AP SCERT 6th Class Maths Textbook Solutions Chapter 9 ద్విమితీయ – త్రిమితీయ ఆకారాలు Ex 9.2 Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 6th Class Maths Solutions 9th Lesson ద్విమితీయ – త్రిమితీయ ఆకారాలు Exercise 9.2
ప్రశ్న 1.
ఇవ్వబడిన త్రిభుజాన్ని గమనించండి మరియు కింది ప్రశ్నలకు జవాబివ్వండి.

(అ) త్రిభుజానికి బాహ్యంగా ఉండే బిందువులేవి?
(ఆ) త్రిభుజం మీది గల బిందువులేవి?
(ఇ) త్రిభుజానికి అంతరంగా ఉండే బిందువులేవి?
సాధన.
(అ) త్రిభుజానికి బాహ్యంగా గల బిందువులు X, Y, Z.
(ఆ) త్రిభుజం మీది గల బిందువులు A, B, C, I, J.
(ఇ) త్రిభుజానికి అంతరంగా గల బిందువులు O, L, K.
![]()
ప్రశ్న 2.
ఇవ్వబడిన త్రిభుజాన్ని గమనించి, కింది ప్రశ్నలకు సమాధానాలివ్వండి.

(అ) త్రిభుజంలో ఎన్ని భుజాలు కలవు ? అవి ఏవి?
(ఆ) త్రిభుజంలో ఎన్ని శీర్షాలు ఉన్నవి ? అవి ఏవి?
(ఇ) శీర్షం P కు అభిముఖంగా ఉన్న భుజం ఏది?
(ఈ) \(\overline{\mathbf{P R}}\) భుజానికి అభిముఖంగా ఉన్న శీర్షం ఏది?
సాధన.
(అ) 3 భుజాలు కలవు. అవి : (i) \(\overline{\mathbf{P Q}}\) (ii) \(\overline{\mathbf{Q R}}\) (iii) \(\overline{\mathbf{P R}}\).
(ఆ) 3 శీర్షాలు కలవు. అవి : (i) P (ii) Q (iii) R.
(ఇ) శీర్షం P కు అభిముఖంగా ఉన్న భుజం \(\overline{\mathbf{Q R}}\).
(ఈ) \(\overline{\mathbf{P R}}\) భుజానికి అభిముఖంగా ఉన్న శీర్షం ‘Q’.
![]()
ప్రశ్న 3.
పక్క త్రిభుజాన్ని పరిశీలించి, కింది వాటికి జవాబివ్వండి.

(అ) త్రిభుజంలో గల కోణాలెన్ని ? అవి ఏవి ?
(ఆ) \(\overline{\mathbf{M N}}\) భుజానికి అభిముఖంగా గల కోణమేది?
(ఇ) ఇవ్వబడిన త్రిభుజంలో లంబకోణం కలిగిన శీర్షమేది?
సాధన.
(అ) త్రిభుజంలో గల కోణాల సంఖ్య 3. అవి :
(i) \(\angle \mathrm{MNO}\) లేదా \(\angle \mathrm{N}\),
(ii) \(\angle \mathrm{NOM}\) లేదా \(\angle \mathrm{O}\),
(iii) \(\angle \mathrm{OMN}\) లేదా \(\angle \mathrm{N}\).
(ఆ) \(\overline{\mathbf{M N}}\) భుజానికి అభిముఖంగా గల కోణం \(\angle \mathrm{NOM}\) లేదా \(\angle \mathrm{O}\)
(ఇ) లంబకోణాన్ని కలిగిన శీర్షం ‘O’.






































































































