Practice the AP 7th Class Maths Bits with Answers 12th Lesson సౌష్ఠవము on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 7th Class Maths Bits 12th Lesson సౌష్ఠవము

క్రింది వానికి సరైన సమాధానాలను ఎన్నుకొనుము.

ప్రశ్న1.
క్రింది వానిలో క్రమబహుభుజి కానిది.
(A) సమబాహు త్రిభుజము
(B) దీర్ఘచతురస్రము
(C) చతురస్రము
(D) పైవన్నీ
జవాబు :
(B) దీర్ఘచతురస్రము

ప్రశ్న2.
క్రింది వానిలో ఏది సత్యం ?
(A) క్రమబహుభుజి యొక్క భుజాల సంఖ్యకు సమాన సంఖ్యలో సౌష్ఠవ రేఖలను కలిగి ఉంటుంది.
(B) ఒక వృత్తమునకు అనంత సౌష్ఠవ రేఖలను గీయవచ్చును.
(C) సమాన భుజాల పొడవులు మరియు సమాన కోణాలు కలిగిన బహుభుజిని క్రమబహుభుజి అంటారు.
(D) పైవన్నీ
జవాబు :
(D) పైవన్నీ

ప్రశ్న3.
చతుర్భుజానికి సౌష్ఠవ రేఖల సంఖ్య .
(A) 2
(B) 3
(C) 4
(D) అనంతము
జవాబు :
(C) 4

ప్రశ్న4.
కింది ఏ కొలతలు గల త్రిభుజానికి సౌష్ఠవరేఖ ఉండదు?
(A) 60°, 60°, 60°
(B) 50°, 80°, 50°
(C) 30°, 60°, 90°
(D) 45°, 45°, 90°
జవాబు :
(C) 30°, 60°, 90°

AP 7th Class Maths Bits 12th Lesson సౌష్ఠవము

ప్రశ్న5.
క్రింది ఏ ఆంగ్ల అక్షరానికి సౌష్ఠవరేఖ లేదు ?
(A) H
(B) J
(C) I
(D) X
జవాబు :
(B) J

ప్రశ్న6.
క్రింది ఏ ఆంగ్ల అక్షరానికి ఇవ్వబడ్డ మిగిలిన అక్షరాల కన్నా ఎక్కువ సౌష్ఠవ రేఖలు కలవు ?
(A) H
(B) I
(C) A
(D) M
జవాబు :
(A) H

ప్రశ్న7.
వాక్యం 1 : ఒక పటాన్ని కేంద్ర బిందువు ద్వారా 360° భ్రమణం చెందించిన, కనీసం మూడుసార్లు ఒకేలా కనిపిస్తే ఆ పటం భ్రమణ సౌష్ఠవం కలిగి ఉంది అంటాము.
వాక్యం II : ఒక పటం 360° భ్రమణం చెందునపుడు ఎన్నిసార్లు అదే పటంతో ఏకీభవిస్తుందో దానినే ఆ పటం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం అంటారు.
(A) I – సత్యం, II – అసత్యం
(B) I – అసత్యం, II – సత్యం
(C) I మరియు II లు రెండూ సత్యం
(D) I మరియు, II లు రెండూ అసత్యం
జవాబు :
(B) I – అసత్యం , II – సత్యం

ప్రశ్న8.
సమబాహు త్రిభుజ భ్రమణ సౌష్ఠవ పరిమాణం
(A) 3
(B) 4
(C) 2
(D) 1
జవాబు :
(A) 3

ప్రశ్న9.
చతుర్భుజ భ్రమణ సౌష్ఠవ కోణం
(A) 30
(B) 60°
(C) 90°
(D) 180°
జవాబు :
(C) 90°

ప్రశ్న10.
భ్రమణ సౌష్ఠవ కోణం x° అయిన భ్రమణ సౌష్ఠవ పరిమాణము.
(A) \(\frac{180^{\circ}}{x^{\circ}}\)
(B) \(\frac{360^{\circ}}{x^{\circ}}\) – 1
(C) \(\frac{180^{\circ}}{x^{\circ}}\) + 1
(D) \(\frac{360^{\circ}}{x^{\circ}}\)
జవాబు :
(D) \(\frac{360^{\circ}}{x^{\circ}}\)

ప్రశ్న11.
బిందు సౌష్ఠవం కలిగిన పటం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణము .
(A) 2
(B) 3
(C) 4
(D) 5
జవాబు :
(A) 2

ప్రశ్న12.
క్రింది ఏ ఆంగ్ల అక్షరానికి బిందు సౌష్ఠవం లేదు ?
AP 7th Class Maths Bits 12th Lesson సౌష్ఠవము 1
జవాబు :
AP 7th Class Maths Bits 12th Lesson సౌష్ఠవము 2

ప్రశ్న13.
క్రమ షడ్భుజి యొక్క సౌష్ఠవాక్షాల సంఖ్య
(A) 6
(B) 5
(C) A
(D) 8
జవాబు :
(A) 6

ప్రశ్న14.
క్రింది ఏ ఆంగ్ల అక్షరానికి రేఖా సౌష్ఠవం, భ్రమణ సౌష్ఠవం మరియు బిందు సౌష్ఠవం కలదు ?
(A) M
(B) S
(C) A
(D) X
జవాబు :
(D) X

క్రింది ఖాళీలను పూరింపుము.

ప్రశ్న1.
క్రమ పంచభుజి యొక్క సౌష్ఠవాక్షాల సంఖ్య __________
జవాబు :
5

AP 7th Class Maths Bits 12th Lesson సౌష్ఠవము

ప్రశ్న2.
సమబాహు త్రిభుజ, భ్రమణ సౌష్ఠవ కోణం __________
జవాబు :
120°

ప్రశ్న3.
చతురస్రం యొక్క భ్రమణ పరిమాణం __________
జవాబు :
4

ప్రశ్న4.
సమబాహు త్రిభుజ ఉన్నతి దాని సౌష్ఠవాక్షం అవుతుంది. __________ (సత్యం | అసత్యం)
జవాబు :
సత్యం

ప్రశ్న5.
సమద్విబాహు త్రిభుజానికి గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య __________
జవాబు :
1

ప్రశ్న6.
60° భ్రమణ సౌష్ఠవ కోణంగా గల బహుభుజి యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణము __________
జవాబు :
6

ప్రశ్న7.
AP 7th Class Maths Bits 12th Lesson సౌష్ఠవము 3
యొక్క భ్రమణ సౌష్ఠవ కోణము __________
జవాబు :
90°

ప్రశ్న8.
AP 7th Class Maths Bits 12th Lesson సౌష్ఠవము 3
యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం __________
జవాబు :
4

ప్రశ్న9.
దీర్ఘచతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం __________
జవాబు :
2

ప్రశ్న10.
బిందు సౌష్ఠవం మరియు భ్రమణ సౌష్ఠవం కలిగిన ఒక ఆంగ్ల అక్షరానికి ఉదాహరణ __________
జవాబు :
S లేదా N లేదా X, Z

ప్రశ్న11.
అత్యధిక సౌష్ఠవాక్షాలు కలిగిన ఆంగ్ల అక్షరము __________
జవాబు :
O

జతపరుచుము :

ప్రశ్న1.
క్రింది క్రమబహుభుజిని, వానికి గల సౌష్ఠవ రేఖల సంఖ్యకు జతపరుచుము.

i) సమబాహు త్రిభుజం a) 6
ii) క్రమ పంచభుజి b) 5
iii) చతురస్రము c) 4
iv) క్రమ షడ్భుజి d) 3

జవాబు :

i) సమబాహు త్రిభుజం d) 3
ii) క్రమ పంచభుజి b) 5
iii) చతురస్రము c) 4
iv) క్రమ షడ్భుజి a) 6

AP 7th Class Maths Bits 12th Lesson సౌష్ఠవము

ప్రశ్న2.
క్రింది పటాలను వాని యొక్క భ్రమణ సౌష్ఠవ ‘పరిమాణమునకు జతపరుచుము.
AP 7th Class Maths Bits 12th Lesson సౌష్ఠవము 4
జవాబు :
i) b
ii) d
iii) a
iv) c

ప్రశ్న3.
క్రింది ఆకారాన్ని వాని యొక్క భ్రమణ సౌష్ఠవ కోణానికి జతపరుచుము.

i) చతురస్రం a) 180°
ii) క్రమ షడ్భుజి b) 120°
iii) దీర్ఘచతురస్రం c) 90°
iv) సమబాహు త్రిభుజం d) 60°

జవాబు :

i) చతురస్రం c) 90°
ii) క్రమ షడ్భుజి d) 60°
iii) దీర్ఘచతురస్రం a) 180°
iv) సమబాహు త్రిభుజం b) 120°