AP Board 9th Class Biology Solutions 7th Lesson జంతువులలో ప్రవర్తన

SCERT AP 9th Class Biology Study Material Pdf Download 7th Lesson జంతువులలో ప్రవర్తన Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Biology 7th Lesson Questions and Answers జంతువులలో ప్రవర్తన

9th Class Biology 7th Lesson జంతువులలో ప్రవర్తన Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
ప్రతిచర్య ఉపయోగం ఏమిటి? (AS 1)
ఎ) ఇది నేర్చుకోవలసి ఉంటుంది
బి) ప్రతిసారి వేరువేరుగా జరుగుతుంది
సి) ఇది నేర్చుకోవలసిన అవసరం లేదు
డి) ఏదీ కాదు
జవాబు:
సి) ఇది నేర్చుకోవలసిన అవసరం లేదు

ప్రశ్న 2.
బోనులో ఉన్న ఎలుకను బోనులోని ప్రత్యేక భాగానికి వెళ్ళినప్పుడు తక్కువ విద్యుత్ సరఫరా చేసి షాక్ కు గురిచేసిన, అది ఆ భాగము వైపు వెళ్ళడం మానివేస్తుంది. ఇది …. (AS 1)
ఎ) సహజాత ప్రవృత్తి బి) నిబంధన సి) అనుకరణ డి) ముద్రవేయడం
జవాబు:
బి) నిబంధన

ప్రశ్న 3.
భేదాలు తెలపండి.
ఎ) అనుకరణ మరియు అనుసరణ బి) సహజాత ప్రవృత్తి మరియు నిబంధన. (AS 1)
ఎ) అనుకరణ మరియు అనుసరణ
జవాబు:

అనుకరణ అనుసరణ
1) మనుష్యులు, జంతువులయందు అనుకరణను చూస్తాము. 1) జంతువులలో మాత్రం అనుసరణను చూస్తాము.
2) అనుకరణలో ఒక జంతువు లేదా మానవుడు మరొక జంతువు లేదా మానవుని ప్రవర్తనను ప్రదర్శిస్తాయి. 2) అనుసరణ ద్వారా కోడి పిల్లలు, బాతు పిల్లలు చిన్నతనంలోనే తల్లిని గుర్తిస్తాయి.
3) కోప్లెర్ అనే శాస్త్రవేత్త చింపాంజీలలో గల అనుకరణ శక్తిమీద ప్రయోగాలు చేశాడు. 3) కోనార్డ్ లోరెంజ్ తెల్ల బాతులను స్వయంగా పెంచి అనుసరణను అధ్యయనం చేశాడు.

బి) సహజాత ప్రవృత్తి మరియు నిబంధన

సహజాత ప్రవృత్తి నిబంధన
1) ఇది పుట్టుకతో వచ్చే ప్రవర్తన. 1) ఇది పుట్టుకతో వచ్చే ప్రవర్తన కాదు.
2) ప్రత్యేకంగా నేర్చుకోవలసిన అవసరం లేదు. 2) ఇది నేర్చుకోవలసిన ప్రవర్తన.
3) పక్షులు గూడు కట్టుకోవడం, సంతానోత్పత్తికోసం భిన్న లింగజీవిని ఎంచుకోవడం ఉదాహరణలు. 3) పెద్దవాళ్ళు రాగానే గౌరవంగా లేచి నిలబడడం, పలుపుతాడు విప్పదీయగానే ఎద్దు అరక దగ్గరకు పోవడం నిబంధనకు ఉదాహరణలు.

AP Board 9th Class Biology Solutions 7th Lesson జంతువులలో ప్రవర్తన

ప్రశ్న 4.
మనుషుల ప్రవర్తన జంతువుల ప్రవర్తన కంటే ఎలా భిన్నంగా ఉంటుంది? ఒక ఉదాహరణతో వివరించండి. (AS 1)
జవాబు:

  1. మానవులు కూడా ఇతరత్రా జంతువుల వలె ప్రవర్తనను కలిగి ఉంటారు.
  2. కానీ మానవుల ప్రవర్తన ఇతర జంతువుల కన్నా సంక్లిష్టంగా ఉంటుంది.
  3. ఎందుకంటే మానవులు ఇతర జంతువుల కన్నా తెలివైనవారు, ఆలోచించగల శక్తి కలిగినవారు.
  4. మానవులకు వాళ్ళ గురించి వాళ్ళకు బాగా తెలుసు.
  5. ఉదాహరణకి బాగా ఆకలిగా ఉన్నప్పుడు వెంటనే భోజనం చేయాలనిపిస్తుంది. కానీ మర్యాద కోసం అందరూ కూర్చున్న తరువాతే భోజనం చేయడం మొదలు పెడతాం.
  6. కానీ జంతువులు తమకు ఆహారం దొరకగానే వెంటనే తింటాయి.

ప్రశ్న 5.
వరుసగా వెళ్తున్న చీమలను గమనించండి. కొన్నిసార్లు రెండు చీమలు మాట్లాడుకున్నట్లు మీకు అనిపిస్తుంది కదా ! మీ ఉపాధ్యాయున్ని అడిగి చీమలు ఎలా భావప్రసారం చేసుకుంటాయో మీ నోట్‌బుక్ లో రాయండి. (AS 3)
జవాబు:

  1. చీమలు వెదకులాడడం లేదా సమాచారం అందించడం అనేవి అవి విడుదల చేసే ఫెర్మెనుల వలన జరుగుతుంది.
  2. చీమలు రసాయన సంకేతాలయిన ఫెర్మెనులను స్పర్శకాలతో గుర్తించడం ద్వారా ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి. స్పర్శకాలను వాసనలు గ్రహించడానికి ఉపయోగిస్తాయి.
  3. ఒక జత స్పర్శకాలు చీమలకు అవి ఎటువైపు వెళ్ళాలి, వాసన తీవ్రత గురించిన సమాచారాన్ని అందిస్తాయి.
  4. చీమలు నేలమీద జీవిస్తాయి కనుక ఫెర్సె నులను విడుదల చేయుట ద్వారా మిగతా చీమలు దానిని అనుసరిస్తాయి.
  5. కొన్ని చీమలు వాటి యొక్క హనువులు (మాండిబుల్స్) ద్వారా శబ్దములను ఉత్పత్తి చేస్తాయి.
  6. శబ్దములను సమూహమునందలి ఇతర చీమలతో భావ ప్రసారానికి వినియోగిస్తాయి.
  7. ప్రమాదము ఉందనే విషయాన్ని మరియు ఆహారం ఉన్న ప్రదేశమును చీమలు ఫెర్మెనుల ఉత్పత్తి ద్వారా తెలుసుకుంటాయి.

ప్రశ్న 6.
నాగమ్మ తన వద్ద ఉన్న బాతుగుడ్లను, కోడిగుడ్లతో కలిపి పొదగేసింది. పొదిగిన తరువాత బాతు పిల్లలు కూడా కోడినే తమ తల్లిగా భావించాయి. దాని వెంటే తిరుగుతున్నాయి. దీనిని ఎలా వివరిస్తావు? (AS 3)
జవాబు:

  1. బాతు పిల్లలు, కోడి పిల్లలు గుడ్ల నుండి బయటకు వచ్చిన వెంటనే నడవగలుగుతాయి.
  2. బాతు పిల్లలు గుడ్ల నుండి బయటకు వచ్చిన వెంటనే కదులుతున్నది ఏదైనా కనిపిస్తే దాని వెనకే పోతాయి.
  3. బాతు పిల్లలు ఆ జీవితో గడుపుతూ దానినే తల్లిగా భావిస్తాయి.
  4. అనుసరణ అనే లక్షణం వలన బాతుపిల్లలు చిన్న వయసులోనే ఆ బాతుని తమ తల్లిగా భావించాయి.

ప్రశ్న 7.
“జంతువుల ప్రవర్తనను అర్థం చేసుకోవడం వలన జంతువుల పట్ల సానుకూల దృక్పథం జనిస్తుంది” దీనిని నీవు ఎలా సమరిస్తావు? సరియైన ఉదాహరణలతో వివరించండి. (AS 6)
జవాబు:

  1. జంతువులు వివిధ సందర్భాలలో ప్రదర్శించే ప్రవర్తనను అర్థం చేసుకోవడం వలన వాటిపట్ల సానుకూల దృక్పథం జనిస్తుంది. దీనిని నేను సమర్థిస్తాను.
  2. జంతువులు వాటి అవసరాలకు అనుగుణంగా అరవడం, ఘీంకరించడం చేస్తాయి. వివిధ రకాల హావ భావాలను ప్రదర్శిస్తాయి.
  3. ఉదాహరణకు పశువులు అరుస్తాయి. ఆ అరుపు పాటికి అవసరమైన నీరు, ఆహారం గురించి అయి ఉంటుంది.
  4. వాటికి కావలసిన నీరు, ఆహారం ఇచ్చిన తరువాత అవి ప్రశాంతంగా ఉంటాయి.
  5. కాకి చనిపోతే మిగిలిన కాకులు అన్నీ గుమిగూడి అరిచే అరుపులను మనము అవి వ్యక్తపరచే బాధగా గుర్తించాలి.
  6. చీమలు అన్నీ ఆహార సేకరణ కోసం బారులు తీరినప్పుడు మనం వాటిలో ఉన్న సమైక్య శక్తిని, సహకార స్వభావాన్ని గుర్తించాలి.
  7. కుక్కలు రాత్రి సమయములో మొరుగునప్పుడు అవి మనకు దొంగలు రాకుండా సహాయం చేస్తున్నాయని భావించాలి. కాని మనకు నిద్రాభంగం చేస్తున్నాయని భావించకూడదు.
  8. మనకు తోడూ నీడగా ఉండే జంతువుల యొక్క ప్రవర్తన పట్ల సానుభూతి దృక్పథం కలిగి వాటి యొక్క అవసరాలను తీర్చాలి. ‘నీవు జీవించు, జీవించనివ్వు’ అనే సూత్రాన్ని మనం పాటించాలి.

ప్రశ్న 8.
పాఠ్యాంశములో చర్చించిన అనేక రకాల జంతువుల ప్రవర్తనలను ఉదాహరణలతో వివరించండి. (AS 7)
(లేదా)
జంతువులలో సాధారణంగా ఏయే రకాలైన ప్రవర్తనలను గమనించవచ్చు ? వీటిని గూర్చి క్లుప్తంగా వివరించండి.
జవాబు:
జంతువుల ప్రవర్తనలు నాలుగు రకములు. అవి :

  1. సహజాత ప్రవృత్తి
  2. అనుసరణ
  3. నిబంధన
  4. అనుకరణ.

1) సహజాత ప్రవృత్తి :
పుట్టుకతో వచ్చే ప్రవర్తనలను సహజాత ప్రవృత్తి లేదా సహజాత లక్షణాలు అంటారు. వీటిని నేర్చుకోవలసిన అవసరం ఉండదు. ఇవి జటిలమైనవిగా ఉంటాయి.
ఉదా : పక్షులు గూడు కట్టుకోవడం, సంతానోత్పత్తి కోసం భిన్న లింగజీవిని ఎంచుకోవడం, రక్షణ కోసం సమూహాలు ఏర్పాటు చేసుకోవడం.

2) అనుసరణ :
కోళ్ళు, బాతులు గుడ్లు పొదిగి బయటకు వచ్చిన వెంటనే నడవగలుగుతాయి. పిల్లలు వాటి తల్లిని పోల్చుకోగలుగుతాయి. ఈ లక్షణాన్ని అనుసరణ అంటారు. అనుసరణ అనే లక్షణం వలన కోడి, బాతు పిల్లలు తమ తల్లిని గుర్తించి, అనుసరించి ఆహారాన్ని, రక్షణను పొందుతాయి.

3) నిబంధన :
సహజంగా కాకుండా కృత్రిమంగా ఒక ఉద్దీపనకు ప్రతి చర్య చూపే ఒక రకమైన ప్రవర్తన నిబంధన. ఇది నేర్చుకోవలసినది. పుట్టుకతో రాని ప్రవర్తన.

ఉదాహరణకి, విద్యుత్ సరఫరా అవుతున్న కంచెలు కట్టి ఉన్న పొలంలో జంతువులను మేత మేయడానికి లోపలికి విడిచిపెట్టారు. గొర్రెలు కంచె వైపునకు పోగానే వాటికి చిన్నపాటి విద్యుత్ ఘాతం తగిలింది. అది అలవాటైన తరువాత విద్యుత్ సరఫరా ఆపివేసినా కూడా ఆ జంతువులు అటువైపు పోకపోవడం నిబంధన.

4) అనుకరణ:

  1. ఒక జంతువు యొక్క ప్రవర్తన వేరొక జంతువు ప్రదర్శిస్తే లేదా కాపీ చేస్తే అలాంటి ప్రవర్తనను ‘అనుకరణ’ అంటారు.
  2. ఉదాహరణకు కోఫ్టర్ అనే శాస్త్రవేత్త చింపాంజీలలో గల అనుకరణ శక్తి మీద ప్రయోగాలు చేశాడు.
  3. ఒక చింపాంజీ చెట్టుకు ఉన్న పండు కోయడానికి ప్రయత్నించింది. అది అందలేదు. కర్రపుల్లలు ఉపయోగించి పండు కోసింది. పుల్లతో గుచ్చి పండ్లను తినసాగింది.
  4. మిగతా చింపాంజీలు కూడా అలానే చేస్తాయి. ఈ విధంగా చింపాంజీలు కొత్త మెలకువలు నేర్చుకుంటాయి.

AP Board 9th Class Biology Solutions 7th Lesson జంతువులలో ప్రవర్తన

ప్రశ్న 9.
ఈ చిత్రం చూడండి. జంతువులు పిల్లల్ని ఎలా సంరక్షించుకుంటున్నాయి. ఇది వీటి సహజ లక్షణం. దీని గురించి నీ భావన ఏమిటి? ఇటువంటి దృశ్యాలను మీ పరిసరాలలో గమనించావా? నీ సొంత మాటల్లో వర్ణించండి. (AS 7)
AP Board 9th Class Biology Solutions 7th Lesson జంతువులలో ప్రవర్తన 1
జవాబు:

  1. జంతువులు పిల్లల్ని సంరక్షించడం అనేది వాటి సహజ లక్షణం. ప్రతి జంతువు తన పిల్లలను తమ కాళ్ళ మీద అవి నిలబడేవరకు రక్షించి కాపాడుతుంది.
  2. ఇటువంటి దృశ్యాలను మా పరిసరాలలో గమనించాను.
  3. గుడ్ల నుండి బయటకు వచ్చిన కోడి పిల్లలను కోడి తన వెంట తిప్పుకుంటూ ఆహారాన్ని సంపాదించి ఇస్తుంది.
  4. కోడి పిల్లలకు ఆపద ఎదురైనప్పుడు కోడి తన రెక్కల క్రింద దాచి రక్షణ కలుగచేస్తుంది.
  5. తన పిల్లలను గ్రద్ద తన్నుకుపోవడానికి ప్రయత్నించినపుడు తను వాటి వెంటపడి తరుముతుంది.
  6. కోడి తన పిల్లలు తమ కాళ్ళమీద నిలబడి ఆహారం సంపాదించేవరకు తన పిల్లలను సంరక్షిస్తుంది.
  7. పుట్టిన 10 నుండి 12 రోజులవరకు కళ్ళు కనపడని తన పిల్లలకు పిల్లి పాలు తాగటాన్ని అలవాటు చేస్తుంది.
  8. పిల్లి తన పిల్లలను శత్రువుల బారి నుండి రక్షణ కల్పించడానికి తరచూ వాటిని ఉంచే ప్రదేశాన్ని మారుస్తుంది.

9th Class Biology 7th Lesson జంతువులలో ప్రవర్తన Textbook Activities (కృత్యములు)

ప్రయోగశాల కృత్యము

ప్రశ్న 1.
బొద్దింక ప్రవర్తన అధ్యయనం : దీని కోసం ఒక పరిశోధన పెట్టి, కాల్షియం క్లోరైడ్ కావాలి.
పరిశోధన పెట్టె తయారీ సోపానాలు :
AP Board 9th Class Biology Solutions 7th Lesson జంతువులలో ప్రవర్తన 2

  1. ఒక చతురస్రాకారపు పెట్టె తీసుకొని దానిని కార్డుబోర్డు సహాయంతో 4 గదులుగా విభజించాలి.
  2. రెండు గదులకు చిన్న రంధ్రాలు చేయాలి. వీటి ద్వారా కాంతి ఉన్న భాగం ఉన్న భాగం ప్రసరించేలా చేయాలి.
  3. మిగతా రెండు గదులలో చీకటిని అలానే ఉండనీయాలి.
  4. వెలుగు ఉన్న ఒక గదిలో, చీకటి ఉన్న ఒక గదిలో దూదిని తడిపి తడి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి.
  5. వెలుగు ఉన్న ఒక గదిలో, చీకటి ఉన్న ఒక గదిలో కొంచెం కాల్సియం క్లోరైడును ఉంచి పొడి వాతావరణాన్ని ఏర్పాటుచేయాలి.
  6. నాలుగు గదులలో వేరువేరు స్థితులు ఉన్నాయి. అవి వెలుగు మరియు పొడి, వెలుగు మరియు తడి, చీకటి మరియు పొడి, చీకటి మరియు తడి.
  7. తరగతి విద్యార్థులను 4 జట్లుగా చేయాలి. ఒక్కొక్క జట్టు కొన్ని బొద్దింకలను వారికిష్టమైన వేరువేరు స్థితులున్న గదిలో ఉంచాలి.
  8. పెట్టి పై భాగంలో మూతతో కప్పి ఉంచాలి. మొత్తం అమరికను 15-20 నిమిషాలు వదలివేయాలి.
  9. తరువాత ప్రతి గదిలో ఉన్న బొద్దింకలను లెక్కించాలి.

బొద్దింక ప్రవర్తన – నివసించే పరిస్థితులు – పరిశీలన :
బొద్దింకలు ఎల్లప్పుడూ చీకటి మరియు తడి ప్రదేశాన్ని ఎంచుకుంటాయి. అందుచేతనే తడి మరియు చీకటి అరలో ఎక్కువ లేదా మొత్తం బొద్దింకలు చేరతాయి.

కృత్యం – 1

ప్రశ్న 2.
కింద పేర్కొనిన జంతువులలో వివిధ రకాల ప్రవర్తనలు పరిశీలించండి. అది సహజాత ప్రవృత్తి, అనుసరణ, నిబంధన అనుకరణ దేనికి చెందుతుందో గుర్తించండి.
– మన పెంపుడు కుక్క కొత్త వారిని చూస్తే మొరుగుతుంది, మీరు మీ కుక్కలను వంటగదిలోకి రాకుండా అలవాటు చేస్తే అవి ఎప్పటికైనా వంటింటిలోకి వస్తాయా?
జవాబు:
నిబంధన

డబ్బాలో పెట్టిన స్వీట్ ను చేరుకోవడానికి చీమలు వరుసలో వెళ్తాయి. చీమలకు డబ్బా దగ్గరకు చేరుకోవడానికి దారి ఎలా తెలుసు?
జవాబు:
నిబంధన.

రాత్రి మాత్రమే దోమలు, బొద్దింకలు తమ స్థానాలలో నుండి బయటకు వస్తాయి. వెలుతురుకు, చీకటికి తేడా వాటికి ఎలా తెలుస్తుంది?
జవాబు:
సహజాత ప్రవృత్తి

కేవలం రాత్రివేళల్లో మాత్రమే గుడ్లగూబ తిరుగుతుంది. ఆహారం వెతుకుతుంది. వాటికి రాత్రి, పగలుకు తేడా ఎలా తెలుస్తుంది?
జవాబు:
సహజాత ప్రవృత్తి

ఎద్దు మెడకి ఉన్న తాడు తీయగానే ఏ సూచనలు చేయనప్పటికీ అరక దున్నే సమయం కాగానే అరక దగ్గరికి వెళ్తుంది. నీరు తాగే సమయం కాగానే తొట్టివైపు వెళ్తుంది. ఎద్దులు ఎలా ఇట్లా ప్రతిస్పందిస్తాయి?
జవాబు:
నిబంధన

పక్షులు గూడు అల్లడానికి బలంగా ఉన్న మెత్తటి పదార్థాన్ని సేకరిస్తాయి. సేకరించే పదార్థము యొక్క నాణ్యత వాటికి ఎలా తెలుసు?
జవాబు:
సహజాత ప్రవృత్తి

కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు గుడ్డముక్కను చూడగానే ఒకదానితో ఒకటి పోట్లాడి దానిని చింపుతాయి.
జవాబు:
అనుకరణ

కొన్ని ప్రత్యేక కాలాల్లో కొన్ని పక్షులు చాలా దూరం నుండి మన చుట్టుప్రక్కల ప్రాంతాలకు వలస వస్తాయి. వాటికి ఇక్కడికి రావడానికి దారి ఎలా తెలుసు?
జవాబు:
సహజాత ప్రవృత్తి

AP Board 9th Class Biology Solutions 7th Lesson జంతువులలో ప్రవర్తన

కృత్యం – 2

ప్రశ్న 3.
మీ పరిసరాలలో ఏదేని ఒక జంతువును ఎన్నుకొని అది కింద ఇవ్వబడిన పరిస్థితులలో ఎలా ప్రవర్తిస్తుందో పరిశీలించండి.
1) జంతువు పేరు : కాకి

2) అది నివసించే ప్రదేశం :
ఎత్తైన చెట్లపై గూడు నిర్మించుకుంటుంది.

3) అది నివాసాన్ని ఎలా కట్టుకుంది :
సాధారణంగా చెట్ల యొక్క కొమ్మలు, ఆకులు, మాస్ మొక్కలు, గడ్డి పరకలతో నివాసాన్ని కడుతుంది.

4) ఆహార సేకరణ :
ఎ) కాకి నివసించే ప్రదేశం చుట్టుప్రక్కల కొద్ది దూరం ప్రయాణించి ఆహారాన్ని సేకరిస్తుంది.
బి) కాకి సర్వభక్షకం, దాదాపు అన్ని రకాల ఆహార పదార్థాలను తింటుంది.

5) బాహ్య లక్షణాలు :
ఎ) కాకులు సాధారణంగా నలుపు రంగులో ఉంటాయి.
బి) కొన్నిసార్లు తెల్లని లేదా ఊదారంగు ఈకలు శరీరంపై అక్కడక్కడ ఉంటాయి.

6) భావ వ్యక్తీకరణలు (సంతోషం, విచారం, భయం, ప్రాణభీతి, కోట్లాట, స్వీయరక్షణ / పిల్లల సంరక్షణ) :
ఎ) కాకులు సాధారణంగా రకరకాల కంఠ ధ్వనులను పలుకుతాయి.
బి) చుట్టుప్రక్కల జరిగే వివిధ రకాల ప్రేరణలకు అనుగుణంగా కాకులు శబ్దములను చేస్తాయి. వెళ్ళునప్పుడు, వచ్చేటప్పుడు కాకులు అరిచే సంజ్ఞలలో తేడా ఉంటుంది.
సి) కాకులు సంతోషము, విచారము, భయం, ప్రాణభీతి సమయములందు ‘కావ్ కావ్’ అను ధ్వనులను వ్యక్తపరుస్తాయి.

7) జట్టుతో దాని ప్రవర్తన :
ఎ) ఒక కాకికి ఆహారం దొరికితే ఇతర కాకులను అరుస్తూ పిలుస్తుంది.
బి) ఒక కాకి చనిపోతే మిగిలినవన్నీ గుమిగూడి అరుపుల ద్వారా తమ బాధను వ్యక్తపరుస్తాయి.

AP Board 9th Class Biology Solutions 6th Lesson జ్ఞానేంద్రియాలు

SCERT AP 9th Class Biology Guide Pdf Download 6th Lesson జ్ఞానేంద్రియాలు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Biology 6th Lesson Questions and Answers జ్ఞానేంద్రియాలు

9th Class Biology 6th Lesson జ్ఞానేంద్రియాలు Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
కారణాలను ఇవ్వండి.
అ) సాధారణంగా మనం తక్కువ కాంతిలో (చిరుకాంతిలో) కాంతివంతమైన రంగుల్ని చూడలేము. (AS 1)
జవాబు:

  1. నేత్రపటలంలో దండాలు, శంకువులు అనే కణాలుంటాయి.
  2. మన కంటిలో రొడాప్సిన్ అనే వర్ణద్రవ్యాన్ని కలిగిన దండాలు సుమారుగా 125 మిలియన్లు ఉన్నాయి.
  3. దండాలు అతి తక్కువ కాంతిలో అంటే చీకటిలో వస్తువులను చూడగలవు.
  4. కానీ వివిధ రంగులకు సంబంధించిన నిశితమైన తేడాలను మాత్రం దండాలు గుర్తించలేవు.

ఆ) మరీ తరచుగా చెవిలో గులిమి (మైనం)ను తొలగించడం అన్నది చెవి వ్యాధులకు దారి తీయవచ్చు.
జవాబు:

  1. వెలుపలి చెవినందు మైనంను ఉత్పత్తిచేయు సెరుమినస్ గ్రంథులు మరియు నూనె ఉత్పత్తి చేయు తైలగ్రంథులు ఉన్నాయి.
  2. ఇవి శ్రవణకుల్యను మృదువుగా ఉంచడానికి, మురికి మరియు ఇతర బాహ్య పదార్థములను శ్రవణకుల్యలోనికి ప్రవేశించడాన్ని నిరోధిస్తాయి.
  3. తరచుగా చెవిలో గులిమిని తొలగిస్తే బ్యా క్టీరియా, ఫంగస్ వల్ల చీము, కర్ణభేరికి ఇన్ఫెక్షన్ సాధారణంగా వస్తాయి.
  4. అందువలన గులిమిని తరచుగా తొలగించకూడదు.

ఇ) బాగా దగ్గు, జలుబు ఉన్నప్పుడు మనకు ఆహారం రుచి తెలియదు.
జవాబు:

  1. మనకు జలుబుగా ఉన్నప్పుడు నోటికి ఆహారం రుచి తెలియకపోవడానికి కారణం నాసికాకుహరం పూడుకున్నట్లు ఉండటం.
  2. తద్వారా ఆహారంలోని మధురమైన సువాసనను ముక్కు గ్రహించదు. అందువలన ఆహారం రుచి తెలియదు.

ఈ) ఉల్లిగడ్డలు కోస్తున్నప్పుడు మన కళ్ళ నుండి నీరు కారుతుంది.
జవాబు:

  1. ఉల్లిగడ్డనందలి కణములు అమైనో ఆమ్లాలను, సల్ఫోనిక్ ఆమ్లమును ఏర్పరచే సల్ఫాక్సెడ్ను కలిగి ఉంటాయి.
  2. ఇవి రెండు ఉల్లిగడ్డ కణమునందు వేరుగా ఉంచబడతాయి.
  3. మనము ఉల్లిగడ్డను కోసినపుడు వేరుగా ఉంచబడిన అమైనో ఆమ్లములు, సల్ఫాక్సైడ్ లు కలసి ప్రొపనిధియోల్ సల్ఫర్ ఆక్సైడ్ ను ఏర్పాటు చేస్తాయి.
  4. ప్రొపనిధియోల్ సల్ఫర్ ఆక్సెడ్ ఆవిరి అయి మన కళ్ళవైపు ప్రయాణిస్తుంది.
  5. ఇది మన కంటినందలి నీటితో చర్య జరిపి సల్ఫ్యూరిక్ ఆమ్లమును ఏర్పరచును.
  6. కంటినందు. సల్ఫ్యూరిక్ ఆమ్లము వలన కళ్ళు మండుతాయి. దీనివలన అశ్రుగ్రంథులు నీటిని స్రవిస్తాయి.
  7. అందువలన ఉల్లిగడ్డను మనము కోసిన ప్రతిసారి మన కళ్ళు నీటితో నిండుతాయి.

ప్రశ్న 2.
తప్పైన వాక్యాన్ని గుర్తించి, దాన్ని సరిచేసి వ్రాయండి. (AS 1)
అ) నేత్రపటలం మీద ప్రతిబింబం పడడమన్నదే “చూడడం”కు వెనుక ఉన్న నియమం లేక సూత్రం.
ఆ) చెవులు వినడానికి మాత్రమే పనికొస్తాయి.
ఇ) కంటిపాప నమూనాలు, వేలిముద్రల మాదిరిగానే వ్యక్తుల్ని గుర్తించడానికి ఉపయోగపడతాయి.
ఈ) రుచిని కనుగొనడం (జిహ్వజ్ఞానం)లో లాలాజలం రుచికణికలకు సహాయపడుతుంది.
ఉ) మనం ఇంద్రియ జ్ఞానాలకు తగిన అనుకూలనాలు కలిగిలేము.
అ) నేత్రపటలం మీద ప్రతిబింబం పడడమన్నదే “చూడడం”కు వెనుక ఉన్న నియమం లేక సూత్రం.
జవాబు:
ఈ వాక్యము సరియైనదే. కెమెరా మాదిరిగానే కన్ను కాంతిని సేకరించి, కుంభాకార కటకం ద్వారా కేంద్రీకరించి కంటిలో వెనుక భాగాన ఉండే నేత్రపటలంపై ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది.

ఆ) చెవులు వినడానికి మాత్రమే పనికొస్తాయి.
జవాబు:
ఈ వాక్యము సరియైనది కాదు. ఎందుకంటే చెవులు వినడంతో బాటు మన శరీరం యొక్క సమతాస్థితిని సక్రమంగా ఉంచడానికి చెవులు ఉపయోగపడతాయి.

ఇ) కంటిపాప నమూనాలు, వేలిముద్రల మాదిరిగానే వ్యక్తుల్ని గుర్తించడానికి ఉపయోగపడతాయి.
జవాబు:
ఈ వాక్యము సరియైనదే. ఎందుకంటే కంటిపాపలు ఎవరికి వారికి ప్రత్యేకంగా ఉంటాయి. అందుకే వేలిముద్రల మాదిరిగానే వాటిని కూడా గుర్తింపు కోసం ఉపయోగిస్తారు.

ఈ) రుచిని కనుగొనడం (జిహ్వ జ్ఞానం)లో లాలాజలం రుచికణికలకు సహాయపడుతుంది.
జవాబు:
ఈ వాక్యము సరైనదే. ఎందుకంటే ఆహారంలో రుచిని కలుగజేసే రసాయనిక పదార్థాలు లాలాజలంలో కరుగుతాయి. ఈ లాలాజలం, రుచికణికల ద్వారా వాటి కుహరంలో ప్రవేశించి జిహ్వ గ్రాహకాలను తడుపుతుంది. తద్వారా లాలాజలం రుచికణికలకు సహాయపడుతుంది.

ఉ) మనం ఇంద్రియ జానాలకు తగిన అనుకూలనాలు కలిగి లేము.
జవాబు:
ఈ వాక్యము సరికాదు. ఎందుకంటే అన్ని జ్ఞానేంద్రియాలకు తగిన అనుకూలనాలు మన శరీరం కలిగి ఉంది.

AP Board 9th Class Biology Solutions 6th Lesson జ్ఞానేంద్రియాలు

ప్రశ్న 3.
రెండింటి మధ్య తేడాలు తెలపండి. (AS 1)
అ) దందాలు, శంకువులు

దండాలు శంకువులు
1. అతి తక్కువ కాంతిలో, చీకటిలో వస్తువులను చూడగలవు. 1. కాంతివంతమైన వెలుతురులో రంగులను గుర్తిస్తాయి.
2. వివిధ రంగులకు సంబంధించిన నిశితమైన తేడాలను గుర్తించలేవు. 2. నీలం, ఎరుపు, పసుపుపచ్చ వంటి రంగులు కాకుండా వాటి కలయికచే ఏర్పడు రంగులను కూడా గుర్తించగలవు.
3. దండాలు సుమారుగా 125 మిలియన్లు ఉంటాయి. 3. శంకువులు దాదాపు ఏడు మిలియన్లు ఉంటాయి.
4. దండాలలో రొడాప్సిన్ అనే వర్ణద్రవ్యం ఉంటుంది. 4. శంకువులలో అయెడాప్సిన్ అనే వర్ణద్రవ్యం ఉంటుంది.
5. దండాలలో లోపములు ఉంటే రేచీకటి కలుగుతుంది. 5. శంకువులలో తేడాలుంటే రంగులను గుర్తించలేని లోపము కలుగుతుంది.

ఆ) కంటిపాప, తారక
జవాబు:

కంటిపాప తారక
1. కంటిలో తారక చుట్టూ ఉన్న రంగుగల భాగము. 1. కంటి మధ్యన ఉన్న గుండ్రటి భాగము.
2. కంటిపాప నీలం, ఆకుపచ్చ, బూడిద మరియు గోధుమరంగు వర్ణములో ఉండవచ్చు. 2. తారక నల్లని రంగులో ఉంటుంది.
3. కాంతి తీవ్రతకు అనుగుణంగా పెద్దగా మరియు చిన్నగా మారదు. 3. కాంతి తీవ్రతకు అనుగుణంగా పెద్దదిగాను, చిన్నదిగాను అవుతుంది.

ఇ) పిన్నా, కర్ణభేరి
జవాబు:

పిన్నా కర్ణభేరి
1. దీనిని వెలుపలి చెవి అంటారు. 1. దీనిని టింపానమ్ అని అంటారు.
2. ఇది మన తలభాగాన ఇరువైపులా కంటికి కనిపించే చెవిభాగము. 2. వెలుపలి చెవి మరియు మధ్యచెవి మధ్యన ఉంటుంది.
3. ఇది ఒక దొప్ప మాదిరిగా ఉంటుంది. 3. ఇది శంకువు ఆకారములో ఉంటుంది.
4. పిన్నా మృదులాస్థితో నిర్మితమైనది. 4. కర్ణభేరి ఒక పలుచని పొరలాంటి నిర్మాణము.
5. శబ్ద తరంగాలను సేకరిస్తుంది. 5. శబ్ద తరంగాలను ప్రకంపనాలుగా మారుస్తుంది.
6. ఇది వెలుపలి చెవి మొదటి భాగము. 6. ఇది వెలుపలి చెవి చివరి భాగము.

ఈ) నాసికా కుహరం, శ్రవణకుల్య
జవాబు:

నాసికా కుహరం శ్రవణ కుల్య
1. బాహ్య నాసికా రంధ్రములలోని ఖాళీ ప్రదేశం నాసికా కుహరం. 1. వెలుపలి, మధ్య చెవినందలి కాలువలాంటి నిర్మాణం శ్రవణ కుల్య.
2. నాసికా కుహరం అంతరనాసికా రంధ్రాల లోనికి తెరుచుకుంటుంది. 2. శ్రవణ కుల్య మధ్య చివర కర్ణభేరి ఉంటుంది.
3. అంతరనాసికా రంధ్రాలలోనికి పోయే గాలి నుండి దుమ్ము కణాలను వేరుచేస్తుంది. 3. వెలుపలి చెవి నుండి శబ్ద తరంగాలను కర్ణభేరికి తీసుకువెళుతుంది.
4. నాసికా కుహరం గోడలు శ్లేషస్తరాన్ని, చిన్న వెంట్రుకలను కలిగి ఉంటుంది. 4. శ్రవణ కుల్యనందు సెరుమినస్ మరియు తైల గ్రంథుల స్రావమైన గులిమి ఉంటుంది.

ప్రశ్న 4.
క్రింది ప్రక్రియలు ఎలా జరుగుతున్నాయి? (AS 1)
అ) మనం వస్తువును చూడగానే దాని నిజమైన ప్రతిబింబం నేత్రపటలంపై తలకిందులుగా ఏర్పడుతుంది.
ఆ) పిన్నా సేకరించిన శబ్ద తరంగాలు ప్రకంపనాలుగా మారతాయి.
ఇ) మనం మనచేతిని వేడి వస్తువుకు దూరంగా జరుపుతాం.
ఈ) ఘాటైన వాసన, మనం ముక్కు మూసుకునేలా చేస్తుంది.
అ) మనం వస్తువును చూడగానే దాని నిజమైన ప్రతిబింబం నేత్రపటలంపై తలకిందులుగా ఏర్పడుతుంది.
జవాబు:
మనం వస్తువును చూడగానే, కెమెరా మాదిరిగానే కన్ను కాంతిని సేకరించి, కుంభాకార కటకం ద్వారా కేంద్రీకరించి కంటిలో వెనుక భాగాన ఉండే నేత్రపటలంపై ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. కటకం వల్ల ఏర్పడే ప్రతిబింబంలో ఎడమ కుడిగాను, తలకిందులుగాను ఉంటుంది.

ఆ) పిన్నా సేకరించిన శబ్ద తరంగాలు ప్రకంపనాలుగా మారతాయి.
జవాబు:
పిన్నా శబ్ద తరంగాలను సేకరిస్తుంది. సేకరించిన శబ్ద తరంగాలు శ్రవణకుల్యను చేరతాయి. అవి అప్పుడు కర్ణభేరిని తాకుతాయి. ఈ శబ్ద తరంగాలు, ప్రకంపనాలుగా మారతాయి.

ఇ) మనం మనచేతిని వేడి వస్తువుకు దూరంగా జరుపుతాం.
జవాబు:
జ్ఞానేంద్రియాలు చేసే పనులన్నింటికీ కేంద్రం మెదడు. అది జ్ఞానేంద్రియాల నుండి నాడీ సంకేతాలు తెచ్చే జ్ఞాననాడుల ద్వారా సమాచారాన్ని అందుకుంటుంది. తరువాత వాటిని విశ్లేషించి చాలకనాడులు అని పిలువబడే మరొక రకం నాడుల ద్వారా ప్రతిచర్యను చూపాల్సిన భాగాలకు సంకేతాలు పంపుతుంది. ఉదాహరణకు మన చేతిని వేడి వస్తువు దగ్గరకు తీసుకెళ్ళామనుకోండి. వెంటనే జ్ఞాననాడులు, చర్మానికి వేడి తగులుతుందనే సమాచారాన్ని మెదడుకు చేరుస్తాయి. మెదడు చేతిని దూరంగా జరపాల్సిందిగా చాలకనాడుల ద్వారా సమాచారం పంపుతుంది. అపుడు చేతిని వేడి వస్తువుకు దూరంగా జరుపుతాం.

ఈ) ఘాటైన వాసన, మనం ముక్కు మూసుకునేలా చేస్తుంది.
జవాబు:
ముక్కులోని గ్రాహక కణాలు ప్రేరణను, నాడీ సంకేతాలుగా మార్చి మెదడులో కింది భాగాన ఉండే ఝణకేంద్రాలకు చేరుస్తాయి. అక్కడ ఋణ జ్ఞానం (వాసన) ప్రక్రియ జరుగుతుంది. అలా ఘాటైన వాసన ముక్కులోని గ్రాహక కణాల ‘ నుండి మెదడుకు చేరుతుంది. వెంటనే మెదడు భరించలేని వాసన కనుక ముక్కు మూసుకోమని సంకేతాన్నిస్తుంది.

ప్రశ్న 5.
ఖాళీలను సరియైన పదాలతో పూరించండి. తరువాత ఆ పదాలు ఎలా సరిపోతాయో కారణాలు ఇవ్వండి. (AS 1)
1. రక్తపటలం కంటికి ………………. ఇస్తుంది.
జవాబు:
రక్షణ.
కారణం : ఈ పొర కంటి యొక్క అన్ని భాగాలను (తారక తప్ప) ఆవరించియుంటుంది కనుక.

2. నాలుకకు, ……………… కు మధ్య సంబంధం చాలా ఎక్కువ.
జవాబు:
ముక్కు
కారణం : వాసనకు, రుచికి సంబంధం ఉంది కనుక.

3. కంటిపాప నమూనా వ్యక్తుల ……………… కు ఉపయోగపడుతుంది.
జవాబు:
గుర్తింపు
కారణం : కంటి పాప ఎవరికి వారికే ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి.

4. దృక్మడి కంటిని దాటి చోటు పేరు ………..
జవాబు:
అంధచుక్క
కారణం : అంధచుక్క దృక్మడి కంటినుండి బయటకు పోయేచోట ఉంటుంది కనుక.

5. కర్ణభేరి అనేది ……………..
జవాబు:
ప్రకంపించే పొర
కారణం : శబ్ద తరంగాలు కర్ణభేరిని తాకగానే ప్రకంపనాలు వస్తాయి కనుక.

AP Board 9th Class Biology Solutions 6th Lesson జ్ఞానేంద్రియాలు

ప్రశ్న 6.
సరియైనదాన్ని ఎంపిక చేయండి : (AS 1)
అ. కంటి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్
ఎ) విటమిన్ ‘ఎ’
బి) విటమిన్ ‘బి’
సి) విటమిన్ ‘సి’
డి) విటమిన్ ‘డి’
జవాబు:
ఎ) విటమిన్ ‘ఎ’

ఆ. ఇంద్రియ జ్ఞానమన్నది ఒక సంక్లిష్టమైన విధానం. దీనిలో పాల్గొనేవి
ఎ) జ్ఞానేంద్రియాలు
బి) జ్ఞానేంద్రియాలు, నాడీ ప్రేరణలు
సి) జ్ఞానేంద్రియాలు, నాడీ ప్రేరణలు, మెదడు
డి) మెదడు, నాదీ ప్రేరణలు
జవాబు:
సి) జ్ఞానేంద్రియాలు, నాడీ ప్రేరణలు, మెదడు

ఇ. వెలుపలి చెవి గనుక శబ్ద తరంగాలని కేంద్రీకరించకపోతే ‘శ్రవణ కుల్య
ఎ) అనేక రకాల శబ్దాలను గట్టిగా వినగలదు
బి) ఏమి వినలేదు
సి) కొద్దిగా వినగలదు
డి) శబ్దం పుట్టుకని, రకాన్ని తెలుసుకోలేదు
జవాబు:
బి) ఏమి వినలేదు

ఈ. ఒక వ్యక్తి యొక్క కంటిగుద్దు కండరాలు పనిచేయకుండా పాడైతే, తప్పనిసరిగా కలిగే ప్రభావం?
ఎ) ఆ వ్యక్తి కళ్ళు మూసుకోలేడు
బి) కన్ను కదపలేడు, రంగుల్ని బాగా చూడగలడు
సి) కంటిలో నొప్పి వస్తుంది, కళ్ళు మూసుకోలేడు
డి) ఆ కండరాలకు చేరే నాడులు పనిచేయవు
జవాబు:
బి) కన్ను కదపలేడు, రంగుల్ని బాగా చూడగలడు

ఉ. ఒక వ్యక్తి నాలుక ఎక్కువ ఉప్పగా ఉన్న పదార్థం రుచి చూసింది. అప్పుడు ఆ వ్యక్తి
ఎ) ఉప్పటి పదార్థాలను తినడం నేర్చుకుంటాడు
బి) ఉప్పటి పదార్థాలను తినడానికి ఇష్టపడతాడు
సి) ఉప్పటి పదార్థాలను తినడానికి ఇష్టపడడు
డి) అంతకంటే తక్కువ ఉప్పదనం కలిగిన పదార్థాల రుచి తెలుసుకోలేడు.
జవాబు:
డి) అంతకంటే తక్కువ ఉప్పదనం కలిగిన పదార్థాల రుచి తెలుసుకోలేడు

ప్రశ్న 7.
మన చర్మానికి స్పర్శజ్ఞానం లేకపోతే ఏమవుతుంది? (AS 2)
జవాబు:

  1. శరీరము బయట నుండి సమాచారం గ్రహించడానికి చర్మమునందు అనేక జ్ఞాన గ్రాహకాలున్నాయి.
  2. చర్మమునందలి జ్ఞాన గ్రాహకాలు కనీసం ఐదు రకాల జ్ఞానాన్ని కలుగచేస్తాయి. అవి బాధ, వేడి, చలి, స్పర్శ మరియు పీడనము.
  3. ఐదు జ్ఞానేంద్రియాలను వర్గీకరించే క్రమంలో బాధ, వేడి, చలి, స్పర్శ మరియు పీడనములు అన్నింటిని స్పర్శజ్ఞానము గానే పరిగణించడం జరిగింది.
  4. మన చర్మానికి స్పర్శజ్ఞానం లేకపోయినట్లయితే బాధ, వేడి, చలి, స్పర్శ మరియు పీడనముల గురించిన జ్ఞానాన్ని మనం పొందలేము.

ప్రశ్న 8.
శ్రవణజ్ఞానం కోసం మీరు చేసిన ప్రయోగంలో రబ్బరు పొర మీకు ఏ విధంగా ఉపయోగపడింది? (AS 3)
జవాబు:
శ్రవణజ్ఞానం కోసం మనం చేసిన ప్రయోగంలో రబ్బరు పొర చెవిలోని కర్ణభేరి మాదిరిగా పని చేస్తుంది.

  • గరాటు మూతి వద్ద ‘ఓ’ అని అన్నపుడు శబ్ద తరంగాలకు బెలూన్ ముక్కపై గల ధాన్యపు గింజలు కదులుతాయి.
  • రబ్బరు షీటుని కలిగి ఉన్న గరాటు మూతిని స్నేహితుని ఛాతిపై ఉంచినపుడు గుండెచప్పుడు ల డ మని వినిపిస్తుంది.

ప్రశ్న 9.
మీ తరగతిలోని ఐదుగురు విద్యార్థులు ఒక జట్టుగా ఏర్పడి కంటి వ్యాధులు – లక్షణాలు గురించి సమాచారాన్ని నేత్రవైద్యుల సహాయకుల నుండి సేకరించండి. (AS 4)
(లేదా)
కంటికి వచ్చే ముఖ్యమైన వ్యాధులు, లోపాలను పేర్కొనండి.
జవాబు:

కంటి వ్యాధి పేరు, దోషము పేరు లక్షణాలు
1. వయసు సంబంధిత మాక్యులా (పచ్చచుక్క) క్షీణత ఈ వ్యాధి పరిస్థితిలో నేత్రపటలం నందలి మధ్యభాగమైన మాక్యులా లేదా ఫోవియా క్షీణించిపోతుంది. అంధత్వము వస్తుంది.
2. ఎస్టిగ్మాటిజమ్ నేత్రపటలం నందలి వంపు అసంపూర్ణంగా ఉండడం.
3. కంటిశుక్లం (కెటరాక్ట్) కంటి ముందరభాగంలో ఉండే పొర ఉబ్బి మెత్తగా అయి పగులుతుంది. కళ్ళు సరిగా కనపడవు.
4. సెంట్రల్ రెటినల్ వీన్ ఆక్లుసన్ నేత్రపటం నందలి సిరలో రక్తప్రవాహానికి ఆటంకం ఏర్పడడం.
5. కలర్ బ్లైండ్ నెస్ (వర్ణాంధత) సాధారణ పరిస్థితులలో రంగులను గుర్తించకపోవటం, చూడలేకపోవడం.
6. కండ్ల కలక కంటి ముందర పొర ఉబ్బుతుంది. కన్ను ఎరుపెక్కుతుంది, మండుతుంది, నీరు కారుతుంది.
7. శుక్లపటలం మార్పుచెందడం శుక్లపటలం మీద మచ్చలు, ఉబ్బటం వలన లేదా అక్రమాకారం ఉండడం వలన కళ్ళు మెరవడం, చూపు చెదరడం జరుగుతుంది.
8. డయాబెటిక్ రెటినోపతి మధుమేహం వలన కంటికి వచ్చు వ్యాధి నేత్రపటలం నందలి రక్తనాళాలలో మార్పు వలన కలుగుతుంది.
9. పొడికళ్ళు లేదా జిరాఫ్తాల్మియా కంటిలోని అశ్రుగ్రంథులు అశ్రువులను ఉత్పత్తి చెయ్యవు. కంటిపొర పొడిగా అవుతుంది.
10. దీర్ఘదృష్టి (హైపర్ మెట్రోపియా) ఇది వక్రీభవన దోషము. కన్ను సరిగ్గా కాంతిని ” వక్రీభవించదు. అందువలన ప్రతిబింబాలు నేత్రపటలం వెనుక ఏర్పడతాయి. దూరపు వస్తువులు కనపడతాయి. దగ్గర వస్తువులు సరిగ్గా కనపడవు.
11. గ్లూకోమా కంటిలోని దృక్మడి పాడయిపోతుంది. దీనివలన కంటిలో ఎక్కువ పీడనము కలుగుతుంది.
12. కెరోలైటిస్ శుక్లపటలం ఉబ్బుతుంది. అందువలన కన్ను ఎర్రగా మారి నొప్పి కలిగిస్తుంది. చూచునపుడు నొప్పి ఉంటుంది.
13. మాక్యులార్ ఎడిమా నేత్రపటలం నందలి మాక్యులా లేదా పచ్చచుక్క ఉబ్బుతుంది. మాక్యులా ఉబ్బుట వలన దృష్టి దోషము కలుగవచ్చు.
14. హ్రస్వదృష్టి (మయోపియా) ఇది వక్రీభవన దోషము. కన్ను కాంతిని సరిగా వక్రీభవించటం జరుగదు.
ప్రతిబింబాలు నేత్రపటలం ముందు ఏర్పడతాయి. దగ్గర వస్తువులు చూడడం, దూరపు వస్తువులు సరిగ్గా చూడలేకపోవటం జరుగుతుంది.
15. ఆప్టిక్ న్యూరైటిస్ కంటినందలి దృక్మడి పెద్దగా మారుతుంది.
16. రెటినోపతి ఆఫ్ ప్రీ మెచ్యూరిటీ నెలలు నిండకుండానే పుట్టే పిల్లలలో నేత్రపటలం మీద అసాధారణంగా రక్తనాళాలు పెరుగుతాయి.
17. సీరైటిస్ కంటిలోని తెల్లగుడ్డు ఉబ్బటం వలన నొప్పి కలుగుతుంది. దీనినే స్క్లీరా అంటారు.
18. డిటాచ్ రెటీనా లేదా టార్న్ రెటీనా నేత్రపటలం ఒకటి లేదా ఎక్కువ స్థలాలలో చిరగడం, కంటి గోడల నుండి నేత్రపటలం పైకి నెట్టబడటం జరుగును.
19. నైట్ బ్లెండ్ నెస్ లేదా రేచీకటి ఈ వ్యాధితో బాధపడేవారు తక్కువ వెలుతురులోగాని, రాత్రి గాని వస్తువులను చూడలేరు.
20. ట్రకోమా కంటికి సోకే అంటువ్యాధి. రెండు కళ్ళకు వస్తుంది. ఇది క్లామీడియా ట్రాకోమేటిస్ అనే బాక్టీరియా వల్ల కలుగుతుంది.

AP Board 9th Class Biology Solutions 6th Lesson జ్ఞానేంద్రియాలు

ప్రశ్న 10.
కింది వాటి నిర్మాణాలను సూచించే పటాలను గీయండి. భాగాలను గుర్తించండి. (AS 5)
1) కన్ను 2) చెవి 3) నాలుక
జవాబు:
1) కన్ను :
AP Board 9th Class Biology Solutions 6th Lesson జ్ఞానేంద్రియాలు 1
2) చెవి :
AP Board 9th Class Biology Solutions 6th Lesson జ్ఞానేంద్రియాలు 2
3) నాలుక :
AP Board 9th Class Biology Solutions 6th Lesson జ్ఞానేంద్రియాలు 3

ప్రశ్న 11.
జ్ఞానేంద్రియాలు పనిచేయని ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు మీరు ఎలాంటి ప్రోత్సాహం ఇస్తారు? (AS 6)
జవాబు:

  1. జ్ఞానేంద్రియాలు పనిచేయని ప్రత్యేక అవసరాలు గల పిల్లల పట్ల మనం సానుభూతిని కలిగి ఉండాలి.
  2. అటువంటి పిల్లలు సక్రమమైన జీవితమును గడపటానికి కావలసిన సహకారం అందిస్తాను.
  3. వారు మామూలు మనుష్యులలాగానే జీవించడానికి అవసరమైన ఆత్మవిశ్వాసమును వారిలో నింపుతాను.
  4. అంధులైన పిల్లలకు బ్రెయిలీ లిపి గురించి వివరిస్తాను. వారిని ప్రత్యేక శిక్షణ ఇచ్చు పాఠశాలల యందు చేర్పించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను.
  5. చెవులు పనిచేయని విద్యార్ధులకు మనము చేసే సంజ్ఞలు, సైగల ద్వారా విషయము అవగాహన అయ్యే విధముగా చేస్తాను.
  6. ప్రభుత్వము నుండి ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు కావలసిన సహాయమును అందే విధముగా కృషిచేస్తాను.
  7. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు తమకు ఎటువంటి కొరత లేదనే భావనను మరియు వారికి కొదువ లేదనే తృప్తిని అందిస్తాను.

ప్రశ్న 12.
ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి సహాయపడే జ్ఞానేంద్రియాల పనులను నువ్వెలా మెచ్చుకోగలవు? (AS 6)
జవాబు:

  1. జ్ఞానేంద్రియాల ద్వారా ప్రకృతి యొక్క సౌందర్యాన్ని ఆస్వాదిస్తాము.
  2. మనం ప్రకృతి సౌందర్యాన్ని కళ్ళతో, వీనులవిందైన సంగీతాన్ని చెవులతో, పూల సువాసనలను ముక్కుతో, ఆహారపదార్థాల రుచిని నాలుకతో ఆస్వాదిస్తున్నాము. చల్లని చిరుగాలిని చర్మంతో స్పర్శిస్తున్నాము.
  3. ఇటువంటివన్నీ మన జ్ఞానేంద్రియాలు ఎలా సమాచారాన్ని గ్రహిస్తున్నాయో, ఎలా ప్రతిస్పందిస్తున్నాయో మనకు ప్రత్యక్షంగా తెలియచేస్తున్నాయి.
  4. జ్ఞానేంద్రియాలు మన శరీరంలోని భాగాలు మాత్రమే కాదు, అవి మనమంటే ఏమిటో నిర్వచిస్తాయి.
  5. మన జీవితంలో అతిముఖ్యమైన విషయాల నుండి, అతి చికాకుపడే విషయాల వరకు ఏదీ జ్ఞానేంద్రియాల ప్రమేయం లేకుండా జరుగవు.
  6. మన కళ్ళు, చెవులు, చర్మం, నాలుక, ముక్కు గ్రహించే సమాచారం మిల్లీ సెకనుల వ్యవధిలో మెదడుకు అందచేయడం, అది సమాచారాన్ని సరిపోల్చుకోవడం, ప్రతిస్పందించడమనేది లేకపోతే ఈ ప్రపంచంలో పరిశోధనలకు అవకాశమే ఉండేది కాదు.

ప్రశ్న 13.
సాగర్ సరిగ్గా వినలేకపోతున్నాడు. అతనికి ఏం జరిగి ఉండొచ్చో ఊహించండి. అతనికి మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు? (AS 7)
జవాబు:

  1. సాగర్ పెద్ద ధ్వనులను వినడం వలన అతను సరిగా వినలేకపోవచ్చు. ఇటువంటి స్థితిని ధ్వని వలన కలిగే వినికిడి లోపం అంటారు.
  2. కొన్నిసార్లు ఎక్కువ ధ్వని తీవ్రతకు గురి అయిన చెవినందు మోగుతున్నట్లు, బుసకొడుతున్నట్లు, అరుపుల శబ్దములు ఉండే స్థితిని ‘టిన్నిటస్’ అంటారు.
  3. చెవి భాగములందు సమస్య ఉన్నా కూడా సరిగా వినబడకపోవచ్చు.
  4. వినికిడి లోపం బ్యాక్టీరియా మరియు వైరస్ట్ వలన కలగవచ్చు.
  5. కనుక సరిగా వినలేకపోవటానికి కారణమును కనుగొనమని సాగర్‌కు సలహా ఇస్తాను.
  6. పాటలను ఎక్కువ ధ్వనితో వినవద్దని సలహా ఇస్తాను.
  7. చెవి వ్యాధులందు నిపుణుడైన వైద్యుని సంప్రదించమని సాగర్ కు నేను సలహా ఇస్తాను.

9th Class Biology 6th Lesson జ్ఞానేంద్రియాలు Textbook Activities (కృత్యములు)

కృత్యం -1

1. పుష్పాల గురించి కొన్ని వాక్యాలు మీ నోటు పుస్తకంలో రాయండి. ఆ పనిలో పాల్గొన్న జ్ఞానేంద్రియాలు, వాటి ప్రేరణలు ప్రతిచర్యలు, జ్ఞాన, చాలక నాడుల విధులను రాయండి.
జవాబు:
పుష్పములు వివిధ రంగులలో ఉంటాయి.
పుష్పములు సువాసనలను వెదజల్లుతాయి.
పుష్పములను తాకినచో మృదువుగా ఉంటాయి.
పుష్పములు తియ్యని మకరందాన్ని ఉత్పత్తి చేస్తాయి.
ఈ వాక్యములు రాయడంలో పాల్గొన్న జ్ఞానేంద్రియాలు కన్ను మరియు చర్మం.
పుష్పముల గురించి రాయడమన్నది ప్రేరణ. వాటిని రాయడం ప్రతిచర్య.

జ్ఞాననాడులు వార్తలను లేదా సమాచారాన్ని మెదడుకు తీసుకొని వెళతాయి. చాలకనాడులు సమాచారాన్ని మెదడు నుండి శరీరపు వివిధ భాగాలకు తీసుకొని వెళతాయి.

AP Board 9th Class Biology Solutions 6th Lesson జ్ఞానేంద్రియాలు

కృత్యం – 2

2. ప్రేరణ కృత్యం.
జవాబు:
1) ఒక గ్లాసు నీటిలో చిటికెడు పంచదార కలపాలి.
2) కొంచెం తాగితే తియ్యగా అనిపించాయి.
3) ఆ నీటిలో ప్రతిసారి పావు టీ స్పూన్ చొప్పున పంచదార పరిమాణం పెంచుతూ వివిధ గాఢతల్లో ద్రావణాన్ని తయారుచేయాలి.
4) ప్రతిసారి రుచి చూడాలి.
5) 3 టీస్పూన్ల పంచదార వేసిన తరువాత రుచి స్థిరంగా ఉంటుంది.

కృత్యం – 3

3. మీ స్నేహితుని కంటి బాహ్య నిర్మాణం పరిశీలించండి. దాని పటం గీచి, భాగాలను గుర్తించండి. సాధారణ కాంతిలో మీ స్నేహితుని కంటిగుడ్డు పరిశీలించండి. తరువాత అతని కంటిలోకి టార్చిలైట్ కాంతి కిరణపుంజాన్ని వేసి మరలా పరిశీలించండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 6th Lesson జ్ఞానేంద్రియాలు 1

  1. నా స్నేహితుని కంటిలో కంటిరెప్పలు, కనురెప్ప రోమాలు, కనుబొమ్మలు, అశ్రుగ్రంథులు, నల్లగుడ్డు, తెల్లగుడ్డు ఉన్నాయి.
  2. కంటిలోకి టార్చిలైట్ కాంతికిరణ పుంజాన్ని వేసినపుడు కంటిని వెంటనే శుక్ల పటలంలో మూయడం జరిగింది.
  3. మరలా టార్చిలైట్ కాంతికిరణ పుంజాన్ని కంటిలో వేస్తూ స్నేహితుడు కళ్ళు తెరచినప్పుడు చిన్న నలుపురంగు భాగం పరిమాణం చిన్నదిగా అయినది.

కృత్యం – 4

4. అంధచుక్క పరిశీలన
జవాబు:
AP Board 9th Class Biology Solutions 6th Lesson జ్ఞానేంద్రియాలు 4

  1. పుస్తకాన్ని చెయ్యంత దూరంలో పెట్టుకోవాలి.
  2. కుడి కన్ను మూయాలి. ఎడమకంటితో + గుర్తుకేసి తీక్షణంగా చూడాలి.
  3. కుడి కంటిని అలా మూసే ఉంచి పుస్తకాన్ని నెమ్మదిగా కంటి దగ్గరకు తీసుకురావాలి.
  4. పుస్తకం 8 నుండి 10 అంగుళాల దూరంలో ఉన్నప్పుడు + గుర్తు మన ఎడమకన్ను అంధచుక్క దగ్గర ఉండడంతో కనపడకుండా పోతుంది.
  5. + గుర్తుకు బదులుగా మన దృశ్య వ్యవస్థ దానికి అటు ఇటు ఉన్న నీలిరేఖల సమాచారంతో కనిపించని ఆ ప్రాంతాన్ని పూర్తి చేస్తుంది.

కృత్యం – 5

5. మీ స్నేహితుని కన్నులో కంటిపాప, దాని చుట్టుపక్కలను పరిశీలించండి. తారక మీకు కనిపించిందా? మీ స్నేహితుల కళ్ళలోని కంటిపాప రంగులు, ఆకారాలు పరిశీలించండి. ఒకరి నుండి ఒకరికి ఏమైనా తేడా ఉన్నదా?
జవాబు:

  1. స్నేహితుని కంటిలో నల్లటి చుక్క తారక కనిపించింది.
  2. స్నేహితుల కళ్ళలోని కంటిపాపల రంగులు వేరువేరుగా ఉన్నాయి.
  3. స్నేహితుల ‘కంటిపాపలు కొందరిలో నీలంరంగుగాను, కొందరిలో ఆకుపచ్చగాను, కొందరిలో బూడిద మరియు గోధుమరంగులో ఉన్నాయి.
  4. కంటిపాపల ఆకారాలు అందరిలో గుండ్రంగా ఉన్నాయి. తేడా ఏమీ లేదు.

కృత్యం – 6

6. కాంతివంతంగా ఉన్న ప్రాంతం నుండి చీకటిగా ఉండే గదిలోకి వెళ్ళండి. ఏం జరుగుతుంది ? చీకటి గదిలో కొంతసేపు కూర్చోంది. అప్పుడు ఎండలోకి వెళ్ళండి. ఏం జరుగుతుంది?
జవాబు:
a) 1) కాంతివంతంగా ఉన్న ప్రాంతంలో ఉండే తారక చాలా చిన్నదిగా ఉంటుంది.
2) చీకటి గదిలోకి వెళ్ళినట్లయితే మొదట మనకు ఏమీ కనిపించదు. ఈ సమయంలో తారక యొక్క పరిమాణం పెరుగుట వలన నెమ్మదిగా గదిలోని వస్తువులు మనకు కనపడతాయి.

b) 1) చీకటి గదిలో నుండి ఎండలోకి వెళ్ళినప్పుడు మొదట మనకు ఏమీ కనిపించదు. నెమ్మదిగా తారక పరిమాణం ఎండకు అనుగుణంగా మారుట వలన మనము వస్తువులను చూడగలము.
2) ఒకే పరిమాణంలో ఉన్న రెండు తెల్లకాగితం ముక్కల్ని తీసుకోవాలి.
3) ఒక కాగితం మీద పంజరం పటాన్ని, మరొక కాగితం మీద చిలక పటం గీయాలి.
AP Board 9th Class Biology Solutions 6th Lesson జ్ఞానేంద్రియాలు 5
4) రెండింటి మధ్య పుల్ల ఉంచాలి. వాటి కొనల్ని జిగురుతో అంటించాలి.
5) ఆరిన తర్వాత పుల్లని వేగంగా తిప్పాలి.
6) వేగంగా పుల్లను తిప్పినపుడు చిలుక పంజరములో ఉన్నట్లు మనకు భ్రమ కలుగుతుంది.

AP Board 9th Class Biology Solutions 6th Lesson జ్ఞానేంద్రియాలు

కృత్యం – 7

7. 1) ఒక ప్లాస్టిక్ లేక ఇనుప గరాటును తీసుకోవాలి.
2) ఒక రబ్బరు బెలూన్ ముక్కను సాగదీసి, గరాటు మూతికి కట్టాలి.
3) దాన్ని రబ్బరు బ్యాండ్తో గట్టిగా కట్టాలి.
4) 4-5 బియ్యపు గింజల్ని రబ్బరు ముక్కపై వేయాలి.
5) గరాటు మూతి వద్ద స్నేహితుడిని ‘ఓ’ అని అనమనండి.

పరిశీలనలు:

  1. గరాటు మూతి వద్ద ‘ఓ’ అని అన్నపుడు శబ్ద తరంగాలకు బెలూన్ ముక్కపై గల ధాన్యపు గింజలు కదులుతాయి.
  2. రబ్బరు ఓటుని కలిగి ఉన్న గరాటు మూతిని స్నేహితుని ఛాతిపై ఉంచినపుడు గుండెచప్పుడు ల ‘ మని వినిపిస్తుంది.

కృత్యం – 8

8. 1) మీ స్నేహితుని కళ్ళకు గంతలు కట్టాలి.
2) నిమ్మకాయ, టీ, కాఫీ, బంగాళాదుంప, టొమాటో, చింతకాయ, పాలకూర, పెరుగు, వంకాయ పదార్థాలను గుర్తించమనాలి.
3) మనము ఎంపిక చేసిన పదార్థాలు పొడిగా ఉండకూడదు.
4) మీ స్నేహితుడు పదార్థాలను ముట్టుకోకూడదు. కేవలం వాసన మాత్రమే చూడాలి.
పై పదార్థాలను గుర్తించడానికి వాసన ఎలా ఉపయోగపడుతుంది?
జవాబు:

  1. జీవశాస్త్ర పరంగా వాసన అన్నది ముక్కులో ఉండే రసాయనాల సంఘటనతో ప్రారంభమవుతుంది.
  2. అక్కడ వాసనలు ప్రత్యేకమైన నాడీకణాలతో కూడిన గ్రాహక మాంసకృత్తులతో అంతరచర్య పొందుతాయి.
  3. ముక్కులోని నాడీకణాలు మాత్రమే బాహ్య ప్రపంచంతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటాయి.
  4. ముక్కులోపలి గోడల్లో ఉండే కణాలు వాసన కలిగిన రసాయనాలకి సూక్ష్మ గ్రాహకతను కలిగి ఉంటాయి.
  5. వాసన కలిగించే రసాయనాలు సంక్లిష్టమైనవి. భిన్నత్వాన్ని కలిగి ఉంటాయి.

కృత్యం- 9

9. 1) మీ స్నేహితుని కళ్ళకు గంతలు కట్టండి. అతనికి అల్లం ముక్క, వెల్లుల్లి, చింతకాయ, అరటిపండు ఒకదాని తర్వాత ఒకటి ఇవ్వండి.
2) అతన్ని ఒక్కొక్కటి నాలుకకి ఒకసారి రాసుకొని రుచి చెప్పమనండి.
3) ప్రతి ఒక్కటి రుచి చూశాక నోటిని, నీటితో పుక్కిలించమనాలి.
4) స్నేహితులు అందరూ రుచిని చెప్పగలిగారు.
5) మీ స్నేహితుని ప్రతి పదార్థం నోట్లో పెట్టుకొని ఒక్కసారి కొరికి నాలుకతో చప్పరించమనాలి. ఇప్పుడు తేడా ఏ విధంగా ఉంది?
6) ఆహారం నోటిలోకి వెళ్ళగానే మనం దాన్ని కొరుకుతాం, నమలుతాం, సాలుకతో చప్పరిస్తాం.
7) ఇందువల్ల ఆహారం నుండి వెలువడే రసాయనాలు, మన రుచి కణికల్ని ప్రేరేపిస్తాయి.
8) దాంతో అవి ప్రేరణను మెదడుకి పంపి రుచిని తెలుసుకునేలా చేస్తాయి.
9) ఒకే విధమైన రుచికళికలు, వివిధ సంకేతాలు ఉత్పత్తి చేస్తూ వివిధ ఆహారపదార్థాల్లోని రసాయనాల్ని గుర్తించగలవు.

కృత్యం – 10

10. అద్దం ముందు నిలబడి, నాలుకను బయటకు తెచ్చి పరిశీలించండి. మీరు ఎన్ని రకాల నిర్మాణాల్ని మీ నాలుకపై చూడగలిగారో ఇచ్చిన పటంతో సరిచూడండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 6th Lesson జ్ఞానేంద్రియాలు 3

  1. నాలుకపై పొలుసులవంటి నిర్మాణాలు ఉన్నాయి. ఇవి ఫిలి. ఫార్మ్ పాపిల్లే.
  2. గుండ్రంగా నాలుకపై కనిపించేవి ఫంగి ఫార్మ్ పాపిల్లే.
  3. నాలుక వెనుకవైపు గుండ్రంగా ఉండే పెద్ద పాపిల్లే సర్కం విల్లేట్ పాపిల్లే.
  4. నాలుకకు ఇరువైపులా ఉబ్బెత్తుగా ఉండే నిర్మాణాలు ఫోలియేట్ పాపిల్లే.

కృత్యం – 11

11. 1) మీ స్నేహితుని కళ్ళకు గంతలు కట్టాలి.
2) ముక్కుకి గుడ్డ కట్టాలి.
3) కొంచెం జీలకర్ర ఇచ్చి నమలమనాలి.
4) మీరు ఇచ్చిందేమిటో చెప్పమనాలి.
5) ఇలాగే చిన్న బంగాళాదుంప ముక్కతో కూడా ప్రయత్నించాలి.
6) నా స్నేహితుడు జీలకర్ర గింజలను, చిన్న బంగాళాదుంపను గుర్తించెను.

కృత్యం – 12

12. 1) మూడు పంటిపుల్లలు కట్టగా కట్టాలి.
2) వాటి సన్నని కొనలు మూడూ ఒకే తలంలో ఉండేలా చూడాలి.
3) మీ స్నేహితుని చేతిమీద వాటిని ఒకసారి అదిమి ఎలా ఉందో అడగాలి.
4) తర్వాత స్నేహితుని కళ్ళు మూసుకోమనాలి.
5) బొటనవేలు కొన నుండి క్రమంగా అరచేయి అంతా ‘వాటిని తేలికగా గుచ్చుతూ, గుచ్చినప్పుడల్లా ఎన్ని కొనలు గుచ్చుకున్నట్లుందో అడిగి నమోదు చేయాలి.
6) వచ్చిన అంకెను బట్టి అరచేతిలో ఏ భాగంలో స్పర్శ జ్ఞానం ఎక్కువ ఉందో, ఏ భాగంలో తక్కువ ఉందో గుర్తించమనాలి.

పరిశీలనలు :

  1. అరచేతి మధ్యలో స్పర్శ జ్ఞానం ఎక్కువ ఉన్నది.
  2. తక్కువ స్పర్శ జ్ఞానం అరచేయి అంచుల వద్ద ఉన్నది.
  3. అందరి అరచేతుల్లో స్పర్శ జ్ఞానం ఒకే విధంగా ఉంటుంది.
  4. బొటనవేలు కొన వద్ద ఎక్కువ స్పర్శ జ్ఞానం ఉండి, క్రింద భాగంలో తక్కువగా స్పర్శ జ్ఞానం ఉంది.

AP Board 9th Class Biology Solutions 6th Lesson జ్ఞానేంద్రియాలు

కృత్యం – 13

13. సన్నగా చెక్కిన పెన్సిల్ కొనపై మీ బొటనవేలిని నెమ్మదిగా అదమండి. తరువాత మొద్దుగా ఉన్న కొనపై అదమండి. మీకెలా అనిపించింది?
పరిశీలనలు :

  1. సన్నగా చెక్కిన పెన్సిల్ కొనపై బొటనవేలిని అదిమినపుడు గుచ్చుకున్నట్టుగా అనిపిస్తుంది.
  2. మొద్దుగా ఉన్న కొనపై అదిమినపుడు ఆ విధంగా అనిపించదు.

AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం

SCERT AP 9th Class Biology Study Material Pdf Download 5th Lesson జీవులలో వైవిధ్యం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Biology 5th Lesson Questions and Answers జీవులలో వైవిధ్యం

9th Class Biology 5th Lesson జీవులలో వైవిధ్యం Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
జీవులలో ఉండే తేడాలు వైవిధ్యానికి ఏ విధంగా ఆస్కారం కల్పిస్తాయి? వివరించండి. (AS 1)
జవాబు:

  1. ఒకే జాతి జీవుల మధ్య ఉండే తేడాలను వైవిధ్యం అంటారు.
  2. వేరువేరు జాతుల మధ్య ఉన్న వైవిధ్యం కంటే, ఒక జాతి జీవుల మధ్య వైవిధ్యం తక్కువగా ఉంటుంది.
  3. ఒక జీవి చూపించే ప్రత్యేక లక్షణాలే జీవులు చూపించే వైవిధ్యానికి ఆధారంగా నిలుస్తాయి.
  4. నిత్య జీవితంలో మన చుట్టూ అనేక రకాలయిన మొక్కలను, జంతువులను చూస్తాము.
  5. మనము కొండ ప్రాంతాలు మరియు అటవీ ప్రాంతాలకు వెళ్ళినపుడు మనము రకరకాల మొక్కలను, జంతువులను గమనిస్తాం.
  6. నిజం చెప్పాలంటే ప్రపంచంలోని ప్రతిభాగము దానికే పరిమితమైన ప్రత్యేక రకమైన జీవులను కలిగి ఉంటుంది.
  7. అందువలన జీవులలో ఉండే తేడాలు వైవిధ్యానికి ఆస్కారం కల్పిస్తున్నాయి.

ప్రశ్న 2.
శాస్త్రవేత్తలు దేని ఆధారంగా మొదటగా వర్గీకరణ ప్రారంభించారు? (AS 1)
జవాబు:

  1. జీవులు వాటి శరీర నిర్మాణం ఆధారంగా వర్గీకరించబడ్డాయి.
  2. జీవుల మధ్య ఉన్న పోలికలు, విభేదాలను అనుసరించి జీవులు వర్గీకరించబడ్డాయి.
  3. చరకుడు, సుశ్రుతుడు మొక్కలను వాటి ఔషధ గుణములను అనుసరించి వర్గీకరించారు.
  4. పరాశర మహర్షి పుష్ప నిర్మాణం ఆధారంగా మొక్కలను వర్గీకరించాడు.
  5. అరిస్టాటిల్ జంతువులను అవి నివసించే ప్రదేశం అనగా భూమి, నీరు మరియు గాలి ఆధారంగా వర్గీకరించాడు.

ప్రశ్న 3.
ఏకదళ బీజాలు ద్విదళ బీజాల కంటే ఎలా భిన్నంగా ఉంటాయి? (AS 1)
జవాబు:

ఏకదళ బీజాలు ద్విదళ బీజాలు
1. మొక్కల గింజలలో ఒకే దళం కలిగి ఉంటాయి. 1. మొక్కల గింజలలో రెండు దళాలు కలిగి ఉంటాయి.
2. సమాంతర ఈనెల వ్యాపనం కలిగి ఉంటాయి. 2. జాలాకార వ్యాపనం కలిగి ఉంటాయి.
3. గుబురు వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి. 3. ప్రధాన వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి.
4. ఏకదళ బీజాలకు ఉదాహరణలు వరి, గోధుమ మొదలైనవి. 4. ద్విదళ బీజాలకు ఉదాహరణ వేప, మామిడి మొదలైనవి.

ప్రశ్న 4.
విట్టేకర్ ప్రకారం క్రింది జీవులు ఏ రాజ్యానికి చెందుతాయి? (AS 1)
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 1
జవాబు:
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 2

ప్రశ్న 5.
నేను ఏ విభాగానికి చెందుతాను? (AS 1)
ఎ) నా శరీరంలో రంధ్రాలున్నాయి, నేను నీటిలో నివసిస్తాను. నాకు వెన్నెముక లేదు.
జవాబు:
ఫొరిఫెర

బి) నేను కీటకాన్ని. నాకు అతుకుల కాళ్ళున్నాయి.
జవాబు:
ఆల్డోపొడ

సి) నేను సముద్రంలో నివసించే జీవిని, చర్మంపై ముళ్ళు ఉండి, అనుపార్శ్వ సౌష్టవం కలిగి ఉంటాను.
జవాబు:
ఇఖైనోడర్మేట

AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం

ప్రశ్న 6.
చేపలు, ఉభయచరాలు, పక్షులలో మీరు గమనించిన సాధారణ లక్షణాలను రాయండి. (AS 1)
జవాబు:

  1. చేపలు, ఉభయచరాలు, పక్షులు అన్నీ సకశేరుకాలు.
  2. ఇవి అన్నీ వెన్నెముక కలిగిన జీవులు.
  3. చేపలు, ఉభయచరాలు, పక్షులు అన్నీ అండజనకాలు.

ప్రశ్న 7.
వర్గీకరణ అవసరం గురించి తెలుసుకోవడానికి నీవు ఏ ఏ ప్రశ్నలు అడుగుతావు? (AS 2)
జవాబు:
ప్రశ్నలు :
i) వర్గీకరణ యొక్క అవసరం ఏమిటి?
ii) వర్గీకరణను ఎవరు, ఎప్పుడు చేశారు?
iii) వర్గీకరణ వలన ఉపయోగం ఏమిటి?
iv) వర్గీకరణలో నూతనముగా వచ్చిన మార్పులు ఏమిటి?
v) వర్గీకరణ అన్ని జీవులకు వర్తిస్తుందా?

ప్రశ్న 8.
స్లెడు తయారు చేసేటప్పుడు నీవు తీసుకున్న జాగ్రత్తలేమిటి? (AS 3)
జవాబు:
స్లెడును తయారుచేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు :

  • పరిచ్ఛేదాలను పలుచగా కత్తిరించాలి.
  • పరిచ్ఛేదాలను వా గ్లాస్ ఉన్న నీటిలో ఉంచాలి.
  • పలుచటి పరిచ్చేదాలను మాత్రమే గాజు పలకపై ఉంచాలి.
  • పరిచ్ఛేదం ఆరిపోకుండా దానిపై గ్లిజరిన్ చుక్క వేయాలి.
  • భాగాలు స్పష్టంగా కనిపించటానికి అవసరమైన రంజకాన్ని ఉపయోగించాలి.
  • గాజు పలక పై ఉన్న పరిచ్ఛేదం ఎక్కువ కాలం ఉంచుటకు కవర్ స్లితో మూసి ఉంచాలి.
  • గాజు పలకపై కవర్ స్లిప్ ను ఉంచునపుడు గాలిబుడగలు లేకుండా చూడాలి.
  • అధికంగా ఉన్న నీటిని లేక గ్లిజరిన్ లేక వర్ణద్రవ్యాన్ని అద్దుడు, కాగితంతో తొలగించాలి.

ప్రశ్న 9.
ఒక రోజు కవిత పెసలు, గోధుమలు, మొక్కజొన్న, బఠాని మరియు చింతగింజలను నీటిలో నానవేసింది. అవి నీటిలో నానిన తరువాత నెమ్మదిగా పగలగొడితే అవి రెండు బద్ధలుగా విడిపోయాయి. ఇవి ద్విదళ బీజాలు. కొన్ని విడిపోలేదు. ఇవి ఏకదళ బీజాలు. కవిత పట్టికను ఎలా నింపిందో ఆలోచించండి. మీరూ ప్రయత్నించండి. (AS 4)
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 3
జవాబు:
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 4

ప్రశ్న 10.
గ్రంథాలయం లేదా అంతర్జాలం నుండి సమాచారం సేకరించి ప్లాటిపస్ మరియు ఎకిడ్నాలను క్షీరదాలను మరియు సరీసృపాలను అనుసంధానం చేసే జీవిగా ఎలా చెప్పవచ్చో వివరించండి. (AS 4)
జవాబు:

  1. ఎకిడ్నా మరియు ప్లాటిపస్లు రెండూ మెనోట్రీమ్ గ్రూపునకు చెందిన జీవులు,
  2. ఈ రెండు కూడా అండజనక క్షీరదాలు. అయినప్పటికీ ఇవి సరీసృపాలు లేదా పక్షులు కావు.
  3. గుడ్లను పొదుగుతాయి. రెండూ పిల్లలకు పాలు ఇస్తాయి.
  4. ఇవి రెండూ ఆస్ట్రేలియా మరియు టాస్మేనియాలో కనిపిస్తాయి.
  5. ప్లాటిపస్ ముఖ్య లక్షణాలు మరియు అసాధారణ లక్షణాలు-బాతుకు ఉన్న ముక్కు వంటి నిర్మాణం దీనికి ఉండటం, క్షీరద లక్షణమైన దంతములు లేకపోవటం.
  6. స్పైనీ ఏంట్ ఈటర్ అయిన ఎకిడ్నాకు కూడా దంతములు లేవు. నాలుక ఆహారం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది.
  7. గుడ్ల నుండి బయటకు వచ్చిన ఎకిడ్నా మరియు ప్లాటిపస్ పిల్లలు బొరియలలో నివసిస్తాయి. కానీ సరీసృపాలు కాదు. ప్రజనన సమయంలో ఎకిడ్నా ప్రాథమికమైన సంచిని అభివృద్ధి చేసుకుంటుంది.
  8. రెండు జీవులకూ గుంటలు చేయడానికి పదునైన గోళ్ళు కలవు.
  9. ప్లాటిపస్ మరియు ఎకిడ్నా నీటిని ఇష్టపడతాయి. ప్లాటిపస్ నీటిలో ఆహారం వేటాడుతుంది.
  10. ఎకిడ్నా నీటిలో ఉండుట ద్వారా తన శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరణ చేస్తుంది.

ప్రశ్న 11.
అనిమేలియా రాజ్యాన్ని వాటి లక్షణాల ఆధారంగా ఒక ఫ్లో చార్టు తయారుచేయండి. (AS 5)
జవాబు:
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 5

ప్రశ్న 12.
వెన్నెముక గల జీవులను ఉపరితరగతులుగా విభజిస్తూ ఫ్లోచార్ట్ తయారు చేయండి. (AS 5)
జవాబు:
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 6

ప్రశ్న 13.
శాస్త్రవేత్తలు వర్గీకరణపై చేసిన పరిశోధనలను నీవు ఏ విధంగా ప్రశంసిస్తావు? (AS 6)
జవాబు:

  1. శాస్త్రవేత్తలు చేసిన వర్గీకరణముల వలన వైవిధ్యము కలిగిన జీవుల అధ్యయనం సులభమయ్యింది.
  2. వివిధ మొక్కలు మరియు జంతువుల మధ్య గల సంబంధాలను వర్గీకరణ ద్వారా అవగాహన చేసుకోవచ్చు.
  3. జీవులు సరళస్థితి నుండి సంక్లిష్ట స్థితి వరకు జరిగిన పరిణామము వర్గీకరణ ద్వారా మనకు అవగాహన కలుగుతుంది.

AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం

ప్రశ్న 14.
‘గబ్బిలం పక్షి కాదు క్షీరదం’ అని సుజాత చెప్పింది. మీరు ఆమె మాటలను ఏ విధంగా సమర్థిస్తారు? (AS 7)
జవాబు:

  1. గబ్బిలం పక్షి కాదు క్షీరదం అని సుజాత చెప్పిన మాటను సమర్థిస్తాను.
  2. ఇతర క్షీరదాలవలె మానవునితో సహా గబ్బిలానికి శరీరం మీద వెంట్రుకలు లేదా రోమములు కలవు.
  3. గబ్బిలం ఉష్ణరక్త జంతువు.
  4. పుట్టిన గబ్బిలం పాలకోసం తల్లిపాల మీద ఆధారపడుతుంది.
  5. గబ్బిలములు క్షీరదములలో గల ఏకైక ఎగిరే క్షీరదము.

9th Class Biology 5th Lesson జీవులలో వైవిధ్యం Textbook InText Questions and Answers

9th Class Biology Textbook Page No. 63

ప్రశ్న 1.
వృక్షరాజ్యాన్ని వాటి లక్షణాల ఆధారంగా ఒక ఫ్లోచార్ట్ తయారు చేయండి. పేజి నెం. 63
జవాబు:
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 8

ప్రశ్న 2.
మీ తరగతిలో నలుగురు లేదా ఐదుగురు విద్యార్థులు ఒక జట్టుగా ఏర్పడి పాఠశాల గ్రంథాలయం లేదా అంతర్జాలం నుండి ఏవైనా 20 మొక్కలు, 20 జంతువుల శాస్త్రీయ నామాలతో జాబితా రూపొందించండి. (పేజి నెం. 71)
జవాబు:
మొక్కల శాస్త్రీయ నామములు :

మొక్క పేరు శాస్త్రీయ నామం
1. మామిడి మాంగి ఫెరా ఇండికా
2. కొబ్బరి కాకస్ న్యూసిఫెర
3. తాటి బొరాసస్ ప్లాజెల్లి ఫెర్
4. గరిక గడ్డి సైనోడాన్ డాక్టలాన్
5. వరి ఒరైజా సటైవా
6. అరటి మ్యూసా పారడైసికా
7. మర్రి ఫైకస్ బెంగాలెన్సిస్
8. పెద్ద ఉసిరి ఎంబ్లికా అఫిసినాలిస్
9. తోటకూర అమరాంతస్ గాంజిటికస్
10. తులసి ఆసిమమ్ సాంక్టమ్
11. టేకు టెక్టోనా గ్రాండిస్
12. కనకాంబరము క్రొసాండ్ర ఇన్ఫండిబులిఫార్మిస్
13. వంకాయ సొలానమ్ మెలాంజినా
14. సపోట ఎక్రస్ జపోట
15. గడ్డి చామంతి ట్రెడాక్స్ ప్రొకంబెన్స్
16. ధనియాలు (కొత్తిమీర) కొరియాండ్రమ్ సటైవమ్
17. జామ సిడియమ్ గ్వజావ
18. గులాబి రోజా గ్రాండిప్లోరా
19. చింత టామరిండస్ ఇండికా
20. మందార హైబిస్కస్ రోజా – సైనెన్సిస్
21. బెండ అబెలియాస్మస్ ఎస్కూలెంటస్
22. జీడిమామిడి అనకార్డియం ఆక్సిడెంటాలిస్
23. పైనాపిల్ అనాన స్క్వామోజస్
24. ఆవాలు బ్రాసికా జెన్షియా
25. క్యా బేజి బ్రాసికా ఒలరేసియా రకం కాపిటేట
26. తేయాకు కెమెల్లియా సైనన్సిస్
27. నారింజ సిట్రస్ సైనన్సిస్
28. పసుపు కుర్కుమా లోంగా
29. ఉమ్మెత్త దతురా మెటల్
30. వెదురు డెండ్రోకాలమస్ కలోస్ట్రాఖియస్
31. మిరప కాప్సికమ్ ఫ్రూటి సెన్స్

AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం

జంతువుల శాస్త్రీయ నామములు :

జంతువు పేరు శాస్త్రీయ నామం
1. కాకి కార్పస్ స్పెండెన్స్
2. పిచ్చుక పాస్సర్ డొమెస్టికస్
3. కప్ప రానాటైగ్రీనా
4. కుక్క కేనిస్ ఫెమిలియారీస్
5. పిల్లి ఫెలిస్ డొమెస్టికస్
6. చింపాంజి ఎంత్రోపిథికస్ ట్రైగ్లో డైట్స్
7. కోడి గాలస్ డొమెస్టికస్
8. పావురము కొలంబియ లివియ
9. గేదే బుబాలస్ బుబాలిస్
10. తేనెటీగ ఎపిస్ ఇండికా
11. వానపాము ఫెరిటీమా పోస్తుమా
12. బొద్దింక పెరిప్లానేటా అమెరికానా
13. జలగ హిరుడినేరియా గ్రాన్యులోస
14. రొయ్య పాలియమాన్ మాక్మో సోనీ
15. ఈగ మస్కా సెబ్యులోం
16. నత్త పైలాగ్లోబోసా
17. గుడ్లగూబ బుబోబుబో
18. తాచుపాము నాజనాజ
19. గుర్రము ఈక్వస్ కబాలస్
20. రామచిలుక సిట్టిక్యుల క్రామెరి
21. చీమ హైమినోప్టెరస్ ఫార్మిసిడి
22. గాడిద ఇక్వియస్ అసినస్
23. కంగారు మాక్రోఫస్ మాక్రోపాజిడే
24. కుందేలు రొడెంటియా రాటస్
25. ఏనుగు ప్రోబోసిడియా ఎలిఫెండిడే
26. జిరాఫీ రాఫాకామిలో పారాలిస్
27. పంది ఆడియో డక్టలా సుయిడే
28. నీటి గుర్రం ఇప్పోకాంపస్ సిగ్నాంథిగే
29. నెమలి పావో క్రిస్టేటస్

9th Class Biology 5th Lesson జీవులలో వైవిధ్యం Textbook Activities (కృత్యములు)

కృత్యం – 1

ప్రశ్న 1.
మొక్కలలో ఆకుల పరిశీలన :

మొక్కలలో ఆకుల పరిశీలన. వివిధ రకాల మొక్కల ఆకులను సేకరించి వాటిని పరిశీలించి పట్టికను పూరించండి.
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 9
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 10
ఎ) పైన పరిశీలించిన ఆకులలో ఏ రెండు ఆకులైనా ఒకే విధంగా ఉన్నాయా? (ఆకారం, పరిమాణం, రంగులో)
జవాబు:
ఏ రెండు ఆకులూ పరిమాణంలోను, ఆకారంలోను ఒకే విధముగా లేవు.

బి) సేకరించిన ఆకులలో మీరు గుర్తించిన ముఖ్యమైన భేదాలను రాయండి. ఏ రెండు లక్షణాలలో ఎక్కువగా భేదాలు చూపుతున్నాయో గుర్తించండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 11
i) కొన్ని ఆకుల ఆకారం అండాకారంగాను, మరికొన్ని ఆకుల ఆకారం దీర్ఘవృత్తాకారంగాను ఉంది.
ii) పత్రపు అంచులు కొన్నిటికి నొక్కబడి, కొన్ని రంపము అంచుగలవిగా మరికొన్ని నొక్కులు లేనివిగా ఉన్నాయి.
iii) ఆకుల పొడవు, వెడల్పులలో ఆకులు అన్నీ వివిధ కొలతలలో ఉన్నాయి.

కృత్యం – 2

ప్రశ్న 2.
మొక్కల పరిశీలన :
మీ పరిసరాలలో గల 5 రకాల మొక్కలు వాటి పుష్పాలతో సేకరించి వాటి బాహ్య లక్షణాలను జాగ్రత్తగా పరిశీలించండి. పరిశీలించిన అంశాలను పట్టికలో నమోదు చేయండి.
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 12

1. ఏయే లక్షణాలలో ఎక్కువ తేడాలు ఉండటం గమనించారు?
జవాబు:
కాండం పొడవు, కణుపుల మధ్య దూరం, ఆకుల, ఈనెల వ్యాపనంలో మరియు వేరు వ్యవస్థలలో తేడాలు ఉన్నాయి.

2. అతి తక్కువ భేదం చూపుతున్న లక్షణమేది?
జవాబు:
పుష్పం నందు అతి తక్కువ భేదం చూపుతున్నవి – పుష్పాలు గుత్తులుగా రావడం అనేది.

3. మీకు వాటిలో ఏమైనా పోలికలు కనిపించాయా? కనిపిస్తే అవి ఏమిటి?
జవాబు:
ఈనెల వ్యాపనంలోను, రక్షక ఆకర్షక పత్రాల సంఖ్యలోను వేరువ్యవస్థలోను పోలికలు ఉన్నాయి.

4. పీచు వేర్లు కలిగిన మొక్కలలో పుష్పాలు గుంపులుగా ఉన్నాయా? లేక వేరే విధంగా ఉన్నాయా?
జవాబు:
గుంపులుగా ఉంటాయి.

5. పై పట్టికలో పేర్కొన్న లక్షణాలు కాకుండా ఇంకేమైనా కొత్త లక్షణాలను మీరు పరిశీలించారా ? వాటిని నమోదు చేయండి.
జవాబు:
గులాబి చెట్లకు ముళ్ళుంటాయి.

6. పట్టికలో పేర్కొన్న లక్షణాలు ప్రాతిపదికగా పరిశీలిస్తే ఏ రెండు మొక్కలైనా ఒకేలా ఉన్నాయా?
జవాబు:
లేవు.

7. వేరు వేరు మొక్కలలో ఒకే రకమైన లక్షణాలు పరిశీలించినట్లయితే వాటిని పేర్కొనండి.
జవాబు:
వరి, మొక్కజొన్న నందు సమాంతర వ్యాపనం, పీచు వేరు వ్యవస్థ ఉన్నాయి. మామిడి, గులాబి, జామనందు తల్లివేరు వ్యవస్థ, జాలాకార ఈనెల వ్యాపనం ఉన్నాయి.

8. మీరు సేకరించిన మొక్కలలో ఏ రెండు మొక్కలలో అయినా ఎక్కువ లక్షణాలు ఒకే రకంగా ఉన్నాయా? అవి ఏమిటి?
జవాబు:
జామ, గులాబినందు ఎక్కువ లక్షణాలు ఒకే విధంగా ఉన్నాయి.

AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం

కృత్యం – 3

ప్రశ్న 3.
విత్తనాలను పరిశీలిద్దాం :
వివిధ రకముల విత్తనములందు గల బీజదళాల సంఖ్యను నీవు ఏ విధముగా పరిశీలిస్తావు? నీ యొక్క పరిశీలనలను పట్టికయందు నమోదు చేయుము.
జవాబు:
విత్తనమునందు గల బీజదళాల సంఖ్యను పరిశీలించు విధము :

  1. పెసలు, కందులు, మినుములు, గోధుమ, వరి, వేరుశనగ, మొక్కజొన్న విత్తనములను సేకరించి వాటిని ఒక రోజు నీటిలో నానబెట్టాలి.
  2. వీటిలో మొక్కజొన్న విత్తనాన్ని తీసుకొని చేతివేళ్ళతో నొక్కాలి.
  3. మొక్కజొన్న విత్తనము నుండి తెల్లని నిర్మాణం బయటకు వస్తుంది.
  4. తెల్లని నిర్మాణమును పిండం లేదా పిల్లమొక్క అంటారు.
  5. పిండం కాకుండా మన చేతిలో మిగిలిన భాగంలో ఉన్న విత్తనం పైభాగంలో ఒకే బీజదళం ఉంటుంది.
  6. ఇదే విధంగా మిగిలిన అన్ని విత్తనాలనూ నొక్కి పరిశీలించాలి.
  7. భూతద్దం ద్వారా పరిశీలించిన అంశాలను పట్టికలో నమోదుచేయాలి.

AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 13

కృత్యం – 4

ప్రశ్న 4.
ఏకదళ, ద్విదళ బీజ మొక్కల లక్షణాలను పరిశీలిద్దాం :
ఏకదళ, ద్విదళ బీజ మొక్కలను సేకరించి వాటి లక్షణాలను పరిశీలించి పట్టికను పూరించండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 14
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 15

కృత్యం – 5

ప్రశ్న 5.
కీటకాల బాహ్య లక్షణాలను పరిశీలిద్దాం.
మీ పరిసరాలలోని ఈగ, దోమ, చీమ, పేడ పురుగు, సీతాకోక చిలుక మాత్, బొద్దింక మొదలైన కీటకాలను పరిశీలించి పట్టికను పూర్తిచేయండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 16

1. అన్ని కీటకాలు ఒకే ఆకారం, పరిమాణం కలిగి ఉన్నాయా?
జవాబు:
కీటకాలు అన్నీ ఒకే ఆకారం, పరిమాణం కలిగి ఉండలేదు.

2. కాళ్ళను పరిశీలిస్తే వాటిలో కనిపించే తేడాలేమిటి?
జవాబు:
కొన్ని కీటకాలకు కీళ్ళు కలిగిన కాళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క కీటకము కాళ్ళనందు అతుకులు ఉన్నాయి.

3. రెక్కలను పరిశీలిస్తే వాటిలో కనిపించే తేడాలేమిటి?
జవాబు:
రెక్కలు పెద్దవిగాను, చిన్నవిగాను ఉన్నాయి. కొన్నింటిలో 1 జత రెక్కలు ఉంటే కొన్నింటిలో – (సీతాకోకచిలుక, మాత్, బొద్దింక) రెండు జతల రెక్కలు ఉన్నాయి. రెక్కలు వివిధ రంగులలో ఉన్నాయి.

4. రెక్కల సంఖ్యకి, కాళ్ళ సంఖ్యకి మధ్య ఏమైనా సంబంధం ఉందా?
జవాబు:
కాళ్ళ సంఖ్య స్థిరంగా ఉంటే అనగా 6 కాళ్ళు ఉంటే, రెక్కలు తక్కువ సంఖ్యలో ఉన్నాయి.

5. ఏ రెండు కీటకాల లక్షణాలు ఒకేలా ఉన్నాయా? ‘అవును’ అయితే వాటిని మీ తరగతిలో ప్రదర్శించండి. ‘లేదు’ అయితే తేడాలను మీ నోట్‌బుక్ లో రాయండి.
జవాబు:
ఏ రెండు కీటకాల లక్షణాలు ఒకే విధంగా లేవు. సీతాకోకచిలుక, బొద్దింక కాళ్ళ సంఖ్యలోను, రెక్కలసంఖ్యలోను ఒకేవిధంగా ఉన్నప్పటికి ఆకారంలోను, రంగులోను తేడాను చూపిస్తున్నాయి.

కృత్యం – 6

ప్రశ్న 6.
మానవులలో వైవిధ్యాన్ని పరిశీలిద్దాం :
జంతువులలో వైవిధ్యం పరిశీలించడానికి పాఠశాలలోని పదిమంది పిల్లలను ఎంపిక చేసుకొని వారి వివరములను క్రింది పట్టిక యందు నింపండి. ఒక్కొక్క జట్టు యందు నలుగురు చొప్పున జట్లుగా ఏర్పడాలి.
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 17
జవాబు:
1. ఏ లక్షణం వీరిని విభజించడంలో ఎక్కువగా తోడ్పడుతుంది?
జవాబు:
‘ఎత్తు’ లక్షణం ద్వారా వీరిని విభజించవచ్చు.

2. ఏ లక్షణం గ్రూపులలో ఒక్కరికి మాత్రమే వర్తిస్తుంది?
జవాబు:
బొటన వేలిముద్ర

3. మీ తరగతిలో ఏ ఇద్దరు విద్యార్థులకైనా ఒకే విధమైన లక్షణాలు ఉన్నాయా?
జవాబు:
లేవు

4. మీ పట్టికను ఇతరులతో పోల్చి వివిధ పట్టికలలో ఉన్న అంశాల మధ్య తేడాలను నమోదు చేయండి.
జవాబు:
విద్యార్థి కృత్యము.

AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం

కృత్యం – 7

ప్రశ్న 7.
రెండు వేరు వేరు మొక్కలలో వైవిధ్యాన్ని పరిశీలిద్దాం.
రెండు వేరు వేరు వేప మొక్కలలోని వైవిధ్యంను పరిశీలించి కింది పట్టికను పూర్తి చేయంది.
సమాన పరిమాణాలలో ఉన్న రెండు వేప మొక్కలను ఎంపిక చేసుకొని వాటి లక్షణాలను పట్టికలో పూరించాలి.
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 18
1. ఒకే రకమైన రెండు వేపమొక్కలలో ఏ ఏ తేడాలను నీవు గమనించావు?
జవాబు:
పొడవులో తేడా, ఆకుల సంఖ్యలో తేడా గలవు.

2. అలాంటి తేడాలు వాటిలో ఉండడానికి కారణాలు ఏమై ఉండవచ్చునని ఊహిస్తున్నావు?
జవాబు:
ఒక్కొక్క మొక్క దాని లక్షణాలు ప్రత్యేకంగా ఉంటాయి. మొక్క వయసు కూడా లక్షణాలలో తేడా ఉండడానికి కారణమవుతుంది.

కృత్యం – 8

ప్రశ్న 8.
వివిధ రకాల నాచు మొక్కలను పరిశీలిద్దాం.
నాచు మొక్క (మాస్)ను సేకరించి దానిని భూతద్దంతో గాని సంయుక్త సూక్ష్మదర్శినితో గాని పరిశీలించండి. బొమ్మ గీసి నాచు మొక్కల లక్షణములు రాయండి.
జవాబు:

  1. గోడలపైన, ఇటుకల మీద వానాకాలంలో పెరిగే ‘పచ్చని నిర్మాణాలను సేకరించాలి.
  2. వాటి నుండి కొంతభాగం ఒక స్లెడ్ పైన తీసుకొని సంయుక్త సూక్ష్మదర్శినితో పరిశీలించాలి.

AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 19
పరిశీలనలు :

  1. నాచు మొక్క సైడ్ నందు కనిపించే పువ్వుల మాదిరి నిర్మాణాలను సిద్ధబీజాలు అంటారు.
  2. సిద్ధ బీజాలలో చాలా తక్కువ పరిమాణంలో ఆహారపదార్థాలు నిల్వ ఉంటాయి.
  3. సిద్ధబీజాలు సిద్ధబీజాశయము నుండి ఉత్పత్తి అవుతాయి.

ప్రయోగశాల కృత్యములు

ప్రశ్న 1.
ప్రయోగశాల నుండి హైడ్రాస్లెడ్ ను సేకరించి మైక్రోస్కోపులో పరిశీలించండి. బొమ్మను గీచి, భాగాలు గుర్తించి పరిశీనలను రాయండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 20
పరిశీలనలు :
1. హైడ్రా శరీరం ఏకకణ నిర్మితమా ? బహుకణ నిర్మితమా?
జవాబు:
బహుకణ నిర్మితము.

2. హైడ్రా శరీరం లోపల ఎలా కనిపిస్తుంది?
జవాబు:
హైడ్రా శరీరం లోపల ఖాళీ ప్రదేశం కనిపిస్తుంది. దానిని శరీరకుహరం అంటారు.

3. హైడ్రాలో ఇంకేమైనా లక్షణాలు కనిపించాయా?
జవాబు:
1) హైడ్రా జీవుల అపముఖము వైపు ఒక సన్నని కాడ చివర ఉన్న ఆధారముతో అంటిపెట్టుకొని ఉంటుంది.
2) స్వేచ్ఛగా ఉండే ముఖభాగము హైపోస్టోమ్ మీద అమరి ఉంటుంది.
3) హైపోస్టోమ్ చుట్టూ 6-10 స్పర్శకాలు ఉంటాయి.
4) కాడ ప్రక్కభాగమున నోరు లేదా స్పర్శకాలతో కూడిన ప్రరోహము ఉంటుంది.

ప్రశ్న 2.
బద్దెపురుగు స్పెసిమన్ ను పరిశీలించి బొమ్మగీచి, భాగాలు గుర్తించండి. పరిశీలనలు రాయండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 21
పరిశీలనలు:
1. జీవి శరీరం ఎలా కనిపిస్తుంది?
జవాబు:
జీవి శరీరం చదునుగా ఉండి, రిబ్బన్ వలె ఉంటుంది. వీటిని ప్లాటీహెల్మింథిస్ లేదా చదును పురుగు అంటారు.

2. జీవి శరీరంలో ఏదైనా ఖాళీ ప్రదేశం కనిపించినదా?
జవాబు:
ఖాళీ ప్రదేశం లేదు. నిజ శరీరకుహరం ఏర్పడలేదు.

3. దాని తల మరియు తోక ఎలా ఉంది?
జవాబు:
తలభాగము చిన్నదిగా గుండుసూదంత పరిమాణంలో ఉంటుంది. తోక కలిగి ఉంటుంది.

ప్రశ్న 3.
నులిపురుగు స్పెసిమన్ ను పరిశీలించండి. గమనించిన అంశాలను నోటు పుస్తకంలో రాయంది. దాని బొమ్మ గీచి, భాగాలు గుర్తించండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 22
పరిశీలనలు :
1. జీవి శరీరం బద్దెపురుగు (ప్లాటీ హెల్మింథిస్) ను పోలి ఉందా?
జవాబు:
జీవి శరీరం బద్దెపురుగును పోలియుండలేదు. శరీరం గుండ్రంగా ఉంది.

2. బద్దెపురుగు మరియు నులిపురుగులలో ఏమి తేడాలు గమనించారు?
జవాబు:
బద్దెపురుగు చదునుగా, శరీరకుహరం లేకుండా ఉంటుంది. నులిపురుగు గుండ్రంగా మిథ్యాకుహరం కలిగి ఉంటుంది.

3. స్పెసిమన్ లో దాని తల మరియు తోక ఎలా కన్పిస్తుంది?
జవాబు:
తల మరియు తోకలు చిన్నవిగా ఉండి మొనదేలి ఉంటాయి.

AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం

ప్రశ్న 4.
వానపాము స్పెసిమను పరిశీలించండి. మీరు గమనించిన అంశాలు నోటుపుస్తకంలో రాయండి. దాని బొమ్మ గీచి, భాగాలు గుర్తించండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 23
పరిశీలనలు :
1. వానపాము ఎలా కదులుతుంది?
జవాబు:
వర్తులాకార మరియు నిలువు కండరాల ఏకాంతర సంకోచ, సడలికల వల్ల కదులుతుంది.

2. దాని రంగు ఎలా ఉంది? శరీరంలో వలయాలు ఉన్నాయా?
జవాబు:
ముదురు గోధుమ వర్ణంలో ఉంది. శరీరంలో వలయాలు ఉన్నాయి.

3. శరీర రంగులో, శరీర భాగాల్లో ఏమి తేడా గమనించారు?
జవాబు:
శరీర పైభాగము ముదురు గోధుమ రంగులో ఉంటుంది. శరీర అడుగుభాగము లేత గోధుమ రంగులో ఉంటుంది. శరీర భాగమునందు ఖండితములు 14 నుండి 17 వరకు ఉన్నాయి. చర్మం మందంగా ఉంది. అక్కడ చర్మం శ్లేష్మంను స్రవించి గట్టిపడుతుంది. శరీరమంతా వలయాకార ఖండితాలు ఉన్నాయి.

ప్రశ్న 5.
బొద్దింక స్పెసిమన్ పరిశీలించండి. మీరు గమనించిన అంశాలు నోటు పుస్తకంలో రాయండి. దాని బొమ్మ గీచి, భాగాలు గుర్తించండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 24
పరిశీలనలు :
1. బొద్దింక చర్మం ఎలా కనిపిస్తుంది?
జవాబు:
బొద్దింక చర్మం గట్టిదైన అవభాసినితో ఆవరించబడి ఉంది.

2. వాటి చర్మంపై ఏదయినా గట్టిపొరను గమనించారా?
జవాబు:
గట్టి పొరను గమనించాము. దానిని అవభాసిని అంటారు.

3. బొద్దింక కాళ్ళను గమనించండి. అవి ఎలా కన్పిస్తున్నాయో చెప్పండి.
జవాబు:
బొద్దింకలో 3 జతల కాళ్ళున్నాయి. అవి కీళ్ళు కలిగిన కాళ్ళు.

4. బొద్దింక శరీరాన్ని ఎన్ని భాగాలుగా విభజించవచ్చు?
జవాబు:
బొద్దింక శరీరాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు. అవి : తల, రొమ్ము , ఉదర భాగం.

5. బొద్దింక మాదిరిగా కీళ్ళు కలిగిన కాళ్ళు ఉండే మరికొన్ని కీటకాల జాబితా రాయండి.
జవాబు:
సీతాకోక చిలుక, దోమ, ఈగ, గొల్లభామ, చీమ మొదలైనవి.

ప్రశ్న 6.
నత్త స్పెసిమనను పరిశీలించి గమనించిన అంశాలను నోటుపుస్తకంలో రాయండి. దాని బొమ్మ గీచి, భాగాలు గుర్తించండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 25
పరిశీలనలు :
1. నత్త బాహ్య స్వరూపం ఎలా కన్పిస్తుంది?
జవాబు:
నత్త బాహ్య స్వరూపం మెత్తగా ఉండి గట్టి కర్పరంతో ఉంటుంది.

2. నత్తను కాసేపు కదలకుండా ఉంచండి. అది కదలికను ఎక్కడ నుంది మొదలు పెట్టింది? ఆ భాగం ఏమిటి?
జవాబు:
పాదము నుండి కదలికను మొదలుపెట్టింది.

3. నత్త శరీరం గట్టిగా ఉందా? మెత్తగా ఉందా?
జవాబు:
నత్త శరీరం గట్టిగా ఉంది.

4. నత్త శరీరంలో ఏవైనా స్పర్శకాలు వంటి నిర్మాణాలు గుర్తించారా?
జవాబు:
నత్త శరీరంలో స్పర్శకాలు వంటి నిర్మాణాలు ఉన్నాయి.

ప్రశ్న 7.
సముద్ర నక్షత్రం స్పెసిమను పరిశీలించండి. మీరు గమనించిన అంశాలను నోటు పుస్తకంలో రాయండి. దాని బొమ్మ గీచి, భాగాలు గుర్తించండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 26
పరిశీలనలు:
1. సముద్ర నక్షత్రం శరీరం చర్మంపై ఏమి గమనించారు?
జవాబు:
సముద్ర నక్షత్రం శరీరం చర్మంపై ముళ్ళు ఉన్నాయి.

2. వాటికి చేతుల వంటి నిర్మాణాలు ఏమైనా ఉన్నాయా? అవి ఎలా ఉన్నాయి?
జవాబు:
జీవి శరీరం పంచభాగ వ్యాసార్ధ సౌష్టవము కలిగి ఐదు చేతుల వంటి నిర్మాణాలు ఉన్నాయి.

3. శరీరం మధ్యలో ఏదైనా రంధ్రాన్ని గమనించారా?
జవాబు:
సముద్ర నక్షత్రం మధ్య భాగంలో చిన్న రంధ్రము ఉన్నది. అది దాని యొక్క నోరు.

AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం

ప్రశ్న 8.
పాఠశాల ప్రయోగశాల నుండి చేప స్పెసిమన్ ను పరిశీలించండి. మీరు గమనించిన అంశాలు నోటుపుస్తకంలో రాయండి. దాని బొమ్మ గీచి, భాగాలు గుర్తించండి.
జవాబు:
పరిశీలనలు :
1. చేప యొక్క చర్మం గమనించి ఎలా ఉందో చెప్పంది.
జవాబు:
చేప చర్మం తేమగా, జిగటగా పొలుసులతో నిండియున్నది.
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 27

2. పొలుసులు లేని భాగాలను చేపలో గుర్తించి రాయండి.
జవాబు:
తలభాగము, ఉదరభాగము నందు పొలుసులు ఉండవు.

3. చేప యొక్క నోటిని తెరచి చేప నోటిలో ఏముందో చెప్పంది.
జవాబు:
చేప నోటిలో దంతాలు అమరి ఉన్నాయి. నాలుక ఉన్నది.

4. చేప యొక్క చెవి భాగాన్ని తెరచి అక్కడ ఏమి చూసారో చెప్పండి.
జవాబు:
చేప యొక్క చెవిభాగాన్ని తెరచి చూస్తే అక్కడ ఎర్రగా దువ్వెన మాదిరిగా ఉన్న మొప్పలు ఉన్నాయి.

5. చేపను కోసి దాని గుండెను పరిశీలించండి.
జవాబు:
చేప గుండె ఎరుపురంగులో చిన్నగా ఉన్నది.

6. చేప హృదయంలో ఎన్ని గదులున్నాయో తెల్పండి.
జవాబు:
చేప హృదయంలో రెండు గదులున్నాయి.

AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక

SCERT AP 9th Class Biology Guide Pdf Download 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Biology 4th Lesson Questions and Answers ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక

9th Class Biology 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
కణాలలోని, బయటకు పదార్థాల కదలికలను నియంత్రించే నిర్మాణం (AS 1)
ఎ) కణకవచం
బి) కణత్వచం
సి) రెండూ
డి) పైవేవీ కావు
జవాబు:
బి) కణత్వచం

ప్రశ్న 2.
ఖాళీలను పూరించండి. (AS 1)
ఎ) పువ్వుల పరిమళం మనకు చేరే ప్రక్రియ …………..
బి) భోపాల్ విషాధంలో MIC అను వాయువు నగరమంతా వ్యాపించిన పద్ధతి
సి) పొటాటో ఆస్మోమీటర్ లోనికి నీరు ………………. పద్ధతి ద్వారా ప్రవేశిస్తుంది.
డి) తాజా ద్రాక్ష ఉప్పు నీటిలో ఉంచినప్పుడు కృశించుటకు కారణం. ………………
జవాబు:
ఎ) వ్యాపనం
బి) వ్యాపనం
సి) ద్రవాభిసరణం
డి) ద్రవాభిసరణం

ప్రశ్న 3.
త్వచానికి ఉండే పారగమ్య స్వభావం అంటే ఏమిటి? సరైన ఉదాహరణలతో వివరించండి. (AS 1)
జవాబు:
ద్రావితాలు, ద్రావణిని తమ గుండా ప్రసరింపనీయడాన్ని పారగమ్యత అంటారు.

ఉదాహరణ :

  1. ప్లాస్మాపొర తన గుండా కార్బన్ డై ఆక్సైడ్, ఆక్సిజన్, నైట్రోజన్ మరియు క్రొవ్వులో కరిగే ఆల్కహాలు, ఈథర్ మరియు క్లోరోఫామ్ లను తన గుండా పోవటానికి అనుమతి ఇస్తుంది.
  2. ప్లాస్మాపొర తన గుండా పాలిసాకరైడ్లు, ఫాస్ఫోలిపిడ్లు మరియు ప్రోటీనులను తనగుండా పోవడానికి అనుమతి ఇవ్వదు.

AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక

ప్రశ్న 4.
ఎండిన కూరగాయలు మంచినీటిలో ఉంచినపుడు తాజాగా తయారవుతాయి. కారణమేమి? (AS 1)
జవాబు:

  1. ఎండిన కూరగాయలందు నీరు తక్కువగా ఉంటుంది మరియు లవణాల గాఢత ఎక్కువగా ఉంటుంది.
  2. ఎండిన కూరగాయలను మంచినీటిలో ఉంచినపుడు అవి నీటిని గ్రహించి తాజాగా మారతాయి.
  3. మంచినీటిలో కూరగాయలను ఉంచినపుడు ద్రవాభిసరణ ప్రక్రియ జరిగి కూరగాయలలోనికి నీరు ప్రవేశిస్తుంది.

ప్రశ్న 5.
సముద్రపు నీటి నుండి మంచి నీటిని పొందే విధానం ఏది? (AS 1)
జవాబు:
వ్యతిరేక ద్రవాభిసరణము ద్వారా సముద్రపు నీటి నుండి మంచినీటిని పొందుతాము.

ప్రశ్న 6.
సముద్రపు చేపను మంచినీటి ఎక్వేరియమ్ లో ఉంచితే ఏమవుతుంది? (AS 2)
జవాబు:
సముద్రపు చేపను మంచినీటి ఎక్వేరియమ్ లో ఉంచితే చనిపోతుంది.

కారణాలు :

  1. సముద్రపు చేప శరీరము నందు లవణాలు ఎక్కువ గాఢతలో ఉంటాయి.
  2. సముద్రపు చేపను మంచినీటి ఎక్వేరియమ్ లో ఉంచినపుడు చేప శరీరములోనికి నీరు ద్రవాభిసరణము ద్వారా ప్రవేశిస్తుంది.
  3. ఎక్కువ మొత్తంలో నీరు చేప శరీరంలోనికి ప్రవేశించడం వలన కణములు ఉబ్బి పగిలిపోతాయి. చేప చనిపోతుంది.

ప్రశ్న 7.
డాక్టర్లు (ఉప్పునీటి ద్రావణం) సెలైనను మాత్రమే రక్తంలోకి ఎక్కిస్తారు. మంచినీరు కాదు. ఎందుకో రాయండి. (AS 2)
జవాబు:

  1. మంచి నీటిని సిరలోనికి ఎక్కించినపుడు దాని వలన కొద్దిమేర ‘కణముల విచ్ఛిన్నము జరుగుతుంది.
  2. ఎర్ర రక్తకణములు సాధారణముగా నీటిచేరిక వలన విచ్చిన్నం చెందుతాయి.
  3. ఎక్కువ మొతంలో శరీరంలోనికి మంచినీటిని ఎక్కించినపుడు ఎర్రరక్త కణములు విచ్చిన్నం అవటం మాత్రమే కాకుండా మెదడుకు నష్టం జరగటం, గుండె ఆగిపోవటం జరిగి మనిషి చనిపోవచ్చు.
  4. అందువలన డాక్టర్లు సరిపోయినంత మొత్తంలో గల ద్రవపదార్ధములు అనగా సెలైనును మాత్రమే రక్తంలోకి ఎక్కిస్తారు.

ప్రశ్న 8.
మన రక్తంలోకి అంతర సిరల ద్వారా 50% గ్లూకోజ్ ద్రావణాన్ని నేరుగా ఎక్కిస్తే ఏమవుతుంది? (AS 2)
జవాబు:

  1. 50% గ్లూకోజ్ ద్రావణాన్ని డెక్టోజ్ అంటారు. దీనిని మెదడు, వెన్నెముక సంబంధం గల ఒత్తిడిని తగ్గించడానికి మరియు శరీర అంతరభాగాలలో ద్రవపదార్థం చేరికను తగ్గించడానికి ఉపయోగిస్తారు.
  2. అంతర సిరల’ ద్వారా 50% గ్లూకోజ్ ద్రావణాన్ని నేరుగా ఎక్కిస్తే కొంతమందిలో ఇది వేదనాత్మకతను (ఎలర్జీ) కలిగిస్తుంది.
  3. వేదనాత్మక చర్యలు అనగా నాడులు ఉత్తేజం చెందడం, కీళ్ళ వద్ద వ్యాధి సోకటం, అవయవాలలోని కణజాలములు చనిపోవటం, వ్యాధిసోకిన భాగము వరకు సిరలందు రక్తం గడ్డకట్టడం మొదలైనవి.
  4. అందువలన గాఢత గల 50% గ్లూకోజ్ (డెక్టోజ్) ద్రావణాన్ని నీటికి కలిపి పలుచగా చేసిన తరువాత సిరగుండా ఎక్కించాలి.

ప్రశ్న 9.
పారగమ్యత సామర్థ్యం కణాలకి లేకపోతే ఏమవుతుంది? (AS 2)
జవాబు:

  1. కణములకు పారగమ్యత సామర్థ్యం లేకపోయినట్లయితే, అవి ముఖ్యమైన జీవక్రియలను నిర్వహించలేవు.
  2. ఆక్సిజన్, గ్లూకోజ్, విటమినులు, క్రొవ్వులు కణమునకు అందకపోయినట్లయితే కణములు జీవక్రియలను జరపలేవు.
  3. పరిపక్వం చెందిన కణములకు పారగమ్యత సామర్థ్యం లేకపోయినట్లయితే విషపదార్ధములు పేరుకొనిపోతాయి. తద్వారా కణం నశించిపోతుంది.

AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక

ప్రశ్న 10.
వ్యాపనం గురించి తెలుసుకోవడానికి నీవు చేసిన ప్రయోగంలో నీవు గమనించిన దేమిటి? (AS 3)
జవాబు:
గమనించిన విషయాలు :

  1. ద్రవ, వాయుపదార్థాలలో వ్యాపనం జరుగుతుంది.
  2. ఎక్కువ గాఢత నుండి తక్కువ గాఢతకు పదార్థాలు కదలడం వలన వ్యాపనం జరుగుతుంది.
  3. వ్యాపనమనేది భౌతిక చర్య.
  4. గాలి లేదా నీరు లాంటి మాధ్యమంలో కొన్ని పదార్థాలను ఉంచినప్పుడు అవి ఆ మాధ్యమంలో సమానంగా విస్తరించడాన్ని వ్యాపనం (diffussion) అంటారు.

ప్రశ్న 11.
మీ స్నేహితులతో చర్చించి వ్యాపనం జరిగే సందర్భాల జాబితా రాయండి. (AS 4)
జవాబు:

  1. మా స్నేహితుడు రాసుకొచ్చిన సెంటు వాసన తరగతి గది అంతయూ వ్యాపిస్తుంది.
  2. మధ్యాహ్న భోజన సమయంలో మా స్నేహితురాలి క్యారేజిలో నుండి వచ్చిన మసాలా కూరవాసనను మేమందరం ఆస్వాదించాము.
  3. సాయంత్రం ఇంటికి వెళ్ళే సమయంలో మురికి కాలువ నుండి వచ్చిన దుర్గంధమును పీల్చలేకపోయాము.
  4. రాత్రికి మా ఇంటిలో దేవుని వద్ద వెలిగించిన అగరుబత్తి వాసన ఇల్లంతా వ్యాపించినది.
  5. మా వీధిలో వెళుతున్న పెళ్ళి ఊరేగింపునకు ముందు కాల్చిన బాణాసంచా వాసన మా వీధి అంతయూ వ్యాపించినది.

ప్రశ్న 12.
మీరు కోడిగుడ్డును ఉపయోగించి చేసిన ప్రయోగాన్ని వివరించే దశలను తెలిపే ఫ్లోచార్ట్ గీయండి. (AS 5)
జవాబు:
AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 1

ప్రశ్న 13.
మీరు ఒక కొబ్బరికాయను కొన్నారు. దానిని ఊపినప్పుడు నీరు నిండుగా లేదని తెలిసింది. కొబ్బరికాయలోనికి రంధ్రం చేయకుండా నీరు నింపగలరా? ఎలా? (AS 6)
జవాబు:

  1. రంధ్రము చేయకుండా కొబ్బరికాయలోనికి నీరును నింపలేము.
  2. కొబ్బరికాయను నీళ్ళలో ఉంచినప్పటికి ద్రవాభిసరణం ద్వారా నీరు దానిలోనికి ప్రవేశించదు.
  3. కొబ్బరికాయ పెంకు నిర్జీవ కణములయిన దృఢ కణజాలముతో నిర్మితమైనది.
  4. నిర్జీవ కణాలలో ద్రవాభిసరణక్రియ జరుగదు.
  5. అందువలన కొబ్బరికాయకు రంధ్రము చేయకుండా నీరు నింపలేము.

ప్రశ్న 14.
నిత్య జీవితంలో వ్యాపనాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటావు? (AS 7)
జవాబు:

  1. గదిలో సిగరెట్ తాగినపుడు పొగ అణువులు గది అంతా వ్యాపించి వాసన కలుగచేస్తాయి.
  2. పంచదార స్ఫటికములను నీరు కలిగిన గ్లాసులో ఉంచిన పంచదార అణువులు వ్యాపనం ద్వారా నీరు అంతా వ్యాపిస్తాయి.
  3. బేకింగ్ పదార్థములను వండుతున్నప్పుడు ఇల్లంతా వాసన రావటానికి కారణం వ్యాపనం.
  4. తేయాకు సంచినందలి వర్ణద్రవ్యములు వ్యాపనం ద్వారా కరిగి నీటికి రంగును, రుచిని ఇస్తాయి.
  5. గాలిని శుభ్రపరిచే డియోడరెంట్ నందలి అణువులు వ్యాపనము ద్వారా గాలిలోనికి ప్రవేశిస్తాయి.
  6. వంటచేయడానికి ఉపయోగించే వాయువు సిలిండర్ నుండి బయటకు వచ్చిన గది నిండా వ్యాపనం ద్వారా చేరుతుంది.
  7. సోడానందలి కార్బన్ డై ఆక్సెడ్ వ్యాపనము ద్వారా బయటకు రావటం వలన సోడా నీరు కదలకుండా ఉంటుంది.
  8. అగర్బత్తీ, దోమల నివారణ మందులు వ్యాపన సూత్రంపై పనిచేస్తాయి.

AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక

ప్రశ్న 15.
నిత్యజీవితంలో ద్రవాభిసరణ జరిగే 3 సన్నివేశాలను తెలపంది. (AS 7)
జవాబు:

  1. మొక్కల వేర్లలోనికి నీరు ద్రవాభిసరణ ద్వారా చేరుతుంది.
  2. కణాల మధ్య నీరు ప్రవహించడానికి కారణం ద్రవాభిసరణం.
  3. పత్రరంధ్రాలు మూసుకోవడం, తెరచుకోవడం ద్రవాభిసరణ వల్ల జరుగుతుంది.
  4. ద్రవాభిసరణం మొక్కలలో నీరు, లవణాల కదలికలకు సహాయపడుతుంది.
  5. రక్తంలో మలినాలు వడపోయడానికి ద్రవాభిసరణం అవసరం.
  6. మన శరీరానికి కావలసిన నీరు మరియు లవణాలు పునఃశోషణం చేసుకోవడానికి ద్రవాభిసరణం ఉపయోగపడుతుంది.
  7. వాడిపోయిన క్యారెట్ ను నీటిలో ఉంచిన, ద్రవాభిసరణ ద్వారా నీరు ప్రవేశించి క్యారెట్ తాజాగా అవుతుంది.

9th Class Biology 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక Textbook Activities (కృత్యములు)

కృత్యం – 1

1. కణంలోకి వచ్చేవి బయటకు పోయేవి.
పట్టికలో ఇచ్చిన పదార్థాల జాబితాను చూచి కణం లోపలికి ప్రవేశించే పదార్థాలను, కణం బయటకు వెళ్ళే పదార్థాలను (✓) తో గుర్తించండి.
జవాబు:

పదార్థం కణంలోకి ప్రవేశిస్తుంది కణం బయటకు వెళుతుంది
ఆక్సిజన్
గ్లూకోజ్
ప్రోటీన్లు
కొవ్వులు
విటమిన్లు
ఖనిజ లవణాలు
కార్బన్ డై ఆక్సైడ్
వ్యర్థాలు

ప్రయోగశాల కృత్యము

2. గాఢతల పరిశీలన :
వివిధ ద్రావణాల గాఢతను పరిశీలించు విధమును రాయండి.
(లేదా)
మీకు బీకరు, ఎండుద్రాక్ష, చక్కెర, నీరు అందిస్తే వీటితో ద్రవాభిసరణను ఎలా చూపిస్తావు?
జవాబు:
AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 2
ఎ) ఉద్దేశం : నీటిలో వేసిన ఎండు ద్రాక్షను పరిశీలించుట
పదార్థాలు / పరికరాలు : 1) బీకరు 2) కుళాయి నీరు 3) ఎండు ద్రాక్ష

విధానం:

  1. ఒక బీకరులో 100 మి.లీ నీరు తీసుకొని దానిలో ఎండు ద్రాక్ష వేయాలి.
  2. ఒక గంట తరువాత ఎండు ద్రాక్షను బయటకు తీసి మామూలు ఎండు ద్రాక్షతో పోల్చాలి.

పోలిక :
మామూలు ఎండు ద్రాక్ష కంటె నీటి నుండి బయటకు తీసిన ద్రాక్ష పరిమాణము పెద్దదిగా ఉన్నది.

బి) ఉద్దేశం : సంతృప్త చక్కెర ద్రావణంలో ఉంచిన తాజాద్రాక్షను పరిశీలించుట.
AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 3

పదార్థాలు / పరికరాలు :
1) బీకరు 2) కుళాయి నీరు 3) చక్కెర 4) తాజా ద్రాక్ష.

విధానం:

  1. 100 మి.లీ. చక్కెర ద్రావణాన్ని బీకరులో తీసుకొని అందులో తాజా ద్రాక్ష పండును వేయాలి.
  2. ఒక రాత్రి అంతా ఉంచి తెల్లవారగానే ద్రాక్షను తీసి పరిశీలించాలి.

గమనిక : తాజా ద్రాక్ష పరిమాణము తగ్గి ముడుచుకుపోయినది.

పరిశీలనలు:

  1. మొదటి ప్రయోగములో నీరు బీకరులో నుండి ఎండుద్రాక్షలోనికి ప్రవేశించినది.
  2. రెండవ ప్రయోగములో తాజా ద్రాక్ష నుండి నీరు బీకరులోనికి వెళ్తుంది.

నిర్ధారణ :
పై రెండు ప్రయోగములలో ద్రాక్ష త్వచంలోని కణాలు నీటిని లోపలికి మరియు బయటకు వెళ్ళడానికి సహకరించినవి.

AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక

ప్రయోగశాల కృత్యము

3. ద్రవాభిసరణం (Osmosis) :
ద్రవాభిసరణను నిరూపించుటకు ఒక ప్రయోగమును వివరింపుము.
(లేదా)
ద్రవాభిసరణంను నిరూపించడానికి మీరు ప్రయోగశాలలో కృత్యం నిర్వహించారుగదా! క్రింది అంశాలను వివరించండి.
a) కావలసిన పదార్థాలు
b) తీసుకోవలసిన జాగ్రత్తలు
c) ప్రయోగ విధానం
d) ఫలితం
జవాబు:
ఉద్దేశం : బంగాళాదుంపను ఉపయోగించి ద్రవాభిసరణను నిరూపించుట.

కావల్సిన పదార్థాలు :
1) తాజా బంగాళాదుంప 2) ఉడికించిన బంగాళాదుంప 3) రెండు బీకర్లు లేదా కప్పులు 4) రెండు గుండు సూదులు 5) నీరు 6) పదునైన కత్తి 7) చక్కెర ద్రావణం.

AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 4
ప్రయోగ విధానం (లేదా) పద్ధతి :

  1. తాజా దుంపను తీసికొని పై పొట్టును తొలగించి దానిని తొట్టి లేదా కప్పు గిన్నె మాదిరిగా తయారుచేయాలి.
  2. తయారుచేసిన చక్కెర ద్రావణాన్ని బంగాళాదుంప కప్పు లేదా తొట్టియందు పోయాలి.
  3. చక్కెర ద్రావణ మట్టమును సూచిస్తూ గుండుసూది గుచ్చాలి.
  4. బంగాళాదుంప కప్పు లేక తొట్టిని బీకరులో ఉంచాలి.
  5. బీకరులో బంగాళాదుంప తొట్టి లేదా కప్పు సగం వరకు వచ్చేటట్లు నీరు నింపి అది మునగకుండా, తేలకుండా జాగ్రత్త తీసుకోవాలి.
  6. ఈ అమరికను ఒక అరగంట పాటు కదిలించకుండా ఉంచి పరిశీలించాలి.

AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 5
పరిశీలన:
బంగాళాదుంప కప్పు లేదా గిన్నెలోనికి బీకరులోని నీరు ప్రవేశించుట వలన చక్కెర ద్రావణమట్టం పెరుగుతుంది. పద్దతి : తరువాత బంగాళాదుంప కప్పులోనికి నీటిని, చక్కెర ద్రావణమును చక్కెర ద్రావణంలో బంగాళాదుంప గిన్నె బీకరులో ఉంచి అరగంట తరువాత పరిశీలించాలి. పరిశీలన : బంగాళాదుంప కప్పులోని నీరు బీకరులోనికి ప్రవేశించడం వల్ల క్రమేపి నీటిమట్టము తగ్గుతుంది.

నిర్ధారణ:

  1. పై రెండు సందర్భాలలోను నీరు చక్కెర ద్రావణం వైపు ప్రవహిస్తుంది. ఈ ప్రక్రియను ద్రవాభిసరణం అంటారు.
  2. ఈ ప్రక్రియలో నీరు తక్కువ గాఢత నుండి ఎక్కువ చక్కెర గాఢతవైపు బంగాళాదుంప పొర ద్వారా ప్రయాణిస్తుంది.

కృత్యం – 2

4. వడపోత:
వడపోత ప్రక్రియను ప్రయోగం ద్వారా వివరింపుము.
జవాబు:
ఉద్దేశం : వడపోత జరిగే విధానమును నిరూపించుట.

కావలసిన పదార్థాలు / పరికరాలు : రెండు బీకర్లు, ఒక గరాటు, వడపోత కాగితం, రిటార్ట్ స్టాండు, చక్కెర, అయోడిన్, గోధుమపిండి లేదా వరిపిండి.
AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 6

ప్రయోగ విధానం:

  1. ఒక రిటార్టు స్టాండునకు వడపోత కాగితమును అమర్చిన గరాటును బిగించాలి.
  2. గరాటు కింద బీకరును ఉంచాలి.
  3. 100 మి.లీ. నీటికి ఒక చెంచాడు గోధుమపిండి లేదా వరిపిండి కలిపి ద్రావణం తయారుచేయాలి.
  4. ఈ ద్రావణానికి ఒక చుక్క టింక్చర్ అయోడినను కలిపి వడపోయాలి.

పరిశీలన :

  1. వడపోత ద్వారా నీరు మరియు నీటిలో కరిగిన పిండి గరాటు కింద గల బీకరులోనికి చేరుతుంది.
  2. వడపోత కాగితం నీటిలో కరగని పిండిని తనగుండా ప్రయాణించడానికి అనుమతి ఇవ్వలేదు. పిండి అవక్షేపము వడపోత కాగితము మీద ఏర్పడినది.

AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక

కృత్యం – 3

5. బాహ్య ద్రవాభిసరణం మరియు అంతర ద్రవాభిసరణ ప్రక్రియలను ప్రయోగపూర్వకముగా నిరూపించుము.
జవాబు:
ఉద్దేశం : బాహ్య మరియు అంతర ద్రవాభిసరణలను నిరూపించుట.

కావలసిన పదార్థాలు : మూడు బీకర్లు, పెట్రెడిష్, ఉప్పు, సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం, రెండు సమాన పరిమాణంలో ఉన్న పచ్చి గుడ్లు, తుడవడానికి గుడ్డ, గుడ్డు చుట్టుకొలత కొలవడానికి సన్నని పొడవైన కాగితం, ఒక చెమ్చా.

పద్ధతి / ప్రయోగ విధానం :

  1. గుడ్లను సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో నాలుగు నుండి ఐదుగంటల పాటు ఉంచాలి.
  2. గుడ్లను చెమ్చాతో బయటకు తీయాలి. గుడ్డుపైన ఉండే కాల్షియం కార్బొనేట్ తో తయారైన పెంకు కరిగిపోతుంది.
  3. గుడ్లను కుళాయి కింద నీటిలో కడగాలి.
  4. గుడు చుట్టు సన్నని కాగితం చీలికను చుట్టి పెన్సిల్ లేదా పెన్నుతో గుర్తించి గుడ్ల చుట్టుకొలతను కొలవాలి.
  5. ఒక బీకరులో గాఢమైన ఉప్పునీటి ద్రావణాన్ని తయారు నీటితో కడగడం చేయాలి.
  6. రెండు గుడ్లలో ఒకదాన్ని మంచినీరు ఉన్న బీకరులోను, HCl లో ఉంచిన గుడ్డు రెండవ దాన్ని ఉప్పునీటి ద్రావణంలోను ఉంచాలి.
  7. బీకర్లను రెండు నుండి నాలుగు గంటల పాటు కదపకుండా అలాగే ఉంచాలి.
  8. గుడ్లను బయటకు తీసి తుడిచి వాటి చుట్టుకొలతను కాగితంతో కొలవాలి. దానిని నమోదుచేయాలి.

AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 7 AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 8
పరిశీలన :
ఉప్పు నీటి ద్రావణంలో ఉంచిన గుడ్డు కృశించుకుపోయినది. మంచినీటిలో ఉంచిన గుడు ఉబ్బియున్నది.

నిర్ధారణ :

  1. ఉప్పు నీటి ద్రావణంలో ఉంచిన గ్రుడు నుండి నీరు బాహ్యద్రవాభిసరణం వలన బయటకు పోతుంది.
  2. మంచి నీటిలో ఉంచిన గుడ్డు లోపలికి నీరు అంతర ద్రవాభిసరణ వలన వస్తుంది.

ప్రయోగశాల కృత్యము

6. పాక్షిక పారగమ్య త్వచాన్ని తయారుచేద్దాం :

పాక్షిక పారగమ్య త్వచాన్ని తయారుచేసి దాని సహాయముతో ద్రవాభిసరణమును నిరూపించండి.
(లేదా)
ఉడకబెట్టని కోడిగుడ్డు నుండి పాక్షిక పారగమ్య త్వచాన్ని ఎలా తయారుచేస్తావు?
జవాబు:
పాక్షిక పారగమ్య త్వచమును తయారుచేయుట :

  1. రెండు గుడ్లను తీసికొని వాటిని సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో నాలుగు నుండి ఐదుగంటల సేపు ఉంచాలి.
  2. గుడ్ల పైన ఉండే కాల్షియం కార్బొనేట్ తో తయారయిన ‘పెంకు కరిగిపోతుంది.
  3. గుడ్లను బయటకు తీసి కుళాయి నీటితో కడగాలి.
  4. పెంకు కరిగిన గుడ్లకు జాగ్రత్తగా పెన్సిల్ పరిమాణంలో ఉండే రంధ్రం చేయాలి. లోపలి పదార్థం అంతటినీ రంధ్రం ద్వారా నెమ్మదిగా బయటకు తీసివేయాలి.
  5. సంచిలాగా కనిపించే గుడ్ల పొర లోపలి భాగాన్ని నీటితో శుభ్రంగా కడగాలి.
  6. పారగమ్య త్వచాలు వాడటానికి సిద్ధంగా ఉన్నవి. ఇవి పాక్షిక పారగమ్యత్వచాలు.

AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 9
కోడిగుడ్డు పారగమ్య త్వచంతో ద్రవాభిసరణ ప్రయోగము :

ఉద్దేశం : పారగమ్య త్వచం ఉపయోగించి ద్రవాభిసరణమును నిరూపించుట.

కావలసిన పదార్థాలు / పరికరాలు : రెండు గుడ్లు పొరలు, మూడు బీకర్లు, చక్కెర, నీరు, దారం, కొలజాడి, సిరంజి.
AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 10AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 11

ప్రయోగ విధానం :

  1. గుడ్డు పొర సంచిని తీసుకొని సిరంజి సహాయంతో 10 మి.లీ. సంతృప్త చక్కెర ద్రావణంతో నింపాలి.
  2. పొరకు ఉన్న రంధ్రాన్ని దారంతో కట్టాలి. 100 మి.లీ. నీటిని ఒక బీకరులో పోయాలి.
  3. చక్కెర ద్రావణం ఉన్న గుడ్డు పొర సంచిని బేకరులో ఉంచాలి.
  4. ఒక రాత్రి పూర్తిగా దానిని అలాగే వదలివేయాలి.
  5. సిరంజి సహాయంతో 10 మి.లీ. మంచినీటిని రెండవ గుడ్లు పొర సంచిలో నింపాలి.
  6. 100 మి.లీ. సంతృప్త చక్కెర ద్రావణాన్ని కొలజాడీతో కొలిచి బీకర్లో పోయాలి.
  7. ఈ అమరికను ఒక రాత్రి పూర్తిగా కదలించకుండా వదలివేయాలి.
  8. రెండవ రోజు గుడ్ల పొర సంచులను బయటకు తీసి వాటిలోపలి ద్రవాలను కొలిచి పరిశీలించాలి.

పరిశీలనలు:

  1. మొదటి కృత్యములో చక్కెర ద్రావణం నింపిన కోడిగుడ్డు త్వచములోనికి నీరు ప్రవేశించుట వలన నీటి పరిమాణము పెరిగినది.
  2. రెండవ కృత్యములో గుడ్డు పొర సంచి నుండి నీరు బీకరులోనికి ప్రవేశించుట వలన సంచి నందు నీటి పరిమాణం తగ్గినది.

నిర్ధారణ :
కోడిగుడ్డు త్వచం ద్వారా నీరు తక్కువ గాఢత గల ప్రదేశం నుండి ఎక్కువ గాఢత గల ద్రవంలోనికి ప్రయాణించినది. ఈ పద్ధతిని ద్రవాభిసరణం అంటారు.

AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక

కృత్యం – 4

7. కాఫీ పొడితో వ్యాపనం

కాఫీ పొడిని ఉపయోగించి వ్యాపనమును పరిశీలించుము. పరిశీలనలను రాయుము.
జవాబు:

  1. చిన్న గిన్నెలో నీరు తీసుకోవాలి.
  2. కాఫీ పొడిని చిన్న ఉండగా తయారుచేయాలి.
  3. కాఫీ పొడి ఉండను నెమ్మదిగా నీటిలో జారవేయాలి.
  4. కాఫీ పొడి ఉండ బీకరు అడుగుకు చేరిన తర్వాత బీకరును కదపకుండా ఉంచి పరిశీలించాలి.

పరిశీలనలు:

  1. కాఫీ పొడి అణువులు నీటిలో కరగడం మొదలవుతాయి.
  2. స్ఫటికాల చుట్టూ ఉన్న నీరు మిగిలిన నీటికన్నా గాఢమైన రంగులో ఉంటుంది.
  3. సమయం గడచిన కొద్దీ నీరు మొత్తం రంగు మారుతుంది.
  4. మొదట నీరు లేత రంగులో ఉండి చివరకు నీరంతా ఒకే రంగులోకి మారుతుంది. వ్యాపనము ద్వారా కాఫీ పొడి అణువులు నీరు అంతా ప్రసరించి చివరికి ఒకే రంగులోకి మారుతుంది.

కృత్యం – 5

8. నీటిలో పొటాషియం పర్మాంగనేటు స్పటికం వ్యాపనం చెందు విధమును రాయండి.
జవాబు:

  1. పొటాషియం పర్మాంగనేటు స్ఫటికం ఒకదాన్ని శ్రావణం సహాయంతో పెట్రెడిష్ మధ్యలో ఉంచాలి.
  2. జాగ్రత్తగా పెట్రిడిలో నీళ్ళు పోయాలి.
  3. నీటిలో పర్మాంగనేటు పింక్ రంగు విస్తరించడం ప్రతి నిమిషానికీ గమనించాలి.
  4. పెట్రెడిష్ మధ్య నుండి అంచుల వరకు వ్యాపించే విధమును పరిశీలించాలి.

పరిశీలనలు :

  1. పొటాషియం పర్మాంగనేటు స్పటికం నీటిలో కరగడం మొదలవుతుంది.
  2. స్పటికం చుట్టూ ఉన్న నీరు మిగిలిన నీటికన్నా గాఢమైన రంగులో ఉంటుంది.
  3. సమయం గడచిన కొద్దీ నీరు మొత్తం రంగు మారుతుంది.
  4. మొదట నీరు లేత రంగులో ఉండి చివరకు నీరంతా ఒకే రంగులోకి మారుతుంది.

విసరణము :
ఎక్కువ గాఢత గల ప్రదేశం నుండి పొటాషియం పర్మాంగనేటు అణువులు తక్కువ గాఢత గల ప్రదేశమయిన నీటిలోనికి సమానంగా వ్యాపించే ప్రక్రియ విసరణము.

AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక

కృత్యం – 6

9. కాపర్ సల్ఫేటు స్ఫటికంను నీటిలో ఉంచినపుడు విసరణ జరుగు ప్రక్రియను వివరించుము.
జవాబు:

  1. కాపర్ సల్ఫేట్ స్పటికం ఒక దానిని శ్రావణం సహాయంతో పెట్రేడిష్ మధ్యలో ఉంచాలి.
  2. జాగ్రత్తగా పెట్టాడిలో నీరు పోయాలి.
  3. నీటిలో కాపర్ సల్ఫేట్ నీలం రంగు విస్తరించడం ప్రతి నిమిషానికి గమనించాలి.
  4. పెట్రెడిష్ మధ్య నుండి అంచులవరకు వ్యాపించే విధమును పరిశీలించాలి.

పరిశీలనలు:

  1. కాపర్ సల్ఫేట్ స్పటికం నీటిలో కరగడం మొదలవుతుంది.
  2. స్పటికం చుట్టూ ఉన్న నీరు మిగిలిన నీటికన్నా గాఢమైన రంగులో ఉంటుంది.
  3. సమయం గడచిన కొద్దీ నీరు మొత్తం రంగు మారుతుంది.
  4. మొదట నీరు లేత రంగులో ఉండి చివరకు నీరంతా ఒకే రంగులోకి మారుతుంది.

విసరణము :
ఎక్కువ గాఢత గల ప్రదేశం నుండి కాపర్ సల్ఫేట్ అణువులు తక్కువ గాఢత గల ప్రదేశమయిన నీటిలోనికి సమానంగా విస్తరించే ప్రక్రియ.

AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం

SCERT AP 9th Class Biology Study Material Pdf Download 3rd Lesson జంతు కణజాలం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Biology 3rd Lesson Questions and Answers జంతు కణజాలం

9th Class Biology 3rd Lesson జంతు కణజాలం Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
కణజాలం అనగానేమి? (AS 1)
జవాబు:
కణజాలం :
ఒకే నిర్మాణం కలిగి, ఒకే విధమైన విధుల్ని నిర్వర్తించే కణాల సమూహమును కణజాలం అంటారు.

ప్రశ్న 2.
హృదయ కండరం చేసే ప్రత్యేకమైన విధి ఏమిటి? (AS 1)
జవాబు:
హృదయకండరం చేసే ప్రత్యేకమైన విధి : హృదయ కండరం హృదయాన్ని ఆవరించి ఉండి, హృదయంలో సంకోచ వ్యాకోచాలను కలిగిస్తూ రక్త ప్రసరణలో పాత్ర వహిస్తుంది.

ప్రశ్న 3.
ఉండే స్థానం, ఆకారాన్ని అనుసరించి రేఖిత, అరేఖిత కండరాల మధ్య భేదాన్ని రాయండి. (AS 1)
జవాబు:

రేఖిత కందరం అరేఖిత కండరం
నిర్మాణం:
1) ప్రతి కండరం అనేక పొడవైన సన్నటి శాఖా రహితమైన తంతువులను పోలిన కణములను కలిగి ఉంటుంది. కణం స్థూపాకారంలో అనేక కేంద్రకాలను కలిగి ఉంటుంది.
1) కండర కణాలు పొడవుగా సాగదీయబడి కుదురు ఆకారంలో ఉంటాయి. కణంలో ఒకే కేంద్రకం ఉంటుంది.
2) కండరము పొడవుగా అనేక అడ్డుచారలు కలిగి ఉంటుంది. 2) అడ్డుచారలు ఉండవు.
స్థానం :
3) కాళ్ళు, చేతులందు మరియు అస్థిపంజరములోని ఎముకలకు అతికి ఉంటాయి.
3) ఆహారనాళం, రక్తనాళాలు, ఐరిస్, గర్భాశయం మరియు వాయునాళాల్లో ఉంటాయి.

AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం

ప్రశ్న 4.
కింది వాక్యాలు చదివి వాటి పేర్లు రాయండి. (AS 1)
ఎ) మన నోటి లోపలి పొరలలో ఉండే కణజాలం
బి) మానవుల శరీరపు ఎముకలతో కలిసి ఉండే కండరం
సి) జంతువులలో ఆహారపదార్థం రవాణా చేసే కణజాలం
డి) మన శరీరంలో కొవ్వు నిల్వచేసే కణజాలం
ఇ) మెదడులో ఉండే సంయోజక కణజాలం
జవాబు:
ఎ) స్తంభాకార ఉపకళా కణజాలము
బి) స్నాయుబంధనం
సి) రక్తకణజాలం
డి) ఎడిపోజ్ కణజాలం
ఇ) నాడీ కణజాలం

ప్రశ్న 5.
ఈ క్రింది అవయవాల్లో ఎటువంటి కణజాలం ఉంటుంది? (AS 1)
చర్మం, ఎముక, మూత్రపిండ నాళాల అంతర భాగం.
జవాబు:
చర్మం : సరిత ఉపకళా కణజాలము.
ఎముక : సంయోజక కణజాలము.
మూత్రపిండనాళాల అంతర్భాగం : ఘనాకార ఉపకళా కణజాలము.

ప్రశ్న 6.
ఒక్కొక్కసారి మోచేతిని గట్టిగా కొట్టినప్పుడు విద్యుత్ ఘాతం తగిలినట్టు అనిపిస్తుంది. ఎందుకు? (AS 1)
జవాబు:

  1. మానవులలో ముంజేటి లోపల ఎముక అయిన మూర ఎముకతో ఉన్న: నరము లేదా నాడి భుజము నుండి చేయి వరకు వ్యాపిస్తుంది.
  2. ఈ నరము మోచేయి దగ్గర ఉపరితలమునకు వస్తుంది.
  3. ఉపరితలమునకు వచ్చిన నరమునకు కండరముగాని, క్రొవ్వుగాని, ఏ ఇతర మెత్తటి కణజాలము గాని రక్షణ ఇవ్వదు.
  4. చిన్న ప్రేరణలకు కూడా ఈ నరము చాలా ఎక్కువగా ప్రతిస్పందిస్తుంది.
  5. అందువలన మనకు మోచేతి పై దెబ్బ తగిలినపుడు విద్యుత్ తం తగిలినట్టు అనిపిస్తుంది.

ప్రశ్న 7.
రక్తాన్ని ద్రవరూప కణజాలమని ఎందుకు అంటారు? (AS 1)
జవాబు:

  1. రక్తం అన్ని అవయవాల గుండా ప్రవహించుట ద్వారా శరీరములోని రకరకాల కణజాలములను, అవయవములను కలుపుతుంది. అందువలన రక్తమును కదలాడే ద్రవరూప సంయోజక కణజాలం అంటారు.
  2. ఇది మిగతా సంయోజక కణజాలముల కంటే భిన్నమైనది.
  3. రక్తములో రకరకాల కణములు ఉన్నాయి. ప్రతి కణమునకు నిర్దిష్టమైన పని ఉన్నది.
  4. కణేతర మాత్రిక ద్రవరూప ప్లాస్మాతో నిండియుంది. దీనిలో రక్తకణములు స్వేచ్చగా తేలియాడతాయి.
  5. అందువలన రక్తమును ద్రవరూప కణజాలం అంటారు.

ప్రశ్న 8.
రక్తంలో రక్తఫలకికలు లేకపోతే ఏమి జరుగుతుంది? (AS 2)
జవాబు:

  1. రక్తఫలకికలు రక్తాన్ని గడ్డకట్టించడంలో సహాయపడతాయి.
  2. రక్తఫలకికలు లేకపోతే రక్తము గడ్డ కట్టదు. తద్వారా గాయము నుండి రక్తము కారిపోతూనే ఉంటుంది.
  3. ఎక్కువ మొత్తంలో రక్త నష్టం జరిగితే గాయపడిన వ్యక్తి చివరకు చనిపోతాడు.

AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం

ప్రశ్న 9.
మూడు రకాల కండర కణజాలాలలో గల భేదాలను పటం సహాయంతో వివరించండి. (AS 3)
జవాబు:
కండరాలు మూడు రకాలు. అవి : రేఖిత, అరేఖిత మరియు హృదయ కండరాలు.
1) రేఖిత కండరాలు:
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 4

  • ఇవి అస్థిపంజరంలో ఎముకలకు అతికి ఉండి కదలికలకు కారణమవుతాయి.
  • ఇవి మన అధీనంలో ఉంటాయి. కాబట్టి వీటిని నియంత్రిత కండరములు అంటారు.
  • ప్రతి కండరం అనేక పొడవాటి శాఖారహితమైన కణాలను కలిగి ఉండును.
  • ప్రతి కణం కండరం పొడవునా ఉండును.
  • కండరం పొడవునా అనేక అడ్డుచారలు కలిగి ఉంటాయి. కావున వీటిని రేఖిత కండరాలంటారు. వీటిలో అనేక కేంద్రకాలుంటాయి.

2) అరేఖిత కండరాలు :
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 5

  • ఇవి అన్నవాహిక, రక్తనాళాలలో ఉండి సంకోచ వ్యాకోచాలను కలిగిస్తాయి.
  • ఈ కండరాల కదలికలు మన అధీనంలో ఉండవు. కాబట్టి వాటిని అనియంత్రిత కండరాలు అంటారు.
  • ఇవి పొడవుగా సాగదీయబడి, కుదురు ఆకారంలో ఉంటాయి.
  • వీటిలో అడ్డుచారలుండవు. కాబట్టి వీటిని అరేఖిత కండరాలంటారు.
  • ఈ కణాలలో ఒక్క కేంద్రకం మాత్రమే ఉంటుంది. (ఏక కేంద్రకం).

3) హృదయ కండరాలు:
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 6

  • ఈ కండరాలు గుండెలో ఉంటాయి. ఇవి రక్తప్రసరణలో సహాయపడతాయి.
  • ఈ కణాలు శాఖలు కలిగి, పొడవుగా ఉంటాయి.
  • హృదయ కండరంలోని కణాలన్నీ చారలు కలిగి, ఉంటాయి.
  • దీనిలో కదలికలు మన అధీనంలో ఉండవు.
  • నిర్మాణంలో ఇది రేఖిత కండరాన్ని పోలి ఉన్న అనియంత్రిత చర్యలు చూపిస్తుంది.

ప్రశ్న 10.
కిట్ ను ఉపయోగించి మీ రక్తవర్గాన్ని కనుగొనడంలో మీరు అనుసరించిన విధానాన్ని రాయంది. (AS 3)
జవాబు:
ఉద్దేశ్యం : రక్త వర్గాలను కనుగొనడం.

కావలసిన పరికరాలు : రక్త పరీక్ష కిట్, స్లెడ్, మైనపు పెన్సిల్, డిస్పోసబుల్ సూదులు.

కిట్లో లేనివి : దూది, 70% ఆల్కహాల్, పంటిపుల్లలు.

ప్రయోగ విధానం:
1) ఒక తెల్ల పింగాణి పలక. తీసుకొని తుడిచి ఆరబెట్టాలి.
2) తెల్ల పింగాణి పలక మీద సమానదూరంలో మైనపు పెన్సిల్ లో మూడు వృత్తాలను గీయాలి.
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 1
3) ప్రతి వృత్తంలో ఒక్కొక్క సీరంను అంచులు తాకకుండా ఒక చుక్క వేయాలి. (ఉదా : మొదటి వృత్తంలో యాంటీ సీరం ‘A’ను, రెండవదానిలో యాంటీ సీరం ‘B’ ను, మూడవ వృత్తంలో ‘RhD’ సీరంను వేయాలి).
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 2
4) ఎడమచేతి ఉంగరపు వేలిని సర్జికల్ స్పిరిట్లో ముంచిన దూదితో తుడిచి, వేలు మీద సూదిని మెల్లగా గుచ్చి రక్తాన్ని బయటకు తీయాలి.
5) వేలుని కొద్దిగా ఒత్తుట వలన రక్తం రావడం మొదలవుతుంది.
6) ఒక చుక్క రక్తాన్ని వృత్తంలో పడేలా బొటనవేలితో వేలిని ఒత్తాలి. ఆ రక్తపు చుక్కలను సీరం ఎ, బి, RhD లకు కలపాలి.
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 3
7) మూడు వృత్తాలలో రక్తం సేకరించిన తర్వాత వేలి మీద సూదితో గుచ్చినచోట ఇంతకుముందు ఉంచిన దూదితో అణచి పెట్టాలి.
8) మూడు వేరు వేరు పంటి పుల్లలను తీసుకొని రక్తం, సీరంలను బాగా కలపాలి.
9) ఏ వృత్తములోనైనా రక్తం గడ్డ కట్టిందేమో పరిశీలించాలి. పారదర్శక ద్రవంలో చిన్న చిన్న తునకలుగా రక్తం గడ్డకట్టి తేలి ఉండేటట్లు ఉందేమో గమనించాలి.
10) ‘Rh’ వృత్తం వద్ద రక్తం గడ్డకట్టడానికి కొంచెం సమయం తీసుకుంటుంది.

ఫలిత నిర్ధారణ :
ఫలితాల అనుగుణంగా రక్తవర్గాన్ని నిర్ధారించవచ్చు. ఇందుకోసం కింది పట్టిక సహాయం తీసుకోవాలి.

యాంటి – ఎ యాంటి – బి రకం
రక్తం గడ్డకట్టింది రక్తం గడ్డకట్టలేదు
రక్తం గడ్డకట్టలేదు రక్తం గడ్డకట్టింది బి
రక్తం గడ్డకట్టింది రక్తం గడ్డకట్టింది ఎబి
రక్తం గడ్డకట్టలేదు రక్తం గడ్డకట్టలేదు

అలాగే RhD కారకంలో రక్తం గడ్డకట్టితే Rh* రక్తం, రక్తం గడ్డకట్టకపోతే Rh” అవుతుందని గమనించాలి.

AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం

ప్రశ్న 11.
మీ దగ్గర బంధువు/స్నేహితుల పాత రక్తనమూనాలను సేకరించి అందులోని అంశాల ఆధారంగా ఒక ప్రాజెక్టు నివేదికను తయారుచేయండి. (AS 4)
జవాబు:
నేను నా స్నేహితుని పాత రక్త నమూనాను పరిశీలించాను. అది క్రింది విధంగా ఉంది.
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 7

Random blood sugar 115 mg/dl (80 – 140 mg/dl)
Microscopic -2 – 4 puscells / Hp of seen Malaria – Negative (-ve)
దీని ఆధారంగా తెల్లరక్త కణాల సంఖ్య సరైన మోతాదులో ఉందని గుర్తించాను. చీము కణాలు కణించటం వలన స్వల్పంగా ఇన్ ఫెక్షన్ ఉన్నట్లుగా భావించవచ్చు మలేరియా పరీక్ష ఋణాత్మకం కావున, రక్తంలో మలేరియా పరాన్నజీవి లేదని నిర్ధారించవచ్చు.

ప్రశ్న 12.
నాడీకణం పటం గీచి, భాగాలు రాయండి. (AS 5)
జవాబు:
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 8

ప్రశ్న 13.
రాము బలహీనంగా కనిపించడం చేత, వాళ్ళ నాన్న అతడిని ఆసుపత్రికి తీసుకుపోయాడు. డాక్టర్ రక్తపరీక్ష చేయించి రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉందని చెప్పారు. హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే జరిగే పరిణామాలను చర్చించి వ్రాయండి. (AS 6)
జవాబు:
హిమోగ్లోబిన్ తక్కువగా ఉండుట వలన కలిగే దుష్ఫలితాలు :

  1. రక్తము ఎర్రగా ఉండటానికి కారణం ఎరుపు వర్ణపు ప్రోటీను హిమోగ్లోబిన్.
  2. హిమోగ్లోబిన్ ఆక్సిజన్ మరియు కార్బన్ డై ఆక్సెడులను రవాణా చేయటంలో సహాయపడుతుంది.
  3. హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే అది రక్తహీనతకు దారితీస్తుంది.
  4. రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే కణజాలాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. దీని వలన తక్కువగా ఊపిరి ఆడటం జరుగుతుంది.
  5. తక్కువ హిమోగ్లోబిన్ స్థాయి గుండెకు సంబంధించిన సమస్యలను ఎక్కువ చేస్తుంది.
  6. తక్కువ హిమోగ్లోబిన్ స్థాయి వలన మనుష్యులు ఎక్కువగా నీరసించిపోతారు. కణములు క్రియలను నిర్వహించడానికి కావలసిన ఆమ్లజని సరఫరా లేకపోవడం ప్రధాన కారణం.

ప్రశ్న 14.
రోగనిర్ధారణలో రక్తపరీక్ష యొక్క ఆవశ్యకతను నిజజీవిత సన్నివేశంలో వివరించండి. (AS 7)
జవాబు:
నా పేరు వివేక్. రెండు నెలల క్రితం నాకు జ్వరం వచ్చింది. మా నాన్న దగ్గరలో ఉన్న ఆర్.ఎం.పి వైద్యుని వద్దకు తీసుకెళ్ళాడు. అతను పరీక్షించి ఇంజక్షన్ చేసి మందులు ఇచ్చాడు. అవి వాడినప్పటికి జ్వరం తగ్గలేదు. ఐదు రోజుల గడచిపోయాయి. నేను బాగా నీరసించిపోయాను. అప్పుడు మా నాన్న నన్ను పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. డాక్టర్ పరీక్షించి రక్తపరీక్ష చేయించమన్నాడు. మలేరియా, టైఫాయిడ్, వైరల్ జ్వరాల కొరకు రక్తపరీక్ష నిర్వహించారు.

రక్తపరీక్షలో టైఫాయిడ్ అని తేలింది. డాక్టర్ ధైర్యం చెప్పి మందులను కోర్స్ గా పదిహేను రోజుల పాటు వాడారు. నేను వ్యాధి నుండి , కోలుకున్నాను. వ్యాధిని నిర్ధారించటంలో రక్తపరీక్ష యొక్క ఆవశ్యకత నాకు అర్థమైంది. రక్తపరీక్ష ద్వారా అనేక వ్యాధులను నిర్ధారిస్తారని తెలుసుకొన్నాను. వ్యాధిని సరిగా నిర్ధారించకుండా చికిత్స చేయటం కూడా ప్రమాదకరమని తెలుసుకొన్నాను.

9th Class Biology 3rd Lesson జంతు కణజాలం Textbook Activities (కృత్యములు)

ప్రయోగశాల కృత్యము – 1

ఉద్దేశ్యం : సేకరించిన నమూనా నుండి కణజాలాలు గుర్తించుట.

కావలసిన పరికరాలు : మైక్రోస్కోప్, స్లెడ్, సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం, శ్రావణాలు, బ్రష్,

ప్రయోగ విధానం :

  1. మీ దగ్గరలో ఉండే మాంసం అమ్మే చోటికి వెళ్ళి చిన్న కోడి మాంసం ముక్కని ఎముకతో సహా సేకరించాలి.
  2. మాంసం ముక్కను రెండు గంటల పాటు సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో ఉంచాలి. దాని నుండి పలుచని చర్మ భాగాన్ని తీసుకోవాలి.
  3. దాంట్లోని చిన్న భాగాన్ని శ్రావణం సహాయంతో ఒక స్లెడ్ పైన ఉంచాలి.
  4. మరొక సైడ్ ను దానిమీద ఉంచి రెండు స్లెట్లను గట్టిగా అణచి నొక్కాలి. చర్మపు పొర మరింత పలుచగా స్లెడ్ మీద పరుచుకుంటుంది.
  5. ఈ సైడ్ ను సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించాలి. మీ ల్యాబ్ రికార్డులో దాని పటాన్ని గీయాలి.
  6. ఇచ్చిన పటంతో మీరు గీసిన పటాన్ని పోల్చండి.

AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 9

ప్రశ్నలు:
1. రెండూ ఒకే మాదిరిగా ఉన్నాయా?
జవాబు:
ఒకే మాదిరిగా ఉన్నాయి.

2. అన్ని కణాలు ఒకేలా ఉన్నాయా?
జవాబు:
అన్ని కణాలు ఒకేలా ఉన్నాయి.

3. వాటి అమరిక ఏ విధంగా ఉంది?
జవాబు:
కణాలు వరుసలలో పొరలాగా అమరి ఉన్నాయి.

4. ఈ కణాలన్నీ దగ్గర దగ్గరగా అమరి ఉన్నాయా? ఒక త్వచం లేదా పొర మాదిరిగా ఏర్పడినాయా?
జవాబు:
కణాలు దగ్గర దగ్గరగా అమరి త్వచం లేదా పొర మాదిరిగా ఏర్పడినాయి.

5. కణాల మధ్య ఖాళీ ప్రదేశాలు లేదా కణాంతర అవకాశం ఉన్నదా?
జవాబు:
ఖాళీ ప్రదేశాలు లేవు.

AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం

కృత్యం – 1

1. ఒక శుభ్రమైన స్పూనిగాని, ఐస్క్రీం పుల్లగాని తీసుకొని మీ బుగ్గ లోపలి భాగంలో ఉన్న సన్నని పొరని గీకాలి.
2. ఒక పలుచని పొరను స్పూన్ నుండి సేకరించి ఒక సైడ్ పైన ఉంచి సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించాలి.
3. పరిశీలించిన దాని పటాన్ని మీ నోట్ పుస్తకంలో గీయాలి.
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 10

ప్రశ్నలు :
1. కణాలన్నీ ఏ విధంగా అమరి ఉన్నాయి?
జవాబు:
కణాలు అన్ని పలుచగా, బల్లపరుపుగా అమరి ఉన్నాయి.

2. కణాల మధ్య కణాంతర అవకాశాలు ఉన్నాయా?
జవాబు:
కణాల మధ్య కణాంతర అవకాశాలు లేవు.

3. చర్మంలో ఇవి ఎందుకు అనేక వరుసలలో అమరియుంటాయో ఒకసారి ఆలోచించండి?
జవాబు:
చర్మము మన శరీరానికి రక్షణ ఇస్తుంది. అందువలన ఇవి అనేక వరుసలలో అమరి ఉంటాయి.

4. మీరు వేడి టీ/ కాఫీగాని, చల్లని పానీయం గానీ తాగేటప్పుడు ఎలా అనిపిస్తుంది?
జవాబు:
వేడి టీగాని, కాఫీగాని తాగినపుడు నోరు కాలుతుంది. బయటకు ఊస్తాము. చల్లని పానీయం తాగినపుడు నోటిలోపలి పొరలు చల్లదనాన్ని భరించలేవు.

5. ఒకవేళ చర్మం కాలిపోయినట్లయితే ఏ కణజాలం దెబ్బతినే అవకాశం ఉంటుంది?
జవాబు:
ఉపకళా కణజాలం.

కృత్యం – 2

ఘనాకార ఉపకళ కణజాలాన్ని పరిశీలిద్దాం.

1. మీ పాఠశాలలో ఉన్న సైడ్ పెట్టి నుండి ఘనాకార ఉపకళా శాశ్వత సైడ్ ను తీసుకొని సూక్ష్మదర్శిని సహాయంతో జాగ్రత్తగా పరిశీలించాలి.
2. పరిశీలించిన దాని పటాన్ని మీ నోట్ పుస్తకంలో గీయాలి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 11

1. కణాలన్నీ ఎలా అమరి ఉన్నాయి?
జవాబు:
ఘనాకారపు కణాలు దగ్గర దగ్గరగా, కణాంతర అవకాశాలు లేకుండా అమరి ఉన్నాయి.

AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం

ప్రయోగశాల కృత్యము -2

ఉద్దేశ్యం :
సేకరించిన నమూనా నుండి కణజాలాలు గుర్తించుట.

కావలసిన పరికరాలు : మైక్రోస్కోప్, స్లెడ్, రక్త నమూనా, సిరంజి, దూది.

ప్రయోగ విధానం :

  1. ఒక క్రిమిరహితం చేసిన సిరంజి మరియు సూదిని తీసుకోవాలి.
  2. ఉపాధ్యాయుని సహాయంతో మీ వేలినుండి ఒక చుక్క రక్తం తీసుకోవాలి.
  3. జాగ్రత్తగా రక్తపు బొట్టును ఒక సైడ్ పైన రుద్దాలి.
  4. వేరొక సైడ్ సహాయంతో ఒక పలుచని పొర ఏర్పడేటట్లు అడ్డంగా రుద్దాలి.
  5. సూక్ష్మదర్శిని సహాయంతో సైడ్ ను పరిశీలించాలి.
  6. మీరు పరిశీలించిన అంశాల పటం గీచి, దానిని ఇవ్వబడిన పటంతో పోల్చాలి.

AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 12

ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి.

1. సైట్లో ఏమి పరిశీలించావు?
జవాబు:
రక్తములో ప్లాస్మాను, రక్తకణములను పరిశీలించాను.

2. ఏమైనా కణాలు కనబడుతున్నాయా?
జవాబు:
కనబడుతున్నాయి.

3. దానిలోని అన్ని కణాలు ఒకే రకంగా ఉన్నాయా?
జవాబు:
లేవు.

4. ద్రవరూపంలో ఉన్న పదార్థం ఏమైనా ఉన్నదా?
జవాబు:
ద్రవరూప ప్లాస్మా ఉన్నది.

15. రక్తం కూడా ఒక కణజాలమే అని ఒప్పుకుంటావా?
జవాబు:
అవును. రక్తం కూడా ఒక ద్రవరూప కణజాలమే.

కృత్యం – 3

1. పాఠశాల ప్రయోగశాల నుండి స్తంభాకార ఉపకళా కణజాలం యొక్క సైడ్ ను తీసుకుని సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించాలి.
2. మీరు పరిశీలన చేసిన దాని పటాన్ని గీయాలి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 13

ప్రశ్నలు :
1. మీరు పరిశీలన చేసిన దాని పటాన్ని గీయండి.
జవాబు:
విద్యార్థి కృత్యము.

2. మీరు పరిశీలించిన కణాల్లో చిన్న కేశాల వంటి నిర్మాణాలు కనిపిస్తున్నాయా?
జవాబు:
అవును కనిపిస్తున్నాయి.

AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం

ప్రయోగశాల కృత్యము – 3

ఉద్దేశ్యం : సేకరించిన నమూనా నుండి కణజాలాలు గుర్తించుట.

కావలసిన పరికరాలు : మైక్రోస్కోప్, సైడ్, సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం, శ్రావణాలు, బ్రష్

ప్రయోగ విధానం :

  1. సేకరించిన మాంసం ముక్క నుండి కొంచెం కండరం తీసుకోవాలి.
  2. దీనిని సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంలోగాని, వెనిగర్ లో గాని రెండు గంటల పాటు నానబెట్టాలి.
  3. దానిలో నుండి ఒక పలుచని ముక్కని శ్రావణం ద్వారా తీసుకొని ఒక స్లెడ్ పైన ఉంచాలి.
  4. దానిపైన ఇంకో సైడ్ పెట్టి నెమ్మదిగా నొక్కాలి.
  5. సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించిన దాని పటం గీయాలి.
  6. రెండు పటాలను పోల్చాలి.

AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 14

ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి.

1. కణాలన్నీ ఎలా అమరి ఉన్నాయి?
జవాబు:
కణాలన్నీ వరుసలలో ఒకదానిపై ఒకటి అమరి ఉన్నాయి.

2. త్వచకణజాలానికి, కండరకణజాలానికి మధ్య ఏమైనా తేడాలున్నాయా?
జవాబు:
కండర కణాలు పొడవుగా, సాగదీయబడి కేంద్రకమును కలిగి ఉన్నాయి.

ఎముకను పరిశీలించుట :
మాంసం ముక్క నుండి ఎముకను వేరుచేసి దాదాపు ఒక రోజంతా సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంలోగాని, వెనిగర్ లోగాని ఉంచి నానబెట్టాలి. ఒక కత్తి సహాయంతో ఎముక నుంచి పలుచని ముక్కను కోయాలి. రెండు స్లె మధ్య అణచి పెట్టాలి. ఎముక ఉన్న సైడ్ ని సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించాలి.

3. ఇంతకు ముందు చూసిన కణజాలానికి, ఇప్పుడు చూసిన దానికి ఏమైనా సంబంధాలున్నాయా?
జవాబు:
సాధారణంగా ఎముక కండరముతో కలుపబడి ఉంటుంది.

4. ఈ కణజాలాలు చలనానికి సహాయపడతాయా?
జవాబు:
సహాయపడతాయి.

5. అన్ని రకాల కణజాలాలు ఒకే రకమైన విధులు నిర్వర్తిస్తాయా?
జవాబు:
లేదు. వేరు వేరు కణజాలాలు రకరకాల విధులు నిర్వహిస్తాయి.

కృత్యం – 4

రక్తకణజాలం

1. మీ గ్రామంలోని ఆరోగ్య కేంద్రంలో ఉండే ఆరోగ్య కార్యకర్తలను లేదా రోగ నిర్ధారణ చేసే నిపుణుడిని మీ తరగతికి ఆహ్వానించాలి.
2. అతనితో రక్తం యొక్క నిర్మాణం, విధులపై ఒక ముఖాముఖి ఏర్పాటు చేయాలి.
3. ముఖాముఖి ఏర్పాటు చేసే ముందు ఒక ప్రశ్నావళి తయారుచేయాలి.
4. ముఖాముఖి పూర్తి అయిన తరువాత రక్తంపై ఒక చిన్న పుస్తకం తయారు చేయాలి.
5. ఆ చిన్న పుస్తకాన్ని గ్రంథాలయంలో ఉంచాలి. బులెటిన్ బోర్డుపై ప్రదర్శించాలి.
జవాబు:
రక్తం గురించిన చిన్న పుస్తకం :

  1. రక్తం ద్రవరూప కణజాలం.
  2. రక్తంలో వివిధ రకాలయిన కణజాలాలున్నాయి. ప్రతీది భిన్నమైన నిర్దిష్టమైన పనిని నిర్వహిస్తుంది.
  3. ఈ కణాలన్నీ ప్లాస్మాలో స్వేచ్ఛగా తేలియాడుతూ ఉంటాయి.
  4. కణబాహ్య ప్రదేశం ద్రవపదార్థమైన ప్లాస్మాతో నింపబడి ఉంటుంది. రక్తం సంధాయక కణజాలమైనప్పటికీ రక్తంలో తంతువులు ఉండవు.
  5. ఒక ప్రౌఢ మానవుని శరీరంలో 5 లీటర్ల రక్తం ఉంటుంది. రక్తంలో ఒక అంశం అయిన ప్లాస్మాలో ఎక్కువ శాతం నీరే ఉంటుంది.
  6. నీటితో పాటు ఇందులో గ్లూకోజు, ఎమినో యాసిడ్ల వంటి రకరకాల పోషకాలు కూడా ఉంటాయి.
  7. రక్తం గడ్డకట్టడానికి కావలసిన అనేక కారకాలు కూడా ప్లాస్మాలో ఉంటాయి. రక్తం రక్తనాళాలలో గడ్డకట్టకుండా హిపారిన్ అనే పదార్థం ఉపయోగపడుతుంది.
  8. రక్త కణాలు మూడు రకాలు 1. ఎర్ర రక్తకణాలు 2. తెల్ల రక్తకణాలు. 3. రక్తఫలకికలు.
    AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 12
  9. ఎర్ర రక్తకణాలను ఎరిత్రోసైటులు అంటారు. హిమోగ్లోబిన్ ఉండుట వలన ఇవి ఎర్రగా ఉంటాయి.
  10. హిమోగ్లోబిన్ ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సెల రవాణాలో ,సహాయపడుతుంది.
  11. శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు రక్త కణాలు కాలేయం మరియు పిత్తాశయంలో తయారవుతాయి. ప్రౌఢ మానవులలో ఎముకలలో ఉండే మజ్జలో తయారవుతాయి.
  12. ఎర్ర రక్త కణాలు 120 రోజులు జీవిస్తాయి.
  13. రక్తంలో గల రెండవ రకపు కణాలు తెల్ల రక్తకణాలు. వీటిల్లో హిమోగ్లోబిన్ ఉండదు కాబట్టి వర్ణరహితంగా ఉంటాయి. వీటిని ల్యూకోసైటులు అంటారు.
  14. తెల్లరక్తకణాలు రెండు రకాలు – కణికాభకణాలు, కణికరహిత కణాలు.
  15. కణికాభ కణాలలో న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్ మరియు ఇసినోఫిల్స్ అని మూడు రకాలు ఉన్నాయి.
  16. ఇవి రక్తంలోకి ప్రవేశించిన సూక్ష్మజీవులను ఎదుర్కొని నాశనం చేస్తాయి.
  17. కణిక రహిత కణాలు లింఫోసైట్స్ మరియు మోనోసైట్స్ అని రెండు రకాలు.
  18. లింఫోసైట్స్ రక్తంలోకి వచ్చిన బాహ్య పదార్థాలను ఎదుర్కొని ప్రతిదేహాలను తయారు చేస్తాయి. లింఫోసైటులను సూక్ష్మరక్షక భటులంటారు.
  19. మోనోసైటులు రక్తంలో అమీబా మాదిరిగా కదులుతూ బాహ్య పదార్థాలను ఎదుర్కొని భక్షించి నాశనం చేస్తాయి. మోనోసైట్లను పారిశుద్ధ్య కార్మికులు అంటారు.
  20. రక్తఫలకికలకు కేంద్రకం ఉండదు. ఇవి రక్తం గడ్డకట్టడానికి సహాయపడతాయి.

AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం

ప్రయోగశాల కృత్యము – 4

రక్త వర్గాన్ని కనుగొనటానికి నీవు చేసిన ప్రయోగాన్ని వివరింపుము.

ఉద్దేశ్యం : రక్త వర్గాలను కనుగొనడం.

కావలసిన పరికరాలు : రక్త పరీక్ష, కిట్, సైడ్, మైనపు పెన్సిల్, డిస్పోసబుల్ సూదులు.

కిట్లో ఉండవలసిన పరికరాలు :
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 15

కిట్లో లేనివి : దూది, 70% ఆల్కహాల్, పంటి పుల్లలు.

ప్రయోగ విధానం :
1) ఒక తెల్ల పింగాణి పలక తీసుకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి.
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 1
2) పటంలో చూపినట్లు తెల్ల పింగాణి పలక మీద ఒక మైనపు పెన్సిల్ లో మూడు వృత్తాలు గీయాలి. వృత్తాలను వేరుచేస్తూ అడ్డగీతలు గీయాలి.
3) ప్రతి వృత్తంలో పైన పేర్కొనిన మూడు సీరమ్ లు తీసుకొని ఒక్కొక్క చుక్క పటంలో చూపిన విధంగా అంచులలో వేయాలి.
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 2
4) ఎడమ చేతి ఉంగరపు వేలిని సర్జికల్ స్పిరిట్ ముంచిన దూదితో తుడిచి, సూదిని మెల్లగా గుచ్చి బయటకు తీయాలి.
5) వేలుని కొద్దిగా ఒత్తాలి – రక్తం రావడం మొదలవుతుంది.
6) ఒక చుక్క రక్తాన్ని వృత్తంలో పడేలా బొటన వేలితో వేలిని ఒత్తాలి. ఆ రక్తం చుక్కలను సీరంలు ఎ, బి, RhDని ఒక చొప్పున కలపాలి.
7) మూడు వృత్తాలలో రక్తం సేకరించిన తరువాత వేలిమీద సూదితో గుచ్చిన చోట ఇంతకు ముందు ఉంచిన దూదితో అణచిపెట్టాలి.
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 3
8) ఒక పంటి పుల్లను తీసుకొని సీరమ్ ను, రక్తాన్ని జాగ్రత్తగా కలపండి. వేరు వేరు వృత్తాలకు వేరు వేరు పంటి పుల్లలను ఉపయోగించి కలపాలి.
9) ఏ వృత్తాలలోనైనా రక్తం గడ్డకట్టిందేమో పరిశీలించాలి. ‘ఆర్ హెచ్’ వృత్తం వద్ద రక్తం గడ్డకట్టడానికి కొంచెం సమయం తీసుకుంటుంది.

ఫలిత నిర్ధారణ :
ఫలితాలకు అనుగుణంగా రక్తవర్గాన్ని నిర్ధారించవచ్చు. కింది పట్టిక సహాయం తీసుకోవాలి.

రక్తం వర్గం నిర్ధారించటం.

యాంటి – ఎ యాంటి – బి రకం
రక్తం గడ్డకట్టింది రక్తం గడ్డకట్టలేదు
రక్తం గడ్డకట్టలేదు రక్తం గడ్డకట్టింది బి
రక్తం గడ్డకట్టింది రక్తం గడ్డకట్టింది ఎబి
రక్తం గడ్డకట్టలేదు రక్తం గడ్డకట్టలేదు

అలాగే ఆర్ హెడ్ కారకంలో గాని రక్తం గడ్డకడితే Rh+ రక్తం గడ్డకట్టకపోతే Rh అవుతుంది.

గమనించిన ఫలితాలు పట్టికలో నమోదు

విద్యార్థి పేరు రక్తవర్గం
1. పి. ప్రణయ O
2. పి. ప్రబంధ O
3. పి. ప్రమోద A
4. వి. ఉమాదేవి A
5. కె. అనసూయ AB
6. యమ్. రాము B
7. ఎస్. రవి. A
8. ఎల్. లక్ష్మీకాంత్ AB
9. కె. గోపాల్ B
10. జి. ఉదయకిరణ్ B

AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం

కృత్యం – 5

5. మీ పాఠశాల ప్రయోగశాల నుండి మూడు రకాల కండరాల సైడ్ తీసుకొని సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించండి. పరిశీలించిన అంశాలు క్రింది పట్టికలో నమోదు చేయండి.
జవాబు:

రేఖిత కండరాల లక్షణాలు అరేఖిత కండరాల లక్షణాలు హృదయ కండర లక్షణాలు
1. నియంత్రిత కండరాలు అనియంత్రిత కండరాలు అనియంత్రిత కండరాలు
2. కండరాల పొడవుగా అనేక అడ్డు చారలు కలిగి ఉంటాయి. పొడవుగా ఉంటాయి. అడ్డు చారలు ఉండవు. కణాలు చారలతో ఉంటాయి.
3. ప్రతి కండరం అనేక పొడవైన సన్నటి శాఖారహితమైన తంతువులు పోలిన కణాలు ఉంటాయి. చాలా కేంద్రకాలు ఉంటాయి. కండరాలు పొడవుగా సాగదీయబడిన కుదురు ఆకారంలో ఉంటాయి. ఒకే కేంద్రకం ఉంటుంది. కణాలు పొడవుగా, శాఖలు కలిగి ఉంటాయి. చాలా కేంద్రకాలు ఉంటాయి.
4. ఈ కండరాలు కాళ్ళు, చేతులతో ఉంటాయి. ఆహార వాహిక, రక్తనాళాలు ఐరిస్, గర్భాశయంలో ఉంటాయి. హృదయంనందు ఉంటాయి.

కృత్యం – 6

1. పాఠశాల ప్రయోగశాల నుండి నాడీకణం సైడ్ ను తీసుకొని సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించాలి.
2. పరిశీలించిన అంశాలు నోటు పుస్తకంలో రాయాలి.
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 8
జవాబు:

  1. నాడీ కణాలను మూడు భాగాలుగా విభజించవచ్చు. 1. కణదేహం, 2. ఆక్టాన్, 3. డెండ్రైటులు.
  2. నాడీ కణదేహంలో ఉన్న జీవద్రవంలో ఒక కేంద్రకం తేలియాడుతూ ఉంటుంది. జీవద్రవంలో కొన్ని గ్రంథిరూప కణాలుంటాయి. వీటిని నిస్సల్ కణికలు అంటారు.
  3. కణదేహం నుండి బయటకు వచ్చిన నిర్మాణాలను డెండ్రైటులు అంటారు. ఇది శాఖలు కలిగి మొనదేలి ఉంటాయి.
  4. కణదేహం నుండి ఒకే ఒక్క పొడవాటి నిర్మాణం బయలుదేరుతుంది. దీనిని తంత్రిరాక్షం లేదా ఆక్లాస్ అంటారు.
  5. ఆక్టాన్లో కొంత భాగం ఒక పొరతో కప్పబడి ఉంటుంది. ఆ త్వచాన్నే మెయిలిన్ త్వచం అంటారు.
  6. ఆక్టాన్లో ఉండే కణుపుల వంటి భాగాన్ని రాన్ వియర్ సంధులు అంటారు.

AP Board 9th Class Biology Solutions 2nd Lesson వృక్ష కణజాలం

SCERT AP 9th Class Biology Guide Pdf Download 2nd Lesson వృక్ష కణజాలం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Biology 2nd Lesson Questions and Answers వృక్ష కణజాలం

9th Class Biology 2nd Lesson వృక్ష కణజాలం Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
ఈ పదాలను నిర్వచించండి. (AS 1)
ఎ) కణజాలం
బి) విభాజ్య కణజాలం
సి) త్వచ కణజాలం
జవాబు:
ఎ) కణజాలం :
ఒకే నిర్మాణం కలిగి, ఒకే విధమైన విధుల్ని నిర్వర్తించే కణాల సమూహమును కణజాలం అంటారు.

బి) విభాజ్య కణజాలం :
పెరుగుతున్న భాగాల్లో ఉండే, విభజన చెందగలిగే కణజాలంను విభాజ్య కణజాలం అంటారు.

సి) త్వచ కణజాలం :
మొక్క భాగాలను వెలుపల కప్పి ఉంచే కణజాలంను త్వచ కణజాలం అంటారు. మొక్కకు రక్షణ ఇస్తుంది.

ప్రశ్న 2.
కింది వాటి మధ్య భేదములను తెల్పండి. (AS 1)
జవాబు:
ఎ) విభాజ్య కణజాలం, సంధాయక కణజాలం

విభాజ్య కణజాలం సంధాయక కణజాలం
1. ఎప్పుడూ విభజన చెందగలిగిన కణాలు ఉంటాయి. 1. విభజన చెందలేని కణాలు ఉంటాయి.
2. ఇది సరళ కణజాలం. 2. ఇది సరళ లేదా సంక్లిష్ట కణజాలం.
3. దీని యందు సజీవ కణాలు ఉంటాయి. 3. దీని యందు సజీవ (లేదా) నిర్జీవ కణములు ఉండవచ్చు.
4. చిక్కని జీవపదార్థము కణమునందు ఉంటుంది. 4. పలుచని జీవపదార్ధము కణము నందు ఉంటుంది.

బి) అగ్ర విజ్య కణజాలం, పార్శ్వ విభాజ్య కణజాలం

అగ్ర విభాజ్య కణజాలం పార్శ్వ విభాజ్య కణజాలం
1. వేరు, కాండం శాఖల అగ్రభాగాలలో ఉంటుంది. 1. మొక్క దేహం యొక్క పార్శ్వ అంచుల వద్ద ఉంటుంది.
2. వేరు, కాండములు పొడవుగా పెరగటానికి తోడ్పడతాయి. 2. కాండాలు, వేర్లు మందంలో పెరుగుదల చెందడానికి తోడ్పడతాయి.

సి) మృదు కణజాలం, స్థూలకోణ కణజాలం

మృదు కణజాలం స్థూలకోణ కణజాలం
1. మృదు కణజాల కణాలు మృదువుగా, పలుచని గోడలు కలిగి, వదులుగా అమరి ఉంటాయి. 1. స్థూలకోణ కణజాల కణాలు దళసరి గోడలను కలిగి కొంచెం పొడవైన కణాలు కలిగి ఉంటాయి.
2. మృదు కణజాల కణాలు ఆహారనిల్వ చేస్తాయి. హరితరేణువులు మరియు పెద్దగాలి గదులను కలిగి ఉంటాయి. 2. ఇది కాండపు లేత కణజాలమునకు యాంత్రిక బలాన్ని ఇస్తుంది.
3. కణకవచాలు, అసమాన మందంలో ఉంటాయి. 3. సెల్యులోజ్ తయారయిన కణకవచము ఉంటుంది.
4. కణాలు అండాకారంగా, గోళాకారంగా లేదా దీర్ఘచతురస్రాకారంగా ఉంటాయి. 4. కణములు సాగి గుండ్రంగా గాని, గోళాకారంలోగాని ఉంటాయి.

డి) దృఢ కణజాలం, మృదు కణజాలం

దృఢ కణజాలం మృదు కణజాలం
1. ఇది నిర్జీవ కణజాలం. 1. ఇది సజీవ కణజాలం.
2. కణకవచాలు మందంగా ఉంటాయి. 2. కణకవచాలు పలుచగా ఉంటాయి.
3. కణాల మధ్య ఖాళీ ప్రదేశాలు ఉండవు. 3. కణాల మధ్య ఖాళీ ప్రదేశాలు ఉంటాయి.
4. ఇది మొక్కకు యాంత్రిక బలాన్ని ఇస్తుంది. 4. ఇది ఆహారనిల్వకు, కిరణజన్య సంయోగక్రియ జరుపుటకు మరియు మొక్కలు నీటిలో . తేలుటకు ఉపయోగపడుతుంది.

AP Board 9th Class Biology Solutions 2nd Lesson వృక్ష కణజాలం

ఇ) దారువు, పోషక కణజాలం

దారువు పోషక కణజాలం
1. నీరు-పోషకాలను వేర్ల నుండి మొక్క అగ్రభాగాలకు సరఫరా చేస్తుంది. 1. ఆకు నుండి ఆహారపదార్ధములను మొక్క పెరుగుదల భాగాలకు సరఫరా చేస్తుంది.
2. దారువు నందు దారు కణములు, దారునాళములు, దారునారలు మరియు దారుమృదు కణజాలం ఉంటాయి. 2. పోషక కణజాలం నందు చాలనీ కణాలు చాలనీ నాళాలు, సహకణాలు పోషక కణజాల నారలు మరియు పోషక కణజాల మృదుకణజాలం ఉంటాయి.
3. దారు మృదుకణజాలం సజీవ కణజాలం. 3. పోషక కణజాల నారలు నిర్జీవ కణాలు.

ఎఫ్) బాహ్యచర్మం, బెరదు

బాహ్య చర్మం బెరడు
1. కాండము, వేరు, ఆకునందు వెలుపల ఉండు పొర. 1. బాహ్య చర్మం మీద అనేక వరుసలలో ఏర్పడినది బెరడు.
2. బాహ్య చర్మం సజీవ కణజాలం. 2. బెరడు నిర్జీవ కణజాలం.

ప్రశ్న 3.
నా పేరేంటో చెప్పండి. (AS 1)
ఎ) నేను మొక్క పొడవులో పెరుగుదలకు కారణమైన పెరుగుదల కణజాలాన్ని
బి) నేను మొక్కలలో వర్తులంగా పెరుగుదలకు కారణమైన పెరుగుదల కణజాలాన్ని
సి) నేను నీటి మొక్కల్లో పెద్ద గాలి గదుల్ని కలిగి ఉండే మృదు కణజాలాన్ని
డి) నేను ఆహారపదార్థాన్ని కలిగి ఉండే మృదు కణజాలాన్ని
ఇ) నేను వాయు మార్పిడికి, బాష్పోత్సేకానికి అత్యవసరమైన రంధ్రాన్ని
జవాబు:
ఎ) అగ్ర విభాజ్య కణజాలం
బి) పార్శ్వ విభాజ్య కణజాలం
సి) వాయుగత కణజాలం
డి) నిల్వచేసే కణజాలం
ఇ) పత్రరంధ్రం

ప్రశ్న 4.
కింది వాటి మధ్య పోలికలు రాయండి. (AS 1)
జవాబు:
ఎ) దారువు, పోషక కణజాలం

దారువు పోషక కణజాలము
1. దారువు నీరు మరియు పోషక పదార్థములను వేర్ల నుండి మొక్క అగ్రభాగాలకు సరఫరా చేస్తుంది. 1. ఇది ఆకుల నుండి ఆహార పదార్ధములను మొక్క ఇతర భాగాలకు సరఫరా చేస్తుంది.
2. దారుకణాలు, దారునాళాలు, దారునారలు మరియు దారు మృదుకణజాలంలు దీనియందు ఉంటాయి. 2. పోషక కణజాలం నందు చాలనీ కణాలు చాలనీ నాళాలు, సహకణాలు, పోషక కణజాల నారలు మరియు పోషక కణజాల మృదుకణజాలం ఉంటాయి.
3. దారు మృదుకణజాలం మాత్రమే సజీవ కణజాలం. 3. చాలనీ కణాలు, చాలనీ నాళాలు, సహకణాలు మరియు పోషక మృదుకణజాలంలు సజీవ కణజాలాలు.
4. దారుకణాలు, దారునాళాలు, దారునారలు నిర్జీవ కణజాలంలు. 4. పోషక కణజాల నారలు మాత్రమే నిర్జీవ కణజాలం.
5. మొక్కకు యాంత్రిక బలాన్ని ఇస్తుంది. 5. మొక్కకు యాంత్రిక బలమును ఇవ్వదు.
6. దారువు నీటి సరఫరాను ఏకమార్గములో నిర్వహిస్తుంది. వేర్ల నుండి మొక్క అగ్రభాగాలకు చేరుస్తుంది. 6. ఆహార పదార్థాల సరఫరా ద్విమార్గముల ద్వారా నిర్వహిస్తుంది. ఆకుల నుండి నిల్వ అంగాలు లేదా పెరుగుదల నిల్వ అంగాల నుండి పెరుగుదల ప్రదేశాలకు సరఫరా చేస్తుంది.

బి) విభాజ్య కణజాలం, త్వచ కణజాలం

విభాజ్య కణజాలం త్వచ కణజాలం
1. కణములు చిన్నవిగా పలుచని కణకవచములు కలిగి ఉంటాయి. 1. దీనియందలి కణముల కణకవచములు దళసరిగా ఉంటాయి.
2. విభజన చెందగలిగే కణాలు ఉంటాయి. 2. విభజన చెందలేని కణాలు ఉంటాయి.
3. ఇది వేరు, కాండము, కొనలు మరియు శాఖలు వచ్చే ప్రదేశములలో ఉంటుంది. 3. త్వచకణజాలం బాహ్యస్వచం, మధ్యస్త్వచం మరియు. అంతస్త్వచములుగా ఉంటుంది.
4. మొక్క పెరుగుదలకు సహాయపడుతుంది. 4. మొక్క భాగాలకు రక్షణ ఇస్తుంది. బాష్పోత్సేకము ద్వారా కలిగే నీటి నష్టాన్ని నివారిస్తుంది.

AP Board 9th Class Biology Solutions 2nd Lesson వృక్ష కణజాలం

ప్రశ్న 5.
కింది వాక్యాలు చదివి కారణాలు రాయండి. (AS 1)
జవాబు:
ఎ) దారువు ప్రసరణ కణజాలం :

  1. దారువు వేర్ల నుండి నీటిని పోషక పదార్థములను మొక్క అగ్రభాగాలకు సరఫరా చేస్తుంది.
  2. వేర్ల నుండి పదార్థములను దూరభాగములకు రవాణా చేస్తుంది.
  3. వేర్ల నుండి మొక్క అగ్రభాగాలకు నీటి సరఫరా ఏకమార్గములో జరుగుతుంది.

బి) బాహ్య చర్మం రక్షణనిస్తుంది.

  1. బాహ్యచర్మము నందలి కణములు సాధారణముగా ఒక పొరయందు ఉంటాయి.
  2. బాహ్యచర్మము నందలి కణముల గోడలు దళసరిగా ఉంటాయి.
  3. నీటి ఎద్దడి, కొమ్మలు విరగడం, చీలడం వంటి యాంత్రికంగా కలిగే నష్టాలు పరాన్న జీవులు, రోగకారక జీవుల దాడి మొదలైన వాటి నుండి మొక్కలను బాహ్యచర్మం రక్షిస్తుంది.

ప్రశ్న 6.
కింది వాటి విధులను వివరించండి. (AS 1)
1) విభాజ్య కణజాలం 2) దారువు 3) పోషక కణజాలం
జవాబు:
1) విభాజ్య కణజాలం విధులు :

  1. మొక్క భాగాలన్నింటిలో పెరుగుదలను, మరమ్మతులను నిర్వహించేది విభాజ్య కణజాలం.
  2. దీని నుండి ఏర్పడిన కణములు మొక్క దేహంలో వివిధరకాల కణజాలాలుగా ఏర్పడతాయి.

2) దారువు విధులు :

  1. నీరు మరియు పోషక పదార్థములను వేర్ల నుండి మొక్క అగ్రభాగాలకు సరఫరా చేస్తుంది.
  2. మొక్కకు యాంత్రిక బలాన్ని ఇస్తుంది.
  3. పోషక కణజాలం విధులు : ఆకులలో తయారయిన ఆహారపదార్థములు మొక్కలోని ఇతర భాగాలకు సరఫరా చేస్తుంది.

ప్రశ్న 7.
మొక్కల్లోని కణజాలాల గురించి మరింత విపులంగా తెలుసుకోవడానికి, మీరు ఎటువంటి ప్రశ్నలను అడుగుతారు? జాబితా రాయండి. (AS 2)
జవాబు:

  1. మొక్కలకు యాంత్రిక బలాన్ని, వంగే గుణాన్ని కలిగించే కణజాలమేది? (స్థూలకోణ కణజాలం)
  2. మొక్క దేహంలోనికి వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులను రానీయకుండా అడ్డుకునే కణజాలం? (బాహ్య చర్మం)
  3. అగ్రవిభాజ్య కణజాలం పాడైనా లేదా తెగిన ఏమి జరుగుతుంది? (మొక్క పొడవు అవడం ఆగిపోతుంది)
  4. కొబ్బరికాయపై తొక్కునందు ఉండు కణజాలం పేరేమిటి? (దృఢ కణజాలం)
  5. మొక్కలకు రకరకాల కణజాలాలు ఎందుకు కావాలి? (వివిధ రకముల పనుల నిర్వహణకు)

ప్రశ్న 8.
“బెరడు కణాలు వాయువులను, నీటిని లోనికి పోనీయవు” ఈ వాక్యాన్ని వివరించడానికి నీవు ఏ ప్రయోగం చేస్తావు? (AS 3)
జవాబు:

  1. వేప చెట్టు నుండి బెరడు వలచి పడవ (దోనె) ఆకారంలో తయారు చేసుకొన్నాను.
  2. ఒక పలుచటి వేప చెక్కను బెరడు లేకుండా తీసుకొన్నాను.
  3. వేపచెక్కను, బెరడును, నీటిలో పడవేశాను. రెండూ నీటి మీద తేలాయి.
  4. బెరడు వెలుపలి భాగం నీటిని తాకుతూ, లోపలిభాగం నీటిని తాకకుండా జాగ్రత్త పడ్డాను.
  5. ఒక రోజు ఆగిన తరువాత రెండింటినీ పరిశీలించాను.
  6. వేపచెక్క పైభాగం తడిగా కనిపించింది. వేపచెక్క నీటిని పీల్చటం వలన పైభాగం తడిగా మారిందని గ్రహించాను.
  7. బెరడు లోపలి భాగంలో ఎటువంటి మార్పు గాని, తేమ గాని కనిపించలేదు.
  8. అంటే బెరడు ద్వారా నీరు లోపలికి ప్రసరించలేదు.
  9. దీనిని బట్టి బెరడు నీటిని లోపలికి పోనివ్వదని నిరూపించాను.

AP Board 9th Class Biology Solutions 2nd Lesson వృక్ష కణజాలం

ప్రశ్న 9.
మొక్కల్లోని త్వచకణజాలం, వాటికి ఎలా సహాయపడుతుందో తెలిపే సమాచారాన్ని సేకరించండి. గోడపత్రికలో ప్రదర్శించండి. (AS 4)
జవాబు:

  1. త్వచ కణజాలంనందు సాధారణముగా ఒక పొర ఉంటుంది. దీనిలోని కణములు వేరువేరు విధముగా ఉంటాయి.
  2. వాటి విధులు, స్థానాన్ని బట్టి ఈ కణజాలం మూడు రకాలుగా విభజించబడింది. అవి బాహ్యచర్మం లేక బహిస్త్వచం (వెలుపలి పొర), మధ్యస్వచం (మధ్య పొర), అంతస్త్వచం (లోపలి పొర).
  3. ఆకు బాహ్య చర్మంలో చిన్నరంధ్రాలు కనిపిస్తాయి. వాటిని పత్రరంధ్రాలు అంటారు.
  4. వేరులో అయితే కణాలు పొడవైన వెంట్రుక వంటి మూలకేశాలను కలిగి ఉంటాయి.
  5. జిగురునిచ్చే చెట్ల యొక్క త్వచకణజాలం నుండి జిగురు స్రవించబడుతుంది.
  6. నీటి ఎద్దడి, కొమ్మలు విరగడం, చీలడం వంటి యాంత్రికంగా కలిగే నష్టాలు, పరాన్న జీవులు, రోగకారక జీవుల దాడి మొదలైన వాటి నుండి మొక్కలను రక్షించేది త్వచ కణజాలం.

ప్రశ్న 10.
కాండం-అడ్డుకోత పటం గీచి, భాగాలు గుర్తించండి. (AS 5)
జవాబు:
AP Board 9th Class Biology Solutions 2nd Lesson వృక్ష కణజాలం 1

ప్రశ్న 11.
హరిత కణజాలం, వాయుగత కణజాలం, నిల్వ ఉంచే కణజాలం – ఈ మూడూ మృదుకణజాలాలే. అయినా వాటికి ప్రత్యేకమైన పేర్లు ఎందుకున్నాయి? (AS 6)
జవాబు:

  1. హరితకణజాలం, వాయుగత కణజాలం, నిల్వ ఉంచే కణజాలం ఇవి అన్నియు మృదు కణజాలంలే.
  2. ఈ మృదు కణజాలాలన్ని వివిధ రకాల పనుల నిర్వహణకై రూపాంతరం చెందాయి.
  3. హరిత రేణువులు కలిగి ఉండే మృదుకణజాలం హరిత కణజాలం. ఇది కిరణజన్య సంయోగక్రియ నిర్వహణకు ఉపయోగపడుతుంది.
  4. పెద్ద గాలి గదుల్ని కలిగి ఉండే మృదు కణజాలాన్ని వాయుగత కణజాలం అంటారు. ఇది మొక్కలు నీటిలో తేలుటకు సహాయపడుతుంది.
  5. నీరు, ఆహారం, వ్యర్థ పదార్థాల నిల్వకు ఉపయోగపడే కణజాలాన్ని నిల్వచేసే కణజాలం అంటారు.

ప్రశ్న 12.
మొక్కల అంతర్భాగములను పరిశీలించేటప్పుడు వాటి నిర్మాణం, విధులు గురించి మీరెలా అనుభూతిని పొందారు? (AS 6)
జవాబు:

  1. మొక్క భాగాల అంతర్నిర్మాణమును పరిశీలించినపుడు కణములు రకరకములని అందువలన వాటి యొక్క విధులు నిర్దిష్టంగా ఉన్నాయని భావించాను.
  2. ఉదాహరణకు కాండములో దారువు, పోషక కణజాలం మరియు ఆకునందు వెలుపలి పొరనందు ఉండే పత్రరంధ్రములు వివిధ పనుల నిర్వహణకు ఉన్నాయి.
  3. కణములు కణజాలములుగా ఏర్పడి వివిధరకాల క్రియల నిర్వహణ ద్వారా మొక్క జీవించి ఉండడానికి కారణమవుతున్నాయని భావించాను.

ప్రశ్న 13.
మొక్క పెరుగుదలలో వివిధ రకాల కణజాలాలు ఎలా దోహదం చేస్తాయో మీ పరిసరాలలోని ఒక చెట్టును పరిశీలించి అన్వయించండి. (AS 7)
జవాబు:

  1. చెట్టు యొక్క గ్రీవ భాగాలలోనూ, అగ్రభాగంలోనూ మొగ్గలు ఉన్నాయి. ఇవి విభాజ్య కణజాలాన్ని కలిగి వేగంగా పెరుగుదల చూపుతున్నాయి.
  2. ఈ మొగ్గలు (కోరకాలు) కొత్త ఆకులను ఏర్పర్చి చెట్టు ఆకారాన్ని, పరిమాణాన్ని నియంత్రిస్తున్నాయి.
  3. ఆకులు, కాండము, కొమ్మలు పై భాగాన పలుచని పొరవంటి కణజాలం కప్పి ఉంది. దీనిని త్వచకణజాలం అంటారు. ఇది మొక్క భాగాలకు రక్షణ కల్పిస్తుంది.
  4. వృక్ష దేహాన్ని ఏర్పర్చుతూ ఇతర కణజాలాన్ని సరైన స్థితిలో ఉంచటానికి సంధాయక కణజాలం ఉంది. ఇది అధికంగా విస్తరించి ఎక్కువ మోతాదులో ఉంది.
  5. పదార్థాల రవాణాకు, కాండము నుండి కొమ్మల ద్వారా పత్రాలలోనికి విస్తరించిన నాళాల వంటి కణజాలం ఉంది. దీనిని ప్రసరణ కణజాలం అంటారు.
  6. ప్రసరణ కణజాలంలోని దారువు ద్వారా నీరు సరఫరా చేయబడితే పోషకకణజాలం ద్వారా ఆహారపదార్థాల రవాణా జరుగుతుంది.

9th Class Biology 2nd Lesson వృక్ష కణజాలం Textbook Activities (కృత్యములు)

కృత్యం – 1

1. మొక్కలోని భాగాలు – వాటి విధులు :

మొక్కల్లోని వివిధ భాగాల పనులను గురించి కింది తరగతుల్లో చదువుకున్నారు. కింది పట్టికలోని విధుల జాబితా చదవంది. ఆ విధుల నిర్వహణలో పాల్గొనే మొక్క భాగాల పేర్లు రాయండి.
జవాబు:

విధి భాగాల పేర్లు
1. నీటి సంగ్రహణ వేరు వ్యవస్థలోని దారువు
2. వాయువుల (గాలి) మార్పిడి ఆకులలోని పత్రరంధ్రాలు
3. కిరణజన్య సంయోగక్రియ ఆకులలోని పత్ర హరితం
4. బాష్పోత్సేకం ఆకులలోని పత్రరంధ్రాలు
5. ప్రత్యుత్పత్తి వేర్లు, కాండం, పత్రం, విత్తనాలు

1. మొక్కలు అన్ని రకాల జీవ క్రియలను ఎలా జరుపుకోగలుగుతున్నాయి?
జవాబు:
మొక్కలలో అమరియున్న వివిధ కణజాలముల ద్వారా మొక్కలు అన్ని రకాల జీవక్రియలు జరుపుకోగలుగుతున్నాయి.

2. ఈ క్రియల నిర్వహణలో సహాయపడటానికి మొక్కల్లో ప్రత్యేకమైన కణాల అమరిక ఏమైన ఉందా?
జవాబు:

  1. ఒకే రకమైన నిర్మాణం మరియు విధులను నిర్వహించే కణములన్ని సమూహములుగా ఉండి కణజాలములు ఏర్పడినాయి.
  2. కణజాలాలు అన్ని నిర్దిష్టమైన అమరిక కలిగియుండి మొక్కలకు జీవక్రియ నిర్వహణలో తోడ్పడతాయి.

AP Board 9th Class Biology Solutions 2nd Lesson వృక్ష కణజాలం

కృత్యం – 2

ఉల్లిపొరలోని కణాలు :

2. సూక్ష్మదర్శిని సహాయముతో ఉల్లిగడ్డ పొరను నీవు ఏ విధముగా పరిశీలిస్తావు? బొమ్మ గీచి, భాగాలు గుర్తించి, నీ పరిశీలనలను రాయుము.
జవాబు:
ఉల్లిగడ్డ పొర పరిశీలన :

  1. ఒక ఉల్లిపొర ముక్కని తీసుకోవాలి.
  2. దానిని గాజుపలక మీద ఉంచాలి.
  3. దీని పైన ఒక చుక్కనీరు, ఆ తర్వాత ఒక చుక్క గ్లిజరిన్ వేయాలి.
  4. దానిపై కవర్‌పను నెమ్మదిగా ఉంచాలి.
  5. సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించాలి.

AP Board 9th Class Biology Solutions 2nd Lesson వృక్ష కణజాలం 2
పరిశీలనలు :

  1. కణములన్నియు ఒకే ఆకారం, నిర్మాణము కలిగి ఉన్నాయి.
  2. కణముల మధ్య ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి.
  3. కణములు వరుసలలో అమరి ఉన్నాయి.
  4. ప్రతి కణమునకు కణకవచము, కేంద్రకము మరియు కణజీవ పదార్ధము ఉన్నాయి.

కృత్యం – 3

ఆకు – పై పొరలోని కణాలు :

3. సూక్ష్మదర్శిని సహాయంతో తమలపాకును ఏ విధంగా పరిశీలిస్తావు? బొమ్మ గీచి, భాగాలను గుర్తించి, నీ పరిశీలనలను వ్రాయుము.
AP Board 9th Class Biology Solutions 2nd Lesson వృక్ష కణజాలం 3
కృత్యం :

  1. తమలపాకును గానీ, గోలగొండి ఆకును గానీ తీసుకొనవలెను.
  2. ఆకును మధ్యకు మడిచి చింపవలెను. చినిగిన చోట సన్నటి అంచు కనిపిస్తుంది.
  3. ఈ అంచును, ఉల్లిపొరను పరిశీలించినట్లే సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించవలెను.
  4. పరిశీలించిన దాని పటాన్ని గీయవలెను. పటంతో పోల్చవలెను.

పరిశీలనలు :

  1. పరిశీలించిన కణాలు అన్ని ఒకే మాదిరిగా లేవు. కొన్ని చిన్నవిగా, మరికొన్ని పెద్దవిగా ఉన్నాయి.
  2. కణాల అమరికలో తేడా ఉంది. అవి దగ్గర దగ్గరగా కణాంతరావకాశాలు లేకుండా అమరి ఉన్నాయి.
  3. కణాలు సమూహాలుగా ఉండి, నిర్దిష్టంగా అమరి ఉండటాన్ని పరిశీలించవచ్చు.

AP Board 9th Class Biology Solutions 2nd Lesson వృక్ష కణజాలం

కృత్యం – 4

వేరు మూలలోని కణాలు :

4. ఉల్లిగడ్డ వేరుమూలంను నీవు ఏ విధముగా పరిశీలిస్తావు? సూక్ష్మదర్శిని సహాయముతో బొమ్మ గీయుము. నీ యొక్క పరిశీలనలను నమోదు చేయుము.
జవాబు:
వేరు మూలంలోని కణాల పరిశీలన :

  1. ఒక పారదర్శకమైన సీసాను తీసుకొని నీటితో నింపాలి. సీసా మూతి కంటే కొంచెం పెద్దదిగా ఉండే ఉల్లిగడ్డను తీసుకోవాలి. ఉల్లిగడ్డను సీసా మూతిపై ఉంచాలి.
  2. వేర్లు దాదాపు ఒక అంగుళం పొడవు పెరిగే వరకు కొద్దిరోజుల పాటు వేర్ల పెరుగుదలను గమనించాలి.
  3. ఉల్లిగడ్డను తీసుకొని కొన్ని వేర్ల కొనలను కత్తిరించాలి.
  4. ఒక వేరుకొనను తీసుకోవాలి. దాన్ని గాజుపలకపై ఉంచాలి.
  5. దానిపై ఒక చుక్క నీటిని, తరువాత ఒక చుక్క గ్లిజరినను వేయాలి.
  6. కవర్‌స్లితో కప్పి కవర్‌ స్లిప్ పై 2, 3 అదుడు కాగితాలను ఉంచాలి.
  7. నీడిల్ లేదా బ్రష్ వెనుకవైపు కొనతో కవర్ స్లిప్ పై సున్నితంగా కొట్టి పదార్థం పరచుకునేలా చేయాలి.
  8. కణాల నిర్మాణాన్ని, అమరికను సూక్ష్మదర్శినితో పరిశీలించాలి.

AP Board 9th Class Biology Solutions 2nd Lesson వృక్ష కణజాలం 4 AP Board 9th Class Biology Solutions 2nd Lesson వృక్ష కణజాలం 5

పరిశీలనలు :

  1. కణములన్నియు ఆకారపరంగా, నిర్మాణపరంగా ఒకే విధముగా లేవు.
  2. కణములన్నీ వివిధ వరుసలలో అమరి ఉన్నాయి.
  3. అగ్రవిభాజ్య కణజాలం వేరు తొడుగునకు క్రింద ఉన్నది.

కృత్యం – 5

పెరుగుతున్న వేర్లు :

5. ఉల్లిగడ్డ యొక్క కత్తిరించిన కొనలను సూక్ష్మదర్శినితో పరిశీలించుము. బొమ్మను గీచి పరిశీలనలను రాయండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 2nd Lesson వృక్ష కణజాలం 6

  1. ఉల్లిగడ్డను తీసికొని వేర్లను కత్తిరించాలి.
  2. కత్తిరించిన వేరు కొనలకు కొంచెం పైగా మార్కర్ పెతో గుర్తించాలి.
  3. ఉల్లిగడ్డను సీసామూత మీద ఉంచాలి.
  4. నాలుగు, ఐదు రోజులపాటు అలాగే ఉంచాలి.
  5. వేర్లు కొంచెం మునిగేలా, చాలినంత నీరు ఉండేలా తగు జాగ్రత్త తీసుకోవాలి.

పరిశీలనలు :

  1. నిర్దిష్ట రూపములో కణములు అమరియుండిన వేరుకొనను తొలగించిన వేరు పొడవు పెరుగుదల ఆగిపోతుంది.
  2. కణములు సమూహములుగా ఉన్నాయి.

కృత్యం – 6

కాండంకొన, వేరు కొనలో ఉన్న విభాజ్య కణజాలాన్ని సరిపోల్చడం.

6. కాండం కొన, వేరుభాగాలను పరిశీలించి కణాల అమరికను క్రింది పట్టిక నందు రాయండి.
జవాబు:

కణాల అమరిక (కణజాలాలు) కాండం కొన వేరుకొన
కొనభాగంలో అగ్ర విభాజ్య కణజాలం వేరు తొడుగునకు
వెనుక అగ్ర విభాజ్య కణజాలం
పార్శ్వ భాగంలో పార్శ్వ విభాజ్య కణజాలం పార్శ్వ విభాజ్య కణజాలం
శాఖలు వచ్చేచోట మధ్యస్థ విభాజ్య కణజాలం మధ్యస్థ విభాజ్య కణజాలం లేదు

కృత్యం – 7

ద్విదళబీజ కాండంలోని కణజాలాలు :

7. ద్విదళ బీజకాండము అడ్డుకోత తాత్కాలిక సైడ్ ను సూక్ష్మదర్శిని క్రింద పరిశీలించి, బొమ్మ గీచి, భాగములను గుర్తించుము. నీ యొక్క పరిశీలనలను రాయుము.
జవాబు:
ద్విదళ బీజకాండము అడ్డుకోత సైడ్ ను తయారుచేసి సూక్ష్మదర్శిని క్రింద పరిశీలించాలి.
AP Board 9th Class Biology Solutions 2nd Lesson వృక్ష కణజాలం 7

పరిశీలనలు:

  1. ద్విదళ బీకాండపు అడ్డుకోతనందు విభాజ్య కణజాలం, ప్రసరణ కణజాలం, త్వచకణజాలం మరియు సంధాయక కణజాలాలు ఉన్నాయి.
  2. కణములన్నియు ఒకేవిధమైన ఆకారము, నిర్మాణమును కలిగి యుండలేదు.

కృత్యం – 8

రియో ఆకు – ఉపరితల కణజాలం :

8. రియో ఆకును సూక్ష్మదర్శిని క్రింద పరిశీలించుము. మ్మ గీచి, భాగములను గుర్తించుము. నీ పరిశీలనలను రాయుము.
జవాబు:

  1. తాజాగా ఉన్న రియో ఆకును తీసుకోవాలి.
  2. ఒక్కసారిగా మధ్యలో చీల్చండి. చినిగిన అంచు వద్ద తెల్లటి పొర కనిపిస్తుంది.
  3. ఆ పొరను జాగ్రత్తగా తీసి సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించాలి.

AP Board 9th Class Biology Solutions 2nd Lesson వృక్ష కణజాలం 8
పరిశీలనలు :

  1. నిర్మాణపరంగా కణములన్నీ ఒకే విధముగా ఉన్నాయి.
  2. కణముల మధ్య ఖాళీ ప్రదేశములు లేకుండా దగ్గరగా అమరి ఉన్నాయి.
  3. ఇది మొక్క యొక్క త్వచ కణజాలం.
  4. దీనియందు పత్రరంధ్రము కలదు.

AP Board 9th Class Biology Solutions 2nd Lesson వృక్ష కణజాలం

కృత్యం – 9

కణజాలాల పరిశీలన :

9. మీ ప్రయోగశాల నుండి హరిత కణజాలం, వాతయుత కణజాలం, నిల్వచేసే కణజాలాల సైట్లను సేకరించండి. మైక్రోస్కోపీతో పరిశీలించండి. మీరు గమనించిన లక్షణాలను నోటు పుస్తకంలో రాయండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 2nd Lesson వృక్ష కణజాలం 9
గమనించిన లక్షణాలు:
i) హరిత కణజాలం :
ఈ కణజాలం హరిత రేణువులను కలిగి ఉంటుంది. అందువలన దీనిని హరిత కణజాలం అంటారు.

ii) వాతయుత కణజాలం :
ఈ కణజాలం మృదుకణజాలం. పెద్ద గాలిగదుల్ని కలిగి ఉంటుంది. అందువలన దీనిని వాయుగత మృదుకణజాలం లేదా వాతయుత కణజాలం అంటారు.

iii) నిల్వజేసే కణజాలం :
ఈ మృదు కణజాలం నీరు, ఆహారం, వ్యర్థ పదార్థాలను నిల్వ చేస్తుంది. అందువలన దీనిని నిల్వచేసే కణజాలం అంటారు.

AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు

SCERT AP 9th Class Biology Guide Pdf Download 1st Lesson కణ నిర్మాణం – విధులు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Biology 1st Lesson Questions and Answers కణ నిర్మాణం – విధులు

9th Class Biology 1st Lesson కణ నిర్మాణం – విధులు Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
కింది వాటిలో భేదాలను గుర్తించండి. (AS 1)
A) వృక్ష కణం మరియు జంతు కణం
B) కేంద్రక పూర్వకణం మరియు నిజకేంద్రక కణం
జవాబు:
A) వృక్ష కణం మరియు జంతు కణం :

వృక్ష కణము జంతు కణము
1. సాధారణంగా పెద్ద పరిమాణంలో ఉంటుంది. 1. సాధారణంగా చిన్న పరిమాణంలో ఉంటుంది.
2. కణకవచము ఉంటుంది. 2. కణకవచము ఉండదు.
3. ప్లాస్టిడ్లు (క్రోమోప్లాస్టులు, ల్యూకోప్లాస్టులు) ఉంటాయి. 3. ప్లాస్టిడ్లు ఉండవు.
4. సెంట్రియోల్స్ ఉండవు. 4. సెంట్రియోల్స్ ఉంటాయి.
5. రిక్తికలు పెద్దవిగా ఉంటాయి. 5. రిక్తికలు చిన్నవిగా ఉంటాయి.

B) కేంద్రక పూర్వకణం మరియు నిజకేంద్రక కణం

కేంద్రక పూర్వకణం నిజకేంద్రక కణం
1. కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం ఉండదు. 1. కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం ఉంటుంది.
2. త్వచముతో కూడిన కణాంగాలు ఉండవు. 2. త్వచముతో కూడిన కణాంగాలు ఉంటాయి.
3. కేంద్రక పూర్వకణాలు ఎక్కువగా ఏకకణజీవులలో ఉంటాయి. 3. నిజకేంద్రక కణాలు బహుకణజీవులలో ఉంటాయి.
4. దీనిలో ఒకే క్రోమోసోము ఉంటుంది. 4. దీనిలో ఒకటి కంటే ఎక్కువ క్రోమోసోములు ఉంటాయి.
5. కేంద్రకాంశము ఉండదు. 5. కేంద్రకాంశము ఉంటుంది.
6. కణవిభజన సమవిభజన ద్వారా జరుగుతుంది. 6. కణవిభజన సమవిభజన మరియు క్షయకరణ విభజనల ద్వారా జరుగుతుంది.
7. కణపరిమాణము చిన్నగా ఉంటుంది. 7. కణ పరిమాణము పెద్దగా ఉంటుంది.
8. కేంద్రక పూర్వకణాలు బాక్టీరియా మరియు సయానో బాక్టీరియాలలో ఉంటాయి. 8. నిజకేంద్రక కణాలు శిలీంధ్రాలు, మొక్కలు మరియు జంతు కణాలలో ఉంటాయి.

ప్రశ్న 2.
కణం నుండి కేంద్రకాన్ని తొలగిస్తే ఏమవుతుంది? మీ జవాబులను బలోపేతం చేయడానికి రెండు కారణాలు రాయండి. (AS 1)
జవాబు:

  1. కణాంగాలలో కేంద్రకము అతిముఖ్యమైనది.
  2. కేంద్రకము కణవిధులను అన్నింటిని నియంత్రిస్తుంది.
  3. కేంద్రకము అన్ని కణాంగాలను మరియు కేంద్రకాంశమును కూడా నియంత్రిస్తుంది.
  4. కణ మెదడు అయిన కేంద్రకమును తొలగించినట్లయితే కణము ఆ వెంటనే చనిపోతుంది.
  5. కనుక కేంద్రకమును తొలగించినట్లయితే కేంద్రక నియంత్రణలో పనిచేసే కణాంగాలు చనిపోతాయి. తద్వారా ఆ జీవి చనిపోతుంది.

AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు

ప్రశ్న 3.
లైసోజోమ్ లను స్వయం విచ్ఛిత్తి సంచులని ఎందుకు అంటారు? (AS 1)
జవాబు:

  1. లైసోజోములు విచ్ఛిన్నకర ఎంజైములను కలిగి ఉంటాయి.
  2. విచ్ఛిన్నం చేయవలసిన పదార్థములు లైసోజోమ్ నకు రవాణా చేయబడతాయి.
  3. కొన్ని సందర్భాలలో లైసోజోముల విచ్ఛిన్నం ద్వారా విడుదలైన ఎంజైములు కణమును జీర్ణం చేస్తాయి.
  4. అందువలన లైసోజోమ్ ను స్వయం విచ్ఛిత్తి సంచులు అంటారు.

ప్రశ్న 4.
వృక్ష కణంలో పెద్ద రిక్తికలు ఎందుకు ఉంటాయి? (AS 1)
జవాబు:

  1. మొక్కల రిక్తికలు నీటి నిలువకు, ద్రవాభిసరణ క్రమతకు, వ్యర్థ పదార్థాల సంగ్రహణకు ఉపయోగపడుట ద్వారా ఆకులు, రక్షకపత్రాల కణముల యొక్క నిర్మాణాత్మక రూపమును నియంత్రిస్తాయి.
  2. కణము మధ్యన గల రిక్తిక, కణకవచముపై కలిగించే ఒత్తిడి ద్వారా కణము యొక్క ఆకారము స్థిరంగా ఉంచబడుతుంది.
  3. నియంత్రిత పెరుగుదలలో భాగంగా మొక్కలు కణము పొడవుగా అగుటకు కణము అంతర్గతశక్తిని ఉపయోగించుకుంటాయి.
  4. జంతువుల రిక్తిక కంటె వృక్షము యందు ఉండు రిక్తిక క్లిష్టమైన విధులను నిర్వహిస్తుంది.
  5. అందువలన వృక్ష కణములలో పెద్ద రిక్తికలు ఉంటాయి.

ప్రశ్న 5.
“జీవుల మౌళిక ప్రమాణం కణం” వివరించండి. (AS 1)
జవాబు:

  1. కణ సిద్ధాంతం ప్రకారం జీవుల నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం కణం, జీవులు కణ నిర్మితాలు మరియు కణములన్నీ ముందుతరం కణం నుంచి ఏర్పడతాయి.
  2. జీవి జీవించడానికి అవసరమయ్యే జీవక్రియలన్నీ కణస్థాయిలోనే జరుగుతాయి.
  3. అందువలన కణమును జీవుల మౌళిక ప్రమాణం అని చెప్పవచ్చు.

ప్రశ్న 6.
కణ సిద్ధాంతమును ఎవరు, ఎప్పుడు ప్రతిపాదించారు ? దీనిలోని ముఖ్యమైన అంశాలు ఏవి? (AS 1)
జవాబు:
ప్రతిపాదించినవారు :
ఎమ్.జె. ప్లీడన్ మరియు థియోడర్ ష్వాన్ 1838-39 సంవత్సరంలో కణ సిద్ధాంతమును

ప్రతిపాదించారు. ముఖ్యమైన అంశములు :

  1. జీవరాసులన్నీ కణాలు, వాటి ఉత్పన్నాలతో నిర్మించబడి ఉంటాయి.
  2. కణాలన్నీ ముందు తరం కణం నుంచే ఏర్పడతాయి.
  3. అన్ని కణాలు ఒకే రకమైన రసాయన నిర్మాణం కలిగి, ఒకే రకమైన జీవక్రియలు నెరవేరుస్తాయి.
  4. జీవి యొక్క జీవక్రియలు ఆ జీవిలోని కణములు నిర్వర్తించే విధులను బట్టి, ఆ జీవిలో వివిధ కణముల మధ్య ఉండే సంబంధ బాంధవ్యాల మీద ఆధారపడి ఉంటాయి.

AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు

ప్రశ్న 7.
ప్లాస్మా పొర పగిలిపోతే/ విరిగితే కణానికి ఏమి జరుగుతుంది? (AS 2)
జవాబు:
ప్లాస్మా పొర పగిలిపోతే / విరిగితే :

  1. విసరణ లేదా ద్రవాభిసరణ ద్వారా కణము లోపలకు, బయటకు జరిగే పదార్థాల రవాణాను ప్లాస్మా పొర నియంత్రిస్తుంది.
  2. అందువలన ప్లాస్మాపొర పగిలిపోతే కణము, దాని లోపలి అంశములను బయటకు విడుదల చేయవచ్చు.
  3. అందువలన కణము చనిపోతుంది.

ప్రశ్న 8.
గాల్జీ సంక్లిష్టాలు లేకపోతే కణానికి ఏమవుతుంది? (AS 2)
జవాబు:
గాల్జీ సంక్లిష్టాలు లేకపోతే :

  1. వీటి ద్వారా జరుగవలసిన కార్యకలాపాలు జరుగవు.
  2. వివిధ రకాల పదార్థములను మార్పుచేయడం కణము నందు జరుగదు.
  3. గాల్జీ సంక్లిష్టము నుండి పదార్థాలన్నీ ప్లాస్మాపొర వైపు కాని లేదా మరొక కణాంగమైన లైసోజోమ్స్ వైపు కాని పంపబడవు.
  4. రైబోజోములచే తయారుచేయబడిన ప్రోటీనులు మరియు ఇతర పదార్థములు లైసోజోమ్ లకు రవాణా చేయబడవు.
  5. పదార్ధముల రవాణా జరుగకపోయినట్లయితే ప్లాస్మా పొరకు మరమ్మత్తులు జరుగక కణం చనిపోతుంది.
  6. గాల్జీ సంక్లిష్టము నుండి విషపదార్థములు లైసోజోమ్స్ నకు పంపబడనట్లయితే విషపదార్ధములు కణము నందు నిల్వచేయబడి కణము చనిపోతుంది.

ప్రశ్న 9.
బుగ్గకణంలో కేంద్రకాన్ని చూడడానికి నీవు ప్రయోగశాలలో ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నావు? (AS 3)
జవాబు:
బుగ్గకణంలో కేంద్రకాన్ని చూడడానికి ప్రయోగశాలలో తీసుకోవలసిన జాగ్రత్తలు :

  1. చెంప (బుగ్గ) లోపలి భాగాన్ని ఎక్కువగా గీకకూడదు. ఎక్కువగా గీకితే గాయమయ్యే అవకాశం ఉంటుంది.
  2. గీకిన భాగాన్ని స్లెడ్ పైన వ్యాపించేటట్లు చేయవలెను.
  3. ఎక్కువగా రంగు ఉన్నట్లయితే దానిని తొలగించవలెను.

ప్రశ్న 10.
ప్రస్తుత పాఠాన్ని పూర్తిగా, క్షుణ్ణంగా చదివి వివిధ రకాల కణాంగాల విధులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి క్రమసంఖ్య, కణాంగాలు, విధులు అనే అంశాలను పట్టికలో నమోదు చేయండి. నమోదు చేసేటపుడు నూతన ప్రత్యేక అంశాలు ఉన్నట్లయితే పట్టిక క్రింద నమోదు చేయండి. (AS 4)
జవాబు:

కణాంగము విధులు
1. కేంద్రకము కణవిధుల క్రమబద్దీకరణ మరియు నియంత్రణ, జీవుల లక్షణాల నిర్ధారణ.
2. అంతర్జీవ ద్రవ్యజాలము కణంలో ఒక భాగం నుండి మరియొక భాగానికి పదార్థాల రవాణా, జీవరసాయన చర్యలకు వేదిక.
3. గాల్జీ సంక్లిష్టము ప్రోటీనుల రూపమును మార్చుట, అనేక పదార్థములను ఒకటిగా చేయుట.
4. లైసోజోములు కణాంతర జీర్ణక్రియ, కణభాగములను నాశనం చేయుట.
5. మైటోకాండ్రియా కణ శ్వాసక్రియ ద్వారా కణమునందు శక్తి ఉత్పాదన.
6. ప్లాస్టిడ్లు మొక్కల కణాలకు రంగులను ఇస్తుంది.
A) క్రోమోప్లాస్టులు రకరకాల పూలు, పండ్లకు రంగునిచ్చుట.
B) క్లోరోప్లాస్టులు కిరణజన్య సంయోగక్రియలో కాంతి శక్తిని రసాయనశక్తిగా మార్చుట.
C) ల్యూకోప్లాస్టులు రంగులేని ప్లాస్టిడ్లు, పిండిపదార్ధాలు, నూనెలు మరియు ప్రోటీనుల నిల్వ.

ప్రత్యేక అంశాలు :

  1. కేంద్రకము జన్యు సమాచారాన్ని కలిగి ఉంటుంది.
  2. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము ప్రోటీన్లను సంశ్లేషణ చేస్తుంది. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము లిపిడ్లను సంశ్లేషణ చేస్తుంది.
  3. గాల్టీ సంక్లిష్టము రైబోజోములు తయారు చేసిన ప్రోటీనులను ఒకటిగా చేర్చుటకు సహాయం చేస్తుంది.
  4. కణ వినాశమునకు కారణమగుట వలన లైసోజోములను స్వయంవిచ్చిత్తి సంచులు అంటారు.
  5. కణ శ్వాసక్రియ ద్వారా కణము శక్తిని ఉత్పాదన చేయుట వలన మైటోకాండ్రియాలను కణ శక్త్యా గారాలు అంటారు.
  6. క్లోరోప్లాస్టులు, ల్యూకోప్లాస్టులు, క్రోమోప్లాస్టులు మొక్కలలో ఉండే ప్లాస్టిడ్లు.

ప్రశ్న 11.
వృక్ష కణం లేదా జంతు కణం నమూనాను పరిసరాలలో లభ్యమయ్యే పదార్థాలతో తయారుచేయండి. (AS 15)
జవాబు:
AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు 1

ప్రశ్న 12.
మీరు సేకరించిన పత్రం పొరతో తాత్కాలిక స్లెడను తయారుచేసి పత్రరంధ్రాలను పరిశీలించి పటమును గీయండి. వాటి గురించి రాయండి. (AS 5)
జవాబు:
పెద్దదిగా చూపబడిన పత్రరంధ్రము ఈ క్రింది కణాలను చూపిస్తుంది.
AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు 2

  1. పత్రరంధ్రము రెండు రక్షక కణములచే ఆవరించబడినది.
  2. రక్షక కణములు మూత్రపిండాకారములో ఉన్నాయి.
  3. రక్షక కణమందు కేంద్రకము, క్లోరోప్లాస్టులు కలవు.
  4. రెండు రక్షక కణముల మధ్య చిన్న పత్రరంధ్రము కలదు.
  5. ఆకునందలి పత్రరంధ్రముల ద్వారా వాయువుల మార్పిడి జరుగును.
  6. ఆకు వైశాల్యం నందు పత్రరంధ్రములు సుమారు 1 నుండి 2 శాతం ఆక్రమించి ఉన్నాయి.

ప్రశ్న 13.
నమూనా జంతు కణం పటము గీచి భాగాలు గుర్తించండి. (AS 5)
జవాబు:
AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు 3

ప్రశ్న 14.
కింది కార్టూనును చూడండి. కణాంగాల విధులను గురించి రాయండి. (AS 5)
AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు 4
జవాబు:
కణంలోని ముఖ్యమైన కణాంగాలు అనగా అంతర్జీవ ద్రవ్యజాలం, గాల్టీ సంక్లిష్టాలు, లైసోజోములు, మైటోకాండ్రియా, – ప్లాస్టిడ్స్ మరియు రిక్తికలు.

కణాంగాలు, విధులు :
1) అంతర్జీవ ద్రవ్యజాలం :
కణ ద్రవ్యంలో వల వంటి నిర్మాణాన్ని అంతర్జీవ ద్రవ్యజాలం అంటారు. ఇది ప్రోటీన్ల వంటి పదార్థాలను కణద్రవ్యంలోని వివిధ ప్రాంతాలకు ఇక్కడ నుండి కేంద్రకానికి రవాణా మార్గంగా పని చేస్తుంది. క్రొవ్వు మరియు లిపిడ్ల సంశ్లేషణకు తోడ్పడుతుంది. విష పదార్థాలను నిర్వీర్యం చేస్తుంది.

2) గాల్జీ సంక్లిష్టాలు :
ఇవి వివిధ రకాల పదార్థాలను కణంలోని ఇతర భాగాలకు పంపే ముందు, తమలో నిల్వ చేసుకుని, అక్కడ నుండి ప్లాస్మాపొర వైపు లేదా లైసోసోమ్స్ వైపు పంపిస్తాయి.

3) లైసోజోములు :
వినాశకర పదార్థాలను ఇవి ఎంజైముల ద్వారా వినాశనం చేస్తాయి.

4) మైటోకాండ్రియా :
కణానికి కావలసిన శక్తిని ఉత్పత్తి చేసి కణ శ్వాసక్రియను జరుపుతాయి.

5) ప్లాస్టిడ్లు :
కిరణజన్య సంయోగక్రియలో సౌరశక్తిని గ్రహించి రసాయనిక శక్తిగా మార్చటమే వీటి యొక్క ముఖ్య

6) రిక్తికలు :
రిక్తికలు కార్బోహైడ్రేటులు, అమైనో ఆమ్లాలు, ప్రోటీనులు, వర్ణద్రవ్యాలు విసర్జన పదార్థాలను నిల్వ చేస్తాయి.

AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు

ప్రశ్న 15.
సజీవులలో కణ వ్యవస్థీకరణను ఎలా అభినందిస్తావు? (AS 6)
జవాబు:

  1. జీవులలో ఐదు రకాల స్థాయిలను గమనిస్తాను. కణము-కణజాలము-అవయవము-అవయవ వ్యవస్థ – జీవి.
  2. జీవులలో కణము చక్కగా వ్యవస్థీకృతమైంది. కణము కణజాలముగాను, కణజాలములు అవయవముగాను, అవయవములు కలిసి అవయవ వ్యవస్థలుగాను, అవయవ వ్యవస్థలు జీవిగాను రూపొందినాయి.
  3. మౌలికమైన మరియు ప్రాథమికమైన కణము ఏకకణ జీవులను, బహుకణ జీవులను ఏర్పరుస్తుంది.
  4. జీవులు తరువాత క్రమంలో జనాభాలను, సంఘాలను, ఆవరణ వ్యవస్థలను మరియు జీవావరణంగాను వ్యవస్థీకృతమైనవి.

ప్రశ్న 16.
భౌతిక మరియు రసాయనిక చర్యల వలన కణ వ్యవకరణం నాశనమైతే ఏమి జరుగుతుంది? (AS 6)
జవాబు:

  1. జీవమునకు ప్రమాణమైన కణము, జీవక్రియలన్నింటిని నిర్వహించగల సామర్యము కలిగినది.
  2. భౌతిక మరియు రసాయనిక చర్యల వలన కణవ్యవస్థ నాశనమైతే జీవక్రియల నిర్వహణ అనగా శ్వాసక్రియ, పోషణ, విసర్జన మొదలగు క్రియల నిర్వహణకు కణ సామర్థ్యము సక్రమముగా ఉండదు.

ప్రశ్న 17.
అతి సూక్ష్మకణం విధిని అతి పెద్దగా ఉండే జీవిలో ఏ విధంగా అభినందిస్తావు? (AS 6)
జవాబు:

  1. కణ సిద్ధాంతం ప్రకారం జీవులన్నియూ కణనిర్మితాలు.
  2. జీవమునకు ప్రమాణమైన చిన్నకణము అన్ని జీవక్రియలను నిర్వహించగల సామర్థ్యం గలది.
  3. జీవి యొక్క జీవక్రియలు ఆ జీవిలోని కణములు నిర్వహించే విధుల మీద ఆధారపడి ఉంటాయి.
  4. కణములు జీవనిర్మాణ సౌధములు.
  5. అందువలన కణములను జీవమునకు నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణము అంటారు.
  6. కణములు ఆకారములోను, పరిమాణములోను మరియు క్రియలపరంగా వేరుగా ఉంటాయి.
  7. ఒక కణము యొక్క పరిమాణము కచ్చితంగా ఆ కణము నిర్వహించే పని మీద ఆధారపడి ఉంటుంది.
  8. జీవిలోని కణములు సక్రమముగా విధులను నిర్వహించినట్లయితే జీవి శరీరము విధులను సక్రమముగా నిర్వహిస్తుంది.

9th Class Biology 1st Lesson కణ నిర్మాణం – విధులు Textbook InText Questions and Answers

9th Class Biology Textbook Page No. 1

ప్రశ్న 1.
ఉల్లిపొరలో కణాలు దీర్ఘచతురస్ర ఆకారంలో ఉంటే, బుగ్గ కణాలు గుండ్రంగా ఉంటాయని తెలుసుకున్నాం. ఇలాగే కణం గురించి మీరు గుర్తించిన మరికొన్ని ముఖ్యాంశాలు రాయండి.
జవాబు:

  1. జీవులన్నిటికి కణం ప్రధానమైన మూలం.
  2. కణాలలో కేంద్రకం ఉంటుంది.
  3. వృక్ష కణాలలో కణకవచం ఉంటుంది. కానీ జంతు కణాలలో కణకవచం ఉండదు.
  4. కణమును నిర్మాణాత్మక ప్రమాణంగా పరిగణించవచ్చు.
  5. బహుకణజీవులలో ఈ కణాల ఆకారంలో వైవిధ్యం కనపడుతుంది.

9th Class Biology Textbook Page No. 2

ప్రశ్న 2.
ఈ క్రింది కణాలను పరిశీలించండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు 1

a) పై రెండు కణాలలో కనబడే సాధారణ లక్షణాలు ఏవి?
జవాబు:
పై రెండు కణాలలో కనబడే సాధారణ లక్షణాలు : పై రెండు కణాలు మైటోకాండ్రియా, గాల్టీ సంక్లిష్టం, కేంద్రకం, అంతర్జీవ ద్రవ్యజాలం అనే కణాంగాలను కలిగి ఉన్నాయి.

b) వృక్ష కణంలో మాత్రమే కనబడే కణాంగాలేవి?
జవాబు:
వృక్ష కణంలో మాత్రమే కనబడే కణాంగాలు : రిక్తికలు, ప్లాస్టిడ్లు, కణకవచం మొదలగునవి.

c) వృక్ష కణంలోని రిక్తకలు జంతుకణంలోని రిక్తికలను పోల్చండి. రెండింటి మధ్య మీరు గమనించిన భేదాలను రాయండి.
జవాబు:
వృక్ష కణంలో రిక్తికలు ఉంటాయి. జంతుకణంలో రిక్తికలు ఉండవు.

AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు

ప్రశ్న 3.
వృక్ష కణాలలో కణకవచం యొక్క ఆవశ్యకత ఏమిటి?
జవాబు:

  1. కణరసం ద్వారా ఏర్పడే బాహ్యపీడనాన్ని నిరోధించడానికి కణకవచం అంతర పీడనాన్ని కలిగిస్తుంది.
  2. అందువల్ల పరిసరాలలో జరిగే మార్పులను జంతుకణం కంటే వృక్షకణం తట్టుకునే అవకాశం ఎక్కువ.

9th Class Biology 1st Lesson కణ నిర్మాణం – విధులు Textbook Activities (కృత్యములు)

కృత్యం – 1

1. ప్లాస్మా పొర పరిశీలన :
a) సూక్ష్మదర్శినితో పత్రంనందలి ప్లాస్మా పొరను నీవు ఏ విధముగా పరిశీలిస్తావు? నీ పరిశీలనలు రాయుము.
జవాబు:

  1. రియో పత్రాన్ని తీసుకొని ఒక్కసారిగా మధ్యకు చించాలి.
  2. చించిన భాగాన్ని వెలుతురులో ఉంచి పరిశీలించాలి. పత్రంలోని లేతరంగులో ఉన్న భాగాన్ని తీసుకొని స్లెడ్ పైన పెట్టాలి.
  3. నీటి చుక్కను వేసి కవర్ స్లితో కప్పాలి. తరువాత స్లెడ్ ను సూక్ష్మదర్శినితో పరిశీలించాలి.

AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు 5
పరిశీలనలు :

  1. కణములు వరుసలలో అమరి ఉన్నాయి.
  2. ప్లాస్మా పొర స్పష్టముగా కనిపిస్తుంది.
  3. కణము నందు కేంద్రకము కలదు.

b) రియో పత్రపు పొరపై 1 లేదా 2 చుక్కల సజల ఉప్పు ద్రావణము వేసిన ఏమి జరుగుతుంది? సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించి బొమ్మను గీయుము. కేంద్రకముతో కూడిన జీవపదార్థము కుదించుకుపోవడానికి కారణములు రాయుము.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు 6
పరిశీలనలు :

  1. రియో పత్రపు పొరపై జల ఉప్పు ద్రావణము వేసినప్పుడు రియో పత్రము నందలి కణముల నుండి నీరు బయటకు ప్లాస్మాపొర వచ్చును.
  2. నీరు బయటకు రావడము వలన కణద్రవ్యం, కణత్వచంతో పాటు కుదించబడుతుంది.
  3. మనకు కనబడే రంగుభాగపు బాహ్య అంచును కణత్వచం అంటారు. ఆ భాగం కణకవచం నుంచి వేరైపోతుంది.

2. కేంద్రక పరిశీలన :
జవాబు:
ఉద్దేశ్యం : చెంప (బు) కణంలో కేంద్రకం పరిశీలించుట.

కావాల్సిన పదార్థాలు :
టూత్ పిక్, స్లెడ్, కవర్‌ స్లిప్, వాచ్ గ్లాస్, నీడిల్, బ్లాటింగ్ పేపర్, 1% మిథిలీన్ బ్లూ, ఉప్పు ద్రావణం, గ్లిజరిన్, సూక్ష్మదర్శిని మొదలైనవి.

విధానం :

  1. ముందుగా నోటిని శుభ్రంగా కడగవలెను. టూత్ పిక్ తో గాని లేదా ఐస్ క్రీమ్ చెంచాతో గాని నోటిలోపలి చెంప (బుగ్గ)లోని భాగాన్ని కొద్దిగా గీకవలెను.
  2. గీకిన భాగాన్ని ఉప్పు ద్రావణం కలిగి ఉన్న వాచ్ గ్లాసులో పెట్టవలెను. (పదార్థం ఉప్పు ద్రావణంలో కలిసిపోకుండా జాగ్రత్త పడండి).
  3. తరువాత స్లెడ్ పైన పెట్టవలెను.
  4. ఒక చుక్క మిథిలీన్ బ్లూ ద్రావణాన్ని వేసి రెండు నిమిషాల సేపు కదపకుండా ఉండవలెను.
  5. అద్దుడు కాగితం ఉపయోగించి ఎక్కువగా ఉన్న రంగును తొలగించవలెను.
  6. ఒక చుక్క గ్లిజరిన్ వేయవలెను.
  7. కవర్ స్లితో కప్పి నీడిల్ లో కవర్ స్లిప్ ని కొద్దిగా తట్టవలెను. దాని వలన కణాలన్నీ వ్యాపిస్తాయి.

జాగ్రత్తలు:

  1. చెంప (బుగ్గ) లోపలి భాగాన్ని ఎక్కువగా గీకవద్దు. గాయమయ్యే అవకాశముంటుంది.
  2. గీకిన భాగాన్ని స్లెడ్ పైన వ్యాపించేటట్లు చేయవలెను.
  3. ఎక్కువగా రంగు ఉన్నట్లయితే తొలగించవలెను.

ఈ విధముగా తయారుచేసిన తాత్కాలిక సైడ్ ను సూక్ష్మదర్శిని ఎక్కువ, తక్కువగా కాంతిని వర్ధనం చేస్తూ పరిశీలించవలెను.

AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు 7
పరిశీలనలు:

  1. కణాల ఆకారంను పరిశీలించగా కణాలు వివిధ ఆకారాలలో ఉన్నవి.
  2. కణ మధ్య భాగంలో రంగుతో కూడిన గుండ్రటి చుక్క కనబడుతుంది. అదే కణ కేంద్రకం.

AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు

కృత్యం – 2

3. మైటోకాండ్రియా పరిశీలన :
ఉల్లిపొర కణాలతో మైటోకాండ్రియాను నీవు ఏ విధంగా పరిశీలిస్తావు?
(లేదా)
నిర్మల ఉల్లిపొరలోని కణాలను పరిశీలించాలనుకుంటుంది. అందుకు కావలసిన పరికరాలను, ప్రయోగ విధానాన్ని ఆమెకు వివరించండి.
జవాబు:
పరికరాలు :
ఉల్లిపొర, బ్లేడ్, జానస్ గ్రీన్ – B ద్రావణం కవర్‌ స్లిప్, వాచ్ గ్లాస్, సూక్ష్మదర్శిని

AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు 8
మైటోకాండ్రియా పరిశీలన :

  1. బీకరులో జానస్ గ్రీన్-బి ద్రావణాన్ని తయారుచేయాలి.
  2. 200 మి.గ్రా. జానస్ గ్రీన్-‘బి’ ను 100 మి.లీ. నీటిలో కలపాలి.
  3. ఒక వాచ్ గ్లాలో ఈ ద్రావణం కొంత తీసుకుని దానిలో ఉల్లిపొరను దాదాపు అరగంటసేపు ఉంచాలి.
  4. ఉల్లిపొరను వాచ్ గ్లాస్ నుండి తీసి స్లెడ్ పైన పెట్టి నెమ్మదిగా నీటితో కడగాలి.
  5. కవర్ స్లిప్ నుంచి ఉల్లిపొరను సూక్ష్మదర్శినిలో (ఎక్కువ మాగ్నిఫికేషన్) పరిశీలించాలి.
  6. పరిశీలించిన అంశాన్ని బొమ్మ గీయాలి.

పరిశీలనలు :
ఆకుపచ్చ రంగులో గుండ్రంగా కాని పొడవుగా ఉండే రేణువులు కణద్రవ్యంలో వెదజల్లినట్లు కనబడే నిర్మాణాలు మైటోకాండ్రియా.

కృత్యం – 3

4. రియో పత్రంలో హరితరేణువులను (Chloroplast) పరిశీలిద్దాం.
సూక్ష్మదర్శిని సహాయముతో రియో పత్రమునందలి క్లోరోప్లాస్టు (హరితరేణువులు)లను పరిశీలించుము. బొమ్మను గీచి, పరిశీలనలు రాయుము.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు 9
క్లోరోప్లాస్టులను పరిశీలించుట :

  1. రియో పత్రం పొరను తీసుకొని స్లెడ్ పైన ఉంచి నీటి చుక్క వేయాలి.
  2. ఎక్కువ మాగ్నిఫికేషన్ గల సూక్ష్మదర్శినితో పరిశీలించాలి.

పరిశీలనలు:

  1. స్లెడ్ రియో పత్రమునందు ఆకుపచ్చని చిన్నటి రేణువులు కనబడుతున్నాయి. వీటిని హరితరేణువులు అంటారు.
  2. హరితరేణువులు పత్రహరిత వర్ణద్రవ్యమును కలిగి ఉంటాయి.

కృత్యం – 4

5. శైవలాలలో హరితరేణువులు పరిశీలిదాం :
శైవలములందలి హరితరేణువులను నీవు ఏ విధముగా సూక్ష్మదర్శినిలో పరిశీలిస్తావు ? పరిశీలించిన బొమ్మను గీచి, నీవు కనుగొనిన విషయమును రాయుము.
జవాబు:
శైవల హరితరేణువులను పరిశీలించుట :

  1. నీటి కొలను నుండి ఆకుపచ్చని శైవలాలను సేకరించాలి.
  2. వాటి సన్నని తంతువులను వేరుచేయాలి.
  3. కొన్ని తంతువులను స్లెడ్ పైన ఉంచి సూక్ష్మదర్శినితో పరిశీలించాలి.

AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు 10

పరిశీలనలు:

  1. శైవలాలలో హరితరేణువులు నిచ్చెన ఆకారంలో గాని, నక్షత్ర ఆకారంలో గాని, సర్పిలాకారంలో గాని, జాలాకారంలో గాని ఉంటాయి.
  2. కిరణజన్య సంయోగక్రియలో సూర్యకాంతిలోని సౌరశక్తిని గ్రహించి రసాయనశక్తిగా హరితరేణువులు మార్చుతాయి.

AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు

కృత్యం – 5

6. రిక్తికలను పరిశీలిద్దాం :
కలబంద వంటి రసభరిత మొక్క కాండం లేదా పత్రాన్ని నీవు ఏ విధముగా సూక్ష్మదర్శినితో పరిశీలిస్తావు?
జవాబు:
రిక్తికల పరిశీలన చేయు విధం :

  1. కలబంద వంటి రసభరిత మొక్క కాండం లేదా పత్రాన్ని తీసుకోవాలి.
  2. కాండం నుండి పల్చటి భాగాన్ని తీసుకొని నీరు ఉన్న వాగ్లాలో ఉంచాలి.
  3. స్లెడ్ మీద ఉంచి సజల సాఫ్రనిలో రంజనం చేయాలి.
  4. స్లెడు సంయుక్త సూక్ష్మదర్శినితో పరిశీలించాలి.

పరిశీలనలు :

  1. కణంలో పెద్ద పెద్ద ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి. వాటిని రిక్తికలు అంటారు.
  2. ఇవి రసభరితంగా ఉండే సంచుల వంటి నిర్మాణాలు.

AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు

These AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు will help students prepare well for the exams.

AP Board 10th Class Biology 10th lesson Important Questions and Answers సహజ వనరులు

10th Class Biology 10th lesson సహజ వనరులు 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
మృత్తికక్షయాన్ని అరికట్టుటకు మీరు ఇచ్చే ఏవైనా రెండు సలహాలను రాయండి.
జవాబు:

  1. అడవులను పెంచటం
  2. చెక్ డ్యామ్ లు నిర్మించటం
  3. ఖాళీ నేలలో గడ్డి పెంచటం మొదలైన వాటి వలన క్రమక్షయం నివారించవచ్చు.

ప్రశ్న 2.
మీ ప్రాంతములో “నీటి సంరక్షణ” పై చైతన్యము కల్గించడానికి ఏ నినాదమును సూచిస్తావు?
జవాబు:

  1. నీటిని పొదుపుగా వాడాలి
  2. నీటిని వృథా చేయవద్దు
  3. జలమే జీవం

ప్రశ్న 3.
AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు 1గుర్తు దేనిని సూచిస్తుంది? దాని అర్థం ఏమిటి?
జవాబు:
పటంలోని గుర్తు పునఃవినియోగాన్ని సూచిస్తుంది. ఇది వాడిన వస్తువులను తిరిగి వాడటం గురించి తెలుపుతుంది.

ప్రశ్న 4.
అడవుల విస్తీర్ణం బాగా తగ్గితే ఏం జరుగుతుంది?
జవాబు:

  1. వన్యజీవుల ఆవాసాల విధ్వంసం జరుగును.
  2. నేల క్రమక్షయం జరుగును.
  3. గ్రీన్‌హౌస్ వాయువుల పెరుగుదల చేత భూతాపము పెరుగుతుంది.
  4. అడవులపై ఆధారపడి నివసించేవారు జీవనోపాధి కోల్పోతారు.
  5. అడవుల విస్తీర్ణం బాగా తగ్గితే వర్షపాతం తగ్గుతుంది.

ప్రశ్న 5.
విద్యుత్ పొదుపుకు మీరు చేస్తున్న రెండు పనులను రాయండి.
జవాబు:

  1. విద్యుత్ దీపాలు, పరికరాలు, ఫ్యాన్స్ వాడనప్పుడు స్వి ను ఆపివేయవలెను.
  2. విద్యుత్ను ఆదా చేసే పరికరాలైన LEDS మరియు CFL బలను ఉపయోగించవలెను.
  3. సాంప్రదాయేతర ఇంధన వనరులైన సౌరశక్తి మరియు పవనశక్తిని ఉపయోగించాలి.

AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు

ప్రశ్న 6.
సహజవనరులను పునరుద్ధరించడానికి మీరు ఏఏ చర్యలు తీసుకొంటారు?
జవాబు:

  1. ప్రజలు నీటిని సంరక్షించుకునే విధంగా ప్రేరేపించాలి.
  2. నీటిని వీలైనంత వరకు సృధా చేయకూడదు.
  3. ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటాలి
  4. నీటి వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలి.
  5. వీలైనంత వరకు నీటిని పునర్వినియోగించుకునేటట్లు చేయూలి.

ప్రశ్న 7.
తక్కువ నీటి సౌకర్యాలు ఉన్న ప్రాంతాలలో రైతులు అనుసరించదగిన ఏవైనా రెండు విధానాలు రాయుము.
జవాబు:

  1. ఇంకుడు గుంతలు త్రవ్వుట,
  2. బిందు సేద్యం మరియు స్ప్రింక్లర్స్ తో సూక్ష్మ నీటిపారుదల పద్ధతి.

ప్రశ్న 8.
మన రాష్ట్రంలో ఇటీవల ప్రకటించిన “వనం-మనం” అను కార్యక్రమమును ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మీరు ఏవైనా రెండు నినాదాలు తయారుచేయండి.
(లేదా)
మీ పాఠశాల ర్యాలిలో ప్రదర్శించడానికి “వనం-మనం” కార్యక్రమం గురించి కొన్ని నినాదాలు రాయండి.
జవాబు:

  1. మొక్కలు నాటుదాము – స్వచ్ఛమైన గాలిని పొందుదాము.
  2. మొక్కలు పెంచు – కాలుష్యం తగ్గించు.
  3. మొక్కలు పెంచుదాము – భౌగోళిక వెచ్చదనాన్ని తగ్గిద్దాము.
  4. చెట్లను నరికితే – జీవుల ప్రాణం తీసినట్లే.
  5. వృక్షోరక్షతి రక్షితః
  6. చెట్లను పెంచుదాం దండిగా – పరిసరాలను ఉంచుదాం పచ్చగా.

ప్రశ్న 9.
“పునరుద్దరింపబడని వనరుల సంరక్షణ” పై రెండు నినాదాలు తయారుచేయండి.
జవాబు:

  1. జీవ ఇంధనాలను వాడదాం – శిలాజ ఇంధనాలను తగ్గిదాం.
  2. ప్రత్యామ్నాయ ఇంధనాలను వాడదాం – పర్యావరణాన్ని కాపాడదాం.

ప్రశ్న 10.
అడవులను ఎందుకు సంరక్షించుకోవాలో రెండు కారణాలు తెల్పండి.
జవాబు:
అడవులను సంరక్షించుకోవటానికి గల కారణాలు :

  1. అడవులు వాతావరణంలో పెరుగుతున్న కార్బన్ డయాక్సెడ్ ను గ్రహించి భౌగోళిక వెచ్చదనాన్ని తగ్గిస్తాయి.
  2. అడవుల నుండి విలువైన వనరులు అనగా ఔషధాలు, కలప, లక్క తేనె మొదలైన వాటిని పొందుతున్నాము.
  3. అడవులు వర్షాలుపడటంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి.

ప్రశ్న 11.
పునరుద్దరింపలేని వనరులకు రెండు ఉదాహరణలు రాయండి.
జవాబు:
1. బొగ్గు 2. పెట్రోల్ 3. సహజ వాయువు 4. ఆయిల్ (నూనె)

ప్రశ్న 12.
శిలాజ ఇంధనాలు ఎలా ఉత్పత్తి అవుతాయి?
జవాబు:
బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు వంటి శిలాజ ఇంధనాలు వేల సంవత్సరాల క్రిందట భూగర్భంలో పాతుకుపోయిన వృక్ష, జంతు కళేబరాల నుండి ఉత్పత్తి అవుతాయి.

ప్రశ్న 13.
వనరులు అనగానేమి?
జవాబు:
అధిక మోతాదులో లభిస్తూ, భవిష్యత్ లో వాడకానికి వీలుగా ఉన్న పదార్థాలను “వనరులు” అంటారు.

ప్రశ్న 14.
సహజ వనరులు అనగానేమి?
జవాబు:
సహజ వనరులు :
పకృతిలో సహజంగా లభించే వనరులను సహజ వనరులు అంటారు.
ఉదా : గాలి, నీరు.

AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు

ప్రశ్న 15.
సహజ వనరులు ఎన్ని రకాలు? అవి ఏవి?
జవాబు:
సహజ వనరులు రెండు రకాలు

  1. పునరుద్ధరింపబడేవి
  2. పునరుద్ధరింపబడనివి.

ప్రశ్న 16.
శ్రీరాం సాగర్ ప్రాజెక్టు ఏ జిల్లాల అవసరాలు తీర్చుతుంది?
జవాబు:
కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లావాసుల అవసరాలను శ్రీరాం సాగర్ ప్రాజెక్టు తీర్చుతుంది.

ప్రశ్న 17.
శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం ఎంత?
జవాబు:
శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 80.66. టి.ఎమ్.సి.లు.

ప్రశ్న 18.
ఇంకుడు చెరువు అనగానేమి?
జవాబు:
ఇంకుడు చెరువు :
నీటి ప్రవాహాలకు అడ్డంగా రాళ్లు, మట్టితో అడ్డుకట్టలు కట్టి ఏర్పాటు చేసే నీటి నిల్వలను “ఇంకుడు చెరువులు” (Percolation tanks) అంటారు.

ప్రశ్న 19.
సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ సంస్థ ఎక్కడ ఉంది?
జవాబు:
సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ సంస్థ ఆంధ్రప్రదేశ్ లోని సికింద్రాబాద్ లో ఉంది.

ప్రశ్న 20.
మైక్రో ఇరిగేషన్ అనగానేమి?
జవాబు:
మైక్రో ఇరిగేషన్ :
డ్రిప్ మరియు స్ప్రింక్లర్లతో, తక్కువ నీటితో వ్యవసాయం చేసే పద్ధతిని “మైక్రో ఇరిగేషన్” అంటారు.

ప్రశ్న 21.
నేల వనరు సద్వినియోగానికి ఉపయోగపడే రైతు ఆధారిత విధానాలు ఏమిటి?
జవాబు:
వెడల్పు చాళ్లు తియ్యడం, తక్కువ ఎత్తు పెరిగే పంటలు పెంచడం, కాంటూర్ సేద్యం చేయటం వంటి పద్ధతుల ద్వారా నేలను సద్వినియోగం చేయవచ్చు.

ప్రశ్న 22.
నేలలో నైట్రోజన్ నిల్వలు ఎలా పెంచవచ్చు?
జవాబు:
గట్ల మీద గెరిసీడియా మొక్కలను, లెగ్యుమినేసి పంటలను పండించటం వలన నేలలో నైట్రోజన్ నిల్వలు పెంచవచ్చు.

ప్రశ్న 23.
‘సుస్థిరాభివృద్ధి’ అనగానేమి?
జవాబు:
సుస్థిరాభివృద్ధి :
అభివృద్ధికి, సంరక్షణకు రెండింటికి ప్రాధాన్యమిస్తూ భావితరాలకు అవసరమయ్యే సహజ వనరులను అందుబాటులో ఉండే విధంగా పర్యావరణాన్ని ఉపయోగించుకోవడాన్ని “సుస్థిరాభివృద్ధి” అంటారు.

ప్రశ్న 24.
సుస్థిర అటవీ పద్ధతులు కొన్ని తెలపండి.
జవాబు:
చెట్లు తక్కువగా నరకటం, చెట్లు తిరిగి ఎదగడానికి అవకాశం ఇవ్వటం, ఎత్తైన చెట్లను, పెద్దచెట్లను నరకకుండా చూడటం వలన అటవీ వనరులను కాపాడుకోవచ్చు. వీటినే “సుస్థిర అటవీ పద్దతులు” అంటారు.

ప్రశ్న 25.
కాంటూర్ పట్టీ పంటలు అనగానేమి?
జవాబు:
కాంటూర్ పట్టీ పంటలు: ఏటవాలు ప్రాంతాలలో నేల వాలుకు అడ్డంగా గాలి వీచే దిశకు అడ్డంగా నేలను దున్ని ఒక్కొక్క వరుసలో ఒక్కొక్క పంటను పండించే పద్ధతిని “కాంటూర్ పట్టి పంటలు” అంటారు.

ప్రశ్న 26.
జీవవైవిధ్య వినాశనానికి దారితీసే ప్రక్రియలు ఏమిటి?
జవాబు:
వేటాడడం, కాలుష్యం, ఆవాసాలు విధ్వంసం వంటి కార్యకలాపాలు జీవవైవిధ్య వినాశనానికి దారితీస్తున్నాయి.

ప్రశ్న 27.
శిలాజ ఇంధనాలు అనగానేమి?
జవాబు:
శిలాజ ఇంధనాలు :
బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు వంటి శిలాజ ఇంధనాలు వేల సంవత్సరాల క్రిందట భూగర్భంలో పాతుకు పోయిన వృక్ష జంతు కళేబరాల నుండి ఉత్పత్తి అవుతాయి. వీటిని “శిలాజ ఇంధనాలు” అంటారు.

ప్రశ్న 28.
జీవ ఇంధనాలు అనగానేమి?
జవాబు:
జీవ ఇంధనాలు :
శక్తిని ఇచ్చే జీవ ద్రవ్యరాశిని “జీవ ఇంధనాలు” అంటారు.
ఉదా : బయోడీజిల్.

AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు

ప్రశ్న 29.
బయోడీజిల్ ఉత్పత్తికి అనువైన మొక్కలు ఏమిటి?
జవాబు:
జట్రోపా (అడవి ఆముదం) కర్కాస్ మొక్కలు విత్తనాల నుండి బయోడీజిల్ తయారుచేస్తారు.

ప్రశ్న 30.
4R సూత్రం అనగానేమి?
జవాబు:
పర్యావరణ పరిరక్షణకు, వనరుల సద్వినియోగానికి 4R సూత్రం పాటించాలి. అవి:

  1. Reduce:తగ్గించటం
  2. Reuse :తిరిగివాడటం
  3. Recycle: పునఃచక్రీయం
  4. Recover : తిరిగి ఏర్పరచడం

ప్రశ్న 31.
ఈ క్రింది పటం దేనిని సూచిస్తుంది?
AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు 1
జవాబు:
ఇది పునఃచక్రీయానికి గుర్తు.

ప్రశ్న 32.
IUCN అనగా నేమి?
జవాబు:
‘ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్సర్వేషన్ ఆఫ్ నేచర్’ ను సంక్షిప్తంగా IUCN అంటారు. 1980లో ఇది ప్రపంచ సంరక్షణ విధానాన్ని ప్రతిపాదించింది.

ప్రశ్న 33.
తరగని వనరులు తరిగిపోయే వనరులుగా మారే అవకాశం ఉందా?
జవాబు:
విచక్షణారహిత వినియోగం వలన తరగని వనరులు తరిగిపోయే వనరులుగా మారే ప్రమాదం ఉంది.

ప్రశ్న 34.
భూగర్భజలాలు తగ్గటానికి కారణాలు ఏమిటి?
జవాబు:
ఋతుపవనాల రాకడలో మార్పులు, లోతైన గొట్టపు బావులు, భూగర్భ జల వినియోగంలో విచక్షణా రాహిత్యం మొదలయిన వాటి వలన భూగర్భజలాలు తగ్గుతున్నాయి.

ప్రశ్న 35.
ICRISAT పూర్తి పేరు ఏమిటి?
జవాబు:
“ఇంటర్ నేషనల్ క్రాప్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ ఫర్ సెమి-ఎండ్ ట్రాపిక్స్” ను ఇక్రిసాట్ అంటారు. ఇది సికింద్రాబాదులో ఉంది.

10th Class Biology 10th lesson సహజ వనరులు 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
“అడవి ఒక ప్రధాన పునరుద్ధరింపదగిన వనరు” – దీనిని నీవు ఎలా సమర్థిస్తావు?
జవాబు:
“అడవి ఒక ప్రధాన పునరుద్దరింపదగిన ప్రధాన వనరు.” దీనిని నేను సమర్థిస్తాను.
ఉదాహరణలు:

  1. చెట్లను నరికివేస్తే తిరిగి పెరుగుతాయి. వాటంతట అవే పెరుగుతాయి.
  2. అటవీ పదార్థాలు వాడిన కొద్ది తిరిగి ఏర్పడుతాయి.
  3. మొక్కలు పెంచటం, సామాజిక అడవుల అభివృద్ధి వంటి కార్యక్రమాల ద్వారా అడవులు పునరుద్ధరించబడతాయి.

ప్రశ్న 2.
శిలాజ ఇంధనాలు పొదుపుగా ఎందుకు వాడాలి?
జవాబు:

  1. శిలాజ ఇంధనాలు తరిగిపోయే ఇంధనాలు.
  2. ఇవి తిరిగి ఏర్పడటానికి లక్షల సంవత్సరాలు పడుతుంది.
  3. విచక్షణా రహితంగా వీటిని వాడినట్లయితే మనకు ఇంధన కొరత వస్తుంది.
  4. భవిష్యత్ అవసరాలకు ఇంధన పరిరక్షణ కొరకు వీటిని పొదుపుగా వాడాలి.

ప్రశ్న 3.
భూగర్భ జలాల సంరక్షణ గురించి అవగాహన కలిగించుటకు మీరిచ్చే రెండు సలహాలను రాయండి.
జవాబు:
భూగర్భ జలాల సంరక్షణ :

  1. ఇంకుడు గుంతలు త్రవ్వడం, చెక్ డ్యాం నిర్మించడం ద్వారా వర్షపు నీటిని నిల్వ చేయడం.
  2. ర్యాలీలు నిర్వహించడం, కరపత్రాలు, గోడ పత్రికల ద్వారా ప్రచారం చేయడం ద్వారా భూగర్భ జల సంరక్షణపై అవగాహన కల్పించడం.
  3. తక్కువ నీటితో వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం మొదలగునవి.

ప్రశ్న 4.
భూమి వేడెక్కుటలో గ్రీన్‌హౌస్ వాయువుల పాత్రను వివరించుము.
జవాబు:

  1. CO2, CFC’s, NO2, హైడ్రోకార్బన్లు మరియు మిథేన్ వంటి వాయువులను గ్రీన్‌హౌస్ వాయువులంటారు. ఇవి భూమిని వెచ్చగా ఉంచుతాయి.
  2. గ్రీన్‌హౌస్ వాయువుల గాఢత పెరుగుట వలన భూమి యొక్క ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది.
  3. గ్రీన్‌హౌస్ వాయువులు భూమి నుండి ఉద్గారమయ్యే వేడిమిని గ్రహించి భౌగోళిక వెచ్చదనానికి కారణమవుతున్నాయి.

ప్రశ్న 5.
సహజ వనరులను సద్వినియోగం చేసుకోవడమే దేశానికి మనం చేసే సేవ అని చెప్పవచ్చు. దీనిని నీవు సమర్థిస్తావా? ఎందుకు?
జవాబు:

  1. ఒక దేశపు సహజ వనరులు ఆ దేశం యొక్క ఆర్థిక, సామాజిక పురోభివృద్ధిని నిర్ణయిస్తాయి.
  2. సహజ వనరులు ప్రకృతిలో సహజంగా లభిస్తూ మానవ కార్యకలాపాలకు, మనుగడకు ఉపయోగపడతాయి.
  3. సహజ వనరులు తయారుకావడానికి చాలాకాలం పడుతుంది.
  4. వీటిని విచక్షణారహితంగా వాడినపుడు పూర్తిగా అంతరించిపోతాయి.
  5. కావున సహజ వనరులను భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉండే విధంగా సద్వినియోగం చేసుకోవడమే దేశానికి మనం చేసే సేవ.

AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు

ప్రశ్న 6.
శిలాజ ఇంధనాలను సంరక్షించుటకు మీరు పాటించే నాలుగు పద్ధతులు రాయండి.
జవాబు:

  1. ప్రత్యామ్నాయ ఇంధనాలను ఉపయోగించాలి.
  2. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలి.
  3. కార్లవంటి సొంత వాహనాలలో కాకుండా బస్సులు, రైళ్ళ వంటి ప్రజారవాణా వ్యవస్థలను ఉపయోగించాలి.
  4. వీలైనప్పుడు నడవడం, సైకిలను ఉపయోగించాలి.
  5. విద్యుత్ ఆదా చేసే పరికరాలను ఉపయోగించాలి.

ప్రశ్న 7.
మానవులమైన మనము ప్రకృతి ప్రసాదించిన వనరులను విచక్షణా రహితంగా వినియోగిస్తున్నాము. ఫలితంగా ప్రకృతి వనరులు చాలా వేగంగా తరిగిపోతున్నాయి. దీనివల్ల భవిష్యత్ లో జరుగబోవు పరిణామాలను ఊహించి వ్రాయుము. జ. సహజ వనరులను విచక్షణారహితంగా వాడటం వలన ఈ క్రింది దుష్పరిణామాలు సంభవిస్తాయి.
జవాబు:

  1. వర్షపాతంలో తగ్గుదల.
  2. కరువు సంభవించుట.
  3. వాతావరణ ఉష్ణోగ్రతలలో పెరుగుదల.
  4. అరుదైన జాతులు అంతరించిపోయే ప్రమాదం గలదు.

ప్రశ్న 8.
సంవత్సరం నుండి మరో సంవత్సరానికి వాతావరణ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి కదా ! ఇలానే ఉష్ణోగ్రతలు పెరుగుతూ పోతే జరిగే పరిణామాలను ఊహించి వ్రాయండి.
జవాబు:

  1. ఉష్ణోగ్రతలు పెరిగే కొలది ధృవప్రాంతాలలో మంచు కరిగి, సముద్రాలలో నీటిమట్టం పెరుగుతుంది.
  2. సముద్రాలలో నీటిమట్టం పెరుగుట వల్ల చిన్న చిన్న దీవులు మునిగిపోతాయి.
  3. ఉష్ణోగ్రతలు పెరుగుట వల్ల వర్షాలు తగ్గి కరువులు ఏర్పడతాయి.
  4. ఉష్ణోగ్రతలు ఎక్కువ పెరిగినప్పుడు కొన్ని జీవజాతులు అంతరించవచ్చు.

ప్రశ్న 9.
స్వచ్ఛ భారత్ సాధనలో 4R’s ప్రాముఖ్యతను తెలియచేయండి.
జవాబు:

  1. చెత్తను ఉత్పత్తి చేయటాన్ని తగ్గించటము. .
  2. చెత్తను తిరిగి వాడుటము ద్వారా ఎరువులను, కరెంట్ ను ఉత్పత్తి చేయవచ్చును.
  3. చెత్తను పారవేసేముందు తడిచెత్త, పొడి చెత్తలను వేరు చేయటము ద్వారా పునఃచక్రీయం చేయవచ్చు.
  4. చెట్లను నరికివేసినప్పుడు ప్రత్యామ్నాయంగా మరో చోట చెట్లను పెంచడం.

ప్రశ్న 10.
ఇంకుడు చెరువులు అనగానేమి? వీటిని ఎలా నిర్మిస్తావు?
జవాబు:
AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు 2
నీటి ప్రవాహాలకు అడ్డంగా ‘ రాళ్లు, మట్టితో అడ్డుకట్టలు కట్టి ఏర్పాటు చేసే నీటి నిల్వలను ఇంకుడు చెరువులు (Percolation tanks) అంటారు. బంకమట్టి, ఇసుక, కంకర, గులకరాళ్లు మొదలైన వాటిని బాగా కలిపి ఒకదానిపైన ఒకటి వచ్చేటట్లుగా పొరలపొరలుగా చెరువు నేలను, అంచుల వెంబడి కప్పుతారు. తరువాత దీనిని గట్టిగా కుదురుకునేలా చేస్తారు. వ్యవసాయం కోసం నీటిని సరఫరా చేయడానికి మట్టికట్టకు తూము ఏర్పాటు చేస్తారు. పూర్తి నీటి నిల్వ మట్టానికి, అడుగు మట్టానికి మధ్య నాలుగోవంతు ఎత్తులో తూమును ఏర్పాటు చేస్తారు. అందువల్ల తగినంత నీటిని విడుదల చేసుకోవడానికి వీలుకలుగుతుంది.

ప్రశ్న 11.
కేడీ నిర్వహించిన వనపర్తి, వట్టిచెర్ల గ్రామాల మధ్యగల పోలికలు ఏమిటి?
జవాబు:
వృత్తులు, పంట విధానాలు, భౌగోళిక స్థితిగతులు, మౌలిక సదుపాయాలు, సామాజిక సేవలు వంటి అంశాల దృష్ట్యా వనపర్తి, వడ్డిచెర్ల గ్రామాలు ఒకే విధంగా ఉన్నాయి. రెండు గ్రామాలలో చిన్న రైతులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. సరాసరి కుటుంబ ఆదాయం వనపర్తిలో ఎక్కువ. ఈ రెండు గ్రామాల్లో వ్యవసాయమే జీవనాధారం. బావులే నీటిపారుదలకు మూలం. కుటుంబ ఆదాయం, భూగర్భజలం యొక్క స్థాయిపైనే ఆధారపడి ఉంటుంది. కుటుంబ ఆదాయాన్ని ప్రభావితం చేసే పంటల క్రమం ఈ గ్రామాల్లో వేరు వేరుగా ఉంది.

ప్రశ్న 12.
భూగర్భజలం ఇటీవలి కాలంలో తగ్గటానికి గల కారణాలు ఏమిటి?
జవాబు:
గత కొన్ని సంవత్సరాల నుండి ఋతుపవనాల రాకడలో మార్పులు సంభవించడం వలన, భూగర్భజలాల వినియోగంపై ఒత్తిడి పెరిగింది. డ్రిల్లింగ్, లోతైన గొట్టపుబావులు, బోరుబావులను తవ్వడం వంటి చర్యల వలన, విచక్షణారహితంగా రాష్ట్రంలోని భూగర్భజలాన్ని వాడడం వలన ఈ వనరు బాగా తరిగిపోతున్నది. మన రాష్ట్రంలో 1998-2002 మధ్యకాలంలో సరాసరిగా నీటి స్థాయి 3 మీటర్ల దాక తగ్గింది.

ప్రశ్న 13.
భూగర్భ జల సంరక్షణకు సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ సంస్థ చేపట్టిన చర్యలు ఏమిటి?
జవాబు:
సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ (సికింద్రాబాదు, ఆంధ్రప్రదేశ్), గ్రామాలలో ఎండిపోతున్న బావులలో నీరు చేరుకునేలా, భూగర్భజలాలపై సుస్థిరత్వంపై దృష్టి కేంద్రీకరించింది. రైతులందరూ సమష్టిగా నీటిని పంచుకొని వాడుకునే విధంగా ప్రోత్సహించారు. ఒకే నీటి వనరును ఉపయోగించుకునే విధంగా, రైతులు చిన్న, పెద్ద గ్రూపులుగా ఏర్పడ్డారు. డ్రిప్ మరియు స్ప్రింక్లర్లతో సూక్ష్మ నీటిపారుదల (మైక్రో ఇరిగేషన్) పద్ధతులను అనుసరించేలా రైతులు స్ఫూర్తిని పొందారు. వర్షపు నీటి సంరక్షణకై ఇంకుడు గుంటలు తవ్వారు.

ప్రశ్న 14.
నీటిని విచక్షణాయుతంగా వాడవలసిన అవసరం ఏమిటి?
జవాబు:
భూమిపై ఉన్న మొత్తం నీటిలో సముద్రాలు, మహాసముద్రాలు, భూగర్భ జలాలలో ఉన్న నీటిలో 97 శాతం ఉప్పు నీరే. 2.5-2.75% మాత్రమే మంచినీరు. దీనిలో 1.75-2% (మూడింట రెండు వంతులు) నీరు గ్లేషియర్లు, మంచు, హిమపాతం రూపంలో గడ్డకట్టి ఉంటుంది. 0.7-0.8% మంచినీరు భూగర్భజలంగా, నేలలో నీటి ఆవిరి రూపంలో ఉంటుంది. 0.01%’ కంటే తక్కువ పరిమాణంలో మంచినీరు ఉపరితల జలం రూపంలో సరస్సులు, నదులలో ఉంటుంది. మంచినీరు చాలా తక్కువ ఉన్నప్పటికీ విచక్షణతో ఉపయోగించాలి.

AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు

ప్రశ్న 15.
పూర్వకాలంలో గ్రామ సరిహద్దులను ఎలా నిర్ణయించేవారు?
జవాబు:
పూర్వం వాటర్ షెడ్ (రెండు నదులు లేదా కాలువల మధ్యగల భూ ప్రాంతం) ఆధారంగా, నిపుణులైన రైతులు గ్రామ సరిహద్దులను నిర్ణయించేవారు. రెండు గ్రామాల మధ్యగల మురుగు నీటిపారుదల వ్యవస్థ ఆధారంగా ఈ హద్దులు నిర్ణయించబడేవి. వ్యవస్థలోని సభ్యులందరూ వీటిని సామాజికంగా అంగీకరించేవారు.

ప్రశ్న 16.
సర్వే నిర్వహణకు ముందు కొత్తపల్లి గ్రామ ప్రజల పరిస్థితులు ఏమిటి?
జవాబు:
కొత్తపల్లి గ్రామంలో సర్వేకు పూర్వపరిస్థితులు:
1. సాగుభూమి కన్నా బీడు భూములు విస్తృతంగా ఉండేవి; 2. తక్కువ అక్షరాస్యత ; 3. శ్రామికులు తక్కువగా ఉండేవారు; 4. చిన్న కమతాలలో లేదా పొలాలలో క్రిమిసంహారకాలు లేదా ఎరువులు ఎక్కువగా వాడేవారు ; 5. పంట దిగుబడి తక్కువగా ఉండేది ; 6. గ్రామంలో నీటి సంరక్షణ నిర్మాణం ఒక్కటి కూడా లేదు. ఉత్పాదకత, ఆదాయాన్ని పెంపొందించే విధానాలు లేవు.

ప్రశ్న 17.
శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ గురించి రాయండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు 3
శ్రీరాం సాగర్ ప్రాజెక్టు పోచంపాడు ప్రాజెక్టు అని కూడా అంటారు. ఇది గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టు, తెలంగాణా ప్రాంతంలో అధిక భాగానికి ఇది జీవనాధారం. కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం జిల్లా వాసుల అవసరాలను ఈ ప్రాజెక్టు తీరుస్తుంది. గోదావరి నదిపై, ఇతర రాష్ట్రంలో ఆనకట్ట నిర్మించడం వలన, ఎక్కువ శాతం నీరు ఆంధ్రప్రదేశ్ కు చేరకుండానే పై రాష్ట్రాలలో నిలువ చేయబడుతోంది. ఆగస్టు 2013 గణాంకాల ప్రకారం ఈ ప్రాజెక్టు యొక్క అంచనా వేయబడిన నీటి నిలువ సామర్థ్యం 80, 66 టి.ఎం.సి.లు.

ప్రశ్న 18.
బీడు భూములను ఎలా అభివృద్ధి పర్చవచ్చు?
జవాబు:
రోడ్ల వెంబడి, పొలాలు, కాలువల గట్ల వెంబడి ఉపయోగకరమైన జాతుల మొక్కలను పెంచడం ద్వారా బీడు భూములు అభివృద్ధి చేయవచ్చు. ఇందుకుగాను రైతులు అనేకచోట్ల 0.3 మీటర్ల ఎత్తు కట్టలను కట్టి, 10 మీటర్ల దూరానికి ఒకటి చొప్పున కాంటూర్ కందకాలను ఏర్పాటు చేశారు. సీతాఫలం మొక్కలతో పాటు అనేక ఉపయోగకరమైన జాతుల మొక్కలను, గెరిసీడియా మొక్కలను వారు పెంచడం మొదలు పెట్టారు. 2500 పండ్ల చెట్లు, టేకు చెట్లను నాటారు. ఇదే విధంగా బీడు భూములను అభివృద్ధి చేయవచ్చు.

ప్రశ్న 19.
పునరుద్దరించదగిన వనరులు (Reneuuable resources) అనగానేమి?
జవాబు:
మనం జీవించడానికి అవసరమయ్యే ఆహారం, నీరు, గాలి, నివాసం అన్నీ సహజ వనరుల నుండి లభిస్తాయి. కొన్ని సహజ వనరులు ఉపయోగించిన తరువాత, తిరిగి ఉత్పత్తి చేయబడుతాయి. వీటిని పునరుద్ధరింపదగిన వనరులు (Renewable resources) అంటారు.

ప్రశ్న 20.
పునరుద్దరింపలేని వనరులు (Non-reneuable resources) అనగానేమి?
జవాబు:
శిలాజ ఇంధనాలు వంటి వనరులను పునరుద్దరింపలేము. ఒకసారి వీటిని పూర్తిగా వాడుకున్నట్లయితే, అవి ఎప్పటికీ తరిగిపోయినట్లే. అతి తక్కువ కాలం ఇవి వినియోగించబడతాయి. కానీ, ఇవి తయారవ్వాలంటే చాలా కాలం పడుతుంది. వీటినే పునరుద్ధరింపలేని వనరులు (Non-renewable resources) అంటారు.

ప్రశ్న 21.
అదవులు చాలా ప్రాముఖ్యత గలవని అనుకోవటానికి కారణాలు ఏమిటి?
జవాబు:
అడవులు చాలా ప్రాముఖ్యత కలిగినవి. ఎందుకంటే అంటార్కిటికా తప్ప మిగిలిన ఖండాలన్నింటిలోనూ అడవులు ఉన్నాయి. మొక్కలకు, జంతువులకు ఒక గొప్ప ఆవాసంగా ఉన్నాయి. ప్రపంచానికి అడవులు ఊపిరితిత్తులు వంటివి మరియు కొత్త జీవితానికి పోషకాలనందించే ప్రముఖ స్థానం వంటివి లెక్కలేనన్ని ఉత్పత్తులు అడవుల నుండి లభిస్తున్నాయి.

ప్రశ్న 22.
అడవుల సంరక్షణలో రాజస్థానీయులు చూపిన చొరవ తెలపంది.
జవాబు:
రాజస్థాన్లో వైష్ణోయిలు చేసిన కార్యక్రమం మనకు మార్గదర్శకం. అమృతాదేవి, ఆమె కుమార్తెలు, వారి గ్రామస్తులందరూ కలిసి గ్రామ సమీపంలో ఉండే అడవుల్లోని వృక్షాలను కొట్టివేయకుండా కాపాడుకొన్నారు. ఇలాంటి అద్భుతమైన ఉద్యమాలు మనకు పర్యావరణాన్ని కాపాడుకోవడంలో స్ఫూర్తినిస్తాయి. అడవిని నరికి కలప సేకరించి రాజభవనం కట్టుకోవాలన్న రాజుగారికి వ్యతిరేకంగా పోరాటం చేసి అడవితో ప్రశాంతమైన సహసంబంధాన్ని గడపడానికి ప్రతిన పూనారు. ప్రకృతిని కాపాడేందుకు 29 నియమాలతో స్వయంచట్టం చేసుకున్నారు.

ప్రశ్న 23.
నేల ప్రాధాన్యత తెలపండి.
జవాబు:
ఆహారోత్పత్తికి నేల చాలా ముఖ్యమైనది. మనకు అవసరమైన పంటలు పండించాలంటే బాగా సారవంతమైన నేల ఉండాలి. వన్యజాతి మొక్కలు పెరగాలన్నా నేల అవసరం. మొక్కలు, జంతువులు మరియు ఇతర వనరులను సంరక్షించుకోవడానికి మనం చేసే అన్ని ప్రయత్నాలు నేల సంరక్షణ పైనే ఆధారపడి ఉంటాయి.

ప్రశ్న 24.
నేలకు నష్టాలు కలిగిస్తున్న కారకాలు తెలపండి.
జవాబు:
ఒక పొలంలో ఒకే రకం పంటను పలుమార్లు పండించడం వంటి లోపభూయిష్టమైన వ్యవసాయ పద్ధతులు నేలలోని పోషకాలను తొలగిస్తాయి. కొండ ప్రాంతాలను దున్నడం వలన నీరు, గాలి ద్వారా నేలకోత చాలా ఎక్కువవుతుంది.

ప్రశ్న 25.
జీవవైవిధ్యం అనగానేమి? దాని ప్రాముఖ్యత ఏమిటి?
జవాబు:
భూమిపై నివసిస్తున్న జీవులలో గల వైవిధ్యమే జీవవైవిధ్యం. ప్రకృతి నుండి మనకు లభించే ఉత్పత్తులు మరియు లాభాలన్నీ జీవవైవిధ్యం నుండి పొందుతున్నవే. ఆహార పదార్థాలు, వాటి నిర్మాణాలకు ఉపయోగించే పదార్థాలు, ఔషధాలు లభించాలన్నా మరియు పరిశుభ్రమైన, ఉపయోగకరమైన నేల ఉండాలన్నా జీవవైవిధ్యం ఎంతో అవసరం.

ఆహార వనరులు వైవిధ్యంగా, సమృద్ధిగా ఉండే విధంగా మనం జీవవైవిధ్యాన్ని కాపాడుకోవలసిన అవసరం ఉంది. ఆహారం కన్నా జీవవైవిధ్యం గొప్పది. ఉదాహరణకు ప్రపంచంలో మొత్తంలో 50,000 నుండి 70,000 వృక్ష జాతులను ఔషధాల తయారీలో వినియోగిస్తున్నారు.

AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు

ప్రశ్న 26.
శిలాజ ఇంధనాల వినియోగం ఎలా తగ్గించవచ్చు?
జవాబు:
శిలాజ ఇంధనాలను జాగ్రత్తగా వినియోగిస్తూ, ప్రతి ఒక్కరూ వాటిని సంరక్షించాలి. విద్యుత్ దీపాలను, పరికరాలను వాడనప్పుడు స్వి ను ఆపివేయండి. విద్యుత్ను ఆదాచేసే పరికరాలను మాత్రమే కొనండి. వీలైనపుడు నడవడం, సైకిలను ఉపయోగించడం చేయాలి.

కార్ల వంటి సొంత వాహనాలలో కాకుండా బస్సులు, రైళ్లు వంటి ప్రజా రవాణా వ్యవస్థల ద్వారా ప్రయాణిస్తే లాభదాయకం. ఈ విధంగా చేస్తే సమాజానికి ఎంతో ఉపయోగం.

ప్రశ్న 27.
ఖనిజాల వినియోగం వలన భవిష్యత్ లో వచ్చే సమస్యలు ఏమిటి?
జవాబు:
భూమిలో ఖనిజ వనరులు తగ్గిపోతాయి. కనుగొనబడిన, గుర్తించబడిన చాలా ఖనిజాలు తరిగిపోతాయి. అల్యూమినియం, ఇనుము యొక్క ఖనిజ నిలువలు లేదా ఖనిజ నిక్షేపాలు కనుమరుగైపోతుండడం వలన వాటి ధరలు చాలా పెరిగిపోయే అవకాశం ఉంది. ఈ మూలకాలతో తయారుచేసే పరికరాలు, యంత్రాల యొక్క ధరలు పెరిగి, వాటిని కొనడం మరియు వినియోగించడం కష్టమైపోతుంది.

10th Class Biology 10th lesson సహజ వనరులు 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
అడవి ఒక పునరుద్దరింపదగిన వనరు. కాని ప్రతి సంవత్సరం భూమిపై 36 మిలియన్ల ఎకరాల అడవులు నరికివేయబడుతున్న నేపథ్యంలో అవి పునరుద్ధరింపబడని వనరులుగా మారకుండుటకు నీవు ఎటువంటి సూచనలు చేస్తావు?
జవాబు:
ప్రపంచానికి అడవులు ఊపిరితిత్తులు వంటివి. అవి పునరుద్ధరింపబడని వనరుగా మారకుండా ఉండుటకు నేనిచ్చే సూచనలు :

  1. సుస్థిర అటవీ విధానాల ద్వారా భవిష్యత్ తరాలవారికి అందచేయగలం.
  2. చాలా తక్కువగా చెట్లను నరకడం.
  3. సహజంగా చెట్లు, తిరిగి ఎదగటానికి అవకాశం కల్గించే పద్ధతులు పాటించాలి.
  4. ఎత్తైన చెట్లు, పెద్ద చెట్లను నరికివేసే విధానాలను నిషేధించాలి.
  5. పునఃచక్రీయ పద్ధతులు అవలంబించడం.
  6. కలపకు బదులుగా ప్రత్యామ్నాయ వనరులను ఉపయోగించటం.
  7. అడవులను దహించకుండా చేయడం.

ప్రశ్న 2.
AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు 4
పై పట్టికను పరిశీలించి, క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
1) రెండు గ్రామములలో చిన్న రైతులు పండించడానికి అనుకూలమైన పంట ఏది?
జవాబు:
మొక్కజొన్న, వరి.

2) నీవు ఒకవేళ పెద్ద రైతువైతే ఏ పంట పండిస్తావు ?
జవాబు:
మిర్చి, వరి

3) A మరియు B గ్రామముల మధ్య ఏమైన పోలికలను గమనించావా?
జవాబు:
A మరియు B గ్రామాలలో చిన్న పెద్ద రైతు ఒకే రకమైన పంటలు పండిస్తున్నారు. A మరియు B గ్రామాలలో చిన్నకారు రైతు కంటే పెద్దకారు రైతు ఎకరాకు వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంది. రెండు గ్రామాలలో పెద్ద రైతు ఎక్కువ ఆదాయాన్ని వరి, మిర్చి, మొక్కజొన్న పంటలలో పొందుతున్నారు.

4) పై పట్టికలో తక్కువ ఆదాయాన్ని ఇచ్చే పంట ఏది?
జవాబు:
పత్తి

5) పంటకు, ఆదాయంనకు ఏమైన సంబంధం ఉన్నదా? వివరించండి.
జవాబు:
ఉంది. పంట దిగుబడి ఎక్కువగా ఉన్నప్పుడు ఆదాయం ఎక్కువగా ఉంటుంది. (లేదా)
ఉండకపోవచ్చు. మార్కెటు అవసరాన్ని బట్టి ఆదాయం ఉంటుంది. వాణిజ్య పంటలకు ఎక్కువ ఆదాయం వస్తుంది.

ప్రశ్న 3.
AR లు అనగానేమి? ఇవి పర్యావరణ సంరక్షణకు ఎలా ఉపయోగపడతాయి?
(లేదా)
పర్యావరణ సంరక్షణకు అవసరమయ్యే 4R సూత్రం వివరించండి.
జవాబు:
పర్యావరణ సంరక్షణకు నాలుగు నియమాలు పాటించాలి. అవి :

తగ్గించడం (Reduce) :
వనరులను తక్కువగా -వృథా చేయకుండా వినియోగించడం, కారుతున్న నల్లాలను, పంపులను సరిచేయడం, స్నానాల గదిలో షవర్ల వాడకం తగ్గించడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించవచ్చు. అవసరం లేని సమయాల్లో విద్యుద్దీపాలను, ఫ్యాన్లను ఆపివేయడం వలన విద్యుచ్ఛక్తిని పొదుపు చేయవచ్చు.

తిరిగి వాడడం (Reuse) :
పారేయకుండా తిరిగి ఉపయోగించుకోవడం. కాగితాన్ని తిరిగి వాడడం వలన మొక్కలను కాపాడడమే కాకుండా కాలుష్యాన్ని తగ్గించినవారమవుతాము.

AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు 5
పునఃచక్రీయం (Recycle) :
ఇది అన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు. ఉదాహరణకు ప్లాస్టికను పునఃచక్రీయం చేయడమనేది చాలా క్లిష్టమైన, ప్రమాదకరమైన ప్రక్రియ. ప్లాస్టిక్కు గల సంక్లిష్టత వలన ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. ప్లాస్టిక్ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని రకాల నష్టాలూ ఉన్నాయి. ఒక రకమైన ప్లాస్టికను అదే రకం నుండి పునఃచక్రీయం చేయాలి. కావున, వివిధ రకాల ప్లాస్టిక్ లను పునఃచక్రీయం చేయడానికి పునఃచక్రీయం ముందు వేరుచేయాలి. ఒక్కొక్క దానిని ఒక్కొక్క రకంగా రీసైకిల్ చేయాల్సి ఉంటుంది.

తిరిగి ఏర్పాటుచేయటం (Recover) :
మనం వాడుకొన్న వనరులను, తిరిగి నెలకొల్పటాన్ని తిరిగి ఏర్పాటు చేయటం అంటారు.
ఉదా : కర్మాగారాలు, రోడ్ల నిర్మాణం కోసం చెట్లను కొట్టివేసినపుడు, అడవులను నరికివేసినపుడు ప్రత్యామ్నాయంగా మరొకచోట చెట్లను పెంచటం అవసరం.

ప్రశ్న 4.
ఈ క్రింది పై (Ple) చార్టును విశ్లేషించి, దిగువనీయబడిన ప్రశ్నలకు సమాధానాలు వ్రాయుము.
AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు 6
జవాబు:
i) వీటిలో శిలాజ ఇంధనాలను గుర్తించి రాయండి.
జవాబు:
బొగ్గు, సహజవాయువు, నూనెలు.

ii) వ్యర్థాలను ప్రధాన ఇంధన వనరులుగా భవిష్యత్తులో ఎందుకు అభివృద్ధి చేసుకోవాలి?
జవాబు:
భవిష్యత్ లో శిలాజ ఇంధనాలు తరిగిపోవచ్చు కనుక ప్రత్యామ్నాయ ఇంధనముగా వ్యర్థాలను భవిష్యత్తులో ఉపయోగించవచ్చును.

iii) శిలాజ ఇంధనాలపై దీర్ఘకాలం మనం ఎందుకు ఆధారపడలేము?
జవాబు:
శిలాజ ఇంధనాలు పునరుద్దరింపదగని వనరులు కనుక.

iv) శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించగల ఇంధన వనరులు ఏవి?
జవాబు:
సౌరశక్తి, పవనశక్తి, తరంగశక్తి, అణుశక్తి, వ్యర్థాలు.

AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు

ప్రశ్న 5.
నీటి యాజమాన్యం కొరకు పాటించవలసిన సముదాయ ఆధారిత విధానాలు, రైతు ఆధారిత విధానాలను మరియు వాటి ప్రాధాన్యతను వివరించండి.
జవాబు:
సముదాయ ఆధారిత విధానాలు :
14 నీటిని నిలువ చేసే నిర్మాణాలు, 60 చిన్న ఇంకుడు గుంతలు, డైక్లు, 38 హెక్టార్ల పొలంగట్ల ద్వారా 28 ఎండిన బావులలోకి నీరు చేరేలా చేయడం జరిగింది. వర్షపు నీటిని నీటి వినియోగదారుల సంఘంగా ఏర్పడి సంరక్షించుకోగలిగారు. ఈ నిర్మాణాలలో నిలువ చేయబడిన నీరు భూగర్భజలాల నీటి మట్టాన్ని పెంచుటకు ఉపయోగించబడింది.

రైతు ఆధారిత విధానాలు :
వెడల్పు చాళ్ళు తీయడం, తక్కువ ఎత్తు పెరిగే పంటలను పెంచడం, కాంటూరు సేద్యం చేయడం, గట్ల మీద గెరిసిడియా చెట్లను పెంచడం, సూక్ష్మ సేద్య పద్ధతులు వంటివి వ్యక్తిగతంగా రైతులు వారి వారి పొలాలలో చేయడం జరిగింది. వీటి వలన నేల, వర్షపు నీరు, పోషకాలు దుర్వినియోగం కాకుండా కలుపు నివారణా పద్ధతులు పాటించడం, నైట్రోజన్ నిలువలను పెంచడం జరుగుతుంది.

ప్రశ్న 6.
రైతు ఆధారిత విధానాల గూర్చి రాయండి.
జవాబు:

  1. రైతు ఆధారిత విధానాల ద్వారా నేల, నీటి సంరక్షణ కార్యక్రమాలను అమలు చేశారు. వెడల్పు చాళ్లు తియ్యడం, తక్కువ ఎత్తు పెరిగే పంటలు పెంచడం, కాంటూర్ సేద్యం చేయడం మొదలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ నేల, నీరు, పోషకాలు దుర్వినియోగం కాకుండా కాపాడుతారు.
  2. కలుపు నివారణ పద్ధతులు పాటించడంతోబాటు 38 హెక్టార్ల పొలాల చుట్టూ దీర్ఘచతురస్రాకారంలో గట్ట కట్టడం, వాలులకు అడ్డంగా కాంటూర్ కందకాలు ఏర్పాటు చేయడం ద్వారా వర్షపు నీటిని సంరక్షించవచ్చు.
  3. గట్లు బలంగా ఉండేందుకు. నేలలో నైట్రోజన్ నిల్వలు పెరిగేందుకు గట్టమీద గ్లైరిసీడియా (లెగ్యూమ్ మొక్క) లను పెంచుతారు. రైతులు ఉమ్మడిగా నీటిని వినియోగించుకోడం, సూక్ష్మ సేద్యం పద్దతులు చేస్తారు.
  4. వెడల్పు చాళ్లు తీయడం, సూక్ష్మసేద్య పద్ధతులు పాటించడం వలన హెక్టారుకు 250 కిలోల పైగా జొన్నలు, 50 కిలోల పైగా మొక్కజొన్నలు అధిక దిగుబడి సాధించవచ్చు.
  5. బిందు సేద్యం అమలు చేయడం వలన 70% నీటిని పొదుపు చేయవచ్చు.

ప్రశ్న 7.
అడవుల నరికివేత వలన కలిగే నష్టాలు ఏమిటి?
జవాబు:

  1. కలప లేదా వ్యవసాయం లేదా అభివృద్ధి పేరిట ప్రజలు అడవులను నరుకుతున్నారు.
  2. ప్రతి సంవత్సరం భూమిపై 36 మిలియన్ల ఎకరాల అడవులు (ఆంధ్రప్రదేశ్ లోని సగభాగం కన్నా ఎక్కువ భాగం) నరికివేయబడుతున్నాయి.
  3. అడవులను నరికివేయడం వలన వన్యజాతుల ఆవాసాలు నాశనమవుతాయి. నేలకోత ఎక్కువవుతుంది.
  4. హరిత గృహ వాయువులు (Green house gases) విడుదలై, భౌగోళిక వెచ్చదనానికి (Global warming) దారితీస్తాయి
  5. ప్రపంచంలో విడుదలయ్యే హరిత గృహ వాయువుల మొత్తంలో 15% వాయువులు అడవులను నరకడం వలననే విడుదలవుతున్నాయి.
  6. అటవీ ఉత్పత్తుల సేకరణ కోసం, వంటచెరకుకు మరియు జీవనోపాధి కోసం, మనుగడ కోసం అడవులపై ఆధారపడి జీవించే ప్రజలు అడవులు నరకడం వలన చాలా నష్టపోతున్నారు.

ప్రశ్న 8.
అడవుల సంరక్షణకు పాటించవలసిన సుస్థిర పద్ధతులు తెలపండి.
జవాబు:
అడవులను కాపాడుకోడానికి సుస్థిర అటవీ పద్దతులు కొన్ని పాటించాలి. ఉదాహరణకు చాలా తక్కువగా చెట్లు నరకడం, సహజంగా చెట్లు తిరిగి ఎదగడానికి అవకాశం కలిగించే పద్ధతులను పాటించడం, ఎత్తయిన చెట్లు, పెద్ద పెద్ద చెట్లను పెద్ద ఎత్తున నరికివేసే విధానాలను నిషేధించడం మొదలైనవి.

పునఃచక్రీయ వలన చెట్లను సంరక్షించవచ్చును. ఉదాహరణకు చైనా మరియు మెక్సికో దేశాల ప్రజలు రాయడానికి మరియు ఇతర అవసరాలకు వాడే కాగితాన్ని, కార్డుబోర్డును తిరిగి వాడడం ద్వారా అడవులను సంరక్షిస్తున్నారు. ప్రపంచంలోని కాగితంలో సగభాగం తిరిగి వాడడం జరిగితే, ప్రపంచంలోని కొత్త కాగితానికి ఉన్న అవసరం తీరడమే కాకుండా భూమి పైనున్న చెట్లను కాపాడినట్లవుతుంది. కొన్ని కలప వస్తువులకు బదులుగా వెదురు వాడవచ్చు.

ప్రశ్న 9.
నేల సంరక్షణ విధానాలు తెలపండి.
జవాబు:

  1. నేలల సంరక్షణా విధానాలలో కాంటూర్ పట్టి పంటల (Contour strip cropping) పద్ధతి ఒకటి. ఈ విధానంలో నేలవాలుకు అడ్డంగా, గాలివీచే దిశకు అడ్డంగా దున్ని ఒక్కొక్క వరుసలో ఒక్కొక్క రకం పంటను వేస్తారు. ఉదాహరణకు ఒక వరుసలో మొక్కజొన్న, మరొక వరుసలో గోధుమ, ఇంకొక వరుసలో క్లోవర్ (పులిచింత) పంటలు పండించడం.
  2. వేరువేరు పంట మొక్కలు వేరువేరు రకాల వేరు వ్యవస్థలను, భిన్న పరిమాణంలో ఆకులను కలిగి ఉంటాయి. కాబట్టి నేలక్రమక్షయం జరగకుండా కాపాడుతాయి.
  3. అలాగే పంటకోసేటపుడు కూడా ఒక్కొక్క మొక్కను లేదా చిన్న గుంపును తీసివేయడం వంటి ఎంపిక వంట పద్దతులు (Selective harvesting) పాటించడం వల్ల మిగిలిన మొక్కలు నేల కొట్టుకుపోకుండా పట్టి ఉంచుతాయి.

ప్రశ్న 10.
వనరుల సంరక్షణకు అంతర్జాతీయ సంస్థలు చూపుతున్న శ్రద్ధను తెలపండి.
జవాబు:
ఎన్నో అంతర్జాతీయ సంస్థలు వనరుల సంరక్షణ పట్ల శ్రద్ధ చూపుతున్నాయి. వర్షారణ్యాలను కాపాడడం, జంతువులు అంతరించిపోకుండా సంరక్షించడం మరియు గాలిని శుభ్రపరచడం వంటి కార్యకలాపాలను సంస్థ సభ్యులు బలపరుస్తున్నారు. 1948లో ప్రభుత్వ, ప్రైవేటు సమూహాల సమ్మేళనం ‘ద ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్ఫర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN)’ ఏర్పడింది.

1980లో ఇది ప్రపంచ సంరక్షణా విధానాన్ని ప్రతిపాదించింది. ఎన్నో దేశాల ప్రభుత్వాలు వాటి సంరక్షణా పథకాలను అభివృద్ధి చేసుకోవడంలో IUCN విధానాలనే అనుసరించాయి. అంతేకాకుండా IUCN అనే సంస్థ ప్రమాదం అంచున ఉన్న వన్యజాతులను, జాతీయ ఉద్యానవనాలు, సంరక్షణా కేంద్రాలు, పర్యావరణానికి సంబంధించిన అంశాల స్థాయిని పరిశీలిస్తుంది.

ప్రశ్న 11.
మీ గ్రామంలో బావులు, చెరువులు ఎండిపోయాయి. భూగర్భజలాలు తగ్గిపోయాయి. ఇందుకు గల కారణాలను గుర్తించండి. మీ గ్రామంలోని రైతులందరూ కలిసి పనిచేస్తే నీటి కరవు తీరుతుందా?
జవాబు:
భూగర్భజలాలు తగ్గిపోవడానికి కారణాలు :

  1. ఈ మధ్యకాలములో ఋతుపవనములు సకాలములో రాకపోవడము, వచ్చినా సరిపోయిన మొత్తములో వర్షములు ఇవ్వకపోవడం ప్రధాన కారణంగా భావించవచ్చు.
  2. తక్కువ మొత్తంలో బోరుబావులు తవ్వి సాగునీటి అవసరాల కోసం విచక్షణారహితంగా వినియోగించడం. వీటి ద్వారా ఎక్కువ మొత్తంలో నీటిని ఉపయోగించటం వలన భూగర్భజల మట్టాలు పడిపోవడం జరిగినది.
  3. ఆహార పంటలు ఎక్కువగా పండించుట వలన కూడా నీటి వినియోగం ఎక్కువ కావటం భూగర్భజలమట్టాలు పడిపోవడం జరుగుతుంది.
  4. మా గ్రామంలోని రైతులందరూ ఉమ్మడిగా నీటిని వినియోగిస్తే పంటలకు నీటికొరత ఉండదు. మా ఊరిలో ఉన్న రైతులను నీటి సద్వినియోగం కొరకు ఉమ్మడిగా మరియు సూక్ష్మనీటిపారుదల పద్ధతులను అవలంబించవలసినదిగా సూచించడమైనది.
  5. సూక్ష్మసాగునీటి పద్ధతులయిన బిందుసేద్యం, స్ప్రింక్లర్లు మొదలైనవి వినియోగించడం వలన నీటిని పొదుపుగా వాడటమే కాకుండా ఎక్కువ మొత్తంలో దిగుబడులు సాధించడం జరిగింది.

AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు

ప్రశ్న 12.
మీ గ్రామంలో తాగునీటికి, సాగునీటికి తీవ్రమైన కొరత ఉంది అనుకుందాం. దానిని నివారించడానికి నీవు ఇచ్చే సలహాలు ఏమిటి?
జవాబు:

  1. నీటిని పొదుపుగా వాడుకోవలసిన అవసరాన్ని, సంరక్షించుకోవలసిన విధానాన్ని గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తాను.
  2. నీటి వాడకంలో వృథాను అరికట్టే విధంగా ప్రజలను ప్రోత్సహిస్తాను.
  3. భూగర్భ జలమట్టాలను పెంచడానికి రీఛార్జి గుంటలను ఇళ్ళు మరియు పాఠశాల ఆవరణలో నిర్మించే విధంగా ప్రోత్సహిస్తాను.
  4. బీడు భూముల్లో విరివిగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడతాను.
  5. రైతులు సూక్ష్మ నీటి సాగు పద్ధతులైన బిందుసేద్యం, స్ప్రింక్లర్స్ విధానాలను ఆచరించే విధంగా ప్రోత్సహిస్తాను.
  6. అందుబాటులో ఉన్న నీటి వనరులను సామూహికంగా వినియోగించుకునే విధంగా రైతులను ప్రోత్సహిస్తాను.
  7. ఇంకుడు గుంతలు మరియు చెరువులను తవ్వి వృథాగా పోయే వర్షపునీటిని పరిరక్షించి భూగర్భజలమట్టాలను పెంచడానికి ప్రయత్నిస్తాను.
  8. వాటర్ షెడ్ పథకాల అమలును పర్యవేక్షిస్తాను.

ప్రశ్న 13.
సహజ వనరుల సద్వినియోగం దేశ ఆర్థికాభివృద్ధిలో ఎంతో దోహదం చేస్తుందని నీవు ఎలా చెప్పగలవు?
జవాబు:

  1. గాలి, నీరు, నేల, ఖనిజాలు, ఇంధనాలు, మొక్కలు, జంతువులు భూమిపై ఉండే సహజ వనరులు.
  2. వర్తమానంలో మరియు భవిష్యత్తులో జీవులన్నీ లాభం పొందాలంటే సహజ వనరులు సంరక్షించబడాలి.
  3. ప్రజలు చాలా వరకు పునరుద్దరింపదగిన మరియు పునరుద్ధరింపలేని వనరులను నాశనం చేస్తుంటారు. మనుగడ కొనసాగించడమనేది, సహజ వనరులను విచక్షణతో ఉపయోగించడంపై ఆధారపడి ఉంటుంది.
  4. జంతువులు ఇతర ఆవాసాలకు తరలిపోయేలా వాటికి నష్టం చేకూరుస్తూ భవిష్యత్తులో ఉపయోగపడవలసిన వనరులను తరిగిపోయేలా చేస్తూ, నేడు అందుబాటులో ఉన్న వనరులన్నింటినీ నాశనం చేస్తూ మనం అభివృద్ధి యొక్క ప్రయోజనాలను లెక్కిస్తున్నాం.
  5. అభివృద్ధి, సంరక్షణ రెండింటికీ ప్రాధాన్యమిస్తూ మనుగడ సాగించవచ్చును.
  6. భావితరాలకు అవసరమయ్యే సహజవనరులను అందుబాటులో ఉండేవిధంగా మనం పర్యావరణాన్ని ఉపయోగించుకున్నట్లయితే అది సుస్థిరాభివృద్ధి అవుతుంది.
  7. సుస్థిరంగా జీవించాలంటే మనం ఎన్నో రకాల వనరులను జాగ్రత్తగా వినియోగిస్తూ సంరక్షించుకోవాలి.

ప్రశ్న 14.
రైతులకు వ్యవసాయం ఎంపిక విధానంపై అవగాహన కల్పించటానికి నీవు చేపట్టే కార్యక్రమాలేవి?
జవాబు:

  1. వ్యవసాయ సంబంధ మరియు అనుబంధ అంశాలపై రైతులకు అవగాహన కల్పించడానికి రైతు సదస్సులు ఏర్పాటు చేస్తాను.
  2. రసాయనిక ఎరువులు కలిగించే నషాన్ని రైతులకు వివరించి ఆరానిక్ ఎరువులను వాడే విధంగా ప్రోత్సహిసాను.
  3. మృత్తిక యొక్క సహజ స్వరూపాన్ని కాపాడవలసిన అవసరతను రైతులకు వివరిస్తాను. తద్వారా దిగుబడి ఎక్కువ సాధించుటకు రైతులను ప్రోత్సహిస్తాను.
  4. దిగుబడులను పెంచడానికి రైతులు అధిక దిగుబడినిచ్చే వంగడాలను వినియోగించే విధంగా ప్రోత్సహిస్తాను.
  5. మొక్కల సంఖ్యను అధికం చేయడానికి కణజాలవర్గన పద్ధతులను అవలంబించే విధంగా రైతులకు అవగాహన కలిగిస్తాను.
  6. నీటిని పొదుపుగా వాడటానికి సూక్ష్మ సేద్య సాగునీటి పద్దతులైన బిందుసేద్యం మరియు స్ప్రింక్లర్ విధానమును అవలంబించే విధంగా రైతులకు సూచనలిస్తాను.
  7. రెతులు సామూహికంగా నీటిని వినియోగించుకునే విధంగా ప్రణాళికలను రూపొందిస్తాను. తద్వారా పంట సాగుకు అతి తక్కువ మొత్తంలో నీరు వాడే విధంగా చూస్తాను.
  8. వర్షపు నీటిని ఆదాచేయడానికి ఇంకుడు గుంతలు, చెరువులు నిర్మించే విధంగా రైతులను ప్రోత్సహిస్తాను.

10th Class Biology 10th lesson సహజ వనరులు 1 Mark Important Questions and Answers

ఉదాహరణలు ఇవ్వండి

1. బిందు సేద్యం అనేది ఒక రకమైన సూక్ష్మ నీటిపారుదల సాంకేతికత. మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
స్ప్రింక్లర్

2. భూగర్భ జలాలు లేదా ఎండిన బోర్లను బాగా రీఛార్జ్ చేయడానికి పెర్కొలేషన్ ట్యాంక్ ఉపయోగించబదుతుంది. మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ఇంకుడు గుంటలు

3. రైతు ఆధారిత సేద్యానికి బ్రాడ్ బెడ్ ఫర్రో ల్యాండ్ ఫామ్ ఒక ఉదాహరణ. మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ఆకృతి నాటడం

4. పొడి ప్రాంతాల్లో పెరగడానికి అనువుగా ఉండే లెగ్యుమినస్ మొక్కకు ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
గ్లైరిసిడియా

5. శిలాజ ఇంధనాలకు పెట్రోలియం మరియు సహజ వాయువు ఉదాహరణలు. మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
బొగ్గు

6. గోండు ఆంధ్రప్రదేశ్ లో ఒక రకమైన గిరిజనులు. మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
చెంచు

7. జపాన్ ఆటోమొబైల్స్ తయారీలో రీసైకిల్ ముడి పదార్థాలను వాడుతున్న దేశం. ఇటువంటి దేశానికి మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
అమెరికా సంయుక్త రాష్ట్రాలు

8. సూర్యకాంతి విద్యుత్ ఉత్పత్తిలో ఉపయోగించే ప్రత్యామ్నాయ వనరు. మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
పవన శక్తి

9. అడవి అంటే మనం నిర్వహించాల్సిన మరియు పరిరక్షించాల్సిన వనరు. ఇటువంటి మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
నేల / నీరు

10. గ్లైరిసిడియా మొక్కల నేలను సారవంతం చేయటానికి ఉపయోగిస్తారు. ఇటువంటి మొక్కలకు మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
సీతాఫల మొక్కలు

11. కాంటూర్ సేద్యం అనేది నేల సంరక్షణకు ఒక పద్ధతి. మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
పంట మార్పిడి.

విస్తరించుము

12. ICRISAT ని విస్తరించండి.
జవాబు:
ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ సెమీ – అరిడ్ ట్రాపిక్స్

13. T.M.Cని విస్తరించండి.
జవాబు:
వెయ్యి మిలియన్ క్యూబిక్ అడుగులు

14. B.B.F ని విస్తరించండి.
జవాబు:
బ్రాడ్ బెడ్ ఫర్రో

15. MTRని విస్తరించండి.
జవాబు:
మౌంటైన్ టాప్ రిమూవల్

AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు

16. 4Rని విస్తరించండి.
జవాబు:
తగ్గించటం (Reduce), పునర్వినియోగం (Re-use), పునఃచక్రీయము (Recycle), తిరిగి పొందటం (Recover).

17. I.U.C.Nని విస్తరించండి.
జవాబు:
ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్

18. O.N.G.Cని విస్తరించండి.
జవాబు:
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్

19. U.N.D.P ని విస్తరించండి.
జవాబు:
ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం

20. FAOని విస్తరించండి.
జవాబు:
ఆహార మరియు వ్యవసాయ సంస్థ

దోషాన్ని గుర్తించి, సరిచేసి రాయండి

21. ఉపరితల నీటి పారుదల పద్దతి నీటి వినియోగాన్ని 70% తగ్గిస్తుంది.
జవాబు:
బిందు సేద్యం పద్దతి నీటి వినియోగాన్ని 70% తగ్గిస్తుంది.

22. ప్రతి సంవత్సరం భూమి అటవీ నిర్మూలనకు సుమారు 63 మిలియన్ ఎకరాల అడవిని కోల్పోతుంది.
జవాబు:
ప్రతి సంవత్సరం భూమి అటవీ నిర్మూలనకు సుమారు 36 మిలియన్ ఎకరాల అడవిని కోల్పోతుంది.

23. పులులను రక్షించడానికి చిప్కో ఉద్యమం ముడిపడి ఉంది.
జవాబు:
చెట్లు రక్షించడానికి చిప్కో ఉద్యమం ముడిపడి ఉంది.

24. నదీ జలాల pH 7 పైన ఉంటే నదీ జలాలు ఆమ్ల వ్యర్థాలతో కలుషితమవుతాయని చెబుతారు.
జవాబు:
నదీ జలాల pH 7 పైన ఉంటే నదీ జలాలు క్షార వ్యర్థాలతో కలుషితమవుతాయని చెబుతారు.

ఖాళీలను పూరించండి

25. ఫ్లో చార్టులో ఖాళీని పూరించండి.
AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు 7
జవాబు:
గాలి, సూర్యరశ్మి

26. అటవీ నిర్మూలన వలన ప్రపంచంలోని గ్రీన్‌హౌస్ గ్యాస్ ఉద్గారాలలో ……….. వెలువడుతుంది.
జవాబు:
15%

27. భూమిపై మంచినీటి శాతం …………
జవాబు:
2.5 – 2.75%

నేను ఎవరు?

28. మేము రాజస్థాన్లో గిరిజనులం. ప్రకృతిని పరిరక్షించదానికి మాకు 29 నియమాల సమితి ఉంది. మేము ఎవరు?
జవాబు:
బిష్ణోలు

29. నా కుమార్తె, మా గ్రామస్తులు మరియు నేను అటవీ స్థలం కోసం రాజు సైనికుడిచే చెట్లను నరికివేయకుండా కాపాడాము. నేను ఎవరు?
జవాబు:
అమృతా దేవి

AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు

30. నేను హిమాలయ లోయలలో అటవీ నిర్మూలనకు వ్యతిరేకంగా పోరాడుతున్నాను. మరియు అటవీ నిర్మూలనకు వ్యతిరేకంగా నా ఉద్యమాన్ని చిప్కో ఉద్యమం అంటారు. నేను ఎవరు?
జవాబు:
సుందర్‌లాల్ బహుగుణ

31. నేను పర్యావరణవేత్తని. నేను నర్మదా నదికి అడ్డంగా అనేక ఆనకట్టలను నిర్మిస్తున్నాను. నేను ఎవరు?
జవాబు:
మేధా పాట్కర్

32. నేను ఒక మొక్కను. నా విత్తనాలను బయోడీజిల్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. నేను ఎవరు?
జవాబు:
జట్రోపా కర్కస్ (అడవి ఆముదం)

33. మీరు గది నుండి బయలుదేరినప్పుడు లైట్ మరియు ఫ్యాన్ ఆపివేయండి. ఇది ఏ రకమైన R?
జవాబు:
తగ్గింపు

జతపరచుట

34. సరిగ్గా సరిపోలినదాన్ని గుర్తించండి.
షవర్ బాత్ మానటం – తగ్గింపు
స్నేహితులతో పుస్తకాలను పంచుకోండి – రీసైకిల్ చేయడం
లీకైన కుళాయిలను రిపేర్ చేయండి – పునర్వినియోగం
జవాబు:
షవర్ బాత్ మానటం – తగ్గింపు

35. సరిగ్గా సరిపోలినదాన్ని గుర్తించండి.
వస్త్ర సంచులను వాడండి – పునర్వినియోగం
పునర్వినియోగపరచదగిన బ్యాటరీలను
ఉపయోగించండి – తగ్గించడం
పెన్ను రీఫిల్ చేయండి – రీసైకిల్ చేయడం
జవాబు:
పునర్వినియోగపరచదగిన బ్యాటరీలను ఉపయోగించండి – తగ్గించడం

36. సరిగ్గా సరిపోలినదాన్ని గుర్తించండి.
జట్రోపా – శిలాజ ఇంధనం
గ్లిరిసిడియా – లెగ్యుమినస్ మొక్క
కస్టర్డ్ ఆపిల్ – జీవ ఇంధన కర్మాగారం
జవాబు:
గ్లిరిసిడియా – లెగ్యుమినస్. మొక్క

37. సరిగ్గా సరిపోలనిదాన్ని గుర్తించండి.
బ్రాడ్ బెడ్ ఫర్రో – రైతు ఆధారిత సేద్యం
వర్షాధార ఆనకట్ట – సమాజ ఆధారిత సేద్యం
పునరుత్పాదక వనరు – బొగ్గు
జవాబు:
పునరుత్పాదక వనరు – బొగ్గు

నినాదాలు

38. ర్యాలీ నిర్వహించడానికి మీ పాఠశాలలో ఈ క్రింది నినాదాలు తయారుచేయబడ్డాయి. ఏ సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తారు?
చెట్టును కత్తిరించవద్దు – జీవితాన్ని కత్తిరించవద్దు
చెట్టును పెంచండి – వరదకు దూరంగా ఉండండి.
జవాబు:
జూన్-6 – ప్రపంచ పర్యావరణ దినం.

39. ఈ క్రింది నినాదాల యొక్క ఉద్దేశ్యం ఏమిటి?
నీరు జీవితాధారం.
ప్రతి నీటి చుక్కను లెక్కింపు చేద్దాం.
ఒక చుక్కను దాచండి – భవిష్యత్తును కాపాడండి.
జవాబు:
నీటి పొదుపు

AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు

40. కింది నినాదాల యొక్క ప్రాథమిక భావన ఏమిటి?
నూనె కంటే నేల విలువైనది.
రోజుకు ఒక చెట్టును నాటండి మరియు నేల కోతను దూరంగా ఉంచండి.
జవాబు:
నేల పరిరక్షణ

41. ఓజోన్ యొక్క ప్రాముఖ్యత ఈ క్రింది నినాదాలలో ప్రస్తావించబడింది. ఇది ఏ రకమైన కిరణాల నుండి మనలను రక్షిస్తుంది?
ఓజోన్ లేదు, డెడ్ జోన్ మాత్రమే
ఓజోన్ ప్రకృతి స్వంత సన్
జవాబు:
అతినీలలోహిత కిరణాలు

బొమ్మలపై ప్రశ్నలు

42.
AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు 8
ఈ లోగో దేనిని సూచిస్తుంది?
జవాబు:
సమగ్రాభివృద్ధి

43.
AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు 1
ఈ లోగో దేనిని సూచిస్తుంది?
జవాబు:
పునఃచక్రీయము

44.
AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు 9
ఈ చిత్రం ఏ 4R ను సూచిస్తుంది?
జవాబు:
తిరిగి వాడడం

10th Class Biology 10th lesson సహజ వనరులు 1 Mark Important Questions and Answers

1. భూగర్భ జలాలు తగ్గటానికి కారణం ………..
A) వర్షం పడకపోవడం
B) అడవుల నరికివేత
C) బోర్ బావుల సంఖ్య ఎక్కువైపోవుట
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

2. తక్కువ నీటి సౌకర్యాలు ఉన్న ప్రాంతాలలో రైతులు అనుసరించదగిన విధానం
i) స్వల్పకాలిక పంటలు పండించడం.
ii) వ్యాపార పంటలు పండించడం.
iii) బిందు సేద్యం చేయడం.
iv) పంట విరామం ప్రకటించడం.
A) (i), (ii)
B) (i), (ii), (iii)
C) (i), (iv)
D) (iii), (iv)
జవాబు:
B) (i), (ii), (iii)

3. ఒక రైతు తన పంటపొలంలో కీటకాలను నివారించేందుకు తొండలను ప్రవేశపెట్టాడు. ఇది ఒక …..
A) పర్యావరణ నైతికత పద్ధతి
B) జైవిక నియంత్రణ పద్ధతి
C) జైవిక వ్యవస్థాపనం
D) జైవిక వృద్ధీకరణము
జవాబు:
B) జైవిక నియంత్రణ పద్ధతి

AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు

4. క్రింది వానిలో పునరుద్ధరింపలేని వనరు
A) నీరు
B) సౌరశక్తి
C) బొగ్గు
D) మృత్తిక
జవాబు:
C) బొగ్గు

5. అడవులను అధికంగా నిర్మూలిస్తే జరిగే పరిణామాన్ని
A) అగ్నిపర్వతాలు బ్రద్దలగుట
B) భూకంపాలు వస్తాయి.
C) భౌగోళిక వెచ్చదనం కలుగును
D) సునామీలు వస్తాయి.
జవాబు:
C) భౌగోళిక వెచ్చదనం కలుగును

6. ఇంధనాన్ని ఆదా చేసే మార్గం ఇది కాదు.
A) సైకిలను ఉపయోగించడం
B) కారుకు బదులు రైలులో ప్రయాణించడం
C) సెల్‌ఫోన్‌ను వాడడం
D) బావి నుండి నీటిని తోడుకోవడం
జవాబు:
C) సెల్‌ఫోన్‌ను వాడడం

7. గాలిని కలుషితం చేసే రేణురూప కలుషితం
A) CO2
B) బూడిద
C) SO2
D) CO
జవాబు:
B) బూడిద

8. క్రింది వృత్త రేఖాచిత్రంలో “నీటి పారుదల సౌకర్యాలు – విస్తీర్ణం” వివరాలు చూపబడ్డాయి. అందు భూగర్భ జల వనరుల శాతం ……………..
AP Board 10th Class Biology Solutions 10th Lesson సహజ వనరులు 8
A) 40%
B) 45%
C) 43%
D) 48%
జవాబు:
C) 43%

9. IUCN యొక్క ప్రధాన విధి
A) వన్య ప్రాణుల ఆవాసాల పరిరక్షణ
B) మెట్ట పంటల అధ్యయనం
C) వైరల్ వ్యాధుల అధ్యయనం
D) నీటి పంటలు (wet land) వ్యవసాయ అధ్యయనం
జవాబు:
A) వన్య ప్రాణుల ఆవాసాల పరిరక్షణ

10. ఇంకుడు గుంట వలన ఉపయోగము ……..
A) వర్షాకాలంలో వచ్చే వరదలను అరికట్టడము
B) వ్యవసాయానికి నీరు అందించుట
C) వర్షపు నీటిని నిల్వచేయడము ,
D) భూగర్భజల మట్టాలను పెంచడము
జవాబు:
C or D

11. AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు 1 ఈ లోగో దీనిని సూచిస్తుంది ……. ఊహించండి.
A) రియూజ్
B) రెడ్యూస్
C) రీసైకిల్
D) అన్నీ
జవాబు:
C) రీసైకిల్

AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు

12. తరిగిపోని ఇంధన వనరుకు ఉదాహరణ
A) సహజవాయువు
B) పెట్రోలు
C) సౌరశక్తి
D) వంటచెరకు
జవాబు:
C) సౌరశక్తి

13. భూగర్భ జల మట్టాలను పెంచాలంటే …………
A) బావులు తవ్వాలి
B) కాలువలు తవ్వాలి
C) రోడ్లను తవ్వాలి
D) ఇంకుడు గుంతలు తవ్వాలి
జవాబు:
D) ఇంకుడు గుంతలు తవ్వాలి

14. నేల సంరక్షణా పదతి
A) కాంటూర్ పద్ధతి
B) గడ్డి మొక్కల పెంపకం
C) పంటమార్పిడి పద్ధతి
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

15. ఓజోన్ పొర వినాశనానికి కారణమైన వాయువు …………………
A) కార్బన్ డై ఆక్సెడ్
B) ఆక్సిజన్
C) క్లోరోఫ్లోరోకార్బన్స్
D) నైట్రోజన్ డై ఆక్సెడ్
జవాబు:
C) క్లోరోఫ్లోరోకార్బన్స్

16. UNDP అనగా……………….
A) United Nations Development Plan
B) United Nations Development Programme
C) United Nations Drought Programme
D) United Nations Dropout Programme
జవాబు:
B) United Nations Development Programme

17. ICRISAT ఉన్న ప్రదేశం
A) బెంగళూరు
B) హైదరాబాద్
C) చెన్నై
D) పుణె
జవాబు:
B) హైదరాబాద్

18. ఈ గుర్తు దేనిని సూచిస్తుంది?
AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు 8
A) UNDP
B) ఇంకుడు గుంతలు
C) సుస్థిర అభివృద్ధి
D) పునః చక్రీయం లోగో
జవాబు:
C) సుస్థిర అభివృద్ధి

19. క్రింది వాక్యా లలో సరియైనది.
a) అభివృద్ధి అవసరం
b) అభివృద్ధి పర్యావరణ స్నేహపూర్వకంగా ఉండాలి.
A) a సరియైనది, b తప్పు
B) a తప్పు, b సరియైనది.
C) a, b రెండూ తప్పు
D) a, b రెండూ సరియైనవి.
జవాబు:
D) a, b రెండూ సరియైనవి.

AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు

20. తక్కువ నీటి సౌకర్యాలు ఉన్న ప్రాంతాలలో రైతులు అనుసరించదగిన విధానం
1) స్వల్పకాలిక పంటలు పండించడం
2) వ్యాపార పంటలు పండించడం
3) బిందు సేద్యం చేయడం
4) పంట విరామం ప్రకటించడం
A) 1, 3
B) 2, 3
C) 1, 4
D) 3, 4
జవాబు:
A) 1, 3

21. దోమల జనాభా పెరుగుటకు కారణం
A) సముద్రపు నీరు
B) నదులలో ప్రవహించే నీరు
C) కాలువలలో ప్రవహించే నీరు
D) నిలకడగా ఉండే నీరు
జవాబు:
D) నిలకడగా ఉండే నీరు

22. సరి అయిన వాక్యాన్ని గుర్తించండి.
A) గ్యాసన్ను ఆదా చేయటానికి ప్రెషర్ కుక్కర్ వాడాలి.
B) ఉడికించటానికి ఎక్కువ నీరు వాడాలి.
C) వండే ముందు పదార్థాలను నానబెట్టకూడదు.
D) అన్ని అమర్చుకోకుండా స్టవ్ వెలిగించాలి.
జవాబు:
A) గ్యాసన్ను ఆదా చేయటానికి ప్రెషర్ కుక్కర్ వాడాలి.

23. అడవులు లేని ఖండం
A) ఆర్కిటిక్
B) ఆసియా
C) ఆస్ట్రేలియా
D) అంటార్కిటికా
జవాబు:
D) అంటార్కిటికా

24. మన ఇంట్లో గ్యాస్ పొదుపు చేసే మార్గం.
A) వంటలో ఎక్కువ నీరు వాడాలి.
B) వండే ముందు పదార్థాలు నానబెట్టాలి.
C) వండే ముందు పదార్థాలు ఫ్రిజ్ లో పెట్టాలి.
D) గ్యాస్పోయ్యికి పెద్ద బర్నర్ వాడాలి
జవాబు:
B) వండే ముందు పదార్థాలు నానబెట్టాలి.

25. ఈ మధ్య జరిపిన పరిశోధనలలో పొద్దుతిరుగుడు పంట దిగుబడి తగ్గడానికి కారణం ఏమని తెలిసింది?
A) పరాగ సంపర్కానికి తోడ్పడే కీటకాల సంఖ్య తగ్గిపోవడం
B) రసాయన ఎరువుల వాడకం వల్ల
C) కరువు పరిస్థితులు
D) పైవేవీ కాదు
జవాబు:
A) పరాగ సంపర్కానికి తోడ్పడే కీటకాల సంఖ్య తగ్గిపోవడం

26. భూగర్భ జలాలు పెంచుటకు చేయవలసినది
A) ఎక్కువ బోరుబావులు తవ్వడం
B) అడవుల నిర్మూలన
C) పట్టణీకరణ
D) ఇంకుడు గుంతల ఏర్పాటు
జవాబు:
D) ఇంకుడు గుంతల ఏర్పాటు

AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు

27. రైతులు గెరిసిడియా పెంచుటకు కారణం
A) కాలుష్యం తగ్గించుటకు
B) నేలలో నైట్రోజన్ నిల్వలు పెరిగేందుకు
C) కలుపు మొక్కల నియంత్రణకు
D) పశుగ్రాసం కొరకు
జవాబు:
B) నేలలో నైట్రోజన్ నిల్వలు పెరిగేందుకు

మీకు తెలుసా?

AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు 2
* నీటి ప్రవాహాలకు అడ్డంగా రాళ్ళ, మట్టితో అడ్డుకట్టలు కట్టి ఏర్పాటు చేసే నీటి నిల్వలను ఇంకుడు చెరువులు, (Percolation tanks) అంటారు. బంకమట్టి, ఇసుక, కంకర, గులకరాళ్ళు మొదలైన వాటిని బాగా కలిపి ఒకదానిపైన ఒకటి వచ్చేటట్లుగా పొరలు పొరలుగా చెరువు నేలను, అంచుల వెంబడి కప్పుతారు. తరువాత దీనిని గట్టిగా కుదురుకునేలా చేస్తారు. వ్యవసాయం కోసం నీటిని సరఫరా చేయడానికి మట్టికట్టకు తూము ఏర్పాటు చేస్తారు. పూర్తి నీటి నిల్వ మట్టానికి అడుగు మట్టానికి మధ్య నాలుగోవంతు ఎత్తులో తూమును ఇంకుడు చెరువు ఏర్పాటు చేస్తారు. అందువల్ల తగినంత నీటిని విడుదల చేసుకోడానికి వీలు కలుగుతుంది.

* గత కొన్ని సంవత్సరాల నుండి ఋతుపవనాల రాకడలో మార్పులు సంభవించడం వలన, భూగర్భజలాల వినియోగంపై ఒత్తిడి పెరిగింది. డ్రిల్లింగ్, లోతైన గొట్టపు బావులు, బోరు బావులను తవ్వడం వంటి చర్యల వలన విచక్షణారహితంగా రాష్ట్రంలోని భూగర్భజలాన్ని వాడడం వలన, ఈ వనరు బాగా తరిగిపోతున్నది. మన రాష్ట్రంలో 1998-2002 మధ్య కాలంలో సరాసరిగా నీటి స్థాయి 3 మీటర్ల దాక తగ్గింది.

* పూర్వం వాటర్‌షెడ్ (రెండు నదులు లేదా కాలువల మధ్య గల భూ ప్రాంతం) ఆధారంగా, నిపుణులైన రైతుల గ్రామ సరిహద్దులను నిర్ణయించేవారు. రెండు గ్రామాల మధ్య గల మురుగు నీటి పారుదల వ్యవస్థ ఆధారంగా, ఈ హద్దులు నిర్ణయించబడేవి. వ్యవస్థలోని సభ్యులందరూ వీటిని సామాజికంగా అంగీకరించేవారు.

AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు 3
* శ్రీరాంసాగర్ ప్రాజెక్టును పోచంపాడు ప్రాజెక్టు అని కూడా అంటారు. ఇది గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టు, తెలంగాణా ప్రాంతంలోని అధిక భాగానికి ఇది జీవనాధారం. కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం జిల్లావాసుల అవసరాలను ఈ ప్రాజెక్టు తీరుస్తుంది. గోదావరి నదిపై ఇతర రాష్ట్రంలో ఆనకట్ట నిర్మించడం వలన, ఎక్కువ శాతం నీరు ఆంధ్రప్రదేశ్ కు చేరకుండానే పై రాష్ట్రాలలో నిలువ చేయబడుతోంది. ఆగస్టు 2013 గణాంకాల ప్రకారం ఈ ప్రాజెక్టు యొక్క అంచనా వేయబడిన నీటి నిలువ సామర్థ్యం 80.66 టి.ఎం.సి.లు.

* ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో నీటి వినియోగంపై నిషేధాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో కరవు వల్ల సంభవించిన తీవ్రమైన నీటి కొరత వలన తోటలకు నీళ్ళు పెట్టడం, వాహనాలు కడగడం, ఈత కొలను నీటితో నింపడం వంటి కార్యకలాపాలు నిషేధించాలని ఉత్తర్వులు జారీ చేశారు. అందువల్ల ప్రజలలో నీటి వినియోగంపై అవగాహన కలిగింది. వృథాను అరికట్టగలిగారు.

AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు 10
* బయో డీజిల్ ఉత్పత్తికి జట్రోపా కర్కాస్ యొక్క విత్తనాలు వాడడం అనేది శక్తి సుస్లిరత్వాన్ని సాధించడంలో భారతదేశం యొక్క ప్రణాళికలో ముఖ్యమైన ఘట్టం. జట్రోపా మొక్కల పెంపకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రిలయన్స్ కంపెనీతో ఒక ఒప్పందాన్ని చేసుకుంది. జట్రోపా మొక్కలను పెంచి నాణ్యమైన బయో డీజిల్ ను ఉత్పత్తి చేయడానికి ఈ కంపెనీ కాకినాడ వద్ద 200 ఎకరాల స్థలాన్ని సేకరించింది. జీవ ఇంధనాలను తయారుచేసే పద్దతిని బయో ఎస్టరిఫికేషన్ అంటారు.

పునశ్చరణ

AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు 11

AP Board 10th Class Biology Solutions 10th Lesson సహజ వనరులు 8

AP Board 10th Class Biology Solutions 10th Lesson సహజ వనరులు 9

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత

These AP 10th Class Biology Most Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత will help students prepare well for the exams.

AP Board 10th Class Biology 9th lesson Important Questions and Answers మన పర్యావరణం – మన బాధ్యత

10th Class Biology 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
ఆహారపు జాలకం నుండి విచ్ఛిన్నకారులను తొలగిస్తే ఏమవుతుంది?
జవాబు:
ఆహారపు జాలకం నుండి విచ్ఛిన్నకారులను తొలగిస్తే జీవరసాయన వలయాలు భర్తీ కావు. జీవులలోని సేంద్రియ పదార్థాలు నిరీంద్రియ పదార్థాలుగా మారవు.

ప్రశ్న 2.
క్రింది వానిని పరిశీలించి సంఖ్యా పిరమిడ్ చిత్రం గీయండి.
గడ్డి – మేక – మానవుడు,
జవాబు:
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 1

ప్రశ్న 3.
పిచ్చుకలు లేని ప్రపంచాన్ని ఊహించలేం. వాటి సంరక్షణ పట్ల మన ప్రవర్తన ఎలా ఉండాలి?
జవాబు:

  1. క్రిమిసంహారక మందుల వినియోగం తగ్గించాలి.
  2. సెల్ టవర్ రేడియేషన్ తగ్గించాలి.
  3. జైవిక నియంత్రణ పద్ధతులు పాటించాలి.
  4. పక్షుల సంరక్షణ కేంద్రాలను నెలకొల్పాలి.

ప్రశ్న 4.
మీ పరిసరాలలో మీరు గమనించిన ఒక ఆహారపు గొలుసును గుర్తించి, దానిలోని ఉత్పత్తిదారుల మరియు వివిధ స్థాయిలలో గల వినియోగదారుల పేర్లు వ్రాయండి.
జవాబు:
గడ్డి → కీటకాలు → కప్ప → పాము
ఉత్పత్తిదారులు – గడ్డి
ప్రాథమిక వినియోగదారులు – కీటకాలు
ద్వితీయ వినియోగదారులు – కప్ప
తృతీయ వినియోగదారులు – పాము

నీటిమొక్కలు → కీటకాలు → చేప → కొంగ
ఉత్పత్తిదారులు – నీటిమొక్కలు
ప్రాథమిక వినియోగదారులు – కీటకాలు
ద్వితీయ వినియోగదారులు – చేప
తృతీయ వినియోగదారులు – కొంగ

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత

ప్రశ్న 5.
మీకు తెలిసిన ఆహారపు గొలుసులోని ఉత్పత్తిదారులు మరియు వినియోగదార్ల పేర్లను రాయండి.
జవాబు:
ఉత్పత్తిదారులు – మొక్కలు, ఆకుపచ్చ శైవలాలు
వినియోగదారులు – అన్ని రకాల జంతువులు

ప్రశ్న 6.
“కీటకాలు, పక్షులు లేని ప్రపంచాన్ని మనం ఊహించలేము.” వాటిని సంరక్షించుటకు మీరు పాటించే రెండు పద్ధతులను తెలుపండి.
జవాబు:

  1. క్రిమి సంహారక మందులను అతిగా వాడకూడదు.
  2. కీటకాల మరియు పక్షుల సహజ ఆవాసాలను కాపాడాలి.
  3. పార్కులను మరియు పక్షుల సాంక్చ్యురీలను అభివృద్ధి చేయాలి.
  4. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పర్యావరణ సూత్రాలను పాటించే విధంగా చైతన్య పరచాలి.

ప్రశ్న 7.
క్రింది ఆహార పిరమిడను గమనించండి. క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 2
i) ఏ పోషక స్థాయిలో అధిక శక్తి ఉంటుంది?
ii) T4 పోషక స్థాయికి ఒక ఉదాహరణ రాయండి.
జవాబు:
i) T1 (లేదా) ఆకుపచ్చ మొక్కలు (లేదా) ప్రాథమిక ఉత్పత్తిదారులు. –
ii) సింహము, పులి, డేగ మొ||నవి.

ప్రశ్న 8.
పర్యావరణ స్నేహపూర్వక కార్యక్రమాలపై అవగాహన కల్పించుటకు ఏవైనా రెండు నినాదాలను వ్రాయండి.
జవాబు:

  1. పచ్చదనాన్ని పెంచు – భూగోళాన్ని శుభ్రంగా ఉంచు.
  2. ప్రకృతిని నీవు నాశనం చేస్తే – ప్రకృతి నిన్ను నాశనం చేస్తుంది.
  3. కాలుష్య నివారణకు ఉత్తమ మార్గం – మొక్కల పెంపకం.
  4. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం – కాలుష్యాన్ని తగ్గిద్దాం.

ప్రశ్న 9.
హరితహారంలో భాగంగా మీ పాఠశాలలో నాటిన మొక్కలను సంరక్షించటానికి మీరు ఏ చర్యలు తీసుకొంటారు?
జవాబు:

  1. మొక్కలకు నీటిని సరఫరాచేయటం,
  2. కంచె వేయటము (లేదా) మొక్కల సంరక్షణ,
  3. మొక్కలను దత్తత తీసుకోవటం,
  4. సహజ ఎరువులను సరఫరా చేయటము.

ప్రశ్న 10.
జీవావరణం అనగానేమి?
జవాబు:
భూమి మీద జీవులు నివసించటానికి యోగ్యమైన ప్రదేశం అంతా ‘కలిపి ‘జీవావరణం’ అంటారు. ఇది అనేక ఆవరణ వ్యవస్థల సమూహం. అతి పెద్ద ఆవాసంగా కూడా జీవావరణాన్ని పరిగణించవచ్చు.

ప్రశ్న 11.
పోషకస్థాయి అనగానేమి?
జవాబు:
ఆహారపు గొలుసులో ప్రతి స్థాయి వద్ద లభించే పోషక విలువను పోషకస్థాయి అంటారు. సాధారణంగా ఆహార గొలుసులో పోషకస్థాయి వద్ద 10 నుండి 20 శాతం శక్తి బదిలీ జరుగుతూ ఉంటుంది.

ప్రశ్న 12.
పర్యావరణం అనగానేమి?
జవాబు:
పర్యావరణం:
జీవజాలం మీద ప్రభావం చూపే జీవభౌతిక కారకాలతో పాటు, రసాయనిక కారకాలన్నింటితో గల పరస్పర సంబంధాన్ని “పర్యావరణం” (Environment) అంటారు.

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత

ప్రశ్న 13.
పర్యావరణంలోని నిర్జీవ కారకాలు ఏమిటి?
జవాబు:
నిర్జీవ కారకాలు :
పర్యావరణంలో గాలి, నీరు, నేల, కాంతి మొదలైన నిర్జీవ కారకాలను “భౌతిక కారకాలు” అంటారు.

ప్రశ్న 14.
పర్యావరణంలోని జీవకారకాలు ఏమిటి?
జవాబు:
జీవకారకాలు :
పర్యావరణంలోని మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులను కలిపి “జీవకారకాలు’ అంటారు.

ప్రశ్న 15.
ఆహార గొలుసు అనగానేమి?
జవాబు:
ఆహార గొలుసు:
జీవుల మధ్య ఉండే ఆహార సంబంధ వరుస క్రమాన్ని ఆహార గొలుసు అంటారు.

ప్రశ్న 16.
ఆహార జాలకం అనగానేమి?
జవాబు:
ఆహార జాలకం :
అనేక ఆహారపు గొలుసుల కలయికను ఆహార జాలకం అంటారు. ఇది ఆహార గొలుసుల మధ్యగల సంబంధాన్ని చూపుతుంది.

ప్రశ్న 17.
ఆహారపు గొలుసులోని స్థాయిలను తెలపండి.
జవాబు:
ఆహారపు గొలుసులో కింది స్లాయిలు ఉంటాయి.
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 4

ప్రశ్న 18.
ఆహార గొలుసుకు ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
1. గడ్డి → మిడత → కప్ప → పాము → గద్ద
2. గడ్డి → కుందేలు → నక్క → తోడేలు
3. గడ్డి → మేక → మానవుడు

ప్రశ్న 19.
ఆహారపు గొలుసులో శక్తి బదిలీ జరిగేటప్పుడు జరిగే నష్టమెంత?
జవాబు:
ఆహారపు గొలుసులో శక్తి బదిలీ జరిగేటప్పుడు 80 నుండి 90% శక్తి వృథా అవుతుంది. ఇది శ్వాసక్రియలోనూ, ఇతర క్రియల ద్వారా ఉత్పత్తి అయిన ఉష్ణరూపంలో నష్టపోవటం జరుగును.

ప్రశ్న 20.
భౌమ ఆవరణ వ్యవస్థలోని వ్యత్యాసాలకు కారణాలు ఏమిటి?
జవాబు:
భూమధ్యరేఖకు, ధృవాలకు మధ్యగల శీతోష్ణస్థితిలోని వ్యత్యాసాలే భౌమ్యావరణ వ్యవస్థలను నిర్ధారిస్తాయి.

ప్రశ్న 21.
కొల్లేరు సరస్సులోనికి ఎక్కువ పోషకాలు కలిగిన వ్యర్థాలు ఎలా చేరుతున్నాయి?
జవాబు:
కొల్లేరు పరీవాహక ప్రాంతాలను వ్యవసాయ భూములుగా మార్చి అధిక మోతాదులో రసాయనిక ఎరువులు వాడుతున్నారు. రసాయనిక ఎరువులు కలిగిన ఈ నీరు సరస్సులోనికి చేరి కలుషితం చేస్తుంది.

ప్రశ్న 22.
నిచ్ (Niche) అనగానేమి?
జవాబు:
నిచ్ : ప్రతి జంతువు ఆహార జాలకంలో ఒక నిర్దిష్ట స్థానాన్ని కలిగి ఉంటుంది. దీనిని ఆ జంతువు యొక్క ‘ఆహార జాలకపు ఆవాహం ‘ లేదా ‘నిచ్’ అంటారు.

ప్రశ్న 23.
జీవావరణ పిరమిడ్ అనగానేమి?
జవాబు:
జీవావరణ పిరమిడ్ :
జీవుల మధ్య సంబంధాలను చూపడానికి లేదా వర్ణించటానికి, ఆవరణ శాస్త్రవేత్తలు ‘పిరమిడ్’ అనే భావనను ఉపయోగించారు. వివిధ పోషకస్థాయిలలో ఆవరణ వ్యవస్థ యొక్క నిర్మాణాన్ని ‘పిరమిడ్’ రూపంలో రేఖాత్మకంగా చూపే చిత్రాన్ని “జీవావరణ పిరమిడ్” (Ecological pyramid) అంటారు.

ప్రశ్న 24.
ఆవరణశాస్త్ర పిరమిడ్ లోని రకాలు తెలపంది.
జవాబు:
ఆవరణ శాస్త్ర పిరమిడ్లు మూడురకాలు :

  1. సంఖ్యాపిరమిడ్లు
  2. జీవద్రవ్యరాశి పిరమిడ్లు
  3. శక్తి పిరమిడ్లు

ప్రశ్న 25.
సంఖ్యాపిరమిడ్ అనగానేమి?
జవాబు:
ఆహారపు గొలుసులోని జీవులను సంఖ్యాత్మకంగా చూపించే పిరమిడను “సంఖ్యాపిరమిడ్” అంటారు.

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత

ప్రశ్న 26.
జీవద్రవ్యరాశి అనగానేమి?
జవాబు:
శక్తిగా మార్చడానికి వీలైన వృక్ష, జంతు సంబంధ పదార్థాన్ని “జీవద్రవ్యరాశి” అంటారు. జీవద్రవ్యరాశిని శక్తి ఉత్పత్తికోసం వినియోగిస్తే అది జీవశక్తి (Biofuel) అవుతుంది.

ప్రశ్న 27.
జీవద్రవ్యరాశి పిరమిడ్లు ఎలా ఉంటాయి?
జవాబు:
జీవద్రవ్యరాశి పిరమిడ్లు :
భౌమ ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారుల నుండి మాంసాహారుల వరకు జీవద్రవ్యరాశి క్రమంగా తగ్గుతూ ఉంటుంది. అందువలన ఈ జీవద్రవ్యరాశి పిరమిడ్లు నిటారుగా ఉంటాయి. జలావరణ వ్యవస్థలో ఉత్పత్తిదారుల జీవద్రవ్యరాశి ఇతర పోషకస్థాయిలలో ఉన్న జీవద్రవ్యరాశి కంటే చాలా తక్కువగా ఉంటుంది. అందువలన ఈ జీవద్రవ్యరాశి పిరమిడ్ అధోముఖంగా ఉంటుంది.

ప్రశ్న 28.
ఆహారపు గొలుసులో శక్తి బదిలీ శాతం ఎంత?
జవాబు:
ఆహారపు గొలుసులో ఒక పోషకస్థాయి నుండి తరువాత పోషకస్థాయికి 10 నుండి 20% వరకు, జీవద్రవ్యరాశి బదిలీ అవుతుంది.

ప్రశ్న 29.
జలావరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులు ఏమిటి?
జవాబు:
జలావరణ వ్యవస్థలో నీటి మొక్కలు, నాచు, వృక్షప్లవకాలు ఉత్పత్తిదారులుగా వ్యవహరిస్తాయి.

ప్రశ్న 30.
శక్తి పిరమిడ్ అనగానేమి?
జవాబు:
శక్తి పిరమిడ్ :
ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రసరణను, పరిమాణాన్ని చూపించే రేఖా పటాన్ని “శక్తి పిరమిడ్” అంటారు.

ప్రశ్న 31.
శక్తి పిరమిడ్ లోని శక్తి క్షీణతను దిమ్మెల చిత్రంలో చూపించండి. వృక్ష ఫ్లవకాలు జంతుప్లవకాలు
జవాబు:
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 5

ప్రశ్న 32.
BOD అనగానేమి?
జవాబు:
“బయాలాజికల్ ఆక్సిజన్ డిమాండ్”ను సంక్షిప్తంగా BOD అంటారు. ఇది ఆవాసంలోని ఆక్సిజన్ మోతాదును తెలియజేస్తుంది. ఆక్సిజన్ మోతాదు కంటే తగ్గినపుడు జీవులు మరణించే ప్రమాదం ఉంది.

ప్రశ్న 33.
యూట్రిఫికేషన్ అనగానేమి?
జవాబు:
యూట్రిఫికేషన్ :
నీటిలోనికి పోషక కలుషితాలు అధికంగా వచ్చి చేరటం వలన కలుపు మొక్కలు విపరీతంగా పెరిగి జలావాసాన్ని పాడుచేస్తాయి. ఈ పరిస్థితిని “యూట్రిఫికేషన్” అంటారు. దీని వలన జలచర జీవులకు ఆక్సిజన్ అందక మరణిస్తాయి.

ప్రశ్న 34.
నీటిని కలుషితం చేసే భారలోహాలు ఏమిటి?
జవాబు:
నీటిని కలుషితం చేసే భారలోహాలు :
సీసం (Pb), కాడ్మియం (Cd), క్రోమియం (Cr), మాంగనీస్(Mn), నికెల్ (Ni) మరియు ఐరన్(Fe) వంటి భారలోహాలు నీటిని కలుషితం చేస్తున్నాయి.

ప్రశ్న 35.
జైవిక వ్యవస్థాపనం అనగానేమి?
జవాబు:
జైవిక వ్యవస్థాపనం :
ఆహారపు గొలుసులోనికి కాలుష్యాలు చేరడాన్ని “జైవిక వ్యవస్థాపనం” అంటారు.

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత

ప్రశ్న 36.
జైవిక వృద్ధీకరణం అనగానేమి?
జవాబు:
జైవిక వృద్దీకరణం : ఆహారపు గొలుసులోని ఒక పోషకస్థాయి నుండి తరువాత పోషకస్థాయికి చేరిన కాలుష్యాలు సాంద్రీకృతమయ్యే విధానాన్ని “జైవిక వృద్ధీకరణం” అంటారు.

ప్రశ్న 37.
ఏదులాబాద్ రిజర్వాయర్ లో పెంచే చేపల పేరు ఏమిటి?
జవాబు:
సిప్రినస్ కార్షికో అనే పొలుసు చేపను ఏదులాబాద్ రిజర్వాయర్లో పెంచుతారు.

ప్రశ్న 38.
పంట మార్పిడి పద్ధతి అనగానేమి?
జవాబు:
పంట మార్పిడి పద్దతి :
ప్రతి సంవత్సరం ఒకే పంటను కాకుండా వేరువేరు పంటలను పండించే పద్ధతిని “పంటమార్పిడి” పద్ధతి అంటారు.

ప్రశ్న 39.
వంధ్యత్వం కలిగించే పద్ధతి అనగానేమి?
జవాబు:
వంధ్యత్వం కలిగించే పద్ధతి : తెగుళ్లు కలిగించే క్రిమి కీటకాల పురుషజీవులు పునరుత్పత్తి సామర్థ్యం కోల్పోయేలా చేసే ప్రక్రియను “వంధ్యత్వం కలిగించే పద్ధతి” అంటారు.

ప్రశ్న 40.
శక్తి పిరమిడ్ ఎల్లప్పుడూ నిటారుగానే ఉంటుందా? ఎందుకు?
జవాబు:
శక్తి పిరమిడ్ ఎల్లప్పుడూ నిటారుగానే ఉంటుంది. ఎందుకంటే ఆహారపు గొలుసులో శక్తి ఒక స్థాయి నుండి మరొక స్థాయికి బదిలీ అయ్యేటప్పుడు క్షీణత అధికంగా ఉంటుంది. అందువలన ఆహారపు గొలుసులో పైకి వెళ్ళేకొలదీ ప్రవహించే శక్తి విలువ తక్కువగా ఉండి శక్తి పిథమిడ్ శీర్షాభిముఖంగా ఉంటుంది.

ప్రశ్న 41.
ఆవరణ వ్యవస్థలో ఆహారానికి మూలం మొక్కలే అని ఎలా చెప్పగలవు?
జవాబు:
మనం తినే ఆహారాన్ని పరిశీలిస్తే, పెరుగు పాల నుండి వస్తుంది. పాలు ఆవు నుండి లభిస్తాయి. ఆవు గడ్డిని ఆహారంగా తీసుకుంటుంది. గడ్డి మొక్కలు కిరణజన్యసంయోగక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేస్తాయి. ఆహారం ఏరకమైనా దానికి మూలం ఆకుపచ్చని మొక్కలే.

ప్రశ్న 42.
మన రాష్ట్రంలో కొల్లేరు సరస్సు ఎక్కడ విస్తరించి ఉంది?
జవాబు:
మన రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదుల మధ్య కొల్లేరు సరస్సు విస్తరించి ఉంది. ఇది ఒక పెద్ద మంచి నీటి సరస్సు. దాదాపు 6121 చ.కి.మీ. విస్తరించి ఉంది.

ప్రశ్న 43.
కొల్లేరు సరస్సు యొక్క ప్రాధాన్యత ఏమిటి?
జవాబు:
1999 నవంబరులో భారత ప్రభుత్వం కొల్లేరు సరస్సును పక్షి సంరక్షణ కేంద్రంగా ప్రకటించింది. ఇక్కడ 193 రకాల పక్షి జాతులు, వివిధ రకాల జంతు వృక్షజాలానికి ఆవాసంగా ఉండడంతో పాటు ఎన్నో రకాల మందు మొక్కలు కూడా పెరుగుతున్నాయి. ఆసియా, తూర్పు ఐరోపా దేశాల నుండి అక్టోబర్, మార్చి నెలల మధ్యకాలంలో ప్రతి ఏటా దాదాపు, 20 లక్షల పక్షులు ఈ సరస్సుకు వలస వస్తాయి. సరస్సుపై ఆధారపడి దాదాపు 20 మిలియన్ల ప్రజలు జీవిస్తున్నారు.

ప్రశ్న 44.
కొల్లేరు సరస్సు నీటి నిలువ సామర్థ్యం తగ్గటానికి కారణాలు ఏమిటి?
జవాబు:

  1. కొల్లేరు సరస్సు అధికంగా ఆక్రమణలకు లోనైంది.
  2. పరిసరప్రాంతాలను వ్యవసాయ భూములుగా మార్చారు.
  3. చేపల పరిశ్రమ లాభసాటిగా ఉండుటవలన ఆక్రమిక ప్రాంతాలు రొయ్యల సాగు కేంద్రాలుగా మారాయి.
  4. కలుషితాలు చేరి, పూడిక పెరిగింది.
  5. ఆక్రమణల వలన నీటి ప్రవాహదిశ మారి, నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది.

10th Class Biology 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
ఈ క్రింది ఫ్లోచార్టును వివరించండి.
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 3
జవాబు:
ఆహారపు గొలుసులో, ప్రతి పోషకస్థాయిలో సుమారుగా 90% ఆహారం నష్టపోవడం జరుగుతుంది. 1000 కిలోల నీటిలో తేలే మొక్కలు, 100 కిలోల నీటిపై తేలే జంతు ప్లవకాల ఉత్పత్తికి అవసరమవుతుంది. ఆ 100 కిలోల జంతు ప్లవకాలు 10 కిలోల చేపల ఉత్పత్తికి, తిరిగి ఈ చేపలు ఒక కిలో మానవ కణజాలాల ఉత్పత్తికి అవసరమవుతాయి. ఈ జీవద్రవ్యరాశి ఉత్పత్తి ప్రక్రియలో, మొక్కలలో (ఉత్పత్తిదారులలో) నిక్షిప్తమైన స్థితిశక్తి (సూర్యరశ్మి ఫలితంగా) పై పోషకస్థాయులకు వెళ్ళే కొద్దీ క్రమంగా. నష్టపోవడం జరుగుతుంది.

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత

ప్రశ్న 2.
కింద ఇవ్వబడిన సంఖ్యా పిరమిడను పరిశీలించి, ప్రశ్నలకు జవాబిమ్ము.
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 6
i) పోషక స్థాయిలలోని జీవుల సంఖ్య ప్రకారం అతి ఎక్కువగా, అతి తక్కువగా గల జీవులు ఏవి?
ii) ఒకవేళ ద్వితీయ వినియోగదారులు అదృశ్యమైతే ఏం జరుగుతుంది?
జవాబు:
i) పోషక స్థాయిలోని జీవుల సంఖ్య ప్రకారం ఎక్కువగా గల జీవులను ‘ఉత్పత్తిదారులు’ అని, తక్కువగా గల జీవులను ‘తృతీయ వినియోగదారులు’ అని అంటారు.
ii) ద్వితీయ వినియోగదారులు అదృశ్యమైతే తృతీయ వినియోగదారులకు ఆహారం లభించక వాటి సంఖ్య తగ్గిపోతుంది. ప్రథమ వినియోగదారుల సంఖ్య పెరుగుతుంది.

ప్రశ్న 3.
ప్రక్క పటాన్ని గమనించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 7
i) పై పటం నుండి ఏవైనా రెండు ఆహార గొలుసులు తెలపండి.
ii) నీవు వ్రాసిన ఆహారపు గొలుసులోని ద్వితీయ వినియోగదారులు ఏమిటి?
జవాబు:
i) a) మొక్క → మేక → పులి
b) మొక్క → కుందేలు → తోడేలు / నక్క

ii) పులి, తోడేలు / నక్క
(లేదా)

i) a) వృక్షప్లవకాలు → క్రస్టేషియన్లు → చేపలు
b) మొక్కలు → ఎలుకలు → గ్రద్ద

ii) చేపలు, గ్రద్ద

ప్రశ్న 4.
గడ్డి → మిడత → కప్ప → పాము → గద్ద
పై ఆహారపు గొలుసు నుండి కప్పను తొలగిస్తే ఏమి జరుగుతుంది? వివరించుము.
జవాబు:

  1. ఇవ్వబడిన ఆహారపు గొలుసులో కప్ప ద్వితీయ వినియోగదారు.
  2. ఈ ఆహారపు గొలుసు నుండి కప్పను తొలగించినట్లయితే మిడతల సంఖ్య పెరుగును. మరోవైపు కప్పల మీద ఆధారపడిన పాముల సంఖ్య తగ్గుతుంది.
  3. దీని వలన జీవావరణ సమతుల్యత దెబ్బతింటుంది.

ప్రశ్న 5.
పర్యావరణం అనగానేమి? అందలి అంశాలు ఏమిటి?
జవాబు:
పర్యావరణం :
జీవుల మీద ప్రభావం చూపే జీవ, భౌతిక కారకాలతో పాటు, రసాయన కారకాలన్నింటిలో గల పరస్పర సంబంధాన్ని “పర్యావరణం” అంటారు.

పర్యావరణంలోని అంశాలను ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు. అవి:

1. నిర్జీవ అంశాలు :
గాలి, నేల, నీరు, కాంతి మొదలైన భౌతిక కారకాల ఎ “నిర్జీవ అంశాలు” అంటారు.

2. జీవకారకాలు :
మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు, క్రిములు, కీటకాలు అన్నింటిని “జీవకారకాలు” అంటారు.

ప్రశ్న 6.
ఆహారపు గొలుసు, ఆహారజాలకాన్ని నిర్వచించండి.
జవాబు:
ఆహారపు గొలుసు :
ఆవాసంలో జీవుల మధ్య ఉండే ఆహార సంబంధాన్ని చూపించే రేఖీయ చిత్రాన్ని ఆహారపు గొలుసు అంటారు. ఇది సాధారణంగా ఉత్పత్తిదారులతో ప్రారంభమై అగ్రశ్రేణి వినియోగదారులతో ముగుస్తుంది.
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 8

ఆహారజాలం :
ఆవరణ వ్యవస్థలోని అన్ని ఆహారపు గొలుసులను కలిపి ఆహారజాలం అంటారు. ఇది సంక్లిష్ట నిర్మాణం. ఇది ఒక జీవి ఎన్ని రకాలుగా ఆహారం పొందుతుందో వివరిస్తుంది.

ప్రశ్న 7.
ఆవరణ వ్యవస్థను నిర్ణయించే కారకాలు తెలపండి.
జవాబు:
ఆవరణ వ్యవస్థలో గాలి, నీరు, నేల, ఉష్ణోగ్రత, లవణాలు, కాంతి వంటి నిర్జీవ కారకాలు ఆవరణ వ్యవస్థను నిర్ణయిస్తుంటాయి. నీటి వనరులు తక్కువగా ఉన్న ప్రాంతాలు ఎడారి ఆవాసాలుగానూ, వర్షపాతం అధికంగా ఉండే ప్రాంతాలు అటవీ ఆవాసంగానూ, జలవనరులు ఉన్న ప్రాంతాలు జల ఆవాసాలుగానూ మారతాయి.

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత

ప్రశ్న 8.
నిచ్ అనగానేమి? ఇది ఆవాసం కంటే ఎలా భిన్నమైనది?
జవాబు:
ప్రతి జంతువు ఆహార జాలకంలో ఒక నిర్దిష్ట స్థానాన్ని కలిగి ఉంటుంది. దీనిని ఆ జంతువు యొక్క ‘ఆహార జాలకపు ఆవాసం’ లేదా ‘నిచ్’ (Niche) అని వర్ణిస్తారు. ఉదాహరణకు, ఆకుల నుండి రసాలను పీల్చే ఎఫిడ్లు అనే కీటకాలకు ఒక స్థానం ఉంటే ఆకులను చిన్నచిన్న ముక్కలుగా చేసే లేదా కొరికే దవడలున్న గొంగళి పురుగులకు మరొక స్థానం ఉంటుంది.

‘నిచ్’ అనే పదం, ఆహార జాలకంలో జంతువు యొక్క ఆక్రమించిన సరైన స్థానాన్ని మరియు ఆహారాన్నే కాకుండా, దాని జీవన విధానాన్ని తెలుపుతుంది. ఆవాసం అనేది జంతువు యొక్క నివాస స్థలమైనట్లే ‘నీచ్’ దాని బ్రతుకుదెరువును అంటే ఆ జీవి చేసే పనిని, సంచరించే ప్రదేశాలను ఆహారం పొందే విధానాన్ని మొదలైన వాటన్నింటినీ స్పష్టంగా వర్ణిస్తుంది.

ప్రశ్న 9.
ఆవరణ వ్యవస్థ పిరమిడ్లు అనగానేమి? అందలి రకాలు ఏమిటి?
జవాబు:
జీవుల మధ్య సంబంధాలను చూపడానికి లేదా వర్ణించడానికి ఆవరణ శాస్త్రవేత్తలు ‘పిరమిడ్’ (Pyramid) అనే భావనను ఉపయోగిస్తారు. వివిధ పోషక స్థాయిలలో ఆవరణ వ్యవస్థ యొక్క నిర్మాణాన్ని పిరమిడ్ రూపంలో రేఖాత్మకంగా చూపే చిత్రాన్ని ‘జీవావరణ పిరమిడ్’ (Ecological pyramid) అంటారు. బ్రిటిష్ ఆవరణ శాస్త్రవేత్త ‘చార్లెస్ ఎల్టన్’ 1927లో ఆవరణశాస్త్ర పిరమిడ్ రేఖాచిత్రాలను ప్రప్రథమంగా ప్రవేశపెట్టాడు. పిరమిడ్ పీఠభాగంలో ఉత్పత్తిదారులు (ప్రథమ పోషకస్థాయి), వాటిపై క్రమంగా ఇతర పోషకస్థాయిలు (ప్రథమ, ద్వితీయ, తృతీయ వినియోగదారులు) ఒకదానిపై ఒకటి చొప్పున పిరమిడ్ శిఖరం వరకు అమరి ఉంటాయి.

ఆవరణశాస్త్ర పిరమిడ్లు మూడు రకాలుగా ఉంటాయి. అవి: 1. సంఖ్యాపిరమిడ్లు . 2. జీవద్రవ్యరాశి పిరమిడ్లు – 3. శక్తి పిరమిడ్లు.

ప్రశ్న 10.
సంఖ్యా పిరమిడ్లు అనగానేమి? వివరించండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 6
ఆహారపు గొలుసులోని జీవుల సంఖ్యను పిరమిడ్ అనే రేఖాపటం ద్వారా చూపవచ్చును. పిరమిడ్ లోని ప్రతిభాగం ఆహారపు గొలుసులోని ప్రతి పోషకస్థాయి (Trophic level) లో గల జీవుల సంఖ్యను సూచిస్తుంది. ప్రథమ వినియోగదారుల స్థాయి నుండి అతిపెద్ద మాంసాహారుల వరకు, ఆహారపు గొలుసులోని ప్రతి పోషకస్థాయిలో సాధారణంగా జీవుల పరిమాణం పెరుగుతూ ఉంటుంది. కానీ జీవుల సంఖ్య తగ్గుతూ ఉంటుంది.

ప్రశ్న 11.
జీవద్రవ్యరాశి పిరమిడ్లు అనగానేమి? వివరించండి.
జవాబు:
చెట్లు, గుల్మాలు, పంటలు, గడ్డి, శైవలాలు, నీటి మొక్కలు, వ్యవసాయ మరియు అరణ్య సంబంధ అవక్షేపాలు, మొక్కల, జంతువుల విసర్జితాలన్నీ జీవద్రవ్యరాశులే. శక్తిగా మార్చడానికి వీలైన వృక్ష, జంతు సంబంధ పదార్థాన్ని జీవద్రవ్యరాశి (Biomass) అంటారు. జీవద్రవ్యరాశిని శక్తి ఉత్పత్తి కోసం వినియోగిస్తే, అది జీవశక్తి (Biofuel) అవుతుంది.

జీవద్రవ్యరాశి పిరమిడ్ ప్రతి పోషకస్థాయిలోని జీవద్రవ్యరాశి పరిమాణాన్ని, వివిధ పోషకస్థాయిలలో ఉన్న రాశుల మధ్యగల సంబంధాన్ని తెలియజేస్తుంది. భౌమ్యావరణ వ్యవస్థలలో, ఉత్పత్తిదారుల నుండి మాంసాహారుల వరకు జీవద్రవ్యరాశి క్రమంగా తగ్గుతూ ఉంటుంది. అందువల్ల జీవద్రవ్యరాశి పిరమిడ్ల నిర్మాణం నిటారుగా ఉంటుంది. జలావరణ వ్యవస్థలో ఉత్పత్తిదారుల జీవద్రవ్యరాశి ఇతర పోషక స్థాయిలలో ఉన్న జీవుల జీవద్రవ్యరాశి కంటే చాలా తక్కువగా ఉంటుంది.

ప్రశ్న 12.
జలావరణ వ్యవస్థలోని జీవద్రవ్యరాశి పిరమిడను వర్ణించండి.
జవాబు:
జలావరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులైన నీటిలో తేలే మొక్కల జీవద్రవ్యరాశి, వీటిని ఆహారంగా తీసుకొనే క్రస్టేషియన్లు మరియు శాకాహార చేపల జీవద్రవ్యరాశి కన్నా చాలా తక్కువ. చిన్న చేపలు తినే పెద్ద, మాంసాహార చేపల జీవ ద్రవ్యరాశి చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ విధమైన పిరమిడ్ నిర్మాణం తలకిందులుగా ఉంటుంది. ఆహారపు గొలుసులోని ఒక పోషక స్థాయి నుండి తరువాత పోషక స్థాయికి 10 నుండి .20% వరకు జీవద్రవ్యరాశి బదిలీ అవుతుంది.

ప్రశ్న 13.
ఒక పోషకస్థాయిలోని జీవద్రవ్యరాశి, దాని క్రింది స్థాయిలోని జీవద్రవ్యరాశి కన్నా తక్కువగా ఉంటుంది. ఎందుకు?
జవాబు:
ఒక పోషకస్థాయిలోని జీవద్రవ్యరాశి, దాని కింది స్థాయిలోని జీవద్రవ్యరాశి కన్నా తక్కువగా ఉంటుంది. ఎందుకనగా, జీవద్రవ్యరాశి అనేది అందుబాటులో ఉన్న మొత్తం ఆహారానికి కొలమానం. జంతువులు తమ ఆహారాన్ని గ్రహించినపుడు, దానిలోని కొంతభాగం మాత్రమే తరువాత పోషకస్థాయికి ఆహారమయ్యే కొత్త కణజాలాలు ఏర్పడడానికి వినియోగించబడుతుంది. ఆహారంగా గ్రహించిన జీవద్రవ్యరాశి చాలా వరకు విసర్జింపబడడం లేదా శక్తి ఉత్పత్తిలో ఉపయోగించబడకపోవడం జరుగుతుంది.

ప్రశ్న 14.
జీవద్రవ్యరాశి పిరమిడ్లో శక్తి తగ్గుదలను వివరించండి.
జవాబు:
ఆహారపు గొలుసులో, ప్రతి పోషకస్థాయిలో సుమారుగా 90% ఆహారం నష్టపోవడం జరుగుతుంది. 1000 కిలోల నీటిలో తేలే మొక్కలు, 100 కిలోల నీటిపై తేలే జంతు ప్లవకాల ఉత్పత్తికి అవసరమవుతుంది. ఆ 100 కిలోల జంతు ప్లవకాలు 10 కిలోల చేపల ఉత్పత్తికి, తిరిగి ఈ చేపలు ఒక కిలో మానవ కణజాలాల ఉత్పత్తికి అవసరమవుతాయి. ఈ జీవద్రవ్యరాశి ఉత్పత్తి ప్రక్రియలో, మొక్కలలో (ఉత్పత్తిదారులలో) నిక్షిప్తమైన స్థితిశక్తి (సూర్యరశ్మి ఫలితంగా) పై పోషకస్థాయులకు వెళ్ళే కొద్దీ క్రమంగా నష్టపోవడం జరుగుతుంది.
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 5

ప్రశ్న 15.
కొల్లేరు సరస్సు విస్తీర్ణం తగ్గుదలకు గల కారణాలు ఏమిటి?
జవాబు:
80వ దశకం నుండి కొల్లేరు ప్రాంతంలో రొయ్యలు, చేపల పెంపకం (Acqua culture) అత్యంత లాభదాయకమైన వ్యాపారంగా విస్తరించింది. అందువల్ల అనేక మంది పెట్టుబడిదారుల దృష్టి దీని పైబడి సరస్సు ఆక్రమణలకు గురైంది. 1996 నాటికి చాలా ప్రాంతాలలో కట్టలు కట్టి నీటి ప్రవాహాన్ని మళ్ళించి సరస్సును సాగుభూమిగా మార్చారు. ఇది సరస్సు సహజ ప్రవాహ దిశను మార్చివేసింది. అందువల్ల సరస్సులో నీటి నిలువ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయింది.

ప్రశ్న 16.
విచక్షణారహితంగా పెస్టిసైడ్లు వాడటం వలన కలిగే నష్టాలు ఏమిటి?
జవాబు:
పెస్టిసైడ్లు విచక్షణారహితంగా ప్రభావాన్ని చూపుతూ, ఎక్కువ సంఖ్యలో ఇతర జంతువులను నాశనం చేస్తాయి. వీటిలో ఈ క్రిములను ఆహారంగా తీసుకొనే జంతువులు మరియు ఇతరులకు ఆహారమయ్యే జంతువులూ ఉంటాయి. ఫలితంగా పెస్టిసైడ్లు ఆహారపు గొలుసులలో అనూహ్యమైన మార్పులకు దారితీస్తూ, ఆవరణ వ్యవస్థ యొక్క సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఇవి నేలలో కలిసిపోయినపుడు అవి కలిగించే ప్రభావం ఇంకా అపాయకరంగా ఉంటుంది.

ప్రశ్న 17.
జైవిక వ్యవస్థాపనం, జైవిక వృద్ధీకరణం పదాలను నిర్వచించంది.
జవాబు:
పాదరసం, ఆర్సెనిక్, సీసం కలిగియున్న పెస్టిసైడ్లు విచ్ఛిన్నం చెందవు. విచ్ఛిన్నం కాని పెస్టిసైడ్లు చాలా అపాయకరమైనవి. ఇవి ఒక్కొక్క పోషకస్థాయిలో కేంద్రీకృతమవుతూ పిరమిడ్ శిఖర భాగంలో ఉండే జంతువుల శరీరాలలోనికి చేరి అపాయకరమైన స్థాయిలో పేరుకుంటాయి. ఆహారపు గొలుసులోనికి కాలుష్యాలు చేరడాన్ని ‘జైవిక వ్యవస్థాపనం’ (Bio accumulation) అంటారు. ఆహారపు గొలుసులోని ఒక పోషకస్థాయి నుండి తరవాత పోషకస్థాయికి చేరిన కాలుష్యాలు సాంద్రీకృతమయ్యే విధానాన్ని జైవిక వృద్ధీకరణం (Bio magnification) అంటారు.

ప్రశ్న 18.
చేపలను లోహ కాలుష్య సూచికలుగా పరిగణిస్తున్నారు. ఎందుకు?
జవాబు:
పట్టణ, పారిశ్రామికీకరణ, ఆధునిక జీవన విధానాలు, మానవుల నిత్యకృత్యాల కారణంగా భారమూలకాలు దగ్గరలోని నీటివనరులలో కలుస్తున్నాయి. దీని వలన జీవజాలం ఈ కలుషిత నీటిలోనే జీవనం కొనసాగించవలసిన దుస్థితి ఏర్పడుతోంది. ఇలాంటి పరిస్థితులలో జీవించే చేపలు లోహ కాలుష్య వాతావరణానికి తీవ్రంగా ప్రతిస్పందించడాన్ని గమనించారు. అందువల్ల ఈ మధ్యకాలంలో చేపలను లోహకాలుష్యాలకు జీవసూచికలుగా భావిస్తున్నారు.

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత

ప్రశ్న 19.
ఏదులాబాదు రిజర్వాయర్ లోని చేపలలో గుర్తించిన కలుషితాలు ఏమిటి?
జవాబు:
ఏదులాబాదు చేపల్లో భారమూలకాల పరిమాణం దేశ సగటు కన్నా ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. అలాగే భారమూలకాల సంచయనాన్ని పరిశీలిస్తే అన్నింటికన్నా ఎక్కువ ఇనుము ఉండగా సీసం, క్రోమియం, నికెల్, కాడ్మియం తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ మూలకాలు ఆహార జాలకం ద్వారా చేపల కణాల్లో చేరి అక్కడ నుండి మానవులలోకి చేరుతున్నాయి. చేపల కాలేయం, మొప్పలు, మూత్రపిండాలలో కాడ్మియం అత్యధికంగా చేరుతోంది. అతి తక్కువ గాఢతలలో కూడా చేపలు కాడ్మియం లోహానికి సున్నితత్వాన్ని కలిగి ఉండడం వల్ల ఇది చేపల కణజాలంలోకి సులభంగా చేరుతోందని గుర్తించారు. క్రోమియం, ఇనుము, నికెల్, సీసం తరువాతి స్థానాలలో ఉన్నాయి.

ప్రశ్న 20.
మానవ కార్యకలాపాలు సహజ ఆవరణవ్యవస్థలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి?
జవాబు:
నదులపై ఆనకట్టలు నిర్మిస్తూ, చిత్తడి నేలలను, సముద్రతీరాలను ఆక్రమిస్తూ, అడవులను నరుకుతూ, భూమిని దున్ని పంటలను పండిస్తూ, కాలువలు, రహదారులు, పట్టణాలు మరియు నగరాలను నిర్మిస్తూ మానవుడు సహజ ఆవరణ వ్యవస్థలను ఎన్నో మార్పులకు గురిచేశాడు. ఈ మార్పులు సహజ ఆవరణ వ్యవస్థలలో నివసిస్తున్న వృక్ష, జంతుసముదాయాలను చాలా వరకు మార్చివేశాయి.

ప్రశ్న 21.
ఒక పట్టణ అభివృద్ధిలో ఏ ఏ మార్పులు, జీవజాలంలో చోటు చేసుకుంటాయి?
జవాబు:

  1. కొన్ని వృక్షజంతు జాతులు చనిపోతాయి.
  2. కొన్ని మారిన, కొత్త పరిస్థితులకు అనుకూలంగా మార్చుకొని తక్కువ సంఖ్యలో మనుగడ కొనసాగిస్తాయి.
  3. కొన్ని మారిన, కొత్త పరిస్థితుల నుండి లాభాన్ని పొందుతూ, వాటి సంఖ్యను పెంచుకుంటాయి.

ప్రశ్న 22.
మినిమేటా వ్యాధి గురించి రాయండి.
జవాబు:
మినిమేటా వ్యాధిని మొదట 1956వ సంవత్సరంలో జపాన్లోని కుమయోటో ప్రిఫెక్చర్ లో గల మిమిమేటా నగరంలో కనుగొన్నారు. 1932 నుండి 1968 వరకు చిస్సో కార్పొరేషన్ వారి రసాయన పరిశ్రమ నుండి విడుదలైన మిథైల్ మెర్క్యురీతో కూడిన వ్యర్థజలాలే మినిమేటా వ్యాధికి కారణం. షిరని సముద్ర (Shiranui sea), మినమేటా అఖాతంలో ఉండే చేపల ద్వారా వీటిని తినే స్థానిక మనుషుల్లోకి మిథైల్ మెర్క్యురీ చేరి అనారోగ్యాలకు దారితీసింది. ఫలితంగా పిల్లులు, కుక్కలు, పందులు, మనుషుల మరణాలు 36 ఏళ్లపాటు కొనసాగాయి.

ప్రశ్న 23.
పిచ్చుకల ప్రయోజనాన్ని శాస్త్రవేత్తలు ఎలా తెలియజేశారు?
జవాబు:
చనిపోయిన పిచ్చుకల జీర్ణవ్యవస్థలోని పదార్థాలను శాస్త్రవేత్తలు పరిశీలించారు. దానిలో మూడు వంతులు పంటలను నాశనం చేసే క్రిమికీటకాలు ఉండగా, ఒక వంతు మాత్రమే ధాన్యపు గింజలు ఉన్నట్లు కనుగొన్నారు. పిచ్చుకలు మానవులకు ఎంతో ఉపయోగం కలిగించే పక్షులని వారు తమ పరిశోధనల ద్వారా నిర్ధారణకు వచ్చారు. పిచ్చుకలను నాశనం చేసే ప్రయత్నాల వలన పంట దిగుబడి పెరగకపోగా మరింతగా తగ్గిపోయింది.

ప్రశ్న 24.
పిచ్చుకల నిర్మూలన వలన కలిగే నష్టాలు ఏమిటి?
జవాబు:
మిడతలను తినే పిచ్చుకలు లేకపోవడంతో పంటలపై మిడతల దాడి ఎక్కువయింది. దానితో పాటు ప్రతికూల వాతావరణ పరిస్థితులు కూడా తోడయ్యాయి. అతి పెద్ద కరవుకు దారితీశాయి. మిడతలను చంపడానికి కీటకనాశనులను పెద్దమొత్తంలో వినియోగించడం ప్రారంభించడంతో నేల నాణ్యత క్షీణించిపోయింది. పొలాలలో పనిచేయాల్సిన రైతులు వ్యవసాయం గిట్టుబాటు కాకపోడంతో వేల సంఖ్యలో గ్రామాలను వదిలి పరిశ్రమలలో కార్మికులుగా పనిచేయడానికి వలస వెళ్ళారు.

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత

ప్రశ్న 25.
కొల్లేరు సరస్సు నీటి నిలువ సామర్థ్యం తగ్గటానికి కారణాలు ఏమిటి?
జవాబు:

  1. కొల్లేరు సరస్సు అధికంగా ఆక్రమణలకు లోనైంది.
  2. పరిసరప్రాంతాలను వ్యవసాయ భూములుగా మార్చారు.
  3. చేపల పరిశ్రమ లాభసాటిగా ఉండుటవలన ఆక్రమిక ప్రాంతాలు రొయ్యల సాగు కేంద్రాలుగా మారాయి.
  4. కలుషితాలు చేరి, పూడిక పెరిగింది. 5. ఆక్రమణల వలన నీటి ప్రవాహదిశ మారి, నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది.

10th Class Biology 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
క్రిమి కీటకాల బారి నుండి పంటలను, ఆహార పదార్థాలను నివారించే క్రిమి సంహారకాలను ఉపయోగించాలా? లేదా ప్రత్యామ్నాయాలను ఆలోచించాలా ? ఆ విషయం గురించి మీ అభిప్రాయాన్ని, దానికి గల కారణాలను రాయండి.
జవాబు:

  1. క్రిమి సంహారకాలను ఉపయోగించరాదు. వీనికి ప్రత్యామ్నాయ విధానాలను అనుసరించాలి.
  2. విచక్షణ కాని క్రిమి సంహారకాల వినియోగం వివిధ రకాల కాలుష్యాలకు కారణమవుతుంది.
  3. హానికారక క్రిమిసంహారకాలు ఆవరణ వ్యవస్థలోనికి చేరి జైవిక వ్యవస్థాపనం, జైవిక వృద్ధీకరణంలకు కారణమైన పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నది.
  4. క్రిమిసంహారకాలకు ప్రత్యామ్నాయంగా జైవిక నియంత్రణ, వంధ్యత్వం, జన్యు ఉత్పరివర్తన రకాల అభివృద్ధి మరియు తెగుళ్ళకు సంబంధించిన మూలకారణాల అన్వేషణ విధానాలను అనుసరించాలి.

ప్రశ్న 2.
క్రిమి సంహారకాల వినియోగాన్ని ఆపివేసి నేల కాలుష్యం నివారించడానికి అనువైన ఏవైనా 4 పర్యావరణహిత పద్ధతులను వివరించండి.
(లేదా)
పంటలకు హాని కలిగించే చీడ పీడలను నివారించేందుకు అనుసరించాల్సిన ఏవేని నాలుగు జైవిక నియమాలను రాయండి.
జవాబు:
పంటలను నాశనం చేసే చీడలను తొలగించడానికి వాడే, రసాయనిక క్రిమి సంహారకాల పర్యావరణాన్ని నాశనం చేయడమే కాక నేలను కూడా కాలుష్యం చేస్తాయి. నేల కాలుష్యాన్ని నివారించడానికి ఈ క్రింది పద్ధతులు ఆచరణ యోగ్యం అయినవి.

1) పంట మార్పిడి :
ప్రతి సంవత్సరం ఒకే పంటను కాకుండా వేరు వేరు పంటలను పండించే పంట మార్పిడి విధానాన్ని పాటించడం వల్ల తెగుళ్ళను, వాటి వల్ల కలిగే నష్టాన్ని నివారించవచ్చు.

2) తెగుళ్ళకు సంబంధించిన పూర్వాపరాలను తెలుసుకోవడం :
ఏ తెగులు ఎలా వ్యాపిస్తుంది, దీనికి మూల కారణాలేంటి, అనే విషయాలను పూర్తిగా అర్ధం చేసుకోవడం వలన పంట నష్టాన్ని నివారించవచ్చు.

3) జైవిక నియంత్రణ :
తెగుళ్ళు కలిగించే కారకాలను తినే పరాన్న జీవులను, నిశాచర మాంస భక్షకులను ప్రవేశపెట్టడం ద్వారా తెగుళ్ళను నివారించవచ్చు.

4) వంధ్యత్వం :
తెగుళ్ళు కలిగించే క్రిమి కీటకాల పురుష జీవుల పునరుత్పత్తి సామర్థ్యం కోల్పోయేలా వంధ్యత్వం చేయడం ద్వారా వాటి వ్యాప్తిని అరికట్టవచ్చు.

5) జన్యు ఉత్పరివర్తన రకాలు :
వివిధ రకాల తెగుళ్ళను, వాతావరణ పరిస్థితులను తట్టుకునే జన్యు సంబంధ రకాలను అభివృద్ధి చేయడం ద్వారా పురుగుమందుల వినియోగాన్ని తగ్గించవచ్చు.

6) పర్యావరణ నైతికత కల్గి ఉండడం :
పర్యావరణం పట్ల నైతికత కల్గి ఉండాలి. పర్యావరణ సంబంధ చట్టాలను తెలుసుకోవడమే కాక పర్యావరణపరంగా ఏది సరి అయినది ఏది సరికానిదో తెలుసుకొని ప్రవర్తించాలి.

ప్రశ్న 3.
ఈ దిగువనీయబడిన పటములోని సమాచారాన్ని విశ్లేషించి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం వ్రాయుము.
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 7
i) మీకివ్వబడిన ఆహార జాలకంలో ప్రాథమిక ఉత్పత్తిదారులు ఏవి?
ii) పటము నుండి ఏదైనా ఒక ఆహారపు గొలుసును తయారు చేయండి.
iii) పై ఆహారజాలకంలో తృతీయ వినియోగదారులేవి?
iv) ఏవేని రెండు శాకాహార జంతువుల పేర్లను తెలపండి.
జవాబు:
i) మొక్కలు, గడ్డి, వృక్షప్లవకాలు, చెట్లు మొదలైనవి.
ii) గడ్డి → కుందేలు → నక్క → పులి
iii) పులి, రాబందు, కొంగ, గుడ్లగూబ, నెమలి మొదలైనవి.
iv) కుందేలు, జింక, మేక, ఆవు

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత

ప్రశ్న 4.
ప్రక్కన చూపిన జీవ ద్రవ్యరాశి పిరమిడ్ ను పరిశీలించి, ప్రశ్నలకు సమాధానాలు వ్రాయుము.
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 9
a) ఈ పిరమిడ్ లో పైకి వెళ్ళే కొద్దీ ద్రవ్యరాశి తగ్గిపోతుంది కదా ! ఎందుకు?
జవాబు:
ఈ పిరమిడ్ నందు ఉత్పత్తిదారుల నుండి పై పోషకస్థాయికి పోయేకొలది జీవ ద్రవ్యరాశి 10% మాత్రమే బదిలి జరుగుతుంది. అందువలన ద్రవ్యరాశి తగ్గిపోతుంది.

b) ఉత్పత్తిదారులకు, ప్రాథమిక వినియోగదారులకు కొన్ని ఉదాహరణలిమ్ము..
జవాబు:
ఉత్పత్తిదారులు : ఆకుపచ్చని మొక్కలు, శైవలాలు, వృక్ష ప్లవకాలు
ప్రాథమిక వినియోగదారులు : శాకాహార జంతువులు (లేదా) కుందేలు, ఆవు, మేక మొ॥

c) ఉత్పత్తిదారులకు శక్తి ఎక్కడి నుండి లభిస్తుంది?
జవాబు:
ఉత్పత్తిదారులకు శక్తి సూర్యుని నుండి లేదా సూర్యరశ్మి నుండి లభిస్తుంది.

d) ప్రతీ పోషకస్థాయిలో ఎంత ద్రవ్యరాశి నష్టపోతున్నది?
జవాబు:
ప్రతీ పోషకస్థాయిలో 90% ద్రవ్యరాశి నష్టపోతుంది.

ప్రశ్న 5.
శక్తి పిరమిడ్ ను వివరించండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 10

  1. ఆవరణ వ్యవస్థలో ఆహారం ద్వారా జీవులలో శక్తి ప్రసరణ జరుగుతుంది. ఆహారపు గొలుసులో కేలరీలు శక్తిప్రసరణను పిరమిడ్ ఆకారంలో రేఖాత్మకంగా సూచించడాన్ని “శక్తి పిరమిడ్” అంటారు.
  2. ఆహారగొలుసులో ప్రతి స్థాయి వద్ద శక్తి నష్టం జరుగుతుంది. ప్రతి పోషక స్తాయిలో 20% ఆహారం నష్టపోవడం జరుగుతుంది.
  3. కావున ఆహారపు గొలుసులో పైకి ప్రయాణిస్తున్నది కొలది శక్తి విలువ తగ్గుతుంది, అందువలన శక్తిపిరమిడ్ ఎల్లప్పుడూ శీర్షాభిముఖంగానే ఉంటుంది.
  4. ఈ పిరమిడ్ లో అడుగుభాగాన ఉత్పత్తిదారులు అధిక శక్తిని కలిగి ఉండగా, ప్రతి పోషక స్థాయిలో సుమారు 10% శక్తి బదిలీ అవుతూ ఉంటుంది.

ప్రశ్న 6.
నీటిలో అధిక పోషకాలు కలిగిన వ్యర్థాలు చేరటం వలన కలిగే నష్టాలు ఏమిటి?
జవాబు:
వ్యవసాయ రసాయనాలు, ఎరువులు, చేపల చెరువుల వ్యర్థాలు, పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థ రసాయనాలు, మున్సిపల్ వ్యర్థాలు మొదలైనవన్నీ సరస్సులో కలిసి కాలుష్యాన్ని కలిగిస్తున్నాయి. ఎక్కువ పోషకాలు కలిగిన వ్యర్థాలు (Anthropogenic pollutants) కలుపు విపరీతంగా పెరగడానికి కారణమవుతున్నాయి.

ఫలితంగా సరస్సులో నీరు క్షారస్వభావంతో, మురికిగా, పోషక పదార్థాలతో కూడి ఉండడం వల్ల నీటిలో కరిగే ఆక్సిజన్ పరిమాణం (DO) తగ్గిపోయింది. జైవిక ఆక్సిజన్ డిమాండ్ (BOD) ఎక్కువ కావడం వలన జలచరాలపై తీవ్ర ప్రభావం కలిగింది. ఇక్కడి ప్రజలకు జలకాలుష్యంపై అవగాహన లేకపోవడం వల్ల డయేరియా, కలరా, టైఫాయిడ్, అమీబియాసిస్ మొదలైన నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు తీవ్రంగా వ్యాప్తి చెందాయి. వీటితో పాటు దోమలు వంటి వాహకాల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు కూడా ప్రబలాయి. రొయ్యలు, చేప వంటి జలచరాలు కూడా కాలుష్యానికి గురయ్యాయి. పొలాలు వ్యవసాయానికి యోగ్యం కాకుండా పోయాయి. దిగుబడి తగ్గిపోయింది.

ప్రశ్న 7.
చైనా ప్రభుత్వం పిచ్చుకలను చంపే కార్యక్రమం ఎందుకు చేపట్టింది?
జవాబు:
చైనా ప్రభుత్వం పారిశ్రామిక ఉత్పత్తులను పెంచే దిశలో గ్రామీణ రైతులను పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. పారిశ్రామిక ఉతృతిని త్వరితంగా సాధించడానికి ఎన్నో ప్రణాళికలు రూపొందించారు. అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా తొందరగా ఆధునికతను రూపుదిద్దుకొనేందుకు చైనా ప్రభుత్వం ఉద్యమాన్ని చేపట్టింది. అయితే అప్పటిదాకా చైనా వ్యవయసాయాధారిత సమాజమే. ఈ ఉద్యమంలో భాగంగా 5000 కుటుంబాలతో సమూహాలుగా ఏర్పడి వ్యవసాయం చేయడం అన్నది ఒక ముఖ్యాంశం. దీనివల్ల పంట దిగుబడి రెట్టింపు అయ్యింది.

ఈ మొదటి విజయంతో తరువాతి సంవత్సరానికి మరింత పెద్ద లక్ష్యాలను రూపొందించుకోవడం జరిగింది. కానీ వాతావరణం అందుకు సహకరించలేదు. కొంత పంట దిగుబడి వచ్చినప్పటికీ తగిన ఫలితాలను సాధించలేకపోయామనే భయంతో ప్రభుత్వ వ్యవసాయాధికారులు దిగుబడిని ఎక్కువగా లెక్కగట్టారు. ఈ తప్పుడు లెక్కలు ప్రజల అవసరాలకు ఆహార సరఫరాలకు మధ్యగల సమతుల్యత పై తీవ్రంగా ప్రభావం చూపాయి. దీనినుండి తప్పించుకోవడానికి అధికారులు తమ తప్పిదాన్ని పిచ్చుకలపైకి నెట్టారు. గిడ్డంగుల నుండి సంవత్సర కాలంలో ఒక పిచ్చుక సుమారుగా 1.8 కిలోల ధాన్యపు గింజలు తిన్నదని అందువల్ల ఆహార కొరత ఏర్పడిందని ప్రకటించారు. పిచ్చుకలపై నేరాన్ని మోపారు. పల్లెల్లో, పట్టణాల్లో ప్రజలందరినీ పిచ్చుకలపై యుద్ధం చేయాల్సిందిగా ఆదేశించారు.

ప్రశ్న 8.
మీ ఇంట్లో ఏయే పనులకు శిలాజ ఇంధనాలను ఉపయోగిస్తున్నారు? వాటిని సంరక్షించడానికి నీవు చేపట్టే చర్యలు ఏవి?
జవాబు:
మా ఇంట్లో LPGని వంటకు, వేడి చేయడానికి మరియు మండించే ప్రక్రియలందు శిలాజ ఇంధనాలను వినియోగిస్తాము. పెట్రోలు మరియు డీజిలను రవాణాకు మరియు జనరేటర్లు, నీటిపంపులు పనిచేయడానికి వినియోగిస్తాము.

శిలాజ ఇంధనాలను సంరక్షించడానికి చేపట్టే చర్యలు :

  1. వంట చేయడానికి అవసరమయిన పదార్ధములు మరియు పాత్రలు సిద్ధం చేసుకున్న తర్వాతే వంట చేయడం మొదలు పెడతాను.
  2. అన్నంను రైస్ కుక్కర్ నందు వండుట వలన 20% మరియు మాంసంను వండుట ద్వారా 41.5% సహజ వాయువును ఆదా అయ్యే విధంగా చూస్తాను.
  3. ప్రెజర్ కుక్కర్ నందు మరిగే ప్రక్రియ – ప్రారంభం అయిన వెంటనే పొయ్యి మంట పరిమాణాన్ని తగ్గిస్తాను. దీని ద్వారా నాకు 35% ఇంధనం ఆదా అవుతుంది.
  4. ఆహార పదార్థాలను వండడానికి ముందు కొంచెం సేపు నానబెట్టుట వలన 22% ఇంధనం ఆదా చేయగలుగుతాను.
  5. వెడల్పు మరియు తక్కువ లోతుగల పాత్రలలో ఆహార పదార్థాలను వండుతాను. తద్వారా ఇంధనమును ఆదా చేస్తాను.
  6. వండే పాత్రలపై మూతను ఉంచుట ద్వారా ఆహార పదార్ధములు త్వరగా ఉడుకునట్లు చూస్తాను.
  7. పాఠశాలకు నడకద్వారా ప్రతిరోజు వచ్చి వెళతాను. దూర ప్రాంతాలకు వెళ్ళటానికి ప్రభుత్వ రవాణా సాధనములను ఉపయోగిస్తాను.
  8. శిలాజ ఇంధనాలకు బదులుగా నీటిని వేడిచేయడానికి, బల్బులను వెలిగించడానికి సోలార్ శక్తిని వినియోగిస్తాను.
  9. పెట్రోలు మరియు డీజిల్ తో నడిచే జనరేటర్లు, నీటి పంపులను సోలార్ పవర్ తో నడిచే విధంగా చూస్తాను.

ప్రశ్న 9.
సాధారణంగా ఆవరణ వ్యవస్థలలో ఉత్పత్తిదారుల నుండి అగ్రభాగాన ఉండే మాంసాహారులకు చేరేసరికి జీవుల సంఖ్య, జీవద్రవ్యరాశి తగ్గడానికి గల కారణాలు ఏమిటి?
జవాబు:
ఆహారపు గొలుసులో స్థాయి పెరిగే కొలది శక్తి ప్రసరణ తగ్గుతుంది. సరిపడిన శక్తి కొరకు వినియోగదారులు అధిక సంఖ్యలో వాటి కింది జీవులను ఆహారంగా తీసుకోవలసి ఉంటుంది. అందువలన ఆహార కొరత ఏర్పడి, అగ్రశ్రేణి మాంసాహారుల సంఖ్య తక్కువగా ఉంటుంది. కావున ఆహారపు గొలుసులో ఉత్పత్తిదారుల కంటే వినియోగదారుల సంఖ్య తక్కువగా ఉంటుంది.

ఆహారపు గొలుసులో ప్రతి పోషక స్థాయిలో సుమారుగా 90% ఆహారం నష్టపోవడం జరుగుతుంది. జంతువులు తమ ఆహారాన్ని గ్రహించినపుడు దానిలోని కొంత భాగం మాత్రమే తరువాత పోషకస్థాయికి అవసరమయ్యే కొత్త కణజాలాలు ఏర్పడడానికి వినియోగించబడుతుంది. ఆహారంగా గ్రహించిన జీవద్రవ్యరాశి చాలా వరకు విసర్జింపబడటం లేదా శక్తి ఉత్పత్తిలో ఉపయోగించకపోవడం జరుగుతుంది. జీవద్రవ్యరాశి ఉత్పత్తి ప్రక్రియలో, మొక్కలలో నిక్షిప్తమైన . స్థితిశక్తి పై పోషకస్థాయిలకు వెళ్ళే కొద్దీ క్రమంగా నష్టపోవడం జరుగుతుంది.

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత

ప్రశ్న 10.
మీ గ్రామములో కుటుంబ నియంత్రణ, ఆరోగ్య పరిశుభ్రత, పచ్చదనం, పోలియో, ఎయిడ్స్ వంటి కార్యక్రమాలు అమలుపరచడానికి ఎప్పుడు, ఏయే సందర్భాలలో, ఎటువంటి కార్యక్రమాలు చేపడతావో పట్టిక రూపంలో రాయండి.
జవాబు:

వ్యాధి పేరు/ కార్యక్రమం పేరు అమలు పరిచే కార్యక్రమాలు
1. పోలియో పల్స్ పోలియో కార్యక్రమము నందు అందరు పిల్లలకు వ్యాక్సిన్ వేయటం.
ఇంటింటి ప్రచారం – పోలియో రహిత సమాజం కోసం ప్రచారం.
కరపత్రముల ద్వారా పోలియో వ్యాధి నివారణ చర్యలు ప్రచారం చేయటం.
డాక్టర్లచే అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం
2. AIDS ఆశ వర్కర్ల సహాయంతో HIV వైరస్ పట్ల ఇంటింటికి తిరిగి అవగాహన కల్గించడం.
ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులచే ప్రచారం చేయించటం కరపత్రాలు మరియు గోడపత్రికలు విడుదల చేయడం.
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం (డిసెంబర్ 1) జరపటం
సామూహిక ఆరోగ్య పరీక్షలను నిర్వహించడం
నిపుణులైన వైద్యులచే సమావేశాలు నిర్వహించడం
3. కుటుంబ నియంత్రణ ప్రజలలో అవగాహన కల్పించడం సామూహిక కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సా శిబిరాలను ఏర్పాటు చేయడం.
4. ఆరోగ్యం – పరిశుభ్రత ఆరోగ్యంగా ఉండవలసిన అవసరంపై ప్రజలకు అవగాహన కల్పించుట.
పరిశుభ్రత పై నిపుణులచే సలహాలు ఇప్పించుట
ఆరోగ్య పరీక్షా శిబిరాలు నిర్వహించడం
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కార్యక్రమాల నిర్వహణ
5. పచ్చదనం పచ్చదనం పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం సామూహిక చెట్లు నాటే కార్యక్రమాలు వనమహోత్సవాల నిర్వహణ

ప్రశ్న 11.
పర్యావరణ స్నేహపూర్వక కృత్యాలు మీ పాఠశాలలో ఏమేమి నిర్వహిస్తారో రాయండి.
జవాబు:

  1. పర్యావరణ క్లబ్బులను పాఠశాలలో ఏర్పడే విధంగా చూస్తాము. క్లబ్బు సభ్యులు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించడం వాటిలో గ్రామ ప్రజల భాగస్వామ్యము ఉండే విధంగా చూస్తాము.
  2. పాఠశాల యందు అందమైన తోటను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాము. ఇందులో పూల, పండ్ల మరియు కూరగాయల మొక్కలు ఉండే విధంగా చూస్తాము.
  3. పాఠశాలలో ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటలకు కరెంటు సరఫరాను నిలుపుదల చేయు అలవాటును విద్యార్థులలో కల్పిస్తాను. దీనిద్వారా విద్యుత్తును ఆదా చేయవచ్చు.
  4. పాఠశాలలో పోగయిన చెత్తను కాల్చకుండా చూస్తాము. క్రుళ్ళిపోయే పదార్థాలను గుర్తించి వాటిని కంపోస్టు ఎరువు తయారీలో వినియోగిస్తాము. పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా, స్వచ్ఛంగా ఉండేలా చూస్తాము.
  5. పాఠశాల ఒక మూలయందు కంపోస్టు ఎరువును తయారు చేయుటకు గుంటను త్రవ్వి అందులో మధ్యాహ్న భోజన సమయంలో తయారగు వ్యర్థాలు అన్నింటిని వేసి కంపోస్టు తయారీని చేపడతాము. దానిని పాఠశాలలో పెరిగే మొక్కలకు ఎరువుగా వినియోగిస్తాం.
  6. బాల బాలికలు పాలిథీన్ కవర్లు కాకుండా గుడ్డ సంచులను వినియోగించే విధంగా ప్రోత్సహిస్తాము.
  7. ఘన వ్యర్థాలను సేకరించి వాటిని సక్రమ నిర్వహణ ద్వారా వినియోగించి నేల కాలుష్యము కాకుండా చూస్తాము.
  8. విద్యార్థిని విద్యార్థులు ‘4R’ ల పద్ధతిని పాటించే విధంగా కృషి చేస్తాము. తగ్గించడం, తిరిగి వినియోగించడం మరియు పునఃచక్రీయం పద్ధతులను అవలంబించే విధంగా కృషి చేస్తాము.

ప్రశ్న 12.
జీవ ద్రవ్యరాశి అనగానేమి? కింద ఇవ్వబడిన ఆహారపు గొలుసును ఉదాహరణగా తీసుకొని, జీవద్రవ్యరాశి పిరమిడు గీయండి.
ఎ) గడ్డి బి) శాకాహారులు సి) మాంసాహారులు డి) గద్ద లేదా రాబందు
జవాబు:
AP Board 10th Class Biology Solutions 9th Lesson మన పర్యావరణం – మన బాధ్యత 2
శక్తిగా మార్చటానికి వీలైన వృక్ష, జంతు సంబంధ పదార్థాన్ని జీవద్రవ్యరాశి అంటారు. వివిధ ఆహారపు గొలుసుల జీవ ద్రవ్యరాశి పిరమిడ్లను నిర్మిస్తే అవి ఆహారపు గొలుసులోని జీవుల పరిమాణాన్ని సూచిస్తాయి.
గడ్డి → కీటకం → పాము → గద్ద
ఉత్పత్తి శాకాహారి → మాంసాహారి → అగ్రశ్రేణి మాంసాహారి

పై ఆహారపు గొలుసు యొక్క జీవద్రవ్యరాశి పిరమిడను నిర్మిస్తే అది అధోముఖంగా ఉంటుంది. ఈ ఆహారపు గొలుసులో పైకి వెళ్ళేకొలది జీవుల యొక్క జీవ ద్రవ్యరాశి పెరుగుతుండుట వలన పిరమిడ్ తలక్రిందులుగా ఏర్పడింది. కానీ సాధారణంగా భౌమ ఆవరణ వ్యవస్థలో జీవద్రవ్యరాశి పిరమిడ్లు శీర్షాభిముఖంగా ఉంటాయి.

10th Class Biology 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత ½ Mark Important Questions and Answers

విస్తరింపుము

1. EBWRని విస్తరించండి.
జవాబు:
ఎడులాబాద్ వాటర్ రిజర్వాయర్

2. MOEF ని విస్తరించండి.
జవాబు:
పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ

3. BODని విస్తరించండి.
జవాబు:
బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్

4. DO ని విస్తరించండి.
జవాబు:
కరిగిన ఆక్సిజన్

దోషాన్ని గుర్తించి, సరిచేసి వ్రాయండి

5. పర్యావరణ వ్యవస్థలోని జీవులను, భాగాలను జీవేతర కారకాలు అంటారు.
జవాబు:
పర్యావరణ వ్యవస్థలోని జీవులను, భాగాలను జీవ కారకాలు అంటారు.

6. జీవ కారకాలను పర్యావరణ కారకాలు అని కూడా అంటారు.
జవాబు:
నిర్జీవ కారకాలను పర్యావరణ కారకాలు అని కూడా అంటారు.

7. పర్యావరణ వ్యవస్థలో వినియోగదారులు క్షీణిస్తున్న సేంద్రియ పదార్థాన్ని తిని, వివిధ అణువులుగా తిరిగి పర్యావరణానికి మారుస్తారు.
జవాబు:
పర్యావరణ వ్యవస్థలో విచ్ఛిన్నకారులు క్షీణిస్తున్న సేంద్రియ పదార్థాన్ని తిని, వివిధ అణువులుగా తిరిగి పర్యావరణానికి మారుస్తారు.

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత

8. పోషకస్థాయి ఆహారజాలకంలో జంతువుల స్థానాన్ని మరియు దాని జీవన విధానాన్ని సూచిస్తుంది.
జవాబు:
నిచ్ ఆహారజాలకంలో జంతువుల స్థానాన్ని మరియు దాని జీవన విధానాన్ని సూచిస్తుంది.

9. ఈజిప్ట్ పిరమిడ్ అనేది ఆహార గొలుసులోని వివిధ పోషక స్థాయిల జీవుల మధ్య సంబంధాల యొక్క గ్రాఫికల్ ప్రాతినిధ్యం.
జవాబు:
పర్యావరణ పిరమిడ్ అనేది ఆహార గొలుసులోని వివిధ పోషక స్థాయిల జీవుల మధ్య సంబంధాల యొక్క గ్రాఫికల్ ప్రాతినిధ్యం.

10. పర్యావరణ పిరమిడ్ యొక్క అడుగు ఎల్లప్పుడూ విచ్ఛిన్నకారుల చేత ఆక్రమించబడుతుంది.
జవాబు:
పర్యావరణ పిరమిడ్ యొక్క అడుగు ఎల్లప్పుడూ ఉత్పత్తిదారుల చేత ఆక్రమించబడుతుంది.

11. ఆహార గొలుసులో ప్రతి దశలో సుమారు 10% ఆహారం పోతుంది.
జవాబు:
ఆహారగొలుసులో ప్రతి దశలో సుమారు 90% ఆహారం పోతుంది.

12. ఆహార గొలుసులోకి కాలుష్య కారకాలను ప్రవేశపెట్టే ప్రక్రియను బయో మాగ్నిఫికేషన్ అంటారు.
జవాబు:
ఆహార గొలుసులోకి కాలుష్య కారకాలను ప్రవేశ పెట్టే ప్రక్రియను జైవీకరణ అంటారు.

13. కాలుష్య కారకాలు ఒక పోషకస్థాయి నుండి తదుపరి పోషకస్థాయికి వెళ్ళేటప్పుడు కేంద్రీకృతమయ్యే ధోరణిని జైవీకరణ అంటారు.
జవాబు:
కాలుష్య కారకాలు ఒక పోషకస్థాయి నుండి తదుపరి పోషక స్థాయికి వెళ్ళేటప్పుడు కేంద్రీకృతమయ్యే ధోరణిని జైవిక వృద్ధీకరణ అంటారు.

నేను ఎవరు?

14. నేను ఒక వ్యా ధిని. నేను మొట్టమొదట 1956లో జపాన్లో కనుగొనబడ్డాను. నా కారణంగా పిల్లి, కుక్క పంది మరియు మానవుల మరణాలు 36 ఏళ్ళు కొనసాగాయి. నేను ఎవరు?
జవాబు:
మినిమేటా

15. నేను ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మంచినీటి సరస్సును. నేను 20 మిలియన్ల నివాసితులకు ఆవాసంగా ఉన్నాను. 1999లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నన్ను పక్షుల అభయారణ్యంగా ప్రకటించింది.
జవాబు:
కొల్లేరు సరస్సు

16. నేను బ్రిటిష్ పర్యావరణవేత్తను. పర్యావరణ పిరమిడ్ అనే పదాన్ని పరిచయం చేసిన మొదటి వ్యక్తిని నేను.
జవాబు:
చార్లెస్ ఎల్టన్

17. ఆహార గొలుసు మరియు ఆహార జాలకం గురించి తప్పుగా పేర్కొన్న వ్యత్యాసాన్ని కనుగొనండి.
1. ఇది జీవుల యొక్క సరళ ప్రముల.
2. ఇది బహుళ ఆహార గొలుసుల సముదాయం
3. ఆహార గొలుసు బహుళమార్గాన్ని అనుసరిస్తుంది.
4. ఆహార జాలకం ఒకే మార్గాన్ని అనుసరిస్తుంది.
జవాబు:
4 – ఆహార జాలకం ఒకే మార్గాన్ని అనుసరిస్తుంది.

జతపరచుట

18. సరిగ్గా సరిపోలిన దాన్ని గుర్తించండి.
సంఖ్యా పిరమిడ్ – జీవి యొక్క బరువు
జీవ ద్రవ్యరాశి పిరమిడ్- జీవుల సంఖ్య
శక్తి పిరమిడ్ – శక్తి ప్రవాహం
జవాబు:
శక్తి పిరమిడ్ – శక్తి ప్రవాహం

19. సరిగ్గా సరిపోలినదాన్ని గుర్తించండి.
ఉత్పత్తిదారి – ఎలుక
ప్రాథమిక వినియోగదారుడు – మొక్క
ద్వితీయ వినియోగదారుడు – పిల్లి
జవాబు:
ద్వితీయ వినియోగదారుడు – పిల్లి

20. సరిగ్గా సరిపోలినదాన్ని గుర్తించండి.
శిలీంధ్రాలు – విచ్ఛిన్నకారులు
పులి – ప్రాథమిక వినియోగదారులు
జింక – అగ్ర మాంసాహారి
జవాబు:
శిలీంధ్రాలు – విచ్ఛిన్నకారులు

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత

21. సరిగ్గా సరిపోలినదాన్ని గుర్తించండి.
జైవిక వృద్ధీకరణ – ఆహార గొలుసులోకి కాలుష్య కారకాల ప్రవేశం
జైవీకరణ – కాలుష్య కారకాల సాంద్రత
పోషకస్థాయి – ఆహార గొలుసులో శక్తి స్థాయి
జవాబు:
పోషక స్థాయి – ఆహార గొలుసులో శక్తి స్థాయి

ఉదాహరణ ఇవ్వండి

22. జంతువులు జీర్ణించుకోని మొక్కల పదార్థాలకు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
సెల్యులోజ్, లిగ్నిన్

23. కీటకాల బాహ్య అస్థిపంజరం, మరియు ఈకలు జీర్ణం కాని జంతువుల భాగాలు. వీటికి మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
రోమాలు

24. మెర్క్యురీ మరియు ఆర్సెనిక్ నీటిలో ఉంటే లోహపు వ్యరాలుగా ఉంటాయి. మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
లెడ్

25. ఎదులాబాద్లో నీటి కాలుష్యం యొక్క జీవ సూచికగా పనిచేసే చేపలు ఏమిటి?
జవాబు:
సైప్రినస్ కార్పియో

26. EBWR లో లోహపు నిష్పత్తి యొక్క సరైన క్రమాన్ని వ్రాయండి.
Fe > Pb > Cr > Ni > Cd
జవాబు:
Fe< Pb< Cr < Ni < Cd

27. EBWR లో చేపలలో లోహాలు చేరడం లేదు. తన క్రమాన్ని వ్రాయండి.
జవాబు:
Cd < Cr < Fe< Ni « Pb

28. పిచ్చుక ప్రచారం తరువాత పంట దిగుబడి చైనాలో గణనీయంగా తగ్గింది. ఈ గొప్ప చైనీస్ కరవుకు గల కారణం ఏమిటి?
జవాబు:
మిడుత జనాభా

29.
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 11
ఈ చిత్రం ఏ రకమైన తెగులు నియంత్రణ పద్ధతిని సూచిస్తుంది?
జవాబు:
జీవ నియంత్రణ పద్ధతి

30. భూ సంబంధ పర్యావరణ వ్యవస్థలో నేల మరియు నేల రకాలు జీవేతర కారకాలు. మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ఉష్ణోగ్రత / నీరు

31. జల పర్యావరణ వ్యవస్థలో విచ్ఛిన్న కారకాలకు లో ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
శిలీంధ్రాలు / బాక్టీరియా

ఫ్లో చార్టులు

32.
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 12
జవాబు:
ఉష్ణోగ్రత

33. ఆహార గొలుసును పూరించండి.
ఉత్పత్తిదారులు → ప్రాథమిక వినియోగదారి → ద్వితీయ వినియోగదారి → అగ్రశ్రేణి వినియోగదారి
జవాబు:
ద్వితీయ వినియోగదారి

34.
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 13
జవాబు:
సముద్ర ఆవరణ వ్యవస్థ

35. గడ్డి → కుందేలు → నక్క → సింహం
పై ఆహార గొలుసులో ద్వితీయ వినియోగదారి ఏది?
జవాబు:
నక్క

36. గడ్డి → కీటకం → కప్ప → పాము → గ్రద్ద
పై ఆహార గొలుసులో అగ్ర వినియోగదారి ఏది?
జవాబు:
గ్రద్ద

37.
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 14
జవాబు:
రసాయనిక

37.
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 15
జవాబు:
సంఖ్యా పిరమిడ్

38. నీటి మొక్క → కీటకాలు → [ ] → కొంగ
జవాబు:
చేప

39. క్రింది వానిలో ఏది జలావరణ వ్యవస్థలో జీవ ద్రవ్యరాశి పిరమిడను సూచిస్తుంది?
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 16
జవాబు:
B

40. జీవ ద్రవ్యరాశి పిరమిడను పూరించండి.
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 17
జవాబు:
50 kgs

41. క్రింది వానిలో ఏది పరాన్నజీవుల సంఖ్యా పిరమిడ్ ను సూచిస్తుంది?
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 16
జవాబు:
B

10th Class Biology 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 1 Mark Bits Questions and Answers

1. ఈ క్రింది ఆహారపు గొలుసులలో సరైన క్రమము
A) గద్ద → ఎలుక → పాము → ధాన్యం
B) ధాన్యం → ఎలుక → పాము → గద్ద
C) పాము → గద్ద → ఎలుక → ధాన్యం
D) ఎలుక → పాము → ధాన్యం → గద్ద
జవాబు:
B) ధాన్యం → ఎలుక → పాము → గద్ద

2. చార్లెస్ ఎల్టన్ ప్రకారం క్రింది వానిలో సరైన వాక్యం ………….
A) మాంసాహారులు పిరమిడ్ శిఖర భాగంలో ఉంటాయి
B) పిరమిడ్ శిఖర భాగంలో ఎక్కువ శక్తి గ్రహించబడును
C) పిరమిడ్ శిఖర భాగంలో ఉత్పత్తిదారులు ఉండవు
D) A మరియు C
జవాబు:
D) A మరియు C

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత

3. ఆహారపు గొలుసు దేనితో మొదలౌతుంది?
A) మాంసాహారి
B) ఉత్పత్తిదారు
C) శాకాహారి
D) ఏదీకాదు
జవాబు:
B) ఉత్పత్తిదారు

4. మొక్క → కీటకము – కప్ప → [ ]
A) పాము
B) గుడ్డు
C) పుష్పం
D) ఏదీకాదు
జవాబు:
A) పాము

5. క్రిందివానిలో ప్రాథమిక వినియోగదారులు
A) కుందేలు
B) పులి
C) కప్ప
D) పాము
జవాబు:
A) కుందేలు

6. ఉత్పత్తిదారులు → ప్రాథమిక వినియోగదారులు → ద్వితీయ వినియోగదారులు → తృతీయ వినియోగదారులు
ఈ ఆహారపు గొలుసులో 2లో ఈ జీవి ఉంటుంది.
A) పాము
B) మొక్క
C) మిడుత
D) కప్ప
జవాబు:
C) మిడుత

7. క్రిమిసంహారకాల వాడకాన్ని పూర్తిగా ఆపివేయడం అంటే …………..
A) పురుగుమందుల వాడకంపై పూర్తి నియంత్రణ
B) పురుగుమందుల నిషేధం
C) పర్యావరణ స్నేహపూర్వక వ్యవసాయ పద్ధతులు ప్రోత్సహించడం
D) జీవ రసాయన పరిశ్రమలు మూసివేయడం
జవాబు:
C) పర్యావరణ స్నేహపూర్వక వ్యవసాయ పద్ధతులు ప్రోత్సహించడం

8.
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 19
ఖాళీని పూరించడానికి సరియైన దానిని ఎన్నుకోండి.
A)మిడత
B) పాము
C)కప్ప
D) గద్ద
జవాబు:
B) పాము

9. క్రింది పట్టికలో (?) స్థానంలో వుండవలసినది

పిరమిడ్ రకం ఆధారం
సంఖ్యా పిరమిడ్ జీవుల సంఖ్య
? శక్తి పరిమాణం

A) భౌగోళిక పిరమిడ్
B) శక్తి పిరమిడ్
C) జీవ ద్రవ్యరాశి పిరమిడ్
D) గిజా పిరమిడ్
జవాబు:
B) శక్తి పిరమిడ్

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత

10. క్రింది పట్టికను పూరింపుము.

పిరమిడ్ రకం ఆధారం
సంఖ్యా పిరమిడ్ జీవుల సంఖ్య
……… ? ……. శక్తి ప్రవాహం

A) ఆవరణ పిరమిడ్
B) శక్తి పిరమిడ్
C) జీవ ద్రవ్యరాశి పిరమిడ్
D) గిజా పిరమిడ్
జవాబు:
B) శక్తి పిరమిడ్

11. 1958లో చైనా ఏ పక్షులపై దండయాత్ర ప్రకటించింది?
A) చిలుకలు
B) పిచ్చుకలు
C) కాకులు
D) రాబందులు
జవాబు:
B) పిచ్చుకలు

12. నేలలో నత్రజనిని వృద్ధి చేసే మొక్క ఏది?
A) బంతి
B) తుమ్మ
C) గైరిసిడియా
D) కాక్టస్
జవాబు:
C) గైరిసిడియా

13. కింది వానిలో జలావరణ వ్యవస్థ నందు నిటారుగా ఉండని పిరమిడ్
A) సంఖ్యా పిరమిడ్
B) జీవ ద్రవ్యరాశి పిరమిడ్
C) శక్తి పిరమిడ్
D) ఉష్ణ, పిరమిడ్
జవాబు:
B) జీవ ద్రవ్యరాశి పిరమిడ్

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత

14. కింది వానిలో గ్రీన్‌హౌస్ వాయువు కానిది ………
A) కార్బన్ డయాక్సెడ్
B) మీథేన్
C) ఓజోన్
D) క్లోరోఫ్లోరో కార్బన్స్
జవాబు:
C) ఓజోన్

15. గీత ఎల్లప్పుడూ మన్నిక గల వస్తువులనే వాడుతుంది, ఎందుకంటే …….
A) వ్యర్థాలను తగ్గించటానికి
B) పునః వినియోగం తగ్గించటానికి
C) పునః చక్రీయం తగ్గించటానికి
D) పునః స్థాపన పెంచటానికి
జవాబు:
A) వ్యర్థాలను తగ్గించటానికి

16. రేణురూప పదార్థాలు గాలిలో చేరుట వల్ల
A) మూత్రపిండాల వ్యాధులు కల్గుతాయి
B) ఆర్గెటీస్ కలుగుతుంది
C) కీళ్ళనొప్పులు కలుగుతాయి.
D) శ్వాసకోశ వ్యాధులు కల్గుతాయి.
జవాబు:
D) శ్వాసకోశ వ్యాధులు కల్గుతాయి.

17. భౌగోళిక వెచ్చదనంను తగ్గించుటకు నీవు పాటించే పద్ధతి
A) ప్లాస్టిక్ ను కాల్చివేయడం
B) విస్తారంగా పశువులు మేపడం
C) శిలాజ ఇంధనాల వాడకం తగ్గించుట
D) ఎ.సి. ల వాడకాన్ని పెంచడం
జవాబు:
C) శిలాజ ఇంధనాల వాడకం తగ్గించుట

18. కింది వాక్యాలలో సరియైనది.
i) పిరమిడ్ ఆధార భాగంలో ఎల్లప్పుడు ఉత్పత్తిదారులే ఉంటారు.
ii) జీవ ద్రవ్యరాశి పిరమిడ్ ఎల్లప్పుడు నిటారుగా ఉంటుంది.
A) (i), (ii) సరియైనవి.
B) (i) మాత్రమే సరియైనది.
C) (ii) మాత్రమే సరియైనది.
D) (i), (ii) లు సరియైనవి కావు.
జవాబు:
B) (i) మాత్రమే సరియైనది.

19. దేనికోసం మొక్కలు పోటీ పడతాయి?
(i) నీరు (ii) ఆహారం (iii) స్థలం
A) (i) మరియు (ii)
B) (ii) మరియు (iii)
C) (i) మరియు (iii)
D) (i), (ii) మరియు (iii)
జవాబు:
C) (i) మరియు (iii)

20. పంటలు పండించడానికి సరియైన పద్దతి కానిది
A) పంట మార్పిడి
B) జైవిక నియంత్రణ
C) మిశ్రమ పంటలు పండించడం
D) రసాయన ఎరువులు, పురుగు మందులు ఉపయోగించడం
జవాబు:
D) రసాయన ఎరువులు, పురుగు మందులు ఉపయోగించడం

21. ఎల్లప్పుడు ఆహారపు గొలుసు దేనితో మొదలవుతుంది?
A) శాకాహారులు
B) మాంసాహారులు
C) ఉత్పత్తిదారులు
D) ఏదీకాదు
జవాబు:
C) ఉత్పత్తిదారులు

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత

22. జీవావరణ పిరమిడ్లకు సంబంధించి సరయిన వాక్యం
A) సంఖ్యా పిరమిడ్ నిర్మాణం ఏ విధంగా ఉన్నా ఉత్పత్తి దారులు పై భాగంలో ఉంటాయి.
B) చార్లెస్ ఎల్టన్ జీవావరణ పిరమిడ్ల రేఖాచిత్రాలను మొదటగా ప్రవేశపెట్టాడు.
C) సాధారణంగా సంఖ్యా పిరమిడ్ లాగే జీవ ద్రవ్యరాశి పిరమిడ్ ఉంటుంది.
D)ఒక పోషకస్థాయి నుండి మరొక పోషకస్థాయి జీవులకు శక్తి పూర్తిగా చేరుతుంది.
జవాబు:
B) చార్లెస్ ఎల్టన్ జీవావరణ పిరమిడ్ల రేఖాచిత్రాలను మొదటగా ప్రవేశపెట్టాడు.

మీకు తెలుసా?

• పిరమిడ్ నిర్మాణం జ్యామితీయ ఆకృతిలో ఉంటుంది. బయటి ఉపరితలాలు త్రిభుజాకారంలో ఉండి వాటి చివరలు పై కొనలో కలుస్తాయి. పిరమిడ్ అడుగుభాగం త్రిముఖీయంగా లేదా చతుర్ముఖీయంగా లేదా బహుముఖీయ ఆకారంలో ఉంటుంది. చతురస్రాకార పిరమిడ్ల చతురస్రాకారంగా ఉండి బయటి ఉపరితలాలు మాత్రం త్రిభుజాకారంలో ఉంటాయి. సాధారణంగా పిరమిడ్ లో ఈ ఆకృతిలోనే ఉంటాయి.

• శిలాజ ఇంధనాలపై (భూమిలో మృత కళేబరాల అవాయు విచ్ఛిన్న క్రియ ద్వారా ఏర్పడిన పెట్రోలియం, బొగ్గు మొదలైన ఇంధనాలు) మనం ఆధారపడటాన్ని తగ్గించడానికి, గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి, జీవ ద్రవ్యరాశిని కూడా ఒక ఇంధన వనరుగా వినియోగించవచ్చును. జీవ ద్రవ్యరాశిని ఇంధనంగా వాడినపుడు కూడా కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతుంది. కానీ, అది జీవ ద్రవ్యరాశి ఏర్పడటానికి, తిరిగి గాలి నుండి గ్రహించబడుతుంది.

• మినిమేటా వ్యాధిని మొదట 1956వ సంవత్సరంలో జపాన్‌లోని కుమమోటో ఎఫెక్చర్ లో గల మిమిమేటా నగరంలో కనుగొన్నారు. 1932 నుండి 1968 వరకు చిస్సో కార్పొరేషన్ వారి రసాయన పరిశ్రమ నుండి విడుదలైన మిథైల్ మెర్క్యురీతో కూడిన వ్యర్థజలాలే, మినిమేటా వ్యాధికి కారణం. షిరని సముద్రం (Shiranui sea) మినిమేటా అఖాతంలో ఉండే చేపల ద్వారా వీటిని తినే స్థానిక మనుషుల్లోకి మిథైల్ మెర్క్యురీ చేరి అనారోగ్యాలకు దారితీసింది. ఫలితంగా పిల్లులు, కుక్కలు, పందులు, మనుషుల మరణాలు 36 ఏళ్ళుగా కొనసాగాయి.

పునశ్చరణ

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 18

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

These AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు will help students prepare well for the exams.

AP Board 10th Class Biology 8th lesson Important Questions and Answers అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

10th Class Biology 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
ఫ్లోచార్టును పరిశీలించి, క్రింది ప్రశ్నకు సమాధానము ఇవ్వండి. శిశువు యొక్క లింగ నిర్ధారణ చేసేది తల్లా? తండ్రా? ఏ విధంగానో వివరించండి.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 1
జవాబు:

  1. శిశువు యొక్క లింగ నిర్ధారణ చేసే తండ్రి.
  2. తల్లిలో XX క్రోమోజోములు ఉంటాయి.
  3. తండ్రిలో XY క్రోమోజోములు ఉంటాయి
  4. Y క్రోమోజోమ్ లింగ నిర్ధారణ చేస్తుంది. కాబట్టి తండ్రి లింగ నిర్ధారణ కారణం.

ప్రశ్న 2.
ఈ క్రింది పట్టికను పరిశీలించి, దృశ్యరూప, జన్యురూప నిష్పత్తిని వ్రాయండి.
(లేదా)
మెండల్ తన సంకరణ ప్రయోగాలలో విషమయుగ్మజ పసుపురంగు (YY) విత్తనాలు గల బఠాణీ మొక్కను, అదే రకపు మొక్కతో సంకరణం జరిపినపుడు వచ్చిన ఫలితాలను దృశ్యరూప మరియు జన్యురూప నిష్పత్తులలో తెలపండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 2
దృశ్యరూపం – 3 : 1; జన్యురూపం – 1 : 2 : 1

ప్రశ్న 3.
దృశ్యరూపం, జన్యురూపంలను నిర్వచించండి. .
జవాబు:
దృశ్యరూపం :
కంటికి కనిపించే జీవుల యొక్క బాహ్య లక్షణాలను దృశ్యరూపం అంటారు. ఉదా : పొడవు, పొట్టి

జన్యురూపం :
దృశ్యరూపాన్ని నిర్ణయించే జన్యుస్థితిని జన్యురూపం అంటారు.
ఉదా : TT, tt

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

ప్రశ్న 4.
నీవు సేకరించిన సమాచారం ఆధారంగా కార్బన్ డేటింగ్ పద్దతి గురించి వివరింపుము.
జవాబు:

  1. శిలాజాలు, ఖనిజ లవణాలు మరియు రాళ్ళ యొక్క వయస్సును నిర్ణయించుటకు కార్బన్ డేటింగ్ పద్ధతిని ఉపయోగిస్తారు.
  2. ఇందుకు రేడియో ధార్మిక పదార్థాలైన కార్బన్, యురేనియం, పొటాషియం యొక్క ఐసోటోపులను ఉపయోగిస్తారు.
  3. పురాజీవ శాస్త్రవేత్తలు C14 విచ్చిన్నాన్ని ఉపయోగించి శిలాజాల మరియు శిలల వయస్సును నిర్ధారిస్తారు.
  4. భూ వాతావరణంలో C12 మరియు C14 ఐసోటోపులు ఉంటాయి.
  5. ఒక జీవి జీవించి ఉన్నప్పుడు దానిలో C14 మరియు C12 లు స్థిర నిష్పత్తిలో ఉంటాయి.
  6. కాని, జీవి మరణించినప్పుడు దానిలో గల C14 విచ్చిన్నం చెందడం ప్రారంభమై దాని పరిమాణం ఒక స్థిరరేటుతో తగ్గుతుంది.
  7. C14 సగభాగం విచ్చిన్నమవటానికి పట్టే కాలాన్ని అర్థ జీవిత కాలం అంటారు. ఇది 5730 సంవత్సరాలు.
  8. C14 డేటింగ్ ద్వారా ఒక నమూనా శిలాజిం లేదా రాయి వయస్సు కనుగొనుటకు ఈ క్రింది సూత్రమును ఉపయోగిస్తారు.

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 3

ప్రశ్న 5.
మీ అమ్మమ్మ తాతయ్యల నుండి, మీ అమ్మా నాన్నల నుండి లక్షణాలు నీకు ఎలా సంక్రమించాయి?
జవాబు:
జన్యువుల ద్వారా

ప్రశ్న 6.
లామార్క్ వాదం తప్పు అని నిరూపించుటకు అవసరమైన ఉదాహరణలు వ్రాయండి.
జవాబు:

  1. ఆగస్టస్ వీస్మాన్ లామార్క్ “ఆర్జిత గుణాల అనువంశికత” సిద్ధాంతాన్ని ఎలుకలపై ప్రయోగించాడు.
  2. అతడు 22 తరాల వరకు ఎలుకల తోకలను తొలగించుకుంటూ ప్రయోగాలు చేశాడు. అయితే ప్రతిసారి ఎలుకలు తోకలతోనే పుట్టాయి.
  3. శారీరకమైన మార్పులు పరిసరాల కారణంగా ఏర్పడినా సరే అది తమ సంతతికి అందించబడవని లామార్క్ వాదం తప్పు అని నిర్ధారించాడు.

ప్రశ్న 7.
మానవులలో లింగ నిర్ధారణ చేసే క్రోమోసోములేవి?
జవాబు:
అల్లోజోములు (లేదా) లైంగిక క్రోమోజోములు. అవి XX (బాలికలు), Xy (బాలురు).

ప్రశ్న 8.
మానవుడిని నడిచే అవశేషావయవాల మ్యూజియం అంటారు. ఎందుకు ?
జవాబు:
మానవునిలో దాదాపు 180 వరకు అవశేషావయవాలు ఉన్నాయి. కావున మానవుడిని నడిచే అవశేషావయవాల మ్యూజియం అంటారు.

ప్రశ్న 9.
ఉండుకమును అవశేషావయవం అని ఎందుకు అంటారు?
జవాబు:

  1. మానవ జీర్ణవ్యవస్థలో ఉండే ఉండుకము జీర్ణక్రియలో ఏవిధంగానూ తోడ్పడదు.
  2. పరిణామ క్రమంలో భాగంగా అవసరం లేని అవయవాలు క్షీణించి పోకుండా నిరుపయోగంగా మిగిలిపోతాయి.

ప్రశ్న 10.
ఏ ప్రత్యుత్పత్తి విధానంలో వైవిధ్యాలకు అధిక అవకాశం ఉంటుంది? ఎందుకు?
జవాబు:
లైంగిక ప్రత్యుత్పత్తి విధానంలో వైవిధ్యాలకు అవకాశం అధికం. ఈ ప్రక్రియలో స్త్రీ, పురుష సంయోగ బీజాలు కలిసిపోతాయి వాటిలోని జన్యుపదార్థం మధ్య వినిమయం జరగటం వలన సంతతిలో కొత్త లక్షణాలు (వైవిధ్యాలు) ఏర్పడతాలు.

ప్రశ్న 11.
వైవిధ్యాల ప్రాముఖ్యత ఏమిటి? జీవులకు వైవిధ్యాలు ఏ విధంగా ఉపయోగపడతాయి?
జవాబు:
జీవుల మధ్యగల భేదాలను వైవిధ్యాలు అంటారు. ఇవి జీవులను గుర్తించటానికి, మనుగడకు, ప్రకృతి వరణానికి తోడ్పడతాయి.

ప్రశ్న 12.
జనక మొక్కలు తమ లక్షణాంశాలను విత్తనాలకు ఏ విధంగా పంపిస్తాయి?
జవాబు:
జనక మొక్కలలోని లక్షణాంశాలు కణ విభజన వలన సంయోగబీజాలలో చేరతాయి. సంయోగబీజాలు కలిసి విత్తనాలు ఏర్పడతాయి. కావున జనక మొక్కల లక్షణాంశాలు సంయోగబీజాల ద్వారా విత్తనాలలోనికి చేరతాయి.

ప్రశ్న 13.
పొడవైన మొక్కలు ఎల్లప్పుడు పొడవు మొక్కలనే ఉత్పత్తి చేస్తాయా?
జవాబు:
సాధారణంగా పొడవు మొక్కల నుండి పొడవు మొక్కలే ఏర్పడతాయి. కానీ పొట్టి మొక్కతో పరపరాగ సంపర్కం వలన పొట్టి మొక్కలు ఏర్పడే అవకాశం ఉంది.

ప్రశ్న 14.
అనువంశికత అనగానేమి?
జవాబు:
అనువంశికత :
జనకుల లక్షణాలు తరువాత తరానికి అందించే ప్రక్రియను “అనువంశికత” అంటారు.

ప్రశ్న 15.
వైవిధ్యాలు అనగానేమి?
జవాబు:
వైవిధ్యాలు :
జీవుల మధ్య ఉండే భేదాలను “వైవిధ్యాలు” అంటారు.

ప్రశ్న 16.
పరిణామం అనగానేమి?
జవాబు:
పరిణామం : మార్పుచెందే ప్రక్రియను “పరిణామం” అంటారు.

ప్రశ్న 17.
అనుకూలనాలు అనగానేమి?
జవాబు:
అనుకూలనాలు:
జీవి మనుగడ సాగించటానికి ఉపయోగపడే లక్షణాలను “అనుకూలనాలు” అంటారు.

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

ప్రశ్న 18.
మెండల్ తన ప్రయోగానికి ఎన్నుకున్న మొక్క ఏమిటీ?
జవాబు:
మెండల్ తన ప్రయోగానికి బరానీ మొక్క (ఫైసమ్ సటైవమ్) ను ఎన్నుకున్నాడు.

ప్రశ్న 19.
మెండల్ బఠానీ మొక్కలో ఎన్నుకున్న వ్యతిరేక లక్షణాల సంఖ్య ఎంత?
జవాబు:
మెండల్ బఠానీ మొక్కలో 7 జతల వ్యతిరేక లక్షణాలను ఎన్నుకున్నాడు.

ప్రశ్న 20.
లక్షణాంశాలు అనగానేమి?
జవాబు:
లక్షణాంశాలు :
జీవి లక్షణాలను నిర్ణయించే కారకాలను లక్షణాంశాలు (Traits) అంటారు . వీటినే నేడు జన్యువులు (Genes) అని అంటాం.

ప్రశ్న 21.
ప్రతి లక్షణానికి ఎన్ని లక్షణాంశాలు ఉంటాయి?
జవాబు:
ప్రతి లక్షణానికి ఒక జత లక్షణాంశాలు ఉంటాయి.

ప్రశ్న 22.
జన్యువు అనగానేమి?
జవాబు:
జన్యువు :
ప్రతి లక్షణానికి కారణమైన లేదా నియంత్రించే ఒక జత కారకాలుంటాయని మెండల్ భావించాడు. ప్రస్తుతం ఆ కారకాలనే మనం జన్యువులు (Genes) అంటాం.

ప్రశ్న 23.
యుగ్మ వికల్పకాలు అనగానేమి?
జవాబు:
ముగ్మవికల్పకాలు :
ప్రతి లక్షణానికి కారణమైన ఒక జత జన్యువులను “యుగ్మవికల్పకాలు” (Allele) అంటారు.

ప్రశ్న 24.
సమయుగ్మజం అనగానేమి?
జవాబు:
సమయుగ్మజం :
ఒక లక్షణానికి రెండూ ఒకేరకమైన కారకాలుంటే దానిని “సమయుగ్మజం” (Homozygous) అంటారు.

ప్రశ్న 25.
విషమయుగ్మజం అనగానేమి?
జవాబు:
విషమయుగ్మజం :
ఒక లక్షణానికి వ్యతిరేక లక్షణాలున్న జన్యువులు జతగా ఉంటే దానిని “విషమయుగ్మజం” (Heterozygous) అని అంటారు.

ప్రశ్న 26.
మెండల్ ప్రయోగాలలో జనకతరం యొక్క స్థితి ఏమిటీ?
జవాబు:
మెండల్ (శుద్ధ జాతులను) సమయుగ్మజ స్థితిలో ఉన్న మొక్కలను ప్రయోగానికి ఎన్నుకున్నాడు.

ప్రశ్న 27.
జనకతరం మొక్కల సంకరణం వలన ఏర్పడిన సంతతిని ఏమంటారు?
జవాబు:
జనకతరం మొక్కల సంకరణం వలన ఏర్పడిన సంతతిని F1 తరం అంటారు.

ప్రశ్న 28.
F1 తరపు మొక్కల జన్యుస్థితి ఏమిటి?
జవాబు:
F1 తరపు మొక్కలు విషమయుగ్మజ స్థితిలో ఉంటాయి.

ప్రశ్న 29.
F1 తరపు మొక్కల సామాన్య లక్షణం ఏమిటి?
జవాబు:
F1 తరపు మొక్కలన్నీ ఒకే దృశ్యరూపం మరియు జన్యురూపం కలిగి ఉంటాయి. ఇవి విషమయుగ్మజ స్థితిలో ఉండి, బహిర్గత లక్షణాలను ప్రదర్శిస్తాయి.

ప్రశ్న 30.
F2 తరం ఎలా ఏర్పడుతుంది?
జవాబు:
F2 తరం మొక్కలలో ఆత్మపరాగసంపర్కం జరపగా F2 తరం ఏర్పడుతుంది.

ప్రశ్న 31.
ఏక సంకరణ ప్రయోగంలో F1 తరం యొక్క దృశ్య, జన్యురూప నిష్పత్తులు ఏమిటి?
జవాబు:
F2 తరం యొక్క దృశ్యరూప నిష్పత్తి : 3 : 1
F2 తరం యొక్క జన్యురూప నిష్పత్తి : 1 : 2 : 1

ప్రశ్న 32.
బహిర్గత సూత్రంను తెలపండి.
జవాబు:
బహిర్గత సూత్రం :
విషమయుగ్మజ స్థితిలో ఏదో ఒక లక్షణం మాత్రమే బహిర్గతమౌవుతుంది. దీనినే “బహిర్గత సూత్రం” అంటారు.

ప్రశ్న 33.
పృథక్కరణ సూత్రం తెలపండి.
జవాబు:
పృథక్కరణ సూత్రం :
జనకుల యుగ్మవికల్పకాలలో ఏదో ఒక కారకం యథేచ్చగా సంతతికి అందించబడుతుంది. దీనినే ‘పృథక్కరణ’ లేదా ‘అలీనత సూత్రం’ అంటారు.

ప్రశ్న 34.
అనువంశిక లక్షణాలు అనగానేమి?
జవాబు:
అనువంశిక లక్షణాలు :
తల్లిదండ్రుల నుండి పిల్లలకు సంక్రమించే లక్షణాలను “అనువంశిక లక్షణాలు” అంటారు.

ప్రశ్న 35.
‘వంశపారంపర్యం’ అనగానేమి?
జవాబు:
వంశపారంపర్యం:
అనువంశికత వలన ఒక తరం నుండి మరొక తరానికి లక్షణాలు అందించడాన్ని “వంశపారంపర్యం” అంటారు.

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

ప్రశ్న 36.
జన్యువు అనగానేమి?
జవాబు:
జన్యువు :
లక్షణాలు నిర్ణయించే కారకాలను జన్యువులు అంటారు. జన్యువు అనేది న్యూక్లియిక్ ఆమ్లం. అంటే DNA యొక్క కొంత భాగం.

ప్రశ్న 37.
DNA అనగా నేమి? దాని ఆకారం ఏమిటి?
జవాబు:
డీ ఆక్సీరిబో న్యూక్లిక్ ఆమ్లాన్ని సంక్షిప్తంగా DNA అంటారు. ఇది సర్పిలాకారంగా ఉండే మెట్ల మాదిరిగా (మెలితిరిగిన నిచ్చెన) ఉంటుంది. ఈ ఆకారాన్నే ద్వంద్వకుండలి (Double helix) అని కూడా అంటారు.

ప్రశ్న 38.
‘న్యూక్లియోటైడ్’ అనగానేమి?
జవాబు:
న్యూక్లియోటైడ్
DNA అణువులోని ఒక పోచను న్యూక్లియోటైడ్ అంటారు. రెండు న్యూక్లియోటైడ్స్ కలయిక వలన DNA ఏర్పడుతుంది.

ప్రశ్న 39.
న్యూక్లియోటైడ్ లోని అణువులు ఏమిటి?
జవాబు:
న్యూక్లియోటైడ్ లో చక్కెర అణువు, ఫాస్ఫేట్ అణువు మరియు నత్రజని క్షారము ఉంటాయి.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 4

ప్రశ్న 40.
DNA లోని నత్రజని క్షారాలు ఏమిటి?
జవాబు:
DNA లో నాలుగు రకాల నత్రజని క్షారాలు ఉంటాయి. అవి:
1. అడినిన్ – (A) 2. గ్వా నిన్ – (G) – 3. థైమిన్ – (T) 4. సైటోసిన్ – (C).

ప్రశ్న 41.
ఆటోసోమ్స్ అనగానేమి?
జవాబు:
ఆటోసోమ్స్ :
శారీరక లక్షణాలను నిర్ణయించే క్రోమోజోమ్స్ ను ‘శారీరక క్రోమోజోమ్స్’ లేదా ‘ఆటోసోమ్స్’ అంటారు. మానవునిలో వీటి సంఖ్య 22 జతలు.

ప్రశ్న 42.
ఎల్లోసోమ్స్ అనగానేమి?
జవాబు:
ఎల్లోసోమ్స్ :
లైంగికతను నిర్ణయించే క్రోమోజోమ్ లను ‘లైంగిక క్రోమోజోమ్ లు లేదా ఎల్లోసోమ్స్’ అంటారు. మానవునిలో వీటి సంఖ్య ఒక జత.

ప్రశ్న 43.
ప్రకృతి వరణం అనగా నేమి?
జవాబు:
ప్రకృతి వరణం :
అనుకూలతలు కలిగిన జీవులు మాత్రమే ప్రకృతిలో జీవించగలిగి తదుపరి తరాన్ని ఉత్పత్తి చేస్తాయి. మిగిలిన జీవులు నశిస్తాయి. ప్రకృతి చేసే ఈ ఎంపికను “ప్రకృతి వరణం” అంటారు.

ప్రశ్న 44.
జన్యువిస్థాపనం (Genetic drift) అనగానేమి?
జవాబు:
జన్యువిస్థాపనం :
జనాభాలో ఆకస్మికంగా లేదా హఠాత్తుగా సంభవించే సంఘటనల వలన జన్యువుల పౌనఃపున్యంలో మార్పులు వస్తాయి. దీనినే “జన్యువిస్థాపనం” అంటారు.

ప్రశ్న 45.
ఆర్జిత గుణాలు అనగానేమి?
జవాబు:
ఆర్జిత గుణాలు :
జీవి తన మనుగడ కోసం, అవసరం కొద్దీ అభివృద్ధి చేసుకున్న లక్షణాలను “ఆర్జిత గుణాలు” అంటారు.

ప్రశ్న 46.
ఆర్జిత గుణాల అనువంశికత అనగానేమి?
జవాబు:
ఆర్జిత గుణాల అనువంశికత :
లామార్క్ అభిప్రాయం ప్రకారం- ఆర్జించిన గుణాలు తమ సంతతికి అందించబడుతూ ఉంటాయి. దీనినే ‘ఆర్జిత గుణాల అనువంశికత’ అంటారు.
ఉదా : జిరాఫీ మెడ.

ప్రశ్న 47.
సూక్ష్మ పరిణామం అనగానేమి?
జవాబు:
సూక్ష్మపరిణామం : జాతిలోని చిన్న చిన్న మార్పులను “సూక్ష్మపరిణామం” అంటారు.

ప్రశ్న 48.
స్థూలపరిణామం అనగానేమి?
జవాబు:
స్థూలపరిణామం :
కొత్త జాతులు ఏర్పడే ప్రక్రియను జాతుల ఉత్పత్తి లేదా “స్థూలపరిణామం” అంటారు.

ప్రశ్న 49.
సమజాత అవయవాలు అనగానేమి?
జవాబు:
సమజాత అవయవాలు:
ఒకే నిర్మాణం కలిగి విభిన్న జీవులలో వేరు వేరు పనులను నిర్వహించే అవయవాలను “సమజాత అవయవాలు” అంటారు.
ఉదా : తిమింగలం చెయ్యి, గబ్బిలం చెయ్యి.

ప్రశ్న 50.
సమానమైన అవయవాలు అనగానేమి?
జవాబు:
సమానమైన అవయవాలు :
విభిన్న నిర్మాణం కలిగిన, వేరు వేరు జీవులలో ఒకే పనిని నిర్వహించే అవయవాలను సమానమైన అవయవాలు అంటారు.
ఉదా : పక్షి రెక్క, గబ్బిలం రెక్క ఎగరటానికి తోడ్పడతాయి.

ప్రశ్న 51.
పిండాభివృద్ధిశాస్త్రం అనగానేమి?
జవాబు:
పిండాభివృద్ధిశాస్త్రం :
ఒక జీవి అండం మొదలుకొని, సంపూర్తిగా ఎదగడం వరకు గల వివిధ అభివృద్ధి దశలను గురించి అధ్యయనం చేయడాన్ని “పిండాభివృద్ధిశాస్త్రం” అంటారు.

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

ప్రశ్న 52.
శిలాజాలు అనగానేమి?
జవాబు:
శిలాజాలు :
ప్రాచీన జీవ యుగాల్లో నివసించిన జీవుల ఉనికిని తెలియజేసే నిర్జీవ పదార్థాలను “శిలాజాలు” అంటారు.

ప్రశ్న 53.
శిలాజాల వయస్సును ఎలా నిర్ణయిస్తారు?
జవాబు:
కార్బన్ డేటింగ్ పద్ధతి ఆధారంగా శిలాజాల వయస్సును నిర్ణయిస్తారు.

ప్రశ్న 54.
అవశేష అవయవాలు అనగానేమి?
జవాబు:
అవశేష అవయవాలు :
పరిణామ క్రమంలో భాగంగా అవసరంలేని అవయవాలు క్రమంగా క్షీణించిపోతాయి. కానీ అలా క్షీణించిపోకుండా నిరుపయోగంగా మిగిలిపోయిన అవయవాలనే “అవశేషావయవాలు” (Vestigial organs) అంటారు.

ప్రశ్న 55.
జన్యుశాస్త్ర పిత అని ఎవరిని పిలుస్తారు?
జవాబు:
“గ్రెగర్ జోహాన్ మెండల్” ను జన్యుశాస్త్ర పిత అంటారు.

ప్రశ్న 56.
లింగ సహలగ్నత పైన పరిశోధన చేసినవారు ఎవరు?
జవాబు:
వాల్టర్ స్టటన్, థామస్ హంట్ మోర్గాలు లింగ సహలగ్నతపై పరిశోధన చేశారు.

ప్రశ్న 57.
వాల్టర్, మోర్గాన్లు ఏ జీవిపై ప్రయోగాలు చేశారు?
జవాబు:
వాల్టర్, మోర్గాన్లు చిన్న పండ్ల ఈగ ( సోఫిలా మెలనోగాసర్) పై పరిశోధనలు చేశారు.

ప్రశ్న 58.
లామార్కిజాన్ని ఖండించిన శాస్త్రవేత్త ఎవరు?
జవాబు:
ఆగస్టస్ వీస్మస్ లామార్కిజాన్ని తప్పు అని నిరూపించాడు. అతను ఎలుక తోకను 22 తరాల వరకూ కత్తిరించి, ఆ లక్షణం తరువాత తరానికి రావటం లేదని నిరూపించాడు.

ప్రశ్న 59.
ప్రకృతివరణం సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు?
జవాబు:
చార్లెస్ డార్విన్ “ప్రకృతివరణం” సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.

ప్రశ్న 60.
డార్విన్ రచించిన గ్రంథం పేరు ఏమిటి?
జవాబు:
డార్విన్ రచించిన ప్రముఖ గ్రంథం పేరు, జాతుల ఉత్పత్తి (The origin of species).

ప్రశ్న 61.
మానవునిలో క్రోమోజోమ్ ల సంఖ్య ఎంత?
జవాబు:
మానవునిలో 23 జతలు లేదా 46 క్రోమోజోమ్లు ఉంటాయి.

ప్రశ్న 62.
ఆడవారిలోని లైంగిక క్రోమోజోమ్స్ ఏమిటి?
జవాబు:
ఆడవారిలో ‘XX’ అనే లైంగిక క్రోమోజోమ్స్ ఉంటాయి.

ప్రశ్న 63.
పురుషులలోని లైంగిక క్రోమోజోమ్స్ ఏమిటి?
జవాబు:
పురుషులలో ‘XY’ అనే లైంగిక క్రోమోజోమ్స్ ఉంటాయి.

ప్రశ్న 64.
మానవుడిని ‘నడిచే అవశేషావయవాల మ్యూజియం’ అంటారు. ఎందుకు?
జవాబు:
మానవునిలో దాదాపు 180 అవశేష అవయవాలు ఉన్నాయి. ఉదాహణకు చెవితమ్మె, చర్మంపై కేశాలు, మగవారిలో క్షీరగ్రంథులు మొదలగునవి. అందుచేతనే మానవుడిని “నడిచే అవశేషాయవాల మ్యూజియం” అంటారు.

ప్రశ్న 65.
మానవులనందరినీ ఏ ఖండం నుండి వలస చెందినవారుగా భావిస్తున్నారు?
జవాబు:
మానవుల అతిపురాతనజీవి హోమోసెఫియన్స్. దీనిని ఆఫ్రికాలో కనుగొన్నారు. కావున మనుషులందరూ ఆఫ్రికా ఖండం నుండి వచ్చిన వారుగా భావిస్తున్నారు.

10th Class Biology 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
బిడ్డ యొక్క లింగ నిర్ధారణ ఎవరి వల్ల జరుగుతుంది ? తండ్రి వల్లనా, తల్లి వల్లనా? శిశువులలో లింగ నిర్ధారణను ప్లోచార్టు రూపంలో వివరించండి.
జవాబు:
లింగ నిర్ధారణ తండ్రి వలన జరుగును.
AP Board 10th Class Biology Solutions 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 6

ప్రశ్న 2.
శిలాజాల గురించి తెలుసుకొనుటకు పురాజీవ శాస్త్రవేత్తను మీరు ఏ ప్రశ్నలు అడుగుతారు?
జవాబు:

  1. శిలాజాల వయస్సును ఏవిధంగా కనుగొంటారు?
  2. శిలాజాలు ఎక్కువగా ఎక్కడ లభ్యమవుతాయి?
  3. శిలాజాలలో ఏ మూలకాలు ఎక్కువగా ఉంటాయి?
  4. పరిణామక్రమం తెలుసుకోవడానికి శిలాజాలు ఏవిధంగా ఉపయోగపడతాయి?

ప్రశ్న 3.
క్రింది గళ్ళ చదరమును పరిశీలించి దిగువనీయబడిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
i) ఏక సంకరణం యొక్క దృశ్యరూప నిష్పత్తిని వ్రాయుము.
ii) పై చదరంలో ఎన్ని విషమయుగ్మజ మొక్కలు కలవు?
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 2
జవాబు:
i) 3 : 1
ii) రెండు విషమయుగ్మజ మొక్కలు (YY) మరియు (YY)

ప్రశ్న 4.
జీవ పరిణామం జరిగినదనడానికి పిండోత్పత్తి శాస్త్ర నిదర్శనాలు ఏ విధంగా తోడ్పడుతున్నాయి?
జవాబు:
నిదర్శనాలు :

  1. చేప నుండి మానవుని వరకు గల వివిధ జీవుల పిండాలలో గుర్తించతగిన పోలికలు వుంటాయి.
  2. కప్ప డింభకము, కప్ప కన్నా చేపను పోలివుండును.
  3. ప్రతి జీవి జీవిత చరిత్ర, పూర్వీకుల నిర్మాణాత్మక లక్షణాలను ప్రదర్శిస్తుంది.
  4. తొలిదశలో వున్న పిండాన్ని వేరొక దాని నుండి వేరుగా గుర్తించటము కష్టము.

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

ప్రశ్న 5.
జీవ పరిణామం జరగకపోతే ఏం జరగొచ్చు?
జవాబు:

  1. క్రొత్త జాతులు ఏర్పడవు / జాతుల ఉత్పత్తి ఉండదు
  2. జీవుల మనుగడ ఉండదు.
  3. వైవిధ్యాలు ఉండవు.
  4. అనుకూలనాలు ఉండవు.
  5. నిదర్శనాలు ఉండవు.

ప్రశ్న 6.
F1 తరం అనగానేమి? దాని లక్షణాలు ఏమిటి?
జవాబు:
మెండల్ సంకరీకరణ ప్రయోగంలో, రెండు శుద్ధ జాతుల మధ్య పరపరాగ సంపర్కం జరపగా ఏర్పడిన మొదటి తరాన్ని ‘F1 తరం’ అంటారు.

లక్షణాలు:

  1. ఇవన్నీ దృశ్యరూపం పరంగా ఒకే విధంగా ఉంటాయి.
  2. బహిర్గత లక్షణాలు ప్రదర్శిస్తాయి.
  3. కానీ జన్యురూపం పరంగా విషమయుగ్మజ స్థితిలో ఉంటాయి.

ప్రశ్న 7.
పరిణామం అనగానేమి? అందలి రకాలు తెలపండి.
జవాబు:
మార్పు చెందే ప్రక్రియను పరిణామం (Evolution) అంటారు. Evolution అనే పదానికి ‘మడత విప్పుట’ అని అర్ధం (పెద్దదిగా మారటం). సరళంగా, సూక్ష్మంగా ఉండే జీవులు స్థూల, సంక్లిష్టంగా మారే ప్రక్రియ పరిణామం. దీనిలో రెండు రకాలు కలవు. అవి:
1. సూక్ష్మపరిణామం :
జాతులలోని చిన్న చిన్న మార్పులను “సూక్ష్మపరిణామం” అంటారు.
ఉదా : జీవులలోని రంగుల లక్షణం.

2. స్టూలపరిణామం :
కొత్త జాతులు ఏర్పడటాన్ని జాతుల “ఉత్పత్తి లేదా స్థూలపరిణామం” అంటారు.

ప్రశ్న 8.
లామార్క్ సిద్ధాంతం తప్పు అని ‘వీస్మస్’ ఎలా నిరూపించాడు?
జవాబు:
ఆగస్టస్ వీస్మస్ లామార్క్ సిద్ధాంతాన్ని ఎలుకలపై ప్రయోగాలు చేసి పరీక్షించాడు. అతడు ఎలుకల తోకలు తొలగించాడు. కానీ సంతతి మామూలుగానే తోకలతో జన్మించాయి. తరువాత తరం ఎలుకల తోకలు కూడా తొలగించుకుంటూ అలా 22 తరాల వరకు చేశాడు. అయితే ప్రతిసారి ఎలుకలు తోకలతోనే పుట్టాయి. శారీరకమైన మార్పులు పరిసరాల కారణంగా ఏర్పడినా సరే అది తమ సంతతికి అందించవని వీస్మస్ నిర్ధారించాడు.

ప్రశ్న 9.
జీవ పరిణామానికి ఏ ఏ శాస్త్రాల నుండి నిదర్శనాలు లభిస్తున్నాయి?
జవాబు:
జీవ పరిణామానికి క్రింది శాస్త్రాల నుండి మద్దతు లభిస్తుంది.

  1. శరీరధర్మ శాస్త్రము – సహజాత అవయవాలు, సమానమైన అవయవాలు
  2. పిండోత్పత్తి శాస్త్రము – పిండాభివృద్ధిలో పూర్వజీవుల లక్షణాలు
  3. పురాజీవ శాస్త్రం – శిలాజాలు

వీటి నుండే కాకుండా, వర్గీకరణ శాస్త్రం, జన్యుశాస్త్రం, శరీర నిర్మాణ శాస్త్రం నుండి అనేక నిదర్శనాలు జీవ పరిణామాన్ని సమర్థిస్తున్నాయి.

ప్రశ్న 10.
శిలాజాలు అనగానేమి? అవి ఎలా ఏర్పడతాయి?
జవాబు:
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 5

  1. ప్రాచీన జీవయుగాల్లో నివసించిన జీవుల ఉనికిని తెలియజేసే నిర్జీవ పదార్థాలనే “శిలాజాలు” అంటారు.
  2. పురాతన జీవులు లేదా వృక్షాల ఏ భాగమైనా శిలాజాలుగా ఏర్పడవచ్చు.
  3. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో జీవులలోని కర్బన పదార్థాలు క్షీణించి, పూర్తి నిర్మూలన చెందకుండా ఉండటం వల్ల శిలాజాలు ఏర్పడతాయి.
  4. శిలాజాలు భూమి లోపలి పొరల్లో, నీటి లోపలి నిక్షేప శిలల్లో (Sediments) లభించవచ్చు.

ప్రశ్న 11.
శిలాజాలు ఏర్పడే విధానం వివరించండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 6
ప్రాచీన జీవుల పూర్తి దేహం కాకుండా ఏవేని భాగాలు – ఎముకలు, దంతాలు, – కొమ్ములు, విత్తనాలు, పత్రాలు లేదా ముద్రలు శిలాజాలుగా లభిస్తాయి. డైనోసార్ల పాదాల శరీరం కుళ్ళి నశించిపోతుంది. ఆ తరువాత కనిపించదు. కానీ కొన్నిసార్లు శరీరం మొత్తం లేదా ఏవైనా కొన్ని భాగాలు సహజంగా నశించిపోకుండా ఉండి శిలాజాలుగా మిగిలిపోతాయి. ఉదాహరణకు ఏదేని చనిపోయిన కీటకం బురదలో చిక్కుకుపోయిందనుకుంటే, అది అంత సులువుగా నశించదు. బురద క్రమంగా ఎండి, గట్టిపడే పరిస్థితులుంటే ఆ మట్టి లోపలి కీటకం దేహం, భాగాలు, ముద్రలుగా ఉండిసోతాయి. ఇలా చెడిపోకుండా ఉండిపోయిన ముద్రలను కూడా శిలాజాలే అంటారు.

ప్రశ్న 12.
శిలాజ వయస్సును ఎలా నిర్ణయిస్తారు?
జవాబు:
భూగర్భ శాస్త్రవేత్తలు (Geologists) ఒక శిలాజ కాలాన్ని చెప్పగలరు. శిలాజాలను గురించిన అధ్యయనాన్ని పురాజీవశాస్త్రం (Palaeontology) అని అంటారు. పురాజీవ శాస్త్రవేత్తలు కార్బన్ డేటింగ్ పద్దతిని ఉపయోగించి శిలాజాల వయస్సును లేదా అవి నివసించిన కాలాన్ని కనుగొంటారు. అందుకు రేడియోధార్మిక పదార్థాలైన కార్బన్, యురేనియం మరియు పొటాషియం యొక్క ఐసోటోప్లను ఉపయోగిస్తారు. శిలాజాల లోపలి ఖనిజ లవణాల లేదా శిలాజాలున్న శిలలలోని ఐసోటోప్ల అర్ధజీవిత కాలాన్ని లెక్కించడం ద్వారా శిలాజాల కాలాన్ని అంచనా వేస్తారు.

ప్రశ్న 13.
అవశేష అవయవాలు అనగానేమి? ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
అవశేష అవయవాలు :
పరిణామక్రమంలో భాగంగా అవసరంలేని అవయవాలు క్రమంగా క్షీణించిపోతాయి. కానీ అలా క్షీణించి పోకుండా, నిరుపయోగంగా మిగిలిపోయిన అవయవాలనే అవశేషావయవాలు (Vestigial organs) అంటారు.
ఉదా :
మన జీర్ణవ్యవస్థ ‘ఉండుకం’ (Appendix) లోని జీర్ణక్రియలో అది ఏ విధంగానూ తోడ్పడదు. కానీ కుందేలు వంటి శాకాహారులలో మాత్రం జీర్ణక్రియలో ముఖ్యమైన విధినే నిర్వర్తిస్తుంది. అలా నిరుపయోగంగా మానవునిలో దాదాపు 180 అవశేషావయవాలున్నాయి. ఉదాహరణకు చెవితమ్మె, చర్మంపై కేశాలు, మగవారిలో క్షీరగ్రంథులు మొదలగునవి. అందుచేతనే మానవుడిని “నడిచే అవశేషావయవాల మ్యూజియం” అని అంటారు.

ప్రశ్న 14.
ప్రక్క పటాన్ని పరిశీలించి నీవు గమనించిన తేడాలు తెలపండి.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 8
జవాబు:
ప్రక్క పటంలో అన్ని గులాబి పూలు ఉన్నప్పటికి వాటి మధ్య తేడాలు ఉన్నాయి. కొన్ని ఎరుపు, పసుపు, తెలుపు, నీలం రంగులలో ఉన్నాయి. పుష్పాల పరిమాణంలో కూడా వ్యత్యాసం ఉంది. కొన్ని పెద్దవిగా ఉంటే, మరి కొన్ని చిన్నవిగా ఉన్నాయి. వాటితో పాటు ఆకర్షక పత్రదళాల సంఖ్య, ఆకుపరిమాణం, కాండం, ముళ్లు మొదలైన లక్షణాలలో కూడా భేదాలు గమనించవచ్చు.

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

ప్రశ్న 15.
‘జీవులలో భిన్న లక్షణాలు ఏర్పడటానికి జన్యువులు కారణం’ దీనిని సమర్థిస్తూ చిన్న వ్యాసం రాయండి.
జవాబు:
క్రోమోజోమునందలి DNA లో ఒక భాగమైన జన్యువు జీవులలో ఒక నిర్దిష్టమైన లక్షణమును నియంత్రిస్తుంది. DNA ఒక ప్రోటీనును ఉత్పత్తి చేయుట ద్వారా లక్షణమును నియంత్రిస్తుంది. క్రోమోజోమునందు వేల సంఖ్యలో ఉండు జన్యువులు రకరకాల లక్షణములను నియంత్రిస్తాయి.

జన్యువులు ఒక తరం నుండి మరియొక తరానికి లక్షణాలను అందించడానికి ఉపయోగపడే అనువంశికత ప్రమాణాలు, జన్యువులు జతలుగా పనిచేస్తాయి. ఒకే విధమైన లక్షణాలను నియంత్రించే జన్యువులకు ఒక ఇంగ్లీషు అక్షరము ఇవ్వబడింది. ఉదాహరణకు ఎత్తును నియత్రించే జన్యువు ‘T’ గాను, పొట్టిని నియంత్రించే జన్యువు ‘t’ గాను సూచించబడుతుంది.

ప్రతి లక్షణానికి కారణమైన ఒక జత జన్యువులను యుగ్మ వికల్పకాలు అంటారు. ఒక లక్షణానికి కారణమైన రెండు కారకాలు ఉన్నా, వాటిలో ఒకటి మాత్రమే సంతతిలో బహిర్గతమవుతుంది. అటువంటి జన్యువును బహిర్గత జన్యువు అంటారు. రెండవ జన్యువు బహిర్గతం కాకుండా అంతర్గతంగా ఉంటుంది.

10th Class Biology 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
పురాతన జీవుల సమాచారం మనకు తెలుపుటకు ప్రకృతి భద్రపరిచిన విలువైన ఆధారాలు శిలాజాలు. శిలాజాల గూర్చి నీవు సేకరించిన సమాచారం తెలుపుము.
జవాబు:

  1. ప్రాచీన జీవ యుగాలలో నివశించిన జీవుల ఉనికిని తెలియజేసే, ప్రకృతిసిద్ధంగా భద్రపరిచిన నిర్జీవ పదార్థాలనే శిలాజాలు అంటారు.
  2. పురాజీవశాస్త్రం ప్రాచీనయుగాలలో జీవించిన జీవుల సమాచారాన్ని తెలియజేస్తుంది.
  3. కార్బన్ రేటింగ్ పద్దతినుపయోగించి జీవులు, జీవించిన కాలాన్ని భూగర్భశాస్త్రవేత్తలు కనుగొంటారు.
  4. శిలాజాల యందు లభించే క్రోమోజోమ్ సమాచారం ద్వారా వంశపారంపర్య లక్షణాలు లభిస్తాయి.
  5. ఆహారపు అలవాట్లు, జీవనవిధానాలు – శరీర నిర్మాణం గురించి తెలుస్తుంది.
  6. కాలగమనంలో జీవులు పొందిన వివిధ రూపాంతరాలు, క్రొత్తజీవులు ఏర్పడిన విధానం గురించిన సమాచారం లభిస్తుంది.

ప్రశ్న 2.
మనతో పాటు భూమి మీద జీవించే హక్కు జీవులన్నిటికీ కలదు. జీవ వైవిధ్య పరిరక్షణపై ప్రజలలో చైతన్యం కలిగించే నినాదాలను వ్రాయండి.
జవాబు:

  1. జీవించు – జీవించనివ్వు
  2. ప్రకృతిని ప్రేమించు – జీవవైవిధ్యాన్ని సంరక్షించు
  3. జీవకారుణ్యాన్ని చూపించు – జీవ వైవిధ్యాన్ని విస్తరించు
  4. తోటి జీవరాశిని కాపాడు – అందమైన ప్రకృతిని చూడు
  5. అన్ని జీవులను ఆదరించు – వైవిధ్యాన్ని సంరక్షించు
  6. పలు కాలుష్యాలను తగ్గించండి – జీవ వైవిధ్యాన్ని కాపాడండి

ప్రశ్న 3.
మెండల్ తన ప్రయోగాల కోసం బఠాణీ మొక్కను ఎంచుకోవడానికి గల కారణాలు ఏమిటి?
జవాబు:
మెండల్ తన ప్రయోగాల కోసం బఠాణీ మొక్కను ఎంచుకోవటానికి గల కారణాలు :
1. ‘బఠాణీ అధిక వైవిధ్యాలు కలిగిన మొక్క :
మెండల్ తన ప్రయోగాల కోసం దాదాపు ఏడు విభిన్న లక్షణాలను ఎన్నుకున్నాడు. ఇవన్నీ స్పష్టంగా ఉండి పరిశీలించటానికి అనువుగా ఉన్నాయి.
ఉదా : పువ్వురంగు, పువ్వుస్థానం.

2. బఠాణీ ద్విలింగ పుష్పం కలిగిన మొక్క :
కావున ఇది పరపరాగ సంపర్కం, ఆత్మపరాగ సంపర్కం జరపటానికి వీలుగా ఉంటుంది.

3. పుష్ప నిర్మాణం :
పుష్పంలో కేసరావళి, అండకోశం పెద్దవిగా ఉండుట వలన పరాగ సంపర్కం సులభం.

4. బఠాణీ మొక్క ఏకవార్షికం :
కావున ప్రయోగ ఫలితాలు త్వరగా తెలుస్తాయి. తక్కువ కాలంలో ఎక్కువ ప్రయోగాలు నిర్వహించవచ్చు.

ప్రశ్న 4.
మానవులలో లింగ నిర్ధారణను ఫ్లో చార్టు గీసి, వివరించండి.
(లేదా)
మానవునిలో లింగ నిర్ధారణ తెలియజేయు ఫ్లో చార్టు గీయుము.
జవాబు:
AP Board 10th Class Biology Solutions 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 17AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 10

  1. ఆడవారిలో రెండు X క్రోమోజోములు, మగవారిలో X, Y క్రోమోజోమ్ లు ఉంటాయి.
  2. స్త్రీ సంయోగ బీజాలలో ఒకే రకమైన X క్రోమోజోమ్లు , పురుష సంయోగ బీజాలలో X మరియు Y క్రోమోజోమ్లు ఉంటాయి.
  3. Y క్రోమోజోమ్ ఉన్న శుక్రకణం, X క్రోమోజోమ్ ఉన్న అండంతో కలిస్తే ఫలదీకరణ జరి X, Y క్రోమోజోమ్ తో ఏర్పడే శిశువు అబ్బాయి అవుతుంది.
  4. అదే X క్రోమోజోమ్ ఉన్న శుక్రకణం, X క్రోమోజోమ్ ఉన్న అండంతో కలిస్తే ఏర్పడే శిశువు అమ్మాయి అవుతుంది.

ప్రశ్న 5.
జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి నీ వంతుగా నీవు చేస్తున్న ప్రయత్నాలేవి?
జవాబు:

  1. భూమిపై నివసిస్తున్న జీవులలో గల వైవిధ్యమే జీవ వైవిధ్యం.
  2. జీవ వైవిధ్యాన్ని సంరక్షించడానికి, వేటాడటాన్ని నిషేధించాలి.
  3. సుస్థిర అడవుల సంరక్షణా పద్ధతులను అవలంబించాలి.
  4. నేను నావంతుగా వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొంటాను.
  5. ప్రజలను చైతన్య పరుస్తూ వారిని వివిధ జీవ వైవిధ్య సంరక్షణా కార్యక్రమాలలో పాల్గొనేలా ప్రోత్సహిస్తాను.
  6. పాఠశాల పరిసర ప్రాంతాలలో చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తాను.
  7. జీవ వైవిధ్యానికి సంబంధించిన నినాదాలు, గోడ పత్రికలు ముద్రిస్తాము.
  8. విద్యుత్తును సాధ్యమైనంత వరకు పొదుపుగా వినియోగిస్తాను.
  9. ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వినియోగించుకుంటాము.
  10. ఆవాస ప్రాంతాలలో చెట్లను నరికివేస్తే మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడతాను.
  11. సామాజిక అడవుల పెంపకాన్ని ప్రోత్సహిస్తాను.

ప్రశ్న 6.
AP Board 10th Class Biology Solutions 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 17AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 10
i) ఈ షో చార్డ్ ఏమి తెలియజేస్తుంది?
జవాబు:
మానవునిలో లింగ నిర్ధారణ తెలియజేయును.

ii) ‘X’ క్రోమోజోమ్ ఉన్న శుక్రకణం అండంతో కలిసి ఫలదీకరణ జరిగితే ఏమి జరుగుతుంది?
జవాబు:
ఆడపిల్ల పుడుతుంది.

iii) శిశువు లింగ నిర్ధారణ చేసేది అమ్మా, నాన్నలలో ఎవరు?
జవాబు:
తండ్రి

iv) సంతతిలో ఎన్ని క్రోమోజోమ్ జతలు ఉంటాయి?
జవాబు:
23 జతలు

ప్రశ్న 7.
ఈ చిత్రాన్ని పరిశీలించండి. సమాధానములు రాయండి.
వంశీ, ప్రియలు నూతన దంపతులు. వారు మగపిల్లవానిని కనాలనుకొంటున్నారు.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 11
a) మగ పిల్లవాడు జన్మించాలంటే జరుగవలసిన క్రోమోజోముల బదిలీని తెలిపే సంభావ్యతా చిత్రాన్ని గీయండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 12

b) శిశువు లింగ నిర్ధారణలో ఎవరు పాత్ర పోషిస్తారు? ఎలా చెప్పగలవు?
జవాబు:
శిశువు లింగ నిర్ధారణలో తండ్రి పాత్ర పోషిస్తారు. ఎందుకనగా మగశిశువును నిర్థారించే “Y” క్రోమోసోమ్ తండ్రిలోనే ఉత్పత్తి అవుతుంది.

ప్రశ్న 8.
దృశ్యరూపం మరియు జన్యురూపం అనగానేమి? మెండల్ ఏకసంకరణ పద్ధతి ద్వారా వీటిని వివరించండి.
జవాబు:
దృశ్యరూపం :
జీవులలో బయటకు కన్పించే (బహిర్గతం) అయ్యే లక్షణాన్ని దృశ్యరూపంగా గుర్తిస్తాం.

జన్యురూపం :
జీవులు ప్రదర్శించే స్వరూప స్వభావాల సంభావ్యత క్రమాన్ని జన్యురూపంగా గుర్తిస్తాం.

పసుపు (YY) ఆకుపచ్చ (YY), విత్తనాలు ఉన్న శుద్ధజాతుల బఠాణీల మొక్కల మధ్య పరపరాగ సంపర్కం చేయగా F1 తరంలో మొక్కలన్నీ పసుపు రంగు విత్తనాలు కల్గి ఉన్నాయి. అంటే F1 తరంలో పసుపు రంగు దృశ్యరూపంగా గుర్తించటం జరిగింది.

ఈ F1 తరంలో ఏర్పడే విత్తనాల జన్యురూపం ‘Yy’
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 13

F2 తరం : F1 తరం మొక్కల మధ్య (YY) స్వపరాగ
సంపర్కం చేయగా F2 తరం మొక్కలు ఏర్పడ్డాయి.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 2

దృశ్యరూప నిష్పత్తి : 3 : 1; జన్యురూప నిష్పత్తి : 1 : 2 : 1

ప్రశ్న 9.
మెండల్ అనువంశికతా సూత్రాలను తెలుపుము. మెండల్ తన ప్రయోగాలకు ఐరాణీ మొక్కను ఎంచుకోవడానికి గల కారణాలు రాయండి.
జవాబు:
మెండల్ అనువంశికతా సూత్రాలు:

  1. బహిర్గతత్వ సూత్రం,
  2. పృథక్కరణ సూత్రం,
  3. స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం.

మెండల్ తన ప్రయోగానికి బఠానీ మొక్కను ఎంపిక చేసుకోవడానికి కారణాలు :

  1. స్పష్టమైన లక్షణాలు కల్గి ఉండటం
  2. ద్విలింగ పుష్పాలు కల్గి ఉండటం
  3. ఆత్మ పరాగసంపర్కం జరపడం
  4. సంకరీకరణానికి అనువుగా ఉండటం
  5. బఠానీ ఏకవార్షిక మొక్క

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

ప్రశ్న 10.
ప్రక్కన ఉన్న ఫ్లోచార్టు గమనించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 14
i) ఈ ఫ్లోచార్టు దేనిని తెలియచేస్తుంది?
జవాబు:
శుద్ధ పొడవు మరియు పొట్టి మొక్కల మధ్య మెండల్ ఏక సంకరీకరణము.

ii) F1 తరపు మొక్కల దృశ్యరూపం ఏమిటి?
జవాబు:
అన్నీ మొక్కలూ పొడవైనవి.

iii) తరం యొక్క దృశ్యరూప మరియు జన్యురూప నిష్పత్తులు తెల్పండి.
జవాబు:
దృశ్యరూప నిష్పత్తి 3 : 1
జన్యురూప నిష్పత్తి 1 : 2 : 1

iv) ఈ ఫ్లోచార్టు ద్వారా నీవు ఏ అనువంశిక సూత్రాలను అర్థం చేసుకుంటావు?
జవాబు:
బహిర్గతత్వ సూత్రము మరియు పృథక్కరణ సూత్రము

ప్రశ్న 11.
జీవ పరిణామం గురించి డార్విన్ ప్రతిపాదించిన సిద్ధాంతం నందలి ముఖ్యాంశాలను రాయంది.
జవాబు:
డార్విన్ సిద్ధాంతము నందలి ముఖ్యాంశాలు :

  1. పరిణామం అనేది నెమ్మదిగా నిరంతరాయంగా జరుగుతుంది.
  2. ఒక జనాభాలోని ఏదేని సమూహం వైవిధ్యాలను సంతరించుకోవచ్చు.
  3. వైవిధ్యాలు జనకుల నుండి సంతతికి అనువంశికంగా అందించబడతాయి.
  4. సంతతి అధిక సంఖ్యలో వుంటే అది మనుగడ కోసం పోరాటానికి దారితీస్తుంది.
  5. ఉపయుక్తమైన లక్షణాలు గల జీవులు మనుగడ కోసం జరిగే పోరాటంలో విజయం సాధిస్తాయి.
  6. పర్యావరణంలో మార్పులు వస్తే జీవులు వాటికి అనుగుణంగా మార్పులు లేదా అనుకూలనాలను సంతరించుకొని కొత్త పరిస్థితులలో జీవించగల్గుతాయి.
  7. ప్రతి జీవజాతిలో సుదీర్ఘకాలం మార్పులు చోటుచేసుకుంటూ వుంటే అది ఒక కొత్త జాతి ఏర్పడటానికి దారితీస్తుంది.

ప్రశ్న 12.
జీవ పరిణామంను నిరూపించే ఏవైనా రెండు ఆధారాలను గురించి వివరించండి.
జవాబు:
1. నిర్మాణ సామ్య అవయవాలు :
తిమింగలాల్లో వాజాలు (ఈదడానికి), గబ్బిలాల్లో రెక్కలు (ఎగరడానికి), చిరుతల్లో కాళ్ళు (పరిగెత్తడానికి), మనుషుల్లో చేతులు (పట్టుకోవడానికి), చుంచు ఎలుకల్లో కాళ్ళు (తవ్వడానికి) ఇలా వివిధ రకాలుగా ఉపయోగపడే ముందరి చలనాంగాల అంతర్నిర్మాణము ఒకేలా ఉంటుంది. వీటన్నింటి ఎముకల అమరిక ఒకేలా ఉంటాయి. సకశేరుకాలన్నీ ఒకే పూర్వీకుల నుండి పరిణామం ఫలితంగా ఏర్పడినవేనని ఈ రుజువులు తెలుపుతున్నాయి. ఈ అవయవాలనే నిర్మాణసామ్య అవయవాలు’ అంటారు. ఈ విధమైన పరిణామాన్ని (అపసారి పరిణామం) అందురు.

2. క్రియాసామ్య అవయవాలు :
పక్షులు, గబ్బిలాల రెక్కలు గురించి పరిశీలిస్తే, గబ్బిలం రెక్కలలో పొడవుగా ఉన్న వేళ్ళ మధ్యలో సాగడానికి, ముడుచుకోవడానికి వీలుగా ఉన్న చర్మపంకం కనిపిస్తుంది. కానీ పక్షులలో రెక్కలు ఈకలతో కప్పబడిన ముందరి చలనాంగాలు. ఈ రెండింటిలో నిర్మాణం, అవయవాలు వేరువేరుగా ఉన్నప్పటికీ అవి నిర్వర్తించే విధి మాత్రం ఒక్కటే. నిర్మాణం వేరువేరుగా ఉన్నప్పటికీ ఒకేరకమైన పనిని నిర్వర్తించే వాటిని క్రియాసామ్య అవయవాలు అంటారు. ఈ విధమైన పరిణామాన్ని (అభిసారి పరిణామం) అంటారు.

3. పిండోత్పత్తి శాస్త్ర నిదర్శనాలు :
చేప నుండి మానవుని వరకు గల వివిధ జీవుల పిండాలలో గుర్తించదగిన పోలికలు ఉంటాయి. ప్రతి జీవి జీవిత చరిత్ర పూర్వీకుల నిర్మాణాత్మక లక్షణాలను ప్రదర్శించును. జీవులన్నింటికీ ఒకే సామాన్య పూర్వీకులు ఉన్నారని, దాని నుండే జీవులన్నీ పరిణామం చెందాయనే భావనకు బలం చేకూరుతుంది.

4. శిలాజ నిదర్శనాలు :
ప్రాచీన జీవ యుగాల్లో నివసించిన జీవుల ఉనికిని తెలియజేసే ప్రకృతి సిద్ధంగా భద్రపరచబడిన నిర్జీవ పదార్థాలను శిలాజాలు అంటారు. శిలాజాలను గురించిన అధ్యయనాన్ని పురాజీవ శాస్త్రం అని అంటారు. భూగర్భ శాస్త్రవేత్త శిలాజకాలాన్ని లెక్కించి చెప్పగలుగుతారు. కార్బన్ డేటింగ్ పద్దతిని ఉపయోగించి శిలాజాల వయస్సును, అవి నివసించిన కాలాన్ని కనుగొందురు.
ఉదా : రాక్షస బల్లులు (డైనోసారస్) కీటోసారస్ ప్రస్తుతం మనకు లభించిన శిలాజ నిదర్శనాలు.

ప్రశ్న 13.
బఠానీ మొక్కలలో బహిర్గత, అంతర్గత లక్షణాలను బట్టి F2 తరంలో వాటి నిష్పత్తిని తెలపండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 15

ప్రశ్న 14.
ఈ క్రింది పదాలను వివరించండి.
ఎ) యుగ్మవికల్పకాలు బి) సమయుగ్మజ స్థితి సి) విషమయుగ్మజ స్థితి డి) F1 తరం ఈ) F1 తరం ఎఫ్) దృశ్యరూపం జి) జన్యురూపం హెచ్) బహిర్గతం ఐ) స్వతంత్ర జన్యువ్యూహనం
జవాబు:
ఎ) యుగువికల్పకాలు :
ప్రతి లక్షణాన్ని నియంత్రించే ఒక జత కారకాలను యుగ్మ వికల్పకాలు అంటారు. ప్రస్తుతం ఈ కారకాలనే ‘జన్యువులు’ అంటారు.
ఉదా : పొడవు (TT), పొట్టి (tt).

బి) సమయుగ్మజ స్థితి :
ఒక లక్షణానికి రెండూ ఒకే రకమైన కారకాలుంటే దానిని ‘సమయుగ్మజం’ (Homozygous) అంటారు.
ఉదా : పసుపురంగు (YY), గుండ్రని విత్తనం (RR),

సి) విషమయుగ్మజ స్థితి :
ఒక లక్షణానికి వ్యతిరేక లక్షణాలున్న జన్యువులు జతగా ఉంటే దానిని “విషమయుగ్మజం” అంటారు. (Heterozygous) అంటారు.
ఉదా: పసుపురంగు (YY), గుండ్రం (Rr),

డి) F1 తరం :
సంకరణ ప్రయోగంలో, సమయుగ్మజ మొక్కల మధ్య పరపరాగ సంపర్కం జరపగా ఏర్పడిన మొదటి తరాన్ని “F1 తరం” అంటారు. ఇవి దృశ్యరూపం పరంగా ఒకే విధంగా ఉండి జన్యురూపంగా విషమయుగ్మజ స్థితిలో ఉంటాయి.

ఈ) F2 తరం :
F1 తరం మొక్కల మధ్య ఆత్మపరాగ సంపర్కం జరపగా ఏర్పడిన సంతతిని “F2 తరం” అంటారు. ఇవి దృశ్యరూపంగా 3:1 నిష్పత్తిని, జన్యుపరంగా 1 : 2 : 1 నిష్పత్తిని కలిగి ఉంటాయి.

ఎఫ్) దృశ్యరూపం :
ఒక జీవిలో బయటకు కనిపించే లక్షణాలను “దృశ్యరూపం” అంటారు.
ఉదా : పొడవు, పొట్టి.

జి) జన్యురూపం :
జీవి ప్రదర్శించే లక్షణాలకు కారణమైన జన్యుస్థితిని “జన్యురూపం” అంటారు.
ఉదా : పొడవు (TT లేదా TI).

హెచ్) బహిర్గతం :
విషమయుగ్మజ స్థితిలో జీవి ఏదో ఒక లక్షణం మాత్రమే ప్రదర్శింపబడుతుంది. ఈ ధర్మాన్ని బహిర్గతం అని, అటువంటి లక్షణాన్ని బహిర్గత లక్షణం అంటారు.
ఉదా : విషమయుగ్మజ పొడవు మొక్క (TV) పొడవు మరియు పొట్టి లక్షణాల కారకాలను కలిగి ఉన్నప్పటికి అది పొడవు మొక్కగా ఉంటుంది. ఇక్కడ పొడవు బహిర్గత లక్షణం. పొట్టి అంతర్గత లక్షణం.

ఐ) స్వతంత్ర జన్యువ్యూహనం :
యుగ్మవికల్పకాలలో రెండు కారకాలు ఉన్నప్పటికీ, సంయోగ బీజాలు ఏర్పడేటప్పుడు ఒక్కో కారకం విడిపోయి ప్రవేశిస్తాయి. ఈ సందర్భంలో ప్రతి కారకం స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. ఈ జన్యు ధర్మాన్ని పృధక్కరణ లేదా వేరుపడే సూత్రం లేదా స్వతంత్ర జన్యువ్యూహనం (Law of Segregation) అంటారు.
ఉదా: విషమయుగ్మజ పొడవు మొక్క (T) నుండి, రెండు రకాల సంయోగబీజాలు (T) (1) ఏర్పడతాయి. ఇవి ఏర్పడేటప్పుడు ఒక కారకం, మరొక కారకంపై ప్రభావాన్ని చూపుతుంది.

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

ప్రశ్న 15.
మెండల్ సిద్ధాంతాన్ని వివరించండి.
జవాబు:
వైవిధ్యాలు గురించి అవి అనువంశికంగా సంక్రమించే విధానం గురించి 1857లో గ్రెగర్ జోహాన్ మెండల్ పరిశోధన చేశాడు. ఇతను బఠానీ మొక్కలపై సంకరణ ప్రయోగాలు చేసి అనువంశికతను వివరించాడు. ఇతని సిద్ధాంతంలో మూడు పరికల్పనలు, రెండు సూత్రాలు ఉన్నాయి.

పరికల్పనలు :
మొదటి పరికల్పన :
జీవిలోని ప్రతి ప్రత్యేక లక్షణానికి రెండు కారకాలు ఉంటాయి. (వీటిని నేడు మనం జన్యువులు అంటున్నాము. ఈ జన్యువుల జతను యుగ్మవికల్పకం అంటారు.)

రెండవ పరికల్పన :
సంతతిలోని రెండు కారకాలు ఒక్కో జనకుని నుండి ఒక్కొక్కటి పొందును.

వివరణ :
సంయోగబీజాల కలయిక వలన జీవి ఏర్పడుతుంది. సంయోగబీజం ఒకటి తల్లి నుండి మరొకటి తండ్రి నుండి వస్తాయి. కావున సంతతిలోని యుగువికల్పకంలో ఒకటి తల్లి మరొకటి తండ్రికి చెంది ఉంటాయి.

మూడవ పరికల్పన :
సంతతికి లభించిన రెండు భిన్న కారకాలలో ఒక కారకం మాత్రమే బహిర్గతమవుతుంది.

వివరణ :
సంతతి విషమయుగ్మజ స్థితిలో ఉంటే ఒక లక్షణం మాత్రమే ప్రదర్శిస్తుంది. ఈ ధర్మాన్ని బహిర్గతం అంటారు.

సిద్ధాంతాలు :
తన పరికల్పనల ఆధారంగా మెండల్ రెండు సిద్ధాంతాలను సూత్రీకరించాడు. అవి

1. బహిర్గత సిద్ధాంతం :
జీవి విషమయుగ్మజ స్థితిలో ఉన్నప్పుడు ఒక లక్షణం మాత్రమే ప్రదర్శింపబడుతుంది. మరొకటి అంతర్గతంగా ఉండిపోతుంది.
ఉదా : విషమయుగ్మజ పొడవు (Tt) మొక్కలో పొడవు లక్షణం ప్రదర్శింపబడి పొట్టి లక్షణం అంతర్గతంగా ఉంటుంది.

2. వేరుపడే సూత్రం :
యుగ్మవికల్పకాలలో ఒక్కొక్కటి ఒక్కో జనకుడి నుండి సంతతికి లభిస్తాయి. అయితే జనకుల యుగ్నవిక్సలకాలలో ఏదో ఒక కారకం యథేచ్చగా (Random) సంతతికి అందించటం జరుగుతుంది.
ఉదా :
విషమయుగ్మజ పొడవు మొక్క (Tt) నుండి రెండు రకాల సంయోగబీజాలు (T), (t) సమ సంఖ్యలో ఏర్పడతాయి.

ప్రశ్న 16.
దార్విన్ సిద్ధాంతాన్ని వివరించండి.
జవాబు:
చార్లెస్ రాబర్ట్ డార్విన్ (1809-1882)
ప్రకృతి వరణం (natural selection) అనే ప్రఖ్యాత సిద్ధాంతాన్ని డార్విన్ ప్రతిపాదించాడు. డార్విన్ తన 22వ యేట HMS బీగిల్ అనే నౌకలో ప్రపంచ సర్వే కోసం బయలుదేరి 5 సంవత్సరాలు ప్రయాణించాడు. గాలాపాగస్ దీవులతో సహా ఎన్నెన్నో ప్రదేశాలను అతడు సందర్శించాడు. ఆయా ప్రదేశాలలోని మొక్కలు, జంతువుల గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. అలాగే ఎంతో సమాచారాన్ని, ఋజువులను కూడా సేకరించాడు.

డార్విన్ సిద్ధాంతంలో ప్రధానంగా మూడు సత్యాలు (పరిశీలనలు), రెండు సూత్రీకరణలు (సిద్ధాంతాలు) ఉంటాయి. అవి

1. అత్యుత్పత్తి :
(మొదటి సత్యం) జీవులు తమ సంతతిని అధికసంఖ్యలో ఉత్పత్తి చేస్తాయి. ఒక ఆవాలు చెట్టు, తన జీవితకాలంలో 10 వేల విత్తనాలు ఉత్పత్తి చేస్తుంది. ఇవన్నీ మొక్కలుగా మారితే భూమి అంతా ఆవాల మొక్కలతో నిండిపోతుంది.

2. జనాభా నిర్ణీత సంఖ్య :
(రెండవ సత్యం) జీవులు తమ సంతతిని అధికంగా ఉత్పత్తి చేసినా, ఏ జీవి భూమి అంతటినీ ఆక్రమించలేదు. ప్రతి జాతి సంఖ్య నిర్దిష్టంగా నియంత్రించబడుతుంది. జనాభా నిర్ణీత సంఖ్యలో ఎందుకు ఉంటుందని డార్విన్ ఆలోచించాడు.

3. మనుగడ కోసం పోరాటం :
(మొదటి సిద్ధాంతం) జీవులు అధిక సంఖ్యలో ఏర్పడిన్పటికి, అవి జీవించటంలో అధికమైన పోటీని ఎదుర్కొంటున్నాయి. వాటి అవసరాలు ఒకే విధంగా ఉండుట వలన తీవ్రమైన పోటీ ఉంటుంది. దీనినే ‘మనుగడ కోసం పోరాటం’ అంటారు. మరి ఈ పోరాటంలో ఏ జీవులు గెలుస్తాయి? ఏవి మరణిస్తాయి? అని ఆలోచించాడు.

4. వైవిధ్యాలు :
(మూడవ సత్యం) జీవులన్నీ ఒకే విధమైన లక్షణాలలో లేవు. జీవుల మధ్య ఉండే ఈ వ్యత్యాసాలను వైవిధ్యాలు అంటారు. పించ్ పక్షుల ముక్కుల ఆకారం వాటి ఆహార అలవాట్లకు గల సంబంధాన్ని పరిశీలించి, డార్విన్ వైవిధ్యాలు మనుగడకోసం పోరాటానికి తోడ్పడతాయని భావించాడు.

5. యోగ్యతను సార్థక జీవనం :
(రెండవ సిద్ధాంతం) మనుగడ కోసం జరిగే పోరాటంలో వైవిధ్యాలు తోడ్పడితే అవి సమర్థవంతంగా జీవించగలుగుతాయి. మనుగడకు తోడ్పడే ఇటువంటి లక్షణాలను అనుకూలనాలు అంటారు. అనుకూలనాలు లేని జీవులు నశించి ప్రకృతి నుండి తొలగించబడతాయి. ప్రకృతిచే ఎన్నుకొనబడే ఈ ప్రక్రియను ‘ప్రకృతి వరణం’ అంటారు.
1. అత్యుత్పత్తి 2. జనాభా నిర్ణీత సంఖ్య – మనుగడ కోసం పోరాటం 3. వైవిధ్యాలు యోగ్యతమ సార్థక జీవనం
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 16

ప్రశ్న 17.
మెండల్ స్వతంత్ర జన్యువ్యూహన సిద్ధాంతంను వివరించండి.
జవాబు:
మెండల్ స్వతంత్ర వ్యూహన సిద్దాంతం :
బఠానీ మొక్కలలో పై విధంగా ద్విసంకర సంకరణం జరపగా, సంతతిలో పసుపు (Yy), గుండ్రని (RR) మరియు ముడతలు (rr), ఆకుపచ్చ (yy) లక్షణాలు కనిపించాయి. F1 తరం మొక్కల మధ్య స్వపరాగ సంపర్కం జరిపినపుడు ఆయా లక్షణాలు, ఇతర లక్షణాలతో స్వతంత్రంగా కలిసిపోయి F2 తరం ఏర్పడింది.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 17

– (1) RRYY (2) RRYy (3) RrYY (4) RrYy (5) RRYy (6) RrYY (7) RrYy (8) RrYy (9) RrYy అనేవి గుండ్రని మరియు పసుపు విత్తనాలనిచ్చేవి.
– (1) RRyy(2) Rryy (3) Rryy అనేవి గుండ్రని మరియు ఆకుపచ్చనివి.
– (1) rr Yy(2) rr Yy (3) Ir YY అనేవి ముడతలు మరియు పసుపువి.
– rryy అనేవి ముడతలు మరియు ఆకుపచ్చనివి.

పై ఫలితాలను బట్టి ప్రతి లక్షణానికి కారణమైన కారకం స్వతంత్రంగా ఉంటూ సంయోజబీజాలలో మనగలిగనట్లు నిర్ధారణకు రావచ్చు. అంటే కారకాలనేవి (factors) స్వతంత్రమైనవి మరియు సంయోగబీజాల ద్వారా అనువంశికంగా సంతతికి అందించబడతాయి. ఈ ఒక జతకన్నా ఎక్కువ లక్షణాల యొక్క అనువంశికతను గమనిస్తే, ఆ జత లక్షణాలకు కారణమైన కారకాలు చేరే లక్షణాలపై ఆధారపడకుండా స్వతంత్రంగా సంతతికి లభించుటనే లేదా అందించుటనే “స్వతంత్ర వ్యూహన సిద్ధాంతమని” అంటారు.

ప్రశ్న 18.
లామార్క్ సిద్ధాంతాన్ని వివరించండి. (లేదా) ఆర్తిత గుణాల అనువంశికత అనగానేమి?
జవాబు:
ఒక జీవి తన మనుగడ కోసం అవసరం కొద్ది అభివృద్ధి చేసుకొన్న లక్షణాలను ఆర్జిత గుణాలు (Acquired characters) అంటారు. లామార్క్ అభిప్రాయం ప్రకారం- ఇలా ఆర్జించిన గుణాలు తమ సంతతికి అందించబడతాయి. దీనిని ఆర్జిత గుణాల అనువంశికత అంటారు.

ఉదా :
జీన్ బాప్టిస్ట్ లామార్క్ జీవపరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మొదటి వ్యక్తి. కొన్ని వేల సంవత్సరాల క్రితం జిరాఫీలు జింకల వలెనే ఉండేవని లామార్క్ భావించాడు. ఆహార కొరత కారణంగా నేలపైన మరియు చెట్ల యొక్క కింది శాఖలు లేకుండా పోయాక జిరాఫీలు మెడసాచి పైన ఉన్న శాఖలను అందుకోవాల్సిన అవసరం ఏర్పడి ఉండవచ్చు. కనుక మెడనిసాచి పై శాఖలను అందుకోవడం వలన మెడ నెమ్మదిగా సాగడం మొదలై ఉండవచ్చు.

ఎందుకంటే ఎల్లప్పుడూ మెడను సాచి ఉపయోగించడం మూలంగా కొన్ని తరాల తరవాత జిరాఫీల మెడ సాగిపోయి ఇప్పుడు ఉన్నట్లు సాగిన మెడ గల జిరాఫీల ఆవిర్భావం జరిగి ఉంటుంది. ఇలా ఒక జీవి తన మనుగడ కోసం అవసరం కొద్దీ అభివృద్ధి చేసుకున్న లక్షణాలను లేదా గుణాలను ఆర్జిత గుణాలు (Acquired characters) అంటారు. లామార్క్ అభిప్రాయం ప్రకారం ఈ విధంగా ఆర్జించిన గుణాలు తమ సంతతికి అందించబడుతూ ఉంటాయి. దీనినే ‘ఆర్జిత గుణాల అనువంశికత’ అంటారు. ఉదా : సాగిన మెడ మరియు పొడవు ఎదిగిన ముందుకాళ్ల జిరాఫీ.

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

ప్రశ్న 19.
DNA గురించి తెలపండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 18

  1. DNA అనగా డీ ఆక్సీరిబో న్యూక్లిక్ ఆమ్లం. ఇది కేంద్రకంలో ఉండే ఒక ఆమ్లం.
  2. జేమ్స్ వాట్సన్ మరియు ఫ్రాన్సిస్ క్రిక్ అనే శాస్త్రవేత్తలు 1953లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నందు DNA యొక్క పూర్తి నిర్మాణాన్ని కనుగొన్నారు.
  3. మీరు DNA అణువు సర్పిలంగా ఉండే మెట్ల మాదిరిగా ఉంటుందని వాట్సన కనుగొన్నారు. ఈ ఆకారాన్నే ద్వంద్వ కుండలి (Double helix) అని అంటారు.
  4. ఇది ఏకాంతరంగా అమర్చబడిన చక్కెరలు మరియు ఫాస్పేట నిర్మితం.
  5. దీనిలో మెట్ల వలె ఉండేవి నత్రజని క్షారాలు. అవి అడినిన్, గ్వానిస్, థైమిన్ మరియు సైటోసిన్.
  6. ఫ్రాంక్లిన్ మరియు మౌరిస్ విల్కిన్స్ తో పాటుగా వాట్సన్ మరియు క్రికు నోబెల్ బహుమతి వచ్చింది.
  7. జుట్టు యొక్క రంగు, చర్మం మొదలగు లక్షణాలు దీనికి ఉదాహరణలు.
  8. DNA యొక్క రసాయనిక నిర్మాణంలో ఏ చిన్న మార్పు కలిగినా అది సంతతి యొక్క లక్షణాలలో మార్పునకు కారణమవుతుంది. ఆ మార్పులే వైవిధ్యాలకు దారితీస్తాయి.

ప్రశ్న 20.
దార్విన్ సిద్ధాంత సారాంశం తెలపండి.
జవాబు:
డార్విన్ సిద్ధాంత సారాంశం :

  1. ఒక జీవి జనాభాలోని ఏదేని సమూహం వైవిధ్యాలను సంతరించుకోవచ్చు. కానీ సమూహంలోని అన్ని జీవులూ ఒకే రకంగా కాదు.
  2. వైవిధ్యాలు జనకుల నుండి సంతతికి అనువంశికంగా అందించబడతాయి.
  3. అధిక సంఖ్యలో సంతతి ఉంటే అది మనుగడ కోసం పోరాటానికి దారితీస్తుంది.
  4. తగిన ఉపయుక్త లక్షణాలు లేని జీవులకన్నా, ఉన్నవి మనుగడ కొనసాగించడానికి, ప్రత్యుత్పత్తి ద్వారా అధిక సంతానం ఉత్పన్నం చేస్తుంది.
  5. ఉపయుక్త వైవిధ్యాలుండి, మనుగడ సాగిస్తున్న జీవులు అనువంశికంగా సంతతికి వాటిని అందజేస్తాయి. అలాగే ప్రతి తరంలోనూ జరగడం వలన ఆ వైవిధ్యాలు సర్వసాధారణ లక్షణాలవుతాయి.
  6. పర్యావరణంలో మార్పులు వస్తే జీవులు వాటికి అనుగుణంగా మార్పులు లేదా అనుకూలనాలను సంతరించుకుని కొత్త పరిస్థితులలో జీవించగలుగుతాయి.
  7. ప్రతి జీవజాతిలో సుదీర్ఘకాలం మార్పులు చోటుచేసుకుంటూ ఉంటే, అది ఒక కొత్త జాతి ఏర్పడటానికి దారితీస్తుంది. కొత్త జాతి, నిజమైన జాతికి భిన్నంగా ఉంటుంది.
  8. భూమిపైన అన్ని జాతులు ఈ విధంగా ఏర్పడినవే.

ప్రశ్న 21.
కొత్త జాతులు ఏర్పడే విధానాన్ని ఉదాహరణతో వివరించండి.
జవాబు:
కొత్త జాతులు ఏర్పడటాన్ని జాతుల ఉత్పత్తి (Speciation) అని లేదా స్థూలపరిణామం (Macro evolution) అనీ అంటారు.

ఉదా : ఎర్ర, ఆకుపచ్చ కుమ్మరి పురుగులు లైంగికంగా కలిసి సంతతిని పొందగలవని మనకు తెలుసు. కానీ ఎర్ర, ఆకుపచ్చ కుమ్మరి పురుగులు ఏవేని కారణాలచేత చాలా కాలం వేరైపోయాయని ఊహించుకోండి (ఉదాహరణకు కాయలు తినడానికై నోట కరచుకొని తీసుకెళ్ళి దూరంగా ఎక్కడో జారవిడిచాయనుకోండి).

కొన్ని సంవత్సరాలలో రెండు రకాల కుమ్మరి పురుగులలోనూ ఎంతో వైవిధ్యం ఏర్పడుతుంది. ఆ తరువాత అవి అనుకోకుండా కలిసినప్పటికీ ప్రత్యుత్పత్తి జరపలేవు. సంతతిని ఉత్పత్తి చేయలేవు. ఏదైనా జీవులు వాటి జాతి జీవులతోనే కలవడం, సంతానాన్ని పొందడం జరుగుతుంది. ఈ విధంగా కొత్త జాతులు ఏర్పడుతుంటాయి.

ప్రశ్న 22.
మానవ పరిణామక్రమం తెలపండి.
జవాబు:
ఆధునిక మానవుడి రూపు సంతరించుకొనే వరకు జరుగుతూ ఉన్న పరిణామ ప్రక్రియనే మానవ పరిణామం అంటారు. ఇతర మొక్కలు, జంతువులన్నింటి వలెనే మనకు కూడా పరిణామ చరిత్ర ఉంది. ఆదిమానవుని వలె కనిపించే జీవులు 7 లక్షల 50 వేల సంవత్సరాలకు పూర్వమే ఉండేవారు. మానవులకు (హోమో సెపియన్స్) చెందిన అతి పురాతన శిలాజం భూమిపై మానవుల ఉనికి 2 లక్షల 50 వేల సంవత్సరాలకు పూర్వమే ఉన్నట్లు తెలుపుతున్నది.

మానవ పరిణామ క్రమం :
హోమో హెబిలస్ – 1.6 – 2.5 మిలియన్ సంవత్సరాల పూర్వం నివసించేవారు.
హోమో ఎరెక్షన్ – 1-1.8 మిలియన్ సంవత్సరాల పూర్వం నివసించేవారు.
హోమో సెపియన్స్ నియండర్తలెన్సిస్ – 2.3-3 లక్షల సంవత్సరాల క్రితం నివసించేవారు.
హోమో సియన్స్ (ప్రస్తుత మానవులు) – 40 వేల సంవత్సరాల పూర్వం నుండే నివసిస్తున్నారని తెలియుచున్నది.

ప్రశ్న 23.
పరిణామక్రమంలో మానవ వలస ప్రయాణం తెలపండి. (లేదా) మానవులలోని వేరు వేరు జాతులు ఒకే జాతి నుండి పరిణామం చెందాయని ఎలా చెప్పగలవు?
జవాబు:

  1. మానవులంతా ఆఫ్రికా నుండి వచ్చినవారే! మానవుల అతిపురాతన జీవులు హెమో సెపియన్స్ అక్కడే కనుగొనబడ్డారు.
  2. మన జన్యు సమాచారం కూడా ఆఫ్రికన్ మూలాలనే సూచిస్తోంది.
  3. అంటే రెండు మిలియన్ సంవత్సరాల పూర్వం అక్కడే మానవులుండేవారు. తర్వాతే వివిధ కారణాలతో మన పూర్వీకులు ఆఫ్రికాను వదిలి బయటకు వచ్చారు. కొందరేమో అక్కడే ఉండిపోయారు.
  4. వలసకు బయలుదేరిన వారు ఆఫ్రికా నుండి ఆసియా, తరవాత ఆసియా మధ్యభాగం, యురేషియా, దక్షిణ ఆసియా, తూర్పు ఆసియా అలా చేరుకున్నారు.
  5. వారిలో కొందరు ఇండోనేషియా దీవుల నుండి ప్రయాణిస్తూ ఫిలిప్పైన్స్ మీదుగా ఆస్ట్రేలియా చేరారు.
  6. అలాగే బేరింగ్ జలసంధి దాటి అమెరికా చేరుకున్నారు.
  7. వారంతా ఒకే దారిలో లేదా ఒకే కాలంలో పయనించలేదు. కేవలం ప్రయాణించాలనే ప్రయాణించలేదు. అప్పటి అవసరాలు, కారణాలు వారు ప్రయాణించేలా పురికొల్పి ఉంటాయి.
  8. ముఖ్యంగా ముందుకు, వెనుకకు, గుంపులుగా, ఒకసారి కొంత కొంత మంది వేరవుతూ, ఒకరికొకరు విడిపోతూ ఆఫ్రికా నుండి దూరంగా, ఆఫ్రికాలోనికి అలా ప్రయాణించారు.

ప్రశ్న 24.
ఒక ప్రయోగంలో F1 తరంలో అన్ని గుండ్రని పసుపు విత్తనాలు ఏర్పడినాయి (Yy Rr). F2 తరంలో గుండ్రని పసుపు (YYRr లేదా YY RR), గుండ్రని ఆకుపచ్చ (vy RRor YyRr), ముడతలు పడిన పసుపు (Yyrr లేదా YYrr) ముడతలు పడిన ఆకుపచ్చ (vy rr) గింజలు వచ్చాయి.
జవాబు:
1. ఒక్కొక్క రకం మొక్కలు ఎంతెంత శాతం ఏర్పడినవి?
గుండ్రని పసుపు గింజల మొక్కలు : 9 %
ముడతలు పడిన పసుపు గింజల మొక్కలు : 3%
గుండ్రని ఆకుపచ్చ గింజల మొక్కలు : 3%
ముడతలు పడిన ఆకుపచ్చ గింజల మొక్కలు : 1% గా ఏర్పడినవి.
అంటే వీటి జన్యురూప నిష్పత్తి 9 : 3 : 3 : 1 గా ఉంది.

2. ఏ మొక్కలు ఏర్పడటానికి ఎంత సంభావ్యత ఉందో కనుగొనగలరా?
ఔను. నాలుగు రకాల మొక్కలు 9:3:3:1 నిష్పత్తిలో ఏర్పడ్డాయి.

3. మెండల్ పరిశోధనలతో మీరు ఏకీభవిస్తున్నారా?
ఔను, మెండల్ పరిశోధనల ఫలితాలు కూడా ఇదే విధంగా ఉన్నాయి.

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

ప్రశ్న 25.
‘మానవుడు ఆఫ్రికా ఖండంలోనే మొదట జన్మించాడు’ అన్న అంశంపై మీ అనుమానాల నివృత్తి కొరకు మీరు ఒక చరిత్రకారుడిని కలిసినపుడు మీరు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు?
జవాబు:

  1. మానవ పరిణామము అనగానేమి?
  2. మానవుని పోలివుండే ఆదిమానవుడు ఎప్పుడు భూమిపై కనిపించడం జరిగినది?
  3. ఆదిమానవుడు ఎక్కడ జీవించాడు?
  4. ప్రస్తుత మానవ సమాజాలు ఎక్కడ నివసిస్తున్నప్పటికి వారి మూలాలు ఎక్కడ ఉన్నాయి?
  5. మానవులకు చెందిన అతిపురాతన శిలాజం భూమిపై మానవుల ఉనికి ఎప్పటి నుండి ఉందని చెపుతుంది?
  6. మానవజాతి అయిన ‘హోమోసెపియన్సు’ ఎన్ని సంవత్సరాల క్రితం నుండి నివసిస్తున్నారని తెలుస్తోంది?
  7. ఆఫ్రికా నుండి కొన్ని మానవ సమాజాలు ఎప్పుడు అక్కడ నుండి బయలుదేరినాయి?
  8. మానవులందరూ ఒకే మానవుని నుండి ఉద్భవించినారా?

ప్రశ్న 26.
మానవ పరిమాణ క్రమాన్ని ఫ్లోచార్ట్ ద్వారా చూపండి.
జవాబు:
మానవ పరిణామక్రమం (Human evolution) :
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 19

10th Class Biology 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు ½ Mark Important Questions and Answers

ఫ్లో చార్టులు

1.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 20
జవాబు:
పృథక్కరణ సూత్రం

2.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 21
జవాబు:
సూక్ష్మ పరిణామం

3.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 22
జవాబు:
అనువంశిక లక్షణాలు

4.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 23
జవాబు:
మనుగడ కోసం పోరాటం

5.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 24
జవాబు:
ఆహారం మరియు ఆశ్రయం కోసం వివిధ జాతుల మధ్య పోరాటం

6.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 25
జవాబు:
పురాజీవ శాస్త్ర నిదర్శనాలు

7.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 26
జవాబు:
అవశేషావయవాలు

8.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 27
జవాబు:
Tt

9.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 28
జవాబు:
బీజ ద్రవ్య సిద్ధాంతం

10.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 29
జవాబు:
Tt

11.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 30
జవాబు:
పసుపు, ముడతలు

సరైన గ్రూపును గుర్తించండి

12. మెండల్ ప్రయోగాల సంఘటనలు ఏవి వరుస క్రమంలో ఉన్నాయి?
A. స్వచ్ఛమైన జాతి ఎంపిక – స్వచ్చమైన మొక్కలను సంకరణం – F1 మొక్కలు స్వయం ఫలదీకరణం
B. F1 మొక్కలు స్వయం ఫలదీకరణం – F1 మొక్కలను సంకరణం చేయడం – మొత్తం F2 మొక్కలు శుద్ధ జాతీ
జవాబు:
గ్రూపు – A

13. మెండల్ ఏక సంకర సంకరణంలో ఏ గ్రూపు లక్షణాలు సరైనవి?
A. F1 లక్షణాలు : సమయుగ్మజ పొడవు, విషమ యుగ్మజ పొడవు
B. F2 లక్షణాలు : సమయుగ్మజ పొడవు, విషమ యుగ్మజ పొడవు, సమయుగ్మజ పొట్టి
జవాబు:
F2 లక్షణాలు

14. క్రింది వానిలో మెండల్ ప్రయోగానికి అనువైన బఠానీ మొక్కల లక్షణాలు ఏవి?
A. ఏక వార్షిక మొక్క ద్విలింగ పుష్పాలు, ఎక్కువ మొత్తంలో విత్తనాలు ఉత్పత్తి చేయడం.
B. ద్వివార్షిక మొక్క ఏకలింగ పుష్పాలు, తక్కువ మొత్తంలో విత్తనాలు ఉత్పత్తి చేయడం.
జవాబు:
గ్రూపు – A

15. బఠాణీ మొక్కల్లో మెండల్ అధ్యయనం చేసిన పరస్పర విరుద్ధ లక్షణాలు ఏవి ?
A. కాండం పొడవు – పొడవు & పొట్టి
పూల రంగు – ఎరుపు & నీలం
కాయ రంగు – ఆకుపచ్చ & పసుపు
B. కాండం పొడవు – పొడవు & పొట్టి
పూల రంగు – ఊదారంగు & తెలుపు
విత్తనం రంగు – పసుపు & ఆకుపచ్చ
జవాబు:
గ్రూపు – B

16. బరాణీ మొక్కల్లో దిగువ పేర్కొన్న ఏ గ్రూపు బహిర్గత లక్షణాలు?
A. పొడవైన, ఊదారంగు, గ్రీవ, గుండ్రని
B. పొట్టి, తెలుపు, శిఖరపు, ముడతలు
జవాబు:
గ్రూపు – A

17. ఈ దిగువ పేర్కొన్న ఏ సముదాయం అభిసారి పరిణామాన్ని సూచిస్తున్నాయి?
A. గబ్బిలం రెక్క – మానవుని చేయి
B. గబ్బిలం రెక్క – సీతాకోకచిలుక రెక్క
జవాబు:
గ్రూపు – B

18. దిగువ పేర్కొన్న ఏ మొక్క భాగాలు నిర్మాణ సామ్య అవయవాలు?
A. ముళ్ళు – నులి తీగలు & కొక్కేలు – ముళ్ళు
B. క్యారెట్ – బంగాళదుంప & మొక్క యొక్క ఆకు – ఒపర్షియా యొక్క కాండం
జవాబు:
గ్రూపు – A

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

19. దిగువ పేర్కొన్న ఏ జీవులు లామార్క్ వాదానికి చెందినవి?
A. ఫించ్ పక్షులు, సాల్మన్ చేపలు
B. జిరాఫీ, పాములోని చలనాంగాలు
జవాబు:
గ్రూపు – B

20. దిగువ పేర్కొన్న ఏ సముదాయం పరిణామానికి సంబంధించిన స్వరూప శాస్త్ర నిదర్శనాలు కావు?
A. నిర్మాణసామ్య అవయవాలు, క్రియాసామ్య అవయవాలు
B. శిలాజాలు, పిండ దశలు
జవాబు:
గ్రూపు – B

21. దిగువ పేర్కొన్న ఏ గ్రూపు మానవ పరిణామం సరైన క్రమంలో ఉన్నది?
A. హోమో హెబిలిస్ – హోమో ఎరెక్టస్ – హోమో సెపియన్స్ నియాండర్తాలెన్సిస్ – హోమో సెపియన్స్
B. హోమో ఎరెక్టస్ – హోమో హెబిలిస్ – హోమో సెపియన్స్ – హోమో సెపియన్స్ నియాండర్తాలెన్సిస్
జవాబు:
గ్రూపు – A

22. దిగువ పేర్కొన్న ఏ పరిస్థితి వారసత్వంగా సంక్రమిస్తుంది?
A. రెక్కల పురుగు జనాభాలో బరువు తగ్గడం
B. ఎర్ర రెక్కల పురుగు నుండి ఉత్పరివర్తన ఆకుపచ్చ రెక్కల పురుగు ఉద్భవం
జవాబు:
B

23. దిగువ పేర్కొన్న ఏ వైవిధ్యం ప్రకృతి వరణానికి దారి తీస్తుంది?
A. బీజకణ వైవిధ్యం
B. శారీరక కణాల వైవిధ్యం
జవాబు:
A

24. దిగువ పేర్కొన్న ఏ గ్రూపు అవశేష అవయవాలు?
A. గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, చర్మం
B. జ్ఞాన దంతాలు, ఉండుకం, బాహ్య చెవి కండరాలు, పురుషుల శరీరం మీద వెంట్రుకలు
జవాబు:
గ్రూపు – B

25. దిగువ పేర్కొన్న వాటిలో ఏవి శిలాజాలుగా సంరక్షించ బడుతున్నాయి?
A. బాహ్య అస్థిపంజరం, ఎముకలు, దంతాలు, వెంట్రుకలు
B. కండరాలు, నాలుక, చర్మం, గోళ్లు
జవాబు:
గ్రూపు – A

26. శిలాజాల వయస్సును లెక్కించడానికి ఏ సమూహ ఐసోటోపులను ఉపయోగిస్తారు?
A. ఆక్సిజన్, హైడ్రోజన్, సల్ఫర్
B. కార్బన్, యురేనియం, పొటాషియం
జవాబు:
గ్రూపు – B

ఉదాహరణలు ఇవ్వండి

27. సమయుగ్మజ పొడవు యొక్క జన్యురూపం TT. పొట్టి మొక్క యొక్క జన్యు రూపం ఏమిటి ?
జవాబు:
tt

28. పొడవు బఠాణి మొక్క యొక్క ఒక లక్షణం. దీనికి విరుద్ధమైన లక్షణం ఏమిటి?
జవాబు:
పొట్టి

29. సీతాకోకచిలుక మరియు దోమ యొక్క ముఖ భాగాలు నిర్మాణ సామ్య అవయవాలకు ఉదాహరణ. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
చిరుత మరియు మానవుడు యొక్క పూర్వాంగాలు

30. కీటకాల రెక్కలు మరియు పక్షి రెక్కలు క్రియాసామ్య అవయవాలకు ఉదాహరణ. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
సీతాకోకచిలుక రెక్కలు మరియు గబ్బిలం యొక్క రెక్కలు.

31. పెరిపీటస్, ఎకిడ్నా సంధాన సేతువులకు ఉదాహరణలు. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ఆర్కియోటెరిక్స్

32. ‘X’ స్త్రీ బీజం యొక్క లైంగిక క్రోమోజోము. పురుష లైంగిక క్రోమోజోముకు ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
X మరియు Y

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

33. డార్వినిజం అనేది పరిణామ సిద్దాంతాలలో ఒకటి. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
లామార్కిజం

34. 3: 1 ఏక సంకర సంకరణం యొక్క దృశ్యరూప నిష్పత్తి. ఏక సంకర సంకరణం యొక్క జన్యురూప నిష్పత్తి ఏమిటి?
జవాబు:
1 : 2 : 1

35. డోడో విలుప్త జీవికి ఉదాహరణ. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
డైనోసార్లు

36. స్వరూప శాస్త్రం, అంతర నిర్మాణ శాస్త్రం, పిండోత్పత్తి శాస్త్రం అనేవి పరిణామ సిద్ధాంతానికి సాక్ష్యాలను అందించే విజ్ఞానశాస్త్ర శాఖలు. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
పురాజీవశాస్త్రం

పోలికను గుర్తించుట

37. 44 : మానవులలో శారీరక క్రోమోజోములు : : ? : మానవులలో లైంగిక క్రోమోజోములు
జవాబు:
2

38. XX; స్త్రీలలో లైంగిక క్రోమోజోములు : : ? : పురుషులలో లైంగిక క్రోమోజోములు
జవాబు:
XY

39. X, Y : శుక్రకణాలు : : ? : అండం
జవాబు:
X

40. Tt : F1 తరం : : TT, Tt, tt 😕
జవాబు:
F2 తరం

41. ఎలుకలు : వీస్మన్ : : ఫించ్ పక్షులు 😕
జవాబు:
డార్విన్

42. ఉండుకం : అవశేష అవయవం : : తోకతో ఉన్న బేబీ 😕
జవాబు:
అటావిస్టిక్ అవయవం

43. TT: సమయుగ్మజ పొడవు : : ? : సమయుగ్మజ పొట్టి
జవాబు:
tt

44. యోగ్యతముల సార్లక జీవనం :: డార్విన్ : : ఆర్జిత లక్షణాల అనువంశికత 😕
జవాబు:
లామార్క్

45. బీజద్రవ్య సిద్ధాంతం : వీసమన్ : : An essay on the principles of population.
జవాబు:
మాల్టస్

46. నిటారైన మనిషి : నియాండర్తలెన్సిస్ : : ఆధునిక మానవుడు 😕
జవాబు:
హోమో సెపియన్స్

శాస్త్రవేత్తను గుర్తించండి

47. ఈయన ఆస్ట్రియా దేశానికి చెందిన మతగురువు. ఆయన దాదాపు 34 రకాలకు చెందిన 10000 బఠాణీ మొక్కలపై అధ్యయనం చేశారు. ఆయన ‘జన్యు శాస్త్ర పితామహుడు’ గా పేరొందాడు.
జవాబు:
గ్రెగర్ జోహన్ మెండల్

48. DNA అణువు సర్పిలంగా ఉండే మెట్ల మాదిరి ద్వంద్వ కుండలి ఆకారాన్ని కలిగి ఉంటుంది అని వీరు ఇరువురు కనుగొన్నారు.
జవాబు:
ఫ్రాన్సిస్ క్రీక్ & జేమ్స్ వాట్సన్

49. డ్రోసోఫిలాలో లింగ సహలగ్న లక్షణాలను వారు కనిపెట్టారు. డ్రోసోఫిలాలో వంశపారంపర్యత గురించి అధ్యయనం చేశారు.
జవాబు:
వాల్టర్ సటన్ & థామస్ హంట్ మోర్గాన్

50. పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించే మొదటి వ్యక్తి ఆయన. ఆర్జిత గుణాల అనువంశికత అనే పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
జవాబు:
జీన్ బాప్టిస్ట్ లామార్క్

51. ఆయన ‘ప్రకృతి వరణం’ అనే ప్రసిద్ధ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. HMS బీగిల్ అనే నౌకలో గాలాపాగస్ దీవులను సందర్శించి, ఫించ్ పక్షులలో వైవిధ్యాలను గమనించాడు.
జవాబు:
చార్లెస్ డార్విన్

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

52. ఆయన రాసిన పుస్తకం ‘Principles of geology’. భౌగోళిక మార్పులు క్రమబద్ధంగా జరుగుతాయి అని ప్రతిపాదించారు.
జవాబు:
చార్లెస్ లైల్

53. జనాభా గుణ శ్రేణిలో పెరుగుతుంటే (1, 2, 4, 8, …..) వాటి ఆహార అవసరాలు అంక శ్రేడి పద్దతిలో పెరుగుతున్నాయి. (1, 2, 3, 4, …..) అని వివరించాడు.
జవాబు:
మాల్టస్

54. ప్రకృతి వరణం కొత్త జాతుల పుట్టుకకు దోహద పడిందని స్వతంత్రంగా ప్రకృతి వరణం సిద్ధాంతాన్ని నిర్ధారించింది.
జవాబు:
ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలెస్

నేను ఎవరు?

55. నేను ఒక రకమైన పరిణామం, పెద్ద ఎత్తున మార్పులు సంభవించడం వలన కొత్త జాతులు ఏర్పడతాయి.
జవాబు:
స్థూల పరిణామం

56. ఆర్జిత గుణాలు దాని సంతానానికి అందజేయబడతాయి అని వివరించే లామార్క్ ప్రతిపాదించిన పరిణామ సిద్ధాంతాన్ని.
జవాబు:
ఆర్జిత గుణాల అనువంశికత

57. ఈ పరిణామ సిద్ధాంతం ప్రకారం సొమాటో ప్లాస్మాలో సంభవించే మార్పులు తరువాతి తరానికి సంక్రమించవు. కానీ బీజద్రవ్యంలో సంభవించే మార్పులు తరువాతి తరానికి సంక్రమిస్తాయి.
జవాబు:
బీజద్రవ్య సిద్ధాంతం

58. అవయవాలు ఒకే విధమైన నిర్మాణాన్ని కలిగి ఉండి, భిన్నమైన విధిని కలిగి ఉండటం అనే స్వరూప శాస్త్ర నిదర్శనాన్ని నేను.
జవాబు:
నిర్మాణ సామ్య అవయవాలు

59. మానవ శరీరంలోని కొన్ని అవయవాలు జీవక్రియల్లో ఎటువంటి పాత్ర కలిగి ఉండవు. పరిణామ క్రమంలో ఈ అవయవాలు పనిచేయకుండా పోయాయి.
జవాబు:
అవశేషావయవాలు

60. నేను శిలాజాలను అధ్యయనం చేసే విజ్ఞానశాస్త్ర విభాగాన్ని.
జవాబు:
పురాజీవశాస్త్రం

61. ఐసోటోపులు , కలిగియున్న రాయి లేదా మూలకాల వయసును ఈ పద్ధతి ద్వారా గణించవచ్చు.
జవాబు:
కార్బన్ డేటింగ్ పద్ధతి

62. నేను శీతాకాలం పంటను. లక్షణాలు వారసత్వంగా ఎలా వస్తాయో నిరూపించడానికి మెండల్ నన్ను తన ప్రయోగాలకు ఉపయోగించాడు. నా శాస్త్రీయ నామం ఏమిటి?
జవాబు:
పైసం సెటైవం

63. నేను అనువంశికత ప్రమాణాన్ని. మెండల్ నన్ను కారకంగా పిలిచాడు.
జవాబు:
జన్యువులు

64. జన్యువుల యొక్క అన్ని సంభావ్యతలను లెక్కించడానికి సహాయపడే ఒక రేఖాత్మక చిత్రరూపాన్ని?
జవాబు:
పన్నేట్ స్క్వేర్

దోషాన్ని గుర్తించి, సరిచేసి రాయండి

65. విభిన్న లక్షణాలు తల్లిదండ్రుల నుండి సంతతి పొందే ప్రక్రియను వంశపారంపర్యం అంటారు.
జవాబు:
విభిన్న లక్షణాలు తల్లిదండ్రుల నుండి సంతతి పొందే ప్రక్రియను అనువంశికత అంటారు.

67. ఒక జత విభిన్న లక్షణాలు గల రెండు బఠాణీ మొక్కల మధ్య సంకరణం చేయడాన్ని ద్విసంకర సంకరణం అని అంటారు.
జవాబు:
ఒక జత విభిన్న లక్షణాలు గల రెండు బఠాణీ మొక్కల మధ్య సంకరణం చేయడాన్ని ఏకసంకర సంకరణం అని అంటారు.

68. ఒక వ్యక్తి యొక్క లింగ నిర్ధారణలో సహాయపడే క్రోమో జోమ్ జతను శారీరక క్రోమోజోములు అని అంటారు.
జవాబు:
ఒక వ్యక్తి యొక్క లింగ నిర్ధారణలో సహాయపడే క్రోమోజోమ్ జతను లైంగిక క్రోమోజోములు అని అంటారు.

69. ఆర్తిత లక్షణాలు అనేవి ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమించే లక్షణాలు.
జవాబు:
అనువంశికత లక్షణాలు అనేవి ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమించే లక్షణాలు.

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

70. నిర్మాణ సామ్య అవయవాలు విభిన్న నిర్మాణం కలిగి మరియు ఒకే విధిని కలిగి ఉంటాయి.
జవాబు:
క్రియాసామ్య అవయవాలు విభిన్న నిర్మాణం కలిగి మరియు ఒకే విధిని కలిగి ఉంటాయి.

71. మానవులలో శిశువు యొక్క లింగ నిర్ధారణ అనేది స్త్రీ బీజము యొక్క రక్తాన్ని బట్టి నిర్ణయింపబడుతుంది.
జవాబు:
మానవులలో శిశువు యొక్క లింగ నిర్ధారణ అనేది పురుష బీజము యొక్క రక్తాన్ని బట్టి నిర్ణయింపబడుతుంది.

72. బీజ కణాలు ఏర్పడేటప్పుడు ఒక జత లక్షణాలకు కారణమైన కారకాలు వేరే లక్షణాలపై ఆధారపడకుండా స్వతంత్రంగా సంతతికి లభించడాన్ని బహిర్గతత్వ సూత్రం అంటారు.
జవాబు:
బీజ కణాలు ఏర్పడేటప్పుడు ఒక జత లక్షణాలకు కారణమైన కారకాలు వేరే లక్షణాలపై ఆధారపడకుండా స్వతంత్రంగా సంతతికి లభించడాన్ని స్వతంత్ర జన్యు
వ్యూహన సిద్దాంతం అంటారు.

73. ఒక జీవి అండం మొదలుకొని సంపూర్ణంగా ఎదగడం వరకు గల వివిధ అభివృద్ధి దశలను గురించిన అధ్యయనం చేయడాన్ని పురాజీవశాస్త్రం అంటారు.
జవాబు:
ఒక జీవి అండం మొదలుకొని సంపూర్ణంగా ఎదగడం వరకు గల వివిధ అభివృద్ధి దశలను గురించిన అధ్యయనం చేయడాన్ని పిండోత్పత్తి శాస్త్రం అంటారు. 66. మొక్కల పెంపకం, సంకరణం గురించి డార్విన్ తన ప్రయోగాల్లో ఇలా పేర్కొన్నాడు. అనువంశికత సూత్రాలను ఆయన ప్రతిపాదించారు. జ. మొక్కల పెంపకం, సంకరణం గురించి మెండల్ తన – ప్రయోగాల్లో ఇలా పేర్కొన్నాడు. అనువంశికత సూత్రాలను ఆయన ప్రతిపాదించారు.

74. ఒక జీవి యొక్క జీవిత కాలంలో అభివృద్ధి చేసుకున్న లక్షణాలను వంశపారంపర్య లక్షణాలుగా పిలుస్తారు.
జవాబు:
ఒక జీవి యొక్క జీవిత కాలంలో అభివృద్ధి చేసుకున్న లక్షణాలను ఆర్జిత లక్షణాలుగా పిలుస్తారు.

జతపరచుట

75. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
లామర్కిజం – లామార్క్
బీజద్రవ్య సిద్ధాంతం – మెండల్
డార్వినిజం – డార్విన్
జవాబు:
బీజద్రవ్య సిద్ధాంతం – మెండల్

76. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
ఉపయుక్త నిరుపయుక్త అవయవాలు – వీస్మన్
ఎలుకలపై ప్రయోగాలు – లామార్క్
ఫించ్ పక్షులలో వైవిధ్యం – డార్విన్
జవాబు:
ఫించ్ పక్షులలో వైవిధ్యం – డార్విన్

77. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
ముళ్ళు మరియు నులి తీగలు – క్రియాసామ్య అవయవాలు
క్యారెట్ మరియు అల్లం – నిర్మాణసామ్య అవయవాలు
ఆర్కియోటెరిక్స్ – సంధాన సేతువు
జవాబు:
ఆర్కియోటెరిక్స్ – సంధాన సేతువు

78. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
కార్బన్ డేటింగ్ – హైడ్రోజన్
జన్యుపదార్థం – DNA
కెటోసారస్ – శిలాజం
జవాబు:
కార్బన్ డేటింగ్ – హైడ్రోజన్

79. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
F1 తరం – TT, Tt, it
జనక తరం – Tr, it
F2 తరం – It
జవాబు:
జనక తరం – TT, tt

80. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
విషమయుగ్మజం – YY
సమయుగ్మజం – Yy
YY, Yy- యుగ్మ వికల్పాలు
జవాబు:
YYYy – యుగ్మ వికల్పాలు

81. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
దృశ్యరూపం – 3 : 1
జన్యురూపం – 1 : 2 : 1
పన్నేట్ స్క్వేర్ – డార్విన్
జవాబు:
పన్నేట్ స్క్వేర్ – డార్విన్

82. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
లైంగిక క్రోమోజోములు – 44
పురుష లైంగిక క్రోమోజోములు – X,Y
స్త్రీ లైంగిక క్రోమోజోములు – Y
జవాబు:
స్త్రీ లైంగిక క్రోమోజోములు – Y

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

83. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
పూల రంగు – నీలం
విత్తనం రంగు – పసుపు
కాయ రంగు – ఎరుపు
జవాబు:
విత్తనం రంగు – పసుపు

బొమ్మలపై ప్రశ్నలు

84.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 31
ఈ పటాలు దేనిని సూచిస్తున్నాయి?
జవాబు:
చెవి తమ్మెలలో వైవిధ్యాన్ని సూచిస్తున్నాయి.

85.
AP Board 10th Class Biology Solutions 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 13
ఈ కాయ సహాయంతో మొక్కను గుర్తించండి.
జవాబు:
బఠానీ మొక్క

86.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 2
ఈ చతురస్రము అభివృద్ధి చేసినది ఎవరు?
జవాబు:
ఆర్.సి. పన్నెట్

87.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 32
ఈ జన్యుపదార్థం యొక్క నిర్మాణం పేరేమిటి?
జవాబు:
ద్వికుండలిని నిర్మాణం

88.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 33
ఏరకమైన పరిణామ సిద్ధాంతాన్ని ఈ చిత్రం సూచిస్తుంది?
జవాబు:
బీజ ద్రవ్య సిద్ధాంతం

89.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 34
ఏ వర్గాలకు ఈ జీవి సంధాన సేతువుగా ఉంటుంది?
జవాబు:
సరీసృపాలు మరియు పక్షులు

90.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 6
తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రదేశంలో ఈ శిలాజాన్ని భద్రపరచారు?
జవాబు:
BM బిర్లా సైన్స్ సెంటర్, హైదరాబాదు

91.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 35
లాగూర్క్ ప్రతిపాదించిన సూత్రం ఏమిటి?
జవాబు:
కణాల అనువంశికత

92.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 37
ఈయన ప్రతిపాదించిన పరిణామ సిద్ధాంతం పేరు?
జవాబు:
ప్రకృతివరణం

93.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 36
ఈయన ఏ శాస్త్రానికి పితామహుడు?
జవాబు:
పురాజీవశాస్త్రం

ఖాళీలను పూరించండి

94. జీవుల మధ్య గల స్యల ను…………
జవాబు:
వైవిధ్యం

95. జీవుల లక్షణాలు తరువాతి తరానికి సంక్రమించడాన్ని ……….. అంటారు.
జవాబు:
అనువంశికత

96. జన్యుశాస్త్ర పితామహుడు ……………
జవాబు:
మెండల్

97. బఠానీ మొక్క శాస్త్రీయ నామం ………..
జవాబు:
పైసమ్ సటైవమ్

98. ఏక సంకరణ ప్రయోగ దృశ్యరూప నిష్పత్తి
జవాబు:
3 : 1

99. ………. శాస్త్రం శిలాజాలను అధ్యయనం చేస్తుంది.
జవాబు:
జన్యుశాస్త్రం

10th Class Biology 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 1 Mark Bits Questions and Answers

1. గాలాపాగన్ దీవులలోని ఈ జీవుల నిర్మాణంలోని వైవిధ్యాలను డార్విన్ గుర్తించాడు
A) ఏనుగులు
B) జిరాఫీలు
C) ఎలుకలు
D) ఫించ్ పక్షులు
జవాబు:
D) ఫించ్ పక్షులు

2. క్రింది పటంలోని జీవుల శరీర భాగాలు ……… కు ఉదాహరణ.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 41
A) నిర్మాణ సామ్య అవయవాలు
B) క్రియాసామ్య అవయవాలు
C) సహజాత అవయవాలు
D) పైవేవీ కావు
జవాబు:
A) నిర్మాణ సామ్య అవయవాలు

3. జాతుల ఉత్పత్తి (The Origin of Species) రచయిత ………
A) ఛార్లెస్ డార్విన్
B) బాప్టిస్ట్ లామార్క్
C) ఛార్లెస్ లైల్
D) గ్రిగర్ జోహాన్ మెండల్
జవాబు:
A) ఛార్లెస్ డార్విన్

4. జెనిటిక్స్ పితామహుడు ….
(లేదా)
జన్యుశాస్త్ర పిత ఎవరు?
A) మెండల్
B) డార్విన్
C) వాట్సన్
D) లామార్క్
జవాబు:
A) మెండల్

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

5. DNA నిర్మాణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త
A) వాట్సన్
B) క్రిక్
C) పై ఇద్దరూ
D) వీరిద్దరూ కాదు
జవాబు:
A) వాట్సన్

6. పురా జీవశాస్త్రం దీని గురించి తెల్పుతుంది …………
A) ?
B) శిలాజాలు
C) విత్తనాలు
D) ఫలాలు
జవాబు:
B) శిలాజాలు

7. క్రింది వ్యాఖ్యలలో సరికానిది.
A) మాలాస్ సిద్ధాంతము ‘An Essay on the Principles of Population’ లో ఉంది.
B) జీవ పరిణామ సిద్ధాంతమును చార్లెస్ ఎల్ వ్రాశాడు.
C) ప్రకృతి వరణము అనే ప్రఖ్యాత సిద్ధాంతమును
D) “ఆర్జిత గుణాల అనువంశికత” అనే సిద్ధాంతాన్ని లామార్క్ ప్రతిపాదించాడు.
జవాబు:
B) జీవ పరిణామ సిద్ధాంతమును చార్లెస్ ఎల్ వ్రాశాడు.

8. ఒక సమయుగ్మజ పొడవు మొక్కను, ఒక సమయుగ్మజ పొట్టి మొక్కతో సంకరీకరణం జరిపినప్పుడు F1 తరంలో జన్యురూప నిష్పత్తి
A) 2 : 1 : 1
B) 1 : 1 : 2
C) 1 : 2: 1
D) 2 : 2 : 2
జవాబు:
C) 1 : 2: 1

9. క్రింది వాటిని జతపరుచుము.
1. DNA ( ) a. జన్యుశాస్త్ర పిత
2. మెండల్ ( ) b. ప్రకృతి వరణం
3. డార్విన్ ( ) c. ద్వికుండలి
A) 1 – a, 2 – b, 3 – c
B) 1 – b, 2 – c, 3 – a
C) 1 – c, 2 – b, 3 – a
D) 1 – c, 2 – a, 3 – b
జవాబు:
D) 1 – c, 2 – a, 3 – b

10. క్రింది వాటిలో మెండల్ తన ప్రయోగాలకు బరానీ
A) స్పష్టమైన లక్షణాలు కలిగి ఉండడం
B) ద్విలింగ పుష్పాలు కలిగి ఉండడం
C) ఆత్మపరాగ సంపర్కం జరపడం
D) తక్కువ ఖరీదు
జవాబు:
D) తక్కువ ఖరీదు

11. కింది వానిలో డార్విన్ సిద్ధాంతంకు సంబంధించనిది.
A) ఒక సమూహంలోని అన్ని జీవులు ఒకే రకంగా ఉండవు.
B) వైవిధ్యాలు జనకుల నుండి సంతతికి అందవచ్చు.
C) పరిణామం నెమ్మదిగా, నిరంతరాయంగా జరుగుతుంది.
D) జనాభా గుణ శ్రేణిలో పెరగదు.
జవాబు:
D) జనాభా గుణ శ్రేణిలో పెరగదు.

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

12. క్రియాసామ్య అవయవాలు
A) మేక పూర్వాంగం మరియు పక్షి రెక్క
B) తిమింగలం వాజం మరియు పక్షి రెక్క
C) మనిషి చేయి మరియు పక్షి రెక్క
D) గబ్బిలం రెక్క మరియు పక్షి రెక్క
జవాబు:
D) గబ్బిలం రెక్క మరియు పక్షి రెక్క

13. i) చాలా దగ్గర సంబంధం గల జీవులలో వైవిధ్యాలు కనిపిస్తాయి.
ii) జనకులు తమ యుగ్మ వికల్పాలలోని ఏదో ఒక యుగ్మ వికల్పాన్ని యధేచ్చగా సంతతికి అందిస్తారు. చార్లెస్ డార్విన్ ప్రతిపాదించాడు.
A) (i) సరైనది; (ii) సరైనది.
B) (i) సరికాదు; (ii) సరికాదు.
C) (i) సరైనది; (ii) సరికాదు.
D) (i) సరికాదు; (ii) సరైనది.
జవాబు:
A) (i) సరైనది; (ii) సరైనది.

14. బరానీ మొక్క నందు కింది ఏ లక్షణాన్ని మెండల్ ఎంపిక చేయలేదు?
A) విత్తనం రంగు
B) పుష్పం ఉన్న స్థానం
C) విత్తన బరువు
D) కాండం పొడవు
జవాబు:
C) విత్తన బరువు

15. ప్రకృతి వరణం అనగా ………..
A) ప్రకృతి యోగ్యత కలిగిన లక్షణాలను ఎంపిక చేయడం
B) ఉపయోగం లేని లక్షణాలను ప్రకృతి ఎంపిక మొక్కను ఎంపిక చేసుకోవడానికి కారణం కానిది చేయడం
C) ప్రకృతి యోగ్యత కల్గిన లక్షణాలను వ్యతిరేకించడం
D) పైవేవి కావు
జవాబు:
A) ప్రకృతి యోగ్యత కలిగిన లక్షణాలను ఎంపిక చేయడం

16. మెండల్ ఏక సంకరణ ప్రయోగాలలో F2 తరంలో దృశ్యరూప నిష్పత్తి
A) 2: 1 : 1
B) 1 : 2 : 1
C) 3 : 1
D) 9 : 3 : 3 : 1
జవాబు:
C) 3 : 1

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

17. కింది వాటిలో సరయిన జతను గుర్తించండి.
A) గ్రిగర్ జోహన్ మెండల్ – పృథక్కరణ సూత్రం
B) జీన్ బాప్టిస్ట్ లామార్క్ – ప్రకృతి వరణం
C) చార్లెస్ డార్విన్ – ఆర్జిత గుణాల అనువంశికత
D) అగస్ట్ వీస్మాన్ – జనాభా సిద్ధాంతం
జవాబు:
A) గ్రిగర్ జోహన్ మెండల్ – పృథక్కరణ సూత్రం

మీకు తెలుసా?

• మెండల్ చేసిన ప్రయోగాలకు ఉదాహరణలు

మెండల్ ఏ ప్రయోగం చేసినా దానికి సంబంధించిన అంశాలన్నింటినీ ఎప్పటికప్పుడు రాసిపెట్టుకునేవాడు. కింది అంశాలను పరిశీలిస్తే మెండల్ ఎన్ని ప్రయోగాలు నిర్వహించాడో, ఎన్ని ఫలదీకరణలు జరిపాడో, ఎన్ని మొక్కలపై ప్రయోగాలు చేశాడో మనం తెలుసుకోవచ్చు.

  1. మొదటి ప్రయోగం 15 మొక్కలపై 60 ఫలదీకరణలు.
  2. రెండవ ప్రయోగం 10 మొక్కలపై 58 ఫలదీకరణలు
  3. మూడవ ప్రయోగం 10 మొక్కలపై 35 ఫలదీకరణలు
  4. నాల్గవ ప్రయోగం 10 మొక్కలపై 40 ఫలదీకరణలు.
  5. ఐదవ ప్రయోగం 5 మొక్కలపై 23 ఫలదీకరణలు
  6. ఆరవ ప్రయోగం 10 మొక్కలపై 34 ఫలదీకరణలు
  7. ఏడవ ప్రయోగం 10 మొక్కలపై 37 ఫలదీకరణలు.

AP Board 10th Class Biology Solutions 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 13
మెండల్ ఎన్నో రకాలుగా ప్రయోగాలు నిర్వహించినప్పటికి వాటినన్నిటిని క్రోడీకరించి ఒక సాధారణ రూపంలోనికి మార్చడాన్ని మనం గమనించవచ్చు.

• బఠానీ ఏకవార్షిక మొక్క. ఇది తన జీవిత చక్రాన్ని ఒక సంవత్సరంలో పూర్తి చేస్తుంది. ప్రపంచంలో అనేక ప్రాంతాలలో బఠానీ సులభంగా పెరగగలుగుతుంది. క్రీ.పూ. 2000 సం॥లో ఆఫ్ఘనిస్తాన్లో బఠానీ ఉన్నట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. క్రీ.పూ. 2250 – 1750 కాలంలో హరప్ప ప్రస్తుత పాకిస్తాన్ వాయవ్య భారతదేశ ప్రాంతంలో బఠానీని పండించినట్లుగా రుజువులున్నాయి. అలాగే గంగానదీ పరివాహక ప్రాంతంలోని దక్షిణ భారతదేశంలోని బఠానీ పంట పండించేవారు. దీనిలో విటమిన్ ‘ఎ, సి, ఇ, కె మరియు బి కాంప్లెక్స్’లు Ca, Fe, Mg, Mn, P, S మరియు Zn లవణాలు కూడా ఉన్నాయి.

• జేమ్స్ వాట్సన్ మరియు ఫ్రాన్సిస్ క్రిక్ అనే శాస్త్రవేత్తలు 1953లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చేసిన పరిశోధనల్లో DNA యొక్క పూర్తి నిర్మాణాన్ని కనుగొన్నారు. DNA అణువు సర్పిలంగా ఉండే మెట్ల మాదిరిగా ఉంటుందని గుర్తించారు.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 18

ఈ ఆకారాన్నే ద్వంద్వ కుండలి (Double helix) అని అంటారు. ఇది ఏకాంతరంగా అమర్చబడిన చక్కెరలు మరియు ఫాస్ఫేట్లతో నిర్మితమై ఉంటుంది. దీనిలో అడినిన్, గ్వానిస్, థైమిన్ మరియు సైటోసిన్ అనే నత్రజని క్షారాలు మెట్లవలె అమరి ఉంటాయి. ఫ్రాంక్లిన్ మరియు మౌరిస్ విల్కిన్లు కూడా DNA ఆవిష్కరణలో వాట్సన్, లతో కలిసి పనిచేశారు. జన్యుశాస్త్రంలో నూతన ప్రయోగాలకు దారితీసిన ఈ అద్భుత ఆవిష్కరణకు గాను వాట్సన్ మరియు క్రిక్స్ బృందానికి నోబెల్ బహుమతి వచ్చింది. DNA యొక్క రసాయనిక స్వభావం జీవులలో లక్షణాలను నిర్ధారిస్తుంది. జుట్టు, చర్మపు రంగు మొదలైనవి ఇలాంటి లక్షణాలకు ఉదాహరణలు. DNA యొక్క రసాయనిక నిర్మాణంలో ఏ చిన్న మార్పు కలిగినా అది సంతతి యొక్క లక్షణాలలో మార్పుకు కారణమవుతుంది. ఆ మార్పులే వైవిధ్యాలకు దారితీస్తాయి.

• లైంగిక క్రోమోజోమ్ ఆవిష్కరణ :
వాల్టర్ స్టటన్ మరియు థామస్ హంట్ మోర్గాన్లు 1956వ సంవత్సరంలో చిన్న పండ్ల ఈగ –సోఫిలా మెలనోగాస్టర్) గురించి కొలంబియా యూనివర్సిటీలో అధ్యయనం చేశారు. గ్రాసోఫిలాలో లింగ సహలగ్నత లక్షణాలను కనుగొనేటప్పుడు లక్షణాలకు కారణమయ్యే జన్యువులు క్రోమోజోమ్ లో ఉన్నట్లు నిర్ధారించబడినది. డ్రాసోఫిలాలలోని వంశపారంపర్యత గురించి వాళ్ళు పూర్తిగా అధ్యయనం చేశారు.

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 38
• చారెస్ డార్విన్, ఆల్బెడ్ రస్పెల్ వాలెట్ల ఆలోచనలు ఒకేలా ఉండేవి. డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని రూపొందిస్తున్న సమయంలో వాలెస్ రాసిన ఉత్తరాన్ని అందుకున్నాడు. వాలెస్ ఇండోనేషియా దీవులలో తన పరిశోధనల గురించి, ప్రకృతి వరణం గురించి రాశాడు. తాను ఆలోచించినట్లుగానే వాలెస్ సిద్ధాంతం కూడా ఉండటం డార్విన్‌ను చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. తరవాత డార్విన్, వాలెస్ కలిసి Journal of Linnaean Society పత్రికలో ప్రకృతి వరణం గురించి ఒక వ్యాసాన్ని ప్రచురించారు.
దాని తరవాతే డార్విన్ తన ప్రముఖమైన గ్రంథం ‘జాతుల | ఆల్ఫ్రెడ్ రస్సెల్ ఉత్పత్తి (The Origin of Species)’ ప్రచురించి, ప్రకృతి వరణం గురించి వివరించాడు.

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 40
• ఆర్కియోప్టెరిక్స్ అనే సంధాన సేతువు దేనిని పోలి ఉంటుంది. పక్షులనా? సరీసృపాలనా? లేదా రెండింటినా? రెండు విభిన్న సమూహాలకు చెందిన లక్షణాలను కలిగి ఉండే జీవులను సంధాన సేతువులు అంటారు. ఆర్కియోప్టెరిక్స్ యొక్క శిలాజం పక్షులు, సరీసృపాల నుండి పరిణామ క్రమంలో ఉద్భవించాయని తెలియజేస్తుంది. అందువల్ల దీనిని పక్షులకు, సరీసృపాలకు మధ్య సంధానంగా భావిస్తారు.

పునశ్చరణ

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 39

AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం

These AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం will help students prepare well for the exams.

AP Board 10th Class Biology 7th lesson Important Questions and Answers జీవక్రియలలో సమన్వయం

10th Class Biology 7th lesson జీవక్రియలలో సమన్వయం 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
ఆవు వంటి జంతువులలో వ్యతిరేక దిశలో పెరిస్టాలిసిస్ జరగకపోతే ఏమవుతుంది?
జవాబు:
ఆవులు ఆహారాన్ని త్వరగా నమిలి మ్రింగి తీరిక సమయంలో తిరిగి నోటిలోనికి తెచ్చుకొని నెమరువేస్తాయి. వ్యతిరేక పెరిస్టాలిసిస్ జరగకపోతే ఈ నెమరువేయు ప్రక్రియ జరగదు.

ప్రశ్న 2.
ఆహారవాహికలో శ్లేష్మం లేకపోతే ఏం జరుగుతుంది?
జవాబు:
ఆహారవాహికలో శ్లేష్మం లేకపోతే :

  1. పెరిస్టాలిటిక్ చలనముకు అవరోధం ఏర్పడును.
  2. ఆహారపు బోలస్, జారడంకు కష్టమగును.
  3. ఆహారం మ్రింగడం కష్టతరమగును.
  4. ఆహారవాహిక గోడలు దెబ్బతినును.
  5. వివిధ గాడతలు గల ఆహార పదార్థాల నుండి ఆహారవాహిక రక్షించబడదు.

ప్రశ్న 3.
క్రింది పట్టికను పూరించండి.
జవాబు:

జీర్ణాశయంలో స్రవించబడే హార్మోనులు విధులు
గ్రీలిన్ ఆకలి కోరికలు ప్రేరేపించుట
లెఫ్టిన్ ఆకలి కోరికను తగ్గించుట

ప్రశ్న 4.
జీర్ణమైన ఆహారాన్ని శోషించుకునే చిన్న ప్రేగు యొక్క భాగమేది?
జవాబు:
సూక్ష్మచూషకాలు (విల్లి)

ప్రశ్న 5.
పిండిపై లాలాజలం యొక్క చర్యలో ఉపయోగించు రసాయనం ఏది?
జవాబు:
అయోడిన్ ద్రావణం

AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం

ప్రశ్న 6.
మీ తరగతి గదిలో ఆహార వాహిక నందు జరిగే పెరిస్టాలిటిక్ చలనంను అర్థం చేసుకోవడానికి నిర్వహించిన కృత్యంలో ఉపయోగించిన పరికరాలు ఏవి?
జవాబు:
పెరిస్టాలిటిక్ చలన కృత్యంలో ఉపయోగించిన పరికరాలు : సైకిల్ ట్యూబ్, బంగాళదుంప, నూనె.

ప్రశ్న 7.
ఆహారవాహికలో పెరిస్టాల్టిక్ చలనం లేకపోతే ఏం జరగవచ్చు?
జవాబు:
1. ఆహారమును మింగలేము
(లేదా)
2. ఆహారము జీర్ణాశయమునకు చేరదు.

ప్రశ్న 8.
జీర్ణక్రియ అనగానేమి?
జవాబు:
జీర్ణక్రియ:
సంక్లిష్ట ఆహారపదార్థాలను, రక్తంలో శోషణ చెందే సరళ పదార్థాలుగా మార్చే ప్రక్రియను “జీర్ణక్రియ” అంటారు.

ప్రశ్న 9.
జీర్ణక్రియలో ఏ ఏ జీవక్రియల సమన్వయం పరిశీలించవచ్చు?
జవాబు:
మన శరీరంలో అనేక జీవక్రియలు పరస్పరం సమన్వయంతో పనిచేస్తాయి.
ఉదా : జీర్ణక్రియ జరగటానికి నాడీవ్యవస్థ, అంతస్రావీ వ్యవస్థ, రక్తప్రసరణ వ్యవస్థ, కండర వ్యవస్థలు సమన్వయంగా పనిచేస్తాయి.

ప్రశ్న 10.
ఆకలి సంకేతాలు మెదడులోని ఏ భాగాన్ని చేరతాయి?
జవాబు:
జీర్ణాశయంలో ఉత్పత్తి అయిన ఆకలి సంకేతాలు, పదవ కపాలనాడి ‘వేగస్ నాడి’ ద్వారా మెదడులోని ‘డైయన్ సెఫలాన్’ను చేరతాయి.

ప్రశ్న 11.
రుచులలో భేదం ఎలా కల్గుతుంది?
జవాబు:
ఆహారపదార్ధాలలోని రసాయన స్వభావాన్ని బట్టి వివిధ రుచులు ఏర్పడతాయి. తీపి, ఉప్పు, పులుపు, చేదు వంటి రుచులు ఆహారపదార్థంలోని రసాయన భేదాలను బట్టి ఏర్పడతాయి.

ప్రశ్న 12.
ఆహారం రుచిని కనుగొనటంలో అంగిలి పాత్ర ఏమిటి?
జవాబు:
ఆహారం లాలాజలంలో కరిగినపుడు ద్రవస్థితికి మారుతుంది. నాలుక అంగిలిని నొక్కినపుడు ఆహారపదార్థం రుచి మొగ్గ యొక్క ద్వారాన్ని నొక్కి రుచిగుళికలలోనికి ప్రవేశిస్తాయి.

ప్రశ్న 13.
మానవ నోటిలో దంతాలు ఎన్ని రకాలు? అవి ఏవి?
జవాబు:
మానవ నోటిలో నాలుగు రకాల దంతాలు ఉంటాయి.
అవి 1. కుంతకాలు 2. రదనికలు 3. చర్వణకాలు 4. అగ్రచర్వణకాలు

ప్రశ్న 14.
చూర్ణం చేయటం అనగానేమి?
జవాబు:
చూర్ణం చేయటం :
నోటిలో దంతాలు ఆహారాన్ని విసరి, నమిలి, చిన్న ముక్కలుగా విచ్ఛిన్నం చేస్తాయి. ఈ విధానాన్ని “నమలడం లేదా చూర్ణం చేయటం” (Mastication) అంటారు.

ప్రశ్న 15.
బోలస్ అనగా నేమి?
జవాబు:
బోలస్ :
నోటిలో ఆహారం ముక్కలు కాబడి, లాలాజలంతో కలసి మింగటానికి అనుకూలంగా జిగురు ముద్దలా మారుతుంది. దీనిని “బోలస్” (Bolus) అంటారు.

AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం

ప్రశ్న 16.
ఆహారంపై లాలాజలం చర్య ఏమిటి?
జవాబు:
లాలాజలంలో ‘ఏమైలేజ్ ‘ అనే ఎంజైమ్ పిండి పదార్థాన్ని చక్కెరగా మార్చుతుంది. పిండిపదార్ధం → చక్కెర

ప్రశ్న 17.
లాలాజలం యొక్క స్వభావం ఏమిటి?
జవాబు:
లాలాజలం క్షార స్వభావాన్ని కల్గి ఉంటుంది.

ప్రశ్న 18.
ఆహారవాహిక పని ఏమిటి?
జవాబు:
ఆహారవాహిక నోటిలోని ఆహారాన్ని జీర్ణాశయంలో చేర్చటానికి తోడ్పడుతుంది.

ప్రశ్న 19.
ఆహారవాహికలోని కదలికలను ఏమంటారు? (లేదా) పెరిస్టాలిసిస్ అనగానేమి?
జవాబు:
ఆహారం ప్రయాణించేటప్పుడు ఆహారవాహికలో అలల వంటి కదలికలు ఏర్పడతాయి. వీటినే ‘పెరిస్టాల్ చలనాలు’ అంటారు. ఈ ప్రక్రియను ‘పెరిస్టాల్‌ సిస్’ అంటారు.

ప్రశ్న 20.
జీర్ణాశయం రసాయనికంగా ఏ స్వభావం కల్గి ఉంటుంది?
జవాబు:
జీర్ణాశయ గోడలు జఠర రసాన్ని స్రవిస్తాయి. ఇది హైడ్రోక్లోరిక్ ఆమ్లం (HCI) కలిగి ఉండుట వలన జీర్ణాశయం రసాయనికంగా ఆమ్ల స్వభావాన్ని కల్గి ఉంటుంది.

ప్రశ్న 21.
కైమ్ (Chyme) అనగానేమి?
జవాబు:
క్రైమ్ :
జీర్ణాశయంలో ఆహారం పాక్షికంగా జీర్ణమై ద్రవంలా మారుతుంది. పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని “క్రైమ్” (Chyme) అంటారు.

ప్రశ్న 22.
సంవరిణి కండరం (Pyloric sphincter) ఎక్కడ ఉంటుంది? దాని పని ఏమిటి?
జవాబు:
జీర్ణాశయం నుండి ఆంత్రమూలం ప్రారంభమయ్యే ప్రాంతంలో సంవరిణీ కండరం ఉంటుంది. ఇది ఆంత్రమూలంలోనికి ప్రవేశించే ఆహారాన్ని నియంత్రిస్తుంది.

ప్రశ్న 23.
ఆహారవాహికలో వ్యతిరేక పెరిస్టాలిసిస్ ఎప్పుడు జరుగుతుంది?
జవాబు:

  1. నెమరు వేయు జంతువులలో వ్యతిరేక పెరిస్టాల్సస్ వలన ఆహారం జీర్ణాశయం నుండి నోటిలోనికి వచ్చి నెమరు వేయటం జరుగుతుంది.
  2. మానవులలో ఈ క్రియ ఆహారనాళానికి సరిపడని వ్యర్థ పదార్థాలను బయటకు పంపే రక్షణ ప్రతిచర్యగా ఉపయోగపడుతుంది.

ప్రశ్న 24.
జీర్ణక్రియలో పాల్గొనే కొన్ని హార్మోన్స్ పేర్లు తెలపండి.
జవాబు:
సెక్రిటిన్, కొలిసిస్టోకైనిన్ అనే హార్మోన్స్ జీర్ణక్రియలో పాల్గొంటాయి.

ప్రశ్న 25.
ఆంత్రచూషకాలు (Villi) అనగానేమి? వాటి పని ఏమిటి?
జవాబు:
చిన్న ప్రేగు గోడల లోపలి తలంలో వేల సంఖ్యలో వేళ్ళ వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని ఆంత్ర చూషకాలు (Villi) అంటారు. ఇవి శోషణ తల వైశాల్యం పెంచి, జీర్ణమైన ఆహారాన్ని శోషించుకొంటాయి.

ప్రశ్న 26.
శోషణ అనగానేమి?
జవాబు:
శోషణ :
జీర్ణమైన ఆహారం రక్తంలోనికి పీల్చుకోబడటాన్ని “శోషణ” అంటారు. ఇది చిన్నప్రేగులలో జరుగుతుంది.

ప్రశ్న 27.
రెండవ మెదడుగా దేనిని పరిగణిస్తున్నారు?
జవాబు:
ఆహారవాహిక నుండి పాయువు వరకు 9 మీటర్ల పొడవునా, జీర్ణవ్యవస్థకు అనుబంధంగా నాడీవ్యవస్థ వ్యాపించి ఉంది. దీనిని రెండవ మెదడుగా పరిగణిస్తున్నారు.

ప్రశ్న 28.
మలం అనగానేమి?
జవాబు:
మలం :
జీర్ణవ్యవస్థలో ఏర్పడిన వ్యర్థ పదార్థాలను “మలం” అంటారు. ఇది పాయువు ద్వారా విసర్జింపబడుతుంది.

ప్రశ్న 29.
కణాలకు శక్తి ఎలా లభిస్తుంది?
జవాబు:
జీర్ణక్రియ ద్వారా శోషించబడిన పోషకాలు కణాలలో ఆక్సీకరణం చెంది శక్తిని ఇస్తాయి.

AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం

ప్రశ్న 30.
అనియంత్రిత చర్యలు మెదడు ఏ భాగంలో నియంత్రించబడతాయి?
జవాబు:
శ్వాసక్రియ, హృదయస్పందన వంటి అనియంత్రిత చర్యలు స్వయంచోదిత నాడీవ్యవస్థ ద్వారా మెదడులోని మజ్జి ముఖం నియంత్రిస్తుంది.

ప్రశ్న 31.
‘ఆకలి కోరికలు’ ఎలా ఏర్పడతాయి?
జవాబు:
రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గినపుడు, జీర్ణాశయ గోడలు ‘గ్రీలిన్’ అనే హార్మోన్‌ను స్రవిస్తాయి. ఈ హార్మోన్ జీర్ణకోశంలో ఆకలి సంకేతాలను ఉత్పత్తి చేస్తుంది.

ప్రశ్న 32.
ఆకలి కోరికలు ఎలా నియంత్రించబడతాయి?
జవాబు:
మనకు కడుపు నిండుగా ఉండి ఇక ఎలాంటి ఆహారం అవసరం లేదు అనిపించినపుడు లెఫ్టిన్ అనే మరో హార్మోన్ స్రవించబడి ఆకలిని అణిచి వేస్తుంది.

ప్రశ్న 33.
మనం వాసన, రుచిని ఎలా గుర్తించగల్గుతాము?
జవాబు:
ముక్కులోని శ్లేష్మసరం ఓ పలుచని నీటిపొర కలిగి ఉంటుంది. మనం వాసన చూసినపుడు గాలిలో తేలియాడే వాసన పదార్ద అణువులు ఈ పొరలో కరుగుతాయి. ముక్కు మరియు నాలుకపై గల రసాయన గ్రాహకాలు లేదా ఘ్రాణ గ్రాహికలు (Olfactory receptors) సంకేతాలను నాడీ ప్రచోదాల రూపంలో మెదడుకు పంపుతాయి. మెదడు ఈ సంకేతాలను విశ్లేషించి వాసన మరియు రుచిని గుర్తిస్తుంది.

ప్రశ్న 34.
నిబంధిత, ఉద్దీపన, ప్రతిస్పందనలపై ప్రయోగాలు జరిపిన శాస్త్రవేత్తలు ఎవరు?
జవాబు:
రష్యాకు చెందిన ఇవాన్ పావ్లోవ్ నిబంధిత, ఉద్దీపన, ప్రతిస్పందనలపై ప్రయోగాలు చేశాడు. ఆహారం గురించి ఆలోచన వచ్చిన వెంటనే లాలాజలం ఊరటం ఒక నిబంధిత ఉద్దీపనకు ప్రతిస్పందన అని చెప్పాడు.

ప్రశ్న 35.
మనకు రోజూ నిర్దిష్ట సమయంలోనే ఎందుకు ఆకలి వేస్తుంది?
జవాబు:
మనం రోజూ నిరిష సమయానికి ఆహారం తీసుకోవటం వలన శరీర జీవక్రియలు దానికి అలవాటు పడిపోతాయి. ఇది ఒక నిబంధన సహిత ప్రతిచర్యగా మారి రోజూ అదే సమయానికి ఆకలివేస్తుంది.

ప్రశ్న 36.
మనకు జలుబు చేసినపుడు ఆహార రుచిని సరిగా గుర్తించలేము. ఎందుకు?
జవాబు:
రుచి జనం వాసనతో ముడిపడి ఉంది. జలుబు చేసినపుడు, శ్లేష్మసరంలోని అధిక శ్లేష్మం వలన వాసనను గుర్తించలేము. కావున రుచిని కూడ సరిగా ఆస్వాదించలేము.

ప్రశ్న 37.
మనం తినే ఆహారాన్ని, రుచిని ప్రభావితం చేయు అంశాలు ఏమిటి?
జవాబు:

  1. నోటిలోని తేమ
  2. అంగిలి నొక్కబడటం
  3. పదార్థ ఉష్ణోగ్రత
  4. పదార్థం యొక్క వాసన
  5. పదార్ధ రసాయన స్వభావం మొదలగు అంశాలు ఆహార రుచిని ప్రభావితం చేస్తాయి.

10th Class Biology 7th lesson జీవక్రియలలో సమన్వయం 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
రెండు ఆకుపచ్చని పత్రాలలో ఒక దానికి గ్రీజు రాసి ఉంచి, మరొకటి అలాగే వదిలేసి, ఆ రెండు ఆకులపై రెండు చుక్కల ఆమ్లం వేసిన ప్రయోగములో నీవు ఏమి గమనించెదవు?
జవాబు:

  1. గ్రీజు రాసిన ఆకు పై భాగం ఆమ్లం వలన దెబ్బతినలేదు. ఆమ్ల ప్రభావాన్ని గ్రీజు ఒక పొరలా ఉండి నిరోధించింది.
  2. గ్రీజు రాయని ఆకు ఆమ్ల ప్రభావం వలన దెబ్బతిని పాడైపోయింది.

ప్రశ్న 2.
మానవులలో ఉపజిహ్విక లేకపోతే ఏమి జరగవచ్చు?
జవాబు:

  1. కంఠబిలం ద్వారా స్వర పేటికలోనికి ఆహారం ప్రవేశిస్తుంది.
  2. ఊపిరితిత్తులలోనికి ఆహారం ప్రవేశిస్తుంది. దాని వల్ల ప్రాణాపాయం కలుగుతుంది.
  3. సరిగ్గా మాట్లాడలేము.
  4. గాలి, ఆహార మార్గాల నియంత్రణ సరిగ్గా జరగదు.

AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం

ప్రశ్న 3.
జీర్ణ వ్యవస్థలో ఏర్పడే సమస్యలను తెలుసుకొనుటకు గాస్ట్రో ఎంటరాలజిస్టు అడిగే ప్రశ్నలు నాలుగింటిని రాయండి.
జవాబు:

  1. మనకు ఆజీర్ణము ఎందుకు కలుగును?
  2. మనకు వాంతులు ఎందుకు కలుగుతాయి?
  3. మనకు త్రేన్పులు ఎందుకు కలుగుతాయి?
  4. మనకు అల్సర్స్ ఎందుకు కలుగుతాయి?
  5. మనకు కడుపులో మంట ఎలా కలుగుతుంది?

ప్రశ్న 4.
నోటిలో జరిగే జీర్ణక్రియలో కండరాల పాత్రను తెలపండి.
జవాబు:

  1. నోటిలో ఉండే వలయ కండరాలు ఆహారాన్ని నోటి కుహరంలో నెట్టడంలోనూ మరియు నోటిలో చుట్టూ కదిలించటంలోనూ సహాయపడతాయి.
  2. దవడలోని ఉపరితల కండరాలు ఆహారాన్ని దంతాల క్రిందకు నెట్టి, కొరకటం మరియు నమలటం వంటి క్రియలకు తోడ్పడతాయి.
  3. దవడలోని అంతర కండరాలు ఆహారం నమిలేటప్పుడు దవడను పైకి, క్రిందకు, ముందుకు, వెనుకకు కదిలించటంలో తోడ్పడతాయి.

ప్రశ్న 5.
నోటి జీర్ణక్రియలో పాల్గొనే వివిధ భాగాలు తెలపండి.
జవాబు:
దంతాలు ఆహారాన్ని నమలడం, విసరడంలో తోడ్పడితే నాలుక కదలికలు ఆహారాన్ని లాలాజలంతో కలుపుతూ నోటి కుహరంలో సమంగా విస్తరించడంలో తోడ్పడుతుంది. నోటి కండరాలు ఆహారాన్ని ఆస్యకుహరంలోకి నెట్టడానికి సహాయపడతాయి. 5వ కపాలనాడి దవడలోని అంతర కండరాల కదలికలను నియంత్రిస్తుంది.

ప్రశ్న 6.
పగలు నిద్రించినపుడు సొంగ (లాలాజలం) ఎందుకు కారుతుంది?
జవాబు:
నిశాచర జీవుల (Nocturnals) గురించి మీరు వినే ఉంటారు కదా! ఇవి రాత్రివేళలో చురుకుగా ఉంటాయి. అయితే మనం పగటివేళలో చురుకుగా ఉండి, రాత్రివేళలో విశ్రాంతి తీసుకుంటాం. శరీరంలోని వ్యవస్థలన్నీ మనం పని చేస్తున్నప్పుడు చురుకుగా ఉంటాయి. అందుకే మనిషిని దివాచరులు (Diurnal animals) అంటారు.

మన జీర్ణవ్యవస్థ పగటివేళలో చురుకుగా ఉండడం వలన అది ఆహారాన్ని స్వీకరించి జీర్ణక్రియ జరపడానికి సిద్ధంగా ఉంటుంది. అందుకే పగటివేళలో నిద్రిస్తే నోటి ద్వారా స్రవించే లాలాజలం తలదిండును తడుపుతుంది. కానీ రాత్రివేళలో ఇలా జరగదు. సాధారణంగా ఒక రోజులో మనం 1-1.5 లీటర్ల లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తాం.

ప్రశ్న 7.
ఆహారవాహికలో ఆహారం జారటానికి లాలాజలం ఎలా తోడ్పడుతుంది?
జవాబు:

  1. ఆహారనాళపు గోడలు జారుడు గుణంగల జిగురు పదార్థాన్ని స్రవిస్తాయి. దీనిని ‘శ్లేష్మం’ (Mucus) అంటారు.
  2. శ్లేష్మం చమురులా పనిచేస్తూ ఆహారవాహిక గోడలకు హాని జరగకుండా కాపాడుతుంది.
  3. దీని వలన ఆహార బోలస్ నూనెపూసిన బంగాళదుంపల్లా ఆహారవాహికలో సులభంగా కదులుతూ కిందికి జారుతుంది.
  4. దీనికి తోడుగా ఆహార బోలలోని లాలాజలం సులభంగా దానిని జీర్ణాశయంలోకి చేరవేయడంలో ఉపయోగకడుతుంది.

ప్రశ్న 8.
జీర్ణాశయంలో ఆహారం పొందే మార్పులు ఏమిటి?
జవాబు:
జీర్ణాశయంలో ఆహారం పొందే మార్పులు

  1. జఠర రసంతో చిలకబడి, ఆమ్ల స్వభావంగా మారుతుంది.
  2. జఠర రసంలోని రెనిన్ పాలపదార్థంపై పనిచేస్తుంది.
  3. లైపేజ్ క్రొవ్వులను జీర్ణం చేసి క్రొవ్వు ఆమ్లాలుగా మార్చుతుంది.
  4. పెప్సిన్ ప్రోటీన్స్ పైన పనిచేసి వాటిని పెప్టైడ్, పాలిపెప్టెడ్ గా మార్చుతాయి.

ప్రశ్న 9.
ఆంత్రమూలంలోనికి ప్రవేశించే ఆహారం ఎలా నియంత్రించబడుతుంది?
జవాబు:
జీర్ణాశయంలో జీర్ణక్రియ ముగింపు దశకు చేరుకునే సరికి జీర్ణాశయ గోడల సంకోచాలు తగ్గుముఖం పడతాయి. ఫలితంగా జీరాశయం చిన్న ప్రేగులోకి తెరుచుకునే భాగంలో గల సంవరిణీ కండరాన్ని (Pyloric sphincter) సంకోచం చెందిస్తుంది. అందువల్ల ఆంత్రమూలం లోపలికి దారి ఏర్పడి అసంపూర్ణంగా జీర్ణమైన ఆహారం కొద్దికొద్ది మోతాదుల్లో ఆంత్రమూలంలోకి విడుదలవుతుంది.

ప్రశ్న 10.
నెమరు వేయటం అనగానేమి? ఇది ఎలా జరుగుతుంది?
జవాబు:
కొన్ని శాఖాహార జంతువులు, విరామ సమయంలో, జీర్ణాశయం నుండి ఆహారాన్ని నోటిలోనికి తెచ్చుకొని తీరుబడిగా నమలుతాయి. ఈ ప్రక్రియను ‘నెమరు వేయుట’ అంటారు. ఆహారం దొరికినపుడు, నెమరువేయు జంతువులు ఆహారాన్ని పూర్తిగా నమలకుండా గబగబా మింగుతాయి. విరామ సమయంలో ఇవి ఆహారాన్ని నోటిలోనికి తెచ్చుకొంటాయి. ఈ ప్రక్రియలో ఆహారవాహికలోని కండరాలు వ్యతిరేక పెరిస్టాల్సినను జరుపుతాయి. అందువలన ఆహారం జీర్ణాశయం నుండి నోటిలోనికి వస్తుంది.

ప్రశ్న 11.
మానవ ఆహారనాళంలో వ్యతిరేక చలనం ఎప్పుడు జరుగుతుంది?
జవాబు:

  1. ఒకవేళ మనం చెడిపోయిన లేదా శరీరానికి సరిపడని ఆహారపదార్థాలు తిన్నప్పుడు జీర్ణక్రియా యంత్రాంగం దాన్ని గుర్తుపట్టి జీర్ణం చేయడానికి నిరాకరిస్తుంది.
  2. అనియంత్రిత నాడీవ్యవస్థ అధీనంలో పనిచేసే జీర్ణాశయ గోడలలో అలజడి ఏర్పడి, జీర్ణం కాని ఆహారంతోపాటు ‘క్రైమ్’ను కూడా బయటకు నెట్టివేస్తుంది.
  3. దీనినే మనం వాంతులుగా పరిగణిస్తాం. ఒక్కోసారి హఠాత్తుగా త్రేన్పులు కూడా (belching) వస్తుంటాయి.

ప్రశ్న 12.
పెద్దప్రేగులో మలం ఎలా ఏర్పడుతుంది?
జవాబు:

  1. అవసరమైన వ్యర్థ పదార్థాలు పెద్దప్రేగును చేరినపుడు దానిలోని నీటిని పెద్దప్రేగు గోడలు శోషిస్తాయి.
  2. పెరిస్టాలిసిస్ తరంగాలు వ్యర్థ పదార్థాలను పెద్ద ప్రేగు నుండి పురీషనాళంలోకి కదిలిస్తాయి.
  3. పెద్ద ప్రేగులోని కొలాన్ ఎడమ భాగం మలాన్ని నిలువ చేసే ట్యాంలా పనిచేస్తుంది. నీటిని పునఃశోషణం చెందుతుంది.
  4. మిగిలిన వ్యర్థాలు పెద్ద ప్రేగులోని చివరి భాగమైన పురీషనాళంలో నిలువ చేయబడతాయి.
  5. దుర్గంధంతో కూడిన ఈ పసుపు రంగులోని వ్యర్థాన్నే సాధారణంగా ‘మలం’ (Faecal matter) అంటాం.
  6. తదుపరి ఇది శరీరం నుండి పాయువు (Anus) ద్వారా బయటకు విసర్జింపబడుతుంది.

ప్రశ్న 13.
గుప్పెడు మిగిలిపోయిన తడి టీ పొడిని ఒక అద్దుడు కాగితంలో తీసుకొని ఒక ముద్దలా చేయండి. తరవాత దానిని సున్నితంగా ఒత్తి తెరిచి చూడండి. ‘ఏం గమనించారు? అద్దుడు కాగితం టీ పొడిలోని నీటిని పీల్చుకుంది కదా! ఈ ప్రక్రియను జీర్ణవ్యవస్థలోని ఏ భాగంతో పోల్చవచ్చు?
జవాబు:
తడి టీ పొడిలోని నీటిని అద్దుడు కాగితం పీల్చుకొన్నట్లు మన జీర్ణవ్యవస్థలోని జీర్ణమైన ఆహారం నుండి పెద్ద ప్రేగు నీటిని పీల్చుకొంటుంది. ఈ ప్రక్రియలో జీర్ణమైన ఆహారాన్ని టీ పొడితోనూ, పెద్ద ప్రేగును అద్దుడు కాగితంతోనూ పోల్చవచ్చు.

ప్రశ్న 14.
మలవిసర్జన ఎలా నియంత్రించబడుతుంది?
జవాబు:
పెద్ద ప్రేగు చివరి భాగంలో ఉండే రెండు కండర పొరలు పాయువు యొక్క సంవరణి కండరాలుగా (Anal sphincter)ఏర్పడతాయి. లోపలి సంవరిణీ కండరం అనియంత్రితంగాను, బాహ్య సంవరిణీ కండరం నియంత్రితంగా పనిచేస్తుంది. ఇవి మలవిసర్జన మార్గాన్ని నియంత్రిస్తాయి.

ప్రశ్న 15.
కణాలలో శక్తి ఎలా వెలువడుతుంది?
జవాబు:

  1. ఉచ్చ్వాస క్రియలో ఆక్సిజన్ వాయుగోణుల గోడల ద్వారా రక్తంలోకి చేరుతుంది.
  2. ఇక్కడ నుండి ఎర్రరక్త కణాల్లోకి ప్రవేశించి శరీరంలోని అన్ని కణాలకు సరఫరా చేయబడుతుంది.
  3. అదే సమయంలో రక్తంలోని కార్బన్ డై ఆక్సైడ్ ఊపిరితిత్తులోని వాయుగోణులలోనికి చేరుతుంది.
  4. నిశ్వాస క్రియలో అది బయటకు పంపబడుతుంది. కణాల్లోకి పోషకాలు ఆక్సీకరణం చెంది శక్తి విడుదలవుతుంది.

AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం

ప్రశ్న 16.
మన శరీరంలోని వివిధ వ్యవస్థలు సమన్వయంగా పని చేస్తున్నాయని ఎలా చెప్పగలవు?
జవాబు:

  1. సంక్లిష్టమైన ఈ జీర్ణక్రియా విధానంలో అనేక రకాల అవయవాలు, అవయవ వ్యవస్థలు సమన్వయంతో పనిచేస్తాయి.
  2. జీర్ణక్రియ నోటినుండి పాయువు వరకు వ్యాపించి ఉన్న ఆహారనాళంలో జీర్ణక్రియ జరుగుతున్నప్పటికీ దీనికి శ్వాసవ్యవస్థ, రక్తప్రసరణ వ్యవస్థ, నాడీవ్యవస్థలతో సమన్వయం ఎంతో అవసరం.
  3. లేకపోతే ఆహారం ఆక్సీకరణం చెందడం పదార్థాల రవాణా, శక్తి ఉత్పాదకత మొదలైన ప్రక్రియలు చోటుచేసుకోలేవు. అలా జరగనట్లయితే ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్న జీవ వ్యవస్థలన్నీ నిలిచిపోతాయి.

10th Class Biology 7th lesson జీవక్రియలలో సమన్వయం 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
ఆహార వాహికలో ఆహారం పెరిస్టాలిక్ చలనాల ద్వారా ముందుకు నెట్టబడి, జీర్ణాశయాన్ని చేరుతుంది. దీన్ని పటము. ద్వారా చూపండి. బోలస్ అనగానేమి?
జవాబు:
AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం 6
బోలస్ :
నోటిలో ఆహారం నమలబడి లాలాజలంతో కలిసి ఏర్పడే ముద్దను బోలస్ అంటారు. ఇది ఆస్యకుహరంలో ఏర్పడుతుంది.

ప్రశ్న 2.
పెరిస్టాల్టిక్ చలనం అంటే ఏమిటి? ఆహారవాహికలో ఆహార చలనాన్ని, మీరు పాఠశాలలో చేసిన సైకిలు ట్యూబ్ లో ఆలుగడ్డ (బంగాళదుంప) కదలిక ప్రయోగంతో పోల్చి వివరించండి.
జవాబు:
ఆహారం మ్రింగినపుడు ఆహారవాహికలో ఏర్పడే అని యాంత్రిత క్రమబద్ద చలనాన్ని పెరిస్టాల్టిక్ చలనం అంటారు. దీని వలన ఆహారం నోటి నుండి జీర్ణాశయం చేరుతుంది.

మేము నిర్వహించిన సైకిల్ ట్యూబ్ ప్రయోగంలో
సైకిల్ ట్యూబ్ – ఆహారవాహిక
బంగాళదుంప – ఆహారపు
నూనె పూత – లాలాజలం
కదలిక – పెరిస్టాలిటిక్ చలనంతో పోల్చవచ్చు.

ప్రశ్న 3.
జీర్ణాశయం సొంత ఆమ్లాల స్రావాల నుండి తనను తాను ఎలా రక్షించుకుంటుందో అర్థం చేసుకొనుటకు నిర్వహించిన ఆమ్లం మరియు పత్ర ప్రయోగం విధానాన్ని రాయండి. ఫలితాలను మానవ జీర్ణ వ్యవస్థలో జరిగే అంశాలతో పోల్చండి.
జవాబు:
కావలసిన పరికరాలు :
రెండు ఆకులు, పెట్రోలియం జెల్లీ / వాజ్ లీన్, బలహీన ఆమ్లం, రెండు పెట్రెడిషన్లు, డ్రాపర్.

ప్రయోగ విధానం :

  1. రెండు ఆకుపచ్చని పత్రాలు సేకరించాలి. ఒక పత్రానికి పెట్రోలియం జెల్లీ లేదా వాజ్ లీన్ పూయాలి. మరొక దానిని అలాగే వదిలేయాలి.
  2. రెండు ఆకులను పెట్రెడిష్ లో ఉంచి 1 లేదా 2 చుక్కల బలహీన ఆమ్లాన్ని రెండు పత్రాలపై డ్రాపర్ సహాయంతో వేయాలి.
  3. అరగంట తరువాత పత్రాలను పరిశీలించాలి. వాజ్ లీన్ పూసిన ఆకులో ఏ మార్పు ఉండదు.
  4. వాజ్ లీన్ పూయని ఆకు ఆమ్లం ప్రభావం నుండి రక్షించబడలేదు. (కాలినట్లుగా మారింది).

పోలిక :

  1. శ్లేష్మ పదార్థం జీర్ణాశయపు గోడలపై ఒక పలుచని పొరలా ఏర్పడుతుంది. ఇది ఆమ్ల ప్రభావం నుండి జీర్ణాశయాన్ని రక్షిస్తుంది.
  2. పెట్రోలియం జెల్లీ చేసే పనిని జీర్ణాశయపు గోడలలోని శ్లేష్మం చేసే పనితో పోల్చవచ్చు.

ప్రశ్న 4.
క్రింది వాటికి కారణాలు తెలపండి.
a) జీర్ణాశయం ఖాళీ అయినపుడు ఆకలి సంకేతాలు మెదడుకు చేరతాయి.
b) జీర్ణాశయం ఆహారంతో నిండినపుడు ఇంక ఆహారం అవసరం లేదనిపిస్తుంది.
c) జలుబు చేసినపుడు ఆహారం రుచిగా ఉండదు.
d) ఒక ద్రాక్షపండును నాలుకపై ఉంచినపుడు దాని రుచి మనకు తెలియదు.
జవాబు:
a) జీర్ణకోశ గోడల నుండి ‘గ్రీలిన్’ హార్మోన్ స్రవించుట వలన ఆకలి సంకేతాలు మెదడుకు చేరతాయి.
b) జీర్ణాశయం ఆహారంతో నిండినపుడు లెప్టిన్ అనే హార్మోన్ స్రవించబడి ఆకలిని అణచివేస్తుంది.
c) ఋణ గ్రాహికలు మూసుకుపోవటం వలన జలుబు చేసినపుడు ఆహారం రుచిగా ఉండదు.
d) ఆహారపదార్థం రుచి కళికలలోనికి ప్రవేశించినపుడు మాత్రమే రుచి తెలుస్తుంది. ద్రాక్షపండు ద్రవరూపంలో లేకపోవటం వలన పదార్ధం రుచి కళికలలోనికి ప్రవేశించలేదు.

ప్రశ్న 5.
మానవ జీర్ణ వ్యవస్థలోని క్రింది భాగాలలో పెరిస్టాలిసిస్ విధులు తెల్పండి.
a) ఆహారవాహిక
b) జీర్ణాశయం
c) చిన్న ప్రేగు
d) పెద్ద ప్రేగు
జవాబు:
a) ఆహారవాహిక :
ఆహారవాహికలో పెరిస్టాలిసిస్ బోలను జీర్ణాశయంలోనికి నెడుతుంది.

b) జీర్ణాశయం :
జీర్ణాశయంలో పెరిస్టాలిసిస్ ఆహారాన్ని నిల్వ చేయుటలోనూ, ముక్కలు చేయుటలోనూ, జఠర రసంలో కలుపుటలోనూ తోడ్పడుతుంది.

c) చిన్న ప్రేగు :
జీర్ణ రసాలతో క్రైమ్ ను కలుపుతుంది.

d) పెద్ద ప్రేగు :
జీర్ణం కాని వ్యర్థ పదార్థాలు పురీష నాళం ద్వారా బయటకు పంపుటలో సహాయపడుతుంది.

ప్రశ్న 6.
పిండిపై లాలాజలం యొక్క చర్యను వివరించడానికి నీవు చేసిన ప్రయోగమును వివరించుము.
(లేదా)
పిండి పదార్థాలపై లాలాజలం యొక్క చర్యను తెలుసుకొనుటకు నీవు నిర్వహించిన ప్రయోగం తెలపండి. లాలాజలము యొక్క pH ను ఏ విధంగా గుర్తించారు?
జవాబు:
కావాల్సిన పరికరాలు :
1) పరీక్షనాళిక, 2) పిండి, 3) లాలాజలం, 4) అయోడిన్ ద్రావణం, 5) డ్రాపర్, 6) pH కాగితం.

ప్రయోగ విధానం :

  1. ఒక పరీక్షనాళిక తీసుకుని సగం వరకు నీటితో నింపి చిటికెడు పిండి కల్పి బాగా కదిలించండి.
  2. మిశ్రమాన్ని రెండు సమాన భాగాలుగా రెండు పరీక్షనాళికల్లో తీసుకోండి.
  3. టీస్పూన్ లాలాజలంను ఒక పరీక్షనాళికలో కలపండి. రెండో పరీక్షనాళికలో కలపవద్దు.
  4. 45 ని|| తరువాత ఒక చుక్క అయోడిన్ ద్రావణం రెండు పరీక్షనాళికలలో కలపండి.

పరీశీలన మరియు నిర్ధారణ :
లాలాజలం కలిపిన ద్రావణం నీలిరంగులోకి మారలేదు. లాలాజలం కలపని ద్రావణం నీలిరంగులోకి మారింది.

గుర్తించుట :
ఒక చిన్న pH కాగితం ముక్కను తీసుకుని నాలుకపై తాకించండి. దానిపై ఏర్పడిన రంగును రంగు పట్టికతో జత చేసి చూడండి pH విలువను గుర్తించవలెను.

AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం

ప్రశ్న 7.
రుచి నాలుక మరియు అంగిలికి సంబంధించిన విషయం – దీనిని నిరూపించే ఒక కృత్యాన్ని రాయండి.
జవాబు:

  1. కొంచెం చక్కెరను నాలుకపై వేసుకొని, నాలుకను అంగిలికి తగలకుండా నోటిని తెరిచి ఉంచాలి.
  2. కొద్ది సేపటికి రుచి గుర్తించబడుతుంది.
  3. స్టాప్ క్లాక్ ను ఉపయోగించి నాలుకపై చక్కెర ఉంచినప్పటి నుండి రుచి గుర్తించినప్పటి వరకు పట్టిన సమయాన్ని గుర్తించాలి.
  4. ఇప్పుడు ఇదే ప్రయోగాన్ని నాలుకపై చక్కెర వేసుకొని దానిని అంగిలితో నొక్కి ఉంచి చేయాలి.
  5. ఇప్పుడు రుచి చాలా కొద్ది సమయంలోనే తెలుస్తుంది.
  6. దీనిని బట్టి రుచి నాలుక మరియు అంగిలికి సంబంధించిన విషయం అని తెలుస్తుంది.

ప్రశ్న 8.
క్రింది పటాన్ని పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం 18
i) ఆహారవాహికలో గల కండరాలు తరంగం లాగా జరిపే కదలికలను ఏమంటారు?
జవాబు:
ఆహారవాహికలో గల కండరాలు తరంగం లాగా జరిపే కదలికలను పెరిస్టాలిటిక్ చలనము అంటారు.

ii) ఆహారవాహిక ఏ విధమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది?
జవాబు:
ఆహారవాహిక పొడవాటి గొట్టము వంటి నిర్మాణము కలిగి ఉంటుంది.

iii) ఆహారవాహికలో ఆహారం ప్రయాణించడానికి శ్లేషస్తరం ఎలా ఉపయోగపడుతుంది?
జవాబు:
శ్లేష్మము, ఆహారము సులభంగా క్రిందికి జారుటకు తోడ్పడుతుంది.

iv) ఆహార నాళంలోని ఏఏ భాగాలు ఆహారవాహిక ద్వారా కలుపబడుతూ ఉంటాయి?
జవాబు:
ఆహార నాళంలోని గ్రసని మరియు జీర్ణాశయము ఆహారవాహిక ద్వారా కలుపబడుతూ ఉంటాయి.

ప్రశ్న 9.
నోటి జీర్ణక్రియలో లాలాజల పాత్ర ఏమిటి?
జవాబు:

  1. అనియంత్రిత నాడీవ్యవస్థ చర్య వలన లాలాజల గ్రంథులు లాలాజలాన్ని స్రవిస్తాయి.
  2. ఇది ఆహారాన్ని తేమగా చేసి నమిలి మింగడానికి అనుకూలంగా తయారుచేస్తుంది. అపుడు ఆహారం జిగురు ముద్దలా మారుతుంది. దీనిని “బోలస్” (Bolus) అంటారు.
  3. నాలుక సహాయంతో మింగడం వలన ఇది ఆహారవాహికలోనికి చేరుతుంది.
  4. లాలాజలంలో ఉండే ‘లాలాజల ఎమైలేజ్’ అనే ఎంజైమ్ పెద్ద పెద్ద పిండిపదార్థ అణువులను చిన్న చిన్న అణువులుగా మారుస్తుంది. సాధారణంగా చక్కెరలుగా మారుస్తుంది.
  5. మింగే క్రియాయంత్రాంగం కూడా నాడీ సమన్వయంతో పనిచేస్తుంది. మెదడు కాండం దగ్గరలోని మజ్జిముఖంలో ఈ నియంత్రణ కేంద్రం ఉంటుంది.
  6. దంతాలు, నాలుక సహాయంతో ఆహారాన్ని నమిలి చూర్ణం చేయడం వల్ల ఆహార పదార్థాల పరిమాణం మింగడానికి అనువుగా మారుతుంది.

ప్రశ్న 10.
ఆహారవాహికలో ‘బోలస్’ ఎలా క్రిందకు కదులుతుంది?
జవాబు:

  1. ఆహారవాహిక గోడలు రెండు రకాలైన మెత్తని నునుపు కండరాలను కలిగి ఉంటాయి.
  2. లోపలి పొరలో వలయాకార కండరాలు వెలుపలి పొరలో సంభాకార కండరాలు ఉంటాయి.
  3. వలయాకార కండరాలు సంకోచించినపుడు ఆహారపు ముద్దకు వెనుక ఉండే ఆహారవాహిక భాగం ముడుచుకుని ఆహార ముద్దను కిందికి జరిగేలా ఒత్తిడి కలిగిస్తుంది.
  4. స్తంభాకార కండరాల వలన ఆహారవాహికలోని బోలస్ ముందు భాగం పొడవు తగ్గి గొట్టం వెడల్పవుతుంది. బోలస్ ముందుకు కదులుతుంది.
  5. ఇలా కండరాల సంకోచ వ్యాకోచ కదలికల వలన ఒక తరంగం లాంటి చలనం ఏర్పడి ఆహార బోలను జీర్ణాశయం లోనికి నెడుతుంది. ఈ ప్రక్రియను ‘పెరిస్టాల్ సిస్’ (Peristalsis) అంటారు.
  6. ఇది అనియంత్రితమైనది, మరియు అనియంత్రిత నాడీవ్యవస్థ అధీనంలో నియంత్రించబడుతుంది.

ప్రశ్న 11.
చిన్నప్రేగుల అంతర నిర్మాణం వర్ణించండి.
జవాబు:

  1. చిన్నప్రేగుల లోపలి గోడలు అనేక ముడతలు పడి ఉంటాయి. వీటిని ఆంత్రచూషకాలు అంటారు.
  2. ఆంత్రచూషకాలు రక్తనాళాలు మరియు శోషరసనాళాలను కలిగి ఉంటుంది.
  3. జీర్ణమైన ఆహారం రక్తంలోనికి పీల్చుకొనబడుతుంది. ఈ ప్రక్రియను శోషణ అంటారు.
  4. శోషణ చిన్నప్రేగుల ప్రధానవిధి. శోషణాతల వైశాల్యం పెంచటానికి ఆంత్రచూషకాలు తోడ్పడతాయి.
  5. గ్లూకోజ్ రక్తనాళంలోనికి, ఎమైనోఆమ్లాలు, గ్లిజరాల్ శోషరస నాళంలోనికి శోషణ చెంది శరీర కణజాలానికి రవాణా కాబడతాయి.

ప్రశ్న 12.
రెండవ మెదడు అనగానేమి? దాని ప్రాధాన్యత ఏమిటి?
జవాబు:

  1. జీర్ణనాళంలోని నాడీవ్యవస్థ నాడీ కణాలతో కూడిన ఎంతో సంక్లిష్టమైన నాడీ వలయాన్ని కలిగి ఉంటుంది. శాస్త్రవేత్తలు ఈ వ్యవస్థను రెండవ మెదడుగా పిలుస్తారు.
  2. దాదాపు 100 మిలియన్ల నాడీకణాలు ఈ రెండవ మెదడులో ఇమిడి ఉంటాయి. ఇది వెన్నుపాము లేదా పరిధీయ నాడీవ్యవస్థలోని నాడీ కణాల సంఖ్యను మించి ఉంటుంది.
  3. జీర్ణనాడీవ్యవస్థలోని ఈ మహా నాడీకణాల సముదాయం జీర్ణవ్యవస్థ యొక్క అంతర ప్రపంచం, అందులో గల పదార్థాల గురించి తెలుసుకోవడానికి, అనుభూతి చెందడానికి తోడ్పడుతుంది.
  4. ఆహారాన్ని చిన్నచిన్న రేణువులుగా విచ్ఛిన్నం చేయడం, పోషకాలను గ్రహించడం మరియు వ్యర్థాలను విసర్జించడం లాంటి జీవక్రియలను ఉత్తేజపరచడం మరియు సమన్వయం చేయడానికి అనేక రసాయనిక పద్ధతులు, యాంత్రిక మిశ్రణీకరణ విధానాలు, లయబద్దమైన కండర సంకోచాలు ఒకదానివెంట ఒకటిగా జీర్ణక్రియా చర్యలన్నీ జరుగుతూ ఉంటాయి.
  5. రెండవ మెదడు తనదైన స్వీయ ప్రతిస్పందనలను, జ్ఞానేంద్రియ శక్తిని కలిగి ఉండడంవల్ల జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఎన్నో పనుల నిర్వహణను మెదడుతో సంబంధం లేకుండా స్వతంత్రంగా నియంత్రిస్తుంది.
  6. జీర్ణవ్యవస్థలో పదార్థాలు సజావుగా లోనికి రావడానికి, బయటకు వెళ్ళడానికి వీలుగా ఈ వ్యవస్థ ఇంత సంక్లిష్టతతో ఏర్పడి ఉండవచ్చునని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ప్రశ్న 13.
జీర్ణాశయంలో పెరిస్టాల్టిక్ చలనాన్ని చూపే బొమ్మను గీయండి. జీర్ణాశయంలో ఆహార కదలికలు వివరించండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 1

  1. పెరిస్టాల్టిక్ చలనాలు ఆహారాన్ని ఒక చోట నుండి మరియొక చోటుకి కదిలిస్తాయి.
  2. జీర్ణాశయంలో పెరిస్టాల్టిక్ కదలికలు, కండరాల కదలికలు వేగంగా ఉండడం వల్ల ఆహారం మెత్తగా నూరబడుతుంది.
  3. జీర్ణాశయ కండరాలలో కలిగే సంకోచ సడలికలు ఆహారాన్ని ఆమ్లాలు మరియు ఇతర జీర్ణరసాలతో కలిపి చిలుకుతాయి. జీర్ణరసాలు ఆహారాన్ని మెత్తటి జావలాంటి ద్రవంలా మారుస్తాయి. దీనిని క్రైమ్ అంటారు.
  4. జీర్ణాశయంలో జీర్ణక్రియ ముగింపు దశకు చేరుకునే సరికి జీర్ణాశయ గోడల సంకోచాలు తగ్గుముఖం పడతాయి.

10th Class Biology 7th lesson జీవక్రియలలో సమన్వయం ½ Mark Important Questions and Answers

ఫ్లో బారులు

1.
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 2
జవాబు:
నాడీ వ్యవస్థ

2.
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 3
జవాబు:
లెఫ్టిన్

3.
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 4
జవాబు:
ద్వారగొర్ధం

4.
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 5
జవాబు:
పులుపు

5.
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 6
జవాబు:
పొలియెట్

6.
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 7
జవాబు:
ఋణ గ్రాహకాలు / వాసన గ్రాహకాలు

7.
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 8
జవాబు:
రదనికలు

సరైన గ్రూపును గుర్తించండి

8. ఏ గ్రూపు సంఘటనలు సరైన క్రమంలో ఉన్నాయి?
A. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గడం – గ్రీలిన్ జీర్ణాశయ గోడల నుండి స్రవించడం – జీర్ణాశయంలో ఆకలి కోరికలు
B. గ్రీలిన్ జీర్ణాశయ గోడల నుండి స్రవించడం – రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గడం – జీర్ణాశయంలో ఆకలి కోరికలు
జవాబు:
గ్రూపు – A

9. మెదడు వాసనను గుర్తించే సరైన క్రమాన్ని కనుగొనండి.
A. మెదడులో ఘోణ గ్రాహకాలు-ముక్కులో ఋణ గ్రాహకాలు – వాసన గుర్తించబడటం
B. ముక్కులో మాణ గ్రాహకాలు-మెదడులో ఘ్రాణ గ్రాహకాలు – వాసన గుర్తించబడటం
జవాబు:
గ్రూపు – B

10. ఏ గ్రూపు సంఘటనలు ఆహారం యొక్క రుచిని గుర్తించడంలో చోటు చేసుకుంటాయి?
A. నాలుక మీద ఉంచిన ఆహారం – లాలాజలంలో కరగడం – నాలుకతో అంగిలిని నొక్కడం.
B. నాలుక మీద ఉంచిన ఆహారం – నోరు తెరచి ఉంచడం – నాలుక అంగిలిని తాకరాదు.
జవాబు:
గ్రూపు – A

AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం

11. ఏ గ్రూపు దంత అమరిక సరైన క్రమంలో అమరి ఉన్నాయి?
A. కుంతకాలు – రదనికలు – చర్వణకాలు – అగ్ర చర్వణకాలు
B. కుంతకాలు – రదనికలు – అగ్ర చర్వణకాలు – చర్వణకాలు
జవాబు:
గ్రూపు – B

12. క్రింది వానిలో పాలపళ్ళు దంత సూత్రాన్ని సూచించేది ఏమిటి?
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 9
జవాబు:
గ్రూపు – B

13. ఆహార వాహిక యొక్క పెరిస్టాలసిస్ సమయంలో ఏ గ్రూపు సంఘటనలు చోటు చేసుకుంటాయి?
A. వలయ కండరాల సంకోచం – ఆహార వాహిక విశాలం – స్తంభాకార కండరాల సంకోచం – ఆహారవాహిక ముడుచుకుపోవడం
B. వలయ కండరాల సంకోచం – ఆహారవాహిక ముడుచుకుపోవడం-స్తంభాకార కండరాల సంకోచం – బోలస్ ముందు ఉన్న ఆహారవాహిక విశాలం.
జవాబు:
గ్రూపు – B

14. ఏ గ్రూపు ప్రక్రియలు జీర్ణాశయంకు సంబంధించినవి?
A. నూరడం, ప్రొపల్టన్, రెట్రోపర్టైన్
B. నమలడం, మాస్టికేషన్, శోషణం
జవాబు:
గ్రూపు – A

15. ఏ గ్రూపు సంఘటనలు స్వయంచోదిత నాడీవ్యవస్థ నియంత్రణలో ఉంటాయి?
A. మింగడం, హార్మోన్ స్రావం, మాస్టికేషన్
B. లాలాజలం స్రావం, పెరిస్టాలసిస్, రివర్స్ పెరిస్టాలసిస్
జవాబు:
గ్రూపు – B

నేను ఎవరు?

16. నేనొక హార్మోన్‌ని. ఆకలి అనే అనుభూతిని కల్గించి, ఆహారం తీసుకొనే విధంగా ప్రేరణను కల్గిస్తాను.
జవాబు:
గ్రీలిన్

17. నాలుక మీద ఇమిడి మరియు రుచిని గ్రహించడం నా బాధ్య త.
జవాబు:
రుచి మొగ్గ

18. నోటి కుహరం మరియు నాసికా కుహరాల మధ్య అమరియున్న అస్థి పలకను నేను. ఆహారం నాకు వ్యతిరేకంగా నొక్కినప్పుడు మాత్రమే మీరు ఆహారం
జవాబు:
అంగిలి

19. నేను మెదడులో ఒక బాగం. మింగుట అనే ప్రక్రియ నా అధీనంలో జరుగుతుంది.
జవాబు:
మజ్జిముఖం

20. నేనొక జిగురు లాంటి పదార్థాన్ని మరియు ఆహారవాహిక గోడలు దెబ్బతినకుండా కందెన వలె పనిచేస్తూ కాపాడతాను.
జవాబు:
శ్లేష్మం

21. ఆహారనాళంలో కనపడే తరంగాకార కదలికను. ఆహారం ఆహారనాళంలో ముందుకు కదలడానికి తోడ్పడతాను.
జవాబు:
పెరిస్టాలసిస్

22. జీర్ణనాళపు గోడలలో ఆహారవాహిక నుండి పాయువు వరకు ఏర్పడిన సంక్లిష్ట నాడీ కణాలతో ఏర్పడిన నాడీ యంత్రాంగాన్ని.
జవాబు:
జీర్ణ సాడీ వ్యవస్థ / రెండవ మెదడు

23. నేను లాలాజలంలో ఉండే ఒక ఎంజైమ్ ను మరియు కార్బోహైడ్రేట్ పై చర్య జరుపుతాను.
జవాబు:
టయలిన్ / లాలాజల అమైలేజ్

24. ఆహారనాళంలో పొడవైన భాగాన్ని నేను. నా పూర్వ భాగము గ్రసనితోను మరియు నా పరభాగము జీర్ణాశయంతోను ‘కలపబడి ఉంటుంది.
జవాబు:
ఆహార వాహిక

AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం

25. నేను అమెరికన్ శాస్త్రవేత్తని. నా ప్రయోగాలు జీర్ణక్రియ భావనలు విప్లవంగా మారాయి.
జవాబు:
డా॥ బ్యూమాంట్ దోషాన్ని గుర్తించి, సరిచేసి వ్రాయండి

26. కడుపు నిండినప్పుడు గ్రీలిన్ స్రవించడం వల్ల ఆకలి అణచివేయబడుతుంది.
జవాబు:
కడుపు నిండినప్పుడు లెఫ్టిన్ స్రవించడం వల్ల ఆకలి అణచివేయబడుతుంది.

27. ఆహారాన్ని విసిరి, నమిలి, చిన్న ముక్కలుగా విచ్ఛిన్నం చేయడాన్ని రిట్రో పల్టన్ అంటారు.
జవాబు:
ఆహారాన్ని విసిరి, నమిలి, చిన్న ముక్కలుగా విచ్ఛిన్నం చేయడాన్ని మాస్టికేషన్ / నమలడం అంటారు.

28. 10వ కపాలనాడి దవడ భాగంలోని కండరాల కదలికను నియంత్రిస్తుంది.
జవాబు:
5వ కపాలనాడి దవడ భాగంలోని కండరాల కదలికను నియంత్రిస్తుంది.

29. మనం లాలాజలాన్ని స్టార్చ్ ద్రావణానికి జోడించినప్పుడు, లాలాజలంలోని పెప్సిన్ ఎంజైమ్ యొక్క చర్య వలన నీలం నలుపు రంగు అదృశ్యం అవుతుంది. యొక్క రుచిని గుర్తించగలరు.
జవాబు:
మనం లాలాజలాన్ని స్టార్చ్ ద్రావణానికి జోడించినప్పుడు, లాలాజలంలోని టయలిన్/ అమైలేజ్ ఎంజైమ్ యొక్క చర్య వలన నీలం సలుపు రంగు అదృశ్యం అవుతుంది.

30. మింగడం అనేది మెదడు కాండం అనగా ద్వారగోర్లం నియంత్రణలో ఉంటుంది.
జవాబు:
మింగడం అనేది మెదడు కాండం అనగా మజ్జిముఖం నియంత్రణలో ఉంటుంది.

31. పెరిస్టాలిసిస్ అనేది అసంకల్పిత చర్య మరియు ఎంటరిక్ నాడీవ్యవస్థ నియంత్రణలో ఉంటుంది.
జవాబు:
పెరిస్టాలిసిస్ అనేది అసంకల్పిత చర్య మరియు స్వయంచోదిత నాడీవ్యవస్థ నియంత్రణలో ఉంటుంది.

32. చిన్న ప్రేగులో నీరు పునఃశోషణం చెందుతుంది మరియు మిగిలిన వ్యర్థాలు పురీషనాళంలో నిల్వ చేయబడతాయి.
జవాబు:
పెద్ద ప్రేగు లో నీరు పునఃశోషణం చెందుతుంది మరియు మిగిలిన వ్యర్థాలు పురీషనాళంలో నిల్వ చేయబడతాయి.

33. మలద్వార రంధ్రం తెరుచుకోవడం మరియు మూయడంలో జఠర నిర్గమ సంవరిణి దోహదపడుతుంది.
జవాబు:
మలద్వార రంధ్రం తెరుచుకోవడం మరియు మూయడంలో పాయువు సంవరిణి కందరం దోహదపడుతుంది.

34. జఠర రసంలో ఎక్కువ మొత్తంలో సల్స్యురిక్ ఆమ్లం ఉంటుంది మరియు రసాయన చర్యలలో పాల్గొనే రసాయన కారకంగా పనిచేస్తుంది.
జవాబు:
జఠర రసంలో ఎక్కువ మొత్తంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుంది మరియు రసాయన చర్యలలో పాల్గొనే రసాయన కారకంగా పనిచేస్తుంది.

35. రివర్స్ పెరిస్టాలసిస్లో కండర సంకోచాలు స్వయం చోదిత నాడీవ్యవస్థ నియంత్రణలో 5వ కపాలనాడి ద్వారా నియంత్రించబడతాయి.
జవాబు:
రివర్స్ పెరిస్టాలసిలో కండర సంకోచాలు స్వయం చోదిత నాడీవ్యవస్థ నియంత్రణలో 10వ కపాలనాడి ద్వారా నియంత్రించబడతాయి.

జతపరచుట

36. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
పాల దంతాలు – 20
జ్ఞాన దంతాలు – 8
శాశ్వత దంతాలు – 32
జవాబు:
జ్ఞాన దంతాలు

AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం

37. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
కుంతకాలు – విసరడం
రదనికలు – చీల్చడం
అగ్ర చర్వణకాలు – కొరకడం
జవాబు:
రదనికలు – చీల్చడం

38. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
ఆకలి కోరికలు – 30-45 నిమిషాలు
లాలాజలం pH – 6.4-7.2
కడుపు ఖాళీ చేసే సమయం – 10 గంటలు
జవాబు:
కడుపు ఖాళీ చేసే సమయం – 10 గంటలు

39. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
నాలుక – ఝణ గ్రాహకాలు
ఆకలి కోరికలు – వేగస్ నాడి
ముక్కు – రుచి గ్రాహకాలు
జవాబు:
ఆకలి కోరికలు – వేగస్ నాడి

40. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
మాస్టికేషన్ – 5వ కపాలనాడి
హార్మోన్ల స్రావం – హైపోథాలమస్
రివర్స్ పెరిస్టాలసిస్ – 7వ కపాలనాడి
జవాబు:
రివర్స్ పెరిస్టాలసిస్ – 7వ కపాలనాడి

41. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
మలము – జీర్ణం కాని వ్యర్థ పదార్థం
బోలస్ – పాక్షికంగా జీర్ణమైన ఆహారం
క్రైమ్ – మెత్తగా చేయబడిన ఆహారపు ముద్ద
జవాబు:
మలము – జీర్ణం కాని వ్యర్థ పదార్థం

42. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
రెండవ మెదడు – జీర్ణనాళం
జఠర నిర్గమ సంవరిణి – జీర్ణాశయం
పాయు సంవరిణి కండరం – పెద్ద ప్రేగు
జవాబు:
పాయు సంవరిణి కండరం – పెద్ద ప్రేగు

ఉదాహరణలు ఇవ్వండి

43. వాంతులు రివర్స్ పెరిస్టాలసిస్కు ఉదాహరణ. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
త్రేనుపు

44. నెమరువేయడం అనేది రివర్స్ పెరిస్టాలసిస్ ప్రక్రియ. నెమరువేయు జీవికి ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ఆవు/గేదె

45. గబ్బిలం నిశాచర జంతువుకు ఉదాహరణ. దిశాచర జీవికి ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
మానవుడు

46. గ్రీలిన్ అనే హార్మోన్ ఆకలి కోరికలను ప్రేరేపిస్తుంది. కాలేయం, క్లోమం మొదలైన వాటి నుంచి జీర్ణ రసాలను స్రవించడాన్ని ప్రేరేపించే హార్మోన్‌కు మరో ఉదాహరణ. ఇవ్వండి.
జవాబు:
సెక్రెటిన్ / కోల్ సెప్టోకైనిన్

AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం

47. జీర్ణాశయం దగ్గరలో జఠర నిర్గమ సంవరిణి కండరం ఉంటుంది. మలద్వారం వద్ద ఉండే నంవరిణి కండరానికి మరో ఉదాహరణను ఇవ్వండి.
జవాబు:
పాయు సంవరిణి కండరం

విస్తరించుము

48. ENSని విస్తరించుము.
జవాబు:
Enteric Nervous System/ జీర్ణనాడీవ్యవస్థ

49. ANSని విస్తరించుము.
జవాబు:
Autonomous Nervous System/స్వయంచోదిత నాడీవ్యవస్థ

50. pH ని విస్తరించుము.
జవాబు:
Potential of Hydrogen

పోలికను గుర్తించుట

51. ఆహారవాహిక : బోలస్ : : జీర్ణాశయం 😕
జవాబు:
క్రైమ్

52. కుంతకాలు: 2::?: 1
జవాబు:
రదనికలు

53. ముక్కు : ఘోణ గ్రాహకాలు : : ? : రుచి గ్రాహకాలు
జవాబు:
నాలుక

54. పెరిస్టాలసిస్ : ఆహార వాహిక :: రెట్రోపర్టన్ : ?
జవాబు:
జీర్ణాశయం

AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం

55. జీర్ణాశయం : చిలకడం :: సూక్ష్మ చూషకాలు 😕
జవాబు:
శోషణం

బొమ్మలపై ప్రశ్నలు

56.
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 10
దీనికి ఏ హార్మోన్ బాధ్యత వహిస్తుంది?
జవాబు:
గ్రీలిన్

57.
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 11
ఈ చిత్రం దేనిని సూచిస్తుంది?
జవాబు:
నాలుక చూషకాలు

58.
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 12
ఈ పటం దేనిని సూచిస్తుంది?
జవాబు:
pH స్కేలు

59.
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 13
ఈ ప్రయోగంలో ఏ పదార్థాన్ని మీరు శ్లేష్మం పొరగా ఉపయోగిస్తారు?
జవాబు:
రదనిక

60.
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 14
‘X’ అనే భాగాన్ని గుర్తించండి.
జవాబు:
లాక్టియేల్స్

ఖాళీలను పూరించండి

61. జీర్ణవ్యవస్థలో సంచి వంటి నిర్మాణం …………….
జవాబు:
జీర్ణాశయం

62. ఆహారం ఆహారవాహికలో జారటానికి ………… తోడ్పడుతుంది.
జవాబు:
శ్లేష్మం

63. ఆహారవాహికలోని చలనం …………
జవాబు:
పెరిస్టాలిటిక్ చలనం

64. చెరకును చీల్చటానికి ఉపయోగించే దంతము ………..
జవాబు:

65. పాయు సంవరణి కండరాల సంఖ్య …………
జవాబు:
2

66. లాలాజల స్వభావం ………..
జవాబు:
క్షార స్వభావం

67. జీర్ణవ్యవస్థలో ఆమ్ల స్వభావం కలిగిన భాగం ………
జవాబు:
జీర్ణాశయం

AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం

68. లాలాజలంలోని ఎంజైమ్ ………
జవాబు:
టయలిన్

69. అయోడిన్ పిండిపదార్థాన్ని …………… రంగుకు మారుస్తుంది.
జవాబు:
నూనె

10th Class Biology 7th lesson జీవక్రియలలో సమన్వయం 1 Mark Bits Questions and Answers

1. వ్యతిరేక దిశలో జరిగే పెరిస్టాలిసిస్ దీనిలో చూడవచ్చు.
A) పులి
B) ఉడుత
C) ఆవు
D) పిల్లి
జవాబు:
C) ఆవు

2. మానవుని దంతసూత్రం [latex]\frac{2}{2}, \frac{1}{1}, \frac{2}{2}, \frac{3}{3}[/latex] ఇందులో [latex]\frac{1}{1}[/latex] సూచించేది ………..
A) కుంతకాలు
B) రదనికలు
C) అగ్రచర్వణకాలు
D) చర్వణకాలు
జవాబు:
B) రదనికలు

3. నీవు చెఱకును చీల్చడానికి ఉపయోగించే దంతాలు ……….
A) రదనికలు
B) కుంతకాలు
C) చర్వణకాలు
D) అగ్రచర్వణకాలు
జవాబు:
A) రదనికలు

4. మన దంతాల అమరిక నిష్పత్తి 3: 2:1: 2 అయితే దీనిలో 3 దేనిని సూచిస్తుంది?
A) రదనికలు
B) చర్వణకాలు
C) అగ్రచర్వణకాలు
D) కుంతకాలు
జవాబు:
B) చర్వణకాలు

AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం

5. పటంలో బాణం గుర్తుగల భాగం పేరేమిటి?
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 15
A) ఆహారవాహిక
B) జీర్ణాశయము
C) ఆంత్రమూలము
D) ఉండుకము
జవాబు:
C) ఆంత్రమూలము

6. శ్రీరాశయపు ప్రతిచర్యకు ఉదాహరణ
A) పెరిస్టాల్టిక్ చలనం
B) శోషణం
C) వాంతి
D) జీర్ణమవడం
జవాబు:
C) వాంతి

7. బొమ్మలో సూచించిన చోట ఉండే కవాటం
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 16
A) ద్విపత్ర కవాటం
B) పైలోరిక్ కవాటం
C) విల్లె
D) త్రిపత్ర కవాటం
జవాబు:
B) పైలోరిక్ కవాటం

8. పాక్షికముగా జీర్ణమైన ఆహారము …………
A) టైమ్
B) బోలస్
C) ఎముక
D) కండరము
జవాబు:
A or B

9. నాలుక రుచి గ్రాహకం, కనుక రుచిని గ్రహించుటలో ఏ నాడి ముఖ్య మైనది?
A) 6వ కపాలనాడి
B) 5వ కపాలనాడి
C) 10వ కపాలనాడి
D) దృక్ నాడి
జవాబు:
C) 10వ కపాలనాడి

10. నోటిలో ఆహారం ఉన్నప్పుడు లాలాజలం పరిమాణం
A) మారదు
B) తగ్గుతుంది
C) పెరుగుతుంది
D) పైవేవీ కాదు
జవాబు:
C) పెరుగుతుంది

11. జఠర రసములో ఉన్న ఆమ్లము
A) సల్ఫ్యూరిక్ ఆమ్లము
B) హైడ్రోక్లోరిక్ ఆమ్లము
C) నైట్రస్ ఆమ్లము
D) ఫాస్ఫారిక్ ఆమ్లము
జవాబు:
B) హైడ్రోక్లోరిక్ ఆమ్లము

12. pH విలువ 7 కన్నా తక్కువైతే ఆ పదార్థం
A) ఆమ్లం
B) క్షారం
C) తటస్థం
D) హార్మోన్
జవాబు:
A) ఆమ్లం

13. మానవునిలో దంత విన్యాసం
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 20
జవాబు:
A

AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం

14. మనకు కడుపు నిండుగా ఉండి, ఇంక ఎలాంటి ఆహారం స్రవించబడి ఆకలిని అణిచివేస్తుంది. ఆ హార్మోన్ పేరేమిటి?
A) గ్రీలిన్
B) వాసోప్రెస్సిన్
C) లెఫ్టిన్
D) ఇన్సులిన్
జవాబు:
C) లెఫ్టిన్

15. మానవునిలో జీర్ణక్రియను ప్రారంభించు ఎంజైమ్
A) లాలాజల అమైలేజ్
B) పెప్సిన్ అవంతి
C) ట్రిప్సిన్
D) లైపేజ్
జవాబు:
A) లాలాజల అమైలేజ్

16. పిండి పదార్థాల పై లాలాజలం యొక్క చర్యను నిరూపించుటకు నీవు ఏ కారకాన్ని వాడతావు?
A) KOH
B) ఆల్కహాల్
C) అయోడిన్
D) సున్నపునీరు
జవాబు:
C) అయోడిన్

17.
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 18
A) థ్రాంబోలైనేజ్
B) థ్రాంబిన్
C) ఫ్రాంఛాంబిన్
D) ఎంటిరోకైనేజ్
జవాబు:
B) థ్రాంబిన్

18. రెండవ మెదడు అనగా ………..
A) మస్తిష్కం
B) అనుమస్తిష్కం
C) జీర్ణ నాడీవ్యవస్థ
D) వెనుక మెదడు
జవాబు:
C) జీర్ణ నాడీవ్యవస్థ

19. ఆకలితో రజిని ఏడుస్తోంది. ఆమె జీర్ణాశయంలో ఆకలి ప్రచోదనాలకు కారణమైన హార్మోను ఏది?
A) లెఫ్టిన్
B) గ్రీలిన్
C) వాసోప్రెస్సిన్
D) థైరాక్సిన్
జవాబు:
B) గ్రీలిన్

20. జీర్ణాశయం, ఆంత్రమూలంలోకి తెరుచుకునే చోట ఉండే సంపరిణీ కండరం
A) కార్డియాక్
B) పైలోరిక్
C) ఆనల్
D) గాస్టిక్
జవాబు:
B) పైలోరిక్

21. ఆకలి కోరికలు ఎంత సమయం కొనసాగుతాయి?
A) 10-15 నిముషాలు
B) 1-2 గంటలు
C) 15-20 నిముషాలు
D) 30-45 నిముషాలు
జవాబు:
D) 30-45 నిముషాలు

22. మనకు కడుపు నిండుగా ఉండి, ఎలాంటి ఆహారం అవసరం లేదు అనిపించినప్పుడు స్రవించబడే హార్మోన్
A) సెక్రిటిన్
B) గ్లూకోగాన్
C) లెఫ్టిన్
D) గ్రీలిన్
జవాబు:
C) లెఫ్టిన్

AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం

23. కింది బొమ్మను గుర్తించండి. అవసరం లేదు అనిపించినపుడు ఒక హార్మోన్
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 17
A) ధమని రక్తనాళం
B) చాలకనాడీ కణం
C) శ్వాసగోణి
D) ఆంత్రచూషకం
జవాబు:
D) ఆంత్రచూషకం

మీకు తెలుసా?

* పగలు నిద్రించినపుడు సొంగ (లాలాజలం) ఎందుకు కారుతుంది?
నిశాచర జీవుల (Nocturnals) గురించి మీరు వినే ఉంటారు కదా! ఇవి రాత్రివేళలో చురుకుగా ఉంటాయి. అయితే మనం పగటివేళలో చురుకుగా ఉండి, రాత్రివేళలో విశ్రాంతి తీసుకుంటాం. శరీరంలోని వ్యవస్థలన్నీ మనం పనిచేస్తున్నప్పుడు చురుకుగా ఉంటాయి. అందుకే మనిషిని దివాచరులు (Diurnal animals) అంటారు. మన జీర్ణ వ్యవస్థ పగటివేళలో చురుకుగా ఉండడం వలన అది ఆహారాన్ని స్వీకరించి జీర్ణక్రియ జరపడానికి సిద్ధంగా ఉంటుంది. అందుకే పగటివేళలో నిద్రిస్తే నోటి ద్వారా స్రవించే లాలాజలం తలదిండును తడుపుతుంది. కానీ రాత్రివేళలో ఇలా జరగదు. సాధారణంగా ఒక రోజులో మనం 1- 1.5 లీటర్ల లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తాం.

పునశ్చరణం

AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 19

AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

These AP 10th Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ will help students prepare well for the exams.

AP Board 10th Class Biology 6th lesson Important Questions and Answers ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

10th Class Biology 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
సజీవులలో సమవిభజన ఏ విధంగా తోడ్పడుతుంది?
జవాబు:
సమవిభజన గాయాలు మాన్పటానికి, పెరుగుదలకు తోడ్పడుతుంది.

ప్రశ్న 2.
బీజ దళాలు మొక్కకు ఏ విధంగా ఉపయోగపడతాయో రాయంది.
జవాబు:
బీజ దళాలు మొక్కలో పత్రాలు ఏర్పడేవరకు ఆహారాన్ని అందించటానికి తోడ్పడతాయి.

ప్రశ్న 3.
నీవు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా మీ పాఠశాలను సందర్శించిన డాక్టర్‌ను ఎలాంటి ప్రశ్నలు అడుగుతావు?
జవాబు:

  1. AIDS వ్యాధి ఎలా కలుగుతుంది?
  2. AIDS ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది?
  3. AIDS వ్యాధి లక్షణాలు ఏవి?
  4. AIDS వ్యాధి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ప్రశ్న 4.
ప్రథమ స్తన్యం అనగా నేమి?
జవాబు:
గర్భావధి చివరిదశలో స్తన గ్రంథుల్లో ప్రోగయ్యే శోషరసాన్ని పోలిన ద్రవాన్ని ముర్రుపాలు లేదా ప్రథమ స్తన్యం (Colostrum) అంటారు. ఇది నవజాత శిశువులో వ్యాధి నిరోధకతను పెంచడానికి అత్యావశ్యకం. దీని తరువాత పాలు స్రవించబడతాయి.

AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

ప్రశ్న 5.
స్త్రీ భ్రూణ హత్యల నివారణకు రెండు సలహాలను సూచించండి.
జవాబు:

  1. సంబంధిత నినాదాలు తయారు చేయుట
  2. ర్యాలీలు నిర్వహించుట
  3. ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలను చైతన్యపరచుట.

ప్రశ్న 6.
రైజోపస్ ను సూక్ష్మదర్శినిలో పరిశీలించినపుడు మీరు తీసుకొనిన రెండు జాగ్రత్తలను తెలుపండి.
జవాబు:

  1. ప్రయోగంలో ఉపయోగించే రొట్టెను నేరుగా చేతులతో ముట్టరాదు.
  2. రొట్టెను చేతులతో ముట్టినట్లయితే చేతులను శుభ్రంగా కడుగుకోవాలి.
  3. రొట్టెను ఒక గంటపాటు ఆరుబయట ఉంచాలి. ఇలా చేయడం ద్వారా సాంక్రమిక పదార్థాలను గ్రహిస్తుంది.
  4. రొట్టెను వుంచిన సంచిని మాత్రము తెరవద్దు.
  5. ప్రతి రెండు రోజులకోసారి పరీక్షిస్తూ, ఎండిపోకుండా కొంత నీటిని చల్లుతూ ఉంచాలి.
  6. సంచిని దూరంగా, చీకటి, తేమ మరియు వెచ్చగా వుండే ప్రదేశంలో ఉంచాలి.

ప్రశ్న 7.
ప్రత్యుత్పత్తి అనగానేమి?
జవాబు:
ప్రత్యుత్పత్తి :
ఒక జీవి తన జీవిత కాలంలో తనను పోలిన జీవులను ఉత్పత్తి చేసే ధర్మాన్ని “ప్రత్యుత్పత్తి” అంటారు.

ప్రశ్న 8.
అనుకూల పరిస్థితులలో పారమీషియం ఎలా ప్రత్యుత్పత్తి జరుపుతుంది?
జవాబు:
అనుకూల పరిస్థితులలో పారమీషియం ద్విధావిచ్ఛిత్తి ద్వారా రెండు పిల్ల పారమీషియంలను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రక్రియ చాలా వేగంగా జరగటం వలన ఎక్కువ సంఖ్యలో జీవులు ఉత్పత్తి అవుతాయి.

ప్రశ్న 9.
అననుకూల పరిస్థితులలో పారమీషియం ఎటువంటి ప్రత్యుత్పత్తి జరుపుతుంది?
జవాబు:
ప్రతికూల పరిస్థితులలో రెండు పారమీషియాలు దగ్గరగా చేరి కేంద్రక పదార్థాలను పరస్పరం మార్పు చేసుకొంటాయి. అందువల్ల ఏర్పడే జీవులు ప్రతికూల పరిస్థితులను తట్టుకోగలిగినవిగా ఉంటాయి.

ప్రశ్న 10.
అలైంగిక ప్రత్యుత్పత్తి అనగానేమి?
జవాబు:
అలైంగిక ప్రత్యుత్పత్తి : సంయోగబీజాల కలయిక లేకుండా కేవలం ఒక జీవి ప్రమేయంతోనే జరిగే ప్రత్యుత్పత్తిని “అలైంగిక ప్రత్యుత్పత్తి” అంటారు.

ప్రశ్న 11.
ద్విధావిచ్చిత్తి అనగానేమి?
జవాబు:
ద్విధావిచ్చిత్తి :
ఏకకణ జీవులు రెండుగా విడిపోయే ప్రక్రియను “ద్విధావిచ్చిత్తి” అంటారు. సాధారణంగా ఇది సౌష్ఠవంగా జరుగుతుంది.
ఉదా: అమీబా, పారమీషియం

ప్రశ్న 12.
బహుధావిచ్చిత్తి అనగా నేమి?
జవాబు:
బహుధావిచ్చితి :
ఒక జీవి ఎక్కువ భాగాలుగా విడిపోయి, అవి జీవులుగా రూపొందే ప్రక్రియను “బహుధావిచ్చిత్తి” అంటారు. సాధారణంగా ఇది ప్రతికూల పరిస్థితులలో జరుగుతుంది.

ప్రశ్న 13.
‘అనిషేక జననం’ అనగానేమి?
జవాబు:
అనిషేక జననం :
ఫలదీకరణం జరగకపోయినా అండం అభివృద్ధి చెంది పిల్లజీవులుగా ఏర్పడే ప్రక్రియను “అనిషేక జననం” అంటారు.

ప్రశ్న 14.
కాండముల ద్వారా జరిగే శాఖీయోత్పత్తి రకములను తెలపండి.
జవాబు:
కాండముల ద్వారా జరిగే శాఖీయోత్పత్తి విధానాలు :
స్టోలన్లు : వాలిస్ నేరియా, స్ట్రాబెర్రీ
లశునాలు: ఉల్లి
కొమ్ములు : పసుపు
దుంప : బంగాళదుంప

ప్రశ్న 15.
కణజాలవర్ధనం అనగానేమి?
జవాబు:
కణజాలవర్ధనం: మొక్కలలోని కొంత కణజాలాన్ని వర్ధన యానకంలో ఉంచినపుడు, అవి కొత్త మొక్కలుగా పెరుగుతాయి. ఈ ప్రక్రియను “కణజాలవర్ధనం” అంటారు.

ప్రశ్న 16.
సిద్ధబీజాశయ పత్రాలు అనగానేమి?
జవాబు:
సిద్ధబీజాశయ పత్రాలు :
ఫెర్న్ మొక్క ఆకుల అడుగు భాగాన బూడిద రంగు మచ్చలు ఉంటాయి. ఈ మచ్చలను సోరై అంటారు. సోరైలుండే పత్రాలను “సిద్ధబీజాశయ పత్రాలు” (Sporophyll) అంటారు.

ప్రశ్న 17.
బాహ్య ఫలదీకరణం అనగానేమి?
జవాబు:
బాహ్య ఫలదీకరణం :
తల్లి శరీరానికి బయట జరిగే ఫలదీకరణను “బాహ్య ఫలదీకరణం” అంటారు.
ఉదా : చేపలు, కప్పలు

ప్రశ్న 18.
అంతర ఫలదీకరణ అనగానేమి?
జవాబు:
అంతర ఫలదీకరణం : సీ జీవి శరీరం లోపల జరిగే ఫలదీకరణను “అంతర ఫలదీకరణ” అంటారు.
ఉదా : పక్షులు, క్షీరదాలు

ప్రశ్న 19.
మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగాలు తెలపంది.
జవాబు:
ముష్కాలు, శుక్రవాహిక, ప్రసేకం, పౌరుష గ్రంథి, మేహనం, ఎపిడిడిమిస్ మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని ప్రధాన భాగాలు.

ప్రశ్న 20.
స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగాల పేర్లు చెప్పండి.
జవాబు:
గర్భాశయం, ఫాలోపియన్ నాళాలు, స్త్రీ బీజకోశాలు, యోని స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని ప్రధాన భాగాలు.

AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

ప్రశ్న 21.
అండోత్సర్గం అనగానేమి?
జవాబు:
అండోత్సర్గం :
గ్రాఫియన్ పుటిక నుండి అండం విడుదల కావటాన్ని “అండోత్సర్గం” (Ovulation) అంటారు.

ప్రశ్న 22.
పిండాన్ని ఆవరించి ఉండే పొరలు ఏమిటి?
జవాబు:
పిండాన్ని ఆవరిస్తూ పరాయువు (Chorion), ఉల్బం (Amnion), ఎల్లంటోయిస్ (Allantois) అనే పొరలు ఉంటాయి.

ప్రశ్న 23.
తల్లికి, ఎదుగుతున్న పిండానికి మధ్య పదార్థాల రవాణా ఎలా జరుగుతుంది?
జవాబు:
జరాయువు బొడ్డు తాడు (నాభిరజ్జువు) ద్వారా తల్లి, పిండాల మధ్య పదార్థాల రవాణా జరుగుతుంది.

ప్రశ్న 24.
జననాంతరం అనగానేమి?
జవాబు:
జననాంతరం :
శిశువు జననం తరువాత గర్భాశయ కండరాల సంకోచం, జరాయువును బయటకు నెట్టేంత వరకు జరుగుతుంది. ఈ ప్రక్రియను “జననాంతరం” అంటారు.

ప్రశ్న 25.
పిండకోశంలో ఎన్ని కణాలు ఎన్ని సమూహాలుగా అమరి ఉంటాయి?
జవాబు:
పిండకోశంలో మొత్తం ఏడు కణాలు, మూడు సమూహాలుగా ఉంటాయి. వీటిలో ధృవ కేంద్రకం ద్వయస్థితికంగా ఉండును.

ప్రశ్న 26.
ఏకలింగ పుషాలు అనగానేమి?
జవాబు:
ఏకలింగ పుష్పాలు :
కొన్ని పుష్పాలు కేసరావళిగాని, అండకోశం గాని ఏదో ఒక ప్రత్యుత్పత్తి భాగాన్ని మాత్రమే కలిగి ఉంటాయి. ఇటువంటి పుష్పాలను “ఏకలింగ పుష్పాలు” అంటారు.
ఉదా : సొరకాయ, బొప్పాయి

ప్రశ్న 27.
ద్విలింగ పుష్పాలు అనగానేమి?
జవాబు:
ద్విలింగ పుష్పాలు :
కేసరావళి అండకోశము రెండింటిని కలిగి ఉన్న పుష్పాలను “ద్విలింగ పుష్పాలు” అంటారు.
ఉదా : బఠాని, ఉమ్మెత్త

ప్రశ్న 28.
స్వపరాగ సంపర్కం అనగానేమి?
జవాబు:
స్వపరాగ సంపర్కం :
ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పం యొక్క కీలాగ్రం చేరడాన్ని “స్వపరాగ సంపర్కం” అంటారు.

ప్రశ్న 29.
పరపరాగ సంపర్కం అనగానేమి?
జవాబు:
పరపరాగ సంపర్కం :
పుష్పంలోని పురుష బీజకణాలు అదే జాతికి చెందిన ఇతర మొక్కల స్త్రీ బీజకణాలతో ఫలదీకరణ జరిగితే దానిని “పరపరాగ సంపర్కం” (Cross pollination) అంటారు.

ప్రశ్న 30.
పిండ కోశంలోని కణాలు ఏమిటి?
జవాబు:
పుష్పించే మొక్కల పిండకోశంలో 7 కణాలు ఉంటాయి. వీటిలో మూడు ప్రాతిపదిక కణాలు రెండు సహాయకణాలు. ఒక స్త్రీ బీజకణం, ఒక ద్వితీయ కేంద్రకం ఉంటాయి.

ప్రశ్న 31.
అంకురచ్ఛదము ఎలా ఏర్పడుతుంది?
జవాబు:
పురుష బీజకణం పిండకోశం మధ్యలో ఉన్న ద్వితీయ కేంద్రకంతో కలసి అంకురచ్ఛదాన్ని (Endo sperm) ఏర్పరుస్తుంది.

ప్రశ్న 32.
ద్విఫలదీకరణ అనగానేమి?
జవాబు:
ద్విఫలదీకరణ :
మొక్కలలో రెండు పురుష కేంద్రకాలు ఏర్పడి, ఒకటి స్త్రీ బీజకణంతోనూ, మరొకటి ద్వితీయ కేంద్రకంతోనూ కలుసాయి. ఇలా పిండకోశంలో రెండు ఫలదీకరణాలు జరగడాన్ని “ద్విఫలదీకరణం” అంటారు.

ప్రశ్న 33.
DNA అనగానేమి? దాని రసాయనిక నిర్మాణం ఏమిటి?
జవాబు:
డీ ఆక్సీరిబో న్యూక్లిక్ ఆసిడ్ ను “DNA” అంటారు. ఇది ద్వికుండలి నిర్మాణం కలిగి ఉంటుంది. దీని నిర్మాణాన్ని 1953లో “జేమ్స్ వాట్సన్ మరియు ఫ్రాన్సిస్ క్రికె” కనుగొన్నారు.

ప్రశ్న 34.
సమవిభజన గల ఉపదశలు ఏమిటి?
జవాబు:
సమ విభజనలో ప్రథమదశ, మధ్యస్థదశ, చలనదశ మరియు అంత్యదశ అనే ఉపదశలు ఉన్నాయి.

ప్రశ్న 35.
మధ్యస్థదశ యొక్క ప్రధాన లక్షణాలు ఏమిటి?
జవాబు:

  1. మధ్యస్థదశలో క్రోమోజోములు, సెంట్రిమియర్లు అన్నీ వరుసగా అమరి మధ్య ఫలకాన్ని ఏర్పరుస్తాయి.
  2. క్రోమోజోములను అంటి ‘కండె పరికరం’ ఏర్పడుతుంది.
  3. మధ్య ఫలకం, కండె పరికరం మధ్యస్థదశ యొక్క ప్రధాన లక్ష్యం.

ప్రశ్న 36.
క్షయకరణ విభజన ప్రాధాన్యత ఏమిటి?
జవాబు:
క్షయకరణ విభజనలో లైంగిక కణాల క్రోమోజోమ్ సంఖ్య సగానికి తగ్గించబడి సంయోగబీజాలు ఏర్పడతాయి. వీటి కలయిక వలన ఏర్పడిన కొత్త జీవిలో తల్లి జీవుల వలె క్రోమోజోమ్ సంఖ్య స్థిరంగా ఉంటుంది.

ప్రతి తరంలోనూ క్రోమోజోమ్ ల సంఖ్య స్థిరంగా ఉంచటానికి క్షయకరణ విభజన తోడ్పడుతుంది.

AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

ప్రశ్న 37.
స్టాక్, సయాన్ అనగా నేమి?
జవాబు:
సయాన్ :
అంటుకట్టే ప్రక్రియలో వాంఛిత లక్షణాలు ఉన్న మొక్కను “సయాన్” అంటారు.

స్టాక్ :
సయానికి ఆధారాన్నిచ్చే క్రింది మొక్కను “స్టాక్” అంటారు.

ప్రశ్న 38.
అలైంగిక ప్రత్యుత్పత్తికి ఉదాహరణలు తెలపండి.
జవాబు:
విచ్ఛిత్తి, కోరకీభవనం, ముక్కలు కావటం, సిద్ధబీజాలు, అనిషేక ఫలాలు మొదలైనవి. అలైంగికోత్పత్తిలోని కొన్ని ప్రక్రియలు.

ప్రశ్న 39.
కోరకీభవనాన్ని ఏ జీవులలో గమనిస్తావు?
జవాబు:
ఈస్ట్ వంటి శిలీంధ్రాలలో కోరకీభవనాన్ని గుర్తించవచ్చు.

ప్రశ్న 40.
ముక్కలవటం (Fragmentation) ఏ జీవులలో పరిశీలించవచ్చు?
జవాబు:
చదును పురుగులు, మోల్డులు, లైకెన్లు, స్పైరోగైరా వంటి సరళ జీవులలో ముక్కలవటం గమనించవచ్చు.

ప్రశ్న 41.
అనిషేక జననం ఏ ఏ జంతువులలో గమనించవచ్చు?
జవాబు:
తేనెటీగలు, చీమలు, కందిరీగలలో అనిషేక జననం గమనించవచ్చు.

ప్రశ్న 42.
పత్రముల ద్వారా శాఖీయోత్పత్తి జరిపే మొక్క ఏది?
జవాబు:
రణపాల ఆకు (బ్రయోఫిల్లమ్) పత్రముల ద్వారా శాఖీయోత్పత్తి జరుపుతుంది.

ప్రశ్న 43.
ఛేదనం ద్వారా శాఖీయోత్పత్తి జరిపే మొక్కలు ఏమిటి?
జవాబు:
చెరకు, గులాబి, మందార వంటి మొక్కలు ఛేదనం ద్వారా శాఖీయోత్పత్తి చెందుతాయి.

ప్రశ్న 44.
పాలను పెరుగుగా మార్చే సూక్ష్మజీవిలో ప్రత్యుత్పత్తి విధానం ఏమిటి?
జవాబు:
లాక్టిక్ యాసిడ్ బాక్టీరియా పాలను పెరుగుగా మార్చుతుంది. ఇది ద్విదావిచ్ఛిత్తి ద్వారా తన సంఖ్యను విపరీతంగా పెంచుతుంది.

ప్రశ్న 45.
విత్తనరహిత ఫలాలు ఎలా ఏర్పడతాయి? ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
అనిషేక ఫలనం (Parthenogenesis) ప్రక్రియలో విత్తనరహిత ఫలాలు ఏర్పడతాయి.
ఉదా : అరటి, ద్రాక్ష

ప్రశ్న 46.
కొన్ని లైంగిక వ్యాధులు తెలపండి.
జవాబు:
గనేరియా, సిఫిలిస్, ఎయిడ్స్ మొదలైనవి లైంగిక వ్యాధులు.

ప్రశ్న 47.
కొన్ని గర్భనిరోధక పద్ధతులు తెలపండి.
జవాబు:
భౌతిక ఉపకరణాలు : కండోమ్ లు, డయాఫ్రమలు, కాపర్ – T
రసాయన ఉపకరణాలు : స్పెర్మిసైడ్స్, మాలా – డి
శస్త్ర ఉపకరణాలు : వేసెక్టమీ, ట్యూబెక్టమీ మొదలైన గర్భనిరోధక పద్ధతులు నేడు అందుబాటులో ఉన్నాయి.

ప్రశ్న 48.
సెమినల్ ప్లాస్మా మరియు శుక్రము అనగానేమి?
జవాబు:
సెమినల్ ప్లాస్మా :
శుక్ర గ్రాహికలు ఉత్పత్తిచేసే ద్రవం, పౌరుష గ్రంధి స్రావాలు, కౌపర్ గ్రంధి స్రావాలను కలిపి సెమినల్ ప్లాస్మా అంటారు.

శుక్రము :
సెమినల్ ప్లాస్మా మరియు శుక్రకణాలను కలిపి శుక్రము (Semen) అంటారు.

ప్రశ్న 49.
‘స్కలనము’ అనగానేమి?
జవాబు:
స్కలనము :
పురుష జీవి నుండి శుక్రాన్ని బయటకు పంపడాన్ని ‘స్కలనము’ అంటారు.

ప్రశ్న 50.
సాధారణ ఫలదీకరణము జరగడానికి శుక్ర కణాలకు ఉండవలసిన లక్షణాలేవి?
జవాబు:
i) సాధారణ ఫలదీకరణానికి శుక్ర కణాలలో 60% సరైన ఆకారము, పరిమాణంలో ఉండాలి.
ii) కనీసం 40% వేగంగా చలించేలా ఉండాలి.

10th Class Biology 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
ఈ క్రింది పటంలో 4, b, c, d లను గుర్తించి వాటి విధులను వ్రాయండి.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 1
జవాబు:
a) అండాశయం :
మొక్కలలో స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం అండాశయం, స్త్రీ బీజకణాలు ఉత్పత్తి అవుతాయి. స్త్రీ, పురుష బీజకణాలు కలసి సంయోగ బీజం అండాశయంలో ఏర్పడుతుంది. ఫలదీకరణ ప్రక్రియలో కీలక పాత్ర వహిస్తుంది.

b) కీలం :
పురుష బీజకణాలు దీని ద్వారా ప్రయాణించి అండాశయాన్ని చేరటానికి తోడ్పడుతుంది.

c) కేసర దండం :
కేసరము పురుష బీజ ప్రత్యుత్పత్తి భాగము. దీనికి కేసర దండం, పరాగకోశం అని రెండు భాగాలుంటాయి. కేసర దండం పరాగ కోశానికి ఆధారాన్నిస్తుంది.

d) పరాగ కోశం :
పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ. పరాగకోశంలో పురుష బీజకణాలైన “పరాగ రేణువులు” ఉత్పత్తి అవుతాయి.

ప్రశ్న 2.
మానవ శుక్రకణం పటం గీసి, భాగాలు గుర్తించండి.
జవాబు:
AP Board 10th Class Biology Solutions 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 5

ప్రశ్న 3.
రెండు లక్షణాలను ఎన్నుకొని అంటుకట్టుట ద్వారా వాంఛిత ఉపయుక్త లక్షణాలను ఎలా పొందవచ్చో వివరించండి.
జవాబు:

  1. రెండు మొక్కలను దగ్గరగా చేర్చినప్పుడు రెండింటి కాండాలు కలిసిపోయి ఒకే మొక్కగా పెరుగుతాయి.
  2. నేలలో పెరుగుతున్న మొక్కను స్టాక్ అని, వేరే మొక్క నుండి వేరు చేయబడిన వేర్లు లేని అవాంఛిత లక్షణాలు గల భాగాన్ని సయాన్ అని అంటారు.
  3. స్టాక్, సయాన్ రెండింటిని పాలిథిన్ కాగితంతో కప్పి పురి ఉన్న దారంతో కట్బాలి.
  4. వాంఛనీయ లక్షణాలు గల మొక్కలను పొందేందుకు కావలసిన లక్షణాలున్న మొక్కలను సయాగా ఉపయోగించాలి.

ప్రశ్న 4.
పిండకోశం బొమ్మ గీసి, భాగాలు గుర్తించండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 2

ప్రశ్న 5.
మీ పాఠశాలకు వచ్చిన డాక్టర్ తో HIV వ్యాప్తి చెందే మార్గాలను తెలిసికోవడానికి నీవు ఎలాంటి ప్రశ్నలు అడుగుతావు?
జవాబు:

  1. HIV సంక్రమించే మార్గాలు ఏమిటి?
  2. రక్తమార్పిడి ద్వారా HIV వ్యాపిస్తుందా?
  3. సిరంజ్ లను వాడేటపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు సూచించండి.
  4. తల్లి నుండి బిడ్డకు HIV సంక్రమిస్తుందా?

ప్రశ్న 6.
క్షయకరణ విభజనలో మాతృకణాల కంటే ఏర్పడే పిల్లకణాల్లో క్రోమోసోముల సంఖ్య సగానికి తగ్గించబడతాయి. ఒకవేళ ఇలా జరుగకపోతే ఏమవుతుందో ఊహించి వ్రాయండి.
జవాబు:

  1. క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గించబడనట్లయితే రెండు కణాల కలయిక వలన కొత్తతరంలో క్రోమోజోముల సంఖ్య రెట్టింపవుతుంది.
  2. క్రోమోజోముల సంఖ్యలోని మార్పు జీవి లక్షణాలను పూర్తిగా మార్చివేస్తుంది.
  3. జనకతరంతో పొంతన లేని కొత్తతరం ఏర్పడుతుంది.
  4. కొత్తతరంలో మనుగడకు తోడ్పడని విపరీత లక్షణాలు ఏర్పడతాయి.

AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

ప్రశ్న 7.
విత్తనరహిత ఫలాలను అభివృద్ధి చేయడం ఎలా సాధ్యమవుతుంది? ఇలా అభివృద్ధి చేసిన వాటికి రెండు ఉదాహరణలు రాయండి.
జవాబు:
కొన్ని మొక్కలలో అండం క్షయకరణ విభజన జరగకుండానే సంయుక్త బీజంగా అభివృద్ధి చెందుతుంది. ఇవి విత్తనరహిత ఫలాలు.
ఉదా : పుచ్చకాయ, ద్రాక్ష

ప్రశ్న 8.
ఎయిడ్స్, ఇతర లైంగిక వ్యాధులు రాకుండా నీవు తీసుకునే జాగ్రత్తలేవి?
జవాబు:

  1. తెలియని వ్యక్తులతో లేదా ఎక్కువ మందితో శృంగారంలో పాల్గొనకపోవడం,
  2. శృంగారంలో పాల్గొనిన ప్రతిసారి కండోమ్ ఉపయోగించడం.
  3. రోగులకు సురక్షిత రక్తాన్ని ఎక్కించడం.
  4. డిస్పోసబుల్ సిరంజిలు మరియు సూదులు ఉపయోగించడం.
  5. HIV పాజిటివ్ ఉన్న తల్లి, డాక్టరు సలహా మేరకు మాత్రమే పిల్లల్ని కనాలి.

ప్రశ్న 9.
ఇవ్వబడిన పటాన్ని గమనించి దిగువనీయబడిన ప్రశ్నలకు సమాధానం వ్రాయుము.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 3
a) ఏ ఏ దశలు పూర్తవటానికి ఒకే సమయం తీసుకుంటాయి?
b) DNA సంశ్లేషణ ఏ దశలో జరుగుతుంది?
జవాబు:
a) ‘G1’ దశ మరియు ‘S’ దశ.
b) ‘S’ దశ

ప్రశ్న 10.
బొమ్మను పరిశీలించి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 4
i) బొమ్మలోని పురుష మరియు స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణాల పేర్లను రాయండి.
ii) బొమ్మలో సూచించిన 1, 2 భాగాల పేర్లు రాయండి.
జవాబు:
i) పురుష నిర్మాణాలు : పరాగరేణువులు, పరాగకోశము
స్త్రీ నిర్మాణాలు : కీలాగ్రము, అండాశయం, మరియు అండము.

ii) 1) రక్షక పత్రావళి, 2) ఆకర్షణ పత్రావళి

ప్రశ్న 11.
అప్పారావ్ మరియు రాములమ్మ కొత్తగా పెళ్ళైన నిరక్షరాశ్యులైన జంట. కొన్ని సంవత్సరాల వరకు పిల్లలు వద్దనుకుంటున్నారు. వారి కొరకు కుటుంబ నియంత్రణ పద్ధతులను కొన్నింటిని వ్రాయుము.
జవాబు:
తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్దతులు :
1) కండోమ్స్ 2) డయాఫ్రమ్స్ (క్యాప్స్) 3) కాపర్-టి 4) లూప్ 5) పిల్స్

ప్రశ్న 12.
సమవిభజనలో మధ్యస్థ దశ బొమ్మగీసి, దాని గురించి రాయండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 5

  1. క్రోమోజోమ్ లు కండే ఫలకము దగ్గరకు కదులుతాయి.
  2. సెంథీమియర్లు కండె తంతువులకు కలుపబడి ఉంటాయి.

ప్రశ్న 13.
అనిషేక జననం ఏ సందర్భంలో జరుగుతుంది? ఈ ప్రక్రియ జరిపే జంతువులకు రెండు ఉదాహరణలు రాయండి.
జవాబు:
ఫలదీకరణము చెందని అండ కణము నుంచి పిల్ల జీవులు నేరుగా ఏర్పడినప్పుడు అనిషేక జననము జరుగును.
ఉదా : 1. తేనెటీగలు, 2. చీమలు, 3. కందిరీగ

ప్రశ్న 14.
వివిధ జీవులలో ప్రత్యుత్పత్తికి పట్టే సమయంలో వ్యత్యాసం ఉంటుందా?
జవాబు:

  1. వివిధ జీవులలో ప్రత్యుత్పత్తికి పట్టే సమయం వేరుగా ఉంటుంది.
  2. కీటకాల జీవితకాలం కొన్ని నెలలలోనే పూర్తి అయితే, ఏనుగు సంతానోత్పత్తికి 360 రోజులు పడుతుంది.
  3. ఈస్ట్, బాక్టీరియా వంటి సూక్ష్మజీవులు ఒక గంట వ్యవధిలోనే తమ సంఖ్యను విస్తృతంగా పెంచుకుంటాయి.
  4. పిల్లి, కుక్కలలో గర్భావధికాలం 63 రోజుల ఉండగా, ఆవులో 280 రోజులు, గుర్రంలో 330 రోజులు ఉంటుంది.
  5. చుంచులలో అతి తక్కువ గర్భావధి 20 రోజులు ఉండగా, మానవునిలో 280 రోజులు ఉంటుంది.

ప్రశ్న 15.
అలైంగిక ప్రత్యుత్పత్తి అనగానేమి? ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
సంయోగబీజాల కలయిక లేకుండా కేవలం ఒక జీవి ప్రమేయంతోనే జరిగే ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు.

అలైంగిక ప్రత్యుత్పత్తి ఉదాహరణ
1. విచ్ఛిత్తి బాక్టీరియా, పారమీషియం
2. కోరకీభవనం ఈస్ట్‌
3. ముక్కలవటం స్పైరోగైరా శిలీంధ్రం
4. అనిషేక ఫలాలు పుచ్చకాయ, ద్రాక్ష
5. పునరుత్పత్తి ప్లనేరియా

ప్రశ్న 16.
విచ్ఛిత్తి గురించి రాయండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 6
విచ్ఛిత్తి (Fission):
పారమీషియం , బాక్టీరియా వంటి ఏకకణ జీవులు రెండు లేదా అంతకంటే ఎక్కువ ముక్కలుగా విడిపోవడం ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఇవి సాధారణంగా ఏకరూపకత కలిగి ఉంటాయి. ఇది సాధారణంగా సౌష్ఠవంగా జరుగుతుంది. పారమీషియం రెండుగా విడిపోవడాన్ని ద్విధావిచ్చిత్తి అని, అంతకంటే ఎక్కువ భాగాలుగా విడిపోతే దానిని బహుధావిచ్చిత్తి అని అంటారు. పారమీషియం పారామీషియంలో విచ్చిత్తి , వంటి జీవులలో తరచుగా ఈ విధానంలోనే ప్రత్యుత్పత్తి జరుగుతుంది.

ప్రశ్న 17.
కోరకీభవనం గురించి రాయండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 7
జనక జీవి శరీరం నుండి అవే పోలికలతో ఉన్న నిర్మాణం బయటకు పెరుగుతాయి. అది జనక జీవి నుండి వేరై స్వతంత్రంగా జీవిస్తుంది. ఉదాహరణకు ఈస్ట్‌లో కోరకీభవనం.

ప్రశ్న 18.
ముక్కలగుట గురించి రాయండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 8
కొన్ని జీవులు జనక జీవి శరీర ఖండాల నుండి కూడా పెరగగలవు. శరీరంలోని ఏ ఖండమైనా మొత్తం శరీరాన్ని ఏర్పరుస్తుంది. ఇటువంటి విధానం కేవలం చదును పురుగులు, మోల్డులు, లైకేన్లు, స్పెరోగైరా వంటి సరళజీవులలో మాత్రమే జరుగుతుంది. ఈ జీవులు లైంగిక ప్రత్యుత్పత్తి కూడా జరుపుకోగలవు. శైవలాలు, శిలీంధ్రాలు, కొన్ని రకాల మొక్కలలో ఇది సాధారణమైన ప్రత్యుత్పత్తి విధానంగా ఉంటుంది.

ప్రశ్న 19.
విత్తనరహిత ఫలాలు ఎలా ఏర్పడతాయి?
జవాబు:
ప్రకృతిలో సహజంగా కొన్నిసార్లు అండాలు ఫలదీకరణం చెందకుండానే, అండాశయం ఫలంగా మారుతుంది. ఇటువంటి కాయలో విత్తనాలు ఉండవు. వీటిని అనిషేక ఫలాలు అంటారు.

మానవుడు జిబ్బరెల్లిన్ వంటి ఫైటో హార్మోన్లను చల్లి కృత్రిమంగా అనిషేక ఫలాలు పొందుతున్నాడు.
ఉదా : అరటి, ద్రాక్ష

AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

ప్రశ్న 20.
పార్టినోజెనెసిస్ అనగానేమి? ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:

  1. క్షయకరణ విభజన జరిగి ఫలదీకరణ జరిగినా, జరగకపోయినా అండం జీవిగా అభివృద్ధి చెందుతుంది.
  2. ఈ ప్రక్రియలో ఏకస్థితిక పిల్లజీవులు మగజీవులు గాను, ద్వయస్థితిక అండాల నుండి ఆడజీవులు అభివృద్ధి చెందుతాయి.
  3. ఫలదీకరణతో ప్రమేయం లేకుండా అండాలు, జీవులుగా వృద్ధి చెందే ప్రక్రియను పార్టినోజెనెసిస్ అంటారు.
    ఉదా : తేనెటీగలు, చీమలు, కందిరీగలు

ప్రశ్న 21.
పునరుత్పత్తి అనగానేమి?
జవాబు:
AP Board 10th Class Biology Solutions 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 17
పూర్తిగా విభేదనం చెందిన అనేక జీవులకు తమ శరీర ఖండాల నుండి నూతన జీవిని ఇచ్చే సామర్థ్యం కలదు. ఈ ప్రక్రియను పునరుత్పత్తి అంటారు. దీనిని ‘ముక్కలవటం’ అనే శాఖీయోత్పత్తితో పోల్చవచ్చు.
ఉదా : ప్లనేరియా, వానపాము.

ప్రశ్న 22.
కృత్రిమ శాఖీయ వ్యాప్తి విధానాలు తెలపండి.
జవాబు:
కృత్రిమ శాఖీయ వ్యాప్తి విధానాలు :

  1. ఛేదనం : చెరకు, మందార
  2. అంటు తొక్కుట : మల్లె, గన్నేరు
  3. అంటుకట్టుట : గులాబి, మామిడి

ప్రశ్న 23.
ఛేదనం గురించి రాయండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 9
జనక మొక్క నుండి కోరకం కలిగిన మొక్క భాగాన్ని వేరు చేసినపుడు ఆ ఛేదన భాగం నుండి కొత్త మొక్కగా పెరుగుతుంది. ఆ ఛేదనం చేసిన భాగాన్ని తడి నేలలో నాటాలి. కొద్ది రోజులలో వేర్లు ఏర్పడి, మొగ్గలు పెరిగి కొత్త మొక్కగా పెరుగుతుంది.
ఉదా : బంతి, గులాబి

ప్రశ్న 24.
అంటు తొక్కుట గురించి రాయండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 10
అంటు తొక్కుట (Layering) :
మొక్కలో కనీసం ఒక కణపు అయినా కలిగి ఉన్న శాఖను నేలవైపు వంచి, కొంత భాగాన్ని చిగుర్లు బయటకు కనిపించేటట్లుగా మట్టితో కప్పాలి. కొద్దికాలం తరువాత ఈ కప్పి ఉంచిన భాగం నుండి కొత్త వేర్లు ఉత్పత్తి అవుతాయి. అపుడు ఈ కొమ్మను జనక మొక్క నుండి వేరు చేయాలి. వేర్లను ఉత్పత్తి చేసిన భాగం కొత్త మొక్కగా అభివృద్ధి చెందుతుంది.
ఉదా : మల్లె, గన్నేరు.

ప్రశ్న 25.
సిద్ధబీజాశయ పత్రం అనగానేమి?
జవాబు:
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 11
ఫెర్న్ మొక్కలు కూడా సిద్ధబీజాలను ఉత్పత్తి చేస్తాయి. ముదిరిన ఆకుల అడుగుభాగంలో బూడిద రంగులో ఉండే అనేక మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలను సోరై అంటారు. సోరైలుండే పత్రాలను సిద్ధబీజాశయ పత్రాలు (Sporophyll) అంటారు.

ప్రశ్న 26.
చేపలు, కప్పలు ఎక్కువ సంఖ్యలో అందాలను, శుక్రకణాలను విడుదల చేస్తాయి. ఎందుకు?
జవాబు:
చాలా వరకు చేపలు, ఉభయచరాలలో బాహ్య ఫలదీకరణం జరుగుతుంది. స్త్రీ జీవి అధిక సంఖ్యలో అండాలను నీటిలోకి విడుదల చేస్తుంది. అదే విధంగా పురుష జీవి మిలియన్లలో శుక్రకణాలను నీటిలోకి విడుదల చేస్తుంది. ఫలదీకరణ ప్రక్రియ ప్రకృతిచే నియంత్రించబడుతుంది. కాబట్టి స్త్రీ, పురుష జీవులు ఎక్కువ సంఖ్యలో అండాలను, శుక్రకణాలను విడుదల చేస్తాయి.

ప్రశ్న 27.
పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని అనుబంధ గ్రంథులు ఏవి? వాటి పని ఏమిటి?
జవాబు:
పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో అనుబంధ గ్రంథులైన పౌరుష గ్రంథి, రెండు కాఫర్ గ్రంథులు కలిసి జిగురు వంటి ఆ స్రావాన్ని ఉత్పత్తి చేస్తాయి. దీనిని శుక్రం అంటారు. ఇది శుక్రకణాలకు పోషక పదార్థాలను అందించడంతో పాటు శుక్రకణాల కదలికలకు మాధ్యమంగా కూడా పనిచేస్తుంది.

ప్రశ్న 28.
అండోత్సరం అనగానేమి?
జవాబు:
స్త్రీ బీజకోశ పుటికలలో అండాలు అభివృద్ధి చెందుతాయి. ఈ పుటికలు ప్రారంభంలో చిన్న చిన్న బుడగల రూపంలో ఉంటాయి. వీటిని గ్రాఫియన్ పుటికలు (Graphian follicles) అంటారు. ఈ పుటికల పరిమాణంతో పాటు ద్రవంతో కూడిన కుహరాలు కూడా అభివృద్ధి చెందుతాయి. ప్రతి పుటికలోనూ ఒక అండం ఉంటుంది. అండం పరిపక్వం చెందినపుడు, పుటిక పగిలి అండం విడుదలవుతుంది. ఇలా అండం విడుదల కావడాన్ని అండోత్సర్గం (Ovulation) అంటారు.

ప్రశ్న 29.
ఫలదీకరణ సమయంలో గర్భాశయంలో వచ్చే మార్పులు ఏమిటి?
జవాబు:
ఫలదీకరణ చెందిన అండం లేదా సంయుక్త బీజం ప్రవేశించడానికి ముందుగా గర్భాశయ పరిమాణం పెరుగుతుంది. ఇప్పుడు దీని లోపలి గోడలు మృదువుగా, దళసరిగా మారతాయి. తేమతో కూడిన ద్రవాన్ని స్రవిస్తాయి. రక్త సరఫరా కూడా బాగా మెరుగుపడుతుంది. ఇప్పుడు గర్భాశయం పిండ ప్రతిస్థాపనకు సిద్ధంగా ఉందన్నమాట.

ప్రశ్న 30.
పిండ ప్రతిస్థాపన అనగానేమి?
జవాబు:
ఫలదీకరణ చెందిన అండం గర్భాశయ కుడ్యానికి అంటి పెట్టుకోవడాన్ని పిండ ప్రతిస్థాపన అంటారు. తరువాత పిండంలోని కొన్ని కణాలు పిండానికి పోషణ, రక్షణ, ఆధారం ఇవ్వడానికి వీలుగా వేరు వేరు త్వచాలుగా అభివృద్ధి చెందుతాయి.

ప్రశ్న 31.
కణజాలవర్ధనం అనగానేమి? దాని ప్రయోజనం ఏమిటి?
జవాబు:
మొక్కలలో కొన్ని కణాలు లేదా కణజాలాన్ని మొక్క పెరుగుదల కారకాలు కలిగి ఉన్న వర్ధన యానకంలో ఉంచినపుడు అవి కొత్త మొక్కలుగా పెరుగుతాయి. ఈ విధానంలో వేల సంఖ్యలో మొక్కలను తక్కువ కాల వ్యవధిలో పెంచవచ్చు. దీనిని “కణజాలవర్ధనం” అంటారు.

ప్రశ్న 32.
జరాయువు ఎలా ఏర్పడుతుంది?
జవాబు:
పిండాన్ని ఆవరించి ఉండే బాహ్య త్వచాన్ని పరాయువు (Chorion) అంటారు. పిండం అభివృద్ధి చెందుతున్నప్పుడు పరాయువు ఉపరితలం నుండి సన్నని వేళ్ళవంటి నిర్మాణాలు గర్భాశయ మృదుకణజాలంలోనికి పెరుగుతాయి. క్రమేపి గర్భాశయి జ్యంలో పాతుకున్న ఈ వేళ్ళ వంటి నిర్మాణాల చుట్టూ వేగంగా కదిలే చిన్న చిన్న రక్తపు మడుగులు ఏర్పడతాయి. పరాయువు కణజాలం, దీనికి ఆనుకొని ఉన్న గర్భాశయ కణజాలం కలిసి జరాయువు (Placenta) ను ఏర్పరుస్తాయి.

ప్రశ్న 33.
జరాయువు పని ఏమిటి?
జవాబు:
పిండ కణాలు, తల్లి కణాలు కలిసి జరాయువు ఏర్పడుతుంది. పిండ పోషణకు అత్యంత ఆవశ్యకమైన ఈ జరాయువు గర్భధారణ జరిగిన సుమారు 12 వారాలకు ఏర్పడుతుంది. సాధారణ పరిస్థితిలో తల్లికి, బిడ్డకు మధ్య నేరుగా రక్త ప్రసరణ జరగదు. ఇద్దరి రక్త ప్రసరణ వ్యవస్థలు పలుచని త్వచం ద్వారా వేరు చేయబడి ఉంటాయి. దీని గుండా ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్, పోషకాలు, వ్యర్థ పదార్థాలు విస్తరణ పద్ధతి ద్వారా రవాణా చేయబడతాయి.

AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

ప్రశ్న 34.
నాభిరజ్జువు ఎలా ఏర్పడుతుంది?
జవాబు:

  1. పిండం యొక్క మరోక త్వచం ఎల్లంటోయిస్ (Allantois) త్వచం పిండం యొక్క ఆహారనాళం నుండి ఉద్భవిస్తుంది.
  2. సొన సంచి, ఉల్బపు ముడతల అంచులు ఎల్లంటోయిస్ కాడ వద్ద కలిసి పిండాన్ని జరాయువుతో కలిపే నాళాన్ని ఏర్పరుస్తాయి.
  3. ఈ నాళాన్నే నాభిరజ్జువు (Umbellical cord) అంటారు. ఇది పిండాన్ని జరాయువుతో కలిపే రక్త నాళాలను కలిగి ఉంటుంది. దీని ద్వారా తల్లి నుండి బిడ్డకు పోషకపదార్థాలు అందజేయబడతాయి.

ప్రశ్న 35.
గర్భావధి కాలం అనగానేమి? వివిధ జంతువులలోని గర్భావధికాలం తెలపండి.
జవాబు:
గర్భావధి కాలం :
పిండం పూర్తిగా అభివృద్ధి చెందటానికి పట్టే కాలాన్ని గర్భావధి కాలం అంటారు. వివిధ జీవులలో సరాసరి గర్భావధి కాలం వేర్వేరుగా ఉంటుంది. పిల్లి, కుక్కలలో గర్భావధి కాలం 63 రోజులు. గుర్రం 330 రోజులు, ఆవు 280 రోజులు. ఎలుకలు మరియు చుంచుల గర్భావధి కాలం 20-22 రోజులు ఉంటుంది.

ప్రశ్న 36.
జనసాంతరం అనగానేమి?
జవాబు:

  1. ప్రసవం తరువాత శిశువు నుండి జరాయువు వరకు గల నాభిరజువును వైద్యులు కత్తిరించి వేరుచేస్తారు.
  2. శిశువుతోనున్న నాభిరజువు యొక్క చిన్న భాగం కృశించుకుపోయి కొద్ది రోజులలో ఊడిపోతుంది. ఈ భాగాన్ని నాభి అంటాం.
  3. శిశుజననం తరవాత గర్భాశయ కండరాల సంకోచం, జరాయువును బయటకు నెట్టేంతవరకు కొనసాగుతుంది. ఈ ప్రక్రియనే ‘జననాంతరం’ అంటారు.

ప్రశ్న 37.
ప్రథమ స్తన్యం అనగానేమి? దాని ప్రాధాన్యత ఏమిటి?
జవాబు:

  1. గర్భావధి చివరి దశలో శోషరసాన్ని పోలిన ద్రవం స్తన గ్రంథులలో ప్రోగవుతుంది. దీనినే “ముర్రుపాలు లేదా ప్రథమ స్తన్యం” అంటారు.
  2. శిశుజననం తరువాత కొన్ని రోజులు స్తన గ్రంథులు ముర్రుపాలనే స్రవిస్తాయి.
  3. నవజాత శిశువులో వ్యాధినిరోధకత పెంచటానికి ఇవి అత్యావశ్యకం.

ప్రశ్న 38.
లైంగిక ప్రత్యుత్పత్తి ప్రాధాన్యత ఏమిటి?
జవాబు:
లైంగిక ప్రత్యుత్పత్తి ప్రాధాన్యత :
అలైంగిక ప్రత్యుత్పత్తిలో జీవులు తమను పోలిన జీవులను ఉత్పత్తి చేయడంలో ఒక జనక జీవి మాత్రమే ఉంటుంది. లైంగిక ప్రత్యుత్పత్తిలో రెండు జనక జీవులు పాల్గొంటాయి. రెండు జీవుల ఉమ్మడి లక్షణాలు తరువాత తరానికి వస్తాయి. లైంగిక ప్రత్యుత్పత్తికి ఎక్కువ సమయం, శక్తి వృథా కావు. భాగస్వామిని వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. లైంగిక ప్రత్యుత్పత్తిలో తమచుట్టూ ఉన్న పరిసరాలతో సమర్థవంతంగా సర్దుబాటు చేసుకోవడానికి అనువైన జీవులు ఉత్పత్తి అవుతాయి.

ప్రశ్న 39.
పరాగసంపర్కానికి సంబంధించి డార్విన్ పరిశీలన ఏమిటి?
జవాబు:
మొక్కలను ఎక్కువ కాలం అదే జాతికి చెందిన మొక్కల నుండి వేరుచేస్తే వాటికి స్వపరాగసంపర్కం జరుపుకునే సామర్థ్యం పెరుగుతుంది. అదే జాతికి చెందిన మొక్కల్లో ఉంచినపుడు పరపరాగ సంపర్కం జరుపుకునే సామర్థ్యం పెరుగుతుందని 1867 సం||లో “ఛార్లెస్ డార్విన్” నిరూపించాడు.

ప్రశ్న 40.
విత్తనంలో అంకురచ్ఛదం యొక్క ప్రాధాన్యత ఏమిటి?
జవాబు:
అంకురచ్చదాన్ని ఉపయోగించుకొని బీజదళాలు అభివృద్ధి చెందుతాయి. అంటే అంకురచ్చదంలో నిలువచేసిన పోషక పదార్థాలను బీజదళాలు వినియోగించుకుంటాయి. కొన్ని మొక్కల బీజదళాలు (ఉదా : చిక్కుడు) అలకు రచ్చదాన్ని పూర్తిగా వినియోగించుకొని విత్తనాలుగా మారతాయి. ఫలితంగా పోషక పదార్థాల నిలువలు పెరగడం వలన బీజదళాల పరిమాణం పెరుగుతుంది. మొక్కజొన్న లేదా ఆముదం వంటి మరికొన్ని రకాల పుష్పించే మొక్కల్లో పిండం విత్తనంగా ఎదిగే వరకు దానితోపాటుగా అంకురచ్ఛద కణజాలం కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది.

ప్రశ్న 41.
కణవిభజన మీద ‘ఆగస్ట్ వీస్మన్’ ప్రతిపాదనలు ఏమిటి?
జవాబు:

  1. ఒక జాతి జీవులలో క్రోమోజోమ్ ల సంఖ్య ఎన్ని తరాలు మారినా నిర్దిష్టంగా, ఒకే విధంగా ఉంటుంది.
  2. కణ విభజన జరిగినా క్రోమోజోమ్ సంఖ్య స్థిరంగా ఉంటుంది.

ప్రశ్న 42.
లైంగిక వ్యాధులు ఎలా సంక్రమిస్తాయి?
జవాబు:
లైంగిక వ్యాధులు ఎక్కువగా సురక్షితం కాని లైంగిక కార్యకలాపాల వలన, శుద్ధిచేయని సూదులు మొదలైన ఉపకరణాల వలన, రక్త మార్పిడి వలన ఒకరి నుండి ఒకరికి సంక్రమిస్తాయి. కొన్ని సందర్భాలలో తల్లి నుండి బిడ్డకు కూడా వ్యాపిస్తాయి.

ప్రశ్న 43.
ఎయిడ్స్ వ్యాధి నివారణకు తీసుకొంటున్న చర్యలు ఏమిటి?
జవాబు:
ప్రభుత్వం ART కేంద్రాల ద్వారా (Anti Retroviral Therapy) HIV వ్యాధిగ్రస్తులకు వైద్య సదుపాయాలు కలుగజేస్తోంది. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ విభాగాలు AIDS నిర్మూలన కోసం అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఆశ (ASHA – Accredited Social Health Activist), రెడ్ రిబ్బన్ ఎక్స్ ప్రెస్ మొదలైన కార్యక్రమాల ద్వారా AIDS వ్యాధి లక్షణాలు, ప్రమాదాలు, నివారణా చర్యలను తెలుపుతూ అవగాహన కలిగించేందుకు కృషి చేస్తున్నారు.

ప్రశ్న 44.
కుటుంబ నియంత్రణకు చేసే శస్త్రచికిత్సలు ఏమిటి?
జవాబు:
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 12
స్త్రీ పురుషులిద్దరికీ కుటుంబ నియంత్రణ (birth control) కోసం శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయి. పురుషులకు చేసే శస్త్రచికిత్సలో శుక్రనాళాన్ని కత్తిరించి నాళం రెండు చివరలను గట్టిగా కట్టి ముడివేస్తారు. అందువల్ల శుక్రకణాలు విడుదల కాకుండా అడ్డగించబడతాయి. ఈ పద్ధతినే వేసెక్టమీ (Vasectomy) అంటారు. స్త్రీలలో అండనాళంలో (Fallopian tubes) చిన్న భాగాన్ని కత్తిరించి, తీసివేసి చివరలను గట్టిగా ముడి వేస్తారు. ఇలా చేయటం ద్వారా అండం, అండనాళంలోనికి వెళ్ళకుండా చేస్తారు. దీనిని ట్యూబెక్టమీ అంటారు.

ప్రశ్న 45.
18 సంవత్సరాలు వయస్సు నిండకుండా అమ్మాయిలకు వివాహం ఎందుకు చేయకూడదు?
జవాబు:
చిన్నతనంలో తల్లి కావడం అనారోగ్యానికి దారితీస్తుంది. శిశువుకు జన్మనివ్వడం అనేది ఒక సంక్లిష్టమైన జీవన ప్రక్రియ. స్త్రీలలో 18 సంవత్సరాలు నిండిన తరువాతే శిశువుకు జన్మనివ్వడానికి శారీరకంగా సిద్ధంగా ఉంటారు. నిరక్షరాస్యత, పేదరికం, మూఢనమ్మకాలు, బాల్యవివాహాలకు ముఖ్యమైన కారణాలు. కుటుంబ సంక్షేమశాఖ వివరాల ప్రకారం మన దేశంలో ప్రతి ఏటా 21 శాతం మంది బాలికలు ప్రసవ సమయంలోనే చనిపోతున్నారు. పోషకాహార లోపం కూడా ప్రసవ సమయానికి ముందు, ప్రసవం తరువాత మరణానికి దారితీస్తుంది. కాబట్టి 18 సంవత్సరాల వయస్సు నిండకుండా అమ్మాయిలు వివాహానికి అంగీకరించకూడదు.

ప్రశ్న 46.
ద్విధావిచ్ఛిత్తి ఏ విధంగా బహుధావిచ్చిత్తి కంటే భిన్నంగా ఉంటుంది?
జవాబు:

ద్విధావిచ్ఛిత్తి బహుధావిచ్చిత్తి
1. రెండు పిల్ల జీవులు ఏర్పడతాయి. 1. ఎక్కువ పిల్ల జీవులు ఏర్పడతాయి.
2. సౌష్ఠవంగా జరుగుతుంది. 2. సౌష్ఠవంగా జరగదు.
3. అనుకూల పరిస్థితులలో జరుగుతుంది. 3. ప్రతికూల పరిస్థితులలో జరుగుతుంది.
4. తక్కువ సమయం పడుతుంది. 4. ఎక్కువ సమయం పడుతుంది.

ప్రశ్న 47.
ఫలదీకరణ అనగానేమి? అందలి రకాలు తెలపండి.
జవాబు:
ఫలదీకరణ :
స్త్రీ, పురుష సంయోగ బీజాల కలయికను ఫలదీకరణ అంటారు. ఇది రెండు రకాలు.

1. బాహ్య ఫలదీకరణ :
శుక్రకణాలు, అండాల కలయిక జంతు శరీరం బయట జరిగితే దానిని “బాహ్య ఫలదీకరణ” అంటారు.
ఉదా : చేప, కప్ప

2. అంతర ఫలదీకరణ :
ఫలదీకరణ స్త్రీ జీవి శరీరంలో జరిగితే దానిని “అంతర ఫలదీకరణ” అంటారు.
ఉదా : పక్షులు, క్షీరదాలు

AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

ప్రశ్న 48.
‘బాల్య వివాహాలను ఒక సాంఘిక దురాచారం’ అని తెలుపుతూ కొన్ని నినాదాలు రాయండి.
జవాబు:

  1. బాల్య వివాహం చేయటం ఓడిపోనున్న ఆటతో సమానం.
  2. బాల్య వివాహాలు వద్దు – చదువే ముద్దు.
  3. బాల్య వివాహాలను అరికట్టండి – బాలికలను ఎదగనీయండి.
  4. బాలిక అమ్మా అని పిలవాలి – ఆమె అమ్మా అని పిలవబడకూడదు.
  5. మంచి వివాహాలు నిదానంగా జరుగుతాయి. బాలిక వివాహం పట్ల జాగరూకత ఉండాలి.
  6. బాల్య వివాహాలు వద్దు – బతుకంతా నరకం చేయవద్దు.

ప్రశ్న 49.
HIV ఎయిడ్స్ వ్యాధి నివారణ తెలుపుతూ 5 నినాదాలు రాయండి.
జవాబు:

  1. ఎయిడ్స్ వ్యాధికి మందు లేదు నివారణ ఒక్కటే మార్గం.
  2. ఎయిడ్స్ వ్యాధి నీ కళ్ళను మూయక ముందే వాటిని నీవు తెరువు.
  3. ఎయిడ్స్ వ్యాధిని అసహ్యించండి… వ్యాధిగ్రస్తులను కాదు.
  4. విజ్ఞానాన్ని వ్యాప్తి చేయండి…. HIV వైరసన్ను కాదు.
  5. ఎయిడ్స్ అంటువ్యాధి కాదు …. అంటించుకునే వ్యాధి.
  6. కండోమ్ ను ధరించు ….. వ్యాధి సంక్రమణను నివారించు.

ప్రశ్న 50.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 13
పైన గీయబడిన మానవ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో A, B, C, D అని సూచించిన భాగముల పేర్లు వ్రాయుము.
జవాబు:
A – ఫాలోపియన్ నాళం (స్త్రీ బీజవాహిక) –
B – అండాశయం, C – గర్భాశయం, D – యోని

ప్రశ్న 51.
కౌమార దశలోని పిల్లలలో ఎటువంటి జీవన నైపుణ్యాలు ఉండవలసిన అవసరముందో వివరించండి.
జవాబు:

  1. సరియైన నిర్ణయాన్ని తీసుకునే నైపుణ్యం అనగా సరియైన విధంగా ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవడం.
  2. వివిధ రకాల వ్యక్తులతో వ్యవహరించే నైపుణ్యం అనగా, స్నేహితులతో ఆరోగ్యకరమైన సంబంధాలను ఏర్పరచుకోవడం.
  3. సంభాషణ నైపుణ్యం అనగా తమ అభిప్రాయాలను, భయాలను, సందేహాలను నిర్భయంగా వ్యక్తపరచడం.
  4. సమస్యలను అధిగమించే నైపుణ్యం అనగా పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించడం.
  5. సమవయస్కుల ఒత్తిళ్ళకు సరియైన రీతిలో స్పందించడం అనగా తోటి వారి వత్తిడులకు లొంగకుండడం.
  6. మమతానుబంధాలను పెంపొందించుకోవడం అనగా, స్త్రీలు పురుషుల పట్లను, పురుషులు స్త్రీల పట్లను సరియైన అవగాహనతో మెలగడం.

ప్రశ్న 52.
శుక్రకణం అండంలోనికి ప్రవేశించిన తరువాత జరిగే మార్పులు ఏవి?
జవాబు:

  1. శుక్రకణం అండంలోనికి ప్రవేశించిన తరువాత రెండు కేంద్రకాలు కలవడానికి ముందుగా అండంలో క్షయకరణ విభజన యొక్క రెండవ దశ జరుగుతుంది.
  2. ఫలదీకరణం తరువాత అండం సంయుక్తబీజం (Zygote) గా మారుతుంది.
  3. సంయుక్తబీజం ఫాలోపియన్ నాళం ద్వారా ప్రయాణించేటప్పుడు సమవిభజనలు చెందడం మొదలవుతుంది.
  4. గర్భాశయాన్ని చేరే సమయానికి సంయుక్త బీజం కణాల ‘బంతిగా మారుతుంది.

10th Class Biology 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
పుష్పంలో అండము నుండి విత్తనము ఏర్పడే విధానములో ఉండే మార్పులను వివరించండి.
జవాబు:
ద్విఫలదీకరణం విధానం :

  1. మొక్క జాతిని బట్టి అండాశయంలో ఒకటి, రెండు లేదా అంతకన్నా ఎక్కువ అండాలుంటాయి. ప్రతీ అండం మధ్యలో పోషక పదార్థాలు, నీరు మరియు సిద్ధ బీజకణాలను కలిగిన పిండకోశం (embryo sac) ఉంటుంది.
  2. పిండకోశం 7 కణాలను, 8 కేంద్రకాలను కలిగి ఉంటుంది. మొదట స్థూల సిద్ధ బీజం 4 విభజనల తరువాత 8 కణాల స్థితి లోనికి వస్తుంది.
  3. 3 కణాలు పిండకోశం పై భాగానికి చేరి పోషణకు తోడ్పడతాయి. వీటిని ప్రతిపాదకణాలు” (Antipodals) అంటారు. పిండకోశం పూర్వ భాగంలో 3 కణాలుంటాయి. వానిలో రెండు “సహాయ కణాలు” (Synergids), ఒకటి “స్త్రీ బీజకణం” (Egg) ఉంటాయి.
  4. మధ్య భాగంలో ఉండే కణం పెద్దదిగా ఉండి రెండు కేంద్రకాలను కలిగి ఉంటుంది. “దీనిని ద్వితీయ కేంద్రకం” అంటారు.
  5. పరాగ రేణువు మొలకెత్తి ఏర్పడిన పరాగనాళం పిండకోశం లోనికి ప్రవేశించగానే, కొనభాగం పగిలిపోయి రెండు పురుష బీజకణాలు పిండకోశంలోనికి విడుదలవుతాయి.
  6. వాటిలో ఒకటి స్త్రీ బీజకణంతో కలుస్తుంది. దీనిని ఫలదీకరణం అంటారు. దీనివల్ల “సంయుక్త బీజం” ఏర్పడుతుంది. మరొక పురుష బీజ కేంద్రకం పిండకోశం మధ్యలో ఉన్న ద్వితీయ కేంద్రకంతో కలసి “అంకురచ్ఛదం” (Endosperm)ను ఏర్పరుస్తుంది. అలా రెండు సార్లు ఫలదీకరణ జరగటాన్ని “ద్విఫల దీకరణం” (Double fertilization) అంటారు.
  7. ద్విఫలదీకరణం తరువాత అండంలో త్వరితగతిన జరిగే అనేక మార్పుల కారణంగా, అంకురచ్చదం ఏర్పడటం మూలంగా పిండాభివృద్ధి వేగవంతమవుతుంది. పిండంలో ఒకటి లేదా రెండు బీజదళాలు ఏర్పడతాయి.
  8. అంకురచ్చదంలో నిలువచేసిన పోషక పదార్థాలను బీజదళాలు వినియోగించుకుంటాయి.
  9. ఫలదీకరణం తరువాత సంయుక్త బీజం పలుమార్లు సమవిభజన చెంది పిండం ఏర్పడుతుంది. ఇది దృఢమైన కవచాన్ని ఏర్పరుచుకొని విత్తనంగా మారుతుంది.
  10. అండాశయం పెరిగి పరిపక్వం చెంది ఫలంగా మారుతుంది. తరువాత మిగతా పుష్పభాగాలు క్షీణించి రాలిపోతాయి.

ప్రశ్న 2.
కింది సమాచారాన్ని విశ్లేషించండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

మొక్క పేరు వ్యాప్తి చెందే పద్ధతి
1. మామిడి అంటుకట్టడం
2. గులాబి, మందార ఛేదనం
3. మల్లె అంటు తొక్కడం
4. రణపాల ఆకు అంచుల నుండి కొత్త మొక్కలు మొలకెత్తుతాయి
5. బంగాళదుంప దుంప
6. ఉల్లి లశునం

i) పైన సూచించిన ప్రత్యుత్పత్తి విధానాలను ఏమని పిలవవచ్చు?
ii) మొక్కలలో శాఖీయ ప్రత్యుత్పత్తికి, లైంగిక ప్రత్యుత్పత్తికి గల ముఖ్యమైన తేడా ఏమిటి?
iii) బంగాళదుంప మొక్క విత్తనాలను ఉత్పత్తి చేయలేదు. ఇలాంటి మొక్కలను ఏ పద్ధతి ద్వారా వ్యాప్తి చెందించవచ్చు?
iv) పట్టికలో సూచించిన పద్ధతులలో మొక్కలను వ్యాప్తి చెందించడం వలన కలిగే లాభం ఏమిటి?
జవాబు:
i) పైన సూచించిన ప్రత్యుత్పత్తి విధానాలను ఏమని పిలవవచ్చు?
జవాబు:
పట్టికలో సూచించినవి శాఖీయోత్పత్తి విధానాలు.

ii) మొక్కలలో శాఖీయ ప్రత్యుత్పత్తికి, లైంగిక ప్రత్యుత్పత్తికి గల ముఖ్యమైన తేడా ఏమిటి?
జవాబు:
లైంగిక ప్రత్యుత్పత్తిలో సంయోగబీజాలు ఏర్పడి సంయోగం చెందుతాయి. శాఖీయ ప్రత్యుత్పత్తిలో సంయోగబీజాలు ఏర్పడవు.

iii) బంగాళదుంప మొక్క విత్తనాలను ఉత్పత్తి చేయలేదు. ఇలాంటి మొక్కలను ఏ పద్ధతి ద్వారా వ్యాప్తి చెందించవచ్చు?
జవాబు:
బంగాళదుంప మొక్కలు ‘కన్నులు’ అనే శాఖీయోత్పత్తి విధానంలో వ్యాప్తి చెందును.

iv) పట్టికలో సూచించిన పద్ధతులలో మొక్కలను వ్యాప్తి చెందించడం వలన కలిగే లాభం ఏమిటి?
జవాబు:
శాఖీయోత్పత్తిలో మొక్కల నాణ్యత మారదు. తక్కువ కాలంలో ఎక్కువ మొక్కలు ఉత్పత్తి చేయవచ్చు.

AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

ప్రశ్న 3.
వివిధ మొక్కలలో అవలంభించే కృత్రిమ శాఖీయ వ్యాప్తి పద్ధతులు తెలపండి.
జవాబు:
కృత్రిమ శాఖీయ వ్యాప్తి పద్ధతులు :
a) అంటు తొక్కుట :
మల్లె, జాజి వంటి పుష్ప, మొక్కలు బలహీన కాండాలను కల్గి ఉంటాయి. వీటి బెరడును కొంచెం తొలగించి, భూమిలో పాతిపెట్టి కొత్త మొక్కలను ఉత్పత్తి చేయు పద్దతిని అంటు తొక్కుట అంటారు.

b) అంటుకట్టుట :
వేరు వేరు మొక్క భాగాలను జోడించి, కలిపి ఒకే మొక్కగా పెంచే ప్రక్రియను అంటుకట్టుట అంటారు. ఈ ప్రక్రియలో క్రింది భాగాన్ని (వేరు కల్గిన భాగం) స్టాక్ అని, పైన పెరిగిన భాగాన్ని సయాన్ అని అంటారు.
ఉదా : గులాబి, మామిడి.

c) కణజాల వర్ధనం :
ఇది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం. కణజాలాన్ని కాలలో పెంచి మొక్కలుగా పెంచుతారు. ఇది నియంత్రిత పరిస్థితులలో జరుగుతుంది.

ప్రశ్న 4.
క్రింది పటాల ఆధారంగా కణ విభజనలోని వివిధ దశలను గుర్తించి, వివరించండి.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 14
జవాబు:

దశ వివరణ
A) ప్రథమదశ 1. క్రోమోజోమ్ లు వికుండలీకరణ చెంది క్రమంగా పొట్టిగా, దళసరిగా మారతాయి. (కాంతి సూక్ష్మదర్శిని కింద కనిపించేలా తయారవుతాయి.) కేంద్రకం చిన్నదవుతుంది.
2. ప్రతి క్రోమోజోమ్ నిలువుగా చీలి క్రొమాటిడ్లుగా రూపొందుతాయి. అవి
సెంట్రోమియర్తో కలుపబడి ఉంటాయి.
3. కేంద్రకత్వచం అంతర్థానమవుతుంది.
4. కడ్డీ వంటి సెంట్రియోలను కలిగి ఉన్న సెంట్రోసోమ్ విభజన చెంది కండె పరికరాన్ని ఏర్పరుస్తుంది. (జంతు కణాలలో మాత్రమే సెంట్రియోల్స్ ఉంటాయి. క్షయకరణ విభజన వలె క్రోమోజోమ్ లు జతలుగా ఏర్పడవు.)
B) మధ్యస్థదశ 1. క్రోమోజోమ్ లు కండె. ఫలకం దగ్గరకు కదులుతాయి. సెంట్రోమియర్లు కండె తంతువులకు కలుపబడి ఉంటాయి.
2. సెంట్రోమియర్ చీలిపోయి రెండు క్రొమాటిడ్లు వేరవుతాయి.
C) చలనదశ 1. సెంట్రోమియర్లను అంటి ఉన్న కండె తంతువులు సంకోచం చెందడం వలన క్రొమాటిడ్లు ధృవాల వైపుకు లాగబడతాయి.
D) అంత్యదశ 1. క్రొమాటిద్దు పొడవుగా దారపు పోగుల మాదిరిగా మారిపోతాయి. స్పష్టంగా కనబడవు. తిరిగి క్రోమోజోమ్లుగా మారుతున్నాయన్నమాట.
2. పిల్ల కేంద్రాల చుట్టూ కేంద్రక త్వచాలు ఏర్పడతాయి.
3. కణ త్వచంలో నొక్కు ఏర్పడటం ద్వారా రెండు పిల్ల కేంద్రాలు వేరవుతాయి. (జంతు కణాలలో), అదే మొక్కలలో అయితే కండే పరికరం ప్రాంతంలో కణకవచ పదార్థం లేదా కణఫలకం ఏర్పడటం ద్వారా రెండు కేంద్రకాలు వేరవుతాయి.
4. కేంద్రకం రెండుగా విడిపోతుంది. తరువాత సైటోప్లాజమ్ విభజన జరుగుతుంది. రెండు కణాలు ఏర్పడతాయి.

ప్రశ్న 5.
సమ విభజనలోని వివిధ దశలేవి ? వాటిని సూచించే బొమ్మలు గీసి, ప్రథమ దశలో ఏ మార్పులు జరుగుతాయో వివరించండి.
జవాబు:
1) ప్రథమ దశ 2) మధ్యస్థ దశ 3) చలనదశ 4) అంత్యదశ
AP Board 10th Class Biology Solutions 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 15

ప్రథమదశలో జరిగే మార్పులు :

  1. క్రోమోజోమ్ లు వికుండలీకరణ చెంది పొట్టిగా మారతాయి. కేంద్రకం చిన్నదవుతుంది.
  2. ప్రతి క్రోమోజోమ్ నిలువుగా చీలి క్రొమాటిడ్లుగా రూపొందుతాయి. అవి సెంట్రోమియర్తో కలుపబడి ఉంటాయి.
  3. కేంద్రక త్వచం అంతర్థానమవుతుంది.
  4. కడ్డీ వంటి సెంట్రియోల్స్ ను కలిగి ఉన్న సెంట్రోసోమ్ విభజన చెంది కండె ఫలకాన్ని ఏర్పరుస్తుంది.

ప్రశ్న 6.
చక్కని అండాశయం నిర్మాణం పటం గీచి, భాగాలు గుర్తించండి.
జవాబు:
AP Board 10th Class Biology Solutions 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 11

ప్రశ్న 7.
పుష్పించే మొక్క జీవిత చరిత్రను తెలిపే పటం గీయండి. బీజ దళాలు మొక్కకు ఏ విధంగా ఉపయోగపడతాయో రాయండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 15
బీజదళాలు మొక్కలో పత్రాలు ఏర్పడే వరకు ఆహారాన్ని అందించటానికి తోడ్పడతాయి.

ప్రశ్న 8.
పటమును పరిశీలించి కింది ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 16
ఎ) పుష్పంలోని నాలుగు ప్రధాన భాగములేవి?
బి) పటంలో బీజకణాలను ఉత్పత్తి చేసే నిర్మాణాలేవి?
సి) పరాగ సంపర్కానికి తోడ్పడే భాగాలేవి?
డి) మొగ్గదశలో పుష్పాన్ని రక్షించు నిర్మాణాలేవి?
ఇ) పటంలోని ఏ భాగం భవిష్యత్ లో ఫలంగా మారుతుంది?
జవాబు:
ఎ) 1. రక్షక పత్రావళి, 2. ఆకర్షక పత్రావళి, 3) కేసరావళి, 4) అండకోశం
బి) కేసరావళి, అండకోశం సి) ఆకర్షక పత్రావళి డి)రక్షక పత్రావళి ఇ) అండకోశం

ప్రశ్న 9.
కొన్ని జీవులు అలైంగిక విధానంలో ప్రత్యుత్పత్తిని వివిధ రకాలుగా జరుపుకుంటాయి. క్రింద ఇవ్వబడిన జీవులను మరియు వాటిలో జరిగే ప్రత్యుత్పత్తి విధానాన్ని నీవు సేకరించిన సమాచారం ఆధారంగా సరైన విధంగా పట్టికలో నింపండి.
ఉల్లి, స్పెరోగైరా, స్ట్రాబెర్రీ, అల్లం, తేనెటీగలు, పారామీషియం , ప్లనేరియా, ఈస్ట్.
జవాబు:

జీవి పేరు అది జరిపే అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం
1. ఉల్లి లశునం
2. స్పెరోగైరా ముక్కలగుట
3. స్ట్రాబెర్రీ స్టోలన్
4. అల్లం కొమ్ములు
5. తేనెటీగలు అనిషేక ఫలనం
6. పారామీషియం ద్విధావిచ్ఛిత్తి
7. ప్లనేరియా పునరుత్పత్తి
8. ఈస్ట్ కోరకీభవనం

ప్రశ్న 10.
i) పుష్పం అంతర్నిర్మాణం పటం గీచి, భాగములు గుర్తించుము.
జవాబు:
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 17

ii) పుష్పంలో గల లైంగిక అవయవాలు ఏవి?
ఎ) కేసరావళి బి) అండకోశం

ప్రశ్న 11.
ప్రయోగశాలలో రైజోపస్ యొక్క సిద్ధబీజాశయాలను గమనించుటకు అవలంబించు ప్రయోగ విధానము మరియు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించండి.
(లేదా)
రైజోపసను పరిశీలించుటకు మీరు నిర్వహించిన ప్రయోగానికి ఉపయోగించిన సామగ్రి మరియు ప్రయోగ విధానమును రాయండి.
జవాబు:
పరికరాలు : సూక్ష్మదర్శిని, బ్రెడ్, ప్లాస్టిక్ సంచి, నీరు సైడ్, కవర్ స్లిప్.
తయారీ విధానం :

  1. బ్రెడ్ నుగాని, రొట్టెను గాని నియమిత పరిస్థితులలో ఉంచి రైజోపస్ లేదా బూజును పెంచాలి.
  2. ఒక ప్లాస్టిక్ సంచిలో ఉంచి దానిపై నీళ్ళు చల్లాలి. అది తేమను గ్రహిస్తుంది. ఇప్పుడు సంచిలో కొంత గాలి ఉండేలా దారంతో ముడి వేయండి.
  3. చీకటి మరియు వెచ్చగా ఉండే ప్రదేశంలో ఉంచాలి. 2-3 రోజుల్లో బూజు పెరగడం మొదలై 1-2 వారాల్లో పూర్తిస్థాయిలో పెరుగుతుంది.

పరిశీలన :

  1. ఒక గాజు సైడ్ తీసుకొని దానిపై మధ్యలో ఒకచుక్క నీరువేసి పంటి పుల్లతో కొంత బూజు తీసుకొని స్లెడ్ మధ్యలో ఉంచాలి.
  2. దానిపై కవర్‌తో నీటి బుడగలు లేకుండా అమర్చాలి.
  3. అధికంగా ఉన్న నీటిని టిష్యూ పేపరుతో తొలగించాలి. సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించాలి.
  4. రైజోపసను చేతితో ముట్టుకుంటే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.

జాగ్రత్తలు :

  1. బూజును పెంచే సంచిని మిగతా ఆహార పదార్థాలకు దూరంగా ఉంచాలి.
  2. రొట్టెను చేతితో పట్టుకుంటే, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.

ప్రశ్న 12.
మొక్కలలో జరిగే ద్విఫలదీకరణను వివరించండి. దీని తర్వాత ఏర్పడే అంకురచ్ఛదం ఉపయోగాలను వివరించండి.
జవాబు:
ద్విఫలదీకరణం :
పుష్పించే మొక్కలలో పరాగరేణువు మొలకెత్తి ఏర్పడిన పరాగ నాళం పిండకోశంలోనికి ప్రవేశించగానే కొన భాగం పగిలిపోయి రెండు పురుషబీజకణాలు పిండకోశంలోకి విడుదలవుతాయి. వాటిలో ఒకటి స్త్రీ బీజకణంతో కలుస్తుంది. దీనిని ఫలదీకరణం అంటారు. మరొక పురుషబీజ కణం పిండకోశం మధ్యలోనున్న ద్వితీయ కేంద్రకంతో కలిసి అంకురచ్చదం ఏర్పరుస్తుంది ఇలా ఫలదీకరణం రెండు సార్లు జరగడాన్ని ద్విఫలదీకరణం అంటారు.

  1. అంకురచ్ఛదాన్ని ఉపయోగించుకుని బీజదళాలు అభివృద్ధి చెందుతాయి.
  2. అంకురచ్ఛదంలో నిలువ చేసిన పోషక పదార్థాలను బీజదళాలు వినియోగించుకుంటాయి.
  3. కొన్ని మొక్కల బీజదళాలు అంకురచ్ఛదాన్ని పూర్తిగా వినియోగించుకుని విత్తనాలుగా మారుతాయి.
  4. పోషక పదార్థాల నిలువలు పెరగటం వలన బీజదళాల పరిమాణం పెరుగుతుంది.

ప్రశ్న 13.
పటాన్ని పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధాణాలు రాయండి.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 18
i) స్త్రీ సంయోగ బీజాన్ని ఉత్పత్తి చేయు అవయవం ఏమిటి?
జవాబు:
స్త్రీ బీజకోశము (అండాశయము)

ii) మానవునిలో ఫలదీకరణ ఎక్కడ జరుగుతుంది?
జవాబు:
స్త్రీ బీజవాహిక (ఫాలోపియన్ నాళము)

iii) స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో పిండము అభివృద్ధి చెందు ప్రాంతం ఏమిటి?
జవాబు:
గర్భాశయము

iv) కొన్ని సందర్భాలలో వైద్యులు ఫాలోఫియన్ నాళాన్ని కత్తిరించి ముడి వేస్తారు. ఈ ఆపరేషన్ పేరు ఏమిటి ?
జవాబు:
ట్యూబెక్టమీ

ప్రశ్న 14.
మొక్కలలో జరిగే కృత్రిమ శాఖీయ ప్రత్యుత్పత్తి విధానాలను వివరించండి.
జవాబు:
1. కృత్రిమ శాఖీయ విధానాలు
i) ఛేదనం ii) అంటు తొక్కుట iii) అంటుకట్టుట

2. i) ఛేదనం :
జనక మొక్క నుండి కోరకం కలిగిన మొక్కభాగాన్ని వేరు చేసినపుడు ఆ ఛేదన భాగం నుండి క్రొత్త మొక్క పెరుగుతుంది.
ఉదా : గులాబి, మందార

3. ii) అంటుతొక్కుట :
మొక్కలో కనీసం ఒక కణుపు అయినా కలిగివున్న శాఖను నేలవైస వంచి నా ప ని చిగుర్లు బయటకు కనిపించేటట్లుగా మట్టితో కప్పాలి. కప్పివుంచిన భాగం నుంచి కొత్తవేరు అని
కొమ్మను జనక మొక్క నుండి వేరుచేయాలి. ఉదా : మల్లె, గన్నేరు.

4. iii) అంటుకట్టుట :
రెండు మొక్కలను దగ్గరగా చేర్చినపుడు రెండింటి కాండాలు కలిసిపోయి, ఒక మొక్కగా పెరుగుతాయి. నేలలో పెరుగుతున్న మొక్కను స్టాక్ అని, వేరే మొక్కనుండి వేరు చేయబడిన వేర్లు లేని భాగాన్ని సయాన్ అనీ అంటారు. స్టాక్, సయాన్ రెండింటిని పాలిథీన్ కాగితంతో కప్పి, పురివున్న దారంతో కట్టాలి.
ఉదా : ఆపిల్, మామిడి

AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

ప్రశ్న 15.
కింది ఇచ్చిన సమాచారాన్ని చదివి, ప్రశ్నలకు జవాబులివ్వండి.
ప్రతి జీవిలో రెండు రకాల కణ విభజనలు జరుగుతాయి. సమ విభజనలో క్రోమోజోమ్ సంఖ్య (20) లో మార్పు ఉండదు. క్షయకరణ విభజనలో క్రోమోజోముల సంఖ్య సగానికి (1) కు తగ్గుతుంది, అని వీసమన్ ఎరికల్పన చేశాడు.
i) ‘n’ మరియు ‘2n’ అనేవి వేటిని సూచిస్తాయి?
జవాబు:
‘n’ ఏకస్థితికమును, ‘2n’ ద్వయ స్థితికమును సూచిస్తాయి.

ii) క్షయకరణ విభజన ఏ కణాలలో జరుగుతుంది?
జవాబు:
లైంగిక కణాలలో సంయోగ బీజాలు ఏర్పడేటప్పుడు క్షయకరణ విభజన జరుగుతుంది.

iii) క్షయకరణ విభజనలో క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గకుంటే ఏమి జరుగుతుంది?
జవాబు:
క్షయకరణ విభజనలో క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గకుంటే క్రోమోజోముల సంఖ్య తరువాత తరాలలో స్థిరంగా వుండదు.

iv) చర్మ కణాలు ఏ రకం అయిన కణవిభజనను జరుపుతాయి?
జవాబు:
చర్మ కణాలు సమవిభజనను జరుపుతాయి.

ప్రశ్న 16.
తక్కువ సమయంలో ఎక్కువ మొక్కలు పొందుటకు రెండు సహజ మరియు రెండు కృత్రిమ శాఖీయోత్పత్తి పద్దతులను ఉదాహరణలతో తెలుపండి.
జవాబు:
I. సహజమైన శాఖీయ ప్రత్యుత్పత్తి :
1) పత్రాలు :
రణపాల వంటి మొక్కలలో ఆకుల అంచుల వెంబడి చిన్న చిన్న మొక్కలు పెరుగుతాయి.
ఉదా : రణపాల

2) కాండాలు:
1) స్టోలన్స్ : ఉదా : మల్లె, స్ట్రాబెర్రీ,
2) లశునాలు : ఉదా : ఉల్లి,
3) కొమ్ములు : ఉదా : పసుపు, అల్లం,
4) దుంపలు : ఉదా : బంగాళాదుంప

3) వేర్లు : ఉదా : డాలియా, ముల్లంగి, క్యారెట్

II. కృత్రిమ శాఖీయ ప్రత్యుత్పత్తి :
1) ఛేదనం :
జనక మొక్క నుండి కోరకం కలిగిన మొక్క భాగాన్ని వేరుచేసినపుడు ఆ ఛేదన భాగం నుండి కొత్త మొక్కగా పెరుగుతుంది.
ఉదా : గులాబి, మందార,

2) అంటు తొక్కుట :
మొక్కలో కనీసం ఒక కణుపు అయినా కలిగి వున్న శాఖను నేలవైపు వంచి, కొంత భాగాన్ని చిగుర్లు బయటకు కనిపించేట్లుగా మట్టితో కప్పాలి. కొద్దికాలం తర్వాత ఈ కప్పి వుంచిన భాగం నుండి కొత్తవేర్లు ఉత్పత్తి అవుతాయి.
ఉదా : మల్లె, గన్నేరు.

3) అంటు కట్టుట:
i) రెండు మొక్కలను దగ్గరగా చేర్చినప్పుడు రెండింటి కాండాలు కల్సిపోయి ఒకే మొక్కగా పెరుగుతాయి.
ii) నేలలో పెరుగుతున్న మొక్కను ‘స్టాక్’ అని వేరే మొక్క నుండి వేరు చేయబడిన వేర్లు లేని భాగాన్ని ‘సయాన్’ అని అంటారు.
iii)’స్టాక్’, ‘సయాన్’ రెండింటిని పాలిథీన్ కాగితంతో కప్పి దారంతో కట్టాలి. ఉదా : మామిడి, నిమ్మ, ఆపిల్, గులాబి.

ప్రశ్న 17.
కింద నటికను పరిశీలించండి.

ప్రత్యుత్పత్తి విధానం జీవులు
విచ్చిత్తి పారామీషియం, బాక్టీరియా
కోరకీభవనం ఈస్ట్, హైడ్రా
ముక్కలగుట స్పెరోగైరా, బద్దె పురుగులు
కొమ్ములు పసుపు, అల్లం
ఛేదనం గులాబి, మందార
అంటుకట్టుట నిమ్మ, ఆపిల్

పట్టిక ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
(i) పై పట్టికలో అలైంగిక ప్రత్యుత్పత్తి జరిపే రెండు జీవుల పేర్లు రాయండి.
(ii) సై పట్టికలో సూచించిన వాటిలో రెండు కృత్రిమ శాఖీయ వ్యాప్తి విధానాలను రాయండి.
(iii) పై వాటిలో సహజ శాఖీయ వ్యాప్తి జరిపే రెండు మొక్కల పేర్లు రాయండి.
(iv) విచ్ఛిత్తి ద్వారా ఒక జీవి నుండి ఎన్ని జీవులు ఏర్పడతాయి?
జవాబు:
1. పారామీషియం, బాక్టీరియా, ఈస్ట్, హైడ్రా
2. (ఎ) ఛేదనము (బి) అంటుకట్టుట
3. (ఎ) పసుపు (బి) అల్లం
4. విచ్చిత్తి – ద్విదా విచ్చిత్తి – రెండు జీవులు ఏర్పడతాయి.
(లేదా)
విచ్ఛిత్తి – బహుదా విచ్ఛిత్తి – రెండు కంటే ఎక్కువ జీవులు ఏర్పడతాయి.

ప్రశ్న 18.
మొక్కలలోని సహజ శాఖీయ ప్రత్యుత్పత్తి గురించి తెలపండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 19 AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 20
సహజమైన శాఖీయ ప్రత్యుత్పత్తి :
పత్రాలు :
రణపాల వంటి మొక్కలలో ఆకుల అంచుల వెంబడి చిన్న చిన్న మొక్కలు పెరుగుతాయి.

కాందాలు :
రన్నర్లు, సోలన్ల వంటి బలహీన వాయుగత కాండాలు నేలను తాకినట్లయితే అక్కడ నుండి పీచు వేర్లు అభివృద్ధి చెందుతాయి. ఒకవేళ జనక మొక్క నుండి ఈ భాగం విడిపోయినట్లయితే కొత్తగా ఏర్పడిన వేర్ల సహాయంతో కొత్త మొక్కలుగా పెరుగుతాయి. కాండం ద్వారా జరిపే మొక్కలకు కొన్ని ఉదాహరణలు గమనిద్దాం.

స్టోలన్లు – వాలిస్ నేరియా, స్ట్రాబెర్రీ, లశునాలు – ఉల్లి; కొమ్ములు – పసుపు; దుంప – బంగాళదుంప.

వేర్లు :
దాలియా, ముల్లంగి, క్యారట్ మొదలగు వాటిపై పెరిగే చిన్నచిన్న మొగ్గలు, పత్రాలు కలిగిన కాండ భాగాలుగా పెరుగుతాయి.

ప్రశ్న 19.
అంటుకట్టుట గురించి రాయండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 21
అంటుకట్టుట (Grafting) :
వేరు వేరు మొక్క భాగాలను జోడించి, కలిపి ఒకే మొక్కగా పెంచే ప్రక్రియను అంటుకట్టుట అంటారు.

ఇందులో రెండు మొక్కలను దగ్గరగా చేర్చినపుడు రెండింటి కాండాలు కలిసిపోయి ఒకే మొక్కగా పెరుగుతాయి. దీనిలో నేలలో పెరుగుతున్న మొక్కను ‘స్టాక్’ అని, వేరే మొక్క నుండి వేరుచేయబడిన వేర్లు లేని భాగాన్ని ‘సయాన్’ అని అంటారు. స్టాక్, సయాన్ రెండింటిని పాలిథీన్ కాగితంతో కప్పి పురి ఉన్న దారంతో కట్టాలి. వాంఛనీయ లక్షణాలు గల మొక్కలను పొందేందుకు అంటుకట్టే విధానాన్ని ఉపయోగిస్తారు.

ప్రశ్న 20.
సిద్ధబీజాల గురించి రాయండి.
జవాబు:

  1. శిలీంధ్రాలలో సిద్ధబీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది.
  2. శిలీంధ్రాలలో సిద్ధబీజాలు ఏర్పడే పద్ధతిని స్పోరులేషన్ అంటారు.
  3. సిద్ధబీజము ఒక సూక్ష్మమైన, ఏకకణ ప్రత్యుత్పత్తి చేసే ప్రమాణం.
  4. శిలీంధ్రాలలో సిద్ధబీజములు సిద్ధబీజాశయము అనే ప్రత్యేకమైన నిర్మాణంలో ఏర్పడతాయి.
  5. సిద్ధబీజాశయములోని కేంద్రకము అనేక సార్లు సమవిభజన చెంది, అనేక సిద్ధబీజాలను ఏర్పరుస్తుంది.
  6. సిద్ధబీజాలు అనుకూల పరిస్థితులలో అంకురించి పెక్కు తంతువులతో ఒక పెద్ద జీవిగా ఏర్పడతాయి.

ప్రశ్న 21.
మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థను వర్ణించండి.
జవాబు:
AP Board 10th Class Biology Solutions 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 9
పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ :
పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో రెండు ముష్కాలు బాహ్యంగా ఉండే సంచిలాంటి నిర్మాణంలో అమరి ఉంటాయి. దీనినే ముష్కగోణి అంటారు. ముష్కాలలో అధిక సంఖ్యలో మిలియన్ల కొద్దీ పురుష బీజకణాలైన శుక్రకణాలు ఉత్పత్తి అవుతాయి. పురుష ప్రత్యుత్పత్తి అవయవాలను తెలుసుకోవడానికి మానవుని పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ పటంను పరిశీలించండి. ప్రతీ ముష్కంలో చాలా లంబికలు ఉంటాయి. ప్రతి లంబికలో బాగా మెలితిరిగి చిన్న చిన్న నాళికలు ఉంటాయి. వీటిని శుక్రోత్పాదక నాళికలు అంటారు. ఇవి దాదాపు 80 సెం.మీ. పొడవు కలిగి ఉంటాయి. శుక్రనాళికలు శుక్రోత్పాదక నాళికల నుండి శుక్రకణాలను సేకరిస్తాయి. శుక్రనాళికలన్నీ కలిసి ఎపిడిడిమిసను ఏర్పరుస్తాయి. ఇక్కడ శుక్ర కణాలు తాత్కాలికంగా నిలువ ఉంటాయి. ఇక్కడి నుండి శుక్రనాళం ద్వారా ప్రసేకంలోనికి, అక్కడి నుండి శరీరం వెలుపలికి వెలువడుతాయి.

ప్రశ్న 22.
మానవ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థను వర్ణించండి.
జవాబు:
AP Board 10th Class Biology Solutions 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 10

  1. స్త్రీలలో ఒక జత స్త్రీ బీజకోశాలుంటాయి. ఇవి ఉదరకుహరంలో మూత్రపిండాలకు దిగువగా ఉంటాయి.
  2. ఒక్కొక్క అండకోశంలో అనేక సంచీల్లాంటి నిర్మాణాలున్నాయి. వీటిని స్త్రీ బీజకోశ పుటికలు లేక గ్రాఫియన్ పుటికలు అంటారు.
  3. ప్రతి పుటికలోనూ పెద్దగా ఉండే ఒక అండము ఉంటుంది.
  4. పుటిక నుండి విడుదలయిన అండము ఫాలోపియన్ నాళములోనికి ప్రవేశిస్తుంది.
  5. ఈ నాళం పుర్వాంతము వేళ్ళలాంటి అనేక నిర్మాణాలను కలిగి ఉంటుంది.
  6. దీనికి శైలికలు కూడా ఉంటాయి. ఇవి అండము ఫాలోపియన్ నాళం నుండి గర్భాశయంలోకి కదలడానికి తోడ్పడుతాయి.
  7. గర్భాశయము దృఢంగా కండరయుతంగా ఉండే కోశము వంటి నిర్మాణము.
  8. ఇది యోని అను కండరయుత నాళంలోకి తెరచుకొని ఉంటుంది.

ప్రశ్న 23.
పిండాన్ని చుట్టి ఉంచు పొరలు ఏమిటి?
జవాబు:
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 22

  1. పెరుగుతున్న పిండము తన చుట్టూ రెండు పొరలను ఏర్పరుచు కుంటుంది.
  2. అవి 1) పరాయువు 2) ఉల్బం
  3. పరాయువు గర్భాశయ గోడతో సంబంధం ఏర్పరుచుకొని, పిండానికి ఉల్బం పోషక పదార్థాలను అందజేయటంలోనూ, పిండము నుండి విసర్జక పదార్థాలను తీసివేయటంలోనూ సహాయపడుతుంది.
  4. ఉల్బము పిండము చుట్టూ ఉండే ఒక సంచి వంటి నిర్మాణము.
  5. ఇందులో ఉల్బక ద్రవముంటుంది. ఇది పిండమును యాంత్రిక అఘాతముల నుండి రక్షిస్తుంది.
  6. మరొక త్వచం ఎల్లంటోయిస్ పిండం యొక్క ఆహార నాళం నుండి ఉద్భవిస్తుంది.
  7. సొన సంచి, ఉల్బపు ముడతల అంచులు, ఎల్లంటోయిస్ కాడ వద్ద కలిసి పిండాన్ని జరాయువుతో కలిసే నాళాన్ని ఏర్పరుస్తుంది.
  8. ఈ నాళాన్ని నాభిరజువు (Umbellical cord) అంటారు.

ప్రశ్న 24.
శిశు జనన ప్రక్రియను వివరించండి.
జవాబు:

  1. శిశుజననం, గర్భాశయ కండర త్వచాల సంకోచ సడలికలతో ప్రారంభమవుతుంది. ఈ చర్యలనే పురిటినొప్పులు అని భావిస్తాం.
  2. ముందుగా గర్భాశయ కండర సంకోచ సడలికలు శిశువును స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క బాహ్యకుల్య అయిన యోని వైపునకు నెమ్మదిగా నెట్టుటకు సరిపడేంత బలాన్ని కలిగిస్తాయి.
  3. ఈ దశలో శిశువును ఆవరించియున్న ఉల్బం పగిలి అందులోని ద్రవ పదార్థాలు బయటకు విడుదలవుతాయి.
  4. ప్రసవం సరియైన విధానంలో జరుగుతోంది. అనడానికి ఇది ఒక సరయిన సంకేతం.
  5. అప్పుడు గర్భాశయ కండరాల సంకోచాలు బలంగా, అత్యంత వేగంగా జరిగి యోని ద్వారా శిశువును బాహ్య ప్రపంచంలోనికి నెట్టబడుతుంది.

ప్రశ్న 25.
శిశు జననానికి ముందు గర్భాశయంలో కలిగే మార్పులు ఏమిటి?
జవాబు:
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 23

  1. గర్భావధి కాలం గడుస్తున్న కొద్దీ భ్రూణంగా పిలువబడుతున్న పిండం పెరిగి రూపుదాల్చుకుంటుంది.
  2. భ్రూణాన్ని ఇముడ్చుకునేందుకు వీలుగా గర్భాశయ పరిమాణం పెరుగుతుంది.
  3. సాధారణంగా ఫలదీకరణం జరిగిన 9 నెలలకు, గర్భావధి కాలం చివరి దశలో తల భాగం కిందివైపునకు గర్భాశయ ముఖద్వారానికి చేరుతుంది.
  4. సాధారణంగా ప్రసవ సమయంలో తల ముందుగా బయటకు వస్తుంది.
  5. కొన్ని సమయాలలో కాళ్ళు ముందుగా బయటకు వస్తాయి. ఈ పరిస్థితిలో ప్రసవం చాలా కష్టం.
  6. శిశు జననం లేదా పురిటి నొప్పులు ఎలా వస్తాయన్నది. ఇప్పటికీ శాస్త్రవేత్తలకు పూర్తిగా తెలియదు. దీనిని ఒక సంక్లిష్టమైన దృగ్విషయంగా భావిస్తారు.

ప్రశ్న 26.
పుష్ప నిర్మాణం వర్ణించండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 24
పుష్పమునకు గల కాడను పుష్పవృంతం అంటారు. దీని చివరి భాగం ఉబ్బి ఉంటుంది. దీనిని పుష్పాసనం అంటారు. దీనిపై సాధారణంగా (1) రక్షక పత్రాలు (2) ఆకర్షక పత్రాలు (3) కేసరావళి (4) అండకోశము అను పుష్పభాగాలు వివిధ వలయాలలో అమరి ఉంటాయి.

1) రక్షక పత్రములు :
ఇవి మొదటి వలయంలో ఆకుపచ్చని రంగులో ఉంటాయి. ఇవి మొగ్గదశలో, పుష్పం లోపలి భాగాలను కప్పి ఉండి రక్షణనిస్తాయి.

2) ఆకర్షక పత్రములు :
ఇవి పుష్పం యొక్క రెండవ వలయంలో వివిధ వర్ణములను, సువాసనను కలిగి, కీటకాలను పరాగ సంపర్కం కోసం ఆకర్షించటానికి సహాయపడతాయి.

3) కేసరావళి :
ఇవి పుష్ప మూడవ వలయంలో ఉంటాయి. ఇవి పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు. కేసరావళి, కేసరదండము, పరాగకోశము అను భాగాలను కలిగి ఉంటుంది. పరాగకోశాలలో పరాగరేణువులు తయారవుతాయి.

4) అండకోశము :
ఇవి పుష్పాసనం నాల్గవ వలయంలో ఉండే భాగము. ఇది అండాశయము, కీలము, కీలాగ్రము అను భాగాలను కలిగి ఉంటుంది. అండాశయములో అండములు ఉంటాయి. ఇవి అండాశయంలో అండన్యాస స్థానం వద్ద అమరి ఉంటాయి.

AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

ప్రశ్న 27.
అండం యొక్క నిర్మాణం వర్ణించండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 25

  1. స్త్రీ సంయోగబీజాన్ని అండం అంటారు.
  2. అండాశయములోని అండన్యాస స్థానమునందు అండములు అండ వృంతము ద్వారా చేర్చబడి ఉంటాయి.
  3. అండములోని కణజాలాన్ని, అండాంత కణజాలము అంటారు. అండము రెండు పొరలచే లేక అండ కవచములచే కప్పబడి ఉంటుంది.
  4. ఈ రెండు కవచాలు అండాన్ని పూర్తిగా కప్పకుండా ఒక చిన్న రంధ్రాన్ని వదులుతాయి. దాన్ని అండ ద్వారము అంటారు.
  5. అండం క్రింద భాగములో రెండు కవచములు ప్రారంభమయ్యే స్థలాన్ని ఛలాజా అని పిలుస్తారు.
  6. అండాంత కణజాలము నుండి ఒక కణము స్థూల సిద్ధబీజ మాతృకణముగా విభేదనము చెందుతుంది. ఇది ద్వయక స్థితిలో (2n) ఉంటుంది.
  7. క్షయకరణ విభజన ద్వారా ఈ మాతృకణము నాలుగు సూలసిద్ధ బీజాలను ఇస్తుంది. వీటిలో ఒకటి మాత్రమే పిండకోశముగా అభివృద్ధి చెందుతుంది.
  8. ఇది ఏక స్థితిదశలో ఉంటుంది. దీనిని స్త్రీ సంయోగ బీజదము అని అంటారు.

ప్రశ్న 29.
ఫలదీకరణ తరువాత పుష్పంలో వచ్చే మార్పులు ఏమిటి?
జవాబు:
ఫలదీకరణము తరువాత పుష్పభాగాలలో అనేక మార్పులు వస్తాయి.

  1. అండాశయము ఫలముగాను, అండము విత్తనముగాను మారుతుంది.
  2. అండము యొక్క రెండు కవచములు విత్తనములపై కవచంగాను, లోకవచంగాను మారుతాయి.
  3. అండకోశపు కీలము, కీలాగ్రము రాలి పోతాయి.
  4. కొన్ని సందర్భాలలో రక్షణ పత్రాలు పొడిగా అయి ఫలదీకరణం తరువాత ఉండిపోతాయి.
  5. పుష్పములో కేసరాలు, ఆకర్షణ పత్రావళి కూడా పడిపోతాయి.

ప్రశ్న 30.
ద్విఫలదీకరణ అనగా నేమి?
జవాబు:

  1. జంతువులలో ఒకసారి ఫలదీకరణం జరగడం వలన సంయుక్తబీజం ఏర్పడుతుంది.
  2. మొక్కల్లో మొదటి ఫలదీకరణం వలన సంయుక్తబీజం, రెండవసారి జరిగే ఫలదీకరణం వలన అంకురచ్ఛదం ఏర్పడతాయి.
  3. పరాగరేణువులో రెండు కణాలుంటాయి. వీటిలో ఒకటైన నాళికాకణంలో రెండు కేంద్రకాలుంటాయి.
  4. ఇవి కీలాగ్రం నుండి కీలం ద్వారా అండాశయాన్ని చేరుతాయి.
  5. ఒక కేంద్రకం అండాశయం గుండా చొచ్చుకుపోయి అండాన్ని చేరుతుంది.
  6. రెండో కేంద్రకం ద్వితీయ కేంద్రకంతో సంయోగం చెంది అంకురచ్ఛదాన్ని ఏర్పరుస్తుంది.
  7. ఇది సంయుక్తబీజం నుండి పెరిగే కొత్త మొక్కకు పోషకపదార్ధాలను అందిస్తుంది. దీనినే “ద్విఫలదీకరణం” అంటారు.

ప్రశ్న 31.
కణవిభజన చరిత్ర గురించి తెలపండి.
జవాబు:

  1. కణాలు అంతకు ముందు ఉన్న కణాల నుండే ఉత్పన్నమవుతాయని “విర్చోవ్” మొదట ప్రతిపాదించాడు.
  2. 1852 లో “రాబర్ట్ రెమెక్” కణవిభజన గురించి పరిశోధన జరిపాడు.
  3. “వాల్టర్ ఫ్లెమింగ్” 1879లో, కణవిభజన సమయంలో కణ కేంద్రకంలో దారపుపోగుల వంటి నిర్మాణాలు నిలువుగా చీలుతాయని పరిశీలించాడు.
  4. “విల్ హెల్మ్ రాక్స్” ప్రతి క్రోమోజోమ్ అనువంశికతకు కారణమైన విభిన్నమైన అంశాలను కలిగి ఉంటుందని తెలిపాడు.
  5. “గ్రెగర్ మెండల్” బఠాని మొక్కలో పరిశోధనలు జరిపి, అనువంశికతా సూత్రాలను తెలిపాడు.
  6. “వాట్సన్ మరియు క్రిక్”లు క్రోమోజోమ్స్ DNA తో నిర్మితమవుతాయని DNA ద్వికుండలి నిర్మాణం కలిగిఉంటుందని నిరూపించారు.

ప్రశ్న 32.
కణచక్రంలోని దశలు తెలపండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 3
సర్వసాధారణంగా కణ విభజన ప్రక్రియలను సమవిభజన (mitosis) అంటాము. అది 40 నుంచి 60 నిమిషాలల్లోనే పూర్తవుతుంది. (సరిగ్గా విభజనకై తీసుకొనే సమయం), రెండు కణ విభజనలకు మధ్య నుండే సమయాన్ని అంతర్దశ (interphase) అంటారు. ఈ దశలో కణ విభజనకు అవసరమయ్యే వివిధ పదార్థాల ఉత్పత్తి, DNA జన్యు పదార్థం ప్రతికృతి జరిగి సమవిభజన ద్వారా పిల్ల కణాలకు సమానంగా పంచబడతాయి. ఈ దశను 3 ఉపదశలుగా వర్గీకరించారు.

G1 దశ : ఇది సమవిభజనకు మరియు DNA ప్రతికృతికి మధ్యగల సంధాన దశ. ఈ దశలో కణ పరిమాణం పెరుగుతుంది.
S దశ : ఇది DNA సంశ్లేషణ జరిగే దశ. ఈ దశలో క్రోమోజోమ్లు రెట్టింపు అవుతాయి.
G2 దశ : ఇది DNA ప్రతికృతి మరియు సమవిభజన ప్రారంభానికి మధ్యగల దశ. కణాంగాలు విభజన చెందుతాయి. క్రోమోజోమ్లు సమవిభజనకు సిద్ధమవుతాయి.
M దశ : ఇది సమవిభజన జరిగే దశ.

ప్రశ్న 33.
కణ విభజనలోని దశలను వర్ణించండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 26

ప్రశ్న 34.
క్షయకరణ విభజన గురించి రాయండి.
జవాబు:
AP Board 10th Class Biology Solutions 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 6
క్షయకరణ విభజన (Meosis) :

  1. శరీర కణాలన్నింటిలో సాధారణంగా జరిగే సమ విభజన వలె కాకుండా క్షయకరణ విభజన లైంగిక ప్రత్యుత్పత్తిలో సంయోగబీజాలు ఏర్పడేటప్పుడే జరుగుతుంది.
  2. క్షయకరణ విభజన రెండు దశలలో ఉంటుంది.
  3. మొదటి దశ క్షయకరణ విభజన మాతృకణాలలో జరుగుతుంది. (రెండు జతల క్రోమోజోమ్లుంటాయి.)
  4. రెండుసార్లు విభజన జరిగినప్పటికీ క్రోమోజోమ్ విభజన మాత్రం ఒకేసారి జరుగుతుంది.
  5. రెండవ దశ సాధారణ సమవిభజన మాదిరిగా ఉంటుంది.
  6. క్రోమోజోమ్ విభజన జరగదు. కాబట్టి పిల్లకణాలకు క్రోమోజోమ్లు సమానంగా పంచబడతాయి. అందువల్ల నాలుగు పిల్లకణాలు ఏర్పడతాయి.
  7. కానీ మాతృకణాల కంటే సగం క్రోమోజోమ్ లనే కలిగి ఉంటాయి. కనుక వీటినే ఏకస్థితికాలు (ఒకే జత క్రోమోజోమ్ లు ఉంటాయి) అంటారు.
  8. ఈ విభజనలో క్రోమోజోమ్ ల సంఖ్య సగానికి తగ్గిపోతుంది. కనుక ఈ విభజనను క్షయకరణ విభజన (Reduction division) అంటారు.

ప్రశ్న 35.
మన రాష్ట్రంలో AIDS విస్తరణ గురించి రాయండి.
జవాబు:
దురదృష్టవశాత్తు మన రాష్ట్రం ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులలో దేశంలోనే మొదటిస్థానంలో ఉంది. 2011-12 సం|| ప్రభుత్వ గణాంకాల ప్రకారం 24 లక్షలకు పైగా HIV పాజిటివ్ రోగులు ఉన్నట్లు తెలుస్తోంది. తరువాత స్థానంలో కర్ణాటక, మహారాష్ట్రాలు ఉన్నాయి. దాదాపు ప్రతి 300 మందిలో ఒకరు వ్యాధిగ్రస్తులుగా ఉన్నట్లు గుర్తించారు.

ప్రతి సంవత్సరం రాష్ట్ర జనాభాలో పురుషులలో 1.07 శాతం, స్త్రీలలో 0.73 శాతం మంది HIV కి గురువుతున్నారు. ఇదికూడా ఇతర రాష్ట్రాలకన్నా మన రాష్ట్రంలోనే ఎక్కువగా ఉంది. ఈ వ్యాధికి గురవుతున్న వారిలో ముఖ్యంగా 15-49 సంవత్సరాల వయసుల సమూహంలో 0.09 శాతం ఉండగా గర్భిణీలో 1.22 శాతం మంది ఉన్నారని గణాంకాలు తెలియజేస్తున్నాయి.

నిరక్షరాస్యత, అనారోగ్యం , నిరుద్యోగం, వలసలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు, విలువలు పాటించకపోవడం, విచ్చలవిడితనం, వ్యభిచారం మొదలైనవి HIV ప్రబలడానికి కారణం అవుతున్నాయి.

ప్రశ్న 36.
గర్భనిరోధం అనగానేమి? కొన్ని గర్భనిరోధ పద్దతులు సూచించంది.
జవాబు:
స్త్రీ గర్భం ధరించకుండా ఉండటం కోసం ఫలదీకరణం జరగకుండా ముందు జాగ్రత్తలను తీసుకోవడాన్ని గర్భనిరోధం (Contraception) అంటారు. ఏదేని ఉపకరణం లేదా రసాయనం (మందులు) ఉపయోగించి స్త్రీలలో గర్భధారణను అడ్డుకుంటే దానినే గర్భనిరోధక సాధనం (Contraceptive) అంటారు.

ప్రస్తుతం గర్భనిరోధక విధానాలెన్నో అందుబాటులో ఉన్నాయి. భౌతికపరమైన ఉపకరణాలుగా కండోమ్ లు మరియు డయాఫ్రము (Cap) మొదలైనవి ఉపయోగించవచ్చు. ఇలా కేవలం ఫలదీకరణ ప్రక్రియనే కాకుండా లైంగిక అంటువ్యాధులు (Sexally Transmitted Diseases (STD) వ్యాపించకుండా కూడా అరికట్టడంలో ఉపయోగపడతాయి.

ఇవి కాకుండా ఇతర గర్భనిరోధక మార్గాలేవీ కూడా లైంగిక వ్యాధుల వ్యాప్తిని నిరోధించలేవు. నోటి ద్వారా తీసుకొనే మాత్రలు లేదా స్త్రీ లైంగిక అవయవాలలో ఉంచే మాత్రలలోని రసాయనాలు లేదా హార్మోన్లు అండాశయాలు అండాన్ని విడుదల చేయకుండా ఫలదీకరణం జరగకుండా చేస్తాయి. ఈ రోజుల్లో పురుషుల కోసం కూడా ఇలాంటి మాత్రలు అందుబాటులోకి వచ్చాయి. ఆ మాత్రల వలన శుక్రకణాలు చనిపోతాయి. కనుకనే వీటిని శుక్రకణనాశినులు లేదా స్పెర్మిసైడ్స్ (Spermicides) అని అంటారు.

గర్భాశయ ద్వారంలో అమర్చడానికి వీలైన కాపర్ – T, లూప్ మొదలైనవి ఎంతో ప్రభావవంతమైన గర్భనిరోధక సాధనాలుగా ఉపయోగపడతాయి. అవాంఛిత గర్భధారణ కాకుండా గర్భనిరోధక సాధనంగా కాపర్ – T ని ఉపయోగిస్తే అది గర్భాన్ని రాకుండా నిరోధించవచ్చు. కానీ, భాగస్వామికి ఒకవేళ ఏదేని లైంగిక అంటువ్యాధి ఉంటే దానిని ఆపలేదు.

AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

ప్రశ్న 37.
భ్రూణహత్యలు అనగానేమి? దానికి గల కారణాలు ఏమిటి?
జవాబు:
గర్భస్థ శిశువులను గర్భవిచ్ఛిత్తి ద్వారా చంపటాన్ని భ్రూణహత్యలు అంటారు. ఇది ప్రధానంగా లింగవివక్ష ఆధారంగా జరగటం బాధాకరవిషయం.

కారణాలు :

  1. సమాజంలో ఆడపిల్లల పట్ల చిన్నచూపు ఉండటం.
  2. ఆడపిల్లల పెంపకం, కట్నకానుకలు, వ్యయభరితంగా మారటం.
  3. సమాజంలో ఆడపిల్లలకు రక్షణ లేకపోవటం.
  4. గర్భధారణపై అవగాహన లేక అవాంఛిత గర్భం దాల్చటం.
  5. నైతిక విలువలు లేక పెళ్ళికి ముందు గర్భం దాల్చటం వంటి కారణాలు భ్రూణహత్యలకు కారణమవుతున్నాయి.

ప్రశ్న 38.
ప్రక్కపటం పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 27
a) పటంలో చూపబడిన వ్యవస్థ ఏ జీవక్రియను నిర్వహిస్తుంది?
b) పురుష సంయోగబీజాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి?
c) వేసక్టమి ఆపరేషన్లో ఏ భాగాన్ని కత్తిరిస్తారు?
d) ముష్కాలు వేనిలో అమరి ఉంటాయి?
e) పటంలో ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధం లేని భాగము ఏమిటి?
జవాబు:
a) పటంలో చూపబడిన వ్యవస్థ ప్రత్యుత్పత్తిని నిర్వహిస్తుంది.
b) పురుష సంయోగబీజాలు ముష్కాలలో ఉత్పత్తి అవుతాయి.
c) వేసక్టమి ఆపరేషన్లో శుక్రవాహికలను కత్తిరిస్తారు.
d) ముష్కాలు ముష్కగోణులలో అమరి ఉంటాయి. –
e) ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధం లేని భాగము ‘మూత్రాశయం’.

ప్రశ్న 39.
ప్రక్కపటం పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 28
a) శుక్ర కణంలోని మూడు ప్రదానభాగాలు ఏమిటి?
b) శుక్రకణం చలనానికి తోడ్పడు నిర్మాణం ఏమిటి?
c) శుక్రకణ చలనానికి శక్తిని అందించే మైటోకాండ్రియాలు ఏ భాగంలో ఉంటాయి?
d) ఆక్రోసోమ్ ప్రయోజనం ఏమిటి?
e) మానవ శుక్రకణ కేంద్రకంలో ఎన్ని క్రోమోజోమ్లు ఉంటాయి?
జవాబు:
a) శుక్ర కణంలో 1) తల 2) మధ్యభాగం 3) తోక అనే మూడు భాగాలు ఉంటాయి.
b) శుక్రకణ చలనానికి తోక ఉపయోగపడును.
c) మైటోకాండ్రియాలు మధ్యభాగంలో ఉంటాయి.
d) ఎక్రోసోమ్ అండంలోనికి చొచ్చుకుపోవటానికి తోడ్పడుతుంది.
e) శుక్రకణంలో 23 క్రోమోజోమ్లు ఉంటాయి.

ప్రశ్న 40.
ప్రక్కపటాన్ని పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 18
a) పటంలో చూపబడిన కండరయుత సంచి వంటి నిర్మాణం ఏమిటి?
b) స్త్రీ సంయోగబీజాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి?
c) ట్యూబెక్టమీలో కత్తిరించబడే భాగాలు ఏమిటి?
d) మానవునిలో ఫలదీకరణ ఎక్కడ జరుగుతుంది?
e) గర్భాశయ గ్రీవం ఏ భాగంలోనికి తెరుచుకొంటుంది?
జవాబు:
a) స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని కండరయుత సంచి వంట నిర్మాణం గర్భాశయం.
b) స్త్రీ సంయోగబీజాలు స్త్రీ బీజకోశంలో ఉత్పత్తి అవుతాయి.
c)ట్యూబెక్టమీలో ఫాలోపియన్ నాళాలు కత్తిరించబడతాయి.
d) మానవునిలో ఫలదీకరణ ఫాలోపియన్ నాళాలలో జరుగును.
e) గర్భాశయ గ్రీవం యోనిలోనికి తెరుచుకొంటుంది.

ప్రశ్న 41.
ప్రక్కపటం పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 29
a) పటంలో చూపబడిన భాగము ఏమిటి?
b) ఈ నిర్మాణంలో ఎన్ని కణాలు ఎన్ని గుంపులుగా ఉంటాయి?
c) ఈ నిర్మాణంలో ద్వయ స్థితిక కణము ఏమిటి?
d) పై వైపున ఉన్న మూడు కణాలను ఏమంటారు?
e) సీబీజ కణం మొక్క స్థానం ఏమిటి?
జవాబు:
a) పటములో చూపబడిన నిర్మాణాన్ని ‘పిండకోశం’ అంటారు.
b) పిండకోశంలో ఏడు కణాలు మూడు గుంపులుగా ఉంటాయి.
c) ద్వితీయ కేంద్రకం ద్వయస్థితిక దశలో ఉంటుంది.
d) పై వైపున ఉన్న మూడు కణాలను ప్రాతిపదిక కణాలు అంటారు.
e) క్రింద ఉన్న మూడు కణాలలో మధ్యకణం స్త్రీ బీజకణము.

ప్రశ్న 42.
అంటుకట్టడం ద్వారా ఏ ఏ మొక్కలను పెంచుతారో మీ గ్రామంలోని తోట యజమానిని అడిగి తెల్సుకోవడానికి ప్రశ్నల జాబితా రాయండి. తెలుసుకున్న సమాచారాన్ని నమోదు చేయడానికి నమూనా పట్టిక రాయండి.
జవాబు:

  1. అంటుకట్టడం అనగానేమి?
  2. అంటుకట్టడం వలన కలిగే ప్రయోజనాలు ఏవి?
  3. అంటుకట్టడం వలన వ్యాప్తి చెందించబడే మొక్కలు ఏవి?
  4. అంటుకట్టడం ద్వారా ఉత్పత్తి చేయబడిన మొక్కలు వ్యాధులను తట్టుకొని నిలబడగలుగుతాయా?
  5. అంటుకట్టడం ద్వారా కొత్త మొక్క రావడానికి ఎంత సమయం అవసరం అవుతుంది?
  6. వాంఛిత లక్షణాలు కలిగిన మొక్కలను అంటుకట్టడం ద్వారా పొందవచ్చా?
  7. అంటుకట్టడంలో నేల యందు గల మొక్క భాగాన్ని ఏమంటారు?
  8. అంటుకట్టడంలో నేలయందున్న మొక్క భాగానికి జతకట్టబడిన భాగాన్ని ఏమంటారు?

ప్రశ్న 43.
పుష్పించే మొక్క జీవితచక్రం పటం గీచి, భాగాలు గుర్తించండి. మొక్క జీవితచక్రంలో ఏకస్థితిక నిర్మాణాలు ఏమిటి?
జవాబు:
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 15
మొక్క జీవిత చక్రంలో సంయోగబీజాలు (అండాలు, పరాగ రేణువులు) ఏకస్థితికంలో ఉంటాయి.

ప్రశ్న 44.
ఆరోగ్యం – పరిశుభ్రత, కుటుంబ నియంత్రణ వంటి విషయాలపై అవగాహన కలిగించడానికి నీవు చేపట్టే కార్యక్రమాలు ఏమిటి?
జవాబు:

  1. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భముగా ఆరోగ్య సదస్సులు, ఆరోగ్య పరీక్షలు నిర్వహింపచేస్తాను.
  2. సామూహిక వ్యాధి నిరోధక టీకా కార్యక్రమములు ఏర్పాటు చేయుటలో వైద్య సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు ఇస్తాను.
  3. క్రిమిరహిత దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులందరికి మాత్రలు సరఫరా అయ్యే విధంగా చూస్తాను.
  4. వ్యక్తిగత పరిశుభ్రత – ఆరోగ్యం గురించి నిపుణులైన వైద్యులచే సెమినార్లు నిర్వహిస్తాను.
  5. చిన్న కుటుంబము యొక్క ఆవశ్యకతను వివరిస్తాను. కుటుంబ నియంత్రణను పాటించే విధంగా గ్రామస్తులను ప్రోత్సహిస్తాను.
  6. కరపత్రాలను ముద్రించి పంచుట ద్వారా సంతులిత ఆహారము యొక్క ప్రాధాన్యతను, తీసుకోవలసిన అవసరాన్ని తెలుపుతాను.
  7. మల మూత్రవిసర్జన తరువాత కాళ్ళు, చేతులు శుభ్రం చేసుకోవలసిన ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తాను.
  8. నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు వయోజన పాఠశాలలు నెలకొల్పే విధంగా ప్రోత్సహిస్తాను.

AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

ప్రశ్న 45.
మానవ శుక్రకణ నిర్మాణాన్ని పటసహాయమున వర్ణించండి.
జవాబు:
AP Board 10th Class Biology Solutions 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 5
శుక్రకణము :

  1. శుక్రకణానికి ఏక్రోజోమ్ మరియు కేంద్రకము కలిగిన తల ఉంటుంది.
  2. శుక్రకణం అండములోనికి ప్రవేశించటానికి ఏక్రోజోమ్ తోడ్పడుతుంది.
  3. మధ్యలో ఉండే పురుష కేంద్రకం, స్త్రీ కేంద్రకంతో కలిసిపోతుంది.
  4. శుక్రకణం తల, మధ్యభాగం మెడతో కలుపబడతాయి.
  5. మధ్యభాగంలో ఉండే మైటోకాండ్రియాలు శుక్రకణం కదలటానికి అవసరమైన శక్తిని ఇస్తాయి.
  6. తోక శుక్రకణం ముందుకు కదలటానికి తోడ్పడుతుంది.

10th Class Biology 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ ½ Mark Important Questions and Answers

ఫ్లో చార్టులు

1.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 30
జవాబు:
మొగ్గ తొడగటం

2.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 31
జవాబు:
ఆకులు

3.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 32
జవాబు:
రైజోమ్

4.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 33
జవాబు:
అంటు తొక్కుట

5.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 34
జవాబు:
ద్విదావిచ్ఛిత్తి

6.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 35
జవాబు:
పిండకోశం

7.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 36
జవాబు:
ఫెర్న్

8.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 37
జవాబు:
కేసరావళి

9.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 38
జవాబు:
ఏకలింగ పుష్పము

10.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 39
జవాబు:
కీలాగ్రం

11.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 40
జవాబు:
పరాగ సంపర్కం

12.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 41
జవాబు:
జీవ కారకాలు

13.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 42
జవాబు:
ఫలం

14.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 43
జవాబు:
ఎపిడిడిమిస్

15.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 44
జవాబు:
స్థలన నాళం

16.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 45
జవాబు:
ఫాలోపియన్ నాళం

17.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 46
జవాబు:
సంయుక్త బీజం

18.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 47
జవాబు:
క్షయకరణ విభజన

19.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 48
జవాబు:
S దశ

20.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 49
జవాబు:
మధ్య దశ

శాస్త్రవేత్తను కనుగొనండి

21. ఇతను కణ సిద్ధాంతం యొక్క ప్రతిపాదకుడు, కణాలు అన్నీ ముందుగా ఉన్న కణాల నుండి ఉత్పన్నమవుతాయి అని చెప్పాడు. అతను ఎవరు?
జవాబు:
రాబర్ట్ విర్కోన్

22. అతను జర్మన్ శాస్త్రవేత్త. 1952లో కణ విభజనపై తన పరిశీలనలను ప్రచురించాడు. ద్విదావిచ్ఛిత్తి జంతు కణాల ప్రత్యుత్పత్తి సాధనమని ఆయన పేర్కొన్నారు. అతను ఎవరు?
జవాబు:
రాబర్ట్ రీమాక్

23. కణాలలో విభజన సమయంలో కేంద్రకంలో నిలువుగా వీడిపోయే దాతాల వంటి నిర్మాణాలు గమనించాడు. అతను ఆ కణ విభజనకు సమ విభజన అని పేరు పెట్టాడు. అతను ఎవరు?
జవాబు:
వాల్తేర్ ఫ్లెమింగ్

24. జీవులలోని క్రోమోజోమ్ జననీ జనకుల నుండి సంక్రమిస్తాయని ప్రతిపాదించారు. అతను ఎవరు?
జవాబు:
విల్మ్ రూక్స్

25. అతను కంటిచూపు తక్కువగా ఉన్న జీవశాస్త్రవేత్త. వరుస కణ విభజనలో క్రోమోజోమ్ ల సంఖ్య ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుందని అతను ఊహించాడు. అతను ఎవరు?
జవాబు:
ఆగస్టు వీస్మాన్

26. 1904 లో సమ విభజన దశలు ఆయనచే ధృవీకరించబడినాయి. అతను ఎవరు?
జవాబు:
థియోడర్ బోవేరి

AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

27. 1953లో వరుస ప్రయోగాల తరువాత జన్యు పదార్థం యొక్క రసాయన స్వభావం వారిచే నిర్ణయించబడింది. వారు ఎవరు?
జవాబు:
జేమ్స్ వాట్సన్ మరియు ఫ్రాన్సిస్ క్రిక్

28. అతను కణ శాస్త్రవేత్త. మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు చెందినవాడు. కణ సంలీన టెక్నిక్ ఉపయోగించి అంతర దశ నిర్మాణాన్ని ఆయన వెల్లడించారు. అతను ఎవరు?
జవాబు:
పోటు నరసింహారావు

విస్తరించుము

29. G1 దశ – పెరుగుదల దశ 1
30. Sదశ – సంశ్లేషణ దశ
31. S2 దశ – పెరుగుదల దశ 2
32. M దశ – సమ విభజన దశ
33. H.I – హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్
34. A.I.D.S – అక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియన్సీ సిండ్రోమ్
35. A.R.T – యాంటీ – రెట్రోవైరల్ థెరపీ
36. A.S.H.A – గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్త
37. S.T.D – లైంగికంగా సంక్రమించే వ్యాధి
38. D.N.A – డీ ఆక్సిరైబో న్యూక్లిక్ ఆసిడ్

సరైన గ్రూపును గుర్తించండి

39. ఈ క్రింది సమూహాలలో ఏది సహజ శాఖీయ వ్యాప్తి పద్దతి కాదు?
ఎ) విచ్చిత్తి, మొగ్గ తొడగటం, ముక్కలు కావటం
బి) ఛేదనం, అంటు తొక్కుట, అంటుకట్టుట
జవాబు:
గ్రూపు-బి

40. కాండం ద్వారా ఏ మొక్కల సమూహం వ్యాప్తి చేయబడదు?
ఎ) క్యారెట్, బ్రయోఫిల్లమ్, ముల్లంగి
బి) మల్లె, ఉల్లిపాయ, బంగాళాదుంప
జవాబు:
గ్రూపు-ఎ

41. కాండం ద్వారా వ్యాప్తి చెందే సమూహం ఏది?
ఎ) స్టోలన్, మొక్కజొన్న, రైజోమ్
బి) మొగ్గ తొడుగుట, పత్ర మొగ్గలు, విచ్ఛిత్తి
జవాబు:
గ్రూప్-ఎ

42. కింది వాటిలో సిద్ధబీజాలను ఉత్పత్తి చేస్తున్న సమూహము ఏది?
ఎ) ద్రాక్ష, పుచ్చకాయ, క్యారెట్
బి) పుట్టగొడుగు, రైజోపస్, ఫెర్న్
జవాబు:
గ్రూపు-బి

43. పురుష పునరుత్పత్తి వ్యవస్థకు చెందిన అనుబంధ గ్రంథుల సమూహం ఏది?
ఎ) శుక్ర గ్రాహికలు, ప్రోస్టేట్ గ్రంథి, కౌపర్ గ్రంథి
బి) పిట్యూటరీ గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, థైమస్ గ్రంథి
జవాబు:
గ్రూపు-ఎ

44. ఏ జీవుల సమూహం బాహ్య ఫలదీకరణం జరుపుతాయి ?
ఎ) కుక్క పిల్లి, ఏనుగు
బి) చేప, కప్ప, వానపాము
జవాబు:
గ్రూపు-బి

45. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధం లేని భాగాలు ఏవి?
ఎ) అండాశయం, గర్భాశయం, యోని
బి) టెస్టిస్, ఎపిడిడిమిస్, యురేత్రా
జవాబు:
గ్రూపు-ఎ

46. స్త్రీలలోని గర్భనిరోధక పద్ధతుల సమూహం ఏది?
ఎ) కండోమ్స్, వాసెక్టమీ, ట్యూబెక్టమీ
బి) కాపర్-టి, డయాఫ్రాగమ్, నోటి మాత్రలు
జవాబు:
గ్రూపు-బి

47. కణ చక్రం యొక్క సరైన క్రమం ఏది?
ఎ) G1 – S – G2 – M
బి) G1 – G2 – S – M
జవాబు:
గ్రూపు-ఎ

48. సమ విభజన దశల యొక్క సరైన క్రమం ఏది?
ఎ) ప్రథమ, చలన, మధ్య అంతిమ దశలు
బి) ప్రథమ, మధ్య, చలన, అంత్య దశలు
జవాబు:
గ్రూపు-బి

49. పువ్వు యొక్క అండకోశంలో ఉన్న భాగాలు ఏమిటి?
ఎ) అండాశయం, కీలాగ్రం, కీలం
బి) కాడ, పరాగకోశం, పుప్పొడి రేణువులు
జవాబు:
గ్రూపు-ఎ

50. ఏ కణాల సమూహం సమ విభజన జరుపుతాయి?
ఎ) అస్థి కణం, కాలేయ కణం, నెఫ్రాన్లు
బి) సిద్ధబీజ తల్లి కణం, పుప్పొడి తల్లి కణం, శుక్ర తల్లి కణం
జవాబు:
గ్రూపు-ఎ

51. ఏక స్థితిక క్రోమోజోమ్ లను కలిగి ఉన్న కణాల సమూహం ఏది?
ఎ) ధ్రువ కేంద్రకాలు, జైగోట్, స్త్రీ బీజ కణం
బి) యాంటిపోడల్ కణాలు, సహాయక కణాలు, స్త్రీ బీజ కణం
జవాబు:
గ్రూపు-బి

జతపరచుట

52. సరిపోలని దాన్ని గుర్తించండి.
ముష్కము – శుక్రకణాలు
అండాశయం – టెస్టోస్టెరాన్
ప్రసేకము – మూత్ర జననేంద్రియ నాళం
జవాబు:
అండాశయం – టెస్టోస్టెరాన్

53. సరిగ్గా సరిపోలిన దాన్ని కనుగొనండి.
అండాశయం – శుక్రకణాలు
ముష్కములు – అండము
ఫెలోపియన్ నాళం – ఫలదీకరణం
జవాబు:
ఫెలోపియన్ నాళం – ఫలదీకరణం

AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

54. సరిగ్గా సరిపోలిన దాన్ని గుర్తించండి.
ఈస్ట్రోజన్ – ఋతుచక్రం
ప్రొజెస్టెరాన్ – ఆడవారిలో ద్వితీయ లైంగిక లక్షణాలు
టెస్టోస్టెరాన్ – పిండ ప్రతిస్థాపన
జవాబు:
ఈస్ట్రోజన్ – ఋతుచక్రం

55. సరిపోలని దాన్ని గుర్తించండి.
అండ ఉత్పత్తి – 28-30 రోజులు
గర్భధారణ కాలం – 180 రోజులు
జరాయువు ఏర్పడటం – గర్భం యొక్క 12 వారాలు
జవాబు:
గర్భధారణ కాలం – 180 రోజులు

56. సరిపోలని దాన్ని గుర్తించండి.
రక్షక పత్రావళి – రక్షణ
ఆకర్షక పత్రావళి – ప్రకాశవంతమైన రంగు
కేసరాలు – అండకోశం
జవాబు:
కేసరాలు – అండకోశం

57. సరిగ్గా సరిపోలిన దాన్ని గుర్తించండి.
అండాశయం – విత్తనంపై పొర
అండం – విత్తనం
విత్తనకవచం – పండు
జవాబు:
అండం – విత్తనం

58. సరిపోలని దాన్ని గుర్తించండి.
గాయాలు మానటం – సమవిభజన
బీజకణాలు – క్షయకరణ విభజన
క్రోమోసోమ్ తగ్గింపు – క్షయకరణ విభజన
జవాబు:
క్రోమోసోమ్ తగ్గింపు – క్షయకరణ విభజన

59. సరిగ్గా సరిపోలిన దాన్ని గుర్తించండి.
పారామీషియం – మొగ్గ తొడగటం
ఫ్లనేరియా – పునరుత్పత్తి
హైడ్రా – ద్విదావిచ్ఛిత్తి
జవాబు:
ప్లనేరియా – పునరుత్పత్తి

60. సరిపోలని దాన్ని గుర్తించండి.
ఆకులు – పత్ర మొగ్గలు
అల్లం – రన్నర్
రోజ్ – స్టోలన్
జవాబు:
రోజ్ – స్టోలన్

ఉదాహరణలు ఇవ్వండి

61. హైడ్రామొగ్గ తొడగటం ద్వారా ప్రత్యుత్పత్తి చేయగలదు. ఇటువంటి మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ఈస్ట్‌

62. ద్విదావిచ్చిత్తి ప్రక్రియ ద్వారా అమీబా తదుపరి తరానికి ప్రత్యుత్పత్తి చేస్తుంది. దీనికి మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
పేరామీషియం / బాక్టీరియా

63. ప్లనేరియా ప్రత్యుత్పత్తికి ఒక ఉదాహరణ. మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
హైడ్రా

64. బ్రయోఫిల్లమ్ ఆకుల ద్వారా వ్యాప్తి చెందే మొక్క వేర్ల ద్వారా వ్యాప్తి చెందగల మొక్కకు మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
క్యారెట్ / ముల్లంగి

65. రైజోమ్ ఒక భూగర్భ కాండం, ఇది అడ్డంగా పెరిగింది. నిలువుగా పెరిగిన భూగర్భ కాండానికి మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
కార్న్

66. ఛేదనం అనేది మొక్కలలో ఒక కృత్రిమ శాఖీయ వ్యాప్తి పద్ధతి. బహుళ పండ్ల మొక్కలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే కృత్రిమ శాఖీయ వ్యాప్తి పద్ధతికి మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
అంటుకట్టుట

67. ఫెర్న్ మొక్క సిద్ధ బీజాలను ఉత్పత్తి చేస్తుంది. మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
రొట్టె బూజు / పుట్ట గొడుగు

68. ఏకలింగ పువ్వుకు గుమ్మడి ఒక ఉదాహరణ. మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
బొప్పాయి

69. టెస్టోస్టెరాన్ పురుష లైంగిక హార్మోన్. స్త్రీ లైంగిక హార్మోన్‌కు మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ఈస్ట్రోజన్ / ప్రొజెస్టెరాన్

AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

70. హెచ్.ఐ.వి. లైంగిక సంక్రమణ వ్యాధి. మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
గనేరియా, సిఫిలిస్

71. బాల్య వివాహాలు ఒక సామాజిక దురాచారం. మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
స్త్రీ భ్రూణహత్య

పోలికను గుర్తించుట

72. బాహ్య ఫలదీకరణం : కప్ప : 😕 : పులి
జవాబు:
అంతర్గత ఫలదీకరణం

73. ముష్కం : శుక్రకణం : : అండాశయము 😕
జవాబు:
అండము

74. పరాగకోశం 😕 : : పిండం కోశం : స్త్రీ బీజ కణం
జవాబు:
పుప్పొడి రేణువు

75. సహాయ కణం : n::? : 2n
జవాబు:
ధ్రువ కేంద్రకాలు / కేంద్ర కణం

76. మగవారు : వేసెక్టమీ : : ఆడవారు 😕
జవాబు:
ట్యూబెక్టమీ

77. ప్రొజెస్టెరాన్ : స్త్రీ లైంగిక హార్మోన్ : 😕 : పురుష లైంగిక హార్మోన్
జవాబు:
టెస్టోస్టెరాన్

78. రైజోపస్ 😕 : : శైవలం : ముక్కలు కావటం
జవాబు:
సిద్ధబీజాలు

79. 2n : మియోసిస్ : : n:?
జవాబు:
సమ విభజన

80. లశునం : ఉల్లిపాయ : 😕 : బంగాళాదుంప
జవాబు:
దుంప కాండం

నేను ఎవరు?

81. నేను ఒకే జాతికి చెందిన కొత్తతరం జీవులను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్న జీవిత ప్రక్రియను.
జవాబు:
ప్రత్యుత్పత్తి

82. నేను జంతువులలో అలైంగిక ప్రత్యుత్పత్తిని. ఈ ప్రక్రియలో తేనెటీగల ఫలదీకరణం చెందని గుడ్ల నుండి డ్రోన్లు ఏర్పడతాయి.
జవాబు:
అనిషేక జననము (పారాథెనో జెనెసిస్)

83. నేను మొక్కలలో కృత్రిమ వ్యాప్తి పద్ధతిని. ఈ పద్ధతిలో ఒక మొక్క యొక్క ఒక భాగంలో మరొక మొక్కను ఉంచడం వలన, అవి ఒకే విధమైన మొక్కలా పెరుగుతాయి.
జవాబు:
అంటు కట్టుట (గ్రాఫ్టింగ్)

84. నేను కణచక్రంలో ఒక దశను. నేను రెండు కణ విభజనల మధ్య అంతరాన్ని. ఈ దశలో క్రోమోజోమ్ ల సంఖ్య రెట్టింపు అవుతుంది.
జవాబు:
అంతర దశ

85. నేను పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క అనుబంధ గ్రంథుల నుండి స్రవింపబడతాను. పురుషుల శరీరం నుండి శుక్రకణాలను పంపించడానికి నేను సహాయంచేస్తాను.
జవాబు:
శుక్ర స్రావం

86. నేను అండాశయంలో గుండ్రని కణాల బంతి లాగ ఉన్నాను. అండం ఈ చిన్న నిర్మాణం నుండి అభివృద్ధి చెందుతుంది.
జవాబు:
ఫియన్ పుటిక

87. నేను పిండం మరియు తల్లి నుండి ఏర్పడిన కణజాలం. నేను గర్భం దాల్చిన 12 వారాల వద్ద ఏర్పడతాను మరియు పిండం యొక్క పోషణకు సహాయపడతాను.
జవాబు:
జరాయువు

AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

88. నేను గర్భావధి చివరలో క్షీర గ్రంథులలో శోషరసము వంటి ద్రవం పేరుకుపోవడం వలన ఏర్పడతాను. నేను పిల్లల రోగ నిరోధక శక్తిని అభివృద్ధి చేయడంలో సహాయపడతాను.
జవాబు:
ప్రారంభ స్తన్యము

దోషాన్ని గుర్తించి, సరిచేసి రాయండి

89. మారుతున్న పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా, స్వీకరించడానికి, వ్యాధులను తట్టుకోవటానికి, కొత్త ప్రాంతాలకు వ్యాప్తి చెందడానికి మరియు వారి జనాభాను పెంచడానికి స్వలింగ పునరుత్పత్తి మంచి అవకాశాన్ని ఇస్తుంది.
జవాబు:
మారుతున్న పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా, స్వీకరించడానికి, వ్యాధులను తట్టుకోవటానికి, కొత్త ప్రాంతాలకు వ్యాప్తి చెందడానికి మరియు వారి జనాభాను పెంచడానికి లైంగిక పునరుత్పత్తి మంచి అవకాశాన్ని ఇస్తుంది.

90. కేసరం మరియు కార్పెల్ రెండింటినీ కలిగి ఉన్న పువ్వులు మోనో లైంగిక పువ్వులు.
జవాబు:
కేసరం మరియు కార్పెల్ రెండింటినీ కలిగి ఉన్న పువ్వులు ద్విలింగ లైంగిక పువ్వులు.

91. యాంటీ పోడల్ కణాలు పుప్పొడి గొట్టం పెరుగుదలను గుడ్డు వైపు నిర్దేశిస్తాయి.
జవాబు:
సహాయక కణాలు పుప్పొడి గొట్టం పెరుగుదలను గుడ్డు వైపు నిర్దేశిస్తాయి.

92. స్త్రీలలో ద్వితీయ లైంగిక పాత్రలకు టెస్టోస్టిరాన్ బాధ్యత వహిస్తుంది.
జవాబు:
స్త్రీలలో ద్వితీయ లైంగిక పాత్రలకు ఈస్ట్రోజెన్ బాధ్యత వహిస్తుంది.

93. వాసా ఎఫరెన్షియా అనేది వృషణాల పృష్ఠం వైపున ఉన్న అత్యంత కాయిల్ ట్యూబ్. వీర్యకణాలు వాటిలో నిల్వ చేయబడతాయి.
జవాబు:
అడెనోకార్సినోమా అనేది వృషణాల పృష్ఠం వైపున ఉన్న అత్యంత కాయిల్డ్ ట్యూబ్. వీర్యకణాలు వాటిలో నిల్వ చేయబడతాయి.

94. మగవారిలో అండాశయాల యొక్క చిన్న భాగం శస్త్రచికిత్స ఆపరేషన్ ద్వారా తొలగించబడుతుంది మరియు రెండు చివరలను సరిగ్గా కట్టివేస్తారు.
జవాబు:
మగవారిలో శుక్రనాళం యొక్క చిన్న భాగం శస్త్రచికిత్స ఆపరేషన్ ద్వారా తొలగించబడుతుంది మరియు రెండు చివరలను సరిగ్గా కట్టివేస్తారు.

95. ఆకు మార్జిన్ వెంట నోట్లలో ఉత్పత్తి అయ్యే మొగ్గలు నేల మీద పడి కొత్త మొక్కలుగా అభివృద్ధి చెందుతాయి. వీటిని స్పోరోఫిల్స్ మొగ్గలు అంటారు.
జవాబు:
ఆకు మార్జిన్ వెంట నోట్లలో ఉత్పత్తి అయ్యే మొగ్గలు నేల మీద పడి కొత్త మొక్కలుగా అభివృద్ధి చెందుతాయి. వీటిని ఎపిఫిల్లస్ మొగ్గలు అంటారు.

AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

96. ఈ క్రింది నినాదాల యొక్క ప్రధాన ఇతివృత్తం ఏమిటి? ఆడపిల్లలు గులాబీ రేకులలాంటి వారు, వారిని కాపాడండి.
భవిష్యత్ తరాలను కాపాడటానికి అమ్మాయిలను రక్షించండి.
జవాబు:
స్త్రీ భ్రూణహత్యలను ఆపడానికి

బొమ్మలపై ప్రశ్నలు

97.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 50
స్ట్రాబెర్రిలోని కాండం ఏ రకానికి చెందుతుంది?
జవాబు:
స్టోలన్

98.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 51
ఈ చిత్రంలో చూపించబడిన శాఖీయ వ్యాప్తి విధానం?
జవాబు:
అంటుకట్టుట

99.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 52
పటంలో చూపబడిన అలైంగిక నిర్మాణం?
జవాబు:
సిద్ధబీజాశయ పత్రం

100.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 53
ఇవ్వబడిన పుష్పము ఏ రకానికి చెందుతుంది?
జవాబు:
ద్విలింగ పుష్పము

101.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 54
పుష్పంలో అందమైన భాగాల పని?
జవాబు:
కీటకాల ఆకర్షణ

102.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 55
పటంలో చూపబడిన X భాగం ఏమిటి?
జవాబు:
పరాగనాళం

103.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 56
పటంలో తప్పుగా గుర్తించిన భాగం.
జవాబు:
ఫాలోపియన్ నాళం

104.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 57
ఈ పటంలో చూపబడిన భాగం యొక్క పని
జవాబు:
శుక్రకణ కదలిక

105.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 59
పటంలో చూపబడిన కణ విభజన దశ ఏమిటి?
జవాబు:
చలన దశ

ఖాళీలను పూరించండి

106. బంగాళాదుంప ……. ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతుంది.
జవాబు:
కన్నుల

107. భూమికి సమాంతరంగా పెరిగే భూగర్భ కాండం ………..
జవాబు:
రైజోమ్

108. పుష్పంలోని లైంగిక వలయాల సంఖ్య
జవాబు:
2

AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

109. పిండకోశములో ద్వయస్థితిక కేంద్రకము …………..
జవాబు:
మధ్యస్థ కేంద్రకము

110. విత్తనాలు లేకుండా ఏర్పడే ఫలాలు ……..
జవాబు:
అని షేక ఫలాలు

111. పత్రాల ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే మొక్క …..
జవాబు:
రణపాల

112. మొక్కలలోని లైంగిక భాగం ………….
జవాబు:
పుష్పము

113. పిండకోశంలోని కేంద్రకాల సంఖ్య …………
జవాబు:
7

10th Class Biology 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 1 Mark Bits Questions and Answers

1.

జాబితా – A జాబితా – B
1. ముక్కలగుట శిలీంధ్రాలు
2. కోరకీభవనము పారామీషియమ్
3. ద్విదావిచ్ఛిత్తి చదునుపురుగు

తప్పుగా జతపరచబడినవి ఏవి?
A) 1, 2
B) 2, 3
C) 1, 3
D) 1, 2, 3
జవాబు:
B) 2, 3

2. సమవిభజనలోని కణచక్రం యొక్క ప్లోచార్ట్ దశలను సరియైన, క్రమంలో అమర్చండి.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 61
A) 4, 1, 2, 3
B) 2, 3, 4, 1
C) 4, 2, 3, 1
D ) 1, 3, 4, 2
జవాబు:
A) 4, 1, 2, 3

3. బొమ్మలో గుర్తించిన ‘X’ దీనిని సూచిస్తుంది.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 60
A) సహాయకణాలు
B) ప్రతిపాదిత కణాలు
C) ధృవ కేంద్రకం
D) అండకణం
జవాబు:
C) ధృవ కేంద్రకం

4. సరైన క్రమాన్ని గుర్తించండి.
A) ప్రథమదశ → చలనదశ → అంత్యదశ → మధ్యస్థదశ
B) ప్రథమదశ → మధ్యస్టదశ → చలనదశ → అంత్యదశ
C) మధ్యస్థదశ → అంత్యదశ → ప్రథమదశ → చలనదశ
D) ప్రథమదశ → చలనదశ → మధ్యస్థదశ → అంత్యదశ
జవాబు:
B) ప్రథమదశ → మధ్యస్టదశ → చలనదశ → అంత్యదశ

AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

5. శుక్ర కణాలను ఉత్పత్తి చేసే పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగం
A) శుక్రవాహిక
B) పౌరుష గ్రంథి
C) ముష్కాలు
D) శుక్రాశయము
జవాబు:
C) ముష్కాలు

6. మొక్కల్లో పురుష బీజకేంద్రం ద్వితీయ కేంద్రకంతో కలిస్తే ఏర్పడేది
A) పిండకోశం
B) అంకురచ్ఛదం
C) బీజదళాలు
D) సిద్ధబీజాలు
జవాబు:
B) అంకురచ్ఛదం

7. విభజన చెందని కణాలున్న శరీర భాగం
A) మెదడు
B) ఊపిరితిత్తులు
C) మూత్రపిండం
D) జీర్ణాశయం
జవాబు:
A) మెదడు

8. అండాలను ఉత్పత్తిచేసే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగము ఏది?
A) గర్భాశయ ముఖద్వారం
B) ఎపిడిడిమిస్
C) అండాశయము
D) ఫాలోఫియన్ నాళం
జవాబు:
C) అండాశయము

9. పార్థినోజెనిసిస్ ప్రదర్శించే జీవి ……..
A) తేనెటీగలు
B) కందిరీగలు
C) చీమలు
D) అన్నీ
జవాబు:
D) అన్నీ

10. గర్భస్థ శిశువు పెరుగుదలపై ప్రభావాన్ని చూపేవేవి?
A) సిగరెట్ పొగలో రసాయనాలు
B) ఆల్కహాల్
C) మందులు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

11. మానవులలో గర్భావధి కాలం
A) 330 రో॥
B) 20 రో॥
C) 280 నె॥
D) 280 రో॥
జవాబు:
D) 280 రో॥

12. ఈ క్రింది విత్తనాలలో అంకురచ్ఛదం కలది ………..
A) ఆముదము
B) బఠాణి
C) కందులు
D) పెసలు
జవాబు:
A) ఆముదము

AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

13. మానవ జీవిత చక్రంలోని వివిధ దశలు క్రిందయివ్వబడినవి. సరియైన క్రమంలో అమర్చండి.
1) కౌమార దశ
2) శిశుదశ
3) వయోజన దశ
4) బాల్య దశ
A) 1, 3, 4, 2
B) 4, 2, 3, 1
C) 2, 4, 1, 3
D) 3, 1, 2, 4
జవాబు:
C) 2, 4, 1, 3

14. ఈ చిహ్నం తెలియజేయు అంశం
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 62
A) ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం
B) ప్రపంచ వైద్యుల దినోత్సవం
C) ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
D) ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం
జవాబు:
A) ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం

15. సైడ్ పైన ఒక విద్యార్థి పరాగరేణువును సూక్ష్మదర్శినిలో పరీక్షించినపుడు ఈ క్రింది విధంగా కనబడింది.
‘X’ దేనిని సూచించును?
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 63
A) పక్వం చెందిన కేంద్రకం
B) పరాగ నాళం
C) కీలాగ్రం
D) నాళికా కేంద్రకం
జవాబు:
B) పరాగ నాళం

16. ప్రక్క పటంలో ‘X’ దేనిని తెలియజేస్తుంది?
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 57
A) ఆక్రోసోమ్
B) తల
C) కేంద్రకం
D) తోక
జవాబు:
A) ఆక్రోసోమ్

17. కోరకీభవనము ఏ జీవులలో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి?
A) ఈస్ట్
B) పారమీసియం
C) వానపాము
D) అమీబా
జవాబు:
A) ఈస్ట్

18. క్రింది బొమ్మలోని సమవిభజన దశను గుర్తించుము.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 64
A) ప్రథమ దశ
B) చలన దశ
C) మధ్య స్థ దశ
D) అంత్య దశ
జవాబు:
B) చలన దశ

19. క్రింది వానిలో యవ్వన దశ యందు ముష్కాలు నిర్వహించే పని
i) ప్రొజెస్టిరానను స్రవించుట
ii) టెస్టోస్టిరానను స్రవించుట
iii) ఆళిందమును ఏర్పరచుట
iv) శుక్రకణాల ఉత్పత్తి
A) (i) మరియు (iii)
B) (ii) మరియు (iv)
C) (iii) మరియు (iv)
D) (i) మరియు (ii)
జవాబు:
B) (ii) మరియు (iv)

20. సిద్ధబీజాల ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరిపే మొక్క
A) మందార
B) గడ్డిచామంతి
C) బంతి
D) ఫెర్న్
జవాబు:
D) ఫెర్న్

21. కింది బొమ్మలోని చిక్కుడు బీజదళాలను తెరచి చూచినపుడు కనిపించే భాగాలు
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 65
A) బీజదళాలు మరియు ప్రథమ మూలం
B) ప్రథమ కాండం, బీజదళం
C) బీజదళం మరియు అంకురచ్ఛదం
D) ప్రథమాంకురం, ప్రథమ మూలం
జవాబు:
D) ప్రథమాంకురం, ప్రథమ మూలం

22. కింది వానిలో వేరుగా ఉన్నది
A) పౌరుష గ్రంథి
B) ఎపిడిడిమిస్
C) శుక్రవాహికలు
D) ఫాలోపియన్ నాళం
జవాబు:
D) ఫాలోపియన్ నాళం

AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

23. అండకణం శుక్రకణం కన్నా పెద్దదిగా ఉంటుంది అని ఉపాధ్యాయుడు బోధించాడు. దీనికి గల కారణం
A) అండం ఎక్కువ కణాలను కలిగి ఉంటుంది.
B) ఫలదీకరణ అనంతరము పెరుగుదలకు కావలసిన పోషక పదార్థాలను కలిగి ఉంటుంది.
C) మందమైన కణత్వచాన్ని కలిగి ఉంటుంది.
D) పెద్ద కేంద్రకాన్ని కలిగి ఉంటుంది.
జవాబు:
B) ఫలదీకరణ అనంతరము పెరుగుదలకు కావలసిన పోషక పదార్థాలను కలిగి ఉంటుంది.

24. గర్భధారణ జరిగాక 3 నెలల పిండాన్ని ఏమంటారు?
A) సంయుక్త బీజం
B) జరాయువు
C) పిండం
D) భ్రూణం
జవాబు:
D) భ్రూణం

25. ఎయిడ్స్ వ్యాధికి గురి కాకుండా ఉండాలంటే ……
A) పరీక్షించిన రక్తాన్ని మాత్రమే రక్తమార్పిడికి ఉపయోగించాలి.
B) డిస్పోజబుల్ సూదులను వాడాలి.
C) సురక్షితం కాని లైంగిక సంబంధాలు కలిగి ఉండకూడదు.
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

26. పటంలో చూపబడిన మొక్క
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 66
A) బంగాళాదుంప
B) వాలిస్ నేరియా
C) స్ట్రాబెర్రీ
D) రణపాల
జవాబు:
D) రణపాల

మీకు తెలుసా?

* వాణిజ్యరీత్యా ఈ సాంప్రదాయ పద్ధతులకు బదులుగా అధునాతన కృత్రిమ శాఖీయోత్పత్తి పద్దతులైన కణజాల వర్ధనాన్ని ఉపయోగిస్తున్నారు. కణజాల వర్ధనంలో కేవలం మొక్కలలో కొన్ని కణాలు లేదా కణజాలాన్ని మొక్క పెరుగుదల కారకాలు కలిగి ఉన్న వర్ణన యానకంలో ఉంచినపుడు అవి కొత్త మొక్కలుగా పెరుగుతాయి. ఈ విధానంలో వేల సంఖ్యలో మొక్కలను తక్కువ కాల వ్యవధిలో పెంచవచ్చు. దీనిని “కణజాలవర్ధనం” అంటారు.

* లైంగిక ప్రత్యుత్పత్తి ప్రాధాన్యత : అలైంగిక ప్రత్యుత్పత్తిలో జీవులు తమను పోలిన జీవులను ఉత్పత్తి చేయడంలో ఒక జనక జీవి మాత్రమే ఉంటుంది. లైంగిక ప్రత్యుత్పత్తిలో రెండు జనక జీవులు పాల్గొంటాయి. రెండు జీవుల ఉమ్మడి లక్షణాలు తరువాత తరానికి వస్తాయి. అలైంగిక ప్రత్యుత్పత్తికి ఎక్కువ సమయం, శక్తి వృథా కావు. భాగస్వామిని వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. అలైంగిక ప్రత్యుత్పత్తిలో తమచుట్టూ ఉన్న పరిసరాలతో సమర్థవంతంగా సర్దుబాటు చేసుకోవడానికి అనువైన జీవులు ఉత్పత్తి అవుతాయి. ఈ పాఠం ప్రారంభంలో పారమీషియంలో జరిగే లైంగిక, అలైంగిక ప్రత్యుత్పత్తులను గురించి చర్చించిన అంశాలను గుర్తుకు తెచ్చుకోండి.

* మొక్కలను ఎక్కువ కాలం అదే జాతికి చెందిన మొక్కల నుండి వేరుచేస్తే వాటికి స్వపరాగసంపరం జరుపుకొనే సామర్థ్యం పెరుగుతుంది. అదే జాతికి చెందిన మొక్కల్లో ఉంచినపుడు పరపరాగ సంపర్కం జరుపుకునే సామర్థ్యం పెరుగుతుందని 1867 సం||లో “ఛార్లెస్ డార్విన్” నిరూపించాడు.

* లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవులలో ఒకసారి ఫలదీకరణం జరగడం వలన సంయుక్తబీజం ఏర్పడుతుంది. మొక్కల్లో మొదటి ఫలదీకరణం వలన సంయుక్తబీజం, రెండవసారి జరిగే ఫలదీకరణం వలన అంకురచ్చదం ఏర్పడతాయి. పరాగరేణువులో రెండు కణాలుంటాయి. వీటిలో ఒకటైన నాళికాకణంలో రెండు కేంద్రకాలుంటాయి. ఇవి కీలాగ్రం నుండి కీలం ద్వారా అండాశయాన్ని చేరుతాయి. ఒక కేంద్రకం అండాశయం గుండా చొచ్చుకుపోయి పిండకోశంలోని స్త్రీ బీజకణాన్ని చేరుతుంది. రెండో కేంద్రకం ద్వితీయ కేంద్రకంతో సంయోగం చెంది అంకురచ్చదాన్ని ఏర్పరుస్తుంది. ఇది సంయుక్తబీజం నుండి పెరిగే కొత్త మొక్కకు పోషకపదార్థాలను అందిస్తుంది. దీనినే “ద్విఫలదీకరణం” అంటారు.

* ఆగస్ట్ వీస్మన్ ఒక జీవ శాస్త్రవేత్త. అతనికి కంటిచూపు తక్కువగా ఉండేది. కణాలను సూక్ష్మదర్శిని ఉపయోగించి పరిశీలించడం కష్టంగా ఉండేది. అందుకే అతను ఇతర మార్గాల ద్వారా తన పరిశోధనలను కొనసాగించాడు. శాస్త్రం కేవలం సేకరించిన సమాచారంపైనే ఆధారపడి అభివృద్ధి చెందలేదు. సేకరించబడిన సమాచారాన్ని గురించి ఆలోచించడం మరియు నూతన విషయాలను కనుక్కోవడం, వాటిని వ్యాఖ్యానించడం కూడా పరిశోధనే అవుతుంది. ఆగస్ట్ వీసమన్ తనకు కంటిచూపు తక్కువ అని విచారిస్తూ వృథాగా కూర్చోలేదు. తన సమయాన్నంతా శాస్త్ర విషయాలను గురించి ఆలోచించడానికే కేటాయించాడు. నిజంగా అతనెంత గొప్పవాడో, ఆదర్శప్రాయుడో ఆలోచించండి.

పునశ్చరణం
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 67