Practice the AP 7th Class Maths Bits with Answers 7th Lesson నిష్పత్తి మరియు అనుపాతం on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 7th Class Maths Bits 7th Lesson నిష్పత్తి మరియు అనుపాతం

క్రింది వానికి సరైన సమాధానాలను ఎన్నుకొనుము.

ప్రశ్న1.
24 : 36 యొక్క సూక్ష్మరూపం
(A) 3 : 2
(B) 2 : 3
(C) 12 : 18
(D) 4 : 6
జవాబు :
(B) 2 : 3

ప్రశ్న2.
3:5కు సమానమైన నిష్పత్తి
(A) 6:10
(B) 9 : 15
(C) 12 : 20
(D) పైవన్నీ
జవాబు :
(D) పైవన్నీ

ప్రశ్న3.
క్రింది వానిలో ఏది సత్యం ?
(A) a : b మరియు c : d ల బహుళ నిష్పత్తి a × c : b × d
(B) a : b మరియు c : d లు అనుపాతంలో ఉంటే ad = bc
(C) నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని “అనుపాతము” అంటారు.
(D) పైవన్నీ
జవాబు :
(D) పైవన్నీ

ప్రశ్న4.
3 : 5 మరియు 2 : 5ల బహుళ నిష్పత్తి
(A) 6:25
(B) 15 : 10
(C) 10 : 15
(D) 25 : 6
జవాబు :
(A) 6:25

AP 7th Class Maths Bits 7th Lesson నిష్పత్తి మరియు అనుపాతం

ప్రశ్న5.
క్రింది వానిలో అనుపాతంలో గల నిష్పత్తులు
(A) 10 : 20 మరియు 2 : 1
(B) 10 : 20 మరియు 1:2
(C) 6 : 5 మరియు 2 : 3
(D) 6 : 5 మరియు 3:2
జవాబు :
(B) 10 : 20 మరియు 1:2

ప్రశ్న6.
3:5 = 9 : x అయిన x =
(A) 10
(B) 11
(C) 15
(D) 20
జవాబు :
(C) 15

ప్రశ్న7.
x, y లు అనులోమానుపాతంలో ఉంటే క్రింది వాటిలో ఏది సత్యం ? (k అనుపాత, స్థిరాంకము)
(A) xy = k
(B) \(\frac{x}{y}\) = k
(C) A మరియు B
(D) x<sup>2</sup>y =k
జవాబు :
(B) \(\frac{x}{y}\) = k

ప్రశ్న8.
క్రింది వానిలో ఏవి అనులోమానుపాతంలో కలవు ?
(A) రైలు వేగం, గమ్యాన్ని చేరడానికి పట్టే కాలం.
(B) మనుషుల సంఖ్య, ఒకపని పూర్తి కావడానికి పట్టే కాలం.
(C) మనుషుల సంఖ్య, వారికి కావలసిన అహారం.
(D) రంగులు వేసేవారి సంఖ్య, రోజుల సంఖ్య.
జవాబు :
(C) మనుషుల సంఖ్య, వారికి కావలసిన అహారం.

ప్రశ్న9.
10 పెన్నుల వెల ₹60 అయిన 15 పెన్నుల వెల
(A) ₹ 90
(B) ₹ 120
(C) ₹ 30
(D) ₹ 150
జవాబు :
(A) ₹ 90

ప్రశ్న10.
క్రింది పట్టికలోని రాశులు విలోమానుపాతంలో ఉంటే x విలువ ఎంత ?
AP 7th Class Maths Bits 7th Lesson నిష్పత్తి మరియు అనుపాతం 1
(A) 100
(B) 25
(C) 40
(D) 10
జవాబు :
(B) 25

ప్రశ్న11.
వాక్యం I : x, y లు అనులోమానుపాతంలో ఉంటే xy = k.
వాక్యం II : x, y లు విలోమానుపాతంలో ఉంటే \(\frac{x}{y}\) = k
(A) I – సత్యం , II – అసత్యం
(B) I – అసత్యం , II – సత్యం
(C) I మరియు II లు రెండూ సత్యం
(D) I మరియు II లు రెండూ అసత్యం
జవాబు :
(D) I మరియు II లు రెండూ అసత్యం

ప్రశ్న12.
25% యొక్క భిన్న రూపం
(A) \(\frac{1}{5}\)
(B) \(\frac{1}{4}\)
(C) \(\frac{1}{3}\)
(D) \(\frac{1}{2}\)
జవాబు :
(B) \(\frac{1}{4}\)

ప్రశ్న13.
శాతాన్ని సూచించుటకు గుర్తు.
(A) %
(B) >
(C) <
(D) : :
జవాబు :
(A) %

ప్రశ్న14.
ఒక సైకిల్ కొన్న వెల ₹ 7000, అమ్మిన వెల ₹ 4000 అయిన
(A) లాభం ₹ 3000
(B) నష్టం ₹ 3000
(C) లాభం 50%
(D) పైవేవీ కావు
జవాబు :
(B) నష్టం ₹ 3000

ప్రశ్న15.
సురేష్ సెల్ ఫోన్లు ₹ 10,000 కు కొని ₹ 11,000 కు అమ్మిన లాభశాతము
(A) 1000
(B) 50
(C) 20
(D) 10
జవాబు :
(D) 10

AP 7th Class Maths Bits 7th Lesson నిష్పత్తి మరియు అనుపాతం

ప్రశ్న16.
ఒక వ్యాపారి ఒక బొమ్మను ₹ 500 కొన్నాడు. 20% లాభానికి అమ్మిన బొమ్మ అమ్మిన వెల
(A) ₹ 550
(B) ₹ 600
(C) ₹ 400
(D) ₹ 580
జవాబు :
(B) ₹ 600

ప్రశ్న17.
నష్టశాతము =
AP 7th Class Maths Bits 7th Lesson నిష్పత్తి మరియు అనుపాతం 2
జవాబు :
AP 7th Class Maths Bits 7th Lesson నిష్పత్తి మరియు అనుపాతం 3

ప్రశ్న18.
క్రింది వానిలో ఏది సత్యం ?
(A) రాయితీ = ప్రకటన వెల – అమ్మిన వెల
(B) లాభం = అమ్మిన వెల – కొన్న వెల
(C) నష్టం = కొన్న వెల – అమ్మిన వెల
(D) పైవన్నీ
జవాబు :
(D) పైవన్నీ

ప్రశ్న19.
చిన్న చిన్న లోపాలు గల చీరలపై బట్టల దుకాణదారుడు 25% రాయితీ ఇస్తున్నాడు. సరళ ప్రకటన వెల ₹ 1600 గల చీరను కొన్నచో దుకాణదారునికి ఎంత సొమ్ము చెల్లించాలి ?
(A) ₹ 1200
(B) ₹ 1000
(C) ₹ 2000
(D) ₹ 800
జవాబు :
(A) ₹ 1200

ప్రశ్న20.
I = \(\frac{P T R}{100}\) లో P సూచించునది.
(A) సాధారణ వడ్డీ
(B) కాలం
(C) అసలు
(D) వడ్డీ రేటు
జవాబు :
(C) అసలు

ప్రశ్న21.
సాధారణ వడ్డీ I = \(\frac{P T R}{100}\) అయిన క్రింది వానిలో ఏది సత్యం ?
(A) P = \(\frac{\mathrm{TR}}{100 \mathrm{I}}\)
(B) T = \(\frac{100 \mathrm{I}}{\mathrm{PR}}\)
(C) R = \(\frac{\mathrm{I}}{\mathrm{PT}}\)
(D) పైవన్నీ
జవాబు :
(B) T = \(\frac{100 \mathrm{I}}{\mathrm{PR}}\)

ప్రశ్న22.
అసలు ₹ 10,000, వడ్డీ రేటు 10% అయిన 2 సంవత్సరాలకు ఎంత వడ్డీ అవుతుంది ?
(A) ₹ 2000
(B) ₹ 1000
(C) ₹ 12,000
(D) ₹11,000
జవాబు :
(A) ₹ 2000

ప్రశ్న23.
2% =
(A) \(\frac{2}{100}\)
(B) \(\frac{1}{50}\)
(C) 0.02
(D) పైవన్నీ
జవాబు :
(D) పైవన్నీ

ప్రశ్న24.
5 లీటర్ల శానిటైజర్ యొక్క ప్రకటన వెల ₹ 500, అమ్మిన వెల ₹ 475 అయిన రాయితీ
(A) 10%
(B) 5%
(C) 25%
(D) 20%
జవాబు :
(B) 5%

AP 7th Class Maths Bits 7th Lesson నిష్పత్తి మరియు అనుపాతం

ప్రశ్న25.
18 మంది కూలీలు ఒక పంటను 6 రోజులలో కోయగలరు. అదే పంటను 12 మంది కూలీలు ఎన్ని రోజులలో కోయగలరు? .
(A) 15
(B) 12
(C) 9
(D) 6
జవాబు :
(C) 9

క్రింది ఖాళీలను పూరింపుము.

ప్రశ్న1.
a : b లో పూర్వ పదం _________
జవాబు :
a

ప్రశ్న2.
8: _________= 72 : 63
జవాబు :
7

ప్రశ్న3.
1 : 3 మరియు 2 : 5 ల బహుళ నిష్పత్తి _________
జవాబు :
2 : 15

ప్రశ్న4.
2 : 5 మరియు 6 : x అనుపాతంలో ఉంటే x = _________
జవాబు :
15

ప్రశ్న5.
x, y లు అనులోమానుపాతంలో ఉంటే x = k × y. ఇక్కడ k ను _________ అంటారు.
జవాబు :
అనుపాత స్థిరాంకం

ప్రశ్న6.
5 నోటు పుస్తకాల వెల ₹ 100 అయిన 7 నోటు పుస్తకాల వెల _________
జవాబు :
₹ 140

ప్రశ్న7.
3, 6 మరియు 10, x లు విలోమానుపాతంలో ఉంటే x = _________
జవాబు :
5

ప్రశ్న8.
6 పంపులు ఒక నీళ్ళ ట్యాంకును 3 గంటలలో నింపగలవు. అదే ట్యాంకు 2 గంటలలో నింపవలెనన్న కావలసిన పంపుల సంఖ్య _________
జవాబు :
9

ప్రశ్న9.
ఒక వర్తకుడు ఒక TV ని ₹ 48,000 లకు కొని, ₹ 54,000 అమ్మిన లాభం _________
జవాబు :
₹ 6000

AP 7th Class Maths Bits 7th Lesson నిష్పత్తి మరియు అనుపాతం

ప్రశ్న10.
పై 9వ సమస్యలో లాభ శాతం _________
జవాబు :
12 1/2%

ప్రశ్న11.
ఒక వస్తువు యొక్క అమ్మిన వెల ₹ 750, రాయితీ ₹ 75 అయిన ప్రకటన వెల. _________
జవాబు :
₹ 825

ప్రశ్న12.
సాధారణ వడ్డీ కనుగొనుటకు సూత్రం _________
జవాబు :
I = \(\frac{\mathrm{PTR}}{100}\)

ప్రశ్న13.
రాయితీ శాతము లెక్కించు సూత్రం _________
జవాబు :
AP 7th Class Maths Bits 7th Lesson నిష్పత్తి మరియు అనుపాతం 4

ప్రశ్న14.
ఒక సెల్ ఫోన్ కొన్న వెల ₹ 1500, నష్టం 10% అయిన అమ్మినవెల _________
జవాబు :
₹ 1350

ప్రశ్న15.
ఒక గ్రామంలోని ఓటర్ల సంఖ్య 5000, సర్పంచ్ ఎన్నికల యందు 90% ఓటర్లు ఓటు వేసినచో (పోలింగ్ శాతం 90) ఓటు వేయనివారి సంఖ్య _________
జవాబు :
500

జతపరుచుము :

ప్రశ్న1.

i) 200లో 3% = a) 2
ii) 3 : 2 = 6 : x అయిన x= b) 4
iii) 40% = \(\frac{x}{5}\) అయిన x = c) 6
iv) 1 : 4 మరియు 3 : 2 ల బహుళ నిష్పత్తి 3 : x అయిన x = d) 8

జవాబు :

i) 200లో 3% = c) 6
ii) 3 : 2 = 6 : x అయిన x= b) 4
iii) 40% = \(\frac{x}{5}\) అయిన x = a) 2
iv) 1 : 4 మరియు 3 : 2 ల బహుళ నిష్పత్తి 3 : x అయిన x = d) 8

ప్రశ్న2.
I = \(\frac{\text { PTR }}{100}\) సూత్రంలో క్రింది వానిని జతపరుచుము.

i) I a) కాలం
ii) P b) వడ్డీ రేటు
iii) T c) సాధారణ వడ్డ
iv) R d) అసలు

జవాబు :

i) I c) సాధారణ వడ్డ
ii) P d) అసలు
iii) T a) కాలం
iv) R b) వడ్డీ రేటు

AP 7th Class Maths Bits 7th Lesson నిష్పత్తి మరియు అనుపాతం

ప్రశ్న3.
క్రింది శాతాలను, వాని భిన్నరూపానికి జతపరుచుము.

i) 5% a) \(\frac{1}{5}\)
ii) 25% b) \(\frac{1}{20}\)
iii) 20% c) \(\frac{2}{5}\)
iv) 40% d) \(\frac{1}{4}\)

జవాబు :

i) 5% b) \(\frac{1}{20}\)
ii) 25% d) \(\frac{1}{4}\)
iii) 20% a) \(\frac{1}{5}\)
iv) 40% c) \(\frac{2}{5}\)

ప్రశ్న4.
క్రింది దశాంశ రూపానికి సమానమైన శాతానికి జతపరుచుము.

i) 0.25 a) 5%
ii) 0.05 b) 20%
iii) 0.2 c) 25%
iv) 0.5 d) 50%

జవాబు :

i) 0.25 c) 25%
ii) 0.05 a) 5%
iii) 0.2 b) 20%
iv) 0.5 d) 50%

క్రింది వానిలో సత్యం లేదా అసత్యం అయిన వాక్యాలను గుర్తించండి.

ప్రశ్న1.
లాభశాతాన్నిగాని, నష్టశాతాన్ని గాని అమ్మిన వెలపై లెక్కిస్తారు.
జవాబు :
అసత్యం

ప్రశ్న2.
శాతము అనగా 100 కి అని అర్థం.
జవాబు :
సత్యం

ప్రశ్న3.
AP 7th Class Maths Bits 7th Lesson నిష్పత్తి మరియు అనుపాతం 5
జవాబు :
అసత్యం

AP 7th Class Maths Bits 7th Lesson నిష్పత్తి మరియు అనుపాతం

ప్రశ్న4.
ఒక స్థలం యొక్క వైశాల్యం, దాని వెల విలోమాను పాతంలో ఉంటాయి.
జవాబు :
అసత్యం

ప్రశ్న5.
a, b మరియు c, d లు అనుపాతంలో ఉంటే ad = bc.
జవాబు :
సత్యం