Practice the AP 6th Class Maths Bits with Answers 9th Lesson ద్విమితీయ – త్రిమితీయ ఆకారాలు on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 6th Class Maths Bits 9th Lesson ద్విమితీయ – త్రిమితీయ ఆకారాలు

క్రింది ప్రశ్నలకు ఒక పదం లేదా ఒక వాక్యంలో సమాధానాలు రాయండి.

ప్రశ్న1.
∆ABC ని చిత్తుపటంలో చూపండి.
జవాబు :
AP 6th Class Maths Bits 9th Lesson ద్విమితీయ – త్రిమితీయ ఆకారాలు 1

ప్రశ్న2.
∆PQR కు చిత్తుపటం గీచి, A, B, C లు అంతరంగాను, X, Y, Z లు బాహ్యంగాను ఉండునట్లు గుర్తించండి.
జవాబు :
AP 6th Class Maths Bits 9th Lesson ద్విమితీయ – త్రిమితీయ ఆకారాలు 2

ప్రశ్న3.
‘O’ కేంద్రంగా గల వృత్తాన్ని గీచి, దానిలో వ్యాసం PQ, జ్యా AB లను గుర్తించండి.
జవాబు :
AP 6th Class Maths Bits 9th Lesson ద్విమితీయ – త్రిమితీయ ఆకారాలు 3

ప్రశ్న4.
రెండు సౌష్ఠవాక్షాలు కలిగిన ఆంగ్ల పెద్ద అక్షరాలను రాయండి.
జవాబు :
H, I, X

ప్రశ్న5.
ఒక సౌష్ఠవాక్షం గల ఆంగ్ల పెద్ద అక్షరాలను రాయండి.
జవాబు :
A, B, C, D, E, I, K, M, T, U, V, W

ప్రశ్న6.
దీర్ఘఘనానికి ఆయిలర్ సూత్రాన్ని సరిచూడండి.
జవాబు :
దీర్ఘఘనం ముఖాలు (F) = 6
అంచులు (E) = 12
శీర్షాలు (V) = 8
ఆయిలర్ సూత్రం F + V = E + 2
6 + 8 = 12 + 2
14 = 14

AP 6th Class Maths Bits 9th Lesson ద్విమితీయ – త్రిమితీయ ఆకారాలు

ప్రశ్న7.
ఆయిలర్ సూత్రాన్ని రాసి, అందలి అక్షరాలు సూచించే విషయాలను తెల్పండి.
జవాబు :
ఆయిలర్ సూత్రం F + V = E + 2
F- ముఖాల సంఖ్య, V – శీర్షాల సంఖ్య, E- అంచుల సంఖ్య

ప్రశ్న8.
క్రింది వానిలో సత్యమైన వాక్యం ఎదురు T అని, అసత్య వాక్యానికి ఎదురుగా F అని రాయండి.
i) వృత్త కేంద్రం ఎల్లప్పుడు వృత్త అంతరంగా ఉంటుంది.
ii) వృత్త వ్యాసార్ధం ‘r’ అయితే ఆ వృత్త వ్యాసం 2r.
iii) గోళమునకు గల శీర్షాల సంఖ్య 8.
iv) త్రిభుజానికి మూడు భుజాలు, మూడు కోణాలు, మూడు శీర్షాలు ఉంటాయి.
జవాబు :
i – T, ii – T, iii – F, iv-T

ఈ క్రింది వానికి సరియైన సమాధానాన్ని గుర్తించి రాయండి.

ప్రశ్న1.
బహుభుజి పేరును, దానికి గల భుజాల సంఖ్యకు జతచేయడంలో ఏది సరైనది ?

i) పంచభుజి a) 4
ii) సప్తభుజి b) 5
iii) అష్టభుజి c) 7
iv) చతుర్భుజం d) 8

A) i → b, ii → c, iii → d, iv → a
B) i → b, ii → d, iii → a, iv → c
C) i → c, ii → d, iii → b, iv → a
D) i → a, ii → c, iii → b, iv → d
జవాబు :
A) i → b, ii → c, iii → d, iv → a

ప్రశ్న2.
త్రిమితీయ (3D – ఆకారం) క్రింది ఏ కొలతను కలిగి ఉంటుంది ?
A) పొడవు
B) వెడల్పు
C) ఎత్తు (లోతు)
D) పైవిఅన్ని
జవాబు :
D) పైవిఅన్ని

ప్రశ్న3.
వాక్యం – I : వృత్త కేంద్రం గుండా పోవు జ్యాను వ్యాసం అంటారు.
వాక్యం – II : ఒక బహుభుజి ఏర్పడుటకు కనీసం మూడు భుజాలు ఉండాలి. పై రెండు వాక్యాలకు సంబంధించి క్రింది ఏది సరైనది ?
A) I సత్యం, II సత్యం
B) I అసత్యం, II అసత్యం
C) I సత్యం, II అసత్యం
D) I అసత్యం, II సత్యం
జవాబు :
A) I సత్యం, II సత్యం

ప్రశ్న4.
‘x’ అక్షరానికి సాధ్యమవు సౌష్ఠవ రేఖల సంఖ్య
A) 1
B) 2
C) 3
D) 4
జవాబు :
B) 2

ప్రశ్న5.
క్రింది ఏ 3D- ఆకారం యొక్క భూమి వృత్తాకారము?
A) స్థూపం
B) శంఖువు
C) పిరమిడ్
D) A మరియు B
జవాబు :
D) A మరియు B

ప్రశ్న6.
ఫుట్ బాల్ ఆటలో వాడే బంతి క్రింది ఏ ఘనాకార వస్తువుకు నమూనా ?
A) స్థూపం
B) గోళము
C) శంఖువు
D) అర్ధగోళము
జవాబు :
B) గోళము

ప్రశ్న7.
ఆయిలర్ సూత్రం .
A) F + V = E + 2
B) F + E = V + 2
C) E + V = F + 2
D) E – F = V + 2
జవాబు :
A) F + V = E + 2

AP 6th Class Maths Bits 9th Lesson ద్విమితీయ – త్రిమితీయ ఆకారాలు

ప్రశ్న8.
దీర్ఘఘనం యొక్క శీర్షాల సంఖ్య
A) 12
B) 6
C) 8
D) 10
జవాబు :
C) 8

ప్రశ్న9.
చతురస్రాకార పిరమిడ్ యొక్క తలాల సంఖ్య
A) 8
B) 7
C) 5
D) 4
జవాబు :
C) 5

→ ప్రక్క పటం ‘O’ కేంద్రంగా గల వృత్తాన్ని సూచిస్తుంది. పటం ఆధారంగా 10-14 వరకు గల ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 6th Class Maths Bits 9th Lesson ద్విమితీయ – త్రిమితీయ ఆకారాలు 4

ప్రశ్న10.
\(\overline{\mathbf{O C}}\) దేనిని సూచిస్తుంది ?
A) వ్యాసం
B) జ్యా
C) వ్యాసార్ధం
D) చాపం
జవాబు :
C) వ్యాసార్ధం

ప్రశ్న11.
వృత్త వ్యాసము
A) AB
B) XY
C) OC
D) OX
జవాబు :
B) XY

ప్రశ్న12.
వృత్త వ్యాసము పొడవు
A) 3 సెం.మీ.
B) 1.5 సెం.మీ.
C) 6 సెం.మీ.
D) కనుగొనలేము
జవాబు :
C) 6 సెం.మీ.

ప్రశ్న13.
క్రింది వానిలో ఏది సత్యం ?
A) AB = XY
B) OX = OC
C) OY < OX
D) ‘O’ వృత్తంపై గల బిందువు
జవాబు :
B) OX = OC

ప్రశ్న14.
Y మరియు C ల మధ్యగల వృత్తభాగాన్ని “చాపం” అంటారు. ఈ చాపాన్ని క్రింది ఏ విధంగా సూచిస్తారు?
A) \(\widehat{\mathrm{XC}}\)
B) \(\overline{\mathrm{XC}}\)
C) ∠XOC
D) OX ⊥ OC
జవాబు :
A) \(\widehat{\mathrm{XC}}\)

ప్రశ్న15.
క్రింది పటం ABCD చతుర్భుజంలోని కర్ణాలు
AP 6th Class Maths Bits 9th Lesson ద్విమితీయ – త్రిమితీయ ఆకారాలు 5
A) AB మరియు AC
B) BC మరియు CD
C) BD మరియు DC
D) AC మరియు BD
జవాబు :
D) AC మరియు BD

ప్రశ్న16.
క్రింది వానిలో త్రిమితీయ 3D – ఆకారము
A) త్రిభుజం
B) ఘనం
C) చతుర్భుజం
D) షడ్భుజి
జవాబు :
B) ఘనం

AP 6th Class Maths Bits 9th Lesson ద్విమితీయ – త్రిమితీయ ఆకారాలు

ప్రశ్న17.
క్రింది వానిని సూచించుటకు ఉపయోగించే గుర్తులను జతపరచడంలో ఏది సరైనది ?
AP 6th Class Maths Bits 9th Lesson ద్విమితీయ – త్రిమితీయ ఆకారాలు 6
A) i → a, ii → b, iii → c, iv → d
B) i → d, ii → c, iii → a, iv → b
C) i → c, ii → d, iii → a, iv → b
D) i → c, ii → b, iii → d, iv → a
జవాబు :
D) i → c, ii → b, iii → d, iv → a

క్రింది ఖాళీలను పూరించండి.

ప్రశ్న1.
బహుభుజి ఏర్పడుటకు అవసరమగు కనీస భుజాల సంఖ్య ________________
జవాబు :
3

ప్రశ్న2.
నాలుగు భుజాలు కలిగిన బహుభుజిని ________________ అంటారు.
జవాబు :
చతుర్భుజం

ప్రశ్న3.
త్రిభుజం కలిగి ఉండు శీర్షాల సంఖ్య ________________
జవాబు :
3

ప్రశ్న4.
దీర్ఘఘనంనకు గల తలాల సంఖ్య ________________ అంటారు.
జవాబు :
6

ప్రశ్న5.
ఘనం యొక్క అంచుల సంఖ్య ________________
జవాబు :
12

ప్రశ్న6.
భూమి బహుభుజిగాను మిగిలిన ముఖాలు త్రిభుజాకారంలో గల త్రిమితీయ ఆకారం పేరు ________________
జవాబు :
పిరమిడ్

ప్రశ్న7.
గోళం యొక్క అంచుల సంఖ్య ________________
జవాబు :
0

AP 6th Class Maths Bits 9th Lesson ద్విమితీయ – త్రిమితీయ ఆకారాలు

ప్రశ్న8.
చతురస్రానికి సాధ్యమగు, సౌష్ఠవ రేఖల సంఖ్య ________________
జవాబు :
4

ప్రశ్న9.
‘B’ అక్షరానికి గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య ________________
జవాబు :
1

ప్రశ్న10.
అనంతంగా సౌష్ఠవ రేఖలను కలిగిన ఆంగ్ల అక్షరం ________________
జవాబు :
O

ప్రశ్న11.
వృత్తంపై గల రెండు బిందువులను కలిపే రేఖాఖండాన్ని ________________
జవాబు :
జ్యా

ప్రశ్న12.
కేంద్రం గుండా పోవు జ్యాను ________________ అంటారు.
జవాబు :
వ్యాసము

ప్రశ్న13.
వృత్తకేంద్రం నుండి వృత్తానికి గల దూరాన్ని ________________ అంటారు.
జవాబు :
వ్యాసార్ధం

క్రింది వానిని జతపరుచుము.

ప్రశ్న1.

i) అగ్గిపెట్టె a) శంఖువు
ii) బంతి b) దీర్ఘఘనం
iii) జోకర్ టోపి c) గోళము
iv) కర్రదుంగ d) పిరమిడ్
e) స్థూపము

జవాబు :

i) అగ్గిపెట్టె b) దీర్ఘఘనం
ii) బంతి c) గోళము
iii) జోకర్ టోపి a) శంఖువు
iv) కర్రదుంగ e) స్థూపము

ప్రశ్న2.

బహుభుజి పేరు భుజాల సంఖ్య
i) త్రిభుజము a) 7
ii) పంచభుజి b) 6
iii) షడ్భుజి c) 5
iv) చతుర్భుజి d) 4
e) 3

జవాబు :

బహుభుజి పేరు భుజాల సంఖ్య
i) త్రిభుజము e) 3
ii) పంచభుజి c) 5
iii) షడ్భుజి b) 6
iv) చతుర్భుజి d) 4

AP 6th Class Maths Bits 9th Lesson ద్విమితీయ – త్రిమితీయ ఆకారాలు

ప్రశ్న3.

i) దీర్ఘఘనం అంచుల సంఖ్య a) 8
ii) ఘనం శీర్షాల సంఖ్య b) 6
iii) శంఖువు శీర్షాల సంఖ్య c) 6
iv) పట్టకం యొక్క శీర్షాల సంఖ్య d) 12
e) 10

జవాబు :

i) దీర్ఘఘనం అంచుల సంఖ్య d) 12
ii) ఘనం శీర్షాల సంఖ్య a) 8
iii) శంఖువు శీర్షాల సంఖ్య b) 6
iv) పట్టకం యొక్క శీర్షాల సంఖ్య c) 6

ప్రశ్న4.
ఆయిలర్ సూత్రం F + V = E + 2 లో వివిధ అక్షరాలు సూచించే అంశాలకు జతపరుచుము.

i) F a) శీర్షాలు
ii) V b) అంచులు
iii) E c) ముఖాలు (తలాలు)
d) భూమి చుట్టుకొలత

జవాబు :

i) F c) ముఖాలు (తలాలు)
ii) V a) శీర్షాలు
iii) E b) అంచులు