Practice the AP 7th Class Science Bits with Answers 9th Lesson ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 7th Class Science Bits 9th Lesson ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి

I. బహుళైచ్ఛిక ప్రశ్నలు

సరియైన జవాబు సూచించు అక్షరమును బ్రాకెట్లో రాయండి.

1. ఉష్ణప్రసరణ ఎల్లప్పుడూ …….
A) వేడి నుండి చల్లదనానికి
B) వేడి నుండి అధిక వేడికి
C) చల్లదనం నుండి వేడికి
D) చల్లదనం నుండి చల్లదనానికి
జవాబు:
A) వేడి నుండి చల్లదనానికి

2. ఉష్ణము యొక్క తీవ్రతకు ప్రమాణం కానిది
A) కెల్విన్
B) సెంటిగ్రేడ్
C) ఫారెన్హీట్
D) కెలోరి
జవాబు:
D) కెలోరి

AP 7th Class Science Bits Chapter 9 ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి

3. ఉష్ణవాహకం కానిది గుర్తించండి.
A) రాగి
B) చెక్క
C) అల్యూమినియం
D) ఇనుము
జవాబు:
B) చెక్క

4. ఉష్ణవహన పద్ధతి కానిది
A) చెంచా వేడెక్కటం
B) దోసె పెనం వేడక్కటం
C) నీరు వేడెక్కటం
D) లోహపు పాత్ర వేడెక్కటం
జవాబు:
C) నీరు వేడెక్కటం

5. ఉష్ణ బదిలీ విధానము
A) వహనం
B) సంవహనం
C) వికిరణం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

6. ఘనపదార్థాలలో ఉష్ణ ప్రసరణ
A) వహనం
B) సంవహనం
C) వికిరణం
D) వాహకత్వం
జవాబు:
A) వహనం

7. ఉష్ణసంవహనం ప్రదర్శించునవి
A) ఘనాలు
B) ద్రవాలు మరియు వాయువులు
C) మొక్కలు
D) జంతువులు
జవాబు:
B) ద్రవాలు మరియు వాయువులు

8. ఉష్ణబదిలీని తగ్గించటానికి ఉపయోగించే పరికరము
A) కెటిల్
B) ఫ్లాస్క్
C) థర్మామీటరు
D) పాదరసం
జవాబు:
B) ఫ్లాస్క్

9. ఉష్ణము వలన పదార్థ పరిమాణం పెరగడాన్ని ఏమంటారు?
A) వ్యాకోచం
B) సంకోచం
C) సడలింపు
D) తటస్థము
జవాబు:
A) వ్యాకోచం

AP 7th Class Science Bits Chapter 9 ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి

10. థర్మామీటర్లలో ఉపయోగించే ద్రవాలు
A) పాదరసం
B) నీరు
C) కిరోసిన్
D) నూనె
జవాబు:
A) పాదరసం

11. ఏ థర్మామీటరులో నొక్కు ఉంటుంది?
A) డిజిటల్
B) థర్మల్ స్కానర్
C) జ్వరమానిని
D) ప్రయోగశాల థర్మామీటరు
జవాబు:
C) జ్వరమానిని

12. సిక్స్ గరిష్ట – కనిష్ట ఉష్ణమాపకంలోని ద్రవాలు
A) పాదరసం, ఆల్కహాలు
B) నీరు, ఆల్కహాల్
C) నూనె, పాదరసం
D) నీరు, నూనె
జవాబు:
A) పాదరసం, ఆల్కహాలు

13. గాలి పీడనాన్ని దేనితో కొలుస్తారు?
A) థర్మామీటరు
B) బారోమీటరు
C) హైగ్రోమీటర్
D) హైడ్రోమీటర్
జవాబు:
B) బారోమీటరు

14. అత్యవసర పరిస్థితులలో ఆరోగ్య సహాయం కోసం చేయవలసిన ఫోన్ నెంబర్
A) 100
B) 108
C) 103
D) 102
జవాబు:
B) 108

15. మన జీవన శైలిని ప్రభావితం చేయునది
A) వాతావరణం
B) ఆర్థత
C) శీతోష్ణస్థితి
D) ఉష్ణోగ్రత
జవాబు:
C) శీతోష్ణస్థితి

16. గాలిని వేడి చేసినపుడు
A) తేలిక అవుతుంది
B) వేడెక్కుతుంది
C) వ్యాకోచిస్తుంది
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

17. థర్మల్ స్కానర్ మన శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి ఉష్ణాన్ని ఏ రూపంలో గ్రహిస్తుంది?
A) ఉష్ణ వహనం
B) ఉష్ణ సంవహనం
C) ఉష్ణవికిరణం
D) పైవన్నియూ
జవాబు:
C) ఉష్ణవికిరణం

18. థర్మోస్ ఫ్లాస్క్ లోపలి వెండి పూత ఉష్ణాన్ని ఏ రూపంలో కోల్పోకుండా కాపాడుతుంది?
A) ఉష్ణ వహనం
B) ఉష్ణ సంవహనం
C) ఉష్ణవికిరణం
D) పైవన్నియూ
జవాబు:
C) ఉష్ణవికిరణం

19. ఈ కృత్యం ద్వారా మనము నిరూపించు అంశము
AP 7th Class Science Bits Chapter 9 ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి 8
A) ద్రవాల వ్యాకోచం మరియు సంకోచం
B) వాయువుల వ్యాకోచం మరియు సంకోచం
C) ఘనపదార్థాల వ్యాకోచం మరియు సంకోచం
D) ద్రవపదార్థాలలో ఉష్ణసంవహనం
జవాబు:
A) ద్రవాల వ్యాకోచం మరియు సంకోచం

20. ఈ కృత్యము ద్వారా మనము నిరూపించు అంశం
AP 7th Class Science Bits Chapter 9 ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి 7
A) ద్రవాల వ్యాకోచం మరియు సంకోచం
B) వాయువుల వ్యాకోచం మరియు సంకోచం
C) ఘనపదార్థాల వ్యాకోచం మరియు సంకోచం
D) ద్రవపదార్థాలలో ఉష్ణసంవహనం
జవాబు:
D) ద్రవపదార్థాలలో ఉష్ణసంవహనం

21. ఈ చిత్రం ద్వారా మనము నిరూపించు అంశం.
AP 7th Class Science Bits Chapter 9 ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి 9
A) ద్రవాల వ్యాకోచం మరియు సంకోచం
B) వాయువుల వ్యాకోచం మరియు సంకోచం
C) ఘనపదార్థాల వ్యాకోచం మరియు సంకోచం
D) ద్రవపదార్థాలలో ఉష్ణసంవహనం
జవాబు:
B) వాయువుల వ్యాకోచం మరియు సంకోచం

22. క్రింది వానిలో తప్పుగా ఉన్న వాక్యం
A) ఉష్ణం ఒక రకమయిన శక్తి.
B) శక్తి ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మారుతుంది.
C) ఉష్ణం ఎక్కువ ఉష్ణోగ్రత గల వస్తువు నుండి తక్కువ ఉష్ణోగ్రత గల వస్తువుకు ప్రసారమవుతుంది.
D) ఉష్టాన్ని కొలవడానికి థర్మామీటర్ ఉపయోగిస్తారు.
జవాబు:
D) ఉష్టాన్ని కొలవడానికి థర్మామీటర్ ఉపయోగిస్తారు.

AP 7th Class Science Bits Chapter 9 ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి

23. హరి జ్వరమాని బల్బును మండుతున్న కొవ్వొత్తి దగ్గరికి తెచ్చాడు. ఏం జరిగి ఉంటుందో ఊహించండి.
1) పాదరస మట్టం పెరుగుతుంది.
2) పాదరస మట్టం తగ్గుతుంది.
3) పాదరస మట్టంలో ఏ మార్పు ఉండదు.
4) థర్మామీటర్ పగిలిపోతుంది.
A) 1 సరైనది
B) 2 సరైనది
C) 1, 4 సరైనవి
D) 3 సరైనది
జవాబు:
C) 1, 4 సరైనవి

II. ఖాళీలను పూరించుట కింది ఖాళీలను పూరింపుము.

1. వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ప్రవహించే శక్తి ……………..
2. ఉష్ణము యొక్క తీవ్రతను ………… అంటారు.
3. ఉష్ణోగ్రతకు SI ప్రమాణం ………………. .
4. సెల్సియస్, ఫారన్‌హీట్లు అనునవి ………… ప్రమాణాలు.
5. ఉష్టాన్ని ప్రసరింపజేయు ధర్మాన్ని …………. అంటారు.
6. ఉష్ణవాహకాలు ……………
7. ఘనపదార్థాలలో ఉష్ణము …………… పద్ధతిలో …………… బదిలీ అగును.
8. ఉష్ణబదిలీకి దోహదపడే పదార్థాలను ……….. అంటారు.
9. ద్రవాలు మరియు వాయువులలో ఉష్ణము ……….. పద్ధతిలో రవాణా అగును.
10. …………. పద్దతిలో యానకంతో అవసరం లేదు.
11. ఉష్ణవహన పద్దతిలో ……………… అవసరము.
12. థర్మోస్ ను కనుగొన్న శాస్త్రవేత్త ……………..
13. థర్మల్ స్కానర్ …………. ఆధారంగా పని చేస్తుంది.
14. ఫ్లాస్క్ లోపలి తలం ………… పూత కల్గి ఉంటుంది.
15. ఉష్ణం వలన పదార్థాల పరిమాణం పెరగడాన్ని …………… అంటారు.
16. వేడిగాలి చల్లని గాలికంటే ………… ఉంటుంది.
17. శరీర ఉష్ణోగ్రత కొలవటానికి ………. వాడతారు.
18. థర్మామీటరులలో ఉపయోగించే ద్రవము …………
19. పాదరసం యొక్క మరుగు ఉష్ణోగ్రత …………..
20. ఫారన్‌హీట్ స్కేలు నందు విభాగాల సంఖ్య ………..
21. పాదరసం లేకుండా ………….. ఉష్ణమాపకం పని చేస్తుంది.
22. రోజులోని గరిష్ట – కనిష్ట ఉష్ణోగ్రతలను కొలవటానికి ……………. ఉష్ణమాపకం వాడతాము.
23. సిక్స్ గరిష్ట – కనిష్ట ఉష్ణమాపకాలలో ……………. ఉపయోగిస్తారు.
24. మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత ………… లేదా ………………
25. గాలి పీడనాన్ని ………….. తో కొలుస్తారు.
26. గాలిలో ఉన్న నీటి ఆవిరి పరిమాణాన్ని …………. అంటారు.
27. గాలిలో ఆర్థతను ……………… తో కొలుస్తారు.
28. వాతావరణాన్ని అధ్యయనం చేయు శాస్త్రవేత్తలు ………………….
29. 25 సంవత్సరాల వాతావరణ సగటును ………………… అంటారు.
30. ఒక ప్రాంత ప్రజల ………… శీతోష్ణస్థితి ప్రభావితం చేస్తుంది.
జవాబు:

  1. ఉష్ణము
  2. ఉష్ణోగ్రత
  3. కెల్విన్
  4. ఉష్ణోగ్రత
  5. ఉష్ణవాహకత్వం
  6. రాగి, వెండి
  7. వహన
  8. యానకాలు
  9. ఉష్ణసంవహన
  10. ఉష్ణ వికిరణ
  11. థార్మిక స్పర్శ
  12. సర్‌ జేమ్స్ డేవర్
  13. ఉష్ణవికిరణం
  14. వెండి
  15. వ్యాకోచం
  16. తేలికగా
  17. జ్వరమానిని
  18. పాదరసం
  19. 357°C
  20. 180
  21. డిజిటల్
  22. సిక్స్ గరిష్ట, కనిష్ట
  23. పాదరసం, ఆల్కహాలు
  24. 37°C, 98.4°F
  25. బారోమీటర్
  26. ఆర్ధత
  27. హైగ్రోమీటర్
  28. మెట్రాలజిస్టులు
  29. శీతోష్ణస్థితి
  30. జీవనశైలిని

III. జతపరుచుట

కింది వానిని జతపరుచుము.

1.

Group – A Group – B
A) ఉష్ణవహనం 1) ఉష్ణాన్ని ప్రసరింపజేయటం
B) ఉష్ణసంవహనం 2) ఘనపదార్థాలు
C) ఉష్ణ వికిరణం 3) యానకం అవసరం లేదు
D) ఉష్ణ వ్యాకోచం 4) ద్రవాలు
E) ఉష్ణవాహకత్వం 5) పరిమాణం పెరగటం
6) చల్లని పరిస్థితి

జవాబు:

Group – A Group – B
A) ఉష్ణవహనం 2) ఘనపదార్థాలు
B) ఉష్ణసంవహనం 4) ద్రవాలు
C) ఉష్ణ వికిరణం 3) యానకం అవసరం లేదు
D) ఉష్ణ వ్యాకోచం 5) పరిమాణం పెరగటం
E) ఉష్ణవాహకత్వం 1) ఉష్ణాన్ని ప్రసరింపజేయటం

2.

Group – A Group – B
A) జ్వరమానిని 1) కనిష్ట ఉష్ణోగ్రత
B) థర్మల్ స్కానర్ 2) శరీర ఉష్ణోగ్రత
C) ప్రయోగశాల థర్మామీటరు 3) ఉష్ణ వికిరణం
D) డిజిటల్ థర్మామీటరు 4) ఎలక్ట్రానిక్ పరికరం
E) సిక్స్ గరిష్ట – కనిష్ట మాపకం 5) ద్రవాల ఉష్ణోగ్రత

జవాబు:

Group – A Group – B
A) జ్వరమానిని 2) శరీర ఉష్ణోగ్రత
B) థర్మల్ స్కానర్ 3) ఉష్ణ వికిరణం
C) ప్రయోగశాల థర్మామీటరు 5) ద్రవాల ఉష్ణోగ్రత
D) డిజిటల్ థర్మామీటరు 4) ఎలక్ట్రానిక్ పరికరం
E) సిక్స్ గరిష్ట – కనిష్ట మాపకం 1) కనిష్ట ఉష్ణోగ్రత

3.

Group – A Group – B
A) సెల్సియస్ 1) ఉష్ణము
B) ఫారన్‌హీట్ 2) వాతావరణ పీడనం
C) కెల్విన్ 3) S.I ప్రమాణం
D) కెలోరి 4) 100 విభాగాలు
E) సెం.మీ. (cm) 5) 180 విభాగాలు

జవాబు:

Group – A Group – B
A) సెల్సియస్ 4) 100 విభాగాలు
B) ఫారన్‌హీట్ 5) 180 విభాగాలు
C) కెల్విన్ 3) S.I ప్రమాణం
D) కెలోరి 1) ఉష్ణము
E) సెం.మీ. (cm) 2) వాతావరణ పీడనం