AP Board 9th Class Telugu Solutions Chapter 4 ప్రేరణ

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions Chapter 4 ప్రేరణ Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions 4th Lesson ప్రేరణ

9th Class Telugu 4th Lesson ప్రేరణ Textbook Questions and Answers

చదవండి-ఆలోచించండి-చెప్పండి

ప్రజ్ఞ చాలా తెలివికలది. ఆమెకు శాస్త్రవేత్త కావాలని బలమైన కోరిక ఉంది. ప్రతీ దాన్ని పరిశీలన దృష్టితో చూస్తుంది. విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో బహుమతులు కూడా గెల్చుకుంది. శాస్త్రవేత్తలకు సంబంధించిన పుస్తకాలను చదువుతుంది. సందేహ నివృత్తి కోసం ఉపాధ్యాయులను, పెద్దలను, అన్నయ్యను సంప్రదిస్తుంది. ఒకరోజున విజ్ఞానశాస్త్ర కార్యక్రమంలో పాల్గొనడానికి వారి గ్రామానికి ఒక శాస్త్రవేత్త రాగా, ప్రజ్ఞ వెళ్ళి కలుసుకున్నది.

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
ప్రజ్ఞ శాస్త్రవేత్తను ఏమడిగి ఉంటుంది?
జవాబు:
నాకు శాస్త్రవేత్తలంటే చాలా ఇష్టం. నేను కూడా మీలా శాస్త్రవేత్తను కావాలంటే ఏమి చేయాలి?

ప్రశ్న 2.
శాస్త్రవేత్త ప్రజ్ఞకు ఏమి చెప్పి ఉంటాడు?
జవాబు:
“నువ్వు కూడా శాస్త్రవేత్తవు కావచ్చు. ముందు విజ్ఞాన శాస్త్రాన్ని బాగా చదువు. శాస్త్రంలోని ప్రాథమికాంశాలు బాగా అర్థమైతేనే పై తరగతుల్లో వచ్చే జటిలమైన విషయాలు అర్థమవుతాయి. కాబట్టి కష్టపడి కాక ఇష్టపడి చదువు” అని శాస్త్రవేత్త ప్రజ్ఞకు చెప్పి ఉంచాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 4 ప్రేరణ

ప్రశ్న 3.
ప్రజ్ఞ శాస్త్రవేత్త కావాలనుకుంది కదా! మీరేం కావాలనుకుంటున్నారు? ఇందుకోసం మీరేం చేస్తారు?
జవాబు:
నేను వైద్యుణ్ణి కావాలనుకుంటున్నాను. ఇందుకోసం విజ్ఞాన శాస్త్రాన్ని, ప్రత్యేకంగా ‘జీవశాస్త్రాన్ని’ ఇష్టంతో చదువుతాను. ఇంకా పెద్దల సలహా, సూచనల ప్రకారం నా అధ్యయనాన్ని కొనసాగిస్తాను.

ప్రశ్న 4.
అతిసామాన్య కుటుంబంలో జన్మించి, పరిశోధన సంస్థలకు ప్రాణం పోసి ‘భారతరత్న’ బిరుదు పొందిన శాస్త్రవేత్త ఎవరో తెలుసా?
జవాబు:
డాక్టర్|| ఏ.పి.జె. అబ్దుల్ కలామ్.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది విషయాలను చర్చించండి.

ప్రశ్న 1.
ప్రేరణ అని ‘పాఠం’ పేరు వినగానే మీకేమనిపించింది?
జవాబు:
మాకేదో కొత్త అంశాన్ని నేర్చుకోవాలనే ఆసక్తిని ఈ పాఠం తప్పక కలిగిస్తుందనిపించింది. మహానుభావుల జీవితంలోని అనుభవాలను మాకిది అందిస్తుందనిపించింది. మాలో నిగూఢంగా ఉన్న కోరికలను, భావాలను తట్టిలేపేదిగా, వాటిని సాధించే దిశగా మమ్మల్ని సన్నద్దుల్ని చేసేదిగా ఈ పాఠంలోని అంశం ఉంటుందనిపించింది.

ప్రశ్న 2.
అబ్దుల్ కలామ్ చదువుకున్న రోజుల్లోని విద్యావిధానం గూర్చి మీ మిత్రులతో చర్చించండి.
జవాబు:
నాడున్న బ్రిటిష్ విద్యా విధానంపై భారతీయ విద్యార్థులకు సరైన అవగాహన లేదనిపిస్తుంది. పదవతరగతి పూర్తవగానే గుమస్తా ఉద్యోగాలను పొందడానికి అర్హత కలగడంతో ఎక్కువమంది చదువుకి అదే ముగింపు అయ్యేది. నాటి గురుశిష్య సంబంధం ఎంతో ఆత్మీయతతో కూడి ఉండేదని అన్పిస్తుంది. వృత్తివిద్యల మీద అవగాహన గలవారు తక్కువమంది. నాటి విద్యావిధానం నేటి విద్యావిధానానికి చాలా దగ్గరగా ఉంది. నేటికి వలెనే పదవతరగతి వరకు మాధ్యమిక విద్యగాను, ఇంటర్మీడియట్, డిగ్రీ చదువులు కళాశాల విద్యగాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నత విద్యగా ఉంది. ఇంటర్మీడియట్ తరువాత ఇంజనీరింగ్ విద్యను అభ్యసించడానికి అవకాశాలున్నాయి. కానీ అలా వెళ్ళవచ్చనే విషయం నాటి విద్యార్థుల్లో ఎక్కువమందికి తెలియదు. ఉన్నత విద్యల్లోను, కళాశాల విద్యలోను ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహంగా కొంత డబ్బును (స్కాలర్ షిప్) ఇచ్చేవారని తెలుస్తోంది. నాడు పేద విద్యార్థులలో ఎక్కువ మందికి ఉన్నత విద్యను చదివే పరిస్థితులు లేవు.
అది చాలా ఖర్చుతో కూడి ఉండేది.

AP Board 9th Class Telugu Solutions Chapter 4 ప్రేరణ

ఆ) కింది వాక్యాలు పాఠంలో ఏ పేరాల్లో ఉన్నాయో గుర్తించండి. ఆ వాక్యాల కింద గీత గీయండి.

ప్రశ్న 1.
కలామ్ తత్వశాస్త్ర గ్రంథాలు చదవడం.
జవాబు:
“నేను సెంట్ జోసెఫ్ లో నా చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు ఇంగ్లీషు సాహిత్యం పట్ల మక్కువ పెంచుకున్నాను. ఇంగ్లీషులోని సర్వశ్రేష్ఠ కృతుల్ని చదువుతుండేవాణ్ణి. టాల్ స్టాయ్, స్కాట్, హార్డీల పట్ల ప్రత్యేక ఆసక్తి ఉండేది. అప్పుడప్పుడు తత్త్వశాస్త్ర గ్రంథాలు చదువుతుండేవాణ్ణి. దాదాపుగా ఆ సమయంలోనే భౌతికశాస్త్రం పట్ల నాకు అమితమైన ఆసక్తి ఏర్పడింది.”

ప్రశ్న 2.
విజయానికి సూత్రాలు మూడు.
జవాబు:
“నేను రామనాథపురంలో ఉన్న కాలంలో మా అనుబంధం గురుశిష్య బంధాన్ని దాటి వికసించింది. ఆయన సాహచర్యంలో ఒకరి జీవిత గమనాన్ని ఎవరైనా ఏ మేరకు ప్రభావితం చేయగలరో తెలుసుకున్నాను. ఇయదురై సోలోమోన్ అంటూండేవారు – “జీవితంలో విజయం పొందడానికీ, ఫలితాలు సాధించడానికి నువ్వు మూడు అంశాల మీద పట్టు సాధించాల్మి
ఉంటుంది – అవి “కోరిక”, “నమ్మకం”, “ఆశ పెట్టుకోవడమూను.”

ప్రశ్న 3.
సోదరి సహాయం.
జవాబు:
“ప్రవేశానికి ఎంపికైతే అయ్యాను గానీ అటువంటి ప్రతిష్టాత్మక సంస్థలో చదవడమంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. దాదాపు వెయ్యి రూపాయలన్నా అవసరమవుతాయి. కానీ అది నా తండ్రికి తలకు మించిన విషయం. అప్పుడు నా సోదరి జొహారా నాకు తోడు నిలబడింది. తన బంగారు గాజులు, గొలుసు కుదువబెట్టి ఆమె నాకు సహాయం చేసింది. నేను చదువుకోవాలన్న ఆమె ఆకాంక్ష, నా సామర్థ్యంపై ఆమె నమ్మకం నన్ను గాఢంగా చలింపచేశాయి. నేను నా సొంత సంపాదన మీదనే ఆమె గాజుల్ని విడిపిస్తానని ఒట్టు పెట్టుకున్నాను. అప్పుడు నాకు సంపాదించడానికున్న ఏకైక మార్గం కష్టపడి చదువుకుని స్కాలర్ షిప్ సంపాదించుకోవడమే.

ప్రశ్న 4.
ప్రొఫెసర్ పక్కన కూర్చొని ఫొటో దిగడం.
జవాబు:
“ఎమ్. ఐ.టి.కి సంబంధించిన ఆత్మీయమైన జ్ఞాపకం ప్రొఫెసర్ స్పాండర్ కి సంబంధించిందే. వీడ్కోలు సమావేశంలో భాగంగా మేము గ్రూప్ ఫోటో కోసం నిలబడ్డాము. ప్రొఫెసర్లు ముందు కూర్చొని ఉండగా గ్రాడ్యుయేట్ విద్యార్థులమంతా మూడు వరుసల్లో వెనుక నిల్చొన్నాము. హఠాత్తుగా ప్రొఫెసర్ స్పాండర్ లేచి నిల్చొని, నాకోసం కలియచూశాడు. నేను మూడో వరుసలో నిల్చున్నాను. ‘రా నాతో పాటు ముందు కూర్చో’ అన్నాడు. నేను ప్రొఫెసర్ స్పాండర్ ఆహ్వానానికి నిరాంతపోయాను. ‘నువ్వు నా బెసు స్టూడెంట్ వి.’ నీ పరిశ్రమ నీ ఉపాధ్యాయులకి భవిష్యతులో మంచి పేరు తేవడానికి ఉపకరిస్తుంది అన్నాడు. ఆ ప్రశంసకి సిగ్గుపడాను. అదే సమయంలో నాకు లభించిన గుర్తింపుకు గర్విస్తూ నేను ప్రొఫెసర్ స్పాండర్తో కలిసి ఫోటోగ్రాఫ్ కోసం కూచున్నాను. ‘దేవుడే నీ ఆశా, ఆశ్రయమూ, మార్గదర్శి కాగలడు. భవిష్యత్ లోకి నీ ప్రయాణానికి ఆయనే దారి చూపే దీపం కాగలడు’ అన్నాడు ఆ మహామేధావి నాకు వీడ్కోలు పలుకుతూ.

AP Board 9th Class Telugu Solutions Chapter 4 ప్రేరణ

ఇ) కింది పేరా చదవండి. తప్పు ఒప్పులను గుర్తించండి.

“భారత జాతీయోద్యమ నాయకుల్లో బిపిన్ చంద్రపాల్ ఒకడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉన్న సైబెల్ లో జన్మించాడు. సహాయ నిరాకరణోద్యమానికి పిలుపునిచ్చాడు. దేశ స్వాతంత్ర్యం కోసం, అభ్యుదయం కోసం పాటుపడ్డాడు. కవులను, పండితులను, తత్త్వవేత్తలను, వక్తలను, నాయకులను, సాధారణ ప్రజలనూ అందరినీ ఆహ్వానించాడు. ఈ విధంగా దేశానికి సేవ చేయడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రంగాన్ని ఎంచుకొని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
1. బిపిన్ చంద్రపాల్ జాతీయోద్యమ నాయకుడు. (✓)
2. బిపిన్ చంద్రపాల్ సహాయ నిరాకరణోద్యమానికి వ్యతిరేకి. (✗)
3. బిపిన్ చంద్రపాల్ కవులను, పండితులను స్వాతంత్ర్యోద్యమంలోకి ఆహ్వానించాడు. (✓)
4. బిపిన్ చంద్రపాల్ కి స్వాతంత్ర్యోద్యమ కాంక్ష ఉంది. (✓)
5. బిపిన్ చంద్రపాల్ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన జాతీయ నాయకుడు. (✓)

ఈ) పాఠం ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రశ్న 1.
అబ్దుల్ కలాం దారి తప్పినప్పుడు ఆయన తండ్రి మాటలు అతన్ని దారిలో పెట్టేవి కదా ! ఆ మాటలు ఏవి?
జవాబు:
ఆ ఉత్తేజకరమైన మాటలివి – “ఇతరుల్ని అర్థం చేసుకున్నవాడు విజ్ఞాని. కానీ తనని తాను తెలుసుకున్నవాడే వివేకి. వివేకం లేని విజ్ఞానం ప్రయోజన శూన్యం.”

ప్రశ్న 2.
కలాం బాల్యంలో వేటిని పరిశీలించేవాడు ? వాటి ద్వారా ఏ స్పూర్తిని పొందాడు?
జవాబు:
కలాం బాల్యంలో పక్షుల ప్రయాణాన్ని గమనించేవాడు. ఆకాశంలో విహారించాలంటే అమితాసక్తి. కొంగలూ, సముద్రపు గువ్వలూ ఎగురుతుండడం గమనిస్తూ తాను కూడా ఎగరాలనే స్ఫూర్తిని పొందేవాడు. ఆకాశ రహస్యాలను కనుక్కోవాలనే కోరిక పెంచుకున్నాడు.

ప్రశ్న 3.
మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రవేశానికి ఆర్థిక సహాయం చేసిందెవరు?
జవాబు:
మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రవేశానికి ఆర్థిక సహాయం చేసినది కలాం సోదరి జొహారా. ఆమె తన బంగారు గాజులూ, గొలుసూ కుదువ పెట్టి వచ్చిన డబ్బుని కలాంకు ఇచ్చింది.

ప్రశ్న 4.
వీడ్కోలు సమావేశంలో ఏం జరిగింది?
జవాబు:
వీడ్కోలు సమావేశంలో భాగంగా కలాం, ఇతర విద్యార్థులు వాళ్ళ ప్రొఫెసర్లతో కలిసి గ్రూప్ ఫొటో కోసం నిలబడ్డారు. ప్రొఫెసర్లు ముందు కూర్చొని ఉండగా గ్రాడ్యుయేట్ విద్యార్థులంతా మూడు వరుసల్లో వెనుక నిలుచున్నారు. హఠాత్తుగా ప్రొఫెసర్ స్పాండర్ లేచి నిల్చొని కలాం కోసం కలియచూశాడు. కలాం మూడోవరుసలో నిల్చున్నాడు. కలాంతో ‘రా………. నాతోపాటు ముందు కూర్చో’ అని పిలిచాడు. కలాం ప్రొఫెసర్ గారి ఆహ్వానానికి నిర్ఘాంతపోయాడు. ‘నువ్వు నా బెస్ట్ స్టూడెంట్ వి. నీ పరిశ్రమ నీ ఉపాధ్యాయులకి భవిష్యత్తులో మంచి పేరు తేవడానికి ఉపకరిస్తుంది’ అని అన్నాడు ప్రొఫెసర్. ఆ ప్రశంసకి కలాం సిగ్గుపడ్డాడు. తనకు లభించిన గుర్తింపునకు గర్విస్తూ ప్రొఫెసర్ స్పాండర్తో కలిసి ఫోటోకోసం కూర్చున్నాడు. దేవుడే కలాం ఆశ, ఆశ్రయం, మార్గదర్శి కాగలడని, భవిష్యత్తులో కలాం ప్రయాణానికి దారి చూపే దీపం కాగలడని ప్రొఫెసర్ వీడ్కోలు పలికాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 4 ప్రేరణ

ప్రశ్న 5.
ప్రొఫెసర్ శ్రీనివాసన్ అప్పగించిన పనిని కలాం ఎలా పూర్తి చేశాడు?
జవాబు:
కోర్సు పూర్తి చేయగానే కలాం తన నలుగురు సహచరులతో కలసి ఒక చిన్నతరహా యుద్ధ విమానం డిజైన్ చేసే బాధ్యత చేపట్టాడు. అందులో ఏరోడైనమిక్ డిజైన్ రూపకల్పన బాధ్యత కలాంది. చోదనం, నిర్మాణం, అదుపు, ఉపకరణ సామాగ్రికి సంబంధించిన రూపకల్పనను ఇతర మిత్రులు తీసుకున్నారు. ఒకరోజు వాళ్ళ డిజైనింగ్ ప్రొఫెసరైన శ్రీనివాసన్ వాళ్ళ ప్రగతిని సమీక్షించి ఏమీ పురోగతి లేదని తేల్చాడు. కలాం ఎన్ని సాకులు చెప్పినప్పటికీ ఆయన ఒప్పుకోలేదు. ఆ పనిని పూర్తి చెయ్యడానికి ఒక నెలరోజుల వ్యవధి కోరినా మూడు రోజులు మాత్రమే గడువిచ్చాడు. సోమవారం ఉదయానికి విమాన నిర్మాణం డ్రాయింగ్ పూర్తికాకపోతే స్కాలర్షిప్ ని ఆపెయ్యవలసివస్తుందని హెచ్చరించాడు.

కలాం రాత్రి భోజనం మానేసి, డ్రాయింగ్ బోర్డు దగ్గరే పనిలో నిమగ్నుడైనాడు. మర్నాడు ఉదయం ఒక గంట మాత్రమే విరామం తీసుకొని, ఏదో తిన్నాడనిపించి మళ్ళీ పనిలో పడ్డాడు. ఆదివారం ఉదయానికి దాదాపుగా పని పూర్తి చేశాడు. ప్రొఫెసర్ ఆప్యాయంగా కావలించుకొని ప్రశంసాత్మకంగా వెన్ను తట్టాడు.

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో సొంతమాటల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘ఇతరుల్ని అర్థం చేసుకున్నవాడు జ్ఞాని’ ఈ వాక్యంపై మీ అభిప్రాయం రాయండి.
(లేదా)
ఇతరులను అర్థం చేసుకున్నవాడు జ్ఞాని అన్న కలాం తండ్రి మాటలపై మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు:
మనిషి సంఘజీవి. ప్రతి మనిషికీ తన పరిసరాలకు సంబంధించిన జ్ఞానం చాలా అవసరం. తనే గాక తన చుట్టు . ప్రక్కలవారి బాగోగులను గమనించాల్సిన బాధ్యత, తోటి మనిషికి సహాయపడాల్సిన బాధ్యత ప్రతి మనిషికి ఉంది. తన ఇంట్లోనే గాక తన ఇంటి చుట్టుప్రక్కల చక్కని స్నేహపూర్వక వాతావరణాన్ని ఏర్పరచుకోవాలి. తనకు ఉన్నదాంట్లోనే తోటి వారికి సహాయపడాలి. అలా ఇతరుల కష్టసుఖాలను అర్థం చేసుకున్నవాడే జ్ఞాని.

ప్రశ్న 2.
‘కోరిక, నమ్మకం, ఆశపెట్టుకోవడం’ అనే మూడు అంశాల మీద ఎందుకు పట్టు సాధించాలి?
జవాబు:
కలాం పాఠశాల ఉపాధ్యాయుడైన ఇయదురై సోలోమోన్ ఈ విజయ సూత్రాన్ని బోధించాడు. మనకేదన్నా సంభవించాలని అనుకుంటే ముందు దాన్ని గట్టిగా కోరుకోవాలి. అది తప్పక జరిగి తీరుతుందని నమ్మాలి. ఆ కోరిక ఎన్ని ఇబ్బందులెదురైనా జరిగి తీరుతుందనే ఆశను ఎన్నటికీ విడిచిపెట్టకూడదు. ఇలా చేయడం ద్వారా కోరిక తీరాక మన సంకల్పబలం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఆశావహ జీవనం అలవడుతుంది. తద్వారా నిరాశానిస్పృహలను జయించవచ్చు. ఆత్మన్యూనతను గెలవవచ్చు. అందుకనే కోరిక – నమ్మకం – ఆశ పెట్టుకోవడం అనే మూడు అంశాల మీద ప్రతి ఒక్కరు పట్టు సాధించాలి.

ప్రశ్న 3.
“తమ విద్యార్థుల జ్ఞానతృష్ణను తమ చైతన్యంతో, అకుంఠిత సంకల్పంతో సంతృప్తిపరచడమే!” ఈ మాటలు ఎవరి నుద్దేశించినవి? దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
జవాబు:
కలాం ఎమ్.ఐ.టి.లో తన ప్రొఫెసర్లు అయిన స్పాండర్, కే.ఏ.వి. పండలై, నరసింగరావుగార్ల గురించి చెప్పిన మాటలివి. ఇందులో ప్రతి అక్షరం సత్యమే అని నా కనిపిస్తుంది. విద్యార్థులకు ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ. ఉపాధ్యాయుడు విసుక్కోకుండా ఓపికతో వివరించినప్పుడే విద్యార్థి మేధస్సు వికసిస్తుంది. ఉపాధ్యాయుడు నిరంతర విద్యాన్వేషి కావాలి. విద్యార్థుల ప్రశ్నలను పిచ్చివని కొట్టిపారేయకుండా, విజ్ఞానాత్మకంగా ఆలోచించి సమాధానాలను చెప్పాలి. అప్పుడే విద్యార్థుల జ్ఞానతృష్ణ సంతృప్తిపడుతుంది. లేకుంటే తెలివైన విద్యార్థి వేరొకరిని ఆశ్రయించడం ద్వారా తన విజ్ఞాన తృష్ణను తీర్చుకోగలడు. సాధారణ విద్యార్థులు దాన్ని అంతటితో విడిచిపెట్టడం ద్వారా నష్టపోతారు. కాబట్టి ఉపాధ్యాయుడు నిరంతరం చైతన్యశీలిగా ఉండాలి. అకుంఠిత సంకల్పంతో విద్యార్థుల జ్ఞానతృష్ణను సంతృప్తి పరచాలి.

AP Board 9th Class Telugu Solutions Chapter 4 ప్రేరణ

ప్రశ్న 4.
ప్రొఫెసర్ శ్రీనివాసన్ అప్పగించిన పనిని పూర్తి చేసే సమయంలో కలాం స్థానంలో మీరుంటే ఏం చేసేవారు?
జవాబు:
కలాం స్థానంలో నేనుంటే ముందు కంగారు పడే మాట వాస్తవం. క్రమంగా విచక్షణతో ఆలోచిస్తాను. అవసరాన్ని బట్టి మిత్రుల సహాయం తీసుకుంటాను. “అవసరమే అన్ని ఆవిష్కరణలకు జనని” అనే సామెతను గుర్తుకు తెచ్చుకొని నా అవసరం కూడా ఒక నూతనావిష్కరణకు దారితీయాలని దృఢంగా సంకల్పించుకుంటాను. తగినట్లు కష్టపడతాను. వీలైనంత త్వరగా పనిని పూర్తిచేసి, గురువుల మన్ననలందుకుంటాను.

ఆ) కింది ప్రశ్నలకు పదిహేనేసి వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
కలాం తన ఆశయ సాధనలో ఎలా కృతకృత్యుడయ్యారు? మీ సొంతమాటల్లో రాయండి.
(లేదా)
ప్రతి వ్యక్తికి ఆశయం ఉంటుంది. అది సఫలం చేసుకోవడానికి అందరూ కృషి చేస్తుంటారు. అదే విధంగా కలాం తన ఆశయ సాధన విషయంలో ఎలా కృతకృత్యుడయ్యాడో వివరించండి.
జవాబు:
రామనాథపురంలోని హైస్కూల్లో చేరిన కలాంకు ఉపాధ్యాయుడైన ఇయదురై సోలోమోన్ ఆదర్శపథ నిర్దేశకుడయ్యాడు. క్రమంగా వారి అనుబంధం గురుశిష్యబంధాన్ని దాటి వికసించింది. జీవితంలో విజయం పొందాలన్నా, మంచి ఫలితాలు సాధించాలన్నా మూడు అంశాల మీద పట్టు సాధించాల్సి ఉంటుంది. అవి కోరిక – నమ్మకం – ఆశ అని సోలోమోన్ చెప్పే మాటలు కలాంపై బాగా ప్రభావం చూపాయి. “విశ్వాసంతో నువ్వు నీ విధిని కూడా తిరిగిరాయగలవు” – అనే గురువు గారి మాట కలాంలో ఆత్మవిశ్వాసాన్ని రేకెత్తించింది. సాధారణ గ్రామీణ బాలుడైన్పటికీ తాను కూడా ఏదో ఒక రోజు ఆకాశంలో విహరించగలడనే నమ్మకం బలంగా కలిగింది.

స్క్వారాట్ పాఠశాలలో చదువు పూర్తిచేసుకునేటప్పటికీ జీవితంలో విజయం సాధించాలనే దృఢసంకల్పం రెట్టింపయింది. ఆ రోజుల్లో వృత్తి విద్యాకోర్సుల గురించి ఊహ కూడా లేకపోవడంతో, ఉన్నత విద్య అంటే అప్పటికి కాలేజీ చదువే కావడంతో ట్రిచీ సెంట్ జోసఫ్ కాలేజీలో చేరాడు. గణితశాస్త్ర ప్రొఫెసర్లైన తోతత్రి అయ్యంగార్, సూర్యనారాయణ శాస్త్రి గార్లతో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు. సెంట్ జోసఫ్ కాలేజీలో బి.ఎస్.సి. డిగ్రీ కోర్సులో చేరి పూర్తి చేశాక గాని తన కిష్టమైన భౌతికశాస్త్రంలో తానేమీ చేయలేదని గుర్తించాడు. తన కలలు నిజం చేసుకోవాలంటే ఇంజనీరింగ్ చదవాల్సి ఉంటుందని గ్రహించాడు. తర్వాత “మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ”లో ప్రవేశానికి ఎంపిక అయ్యాడు. ఇక్కడే అసలు కష్టం మొదలైంది. ఆ సంస్థలో చేరాలంటే దాదాపు వేయి రూపాయలన్నా అవసరమవుతాయని తెలిసింది. అది తన తండ్రికి అసాధ్యమైన పని. అప్పుడే కలాం సోదరి జొహారా తన బంగారు గాజులు, గొలుసు కుదువబెట్టి ధన సహాయం చేసింది. తన సొంత సంపాదనతోనే ఆమె గాజుల్ని విడిపించాలని నిశ్చయించుకున్నాడు కలాం. డబ్బు సంపాదించాలంటే అతనికున్న ఒకే ఒక మార్గం స్కాలర్ షిప్ సంపాదించడం.

ఎమ్. ఐ. టి లో (కలాంను) అతణ్ణి అన్నిటికన్నా మిన్నగా ఆకర్షించింది అక్కడ ప్రదర్శనగా ఉంచిన రెండు పాత విమానాల యంత్రాలు. వాటి పట్ల ఎంత ఆకర్షితుడైనాడంటే మిగిలిన విద్యార్థులంతా హాస్టలుకు వెళ్ళాక కూడా చాలా సేపు వాటి దగ్గరే కూర్చొనేవాడు. పక్షిలా ఆకాశంలో విహరించాలన్న తన కాంక్షని ఆరాధిస్తూ గడిపేవాడు. మొదటి సంవత్సరం పూర్తిచేశాక ఒక ప్రత్యేక విషయాన్ని ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు మరేమీ ఆలోచించకుండా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ను ఎంచుకున్నాడు. ఎలాగైనా విమానాల్ని నడపాలనే తన కోరికకు సాధారణ కుటుంబ నేపథ్యమేమీ అడ్డుకాలేదని భావించాడు.

అప్పుడే వివిధ రకాల వ్యక్తులతో పరిచయాలు పెరిగాయి. అప్పుడే కొన్ని వైఫల్యాలు, ఆశాభంగాలు చవిచూడాల్సి వచ్చింది. దారితప్పే పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ తన తండ్రి మాటలు ఎప్పుడూ చెవులలో మారుమ్రోగుతూ సరైన మార్గంలో నడిపాయి. కలాం ఆలోచనల్ని ముగ్గురు ఉపాధ్యాయులు మలచారు. వారే ప్రొఫెసర్స్ స్పాండర్, కే.ఏ.వి. పండలై, నరసింగరావు గార్లు. తమ నిశిత బోధనల ద్వారా ఏరోనాటిక్స్ పట్ల కలాంలోని కోరికను మేల్కొల్పారు. వారి మేధస్సు, ఆలోచనా స్పష్టత, కలాం శ్రద్ధను బలోపేతం చేశాయి. కోర్సు పూర్తిచేశాక నలుగురు సహచరులతో కలసి ఒక చిన్నతరహా యుద్ధవిమానం డిజైన్ చేసే బాధ్యత చేపట్టాడు. అందులో ఏరోడైనమిక్ డిజైన్ రూపకల్పన బాధ్యత కలాంది. కాగా ప్రొఫెసర్ శ్రీనివాసన్ వారి పురోగతేమీ లేదని తేల్చి మూడు రోజుల్లోనే డిజైన్ పూర్తిచేయకుంటే స్కాలర్షిప్ ఆపేస్తామని హెచ్చరించాడు. దానితో కలాం నిద్రాహారాలు మాని రెండు రోజుల్లోనే దానిని పూర్తిచేసి ప్రొఫెసర్ శ్రీనివాస గారి మన్ననలే గాక ఇతర అధ్యాపకుల ప్రశంసలందుకున్నాడు. ‘మన విమానాన్ని మనమే తయారు చేసుకుందాం’ అని ఒక వ్యాసాన్ని తమిళంలో రాసి ఎమ్.ఐ.టి. తమిళ సంఘంవారు నిర్వహించిన వ్యాసరచన పోటీకి పంపాడు. ప్రథమ బహుమతిని పొందాడు.

ఎమ్.ఐ.టి. నుంచి బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో ట్రైనీగా చేరాడు. అక్కడ ఒక టీంలో భాగంగా ఇంజన్ ఓవర్ హాలింగ్ లో పనిచేశాడు. పిస్టన్, టర్బయిన్ ఇంజన్లు రెండింటి ఓవరాలింగ్ మీద పనిచేశాడు. వాయు పదార్థాల డైనమిక్స్ లోని ఎన్నో అంశాలు అవగతం చేసుకున్నాడు. గ్రాడ్యుయేట్ ఏరోనాటికల్ ఇంజనీర్ గా హెచ్.ఏ.ఎల్. నుండి బయటికి వచ్చాడు. అప్పుడు వైమానిక దళంలో ఉద్యోగం, రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సాంకేతిక అభివృద్ధి ఉత్పాదక డైరెక్టరేట్ లో ఉద్యోగ రూపంలో కలాం చిరకాల స్వప్నాన్ని నిజం చేసే రెండు ఉపాధి అవకాశాలు లభించాయి. రామేశ్వరం నుంచి ఆకాశయానం చేసిన మొదటి బాలుడు కూడా కలామే.

ప్రశ్న 2.
కలాం విద్యాభ్యాసం ఏ విధంగా కొనసాగిందో మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
రామనాథపురంలో హైస్కూల్ లో చేరాడు కలాం. జిజ్ఞాసియైన కలాంకు ఇయదురై సోలోమోన్ అనే ఉపాధ్యాయుడు మార్గదర్శియై నిలిచాడు. ఆయన తరగతి గదిలోని విద్యార్థుల్ని ఉత్సాహపరిచేవాడు. కోరిక – నమ్మకం – ఆశపెట్టుకోవడం అనే మూడు అంశాల ద్వారా జీవితంలో విజయం సాధించవచ్చని, మంచి ఫలితాలను పొందవచ్చని ఇయదురై బోధించేవాడు. “విశ్వాసంతో నీ విధిని కూడా తిరిగి రాయగలవు” – అనే సోలోమోన్ మాటలు కలాంపై బాగా ప్రభావం చూపాయి. కలాంకు చిన్నప్పటి నుండీ ఆకాశపు రహస్యాలన్నా, పక్షుల ప్రయాణమన్నా ఆసక్తి ఎక్కువ. కొంగలూ, సముద్రపు గువ్వలూ ఎగురుతుండడం చూస్తూ తాను కూడా ఎగరాలని కోరుకునేవాడు. సోలోమోన్ బోధనలతో ఎగరాలనే కోరిక పెంచుకున్నాడు. ఎగురుతానని గట్టిగా నమ్మాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశవీడలేదు. కాబట్టే రామేశ్వరం నుండి ఆకాశయానం చేసిన మొదటి బాలుడతడే అయ్యాడు.

స్క్వారాట్ పాఠశాలలో చదువు పూర్తిచేసుకున్నాడు. వృత్తి విద్యాకోర్సుల గురించి అవగాహన లేకపోవడంతో ట్రిచీలోని సెంట్ జోసెఫ్ కాలేజీలో ఇంటర్మీడియట్ లో చేరాడు. పరీక్షల గ్రేడుల ప్రకారం చూస్తే ఏమంత తెలివైన విద్యార్థి కాడు కలాం. కళాశాలలో గణితశాస్త్రంలో ప్రొఫెసర్స్ అయిన తోతత్రి అయ్యంగార్, సూర్యనారాయణ శాస్త్రి గార్ల ప్రేమకు పాత్రుడైనాడు. అక్కడే ఇంగ్లీషు సాహిత్యం పట్ల మక్కువ ఎక్కువ అయింది. టాల్ స్టాయ్, స్కాట్, హార్డీల రచనల పట్ల ప్రత్యేకాసక్తి కలిగింది. ఉత్తమ రచనలన్నీ చదివాడు. అప్పుడప్పుడు తత్వశాస్త్ర గ్రంథాలు కూడా చదివేవాడు. అప్పుడే భౌతికశాస్త్రం పట్ల విశేషమైన ఆసక్తి కలిగింది. ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు.

సెంట్ జోసెఫ్ కాలేజీలో బి.ఎస్.సి. డిగ్రీ కోర్సులో చేరాడు. నాటికి ఇంజనీరింగ్ విద్య గురించి అవగాహన కలాంకు లేదు. బి. ఎస్.సి. పూర్తిచేశాక గాని భౌతికశాస్త్రం తన ప్రధాన విషయం కాదని తెలియలేదు. తన కలల్ని నెరవేర్చుకోవడం కోసం ఇంజనీరింగ్ లో చేరాలనుకున్నాడు. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రవేశానికి ఎంపికయ్యాడు. కానీ అసలు కష్టం అప్పుడే మొదలైంది. అతడా సంస్థలో చేరాలంటే దాదాపు వేయి రూపాయల దాకా కావాలి.

అప్పుడు కలాం సోదరి జొహారా తన బంగారు గాజుల్ని, గొలుసును కుదువబెట్టి ధనసహాయం చేసింది. తన సొంత డబ్బుతోనే వాటిని విడిపించాలని కలాం నిర్ణయించుకున్నాడు. చదువుకునే తనకి డబ్బు సంపాదించే ఒకే ఒక మార్గం కష్టపడి చదివి స్కాలర్ షిప్ సంపాదించడం.

మొదటి సంవత్సరం పూర్తయ్యాక ఒక ప్రత్యేక విషయాన్ని ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది. ఇంకేమీ ఆలోచించకుండా కలాం ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ని ఎన్నుకున్నాడు. ఎలాగైనా తాను విమానాల్ని నడపాలనే బలమైన కోరిక అందుకు కారణమైంది. అక్కడే చాలా రకాల వ్యక్తులతో పరిచయాలు పెరిగాయి. దారితప్పే పరిస్థితులేర్పడ్డాయి. తండ్రి మాటలే కలాంని సరైన మార్గంలో నిలిపాయి. ప్రొఫెసర్స్ స్పాండర్, కే.ఏ.వి పండలై, నరసింగరావుగార్లు ఎమ్.ఐ.టి. లో కలాంపై ప్రభావం చూపిన గురువులు. తమ నిశిత బోధనల ద్వారా వారు ఏరోనాటిక్స్ పట్ల కలాంలో తృష్ణని రేకెత్తించారు. పరిజ్ఞానం పెరగడం మొదలైంది. వివిధ రకాల ఏరోప్లేన్ల నిర్మాణాంశాల ప్రాముఖ్యం తెలిసింది. కోర్సు పూర్తి అయింది. కోర్సులో భాగంగా నలుగురు సహచరులతో కలసి ఒక చిన్నతరహా యుద్ధవిమానం డిజైన్ చేసే బాధ్యత చేపట్టాడు. అందులో ఏరోడైనమిక్ డిజైన్ రూపకల్పన కలాం బాధ్యత కాగా చోదనం, నిర్మాణం, అదుపు, ఉపకరణ సామాగ్రికి సంబంధించిన రూపకల్పనలు అతని మిత్రుల బాధ్యత.

ఒకరోజు వాళ్ళ డైరెక్టర్, డిజైనింగ్ ప్రొఫెసర్ అయిన శ్రీనివాసన్ గారు వాళ్ళ ప్రగతిని చూసి, పురోగతి లేదని తేల్చేశాడు. పనిలో జాప్యానికి కలాం ఎన్ని కారణాలు చూపినా ఆయన అంగీకరించలేదు. చివరికి ఒక నెలరోజుల వ్యవధి కోరగా, నేటి నుండి మూడో రోజున డిజైన్ పూర్తిచేసి చూపాలని, లేకుంటే స్కాలర్ షిప్ ఆపేస్తామని నిరంకుశంగా చెప్పాడు. స్కాలర్ షిప్పే కలాంకు ఆధారం. మూడు రోజుల్లో పూర్తి చేయడం తప్ప మరో మార్గం లేదు. నిద్రాహారాలు మాని డ్రాయింగ్ కు పూనుకున్నాడు. రెండవ రోజు ఉదయానికల్లా డిజైన్ పూర్తిచేసి గురువుల ప్రశంసలందుకున్నాడు.

ఎమ్.ఐ.టి. లో కోర్సు పూర్తిచేసుకొని, బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో ట్రైనీగా చేరాడు. అక్కడ విమానాల ఇంజన్ ఓవరాలింగు చేశాడు. వాయుపదార్థాల డైనమిక్స్ లోని ఎన్నో అంశాలను అవగతం చేసుకున్నాడు. గ్రాడ్యుయేట్ ఏరోనాటికల్ ఇంజనీర్ గా హెచ్.ఏ.ఎల్. నుండి బయటికి వచ్చాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 4 ప్రేరణ

ప్రశ్న 3.
‘మనమే విమానాన్ని తయారుచేసుకుందాం’ అన్న వ్యాసంలో అబ్దుల్ కలాం ఏమి రాసి ఉంటారు?
జవాబు:
కలాంకి చిన్నప్పటినుండి పక్షిలా ఆకాశంలో ఎగరడమంటే ఇష్టం. ఇలాంటి కోరికతోనే మొదటిసారిగా యంత్రాన్ని నిర్మించి, ఆకాశంలో ఎగిరిన వారు రైట్ సోదరులు. కలాం తన ఇంజనీరింగ్ విద్యలో భాగంగా వివిధ విమాన యంత్రాలను నిశితంగా పరిశీలించాడు. ఇతర భాగాలను శ్రద్ధగా గమనించాడు. విమానాన్ని పూర్తిగా ఏ భాగానికి ఆ భాగం విడదీయడం, విడి భాగాలను కలిపి విమానాన్ని తయారు చేయడంలో ప్రజ్ఞ గడించాడు. తన ప్రొఫెసర్ శ్రీనివాసన్ గారి పుణ్యమా అని సొంతంగా విమానయంత్రాన్ని డిజైన్ చేశాడు.

‘మనమే విమానాన్ని తయారుచేసుకుందాం’- అనే వ్యాసంలో కలాం తన అనుభవాలను, విజ్ఞానాన్ని రంగరించి విమానాన్ని సులభంగా ఎలా తయారుచేయవచ్చో నిరూపించి ఉంటాడని అన్పిస్తుంది. ఇంకా వీలైనంత తక్కువ ఖర్చుతో దాన్ని తయారుచేయగల మార్గాలను సూచించి ఉంటాడు. ముందుగా చిన్న చిన్న యంత్రాలను తయారుచేయడం, వాటిని విమానం బొమ్మలకు అనుసంధానించడం వంటి విషయాలను ఆసక్తి గల బాలల కొరకు వివరించి ఉంటాడు. వివిధ రకాల విమాన యంత్రాలకు ఉపకరించే లోహాలను, వాటి స్వరూపాలను తెలిపి ఉంటాడు. సాధారణ యంత్రాలకు కొద్దిపాటి మార్పులు చేయడం ద్వారా విమాన యంత్రాలుగా ఎలా మార్చవచ్చో నిరూపించి ఉంటాడు.

ఇ) సృజనాత్మకంగా రాయండి.
పాఠంలోని మూడవ పేరాను చదవండి. కలాం తన కోరికను గురించి చెప్పాడు కదా! అలాగే మీరు కూడా మీ కోరికను చిన్న కవిత రూపంలో రాయండి.
జవాబు:
“నాకూ రెక్కలు ఉంటే
నీలాకాశంలో విహరిస్తా
అవని అందాలను పరికిస్తా
చందమామను పలకరిస్తా
తారామండలానికి వెళ్ళిస్తా
గ్రహగతుల్ని వీక్షిస్తా
ఖగోళపు వింతల్ని పరిశీలిస్తా
విశ్వరహస్యాన్ని ఛేదిస్తా
గ్రహాంతర వాసులతో చెలిమిచేస్తా
భూగోళపు గొప్పదనం తెలియజేస్తా”
(లేదా)
ఈ పాఠం స్ఫూర్తితో మీరే అబ్దుల్ కలాం అయితే నేటి విద్యార్థులకు ఏం చెపుతారు? సందేశమివ్వండి. ఏకపాత్రాభినయం చెయ్యండి.
జవాబు:
కలాం సందేశం :
ప్రియ విద్యార్థులారా! భారత భవిష్య నిర్ణేతలారా!

మీ ఉత్సాహం, మీ ఆసక్తి చూస్తుంటే నాకు నా బాల్యం గుర్తొస్తుంది. ఆ ధైర్యం, ఆ ఆత్మవిశ్వాసం గమనిస్తే మీరంతా నా ప్రతిబింబాలలాగే ఉన్నారు. ఇప్పుడు వయసు ఉడిగి వృద్దుడినైనా మానసికంగా ఉత్సాహంగా, బలంగానే ఉన్నా. నా ఈ స్థితికి కారణం నా గురువుల సందేశాలే. మనం ఏదైనా సాధించాలంటే దాన్ని గురించిన కోరిక బలంగా ఉండాలి. సాధించగలననే అచంచలమైన విశ్వాసం ఉండాలి. ఎలాంటి పరిస్థితులెదురైనా ఆశను వీడకూడదు. అప్పుడే మనం దాన్ని సాధించగలం. జీవితంలో ఏరకమైన లక్ష్యాన్నైనా సాధించాలంటే ఇదే సులభమైన మార్గం. ముందు మీ కోరిక ఏదనే దానిపై ఒక స్పష్టత కలిగి ఉండండి. దాన్ని సాధించగలననే విశ్వాసాన్ని పెంచుకోండి. లక్ష్యం చేరేవరకు నిరాశను దగ్గరకు రానివ్వవద్దు. “విశ్వాసంతో మనం మన విధిని కూడా తిరిగి రాయగలం”. ఇది నిజం.

చిన్నారులారా! ఇతురుల్ని బాగా అర్థం చేసుకున్నవాడే విజ్ఞాని. తన గూర్చి తాను తెలుసుకున్నవాడే వివేకి. కానీ వివేకం లేని విజ్ఞానం ఏమాత్రం ప్రయోజనం లేనిది. నేడు విజ్ఞానాన్ని సంపాదిస్తున్నారు గాని వివేకాన్ని కోల్పోతున్నారు. అందువల్లే చాలా దేశాల మధ్య పరస్పర ద్వేషాలు రగులుతున్నాయి. యుద్ధాలకు కారణాలవుతున్నాయి. మారణహోమాన్ని సృష్టిస్తున్నాయి. కాబట్టి మనిషి విజ్ఞాని, వివేకి కావాలి.

ఏకపాత్రాభినయం :
తేది: 17 – 05 – 1974.
రంగం : ఢిల్లీ నగరంలోని కలాం వసతి గృహంలో ప్రయోగశాల.
సమయం : రాత్రి 11.00
సన్నివేశం : ఏకాంతంగా ప్రయోగశాలలో సంచరిస్తూ, ఆలోచిస్తున్న సన్నివేశం.

కలాం అంతరంగ మథనం :
(దీర్ఘంగా నిట్టూర్చి) ఏమిటీ వింత స్థితి? ఎన్నడూ నా జీవితంలో లేదే ఈ పరిస్థితి? ఎందుకు నా హృదయస్పందన నాకే తెలుస్తోంది నా శరీరావయవాల కంపం ఆగటంలేదెందుకు? అవునులే! రేపు జరగబోయేదేమన్నా చిన్నకార్యమా? యావత్ ప్రపంచం విస్తుపోయే కార్యం! పొరుగుదేశాలే కాక, అవకాశం కోసం పొంచి ఉన్న గుంటనక్కల లాంటి పాకిస్థాన్, చైనా వంటి దేశాలకు కన్నుకుట్టే సన్నివేశం. భారతీయులంతా సగర్వంగా తలలెత్తుకొని ఆనందంగా “వందేమాతరమ్” అని ఎలుగెత్తి నినదించే ఘటన. అమెరికా, బ్రిటన్ వంటి అగ్రరాజ్యాలు కుళ్ళుకొని కుమిలిపోయే సంఘటన. నేపాల్, రష్యా వంటి మిత్రదేశాలు “శెహభాష్” అని ప్రశంసల జల్లు కురిపించే పని. టెక్నాలజీలో తామే గొప్పని విర్రవీగే జపాన్, జర్మనీ వంటి దేశాలు సిగ్గుతో చిమిడిపోయే ఘనకార్యం. అవును ఆ విషయాన్ని తలుచుకుంటేనే ఒళ్ళు పులకరించిపోతుంది. మనస్సు ఉప్పొంగిపోతుంది. ఆనందంతో శరీరం గాలిలో తేలుతున్నట్లుంది.

నా దేశం, నా భారతదేశం రేపు మొట్టమొదటిసారిగా అణు పరీక్షను జరపబోతోంది. తన అణుసామర్థ్యాన్ని ప్రదర్శించబోతోంది. పాక్, చైనా వంటి దేశాలు ఇక కవ్వింపు చర్యలాపి, తోక ముడవాల్సిందే. భారతమాత శక్తి యుక్తులను తలచి మోకరిల్లాల్సిందే. అగ్రరాజ్యాలిక ఆగ్రహాన్ని నిగ్రహించుకోవాల్సిందే. నేపాల్, భూటాన్, బర్మా వంటి చిన్న దేశాలు భారతదేశం పంచన చేరాల్సిందే. ఇంతవరకూ శాంతికి ప్రతీకగా నిలిచింది నా దేశం. కానీ శాంతిని కోరడం చేతకానితనంగా భావించింది ప్రపంచం. తనకై తాను కయ్యానికి కాలు దువ్వనని, తన జోలికి వస్తే మాత్రం తాట తీయకుండా వదలనని ప్రపంచానికి చాటి చెపుతుంది నా దేశం.

కానీ ఇవన్నీ జరగాలంటే రేపటి అణుపరీక్ష విజయవంతం కావాలి. లేకుంటే ………… (చెవులు మూసుకొన్నట్లు నటించి), అపహాస్యాన్ని, ఎగతాళిమాటలను ………….. భరించాలి. నో………. అలా జరగడానికి వీలులేదు. దేశాన్ని అవమానాలపాలు చేయడం కంటే ఆత్మాహుతి మేలు.

మానవ ప్రయత్నంలో ఎటువంటి లోపం లేదు. కార్మికుని నుండి కార్యదర్శి దాకా అందరం కలిసికట్టుగా దేశ భవిష్యత్తును కోరి కష్టపడ్డాం. అయినా మానవాతీతమైనది కదా దైవం. దైవం ధర్మానికి బద్ధుడని భారతీయ తత్త్వశాస్త్రం ఘోషిస్తోంది. మేము మా ధర్మానికి కట్టుబడే ఈ ప్రయత్నం చేశాం. భారతదేశం కూడా ఆత్మరక్షణ కోసమే అణ్వాయుధాన్ని తయారుచేసుకుంది తప్ప వేరే దేశాలకు హానిచేయడం కోసం కాదు. కాబట్టి దైవం తప్పక భారతదేశానికి సహకరిస్తాడు.

అవును, నా మనస్సు దృఢంగా నమ్ముతోంది. రేపు తప్పక విజయం లభిస్తుంది. భారతదేశమంతా ఆనందం వెల్లివిరుస్తుంది. ఆ చక్కని సన్నివేశాన్ని ఇప్పుడు దర్శిస్తా. రేపు కళ్ళతో చూసి హర్షిస్తా. ఇక విశ్రమిస్తా. (నిద్రకు ఉపక్రమిస్తాడు)

AP Board 9th Class Telugu Solutions Chapter 4 ప్రేరణ

ఈ) ప్రశంసాత్మకంగా రాయండి.

కలాం గురించి చాలా విషయాలు ఈ పాఠం ద్వారా తెలుసుకున్నారు కదా! కలాం జీవితం నుండి మనం నేర్చుకోదగిన మంచి విషయాలేమిటి? వీటిలో మీరు వేటిని ఆచరణలో పెడతారు?
జవాబు:
కలాం జీవితం నుండి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. దృఢమైన సంకల్పం, ఆత్మవిశ్వాసం, ఎన్ని కష్టాలు వచ్చినా మొదలు పెట్టిన పనిని పూర్తిచేయడం వంటి ఎన్నో మంచిగుణాలు కలాంలో ఉన్నాయి. వీటిల్లో ఆయన ఆత్మ విశ్వాసాన్ని, కష్టాల్లో కూడా లక్ష్యాన్ని విడిచి పెట్టకపోవడాన్ని నేను ఆచరణలో పెడదామనుకుంటున్నాను. ఇలాగే జీవిత లక్ష్యానికి సంబంధించిన దాన్ని మనస్సులో బలంగా కోరుకోవడం, కోరుకున్నదాన్ని సాధించగలనని విశ్వసించడం, ఎన్ని అడ్డంకులెదురైనా ఆశ వీడకపోవడం అనే దాన్ని కూడా ఆచరణలో పెడతాను.

IV. ప్రాజెక్టు పని

* మీకు నచ్చిన శాస్త్రవేత్తను గురించి వారెలా ప్రేరణ పొందారో, ఏ కొత్త విషయాలు కనుకున్నారో వివరాలు సేకరించి వ్యాసం రాయండి.
జవాబు:
నాకు నచ్చిన శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్. భౌతికశాస్త్రంలోను, జీవశాస్త్రంలోను భారతదేశం గర్వించదగిన శాస్త్రవేత్త. ఈయన స్వేచ్ఛగా సంచరించే మనుషులకు, ఇతర జంతుజాలానికే కాక కదలని చెట్టుచేమలకు కూడా ప్రాణం ఉందని నిరూపించిన గొప్ప శాస్త్రవేత్త.

ఈయన చెట్టు, తీగలకు ప్రాణం ఉందని నిరూపించడంలో, మహాభారతంలోని శాంతిపర్వంలో భరద్వాజ – భృగుమహర్షుల సంభాషణ ఆయనకు మంచి ప్రేరణ ఇచ్చిందని ఆయన తాత్త్వికత గురించి తెలిసిన పెద్దలు చెప్తారు. ఆ సంభాషణ ఇది –
భృగుమహర్షి : బ్రహ్మ ఈ సృష్టి అంతటిని పంచమహాభూతాల సమ్మేళనంతో చేశాడు.

భరద్వాజ మహర్షి : స్థావరజంగమములలో ఈ పంచభూత ధాతువులు కనిపించడం లేదు గదా మహాత్మా ! అవి వినలేవు – చూడలేవు – వాసనను గ్రహించలేవు – స్పర్శలేదు గదా !

భృగుమహర్షి : బలమైన గాలులకు, అగ్నికి, ఉరుములకు, పిడుగులకు, ఫలాలు, పుష్పాలు చెదిరిపోతాయి. అంటే వాటినుండి వచ్చే ధ్వనిని గ్రహించే అవి అలా అవుతున్నాయి. కాబట్టి అవి వినగలుగుతున్నట్లే గదా!

“వాయ్వగ్యశని నిర్దోషైః ఫలం పుష్పం విశీర్యతే|
శ్రోత్రేణ గృహ్యతే శబ్దః తస్మాత్ శ్రుణ్వంతి పాదపాః ||

(అధ్యాయం – 184, శ్లో|| 12)
తీగలు చెట్లను అల్లుకొని పై పైకి పాకుతాయి. కొమ్మలు ఎటు వ్యాపించాయో చూడకుండా అవి అలా పాకలేవు గదా! కాబట్టి అవి చూడగలవు.

“వల్లీ వేష్టయతే వృక్షం సర్వతః చైవ గచ్ఛతి!
న హి అదృష్టశ్చ మార్గో 2 స్తి తస్మాత్ పశ్యంతి పాదపా?”|| (అ|| 184 – శ్లో|| 13)
చెట్లకు వచ్చే రకరకాల తెగుళ్ళను పోగొట్టడానికి సుగంధమైన, దుర్గంధమైన రకరకాల ధూపాలను వేస్తాం. అప్పుడు ఆ తెగుళ్ళు పోయి అవి పుష్పిస్తాయి. అంటే అవి వాసనను గ్రహించగలిగినట్లే గదా!

“పుణ్యాపుడ్యైః తథా గంధైః ధూ పైశ్చ వివిధైరపి
అరోగాః పుష్పితాః సంతి తస్మాత్ జిఝంతి పాదపాః”|| (అ|| 184 – శ్లో|| 14)
చెట్లు నీటిని స్వీకరిస్తున్నాయి. వాటికి వచ్చే రోగాలకు ఔషధాలు ఇవ్వడం ద్వారా నయం చేయగలుగుతున్నాము. కొమ్మను నరికేశాక కొన్నాళ్ళకు మళ్ళీ చిగుళ్ళు వస్తున్నాయి. అవి కూడా సుఖదుఃఖాలకు స్పందిస్తున్నాయి. వాటికి జీవం ఉన్నట్లే కదా!

భారతీయ గ్రంథాలను ‘వైజ్ఞానిక దృష్టితో పరిశోధించే సుభాష్ చంద్రబోస్ మహాశయుణ్ణి ఈ సంభాషణ బాగా ఆకర్షించింది. తన పరిశోధనను ఈ వైపుగా కొనసాగించి క్రెస్కోగ్రాఫ్ ను ఆవిష్కరించాడు. దీని సహాయంతో మొక్కలకు జీవం ఉందని, తీవ్రమైన కాంతికి, ధ్వనికి అవి స్పందిస్తాయని, వాటిలో జీవలక్షణమైన పెరుగుదల ఉందని ఆధునిక ఆధును. ప్రపంచానికి మొదటిసారిగా తెలియజేశాడు. వృక్ష శరీర ధర్మశాస్త్ర పితామహునిగా కీర్తించబడినాడు.
(లేదా)
* శాస్త్రవేత్తల గురించి పత్రికల్లో వచ్చిన అంశాలను సేకరించండి.
జవాబు:
పైన చెప్పిన పని మీరు మిత్రులతో కలసి పూర్తిచేయండి.

III. భాషాంశాలు

పదజాలం

అ) కింద గీత గీసిన పదాలకు అర్థాలను రాసి ఆ పదాలను సొంతవాక్యాలలో రాయండి.
ఉదా :
వివేకానందుడు రామకృష్ణుని పథంలో పయనించాడు.
పథం = మార్గం
మహాత్ములు చూపిన మార్గంలో పయనించాలి.

1. ఔత్సాహికుడైన వ్యక్తి ఏ రంగంలోనైనా రాణిస్తాడు.
జవాబు:
ఔత్సాహికుడు = ఉత్సాహం గలవాడు – ఉత్సాహం గలవాడికే ఉన్నత స్థితి త్వరగా లభిస్తుంది.

2. జిజ్ఞాసువు కొత్త విషయాలను తెలుసుకుంటాడు.
జవాబు:
జిజ్ఞాసువు = తెలుసుకోవాలనే కోరిక గలవాడు.
జగదీష్ చంద్రబోస్ కొత్త విషయాలను తెలుసుకోవాలనే కోరిక గలవాడు.

3. బందు కారణంగా పనులు నిలిచిపోకుండా యాజమాన్యం ప్రత్యామ్నాయపు ఏర్పాట్లు చేసింది.
జవాబు:
ప్రత్యామ్నాయము = ఇతర సౌకర్యం
నేడు మా నగరానికి గవర్నర్ వస్తున్న కారణంగా ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు తగిన ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు.

4. వివేకానందుని ఉపన్యాసాలు ఎందరినో ప్రభావితం చేశాయి.
జవాబు:
ప్రభావితం చేయు = ప్రేరణ కలిగించు, ప్రకాశింపజేయు.
కలాం బోధనలు యువతలో ప్రేరణ కలిగించాయి.

5. సుస్మితకు డాక్టరుగా ఎదగాలని ఆకాంక్ష.
జవాబు:
ఆకాంక్ష = కోరిక
నేను ఇంజనీర్ ను కావాలని మా తల్లిదండ్రుల కోరిక.

6. అభ్యర్థులు ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేస్తారు.
జవాబు:
వాగ్దానం = మాట ఇవ్వడం
మాట ఇవ్వగానే సరికాదు, దాన్ని నిలుపుకోగలగాలి.

AP Board 9th Class Telugu Solutions Chapter 4 ప్రేరణ

ఆ) పాఠం చదివి కింది పదాలను వివరించి రాయండి.
1. ఆకాశయానం : ఆకాశంలో ప్రయాణించడం, విమానాల్లో తిరగడం.
2. అణు భౌతికశాస్త్రం : అణువులు, వాటి విచ్ఛేదనం వలన ఉత్పన్నమయ్యే శక్తి మొదలైన వాటిని గురించి వివరించే శాస్త్రం.
3. సాంకేతిక విద్య : సాంకేతికత (Technology) ను బోధించే విద్యను సాంకేతిక విద్య అంటారు.
ఉదా :
పాలిటెక్నిక్, ఇంజనీరింగ్
4. ప్రొఫెషనల్ చదువు : వృత్తికి సంబంధించిన చదువు.
5. జ్ఞానతృష్ణ : తృష్ణ అంటే కోరిక. జ్ఞానాన్ని సంపాదించాలనే కోరికను జ్ఞానతృష్ణ అంటారు.

ఇ) ఈ పాఠంలో శాస్త్ర సంబంధ పదాలున్నాయి. వాటిని పట్టికగా రాయండి.
ఉదా : ఎరోనాటికల్ ఇంజనియర్
1) ప్రొఫెషనల్
2) ఫిజిక్స్
3) ఇంజనీరింగ్
4) ఏరోనాటికల్ ఇంజనీరింగ్
5) ఏ ప్లేన్
6) డిజైన్
7) ఏరోడైనమిక్ డిజైన్
8) చోదనం
9) నిర్మాణం
10) అదుపు
11) ఉపకరణ సామాగ్రి
12) రూపకల్పన
13) డ్రాయింగ్
14) డ్రాయింగ్ బోర్డ్
15) ప్రాజెక్ట్
16) ఇంజన్ ఓవరహాలింగ్
17) విమానాల ఓవరాలింగ్
18) ప్రాక్టికల్
19) పిస్టన్
20) టర్బయిన్
21) ఇంజన్
22) వాయుపదార్థాల డైనమిక్స్

ఈ) కింది వాక్యాలలో గీత గీసిన పదాలు సమానార్థాన్ని ఇస్తాయి. ఆ పదాలతో కొత్త వాక్యాలు రాయండి.

1. ఆకాశంలో చుక్కలు మెరుస్తున్నాయి. ఆ గగనంలోనే చంద్రుడు కాంతులీనుతున్నాడు. అందుకే నింగి అంటే నాకెంతో – ఇష్టం.
జవాబు:
ఆకాశంలో విమానాలు వెళతాయి. ఆ గగనంలోకే రాకెట్లు దూసుకెళతాయి. ఉపగ్రహాలన్నీ నింగి లోనే సంచరిస్తాయి.

2. భూమిమీద ఎన్నో జీవరాశులున్నాయి. వసుధలో నిధి నిక్షేపాలుంటాయి. ధరణికి వృక్షాలు అందాన్నిస్తాయి.
జవాబు:
భూమి మానవునికి నివాసం. వసుధ గురించి మానవుడెంతో తెలుసుకోవాల్సింది ఉంది. ఈ ధరణిని నిర్లక్ష్యం చేస్తే మనుగడే ఉండదు.

3. ఆయనకు సుమారు ముప్పై ఏళ్ళు. ఉద్యోగంలో చేరి ఇంచుమించు ఆరు సంవత్సరాలయింది. నెలకు దాదాపు నలభై వేలు సంపాదిస్తున్నాడు.
జవాబు:
మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి సుమారు 66 సంత్సరాలు. మన రాజ్యాంగం అమలులోకి వచ్చి ఇంచుమించు 63 సంవత్సరాలు. మన పంచవర్ష ప్రణాళికలను అమలు చేయడం మొదలు పెట్టి దాదాపు 63 సంవత్సరాలు.

AP Board 9th Class Telugu Solutions Chapter 4 ప్రేరణ

ఉ) కింది వాక్యాలు చదవండి. ప్రతి వాక్యంలోనూ ప్రకృతి – వికృతి పదాలున్నాయి. వాటిని గుర్తించి పట్టికగా రాయండి. వాటితో కొత్త వాక్యాలు తయారుచేయండి.
1) ఆకాశం మేఘావృతమైనది. ఆకసం నిండా మబ్బులున్నాయి.
2) మా ఉపాధ్యాయుడు పాఠాలు బాగా చెప్తారు. అందుకే మా ఒజ్జ అంటే మాకిష్టం.
3) అగ్ని దగ్గర జాగ్రత్త అవసరం. అగ్గితో ఆటలాడగూడదు.
4) సముద్రంలో గవ్వలుంటాయి. సంద్రంలో అలలు వస్తుంటాయి.
5) ఆకాశంలో పక్షి ఎగురుతోంది. పక్కిలా ఎగరటమంటే పవన్ కు ఎంతో సరదా.
జవాబు:
ప్రకృతి-వికృతి పదముల పట్టిక :
1. ఆకాశం – ఆకసం
2. ఉపాధ్యాయుడు – ఒజ్జ
3. అగ్ని – అగ్గి
4. సముద్రం – సంద్రం
5. పక్షి – పక్కి

కొత్త వాక్యాలు :

  1. ఆకసంలో చందమామ వెలిగిపోతున్నాడు. ఆకాశంలో తారకల అందానికి మరేదీ పోటీ కాదు.
  2. బాల్యంలో కలాం వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన ఉపాధ్యాయుడు ఇయదురై సోలోమోన్. ఆ ఒజ్జను 82 సం||ల వయస్సులో కూడా సంస్మరిస్తాడు కలాం.
  3. ఎండాకాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువ. ఈ కాలంలో అగ్గిని ఆపాలంటే ఎక్కువ కష్టపడాలి.
  4. భారతదేశానికి దక్షిణాన హిందూమహాసముద్రం ఉంది. ఆ సంద్రం ఒడ్డున సూర్యాస్తమయ సన్నివేశాన్ని చూడటానికి యాత్రికులు పోటీపడతారు.
  5. మా బడి దగ్గర తుమ్మచెట్టుకు గిజిగాడు పక్షిగూడు వేలాడుతోంది. పక్కి ఆ గూటిని ఎంతో అందంగా నిర్మించింది.

వ్యాకరణం

అ) పాఠంలోని ప్రత్యక్ష కథనంలోని వాక్యాలు గుర్తించండి. వాటిని పరోక్ష కథనంలోకి మార్చి రాయండి.

1. “మా అన్నయ్య ముస్తఫాకమల్ కి స్టేషన్ రోడ్ లో ఒక కిరాణా దుకాణం ఉండేది” అన్నారు కలామ్.
జవాబు:
తన అన్నయ్య ముస్తఫాకమల్ కి స్టేషన్ రోడ్లో ఒక కిరాణా దుకాణం ఉండేదని కలామ్ అన్నారు.

2. “నేను రామనాథపురం హైస్కూల్లో స్థిరపడగానే నాలోని పదిహేనేళ్ళ జిజ్ఞాసువు మేల్కొన్నాడు” చెప్పాడు కలాం.
జవాబు:
తాను రామనాథపురం హైస్కూల్లో స్థిరపడగానే తనలోని పదిహేనేళ్ళ జిజ్ఞాసువు మేల్కొన్నాడని కలాం చెప్పాడు.

3. “నా ఉపాధ్యాయుడు ఇయదురై సోలోమోన్ ఆదర్శ పథ నిర్దేశకుడయ్యాడు” చెప్పాడు కలాం.
జవాబు:
తన ఉపాధ్యాయుడు ఇయదురై సోలోమోన్ ఆదర్శ పథ నిర్దేశకుడయ్యాడని కలాం చెప్పాడు.

4. “నేను రామనాథపురంలో ఉన్న కాలంలో మా అనుబంధం గురుశిష్య బంధాన్ని దాటి వికసించింది” చెప్పాడు కలాం.
జవాబు:
తాను రామనాథపురంలో ఉన్న కాలంలో తమ అనుబంధం గరుశిష్య బంధాన్ని దాటి వికసించిందని కలాం చెప్పాడు.

5. “జీవితంలో విజయం పొందడానికీ, ఫలితాలు సాధించడానికి నువ్వు మూడు అంశాల మీద పట్టు సాధించాలి” చెప్పాడు సోలోమోన్.
జవాబు:
జీవితంలో విజయం పొందడానికీ, ఫలితాలు సాధించడానికీ అతడు మూడు అంశాల మీద పట్టు సాధించాలని సోలోమోన్ చెప్పాడు.

6. “నా జీవితం నుంచి ఒక ఉదాహరణ ఇస్తాను” చెప్పాడు కలాం.
జవాబు:
తన జీవితం నుంచి ఒక ఉదాహరణ ఇస్తానని కలాం చెప్పాడు.

7. “నాకు చిన్నప్పటి నుంచి ఆకాశపు రహస్యాలన్నా, పక్షుల ప్రయాణమన్నా అమితాసక్తి” కలాం చెప్పాడు.
జవాబు:
తనకు చిన్నప్పటి నుంచి ఆకాశపు రహస్యాలన్నా, పక్షుల ప్రయాణమన్నా అమితాసక్తని కలాం చెప్పాడు.

8. “కొంగలూ, సముద్రపు గువ్వలూ ఎగురుతుండటం చూస్తూ, నేను కూడా ఎగరాలని కోరుకునేవాణ్ణి” చెప్పాడు కలాం.
జవాబు:
కొంగలూ, సముద్రపు గువ్వలూ ఎగురుతుండటం చూస్తూ, తాను కూడా ఎగరాలని కోరుకునేవాణ్ణని కలాం చెప్పాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 4 ప్రేరణ

9. ”నేను కూడా ఏదో ఒకరోజు ఆకాశంలో విహరించగలనని ఎంతగానో నమ్మాను” అన్నాడు కలాం.
జవాబు:
తాను కూడా ఏదో ఒకరోజు ఆకాశంలో విహరించగలనని ఎంతగానో నమ్మానని కలాం అన్నాడు.

10. “విశ్వాసంతో నువ్వు నీ విధిని కూడా తిరిగి రాయగలవు” అనేవాడు సోలోమోన్.
జవాబు:
విశ్వాసంతో అతడు తన విధిని కూడా తిరిగి రాయగలడని సోలోమోన్ అనేవాడు.

11. “నేను రామేశ్వరం వెళ్ళినప్పుడల్లా నన్ను సాయం చేయమంటూ పిలిచి, షాపులో కూర్చోబెట్టేవాడు మా అన్నయ్య” చెప్పాడు కలాం.
జవాబు:
తాను రామేశ్వరం వెళ్ళినప్పుడల్లా తనను సాయం చేయమంటూ పిలిచి, షాపులో కూర్చోబెట్టేవాడు తన అన్నయ్య అని చెప్పాడు కలాం.

12. “నేను అక్కడ ఆ షాపుని కనిపెట్టుకు కూచొని బియ్యం , నూనె, ఉల్లిపాయలు ఒకటేమిటి అన్నీ అమ్ముతుండేవాణ్ణి” అన్నాడు కలాం.
జవాబు:
తాను అక్కడ ఆ షాపుని కనిపెట్టుకు కూచొని బియ్యం, నూనె, ఉల్లిపాయలు ఒకటేమిటి అన్నీ అమ్ముతుండేవాణ్ణి అని కలాం అన్నాడు.

13. “మా అన్నయ్య ముస్తఫా నన్ను వదిలిపెట్టగానే మా తమ్ముడు కాశిం మహమ్మద్ నన్ను తన ఫ్యాన్సీ షాపులో కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉండేవాడు” చెప్పాడు కలాం.
జవాబు:
తన అన్నయ్య ముస్తఫా తనను వదలిపెట్టగానే తన తమ్ముడు కాశిం మహమ్మద్ తనని అతని ఫ్యాన్సీ షాపులో కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉండేవాడని కలాం చెప్పాడు.

14. “నేను సెంట్ జోసెఫ్ లో నా చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు ఇంగ్లీషు సాహిత్యం పట్ల మక్కువ పెంచుకున్నాను” అన్నాడు కలాం.
జవాబు:
తాను సెంట్ జోసె లో తన చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు ఇంగ్లీషు సాహిత్యం పట్ల మక్కువ పెంచుకున్నానని కలాం అన్నాడు.

15. “దాదాపుగా ఆ సమయంలోనే భౌతికశాస్త్రం పట్ల నాకు అమితమైన ఆసక్తి ఏర్పడింది” చెప్పాడు కలాం.
జవాబు:
దాదాపుగా ఆ సమయంలోనే భౌతికశాస్త్రం పట్ల తనకు అమితమైన ఆసక్తి ఏర్పడిందని కలాం చెప్పాడు.

16. “నాకయితే సైన్స్ ఎప్పుడూ ఆధ్యాత్మిక ఉన్నతికి, ఆత్మ సాక్షాత్కారానికి మార్గంగానే ఉంటూ వచ్చింది” అన్నాడు కలాం.
జవాబు:
తనకయితే సైన్స్ ఎప్పుడూ ఆధ్యాత్మిక ఉన్నతికి, ఆత్మ సాక్షాత్కారానికి మార్గంగానే ఉంటూ వచ్చిందని కలాం అన్నాడు.

17. “ఒక సైన్స్ విద్యార్థికి ఉన్న భవిష్య అవకాశాల గురించిన సమాచారం కూడా నాకేమీ తెలియదు” చెప్పాడు కలాం.
జవాబు:
ఒక సైన్స్ విద్యార్థికి ఉన్న భవిష్య అవకాశాల గురించిన సమాచారం కూడా తనకేమీ తెలియదని కలాం చెప్పాడు.

18. “బి.ఎస్.సి. డిగ్రీ పూర్తి చేశాకే భౌతికశాస్త్రం నా సబ్జెక్ట్ కాదని గ్రహించాను” అన్నాడు కలాం.
జవాబు:
బి.ఎస్.సి. డిగ్రీ పూర్తి చేశాకే భౌతికశాస్త్రం తన సబ్జెక్ట్ కాదని గ్రహించానని కలాం అన్నాడు.

19. “నా కలలు నిజం కావాలంటే నేను ఇంజనీరింగ్ చదవవలసి ఉంటుందని తెలుసుకున్నాను” చెప్పాడు కలాం.
జవాబు:
తన కలలు నిజం కావాలంటే తాను ఇంజనీరింగ్ చదవవలసి ఉంటుందని తెలుసుకున్నానని కలాం చెప్పాడు.

20. “ఇంటర్మీడియెట్ అయిన తరువాతనే నేను నేరుగా ఇంజనీరింగ్ లో చేరి ఉండవచ్చు” అన్నాడు కలాం.
జవాబు:
ఇంటర్మీడియెట్ అయిన తరువాతనే తాను నేరుగా ఇంజనీరింగ్ లో చేరి ఉండవచ్చని కలాం అన్నాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 4 ప్రేరణ

21. “అప్పుడు నా సోదరి ఊహారా నాకు తోడు నిలబడింది” చెప్పాడు కలాం.
జవాబు:
అప్పుడు తన సోదరి జొహారా తనకు తోడు నిలబడిందని కలాం చెప్పాడు.

22. “నేను చదువుకోవాలన్న ఆమె కాంక్ష, నా సామర్థ్యంపై ఆమె నమ్మకం నన్ను గాఢంగా చలింపచేశాయి” అన్నాడు కలాం.
జవాబు:
తను చదువుకోవాలన్న ఆమె కాంక్ష, తన సామర్థ్యంపై ఆమె నమ్మకం తనను గాఢంగా చలింపచేశాయని కలాం అన్నాడు.

23. “నేను నా సొంత సంపాదన మీదనే ఆమె గాజుల్ని విడిపిస్తానని ఒట్టు పెట్టుకున్నాను” పేర్కొన్నాడు కలాం.
జవాబు:
తాను తన సొంత సంపాదన మీదనే ఆమె గాజుల్ని విడిపిస్తానని ఒట్టు పెట్టుకున్నానని కలాం పేర్కొన్నాడు.

24. “నా మొదటి సంవత్సరం పూర్తయ్యాకజకు ప్రత్యేక విషయాన్ని పంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు మరేమీ ఆలోచించకుండా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ని ఎంచుకున్నాను” చెప్పాడు కలాం.
జవాబు:
తన మొదటి సంవత్సరం పూర్తయ్యాక ఒక ప్రత్యేక విషయాన్ని ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు మరేమీ ఆలోచించకుండా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ని ఎంచుకున్నానని కలాం చెప్పాడు.

25. “లక్ష్యం నా మనస్సులో స్పష్టంగానే ఉండింది” అన్నాడు కలాం.
జవాబు:
లక్ష్యం తన మనస్సులో స్పష్టంగానే ఉండిందని అన్నాడు కలాం.

26. “ఎమ్.ఐ.టి. లో నా విద్యాభ్యాసంలో నా ఆలోచనని ముగ్గురు ఉపాధ్యాయులు తీర్చిదిద్దారు” పేర్కొన్నాడు కలాం.
జవాబు:
ఎమ్.ఐ.టి. లో తన విద్యాభ్యాసంలో తన ఆలోచనని ముగ్గురు ఉపాధ్యాయులు తీర్చిదిద్దారని కలాం పేర్కొన్నాడు.

27. “విస్తృత పరిజ్ఞానం నా మనసులో నెమ్మదిగా సమీకరింపబడటం మొదలయ్యింది” చెప్పాడు కలాం.
జవాబు:
విస్తృత పరిజ్ఞానం తన మనసులో నెమ్మదిగా సమీకరింపబడటం మొదలయ్యిందని కలాం చెప్పాడు.

28. “ఒక రోజు మా డైరెక్టర్, మాకు డిజైనింగ్ ఉపాధ్యాయుడూ అయిన ప్రొఫెసర్ శ్రీనివాసన్ మా పనిలో ప్రగతిని సమీక్షించి, ఏమీ పురోగతి లేదని తేల్చేశారు” అన్నాడు కలాం.
జవాబు:
ఒకరోజు తమ డైరెక్టర్, తమకు డిజైనింగ్ ఉపాధ్యాయుడూ అయిన ప్రొఫెసర్ శ్రీనివాసన్ తమ పనిలో ప్రగతిని సమీక్షించి, ఏమీ పురోగతి లేదని తేల్చేశారని కలాం అన్నాడు.

29. “ఆ రాత్రి నేను భోజనం మానేసి డ్రాయింగ్ బోర్డ్ దగ్గరే పనిలో నిమగ్నుణ్ణిపోయాను” చెప్పాడు కలాం.
జవాబు:
ఆ రాత్రి తాను భోజనం మానేసి డ్రాయింగ్ బోర్డ్ దగ్గరే పనిలో నిమగ్నుణ్ణిపోయానని కలాం చెప్పాడు.

30. “నేను ఎమ్. ఐ.టి. తమిళ సంఘం వారు నిర్వహించిన వ్యాసరచన పోటీలో పాల్గొన్నాను” అన్నాడు కలాం.
జవాబు:
తాను ఎమ్. ఐ.టి. తమిళ సంఘం వారు నిర్వహించిన వ్యాసరచన పోటీలో పాల్గొన్నానని కలాం అన్నాడు.

31. “రా నాతోపాటు ముందు కూర్చో” అన్నాడు ప్రొఫెసర్ స్పాండర్.
జవాబు:
తనతో పాటు ముందు కూర్చొనుటకు రమ్మని ప్రొఫెసర్ స్పాండర్ అన్నాడు.

32. “నువ్వు నా బెస్టు స్టూడెంట్ వి. నీ పరిశ్రమ నీ ఉపాధ్యాయులకి భవిష్యత్తులో మంచిపేరు తేవడానికి ఉపకరిస్తుంది” అన్నాడు ప్రొఫెసర్ స్పాండర్.
జవాబు:
అతడు తన బెస్టు స్టూడెంట్ అని, అతని పరిశ్రమ అతని ఉపాధ్యాయులకి భవిష్యత్తులో మంచి పేరు తేవడానికి ఉపకరిస్తుందని ప్రొఫెసర్ స్పాండర్ అన్నాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 4 ప్రేరణ

ఆ) క్రియను మార్చి వ్యతిరేకార్థక వాక్యాలు రాయండి.

1. పుస్తక రచనను పూర్తి చేయడానికి ఒక నెల రోజుల వ్యవధి కావాలి.
జవాబు:
పుస్తక రచనను పూర్తి చేయడానికి ఒక నెలరోజుల వ్యవధి అవసరం లేదు.

2. నా మాతృభూమి విస్తృతి ఎంతో తెలుసుకోలేకపోయాను.
జవాబు:
నా మాతృభూమి విస్తృతి ఎంతో తెలుసుకోగలిగాను.

ఇ) కర్తరి వాక్యాలు, కర్మణి వాక్యాలు

1. కర్తరి వాక్యం :
క్రియ చేత కర్త చెప్పబడితే ఆ వాక్యాన్ని కర్తరి వాక్యం అంటారు. ఇది సూటిగా అర్థమవుతుంది. ఇది తెలుగు భాషకు సహజసిద్ధమైంది.
ఉదా :
జిడ్డు కృష్ణమూర్తి గారు ఎన్నో మంచి విషయాలను చెప్పారు.

2. కర్మణి వాక్యం :
క్రియ చేత కర్మ చెప్పబడితే ఆ వాక్యాన్ని కర్మణి వాక్యం అంటారు. ఇది కాస్త చుట్టు తిప్పి చెప్పినట్లుంటుంది. ఈ వాక్యాలు సంస్కృత భాషా ప్రభావం వల్ల తెలుగులో ఏర్పడ్డాయి. ఇంగ్లీషులో ఇటువంటి వాక్య పద్ధతి ఉంది.
ఉదా :
ఎన్నో మంచి విషయాలు జిడ్డు కృష్ణమూర్తి గారి చేత చెప్పబడ్డాయి.

AP Board 9th Class Telugu Solutions Chapter 4 ప్రేరణ

ఇలాగే మీరు మార్చండి.
1. రమేష్ భారతాన్ని చదివాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
భారతం రమేష్ చే చదవబడింది. (కర్మణి వాక్యం)

2. నేనెన్నో పుస్తకాలు రాశాను. (కర్తరి వాక్యం)
జవాబు:
నా చేత ఎన్నో పుస్తకాలు రాయబడ్డాయి. (కర్మణి వాక్యం)

9th Class Telugu 4th Lesson ప్రేరణ రచయిత పరిచయం

ఆ అందరూ ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ అని పిలిచే డాక్టర్ అవుల్ ఫకీర్ జైనులాద్దీన్ అబ్దుల్ కలామ్ 1931 అక్టోబర్ 15 న తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటిలో పుట్టారు. సామాన్య కుటుంబంలో పుట్టిన ఆయన పట్టుదల, క్రమశిక్షణ, జ్ఞాన జిజ్ఞాసతో ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా తన సేవలను ఈ జాతికి అందించారు. “ఒక విజేత ఆత్మకథ” (ఇగ్నైటెడ్ మైండ్స్, ద వింగ్స్ ఆఫ్ ఫైర్ – యాన్ ఆటోబయోగ్రఫీ) వంటి రచనలు చేశారు.

శాస్త్రరంగంలో విశేష కృషి చేసినందుకు గాను పద్మభూషణ్, పద్మవిభూషణ్ తో పాటు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతోను భారత ప్రభుత్వం సత్కరించింది. దేశ విదేశాల్లోని | విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లతో ఆయనను గౌరవించాయి.

కఠిన పదాలకు అర్థాలు

జిజ్ఞాసి = తెలిసికోవాలనే కోరిక కలవాడు
మేల్కొను = ముందు జాగ్రత్తపడు
జీవితావకాశాలు = జీవితంలో వచ్చే అవకాశాలు
ప్రత్యామ్నాయాలు = బదులుగా చేసే పనులు
ఔత్సాహికుడు = ఉత్సాహం కలవాడు
ఆదర్శపథము = ఆదర్శ మార్గం
నిర్దేశకుడు = ఉపదేశించేవాడు ; చూపించేవాడు
ఉదార = గొప్పదైన
దృక్పథము = ఆలోచనా ధోరణి లేదా సరళి
అనుబంధం = సంబంధం
గురుశిష్య బంధము = గురుశిష్యుల సంబంధం
సాహచర్యం = కలిసి ఉండడం
జీవిత గమనం = జీవితం నడవడి
ప్రభావితం = ప్రభావము పడినది
పట్టు = ఊత
ఆశ పెట్టుకోవడం = కోరిక కలిగి ఉండడం
సంభవించాలని = జరగాలని ; కలగాలని
ఆకాంక్షించాలని = కోరాలని
ప్రగాఢంగా = మిక్కిలి అధికంగా
విశ్వసించాలి = నమ్మాలి
అమితాసక్తి (అమిత+ఆసక్తి) = అంతులేని ఆసక్తి
స్పృహ = ఇచ్ఛ, కోరిక
విధిని = భాగ్యమును (విధి రాతను)
దృఢ సంకల్పం = గట్టి లక్ష్యము
ఇనుమడించింది = రెట్టింపు అయ్యింది
ప్రొఫెషనల్ చదువులు = వృత్తి విద్యలు
క్లుప్తంగా = సంక్షిప్తంగా
అదృశ్యం = కనబడనిది
కష్టార్జితం (కష్ట + ఆర్జితం) = కష్టంతో సంపాదింపబడినది
కంచి పరమాచార్య = కంచిలో గల చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామీజీ శంకర మఠం అధ్యక్షులు)
అనుచరులు = సహాయకులు
త్యాగనిరతి = దానము చేయుటయందు మిక్కిలి ఆసక్తి
కేంపస్ = ప్రాంగణం
దృశ్యం = చూడదగినది
ఉద్వేగభరితుణ్ణి = కలతతో నిండినవాణ్ణి
మక్కువ = ప్రేమ
సర్వశ్రేష్ఠకృతుల్ని = అన్నింటికంటె గొప్ప కావ్యాల్ని
అంశము = విషయం
విజ్ఞానశాస్త్ర పథం = సైన్సు మార్గం
భవిష్య అవకాశాలు = రాబోయే కాలంలో వచ్చే అవకాశాలు
సమాచారం = వార్త
సబ్జెక్ట్ (subject) = విషయం
సాంకేతిక విద్య = యాంత్రిక విద్య
తలమానికం = శిరోరత్నం
దరఖాస్తు = అభ్యర్థన పత్రం
ఎంపిక = ఎన్నుకొను
ప్రతిష్టాత్మక సంస్థ = పేరుపొందిన సంస్థ
తలకు మించిన విషయం = తన వల్ల కాని విషయం
తోడు నిలబడింది = సహాయంగా నిలబడింది (సాయం చేసింది)
కుదువబెట్టి = తాకట్టుపెట్టి
ఆకాంక్ష = గాఢమైన కోరిక
చలింపచేశాయి = కదిలించాయి
స్కాలర్‌షిప్ = ఉపకార వేతనం (scholarship)
మిన్నగా = అధికంగా
ఆరాధిస్తూ = పూజిస్తూ (గౌరవిస్తూ)
ఏరోనాటికల్ ఇంజనీరింగు = విమానాలను నడపడానికి సంబంధించిన ఇంజనీరింగు
లక్ష్యం = గురి
సాధ్యము = సిద్ది
నేపథ్యం = తెరవెనుక విషయము (పూర్వ రంగం)
వైఫల్యాలు = ప్రయత్నము జయప్రదం కాకుండా పోవడం, (Failures)
ఆశాభంగాలు = కోరిక భగ్నం కావడాలు
ఉత్తేజకరము = ప్రేరణను ఇచ్చేది
వివేకి = విచారణ చేయువాడు
ప్రయోజన శూన్యం = ఉపయోగం లేనిది
వ్యక్తిత్వం = వ్యక్తికి సంబంధించిన స్వభావం
ఆశయము = అభిప్రాయం
జ్ఞానతృష్ణ = జ్ఞాన సంపాదనమందు ఆసక్తి
చైతన్యం = జ్ఞానం (తెలివి)
అకుంఠిత సంకల్పం = మొక్కవోని కోరిక (తిరుగులేని అభిప్రాయం)
ఉవ్విళ్ళూరించే = మిక్కిలి ఆశించే ; (త్వరపడే)
వ్యత్యాసము = భేదం
నిశిత బోధన = మెఱుగు పెట్టబడిన బోధన
ఏరోనాటిక్స్ = వైమానిక సంబంధమైనది
తృష్ణ = పేరాస
జాగరితం = మేల్కొనడం
మేధాగరిమ = గొప్ప తెలివి

AP Board 9th Class Telugu Solutions Chapter 4 ప్రేరణ

సమగ్రత = సంపూర్ణం
బలోపేతం = బలంతో కూడినది
సమీకరింపబడటం = ఒకటిగా చేయబడటం
ఏరోప్లేన్ = విమానం (Aeroplane)
సమగ్రవంతం = సంపూర్ణము కావడం
సహకరించారు = సాయం చేశారు
కోర్సు (course) = పాఠ్య ప్రణాళిక
డిజైన్ (design) = నమూనా, ప్రణాళిక (Design)
ప్రగతి = అభివృద్ధి
సమీక్షించి = పరామర్శించి
పురోగతి = ముందుకు నడచుట
నిరాశాజనకం = నిరాశను పుట్టించేది
సాకులు = వంకలు
వ్యవధి = మేర,ఎడమ
భాగ్య రేఖ = అదృష్ట రేఖ
నిమగ్నుడు = మునిగినవాడు
కావలించుకొని = ఆలింగనం చేసుకొని
ప్రశంసాత్మకంగా = పొగడబడే విధంగా
వెన్నుతట్టు = ధైర్యము చెప్పు
నెడుతున్నాను = గెంటుతున్నాను
ఆసక్తి = అపేక్ష
మార్గదర్శి = మార్గాన్ని చూపేవాడు
మహామేధావి = గొప్ప తెలివి కలవాడు
వీడ్కోలు = పోవడానికి అంగీకారం తెల్పడం
ఇంజన్ ఓవర్ హాలింగ్ = ఇంజనను పరిశుభ్రం చేయడం
ప్రాక్టికల్స్ (practicals) = ప్రయోగాలు
ఉద్వేగాన్ని = కలతచెందిన మనస్సును
పసిగట్టడం = సూచనగా తెలిసికొను
డైనమిక్స్ = ఇది ఫిజిలో ఒక భాగం ప్రతిభ = తెలివి
అంశాలు = విషయాలు
బోధపడ్డాయి = అర్థమయ్యాయి
గ్రాడ్యుయేట్ (graduate)=పట్టభద్రుడు
చిరకాల స్వప్నం = చాలాకాలం నుండి ఉన్న కల
ఉపాధి అవకాశాలు = బ్రతుకు తెరువుకు దారులు
ఆధ్వర్యం = పెత్తనం
కాల్ లెటర్లు (call letters) = రమ్మని పిలిచే ఉత్తరాలు
కోరమాండల్ తీరం = భారతదేశానికి తూర్పు వైపున క్రింది భాగాన ఉన్న సముద్ర తీరాన్ని కోరమాండల్ తీరం అంటారు.

కోరమాండల్ తీరబాలుడు అంటే తూర్పు సముద్ర తూర్పు తీరాన పుట్టిన ‘కలాం’

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions Chapter 3 శివతాండవం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions 3rd Lesson శివతాండవం

9th Class Telugu 3rd Lesson శివతాండవం Textbook Questions and Answers

చదవండి-ఆలోచించండి-చెప్పండి

నా గానపు స్వరలయలకు శివుడు తాండవించాడట నా గానపు గతికి జతికి గణపతి నర్తించాడట నా గానపు మధురిమలకు కృష్ణమురళి మోగిందట నా గానపు రసఝరిలో ప్రకృతి నాట్య మాడిందట

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
ఈ పంక్తులు దేని గురించి చెబుతున్నాయి?
జవాబు:
గాన మహిమ గురించి చెబుతున్నాయి.

ప్రశ్న 2.
ఈ పంక్తులలోని ముఖ్యమైన పదాలేవి?
జవాబు:
తాండవం, నర్తించడం, నాట్యమాడటం.

ప్రశ్న 3.
ఈ పంక్తులు వింటున్నప్పుడు లేదా చదువుతున్నప్పుడు మీరు పొందిన అనుభూతి ఏమిటి?
జవాబు:
గానం యొక్క గొప్పదనానికి ఒళ్ళు పులకరించింది.

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

ప్రశ్న 4.
ఇలాంటి గేయం మీకు తెలుసా?
జవాబు:
పుట్టపర్తి నారాయణాచార్యులు గారు “శివతాండవం” గేయం రాశారనీ, అందులో గేయ పంక్తులు ఇలాగే ఉంటాయనీ మా గురువులు చెప్పగా విన్నాను. శివతాండవంలోని కొన్ని గేయ పంక్తులు ఇవి.
ఉదా :
1) బంగరు పులుగుల వలె మబ్బులు విరిసినవి.
2) వియచ్చర కాంతలు జలదాంగనలై వచ్చిరొయేమో.
3) అలలై బంగరు కలలై.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది అంశాలను గురించి మాట్లాడండి.

ప్రశ్న 1.
మీకు తెలిసిన నాట్యరీతుల గురించి చెప్పండి.
జవాబు:
కూచిపూడి, భరతనాట్యం, కథక్, కథాకళి, మోహినీ అట్టం.

ప్రశ్న 2.
‘శివతాండవం’ గేయాన్ని లయబద్దంగా పాడండి. ఇది వింటున్నప్పుడు మీకు ఎలా అనిపించిందో చెప్పండి.
జవాబు:
అచ్చ తెలుగు పదాల అందం తెలిసింది. గేయం వినసొంపుగా ఉండి, తెలియని ఆనందం కలుగుతుంది.

ప్రశ్న 3.
పుట్టపర్తి నారాయణాచార్యులు శివతాండవాన్ని “నల్లకలువలు విచ్చుకొన్నట్లు, నల్లని కొండలు పగిలినట్లు, చీకట్లు వ్యాపించినట్లు” – ఇలా ఎన్నో అంశాలతో పోల్చారు కదా ! ఇలాంటి పోలికల ద్వారా మీరేం గ్రహించారు?
జవాబు:
ప్రకృతిని కవి చక్కగా వర్ణించాడు. ఈ వర్ణన ద్వారా శివుని తాండవాన్ని మన కన్నులకు కట్టేలా చూపగలిగాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

ఆ) గేయంలో అంత్యప్రాస పదాలు ఏమున్నాయి? పాఠ్యభాగంలో గుర్తించి కింద గీత గీయండి.
జవాబు:
శివుడు భవుడు; పూయ ఘోయ; విధాన; అట్లు

ఇ) కింది గద్యం చదివి, ప్రశ్నలకు జవాబులివ్వండి.

మహాశివుడు ఆనందంతో నాట్యం చేస్తూ తన చేతిలోని డమరుకాన్ని 14 మార్లు మోగించాడు. ఆ ధ్వని విశ్వవ్యాప్తమైంది. పాణిని అలా వెలువడ్డ శబ్దాలను స్వీకరించి సంస్కృత భాషలో సూత్రమయమైన వ్యాకరణాన్ని రచించాడు. “అ ఇ ఉణ్, ఋ, ఇక్ ……. అంటూ 14 మాహేశ్వర సూత్రాలతో తన వ్యాకరణ రచన ఆరంభించాడు. ప్రపంచ వాజ్మయంలో పాణిని సంస్కృత వ్యాకరణం సర్వోత్తమమైనది.

ప్రశ్న 1.
శివుడు డమరుకం ఎందుకు మోగించాడు?
జవాబు:
శివుడు ఆనందంతో నాట్యం చేస్తూ తన చేతిలోని డమరుకాన్ని మోగించాడు.

ప్రశ్న 2.
పాణిని వ్యాకరణం గొప్పతనం ఏమిటి?
జవాబు:
ప్రపంచ వాజ్మయంలో పాణిని సంస్కృత వ్యాకరణం సర్వోత్తమమైనది.

ప్రశ్న 3.
పై సన్నివేశం దేనికి ప్రారంభంగా చెప్పవచ్చు?
జవాబు:
పాణిని సంస్కృత వ్యాకరణ రచనకు ప్రారంభంగా చెప్పవచ్చు.

ఈ) కింది ప్రశ్నలకు పాఠ్యాంశం నుండి సంక్షిప్తంగా సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
పాఠంలో గేయంలోని మొదటి చరణం చదవండి. శివతాండవాన్ని కవి ఎలా వర్ణించాడో రాయండి.
జవాబు:
స్వచ్ఛమైన వెన్నెల విరబూసినట్లుగా, అందమైన పూలను కుప్పపోసినట్లుగా, తెల్లని విబూదితో పూత పెట్టినట్లుగా, మంచు కుప్పలుగా పేర్చినట్లుగా, మంచి ముత్యాలను ఏర్చికూర్చినట్లుగా, సరిపోల్చలేని అమృతాన్ని పంచి పెట్టినట్లుగా, పచ్చ కర్పూరాన్ని తెచ్చి కలియజల్లినట్లుగా, మనసులోని ఆనందమంతా కళ్ళ నుండి వెలువడినట్లుగా, చురుకైన నీలపు కళ్ళలో కాంతులు వెల్లివిరిసేలా, ఘల్లు ఘల్లుమని చిలిపి గజ్జెలు మోగుతుండగా ఆడుతూ పాడుతున్నాడు శివుడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

ప్రశ్న 2.
‘తమ్ములై’ – అంటూ సాగిన గేయంలో శివుని నాట్యాన్ని కవి కొన్ని పూలతో పోల్చాడు. వాటిని తెలపండి.
జవాబు:
శివుని తాండవం తామరపూలు విప్పారినట్లుంది. శుభాలనిచ్చేదిగా ఉంది. అప్పుడే విచ్చిన తాజా పూమొగ్గల్లా, వికసించిన పూలలా ఉంది. తుమ్మెదలచే కప్పబడిన తామరలా ఉంది. కొత్త రత్నాల్లాగా ఉంది.

ప్రశ్న 3.
తెల్లదనాన్ని తెలిపే కొన్ని అంశాలతో శివతాండవాన్ని పోల్చారు. ఉదాహరణకు ‘వెన్నెల కురుస్తున్నట్టు’ మొదలైనవి. ఇలాంటి అంశాలను కొన్నింటిని రాయండి.
జవాబు:
శివుని తాండవం స్వచ్ఛమైన వెన్నెల విరబూసినట్లు, తెల్లని విబూదితో పూత పెట్టినట్లు ఉంది. జాజిపూలను కుప్పలుగా పోసినట్లు, మంచును కుప్పలుగా పేర్చినట్లుంది. మంచి ముత్యాలను ఏర్చికూర్చినట్లు, పచ్చ కర్పూరం కలియజల్లినట్లుగా ఉంది. ఇంకా ఆనందం కన్నుల నుండి కారుతున్నట్లుగా, అమృతాన్ని పంచినట్లుగా ఉంది.

ప్రశ్న 4.
శివుని నాట్యాన్ని వర్ణించే కొన్ని పంక్తులను రాసి, వాటిని వివరించండి.
జవాబు:
మబ్బుగము లుబ్బికొని ప్రబ్బికొన్న విధాన
అబ్బురపు నీలములు లిబ్బి సేరు విధాన
నల్లకలువలు దిక్కులెల్ల విచ్చు విధాన
మొల్లముగ దుమ్మెదలు మొనసికొన్న విధాన
నగలు కాటుకకొండ పగిలి చెదరు విధాన
తగిలి చీకటులు గొప్పగ గప్పెడు విధాన
తనలోని తామసము కనుల జారు విధాన
తనలోని వక్రతయె కనుల దీరు విధాన
కులుకు నీలపు గండ్ల దళుకు జూపులు బూయ
ఘలు ఘల్లుమని కాళ్ళ జిలిపి గజ్జెలు మ్రోయ
ఆడెనమ్మా ! శివుడు!
పాడెనమ్మా! భవుడు

శివుని తాండవం మబ్బులన్నీ నీటి ఆవిరితో కూడి, అలముకొన్నట్లుగా ఉంది. అద్భుతమైన నీలమణులను ఒకే చోట పేర్చినట్లుగా, నల్లకలువలు దిక్కులంతా వికసించినట్లుగా ఉంది. తుమ్మెదలు ఒక చోట చేరి ముసిరి ఉన్నట్లుగా అందంగా ఉంది. కాటుక కొండ పగలగా కాటుకంతా చెదరిపోయినట్లుగా ఉంది. చీకట్లు ఒక్కసారిగా కమ్ముకున్నట్లుగా శోభాయమానంగా ఉంది. తనలోని అజ్ఞానమంతా కళ్ళనుంచి కారిపోతున్నట్లుగా, మనస్సులోని వంకరలన్నీ కళ్ళలో కనిపిస్తున్నట్లుగా ఉంది. చురుకు నీలపు కళ్ళలో కాంతులు వికసిస్తుండగా పాదాలకున్న గజ్జెలు మోగుతుండగా ఆడుతూ పాడుతున్నాడు శివుడు.

ఇందులో నలుపే ఎక్కువగా వర్ణించబడింది. సాధారణంగా, నలుపును అశుభసూచకంగా లోకం భావిస్తుంది. కానీ నలుపు కూడా దైవ స్వరూపమే అని కవి చెప్పడం వలన లోకంలో దైవ స్వరూపం కానిదేదీ లేదనే భావన కలుగుతుంది.

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
వసంతశోభ ఎలా కమ్ముకుందో సొంతమాటల్లో రాయండి.
జవాబు:
వసంత ఋతువు ఆరంభం కాగానే ఎండిన చెట్లకు జీవం వచ్చి క్రమంగా లేజిగురాకులు రాసాగాయి. చెట్లు, తీగలు, పూలతో నిండి కొత్త శోభను వెదజల్లుతున్నాయి. లేజిగురాకుల ఎర్రని సోయగం వింత కాంతిని విరజిమ్ముతుంది. ఎక్కడ చూసినా పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉంది. పూలపై నుంచి వచ్చే పరిమళాలతో కూడిన గాలులు జనాలను ఉత్సాహ పరుస్తున్నాయి. మామిడి చిగుళ్ళను తిని మదించిన కోయిలల కుహూ రాగాలతో ఆనందకర వాతావరణం ఏర్పడుతుంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

ప్రశ్న 2.
ఈ పాఠ్యభాగంలోని కవి వర్ణనల్లో మీకు బాగా నచ్చిన అంశమేది? అది ఎందుకు నచ్చింది? వివరించండి.
జవాబు:
పాఠ్యభాగంలోని కవి వర్ణనల్లో నాకు బాగా నచ్చిన అంశం ఏమిటంటే – శివుని తాండవం అలలు కదలినట్లుగా, చిరుగాలికి ఆకులు కదలినట్లుగా ఉంది. తామర పూలు కదలినట్లు, పూలలోని సువాసనలు గాలిలో వ్యాపించినట్లుంది. తెరపై బొమ్మలు నటనను ప్రదర్శించినట్లుంది. కమ్మని కస్తూరి పరిమళ వీణలు మోగినట్లు, నెమలి అందమైన తన పింఛాన్ని విప్పినట్లుంది. గాలికి చిగురాకులు ఒయ్యారంగా కదిలినట్లు, నవ్వులో లేత వలపు జాలువారినట్లుంది. చురుకైన నీలపు కళ్ళలో కాంతులు విరబూస్తుండగా, ఘల్లు ఘల్లుమని పాదాలకున్న చిలిపి గజ్జెలు మోగేలా శివుడు ఆడుతూ పాడుతున్నాడు. నెమలి పురివిప్పి ఆడడం, అలలు కదలడం, సువాసనలు వ్యాపించడం, గాలికి ఆకులు కదలడం, తెరపై బొమ్మలు నటించడం, నవ్వులో ప్రేమ ఒలకపోయడం ఇవన్నీ నిత్య జీవితంలో మన కెదురయ్యే అనుభవాలు. ఇలాంటి వాటితో శివతాండవాన్ని పోల్చడం వలన అది మన కనుల ముందు కన్పిస్తున్న భావన కలుగుతుంది. అందువలన ఈ భాగం నాకు బాగా నచ్చింది.

ప్రశ్న 3.
“శివుని తాండవం కర్పూరం చల్లినట్లుంద”ని కవి భావించాడు. దాని ఆంతర్యాన్ని మీరు ఏమని భావిస్తున్నారు?
జవాబు:
పచ్చకర్పూరం తెల్లగా ప్రకాశిస్తుంది. చల్లదనాన్ని కలిగిస్తుంది. ఇంతేగాక వింత పరిమళాన్ని వెదజల్లుతుంది. శివతాండవాన్ని కవి పచ్చకర్పూరంతో పోల్చడం వలన తెల్లదనం ఎలా అంతా వ్యాపిస్తుందో అలా తాండవం దిక్కులంతా వ్యాపించింది. ఎంతసేపు చూసినా కళ్ళకు అలసట కలుగకుండా చల్లదనాన్ని కలిగిస్తుంది. తాండవ సమయంలో శివుని ఒంటికి పూసుకున్న విబూది ఆ ప్రాంతమంతా రాలిపడడం వలన కవి దాన్ని ‘ఘనసారం’ తో పోల్చి ఉంటాడు.

ఆ) కింది ప్రశ్నలకు పదిహేనేసి పంక్తుల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
శివతాండవం గేయ సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.
(లేదా)
సత్వరజస్తమీగుణ ప్రధానంగా సాగిన శివతాండవాన్ని మీ సొంతమాటల్లో వివరించండి.
(లేదా)
పుట్టపర్తి వారు శివుని తాండవాన్ని ఏ విధంగా వర్ణించారో మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
స్వచ్ఛమైన వెన్నెల విరియబూసినట్లుగా, అందమైన జాజిపూలను కుప్పలుగా పోసినట్లుగా, తెల్లని విభూతి పొరలు పొరలుగా ఉన్నట్లు మంచి ముత్యాలను ఏరి కూర్చినట్లుగా, మంచు కుప్పలుగా పేర్చినట్లుగా, సరిపోల్చలేని అమృతాన్ని పంచిపెట్టినట్లుగా, పచ్చకర్పూరాన్ని తెచ్చి కల్లాపు జల్లినట్లుగా శివతాండవం ఉంది. మనసులోని ఆనందమంతా కళ్ళ నుండి వెలువడినట్లుగా, చురుకైన నీలపు కళ్ళలో కాంతులు విరిసేలా, ఘల్లు ఘల్లుమని చిలిపి గజ్జెలు మోగుతుండగా శివుడు ఆడుతూ పాడుతున్నాడు.

శివుని తాండవం మబ్బులన్నీ నీటిఆవిరితో కూడి అలముకొన్నట్లుగా ఉంది. అద్భుతమైన నీలమణులను ఒకేచోట పేర్చినట్లుగా, నల్ల కలువలు దిక్కులంతా వికసించినట్లుగా ఉంది. తుమ్మెదలు ఒకచోట చేరి ముసిరికొన్నట్లుగా అందంగా ఉంది. కాటుక కొండ పగలగా కాటుకంతా చెదరిపోయినట్లుగా ఉంది. చీకట్లు ఒక్కసారిగా కమ్ముకొన్నట్లు శోభాయమానంగా ఉంది. తనలోని అజ్ఞానమంతా కళ్ళ నుంచి కారిపోతున్నట్లుగా ఉంది. మనస్సులోని వంకరలన్నీ కళ్ళలో కన్పిస్తున్నట్లుంది.

తామరపూలు విప్పారినట్లుంది. పూర్వజన్మ పుణ్యం ఆకారం దాల్చినట్లుంది. శాస్త్ర సంపదను పెంచేదై ఉంది. అప్పుడే వికసించిన పూలలా ఉంది. తుమ్మెదలు ముసిరిన పద్మాలలా ఉంది. చక్కని హావ భావాలతో కూడి ఉంది. కొత్త హారాలలాగా, మంచి నవ్వులాగా ఉంది. కనుకొలకుల సోకులా ఉంది. ఎర్రని లేజిగురాకులా ఉంది. అనురాగపు గుర్తులతో కూడి ఉంది. మైమరపును (తంద్రను) కలిగించేదిగా ఉంది.

ఇంకా శివుడు అలలు కదలినట్లుగా, చిరు గాలికి ఆకులు కదిలినట్లుగా పాడుతూ తాండవం చేస్తున్నాడు. శివతాండవం తామర పూలు కదలినట్లు, పూల సువాసనలు గాలిలో వ్యాపించినట్లుంది. కమ్మని కస్తూరి పరిమళాలు వెల్లివిరిసినట్లుంది. నెమలి పురివిప్పి ఆడినట్లుంది. గాలికి చిగురాకులు ఒయ్యారంగా కదలినట్లు, నవ్వులో ప్రేమంతా ఒలకబోసినట్లుంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

ప్రశ్న 2.
శివుడు నర్తించిన విధానంలో ప్రత్యేకతలు ఏమున్నాయి? (లేదా) త్రిగుణాలను తన నాట్యంలో ఆవిష్కరించినట్లు పుట్టపర్తివారిచే వర్ణించబడిన శివతాండవాన్ని గూర్చి రాయండి.
జవాబు:
శివుడు చేసిన ఆనంద తాండవంలో ప్రత్యేకతలను కవి సంకేతాలతో సూచించాడు. ఆ వెన్నెల విరబూసినట్లుందన్నాడు. కాంతికి, చల్లదనానికి ఇది సంకేతం. జాజిపూలు పరిమళానికి, విబూది స్వచ్ఛతకు గుర్తులు. మంచు నిర్మలత్వానికి, మంచి ముత్యాలు అందానికి చిహ్నాలు. పచ్చకర్పూరం రోగనిర్మూలనం కోసం వాడతాం. అమృతం దైవత్వానికి గుర్తు. ఇక -ఇవన్నీ తెల్లదనాన్ని కలిగి ఉన్నాయి. తెలుపు సత్వగుణానికి గుర్తుగా ఆధ్యాత్మికవేత్తలు చెప్తారు.

తామరలలో కొన్ని ఎర్రవి ఉంటాయి. చిగురాకులు ఎర్రగా ఉంటాయి. కనుకొలకులు ఎర్రగా ఉంటాయి. మాణిక్యాల వంటి రత్నాలు ఎర్రగా ఉంటాయి. అనురాగం (ప్రేమ) వలన ముఖంలోని బుగ్గలు వంటి భాగాలు ఎర్రబడతాయి. వీటినే “రక్తిచిహ్నాలు” అని అంటారు. తండ్రి అంటే బద్దకంతో కూడిన మైమరపు. ఇది రజోగుణ సంబంధమైనది. ఎరుపు రజోగుణానికి గుర్తు. తాండవం క్రమంగా ఉదృతంగా మారుతుందని చెప్పడం దీని ప్రత్యేకత.

నల్లని మబ్బులు కమ్ముకొన్నట్లుగా, నీలమణులను ఒకేచోట పేర్చినట్లుగా, నల్లకలువలు దిక్కులంతా వికసించినట్లుగా, తుమ్మెదలు ఒకే చోట చేరినట్టుగా తాండవం ఉంది. కాటుక కొండ పగిలిపోగా కాటుకంతా చెదరిపోయినట్లుగా చీకట్లు ఒక్కసారిగా కమ్మినట్లు, అజ్ఞానం కన్నుల నుండి కారినట్లుంది. ఇంకా మనస్సులోని వంకరలు కళ్ళలో కనిపించినట్లుంది. ఇవన్నీ నల్లదనాన్ని కలిగి ఉన్నాయి. నలుపు తమోగుణానికి గుర్తు.

సత్వ – రజ – తమోగుణాల కలయిక వలన సృష్టి ఏర్పడింది. పరమాత్మ పరమశివుడు గనుక ఆయన తాండవంలో ఈ మూడు గుణాలు వ్యక్తమైనట్లు వర్ణించబడటం ఒక ప్రత్యేకతను సంతరించుకొంది.

ప్రశ్న 3.
పాఠం ఆధారంగా కవి శివుని నాట్యాన్ని ఏయే ప్రకృతి అంశాలతో పోల్చాడో వివరంగా రాయండి.
జవాబు:
కవి శివుని నాట్యాన్ని చాలా ప్రకృతి అంశాలతో అందంగా పోల్చాడు. స్వచ్ఛమైన వెన్నెల విరబూసినట్లుగా ఉందన్నాడు. జాజిపూలను కుప్పలుగా పేర్చినట్లు, మంచును కుప్పలుగా చేసినట్లుందన్నాడు. మబ్బులన్నీ నీటి ఆవిరితో కూడి ఆకాశమంతా పరచుకొన్నట్లు, నల్ల కలువలు దిక్కులంతా .వికసించినట్లుందన్నాడు. తుమ్మెదలన్నీ ఒకే చోట ముసిరికొన్నట్లు, కాటుక కొండ పగిలినట్లుందన్నాడు. .చీకట్లు ఒక్కసారిగా కమ్ముకొచ్చినట్లు శోభాయమానంగా ఉందన్నాడు. తామరలు విప్పారినట్లు, అప్పుడే వికసించిన పూలలా ఉందన్నాడు. తుమ్మెదలు ముసిరిన పద్మాలలాగా, ఎర్రని లేజిగురాకులాగా ఉందన్నాడు. సముద్రంలో అలలు కదిలినట్లు, చిరుగాలికి ఆకులు కదలినట్లుందన్నాడు. తామరపూలు కదలినట్లు, పూల సువాసనలు గాలిలో వ్యాపించినట్లుందన్నాడు. కమ్మని కస్తూరి పరిమళంలా, నెమలి అందంగా తన పింఛాన్ని విప్పినట్లుందన్నాడు. గాలికి చిగురాకులు ఒయ్యారంగా కదలినట్లుందన్నాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

ఇ) సృజనాత్మకంగా రాయండి.

ప్రశ్న 1.
ఈ గేయంలో “పొరలు లేచినయట్లు”, “విరులు కదలినయట్లు” మొదలైన అంత్యప్రాసలున్నాయి కదా ! ఇవి చదువుతుంటే లయాత్మకంగా ఉండడం వల్ల ఆనందం కలుగుతుంది. ఇలాంటి వాటిని కొన్నింటిని గ్రహించి వాటితో చిన్న కవిత గాని, గేయం గాని రాయండి.
జవాబు:
కవిత :
తెలుగుభాషా భవిష్యత్తు

తెలుగు భాషా భవిష్యత్తు
చేస్తుందోయి కసరత్తు
ఇతర భాషల సరసన
చూపుతుందా తన సత్తు
పోషకులే కరువై
పీక్కుంటుందా తన జుత్తు
తెలుగు బాలల సహకారంతో
వదిలిస్తుందా పరభాషల మత్తు
చేస్తుందా ఎన్నటికైనా
అన్యభాషలను చిత్తు
కోరుతున్నా దేవుణ్ణి
చేయాలని ఈ గమ్మత్తు!! – యస్. కె. చక్రవర్తి.

గేయం :
(హెచ్చరిక!!)
హెచ్చరిక! ఆంధ్రుడా హెచ్చరిక!
వినకుంటే నీ మనుగడ సాగదిక!
తల్లిపాలను నేలపాలు చేస్తూ
దాదిపాలకై అర్రులు చాపావంటే
నీ భాషా సంస్కృతులను విస్మరిస్తూ
పరభాషా సంస్కృతులకై పరుగులిడినావంటే
|| హెచ్చరిక||

నీ మాన ప్రాణాలను పణంగా పెడుతూ
పరులను పరమోన్నతులుగా పరిగణిస్తే
నీ భాషా జాతులను పరాభవిస్తూ
పరుల పదోన్నతికై పరిశ్రమిస్తే
నీ భాషా జాతీయాలను నట్టేట కలుపుతూ
అన్యభాషా సంస్కృతులతో అద్వైతసిద్ధి సాధిస్తే
|| హెచ్చరిక||

నిన్ను నీవే నిన్నాకరిస్తూ
పరసేవా పరాయణుడవైతే
నీ నీతి నీ జాతిరీతులను నిప్పుల గుండంలో నిలిపితే
నీవనేదీ నీదనేదీ నీకేదీ మిగలదిక || 2 ||
విన్నపము నీకిదే వినుమో వివేక శూన్యుడా !
వినకుంటే నీకిదే మరణశాసన మాంధ్రుడా !!
– యస్. కె. చక్రవర్తి.

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

ఈ) ప్రశంసాత్మకంగా రాయండి.

ప్రశ్న 1.
పుట్టపర్తి నారాయణాచార్యులు గారు అంత్యప్రాసలతో శివతాండవాన్ని, దాని సౌందర్యాన్ని వర్ణిస్తూ రాసిన విధానాన్ని చూశారు కదా ! దీనివల్ల మీరు పొందిన అనుభూతిని మీ ‘దినచర్య’ లో రాయండి. ఉపాధ్యాయులకు చూపండి.
జవాబు:
ఈ రోజు పాఠశాలలో “శివతాండవం” – అనే పాఠం చెప్పారు. పుట్టపర్తి నారాయణాచార్యులు గారు “శివతాండవం” అనే గేయకావ్యాన్ని రచిస్తే దానిలో కొద్ది భాగం మాకు పాఠ్యాంశంగా ఉంచారని తెలుగు భాషోపాధ్యాయులు గారు చెప్పారు. గేయాన్ని లయబద్దంగా పాడుతూ మాచేత కూడా పాడించారు.

ఈ గేయం నన్నెంతగానో ఆకట్టుకుంది. ఇందులో వాడిన అచ్చ తెలుగు పదాలు ఊరిన మాగాయ ముక్కల్లా రసవత్తరంగా, రుచికరంగా ఉన్నాయి. ఇందులోని పదాలలో నేను చదవని కొత్త పదాలే ఎక్కువ. కానీ విచిత్రంగా పదాల అర్థం తెలియకపోయినా భావం అర్థమవుతూ తెలియని ఆనందాన్ని కలిగిస్తుంది. సత్త్వ – రజ – తమో గుణాలకు చిహ్నాలైన తెలుపు – ఎరుపు – నలుపు రంగులను తాండవానికి అన్వయిస్తూ చెప్పిన తీరు ఎంతో ఆకర్షణీయంగా ఉంది. “తమ్ములై, ఘటిత మోదమ్ములై” – వంటి అనుప్రాసలతో కూడిన పదాలు గేయానికి ఒక కొత్త ఊపును ఇచ్చాయి.

అలలు కదలినట్లు, చిరుగాలికి ఆకులు కదలినట్లు, తామరపూలు కదలినట్లు, సువాసన వ్యాపించినట్లు, తెరపై బొమ్మలు నటించినట్లు, చిగురాకులు ఒయ్యారంగా కదలినట్లు, నవ్వులో ప్రేమ జాలువారినట్లు – ఇలాంటి ఉపమానాలు మన రోజువారీ జీవితంలో కనిపించేవే, మనల్ని తెలియని లోకాలకు తీసుకెళ్ళేవే. మన శ్రమని, కాలాన్ని మరచేలా చేసేవే. ఇలాంటి వాటితో ‘శివతాండవాన్ని’ పోల్చడం వల్ల మన ఊహకు అందేలా, మనో నేత్రాలకు కనిపించేలా కవి చేయగలిగాడు. ఈ గేయం చదివినప్పుడూ, మిత్రులు చదువుతుంటే విన్నప్పుడూ, శివునిలా తాండవం చేయలేకపోయినా, కనీసం చిందువేయాలనైనా మనస్సుకు బలంగా అనిపిస్తుంది. ఒక చిన్న గేయభాగమే వినే వారిలో లేక చదివే వారిలో ఇలాంటి కదలిక తీసుకురాగలిగిందంటే, వింతైన అనుభూతిని కలిగించిందంటే కవి ఎంతటి ఆనందాన్ని అనుభవిస్తూ రాశాడో అని అన్పిస్తున్నది.

కవికి తెలుగు పదాల మీద మంచి పట్టు ఉంది. అచ్చ తెలుగు పదాలతో ఆయన గేయాన్ని నడిపించిన తీరు ‘శివతాండవాన్ని’ తలపిస్తుంది. అందుకనే ఆ మహానుభావుణ్ణి “సరస్వతీ పుత్రుడు” అనే బిరుదుతో గౌరవించారేమో పెద్దలు. ఈ గేయం చదివాక నాలో తెలియకుండానే ప్రకృతి ప్రేమ, తెలుగు భాషాభిరుచి పెరిగాయి. చక్కని పదాలతో గేయాలు అల్లాలనే ఉత్సుకత ఉరకలేస్తున్నది.

IV. ప్రాజెక్టు పని

మీ గ్రామంలో/ పట్టణంలో రకరకాల కళాకారులుంటారు. ఒగ్గు కథ చెప్పేవాళ్ళు, బుర్రకథలు చెప్పేవాళ్ళు, చిందు భాగవతులు, హరికథలు చెప్పేవారు…… ఇలాంటి వారి వివరాలు సేకరించండి. వారి ప్రదర్శనల గురించి వివరాలు అడిగి తెలుసుకోండి, రాయండి.
జవాబు:
1) బుర్రకథలు :
బుర్రకథలను తంబుర కథలని, డక్కీ కథలని వివిధ పేర్లతో పిలుస్తారు. వీటిలో వీరగాథలకు సంబంధించిన కథలే ఎక్కువ ఉంటాయి. బుర్రకథను చెప్పడానికి ముగ్గురు వ్యక్తులు కావాలి. మధ్య వ్యక్తి కథ చెపుతూ తంబురా వాయిస్తాడు. ఆయనకు రెండు ప్రక్కలా నిలబడి గొంతు కలిపేవాళ్ళను ‘వంతలు’ అని అంటారు. వంతలు డక్కీలు వాయిస్తారు. కథకునికి ఒక ప్రక్క వ్యక్తి హాస్యంగా మాట్లాడుతుంటే, రెండవవైపు వ్యక్తి కథకు తగిన వివరణ చెపుతుంటాడు.

బుర్రకథలో మొదట కథకుడు సరస్వతిని, మహాలక్ష్మిని, దుర్గనూ ప్రార్థిస్తాడు. దీనిలో సాధారణంగా ‘వినరా భారత వీరకుమారా విజయం మనదేరా ……. తందాన తాన, తందాన, తానే తందనాన’ అంటూ వంతలు పాడుతారు. కథ పూర్తి అయ్యాక మంగళం పాడతారు. బుర్రకథలలో అల్లూరి సీతారామరాజు – ఝాన్సీ లక్ష్మీబాయి – బాలచంద్రుడు మొదలైన కథలు ప్రసిద్ధి పొందాయి. ‘నాజర్’ బుర్రకథా పితామహుడుగా ప్రసిద్ధి చెందాడు.

జానపదకళల్లో బుర్రకథ ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది. ముఖ్యంగా స్వాతంత్ర్యోద్యమ పోరాట సమయంలో బుర్రకథ ప్రజలను చైతన్యపరచింది.

2) తోలుబొమ్మలాట :
ఈ ఆటను ఊరి బయట వేదిక పైన రాత్రి సమయంలో ప్రారంభించి తెల్లవారే వరకు ఆడతారు. మూడు వైపుల మూసి ఉన్న పందిరి వేస్తారు. ముందువైపు తెల్లని తెర లాంటి పల్చని గుడ్డను కడతారు. పూర్వం ఈ ఆటలాడేటప్పుడు తెరవెనుక ఆముదపు దీపాలు వెలిగించేవారు. తరువాత పెట్రోమాక్స్ దీపాలు, విద్యుద్దీపాలు వచ్చాయి. ఈ దీపాల కాంతి వల్ల చీకటిలో కూర్చున్న వారికి తోలుబొమ్మలు సజీవంగా ఉన్నట్లు కనబడతాయి.

పురుష పాత్రల వెనుక మగవారు, స్త్రీ పాత్రల వెనుక ఆడవారు ఉండి పాత్రలకు అనుగుణంగా మాట్లాడతారు. రామాయణం, భారతం కథలను ప్రదర్శిస్తారు. ప్రేక్షకుల నిద్రమత్తు పోవడానికి ఆట మధ్యలో హాస్యగాళ్ళు అయిన జుట్టుపోలిగాడు, బంగారక్క, కేతిగాడు పాల్గొని ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తారు.

ఈ బొమ్మలను తెరమీద సులభంగా ఆడించేందుకు సన్నటి వెదురు బద్దలను బొమ్మల మధ్యలో కడతారు. బొమ్మల సంభాషణకు తగినట్లుగా ఆడించాలంటే ఆ వెదురు బద్దే ఆధారం. ఆ బద్ద సహాయంతో బొమ్మలను అటు ఇటు తిప్పుతూ ఆడిస్తారు.

ముఖ్యంగా ఈ బొమ్మలను తయారు చేసేటప్పుడు రాముడు, కృష్ణుడు, సీత వంటి పవిత్రమైన పాత్రలకు ఒక రకమైన చర్మాన్ని; రావణాసురుడు, కంసుడు వంటి ప్రతినాయక పాత్రలకు వేరొక రకమైన చర్మాన్ని ఉపయోగిస్తారు. ఈ తోలుబొమ్మలాటలు ఆడేవారిని ‘దేశదిమ్మరులు’ అంటారు. వీరు దేశమంతా తిరుగుతూ ప్రదర్శనలు ఇస్తారు. ‘రామాయణ, మహాభారతాలకు సంబంధించిన కథలనే ఎక్కువగా ప్రదర్శిస్తారు. మన రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లా తోలుబొమ్మలాటకు ప్రసిద్ధి చెందింది. కానీ నేడు ఈ జానపదకళ కనుమరుగైందనే చెప్పవచ్చు.

3) హరికథ :
హరికథ అంటే విష్ణుకథ. హరికథలు భక్తికి సంబంధించినవి. ఈ కథ చెప్పేవారిని భాగవతార్ అని, హరిదాసని పిలుస్తారు. హరికథ చెప్పేవారు పట్టుపంచె కట్టుకొని నుదుట నామం, మెడలో పూలదండ వేసుకుంటారు. చేతిలో చిడతలు పట్టుకొని, కాళ్ళకు గజ్జెలు కట్టుకుంటారు. నడుముకు ఉత్తరీయం బిగించుకుంటారు. “శ్రీమద్రమారమణ గోవిందోహరి” అని గోవింద కొట్టించి కథ ప్రారంభిస్తారు. ఎన్నో గంటల పాటు కథకుడు అన్ని పాత్రలలో జీవిస్తూ, అభినయం చేస్తూ ప్రేక్షకులు విసుగు చెందకుండా మధ్యమధ్య పిట్టకథలు చెప్తూ హరికథా గానం చేస్తాడు.

ఆదిభట్ల నారాయణదాసు గారిని “హరికథా పితామహుడ”ని అంటారు.

III. భాషాంశాలు

పదజాలం

అ) కింది పదాలకు సమానార్ధక పదాలను పాఠం నుండి గ్రహించి రాయండి. వాటితో వాక్యాలు రాయండి.
1. తామరలై : తమ్ములై, తమ్మివిరులై
1) పగడాలతో చేసిన ఆభరణాలు తమ్ములై (పద్మాలై) భాసిస్తున్నాయి.
2) ఈత కొలనులో అందం కోసం ఉంచిన ప్లాస్టిక్ పూలు నిజమైన తమ్మివిరులై శోభిస్తున్నాయి.

2. సంతోషాలై : సంతసములై, మోదమ్ములై
1) మా ఊరి యువకుడు కలెక్టరుగా ఉద్యోగాన్ని పొందడం, అతడు మా పాఠశాల పూర్వ విద్యార్థి కావడం సంతస – (కారణ) ములైనాయి.
2) అన్నయ్య ప్రభుత్వోద్యోగాన్ని పొందడం, అక్కకు మెడిసిన్లో సీటు రావడం అమ్మానాన్నలకు మోదమ్ములైనాయి.

3. మొగ్గలై : నవకోరకమ్ములై, కోరకములై
1) మల్లె చెట్టుపై ఉన్న మంచు బిందువులు నవకోరకమ్ములై రాజిల్లుతున్నాయి.
2) ప్లాస్టిక్ జాజి తీగకు ఉన్న మొగ్గలు సహజమైన కోరకములై శోభిస్తున్నాయి.

4. హొయల నడకలై : వగలువోయినట్లు
1) గాలికి చిగురుటాకులు వగలు వోయినట్లుగా ఉంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

ఆ) కింది వాక్యాల్లో ఒకే అర్థానిచ్చే పదాల్ని గుర్తించి, వేరు చేసి రాయండి.

1. వెన్నెల విరగకాస్తే హాయి కలుగుతుంది. ఆ కౌముది చల్లదనాన్నిస్తుంది. మన కవులు అనేకులు తమ కావ్యాల్లో చంద్రికల్ని వర్ణించారు.
జవాబు:
వెన్నెల విరగకాస్తే హాయి కలుగుతుంది. ఆ కౌముది చల్లదనాన్ని ఇస్తుంది. మన కవులు. అనేకులు తమ కావ్యాల్లో చంద్రికల్ని వర్ణించారు.
వెన్నెల – కౌముది – చంద్రికలు

2. సూర్యుడు అస్తమించగానే అంధకారం అలముకుంది. ఆ కమస్సు భయం కలిగిస్తుంది. అందుకే చీకట్లో ప్రయాణం మంచిది కాదంటారు పెద్దలు.
జవాబు:
సూర్యుడు అస్తమించగానే అంధకారం అలముకుంది. ఆ తమస్సు భయం కలిగిస్తుంది. అందుకే చీకట్లో ప్రయాణం మంచిది కాదంటారు పెద్దలు.
అంధకారం – తమస్సు – చీకటి.

3. ఆహా ! ఏమి తావి! బహుశా ఈ పరిమళం గులాబీతోట నుండి కాబోలు! భగవంతుడు పుష్పాలకు మంచి సౌరభాన్ని కూడా అందించి గొప్ప పని చేశాడు.
జవాబు:
ఆహా ! ఏమి తావి ! బహుశా, ఈ పరిమళం గులాబీతోట నుండి కాబోలు! భగవంతుడు పుష్పాలకు మంచి సౌరభాన్ని కూడా అందించి గొప్ప పని చేశాడు.
తావి – పరిమళం – సౌరభము

ఇ) కింది పదాలకు పాఠం ఆధారంగా వికృతి పదాల్ని గుర్తించి రాయండి.
1) అపూర్వం – అబ్బురం
2) మౌక్తికం – ముత్తెం
3) సంతోషం – సంతసం

ఈ) కింది పదాలకు అదే అర్థం వచ్చే మరి రెండు పదాలను రాయండి.
1) చలికొండ – మంచుకొండ, హిమవత్పర్వతం
2) పుష్పం – విరి, కుసుమం, సుమం, పువ్వు
3) మోదం – సంతోషం, ఆనందం, ప్రమోదం
4) కిసలయం – చిగురాకు, లేతాకు
5) తరగలు – అలలు, తరంగాలు

వ్యాకరణం

ఆ) కింది సంధులకు సంబంధించిన ఉదాహరణలను పాఠంలో వెతికి రాయండి. విడదీసి, సంధి సూత్రం రాయండి.

1. ఉత్వసంధి:
ఆడెను + అమ్మా = ఆడెనమ్మా
పాడెను + అమ్మా = పాడెనమ్మా
1) మబ్బుగములు + ఉబ్బికొని = మబ్బుగములుబ్బికొని
2) తమ్ములు + ఐ = తమ్ములై
3) మోదమ్ములు + ఐ = మోదమ్ములై
4) రూపమ్ములు + ఐ = రూపమ్ములై
5) భాగ్యమ్ములు + = భాగ్యమ్ములై
6) కోరకమ్ములు + ఐ = కోరకమ్ములై
7) పుష్పమ్ములు + ఐ = పుష్పమ్ములై
8) మంద్రమ్ములు + ఐ = మంద్రమ్ములై
9) ఫుల్లమ్ములు + ఐ = ఫుల్లమ్ము
10) హారమ్ములు + ఐ = హారమ్ములై
11) హాసమ్ములు + ఐ = హాసమ్ములై
12) సొమ్ములు + ఐ = సొమ్ములై
13) కిసలమ్ములు + ఐ = కిసలమ్ములై
14) చిహ్నమ్ములు + ఐ = చిహ్నమ్ములై
15) గమనమ్ములు + ఐ = గమనమ్ములై
16) దిక్కులు + ఎల్ల = దిక్కులెల్ల

ఉత్వ సంధి సూత్రం:
హ్రస్వమైన ఉకారానికి అచ్చు పరమైతే సంధి జరుగుతుంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

2. సరళాదేశ సంధి:
1) పూతన్ + పెట్టుట = పూతఁబెట్టుట
2) కనులన్ + జారు = కనులజారు
3) ఘనసారమును + తెచ్చి = ఘనసారమునుదెచ్చి
4) కలయ + చల్లు = కలయజల్లు
5) కనులన్ + తీరు = కనులఁదీరు
6) కండ్లన్ + తళుకు = కండ్లఁదళుకు
7) తళుకున్ + చూపులు = తళుకుఁజూపులు
8) కాళ్ళన్ + చిలిపి = కాళ్ళఁజిలిపి
9) మొల్లముగన్ + తుమ్మెదలు = మొల్లముగఁదుమ్మెదలు
10) గొప్పగన్ + కప్పెడు = గొప్పగఁగప్పెడు
11) కనులన్ + తీరు = కనులఁదీరు
12) గెడన్ + కూడి = గెడఁగూడి
13) తరగలను + చిరుగాలి = తరగలఁజిరుగాలి
14) చిరుగాలిలోన్ + తమ్మివిరులు = చిరుగాలిలోఁదమ్మివిరులు
15) కన్ + కొనల = కల్గొనల

సరళాదేశ సంధి సూత్రం :
1) ద్రుత ప్రకృతికం మీది పరుషాలకు సరళాలు వస్తాయి.
2) ఆదేశ సరళాలకు ముందున్న ద్రుతానికి బిందు, సంశ్లేషలు విభాషగా వస్తాయి.

3. యడాగమ సంధి :
1) వక్రత + ఎ = వక్రతయె
2) లేచిన + అట్లు = లేచినయట్లు
3) కదలిన + అట్లు = కదలినయట్లు
4) పరిఢవించిన + అట్లు = పరిఢవించినయట్లు
5) విరిసిన + అట్లు = విరిసినయట్లు
6) విప్పిన + అట్లు = విప్పినయట్లు
7) పోయిన + అట్లు = పోయినయట్లు
8) జారిన + అట్లు = జారినయట్లు

యడాగమ సంధి సూత్రం :
1) సంధి జరగని చోట అచ్చు కంటె పరమైన అచ్చుకు యడాగమం వస్తుంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

4. గసడదవాదేశ సంధి :
1) పూత + పెట్టుట = పూతబెట్టుట
2) దెట్టులు + కట్టిన = దెట్టులుగట్టిన
3) కుప్పలు + కూర్చిన = కుప్పలుగూర్చిన
4) చూపులు + పూయ = చూపులుబూయ
5) విరులు + కదలిన = విరులుగదలిన
6) వీణా + కడగి = వీణెగడగి
7) నెమ్మి + తన = నెమ్మిదన
8) వగలు + పోయిన = వగలు వోయిన

గసడదవాదేశ సంధి సూత్రం :
1) ప్రథమము మీది పరుషములకు గసడదవలగు.

ఆ) టుగాగమ సంధి : కింది పదాలను పరిశీలించండి.
ఉదా :
1) నిలువు + అద్దం = నిలువుటద్దం
2) తేనె + ఈగ = తేనెటీగ
3) పల్లె + ఊరు = పల్లెటూరు

గమనిక :
వీటిలో సంధి జరిగినపుడు ‘ట్’ అదనంగా వచ్చి చేరుతుంది. ఇలా ‘ట్’ వర్ణం వచ్చే సంధిని ‘టుగాగమ సంధి’ అంటారు.

అట్లే కింది పదాలను కూడా పరిశీలించండి.
చిగురు + ఆకు = చిగురుటాకు / చిగురాకు
పొదరు + ఇల్లు = పొదరుటిల్లు / పొదరిల్లు

వీటిలో ‘ట్’ అనే వర్ణం సంధి జరిగినపుడు రావచ్చు, రాకపోవచ్చు. ‘ట్’ వస్తే టుగాగమం అవుతుంది. ‘ట్’ రాకుంటే ఉత్వసంధి అవుతుంది.

సూత్రం :
కర్మధారయములందు ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు టుగాగమంబగు. కింది పదాలను విడదీసి రాయండి.
1) పడకటిల్లు = పడక + ఇల్లు
2) కరకుటమ్ము = కరకు + అమ్ము
3) నిక్కంపుటుత్తర్వు = నిక్కంపు + ఉత్తర్వు
4) నిగ్గుటద్దం = నిగ్గు + అద్దం

ఇ) లు,ల,న, ల సంధి :
లు – ల – న – లకు జరిగే సంధిని లు, ల, న, ల సంధి అంటారు.

సూత్రం :
లు, ల, న లు పరమైనపుడు, ఒక్కొక్కప్పుడు ము వర్ణానికి లోపమూ, దాని పూర్వ స్వరానికి దీర్ఘమూ విభాషగా వస్తాయి.
ఉదా :
1) పుస్తకము + లు = పుస్తకాలు
2) దేశము + ల = దేశాల
3) జీవితము + న = జీవితాన
4) గ్రంథము + లు = గ్రంథాలు
5) రాష్ట్రము + ల = రాష్ట్రాల
6)వృక్షము + న = వృక్షాన

మరి కొన్ని ఉదాహరణలు :
1) వజ్రము + లు = వజ్రాలు
2) రత్నము + ల = రత్నాల
3) వాచకము + ల = వాచకాల
4) కేసరము + లు = కేసరాలు
5) గ్రంథము + లు = గ్రంథాలు
6) హారము + న = హారాన
7) విషయము + లు = విషయాలు
8) చుట్టము + లు = చుట్టాలు

ఈ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి సంబంధించిన ఉదాహరణలు ప్రస్తుత పాఠంలో వెతికి రాయండి.

కర్మధారయ సమాసం :
విశేషణానికి, విశేష్యానికి (నామవాచకానికి) చేసే సమాసాన్ని కర్మధారయ సమాసం అంటారు.
ఉదా :
నల్లకలువ

విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం :
కర్మధారయ సమాసంలో పూర్వ (మొదటి) పదం విశేషణమైతే దాన్ని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటారు.
ఉదా :
చిలిపి గజ్జెలు – చిలిపివైన గజ్జెలు – చిలిపి (విశేషణం) – గజ్జెలు (నామవాచకం)

ప్రస్తుత పాఠంలోని ఉదాహరణలు :
1) తరితీపు వెన్నెలలు – తరితీపులైన వెన్నెలలు
2) నెరజాజులు – నెరయైన జాజులు
3) తెలిబూది – తెల్లనైన బూది
4) చలికొండ – చల్లనైన కొండ
5) ఘనసారము – ఘనమైన సారము
6) నీలపుగండ్లు – నీలమైన కండ్లు
7) అబ్బురపు నీలములు – అబ్బురమైన నీలములు
8) నల్లకలువలు – నల్లనైన కలువలు
9) లేవలపు – లేతయైన వలపు
10) నవకోరకమ్ములు – నవమైన కోరకమ్ములు
11) వికచపుష్పములు – వికచములైన పుష్పములు
12) నూత్నహారమ్ములు – నూతనమైన హారమ్ములు
13) వల్గుహాసమ్ములు – వల్గులైన హాసమ్ములు
14) రక్తకిసలయములు – రకములైన (ఎర్రనైన) కిసలయములు
15) తంద్రగమనమ్ములు – తంద్రమైన గమనమ్ములు
16) చిరుగాలి – చిరుత (కొంచమైన) యైన గాలి
17) కమ్మకస్తురి – కమ్మనైన కస్తురి
18) చిగురుటాకులు – చిగురులైన ఆకులు

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

ఉ) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం :
‘సంభావన’ అంటే ‘సంజ్ఞ’ అని అర్థం. అంటే పేరు మొదలైనవి. కర్మధారయ సమాసంలో మొదటి పదం ‘సంజ్ఞా వాచకమైనట్లైతే దాన్ని సంభావనా పూర్వపదకర్మధారయ సమాసం’ అంటారు.

‘తమ్మి విరులు’ అనే సమాసంలో మొదట పదమైన ‘తమ్మి ‘ ఏ రకం విరులో (తామరపూలు) తెలియజేస్తుంది. ఇలా పూర్వపదం నదులూ, వృక్షాలూ, ప్రాంతాలూ మొదలైన వాటి పేర్లను సూచిస్తే దాన్ని ‘సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం’ అంటారు.
ఉదా :
1) మర్రిచెట్టు – మర్రి అనే పేరుగల చెట్టు
2) గంగానది – గంగా అనే పేరుగల నది
3) భారతదేశం – భారతం అనే పేరు గల దేశం

సంభావనా పూర్వపద కర్మధారయ సమాసానికి మరికొన్ని ఉదాహరణలు.
1. వింధ్య పర్వతం – వింధ్య అనే పేరు గల పర్వతం
2. కృష్ణానది – కృష్ణ అనే పేరు గల నది
3. అరేబియా సముద్రం ‘అరేబియా’ అనే పేరు గల సముద్రం
4. విజయవాడ నగరం – విజయవాడ అనే పేరు గల నగరం
5. తెలుగుభాష – తెలుగు అనే పేరు గల భాష
6. హిమాలయ పర్వతం – హిమాలయమనే పేరు గల పర్వతం అని
7. నర్మదానదం – నర్మద అనే పేరు గల నదం.

9th Class Telugu 3rd Lesson శివతాండవం కవి పరిచయం

పుట్టపర్తి నారాయణాచార్యులు (1914 – 1990) స్వస్థలం అనంతపురం జిల్లా చియ్యేడు గ్రామం. 14 భాషల్లో ప్రవీణులు. 8 భాషల్లో కవిత్వం చెప్పగల దిట్ట. సంగీత, నాట్య శాస్త్రాల్లో సంపూర్ణ పాండిత్యం కలవారు. “సరస్వతీ పుత్ర” వీరి బిరుదు. శివతాండవం, మేఘదూతం, షాజీ, కావ్యమాల, జనప్రియ రామాయణం, పండరీ భాగవతం, సాక్షాత్కారం మొదలైన రచనలు చేశారు. ‘లీవ్స్ ఇన్ ద విండ్’ అనే ఆంగ్ల కావ్యం కూడా వీరి రచనే! వీరు రాసిన శివతాండవం సంగీత సాహిత్య నాట్య సంకేతాల సమ్మేళనం. పుట్టపర్తి రచనల్లో దేశభక్తి, సాంస్కృతిక విలువలు, జాతీయ భావాలు, మానవీయ విలువలు తొణికిసలాడతాయి.

గేయాలు – ప్రతి పదార్థాలు-భావాలు

1వ గేయం :
ఆడెనమ్మా ! శివుడు
పాడెనమ్మా ! భవుడు
తరితీపు వెన్నెలలు విరిసికొన్న విధాన
నెరజాజులవి కుప్ప నెరసికొన్న విధాన
తెలిబూది పూత చెట్టులు గట్టిన విధాన
చలికొండ మంచు కుపులు గూర్చిన విధాన
పొసగ ముత్తెపు సరుల్పోహళించు విధాన
అసదృశము నమృతంబు నామతించు విధాన
ఘనసారమును దెచ్చి కలయజల్లు విధాన
మనసులో సంతసము గనుల జారు విధాన
కులుకు నీలపుగండ్ల దళుకు జూపులు బూయ
ఘలు ఘల్లుమని కాళ్ళ జిలిపి గజ్జెలు మ్రోయ
ఆడెనమ్మా ! శివుడు !
పాడెనమ్మా ! భవుడు
ప్రతిపదార్థం :
తరితీపు = స్వచ్ఛమైన
వెన్నెలలు = చంద్రుని తెల్లని కాంతులు
విరిసికొన్న విధాన = ఉప్పొంగినట్లు (కురిసినట్లు)
నెరజాజులు + అవి = ఆ అందమైన జాజిపూలు
కుప్ప నెరసికొన్న విధాన = కుప్పలు పోసినట్లుగా
తెలిబూదిపూత = తెల్లని విభూతి (విబూది) పూత
దెట్టులు + కట్టిన విధాన = అతిశయించిన విధంగా (మిక్కిలి ఎక్కువగా ఉన్నట్లు)
చలికొండ = హిమాలయము ( హిమగిరి)న
మంచు = మంచును
కుప్పలు + కూర్చిన విధాన = ప్రోగులు పెట్టినట్లు
పొసగన్ = సరిపడేటట్లు (పొత్తుగా, తగిన విధంగా)
ముత్తెము + సరుల్ = ముత్యాలహారాలు
పోహళించు విధాన = కూర్చినట్లుగా
అసదృశమున్ = అనన్య సామాన్యమైన
అమృతంబున్ = అమృతమును
ఆమతించు విధాన = విందు చేసినట్లు (పంచినట్లు)గా
ఘనసారమును + తెచ్చి = పచ్చ కర్పూరమును తెచ్చి
కలయన్ + చల్లు విధాన = అంతటా చల్లే రీతిగా
మనసులోన = మనస్సులో గల
సంతసము = సంతోషం (ఆనందం)
కనులన్ + జారువిధాన = కన్నుల నుండి జారుతున్నట్లుగా
కులుకు = ఒప్పెన (చురుకైన)
నీలపు గండ్ల (నీలము +కండ్ల) = నీలవర్ణము గల కన్నుల యొక్క
తళుకు + చూపులు = మెఱసే చూపుల కాంతులు
పూయన్ = విరబూయగా
ఘల్లుఘల్లుమని = ఘల్లుఘల్లుమని
కాళ్ళ = కాళ్ళకు కట్టుకొన్న
చిలిపి గజ్జెలు = చిరుగజ్జెలు; (చిన్నగజ్జెలు)
మ్రోయన్ = ధ్వనింపగా
ఆడెనమ్మా శివుడు = శివుడు ఆడుతున్నాడు
పాడెనమ్మా భవుడు = శివుడు పాడుతున్నాడు

భావం :
నిర్మలమైన వెన్నెల కురుస్తున్నట్లుగా, అందమైన జాజిపూలు కుప్పపోసినట్లుగా, తెల్లని విబూది చెట్టులు కట్టి నట్లుగా, మంచుకొండపై మంచు కుప్పలు పోసినట్లుగా, మృదువైన ముత్యాల హారాలను కూర్చినట్లుగా, అనన్య సామాన్యమైన అమృతాన్ని విందు చేసినట్లుగా (పంచినట్లుగా), పచ్చ కర్పూరాన్ని తెచ్చి అన్ని వైపులా చల్లినట్లుగా, మనస్సులోని సంతోషం కళ్ళల్లోంచి జారునట్లుగా, చురుకైన నీలపు కన్నుల తళుకు చూపుల కాంతులు విరబూసినట్లుగా, ఘల్లు ఘల్లుమని చిరుగజ్జెలు మోగుతుండగా శివుడు ఆడుతున్నాడు. శివుడు పాడుతున్నాడు.

విశేషం :
దీనిలో చెప్పిన పోలికలన్నీ తెల్లదనాన్ని ప్రతిబింబిస్తున్నాయి. తెలుపు యొక్క సంకేతం స్వచ్ఛతకూ, పవిత్రతకూ నిదర్శనం. శివుడి తాండవం వల్ల ఆనందం అంతటా నిండిందని కవి తలంపు. శివునిలో సత్త్వగుణం వెల్లివిరిసిందని భావం. సత్త్వగుణం. తెలుపు రంగును సూచిస్తుంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

2వ గేయం :
మబ్బుగము లుబ్బికొని ప్రబ్బి కొన్న విధాన
అబ్బురపు నీలములు లిబ్బిసేరు విధాన
నల్లకలువలు దిక్కులెల్ల విచ్చు విధాన
మొల్లముగ దుమ్మెదలు మొనసికొన్న విధాన
నగలు కాటుకకొండ పగిలి చెదరు విధాన
తగిలి చీకటులు గొప్పగ గప్పెడు విధాన
తనలోని తామసము కనుల జారు విధాన
తనలోని వక్రతయె కనుల దీరు విధాన
కులుకు నీలపు గండ్ల దళుకు జూపులు బూయ
ఘలు ఘల్లుమని కాళ్ళ జిలిపి గజ్జెలు మ్రోయ
ఆడెనమ్మా ! శివుడు!
పాడెనమ్మా! భవుడు
ప్రతిపదార్థం :
మబ్బుగములు = మేఘాల యొక్క సమూహాలు
ఉబ్బికొని = అతిశయించి (దట్టముగా)
ప్రబ్బికొన్న విధాన = అలముకొన్న విధంగా
అబ్బురము + నీలములు = అపూర్వమైన ఇంద్రనీలమణులు
లిబ్బి + చేరు విధాన = కుప్ప పోసినట్లుగా (ఒకదానిపై ఒకటి పేర్చినట్లుగా)
నల్ల కలువలు = నల్ల కలువపూలు
దిక్కులు + ఎల్ల = దిక్కులంతటా
విచ్చు విధాన = విచ్చుకున్నట్లుగా (విరిసిన విధంగా)
మొల్లముగ = గుంపుగా (ముసురుకొని)
తుమ్మెదలు = తుమ్మెదలు
మొనసికొన్న విధానన్ = శోభిల్లిన విధంగా
అగలు = పగిలే
కాటుక కొండ = నల్లని కొండ
పగిలి, చెదరు విధాన = బ్రద్దలయి, చెల్లాచెదరయినట్లు
తగిలి = సంభవించి (కలిగి)
చీకటులు = చీకట్లు
గొప్పగ = అధికంగా
కప్పెడు విధాన = వ్యాపించినట్లుగా
తనలోనన్ = తనలోనున్న
తామసము = తమస్సు అనే గుణము
కనులన్ = కన్నుల నుండి
జారువిధాన = జారే విధంగా
తనలోని వక్రతయె (వక్రత + ఎ) = తనలోనున్న వక్రత్వములే
కనులన్ + తీరువిధాన = కళ్ళల్లో కన్పిస్తున్నట్లుగా
కులుకు నీలము + కండ్లన్ = ఒప్పెన (చురుకైన), నీలవర్ణముగల కన్నుల యొక్క
తళుకు + చూపులు = మెఱసే చూపుల కాంతులు
పూయన్ = విరబూయగా
ఘలు ఘల్లుమని = ఘల్లు ఘల్లుమని
కాళ్ళ = కాళ్ళకున్న
చిలిపి గజ్జెలు = చిరుగజ్జెలు
మ్రోయన్ = ధ్వనింపగా
ఆడెనమ్మా శివుడు = శివుడు ఆడుతున్నాడు
పాడెనమ్మా భవుడు = శివుడు పాడుతున్నాడు

భావం :
మేఘాలన్నీ ఒక్కసారిగా అలముకున్నట్లుగా, అద్భుతమైన నీలమణులు ఒకచోట పేర్చినట్లుగా, నల్లకలువలు దిక్కులన్నిటా విచ్చుకున్నట్లుగా, తుమ్మెదలు ముసురుకొని శోభిస్తున్నట్లుగా, నల్లని కొండలు పగిలి ముక్కలయినట్లుగా, ఒక్కసారి చీకట్లు వ్యాపించినట్లుగా, తనలోని తమస్సు కళ్ళల్లోంచి జారుతున్నట్లుగా, తనలోని వక్రతలు కళ్ళల్లో కన్పిస్తున్నట్లుగా, చురుకైన నీలపు కళ్ళలో కాంతులు విరబూయగా, పాదాల గజ్జెలు ఘల్లుఘల్లుమని మోగుతుండగా శివుడు ఆడుతున్నాడు. శివుడు పాడుతున్నాడు.

విశేషం :
ఇందులో వర్ణించబడినవి అన్నీ నీలవర్ణము గలవి. సృష్టిలో నలుపురంగు కూడా అద్భుతమైనదని కవి చెప్పారు. శివునిలో తమోగుణం (నల్లనిది) వ్యాపించిందని భావం.

3వ గేయం :
తమ్ములై, ఘటిత మోదమ్ములై, సుకృత రూ
పమ్ములై, శాస్త్ర భాగ్యమ్ములై, నవకోర
కమ్ములై, వికచ పుష్పమ్ములై, తుమ్మెదల
తమ్ములై, భావ మంద్రమ్ములై, హావపు
ల్లమ్ములై, నూత్నహారమ్ములై, వల్గు
హాసమ్ములై, కనల సొమ్ములై, విశ్రాంతి
దమ్ములై, రక్త కిసలమ్ములై, రక్తి చి
హ్నమ్ములై, తంద్ర గమనమ్ములై, గెడగూడి
కులుకు నీలపు గండ్ల దళుకు జూపులు బూయ
ఘలు ఘల్లుమని కాళ్ళ జిలిపిగజ్జెలు మ్రోయ
ఆడెనమ్మా ! శివుడు !
పాడెనమ్మా! భవుడు
ప్రతిపదార్థం :
తమ్ములు + ఐ = తామర పూలై
ఘటిత మోదమ్ములు + ఐ = కలిగింపబడిన, సంతోషము కలవై (సంతోషాన్ని కలించేవై)
సుకృత రూపమ్ములు + ఐ = మంగళప్రదమైన రూపము కలవై
శాస్త్ర భాగ్యమ్ములు + ఐ = శాస్త్రంలో చెప్పబడిన విధంగా సంపదతో నిండినవై
నవ కోరకమ్ములు + ఐ = క్రొత్త పూలమొగ్గలై
వికచ పుష్పమ్ములు + ఐ = వికసించిన పుష్పముల వలెనై
తుమ్మెదల తమ్ములు + ఐ = తుమ్మెదలు వాలిన తామరలై
భావ మంద్రమ్ములు+ ఐ = భావ గంభీరములై
హావ ఫుల్లమ్ములు + ఐ = వికసించిన శృంగార భావము కలవై
నూత్న హారమ్ములు + ఐ = క్రొత్త హారాలై
వల్గు హాసమ్ములై = చక్కని నవ్వులై
కల్గొనల సొమ్ములై = కంటికొలకుల సోకులై
విశ్రాంతి దమ్ములై = విశ్రాంతి నిచ్చేవై
రక్త కిసలమ్ములై = ఎఱ్ఱని చివుళ్ళె
రక్తి చిహ్నమ్ములై = అనురాగానికి గుర్తులై
తంద్ర గమనమ్ములై = తూగు నడకలు కలవై
కెడగూడి = జతగూడి
కులుకు నీలపుగండ్ల = చురుకైన, నీలవర్ణంగల కన్నుల
తళుకుచూపులు + పూయ – తళతళ కాంతులు విరబూయగా
ఘలు ఘల్లుమని = ఘల్లు ఘల్లుమని
కాళ్ళ చిలిపి గజ్జెలు మ్రోయ = కాళ్ళకున్న చిరుగజ్జెలు ధ్వని చేస్తుండగా
ఆడెనమ్మా! శివుడు = శివుడు ఆడుతున్నాడు
పాడెనమ్మా! భవుడు = శివుడు పాడుతున్నాడు

భావం :
శివుని నాట్యం తామరపూవులవలె గొప్ప సంతోషాన్ని చేకూర్చింది. ఆ నాట్యం శుభప్రదరూపంతో, శాస్త్రీయ సంపదతో నిండి ఉంది. కొత్త పూల మొగ్గల్లా, వికసించిన పువ్వుల్లా, తుమ్మెదలు వాలిన తామరల్లా, భావ గంభీరములై, వికసించిన హావభావములై, కొత్త హారములై, చక్కని నవ్వులై, కనుగొలకుల సోకులై; విశ్రాంతి నిచ్చేవై, ఎఱ్ఱని చిగురులై, అనురాగ చిహ్నాలై, తూగు నడకలతో జతగలసి, చురుకైన నీలపు కన్నుల కాంతులు విరబూయగా, ఘల్లు ఘల్లుమని పాదాలకు ఉన్న చిరు గజ్జెలు మ్రోగుతుండగా శివుడు ఆడుతున్నాడు. శివుడు పాడుతున్నాడు.

విశేషం : ఈ గేయంలో వర్ణించబడినవన్నీ ఎఱుపు రంగుతో నిండినవి. అనగా శివుడు చేసే తాండవ నృత్యం రానురానూ ఉద్ధృతమై, ఆనందాన్ని ఇస్తోందని వర్ణించడం ఈ వర్ణనలోని ప్రత్యేకత. ఎఱుపు రజోగుణానికి ప్రతీక. కవి శివునిలో రజోగుణ ఉద్ధృతిని ఇక్కడ వర్ణించారు.

AP Board 9th Class Telugu Solutions Chapter 3 శివతాండవం

4వ గేయం:
తరగలను జిరుగాలి పొరలు లేచిన యట్లు
చిరుగాలిలో దమ్మి విరులు గదలిన యట్లు
విరులలో నును తావి తెరలు లేచినయట్లు
తెరలపై చిత్రాలు పరిఢవించిన యట్లు
కమ్మ కస్తురి వీణె గడగి విరసిన యట్లు
నెమ్మి దన పింఛమ్ము నెమ్మి విప్పిన యట్లు
చిగురుటాకులు గాలి వగలు వోయిన యట్లు
నగవులో లేవలపు బిగువు జారినయట్లు
కులుకు నీలపు గండ్ల దళుకు జూపులు బూయ
ఘలు ఘల్లుమని కాళ్ళ జిలిపి గజ్జెలు మ్రోయ
ఆడెనమ్మా ! శివుడు !
పాడెనమ్మా! భవుడు
ప్రతిపదార్థం :
తరగలను = అలలలో (కెరటములలో నుండి)
చిరుగాలి = నెమ్మదిగా గాలి
పొరలు లేచిన + అట్లు = పొరలు పొరలుగా పైకి లేచిన విధంగా
చిరుగాలిలో = మంద వాయువులో
తమ్మి విరులు = పద్మములు (తామర పద్మములు అనే పూలు)
ఘలు ఘల్లుమని = ఘల్లు ఘల్లుమని
కాళ్ళ = కాళ్ళకు కట్టబడిన
చిలిపి గజ్జెలు = చిరు గజ్జెలు
తెరలు లేచిన + యట్లు = తెరలు తెరలుగా వ్యాపించినట్లు
తెరలపై = తెరలపై
చిత్రాలు = బొమ్మలు
పరిఢవించిన + అట్లు = అతిశయించిన విధంగా
కమ్మ కస్తురి వీణా = శ్రావ్యమైన పరిమళ వీణ
కడగి విరసిన + అట్లు = మ్రోగిన విధంగా
నెమ్మి = నెమలి
తన పింఛమ్మున్ = తన పింఛాన్ని
నెమ్మి = ప్రీతితో (సంతోషంతో)
విప్పిన + అట్లు = విప్పిన విధంగా
చిగురుటాకులు (చిగురు + ఆకులు) = చిగురాకులు (త ఆకులు)
గాలిన్ = గాలికి
వగలు + పోయిన + అట్లు = ఒయ్యారాలు పోయిన విధంగా
నగవులో = నవ్వులో
లేవలపు = లేత కోరిక
బిగువుజారిన + అట్లు = బింకము తగ్గిన విధంగా
కులుకు = చురుకైన
నీలపుగండ్ల (నీలము +కండ్ల) = నీలికన్నుల
తళుకు + చూపులు = తళతళ కాంతులు
పూయన్ = విరబూయగా
కదలిన + అట్లు = కదలిన విధంగా
విరులలో = పూలలో
నునుతావి = చిరు సువాసన
మ్రోయన్ = ధ్వనిస్తుండగా
ఆడెనమ్మా శివుడు = శివుడు ఆడుతున్నాడు
పాడెనమ్మా భవుడు = శివుడు పాడుతున్నాడు

భావం :
అలలపై చిరుగాలి పొరలు లేచినట్లు, చిరుగాలికి పద్మములు కదలినట్లు, పూలలో నుండి సువాసనలు తెరలు తెరలుగా పైకి వ్యాపించినట్లు, తెరలపై బొమ్మలు నటనను ప్రదర్శించినట్లు, శ్రావ్యమైన పరిమళ వీణలు మ్రోగినట్లు, నెమలి తన అందమైన పింఛాన్ని విప్పినట్లు, గాలికి చిగురుటాకులు ఒయ్యారాలు పోయినట్లు, లేత నవ్వులు ఒలికినట్లు, చురుకైన నీలపు కళ్ళు కాంతులు విరబూయగా, ఘల్లు ఘల్లుమని పాదాలకు ఉన్న చిరుగజ్జెలు మ్రోగుతుండగా శివుడు ఆడుతున్నాడు. శివుడు పాడుతున్నాడు.

విశేషం :
శివతాండవంలో అలలు కదలడం అనేది గంభీరతకు గుర్తు. పరిమళాలు వ్యాపించడం, నెమలి నాట్యం చేయడం, చిగురాకుల ఒయ్యారాలూ సౌకుమార్యానికి ప్రతిబింబాలు. శివుని తాండవంలో గంభీరత, సౌకుమార్యమూ కలగలసి అద్భుతంగా అందాన్ని ఆవిష్కరించడమే ఇక్కడి విశేషం. మొత్తంగా శివతాండవంలో ప్రకృతి ప్రతిబింబించింది. ప్రకృతి వర్ణన పదాల కూర్పు, అలంకారాలతో కూడి మరింత సౌందర్యాన్ని చేకూర్చింది.

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions Chapter 2 స్వభాష Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions 2nd Lesson స్వభాష

9th Class Telugu 2nd Lesson స్వభాష Textbook Questions and Answers

ఆలోచించండి-చెప్పండి

ప్రశ్నలు జవాబులు

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష 1
ప్రశ్న 1.
జంఘాలశాస్త్రి దేన్ని గురించి ఉపన్యసించి ఉంటాడని మీరనుకుంటున్నారు?
జవాబు:
తెలుగుభాష గొప్పతనాన్ని గురించి ఉపన్యసించి ఉంటాడని అనుకుంటున్నాను.

ప్రశ్న 2.
ఎదుటి వ్యక్తి ప్రశంసిస్తున్నా, జంఘాలశాస్త్రి నిర్ఘాంతపోవడానికి కారణమేమై ఉంటుంది?
జవాబు:
తన ఉపన్యాస సారాంశాన్ని ఏ మాత్రం గ్రహించకుండా తనని ఆంగ్ల భాషలో పొగిడినందుకు.

ప్రశ్న 3.
జంఘాలశాస్త్రి అంటే ఎవరో మీకు తెలుసా?
జవాబు:
పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు రచించిన ‘సాక్షి వ్యాస సంకలనం’ లోని ఒక పాత్ర.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన
అ) కింది వాటి గురించి సొంతమాటల్లో చెప్పండి.

ప్రశ్న 1.
మాతృభాషలోనే మాట్లాడితే కలిగే ప్రయోజనాలేమిటి?
జవాబు:
మాతృభాషలోనే మాట్లాడటం వలన అనేక ప్రయోజనాలున్నాయి. మాతృభాషలో మన భావాలను సూటిగా, స్పష్టంగా చెప్పగలము. పరభాషలను ఎంతోకాలంగా అభ్యసించినప్పటికి అటువంటి సౌలభ్యాన్ని పొందలేము. పరభాషలలో ఉపన్యసించగల శక్తి గలవారైనా, గ్రంథాలను రచించగల సమర్థులైనా, ఆయా భాషలు మాతృభాషలుగా గలవారి ముందు దిగదుడుపే గదా ! ఆంగ్ల సాహిత్యంలో సుప్రసిద్ధుడైన ‘మిల్టన్’ మహాశయుడు లాటిన్ భాషలో పద్యాలను రాశాడు. లాటిన్ భాష మాతృభాషగాగల కవులలో తక్కువ స్థాయిగల కవులు రాసిన పద్యాలకంటే ‘మిల్టన్’ మహాకవి పద్యాలు తక్కువ స్థాయికి చెందినవని పరిశోధకులు చెబుతుంటే ఇక సామాన్యుల సంగతి చెప్పేదేముంది ?

పరభాషాపదాలకర్థం తెలుసుకున్నంతమాత్రాన అందు పండితులమయ్యామనుకోకూడదు. ఆయా భాషలలోని జీవాన్ని, తత్త్వాన్ని, కళను కనిపెట్టగలగాలి. అది ఆయా భాషలు మాతృభాషలుగా గలవారికే సాధ్యము. ఇతరులకది ఎన్ని సంవత్సరాలు అభ్యసించినా అసాధ్యమే. మాతృభాషలోనే మాట్లాడటం వలన ఆ భాషలోని జాతీయాలు, నుడికారాలు, పలుకుబళ్ళు, సామెతలు, జీవాన్ని పొంది భాషకు జీవాన్ని, బలాన్ని కలిగిస్తాయి. మనోభావాలను ఆవిష్కరించడానికి భాషకై వెదుక్కోవాల్సిన పని ఉండదు. ఎదుటివారికి కూడా మనం చెప్పదలచిన విషయాన్ని సందేహరహితంగా, నిర్దోషంగా సవివరంగా చెప్పగలము. ఈ సౌలభ్యం ఒక్క మాతృభాషవల్లే సాధ్యం.

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష

ప్రశ్న 2.
ఈ కింది అంశం గురించి విభేదిస్తూ లేదా సమర్థిస్తూ మాట్లాడండి. “మాతృభాషలో విద్య”
జవాబు:
“మాతృభాషలో విద్య” విభేదించడం లేక ఖండన :

నేటి సమాజం శరవేగంతో ప్రయాణిస్తోంది. ప్రపంచం మొత్తం “గ్లోబలైజేషన్” పుణ్యమా అని కుగ్రామమైపోయింది. ఇటువంటి పరిస్థితులలో విద్యార్థులు ఎన్ని ఎక్కువ భాషలు అధ్యయనం చేస్తే అంత త్వరగా పోటీ ప్రపంచంలోకి దూసుకుపోవచ్చు. చిన్నప్పటినుండే ఆంగ్లభాషా మాధ్యమంలో విద్యార్థులు విద్యను అభ్యసించినట్లైతే ఉన్నత విద్యలకు వెళ్లేటప్పటికి ఆ భాషపై పట్టు, సాధికారతను సాధించవచ్చు. నేటి ఆధునిక సౌకర్యాలన్నింటిని ఉపయోగించుకోవాలంటే ఆంగ్ల భాషే శరణ్యం. ఉదాహరణకు కంప్యూటర్ ప్రవేశించని రంగమంటూ నేడు లేదు. దాన్ని సమర్థతతో నిర్వహించాలంటే ఆంగ్ల భాషాజ్ఞానమెంతో ఆవశ్యకం.

కాదు, కూడదని మాతృభాషలో విద్యనభ్యసిస్తే దాని ప్రభావం నుండి బయటపడటానికి చాలాకాలం పడుతుంది. ఆంగ్లం మొదలైన భాషలను అభ్యసించేటప్పుడు ఇది ఇబ్బందికరమవుతుంది. వేరే భాషలలో మాట్లాడాల్సివచ్చినప్పుడు మనస్సులో మాతృభాషలో ఆలోచించుకొని దాన్ని ఆయా భాషలలోనికి అనువదించినప్పుడు ఆ సంభాషణ చాలా కృతకం గాను, అసహజంగాను, హాస్యాస్పదంగాను తయారవుతుంది. ఇదే ఆయా భాషలలోనే ఆలోచించినట్లైతే సంభాషణ నిర్దోషంగాను, సహజ సుందరంగాను, ఆకర్షణీయంగాను ఉంటుంది. ఇది సాధించాలంటే చిన్నప్పటి నుండి ఆయా భాషలను శ్రద్ధతో అభ్యసించాల్సి ఉంటుంది. దీనిని గుర్తించే మన ప్రభుత్వం ప్రాథమిక విద్య నుంచే ఆంగ్ల మాధ్యమాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి మండల ప్రాథమిక పాఠశాలలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది. దీనివలన ప్రైవేటు పాఠశాలలలో ఖర్చుల కోర్చి చదవలేని పేద విద్యార్థులు సైతం లబ్ధి పొందవచ్చు.

శాస్త్ర సంబంధిత సాంకేతిక పదాలను, అంశాలను, మాతృభాషలోనికి అనువదించుట సాధ్యం కాదు. ఒక్కోసారి అలా అనువదించడం వలన విపరీతార్థాలు ఏర్పడే ప్రమాదం కూడా లేకపోలేదు. కాబట్టి మూలభాషలో తగినంత పరిజ్ఞానాన్ని సంపాదించడం ద్వారా ఆయాశాస్త్రాలను చక్కగా అధ్యయనం చేయవచ్చు. తద్వారా ప్రపంచవ్యాప్త గుర్తింపును పొందవచ్చు. ఇవన్నీ సాధించబడాలంటే “మాతృభాషలో విద్య” బోధించబడకూడదు.

సమర్దన:
మాతృభాషలో విద్యాబోధన ద్వారా అనేక లాభాలున్నాయి. చిన్న వయస్సులో విద్యార్థుల బుద్ధివికాసం తక్కువగా ఉంటుంది. ఇటువంటి స్థితిలో వారు మాతృభాషలో బోధించిన అంశాలను సులభంగా గ్రహించగలుగుతారు. కంఠస్థం చేయాల్సిన పనిలేకుండా ఆయా అంశాలను అవగతం చేసుకోవడం ద్వారా ఎక్కువ కాలం గుర్తుంచుకోగలుగుతారు. అన్యభాషలను సైతం ప్రాథమిక దశలో మాతృ భాష ద్వారా బోధించడం వలన ఆయా భాషలపై విద్యార్థులు ఒక అవగాహనకు రాగలుగుతారు. వాటి పై భయాన్ని వీడి అభ్యసించడానికి సంసిద్ధులవుతారు.

మాతృభాషలో విద్యను బోధించడం వలన విద్యార్థుల మనోవికాసం ఎక్కువగా ఉంటుందని మానసిక శాస్త్రవేత్తలు కూడా నిరూపించారు. కఠిన శాస్త్రాలను అభ్యసించేటప్పుడు భాష కూడా కొత్తదైనట్లైతే కొద్ది సేపటికే విషయం అర్థంకాక, విసుగు కలిగి, ఆయా శాస్త్రాలపై శాశ్వతంగా అనిష్టత పెరిగే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మాతృభాషలో బోధన ద్వారా ఈ ఇబ్బందిని దాటవచ్చు. ఇతర భాషలలోని ఆయా అంశాలను, సాంకేతికపదాలను, మాతృభాషలోకి ఉన్నవి ఉన్నట్లుగా తీసుకొని రాలేకపోవచ్చు. ఇటువంటివి చాలా కొద్దివి మాత్రమే కష్టంగా అన్పిస్తాయి. అంతమాత్రాన మొత్తం ఆయా భాషలలోనే బోధించాలనుకోవటం ఎంత బుద్ధి తక్కువ పనో విజ్ఞులు గ్రహింతురు గాక !

మన పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, ఒడిశా మొదలైన రాష్ట్రాలు మాతృభాష గొప్పతనాన్ని గుర్తించి దాన్ని కాపాడుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక మనం “పొరుగింటి పుల్లకూర రుచి” అన్న చందంగా మన మాతృభాష తప్ప తక్కినవన్నింటిని తలపై పెట్టుకొంటున్నాం. త్వరలో అంతరించే భాషల్లో మన తెలుగు కూడా ఉందని తెలుసుకొని ఇప్పుడు బాధపడుతున్నాం. “చేతులు కాలాక ఆకులు పట్టుకొని లాభం లేదు” కదా !

ఇక ‘మాతృభాషలో అన్నింటినీ బోధించడం సాధ్యం కాదు’ అనే మాట ఒట్టిమాటే. మాతృభాషాభిమానం లేనివారు సాకుగా చెప్పేమాటిది. తమిళనాడు రాష్ట్రంలో సాంకేతికశాస్త్ర విద్య (ఇంజనీరింగ్), వైద్య విద్య (మెడిసన్) లు సైతం మాతృభాషలో బోధించబడుతున్నాయి. న్యాయాలయాలలో వాద ప్రతివాదాలు, వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఉత్తర ప్రత్యుత్తరాలు, అనుమతులు మొదలైనవన్నీ మాతృభాషలోనే కొనసాగుతున్నాయి. వీటి అన్నింటికీ కారణం మాతృభాషలో విద్యాబోధనే. కాబట్టి మనం కూడ బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా మాతృభాష గొప్పదనాన్ని గుర్తించి, దానిలో విద్యాబోధన ద్వారా భాషను బతికించుకొందాం. విజ్ఞానాన్ని అందిపుచ్చుకుందాం.

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష

ఆ) పాఠం చదవండి. కింది అంశాలను గుర్తించండి.

ప్రశ్న 1.
ఆంగ్లభాష గురించి ప్రస్తావించిన అంశాలు.
జవాబు:
పరాయి భాష ఎప్పటికీ పరాయి భాషే. అందులో ఎంతోకాలం కష్టపడి ఎంత జ్ఞానమార్జించినా ఆ భాష మాతృభాషగా గలవారి ముందు ఈ పాండిత్యం దిగదుడుపే. ఆంగ్లభాషలో ఎన్ని గ్రంథాలు రాసినా, ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా అవి స్వతంత్రత లేనివే. ఆ భాషలో పూర్వులు చెప్పినవే. వాటిలో సహజత లేదు. ఆంగ్లేయ భాషలో వ్యాసరచనలో ఉత్తమోత్తముడని అనిపించుకున్న “మిల్టన్” మహాశయుడు లాటిన్ భాషలో కొన్ని పద్యాలను రచించాడు. లాటిన్ మాతృభాషగాగల పండితులు వాటిని చదివి, లాటిన్ భాషలో ఇంతకన్నా అథమమైన పద్యాలు లేనేలేవని నిగ్గుతేల్చారు.

“కన్నింగ్ హామ్స్ ఎవిడెన్సు యాక్ట్”ను చదువుట వలన న్యాయవాదిగా మన కడుపును నింపుకోగలం కాని కంకంటి పాపరాజు ఉత్తర రామాయణం చదవడం వలన మన మనస్సు సంతోషంతో నిండుతుంది.

ప్రశ్న 2.
పాఠంలోని ఆంగ్లపదాలు.
జవాబు:

  1. ఎం.ఏ.,బి.యల్. పరీక్షలో ఉత్తీర్ణుడైనాడు.
  2. విల్ ఎనీ జెంటిల్మన్ కం ఫార్వర్డు టు స్పీక్
  3. బర్కు, సిసిరో, డెమా సైనీసు, గ్లాడ్ట్స్
  4. ఇంగ్లీషు మీడియం
  5. ఒరిజినాలిటీ
  6. మిల్టన్
  7. లాటిన్
  8. ప్యారడైజు లాస్ట్
  9. కాలేజీ
  10. వర్నాక్యులర్ సూపరింటెండెంట్
  11. అయాంబికుమీటరు
  12. ది వెల్ నోన్ తెలుగు స్కాలర్
  13. బ్రౌను
  14. ఇన్ మెమోరియం
  15. మ్యూజిక్
  16. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్
  17. ట్రాన్స్ ఫర్ ఆఫ్ ప్రాపర్టీ
  18. కన్నింగ్ హామ్స్ ఎవిడెన్స్
  19. జస్టిస్ హాలోవే
  20. సివిల్ ప్రొసీజర్ కోడ్
  21. ఇంగ్లీషు
  22. పార్టీ
  23. బాయ్ రూమ్, పాట్, రైస్, కెన్ డ్లీ గెటిట్ హియర్
  24. థ్యాంక్యూ
  25. ఇన్ ఆంటిసిపేషన్
  26. డియర్ ఫ్రెండ్
  27. యువర్సు ట్రూలీ

ప్రశ్న 3.
జంఘాలశాస్త్రి సందేశ వాక్యాలు.
జవాబు:
ఆంధ్రదేశంలో ఆంధ్రులైన తల్లిదండ్రులకు పుట్టి ఆంధ్రభాష రాదని చెప్పడం ఎంతో హస్యాస్పదం. మ్యావుమని కూయ లేని పిల్లి, కిచకిచలాడలేని కోతి ఎక్కడా ఉండవు. పుట్టగానే క్యారుమనలేని బిడ్డ చచ్చినదనుటకు సందేహించాలా? ఆంధ్రదేశంలో పుట్టి తక్కువలో తక్కువగా ఆరు సంవత్సరాల వరకైనా ఆంధ్రంలో మాట్లాడి, ఆంగ్లేయ భాషను అభ్యసించినంత మాత్రాన తెలుగు రాదనుట ఎంత ఆశ్చర్యకరం? ఆంగ్లంలో ఎన్ని గ్రంథాలు రాసినా, ఎన్ని ఉపన్యాసాలిచ్చినా అందు భాషా సౌకర్యం ఏమీ ఉండదు. ఆంగ్లం మాతృభాషగా గలిగిన వ్యక్తికి గల సౌలభ్యం 50 సంవత్సరములు ఆంగ్లభాషను అభ్యసించిన మనకు కలుగదు గదా ! సంపూర్ణ భాషోచ్చారణ పట్టువడదు కదా ! ఇట్లే ఆంగ్లేయుడు 18 సంవత్సములు సంస్కృత భాషను నిరంతర దీక్షతో నేర్చుకున్నా, నేర్చుకున్నంత కాలమూ మనస్సులో మననం చేసినా “హగుం సశ్యుచిషత్” అనే ఉపనిషత్ మంత్రాన్ని సరైన ఉచ్చారణతో పలకలేడు. ఇక మనం 24 సంవత్సరాలు ఆంగ్లభాషను నేర్చుకున్నా “ఇన్ మెమోరియం” లో ఉన్న సంగీతాన్ని కనిపెట్టలేం. పరభాషా పదాలకు అర్థం తెలిసినంత మాత్రాన పరభాషా పాండిత్యం లభించినట్లు కాదు. భాషలోని కళను, ప్రాణాన్ని, ఆత్మను కనిపెట్టగలగాలి. అది మాతృభాషలోనే సాధ్యం.

పొలాలను అమ్మి, అమ్మ మెడలోని పుస్లెపూసలమ్మి, ఇంట్లో సామానులమ్మి, దైన్యంగా ముష్టియెత్తి సంపాదించిన ఆంగ్లేయ భాషా పాండిత్యం వలన మనకేమి ఒరిగింది ? అటు స్వభాషకు దూరమై, పరభాషను సంపూర్ణంగా నేర్చుకోలేక రెండింటికి చెడుతున్నాం. పరభాషకై వెచ్చించిన ధనంలో పడిన శ్రమలో, ఉపయోగించిన కాలంలో, పొందిన బాధలో 14వ వంతైనా అవసరం లేకుండా స్వభాషలో పండితులు కావచ్చు. అక్షరాభ్యాసం నుండే మన స్వభాషను అభ్యసిస్తున్నాం అనుకోనక్కరలేదు. నిజానికి తల్లి కడపులో ఉన్నప్పుడే నేర్చుకోవడం మొదలుపెట్టాం. ఉపాధ్యాయుడైనా అవసరం లేకుండా గ్రంథాలను ఊరకనే చదువుకుంటూ పోయినా కూడా భాషాజ్ఞానాన్ని సంపాదించవచ్చు.

తెలుగుభాష అసలు రానివానితోనే ఆంగ్లభాషలో మాట్లాడండి. మీ స్నేహితులకు ఉత్తరాలు రాసేటప్పుడు ‘డియర్ ఫ్రెండ్’ అని మొదలు పెట్టి ‘యువర్స్ ట్రూలీ’ అని ముగించవద్దు. ‘బ్రహ్మశ్రీ’ అనో ‘మహారాజ శ్రీ’ అనో మొదలుపెట్టి ‘చిత్తగింపవలయును’ అని ముగించండి. ఇక తెలుగుభాష అసలు తెలియని వానికే ఆంగ్లంలో ఉత్తరం రాయండి. కొత్తగా వస్తున్న ఆంధ్ర పుస్తకములను విమర్శన బుద్ధితో చదవండి. తొందరపడి నిందించవద్దు. శనివారం మరియు ఆదివారం రాత్రిపూట తప్పకుండా రెండు గంటలు పురాణాలను చదవండి. తెలుగు భాషలోని వివిధ పత్రికలను చదవండి. ఆంగ్లేయ భాషా గ్రంథాలను చదివేటప్పుడు వాటిల్లో మన భాషకు పనికివచ్చే అంశాలను తదేక దృష్టితో వెతకండి. వాటిని గుర్తుంచుకోండి. ఇలా నియమంగా పట్టుదలతో ఉన్నప్పుడే కేవలం పుట్టుక చేత ఆంధ్రులం అనిగాక, బుద్ధిచేత, స్వభావం చేత, యోగ్యతచేత కూడా ఆంధ్రులమని అనిపించుకొంటాం.

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష

ఇ) పాఠం చదివి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
జంఘాలశాస్తి ఎవరు?
జవాబు:
పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు ‘సాక్షి’ అనే పేరుతో అనేక సంఘ సంస్కరణ వ్యాసాలను రాశారు. అందులో జంఘాలశాస్త్రి, బొర్రయ్య సెట్టి, కాలాచార్యులు, సాక్షి వంటివి కొన్ని పాత్రలు. స్వభాష గొప్పదనాన్ని జంఘాలశాస్త్రి చేత ఉపన్యాసరూపంగా ఈ వ్యాసంలో పేర్కొన్నారు.

ప్రశ్న 2.
జంఘాలశాస్త్రి ఆవేదనతో పలికిన మాటలేవి?
జవాబు:
హరహరా ! మహాదేవ శంభూ ! మహాదేవ శంభూ ! ఎంతమాట? ఎంతమాట? మీరు కూడా విన్నారా? నేనొక్కడినే విన్నానా? ఏదో విని ఇంకేదో అని భ్రమపడ్డానా ? భ్రమపడితే అదృష్టవంతుడినే ! నేనొక్కడనే కాదు ఆంధ్రులందరూ అదృష్టవంతులే ! కాని అంతటి అదృష్టమెక్కడిది? ఆంధ్రదేశంలో, ఆంధ్రులైన తల్లిదండ్రులకు పుట్టి, ఆంధ్ర సంప్రదాయాల్ని నేర్చుకొని, ఆంధ్ర జాతీయతత్త్వ సంపదచే అభివృద్ధి పొంది, ఆంధ్రభాషలో పండితులై, గ్రంథములను రచించి, భాషకు చక్కని అలంకారాలుగా అర్పించిన, సేవించిన తమ శరీరాల్ని, ప్రాణాల్ని, ఆత్మల్ని పవిత్రంగా చేసుకుని ప్రాణాలు విడిచి స్వర్గాన్ని చేరిన ప్రాచీనులైన ఆంధ్రులందరూ అదృష్టవంతులే ! అయ్యయ్యో ! అంత అదృష్టం పట్టునా? పట్టదు. విన్నాను. నిజంగానే విన్నాను. నాది భ్రమ కాదు. నాతోపాటు మీరూ విన్నారు. వినక చెవులేమైనా చిల్లులు పడ్డాయా ? బుద్ధి తక్కువైందా? గుండెలు పగిలేలా విన్నాం. మనస్సు మండేలా విన్నాం. సిగ్గుపోయేలా విన్నాం. ప్రాణాలు పోతుండగా విన్నాం. బతికి ఉంటే ఎన్నటికైనా సుఖాలు పొందవచ్చని కవి చెప్పాడే. జీవించి ఉన్నందుకు మనకిదే ఫలమా? ఇదే సుఖమా?

ఆహాహ ! మన అధ్యక్షులవారు చెప్పినదేమి? వారి శ్రీ సూక్తి ఏమిటి? వారి నోటి నుండి వెలువడ్డ సూత్రం ఏమిటి? చెప్పేదా? తెలుగువాడు చెప్ప గూడనిదే ! చెప్పక తప్పదు గదా ! మన అధ్యక్షుల వారికి తెలుగుభాష రాదట. ఆయన తెలుగులో మాట్లాడలేరట. వారేమీ మూగవారు కారే. నత్తిగా మాట్లాడేవారు కారే. ఆంగ్లేయ భాషలో పండితులే. బర్కు, సిసిరో, డెమోస్టెనీసు, గ్లాడ్స్ వంటి గొప్ప ఉపన్యాసకుల ఉపన్యాస వైభవాన్ని అర్థం చేసుకొనడమే గాక, ఒంటబట్టించు కున్నవారే. బి.ఎల్. పరీక్షలో ఉత్తీర్ణులై నల్లని కోటు ధరించి, న్యాయమూర్తుల ఎదుట కాకిని గట్టిగాను, గద్దను కాకిగాను నిరూపించగల, సమ్మోహనం చేయగల సంభాషణ గలవారే. అటువంటి వారు తెలుగులో మాట్లాడలేకపోవడం ఏమిటి? తెలుగుదేశంలో పుట్టిన పక్షుల సైతం నిరంతరం వినడం వలన తెలుగు మాట్లాడుతుంటే అయ్యయ్యో ! మనుషుడై తెలుగువారికి పుట్టి, తెలుగు ప్రాంతపు నీరు, ఆహారం, గాలి స్వీకరిస్తున్నవాడే. తక్కువలో తక్కువగా ఆరు సంవత్సరాల వరకైనా తెలుగులో మాట్లాడినవాడే. అట్టివాడు ఆంగ్లేయ భాషను నేర్చుకున్నంతమాత్రాన ఇప్పుడు తెలుగులో మాట్లాడలేనంటున్నాడే? ఎంత ఆశ్చర్యం ! నమ్మదగని విషయం. పెద్ద అబద్ధం.

తెలుగులో అతణ్ణి మాట్లాడకుండా చేసింది అశక్తి కాదు. అనిష్టత, అసహ్యం. ఇది రాతితో చెక్కిన మాట. ఎందుకని ఇష్టం లేదు? తెలుగు భాషలాంటి దిక్కుమాలిన భాషలేదని ఇతని నమ్మకం. పద్దతి తెలియనివాడు, చదువుకోనివాడు, గౌరవం లేనివాడు, గతిలేనివాడు, తెలివి తక్కువవాడు, దిక్కుమాలినవాడు- ఇలాంటివారే తెలుగులో మాట్లాడతారని ఇతని అభిప్రాయం కాకుంటే ఎందుకు మాట్లాడడు? అయ్యయ్యో ! తెలుగులో మాట్లాడడం అంత చేయగూడని పనా? మకరంద బిందువులను స్రవించే సుందరమైన భాషే. ఇట్టి భాషను విడచి పరభాషను ఆశ్రయిస్తున్నారే.

పోనీ పరభాషలో సాధించిన పాండిత్యమేమైనా గొప్పదా అంటే ఆయా భాషలు మాతృభాషలుగా గలవారి ముందు నిలువలేకుందే ! మన రాజధానిలో ఉన్న ఒక కాలేజీలో ‘వర్నాక్యులర్ సూపరింటెండెంటు’ గా ఒక సంస్కృత భాషా పండితుడగు ఆంగ్లేయుడున్నాడు. అతడు ‘యం బ్రహ్మ వేదాంత’ మొదలైన శ్లోకాలను చదివాడు. ఆ సంగతి చెప్పనక్కరలేదు. అలాగే గొప్ప తెలుగు పండితునిగా పేరొందిన బ్రౌను దొరగారు ఆంధ్రభాషలో ఏమాత్రం పండితులో మనకు తెలియకపోయినా నాటి ఆంధ్రులకు తెలియదా?

ఇలా పరభాషా వ్యా మోహంతో స్వభాషకు దూరమై “రెంటికీ చెడ్డ రేవడి”లా తయారవుతున్నాం. ఈ విధంగా జంఘాలశాస్త్రి ఆవేదనతో పల్కాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష

ప్రశ్న 3.
జంఘాలశాస్త్రి ఎవరిని అదృష్టవంతులంటున్నాడు?
జవాబు:
సభాధ్యక్షుడు పలికిన తనకు తెలుగులో మాట్లాడటం రాదనే మాట ఒకవేళ భ్రమైతే తాను అదృష్టవంతుణ్ణి అని అన్నాడు. ఇంకా ఆంధ్రులంతా అదృష్టవంతులని చెప్పాడు. ఆంధ్రదేశం కూడా అదృష్టవంతమైనదని భావించాడు. తెలుగు ప్రాంతంలో పుట్టినవారు, తెలుగు తల్లిదండ్రులకు పుట్టినవారు, ఆంధ్ర జాతీయతత్త్వ సంపదచే అభివృద్ధి చెందినవారు అదృష్టవంతులని పేర్కొన్నాడు. ఆంధ్రభాషలో పండితులై, ఆంధ్రభాషలో గ్రంథాలను రచించి, ఆంధ్రభాషా దేవికి వెలకట్టలేని అలంకారాభరణాలుగా సమర్పించినవారు అదృష్టవంతులని చెప్పాడు. ఆంధ్రదేశ సేవచేసి- తమ శరీరాలను, ప్రాణాలను, ఆత్మలను పవిత్రులుగా జేసుకున్న వారిని అదృష్టవంతులన్నాడు. ప్రాణాలు విడచి పరమపదాన్ని చేరిన పూర్వకాలపు ఆంధ్రులందరూ కూడా అదృష్టవంతులే అని సంభావించాడు.

ఈ) కింది అంశానికి భావం ఏమిటి? దీన్ని ఏ సందర్భంలో మాట్లాడాడు?
ప్రశ్న 1.
“కావు కావుమని యనవలసిన కాకులన్నిటిలో నొక కాకికొక్కొరోకోయని యఱచిన యెడల మిగిలిన కాకులు దానిని ముక్కుతో బొడిచివేయక మానునా?”
జవాబు:
భావం :
కాకులు, సహజంగా కావు కావుమని అరుస్తాయి. ఇది వాటి జాతి లక్షణం. కాకులలో ఉన్న ఒక కాకి అలా అరవక కోడిలా ‘కొక్కొరోకో’ అని అరిస్తే మిగిలిన కాకులు దాన్ని కాకిగా భావించక, వేరే పక్షి తమలో చేరిందని భావించి కోపంతో పొడిచి చంపేస్తాయి గదా ! అని భావం.

సందర్భం :
ఈ వాక్యాన్ని జంఘాలశాస్త్రి సభాధ్యక్షుణ్ణి ఉద్దేశించి మాట్లాడాడు. అందరూ తెలుగు మాట్లాడవలసిన చోట, ఇంతమందిలో నీవొక్కడివే ఇంగ్లీషులో మాట్లాడావు. మేము నీలాంటి వారిని చాలామందిని చూశాము. ఇటువంటి పరిస్థితులకు అలవాటు పడ్డాం గనుక సరిపోయింది. లేకుంటే కాకులన్నీ కలిసి తోటికాకిని పొడిచినట్లు నిన్ను హింసించక విడిచేవారమా? అని పల్కాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష

ప్రశ్న 2.
“మకరంద బిందుబృందరస స్యందన మందరమగు మాతృభాషయే”.
భావం :
తేనె బిందువులను కార్చే మందర పర్వతమువంటిదైన స్వభాష.

సందర్భం :
సభాధ్యక్షుడు ఆంగ్లంలోనే సంభాషించుటకు గల కారణాలను వెదుకుతూ జంఘాలశాస్త్రి ఈ వాక్యాన్ని పల్కాడు. తెలుగులో మాట్లాడేవాడు పద్ధతి తెలియనివాడు. చదువుకోనివాడు. గౌరవం లేనివాడు. దిక్కులేనివాడు. తెలివి తక్కువవాడు అని అధ్యక్షుల వారి అభిప్రాయం. కాబట్టే తేనె లాంటి మధురభాషను విడచి పరభాషలో ఉపన్యసిస్తున్నాడు.

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సొంతమాటల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
కావ్యభాష, వ్యావహారిక భాషలంటే ఏమిటి? వీటి మధ్య భేదాలు ఏమిటి?
గ్రాంథికభాష, వ్యావహారిక భాషలంటే ఏమిటి? వాటి మధ్య తేడాలను వివరించండి.
జవాబు:
కావ్యభాష :
కావ్యాలలోను, గ్రంథాలలోను ఉపయోగించే, వ్యాకరణంతో గూడిన భాషను ‘కావ్యభాష’ అంటారు.

వ్యావహారికభాష :
రోజువారీ వ్యవహారాలను జరుపుకోవడానికి ఉపయోగించే భాషను ‘వ్యావహారిక భాష’ అంటారు. ఇందులో భావానికే ప్రాధాన్యం. వ్యాకరణ నియమాలను పెద్దగా పట్టించుకోనవసరం లేదు.

భేదాలు :

కావ్యభాష వ్యావహారికభాష
1. ఈ భాష జాతి-కుల-మత – ప్రాంతాలకు అతీతంగా అందరిచే ఒకేలా ప్రయోగించబడుతుంది. 1. ఈ భాష జాతి-కుల-మత – ప్రాంతాలను బట్టి అనేక విధాలుగా మారిపోతుంది.
2. దీనిలో మార్పులు చేరవు. ఎప్పటికీ ఒకేలా నిలచి ఉంటుంది. 2. దీనిలో మార్పులు సహజం. కాలం, ప్రాంతం, జనాల అవసరాలను బట్టి ఇది పలు రకాలుగా మారిపోతుంది.
3. నన్నయ-తిక్కన -ఎర్రనలు రాసిన భారతాన్ని ఇంకా ఇతర ప్రబంధ కవులు రాసిన కావ్యాలను గ్రంథాలను నేటికీ చదివి అర్థం చేసుకోగలుగుతున్నా మంటే కారణం కావ్యభాషలో ఉండటం. 3. ఇది ఆయా ప్రాంతాల వర్ణాల వారి స్వభావాన్ని, సహజతను తెలుపుతుంది. కాబట్టే అన్నమయ్య సంకీర్తనలలో చాలావరకు రాయలసీమ ప్రాంతపు యాస వాడబడినా “అన్నమయ్య పదసర్వస్వం” వంటి గ్రంథాల ద్వారా ఆయన సంకీర్తన సౌరభాలను ఆస్వాదించగలుగు తున్నాం.

ప్రశ్న 2.
జంఘాలశాస్త్రి మంచి వక్త అని ఎలా చెప్పగలవు?
జవాబు:
మంచివక్తకు ప్రధానంగా సభలో పిరికితనం పనికిరాదు. కొత్త ప్రదేశమైనా, కొత్త మనుషులైనా చొరవగా చొచ్చుకుపోగలగాలి. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోగల నేర్పు ఉండాలి. జంఘాలశాస్త్రికి అటువంటి చొరవ, నేర్పు ఉన్నాయి. చెప్పదలచుకొన్న అంశం పై సాధికారత ఉండాలి. సందర్భానుగుణంగా మాట్లాడే ఇతర అంశాలపై కూడా పట్టు ఉండాలి. భావానుగుణంగా భాష తడబాటు లేకుండా నదీ ప్రవాహంలా ఉరకలెత్తాలి. చెప్పదలచుకొన్న విషయాన్ని పక్షపాతం చూపకుండా నిర్భయంగా, స్పష్టంగా చెప్పగలగాలి. ఈ గుణాలన్నీ జంఘాలశాస్త్రిలో పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి జంఘాలశాస్త్రి మంచి వక్త అని చెప్పవచ్చు.

ప్రశ్న 3.
సభాధ్యక్షుడు తెలుగు మాట్లాడకపోవడానికి కారణం ఏమై ఉంటుంది?
జవాబు:
తెలుగులో అతడు మాట్లాడలేకపోవడానికి కారణం శక్తి లేకపోవడం కాదు. ఇష్టం లేకపోవడం. తెలుగంటే చులకన భావం. తెలుగు భాషకన్నా దిక్కుమాలిన భాషలేదని అతని నమ్మకం. తెలుగులో మాట్లాడేవాడు పద్ధతి తెలియనివాడు, చదువుకోనివాడు, గౌరవం లేనివాడు, గతిలేనివాడు, తెలివి తక్కువవాడు, ఇంకా దిక్కు మాలినవాడని అతని అభిప్రాయమై ఉంటుంది. తెలుగులో మాట్లాడటం సిగ్గుచేటని అతని విశ్వాసం కాబోలు. సభాధ్యక్షుడు తెలుగులో మాట్లాడకపోవడానికి ఇవన్నీ కారణాలై ఉంటాయి.

ఆ) కింది ప్రశ్నలకు పదిహేనేసి వాక్యాలలో సొంతమాటల్లో రాయండి.

ప్రశ్న 1.
జంఘాలశాస్త్రి గురించి సొంతమాటల్లో రాయండి.
జవాబు:
జంఘాలశాస్త్రికి మాతృభాషపై మక్కువ ఎక్కువ. ఆంగ్లవిద్యను అభ్యసించినా అత్యవసర పరిస్థితుల్లో తప్ప దాన్ని వాడడానికి ఇష్టపడడు. తెలుగును ఎవరైనా కించపరిచేలా మాట్లాడినా, ప్రవర్తించినా సహించలేనివాడు. తోటి తెలుగువారైనా సరే చీల్చి చెండాడుతాడు. భాషను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను గూర్చి ప్రచారం చేయడానికి ఉద్యమించాడు. మంచి వక్త, ఏ సభలోకైనా దూసుకొని వెళ్ళే స్వభావం కలవాడు. ప్రాచీన శాస్త్రాలను , నవీన శాస్త్రాలను కూడా ఒంటబట్టించుకున్నవాడు. వ్యంగ్యంగా మాట్లాడటంలో నేర్పరి. ఎదుటివారి మనసులోకి దూసుకొని వెళ్లేలా సూటిగా, స్పష్టంగా మాట్లాడగలడు. చిన్న తప్పును సైతం సహించలేని స్వభావం గలవాడు.

ప్రత్యేకించి తెలుగులో విద్యనభ్యసించేవారిని, తెలుగు సంభాషించేవారిని, తెలుగుదనం కోరేవారిని అభిమానిస్తాడు. ఇతని ఉపన్యాసం ద్వారా ఇతనికి ఆధునిక న్యాయశాస్త్రంపై చక్కని అవగాహన ఉందని తెలుస్తుంది. ఆధునిక ఆంగ్ల సాహిత్యం పై కూడా మంచిపట్టు ఉంది. నిష్కర్షగా, నిర్మొహమాటంగా, నిజాయితీగా మాట్లాడతాడు. చక్కని ఉదాహరణలతో మనసుకు హత్తుకునేలా విషయాన్ని వివరించగల నేర్పు, ఓర్పు గలవాడు. తెలుగు, సంస్కృత భాషలను అనర్గళంగా మాట్లాడగలవాడు. పురాణ పరిజ్ఞానం, నవీన విజ్ఞానం, ఆంధ్ర సాహిత్య జ్ఞానం సమపాళ్లలో గల మేధావి. ప్రాచీనతను ఆధునికతతో మేళవించగలిగిన వ్యవహారదక్షుడు. శ్రోతలను మంత్రముగ్ధులను చేయగల వాగ్దాటి గలవాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష

ప్రశ్న 2.
“ఆంగ్లభాషయే కాదు. ఇంకననేక భాషలు కూడా నేర్చుకొనుము. నీవు సంపాదించిన పరభాషా జ్ఞానమంతయు నీ భాషను అభివృద్ధిపరచడానికే ఈ వాక్యాల ద్వారా మీరేం గ్రహించారు ? దీనిపై మీ అభిప్రాయం రాయండి.
జవాబు:
ఆధునిక కాలంలో కేవలం మాతృభాషాధ్యయనం వలన అన్నీ సాధించుకోలేం. కాబట్టి అన్యభాషలను అధ్యయనం చేయక తప్పదు. దేశీయ భాషలనే కాక అంతర్జాతీయ భాషలైన ఆంగ్లం, ఫ్రెంచ్ వంటి వాటిని సైతం నేర్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. కానీ పరభాషల మత్తులో పడి మాతృభాషను మరువకూడదు. ఒకే మాతృభాష మాట్లాడేవారున్నచోట పరభాషలో మాట్లాడకూడదు. ఇంకా పరభాషలను అధ్యయనం చేసి, ఆయా భాషలలోని పదాలను మాతృభాషలోకి తీసుకువచ్చి స్వభాషలోని పదసంపదను పెంపొందించుకోవాలి. పరభాషలలోని గ్రంథాలలో ఉన్న ఉత్తమాభిప్రాయాలను, భావాలను గ్రహించి మాతృభాషలో వాటిని వినియోగించుట ద్వారా మాతృభాషకు వన్నె పెట్టుకోవాలి.

ఇతర భాషలలోని ఉత్తమ గ్రంథాలను, కవితా సంపుటాలను మాతృభాషలోకి అనువదించుట ద్వారా వాటి సౌందర్యాన్ని తోటివారికి పరిచయం చేసి ఆనందం కలిగించవచ్చు. స్వభాషను పరిపుష్టం చేసుకోవచ్చు. పరాయి భాషలలోని నూతన సాహిత్యపు పోకడలను, కొత్తగా పుడుతున్న శాస్త్రాలను, పారిభాషిక పదాలను స్వీయభాషలోకి తర్జుమా చేయడం ద్వారా సాహిత్య శాస్త్ర సంపదలను అభివృద్ధి చేసుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న విజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవడం ద్వారా మాతృభాషను కలకాలం నిలిచి ఉండేలా చేసుకోవచ్చు. అన్య భాషా గ్రంథాలను అభ్యసించేటప్పుడు మన భాషకు ఉపయోగపడే అంశాలేమైనా ఉన్నాయా అని తదేక దృష్టితో గమనించాలి. అట్టి వాటిని జాగ్రత్తగా గుర్తుంచుకొని అవసరమైన చోట వినియోగించాలి.

ఇలా పరభాషా జ్ఞానాన్ని స్వభాషాభివృద్ధికి నిరంతరం వినియోగించడం ద్వారా భాష జీవత్వాన్ని కోల్పోదు. జవసత్వాలను కోల్పోదు. తద్వారా అమృతభాషయై నిలుస్తుంది.

ప్రశ్న 3.
తెలుగు భాష వచ్చి కూడా కావాలని ఆంగ్లంలో మాట్లాడేవారు ఎదురై, మీతో ఆంగ్లంలోనే మాట్లాడితే, మీకెలా ఉంటుంది? మీరేం చేస్తారు?
జవాబు:
నేడు ఆంగ్లంలో సంభాషించడం నాగరికతకు గుర్తుగా భావిస్తున్నారు. మాతృభాషలో మాట్లాడడం మొరటైపోయింది. దూరదర్శన్లలోను, చలన చిత్రాలలోను ఆంగ్లభాషా ప్రభావం అధికంగా కన్పిస్తుంది. రోజువారీ వ్యవహారాలలోను ఆంగ్ల పదాలు చోటుచేసుకుంటున్నాయి. తెలుగుభాష క్రమక్రమంగా కృంగి కృశించిపోతోంది. చాలామంది తెలుగు భాష వచ్చి కూడా కావాలని ఆంగ్లంలో మాట్లాడుతున్నారు. అలాంటి వారు నాకు ఎదురై ఆంగ్లంలో మాట్లాడితే నాకు ఎక్కడలేని చిరాకు వస్తుంది. ఏం రోగం చక్కగా తెలుగులో మాట్లాడవచ్చు కదా అని అన్పిస్తుంది. “పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంద’నే సామెత గుర్తుకు వచ్చి నవ్వు వస్తుంది. భాషపై ఉన్న నిర్లక్ష్య భావానికి కోపం వస్తుంది.

నేను మాత్రం తప్పక తెలుగులోనే మాట్లాడతాను. వాళ్ళు ఆంగ్లంలో మాట్లాడినదానికి తగ్గట్లు సందర్భోచితంగా తెలుగులో మాట్లాడతాను. దానివల్ల నాకు కూడా ఆంగ్ల పరిజ్ఞానం తగినంత ఉందని, కావాలనే నేను తెలుగులో మాట్లాడుతున్నానని వాళ్లు గ్రహించేలా చేస్తాను. తెలుగులో మాట్లాడటం తక్కువతనమేమీ కాదని నిరూపిస్తాను. ఏయే భావాలను, పదాలను తెలుగులో మాట్లాడలేమని కేవలం ఆంగ్లంలోనే మాట్లాడగలమని భావిస్తారో అటువంటి వాటిని మాతృభాషోపాధ్యాయుని సాయంతో, ఇతర పెద్దల సాయంతో తెలుగులో మాట్లాడి చెప్పుతో కొట్టినట్లు చేస్తాను. తెలుగు భాష సత్తాను చాటిచెపుతాను. తెలుగులో మాట్లాడటం వలన కలిగే సౌలభ్యాన్ని తెలియజేస్తాను. తద్వారా ప్రభావితులై కొంతమందైనా తెలుగులో మాట్లాడటానికి ప్రాధాన్యం ఇచ్చేలా చూస్తాను.

ఇ) సృజనాత్మకంగా రాయండి.

జంఘాలశాస్త్రి పాత్రను ఏకపాత్రాభినయం చేయండి.
జవాబు:
చెవులు మూసుకున్నట్లు అభినయిస్తూ ….

“హరహరా ! మహాదేవ శంభూ ! మహాదేవ శంభూ ! ఎంతమాట విన్నాను ! ఎంతమాట విన్నాను ! సరిగ్గానే విన్నానా? లేక ఏదో విని మరేదో అని భ్రమపడ్డానా? ఇది భ్రమే అయితే అంతకన్నా అదృష్టమేముంది ? నేనొక్కడినే కాదు యావదాంధ్రులూ అదృష్టవంతులే గదా ! ఆంధ్ర భాషా యోష (స్త్రీ) ను తమ గ్రంథాలచే అలంకరించిన పూర్వులందరూ అదృష్టవంతులే. అయ్యో ! అయ్యయ్యో ! అంతటి అదృష్టం కూడానా? ఇది భ్రమకాదు నిజమే. వినకపోవడమేమి? చెవులేమైనా చిల్లులు పడ్డాయా? గుండెలు పగిలేలా విన్నాను. మనస్సు మండేలా విన్నా ! సిగ్గు చిమిడిపోయేలా విన్నా? ప్రాణాలు ఎగిరిపోయేలా విన్నా ! “జీవన్ భద్రాణి పశ్యతి” – బతికి ఉంటే ఎప్పటికైనా సుఖాలు బడయవచ్చని కదా ఆదికవి వాల్మీకి వాక్యం. ఇంకా బతికి ఉన్నందుకు ఇదా ఫలం ! ఇదా సుఖం !!

ఆహాహా! ఏమి ? అతని ఆలాపకలాపం? ఏమా శ్రీసూక్తి? అతని వదనం నుండి వెలువడిన వాగమృతమేమి? ఆంధ్రుడు చెప్పదగినదికాదే? ఆలోచనలలో సైతం అనుకోకూడనిదే? కాని …… (సాలోచనగా) అంత నిర్లజ్జగా ఎలా చెప్పగలిగాడు తనకాంధ్రభాష రాదని ! తాను తెలుగులో మాట్లాడలేనని ! కృష్ణాతీరంలో ఆంధ్రులైన దంపతులకు పుట్టి, తక్కువలో తక్కువగా ఆరు సంవత్సరాలైనా తెలుగులో మాట్లాడి, ఏమ్.ఏ.,బి.ఎల్. చేసి, న్యాయవాద వృత్తిని నిరాఘాటంగా, నిరంకుశంగా నిర్వహిస్తున్నవాడే. కాలాంబర కవచధారియై న్యాయమూర్తుల ఎదుట గ్రద్దను కాకిగాను, కాకిని గ్రద్దగాను నిరూపించగల కర్కశతర్కంతో, వాగ్విలాసంతో సర్వులనూ సమ్మోహితుల్ని జేయజాలినవాడే. అట్టివాడు ఆంగ్లభాషను అభ్యసించినంతమాత్రాన ఇప్పుడు తెలుగులో మాట్లాడలేడా ? మూగవాడేమీకాదే – నంగి నంగి మాటలాడువాడు కాదే? మెమ్మెపెప్పె అనేవాడు కాదే ? మాట్లాడలేకపోవటం అంటే నాకేమీ బోధపడటం లేదు. మ్యావుమని అరవని పిల్లెక్కడైనా ఉంటుందా ? కిచకిచలాడని కోతినెక్కడైనా చూశామా? తెలుగు గడ్డపై పుట్టిన పక్షులు సైతం అనవరత శ్రవణం వల్ల తెలుగులో మాట్లాడుతుంటే మనిషై పుట్టి, అందునా ఆంధ్రుడిగా పుట్టి తెలుగు ప్రాంతమందలి నీటిని, గాలిని, ఆహారాన్ని వినియోగించుకుంటూ, ఆ మాత్రం విశ్వాసం కూడా చూపక నీచాతినీచంగా తెలుగురాదని అంటాడా ? ఇంతకన్నా విశ్వాసఘాతుకం ఉందా?

హా ! తెలిసింది! ఇప్పటికి కారణం దృగ్గోచరమైంది. తెలుగులో అతణ్ణి మాట్లాడకుండా జేసింది అశక్తి కాదు. అనిష్టత – అహ్యతత – ఇది శిలాక్షరమైన మాట. తెలుగు బాసంత దిక్కుమాలిన బాసే లేదని ఈతని అభిప్రాయం. తెలుగులో మాట్లాడేవాడు పద్ధతి తెలియనివాడు. చదువుకోనివాడు. గౌరవము లేనివాడు. గతిలేనివాడు. బుద్ధిమాలినవాడు. తెలుగులో మాట్లాడుట సిగ్గుసిగ్గు. ఇది ఇతని అభిప్రాయం మాత్రమే కాదు. ఏ కొద్దిపాటి ఆంగ్లం అభ్యసించిన తెలుగువారందరి అభిప్రాయమని కూడా తోస్తుంది.

తెలుగులో మాట్లాడటం అంత సిగ్గుమాలిన పనా ? అయ్యో ! మన భాషకు, మకరంద బిందు బృందరస స్యందన మందరమగు మాతృభాషకు, తేనెలూరు తేట తెలుగుకు ఎంతటి దురావస్థ పట్టింది ? మాన్యాలమ్ముకొని, సొమ్ము వ్యయపరచి, ఎంతోమందిని ఆశ్రయించి, ఎన్నో బాధలుపడి దైన్యంతో సంపాదించిన ఆంగ్లభాష వలన ఒరిగినదేమున్నది ? అర్ధ శతాబ్దం ఆంగ్లభాషను అభ్యసించినా సంపూర్ణ భాషోచ్చారణా సౌష్ఠవం పట్టుపడ్డదా ? భాషా సౌలభ్యం అలవడిందా? లేదే ! గ్రంథజ్ఞాన శూన్యుడైన జన్మమాత్రాంగ్లేయునికి ఉన్న సౌలభ్యంలో సాబాలైనా సిద్ధించలేదే ? ఇక సంస్కృతాంధ్రాలను అభ్యసించిన ఆంగ్లేయులు వేదమంత్రాలను, చిత్ర కావ్యాలలోని శ్లోకాలను, తెలుగు జానపద గీతాలను చక్కగా ఆలపించగలరా? ఎన్నటికి చేయలేరు గదా ! పరభాషా పదాలకు అర్థాలు తెలిసినంతమాత్రాన పండితులమయ్యామనుకుంటే ఎలా ? ఆ భాషలోని కళను, ప్రాణాన్ని, తత్వాన్ని, ఆత్మని కనిపెట్టాలి. అది ఆ భాష మాతృభాషగా గలవారికి మాత్రమే సాధ్యం. మిగతా వారందరికీ అది నేల విడిచిన సామే. స్వభాషను విడిచి పరభాషకై పాకులాడటం వలన రెండింటికి చెడ్డ రేవడిలా అయింది.

స్వభాషను నేర్చుకోవటంలో కష్టమేముంది ? నిజానికి ఇష్టం లేదుగాని. విద్యాభ్యాసానికి ముందే తల్లి కడుపులో ఉన్నప్పుడే నేర్చుకోవటం మొదలైంది గదా ! పరభాషకై వెచ్చించిన ధనంలో, పడిన శ్రమలో, వ్యర్థపరచిన కాలంలో, పొందిన దైన్యంలో, ఏడ్చిన ఏడ్పులో 14వ వంతైన అక్కరలేకుండా మాతృభాషలో పండితులమవుతాం గదా ! ఈ వాస్తవాన్ని నా తెలుగు వారెన్నటికి గ్రహిస్తారో గదా ! నా తెలుగు ఎన్నటికి మహోన్నత వైభవాన్ని పొందుతుందో గదా !! (భారంగా నిట్టూరుస్తాడు.)

అయినా నా భావాలను ఆలోచనల రూపంలో మాత్రమే ఉంచితే లాభం లేదు. తెలుగు భాషోన్నతికై నడుం బిగించి ఉద్యమించాలి. యావదాంధ్రదేశంలో సంచరిస్తూ, మాతృభాషా విషయమై జాగరూకుల్ని చేయాలి. ఇదే కర్తవ్యం. అవును. ఇదే తక్షణ కర్తవ్యం.

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష

ఈ) ప్రశంసాత్మకంగా రాయండి.

మీ స్నేహితులలో కేవలం తెలుగులోనే ఒక రోజంతా మాట్లాడగలిగే వారెవరో గుర్తించి, వారిని అభినందిస్తూ కేవలం తెలుగుపదాలతో ఒక అభినందన పత్రం రాయండి.
అభినందన పత్రం
జవాబు:
ప్రియమైన మిత్రులకు,

శుభాభినందనలు. నేను చాలా రోజులుగా మిమ్మల్ని గమనిస్తున్నాను. మీరు తెలుగులో మాట్లాడటం నన్ను బాగా ఆకర్షించింది. నిజానికి మనం రోజూవాడే మాటలలో కొన్ని ఆంగ్ల పదాలకు తెలుగు పదాలే లేవని నేను అనుకొన్నాను.

నా ఊహ తప్పని మీరు నిరూపించారు. తరగతి గది, తుడుపు గుడ్డ, సుద్దముక్క, ఉపస్థితి పట్టిక వంటి చక్కని తెలుగు పదాలను ఉపయోగిస్తూ తెలుగు వాతావరణాన్ని ఏర్పరచారు. మీలాంటి వారు నా మిత్రులని చెప్పుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది.

మీ వలన నేను తెలుగు భాష గొప్పదనాన్ని, మాధుర్యాన్ని గుర్తించాను. ఇంతకుముందు నేను తెలుగు మాధ్యమంలో చదువుతున్నందుకు సిగ్గుపడ్డాను. కాని నేడెంతో గర్వపడుతున్నాను. తెలుగుని అభిమాన విషయంగా చదువుతున్నాను. పద్యాలను రాగయుక్తంగా, భావయుక్తంగా చదివే ప్రయత్నం చేస్తున్నాను. గేయాలను చక్కగా గానం చేయడానికి కృషి చేస్తున్నాను. రోజువారీ వ్యవహారంలో మనం ఉపయోగించే ఆంగ్ల పదాలకు సరైన తెలుగు పదాలను మాతృభాషోపాధ్యాయుని సహాయంతో, ఇతర పెద్దల సహాయంతో సేకరించి, తగినచోట్ల వినియోగిస్తున్నాను. వీటి అన్నింటికి ప్రేరకులు మీరే. ధన్యవాదాలు.

ఇలా తెలుగులో నా కార్యకలాపాలకు తగిన భాషను వినియోగిస్తున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఇంట్లోని పెద్దవారు కూడా ఎంతో ప్రోత్సహిస్తున్నారు. మా తాతయ్య – నాయనమ్మల ఆనందానికి అవధులు లేవు. “నీలా నీ మిత్రులందరూ, రాష్ట్రంలోని విద్యార్థులందరూ తెలుగును అభిమానిస్తూ తెలుగు భాషనే వినియోగిస్తూ ఉంటే మన తెలుగుభాష అమృత భాషగా నిలుస్తుంది. మీ వలన పెద్దలలో కూడా తప్పక మార్పు వస్తుంది. ఇది ఒక శుభపరిణామం. నీలో మార్పునకు కారకులైన నీ స్నేహితులకు శుభాశీస్సులు. వీలైతే ఎప్పుడైనా వారిని మనింటికి అతిథులుగా తీసుకొనిరా” అని చెప్పారు. తప్పక మీరు మా ఆతిథ్యం స్వీకరించాలి. మీ రాకకై మేమందరం ఎదురు చూస్తున్నాం. మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష

(లేదా)
పాఠంలోని ఏవైనా రెండు పేరాలను వ్యవహార భాషలోకి మార్చి రాయండి.
1. గ్రాంథికములో ఉన్న పాఠ్యపుస్తకంలోని 4వ పేరా :
“స్వభాష యిదివఱకు మీచేతఁజావనే చచ్చినది. మీగతి యెంత యుభయభ్రష్టమైనదో చూచుకొంటిరా? మీరు వెచ్చించిన ధనములోఁ బడిన శ్రమములో వినియోగపఱచిన కాలములోఁ, బొందిన దైన్యములో, నేడ్చిన యేడ్పులలోఁ, బదునాలవవంతైన నక్కఱలేకుండ మీరు దేశభాషా పండితులై యుందురు. స్వభాషను మీరు నేర్చుకొనుటకే మంత శ్రమమున్నది ? అక్షరాభ్యాస దినమునుండియే మీరు స్వభాష నభ్యసించుచున్నారని యనుకొనవలదు. మీ తల్లి కడుపులో నున్నప్పుడే నేర్చుకొనుట మొదలు పెట్టినారు.
పై పేరా వ్యవహారభాషలో రాయడం :
జవాబు:
స్వభాష ఇదివరకే మీ చేతిలో చచ్చింది. మీ గతి ఎలా ఉభయభ్రష్టమైందో చూసుకున్నారా ? మీరు వెచ్చించిన ధనంలో, పడ్డ శ్రమలో, వినియోగించిన కాలంలో, పొందిన దైన్యంలో, ఏడ్చిన ఏడ్పుల్లో పద్నాలుగవ వంతైనా అక్కర్లేకుండా, మీరు దేశభాషలో పండితులయ్యేవారు. స్వభాషను మీరు నేర్చుకోడానికి ఏమంత శ్రమ ఉంది ? అక్షరాభ్యాస దినం నుంచే మీరు స్వభాషను అభ్యసిస్తున్నారని అనుకోవద్దు. మీ తల్లి కడుపులో ఉన్నప్పుడే నేర్చుకోడం (మొదలెట్టారు.) మొదలుపెట్టారు.

2. గ్రాంథికములో ఉన్న పాఠ్యపుస్తకంలోని 7వ పేరా :
“నాయనలారా ! మీ సభా కార్యక్రమము నంతయుఁ జెడఁగొట్టితిని. నన్ను మీరు క్షమింపవలయును. మఱి యెప్పుడైన నీసభ తిరుగఁజేసికొనుడు. (‘అప్పుడు మీరధ్యక్షులుగా రావలయును’ కేకలు) నాయనలారా ! అటులే-మీరంత యాంధ్రభాషాభిమానంతోఁ బ్రవర్తించుచున్నప్పుడు నా చేతనైన సేవను నేను జేయనా? ఇఁక నాలుగు మాటలు మాత్రము చెప్పుదును. ఆంధ్రభాష బొత్తిగ రానివానితోడనే కాని మీరాంధ్యమున నెన్నఁడు మాటాడవలదు.
వ్యవహారభాషలో పై పేరాను రాయడం :
జవాబు:
నాయనారా ! మీ సభా కార్యక్రమాన్నంతా చెడగొట్టాను. నన్ను మీరు క్షమించాలి. మరెప్పుడైనా ఈ సభ తిరిగి చేసికోండి. (అప్పుడు మీరధ్యక్షులుగా రావాలి. సభలో కేకలు …) నాయనారా ! అలాగే, మీరంత ఆంధ్రభాషాభిమానంతో ప్రవర్తిస్తున్నప్పుడు నా చేతనైన సేవను నేను చేయనా ? ఇక నాలుగు మాటలు మాత్రం చెప్తాను. ఆంధ్రభాష బొత్తిగా, రానివాడితో కాని, మీరాంగ్లంలో ఎన్నడూ మాట్లాడొద్దు.

IV. ప్రాజెక్టు పని

తెలుగు భాష గొప్పదనాన్ని వివరించే వ్యాసాలను, పద్యాలను సేకరించండి. వాటి గురించి తరగతిలో చర్చించండి.
జవాబు:
తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
తెలుగువల్లభుండ తెలుగొకండ
ఎల్లనృపులు గొలువ నెఱుగవే బాసాడి
దేశభాషలందు తెలుగు లెస్స.

III. భాషాంశాలు

పదజాలం

అ) కింద గీత గీసిన పదాలకు అర్థాలు రాసి, ఆ పదాలను ఉపయోగిస్తూ సొంతవాక్యాలు రాయండి.

1. శిశువుల మాటలు చిలుక పలుకుల్లా ఉంటాయి.
జవాబు:
చిలుక పలుకులు – అర్థం తెలియకుండా అనే మాటలు.
వాక్యప్రయోగం :
మా తమ్ముడు హిందీ వ్యాసాన్ని చదువుతుంటే అర్థం తెలియకుండా అనే మాటల్లా ఉంది.

2. తొందరపడి ఎవరినీ అధిక్షేపించ గూడదు.
జవాబు:
అధిక్షేపించుట = ఎగతాళి చేయుట
వాక్య ప్రయోగం :
వికలాంగులను (దివ్యాంగులను) చూసి ఎగతాళి చేయగూడదు.

ఆ) కింది పట్టికలో ప్రకృతి వికృతుల పదాలున్నాయి. వాటిని గుర్తించి రాయండి.
AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష 2
జవాబు:

ప్రకృతి – వికృతి

1. భాష – బాస
2. పక్షి – పక్కి
3. విద్య – విద్దె
4. రాత్రి – రాతిరి
5. ఆశ్చర్యము – అచ్చెరువు
6. గృధ్రము – గద్ద

వ్యాకరణం

అ) రెండు గాని, అంతకంటే ఎక్కువగాని వాక్యాలలోని సమాపక క్రియలను అసమాపక క్రియలుగా మార్చి, ఆ వాక్యాలను ఒకే వాక్యంగా రాస్తే దాన్ని ‘సంక్లిష్ట వాక్యం’ అంటారని మీరు తెలుసుకున్నారు కదా !
అభ్యాసం :
కింది సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.

1. ఆంగ్లేయ గ్రంథములెన్నియో వ్రాయుచున్నారు.
ఆంగ్లేయ ఉపన్యాసములెన్నియో ఇచ్చుచున్నారు.
జవాబు:
ఆంగ్లేయ గ్రంథములెన్నియో వ్రాస్తూ, ఆంగ్లేయ ఉపన్యాసములెన్నియో ఇచ్చుచున్నారు.

2. నన్ను మీరు క్షమింపవలయును.
మఱి యెప్పుడైన ఈ సభ తిరుగ జేసికొనుడు.
జవాబు:
నన్ను మీరు క్షమించి, మఱి యెప్పుడైన ఈ సభ తిరుగజేసికొనుడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష

ఆ) సమాన ప్రాధాన్యం గల సామాన్యవాక్యాలు కలిసి ఒక వాక్యంగా ఏర్పడితే దాన్ని సంయుక్తవాక్యమంటారని తెలుసుకున్నారు కదా!
కింది సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.

1. ఆయన ఆంధ్రుడు. ఆయన కృష్ణాతీరమున పుట్టినవాడు.
జవాబు:
ఆయన ఆంధ్రుడు మరియు కృష్ణాతీరమున పుట్టినవాడు.

2. మోహిని కూచిపూడి నృత్యం నేర్చుకొంది. భావన భరతనాట్యం నేర్చుకొంది.
జవాబు:
మోహిని కూచిపూడి నృత్యం మరియు భావన భరతనాట్యం నేర్చుకొన్నారు.

క్వార్థకం :
భూతకాలంలోని అసమాపక క్రియను ‘క్త్వార్థకం’ అంటారు. ‘క్వా’ అనే సంస్కృత ప్రత్యయం యొక్క అర్థమే క్వార్థకం.
ఉదా :
వచ్చి, తిని

చేదర్థకం :
సంస్కృతంలో ‘చేత్’ అనే ప్రత్యయానికి ‘అయితే’ అని అర్థం. ఇలా తెలుగులో అదే ప్రత్యయం ఏ పదానికి చేరితే దాన్ని ‘చేదర్థకం’ అంటారు.
ఉదా :
కురిస్తే

శత్రర్థకం :
‘శత్రచ్’ అనే సంస్కృత ప్రత్యయం యొక్క అర్థం శత్రర్థకం. ‘శతృ’ ప్రత్యయం వర్తమానకాలమందలి అసమాపక క్రియకు చేరుతుంది. కాబట్టి వీటిని శత్రర్థకాలు అంటారు.
ఉదా :
చేస్తూ, తింటూ

ఇ) కింది వాక్యాలు చదవండి. వీటిలో క్వార్థకం, చేదర్థకం, శత్రర్థకం ఉన్న అసమాపక క్రియలున్న వాక్యాలను గుర్తించండి.

1. వర్షాకాలంలో వానలు పడితే పంటలు పండుతాయి. – చేదర్థకం
2. కవిత గ్రంథాలయానికి వెళ్ళి పుస్తకాలు తెచ్చింది. – క్వార్థకం
3. సుగుణ వంట చేస్తూ పాటలు వింటోంది. – శత్రర్థకం
4. సరిగ్గా మందులు వాడితే జబ్బు తగ్గుతుంది. – చేదర్థకం
5. రంగయ్యకు రెక్కాడితే కాని డొక్కాడదు. – చేదర్థకం
6. మాధవి ఉద్యోగం చేస్తూ చదువుకొంటున్నది. – శత్రర్థకం

ఈ) కింది పేరాలో అవసరమైనచోట తగిన విరామచిహ్నాలు ఉంచండి.
మనము చూడనే లేదయ్యా మన జంఘాలశాస్త్రియే యయ్యా యని వారిలో వారనుకొనుచు ఎప్పుడు వచ్చినారు ఎక్కడి నుండి వచ్చినారు మీరు సభకు వచ్చిన తరువాతనైనను మాకు తెలియజేయనక్కల లేదా ఏమి న్యాయమయ్యా యని యేవేవో అసందర్భములాడి నన్నుపన్యాసరంగము నొద్దకు తీసికొనిపోయిరి.
జవాబు:
విరామచిహ్నములతో వ్రాయుట :
‘మనము చూడనేలేదయ్యా. మన జంఘాలశాస్త్రియేయయ్యా’, యని వారిలో వారనుకొనుచు, “ఎప్పుడు వచ్చినారు? ఎక్కడి నుండి వచ్చినారు? మీరు సభకు వచ్చిన తరువాతనైనను మాకు తెలియజేయనక్కఱలేదా ? ఏమి న్యాయమయ్యా?”, యని యేవేవో అసందర్భములాడి, నన్నుపన్యాసరంగము నొద్దకు తీసికొనిపోయిరి.

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష

ఉ) ప్రత్యక్ష, పరోక్ష కథనాలు
ప్రత్యక్ష కథనం :
ఒక వ్యక్తి చెప్పిన మాటలను అలాగే ఉన్నది ఉన్నట్లుగా (ఉద్ధరణ చిహ్నాలలో ఉంచి) చెప్పడాన్ని ప్రత్యక్ష కథనం అంటారు.

కింది వాక్యాలు చదవండి.
1) “నాయనలారా ! నేను మీ సభా కార్యక్రమమునంతయు జెడగొట్టితిని.”
2) “నన్ను మీరు క్షమింపవలయును.”

పై వాక్యాలన్నీ జంఘాలశాస్త్రి నేరుగా చెబుతున్నట్లు ఉన్నాయి కదా !
నేను, మేము, …….. ఇలా ఉండే వాక్యాలు అనగా ఉత్తమ పురుషలోని వాక్యాలు సాధారణంగా, ప్రత్యక్షంగా చెబుతున్నట్లుగా ఉంటాయి. అట్లే కింది వాక్యాలను చదవండి.
1) “నేనొక్కడినే అదృష్టవంతుడినా?” అన్నాడు జంఘాలశాస్త్రి.
2) “నేను రాను” అని నరేశ్ రఘుతో అన్నాడు.
(లేదా )
“నేను రా” నని నరేశ్ రఘుతో అన్నాడు.

పై వాక్యాలలో గీత గీసిన మాటలను ఎవరు అన్నారు ?
మొదటి దాంట్లో జంఘాలశాస్త్రి అన్న మాటల్ని, రెండవదాంట్లో నరేష్ అన్న మాటల్ని “ఉద్ధరణ చిహ్నాలు” (ఇన్వర్టడ్ కామాలు) ఉంచి చెప్పినప్పుడు వారే ప్రత్యక్షంగా చెప్పినట్లుగా ఉంటుంది. దీన్నే ప్రత్యక్ష కథనం అంటారు.

పాఠం చదవండి. ప్రత్యక్ష కథనంలో ఉన్న వాక్యాలను గుర్తించండి. వాటి కింద గీత గీయండి.

  1. “బ్రతికి యుండిన సుఖములు పడయవచ్చు” నని కవి చెప్పినాడే.
  2. “నాయనలారా ! మీరు కూడా వింటిరి కాదా ! నేనొక్కడినే వింటినా? ఏదో విని మటియేదో యని భ్రమపడితినా?”
  3. ‘నేనొక్కడను మాత్రమే యదృష్టవంతుడనా ? ఆంధ్రులందఱదృష్టవంతులే కదా!”
  4. “నాది భ్రమము కాదు. తాత్కాలికోన్మాదము కాదు.”
  5. “మన యగ్రాసనాధిపతి దేవుని కాంధ్రభాష రాదట.”
  6. “అబ్బా ! మీరే ప్రయత్నము చేసినారని రాదనుచున్నారు?”
  7. “మా భాష మాకు రాదు.” 8. “ఆంగ్లేయభాష యేల చదువుకొంటివని నే నధిక్షేపింపను.”
  8. “ఇక నాలుగు మాటలు మాత్రము చెప్పుదును.”
  9. “మన భాష కక్కఱకు వచ్చు నంశము లేమియా” యని తదేక దృష్టితో జూడండి.

పరోక్ష కథనం :
ఒకరు చెప్పిన మాటలను యథాతథంగా అట్లే చెప్పక ఇంకొకరు చెపుతున్నట్లుగా చెప్పడాన్నే పరోక్ష కథనం అంటారు. ఇందులో వాక్యాలు ఉత్తమ పురుషలో ఉండవు. ఉద్ధరణ చిహ్నాల అవసరమూ ఉండదు.

కింది వాక్యాలు చదవండి.

  1. నరేష్ తాను రానని రఘుతో అన్నాడు.
  2. ప్రధానోపాధ్యాయుడు చెప్పినట్లుగా చేస్తామని పిల్లలు అన్నారు.
  3. తనను క్షమించమని రాజు తన మిత్రుడితో అన్నాడు.

పాఠం చదవండి. పరోక్ష కథనంలోని వాక్యాలను గుర్తించండి. వాటి కింద గీత గీయండి.
పాఠంలో గుర్తించిన పరోక్ష కథనంలోని వాక్యాలు :

  1. ఆయన యాంధ్రుడు. కృష్ణాతీరమున బుట్టినవాడు.
  2. న్యాయవాద వృత్తిని నిరాఘాటముగా, నిరంకుశముగా నిర్వర్తించుచున్నవాడు.
  3. ఆయన ఆంధ్రమున మాటలాడనేలేరట.

ప్రత్యక్ష కథనంలో ఉన్న వాటిని పరోక్ష కథనంలోకి మార్చేటప్పుడు జరిగే మార్పులు

  1. ప్రత్యక్ష కథనంలోని మాటల/వాక్యాల భావం మాత్రమే పరోక్ష కథనంలో తీసుకొనబడుతుంది.
  2. ఉద్దరణ చిహ్నాలు తొలగించబడతాయి పరోక్ష కథనంలో.
  3. ‘అని’ అనే పదం పరోక్ష కథనంలో చేరుతుంది.
  4. ప్రత్యక్ష కథనంలోని ఉత్తమ పురుష పదాలైన – నేను – మేము – మన – మా వంటి పదాలు – తాను – తాము – తమ – అనే పదాలుగా పరోక్ష కథనంలో మారుతాయి.

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష

1) పాఠంలోని ప్రత్యక్ష కథనంలోని వాక్యాలను గుర్తించండి. వాటిని పరోక్ష కథనంలోకి మార్చి రాయండి.

1. “బ్రతికి యుండిన సుఖములు పడయవచ్చు” నని కవి చెప్పినాడు.
జవాబు:
బ్రతికి యుండిన సుఖములు పడయవచ్చు అని కవి చెప్పినాడు.

2. “మీరు కూడ వింటిరి కాదా? నేనొక్కడనే వింటినా? ఏదో విని మఱియేదో యని భ్రమపడితినా?” అన్నాడు జంఘాలశాస్త్రి.
జవాబు:
మీరు కూడ వింటిరి కాదా? తానొక్కడే విన్నాడా? ఏదో విని మటియేదో యని భ్రమపడినాడా? అని జంఘాలశాస్త్రి అన్నాడు.

3. “నేనొక్కడనే అదృష్టవంతుడనా? ఆంధ్రులంద అదృష్టవంతులే కదా ! ” అన్నాడు జంఘాలశాస్త్రి.
జవాబు:
తానొక్కడే అదృష్టవంతుడా ? ఆంధ్రులందరు అదృష్టవంతులే కదా ! అని అన్నాడు జంఘాలశాస్త్రి.

4. “నాది భ్రమము కాదు. తాత్కాలికోన్మాదము కాదు” అన్నాడు జంఘాలశాస్త్రి.
జవాబు:
తనది భ్రమము కాదని, తాత్కాలికోన్మాదము కాదని అన్నాడు జంఘాలశాస్త్రి.

5. “మన యగ్రాసనాధిపతి దేవుని కాంధ్రభాష రాదట ” అన్నాడు జంఘాలశాస్త్రి.
జవాబు:
తమ యగ్రాసనాధిపతి దేవుని కాంధ్రభాష రాదట అని అన్నాడు జంఘాలశాస్త్రి.

6. “అబ్బా ! మీరే ప్రయత్నము చేసినారని రాదనుచున్నారు?” అన్నాడు శాస్త్రి.
జవాబు:
అబ్బా ! మీరే ప్రయత్నము చేసినారని రాదనుచున్నారని అన్నాడు శాస్త్రి.

7. “మా భాష మాకు రాదు” ఇలా అనకూడదేవరు.
జవాబు:
తమ భాష తమకు రాదని అనకూడదెవరు.

8. “ఆంగ్లేయభాష యేల చదువుకొంటివని నేధిక్షేపింపనా” అన్నాడు జంఘాలశాస్త్రి.
జవాబు:
ఆంగ్లేయభాష యేల చదువుకొంటివని తానధిక్షేపింపనని అన్నాడు జంఘాలశాస్త్రి.

9. “ఇక నాలుగు మాటలు మాత్రము చెప్పుదును” అన్నాడు జంఘాలశాస్త్రి.
జవాబు:
ఇక నాలుగు మాటలు మాత్రము చెప్పెదనని అన్నాడు జంఘాలశాస్త్రి.

10. “మన భాషకక్కఱకు వచ్చు నంశము లేమియా’యని తదేక దృష్టి జూడుడి” అన్నాడు జంఘాలశాస్త్రి.
జవాబు:
తమ భాష కక్కల వచ్చు నంశము లేమియాయని తదేక దృష్టి జూడండని అన్నాడు జంఘాలశాస్త్రి.

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష

2) మీరే మరికొన్ని ప్రత్యక్ష కథనంలోని వాక్యాలు రాయండి. వాటిని పరోక్ష కథనంలోకి మార్చండి.
1. “నేను బాగా చదువుతాను” అన్నాడు రఘు, రాజుతో.
జవాబు:
తాను బాగా చదువుతానని రఘు రాజుతో అన్నాడు.

2. “నేను అందగత్తెనని” చెప్పింది రాణి.
జవాబు:
తాను అందగత్తెనని రాణి చెప్పింది.

3. “మేము రేపు ఊరికి వెళ్ళుతున్నాం”చెప్పాడు విష్ణు.
జవాబు:
తాము రేపు ఊరికి వెళ్ళుతున్నామని విష్ణు చెప్పాడు.

4. “మన మందరం అమెరికా వెళ్తున్నాం” ఆనందంగా చెప్పింది రోజి.
జవాబు:
తామందరం అమెరికా వెళ్తున్నారని రోజి ఆనందంగా చెప్పింది.

5. ” మా అక్కయ్యకు మెడిసిన్లో సీటు వచ్చింది” అన్నాడు రాము నిఖిల్ తో సంతోషంగా.
జవాబు:
తన అక్కయ్యకు మెడిసిన్లో సీటు వచ్చిందని రాము నిఖిల్ తో సంతోషంగా అన్నాడు.

6. “మా ఇల్లు చాలా విశాలంగా ఉంటుంది” అని మేరి రమణతో అంది.
జవాబు:
తమ ఇల్లు చాలా విశాలంగా ఉంటుందని మేరి రమణతో అంది.

7. “మా అన్నయ్య కవితలు బాగా రాస్తాడు” అంది సుమ రమతో.
జవాబు:
తన అన్నయ్య కవితలు బాగా రాస్తాడని సుమ రమతో అంది.

8. “మా చెల్లెలు బాగా పాటలు పాడుతుంది” అన్నాడు రమేష్.
జవాబు:
తన చెల్లెలు బాగా పాటలు పాడుతుందని రమేష్ అన్నాడు.

9. “నేను మా తమ్ముడితో ఆటలు ఆడను” తెగేసి చెప్పింది వాణి.
జవాబు:
తాను తమ తమ్ముడితో ఆటలు ఆడనని వాణి తెగేసి చెప్పింది.

10. “మా అబ్బాయి చదరంగం బాగా ఆడతాడు” చెప్పింది గిరిజ నీరజతో.
జవాబు:
తమ అబ్బాయి చదరంగం బాగా ఆడతాడని గిరిజ నీరజతో చెప్పింది.

9th Class Telugu 2nd Lesson స్వభాష రచయిత పరిచయం

పానుగంటి లక్ష్మీ నరసింహారావుగారు 11.2.1865లో రాజమండ్రి – సీతానగరంలో 1 జన్మించారు. వీరి తల్లిదండ్రులు రత్నమాంబ, వేంకటరమణయ్య. ఉన్నత విద్య వరకూ | రాజమండ్రిలోనే విద్యాభ్యాసం చేశారు. బళ్ళారి జిల్లాలోని ఆనెగొంది సంస్థానంలో దివానుగా | కొంతకాలం చేసి, తరువాత పిఠాపురం సంస్థానంలో ఆస్థానకవిగా స్థిరపడ్డారు.

సారంగధర, ప్రచండ చాణక్యము, విప్రనారాయణ, కంఠాభరణం, పూర్ణిమ, సరస్వతి, సరోజని, సాక్షి మొ||వి వీరి ప్రసిద్ధ రచనలు. వీరి శైలి అద్భుతమైన గ్రాంథిక భాషా ప్రవాహంతో | సున్నితమైన వ్యంగ్యంతో, చురుక్కుమనే హాస్యంతో అలరారుతుంది.

సమకాలీన సమస్యలపై తీవ్రంగా స్పందించి, సంఘ సంస్కరణకు నడుం కట్టి, తన రచనల ద్వారా ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించిన పానుగంటివారు చిరస్మరణీయులు. వారి రచనలు ఈనాటి పరిస్థితులకు కూడా అద్దం పడుతున్నాయి. వీరు 1-1-1940 న పరమపదించారు.

కఠిన పదాలకు అర్థాలు

1వ పేరా :
హరహరా = ఈశ్వరా ! ఈశ్వరా !
శంభూ = ఓ శివా !
భ్రమపడితిని = భ్రాంతి చెందితిని
ఆంధ్ర మాతాపితలు = తెలుగువారైన తల్లిదండ్రులు
ఉద్భవించి = పుట్టి
అభ్యసించి = నేర్చి
అమూల్య + అలంకారములు = విలువ కట్టరాని అలంకారాలు
అర్పించి = ఇచ్చి
ఆచరించి = చేసి
అంగములు = అవయవాలు
అసువులు = ప్రాణాలు
పాసి = విడిచి
పరమ పదము = వైకుంఠము లేక కైలాసము
తాత్కాలికోన్మాదము (తాత్కాలిక + ఉన్మాదము) = అప్పుడు మాత్రమే ఉండిన వెఱ్ఱి
చెవులు చిల్లులుపడు = పెద్ద ధ్వనిచే చెవులు చిల్లులు పడినట్లగుట

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష

2వ పేరా :
ఆలాప కలాపము = మాటల సమూహం
సాయించిన = చెప్పిన
శ్రీ సూక్తి = మంగళకరమైన నీతివాక్యము
ఆస్యగహ్వరము = గుహ వంటి నోరు
అవతరించిన = పుట్టిన
ఆగమ సూత్రము = వేద సూత్రం
వచింపదగినది = చెప్పదగినది
అగ్రాసనాధిపతి (అగ్ర + ఆసన + అధిపతి) = అధ్యక్షుడు
ఆంగ్లేయ భాషా పండిత + అగ్రణులు = ఇంగ్లీషు భాషా పండితులలో శ్రేష్ఠుడు
వక్తృ, వావదూకతా వైభవము = మాటలాడే వ్యక్తి యొక్క ఉపన్యాస వైభవం
కబళించి = ముద్దగా మ్రింగి
కడతేఱ్ఱి = కృతార్థులయి
కాలాంబర కవచధారి = నల్లని వస్త్రాన్ని కవచంగా ధరించినవాడు (నల్లకోటు ధరించిన వకీలు)
కర్కశ తర్క వాగ్వాహినీ = కఠినమైన తర్కవాక్కుల ప్రవాహం
మోహినీకరణ దక్షులు = ‘మోహింపజేయడంలో సమర్థులు
వాగ్దోరణీ ధీరులు = మాట్లాడే తీరులో గొప్పవారు
అనవరత శ్రవణము = ఎల్లప్పుడూ వినడం
మనుజుడు = మనిషి
వాయునీరాహారపారణము = గాలిని, నీటినీ ఆహారంగా తినడం
ఒనర్చినవాడు = చేసినవాడు
అవిశ్వసనీయము = నమ్మదగనిది

3వ పేరా :
అనిష్టత = ఇష్టము లేకపోవడం
శిలాక్షరము (శిల + అక్షరము) = రాతిపై చెక్కిన అక్షరం (శాశ్వతం)
ఆంగ్లేయ తేజస్సు = ఇంగ్లీషు ప్రకాశం
అకార్యకరణము = చేయరాని పనిని చేయడం
మకరంద, బిందు, బృంద, రస = పూదేనె, బిందువుల యొక్క సమూహం యొక్క రసం
స్యందన మందరము = స్రవించే మందారము అనే కల్పవృక్షం
మాతృభాష = తల్లి భాష
పరిత్యజించి = విడిచి
పఠించినవారు = చదివినవారు
మాన్యములు = శ్రీమంతులు పన్నులు లేకుండా గౌరవం కోసం పూజ్యులకు ఇచ్చే పొలాలు
వ్యయపఱచి = ఖర్చు చేసి
చిత్తక్లేశము = మనస్సునకు కష్టం
సౌలభ్యము = సులభత్వము
గ్రంథజ్ఞాన శూన్యుడు = పుస్తక జ్ఞానం లేనివాడు
సాబాలు = సగము
అర్ధశతాబ్దము = ఏబది సంవత్సరాలు
అలవడినది = అబ్బినది
భాషోచ్చారణ (భాషా + ఉచ్చారణ) = భాషను పలుకుట
సౌష్ఠవము = నిండుదనం
విశేషజ్ఞులము = బాగా తెలిసినవారం
ఉపజ్జా సహితములు = ఇతరుల ఉపదేశం లేకుండానే, మొట్టమొదటనే కలిగే జ్ఞానము ‘ఉపజ్ఞ’ – దానితో కూడినవి.
వాగ్దోరణులు = మాటతీరులు
చిలుక పలుకులు = సొంతముగా ఆలోచింపక పలుకు మాటలు
ఒరిజినాలిటీ (originality) = ఉపజ్ఞ, నవీన కల్పనాశక్తి
ధీమంతులు = బుద్ధిమంతులు
వ్యాసపీఠాధిపత్యము = వ్యాసరచన పీఠానికి అధికారిత్వము

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష

4వ పేరా :
ఈనాము = బహుమానంగా ఇచ్చిన భూభాగం, మాన్యం
దైన్యపడి = దీనత్వమును పొంది

5వ పేరా :
ఉభయభ్రష్టము = రెండిటికీ చెడినది

6వ పేరా :
కంఠోక్తి (కంఠ + ఉక్తి) – = గట్టిగా చెప్పడం
అనర్హవాక్యము = తగని మాట
అనుచిత వాక్యము = ఉచితము కాని మాట
నిస్సందేహము = సందేహము లేకుండా
అవకతవక = అసందర్భం

7వ పేరా :
ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ = ఆస్తులను బదలాయించే చట్టం
యథార్థము (యథా + అర్థము) = సరియైనది
రవంత (రవ + అంత) = రేణువు అంత
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ = నేరాలకు శిక్షించు విధిని నిర్ణయించు గ్రంథం

8వ పేరా:
ఎవిడన్సు యాక్ట్ = సాక్ష్య చట్టం
లేటెస్టు ఎడిషన్ = కడపట అచ్చువేసిన ప్రతి
జడ్జిమెంటు = తీర్పు

9వ పేరా :
అధిక్షేపించు = ఆక్షేపించు
ప్రశస్తము = మేలయినది
వన్నెపెట్టుట = మెఱుగు పెట్టుట
అక్కఱములు = అక్షరములు
ఉపచరింపదలచితివి = సేవింపదలచితివి
బాయ్ ! రూములోనున్న పాట్ లో = అబ్బాయీ ! గదిలోని కుండలో
రైస్ = బియ్యం
క్రైండ్లీ గెటిట్ హియర్ = దయతో ఇక్కడకు వాటిని తెండి
థాంక్ యూ ఇన్ ఆంటిసిపేషన్ = ముందుగా కృతజ్ఞతలు

AP Board 9th Class Telugu Solutions Chapter 2 స్వభాష

10వ పేరా:
డియర్ ఫ్రెండ్ = ప్రియమైన స్నేహితుడా !
యువర్సు ట్రూలీ = మీ విశ్వసనీయమైన
అక్కఱ = అవసరం
తదేకదృష్టి (తత్ + ఏక దృష్టి) = అది ఒక్కటే చూపు
మెదటిలో = మెదడులో
పదిలపటపుడు = స్థిరపరచండి

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions Chapter 1 శాంతికాంక్ష Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions 1st Lesson శాంతికాంక్ష

9th Class Telugu 1st Lesson శాంతికాంక్ష Textbook Questions and Answers

చదవండి-ఆలోచించండి-చెప్పండి

అది 1945 వ సంవత్సరం. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా జపాన్ లోని హిరోషిమా అనే నగరం మీద అణుబాంబులతో దాడి చేసింది. దాని ఫలితంగా కొద్ది క్షణాల్లో అరవైఆరు వేలమంది ప్రాణాలు కోల్పోయారు. డెబ్బై వేలమంది క్షతగాత్రులయ్యారు. నిన్న మొన్నటి వరకూ అక్కడి ప్రజలకు అది పీడకలగా నిలిచిపోయింది.

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
ఈ పేరా చదివాక మీకేమర్థమైంది?
జవాబు:
యుద్ధం వలన జననష్టం ఎక్కువగా జరుగుతుందని అర్థమైంది.

ప్రశ్న 2.
మానవ కళ్యాణానికి ఉపయోగపడాల్సిన సైన్సు దేనికి దారితీసింది?
జవాబు:
మానవ వినాశనానికి దారితీసింది.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

ప్రశ్న 3.
ఆధునిక కాలంలో యుద్ధాలవల్ల ఎలాంటి నష్టాలు సంభవిస్తాయి?
జవాబు:
ఆధునిక కాలంలో యుద్ధాలలో రసాయనిక బాంబులను, అణుబాంబులను ఉపయోగించే ప్రమాదముంది. దీనివల్ల ప్రపంచపటంలోని కొన్ని దేశాలు కనుమరుగయ్యే అపాయం ఉంది.

ప్రశ్న 4.
యుద్ధాలను నివారించడానికి, శాంతిని నెలకొల్పడానికి ఏం చేయాలి?
జవాబు:
యుద్ధాలను నివారించడానికి, శాంతిని నెలకొల్పడానికి ప్రపంచదేశాలన్నీ అసమానతలను వీడాలి. సోదర భావంతో మెలగాలి.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది అంశాలను గురించి చర్చించండి.

ప్రశ్న 1.
శ్రీకృష్ణుణ్ణి కష్టాలను తొలగించే వ్యక్తిగా ధర్మరాజు కీర్తించాడు గదా! అలా ఎందుకన్నాడో చర్చించండి.
జవాబు:
పాండురాజు మరణిస్తూ శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించమని పాండవులకు సూచించాడు. పాండవులను చిన్నప్పటి నుండి శ్రీకృష్ణుడు అనేక కష్టాల నుండి రక్షించాడు. లక్క ఇంటి ప్రమాదం నుండి, ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టంలో, అరణ్యవాస సమయంలో, ఇలా పలు సందర్భాల్లో శ్రీకృష్ణుడు కాపాడటం ధర్మరాజుకు తెలుసు. ధర్మరాజు ధర్మాన్నే ఆశ్రయించినవాడు కాగా శ్రీకృష్ణుడు ధర్మపక్షపాతి. అందుకే ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించాడు.

యుద్ధం లేకుండా, బంధునాశనం కాకుండా, తమ రాజ్యం తమకు రావాలని ధర్మరాజు కోరిక. దాన్ని నెరవేర్చగల సమర్థుడు శ్రీకృష్ణుడని అతని విశ్వాసం. ఒకవేళ యుద్ధం తప్పనిసరి అయితే దానికి కారకుడిగా దుర్యోధనుడినే లోకం నిందించాలి తప్ప తమని నిందించకూడదనేది ధర్మజుడి కోరిక. అలా “కర్ర విరగకుండా పాము చావకుండా” – కార్యం సాధించగల నేర్పరి శ్రీకృష్ణుడు. కాబట్టే కష్టాలను తొలగించే వ్యక్తిగా ధర్మరాజు కృష్ణుణ్ణి కీర్తించాడు.

ఎదుటివారి మనోభావాలను చక్కగా గ్రహించి, తదనుగుణంగా వ్యూహాన్ని పన్నగల మేధావి శ్రీకృష్ణుడు. దక్షుడు కాబట్టే ఈ అసాధ్య కార్యాన్ని సాధించగలడని, రాయబార సమయంలో దుర్యోధనాదులు ఏవైనా ఇబ్బందులు కలిగించినా తప్పుకొనిరాగల ధీరుడని ధర్మరాజు నమ్మకం. పాండవుల హృదయాల్ని లోకానికి తెలియబరచగలిగిన వాక్చాతుర్యం, అవసరమైతే తగిన సమాధానం చెప్పగల నేర్పు, తగినంత ఓర్పు గల మహానుభావుడు శ్రీకృష్ణుడు. అందుకనే శ్రీకృష్ణుణ్ణి కష్టాలను తొలగించే వ్యక్తిగా ధర్మరాజు కీర్తించాడు.

శ్రీకృష్ణుడు తాను చిన్నప్పటి నుండే మానవాతీత శక్తుల్ని ప్రదర్శించాడు. పూతన, శకటాసురుడు మొదలైన రాక్షసులను చంపడం, కాళీయుని పడగలపై నాట్యం చేయడం వంటి అతిమానుష శక్తుల్ని కలిగి ఉన్నాడు. గోవర్ధనగిరిని పైకిలేపుట వంటి కార్యాల ద్వారా తాను పరమాత్ముడనే సత్యాన్ని వెల్లడి చేశాడు. కుంతీదేవి కూడా కృష్ణుడిని మేనల్లునిగా గాక భగవంతునిగానే సంభావించింది. కష్టాల నుండి గట్టెక్కించేవాడు, ఎల్లప్పుడు శుభాలను కలిగించేవాడు భగవంతుడు ఒక్కడే. కాబట్టే కృష్ణునికి శరణాగతుడైనాడు ధర్మరాజు.

ప్రశ్న 2.
యుద్ధాల వల్ల కలిగే నష్టాలు, అనర్దాలు చెప్పండి.
జవాబు:
యుద్దాల వల్ల సంపదలు కలిగినా ప్రాణహాని కూడా జరుగుతుంది. బలహీనులు బలవంతుని చేతిలో చనిపోతారు. ఒక్కొక్కసారి బలవంతులు సైతం బలహీనుల చేతిలో సమసిపోతారు. యుద్ధంలో ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో నిశ్చయించి చెప్పలేము. ఒకవేళ సంగ్రామంలో అపజయం కలిగితే అది చావు కంటే భయంకరమైనది. యుద్ధం అన్ని అనర్థాలకు మూలం. యుద్ధానికి మూలం పగ. పగ కారణంగానే యుద్ధజ్వాల రగులుతుంది. పగ తగ్గితే యుద్ధ ప్రవృత్తి సహజంగానే తొలగిపోతుంది.

ఒకసారి పగ సాధింపునకు దిగితే ఇక దయాదాక్షిణ్యాలు ఉండవు. సంధికి అవకాశం ఉండదు. దారుణమైన క్రూరవృత్తితో శత్రుసంహారమే కొనసాగుతుంది. లక్ష్యం కొద్దిమందికే అయినా ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతారు. చాలామంది వికలాంగులవుతారు. భర్తలను కోల్పోయిన స్త్రీలు, వారి కుటుంబాలు వీధినబడతాయి. తమ పిల్లల్ని కోల్పోయిన వృద్ధులు అనాథలవుతారు. దేశంలో కరవుకాటకాలు విలయతాండవం చేస్తాయి.

పూర్వకాలంలోని యుద్ధాలకు నీతినియమాలుండేవి. కానీ ఆధునిక కాలంలో యుద్ధాలకు అవి వర్తించడం లేదు. పూర్వం యుద్ధాలు సూర్యోదయం తర్వాత ఆరంభమై సూర్యాస్తమయంతో ముగిసేవి. నేడు రాత్రివేళల్లో కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. ఆధునిక కాలంలో మానవుని విజ్ఞానం బాగా పెరిగి, అణ్వాయుధాలు, రసాయనిక ఆయుధాలు కనుగొనబడి యుద్ధాల్లో ప్రయోగించబడుతున్నాయి. వీటివల్ల దేశాలకు దేశాలే ప్రపంచ పటం నుండి మాయమయ్యే పరిస్థితులేర్పడుతున్నాయి. యుద్ధంలో పాల్గొనే దేశాలకే కాక ఇతర ప్రపంచ దేశాలకు సైతం నేడు అనర్థాలు కలుగుతున్నాయి.

బాంబుల విస్ఫోటనాల వల్ల జలకాలుష్యం, వాయు కాలుష్యాలేర్పడి ప్రక్కనున్న దేశాలు కూడా నష్టమౌతున్నాయి. పరిసరాల కాలుష్యం వలన యుద్ధం జరిగి కొన్ని సంవత్సరాలైనా అక్కడి ప్రజలు ఇంకా కోలుకోని దుస్థితులేర్పడుతున్నాయి. గ్రామాలలో, కొండలలో నక్కిన శత్రువులను చంపడం కోసం చేసే వైమానిక దాడుల్లో ఎందరో అమాయక ప్రజలు, పశువులు ప్రాణాలు కోల్పోతున్నాయి. యుద్ధ సమయంలో అరబ్బు దేశాల్లో పెట్రోలు బావుల పై బాంబులు పడి మంటలు రేగి కలిగిన నష్టం ఎప్పటికీ తీర్చలేనిది.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

ఆ) గుర్తున్న పద్యాలకు ప్రతిపదార్థాలు రాయండి.

శా|| ఆ దుర్యోధనుఁడంత మాత్రయును జేయంజాలఁడో కాని, పెం
పేదం గ్రూరత కోర్వరాదు, సిరి నాకేలందునే, గ్రాసవా
సోదైన్యంబులు వచ్చు నాయరయు నీ చుట్టాలకుం, గావునన్
మోదంబందుట గలుఁ గౌరవులు నేముం బొంది శ్రీనొందినన్.
ప్రతిపదార్థం :
ఆ దుర్యోధనుడు = ఆ సుయోధనుడు
అంతమాత్రయును = ఆ కొలదియైనను
చేయన్ = చేయడానికి
చాలడు + ఓ = ఇష్టపడడేమో
కాని = కాని
పెంపు = అభివృద్ధి
ఏదన్ = నశించునట్లుగా
క్రూరతకున్ = క్రౌర్యమునకు
ఓర్వరాదు = సహించగూడదు
సిరి = రాజ్యం (సంపద)
నాకున్ + ఏల = నాకెందుకు
అందున్ + ఏ =అని అందునా
నా + అరయు = నేను బాగోగులు చూసుకోవలసిన
ఈ చుట్టాలకున్ = ఈ ఆశ్రితులకు (పరివారానికి, బంధువులకు)
గ్రాస = తిండికి
వాసః = బట్టకు (నివాసానికి)
దైన్యంబులు = దురవస్థలు
వచ్చు = కల్గుతాయి
కావునన్ = కాబట్టి
కౌరవులున్ = కౌరవులును
ఏమున్ = మేమును
పొంది = సంధి చేసుకొని
శ్రీన్ = రాజ్యాన్ని
పొందినన్ = పొందినట్లైతే (పంచుకున్నట్లైతే)
మోదంబు = (అందరికీ) సంతోషం
అందుట = పొందుట
కల్గున్ = జరుగుతుంది
అని ధర్మరాజు శ్రీకృష్ణునితో అన్నాడు.

సూచన : పాఠంలోని పద్యాలు అన్నింటికీ ప్రతిపదార్థాలు, భావాలు ముందు ఇవ్వబడ్డాయి. * గుర్తుపెట్టిన పద్యాల ప్రతిపదార్థాలు చదవండి.

ఇ) కింది పేరాను చదివి ఎలా, ఎందుకు? అనే ప్రశ్న పదాలను మాత్రమే ఉపయోగించి కొన్ని ప్రశ్నలు తయారుచేయండి.
మనసుకు నచ్చిన పనులే పిల్లలు ఇష్టంగా చేస్తారు. కఠినంగా మాట్లాడితే పిల్లలకు నచ్చదు. కాబట్టి అలా మాట్లాడేవారికి దూరంగా ఉంటారు. పిల్లలు అద్భుతంగా ఆలోచిస్తారు. కొందరు తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకోలేక అనవసరంగా బాధపడుతుంటారు. తమకు స్వేచ్ఛ ఉన్నచోటనే నిర్భయంగా ప్రశ్నిస్తారు. భద్రత ఉందని భావిస్తేనే, స్వేచ్చగా ఉంటారు. మనసు విప్పి మాట్లాడతారు.

ప్రశ్నలు:
1. మనసుకు నచ్చిన పనులే పిల్లలు ‘ఎలా’ చేస్తారు?
2. కఠినంగా మాట్లాడితే పిల్లలకు ఎందుకు నచ్చదు?
3. కఠినంగా మాట్లాడే వారితో పిల్లలు ఎలా ఉంటారు?
4. పిల్లలు ‘ఏలా’ ఆలోచిస్తారు?
5. కొందరు తల్లిదండ్రులు ‘ఎందుకు’ బాధపడుతూ ఉంటారు?
6. ఎలా ఉన్నచోట పిల్లలు నిర్భయంగా ప్రశ్నిస్తారు?
7. ఎందుకు స్వేచ్ఛగా ఉంటారు?
8. స్వేచ్ఛ ఉన్నచోట పిల్లలు ఎలా మాట్లాడతారు?

ఈ) పాఠం చదవి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
ధర్మరాజు రాజ్యసంపద దేనికోసం కోరాడు?
జవాబు:
క్షత్రియ ధర్మాన్ని పాటించడం ఎంతో కష్టం. అలాగని రాజు వేరే ధర్మాలను పాటించకూడదు. కాబట్టి ఆయుధాలను చేపట్టి రాజ్యసంపదను పొందాలి. పోనీ రాజ్యసంపద తనకెందుకని కౌరవులను అడగటం మానితే, తననే ఆశ్రయించుకొని ఉన్న తన తమ్ములకు, బంధుజనాలకు కూటికీ, గుడ్డకు సైతం ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టే ధర్మరాజు రాజ్యసంపదను కోరాడు.

ప్రశ్న 2.
శత్రుత్వ భావనను కవి దేనితో పోల్చాడు?
జవాబు:
శత్రుత్వ భావనను కవి పామున్న ఇంటిలో కాపురం ఉండడంతో పోల్చాడు. అంటే పామున్న ఇంట్లో ఎలా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తామో అలా శత్రుత్వమున్న చోట కూడా ఏ క్షణం ఏమి జరుగుతుందో అని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని జీవించాలని కవి భావం.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

ప్రశ్న 3.
చాకచక్యంగా మాట్లాడమంటూ శ్రీకృష్ణునికి ధర్మరాజు ఎలాంటి సలహా ఇచ్చాడు?
జవాబు:
కృష్ణా ! మా విషయంలో పక్షపాతం చూపించకు ! ధర్మం – నీతి వాటిననుసరించి ఇరుపక్షాలకూ మేలు, అభివృద్ధి జరిగేలా మాట్లాడు. విదురుడు మొదలైన సత్పురుషుల మనసులకు సమ్మతమయ్యేటట్లుగా తగినంత మెత్తదనంతోనూ, అవసరమైనచోట కఠినమైన మందలింపులతోను కురుసభలో రాజులందరూ గ్రహించేలా మాట్లాడు. న్యాయం పట్టించుకోకుండా దుర్యోధనుడు పరుష వాక్యాలు పలికితే సహించు. తొందరపాటుతో సభను విడిచిరాకు. పెద్దలమాటను సుయోధనుడు వినలేదనే నింద అతనికే ఉంచు. మనం గౌరవంగా పెద్దలమాటను, ఉద్దేశాన్ని సాగనిస్తున్నామని లోకులు మెచ్చుకునేలా చేయి.

ఆ ధృతరాష్ట్రుడు సుతపక్షపాతియై సూటిగా ఏ అభిప్రాయాన్ని చెప్పక, అవినీతితో ప్రవర్తిస్తే సంధి కుదరదని సాహసించి పలుకకు. సాహసం చేయాల్సివస్తే జనులంతా మెచ్చుకునేటట్లు ధర్మానికి నిలచి, మాకు విచారం లేకుండా చేయి. నీకంతా తెలుసు. నీకు ఉపాయాలు చెప్పడానికి నేనేమాత్రం వాణ్ణి ? హస్తినాపురానికి వెళ్ళిరా !

II. వ్యక్తీకరణ సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
“పామున్న ఇంటిలో కాపురమున్నట్లే” అంటే ఏమిటి? ధర్మరాజు ఈ వాక్యాన్ని ఎందుకు చెప్పాడు?
జవాబు:
ఇంట్లో పాము ఎప్పుడు కాటువేసి ప్రాణాలు తీస్తుందో తెలియదు కాబట్టి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ప్రతిక్షణం భయంతో గడపాలి.

యుద్ధానికి మూలం పగ. ఎడతెగని పగే యుద్ధాన్మాదంగా మారుతుంది. మాయాద్యూతంలో మోసంతో, రాజ్యాన్ని కాజేశారనే పగతో పాండవులలో యుద్ధజ్వాల రగుల్కొంది. బలవంతులైన పాండవులు బతికి ఉంటే రాజ్యం దక్కదని అసూయాపరులైన కౌరవులు వారి మీద పగతో యుద్ధానికి సిద్ధపడ్డారు. పగ తగ్గితే యుద్ధం చేయాలనే కోరిక అణగారి పోతుంది. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. శత్రుత్వం వలన ఎప్పుడూ అశాంతితో ఉండాల్సి వస్తుందని ధర్మరాజు ఈ వాక్యాన్ని చెప్పాడు.

ప్రశ్న 2.
“ఎవరితోనూ దీర్ఘకాలం విరోధం మంచిది కాదు” దీని మీద మీ అభిప్రాయం ఏమిటి?
జవాబు:
పగ ఒకసారి ప్రవేశిస్తే ఇక శాంతి ఉండదు. కాబట్టి దాన్ని తగ్గించడం, తొలగించడం తప్ప మరో మార్గం లేదు. ఎక్కువకాలం పగను మనసులో ఉంచుకోకుండా నిర్మూలించడమే మంచిది. ఎందుకంటే మనసు త్వరగా శాంతిస్తుంది. ఉద్వేగం లేకపోవడం వలన ఆరోగ్యం చక్కబడుతుంది. పగబట్టినవారు ప్రతిరోజూ దుఃఖంతోనే నిద్రిస్తారు. పగ లేకుంటే ప్రశాంత చిత్తంతో సుఖంగా నిద్రిస్తారు. పగ వలన సుఖంలేనివాడు తన సర్వస్వాన్నీ తానే నాశనం చేసుకుంటాడు. అంతకుముందున్న మంచిపేరు కూడా పోతుంది.

దీర్ఘకాల విరోధం వలన కుటుంబాలే గాక వంశాలు కూడా నశించే ప్రమాదం ఉంది. ఒకవేళ ఈ విరోధం రెండుగాని అంతకన్న ఎక్కువ దేశాల మధ్యగాని ఉండేటట్లయితే ప్రపంచశాంతికే భంగం కలుగుతుంది. ఆయా దేశాలు నిరంతరం అశాంతితో, ఉద్వేగంతో గడపాల్సి వస్తుంది. కాబట్టి ఎవరితోనూ దీర్ఘకాలిక వైరం మంచిది కాదు.

ప్రశ్న 3.
“కార్యసాధన” అంటే అనుకొన్న పనిని సాధించడం. ధర్మరాజు మాటల్ని బట్టి ఈ కార్యసాధనను మనం ఎలా సాధించాలి?
జవాబు:
కార్యాన్ని సాధించదలచుకున్నవాడికి ఎంతో ఓర్పు, తగిన నేర్పు ఉండాలి. ఇతరులను బాధించకుండా, తాను బాధపడకుండా తెలివిగా పనిని సాధించుకోవాలి. ఒకవేళ జనాలు విమర్శించే పని అయినట్లైతే ఆ నింద తనపై పడకుండా అందరూ ఎదుటి వారినే నిందించేలా పనిని చాకచక్యంగా నెరవేర్చుకోవాలి. ధర్మబద్ధంగా, న్యాయసమ్మతంగా కార్యాన్ని సాధించాలి. కోరిన ప్రయోజనాన్ని పాపం రాకుండా, కీర్తి కలిగేలా సాధించుకోవాలి.

ప్రశ్న 4.
మాట్లాడే విధానం అంటే ఏమిటి? కార్యసాధకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి?
జవాబు:
స్ఫుటంగాను, స్పష్టంగాను, సూటిగాను మాట్లాడాలి. వాదాంశాన్ని క్రమంగా ప్రతిపాదించాలి. నాటకీయ ధోరణిలో మాట్లాడే విధంగా ఉంటే సహజంగా మనసుకు హత్తుకుంటుంది. ఇలా చక్కగా ఆకర్షించేలా పనిని సాధించుకునేలా మాట్లాడటాన్నే మాట్లాడే విధం అంటారు. ఇక కార్యసాధకుడైనవాడు తన శక్తిని, ఎదుటివారి శక్తిని చక్కగా అంచనా వేయగలిగి ఉండాలి. వినయంతో ఉంటూ అవసరమైనప్పుడు తన శక్తియుక్తుల్ని ప్రదర్శించాలి. సమయానుకూలంగా తనని తాను మలచుకోగలిగి ఉండాలి. ధననష్టం, ప్రాణనష్టం వంటివి జరగకుండా తన కార్యాన్ని నేర్పుగా చేయగలిగి
ఉండాలి.

ఆ) కింది ప్రశ్నలకు పదిహేనేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
ధర్మరాజు శాంతి వచనాలను సొంతమాటల్లో రాయండి.
(లేదా)
ప్రపంచ శాంతిని కాంక్షించడం అందరి కర్తవ్యం కదా ! అలాంటి శాంతిని కోరుతూ ధర్మజుడు ఏం చెప్పాడో మీ సొంతమాటల్లో రాయండి.
(లేదా)
ధర్మరాజు కృష్ణనుద్దేశించి శాంతి పట్ల తనకు గల ఆకాంక్షను ఏ విధంగా వెల్లడించాడో మీ స్వంత మాటల్లో రాయండి.
(లేదా )
శాంతిని కోరుకోవడం అందరికి అభిలాష మరి ధర్మజుడు శాంతిని కోరుతూ ఏ విధంగా శ్రీకృష్ణునితో చెప్పాడు?
జవాబు:
ఓ కృష్ణా ! అర్ధరాజ్యం బదులు ఐదూళ్ళు ఇచ్చినా చాలని – నీవు, బంధువులు ఆశ్చర్యపోయేటట్లుగా చెప్పాను. కానీ ఆ ఔదార్యం కూడా కౌరవుల వలన బూడిదలో పోసిన పన్నీరైంది. ఒకవేళ దుర్యోధనుడు ఐదూళ్ళు కూడా ఇవ్వకపోతే సిరిసంపదలకు నెలవైన రాజ్యం అసలు ఉండదు. పోనీ సిరిని కోరకుండా వైరాగ్యజీవితం గడపటానికి సిద్ధమైతే నన్నాశ్రయించుకున్న వారికి కనీస అవసరాలైన కూడు – గుడ్డ – గూడులకు చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. అప్పుడు తప్పక యుద్ధం జరుగుతుంది. దానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. చంపాల్సి వస్తే లోకంలో పరాయివారిని, శత్రువులను ఎన్నుకోవడం సహజం. అయినా వారిని కూడా రాజ్యం కొరకు చంపాలనుకోవడం అహింసా ధర్మం కాదు. అది యుద్ధనీతి అవుతుంది గాని ధర్మనీతి కాదు. ఇక బంధుమిత్రులను చంపటం న్యాయం కాదు గదా !

విజయం పొందని యుద్ధం కంటే చావే మేలు. కాని యుద్ధంలో జయాపజయాలను ఎవరూ నిశ్చయించలేము. యుద్ధం వలన అనేక నష్టాలు కలుగుతాయి. ఇక శత్రుత్వమే ఏర్పడితే పామున్న ఇంటిలో కాపురమున్నట్లే. మనశ్శాంతికి చోటే ఉండదు. కాబట్టి ఎవరితోనూ దీర్ఘకాల వైరం పనికిరాదు. విరోధాన్ని అణచివేయడం మంచిది. విరోధం వలన విరోధమెప్పుడూ సమసిపోదు. ఒకడు వైరంతో వేరొకరికి బాధ కలిగిస్తే బాధపడినవాడు ఊరుకోడు. అవకాశం రాగానే పగ సాధిస్తాడు. సాహసించి పగను నిర్మూలించదలిస్తే దారుణకార్యాలు చేయాల్సి వస్తుంది. పగ వలన కీడే గాని వేరొక ప్రయోజనం లేదు.

కృష్ణా ! సంపద కావాలనీ, యుద్ధం జరగకూడదని కోరుకుంటున్నాను. యుద్ధం వలన ధననష్టం, వంశ నాశనం జరుగుతుంది. ఈ రెండూ జరగని ఉపాయంతో ఎలాగైనా బాగుపడటం మంచిది కదా ! ధర్మం, నీతి – వాటిని బట్టి రెండు వర్గాల వారికీ మేలు, అభివృద్ధి జరిగేలా చూడు. విదురుడు మొదలైన మహానుభావులు సమ్మతించేలా తగినంత మెత్తదనంతోను, అవసరమైనచోట కఠిన మందలింపులతోను కురుసభలో రాజులందరూ గ్రహించేలా మాట్లాడు. ఒకవేళ ధృతరాష్ట్రుడు కుమారుడి మీది ప్రేమతో ఏ విషయం తేల్చి చెప్పకుంటే ధర్మబద్ధుడవై తగిన నిర్ణయం తీసుకో. మా ఇరువర్గాలకూ కావాల్సినవాడివి. నీతి తెలిసిన వాడివి, నీకు నేను చెప్పగలవాడినా ? హస్తినాపురానికి వెళ్ళిరా ! … అని ధర్మరాజు శ్రీకృష్ణుడితో శాంతి వచనాలను పలికాడు.

ప్రశ్న 2.
ధర్మరాజు యుద్ధం వల్ల కలిగే నష్టాలు చెప్పాడు గదా ! ఈ రోజుల్లో కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాలు రాకుండా ఉండడానికి చేపట్టాల్సిన చర్యలేమిటి?
జవాబు:
నేటి కాలంలో కూడా దారుణమైన యుద్ధాలు జరుగుతున్నాయి. మన భారతదేశంపై పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. మన సరిహద్దు ప్రాంతాన్ని ఆక్రమించడంతో తప్పక “కార్గిల్ యుద్ధాన్ని” చేయాల్సి వచ్చింది. అయినా బుద్ధి తెచ్చుకోక పాకిస్థాన్ మన దేశంలో ఉగ్రవాద చర్యలకు సిద్ధపడుతున్నది. మరొక ప్రక్క చైనా కూడా యుద్ధాన్మాదంతో ఊగిపోతోంది. మన సరిహద్దు రాష్ట్రాలను ఆక్రమించాలని నిరంతరం ప్రయత్నిస్తోంది.

అమెరికా ధన మదంతో, అధికార దాహంతో యుద్ధానికి కాలు దువ్వుతుంది. ఐక్యరాజ్యసమితి మిగతా దేశాలను కొంతవరకు అదుపు చేయగలిగినా అగ్రరాజ్యా లైన అమెరికా, బ్రిటన్లకు సూచనలను చేయడానికి కూడా సాహసించలేని దుస్థితిలో ఉంది. తమ ఇష్టానుగుణంగా ప్రవర్తిస్తున్న అగ్రరాజ్యాల అహంకారం ముందు ప్రపంచశాంతి కోసం స్థాపించబడిన ఐక్యరాజ్యసమితి సైతం బానిసలాగా తలొంచుకొని నిలుచుందంటే ఇంతకన్నా సిగ్గుపడాల్సిన విషయం లేదు.

యుద్దాలను ఆపాలనుకొంటే ముందు ప్రపంచ దేశాలన్నీ చిత్తశుద్ధితో శాంతి ఒడంబడికలు చేసుకోవాలి. ఐక్యరాజ్యసమితి ఆదేశాలను అన్ని దేశాలూ శిరసావహించాలి. దేశాల మధ్య ఉన్న ఆర్థిక అసమానతలను, పరిగణించక సోదరులుగా భావించాలి. ఒకరికొకరు సహకరించుకుంటూ సమగ్రమైన అభివృద్ధికి అన్ని దేశాలూ సహకరించాలి. చిన్న దేశమైనా, పెద్ద దేశమైనా పొరుగుదేశం యొక్క ఆంతరంగిక విషయాల్లో కలుగజేసుకోకూడదు. ఇప్పటికే రగులుతున్న సమస్యలైన కాశ్మీర్ సమస్య, వివిధ దేశాల సరిహద్దు సమస్యలను శాంతియుతంగా పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. సామ్యవాద భావనలు వెల్లివిరియాలి. స్వార్ధ భావాలను విడిచి పెట్టాలి. ప్రక్క దేశాలపై కవ్వింపు చర్యల్ని కూడా మానాలి. విశ్వశాంతికై చిత్తశుద్ధితో పాటుపడాలి.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

ఇ) సృజనాత్మకంగా రాయండి.
పగ, ప్రతీకారం మంచివి కాదనీ, శాంతియుత జీవనం గొప్పదనీ మీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

గుంటూరు,
x x x x

ప్రియమైన మిత్రునకు / మిత్రురాలికి,

నేనిక్కడ క్షేమంగా ఉన్నాను. బాగా చదువుకుంటున్నాను. నీవు క్షేమమని, బాగానే చదువుకుంటున్నావని తలుస్తాను. ఈ మధ్యకాలంలో కుటుంబ కలహాలు, ఇతర వివాదాల వలన చాలామంది చనిపోతున్నారు. గ్రామాలలో కుల వివాదాలు, ఇతర పొలాలు, ఆస్తులకు సంబంధించిన వివాదాల వలన రక్తపాతాలు జరుగుతున్నాయి. వీటి వలన పెద్దవారు, పిల్లలు అనాథలవుతున్నారు.

వీటి అన్నింటికి మూలమైన పగ, ప్రతీకారాలు మంచివి కాదు. చదువుకున్నవారు, ఉన్నతస్థితులలో ఉన్నవారు సైతం వీటి ప్రభావానికి లోనవుతున్నారంటే, చదువుకున్న మూర్ఖులులా ప్రవర్తిస్తున్నారంటే ఇవి ఎంత చెడ్డవో తెలుస్తుంది. పగ, ప్రతీకారాల వల్ల ఎల్లప్పుడూ అశాంతితో, భయంతో, ఉద్వేగంతో గడపాల్సి వస్తుంది. వీటి ద్వారా ఆరోగ్యం దెబ్బతిని, చిన్నవయస్సులోనే మధుమేహ వ్యాధి (షుగర్) వంటి దీర్ఘకాలిక రోగాల బారినపడే ప్రమాదం ఎక్కువ. పూర్వకాలంలో సమాజాలలో అన్ని కులాలవారు, మతాలవారు ఒకరినొకరు బాబాయ్, చిన్నమ్మ, అన్నయ్య, తమ్ముడూ, చెల్లెమ్మ లాంటి వావి-వరుసలతో పిలుచుకుంటూ ఒకే కుటుంబంలా మెలగేవారు. ఒక్కడి కోసం అందరూ, అందరికోసం ఒక్కడుగా నిలచేవారు. అటువంటి స్థితి నేడు రావాలి. దానికి ఉమ్మడి కుటుంబాలు ఎంతో సహకరిస్తాయి. ఉమ్మడి కుటుంబ భావన అందరికీ కలిగించాలి.

నగరాలలో, పట్టణాలలో బహుళ అంతస్థుల భవనాలు (అపార్ట్ మెంట్స్) పెరిగిపోతున్నాయి. వీటిల్లో నివసించేవారు వేరు వేరు కుటుంబాల నుంచి, ప్రాంతాల నుంచి వస్తారు. కొన్నిచోట్ల వేరు వేరు భాషలు మాట్లాడేవారు సైతం ఒకచోట జేరతారు. అలాంటి చోట అన్ని మతాల పండుగలను అందరూ కలసి జరుపుకోవడం, వంటకాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం వంటి వాటి ద్వారా కుటుంబ భావన పెరుగుతుంది. దాని ద్వారా పరమత సహనం అలవడుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. శాంతియుత జీవనం కలుగుతుంది. మానసిక ఉద్వేగాలు అణగారి పోయి, రోగాలు తగ్గుతాయి. ఆరోగ్యం వలన ఆయువు పెరిగి సుఖశాంతులతో జీవించవచ్చు.

మీ అమ్మగారిని, నాన్నగారిని ఇతర కుటుంబ సభ్యులను అడిగినట్లు చెప్పు. శాంతియుత సమాజ నిర్మాణాన్ని గూర్చి నీ భావాలను నాకు లేఖ ద్వారా తెలియజేయి. నీ లేఖకై ఎదురుచూస్తూ ఉంటాను.

ధన్యవాదములు

ఇట్లు,
నీ మిత్రుడు / మిత్రురాలు,
బి. రాజు | బి. రాణి,
9వ తరగతి, క్రమసంఖ్య – 12/6,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
రాజాగారి తోట,
గుంటూరు (పోస్టు) (మండలం), వేమవరం (పోస్టు),
గుంటూరు జిల్లా.

చిరునామా :
షేక్ రసూల్ / షేక్ రేష్మ,
తొమ్మిదవ తరగతి,
క్రమసంఖ్య – 18,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
మాచవరం (మండలం),
గుంటూరు జిల్లా.

(లేదా)
‘శాంతి’ ఆవశ్యకతను తెలియజేసేలా ఒక ‘కరపత్రాన్ని’ తయారుచేయండి.
(లేదా)
ధర్మరాజు లాగ శాంతిని కాంక్షించవలసిన ఆవశ్యకతను వివరిస్తూ ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:
శాంతి నీవెక్కడ ? (కరపత్రం)

శాంతమే రక్ష
దయ చుట్టము
మనకి స్వాతంత్ర్యం వచ్చి ఆరు దశాబ్దాలు దాటినా, ఇంకా దేశంలో అశాంతి పూరిత, ఆందోళనకర వాతావరణమే నెలకొని ఉంది. అగ్రరాజ్యాలే నేటికీ అంతర్జాతీయ అంశాల్ని నిర్ణయించేవిగా ఉన్నాయి. ఉగ్రవాదం ఉరకలు వేస్తోంది. స్థానిక ఉద్యమాలు, కులమత లింగ వివక్షలు, ప్రజావిప్లవాలు దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. స్వార్థపూరితమైన జీవనం, అనారోగ్యకరమైన పోటీతత్వం, ప్రపంచీకరణ విధానాలు అంటువ్యాధుల్లా ప్రజల్ని పట్టి పీడిస్తున్నాయి.

కేవలం మన దేశంలోనే గాక ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో ఇదే పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధమేఘాలు అలముకుంటున్నాయి. చాలా చోట్ల ప్రచ్ఛన్న యుద్ధాలు, ప్రత్యక్ష యుద్ధాలు చోటుచేసుకుంటున్నాయి. అణుబాంబుల్ని మించిన వినాశకర ఆయుధాలెన్నో అగ్రరాజ్యాలు సమకూర్చుకుంటున్నాయి. ప్రతి ప్రాంతంలోనూ అశాంతి, అభద్రత, అసంతృప్తి నెలకొంటున్నాయి. ప్రతివారి మనస్సు శాంతికోసం పరితపిస్తుంది. కానీ శాంతి ఎక్కడా కనిపించలేదు. ప్రపంచవ్యాప్తంగా అందరూ వెతుకుతున్నా ఎక్కడా కనిపించడం లేదు.

అవును, ఎక్కడని కనిపిస్తుంది? ‘శాంతిని’ మనమే చంపి, గోరీలు కూడా కట్టామాయె. ఇప్పుడు పరితపిస్తే మాత్రం ఎలా వస్తుంది? ఉన్నప్పుడు స్వార్థంతో, సామ్రాజ్యవాదంతో, మతోన్మాదంతో ఊపిరి సలపనీయకుండా చేశామాయె. ఇప్పుడు రమ్మంటే ఎక్కడి నుండి వస్తుంది? ఎలాగ వస్తుంది? ప్రపంచమంతా అశాంతితో నింపి, ఇప్పుడు శాంతి పాఠాలు వల్లిస్తే మాత్రం వస్తుందా? ‘శాంతి’ నీవెక్కడ ? అని ఆక్రోశిస్తే వచ్చేస్తుందా?

ఎప్పుడైతే మనం పరమత సహనాన్ని కలిగి ఉంటామో, ఎప్పుడైతే సోదరభావంతో అందరినీ కలుపుకుంటామో, ఎప్పుడైతే సహృదయతను, నిస్వార్థాన్ని అలవరచుకుంటామో, ఎప్పుడైతే పరోపకార పరాయణులమవుతామో, ఎప్పుడైతే పగ – ప్రతీకారాల్ని విడుస్తామో, అంతర్యుద్ధాలను అసహ్యించుకుంటామో, యుద్ధాలను విడిచి పెడతామో, ఆయుధాలను ప్రేమించడం మాని, మానవులను ఇష్టపడతామో, ప్రేమతత్వంతో మెలగుతామో అప్పుడు – సరిగ్గా అప్పుడు ‘శాంతి’ తన ఉనికిని చాటుకుంటుంది. మనం తనని మనస్ఫూర్తిగా కోరుతున్నామని నమ్మిన రోజున తనకైతానే ప్రత్యక్షమవుతుంది. అంతదాకా మానవజాతి అంతా ‘శాంతి’ నీవెక్కడా ? అని దీనంగా, హీనంగా విలపించక తప్పదు.

ఈ)
ప్రశంసాత్మకంగా రాయండి.

ప్రపంచశాంతి కోసం పాటుపడిన ‘నెల్సన్ మండేలా’, ‘గాంధీ’, ‘యాసర్ అరాఫత్’ వంటి వారి వివరాలు సేకరించి, వారిని అభినందిస్తూ ఒక వ్యాసం రాయండి. దాన్ని చదివి వినిపించండి.
జవాబు:
1) మహాత్మాగాంధీ :
మన దేశ ‘జాతిపిత’గా అందరిచే ప్రేమగా ‘బాపూజీ’ అని పిలవబడే మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్ పట్టణంలో 1869వ సంవత్సరం అక్టోబరు రెండవ తారీఖున జన్మించాడు. మెట్రిక్యులేషన్ పూర్తి చేశాక లండన్ వెళ్ళి బారిష్టరు పరీక్షలో ఉత్తీర్ణుడై తిరిగివచ్చాడు. 1893వ సంవత్సరంలో ఒక వ్యాజ్యం విషయంగా దక్షిణాఫ్రికా వెళ్ళాడు. అక్కడ భారతీయులు, ఇతర నల్ల జాతీయులు పడే అగచాట్లన్నీ గమనించాడు. రైళ్ళలో మొదటి తరగతిలో ప్రయాణం చేసేందుకు వీలులేదు. శ్వేత జాతీయులు, పెద్ద కుటుంబాలు ఉండే చోట్లకు భారతీయులను, ఇతర నల్లజాతి వారిని అనుమతించరు. చివరకు తలపై టోపీని ధరించి కోర్టులో వాదించడానికి కూడా అనుమతి లభించలేదు.

ట్రాముల్లోనూ, రైళ్ళలోనూ శ్వేత జాతీయులతో కలసి ప్రయాణించే యోగ్యత లేదు. బానిసలుగా చూస్తూ ‘కూలీ’ అని సంబోధించేవారు. ఈ దురాగతాలను ఆపడానికై గాంధీజీ ప్రయత్నించాడు. 1869వ సంవత్సరంలో ట్రాన్స్ వాల్ లో ఇంగ్లీషు, డచ్చి వారికి జరిగిన యుద్ధంలో గాయపడిన బ్రిటిషు వారిని వైద్యశాలలకు చేర్చి చికిత్స చేయించాడు. గాంధీ సేవను గుర్తించక వారు దక్షిణాఫ్రికా భారతీయులకు నాయకుడై, ప్రభుత్వ ఉత్తర్వులను ఎదిరిస్తున్నాడన్న వంకతో ఆయన్ని జైలుకు పంపి, వెట్టిచాకిరీ చేయించారు. కానీ శాంతి, ఓర్పు, అహింసలతో వాటిని ఎదుర్కొని ఐకమత్యంతోను, పత్రికల సహాయంతోను పోరాడి విముక్తిని సాధించాడు. దక్షిణాఫ్రికా వీడి వచ్చేటప్పుడు అక్కడి అభిమానులు తనకు ఇచ్చిన బహుమతులను, ధనాన్ని “దక్షిణాఫ్రికా భారతీయుల సంక్షేమ నిధి”గా ఏర్పాటుచేసిన నిస్వార్థపరుడు, పరోపకార పరాయణుడు, శాంతి కాముకుడు “గాంధీ మహాత్ముడు” !

భారతదేశానికి తిరిగి వచ్చాక భారతదేశ స్వాతంత్ర్యం కోసం అహర్నిశలు పాటుపడ్డాడు. ఉప్పు సత్యాగ్రహం, సహాయనిరాకరణోద్యమం, విదేశీ వస్తు బహిష్కరణోద్యమం, జైల్ బరో వంటి ఉద్యమాలను సమర్థతతో నిర్వహించి బ్రిటిష్ వారిని ముప్పుతిప్పలు పెట్టాడు. చివరికి వారు స్వాతంత్ర్యం ఇచ్చి వెళ్ళిపోవటం తప్ప మరో మార్గం లేకుండా చేశాడు. అలా భారతదేశం 1947వ సంవత్సరం, ఆగస్టు నెల 15వ తారీఖున స్వాతంత్ర్యాన్ని పొందింది. కానీ ఆ మహాత్ముడు, శాంతమూర్తి, అహింసా పరాయణుడు, నిరంతర కార్యశీలి స్వేచ్ఛావాయువులను పూర్తిగా ఆస్వాదించకుండానే 30-1-1948వ తారీఖున కీర్తిశేషుడయ్యాడు.

2) నెల్సన్ మండేలా :
నెల్సన్ మండేలా మొట్టమొదటి సారిగా దక్షిణాఫ్రికాకు ఎన్నికైన నల్లజాతికి చెందిన ప్రెసిడెంటు. ఈయన పూర్తి పేరు రోలిహలాహలా మండేలా. ‘నెల్సన్’ అనే పేరు ఆయన పాఠశాలలో జేరినప్పుడు ఆంగ్ల ఉపాధ్యాయురాలైన మిసెస్ మిడిగేన్ పెట్టినది. నాటి దక్షిణాఫ్రికాను పాలిస్తున్న బ్రిటిష్ వారి నియమాలలో పేరు మార్చడం ఒకటి. నల్ల జాతీయులను పాఠశాలలో చేర్చేటప్పుడు ఒక ఆంగ్లభాషా పేరు వారికి పెడతారు. ఇది బ్రిటిష్ వారి జాత్యహంకారానికి మచ్చుతునక.

మండేలా దక్షిణాఫ్రికాలోని ఆగ్నేయ ప్రాంతమైన ట్రాన్స్ కి ప్రాంతంలో 18-07-1918వ తేదీన టెంబు జాతికి చెందిన కుటుంబంలో జన్మించాడు. వీరి భాష హోసా. మండేలా పాఠశాల విద్యను పూర్తి చేసుకొని, కళాశాల విద్యకై ఆఫ్రికన్ నేటివ్ కళాశాలలో బి.ఎ. డిగ్రీ. ప్రథమ సంవత్సరంలో చేరాడు. కానీ విద్యార్థి సంఘాలలో చేరి తన ప్రవేశం అధికారులచే రద్దు చేయబడటంతో బయటకు వెళ్ళాల్సివచ్చింది. జోహన్స్ బర్గ్ ప్రాంతాన్ని చేరుకొని దూర విద్య ద్వారా చదివి బి.ఎ. డిగ్రీని పొందాడు. తర్వాత బారిష్టరు విద్య కోసం విశ్వవిద్యాలయంలో చేరాడు. అక్కడే ఆయన ఆఫ్రికా జాతీయ కాంగ్రెస్సులో (A.N.C.) సభ్యునిగా చేరాడు. తన మిత్రులైన వాల్టర్ సిస్లూ, ఆలివర్ టాంబో, విలియమ్ కోమో వంటి వారి సహాయంతో ఏ.ఎన్.సి. విస్తరించడం లోను, కార్యశీలకమైన సంస్థగా మలచడంలోను విశేష కృషి సల్పాడు.

దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఆ దేశ పౌరులందరినీ మూడు వర్గాలుగా విభజించింది. శ్వేత జాతీయులు మొదటివరం. తల్లిదండ్రులలో ఒకరు శ్వేత జాతీయులు, వేరొకరు నల్లజాతీయులైన వారు రెండవ వర్గం. ఇక నల్ల జాతీయులు మూడవ వర్గం. మూడు వర్గాలకు ప్రత్యేకమైన వసతి ప్రదేశాలుంటాయి. ఎవరికి వారికే ప్రత్యేకమైన మరుగుదొడ్లు. ఉద్యానవనాలు, సముద్రతీర ప్రాంత విహారాలు, పాఠశాలలు, ఉద్యోగాలు ఉంటాయి. శ్వేతజాతీయులకే పూర్తి రాజకీయ అధికారాలుంటాయి. 1960 – 80 ల మధ్య ప్రభుత్వం శ్వేత జాతీయుల కోసం మిగిలిన రెండు వర్గాల వారిని ఖాళీ చేయించి మూరుమూల ప్రాంతాలకు పంపింది. ముప్పై లక్షలమంది తమ నివాస ప్రాంతాలను విడిచి మారుమూల ప్రాంతాలకు వెళ్ళాల్సి వచ్చింది.

ఈ దుశ్చర్యకు వ్యతిరేకంగా ఏ.ఎన్.సి. పోరాటానికి నడుం కట్టింది. ఐతే అహింసాయుత మార్గంలో సహాయనిరాకరణ, ధర్నాలు చేయటం, అధికారుల పట్ల అవిధేయతను ప్రదర్శించడం వంటి వాటి ద్వారా ఉద్యమించింది. పూర్తి పౌరసత్వాన్ని పొందడం, శాసనసభలో చోటు సంపాదించడం, మిగిలిన వర్గాలతో సమానమైన హక్కులను పొందడం లక్ష్యంగా నిరంతరం పోరాటం సల్పింది. మండేలా దేశమంతా సంచరిస్తూ న్యాయం కోసం పోరాడుతూ ఎంతోమంది మద్దతుదారులను కూడగట్టాడు. ప్రపంచ వ్యాప్తంగా మద్దతును సాధించగలిగాడు కూడా. దాని ఫలితంగా ప్రభుత్వం యొక్క ఆగ్రహానికి గురై 27 సంవత్సరాలు కఠిన కారాగారవాసాన్ని అనుభవించాడు.

చివరకు ప్రభుత్వం తలవొగ్గి ఏ.ఎన్.సి కోరిన వాటిని ఆమోదించింది. మండేలా దక్షిణాఫ్రికా అధ్యక్షుడైనాడు. 1993వ సంవత్సరంలో మండేలా, అతని సహచరుడైన డిక్లార్క్ లకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. 1999 సంవత్సరం దాకా అధ్యక్షునిగా ఉండి, తర్వాత రాజకీయ సన్యాసం చేసి, స్వగ్రామానికి చేరుకున్నాడు. హెచ్.ఐ.వి. మరియు ఎయిడ్స్ రోగ విషయంలో తన వారిని జాగరూకులను చేయడానికి పెద్ద పెద్ద శిబిరాలను నడిపాడు. ప్రపంచవ్యాప్త సదస్సులలో పాల్గొన్నాడు.

దారుణమైన వర్ణ వివక్షకు లోనైనా, దృఢసంకల్పంతో ఎన్నో కష్టాలకు, కారాగారవాస శిక్షలకు ఓర్చి తోటివారికై పరిశ్రమించి కృతార్థుడైనాడు నెల్సన్ మండేలా మహాశయుడు.

3) యాసర్ అరాఫత్ :
యాసర్ అరాఫత్ గా ప్రసిద్ధిచెందిన ఆయన అసలు పేరు మొహమ్మద్ యాసర్ అబ్దుల్ రెహమాన్ అబ్దుల్ రౌఫ్ అరాఫత్ అల్ ఖుద్వా అల్ హుస్సేని. ఈయన 1929వ సంవత్సరం ఆగస్టు నెల 24వ తేదీన పాలస్తీనాలో జన్మించాడు. అరాఫత్ తన జీవితకాలంలో ఎక్కువ భాగం ఇస్రాయేల్ దేశీయులతో పాలస్తీనీయుల స్వీయ నిర్ధారణ అనే పేరుతో పోరాటం జరిపాడు.

పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (P.L.O) కు చైర్మన్ గాను, పాలస్తీనియన్ నేషనల్ అథారిటీ (P.N.A) కి అధ్యక్షునిగాను, ఫాత్ రాజకీయ పార్టీ సభ్యునిగాను పనిచేశాడు. అరాఫత్ తన ఉద్యమాన్ని వివిధ అరబ్ దేశాల నుండి కూడా నిర్వహించాడు. ఇస్రాయేల్ దేశానికి ఇతని ఫాత్ పార్టీ ప్రధాన లక్ష్యం అయింది. ఇస్రాయేల్ దేశీయులు అతన్ని టెర్రరిస్టుగాను, బాంబు దాడులలో వందలమందిని చంపిన దుర్మార్గుడుగాను చిత్రీకరించారు. పాలస్తీనీయులతణ్ణి ఒక గొప్ప దేశభక్తునిగా సంభావించారు. అగ్రరాజ్యాల నెదిరించి, పాలస్తీనాకు సంపూర్ణ స్వేచ్చను సాధించిన ఘనత అరాఫత్ దే. పాలస్తీనాకు మొదటి అధ్యక్షుడుగా చేశాడు. 1994 వ సంవత్సరంలో అరాఫత్ కు నోబెల్ శాంతి బహుమతి లభించింది. శాంతి కోసం పోరాడిన ఈ యోధుడు 11 – 11 – 2004వ తేదీన 75 సంవత్సరాల వయస్సులో తీవ్ర అనారోగ్యానికి గురై కోమాలోకి వెళ్ళి మరణించాడు.

ఈ ముగ్గురు మహానుభావులను గమనించినట్లైతే నిస్వార్థంగా ప్రపంచశాంతికై కృషిచేశారని తెలుస్తుంది. కుల – మత – వర్ణ వివక్షలకు లోనైన ఎందరో సామాన్యులకు మానసిక స్టెర్యాన్ని కలిగించడమే కాకుండా వారిని ఆయా బంధనాల నుంచి విముక్తుల్ని చేసిన ఘనులని తెలుస్తుంది. తమ జాతీయుల స్వాభిమానాన్ని, పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయులు వీరు.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

(లేదా)
మీ ఊరిలో ఏవైనా గొడవలు జరిగితే వెంటనే స్పందించి, గొడవలు వద్దు అని సర్ది చెప్పే పెద్ద వాళ్ళ గురించి, ‘నలుగురూ శాంతియుతంగా సహజీవనం చేయాలి’ అని ‘శాంతికోసం’ పాటుపడేవాళ్ళని గురించి అభినందిస్తూ కొన్ని వాక్యాలు రాయండి.
జవాబు:
మా ఊరిలో కుటుంబ కలహాలు గాని, చిన్న చిన్న తగాదాలు గాని, గొడవలు గాని జరిగితే మా ఊరి ప్రెసిడెంటు గారి వద్దకు తీసుకెళ్తారు. ఆయన ఇరుపక్షాల వారి వాదాలను ఓపికగా విని, నేర్పుగా ఎవరివైపు తప్పు ఉన్నదో గ్రహించి, వారి తప్పుని సున్నితంగా తెలియజేస్తారు. తగాదాలు మాని శాంతంగా ఉండాలని ఇద్దరికీ చెప్పి తగవు తీరుస్తారు. రామయ్య తాత ఊర్లో జరుపుకునే అన్ని మతస్థుల పండుగలకు అందరం పాల్గోవాలని, కులమత భేదాలు పట్టించుకోకుండా అందరం కలసి ఉండాలని చెపుతుంటాడు. అన్ని కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొని యువకుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తాడు. అంజమ్మ అత్త మాలాంటి పిల్లలకు మంచి మంచి కథలు చెపుతూ ఉంటుంది.

ఆ కథల్లో ఎక్కువ శాంతికి సంబంధించినవే ఉంటాయి. మేము అందరం పాఠశాలలో మిగిలిన విద్యార్థులతో కలసిమెలసి మధ్యాహ్న భోజనం చేయాలని కోరుకుంటుంది. రహీమ్ బాబాయి వాళ్ళ పండుగలకు మాలాంటి పిల్లల్ని తన ఇంటికి తీసుకువెళ్ళి మిఠాయిలు పెడతాడు. ఊళ్ళోని ముస్లిం కుటుంబాలకు నాయకత్వం వహిస్తూ, హిందువులతోను, క్రైస్తవులతోను సన్నిహితంగా ఉంటాడు. తనవారు ఇతరులతో గొడవపడకుండా, ఇతరుల వలన తన వారికి ఇబ్బందిరాకుండా చూస్తూ ఉంటాడు. అలాంటివాడు ఉండబట్టే మా ఊళ్ళో కులాల పోర్లు లేవంటే అతిశయోక్తి ఏమీకాదు. ఇక డేవిడ్ అన్నయ్య మంచి ఆటగాడు. ఊళ్ళో పిల్లలందరినీ పోగుచేసి, సాయంత్రం పూట మంచి మంచి ఆటలు ఆడిస్తాడు. అందరూ ఒక్కటే. అందరం ఎప్పుడూ కలసి ఉండాలని దానికి ఆటలు ఎంతో సహకరిస్తాయని ఎప్పుడూ చెపుతుంటాడు. అతని వల్ల పిల్లలం అందరం ధనిక – పేద, కుల-మత, స్త్రీ-పురుష భేదాలు మరచి సంతోషంగా ఆటలు ఆడుతున్నాం . అతను లేకుంటే మాలో ఇలాంటి ఐకమత్యం వచ్చేది కాదు.

ప్రాజెక్టు పని

ప్రపంచశాంతి కోసం కృషిచేసిన వారి వివరాలు సేకరించండి. వారి గురించి ఒక నివేదిక తయారుచేసి ప్రదర్శించండి.
AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష 7

III. భాషాంశాలు

పదజాలం

అ) కింద గీత గీసిన పదాలకు అర్థాలు రాసి, వాక్యాల్లో ప్రయోగించండి.

1. గురువులు శుభంబైన వాటిని సమకూర్చెదరు.
జవాబు:
శుభంబైన = మంచిదైన
పెద్దలు మంచిదైన పనినే చేస్తారు.

2. దీర్ఘ వైరవృత్తి మంచిది కాదు.
జవాబు:
దీర్ఘ వైరవృత్తి : ఎక్కువ కాలం పగతో ఉండడం.
ఎక్కువకాలం పగతో ఉండడం వలన ఆరోగ్యం దెబ్బ తింటుంది.

3. శ్రీకృష్ణుడు అన్ని విషయాలు ఎఱుక గలవాడు.
జవాబు:
ఎఱుక = జ్ఞానం
రాముకు తెలుగుభాషా జ్ఞానం ఎక్కువ.

ఆ) కింది వాక్యాలను పరిశీలించి, గీత గీసిన పదాలకు నానార్థాలు రాయండి.
1. రెండు దిక్కుల న్యాయం చెప్పడానికి నీవే మాకు దిక్కు
దిక్కు: దిశ, శరణం

2. ఒక రాజు దివినేలు నొక రాజు భువినేలు నొక రాజు రాత్రిని యేలు నిజము.
రాజు : ఇంద్రుడు, టేడు, చంద్రుడు

3. వైరి పక్షములోని పక్షి, పక్షమునకు గాయమై, పక్షము రోజులు తిరుగలేకపోయెను.
పక్షము : ప్రక్క, టెక్క 15 రోజులు.

4. పాఠానికి సంబంధించిన మరికొన్ని పదాలకు నానార్థాలను నిఘంటువులో వెతికి, పై విధంగా వాక్యాలలో ప్రయోగించండి.

అ) సమయము లేకున్నా మనము సమయమించక తప్పదు. ఎందుకంటే ఇదే ధర్మమైన సమయము కాబట్టి.
సమయము : కాలము, శపథము, బుద్ధి.

ఆ) మనకు పూర్ణము లేకున్నా జలపాత్ర పూర్ణము ఐనది.
పూర్ణము : శక్తి నిండినది.

ఇ) తగవుకు పోతే తగవు కలిగి, తగవు జరగలేదు.
తగవు : తగిన, తగాదా, న్యాయం.

ఈ) నేను దోష సమయంలో కారులో ప్రయాణిస్తుంటే ఎదురుగా వచ్చేవాడి దోషానికి గాయమై, పెద్ద దోషం జరిగింది.
దోషము : రాత్రి, భుజము, తప్పు, పాపం.

ఉ) శరీరాన్ని పాముట వలన ఏర్పడిన మట్టి పాములా ఉంది.
పాము : రుద్దు, సర్పము.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

ఇ) కింద గీత గీసిన పదాలకు పర్యాయ పదాలు రాసి, వాక్యాలలో ప్రయోగించండి.
ఉదా : ప్రేమ్, సంతోష్ ప్రాణ స్నేహితులు.

అ) స్రవంతికి సంగీత, రాధికలు మంచి నేస్తాలు.
ఆ) మిత్రులు ఆపద్బాంధవులు.

1. అనుకున్నది సాధించినపుడు మోదం కలుగుతుంది.
అ) పిల్లలు బహుమతులను పొందినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది.
ఆ) పిల్లల సంతోషమే పెద్దలు కోరుకుంటారు.

2. ధరిత్రి పుత్రిక సీత.
అ) భూమి లాంటి నివాసయోగ్యమైన గ్రహం కోసం శాస్త్రవేత్తలు వెదకుతున్నారు.
ఆ) ధరకు ఉన్న ఒకే ఒక ఉపగ్రహం చంద్రుడు.

3. పోరితము నష్టదాయకం.
అ) తగాదాల వల్ల కుటుంబాలకు కుటుంబాలే నాశనమవుతాయి.
ఆ) యుద్ధం మూలంగా ధననష్టం, జననష్టం జరుగుతుంది.

వ్యాకరణం

అ) పాతం చదవండి. కింద తెల్సిన సంధులకు సంబంధించిన ఉదాహరణలను వెదికి రాయండి. సూత్రాలు కూడా రాయండి.
1) సవర్ణదీర్ఘ సంధి
2) సరళాదేశ సంధి
3) ఇత్వసంధి
4) యడాగమ సంధి

1. సవర్ణదీర్ఘ సంధి:
1) జనార్ధన : జన + అర్ధన
2) విదురాది : విదుర + ఆది

సూత్రం :అ, ఇ, ఉ, ఋ లకు, అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి.

2. సరళాదేశ సంధి సూత్రం:
1) ద్రుతప్రకృతికము మీది పరుషములకు సరళములగు.
2) ఆదేశ సరళమునకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషములు విభాషనగు.
ఉదాహరణలు :
1) చక్కన్ = చేయ = చక్కఁజేయ
2) ఇచ్చినను + చాలు = ఇచ్చిననుజాలు
3) చేయన్ + చాలడో = చేయంజాలడో
4) ఏమున్ + పొంది = ఏముంబొంది
5) ఒకమాటున్ + కావున = ఒకమాటుఁగావున
6) పగన్ + పగ = పగంబగ
7) కడున్ + తెగ = కడుందెగ
8) ఏమిగతిన్ + తలంచిన = ఏమిగతిఁదలంచిన
9) శాంతిన్ + పొందుట = శాంతిఁబొందుట
10) సొమ్ములున్ + పోవుట = సొమ్ములుంబోవుట
11) చక్కన్ + పడు = చక్కఁబడు
12) ఒప్పున్ + చుమీ = ఒప్పుఁజుమీ
13) మనమునన్ పక్షపాత = మనమునఁబక్షపాత
14) తగన్ + చెప్ప = తగంజెప్ప
15) తెగన్ + పాఱకు = తెగంబాఱకు

3. ఇత్వ సంధి సూత్రం :
సూత్రం – 1: ఏమ్యాదులందలి హ్రస్వమైన ఇకారానికి సంధి వైకల్పికంగా వస్తుంది.
సూత్రం – 2 : మధ్యమ పురుష క్రియలందలి హ్రస్వమైన ఇకారానికి సంధి వికల్పంగా జరుగుతుంది.

1) అదియొప్పది = అది + ఒప్పదె
2) ఊరడిల్లియుండు = ఊరడిల్లి + ఉండు
3) అదియజులు = అది + అట్టులు

4. యడాగమ సంధి సూత్రం :
సంధి జరగని చోట అచ్చు కంటె పరమైన అచ్చుకు యడాగమం వస్తుంది.
ఉదాహరణలు:
1) మా + అంశమగు = మాయంశమగు
2) నా + అరయు = నాయరయు
3) అది + ఒప్పదే = అదియొప్పది
4) పామున్న + ఇంటిలో = పామున్నయింటిలో
5) ఉన్న + అట్ల = ఉన్నయట్ల
6) పగ + అడగించుట = పగయడగించుట
7) పల్కక + ఉండగ = పల్కకయుండగ
8) అది + అట్టులుండె = అదియట్టులుండె
9) పల్కిన + ఏని = పల్కినయేని
10) పొంది + ఉండునట్లు = పొందియుండునట్లు

అ) కర్మధారయ సమాసం :
వివరణ :
‘నల్ల కలువ’ అనే సమాసపదంలో నల్ల, కలువ అనే రెండు పదాలున్నాయి. మొదటి పదం ‘నల్ల’ అనేది విశేషణం. రెండో పదం ‘కలువ’ అనేది నామవాచకం. ఈ విధంగా విశేషణానికీ, నామవాచకానికీ (విశేష్యానికీ) సమాసం జరిగితే దాన్ని ‘కర్మధారయ సమాసం’ అంటారు.

1) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం.
విశేషణం పూర్వపదంగా (మొదటి పదంగా) ఉంటే ఆ సమాసాన్ని “విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం” అంటారు. ఉదా : తెల్లగుర్రం – తెల్లదైన గుర్రం తెల్ల – విశేషణం (పూర్వపదం – మొదటి పదం) గుర్రం – నామవాచకం (ఉత్తరపదం – రెండోపదం)

2) విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం.
‘మామిడి గున్న’ అనే సమాసంలో మామిడి, గున్న అనే రెండు పదాలున్నాయి. మొదటి పదం (పూర్వపదం) ‘మామిడి’ – నామవాచకం. రెండోపదం (ఉత్తరపదం) ‘గున్న’ విశేషణం. ఐతే విశేషణమైన ‘గున్న) ‘ఉత్తరపదం’గా (రెండోపదంగా) ఉండడం వల్ల దీన్ని ‘విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం’ అంటారు.

కింది పదాలు చదవండి. విగ్రహవాక్యాలు, ఏ సమాసమో రాయండి.
1) పుణ్యభూమి – పుణ్యమైన భూమి – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
2) మంచిరాజు – మంచివాడైన రాజు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
3) కొత్త పుస్తకం – కొత్తదైన పుస్తకం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
4) కార్మికవృద్ధుడు – వృద్ధుడైన కార్మికుడు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
5) తమ్ముగుజ్జలు – తమ్మువైన గుజ్జలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

ఇ) ఛందస్సు:
1. కింది పద్యపాదాలకు గణ విభజన చేసి, అవి ఏ పద్యపాదాలో తెల్పి, లక్షణాలను రాయండి.

i) కావున శాంతిఁబొందుటయ కర్జము దానది యట్టులుండె శ్రీ
AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష 1
ఇది “ఉత్పలమాల” పద్యపాదము.
ఉత్పలమాల – లక్షణం:

  1. ఈ పద్యానికి నాలుగు పాదములు ఉంటాయి.
  2. ప్రతి పాదములో భ-ర-న-భ-భ-ర-వ అనే గణాలు ఉంటాయి.
  3. ప్రతి పాదమందలి మొదటి అక్షరాలు పదవ అక్షరాలతో యతి మైత్రిని పొందుతాయి.
  4. ప్రాస నియమము ఉంది.
  5. ప్రతి పాదానికి 20 అక్షరాలు ఉంటాయి.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

ii) పగయడగించు టెంతయు శుభం బదిలెస్సయడంగునే పగం
AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష 2
ఇది ‘చంపకమాల’ పద్యపాదం.
చంపకమాల – లక్షణం :

  1. చంపకమాల పద్యానికి నాలుగు పాదాలు ఉంటాయి.
  2. ప్రతిపాదములోనూ న-జ-భ-జ-జ-జ-ర అనే గణాలు ఉంటాయి.
  3. ప్రతి పాదమందలి మొదటి అక్షరాలు 11వ అక్షరాలతో యతి మైత్రిని పొందుతాయి.
  4. ప్రాస నియమం ఉంది.
  5. ప్రతి పాదానికి 21 అక్షరాలుంటాయి.

2. శార్దూలం:
AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష 3
పై గణవిభజనను పరిశీలించండి. ఇలా మ-స-జ-స-త-త-గ అనే గణాలు వరుసగా ప్రతి పాదంలోనూ వస్తే అది ‘శార్దూల’ పద్యం అవుతుంది. అన్ని వృత్త పద్యాలలాగా దీనికి ప్రాసనియమం ఉంటుంది. ‘యతి’ 13వ అక్షరానికి చెల్లుతుంది (ఆ-య).
మిగిలిన పాదాలకు గణ విభజన చేసి లక్షణాలను సరిచూడండి.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష 4
1) దీనిలో కూడా మ-స-జ-స-త-త-గ అనే గణాలున్నాయి.
2) ‘పే’ లోని ఏ కారానికి 13వ అక్షరమైన ‘కే’ లోని ఏ కారానికి యతి మైత్రి చెల్లింది.
3) ప్రాస నియమం ఉంది.
4) పాదానికి 19 అక్షరాలున్నాయి.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష 5
1) ఈ పాదంలో కూడా మ-స-జ-స-త-త-గ అనే గణాలున్నాయి.
2) ‘సో’ లోని ఓ కారానికి, 13వ అక్షరమైన ‘చు’ లోని ఉ కారానికి యతి మైత్రి చెల్లింది.
3) ప్రాస నియమం ఉంది
4) పాదానికి 19 అక్షరాలున్నాయి.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష 6
1) ఈ పాదంలో కూడా మ-స-జ-స-త-త-గ అనే గణాలున్నాయి.
2) ‘మో’లోని మకారానికి, 13 వ అక్షరమైన ‘ము’ లోని మ కారానికి యతి మైత్రి చెల్లింది.
3) ప్రాస నియమం ఉంది.
4) పాదానికి 19 అక్షరాలున్నాయి.

ఈ) అలంకారాలు :

I. ఇంతకుముందు తరగతులలో ‘ఉపమాలంకారం’ గురించి తెలుసుకున్నారు కదా ! ఈ పాఠంలోని ఉపమాలంకారానికి సంబంధించిన ఉదాహరణను రాసి, వివరించండి.
ఉపమాలంకార లక్షణం :
ఉపమానానికి, ఉపమేయానికి మనోహరమైన పోలిక వర్ణించినట్లైతే దాన్ని ఉపమాలంకారం అంటారు.
ఉదాహరణ :
పగ అంటూ ఏర్పడితే పామున్న ఇంట్లో కాపురమున్నట్లే.

సమన్వయం :
‘పగ’ ఉపమేయం. పామున్న ఇల్లు ఉపమానం ఉండటం సమాన ధర్మం. ఉపమావాచకం లోపించడం.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

II. గతంలో తెలుసుకున్న ‘వృత్త్యనుప్రాస’ను గూర్చి ఆ అలంకార లక్షణం రాసి, ఉదాహరణలు రాయండి.

వృత్త్యనుప్రాసాలంకారం లక్షణము : ఒక పద్యంలో గాని, వాక్యంలో గాని ఒకే అక్షరం పలుమార్లు వచ్చేలా ప్రయోగించడాన్ని వృత్త్యనుప్రాసాలంకారం అంటారు.
ఉదాహరణ -1:
1) లక్ష భక్ష్యములు భక్షించు ఒక పక్షి కుక్షికి ఒక భక్ష్యము లక్ష్యమా?
పై వాక్యంలో ‘క్ష’ కారము ‘క్ష్య’ వర్ణము పలుమార్లు ప్రయోగించబడి ఒక అద్భుతమైన సౌందర్యము తీసుకురాబడినది కనుక ఇది వృత్త్యనుప్రాసాలంకారం.

ఉదాహరణ – 2:
2) కాకి కోకిల కాదు కదా !
పై వాక్యంలో ‘క’ కారం పలుమార్లు ప్రయోగించబడి, వినసొంపుగా ఉంది. కాబట్టి ఇది వృత్త్యనుప్రాసాలంకారం.

ఉదాహరణ – 3:
3) లచ్చి పుచ్చకాయ తెచ్చి ఇచ్చింది.
పై వాక్యంలో ద్విత్వచకారం పలుమార్లు అందంగా ప్రయోగింపబడినది. కాబట్టి ఇది వృత్త్యనుప్రాసాలంకారం.

9th Class Telugu 1st Lesson శాంతికాంక్ష కవిపరిచయం

మహాభారతాన్ని తెలుగులో కవిత్రయం వారు (ముగ్గురు కవులు) రచించారు. వారిలో తిక్కన రెండోవారు. వీరు 13వ శతాబ్దానికి చెందిన మహాకవి. నెల్లూరును పరిపాలించిన మనుమసిద్ధికి మంత్రిగా, ఆస్థానకవిగా ఉన్నారు. తిక్కన మొట్టమొదట ‘నిర్వచనోత్తర రామాయణము’ను రచించి మనుమసిద్ధికి అంకితం ఇచ్చారు. తిక్కన రెండో గ్రంథం ‘మహాభారతం’. విరాటపర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలు రచించి హరిహరనాథునికి అంకితం ఇచ్చారు.

మహాభారత రచనలో ఈయన తీర్చిదిద్దిన పాత్రలు సజీవంగా కనిపిస్తాయి. వీరి శైలిలో ‘నాటకీయత’ ఉంటుంది. సందర్భానుగుణంగా వీరు ప్రయోగించిన పదాలు సృష్టించిన సన్నివేశాలు రసాస్వాదన కలిగిస్తాయి. ఆ ఔచిత్యవంతంగా రసపోషణ చేయగలడాన్ని ‘రసాభ్యుచిత బంధం’ అంటారు. ఇందులో తిక్కన సిద్ధహస్తుడు. సంస్కృతాంధ్రాలలో కవిత్వం రాయగలిగిన ప్రతిభాశాలి కాబట్టి ‘ఉభయకవి మిత్రుడు’ అనీ, కేతనాది కవులకు ప్రేరణ కలిగించి మార్గదర్శకులుగా నిలిచినందుకు ‘కవి బ్రహ్మ’ అనీ బిరుదులు పొందారు.

పద్యాలు – ప్రతి పదార్థాలు-భావాలు

1వ పద్యం :
తే॥ సమయమిది మిత్రకార్యంబు చక్కఁజేయ
నీకతంబున నే మవినీతుఁడైన
యా సుయోధను తోడి పోరాట దక్కి
యనుభవింతుము మా యంశమగు ధరిత్రి.
ప్రతిపదార్థం :
మిత్రకార్యంబున్ = స్నేహితుల పనిని
చక్కన్ + చేయన్ = చక్కబెట్టడానికి
సమయము + ఇది = తగిన కాలమిది
నీ కతంబునన్ = నీ మూలంగా
ఏము = మేము
అవినీతుడు + ఐన = అయోగ్యుడైన
ఆ సుయోధను = ఆ దుర్యోధనునితో
తోడి పోరాట = యుద్ధం
తక్కి = మాని
మా + అంశము + అగు ధరిత్రిన్ = మా వంతు రాజ్యాన్ని
అనుభవింతుము = మేము అనుభవిస్తాము.

భావం :
కృష్ణా ! మిత్రులమైన మా పనిని చక్కబెట్టడానికి నీకు ఇదే తగిన కాలం. నువ్వే రాయబారానికి వెళితే, అయోగ్యు డయిన ఆ దుర్యోధనుడితో మేము యుద్ధం చేయవలసిన పని లేదు. మా వంతు రాజ్యం మాకు వస్తుంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

2వ పద్యం :
కం॥ ఇచ్చటి బంధులు నీవును
నచ్చెరువడి వినుచునుండ నయిదూళ్ళును మా
కిచ్చినను జాలునంటిని
బొచ్చెముగా దింతపట్టు పూర్ణము సుమ్మీ !
ప్రతిపదార్ధం :
ఇచ్చటి = ఇక్కడ ఉన్న
బంధులు = చుట్టాలు
నీవును = నీవు కూడ
అచ్చెరువడి = ఆశ్చర్యంతో
వినుచున్ + ఉండన్ = వింటూ ఉండగా
మాకున్ = అన్నదమ్ములమైన మాకు
అయిదు + ఊళ్ళును = ఐదు గ్రామాలను
ఇచ్చినను = ఇచ్చినప్పటికీ
చాలున్ + అంటిని = సరిపోతాయని అన్నాను
పొచ్చెము + కాదు = తక్కువ కాదు
ఇంతవట్టు = నే పల్కిన ఈ మాట
పూర్ణము సుమ్మీ ! = సంపూర్ణమైనది (నిజమైనది) సుమా !

భావం :
ఓ కృష్ణా ! ఇక్కడున్న చుట్టాలూ, నీవూ ఆశ్చర్యంతో వింటూండగా, ‘సక్రమంగా మాకు అర్ధరాజ్యం ఇవ్వడానికి మా తండ్రికి మనసొప్పకపోతే మేముండటానికి ‘ఐదూళ్ళిచ్చినా చాలు’ అని సంజయుడితో నేనింతవరకూ చెప్పిన మాటలలో దాపరికం లేదు. అంతా నిజమే సుమా!

విశేషం :
పాండవులు కోరిన ఐదూళ్ళ పేర్లను సంస్కృత మహాభారత కర్త వ్యాసుడు ఇంద్రప్రస్థం, కుశస్థం, వృకస్థలం, వాసంతి, వారణావతం అని పేర్కొన్నాడు. కానీ తెలుగు మహాభారత కర్తలలో ఒకడైన తిక్కన అవస్థలం, వృక (కుశ) స్థలంగాను, మాకంది (వాసంతి), వారణావతంతో మరొక ఊరేదైనా పేర్కొన్నాడు. బహుశా తిక్కన కాలానికి ఆయా నగరాల పేర్లు మారి ఉండవచ్చు లేక ఇంకేదైనా కారణం ఉండవచ్చు.

3వ పద్యం : కంఠస్థ పద్యంలో
శా|| ఆ దుర్యోధనుఁడంత మాత్రమును జేయంజాలఁడో కాని, పెం
పేదం గ్రూరత కోర్వరాదు, పిరి నాకేలందునే, గ్రాసవా
సోదైన్యంబులు వచ్చు నాయరయు నీ చుట్టాలకుం, గావునన్
మోదంబందుట గలుఁ గౌరవులు నేముం బొంది శ్రీపొందివన్.
ప్రతిపదార్థం :
ఆ దుర్యోధనుడు = ఆ సుయోధనుడు
అంతమాత్రమును = అంతమాత్రమైనా (నే కోరిన ఐదూళ్ళనైనా)
చేయన్ + చాలండో = ఇస్తాడో, ఇవ్వడో
కాని = కాని
పెంపు + ఏదన్ = గౌరవం చెడేటట్లు
క్రూరతకున్ + ఓర్వన్ రాదు = క్రూరమైన పనులు చేయటాన్ని సహించలేను
సిరి = రాజ్యసంపద
నాకున్ + ఏల + అందునేన్ = నాకెందుకని విడిస్తే
నా + అరయు = నేను చూసే
ఈ చుట్టాలకున్ = ఈ బంధువులకు
గ్రాసవాసః + దైన్యంబులు= తిండికీ, బట్టకూ కరవు
వచ్చున్ = ఏర్పడుతుంది
కావునన్ = కాబట్టి
కౌరవులున్ = దుర్యోధనాదులు

భావం :
ఆ సుయోధనుడు అంతమాత్రమైనా (నే కోరిన ఐదూళ్ళనైనా) ఇస్తాడో ? ఇవ్వడో ? కాని గౌరవం చెడేటట్లు క్రూరమైన పనులు చేయటాన్ని సహించలేను. రాజ్యసంపద నాకెందుకని విడిస్తే నేను చూసే ఈ బంధువులకు తిండికీ, బట్టకూ కరవు ఏర్పడుతుంది. కాబట్టి దుర్యోధనాదులు, మేము కలిసి సంపదలను పొందితే సంతోషం కలుగుతుంది.

విశేషం :
తన కుమారుల, బంధువుల పోషణ, రక్షణ ధృతరాష్ట్రునికి ఎంతముఖ్యమో తన తమ్ముల, ఆశ్రయించిన వారి పోషణ, రక్షణ తనకు ముఖ్యం అని ధర్మరాజు గడుసుగా సమాధానమిచ్చాడు. ఈ పద్యంలో చక్కని మనోవిశ్లేషణ చేయబడింది.

4వ పద్యం : -కంగస్థ పద్యం
ఉ॥ అక్కట ! లాతులైనఁ బగజైనను జంపన కోరనేల ? యొం
డొక్క తెలుగు లేదె ? యది యొప్పదె ? బంధు సుహృజ్జనంబు లా
దిక్కున మన్నవారు, గణుతింపక సంపదకై వధించి దూ
ఱెక్కుట దోషమందుటను నీ దురవస్థల కోర్వవచ్చునే ?
ప్రతిపదార్థం :
అక్కట ! = అయ్యో !
లాంతులు + జనన్ = పరాయివారైనా
పగఱు + ఐనన్ = విరోధులైనా
చంపన్ + అ + కోరన్ + ఏల = చంపాలనే ఎందుకు కోరాలి?
ఒండు + ఒక్క + తెఱంగులేదే ? = మరొక మార్గం లేదా?
అది + ఒప్పదా? = ఆ మార్గం సరైంది కాదా ?
ఆ దిక్కునన్ = ఆ కౌరవులలో
బంధుసుహృద్ + జనంబులు = చుట్టాలు, మిత్రులు
ఉన్నారు = ఉన్నారు
గణుతింపక = ఆ వైపున ఉన్న మా బంధువులను లెక్కించక
సంపదకై = రాజ్య సంపద కోసం
వధించి = చంపి
దూఱు + ఎక్కుట = నిందల పాలవటం
దోషము + అందుట = పాపం పొందటం
అను = అనే
దుర్ + అవస్థలకున్ = చెడు స్థితిని
ఓర్వన్ + వచ్చునే – సహింపదగునా?

భావం :
అయ్యో ! పరాయివారైనా, విరోధులైనా చంపాలనే ఎందుకు కోరాలి ? మరొక మార్గం లేదా ? ఆ మార్గం సరైంది కాదా ? ఆ కౌరవులలో చుట్టాలు, మిత్రులు ఉన్నారు. ఆ వైపున ఉన్న బంధువులను లెక్కించక రాజ్యసంపద కోసం చంపి, నిందల పాలవటం, పాపం పొందడమనే చెడు స్థితిని సహింపదగునా ? (కూడదని భావం).

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

5వ పద్యం :
ఆ||వె|| పగయ కలిగినేనిఁ బామున్న యింటిలో
నున్న యట్ల కాక యూజడిల్లి
యుండునెట్లు చిత్త మొకమాటుగావున
వలవ దధిక దీర్ఘ వైరవృత్తి
ప్రతిపదార్థం :
పగ + అ + కలిగెనేనిన్ = శత్రుత్వమే ఏర్పడితే
పాము + ఉన్న + ఇంటిలోన్ = సర్పమున్న ఇంటిలో
ఉన్న + అట్ల + కాక – ఉన్నట్లే గాని
ఒక మాటున్ = ఒకసారి అయినా
చిత్తము = హృదయం
ఊఱడిల్లి = ఊరట పొంది
ఎట్లు + ఉండున్ = ఎట్లా ఉండగలదు?
కావునన్ = కాబట్టి
అధిక దీర్ఘ వైర వృత్తి = చిరకాల విరోధంతో మెలగటం
వలవదు. = కూడదు

భావం :
శత్రుత్వము ఏర్పడితే, పాము ఉన్న ఇంటిలో ఉన్నట్లే గాని, ఒకసారైనా హృదయం ఊరట పొందదు. కాబట్టి చిరకాలం విరోధంతో ఉండకూడదు.

6వ పద్యం : కంఠస్థ పద్యం
చం|| పగయడఁగించు టెంతయు శుభం, బది లెస్స, యడంగునే సగం
బగ ? పగగొన్న మార్కొనక పల్కక యుండగ వచ్చునే ? కడుం
చెగ మొదలెత్తి పోవఁ బగ దీర్పగ వచ్చినఁ శౌర్యమొందు, నే
మిగతిఁ దలంచినం బగకు మేలిమి లేమి ధ్రువంబు దేశవా!
ప్రతిపదార్థం :
కేశవా = శ్రీ కృష్ణా !
పగ + అడంగించుట = శత్రుత్వాన్ని అణచి వేయడం
ఎంతయున్ శుభంబు = ఎంతో మేలు
అది లెస్స = అదే మంచిది
పగన్ = పగతో
పగ + అడంగునే = పగ సమసిపోదు
పగ + గొన్నన్ = (ఒకరి) పగవలన (మరొకరు) బాధపడితే
మార్కొనక = అతడిని ఎదిరించక
పల్కక + ఉండగన్ = ఊరక ఉండడం
వచ్చునే = సాధ్యమా?
కడున్ + తెగన్ = గొప్ప సాహసంతో
మొదలు + ఎత్తిపోవన్ = తుదముట్టే విధంగా
పగన్ + తీర్పగన్ = విరోధాన్ని రూపుమాపడానికి
వచ్చినన్ = సిద్ధపడితే
క్రౌర్యము + ఒందున్ = దారుణమైన పనులు చేయాల్సివస్తుంది
ఏమిగతి + తలంచినన్ = ఏ విధంగా ఆలోచించినా
పగకున్ = విరోధం వలన
మేలిమిలేమి = మంచి జరగదు
ధ్రువంబు = ఇది నిజం

భావం :
శ్రీ కృష్ణా ! శత్రుత్వాన్ని అణచివేయడం ఎంతో మేలు. అదే మంచిది. పగతో పగ సమసిపోదు. ఒకరి పగ వలన మరొకరు బాధపడితే అతడిని ఎదిరించక ఊరకుండటం సాధ్యమా ? గొప్ప సాహసంతో తుదముట్టే విధంగా విరోధాన్ని రూపుమాపడానికి సిద్ధపడితే దారుణమైన పనులు చేయాల్సి వస్తుంది. ఏ విధంగా ఆలోచించినా విరోధం వలన మంచి జరగదు. ఇది నిజం.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

7వ పద్యం : కంఠస్థ పద్యం
ఉ॥ కావున శాంతిఁ బొందుటయ కర్ణము, దా నది యట్టులుండె, శ్రీ
గావలెనంచు, బోరితము గామియుఁ గోరెద, మెల్ల సొమ్ములుం
బోవుటయుం గులక్షయము పుట్టుటయున్ వెలిగాఁగ నొండుమై
వేవిధినైనఁ జక్కఁబడు టెంతయు నొప్పుఁజుమీ జనార్థవా !
ప్రతిపదార్థం :
కావునన్ = కాబట్టి
శాంతిన్ = శాంతిని
పొందుట + అ = పొందుటే
కర్ణము = చేయాల్సిన పని
తాన్ + అది = ఆ విషయం
అట్టులు + ఉండెన్ = అలా ఉండనీ
శ్రీ = సంపద
కావలెన్ + అంచున్ = కావాలని
పోరితము = యుద్ధం
కామియున్ = వద్దని
కోరెదము = కోరుతున్నాం
ఎల్ల = అన్ని
సొమ్ములున్ = సంపదలు
పోవుటయున్ = నశించడం
కులక్షయము = వంశనాశనం
వుట్టుటయున్ = కలగడం
వెలికాగన్ = జరగకుండ
ఒండుమైన్ = వేరొకవిధంగా
ఏ విధిన్ + ఐనన్ = ఎలాగోలా
చక్కన్ + పడుట = బాగుపడుట
ఎంతయున్ = మిక్కిలి
ఒప్పున్ + చుమీ = తగినది గదా !

భావం :
కాబట్టి శాంతిని పొందుటీ చేయాల్సిన పని. ఆ విషయం అలా ఉండనీ. సంపద కావాలని, యుద్ధం వద్దని కోరుతున్నాం. అన్ని సంపదలు నశించడం, వంశ నాశనం కలగడం జరగకుండా వేరొక విధంగా ఎలాగోలా బాగుపడుట మిక్కిలి తగినది గదా!

8వ పద్యం : కంఠస్థ పద్యంగా
చం॥ మనమువఁ బక్షపాతగతి మాడెన మామము ధర్మనీతి వ
రవముల రెండు దిక్కుల హితంబును బెంపును గల్గునట్టి చొ
ప్పున విదురాది సజ్జనుల బుద్ధికి రామచితంబు తోడి మె
ల్పునఁ బరుసందనంబువను భూపతులెల్ల వెఱుంగ వాడుమీ !
ప్రతిపదార్థం :
మనమునన్ = నీ మనస్సులో
మాదెసన్ = మాపై
పక్షపాతగతిన్ = అభిమానం చూపడం
మానుము = విడిచిపెట్టు
ధర్మనీతివర్తనములన్ = ధర్మంతో, నీతితో కూడిన నడవడికతో
రెండు దిక్కులన్ = ఇరువురికి
హితంబును = మేలును
పెంపును = అభివృద్ధియు
కల్గునట్టి = కలిగే
చొప్పునన్ = విధంగా
విదుర + ఆది = విదురుడు మొదలయిన
సజ్జనుల = మంచివారి
బుద్ధికిన్ + రాన్ = మనస్సులకు అంగీకారమయ్యేలా
ఉచితంబు తోడి = అనువుగా
మెల్పునన్ = మెత్తగా
పరుసందనంబునన్ = పరుషంగా
భూపతులు = రాజులు
ఎల్లన్ = అందరూ
ఎఱుంగన్ = తెలుసుకొనేలా
ఆడుము = మాట్లాడు

భావం :
నీ మనస్సులో మాపై అభిమానం చూపడం విడిచి పెట్టు, ధర్మంతో, నీతితో కూడిన నడవడికతో ఇరువురికీ మేలు, అభివృద్ధి కలిగే విధంగా, విదురుడు మొదలైన మంచివారి మనస్సులకు అంగీకారమయ్యేలా అనువుగా, మెత్తగా, పరుషంగా రాజులందరూ తెలుసుకునేలా మాట్లాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 1 శాంతికాంక్ష

9వ పద్యం :
మ॥ సుతువాఁడై వినయంబు పేకొనక యే చొప్పుం దగం జెప్ప కా
ధృతరాష్ట్రుం డవినీతిఁ జేసినను సంధింపంగ రాదంచు వే
గ తెగంబాలకు చెంపు సేయునెడ లోకం బెల్ల మెచ్చం బ్రకా
శిత ధర్మస్థితి నొంది మా మనము నిశ్చింతంబుగాఁ జేయుమీ !
ప్రతిపదార్థం :
ఆ ధృతరాష్ట్రుండు = ఆ ధృతరాష్ట్ర మహారాజు
సుతువాడు + ఐ = కొడుకు మాటే వినేవాడై
వినయంబు = విధేయతను
చేకొనక = చూపక
ఏ చొప్పుం = ఏ మార్గాన్ని
తగన్ + చెప్పక = తేల్చి చెప్పక
అవినీతిన్ చేసినను = అవినీతితో ఉన్నట్లయితే
సంధింపగన్ = సంధి చేయటం
రాదు + అంచున్ = కుదరదని
వేగ = వెంటనే
తెగన్ + పాలుకు = సాహసించకు
తెంపు + చేయు + ఎడన్ = సాహసించాల్సి వస్తే
లోకంబు + ఎల్లన్ = లోకమంతా
మెచ్చన్ = మెచ్చుకునేలా
ప్రకాశిత ధర్మస్థితిన్ = ధర్మానికి నిలచి
మా మనమున్ = మా మనస్సుల్ని
నిశ్చింతంబుగాన్ = విచారం లేనట్టివిగా
చేయుమీ = చేయాల్సింది

భావం :
ధృతరాష్ట్ర మహారాజు కొడుకుమాటే వినేవాడై | విధేయతను చూపక, ఏ మార్గాన్ని తేల్చి చెప్పక, అవినీతితో – ఉన్నట్లయితే సంధిచేయటం కుదరదని వెంటనే సాహసించి వచ్చేయకు. సాహసించాల్సి వస్తే ధర్మానికి నిలచి లోకమంతా మెచ్చుకునేలా, మా మనస్సుల్ని విచార రహితంగా చేయి.

10వ పద్యం :
కం॥ మమ్మెఱుఁగు, దెదిరి నెఱుఁగుదు
నెమ్మి యెటుఁగు దగ్గ సిద్ది నెట్ యెటుఁగుదు నా
క్యమ్ముల పద్ధతి వెఱుఁగుదు
పొమ్మోవ్వఁడ నేను నీకు బుద్ధులు సెప్పవ్.
ప్రతిపదార్థం :

మమ్మున్ + ఎఱుఁగుదు = మేమెలాంటి వాళ్ళమో తెలిసినవాడవు
ఎదిరిన్ = కౌరవులను గూర్చి
ఎఱుఁగుదు = తెలిసినవాడవు
నెమ్మిన్ + ఎఱుఁగుదు : కూర్మి అంటే ఎలాంటిదో తెలిసినవాడవు
అర్ధ సిద్ధి నెటి + ఎఱుగుదు = కార్యసాధన పద్ధతి తెలిసినవాడవు
వాక్యమ్ముల పద్ధతిన్ = మాటలాడే విధం
ఎఱుఁగుదు = తెలిసినవాడవు
నీకున్ = నీకు
బుద్ధులు + చెప్పన్ = ఉపాయాలు చెప్పడానికి
నేను + ఎవ్వడన్ = నేనేమాత్రం వాడిని
పొమ్ము = హస్తినాపురానికి వెళ్ళిరా !

భావం:
మేమెలాంటి వాళ్ళమో తెలిసినవాడివి, కౌరవులను గూర్చి తెలుసు. కూర్మి అంటే ఏమిటో తెలుసు. కార్యసాధన పద్ధతి కూడా తెలుసు. మాటలాడే విధం తెలుసు. నీకు ఉపాయాలు చెప్పడానికి నేనేమాత్రం వాడిని ? హస్తినాపురానికి వెళ్ళిరా !

AP SSC 10th Class Telugu Important Questions Chapter 12 చిత్రగ్రీవం

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Important Questions Chapter 12 చిత్రగ్రీవం

AP State Syllabus SSC 10th Class Telugu Important Questions 12th Lesson చిత్రగ్రీవం

10th Class Telugu 12th Lesson చిత్రగ్రీవం 2 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
చిత్రగ్రీవంలో ఆశ్చర్యకరమైన విషయాలు ఏమి ఉన్నాయి?
జవాబు:
చిత్రగ్రీవం తనకు మూడువారాల వయస్సు ఉన్నప్పుడు అది తన గూట్లోకి వచ్చిన నల్లచీమను, తన ముక్కుతో పొడిచి చంపింది. అయితే ఆ చీమ దానికి తినడానికి పనికి రానిది. చీమ పావురాల జాతికి స్నేహితుడు. చీమను తినే వస్తువని భావించి చిత్రగ్రీవం దాన్ని పొడిచి చంపింది. తరువాత తాను చేసిన పని తప్పని చిత్రగ్రీవం పశ్చాత్తాపపడి ఉంటుంది.

అందుకేనేమో చిత్రగ్రీవం, మళ్ళీ ఎప్పుడూ తన జీవితంలో మరోసారి చీమను చంపలేదు – తాను చేసిన తప్పును గ్రహించిన చిత్రగ్రీవం, తిరిగి ఎప్పుడూ ఆ తప్పు చేయకపోడం, ఆశ్చర్యకరమైన విషయం.

ప్రశ్న 2.
మానవులకు, పావురాలకూ స్నేహం ఉందని ఎలా చెప్పగలవు?
జవాబు:
ఏనుగులు, పావురాలు తమ యజమానుల పట్ల ఎక్కువగా విశ్వాసాన్ని కనబరుస్తాయి. అడవులలోని ఏనుగులు, నగరాల్లోని పావురాలు, తమ యజమానులంటే ప్రాణం ఇస్తాయి. రోజంతా ఎక్కడ ఎక్కడ తిరిగినా, చివరికి పావురాలు తమకు గల అద్భుతమైన దిశాపరిజ్ఞానంతో, అంతః ప్రేరణా బలంతో తమకు మిత్రుడూ, సహచరుడూ అయిన మానవుడి పంచకు చేరతాయి.

దీనినిబట్టి పావురాలకూ, మానవులకూ స్నేహం ఉందని చెప్పగలము.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 12 చిత్రగ్రీవం

ప్రశ్న 3.
చిత్రగ్రీవం పాఠ్య రచయితను గురించి వ్రాయండి.
జవాబు:
చిత్రగ్రీవం పాఠ్యాంశం ‘చిత్రగ్రీవం – ఓ పావురం కథ’ అనే పుస్తకం నుండి గ్రహించబడింది. దీనిని ధనగోపాల్ ముఖర్జీగారు రచించారు. దానిని దాసరి అమరేంద్రగారు తెలుగులోనికి అనువదించారు.

దీనిని నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా సంస్థ ప్రచురించింది. ధనగోపాల్ ముఖర్జీ తన 19వ ఏటనే అమెరికా వెళ్ళారు. కాలిఫోర్నియా, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయాలలో చదువుకొన్నారు. రచనలు చేయడం, ఉపన్యాసాలు ఇవ్వడం ఆయన ప్రవృత్తి. కలకత్తాలో జన్మించారు.

వీరు 1890 నుండి 1936 వరకు జీవించారు.

ప్రశ్న 4.
ధనగోపాల్ ముఖర్జీ సాహిత్య సేవను వివరించండి.
జవాబు:
ధనగోపాల్ ముఖర్జీగారు జంతువులకు సంబంధించి తొమ్మిది రచనలు చేశారు.

1922లో ఆయన వ్రాసిన ‘కరి ది ఎలిఫెంట్’ ప్రసిద్ధమైన రచన, 1924లో ‘హరిశా ది జంగిల్ ల్యాండ్’, 1928లో ‘గోండ్ ది హంటర్’ చాలా ప్రసిద్ధమైన రచనలు.

1928లో అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ వారు ‘న్యూ బెరీ మెడల్’ బహుమతిని అందించారు. ఈ బహుమతిని గెల్చుకున్న భారతీయ రచయిత ధనగోపాల్ ముఖర్జీ మాత్రమే.

10th Class Telugu 12th Lesson చిత్రగ్రీవం 4 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
చిత్రగ్రీవం యొక్క సొగసులను, చేష్టలను వర్ణించండి.
జవాబు:
‘చిత్రగ్రీవం’ అనేది ఒక పావురం. దానిని తల్లిపక్షి, తండ్రిపక్షి కలిసి అనురాగంగా పెంచాయి. తల్లిదండ్రుల శ్రమ, శ్రద్ధ వల్ల చిత్రగ్రీవం మహా ఏపుగా పెరిగింది. క్రమంగా దాని గులాబీ రంగు మారి తెలుపురంగు వచ్చింది. ముళ్ళపందిలాంటి ఈకలు వచ్చాయి. దాని కళ్ల దగ్గర, నోటి దగ్గర ఉన్న, పసుపు పచ్చని చర్మాలు రాలిపోయాయి. పొడవాటి, గట్టిపాటి సూదిలాంటి ముక్కు ఏర్పడింది.

పుట్టిన ఐదోవారానికి చిత్రగ్రీవం గూడు నుండి బైటికి గెంతి, మూకుళ్లలో నీరు త్రాగేది. చిత్రగ్రీవం మందకొడిగా ఉండేది. మూడు నెలల వయస్సు రాగానే, దాని ఒళ్ళంతా సముద్రపు నీలిరంగు ఈకలు ధగధగా మెరిశాయి. దాని మెడ ప్రాంతం, సూర్యకాంతిలో ఇంద్రధనుస్సు వర్ణాల పూసల గొలుసులా శోభిల్లింది. తండ్రిపక్షి చిత్రగ్రీవానికి ఎగరడం బలవంతంగా నేర్పింది. ఎగరడంలో అలసిన చిత్రగ్రీవాన్ని తల్లిపక్షి లాలించింది.

చిత్రగ్రీవానికి నిండుగా ఈకలు పెరిగాయి. ఆ ఈకలు అతి సుందరమైన రంగులతో నిండాయి. అందుకే, చిత్రగ్రీవానికి సాటిరాగల మరో పావురం లేదని రచయిత చెప్పాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 12 చిత్రగ్రీవం

ప్రశ్న 2.
పావురాల నుండి మానవులు నేర్చుకోవలసిన విషయాలు ఏవి?
జవాబు:
1) పావురాలు తమ యజమానులపై మంచి విశ్వాసాన్నీ, ప్రేమనూ చూపించి, యజమానులంటే ప్రాణం పెడతాయి. మానవులలో కొందరు యజమానుల పట్ల విశ్వాసం లేకుండా ఉంటారు. అది తప్పు, తమకు అన్నం పెట్టే యజమానిపై విశ్వాసం ఉండాలి. కాబట్టి పావురాల నుండి మానవులు యజమానులపై విశ్వాసాన్ని చూపడం అనే మంచి గుణం నేర్చుకోవాలి.

2) చిత్రగ్రీవం అనే పావురము ఒకసారి తన గూటికి వచ్చిన నల్లచీమను చూసి, తాను తినే వస్తువు అనుకొని దానిని ముక్కుతో పొడిచి చంపింది. తరువాత చీమను పావురాలకు స్నేహితుడిగా అది తెలిసికొంది. తిరిగి అది తన జీవితంలో చీమను చంపలేదు. చిత్రగ్రీవం తన తప్పును తెలిసికొని పశ్చాత్తాప పడింది. చేసిన తప్పు అది తిరిగి చేయలేదు.

మనిషి మాత్రం చేసిన తప్పునే తిరిగి తిరిగి చేస్తాడు. కాబట్టి మానవులు పావురాల నుండి, చేసిన తప్పును తిరిగి చేయకపోడం అనే మంచి గుణాన్ని తప్పక నేర్చుకోవాలి.

ప్రశ్న 3.
పక్షులను, జంతువులను పెంచడం వల్ల ఉపయోగాలు ఏవి?
జవాబు:
పక్షుల పెంపకం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మనము కోడి, నెమలి, చిలుక వంటి పక్షులను పెంచుతాము. కోడి, గ్రుడ్లు పెడుతుంది. ఆ గుడ్లు మంచి పోషకాహారము. గుడ్లు, సంపూర్ణమైన బలమైన ఆహారం క్రిందికి వస్తాయి. కోళ్ళను పెంచి గుడ్లను అమ్మితే మంచి లాభాలు వస్తాయి. తాము తినడానికి పనికి వస్తాయి. పక్షుల మాంసం ఆహారంగా ఉపయోగిస్తుంది. చిలుక చక్కగా కబుర్లు చెపుతుంది. కాబట్టి పక్షులను పెంచాలి.

జంతువుల పెంపకం వల్ల చాల లాభాలు ఉన్నాయి. ఆవు, గేదె వంటి జంతువులు పాలను ఇస్తాయి. పాలు సంపూర్ణ ఆహారం. పాలనూ, పాల ఉత్తతులనూ అమ్మి లాభాలు తీస్తారు. వాటి పేడతో గ్యాస్ ఉత్పత్తి చేసుకోవచ్చు. ఎరువులు తయారు చేయవచ్చు. పందులు వంటి వాటిని పెంచి వాటిని అమ్మి లాభాలు గడించవచ్చు. మేకలు, గొట్టెలు వల్ల పాలే కాకుండా, దాని బొచ్చు వల్ల ఉపయోగాలు ఉన్నాయి. గొట్టె బొచ్చుతో కంబళ్ళు చేయవచ్చు. వాటి మాంసం తినవచ్చు. ఎద్దులు, దున్నలు వ్యవసాయానికి పనికివస్తాయి. వాటితో బళ్ళు కట్టి సరకులను రవాణా చేయవచ్చు. కుక్క కాపలా కాస్తుంది. ఈ విధంగా పక్షులు, జంతువుల పెంపకం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 12 చిత్రగ్రీవం

ప్రశ్న 4.
కింది పాత్రల స్వభావాలను రాయండి.
జవాబు:
చిత్రగ్రీవం :
తెలివైనది. చురుకైనది. చిన్నతనంలో మందకొడి. తల్లిదండ్రుల అభిమానాన్ని, అనురాగాన్ని పూర్తిగా అనుభవించింది. తన చిలిపి చేష్టలతో రచయితను అలరించింది. తన అందంతో చూపరులను మైమరపింపజేస్తుంది. . తండ్రి పక్షి : గ్రుడ్డును పొదగాలనే ఆత్రుత ఎక్కువ. ఇది గిరికీల మొనగాడు. వేగం, చురుకుదనం, సాహసం కలది. రచయిత ముఖంపై కొట్టి ఒక గ్రుడ్డు చితికిపోవడానికి కారణమయ్యింది. తొందర ఎక్కువ. చిత్రగ్రీవానికి ఎగరడం నేర్పింది.

తల్లి పక్షి :
తెలివైన పావురం. గ్రుడ్డులోంచి పిల్ల బయటికి వచ్చే సమయాన్ని కచ్చితంగా అంచనా వేయగలదు. చిత్రగ్రీవాన్ని కంటికి రెప్పలా కాపాడింది. ఆహారం, భద్రత కల్పించింది. మేలుజాతి పావురాన్ని ప్రపంచానికి అందించిన ధన్యజీవి.

రచయిత :
పక్షి ప్రేమికుడు. పక్షుల పెంపకం అంటే చాలా ఇష్టం. వ్యక్తిగత శ్రద్ధతో పావురాలను పెంచుతాడు. జంతువులను కూడా పెంచుతాడు. ప్రతి చిన్న విషయాన్ని పరిశీలిస్తాడు. పక్షులకు చిన్న గాయమైనా తట్టుకోలేడు. గ్రుడ్డు పగిలిపోయినందుకు చాలా బాధపడ్డాడు. సున్నిత స్వభావి.

ప్రశ్న 5.
శిశువుల పెంపకంలో పక్షుల దగ్గర నుంచి మనుషులు నేర్చుకోవలసిన విషయాలు ఉన్నాయా? “చిత్రగ్రీవం” పాఠం ఆధారంగా చర్చించండి.
జవాబు:
శిశువుల పెంపకంలో పక్షుల దగ్గర నుంచి మనుషులు నేర్చుకోవలసిన విషయాలు ఉన్నాయి.

  1. చిత్రగ్రీవాన్ని తల్లి పక్షి, తండ్రి పక్షి కలిసి అనురాగంతో పెంచాయి. దీన్నిబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలను అనురాగంతో పెంచాలనే విషయాన్ని వాటి నుండి నేర్చుకోవాలి.
  2. పక్షి తన పిల్లలకు గూటిలో సుఖ సౌకర్యంగా ఉండే ఏర్పాట్లు చేస్తుంది. అదే విధంగా మనుషులు తమ పిల్లలకు పక్క ఏర్పాట్లలో శ్రద్ధ వహించాలనే విషయాన్ని గ్రహించాలి.
  3. పక్షి పిల్లల నోటికి తల్లి పక్షి, తండ్రి పక్షి ఆహారాన్ని అందించి వాటి పెరుగుదలకు సహాయపడతాయి. మనుషులు కూడా తమ చంటిపిల్లల నోటికి ఆహారాన్ని అందించి వారి ఎదుగుదలకు పాటుపడాలి.
  4. చిత్రగ్రీవం తల్లిదండ్రులు చిత్రగ్రీవం దగ్గరనే ఉండి, దాన్ని లాలిస్తూ, దాని బాగోగులు చూస్తూ ఉండేవి. అలాగే మనుషులు కూడా పిల్లలను లాలిస్తూ వారి బాగోగులను గురించి పట్టించుకోవాలి.

10th Class Telugu 12th Lesson చిత్రగ్రీవం Important Questions and Answers

ప్రశ్న 1.
పక్షులను, జంతువులను సంరక్షించవలసిన అవసరం గురించి తెలియజేస్తూ మీ మిత్రునకు లేఖ వ్రాయండి.
జవాబు:

లేఖ

రాజమండ్రి,
x x x x x

ప్రియమైన మిత్రుడు శంకరు,
నీ మిత్రుడు శ్రీనివాస్ వ్రాయు లేఖ.

ఇక్కడంతా క్షేమం. అక్కడ మీరంతా క్షేమమని తలచెదను.

మా తెలుగు పాఠ్యపుస్తకంలో ‘చిత్రగ్రీవం’ పాఠం చదువుకొన్నాం. దానిని ధనగోపాల్ ముఖర్జీగారు రచించారు. దాసరి అమరేంద్రగారు తెలుగులోనికి అనువదించారు. ఆ పాఠం ఒక పావురం గురించి, నాకు చాలా బాగా నచ్చింది.

ఈ మధ్య రేడియేషన్ ప్రభావం వల్ల చాలా పక్షిజాతులు అంతరించిపోతున్నాయని మా సైన్సు మాష్టారు చెప్పారు. గ్లోబల్ వార్మింగ్ వలన కూడా చాలా రకాల జంతుజాతులు అంతరించి పోతున్నాయట. అడవులు విచక్షణా రహితంగా నరికేయడం వల్ల కూడా జంతువులకు రక్షణ పోయింది.

పక్షులు, జంతువులను సంరక్షించుకొంటేనే మన మనుగడకు మంచిది. మనకు గ్రుడ్లు, మాంసమే కాక మానసిక ఆనందాన్ని కల్గించే అందమైన పక్షులను, జంతువులను కోల్పోకూడదు. ఈ విషయంలో అందరినీ చైతన్యపరచాలి. మానవజాతికి విశ్వాస పాత్రంగా సేవలు చేసేవి పక్షులు, జంతువులే కద. మన ప్రగతికి మూలం అవే, మన వంతు ప్రయత్నం మనం చేద్దాం.

మీ అమ్మగారికి, నాన్నగారికి నా నమస్కారాలు.

ఇట్లు,
నీ చెలికాడు,
ఆర్. శ్రీనివాస్.

ప్రశ్న 2.
జంతు సంరక్షణ గురించి వ్యాసం రాయండి.
జవాబు:
జంతు సంరక్షణ

సైన్సు ప్రకారం మానవుడిని కూడా జంతువుగానే పరిగణిస్తారు. కాని, జంతువులకు లేని ‘మాట’ మనిషికి ఉంది. ఆలోచన మొదలైనవన్నీ జంతువులకూ, మానవులకూ సమానమే.

కాని, మన ఆలోచన, తెలివి తేటలు మొదలైన వాటి వలన జంతులోకానికి తీరని నష్టం కలుగుతోంది. ఆది మానవుడు జంతువులకు భయపడ్డాడు. పులులు, సింహాలు, ఏనుగులు మొదలైనవి ఆధునిక మానవుని చేతిలో అంతరించి పోతున్నాయి.

అడవి జంతువుల చర్మాలు, పులిగోళ్లు, ఏనుగు దంతాలు మొదలైనవి ఇతర దేశాలకు అమ్ముకొని సొమ్ము చేసుకొనేందుకు అడవి జంతువులను చంపుతున్నారు. వీరప్పన్ వంటి స్మగ్లర్ల వలన ఎన్నో ఏనుగులు, పులులు నశించిపోయాయి. అటువంటి వారి పట్ల ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించాలి. అటువంటి విషయాలు ఎవరికి తెలిసినా వెంటనే పోలీసులకు, అటవీశాఖాధికారులకు తెలియజేయాలి.

పెంపుడు జంతువులను కబేళాలకు తరలించడం కూడా పెరిగిపోయింది. దీనిని కూడా అరికట్టాలి.

వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను గ్రామగ్రామాన నెలకొల్పి జంతువులను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. ఈ విషయంలో ప్రజలంతా సహకరించాలి.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 12 చిత్రగ్రీవం

ప్రశ్న 3.
జంతువులను, పక్షులను కాపాడమని కోరుతూ ఒక కరపత్రం తయారుచెయ్యండి.
జవాబు:
జంతు పక్షి రక్షణ

సోదరులారా! భగవంతుడు 84 కోట్ల జీవరాశులను సృష్టి చేశాడట. భగవంతుడు సృష్టించిన జీవరాశులు అన్నీ ఉపయోగకరమైనవే. అందులో ముఖ్యంగా జంతువులను మనం రక్షించుకోవాలి. సాధుజంతువులయిన ఆవు, మేక, గేదె, గొట్టె వంటి వాటినే కాదు. అడవి జంతువులయిన సింహం, పులి, మొదలయిన వాటిని కూడా మనం రక్షించుకోవాలి.

వన్య జంతురక్షణను మనం ఉద్యమంగా చేపట్టాలి. అడవులలోని పులి, సింహం వంటి వాటిని వేటాడి చంపడం వల్ల పాపం వస్తుంది. అంతేకాదు అడవులకు రక్షణ పోతుంది. దానితో అడవులు తగ్గి వర్షాలు రాకుండా పోతాయి. మనకు కావలసిన కలప వగైరా రాకుండా పోతాయి.

ముఖ్యంగా మనం చల్లే క్రిమి సంహారక మందుల వల్ల ఎన్నో పక్షులు చచ్చిపోతున్నాయి. మొక్కలకు పట్టే చీడపురుగుల్ని ఎన్నింటినో పక్షులు తిని మొక్కలను కాపాడతాయి. దానివల్ల చీడపీడలు రాకుండా పోతాయి. సీతాకోకచిలుకల వల్లనే మొక్కల్లో పరపరాగ సంపర్కం జరిగి, అవి కాయలు కాస్తున్నాయి. పక్షులు మానవజాతికి స్నేహితులు, వాటిని రక్షించుకుందాం.

ఆవులు, గేదెలు వంటి వాటిని రక్షించుకుంటే, మంచి పాలు ఉత్పత్తి అవుతాయి. మంచి పాలు వల్ల మనకు ఆరోగ్యం వస్తుంది. కాబట్టి ఆవులు, గేదెలు, మొ|| వాటిని మాంసం కోసం చంపకండి. పాడి పశువులను పెంచుకుంటే రైతులకు మంచి లాభాలు వస్తాయి. సేంద్రియ ఎరువులు లభిస్తాయి. రండి. కదలండి. ఉద్యమించండి. జంతు పక్షి రక్షణకు నడుం బిగించండి.

ఇట్లు,
పశుపక్షి రక్షణ సంస్థ,
కర్నూలు.

ప్రశ్న 4.
చిత్రగ్రీవం, తల్లిదండ్రుల సంభాషణను ఊహించి రాయండి.
జవాబు:
(పాత్రలు : 1. చిత్రగ్రీవం 2. తల్లిపక్షి 3. తండ్రిపక్షి)
తండ్రిపక్షి : చూశావా భార్యామణీ! మన చిత్రగ్రీవం ఎంత అందంగా ఉందో!

తల్లిపక్షి : మన చిత్రగ్రీవం అంత అందాలరాశి, ఈ కలకత్తాలోనే లేదు.

తండ్రిపక్షి : బాగుంది. కానీ మన చిత్రగ్రీవానికి ఎగరడం ఇంకా రాలేదు. దీనికి బద్దకం ఎక్కువ.

తల్లిపక్షి : నేనూ అదే అనుకుంటున్నా. నేర్చుకుంటుంది లెండి.

తండ్రిపక్షి : ఏమిరా చిత్రగీవా! నీకు మూడునెలలు నిండాయి. బడుద్దాయిలా ఉన్నావు. ఎగిరే ప్రయత్నం ఏమీ చెయ్యవా ?

చిత్రగ్రీవం : ప్రయత్నం చేస్తా నాన్నా!

తండ్రిపక్షి : చిత్రగ్రీవా! నీవు అసలు పావురానివా? వానపామువా? (చిత్రగ్రీవాన్ని తండ్రి పక్షి, గోడపై నుండి క్రిందికి త్రోసింది)

తల్లిపక్షి : ఏమిటి? చిత్రగ్రీవాన్ని అలా తోస్తున్నారు?

తండ్రిపక్షి : ఇలా చేస్తేగాని వీడికి ఎగరడం రాదు.

తల్లిపక్షి : చాల్లెండి. వాడికి దెబ్బ తగులుతుంది. నేనే వాడిని పట్టుకుంటాను. చూడండి.

చిత్రగ్రీవం : అమ్మా! నువ్వు నన్ను బాగానే పట్టుకొన్నావు. లేకపోతే పడిపోదును.

తల్లిపక్షి : నాయనా! ఆయాసం వచ్చిందా? ఫర్వాలేదులే నా దగ్గరగా రా!

చిత్రగ్రీవం : అమ్మయ్యా! కొద్దిగా ఎగరడం వచ్చింది.

తండ్రిపక్షి : అంతే! నీవూ ఎగురగలవు. సరేనా ? ధైర్యం వచ్చింది కదూ!

తల్లిపక్షి : ఇంక ఎప్పుడూ ఇలా చేయకండి. చిత్రగ్రీవం చిన్నపిల్లాడు.

తండ్రిపక్షి : నేర్పితే గాని ఏ విద్యా రాదు. మన చిత్రగ్రీవానికి కొంచెం బద్దకం ఎక్కువ కదా! అందుకే అలాచేశా.

చిత్రగ్రీవం : చూడు నాన్నా! రేపటి నుండి నేను కూడా ఎగిరి గింజలు తెచ్చుకొని తింటా.

తల్లిపక్షి, తండ్రిపక్షి : సెభాష్! చిత్రగ్రీవా! హాయిగా ఎగురు. నీకు ఏమీ కాదు. మేముంటాం.

10th Class Telugu 12th Lesson చిత్రగ్రీవం 1 Mark Bits

1. “శ్రీమంత్ చొక్కా మల్లెపూవులా తెల్లగా ఉంది” – ఇందులోని అలంకారం (March 2017)
A) రూపకం
B) ఉపమ
C) ఉత్ప్రేక్ష
D) యమకం
జవాబు:
B) ఉపమ

2. చిత్రగ్రీవం చిన్నతనంలో చురుకుగా ఉండేది కాదు – గీత గీసిన పదానికి వ్యుత్పత్యర్థం గుర్తించండి. (June 2018)
A) చిత్రమైన వర్ణాలతో కూడిన కంఠం గలది.
B) చిత్రమైన ముక్కు గలది.
C) చిత్రమైన శరీరం గలది.
D) చిత్రమైన చూపులు గలది.
జవాబు:
A) చిత్రమైన వర్ణాలతో కూడిన కంఠం గలది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 12 చిత్రగ్రీవం

3. “అంధకారమనే అజ్ఞానమును పోగొట్టువాడు” – అనే వ్యుత్పత్త్యర్థం గల పదాన్ని గుర్తించండి. (June 2018)
A) మిత్రుడు
B) ఈశ్వరుడు
C) గురువు
D) పుత్రుడు
జవాబు:
C) గురువు

4. “భ, జ, స, నల, గగ” అనే గణాలతో కూడిన పద్యం పేరును గుర్తించండి. (June 2018)
A) సీసము
B) కందము
C) మత్తేభము
D) శార్దూలము
జవాబు:
B) కందము

5. “నాకు ఎగరడం తెలుసును” అని చిత్రగ్రీవం అన్నది – దీనికి పరోక్ష కథనం గుర్తించండి. (March 2018)
A) ‘నాకు తెలుసును ఎగరడం’ అని చిత్రగ్రీవం అన్నది.
B) ‘నాకు తెలియదు ఎగరడం’ అని చిత్రగ్రీవం అన్నది.
C) తనకు ఎగరడం తెలుసునని చిత్రగ్రీవం అన్నది.
D) తనకు ఎగరడం తెలుసునని చిత్రగ్రీవం అనలేదు.
జవాబు:
C) తనకు ఎగరడం తెలుసునని చిత్రగ్రీవం అన్నది.

చదవండి – తెలుసుకోండి

విశ్వకవి “గీతాంజలి”

సాహిత్య సృజనలో అంతర్జాతీయ కీర్తినందుకొన్న మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్. కవిగా, రచయితగా, తత్త్వవేత్తగా, సంగీతజ్ఞుడిగా, చిత్రకారుడిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు. వీరి పేరు వినగానే చప్పున స్ఫురించేవి “జనగణమన” గీతం, “గీతాంజలి”. “జనగణమన” గీతం భారత జాతీయ గీతంగా గుర్తింపబడింది. బంగ్లాదేశ్ జాతీయ గీతం కూడా వీరి లేఖిని నుండి వెలువడినదే. ఇలా రెండు జాతీయ గీతాలనందించిన కవిగా అపూర్వ చరిత్రను సృష్టించారు. “శాంతినికేతన్” పేరున ఆదర్శ విద్యాలయాన్ని స్థాపించి “గురుదేవుడు”గా కీర్తింపబడ్డారు. ఈ సంస్థ ద్వారా సంస్కారయుక్తమైన విద్యనందించారు.

కవిగా వీరికి ప్రపంచవ్యాప్త గుర్తింపును తెచ్చిన రచన “గీతాంజలి” 1913లో దీనికి “నోబెల్ సాహిత్య పురస్కారం” దక్కింది. నోబెల్ బహుమతిని అందుకున్న తొలి భారతీయుడిగా ఠాగూర్ అరుదైన గౌరవాన్ని పొందారు. “గీతాంజలి” భారతీయ భాషల్లోకి మాత్రమేకాక విదేశీయ భాషలెన్నింటిలోకి అనువాదమయింది. ఒక్క తెలుగు భాషలోనే దాదాపు 50 దాకా అనువాదాలొచ్చాయంటే దీని గొప్పదనమేమిటో ఊహించవచ్చు. తాత్త్విక, సామాజిక అంశాలను స్పృశిస్తూ సాగిన ఈ రచన పాఠకుని హృదయాన్ని కదిలిస్తుంది.

“గీతాంజలి” లోని రెండు అనువాద కవితా ఖండికలను ఇప్పుడు చూద్దాం.

1. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో
ఎక్కడ మనుషులు తలెత్తి తిరుగుతారో
ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో
సంసారపు గోడలమధ్య ఎక్కడ భాగాల కింద ప్రపంచం విడిపోలేదో
ఎక్కడ సత్యాంతరాళంలోంచి పలుకులు బైలు వెడలతాయో
ఎక్కడ అలసటనెరగని శ్రమ తన బాహువుల్ని పరిపూర్ణతవైపు జాస్తుందో
ఎక్కడ నిర్జీవమైన ఆచారపుటెడారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో
ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకీ, కార్యాలలోకీ నీచే నడపబడుతుందో
ఆ స్వేచ్ఛా స్వర్గానికి, తండ్రీ, నా దేశాన్ని మేల్కొలుపు. – చలం

2. నా హృదయంలోని పేదరికాన్ని సమూలంగా తొలగించు ప్రభూ – ఇదే నా ప్రార్థన.
నా సుఖదుఃఖాలను తేలికగా భరించగలిగే శక్తిని నాకు ప్రసాదించు.
సేవలోనే నా ప్రేమను ఫలింపజేసుకొనే శక్తిని అందజేయి.
పేదలను కాదనకుండా, అధికార దర్పానికి దాసోహమనకుండా ఉండే శక్తిని ప్రసాదించు.
దైనందిన అల్పవిషయాలకు అతీతంగా బుద్ధిని నిలుపుకోగల శక్తిని ప్రసాదించు.
నీ అభీష్టానికి ప్రేమతో నా శక్తిని అర్పించుకోగలిగే శక్తి నివ్వు. – డా॥ జె భాగ్యలక్ష్మి

AP SSC 10th Class Telugu Important Questions Chapter 11 భిక్ష

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Important Questions Chapter 11 భిక్ష

AP State Syllabus SSC 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష

10th Class Telugu 11th Lesson భిక్ష 2 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
“ఇవ్వాటిమీద నాగ్రహముదగునె?” అనే మాటలు ఎవరు ఎవరితో ఏ సందర్భంలో అన్నారు? (March 2017)
జవాబు:
ఈ వాక్యం భిక్ష పాఠంలోనిది. కాశీ మహా నగరంలో వేదవ్యాస మహర్షికి ఎవ్వరూ భిక్ష పెట్టలేదు. దానితో ఆయనకు కోపం వచ్చింది. కాశీని శపించబోయాడు. అంతలో పార్వతీదేవి ప్రాకృత వేషంలో వచ్చింది. భోజనానికి రమ్మంది. వేదవ్యాసునికి బుద్ధులు చెపుతూ కాశీ మహానగరం మీద కోప్పడడం తప్పని చెప్పింది.

ప్రశ్న 2.
భిక్ష పాఠ్యాంశ నేపథ్యం రాయండి.
జవాబు:
వేదవ్యాస మహర్షి తన 10 వేలమంది శిష్యులతో కాశీలో నివసిస్తున్నాడు. ఋషి ధర్మంగా భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. శివుడు వ్యాసుని పరీక్షించాలనుకొన్నాడు. అతనికి భిక్ష దొరకకుండా చేయుమని తన భార్య పార్వతీదేవికి చెప్పాడు. ఆమె కాశీ నగర స్త్రీల హృదయాలలో ప్రవేశించి భిక్ష దొరకకుండా చేసింది.

ప్రశ్న 3.
భిక్ష పాఠం ఎవరు రచించారు? ఆయన గురించి రాయండి.
జవాబు:
భిక్ష పాఠం శ్రీనాథ మహాకవి రచించాడు. ఆయన రచించిన కాశీఖండం సప్తమాశ్వాసంలోనిది.

శ్రీనాథుడు 1380-1470 మధ్య జీవించాడు. అనగా 15వ శతాబ్ది కవి. రాజమహేంద్రవరంలో రెడ్డిరాజుల కొలువులో ఆస్థానకవి. మారయ, భీమాంబలు శ్రీనాథుని తల్లిదండ్రులు.

‘కవి సార్వభౌమ’ బిరుదాంకితుడు. పెదకోమటి వేమారెడ్డి కొలువులో విద్యాధికారి. ప్రౌఢ దేవరాయల ఆస్థానంలోని గౌడడిండిమ భట్టును పాండిత్యంలో ఓడించాడు. అతని కంచుఢక్కను పగులకొట్టించాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 11 భిక్ష

ప్రశ్న 4.
శ్రీనాథుని రచనా శైలిని, సాహిత్య సేవను వివరించండి.
జవాబు:
శ్రీనాథుడు చిన్నతనం నుండే కావ్యరచన ప్రారంభించాడు. మరుత్తరాట్చరిత్ర, కాశీఖండం, శృంగారనైషధం మొదలైనవి రచించాడు.

చమత్కారానికీ, లోకానుశీలనకు, రసజ్ఞతకు, ఆయన జీవిత విధానానికి అద్దంపట్టే చాటువులు చాలా ఉన్నాయి. ఆయన కవిత్వం ఉద్దండలీల, ఉభయ వాక్రౌఢి, రసాభ్యుచిత బంధం, సూక్తి వైచిత్రి వంటి లక్షణాలతో ఉంటుంది.

సీస పద్య రచనలో ఆయనకు ఆయనే సాటి. వృద్ధాప్యంలో కష్టాలనుభవించాడు.

ప్రశ్న 5.
వ్యాసునికి కోపకారణం తదనంతర పరిణామాలను వివరించండి.
జవాబు:
వ్యాసుడు కాశీనగరంలో శిష్యులతో భిక్ష కోసం తిరిగాడు. ఈశ్వరుని మాయతో వరుసగా రెండు రోజులపాటు ఎవరూ ఆయనకు భిక్ష పెట్టలేదు. దానితో వ్యాసుడు భిక్షాపాత్రను పగులకొట్టి, కాశీవాసులకు మూడు తరాలదాకా ధనం, విద్య, మోక్షం లేకుండుగాక అని శపించబోయాడు.

అప్పుడు పార్వతీదేవి కాశీ నగరాన్ని శపించడం తప్పని, ఉన్న ఊరు కన్నతల్లితో సమానమని వ్యాసుడిని మందలించి, వ్యాసుడిని తన ఇంటికి భోజనానికి రమ్మని పిలిచింది. వ్యాసుడు, తన పదివేల శిష్యులు తినకుండా, తాను తినననే వ్రతం తనకు ఉందన్నాడు. అప్పుడు అందరికీ భోజనం పెడతాననీ శిష్యులతో తన ఇంటికి రమ్మని పార్వతి పిలిచింది.

వ్యాసుడు గంగలో స్నానం చేసి శిష్యులతో పార్వతీదేవి ఇంటికి వచ్చాడు. పార్వతి వారందరికీ భోజనం వడ్డించింది.

ప్రశ్న 6.
‘వ్రతము తప్పి భుజింపంగ వలను గాదు’ – ఈ మాటలు ఎవరు ఎవరితో ఏ సందర్భంగా అన్నారు?
జవాబు:
‘వ్రతము తప్పి భుజింపంగ వలనుగాదు’ అని వ్యాసుడు సామాన్య స్త్రీవలె కనబడిన అన్నపూర్ణాదేవితో అన్నాడు. వ్యాసుడు తనకు రెండు రోజులుగా కాశీలో భిక్ష దొరకలేదని కోపించి కాశీనగరమును శపించబోయాడు. అప్పుడు అన్నపూర్ణాదేవి సామాన్య స్త్రీవలె కనబడి, వ్యాసుని మందలించి, తన ఇంటికి భోజనానికి రమ్మని వ్యాసుడిని పిలిచింది.

అప్పుడు వ్యాసుడు తనకు పదివేల మంది శిష్యులు ఉన్నారనీ, వారందరితో కలిసి భుజించే వ్రతం తనకు ఉందనీ, ఆ వ్రతాన్ని విడిచి పెట్టి తాను ఒక్కడూ ‘భోజనానికి రాననీ చెప్పిన సందర్భంలో ఈ మాటను అన్నపూర్ణాదేవితో ఆయన చెప్పాడు.

ప్రశ్న 7.
కాశీ పట్టణంలో స్త్రీలు అతిథులను ఎలా ఆదరించేవారు?
జవాబు:
కాశీనగరంలోని స్త్రీలు అన్నపూర్ణాదేవికి ప్రియమైన స్నేహితురాండ్రు. వారు వాకిట్లో ఆవుపేడతో చక్కగా అలికి, నాలుగు అంచులూ కలిసేలా దానిపై ముగ్గు పెడతారు. ఆ ముగ్గు మధ్యలో నచ్చిన అతిథిని నిలిపి, వారికి అర్హపాద్యాలు ఇస్తారు. వారికి పూలతో, గంధముతో పూజ చేస్తారు.

తరువాత బంగారు గరిటెతో అన్నముపై ఆవునేయిని అభిఘరిస్తారు. తరువాత భక్తి విశ్వాసాలు కనబరుస్తూ, పండ్లతో, పరమాన్నముతో, పలురకాల పిండివంటలతో, గాజులు గలగల ధ్వని చేస్తుండగా, యతీశ్వరులకు వారు మాధుకర భిక్ష పెడతారు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 11 భిక్ష

ప్రశ్న 8.
కోపం తగదని అన్నపూర్ణాదేవి వ్యాసునికి ఏయే ఉదాహరణల పూర్వకంగా తెలిపింది?
జవాబు:
వ్యాసుడికి కోపం తగదని అన్నపూర్ణాదేవి ఈ కింది విధంగా చెప్పి, ఆయనను మందలించింది.

“ఓ మహర్షీ! నీవు ఇప్పుడు గొంతుదాకా తినడానికి భిక్షాన్నము దొరకలేదని చిందులు వేస్తున్నావు. ఇది మంచిపని కాదు. నీవు నిజంగా శాంత స్వభావం కలవాడవు కాదు. ఎందుకంటే, ఎంతో మంది మునులు పిడికెడు వరిగింజలతో కాలం వెళ్ళదీస్తున్నారు. మరికొందరు శాకాహారంతో, దుంపలతో సరిపెట్టుకుంటున్నారు. కొందరు వరిమళ్ళలో రాలిన ధాన్యం కంకులు ఏరుకొని దానితో బతుకుతున్నారు. మరికొందరు మునులు రోళ్ళ దగ్గర జారిపడిన బియ్యం ఏరుకొని బతుకుతున్నారు. వారంతా నీ కంటె తెలివితక్కువవారు కాదు కదా ! ఆలోచించు.

అదీగాక ఉన్నఊరు, కన్నతల్లి వంటిది. కాశీ నగరం శివునికి భార్య. “నీవంటివాడు అటువంటి కాశీ నగరాన్ని భిక్ష దొరకలేదని కోపించడం తగదు.” ఈ ఉదాహరణలతో అన్నపూర్ణాదేవి వ్యాసుడిని మందలించింది.

10th Class Telugu 11th Lesson భిక్ష 4 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
“భిక్ష” పాఠ్యభాగ కథను మీ మాటల్లో వివరించండి. (June 2018)
జవాబు:

  1. వ్యాసమహర్షి శిష్యులతో మండుటెండలో కాశీనగర బ్రాహ్మణ వీధులందు భిక్ష కోసం తిరుగసాగాడు.
  2. ఒక ఇల్లాలు వండుతున్నామని చెప్పగా మరో గృహిణి మళ్ళీ రమ్మని చెబుతుంది. ఇంకొక ఆవిడ వ్రతం అని చెబితే, వేరొక ఇల్లాలు అసలు తలుపులే తెరువదు.
  3. కాశీ నగర గృహిణులు అన్నపూర్ణాదేవికి ప్రియమైన చెలులు. అతిథిని పరమేశ్వర స్వరూపంగా భావించి సకల మర్యాదలతో భిక్ష సమర్పిస్తారు. అలాంటి స్త్రీలున్న కాశీలో ఒక్కరు కూడా భిక్ష సమర్పించకపోవడంతో వ్యాసుడు ఆశ్చర్యపోయాడు.
  4. మరుసటి రోజు కూడా విశ్వనాథుని మాయ వలన భిక్ష లభించకపోవడంతో వ్యాసుడు కోపావేశాలకు లోనై కాశీనగర జనులను శపించబోయాడు.
  5. అప్పుడు పార్వతీదేవి సామాన్య స్త్రీ వేషంలో బ్రాహ్మణ మందిరపు వాకిట నిల్చి, వ్యాసుడిని ఇటు రమ్మని పిల్చి “ఓ మునివరా ! ‘ఉన్న ఊరు కన్నతల్లితో సమానం’ అని నీవెరుగవా ? ఈ కాశీనగరిపై ఇంత కోపం తగునా ?” అని సున్నితంగా మందలించింది.
  6. “మా ఇంటికి భోజనానికి రా !” అని పార్వతీదేవి పిలువగా, శిష్యులను వదలి పెట్టి భుజించరాదన్న తన నియమాన్ని వ్యాసుడు వెల్లడించాడు. ఆమె తాను విశ్వనాథుని దయవలన ఎంతమంది అతిథులకైనా భోజనం పెట్టగలనని తెల్సింది. వ్యాసుడు తన శిష్యులతో పాటు, గంగానదిలో స్నాన, ఆచమనాలు ముగించి, భోజనానికి వచ్చాడు.

ప్రశ్న 2.
“కోపం మంచి చెడులను గ్రహించే జ్ఞానాన్ని నశింపచేస్తుంది” – భిక్ష పాఠ్యభాగం ఆధారంగా నిరూపించండి. March 2018
జవాబు:

  1. బ్రహ్మజ్ఞానియైన వేదవ్యాసుడు తన పదివేలమంది శిష్యులతో కాశీలో కొంతకాలం నివసించాడు. ఆ సమయంలో శిష్యులతో కలిసి భిక్షాటనం చేసి జీవించేవాడు. ఒక రోజున కాశీ విశ్వనాథుడికి వ్యాసుణ్ణి పరీక్షించాలన్న సంకల్పం కలిగింది.
  2. పరమేశ్వర సంకల్పం వలన పట్టపగలు మండుటెండలో భిక్షాటనం చేస్తున్న వ్యాసునికి భిక్ష లభించలేదు. “నేను ఈ రోజు ఏ పాపిష్టి వాడి ముఖం చేశానో” అని వ్యాసుడు చింతించాడు. ఆ రోజుకు ఉపవాసం ఉండి మరునాడు భిక్ష కోసం తిరుగసాగాడు. కానీ విశ్వనాథుని మాయ వలన ఏ ఇల్లాలూ భిక్ష పెట్టలేదు.
  3. కోపంతో ఆలోచనాశక్తిని కోల్పోయిన వ్యాసుడు భిక్షపాత్రను నట్టనడివీథిలో విసిరికొట్టి ముక్కలు చేశాడు. ఈ కాశీ నగరంలో నివసించే వారికి మూడు తరాలదాక ధనము, విద్య, మోక్షము లభించకుండుగాక !” అని శపించబోయాడు.
  4. మహర్షులు మనోనిగ్రహం కలిగి ఉండాలి. కోపాన్ని జయించాలి. సంయమనాన్ని (ఓర్పును) వహించాలి. కానీ వ్యాసుడు అలా చేయలేకపోయాడు. వేదాలను విభజించినవాడు, అష్టాదశ పురాణాలను రచించిన వాడైన వ్యాసుడు తన గొప్పతనానికి తగినట్లు ప్రవర్తించక, మితిమీరిన కోపావేశాలకు లోనయ్యాడు. పార్వతీ పరమేశ్వరుల ఆగ్రహానికి గురియైనాడు.
  5. కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే ఎంతటివారికైనా తిప్పలు తప్పవనే విషయం వ్యాసుని ప్రవర్తన ద్వారా
    నిరూపితమైంది. “కోపం ఆలోచనాశక్తిని నశింపజేస్తుంది” అనటానికి వ్యాసుని వృత్తాంతమే నిదర్శనమని చెప్పవచ్చు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 11 భిక్ష

ప్రశ్న 3.
క్రింది పాత్రల స్వభావాలను రాయండి.
జవాబు:
1. వ్యాసమహర్షి :
వేద విభజన చేశాడు. 18 పురాణాలు రచించాడు. 10 వేల మంది శిష్యులకు విద్య నేర్పేవాడు. ఋషి ధర్మంగా భిక్షాటన చేసినవాడు. రెండు రోజులు భిక్ష దొరకలేదు. తన శిష్యుల ఆకలి చూడలేక కాశీని శపించబోయాడు. అంటే కాశీని కూడా శపించగల మహా తపస్సంపన్నుడు. అన్నపూర్ణాదేవి స్వయంగా పిలిచి భిక్షను పెట్టింది. అంటే అన్నపూర్ణాదేవిని కూడా ప్రత్యక్షం చేసుకోగల పుణ్యాత్ముడు. ఆ జగన్మాత చేతి వంటను రుచి చూసిన మహాభాగ్యశాలి. కాని తన కోపం కారణంగా ఆ వైభవాలను కోల్పోయాడు. అల్పసంతోషి. తక్షణ కోపం కలవాడు.

2. కాశీలోని సామాన్య స్త్రీలు :
చక్కగా అలికి ముగ్గులు పెట్టి, ఇల్లు కలకలలాడుతూ ఉంచే స్వభావం కలవారు. అతిథులను సాక్షాత్తు దైవంగా భావించి పూజిస్తారు. బంగారు కంచంలో పిండి వంటలతో అన్నం పెడతారు. భిక్షుకులకు లేదు అనే మాట వారినోట రాదు. వారి హృదయాలలో నిరంతరం అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది. కాశీలోని స్త్రీలు అన్నపూర్ణాదేవికి చెలికత్తెలు. అంతటి పుణ్యస్త్రీలు ఎక్కడా కనిపించరు. వారికి వారేసాటి.

3. అన్నపూర్ణాదేవి (పార్వతీదేవి) :
కేవలం భిక్ష దొరకనంత మాత్రాన ఇంత బాధపడిపోతావా? ఇది మంచిదా? అని బిడ్డను తల్లి మందలించినట్లు వ్యాసుని మందలించింది. పిడికెడు బియ్యం వండుకొని తినే వారున్నారు. కేవలం కాయలు తినే వారున్నారు. ఇంకా రకరకాల వారున్నారు కదా! వారంతా నీకంటే తెలివితక్కువ వారా! అని ప్రశ్నించింది.

ఒక బిడ్డకు తల్లి చెప్పే నీతులు, మందలింపులు, పోలికలు, ప్రశ్నలు సంధిస్తూ పార్వతీదేవి ఒక పెద్ద ముత్తైదువగా కనిపిస్తుంది. పరిపూర్ణ మాతృత్వం మూర్తీభవించినట్లుగా అన్నపూర్ణాదేవి స్వభావం కనిపిస్తుంది.

ప్రశ్న 4.
అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమవడానికి కారణాలు వివరించండి.
జవాబు:
వేదవ్యాసుడు ఒకనాడు కాశీనగరంలో తన పదివేల మంది శిష్యులతో భిక్ష కోసం బ్రాహ్మణ వీధులలో ఇంటింటికీ తిరిగాడు. ఎవరూ వారికి భిక్ష పెట్టలేదు. సామాన్యంగా కాశీనగరంలోని బ్రాహ్మణ స్త్రీలు, రోజూ అతిథులకు ఆదరంగా మాధుకర భిక్ష పెడుతూ ఉంటారు. కానీ ఆనాడు వ్యాసుడికి ఎవరూ భిక్ష పెట్టలేదు. ఒకామె ‘అన్నం వండుతున్నాము’ అంది. మరొక స్త్రీ ‘మళ్ళీ రండి’ అంది. ఒకామె తమ ఇంట్లో దేవకార్యం అని చెప్పింది.

ఆ రోజుకు ఎలాగో ఉపవాసం ఉందామనీ, మరునాడు తప్పక భిక్ష దొరుకుతుందని వ్యాసుడు నిశ్చయించాడు. మరుసటి రోజున వ్యాసుడు శిష్యులతో భిక్షాటనకు వెళ్ళాడు. ఈశ్వరుడి మాయవల్ల ఆ రోజు కూడా ఆయనకు కాశీ నగరంలో ఎవరూ భిక్ష పెట్టలేదు.

దానితో వ్యాసుడు కోపంతో తన భిక్షాపాత్రను పగులకొట్టి, కాశీవాసులకు మూడు తరాల వరకూ ధనము, మోక్షము, విద్య లేకుండుగాక అని శపించడానికి సిద్ధమయ్యాడు.

అప్పుడు అన్నపూర్ణాదేవి, ఒక బ్రాహ్మణ భవనం వాకిటిలో సామాన్య స్త్రీవలె ప్రత్యక్షమయ్యింది. వ్యాసుడు కాశీ నగరాన్ని శపించకుండా అడ్డుపడి, ఆయనను మందలించడానికే అన్నపూర్ణాదేవి అలా ప్రత్యక్షమయ్యింది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 11 భిక్ష

ప్రశ్న 5.
‘కోపం అన్ని అనర్ధాలకు కారణం అని ఎలా చెప్పగలవు?
(లేదా)
కోపం మనిషి విచక్షణను కోల్పోయేలా చేస్తుంది అనే విషయాన్ని భక్ష పొఠం ఆధారంగా వివరించండి.
జవాబు:
“కోపం వస్తే నేను మనిషిని కాను” అని అంటూ ఉంటారు. అది నిజమే. కోపం వస్తే తనను తాను మరచి, మనిషి రాక్షసుడు అవుతాడు. ఆ కోపంతో తాను ఏమి చేస్తున్నాడో, తెలిసికోలేడు. కోపంలోనే అన్నదమ్ములనూ, అక్క చెల్లెండ్రనూ, చివరకు కట్టుకొన్న భార్యనూ, కన్నపిల్లల్నీ కూడా చంపుతూ ఉంటారు. కాబట్టి కోపం మంచిది కాదు.

ఈ కథలో వ్యాసుడి అంతటి బ్రహ్మజ్ఞాని రెండు రోజులు భిక్ష దొరకలేదని కాశీ నగరాన్నే శపించబోయాడు. భర్తృహరి నీతి శతకంలో “క్షమ కవచంబు క్రోధమది శత్రువు” అంటాడు. అంటే ఓర్పు కవచం లాంటిది.
కోపం శత్రువు లాంటిది అని అర్థం. శత్రువులాంటి కోపాన్ని విడిచి పెట్టాలి.

దుర్యోధనుడికి పాండవుల పైన, భీముడి మీద కోపం. అందుకే వారితో తగవు పెట్టుకొని యుద్ధంలో తాను మరణించాడు. దేవతలపై కోపంతోనే, రాక్షసులు అందరూ మరణించారు. “కోపమునను ఘనత కొంచెమైపోవును” అని వేమన కవి చెప్పాడు.

కాబట్టి మనిషి కోపాన్ని అణచుకోవాలి. కోపము మనిషికి శత్రువు వంటిది. “తన కోపమే తన శత్రువు” అంటాడు సుమతీ శతక కర్త. కాబట్టి కోపం విడిచి పెట్టాలి.

ప్రశ్న 6.
‘ఆవేశం ఆలోచనలను నశింపచేస్తుంది’ – మీ పాఠం ఆధారంగా సమర్థించండి.
జవాబు:
కోపం వస్తే, ఆవేశం వస్తుంది. ఆవేశంలో ఏది మంచిదో, ఏది చెడ్డదో గ్రహించే వివేచన శక్తి మనిషికి నశిస్తుంది. దానితో అతడు తప్పుడు పనులకు సిద్ధం అవుతాడు. ఆవేశంతో కట్టుకున్న భార్యను, కన్న పిల్లల్నీ కూడా చంపడానికి సిద్ధం అవుతాడు.

కోపం యొక్క ఆవేశంలో అష్టాదశ పురాణాలు రచించిన వ్యాసమహర్షి అంతటివాడు, కన్నతల్లి వంటి కాశీ నగరాన్నే శపించబోయాడు. వ్యాసమహర్షి పదివేలమంది శిష్యులకు గురువు. నిత్యం కాశీ నగరంలో శిష్యులతో భిక్షకు వెళ్ళి ఆ భిక్షాన్నం తిని జీవించేవాడు. వ్యాసుడిని పరీక్షించాలని శివుడు భావించాడు. అన్నపూర్ణాదేవితో చెప్పి ఎవరూ వ్యాసునికి భిక్ష పెట్టకుండా చేశాడు.

ఒక రోజున వ్యాసుడికి, శిష్యులకూ ఎవరూ భిక్ష పెట్టలేదు. ఆ రోజు కాకపోయినా, మరునాడు తప్పక భిక్ష దొరకుతుందని వారు అనుకున్నారు. మరునాడు కూడా వ్యాసునికి ఎవరూ భిక్ష పెట్టలేదు.

దానితో వ్యాసుడు కోపంవల్ల వచ్చిన ఆవేశంతో, ఉద్రేకంతో తాను నివసిస్తున్న కాశీ నగరాన్నే శపించబోయాడు. ఉన్న ఊరు కన్నతల్లితో సమానం అంటారు. భిక్ష దొరకలేదనే ఆవేశంతో, వ్యాసుడు కాశీ నగరవాసులకు మూడు తరాల దాక విద్య, ధనము, మోక్షము లేకుండా పోవుగాక అని శపించబోయాడు.

దీనినిబట్టి ఆవేశం, ఆలోచనలను నశింపజేస్తుంది అని మనకు తెలుస్తోంది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 11 భిక్ష

ప్రశ్న 7.
అన్నపూర్ణాదేవి పాత్ర స్వభావం వివరించండి.
జవాబు:
పార్వతీ స్వరూపం :
అన్నపూర్ణాదేవి కాశీ విశ్వేశ్వరుని ఇల్లాలు. పరమశివుని భార్య పార్వతీదేవినే, కాశీ నగరంలో అన్నపూర్ణాదేవి అని అంటారు. అన్నపూర్ణా విశ్వేశ్వరులు ఒకసారి కాశీ నగరంలో శిష్యులతో నివసిస్తున్న వ్యాసమహర్షిని పరీక్షిద్దాం అనుకున్నారు.

ఆదిశక్తి :
కాశీ నగరంలో అన్నం కావలసిన వారందరికీ అన్నపూర్ణాదేవి భిక్ష పెడుతుంది. కాశీ నగరంలోని బ్రాహ్మణ స్త్రీలు అందరూ అన్నపూర్ణాదేవికి స్నేహితురాండ్రు. అన్నపూర్ణాదేవి వేదపురాణ శాస్త్ర మార్గాన్ని చక్కగా పాటించే ముత్తయిదువ. ఆమె కాశీనగర బంగారుపీఠాన్ని అధిష్ఠించిన ఆదిశక్తి.

ఆతిధ్యము :
వ్యాసుడు కాశీ నగరాన్ని శపించకుండా అన్నపూర్ణాదేవి అడ్డుపడింది. ఒక బ్రాహ్మణ గృహద్వారం దగ్గర సామాన్య స్త్రీ వలె ఆమె ప్రత్యక్షమై, వ్యాసుడిని మందలించింది. తన ఇంటికి వ్యాసుడినీ, శిష్యులనూ భోజనానికి పిలిచి, వారికి కడుపునిండా భోజనం పెట్టింది.

మాట చాతుర్యం :
అన్నపూర్ణాదేవి మాటలలో మంచి నేర్పు ఉంది. “గొంతు దాకా తిండిలేదని గంతులు వేస్తున్నావు. మహర్షులు పిడికెడు నివ్వరి గింజలతో, కాయగూరలతో తృప్తి పడుతున్నారు కదా” అని వ్యాసుడిని చక్కగా మందలించింది. ఉన్న ఊరు కన్నతల్లి వంటిదని, కాశీ నగరం శివుడికి ఇల్లాలని, వ్యాసుడికి గుర్తు చేసింది. వ్యాసుడు అంతటివాడు కాశీని శపించడం తగదని హితవు చెప్పింది.

దీనినిబట్టి అన్నపూర్ణాదేవి మహాసాధ్వి అని, మంచి మాట చాతుర్యం కలదని, అతిథులకు అన్నం పెట్టే ఉత్తమ ఇల్లాలు అని తెలుస్తుంది.

10th Class Telugu 11th Lesson భిక్ష Important Questions and Answers

ప్రశ్న 1.
యాచన మంచిదికాదు అని చెబుతూ కరపత్రం తయారు చేయండి.
జవాబు:
యాచన మానండి – మాన్నించండి
ఆత్మాభిమానానికి గొడ్డలిపెట్టు యాచన. మర్యాదకు సమాధి యాచన. దరిద్రానికి పునాది యాచన.

అందుకే యాచన మానండి. కష్టపడండి. కాసులను ఆర్జించండి. దరిద్రాన్ని తరిమికొట్టండి. మీకెదురైన యాచకులకు ఆత్మసైర్యాన్ని కల్గించండి. జీవన మార్గాన్ని నిర్దేశించండి. ఉపాధి మార్గాలు చూపించండి. వృద్ధులైతే వృద్ధాశ్రమాల్లో చేర్చండి. అనాథలైతే అనాథాశ్రమాలలో చేర్పించండి. వారూ మన సోదరులే. వారిని ఉద్దరించడం, వారిలో ఆత్మాభిమానం కల్గించడం మన సామాజిక బాధ్యత.

ఇట్లు,
యాచనా వ్యతిరేక సంఘం.

ప్రశ్న 2.
కోపంవల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
‘కోపం – అనర్థాలు’

కోపము చెడ్డ లక్షణం. మనకు వ్యతిరేకంగా మాట్లాడితే, పనిచేస్తే, మనకు కోపం వస్తుంది. అనుకున్న పని జరుగకపోతే, కోపం వస్తుంది. కోపం వల్ల మోహం వస్తుంది. మోహం వల్ల బుద్ది నశిస్తుంది. బుద్ధి నశిస్తే మనిషి నశిస్తాడు అని గీత చెపుతోంది.

కోపంవల్ల చాలా అనర్థాలు సంభవిస్తాయి. మనిషి విచక్షణ శక్తిని కోల్పోతాడు. మనిషి కోపంలో తాను ఏమి చేస్తున్నాడో తెలిసికోలేడు. కోపంలో మనిషి తల్లిదండ్రులనూ, భార్యాబిడ్డలనూ, గురువులనూ సహితం, చంపడానికి సిద్ధం అవుతాడు. కోపంతో పగబట్టి మనిషి శత్రువులను చంపడానికి ప్రయత్నిస్తాడు.

కోపం మంచిదికాదని, మనకు పురాణాలు కూడా చెపుతున్నాయి. విశ్వామిత్రుడు, దుర్వాసుడు వంటి మహర్షులు, కోపంతో విచక్షణ పోగొట్టుకొని, ఎన్నో చిక్కులు పడ్డారు. విశ్వామిత్రుడు వశిష్ఠుడి చేతిలో భంగపడ్డాడు.

దుర్యోధనుడు పాండవులపై కోపంతో యుద్ధానికి దిగి, సర్వనాశనం అయ్యాడు. దుర్వాస మహర్షి అంబరీషుడిపై కోపపడి తానే కష్టాలపాలయ్యాడు. వ్యాసుడి వంటి బ్రహ్మజ్ఞాని కోపంతో కాశీని శపించబోయాడు.

కోపం మంచిది కాదని, మనకు నీతిశతకాలు చెపుతున్నాయి. భర్తృహరి “క్రోధమది శత్రువు” అని చెప్పాడు! “కోపమునను ఘనత కొంచెమైపోవును” అని వేమన చెప్పాడు. “తన కోపమె తన శత్రువు” అని సుమతీశతకం చెప్పింది.

అందువల్ల మనము కోపాన్ని విడిచి, శాంతముగా బ్రతకాలి. ‘శాంతమే భూషణము’ అని మనం గ్రహించాలి.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 11 భిక్ష

ప్రశ్న 3.
కోపంవల్ల గౌరవం తగ్గుతుందనే విషయాన్ని వివరిస్తూ ఒక కరపత్రం రాయండి.
జవాబు:
కోపం – గౌరవహీనం మిత్రులారా!

ఒక్కసారి ఆలోచించండి. మనం ప్రతి చిన్న విషయానికీ కోపం తెచ్చుకుంటూ ఉంటాము. కోపం అన్ని అనర్ధాలకూ మూలకారణం. కోపంవల్ల విచక్షణా జ్ఞానం నశిస్తుంది. ముఖ్యంగా చీటికీ మాటికీ కోపపడే వ్యక్తులకు, సంఘంలో గౌరవం తగ్గుతుంది. కోపం ఉన్న వ్యక్తి, ఇతరుల మనస్సులను జయించలేడు. నవ్వుతూ మాట్లాడే వ్యక్తి, ప్రపంచాన్నే జయిస్తాడు.

క్రోధం వల్ల మోహం, మోహంవల్ల బుద్ధి నాశనం కల్గుతాయని భగవద్గీత చెప్పింది. పురాణాలలో చెప్పబడే మునులలో విశ్వామిత్రుడు, దుర్వాసుడు సులభకోపులు. కోపంవల్ల వారు ఎన్నో చిక్కులు పడ్డారని, ఇతరులను అకారణంగా వారు హింసించారని పురాణాలు చెపుతున్నాయి. కోపం మనిషికి గౌరవ హీనతను తెస్తుంది. కోపం మనిషి వివేకాన్ని పాతర వేస్తుంది.

అందుకే మనం కోపాన్ని దూరంగా పెడదాం. తన కోపం తన శత్రువు అని సుమతీశతకం చెప్పినమాట గుర్తు పెట్టుకుందాము. కోపంవల్ల ఆయుర్దాయం తగ్గుతుంది. గుండె బలం తగ్గుతుంది. పిల్లలకు కోపంతో చెప్పిన దానికంటె, నవ్వుతో చెప్పినధి సులభంగా ఎక్కుతుంది. కార్యసాధనకు కోపం మహాశత్రువు అని గుర్తించండి. కోపానికి తిలోదకాలు ఇవ్వండి. నవ్వుకు, ఆనందానికి స్వాగతం పలకండి. పదికాలాలపాటు ఆరోగ్యంగా బ్రతకండి. కోపాన్ని విడిచిపెడతాం అని మనం ప్రతిజ్ఞ చేద్దాం. పదండి. కదలండి.
ఇట్లు,
ఆరోగ్య మిత్ర సంఘం,
గుంటూరు యువత.

10th Class Telugu 11th Lesson భిక్ష 1 Mark Bits

1. గురుశిష్యులు మండుటెండలో భిక్ష కోసం తిరిగారు – గీత గీసిన పదానికి విడదీసిన రూపాన్ని గుర్తించండి. (June 2017)
A) మండుట + ఎండ
B) మండు + టెండ
C) మండు + ఎండ
D) మండుట + అండ
జవాబు:
C) మండు + ఎండ

2. పార్వతి కాశీనగరమును శపించబోయిన వ్యాసుని మందలించింది – గీత గీసిన పదంలోని సమాసమేది ? (June 2017)
A) ఉపమాన ఉత్తరపద కర్మధారయం
B) సంభావనా పూర్వపద కర్మధారయం
C) అవధారణా పూర్వపద కర్మధారయం
D) విశేషణ పూర్వపద కర్మధారయం
జవాబు:
B) సంభావనా పూర్వపద కర్మధారయం

3. మునివర ! నీవు శిష్యగణముంగొని చయ్యన రమ్మువిశ్వనా – ఇది ఏ పద్యపాదమో గుర్తించండి. (June 2017)
A) మత్తేభం
B) ఉత్పలమాల
C) శార్దూలం
D) చంపకమాల
జవాబు:
D) చంపకమాల

4. మేఘుడంబుధికి పోయి జలంబులు తెచ్చి ఇస్తాడు. లోకోపకర్తలకిది సహజగుణము – ఇందులోని అలంకారాన్ని గుర్తించండి. (June 2017)
A) అర్థాంతరన్యాసం
B) రూపకం
C) స్వభావోక్తి
D) అంత్యానుప్రాసం
జవాబు:
A) అర్థాంతరన్యాసం

AP SSC 10th Class Telugu Important Questions Chapter 11 భిక్ష

5. విజ్ఞానం కోసం విహారయాత్రలు చేయాలి – (గీత గీసిన పదమునకు వికృతిని గుర్తించండి.) (March 2017)
A) యంత్రము
B) ప్రయత్నం
C) జతనం
D) జాతర
జవాబు:
D) జాతర

6. సామాన్యాన్ని విశేషంతో గానీ, విశేషాన్ని సామాన్యంతో గాని సమర్థించి చెప్పే అలంకారం గుర్తించండి. (June 2018)
A) శ్లేష
B) ఉత్ప్రేక్ష
C) రూపకము
D) అర్థాంతరన్యాసము
జవాబు:
D) అర్థాంతరన్యాసము

7. ‘స్వభావం చేతనే ఐశ్వర్యం గలవాడు” అను వ్యుత్పత్యర్ధము గల్గిన పదమును గుర్తించుము. (March 2018)
A) భాగ్యశాలి
B) సంపన్నుడు
C) ధనికుడు
D) ఈశ్వరుడు
జవాబు:
D) ఈశ్వరుడు

8. భవాని ఒక పెద్ద ముత్తైదువ రూపంలో వచ్చి వ్యాసుణ్ణి మందలించింది – గీత గీసిన పదానికి సరైన వ్యుత్పత్యర్థాన్ని గుర్తించుము. (March 2018)
A) ఇంద్రుని భార్య
B) భవుని భార్య
C) విష్ణువు భార్య
D) సూర్యుని భార్య
జవాబు:
B) భవుని భార్య

9. పద్యములోని మొదటి అక్షరమును ఏమంటామో గుర్తించండి?
A) ప్రాస
B) యతి
C) పాదం
D) పదం
జవాబు:
B) యతి

10. మాయింటికిం గుడువ రమ్ము ! (ఆధునిక వచన వాక్యాన్ని గుర్తించండి.) (June 2017)
A) మాయింటికి భోజనానికి రావద్దు
B) మాయింటిలో అన్నం వండేందుకు రా
C) మాయింటికి భోజనానికి రా !
D) మాయింటికి భోజనానికి రాబోకుమా
జవాబు:
C) మాయింటికి భోజనానికి రా !

11. ఏ పాపాత్ముని ముఖంబు నీక్షించితినో – ఈ వాక్యానికి ఆధునిక వచనాన్ని గుర్తించండి. (March 2017)
A) ఏ పాపాత్ముని చూసానో నేను
B) ఏ పాపాత్ముని ముఖాన్ని చూసానో
C) ఏ పాపాత్ముని ముఖాన్ని చూడలేదు
D) ఏ పాపాత్ముని చూడలేదు నేను
జవాబు:
B) ఏ పాపాత్ముని ముఖాన్ని చూసానో

AP SSC 10th Class Telugu Important Questions Chapter 11 భిక్ష

12. బౌద్ధ భిక్షువులచే వేలాది దీపాలు వెలిగించబడ్డాయి – దీనికి కర్తరి వాక్యం గుర్తించండి. (March 2018)
A) బౌద్ధ భిక్షువులు వేలాది దీపాలను వెలిగించారు.
B) బౌద్ధ భిక్షువులు వేలాది దీపాలను వెలిగించలేదు.
C) వేలాది దీపాలు బౌద్ధ భిక్షువులచే వెలిగించారు.
D) బౌద్ధ భిక్షువులు వేలాది దీపాలను వెలిగిస్తారు.
జవాబు:
A) బౌద్ధ భిక్షువులు వేలాది దీపాలను వెలిగించారు.

13. హరిహర బ్రహ్మలను పురిటి బిడ్డలను చేసిన పురంద్రీ లలామ అనసూయ – గీత గీసిన పదానికి సరైన వ్యుత్పత్యర్థాన్ని రాయండి. (March 2019)
జవాబు:
గృహమును ధరించునది

14. ఆకంఠంబుగ నిష్ణు మాధుకర భిక్షాన్నంబు భక్షింపఁగా – ఇది ఏ పద్యపాదము?
జవాబు:
శార్దూలము

15. అర్థాంతరన్యాసాలంకారానికి ఉదాహరణ
జవాబు:
హనుమంతుడు సముద్రమును లంఘించెను. మహాత్ములకు సాధ్యం కానిది లేదుగదా !

చదవండి – తెలుసుకోండి

మాట్లాడటమూ ఒక కళ

మనసులోని భావాన్ని ఎదుటివారికి తెలియజేసే మాధ్యమం మాట. మాటకున్న శక్తి గొప్పది. అది అవతలివారిని మెప్పించగలదు, నొప్పించగలదు, ఆపదల నుండి తప్పించగలదు. మాట్లాడటం ఒక కళ. శబ్దశక్తి తెలిసిన వానికే ఈ కళ కరతలామలకమవుతుంది.

ఒకాయన మెట్లు దిగుతున్నాడు. అదే సమయంలో మరొకాయన మెట్లు ఎక్కుతున్నాడు. దారి ఇరుకుగా ఉంది. ఇద్దరూ మధ్యలో ఎదురుపడ్డారు. కింద నుండి వస్తున్న అతనికి కోపమెక్కువ పై నుండి దిగుతున్న వానితో ‘నేను మూర్ఖులకు దారివ్వను’ అన్నాడు. వెంటనే ఎదుటివాడు ఏమాత్రం తడుముకోకుండా ‘పరవాలేదు నేనిస్తాను’ అన్నాడు. ఇప్పుడు ఎవడు మూర్ఖుడయ్యాడు?

ఒకావిడ ఇంకొకావిడతో పేచీ పెట్టుకున్నది. కోపంతో రెచ్చిపోయి ‘ఛీ కుళ్కా’ అనేసింది. అవతలావిడ ‘ఏమత్కా?” అన్నది. ఈ ముక్కతో మొదటావిడ తిక్క కుదిరింది.

తాంబూలం వేసుకోడానికి వెళ్ళాడో పెద్దమనిషి. తమలపాకులు కట్టేవానితో ‘ఏయ్, ఆకులో సున్నం తక్కువవేయి, దవడ పగులుతుంది’ అంటూ పక్కనేవున్న అరటిపండ్ల గెలకు చేయి ఆనించి నిలబడ్డాడు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న తమలపాకులవాడు ‘ఏమయ్యోయ్, చెయ్యితియ్యి, పండ్లు రాలుతాయి’ అన్నాడు. మాటకు మాట, దెబ్బకు దెబ్బ.

సాహిత్యాభిలాషియైన ఒకడు కవిని కలిశాడు. ఎంతోకాలం నుండి తన మనసులో దాచుకున్న ఆశను బయటపెట్టాడు. ‘అయ్యా, నాకు ఏదైనా నాటికను రాసివ్వండి’ అనడిగాడు. దానికి బదులిస్తూ ఆ కవి ‘ఓ! దానికేముంది ఏనాటికైనా రాస్తాను’ అని అభయమిచ్చాడు.

ఒక పెండ్లి వేడుకలో కొందరు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఒక పెద్దాయన ‘మీవయసెంతండి’ అనడిగారు. దానితా పెద్దమనిషి ‘ఏడేళ్ళు’ అన్నాడు. అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఎంత పెద్దమనిషైతే మాత్రం ఇంతగా పరిహాసమాడుతారా అని నిలదీశారు. అతడన్నాడు. ‘నేను నిజమే చెప్పాను నాకు ఏడేళ్ళు (7 x 7 = 49) అన్నాడు. అసలు విషయం తెలుసుకుని అందరూ గొల్లున నవ్వేశారు.

బజారులో వెళుతున్న ఒకతనికి మిత్రుడు తారసపడ్డాడు. చాలాకాలమైంది వాళ్ళు కలుసుకొని. మిత్రుడు చెప్పులు లేకుండా ఉండడం చూసి విషయమేమిటని ప్రశ్నించాడు. దానికి బదులిస్తూ ‘చెప్పుకొనుటకే మున్నద’ని పెదవి విరిచాడా మిత్రుడు.

తను తీయబోయే సినిమా విషయంలో నిర్మాత ఒక కవి దగ్గరకు వెళ్లాడు. ‘నా సినిమాత పాట రాస్తారా?” అని అభ్యర్థించాడు. దానికి కవి రాస్తారా’ అన్నాడు. ఎంత కవియైతే మాత్రం ఇంత అహంతారంగా తనను ‘రా’ అంటాడా అనుకున్నాడు నిర్మాత. అతని ఆంతర్యం గ్రహించిన కవి అయ్యా, నన్ను తప్పుగా అనుకుంటున్నట్లున్నారు నేనన్నది ‘రాస్తా, రా’ అని. హమ్మయ్య అనుకున్నాడు.

ఇలా మాటలలో విరుపులు మెరుపులను సృష్టిస్తాయి. వ్యంగ్యం గిలిగింతలు పెడుతుంది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 10 గోరంతదీపాలు

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Important Questions Chapter 10 గోరంతదీపాలు

AP State Syllabus SSC 10th Class Telugu Important Questions 10th Lesson గోరంతదీపాలు

10th Class Telugu 10th Lesson గోరంతదీపాలు 2 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
గోరంత దీపాలు పాఠం ఎవరు రచించారు? రచయిత గురించి వ్రాయండి.
జవాబు:
గోరంత దీపాలు పాఠం పులికంటి కృష్ణారెడ్డిగారు రచించారు. ఆయన 30.7.1931న చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలోని ‘జక్కదన్న’ గ్రామంలో జన్మించారు. తండ్రి గోవిందరెడ్డి, తల్లి పాపమ్మ. 18.11.2007లో తిరుపతిలో స్వర్గస్తులయ్యారు.

ఆయన రాయలసీమ కథానికా రచయిత, నటుడు, జానపద కళాకారుడు, కవి, నాటక రచయిత, బుర్రకథా కళాకారుడు. పునర్జన్మ నాటకంలో వృద్ధుని పాత్రను తొలిసారిగా ఆయన ధరించారు.

ప్రశ్న 2.
పులికంటి కృష్ణారెడ్డిగారి సాహిత్యసేవను వివరించండి.
జవాబు:
పులికంటివారు నటనలో అసమాన ప్రతిభ కనబరిచారు. 150 కథలు రచించారు. వాటిలో 14 కథలకు బహుమతులు అందుకొన్నారు. ‘గూడులేని గువ్వలు’ కథ తొలికథగా ఆయన కలం నుండి జాలువారింది.

కుటుంబ సంక్షేమం, వాతావరణ కాలుష్యం, పొదుపు మొదలైన సామాజిక అంశాలపై 100కు పైగా బుర్రకథలు వ్రాసి, ప్రదర్శించారు.

ఆంధ్రప్రభ దినపత్రికలో ‘నాలుగ్గాళ్ళ మండపం’ శీర్షికను 67 వారాలు నిర్వహించారు. దీనిలో గ్రామీణ రైతుల జీవితాన్ని రాయలసీమ మాండలికంలో చిత్రించారు.

ప్రశ్న 3.
పులికంటి వారు అందుకొన్న పురస్కారాలు, చేసిన సత్కారాలు వివరించండి.
జవాబు:
2001లో తెలుగు విశ్వవిద్యాలయం, పులికంటి కృష్ణారెడ్డిగారిని ఘనంగా సత్కరించింది. 2003లో గోపీచంద్ అవార్డు ఆయనను వరించింది.

2005లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి పురస్కారం అందుకొన్నారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ స్వీకరించారు.

2000వ సంవత్సరంలో ‘పులికంటి సాహితీ సంస్కృతి’ని పులికంటి కృష్ణారెడ్డిగారు ప్రారంభించారు. ఈ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో 18 మందిని సన్మానించారు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 10 గోరంతదీపాలు

ప్రశ్న 4.
‘గోరంత దీపాలు’ కథానిక ద్వారా మీరేమి గ్రహించారు?
జవాబు:

  1. అనాథ బాలురు కొడిగట్టిన దీపాలు వంటివారు. కొంచెం సానుభూతితో కొడిని దులిపి నూనెపోసి వత్తి ఎగదోస్తే, ఆ గోరంతదీపం ఎప్పటికో అప్పటికి, గొప్ప వెలుగును ఇస్తుంది.
  2. ప్రతి వ్యక్తి మానవత్వంతో దిక్కులేని వారికి, తనకు ఉన్నంతలో సాయం చేయాలి.
  3. దిక్కులేని వాళ్ళను చేరదీసి ఆశ్రయమిస్తే ఆశ్రయం పొందిన వ్యక్తి, జీవితాంతం ఆశ్రయం ఇచ్చిన వారికి కృతజ్ఞతగా ఉంటాడు.
  4. తమ సహాయంతో అనాథలు అభివృద్ధిలోకి వస్తే, సాయంచేసిన వారి మనస్సు ఆనందంతో నిండిపోతుంది.
  5. అనాథలకు మన శక్తి కొలదీ చేయూతను అందించాలి.

ప్రశ్న 5.
కుర్రవాడి బ్రతుకు మీద వృద్ధుడు చేసిన ప్రయత్నం ఏమిటి? దాని ఫలితం ఎలా ఉంది?
జవాబు:
ఆ వృద్ధుడు కావాలని ఐదు రూపాయిల కాగితం, రైలులో తన సీటు కింద పడవేశాడు. రైలు తుడిచే పిల్లవాడు నిజాయితీ గల పిల్లవాడు. అందువల్లనే ఆ నోటును తీసి వృద్దుడికి తిరిగి ఇచ్చాడు.

ఆ పిల్లవాడు నిజాయితీ గలవాడనీ, చేరదీసి చదివిస్తే బాగుపడతాడనీ వృద్ధుడు అనుకున్నాడు. అదే మాట ఆ కుర్రాడికి చెప్పాడు. ఆ కుర్రవాడు వృద్ధుడితో వెళ్ళడానికి అంగీకరించాడు. వృద్ధుడు ఆ పిల్లవాడిని తన విద్యానగరం పాఠశాలలో ఉంచి, చదివించి అతడికి ఉద్యోగం వచ్చాక పెళ్ళి కూడా చేశాడు.

ప్రశ్న 6.
కుర్రవాడి బ్రతుకు మీద వృద్ధుడు చేసిన ప్రయత్నం ఫలించిందా? వివరించండి.
జవాబు:
ఒక వృద్ధుడు రైలులో ప్రయాణం చేస్తూ ఉంటే రైలు పెట్టెలు తుడుస్తూ ప్రయాణికులు ఇచ్చే డబ్బులతో పొట్ట పోసుకొనే ఒక కుర్రవాడు ఆయనకు కనిపించాడు. ఆ పిల్లవాడు నిజాయితీ గలవాడు. వృద్ధుడు, ఆ కుర్రవాడు నిజాయితీపరుడని గ్రహించాడు. అతడిని చేరదీసి చదివిస్తే బాగుపడతాడని వృద్ధుడు అనుకున్నాడు. పిల్లవాడు కూడా చదువుకుంటానని చెప్పాడు.

ఆ కుర్రవాడిని ఆ వృద్ధుడు తాను నడిపే విద్యానగరం పాఠశాలలో చేర్చి చదివించాడు. ఆ కుర్రవాడు శ్రద్ధగా చదివాడు. ఉద్యోగం సంపాదించాడు. తరువాత ఆ వృద్ధుడు ఆ కుర్రవాడికి పెళ్ళి చేశాడు. ఈ విధంగా వృద్దుడి ప్రయత్నం చక్కగా ఫలించింది.

ప్రశ్న 7.
‘చదువుకొనే వయసులో సంపాదనపైకి దృష్టి పోకూడదు’ ఈ వాక్యంపై మీ అభిప్రాయం రాయండి.
జవాబు:
చదువుకొనే రోజులలో పిల్లల దృష్టి పూర్తిగా వారి చదువుల పైనే ఉండాలి. కాని కొందరు పిల్లలు తీరిక సమయాల్లో ఏదో విధంగా డబ్బులు సంపాదిస్తూ ఖర్చు పెట్టుకుంటారు. కొందరు పిల్లలకు ఏదోరకంగా సంపాదింపవలసిన అవసరాలు కూడా ఉంటాయి.

పేపర్లు వేయడం, పెట్రోలు బంకుల్లో పనిచేయడం, తండ్రి చేసే వృత్తుల పనుల్లో సాయం చెయ్యడం ద్వారా వారు సంపాదిస్తారు. అందువల్ల వారి దృష్టి చదువులపై పూర్తిగా పెట్టలేరు. సంపాదించే డబ్బుతో విలాసాలకు వారు అలవాటు పడతారు. సినిమాలకు పోతారు. సిగరెట్లు వగైరాలకు అలవాటు పడతారు.

కాబట్టి చదువుకొనే వయసులో సంపాదనపై దృష్టి పెట్టరాదు. దానివల్ల వారి చదువులు సక్రమంగా సాగవు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 10 గోరంతదీపాలు

ప్రశ్న 8.
‘ఏకాంతంలో పుస్తకాలను మించిన నేస్తం లేదు’ దీనిపై మీ అభిప్రాయాన్ని వ్యక్తీకరించండి.
జవాబు:
ఒంటరిగా ఉన్నప్పుడు మనతో మాట్లాడే స్నేహితులు ఎవరూ ఉండరు. అలాంటప్పుడు ఏదో మంచి పుస్తకాన్ని తీసుకొని చదువుకుంటే, హాయిగా కాలం గడుస్తుంది. ప్రక్కన కబుర్లు చెప్పేవారు లేరనే బెంగ కూడా ఉండదు.

పుస్తకాలు స్నేహితుడిలా ఆనందాన్ని ఇస్తాయి. మంచి పుస్తకం చదువుతూ ఉంటే, కాలమే తెలియదు. కాబట్టి పుస్తకం ఒంటరిగా ఉన్నప్పుడు మన నేస్తం అనే మాటతో నేను ఏకీభవిస్తాను.

10th Class Telugu 10th Lesson గోరంతదీపాలు 4 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘ఒక వ్యక్తి ఆలోచన ఆచరణగా మారితే ఏర్పడిన మహాసంస్థ ఎన్నో కొడిగట్టిన దీపాలకు ఆశ్రయమిచ్చింది.’ గోరంత దీపాలు పాఠం ఆధారంగా వివరించండి. (June 2017)
జవాబు:
అనాథ బాలురు గోరంత దీపాల వంటివాళ్ళు. ఆ దీపాలను నిలుపుతున్న వ్యక్తి ఒక వృద్ధుడు.

వృద్ధుడు దీనజనబాంధవుడు. విద్యానగరం అనే విద్యాలయం కట్టించాడు. అక్కడ బాలబాలికలకు వసతి గృహాలు, అతిథులకు గదులు, వయస్సులో పెద్దవాళ్ళకు వసతులు, గ్రంథాలయం, ప్రార్థనాలయం ఏర్పాటుచేశాడు.

వృద్ధుడు విద్యానగరంలో మకుటం లేని మహారాజు, దిక్కులేని వారినందరినీ అక్కడకు చేర్చి, వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పించేవాడు. అక్కడ వందలాది మంది ఉపాధ్యాయుల్ని నియమించి, వేలాదిమంది పిల్లలకు చదువు చెప్పించేవాడు. దానికయిన ఖర్చు అంతా ఆయనే భరించేవాడు.

ఎవరయినా ఈ వృద్ధుణ్ణి స్వార్థం కల మనిషి అని నిందించినా, ఆయన తన ధ్యేయాన్ని విడిచి పెట్టేవాడు కాదు. రైల్లో అడుక్కుతింటున్న పిల్లవాణ్ణి తనతో తీసుకువచ్చి చదువు చెప్పించి పెళ్ళిచేశాడు. ఆ పిల్లవాడు ప్రతి పుట్టినరోజుకీ వచ్చి ఈ వృద్ధుడిని కలిసి, కృతజ్ఞత వెల్లడించేవాడు. పిల్లవాడికి తన యందుకల ప్రేమకు వృద్ధుడి మనస్సు పొంగిపోయేది. ఆ వృద్ధుని పిలుపులో ఆప్యాయత ఉండేది.

విద్యానగరంలో చదువుకొంటున్న పిల్లల్ని చూసి వృద్ధుడు ఆనందానుభూతిలో తేలిపోయేవాడు. వృద్ధుని మాటలు అక్షరసత్యాలు. ఈ విధంగా వృద్ధుడి ఆలోచనతో ఒక మహాసంస్థ వెలిసింది. ఎన్నో కొడిగట్టిన దీపాలకు అతడు ఆశ్రయం ఇచ్చాడు. ఆ వృద్ధుడు వెలిగించిన ఎన్నో గోరంత దీపాలు, కొండంత వెలుగునిచ్చాయి.

ప్రశ్న 2.
చిన్నతనంలో చదువుకొంటే పెద్దవయసులో బాగా సంపాదించవచ్చు. ఈ అభిప్రాయాన్ని సమర్థిస్తారా? చర్చించండి.
జవాబు:
చిన్న వయస్సులో చదువుకుంటే పెద్ద వయస్సులో సంపాదించుకోవచ్చు అని వృద్ధుడు రైలు తుడుస్తున్న పిల్లవాడితో అన్నాడు.

రైలు తుడుస్తున్న పిల్లవాడు చిన్న పిల్లవాడు. కాబట్టి రైలు తుడుస్తూ ప్రయాణీకులు ఇచ్చిన డబ్బులతో బతికేసేవాడు. వృద్ధుడు చెప్పినట్లు ఆ పిల్లవాడు పెద్దవాడు అయితే, సిగ్గు విడిచి అలా తుడవలేడు. డబ్బు సంపాదించలేడు. అదీగాక అందరూ అతణ్ణి తప్పుపడతారు.

కాబట్టి వృద్ధుడు చెప్పినట్లు అతడు అతనితో వెళ్ళి చదువుకున్నాడు. శ్రద్ధగా చదివాడు. ఉద్యోగం సంపాదించి పెద్ద అయ్యాక హాయిగా పెళ్ళి చేసుకొని సుఖంగా బ్రతికాడు.

కాబట్టి వృద్ధుడు పిల్లవాడితో అన్నమాట సరయిన మాట. పిల్లలందరూ బాల్యంలో చక్కగా చదువుకోవాలి. అప్పుడు వారు పెద్దతనంలో చక్కగా సంపాదించుకోవచ్చు.

ప్రశ్న 3.
క్రింది పాత్రల స్వభావాలను రాయండి.
జవాబు:
1. వృద్ధుడు :
అనాథలను చేరదీసి విద్యాబుద్ధులు చెప్పిస్తాడు. సమాజంలోని పేదలను, అనాథలను ఆదుకొనే స్వభావం కలవాడు. సమాజం పట్ల బాధ్యత గలవాడు. వయోవృద్ధులకు కూడా సదుపాయం కల్పించాడు. సమాజం పట్టించుకోని వారికి పెద్ద దిక్కు అయ్యాడు. తన వద్ద పెరిగిన అనాథలు ఉన్నత స్థితిలో ఉంటే చూసి, ఆనందించే స్వభావం కలవాడు. తనను విమర్శించే వారిని కూడా పట్టించుకోకుండా సేవ చేసే మహామనీషి.

2. కుర్రవాడు :
అనాథ. రైలు పెట్టెలు తుడిచేవాడు. వృద్ధుని దయతో విద్యానగరం వచ్చాడు. చక్కగా చదువుకొన్నాడు. మంచి ఉద్యోగం సంపాదించుకొన్నాడు. వృద్ధుని పట్ల అమితమైన కృతజ్ఞతను ప్రదర్శించాడు. తన కన్నీటితో వృద్ధుని పాదాలకు అభిషేకం చేశాడు. మేలు చేసిన వారిని భగవంతునితో సమానంగా పూజించే అత్యుత్తమ సంస్కారం కలవాడు. వినయం కలవాడు. ‘మంచివాడు’ అనడానికి సరిపోయే అన్ని లక్షణాలు ఉన్నవాడు.

3. రచయిత :
వృద్ధుని స్నేహితుడు. వృద్ధుని మంచితనాన్ని, గొప్పతనాన్ని ఆకళింపు చేసుకొన్న వ్యక్తి. పరిశీలనాత్మకంగా, విశ్లేషణాత్మకంగా సమాజాన్ని పరిశీలిస్తాడు. వృద్ధునిలోని ఆలోచనా ధోరణిని అభినందించిన సంస్కారి. గోరంతదీపాలు ఇచ్చే కొండంత వెలుగులో తన పాత్ర కూడా గోరంత ఉండాలని తపించే స్వభావం కలవాడు. ఓర్పు, నేర్పు కలవాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 10 గోరంతదీపాలు

ప్రశ్న 4.
గోరంత దీపాలు కథలో వృద్ధుని గూర్చి వివరించండి.
(లేదా)
“గోరంత దీపాలు” కథానికలో వృద్ధుడు చేసిన సమాజసేవను వివరిస్తూ అతని గొప్పతనాన్ని తెలియజేయండి. (March 2019)
జవాబు:
గోరంత దీపాలు కథలో వృద్ధుడు దీనజన బాంధవుడు. ఆయన విద్యానగరం అనే విద్యాలయం కట్టించాడు. అక్కడ బాలబాలికలకు వసతి గృహాలు, అతిథులకు గదులు, వయస్సులో పెద్దవాళ్ళకు వసతులు, గ్రంథాలయం, ప్రార్థనాలయం కట్టించాడు.

దిక్కులేని పిల్లలను తన పాఠశాలలో చేర్చి, వారికి భోజనం పెట్టి చదువు చెప్పించేవాడు. అక్కడ వందల కొద్దీ ఉపాధ్యాయులను నియమించి, వేలాది పిల్లలకు చదువు చెప్పించేవాడు. దానికయిన మొత్తం ఖర్చును తానే భరించేవాడు.

ఇతరులు ఆయన్ని విమర్శించినా, ఆయన పట్టించుకొనేవాడు కాదు. రైలులో అడుక్కుతింటున్న పిల్లవాడిని తీసుకువచ్చి ఆయన వాడికి చదువు చెప్పించి పెళ్ళి చేశాడు. ఆ విద్యానగరంలో చదువుకొనే పిల్లల్ని చూసి ఆ వృద్ధుడు మురిసిపోయేవాడు. ఆయన కొడిగట్టిన దీపాలవంటివారికి ఆశ్రయం ఇచ్చి వారి జీవితాలను కొండంత దీపాలుగా వెలిగించాడు. ఆయన మహానుభావుడు, ఉత్తముడు.

ప్రశ్న 5.
వృద్ధునికి ప్రయోజకుడైన యువకుడికి గల అనుబంధాన్ని వివరించండి.
జవాబు:
ఒకసారి వృద్ధుడు రైలులో ప్రయాణం చేస్తున్నాడు. దానిలో ఒక పిల్లవాడు రైలు పెట్టి తుడుస్తూ అడుక్కుంటున్నాడు. వృద్ధుడికి ఆ పిల్లవాడి మనస్తత్వాన్ని పరీక్షించాలని బుద్ధిపుట్టింది. ఐదు రూపాయల నోటు కింద జారవిడిచాడు. ఆ పిల్లవాడు నోటును తీసి వృద్దుడికి అప్పగించాడు. ఆ పిల్లవాడిని చదివించి వృద్ధిలోకి తేవాలని వృద్ధుడు అనుకున్నాడు. పిల్లవాడు సరే అని, వృద్ధుని వెంట వెళ్ళి విద్యాలయంలో శ్రద్ధగా చదివి ఉద్యోగం కూడా సంపాదించాడు. వృద్ధుడు ఆ యువకుడికి పెళ్ళి కూడా చేశాడు.

ఆ యువకుడికి ఆ వృద్ధునిపై ఎంతో కృతజ్ఞత ఉంది. వృద్ధుడు ఆ యువకుడిని ప్రేమగా చూసేవాడు. ఆ యువకుడికి పుట్టినరోజు ఎప్పుడో కూడా తెలియదు. ఆ యువకుడు విద్యాలయంలో చేరిన రోజునే, తన పుట్టినరోజుగా ఆ యువకుడు భావించేవాడు.

యువకుడు ఎక్కడ ఉన్నా, వృద్ధుడు ఎక్కడ ఉన్నా యువకుడు తన పుట్టినరోజున తప్పకుండా వచ్చి ఆ వృద్ధుడి కాళ్ళు పట్టుకొని ఆ వృద్ధుడి పాదాలను, తన ఆనందబాష్పాలతో ముంచెత్తేవాడు. ఆ వృద్ధుడు ఆ యువకుడిని ఆశీర్వదించి, తన ఆనందబాష్పాలతో యువకుడి తలను తడిపివేసేవాడు. వారి మధ్యన ఉన్న అనుబంధం అనిర్వచనీయం.

10th Class Telugu 10th Lesson గోరంతదీపాలు Important Questions and Answers

ప్రశ్న 1.
‘అనాథ బాలలకు చేయూతనందిస్తే ఎంతటి స్థాయికైనా ఎదుగగలరు’ – ఈ అంశంపై వ్యాసం వ్రాయండి.
జవాబు:
‘అనాథ బాలలు – చేయూత’

తల్లిదండ్రులు లేని పిల్లలను అనాథ బాలలు అంటారు. అలాగే తల్లిదండ్రులకు డబ్బులేక, చదువు సంధ్యలు చదువుకోకుండా వీథి బాలలుగా తిరిగే దిక్కులేని పిల్లలు ఉంటారు. కొందరు పిల్లలు తల్లిదండ్రులపై కోపగించుకొని పారిపోయి రోడ్లపై బిచ్చం ఎత్తుకుంటూ, రైళ్ళల్లో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ అనాథలుగా తిరుగుతారు. ఇలాంటి అనాథలకు రక్షణ కల్పించి వారు చదువుకోడానికి ఆశ్రయం కల్పిస్తే వారు కూడా మంచిగా పెరిగి అభివృద్ధిలోకి వస్తారు. ఆ గోరంత దీపాలను కొండంత దీపాలుగా చేయడానికి సంఘంలోని సంపన్నులూ, దాతలూ, అనాథ శరణాలయాలవారూ, ప్రభుత్వమూ సహాయం చేయాలి.

ఈనాడు దేశంలో ఎన్నో అనాథ శరణాలయాలు ఉన్నాయి. వారు ప్రజల నుండి చందాలు వసూలు చేసి అనాథ బాలబాలికలకు ఆశ్రయం కల్పించి, వారిని పెద్దవారిని చేసి వారికి పెళ్ళిళ్ళు చేయిస్తున్నారు. ఇటువంటి అనాథ శరణాలయాలకు డబ్బు కలవారు విరివిగా విరాళాలు ఇవ్వాలి. అనాథ బాలబాలికలకు తోడుగా నిలవాలి.

డబ్బు కలవారు, దాతలు, ఉదారహృదయం కలవారు తమ సంపాదనలో కొంత భాగం అనాథలకు కేటాయించాలి. అలా ఇచ్చి అనాథలను పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించాలి. అలా చేస్తే వారు పెద్దవారై ఎంతో ఉన్నత స్థానాన్ని తప్పక పొందుతారు. అటువంటి అనాథలు పెద్దవారై డాక్టర్లుగా, ప్రజాపరిపాలకులుగా, ఇంజనీర్లుగా తయారవుతారు. ప్రభుత్వం కూడా అనాథ శరణాలయాలను స్థాపించి, అనాథ బాలబాలికలకు చేయూతను అందివ్వాలి. అప్పుడే ఆ గోరంత దీపాలు పెద్దవై, కొండంత వెలుగును ఇస్తాయి. అనాథ బాలబాలికలకు సాయంచేస్తే దేవుడు కూడా సంతోషించి వారికి మోక్షాన్ని, సంపదలను, సౌఖ్యాన్ని ఇస్తాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 10 గోరంతదీపాలు

ప్రశ్న 2.
అనాథలను ఆదుకొన్న మీ మామయ్యను అభినందిస్తూ లేఖ వ్రాయండి.
జవాబు:

నెల్లూరు,
x x x x x.

పూజ్యులైన చిన్న మామయ్యకు నమస్కరించి,
మీ మేనకోడలు పద్మ వ్రాయు లేఖ.

ఇక్కడంతా క్షేమం. అక్కడ మీరంతా క్షేమమని తలచెదను.

మొన్న తుపాను మీ ప్రాంతంలో చాలా భీభత్సం సృష్టించిందని టీ.వీ. లో చూశాను. పేపర్లో చదివాను. చాలా కంగారు పడ్డాము. మా అమ్మా నాన్నా మిమ్మల్ని చూసి వచ్చేక నాకొక సంగతి చెప్పారు.

ఒక కుటుంబంలో తుపానుకు ఇల్లు కూలి అందరూ మరణించారనీ, ముగ్గురు చిన్నపిల్లలు మిగిలారనీ, ఆ పిల్లలను మీరు పెంచుతున్నారనీ మా అమ్మ చెప్పింది. అంతేకాకుండా చాలామందికి ఆహారం, బట్టలు అందించారని కూడా చెప్పారు. మీ పరోపకార బుద్ధికి నాకు చాలా ఆనందం కల్గింది.

నా స్నేహితులకు మీ మంచి మనసు గురించి చెప్పాను. వాళ్ళంతా చాలా ఆనందించారు. మీ మేనకోడలిని అయినందుకు చాలా గర్వపడ్డాను. కేవలం మాటలు కాకుండా, చేతలతో మంచి చేసే మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను, అభినందిస్తున్నాను. అత్తయ్యకు నా నమస్కారాలు.

ఇట్లు,
మీ మేనకోడలు,
వి. పద్మ.

చిరునామా :
ఎస్. నరసింహారావుగారు,
తెలుగు ఉపాధ్యాయులు,
బాలికోన్నత పాఠశాల,
నరసరావుపేట, గుంటూరు జిల్లా.

ప్రశ్న 3.
అనాథలను ఆదుకోవలసిన అవసరం గురించి వివరిస్తూ ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:
అమృత హృదయులారా ! ఆదుకోండి

అనాథలను ఆదుకోవడం మన కర్తవ్యం. మానవ సేవే మాధవ సేవ అన్నారు పెద్దలు. తోటి మనిషిని ఆదరించండి. పట్టెడన్నం పెట్టండి. సమాజానికి ఉపయోగపడే మాణిక్యాలను మట్టిలో కలిసిపోనీయకండి. ఇది మన బాధ్యత. వాళ్లు కూడా మన సోదరులే.

భగవంతుడికి ‘దరిద్ర దామోదరుడ’ని పేరు. అనాథలలో దైవాన్ని సందర్శించండి. ఆదరించండి. తీర్చిదిద్దండి. భరతమాత సేవలో పునీతులవ్వండి.

ఇట్లు,
అనాథల పెద్ద అన్న.

10th Class Telugu 10th Lesson గోరంతదీపాలు 1 Mark Bits

1. వ్యవసాయంలో అధిక దిగుబడుల కోసం శాస్త్రవేత్తలు ప్రయత్నం చేయాలి – గీత గీసిన పదాలకు నానార్థమును గుర్తించుము. (March 2017)
A) కృషీవలుడు
B) కృషి
C) కర్షకుడు
D) కారణము
జవాబు:
B) కృషి

2. ప్రజలను పాలించే ప్రభువు దేవతలకు తోడు ఇంద్రుడులా ఉండాలి – గీత గీసిన పదానికి నానార్థమును గుర్తించుము. (March 2017)
A) భర్త
B) రాజు
C) శని
D) ధర్మము
జవాబు:
B) రాజు

3. ఏ వయస్సులో చేయవలసిన దానిని, ఆ సమయంలో చేయకున్నచో జీవితము నరకంతో సమానం కాగలదు – గీత గీసిన పదాలకు సంబంధించిన నానార్థ పదాన్ని గుర్తించుము. (March 2018)
A) ప్రాయము
B) కాయము
C) కార్యము
D) ఆదాయము
జవాబు:
A) ప్రాయము

4. విద్యార్థులు ఎల్లవేళలా చదువుపై దృష్టిని తిరముగా ఉంచుకోవాలి – గీత గీసిన పదానికి ప్రకృతి రూపాన్ని గుర్తించండి. (March 2018)
A) తీరము
B) స్థిరము
C) దూరము
D) భారము
జవాబు:
B) స్థిరము

AP SSC 10th Class Telugu Important Questions Chapter 10 గోరంతదీపాలు

5. రైతులు కష్టపడగలరు. (ఏ వాక్యమో గుర్తించండి ?) (June 2017)
A) సంభావనార్ధకం
B) చేదర్థకం
C) ప్రశ్నార్ధకం
D) సామర్ధ్యార్ధకం
జవాబు:
D) సామర్ధ్యార్ధకం

6. వైద్యుడు ప్రథమ చికిత్స చేసి, మందులు ఇస్తాడు. (ఏ వాక్యమో గుర్తించండి.) (June 2017)
A) క్వార్థకము
B) శత్రర్థకం
C) చేదర్థకం
D) అష్యర్ధకం
జవాబు:
A) క్వార్థకము

7. గోరంత దీపాలు కొండంత వెలుగు నిస్తాయి – దీనికి వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించండి. (March 2018)
A) గోరంత దీపాలు కొండంత వెలుగు నివ్వవు
B) గోరంత దీపాలు కొండంత వెలుగు నివ్వవచ్చు
C) గోరంత దీపాలు కొండంత వెలుగు ఇవ్వగలవు.
D) గోరంత దీపాలు కొండంత వెలుగు ఇవ్వకపోవచ్చు
జవాబు:
A) గోరంత దీపాలు కొండంత వెలుగు నివ్వవు

8. వృద్ధుని చేత బాలుడు రక్షింపబడెను – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి.
A) సామాన్య
B) సంయుక్త
C) కర్తరి
D) కర్మణి
జవాబు:
D) కర్మణి

AP SSC 10th Class Telugu Important Questions Chapter 10 గోరంతదీపాలు

9. వఱదైన చేనుదున్న వద్దు. (ఇది ఏ వాక్యమో గుర్తించండి) (S.A. I – 2018-19)
A) నిషేధార్థక వాక్యం
B) ప్రార్థనార్థక వాక్యం
C) విధ్యర్ధకం
D) సామర్థ్యార్థక వాక్యం
జవాబు:
A) నిషేధార్థక వాక్యం

10. క్రింది వానిలో విధ్యర్థక వాక్యం గుర్తించండి. (S.A. I – 2018-19)
A) చదవ గలరు
B) చదవండి
C) దయచేసి చదవండి
D) చదువుతున్నారు
జవాబు:
B) చదవండి

AP SSC 10th Class Telugu Important Questions Chapter 9 మాణిక్యవీణ

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Important Questions Chapter 9 మాణిక్యవీణ

AP State Syllabus SSC 10th Class Telugu Important Questions 9th Lesson మాణిక్యవీణ

10th Class Telugu 9th Lesson మాణిక్యవీణ 2 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
“చిన్నవాడు మానవుడు – చిరంజీవి మానవుడు” అంటూ చాటిన “విద్వాన్ విశ్వం” గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి. (June 2018)
జవాబు:
1) మాణిక్యవీణ పాఠ్యరచయిత విద్వాన్ విశ్వం కాలము 1915 – 1987.

2) రచనలు : పత్రికా సంపాదకునిగా “అవి-ఇవి, తెలుపు నలుపు, మాణిక్యవీణ” వంటి శీర్షికలతో సంపాదకీయాలు, “ప్రేమించాను” అనే నవల, “ఒకనాడు”, “పెన్నేటిపాట” అనే కావ్యాలు రాశారు.

3) బిరుదులు : కళాప్రపూర్ణ

4) రచనా విధానం : చిన్న చిన్న పదాలు, వాక్యాలతో ధ్వని గర్భితంగా ఉండే కవితలు రచించారు.

ప్రశ్న 2.
మాణిక్య వీణ పాఠం ఎవరు రచించారు? రచయిత గురించి వ్రాయండి.
జవాబు:
మాణిక్య వీణ పాఠం విద్వాన్ విశ్వంగారు రచించారు. ఆయన పూర్తి పేరు మీసరగండ విశ్వరూపాచారి. ఆయన తల్లిదండ్రులు లక్ష్మమ్మ, రామయ్య. విశ్వం అనంతపురం జిల్లా తరిమెల గ్రామంలో జన్మించారు. 21.10.1915 ఆయన పుట్టినరోజు. ఆయన 19.10.1987న స్వర్గస్తులయ్యారు.

ప్రశ్న 3.
విద్వాన్ విశ్వం సాహిత్యసేవ, అందుకొన్న సన్మానాలు వ్రాయండి.
జవాబు:
విద్వాన్ విశ్వం తెలుగు, సంస్కృతం, ఆంగ్లభాషలలో పండితులు. మీజాన్, ప్రజాశక్తి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికలలో పనిచేశారు.

‘కాదంబరి’తో సహా అనేక సంస్కృత గ్రంథాలను తెలుగులోనికి అనువదించారు.

పత్రికలలో ‘అవి-ఇవి’, ‘తెలుపు-నలుపు’, ‘మాణిక్య వీణ’ మొదలైన శీర్షికలతో రచనలు చేశారు. భాష, సాహిత్యం , సమాజం, నైతిక విలువలు మొదలైన అంశాలపై రాసిన విశ్వం సంపాదకీయాలు విలువైనవి. ‘పెన్నేటిపాట’, ‘ఒకనాడు’ అనే కావ్యాలను, ‘ప్రేమించాను’ అనే నవలను రచించారు. కళాప్రపూర్ణ, డి.లిట్. వంటి డిగ్రీలను అందుకొన్నారు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 9 మాణిక్యవీణ

ప్రశ్న 4.
మానవ చరిత్రలోని గొప్ప మలపులేవి?
జవాబు:
మానవ చరిత్రలో క్రింద చెప్పినవన్నీ గొప్ప మలపులు. మానవుడు చక్రం కనుక్కొన్న రోజు, మానవుడు చకచకా నాలుగు గీతలతో అక్షర లిపిని కనుక్కొన్న రోజు, నిప్పును కనిపెట్టిన రోజు, మానవుడు తప్పటడుగులు మాని తాండవం చేసిన రోజు, మానవ చరిత్రలో గొప్ప మలపులు.

అలాగే మానవుడు కిచకిచలు మాని, మంచి భాషలు నేర్చుకొన్నరోజు, చిన్న చిన్న మాటలతో జానపద గీతాలు అల్లుకొన్న రోజు, ధాన్యాన్ని పండించడం నేర్చుకున్న రోజు, లలిత కళలను పండించుకొన్న రోజు కూడా, మానవ చరిత్రలో గొప్ప మలపులు.

ఈ విధంగా మానవుడు చక్రం కనుక్కొన్న రోజు, లిపిని నేర్చిన రోజు, నిప్పును కనుక్కొన్న రోజు, కళలు, కవిత్వము నేర్చిన రోజు మానవ చరిత్రలో అసాధారణ పర్వదినాలని, గొప్ప మలపులు అని చెప్పాలి.

ప్రశ్న 5.
మాణిక్యవీణ పాఠం ఆధారంగా సమాజ రుగ్మతలు అంటే ఏమిటో వివరించండి.
జవాబు:
సమాజ రుగ్మతలు అంటే సమాజానికి అనగా సంఘానికి పట్టిన జబ్బులు.

  1. అంటరానితనాన్ని పాటించడం
  2. కులమత భేదాలు పాటించడం
  3. మూఢనమ్మకాలు కలిగియుండడం
  4. అవినీతి దురాచారం
  5. కులసంఘాలు, మత సంఘాలు మొ||నవి.

10th Class Telugu 9th Lesson మాణిక్యవీణ 4 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
మానవాభివృద్ధిలో చోటు చేసుకున్న మార్పులను “మాణిక్యవీణ” పాఠ్యభాగం ఆధారంగా వివరించండి. (June 2018)
జవాబు:

  1. ప్రకృతిని చూచి పరవశించిన మానవుడు దానిని తన కనుసన్నలలో ఉంచుకొనేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో మానవాభివృద్ధిలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి.
  2. గుహలలో జీవించిన ఆదిమానవుడే గుర్రాల్ని, జింకలను గీస్తూ చిత్రలేఖన నైపుణ్యాన్ని పెంపొందించుకున్నాడు. తన గానమాధుర్యంతో ఎండిన మోడుల్ని చిగురింపజేశాడు.
  3. పాటకు అనుగుణంగా కఠినరాతినేలపై కాళ్ళకు గజ్జెకట్టి గంతులేశాడు. స్వరాల సొబగులతో మనసుకు హత్తుకొనే పాటలు పాడాడు. ఇలా కళలపై అభిరుచిని పెంచుకున్నాడు.
  4. ఈ క్రమంలోనే చక్రాన్ని కనుగొనడం, నిప్పును కనుగొనడం వంటి మార్పులు చోటు చేసుకున్నాయి. చక్రాన్ని కనుగొన్న రోజు ఎంత గొప్పదో చకచకా నాలుగు గీతలతో లిపిని కనుగొన్న రోజూ అంతే ముఖ్యమైనది. చక్రం చలనానికి, లిపి భావ సంచలనానికి వేదికలై సృజనాత్మక ప్రపంచం వైపు మానవుడిని నడిపించాయి.
  5. అరుపుల నుండి అర్థవంతమైన మాటలు నేర్వటం, సారవంతమైన భూమి నుండి భుక్తిని పండించుకోవడం – ఈ మార్పులన్నీ ఆదిమ దశ నుండి ఆధునిక దశ వైపు మానవుడిని అభివృద్ధి పథంలో నడిపించి శాశ్వతుణ్ణి చేశాయి.

ప్రశ్న 2.
“ప్రకృతి ఒడిని పాఠశాలగా చేసుకొని మానవుడు కళాభిరుచిని పెంపొందించుకున్నాడనే” కవి అభిప్రాయాన్ని సమర్థించండి. (March 2018)
జవాబు:

  1. మనిషి కళ్ళు తెరవగానే చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను చూసి పరవశించాడు. ప్రకృతిని తన కనుసన్నలలో ఉంచే ప్రయత్నం చేస్తూ అందలి రంగులను, ధ్వనులను అనుకరించాడు. పూర్తిగా ప్రకృతిలో లీనమైపోయాడు.
  2. గుహలలో జీవించిన ఆదిమానవుడు గుర్రాలను, జింకలను గీస్తూ చిత్రలేఖన నైపుణ్యాన్ని పెంపొందించుకొన్నాడు.
  3. ఆటవికుడుగా ఉన్నప్పుడే తన గాన మాధుర్యంతో ఎండిన మోడులను చిగురింపజేశాడు. పాటకు తగినట్లుగా కఱకు రాతినేలపై కాలికి గజ్జెకట్టి గంతులు వేశాడు. స్వరాల సుకుమారపు నొక్కులతో మనస్సుకు హత్తుకొనేలా పాటలు పాడాడు.
  4. ఊహ తెలిసిన నాటి నుండి ప్రకృతిని ఆరాధిస్తూ తనను తాను మైమరచి పాటలు పాడుతూ ఆనందడోలికల్లో తేలిపోయాడు.
  5. ఈ విధంగా అతడు కళలను తన జీవితంలో ఒక భాగం చేసుకొన్నాడు. ప్రకృతి అతడికి తొలి గురువు. ప్రకృతి ఒడి అతడికి తొలి బడి. కనుక మానవుడు ప్రకృతి ఒడిని పాఠశాలగా చేసుకొని కళాభిరుచిని పెంపొందించుకున్నాడనే కవి అభిప్రాయాలు సంపూర్ణంగా సమర్థించదగినవని నేను భావిస్తున్నాను.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 9 మాణిక్యవీణ

ప్రశ్న 3.
మానవ మహాప్రస్థానంలో కవికి తోడైన వాటిని గూర్చి వివరించండి.
(లేదా)
మానవ మహాప్రస్థానంలో అతనితో పెనవేసుకొనిపోయిన అంశాలేవి? వాటిని కవి ఎలా స్మరించుకున్నాడో వివరించండి. (March 2019)
జవాబు:
మానవ మహాప్రస్థానంలో కవికి కళ, కవిత, విజ్ఞానం తోడుగా ఉన్నాయి. ఆదిమ మానవుడికి కళలు తెలియవు. అతడు ప్రకృతిని చూసి సంతోషించి, దాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం ద్వారా మంచి విజ్ఞానం పొందాడు. చిత్రలేఖనం నేర్చుకున్నాడు. పక్షుల ధ్వనులను అనుకరించాడు. ఎండిన చెట్లు చిగిరించేలా పాడడం నేర్చుకున్నాడు. కాలికి గజ్జెకట్టి నాట్యం నేర్చాడు. మంచి కవిత్వం చెప్పడం నేర్చాడు.

గీతలు గీయడం ద్వారా లిపిని నేర్చుకొని తన అభిప్రాయాన్ని ఇతరులకు తెలుపగలిగాడు. చక్కని గీతాలు చిన్న మాటలతో రాశాడు. ధాన్యం పండించి హాయిగా తింటున్నాడు. మానవుడు తన అలసటను, కళా కవితల ద్వారా పోగొట్టుకుంటున్నాడు. విజ్ఞానం పెంచుకొని చక్రాన్ని కనిపెట్టి దాని ద్వారా వాహనాలు, యంత్రాలు కనిపెట్టాడు. వైజ్ఞానికంగా ఎంతో ముందడుగు వేశాడు. నిప్పును కనిపెట్టి వంటకాలు వండుకు తిన్నాడు.

ఈ విధంగా ఆదిమ మానవుడు, కళలు, కవిత, విజ్ఞానముల ద్వారా మిన్నులు పడిన చోటు నుండి ఆకాశానికి ఎదిగాడు.

ప్రశ్న 4.
మైలు రాళ్ళ వంటి అంశాలు వేటికి గుర్తులుగా మీరు భావిస్తున్నారు?
జవాబు:
విద్వాన్ విశ్వంగారు తన ‘మాణిక్య వీణ’ అనే గేయంలో చరిత్రలో మైలురాళ్ళుగా నిలిచిన కొన్ని విషయాలను గూర్చి పేర్కొన్నాడు.

1) మానవుడు ‘చక్రం’ ను కనుక్కొన్న రోజు చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందన్నారు. అలాగే చకచకా నాలుగు గీతలతో లిపిని కనుక్కొన్న రోజు కూడా విశేషమైనదన్నారు. చక్రం, మానవ చలనానికి దోహదపడింది. ‘లిపి’, భావ సంచలనానికి వేదిక అయి, సృజనాత్మకత ప్రపంచంలోకి దారితీసింది.

2) నిప్పును కనుక్కొన్న రోజు ఎంత గొప్పదో, తప్పటడుగుల చిందుల నుండి, గొప్ప నృత్యాలు చేసిన రోజు కూడా అంతే గొప్పది.

3) అరుపుల నుంచి అర్థవంతమైన మాటలు నేర్చిన రోజు, ఆ మాటలతో జానపద గీతాలు అల్లిన రోజు, సారవంతమైన భూమి నుండి ఆహారం పండించుకున్న రోజు, మనస్సుకు ఆనందం కల్గించే కళ ఆవిష్కరణ జరిగిన రోజు, మొదలయినవి అన్నీ చరిత్రలో మైలురాళ్ళుగా నిలుస్తాయి. అవన్నీ గొప్ప రోజులే.

మానవుని జీవన పరిణామచరిత్రలో అసాధారణ సంఘటనలు జరిగిన ప్రతిరోజూ శుభదినమే అని విద్వాన్ విశ్వంగారు చెప్పారు.

ప్రశ్న 5.
చరిత్రలో మైలురాళ్ళుగా కవి వేటిని గుర్తించాడు? ఎందుకు?
జవాబు:
మానవుడు చక్రాన్ని కనుక్కొన్న రోజు, నిప్పును కనిపెట్టిన రోజు, నాలుగు గీతలతో లిపిని కనుక్కొన్న రోజు, తప్పటడుగులు మాని తాండవ నృత్యం చేసిన రోజు, భాషలు నేర్చుకొన్న రోజు, చిన్న చిన్న మాటలతో పదాలు అల్లుకొన్నరోజు, ధాన్యం పండించుకున్న రోజు కళలను పండించుకొన్న రోజు, మానవ జీవిత చరిత్రలో మైలురాళ్ళుగా నిలుస్తాయని, విద్వాన్ విశ్వంగారు చెప్పారు. పైవన్నీ మానవుడి జీవనయాత్రలో అభ్యుదయానికీ, విజ్ఞానానికీ, ప్రతీకలు.
1) చక్రం కనుక్కొన్న రోజు :
చక్రాన్ని కనిపెట్టాకే, బళ్ళు, రిక్షాలు, సైకిళ్ళు, మోటారు సైకిళ్ళు, రైళ్ళు, ఫ్యాక్టరీ యంత్రాలు . వగైరా వాడుకలోకి వచ్చాయి. పారిశ్రామికాభివృద్ధి అంతా, చక్రం తిరగడం మీదే ఆధారపడి ఉంది.

2) నాలుగు గీతలతో ఆకార నిర్మాణం :
ఈ విధంగానే భాషలకు చిత్రలేఖనం, లిపులు, గ్రంథాలు, మహాకావ్యాలు, విజ్ఞాన సాధన, చదువులు వచ్చాయి.

3) నిప్పును కనుక్కోడం :
నిప్పును మానవుడు కనిపెట్టాక, పదార్థాలను ఉడికించి కమ్మగా, రుచిగా అతడు తింటున్నాడు. ఆధునిక నాగరికతకు ఇది ప్రతీక.

4) తాండవ నృత్యం చేయడం :
నృత్యం ద్వారానే, నాట్యకళ అభివృద్ధి అయ్యింది. భరతనాట్యం వంటి వివిధ నృత్యాలు, కళాభివృద్ధి జరిగింది.

5) భాషలు నేర్చుకోడం :
భాషలు నేర్చుకోడం వల్లే కవిత్వము, సాహిత్యాభివృద్ధి జరిగింది. 6) ధాన్యం పండించడం : పచ్చి మాంసం తిన్న మానవుడు నాగరికత పెంచుకొని, వ్యవసాయం నేర్చుకొని ఆహార పదార్థాలను పండించాడు.

7) కళలు పండించడం :
లలిత కళాభివృద్ధి దీనివల్లే జరిగింది. మానవుడు సౌందర్యమును ఆరాధించేవాడయ్యాడు. అందుకే చక్రం, నిప్పు మొ||వి చరిత్రలో మైలురాళ్ళుగా నిలిచాయి.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 9 మాణిక్యవీణ

ప్రశ్న 6.
మానవుడు సాధించిన ప్రగతిని కవి వర్ణించిన తీరుపై మీ అభిప్రాయం ఏమిటి?
జవాబు:
విద్వాన్ విశ్వంగారు మాణిక్య వీణలో మానవుడు ఎంతో ప్రగతిని సాధించాడని, మానవ ప్రస్థానంలో కళ, కవిత, విజ్ఞానం తోడుగా ఉన్నాయని చెప్పారు.

ఆదిమ మానవుడికి కళలు తెలియవు. అతడు ప్రకృతిని తన అధీనం చేసుకోడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో ఎంతో విజ్ఞానం సాధించాడు. చిత్రలేఖనం నేర్చుకున్నాడు. ఎండిన మోళ్ళు చిగురించేలా పాటలు పాడడం నేర్చాడు. నాట్యం చేయడం నేర్చాడు. కవిత్వం చెప్పడం నేర్చుకున్నాడు.

గీతలు గీసి దాని ద్వారా లిపిని నేర్చుకొన్నాడు. చిన్న మాటలతో జానపద గీతాలు అల్లుకున్నాడు. ధాన్యం పండించాడు. విజ్ఞానం అభివృద్ధి చేసుకొని ‘చక్రం’ కనిపెట్టి దాని ద్వారా పరిశ్రమలు, వాహనాలు, యంత్రాలు కనిపెట్టి ముందుకు సాగాడు. నిప్పును కనిపెట్టి వంటకాలు వండుకొని తిన్నాడు.

కవి వర్ణించినట్లుగా, మానవుడు కళలు, కవిత్వం, విజ్ఞానం అనే వాటిని తోడుగా చేసుకొని, ప్రగతిని సాధించాడని నేను కూడా నమ్ముతున్నాను.

ప్రశ్న 7.
మానవ చరిత్రలోని అసాధారణ పర్వదినాల ఆంతర్యం ఏమిటి?
జవాబు:
‘అసాధారణ పర్వదినాలు’ అంటే, గొప్ప విశేషమైన పండుగలు అని అర్ధము. మానవుడు పుట్టినప్పుడు అతడికి ఇల్లు కట్టుకోవడం తెలియక, గుహలలో నివసించాడు. చక్రం గూర్చి తెలియక, కాలి నడకన ప్రయాణం సాగించాడు. నిప్పు గురించి తెలియక, పచ్చిమాంసం తిన్నాడు. అక్షరం గూర్చి తెలియక, గీతలు గీశాడు. భాషలు తెలియక, కిచకిచలాడాడు.

అటువంటి ఆదిమ మానవుడు చక్రాన్ని, నిప్పును, కళలను, భాషలను, వ్యవసాయ పద్ధతులను తెలిసికొన్నాడు. దాని ద్వారా ఎన్నో వాహనాలను, యంత్రాలను నిర్మించి పరిశ్రమలను వృద్ధి చేశాడు. నిప్పు ద్వారా చక్కగా వండుకొని కమ్మగా తిన్నాడు. భాషలను నేర్చుకొని చక్కగా మాట్లాడగలిగాడు. లలిత కళలను నేర్చుకొని ఆనందాన్ని పొందాడు. జానపద గీతాలు, కవిత్వం అల్లాడు. కాబట్టి మానవుని అభ్యుదయ యాత్రలో అతడు నూతనంగా వస్తువులు కనిపెట్టిన రోజులన్నీ, కవి చెప్పినట్లు అసాధారణ పర్వదినాలనే నా అభిప్రాయము.

ప్రశ్న 8.
మానవ ప్రస్థానాన్ని కవి వర్ణించిన తీరును ఎలా సమర్థిస్తావు?
జవాబు:
మానవ ప్రస్థానంలో కళ, కవిత, విజ్ఞానం తోడుగా ఉన్నాయని కవి చెప్పిన మాట నిజం.

ఆదిమ మానవుడికి కళలు తెలియవు. అతడు ప్రకృతిని చూచి పరవశుడయి, ప్రకృతిని తన అధీనం చేసుకోడానికి యత్నించాడు. ఆ ప్రయత్నంలో అతడు ఎంతో విజ్ఞానం సంపాదించాడు. చిత్రలేఖనం నేర్చుకున్నాడు. రంగులనూ, ధ్వనులను అనుకరించాడు. ఎండిన మోళ్ళు చివురించేలా పాటలు పాడడం నేర్చాడు. కాలికి గజ్జెకట్టి నాట్యం చేయడం నేర్చుకున్నాడు. చిక్కని పదాలతో కవిత్వం చెప్పడం నేర్చుకున్నాడు.

గీతలు గీయడం ద్వారా లిపిని నేర్చుకొని తన అభిప్రాయాన్ని ఇతరులకు తెలుపగలిగాడు. చిన్న చిన్న మాటలతో చక్కగా జానపద గీతాలు అల్లుకున్నాడు. ధాన్యం పండించుకొని దానిని ఆహారంగా తిన్నాడు. అతనికి జీవితంలో కలిగిన అలసటనూ, యాంత్రికతనూ కళా కవితల ద్వారా దూరం చేసుకున్నాడు.

విజ్ఞానం అభివృద్ధి చేసుకొని చక్రం కనిపెట్టి దాని ద్వారా పరిశ్రమలు, వాహనాలు, యంత్రాలు కనిపెట్టి ఎంతో వైజ్ఞానికంగా ముందుకుసాగాడు. నిప్పును కనిపెట్టి, అనేక వంటకాలు వండుకొని తిన్నాడు.

ఆదిమ మానవుడు ఈ విధంగా కళలు, కవిత్వం, విజ్ఞానం నేర్చుకోవడం ద్వారా, మిన్నులు పడ్డచోటు నుండి ఎదిగి మిన్నందుకున్నాడు. అతని ప్రస్థానంలో కళ, కవిత, విజ్ఞానం తోడుగా ఉన్నాయి.

ప్రశ్న 9.
మాణిక్య వీణ కవితలో కవిగారు చెప్పిన అంశాలేవి?
జవాబు:
మంత్రాలతో చింతకాయలు ఎలా రాలవో, అలాగే పద్యాల ధాటితో చింతలు తొలగిపోవు. యంత్రాలతో రోగాలు నయం కానట్లే, తంత్రాలతో సమాజ సమస్యలు దారికిరావు.

కడుపులో కేన్సరుతో సంఘం బాధపడుతూ ఉంటే, అంతరిక్షంలోకి రాకెట్లు పంపితే మాత్రం ఏం ప్రయోజనం? మనిషి పుట్టగానే ప్రకృతిని చూచి ఆనందించాడు. దాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని అతడు ప్రయత్నించాడు. ప్రకృతిలోని రంగులనూ, ధ్వనులనూ అనుకరించాడు.

మానవుడు గుహలలో జీవించే ఆదిమ కాలంలోనే, గోడలపై జంతువుల బొమ్మలు గీశాడు. ఎండిన చెట్లు చిగిర్చేలా పాడాడు. గజ్జెకట్టి నాట్యం చేశాడు. చక్కని తీరుగా పదాలు పాడుకున్నాడు.

‘చక్రం’ కనుక్కొన్న రోజు, ‘లిపి’ తో రాసిన రోజు, నిప్పును కనిపెట్టిన రోజు, చక్కగా నాట్యం చేసిన రోజు, మానవ చరిత్రలో మంచి రోజులు. మానవుడు అర్ధవంతమైన భాషలు నేర్చుకొన్న రోజు, చిన్నమాటలతో జానపద గీతాలు అల్లుకున్న రోజు, ధాన్యం పండించిన రోజు, కళలను పండించిన రోజు గొప్పరోజులు. మానవచరిత్రలో అవి అన్నీ పండుగరోజులు.

కళలు, కవితలు, విజ్ఞానం, ప్రజ్ఞానం కలగలసి మానవుడిని మహోన్నతంగా నడిపిస్తాయి. ఈ విధంగా నేల నుండి ఎదిగి మానవుడు ఆకాశాన్ని అందుకున్న చిన్నవాడు. మానవుడు చిరంజీవి. అతి ప్రాచీనుడు.

అనాదిగా నడుస్తున్న ఈ మానవుడి జీవనయాత్రలో కళాకవితలూ, జ్ఞాన విజ్ఞానాలూ, మానవుడి వెంటనే ఉండి, అతనితో నడుస్తూ, అతణ్ణి నడిపిస్తున్నాయి.

10th Class Telugu 9th Lesson మాణిక్యవీణ Important Questions and Answers

ప్రశ్న 1.
దిన పత్రికలు చదవమని విద్యార్థులను ప్రోత్సహిస్తూ కరపత్రం తయారు చేయండి.
జవాబు:
పత్రికా పఠనం
విద్యార్థులారా ! భావిభారత నిర్దేశకులారా !

పత్రికలు చదవండి. నిరంతరం ప్రపంచంలో జరుగుతున్న మార్పులను తెలుసుకోండి. పత్రిక పేరు ఏదైనా కావచ్చు. ప్రపంచ పరిజ్ఞానం ప్రధానం, టీ.వీ.ల మోజులో చదువుకు దూరం కాకండి.

పాఠ్య పుస్తకాలలో పరిజ్ఞానానికి, దిన పత్రికలలోని విశ్లేషణాత్మక పరిజ్ఞానం తోడైతే వ్యాఖ్యానించగల నేర్పు కలుగుతుంది. రోజూ క్రమం తప్పక పత్రికలు చదవండి. నిత్య నూతన విజ్ఞాన కాంతులతో విరాజిల్లండి.
ఇట్లు,
పాఠక బృందం.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 9 మాణిక్యవీణ

ప్రశ్న 2.
మానవుడు సాధించిన ప్రగతిని వివరిస్తూ ఒక వ్యాసం రాయండి.
జవాబు:
ఆదిమ మానవుడికి బట్ట కట్టుకోడం తెలియదు. అన్నం వండుకొని తినడం తెలియదు. చెట్టు బెరడులు కట్టుకొని,జంతువులను చంపి పచ్చిమాంసం తినేవాడు. ప్రకృతిలో దొరికే కాయలు, దుంపలు, పళ్ళు తినేవాడు. ఆదిమ మానవుడికి రాయడం, చదవడం, కళలు తెలియవు. ఇళ్ళు కట్టుకోడం తెలియక, గుహలలో నివసించేవాడు.

మానవుడు క్రమంగా లలిత కళలు నేర్చుకున్నాడు. రాయడం, కవిత్వం చెప్పడం నేర్చుకున్నాడు. చక్రాన్ని, నిప్పును కనిపెట్టాడు. అర్థవంతమైన భాషలు నేర్చాడు. లిపులు నేర్చాడు. బట్టలు నేయడం, ధరించడం నేర్చాడు. కవిత్వం చెప్పడం నేర్చుకున్నాడు.

విజ్ఞానం నేర్చుకొని సైన్సు ద్వారా ఎన్నో కొత్త యంత్రాలు కనిపెట్టాడు. వంటలు వండడంలో మెలకువలు గ్రహించాడు. సమాచార రంగంలో విప్లవం సాధించాడు. రేడియో, టి.వి, ఇంటర్నెట్ వంటివి కనిపెట్టాడు. కంప్యూటర్ రంగంలో విప్లవం సాధించాడు. ఫోటోలు తీయడం నేర్చాడు. కొత్త కొత్త శాస్త్ర విద్యలు నేర్చాడు.

కొత్త ప్రయాణ సాధనాలు కనిపెట్టాడు. ఫ్రిజులు, ఎ.సి.లు వగైరా కనిపెట్టాడు. రాకెట్లు కనిపెట్టాడు. ఇతర గ్రహాల పైకి వెళ్ళి వస్తున్నాడు. విమానాలపై ప్రయాణం సాగిస్తున్నాడు.

మానవుడు ఈ విధంగా అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నాడు.

ప్రశ్న 3.
‘ప్రగతికి మూలం నిరంతర కృషి’ అని తెలియజేసే నినాదాలు రాయండి.
జవాబు:
మానవుడి అభ్యుదయం – మనిషి చేతిలోనే ఉంది.
నిరంతర పరిశోధనయే – నిజ కల్యాణానికి పట్టాభిషేకం
శాస్త్ర ప్రయోగశాలలే – మానవుడి విజయసోపాన మందిరాలు
గోళ్ళు కొరుకుతూ కూర్చోకు – నీ అభివృద్ధికి నిరంతరం పాటుపడు
బద్ధకం, మాంద్యం – మనిషి అభివృద్ధికి వైరుధ్యం
ఈనాటి నీ కృషియే – రేపటి నీ విజయానికి సోపానం
కృషితో నాస్తి దుర్భిక్షం – కృషియే నీ భావి సౌభాగ్యం
బద్దకుడు, సోమరి – దేశ ప్రగతికి విరోధి
కృషి చేస్తే మనుషులు – ఋషులు అవుతారు.
కష్టపడి పనిచేస్తే – కడుపునిండా కూడు లభిస్తుంది.
ఆనాటి మానవుని కృషే – నేటి నీ వైజ్ఞానిక సౌఖ్యం
ఒళ్ళు వంచి పనిచేద్దాం – హాయిగా కులుకుతూ బ్రతికేద్దాం

10th Class Telugu 9th Lesson మాణిక్యవీణ 1 Mark Bits

1. సమాజంలోని రుగ్మతలు తొలగినపుడే దేశం బాగుపడుతుంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలను గుర్తించండి. (June 2017)
A) నీతి, ధర్మం
B) కల్మషం, విరోధం
C) జబ్బు, రోగం
D) ఆదాయం, లాభం
జవాబు:
C) జబ్బు, రోగం

2. శ్లేషాలంకారానికి ఉదాహరణ గుర్తించండి. (June 2018)
A) మా అన్న చేతివంట నలభీమపాకం.
B) ఆమె పలుకులు తేనె పలుకులు.
C) రాజు కువలయానందకరుడు.
D) సంసార సాగరమును ఈదుట కష్టము.
జవాబు:
C) రాజు కువలయానందకరుడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 9 మాణిక్యవీణ

3. సినిమాలు జీవితాన్ని తీర్చిదిద్దగలవు. (వ్యతిరేక వాక్యాన్ని గుర్తించండి.) (June 2017)
A) సినిమాలు జీవితాన్ని తీర్చబోవు.
B) సినిమాలు జీవితాన్ని తీర్చవు.
C) సినిమాలు జీవితాన్ని తీర్చిదిద్దలేవు.
D) సినిమాలు జీవితాన్ని తీర్చిదిద్దుతాయి.
జవాబు:
C) సినిమాలు జీవితాన్ని తీర్చిదిద్దలేవు.

4. ఈ సంవత్సరం వర్షాలు కురుస్తాయో, కురవవో – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (March 2018)
A) సందేహార్థకం
B) ఆశ్చర్యార్థకం
C) నిశ్చయార్థకం
D) నిషేధార్థకం
జవాబు:
C) నిశ్చయార్థకం

5. మంత్రాలకు చింతకాయలు రాలడం : “కష్టపడకుండా ఫలితం రాదు” అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడతారు. (March 2017)

AP SSC 10th Class Telugu Important Questions Chapter 8 సముద్ర‌లంఘ‌నం

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Important Questions Chapter 8 సముద్ర‌లంఘ‌నం

AP State Syllabus SSC 10th Class Telugu Important Questions 8th Lesson సముద్ర‌లంఘ‌నం

10th Class Telugu 8th Lesson సముద్ర‌లంఘ‌నం 2 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
సముద్రలంఘనం పాఠం నేపథ్యం రాయండి. (S.A. I – 2019-20)
జవాబు:
సీతను వెతుకుతూ రామలక్ష్మణులు కిష్కింధకు చేరుకుంటారు. రామలక్ష్మణులు, సుగ్రీవునితో స్నేహం చేస్తారు. సుగ్రీవుడు సీతను వెతకటానికి వానర సైన్యాన్ని నాలుగు దిశలకు పంపిస్తాడు. అంగదుని నాయకత్వంలో ఆంజనేయుని బృందం, దక్షిణ దిక్కుకు వెళ్తుంది. జాంబవంతుని ప్రోత్సాహంతో ఆంజనేయుడు మహేంద్రగిరి నుంచి సముద్ర లంఘనానికి సిద్ధమౌతాడు.

ప్రశ్న 2.
హనుమంతుడు సముద్రలంఘనానికి ముందు చేసిన చేష్టలను గురించి రాయండి. (June 2018)
జవాబు:

  1. సముద్ర లంఘనానికి ముందు హనుమంతుడు పెద్ద పెద్దగా అంగలు వేస్తూ బలంగా నడవడం, తోకను వేగంగా తిప్పడం, చేతిని జబ్బపై చరచడం, సింహనాదం చేయడం వంటి పనులను చేశాడు.
  2. ఈ పనులు అతని ఆత్మవిశ్వాసాన్ని, సమస్త శక్తులను కూడగట్టుకోవడాన్ని సూచిస్తున్నాయి.
  3. ఏ పనినైనా చేయడానికి పూనుకొనే ముందు శక్తులన్నింటినీ సమీకరించడం వీరులు చేసే ముఖ్యమైన పని.
  4. మహావీరుడైన రూనుమంతుడు కూడా తనలో అంతర్గతంగా ఉన్న శక్తులను బయటకు రప్పించడానికే అలా చేశాడని నేను భావిస్తున్నాను.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 8 సముద్ర‌లంఘ‌నం

ప్రశ్న 3.
అయ్యలరాజు రామభద్రుని గురించి రాయండి.
జవాబు:
‘సముద్రలంఘనం’ పాఠ్యభాగ రచయిత అయ్యలరాజు రామభద్రుడు. ఈయన 16వ శతాబ్దానికి చెందినవాడు శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవులలో ఇతడు ప్రసిద్ధుడు. వీరి రచనల్లో రామాభ్యుదయం, సకల కథాసార సంగ్రహం వంటి రచనలు రచించాడు. రామాభ్యుదయంలో ఎనిమిది ఆశ్వాసాలు ఉంటాయి. ఉత్తరకాండను వదలివేశారు. వీరికి ‘చతురసాహిత్య లక్షణ చక్రవర్తి’, ‘ప్రతివాది మదగజ పంచానన’ అనే బిరుదులు ఉన్నాయి. వీరి శైలి కవితాసామర్థ్యంతో కూడి యుంటుంది. వీరి వర్ణన సహజ ధోరణిలో సాగుతుంది.

ప్రశ్న 4.
హనుమంతుని స్వభావాన్ని వివరించండి.
జవాబు:
హనుమంతుడు, సుగ్రీవునకు, మంత్రి, ఇతడు మహాబలశాలి. స్వామిభక్తి పరాయణుడు, శ్రీరామ భక్తుడు. సుగ్రీవునికి నమ్మిన బంటు. రామలక్ష్మణులకు, ఇతడే సుగ్రీవునితో స్నేహం కల్పించాడు. శ్రీరాముని సహాయంతో సుగ్రీవుడిని వానర రాజ్యాధిపతిని చేశాడు. సీతాన్వేషణలో హనుమంతుడు ప్రముఖ పాత్ర వహించాడు. నూరుయోజనాల సముద్రాన్ని దాటి వెళ్ళి పట్టుదలతో సీతాదేవి జాడను కనిపెట్టి, సీతమ్మకు రాముని ఉంగరాన్ని ఇచ్చి, ఆమెకు ధైర్యం చెప్పాడు. సీతమ్మ తనకు ఇచ్చిన చూడామణిని, శ్రీరామునకు తెచ్చి ఇచ్చి, సీత వృత్తాంతాన్ని రామునకు తెలియచెప్పాడు. ఇతడు ఒంటరిగా లంకకు వెళ్ళి, రాక్షస సైన్యాన్ని చంపి, లంకను దహనం చేసి, రావణునికి, రాముని సందేశం అందించిన రామదూత. ఇతడు రామరావణ యుద్ధంలో వీరోచితంగా పోరాడాడు. సంజీవిని తెచ్చి లక్ష్మణుని బ్రతికించాడు. ఆంజనేయుడు మహావీరుడు.

ప్రశ్న 5.
మీకు నచ్చిన ఒక సందర్భాన్ని వివరించండి.
జవాబు:
నేను, నా మిత్రులతో కలిసి విహారయాత్రకై మహానంది బయలుదేరాను. ఈ యాత్ర నాకు మధురానుభూతిని మిగిల్చింది. ముఖ్యంగా ఈ క్షేత్రం నల్లమల అడువుల్లో ఉంటుంది. గిద్దలూరు దగ్గరి నుండి నంద్యాల వరకు రైలు ప్రయాణం అరణ్యం గుండా జరిగింది. వంపుసొంపుల మార్గాలు, ఇరువైపులా ఆకాశాన్ని తాకుతున్న పర్వత శిఖరాలు, వాటిపై పొడవైన చెట్లు, ఆ చెట్టుకున్న ‘పూలు చూడముచ్చటగా ఉన్నాయి. మధ్యలో పొడవైన రెండు పెద్ద గుహలు. ఆ గుహల్లోకి రైలు వెళ్ళగానే అంతా దట్టమైన చీకటి. ఏమీ కనిపించదు. ఇది చూచి అనుభవించి తీరవలసిందే. ఎతైన కొండల నుండి కిందికి జాలువారే సెలయేళ్ళు, అక్కడక్కడా గిరిజనుల నివాసాలు సుమనోహరంగా ఉన్నాయి. ప్రకృతి అందాలకు నల్లమల పుట్టినిల్లు. భూదేవికి పచ్చని చీర కట్టినట్లుగా ఉంటుంది. పక్షుల కిలకిలారావాలు, కోయల విన్యాసాలు చూడముచ్చటగా ఉంటాయి.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 8 సముద్ర‌లంఘ‌నం

ప్రశ్న 6.
సముద్రలంఘనానికి ముందు హనుమంతుని ప్రవర్తనను బట్టి నీవేమి గ్రహించావు?
జవాబు:
సముద్రలంఘనానికి ముందు హనుమంతుడు గట్టిగా ఒత్తి అడుగులు వేసి, రాళ్ళను పగులకొట్టి, చెట్లను కూలగొట్టి, క్రూర జంతువులను సైతం పారిపోయేలా చేసి, గుహలు ప్రతిధ్వనించేలా సింహనాదం చేశాడు. ఆతని పాదాల ఒత్తిడికి పర్వత శిఖరాలు కంపించిపోయాయి.

హనుమంతుడు తన శక్తిని మిగిలిన వానరులకు, ఈ విధంగా చూపించాడు. తాను సీత జాడను తెలిసికొని రాగలనని తనవారికి ఆ విధంగా ధైర్యం కల్పించాడు. తాను మహాశక్తిమంతుడననీ, కొండల్ని పిండి చేయగలననీ నిరూపించాడు. తాను వాయుదేవుని అనుగ్రహం కలవాడినని, మిగిలిన వానరులకు తెలియపరచి, వారికి ధైర్యం కల్పించాడు. హనుమంతుడు తాను తప్పక సీత జాడను తెలిసికొని రాగలనని, ముందుగానే తన తోడి వానరులకు ఈ విధంగా భరోసా ఇచ్చాడు. అందుకే హనుమంతుడు ఆ చేష్టలు చేశాడు.

ప్రశ్న 7.
హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరినపుడు సమీపంలోని వారికి ఎలా కనిపించాడు? ఎందుకో వివరించండి.
జవాబు:
హనుమంతుడు మహేందగిరిపై కాళ్ళు వేసి, దానిని క్రిందికి అణగదొక్కి ఆకాశంలోకి ఎగిరాడు. అప్పుడు హనుమంతుడు ఆకాశంలో ఎగురుతున్నట్లు కాకుండా ఒక పర్వతము ఆకాశంలో ఎగురుతున్నట్లు సమీపం నుండి చూసే వారికి కనబడింది.

కారణము : హనుమంతుడు సూరుయోజనాల సముద్రాన్ని దాటడానికి తన రూపాన్ని బాగా పర్వతం అంత ఆకారంలో పెంచి వేశాడు. అందుకే హనుమంతుడు అప్పుడు చూసేవారికి పర్వతం అంత పరిమాణంలో కనిపించాడు. అందుకే ఆకాశంలో పర్వతం ఎగురుతున్నట్లు దగ్గర నుండి చూసేవారికి కనిపించింది.

10th Class Telugu 8th Lesson సముద్ర‌లంఘ‌నం 4 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
సముద్రాన్ని దాటడానికి ప్రయత్నించిన హనుమంతుడిని కవి వర్ణించాడు కదా ! అయితే నీవు చూచిన ఒక అద్భుత ప్రకృతి దృశ్యాన్ని నీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
పవిత్రమైన భారతదేశంలో చూడదగిన ముఖ్యప్రదేశం కాశ్మీర్ ప్రాంతం. ఇక్కడి వాతావరణం సుమనోహరం. ప్రకృతి దృశ్యాలు నయనానందాన్ని కల్గిస్తాయి. ఒక్కమాటలో, చెప్పాలంటే కాశ్మీర్ ఒక భూతల స్వర్గం.

ఇక్కడ ఎటు చూసినా సమున్నత పర్వత శ్రేణి, వృక్షసంపద, సెలయేటి ధారలు యాత్రకులకు అలౌకికమైన అనందాన్ని కలిగిస్తాయి. పచ్చని పంటల శోభ, వాటి మధ్య ప్రవహించే కొండవాగుల అందం అన్నీ కలగలిపి భూదేవి హృదయాన ధరించిన ముత్యాలహారంలోని పచ్చలపతకంలా కాశ్మీరు లోయ ప్రకాశిస్తుంది.

పిర్ పంజల్ పర్వత శ్రేణిలో ‘బనిహాల్’కనుమ ఉంది. దాని చుట్టూ ఎత్తైన కొండలు. అక్కడ కొండల అంచుల్ని మంచు ముసుగు కప్పేస్తుంది. ఆ కొండల చివళ్ళనున్న మంచు పెళ్ళలుగా గట్టిగా పాలరాతి ముక్కల్లా మెరుస్తోంది. నల్లగా నిగనిగలాడే కొండ శరీరంపై అంచున తెల్లని పాలరాతి ముక్కలు ‘ఎమ్ బాస్’ చేసినట్లుగా ఉంది. అక్కడ కొండవాలుల్లో అన్నీ వరిపైర్లు, కొండవాగులోని నీరే ఆ పంటలకు ఆధారం. పచ్చని పైర్ల శోభ, వాటి మధ్య కొండవాగుల అందం అన్నీ కలగలిపి, భూదేవి హృదయాన ధరించిన ముత్యాలహారంలోని పచ్చల పతకంలా కాశ్మీరలోయ ప్రకాశిస్తోంది. అది అంత అందమైన లోయ కాబట్టే ప్రభుత్వం వారు కూడా అక్కడ ‘స్టాప్ అండ్ సీ బ్యూటిఫుల్ బనిహాల్’ (ఆగి బనిహాల్ సౌందర్యాన్ని దర్శించండి) అనే బోర్డు పెట్టి యాత్రికుల మనస్సులను సైతం అటువైపుకు తిప్పే ప్రయత్నం చేశారు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 8 సముద్ర‌లంఘ‌నం

ప్రశ్న 2.
ప్రాచీన కావ్యాలకు సంబంధించిన వర్ణనాత్మక పాఠ్యాంశాలను చదవడం వల్ల కలిగే ప్రయోజనాలను రాయండి.
జవాబు:
సనాతనమైన భారతీయ సంస్కృతిలో సాహిత్య సంపదకు సమాన్నతమైన స్థానం ఉంది. మన సంస్కృతిలో కావ్య సంపద ఉన్నతమైంది. మన తెలుగు సాహిత్యంలో ఎన్నో వర్ణనాత్మక కావ్యాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన పాఠ్యాంశాలు కూడా చెప్పుకోదగ్గ రీతిలో ఉన్నాయి. వర్ణనాత్మక పాఠ్యాంశాలను చదవడం వల్ల విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వాటిలో కొన్ని.

  • మన ఇతిహాసాలకు సంబంధించిన కళాత్మక రూపాలను, సుందర ప్రదేశాల విశిష్ఠతను తెలుసుకొనవచ్చు.
  • వర్ణనల్లో ఉండే అందాలను, అనుభూతులను గ్రహించవచ్చు.
  • మనం చూడలేని ప్రకృతి దృశ్యాల అందాలను విద్యార్థులు తెలుసుకోవచ్చు.
  • వర్ణనల్లో ఉండే అలంకార మధురిమలను తెలుసుకోవచ్చు.
  • శైలి భేదాలను, రసాత్మకతను గ్రహింపవచ్చు.
  • ప్రాచీన కవుల అలంకారప్రయోగాలను, నుడికారాలను, యాసలను, సామెతలను తెలుసుకోవచ్చు.

ఈ రకంగా ప్రాచీన వర్ణనాత్మక పాఠంను చదవడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. తరతరాల వారసత్వాన్ని తెలుసుకొని భావితరాలకు అందించవచ్చు.

ప్రశ్న 3.
హనుమంతుడు సముద్రలంఘనం చేసేటప్పటి పరిస్థితిని బట్టి అతని బలాన్ని ఊహించి రాయండి.
జవాబు:
సముద్రాన్ని దాటడానికి సిద్ధమైన హనుమంతుడు, మహేంద్ర పర్వతంపై అడుగులు నొక్కిపెట్టి వేసినపుడు, పిడుగులు పడ్డట్లుగా అక్కడ పెద్ద పెద్ద రాళ్ళు పగిలి పడిపోయాయి. దీనిని బట్టి హనుమంతుడు గొప్ప బరువు కలవాడని తెలుస్తోంది. హనుమంతుడు వేగంగా తోకను తిప్పినప్పుడు, ఆ వేగానికి పెద్ద పెద్ద అడవులు సైతం ఖాళీ ప్రదేశాలు అయ్యాయి. చెట్లు అన్నీ కూలిపోయాయి. దీనినిబట్టి హనుమంతుడు వాయుదేవుని మించిన వేగం గలవాడని తెలుస్తోంది.

హనుమంతుడు చేతితో చరిస్తే, కఱ్ఱతో కొట్టినట్లు ఏనుగులు, సింహాలు సైతం బెదరి పారిపోయాయి. దీనినిబట్టి హనుమంతుడి చేతిలో గొప్పబలం, శక్తి ఉందని తెలిసింది. హనుమంతుడు సింహనాదం చేస్తే, ఆ ధ్వనికి గుహలు సైతం ప్రతిధ్వనించాయి. దీనినిబట్టి హనుమంతుని సింహనాదం, కర్ణకఠోరంగా భయంకరంగా ఉంటుందని తెలిసింది.

హనుమంతుడు నడుస్తూంటే, కొండలు కంపించిపోయాయి. ఆ కంపనాలకు కొండలపై ఉన్న సెలయేటి కెరటాలు ఆకాశాన్ని అంటేటట్లు ఎగసిపడ్డాయి. దీనినిబట్టి హనుమంతుడు మహాబలవంతుడని అపారశక్తి సామర్థ్యాలు కలవాడని మనకు తెలుస్తోంది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 8 సముద్ర‌లంఘ‌నం

ప్రశ్న 4.
అందరు వానర వీరుల్లో హనుమయే సముద్రలంఘనానికి సమర్థుడని ఎలా గుర్తించారు?
జవాబు:
ఈ ప్రశ్నకు జవాబు, మన పాఠంలో లేదు. అయినా రామాయణాన్ని బట్టి, దీనికి సమాధానం ఇలా ఉంటుంది.

సీతను అపహరించిన రావణుని గూర్చి, లంకా నగరాన్ని గూర్చి సంపాతి, వానరులకు చెప్పింది. దానితో వానరులు సముద్రాన్ని దాటడంలో వారి వారి శక్తి సామర్థ్యాలను గూర్చి చెప్పారు.

వానరులలో కొందరు తాము 50 యోజనాల దూరం’ దాటగలం అన్నారు. జాంబవంతుడు తాను 90 యోజనాల దూరం దాటగలనన్నాడు. యువరాజైన అంగదుడు తాను సూరుయోజనాల సముద్రాన్ని దాటగలను గాని, తిరిగి రాలేనేమో అన్నాడు.

అప్పుడు జాంబవంతుడు అంగదుడు యువరాజు కాబట్టి అతడు లంకకు వెళ్ళడం తగదని చెప్పాడు. జాంబవంతుడు హనుమంతుని దగ్గరకు వెళ్ళి, అతడు వాయుపుత్రుడని సముద్రాన్ని దాటగలడని చెప్పాడు. హనుమంతుడు చిన్నప్పుడే సూర్యుడిని చూసి పండు అనుకొని నూరు యోజనాలు ఎగిరాడని అతనికి గుర్తు చేశాడు. బ్రహ్మవరం వల్ల హనుమంతుడిని వజ్రం కూడా ఏమి చేయలేదన్నాడు.

దానితో హనుమంతుడు తన శక్తిని వెల్లడించాడు. వేలకొద్దీ యోజనాల దూరం తాను దాటగలనని ప్రకటించాడు. అందువల్ల హనుమయే సముద్రలంఘనానికి సమర్థుడని వానర వీరులు గుర్తించారు. హనుమంతుడిని మెచ్చుకొని సీతాన్వేషణకు అతడినే పంపారు.

ప్రశ్న 5.
మీ పాఠం ఆధారంగా హనుమంతుడి సమర్థతను వివరించండి.
జవాబు:
హనుమంతుడి సమర్దత :
హనుమంతుడు సముద్రం పైకి ఎగిరేటప్పుడు మహేంద్ర పర్వతం పై పాదాలు నొక్కివేస్తే పిడుగులు పడినట్లుగా పెద్దరాళ్ళు పగిలిపోయాయి. హనుమ తోకను త్రిప్పిన గాలివేగానికి అడవులు అన్నీ కూలి శూన్య ప్రదేశాలు ఏర్పడ్డాయి. హనుమ చేతితో చరిస్తే కల్టుతో కొట్టినట్లు ఏనుగులు, సింహాలు పారిపోయాయి. హనుమ సింహనాదం చేస్తే పోటీపడ్డట్లు గుహలు ప్రతిధ్వనించాయి. కొండలు కంపించాయి. ఆ కంపనాలకు కొండలపై సెలయేళ్ళు ఆకాశానికి ఎగసిపడ్డాయి.

హనుమంతుడు శరీరాన్ని ధరించిన వాయుదేవుడు వలె ఉన్నాడు. హనుమ తన శరీరాన్ని పెంచితే, పర్వత శిఖరాలు కదలిపోయాయి.

హనుమంతుడు మహేంద్రగిరిని అణగదొక్కి, ఆకాశంపైకి ఎగిరినప్పుడు పర్వతము ఎగిరినట్లు కనబడింది. దానిని బట్టి హనుమ, పర్వతం అంత ఆకారంలో ఉన్నాడని తెలుస్తుంది.

హనుమంతుడి కాలిపిక్కల నుండి పుట్టిన గాలివేగానికి సముద్రం లోతుగా చీలిపోయింది. హనుమంతుడి కాలిపిక్కల నుండి వచ్చే గాలి వేగానికి సముద్రము మధ్య చీలినట్లు కనబడింది.

ఆ విధంగా చీలిన సముద్రాన్ని చూసినవారికి, రాముడి క్రోధరసము లంకకు చేరడానికి కాలువ త్రవ్వారేమో అనిపించింది. రాబోయే కాలంలో కట్టబోయే సేతువుకు పునాది త్రవ్వారేమో అనిపించింది. హనుమంతుడిని చూడ్డానికి పాతాళంలోని ఆదిశేషువు వచ్చి తలుపులు తెరిచాడేమో అన్నట్లు కనబడింది. హనుమంతుడు భూదేవికి కీర్తి వస్త్రాలను అర్పించి, ఆమె ధరించిన నల్లని వస్త్రాలను చీల్చివేసినట్లు కనబడింది. హనుమంతుడు మహా సమర్థుడు.

ప్రశ్న 6.
సముద్రలంఘనానికి ముందు హనుమంతుని చేష్టలు సమర్థనీయమా? చర్చించండి.
జవాబు:
సముద్రమును దాటడానికి ముందు హనుమంతుడు మహేంద్రగిరిపై గట్టిగా ఒత్తి అడుగులు వేసి కొండ రాళ్ళను పగుల గొట్టాడు. తన తోకను త్రిప్పి ఆ గాలివేగంతో చెట్లను కూలగొట్టాడు. క్రూర జంతువులను సైతం బెదిరించి పారిపోయేటట్లు చేశాడు. గుహలు ప్రతిధ్వనించేలా సింహనాదం చేశాడు. పర్వత శిఖరాలు కంపించిపోయేలా చేసి, సెలయేరులోని నీళ్ళు ఆకాశానికి తగిలేలా చేశాడు.

ఈ పనుల వల్ల హనుమంతుడు తన శక్తిని, బలాన్ని మిగిలిన వానరులకు చూపించాడు. సముద్రమును దాటడం ఎలాగా అని, ఆందోళన పడుతున్న తనతోడి వానరులకూ, యువరాజు అంగదుడికీ, ధైర్యం చేకూర్చాడు. తాను సముద్రాన్ని దాటివెళ్ళి సీత జాడను తెలిసికొని రాగలనని, తనవారికి ధైర్యం కల్పించాడు. తాను మహాశక్తివంతుడననీ, కొండలను పిండి చేయగలనని నిరూపించాడు.

తాను వాయుదేవుని అనుగ్రహంతో ఎంతటి సాహసకార్యం అయినా చేయగలనని తనవారికి భరోసా కల్పించాడు. హనుమంతుడు మహాశక్తివంతుడని, బలవంతుడని ఈ చర్యల ద్వారా మిగిలిన వానరులకు అర్థమయ్యింది. వారి ఆరాటం శాంతించింది. కాబట్టి సముద్రమును దాటే ముందు హనుమంతుడు చేసిన చేష్టలు, సమంజసంగానే ఉన్నాయి.

ప్రశ్న 7.
మీ పాఠం ఆధారంగా హనుమంతుని స్వభావాన్ని విశ్లేషించండి.
జవాబు:
హనుమంతుడు మహాబలవంతుడు. ధైర్యశాలి. సాహసం కలవాడు. దృఢమైన దీక్ష కలవాడు. కార్యసాధకుడు. అందువల్లనే సముద్రలంఘనానికి తాను సిద్ధపడ్డాడు.

హనుమంతుడి శక్తి బలములు :
హనుమంతుడి బలము, శక్తి, ధైర్యము అసమానములైనవి. .సముద్రం దాటడానికి అతడు పర్వతంపై ఒత్తి అడుగులు వేస్తే కొండరాళ్ళన్నీ, పగిలిపోయాయి. అతడు తోకను త్రిప్పిన గాలి వేగానికి చెట్లన్నీ కూలిపోయాయి. అతడు చేతితో చరిస్తే క్రూర జంతువులు సైతం పారిపోయాయి. అతడు సింహనాదం చేస్తే, గుహలు ప్రతిధ్వనించాయి. హనుమంతుడి పాదాల ఒత్తిడికి పర్వతాలు కంపించి, ఏరులలోని జలాలు ఆకాశానికి ఎగసిపడ్డాయి.

పర్వతం అంత ఆకారము:
హనుమంతుడు తన శరీరాన్ని పెంచితే సాక్షాత్తు అతని తండ్రి వాయుదేవుడిలా కనిపించాడు. అతడు ఎగురుతూ ఉంటే, పర్వతం ఎగిరినట్లు కనిపించింది.

సోదర వానరులకు ధైర్యం :
హనుమంతుడు సముద్రంపై ఎగిరే ముందు, తన శక్తి సామర్థ్యాలను తోడి వానరులకు చూపించి తప్పక తాను సీత జాడ తెలిసేని రాగలనని వారికి ధైర్యం కల్పించాడు. హనుమంతుడు మహేంద్ర గిరిపై పాదాలు తొక్కిపెట్టి, పైకి లేవగా ఆ పర్వతమే భూమిలోకి దిగిపోయింది.

కాలిపిక్కల వేగం :
హనుమంతుడు ఎగిరేటప్పుడు అతడి కాలిపిక్కల నుండి వచ్చిన గాలి వేగానికి, సముద్రము చీలిపోయింది. అది రాముడి క్రోధరసం లంకకు చేరడానికి తవ్విన కాలువలా, సేతువు కట్టడానికి తవ్విన పునాదిలా, బలి చక్రవర్తి ఇంటి వాకిలిలా కన్పించింది.

దీనినిబట్టి హనుమంతుడు మహాబలవంతుడని, ధైర్యం కలవాడని, గొప్ప సాహసవంతుడని, కార్యసాధకుడని తెలుస్తోంది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 8 సముద్ర‌లంఘ‌నం

ప్రశ్న 8.
సముద్రలంఘనం పాఠంలో కవి చాతుర్యాన్ని విశ్లేషించండి.
జవాబు:
సముద్రలంఘనం పాఠం అయ్యలరాజు రామభద్రుడు రచించిన ‘రామాభ్యుదయం’ ప్రబంధములోనిది. ఈ కవి గొప్ప – కవితాచాతుర్యం కలవాడు. గొప్ప భావకుడు, మంచి కవితాశక్తి కలవాడు. ఆలంకారిక సిద్ధహస్తుడు.

ఈ పద్యాలలో స్వభావోక్తి, ఉత్ప్రేక్షాలంకారాలు చక్కగా ఉన్నాయి. హనుమంతుడు ఎగరడానికి ముందు చేసిన చేష్టల వర్ణన, చక్కని స్వభావోక్తిలో ఉంది. హనుమంతుడి అడుగులకు కంపించి ఎగిరిన సెలయేళ్ళ జలాలు, ఆకాశం ఎత్తు ఎగిరి దావాగ్నులను, వానరుల మనస్సులలోని తాపాన్ని చల్లార్చాయని కవి చక్కగా చెప్పాడు.

హనుమంతుడు ఎగిరినప్పుడు వచ్చిన పిక్కలగాలికి సముద్రం రెండుగా లోతుగా చీలి పోయిందట. అప్పుడు అది ఆ రాముని క్రోధరసాన్ని లంకకు చేరడానికి తవ్విన కాలువలా, సేతు నిర్మాణానికి తవ్విన పునాదిలా, హనుమంతుడిని చూడ్డానికి శేషుడు వచ్చి తలుపు తెరిచిన బలిమందిరంలా ఉందని, అద్భుతమైన ఉత్ర్ఫేక్షలు ఇక్కడ కవి ప్రయోగించాడు.

రామభద్రకవి ఊహాశక్తికి జోహార్లు అర్పిద్దాం.

10th Class Telugu 8th Lesson సముద్ర‌లంఘ‌నం Important Questions and Answers

ప్రశ్న 1.
హనుమంతుడు సముద్రలంఘనం చేసేటప్పుడు ప్రకృతి ఎలా సహకరించింది?
జవాబు:
హనుమంతుడు సముద్రలంఘనం చేసేటప్పుడు ప్రకృతి అనేక విధాలుగా సహకరించింది. రామ కార్యానికి వెళ్తున్న హనుమంతుడికి సూర్యుడు తాపాన్ని కలిగించలేదు. వాయువు చల్లగా ప్రసరించాడు. దేవతలు, గంధర్వులు, మహర్షులు కీర్తించారు. హనుమంతునికి శ్రమ కలుగకూడదని సముద్రుడు భావించాడు. సముద్రుని ఆజ్ఞపై మైనాకుడు సముద్రం నుండి బయటికి వచ్చి హనుమంతుడ్ని కొంతసేపు తన బంగారు శిఖరాల మీద విశ్రాంతి తీసుకోమన్నాడు.

ప్రశ్న 2.
సముద్రలంఘనం పాఠం కథ రూపంలో రాయండి.
జవాబు:
హనుమంతుడు మహాబలవంతుడు. అతడు సముద్రాన్ని దాటేముందు శరీరాన్ని పెంచి మహేంద్రగిరిపై అడుగులు వేశాడు. అప్పుడు పిడుగులు పడ్డట్లు రాళ్ళు పగిలిపోయాయి. హనుమంతుడు తోకను త్రిప్పినప్పుడు వచ్చిన గాలి వేగానికి చెట్లు కూలిపోయాయి. అతడు చేతితో చరిస్తే భయపడి క్రూర జంతువులు పారిపోయాయి. అతడు చేసిన సింహనాదానికి గుహలు ప్రతిధ్వనించాయి. కొండలు కంపించాయి. కొండలపై సెలయేళ్ళ కెరటాలు ఎగసిపడి ఆకాశాన్ని తాకాయి. హనుమంతుడు పెరిగి మహేంద గిరిపై నిలిచాడు.

హనుమంతుడు సముద్రం వైపు చూసి, తన రెండు చెవులు రిక్కించి, వంగి, చేతులను నడుముకు ఆనించి, తోకను ఆకాశం మీదికి పెంచి, పాదాలు దగ్గరగా పెట్టి, గాలి గట్టిగా పీల్చి, తాను నిలబడ్డ కొండను అణగదొక్కి పైకి ఎగిరాడు.

హనుమంతుడు ఎగురుతూ ఉంటే, పర్వతము ఎగిరినట్లు అనిపించింది. హనుమంతుడు విల్లు నుండి విడిచిన బాణంలా పెద్ద ధ్వనితో లంకవైపు దూసుకుపోయాడు.

హనుమంతుడు తోకతో ఎగరడం చూసిన దేవతలు, సూర్యుడు మహా వేగంగా కాడి ఉన్న తన రథాన్ని అటువైపు తోలుకు వస్తున్నాడేమో అనుకొన్నారు. హనుమంతుని పిక్కల నుండి వచ్చిన గాలి వేగానికి, సముద్రం లోతుగా చీలింది. ఆ గాలి పాతాళంలో ఉన్న పాములకు, ఆహారం వచ్చిందేమో అనిపించింది.

హనుమంతుడి పిక్కల బలంతో వీచిన గాలి వేగానికి సముద్రం చీలినట్లు కాగా, రాముని క్రోధరసం లంకకు చేరడానికి తవ్విన కాలువలా, రాబోయే కాలంలో కట్టే సేతువుకు పునాదిలా, ఆదిశేషుడు తలుపులు తెరిచిన బలిమందిరం యొక్క వాకిలిలా కనిపించింది. హనుమ, త్రికూటాద్రి పై దిగాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 8 సముద్ర‌లంఘ‌నం

ప్రశ్న 3.
‘సామాన్యులు కూడా అద్భుతాలు సాధించగలరు’ అనే అంశం దృష్టిలో పెట్టుకొని సామాన్య విద్యార్థులను ప్రోత్సహిస్తూ కరపత్రం తయారు చెయ్యండి.
జవాబు:

(కరపత్రం )

విద్యార్థినీ, విద్యార్థులారా ! ఒక్కసారి ఆలోచించండి. మనం మన దృష్టిని చదువు పైనే కేంద్రీకరిద్దాం. కొద్దిగా పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని మనం నిరుత్సాహపడకూడదు. మనం ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్నాం, కాన్వెంట్లకు వెళ్ళలేక పోతున్నాం అని బాధపడకండి.

కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. కృషి చేస్తే సామాన్యులు సైతం, ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. మొన్న ఐ.ఎ.యస్ పరీక్ష ఫలితాలు గమనించండి. ఒక కూలి వాని బిడ్డ, ఒక ఫ్యాక్టరీ గుమస్తా కుమార్తె, ఒక మత్స్యకారుని కుమారుడు, ఒక దర్జీ కొడుకులు, కూతుళ్ళు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంలో చదివి ఐ.ఎ.యస్ పరీక్షలలో మంచి ర్యాంకులు సాధించారు. సామాన్య విద్యార్థులు సైతం ఐ.ఐ.టీలలో సీట్లు సాధించి, లక్షలు, కోట్ల జీతాలపై నేడు ఉద్యోగాలు చేస్తున్నారు.

కొందరు స్వయంకృషితో మంచి వ్యాపారవేత్తలుగా, మంచి ప్రతిభావంతులైన ఉద్యోగులుగా, రాజకీయనాయకులుగా తయారవుతున్నారు. టీలు అమ్మిన మన మోదీ గారు నేడు మన ప్రధాని అయ్యారు. విదేశాలలో మంచి ప్రధానమంత్రిగా ఆయన రాణిస్తున్నాడు. ఎందరో చిన్న చిన్న పనివారల పిల్లలు, పెద్ద జీతాలు సాధిస్తున్నారు. MP లుగా, MLA లుగా పేరు సంపాదిస్తున్నారు.

అందుకే నేను సామాన్యుడనని మీరు అనుకోకండి. కృషి చేయండి. పట్టుదల పట్టండి. గొప్పవారు కావాలనే కలలు కనండని మన మాజీ రాష్ట్రపతి కలామ్ మనకు చెప్పిన మాటలు మరచి పోకండి. చిన్న చిల్లర కొట్టు యజమాని కొడుకు మన అబ్దుల్ కలామ్, గొప్ప శాస్త్రవేత్తగా, పరిపాలనా దక్షుడైన రాష్ట్రపతిగా ఆయన కీర్తిని సంపాదించాడు కదా !

అందరూ సంపన్నులుగా, తెలివి కలవారుగా, పెట్టి పుట్టిన వారుగా పుట్టరు. మనమే భవిష్యత్తును బంగారం చేసుకోవాలి. కాబట్టి ప్రయత్నించండి. గొప్పవారు కండి.

రాష్ట్ర విద్యార్థి యూనియన్,
విజయవాడ.

ప్రశ్న 4.
గ్రంథాలయాల ఆవశ్యకత, ప్రయోజనాలు, సంరక్షణ గురించి అవగాహన కల్పిస్తూ కరపత్రం తయారుచేయండి.
జవాబు:

(కరపత్రం )

మిత్రులారా !

“చిరిగిన చొక్కా అయినా తొడుక్కో – కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో” అన్నది సూక్తి. ఇటువంటి సూక్తులెన్నో పుస్తకాల ప్రాముఖ్యాన్ని, ప్రాశస్త్యాన్ని వివరించేవి వున్నాయి. తరతరాల విజ్ఞాన సంపదను అందించేవి గ్రంథాలు. అటువంటి గ్రంథాలు గల నివాసాన్ని గ్రంథాలయం (Library) అంటారు.

ప్రపంచంలో గొప్ప గొప్ప గ్రంథాలయాలున్నాయి. ఆమెరికాలో గల ‘కాంగ్రెసు లైబ్రరీ’, రోము నగరంలోని ‘వాటికన్ లైబ్రరీ’, ‘బ్రిటిష్ లైబ్రరీ’ మొదలైనవి ప్రపంచంలో పేరొందాయి. మనదేశంలో చెన్నైలోని “కన్నెమరా” గ్రంథాలయం, తంజావూరులోని “సరస్వతీ మహలు”, వేటపాలెంలోని “సారస్వత నికేతనం”, హైదరాబాదులోగల “శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం” మొదలైనవి చెప్పుకోదగ్గవి చాలా ఉన్నాయి. కడపలో సి.పి. బ్రౌన్ స్మారక గ్రంథాలయం కూడా నెలకొల్పబడింది.

గ్రంథాలయాలలో చాలా రకాలున్నాయి. ప్రభుత్వ గ్రంథాలయాలు, స్వచ్ఛంద సంస్థల గ్రంథాలయాలు వున్నాయి. గ్రంథాలయాల వల్ల చాలా లాభాలున్నాయి :

  1. గ్రంథాలయాలు మనిషిని మనీషిగా మారుస్తాయి.
  2. మహామేధావులు తరతరాలుగా సంపాదించిన అనుభవాలు, ఆలోచనలు గ్రంథాలలో భద్రపరచబడతాయి.
  3. దేశాభ్యుదయానికి, సమాజవికాసానికి మూలస్తంభాలు గ్రంథాలయాలు.
  4. గ్రంథపఠనమనే మంచి అలవాటు అలవడుతుంది.
  5. గ్రంథాలు తండ్రివలె ఆదేశిస్తాయి. తల్లివలె లాలిస్తాయి. మిత్రుని వలె ఆదుకుంటాయి. గురువువలె ప్రబోధిస్తాయి.

గ్రంథాలయాధికారులు పుస్తకాలు కొనేటప్పుడు అత్యంత శ్రద్ధ వహించాలి. డబ్బును దుర్వినియోగం చెయ్యకుండా మంచి పుస్తకాలనే కొనాలి. హాని కలిగించు పుస్తకాలను నిర్మొహమాటంగా తిరస్కరించాలి. పోటీ పరీక్షలకి, ఉద్యోగ పరీక్షలకి, చదువుకి కావలసిన పాఠ్య గ్రంథాలు, క్విజ్ పుస్తకాల వంటివాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రభుత్వం గ్రంథాలయోద్యమాన్ని నీరుకార్చకుండా తగిన శ్రద్ధవహిస్తే సమాజం అభ్యుదయ పథంలో పయనిస్తుంది.

ఇట్లు
గ్రంథాలయాల అభివృద్ధి మండలి

ప్రశ్న 5.
అయ్యలరాజు రామభద్రుని కవితా విశిష్టతను తెలుపుతూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

తిరుపతి,
x x x x

ప్రియమైన మిత్రుడు సతీష్ చంద్రకు,

నీ మిత్రుడు వ్రాయునది. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా వ్రాయునది మా తెలుగు పాఠ్యాంశాల్లో సముద్రలంఘనం పాఠం ఒకటి. ఇది వర్ణనాత్మక పాఠం. దీన్ని అయ్యలరాజు రామభద్రుడు అనే కవి రచించాడు. రామభక్తుని వర్ణనాత్మక రచన అందరిని ఆకట్టుకుంటుంది. ఈ మహాకవి వర్ణనలు సహజంగా ఉంటాయి. ప్రకృతి దృశ్యాలను కళ్ళకు కట్టినట్టుగా తెలియచేశారు. హనుమంతుని పరారకమాన్ని సుమనోహరంగా వర్ణించాడు. అందువల్లనే నాకు రామభద్రుని వర్ణనాత్మక రచన అంటే ఇష్టం. నీవు ఏ కవిని అభిమానిస్తావో నాకు తెలియజేయి. పెద్దలందరికి నమస్కారములు తెలుపగలవు.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
x x x x x x

చిరునామా :
వి.సతీష్ చంద్ర, 10వ తరగతి,
జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాల,
మంగళగిరి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.

ప్రశ్న 6.
మీ ప్రాంతంలో ప్రవహించే నదిని వర్ణిస్తూ, ఒక కవితా గేయం రాయండి.
జవాబు:
మా ప్రాంతంలో గౌతమీ నది ప్రవహిస్తోంది.
కవితా గేయం :

“సప్తర్షి సంఘాన గౌతముడు పెద్ద
వనము పెంచెను ఋషి ఫలవృక్షములను
గోవొకటి దానిని భగ్నంబు చేసె
గౌతముడు కోపాన కనువిచ్చి చూసే
భస్మమయ్యెను గోవు మునికోపదృష్టి
ఋషిమండలంబంత నిందించె ఋషిని
గౌతముడు తాపమున తపము చేయంగ
పరమేశుడప్పుడు ప్రత్యక్షమయ్యె
గోవు స్వర్గతి చెంద శివు డంత కరుణ
గోదావరీనదిని సృష్టించి విడిచె
నాసిక్కు క్షేత్రాన గోదావరీ మాత
సన్నని పాయగా ప్రభవించెనంత
ప్రవహించి జలము గోభస్మమును ముంచె
గోవు స్వర్గతి చెంద మునియు హర్షించె
గోదావరీ పాయ గౌతమి నదియై
సాగు తాగునీరు జనులకు నందించె
మోక్షమ్ము తా నొసగె దేహమ్ము ముంప
స్వర్గమోక్షదమ్ము గోదావరమ్ము
వేద నాదం బొలుకు దాని కమ్ర రవమ్ము”

10th Class Telugu 8th Lesson సముద్ర‌లంఘ‌నం 1 Mark Bits

1. దనువు అనే స్త్రీ యందు పుట్టిన వాళ్ళు. వీరు దేవతలకు శత్రువులు – గీత గీసిన పదానికి వ్యుత్పత్యర్థ పదాన్ని గుర్తించండి. (June 2017)
A) దానవులు
B) ధర్మాత్ములు
C) దుర్జనులు
D) దుష్టులు
జవాబు:
A) దానవులు

2. అపారమైన తీరము గలది – (వ్యుత్పత్తిని చెప్పే పదం గుర్తించుము. ) (March 2017)
A) పారాశర్యుడు
B) పారావారం
C ) తాపసుడు
D) కార్ముకం
జవాబు:
B) పారావారం

AP SSC 10th Class Telugu Important Questions Chapter 8 సముద్ర‌లంఘ‌నం

3. యమకాలంకారానికి ఉదాహరణ గుర్తించుము. (March 2017)
A) రాజు కువలయానందకరుడు
B) మా పొలంలో బంగారం పండింది
C) లేమా ! దనుజుల గెలవగ లేమా !
D) శ్రీనాథు వర్ణించు జిహ్వజిహ్వ
జవాబు:
C) లేమా ! దనుజుల గెలవగ లేమా !

4. ‘హరి భజియించు హస్తములు హస్తములు’ ఇందులోని అలంకారం గుర్తించండి. (June 2018)
A) లాటానుప్రాసము
B) ఛేకానుప్రాసము
C) యమకము
D) ముక్తపదగ్రసము
జవాబు:
A) లాటానుప్రాసము

5. హనుమంతుడు పర్వతమెక్కాడు – (వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించండి) (S.I. I – 2018-19)
A) హనుమంతుడు పర్వతమెక్కుటలేదు.
B) హనుమంతుడు పర్వతమెక్కలేడు.
C) హనుమంతుడు పర్వతమెక్కుట కష్టం.
D) హనుమంతుడు పర్వతమెక్కలేదు.
జవాబు:
D) హనుమంతుడు పర్వతమెక్కలేదు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 7 మా ప్రయత్నం

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Important Questions Chapter 7 మా ప్రయత్నం

AP State Syllabus SSC 10th Class Telugu Important Questions 7th Lesson మా ప్రయత్నం

10th Class Telugu 7th Lesson మా ప్రయత్నం 2 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
పీఠిక అంటే ఏమిటి? వివరించండి. (June 2017)
(లేదా)
‘పీఠిక’ సాహిత్య ప్రక్రియను వివరింపుము. (March 2017)
ఒక పుస్తకం యొక్క తాత్త్వికతను, అంతస్సారాన్ని తెలియజేసే దానిని ‘ముందుమాట’ లేదా ‘పీఠిక’ అంటారు గదా ! ‘పీఠిక’ ప్రక్రియ గురించి వ్రాయండి. (March 2019)
జవాబు:
ఒక గ్రంథాన్నీ, గ్రంథ నేపథ్యాన్ని పరిచయం చేస్తూ వ్రాసే ముందుమాటను పీఠిక అంటారు. దీనిని రచయిత కానీ, విమర్శకుడు కానీ, వేరే వ్యక్తి కానీ వ్రాయవచ్చు.

పీఠికకు ముందుమాట, ప్రస్తావన, తొలిపలుకు, మున్నుడి, ఆముఖం అని కూడా అంటారు.

ప్రశ్న 2.
‘మహిళావరణం’ అనే పుస్తకానికి రచయిత్రులు రాసిన ‘పీఠిక’ ప్రక్రియ వివరించండి. (S.A. I – 2018-19)
(లేదా)
మా ప్రయత్నం పాఠ్యాంశ ప్రక్రియను రాయండి. (S.A. I – 2019-20)
జవాబు:
ఒక గ్రంథాన్నీ, గ్రంథ నేపథ్యాన్ని పరిచయం చేస్తూ వ్రాసే ముందుమాటను పీఠిక అంటారు. దీనిని రచయిత కానీ, విమర్శకుడు కానీ, వేరే వ్యక్తి కానీ వ్రాయవచ్చు.

పీఠికకు ముందుమాట, ప్రస్తావన, తొలిపలుకు, మున్నుడి, ఆముఖం అని కూడా అంటారు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 7 మా ప్రయత్నం

ప్రశ్న 3.
ఓల్గా గారి గురించి వ్రాయండి.
జవాబు:
ఈమె ప్రముఖ స్త్రీవాద రచయిత్రి. ఈమే తన కథలు, కవితలు, నవలలతో తెలుగు సాహిత్యంలో స్త్రీవాద ఉద్యమానికి ఉత్తేజాన్ని అందించింది. ఈమె ఎన్నో పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. అనేక పురస్కారాలు, అవార్డులను ఆమె అందుకొన్నారు.

ప్రశ్న 4.
వసంత కన్నబిరాన్ గురించి వ్రాయండి.
జవాబు:
ఈమె 1930లో హైదరాబాద్ లో జన్మించారు. ఈమె ఇంగ్లీషు లెక్చరర్‌గా పనిచేశారు. మానవహక్కులు, స్త్రీ సమానత్వం కోసం ఆమె కృషి చేస్తున్నారు. ఆమె “నేషనల్ అలయెన్స్ ఆఫ్ ఉమెన్”, “ఇండియన్ నేషనల్ సోషల్ యాక్షన్ ఫోరం”లో పనిచేస్తున్నారు.

ప్రశ్న 5.
కల్పన కన్నబిరాన్ గురించి వ్రాయండి.
జవాబు:
ప్రముఖ న్యాయవాది కె.జి. కన్నబిరాన్, రచయిత్రి వసంత కన్నబిరాన్ల కుమార్తె కన్నబిరాన్. ఈమె హైదరాబాద్లోని ‘సెంటర్ ఫర్ నేషనల్ డెవలప్ మెంట్’ కు సంచాలకులుగా పనిచేస్తున్నారు. సామాజిక న్యాయం, సామాజిక ఉద్యమాలలో క్రియాశీలకంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ‘జెండర్ స్టడీస్’, ‘క్రిమినల్ లా’లో విస్తృత అధ్యయనం, పరిశోధనలు చేశారు. చాలా విలువైన గ్రంథాలు రాశారు.

10th Class Telugu 7th Lesson మా ప్రయత్నం 4 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
“స్త్రీలు ప్రధానమైన చరిత్ర నిర్మాతలు” అని రచయిత్రులు భావించడానికి గల కారణాలను ‘మా ప్రయత్నం’ పాఠం ఆధారంగా వివరించండి. (June 2018)
జవాబు:

  1. కొత్త కాలంలోకి అడుగు పెడుతున్న కాలంలో గడచిన కాలాన్ని గుర్తుకు తెచ్చుకొని భవిష్యత్తుపై ఒక అంచనాకు రావటం సహజం.
  2. గత శతాబ్దపు సామాజిక మార్పులలో, అభివృద్ధిలో స్త్రీల భాగస్వామ్యాన్ని గురించి ఆలోచించిన రచయిత్రులకు చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు ప్రధానంగా ఉన్నారనే భావం కలిగింది.
  3. గడచిన శతాబ్దంలో స్త్రీలు చేసిన పోరాటాలూ, వారు నడిపిన ఉద్యమాలూ, రాణించిన రంగాలు ఎన్నో ఉండటమే ఆ భావనకు ప్రధాన కారణం.
  4. మొదటిసారి చదువుకొన్న స్త్రీలు, మొదటి వితంతు వివాహం చేసుకొనే సాహసం చేసిన స్త్రీలు, స్త్రీ విద్య కోసం పాటుపడినవారు, ఉద్యమాలలో పాల్గొని జైలుకు కూడా వెళ్ళేందుకు తెగించిన స్త్రీలు, కళారంగంలో తొలిసారి కాలుమోపిన మహిళలు, మొదటి తరం డాక్టర్లూ, శాస్త్రవేత్తలూ – వారు చేసిన పోరాటాలు రచయిత్రుల భావాన్ని బలపరిచాయి.
  5. స్త్రీలకు తగిన గుర్తింపు లభించలేదని, సంప్రదాయ చరిత్రకారులు స్త్రీలకు తగిన ప్రాధాన్యం, ప్రాతినిధ్యం ఇవ్వలేదని రచయిత్రులు భావించారు.
  6. చరిత్ర అనే జగన్నాథ రథ చక్రాల క్రింద నలిగిపోయినందున చరిత్ర నిర్మాతలుగా స్త్రీలకు గుర్తింపు లభించలేదని, కానీ, ప్రధాన చరిత్ర నిర్మాతలుగా వారిది తిరుగులేని స్థానమని రచయిత్రులు భావించారు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 7 మా ప్రయత్నం

ప్రశ్న 2.
“మహిళావరణం” పుస్తక రూపకల్పనలో రచయిత్రులు పడిన శ్రమను, పొందిన అనుభవాలను తెల్పండి. (March 2018)
జవాబు:
1) గడచిన శతాబ్దంలో సామాజికాభివృద్ధిలో, సామాజిక మార్పులలో, స్త్రీల యొక్క భాగస్వామ్యం గురించి ఆలోచించిన – ఓల్గా తదితర స్త్రీవాద రచయితల ముందుకు ఎన్నో విషయాలు వచ్చాయి. గడచిన శతాబ్దంలో చాలా అంశాలలో స్త్రీల భాగస్వామ్యం అధికంగా ఉందని చరిత్ర నిర్మాతలుగా వారిది తిరుగులేని స్థానమని రచయిత్రులు భావించారు.

2) ఆ విషయాన్ని సాధికారికంగా, సోదాహరణంగా నిరూపించటానికి రచయిత్రులు ఒక పుస్తకాన్ని తీసుకురావాలను కొన్నారు. అలా “మహిళావరణం” పుస్తక రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో వారెన్నో కష్టాలనెదుర్కొన్నారు. ఒళ్ళు పులకించే అనుభవాలను పొందారు.

3) గడచిన శతాబ్దంలో స్త్రీలు చేసిన పోరాటాలు, రాణించిన రంగాలు ఎన్నో ఉన్నాయి. ఆ స్త్రీలను అందరినీ ఒకచోట చేర్చటం రచయిత్రులకెంతో ఉత్సాహాన్నిచ్చింది. ఇంతమంది స్త్రీలను ఒకే చోట చూడటం వలన, స్త్రీలు వెనుకబడిపోయారనే భావంతో ఉన్న రచయిత్రులకు కనువిప్పు కలిగింది. ఒక చైతన్య ప్రవాహంగా స్త్రీలను వాళ్ళు చూడగలిగారు.

4) ఎక్కడో ఒకచోట కొంతమంది స్త్రీలను గురించి చదవటానికి, ఒకేసారి వందమందికి పైగా స్త్రీలను, వివిధరంగాలలో వారు చేసిన కృషిని, సాధించిన విజయాలను తెలుసుకోవటానికి గల తేడాను, అనుభూతిలో గల భేదాన్ని రచయిత్రులు గ్రహించారు.

5) చరిత్రను నిర్మించడానికి ఆనాటి స్త్రీలు ఎంత మూల్యం చెల్లించారో తలచుకొంటే రచయిత్రుల గుండెలు బరువెక్కాయి. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, ఎంతో శ్రమకోర్చి. రచయిత్రులు ఈ “మహిళావరణం” పుస్తకాన్ని రూపొందించారనటం అక్షర సత్యం.

ప్రశ్న 3.
సామాన్యంగా చరిత్ర నిర్మాతలుగా స్త్రీలకు ఎందుకు గుర్తింపు లభించదో వివరించండి.
జవాబు:
చరిత్ర రచయితలకు, స్త్రీలను గూర్చి, వారు చేసిన కృషిని గురించి, అంతగా గౌరవమూ, శ్రద్ధ లేకపోవడం వల్లనే, స్త్రీలు చరిత్రలో ఎక్కకపోవడానికి కారణం అయి ఉంటుంది. చరిత్ర అనే జగన్నాథ రథచక్రాల క్రింద, ఆ స్త్రీల యొక్క ఉనికి, ముక్కలయ్యింది.

అదీగాక చరిత్రకారులకు, స్త్రీలపై చిన్నచూపు ఉండడం కూడా అందుకు కారణం అయి ఉంటుంది. చరిత్రకారుడికి ఆ స్త్రీలను గూర్చి అంతగా వివరంగా తెలియకపోవడం కూడా ఒక కారణం అయి ఉంటుంది. అందుకే సంప్రదాయ చరిత్ర రచయితలు స్త్రీలను చరిత్రలో అక్కడక్కడ పౌడర్ అద్దుతారు. బాగా ప్రసిద్ధులయిన స్త్రీలను గురించి మాత్రమే ఆ చరిత్రకారులు రాసి ఉంటారు. అదీగాక, ఈనాటి వలె ఆ రోజుల్లో సమాచారం అంతగా తెలిసికోడానికి సాధనాలు కూడా లేవు. అందువల్లనే ఆయారంగాల్లో అక్కడక్కడ కృషి చేసిన స్త్రీల గూర్చి ఆ చరిత్రకారుల దృష్టికి సరిగా వచ్చి ఉండదు. కొంతమంది ఉద్యమ స్త్రీలను గురించి, చరిత్ర రచయిత విని ఉన్నా, ఆ స్త్రీల వివరాలు, వారు చేసిన కృషి, చరిత్రకారుల దృష్టికి వచ్చియుండకపోవచ్చు.

అందువల్లనే సామాన్యంగా చరిత్ర నిర్మాతలుగా పెక్కుమంది స్త్రీలకు గుర్తింపు లభించలేదని మనం గ్రహించాలి.

ప్రశ్న 4.
“మహిళావరణం” శీర్షిక గురించి మీ అభిప్రాయాలు రాయండి.
జవాబు:
గడచిన 20వ శతాబ్దంలో స్త్రీలు ఆయారంగాల్లో కీలకస్థానాల్లో కీలక సమయాలలో పనిచేసి, అక్కడ తమ ముద్రవేసిన వందమంది స్త్రీలను గురించి మహిళావరణం సంపాదకులు ఒక పుస్తకం తీసుకువచ్చారు. ఆ పుస్తకానికి “మహిళావరణం” అని పేరు పెట్టారు. ‘మహిళావరణం’ అంటే, స్త్రీలను వరించడం, అనగా కోరుకోవడం అని భావము. 20వ శతాబ్దంలో విభిన్నరంగాలలో కీలక సమయాల్లో, కీలక స్థానాల్లో పనిచేసిన నారీమణులను, ఈ పుస్తకం సంపాదకులు కోరి వారికి తమ గ్రంథములో చోటు కల్పించారు. వారి దృష్టికి, ఎంతోమంది స్త్రీలు చరిత్రకు ఎక్కవలసినవారు కనిపించారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అందులో కొంతమందినే ఏరి కోరుకొని, ఈ పుస్తకంలో, వారికి, చోటు కల్పించారు.

అంటే ఈ పుస్తకంలోకి ఎక్కిన స్త్రీలు, సంపాదకులు కోరి వరించిన వారన్న మాట. అందుకే ఈ పుస్తకానికి ‘మహిళావరణం’ అని, సంపాదకులు అర్థవంతమైన చక్కని పేరు పెట్టారని నా అభిప్రాయము.

అయితే, ఈ పుస్తకానికి “20వ శతాబ్దపు ప్రసిద్ధ నారీమణులు” అని కూడా పేరుపెట్టవచ్చు. సంపాదకుల దృష్టికి సుప్రసిద్ధ నారీమణులు సుమారు 300 మంది వచ్చారు. వారిలో కేవలం 118 మంది మహిళామణులనే ఏరి కోరుకొని, స్థానం కల్పించారు. అందువల్లనే ‘మహిళావరణం’ అన్న పేరు “సమంజసంగా ఉంది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 7 మా ప్రయత్నం

ప్రశ్న 5.
చరిత్ర సాగిన క్రమాన్ని ప్రతివాళ్ళూ ఎందుకు ప్రశ్నించారు?
జవాబు:
మహిళావరణం సంపాదకులు, విభిన్నరంగాల్లో విశిష్ట కృషి చేసిన స్త్రీమూర్తులను కలసికొన్నారు. అందులో వారు సరిదె మాణిక్యాంబగారిని కలిసినప్పుడు, వేశ్యాకులం వారిని మొదట ఆడవద్దని ప్రభుత్వం వారు, వారి మాన్యాలను తీసికొన్నారని, కానీ ఇప్పుడు అన్ని కులాలవారు జీవనోపాధి కోసం ఆడుతున్నారనీ, వేశ్యలను నాట్యం చేయవద్దనడం నేరం కదా అని ప్రశ్నించింది.

ఈ విధంగా మాణిక్యాంబగారే కాక, మరెందరో స్త్రీలు చరిత్ర సాగిన క్రమాన్నీ, అందులో స్త్రీలకు జరిగిన అన్యాయాన్నీ ప్రశ్నించారు. ఆ రోజుల్లో స్త్రీలకు ఉన్నత విద్య చదువుకొనే అవకాశం ఉండేది కాదు. స్త్రీలు రేడియో, సినిమా వంటి రంగాల్లో పనిచేయడానికి అవకాశం ఉండేది కాదు.

వితంతు స్త్రీలకు తిరిగి వివాహం చేసుకొనే హక్కు ఉండేది కాదు. అందుకే సాహసవంతులయిన స్త్రీ మూర్తులు నాడు చరిత్ర సాగిన క్రమాన్ని ప్రశ్నించారు.

ప్రశ్న 6.
ప్రతివాళ్ళూ ప్రశ్నించే విధంగా చరిత్ర ఎందుకు సాగింది? దీనికి కారణాలు ఏమిటి? విశ్లేషించండి.
జవాబు:
20వ శతాబ్దం నాటికి సంఘంలో నేడు ఉన్నంత చైతన్యం లేదు. పెద్దవాళ్ళు పాటించిన రీతిలోనే చరిత్ర సాగిపోయేది. స్త్రీలకు బాల్యవివాహాలు ఉండేవి. విధవ వివాహాలు చేసేవారు కారు. స్త్రీలకు అన్నిరంగాల్లోనూ ప్రవేశం ఉండేది కాదు. స్త్రీలు ఉన్నత విద్య చదివే సావకాశం లేదు.

స్త్రీలు బిడియపడుతూ ఉండేవారు. ఆనాడు అంతా మనుధర్మశాస్త్రం ప్రకారం అంటూ, మూఢాచారాలు పాటించేవారు, ఆ రోజుల్లోనే కందుకూరి వీరేశలింగము, రాజ్యలక్ష్మి, విలియం బెంటిక్, రాజారామమోహనరాయ్ వంటి సంఘ సంస్కర్తల ప్రభావంతో సంఘంలో కొంత మార్పు వచ్చింది.

స్త్రీ సహగమనము వంటి దురాచారాలు తగ్గాయి. విధవా పునర్వివాహాలు, సామాన్య స్త్రీలు విద్యాభ్యాసం చెయ్యడం వంటివి సాగించారు. మొత్తంపై ఆ 20వ శతాబ్దంలో మొదట్లో కొన్ని సాంఘిక దురాచారాల వల్ల స్త్రీలు అంతగా రాణించలేకపోయారు.

అందువల్లనే ప్రతివాళ్ళూ ప్రశ్నించే విధంగా నాడు చరిత్ర సాగింది. ఆ స్త్రీలు అందరూ చరిత్రను మార్చటానికి గట్టిగా ప్రయత్నించారు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 7 మా ప్రయత్నం

ప్రశ్న 7.
చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు ప్రధానంగా ఉన్నారనడానికి కారణాలను వివరించండి.
జవాబు:
20వ శతాబ్దం సామాజికాభివృద్ధిలో, సామాజిక మార్పులలో, స్త్రీల భాగస్వామ్యాన్ని గూర్చి ఆలోచిస్తే, 20వ శతాబ్దపు చరిత్ర నిర్మాతలుగా, వారికి తిరుగులేని స్థానం ఉందని సంపాదకులకు అనిపించింది.

20వ శతాబ్దంలో స్త్రీలు చేసిన పోరాటాలు, వారు పాలుపంచుకున్న ఉద్యమాలు, రాణించిన రంగాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. అటువంటి స్త్రీలు ఎంతోమంది సంపాదకులకు గుర్తుకు వచ్చారు.

20వ శతాబ్దంలో మొదటిసారి చదువుకున్న స్త్రీలు, ఉద్యమాల్లో చేరి జైలుకు వెళ్ళడానికి సైతం సిద్ధపడిన స్త్రీలు, మొదటగా వితంతు వివాహం చేసుకునేందుకు సాహసించిన స్త్రీలు, స్త్రీ విద్యకోసం ఉద్యమించిన స్త్రీలు, నాటకం, రేడియో, సినిమా రంగాలలో మొదటిసారి అడుగు పెట్టిన స్త్రీలు, మొదటి తరం డాక్టర్లూ, శాస్త్రవేత్తలూ, సంగీత నృత్య కళాకారిణులూ, విద్యావేత్తలూ ఎందరో సంపాదకులకు కనిపించారు. దానితో చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు ప్రధానంగా ఉన్నారనే భావన సంపాదకులకు కలిగింది.

ప్రశ్న 8.
‘స్త్రీలే ప్రధానమైన చరిత్ర నిర్మాతలు’ – సమర్థించండి.
జవాబు:
20వ శతాబ్దపు సామాజికాభివృద్ధిలో, సామాజిక మార్పులలో, స్త్రీలకు కల భాగస్వామ్యాన్ని గురించి ఆలోచిస్తే, ఎన్నో విషయాలు మహిళావరణం సంపాదకుల ముందుకు వచ్చాయి. 20వ శతాబ్దాన్ని స్త్రీల శతాబ్దంగా చెప్పవచ్చునని వారికి అనిపించింది. జరిగిన శతాబ్దం చరిత్ర నిర్మాతలుగా, స్త్రీలకు తిరుగులేని స్థానం ఉందని వారికి అనిపించింది.

గడిచిన 20వ శతాబ్దంలో స్త్రీలు చేసిన పోరాటాలు, వారు పాలుపంచుకున్న ఉద్యమాలు, వారు రాణించిన రంగాలు ఎన్నో ఉన్నాయి. 20వ శతాబ్దంలో మొదటిసారి చదువుకున్న స్త్రీలు, మొదటి వితంతు వివాహం చేసుకున్న సాహసురాండ్రు, స్త్రీ విద్య కావాలని, ఉద్యమించిన స్త్రీలు, ఉద్యమాలు చేసి జైలుకు వెళ్ళిన స్త్రీలూ ఉన్నారు. నాటకం, సినిమా, రేడియో, వంటి రంగాలలో స్త్రీలు మొదటిసారిగా 20వ శతాబ్దంలోనే అడుగుపెట్టారు. స్త్రీలలో ఎందరో మొదటితరం డాక్టర్లు, శాస్త్రవేత్తలు, కళాకారిణులు, విద్యాధికులు నాడు ఉన్నారు.

శరీరం పులకరింపజేసే ఎందరో సాహసమూర్తులు, ఆ శతాబ్దంలోనే ఉన్నారు. అందువల్లనే 20వ శతాబ్దంలో స్త్రీలే .. ప్రధానమైన చరిత్ర నిర్మాతలు అని చెప్పవచ్చు.

ప్రశ్న 9.
చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు నిలదొక్కుకొనేందుకు ఎంత కష్టపడి ఉంటారు?
జవాబు:
చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు నిలదొక్కుకోడానికి వారు చాలా కష్టపడి యుంటారు. ఆ విషయం తలచుకోగానే ఈ గ్రంథము సంపాదకులకు గుండెలు బరువెక్కాయట. ఆ స్త్రీలు, వాస్తవ జీవితానికి వ్యతిరేకమైన పరిస్థితులతో పోరాడారు. ఆ స్త్రీలు కొత్త కలలు కనడానికి, కొత్త జీవిత విధానాలు కనుక్కోడానికి, వారు ఎన్నో కఠిన పరీక్షలకు గురి అయ్యారు. మొదటిసారిగా వివాహం చేసుకున్న వితంతువు పరిస్థితి తలచుకొంటే, ఆ సామాన్య స్త్రీల సాహసం అసామాన్యమైనదని, సంపాదకులకు అనిపించింది.

ఉద్యమాలలో చేరి జైలుకు వెళ్ళిన స్త్రీ మూర్తులను, మొదటిసారి సినిమాలలో నటించిన స్త్రీలను చూస్తే వారు ఆనాడు ఎంత సాహసం చేశారో మనకు తెలుస్తుంది. ఆనాడు సమాజంలో స్త్రీలకు నేటి స్వాతంత్ర్యం లేదు. ఎన్నో కట్టుబాట్లు ఉండేవి. ఆ పరిస్థితులలో చరిత్ర నిర్మాతలుగా నిలదొక్కుకోడానికి ఆనాటి స్త్రీలు చాలా కష్టపడి ఉంటారని మనం గ్రహింపవచ్చు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 7 మా ప్రయత్నం

ప్రశ్న 10.
రచయిత్రుల గుండెలు ఎందుకు బరువెక్కాయి?
జవాబు:
స్త్రీలు దేశం కోసం, తమ కోసం ఒక సమూహంగా చేసిన పోరాటాలకూ, వారు పడిన సంఘర్షణలకూ, వారు సాధించిన విజయాలకూ చరిత్రలో సరైన గుర్తింపు దొరకలేదు. చరిత్ర అనే జగన్నాథ రథచక్రాల కింద వారి సామూహిక ఉనికి ముక్కముక్కలయ్యింది.

మహిళావరణం పుస్తకంలో స్త్రీమూర్తులందరినీ గూర్చి వరుసగా రాయడం జరిగింది. ఆ స్త్రీలందరి గూర్చి చదివేటప్పటికి, వారు సాధించిన విజయాలను గూర్చి తెలిసికొనేటప్పటికి, స్త్రీల చైతన్య ప్రవాహవేగం, జీవం, ఆ ప్రవాహక్రమంలోని మార్పులూ ఈ గ్రంథ సంపాదకులకు ఒక కొత్త విషయాన్ని చెపుతున్నట్లు అనిపించింది.

ఆ స్త్రీలు అందరూ చరిత్ర నిర్మాణానికి ఎంత కష్టపడి ఉంటారో కదా! అని తలచుకొనేటప్పటికి, సంపాదకుల గుండెలు బరువెక్కాయి. ఆ స్త్రీలు వాస్తవ జీవిత ప్రతికూల పరిస్థితులతో తలపడ్డారు. వారు కొత్త కలలు కనడానికీ, కొత్త జీవిత విధానాలు కనుక్కోడానికీ, ఎన్నో కఠిన పరీక్షలకు గురయ్యారు. అవి తలచుకుంటే, ఆ సామాన్య స్త్రీల సాహసం అసామాన్యమైనదని సంపాదకులకు అనిపించింది.

ఆ స్త్రీలు చరిత్రను నిర్మించేందుకు ఎంతగానో కష్టనష్టాలకు గురై ఉంటారని సంపాదకులు అభిప్రాయపడ్డారు.

10th Class Telugu 7th Lesson మా ప్రయత్నం Important Questions and Answers

ప్రశ్న 1.
మహిళల ప్రగతిని వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
ఈనాడు సమాజంలో స్త్రీలు అన్ని రంగాల్లో అగ్రగాములుగా ఉంటున్నారు. చదువుల్లో వారు సరస్వతీమూర్తులుగా మంచి ర్యాంకులు సాధిస్తున్నారు. వారు విమానాలను నడుపుతున్నారు. మిలటరీలో కూడా చేరి రాణిస్తున్నారు. శాస్త్రవేత్తలుగా ఎన్నో చక్కని పరిశోధనలు చేసి పేరు గడిస్తున్నారు. ఐ.ఎ.యస్, ఐ.పి.యస్ ఆఫీసర్లుగా పరిపాలనా రంగంలో స్త్రీలు చక్కగా రాణిస్తున్నారు.

M.L.Aలుగా, MLC లుగా, MP లుగా, ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా, కేంద్రమంత్రులుగా స్త్రీలు చక్కగా రాణిస్తున్నారు. స్త్రీలు గొప్ప పరిపాలనాదక్షలుగా నిరూపించుకున్నారు. నిరూపించుకుంటున్నారు.

ఒకనాడు స్త్రీలు ఉన్నత విద్యారంగంలో ఉండేవారు కాదు. అటువంటిది ఈనాడు స్త్రీలకు ప్రత్యేక కళాశాలలు, విశ్వవిద్యాలయాలు వచ్చాయి. పురుషులతో సమానంగా స్త్రీలు విద్యావంతులై రాణిస్తున్నారు. స్త్రీలలో మంచి డాక్టర్లు, ఇంజనీర్లు నేడు ఉన్నారు. స్త్రీలు పంచాయతీ బోర్డు మెంబర్ల దగ్గర నుండి, దేశ ప్రధానులుగా కూడా తమ పరిపాలనా దక్షతను ప్రదర్శిస్తున్నారు. ఇందిరాగాంధీ, మార్గరెట్ థాచర్, సిరిమావో- భండారనాయకే, జయలలిత, మమత వంటి స్త్రీమణులు, మంచి పరిపాలన దక్షలుగా రాణించారు. రాణిస్తున్నారు.

స్త్రీలల్లో మంచి క్రీడాకారిణులు ఉన్నారు. ఉషా, అశ్వినీ వంటి స్త్రీలు, పరుగుపందెంలో రాణించారు. సైనా నెహ్వాల్, సెరెనా విలియమ్స్, హంపి, సానియామీర్జా వంటి క్రీడాకారిణులు వివిధమైన ఆటలలో ప్రపంచంలో మొదటివారుగా ఉన్నారు.

వ్యాపార రంగంలో ఎందరో స్త్రీలు చక్కగా రాణిస్తున్నారు. కిరణ్ బేడీ వంటి మంచి పోలీసు ఆఫీసర్లు స్త్రీలలో ఉన్నారు. ఈ విధంగా స్త్రీలు అన్ని రంగాలలో నేడు ముందంజలో ఉంటున్నారు. నేటి మహిళల ప్రగతికి, 20వ శతాబ్దంలో స్త్రీ విద్యకై పోరాడిన స్త్రీ మూర్తులే కారణం అని మనం ఎప్పుడూ మరువకూడదు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 7 మా ప్రయత్నం

ప్రశ్న 2.
అత్యున్నత స్థాయికి చేరిన ఒక మహిళ ఆత్మకథ రాయండి.
జవాబు:
నాకు నచ్చిన మహిళ (శ్రీమతి ఇందిరా గాంధీ) : భరతమాత ముద్దుబిడ్డలలో, ఇందిరాగాంధీ ఒకరు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మహిళామణులలో, ఇందిర సుప్రసిద్ధురాలు. ఈమె 1917వ సంవత్సరము నవంబరు 19వ తేదీన అలహాబాదులో జవహర్లాల్ నెహ్రూ – కమలా నెహ్రూ దంపతులకు జన్మించింది.

ఇందిర శాంతినికేతన్లో రవీంద్రుని వద్ద చదివింది. ఈమె గొప్ప దేశ భక్తురాలు. ఈమె భర్త ఫిరోజ్ గాంధీ, మహమ్మదీయుడు. ఆ వివాహం ఈమెకు మత సహనాన్ని నేర్పింది. ఈమె తండ్రితో పాటు దేశ విదేశాలు పర్యటించి, రాజనీతి చతురజ్ఞ అయ్యింది.

ఈమె భారతదేశ ప్రధానమంత్రిగా 15 సంవత్సరాలు పనిచేసింది. ఆ కాలంలో ఈమె బ్యాంకులను జాతీయం చేసింది. రాజభరణాలను రద్దు చేసింది. భూ సంస్కరణలను చేపట్టింది. ‘గరీబీ హఠావో’ అని ఈమె ఇచ్చిన నినాదం భారతదేశం అంతటా మారుమ్రోగింది.

ఈమె బడుగువర్గాల ఆశాజ్యోతిగా, దళిత వర్గాల కన్నతల్లిగా పేరు తెచ్చుకొంది. ఈమె గొప్ప సాహసురాలు. గొప్ప రాజనీతిజ్ఞురాలు.

ప్రశ్న 3.
మహిళల పట్ల చూపుతున్న వివక్షను, వారిపై జరుగుతున్న దాడులనూ ఖండిస్తూ నినాదాలు రాయండి.
జవాబు:

  1. ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి – ఆమెను పువ్వుల్లా చూడండి.
  2. స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానమే – స్త్రీలపట్ల వివక్ష విడవండి.
  3. స్త్రీలు నీకు కన్నతల్లులు, సోదరీమణులు – స్త్రీలను నీవు గౌరవించు.
  4. స్త్రీలను అవమానించావా! నిర్భయ చట్టానికి లొంగుతావు జాగ్రత్త.
  5. ఆడపిల్లల జోలికి వస్తే – అడుగంటిపోతావు జాగ్రత్త.
  6. మహిళలు లక్ష్మీ స్వరూపిణులు, సరస్వతీ స్వరూపిణులు. వారిని గౌరవించండి.
  7. పార్లమెంటులో స్త్రీలకు రిజర్వేషన్లు కల్పించండి – స్త్రీ పురుష సమానత్వాన్ని గౌరవించండి.
  8. స్త్రీలపై దాడిచేస్తే – మాడు పగులుగొడతారు జాగ్రత్త.
  9. ఆడా మగా తేడావద్దు – స్త్రీ పురుష భేదం నేటితో రద్దు.
  10. భ్రూణహత్యలను నివారించండి – మహిళామణులను ఆదరించండి.

ప్రశ్న 4.
మహిళలను గౌరవించవలసిన ఆవశ్యకతను గురించి వివరిస్తూ, మీ మిత్రునికి లేఖ వ్రాయండి.
జవాబు:

లేఖ,

ఒంగోలు,
x x x x x.

ప్రియమైన స్నేహితుడు శంకరు,
నీ స్నేహితుడు రాజేష్ వ్రాయు లేఖ.

నేను క్షేమంగానే ఉన్నాను. అక్కడ మన మిత్రులంతా క్షేమంగా ఉన్నట్లు తలచెదను.

స్త్రీలను గౌరవించడం మన భారతీయ ధర్మం కదా ! మొన్న ఒక రోడ్ సైడు రోమియో ఒక అమ్మాయిని ఏడిపిస్తుంటే చూశాను.

స్త్రీలు ఆనందించిన చోట దేవతలు ఉంటారు. సిరిసంపదలు వృద్ధి చెందుతాయి. మన అమ్మ, అక్క, చెల్లి, ఉపాధ్యాయురాలు కూడా స్త్రీయే, స్త్రీలను గౌరవించలేని సమాజం అనాగరిక సమాజం. అందుకే స్త్రీలను గౌరవించాలి. స్త్రీలను హేళన చేయడం, దూషించడం తప్పు. నా ఎదురుగా ఇటువంటి పనులు చేస్తే పోలీసు కంప్లైంటు ఇస్తాను అని చెప్పాను. దానితో వాడు పరారైపోయాడు.

ఈ ఉంటాను మరి. మీ అమ్మగారికి, నాన్నగారికి నా నమస్కారాలని చెప్పు. మన స్నేహితులందరినీ అడిగినట్లు చెప్పు.

ఇట్లు,
కె. రాజేష్.

చిరునామా :
జి. శంకర్,
10వ తరగతి, బాలుర ఉన్నత పాఠశాల,
నరసరావుపేట, గుంటూరు జిల్లా.

10th Class Telugu 7th Lesson మా ప్రయత్నం 1 Mark Bits

1. దీపావళి పండుగరోజు ఆబాలగోపాలం ఆనందిస్తారు – గీత గీసిన పదం ఏ సమాసం? (June 2017)
A) బహుజొహి
B) అవ్యయీభావం
C) తత్పురుషం
D) కర్మధారయం
జవాబు:
B) అవ్యయీభావం

2. అవ్యయీభావ సమాసానికి ఉదాహరణను గుర్తించుము. (March 2017)
A) సేవావృత్తి
B) మృదుమధురం
C) అనుకూలం
D) పదాబ్దములు
జవాబు:
C) అనుకూలం

3. ప్రతిదినము పాఠశాల అసెంబ్లి సమయంలోపే పాఠశాలకు రావాలి – గీత గీసిన పదం సమాసం పేరు గుర్తించండి. (June 2018)
A) అవ్యయీభావ సమాసం
B) రూపక సమాసం
C) షష్టీతత్పురుష సమాసం
D) ద్వంద్వ సమాసం
జవాబు:
A) అవ్యయీభావ సమాసం

AP SSC 10th Class Telugu Important Questions Chapter 7 మా ప్రయత్నం

4. క్రింది వానిలో సంభావన పూర్వపద కర్మధారయ సమాసానికి సరియైన ఉదాహరణ గుర్తించండి. (June 2018)
A) రామబాణం
B) గంగానది
C) మూడు రోజులు
D) తల్లిదండ్రులు
జవాబు:
B) గంగానది

5. విద్యార్థులు ప్రతిదినము పాఠాలను చదవాలి. (సమాసం గుర్తించండి) (S.A. I – 2018-19)
A) అవ్యయీభావ సమాసం
B) ద్విగు సమాసం
C) ద్వంద్వ సమాసం
D) షష్ఠీ తత్పురుష
జవాబు:
A) అవ్యయీభావ సమాసం

6. ఆహా ! ఎంత బాగుందీ ! (ఏ వాక్యమో గుర్తించండి.) (June 2017)
A) ఆశ్చర్యార్థకం
B) విధ్యర్థకం
C) ప్రేరణార్థకం
D) సందేహార్ధకం
జవాబు:
A) ఆశ్చర్యార్థకం

7. రమేష్ బడికి వస్తాడో, రాడో. (ఏ వాక్యమో గుర్తించండి.) (June 2017)
A) ప్రార్థనార్థకం
B) సందేహార్థకం
C) ప్రశ్నార్థకం
D) నిషేధార్థకం
జవాబు:
B) సందేహార్థకం

8. ప్రతి పనికి లాభం ఉంటుంది – దీనికి వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించండి. (March 2017)
A) ప్రతి పనికి లాభం ఉంటుందా?
B) ప్రతి పనిలో లాభం ఉంటుంది.
C) ప్రతి పనికి లాభం ఉండే ఉంటుంది.
D) ప్రతి పనికి లాభం ఉండదు.
జవాబు:
D) ప్రతి పనికి లాభం ఉండదు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 7 మా ప్రయత్నం

9. సోముడు అడవికి వెళ్ళి, కట్టెలు తెచ్చాడు – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (March 2017)
A) సంయుక్తం
B) సంక్లిష్టం
C) ప్రశ్నార్థకం
D) ఆశ్చర్యార్థకం
జవాబు:
B) సంక్లిష్టం

10. ‘ఆకాశం నీలంగా ఉంటుంది’ – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (March 2017)
A) సంక్లిష్టం
B) చేదర్థకం
C) సామాన్యం
D) సందేహార్థకం
జవాబు:
C) సామాన్యం

11. “నీవు శాస్త్రవేత్తవు కాగలవు” – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (March 2017)
A) సామర్థ్యార్థకం
B) సందేహార్థకం
C) సంక్లిష్ట వాక్యం
D) సంయుక్త వాక్యం
జవాబు:
A) సామర్థ్యార్థకం

12. ‘ఆహా’ ఎంత రుచిగా ఉందో ! – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (March 2017)
A) చేదర్థకం
B) సందేహార్థకం
C) ఆశ్చర్యార్థకం
D) అప్యర్థకం
జవాబు:
C) ఆశ్చర్యార్థకం

13. ‘వాహనాన్ని వేగంగా నడుపవద్దు’ – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (March 2017)
A) నిషేధాకం
B) ఆశ్చర్యార్థకం
C) ప్రశ్నార్థకం
D) సందేహార్థకం
జవాబు:
A) నిషేధాకం

14. “మీరంతా పాఠం చదవండి” – ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (March 2017)
A) చేదర్థకం
B) ప్రశ్నార్థకం
C) సందేహార్థకం
D) విధ్యర్థకం
జవాబు:
D) విధ్యర్థకం

AP SSC 10th Class Telugu Important Questions Chapter 7 మా ప్రయత్నం

15. ‘తిండి కలిగితే కండ గలదు’ – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (March 2017)
A) విధ్యర్థకం
B) చేదర్థకం
C) అభ్యర్థకం
D) అనుమత్యర్ధకం
జవాబు:
B) చేదర్థకం

16. ప్రతివాళ్ళు ప్రశ్నించారు చరిత్ర సాగిన క్రమాన్ని – కర్మణి వాక్యం గుర్తించండి. (June 2018)
A) చరిత్ర సాగిన క్రమాన్ని ఎందుకు ప్రశ్నించాలి.
B) ప్రతి ఒక్కడు ప్రశ్నించకూడదు చరిత్ర సాగిన క్రమాన్ని.
C) చరిత్ర సాగిన క్రమం ప్రతి వాళ్ళచేత ప్రశ్నించబడింది.
D) ఎవరూ ప్రశ్నించలేదు చరిత్ర సాగిన క్రమాన్ని.
జవాబు:
C) చరిత్ర సాగిన క్రమం ప్రతి వాళ్ళచేత ప్రశ్నించబడింది.

17. విమల టి.వి. చూస్తూ నృత్యం చేస్తున్నది – ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (June 2018)
A) అప్యర్థక వాక్యం
B) సంయుక్త వాక్యం
C) చేదర్థక వాక్యం
D) శత్రర్థక వాక్యం
జవాబు:
D) శత్రర్థక వాక్యం

18. రవి లెక్కలు బాగా చేయగలడు – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (June 2018)
A) సామర్థ్యార్థకం
B) సంభావనార్థకం
C) ఆశ్చర్యార్థకం
D) ఆశీరర్థకం
జవాబు:
A) సామర్థ్యార్థకం

19. నేను తప్పక వస్తాను – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (June 2018)
A) అనుమత్యకం
B) విధ్యర్థకం
C) నిశ్చయార్థక వాక్యం
D) నిషేధకం
జవాబు:
C) నిశ్చయార్థక వాక్యం

20. సీత ఆటలు ఆడి అన్నం తిన్నది – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి.
A) అభ్యర్థకము
B) విధ్యర్థకము
C) చేదర్థకము
D) క్వార్థకము
జవాబు:
D) క్వార్థకము

21. భారతదేశంలో వస్తువుల ఉత్పత్తి పెరిగినా ధరలు తగ్గలేదు – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (June 2018)
A) అష్యకము
B) విధ్యర్థకము
C) క్వార్ధకము
D) చేదర్థకము
జవాబు:
A) అష్యకము

AP SSC 10th Class Telugu Important Questions Chapter 7 మా ప్రయత్నం

22. తామంతా కుటుంబ స్త్రీలం కామా ? అని శ్యామలగారన్నారు. (ప్రత్యక్ష కథనం గుర్తించండి)
A) “మేమంతా కుటుంబ స్త్రీలం కామా?” అని శ్యామల గారన్నారు.
B) “మనమంతా కుటుంబ స్త్రీలం కామా?” అని శ్యామల గారన్నారు.
C) “తామంతా కుటుంబ స్త్రీలం కామా?”, అని శ్యామల గారన్నారు.
D) “మీరు, మేము అంతా కుటుంబ స్త్రీలంకామా”, అని శ్యామల గారన్నారు.
జవాబు:
A) “మేమంతా కుటుంబ స్త్రీలం కామా?” అని శ్యామల గారన్నారు.

23. మా కంటె సీరియస్ గా ఆలోచించి, ప్రశ్నించి, సలహాలిచ్చారు. ఇది ఏ వాక్యమో గుర్తించండి) (S.A.I – 2018-19)
A) సంయుక్త వాక్యం
B) సంక్లిష్ట వాక్యం
C) సామర్థ్యార్థక వాక్యం
D) ప్రార్థనార్థక వాక్యం
జవాబు:
B) సంక్లిష్ట వాక్యం

24. కాలధర్మం చెందుట : పుట్టిన జీవికి కాలధర్మం చెందుట తప్పదు. (June 17, Mar 18)

25. గుండెలు బరువెక్కడం : “మిక్కిలి బాధపడటం” అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. (March 17, 18, S.A.I – 2018-19)

26. కనువిప్పు : గురువులు చెప్పిన మాటలతో అజ్ఞానము తొలగి నాకు కనువిప్పు కలిగింది. (March 2017 S.A. I – 2018-19)

AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

AP State Syllabus SSC 10th Class Telugu Important Questions 6th Lesson శతక మధురిమ

10th Class Telugu 6th Lesson శతక మధురిమ 2 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
పరుల ధనాన్ని ఆశించి చేసే పనులుగా ధూర్జటి కవి వేటిని పేర్కొన్నారు? (March 2018)
జవాబు:
జాతకాలు చెప్పడం, రాజులకు సేవలు చేయడం, అబద్దాలు కల్పించడం, ధర్మాన్ని తప్పడం, చాడీలు చెప్పడం, హింసలు చేయడం, ఉన్నవీ లేనివి పలకడం, మొదలగు వాటిని ఇతరుల ధనాన్ని ఆశించి చేసే పనులుగా ధూర్జటి కవి పేర్కొన్నాడు.

ప్రశ్న 2.
ఒక వ్యక్తి చేయకూడని పనులుగా బద్దెన కవి వేటిని పేర్కొన్నాడో తెలపండి. (March 2019)
జవాబు:
వరదలు వస్తే మునిగిపోయే పొలమును దున్నడం, కఱవు వచ్చినప్పుడు బంధువుల ఇళ్ళకి వెళ్ళడం, రహస్యాన్ని ఇతరులకు చెప్పడం, పిటికివాడికి సేనానాయకత్వమును ఇవ్వడం వంటివి ఒక వ్యక్తి చేయకూడని పనులుగా బద్దెన కవి పేర్కొన్నాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

ప్రశ్న 3.
ధర్మం ఆచరించే వాడిని నీచుడు నిందించినా నష్టం ఏమీ లేదు అనే విషయాన్ని మారదవెంకయ్య ఏ ఉపమానంతో చెప్పాడు?
జవాబు:
‘ధర్మం ఆచరించే వాడిని నీచుడు నిందించినా నష్టం ఏమీ లేదు’ అనే విషయాన్ని మారద వెంకయ్య అమృత సముద్రంలో రెట్టవేసే కాకితో పోల్చాడు.

అమృత సముద్రముపై నుండి కాకి ప్రయాణం చేస్తూ ఆ సముద్రంలో ఆ కాకి రెట్ట వేస్తుంది. అంతమాత్రం చేత, ఆ సముద్రానికి ఏమీ లోటు రాదు. అలాగే ధర్మాత్ముడిని నీచుడు నిందించినా, ఆ ధర్మమూర్తికి లోటు రాదు.

ప్రశ్న 4.
‘శతకం’ అనే ప్రక్రియను గురించి వివరించండి.
జవాబు:
ప్రాచీన తెలుగు సాహిత్య ప్రక్రియల్లో ‘శతకం’ అనే ప్రక్రియ ప్రముఖమైనది. ఇందులో నూరు పద్యాలు ఉంటాయి. కొన్నింటిలో నూరుకు పైగా పద్యాలు ఉంటాయి. శతకంలో మకుటం ప్రధానంగా ఉంటుంది. శతకపద్యాలు నీతిని, ధర్మాన్ని, భక్తిని, వైరాగ్యాన్ని కలిగిస్తాయి. శతక పద్యాలు నైతిక విలువలను ప్రబోధిస్తాయి. శతకపద్యాలు జగతిని జాగృతం చేస్తాయి.

ప్రశ్న 5.
మీకు తెలిసిన ఒక దాతను గురించి సొంతమాటల్లో రాయండి.
జవాబు:
మా ఊళ్ళో సోమయ్య అనే వ్యాపారి ఉన్నాడు. ఆయన గొప్పదాత. తన వ్యాపారంలో వచ్చిన లాభాన్ని దానధర్మాలకు ఉపయోగిస్తాడు. పేద విద్యార్థులకు ఫీజులు కట్టడం, పుస్తకాలు కొనిపెట్టడం, స్కూలు యూనిఫారం కుట్టించడం మొదలగు పనులు చేస్తుంటాడు. వారికి భోజన వసతి కూడా ఏర్పాటు చేస్తాడు.

ఎవరైనా పేదవారు పెళ్ళిళ్ల సమయంలో వచ్చి యాచిస్తే వారికి ధన సహాయం చేస్తాడు. బంగారు మంగళసూత్రాలు దానం చేస్తాడు. ఆయన దేవాలయాలకు, ధర్మసత్రాలకు, అన్నసత్రాలకు, విద్యాలయాలకు విరివిగా దానధర్మాలు చేస్తుంటాడు. ఇరుగుపొరుగు ప్రాంతాలవారు వచ్చి యాచించినా ‘లేదు’ అనకుండా అందరికీ తన శక్తికొద్దీ దానం చేస్తుంటాడు. మా ప్రాంతంలో ఆయన ‘దాత’గా మంచి కీర్తి సంపాదించాడు.

ప్రశ్న 6.
సంపద ఎవరి వద్దకు వచ్చి చేరుతుంది?
జవాబు:
దైవం మనపై దయతో సంపదలు ప్రసాదిస్తాడు. కలిగినంతలో పేదలకు పెట్టాలి. నిందించకుండా, ఆదరణతో పెట్టాలి. ఆ విధంగా పెట్టినవారు ఏ ప్రయత్నం చేయకపోయినా సంపద వారిని చేరుతుంది.

దీనిలో విశేషమేమిటంటే విష్ణువుకు (దరిద్ర) నారాయణుడు, (దరిద్ర) దామోదరుడు అని పేర్లు. అంటే దరిద్రులలో నారాయణుడు ఉంటాడు. నారాయణుని భార్య లక్ష్మీదేవి. తన భర్తను ఆదరించిన వారి దగ్గరకే భార్య కూడా వెడుతుంది. కానీ, ఆదరించని వారి దగ్గరకు వెళ్ళదు కదా ! అందుచేత పేదలను (నారాయణుని) ఆదరించే వారి దగ్గరకు లక్ష్మి వెడుతుంది. సంపదలు ప్రసాదిస్తుంది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

ప్రశ్న 7.
ఎవరిని ఆశ్రయిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో వివరించండి.
జవాబు:
మనిషి అధముడిని ఆశ్రయిస్తే, అతడు కూడా అధముడై పేరు లేకుండా పోతాడు. మనిషి మధ్యముడిని ఆశ్రయిస్తే, తాను కూడా మధ్యముడు అవుతాడు. మనిషి ఉత్తముడిని ఆశ్రయిస్తే తాను కూడా ఉత్తముడు అవుతాడు.

భర్తృహరి ఈ విషయాన్ని చక్కగా సోదాహరణంగా ఇలా వివరించాడు. నీళ్ళు కాల్చిన ఇనుముమీద పడితే, అవి ఆవిరి అయిపోయి పేరులేకుండాపోతాయి. ఆ నీళ్ళు తామరాకు మీద పడితే ముత్యములవలె ప్రకాశిస్తాయి. ఆ నీళ్ళే, ముత్యపుచిప్పలలో పడితే, ముత్యములవలె మారతాయి. నీటి బిందువు తాను ఆశ్రయించిన స్థానాన్ని బట్టి ప్రకాశించింది. అలాగే మనిషి తాను పొందిన ఆశ్రయాన్ని బట్టి రాణిస్తాడని మనం గ్రహించాలి.

ప్రశ్న 8.
ధర్మవర్తనులు పాలసముద్రం వంటివారని ఎలా చెప్పగలవు?
జవాబు:
ధర్మప్రవర్తన గల మనుష్యులు పాలసముద్రం వంటివారు. ధర్మప్రవర్తనతో పేరుపడిన మానవుడిని, ఒక నీచుడు మిక్కిలి నీచమైన మాటలతో నిందించినా, తిరస్కరించినా, ఆ ధర్మాత్ముడికి ఎటువంటి లోపమూ కలుగదు. దీనికి భర్తృహరి ఒక మంచి దృష్టాంతం ఇలా చెప్పాడు.

పాలసముద్రం మీదుగా ఎగిరివెళ్ళే కాకి, ఆ పాలసముద్రములో రెట్టవేస్తుంది. అంతమాత్రంచేత ఆ పాలసముద్రానికి ఏమి లోపము రాదు.

అలాగే పాలసముద్రం వంటి ధర్మవర్తనులను నీచులు నిందించినా, ధర్మవర్తనులకు లోటురాదు. దీనిని బట్టి ధర్మవర్తనులు పాలసముద్రం వంటి వారని మనము చెప్పగలము.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

ప్రశ్న 9.
ధర్మవర్తనులకు, ముష్కరులకు గల తేడా ఏమిటో చర్చించండి.
జవాబు:
ధర్మవర్తనులు అనగా ధర్మబద్ధంగా నడుచుకొనే మానవులు. ధర్మవర్తనులు పాలసముద్రము వంటివారు. ముష్కరులు అంటే నీచులు. ఈ నీచులు కాకులవంటివారు. ధర్మబద్ధంగా జీవించేవారిని చూసి కొందరు నీచులు మిక్కిలి హీనమైన నీచవాక్యాలతో నిందిస్తూ మాట్లాడతారు. ఆ నీచుల తిరస్కారవాక్యాల వల్ల ఆ ధర్మవర్తనులకు ఏమి లోపము రాదు.

ఈ విషయంలో భాస్కరశతకకర్త, చక్కని దృష్టాంతం ఇచ్చాడు. పాలసముద్రము నిర్మలంగా ఉంటుంది. ఆ సముద్రం మీది నుండి కాకి ఎగిరివెడుతూ, ఆ పాలసముద్రంలో రేట్ట వేస్తుంది. అంతమాత్రం చేత ఆ పాలసముద్రానికి ఎలా లోటు కల్గదో, అలాగే నీచులు మాట్లాడిన నీచవాక్యాల వల్ల కూడా, ధర్మవర్తనులకు ఎటువంటి లోటు, లోపము రాదని ఆయన చెప్పాడు.

ప్రశ్న 10.
మంచివాని లక్షణములేవి?
జవాబు:
మంచివారు, ఇతరులు తమకు అపకారము చేసినా, తాము మాత్రం ఇతరులకు ఉపకారమే చేస్తూ ఉంటారు. సర్వకాల సర్వావస్థలలోనూ, మంచివారు తమ ధనమాన ప్రాణాలను పరుల మేలు కోసమే వినియోగిస్తారు. ఇతరుల నుండి మంచివారు ప్రత్యుపకారాన్ని కూడా కోరుకోరు.

పై విషయాన్ని సమర్థిస్తూ భాస్కర శతకకర్త మంచి దృష్టాంతము చెప్పాడు. పెరుగును మానవులు కవ్వమును చేతపట్టి ఎంత గట్టిగా చిలుకుతున్నా, పెరుగు ఆ బాధను ఓర్చుకొని, చిలుకుతున్న వారికి వెన్ననే ఇస్తుంది.

అలాగే మంచివాడు. తనకు ఇతరులు కీడు చేస్తున్నా తాను మాత్రం వారికి అపకారము చేయడు. అంతేకాదు మంచివాడు తనకు కీడు చేసినవారికి సైతం ఉపకారము చేస్తాడు.

10th Class Telugu 6th Lesson శతక మధురిమ 4 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘సుభాషిత రత్నావళి’ ని రచించిన ఏనుగు లక్ష్మణ కవిని గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి.
జవాబు:
కవి పేరు : ఏనుగు లక్ష్మణకవి

రచించిన శతకం : సుభాషిత రత్నావళి

అనువాద శతకం : ఇది సంస్కృతము నుండి తెలుగులోకి అనువదింపబడిన శతకము. భర్తృహరి మహాకవి సంస్కృత భాషలో ‘సుభాషిత త్రిశతి’ అనే పేరున మూడు శతకాలు రచించాడు. వాటినే
ఏనుగు లక్ష్మణకవి ‘సుభాషిత రత్నావళి’ అనే పేరున తెనిగించాడు.

కాలము : క్రీ.శ. 1720 – 1780 మధ్యకాలము.

నివాసము : ఈయన తూర్పు గోదావరి జిల్లా ‘పెద్దాడ’ గ్రామంలో నివసించారు.

ఇతర గ్రంథాలు :

  1. రామేశ్వర మాహాత్మ్యం,
  2. విశ్వామిత్ర చరిత్ర,
  3. గంగా మాహాత్మ్యం,
  4. రామవిలాసం
    అనేవి వీరి ప్రసిద్ధ రచనలు.

ప్రశ్న 2.
శతక మధురిమలో కొన్ని నీతి పద్యాల నుండి నీతులను గ్రహించావు కదా ! మంచి విద్యార్థికి ఉండాల్సిన ఉత్తమ లక్షణాల గురించి సొంతమాటల్లో రాయండి.
జవాబు:
సమాజంలో విద్యార్థుల పాత్ర తిరుగులేనిది. విద్యార్థులు నవసమాజ నిర్మాతలని ఎందరో మహాకవులు చెప్పారు. విద్యార్థులు ప్రాథమిక దశనుండి వినయ విధేయతలు కలిగియుండాలి. గురువుల పట్ల శ్రద్ధాసక్తులు కలిగియుండాలి.

విద్యార్థులు తోటివారితో స్నేహభావంతో ఉండాలి. చదువుపట్ల ఆసక్తి కలిగి ఉండాలి. చిన్నతనం నుండి నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి. సామాజిక సేవాకార్యక్రమాల్లో పాల్గొనాలి. బాగా చదువుకొని ఉన్నతస్థాయికి ఎదిగిన వారిని ఆదర్శంగా తీసుకోవాలి. దేశభక్తిని కలిగి ఉండాలి. తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలి. మంచి మాటలతో సమాజంలో గౌరవాన్ని పొందాలి. క్రమశిక్షణతో కూడిన జీవనసరళిని అలవరచుకోవాలి.

విద్యార్థులు కొన్ని దురలవాట్లను కూడా దూరం చేసుకోవాలి. తిరస్కారంగా మాట్లాడడం, ఇతరులపై చాడీలు చెప్పడం, ఎదిరించి మాట్లాడడం, క్రమశిక్షణ లేకపోవడం, ఉపాధ్యాయులతోను, తోటి విద్యార్థులతోను గొడవలు పడడం మొదలైన దుర్గుణాలను దూరం చేసుకోవాలి. మంచి అలవాట్లను పెంపొందించుకోవాలి. ఇతరులకు ఆదర్శంగా మెలగాలి.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

ప్రశ్న 3.
శతకపద్యాలు సమకాలీన సమాజాన్ని ప్రతిబింబిస్తాయి – విమర్శిస్తాయి – వివరించండి.
జవాబు:
ప్రాచీన తెలుగు సాహిత్యంలో శతక సాహిత్యానికి సమున్నతమైన స్థానం ఉంది. శతక కవులు వివిధ అంశాలపై చక్కని పద్యాలను రచించారు. సమాజంలో నైతిక విలువల్ని పెంచడానికి ప్రయత్నించారు. శతకపద్యాలు జనాన్ని జాగృతం చేస్తాయి.

శతక కవులు తమ అనుభవ సారాన్ని మధించి తేట తెలుగు పద్యాలను రచించారు. వేమన వంటి ప్రజాకవులు ప్రజల్లోని మూఢనమ్మకాలను తొలగించారు. కొంతమంది శతక కవులు సంఘసంస్కరణోద్యమానికి ఆయుధంగా చేసుకున్నారు. మారద వెంకయ్య వంటి శతక కవులు చక్కని దృష్టాంతాలతో శతక పద్యాలను రచించారు. తెలుగుబాల, సుమతీశతక పద్యాలు పిల్లలలో నీతి వర్తనను కల్గించాయి. శ్రీకాళహస్తీశ్వర శతకం, దాశరథి శతకం వంటి శతకాలు ప్రజల్లో భక్తితత్పరతను కల్గించాయి. రాజుల దురహంకారాన్ని ధూర్జటి కళ్ళకు కట్టినట్లుగా శతక పద్యాల్లో చెప్పారు. పోతులూరి వీరబ్రహ్మం వంటి వారు సమకాలీన రుగ్మతలను తేటతెల్లం చేశారు. ప్రజల కళ్ళు తెరిపించారు.

ప్రశ్న 4.
సమాజానికి మార్గనిర్దేశకత్వం చేసేవాళ్ళు శతక కవులు – ఈ విషయాన్ని వివరించండి..
జవాబు:
తెలుగు సాహిత్యంలో శతక వాజ్మయానికి సమున్నతమైన స్థానం ఉంది. శతక కవులు తమ అనుభవసారాన్ని మధించి చక్కని నీతి పద్యాలను రచించారు. వేమన, సుమతి, కృష్ణ, దాశరథి మొదలైన శతకాలు ప్రజల్లో నీతివర్తనను కలుగజేస్తాయి.

అక్కరకు రాని చుట్టము, వినదగునెవ్వరు చెప్పిన, పుత్రోత్సాహము మొదలైన పద్యాలు జీవితాంతం గుర్తుంచుకునే విధంగా ఉంటాయి. వేమన ప్రజాకవిగా గుర్తింపు పొందాడు. సమాజంలోని అసమానతలను, కుళ్ళు, కుతంత్రాలను లోకానికి చాటాడు. భూర్జటి రాజాశ్రయం పొందినా రాజుల దురహంకారాన్ని నిర్భయంగా చాటిచెప్పాడు. భర్తృహరి సుభాషితాలను ఏనుగు లక్ష్మణకవి వంటివారు తేటతెలుగు పద్యాల్లో రచించారు. కరుణశ్రీ గారి తెలుగుబాల శతకంలోని పద్యాలు బాలల్లో ఆలోచనాశక్తిని పెంచుతాయి. శతక పద్యాలు తెలుగు పలుకుబడులను, సంస్కృతీ సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను తేటతెల్లం చేస్తున్నాయి

ప్రశ్న 5.
ఆశ్రయించిన వారిని బట్టి పొందే గౌరవంలో మార్పు వస్తుందనే విషయాన్ని సోదాహరణంగా వివరించండి.
జవాబు:
వ్యక్తులు మంచివారిని ఆశ్రయిస్తే, మంచి గౌరవం పొందుతారు. అధముడిని ఆశ్రయిస్తే వారు నశిస్తారు. భర్తృహరి సుభాషితాలలో ఈ విషయాన్ని సోదాహరణంగా ఇలా వివరించారు.

  1. నీరు కాల్చిన ఇనుము మీదపడితే, ఆ నీరు ఆవిరైపోతుంది. నీరు యొక్క రూపమే నశిస్తుంది.
  2. అదే, నీరు తామరాకుపై పడితే, ముత్యమువలె అందంగా మెరుస్తుంది.
  3. అదే నీరు ముత్యపుచిప్పలలో పడితే, మణులవలె మారుతుంది.

దీనిని బట్టి ఈ క్రింది విషయం మనకు తెలుస్తుంది. మనిషి ఒక అధముడిని ఆశ్రయిస్తే తాను కూడా అధముడు అవుతాడు. మనిషి మధ్యముడిని ఆశ్రయిస్తే, తాను కూడా మధ్యముడు అవుతాడు. ఉత్తముడిని ఆశ్రయిస్తే, తాను కూడా ఉత్తముడు ఔతాడు.

మనిషి అధముడిని ఆశ్రయిస్తే కాల్చిన ఇనుము మీద నీరువలె నామరూపాలు లేకుండా పోతాడు. మనిషి మధ్యముడిని ఆశ్రయిస్తే రామరాకుపై నీరువలె మెరుస్తాడు. మనిషి ఉత్తముడిని ఆశ్రయిస్తే ముత్యపుచిప్పలో నీరువలె మణిగా మారుతాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

ప్రశ్న 6.
మూర్యులకు నీతులు చెప్పడం ఎటువంటిది?
జవాబు:
మూర్చులకు నీతులు చెప్పడం వ్యర్ధము. అందువల్ల కొంచెము కూడా ప్రయోజనం ఉండదని భర్తృహరి సుభాషిత పద్యాల్లో క్రింది ఉదాహరణములు ఇచ్చాడు.

మూర్సులకు నీతులు చెప్పాలని ప్రయత్నించడం, మదించిన ఏనుగును తామరతూడులోని దారములతో బంధించాలని ఆలోచించడం వంటిది. ఏనుగువంటి బలమైన జంతువును సన్నని, బలహీనమైన తారతూడులోని దారాలతో బంధించలేము. అలాగే మూర్చులకు నీతులు బోధించడం వల్ల ప్రయోజనం ఉండదు.

మూర్చులకు నీతులు చెప్పాలని ప్రయత్నించడం, దిరిసెన పువ్వుతో వజ్రాన్ని బద్దలు కొట్టాలని చూడడం వంటిది. మెత్తని దిరిసెనపువ్వుతో కఠినమైన వజ్రాన్ని భేదించలేనట్లే, మూర్యుడికి నీతులు బోధించడం అసాధ్యం. అది వ్యర్థమైన పని.

మూరులకు నీతులు చెప్పవలెనని అనుకోవడం, ఒక- తేనె బొట్టుతో ఉప్పు సముద్రంలోని నీటిని తియ్యగా మార్చాలనుకోవడం వంటిది. ఒక్క తేనె బిందువుతో ఉప్పు సముద్రాన్ని తియ్యగా మార్చడం అసాధ్యం. అలాగే మూర్ఖుడికి నీతులు బోధించడం కూడా అసాధ్యం అని, భర్తృహరి చెప్పాడు.

ప్రశ్న 7.
పరద్రవ్యము నాశించిన వాని ప్రవర్తనను విశ్లేషించండి.
జవాబు:
ఇతరుల నుండి ధనాన్ని ఆశించి కొందరు అనేకరకాలుగా జీవిస్తూ ఉంటారు. పరద్రష్యం కోసం అలాంటి తప్పుడు పనులు చేయడం వ్యర్థమని ఆ ద్రవ్యము వారివద్ద ఎన్నాళ్ళో ఉండదనీ, వారు కూడా శాశ్వతంగా జీవించరనీ, ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో ఇలా చెప్పాడు.

కొందరు పరధనాన్ని ఆశించి, జాతకములు చెపుతారు. మరికొందరు రాజులకు సేవలు చేస్తారు. కొందరు అన్యాయ ప్రవర్తన ద్వారా చెడ్డపేరు తెచ్చుకుంటారు. కొందరు చాడీలు చెపుతూ ఉంటారు. కొందరు ఇతరులను హింసిస్తూ ఉంటారు. కొందరు ఉన్నవీ లేనివీ మాట్లాడుతూ ఉంటారు. ఈ పైన చెప్పిన పనులన్నీ, వారు ఇతరుల నుండి ధనాన్ని ఆశించి చేస్తూ ఉంటారు.

కాని నిజానికి ఆ ద్రవ్యము వారి వద్ద ఎన్నాళ్ళో ఉండదు. అలా చెడుపనులు చేసేవారు కూడా, శాశ్వతంగా ఈ లోకంలో బ్రతికియుండరు. అందువల్ల పైన చెప్పినటువంటి చెడుపనులు చేసి డబ్బు సంపాదించడం వ్యర్థం అని గుర్తించాలి.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

ప్రశ్న 8.
నైతిక విలువల వలన ప్రయోజనములేవి?
జవాబు:
నైతిక విలువలు అంటే నీతి, ధర్మము, సహనము, సజ్జనత్వము, ఓర్మి, సత్యము, స్నేహము వంటి మంచి గుణాల వల్ల కలిగే ప్రయోజనాలు.

సంఘంలో మనుషులు ఎలా నడుచుకోవాలో, ఎలా నడిస్తే తనకూ, ఇతరులకూ కూడా మేలు జరుగుతుందో, ఈ నైతిక విలువలు పాటించడం వల్ల మనకు తెలుస్తుంది.

మన శతకకవులు చక్కని నీతి శతకాలు చెప్పారు. ‘ అందులో ఎన్నో నీతులను వారు మనకు తెలిపారు. భాస్కర శతకకర్త నీతులను దృష్టాంతాలతో బోధించాడు. సుమతీ శతకకర్త, భర్తృహరి, ధూర్జటి వంటి పూర్వ కవులు సైతం మనకు ఎన్నో నీతివాక్యాలు చెప్పారు.

ఈ పద్యాల్లోని నీతివాక్యాలను పాటించి నడచుకుంటే మనుషులు ధర్మవర్తనులు అవుతారు. ఆ నైతిక విలువలు, నేటి తరం వారి జీవితాలకు మార్గదర్శకంగా ఉంటాయి. ఈ నీతులు వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి.

ఈ నైతిక విలువలను పాటిస్తే సంఘంలో మానవులు ధర్మమూర్తులు అవుతారు. చక్కగా ఏ ఆటంకాలు లేకుండా మానవులు తమ జీవితాన్ని హాయిగా నడుపుకోగల్గుతారు.

శాంతి, సత్యము, దయ, ప్రేమ వంటి సద్గుణాలు వారికి అలవడుతాయి. నైతిక విలువలు పాటించడం వల్ల సంఘం చక్కగా పురోగతి చెందుతుంది. అందుకే నీతి శతకపద్యాలను పిల్లలకు నేర్పించాలి.

10th Class Telugu 6th Lesson శతక మధురిమ Important Questions and Answers

ప్రశ్న 1.
నీకు నచ్చిన శతక కవిని గూర్చినీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

మిత్రుడికి లేఖ

అమలాపురం,
x x x x x x x

ప్రియమైన మిత్రుడు రాకేష్ కు,

నీ మిత్రుడు వ్రాయునది. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా వ్రాయునది తెలుగు సాహిత్యంలో ఎంతోమంది శతక కవులు ఉన్నారు. వారిలో వేమన కవి నాకు బాగా నచ్చిన కవి. ఈ మహాకవి తన జీవిత అనుభవసారాన్ని తేట తెలుగు పద్యాల్లో అందించాడు. జీవిత సత్యాలను. అలనాటి సామాజిక రుగ్మతలను చక్కగా తెలియజేశాడు. తన పద్యాలను అంటరానితనం వంటి అసమానతలపై ఆయుధంగా వాడుకున్నాడు. అందుకే నాకు వేమన అంటే బాగా ఇష్టం. నీకు నచ్చిన కవిని గురించి వివరంగా తెలియజేయి. పెద్దలందరికి నమస్కారాలు తెలుపగలవు.

ఇట్లు,
నీ ప్రియ స్నేహితుడు,
x x x x x x x

చిరునామా :
వి. రాకేష్, 10వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
కనిగిరి, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్.

ప్రశ్న 2.
మీరు సందర్శించిన పర్యాటక ప్రదేశాన్ని వర్ణిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

విశాఖపట్టణం,
x x x x x

ప్రియమైన కృష్ణకు,
నీ మిత్రుడు మాధుర్ వ్రాయులేఖ.

నేనీ మధ్య అమరావతి వెళ్ళాను. అమరావతి చాలా విశాలమైన నగరం. చాలా అందమైన నగరం. కృష్ణానది పరవళ్ళతో ఆ అందం రెట్టింపయింది.

చక్కటి ఉద్యానవనాలున్నాయి. కొత్త కొత్త భవనాలు కట్టారు. ఏ విభాగానికి ఆ విభాగం చక్కగా ఉంది. చూపరులను కట్టిపడేసే అందాలతో విరాజిల్లుతున్న అమరావతి మన నవ్యాంధ్ర రాజధాని కావడం మన అదృష్టం. అమరావతిలో విశేషమైన శిల్ప సంపద ఉంది. మానవ శరీర ధర్మ శాస్త్రాననుసరించి చెక్కిన ఆ శిల్పాలను చూడవలసింది.
ఉంటాను మరి

ఇట్లు,
మాధుర్ వ్రాలు

చిరునామా:
చింత. శివరామకృష్ణ,
10వ తరగతి – ఎ,
మునిసిపల్ హైస్కూల్, పవర్ పేట, ఏలూరు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

ప్రశ్న 3.
అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు, అనాథలకు విరాళాలు ప్రకటించి తమ ఉదారతను, వదాన్యతను లోకానికి చాటించుకోవాలని కోరుతూ ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:

ఆపన్నహస్తం ఇవ్వండి

ఆదుకుందాం ! ఆదరిద్దాం !

వదాన్యులారా ! ధనవంతులారా ! ఒక్క మనవి ఆలకించండి. మన సమాజంలో ఎందరో అనాథలు, అభాగ్యులు ఉన్నారు. వారందరిని ఆదుకోవాల్సిన ధర్మం అందరిపైనా ఉంది. ముఖ్యంగా సంపన్నుల పైన ఎక్కువగా ఉంది. ఎంతో మంది అనాథలు చదువులకు దూరంగా ఉన్నారు. వృద్ధులు నిరాదరణకు లోనవుతున్నారు.

స్వార్థం కొంత మానుకొని తోటి సమాజశ్రేయస్సుకై పాటుపడాలి. అనాథలపై కనికరం చూపండి. పేదలకు భోజన వసతులను కల్పించండి. అనాథాశ్రమాలను పోషించండి. పేద విద్యార్థుల చదువుకు ధన సహాయం చేయండి. గ్రామాలను, పాఠశాలలను దత్తత తీసుకోండి. మీలోని మానవీయతను చూపండి. అందరికి ఆదర్శంగా నిలవండి. సమాజ శ్రేయస్సునే మీ శ్రేయస్సుగా భావించండి. పేదలు లేని నవసమాజాన్ని నిర్మించడానికి కృషిచేయండి. ఈ మహాయజ్ఞంలో మీ వంటి ధనవంతుల భాగస్వామ్యం తప్పక ఉండాలి.

ఇట్లు,
నిర్వాసిత బాలల సంరక్షణ సమితి,
కనిగిరి.

ప్రశ్న 4.
శతకాలను చదవమని ప్రేరేపిస్తూ ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:

కరపత్రం

శతక పద్యాలు, శతకకర్తల అనుభవసారాలు. వారు జీవితాన్ని కాచివడపోసిన అనుభవంతో, గమనించిన సత్యాలతో శతకాలు రచించారు. శతకంలో సుమారు వందపద్యాలు ఉంటాయి. ప్రతి శతకంలోనూ మకుటం ఉంటుంది. శతకాలలో నీతి, భక్తి, వైరాగ్య శతకాలు ఉన్నాయి.

ఈనాడు సంఘంలో ఎన్నో అవకతవకలు, అధర్మ ప్రవర్తనలు, తెలివితక్కువ పనులు జరుగుతున్నాయి. వాటిని సరిదిద్ది సంఘాన్ని మంచిదారిలో నడపాలంటే చిన్నప్పటి నుండే మంచి నీతులు నేర్చుకొని తెలివిగా బ్రతకాలి. ధర్మబద్ధంగా, ఇతరులకు ఆటంకాలు లేకుండా న్యాయబద్ధంగా, నీతి మార్గంలో నడవాలి.

అందుకు మనకు ఉన్నది ఒక్కటే మార్గం. మన కవులు మనకు అందించిన శతక పద్యాలను కంఠస్థం చేసి, వాటిలో చెప్పిన నీతిమార్గాన్ని పాటించి, నైతిక విలువలను కాపాడాలి. అందుకే మా పాఠ్యపుస్తకాల్లో ప్రతి తరగతిలోనూ నీతి శతక పద్యాలను పాఠాలుగా పెడుతున్నారు.

మనం అంతా శతకాలు చదువుదాం. మన పిల్లలచే శతకాలు చదివిద్దాం. శతక పద్యాలు చదివి, వాటిలో వేమన, సుమతీ శతకకర్త, భాస్కర శతకకర్త, భర్తృహరి వంటి వారు చెప్పిన శతకపద్యాలలోని విలువలను నేర్చుకుందాం. మన జీవితాన్ని బంగారుబాట పట్టిద్దాం. మన పిల్లలను మేలిమి రత్నాలుగా తీర్చిదిద్దుకుందాం. అందుకే మనం అంతా దీక్షగా శతక పద్యాలు చదువుదాం, కదలండి.

దివి, x x x x x

ఇట్లు,
ఆంధ్రభాషా ప్రవర్థక సమితి,
అమరావతి.

ప్రశ్న 5.
శతకాల వలన కలిగే ప్రయోజనాలను వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:

శతకములు – ప్రయోజనములు

‘శతకము’ అంటే నూరు పద్యాల గ్రంథము. శతకాలలో నూరు నుండి. నూట ఎనిమిది వరకు పద్యాలు ఉంటాయి. శతకాలలో మకుటం ఉంటుంది. మకుటం లేని శతకాలూ ఉన్నాయి. మన తెలుగు భాషలో ఎందరో కవులు శతకాలు వ్రాశారు. వీటిలో నీతి శతకాలు, భక్తి శతకాలు ఎక్కువగా ఉంటాయి. భర్తృహరి నీతి, శృంగార, వైరాగ్య శతకాలను మూడింటినీ రచించి, ‘సుభాషిత త్రిశతి’ అని పేరు పెట్టాడు.

శతకములలో వేమన రచించిన వేమన శతకము, కంచెర్ల గోపన్న రచించిన దాశరథీ శతకము, సుమతీ శతకము, భాస్కర శతకము, ధూర్జటి రచించిన కాళహస్తీశ్వర శతకము వంటివి బాగా ప్రసిద్ధి పొందాయి.

శతకములు చదవడం వల్ల ముఖ్యంగా ప్రజలలో నీతివర్తనం, భక్తి పొందుతుంది. నీతి శతకాలు మానవులకు జీవిత మార్గాన్ని ఉపదేశిస్తాయి. నీతి శతకాలవల్ల నైతిక విలువలు పెంపొందుతాయి. ముఖ్యంగా పిల్లలచే నీతి శతక పద్యాలు చదివిస్తే, వారు మంచి పౌరులుగా తయారు అవుతారు. ఏది మంచో, ఏది చెడో వారికి తెలుస్తుంది. వేమన నీతులను దృష్టాంతాలతో సులభంగా చెప్పాడు. భాస్కర శతకకర్త నీతులను దృష్టాంతాలతో చెప్పాడు. వీటిని చదవడం వల్ల సులభంగా మనకు నీతులు పట్టుపడతాయి.

భక్తి శతకాల ద్వారా దైవభక్తి పెరుగుతుంది. మొత్తంపై శతకాల వల్ల మానవులు భక్తి, నీతి కలవారై యోగ్యులైన ధర్మమూర్తులు అవుతారు. అందుకే మనం శతకాలు చదువుదాం. మన పిల్లలచే చదివిద్దాం.

10th Class Telugu 6th Lesson శతక మధురిమ 1 Mark Bits

1. కులం కంటె గుణం ప్రదానం – గీత గీసిన పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.
A) కాలము
B) కొలం
C) కలము
D) కన్నం
జవాబు:
B) కొలం

2. గగ, భ, జ, స, నల గణములు మాత్రమే వచ్చే పద్యమేది? (June 2017)
A) సీసము
B) కందము
C) ద్విపద
D) తరువోజ
జవాబు:
B) కందము

3. సృష్టి మర్మమును ఎవరు తెలుసుకోగలరు? – (గీత గీసిన పదమునకు అర్థమును గుర్తించుము.) (March 2017)
A) పుట్టుక
B) నడవడిక
C) రహస్యం
D) ఆచరణ
జవాబు:
C) రహస్యం

AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

4. నీరము తప్తలోహమున నిల్చి యనామకమై నశించు, నా – ఏ పద్యపాదమో గుర్తించండి. (March 2018)
A) చంపకమాల
B) మత్తేభము
C) ఉత్పలమాల
D) శార్దూలము
జవాబు:
C) ఉత్పలమాల

5. సిరి సంపదలకన్నా ప్రవర్తన గొప్పగా ఉండాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి. (June 2018)
A) శ్రీశ్రీ
B) శ్రీ
C) శ్రీకారం
D) సాకారం
జవాబు:
B) శ్రీ

6. మహనీయులు వారు చేసిన పనుల వలన ఉత్తములుగా కీర్తి పొందారు. (అర్థాన్ని గుర్తించండి) (S.A. I – 2018-19)
A) స్నేహితులు
B) గొప్పవారు.
C) మధ్యములు
D) పేదవారు
జవాబు:
B) గొప్పవారు.

7. కరి రాజును తామరతూడులతో బంధించలేము. (పర్యాయ పదములు గుర్తించండి) (S.A. I – 2018-19)
A) కరము, కిరణము
B) గజము, ఏనుగు
C) హస్తి, హస్తము
D) గజము, సింహము
జవాబు:
B) గజము, ఏనుగు

8. మనదేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన గొప్ప గొప్ప నాయకులు అమరులుగా నిలిచారు. (వ్యుత్పత్యర్థాన్ని గుర్తించండి) (S.A. I – 2018-19)
A) మరణం పొందినవారు
B) మరణం లేనివారు
C) మరణం లెక్కచేయని వారు
D) మరణానికి భయపడనివారు
జవాబు:
B) మరణం లేనివారు

9. దేశాల మధ్య శాంతి కాపాడుకోవాలి. (విడదీసిన సరియైన రూపం గుర్తించండి) (S.A. I – 2018-19)
A) దే + శాల
B) దేశ + అల
C) దేశము + ల
D) దేశా + ల
జవాబు:
C) దేశము + ల

AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

10. నీ కరుణా కటాక్ష వీక్షణములకై నిరీక్షించుచున్నారము. (అలంకారాన్ని గుర్తించండి) (S.A. I – 2018-19)
A) అంత్యానుప్రాసము
B) లాటానుప్రాసము
C) ఛేకానుప్రాసము
D) వృత్త్యనుప్రాసము
జవాబు:
D) వృత్త్యనుప్రాసము

11. పరధనాపహరణము కంటె దిరియుట మంచిది – ఈ వాక్యానికి ఆధునిక వచనాన్ని గుర్తించండి. (March 2018 )
A) ఇతరుల డబ్బు దొంగతనం చేయకూడదు.
B) పరుల సొమ్ము దొంగిలించడం కంటె బిచ్చమెత్తుకోవడం మంచిది.
C) ఇతరుల సొమ్ము దొంగిలించకుండా అడుక్కోవాలి.
D) పరుల నగదు అడిగి తీసుకోవడం మంచిది.
జవాబు:
B) పరుల సొమ్ము దొంగిలించడం కంటె బిచ్చమెత్తుకోవడం మంచిది.

12. సత్యాన్నే పలుకు, ధర్మాన్నే ఆచరించు – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (March 2018)
A) నిషేధాకం
B) విధ్యర్థకం
C) నిశ్చయార్థకం
D) ప్రశ్నార్థకం
జవాబు:
B) విధ్యర్థకం

చదవండి – తెలుసుకోండి

మహాత్మాగాంధీ బోధలు

సత్యం :
ప్రపంచానికి బోధించటానికి నా వద్ద కొత్తది ఏమీ లేదు. సత్యాహింసలు పర్వతాలంతటి ప్రాచీనమైనవి.

సత్యాహింసలే నా మతం. సత్యం నా భగవంతుడు. ఆయనను ప్రసన్నం చేసుకోవటానికి అహింస మార్గం.

సత్యమనేది, నీవు ఎంత ఎక్కువగా పోషిస్తే అంత ఎక్కువగా ఫలాలిచ్చే విశాల వృక్షం వంటిది. సత్యమనే గనిలో ఎంత లోతుగా అన్వేషిస్తే అక్కడ నిక్షిప్తమైవుండి దొరికే వజ్రం అంత విలువైనదిగా ఉంటుంది. ఇతోధిక సేవా మార్గాలకు దారులు కనిపించవచ్చు.

నా జీవితమంతటా, సత్యంపై దృఢంగా నిలబడటం రాజీ తాలూకు సౌందర్యాన్ని మెచ్చుకోవటం నాకు నేర్పింది. ఈ భావన సత్యాగ్రహం (అహింసాత్మక ప్రతిఘటన)లో తప్పనిసరి భాగమని ఉత్తరోత్తరా జీవితంలో నేను చూడగలిగాను.

నిలకడవున్న వ్యక్తిగా కనిపించేందుకు నేనెప్పుడూ శ్రద్ధచూపలేదు. నా సత్యాన్వేషణ ప్రయత్నంలో అనేక భావాలను విడనాడాను. అనేక కొత్త విషయాలు నేర్చుకున్నాను. నా వయోభారం పెరిగే కొద్దీ నా అంతర్గత వృద్ధి ఆగిపోతుందని గాని లేదా మాంసం కరిగిపోవటంతో నా వృద్ధి ఆగిపోతుందనే భావన గాని నాకు లేదు. నేను ఆలోచిస్తున్నదల్లా సత్యం. నా భగవంతుడు క్షణక్షణానికి యిచ్చే పిలుపును శిరసావహించేందుకు నా సంసిద్ధత గూర్చే.

సత్యం స్వభావరీత్యా స్వయం ప్రదర్శితం. దానిని ఆవహించివున్న అజ్ఞానమనే సాలెగూళ్ళను నీవు తొలగించగలిగితే అది స్పష్టంగా ప్రకాశిస్తుంది.

అహింస:
నేను నాలో ఉన్నట్లు చెప్పుకునే ఒకే ఒక సుగుణం సత్యం, అహింస. మానవాతీత శక్తులున్నట్లు నేను చెప్పుకోజాలను. అటువంటివాటిని నేను కోరుకోను. నా తోటి మానవులలో దురలుని శరీరముకున్న దుష్టమాంసఖండములే నా శరీరమునకూ ఉన్నవి. అందువల్ల అందరిలాగే నేనూ తప్పు చేయవచ్చును. నా సేవలకు అనేక పరిమితులున్నవి.

అహింస మానవాళికి అందుబాటులో ఉన్న గొప్ప శక్తి, అహింస రూపుదిద్దుకోవలసిన లేదా పాటించమని ఆదేశించవలసిన గుణం కాదు. అది అంతర్గతంగా వృద్ధి చెందేది. ఒక వ్యక్తి చేసే తీవ్రమైన ప్రయత్నంపై దాని మనుగడ ఆధారపడి ఉంటుంది.

మన సూత్రాలను ఇతరులు గౌరవించాలని మనం ఎలా ఆశిస్తామో తమ సూత్రాల పట్ల అదే పరిగణనకు ప్రత్యర్థి కూడా పాత్రుడు. ప్రత్యర్థులను గెలుచుకోవటానికి మనం ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అహింస కోరుతుంది.

క్రమశిక్షణ – విధి నిర్వహణ:
జీవిత ముఖ్య ప్రయోజనం సక్రమంగా జీవించడం, సక్రమంగా ఆలోచించడం, సక్రమంగా వ్యవహరించడం.

మనం ఏదైనా గొప్పదైన, శాశ్వతమైనదాన్ని సాధించే ముందు కఠినమైన, ఉక్కు క్రమశిక్షణ ఉండి తీరాలి. ఆ క్రమశిక్షణ కేవలం విద్యాసంబంధమైన వాదన నుండి, హేతువుకు, తర్కానికి విజ్ఞప్తి చేయటం ద్వారా రాదు. క్రమశిక్షణను ప్రతికూలత అనే పాఠశాలలోనే నేర్చుకోవాలి.

సంతృప్తి ప్రయత్నంలో ఉంటుంది గాని సాధించటంలో ఉండదు. సంపూర్ణ కృషి సంపూర్ణ విజయాన్నిస్తుంది.

నిరంతర అభివృద్ధి జీవిత సూత్రం. నిలకడగా ఉన్నట్లు కనిపించే నిమిత్తం తన పిడివాదాలను కాపాడుకునేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నించే మనిషి తనను తాను బూటకపు స్థితిలోకి నెట్టుకుంటున్నాడు.

హక్కులకు సిసలైన మూలం విధి. ‘మనందరం గనుక మన విధులను నిర్వర్తించినట్లయితే హక్కును పొందటం దూరం కాజాలదు. విధులు నిర్వర్తించకుండా హక్కుల వెంట మనం పరుగెడితే అవి అగమ్య గోచరంగా మన నుండి తప్పించుకుంటాయి. మనం ఎంతగా వాటి వెంట పడితే అవి అంతగా దూరం ఎగిరిపోతాయి.

తన విధులు సష్యంగా నిర్వర్తించే వ్యక్తికి హక్కులు వాటంతట అవే సమకూరుతాయి.

ధైర్యం – దృఢ విశ్వాసం:
ధైర్యం అనేది కండర సంబంధమైన పదార్థంగా ఎవ్వరూ ఎన్నడూ చెప్పలేదు, అది హృదయానికి సంబంధించింది. అతి గట్టి కండరం కూడా ఊహాజనితమైన భయం ముందు వణికిపోతుందని మనకు తెలుసు. కండరాన్ని వణికించేది హృదయం.

శారీరక దారుఢ్యం నుండి బలం చేకూరదు. అది మొక్కవోని సంకల్పం నుండి వస్తుంది. బలానికి సంయమనాన్ని, మర్యాదను జత చేసినపుడు అది ప్రబలమవుతుంది.
ప్రపంచంలో చూడాలని నీవు కోరుకుంటున్న మార్పు నీలో రావాలి.

నమ్రత:
అహింసా స్ఫూర్తి విధిగా నమ్రతకు దారి తీస్తుంది.

నమ్రత అనేది ప్రత్యేకించి పాటించేది కాదు. ఎందుకంటే, అది ఉద్దేశపూర్వకంగా ఆచరించటానికి ఉద్దేశించింది కాదు. అయితే అది ‘అహింసకు తప్పనిసరి పరీక్ష, ఎవరిలోనైతే ‘అహింస’ ఉంటుందో వినయం అతని స్వభావంలో భాగమవుతుంది.

తప్పులు చేయనివారు ఎవరూ ఉండరు – దైవాంశ సంభూతులైనా సరే. తప్పిదాలు లేకపోవటం వల్ల వారు దైవాంశ సంభూతులు కాలేదు. తమ తప్పులను తాము తెలుసుకోవటం వల్ల, వాటిని దిద్దుకోవటానికి కృషిచేయటం వల్ల, వాటిని దాచుకోకపోవటం వల్ల, తమను తాము దిద్దుకోవటానికి ఎల్లప్పుడూ సంసిద్ధులుగా వుండటం వల్ల వారు దైవాంశ సంభూతులైనారు.

మరో వ్యక్తి ఆలోచనలు చెడ్డవని, మనవి మాత్రమే మంచి ఆలోచనలని చెప్పటం, మన అభిప్రాయాలకు భిన్నమైన వాటిని కలిగి వున్నవారు దేశానికి శత్రువులని చెప్పటం దురలవాటు.

సహనశీలత – అస్పృశ్యత:
అసహనం అనేది కూడా ఒక హింసారూపం. నిజమైన ప్రజాస్వామిక భావన వృద్ధిచెందటానికి ప్రతిబంధకం. మనం నిజమైన ప్రజాస్వామిక స్ఫూర్తిని అలవరచుకోవాలంటే మనం అసహనపరులుగా వుండకూడదు. అసహనం ఒకని లక్ష్యంలోగల విశ్వాస వాంఛను దెబ్బతీస్తుంది.

ఇతరులు మనలను చూస్తునట్లుగా మనల్ని మనం చూసుకోటం మంచిది. మనం ప్రయత్నించినా, మనల్ని మనం సంపూర్ణంగా ఎన్నడూ తెలుసుకోలేము. ముఖ్యంగా మనలోని దుష్టపార్శ్వాన్ని అసలు తెలుసుకోలేము. మనలను విమర్శించేవారిపట్ల ఆగ్రహం చెందకుండా వున్నప్పుడు ఆ పని మనం చేయగలుగుతాము. వారు ఏమి చెప్పినప్పటికీ సహృదయంతో స్వీకరించాలి.

స్వేచ్ఛ – ప్రజాస్వామ్యం:
అంతర్గత ప్రమాదాలు లేనటువంటి మానవ వ్యవస్థ ఉండదు. వ్యవస్థ ఎంత పెద్దదైతే దుర్వినియోగ అవకాశాలు అంత హెచ్చుగా వుంటాయి. ప్రజాస్వామ్యం గొప్ప వ్యవస్థ. అందువల్ల అది ఎక్కువగా దుర్వినియోగానికి గురి అయ్యే అవకాశముంది. కనుక దానికి పరిష్కారం ప్రజాస్వామ్యాన్ని తప్పించటం కాదు, దుర్వినియోగ అవకాశాన్ని కనీస స్థాయికి తగ్గించటమే.

ప్రజాస్వామ్యం సారాంశం ఏమంటే, అందరి సమష్టి ప్రయోజనానికి సేవచేయటంలో అన్ని విభాగాల ప్రజల ఉద్యం యావత్ భౌతిక, ఆర్థిక, ఆధ్యాత్మిక వనరులను సమీకరించే కళ, శాస్త్రం అని అర్థం.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

AP State Syllabus SSC 10th Class Telugu Important Questions 5th Lesson ధన్యుడు

10th Class Telugu 5th Lesson ధన్యుడు 2 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
ధన్యుడు పాఠం నేపధ్యాన్ని వివరించండి.
జవాబు:
మంచి స్నేహితులను మనం కలిస్తే, ఆ కలయిక, మన జీవితాన్ని ఒక చక్కని దారివైపునకు తిప్పుతుంది. అందుకే మనము ఎప్పుడూ మంచి స్నేహితులను కలిగియుండాలని, మన పెద్దవాళ్లు మనకు చెపుతారు. మంచి స్నేహితులతో స్నేహం మనకు మేలు చేస్తుందనీ, సత్పురుషులతో కలయిక ఎప్పటికీ మంచిది అనీ, చెప్పడమే ఈ పాఠం నేపథ్యం.

ప్రశ్న 2.
ధన్యుడు పాఠంలో నిజమైన ధన్యుడు ఎవరు? ఎట్లు చెప్పగలవు? (March 2017)
(లేదా)
నిజంగా “ధన్యుడు” ఎవరో “ధన్యుడు” పాఠ్యభాగం ఆధారంగా తెల్పండి. (June 2019)
జవాబు:
ధన్యుడు పాఠంలో నిజంగా ధన్యుడు “హిరణ్యకుడు” అనే పేరు గల ఎలుక.

హిరణ్యకుడు అనే ఎలుక, మొదట ధనలోభంతో సంచరించింది. తరువాత తెలివి తెచ్చుకొని ధనలోభాన్ని విడిచి ఉన్నదానితో తృప్తి పడ్డవాడే ధన్యుడు అని నిశ్చయించి, నిర్జనారణ్యంలో నివసించింది.

అక్కడ హిరణ్యకుడికి లఘుపతనకం అనే కాకితో మైత్రి కల్గింది. లఘుపతనకం ద్వారా మంథరుడు అనే తాబేలుతో మైత్రి కల్గింది. మంథరుడి అమృతం వంటి మాటలు, హిరణ్యకుడి తాపాన్ని చల్లార్చి, అతణ్ణి మరింతగా ధన్యుణ్ణి చేశాయి.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 3.
ధన్యుడు పాఠం ఎవరు వ్రాశారు? ఆయన గురించి వ్రాయండి.
(లేదా)
“ధన్యుడు” పాఠ్యభాగ రచయితను గూర్చి రాయండి. (S.N. I – 2019-207)
జవాబు:
ధన్యుడు పాఠమును పరవస్తు చిన్నయసూరిగారు రచించారు. ఆయన 1809వ సంవత్సరంలో జన్మించారు. ఆయన తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని, పెరంబుదూరులో జన్మించాడు. చిన్నయసూరి తండ్రి వేంకట రంగ రామానుజా చార్యులుగారు. తల్లి శ్రీనివాసాంబ. ఆయన నీతిచంద్రిక, బాలవ్యాకరణం, సూత్రాంధ్ర వ్యాకరణం మొదలైన గ్రంథాలు రాశారు.

ప్రశ్న 4.
ధన్యుడు పాఠ్యభాగ రచయిత ఎవరు? ఆయన పాండిత్యం, రచనల గూర్చి వ్రాయండి.
జవాబు:
ధన్యుడు పాఠమును పరవస్తు చిన్నయసూరిగారు రచించారు. ‘సూరి’ అనగా పండితుడు. ఆయన తెలుగు, తమిళం, సంస్కృతం, ఆంగ్ల భాషలలో పండితుడు.

ఆయన అక్షరగుచ్ఛము, ఆంధ్ర కాదంబరి, పద్యాంధ్ర వ్యాకరణం, బాలవ్యాకరణం, నీతిచంద్రిక, సూత్రాంధ్ర వ్యాకరణం, శబ్దలక్షణసంగ్రహము మొదలైన గ్రంథాలు రాశారు.

చిన్నయసూరి రచనా శైలి పాఠకుడిని ఆకట్టుకొనేలా ఉంటుంది. ఆయన ప్రాచీన కావ్య భాషలో రచించారు.
ఆయన పచ్చయ్యప్పకళాశాలలో తెలుగు పండితునిగా పనిచేశారు.

ప్రశ్న 5.
చిన్నయసూరి గురించి, ఆయన విశిష్ట రచనల గురించి వివరింపుము.
జవాబు:

  1. పరవస్తు చిన్నయసూరి తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో “శ్రీ పెరంబుదూర్”లో జన్మించాడు. ఈయన మద్రాసులోని పచ్చయ్యప్ప కళాశాలలో తెలుగు పండితుడుగా పనిచేశాడు.
  2. ఈయన తమిళం, సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు భాషలలో మంచి పండితుడు. ‘సూరి’ అనేది ఈయన బిరుదు.
  3. చిన్నయసూరి బాలవ్యాకరణం, నీతిచంద్రిక, సూత్రాంధ్ర వ్యాకరణం, శబ్దలక్షణసంగ్రహం వంటి గ్రంథాలు రాశాడు.

ఈయన రాసిన బాలవ్యాకరణం నేటికీ ప్రామాణిక గ్రంథం.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 6.
ధన్యుడు పాఠం ఆధారంగా ధనలోభం వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయో నాలుగైదు వాక్యాల్లో రాయండి.
జవాబు:
ధన లోభం అంటే ధనం సంపాదించాలనే దురాశ, అత్యాశ. ధనలోభం ఆపదలు అన్నింటికీ మూలం. ధనలోభాన్ని విడిచిపెట్టడం కంటె, గొప్ప సుఖం ఉండదు.

కడుపుకోసం ఇతరులను యాచించకుండా లభించిన దానితో తృప్తిపడేవాడు. లోకంలో ధన్యుడు. అటువంటి వాడే సుఖవంతుడు.

ధనలోభం వల్ల మోహం కలుగుతుంది. మోహం దుఃఖాన్ని కలిగిస్తుంది. దుఃఖం అగ్నిలా తన స్థానానికి నాశం – కల్గిస్తుంది. కాబట్టి ధనలోభం పనికి రాదు.

ప్రశ్న 7.
ఎక్కడి ఎలుక? ఎక్కడి చిలుక కొయ్య? అనడంలో అంతరార్థం ఏమిటి?
జవాబు:
సాధారణంగా అంతరం ఎక్కువ ఉండేవాటి పట్ల ఈ విధంగా ప్రయోగిస్తారు. ఎలుక నేలపైనా, రంధ్రాలలోనూ ఉంటుంది. గోడను నిలువుగా ఎక్కువ దూరం ఎలుక ప్రాకలేదు. చిలుకకొయ్య గోడకి మధ్యలో ఉంటుంది. అటువంటి , చిలుకకొయ్య పైకి ఎలుక చేరడం అసంభవం. అది సాధ్యం కానిది ఎలాగ సాధ్యమైంది అనేది దీనిలో అంతరార్థం. అలాగే ‘నక్క ఎక్కడ ? నాగ లోకము (స్వర్గం) ఎక్కడ?” అని కూడా అంటారు.

ప్రశ్న 8.
“ధనము సర్వశ్రేయములకు నిదానము” మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు:
ఏ శుభకార్యం చేయాలన్నా ధనం కావాలి. ధనం లేకపోతే ఏ పనీ చేయలేము. అందుకే ప్రతి పుణ్యకార్యానికి అసలు కారణం ధనమే. అన్నదానం, భూదానం, గృహదానం మొదలైన ఏ దానం చేయాలన్నా ధనం కావాలి. చెరువు త్రవ్వించడం, దేవాలయాలు నిర్మించడం, పాఠశాల, ఆసుపత్రి మొదలైనవి నిర్మించడం ధర్మకార్యాలు. కాని ధనం లేకపోతే ఏ ధర్మకార్యాలు చేయలేము. అందుకే సర్వశ్రేయాలకు అసలు కారణం ధనం. మన ఉన్నతత్వానికి, గౌరవానికి, మర్యాదకు మన ధనమే అసలు కారణం.

ప్రశ్న 9.
‘దారిద్యము సర్వశూన్యము” అనే మాటను వ్యాఖ్యానించండి.
జవాబు:
దారిద్ర్యము అంటే బీదతనము: సర్వశూన్యము అంటే ఏమి లేనిది. అంటే ఇంటిలో పదార్థములు లేకుండా పోతాయి. అందువల్ల సుఖసంతోషాలు పోతాయి. దుఃఖము కలుగుతుంది. భార్యాబిడ్డలకు, కడుపునిండా తిండి పెట్టలేము. కాబట్టి దారిద్ర్యము అన్నింటినీ లేకుండా చేస్తుందని భావము.

ప్రశ్న 10.
‘ఆశ దిగనాడినవాడే సత్పురుషుడు’ – ఎట్లు?
జవాబు:
ఆశ అన్ని అనర్థాలకు మూలం. ఆశ పడినది దొరకకపోతే కోపం వస్తుంది. కోపంలో విచక్షణ కోల్పోతాము. పిసినిగొట్టుతనం పెరుగుతుంది. ఆశ మితిమీరితే అజ్ఞానం పెరుగుతుంది. అజ్ఞానం వలన గర్వం పెరుగుతుంది. గర్వం పెరిగితే ఎవ్వరితోటి స్నేహం చేయలేము. అందుచేత ఆశను విడిచిపెడితే సత్పురుషుడౌతాడు. మితిమీరిన ఆశ పనికి రాదు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 11.
‘ధనహీనుడై నలుగురిలో ఉండరాదు. ఎందుకు?
జవాబు:
ధనహీనుడు అంటే ధనం లేనివాడు. ధనం ఉన్నప్పుడు సమాజంలో గౌరవం ఉంటుంది. హోదా ఉంటుంది. స్నేహితులు ఉంటారు. బంధువులు చేరతారు. అందరూ పలకరిస్తారు. నలుగురూ చేరతారు. కాని, ధనం లేకపోతే ఎవ్వరూ మాట్లాడరు. స్నేహితులు, బంధువులు కూడా పలకరించరు. గౌరవం, హోదా ఉండవు. ఇటువంటి అవహేళనలకు గురి అవుతూ నలుగురిలో ఉండకూడదు. ఎవరూ తెలియని ప్రదేశంలో ఉంటే ధనము లేనివాని ఆత్మాభిమానం దెబ్బ తినదు.

ప్రశ్న 12.
‘మనస్సు గట్టిపరచుకోవటం’ అంటే ఏమిటి?
జవాబు:
మనస్సు చంచలమైనది. అది ఇష్టం వచ్చినట్లు సంచరిస్తుంది. గట్టి పరచుకోవడం అంటే మనస్సును దృఢం చేసికోవడం, నిశ్చయం చేసుకోవడం అని అర్థం.

ప్రశ్న 13.
‘చచ్చిన తరి వెంట రాబోదు’ అనడంలో మీకేమి అర్థమయ్యింది?
జవాబు:
మనిషి చచ్చిపోయే సమయంలో అతడు సంపాదించిన ధనం వగైరా అతడి వెంట వెళ్ళదు. కాబట్టి తాను ధనాన్ని హాయిగా వెచ్చించి, కడుపు నిండా తినాలి. ఇతరులకు ఇంత పెట్టాలి. ఇతరులకు ఇవ్వక, తాను తినక, దాచిన డబ్బు చచ్చిపోయేటప్పుడు ఆ వ్యక్తి వెంట వెళ్ళదు అని నాకు తెలిసింది.

ప్రశ్న 14.
చూడాకర్ణుని స్వభావం గురించి వ్రాయండి.
జవాబు:
చూడాకర్ణుడు అమాయకపు సన్యాసి, చంపకవతి అనే పట్టణంలో నివసించేవాడు. తాను తినగా మిగిలిన భోజనం భిక్షాపాత్రలో పెట్టి చిలుకకొయ్యకు తగిలించేవాడు. దానిని ప్రతిరోజూ ఒక ఎలుక తినేసేది.

తన ఎదురుగానే ఎలుక చిలుకకొయ్యపైకి ఎగురుతుంటే, చప్పుడు చేస్తే బెదిరించాడు. అంతేకాని, ఆ ఎలుకకు అంత బలం, ధైర్యం కలగడానికి కారణం ఆలోచించలేదు. దాని బలాన్ని, బలగాన్ని కొల్లగొట్టాలని ఆలోచించలేదు. తన స్నేహితుని సలహాతో హిరణ్యకుని పీడ వదిలించుకొన్నాడు. సలహా చెబితే పాటించే స్వభావం కలవాడు చూడాకర్ణుడు.

ప్రశ్న 15.
వీణాకర్లుని స్వభావం వ్రాయండి.
జవాబు:
వీణాకర్ణుడు ఒకసారి చూడాకర్ణుని దగ్గరకు వచ్చాడు. అతని ఆహారాన్ని ఎలుక దొంగిలిస్తున్న విధానం గమనించాడు. వీణాకర్ణుడు చాలా తెలివైనవాడు. కనుకనే ఎలుక బలానికి కారణాన్ని అన్వేషించాడు. తన స్నేహితునికి ఆ ఎలుక నివాసాన్ని కొల్లగొట్టమని చక్కని సలహా ఇచ్చాడు. స్నేహితునకు ఉపకారం చేసే స్వభావం కలవాడు. స్నేహితుల బాధలను తన బాధలుగా భావించి, నివారిస్తాడు. అతని సలహాతో చూడాకర్ణునికి ఎలుకబాధ పూర్తిగా తొలగిపోయింది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 16.
హిరణ్యకుని స్వభావం వ్రాయండి.
జవాబు:
హిరణ్యకుడు, చూడాకర్ణుని భిక్షాన్నం దొంగిలించి బ్రతికేవాడు. కాని, చూడాకర్ణునిచేత సంపదంతా కొల్లగొట్టబడి తరమబడ్డాడు. ఇంకక్కడ ఉండకూడదనుకొన్నాడు. అడవికి వెళ్ళిపోయాడు. అడవికి వెళ్ళాక జ్ఞానోదయమయింది. సంపద ఉన్నపుడు తనకు ఎవరూ సాటి లేరనుకొని విర్రవీగాడు. సంపదపోగానే, పట్టుదల పెరిగింది. కాని, సన్న్యాసి విసిరిన కర్ర దెబ్బ నుండి తప్పించుకొన్నాక నిజమైన జ్ఞానం కలిగింది. అప్పుడే లోభం వలన కలిగే ప్రమాదం తెలుసుకొన్నాడు. లోభం విడిచి పెట్టాడు. అడవికి వెళ్ళాడు. ధన్యుడయ్యాడు.

ప్రశ్న 17.
మంథరుని స్వభావం వ్రాయండి.
జవాబు:
అన్నిటినీ కోల్పోయి ఒంటరిగా అడవికి వచ్చిన హిరణ్యకుని ఆదరించిన స్నేహశీలి మంథరుడు. తన స్నేహంతో అతనికి పునర్జన్మను ప్రసాదించాడు. తన మంచి మాటలతో జ్ఞానోదయం కల్గించాడు. అతి సంచయేచ్ఛ తగదని బోధించింది. మనోధైర్యాన్ని ప్రసాదించింది. లఘుపతనకునితో సమానంగా ఆదరించిన స్నేహశీలి.

ప్రశ్న 18.
వివేకహీనుడిని ఎందుకు సేవించకూడదు?
జవాబు:
వివేకహీనుడిని సేవించడం కంటే, వనవాసం ఉత్తమం అని హిరణ్యకుడు అనుకుంటాడు. వివేకము అంటే మంచి చెడులు సరిగా తెలిసికొనే జ్ఞానము. వివేకము లేనివాడిని అవివేకి అని, వివేకహీనుడని అంటారు.

మంచి చెడ్డలు తెలియని ప్రభువును సేవిస్తే అతడు తెలివితక్కువగా ప్రవర్తిస్తాడు. ప్రభువు మేలుకోరి పనిచేసేవాడిని కూడా వాడు నిందిస్తాడు. ఇతరుల చెప్పుడుమాటలు విని, తన దగ్గర పనిచేసే సేవకుడిని తప్పు పడతాడు. అకారణంగా శిక్షిస్తాడు. తన కోసం కష్టపడే సేవకుడి మంచితనాన్ని, కష్టాన్ని వివేకహీనుడయిన ప్రభువు గుర్తించలేడు. అకారణంగా, అన్యాయంగా తన తెలివితక్కువతనంతో తనవద్ద పనిచేసే సేవకుడి కష్టాన్ని గుర్తించడు. సేవకుడి మంచితనాన్ని పట్టించుకోడు. కాబట్టి వివేకహీనుడిని సేవించకూడదు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 19.
బాలవ్యాకరణాన్ని గూర్చి రాయండి.
జవాబు:
బాలవ్యాకరణాన్ని చిన్నయసూరి రచించాడు. ఈయన బాలవ్యాకరణము, నీతిచంద్రిక, అక్షరగుచ్ఛము, ఆంధ్రకాదంబరి, సూత్రాంధ్ర వ్యాకరణము, పద్యాంధ్ర వ్యాకరణము అనే గ్రంథాలు రచించాడు. ఈయన రచించిన ‘బాలవ్యాకరణం’
కావ్యభాషకు మంచి ప్రామాణిక గ్రంథము. నీతిచంద్రిక – బాల వ్యాకరణాలు లక్ష్య – లక్షణ గ్రంథాలుగా ప్రసిద్ధిపొందాయి.

10th Class Telugu 5th Lesson ధన్యుడు 4 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
సంసార విషవృక్షమునకు అమృతతుల్యమైనవి ఏమిటో వివరించండి. (S.A.I – 2018-19 June 2016)
జవాబు:
‘సంసారం’ అంటే మనుషుల చావు పుట్టుకలు. ఈ సంసారం విషవృక్షము వంటిది. వృక్షమునకు పళ్ళు పుడతాయి. అలాగే సంసారం అనేది విషవృక్షం అనుకుంటే, ఆ సంసార విషవృక్షానికి రెండు అమృతము వంటి పళ్ళు పుడతాయని కవి చెప్పాడు.

అందులో ‘కావ్యామృత రసపానము’ మొదటి అమృత ఫలము, సత్పురుషులతో సహవాసము రెండవ అమృత ఫలము. అంటే మనుషులుగా పుట్టిన వారికి, రెండు ప్రయోజనాలు కలుగుతాయి. హాయిగా మహాకవులు రాసిన కావ్యాలలోని అమృతం వంటి రసాన్ని గ్రహించి ఆనందించవచ్చు. అలాగే సత్పురుషులతో స్నేహం చేసి దాని ద్వారా అమృతం వంటి ఆనందం పొందవచ్చునని కవి చెప్పాడు.

నిజంగానే రామాయణము, భారతము వంటి కావ్యాలలోని సారాన్ని గ్రహిస్తే, అది అమృతములా ఉంటుంది. అలాగే సత్పురుషులతో స్నేహం చేస్తే అందువల్ల అమృతం వంటి ఆనందం పొందవచ్చు. అందుకే రచయిత సంసారం చేస్తున్న మానవులకు, కావ్యాలను చదివి ఆనందం పొందే అదృష్టము, మంచివారితో సహవాసం చేసే అదృష్టమూ లభిస్తాయని చెప్పాడు.

ప్రశ్న 2.
హిరణ్యకుడు అడవులపాలు కావటానికి లోభమే ప్రధాన కారణమని తెల్పిన మంథరుని మాటలను సమర్థించండి. (Jure 2018)
జవాబు:
1) హిరణ్యకుడు లోభం కారణంగా అడవులపాలైన తన యొక్క పూర్వ వృత్తాంతాన్ని మిత్రుడైన మంథరునికి వినిపించాడు.
2) ఆ మాటలు విన్న మంథరుడు “సంపదలు శాశ్వతమైనవి కావని, యవ్వనం ప్రవాహవేగంలాంటిదని, జీవితం నీటి బుడగతో సమానమైనదని చెప్పాడు.
3) కావున బుద్ధిమంతుడు సత్వరమే (వెంటనే) ఈ నిజాన్ని గుర్తించి ధర్మకార్యాలు చక్కగా ఆచరించాలని, అలా ఆచరించని వారు పశ్చాత్తాపంతో దుఃఖమనే అగ్నిలో కాలిపోతారని చెప్పాడు.
4) “నీవు కావలసిన దానికన్నా ఎక్కువగా కూడబెట్టావు. నీ లోభ బుద్ధియే నిన్నిలా అడవుల పాలు చేసింది. ఎక్కువగా కూడబెట్టాలనే కోరిక తగదు. ఇతరులకిచ్చి మనం భుజించినదే మన సొత్తు. పరులకివ్వకుండా తాను తినకుండా దాచిన సొమ్ము చనిపోయినపుడు వెంటరాదు. బ్రతకడం కోసం ఇన్ని తిప్పలు పడనవసరం లేదు. ధర్మాలన్నీ తెల్సిన నీకు నేను వివరంగా చెప్పవలసిన పని లేదు.” అంటాడు.
5) ఈ అంశాలన్నీ సమర్థింపదగినవేనని నేను భావిస్తున్నాను. సంపదల స్వభావం గురించి యవ్వనం గురించి, జీవితం గురించి, ముఖ్యంగా లోభగుణం గురించి, ధర్మకార్యాలను ఆచరించవలసిన అవసరం గురించి మంథరుడు చెప్పిన మాటలు అందరూ అనుసరించదగినవని, ఆమోదించదగినవనీ నేను భావిస్తున్నాను.

ప్రశ్న 3.
ఈ క్రింది పాత్రల స్వభావాలను రాయండి.
జవాబు:
1. చూడాకర్ణుడు :
చంపకవతి అనే పట్టణంలోని సన్యాసి. తను భోజనము చేయగా మిగిలిన వంటకం చిలుక కొయ్య మీద దాచుకొనేవాడు. ఒక ఎలుక ప్రతిరోజూ దానిని తినేసేది. ఎలుకను బెదిరించాడు తప్ప దానిని భయపెట్టి తరిమేసే ప్రయత్నం చేయలేదు. ఒక సమస్యకు శాశ్వత పరిష్కారం ఆలోచించే స్వభావం కాదు. వీణాకర్ణుని సలహాతో హిరణ్యకుని పీడను వదిలించుకొన్నాడు. అతని మాటతీరును బట్టి చాలా గ్రంథాలు చదివిన వాడని తెలుస్తుంది. స్నేహితులు చెప్పే మంచి సలహాలను వింటాడు. ఆచరిస్తాడు. తెలివైనవాడు.

2. వీణాకర్ణుడు :
చూడాకర్ణుని స్నేహితుడు. ఒక సమస్య యొక్క మూలాలను వెతికి పట్టుకొంటాడు. పరిష్కారం సూచిస్తాడు. చూడాకర్ణునికి హిరణ్యకుని పీడ వదలడానికి కారణం వీణాకర్ణుని సలహాయే. ఆపదలో ఉన్న స్నేహితులకు మంచి సలహాలు చెప్పే స్వభావం కలవాడు.

3. హిరణ్యకుడు :
ఇతడు ఒక ఎలుక. అవకాశం ఉన్నంతకాలం చూడాకర్ణుని దోచుకొన్నాడు. అతని వలన ప్రమాదం ఏర్పడ్డాక జ్ఞానం కలిగింది. ధన వ్యామోహం తగ్గింది. అది తనకు తగిన ప్రదేశం కాదని గుర్తించాడు. భగవంతుని దయామయత్వం అవగాహన చేసుకొన్నాడు. అడవికి చేరాడు. ధన్యుడయ్యాడు. పరిపూర్ణమైన జ్ఞానం కలిగింది.

4. మంథరుడు :
మంథరుడు ఒక తాబేలు పేరు. స్నేహశీలము కలిగినవాడు. హిరణ్యకునికి ఆశ్రయం ఇచ్చాడు. ధనం అశాశ్వతమని, యౌవనం తొందరగా గడిచిపోతుందని తెలుసుకొన్న జ్ఞాని. ధర్మమును ఆచరించాలని చెప్పిన ధర్మాత్ముడు. జీవితం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉన్నవాడు. తన స్నేహితులను కూడా మంచి మార్గంలో నడిపించే ఉత్తముడు మంథరుడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 4.
“యాచక వృత్తి సమస్త గౌరవాన్ని హరిస్తుంది”. విశ్లేషిస్తూ రాయండి.
జవాబు:
యాచక వృత్తి వలన సమస్త గౌరవం పోతుంది. ప్రపంచంలో అనేక రకాల వృత్తులున్నాయి. ఏ వృత్తిని చూసినా కొంతపని చేసి దానికి ప్రతిఫలం పొందడం కనిపిస్తుంది. పనిచేయకుండా ఫలితాన్ని ఆశించడం తప్పు. తప్పు చేస్తే గౌరవం తగ్గడం సహజం. యాచక వృత్తి అంటే ఇతరులకు ఏ మాత్రం ఉపయోగపడకుండా వారి నుంచి ధనం, వస్తువులు మొదలగునవి ఆశించడం. అలా ఎప్పుడైతే ఆశించామో అదే మన గౌరవానికి భంగం కలిగిస్తుంది. యాచక వృత్తిని చేసే వారిని తనవారు కానీ, పైవారు కానీ ఎవరూ గౌరవించరు. చిన్న పనైనా, పెద్ద పనైనా కష్టపడి పనిచేస్తూ సంపాదించుకుని బతుకుతుంటే గౌరవానికి భంగం కలుగదు.

ప్రశ్న 5.
‘ధన్యుడు’ అనే పేరు హిరణ్యకుని వృత్తాంతానికి ఎలా సరిపోయిందో సమర్థించండి.
జవాబు:
ఉదరముకయి పరులగోఁజక, ప్రాప్తి లాభానికి సంతోషించేవాడు ఒక్కడే లోకమందు ధన్యుడు అని హిరణ్యకుడు నిశ్చయించుకొని నిర్జనారణ్యంలో నివాసం చేశాడు.

పొట్టకోసం ఇతరులను పీడించకుండా, తనకు లభించిన దానితో తృప్తిపడి, సంతోషపడేవాడు ధన్యుడని హిరణ్యకుడి అభిప్రాయం. ఇది సరైన అభిప్రాయం. భగవంతుడే మనకు కావలసినవి ఇస్తాడు. అందుచేత పోషణ కోసం ఇతరుల కాళ్ళమీద పడి వారిని యాచించనక్కరలేదు.

రాతిలోని కప్పను దయామయుడైన భగవంతుడు రక్షిస్తున్నాడు. మనం చేసుకొన్న కర్మలను బట్టి మనకు దుఃఖాలు వచ్చినట్లే, కోరకుండానే సుఖాలు వస్తాయి.

హిరణక్యుడు అనే ఎలుక మొదట ధనలోభంతో సంచరించింది. చివరకు సన్యాసి కర్రదెబ్బ తగిలి, తెలివి తెచ్చుకొంది. మనుష్యులు లేని అడవిలో నివసించింది. చివరకు లఘుపతనకం సహాయంతో మంథరుడనే కూర్మరాజు మైత్రి పొందింది. తమకు దొరికిన దానితో ముగ్గురమూ కలసి సుఖంగా ఉందామని మంథరుడు హిరణ్యకునకు నచ్చ చెప్పాడు.

మంథరుడు అమృతం వంటి మాటల వలన తన తాపం పోయిందనీ, తాను ధన్యుడనయ్యానని హిరణ్యకుడు అనుకొన్నాడు. కనుక ధన్యుడు అనే పేరు హిరణ్యకుని వృత్తాంతానికి సరిపోయింది.

ప్రశ్న 6.
హిరణ్యకునిలో ఆలోచనను రేకెత్తించినదెవరు? ఎలా?
జవాబు:
చూడాకర్ణుడు తన స్నేహితుని సలహాతో హిరణ్యకుని కలుగును త్రవ్వాడు. దాని సంపదనంతా కొల్లగొట్టాడు. తర్వాత హిరణ్యకునికి బలం తగ్గింది. ఉత్సాహం కూడా తగ్గింది. ఆహారం కూడా సంపాదించుకొనలేనంతగా నీరసపడింది. నడకలో వేగం తగ్గింది. సంపద పోవడంతో ఆలోచించే అవకాశాన్ని చూడాకర్ణుడు తన చేష్టల ద్వారా కలిగించాడు. ధనము కలవాడే పండితుడు, అతడే బలవంతుడు. ధనమే అన్నింటికీ మూలమన్నాడు చూడాకర్ణుడు.

మూషికం తన సంపదతోపాటు బలాన్ని కూడా కోల్పోయిందని ఆక్షేపించాడు. ధనం లేనివాడికి ఎల్లప్పుడూ బాధగానే ఉంటుంది. నిరంతరం బాధపడడం వలన తెలివి మందగిస్తుంది. తెలివి తగ్గితే అన్ని పనులూ పాడవుతాయి అని దెప్పి పొడిచాడు.

ధనవంతుడికే పౌరుషం చెల్లుతుంది. మేథాసంపద, బంధుమిత్రులు ధనాన్ని బట్టే చేరతారు. భార్యాబిడ్డలు లేని ఇల్లు, మూర్ఖుడి మనసు శూన్యంగా ఉంటాయి. దరిద్రం వలన అంతా శూన్యంగా కనిపిస్తుంది. దరిద్రం కంటె మరణం మంచిది. మరణం చాలా బాధాకరం. జీవితమంతా దరిద్రం అనుభవించడం చాలా కష్టం. డబ్బు లేకుంటే సొంతవాళ్ళే పరాయివాళ్ళు అవుతారు. ఇలా అనేక విధాల తన మాటల ద్వారా హిరణ్యకుని చిత్రవధ చేశాడు.

చూడాకర్ణుని మాటలు, చేష్టలు హిరణ్యకునిలో ఆలోచనలను రేకెత్తించాయి. తనలో తాను ఆలోచించడం ప్రారంభించాడు. ఆ ఆత్మపరిశీలనే జ్ఞానోదయానికి కారణమయ్యింది.

ప్రశ్న 7.
హిరణ్యకుని ఆలోచనా ధోరణిని వివరించండి.
జవాబు:
చూడాకర్ణుడు హిరణ్యకుని సంపదనంతా కొల్లగొట్టాడు. ధనం యొక్క ప్రాధాన్యతని వివరిస్తూ హిరణ్యకుని చాలా కించపరిచాడు. అప్పుడు హిరణ్యకునిలో ఆలోచన మొదలైంది.

అక్కడింక నివసించకూడదనుకొన్నాడు. తనకు జరిగిన అవమానం ఇతరులకు చెప్పుకోవడం మంచిదికాదనే సుభాషితం గుర్తు చేసుకొన్నాడు. దైవం అనుకూలించనపుడు తన పౌరుషం వలన ప్రయోజనం లేదని గుర్తించాడు. వనవాసం మంచిదని తలపోసాడు.

యాచించి బ్రతకడం కంటె వనవాసం మేలనుకొన్నాడు. బ్రతికితే పువ్వులా బ్రతకాలనుకొన్నాడు. యాచన అవమానకరం అనుకొన్నాడు. ఎన్ని విధాల ఆలోచించినా లోభం వదలలేదు. అక్కడే ఉండి మళ్ళీ ధనార్జన చేయాలని సంకల్పించాడు.

కాని, లోభం వలన మోహం పుడుతుంది. మోహం వలన దుఃఖం కలుగుతుంది. దుఃఖం వలన ఆశ్రయం కోల్పోతారు. ఇవేవీ ఆలోచించలేదు. ఇంతలో చూడాకర్ణుడు హిరణ్యకుని పైకి కర్రను విసిరాడు. దైవికంగా ఆ కర్ర దెబ్బ నుండి తప్పించుకొన్నాడు.

అపుడు అతని ఆలోచనలో పరిణతి వచ్చింది. అన్ని ఆపదలకు ధనలోభమే మూలమని గ్రహించాడు. లోభమును విసర్జించినవాడే అన్నీ తెలిసినవాడని తెలుసుకొన్నాడు. వాడు మాత్రమే సుఖపడగలవాడని గ్రహించాడు.

అక్కడి నుండి హిరణ్యకుని ఆలోచనలో చాలా మార్పు వచ్చింది. అదేమి తన తాతముత్తాతల స్థలం కాదని గ్రహించాడు. అడవికిపోయి బ్రతకవచ్చనుకొన్నాడు.

ఈ విధంగా హిరణ్యకుని ఆలోచనా ధోరణిలో చాలా మార్పు వచ్చింది.

ప్రశ్న 8.
కావ్యామృత రసపానము, సజ్జ సంగతులను అమృతతుల్యములు అనడంలో రచయిత ఉద్దేశ్యం ఏమిటి?
జవాబు:
సంసారము అనే విషవృక్షమునకు, రెండు ఫలములు అమృతముతో సమానమైనవి ఉన్నాయి. అందులో ‘కావ్యామృత రసపానము’ ఒకటి. ‘సజ్జన సంగతి’ రెండవది అని, హిరణ్యకుడు అనే ఎలుక, మంథరుడు అనే తాబేలుతో చెప్పాడు.

సంసారము అంటే మానవుల చావు పుట్టుకలు. మనిషి పుడతాడు, తిరిగి చస్తాడు. తిరిగి పుడతాడు. దీన్నే ‘సంసారము’ అంటారు. ఈ సంసారం, విషవృక్షము వంటిది. వృక్షాలకు కాయలు, పళ్ళు కాస్తాయి. అలాగే సంసారం అనేది విషవృక్షము అనుకుంటే, దానికి రెండు పళ్ళు పుడతాయట. అందులో మొదటిది ‘కావ్యామృత రసపానము’. అనగా మహాకవులు రాసిన మంచి కావ్యాలను చదివి, దానిలోని అమృతం వంటి రసాన్ని ఆస్వాదించడం. రెండవది ‘సజ్జన సంగతి’ అంటే మంచివారితో స్నేహము.

మనిషి పుట్టడం, చావడం అనే సంసారం విషవృక్షము వంటిదయినా, ఆ పుట్టుక వల్ల మనిషికి రెండు ప్రయోజనాలు, అమృతము వంటివి సిద్ధిస్తాయట. అంటే మనిషిగా పుట్టినవాడు, చక్కగా అమృతం వంటి రసం గల మహా కావ్యాలు చదివి ఆనందం పొందవచ్చు. అలాగే మనిషిగా పుట్టి సంసారం చేసేవాడు, మంచివారితో స్నేహం చేసి, దానివల్ల అమృతం వంటి ఆనందం పొందవచ్చునని రచయిత ఉద్దేశ్యము.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 9.
‘అర్థములు నిత్యములు కావు. యౌవనము ఝరీవేగతుల్యము’. వీటిని గురించి మీరు ఏమి అర్థం చేసుకున్నారో సోదాహరణంగా రాయండి.
(లేదా)
అర్థములు నిత్యములు కావంటూ – మంధరుడు అన్న మాటలను మీరు ఏవిధంగా సమర్థిస్తారు? (S.A. I – 2019-20)
జవాబు:
‘అర్థములు నిత్యములు కావు’ అంటే ధనము శాశ్వతంగా ఉండదని అర్థము. డబ్బులు సంపాదించినా అది శాశ్వతంగా వాడి వద్ద ఉండవు. ఈ రోజు ధనవంతుడయినవాడు, మరునాటికి బీదవాడు కావచ్చు. పెద్ద పెట్టుబడి పెట్టి ఫ్యాక్టరీ పెట్టిన ధనవంతుడికి, పెద్ద నష్టం రావచ్చు. ఫ్యాక్టరీకి ప్రమాదం రావచ్చు.

బ్యాంకులో డబ్బు పెడితే, ఆ బ్యాంకు దివాలా తీయవచ్చు. లేదా అతడి ధనాన్ని దొంగలు అపహరింపవచ్చు. కాబట్టి అర్థములు నిత్యములు కావని రచయిత చెప్పాడు.

‘యౌవనము ఝరీవేగతుల్యము’ అంటే మంచి యౌవన వయస్సు, ప్రవాహవేగం వంటిది. ‘ఝరి’ అంటే సెలయేరు. సెలయేరు వర్షాలు వస్తే పొంగుతుంది. ఆ నీరు కొండ నుండి కిందికి దిగి పోగానే అది ఎండిపోతుంది. యౌవనము కూడా సెలయేరు వంటిది.

రోజు ఉన్న యౌవనం, శాశ్వతంగా ఉండదు. కొద్ది రోజుల్లో మనం అంతా ముసలివాళ్ళం అవుతాము. తరువాత మరణిస్తాము. వయస్సు వేగంగా వెళ్ళిపోతుంది. చూస్తూ ఉండగానే యువకులు వృద్ధులు అవుతారు. సెలయేరు ఎంత వేగంగా వెడుతుందో, వయస్సు కూడా అంతవేగంగా ముందుకుపోతుంది. కాబట్టి మనిషి ధనాన్ని, యౌవనాన్ని నమ్మి ఉండరాదు. అవి వేగంగా పోయేవని గ్రహించి డబ్బు, యౌవనము ఉన్నపుడే మంచిపనులు చేయాలని నేను గ్రహించాను.

ప్రశ్న 10.
చిత్రాంగుని హిరణ్యకుని జీవితచరిత్ర ఆధారంగా దాని వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి.
గమనిక : చిత్రాంగుడి గూర్చి మనకు పాఠములో లేదు. హిరణ్యకుడి గురించి ఉంది (అందుకే హిరణ్యకుడి గురించి ఇవ్వడం జరిగింది.)
జవాబు:
హిరణ్యకుని లోభము :
హిరణ్యకుడు ఒక ఎలుక. అది చూడకర్ణుడనే సన్న్యాసి ఇంట్లో కన్నంలో ఉండి, అతడు దాచిన వంటకాన్ని దొంగిలించి బాగా సంపాదించింది. ఆ సన్న్యాసి, ఈ ఎలుక కన్నాన్ని తవ్వి, అది దాచిన సర్వస్వాన్నీ తీసుకున్నాడు. దానితో హిరణ్యకం దిగులుపడింది. కాని ధనలోభంతో ఆ చోటును విడిచిపెట్టలేదు.

జ్ఞానము – వివేకము :
హిరణ్యకం, అభిమానం కలవాడికి, వనవాసం మంచిదని గ్రహించింది. వివేకం లేనివాడిని సేవించరాదనుకొంది. యాచనా వృత్తి దోషం అనుకుంది. అడవికి వెళ్ళిపోదామని నిశ్చయించింది. కాని ధనలోభం వల్ల దానికి మోహం కలిగి, అక్కడే ఉండి తిరిగి సంపాదిద్దామనుకుంది.

వనవాసము – వైరాగ్యము :
ఒక రోజున హిరణ్యకుడిపై సన్న్యాసి కజ్జును విసిరాడు. దైవవశం వల్ల ఆ దెబ్బ నుండి హిరణ్యకం రక్షించబడింది. దానితో ధనలోభము వల్ల ఆపదలు వస్తాయని అది గ్రహించింది. దొరికిన దానితో సంతోషించేవాడే ధన్యుడని, సుఖవంతుడు అని హిరణ్యకం గుర్తించింది. కోరకుండానే ప్రాణికి దుఃఖాల వలె సుఖాలు కూడా వస్తాయని హిరణ్యకం గుర్తించి, నిర్జనారణ్యంలోకి వెళ్ళింది.

ఈ విధంగా హిరణ్యకుడు మొదట ధనలోభంతో సంచరించాడు. తరువాత తెలివి తెచ్చుకొని, లోభమోహాలను విడిచి, దొరికిన దానితో తృప్తి పడదామని నిర్జనారణ్యంలో నివసించాడు. కాబట్టి హిరణ్యకుడు ధన్యజీవి.

ప్రశ్న 11.
హిరణ్యకుడు మొదట ఎందుకు బలవంతుడు? తరువాత ఎందుకు బలహీనుడయ్యాడో విశ్లేషించండి.
జవాబు:
హిరణ్యకుడు అనే ఎలుక చూడాకర్ణుడు అనే సన్న్యాసి ఇంట్లో కన్నంలో ఉండేది. ఆ సన్న్యాసి తాను తినగా మిగిలిన వంటకాన్ని భిక్షాపాత్రలో పెట్టి చిలుకకొయ్యకు తగిలించేవాడు. హిరణ్యకుడు ఆ వంటకాన్ని భక్షించేవాడు. ఆ విధంగా హిరణ్యకుడు ఎంతో ఆహారాన్ని దాచాడు. దానితో మొదట్లో హిరణ్యకుడు బలవంతుడుగా ఉండేవాడు.

తరువాత ఒకరోజున చూడకర్ణుడు మిత్రుని సలహాపై హిరణ్యకుడి కన్నమును తవ్వి అతడు దాచుకున్న సర్వస్వాన్నీ గ్రహించాడు. దానితో హిరణ్యకుడు బలహీనుడయ్యాడు. అయినా హిరణ్యకుడు ఆ సన్న్యాసి ఇంట్లోనే తిరిగేవాడు. ఒక రోజున సన్న్యాసి హిరణ్యకుడి పై చేతి కణ్ణను విసిరాడు. దానితో హిరణ్యకుడు నిర్జనారణ్యంలోకి నివాసం మార్చాడు. ఈ విధంగా హిరణ్యకుడు బలహీనుడయ్యాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 12.
సజ్జన సాంగత్యము లభించి ధన్యుడైన హిరణ్యకుని వృత్తాంతాన్ని మీ సొంతమాటల్లో వ్రాయండి. (March 2019)
జవాబు:
హిరణ్యకుడు ఒక ఎలుక. ఆ ఎలుక చూడాకర్ణుడు అనే సన్యాసి ఇంటిలో కన్నంలో నివాసము ఉండేది. ఆ సన్యాసి రోజూ తాను తినగా మిగిలిన అన్నాన్ని భిక్షాపాత్రలో పెట్టి దాన్ని చిలుక కొయ్యకు తగిలించేవాడు. ఎలుక చిలుక కొయ్య పైకి ఎగిరి, ఆ అన్నాన్ని తినివేసేది. ఆ ఎలుక ఈ విధంగా ఎంతో సంపాదించింది.

ఒకరోజు చూడాకర్ణుడి ఇంటికి వీణాకర్ణుడు అనే సన్యాసి వచ్చాడు. చూడాకర్ణుడు ఎలుకను తన కజ్జుతో బెదరిస్తున్నాడు. ఎలుక సంగతి చూడాకర్ణుడు, వీణాకర్ణుడికి చెప్పాడు. వీణాకర్ణుడి సలహాపై, చూడాకర్ణుడు ఎలుక కన్నాన్ని తవ్వి, ఎలుక దాచుకున్న దాన్ని తీసుకున్నాడు. దానితో ఎలుక ఆహారము లేక ఇంటిలో తిరుగుతోంది. సన్యాసి ఎలుకపై తన కజ్జను విసిరాడు. అదృష్టవశాత్తు ఎలుక తప్పించుకొని, ఆ ఇంటిపై విరక్తి పెంచుకొని, అడవిలోకి వెళ్ళిపోయింది. మనుష్యులు లేని ఆ అడవిలో ఆ ఎలుకకు కాకితో స్నేహము కుదిరింది. ఆ అడవిలో తినడానికి ఎలుకకు ఏమీ దొరకలేదు. దానితో ఎలుక, తన మిత్రుడైన కాకితోపాటు, కాకికి స్నేహితుడైన మంథరుడి వద్దకు వచ్చింది. కాకి, ఎలుక, మంథరుడు స్నేహితులయ్యారు.

10th Class Telugu 5th Lesson ధన్యుడు Important Questions and Answers

ప్రశ్న 1.
ధన్యుడు కథను చిన్ననాటికగా మలచండి.
జవాబు:
ఏకాంకిక : పాత్రలు 1) హిరణ్యకుడు 2) మంథరుడు

మంథరుడు : మనమంతా సుఖంగా కలసి ఉందాము. దొరికిన దాంతో కాలం గడిపేద్దాం. అది సరే కాని నీవు అడవిలో ఎందుకు ఉన్నావు హిరణ్యకా!

హిరణ్యకుడు : మిత్రమా! మంథరా ! నేను ఒకప్పుడు చూడాకర్ణుడు అనే సన్యాసి ఇంట్లో కన్నంలో ఉండి, అతడు చిలుక కొయ్యమీద దాచుకొన్న వంటకాన్ని తినేదాన్ని.

మంథరుడు : మరి ఏమైంది?

హిరణ్యకుడు : ఇక్కడ ఒకసారి ఆ సన్న్యాసి ఇంటికి వీణాళుడనే సన్న్యాసి వచ్చాడు. చూడాకర్ణుడిచే నా కన్నం త్రవ్వించాడు.

మంథరుడు : అప్పుడు నువ్వు అడవిలో మకాం పెట్టావా?

హిరణ్యకుడు : లేదు. నేను సన్న్యాసి ఇంట్లోనే తిరుగుతున్నా. ఒకరోజు సన్న్యాసి నాపై కర్ర విసిరాడు. అప్పుడు ఉన్న దానితో తృప్తి పడదామని అడవికి వచ్చా. అక్కడే మన మిత్రుడు లఘుపతనకుడితో స్నేహం అయ్యింది.

మంథరుడు : అడవిలో మీ ఇద్దరికీ ఆహారం సరిగ్గా దొరికిందా!

హిరణ్యకుడు : లేదు మిశ్రమా! అందుకే లఘుపతనకం నీ దగ్గరకు నన్ను కూడా తీసుకువచ్చింది.

మంథరుడు : మిత్రమా! హిరణ్యకా! డబ్బు శాశ్వతం కాదు. దాచిన డబ్బు మనతో రాదు. ప్రక్కవాడికి పెట్టి మనం హాయిగా తినాలి. మనం ముగ్గురమూ ఒకరికొకరు సాయం చేసికొంటూ బ్రతికేద్దాం.

హిరణ్యకుడు : మిత్రమా! నీ మాటలు విని నేను ధన్యుణ్ణి అయ్యాను.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 2.
చిన్నయసూరి కథను చెప్పే విధానాన్ని, రచయిత రచనా విధానాన్ని ప్రశంసిస్తూ మీ గ్రంథాలయంలో చిన్నయసూరి రచనలు పెట్టవలసిన అవసరాన్ని వివరిస్తూ మీ ప్రధానోపాధ్యాయునకు లేఖ వ్రాయండి.
జవాబు:

కర్నూలు,
x x x x x

గౌరవనీయులైన కర్నూలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి,
తమ పాఠశాలలో 10వ తరగతి చదువుచున్న 8. వెంకట్ వ్రాయు లేఖ,

అయ్యా !

విషయము : పాఠశాల గ్రంథాలయంలో – చిన్నయసూరి రచనల గూర్చి – విజ్ఞప్తి.

మాకు పదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో ‘ధన్యుడు’ పాఠం ఉన్నది. దానిని పరవస్తు చిన్నయసూరిగారు రచించారు.

అది కావ్యభాషలో ఉంది. చిన్నయసూరి రచనా శైలి చాలా బాగుంది. మమ్మల్ని ఆ శైలి ఆకట్టుకొంది. కథను చెప్పడంలో చక్కని వేగం ఉంది. ఆ వాక్య నిర్మాణం కూడా చాలా బాగుంది. పదాల ఎన్నికలో అర్థానికి తగినవి ఎన్నుకొన్నారు.

పరివ్రాజకుడు, కాణాచి, పాతకాపు, చెడగరపు బోడవంటి పాతపదాలు ఎక్కువగా ఉన్నాయి.

ఈ కథలోని పాత్రలు అన్నీ జంతువులు. జంతువుల ద్వారా నీతులు చెప్పించడం చిన్నయసూరి ప్రత్యేకత. సంభాషణలలో కూడా నాటకీయత ఉంది.

చిన్నయసూరి ఇలాంటి కథలు ఇంకా చాలా వ్రాశారని మా తెలుగు ఉపాధ్యాయులు చెప్పారు. ఆ కథలన్నీ చదవాలని మాకు చాలా కుతూహలంగా ఉంది.

కనుక మాయందు దయతో చిన్నయసూరి రచనలన్నింటినీ మన పాఠశాల గ్రంథాలయానికి కొనిపించండి.

నమస్కారములు.

ఇట్లు,
తమ విద్యార్థి,
కె. వెంకట్, 10వ తరగతి.

ప్రశ్న 3.
చిన్నయసూరి రచనలను చదవవలసిన అవసరాన్ని తెలియజేస్తూ, అవి చదవమని పాఠకులను కోరుతూ కరపత్రం రూపొందించండి.
జవాబు:

కరపత్రం

పాఠకులారా! తెలుగు పాఠకులారా! చదవండి.

ఈ రోజు టీ.వీ.లను చూడడానికి ఇచ్చిన ప్రాధాన్యం చదవడానికి ఇవ్వటల్లేదు. క్రమంగా పుస్తకాలు చదివే అలవాటుకు దూరమవుతున్నాం. కొన్ని పాత పదాలు మనకు తెలియటం లేదు.

చిలుకకొయ్య, నిదాఘ నదీపూరము, పరివ్రాజకుడు, ఝురీవేగతుల్యము మొదలైన ఎన్నో పాత పదాలు తెలియాలంటే ప్రాచీన రచనలు చదవాలి. చిన్నయసూరి రచనలు చదివితే ఇలాంటి పదాలు తెలుస్తాయి. కథాకథన విధానం తెలుస్తుంది. పాండిత్యం పెరుగుతుంది. మన సంభాషణా చాతుర్యం పెరుగుతుంది.

అందుకే చిన్నయ రచనలు చదవండి. చదివించండి.

ఇట్లు,
పాఠక సమాజం

ప్రశ్న 4.
పరవస్తు చిన్నయసూరి రచనల గురించి ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
సూరి రచనల మాధుర్యం

‘చిన్నయ రచనలు పూర్తిగా చదివినవాడే తెలుగు భాషలో సూరి’ అని పెద్దల మాట. తెలుగు భాష సుష్టుగా నేర్చుకొన్నవాడు, సూరి రచనలను వదలలేడు.

పరవస్తు చిన్నయసూరి 1809వ సంవత్సరంలో పెరంబుదూరులో జన్మించాడు. శ్రీనివాసాంబ, వేంకట రంగ రామానుజాచార్యులు వారి తల్లిదండ్రులు.

తెలుగు, తమిళం, సంస్కృతం, ఆంగ్ల భాషలలో సూరి పండితుడు. అక్షర గుచ్ఛము, ఆంధ్రకాదంబరి, పద్యాంధ్ర వ్యాకరణం, నీతిచంద్రిక, సూత్రాంధ్ర వ్యాకరణం, శబ్ద లక్షణ సంగ్రహం మొదలైనవి ఆయన రచనలు.

పాఠకులను ఆకట్టుకొనే రీతిలో ఆయన రచనలు సాగుతాయి. ఆయన రచనలు ప్రాచీన కావ్య భాషలో ఉంటాయి. సూరి రచనల్లో చక్కటి నీతులు ఉంటాయి. లోకజ్ఞానం ఉంటుంది. మంచి పదబంధాలుంటాయి. వ్యాకరణ సూత్రాలకి అనుగుణమైన పదప్రయోగాలు మాత్రమే ఉంటాయి. జంతువులు, పక్షులు ప్రధాన పాత్రలుగా ఉంటాయి. చిన్నయసూరి రచించిన బాలవ్యాకరణం ఈనాటికే కాదు ఏనాటికైనా ప్రామాణిక వ్యాకరణ గ్రంథమే.

చిన్నయసూరి రచనలు చదివితే, ఇంక ఏ గ్రంథాలు చదవకపోయినా, అపారమైన జ్ఞానం కలుగుతుంది. తెలుగు భాషపై మంచి పట్టు సాధించవచ్చును. అందుకే కనీసం చిన్నయసూరిది ‘నీతిచంద్రిక’నైనా ప్రతి తెలుగువాడూ చదవాలి.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 5.
హిరణ్యకుడు – ఏకపాత్రాభినయం రాయండి.
జవాబు:
నేను హిరణ్యకుడిని. ఈ చూడకర్ణుడి ఇంట్లో వంటకము బాగా దొరుకుతోంది. బాగా సంపాదించా. నేను ఈ చోటును విడిచిపెట్టను. హాయిగా ఉంటాను.

అరే! ఈ సన్యాసి నా కన్నం తవ్వి నేను దాచినదంతా తీసుకున్నాడు. ఏమి చేయను ? నేను ఇంక ఇక్కడ ఉండడం మంచిది కాదు. అభిమానవంతుడు, ఉంటే ఉన్నతంగా బతకాలి లేదా అడవిలో నివాసం ఉండాలి. అడుక్కు తినడం కంటే చావడం మంచిది. అయినా మరికొంత కాలం ఇక్కడే ఉండి చూస్తా.

అబ్బా! ఎంత దెబ్బ కొట్టాడు ఈ సన్న్యాసి నన్ను. నేను ధనలోభం వల్ల ఈ స్థితి తెచ్చుకున్నా. ధనలోభమే అన్ని ఆపదలనూ తెస్తుంది. ప్రాణికి దుఃఖాలులాగే, సుఖాలు కూడా కోరకుండానే వస్తాయి. ఈ స్థలము నా తాతముత్తాతల కాణాచి కాదు. ఈ సన్న్యాసి దెబ్బలు తినడం కన్న, హాయిగా అడవిలో ఉండడం మంచిది. రాతిలో కప్పను పోషించే దేవుడు, నన్ను రక్షించకుండా ఉండడు.

సరే! నిర్జనారణ్యంలోకి పోతా ! వస్తా?

ప్రశ్న 6.
ధన్యుడు పాఠం ఆధారంగా సూక్తులు తయారుచేయండి.
జవాబు:

  1. ధనము కలవాడే బలవంతుడు – పండితుడు.
  2. ధనము సర్వశ్రేయములకు నిదానము.
  3. దారిద్ర్యము కంటే మరణము మేలు. దారిద్ర్యము సర్వశూన్యము.
  4. మానవంతునికి వనవాసము కంటె సుఖము లేదు.
  5. ఒక మ్రుక్కడిని యాచించుటకంటె, నిప్పులోపడి శరీరము విడుచుట మేలు.
  6. వివేకహీనుడయిన ప్రభువును సేవించుటకంటె, వనవాసము ఉత్తమము.
  7. యాచించుకొని బ్రతుకుటకంటే, మరణము శ్రేయము.
  8. సేవా వృత్తి మానమునువలె యాచనా వృత్తి సమస్త గౌరవమునూ హరిస్తుంది.
  9. ధనలోభము సర్వాపదలకూ మూలము.
  10. ఆశ దిగనాడినవాడే సత్పురుషుడు.
  11. అర్థములు నిత్యములు కావు. యౌవనము ఝరీవేగతుల్యము.
  12. జీవనము బుద్బుదప్రాయము.
  13. అతిసంచయేచ్ఛ తగదు.

10th Class Telugu 5th Lesson ధన్యుడు 1 Mark Bits

1. జ్వలనం అన్ని దిక్కులా వ్యాపించింది – గీత గీసిన పదానికి సరియైన అర్థాన్ని గుర్తించండి. (June 2017)
A) మంట
B) సువాసన
C) దుఃఖం
D) సంతోషం
జవాబు:
A) మంట

2. నా స్నేహితుడు ఉదయం వెళ్లి, సూర్యుడు అస్తమించేటప్పుడు ఇంటికి వచ్చాడు – గీత గీసిన పదాలకు నానార్థ పదాన్ని గుర్తించండి. (June 2017)
A) చంద్రుడు
B) మిత్రుడు
C) పగతుడు
D) ఫలం
జవాబు:
B) మిత్రుడు

3. దేవతలు, రాక్షసులు, పాల కడలి నుండి అమృతమును సాధించారు – గీత గీసిన పదానికి వ్యుత్పత్యర్థాన్ని గుర్తించండి. (June 2017)
A) జీవితాన్నిచ్చేది
B) మరణాన్నిచ్చేది
C) బలాన్నిచ్చేది
D) మరణం పొందింపనిది
జవాబు:
D) మరణం పొందింపనిది

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

4. శివుని మూర్ఖమున గంగ కొలువైనది – (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.) (March 2017)
A) తల, నెల
B) నెల, శిరస్సు
C) శిరస్సు, చేయి
D) శిరస్సు, తల
జవాబు:
D) శిరస్సు, తల

5. ధీరులు కర్ణము పూర్తి చేసేవరకు విశ్రమించరు – (గీత గీసిన పదమునకు ప్రకృతిని గుర్తించండి.) (March 2017)
A) కార్యము
B) కార్యక్రమం
C) కష్టం
D) కారణం
జవాబు:
A) కార్యము

6. శాస్త్రము అందరికీ సమ్మతమైనది. అందుకే మనం దానిని గౌరవించాలి – గీత గీసిన పదానికి వికృతి రూపం గుర్తించండి. (June 2018)
A) చుట్టము
B) నష్టము
C) చట్టము
D) కష్టము
జవాబు:
C) చట్టము

7. వివరములోని పాము ఆహారం కోసం బయటకు వచ్చింది – అర్థాన్ని గుర్తించండి. (S.A. I – 2018-19)
A) రంధ్రము
B) విషయము
C) పుట్ట
D) నీరు
జవాబు:
A) రంధ్రము

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

8. అనృతమును పలుకుట కంటే మౌనము మేలు – పర్యాయ పదాలు గుర్తించండి. ( S.A. I – 2018-19)
A) అసత్యము, అబద్ధము
B) సత్యము, యథార్థము
C) నిజము, కారణము
D) అసత్యము, అకారణము
జవాబు:
A) అసత్యము, అబద్ధము

9. కింది వానిలో సంభావన పూర్వపద కర్మధారయ సమాసమునకు ఉదాహరణ గుర్తించుము. (S.A. I – 2018-19)
A) తల్లిదండ్రులు
B) ఏడు రోజులు
C) చంపకవతి పట్టణం
D) దైవ ప్రార్థన
జవాబు:
C) చంపకవతి పట్టణం

10. అందుఁ జూడా కర్ణుడను పరివ్రాజకుడు గలడు. (ఆధునిక వచన వాక్యాన్ని గుర్తించండి.) (June 2017)
A) అక్కడ చూడాకరుడు అనే సన్యాసి ఉన్నాడు.
B) అక్కడ చూడాకర్ణుడనే వ్యక్తి ఉన్నాడు.
C) అక్కడ చూడాకర్ణుడనే స్వామి గలడు.
D) అందు చూడాకర్ణుడనే సన్యాసి గలడు.
జవాబు:
A) అక్కడ చూడాకరుడు అనే సన్యాసి ఉన్నాడు.

11. ఆ పరివ్రాజకుడు చెప్పగా విని మిక్కిలి ఖిన్నుడనయితిని – ఈ వాక్యానికి ఆధునిక వచనాన్ని గుర్తించండి. (March 2017)
A) ఆ సన్యాసి చెప్పగా విని చాలా బాధపడ్డాను.
B) ఆ పరివ్రాజకుడు చెప్పగా విని ఖిన్నుడనయ్యానా?
C) ఆ పరివ్రాజకుడు చెప్పగా విని బాధపడలేదు.
D) ఆ సన్యాసి చెప్పగా విని ఖిన్నుడను కాలేదు.
జవాబు:
A) ఆ సన్యాసి చెప్పగా విని చాలా బాధపడ్డాను.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

12. జీవనము బుద్బుద ప్రాయము – ఆధునిక వచన వాక్యాన్ని గుర్తించండి. – (June 2018)
A) జీవనము బుద్బుదంతో సమానం కాదు.
B) జీవనం బుద్బుద ప్రాయం.
C) బుద్బుద ప్రాయం జీవనమే.
D) జీవితం బుద్బుదప్రాయమే.
జవాబు:
B) జీవనం బుద్బుద ప్రాయం.

13. అనృతమాడుట కంటె మౌనము మేలు. (ఆధునిక వచన వాక్యాన్ని గుర్తించండి.) (S.A. I – 2018-19)
A) అనృతమాడుట కంటెను మౌనమ్ము మేలు.
B) అనృతం ఆడడం కంటే మౌనం మేలు.
C) అనృతంబాడుట కంటె మౌనము మేలు.
D) అనృతమ్మాడుట కంటె మౌనంబు మేలు.
జవాబు:
B) అనృతం ఆడడం కంటే మౌనం మేలు.

14. ప్రత్యక్ష ఫలం ప్రజాసముదాయం చేత కోరబడదు. (కర్తరి వాక్యం గుర్తించండి) (S.A. I – 2018-19)
A) ప్రజా సముదాయం ప్రత్యక్ష ఫలం కోరింది.
B) ప్రజా సముదాయం ప్రత్యక్ష ఫలమును కోరుతోంది.
C) ప్రజా సముదాయం ప్రత్యక్ష ఫలాన్ని కోరదు.
D) ప్రజా సముదాయం ప్రత్యక్ష ఫలం కోరగలదు.
జవాబు:
C) ప్రజా సముదాయం ప్రత్యక్ష ఫలాన్ని కోరదు.

15. “నాకు వసింప తగదు”, అని హిరణ్యకుడన్నాడు. (పరోక్ష కథనం గుర్తించండి) (S.I. I – 2018-19)
A) తను వసించనని హిరణ్యకుడన్నాడు.
B) తనకు వసింప తగదని హిరణ్యకుడన్నాడు.
C) తనకు వసించడం తగవని హిరణ్యకుడన్నాడు.
D) తనకు వసించుట ఇష్టం లేదని హిరణ్యకుడన్నాడు.
జవాబు:
B) తనకు వసింప తగదని హిరణ్యకుడన్నాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

16. చంపకవతి అను పట్టణము గలదు. (ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి) (S.A. I – 2018-19)
A) సంయుక్త వాక్యం
B) చేదర్థక వాక్యం
C) సామాన్య వాక్యం
D) సామార్థ్యార్థక వాక్యం
జవాబు:
D) సామార్థ్యార్థక వాక్యం

చదవండి – తెలుసుకోండి

భారతదేశం కథా సాహిత్యానికి ప్రసిద్ధిపొందింది. ప్రాచీన కాలం నుండే భారతీయ సాహిత్యంలో ప్రాచుర్యం పొందిన కథలు ఎన్నో ఉన్నాయి. విష్ణుశర్మ అనే పండితుడు అమరశక్తి అనే రాజు కొడుకులను వివేకవంతులను చేయడానికి పంచతంత్ర కథలను బోధిస్తాడు. అవే కథా రూపంలో వ్యాప్తి చెందాయి. వీటిని దాదాపు 200 భాషల్లోకి అనువదించారు.

ఈ పంచతంత్ర కథలు మిత్రలాభం, మిత్రభేదం, కారోలూకీయం (సంధి, విగ్రహం), లబ్దప్రణాశం, అపరీక్షితకారకం (అసంప్రేక్షకారిత్వం) అనే భాగాలుగా ఉన్నాయి. వీటిని తెలుగులోకి అనువదించినవారిలో ముఖ్యులు చిన్నయసూరితో పాటు కందుకూరి వీరేశలింగం. వీరేశలింగం పంతులు సంధి, విగ్రహం అనే భాగాలను తెలుగులోకి అనువదించారు. ఈయన వీటితో పాటు రాజశేఖర చరిత్ర, ఆంధ్రకవుల చరిత్ర అభాగ్యోపాఖ్యానం మొదలైన గ్రంథాలను, శతకాలను, నాటకాలను రాసి గద్య తిక్కనగా ప్రసిద్ధికెక్కాడు. స్త్రీ విద్యావ్యాప్తికి కృషి చేశారు. సంఘసంస్కర్తగా పేరు పొందాడు.