Practice the AP 7th Class Science Bits with Answers 7th Lesson మొక్కలలో ప్రత్యుత్పత్తి on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 7th Class Science Bits 7th Lesson మొక్కలలో ప్రత్యుత్పత్తి
I. బహుళైచ్ఛిక ప్రశ్నలు
సరియైన జవాబు సూచించు అక్షరమును బ్రాకెట్లో రాయండి.
1. క్రింది వానిలో ప్రత్యేకమైనది
A) విచ్ఛిత్తి
B) మొగ్గ తొడగటం
C) సిద్ధ బీజాలు
D) విత్తనాలు
జవాబు:
D) విత్తనాలు
2. కిందివానిలో శాఖీయ భాగం కానిది
A) ఆకు
B) పువ్వు
C) కాండం
D) వేరు
జవాబు:
B) పువ్వు
3. అరటిలో శాఖీయ వ్యాప్తి విధానం
A) పిలకలు
B) కణుపులు
C) కన్నులు
D) దుంపలు
జవాబు:
A) పిలకలు
4. మల్లె, జాజి, స్ట్రాబెర్రీలలో శాఖీయ విధానం
A) నేల అంట్లు
B) నేల కణుపులు
C) అంటు తొక్కటం
D) కొమ్మ అంట్లు
జవాబు:
A) నేల అంట్లు
5. ఒకే మొక్కపై వేరు వేరు రకాలు పండించటానికి తోడ్పడే విధానం
A) నేల అంట్లు
B) అంటు కట్టుట
C) కణుపులు
D) సంకరణం
జవాబు:
B) అంటు కట్టుట
6. సంపూర్ణ పుష్పంలోని మొత్తం వలయాల సంఖ్య
A) 2
B) 3
C) 4
D) 5
జవాబు:
C) 4
7. పుష్పంలోని వెలుపలి వలయం
A) ఆకర్షక పత్రాలు
B) రక్షక పత్రాలు
C) కేసరావళి
D) అండకోశము
జవాబు:
B) రక్షక పత్రాలు
8. క్రింది వానిలో పుష్ప వలయం కానిది
A) అండాశయం
B) కేసరావళి
C) ఆకర్షక పత్రావళి
D) రక్షక పత్రావళి
జవాబు:
A) అండాశయం
9. అండకోశంలో భాగము కానిది
A) అండాశయం
B) కీలం
C) కీలాగ్రం
D) కేసరావళి
జవాబు:
D) కేసరావళి
10. అసంపూర్ణ పుష్పాలలో వలయాల సంఖ్య
A) 2
B) 3
C) 4
D) 1
జవాబు:
B) 3
11. అసంపూర్ణ పుష్పాలు ఏకలింగ పుష్పాలు
A) సత్యం
B) అసత్యం
C) నిర్ధారించలేము
D) నిర్ధారించగలము
జవాబు:
A) సత్యం
12. అసంపూర్ణ పుష్పాలలో లోపించునవి
A) కేసరావళి
B) అండకోశము
C) కేసరావళి మరియు అండకోశము
D) కేసరావళి లేదా అండకోశము
జవాబు:
D) కేసరావళి లేదా అండకోశము
13. స్త్రీ, పురుష పుష్పాలు వేరువేరు మొక్కలపై ఉండటానికి ఉదాహరణ
A) బొప్పాయి
B) బీర
C) కాకర
D) సొర
జవాబు:
A) బొప్పాయి
14. ద్విలింగ పుష్పాలన్ని సంపూర్ణ పుష్పాలు
A) సత్యం
B) అసత్యం
C) నిర్ధారించలేము
D) అన్నివేళలా కాదు.
జవాబు:
A) సత్యం
15. పుష్పాలలో ప్రత్యుత్పత్తి వలయాలు
A) 3 మరియు 5
B) 3 మరియు 4
C) 1 మరియు 2
D) 1 మరియు 3
జవాబు:
B) 3 మరియు 4
16. విత్తనాలు దేనికోసం పోటీ పడతాయి?
A) స్థలం
B) నీరు
C) ఎండ
D) అన్ని
జవాబు:
D) అన్ని
17. పరాగనాళం దేని నుండి ఏర్పడుతుంది?
A) పరాగ రేణువు
B) అండాశయం
C) కీలం
D) కీలాగ్రం
జవాబు:
A) పరాగ రేణువు
18. పరాగ సంపర్క కారకాలు
A) గాలి
B) నీరు
C) జంతువులు
D) అన్ని
జవాబు:
D) అన్ని
19. ఫలదీకరణ తరువాత అభివృద్ధి చెందే నిర్మాణం
A) కేసరావళి
B) కీలం
C) అండాశయం
D) కీలాగ్రం
జవాబు:
C) అండాశయం
20. స్త్రీ, పురుష సంయోగ బీజాల కలయిక వలన ఏర్పడునది
A) సంయుక్త బీజం
B) అండాశయం
C) కేసరావళి
D) ఆకర్షక పత్రాలు
జవాబు:
A) సంయుక్త బీజం
21. ముళ్ళు కలిగిన విత్తనాలు దేని ద్వారా వ్యాపిస్తాయి?
A) గాలి
B) నీరు
C) జంతువులు
D) వర్షము
జవాబు:
C) జంతువులు
22. తేలికగా, చిన్నవిగా ఉండే విత్తనాలు దేనిద్వారా వ్యాపిస్తాయి?
A) గాలి
B) నీరు
C) మనుషులు
D) జంతువులు
జవాబు:
A) గాలి
23. పుష్పంలో పుష్పభాగాలన్నిటికి ఆధారాన్నిచ్చేది
A) పుష్పవృంతం
B) పుష్పాసనం
C) అండాశయం
D) రక్షకపత్రావళి
జవాబు:
B) పుష్పాసనం
24. క్రింది వానిలో పుష్పభాగాలు 3 వలయాలలో ఉండే పుష్పం
A) మందార
B) ఉమ్మెత్త
C) లిల్లీ
D) దోస
జవాబు:
C) లిల్లీ
25. దోస పుష్పం
A) అసంపూర్ణ పుష్పం
B) ఏకలింగ పుష్పం
C) A మరియు B
D) సంపూర్ణ పుష్పం
జవాబు:
C) A మరియు B
26. ఉమ్మెత్త పుష్పం
A) సంపూర్ణ పుష్పం
B) ద్విలింగ పుష్పం
C) A మరియు B
D) ఏకలింగ పుష్పం
జవాబు:
B) ద్విలింగ పుష్పం
27. క్రింది వానిలో ఏకలింగ పుష్పం ఏది?
A)దోస
B) సౌర
C) కాకర
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
28. పుష్పంలో పురుష బీజాలను ఉత్పత్తి చేసేది
A) అండాశయం
B) పరాగకోశం
C) పరాగరేణువులు
D) అండాలు
జవాబు:
C) పరాగరేణువులు
29. పుష్పంలో ఫలంగా మారే భాగం
A) అండాశయం
B) అండం
C) పరాగకోశం
D) మొత్తం పుష్పం
జవాబు:
A) అండాశయం
30. పరాగ సంపర్కం అనగా
A) పరాగరేణువులు కీలాన్ని చేరటం
B) పరాగరేణువులు కీలాగ్రాన్ని చేరటం
C) పరాగరేణువులు అండాశయాన్ని చేరటం
D) పరాగరేణువులు అండాన్ని చేరటం
జవాబు:
B) పరాగరేణువులు కీలాగ్రాన్ని చేరటం
31. ఒక పుష్పంలోని పరాగరేణువులు మరొక మొక్కలోని వేరొక పుష్పంలోని కీలాగ్రాన్ని చేరటాన్ని ఏమంటారు?
A) ఆత్మపరాగ సంపర్కం
B) పరపరాగ సంపర్కం
C) స్వపరాగ సంపర్కం
D) భిన్న పరాగ సంపర్కం
జవాబు:
B) పరపరాగ సంపర్కం
32. కన్ను ఉండేది
A) బంగాళదుంప
B) చిలకడదుంప
C) క్యా రెట్
D) బీట్ రూట్
జవాబు:
A) బంగాళదుంప
33. మొక్కలలోని లైంగిక భాగం
A) పత్రం
B) పుష్పం
C) కాండం
D) వేరు
జవాబు:
B) పుష్పం
34. పుష్పంలోని 3వ వలయంలో ఉండే భాగం
A) రక్షక పత్రాలు
B) ఆకర్షక పత్రాలు
C) అండకోశం
D) కేసరావళి
జవాబు:
D) కేసరావళి
35. బంగాళదుంపపై గల గుంటలను పరిశీలించమని రమేష్ ని వాళ్ళ టీచర్ అడిగారు. ఈ పరిశీలనలోని ఉద్దేశ్యం
A) బంగాళదుంపలో రూపాంతరాన్ని చదువడం
B) బంగాళదుంప కొలతలు కొలవడం
C) బంగాళదుంపలో శాఖీయ ప్రత్యుత్పత్తి
D) బంగాళదుంపలను నిల్వచేయు విధానం తెలుసుకొనడం
జవాబు:
C) బంగాళదుంపలో శాఖీయ ప్రత్యుత్పత్తి
36. ఈ పటం పుష్పంలోని ఏవలయాన్ని సూచిస్తుంది?
A) మొదటి వలయం
B) రెండవ వలయం
C) మూడవ వలయం
D) నాల్గవ వలయం
జవాబు:
B) రెండవ వలయం
37. ఈ పటం సూచించునది
A) రక్షక పత్రావళి
B) ఆకర్షక పత్రావళి
C) అండ కోశం
D) కేసరావళి
జవాబు:
B) ఆకర్షక పత్రావళి
38. ఈ విత్తనం ఈ క్రింది వానిలో దేని ద్వారా వ్యాపిస్తుంది?
A) గాలి
B) నీరు
C) జంతువులు
D) పక్షులు
జవాబు:
A) గాలి
39. ప్రక్క పటంలో X, Y లు సూచించునవి
A) X : సయాన్ Y : స్టాక్
B) X : స్టాక్ Y : సయాన్
C) X : నేలంటు Y : గాలి అంటు
D) పైవేవీకాదు
జవాబు:
A) X : సయాన్ Y : స్టాక్
II. ఖాళీలను పూరించుట కింది ఖాళీలను పూరింపుము.
1. కొత్త జీవులను ఉత్పత్తి చేయు ప్రక్రియ …………………
2. విత్తనాల ద్వారా జరిగే ప్రత్యుత్పత్తి ………….
3. చెరకులో శాఖీయవ్యాప్తి విధానం …………….
4. అంటుకట్టే పద్ధతిలో పైన పెరిగే భాగం ………….
5. సయాను ఆధారాన్ని ఇచ్చే మొక్క ………………
6. పువ్వును కాండానికి కలిపే నిర్మాణం ……………
7. కాడ మీద ఉబ్బిన తలం ……………..
8. పుష్పాసనంపై ఉబ్బిన నిర్మాణం ………………
9. పుష్పంలోని నాల్గవ వలయం ………………….
10. సంపూర్ణ పుష్పంలో వలయాల సంఖ్య ………….
11. కేసరావళి మాత్రమే కలిగిన అసంపూర్ణ పుష్పం …………
12. అండకోశం మాత్రమే కలిగిన అసంపూర్ణ పుష్పం ………………….
13. …………….. వంటి మొక్కలలో స్త్రీ, పురుష పుష్పాలు ఒకే మొక్క మీద ఉంటాయి.
14. పరాగ రేణువులు కీలాగ్రం చేరడాన్ని …………..
15. ………….. సంపర్కంలో క్రొత్త లక్షణాలు ఏర్పడతాయి.
16. రెండు వేరు వేరు మొక్కల మధ్య జరిగే పరాగ సంపర్కం …………….
17. స్త్రీ, పురుష సంయోగబీజాల కలయిక ……………
18. పరాగ సంపర్కంలో పుప్పొడి రేణువులు ………… పై పడతాయి.
19. మొలకెత్తిన పుప్పొడి రేణువులు ………………. ఏర్పరుస్తాయి.
20. ఫలదీకరణ తర్వాత ………. ఫలంగా మారుతుంది.
21. సంయుక్త బీజం ………….. వలన ఏర్పడును.
22. సంయుక్త బీజం అభివృద్ధి చెంది …………… గా మారుతుంది.
23. విత్తనాలు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి విస్తరించడాన్ని ……………. అంటారు.
జవాబు:
- ప్రత్యుత్పత్తి
- లైంగిక ప్రత్యుత్పత్తి
- కణుపులు
- సయాన్
- స్టాక్
- కాడ
- పుష్పాసనం
- అండాశయం
- అండకోశం
- నాలుగు
- పురుష పుష్పం
- స్త్రీ పుష్పం
- బీర, కాకర
- పరాగ సంపర్కం
- పరపరాగ
- పరపరాగ సంపర్కం
- ఫలదీకరణం
- కీలం
- పరాగ నాళం
- అండాశయం
- ఫలదీకరణ
- పిండము
- విత్తన వ్యాప్తి
III. జతపరుచుట
కింది వానిని జతపరుచుము.
1.
గ్రూపు – A | గ్రూపు – B |
A) సంపూర్ణ పుష్పాలు | 1) కేసరావళి |
B) అసంపూర్ణ పుష్పాలు | 2) అండకోశము |
C) పురుష పుష్పాలు | 3) కేసరావళి మరియు అండకోశం |
D) స్త్రీ పుష్పాలు | 4) మూడు వలయాలు |
E) ద్విలింగ పుష్పాలు | 5) నాలుగు వలయాలు |
6) పుష్పాసనం |
జవాబు:
గ్రూపు – A | గ్రూపు – B |
A) సంపూర్ణ పుష్పాలు | 5) నాలుగు వలయాలు |
B) అసంపూర్ణ పుష్పాలు | 4) మూడు వలయాలు |
C) పురుష పుష్పాలు | 1) కేసరావళి |
D) స్త్రీ పుష్పాలు | 2) అండకోశము |
E) ద్విలింగ పుష్పాలు | 3) కేసరావళి మరియు అండకోశం |
2.
గ్రూపు – A | గ్రూపు – B |
A) గాలి | 1) బెండ, గురివింద |
B) నీరు | 2) వ్యవసాయం |
C) జంతువులు | 3) తేలికపాటి విత్తనాలు |
D) మనుషులు | 4) గుండ్రంగా, బరువైన |
E) పేలటం | 5) కండ కలిగి రుచిగా |
6) మొలకెత్తటం |
జవాబు:
గ్రూపు – A | గ్రూపు – B |
A) గాలి | 3) తేలికపాటి విత్తనాలు |
B) నీరు | 4) గుండ్రంగా, బరువైన |
C) జంతువులు | 5) కండ కలిగి రుచిగా |
D) మనుషులు | 2) వ్యవసాయం |
E) పేలటం | 1) బెండ, గురివింద |