Practice the AP 7th Class Social Bits with Answers 12th Lesson మన పరిసరాలలో ఉన్న మార్కెట్లు on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 7th Class Social Bits 12th Lesson మన పరిసరాలలో ఉన్న మార్కెట్లు
I. బహుళైచ్ఛిక ప్రశ్నలు
కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.
1. క్రింది వానిలో భౌతిక మార్కెటు కానిది.
A) స్థానిక మార్కెట్
B) జాతీయ మార్కెట్
C) ఇ-కామర్స్ మార్కెట్
D) అంతర్జాతీయ మార్కెట్
జవాబు:
C) ఇ-కామర్స్ మార్కెట్
2. అంతర్జాతీయ మార్కెటు కల వస్తువు కానిది.
A) ఆభరణాలు
B) గోధుమలు
C) పెట్రోలియం
D) బంగారం
జవాబు:
B) గోధుమలు
3. పనిచేసే విధానం ఆధారంగా భౌతిక మార్కెట్.
A) పొరుగు మార్కెట్
B) వారాంతపు సంత
C) షాపింగ్ మాల్స్
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
4. ఋణ సౌకర్యాన్ని వినియోగించుకుని వస్తువులు కొనుగోలు చేయుటకు ఆర్థిక సంస్థలు జారీ చేసే కార్డు.
A) క్రెడిట్ కార్డ్
B) డెబిట్ కార్డ్
C) గిఫ్ట్ కార్డ్
D) మాస్టర్ కార్డ్
జవాబు:
A) క్రెడిట్ కార్డ్
5. ఇక్కడ వస్తువుల ధరలు తక్కువగా ఉంటాయి
A) పొరుగు మార్కెట్లో
B) షాపింగ్ కాంప్లెక్స్ లో
C) ఫ్లోటింగ్ మార్కెట్లో
D) వారాంతపు సంతలో
జవాబు:
D) వారాంతపు సంతలో
6. రైతు బజారుల వల్ల ఎవరికి లబ్ది చేకూరుతుంది?
A) రైతులకు
B) వినియోగదారులకు
C) A & B ఇద్దరికీ
D) టోకు వర్తకులకు
జవాబు:
C) A & B ఇద్దరికీ
7. రైతు బజారు యొక్క ప్రయోజనం కానిది.
A) రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది
B) మధ్యవర్తులకు లబ్ధి చేకూరుతుంది
C) తాజా సరుకు దొరుకుతుంది
D) నాణ్యమైన వస్తువులు దొరుకుతాయి
జవాబు:
B) మధ్యవర్తులకు లబ్ధి చేకూరుతుంది
8. శ్రీనగర్ లో ఫ్లోటింగ్ మార్కెట్ పై వ్యాపారం చేస్తారు. అయితే స్థానిక భాషలో ‘షికారా’ అని వీటినంటారు.
A) కూరగాయలను
B) కుంకుమపువ్వును
C) చెక్క బొమ్మలను
D) పడవలను
జవాబు:
D) పడవలను
9. ఈ-మార్కెట్ కు తప్పనిసరిగా ఉండాల్సినది/వి.
A) కంప్యూటర్
B) ఇంటర్నెట్
C) విద్యుత్ సౌకర్యం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
10. కొనుగోలుదారులు మరియు అమ్మకందారులను అంతర్జాలం ద్వారా వస్తువులను కొనడానికి లేదా అమ్మడానికి అవకాశాన్ని కల్పించే మార్కెట్.
A) అంతర్జాతీయ మార్కెట్
B) షాపింగ్ మాల్
C) ఈ-కామర్స్
D) పైవన్నీ
జవాబు:
C) ఈ-కామర్స్
11. వినియోగ వస్తువుల మార్కెటింగ్ మార్గాలలో ఈ మార్గంలో వినియోగదారునికి వస్తువులు తక్కువ ధరకు లభిస్తాయి.
A) టోకు మార్గం
B) ప్రత్యక్ష మార్గం
C) చిల్లర మార్గం
D) ఏజెంట్ మార్గం
జవాబు:
B) ప్రత్యక్ష మార్గం
12. క్రింది వానిలో కుటీర పరిశ్రమకు ఉదాహరణ కానిది.
A) అగరుబత్తుల తయారీ
B) చెక్కబొమ్మల తయారీ
C) కలంకారీ అద్దకం
D) సిమెంట్ పరిశ్రమ
జవాబు:
D) సిమెంట్ పరిశ్రమ
13. జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమీషన్ (ఎసిడిఆర్ సి) యొక్క ప్రధాన కార్యాలయం ఇక్కడ కలదు
A) ముంబయి
B) ఢిల్లీ
C) కోల్ కత్తా
D) హైద్రాబాద్
జవాబు:
B) ఢిల్లీ
14. భారతదేశంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం ఈ రోజున జరుపుకుంటాం.
A) డిసెంబరు 24
B) జనవరి 24
C) నవంబరు 24
D) అక్టోబర్ 24
జవాబు:
A) డిసెంబరు 24
15. ఈ-మార్కెట్లో డబ్బులు చెల్లించు మార్గం కానిది.
A) క్రెడిట్ కార్డు
B) డెబిట్ కార్డు
C) నెట్ బ్యాంకింగ్
D) ప్రత్యక్షంగా డబ్బులు చెల్లించటం
జవాబు:
D) ప్రత్యక్షంగా డబ్బులు చెల్లించటం
II. ఖాళీలను పూరింపుము
1. కొనుగోలు చేసే వినియోగదారులు మరియు వాటిని విక్రయించే దుకాణాలు ఉండే ప్రాంతాన్ని ……………….. అంటారు.
2. స్థానికంగా ఒక నిర్ణీత ప్రాంతానికి పరిమితమైతే వాటిని ………….. మార్కెట్లు అంటారు.
3. ప్రతి వారం ఒక నిర్దిష్టమైన రోజున సంత జరిగితే వానిని ……….. సంతలంటారు.
4. వారాంతపు సంతలలో …………… చౌకగా లభిస్తాయి.
5. రైతు బజారులు …………… సంవత్సరంలో ప్రారంభించారు.
6. పట్టణ ప్రాంతాలలో బహుళ అంతస్తుల భవనాలలో ఉండే దుకాణాలను …………. అంటారు.
7. ఒకే ప్రాంగణంలలో అన్ని రకాల వస్తువులను విక్రయించే దుకాణాలుంటే వాటిని ………. అంటారు.
8. ఫ్లోటింగ్ మార్కెట్ ……………. లో కలదు.
9. ఇంటి నుంచి బయటకు వెళ్ళకుండానే వస్తువులు కొనుగోలు చేయగల మార్కెట్ ………………
10. ఇంటి వద్దే ఉత్పత్తి చేయు పరిశ్రమలు ………
11. తన వ్యక్తిగత ఉపయోగం కోసం వస్తువులు లేదా సేవలను కొనుగోలు చేసే వ్యక్తి …………..
12. వినియోగదారుల రక్షణ చట్టం …………… తేదీన ఆమోదించబడింది.
13. వినియోగదారుల హెల్ప్ లైన్ నెంబర్ …………..
జవాబు:
- మార్కెట్
- స్థానిక
- వారాంతపు
- సరుకులు
- 1999
- షాపింగ్ మాల్స్
- షాపింగ్ కాంప్లెక్స్
- శ్రీనగర్
- ఆన్ లైన్ మార్కెట్
- కుటీర పరిశ్రమలు
- వినియోగదారుడు
- ఆగస్టు 9, 2019
- 1800-114000 లేదా 14404
III. కింది వానిని జతపరుచుము
1.
Group-A | Group-B |
i) 1999 | a) షాపింగ్ మాల్స్ |
ii) 1986 | b) ఎన్.సి.ఆర్.డి.సి |
iii) 1988 | c) వినియోగదారుల రక్షణ చట్టం |
iv) బ్రాండ్లు | d) రైతు బజారు |
జవాబు:
Group-A | Group-B |
i) 1999 | d) రైతు బజారు |
ii) 1986 | c) వినియోగదారుల రక్షణ చట్టం |
iii) 1988 | b) ఎన్.సి.ఆర్.డి.సి |
iv) బ్రాండ్లు | a) షాపింగ్ మాల్స్ |
2.
Group-A | Group-B |
i) అమెజాన్ | a) ఈ-మార్కెట్ |
ii) ఫ్లోటింగ్ మార్కెట్ | b) దాల్ సరస్సు |
iii) పెట్రోలియం | c) అంతర్జాతీయ మార్కెట్ |
iv) సంత | d) వారంలో నిర్దిష్టమైన ఒక రోజు |
జవాబు:
Group-A | Group-B |
i) అమెజాన్ | a) ఈ-మార్కెట్ |
ii) ఫ్లోటింగ్ మార్కెట్ | b) దాల్ సరస్సు |
iii) పెట్రోలియం | c) అంతర్జాతీయ మార్కెట్ |
iv) సంత | d) వారంలో నిర్దిష్టమైన ఒక రోజు |