Practice the AP 7th Class Social Bits with Answers 8th Lesson భక్తి – సూఫీ on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 7th Class Social Bits 8th Lesson భక్తి – సూఫీ
I. బహుళైచ్ఛిక ప్రశ్నలు
కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.
1. భక్తి ఉద్యమాన్ని ప్రారంభించిన వారు
A) ఆదిశంకరాచార్యులు
B) రామానుజాచార్యులు
C) మధ్వాచార్యులు
D) వల్లభాచార్యులు
జవాబు:
A) ఆదిశంకరాచార్యులు
2. ఆదిశంకరాచార్యులు ప్రబోధించిన సిద్ధాంతం.
A) ద్వైతము
B) అద్వైతము
C) విశిష్టాద్వైతము
D) శుద్ధ అద్వైతము
జవాబు:
B) అద్వైతము
3. ఆదిశంకరాచార్యుల వారి రచన కానిది.
A) వివేక చూడామణి
B) సౌందర్యలహరి
C) శ్రీభాష్యం
D) శివానందలహరి
జవాబు:
C) శ్రీభాష్యం
4. రామానుజాచార్యులు దక్షిణ భారతదేశంలోని ఈ ప్రాంతంలో జన్మించారు
A) కాలడి
B) తల్వండి
C) తంజావూరు
D) శ్రీపెరంబుదూర్
జవాబు:
D) శ్రీపెరంబుదూర్
5. ఈ సిద్ధాంతం ప్రకారం “ఈ ప్రపంచం అనేది భ్రమ కాదు వాస్తవం. బ్రహ్మ, ఆత్మ వస్తువులకు ప్రకృతిలో అస్థిత్వం కలదు.”
A) ద్వైతము
B) అద్వైతము
C) విశిష్టాద్వైతము
D) శుద్ధ అద్వైతము
జవాబు:
A) ద్వైతము
6. క్రింది వారిలో తెలుగు ప్రాంతానికి చెందిన వైష్ణవ సన్యాసి
A) రామానుజాచార్యులు
B) వల్లభాచార్యులు
C) రామానందుడు
D) చైతన్య మహాప్రభు
జవాబు:
B) వల్లభాచార్యులు
7. వీర శైవ సంప్రదాయాన్ని ప్రచారం చేసినవారు
A) ఆదిశంకరాచార్యులు
B) సంత్ రవిదాస్
C) బసవేశ్వరుడు
D) శంకర దేవుడు
జవాబు:
C) బసవేశ్వరుడు
8. కబీర్ వీరి శిష్యుడు
A) సంత్ రవిదాస్
B) శంకర దేవుడు
C) చైతన్య మహాప్రభు
D) రామానందుడు
జవాబు:
D) రామానందుడు
9. హిందూ-ముస్లింల సమైక్యత కొరకు ప్రయత్నించిన మొదటి సాధువు.
A) కబీర్
B) గురునానక్
C) చైతన్య మహాప్రభు
D) నామ్ దేవ్
జవాబు:
A) కబీర్
10. “హరిలో అందరూ, అందరిలోనూ హరి” అనేది వీరి బోధనల సారాంశం.
A) కబీర్
B) సంత్ రవిదాస్
C) మీరాబాయి
D) జ్ఞానేశ్వర్
జవాబు:
B) సంత్ రవిదాస్
11. మీరాబాయి వీరి శిష్యురాలు.
A)కబీర్
B) చైతన్య మహాప్రభు
C) సంత్ రవిదాస్
D) రామానందుడు
జవాబు:
C) సంత్ రవిదాస్
12. శ్రీ గౌరంగ అని వీరిని పిలుస్తారు
A) రామానందుడు
B) సంత్ రవిదాస్
C) శంకరదేవుడు
D) చైతన్య మహాప్రభు
జవాబు:
D) చైతన్య మహాప్రభు
13. సాంఘిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజలు సమావేశమవడానికి సత్రీలు లేక మఠములను ప్రారంభించినవారు.
A) శంకరదేవుడు
B) గురునానక్
C) సంత్ రవిదాస్
D) నామ్ దేవ్
జవాబు:
A) శంకరదేవుడు
14. సిక్కు మత స్థాపకుడు.
A) గురుతేజ్ బహదూర్
B) గురునానక్
C) గురు అంగద్
D) గురు అర్జున్ సింగ్
జవాబు:
B) గురునానక్
15. ‘భగవత్ దీపిక’ పేరుతో భగవద్గీతకు వ్యాఖ్యానాన్ని రచించినవారు.
A) నామ్ దేవ్
B) ఏకనాథుడు
C) జ్ఞానేశ్వరుడు
D) కబీర్
జవాబు:
C) జ్ఞానేశ్వరుడు
16. రామాయణాన్ని తెలుగులో వ్రాసిన కవయిత్రి.
A) మీరాబాయి
B) మొల్లమాంబ
C) గార్టీ
D) మైత్రేయి
జవాబు:
B) మొల్లమాంబ
17. “పద కవితా పితామహుడు”గా పేరు గాంచినవారు
A) కబీర్
B) నామ్ దేవ్
C) మొల్లమాంబ
D) అన్నమయ్య
జవాబు:
D) అన్నమయ్య
18. సూఫీ అనే పదం ‘సాఫ్’ అనే ఈ భాషా పదం నుంచి గ్రహించబడింది.
A) పర్షియన్
B) అరబిక్
C) ఉర్దూ
D) రోమన్
జవాబు:
B) అరబిక్
19. చిస్తీ పద్ధతి వీరి ద్వారా స్థాపించబడింది.
A) ఫరీదుద్దీన్-గంజ్-ఐ-షకర్
B) ఖ్వాజా పీర్ మహ్మద్
C) ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ
D) నిజాముద్దీన్ ఔలియా
జవాబు:
C) ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ
20. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ ఈ సంవత్సరంలో భారతదేశాన్ని సందర్శించారు.
A) క్రీ.శ. 1143
B) క్రీ.శ. 1190
C) క్రీ.శ. 1191
D) క్రీ. శ. 1192
జవాబు:
D) క్రీ. శ. 1192
21. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ వారి దర్గా ఇక్కడ ఉన్నది
A) అజ్మీర్
B) గ్వాలియర్
C) నిజాముద్దీన్ (ఢిల్లీ)
D) ఆగ్రా
జవాబు:
A) అజ్మీర్
22. సమర్థ రామ్ దాస్ స్వామి ప్రేరణతో ఏర్పడిన సామ్రాజ్యం
A) విజయనగర సామ్రాజ్యం
B) మరాఠా సామ్రాజ్యం
C) కాకతీయ సామ్రాజ్యం
D) పైవన్నీ
జవాబు:
B) మరాఠా సామ్రాజ్యం
II. ఖాళీలను పూరింపుము
1. భక్తి అంటే దేవుని యందు …………………………..
2. సగుణ భక్తి అనగా భగవంతుని ………….. లో పూజించడం.
3. నిర్గుణ భక్తి అనగా భగవంతుని ………….. గా పూజించడం.
4. ఆదిశంకరాచార్యులు …………….. రాష్ట్రంలోని కాలడిలో జన్మించారు.
5. భారత సనాతన ధర్మంలో ……………… ని గొప్ప మత సంస్కర్తగా భావిస్తారు.
6. రామానుజాచార్యులు ……………… సం||లో జన్మించారు.
7. రామానుజాచార్యులు …………… అనే పేరుతో బ్రహ్మ సూత్రాలను వ్యాఖ్యానించారు.
8. ద్వైతమనగా ……………… అని అర్ధం.
9. ద్వైత సిద్ధాంతాన్ని …………….. ప్రాచుర్యంలోకి తెచ్చారు.
10. వల్లభాచార్యుని బోధనలను ……………. మార్గంగా చెప్పవచ్చును.
11. వల్లభాచార్యుని ఆలోచనా విధానాన్ని …………. అంటారు.
12. బ్రహ్మ సూత్రాలను …………….. రచించాడు.
13. బసవేశ్వరుడు …………… రాష్ట్రానికి చెందినవారు.
14. బసవేశ్వరుని రచనలను …………….. అంటారు.
15. “మానవులంతా సమానమే, కులం లేదా ఉపకులం లేదు” అనే ప్రసిద్ధ సూక్తి ……………. చెప్పారు.
16. రామానందులు ……………… లో జన్మించారు.
17. రామానందులు ……………. భాషలో బోధనలను చేశారు.
18. “నీరు” అనే ఇస్లాం చేనేతకారుని ఆదరణలో …………… పెరిగారు.
19. సంత్ రవిదాస్ ………….. లో నివసించారు.
20. మీరాబాయి బాల్యం నుంచి …………. కి భక్తురాలు.
21. ……….. భజనలు జనబాహుళ్యంలో చిరస్థాయిగా నిలిచిపోయాయి.
22. మీరాబాయి భజనలు వినడానికి అన్ని మతాల సాధువులు …………. ప్రాంతాన్ని సందర్శించేవారు.
23. చైతన్య మహాప్రభు ……………… లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు.
24. శంకర దేవుడు …………… ప్రాంత సాధువు.
25. నామ్ ఘలను ……………… ప్రారంభించాడు.
26. గురునానక్ …………… బోధనలను విశేషంగా అభిమానించాడు.
27. గురునానక్ ……………. గ్రామంలో జన్మించాడు.
28. గురునానక్ ………….. సంవత్సరంలో జన్మించాడు.
29. జ్ఞానేశ్వర్ ……………. భాషలో బోధనలు చేశాడు.
30. మొల్ల ………….. కి సమకాలీకురాలని పరిశీలకుల అభిప్రాయం.
31. అన్నమయ్య ……………. గ్రామంలో జన్మించాడు.
32. అన్నమయ్య శ్రీవేంకటేశ్వరుని కీర్తిస్తూ ………… వేల సంకీర్తనలు రాశారు.
33. తాళ్ళపాక ………………. జిల్లాలో కలదు.
34. సాఫ్ అనే అరబిక్ పదంనకు అర్థం …………
35. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ …………. సంవత్సరంలో జన్మించారు.
36. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తే ………. లో జన్మించారు.
37. ఫరీదుద్దీన్-గంజ్-ఐ-షకర్ వారిని ……………. అని కూడా పిలుస్తారు.
38. తిరుప్పావైని ………………… రచించారు.
జవాబు:
- ప్రేమ
- ఆకారం
- నిరాకారం
- కేరళ
- ఆదిశంకరాచార్యులు
- క్రీ. శ. 1017
- శ్రీభాష్యం
- రెండు
- మధ్వాచార్యులు
- పుష్టి
- శుద్ధ అద్వైతం
- వ్యాసుడు
- కర్ణాటక
- వచనములు
- బసవేశ్వరుడు
- అలహాబాద్
- హిందీ
- కబీర్
- బెనారస్
- శ్రీకృష్ణుని
- మీరాబాయి
- చిత్తోడ్
- పూరీ
- అస్సాం
- శంకరదేవుడు
- కబీర్
- తల్వండి
- క్రీ.శ. 1469
- మరాఠీ
- శ్రీకృష్ణదేవరాయల
- తాళ్ళపాక
- 32
- కడప
- స్వచ్ఛత లేదా శుభ్రత
- క్రీ.శ. 1143
- సీయిస్థాన్
- బాబా ఫరీద్
- గోదాదేవి
III. కింది వానిని జతపరుచుము
1.
Group-A | Group-B |
i) ద్వైతము | a) ఆదిశంకరాచార్యులు |
ii) అద్వైతము | b) రామానుజాచార్యులు |
iii) శుద్ధ అద్వైతము | c) మధ్వాచార్యులు |
iv) విశిష్టాద్వైతము | d) వల్లభాచార్యులు |
జవాబు:
Group-A | Group-B |
i) ద్వైతము | c) మధ్వాచార్యులు |
ii) అద్వైతము | a) ఆదిశంకరాచార్యులు |
iii) శుద్ధ అద్వైతము | d) వల్లభాచార్యులు |
iv) విశిష్టాద్వైతము | b) రామానుజాచార్యులు |
2.
Group-A | Group-B |
i) ఉత్తరం | a) బదరీ |
ii) దక్షిణం | b) శృంగేరి |
iii) తూర్పు | c) పూరీ |
iv) పడమర | d) ద్వారక |
జవాబు:
Group-A | Group-B |
i) ఉత్తరం | a) బదరీ |
ii) దక్షిణం | b) శృంగేరి |
iii) తూర్పు | c) పూరీ |
iv) పడమర | d) ద్వారక |
3.
Group-A | Group-B |
i) వివేక చూడామణి | a) జ్ఞానేశ్వర్ |
ii) శ్రీభాష్యం | b) బసవేశ్వరుడు |
iii) వచనములు | c) రామానుజాచార్యులు |
iv) జ్ఞానేశ్వరి | d) ఆదిశంకరాచార్యులు |
జవాబు:
Group-A | Group-B |
i) వివేక చూడామణి | d) ఆదిశంకరాచార్యులు |
ii) శ్రీభాష్యం | c) రామానుజాచార్యులు |
iii) వచనములు | b) బసవేశ్వరుడు |
iv) జ్ఞానేశ్వరి | a) జ్ఞానేశ్వర్ |
4.
Group-A | Group-B |
i) చైతన్యుడు | a) బెంగాల్, ప్రాంతం |
ii) శంకర దేవుడు | b) అస్సాం ప్రాంతం |
iii) బసవేశ్వరుడు | c) కర్ణాటక ప్రాంతం |
iv) అన్నమయ్య | d) తెలుగు ప్రాంతం |
v) గురునానక్ | e) పంజాబు ప్రాంతం |
జవాబు:
Group-A | Group-B |
i) చైతన్యుడు | a) బెంగాల్, ప్రాంతం |
ii) శంకర దేవుడు | b) అస్సాం ప్రాంతం |
iii) బసవేశ్వరుడు | c) కర్ణాటక ప్రాంతం |
iv) అన్నమయ్య | d) తెలుగు ప్రాంతం |
v) గురునానక్ | e) పంజాబు ప్రాంతం |