Practice the AP 6th Class Social Bits with Answers 3rd Lesson పటములు on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 6th Class Social Bits 3rd Lesson పటములు

I. బహుళైచ్ఛిక ప్రశ్నలు

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.

1. క్రిందివానిలో ఒక దానిని ఖండంగా, మహా వైపు ఉండే దిక్కు సముద్రంగా ఒకే పేరుతో పిలుస్తాం.
A) ఆర్కిటిక్
B) అట్లాంటిక్
C) అంటార్కిటిక్
D) పైవన్నీ
జవాబు:
C) అంటార్కిటిక్

2. క్రిందివానిలో మూల దిక్కు కానిది.
A) ఈశాన్యం
B) వాయవ్యం
C) ఆగ్నేయం
D) పశ్చిమం
జవాబు:
D) పశ్చిమం

3. క్రిందివానిలో ప్రధాన దిక్కు కానిది.
A) తూర్పు
B) ఉత్తరం
C) దక్షిణం
D) నైరుతి
జవాబు:
D) నైరుతి

4. పటంలోని ముఖ్యమైన అంశం
A) దిక్కులు
B) స్కేలు
C) చిహ్నాలు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

5. ప్రపంచంలో పెద్ద ఖండం
A) ఆసియా
B) ఆఫ్రికా
C) యూరప్
D) ఉత్తర అమెరికా
జవాబు:
A) ఆసియా

AP 6th Class Social Bits Chapter 3 పటములు

6. మైదానాల విస్తరణను గురించి తెలియజేయు మానచిత్రం (పటం)
A) రాజకీయ పటం
B) విషయ నిర్దేశిత పటం
C) భౌతిక పటము
D) పైవన్నీ
జవాబు:
C) భౌతిక పటము

7. తూర్పు దిక్కుకు అభిముఖంగా నిలబడి ఉంటే ఎడమ
A) పడమర
B) ఉత్తరం
C) దక్షిణం
D) ఈశాన్యం
జవాబు:
B) ఉత్తరం

8. మాన చిత్రంలో స్కేలు 5 సెం.మీ : 500 మీ || అయినచో, పటంలోని రెండు ప్రదేశాల మధ్య దూరం 15 సెం.మీ అయితే వాస్తవ దూరం ఎంత?
A) 500 మీ||
B) 1500 మీ ||
C) 1500 కి.మీ||
D) 500 కి.మీ||
జవాబు:
B) 1500 మీ ||

9. మాన చిత్రంలోని PS దేనిని సూచించును?
A) రైల్వే స్టేషన్
B) ప్రైమరీ స్కూల్
C) పోలీసు స్టేషన్
D) పోస్టాఫీసు
జవాబు:
C) పోలీసు స్టేషన్

10. మాన చిత్రాలను తయారు చేసేటపుడు సాధారణంగా ఏ దిక్కును పై భాగంలో ఉంచుతారు.
A) ఉత్తరం
B) దక్షిణం
C) తూర్పు
D) పడమర
జవాబు:
A) ఉత్తరం

11. మాన చిత్రాలపైన దూరాలను సూచించటానికి ఉపయోగించేవి.
A) ధూరం
B) స్కేలు
C) చిహ్నాలు
D) దిక్కులు
జవాబు:
B) స్కేలు

12. క్రింది వానిలో మాన చిత్రంలో ‘పక్కా రోడ్డు’ను సూచించే చిహ్నం.
AP 6th Class Social Bits Chapter 3 పటములు 5
జవాబు:
B

13. స్కేలు పటంలో ఉన్న రెండు బిందువుల మధ్య దూరానికి మరియు భూమిపైన ఉండే వాస్తవ దూరానికి మధ్యన ఉండే ……..
A) విలోమము
B) సమానము
C) నిష్పత్తి
D) పైవన్నీ
జవాబు:
C) నిష్పత్తి

14. భారతదేశం ఈ దేశంతో భూ సరిహద్దును పంచు కోవటం లేదు.
A) ఆఫ్ఘనిస్తాన్
B) బంగ్లాదేశ్
C) భూటాన్
D) శ్రీలంక
జవాబు:
D) శ్రీలంక

15. దేశ రాజధానులు, ముఖ్య పట్టణాలను గురించి తెలుసుకోవాలంటే ఈ పటమును తీసుకోవాలి.
A) భౌతిక పటము
B) విషయ నిర్దేశిత పటము
C) రాజకీయ పటము
D) పైవన్నీ
జవాబు:
C) రాజకీయ పటము

16. క్రింది వానిలో స్కేల్ ఆధారంగా పెద్ద తరహా పటానికి ఉదాహరణ
A) భూ నైసర్గిక పటం
B) భూ సరిహద్దులను తెలిపే పటం
C) A & B
D) గోడ పటాలు
జవాబు:
C) A & B

AP 6th Class Social Bits Chapter 3 పటములు

17. విస్తృత స్కేలుపై చిత్రించిన చిన్న ప్రదేశాన్ని సూచించునది.
A) మాన చిత్రం
B) స్కేలు
C) ప్రణాళిక
D) చిత్తుపటం
జవాబు:
C) ప్రణాళిక

II. ఖాళీలను పూరించుట

కింది ఖాళీలను పూరింపుము

1. స్కేల్ ఉపయోగించకుండా గుర్తు ఉన్న దాన్ని బట్టి అప్పటికప్పుడు పరిశీలించి గీసే చిత్రం
2. అన్ని పటాలలోనూ కుడిచేతివైపు పైన …….. అనే అక్షరం, బాణం గుర్తు ఉంటాయి.
3. ……… ల సహాయంతో ఏ ప్రాంతం యొక్క ఉనికి ని అయినా ఖచ్చితంగా తెలుసుకోవచ్చును.
4. పటంలో రెండు ప్రాంతాల మధ్య గల దూరాన్ని లెక్కించటానికి ………… ఉపయోగిస్తాం.
5. పటాలను తయారు చేసేవారిని ……… అని పిలుస్తారు.
6. పటాల సంకలనాన్ని ……………. అని పిలుస్తారు.
7. పటంలో గోధుమరంగు ………. ని సూచించడానికి ఉపయోగిస్తాము.
8. భూమిపై గల విశాల భూభాగాలను …………….. అంటారు.
9. భూమిపై గల విశాల నీటి భాగాలను అంటారు.
10. G.P.S. ని విస్తరింపుము ………..
11. రెండు ప్రధాన దిక్కుల మధ్యగల దిశ ………
12. భారతదేశం ……… ఖండంలో కలదు.
13. మహారాష్ట్ర రాజధాని ……….
14. దిక్కులను తెలుసుకోవటానికి ఉపయోగించే పరికరము.
15. ……………… తక్కువ స్థలంలో ఎంతో ఎక్కువ సమాచారాన్నిస్తాయి.
జవాబు:

  1. చిత్తు చిత్రం
  2. ‘N’
  3. మూల
  4. స్కేల్
  5. కార్టో గ్రాఫర్లు
  6. అట్లాస్
  7. పర్వతాలు
  8. ఖండాలు
  9. మహాసముద్రాలు
  10. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్
  11. మూలలు
  12. ఆసియా
  13. ముంబయి
  14. దిక్సూచి
  15. చిహ్నాలు

III. జతపరుచుట

కింది వానిని జతపరుచుము.
1.
AP 6th Class Social Bits Chapter 3 పటములు 6
జవాబు:
i) – d ii) – c iii) – b iv) – a

2.
AP 6th Class Social Bits Chapter 3 పటములు 7
జవాబు:
i) – a ii) – b iii) – c iv) – d v) – e vi) – f vii) – g

3.
AP 6th Class Social Bits Chapter 3 పటములు 8
జవాబు:
i) – c ii) – d iii) – a iv) – b