగీర్ ఆత్మకథ.
 5. షాజహాన్ కొడుకు ధారాషికో భగవద్గీత, మహాభారత కథలను పర్షియన్ భాషలోకి అనువదించాడు.
 6. ప్రముఖ హిందీ కవి తులసీదాస్ రామాయణాన్ని రామచరితమానస్ అనే పేరుతో హిందీలో రచించినాడు.

చిత్రకళ :

 1. మొఘలుల కాలంలో మినియేచర్ (సూక్ష్మ) చిత్రకళగా పిలవబడే ఒక ఆధునిక కళాశైలి ప్రారంభమైంది.
 2. జహంగీర్ పోషణలో చిత్రకళ అత్యున్నత స్థాయికి చేరుకుంది.
 3. నెమలి నీలం, భారతీయులు ఉపయోగించే ఎరుపు రంగులు మొఘల్ చిత్రాలలో కొత్తగా చేర్చబడ్డాయి.

సంగీతం :

 1. బాబర్, హుమాయూన్లు సంగీతాన్ని ప్రోత్సహించారు.
 2. కాని ఇది అక్బర్ కాలంలో ఉన్నత స్థితిని పొందింది.
 3. ఔరంగజేబు అన్ని సంగీత కార్యక్రమాలను నిషేధించినాడు.
 4. అక్బర్ ఆస్థానంలో 36 మంది సంగీతకారులు ఉన్నట్లు అబుల్ ఫజల్ పేర్కొన్నాడు. వారిలో తాన్ సేన్, బాజ్ బహదూర్ ప్రసిద్ధులు.
 5. అక్బర్ తాను స్వయంగా నగారాని బాగా వాయించేవాడు.
 6. తాన్ సేన్ అక్బర్ నవరత్నాలలో ఒకడు. అతడు తన సంగీతంతో అద్భుతాలను సృష్టించేవాడు. మేఘ మలర్ రాగంతో వర్షాన్ని, దీపక్ రాగంతో అగ్నిని సృష్టించేవాడని ప్రతీతి.
 7. ప్రస్తుత హిందూస్థానీ సంగీతంలో ఈ శైలులు కనిపిస్తాయి.

ప్రశ్న 15.
మీకివ్వబడిన భారతదేశ పటంలో ‘శివాజీ సామ్రాజ్యం’ ను గుర్తించండి.
జవాబు:
AP 7th Class Social Important Questions Chapter 7 మొఘల్ సామ్రాజ్యం 1

ప్రశ్న 16.
మొఘలుల కాలంలో కేంద్ర పాలనా వ్యవస్థ ఎలా ఉండేది?
జవాబు:
1) మొఘలులది కేంద్రీకృత పరిపాలన. చక్రవర్తికే అన్ని అధికారాలు ఉండేవి.
2) అతనికి పరిపాలనలో మంత్రిమండలి సహాయపడేది.
3) అక్బర్ అనేక పరిపాలనా సంస్కరణలను ప్రవేశపెట్టాడు. అతను తన విస్తారమైన సామ్రాజ్యాన్ని అనేక సుబాలుగా విభజించాడు మరియు ప్రతి సుబాకు ఒక సుబేదార్‌ను నియమించాడు.
4) సుబాలు అనేవి మొఘల్ సామ్రాజ్యంలోని రాష్ట్రాలు. అక్బర్ తన రాజ్యాన్ని 15 సుబాలుగా విభజించాడు.
5) సుబాలను ‘సర్కారులుగా’ విభజించారు. సర్కారులను ‘పరగణాలుగా’ విభజించారు. ఈ విధానాన్ని ఆ తర్వాతి మొఘలు రాజులు కొనసాగించారు.
6) అక్బరు భూమిని సర్వే చేయించి, పండించిన పంట ప్రకారం పన్ను నిర్ణయించే వ్యవసాయ పద్ధతిని ప్రవేశపెట్టాడు.
7) భూమిని నాలుగు రకాలుగా విభజించి 1/3వ వంతు పంటను పన్నుగా వసూలు చేశాడు.
8) అక్బర్ పాలనలో షేర్షా పరిపాలనా ముద్ర కొంత వరకు ప్రస్ఫుటమవుతుంది.

మన్సబ్ దారీ వ్యవస్థ :
9) సైనిక విధానంలో అక్బర్ మున్సబ్ దారీ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. మున్సబ్ దార్ అనే పదం మున్సబ్ కలిగిన వ్యక్తిని సూచిస్తుంది.
10) మన్సబ్ అంటే హోదా లేదా ర్యాంక్. ఇది 1. ర్యాంక్, 2. జీతాలు, 3. సైనిక బాధ్యతలు నిర్ధారించడానికి మొఘలులు ఉపయోగించిన గ్రేడింగ్ పద్దతి.
11) 10 నుండి 10,000 మంది సైనికులు కలిగిన వివిధ స్థాయిల మన్సబ్ దారులు ఉండేవారు.

ప్రశ్న 17.
మొఘల్ సామ్రాజ్య పతనానికి గల కారణాలు తెల్పండి.
జవాబు:
మొఘల్ సామ్రాజ్య పతనం :
మొఘల్ సామ్రాజ్య పతనం షాజహాతో ప్రారంభమై ఔరంగజేబుతో ముగిసింది. ఔరంగజేబు మరణానంతరం చాలా వేగంగా మొఘల్ సామ్రాజ్యం పతనమైంది. ఈ పతనానికి గల కొన్ని కారణాలు

 1. ఔరంగజేబు యొక్క అనుమాన స్వభావము తన కుమారులను గాని, అధికారులను గాని సమర్థులుగా ఎదగడానికి అవకాశం ఇవ్వలేదు. అతని మతమౌఢ్యం కారణంగా జాట్లు , సత్నామీలు, సిక్కులు తిరుగుబాటు చేసారు. రాజపుత్రులు, మరాఠాలతో శతృత్వం అతని సామ్రాజ్యానికి శాపంగా మారింది.
 2. ఔరంగజేబు వారసులు అసమర్థులు. వారిలో చాలామంది విలాస జీవితానికి అలవాటు పడ్డారు.
 3. చాలామంది అధికారులు అవినీతిపరులు అయ్యారు.
 4. సింహాసనం కోసం కుమారుల మధ్య జరిగిన వారసత్వ యుద్దాలు పరిపాలనను బలహీనపరిచాయి.
 5. షాజహాన్, ఔరంగజేబుల దక్కన్ విధానము సామ్రాజ్యాన్ని మరింత బలహీనపరిచింది.
 6. అహ్మద్ షా, నాదిర్షాల దండయాత్రలు, మన్న దారుల తిరుగుబాట్లు కూడా పతనానికి కారణం అయ్యాయి.
 7. 1526లో బాబర్ చే స్థాపించిన మొఘల్ సామ్రాజ్యం క్రీ.శ. 1857లో బహదూర్‌షా – II కాలంలో పతనమైంది.

ప్రశ్న 18.
శివాజీ విజయాలను వివరించండి.
జవాబు:
రాజ్య విస్తరణ :

 1. శివాజీ తన 19 వ ఏట బీజాపూర్ సుల్తాన్ మహమ్మద్ ఆదిల్ షా ఆధీనంలోని తోరణ దుర్గంను జయించాడు.
 2. ఆ తరువాత రాయగఢ్, సింహగఢ్, ప్రతాప్ గఢ్ ను ఒక్కొక్కటిగా జయించాడు.
 3. కోపగ్రస్తుడైన బీజాపూర్ సుల్తాన్ శివాజీని అణచివేయడానికి తన సేనాధిపతి అష్టలను పంపించాడు. అర్జల్ ఖాన్ మోసంతో శివాజీని చంపాలనుకున్నాడు. సంధి చేసుకునే సాకుతో శివాజీని ఆహ్వానించాడు. ముందుగానే ఊహించిన శివాజీ తన వద్దనున్న వ్యాఘ్ర నఖ (పులి గోళ్ళు) అనే ఆయుధంతో అఫ్టలా నన్ను సంహరించాడు.
 4. శివాజీ యొక్క ఈ విజయాలను గ్రహించిన ఔరంగజేబు అతనిని అణచడానికి తన సేనాధిపతి షయిస్తనన్ను దక్కను పంపించాడు. కాని శివాజీ షయిస్తఖానను ఓడించాడు.
 5. దీనితో ఔరంగజేబు కోపగ్రస్తుడైనాడు. రాజా జైసింగ్ నాయకత్వంలో ఒక పెద్ద సైన్యాన్ని శివాజీ పైకి పంపించాడు. జైసింగ్, శివాజీని ఓడించి కొన్ని కోటలను స్వాధీనపరచుకున్నాడు.
 6. చివరికి ఔరంగజేబుతో సంధి చేసుకోవడానికి శివాజీని ఆహ్వానించి ఆగ్రా జైలులో బంధించాడు. శివాజీ తెలివిగా జైలు నుంచి తప్పించుకొని తన రాజధానికి చేరినాడు.
 7. ఆ తరువాత తాను కోల్పోయిన కోటలన్నింటినీ మొఘలుల నుండి తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. అతడు సూరత్ పై దండెత్తి దానిని కొల్లగొట్టాడు.

ప్రశ్న 19.
మొఘలులను వ్యతిరేకించిన రాజ్యాల జాబితా తయారు చేయండి.
జవాబు:
మొఘలుల అధికారమును అంగీకరించక వ్యతిరేకించిన రాజ్యాలు :
మేవాడ్, రణతంబోర్, జోధ్ పూర్, బికనీర్, కలింజర్, రేవా, గోండ్వానా, అహ్మద్ నగర్, మహారాష్ట్రులు, దక్కన్ రాజ్యా లు మొ||వి.

AP 7th Class Social Important Questions Chapter 7 మొఘల్ సామ్రాజ్యం

ప్రశ్న 20.
హిందుస్తానీ, కర్ణాటక సంగీతంలోని కొన్ని రాగాల పేర్లు తెలపండి. హిందుస్తానీ, కర్ణాటక సంగీతంలోని కొంతమంది సంగీత విద్వాంసుల పేర్లు తెలపండి. కొన్ని రాగాలను విని మీ అభిప్రాయాలను తెలుపుము.
జవాబు:
i) కొన్ని రాగాల పేర్లు :
భైరవ రాగం, మాల్కాను, దీపక్, శ్రీరాగం, మేఘరాగం, హిందోళం, బిళహరి, మళహరి, మోహనరాగం, థామస్, కళ్యాణ రాగం, వాగేశ్వరి, కనకాంబరి, కాంబోజ, శ్రీరంజని, రఘుప్రియ, సుహాసిని మొదలైనవి.

ii) సంగీత విద్వాంసుల పేర్లు :
తాన్ సేన్, పండిట్ రవిశంకర్, బీమ్ సేన్ జోషి, జాకీరు హుస్సేన్, హరిప్రసాద్ చౌరాసియా/ఫ్లూట్, బిస్మిల్లా ఖాన్, జరాజ్, అలి అక్బర్ ఖాన్, ఎమ్. బాలమురళీకృష్ణ, ఎమ్. ఎస్. సుబ్బలక్ష్మి, అంజాద్ ఆలీ ఖాన్, అల్లరఖా, అన్నపూర్ణా దేవి, గిరిజా దేవి, జయంతి కుమరేష్, శుభామగ్దల్.

ప్రశ్న 21.
షేర్షా ప్రవేశపెట్టిన పరిపాలనా సంస్కరణలు ఏమిటి?
జవాబు:
షేర్షా ప్రవేశపెట్టిన పరిపాలనా సంస్కరణలు.

 1. ప్రజా సంక్షేమము కాంక్షించి, మంత్రిమండలిని ఏర్పాటు చేసే కేంద్ర పాలనా వ్యవస్థను ఏర్పాటు చేసాడు.
 2. షేర్షా తన సామ్రాజ్యమును పరిపాలనా సౌలభ్యము కొరకు ’47’ సర్కారులుగా విభజించి రాష్ట్ర పాలన చేసాడు.
 3. రాష్ట్రములను తిరిగి పాలనా సౌలభ్యము కొరకు పరగణాలుగా విభజించెను.
 4. సైనిక పరిపాలన వ్యవస్థలో జాగీరులిచ్చు పద్ధతికి స్వస్తి చెప్పి జీతములిచ్చు పద్ధతిని ప్రవేశపెట్టుటతో పాటు అనేక సంస్కరణలు చేసెను.
 5. షేర్షా కీర్తి ప్రతిష్ఠలకు కారణమయిన అంశము ఆయన రూపొందించిన భూమిశిస్తు విధానము లేక రెవెన్యూ సంస్కరణలు.
  ఉదా : భూమిని సర్వే చేయించుట, పట్టాలిచ్చుట మొ||వి.
 6. న్యాయపాలనలో షేర్షా నిష్పక్షపాతంగా వ్యవహరించి ‘న్యాయసింహుడని’ కీర్తించబడెను.
 7. దేశములో శాంతిభద్రతలను పరిరక్షించుటకు షేర్షా పోలీసు వ్యవస్థను పటిష్ఠంగా రూపొందించి, అమలు చేసెను.
 8. షేర్షా వెండి రూపాయిని ప్రవేశపెట్టెను. ఇది 1835 వరకు అమల్లో ఉండెను.
 9. రాజ్యములోని వివిధ పట్టణములను కలుపుతూ రహదారులను నిర్మించెను. వాణిజ్య అభివృద్ధికి కృషి చేసెను.
 10. ప్రజాభిప్రాయమునకు అనుగుణమైన ప్రభుత్వ యంత్రాంగమును రూపొందించుటకు ప్రయత్నించిన తొలి ముస్లిమ్ పాలకుడు షేర్షా.

మీకు తెలుసా?

7th Class Social Textbook Page No.9

 1. బాబర్ తన తండ్రి వైపు తైమూర్ వంశానికి మరియు తల్లి వైపు చెంఘిజ్ ఖాన్ వంశానికి సంబంధించినవాడు. మొఘలులు (మంగోలుల వారసులు) తమను ఛంఘిజ్ యొక్క రెండవ కుమారుడైన ఛగతాయ్ పేరు మీదుగా ఛగతాయిడ్లు అని పిలుచుకోవడానికి ఇష్టపడేవారు.
 2. “మొఘల్” అనే పదం “మంగోల్” అనే పదం నుంచి వచ్చింది.

7th Class Social Textbook Page No. 11

 1. బీర్బల్ : రాజా బీర్బల్ అక్బర్ చక్రవర్తికి సన్నిహితుడు. అక్బర్ ఆస్థానంలో బీర్బల్ గొప్ప గాయకుడు మరియు కవి. అక్బర్ అతని వల్ల ఎక్కువగా ప్రభావితుడు అయ్యాడు.
 2. అహ్మద్ నగర్ రాణి అయిన చాంద్ బీబీ అక్బర్ అధికారాన్ని వ్యతిరేకించిన మహిళ.

7th Class Social Textbook Page No. 15

1. జిజియా పన్ను :
ముస్లిమేతరులు వారి మతాచారాలను పాటించడానికి, సైన్యంలో చేరకుండా మినహాయింపు పొందడానికి ముస్లిం పాలకులకు చెల్లించే పన్నును జిజియా పన్ను అంటారు. బానిస వంశస్థాపకుడైన కుతుబుద్దీన్ ఐబక్ దీనిని మొదటగా ప్రవేశపెట్టాడు.

2. యాత్రికుల పన్ను :
ఈ పన్ను ముస్లిం చక్రవర్తులు మతపరమైన లేదా పవిత్రమైన ప్రదేశానికి ప్రయాణం చేయడానికి హిందువులపై విధించే పన్ను.

7th Class Social Textbook Page No. 17

1. అక్బర్ క్రీ.శ. 1575 లో ఫతేపూర్ సిక్రీ వద్ద ఇబాదత్ ఖానా అనే ప్రార్థనా మందిరాన్ని నిర్మించాడు. 1582లో ‘దీన్-ఇ-ఇలాహి’ అనే నూతన మతాన్ని ప్రకటించాడు. ‘దీన్-ఇ-ఇలాహి’ అంటే “అందరితో శాంతి” లేదా “విశ్వజనీన శాంతి” అని అర్థం. ఇది విభిన్న మతాల మధ్య శాంతియుత, సమన్వయ సంబంధాలను తెలియజేస్తుంది. దీన్-ఇ-ఇలాహి మతంలో 18 మంది మాత్రమే చేరారు. ఇది ఆస్థాన మతంగానే మిగిలిపోయింది.

AP 7th Class Social Important Questions Chapter 7 మొఘల్ సామ్రాజ్యం

7th Class Social Textbook Page No. 29

అష్ట ప్రధానులు :
అష్టప్రధాన్ అనేది మరాఠా సామ్రాజ్యంలో మంత్రివర్గ ప్రతినిధి బృందం. సుపరిపాలన పద్దతులను అమలు చేసిన ఘనత ఈ మండలికే ఉంది.

 1. పీష్వా : ప్రధానమంత్రి – సామ్రాజ్యం యొక్క సాధారణ పరిపాలనను చూస్తారు.
 2. అమాత్య : ఆర్థికమంత్రి – సామ్రాజ్యంలోని ఖాతాలను నిర్వహించడం.
 3. సచివ్ : కార్యదర్శి – రాజశాసనాలు తయారుచేస్తారు.
 4. వాకియానవిస్ : ఆంతరంగిక మంత్రి – గూఢచర్య వ్యవహారాలను చూసే మంత్రి.
 5. సేనాపతి : సర్వ సైన్యాధ్యక్షుడు – రాజ్య రక్షణ మరియు సైనిక వ్యవహారాల నిర్వాహణ
 6. సుమంత్ : విదేశీమంత్రి – ఇతర రాజ్యాలతో సంబంధాలను నిర్వహించే వ్యక్తి.
 7. న్యాయాధీష్ : ప్రధాన న్యాయమూర్తి – పౌర మరియు నేర సంబంధమైన తీర్పులు చెప్పే వ్యక్తి.
 8. పండిత్ రావ్ : ప్రధాన పూజారి – మతపరమైన అంశాలను నిర్వహించే వ్యక్తి.