These AP 7th Class Social Important Questions 5th Lesson కాకతీయ రాజ్యం will help students prepare well for the exams.
AP Board 7th Class Social 5th Lesson Important Questions and Answers కాకతీయ రాజ్యం
ప్రశ్న 1.
కల్యాణి చాళుక్యులు (పశ్చిమ చాళుక్యులు) గురించి క్లుప్తంగా వ్రాయండి.
జవాబు:
కల్యాణి చాళుక్యులు (పశ్చిమ చాళుక్యులు) :
కళ్యాణి చాళుక్యుల వంశ స్థాపకుడు రెండవ తైలపుడు. వీరి రాజధాని బీదర్ జిల్లాలో గల బసవకళ్యాణి. ఈ రాజ్యం 200 సంవత్సరాల పాటు కొనసాగింది. వీరు వేంగికి చెందిన తూర్పు చాళుక్యులు మరియు చోళులతో వీరు సంస్కృత మరియు కన్నడ భాషలను ప్రోత్సహించారు. బిల్హణుడు విక్రమాంక దేవచరిత్రను రాశాడు. రన్నడు అను ప్రసిద్ధ కన్నడ కవి వీరి ఆస్థానానికి చెందినవాడు. కల్యాణి చాళుక్యులు ఘటికలు అనే విద్యాసంస్థలను స్థాపించారు. వీరు హిందూ, జైన మతాలు రెండింటిని ఆదరించారు. వీరశైవ శాఖ కూడా వీరి పాలనలో ప్రాచుర్యం పొందింది.
ప్రశ్న 2.
యాదవులు ఎవరు? వీరి గురించి నీకు ఏమి తెలియును?
జవాబు:
యాదవులు :
యాదవులు మొదట కల్యాణి చాళుక్యులకు సామంతులుగా పనిచేశారు. వారు ప్రస్తుత అహ్మద్ నగర్ మరియు నాసిక్ ప్రాంతాలను పరిపాలించారు. వీరి రాజధాని దేవగిరి బిల్లమ యాదవ రాజవంశం స్థాపకుడు. యాదవులలో సింఘన సుప్రసిద్ధమైనవాడు. వారి రాజ్యం నర్మదా నది నుండి షిమోగా వరకు విస్తరించి ఉండేది. ఢిల్లీ సుల్తానుల దండయాత్రల కారణంగా వీరు తమ పాలనను కోల్పోయారు.
ప్రశ్న 3.
హోయసాలుల గురించి వివరణాత్మకంగా తెల్పండి.
జవాబు:
హోయసాలులు :
హోయసాలులు ద్వార సముద్రంనకు చెందినవారు. వీరు అధికారంలోకి రాకముందు చోళులు మరియు చాళుక్యులకి సామంతులుగా పనిచేశారు. హోయసాలుల పాలన దాదాపు 200 సంవత్సరాలు కొనసాగింది. వీరు ద్వార సముద్రాన్ని తమ రాజధానిగా చేసుకున్నారు. బిత్తిగ విష్ణువర్ధన కాలంలో వీరు ప్రాముఖ్యత పొందారు. నాల్గవ బల్లాలుడు ఈ రాజవంశం యొక్క చివరి పాలకుడు. సంస్కృత, కన్నడ భాషలను వీరు పోషించారు. హోయసాలులు రాజులు జైనమతాన్ని, మధ్వాచార్యులకు చెందిన ద్వైతాన్ని, రామానుజులకు చెందిన విశిష్టాద్వైతాన్ని అనుసరించారు. ఈ మతాలు ప్రాచుర్యం పొందటానికి వీరు మఠాల నిర్వహణను ప్రోత్సహించారు.
ప్రశ్న 4.
పాండ్యుల యొక్క పాలన గురించి తెలియజేయండి.
జవాబు:
పాండ్యులు :
పాండ్యులు మదురైను రాజధానిగా చేసుకొని పాలించారు. వీరు తమ సామ్రాజ్యం విస్తరించడానికి పల్లవులు మరియు చోళుల మధ్య వున్న శత్రుత్వాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ రాజవంశానికి చెందిన కులశేఖరుడు శ్రీలంక వరకు విజయవంతమైన దండయాత్రను పూర్తిచేసాడు. మార్కోపోలో అను వెన్నీసు యాత్రికుడు అతని పరిపాలన కాలములో సందర్శించి అతని పాలనను ప్రశంసించాడు. పాండ్యులు రాజ్యపాలన వ్యవహారములో చోళుల పరిపాలనా విధానాన్ని అనుసరించారు. వీరు శైవమతం మరియు వైష్ణవ మతాలను ఆదరించారు. దక్షిణ భారతదేశంలో శ్రీరంగం, చిదంబరం, రామేశ్వరం మొదలైన చోట్ల అనేక దేవాలయాలు నిర్మించారు. విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించారు.
ప్రశ్న 5.
కాకతీయులకు ఆ పేరు ఎలా వచ్చింది?
జవాబు:
“కాకతి” అనే దేవతను ఆరాధించిన కారణంగా, వీరికి కాకతీయులు అను పేరు వచ్చింది. ఆమె “దుర్గాదేవి” యొక్క మరొక రూపం. వీరు కాకతి అనే కోటకు సంరక్షకులుగా ఉండేవారు. కాబట్టి వీరిని కాకతీయులు అంటారని కొందరి భావన. మరికొందరి వాదన ప్రకారం ఒకప్పుడు చోళులు పరిపాలించిన కాకతి పురానికి చెందిన వారే కాకతీయులు.
ప్రశ్న 6.
కాకతీయ రాజ్య ముఖ్య పాలకులు వారి కాలం యొక్క ప్రాముఖ్యతను తెల్పండి.
జవాబు:
కాకతీయ రాజ్య ముఖ్య పాలకులు :
కాకతీయ రాజు | పాలన కాలం | ప్రాముఖ్యత |
రెండవ ప్రోలరాజు | క్రీ.శ. 1115-1157 | కాకతీయ పాలన స్వతంత్రముగా ప్రారంభించిన మొదటివాడు |
రుద్రదేవుడు | క్రీ.శ. 1158-1195 | హనుమకొండలో రుద్రేశ్వరాలయము నిర్మించినాడు |
మహాదేవుడు | క్రీ.శ. 1195-1199 | దేవగిరి కోట ముట్టడి సంఘటనలో మరణించినాడు |
గణపతిదేవుడు | క్రీ.శ. 1199-1262 | ఇతని పాలన కాలం స్వర్ణయుగం |
రుద్రమదేవి | క్రీ.శ. 1262-1289 | కాకతీయ మహిళా పాలకురాలు |
ప్రతాపరుద్రుడు | క్రీ.శ. 1289-1323 | చివరి కాకతీయ పాలకుడు |
ప్రశ్న 7.
కాకతీయ రాజులైన రెండవ ప్రోలరాజు, రుద్రదేవుడుల గురించి క్లుప్తంగా వివరించండి.
జవాబు:
రెండవ ప్రోలరాజు (క్రీ.శ. 1116-1157) :
రెండవ ప్రోలరాజు పాలన కాకతీయ చరిత్రలో ముఖ్యమైన మైలురాయి. అతను రెండవ బేతరాజు యొక్క కుమారుడు. చాళుక్యుల ఆధిపత్యాన్ని ఎదిరించి ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరిచాడు. ఈ రాజ్యం ఇతని వారసుల హయాంలో మొత్తం ఆంధ్రా ప్రాంతాన్ని కలుపుకొని ఒక శక్తివంతమైన రాజ్యంగా రూపొందినది. ఇతడు హనుమకొండ నుండి స్వతంత్ర పాలన ప్రారంభించాడు.
రుద్రదేవుడు (క్రీ.శ. 1158-1195) :
రుద్రదేవుని విజయాలు హనుమకొండ శాసనంలో వివరించబడ్డాయి. అతను అనేక పొరుగు రాజులను ఓడించి తన ఆధిపత్యాన్ని గోదావరి ఒడ్డు వరకు విస్తరించాడు. దక్షిణాన రుద్రదేవుడు తెలుగు చోడ మూలానికి చెందిన నలుగురు రాజులను ఓడించాడు. అతను వేంగిపై కూడా దాడి చేశాడు. అతని పాలన చివరి కాలములో దేవగిరి యాదవులతో యుద్ధం జరిగింది. దీని ఫలితంగా ఓటమి చెంది మరణించినాడు. అతను సంస్కృత భాషలో నీతిసారము అనే గ్రంథం రాశాడు. హనుమకొండలో అద్భుతమైన వెయ్యిస్తంభాల ఆలయాన్ని నిర్మించాడు. అతను స్థాపించిన ఓరుగల్లు అతని వారసులకు రాజధానిగా మారింది.
రుద్రదేవుని తరువాత అతని సోదరుడు మహాదేవుడు నాలుగేళ్ల స్వల్పకాలం పాలనను అందించాడు. ఇతను యాదవ రాజ్యంపై దాడిచేసి, దేవగిరి ముట్టడి సమయంలో యాదవరాజుల చేతిలో మరణించాడు.
ప్రశ్న 8.
కాకతీయ పాలకుడైన ‘గణపతిదేవుడు’ పాలన గురించి వివరించండి.
జవాబు:
గణపతి దేవుడు (క్రీ.శ. 1199-1262) :
గణపతి దేవుడు అనుకూల పరిస్థితులలో తన పాలనను ప్రారంభించి నప్పటికీ, అతని పాలనను ఆంధ్ర చరిత్రలో అత్యంత అద్భుతమైన పాలనగా చెప్పవచ్చు. అతని 63 సంవత్సరాల సుదీర్ఘ పాలనలో తెలుగు మాట్లాడే ప్రజలు నివసించే దాదాపు మొత్తం భూమిని తన పరిపాలనలోకి తెచ్చుకున్నాడు. ఆయనకు “మహామండలేశ్వర” అనే బిరుదు కలదు.
కాకతీయ పాలకులలో గణపతి దేవుడు అత్యంత శక్తివంతమైనవాడు. ఇతను విస్తృతమైన సామ్రాజ్యాన్ని నిర్మించాడు. గోదావరి ప్రాంతం నుండి మొదలుకొని చెంగల్పట్టు వరకు మరియు ఎలగందల నుండి సముద్రం వరకు విస్తరించి ఉన్న విశాల సామ్రాజ్యాన్ని నిర్మించినాడు. అతను తీరప్రాంతాలపై దాడి చేసి విజయవాడ మరియు దివిసీమ ద్వీపాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అతను మోటుపల్లి శాసనాన్ని జారీ చేశాడు. ఈ శాసనం ప్రకారం పన్నుల విధింపు, విదేశీ వాణిజ్యం, వివిధ వస్తువులపై పన్ను రేట్లు విధించిన తీరును వివరించాడు. అతను సమర్థ పాలకుడు. వాణిజ్యం మరియు వ్యవసాయాన్ని మెరుగుపరచడానికి చర్యలు తీసుకున్నాడు. జలాశయాలను నిర్మించాడు, నీటిపారుదల కోసం చెరువులు త్రవ్వించాడు. పెద్ద మొత్తంలో అటవీ భూములను సాగులోకి తెచ్చాడు. గణపతి దేవుడు ఆలయ నిర్మాణం, సాహిత్య రచనలను ప్రోత్సహించాడు. అతను ఓరుగల్లు కోట నగర నిర్మాణమును పూర్తి చేశాడు. గణపతి దేవుడు తన కుమార్తెలు మరియు సోదరీమణుల వివాహాలను బలమైన పొరుగు రాజులతో ఏర్పాటు చేయడం ద్వారా ఇతర రాజ్యాలతో తన సంబంధాలను బలపరచుకున్నాడు.
ప్రశ్న 9.
కాకతీయ సామ్రాజ్య వైభవానికి చిహ్నంగా నిలచిన రాణి రుద్రమదేవి పాలనా వైభవాన్ని గురించి తెలియజేయండి.
జవాబు:
రుద్రమ దేవి (క్రీ.శ. 1262-1289) :
క్రీ.శ. 1262లో రుద్రమదేవి పాలన ప్రారంభమైనది. మహిళ పాలనను ఆమోదించలేని సామంత ప్రభువుల తిరుగుబాటులను ఆమె అణిచివేయాల్సి వచ్చింది. కాని బయటి ప్రమాదాలే ఆమెకు ఎక్కువ సమస్యాత్మకంగా నిలిచాయి. యాదవులు, చోళులు, పాండ్యులు మరియు కళింగ గజపతులు ఆమె పాలనను వ్యతిరేకించారు. యాదవ రాజులలో ఒకరైన మహాదేవుడు కాకతీయ రాజ్యంపై దాడి చేశాడు. రుద్రమదేవి అతన్ని ఓడించి శాంతి ఒప్పందం ఏర్పరచుకుంది. నెల్లూరులో రుద్రమదేవి పాలనను వ్యతిరేకించిన కాకతీయ సామంతరాజు అంబదేవుని నుంచి మరో దారుణమైన ఇబ్బంది వచ్చింది. ఆమె తన స్వీయ నేతృత్వంలో పెద్ద సైన్యంతో అతనిపై దండెత్తి, అతన్ని ఓడించి త్రిపురాంతకం మరియు చుట్టుపక్కల ప్రదేశాలను స్వాధీనం చేసుకుంది.
రుద్రమదేవి నిస్సందేహంగా ఆంధ్రా ప్రాంతంలోని గొప్ప పాలకులలో ఒకరు. ఆమె ప్రభుత్వంలో చురుకుగా పాల్గొనడమే కాకుండా, చాలా సందర్భాలలో సైన్యాన్ని స్వయముగా నడిపించింది. యుద్ధ విద్యలలో ఆమె చిన్నతనము నుంచి మంచి శిక్షణ పొందడం మరియు పరిపాలనా నైపుణ్యాలలో ఆమె పొందిన అనుభవము పెద్ద సైన్యాన్ని స్వయముగా నడిపించడానికి మరియు మంచి పాలన అందించడానికి సహాయపడ్డాయి. రుద్రమదేవి ఆస్థానాన్ని సందర్శించిన ఇటాలియన్ యాత్రికుడు మార్కోపోలో ఆమె పరిపాలనా సామర్థ్యాన్ని ప్రశంసించినాడు. అతని రచనల ప్రకారం ఆంధ్రదేశం విలువైన రాళ్ళు, ఆభరణాలు మరియు వజ్రాల వాణిజ్యానికి ప్రసిద్ధి చెందింది.
రుద్రమదేవి తన తండ్రి గణపతి దేవునిచే ప్రారంభించబడిన ఓరుగల్లు కోట నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఆమె వ్యవసాయం కోసం చెరువులను తవ్వించినది. దేవాలయ నిర్మాణాలను ప్రోత్సహించింది. కళలు మరియు విదేశీ వాణిజ్యాన్ని ఆమె తన పాలనా కాలంలో అభివృద్ధి చేసింది. ఆమె ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న నిడదవోలు పాలకుడు చాళుక్య వీరభద్రుడుని వివాహం చేసుకుంది. రుద్రమదేవి తన మనవడు ప్రతాపరుద్రుని తదుపరి వారసుడిగా ప్రకటించింది.
ప్రశ్న 10.
కాకతీయుల కాలములో భూమి రకాలు ఏవి?
జవాబు:
కాకతీయుల కాలములో భూమి రకాలు రాచ పొలం – రాజుకి చెందిన ప్రభుత్వ భూమి వెలిపొలం (వెలిచేను) – నీటి వసతి గలిగిన భూమి తోట పొలం (తోట భూమి) – వివిధ రకాల పండ్ల చెట్లతో కూడిన భూమి
ప్రశ్న 11.
కాకతీయుల కాలం నాటి మతం, సాహిత్యాభివృద్ధి గురించి వివరించండి.
జవాబు:
మతం :
కాకతీయుల కాలంలో శైవ మతం బాగా ప్రసిద్ది చెందింది. దీనితో పాటుగా వైష్ణవం, వీరశైవం కూడా ప్రసిద్ధి చెందాయి. వైష్ణవ మతం కూడా ఆచరణలో ఉంది. వీరశైవ అనుచరులలో ఒకరైన మల్లికార్జున పండితారాధ్యుడు, శివతత్వసారము అనే గ్రంథాన్ని రచించాడు. ఈయన కాకతీయ కాలానికి చెందినవాడు.
సాహిత్యం :
కాకతీయ పాలకులు సంస్కృతానికి తమ ప్రోత్సాహాన్ని అందించారు. అనేక మంది ప్రముఖ సంస్కృత . రచయితలు మరియు కవులు వారి ఆస్థానంలో ఉన్నారు. తెలుగు సాహిత్యం కూడా వారి పాలన కాలంలో వృద్ధి చెందింది. బసవపురాణాన్ని పాల్కురికి సోమనాథుడు, కుమార సంభవం అనే గ్రంథాన్ని నన్నెచోడుడు రచించాడు. విద్యానాథుడు సంస్కృతంలో ప్రతాప రుద్రీయమును వ్రాశాడు. గీత రత్నావళి, నృత్య రత్నావళిని జయాపసేనాని సంస్కృతంలో వ్రాయగా వల్లభ రాయడు అనునతడు క్రీడాభిరామమును తెలుగులో వ్రాశాడు. ఈ సాహిత్య రచనలు కాకతీయ కాలం నాటి భాషా విషయాలను సుసంపన్నం చేశాయి.
ప్రశ్న 12.
‘పేరిణి’ నాట్యం గురించి నీకేమి తెలియును?
జవాబు:
పేరిణి నాట్యం :
ఇది కాకతీయ కాలంలో ప్రసిద్ధ నాట్యం ఇది యుద్ధ సమయంలో ప్రదర్శించబడేది. ఇది చాలా ధైర్యంగా యుద్ధంలో చురుకుగా పాల్గొనడానికి సైనికులను ప్రేరేపించింది. పద్మశ్రీ నటరాజ రామకృష్ణ ఈ నృత్యంలో ప్రఖ్యాతిగాంచారు.
ప్రశ్న 13.
కాకతీయ రాజవంశం ఏ విధంగా పతనం చెందింది?
జవాబు:
కాకతీయ రాజవంశం ముగింపు: రెండవ ప్రతాపరుద్రుడి పాలనా కాలంలో ఢిల్లీ సుల్తానులు ఓరుగల్లుపై అనేకమార్లు దండయాత్రలు చేసారు. చివరికి క్రీ.శ. 1323వ సంవత్సరంలో ఉలుగ్ ఖాన్ నాయకత్వంలో ఢిల్లీ సుల్తానులు కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. ప్రతాపరుద్రుడిని ఖైదు చేసారు. ఈ అవమానాన్ని భరించలేక ప్రతాప రుద్రుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విధంగా కాకతీయ రాజ్య వైభవం అంతరించిపోయింది. కాకతీయ రాజ్యం పతనమైన తరువాత ఆంధ్ర తీరములో, అద్దంకి, కొండవీడు, రాజమండ్రి, కందుకూరు మొదలగు చిన్న చిన్న రాజ్యాలు ఆవిర్భవించాయి.
ప్రశ్న 14.
ముసునూరి నాయకుల గురించి వివరణాత్మకంగా తెల్పండి.
జవాబు:
ముసునూరి నాయకులు :
ప్రోలయ నాయక : విలస శాసనమును అనుసరించి ఢిల్లీ సుల్తానుల దండయాత్రల వల్ల కాకతీయులు తమ సామ్రాజ్యాన్ని కోల్పోయారు. ఈ దాడుల కారణంగా స్థానిక కాకతీయ సామంతులు ఆయా ప్రాంతాలలో అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారిలో ఒకరైన ప్రోలయ నాయకుడు రేకపల్లె రాజధానిగా అధికారంలోకి వచ్చాడు. ఈ ప్రాంతం పాపికొండల సమీపంలో భద్రాచలం అటవీ మధ్య ఉన్న ఇరుకైన శబరి నది లోయలో ఉందని, కొండలు మరియు అడవులను కలిగి ఉండటంతో ముస్లిం దండయాత్రల నుండి వ్యూహాత్మకంగా రక్షించబడింది. ఢిల్లీ సుల్తానులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటంలో గిరిజన వంశపు కొండారెడ్డి తెగవారు ప్రోలయ నాయకులకు సహాయపడ్డారు.
ముసునూరి కాపయ నాయక (క్రీ.శ. 1335-1368) :
ముసునూరి కాపయ నాయకుడు తన సోదరుడు ప్రోలయ నాయకుని తరువాత సింహాసనం అధిరోహించాడు. క్రీ.శ.1336లో తుగ్లక్ పాలనను వరంగల్ నుండి తరిమికొట్టడానికి తిరుగుబాటును నడిపించాడు. ఐతే ఈ విజయం ఎక్కువ కాలం నిలువలేదు. ఆంధ్రాలోని అనేక ప్రాంతాలలో స్థానికంగా చిన్నరాజ్యాలు కొండవీడు, రాజమండ్రి, కందుకూరు మొదలైన చిన్న రాజ్యాలు ఈ కాలంలో ఏర్పడ్డాయి.
ప్రశ్న 15.
రుద్రమదేవి పాలనా కాలములో బొల్లినాయకుడు వేయించిన శాసనములోని కొంత భాగము : “క్రీ.శ. 1270 సం. సంక్రాంతి పర్వదిన సందర్భముగా, కాకతీయ రుద్రదేవ మహారాజు ప్రవేశద్వార సంరక్షకుడైన బొల్లి నాయకుడు, 10 కొలతలు గల భూమిని కళ్యాణ కేశవ దేవాలయ సేవకులకు కరంజ గ్రామములో తన స్వీయ నాయంకర పరిధిలోని భూమిని తన రాజైన రుద్రదేవ మహారాజుల గౌరవార్థం దానమిచ్చాడు.” ఈ శాసనంలో రుద్రదేవ మహారాజుగా పిలువబడిన వారెవరు?
జవాబు:
ఈ శాసనంలో రుద్రదేవ మహారాజుగా పిలువబడినది “కాకతీయ రాణి రుద్రమ దేవి”.
మీకు తెలుసా?
7th Class Social Textbook Page No. 129
1. చరిత్రకారుడు : మానవులకు సంబంధించిన గడిచిన సంఘటనలను గురించి అధ్యయనం చేసి వ్రాసే వ్యక్తి. 2. పురావస్తు శాస్త్రవేత్త : పురాతన భవనాలు, అవశేషాలు, శిల్పం, శాసనాలు మరియు పురావస్తు త్రవ్వకాల గురించి అధ్యయనం చేసే వ్యక్తి.
7th Class Social Textbook Page No. 131
కాకతీయులకు ఆ పేరు ఎలా వచ్చింది ? : “కాకతి” అనే దేవతను ఆరాధించిన కారణంగా, వీరికి కాకతీయులు అను పేరు వచ్చింది. ఆమె “దుర్గాదేవి” యొక్క మరొక రూపం. వీరు కాకతి అనే కోటకు సంరక్షకులుగా ఉండేవారు. కాబట్టి వీరిని కాకతీయులు అంటారని కొందరి భావన. మరికొందరి వాదన ప్రకారం ఒకప్పుడు చోళులు పరిపాలించిన కాకతి పురానికి చెందిన వారే కాకతీయులు.
1. త్రిలింగదేశం :
కాళేశ్వరము (తెలంగాణ), శ్రీశైలము (రాయలసీమ), ద్రాక్షారామం (తీర ఆంధ్ర ప్రాంతము)లను కలిపి త్రిలింగదేశం అంటారు.
2. ఓరుగల్లు ప్రస్తుత పేరు : వరంగల్, ప్రాచీన నామం : ఏక శిలా నగరం .
7th Class Social Textbook Page No. 135
అన్నపక్షి అనే సంస్కృతపదం పౌరాణికపక్షి హంసను సూచిస్తుంది. ఇది కాకతీయ కళాతోరణం పైన రెండు వైపులా ఉంచబడింది. Page No. 137 రుద్రమదేవికి గల ఇతర పేర్లు రుద్రమాంబ, రుద్రదేవ మహారాజు
7th Class Social Textbook Page No. 137
రుద్రమదేవి పాలనా కాలములో బొల్లినాయకుడు వేయించిన శాసనములోని కొంత భాగము : “క్రీ.శ. 1270 సం. సంక్రాంతి పర్వదిన సందర్భముగా, కాకతీయ రుద్రదేవ మహారాజు ప్రవేశద్వార సంరక్షకుడైన బొల్లి నాయకుడు, పది కొలతల భూమిని కళ్యాణ కేశవ దేవాలయ సేవకులకు కరంజ గ్రామములో తన స్వీయ నాయంకర పరిధిలోని . భూమిని తన రాజైన రుద్రదేవ మహారాజుల గౌరవార్థం దానమిచ్చాడు.”
7th Class Social Textbook Page No. 139
కాకతీయుల కాలములో భూమి రకాలు
- రాచ పొలం – రాజుకి చెందిన ప్రభుత్వ భూమి
- వెలిపొలం (వెలిచేను) – నీటి వసతి గలిగిన భూమి
- తోట పొలం (తోట భూమి) – వివిధ రకాల పండ్ల చెట్లతో కూడిన భూమి
7th Class Social Textbook Page No. 141
ఇతర పన్నులు దరిశనం, అప్పనం, ఉపకృతి అను పన్నులు నేరుగా చక్రవర్తికి చెల్లించవలసిన పన్నులు.
పేరిణి నాట్యం :
ఇది కాకతీయ కాలంలో ప్రసిద్ధ నాట్యం . ఇది యుద్ధ సమయంలో ప్రదర్శించబడేది. ఇది చాలా ధైర్యంగా యుద్ధంలో చురుకుగా పాల్గొనడానికి సైనికులను ప్రేరేపించింది. పద్మశ్రీ నటరాజ రామకృష్ణ ఈ నృత్యంలో ప్రఖ్యాతిగాంచారు.
7th Class Social Textbook Page No. 143
వెయ్యి స్తంభాల ఆలయం మరియు రామప్ప దేవాలయాలను ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా యునెస్కో గుర్తించింది.