These AP 6th Class Social Important Questions 9th Lesson ప్రభుత్వం will help students prepare well for the exams.
AP Board 6th Class Social 9th Lesson Important Questions and Answers ప్రభుత్వం
ప్రశ్న 1.
ప్రభుత్వం అనగా నేమి? సాధారణంగా ప్రభుత్వం ఎన్ని విభాగాలు కల్గి ఉంటుంది? అవి ఏవి?
జవాబు:
ఒక దేశాన్ని లేదా ఒక రాష్ట్రాన్ని నియంత్రిస్తూ, వారి కొరకు నిర్ణయాలను తీసుకునే ప్రజల సమూహాని “ప్రభుత్వం” అంటారు. సాధారణంగా ప్రభుత్వం మూడు విభాగాలను కలిగి ఉంటుంది. అవి :
- శాసన నిర్మాణ శాఖ
- కార్యనిర్వహక శాఖ
- న్యాయశాఖ
ప్రశ్న 2.
ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఎన్ని రకాలు కలవు? అవి ఏవి? వివరించుము.
జవాబు:
ప్రస్తుత ప్రపంచంలో చాలా దేశాలలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. భారతదేశం కూడా ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యంలో రెండు రకాలు ఉన్నాయి. అవి :
ప్రత్యక్ష ప్రజాస్వామ్యం :
ప్రజలు నేరుగా నిర్ణయం తీసుకోవడంలో పాల్గొంటారు.
ఉదాహరణకి :
స్విట్జర్లాండ్. ఈ దేశంలో పౌరుల ఒక ప్రదేశంలో సమావేశమై నిర్ణయాలు తీసుకుంటారు లేదా చట్టాలు చేస్తారు. ఇక్కడ తక్కువ జనాభా ఉన్నందున ఇది సాధ్యమైంది.
పరోక్ష ప్రజాస్వామ్యం (ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం) :
ప్రజాస్వామ్యం యొక్క ఈ రూపంలో, ప్రజలు తమ ప్రతినిధుల ద్వారా పరోక్షంగా నిర్ణయం తీసుకోవడంలో పాల్గొంటారు. అధికంగా జనాభా ఉండటం వల్ల, భారతదేశంతో సహా చాలా దేశాలు పరోక్ష ప్రజాస్వామ్యాన్ని అనుసరిస్తున్నాయి.
ప్రశ్న 3.
ఎన్నికలు అనగానేమి? ప్రజాస్వామ్యంలో ఎన్నికల పాత్ర ఏమిటి?
జవాబు:
ఎన్నికలు :
ప్రతినిధిని ఎన్నుకునే విధానాన్ని “ఎన్నికలు” అంటారు. పరోక్ష ప్రజాస్వామ్య విజయం ఎన్నికలపై ఆధారపడి ఉంటుంది. ఎన్నికలు ఇక్కడ కీలకపాత్ర పోషిస్తాయి. కాబట్టి, ఎన్నికలు స్వేచ్చగా మరియు నిష్పక్షపాతంగా జరగాలి.
ప్రశ్న 4.
భారతదేశంలో విశ్వజనీన ఓటుహక్కుల గూర్చి తెలుపుము.
జవాబు:
భారతదేశంలో స్వాతంత్ర్యానికి ముందు మహిళలకు మరియు కొన్ని వర్గాల ప్రజలకు ఓటు హక్కు లేదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం, ఒక నిర్దిష్ట వయస్సు (ప్రస్తుతం 18 సంవత్సరాలు) పొందిన అందరికీ ఓటు హక్కు ఉంది. (విశ్వజనీన వయోజన ఓటుహక్కు).
ప్రశ్న 5.
భారతదేశంలో ఎన్ని స్థాయిల్లో ప్రభుత్వం ఉంది? ఎందుకు అలా ఏర్పాటు చేసారు?
జవాబు:
భారతదేశం అత్యధిక జనాభా కలిగిన విశాలమైన దేశం. కాబట్టి దేశ వ్యాప్తంగా ప్రజల అవసరాలు మరియు ఆ సమస్యలను గుర్తించడం కష్టం. కాబట్టి, వివిధ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం వివిధ స్థాయిలలో పనిచేస్తుంది. అవి :
1. జాతీయ స్థాయి – కేంద్ర ప్రభుత్వం,
2. రాష్ట్ర స్థాయి – రాష్ట్ర ప్రభుత్వం,
3. స్థానిక స్థాయి – స్థానిక ప్రభుత్వం.
ప్రశ్న 6.
వివిధ రకాల ప్రభుత్వ రూపాల గురించి సవివరంగా తెల్పండి.
జవాబు:
వివిధ రకాల ప్రభుత్వాలు :
రాచరికం మరియు ప్రజాస్వామ్యం వంటి అనేక రకాల ప్రభుత్వాలు ప్రాచీన కాలం నుండి నేటి వరకు పనిచేస్తున్నాయి.
రాచరికం :
మునుపటి అధ్యాయంలో అశోకుడు, చంద్రగుప్తుడు వంటి చక్రవర్తులు లేదా రాజులు పరిపాలించిన సామ్రాజ్యాలు గురించి మీరు తెలుసుకున్నారు. ఒకరాజు లేదా రాణి చేసే పాలనను “రాచరికం” అంటారు. రాజు లేదా రాణి వారసత్వంగా అధికారంలోకి వస్తారు. ఉదాహరణకు అశోకుడు, తన తండ్రి బిందుసారుడు తరువాత అధికారంలోకి వచ్చాడు. కొంతమంది చక్రవర్తులు అన్ని అధికారాలను తామే కలిగి ఉంటారు.
కానీ మరికొందరు ప్రభుత్వంలోని ఇతర శాఖల అధికారులతో పంచుకుంటారు. కాబట్టి, పౌరులకు రాజును బట్టి హక్కులు మరియు సౌకర్యాలు ఉండవచ్చు. ఉదాహరణకు ప్రజలు ఇతర రాజుల పాలన కంటే అశోకుని పాలనలో ఎక్కువ స్వేచ్ఛ మరియు సౌకర్యాలను పొందారు.
ప్రజాస్వామ్యం :
ఇది ప్రజలు నడుపుతున్న ప్రభుత్వ రూపం. ఇక్కడ ప్రతి పౌరుడికి ఓటు వేయడానికి అనుమతి ఉంది. అందువల్ల అతను / ఆమె నేరుగా లేదా వారి ప్రతినిధుల ద్వారా నిర్ణయాలు తీసుకోవడంలో లేదా చట్టాలు, తీసుకోవడంలో పాల్గొంటారు. రాచరికం వంటి ఇతర రకాల ప్రభుత్వాలలో కంటే ప్రజాస్వామ్యంలోని పౌరులు ఎక్కువ హక్కులు మరియు సౌకర్యాలు పొందుతారు. ఇక్కడ అధికారం వారసత్వంగా పొందలేము.
ప్రశ్న 7.
క్రింద ఇవ్వబడిన ఫ్లోచార్టును పరిశీలించి, ఇచ్చిన ప్రశ్నలకు సరియైన సమాధానలివ్వండి.
ఎ) భారతదేశంలో ఏ విధమైన ప్రజాస్వామ్యం కలదు?
జవాబు:
పరోక్ష ప్రజాస్వామ్యం
బి) ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఏ దేశంలో కలదు?
జవాబు:
స్విట్జర్లాండ్.
సి) పరోక్ష ప్రజాస్వామ్యంలో చట్టాలు, నియమాలు ఎవరు రూపొందిస్తారు?
జవాబు:
ఎన్నికైన ప్రతినిధులు
డి) ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని సం||రాలకు ఓటు హక్కు లభిస్తుంది?
జవాబు:
18 సం||రాలకు పై బడినవారికి. ప్రజాస్వామ్యం రకాలు (ఫ్లోచార్టు)
ప్రశ్న 8.
క్రింది చిత్రంను పరిశీలించి, ఇవ్వబడిన ప్రశ్నలకు సరియైన జవాబు లివ్వండి.
ఎ). చిత్రంలోని వ్యక్తి ఏ దేశ అధ్యక్షుడు?
జవాబు:
అమెరికా
బి) ప్రజాస్వామ్యానికి జన్మస్థలం ఏది?
జవాబు:
గ్రీసు.
సి) ప్రజాస్వామ్యం అనగానేమి?
జవాబు:
ప్రజల యొక్క ప్రజల చేత, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం.
డి) చిత్రంలోని వ్యక్తి ఎవరు?
జవాబు:
అబ్రహం లింకన్.
ప్రశ్న 9.
ఈ క్రింది పటాన్ని గమనించి ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
1. భారతదేశంలో ఉత్తరాన ఉన్న రాష్ట్రం ఏది?
జవాబు:
భారతదేశంలో ఉత్తరాన ఉన్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్,
2. అండమాన్, నికోబార్ దీవులు ఏ సముద్రంలో ఉన్నాయి?
జవాబు:
అండమాన్, నికోబార్ దీవులు బంగాళాఖాతంలో ఉన్నాయి.
3. గోవా ఏ సముద్రం ఒడ్డున ఉన్నది?
జవాబు:
గోవా అరేబియా సముద్రం ఒడ్డున ఉన్నది.
4. భారతదేశం మధ్యలో ఉన్న రాష్ట్రమేది?
జవాబు:
భారతదేశం మధ్యలో ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్,
5. నాగాలాండకు, మిజోరంకు మధ్యన ఏ రాష్ట్రం కలదు?
జవాబు:
నాగాలాండకు, మిజోరంకు మధ్యన ఉన్న రాష్ట్రం మణిపూర్.
6. భారతదేశానికి సరిహద్దుగా ఉన్న రాచరిక దేశం ఏది?
జవాబు:
భూటాన్.