Practice the AP 7th Class Social Bits with Answers 11th Lesson రహదారి భద్రత on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 7th Class Social Bits 11th Lesson రహదారి భద్రత
I. బహుళైచ్ఛిక ప్రశ్నలు
కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.
1. భారతదేశంలో రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం ఈ నెలలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తుంది.
A) జనవరి
B) ఫిబ్రవరి
C) మార్చి
D) ఏప్రిల్
జవాబు:
A) జనవరి
2. ట్రాఫిక్ గుర్తులు
A) తప్పనిసరిగా పాటించవలసిన గుర్తులు
B) సమాచార గుర్తులు
C) హెచ్చరిక గుర్తులు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
3. సంకేతం దీనిని తెలియజేస్తుంది.
A) ఆగుము
B) ఒక వైపు దారి
C) దారి ఇవ్వండి
D) దారి లేదు
జవాబు:
C) దారి ఇవ్వండి
4. సంకేతం దీని గురించి సమాచారం ఇస్తుంది.
A) హాస్పిటల్
B) బ్లడ్ బ్యాంక్
C) విశ్రాంతి స్థలం
D) ప్రథమ చికిత్సా కేంద్రం
జవాబు:
D) ప్రథమ చికిత్సా కేంద్రం
5. సంకేతం దీనిని గురించి హెచ్చరిస్తుంది.
A) పాఠశాల ప్రాంతం
B) పారిశ్రామిక ప్రాంతం
C) పాదచారుల దారి
D) విమానాశ్రయం
జవాబు:
C) పాదచారుల దారి
6. వాహనాల రద్దీ పెరగడానికి ప్రధాన కారణం
A) జనాభా పెరుగుదల
B) పారిశ్రామికీకరణ
C) నగరీకరణ, గ్లోబలైజేషన్
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
7. రోడ్డును ఉపయోగించే వారందరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించడం
A) క్రమబద్ధీకరణ
B) పారిశ్రామికీకరణ
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
A) క్రమబద్ధీకరణ
8. ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళే వాటిని ఈ విధంగా పిలుస్తారు.
A) ట్రాఫిక్
B) సరుకులు
C) నియంత్రణ
D) ఏదీకాదు
జవాబు:
A) ట్రాఫిక్
9. ట్రాఫిక్ నియమ నిబంధనలు సరళంగా, స్పష్టంగా వివరించి తెలియజేయడాన్ని ఈ విధంగా పిలుస్తారు.
A) ట్రాఫిక్
B) ట్రాఫిక్ విద్య
C) ట్రాఫిక్ నియమాలు
D) ట్రాఫిక్ నిబంధనలు
జవాబు:
B) ట్రాఫిక్ విద్య
10. ఈ వయస్సు వారు ఎక్కువగా ప్రమాదాలకు గురౌతున్నారు.
A) 20 – 25
B) 25 – 35
C) 30 – 35
D) 35 – 40
జవాబు:
B) 25 – 35
11. ఏమి లేకుండా వాహనాలను నడపరాదు?
A) డ్రైవింగ్ లైసెన్స్
B) హెల్మెట్
C) రేషన్ కార్డు
D) ఆధార్ కార్డు
జవాబు:
A) డ్రైవింగ్ లైసెన్స్
12. లైసెన్స్ పొందటానికి ఈ పరీక్షలకు గురి కావలసి ఉంటుంది.
A) లెర్నర్ టెస్ట్
B) వర్ణ అంధత్వ పరీక్ష
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
C) పై రెండూ
13. వాహనాలను నడిపేవారు పోలీసులు అడిగినపుడు చూపించవలసిన ధ్రువపత్రాలు ఏవి ?
A) ఇన్సూరెన్స్ సర్టిఫికేట్
B) రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
C) డ్రైవింగ్ లైసెన్స్
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
14. తాత్కాలిక రిజిస్ట్రేషన్‌కు అవసరమైన ధ్రువపత్రాలు ఏవి?
A) అమ్మకం చేసినట్లుగా డీలర్ నుంచి ధ్రువపత్రం
B) రోడ్డుపై నడపటానికి వీలైనది అని ధ్రువీకరణ పత్రం
C) వాహన బీమా ధ్రువపత్రం, కాలుష్య నియంత్రణ ధ్రువపత్రం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
15. రోడ్డుపై పాదచారులు రోడ్డు దాటవలసిన ప్రదేశం.
A) ఫుట్ పాత్
B) డివైడర్
C) జీబ్రా క్రాసింగ్
D) ఏదీ కాదు
జవాబు:
C) జీబ్రా క్రాసింగ్
16. గీతకు ముందు ఆగాలని సూచించే గుర్తు.
A) ఎరుపు
B) ఆరెంజ్
C) ఆకుపచ్చ
D) ఏదీ కాదు
జవాబు:
A) ఎరుపు
17. వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని సూచించే గుర్తు
A) ఎరుపు
B) ఆరెంజ్
C) ఆకుపచ్చ
D) నీలం
జవాబు:
B) ఆరెంజ్
18. వాహనాన్ని కదిలించమని సూచించే గుర్తు
A) ఎరుపు
B) ఆరెంజ్
C) ఆకుపచ్చ
D) పసుపు
జవాబు:
C) ఆకుపచ్చ
II. ఖాళీలను పూరింపుము
1. రోడ్డును ఉపయోగించే వారందరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించడమే …………
2. ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళే వాటిని ………….. అంటాం.
3. ట్రాఫిక్ నియమ నిబంధనలు సరళంగా, స్పష్టంగా వివరించి తెలియజేయడాన్ని ………… అంటాం.
4. ……………… లేకుండా వాహనాలు నడపరాదు.
5. తాత్కాలికమైన డ్రైవింగ్ లైసెన్స్ ను ……………. అంటారు.
6. వస్తువుల, మనుషుల రవాణాకు ఉపయోగించే వాహనాలను నడుపుటకు ఉండవలసిన కనీస వయస్సు …………
7. లెర్నర్ లైసెన్స్ పొందిన తరువాత ………… నుంచి ……………. రోజుల లోపుగా శాశ్వత లైసెన్స్ ఇస్తారు.
8. తాగి వాహనం నడిపే వారి వాహనాలను అధికారులు …………… చేయవచ్చు.
9. డ్రైవర్ ఎల్లప్పుడూ ఎడమవైపున ఉండి కుడివైపున వేగంగా వెళ్ళే వాహనాలకు ………….. వదలాలి.
10. ………………. లేకుండా ఏ వాహనాన్ని నడపరాదు.
11. రోడ్డుకు ఇరువైపులా పాదచారులు నడవటానికి వీలుగా ఉండే దారి …………
12. రోడ్డును రెండు సమభాగాలుగా విభజించేది ………………
13. పాదచారులు రోడ్డు దాటవలసిన ప్రదేశం ………….
14. గీతకు ముందు ఆగాలని సూచించు గుర్తు …………
15. వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని సూచించు గుర్తు ………………
16. వాహనాన్ని కదిలించమని సూచించు గుర్తు ………
17. భారతదేశం ప్రపంచంలో ………….. అతి పెద్ద రోడ్డు మార్గాలు కలిగిన దేశం.
18. రాత్రివేళల్లో నడిచేటప్పుడు పాదచారులు విధిగా దగ్గర ఉంచుకోవాల్సిన వస్తువు ……………
19. రోడ్డుపై నడుచునపుడు, రోడ్డును దాటుతున్నప్పుడు ……………… ను ఉపయోగించరాదు.
20. ……………. చేయించుకుని మాత్రమే వాహనాన్ని రోడ్డుపై నడపాలి.
21. ద్విచక్ర వాహనదారులు ………………. ధరించాలి.
జవాబు:
- క్రమబద్ధీకరణ
- ట్రాఫిక్
- ట్రాఫిక్ విద్య
- డ్రైవింగ్ లైసెన్స్
- లెర్నర్ లైసెన్స్
- 25 సం||లు
- 30 నుంచి 180
- సీజ్
- దారి
- రిజిస్ట్రేషన్
- పాదచారుల దారి
- డివైడర్
- జీబ్రా క్రాసింగ్
- ఎరుపు రంగు
- ఆరెంజ్
- ఆకుపచ్చ
- రెండవ
- టార్చిలైటు
- మొబైల్ ఫోన్
- బీమా
- హెల్మెట్
III. కింది వానిని జతపరుచుము
1.
Group-A | Group-B |
1. ఒక చోటు నుండి మరొక చోటుకు వెళ్ళడం | a) వాహనం నడిపేవారికి ఉండవలసినది |
2. రోడ్డు ప్రమాదాలు | b) కాలిబాట |
3. పాదచారులు | c) యుక్త వయస్సు |
4. డ్రైవింగ్ లైసెన్స్ | d) ట్రాఫిక్ |
జవాబు:
Group-A | Group-B |
1. ఒక చోటు నుండి మరొక చోటుకు వెళ్ళడం | d) ట్రాఫిక్ |
2. రోడ్డు ప్రమాదాలు | c) యుక్త వయస్సు |
3. పాదచారులు | b) కాలిబాట |
4. డ్రైవింగ్ లైసెన్స్ | a) వాహనం నడిపేవారికి ఉండవలసినది |
2.
Group-A | Group-B |
1. హెల్మెట్ | a) పాదచారులు రోడ్డు దాటవలసిన ప్రదేశం |
2. జీబ్రా క్రాసింగ్ | b) ఆగాలని సూచిస్తుంది |
3. ఎరుపు రంగు | c) రక్షిత ప్రయాణం |
4. ఆరెంజ్ రంగు | d) వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని |
5. ఆకుపచ్చ రంగు | e) వాహనాన్ని కదిలించమని |
జవాబు:
Group-A | Group-B |
1. హెల్మెట్ | c) రక్షిత ప్రయాణం |
2. జీబ్రా క్రాసింగ్ | a) పాదచారులు రోడ్డు దాటవలసిన ప్రదేశం |
3. ఎరుపు రంగు | b) ఆగాలని సూచిస్తుంది |
4. ఆరెంజ్ రంగు | d) వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని |
5. ఆకుపచ్చ రంగు | e) వాహనాన్ని కదిలించమని |