AP 9th Class Biology Important Questions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

These AP 9th Biology Important Questions and Answers 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు will help students prepare well for the exams.

AP Board 9th Class Biology 8th Lesson Important Questions and Answers వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

9th Class Biology 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
స్థూల పోషకాలు అనగానేమి? ఉదాహరణలివ్వండి.
జవాబు:
మొక్కలకు అధిక పరిమాణంలో అవసరం అయ్యే ఖనిజ లవణాలను స్థూల పోషకాలు అంటారు.
ఉదా : నత్రజని, భాస్వరం, పొటాషియం , సోడియం మొదలగునవి.

ప్రశ్న 2.
సూక్ష్మ పోషకాలు అనగానేమి? ఉదాహరణలివ్వండి.
జవాబు:
మొక్కలకు తక్కువ పరిమాణంలో అవసరం అయ్యే ఖనిజ లవణాలను సూక్ష్మ పోషకాలు అంటారు.
ఉదా : ఇనుము, మాంగనీస్, బోరాన్, జింక్, కాపర్, మాలిబ్డినమ్, క్లోరిన్ మొదలగునవి.

ప్రశ్న 3.
సేంద్రీయ సేద్యం అనగానేమి? దాని వలన ఉపయోగాలేవి?
జవాబు:

  1. నేల స్వభావాన్ని, సారవంతాన్ని పెంచడానికిగాను ఉపయోగపడే వ్యవసాయ విధానాన్ని సేంద్రీయ సేద్యం అంటారు.
  2. సేంద్రీయ సేద్యంలో అధిక దిగుబడి సాధించడం కోసం రైతులు రసాయనిక ఎరువులకు బదులుగా సేంద్రీయ ఎరువులను ఉపయోగిస్తారు.
  3. సహజ శత్రువులతో కీటకాలను అదుపులో పెట్టే పద్ధతులను ఉపయోగిస్తారు.
  4. పంట మార్పిడి, మిశ్రమ పంటలను పండించడం వంటి పద్ధతులను కూడా అవలంబిస్తారు.

ప్రశ్న 4.
పంచగవ్య ఉండే ముఖ్యమైన పదార్థాలు ఏవి?
జవాబు:
ఇది కూడా సహజ ఎరువు. పంచగవ్యలో ఉండే ముఖ్యమైన పదార్థాలు ఆవు పాలు, పెరుగు, నెయ్యి, పేడ, మూత్రం.

AP 9th Class Biology Important Questions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

ప్రశ్న 5.
‘కలుపు మొక్కలు’ అనగానేమి?
జవాబు:
పంట మొక్కలతో పాటు ఇతర మొక్కలు కూడా నేలలో పెరగడం తరచుగా మనం చూస్తుంటాం. వీటినే ‘కలుపు మొక్కలు’ అంటారు.

9th Class Biology 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
సంకరణము గురించి క్లుప్తంగా రాయండి.
జవాబు:

  1. జన్యుపరంగా వేరు వేరు లక్షణాలు ఉన్న రెండు మొక్కల నుండి మనం కోరుకున్న లక్షణాలతో కూడిన కొత్త మొక్కను ఉత్పత్తి చేయడాన్ని సంకరణం అంటారు.
  2. సంకరణం ద్వారా అభివృద్ధి చెందిన వంగడాలు అధిక దిగుబడిని ఇవ్వడం, వ్యాధులకు నిరోధకత కలిగి ఉండడం, తక్కువ నీటి వసతితో కూడా, ఆమ్లయుత నేలల్లో కూడా పెరగగలగడం వంటి ఉపయోగకరమైన లక్షణాలు కలిగి ఉంటాయి.

ప్రశ్న 2.
పంట మార్పిడిలోని కొన్ని పద్ధతులను రాయండి.
జవాబు:
పంట మార్పిడిలో కొన్ని పద్ధతులు:
ఎ) వరి పండిన తర్వాత మినుములు, వేరుశనగ సాగుచేయడం.
బి) పొగాకు పండించిన తర్వాత మిరప పంట సాగుచేయడం.
సి) కందులు, మొక్కజొన్న పండించిన తర్వాత వరి సాగుచేయడం.

ప్రశ్న 3.
పచ్చిరొట్ట ఎరువులు అనగానేమి ? ఉదాహరణలివ్వండి.
జవాబు:
AP 9th Class Biology Important Questions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 1

  1. కొన్ని రకాల పంటలను పండించిన తరువాత వాటిని అలాగే నీళ్ళలో కలిపి దున్నుతారు. ఇటువంటి వాటిని పచ్చి రొట్ట ఎరువులు అంటారు.
  2. వెంపలి, ఉలవ, పిల్లి పెసర, అలసంద, పెసర వంటి పంటలు పచ్చిరొట్ట ఎరువులకు ఉదాహరణలు.

ప్రశ్న 4.
పంట దిగుబడి అధికం చేయడానికి అవసరమయ్యే కారకాలు ఏవి?
జవాబు:

  1. పంట దిగుబడి అనేది ఏదో ఒక కారకంపైన ఆధారపడి ఉండదు.
  2. అనేక కారకాలు కలసి పనిచేయడం వల్ల మాత్రమే దిగుబడి పెరుగుతుంది.
  3. నాటిన విత్తన రకం, నేల స్వభావం, నీటి లభ్యత, ఎరువులు, పోషక పదార్థాల అందుబాటు, వాతావరణం, పంటపై క్రిమికీటకాల దాడి, కలుపు మొక్కల పెరుగుదలను అదుపుచేయడం వంటి వాటిని అధిక దిగుబడికి కారకాలుగా గుర్తిస్తాం.

ప్రశ్న 5.
అధిక దిగుబడి సాధించడానికి వ్యవసాయదారులు అవలంబించే పద్ధతులు ఏవి?
జవాబు:
అధిక దిగుబడి సాధించడానికి వ్యవసాయదారులు 3 పద్ధతులు ఉపయోగిస్తారు. అవి :

  1. అధిక దిగుబడినిచ్చే వంగడాలను అభివృద్ధి చేయడం.
  2. అధిక దిగుబడినిచ్చే యాజమాన్య పద్ధతులను పాటించడం.
  3. పంటలను పరిరక్షించే పద్ధతులు పాటించడం.

ప్రశ్న 6.
ఆహార ఉత్పత్తిని ఏ విధంగా పెంచవచ్చు?
జవాబు:

  1. సాగుభూమి విస్తీర్ణాన్ని పెంచడం వలన ఆహార ఉత్పత్తి పెంచవచ్చు.
  2. ప్రస్తుతం సాగుచేయుచున్న భూమిలో ఉత్పత్తి పెంచడం.
  3. ఎక్కువ దిగుబడినిచ్చే సంకర జాతులను అభివృద్ధి చేయడం.
  4. పంట మార్పిడి పద్ధతులు.
  5. మిశ్రమ పంట విధానము.
  6. దీర్ఘకాలిక పంటల కంటే స్వల్పకాలిక పంటల వల్ల అధిక ధాన్యం ఉత్పత్తి అవుతుంది.

ప్రశ్న 7.
పంటమార్పిడి అనగానేమి? దీనివలన ఉపయోగమేమిటి?
జవాబు:

  1. వేరు వేరు కాలాల్లో వేరు వేరు పంటలను పండించే విధానమును పంటమార్పిడి అంటారు.
  2. ఆహార ధాన్యాలు పండించినపుడు నేల నుండి అధిక పరిమాణంలో పోషక పదార్థాలు గ్రహిస్తాయి.
  3. కాని లెగ్యూమినేసి పంటలు మాత్రం అందుకు భిన్నంగా ఉంటాయి.
  4. ఇవి నేల నుండి పోషక పదార్థాలను తీసుకున్నప్పటికి నేలలోకి కొన్ని పోషక పదార్థాలను విడుదల చేస్తాయి.
  5. లెగ్యూమినేసి పంటలను పండించడం వల్ల నేలలో నత్రజని సంబంధిత లవణాల స్థాయి పెరుగుతుంది.

AP 9th Class Biology Important Questions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

ప్రశ్న 8.
మిశ్రమ పంటలు అనగానేమి? వాటి వలన ఉపయోగమేమిటి?
జవాబు:
ఒక పంట పొలంలో ఒకటి కంటే ఎక్కువ రకాల పంటలను పండిస్తే దానిని మిశ్రమ పంటలు అంటారు.

ఉపయోగాలు :

  1. మిశ్రమ పంటలను పండించడం వల్ల నేల సారవంతం అవుతుంది.
  2. నేల నుండి ఒక పంట తీసుకున్న పోషక పదార్థాలను మరొక పంట పోషక పదార్థాలను పునరుత్పత్తి చేయగలదు.
    ఉదా : సోయా చిక్కుళ్ళతో బఠాణీలు, బఠాణీతో పెసలు, మొక్కజొన్నతో మినుములు మొదలగునవి.

9th Class Biology 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
సేంద్రీయ ఎరువులను గురించి వివరించండి.
జవాబు:

  1. మొక్కలు, జంతువుల విసర్జితాలు కుళ్ళింప చేసినప్పుడు సేంద్రీయ ఎరువులు ఏర్పడతాయి.
  2. సేంద్రీయ ఎరువులు వాడడం వలన నేలలో హ్యూమస్ చేరి నీటిని నిల్వ చేసుకునే శక్తి నేలకు పెరుగుతుంది.
  3. సేంద్రీయ ఎరువు మంచి పోషక పదార్థములను నేలకు అందిస్తుంది.
  4. సహజ సేంద్రీయ ఎరువులు సాధారణంగా 2 రకాలుగా ఉంటాయి.
    ఎ) అధిక సాంద్రతతో కూడిన జీవ ఎరువులు.
    బి) స్థూల జీవ ఎరువులు.
  5. వేరుశనగ, నువ్వులు, ఆవాలు, కొబ్బరి, వేప, జట్రోపా వంటి విత్తనాల పొడి అధిక సాంద్రత గల జీవ ఎరువులకు ఉదాహరణ.
  6. జంతు సంబంధ విసర్జక పదార్థాలు, కుళ్ళిన పదార్థాలు, చెత్త వంటివి స్థూల జీవ ఎరువులకు ఉదాహరణ.
  7. స్థూల సేంద్రియ ఎరువుల కంటే అధిక సాంద్రత గల సేంద్రీయ ఎరువుల్లోనే పోషకాలు అధికంగా ఉంటాయి.
  8. పొలాల్లో ఎండిపోయిన మొక్కల వ్యర్థాలైన కాండం, వేళ్ళు, ఆవు పేడ, మూత్రం మొదలగు వాటిని మనం సాధారణంగా సేంద్రీయ ఎరువులు అంటాం.

ప్రశ్న 2.
భూసార పరీక్షా కేంద్రాల ఉపయోగం ఏమిటి?
జవాబు:

  1. భూసార పరీక్షా నిపుణులు పొలంలో అక్కడక్కడ నేలను తవ్వి మట్టి నమూనాలు సేకరిస్తారు.
  2. వీటిని పరీక్షించి ఇవి ఎంతవరకు సారవంతమైనవో పరీక్షిస్తారు.
  3. ఇలా చేయడం వలన నేలకు సంబంధించిన అన్ని విషయాలు మనకు తెలుస్తాయి.
  4. దీనివల్ల రైతులు ఏ పంటలు పండించాలి, ఎలాంటి ఎరువు వేయాలి, ఎంత పరిమాణంలో ఎరువులు వాడాలో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.
  5. ఇందువల్ల ఎరువుల వాడకంలో వృథాను అరికట్టడమే కాకుండా పెట్టుబడి కూడా తగ్గిపోతుంది.

ప్రశ్న 3.
సహజ ఎరువు పంచగవ్యను ఏ విధముగా తయారుచేస్తారు?
జవాబు:

  1. పంచగవ్యలో ఉండే ముఖ్యమైన పదార్థాలు ఆవు పాలు, పెరుగు, నెయ్యి, పేడ, మూత్రం.
  2. ఆవు పేడను నెయ్యిలో కలిపి నాలుగు రోజులు అలాగే ఉంచాలి.
  3. 5వ రోజు దీనికి మూత్రం, పాలు, పెరుగు, కల్లు, కొబ్బరి నీరు, చెరకు రసం వంటివి కలపాలి.
  4. దీనికి అరటి పండ్ల గుజ్జును కలిపి 10 రోజులు అలాగే ఉంచాలి.
  5. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దీనిని కలియబెట్టాలి.
  6. ఇలా చేస్తే పొలాల్లో ప్లేయర్ల ద్వారా చల్లడానికి వీలైన పంచగవ్య తయారవుతుంది.
  7. 3% పంచగవ్య పంట బాగా పెరగడానికి, అధిక దిగుబడి సాధించడానికి తోడ్పడుతుంది.
  8. దీన్ని కోళ్ళకు, చేపలకు ఆహారంగా కూడా ఉపయోగిస్తారు.

AP 9th Class Biology Important Questions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

ప్రశ్న 4.
స్థూల పోషకాలయిన నత్రజని, భాస్వరము మరియు పొటాషియం యొక్క ఉపయోగాలు ఏవి?
జవాబు:
నత్రజని, భాస్వరము మరియు పొటాషియంల ఉపయోగాలు :

పోషక పదార్థం ఉపయోగం
నత్రజని కొత్త ఆకులు, పుష్పాలు వేగంగా వస్తాయి.
భాస్వరము (ఫాస్పరస్) వేళ్ళు నేలలోకి చొచ్చుకుపోవడానికి, నేలలోని పోషక పదార్థాలను వేగంగా శోషించుకోవడానికి
పొటాషియం క్రిమికీటకాల నుండి రోగ నిరోధకశక్తిని పెంపొందించడం, వాసన, రంగు, రుచి వంటివి పెంచడం.

ప్రశ్న 5.
జీవ ఎరువులు అనగానేమి? ఉదాహరణలివ్వంది.
జవాబు:

  1. వాతావరణం నుండి పోషకాలను నేలకు తద్వారా మొక్కలకు అందించడానికి ఉపయోగపడే కొన్ని రకాలైన సూక్ష్మజీవులను జీవ ఎరువులు లేదా ‘మైక్రోబియల్ కల్చర్’ అంటారు.
  2. సాధారణంగా జీవ ఎరువులు రెండు రకాలు. అవి : ఎ) నత్రజని స్థాపన చేసేవి బి) భాస్వరాన్ని (పాస్ఫరస్) నేలలోనికి కరిగింపచేసేవి.

AP 9th Class Biology Important Questions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 2

ప్రశ్న 6.
వర్మి కంపోస్టు తయారుచేయు విధమును రాయండి.
జవాబు:

  1. వర్మి కంపోస్టు కోసం 10 × 1 × 1/2 మీటర్ కొలతలతో వర్మీ కంపోస్టు బెడదను ఏర్పాటు చేసుకోవాలి.
  2. ఎండ తగలకుండా, వర్షానికి గురికాకుండా పైన కప్పు వేయాలి.
  3. కొబ్బరి, అరటి, చెరకు ఆకులను, కొబ్బరి పీచు, ఎండిన మినుము మొక్కలను సేకరించాలి.
  4. వీటిని 3 లేదా 4 అంగుళాల పొరగా వేసి నీటితో తడపాలి.
  5. ఇళ్ళలో లభించే వ్యర్థాలు, గ్రామంలో లభించే ఎండిన పేడను సేకరించి బెడ్లను నింపాలి.
  6. బెడ్ తయారుచేసుకున్న 2 వారాల తర్వాత వీటిలో చదరపు మీటరుకు 1000 చొప్పున వానపాములను వదలి దానిపై గోనె సంచులతో కప్పి ఉంచాలి.
  7. వాటిపై నీరు చిలకరిస్తూ 30 నుంచి 40% తేమ ఉండేలా చేయాలి.
  8. 60 రోజుల తరువాత మొదటిసారి ఎరువును సేకరించవచ్చు.
  9. రెండవసారి 45 రోజులకే ఎరువును సేకరించాలి.
  10. ఇలా ప్రతి సంవత్సరం ఈ బెడ్ నుండి 6 సార్లు ఎరువును పొందవచ్చు.
  11. 3 టన్నుల జీవ వ్యర్థాలతో ఒక టన్ను వర్మీ కంపోస్టు ఎరువును పొందవచ్చు.

ప్రశ్న 7.
శ్రీ వరి సాగు విధమును వివరించండి.
జవాబు:

  1. శ్రీ వరి సాగు అనేది సేద్యంలో ఒక విధానం.
  2. శ్రీ వరి సాగు అంటే తక్కువ విత్తనం, తక్కువ నీటితో ఆరుతడి పంటగా పండించే పంట అని అర్థం.
  3. యథార్థానికి SRI అంటే సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ అని అర్థం.
  4. ఏ వరి విత్తనాన్నైనా తీసుకొని ఈ పద్ధతిలో పండించవచ్చు.
  5. శ్రీ వరిలో నీరు పెట్టే విధానం, నాటే విధానం, కలుపు నివారణ విధానం భిన్నంగా ఉంటుంది.
  6. సాధారణంగా ఎకరాకు 30 కిలోల విత్తనాలు వాడితే శ్రీ వరి సాగులో కేవలం 2 కిలోల విత్తనం సరిపోతుంది.
  7. సాధారణ వరి సేద్యంలో ఒక కిలో ధాన్యం పండించడానికి సుమారు 5000 లీటర్లు నీరు కావాలి. శ్రీ వరికి 2500 నుండి 3000 లీటర్ల నీరు సరిపోతుంది.
  8. శ్రీ వరి విధానం వల్ల విత్తన కొరతని నివారించవచ్చు. నీటిని పొదుపు చేయవచ్చు.
  9. శ్రీ వరి విధానంలో తెగుళ్ళు అదుపులో ఉంటాయి, పురుగు మందుల అవసరం తక్కువ.

9th Class Biology 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు Important Questions and Answers

ప్రశ్న 1.
AP 9th Class Biology Important Questions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 3

పోషక పదార్థం ఉపయోగం
నత్రజని కొత్త ఆకులు, పుష్పాలు వేగంగా వస్తాయి.
భాస్వరము (ఫాస్పరస్) వేళ్ళు నేలలోకి చొచ్చుకుపోవడానికి, నేలలోని పోషక పదార్థాలను వేగంగా శోషించుకోవడానికి
పొటాషియం క్రిమికీటకాల నుండి రోగ నిరోధకశక్తిని పెంపొందించడం, వాసన, రంగు, రుచి వంటివి పెంచడం.

ఎ) ఏ పంటలో ఆకులు త్వరగా ఏర్పడతాయి? ఎందుకు?
జవాబు:
చెరుకుపంట. ఎందుకంటే అది 90% నత్రజనిని వినియోగించుకుంటుంది. నత్రజని కొత్త ఆకులు ఏర్పడటానికి తోడ్పడుతుంది.

బి) ఏ పంటలో వేర్లు లోతుగా చొచ్చుకొని పోవు?
జవాబు:
తృణధాన్యాలు

సి) ఏ పంట చీడలను ఎక్కువ ప్రతి రోధకతను కలిగి వుంటుంది?
జవాబు:
చెరుకు పంట

డి) పై పట్టికను బట్టి ఏ పంటను పండించుట వలన రైతు ఎక్కువ దిగుబడి పొందుతాడు.
జవాబు:
చెరుకుపంట

AP 9th Class Biology Important Questions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

ప్రశ్న 2.
రైతులకు సహాయం చేయుటలో వానపాముల పాత్రను నీవు ఏ విధంగా ప్రశంసిస్తావు.
జవాబు:

  1. వానపామును ‘కర్షకమిత్రుడు’ అంటారు.
  2. నేలను గుల్లపరచి, నేలలోనికి గాలి ప్రవేశాన్ని కల్పిస్తుంది.
  3. వానపాము తమ సేంద్రియ వ్యర్థాల ద్వారా నేలను సారవంతం చేసి రైతుకు ఎరువులు వాడవలసిన పనిలేకుండా చేస్తాయి. రైతుకు అధిక పంట దిగుబడిని ఇస్తాయి.

ప్రశ్న 3.
రైతులు ఒకే విధమైన పంటనే పండిస్తే ఏమౌతుంది?
జవాబు:
a) రైతులు ఒకే విధమైన పంటను పండిస్తుంటే పంట దిగుబడి తగ్గిపోతుంది.
b) భూసారం తగ్గిపోతుంది.
c) పంటలను ఆశించే చీడపీడలు ఎక్కువ అవుతాయి.

ప్రశ్న 4.
క్రింది సమాచారం చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
సాధారణంగా రైతులు కృత్రిమంగా తయారుచేసిన ఎరువులు, కీటకనాశనులు ఉపయోగించి పంటపై వచ్చే కీటకాలను అదుపులో ఉంచుతారు. వీటితోపాటు కొన్ని సహజ కీటకనాశన పద్దతులను కూడా ఉపయోగిస్తారు.
1. పై సమాచారం వ్యవసాయంలోని ఏ అంశమును తెలియజేస్తుంది?
2. కృత్రిమంగా తయారుచేసిన కొన్ని ఎరువులను, కీటకనాశనులను పేర్కొనండి.
3. కృత్రిమ కీటకనాశనులకు, సహజ కీటకనాశనులకు గల తేడాలేమిటి?
4. ఏవైనా రెండు సహజ కీటకనాశన పద్దతులను గూర్చి రాయండి.
జవాబు:
1) పంటలను పరిరక్షించే పద్ధతులను పాటించడం

2) D.A.P సూపర్ ఫాస్ఫేట్ D.D.T, హెప్టాక్లోర్

3) కృత్రిమ కీటక నాశనులు విషపూరిత రసాయన పదార్థాలతో తయారు చేస్తారు. ఇవి “మిత్ర కీటకాలను” కూడా చంపివేస్తాయి. సహజ కీటక నాశనులు అంటే పంటలకు నష్టాన్ని కలిగించే అనేక కీటకాలను ఆహారంగా చేసుకొనే సాలెపురుగులు, క్రిసోపా, మిరిబ్స్, లేడీబర్డ్, బీటిల్, డ్రాగన్ఎ మొదలగునవి. ఇవి మిత్ర కీటకాలను నాశనం చేయవు. ఎటువంటి దుష్ఫలితాలను ఇవి పంటలపై చూపించవు.

4) ఎ) “బాసిల్లస్ తురింజెనెసిస్” వంటి బాక్టీరియాలు కొన్ని రకాల హానికారక కీటకాలను నాశనం చేస్తాయి.
బి) మిశ్రమ పంటల సాగు వలన కొన్ని రకాల కీటకాల నుండి పంటలను కాపాడుకోవచ్చు.
ఉదా : వరి సాగు తర్వాత మినుము లేక వేరుశనగ సాగుచేస్తే వరిలో వచ్చే “టుందొ” వైరసను అదుపులో ఉంచవచ్చు.

9th Class Biology 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 1 Mark Bits Questions and Answers

లక్ష్యాత్మక నియోజనము

1. పంట ఉత్పత్తి పెంచడానికి అవసరమయ్యే కారకము
A) నాటిన విత్తన రకం
B) నేల స్వభావం, లక్షణాలు
C) నీటి లభ్యత, ఎరువులు, పోషక పదార్థాల అందుబాటు
D) పై అన్నియు
జవాబు:
D) పై అన్నియు

2. ఆహార ఉత్పత్తిని ఈ విధంగా పెంచవచ్చు.
A) సాగుభూమి విస్తీర్ణం పెంచడం ద్వారా
B) ఎక్కువ దిగుబడి ఇచ్చు సంకర రకాల అభివృద్ధి ద్వారా
C) పంట మార్పిడి ద్వారా
D) పై అన్నియు
జవాబు:
D) పై అన్నియు

AP 9th Class Biology Important Questions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

3. పంట మార్పిడి దీనిని పరిరక్షిస్తుంది.
A) నేల సారాన్ని
B) ఎక్కువ దిగుబడినిచ్చే సంకర రకాలు
C) నేల యాజమాన్యము
D) పంట యాజమాన్యము
జవాబు:
A) నేల సారాన్ని

4. స్టార్ట్ అనునది
A) క్రొవ్వు
B) కార్బోహైడ్రేటు
C) ప్రోటీను
D) విటమిన్
జవాబు:
B) కార్బోహైడ్రేటు

5. 100 గ్రాముల నీరు, 200 గ్రాముల కార్బన్ డయాక్సెడ్‌తో చర్య జరిపి ఎన్ని గ్రాముల కార్బోహైడ్రేటును ఏర్పరుస్తుంది?
A) 280 గ్రాములు
B) 360 గ్రాములు
C) 180 గ్రాములు
D) 380 గ్రాములు
జవాబు:
C) 180 గ్రాములు

6. మొక్కలు విడుదల చేసే నీరు వీటి ద్వారా ఆవిరి అవుతుంది.
A) బాహ్యచర్మము
B) పత్రాంతర కణజాలం
C) పత్ర రంధ్రాలు
D) దారువు
జవాబు:
C) పత్ర రంధ్రాలు

7. ఈ పంటకు ఎక్కువ మొత్తంలో నీరు కావాలి.
A) వరి
B) మినుము
C) వేరుశనగ
D) సజ్జ
జవాబు:
A) వరి

8. నీటిని పరిరక్షించే నీటి పారుదల పద్ధతి
A) కాలువ నీటి వ్యవస్థ
B) చెరువు నీటి వ్యవస్థ
C) డ్రిప్ ఇరిగేషన్
D) ఏదీకాదు
జవాబు:
C) డ్రిప్ ఇరిగేషన్

9. ఈ క్రింది వాటిలో స్థూల పోషకము ఏది?
A) ఇనుము
B) నత్రజని
C) రాగి
D) మాంగనీసు
జవాబు:
B) నత్రజని

10. నేలకు పోషకాలను చేర్చేది
A) పంట మార్పిడి
B) సేంద్రియ ఎరువు
C) రసాయన ఎరువులు
D) అన్నియు
జవాబు:
D) అన్నియు

11. నేల నుండి అధిక మొత్తంలో పోషకాలను ఉపయోగించుకునేవి ……….
A) ప్రధాన ధాన్యాలు
B) చిరు ధాన్యాలు
C) దుంపలు
D) అన్నియు
జవాబు:
A) ప్రధాన ధాన్యాలు

12. చిక్కుడు జాతి పంట ఒక హెక్టారుకు అందించే నత్రజని
A) 150 నుండి 200 కి.గ్రా.
B) 50 నుండి 150 కి.గ్రా.
C) 100 నుండి 150 గ్రా.
D) 25 నుండి 100 కి.గ్రా.
జవాబు:
B) 50 నుండి 150 కి.గ్రా.

AP 9th Class Biology Important Questions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

13. నీలి ఆకుపచ్చ శైవల వర్గనమును ఈ పంటకు వినియోగిస్తారు.
A) బంగాళాదుంప పంట
B) ములగకాయ పంట
C) వేరుశనగ పంట
D) వరి పంట
జవాబు:
D) వరి పంట

14. పొలమును పరిశీలించి సరియైన పంటను పండించడానికి సలహాలిచ్చేది
A) వ్యవసాయ అధికారి
B) భూసార పరీక్షా కేంద్ర నిపుణుడు
C) A మరియు B
D) గ్రామ అభివృద్ధి అధికారి
జవాబు:
C) A మరియు B

15. పంచగవ్యలో ఉండే ముఖ్య పదార్థాలు
A) పాలు, పెరుగు
B) నెయ్యి, పేడ
C) ఆవు మూత్రం
D) పైవి అన్నియు
జవాబు:
B) నెయ్యి, పేడ

16. నేల ఎక్కువకాలం అధిక దిగుబడి ఇవ్వడం అనేది దీనిపై ఆధారపడి ఉంటుంది.
A) నేలలో పోషక పదార్థాల లభ్యత
B) నేల యొక్క సరియైన భౌతిక, రసాయన మరియు జీవ లక్షణాలు
C) A మరియు B
D) వర్షము
జవాబు:
B) నేల యొక్క సరియైన భౌతిక, రసాయన మరియు జీవ లక్షణాలు

17. సేంద్రీయ సేద్య విధానములో రైతు
A) సహజ ఎరువులను వాడతాడు.
B) సహజ కీటకనాశ పద్ధతులను అవలంబిస్తాడు
C) పంట మార్పిడి మరియు మిశ్రమ పంట విధానము పాటిస్తాడు
D) పై అన్నియు
జవాబు:
D) పై అన్నియు

18. యూరియాలో నత్రజని శాతం
A) 36%
B) 46%
C) 56%
D) 44%
జవాబు:
B) 46%

19. కీటకనాశనులు వీటిని సంహరించడానికి వాడతారు.
A) సూక్ష్మజీవులు
B) పురుగులు
C) కీటకాలు
D) శిలీంధ్రాలు
జవాబు:
C) కీటకాలు

20. మన రాష్ట్రంలో అధిక పరిమాణంలో క్రిమి సంహారక మందులను ఉపయోగించే జిల్లాలు
A) గుంటూరు
B) ప్రకాశం
C) నెల్లూరు
D) A మరియు C
జవాబు:
D) A మరియు C

21. మిత్ర కీటకమును గుర్తించుము.
A) సాలెపురుగు, డ్రాగన్ ప్లే
B) క్రిసోపా, మిరిబ్స్
C) లేడీ బర్డ్ బిడిల్
D) పై అన్నియు
జవాబు:
D) పై అన్నియు

22. కాండం తొలిచే పురుగు గుడ్లలో నివసించేది
A) బాసిల్లస్
B) ట్రాకోడర్మా
C) రైజోబియం
D) ఎజటోబాక్టర్
జవాబు:
B) ట్రాకోడర్మా

23. కీటకాలను నాశనం చేసే బాక్టీరియా
A) బాసిల్లస్ తురంజెనెసిస్
B) రైజోబియం
C) ఎజటోబాక్టర్
D) బాసిల్లస్ సూడోమోనాస్
జవాబు:
A) బాసిల్లస్ తురంజెనెసిస్

24. వరి సాగు చేసిన తరువాత మినుములను సాగు చేస్తే దీనిని అదుపులో ఉంచవచ్చు.
A) టుంగ్రోవైరస్
B) ధాన్యాన్ని తినే గొంగళిపురుగు
C) కాండం తొలుచు పురుగు
D) పైవి అన్నియు
జవాబు:
A) టుంగ్రోవైరస్

AP 9th Class Biology Important Questions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

25. నత్రజనిని స్థాపించు బాక్టీరియా
A) రైజోబియం
B) బాసిల్లస్
C) మైకోరైజా
D) పెన్సిలియమ్
జవాబు:
A) రైజోబియం

26. 600 Kgల ధాన్యాన్ని పండించటానికి అవసరమయ్యే నేల
A) 1.4 చ.కి.మీ.
B) 2.4 చ.కి.మీ.
C) 3.4 చ.కి.మీ.
D) 4.4 చ.కి.మీ.
జవాబు:
A) 1.4 చ.కి.మీ.

27. అధిక దిగుబడి సాధించటానికి వ్యవసాయదారులు ఉపయోగించు పద్ధతి
A) అధిక దిగుబడినిచ్చే వంగడాల అభివృద్ధి
B) అధిక దిగుబడినిచ్చే యాజమాన్య పద్ధతులు
C) పంటలను పరిరక్షించే పద్ధతులు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

28. పూలసాగునేమంటారు?
A) హార్టికల్చర్
B) ఫ్లోరీకల్చర్
C) ఎగ్రికల్చర్
D) ఓలరీకల్చర్
జవాబు:
B) ఫ్లోరీకల్చర్

29. ఒక మొక్క ఒక లీటర్ నీటిని శోషించుకుంటే అందులో కార్బోహైడ్రేడ్ల తయారీకి ఉపయోగపడేది.
A) 1 మి.లీ.
B) 10 మి.లీ.
C) 20 మి.లీ.
D) 50 మి.లీ.
జవాబు:
A) 1 మి.లీ.

30. ఈ క్రింది వానిలో తక్కువ నీరు ఉన్నచోట పండే పంట
A) వరి
B) మొక్కజొన్న
C) గోధుమ
D) చెరకు
జవాబు:
B) మొక్కజొన్న

31. బిందు సేద్యం ద్వారా
A) నీటి వృథా అరికట్టవచ్చు
B) పంట దిగుబడి పెరుగుతుంది
C) ఎరువుల వాడకం తక్కువ
D) పురుగులు ఆశించవు
జవాబు:
A) నీటి వృథా అరికట్టవచ్చు

32. ఈ క్రింది వానిలో సూక్ష్మ పోషకం
A) నత్రజని
B) ఇనుము
C) భాస్వరం
D) పొటాషియం
జవాబు:
B) ఇనుము

33. ఈ క్రింది వానిలో స్థూల పోషకం
A) మాంగనీసు
B) భాస్వరం
C) బోరాన్
D) జింక్
జవాబు:
B) భాస్వరం

34. పంట మార్పిడికి ఉపయోగించేవి ఏకుటుంబపు మొక్కలు?
A) మీలియేసి
B) విలియేసి
C) లెగ్యుమినేసి
D) ఆస్టరేసి
జవాబు:
C) లెగ్యుమినేసి

AP 9th Class Biology Important Questions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

35. క్రింది వానిలో మిశ్రమ పంటకు సంబంధించి సత్య వాక్యం
A) పప్పుధాన్యాలు, గింజ ధాన్యాలు కలిపి పండిస్తారు.
B) స్వల్పకాలికాలు, దీర్ఘకాలికాలు కలిపి పండిస్తారు.
C) మామూలు పంటలు, ఆరుతడి పంటలు కలిపి పండిస్తారు.
D) పండ్లతోటల్లో కందులు, మినుములు పండిస్తారు.
జవాబు:
C) మామూలు పంటలు, ఆరుతడి పంటలు కలిపి పండిస్తారు.

36. క్రింది వానిలో అధిక సాంద్రత గల జీవ ఎరువు
A) జట్రోపా విత్తనం పొడి
B) వేప విత్తనం పొడి,
C) కొబ్బరి విత్తనం పొడి
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

37. స్థూల సేంద్రీయ ఎరువు
A) జంతు విసర్జకాలు
B) క్రుళ్ళిన పదార్థాలు
C) చెత్త
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

38. పచ్చిరొట్ట ఎరువు కానిది
A) మినుము
B) పెసర
C) పిల్లి పెసర
D) వెంపలి
జవాబు:
A) మినుము

39. ఒక హెక్టారులో 8 నుండి 25 టన్నుల పచ్చిరొట్ట ఎరువును పండించి నేలలో కలియ దున్నినపుడు ఎంత నేలలోకి పునరుద్ధరింపబడుతుంది?
A) 50 – 60 కేజీలు
B) 60 – 80 కేజీలు
C) 70 – 90 కేజీలు
D) 50 – 75 కేజీలు
జవాబు:
C) 70 – 90 కేజీలు

40. వర్మీకంపోస్టు బెడ్ లోపల ఉండకూడనివి
A) పచ్చిపేడ
B) గాజుముక్కలు
C) ఇనుపముక్కలు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

41. క్రింది వానిలో ఫాస్ఫరసను కరిగించే బాక్టీరియా
A) రైజోబియం
B) అజటోబాక్టర్
C) అజోస్పైరిల్లమ్
D) బాసిల్లస్
జవాబు:
D) బాసిల్లస్

42. కీటకాలు లేక పరాగ సంపర్కానికి సమస్య వచ్చిన పంట
A) వరి
B) కంది
C) వేరుశనగ
D) ప్రొద్దుతిరుగుడు
జవాబు:
D) ప్రొద్దుతిరుగుడు

43. ఈ క్రింది వానిలో మిత్రకీటకం కానిది
A) మిడత
B) సాలెపురుగు
C) గొల్లభామ
D) కందిరీగ
జవాబు:
A) మిడత

44. కీటకాలను నాశనం చేసే బాక్టీరియా
A) బాసిల్లస్ థురింజెనిసిస్
B) రైజోబియం
C) సూడోమోనాస్
D) అజోస్పెరిల్లమ్
జవాబు:
A) బాసిల్లస్ థురింజెనిసిస్

45. వరి సాగు చేసిన తర్వాత ఏ పంటను పండించటం ద్వారా వరిలో వచ్చే టుంగ్రో వైరసీని అదుపులో ఉంచవచ్చు?
A) మినుములు
B) శనగ
C) A & B
D) పైవేవీ కావు
జవాబు:
C) A & B

AP 9th Class Biology Important Questions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

46. ప్రత్తి పండించిన తర్వాత ఈ పంటలు పండిస్తే ధాన్యాన్ని తినే గొంగళి పురుగుల్ని అదుపు చేస్తాయి.
A) పెసర, పిల్లిపెసర
B) జొన్న, మొక్కజొన్న
C) జనుము, నువ్వులు
D) మొక్కజొన్న, నువ్వులు
జవాబు:
D) మొక్కజొన్న, నువ్వులు

47. కందులు పండించిన తర్వాత ఈ పంటలు పండించటం ద్వారా కాండం తొలుచు పురుగు మరియు ఎండు తెగులును నివారించవచ్చు.
A) పెసర, పిల్లి పెసర
B) జొన్న, మొక్కజొన్న
C) జనుము, నువ్వులు
D) మొక్కజొన్న, నువ్వులు
జవాబు:
B) జొన్న, మొక్కజొన్న

48. ఒక పంట పండించటం ద్వారా రెండవ పంటలో తెగుళ్ళను నివారిస్తే అటువంటి పంటలను ఏమంటారు?
A) ఆరుతడి పంటలు
B) ఆకర్షక పంటలు
C) వికర్షక పంటలు
D) లింగాకర్షక పంటలు
జవాబు:
B) ఆకర్షక పంటలు

49. విచక్షణారహితంగా ఎరువులు వాడటం వలన
A) నేల కలుషితమవుతుంది.
B) నీరు కలుషితమవుతుంది.
C) జీవవైవిధ్యం దెబ్బతింటుంది.
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

50. విత్తనాలు లేని సంకర జాతి వంగడాలు ఏ మొక్కల్లో ఉత్పత్తి చేసారు?
A) ద్రాక్ష
B) బొప్పాయి
C) దానిమ్మ
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

51. సంకరణం ద్వారా వచ్చే మొక్కల్లో ఉండనిది
A) అధిక దిగుబడినిస్తాయి.
B) వ్యాధులకు ప్రతిరోధకత కల్గి ఉంటాయి.
C) ఎక్కువ నీటితో పండుతాయి.
D) ఆమ్ల నేలల్లో కూడా పండుతాయి.
జవాబు:
C) ఎక్కువ నీటితో పండుతాయి.

52. 1950 నాటికి మనదేశంలో ఉన్న వరి వంగడాల సంఖ్య
A) 225
B) 335
C) 445
D) 555
జవాబు:
C) 445

53. బంగాళదుంప, టమాట రెండింటిని సంకరం చేయటం ద్వారా వచ్చినటువంటి క్రొత్త పంట
A) టొటాటో
B) పొమాటో
C) బటాటా
D) వాటి మధ్య సంకరం జరగదు
జవాబు:
B) పొమాటో

54. GMS అనగా
A) జెనరల్లి మాడిఫైడ్ సీడ్స్
B) జెనెటికల్లీ మాడిఫైడ్ సీడ్స్
C) జెనెటిక్ మెటీరియల్ ఆఫ్ సీడ్స్
D) జెనెటిక్ మాటర్ ఆఫ్ సీడ్స్
జవాబు:
B) జెనెటికల్లీ మాడిఫైడ్ సీడ్స్

55. శ్రీవరి పద్దతిలో SRI అనగా
A) సిస్టమాటిక్ రైస్ ఇంటిగ్రేషన్
B) సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్
C) సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంప్రూవ్మెంట్
D) సిస్టమ్ ఆఫ్ రైస్ ఇరిగేషన్
జవాబు:
B) సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్

56. సాధారణ పదతిలో ఎకరాకు 30 కిలోల విత్తనం నాటటానికి అవసరమయితే శ్రీవరి పద్దతిలో, ఎంత అవసరమవుతుంది?
A) 2 కిలోలు
B) 4 కిలోలు
C) 20 కిలోలు
D) 15 కిలోలు
జవాబు:
A) 2 కిలోలు

AP 9th Class Biology Important Questions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

57. సాధారణ వరి సేద్యంలో ఒక కిలో వరిధాన్యం పండించటానికి 5,000 లీటర్లు నీరు అవసరమయితే శ్రీ వరి పద్దతిలో అవసరమయ్యే నీరు
A) 1000 లీటర్లు
B) 1500 లీటర్లు
C) 2000 లీటర్లు
D) 2,500 లీటర్లు
జవాబు:
D) 2,500 లీటర్లు

58. ఈ క్రింది వానిలో సరిగా జతపరచబడని జతను ఎన్నుకోండి.
1) రబీ పంట – ఆవాలు
2) ఖరీఫ్ పంట – ప్రత్తి
3) మిశ్రమ పంట – చెరకు
A) 1,2
B) 2, 3
C) 1 మాత్రమే
D) 3 మాత్రమే
జవాబు:
D) 3 మాత్రమే

59. ఈ క్రింది వానిలో సరిగా జతపరచబడని జతను ఎన్నుకోండి.
1) డ్రాగన్ ఫై – సహజ కీటక నాశనులు
2) కొబ్బరి నీరు – పంచగవ్వ
3) కులీ – మిశ్రమపంట
A) 1, 2
B) 2, 3
C) 1 మాత్రమే
D) 3మాత్రమే
జవాబు:
D) 3మాత్రమే

60. ఈ క్రింది వానిలో సరిగా జతపరచబడని జతను ఎన్నుకోండి.
1) బాక్టీరియా – రైజోబియం
2) ఆల్గే – నీలి ఆకుపచ్చ శైవలాలు
3) ఫంగై – సూడోమోనాస్
A) 1, 2
B) 2, 3
C) 2 మాత్రమే
D) 3 మాత్రమే
జవాబు:
D) 3 మాత్రమే

61. ఈ క్రింది వానిలో సరిగా జతపరచబడని జతను ఎన్నుకోండి.
1) వరి – వాంజా
2) పొగాకు – గడ్డి చామంతి
3) వేరుశనగ – పొగాకు మల్లె
A) 1 మాత్రమే
B) 1,2
C) 2,3
D) 3 మాత్రమే
జవాబు:
C) 2,3

పంట రకం పంటపై పెరిగే కలుపు మొక్కలు
వరి గరిక, తుంగ, బుడగ తమ్మ, పొన్నగంటి
వేరుశనగ గురంగుర, గరిక, తుంగ, తుత్తురి బెండ, వెన్న వెదురు, కుక్కవామింట, తుమ్మి, పావలికూర, బాలరక్కిస.
మినుములు గరిక, తుంగ, తుత్తురి బెండ, వెన్న వెదురు, సాల్వీనియా మొలస్టా, పచ్చబొట్లు, బంగారు తీగ.
మొక్కజొన్న పచ్చబొట్లు, సొలానమ్ నైగ్రమ్, గరిక, తుంగ
పెసలు ఉడలు, గరిక, తుంగ, బాలరక్కొస, పావలికూర

పై పట్టికను పరిశీలించి క్రింది ప్రశ్నకు సమాధానం రాయండి.

62. అన్ని పంటలలో పెరిగే కలుపు మొక్క
a) గరిక b) సార్వీనియా మొలస్కా c) తుంగ d) పావలికూర
A) a, b మరియు C
B) a, c మరియు d
C) bమరియు d మాత్రమే
D) a మరియు c మాత్రమే
జవాబు:
D) a మరియు c మాత్రమే

63. క్రింది పటాలలో మిశ్రమ పంటను సూచించే చిత్రం ఏది?
AP 9th Class Biology Important Questions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 4
A) a, b
B) b, c
C) c, d
D) a, b, c, d
జవాబు:
A) a, b

64. ఈ క్రిందివానిలో సరిగా గుర్తించిన జతను ఎన్నుకోండి.
1) నైట్రోజన్ ( ) a) వేళ్ళు నేల లోనికి చొచ్చుకొని పోవడానికి
2) ఫాస్ఫరస్ ( ) b) క్రిమి కీటకాల నుండి రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం
3) పొటాషియం ( ) c) పుష్పాలు వేగంగా రావడం
A) 1 – a, 2 – c, 3 – b
B) 1 – c, 2 – b, 3 – a
C) 1 – a, 2 – b, 3 – c
D) 1 – c, 2 – a, 3 – b
జవాబు:
D) 1 – c, 2 – a, 3 – b

AP 9th Class Biology Important Questions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

65. ఈ క్రిందివానిలో సరిగా గుర్తించిన జతను ఎన్నుకోండి.
1) అజటో బాక్టర్ ( ) a) G.M. విత్తనం
2) B.T ప్రత్తి ( ) b) మిశ్రమ పంట
3) మిర్చి పంటలో పొద్దు తిరుగుడు పువ్వు ( ) c) సేంద్రీయ ఎరువు
A) 1 – c, 2 – b, 3 – a
B) 1 – a, 2 – c, 3 – b
C) 1 – a, 2 – b, 3 – c
D) 1 – c, 2 – a, 3 – b
జవాబు:
D) 1 – c, 2 – a, 3 – b

66. బాసిల్లస్ తురింజెనిసిస్ అనునది
A) పంటలను నాశనం చేస్తుంది.
B) కలుపు నాశనం చేస్తుంది.
C) చీడలను నాశనం చేస్తుంది.
D) మొక్కలకు నత్రజనిని సరఫరా చేస్తుంది
జవాబు:
C) చీడలను నాశనం చేస్తుంది.

67. స్థూల జీవ ఎరువులకు ఉదా||
A) జంతు సంబంధ విసర్జక పదార్థాలు
B) ప్లాస్టిక్ వ్యర్థాలు
C) జట్రోఫా విత్తన పొడి
D) కంపోస్ట్
జవాబు:
A or D

68. బంతిపూల చెట్లను మిర్చి పంటలో సాగు చేయడం
A) తెగుళ్ళ నివారణకు జీవనియంత్రణ
B) పంట మార్పిడి
C) సహజీవన పద్దతి
D) ఏదీకాదు
జవాబు:
A) తెగుళ్ళ నివారణకు జీవనియంత్రణ

69. రైతులకు మిత్రులైన కీటకములు
A) సాలెపురుగు
B) డ్రాగన్ ఫ్లె
C) మిరియడ్లు
D) పైవన్ని
జవాబు:
D) పైవన్ని

70. వరి, పొగాకు వంటి పంటల్లో కనిపించే లార్వాలను గుడ్ల దశలోనే నాశనం చేసే బ్యాక్టీరియా
A) లాక్టోబాసిల్లస్
B) బాసిల్లస్ తురంజియెన్సిస్
C) రైజోబియం
D) అజటోబాక్టర్
జవాబు:
B) బాసిల్లస్ తురంజియెన్సిస్

71. కింది వాటిలో తక్కువ మోతాదులో మొక్కలకు అవసరమయ్యేవి
A) నత్రజని, పొటాషియం
B) పొటాషియం , భాస్వరం
C) బోరాన్, నత్రజని
D) బోరాన్, జింక్
జవాబు:
D) బోరాన్, జింక్

72. ఇతర కీటకాలను ఆహారంగా తీసుకొని రైతుకు సహాయపడే కీటకాలు
A) పరభక్షకులు
B) మిత్రకీటకాలు
C) కీటకనాశనులు
D) ఆకర్షక కీటకాలు
జవాబు:
B) మిత్రకీటకాలు

73. పంచగవ్య తయారుచేయడానికి ఉపయోగపడేవి
1) ఆవుపేడ, ఆవునెయ్యి
2) కొబ్బరినీరు, కల్లు
3) చెరుకురసం
4) ఆవుమూత్రం
A) 1 మాత్రమే
B) 2, 3
C) 3, 4
D) పైవన్నీ
జవాబు:
C) 3, 4

AP 9th Class Biology Important Questions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

74. జీవసేద్యానికి సరైన సూచన
A) జీవ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించుట
B) వర్మీకంపోస్ట్ ఉపయోగించుటకు నిరుత్సాహపర్చుట
C) ఎక్కువ మోతాదులో యూరియా వాడుట.
D) ఎక్కువ మోతాదులో క్రిమిసంహారక మందులు వాడుట
జవాబు:
A) జీవ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించుట

పునరాలోచన

AP 9th Class Biology Important Questions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 5

AP 9th Class Biology Important Questions 7th Lesson జంతువులలో ప్రవర్తన

These AP 9th Biology Important Questions and Answers 7th Lesson జంతువులలో ప్రవర్తన will help students prepare well for the exams.

AP Board 9th Class Biology 7th Lesson Important Questions and Answers జంతువులలో ప్రవర్తన

9th Class Biology 7th Lesson జంతువులలో ప్రవర్తన 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
జంతువుల ప్రవర్తనను శాస్త్రీయంగా ఎందుకు అధ్యయనం చేయాలి?
జవాబు:
జంతువులు తమలో తాము, ఇతర జీవులతో పర్యావరణంతో జరిపే పరస్పర చర్యలను అర్థం చేసుకోవడానికి జంతు ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేయాలి.

ప్రశ్న 2.
జంతువులలో బాహ్య, అంతర్గత ప్రచోదనాలుగా పనిచేసేవి ఏవి?
జవాబు:
జంతువులలో ఇతర జంతువుల నుంచి ఆపద, ధ్వని, వాసన లేక తన చుట్టూ ఉన్న వాతావరణం మొదలైనవి బాహ్య ప్రచోదనలు (External Stimuli) గా పని చేస్తాయి. ఆకలి, భయం మొదలైనవి అంతర్గత ప్రచోదనాలు (Internal Stimuli) గా పని చేస్తాయి.

ప్రశ్న 3.
జంతువులలో ఇప్పటి వరకు పరిశోధించిన ప్రవర్తనారీతులు ఏవి?
జవాబు:
జంతువులలో ఇప్పటి వరకు పరిశోధించిన ప్రవర్తనారీతులు :

  1. సహజాత ప్రవృత్తి (Instinct)
  2. అనుసరణ (Imprinting)
  3. నిబంధన (Conditioning)
  4. అనుకరణ (Imitation)

ప్రశ్న 4.
సహజాత ప్రవృత్తి అంటే ఏమిటి? ఉదాహరణాలు ఇవ్వండి.
జవాబు:
పుట్టుకతో వచ్చే ప్రవర్తనలను సహజాత ప్రవృత్తి లేదా సహజాత లక్షణాలు అంటారు.

ప్రశ్న 5.
నిబంధన అంటే ఏమిటి?
జవాబు:
సహజంగా కాకుండా కృత్రిమంగా ఒక ఉద్దీపనకు ప్రతిచర్య చూపే ఒక రకమైన ప్రవర్తనను ‘నిబంధన’ అంటారు. ఇది నేర్చుకోవలసిన ప్రవర్తన. ఇది పుట్టుకతో రాదు.

AP 9th Class Biology Important Questions 7th Lesson జంతువులలో ప్రవర్తన

ప్రశ్న 6.
అనుకరణ అంటే ఏమిటి?
జవాబు:
ఒక జంతువు యొక్క ప్రవర్తన వేరొక జంతువు ప్రదర్శిస్తే లేదా కాపీ చేస్తే అలాంటి ప్రవర్తనను ‘అనుకరణ’ అంటారు.

ప్రశ్న 7.
మానవుని ప్రవర్తన ఇతర జంతువుల కన్నా ఎందుకు సంక్లిష్టంగా ఉంటుంది?
జవాబు:
మానవుల ప్రవర్తన ఇతర జంతువులలో కన్నా సంక్లిష్టంగా ఉంటుంది. ఎందుకంటే మానవులు ఇతర జంతువుల కన్నా తెలివైనవారు. ఆలోచించగల శక్తి గలిగినవారు. మానవులకు వాళ్ళ గురించి వాళ్ళకు బాగా తెలుసు.

ప్రశ్న 8.
జంతువులు తమ శత్రువుల నుండి రక్షించుకోవడానికి చూపే భావాలు ఏవి?
జవాబు:
పాములు బుస కొట్టడం, కుక్కలు అరవడం (మొరగడం), ముళ్ళపంది దాని గట్టి రోమాలు (ముళ్ళు)ను నిక్కబొడుచుకునేలా చేయడం, టాస్మేనియన్ డెవిల్ అనే జంతువు శరీరం నుండి దుర్వాసన రావడం ఇవన్నీ కూడా ఆయా జంతువులు తమ శత్రువుల నుండి రక్షించుకోవడానికి చూపే భావాలు.

ప్రశ్న 9.
‘ఇథాలజీ’ అంటే ఏమిటి? దాని ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?
జవాబు:
జంతువుల ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేయటాన్ని ఇథాలజీ (Ethology) అంటారు. ఇది జీవశాస్త్రంలో భాగం. ఇథాలజీ ముఖ్య ఉద్దేశ్యం సహజ వాతావరణంలో జంతువుల ప్రవర్తనను పరిశీలించడం.

ప్రశ్న 10.
జంతువుల ప్రవర్తనపై పరిశోధనలకు నోబుల్ పురస్కారం లభించినవారు ఎవరు?
జవాబు:
1930లో డచ్ జీవశాస్త్రవేత్త ‘నికోలస్ టింబర్ జన్’ జంతువులపై పరిశోధనలు ఆస్ట్రియా జీవశాస్త్రవేత్త ‘కొనార్డ్ లారెంజ్’ మరియు కార్లవాన్ ఫ్రితో కలసి నిర్వహించారు. 1973లో జంతువుల ప్రవర్తనపై పరిశోధనలకు గాను వీరికి నోబుల్ పురస్కారం లభించింది.

9th Class Biology 7th Lesson జంతువులలో ప్రవర్తన 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
“గుర్తు కట్టడం” అంటే ఏమిటో వివరించండి.
జవాబు:

  1. పక్షులలాగానే కొన్ని జంతువులు కూడా ఆహారం కోసం, గూడు కోసం చాలా దూరం వలస పోతాయి.
  2. ఈ వలస జంతువులను గుర్తించడానికి వాటికి అన్వేషణ పరికరాలు కడతారు.
  3. ఈ విధమైన గుర్తింపు సూచికలు జంతువులు ప్రయాణించే మార్గం అనుసరించడానికి శాస్త్రవేత్తలకు ఉపయోగపడతాయి.

AP 9th Class Biology Important Questions 7th Lesson జంతువులలో ప్రవర్తన

ప్రశ్న 2.
స్క్రజ్ ఆహారాన్ని దాచే విధమును రాయండి.
జవాబు:
AP 9th Class Biology Important Questions 7th Lesson జంతువులలో ప్రవర్తన 1

  1. స్క్రజ్ అనే పక్షి దాని ఆహారం మరొక పక్షి సమక్షంలో దాచిపెడుతుంది.
  2. కొద్దిసేపటి తరువాత ఆ పక్షి ఒక పథకం ప్రకారం దానిని దొంగిలిస్తుంది.
  3. ఇది ప్రయోగపూర్వకముగా నిరూపించబడింది.

ప్రశ్న 3.
ప్రతీకార చర్యలకు రెండు ఉదాహరణలివ్వండి.
జవాబు:

  1. ఏదైనా వేడివస్తువును లేదా మొనదేలిన దానిని తాకినప్పుడు చేతిని వెనక్కి తీసుకోవడం.
  2. కంటికి ఆపద కలిగినట్లయితే కన్ను వెంటనే మూసుకోవడం.
  3. కంటికి ఎక్కువ కాంతి తగిలినప్పుడు తారక కుదించుకుపోవడం.
  4. ఏదైనా ముక్కులోనికి ప్రవేశించినపుడు చీదడం.
  5. దుమ్ముని పీల్చినపుడు దగ్గడం మొదలైనవి.

9th Class Biology 7th Lesson జంతువులలో ప్రవర్తన 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
జంతువులలో ప్రవర్తన అంటే ఏమిటి? అది ఏమి తెలియచేస్తుంది?
జవాబు:

  1. జంతువుల ప్రవర్తన అనేది జంతువులు ఒకదానితో ఒకటి, ఇతర జంతువులతో, పరిసరాలతో ఎలా ప్రవర్తిస్తాయో తెలిపే శాస్త్రీయ అధ్యయనం.
  2. ఇది జంతువులు తమ భౌతిక పరిసరాలతో, అదే విధంగా ఇతర జంతువులతో ఎలా సంబంధాలు ఏర్పరచుకుంటున్నాయో తెలుపుతుంది.
  3. జంతువులు ఆవాసాలను, వనరులను ఎలా వెతుకుతాయి, సంరక్షిస్తాయి, శత్రువుల నుండి తమను తాము ఎలా కాపాడుకుంటాయి, ప్రత్యుత్పత్తి కొరకు భిన్న లింగ జీవిని ఎలా ఎన్నుకుంటాయి, తమ సంతతిని ఎలా కాపాడు కుంటాయనేవి కూడా వాటి ప్రవర్తనను తెలియచేస్తాయి.

ప్రశ్న 2.
ఇవాన్ పాషాప్ నిబంధనపై జరిపిన పరిశోధనను రాయుము.
జవాబు:
AP 9th Class Biology Important Questions 7th Lesson జంతువులలో ప్రవర్తన 2

  1. ఇవానా వోవ్ అనే రష్యన్ శాస్త్రవేత్త నిబంధనపై అనేక పరిశోధనలు చేశాడు.
  2. అతను కుక్కకు ఆహారం చూపించిన వెంటనే అది లాలాజలం స్రవించడం గమనించాడు. ఇది ఒక సహజ ప్రతిస్పందన.
  3. ఆహారం తీసుకొచ్చే వ్యక్తిని చూసినప్పుడు కూడా కుక్క నోటిలో లాలాజలం స్రవించడం పావ్లోవ్ గమనించాడు.
  4. వ్యక్తి ఆహారం తీసుకురానప్పటికీ కుక్క నోటిలో లాలాజలం స్రవించడం గమనించాడు.
  5. ఆహారంతో పాటు ఒక గంట శబ్దాన్ని వినిపించి ప్రయోగాలు చేశాడు.
  6. గంట మోగినప్పుడు ఆహారం పెట్టడం అలవాటు చేశాడు.
  7. ఆహారం పెట్టకపోయినా గంట శబ్దం వినిపించగానే కుక్క నోటినుండి లాలాజలం స్రవించడం మొదలైంది.
  8. గంట మోగిన వెంటనే లాలాజలం స్రవించడం ఒక నిబంధన. లాలాజలం స్రవించడం ఆ నిబంధనకి ప్రతిచర్య అయితే ఆ ప్రతిచర్యను నిబంధన సహిత ప్రతిచర్య అంటారు.

ప్రశ్న 3.
మానవ ప్రవర్తనలో అనుకరణ వలన లాభమేమిటి? నష్టమేమిటి?
జవాబు:

  1. అనుకరణ కొత్త విషయాలు నేర్చుకోవడంలో, పాఠ్యాంశాలలో మెలకువలు నేర్చుకోవడంలో, ఆటలో నైపుణ్యం పొందడంలో ఉపయోగపడుతుంది.
  2. స్నేహితులతో జత కట్టడానికి కౌమార దశలో ఉన్న పిల్లలు పొగ తాగడం, మద్యం సేవించడం లేక మాదక ద్రవ్యాలు వాడడం వంటి దురలవాట్లకు బానిసలవుతారు. ఇది ఆరోగ్యానికి ప్రమాదకరం. ఇవి అనుకరణ వలన కలిగే నష్టాలు.

AP 9th Class Biology Important Questions 7th Lesson జంతువులలో ప్రవర్తన

ప్రశ్న 4.
ప్రకటన రంగం వారు నిబంధన సహాయంతో ఒక వ్యక్తి ఆచరణలో మార్పు ఏ విధంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తారు?
జవాబు:

  1. ప్రకటన రంగంవారు నిబంధనను ఉపయోగించడంలో నిపుణులు.
  2. తమ తమ ఉత్పత్తులను విక్రయించడానికి వాళ్ళు ఆకర్షణీయమైన ఉద్వేగపూరిత చిత్రాలను వినియోగించుకుంటుంటారు.
  3. సినీ ప్రముఖులు, ప్రముఖ క్రీడాకారులతో తమ ఉత్పత్తుల గురించి ప్రచారం చేయిస్తారు.
  4. ఆకర్షణీయమైన ఛాయాచిత్రాలను ఉపయోగించి వినియోగదారుడిని ఆ ఉత్పత్తులను వాడేలా నిబంధన కలుగచేస్తారు.
  5. ప్రజలు ఆ ఉత్పత్తుల వైపు ఆకర్షితులౌతుంటారు. వాటిని కొని వాడుతుంటారు.

ప్రశ్న 5.
ఉడతలు ఆహారాన్ని దాచే విధానాన్ని వివరించండి.
జవాబు:
AP 9th Class Biology Important Questions 7th Lesson జంతువులలో ప్రవర్తన 3

  1. ఉడత ఆహారాన్ని అమితాశక్తి కలిగించే రీతిలో దాచిపెడుతుంది.
  2. అవి ఎప్పుడూ వాటి ఆహారాన్ని ఎవరో దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారు అనే రీతిలో ప్రవర్తిస్తాయి.
  3. వేరే వాటిని పక్కదారి పట్టించడానికి చాలా చోట్ల నేలలో రంధ్రాలు చేస్తాయి.
  4. వాటిని ఆకులతో, ఇతర పదార్థాలతో కప్పుతాయి. నిజానికి చాలా రంధ్రాలలో ఆహారం ఉండదు.
  5. ఈ విధంగా ఉడతలు మిగతా జీవులను ఆ రంధ్రాలలో ఆహారం ఉందని నమ్మేలా చేస్తాయి.

ప్రశ్న 6.
ఉత్తర అమెరికాలో నివసించే బీవర్ క్షీరదం గురించి రాయండి.
జవాబు:
AP 9th Class Biology Important Questions 7th Lesson జంతువులలో ప్రవర్తన 4

  1. బీవర్ క్షీరదం నీటి ప్రవాహానికి అడ్డంగా ఆనకట్ట నిర్మిస్తుంది.
  2. అతి పెద్ద పెద్ద చెట్లను సైతం తన పదునైన పళ్ళతో కొరికి ప్రవాహానికి అడ్డంగా వేస్తుంది.
  3. వీటి సహాయంతో బీవర్ నాలుగు అడుగుల గోడను నిర్మిస్తుంది.
  4. చెట్ల కొమ్మలతో పాటు రాళ్ళను ఉపయోగించి అడ్డుగోడ కట్టి నీటిని నిల్వచేస్తుంది.
  5. దానిలో తన కుటుంబంతో కలిసి నివసిస్తుంది.

ప్రశ్న 7.
కందిరీగ గూడు ఎలా కడుతుంది? ఆహార సేకరణ ఎలా చేస్తుంది?
జవాబు:
AP 9th Class Biology Important Questions 7th Lesson జంతువులలో ప్రవర్తన 5

  1. తెలివైన కందిరీగ తన భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇంటిని నిర్మించుకుంటుంది. ,
  2. బురద మట్టిని ఉపయోగించి గోడలపైన గూడు కట్టుకుంటుంది.
  3. తరువాత ఆహారాన్ని వెదుకుతుంది.
  4. ఆహారాలు ముఖ్యంగా లార్వాలు కనిపించగానే వాటిని కుట్టి విషాన్ని ఎక్కిస్తుంది.
  5. దానిని సేకరించి, తయారుచేసుకున్న గూటిలో పెడుతుంది.
  6. ఈ ఆహారంపైనే కందిరీగలు గుడ్లు పెడతాయి.
  7. ఇది గుడ్ల నుండి ఏర్పడే కందిరీగల లార్వాలకు ఆహారంగా ఉపయోగపడుతుంది.

ప్రశ్న 8.
“డాల్ఫిన్లకు తార్కికంగా ఆలోచించే శక్తి ఉంటుంది” అని ప్రయోగ పూర్వకంగా నిరూపించినది ఎవరు? ఆయన పరిశోధనలేవి?
జవాబు:
AP 9th Class Biology Important Questions 7th Lesson జంతువులలో ప్రవర్తన 6

  1. డాల్ఫిన్లకు తార్కికంగా ఆలోచించే శక్తి ఉంటుందని హెర్మన్ ప్రయోగపూర్వకంగా నిరూపించాడు.
  2. హెర్మన్ నాలుగు బాటిల్ నోస్ డాల్ఫిన్లపై అధ్యయనం చేశాడు.
  3. ఈ పరిశోధనలు హవాయి ద్వీపంలోని “కవలో బేసిన్ మామల్ లాబొరేటరీ”లో జరిపాడు.
  4. నాలుగు డాల్ఫిన్లకు అక్కికోమాయ్, ఫీనిక్స్, అలెన్, హిప్పో అని పేర్లు పెట్టాడు.
  5. డాల్ఫిన్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లయితే అవి వాటి పేర్లను గుర్తించు కుంటాయని, సంక్లిష్ట సంకేత భాషకు సమాధానం ఇస్తాయని నిరూపించాడు.
  6. ఉదాహరణకు మూసిన పిడికిలిని చూపించగానే తొట్టి అని, ఎత్తిన చేతులు చూపించగానే బంతి అని, ఎత్తిన ఒక చెయ్యి చూపించగానే తీసుకురమ్మని సంజ్ఞలు ఇచ్చి శిక్షణ ఇస్తే డాల్ఫిన్లు అన్నింటిని కలిపి కూడా అర్థం చేసుకున్నాయి.
  7. ఈ సంజ్ఞలు అన్నీ సవ్యక్రమంలో కలిపి చేయగానే డాల్ఫిన్లు బంతిని తొట్టె నుండి తీసుకువచ్చాయి. సంజ్ఞలు అన్నీ వ్యతిరేకదిశలో చేస్తే బంతిని తొట్టిలోకి నెట్టివేశాయి.
  8. ఏదేని డాల్ఫినను ప్రత్యేక ఈలతో పిలిస్తే అన్ని డాల్ఫిన్లు దానివైపు చూసేవి, ఏ డాల్ఫినను పిలిస్తే అదే డాల్ఫిన్ దగ్గరకు వచ్చేది.

ప్రశ్న 9.
అలెక్స్ అనే బూడిదరంగు ఆఫ్రికా చిలుక యొక్క ప్రవర్తనను వివరించండి.
జవాబు:
AP 9th Class Biology Important Questions 7th Lesson జంతువులలో ప్రవర్తన 7

  1. 1977లో ఇర్విన్ పెప్పర్ బర్గ్ అలెక్స్ అను ఒక చిలుకను తెచ్చి దానికి శిక్షణ ఇచ్చాడు. నెమ్మదిగా దానికి 100 పదాలు నేర్పాడు.
  2. పదాలు ఉపయోగించి సొంతంగా వాక్యాలు తయారుచేయడం నేర్పాడు.
  3. కొన్ని రోజుల తరువాత అలెక్సకు పసుపురంగు గిన్నె మరియు పసుపుపచ్చ చిప్ప చూపిస్తే ఆ రెండింటి మధ్య భేదాలు, చిన్న చిన్న పోలికలు గుర్తించగలిగింది.
  4. ఇతర చిలకల గుంపునకు శిక్షణ ఇచ్చింది.
  5. ఆపిలను బానరీ అని పిలిచేది. ఎందుకంటే అది అరటిలాగా రుచి, చెర్రీలాగా రంగుతో కనిపించేది. ఈ రకంగా రెండింటిని కలిపి పేరు పెట్టడం అలెక్స్ సృజనాత్మకతకు ప్రతీక.
  6. అలెక్స్ చనిపోయేటప్పటికి 7వ ఎక్కం దాకా నేర్చుకుంది.

9th Class Biology 7th Lesson జంతువులలో ప్రవర్తన Important Questions and Answers

ప్రశ్న 1.
ఏవైనా రెండు ఉదాహరణల ద్వారా జీవుల్లో ప్రవర్తన అనుకూలనాలు ఎలా వుంటాయో తెలపంది.
జవాబు:

  1. పక్షులు గూళ్ళు కట్టుకోవడం, సంతానోత్పత్తి కోసం భిన్న లింగజీవిని ఎంచుకోవడం, రక్షణ కొరకు సమూహాలు ఏర్పాటు చేసుకోవడం.
  2. ఉత్తర అమెరికాలో నివశించే బీవర్ క్షీరదము నీటి ప్రవాహానికి అడ్డంగా చెట్టుకొమ్మల సాయంతో ఆనకట్టను నిర్మించి, ఆ నిలిచిన నీటిలో చేపలను వేటాడుతూ తన కుటుంబంతో జీవిస్తుంది.

AP 9th Class Biology Important Questions 7th Lesson జంతువులలో ప్రవర్తన

ప్రశ్న 2.
జంతువులలో ప్రవర్తనలను ఎన్ని రకాలుగా పరిశీలించవచ్చు? ఏదైనా ఒక ప్రవర్తనను ఉదాహరణలతో వివరించండి.
జవాబు:

  1. జంతువుల ప్రవర్తనను ప్రత్యక్షంగాను లేదా పరోక్షంగాను శాస్త్రవేత్తలు పరిశీలిస్తుంటారు.
  2. ముఖ్యంగా జంతువుల జీవన విధానం, అవి ఇచ్చిపుచ్చుకునే సంకేతాలను వాటి అర్థాలను అవగాహన చేసుకోవడంలో శాస్త్రవేత్తలు ఎంతో ప్రగతిని కనబరిచారు.
  3. గుర్తుకట్టడం విధానం ద్వారా పక్షుల వలస విధానం అది సుదూర తీరాలకు ఏ విధంగా ప్రయాణం చేయగలుగుతున్నాయి అన్న విషయాలను పరిశీలిస్తున్నారు. ఎన్నో అద్భుత విషయాలను తెలుసుకున్నారు.
  4. మనం ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్కలు మన ఇంట్లోలోకి ఎవరన్నా ప్రవేశిస్తే అవి మొరుగుతాయి.
  5. చీమలు ఆహారాన్వేషణలో సమాచారాన్ని పరస్పరం ఇచ్చి పుచ్చుకుంటాయి.
  6. నిశాచర జీవులైన గబ్బిలాలు, గుడ్లగూబలు రాత్రివేళల్లో మాత్రమే ఆహారాన్వేషణకు బయలుదేరతాయి.

ప్రశ్న 3.
గుర్తు కట్టడం (Tagging) అనగానేమి ? ఇది శాస్త్రవేత్తలకు ఏవిధంగా ఉపయోగపడుతుంది?
జవాబు:
a) జంతువుల ఉనికిని, వలసలను గుర్తించడానికి శాస్త్రవేత్తలు అన్వేషణా పరికరాలను కడతారు. ఈ విధమైన గుర్తింపు సూచికలు కట్టడాన్ని గుర్తుకట్టడం అంటారు.
b) జంతువులు, పక్షులు ప్రయాణించే మార్గం అనుసరించడానికి శాస్త్రవేత్తలకు ఈ గుర్తింపు పరికరాలు ఉపయోగపడతాయి.

ప్రశ్న 4.
క్రింది సమాచారం ఆధారంగా ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి. .
కోళ్ళు, బాతుల పిల్లలు గుడులో నుండి బయటకు వచ్చిన వెంటనే నడవగలుగుతాయి. బాతు పిల్లలైతే కొన్ని రోజుల తరువాత ఈదగలుగుతాయి. దీనినే అనుసరణ అంటారు.
ఎ) బాతు పిల్లలు కోడితో కలిసి ఉండగలుగుతాయి. ఎందుకు?
బి) అనుసరణ వలన కలిగే లాభం ఏమిటి?
జవాబు:
ఎ) బాతుపిల్లలు కోడిని తమ తల్లిగా భావించి, దానిని అనుసరిస్తూ తిరుగుతాయి. దీనికి కారణం ‘అనుసరణ’ అనే లక్షణం.
బి) అనుసరణ వల్ల బాతుపిల్లలు కోడి వెనుక తిరుగుతూ ఆహారాన్ని, రక్షణను పొందుతాయి.

ప్రశ్న 5.
ప్రక్క పటమును పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP Board 9th Class Biology Solutions 7th Lesson జంతువులలో ప్రవర్తన 2
a) ఏ గదిలో ఎక్కువ బొద్దింకలు ఉన్నాయి?
b) ఏ గదిలో తక్కువ బొద్దింకలు ఉన్నాయి?
c) ఎక్కువ సంఖ్యలో నివసిస్తున్న బొద్దింకల గది పరిస్థితులు ఏమి?
d) బొద్దింకల ప్రవర్తన ఎలా ఉంది?
జవాబు:
a) చీకటి మరియు తడి ఉన్న గదిలో ఎక్కువ బొద్దింకలు ఉన్నాయి.
b) వెలుతురు, పొడిగా ఉన్న గదిలో తక్కువ బొద్దింకలు ఉన్నాయి.
c) తడి మరియు చీకటిగా ఉన్నాయి.
d) విభిన్న పరిస్థితులు కల్పించబడిన నాలుగు గదులలో బొద్దింకలు చీకటి మరియు తడి ప్రదేశం గల గదిని వెదుకుతూ ఆ గదిని చేరుకున్నాయి.

ప్రశ్న 6.
పై పటమును పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
a) ఈ ప్రయోగంను ఎందుకొరకు నిర్వహించారు?
b) బొద్దింకల ప్రవర్తన ఎలా ఉన్నది?
c) ఒక గదిలో ఎక్కువ బొద్దింకలు, మరో గదిలో తక్కువ బొద్దింకలు చేరాయికదా. ఆ గదుల మధ్య భేదమేమిటి?
d) ఈ ప్రయోగంలో బొద్దింకలకు బదులుగా ఎలుకలను వదిలితే ఏమౌతుందో ఊహించి రాయండి.
జవాబు:
a) బొద్దింకల ప్రవర్తన అధ్యయనం కొరకు

b) బొద్దింకలు చీకటిగా, తడిగా ఉన్న గదిని ఇష్టపడుతున్నాయి. ఎందుకంటే ఆ పరిస్థితులలో మాత్రమే బొద్దింకలు జీవించగలుగుతాయి.

c) ప్రయోగపెట్టెను 4 గదులుగా విభజించాం కదా !
1) వెలుతురుగా ఉన్న పొడి వాతావరణం
2) చీకటిలో పొడిగా ఉన్న భాగం
3) చీకటిలో తడిగా ఉన్న భాగం
4) పొడిగా ఉన్న భాగం బొద్దింకలు చీకటి, తడిగా ఉన్న గదిలోకి ఎక్కువ చేరాయి.

d) అవి కూడా చీకటిగా తడిగా ఉన్న వాతావరణాన్నే ఎక్కువగా ఇష్టపడతాయి. ఎందుకంటే చీకటిగా ఉన్న ప్రాంతం అయితే శత్రువుల నుండి తమను రక్షించుకోవచ్చు. తడిగా ఉన్న ప్రాంతంలో శరీర తమ ఉష్ణోగ్రతలను నియంత్రణలో ఉంచుకోవచ్చు.

9th Class Biology 7th Lesson జంతువులలో ప్రవర్తన 1 Mark Bits Questions and Answers

లక్ష్యత్మక నియోజనము

1. జంతువుల ప్రవర్తన వీటి గురించి తెలియచేస్తుంది.
A) జంతువుల ఆవాసాలు, వనరులను వెతికే విధానాన్ని
B) శత్రువుల నుండి తమను తాము కాపాడే విధం
C) ప్రత్యుత్పత్తి కొరకు భిన్నజీవిని ఎంచుకోవడం, తమ సంతతిని కాపాడుకోవడం
D) పైవన్నియు
జవాబు:
D) పైవన్నియు

2. జంతు ప్రవర్తనను ప్రభావితం చేసేవి
A) జంతువు శరీర ధర్మం
B) జంతువు శరీర అంతర నిర్మాణం
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
C) A మరియు B

AP 9th Class Biology Important Questions 7th Lesson జంతువులలో ప్రవర్తన

3. పుట్టుకతో వచ్చే ప్రవర్తనలు
A) సహజాత ప్రవృత్తి
B) అనుసరణ
C) నిబంధన
D) అనుకరణ
జవాబు:
D) అనుకరణ

4. సహజాత ప్రవృత్తికి ఉదాహరణలు
A) పక్షులు గూడు కట్టుకోవడం
B) సంతానోత్పత్తి కోసం భిన్న జీవిని ఎంచుకోవడం
C) రక్షణ కోసం సమూహాలు ఏర్పాటు చేసుకోవడం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

5. ప్రతీకార చర్యలు ఈ ప్రవర్తన అంశాలు.
A) అనుకరణ
B) సహజాత ప్రవృత్తి
C) నిబంధన
D) అనుసరణ
జవాబు:
B) సహజాత ప్రవృత్తి

6. బాతు పిల్లలు, కోడి పిల్లలు మొదటిసారిగా తల్లిని గుర్తించే ప్రవర్తన
A) అనుకరణ
B) నిబంధన
C) అనుసరణ
D) సహజాత ప్రవృత్తి
జవాబు:
C) అనుసరణ

7. గంట కొట్టే సమయాన్ని బట్టి బడిలోని పిల్లల ప్రవర్తన
A) నిబంధన
B) అనుకరణ
C) అనుసరణ
D) సహజాత ప్రవృత్తి
జవాబు:
A) నిబంధన

8. నిబంధనపై పరిశోధనలు చేసిన శాస్త్రజ్ఞుడు
A) కోప్లెర్
B) ఇవాన్ పావ్లోవ్
C) ఇర్విన్ పెప్పర్ బర్గ్
D) హెర్మన్
జవాబు:
B) ఇవాన్ పావ్లోవ్

9. నిబంధన సహిత ప్రతిచర్యలకు ఉదాహరణ
A) పెద్దవాళ్ళు రాగానే గౌరవంగా లేచి నిలబడడం
B) పలుపుతాడు విప్పదీయగానే ఎద్దు అరక దగ్గరకు పోవడం
C) జాతీయగీతం వినగానే లేచి నిలబడడం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

10. చింపాంజీలలో అనుకరణ శక్తి మీద ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త
A) కోస్ఆర్
B) హెర్మన్
C) పెప్పర్ బర్గ్
D) పాప్ లోవ్
జవాబు:
A) కోస్ఆర్

11. బాగా ఆకలిగా ఉన్నప్పుడు వెంటనే భోజనం చేయాలని పించినా, అందరూ కూర్చున్న తరువాతే భోజనం చేయడం మొదలుపెట్టడం
A) అనుకరణ
B) సహజాత ప్రవృత్తి
C) నిబంధన
D) గుర్తుకట్టడం
జవాబు:
B) సహజాత ప్రవృత్తి

12. సినీ ప్రముఖులు, క్రీడాకారులతో ఉత్పత్తులను ప్రచారం చేయించి వినియోగదారులను కొనేలా చేయడం
A) అనుకరణ
B) సహజాత ప్రవృత్తి
C) నిబంధన
D) అనుసరణ
జవాబు:
C) నిబంధన

13. జంతువులు ప్రయాణించే మార్గం అనుసరించడానికి శాస్త్రవేత్తలకు ఉపయోగపడేవి.
A) గుర్తుకట్టడం
B) అన్వేషణ
C) A మరియు B
D) సంకేతాలు
జవాబు:
C) A మరియు B

14. చీమలలో వెదకటానికి లేదా సమాచారం అందించడానికి ఉపయోగపడేవి
A) హార్మోనులు
B) ఫెర్మె నులు
C) ఎంజైములు
D) అన్నియు
జవాబు:
B) ఫెర్మె నులు

15. గూటిలోని ఆహారంపై గుడ్లు పెట్టేది
A) కందిరీగ
B) నేతగాని పక్షి
C) చీమలు
D) బీవర్ క్షీరదం
జవాబు:
A) కందిరీగ

AP 9th Class Biology Important Questions 7th Lesson జంతువులలో ప్రవర్తన

16. తార్కికంగా ఎక్కువ శక్తి కలిగిన జంతువు
A) బీవర్ క్షీరదం
B) డాల్ఫిన్
C) ఉడత
D) స్క్రజ్ పక్షి
జవాబు:
B) డాల్ఫిన్

17. అలెక్స్ అనే చిలుక ఆపిల్‌ను ఈ విధంగా పిలిచేది.
A) బానరీ
B) చెర్రీ
C) అరటి
D) ఆరెంజ్ మారటం
జవాబు:
A) బానరీ

18. శత్రువుల నుండి రక్షించుకోవడానికి శరీరము నుండి దుర్వాసనను వెదజల్లే జంతువు ………
A) టాస్మేనియన్
B) బంబార్డియర్ బీటిల్లో
C) A మరియు B
D) బీవర్ క్షీరదం
జవాబు:
C) A మరియు B

19. జంతువుల ప్రవర్తన శాస్త్రం పేరు?
A) ఇకాలజీ
B) ఆర్నిథాలజీ
C) ఇథాలజీ
D) ఎనాలజీ
జవాబు:
C) ఇథాలజీ

20. జంతువుల ప్రవర్తనపై పరిశోధనకుగాను 1973లో నోబెల్ పురస్కారం వీరికి లభించింది.
A) కోనార్డ్ లోరెంజ్
B) నికోలస్ టింబర్జన్
C) కార్లవాన్ ఫ్రిష్
D) అందరూ
జవాబు:
D) అందరూ

21. ఈ క్రింది వానిలో అంతర్గత ప్రచోదనం
A) ఆకలి
B) ఆపద
C) వాసన
D) ధ్వని
జవాబు:
A) ఆకలి

22. ప్రవర్తనలో మొత్తం రకాల సంఖ్య
A) 3
B) 4
C) 5
D) 6
జవాబు:
B) 4

23. సంతానోత్పత్తి కోసం భిన్నలింగ జీవిని ఎంచుకోవటం
A) సహజాత ప్రవృత్తి
B) అనుసరణ
C) నిబంధన
D) అనుకరణ
జవాబు:
A) సహజాత ప్రవృత్తి

24. బాతు పిల్లలు కోడివెంట వెళ్ళడం
A) సహజాత ప్రవృత్తి
B) అనుసరణ
C) నిబంధన
D) అనుకరణ
జవాబు:
B) అనుసరణ

25. అనుసరణ గురించి తెల్లబాతుల మీద పరిశోధన చేసిన శాస్త్రవేత్త
A) కోనార్డ్ లోరెంజ్
B) ఇవాన్ పావ్లోవ్
C) కోస్ఆర్
D) హెర్మన్
జవాబు:
A) కోనార్డ్ లోరెంజ్

26. తార్కికంగా ఆలోచించే శక్తి గురించి హవాయి ద్వీపంలోని “కవలో బేసిన్ మామల్ లాబోరేటరీ”లో డాల్ఫిన్లపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త
A) కోనార్డ్ లోరెంజ్
B) ఇవాన్ పావ్లోవ్
C) కోస్ఆర్
D) హెర్మన్
జవాబు:
D) హెర్మన్

AP 9th Class Biology Important Questions 7th Lesson జంతువులలో ప్రవర్తన

27. తేనెటీగల నృత్యాలపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త
A) కార్లవాష్
B) కోనార్డ్ లోరెంజ్
C) కోప్లెర్
D) హెర్మన్
జవాబు:
A) కార్లవాష్

28. ఉద్దీపనలకు చూపే ప్రతిచర్య
A) సహజాత ప్రవృత్తి
B) అనుసరణ
C) నిబంధన
D) అనుకరణ
జవాబు:
C) నిబంధన

29. ఒక జంతువు యొక్క ప్రవర్తనను వేరొక జంతువు ప్రదర్శిస్తే
A) అనుసరణ
B) అనుకరణ
C) నిబంధన
D) సహజాత ప్రవృత్తి
జవాబు:
B) అనుకరణ

30. ఎడ్వర్టైజ్ మెంట్లలో ఉపయోగించుకునే ప్రవృత్తి
A) అనుకరణ
B) అనుసరణ
C) నిబంధన
D) సహజాత ప్రవృత్తి
జవాబు:
A) అనుకరణ

31. మానవునిలో లేని ప్రవర్తన
A) అనుకరణ
B) అనుసరణ
C) నిబంధన
D) సహజాత ప్రవృత్తి
జవాబు:
B) అనుసరణ

32. ఒక వ్యక్తిలో మార్పు తేవటానికి ఉపయోగపడేది.
A) అనుకరణ
B) అనుసరణ
C) నిబంధన
D) సహజాత ప్రవృత్తి
జవాబు:
C) నిబంధన

33. కుక్కలు వాసన పసిగట్టటం, చీమలు వెదుకులాడటానికి కారణం
A) హార్మోన్లు
B) ఫెర్మోన్లు
C) ఎంజైములు
D) జన్యువులు
జవాబు:
B) ఫెర్మోన్లు

34. ‘బీవర్’ అనే క్షీరదం యిక్కడ కనిపిస్తుంది.
A) ఉత్తర అమెరికా
B) దక్షిణ అమెరికా
C) ఆఫ్రికా
D) ఆస్ట్రేలియా
జవాబు:
A) ఉత్తర అమెరికా

35. కందిరీగ దీనితో గూడు కడుతుంది.
A) పుల్లలు
B) ఆకులు
C) బురదమట్టి
D) బూజువంటి పదార్థం
జవాబు:
C) బురదమట్టి

36. ఇర్విన్ పెప్పర్ బర్గ్ శిక్షణ యిచ్చిన అలెక్స్ అనేది
A) పావురం
B) గోరింక
C) చిలుక
D) కుక్క
జవాబు:
C) చిలుక

37. జంతు రాజ్యంలో అన్నిటికంటె ఎక్కువ దుర్వాసన వెదజల్లే జంతువు
A) కంగారు
B) టాస్మేనియన్ డెవిల్
C) కొమెడో డ్రాగన్
D) ముళ్ళపంది.
జవాబు:
B) టాస్మేనియన్ డెవిల్

38. బంబార్డియర్ పురుగులో ఉండే రసాయనాలు
A) హైడ్రోక్వినోన్, ఫిల్లోక్వినోన్
B) అల్యూమినియం ఆక్సైడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్
C) హైడ్రోక్వినోన్, హైడ్రోజన్ పెరాక్సైడ్
D) అల్యూమినియం ఆక్సైడ్, ఫిల్లోక్వినోన్
జవాబు:
C) హైడ్రోక్వినోన్, హైడ్రోజన్ పెరాక్సైడ్

39. సరిగా జతపరచబడని జత ఏది?
1) చిలుకకు శిక్షణ ఇవ్వడం – ఇర్విన్ పెప్పర్ బర్గ్
2) చింపాంజిపై ప్రయోగాలు – ఇవాన్ పావలోవ్
3) కుక్కపై నియబంధనల ప్రయోగం – కోప్లెర్
A) 1 మాత్రమే
B) 1, 2
C) 2, 3
D) 3 మాత్రమే
జవాబు:
C) 2, 3

AP 9th Class Biology Important Questions 7th Lesson జంతువులలో ప్రవర్తన

40. క్రింది వాక్యాలను చదవండి.
a) కోనార్డ్ లారెంజ్, అనుసరణ మీద ప్రయోగాలు
b) సాలెపురుగు గూడు కట్టడం అనుకరణకు ఉదాహరణ
A) a, b లు రెండూ సరియైనవి కావు
B) a, b లు రెండూ సరియైనవి
C) b సరియైనది, a సరియైనది కాదు
D) a సరియైనది, b సరియైనది కాదు
జవాబు:
D) a సరియైనది, b సరియైనది కాదు

41. సరిగా జతపరచబడిన సమాధానాన్ని ఎన్నుకోండి.
AP 9th Class Biology Important Questions 7th Lesson జంతువులలో ప్రవర్తన 9
A) (i) – d, (ii) – c, (iii) – b, (iv) – a
B) (i) – a, (ii) – d, (iii) – c, (iv) – b
C) (i) – b, (ii) – a, (iii) – c, (iv) – d
D) (i) – b, (ii) – d, (iii) – a, (iv) – c
జవాబు:
D) (i) – b, (ii) – d, (iii) – a, (iv) – c

42. సరిగా జతపరచబడిన సమాధానాన్ని ఎన్నుకోండి.
1) సహజాత ప్రవృత్తి ( ) a) పిల్లవాడు తల్లిని గుర్తించటం
2) అనుసరణ ( ) b) ఇంకొకరి నుండి వేరొకరు కాపీ చేయడం
3) అనుకరణ ( ) c) పుట్టుకతో వచ్చే గుణం
A) 1 – c, 2 – b, 3 – a
B) 1 – a, 2 – c, 3 – b
C) 1 – b, 2 – a, 3 – c
D) 1 – c, 2 – a, 3 – b
జవాబు:
D) 1 – c, 2 – a, 3 – b

43. సరిగా జతపరచబడిన సమాధానాన్ని ఎన్నుకోండి.
1) కొనార్డ్ లారెంజ్ ( ) a) అనుకరణ
2) కాపీ కొట్టే ప్రవర్తన ( ) b) ఇథాలజీ
3) జంతువుల ప్రవర్తనను చదవడం ( ) c) అనుసరణ
A) 1 – c, 2-b, 3 – a
B) 1 – b, 2-6, 3 – a
C) 1 – a, 2 – b, 3 – c
D) 1 – c, 2 – a, 3 – b
జవాబు:
D) 1 – c, 2 – a, 3 – b

44. పాప్ లోవ్ ప్రయోగంలో, గంట శబ్దం విని కుక్క లాలాజలం స్రవించింది. ఇక్కడ లాలాజలం స్రవించుట అనునది.
A) సహజ ఉద్దీపన
B) నిబంధిత ఉద్దీపన
C) సహజ ప్రతిస్పందన
D) నిబంధిత ప్రతిస్పందన
జవాబు:
D) నిబంధిత ప్రతిస్పందన

45. బొద్దింకల ప్రవర్తనను అధ్యయనం చేయటానికి నీతు ఒక ప్రయోగం నిర్వహించింది. ఒక పెట్టెను 4 గదులుగా విభజించి, బొద్దింకలు స్వేచ్ఛగా కదిలేలా కింది పటం వలే ప్రయోగం నిర్వహించింది. ఆ పెట్టెలో 20 బొద్దింకలను వుంచి 2 రోజులు గమనించింది. ఈ ప్రయోగం ద్వారా కింది నిర్ధారణ చేయవచ్చు.
A) బొద్దింకలు పొడి ప్రదేశాల కంటే తడి ప్రదేశాలనే ఇష్టపడతాయా?
B) చీకటిలో బొద్దింకలు వ్యాధులకు గురవుతాయా?
C) బొద్దింకలు ఎలాంటి ఆహారం ఇష్టపడతాయి?
D) బొద్దింకలు గుడ్లు పెట్టి పొదగటానికి ఎంత కాలం పడుతుంది?
జవాబు:
A) బొద్దింకలు పొడి ప్రదేశాల కంటే తడి ప్రదేశాలనే ఇష్టపడతాయా?

46. బాతు పిల్లలు తల్లిని గుర్తించే విధానం
A) ప్రేరణ
B) అనుసరణ
C) సహజాత ప్రవృత్తి
D) అనుకరణ
జవాబు:
B) అనుసరణ

47. ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ చూడగానే లావణ్య తన స్కూటీని ఆపివేయుట దేనికి ఉదాహరణ?
A) అనుకరణ
B) నిబంధిత ప్రతిచర్య
C) సహజాత ప్రవృత్తి
D) అసంకల్పిత ప్రతీకార చర్య
జవాబు:
B) నిబంధిత ప్రతిచర్య

48. క్రింది వానిలో సహజాత ప్రవర్తనకు చెందిన.
A) కందిరీగ మట్టితో గూడును కట్టుకొనుట
B) బీవర్ చెట్ల కొమ్మలను నదీ ప్రవాహానికి అడ్డుగా వేయుట
C) పక్షులు ఆకులు, పుల్లలతో గూళ్ళు నిర్మించుట
D) పైవన్నియు
జవాబు:
D) పైవన్నియు

AP 9th Class Biology Important Questions 7th Lesson జంతువులలో ప్రవర్తన

49. క్రింది వానిలో సరికానిది గుర్తించుము.
A) టాస్మానియన్ డెవిల్
B) బొంబార్డియర్ బీటిల్
C) సముద్రం
D) సుబ్ధయ్
జవాబు:
C) సముద్రం

50.
AP 9th Class Biology Important Questions 7th Lesson జంతువులలో ప్రవర్తన 2
పై ప్రయోగాలను నిర్వహించిన శాస్త్రవేత్త ఎవరు? దేనిని తెలపడానికి నిర్వహించారు?
A) ఇవాన్ పావ్ వ్ – నిబంధన
B) చార్లెస్ డార్విన్ – అనుకరణ
C) గ్రెగర్ మెండల్ – అనుసరణ
D) జీన్ లామార్క్ – నిబంధన
జవాబు:
A) ఇవాన్ పావ్ వ్ – నిబంధన

51.
AP 9th Class Biology Important Questions 7th Lesson జంతువులలో ప్రవర్తన 10
చిత్రంలోని జంతువులో అనుకరణశక్తిని గుర్తించినది
A) ఇవాన్ పావ్లోవ్
B) ప్రిన్స్ డోరియా
C) జీన్ లామార్క్
D) కోబ్లెర్
జవాబు:
D) కోబ్లెర్

52. బొంబార్డియర్ బీటిల్ అనే కీటకం చెడువాసనను వెదజల్లుతుంది. ఎందుకంటే
A) ఆహార సంపాదన కొరకు
B) శత్రువులబారినుండి రక్షించుకోవడానికి
C) ఆడకీటకాన్ని ఆకర్షించుట కొరకు
D) భక్షకజీవిని చంపడానికి
జవాబు:
B) శత్రువులబారినుండి రక్షించుకోవడానికి

మీకు తెలుసా?

జంతువులలో ప్రవర్తనను అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలలో ఆస్ట్రియాకు చెందిన కోనార్డ్ లో రెంజ్ (1903 – 1989) | ప్రముఖుడు. అతను తెల్లబాతులను స్వయంగా పెంచి వాటి ప్రవర్తనను అధ్యయనం చేశాడు. గుడ్లు పొదిగిన నాటి నుండి అవి ఇతన్ని అనుసరించేవి. అవి పెరిగి పెద్దవిగా మారినప్పటికీ ఆయనతోనే కలిసి తిరిగేవి. జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేసినందుకుగాను శరీరధర్మశాస్త్రం మరియు ఔషధశాస్త్ర రంగంలో ఆయనకు 1973లో నోబెల్ బహుమతి లభించింది.

AP 9th Class Biology Important Questions 7th Lesson జంతువులలో ప్రవర్తన 11
కొన్ని జంతువులు, శత్రువుల (భక్షకాలు) నుండి రక్షించుకోవడానికి తమ శరీరం నుండి దుర్వాసన వెదజల్లుతాయి. జంతురాజ్యంలో టాస్మేనియన్ డేవిల్ అన్నింటి కంటే ఎక్కువ దుర్వాసన వెదజల్లే జంతువు. దీని మాదిరిగానే బాంబార్డియర్ బీటిల్ (Bombardier beetle) చెడు వాసన వెదజల్లే కీటకం.

AP 9th Class Biology Important Questions 7th Lesson జంతువులలో ప్రవర్తన 12
ఈ కీటకం శరీరంలో రెండు రకాల రసాయనాలు ఉంటాయి. అవి హైడ్రోక్వినోన్ మరియు హైడ్రోజన్ పెరాక్సైడ్. ఇది ఎప్పుడైతే ప్రాణహాని ఉందని భావిస్తుందో అప్పుడు ఈ రసాయనాలు ప్రత్యేక ఎంజైముతో కలిసి వేడెక్కుతాయి. అవి శరీరం నుండి దుర్వాసనను వెదజల్లేలా చేస్తాయి. వాసన వచ్చే పురుగులు మీరెపుడైనా చూశారా…. అది ఎలా ఉంటుందో పరిశీలించండి.

పునరాలోచన

AP 9th Class Biology Important Questions 7th Lesson జంతువులలో ప్రవర్తన 8

AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు

These AP 9th Biology Important Questions and Answers 6th Lesson జ్ఞానేంద్రియాలు will help students prepare well for the exams.

AP Board 9th Class Biology 6th Lesson Important Questions and Answers జ్ఞానేంద్రియాలు

9th Class Biology 6th Lesson జ్ఞానేంద్రియాలు 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
మనకు ఇంద్రియ జ్ఞానం ఏ విధంగా కలుగుతుంది?
జవాబు:
నాడీ సంకేతాల వలన ఇంద్రియ జ్ఞానం కలుగుతుంది.

ప్రశ్న 2.
ఆకు ఆకుపచ్చగా కనబడుటకు కారణమేది?
జవాబు:
ఆకుపచ్చని ఆకు నుండి పరావర్తనం చెందిన కాంతి గ్రాహకాలను చేరి నాడీ సంకేతాలుగా మారి అవి మెదడుకు చేరి, అది ఒక ఆకుపచ్చని ఆకారంగా రూపకల్పన చేయబడుతుంది.

ప్రశ్న 3.
దృష్టి ఎందుకు సహాయపడుతుంది?
జవాబు:
మన భౌతిక పరిసరాల్లో కోరుకున్న ‘గమ్యాలు, భయాలు, మార్పులను గుర్తించి వాటికి అనుగుణంగా ఉండడానికి దృష్టిలో (చూపు) ఉపయోగపడుతుంది.

ప్రశ్న 4.
కంటిలోని మూడు ముఖ్యమైన పొరలు ఏవి?
జవాబు:
దృఢస్తరం, రక్తపటలం మరియు నేత్రపటలం కంటిలోని మూడు ముఖ్యమైన పొరలు.

ప్రశ్న 5.
కటకం కంటి గుడ్డు లోపలి భాగాల్ని ఎన్ని భాగాలుగా విడగొడుతుంది?
జవాబు:
రెండు భాగాలు, అవి నేత్రోదక కక్ష మరియు కాచావత్ కగా విడగొడుతుంది.

AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు

ప్రశ్న 6.
నేత్రోదక కక్ష మరియు కాచావత్ కక్ష వేటితో నింపబడి ఉంటాయి?
జవాబు:
నేత్రోదక కక్ష నీరు వంటి ద్రవంతోను, కాచావత్ కక్ష జెల్లి వంటి ద్రవంతోను నిండి ఉంటాయి.

ప్రశ్న 7.
కంటిని మనము ఏ విధంగా భావించవచ్చు?
జవాబు:
ప్రపంచంలోని దృశ్యాలను చలన చిత్రాలుగా తీయడానికి మెదడు ఉపయోగించే ఒక రకమైన వీడియో కెమెరాగా కంటిని భావించవచ్చు.

ప్రశ్న 8.
కన్ను ప్రతిబింబాన్ని ఎక్కడ ఏర్పరుస్తుంది?
జవాబు:
కన్ను కాంతిని సేకరించి కుంభాకార కటకం ద్వారా కేంద్రీకరించి కంటిలో వెనుక భాగాన ఉండే నేత్రపటలంపై ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది.

ప్రశ్న 9.
కుంభాకార కటకం వల్ల ఏర్పడే ప్రతిబింబం ఏ విధంగా ఉంటుంది?
జవాబు:
కటకం వల్ల ఏర్పడే ప్రతిబింబంలో ఎడమ కుడిగాను, కుడి ఎడమగాను, తలకిందులుగాను ఏర్పడుతుంది.

ప్రశ్న 10.
నేత్రపటలం మధ్యభాగంలో ఉండే ఫోవియో యొక్క ఉపయోగమేమిటి?
జవాబు:
ఫోవియో నందు శంకువులు గుమికూడి ఉంటాయి. ఇవి , దృష్టి స్పష్టంగా ఉండేలా చేస్తాయి. మరియు మనం చూడాలనుకున్న దానిని సూక్ష్మంగా పరిశీలించడానికి ఉపయోగపడుతుంది.

ప్రశ్న 11.
అంధచుక్క అనగా నేమి?
జవాబు:
నేత్రపటలంలో ఒక చిన్న ప్రాంతంలో కాంతి గ్రాహకాలు ఉండవు. దానితో ఆ ప్రాంతం అంధకారంగా ఉంటుంది. దీనిని అంధచుక్క అంటారు.

ప్రశ్న 12.
కంటిని, కంటి భాగాల్ని యాంత్రిక అఘాతాల నుండి రక్షించేవి ఏవి?
జవాబు:
నేత్రోదక కక్ష, కచావత్ కక్షలో ఉండే ద్రవాలు కంటిని, కంటి భాగాల్ని రక్షిస్తాయి.

ప్రశ్న 13.
కంటిలోని ద్వికుంభాకారంలో ఉండే కటకం యొక్క ఆకారాన్ని మార్చేవి ఏవి?
జవాబు:
కటకాల యొక్క నాభ్యంతరం శైలికామయ కండరాలు, అవలంబిత స్నాయువుల సహాయంతో మార్పుచేయబడుతుంది. అవి కటకం యొక్క ఆకారాన్ని కావలసిన విధంగా మార్చగలవు.

ప్రశ్న 14.
భ్రమలు మనకు దృష్టి జ్ఞానం గురించి ఏమి తెలుపుతాయి?
జవాబు:
భ్రమలు మనం చూస్తున్న దానికి బాహ్యంగా ఉన్న సత్యానికి మధ్య ఉన్న తేడాల్ని అవగాహన చేసుకోడానికి, తార్కికతను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి.

ప్రశ్న 15.
కళ్ళకు ప్రధానంగా వచ్చే కొన్ని వ్యాధులు ఏవి?
జవాబు:
రేచీకటి, పొడిబారిన కళ్ళు, హ్రస్వదృష్టి దీర్ఘదృష్టి, గ్లూకోమా, కంటి శుక్లం, వర్ణాంధత మొదలగునవి కళ్ళకు వచ్చే వ్యాధులు.

AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు

ప్రశ్న 16.
చెవుల యొక్క ఉపయోగమేమిటి?
జవాబు:
వినడంతోబాటు మన శరీరం యొక్క సమతాస్థితిని సక్రమంగా ఉంచడానికి చెవులు ఉపయోగపడతాయి.

ప్రశ్న 17.
చెవినందలి మూడు భాగాలు ఏవి?
జవాబు:
వెలుపలి చెవి, మధ్యచెవి మరియు అంతర చెవి

ప్రశ్న 18.
వెలుపలి చెవినందుండే గ్రంథులు ఏవి?
జవాబు:
వెలుపలి చెవినందు మైనాన్ని స్రవించే సెరుమినస్ గ్రంథులు, తైలాన్ని స్రవించే తైల గ్రంథుల్ని కలిగి ఉంటుంది.

ప్రశ్న 19.
మధ్య చెవినందలి మూడు ఎముకలు ఏవి?
జవాబు:
కూటకము లేక సుత్తి, దాగలి లేక పట్టెడ, కర్ణాంతరాస్థి లేక అంకవన్నె అనే మూడు ఎముకలు మధ్య చెవిలో ఉంటాయి.

ప్రశ్న 20.
అంతర చెవినందు ఉండే పేటికా ఉపకరణం యొక్క ఉపయోగమేమిటి?
జవాబు:
పేటికా ఉపకరణం శరీరస్థితి, సమతులనం సక్రమంగా ఉండేలా చూసి, శరీర సమతాస్థితిని నిర్వహిస్తుంది.

ప్రశ్న 21.
చెవికి సాధారణంగా వచ్చే వ్యాధులు ఏవి?
జవాబు:
బాక్టీరియా, ఫంగస్ వల్ల చీము, కర్ణభేరికి ఇన్ఫెక్షన్ సాధారణంగా చెవికి వచ్చే వ్యాధులు.

ప్రశ్న 22.
ముక్కు జంతువులను ఏ విధంగా సంరక్షిస్తోంది?
జవాబు:
ప్రమాదకరమైన ఆహారం, పరభక్షుల నుండి వచ్చే వాసనను గ్రహించుట ద్వారా ముక్కు జంతువులను సంరక్షిస్తోంది.

ప్రశ్న 23.
నాలుక కలిగించే రుచి జ్ఞానంలో ఉన్న నాలుగు ప్రాథమిక రుచులు ఏవి?
జవాబు:
తీపి, పులుపు, చేదు, ఉప్పు నాలుక కలిగించే రుచి రకాలు.

ప్రశ్న 24.
ఉమామి రకపు రుచి గురించి తెలపండి. ఏయే ఆహారపదార్థాలలో ఉంటుంది?
జవాబు:
మాంసం, సముద్రం నుండి లభించే ఆహారం, జున్ను వంటి మాంసకృత్తులు పుష్కలంగా ఉండే ఆహారం నుండి వచ్చే వాసనను ‘ఉమామి’ అంటారు.

ప్రశ్న 25.
ఆహారపు రుచిని ఏవిధంగా తెలుసుకోగలం?
జవాబు:
ఆహారం నమిలిన, కొరికిన, చప్పరించిన వెలువడే రసాయనాలు రుచికణికల్ని ప్రేరేపిస్తాయి. దాంతో అవి ప్రేరణను మెదడుకు పంపి రుచిని తెలుసుకునేలా చేస్తాయి.

AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు

ప్రశ్న 26.
నాలుక మీద ఉండే నిర్మాణాలు ఎన్ని రకాలు? అవి ఏవి?
జవాబు:
నాలుగు రకాలు. అవి :

  1. ఫిలిఫార్మ్ పాపిల్లే
  2. ఫంగిఫార్మ్ పాపిల్లే
  3. సర్కంవేలేట్ పాపిల్లే
  4. ఫోలియేట్ పాపిల్లే.

ప్రశ్న 27.
చర్మంలోని రెండు ముఖ్యమైన పొరలు ఏవి?
జవాబు:
బహిశ్చర్మం మరియు అంతశ్చర్మం అనేవి చర్మంలోని పొరలు.

ప్రశ్న 28.
బహిశ్చర్మం ఎన్ని పొరలను కలిగి ఉంటుంది? అవి ఏవి?
జవాబు:
బహిశ్చర్మం మూడు పొరలను కలిగి ఉంటుంది. అవి వెలుపలి కార్నియం పొర, జీవకణాలుండే గ్రాన్యులర్ పొర మరియు స్థిరంగా విభజనలు చెందే మాల్ఫీజియన్ పొర.

ప్రశ్న 29.
అంతశ్చర్మంలో ఏమి ఉంటాయి?
జవాబు:
అంతశర్మంలో స్వేదగ్రంథులు, తైలగ్రంథులు, రోమపుటికలు, రక్తనాళాలు, కొవ్వులు ఉంటాయి.

ప్రశ్న 30.
కంటి చూపులో బలహీనులయిన ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్ధులు స్పర్శ ద్వారా బ్రెయిలీ లిపిని ఎందుకు చదవగలరు?
జవాబు:
బ్రెయిలీ లిపిలో అక్షరాలు ఉబ్బెత్తులు, పల్లాలు కలిగి ఉంటాయి. అందువలన కంటి చూపులో బలహీనులయిన ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు బ్రెయిలీ లిపిని చదువగలరు.

ప్రశ్న 31.
జ్ఞానేంద్రియాలు పనిచేయని ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు మీరు ఎలాంటి ప్రోత్సాహం ఇస్తారు?
జవాబు:
వారు మామూలు మనుష్యులలాగానే జీవించడానికి అవసరమైన ఆత్మవిశ్వాసమును వారిలో నింపుతాను. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు తమకు ఎటువంటి కొరత లేదనే భావనను మరియు వారికి కొదువ లేదనే తృప్తిని అందిస్తాను.

ప్రశ్న 32.
ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి సహాయపడే జ్ఞానేంద్రియాల పనులు నీకు ఎలాఉపయోగపడుతున్నాయి?
జవాబు:
మనం ప్రకృతి సౌందర్యాన్ని కళ్ళతో, వీనుల విందైన సంగీతాన్ని చెవులతో, పూల సువాసనలను ముక్కుతో మరియు చల్లని చిరుగాలిని చర్మంతో స్పర్శిస్తున్నాము మరియు ఆహార పదార్థాల రుచిని నాలుకతో ఆస్వాదిస్తున్నాము.

ప్రశ్న 33.
కాంతి యొక్క హానికర ప్రభావానికి లోనుగాకుండా శరీరపు పొరలను చర్మం ఏ విధముగా కాపాడుతుంది?
జవాబు:
చర్మంలో ఉండే వర్ణద్రవ్యం మెలనిన్ సూర్యకాంతి చేత ఉత్తేజితమవుతుంది. అటువంటప్పుడు చర్మం నల్లబడి మిగిలిన పొరల్ని కాంతి యొక్క హానికర ప్రభావానికి లోనుగాకుండా చూస్తుంది.

ప్రశ్న 34.
కన్నీరు మనకు ఏ విధముగా ఉపయోగపడుతుంది?
జవాబు:
ఎప్పుడైనా, ఏదైనా అవసరం లేని పదార్థం కనుక కంటిలో పడితే వెంటనే అశ్రుగ్రంథులు ప్రేరేపితమై ఆ పదార్థాన్ని బయటకు పంపించివేస్తాయి.

ప్రశ్న 35.
మనకు వెలుపలి చెవి లేకుండా ఉంటే ఏం జరుగుతుంది?
జవాబు:
మనకు వెలుపలి చెవి లేకుండా ఉంటే శబ్దతరంగాలు సేకరించబడవు తద్వారా మనకు ఏమీ వినపడదు.

ప్రశ్న 36.
మీరు జలుబుతో బాధపడుతున్నప్పుడు మామూలుగా పదార్థాలను వాసన చూడగలరా? (పేజీ నెం. 89)
జవాబు:
జలుబుగా ఉన్నప్పుడు నాసికామార్గాలు మూయబడి ఉండుట చేత మనకు ఆహారము యొక్క వాసన తెలియదు.

AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు

ప్రశ్న 37.
వాసనకి, రుచికి ఏమైనా సంబంధం ఉందని మీరు అనుకుంటున్నారా? (పేజీ నెం. 89)
జవాబు:
వాసన, రుచి కూడా ఆహారంలో ఉండే రసాయనాలను గుర్తించడం పైన ఆధారపడిన ఇంద్రియ జ్ఞానము. ఇవి ఒకదానితో ఒకటి దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నాయి.

ప్రశ్న 38.
మనకు దోమ కుట్టగానే దానిని ఎలా చంపగలం?
జవాబు:
కాలిమీద దోమ కుట్టగానే జ్ఞాన నాడులు దోమకుట్టే సమాచారాన్ని మెదడుకు చేరవేస్తాయి. మెదడు దోమను చంపాల్సిందిగా చాలకనాడుల ద్వారా చేతికి సమాచారం పంపుతుంది. అప్పుడు చేతితో దోమను చంపుతాం.

ప్రశ్న 39.
మానవులలో జ్ఞానేంద్రియములు ఎన్ని? అవి ఏవి?
జవాబు:
మానవులలో ఐదు జ్ఞానేంద్రియాలు కలవు. అవి :

  1. కన్ను
  2. చెవి
  3. ముక్కు
  4. నాలుక
  5. చర్మం.

ప్రశ్న 40.
కంటిలోని ప్రధాన భాగాలేవి?
జవాబు:
కంటిరెప్పలు, కనురెప్ప రోమాలు, కనుబొమ్మలు, అశ్రుగ్రంథులు, కంటిగుడ్డు కంటిలోని ప్రధాన భాగాలు.

AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు

ప్రశ్న 41.
అరచేయిలో ఎక్కడ స్పర్శ జ్ఞానం ఎక్కువగా ఉంటుంది? (పేజీ నెం. 93)
జవాబు:
అరచేయి మధ్యలో స్పర్శజ్ఞానం ఎక్కువ.

9th Class Biology 6th Lesson జ్ఞానేంద్రియాలు 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
మీరు జ్వరంతో బాధపడుతున్నప్పుడు నోటికి ఆహారం రుచిగా ఉండదు. ఎందువల్ల?
జవాబు:
రుచి కణికల్లో ఉండే ఎంజైములు 77°F నుండి 98.6°F వరకు మాత్రమే పనిచేస్తాయి. ఎంజైములు పనిచేయక పోవడం వలన రుచి కణికలో ఉండే కణాలు మెదడు నందలి రుచి భాగములకు సమాచారమును పంపకపోవడం వలన జ్వరంగా ఉన్నప్పుడు రుచి తెలియదు.

ప్రశ్న 2.
కన్ను ఇతర జ్ఞానేంద్రియాల కంటే ఏ విధముగా భిన్నమైనది?
జవాబు:
కాంతి తరంగాల నుండి సమాచారాన్ని తీసుకొని మెదడు, తన ప్రక్రియను నిర్వర్తించడానికి వీలుగా వాటి కాంతి లక్షణాలను నాడీ సంకేతాలుగా మార్చే సామర్థ్యం ఇతర జ్ఞానేంద్రియాలకు లేకుండా కంటికి మాత్రమే ఉన్న లక్షణం.

ప్రశ్న 3.
నేత్రపటలంలోని దందాల గురించి క్లుప్తంగా రాయండి.
జవాబు:

  1. మన కంటిలో రొడాప్సిన్ అనే వర్ణద్రవ్యం కలిగిన దండాలు సుమారుగా 125 మిలియన్లు ఉన్నాయి.
  2. అవి అతి తక్కువ కాంతిలో అంటే చీకటిలో వస్తువుల్ని చూడగలవు. కానీ వివిధ రంగులకు సంబంధించిన నిశితమైన తేడాలను మాత్రం గుర్తించలేవు.

ప్రశ్న 4.
కన్ను గురించి ఇటీవల కనుగొనిన విషయాలు ఏమిటి?
జవాబు:
వస్తువుల అంచులు, సరిహద్దులను సునిశితంగా చూపేవి, వెలుతురుకు, నీడకు, కదలికలకు స్పందించే ప్రత్యేక గ్రాహక కణాల్ని నేత్రపటలంలో ఇటీవల కనుగొన్నారు.

ప్రశ్న 5.
ఆధార్ కార్లను ఇవ్వడంలో కంటిపాపలు ఎలా ఉపయోగపడతాయి?
జవాబు:

  1. కంటిపాపలు ఎవరికి వారికే ప్రత్యేకంగా ఉంటాయి.
  2. అందుకే వేలిముద్రల మాదిరిగానే కంటిపాపలను కూడా గుర్తింపు కోసం ఉపయోగిస్తారు.

ప్రశ్న 6.
చెవులు నిర్వహించే విధులు ఏమిటి?
జవాబు:
చెవుల యొక్క విధులు :

  1. శబ్ద ప్రకంపనాలను నాడీ ప్రేరణలుగా మార్చి మెదడుకు అందించడం.
  2. సమతాస్థితిని కాపాడుతాయి.

ప్రశ్న 7.
నాసికా కుహరమునందలి శ్లేష్మము మరియు వెంట్రుకల ఉపయోగం ఏమిటి?
జవాబు:
ముక్కు కుహరంలో ఉండే వెంట్రుకలు, మ్యూకస్, దుమ్ము, సూక్ష్మక్రిములు ఇంకా అవసరములేని ఇతర పదార్థాలను ముక్కు ద్వారా శరీరంలోకి చేరకుండా కాపాడతాయి.

AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు

ప్రశ్న 8.
చర్మము యొక్క గ్రాహక స్వభావమెటువంటిది?
జవాబు:

  1. స్పర్శకు, ఉష్ణోగ్రతకు, పీడనానికి చర్మం సూక్ష్మ గ్రాహకత్వాన్ని చూపుతుంది.
  2. స్పర్శకు స్పర్శ గ్రాహకాలు, పీడనానికి పెసిమియన్ గ్రాహకాలు, ఉష్ణోగ్రతకి నాసిష్టారులు వంటి ప్రత్యేక గ్రాహకాలను కలిగి ఉంటుంది.

ప్రశ్న 9.
చర్మానికి వచ్చే కొన్ని వ్యాధులను తెలపండి.
జవాబు:

  1. పొంగు, ఆటలమ్మ వంటివి వైరస్ వల్ల వచ్చే వ్యాధులు.
  2. చర్మానికి బ్యాక్టీరియా వలన వచ్చే వ్యాధి కుష్టు.
  3. మెలనిన్ లోపం వలన చర్మానికి వచ్చే వ్యాధి బొల్లి.
  4. ఫంగస్ వలన చర్మానికి తామర వస్తుంది.
  5. విటమిన్ల లోపం వలన చర్మానికి పెల్లాగ్రా వ్యాధి వస్తుంది.

ప్రశ్న 10.
మెలనిన్ అనగానేమి? మెలనిన్ యొక్క విధులేమిటి?
జవాబు:

  1. చర్మానికి రంగునిచ్చే వర్ణద్రవ్యము మెలనిన్.
  2. ఈ వర్ణద్రవ్యం సూర్యకాంతి చేత ఉత్తేజితమవుతుంది.
  3. అటువంటప్పుడు చర్మం నల్లబడి మిగిలిన పొరల్ని కాంతి యొక్క హానికర ప్రభావానికి లోను కాకుండా చేస్తుంది.

ప్రశ్న 11.
మనకు వెలుపలి చెవి లేకుండా ఉంటే ఏం జరుగుతుంది? (పేజీ నెం. 87)
జవాబు:

  1. చెవి ద్వారా శబ్దతరంగాలు సేకరించబడవు.
  2. మధ్య చెవిని తాకే శబ్ద తరంగాలను మాత్రమే వినగలము.
  3. అందువలన వెలుపలి చెవి శబ్ద తరంగాలను సేకరించకపోతే మనకు ఏమీ వినపడదు.

ప్రశ్న 12.
ప్రేరణలు లేదా ఉత్తేజకాలు అనగానేమి? పరిసరాల నుండి సమాచారం మెదడుకు ఎట్లా చేరుతుంది?
జవాబు:

  1. ప్రకృతిలోని కొన్ని పరిస్థితులు, పదార్థాలు ఇంద్రియ జ్ఞానం మన శరీరంలో కలిగేలా ప్రేరేపిస్తాయి. వాటిని ప్రేరకాలు లేదా ఉత్తేజకాలు అంటారు.
  2. ఈ ఉత్తేజకాలు తీసుకెళ్ళే సమాచారాన్ని మన జ్ఞానేంద్రియాలలోని గ్రాహకాలు గ్రహించి నాడీ సంకేతాలుగా మారుస్తాయి.
  3. ఇవి మెదడుకు అందించబడి, ఇంద్రియ జ్ఞానంగా రూపొందుతాయి.

9th Class Biology 6th Lesson జ్ఞానేంద్రియాలు 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
జ్ఞానేంద్రియాలు చేసే పనికి కేంద్రం ఎవరు? అది ఏ విధముగా సమాచారాన్ని విశ్లేషిస్తుంది? ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:

  1. జ్ఞానేంద్రియాలు చేసే పనులన్నింటికి కేంద్రం మెదడు.
  2. అది జ్ఞానేంద్రియాల నుండి నాడీ సంకేతాలు తెచ్చే జ్ఞాననాడులు ద్వారా సమాచారాన్ని అందుకుంటుంది.
  3. తరువాత వాటిని విశ్లేషించి చాలకనాడులు అని పిలువబడే నాడుల ద్వారా ప్రతిచర్యను చూపాల్సిన భాగాలకు సంకేతాలు పంపుతుంది.
  4. ఉదాహరణకు మన కాలి మీద దోమ కుట్టగానే జ్ఞాననాడులు దోమ కుట్టిన సమాచారాన్ని మెదడుకు చేరవేస్తాయి.
  5. మెదడు దోమను చంపాల్సిందిగా చాలకనాడుల ద్వారా చేతికి సమాచారం పంపుతుంది. అపుడు చేతితో దోమను చంపేస్తాం.

ప్రశ్న 2.
కంటి నిర్మాణమును పటము సహాయముతో వివరించండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 6th Lesson జ్ఞానేంద్రియాలు 1

  1. మన కంటిలో కంటిరెప్పలు, కనురెప్ప రోమాలు, కనుబొమ్మలు, అశ్రుగ్రంథులు ఉంటాయి.
  2. కంటి ముందు భాగాన్ని పలుచటి కంటిపొర కప్పి ఉంటుంది.
  3. కంటి గుడ్డు కంటి గుంతలో అమరి ఉంటుంది.
  4. కంటిగ్రుడ్డులో కేవలం 1/6వ వంతు భాగం మాత్రమే మన కంటికి కన్పిస్తుంది.
  5. కంటిలో మూడు ముఖ్యమైన పొరలు ఉన్నాయి. అవి దృఢస్తరం, రక్తపటలం నేత్రపటలం.
  6. దృఢస్తరం ఉబ్బి శుక్లపటలంను ఏర్పరుస్తుంది.
  7. దృఢస్తరం యొక్క కొనభాగంలో దృక్నడి కలుపబడుతుంది.
  8. రక్తపటలం నలుపురంగులో ఉండి అనేక రక్తనాళాలను కలిగి ఉంటుంది.
  9. తారక భాగాన్ని తప్ప కంటి యొక్క అన్ని భాగాల్ని రక్తపటలం ఆవరించి ఉంటుంది.
  10. తారక చుట్టూ రక్తపటలం నుండి ఏర్పడిన భాగము కంటిపాప.
  11. తారకకు వెనుక ద్వికుంభాకారంలో ఉండే కటకం ఉంటుంది.
  12. కంటిగుడు లోపలి భాగమును నేత్రోదక కక్ష, కాచావత్ కక్ష అనే రెండు భాగాలుగా కటకం విడగొడుతుంది.
  13. నేత్రపటలంలో దండాలు, శంకువులు ఉంటాయి.
  14. దృష్టి జానంలేని అంధచుక్క, మంచి దృష్టి జ్ఞానాన్ని కలిగిన పచ్చచుక్క నేత్రపటలంలో ఉంటాయి.
  15. పచ్చచుక్కను మేక్యులా అని, ఫోవియా అని కూడా అంటారు.

ప్రశ్న 3.
కన్ను పనిచేసే విధానమును వివరించండి.
జవాబు:

  1. కన్ను కాంతిని సేకరించి కుంభాకార కటకం ద్వారా కేంద్రీకరించి, కంటిలో వెనుకభాగాన ఉండే నేత్రపటలంపై ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది.
  2. కటకం వల్ల ఏర్పడే ప్రతిబింబంలో ఎడమ కుడిగాను, తలకిందులుగాను ఉంటుంది.
  3. ఈ తలకిందులైన ప్రతిబింబం మెదడు నిర్మాణంపై ప్రభావం చూపి జ్ఞానకేంద్రాలలో దాన్ని సక్రమంగా చేయడానికి మార్గాన్ని ఏర్పరచుకుంటుంది.
  4. అందువల్ల జ్ఞానేంద్రియాల నుండి వచ్చే సమాచారం చాలా వరకు మెదడులో వ్యతిరేకదిశ నుండి దాటిపోతుంది.
  5. మెదడులోని జ్ఞానకేంద్రాలలో పటాలన్నీ సాధారణముగా తిరగబడి, తలకిందులుగా అవుతాయి.
  6. కన్ను ఏర్పరచే ప్రతిబింబం మెదడులో మరొక పెద్ద ప్రక్రియకు లోనవుతుంది.

ప్రశ్న 4.
కాంతి గ్రాహకాలు అనగానేమి? అవి కాంతిని ఏ విధముగా గ్రహిస్తాయి?
జవాబు:

  1. నేత్రం పటలంలో ఉండే సున్నితమైన కాంతిని గ్రహించే కణములను కాంతి గ్రాహకాలు అంటారు.
  2. కాంతి గ్రాహకాలలో కాంతి శక్తిని శోషించుకోగలిగి, నాడీ ప్రేరణలను సృష్టించి ప్రత్యుత్తరమివ్వగలిగే దండాలు, శం అనే రెండు రకాల ప్రత్యేక కణాలు ఉంటాయి.
  3. మన కళ్ళు కొన్నిసార్లు చిమ్మచీకటిలోను, కొన్నిసార్లు కాంతివంతమైన వెలుతురులోనూ పనిచేస్తుంటాయి.
  4. అందుకనే ఈ రెండు రకాల కణాలు తగిన ప్రక్రియలను నిర్వహిస్తాయి.

ప్రశ్న 5.
నేత్రపటలం నందలి శంకువుల గురించి క్లుప్తంగా రాయండి.
జవాబు:

  1. రంగుల్లో స్వల్ప ప్రత్యేకతల్ని చూడగలిగే లక్షణం శంకువుల్లో ఉంది.
  2. దాదాపు ఏడు మిలియన్ల శంకువులు కంటిలో ఉంటాయి.
  3. అవి అయొడాప్సిన్ అనే వర్గపదార్థాన్ని కలిగి కాంతివంతమైన వెలుతురులో రంగుల్ని గుర్తిస్తాయి.
  4. నేత్రపటలం మధ్యభాగంలో ఉండే ఫోవియా అనే చిన్నభాగంలో శంకువులు గుమిగూడి ఉండి దృష్టి స్పష్టంగా ఉండేలా చేస్తాయి.

ప్రశ్న 6.
కన్నులు ఏ విధంగా సంరక్షించబడతాయి?
జవాబు:

  1. కనురెప్పలు, రెప్ప వెంట్రుకలు, కనుబొమ్మలు అశ్రుగ్రంథులతో కన్ను నిరంతరం రక్షించబడుతూ ఉంటుంది.
  2. కంటి ముందు భాగాన ఉన్న కంటిపొర కంటికి రక్షణ కల్పిస్తుంది.
  3. ఏదైనా అవసరం లేని పదార్థం కనుక కంటిలో పడితే వెంటనే ఆశ్రుగ్రంథులు ప్రేరేపితమై ఆ పదార్థాన్ని బయటకు పంపించివేసాయి.
  4. కంటిలో నేత్రక, కాచావత్ కక్షలో ఉండే ద్రవాలు కటకాన్ని, కంటి యొక్క ఇతర భాగాల్ని యాంత్రిక అఘాతాల నుండి రక్షిస్తాయి.
  5. కంటిపాపకు ముందుండే శుక్లపటలం, దృఢస్తరం ఒక పరిశుభ్రమైన కిటికీలా పనిచేస్తుంది. అది కంటిని కాంతికి ప్రత్యక్షంగా గురికాకుండా రక్షిస్తుంది.

AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు

ప్రశ్న 7.
వెలుపలి చెవి గురించి క్లుప్తంగా వివరించండి.
జవాబు:

  1. వెలుపలి చెవి ఒక గొప్ప మాదిరిగా ఉంటుంది. దీన్నే పిన్నా అని అంటారు.
  2. పిన్నా మగాన్ని స్రవించే సెరుమినస్ గ్రంథుల్ని, తైలాన్ని స్రవించే తైలగ్రంథుల్ని కలిగి ఉంటుంది.
  3. ఇవి శ్రవణ కుహరాన్ని మృదువుగా ఉండేలా చేస్తాయి. ఇంకా దుమ్ము, ధూళి శ్రవణ కుహరంలోకి చేరకుండా ఆపుతాయి.
  4. శ్రవణ కుహరాన్ని ఆడిటరీ మీటస్ అని కూడా అంటారు.
  5. శ్రవణ కుహరం చివరలో కర్ణభేరి అనే పలుచని పొర ఉంటుంది.
  6. ఇది వెలుపలి చెవికి, మధ్య చెవికి మధ్యలో ఉంటుంది. ఇది ఒక శంకువు ఆకారంలో ఉంటుంది.
  7. కర్ణభేరి సన్నటి భాగం మధ్యచెవి యొక్క మొదటి ఎముక కూటకం లేక సుత్తికి కలుపబడి ఉంటుంది.

ప్రశ్న 8.
మధ్య చెవి గురించి క్లుప్తంగా రాయండి.
జవాబు:

  1. కరభేరిపై కలిగిన ప్రకంపనాలకు పెంచడంలో మధ్యచెవి ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.
  2. మూడు ఎముకల గొలుసు కూటకము లేక సుత్తి, దాగలి లేక పట్టెడ, కర్ణాంతరాస్థి లేక అంకవన్నె ఈ పనికి సహకరిస్తాయి.
  3. మధ్య చెవి చివరిభాగాన్ని కప్పుతూ అండాకార కిటికీ అనే పొర ఉంటుంది.
  4. మధ్య చెవి, లోపలి చెవిలోకి వర్తులాకార కిటికీ ద్వారా తెరచుకుంటుంది.

ప్రశ్న 9.
అంతరచెవి నిర్మాణమును వివరించండి.
జవాబు:

  1. లోపలి చెవిలో త్వచాగహనంను ఆవరించి అస్లి గహనం ఉంటుంది.
  2. త్వచాగహనంలో పేటిక, అర్ధవర్తుల కుల్యలు, కర్ణావర్తం అనే భాగాలుంటాయి.
  3. పేటిక యొక్క ముందుభాగాన్ని సేక్యులస్ అని, వెనుకభాగాన్ని యుట్రిక్యులస్ అనీ అంటాం.
  4. వాటి నుండి వచ్చే నాడీ తంతువులు పేటికానాడిని ఏర్పరుస్తాయి.
  5. అర్ధవర్తులాకార కుల్యలు, పేటికకు కలుపబడి ఉండి అంతరలసిక అనే ద్రవాన్ని కలిగి ఉంటాయి.
  6. పేటిక, అర్థవర్తుల కుల్యలు కలిసి పేటికా ఉపకరణంను ఏర్పరుస్తాయి.
  7. ఇది శరీరస్థితి, సమతులనం సక్రమంగా ఉండేలా చూసి శరీర సమతాస్థితిని నిర్వహిస్తుంది.
  8. కర్ణావర్తం ఒక సర్పిలాకార నిర్మాణం. ఇది స్కాలావెస్టిబులై, స్కాలామీడియా, స్కాలాటింపాని అనే మూడు సమాంతర నాళాల్ని కలిగి ఉంటుంది.
  9. స్కాలా వెస్టిబులై, స్కాలాటింపాని పరలసిక ద్రవంతోనూ, స్కాలామీడియా అంతరలసిక ద్రవంతోనూ నిండి ఉంటాయి.
  10. ఇది కార్టి అంగాన్ని, ఇంకా చిన్న ప్రాథమిక జ్ఞాన కణాల్ని కలిగి ఉంటుంది.
  11. పేటికానాడి, కర్ణావర్తన నాడి కలిసి శ్రవణ నాడి ఏర్పడుతుంది.

ప్రశ్న 10.
శ్రవణ జ్ఞానం కలిగే విధమును వ్రాయుము
జవాబు:

  1. వెలుపలి చెవి శబ్ద తరంగాలను సేకరిస్తుంది. అవి శ్రవణకుల్యను చేరతాయి.
  2. అప్పుడు కర్ణభేరిని తాకుతాయి. కర్ణభేరి నుండి వచ్చే ప్రకంపనాలు కూటకము, దాగలి, కర్ణాంతరాస్థిలను చేరతాయి.
  3. కూటకము, దాగలి, కర్ణాంతరాస్థి శబ్ద ప్రకంపనాల తీవ్రతను పెంచుతాయి.
  4. కర్ణాంతరాస్థి ప్రకంపనాలను అండాకార కిటికీకి చేరుస్తుంది.
  5. అక్కడ నుండి అవి కర్ణావర్తం చేరుతాయి.
  6. త్వచాగహనం కదులుతుంది. దాంతో ప్రకంపనాలు కార్టె అంగాన్ని చేరుతాయి.
  7. ప్రేరణలు శ్రవణనాడి ద్వారా మెదడుకు చేరతాయి.
  8. మెదడు ఇచ్చిన ప్రతిస్పందనలను బట్టి వినడం జరుగుతుంది.

ప్రశ్న 11.
ముక్కు నిర్మాణమును గురించి వివరించండి.
జవాబు:
AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు 1

  1. మనకు బాహ్యంగా కనిపించే ముక్కు రెండు నాసికా రంధ్రాలను కలిగి ఉంటుంది.
  2. అవి నాసికా కుహరంలోకి తెరచుకుంటాయి.
  3. నాసికా విభాజకం నాసికా కుహరాన్ని రెండుగా విభజిస్తుంది.
  4. నాసికా కుహరం గోడలు శ్లేష్మస్తరాన్ని, చిన్న వెంట్రుకలని కలిగి ఉంటాయి.
  5. శ్లేష్మస్తరంలో ఋణ గ్రాహకాలు ఉంటాయి.

ప్రశ్న 12.
మన నాలుక మీద ఉండే వివిధ రకాల నిర్మాణముల గురించి రాయండి.
జవాబు:

  1. నాలుక మీద పొలుసుల వంటి నిర్మాణాలను ఫిలిఫార్మ్ పాపిల్లే అంటారు.
  2. గుండ్రంగా కనిపించే వాటిని ఫంగి ఫార్మ్ పాపిల్లే అంటారు.
  3. నాలుక వెనుకవైపు గుండ్రంగా ఉండే పెద్ద పాపిల్లే ఉంటాయి. వాటిని సర్కం వేలేట్ పాపిల్లే అంటారు.
  4. నాలుకకు ఇరువైపులా ఉబ్బెత్తుగా ఉండే నిర్మాణాలను ఫోలియేట్ పాపిల్లే అంటారు.
  5. అన్ని రకాల పాపిల్లేల్లోనూ రుచి కణికలు ఉంటాయి. ఒక్క ఫిలి ఫార్మ్ పాపిల్లేలో మాత్రం ఉండవు.

ప్రశ్న 13.
చర్మమును గురించి సంక్షిప్తంగా వివరించండి.
జవాబు:

  1. మన శరీరంలో అన్నింటికంటే వెలుపల ఉండే పొర చర్మం.
  2. చర్మం శరీర ఉష్ణోగ్రతను క్రమపరుస్తుంది.
  3. చర్మం స్పర్శ జ్ఞానేంద్రియం.
  4. స్పర్శ గ్రాహకాలు స్పర్శజ్ఞానాన్ని కలిగిస్తాయి.
  5. అన్ని అవయవాల కంటే చర్మం పెద్దది.
  6. మన శరీరానికి ప్రాథమిక రక్షణను చర్మం ఇస్తుంది.

ప్రశ్న 14.
మన జ్ఞానేంద్రియాలు ఉమ్మడిగా పనిచేస్తాయా? ఎందుకు? ఎందువలన పనిచేయవు?
జవాబు:

  1. అవును, మన జ్ఞానేంద్రియాలు కలిసి పనిచేస్తాయి.
  2. మన శరీరంలో జరిగే పనులన్నింటిని మెదడు నిర్వహిస్తుంది మరియు నియంత్రిస్తుంది. జ్ఞానేంద్రియాలను కూడా మెదడు సమన్వయపరుస్తుంది.
  3. మెదడు. ఈ విధముగా చేయకపోయినట్లైతే ప్రేరణలకు సంబంధించిన విశ్లేషణ మనను తికమకకు గురిచేస్తుంది.
  4. మెదడు నిరంతరం జ్ఞానేంద్రియాల నుండి ప్రేరణలను గ్రహించుట ద్వారా అవయవాలు కలిసి పనిచేయుటకు అవకాశం కల్పిస్తుంది.
  5. సమాచారమును సమన్వయము చేయుట ద్వారా మెదడు అన్ని భాగాలను కలిపి ఉంచుతుంది.

AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు

ప్రశ్న 15.
కనురెప్పలకు వెంట్రుకలు లేకపోతే ఏం జరుగుతుంది?
జవాబు:

  1. కనురెప్పల యొక్క ముఖ్యవిధి కంటిని ఎల్లప్పుడు తడిగా ఉంచడం.
  2. కనురెప్పల వెంట్రుకలు కంటిని దుమ్ము, ధూళి నుండి కాపాడతాయి.
  3. కనురెప్పలకు వెంట్రుకలు కనుక లేకపోయినట్లైతే కంటిగుడ్డు ఎల్లప్పుడూ తేమగా ఉండే అవకాశం లేదు.
  4. దుమ్ము, ధూళి నుండి రక్షణ ఉండదు.

ప్రశ్న 16.
మన చర్మం స్పర్శ జ్ఞానాన్ని ఎలా కలిగి ఉంటుంది?
జవాబు:

  1. మన శరీరపు వివిధ భాగాలలో స్పర్శ జ్ఞానం వేరుగా ఉంటుంది.
  2. మెడచుట్టూ మరియు వేళ్ళ చివరన స్పర్శ జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. అరచేయి, మోకాలు, చేతుల మీద స్పర్శ జ్ఞానం తక్కువగా ఉంటుంది.
  3. మన శరీరపు స్పర్శ జ్ఞానం ఈ క్రింది వాటిపై ఆధారపడి ఉంటుంది.
    a)మన శరీరపు చర్మం మందం మీద.
    b) స్పర్శ గ్రాహకాల సంఖ్య మీద.

9th Class Biology 6th Lesson జ్ఞానేంద్రియాలు Important Questions and Answers

ప్రశ్న 1.
కింది పటాన్ని పరిశీలించి భాగాలు గుర్తించండి. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు 3
ఎ) చెవిని స్థూలంగా ఎన్ని భాగాలుగా విభజిస్తారు?
జవాబు:
3 భాగాలుగా విభజిస్తారు.
1) బాహ్యచెవి, 2) మధ్యచెవి, 3) లోపలిచెవి

బి) చెవి ఎముకలను సరైన క్రమంలో తెలపండి.
జవాబు:
కూటకము, దాగలి, కర్ణాంతరాస్థి

సి) ధ్వని తరంగాల వల్ల చెవిలో కంపించే భాగం ఏది?
జవాబు:
కర్ణభేరి

డి) సమతాస్థితిని కలిగించే చెవిలోని భాగం ఏది?
జవాబు:
పేటికా ఉపకరణం

ప్రశ్న 2.
కర్ణభేరికి రంధ్రాలు పడితే ఏమవుతుంది?
జవాబు:

  1. కర్ణభేరికి రంధ్రం పడితే, శబ్ద ప్రకంపనాలు సరియైన ప్రేరణలుగా మార్చబడలేవు.
  2. ఇందువల్ల ఈ ప్రేరణలను శ్రవణ నాడి మెదడుకు చేర్చలేదు.
  3. అందువల్ల వినపడదు. చెవుడు వస్తుంది (Deafness).

ప్రశ్న 3.
కన్ను పటము గీచి భాగాలు గుర్తించండి. కంటిలో శంఖువులు లేకపోతే ఏమవుతుంది?
జవాబు:
AP Board 9th Class Biology Solutions 6th Lesson జ్ఞానేంద్రియాలు 1

  1. శంఖువులు ఎక్కువ కాంతిలో చూడడానికి, రంగులను గుర్తించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.
  2. శంఖువులు లేకపోతే ఎక్కువ వెలుతురులో చూడడానికి, రంగులను గుర్తించడానికి వీలుకాదు.

ప్రశ్న 4.
చర్మం తన స్పర్శజ్ఞానంను కోల్పోతే ఏమి జరుగుతుందో ఊహించి వ్రాయండి.
జవాబు:
a) శరీరాన్ని వేడి నుండి చలి నుండి కాపాడుకోలేము.
b) శరీర ఉష్ణోగ్రత క్రమబద్దం కాదు
c) స్పర్శ కోల్పోనపుడు చర్మానికి తగిలే గాయాలు, దెబ్బలు మనం గుర్తించలేము. అందువల్ల తీవ్ర రక్తస్రావం జరిగే మరణించే అవకాశం ఉన్నది.
d) నడవటం చాలా కష్టమవుతుంది.

AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు

ప్రశ్న 5.
కంటిలో శంకు కణాలు లోపిస్తే ఏమౌతుంది?
జవాబు:
రంగులను శక్తివంతమైన వెలుతురులో స్పష్టంగా గుర్తించలేము.

ప్రశ్న 6.
చర్మం ఒక జ్ఞానేంద్రియంగా పనిచేస్తుందని నీవెట్లా చెప్పగలవు?
జవాబు:

  1. చర్మం అన్నింటికన్నా పెద్దదైన జ్ఞానేంద్రియం
  2. ఇది మనకు స్పర్శను కలుగజేస్తుంది.
  3. మనశరీరంలో స్పర్శ జ్ఞానం వేరుగా ఉంటుంది.
  4. మెడచుట్టూ మరియూ వేళ్ళ చివరన స్పర్శజ్ఞానం ఎక్కువగా ఉంటుంది. అరచేయి, మోకాలు చేతుల మీద స్పర్శజ్ఞానం తక్కువగా ఉంటుంది.
  5. స్పర్శకు, ఉష్ణోగ్రతకు, పీడనానికి చర్మం సూక్ష్మగ్రాహ్యతను కలిగి ఉంటుంది.
  6. స్పర్శకు స్పర్శ గ్రాహకాలు, పీడనానికి పెసినియన్ గ్రాహకాలు, ఉష్ణోగ్రతకు నాసిప్టారులు వంటి ప్రత్యేక గ్రాహకాల్ని కలిగి ఉంటుంది.
  7. పై కారణాల వలన చర్మం ఒక జ్ఞానేంద్రియంగా పనిచేస్తుందని చెప్పవచ్చు.

ప్రశ్న 7.
1. A, B, C ల భాగాల పేర్లను రాయండి.
2. కంటిలో కటకం చేసే పని ఏమిటి?
3. నేత్రపటలంలో ఉండే ప్రత్యేకమైన కణాలేవి?
4. కంటికి వచ్చే ఏవైనా రెండు వ్యాధుల పేర్లు వ్రాయండి.
AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు 4
జవాబు:

  1. A) ధృడసరం, B) రక్తపటలం, C) నేత్రపటలం
  2. కన్ను కాంతిని సేకరించీ కుంభాకార కటకం ద్వారా కేంద్రీకరించి కంటి వెనుక భాగాన ఉండే నేత్ర పటలంపై ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది.
  3. దండాలు, కొనులు
  4. రేచీకటి, కండ్లకలక, శుక్లాలు ఏర్పడటం, Dry Eye మొదలగునవి.

9th Class Biology 6th Lesson జ్ఞానేంద్రియాలు 1 Mark Bits Questions and Answers

లక్ష్యాత్మక నియోజనము

1. ఇంద్రియజ్ఞానం మన శరీరంలో కలిగేలా ప్రేరేపించే కొన్ని పరిస్థితులు, పదార్థాలు
A) ఉత్తేజితాలు
B) క్రియాత్మకాలు
C) ఉత్ర్పేరకాలు
D) ఎంజైములు
జవాబు:
A) ఉత్తేజితాలు

2. పరిసరాల నుండి ప్రేరణలను గ్రహించే మన శరీర భాగాలు
A) కన్ను, చెవి
B) ముక్కు, నాలుక
C) చర్మం
D) అన్నీ
జవాబు:
D) అన్నీ

3. జ్ఞానేంద్రియాలు చేసే పనులన్నింటికి కేంద్రం
A) వెన్నుపాము
B) మెదడు
C) హృదయము
D) కన్ను
జవాబు:
B) మెదడు

4. జ్ఞానేంద్రియాల నుండి నాడీ ప్రచోదనలను తీసుకొనివచ్చేవి
A) చాలకనాడులు
B) వెన్నునాడులు
C) జ్ఞాననాడులు
D) అన్నీ
జవాబు:
C) జ్ఞాననాడులు

5. కంటి ముందుభాగంలో ఉండే పలుచని పొర
A) దృఢస్తరం
B) రక్తపటలం
C) కటకం
D) కంజెక్టివ్ (కంటిపొర)
జవాబు:
D) కంజెక్టివ్ (కంటిపొర)

6. కంటిగుద్దులో కేవలం ఎన్నవ వంతు భాగం మాత్రమే మనకు కన్పిస్తుంది?
AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు 5
జవాబు:
B

7. కంటినందుండే ఈ పొరలో ఎక్కువ సంఖ్యలో రక్తనాళాలుంటాయి.
A) కంటిపొర
B) దృఢస్తరం
C) రక్తపటలం
D) నేత్రపటలం
జవాబు:
C) రక్తపటలం

8. జెల్లీ వంటి ద్రవంతో నిండి ఉండే కంటి గుడ్డు భాగం
A) కాచావత్ క
B) నేత్రోదక కక్ష
C) రక్తపటలం
D) దృఢస్తరం
జవాబు:
B) నేత్రోదక కక్ష

AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు

9. కన్ను కాంతిని సేకరించి కుంభాకార కటకం ద్వారా కేంద్రీకరించి దీనిపై ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది.
A) దృఢస్తరం
B) కనుపాప
C) తారక
D) నేత్రపటలం
జవాబు:
D) నేత్రపటలం

10. నేత్రపటలం నందలి దండాలలో ఉండే వర్ణద్రవ్యం
A) రొడాప్సిన్
B) అయొడాప్సిస్
C) ఫోటాప్సిన్
D) కీటాప్సిన్
జవాబు:
A) రొడాప్సిన్

11. శంకువుల ఉపయోగం
A) చీకటిలో చూడడానికి
B) రంగులలోని తేడాలు గుర్తించలేకపోవుట
C) రంగులు గుర్తించడం
D) అశ్రువులను ఉత్పత్తిచేయటం
జవాబు:
C) రంగులు గుర్తించడం

12. నేత్రపటలంలోని ఈ భాగమునందు కాంతిగ్రాహకాలు ఉండవు.
A) అంధ చుక్క
B) పసుపు చుక్క
C) ఆకుపచ్చ చుక్క
D) నల్ల చుక్క
జవాబు:
A) అంధ చుక్క

13. కంటిలోని గ్రంథులు
A) లాక్రిమల్ గ్రంథులు
B) సెరుమినస్ గ్రంథులు
C) సెబేషియస్ గ్రంథులు
D) శ్లేష్మ గ్రంథులు
జవాబు:
A) లాక్రిమల్ గ్రంథులు

14. కంటిలోని ఈ భాగమును సరిచేయవచ్చును.
A) కంటిగ్రుడ్డు
B) ద్వికుంభాకార కటకం
C) నేత్ర పటలం
D) శుక్ల పటలం
జవాబు:
B) ద్వికుంభాకార కటకం

15. పిన్నా అని దీనిని అంటారు.
A) బాహ్య చెవి
B) మధ్య చెవి
C) లోపలి చెవి
D) కర్ణభేరి
జవాబు:
A) బాహ్య చెవి

16. మధ్య చెవిలోని ఎముకల గొలుసునందు ఉండేవి
A) కూటకము
B) దాగలి
C) కర్ణాంతరాస్థి
D) అన్నియు
జవాబు:
D) అన్నియు

17. మధ్య చెవి అంతరచెవిలోకి దీని ద్వారా తెరుచుకుంటుంది.
A) గుండ్రని కిటికి
B) అండాకార కిటికి
C) వర్తులాకార కిటికి
D) దీర్ఘవృత్తాకార కిటికి
జవాబు:
C) వర్తులాకార కిటికి

18. నాలికయందు గల రుచి కణికల సంఖ్య
A) 100
B) 1000
C) 10000
D) 5000
జవాబు:
C) 10000

19. ఋణ గ్రాహకాలు గల జ్ఞానేంద్రియం
A) చర్మం
B) కన్ను
C) చెవి
D) ముక్కు
జవాబు:
D) ముక్కు

20. మెటాలిక్ టేస్ట్ ఈ క్రింది. ఆహార పదార్థాలలో ఉంటుంది.
A) సహజ ఆహార పదార్థాలు
B) కృత్రిమంగా తయారైన ఆహార పదార్థాలు
C) పచ్చి ఆహార పదార్థాలు
D) వండిన ఆహార పదార్థాలు
జవాబు:
B) కృత్రిమంగా తయారైన ఆహార పదార్థాలు

AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు

21. నాలుక యందు రుచికలు ఈ నిర్మాణాలలో ఉంటాయి.
A) ఫంగి ఫార్మ్ పాపిల్లే
B) ఫోలియేట్ పాపిల్లే
C) ఫంగి ఫార్మ్ మరియు ఫోలియేట్ పాపిల్లే
D) ఫిలి ఫార్మ్ పాపిల్లో
జవాబు:
C) ఫంగి ఫార్మ్ మరియు ఫోలియేట్ పాపిల్లే

22. స్పర్శగ్రాహకాలు గల జ్ఞానేంద్రియం
A) చెవి
B) నాలుక
C) ముక్కు
D) చర్మం
జవాబు:
D) చర్మం

23. చర్మము నందలి అంతశ్చర్మంలో ఉండేవి
A) స్వేదగ్రంథులు
B) సెబేషియస్ గ్రంథులు, రక్తనాళాలు
C) రోమపుటికలు, కొవ్వులు
D) పైవి అన్నీ
జవాబు:
D) పైవి అన్నీ

24. చర్మము నందు స్పర్శకు గల ప్రత్యేక గ్రాహకాలు
A) టార్టెల్ రిసెప్టార్స్
B) పెసిమియన్ గ్రాహకాలు
C) నాసి రిసెప్టారులు
D) అన్నీ
జవాబు:
A) టార్టెల్ రిసెప్టార్స్

25. విటమిన్ లోపం వలన చర్మానికి వచ్చే వ్యాధి
A) కుష్టు
B) పెల్లాగ్రా
C) బొల్లి
D) తామర
జవాబు:
B) పెల్లాగ్రా

26. మెలనిన్ అనే వర్ణద్రవ్యం దీనిలో ఉంటుంది.
A) చెవి
B) నాలుక
C) ముక్కు
D) చర్మం
జవాబు:
D) చర్మం

27. ఈ క్రింది వాటిలో చర్మ వ్యాధిని గుర్తించండి.
A) శుక్లం
B) జిరాఫాల్మియా
C) లూకోడెర్మా
D) గ్లూకోమా
జవాబు:
C) లూకోడెర్మా

28. 2,300 సంవత్సరాల క్రిందట మన ఇంద్రియ జ్ఞానాలను గూర్చి తెలియచేసినది
A) అరిస్టాటిల్
B) ప్లాటో
C) A మరియు B
D) పైవేవీ కావు
జవాబు:
C) A మరియు B

29. స్పర్శజ్ఞానంలో నాడుల పాత్రను గూర్చి మొదటిసారిగా తెలిపినది
A) ఆల్బర్టస్ మేగ్నస్
B) అరిస్టాటిల్
C) ప్లాటో
D) కెప్లర్
జవాబు:
A) ఆల్బర్టస్ మేగ్నస్

30. భూభ్రమణం, భూపరిభ్రమణం గురించి వివరించి జ్ఞానేంద్రియంగా కన్ను పాత్రను వివరించే ప్రయత్నం చేసినవాడు
A) ఆల్బర్టస్ మేగ్నస్
B) అరిస్టాటిల్
C) ప్లాటో
D) జోహన్స్ కెప్లర్
జవాబు:
D) జోహన్స్ కెప్లర్

AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు

31. జ్ఞానేంద్రియాలు చేసే పన్నులన్నింటికి కేంద్రం
A) మెదడు
B) వెన్నుపాము
C) A మరియు B
D) పైవేవీ కావు
జవాబు:
C) A మరియు B

32. ఈ క్రింది వానిలో అసత్య వాక్యం
A) అధిక స్థాయిలో ఉండే ప్రేరణ అల్ప స్థాయిలో ఉండే ప్రేరణని కప్పివేస్తుంది.
B) బాహ్య ప్రపంచంలోని మార్పులను గుర్తించటం జ్ఞానేంద్రియాల ప్రధాన పని.
C) మార్పులేని ప్రేరణలకు మన జ్ఞానేంద్రియాలు అలవాటు పడవు.
D) ప్రేరణలు స్థిరంగా ఉంటే వాటి గురించి పట్టించుకోవటం తగ్గుతుంది.
జవాబు:
C) మార్పులేని ప్రేరణలకు మన జ్ఞానేంద్రియాలు అలవాటు పడవు.

33. మెటాలిక్ టేస్ట్ ఈ క్రింది ఆహార పదార్థాల్లో ఉంటుంది.
A) సహజ ఆహార పదార్థాలు
B) కృత్రిమంగా తయారయిన ఆహార పదార్థాలు
C) పచ్చి ఆహార పదార్థాలు
D) వండిన ఆహార పదార్థాలు
జవాబు:
B) కృత్రిమంగా తయారయిన ఆహార పదార్థాలు

34. కంటిలో ఉండే ముఖ్యమైన పొరల సంఖ్య
A) 1
B) 2
C) 3
D) 4
జవాబు:
C) 3

35. కంటిలోని కటకం
A) ద్విపుటాకార
B) ద్వికుంభాకార
C) పుటాకార
D) కుంభాకార
జవాబు:
B) ద్వికుంభాకార

36. దండాలు, శంఖువులు అనే కణాలు ఇక్కడ ఉంటాయి.
A) దృఢస్తరం
B) రక్తపటలం
C) నేత్రపటలం
D) పైవేవీ కావు
జవాబు:
C) నేత్రపటలం

37. నేత్ర పటలంలో దండాలు, శంఖువులు లేని ప్రాంతం
A) అంధచుక్క
B) పసుపుచుక్క
C) పచ్చచుక్క
D) తెల్లచుక్క
జవాబు:
A) అంధచుక్క

38. పసుపు చుక్కలో ఉండేవి
A) దండాలు
B) శంఖువులు
C) దండాలు మరియు శంఖువులు
D) పైవేవీ కావు
జవాబు:
B) శంఖువులు

39. కంటిలో ఏర్పడే ప్రతిబింబ లక్షణం
A) మామూలుగా నిలువుగా
B) మామూలుగా తలక్రిందులుగా
C) ఎడమ కుడిగా నిలువుగా
D) ఎడమ కుడిగా తలక్రిందులుగా
జవాబు:
D) ఎడమ కుడిగా తలక్రిందులుగా

40. హ్రస్వదృష్టి ఉన్నవారిలో ప్రతిబింబం ఏర్పడే ప్రదేశం
A) నేత్ర పటలానికి ముందు
B) నేత్రపటలంపై
C) నేత్ర పటలంకు వెనుక
D) పైవేవీ కావు
జవాబు:
A) నేత్ర పటలానికి ముందు

41. కంటిలో ఉండే గ్రాహకాలు
A) నాసిప్టారులు
B) టాక్టయిల్ రిసెప్టర్స్
C) పాసీనియన్ రిసెప్టర్స్
D) ఫోటో, రిసెప్టర్స్
జవాబు:
D) ఫోటో, రిసెప్టర్స్

AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు

42. కంటిలో ఉండే శంఖువుల సంఖ్య
A) 7 మిలియన్లు
B) 125 మిలియన్లు
C) 14 మిలియన్లు
D) 100 మిలియన్లు
జవాబు:
A) 7 మిలియన్లు

49. కంటిలో ఉండే దందాల సంఖ్య
A) 7 మిలియన్లు
B) 125 మిలియన్లు
C) 14 మిలియన్లు
D) 100 మిలియన్లు
జవాబు:
B) 125 మిలియన్లు

44. తక్కువ కాంతిలో వస్తువుల్ని చూడడానికి ఉపయోగపడేవి సంయోగ పదార్థాలుంటాయి?
A) దండాలు
B) కోనులు
C) A మరియు B
D) పైవేవీ కావు
జవాబు:
A) దండాలు

45. రంగుల్ని గుర్తించడానికి ఉపయోగపడే వర్ణద్రవ్యం
A) రొడాప్సిన్
B) అయోడాప్సిన్
C) పై రెండూ
D) పైవేవీ కావు
జవాబు:
B) అయోడాప్సిన్

46. అంధచుక్క ఉండే ప్రదేశం
A) నేత్రపటలం
B) దృక్మడి
C) నేత్రపటలం నుండి దృక్ నాడి వెలువడే చోటు
D) నేత్రపటలంలో కోనులు ఎక్కువగా ఉండే ప్రదేశం
జవాబు:
C) నేత్రపటలం నుండి దృక్ నాడి వెలువడే చోటు

47. ఆధార్ గుర్తింపుకార్డు ఇచ్చేటప్పుడు ఫోటో తీసే కంటి భాగం
A) కంటికటకం
B) కంటిపాప
C) తారక
D) రెటీనా
జవాబు:
B) కంటిపాప

48. శరీరం యొక్క సమతాస్థితి నిర్వహించే అవయవం
A) కన్ను
B) ముక్కు
C) చెవి
D) చర్మం
జవాబు:
C) చెవి

49. గుబిలిని స్రవించే గ్రంథులు
A) సెబేషియస్ గ్రంథులు
B) స్వేదగ్రంథులు
C) క్షీరగ్రంథులు
D) సెరుమినస్ గ్రంథులు
జవాబు:
D) సెరుమినస్ గ్రంథులు

50. శ్రవణ కుహరం చివరలో ఉండే నిర్మాణం
A) కర్ణభేరి
B) మూడు ఎముకల గొలుసు
C) అర్ధవర్తుల కుల్యలు
D) పేటిక
జవాబు:
A) కర్ణభేరి

AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు

51. మధ్యచెవిలో ఉండే ఎముకల గొలుసులోని మూడు ఎముకలు వరుసగా
A) కూటకం, దాగలి, కర్ణాంతరాస్థి
B) దాగలి, కూటకం, కర్ణాంతరాస్థి
C) కూటకం, కర్ణాంతరాస్థి, దాగలి
D) కర్ణాంతరాస్థి, దాగలి, కూటకం
జవాబు:
A) కూటకం, దాగలి, కర్ణాంతరాస్థి

52. పేటిక యొక్క ముందు భాగాన్ని ఏమంటారు?
A) యుట్రిక్యులస్
B) శాక్యులస్
C) కాక్లియ
D) అర్ధవర్తుల కుల్యలు
జవాబు:
B) శాక్యులస్

53. స్కాలా వెస్టిబ్యులై, స్కాలా మీడియా, స్కాలాటింపాని వీనిలోని భాగాలు.
A) త్వచాగహనం
B) అస్థి గహనం
C) పేటిక
D) కర్ణావర్తం
జవాబు:
D) కర్ణావర్తం

54. అంతరలసికా ద్రవంతో నిండి ఉండేది
A) స్కాలా వెస్టిబ్యులై
B) స్కాలాటింపాని
C) స్కాలామీడియా
D) పైవేవీ కావు
జవాబు:
C) స్కాలామీడియా

55. పేటికానాడి, కర్ణావర్తనాడి కలసి ఏర్పడేది
A) జిహ్వనాడి
B) దృక్నడి
C) శ్రవణనాడి
D) వాగన్నడి
జవాబు:
C) శ్రవణనాడి

56. అపుడే తయారయిన కాఫీలో వెంటనే ఆవిరయ్యే ఎన్ని
A) 500
B) 600
C) 700
D) 800
జవాబు:
B) 600

57. ఇప్పటివరకు శాస్త్రవేత్తలు ఎన్ని రకాల వాసనలను ఉత్పత్తి చేయగలిగే రసాయనాలను వర్గీకరించారు?
A) 1000
B) 1500
C) 2,000
D) 2,500
జవాబు:
B) 1500

58. మెదడులోని దేని ద్వారా వాసన సంకేతాలు ప్రసారం చెందవు?
A) మెడుల్లా
B) హైపోథాలమస్
C) ద్వారగొర్ధం
D) మస్తిష్కం
జవాబు:
B) హైపోథాలమస్

59. MSG అనగా
A) మోనోసోడియం గ్లుటామేట్
B) మెగ్నీషియం సోడియం గ్లుటామేట్
C) మోనోసల్ఫర్ గ్లుటామేట్
D) మెగ్నీషియం సల్ఫర్ గ్లుటామేట్
జవాబు:
A) మోనోసోడియం గ్లుటామేట్

60. రుచికణికలు దీనిలో ఉండవు.
A) ఫిలి ఫార్మ్ పాపిల్లే
B) ఫంగి ఫార్మ్ పాపిల్లే
C) సర్కం వాలేట్ పాపిల్లే
D) ఫోలియేట్ పాపిల్లే
జవాబు:
A) ఫిలి ఫార్మ్ పాపిల్లే

61. ప్రాచీన కాలం నుండి ఉన్నతమైన జ్ఞానంగా గుర్తించినది
A) దృష్టి జ్ఞానం
B) ఋణ జ్ఞానం
C) జిహ్వ జ్ఞానం
D) స్పర్శ జ్ఞానం
జవాబు:
D) స్పర్శ జ్ఞానం

AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు

62. నిర్జీవ కణాలుండే పొర
A) కార్నియం పొర
B) గ్రాన్యులర్ పొర
C) మాల్ఫీజియన్ పొర
D) అంతశ్చర్యం
జవాబు:
A) కార్నియం పొర

63. స్థిరంగా విభజనలు చెందుతూ ఉండే పొర
A) కార్నియం పొర
B) గ్రాన్యులర్ పొర
C) మాల్ఫీజియన్ పొర
D) అంతఃశ్చర్శం
జవాబు:
C) మాల్ఫీజియన్ పొర

64. స్వేదగ్రంథులు, తైలగ్రంథులుండే పొర
A) కార్నియం పొర
B) గ్రాన్యులర్ పొర
C) మాల్ఫీజియన్ పొర
D) అంతఃశ్చర్మం
జవాబు:
D) అంతఃశ్చర్మం

65. శరీర ఉష్ణోగ్రతను క్రమపరిచేది
A) కన్ను
B) ముక్కు
C) చెవి
D) చర్మం
జవాబు:
D) చర్మం

66. అన్ని అవయవాల కంటే పెద్దది
A) చర్మం
B) హృదయం
C) మూత్రపిండం
D) మెదడు
జవాబు:
A) చర్మం

67. యుక్తవయసు వచ్చిన వారిలో శరీరాన్ని కప్పి ఉంచే చర్మ ఉపరితల వైశాల్యం
AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు 6
జవాబు:
A

68. చర్మంను కాంతి నుంచి రక్షించేది
A) టానిన్
B) మెలనిన్
C) టైలిన్
D) హి మోగ్లోబిన్
జవాబు:
B) మెలనిన్

69. ఈ క్రింది వానిలో పీడన గ్రాహకాలు
A) టార్టెల్ రిసెప్టర్స్
B) ఫోటో రిసెప్టర్స్
C) పాసీనియన్ రిసెప్టర్స్
D) నాసిస్టర్స్
జవాబు:
C) పాసీనియన్ రిసెప్టర్స్

70. ఈ క్రింది వానిలో స్పర్శ గ్రాహకాలు
A) టార్టెల్ రిసెప్టర్స్
B) ఫోటో రిసెప్టర్స్
C) పాసీనియన్ రిసెప్టర్స్
D) నాసిస్టర్స్
జవాబు:
A) టార్టెల్ రిసెప్టర్స్

71. ఈ క్రింది వానిలో ఉష్ణ గ్రాహకాలు
A) టార్టెల్ రిసెప్టర్స్
B) ఫోటో రిసెప్టర్స్
C) పాసీనియన్ రిసెస్టర్స్
D) నాసిస్టర్స్
జవాబు:
D) నాసిస్టర్స్

72. ఈ క్రింది వానిలో విటమిన్ల లోపం వలన చర్మానికి వచ్చే వ్యాధి
A) బొల్లి
B) పెల్లాగ్రా
C) తామర
D) పొంగు
జవాబు:
B) పెల్లాగ్రా

73. కంటి ఆరోగ్యా నికి అవసరమైన విటమిన్
A) విటమిన్ ‘ఎ’
B) విటమిన్ ‘బి’
C) విటమిన్ ‘సి’
D) విటమిన్ ‘డి’
జవాబు:
A) విటమిన్ ‘ఎ’

74. ఇంద్రియ జ్ఞానమన్నది ఒక సంక్లిష్టమైన విధానం. దీనిలో పాల్గొనేవి
A) జ్ఞానేంద్రియాలు
B) జ్ఞానేంద్రియాలు, నాడీ ప్రేరణలు
C) జ్ఞానేంద్రియాలు, నాడీ ప్రేరణలు, మెదడు
D) మెదడు, నాడీప్రేరణలు
జవాబు:
C) జ్ఞానేంద్రియాలు, నాడీ ప్రేరణలు, మెదడు

AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు

75. వెలుపలి చెవిగనుక శబ్ద తరంగాలని కేంద్రీకరించకపోతే శ్రవణకుల్య
A) అనేక రకాల శబ్దాలను గట్టిగా వినగలదు
B) ఏమీ వినలేదు
C) కొద్దిగా వినగలదు
D) శబ్దం పుట్టుకని, రకాన్ని తెలుసుకోలేదు
జవాబు:
B) ఏమీ వినలేదు

76. ఒక వ్యక్తి యొక్కకంటి గుడ్డు కండరాలు పనిచేయకుండా పాడైతే, తప్పనిసరిగా కలిగే ప్రభావం
A) ఆ వ్యక్తి కళ్ళు మూసుకోలేడు.
B) కన్ను కదపలేడు, రంగుల్ని బాగా చూడగలడు.
C) కంటిలో నొప్పి వస్తుంది. కళ్ళు మూసుకోలేడు.
D) ఆ కండరాలకు చేరే నాడులు పనిచేయవు.
జవాబు:
B) కన్ను కదపలేడు, రంగుల్ని బాగా చూడగలడు.

77. ఒక వ్యక్తి నాలుక ఎక్కువ ఉప్పగా ఉన్న పదార్థం రుచి చూసింది. అపుడు ఆ వ్యక్తి
A) ఉప్పటి పదార్థాలను తినడం నేర్చుకుంటాడు.
B) ఉప్పటి పదార్థాలను తినడానికి ఇష్టపడతాడు.
C) ఉప్పటి పదార్థాలను తినడానికి ఇష్టపడడు.
D) అంతకంటే తక్కువ ఉప్పదనం కలిగిన పదార్థాల రుచి తెలుసుకోలేడు.
జవాబు:
D) అంతకంటే తక్కువ ఉప్పదనం కలిగిన పదార్థాల రుచి తెలుసుకోలేడు.

78. మధ్య చెవి అంతర చెవిలోకి దీని ద్వారా తెరుచుకుంటుంది.
A) గుండ్రని కిటికి
B) అండాకార కిటికి
C) వర్తులాకార కిటికి
D) దీర్ఘవృత్తాకార కిటికి
జవాబు:
C) వర్తులాకార కిటికి

79. సరియైన జతను గుర్తించండి.
1) పిన్నా – వెలుపలి చెవి
2) కర్ణభేరి – సెరుమినస్ గ్రంథులు
3) మైనం ఉత్పత్తి – కర్ణభేరి
A) 1 మాత్రమే
B)3 మాత్రమే
C) 2, 3
D) 1, 3
జవాబు:
C) 2, 3

80. క్రింది వాక్యాలను చదవండి.
a) పోవియా అనే చిన్న భాగంలో శంకువుల గుమిగూడి ఉండి దృష్టిని స్పష్టంగా ఉండేలా చేస్తాయి.
b) కనుపాపకు ముందుండే శుక్లపటలం ఒక పరిశుభ్రమైన కిటికీలా పనిచేస్తుంది.
A) a సరియైనది, b సరియైనది కాదు
B) b సరియైనది, a సరియైనది కాదు
C) a, b లు రెండూ సరియైనవి కావు
D) a, b లు రెండూ సరియైనవి
జవాబు:
D) a, b లు రెండూ సరియైనవి

81. సరిగా గుర్తించిన జతను గుర్తించండి.
1) బొల్లి – చర్మం
2) గ్లూకోమా – ముక్కు
3) చెవుడు – చెవి
A) 1, 3
B) 2, 3
C) 1 మాత్రమే
D) 2 మాత్రమే
జవాబు:
D) 2 మాత్రమే

82. ఈ క్రింది వాక్యాలను చదవండి.
a) అంధచుక్క దృక్ నాడి కంటి నుండి బయటకు పోయే చోట ఉంటుంది.
b) చెవిలోని సెరుమిన్ గ్రంథులు తైలాన్ని స్రవిస్తాయి.
A) a మరియు b లు సరియైనవే
B) a మరియు b లు సరియైనవి కావు
C) a సరియైనది, b సరియైనది కాదు
D) b సరియైనది, a సరియైనది కాదు
జవాబు:
C) a సరియైనది, b సరియైనది కాదు

83. సరిగా జతపరచని జతను గుర్తించండి.
1) వాసన – గ్రాహక కణాలు
2) కన్నీళ్ళు – అశ్రు గ్రంథులు
3) మైనము – సెరుమిన్ గ్రంథులు
A) 1, 2
B) 2,3
C) 2 మాత్రమే
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

కంటి వ్యాధి పేరు, దోషము పేరు లక్షణాలు
1. వయసు సంబంధిత మాక్యులా (పచ్చచుక్క) క్షీణత ఈ వ్యాధి పరిస్థితిలో నేత్రపటలం నందలి మధ్యభాగమైన మాక్యులా లేదా ఫోవియా క్షీణించిపోతుంది. అంధత్వము వస్తుంది.
2. ఎస్టిగ్మాటిజమ్ నేత్రపటలం నందలి వంపు అసంపూర్ణంగా ఉండడం.
3. కంటిశుక్లం (కెటరాక్ట్) కంటి ముందరభాగంలో ఉండే పొర ఉబ్బి మెత్తగా అయి పగులుతుంది. కళ్ళు సరిగా కనపడవు.
4. సెంట్రల్ రెటినల్ వీన్ ఆక్లుసన్ నేత్రపటం నందలి సిరలో రక్తప్రవాహానికి ఆటంకం ఏర్పడడం.
5. కలర్ బ్లైండ్ నెస్ (వర్ణాంధత) సాధారణ పరిస్థితులలో రంగులను గుర్తించకపోవటం, చూడలేకపోవడం.

పై పట్టికను పరిశీలించి ఈ క్రింది ప్రశ్నకు సరియైన సమాధానాన్ని ఎన్నుకోండి.

84. నేత్రపటలం నందలి వంపులో మార్పు రావటం వలన కలిగే వ్యాధి.
A) ఎస్టిగ్మాటిజమ్
B) కంటిశుక్లం
C) సింట్రల్ రెటినల్ లీన్ ఆక్లుసన్
D) వర్ణాంధత
జవాబు:

కంటి వ్యాధి పేరు, దోషము పేరు లక్షణాలు
1. కండ్ల కలక కంటి ముందర పొర ఉబ్బుతుంది. కన్ను ఎరుపెక్కుతుంది, మండుతుంది, నీరు కారుతుంది.
2. శుక్లపటలం మార్పు చెందడం శుక్లపటలం మీద మచ్చలు, ఉబ్బటం వలన లేదా అక్రమాకారం ఉండడం వలన కళ్ళు మెరవడం, చూపు చెదరడం జరుగుతుంది.
3. డయాబెటిక్ రెటినోపతి మధుమేహం వలన కంటికి వచ్చు వ్యాధి నేత్రపటలం నందలి రక్తనాళాలలో మార్పు వలన కలుగుతుంది.
4. పొడికళ్ళు లేదా జిరాఫ్తాల్మియా కంటిలోని అశ్రుగ్రంథులు అశ్రువులను ఉత్పత్తి చెయ్యవు. కంటిపొర పొడిగా అవుతుంది.
5. దీర్ఘదృష్టి (హైపర్ మెట్రోపియా) ఇది వక్రీభవన దోషము. కన్ను సరిగ్గా కాంతిని వక్రీభవించదు. అందువలన ప్రతిబింబాలు నేత్రపటలం వెనుక ఏర్పడతాయి. దూరపు వస్తువులు కనపడతాయి. దగ్గర వస్తువులు సరిగ్గా కనపడవు.
6. గ్లూకోమా కంటిలోని దృక్మడి పాడయిపోతుంది. దీనివలన కంటిలో ఎక్కువ పీడనము కలుగుతుంది.
7. కెరోలైటిస్ శుక్లపటలం ఉబ్బుతుంది. అందువలన కన్ను ఎర్రగా మారి నొప్పి కలిగిస్తుంది. చూచునపుడు నొప్పి ఉంటుంది.

పై పట్టికను పరిశీలించి ఈ క్రింది ప్రశ్నకు సరియైన సమాధానాన్ని ఎన్నుకోంది.

85. ఈ వ్యాధిలో ప్రతిబింబాలు రెటీనా వెనుక ఏర్పడతాయి.
A) పొడికళ్ళు లేదా జిరాపాల్మియా
B) దీర్ఘదృష్టి
C) గ్లూకోమా
D) కెరోలైటిస్
జవాబు:
B) దీర్ఘదృష్టి

86. ఈ చిత్రం సూచించినది ఏమి?
AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు 7
A) చర్మం
B) కన్ను
C) నాలుక
D) చెవి
జవాబు:
C) నాలుక

87. పటంలోని A, B, C భాగాల పేర్లు.
AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు 8
జవాబు:
C

88. కంటికి సంబంధిత వ్యాధులను అరికట్టడానికి నీవు ఏమి చేస్తావు.
A) కంటిని 3-4 సార్లు కడుగుతాను
B) విటమిన్ – A ఉన్న ఆహారం తింటాను
C) కళ్ళను నలపనుత
D) పైవన్నియూ
జవాబు:
D) పైవన్నియూ

AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు

89. సరిగా జతపరచండి.
1) ఫోవియా ( ) a) నాలుక
2) ఫోలియట్ పాపిల్లె ( ) b) ఆడిటరీమీటన్
3) శ్రవణ కుహరం ( ) c) పచ్చచుక్క
A) 1 – a, 2 – b, 3-c
B) 1-b, 2 – a, 3-c
C) 1 – c, 2 – b, 3- a
D) 1-c, 2-a, 3-b
జవాబు:
D) 1-c, 2-a, 3-b

90. మెలనిన్ వర్ణకం యొక్క లోపం దేనికి దారితీస్తుంది.
A) ల్యూకోడెర్మా
B) పెల్లాగ్రా
C) రింగ్ వార్మ్
D) టానింగ్
జవాబు:
A) ల్యూకోడెర్మా

91. అశ్రుగ్రంధులచే విడుదలయ్యే అశ్రువుల విధి
A) రంగులను గుర్తించుట
B) కంటిలోకి ప్రవేశించే కాంతిని నియంత్రించుట
C) కంటిని తడిగా, తేమగా వుంచుట
D) ఏ విధి లేదు
జవాబు:
C) కంటిని తడిగా, తేమగా వుంచుట

92. కంటిని నేత్రోదయ కక్ష్య కచావత్ కక్ష్యగా విభజించునది
A) కటకము
B) కనుపాప
C) తారక
D) రక్తపటలము
జవాబు:
A) కటకము

93. శరీరస్థితి సమతులనం (సమతాస్థితి)ని క్రమబద్ధం చేయునది
A) యుట్రిక్యులస్ మాత్రమే
B) యుట్రిక్యులస్, సేక్యులస్
C) యుట్రిక్యులస్, సేక్యులస్, అర్ధవృత్త కుల్యాలు
D) యుట్రిక్యులస్, సేక్యులస్, అర్ధవృత్త కుల్యాలు మరియు కర్ణావర్తనం
జవాబు:
C) యుట్రిక్యులస్, సేక్యులస్, అర్ధవృత్త కుల్యాలు

94. జీవశాస్త్రీయంగా వాసన ఇలా ప్రారంభమవుతుంది.
A) ఆహారాన్ని చూడడం వలన
B) ఆహారపు వాసన గురించి ఆలోచించడం వలన
C) ఆహారాన్ని రుచి చూడడం వలన
D) ముక్కులోని రసాయన సంఘటన వలన
జవాబు:
D) ముక్కులోని రసాయన సంఘటన వలన

95. మెలనిన్ అనునది
A) పీడన గ్రాహకము
B) గోర్లు, వెంట్రుకలను ఏర్పరుస్తుంది
C) చర్మం రంగు నిర్ధారిస్తుంది
D) ఉష్ణాన్ని క్రమబద్ధం చేస్తుంది.
జవాబు:
C) చర్మం రంగు నిర్ధారిస్తుంది

96. P : రవి కొన్ని రంగులను గుర్తించలేకున్నాడు.
Q: రవి కంటి నందు కోన్ కణాలు లోపించినవి.
A) P, Q లు రెండూ సరియైనవి
B) P కి Q సరియైన వివరణ కాదు
C) P కి ఏ సంబంధము లేదు
D) P Q సరైన వివరణ
జవాబు:
A) P, Q లు రెండూ సరియైనవి

97. ఆధార్ గుర్తింపు కార్డులు జారీ చేసేందుకు కంటిపాప ఫోటోలను తీయుటకు కారణము.
A) కంటిపాపలు ప్రతి వ్యక్తికి వేరు వేరుగా ఉంటాయి
B) కంటి రంగులు వేరు వేరుగా ఉంటాయి
C) దృష్టి దోషములను గుర్తించుటకు
D) సమయాభావంను పాటించుటకు
జవాబు:
A) కంటిపాపలు ప్రతి వ్యక్తికి వేరు వేరుగా ఉంటాయి

98. చెవి నిర్మాణంలో ఎముకల వరుస క్రమము
A) సుత్తి, పట్టెడ, అంకవన్నె
B) అంకవన్నె, పట్టెడ, సుత్తి
C) పట్టెడ, అంకవన్నె, సుత్తి
D) సుత్తి, అంకవన్నె, పట్టెడ
జవాబు:
A) సుత్తి, పట్టెడ, అంకవన్నె

AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు

99. P: జ్ఞానేంద్రియాలు ప్రేరణలను మాత్రమే గ్రహిస్తాయి.
Q: మెదడు ప్రేరణలను విశ్లేషించి ప్రతి స్పందనలను ఏర్పరుస్తుంది.
A) P మాత్రమే సరియైనది
B) Q మాత్రమే సరియైనది
C) P మరియు Q సరియైనది
D) P మరియు Q సరియైనవి కావు
జవాబు:
C) P మరియు Q సరియైనది

100. వృద్ధులు రుచిని గ్రహించలేకపోవడానికి కారణం ఏమైవుంటుందో ఊహించండి.
A) ఘ్రాణగ్రాహకాల సామర్థ్యం తగ్గడం
B) రుచి కళికల సామర్థ్యం తగ్గడం
C) నాళికా కుహరం మూసుకుపోవడం
D) A మరియు B
జవాబు:
D) A మరియు B

101. అధిక ఉప్పు కలిగిన ఆహారపదార్థమును తీసికొన్న తరువాత ఆవ్యక్తి.
A) ఉప్పు రుచి తెలుసుకుంటాడు
B) ఉప్పు రుచిని ఇష్టపడతారు
C) ఉప్పు కలిగిన పదార్థములను ఇష్టపడడు
D) తక్కువ ఉప్పు కలిగిన రుచిని గుర్తించలేడు
జవాబు:
D) తక్కువ ఉప్పు కలిగిన రుచిని గుర్తించలేడు

102. కింది వాటిని జతపరచండి.
1. నాలుక ( ) a) ఘాణగ్రాహకాలు
2. చెవి ( ) b) కర్ణభేరి
3. ముక్కు ( ) c) రుచికణికలు
A) c, a, b
B) a, b, c
C) c, b, a
D) b, a, c
జవాబు:
C) c, b, a

103. చెవిలో ఉన్న చిన్న ఎముక పేరు
A) సుత్తి
B) అంకవన్నె
C) పట్టెడ
D) కర్ణభేరి
జవాబు:
B) అంకవన్నె

104. కంటి సంబంధిత వ్యాధులను అరికట్టడానికి నీవు ఏమి చేస్తావు?
A) కంటిని 3-4 సార్లు కడుగుతాను
B) విటమిన్-A ఉన్న ఆహారం తింటాను
C) కళ్ళను నలపను
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

మీకు తెలుసా?

“ఆధార్” లాంటి గుర్తింపు కార్డులను ఇచ్చేటప్పుడు వారు మీ కళ్ల ఫోటోలను తీసుకుంటారు. మీ కంట్లో వారు దీన్ని ఫోటోగా తీసుకుంటారో మీకు తెలుసా ? కంటిపాప (Iris) ఎవరికి వారికే ప్రత్యేకంగా ఉంటాయి. అందుకే వేలిముద్రల మాదిరిగానే వాటిని కూడా గుర్తింపు కోసం ఉపయోగిస్తారు.

ప్రతి రుచికణికలోనూ ఒక కుహరం, రంధ్రాన్ని కలిగి ఉంటుంది. ఆ రంధ్రాన్ని రుచిరంధ్రం అంటాం. రుచికణిక దగ్గర ఉండే ఉపకళా కణాలు రుచికణాలు లేక గ్రాహకాలను ఏర్పరుస్తాయి. ఈ గ్రాహక కణాలు, వాటికి ఆధారం ఇచ్చే కణాలు, కుహరంలో ఉంటాయి. ప్రతి గ్రాహక కణం, ఒక నాడీ తంతువుకు కలుపబడి ఉంటుంది. అన్ని నాడి తంతువులు కలిసి ప్రధాన నాడులుగా ఏర్పడతాయి. అవి మెదడుకు, వెన్నుపాముకి వార్తలను అందిస్తాయి.

జ్ఞానేంద్రియాలు జ్ఞానానికి ద్వారాలు, మనం ఈ జ్ఞానేంద్రియాల ద్వారా ప్రకృతిని చూస్తాం, వింటాం, ఆస్వాదిస్తాం. జ్ఞానేంద్రియాల గురించి జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం బాగా ఉంటుంది. అదే మంచి జీవనానికి దారితీస్తుంది.

AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు 9
ఆల్బర్టస్ మేగ్నస్ ఇటలీలో ఒక చర్చి బిషప్. ప్రకృతి పరిశీలకుడు. అరిస్టాటిల్ ఆలోచనలను అనుసరిస్తూ విజ్ఞానశాస్త్రాన్ని ఇష్టపడే వ్యక్తి. మొదటిసారిగా వాటిని విమర్శిస్తూ, విస్తృతమైన విద్యా విషయక చర్చనీయాంశాలుగా అందరికీ అందుబాటులో ఉంచిన వ్యక్తి. స్పర్శజ్ఞానంలో నాడుల పాత్రను మొదటిసారిగా తెలిపిన వ్యక్తి ఆయన.

17వ శతాబ్దం నుండి జ్ఞానేంద్రియాలకు సంబంధించిన శరీర ధర్మశాస్త్రం బాగా అధ్యయనం చేయబడింది. ఆ సమయంలోనే బాగా దగ్గరగా చూడడం కోసం కంటికి సంబంధించి, అనేక ఉపకరణాలను కనుగొనడం జరిగింది. క్రీ. శ. 1600వ సంవత్సరంలో భూమి భ్రమణం – పరిభ్రమణం గురించి తెలిపిన ప్రముఖ ఖగోళశాస్త్రవేత్త జోహాన్స్ కెప్లర్ (Johannes Kepler) జ్ఞానేంద్రియంగా కన్ను పాత్రను వివరించే ప్రయత్నం చేశారు.

ఇటీవల కాలంలో శాస్త్రవేత్తలు జ్ఞానేంద్రియాలను గురించి ఎన్నో విషయాలు కనుగొన్నారు. జ్ఞానేంద్రియాలు ఇంకా మనకు తెలిసీ తెలియని ఎన్నో రకాల ఆశ్చర్యకరమైన క్లిష్టమైన, నమ్మశక్యంకాని పనులను చేయగలవని తెలిపారు. నాడీ సంకేతాల విద్యుత్ రసాయనిక ఆధార ప్రకారం మెదడులో జ్ఞానానికి సంబంధించిన ప్రత్యేక కేంద్రాలు, అవి చేసే పనుల గురించి సరైన అవగాహనను కూడా పెంపొందించారు.

AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు

అరిస్టాటిల్ కాలం నుండి 19వ శతాబ్దం వరకు ఇంద్రియాల వరకు పొందే జ్ఞానాలు ఐదుగా పేర్కొనేవారు. అయితే ఆధునిక కాలంలో ఆ సంఖ్య (5), మన శరీరంలోని జ్ఞానేంద్రియాల సంఖ్యను తెలియజేసేదిగా మారింది.

మనం లెక్కకు ఐదు జ్ఞానేంద్రియాలనే కలిగి ఉన్నా, ఇంద్రియ జ్ఞానాలు మాత్రం చాలా ఎక్కువే ఉంటాయి. ఉదాహరణకి మనం పీడనాన్ని తెలుసుకునేందుకు ఒక స్పర్శజ్ఞానాన్ని, వేడిమి, చల్లదనాన్ని తెలుసుకునేందుకు మరొకటి, కంపనాలు, తరచుదనం తెలుసుకునేందుకు ఇంకొకటి ‘అలా ఎన్నో ఉన్నా లెక్కకి మాత్రం అన్నీ ఒకే రకమైన స్పర్శజ్ఞానంగా భావించడం జరుగుతుంది.

పునరాలోచన
AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు 2

AP 9th Class Biology Important Questions 5th Lesson జీవులలో వైవిధ్యం

These AP 9th Biology Important Questions and Answers 5th Lesson జీవులలో వైవిధ్యం will help students prepare well for the exams.

AP Board 9th Class Biology 5th Lesson Important Questions and Answers జీవులలో వైవిధ్యం

9th Class Biology 5th Lesson జీవులలో వైవిధ్యం 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
ప్రకృతిలో ఉండే వైవిధ్యానికి సంకేతం?
జవాబు:
ఎత్తైన శిఖరాలలో, ఎడారులలో, మైదానాలలో, లోతైన సముద్రాలలో అతి చల్లని ప్రాంతాల నుండి అతి వేడైన ప్రాంతాలకు జీవులు వ్యాపించి ఉండడం ప్రకృతిలో ఉండే వైవిధ్యానికి సూచిక.

ప్రశ్న 2.
ద్విదళ బీజాల మొక్కల లక్షణాలు ఏవి?
జవాబు:
మొక్కల గింజలలో రెండు దళాలు కలిగి ఉండటం, జాలాకార ఈనెల వ్యాపనం మరియు ప్రధాన వేరు వ్యవస్థను ద్విదళబీజ మొక్కలు కలిగి ఉంటాయి.

ప్రశ్న 3.
ఏకదళ బీజ మొక్కల లక్షణాలు ఏవి?
జవాబు:
మొక్కల గింజలందు ఒకే దళం, సమాంతర ఈనెల వ్యాపనం మరియు గుబురు వేరువ్యవస్థను ఏకదళ బీజ మొక్కలు కలిగి ఉంటాయి.

ప్రశ్న 4.
వైవిధ్యం అనగానేమి?
జవాబు:
ఒకే జాతి జీవుల మధ్య ఉండే తేడాలను వైవిధ్యం అంటారు.

ప్రశ్న 5.
వరీకరణము అనగానేమి?
జవాబు:
ఒక జనాభాలో వంశపారంపర్యంగా వచ్చే కొన్ని లక్షణాలు మరియు ఆ జీవులు ఎలా పరిణామం చెందాయో తెలిపే అంశాల ఆధారంగా వాటన్నింటిని ఒక సమూహం కిందికి తీసుకురావడాన్ని వర్గీకరణం అంటారు.

AP 9th Class Biology Important Questions 5th Lesson జీవులలో వైవిధ్యం

ప్రశ్న 6.
ఛార్లెస్ డార్విన్ రచించిన గ్రంథం ‘జీవుల పుట్టుక’ దేనిని గురించి తెలియచేస్తుంది?
జవాబు:
‘జీవుల పుట్టుక’ గ్రంథం జీవపరిణామము గురించి తెలియచేస్తుంది.

ప్రశ్న 7.
లిన్నేయస్ (1758) జీవులను ఎన్ని రాజ్యా లుగా విభజించాడు? అవి ఏవి?
జవాబు:
లిన్నేయస్ జీవులను రెండు రాజ్యాలుగా విభజించాడు. అవి :

  1. వెజిటేబిలియా (స్టాంగే)
  2. అనిమేలియా

ప్రశ్న 8.
ఎర్నెస్ట్ హెకెల్ (1866) జీవులను ఎన్ని రాజ్యాలుగా విభజించాడు?
జవాబు:
ఎర్నెస్ట్ హెకెల్ జీవులను 3 రాజ్యా లుగా విభజించాడు. అవి :

  1. ప్రొటిస్టా
  2. ప్లాంటే
  3. అనిమేలియా

ప్రశ్న 9.
చాటన్ (1925) జీవులను ఎన్ని సామ్రాజ్యాలుగా విభజించాడు? అవి ఏవి?
జవాబు:
చాటన్ జీవులను 2 సామ్రాజ్యాలుగా విభజించాడు. అవి :

  1. కేంద్రకపూర్వజీవులు
  2. నిజకేంద్రక జీవులు

ప్రశ్న 10.
కోప్ లాండ్ (1938) జీవులను ఎన్ని రాజ్యా లుగా విభజించాడు? అవి ఏవి?
జవాబు:
కోప్ లాండ్ (1938) జీవులను 4 రాజ్యా లుగా విభజించాడు. అవి :

  1. మొనిరా
  2. ప్రొటీస్టా
  3. ప్లాంటే
  4. అనిమేలియా

ప్రశ్న 11.
విబేకర్ (1969) జీవులను ఎన్ని రాజ్యా లుగా విభజించాడు. అవి ఏవి?
జవాబు:
విట్టేకర్ జీవులను 5 రాజ్యా లుగా విభజించాడు. అవి :

  1. మొనిరా
  2. ప్రొటీస్టా
  3. ప్లాంటే
  4. ఫంగై
  5. అనిమేలియా

ప్రశ్న 12.
ఊజ్ ఎట్ ఆల్ (1990) జీవులను ఎన్ని డొమైన్స్ గా విభజించాడు? అవి ఏవి?
జవాబు:
ఊజ్ ఎట్ ఆల్ (1990) జీవులను 3 డొమైన్లుగా అవి :

  1. బాక్టీరియా
  2. అరాకియా
  3. యూకారియా

ప్రశ్న 13.
కెవాలియర్ -స్మిత్ (1998) జీవులను ఎన్ని డొమైన్లుగా విభజించాడు? అవి ఏవి?
జవాబు:
కెవాలియర్ – స్మిత్ (1998) జీవులను 6 డొమైన్లుగా విభజించాడు. అవి :

  1. బాక్టీరియా
  2. ప్రోటోజోవా
  3. క్రోమిస్టా
  4. ప్లాంటే
  5. ఫంగై
  6. అనిమేలియా

ప్రశ్న 14.
ద్వినామీకరణం అనగానేమి? దీనిని ఎవరు ప్రవేశపెట్టారు?
జవాబు:
ప్రతి జీవికి రెండు పేర్లతో నామకరణం చేయడమును ద్వినామీకరణం అంటారు. అందులో మొదటి పదం ప్రజాతిని, రెండవ పదం జాతిని తెలియచేస్తుంది. కరోలియస్ వాన్ లిన్నేయస్ ద్వినామీకరణం విధానమును ప్రవేశపెట్టాడు.

ప్రశ్న 15.
లిన్నేయస్ వర్గీకరణములో జీవుల అమరిక విధానమేది?
జవాబు:
ప్రజాతి సమూహాలను కుటుంబము అని, కుటుంబాలన్నీ కలిపి క్రమాలని, క్రమాలన్నీ కలిపి తరగతులు, తరగతులన్నీ కలిపి వర్గాలుగా, వర్గాలన్నీ కలిపి రాజ్యాలుగా పేర్కొన్నాడు. జీవులను రెండు రాజ్యాలుగా గుర్తించాడు.

AP 9th Class Biology Important Questions 5th Lesson జీవులలో వైవిధ్యం

ప్రశ్న 16.
లిన్నేయస్ జీవుల వర్గీకరణకు ఎంచుకున్న అంశాలు ఏవి?
జవాబు:
వివిధ జీవుల మధ్య ఉన్న పోలికలు, భేదాలను జీవుల వర్గీకరణకు అంశాలుగా లిన్నేయస్ ఎంచుకున్నాడు.

ప్రశ్న 17.
థామస్ విట్టేకర్ జీవుల వర్గీకరణకు ఎంచుకున్న లక్షణాలు ఏవి?
జవాబు:
జీవులలో కేంద్రకం ఉన్నవి లేదా కేంద్రకం లేనివి మరియు జీవులు ఆహారాన్ని పొందే విధానంలో భేదాలను బట్టి థీమస్ విట్టేకర్ జీవుల వర్గీకరణను పొందుపరిచాడు.

ప్రశ్న 18.
థర్మోఫిల్స్, హేలోఫిల్స్ అసాధారణ పరిస్థితులలో జీవించడానికి కారణం ఏమిటి?
జవాబు:
థర్మోఫిల్స్, హేలో ఫిల్స్ యొక్క DNA నిర్మాణంలో, అమరికలో వైవిధ్యము ఉండడము వలన అసాధారణ పరిస్థితులలో జీవించగలుగుతున్నాయి.

ప్రశ్న 19.
స్వతంత్ర పూర్వీక కణమైన ‘లూకా’ నుండి ఉద్భవించిన మూడు రకాల కణాల తరువాత కాలంలో నిర్దేశించిన రంగాలు ఏవి?
జవాబు:
అరాఖియా, బాక్టీరియా, యూకేరియా

ప్రశ్న 20.
‘జాతి’ అనగానేమి?
జవాబు:
ఒకే రకమైన లక్షణాలు కలిగి ఉండి, జంటగా లేదా స్వతంత్రంగా తమ తమ సంతతిని ఉత్పత్తి చేయగల జీవుల సముదాయాన్ని ‘జాతి’ అంటారు.

ప్రశ్న 21.
మొనీరా జీవుల నిర్దిష్ట లక్షణమేది? ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
నిజకేంద్రకం లేని ఏకకణజీవులు మొనీరా జీవులు.
ఉదా : అనబిన, బాక్టీరియా,

ప్రశ్న 22.
మొనీరా రాజ్యంలో గల ప్రధాన సమూహాలేవి.
జవాబు:
ఆర్కె బాక్టీరియా, యూబాక్టీరియా మరియు సయానోబాక్టీరియా మొనీరా రాజ్యంలో గల ప్రధాన సమూహాలు.

ప్రశ్న 23.
ప్రొటీస్టా జీవుల ముఖ్య లక్షణాలను పేర్కొనండి.
జవాబు:
చాలావరకు ఏక కణజీవులు, కొన్ని మాత్రం బహుకణజీవులు నిజకేంద్రక జీవులు.
ఉదా : అమీబా, యూగ్లీనా, పారామీషియం.

AP 9th Class Biology Important Questions 5th Lesson జీవులలో వైవిధ్యం

ప్రశ్న 24.
శిలీంధ్ర జీవుల ప్రత్యేక లక్షణాలు ఏవి?
జవాబు:
చాలావరకు బహుకణజీవులు కొన్ని మాత్రం ఏకకణజీవులు సిద్ధబీజాల సహాయంతో ప్రత్యుత్పత్తి, వేళ్ళ వంటి నిర్మాణాల సహాయంతో ఆహారాన్ని సేకరించే పరపోషకాలు.
ఉదా : రైజోపస్, మ్యూకార్, అగారికస్.

ప్రశ్న 25.
మొక్కలను వర్గీకరించడానికి ఎంచుకునే లక్షణాలు ఏవి?
జవాబు:
ఆహారాన్ని సేకరించే విధానం, ప్రత్యుత్పత్తి అవయవాలు, ప్రత్యుత్పత్తి జరుపుకునే విధానాన్ని బట్టి మొక్కలను వర్గీకరిస్తారు.

ప్రశ్న 26.
విత్తనాలకు, సిద్ధబీజాలకు మధ్యగల భేదాలేవి?
జవాబు:
విత్తనాలు పుష్పంలోని అండకోశం నుండి ఉత్పత్తి అవుతాయి. వీటిలో ఎక్కువ పరిమాణంలో ఆహారం నిల్వ ఉంటుంది. సిద్ధబీజాలు సిద్ధబీజాశయం నుండి ఉత్పత్తి అవుతాయి. తక్కువ మొత్తంలో ఆహారం నిల్వ ఉంటుంది.

ప్రశ్న 27.
జంతువులలో కనిపించే సామాన్య లక్షణాలు ఏవి?
జవాబు:
నిజకేంద్రక బహుకణ జీవులు, పరపోషకాలు, కణాలలో కణత్వచం ఉండదు. చలనం కోసం ప్రత్యేకమయిన అవయవాలు ఉంటాయి.

ప్రశ్న 28.
ఏ లక్షణం ఆధారంగా జంతువులను వర్గీకరించడం జరిగినది?
జవాబు:
జంతువుల శరీర నిర్మాణంలో ఉన్న వ్యత్యాసం ఆధారంగా వాటిని వర్గీకరించడం జరిగింది.

ప్రశ్న 29.
పొరిఫెర జీవుల ప్రధాన లక్షణాలు ఏవి?
జవాబు:
రంధ్రాలు కలిగిన చలనాంగాలు లేని స్థిర సముద్ర జీవులు. శరీరం అస్థిపంజరంలో కప్పబడి ఉంటుంది. వీటిని స్పంజికలు అంటారు.
ఉదా : యూప్లిక్టీలియ, సైకాన్, స్పంజీలా

ప్రశ్న 30.
సీలెంటిరేటా నిడేరియ జీవుల లక్షణాలు ఏవి?
జవాబు:
నీటిలో నివసించే ద్విస్తరిత, శరీరకుహరం కలిగి, కొన్ని సమూహాలుగా లేదా ఒంటరిగా జీవిస్తాయి.
ఉదా: హైడ్రా, జెల్లీఫిష్ మరియు పగడాలు

ప్రశ్న 31.
ప్లాటిహెల్మింథిస్ జీవుల ముఖ్య లక్షణాలు రాయండి.
జవాబు:
ద్విపార్శ్వ సౌష్టవం, త్రిస్తరిత మరియు నిజశరీర కుహరం లేని బల్లపరుపు జీవులు. వీటిని చదును పురుగులంటారు. ఉదా : ప్లనేరియా (స్వతంత్ర్యం), టీనియా (పరాన్నజీవి)

ప్రశ్న 32.
నిమటోద వర్గ జీవుల ముఖ్య లక్షణాలు ఏవి?
జవాబు:
ఈ వర్గ జీవుల శరీరం సూపాకారంగా, విస్తరిత, ద్విపార్వ సౌష్టవం మరియు మిధ్యాకుహరం కలిగిన జీవులు. కణజాలాల విభేదనం కలిగి ఉంటాయి.
ఉదా : ఉకరేరియా మరియు ఆస్కారిస్ లుంబికాయిడ్స్ నులిపురుగు.

ప్రశ్న 33.
అనెలిడ జీవుల ముఖ్య లక్షణాలు ఏవి?
జవాబు:
అనెలిడ జీవులు ద్విపార్శ్వ సౌష్టవం, త్రిస్తరిత, నిజశరీరకుహరం మరియు ఖండితాలు గల శరీరం గల జీవులు. అన్ని రకాల ఆవాసాలలో ఉంటాయి.
ఉదా : వానపాము, జలగ.

ప్రశ్న 34.
ఆర్రోపొడ జీవుల ముఖ్య లక్షణాలు ఏవి?
జవాబు:
ఆర్రోపొడ జీవులు శరీరం ద్విపార్శ్వసౌష్టవం, ఖండితాలు కలిగి స్వేచ్ఛాయుత రక్తప్రసరణ మరియు కీళ్ళు గల కాళ్ళు కలిగిన జీవులు.
ఉదా : రొయ్యలు, సీతాకోకచిలుకలు, బొద్దింకలు.

AP 9th Class Biology Important Questions 5th Lesson జీవులలో వైవిధ్యం

ప్రశ్న 35.
మొలస్కా వర్గజీవుల గురించి రాయండి.
జవాబు:
మొలస్కా వర్గజీవులు స్వేచ్ఛాయుత రక్తప్రసరణ వ్యవస్థ, కుచించుకుపోయిన శరీరకుహరం, ద్విపార్వ సౌష్టవం మరియు విసర్జన వ్యవస్థ వృక్కాలతో నిర్మితమై ఉంటుంది. పాదం వంటి అంగంతో చలిస్తాయి. ఉదా : నత్తలు, ఆల్చిప్పలు, కోమటి సంచులు.

ప్రశ్న 36.
‘అఖైనోడర్మేటా’ అనగానేమి?
జవాబు:
గ్రీకు భాషలో ఇఖైనోడర్మేటా అనగా ముళ్ళవంటి చర్మం కలిగిన జీవులు.
ఉదా : సముద్ర నక్షత్రం, సీ అర్చిళ్లు.

ప్రశ్న 37.
ప్రోటోకార్డేటా జీవుల లక్షణాలు తెలుపండి.
జవాబు:
ప్రొటోకారేటాలు త్రిస్తరిత, ద్విపార్శ్వ సౌష్టవం, శరీర కుహరం కలిగిన జీవులు. ఈ జీవులలో పృష్ఠవంశం జీవితంలో ఏదో ఒక దశలో తప్పనిసరిగా ఉంటుంది.
ఉదా : బెలనోగ్లోసెస్, ఎంఫియాక్సిస్

ప్రశ్న 38.
సకశేరుక జీవులను ఎన్ని తరగతులుగా విభజించారు? అవి ఏవి?
జవాబు:
సకశేరుక జీవులను ఐదు తరగతులుగా విభజించారు. అవి : 1. చేపలు 2 ఉభయచరాలు 3. సరీసృపాలు 4. పక్షులు 5. క్షీరదాలు

ప్రశ్న 39.
చేపల ముఖ్య లక్షణాలు ఏవి?
జవాబు:
చేపల ముఖ్య లక్షణాలు :
చర్మంపై పొలుసులు, మొప్పలతో జలశ్వాసక్రియ, రెండు గదుల గుండె కలిగి నీటిలో నివసిస్తాయి.

ప్రశ్న 40.
ఉభయచర జీవుల ముఖ్య లక్షణములు ఏవి?
జవాబు:
ఉభయచర జీవులు :
నేలమీద, నీటిలోని జీవించగల శీతల రక్త జంతువులు. గుండె నందు మూడు గదులుంటాయి.
ఉదా : కప్ప, సాలమాండర్

ప్రశ్న 41.
సరీసృపాల యొక్క ముఖ్య లక్షణములు ఏవి?
జవాబు:
సరీసృపాలు :
చర్మంపైన పొలుసులు ఉంటాయి. శీతల రక్త జంతువులు. గుండెనందు మూడు గదులు ఉంటాయి. మొసళ్ళలో నాలుగు గదుల గుండె ఉంటుంది.
ఉదా : పాములు, బల్లులు, తొండలు.

AP 9th Class Biology Important Questions 5th Lesson జీవులలో వైవిధ్యం

ప్రశ్న 42.
క్షీరదాల ముఖ్య లక్షణములు తెలుపండి.
జవాబు:
క్షీరదాల ముఖ్య లక్షణములు బాహ్య చెవులు, నాలుగు గదుల గుండె, చర్మం వెంట్రుకలతో కప్పబడి స్వేద మరియు పాల గ్రంథులుంటాయి. శిశోత్పాదకాలు (పిల్లలను కని పాలిచ్చే జంతువులు)

ప్రశ్న 43.
క్షీరదములను నివసించే ప్రదేశాన్ని బట్టి ఎన్ని సమూహములుగా విభజించారు?
జవాబు:
క్షీరదములను నివసించే ప్రదేశాన్ని బట్టి 3 సమూహములుగా విభజించారు. అవి :

  1. నేలపై నివసించే క్షీరదాలు
  2. సముద్రపు క్షీరదాలు
  3. ఎగిరే క్షీరదాలు

ప్రశ్న 44.
నేలపై నివసించే క్షీరదములు ఎన్ని రకములు?
జవాబు:
నేలపై నివసించే క్షీరదములు 3 రకములు. అవి : మార్సూపియల్స్, ప్రైవేట్స్, రోడెంట్స్

AP 9th Class Biology Important Questions 5th Lesson జీవులలో వైవిధ్యం

ప్రశ్న 45.
మార్సుపియల్స్ క్షీరద ప్రత్యేక లక్షణమేది?
జవాబు:
మార్సుపియల్స్ క్షీరద ప్రత్యేక లక్షణం :
పిల్లలను సంరక్షించడానికి ఒక సంచి వంటి నిర్మాణము ఉదరభాగములో ఉంటుంది.
ఉదా : కంగారూ

ప్రశ్న 46.
ప్రైమేట్స్ క్షీరదముల లక్షణములేవి?
జవాబు:
ప్రైమేట్స్ క్షీరదముల లక్షణము : అభివృద్ధి చెందిన చేతులు, కాళ్ళు, వేళ్ళకు గోళ్ళుంటాయి. తెలివైన సంఘజీవులు
ఉదా : కోతి, మానవుడు

ప్రశ్న 47.
రోడెండ్స్ క్షీరదముల ప్రత్యేక లక్షణం ఏది?
జవాబు:
రోడెండ్స్ క్షీరదముల ప్రత్యేక లక్షణం దవడలను కలిగి ఆహారాన్ని ముక్కలు చేయడానికి కుంతకాలను ఉపయోగిస్తాయి.
ఉదా : ఎలుక

ప్రశ్న 48.
ద్విపార్శ్వ సౌష్టవం కలిగిన జీవులు అనగానేమి?
జవాబు:
ద్విపార్శ్వ సౌష్టవం కలిగిన జీవులు అనగా శరీరం యొక్క కుడి ఎడమ భాగాలు సమానంగా ఉండే జీవులు.

ప్రశ్న 49.
అనుపార్శ్వ సౌష్టవం కలిగిన జీవులు అనగానేమి?
జవాబు:
అనుపార్శ్వ సౌష్టవం కలిగిన జీవులు అనగా మధ్య అక్షము చుట్టూ క్రమానుగతంగా శరీర భాగాల అమరిక ఉంటే అటువంటి నిర్మాణమును అనుపార్శ్వ సౌష్టవం అంటారు. నోరు మధ్యగా ఉండి దాని చుట్టూ ఐదు సమాన భాగాలు విస్తరించి యుండు విధానం.

ప్రశ్న 50.
ద్విస్తరిత జీవులు అనగానేమి?
జవాబు:
ద్విస్తరిత జీవులు అనగా శరీరం రెండు త్వచాలతో తయారయిన జీవులు.
ఉదా : సీలెంటిరేటా

ప్రశ్న 51.
త్రిస్తరిత జీవులు అనగానేమి?
జవాబు:
త్రిస్తరిత జీవులు అనగా శరీరం మూడు పొరలుగా విభేదనం చెంది ఉంటుంది.
ఉదా : ప్లాటి హెల్మింథిస్, నిమటోడ, అనెలిడ, ఇఖైనోడర్మేటా

AP 9th Class Biology Important Questions 5th Lesson జీవులలో వైవిధ్యం

ప్రశ్న 52.
ఇఖైనోడర్మేటా వర్గజీవుల ప్రత్యేక లక్షణాలేవి?
జవాబు:
ఇఖైనోడర్మేట వర్గజీవులు ముళ్ళవంటి చర్మం కలిగిన త్రిస్తరిత, అనుపార్శ్వ సౌష్టవం, శరీర కుహరం జల విసర్జన వ్యవస్థ గల జీవులు.
ఉదా : సముద్ర నక్షత్రం, సీ అర్చిన్లు.

ప్రశ్న 53.
కరోలస్ వాన్ లిన్నేయస్ వర్గీకరణ విధానమును ఏ విధముగా ప్రశంసిస్తావు?
జవాబు:
లిన్నేయస్ ప్రతిపాదించిన వర్గీకరణ శతాబ్దాలుగా ఉన్న వర్గీకరణలన్నింటిని అధిగమించింది. జీవులను ఒక క్రమ పద్ధతిలో వాటి మధ్య ఉన్న పోలికలు, భేదాలను అధ్యయనం చేయడం ద్వారా వర్గీకరించడం జరిగినది.

ప్రశ్న 54.
ప్రాంతాలను బట్టి జీవులకు ఉన్న పేర్లలోని వ్యత్యాసమును అధిగమించడంలో లిన్నేయస్ చేసిన కృషి ఏమిటి?
జవాబు:
లిన్నేయస్ ప్రతి జీవికి రెండు పేర్లతో నామకరణం చేయడం వలన జీవులను పేర్లను బట్టి అధ్యయనం చేయడం జరిగింది. ప్రపంచమంతటా ఉండి అందరిచే ఆమోదించబడినది.

ప్రశ్న 55.
జీవులలో వైవిధ్యం ఉండదమును నీవు ఏ విధంగా అభినందిస్తావు?
జవాబు:
ప్రకృతి జీవరాసులు అన్నింటిదని, రకరకాల ప్రాంతాలలో వేరు వేరు రకాల జీవరాసులు ఉన్నాయని అవి ప్రకృతి యొక్క సౌందర్యమును ఇనుమడింపచేస్తున్నాయని వాటిని కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నదని భావిస్తాను.

ప్రశ్న 56.
లిన్నేయస్ వర్గీకరణములోని లోపాలను అధిగమించడానికి ప్రయత్నము చేసిన థామస్ విట్టేకర్ సేవలను నీవు ఏవిధంగా అభినందిస్తావు?
జవాబు:
విట్టేకర్ ప్రతిపాదించిన 5 రాజ్యాల వర్గీకరణలో నూతన పద్ధతులు, నూతన ఆధారాలు పొందుపరచాడు. జీవుల మధ్య ఉన్న పోలికలు, భేదాలను బట్టి జీవులను 5 రాజ్యాలుగా వర్గీకరించాడు.

ప్రశ్న 57.
గబ్బిలం పక్షి కాదు క్షీరదమని నీవు ఏ విధముగా భావిస్తావు?
జవాబు:
పుట్టిన గబ్బిలము పాలకోసం తల్లిపాల మీద ఆధారపడుతుంది. శరీరం మీద రోమాలు కలవు. ఇది ఎగర గలిగిన క్షీరదము కాని పక్షి కాదు.

ప్రశ్న 58.
మానవులలో వైవిధ్య లక్షణాలు కలవు అని ఎలా చెప్పగలవు?
జవాబు:
ఏ ఇద్దరు మానవులు ఒకటి కాదనియు, వేలిముద్రలు మరియు కంటి పాపలు వేరు వేరుగా ఉండుట వలన మానవులలో వైవిధ్యము కలదని చెప్పవచ్చు.

AP 9th Class Biology Important Questions 5th Lesson జీవులలో వైవిధ్యం

ప్రశ్న 59.
మీకే గాని జంతువులను వర్గీకరించడానికి అవకాశం వస్తే జీవులను దేని ఆధారంగా వర్గీకరిస్తావు?
జవాబు:
జీవి నిజకేంద్రక జీవా? లేదా కేంద్రక జీవా? బహుకణ జీవా, ఏకకణజీవా? ప్రత్యుత్పత్తి విధానమేది? ఆహార సంపాదన ఎలా చేస్తుంది? అన్న అంశాల ఆధారంగా జంతువులను వర్గీకరిస్తాను.

ప్రశ్న 60.
బంగాళాదుంపలను వివిధ భాషలలో ఏ ఏ పేర్లతో పిలుస్తారో రాయండి.
జవాబు:
బంగాళాదుంపలను హిందీలో ఆలు, తమిళంలో ఉరుళక్కిజ్ హంగు, మరాఠీలో బటాటా, ఒడియాలో బలాటి ఆలు అని పిలుస్తారు.

ప్రశ్న 61.
జీవ వైవిధ్యమును కాపాడుటకు నీవు చేయు కార్యకలాపములు ఏవి?
జవాబు:
జీవ హింస చేయకూడదనియు, జీవ సంరక్షణ కేంద్రాలు, వన సంరక్షణ సమితులు, జంతు ప్రదర్శనశాలలు ఏర్పాటుకు తగు చర్యలను చేపడతాను.

ప్రశ్న 62.
ఆక్రోపొడ వర్గ జీవుల ఉపయోగములు ఏవి?
జవాబు:
ఆర్రోపొడ జీవులు, పరాగసంపర్కం, తేనె సేకరణ, పట్టు పరిశ్రమ, లక్క తయారీల యందు ఉపయోగపడతాయి.

ప్రశ్న 63.
సంవత్సరాల తరబడి వర్గీకరణ విధానం ఎందుకు మార్పునకు లోనవుతుందో చెప్పగలరా?
జవాబు:
సంవత్సరాల తరబడి వర్గీకరణ విధానం మార్పుకు లోనవ్వడానికి కారణాలు : కొత్త జీవులను కనిపెట్టడం, జన్యుశాస్త్రంలో పురోగతి నురియు శక్తివంతమైన సూక్ష్మదర్శినిలు తయారుచేయడం.

ప్రశ్న 64.
కారేటా వరంలోని ఉపవరాలు ఏమిటి?
జవాబు:
కార్డేటా వర్గంలో మూడు ఉపవర్గాలు కలవు. అవి : 1. యూరోకార్డేటా 2. సెఫలోకార్డేటా 3. వర్టిబ్రేటా

ప్రశ్న 65.
ఐ.బి.ఎస్ ఆమోదం పొందిన వర్గీకరణ విధానం ఏమిటి?
జవాబు:
హెవాలియర్ మరియు స్మిత్ 1998లో ప్రతిపాదించిన నూతన వర్గీకరణ విధానాన్ని 2004 లో అంతర్జాతీయ జీవశాస్త్రవేత్తల (ఐ.బి.యస్) ఆమోదం పొందింది.

AP 9th Class Biology Important Questions 5th Lesson జీవులలో వైవిధ్యం

ప్రశ్న 66.
వర్గీకరణలో చిన్న ప్రమాణం ఏమిటి?
జవాబు:
వర్గీకరణలో అతిచిన్న ప్రమాణం జాతి.

9th Class Biology 5th Lesson జీవులలో వైవిధ్యం 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
జీవుల వర్గీకరణ వలన కలిగే లాభాలు ఏమిటి?
జవాబు:

  1. వివిధ జంతువుల అధ్యయనము వర్గీకరణ వలన సులభం అవుతుంది.
  2. వివిధ జీవసమూహాల మధ్య ఉన్న అంతర సంబంధాలను అర్థం చేసుకోవడానికి వర్గీకరణం అవసరం.
  3. వర్గీకరణం వలన జీవుల మధ్య ఉన్న వైవిధ్యంను కనుగొనవచ్చు.
  4. వర్గీకరణం వలన వివిధ జంతువులు సరళము నుండి సంక్లిష్టముగా పరిణామం చెందిన విధమును తెలుసుకోవచ్చు.
  5. జంతువుల భౌగోళిక విస్తరణమును అధ్యయనము చేయడానికి వర్గీకరణ సమాచారము ఉపయోగపడుతుంది.

ప్రశ్న 2.
వెన్నెముక కలిగిన జీవులను ఎన్ని ఉప తరగతులుగా విభజించారు? అవి ఏవి?
జవాబు:
వెన్నెముక కలిగిన జీవులను 5 ఉప తరగతులుగా విభజించారు. అవి.

  1. చేపలు
  2. ఉభయచరాలు
  3. సరీసృపాలు
  4. పక్షులు
  5. క్షీరదాలు.

ప్రశ్న 3.
వైవిధ్యం, జీవవైవిధ్యం మరియు వర్గీకరణం అనగానేమి?
జవాబు:
వైవిధ్యం :
ఒకే జాతి జీవుల మధ్య ఉండే భేదాలను వైవిధ్యం అంటారు.

జీవవైవిధ్యం :
ఒకే జాతి జీవుల మధ్య, వివిధ జాతి జీవుల మధ్య మరియు వివిధ ఆవరణ వ్యవస్థల మధ్య గల వైవిధ్యం.

వర్గీకరణం :
ప్రకృతిలో ఉన్న జీవుల గురించి క్రమబద్ధమైన అధ్యయనం చేయడానికి తోడ్పడే శాస్త్రం.

ప్రశ్న 4.
ప్రాచీన కాలంలో భారతీయ శాస్త్రవేత్తలు వర్గీకరణకు ఏ విధముగా తోడ్పాటును అందించారు?
జవాబు:

  1. భారతదేశంలో మొట్టమొదటిగా క్రీ.శ. మొదటి, రెండవ శతాబ్దాలలో వైద్యశాస్త్రంలో గొప్ప పరిశోధన జరిగింది.
  2. చరకుడు, సుశ్రుతుడు మొక్కలను, వాటి ఔషధ గుణాలను ఆధారంగా చేసికొని వర్గీకరించారు.
  3. మొదటిగా పరాశర మహర్షి ‘వృక్షాయుర్వేద’ అనే గ్రంథంలో వర్గీకరణ అనే అంశాన్ని పొందుపరిచారు.
  4. పుష్పాలను ఆధారంగా చేసుకొని పరాశర మర్షి ఈ వర్గీకరణ చేశాడు.

ప్రశ్న 5.
కరోలస్ లిన్నేయస్ వర్గీకరణము గురించి రాయండి.
జవాబు:

  1. 1758 లో కరోలస్ వాన్ లిన్నేయస్ ప్రతిపాదించిన వర్గీకరణ శతాబ్దాలుగా ఉన్న వర్గీకరణలన్నింటినీ అధిగమించింది.
  2. ఈయన ప్రతి జీవికి రెండు పేర్లతో నామకరణం చేశాడు. దీనిని ద్వినామీకరణం అంటారు. అందులో మొదటి పదం ప్రజాతిని, రెండవ పదం జాతిని తెలియచేస్తుంది.
  3. ఆ తరువాత ప్రజాతి సమూహాలను కుటుంబము అని, కుటుంబాలన్నీ కలిపి క్రమము, క్రమములన్నీ కలిపి తరగతులు, తరగతులన్నీ కలిపి వర్గాలుగా, వర్గాలన్నీ కలిపి రాజ్యా లుగా పేర్కొన్నారు.
  4. జీవులను రెండు రాజ్యాలుగా గుర్తించారు. వాటిలో ఒకటి అనిమేలియా (జంతువులు), రెండవది ప్లాంటే (మొక్కలు).

AP 9th Class Biology Important Questions 5th Lesson జీవులలో వైవిధ్యం

ప్రశ్న 6.
సజీవులు ఏ విధంగా వర్గీకరించబడ్డాయి?
జవాబు:

  1. శరీర నిర్మాణమును అనుసరించి జీవులు వర్గీకరించబడ్డాయి.
  2. జీవుల మధ్య ఉన్న పోలికలు, భేదాలను అనుసరించి జీవులను వర్గీకరించడమైనది.

ప్రశ్న 7.
ద్వినామీకరణ విధానం అనగానేమి? దీనిని ఎవరు ప్రతిపాదించారు?
జవాబు:

  1. ఒక జీవిని ఒక శాస్త్రీయ నామంతో పిలవడాన్ని నామీకరణ విధానం అంటారు.
  2. ఇది ప్రపంచం అంతటా ఒకేలా ఉంటుంది.
  3. ప్రతి జీవికి రెండు పేర్లుండే విధానమును కరోలస్ లిన్నేయస్ ప్రతిపాదించాడు.
  4. మొదటి పేరు ప్రజాతిని, రెండో పేరు జాతిని తెలియజేస్తాయి. దీనినే ద్వినామీకరణ విధానం అంటారు.

ప్రశ్న 8.
సిద్ధబీజము మరియు విత్తనము మధ్యగల భేదములేవి?
జవాబు:

సిద్ధబీజము విత్తనము
1. సిద్ధబీజమునందు తక్కువ మొత్తంలో ఆహారం ఉంటుంది. 1. విత్తనము ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని నిలువచేస్తుంది.
2. ఇది సిద్ధబీజాశయము నుండి ఉత్పత్తి అవుతుంది. 2. విత్తనములు పుష్పమునందలి అండము నుండి తయారవుతాయి.

ప్రశ్న 9.
వివృత బీజాలు మరియు ఆవృత బీజాలకు మధ్యగల భేదములేవి?
జవాబు:

వివృత బీజాలు ఆవృత బీజాలు
1. విత్తనాలు పండ్ల బయటకు కనిపిస్తూ ఉంటాయి. 1. విత్తనాలు పండ్ల లోపల అమరి ఉంటాయి.
2. అండాలు అండాశయమునందు లోపల ఉండవు.
ఉదా : పైనస్, సైకాస్
2. అండాశయము నందు అండములు ఉంటాయి.
ఉదా : మామిడి, యాపిల్.

ప్రశ్న 10.
పొరిఫెరా జీవులకు మరియు సీలెంటిరేటా జీవులకు మధ్యగల రెండు భేదాలను రాయండి.
జవాబు:

పొరిఫెరా జంతువులు సీలెంటిరేటా జంతువులు
1. జీవుల వ్యవస్థీకరణ కణస్థాయిలో ఉంటుంది. 1. జీవుల వ్యవస్థీకరణ కణజాల స్థాయిలో ఉంటుంది.
2. శరీర నిర్మాణం కనీసస్థాయిలో విభేదనం చెంది ఉంటుంది. 2. కొద్ది మొత్తంలో శరీర నిర్మాణం విభేదనం చెంది ఉంటుంది.

9th Class Biology 5th Lesson జీవులలో వైవిధ్యం 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
వర్గీకరణ అవసరం ఏమిటి?
జవాబు:
వర్గీకరణ అవసరం :

  1. మనం పరిశీలించిన జీవుల గురించి పూర్తిగా అర్థంచేసుకోవటానికి వర్గీకరణ తోడ్పడుతుంది.
  2. ఒక నిర్దిష్టమైన, క్రమబద్ధమైన విధానంలో జీవరాశుల గురించి అధ్యయనం చేయడానికి,
  3. జీవులు వాటి యొక్క పూర్వీకుల నుండి ఏర్పడిన విధమును వివరించడానికి,
  4. ఒకే రకమైన జీవుల మధ్య వ్యత్యాసాలను సులభంగా గుర్తించడానికి తోడ్పడుతుంది,
  5. జీవుల మధ్య ఉన్న సంబంధం, పరస్పర ఆధారిత్వాన్ని గురించి అధ్యయనం చేయడానికి,
  6. జనాభాలో వివిధ రకాల జీవుల గురించి అధ్యయనం చేయడానికి,
  7. ప్రకృతిలో జరిగిన జీవపరిణామం గురించి ఒక అవగాహనకు రావడానికి వర్గీకరణ తోడ్పడుతుంది.

ప్రశ్న 2.
వర్గీకరణకు, పరిణామానికి గల సంబంధమేది?
జవాబు:

  1. జీవుల యొక్క శరీర నిర్మాణం, విధుల ఆధారంగా వాటిని గుర్తించడం, వర్గీకరించడం జరిగింది.
  2. కొన్ని లక్షణాలు ఇతర లక్షణాల కంటే శరీరాకృతిలో ఎక్కువ మార్పులు తేవడంలో దోహదపడతాయి.
  3. జీవుల యొక్క మనుగడలో ముందుగా వచ్చిన మౌలిక లక్షణాలు, తరువాత వచ్చిన మౌలిక లక్షణాల కంటే ప్రముఖ పాత్ర వహిస్తాయి.
  4. జీవుల వర్గీకరణ అనే అంశం జీవపరిణామంతో చాలా దగ్గర సంబంధం కలిగి ఉంటుంది.
  5. పరిణామము అనేది వాంఛిత మార్పుల ప్రక్రియ.
  6. నేడు మనం చూస్తున్న చాలా జీవుల లక్షణాలు, సంవత్సరాల తరబడి వచ్చిన మార్పులకు నిదర్శనం.
  7. 1859 లో చార్లెస్ డార్విన్ అను జీవశాస్త్రవేత్త మొదటిసారిగా “జీవుల పుట్టుక” అనే గ్రంథంలో జీవపరిణామం గురించి పేర్కొన్నారు.
  8. జీవుల శరీర నిర్మాణంలో గల సంక్లిష్టత పురాతన జీవులకంటె ఇటీవల ఏర్పడిన జీవులలో తక్కువగా ఉంటుంది.
  9. వర్గీకరణము కూడా సరళమైన జీవులతో ప్రారంభించబడి సంక్లిష్ట జీవుల వరకు కొనసాగినది. ఇది పరిణామమునకు దారితీసింది.
  10. అందువలన వర్గీకరణము, పరిణామము ఒకదానితో నొకటి సంబంధం కలిగినవి.

AP 9th Class Biology Important Questions 5th Lesson జీవులలో వైవిధ్యం

ప్రశ్న 3.
కారల్ వూజ్ ప్రతిపాదించిన వర్గీకరణమును వివరించండి.
జవాబు:

  1. పూజ్ జీవులను మూడు సమూహములుగా విభజించాడు అవి. 1) బ్యా క్టీరియా 2) అరాఖియా 3) యూకేరియా
  2. బాక్టీరియా మరియు అరాఖియా కేంద్రక పూర్వ జీవులు.
  3. బాక్టీరియా కణత్వచం పెప్టిడోగ్లైకాన్ అనే రసాయన పదార్థంతో తయారైనది.
  4. యూకేరియా నందు నిజకేంద్రక జీవులు ఉంటాయి.
  5. కణములన్నీ స్వతంత్ర పూర్వీక కణం అయిన లూకా నుండి ఏర్పడినాయి.
  6. మొట్టమొదటి లూకా కణము నుండి తర్వాతి కాలంలో మూడు రకాల కణాలు పుట్టుకొచ్చాయి.
  7. పరిణామక్రమంలో ఈ మూడు, మూడు రకాల రంగాలను నిర్దేశిస్తాయి. అవి : 1) అరాఖియా 2) బ్యాక్టీరియా 3) యుకరేరియా అని ఊజ్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు.

ప్రశ్న 4.
వర్గీకరణ విధానంలో అమరిక గురించి రాయంది.
జవాబు:
AP 9th Class Biology Important Questions 5th Lesson జీవులలో వైవిధ్యం 1

  1. ఎర్నెస్ట్ హెకెల్ (1894), రాబర్ట్ విట్టేకర్ (1959) మరియు కారల్ వూజ్ సజీవులన్నింటినీ అతిపెద్ద విభాగాలైన రాజ్యాలుగా విభజించడానికి ప్రయత్నించారు.
  2. విట్టేకర్ వర్గీకరణములో 5 రాజ్యా లను ప్రతిపాదించారు.
  3. కణ నిర్మాణము, ఆహార సేకరణ విధానము మరియు శరీర వ్యవస్థీకరణము ఆధారముగా ఐదు రాజ్యాలు ఏర్పడినాయి.
  4. తరువాత వర్గీకరణలో ఉపసమూహములకు వివిధ స్థాయిలలో ఈ క్రింది విధముగా పేర్లు పెట్టడమైనది.
  5. లక్షణాలకు అనుగుణంగా జీవులను విభజించి చివరకు అతిచిన్న సమూహము మరియు వర్గీకరణకు ఆధారమైన జాతి వరకు కొనసాగుతుంది.
  6. ఒకే రకమైన లక్షణాలు కలిగి ఉండి, జంటగా లేదా స్వతంత్రంగా తమ తమ సంతతి ఉత్పత్తి చేయగల జీవుల సముదాయమును జాతి అంటారు.

ప్రశ్న 5.
మొనీరా రాజ్యం జీవుల లక్షణములను పేర్కొనంది. ఉదాహరణలివ్వండి.
జవాబు:
AP 9th Class Biology Important Questions 5th Lesson జీవులలో వైవిధ్యం 2

  1. మొనీరా జీవులు నిజకేంద్రకం లేని ఏకకణజీవులు.
  2. ద్విధావిచ్ఛిత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతాయి.
  3. కశాభం, శైలికలు వంటి నిర్మాణాల సహాయంతో ఒక చోటు నుండి మరియొక చోటికి చలిస్తాయి.
  4. శరీరం వెలుపలి నుండి ఆహారాన్ని సేకరిస్తాయి.
  5. కొన్ని మొనీరా జీవులు మానవులకు హాని కలిగిస్తాయి. కానీ చాలా వరకు ఇవి మానవులకు ఉపకారం చేస్తాయి.
    ఉదాహరణలు : బ్యా క్టీరియా, అనబీన

ప్రశ్న 6.
మొనీరా రాజ్యంలో గల ప్రధాన సమూహములేవి?
జవాబు:
మొనీరా రాజ్యంలో ప్రధానంగా మూడు సమూహాలు గలవు. అవి :

  1. ఆర్కె బ్యా క్టీరియా : మనుగడ సాగిస్తున్న అతి ప్రాచీన బాక్టీరియా. ఇది ఉష్ణమడుగులు లేదా వేడి నీటి బుగ్గలలో నివసిస్తుంది.
  2. యూ బ్యాక్టీరియా : స్ట్రెప్టోకోకస్, రైజోబియం, ఈ కోలై మొదలగునవి.
  3. సయానో బ్యా క్టీరియా : నీలి ఆకుపచ్చ శైవలాలు.

ప్రశ్న 7.
ప్రొటీస్టా రాజ్య జీవుల లక్షణాలను తెలపండి.
జవాబు:
ప్రొటిస్టా రాజ్య జీవుల లక్షణాలు :
AP 9th Class Biology Important Questions 5th Lesson జీవులలో వైవిధ్యం 3

  1. చాలావరకు ఏకకణజీవులు. కొన్ని మాత్రమే బహుకణ జీవులు.
  2. త్వచంతో కూడిన నిజ కేంద్రకం ఉంటుంది.
  3. ఇతర జీవులను భక్షించడం ద్వారా పోషకాలు శక్తిని పొందుతాయి.
  4. కొన్ని సూర్యకాంతిని ఉపయోగించి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. చుట్టూ ఉన్న నీటి నుండి కూడా పోషకాలు గ్రహిస్తాయి.
  5. ఇవి ఒంటరిగా గానీ, సమూహాలుగా గానీ జీవిస్తాయి.
  6. కణం లోపల కొన్ని కణాంగాలు కనిపిస్తాయి.
  7. చాలావరకు ద్విధావిచ్చిత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. కొన్ని బహుధావిచ్చిత్తి, సంయోగం ద్వారా కూడా ప్రత్యుత్పత్తి జరుపుతాయి.
    ఉదా : అమీబా, యూగ్లీనా, పారమీషియం మొదలగునవి.

ప్రశ్న 8.
శిలీంధ్ర రాజ్య జీవుల లక్షణాలను పేర్కొనంది. ఉదాహరణలివ్వండి.
జవాబు:
శిలీంధ్ర రాజ్య జీవుల లక్షణాలు :
AP 9th Class Biology Important Questions 5th Lesson జీవులలో వైవిధ్యం 4

  1. శిలీంధ్రాలు కొన్ని ఏకకణ జీవులు. కానీ చాలావరకు బహుకణ జీవులు.
  2. చాలా వాటిలో తల భాగంలో టిడిపి వంటి నిర్మాణం ఉంటుంది. కొన్నింటిలో గొడుగు వంటి నిర్మాణాలు కూడా ఉంటాయి.
  3. వర్షాకాలంలో నేల పైన గాని, చెట్టుకాండం పైన గాని మొలుస్తాయి.
  4. వీటికి ఉన్న వేళ్ళ వంటి నిర్మాణాల సహాయంతో నివసించే ప్రదేశం నుండి ఆహారాన్ని స్వీకరిస్తాయి.

ఇవి రేణువులు వంటి సిద్ధబీజాల సహాయముతో ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి.
ఉదా : రైజోపస్, మ్యూకార్, అగారికస్ మొదలైనవి.

ప్రశ్న 9.
మొక్కల ప్రధాన లక్షణాలను తెలపండి.
జవాబు:

  1. ప్రకృతిలో మొక్కలు వైవిధ్యభరితమైనవి.
  2. మొక్క శరీరము వేరు, కాండము, ఆకులుగా విభజన చెంది ఉంటుంది.
  3. మొక్కలు బహుకణ, నిజకేంద్రక జీవులు. కణకవచము కలిగి ఉంటాయి.
  4. మొక్కలు ప్రధానంగా స్వయంపోషకాలు. పత్రహరితం సహాయంతో కిరణజన్య సంయోగక్రియ జరిపి పిండిపదార్థమును తయారుచేస్తాయి.
  5. మొక్కలు సాధారణంగా విత్తనాలను ఉత్పత్తిచేస్తాయి.

ప్రశ్న 10.
పొరిఫెరా వర్గజీవులను గురించి రాయండి.
జవాబు:
AP 9th Class Biology Important Questions 5th Lesson జీవులలో వైవిధ్యం 5

  1. పొరిఫెరా అనగా శరీరం మీద రంధ్రాలు కలిగిన జీవులు. ఇవి నీటిలో నివసిస్తాయి.
  2. చలనాంగాలు ఉండవు. బలమైన ఆధారాన్ని అంటి పెట్టుకొని ఉంటాయి.
  3. రంధ్రాలు ‘నాళ వ్యవస్థ’ గా పనిచేస్తాయి. వీటి గుండా ఆక్సిజన్, ఆహారపదార్థాల రవాణా జరుగుతాయి.
  4. శరీరం మొత్తం బలమైన అస్థిపంజరంతో కప్పబడి ఉంటుంది.
  5. శరీరాకృతి సరళంగా ఉంటుంది.
  6. పరిణామ క్రమంలో కణాలు కనీస విభేదనం చెంది ఉంటాయి. వీటిని స్పంజికలు అంటారు.
  7. ఇవి ప్రధానంగా సముద్ర జీవులు.
    ఉదా : యూప్లికితీయ, సైకాన్, స్పంజీలా.

ప్రశ్న 11.
సీలెంటిరేటా / నిడేరియ జీవుల లక్షణాలను రాయండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 20

  1. ఇవి నీటిలో నివసిస్తాయి.
  2. శరీరం లోపల ఖాళీ ప్రదేశాన్ని ‘శరీర కుహరం’ అంటారు.
  3. శరీరం రెండు త్వచాలతో తయారయిన ద్విస్తరిత జీవులు.
  4. వెలుపలి త్వచాన్ని బాహ్యత్వచం అని, లోపలి త్వచాన్ని అంతరత్వచం అని అంటారు.
  5. కొన్ని జీవులు సమూహాలుగా నివసిస్తాయి. ఉదా : హైడ్రా, జెల్లీఫిష్
  6. కొన్ని పగడాలు కాలనీలుగా నివసిస్తాయి.
  7. ఒక్కొక్క పగడం 3 నుండి 56 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటుంది.
  8. కొన్ని దాదాపు 1800 చదరపు కిలోమీటర్ల మేర ‘పగడాల దీవి’ నిర్మిస్తాయి. దీనిని ‘కోరల్ రీఫ్’ అంటారు.

ప్రశ్న 12.
ప్లాటి హెల్మింథిస్ వర్గజీవులను గురించి క్లుప్తంగా రాయండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 21

  1. శరీరం ద్విపార్శ్వ సౌష్టవం కలిగి ఉంటుంది. అంటే శరీరం యొక్క కుడి ఎడమ భాగాలు సమానంగా ఉంటాయి.
  2. శరీరం మూడు పొరలుగా విభేదనం చెంది ఉంటుంది. కనుక వీటిని త్రిస్తరిత జీవులు అంటారు.
  3. త్వచాల నుండి కొన్ని ప్రాథమిక అవయవాలు ఏర్పడతాయి.
  4. కొన్ని ప్రాథమిక కణజాలాలు కూడా ఉంటాయి. అయినప్పటికి అవయవాల అమరికకు నిజశరీర కుహరం ఏర్పడి ఉండదు.
  5. శరీరం మొత్తం తల నుండి తోక వరకు బల్లపరుపుగా ఉంటుంది. కాబట్టి వీటిని చదును పురుగులు (బద్దెపురుగు) అని అంటారు.
  6. ఇవి స్వతంత్రంగాను జీవిస్తాయి. ఉదా : ప్లనేరియా, పరాన్నజీవిగాను జీవిస్తాయి. ఉదా : టినీయా

ప్రశ్న 13.
నిమటోడ వర్గ జీవులను గురించి క్లుప్తంగా రాయండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 22

  1. ఈ వర్గ జీవుల శరీరాలు త్రిస్తరిత, ద్విపార్శ్వ సౌష్టవం కలిగి ఉంటాయి.
  2. శరీరాకృతి స్థూపాకారంగా ఉంటుంది.
  3. కణజాలాలు విభేదనం చెంది కనిపిస్తాయి. కానీ అవయవాలు ఉండవు.
  4. మిధ్యాకుహరం ఉంటుంది.
  5. పరాన్నజీవులుగా జీవిస్తాయి.
    ఉదా : వుకరేరియా బ్యాంక్రాఫ్ట్, పేగులలో నివసించే నులిపురుగులు (ఆస్కారిస్ లూంబికాయిడ్స్)

ప్రశ్న 14.
అనెలిడ వర్గ జంతువులను గురించి క్లుప్తంగా రాయుము.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 23

  1. అనెలిడ జంతువులు ద్విపార్శ్వ సౌష్టవం కలిగిన త్రిస్తరిత జీవులు.
  2. నిజ శరీర కుహరాన్ని కలిగి ఉంటాయి.
  3. నిజ శరీరకుహరం శరీరనిర్మాణ అవయవాలు అమరి ఉండుటకు అనుకూలంగా ఉంటుంది.
  4. శరీర నిర్మాణం ఖండితాలుగా ఉంటుంది. తల నుండి తోక వరకు వలయాకార ” ఖండితాలు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా అమరి ఉంటాయి.
  5. ఈ జంతువులు మంచినీటి ఆవాసం, సముద్ర ఆవాసం మరియు వానపాము భౌమావాసాలలో నివసిస్తుంటాయి. ఉదా : వానపాము, జలగ.

ప్రశ్న 15.
ఆర్థోపొడ వర్గ జంతువులను గురించి వివరించండి.
జవాబు:
AP 9th Class Biology Important Questions 5th Lesson జీవులలో వైవిధ్యం 6

  1. జంతుజాలంలో 80% జీవులు ఆరోపొడ వర్గ జీవులు 90,000 జీవులను కలిగిన అతి పెద్ద వర్గం ఆగ్రోపొడ.
  2. వీటి శరీరం ద్విపార్శ్వ సౌష్టవం కలిగి ఖండితాలుగా ఉంటుంది.
  3. అర్రపొడ జీవులలో స్వేచ్ఛాయుత ప్రసరణ వ్యవస్థ ఉంటుంది.
  4. రక్తం ప్రసరించటానికి రక్తనాళాలు లేవు. శరీర కుహరం రక్తంతో నిండి ఉంటుంది.
  5. కీళ్ళుగల కాళ్ళు ఉండటం ఈ వర్గజీవుల ముఖ్య లక్షణం.
    ఉదా : రొయ్యలు, సీతాకోకచిలుకలు, బొద్దింకలు, ఈగలు, సాలెపురుగులు, తేళ్ళు, పీతలు.
  6. ఆల్డోపొడ జీవులు హానికర మరియు ఉపయోగకర జీవులు.

ప్రశ్న 16.
మొలస్కా వర జీవులను గురించి క్లుప్తంగా రాయండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 25

  1. మొలస్కా జీవుల శరీరం ద్విపార్శ్వ సౌష్టవం కలిగినది.
  2. శరీర కుహరం కుంచించుకుపోయి ఉంటుంది.
  3. మొలస్కా జీవులతో శరీర విభజన మొదలవుతుంది.
  4. స్వేచ్ఛాయుత రక్తప్రసరణ వ్యవస్థ కలిగి ఉంటుంది.
  5. విసర్జన వ్యవస్థ వృక్కాలు వంటి నిర్మాణాలతో జరుగుతుంది.
  6. పాదం వంటి ప్రత్యేక అంగం ద్వారా చలిస్తాయి. ఉదా : నత్తలు, కోమటి సంచులు (Loligo), ఆల్చిప్పలు.

ప్రశ్న 17.
ఇఖైనోడర్మేటా వర్గ జీవుల ప్రత్యేకతలను వివరించండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 26

  1. ముళ్ళ వంటి చర్మం కలిగిన జీవులను ఇఖైనోడర్నేటా అంటారు.
  2. ఇవి స్వతంత్రంగా సముద్రపు నీటిలో నివసిస్తాయి.
  3. ఇవి త్రిస్తరిత అనుపార్శ్వ సౌష్టవం కలిగిన జీవులు.
  4. శరీర కుహరం ఉంటుంది.
  5. శరీరపు కదలిక కోసం, చలనం కోసం జలవిసర్జన వ్యవస్థను ఉపయోగించుకుంటాయి.
  6. జలవిసర్జన వ్యవస్థ నాళికాపాదాలు కలిగి ఉంటుంది.
  7. అస్థిపంజరం కాల్షియం కార్బొనేట్ తో నిర్మితమై ఉంటుంది. ఉదా : సముద్ర నక్షత్రం, సీ అర్చిన్లు.

ప్రశ్న 18.
ప్రొటోకార్డేటా వర్గ జీవులను గురించి పటముల సహాయంతో వర్ణించండి.
జవాబు:
AP 9th Class Biology Important Questions 5th Lesson జీవులలో వైవిధ్యం 7

  1. ప్రొటోకార్డేటా వర్గజీవులు త్రిస్తరిత జీవులు.
  2. శరీరం ద్విపార్శ్వ సౌష్టవం కలిగి ఉంటుంది. శరీర కుహరం ఉంటుంది.
  3. ప్రొటోకార్డేటా జీవులలో ‘పృష్ఠవంశం’ అనే సరిక్రొత్త నిర్మాణం కనబడుతుంది.
  4. పృష్ఠవంశం ఈ జీవుల జీవితంలో ఏదో ఒక దశలో బెలానోగ్లోనెస్ ఏంఫియోక్సస్ తప్పకుండా ఉంటుంది.
  5. పృష్టవంశం ఒక కడ్డీ వంటి నిర్మాణం. ఇది నాడీ కణజాలాల నుండి ఉదరభాగాన్ని వేరుచేస్తుంది.
  6. శరీరం వెనుకభాగంలో తల నుండి చివరి వరకు పృష్ఠవంశం వ్యాపించి ఉంటుంది.
  7. పృష్ఠవంశం కదలిక కొరకు కండరాలతో జత కలిసి ఉంటుంది.
  8. అన్ని జీవులకు పృష్ఠవంశం జీవితాంతం ఉండకపోవచ్చు. ఇవి అన్నీ సముద్ర జీవులు.
    ఉదా : బెలనోగ్లోసెస్, హెర్డ్మనియ మరియు ఏంఫియాక్సస్.

ప్రశ్న 19.
సకశేరుక జీవులు (వర్టిబ్రేటా) ఏ లక్షణాలు కలిగి ఉంటాయి?
జవాబు:
సకశేరుక జీవుల లక్షణాలు :

  1. పృష్ఠవంశం కలిగి ఉంటాయి.
  2. పృష్ఠనాడీ వలయం కలిగి ఉంటాయి.
  3. త్రిస్తరిత జీవులు.
  4. మొప్పగదులు, మొప్ప చీలికలు కొన్నింటిలో ఉంటాయి.
  5. శరీర కుహరం కలిగి ఉంటుంది.

AP 9th Class Biology Important Questions 5th Lesson జీవులలో వైవిధ్యం

ప్రశ్న 20.
సకశేరుక వర్గ జీవులను గురించి క్లుప్తంగా వివరించండి.
జవాబు:

  1. సకశేరుక జీవులకు నిజమైన శరీర కుహరం ఉంటుంది.
  2. వెన్నెముక, అంతర అస్థిపంజరం కలిగి ఉంటాయి.
  3. ఎముకలకు కండరాలు ప్రత్యేకంగా అమరి శరీరకదలికలకు తోడ్పడతాయి.
  4. ఇవి ద్విపార్శ్వ సౌష్టవం, నిజ శరీర కుహరం కలిగిన త్రిస్తరిత జీవులు.
  5. వీటి శరీరం అనేక విభాగాలుగా విభజితమై ఉంటుంది.
  6. కణాలు సంక్లిష్టమైన విభేదనం చెంది కణజాలాలు, అవయవాలు, అవయవ వ్యవస్థలుగా మార్పుచెంది ఉంటాయి.

ప్రశ్న 21.
అనెలిడ, ఆర్థోపొడ మరియు మొలస్కా జీవుల మధ్య గల రెండు భేదాలను పేర్కొనండి.
జవాబు:

అనెలిడ ఆగ్రోపొడ మొలస్కా
1. శరీరము ఖండితములు గలది; జత ఉపాంగాలు ఉంటాయి. 1. శరీరము ఖండితము మరియు కీళ్ళు గల కాళ్ళు ఉంటాయి. 1. తక్కువ మొత్తంలో శరీరం ఖండితమైనది. ఉపాంగాలు ఉండవు.
2. విసర్జన వృక్కాల ద్వారా జరుగుతుంది. 2. విసర్జన కోశీయవృక్కాలు మాల్ఫీజియన్ నాళికల ద్వారా జరుగుతుంది. 2. విసర్జన అంత్యవృక్కాలు లేదా మూత్రపిండము ద్వారా జరుగుతుంది.

ప్రశ్న 22.
చేపల యొక్క లక్షణములను వివరించండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 27

  1. చేపలు రెక్కలు తోకలు కలిగి ఉంటాయి.
  2. చర్మముపై పొలుసులు ఉంటాయి. నీటిలో నివసిస్తాయి.
  3. చేపలు శీతల రక్త జంతువులు.
  4. మొప్పల సహాయంతో జలశ్వాసక్రియ జరుపుతాయి.
  5. నీటిలో గుడ్లను పెడతాయి.
  6. గుండెలో రెండు గదులు మాత్రమే ఉంటాయి.
  7. వెన్నెముక గలిగిన మొదటి సకశేరుకాలు.

ప్రశ్న 23.
ఉభయచర జీవుల ముఖ్య లక్షణములను తెలపంది.
జవాబు:
AP 9th Class Biology Important Questions 5th Lesson జీవులలో వైవిధ్యం 8

  1. లార్వా (పిల్లదశలో) లు నీటిలో నివసిస్తాయి. ప్రౌఢజీవులు నేలపై నివసిస్తాయి.
  2. చర్మంపై పొలుసులు ఉండవు కాని చర్మం నునుపుగా, జిగురుగా ఉంటుంది.
  3. కప్పలు నీటిలో గుడ్లను పెడతాయి. శీతల రక్త జంతువులు.
  4. నేలమీద మరియు నీటిలోను నివసించగల మొదటి సకశేరుకాలు.
  5. గుండె నందు మూడు గదులు ఉంటాయి.
  6. కాలివేళ్ళకు పంజాలు ఉండవు.
  7. భీష్మకాల సుప్తావస్థ మరియు శీతాకాల సుప్తావస్థలను చూపుతాయి.

ప్రశ్న 24.
సరీసృపాల యొక్క ముఖ్య లక్షణములను వివరించండి. ఉదాహరణలివ్వంది.
జవాబు:
సరీసృపాల యొక్క లక్షణాలు:
AP 9th Class Biology Important Questions 5th Lesson జీవులలో వైవిధ్యం 9

  1. చర్మం పొడిగా ఉండి పొలుసులతో నిండి ఉంటుంది.
  2. సరీసృపాలు శీతల రక్త జంతువులు. ఇవి గుడ్లు పెడతాయి.
    ఉదా : మొసళ్ళు, పాములు, తొండలు.
  3. గుండెలో మూడు గదులుంటాయి. కాని మొసళ్ళలో నాలుగు గదులుంటాయి.
  4. మొసళ్ళలో కాళ్ళవేళ్ళ యందు పంజాలుంటాయి.

ప్రశ్న 25.
పక్షుల యొక్క ముఖ్య లక్షణములు తెలపండి. ఉదాహరణలివ్వండి.
జవాబు:

  1. శరీరం మొత్తం ఈకలతో నిండి ఉంటుంది.
  2. పక్షులు ఉష్ణ రక్త జంతువులు.
  3. కాళ్ళకి గోళ్ళుంటాయి. జత రెక్కలుంటాయి.
  4. పక్షులు గుడ్లను పెడతాయి.
    ఉదా : పావురాలు, కోళ్ళు, కాకులు మొదలైనవి.

ప్రశ్న 26.
క్షీరదాల ముఖ్య లక్షణములను తెలిపి, ఉదాహరణలివ్వండి.
జవాబు:
AP 9th Class Biology Important Questions 5th Lesson జీవులలో వైవిధ్యం 10

  1. బాహ్యచెవులు, నాలుగు చలనాంగాలు ఉంటాయి.
  2. చర్మం వెంట్రుకలు లేదా రోమాలతో కప్పబడి ఉంటుంది.
  3. ఎక్కువ జీవులందు స్వేద మరియు పాలగ్రంథులు ఉంటాయి.
  4. దంతములు రకరకాలుగా ఉంటాయి.
  5. పూర్తిగా అభివృద్ధి చెందిన శిశువులకు జన్మనిస్తాయి.
  6. చేతులు, కాళ్ళు కలిగి ఉంటాయి. వేళ్ళకు గోళ్ళుంటాయి.
  7. నేల మీద, నీటిలో మరియు చెట్ల తొర్రలో, గుహలలో నివాసాలు ఏర్పరచుకుంటాయి.

ప్రశ్న 27.
మీకేగాని జంతువులను వర్గీకరించడానికి అవకాశం వస్తే జీవులను దేని ఆధారంగా వర్గీకరిస్తారు?
జవాబు:
నాకు గనుక జీవులను వర్గీకరించడానికి అవకాశం వస్తే ఈ క్రింది వాటి ఆధారంగా వర్గీకరిస్తాను.

  1. జీవి నిజకేంద్రకం కలిగి ఉన్నదా? లేక కేంద్రకపూర్వ జీవా?
  2. బహుకణం కలిగి ఉందా, ఏకకణం కలిగి ఉందా, సమూహంగా జీవిస్తుందా?
  3. ఏ పద్దతిలో ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది?
  4. జీవి స్వయంపోషకమా? పరపోషకమా?
    ఇలా ఒక క్రమమైన పద్ధతిని పాటించి జీవులను వర్గీకరిస్తాను.

9th Class Biology 5th Lesson జీవులలో వైవిధ్యం Important Questions and Answers

ప్రశ్న 1.
జీవులను ఎందుకు వర్గీకరించాలో తెలపండి.
జవాబు:

  1. వివిధ జంతువులను, మొక్కలను అధ్యయనం చేయడానికి వీలు కల్పించడానికి,
  2. వివిధ జీవ సమూహాల మధ్య గల సంబంధాలను అధ్యయనం చేయడానికి,
  3. జీవుల వైవిధ్యం గురించి తెలుసుకోవడానికి,
  4. జంతువుల మొక్కల భౌగోళిక విస్తరణా విధానాన్ని తెలుసుకోవడానికి మనం జీవుల వర్గీకరణ చేయవలసి ఉంటుంది.

AP 9th Class Biology Important Questions 5th Lesson జీవులలో వైవిధ్యం

ప్రశ్న 2.
హాసిత్, ఒక విద్యా పర్యటనకు వెళ్ళి కొన్ని మొక్కలను, జంతువులను సేకరించాడు. ‘వివిధ జీవులు – ఆవాసాలు’ అనే నివేదికను అతడు తయారుచేస్తున్నాడు. జీవులను వర్గీకరించి, పట్టిక పూరించుటలో అతనికి సహాయం చేయండి.
జవాబు:

మొక్క/ జంతువు గ్రూప్ / వర్గము
1. వానపాము అనెలిడా
2. సముద్ర నక్షత్రం ఎఖైనోడర్మెటా
3. తేలు ఆర్థ్రోపోడా
4. నత్త మొలస్కా
5. మాస్ బ్రయోఫైటా
6. మామిడి ఆవృతబీజ ద్విదళ బీజ మొక్క
7. వరి ఆవృతబీజ ఏకదళ మొక్క
8. కొబ్బరి ఆవృతబీజ ఏకదళ బీజ మొక్క

ప్రశ్న 3.
క్రింది పట్టికను పూరించి, క్రింది ప్రశ్నలకు జవాబులివ్వండి.
AP 9th Class Biology Important Questions 5th Lesson జీవులలో వైవిధ్యం 11
ఎ) పుష్పించని మొక్కలలో ఏ విభాగం నిజమైన వేర్లను, పత్రాలను కలిగి వుంటుంది?
బి) ఏ విభాగానికి చెందిన మొక్కలలో విత్తనాలు ఫలాల లోపల వుంటాయి?
జవాబు:
A – పుష్పించే మొక్కలు B – టెరిడోఫైటా C – వివృత బీజాలు D- ద్విదళ బీజాలు

ఎ) టెరిడోఫైటా
బి) ఆవృత బీజాలు

ప్రశ్న 4.
జీవులను వర్గీకరించే సందర్భంలో నీకొచ్చే సందేహాలు నాల్గింటిని రాయుము.
జవాబు:

  1. జీవుల వర్గీకరణకు ప్రాతిపదికలు ఏవి?
  2. జీవ పరిణామ క్రమానికి వర్గీకరణలో ప్రాధాన్యం ఎందుకు ఇవ్వాలి?
  3. ఒకే జాతిలో వివిధ జీవుల మధ్య గల భేదాలను బట్టి వాటిని ఎలా వర్గీకరిస్తారు?
  4. కేవలం బాహ్య లక్షణాలను మాత్రమే కాకుండా ఇతర జీవశాస్త్ర శాఖల పరిజ్ఞానాన్ని కూడా జోడించి జీవులను వర్గీకరించాలా? అది సరియైన పద్ధతేనా?

ప్రశ్న 5.
ఏదైనా ఒక ద్విదళ బీజ మొక్క బొమ్మను గీచి భాగాలను రాయండి.
జవాబు:
AP 9th Class Biology Important Questions 5th Lesson జీవులలో వైవిధ్యం 12

ప్రశ్న 6.
అమీబా, యూగ్లినా, పారామీషియంలు ఏ రాజ్యానికి చెందినవి? ఎందుకు?
జవాబు:
ఇవి ప్రొటీస్టా రాజ్యా నికి చెందిన జీవులు. లక్షణాలు :

  1. ఏకకణ జీవులు.
  2. త్వచంతో కూడిన నిజకేంద్రకం ఉంటుంది.
  3. ఒంటరిగా గానీ సమూహాలుగా గానీ జీవిస్తాయి.
  4. ద్విధావిచ్చిత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతాయి.

ప్రశ్న 7.
క్రింది పట్టికను పరిశీలించి ప్రశ్నలకు జవాబులు రాయండి.
AP 9th Class Biology Important Questions 5th Lesson జీవులలో వైవిధ్యం 13
1. ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరుపుకునే జీవులకు ఉదాహరణలు ఇవ్వండి.
2. శీతల రక్తజీవులు, ఉష్ణ రక్తజీవులకు మధ్య గల తేడాలు రాయండి.
3. చరమాంగాలు మొట్టమొదట ఏ జీవులలో కనపడతాయి?
4. పై లక్షణాలను బట్టి క్షీరదాల లక్షణాలు ఎలా ఉండవచ్చో రాయండి.
జవాబు:
1) కప్ప, పాము, పావురం

2) శీతల రక్తజీవులు – పరిసరాలలో ఉన్న ఉష్ణోగ్రతలకు అనుగుణంగా తమ శరీర ఉష్ణోగ్రతలను మార్చుకొనే జీవులు
ఉదా : చేపలు, ఉభయచరజీవులు, సరీసృపాలు

ఉష్ణ రక్తజీవులు – పరిసరాలలో ఉన్న ఉష్ణోగ్రతలకు అనుగుణంగా తమ శరీర ఉష్ణోగ్రత మార్చుకోలేని జీవులు.
ఉదా : పక్షులు, క్షీరదాలు
3) ఉభయచరాలు

4) a) ఉష్ణరక్త జీవులు
b) 4 గదుల గుండె ఉంటుంది.
c) ఊపిరితిత్తులతో శ్వాసక్రియ జరుపుతాయి.
d) బాహ్య చెవులు, పూర్వ చరమాంగాలను కలిగి ఉంటాయి.
e) పిల్లల్ని కని పాలిస్తాయి. శరీరంపై రోమాలుంటాయి.

ప్రశ్న 8.
క్రింది సమాచారం ఆధారంగా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
AP 9th Class Biology Important Questions 5th Lesson జీవులలో వైవిధ్యం 14
ఎ) మొక్కల వర్గీకరణ దేని ఆధారంగా చేశారు?
బి) ఫలం లోపల విత్తనాలు ఉండే మొక్కలను ఏమంటారు?
సి) మొట్టమొదట వేరు వ్యవస్థ ఏర్పడిన మొక్కలు ఏవి?
డి) ఏకదళ బీజాలకు ఉదాహరణలివ్వండి.
జవాబు:
ఎ) పుష్పాలను విత్తనాలను కలిగి ఉండటం, కలిగి ఉండకపోవడం అనే విధానాన్ని బట్టి వాటిని పుష్పించే మొక్కలు పుష్పించని మొక్కలుగా వర్గీకరించారు.
బి) ఆవృతబీజ మొక్కలు
సి) టెరిడోఫైటా
డి) వరి, గోధుమ

9th Class Biology 5th Lesson జీవులలో వైవిధ్యం 1 Mark Bits Questions and Answers

లక్ష్యాత్మక నియోజనము

1. మొక్కల గింజలలో రెండు దళాలు కలిగి ఉంటే అవి
A) ద్విదళ బీజాలు
B) ఏకదళ బీజాలు
C) ప్రొటీ
D) మొనీరా
జవాబు:
A) ద్విదళ బీజాలు

2. ఒకే జాతి జీవుల మధ్య ఉండే తేడాలను ఏమంటారు?
A) వర్గీకరణం
B) అనువంశికత
C) వైవిధ్యం
D) వంశపారపర్యంగా వచ్చే లక్షణాలు
జవాబు:
C) వైవిధ్యం

AP 9th Class Biology Important Questions 5th Lesson జీవులలో వైవిధ్యం

3. “జీవుల పుట్టుక” గ్రంథమును రచించినది
A) లామార్క్
B) చార్లెస్ డార్విన్
C) లిన్నేయస్
D) విట్టేకర్
జవాబు:
B) చార్లెస్ డార్విన్

4. ఒకే రకమైన లక్షణాలు కలిగి ఉండి, జంటగా లేదా స్వతంత్రంగా తమ తమ సంతతిని ఉత్పత్తి చేయగల జీవుల సముదాయం
A) ప్రజాతి
B) కుటుంబము
C) జాతి
D) తరగతి
జవాబు:
C) జాతి

5. చరకుడు, సుశ్రుతుడు మొక్కలను వీటి ఆధారంగా వర్గీకరించారు.
A) ఆర్థిక ప్రాముఖ్యత
B) ఔషధ గుణాలు
C) కలపను ఇవ్వటం
D) పుష్ప నిర్మాణం
జవాబు:
B) ఔషధ గుణాలు

6. “వృక్షాయుర్వేదమును” రచించినది
A) చరకుడు
B) సుశ్రుతుడు
C) పరాశర మహర్షి
D) వరాహమిహిరుడు
జవాబు:
C) పరాశర మహర్షి

7. 1969లో జీవులను 5 రాజ్యా లుగా వర్గీకరించి ప్రతిపాదించినవాడు
A) హెకెల్
B) కోస్టాండ్
C) విట్టేకర్
D) కెవిలియర్-స్మిత్
జవాబు:
C) విట్టేకర్

8. విట్టేకర్ ఈ క్రింది లక్షణం ఆధారంగా జీవులను
A) నిజకేంద్రక జీవులు లేదా కేంద్రకపూర్వ జీవులు వర్గీకరించెను.
B) ఒంటరిగా జీవిస్తాయా లేదా సమూహాలుగా జీవిస్తాయా?
C) మొక్కలకు విత్తనాలను ఉత్పత్తిచేసే సామర్థ్యం మరియు విత్తనాలు పండ్ల లోపల ఉన్నాయా, బయటకు కనిపిస్తున్నాయా?
D) పైవి అన్నియు
జవాబు:
D) పైవి అన్నియు

9. అతి లవణీయత కలిగిన నీటిలో జీవించగలిగే కేంద్రక పూర్వ జీవులు
A) థర్మఫిల్స్
B) హేలోఫిల్స్
C)హీమోహిల్స్
D) బేసోఫిల్స్
జవాబు:
B) హేలోఫిల్స్

10. స్వతంత్ర పూర్వక కణం నుండి (లూకా) పుట్టుకు వచ్చిన కణాలు ఏర్పరచిన రంగపు జీవులు
A) అరాఖియా
B) బ్యా క్టీరియా
C) యూకేరియా
D) పైవి అన్నియూ
జవాబు:
D) పైవి అన్నియూ

11. ఈ జీవుల కణత్వచం పెప్టిడోగైకాను అను రసాయనిక పదార్ధముతో తయారైనది.
A) అరాఖియా
B) బ్యా క్టీరియా
C) యూకేరియా
D) పైవి అన్నియు
జవాబు:
B) బ్యా క్టీరియా

12. కేంద్రక పూర్వ ఏక కణజీవులు ఈ రాజ్యంలో
A) మొనీరా
B) ప్రొటీస్టా
C) శిలీంధ్రాలు
D) ప్లాంటె
జవాబు:
A) మొనీరా

13. ఇప్పటి వరకు మనుగడ సాగిస్తున్న అతి ప్రాచీన బాక్టీరియా
A) యూ బ్యాక్టీరియా
B) సయానో బ్యా క్టీరియా
C) ఆర్కె బ్యాక్టీరియా
D) పైవి అన్నియు
జవాబు:
C) ఆర్కె బ్యాక్టీరియా

14. సెప్టోకాకస్, రైజోబియం, ఈ కొలై ఏ సమూహమునకు చెందినవి?
A) ఆర్కె బ్యా క్టీరియా
B) యూ బ్యాక్టీరియా
C) సయానో బ్యాక్టీరియా
D) యూకేరియా
జవాబు:
B) యూ బ్యాక్టీరియా

AP 9th Class Biology Important Questions 5th Lesson జీవులలో వైవిధ్యం

15. ఏకకణ లేదా బహుకణ నిజకేంద్రక జీవులు కలిగిన జీవ సమూహం
A) ప్రొటిస్టా
B) శిలీంధ్రాలు
C) మొనీరా
D) పొరిఫెరా
జవాబు:
A) ప్రొటిస్టా

16. సిద్ధబీజాలు సహాయంతో ప్రత్యుత్పత్తి జరిపేవి
A) శిలీంధ్రాలు
B) మొనిరా
C) ప్రొటిస్టా
D) వివృత బీజాలు
జవాబు:
A) శిలీంధ్రాలు

17. మొక్కలలో వర్గీకరణ స్థాయి దీని మీద ఆధారపడి ఉంటుంది.
A) మొక్క శరీరం గుర్తించడానికి వీలు కలిగిన భాగాలుగా విభేదనం చెందినదా?
B) మొక్క శరీరం ప్రసరణ కణజాలాలను కలిగి ఉన్నదా?
C) కణకవచం ఉందా మరియు స్వయంపోషకాలా?
D) పైవి అన్నీ
జవాబు:
D) పైవి అన్నీ

18. పుష్పించని మొక్కలు అని వీటిని అంటారు.
A) క్రిప్టోగాములు
B) ఫానిరోగాములు
C) వివృత బీజాలు
D) ఆవృత బీజాలు
జవాబు:
A) క్రిప్టోగాములు

19. విత్తనాలు పండ్ల బయటకు కనిపించే మొక్కలు
A) వివృత బీజాలు
B) ఆవృత బీజాలు
C) క్రిప్టోగాములు
D) ఫానిరోగాములు,
జవాబు:
A) వివృత బీజాలు

20. పొరిఫెరా వర్గజీవులకు గల మరియొక పేరు
A) స్పంజీలు
B) తిమింగలాలు
C) ప్రోటోకార్డేటా
D) అనెలిడ
జవాబు:
A) స్పంజీలు

21. స్పంజికలకు ఉదాహరణ
A) యూప్లికీలియా
B) సైకాన్
C) స్పంజీలా
D) పైవి అన్నియు
జవాబు:
D) పైవి అన్నియు

22. “పగదాల కాలనీలు” ఈ వర్గమునకు చెందిన జీవులు.
A) పొరిఫెరా
B) మొనీరా
C) సీలెంటిరేటా
D) అనెలిడ ఉంచబడినాయి.
జవాబు:
C) సీలెంటిరేటా

23. క్రింది సమూహపు జీవులు ద్విపార్శ్వ సౌష్టవం, సాపేక్షం, ఖండితములు గల త్రిస్తరిత జీవులు
A) నెమటోడ
B) ప్లాటీ హెల్మింథిస్
C) అనెలిడ
D) సీలెంటిరేటా
జవాబు:
C) అనెలిడ

24. పుష్పములు వీటిలో ప్రత్యుత్పత్తి అవయవాలు.
A) థాలో ఫైటా
B) బ్రయోఫైటా
C) వివృత బీజాలు
D) ఆవృత బీజాలు
జవాబు:
C) వివృత బీజాలు

AP 9th Class Biology Important Questions 5th Lesson జీవులలో వైవిధ్యం

25. వుకరేరియ బాంక్రాప్తి కలిగించు వ్యాధి ,
A) మలేరియా
B) కలరా
C) ఫైలేరియా
D) డెంగ్యూ
జవాబు:
D) డెంగ్యూ

26. జంతుజాలంలో అత్యధిక జీవులు కలిగిన వర్గం
A) అనెలిడ
B) ఆపొడ
C) ఇఖైనోడర్మేటా
D) మొలస్కా
జవాబు:
C) ఇఖైనోడర్మేటా

27. ఇఖైనోడర్మేటా జీవుల అస్థిపంజరం దీనితో నిర్మితమైనది.
A) కాల్షియం కార్బొనేట్
B) సోడియం కార్బొనేట్
C) సోడియం సిలికేట్
D) మెగ్నీషియం కార్బొనేట్
జవాబు:
B) సోడియం కార్బొనేట్

28. పంచభాగ వ్యాసార్ధ సౌష్టవం కలిగి మధ్య అక్షం చుట్టూ ఐదు సమానభాగాలుగా అమరి ఉన్న జీవులు
A) ఇఖైనోడర్మేటా
B) ఆర్థ్రోపొడ
C) అనెలిడ
D) మొలస్కా
జవాబు:
A) ఇఖైనోడర్మేటా

29. వెన్నెముక గలిగిన మొదటి జీవులు
A) ప్రొటోకార్డేటా
B) చేపలు
C) పక్షులు
D) ఉభయచరాలు
జవాబు:
A) ప్రొటోకార్డేటా

30. సకశేరుకాలు ఇన్ని తరగతులుగా విభజించబడ్డాయి.
A) 3
B) 4
C) 5
D) 6
జవాబు:
B) 4

31. శీతల రక్త జంతువులను గుర్తించండి.
A) చేపలు
B) క్షీరదాలు
C) పక్షులు
D) మార్సూపియల్స్
జవాబు:
A) చేపలు

32. వీటిలో మగజీవి పిల్లల్ని కంటుంది.
A) డాల్ఫిన్
B) గబ్బిలం
C) నెమలి
D) మనిషి
జవాబు:
A) డాల్ఫిన్

33. ఎగిరే క్షీరదము
A) గబ్బిలం
B) కాకి
C) నెమలి
D) కోడి
జవాబు:
C) నెమలి

34. మానవులు ఈ క్రమమునందు ఉంచబడినారు.
A) మార్సూపియల్స్
B) ప్రైమేట్స్
C) రోడెంట్స్
D) లోగోమార్పా
జవాబు:
A) మార్సూపియల్స్

35. ప్లాటిపస్ మరియు ఎకిడ్నాలు
A) సీలెంటిరేట్స్
B) రొడెంట్స్
C) మార్సూపియల్స్
D) అండజనక క్షీరదాలు
జవాబు:
B) రొడెంట్స్

36. హోమోసెపియన్స్ అనేది దీని యొక్క శాస్త్రీయ నామం.
A) మనిషి
B) కుక్క
C) పిల్లి
D) మామిడి
జవాబు:
D) మామిడి

37. కీటకములు ఈ విభాగమునకు చెందినవి.
A) ఆర్థ్రోపొడ
B) పక్షులు
C) అనెలిడ
D) సీలెంటిరేటా
జవాబు:
A) ఆర్థ్రోపొడ

AP 9th Class Biology Important Questions 5th Lesson జీవులలో వైవిధ్యం

38. ముత్యములు వీటినుండి తయారవుతాయి.
A) ఆయస్టర్లు
B) సీ కుకుంబరులు
C) నత్తలు
D) నీటిగుర్రాలు
జవాబు:
A) ఆయస్టర్లు

39. చర్మము మీద ముళ్ళు గలిగిన సముద్ర జీవులు
A) ఇఖైనోడర్మేటా
B) అనెలిడ
C) సీలెంటిరేటా
D) నెమటోడ
జవాబు:
A) ఇఖైనోడర్మేటా

40. వివృత బీజాలు గల మొక్క
A) మామిడి
B) ఆపిల్
C) అరటి
D) పైనస్
జవాబు:
A) మామిడి

41. ‘సిస్టమా నేచురే’ గ్రంథమును రచించినది
A) హెకెల్
B) లిన్నేయస్
C) విట్టేకర్
D) వూజ్
జవాబు:
D) వూజ్

42. ఇఖైనోడర్నేటా నందు చలనాంగాలు
A) రెక్కలు
B) వాజాలు
C) మిధ్యాపాదాలు
D) నాళికా పాదాలు
జవాబు:
B) వాజాలు

43. క్షీరదాలు
A) శిశోత్పాదకాలు
B) చర్మము రోమాలతో కప్పబడి ఉంటుంది
C) వెన్నెముక గలవి
D) పైవి అన్నియు
జవాబు:
D) పైవి అన్నియు

44. వర్గీకరణ శాస్త్రము అనగా
A) లిమ్నాలజి
B) టాక్సానమి
C) డైవర్సిటీ
D) ఇకాలజి
జవాబు:
D) ఇకాలజి

45. హిప్పోకాంపస్ (నీటి గుర్రం)ను ఈ దేశీయులు మందులలో వినియోగిస్తారు.
A) చైనీయులు
B) భారతీయులు
C) ఇటాలియన్లు
D) అమెరికన్లు
జవాబు:
B) భారతీయులు

46. హైడ్రా ఈ వర్గమునకు చెందిన జీవి.
A) పొరిఫెర
B) సీలెంటిరేటా
C) మొలస్కా
D) నెమటోడ
జవాబు:
A) పొరిఫెర

47. సముద్ర నక్షత్రం ఈ వర్గ జీవులకు ఉదాహరణ.
A) అనెలిడ
B) ఆర్థోపొడ
C) మొలస్కా
D) ఇఖైనోడర్మేటా
జవాబు:
B) ఆర్థోపొడ

48. ద్వినామీకరణ విధానంలో ఒక జీవికి గల శాస్త్రీయ నామము వీటిని సూచిస్తుంది.
A) ప్రజాతి, జాతి
B) జాతి, క్రమము
C) కుటుంబం, ప్రజాతి
D) క్రమము, వర్గము
జవాబు:
D) క్రమము, వర్గము

49. ఏకదళ బీజ మొక్కలలో ఉండే ఈనెల వ్యాపనం
A) జాలాకార
B) పిచ్చాకార
C) హస్తాకార
D) సమాంతర
జవాబు:
D) సమాంతర

AP 9th Class Biology Important Questions 5th Lesson జీవులలో వైవిధ్యం

50. జీవులను సమూహాలుగా వర్గీకరించటానికి ఆధారం
A) వైవిధ్యాలు
B) వంశపారంపర్య లక్షణాలు
C) పరిణామక్రమం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

51. వైవిధ్యం తక్కువగా ఉండేది
A) ఒకే జాతి జీవులు
B) వేరు వేరు జాతులు
C) శత్రుజాతులు
D) పైవేవీ కావు
జవాబు:
A) ఒకే జాతి జీవులు

52. పరిణామక్రమంలో బాగా అభివృద్ధి చెందిన హృదయంలోని
A) 1
B) 2
C) 3
D) 4
జవాబు:
D) 4

53. జీవులను వెజిటేబిలియా, ఎనిమేలియాగా వర్గీకరించిన శాస్త్రవేత్త
A) లిన్నేయస్
B) హెకెల్
C) చాటన్
D) కోలాండ్
జవాబు:
A) లిన్నేయస్

54. జీవులను కేంద్రకపూర్వ జీవులు, నిజకేంద్రక జీవులుగా వర్గీకరించిన శాస్త్రవేత్త
A) లిన్నేయస్
B) హెకెల్
C) చాటన్
D) కోండ్
జవాబు:
C) చాటన్

55. వర్గీకరణలో ‘ప్రొటీస్టా’ను ప్రవేశపెట్టింది.
A) లిన్నేయస్
B) హెకెల్
C) చాటన్
D) కోర్లాండ్
జవాబు:
B) హెకెల్

56. విట్టేకర్ జీవులను ఎన్ని రాజ్యాలుగా వర్గీకరించాడు?
A) 3
B) 4
C) 5
D) 6
జవాబు:
C) 5

57. అరాకియా అనే రాజ్యా న్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త
A) కోప్ లాండ్
B) విట్టేకర్
C) ఉజ్-ఎట్-ఆల్
D) కెవాలియర్ – స్మిత్
జవాబు:
C) ఉజ్-ఎట్-ఆల్

58. వర్గీకరణలో ‘క్రోమిస్టా’ రాజ్యా న్ని ప్రవేశపెట్టింది
A) కోస్టాండ్
B) విట్టేకర్
C) ఉజ్-ఎట్-ఆల్
D) కెవాలియర్ – స్మిత్
జవాబు:
D) కెవాలియర్ – స్మిత్

59. ద్వినామీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది
A) చాటన్
B) లిన్నేయస్
C) హెకెల్
D) విట్టేకర్
జవాబు:
B) లిన్నేయస్

60. ద్వినామీకరణంలో రెండవపదం దేనిని సూచిస్తుంది?
A) ప్రజాతి
B) జాతి
C) క్రమం
D) తరగతి
జవాబు:
B) జాతి

61. మొట్టమొదటి కణాన్ని ఏమని పిలుస్తారు?
A) ప్రోటా
B) లూకా
C) యూకా
D) క్రోమా
జవాబు:
B) లూకా

62. ఒకే రకమయిన లక్షణాలు కలి ఉండి జంటగా లేదా స్వతంత్రంగా తమ సంతతిని ఉత్పత్తి చేయగల జీవుల సముదాయం
A) తరగతి
B) జాతి
C) కుటుంబం
D) ప్రజాతి
జవాబు:
B) జాతి

63. బాక్టీరియా కణత్వచం ఏ రసాయన పదార్థంతో తయారవుతుంది?
A) ఫాస్ఫోలిపిడ్లు
B) గ్లైకోలిపిడ్లు
C) పెస్టిడోగ్లైకాన్లు
D) ప్రోటీన్లు, లిపిడ్లు
జవాబు:
C) పెస్టిడోగ్లైకాన్లు

64. కణత్వచం ‘వీనిలో ఉంటుంది.
A) ప్రోకారియేట్లు
B) యూకేరియేట్లు
C) పై రెండూ
D) పైవేవీ కావు
జవాబు:
B) యూకేరియేట్లు

AP 9th Class Biology Important Questions 5th Lesson జీవులలో వైవిధ్యం

65. అతి ప్రాచీనమైన బాక్టీరియా
A) ఆర్కె బాక్టీరియా
B) యూ బాక్టీరియా
C) సైనో బాక్టీరియా
D) రైజోబియం
జవాబు:
A) ఆర్కె బాక్టీరియా

66. సంయోగం ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే జీవి
A) అమీబా
B) యూగ్లీనాం
C) పారమీషియం
D) హైడ్రా
జవాబు:
C) పారమీషియం

67. క్రిప్టోగామ్ కి ఉదాహరణ
A) ఫెర్న్
B) మాస్
C) సైకాస్
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

68. మొక్కలను వీటి ఆధారంగా వర్గీకరించారు.
A) వేర్లు
B) కాండం
C) పత్రాలు
D) పుష్పాలు
జవాబు:
D) పుష్పాలు

69. చలనాంగాలు లేని వర్గం
A) ప్రోటోజోవన్స్
B) పొరిఫెరా
C) సీలెంటిరేటా
D) ఇఖైనో డర్మేటా
జవాబు:
B) పొరిఫెరా

70. ద్విపార్శ సౌష్టవం కల్గిన త్రిస్తరిత జీవులు
A) సీలెంటిరేటా
B) ప్లాటిహెల్మింథిస్
C) పొరిఫెరన్స్
D) ప్రోటోజోవన్స్
జవాబు:
B) ప్లాటిహెల్మింథిస్

71. జంతు రాజ్యంలో అతి పెద్ద వర్గం
A) ప్లాటి హెల్మింథిస్
B) నిమాటిహెల్మింథిస్
C) ఆర్థ్రోపొడ
D) మొలస్కా
జవాబు:
C) ఆర్థోపొడ

72. గ్రీకుభాషలో ‘ఇఖైనస్’ అనగా
A) కీళ్ళు
B) కాళ్ళు
C) ముళ్ళు
D) చర్మం
జవాబు:
C) ముళ్ళు

73. ఇఖైనోడర్నేటాలో కనిపించే సౌష్టవం
A) ద్విపార్శ్వ సౌష్ఠవం
B) త్రిపార్శ్వ సౌష్ఠవం
C) అనుపార్శ్వ సౌష్ఠవం
D) పైవన్నీ
జవాబు:
C) అనుపార్శ్వ సౌష్ఠవం

74. జల ప్రసరణ వ్యవస్థ కలిగిన జీవులు
A) ప్రోటోజోవన్స్
B) పొరిఫెరా
C) మొలస్కా జీవులు
D) ఇఖైనోడర్మేటా
జవాబు:
D) ఇఖైనోడర్మేటా

75. పృష్ఠవంశం వీనిలో కనబడుతుంది.
A) ప్రోటోకార్డేటా
B) వరిబ్రేటా
C) పై రెండూ
D) పైవేవీ కావు
జవాబు:
C) పై రెండూ

76. ఈ క్రింది వానిలో శీతల రక్త జీవి
A) క్షీరదాలు
B) పక్షులు
C) చేపలు
D) పైవన్నీ
జవాబు:
C) చేపలు

77. ఈ క్రింది వానిలో చేప
A) జెల్లీఫిష్
B) సిల్వర్ ఫిష్
C) గోల్డ్ ఫిష్
D) డాల్ఫిన్
జవాబు:
C) గోల్డ్ ఫిష్

AP 9th Class Biology Important Questions 5th Lesson జీవులలో వైవిధ్యం

78. క్రింది వానిలో సరిగా జతపరచబడని జతను ఎన్నుకోండి.
a) ఎర్నెస్ట్ హెకెల్ – జీవరాజ్యాన్ని 3 రాజ్యాలుగా విభజించాడు.
b) కోండ్ – జీవరాజ్యాన్ని 6 రాజ్యాలుగా విభజించాడు.
c) కెవిలియర్-స్మిత్ – జీవరాజ్యాన్ని 4 రాజ్యాలుగా విభజించాడు.
A) a మాత్రమే
B) b, c
C) c మాత్రమే
D) a, b
జవాబు:
D) a, b

79. క్రింది వానిలో సరిగా జతపరచబడని జతను ఎన్నుకోండి.
a) జీవుల పుట్టుక – చార్లెస్ డార్విన్
b) వృక్షాయుర్వేదం – చరకుడు
c) ద్వినామీకరణం – విట్టేకర్
A) a, b
B) a మాత్రమే
C) b, c
D) c మాత్రమే
జవాబు:
C) b, c

80. క్రింది వాక్యాలు చదవండి.
a) చర్మం పొడిగా ఉండి, పొలుసులతో నిండి ఉంటుంది, గుడ్లు పెడతాయి. – సరీసృపాల లక్షణాలు
b) వాజాలు తోక కలిగి ఉంటాయి. మొప్పల సహాయంతో జల శ్వాసక్రియ జరుపుకుంటాయి. – చేపల లక్షణాలు
A) a సరియైనది, b సరియైనది కాదు.
B) b సరియైనది, a సరియైనది కాదు.
C) a, b లు రెండు సరియైనవి కావు.
D) a, b లు రెం సరియైనవే.
జవాబు:
D) a, b లు రెం సరియైనవే.

AP 9th Class Biology Important Questions 5th Lesson జీవులలో వైవిధ్యం 15

81. పై పట్టికను చూసి, సరియైన దానిని పట్టికలో నింపిన దానిని గుర్తించండి.
AP 9th Class Biology Important Questions 5th Lesson జీవులలో వైవిధ్యం 16
జవాబు:
A

82. ఈ చిత్రంలోని జీవి ఏ వర్గానికి చెందినది?
AP 9th Class Biology Important Questions 5th Lesson జీవులలో వైవిధ్యం 17
A) ప్రోటోజోవా
B) నిడేరియా
C) ఆర్థోపొడ
D) పొరిఫెరా
జవాబు:
D) పొరిఫెరా

83. ఈ చిత్రంలోని జీవి ఏది?
AP 9th Class Biology Important Questions 5th Lesson జీవులలో వైవిధ్యం 18
A) జెల్లీ చేప
B) హైడ్రా
C) నులి పురుగు
D) బద్దె పురుగు
జవాబు:
B) హైడ్రా

84. ఈ జీవులు ఏ వర్గానికి చెందుతాయి?
AP 9th Class Biology Important Questions 5th Lesson జీవులలో వైవిధ్యం 19
A) అనెలిడ
B) ఆర్థ్రోపొడ
C) మొలస్కా
D) ఇఖైనోడర్మేటా
జవాబు:
B) ఆర్థ్రోపొడ

85. ఈ జీవి ఏ వర్గానికి చెందినది?
AP 9th Class Biology Important Questions 5th Lesson జీవులలో వైవిధ్యం 20
A) ఆర్థ్రోపొడ
B) మొలస్కా
C) ఇఖైనోడర్మేటా
D) ప్రోటోకార్డేటా
జవాబు:
B) మొలస్కా

86. ఈ చిత్రంలోని జీవి పేరేమి?
AP 9th Class Biology Important Questions 5th Lesson జీవులలో వైవిధ్యం 21
A) బల్లి
B) పారామీషియం
C) బాక్టీరియా
D) వైరస్
జవాబు:
C) బాక్టీరియా

87. ఈ జీవి ఏ వర్గానికి చెందుతుంది?
AP 9th Class Biology Important Questions 5th Lesson జీవులలో వైవిధ్యం 22
A) మొలస్కా
B) ఆర్థ్రోపోడ
C) ఇఖైనో డర్మేటా
D) ఆంఫిబియా
జవాబు:
C) ఇఖైనో డర్మేటా

88. ముత్యాలనిచ్చే అల్చిప్పలు ఏ వర్గానికి చెందుతాయి?
A) ఆర్థ్రోపోడ
B) అనిలెడ
C) మొలస్కా
D) ఇఖైనోడర్మేటా
జవాబు:
C) మొలస్కా

AP 9th Class Biology Important Questions 5th Lesson జీవులలో వైవిధ్యం

89. గుండెలో నాలుగు గదులు కలిగిన మొసలి ఏ వర్గానికి చెందుతుంది?
A) క్షీరదాలు
B) చేపలు
C) ఉభయచరాలు
D) సరీసృపాలు
జవాబు:
D) సరీసృపాలు

90.
AP 9th Class Biology Important Questions 5th Lesson జీవులలో వైవిధ్యం 24
పైనున్న ఫ్లోచార్టును క్రమంలో అమర్చండి.
A) 5, 4, 3, 2, 1
B) 1, 3, 2, 4, 5
C) 1, 2, 3, 5, 4
D) 1, 2, 3, 4, 5
జవాబు:
D) 1, 2, 3, 4, 5

91. రొట్టె బూజు (బ్రెడ్ మోల్డ్)లు దీనికి చెందుతాయి.
A) ప్రొటిస్టా
B) బ్రయోఫైటా
C) ఫంగై
D) జిమ్నోస్పెర్మ్
జవాబు:
C) ఫంగై

92. కింది వాటిలో వివృత బీజాల లక్షణం
A) బాహ్యంగా విత్తన కవచాలను కలిగి వుంటాయి
B) ఇవి బహుకణ జీవులు కావు
C) ఇవి పుష్పాలను ఏర్పరచవు
D) ఇవి పరపోషకాలు
జవాబు:
A) బాహ్యంగా విత్తన కవచాలను కలిగి వుంటాయి

93. ఈ క్రింది వాటిలో కార్డేటా లక్షణాలు
1) పృష్టదండము 2) ఉదర నాడీ దండము
3) ద్విస్తరిత 4) జతలుగా వున్న మొప్ప కోష్టాలు
A) 1, 2, 4
B) 1, 4
C) 1, 3
D) 2, 4
జవాబు:
A) 1, 2, 4

94. మానవులు దీనికి చెందుతారు.
A) రొడెంట్స్
B) ప్రైమేట్స్
C) మార్సు బయల్స్
D) సరీసృపాలు
జవాబు:
B) ప్రైమేట్స్

95. సర్వ ఆమోదయోగ్యమైన ఐదు రాజ్యాల వర్గీకరణను ప్రతిపాదించినది.
A) లిన్నేయస్
B) హెకెల్
C) కెవెలియర్ – స్మిత్
D) విట్టేకర్
జవాబు:
D) విట్టేకర్

96. కింది వాటిలో ఆరోపొడా లక్షణాలు
1) జలప్రసరణ వ్యవస్థ
2) కీళ్ళతో కూడిన కాళ్ళు
3) స్వేచ్ఛాయుత రక్తప్రసరణ వ్యవస్థ
4) తేమతో కూడిన చర్మం
A) 1, 2 సరైనవి
B) 2, 3 సరైనవి
C) 3, 4 సరైనవి
D) 1, 4 సరైనవి
జవాబు:
B) 2, 3 సరైనవి

97. కింది వాటిలో కేంద్రక పూర్వ కణాన్ని గుర్తించండి.
A) స్ట్రెప్టోకాకస్
B) యూగ్లీనా
C) హైడ్రా
D) ఈస్ట్
జవాబు:
A) స్ట్రెప్టోకాకస్

98. కింది వాటిలో ఎగిరే క్షీరదాన్ని గుర్తించండి.
A) గుడ్లగూబ
B) కంగారు
C) గబ్బిలం
D) సీల్
జవాబు:
C) గబ్బిలం

99. జతపరుచుము.
1. ఛార్లెస్ డార్విన్ ( ) a) 5 రాజ్యా ల వర్గీకరణ
2. లిన్నేయస్ ( ) b) జీవ పరిణామము.
3. విట్టేకర్ ( ) C) ద్వినామీకరణ
A) 1-ఎ, 2-b, 3-c
B) 1-b, 2-c, 3-a
C) 1-c, 2-6, 3- a
D) 1-c, 2-a, 3-b
జవాబు:
B) 1-b, 2-c, 3-a

AP 9th Class Biology Important Questions 5th Lesson జీవులలో వైవిధ్యం

100. కింది వానిలో సరికానిది గుర్తించుము.
a) పుష్పించని మొక్కలు → విత్తనాలు లేనివి
b) ఆవృత బీజాలు → విత్తనాలు బయటకు కనిపించేవి
C) వివృత బీజాలు → ఫలాల లోపల విత్తనాలు
A) a మాత్రమే
B) bమాత్రమే
C) b మరియు C
D) పైవన్నీ
జవాబు:
C) b మరియు C

101. కణాలను కేంద్రకపూర్వ కణం మరియు నిజకేంద్రక కణంగా విభజించడానికి ఆధారం
A) కణత్వచము
B) కేంద్రకత్వచము
C) రైబోజోములు
D) హరితరేణువులు
జవాబు:
B) కేంద్రకత్వచము

102. మొక్కలను వర్గీకరించడానికి కింది అంశాలను పరిగణలోకి తీసుకుంటారు.
A) పుష్పాలు
B) విత్తనాల అమరిక
C) బీజదళాలు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

103. జీవుల పుట్టుక అనే గ్రంథాన్ని రచించిన ప్రముఖ శాస్త్రవేత్త
A) ఎర్నెస్ట్ హకెల్
B) కెరోలస్ లిన్నేయస్
C) ఆగస్ట్ వీస్మన్
D) చార్లెస్ డార్విస్
జవాబు:
D) చార్లెస్ డార్విస్

104.
AP 9th Class Biology Important Questions 5th Lesson జీవులలో వైవిధ్యం 23
P, Qలు వరుసగా
A) జీవరాజ్యము. నిర్జీవరాజ్యము
B) విభాగము, ప్రగతి
C) తరగతి, కుటుంబము
D) కుటుంబము, తరగతి
జవాబు:
C) తరగతి, కుటుంబము

మీకు తెలుసా?

కేంద్రకపూర్వ జీవులు, నిజకేంద్రక కణాల పుట్టుక గురించి చాలా రకాల సిద్ధాంతాలు మనుగడలో ఉన్నాయి. అన్ని కణాల స్వభావం ఒకేలా ఉంటుంది. కనుక ఇవన్నీ ఒక స్వతంత్ర పూర్వీక కణం నుండి వచ్చి ఉండవచ్చు అని అనుకునేవారు. ఈ మొట్టమొదటి కణాన్ని ‘లూకా’ (Luca’-Last Universal Common Ancestor) అని పిలుస్తారు. ఈ లూకా నుండే తర్వాతి కాలంలో మూడు రకాల కణాలు పుట్టుకొచ్చాయి. పరిణామక్రమంలో ఈ మూడు, మూడు రకాల రంగాలను నిర్దేశిస్తాయి. అవి వరుసగా 1. అరాఖియా 2. బ్యా క్టీరియా 3, యూకేరియా అని ఊజ్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు.

అరాభియా, బ్యాక్టీరియాలు కేంద్రకపూర్వ కణాలు కలిగి ఉంటాయి. అంటే వీటి కణాలలో కణత్వచాన్ని కలిగియున్న కేంద్రకం ఉండదు. కాని కేంద్రక పదార్ధం మాత్రం కణద్రవ్యంలో తేలియాడుతూ ఉంటుంది.

బ్యాక్టీరియాలలో కేంద్రకం లేకపోయినప్పటికీ వాటి కణత్వచం పెప్టిడోగ్లైకాను (Peptidoglycan) అనే రసాయన పదార్థంతో తయారై ఉంటుంది. యూకేరియాలలో నిజకేంద్రకం అంటే కణత్వచం కలిగిన కేంద్రకం ఉంటుంది.

అన్ని కీటకాలు ఆర్థోపొడ వర్గానికి చెందినవే. జీవులలో 80% ఆర్రోపొడ వర్గానికి చెందినవే. 90,000 ప్రజాతి జీవులను కల్గిన అతి పెద్ద వర్గం ఆర్రోపొడ. ఆ పొడ వర్గ జీవులు జీవ వైవిధ్యాన్ని చూపుతాయి. ఇవి హానికర మరియు ఉపయోగకర జీవులు. ఇవి పరాగ సంపర్కం, తేనె సేకరణ, పట్టు పరిశ్రమ, లక్క తయారీల యందు ఉపయోగపడతాయి. మలేరియా, ఫైలేరియా మరియు అనేక రకాల వ్యాధులకు వాహక జీవులుగా కూడా పని చేస్తాయి. కొన్ని ఆర్రోపోడ్లు కంటికి కనిపించనంత చిన్నవిగా కూడా ఉంటాయి. వీటిని సూక్ష్మ ఆర్టోపోడ్లు అంటారు. అయితే ఇవి ‘సూక్ష్మజీవులు కావు.

AP 9th Class Biology Important Questions 5th Lesson జీవులలో వైవిధ్యం

చేపలు శీతల రక్త జంతువులు. వాటి శరీర ఉష్ణోగ్రతను పరిసరాలకు అనుగుణంగా మార్చుకోగలవు. చాలా చేపలు గుడ్లు పెడతాయి. కాని కొన్ని పిల్లల్ని కంటాయి. పిల్లలు పెట్టే వాటిని మనం చేపలు అనలేం. వాటిని జలక్షీరదాలు , అంటారు.
ఉదా : డాల్ఫిన్, తిమింగలం.

AP 9th Class Biology Important Questions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక

These AP 9th Biology Important Questions and Answers 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక will help students prepare well for the exams.

AP Board 9th Class Biology 4th Lesson Important Questions and Answers ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక

9th Class Biology 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
వివిధ రకాల విధులను నిర్వహించడానికి కణమునకు కావలసిన పదార్థాలు ఏవి?
జవాబు:
వివిధ రకాల విధులను నిర్వహించడానికి కణమునకు కావలసిన పదార్థాలు గ్లూకోజ్, నీరు, ఆక్సిజన్, ప్రోటీన్లు, కొవ్వులు మరియు విటమిన్లు.

ప్రశ్న 2.
చక్కెర ద్రావణంలో చక్కెరను మరియు నీటిని ఏమంటారు?
జవాబు:
చక్కెర ద్రావణంలో చక్కెరను ద్రావితం అని, నీటిని ద్రావణి అని అంటారు.

ప్రశ్న 3.
ద్రవాభిసరణ ప్రక్రియలో నీరు ఎల్లప్పుడూ ఎటువైపు ప్రయాణిస్తుంది?
జవాబు:
ద్రవాభిసరణ ప్రక్రియలో నీరు ఎల్లప్పుడూ ఎక్కువ గాఢత కలిగిన చక్కెర లేదా ఉప్పు ద్రావణం వైపు ప్రయాణిస్తుంది.

ప్రశ్న 4.
పారగమ్యత అనగానేమి?
జవాబు:
కొన్ని పదార్థాలను మాత్రమే తన ద్వారా ప్రయాణించడానికి అనుమతించడాన్ని పారగమ్యత అంటారు.

ప్రశ్న 5.
ఎంటోసైటాసిస్ అనగానేమి?
జవాబు:
కణం ఆహారాన్ని కాని ఇతర బాహ్య కణాలను గానీ చుట్టి బాహ్య పరిసరాల నుండి వేరు చేసి ఆహారాన్ని సేకరించే విధానమును ఎండోసైటాసిస్ అంటారు.
ఉదా : అమీబా.

ప్రశ్న 6.
పాక్షిక పారగమ్యత అనగానేమి?
జవాబు:
ప్లాస్మాత్వచం తన గుండా పోవడానికి ద్రావణికి అనుమతి ఇస్తుంది కాని దానిలో కరిగిన ద్రావితాన్ని అనుమతించకపోవడాన్ని పాక్షిక పారగమ్యత అంటారు.

AP 9th Class Biology Important Questions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక

ప్రశ్న 7.
కాల్షియం కార్బొనేటుతో తయారయ్యే గుడ్డు పెంకును కరిగించడానికి ఏ ఆమ్లము నందు ఉంచాలి?
జవాబు:
కాల్షియం కార్బొనేటుతో తయారయ్యే గుడ్డు పెంకును కరిగించడానికి సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లము నందు 4 నుండి 5 గంటలు ఉంచాలి.

ప్రశ్న 8.
మొక్కలలో ద్రవాభిసరణ ఆవశ్యకత ఏమిటి?
జవాబు:
మొక్కల వేర్లలోనికి నీరు ప్రవేశించడానికి, కణాల మధ్య నీరు ప్రవహించడానికి, పత్రరంధ్రాలు మూసుకోవటానికి, తెరుచుకోవడానికి అవసరం.

ప్రశ్న 9.
జంతువులలో ద్రవాభిసరణ ఆవశ్యకత ఏమిటి?
జవాబు:
రక్తములో మలినాలు వడపోయడానికి మరియు మన శరీరానికి కావలసిన నీరు మరియు లవణాలు పునఃశోషణ చేసుకోవడానికి ద్రవాభిసరణం అవసరం.

ప్రశ్న 10.
వ్యాపనం అనగానేమి?
జవాబు:
గాలి లేదా నీరు లాంటి మాధ్యమంలో కొన్ని పదార్థాలను ఉంచినప్పుడు అవి ఆ మాధ్యమంలో సమానంగా విస్తరించడాన్ని వ్యాపనం అంటారు.

ప్రశ్న 11.
గ్రాహం వాయు వ్యాపన నియమం అనగానేమి?
జవాబు:
మాధ్యమంలో కరిగే పదార్థాలు, కరగని పదార్థాల కంటే వేగంగా వ్యాపనం చెందుతాయని థామస్ గ్రాహం కనుగొన్నాడు. దీనిని గ్రాహం వాయు వ్యాపనం అంటారు.

ప్రశ్న 12.
డయాలసిస్ యంత్రం ఏ సూత్రాల ద్వారా పనిచేస్తుంది?
జవాబు:
డయాలసిస్ యంత్రం వడపోత, ద్రవాభిసరణ సూత్రాల ద్వారా పారగమ్య త్వచాలను ఉపయోగించి పనిచేస్తుంది.

ప్రశ్న 13.
జంతు కణాలను తక్కువ గాఢత గల ద్రవాల యందు ఉంచినప్పుడు ఎందుకు పగిలిపోతాయి? వృక్ష కణాలు ఎందుకు పగిలిపోవు?
జవాబు:
ద్రవాల యందు ఉంచినప్పుడు జంతుకణాలకు కణకవచాలు లేకపోవడం వలన పగిలిపోతాయి. వృక్షకణాలకు కణకవచాలు ఉండడం వలన పగిలిపోవు.

ప్రశ్న 14.
శీతల పానీయాలు ఏ విధంగా తయారుచేస్తారు?
జవాబు:
శీతల పానీయాలు చక్కెర ద్రావణాన్ని, CO2 ని కరిగించి చక్కెర ద్రావణాన్ని తయారుచేస్తారు.

ప్రశ్న 15.
జీర్ణమైన ఆహార పదార్థములు శోషణం జరుగుటయందు ఫాత్రవహించే భాగము ఏది?
జవాబు:
జీర్ణమైన ఆహార పదార్ధముల శోషణ జరుగుటయందు ప్లాస్మాత్వచం సూక్ష్మ చూషకాలుగా రూపాంతరం చెందుతుంది.

ప్రశ్న 16.
వ్యాధి జనక జీవుల నుండి శరీరమును రక్షించుటలో ప్లాస్మాత్వచం పాత్రను ఏ విధంగా అభినందిస్తావు?
జవాబు:
ప్లాస్మాత్వచం పైన ఉన్న కొన్ని పదార్థాలు గుర్తింపు కేంద్రాలుగా పనిచేసి మనలను వ్యాధిజనక జీవుల నుండి రక్షణ కలిగిస్తుంది.

ప్రశ్న 17.
నీరు లేని కొబ్బరికాయలోనికి రంధ్రము చేయకుండా నీరు నింపగలరా? ఎలా?
జవాబు:
కొబ్బరికాయ పెంకు నిర్జీవ దృఢకణజాలంతో నిర్మితమైనది. ద్రవాభిసరణం నిర్జీవ కణాలలో ‘జరుగదు. అందువలన రంధ్రం చేయకుండా నీరు నింపలేము.

AP 9th Class Biology Important Questions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక

ప్రశ్న 18.
అన్ని రకాల పదార్థాలను తన గుందా రావడానికి ప్లాస్మాత్వచం అనుమతించినట్లయితే ఏమి జరుగుతుంది?
జవాబు:
అన్ని రకాల పదార్థాలను తన గుండా రావడానికి ప్లాస్మాత్వచం అనుమతించినట్లయితే కణమునకు అవసరం లేని పదార్థాలు మరియు హానికర పదార్థముల చేరిక వలన కణము చనిపోతుంది.

ప్రశ్న 19.
సముద్రపు నీటి నుండి లవణాలను తొలగించి మంచి నీటిని తయారు చేసిన శాస్త్రవేత్తలు ఎవరు?
జవాబు:
ఫ్రెడ్జిమెర్యురీ, డేవిడ్ బోరి పారగమ్యత్వచాన్ని ఉపయోగించి సముద్రపు నీటి నుండి లవణాలను వేరుచేసి మంచి నీటిని తయారు చేశారు.

ప్రశ్న 20.
నిత్యజీవితములో వ్యాపనం మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది?
జవాబు:
పంచదార స్ఫటికములను నీటిలో కరిగించుటకు, దోమల నివారణకు, గాలిని శుభ్రపరిచే డియోడరెంట్ల వినియోగంలో వ్యాపనం ఉపయోగపడుతుంది.

ప్రశ్న 21.
వ్యతిరేక ద్రవాభిసరణ ప్రక్రియ ద్వారా ఉన్న నీరు మంచినీరుగా ఎలా మారుతుంది?
జవాబు:
సముద్రపు నీటిపై ఎక్కువ పీడనాన్ని కలుగచేసినప్పుడు ఉప్పునీరు లవణాలను వదిలివేసి పారగమ్యత్వచం ద్వారా ఉప్పు నీటి నుండి మంచి నీటిలోనికి ప్రవేశిస్తుంది.

ప్రశ్న 22.
మానవులకు ద్రవాభిసరణ ప్రక్రియ ఏ విధంగా ఉపయోగపడుతుంది?
జవాబు:
రక్తంలో మలినాలు వడపోయడానికి, మన శరీరానికి కావలసిన నీరు మరియు లవణాలు పునఃశోషణ చేసుకోవడానికి ద్రవాభిసరణ ఉపయోగపడుతుంది.

ప్రశ్న 23.
మన కళ్ళకు గంతలు కట్టుకొని వివిధ పదార్థములను ఎలా గుర్తించగలుగుతాము?
జవాబు:
వాసనను కలిగించే వివిధ పదార్థాల అణువులు గాలిలోనికి వ్యాపనం చెందుట ద్వారా వివిధ రకాల పదార్థాలను గుర్తిస్తాము.

ప్రశ్న 24.
వాటర్ ప్యూరిఫైయర్ నందు పరిశుభ్రమైన నీరు ఎలా తయారవుతుంది?
జవాబు:
వాటర్ ప్యూరిఫైయర్ నందు రివర్స్ ఆస్మోమీటర్‌ను ఉపయోగించుట ద్వారా పరిశుభ్రమైన నీటిని పొందవచ్చు.

ప్రశ్న 25.
విలియం కాఫ్ అన్ డచ్ వైద్యుడు డయాలసిస్ యంత్రాన్ని కనుగొనకపోయినట్లయితే ఏమి జరిగేది?
జవాబు:
డయాలసిస్ యంత్రం ద్వారా కృత్రిమంగా వ్యర్థ పదార్థాలు వడపోయబడతాయి. లేని పక్షంలో వ్యర్థ పదార్థాలు శరీరంలో నిల్వ ఉండి శరీరం విషపూరితమై మరణం సంభవించటం జరిగేవి.

ప్రశ్న 26.
శీతలపానీయం తాగినా కూడా మనకు దాహం తీరదు? ఎందువలన?
జవాబు:
శీతలపానీయం తాగినా కూడా మనకు దాహం తీరదు. శీతల పానీయం గాఢమైన చక్కెర ద్రావణం. శరీర కణాలలో ద్రవం కన్న శీతల పానీయం గాఢత ఎక్కువ. అందువలన శరీరకణాల నుండి నీరు జీర్ణవ్యవస్థలోనికి ప్రవేశిస్తుంది. తద్వారా దాహం తీరనట్లు మనకు అనిపిస్తుంది.

AP 9th Class Biology Important Questions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక

ప్రశ్న 27.
ఉప్పుతో కూడిన పదార్థాలను తిన్న తర్వాత ఎక్కువ దాహార్తికి ఎందుకు గురి అవుతాం?
జవాబు:
ఉప్పుతో కూడిన పదార్థాలను తిన్న తర్వాత శరీరంలో ఉండే ద్రవాలను ఉప్పు పీల్చుకోవటం వలన నీరు అధికంగా జీర్ణవ్యవస్థలోకి చేరి ద్రవాల గాఢతను సరి చేస్తుంది. అందువలన ఉప్పుతో కూడిన పదార్థాలను తిన్న తర్వాత ఎక్కువ దాహార్తికి గురి అవుతాం.

ప్రశ్న 28.
ప్రయాణంలో ఎటువంటి ఆహారం మంచిది?
జవాబు:
80% నుండి 90% నీరు కలిగిన సహజసిద్ధమైన పండ్లు ఆకలినే కాక దాహార్తిని కూడా తీరుస్తాయి. అందువలన ప్రయాణంలో నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకెళ్ళటం మంచిది.

ప్రశ్న 29.
బాహ్య ద్రవాభిసరణం అనగానేమి?
జవాబు:
కణం నుండి నీరు బయటకు పోవడాన్ని బాహ్య ద్రవాభిసరణం అంటారు.

ప్రశ్న 30.
అంతర ద్రవాభిసరణం అనగానేమి?
జవాబు:
కణము లోపలికి నీరు ప్రవేశించడాన్ని అంతర ద్రవాభిసరణం అంటారు.

9th Class Biology 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
వ్యాపనమునకు, ద్రవాభిసరణకు గల భేదములేవి?
జవాబు:

విసరణ / వ్యాపనం ద్రవాభిసరణము
1. గాఢత ఆధారంగా మాధ్యమంలో పదార్థాలు సమానంగా విస్తరించడాన్ని వ్యాపనం అంటారు. గాఢత ఆధారంగా పదార్థాలు ద్రవమాధ్యమంలో విచక్షణా స్తరం ద్వారా విస్తరించడాన్ని ద్రవాభిసరణ అంటారు.
2. ఇది భౌతిక చర్య. ఇది జీవ, భౌతిక చర్య.
3. పాక్షిక పారగమ్యత్వచం అవసరం లేదు. పాక్షిక పారగమ్యత్వచం అవసరం.
4. ద్రవ, వాయు స్థితులలో జరుగుతుంది. కేవలం ద్రవస్థితిలోనే జరుగుతుంది.

ప్రశ్న 2.
ద్రవాభిసరణం అనగానేమి ? ఉదాహరణతో వివరింపుము.
జవాబు:
తక్కువ గాఢత నుండి ఎక్కువ గాఢతకు పాక్షిక పారగమ్యత్వచం ద్వారా నీటి అణువుల కదలిక రెండువైపులా సమానమయ్యే వరకు జరిగే ప్రక్రియను ద్రవాభిసరణ అంటారు.
ఉదాహరణ : కిస్‌మిస్‌ తో ద్రవాభిసరణం

  1. కిస్‌మిస్‌ను బీకరు నీటిలో వేసి కొద్దిసేపు కదలకుండా ఉంచాలి. తరువాత దానిని తీసి ఎక్కువ గాఢత గల పంచదార లేదా ఉప్పునీటి ద్రావణంలో ఉంచాలి.
  2. నీటిలో ఉంచినపుడు కిస్మిస్ నీటిని గ్రహించి ఉబ్బుతుంది. గాఢమైన పంచదార లేదా ఉప్పు ద్రావణంలో ఉంచినపుడు ముడుచుకుపోతుంది.
  3. పై రెండు సందర్భాలలోను నీరు తక్కువ గాఢత నుండి ఎక్కువ గాఢతకు ద్రవాభిసరణ ప్రక్రియ వలన కదలినది.

ప్రశ్న 3.
వ్యతిరేక ద్రవాభిసరణము అనగానేమి? దాని ఉపయోగమేమి?
జవాబు:
1) సముద్రపు నీటిపై ఎక్కువ పీడనాన్ని కలుగజేసినపుడు ఉప్పు నీరు లవణాలను వదిలివేసి పారగమ్యత్వచం ద్వారా ఉప్పు నీటి నుండి మంచి నీటిలోనికి ప్రవేశిస్తుంది.

2) ఈ పద్ధతిని వ్యతిరేక ద్రవాభిసరణము అంటారు.
ఉపయోగము :
మూడు నుండి ఐదు పొరలుండే పారగమ్యత్వచాల ద్వారా ఉప్పు నీటిని వడపోసే యంత్రాలు ప్రస్తుతము గృహవినియోగానికి వాడుతున్నారు.

AP 9th Class Biology Important Questions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక

ప్రశ్న 4.
వ్యాపనం అనగానేమి? ఉదాహరణనిమ్ము.
జవాబు:
గాలి లేదా నీరులాంటి మాధ్యమంలో కొన్ని పదార్థాలను ఉంచినప్పుడు అవి ఆ మాధ్యమంలో సమానంగా విస్తరించడాన్ని వ్యాపనం అంటారు.
ఉదాహరణ :
గదిలోని ఒక మూల సెంటుసీసా మూత తెరిస్తే సెంటులోని అణువులు గది అంతా వ్యాపనం చెందుట వలన గది అంతా వాసన సమానంగా వ్యాపిస్తుంది.

ప్రశ్న 5.
కణములోనికి CO2 ఎందుకు ప్రవేశించలేదు?
జవాబు:

  1. శ్వాసక్రియ సందర్భముగా O2 వినియోగించబడి CO2 విడుదల అవుతుంది.
  2. కణములో CO2, గాఢత ఎక్కువగా ఉంటుంది. కణము బయట CO2 గాఢత తక్కువగా ఉంటుంది.
  3. అందువలన వ్యాపనము ద్వారా కణము నుండి CO2 బయటకు పోతుంది.

ప్రశ్న 6.
50 గ్రాముల పొటాటో చిప్స్ ను ప్రయాణ సమయంలో తినిన తరువాత దాహం వేయడానికి కారణం?
జవాబు:

  1. మనం బస్సులో ప్రయాణం చేసే సమయంలో గాలివేగం వలన శరీరం నుండి ఎక్కువ నీటిని కోల్పోతాం.
  2. 50 గ్రాముల చిప్స్ తిన్న తర్వాత శరీరంలో ఉండే ద్రవాలను ఉప్పు పీల్చుకోవడం వలన నీరు అధికంగా జీర్ణవ్యవస్థలోకి చేరి ద్రవాల గాఢతను సరిచేస్తుంది.
  3. దీనివలన మనం ఉప్పుతో కూడిన పదార్థాలను తిన్న తర్వాత ఎక్కువ దాహార్తికి గురవుతాం.

ప్రశ్న 7.
ద్రవాభిసరణంతో పనిచేసే ఏవైనా మూడు సన్నివేశాలను తెలపండి.
జవాబు:

  1. మొక్కల వేర్లలోనికి నీరు ద్రవాభిసరణము ద్వారా ప్రవేశిస్తుంది.
  2. రక్తంలో మలినాలను వడపోయడానికి ద్రవాభిసరణ సహాయపడుతుంది.
  3. పత్ర రంధ్రాలు మూసుకోవడం, తెరుచుకోవడం ద్రవాభిసరణ వలన జరుగుతుంది.

9th Class Biology 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
ప్లాస్మా (పొర) అనగానేమి? దాని యొక్క విధులేవి?
జవాబు:
కణాన్ని ఆవరించి ఉండి కణంలోని అంశాలను బాహ్యపరిసరాలతో వేరుపరచే పొరను ప్లాస్మా పొర అంటారు.

ప్లాస్మా పొర, విధులు :
1) ఆకారం :
కణానికి కణంలోని అంశాలకు నిర్దిష్టమైన ఆకారాన్ని ఇస్తుంది.

2) యాంత్రిక అవరోధం :
కణంలోని అంశాలను రక్షించడానికి యాంత్రిక అవరోధంగా పనిచేస్తుంది.

3) పారగమ్యత :
కణం గుండా ప్రవేశించే, నిర్ణమించే పదార్థాలను ప్లాస్మాత్వచం నిర్ధారిస్తుంది.

4) ఎండోసైటాసిస్ :
త్వచం సరళమైన నిర్మాణం కలిగి ఉండుట వలన కణం ఆహారాన్ని గాని, ఇతర బాహ్య కణాలను గాని చుట్టి బాహ్య పరిసరాల నుంచి వేరుచేసి ఆహారాన్ని సేకరిస్తుంది.
ఉదా : అమీబా.

5) గుర్తించటం :
త్వచం నందలి గుర్తింపు కేంద్రాలు కణజాల నిర్మాణానికి బాహ్యపదార్థాలను గుర్తించడానికి వ్యాధిజనక జీవుల నుండి రక్షణ పొందడానికి సహాయపడతాయి.

6) సమాచార ప్రసారం :
అదే జీవిలోని వివిధ కణాల మధ్య సమాచార ప్రసారానికి దోహదం చేస్తుంది.

7) ద్రవాభిసరణం :
చిన్న చిన్న నీటిమార్గాలు ప్లాస్మాత్వచంలో ఉండుట వలన ద్రవాభిసరణ జరుగుతుంది.

8) కణ నిరంతరత :
ప్లాస్మాత్వచం ప్లాస్మాడెస్మోటాల నిర్మాణాల ద్వారా ప్రక్క ప్రక్క కణాలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది.

9) ప్రత్యేకత :
వివిధ విధులను నిర్వర్తించడానికి ప్లాస్మాత్వచం రూపాంతరం చెందుతుంది. ఉదాహరణకి సూక్ష్మ చూషకాలతో శోషణ.

AP 9th Class Biology Important Questions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక

ప్రశ్న 2.
జీవులలో ద్రవాభిసరణ ప్రాముఖ్యత ఏమిటి?
జవాబు:

  1. మొక్కల వేర్లలోకి నీరు ప్రవేశిస్తుంది.
  2. కణాల మధ్య నీరు ప్రవహిస్తుంది.
  3. పత్రరంధ్రాలు మూసుకోవడం, తెరచుకోవడం జరుగుతుంది.
  4. మొక్కలలో నీరు, లవణాల కదలికకు సహాయపడుతుంది.
  5. రక్తంలో మలినాలు వడపోయడానికి సహాయపడుతుంది.
  6. మన శరీరానికి కావలసిన నీరు మరియు లవణాలు పునఃశోషణం చేసుకోవడానికి ద్రవాభిసరణ ఉపయోగపడుతుంది.

9th Class Biology 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక Important Questions and Answers

ప్రశ్న 1.
లత KMnO4 స్పటికాలను బీకరులోని నీటిలో వేసి, ఏం జరుగుతుందోనని పరిశీలిస్తోంది. ఈ ప్రయోగంలో ఇమిడి ఉన్న ప్రక్రియ ఏమిటి?
జవాబు:
వ్యాపనము

ప్రశ్న 2.
కింద ఇవ్వబడిన పట్టికను చదివి అందులోని సమాచారం ఆధారంగా పట్టికను పూరించుము.
జవాబు:

ప్రక్రియ /విధి దృగ్విషయము పేరు
1. కణం గుండా ప్రవేశించే, నిర్గమించే పదార్థాలను ప్లాస్మా త్వచం నిర్ధారిస్తుంది.
2. ప్లాస్నా త్వచము సరళమైన నిర్మాణం కలిగి వుండటం వలన కణం ఆహారాన్ని కానీ, ఇతర బాహ్య కణాలను గానీ చుట్టి బాహ్య పరిసరాల నుంచి వేరు చేసి ఆహారాన్ని సేకరిస్తుంది.
3. చిన్న చిన్న నీటి మార్గాలు ప్లాస్మా త్వచంలో వుండటం వలన నీరు లోనికి ప్రవేశిస్తుంది. (లేదా) బయటకు వెళుతుంది.
4. అణువులు అధిక గాఢత గల ప్రదేశం నుండి అల్ప గాఢత గల ప్రదేశానికి కదులుట

జవాబు:

  1. పారగమ్యత
  2. ఎండోసైటాసిస్
  3. దృవాభిసరణ
  4. వ్యాపనము

ప్రశ్న 3.
పటమును పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
ఎ) కోడిగ్రుడ్డు నుండి విచక్షణాస్తరంను తయారుచేయుటకు నీవు ఉపయోగించిన రసాయన పదార్థమేది?
బి) విచక్షణాస్తరంను తయారుచేయడంలో ఏ జాగ్రత్తలు తీసుకున్నావు?
AP 9th Class Biology Important Questions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 3
జవాబు:
ఎ) సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం
బి) 1) గ్రుడ్డును 4-5 గంటలపాటు సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో పెంకు కరిగే వరకు ఉంచాలి.
2) తరువాత గుడ్డుకు పెన్సిల్ పరిమాణంలో ఉండే రంధ్రం చేయాలి. లోపలి పదార్థాన్ని నెమ్మదిగా బయటకు పోయేటట్లు చేయాలి.
3) పొరలోపలి భాగాన్ని నీటితో కడగాలి.

AP 9th Class Biology Important Questions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక

ప్రశ్న 4.
క్రింది పట్టికను పరిశీలించండి.

పదార్థం కణం లోపలకు ప్రవేశిస్తుంది కణం వెలుపలకు ప్రవేశిస్తుంది
ఆక్సిజన్
గ్లూకోజ్
ప్రోటీన్స్
కొవ్వులు
విటమిన్లు
కార్బన్ డై ఆక్సైడ్
వ్యర్థాలు

ఎ) ఏయే పదార్థాలు కణంలోపలకు వెళతాయి?
బి) ఏ యే వ్యర్థాలు కణం వెలుపలకు వస్తాయి? ఎందుకు?
సి) ఒక కణంలోకి పదార్థాల రవాణా దేని ద్వారా జరుగుతుంది?
డి) పారగమ్యత లక్షణం ఉపయోగమేమిటి?
జవాబు:
ఎ) ఆక్సీజన్, గ్లూకోజ్, ప్రోటీన్స్, కొవ్వులు, విటమిన్లు
బి) కార్బన్ డై ఆక్సైడ్, వ్యర్థాలు
సి) ప్లాస్మాత్వచం
డి) కణానికి అపాయం కలిగించే పదార్థాలను లోనికి ప్రవేశించకుండా అదే విధంగా కణంలో తయారయ్యే విష పదార్థాలను మాత్రమే కణం బయటకు పోయే విధంగా పారగమ్యతా లక్షణం ఉపయోగపడుతుంది.

ప్రశ్న 5.
మీకు రెండు బీకరులు, గరాటు, వడపోత కాగితం, స్టాండు, చక్కెర, బియ్యం లేదా గోధుమపిండి, ప్లాస్టిక్ బాటిల్ ఇవ్వబడినవి. వీటితో నీవు నిర్వహించే ప్రయోగం, ప్రయోగ విధానం, తీసుకోవలసిన జాగ్రత్తలు రాయండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 10

  1. 100 మి.లీ. నీటికి ఒకచెంచాడు గోధుమ లేదా వరిపిండి కలిపి ద్రావణం చేయండి.
  2. ఈ ద్రావణానికి ఒక చుక్క టింక్చర్ అయొడినను కలపండి.
  3. ఈ ద్రావణాన్ని వడపోయండి. ఈ వడపోత ద్వారా నీరు మరియు నీటిలో కరిగిన పిండి గరాటు కింద గల బీకరులోనికి చేరుతుంది.
  4. వడపోత కాగితం నీటిలో కరగని పిండిని తన గుండా ప్రయాణించడానికి, అనుమతి ఇవ్వలేదు. పిండి అవక్షేపం వడపోత కాగితం మీద ఏర్పడినది.

జాగ్రత్తలు:

  1. ఉపయోగించిన వడపోత కాగితానికి రంధ్రాలు లేకుండా చూసుకోవాలి.
  2. వడపోత కాగితం లోకి పిండి ద్రావణం పోసేటప్పుడు నెమ్మదిగా, కలియదిప్పుతూ పోయాలి.

9th Class Biology 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 1 Mark Bits Questions and Answers

లక్ష్యాత్మక నియోజనము

1. ‘ప్లాస్మా పొర
A) పారగమ్యత కలిగినది
B) పాక్షిక పారగమ్యత గలది.
C) విచక్షణాస్తరం
D) పైవి అన్నియూ
జవాబు:
D) పైవి అన్నియూ

2. ప్లాస్మా పొర దీనియందు ఉంటుంది.
A) మొక్కలలో
B) జంతువులలో
C) మొక్కలు మరియు జంతువులలో
D) పైవేవీ కావు
జవాబు:
C) మొక్కలు మరియు జంతువులలో

3. వ్యాపనం ఈ మాధ్యమంలో జరుగుతుంది.
A) ఘనపదారములందు
B) ద్రవపదార్థములందు
C) వాయువులందు
D) పైవి అన్నియూ
జవాబు:
D) పైవి అన్నియూ

4. ద్రవాభిసరణం ఈ మాధ్యమం నందు జరుగుతుంది.
A) ఘనపదార్థములందు
B) ద్రవపదార్థములందు
C) వాయువులందు
D) పైవేవీ కావు
జవాబు:
B) ద్రవపదార్థములందు

5. విచక్షణాస్తరం ఈ ప్రక్రియ జరగటానికి అవసరం.
A) ద్రవాభిసరణం
B) వ్యాపనం
C) ద్రవాభిసరణం మరియు వ్యాపనం
D) పైవేవీ కావు
జవాబు:
A) ద్రవాభిసరణం

AP 9th Class Biology Important Questions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక

6. ద్రావణిని గుర్తించండి
A) పంచదార
B) ఉప్పు
C) నీరు
D) కణద్రవ్యం
జవాబు:
C) నీరు

7. ద్రావణంలో కరిగియున్న పదార్థం
A) ద్రావణి
B) ద్రావితం
C) మిశ్రమం
D) నీరు
జవాబు:
B) ద్రావితం

8. ప్లాస్మా పొర విధి
A) కణానికి, కణంలోని అంశాలకు నిర్దిష్టమైన ఆకారం ఇవ్వడం
B) ద్రవాభిసరణం
C) సమాచార ప్రసారం
D) పైవి అన్నియూ
జవాబు:
D) పైవి అన్నియూ

9. వాయువుల వ్యాపనంపై పరిశోధన చేసినవాడు
A) థామస్ గ్రాహం
B) ఫెడ్డి మెర్క్యురి
C) ఎండోసైటాసిస్
D) ఎక్సోసైటాసిస్
జవాబు:
A) థామస్ గ్రాహం

10. ఈ క్రింది వానిలో కణం నుండి బయటకు వెళ్ళేది
A) ఆక్సిజన్
B) కార్బన్-డై-ఆక్సెడ్
C) గ్లూకోజ్
D) ఖనిజ లవణాలు
జవాబు:
B) కార్బన్-డై-ఆక్సెడ్

11. బీకరు అడుగున పదార్థము మిగిలే ద్రావణము
A) సంతృప్త ద్రావణం
B) అసంతృప్త ద్రావణం
C) చల్లని ద్రావణం
D) వేడి ద్రావణం
జవాబు:
A) సంతృప్త ద్రావణం

12. గ్రీకు భాషలో “ఆస్మా” అనగా
A) లాగటం
B) నెట్టడం
C) పీల్చడం
D) త్రాగడం
జవాబు:
B) నెట్టడం

AP 9th Class Biology Important Questions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక

13. ద్రవాభిసరణ ప్రక్రియలో
A) నీరు అధిక గాఢత నుండి అల్ప గాఢతకు ప్రయాణిస్తుంది.
B) నీరు అల్ప గాఢత నుండి అధిక గాఢతకు ప్రయాణిస్తుంది.
C) పదార్థపు అణువులు అధిక గాఢత నుండి అల్ప గాఢతకు ప్రయాణిస్తాయి.
D) పదార్థపు అణువులు అల్ప గాఢత నుండి అధిక గాఢతకు ప్రయాణిస్తాయి.
జవాబు:
B) నీరు అల్ప గాఢత నుండి అధిక గాఢతకు ప్రయాణిస్తుంది.

14. వ్యాపన ప్రక్రియలో
A) నీరు అధిక గాఢత నుండి అల్ప గాఢతకు ప్రయాణిస్తుంది.
B) నీరు అల్ప గాఢత నుండి అధిక గాఢతకు ప్రయాణిస్తుంది.
C) పదార్థపు అణువులు అధిక గాఢత నుండి అల్ప గాఢతకు ప్రయాణిస్తాయి.
D) పదార్థపు అణువులు అల్ప గాఢత నుండి అధిక గాఢతకు ప్రయాణిస్తాయి.
జవాబు:
C) పదార్థపు అణువులు అధిక గాఢత నుండి అల్ప గాఢతకు ప్రయాణిస్తాయి.

15. పారగమ్యత్వచం దీనికి అవసరం.
A) వ్యాపనం
B) ద్రవాభిసరణం
C) వ్యతిరేక ద్రవాభిసరణం
D) B మరియు C
జవాబు:
D) B మరియు C

16. ప్లాస్మాపొర గురించిన సత్య వాక్యం
A) ప్లాస్మాపొర తన ద్వారా నీరు ప్రయాణించడానికి అనుమతిస్తుంది.
B) నీటిలో కరిగిన కొన్ని పదార్థాలను కూడా తన ద్వారా అనుమతిస్తుంది.
C) ప్లాస్మాపొర కొన్ని పదార్థాలను తన ద్వారా అనుమతించదు.
D) పైవి అన్నియు.
జవాబు:
D) పైవి అన్నియు.

17. ప్లాస్మాపొర గురించి సత్య వాక్యం
A) ఇది స్థితిస్థాపక శక్తి కలిగి ఉంటుంది.
B) పారగమ్యత లక్షణం కలిగి ఉంటుంది.
C) సజీవ త్వచం
D) పైవి అన్నియు
జవాబు:
D) పైవి అన్నియు

18. కణం ఘన ఆహారాన్ని సేకరించే ప్రక్రియ
A) ఆస్మాసిస్
B) పీనోసైటాసిన్
C) డేవిడ్ బోరి
D) బిచాట్
జవాబు:
C) డేవిడ్ బోరి

19. ప్లాస్నాత్వచం పక్క కణాలతో వీని ద్వారా సంబంధం కలిగి ఉంటుంది.
A) ఆక్సాన్లు
B) డెండ్రైట్
C) టెలి డెండ్రైట్
D) ప్లాస్మాడెస్మేటా
జవాబు:
D) ప్లాస్మాడెస్మేటా

20. ఈ క్రింది వానిలో ప్లాస్మాత్వచం యొక్క రూపాంతరం
A) కేంద్రకం
B) సూక్ష్మచూషకాలు
C) కణకవచం
D) అంటు బిళ్ళలు
జవాబు:
B) సూక్ష్మచూషకాలు

AP 9th Class Biology Important Questions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక

21. కణం లోపలికి నీరు ప్రవేశించడాన్ని ఏమంటారు?
A) ఎక్సో ఆస్మాసిస్
B) ఎండో ఆస్మాసిస్
C) ఎండో సైటాసిస్
D) ఎక్సో సైటాసిస్
జవాబు:
B) ఎండో ఆస్మాసిస్

22. రక్తంలో మలినాలు వడపోయడం ఈ ప్రక్రియ ద్వారా జరుగుతుంది.
A) వ్యాపనం
B) ద్రవాభిసరణం
C) వ్యతిరేక ద్రవాభిసరణం
D) బాహ్య ద్రవాభిసరణం
జవాబు:
B) ద్రవాభిసరణం

23. డి-శాలినేషన్ కనుగొన్న శాస్త్రవేత్త
A) విలియ్ కాఫ్
B) ఫ్రెడ్డీ మెర్క్యూరీ
C) డేవిడ్ బోరి
D) B మరియు C
జవాబు:
D) B మరియు C

24. డి-శాలినేషన్ పద్ధతిలో సముద్రపు నీటి నుండి దీనిని వేరు చేస్తారు.
A) మంచినీరు
B) లవణాలు
C) A మరియు B
D) పైవీ ఏవీకాదు
జవాబు:
B) లవణాలు

25. ప్లాస్మాపొర ద్వారా రవాణా అయ్యేవి
A) ఘన పదార్థాలు
B) ద్రవ పదార్థాలు
C) వాయు పదార్థాలు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

26. వ్యాపనం ఇక్కడ జరుగుతుంది.
A) భూమిలో
B) నీటిలో
C) గాలిలో
D) B మరియు C
జవాబు:
D) B మరియు C

27. వాయువ్యాపన నియమాన్ని కనుగొన్న శాస్త్రవేత్త
A) థామస్ గ్రాహం
B) థామస్ ఎడిసన్
C) అవగాడ్రో
D) హంప్రిడేవి
జవాబు:
A) థామస్ గ్రాహం

28. దోమల నివారణ మందులు ఏ సూత్రంపై పనిచేస్తాయి?
A) వ్యాపనం
B) ద్రవాభిసరణం
C) వ్యతిరేక ద్రవాభిసరణం
D) పైవి ఏవీ కాదు
జవాబు:
A) వ్యాపనం

29. వ్యతిరేక ద్రవాభిసరణం ఏ సూత్రంపై పనిచేస్తుంది?
A) వ్యాపనం
B) ద్రవాభిసరణం
C) పై రెండూ
D) ప్రత్యేక పరిస్థితులు
జవాబు:
B) ద్రవాభిసరణం

30. పొటాటో ఆస్మోమీటర్ లోనికి నీరు ఏ పద్ధతి ద్వారా ప్రవేశిస్తుంది?
A) వ్యాపనం
B) ద్రవాభిసరణం
C) వ్యతిరేక ద్రవాభిసరణం
D) పైవి ఏవీకాదు
జవాబు:
B) ద్రవాభిసరణం

AP 9th Class Biology Important Questions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక

31. నీటిని శుద్ధి చేసే ప్రక్రియ
A) వ్యాపనం
B) ద్రవాభిసరణం
C) వ్యతిరేక ద్రవాభిసరణం
D) పైవి ఏవీకాదు
జవాబు:
C) వ్యతిరేక ద్రవాభిసరణం

32. డయాలసిస్ యంత్రాన్ని కనుగొన్న శాస్త్రవేత్త
A) విలియమ్ కాఫ్
B) ఫ్రెడ్డీ మెర్క్యూరి
C) పై రెండూ
D) పైవి ఏవీకాదు
జవాబు:
A) విలియమ్ కాఫ్

33. తక్కువ గాఢత గల ద్రవంలో ఉంచినపుడు పగిలిపోయేవి
A) జంతుకణాలు
B) వృక్షకణాలు
C) నిర్జీవకణాలు
D) పైవి ఏవీకాదు
జవాబు:
A) జంతుకణాలు

34. ప్రయాణంలో తీసుకోవాల్సింది
A) కూల్ డ్రింక్స్
B) పోటాటో చిప్స్
C) చక్కెర ద్రావణంలో ముంచిన స్వీట్స్
D) పైవేవీ తీసుకోకూడదు
జవాబు:
D) పైవేవీ తీసుకోకూడదు

35. రివర్స్ ఆస్మోసిస్లో ఉపయోగించేది
A) కాంతి
B) ఉష్ణోగ్రత
C) పీడనం
D) విద్యుత్
జవాబు:
C) పీడనం

36. కరిగే స్వభావం కలిగినది.
A) ద్రావణి
B) ద్రావితం
C) ద్రావణము
D) పదార్థము
జవాబు:
B) ద్రావితం

37. మొక్కల వేర్లలోకి నీరు ప్రవేశించే ప్రక్రియ
A) వ్యాపనం
B) ద్రవాభిసరణం
C) వ్యతిరేక ద్రవాభిసరణం
D) పైవి ఏవీకాదు
జవాబు:
B) ద్రవాభిసరణం

38. ఈ క్రింది వానిలో సరిగా జతపరచబడిన జత ఏది?
i) వ్యాపనము – థామస్ గ్రాహం
ii) ద్రవాభిసరణం – ఫ్రెడ్డీ మెర్క్యురీ మరియు డేవిడ్ బోరి
iii) వ్యతిరేక ద్రవాభిసరణం – పత్రరంధ్రాలు మూసుకోవడం, తెరుచుకోవడం
A) i, iii
B) ii మాత్రమే
C) i మాత్రమే
D) ii, iii
జవాబు:
D) ii, iii

AP 9th Class Biology Important Questions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక

39. సముద్రపు చేపకు మంచినీటిలో ఉంచితే అది చనిపోవడానికి గల కారణం
A) ద్రవాభిసరణం
B) బాహ్యద్రవాభిసరణం
C) వ్యాపనం
D) వ్యతిరేక ద్రవాభిసరణం
జవాబు:
A) ద్రవాభిసరణం

40. తాజా ద్రాక్ష పండును ఉప్పునీటిలో ఉంచినపుడు ఏమి జరుగుతుంది.
A) ఉబ్బుతుంది
B) కృశిస్తుంది
C) మారదు
D) పగులుతుంది
జవాబు:
B) కృశిస్తుంది

41. కాఫీ పొడి మరియు పొటాషియం పర్మాంగనేట్ (KMNO) లతో చేసే ప్రయోగం నిరూపించునది.
A) ద్రవాభిసరణం
B) వ్యతిరేక ద్రవాభిసరణం
C) బాహ్య ద్రవాభిసరణం
D) వ్యాపనం
జవాబు:
D) వ్యాపనం

42. ఉప్పు నీటిలో ఉంచిన కొడిగుడ్డు కృశించటానికి గల కారణం
A) ద్రవాభిసరణం
B) బాహ్య ద్రవాభిసరణం
C) వ్యాపనం
D) అంతర ద్రవాభిసరణం
జవాబు:
B) బాహ్య ద్రవాభిసరణం

AP 9th Class Biology Important Questions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక

43. కుళాయి నీటిలో ఉంచిన కోడిగుడ్లు ఉబ్బటానికి గల కారణం
A) ద్రవాభిసరణం
B) బాహ్య ద్రవాభిసరణం
C) వ్యాపనం
D) అంతర ద్రవాభిసరణం
జవాబు:
D) అంతర ద్రవాభిసరణం

44. ప్రక్కనున్న చిత్రం సూచించునది
AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 9
A) ద్రవాభిసరణకు పరికరముల ఏర్పాటు
B) వడపోత పద్దతి పరికరాలు
C) ఇది వ్యాపనాన్ని వివరిస్తుంది
D) పాక్షిక పారగమ్య త్వచాన్ని తయారుచేయటం
జవాబు:
D) పాక్షిక పారగమ్య త్వచాన్ని తయారుచేయటం

45. ఈ పటం సూచించునది.
AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 6
A) ద్రవాభిసరణం
B) బాహ్య ద్రవాభిసరణం
C) వడపోత
D) వ్యతిరేక ద్రవాభిసరణం
జవాబు:
C) వడపోత

46. ఈ చిత్రం సూచించునది.
AP 9th Class Biology Important Questions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 4
A) ద్రవాభిసరణం
B) బాహ్య ద్రవాభిసరణం
C) వడపోత
D) వ్యతిరేక ద్రవాభిసరణం
జవాబు:
D) వ్యతిరేక ద్రవాభిసరణం

47. క్రింది (ఫ్ ను పరిశీలించి సరియైన ప్రవచనాన్ని ఎన్నుకోండి.
AP 9th Class Biology Important Questions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 5
A) B మరియు C ద్రావణాల కంటే A ద్రావణం గాఢత ఎక్కువ.
B) A మరియు B ద్రావణాల కంటే C ద్రావణం గాఢత తక్కువ.
C) B ద్రావణం గాఢత A మరియు C ద్రావణాల గాఢతతో సమానం.
D) A మరియు B ద్రావణాల కంటే C ద్రావణం గాఢత ఎక్కువ.
జవాబు:
D) A మరియు B ద్రావణాల కంటే C ద్రావణం గాఢత ఎక్కువ.

48. సరియైన జతపరచడాన్ని గుర్తించండి.
1) ద్రవాభిసరణం ( ) A) అమీబా
2) ఎండోసైటాసిస్ ( ) B) సూక్ష్మచూషకాలు
3) ప్రత్యేకత ( ) C) మూలకేసరాలు
A) 1 – B, 2 – A, 3 – C
B) 1 – C, 2 – B, 3 – A
C) 1 – A, 2 – B, 3- C
D) 1 – C, 2 – A, 3 – B
జవాబు:
D) 1 – C, 2 – A, 3 – B

49. భోపాల్ వాయు దుర్ఘటన జరగటానికి కారణం
A) ద్రవాభిసరణం
B) వ్యతిరేక ద్రవాభిసరణం
C) వ్యాపనం
D) బాహ్య ద్రవాభిసరణం
జవాబు:
C) వ్యాపనం

50. మన శరీరంలో రక్తం నుండి మలినాలు వేరు చేయబడే ప్రక్రియ
A) రెప్లికేషన్
B) ఎండో సైటాసిస్
C) ద్రవాభిసరణం
D) నిశ్వాసము
జవాబు:
C) ద్రవాభిసరణం

51. ఉడకబెట్టిన గుడ్డు నుండి పాక్షిక పారగమ్యత్వచాన్ని పొందుటకు ఉపయోగించే రసాయనం
A) సజల HCl
B) చక్కెర ద్రావణం
C) ఉప్పు ద్రావణం
D) స్వేదన జలం
జవాబు:
A) సజల HCl

52. మంచి నీటి అమీబాను ఉప్పు నీటిలో ఉంచితే ఏమవుతుంది?
A) బాహ్యద్రవాభిసరణ – కణం స్పీతం చెందును
B) బాహ్యద్రవాభిసరణ – కణం ముడుచుకు పోతుంది
C) అంతరద్రవాభిసరణ – కణం సీతం చెందును
D) అంతర ద్రవాభిసరణ కణం ముడుచుకు పోతుంది.
జవాబు:
B) బాహ్యద్రవాభిసరణ – కణం ముడుచుకు పోతుంది

53. పరికరము కింది సూత్రం ఆధారంగా పనిచేస్తుంది.
AP 9th Class Biology Important Questions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 6
A) ద్రవాభిసరణం
B) వ్యతిరేక ద్రవాభిసరణం
C) విసరణం
D) A మరియు C
జవాబు:
B) వ్యతిరేక ద్రవాభిసరణం

54. కొన్ని ఎంపికచేసిన ద్రావికాలను మాత్రమే తమగుండా ప్రవేశింపచేసేవి
A) మృతకణజాలం
B) విచక్షణార్థరం
C) బెరడు
D) పైవేవీ కావు
జవాబు:
B) విచక్షణార్థరం

55. ఎండాకాలంలో కూల్ డ్రింక్ త్రాగితే దాహం తీరదు. ఎందుకంటే
A) కణరసం గాఢతకంటే కూల్ డ్రింక్ గాఢత ఎక్కువ
B) కణరసం గాఢతకంటే కూల్ డ్రింక్ గాఢత తక్కువ
C) రెండూ సమానం కావున
D) పైవేవీ కావు
జవాబు:
A) కణరసం గాఢతకంటే కూల్ డ్రింక్ గాఢత ఎక్కువ

మీకు తెలుసా?

మనం సముద్ర నీటిని త్రాగగలమా? భూమి మీద నాలుగింట మూడు వంతులు సముద్రపు నీరు ఉన్నది. ఎంతో నీరు ఉన్నప్పటికీ, సముద్రపు నీరు ఉప్పగా ఉండటం వలన మనం ఆ నీటిని ఉపయోగించుకోలేం. సముద్రపు నీటి నుండి లవణాలను తొలగించగలిగితే, ఆ నీటిని మనం ఉపయోగించుకోగలం. ఫ్రెడ్డీ మెర్కురీ, డేవిడ్ బోరి అనే శాస్త్రవేత్తలు సముద్రపు నీటి నుండి లవణాలను పారగమ్య త్వచాన్ని ఉపయోగించి తొలగించే పద్ధతి కనుగొన్నారు. ఈ పద్ధతినే లవణాలను తొలగించడం (de salination) అంటారు.

AP 9th Class Biology Important Questions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 7
స్కాట్లాండ్ కు చెందిన థామస్ గ్రాహం అనే భౌతిక, రసాయన శాస్త్రవేత్త వాయువుల వ్యాపనంపై అధ్యయనం చేశాడు. ఈయన వాయువుల వ్యాపనాన్నే కాకుండా ద్రవ పదార్థాల వ్యాపనాన్ని కూడా అధ్యయనం చేశాడు. మాధ్యమంలో కరిగే పదార్థాలు, కరగని పదార్థాల కంటే వేగంగా వ్యాపనం చెందుతాయని గ్రాహం కనుగొన్నాడు. దీనినే గ్రాహం వాయు వ్యాపన నియమం అంటారు. ఇప్పటి వరకు మనం ద్రవాభిసరణ, వ్యాపనాల గురించి అధ్యయనం చేశాం. కణత్వచం ద్వారా జరిగే వేర్వేరు ఇతర ప్రక్రియల గురించి పై తరగతులలో అధ్యయనం చేస్తాం.

పునరాలోచన

AP 9th Class Biology Important Questions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 1

అనుబంధం

→ వాటర్ ప్యూరిఫైయర్ (వాటిని శుభ్రం చేసే యంత్రం) చూశారా ! శుభ్రం చేసే కడ్డీలను వాటర్ ఫిల్టర్ తరుచుగా వాడుతుంటారు, పరిశుభ్రమైన నీరు కావాలంటే రివర్స్ అస్మోమీటర్‌ను ఉపయోగించాలి. రివర్స్ ఆస్మోసిస్ ద్వారా ఈ యంత్రం నీటిని శుభ్రం చేస్తుంది.
AP 9th Class Biology Important Questions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 2

→ మన శరీరంలో మూత్రపిండాలు రక్తం నుండి వ్యర్థ పదార్థాలను ద్రవాభిసరణ ప్రక్రియలో వడపోస్తాయి.
మూత్రపిండాలు వడపోయలేని పక్షంలో వ్యర్థపదార్థాలు శరీరంలో నిల్వ ఉండిపోతాయి. దీనివలన శరీరం విషపూరితమై మరణం సంభవిస్తుంది.

డా|| విలియం కాఫ్ అనే డచ్ వైద్యుడు 1947లో డయాలసిస్ యంత్రాన్ని కనుగొన్నాడు. శరీరంలోని వృథా పదార్థాలను ఈ యంత్రం వడపోస్తుంది. ఈ యంత్రం వడపోత, ద్రవాభిసరణ సూత్రాల ద్వారా పారగమ్య త్వచాలనుపయోగించి పనిచేస్తుంది.

→ రక్తకణాలపై వివిధ రకాల ద్రవాలు ప్రభావం చూపుతాయి.
వృక్ష కణాలలాగా జంతు కణాలలో కణ కవచం లేకపోవటం వలన, వివిధ రకాల ద్రవాల వలన అవి తీవ్రమైన మార్పులకు లోనవుతాయి. రక్త కణాలను తమ ద్రవాల గాఢత కంటే ఎక్కువ గాఢత గల ద్రవంలో ఉంచినపుడు అవి కృశించిపోతాయి. రక్త కణాలను తమ ద్రవాల గాఢత కంటే తక్కువ గాఢత గల డిస్టిల్ వాటర్ వంటి ద్రవాలలో ఉంచినప్పుడు కణాలు ఉబ్బి పగిలిపోతాయి.

గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే జంతు కణాలు తక్కువ గాఢత గల ద్రవంలో ఉంచినప్పుడు కణ కవచం లేకపోవటం వలన పగిలిపోతాయి. కాని వృక్ష కణాలు కణ కవచం. ఉండటం వలన అవి పగిలిపోవు.

→ దాహం వేసినప్పుడు చల్లటి పానీయం తాగాలనిపిస్తుందా?
పక్షులు, జంతువులు దాహం వేసినపుడు ఏం చేస్తాయి? మంచినీరు త్రాగుతాయి. అభివృద్ధి చెందిన మానవులు మాత్రం దాహం తీర్చుకోవటానికి శీతల పానీయాలు త్రాగుతారు. నిజంగా శీతల పానీయాలు నీటిలాగా దాహాన్ని తీరుస్తాయా? శీతల పానీయాలు చక్కెర ద్రావణాన్ని CO2 ని కరిగించి తయారు చేస్తారు. శీతల పానీయం గాఢమైన చక్కెర ద్రావణం. శరీరం కణాలలో ద్రవం కన్న శీతల పానీయం గాఢత ఎక్కువ. దీని ప్రభావం మన శరీరంపై ఎలా ఉంటుంది? శీతల పానీయం తాగినా కూడా దాహం తీరకపోవడాన్ని మీరు గమనించే ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుందో ఆలోచించండి.

→ మీరు ప్రయాణంలో ఉప్పు, చక్కెరతో తయారైన ఆహార పదార్థాలు తింటారా?
సాధారణంగా ఈ ప్రశ్నకు సమాధానం అవును అని వస్తుంది. మనం బస్సులో ప్రయాణం చేసే సమయంలో గాలి వేగం వలన శరీరం నుండి ఎక్కువ నీటిని కోల్పోతాం. ఆకర్షణీయమైన కవర్లలో నింపబడిన ఉప్పు వేసిన బంగాళదుంప చిప్స్ నోరూరిస్తాయి. 50 గ్రా.ల చిప్స్ తిన్న తర్వాత శరీరంలో ఉండే ద్రవాలను ఉప్పు పీల్చుకోవటం వలన నీరు అధికంగా జీర్ణవ్యవస్థలోకి చేరి ద్రవాల గాఢతను సరిచేస్తుంది. దీనివలన మనం ఉప్పుతో కూడిన పదార్థాలను తిన్న . తర్వాత ఎక్కువ దాహార్తికి గురవుతాం.

→ ప్రయాణంలో ఎటువంటి ఆహారం మంచిది?
80 నుండి 90 శాతం నీరు కలిగిన సహజసిద్ధమైన పండ్లు మన ఆకలినే కాక దాహార్తిని కూడా తీరుస్తాయి.

AP 9th Class Biology Important Questions 3rd Lesson జంతు కణజాలం

These AP 9th Biology Important Questions and Answers 3rd Lesson జంతు కణజాలం will help students prepare well for the exams.

AP Board 9th Class Biology 3rd Lesson Important Questions and Answers జంతు కణజాలం

9th Class Biology 3rd Lesson జంతు కణజాలం 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
జీవి శరీరాన్ని కప్పి ఉంచే కణజాలం?
జవాబు:
జీవి శరీరాన్ని కప్పి ఉంచే కణజాలం త్వచ కణజాలం.

ప్రశ్న 2.
ద్రవ రూప కణజాలం ఏది?
జవాబు:
ద్రవ రూప కణజాలం రక్తం.

ప్రశ్న 3.
జంతువులలో ప్రధానంగా ఎన్ని రకాల కణజాలాలు ఉంటాయి?
జవాబు:
జంతువులలో ప్రధానంగా నాలుగు రకాల కణజాలాలు ఉంటాయి. అవి: 1. ఉపకళా కణజాలం 2. సంయోజక కణజాలం 3. కండర కణజాలం 4. నాడీ కణజాలం

ప్రశ్న 4.
ఉపకళా కణజాలం అని దేనిని అంటారు?
జవాబు:
జంతువుల లోపలి అవయవాలను, బయట భాగాలను కప్పి ఉంచే కణజాలం ఉపకళా కణజాలం.

ప్రశ్న 5.
సంయోజక కణజాలం అనగానేమి?
జవాబు:
అవయవాలను కలుపుతూ అంతర మాత్రికలో దూరం దూరంగా విస్తరించినట్లుగా ఉండే కణజాలంను సంయోజక కణజాలం అంటారు.

ప్రశ్న 6.
కండర కణజాలం ఉపయోగమేమి?
జవాబు:
కండర కణజాలం శరీర కదలికలకు తోడ్పడుతుంది.

AP 9th Class Biology Important Questions 3rd Lesson జంతు కణజాలం

ప్రశ్న 7.
బాహ్య, అంతర ఉద్దీపనలకు ప్రతిచర్యలు చూపే కణజాలం ఏది?
జవాబు:
బాహ్య, అంతర ఉద్దీపనలకు ప్రతిచర్యలు చూపే కణజాలం నాడీ కణజాలం.

ప్రశ్న 8.
ఉపకళా కణజాలం ఎక్కడ విస్తరించి ఉంటుంది?
జవాబు:
ఉపకళా కణజాలం చర్మంపైన, నోటి కుహరంలో, రక్తనాళాల పైన, ఊపిరితిత్తులలో ఉన్న వాయుగోణులలో విస్తరించి ఉంటుంది.

ప్రశ్న 9.
స్తరిత ఉపకళా కణజాలం అనగానేమి?
జవాబు:
చర్మంపై ఉన్న ఉపకళా కణజాలం అనేక వరుసలలో ఉంటుంది. దీనిని స్తరిత ఉపకళా కణజాలం అంటారు.

ప్రశ్న 10.
ఘనాకార ఉపకళా కణజాలం ఎక్కడ ఉంటుంది?
జవాబు:
ఘనాకార ఉపకళా కణజాలం మూత్రనాళాలు మరియు లాలాజల గ్రంథులలో ఉంటుంది.

ప్రశ్న 11.
గ్రంథి ఉపకళా కణజాలం అనగానేమి?
జవాబు:
ఉపకళా కణజాలంలో కొంతభాగం లోపలికి ముడుచుకుపోయి బహుకణ గ్రంథులుగా ఏర్పడుతుంది. దీనిని ఉపకళా కణజాలం అంటారు.

ప్రశ్న 12.
స్తంభాకార కణజాలం అనగానేమి?
జవాబు:
శరీరంలో స్రవించే చోట, శోషణ జరిగే చోట ఉంటాయి దీనిని స్తంభాకార కణజాలం అంటారు.

ప్రశ్న 13.
చర్మం నుండి ఏర్పడే నిర్మాణాలు ఏవి?
జవాబు:
చర్మం నుండి ఏర్పడే నిర్మాణాలు గోర్లు, రోమాలు, గిట్టలు, కొమ్ములు.

ప్రశ్న 14.
చర్మం ఏ రకమైన కణజాలంతో తయారవుతుంది?
జవాబు:
చర్మం ఉపకళా కణజాలంతో తయారవుతుంది.

ప్రశ్న 15.
సరీసృపాలలో పొలుసులు, పక్షుల ఈకలు ఏ కణజాలం నుండి తయారవుతాయి?
జవాబు:
సరీసృపాలలో పొలుసులు, పక్షుల ఈకలు ఉపకళా కణజాలం నుండి తయారవుతాయి.

ప్రశ్న 16.
అంతర్గత అవయవాల్ని ఒక నిర్దిష్ట స్థానంలో ఉండడానికి ద్రవ రూపంలో ఉండే స్వేచ్ఛాయుతం కాని మృదువైన కణజాలాలు ఏవి?
జవాబు:
అంతర్గత అవయవాల్ని ఒక నిర్దిష్ట స్థానంలో ఉండడానికి ద్రవ రూపంలో ఉండే స్వేచ్ఛాయుతం కాని మృదువైన కణజాలాలు సంయోజక కణజాలాలు.

ప్రశ్న 17.
సంయోజక కణజాలము ఉపయోగము ఏమిటి?
జవాబు:
ఇతర కణజాలాలను కలిపి ఉంచడం, శరీర అంతర్భాగాలకు ఆధారాన్నివ్వటం, పదార్థాల రవాణాకు, శరీర రక్షణ, శరీర కణాలను బాగు చెయ్యడం, కొవ్వు పదార్థాలు నిలువ చేయడంలో సంయోజక కణజాలము సహాయపడుతుంది.

AP 9th Class Biology Important Questions 3rd Lesson జంతు కణజాలం

ప్రశ్న 18.
కణజాలాలను కలిపి ఉంచి, శరీరంలోని అంతర్భాగాలను వాటి వాటి స్థానాల్లోనే ఉండేటట్లు చేసే కణజాలం ఏది?
జవాబు:
కణజాలాలను కలిపి ఉంచి శరీరంలోని అంతర్భాగాలను వాటి వాటి స్థానాల్లోనే ఉండేటట్లు చేసే కణజాలం వాయుగత కణజాలం.

ప్రశ్న 19.
తంతుయుత పదార్థాన్ని స్రవించి కణజలాన్ని స్థిరంగా నిలిపి ఉంచే వాయుగత కణజాల నిర్మాణాలు ఏవి?
జవాబు:
తంతుయుత పదార్థాన్ని స్రవించి కణజలాన్ని స్థిరంగా నిలిపి ఉంచే వాయుగత కణజాల నిర్మాణాలు ఫైబ్లాస్టులు.

ప్రశ్న 20.
దెబ్బతిన్న ఇతర కణజాలాలను బాగుచేసేవి ఏవి?
జవాబు:
దెబ్బతిన్న ఇతర కణజాలాలను బాగుచేసేవి ఫైబ్లాసులు.

ప్రశ్న 21.
చర్మం క్రింద కొవ్వు పదార్థాన్ని నిలువ ఉంచే సంయోజక కణజాలం ఏది?
జవాబు:
చర్మం క్రింద కొవ్వు పదార్థాన్ని నిలువ ఉంచే సంయోజక కణజాలం ఎడిపోజ్ కణజాలం.

ప్రశ్న 22.
అనేక అకశేరుకాలలో అంతర అస్థిపంజరంలో ఒక ముఖ్యపదార్థం ఏది?
జవాబు:
అనేక అకశేరుకాలలో అంతర అస్థిపంజరంలో ఎముక ఒక ముఖ్యపదార్థం.

ప్రశ్న 23.
ఎముక ఏయే పదార్థాలతో ఏర్పడింది?
జవాబు:
ఎముక కాల్షియం ఫాస్ఫేటు, కాల్షియం కార్బొనేటు అను పదార్థాలతో ఏర్పడింది.

ప్రశ్న 24.
ఎముక నందలి లవణాలను స్రవించే కణాలు ఏవి?
జవాబు:
ఎముక నందలి లవణాలను స్రవించే కణాలు ఆస్థియో సైట్ కణాలు.

ప్రశ్న 25.
ఎముక మధ్య ఖాళీ ప్రాంతంలోని అస్థిమజ్జలో ఉండే కణాలు ఏవి?
జవాబు:
ఎముక మధ్య ఖాళీ ప్రాంతంలోని అస్లిమజ్జలో ఉండే కణాలు ఆస్టియోసైట్ కణాలు.

ప్రశ్న 26.
సొరచేప వంటి చేపలలో అంతర అస్థిపంజరం మొత్తం దేనితో నిర్మితమవుతుంది?
జవాబు:
సొరచేప వంటి చేపలలో అంతర అస్థిపంజరం మొత్తం మృదులాస్థితో నిర్మితమవుతుంది.

ప్రశ్న 27.
ఎముకలను సంధి తలాలలో కలిపి ఉంచే కణజాలము పేరు ఏమిటి?
జవాబు:
ఎముకలను సంధి తలాలలో కలిపి ఉంచే కణజాలము లిగమెంట్ లేదా సంధి బంధనము.

ప్రశ్న 28.
సంధి బంధనం నందలి తంతువులలో ఉండు ప్రోటీను ఏది?
జవాబు:
సంధి బంధనం నందలి తంతువులలో ఉండు ప్రోటీను కొల్లాజెన్.

ప్రశ్న 29.
కండరాలను ఎముకతో కలిపే సంధి తలాలలో జాయింట్లలో ఉండేవి ఏవి?
జవాబు:
కండరాలను ఎముకతో కలిపే సంధి తలాలలో జాయింట్లలో స్నాయు బంధనాలు ఉంటాయి.

ప్రశ్న 30.
రక్తంలోని కణాలు దేనిలో స్వేచ్ఛగా కదులుతాయి?
జవాబు:
రక్తంలోని కణాలు ప్లాస్మాలో స్వేచ్ఛగా కదులుతాయి.

ప్రశ్న 31.
తంతువులు లేని సంధాయక కణజాలం ఏది?
జవాబు:
తంతువులు లేని సంధాయక కణజాలం రక్తం.

ప్రశ్న 32.
నత్తలో రక్తం ఏ రంగులో ఉంటుంది?
జవాబు:
నత్తలో రక్తం రంగు నీలంగా ఉంటుంది.

ప్రశ్న 33.
రక్తంలో నీటితో పాటు ఉండే ఇతర పదార్థాలు ఏవి?
జవాబు:
రక్తంలో నీటితో పాటు గ్లూకోజు, ఎమినోయాసిడ్లు, విటమిన్లు, హార్మోనులు, విసర్జక పదార్థాలయిన లాజిక్ ఏసిడ్, యూరియా మరియు ఇతర లవణాలు ఉంటాయి.

ప్రశ్న 34.
రక్తనాళాలలో రక్తం గడ్డకట్టకుండా ఉపయోగపడే పదార్థం ఏది?
జవాబు:
రక్తనాళాలలో రక్తం గడ్డకట్టకుండా ఉపయోగపడే పదార్థం హిపారిన్.

ప్రశ్న 35.
రక్తము నందు ఎన్ని రకాల కణములు ఉంటాయి?
జవాబు:
రక్తము నందు 3 రకముల కణములు ఉంటాయి. అవి : ఎర్రరక్త కణములు, తెల్లరక్త కణములు మరియు రక్తఫలకికలు.

ప్రశ్న 36.
ఎర్రరక్త కణములకు గల మరియొక పేరు ఏమిటి?
జవాబు:
ఎర్రరక్త కణములకు గల మరియొక పేరు ఎరిత్రోసైట్లు.

AP 9th Class Biology Important Questions 3rd Lesson జంతు కణజాలం

ప్రశ్న 37.
ఎర్రరక్త కణములు ఎర్రగా ఉండుటకు కారణం ఏమిటి?
జవాబు:
ఎర్రరక్త కణములు ఎర్రగా ఉండుటకు కారణం, వీటిలో ఎరుపు వర్ణపు హిమోగ్లోబిన్ అనే ప్రోటీను ఉంటుంది.

ప్రశ్న 38.
ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ రవాణాలో సహాయపడేది ఏది?
జవాబు:
ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ రవాణాలో సహాయపడేది హిమోగ్లోబిన్.

ప్రశ్న 39.
ఎర్రరక్త కణముల జీవితకాలం ఎంత?
జవాబు:
ఎర్రరక్త కణముల జీవితకాలం 120 రోజులు.

ప్రశ్న 40.
ఏ క్షీరదముల ఎర్రరక్త కణములలో కేంద్రకం ఉండదు?
జవాబు:
ఒంటె, ఉలాము క్షీరదముల ఎర్రరక్త కణములలో కేంద్రకం ఉండదు.

ప్రశ్న 41.
తెల్లరక్త కణములకు గల మరియొక పేరు ఏమిటి?
జవాబు:
తెల్లరక్త కణములకు గల మరియొక పేరు ల్యూకోసైట్లు.

ప్రశ్న 42.
తెల్లరక్త కణాలు ఎన్ని రకాలు? అవి ఏవి?
జవాబు:
తెల్లరక్తకణాలు రెండు రకాలు అవి: కణికాభ కణాలు మరియు కణిక రహిత కణాలు.

ప్రశ్న 43.
కణికాభ కణాలలో గల తెల్లరక్త కణ రకములు ఏవి?
జవాబు:
కణికాభ కణాలలో గల తెల్లరక్త కణ రకములు న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్ మరియు ఇసినోఫిల్స్.

ప్రశ్న 44.
రక్తంలోకి ప్రవేశించిన సూక్ష్మజీవులను ఎదుర్కొని నాశనం చేసేవి ఏవి?
జవాబు:
రక్తంలోకి ప్రవేశించిన సూక్ష్మజీవులను ఎదుర్కొని నాశనం చేసేవి కణికాభ కణములు.

ప్రశ్న 45.
కణిక రహిత కణాలలో గల తెల్లరక్తకణ రకములు ఏవి?
జవాబు:
కణిక రహిత కణాలలో గల తెల్లరక్తకణ రకములు లింఫోసైట్స్ మరియు మోనోసైట్స్.

ప్రశ్న 46.
రక్తంలోకి వచ్చిన బాహ్య పదార్థాలను ఎదుర్కొనే ప్రతిదేహాలను తయారు చేసేవి ఏవి?
జవాబు:
రక్తంలోకి వచ్చిన బాహ్య పదార్థాలను ఎదుర్కొనే ప్రతిదేహాలను తయారు చేసేవి లింఫోసైట్లు.

ప్రశ్న 47.
లింఫోసైటులకు గల మరియొక పేరు ఏమిటి?
జవాబు:
లింఫోసైటులకు గల మరియొక పేరు సూక్ష్మరక్షక భటులు.

ప్రశ్న 48.
కణికాభ కణాలతో పాటు రక్తంలో అమీజా మాదిరిగా కదులుతూ బాహ్య పదార్థాలను ఎదుర్కొని భక్షించి నాశనం చేసేవి ఏవి?
జవాబు:
కణికాభ కణాలతో పాటు రక్తంలో అమీబా మాదిరిగా కదులుతూ బాహ్య పదార్థాలను ఎదుర్కొని భక్షించి నాశనం చేసేవి మోనోసైట్లు.

ప్రశ్న 49.
పారిశుద్ధ్య కార్మికులు అని వేటిని అంటారు?
జవాబు:
మోనోసైట్లను పారిశుద్ధ్య కార్మికులు అని అంటారు.

ప్రశ్న 50.
రక్త వర్గాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
జవాబు:
రక్త వర్గాలను కనుగొన్న శాస్త్రవేత్త కార్ల్ లాండ్ స్టీనరు.

ప్రశ్న 51.
రక్తము నందలి రక్త వర్గాలు ఎన్ని? అవి ఏవి?
జవాబు:
రక్తవర్గాలు 4. అవి : ఎ, బి, ఎబి మరియు ఓ.

ప్రశ్న 52.
‘సార్వత్రిక రక్త గ్రహీతలు’ అనగానేమి?
జవాబు:
‘ఎబి’ రక్తవర్గం కలిగిన వారు ఎవరినుండైనా రక్తాన్ని తీసుకోగలరు. కావున ‘ఎబి’ రక్తవర్గం కలిగిన వాళ్ళని సార్వత్రిక గ్రహీతలు అంటారు.

ప్రశ్న 53.
‘సార్వత్రిక దాతలు’ అని ఎవరిని అంటారు?
జవాబు:
‘ఓ’ రక్తవర్గం కలిగిన వారు ఎవరికైనా రక్తదానం చేయవచ్చు. కనుక వారిని సార్వత్రిక దాతలు అంటారు.

ప్రశ్న 54.
రక్తనాళాల్లో ఉండే కండర కణజాలం చేసే పని ఏది?
జవాబు:
రక్తనాళాల్లో ఉండే కండర కణజాలం రక్తనాళ వ్యాసాన్ని సవరిస్తూ క్రమబద్ధమైన రక్త ప్రసరణకు తోడ్పడుతుంది.

AP 9th Class Biology Important Questions 3rd Lesson జంతు కణజాలం

ప్రశ్న 55.
నిర్మాణం, అవి ఉన్న ప్రదేశం, విధులను అనుసరించి కండరాలు ఎన్ని రకాలు? అవి ఏవి?
జవాబు:
నిర్మాణం, అవి ఉన్న ప్రదేశం, విధులను అనుసరించి కండరాలు మూడు రకాలు. అవి : 1. రేఖిత కండరాలు 2. అరేఖిత కండరాలు 3. హృదయ కండరాలు.

ప్రశ్న 56.
నియంత్రిత లేక సంకల్పిత కండరాలు అనగానేమి?
జవాబు:
కొన్ని కండరాల కదలికలు మన ఆధీనంలో ఉంటాయి. మనం అవసరం అయినప్పుడు కదిలించవచ్చు. అవసరం లేకపోయినప్పుడు కదలికను ఆపివేయవచ్చు. అందువలన వీటిని నియంత్రిత లేక సంకల్పిత కండరాలు అంటారు.

ప్రశ్న 57.
నియంత్రిత కండరాలను అస్థికండర కణజాలమని ఎందుకు అంటారు?
జవాబు:
నియంత్రిత కండరాలు అస్తిపంజరంలోని ఎముకలకు అతికి ఉండి కదలికలకు కారణమవుతాయి. అందువలన వాటిని అస్థికండర కణజాలమని అంటారు.

ప్రశ్న 58.
నియంత్రిత కండరంను రేఖిత కండరమని ఎందుకంటారు?
జవాబు:
నియంత్రిత కండరం పొడవుగా అనేక అడ్డుచారలను కలిగి ఉంటుంది. అందువలన దీనిని రేఖిత కండరమంటారు.

ప్రశ్న 59.
నియంత్రిత కండరం నందలి కణముల లక్షణాలు ఏవి?
జవాబు:
ప్రతి కణం కండరమంత పొడవు గలిగి స్తూపాకారంలో ఉంటుంది. అనేక కేంద్రకాలను కలిగి ఉంటుంది. కణములు తంతువులను పోలి ఉంటాయి.

ప్రశ్న 60.
అనియంత్రిత కండరాలు అనగానేమి?
జవాబు:
మన ఆధీనంలో ఉండని, మన ఇష్టానుసారం కదిలించలేని కండరాలను అనియంత్రిత కండరాలు అంటారు.

ప్రశ్న 61.
అనియంత్రిత లేక అరేఖిత కండరం లక్షణాలు ఏవి?
జవాబు:
ఇవి పొడవుగా సాగదీయబడి కుదురు ఆకారంలో ఉంటాయి. అడ్డుచారలు ఉండవు. కణాలలో ఒక్క కేంద్రకం మాత్రమే ఉంటుంది.

ప్రశ్న 62.
హృదయ కండర కణజాలము లక్షణాలు ఏవి?
జవాబు:
హృదయ కండరకణాలు పొడవుగా, శాఖలు కలిగి కేంద్రకం కలిగి ఉంటాయి. అడ్డుచారలు కలిగి ఉంటాయి.

ప్రశ్న 63.
పునరుత్పత్తి చేయగల శక్తిలేని కణాలు ఏవి?
జవాబు:
పునరుత్పత్తి చేయగల శక్తిలేని కణాలు నాడీకణాలు.

ప్రశ్న 64.
నాడీకణము ఎన్ని భాగాలుగా విభజించబడినది? అవి ఏవి?
జవాబు:
నాడీకణము నందు 3 భాగములు కలవు. అవి : 1. కణదేహం 2. ఏక్సాన్ 3. డెండ్రైటులు

ప్రశ్న 65.
నాడీకణదేహము నందలి గ్రంథి కణాలను ఏమంటారు?
జవాబు:
నాడీకణదేహము నందలి గ్రంథి కణాలను నిస్సల్ కణాలు అంటారు.

ప్రశ్న 66.
ఏక్సాన్ అనగానేమి?
జవాబు:
కణదేహం నుండి ఒకే ఒక్క పొడవాటి నిర్మాణం బయలుదేరుతుంది. దీనిని తంత్రికాక్షం లేదా ఏక్సాన్ అంటారు.

ప్రశ్న 67.
ఏక్సాన్లో కొంత భాగాన్ని కప్పి ఉంచే పొర ఏది?
జవాబు:
ఏక్సాన్లో కొంత భాగాన్ని కప్పి ఉంచే పొర మయలిన్ త్వచం.

ప్రశ్న 68.
ఏక్సాన్లో ఉండే కణుపుల వంటి భాగాన్ని ఏమంటారు?
జవాబు:
ఏక్సాన్లో ఉండే కణుపుల వంటి భాగాన్ని రాన్వాయర్ సంధులు అంటారు.

ప్రశ్న 69.
అనియంత్రిత కండరాలు ఉండు ప్రదేశాలు ఏవి?
జవాబు:
అనియంత్రిత కండరాలు ఆహారనాళం, రక్తనాళాలు, కనుపాప, గర్భాశయము మరియు ఊపిరితిత్తులలోని శ్వాసనాళాలు మొదలగు ప్రదేశాలలో ఉంటాయి.

ప్రశ్న 70.
సంయోజక కణజాలమైన మృదులాస్థి మానవులలో ఉండు ప్రదేశాలు?
జవాబు:
మానవులలో ఎముకలు కలిసే ప్రదేశాలలో, పక్కటెముకల చివర, నాశికాగ్రంథి, చెవిదొప్ప, వాయునాళంలోను సంయోజక కణజాలమైన మృదులాస్లి ఉంటుంది.

ప్రశ్న 71.
మానవ రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే జరిగే నష్టాలను వివరించండి.
జవాబు:
హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే కణజాలాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. దీనివలన మనుష్యులు ఎక్కువగా నీరసించిపోతారు.

ప్రశ్న 72.
రక్తవర్గాలను కనుగొనుటలో కారల్ లాండ్ స్టీనర్‌ను నీవు ఏ విధంగా అభినందిస్తావు?
జవాబు:
ఎ, బి, ఎబి మరియు ఓ రక్త వర్గాలను లాండ్ స్టీనర్ కనుగొన్నాడు. భూగోళం మీద ఒకే రక్త వర్గం కలిగిన వారు ఎవరైనా సరే రక్త సంబంధీకులు అన్న విషయాన్ని తెలియజేయుట ద్వారా మానవులందరూ ఒక్కటే అని చాటి చెప్పాడు.

ప్రశ్న 78.
సూక్ష్మజీవుల ద్వారా వ్యాధులు రాకుండా నివారించడంలో తెల్లరక్త కణముల పాత్రను ఏవిధంగా అభినందిచవచ్చు?
జవాబు:
తెల్లరక్త కణములు రక్తంలోకి ప్రవేశించిన సూక్ష్మజీవులను ఎదుర్కొని నాశనం చేస్తాయి. మనలను రక్షించడానికి కొన్నిసార్లు తమ జీవితాన్ని త్యాగం చేస్తాయి.

ప్రశ్న 74.
శరీరపు కదలికలలో కండరాల పాత్రను ఎలా అభినందిస్తావు?
జవాబు:
ఎముకలను అంటి పెట్టుకున్న కండరాల వలన శరీరపు కదలికలు జరుగుతాయి. కండరాలు లేకపోయినట్లయితే శరీరపు కదలికలు ఉండవు.

AP 9th Class Biology Important Questions 3rd Lesson జంతు కణజాలం

ప్రశ్న 75.
శరీరం నుండి వేడి బయటకు పోకుండా ఆపే ఎడిపోజ్ కణజాలాల పాత్రను నీవు ఏవిధంగా అభినందిస్తావు?
జవాబు:
కొవ్వు పదార్థాన్ని నిలువ చేసి ఉంచడానికి చర్మం క్రింద ఎడిపోజ్ కణజాలాలు ఉంటాయి. ఇవి శరీరం నుండి వేడిని బయటకు పోనీయకుండా, ఉష్ణనిరోధకంలా పనిచేసి శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి.

ప్రశ్న 76.
దెబ్బతిన్న శరీరపు కణజాలాలను బాగుచేయడంలో ఏ కణజాలం పాత్ర వహిస్తుంది?
జవాబు:
వాయుగత కణజాలంలో ఉండే ఫైబ్రోబ్లాస్టులు దెబ్బతిన్న ఇతర కణజాలాలను బాగుచేస్తాయి. తద్వారా ఆ కణజాలాలు సక్రమముగా పనిచేస్తాయి.

ప్రశ్న 77.
జీర్ణమైన ఆహారపదార్థాలు సక్రమముగా శోషణం గావించబడడంలో ఏ కణజాలం పాత్రను నీవు అభినందిస్తావు?
జవాబు:
జీర్ణమైన ఆహారపదార్థాలు సక్రమముగా శోషణం గావించబడడంలో స్తంభాకార ఉపకళా కణజాలం పాత్రను అభినందిస్తాను.

ప్రశ్న 78.
చర్మము యొక్క నునుపుదనానికి, తాజాదనమునకు కారణమైన కణజాలము ఏది అని నీవు భావిస్తావు?
జవాబు:
చర్మము యొక్క నునుపుదనానికి, తాజాదనమునకు కారణమైన కణజాలము స్తరిత ఉపకళా కణజాలం అని నేను భావిస్తాను.

ప్రశ్న 79.
చర్మము ఒక విసర్జకావయవముగా సమర్థవంతంగా తన పాత్రను పోషించడంలో ఉపయోగపడే కణజాలము ఏది?
జవాబు:
చర్మము ఒక విసర్జకావయవముగా సమర్థవంతంగా తన పాత్రను పోషించడంలో ఉపయోగపడే కణజాలము స్తరిత ఉపకళా కణజాలము.

ప్రశ్న 80.
అవయవాలు తమ విధులను సక్రమముగా నిర్వహించడంలో ఎవరి పాత్రను నీవు అభినందిస్తావు?
జవాబు:
అవయవాలు తమ విధులను సక్రమముగా నిర్వహించడంలో కణజాలాల పాత్రను నేను అభినందిస్తాను.

ప్రశ్న 81.
వయస్సులో ఉన్న వాళ్ళ కంటే ముసలివాళ్ళు చలికాలంలో ఎందుకు ఎక్కువ వణుకుతారు?
జవాబు:
ఎడిపోజ్ కణజాలం శరీరం నుండి ఉష్ణనష్టాన్ని నివారిస్తుంది. వయస్సులో ఉన్న వారితో పోల్చినపుడు ముసలి వాళ్ళ చర్మం క్రింద తక్కువ మొత్తంలో ఎడిపోజ్ కణజాలం ఉంటుంది. ముసలివాళ్ళ శరీరం నుండి ఉష్ణం ఎక్కువగా పోతుంది. అందువలన ముసలివాళ్ళు చలికాలంలో ఎక్కువగా వణుకుతారు.

ప్రశ్న 82.
మన శరీరానికి ఆకారాన్ని ఇవ్వడంలో సహాయపడే కణజాలం ఏది?
జవాబు:
మన శరీరానికి ఆకారాన్ని ఇవ్వడంలో సహాయపడే కణజాలం ఎముక.

ప్రశ్న 83.
గుండె 24 గంటల్లో 36 వేల లీటర్ల రక్తాన్ని ఎన్ని వేల కిలో మీటర్ల దూరం పంపు చేస్తుంది?
జవాబు:
గుండె 24 గంటల్లో 36 వేల లీటర్ల రక్తాన్ని 20 వేల కిలోమీటర్ల దూరం పంపు చేస్తుంది.

ప్రశ్న 84.
ప్రొడ మానవుని శరీరంలో ఎన్ని లీటర్ల రక్తం ఉంటుంది?
జవాబు:
బ్రౌడ మానవుని శరీరంలో 5 లీటర్ల రక్తం ఉంటుంది.

ప్రశ్న 85.
మన రక్తంలో ఉన్న ఎర్రరక్త కణాలన్నీ ఒక గొలుసుగా అమర్చినట్లయితే దాని పొడవు భూమధ్యరేఖ చుట్టూ ఎన్ని సార్లు చుట్టి రావచ్చు?
జవాబు:
మన రక్తంలో ఉన్న ఎర్రరక్త కణాలన్నీ ఒక గొలుసుగా అమర్చినట్లయితే దాని పొడవు భూమధ్యరేఖ చుట్టూ ఏడుసార్లు చుట్టి రావచ్చు.

AP 9th Class Biology Important Questions 3rd Lesson జంతు కణజాలం

ప్రశ్న 86.
శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎర్రరక్త కణములు ఎక్కడ తయారవుతాయి?
జవాబు:
శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎర్రరక్త కణములు తయారు అయ్యే ప్రదేశం కాలేయం మరియు పిత్తాశయం.

ప్రశ్న 87.
ప్రొడ మానవులలో రక్తం ఎక్కడ తయారవుతుంది?
జవాబు:
పొడవుగా ఉన్న ఎముకలలో ఉండే అస్థిమజ్జలో రక్తం తయారవుతుంది.

ప్రశ్న 88.
చీము అనగానేమి?
జవాబు:
కొన్ని తెల్లరక్త కణాలు శరీరంలో ప్రవేశించే సూక్ష్మజీవులను చంపడంలో తన జీవితాన్ని త్యాగం చేస్తాయి. ఈ యుద్ధంలో చనిపోయిన తెల్లరక్త కణాలే చీము రూపంలో గాయం నుండి బయటకు విసర్జింపబడతాయి.

ప్రశ్న 89.
రక్తఫలకికలు లేకపోతే ఏమి జరుగుతుంది?
జవాబు:
రక్త నాళాలకు దెబ్బతగిలితే రక్తఫలకికలు అక్కడ గుమికూడి రక్తం గడ్డ కట్టేటట్లు చేస్తాయి. ఇది రక్తస్రావం జరుగకుండా కాపాడుతుంది. ఇవి లేకపోతే గాయం నుండి రక్తం కారిపోయి మనిషి చనిపోవచ్చు.

ప్రశ్న 90.
మానవ శరీరంలో కండర కణజాలాలు ఎందుకు ఉపయోగపడతాయి?
జవాబు:
జీవులలో పూర్వ చరమాంగాల కదలికకు, శరీరంలోని ప్రేగులు, హృదయం మొదలైన అనేక అంతర అంగాల కదలికలకు కండరాలే కారణం.

ప్రశ్న 91.
రక్తనాళాల్లో ఉండే కండర కణజాలం చేయు పని ఏమిటి?
జవాబు:
రక్తనాళ వ్యాసాన్ని సవరిస్తూ క్రమబద్ధమైన రక్తప్రసరణకు తోడ్పడుతుంది.

ప్రశ్న 92.
శీతాకాలంలో శరీరం ఎందుకు వణుకుతుంది?
జవాబు:
శరీరానికి చల్లని గాలి తగిలినప్పుడు కండరాలు సంకోచ, వ్యాకోచం చెందుతాయి. ఈ ప్రక్రియలో చాలా ఎక్కువ మోతాదులో శక్తి వేడిమి రూపంలో విడుదల అవుతుంది. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది.

ప్రశ్న 93.
అనియంత్రిత కండరాలు మన శరీరంలో ఎక్కడెక్కడ ఉంటాయి?
జవాబు:
అన్నవాహిక, రక్తనాళాలు, ఐరిస్, గర్భాశయం మరియు వాయునాళంలో ఉంటాయి.

ప్రశ్న 94.
మీరు మీ చేతులను వేది లేదా చల్లటి నీటిలో ముంచినపుడు మీకేమనిపిస్తుంది?
జవాబు:
చేతులను వేడినీటిలో ముంచిన నీరు వేడిగా ఉన్నట్లు, చల్లటి నీటిలో ముంచిన నీరు చల్లగా ఉన్నట్లు నాడీ ప్రచోదనాల ద్వారా తెలుసుకుంటాము.

ప్రశ్న 95.
నడిచేటప్పుడు, నీ కాళ్ళకు మొనదేలి ఉన్న రాయి తగిలితే నీకేమనిపిస్తుంది?
జవాబు:
చర్మానికి దెబ్బ తగిలి మనకు బాధ లేదా నొప్పి అనిపిస్తుంది. నాడీ ప్రచోదనాల వలన మనకు బాధ తెలుస్తుంది.

ప్రశ్న 96.
మన శరీరంలో అన్ని కణాలు మృదువుగా ఉంటాయా?
జవాబు:
మన శరీరంలో అన్ని కణాలు మృదువుగా ఉండవు. ఎముక వంటి భాగాలు గట్టి కణాలతో నిర్మితమవుతాయి.

ప్రశ్న 97.
చర్మంలో స్తరిత ఉపకళా కణజాలం ఎక్కువ వరుసలలో ఎందుకు అమరి ఉంటుంది?
జవాబు:
శరీర అంతర్భాగాలలోనికి సూక్ష్మజీవులు ప్రవేశించకుండాను, వేడి మరియు చల్లని గాలుల నుండి శరీరాన్ని రక్షించడానికి చర్మం అనేక వరుసలలో అమరియుంటుంది.

ప్రశ్న 98.
ఒక వేళ చర్మం కాలిపోయినట్లయితే ఏ కణజాలం దెబ్బతినే అవకాశం ఉన్నది?
జవాబు:
ఒక వేళ చర్మం కాలిపోయినట్లయితే స్తరిత ఉపకళా కణజాలం.

ప్రశ్న 99.
జంతువులందు ఎన్ని రకముల కణజాలములు కలవు? అవి ఏవి?
జవాబు:
జంతువులందు నాలుగు రకముల కణజాలములు కలవు. అవి :

  1. ఉపకళా కణజాలము
  2. సంయోజక కణజాలము
  3. కండర కణజాలము
  4. నాడీ కణజాలము.

AP 9th Class Biology Important Questions 3rd Lesson జంతు కణజాలం

ప్రశ్న 100.
ఉపకళా కణజాలము మన శరీరములో ఎక్కడ ఉన్నది?
జవాబు:
ఉపకళా కణజాలం చర్మంపైన, నోటి కుహరంలో, రక్తనాళాల పైన, ఊపిరితిత్తులలో ఉన్న వాయుగోణులలో, వృక్కనాళాలలో విస్తరించి ఉంటుంది.

9th Class Biology 3rd Lesson జంతు కణజాలం 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
ఉపకళా కణజాలములోని వివిధ రకములేవి?
జవాబు:
ఆకారము మరియు కణములు నిర్వహించే పనులను బట్టి ఉపకళా కణజాలమునందలి రకములు :

  1. స్తంభాకార ఉపకళా కణజాలము
  2. ఘనాకార ఉపకళా కణజాలము
  3. స్తంభాకార ఉపకళా కణజాలము
  4. శైలికామయ ఉపకళా కణజాలము
  5. గ్రంథి ఉపకళా కణజాలము

ప్రశ్న 2.
రక్త ఫలకికల గురించి లఘుటీక రాయండి.
జవాబు:

  1. కేంద్రకంలేని రక్త ఫలకికలు రక్తమునందు ఉండే అంశాలు.
  2. ఇవి బల్లపరుపుగా ఉంటాయి.
  3. ఎక్కడైనా రక్తనాళానికి దెబ్బ తగిలితే రక్త ఫలకికలు అక్కడ గుమికూడి రక్తం గడ్డకట్టేట్లు చేస్తాయి.

ప్రశ్న 3.
రూపాంతరం చెందిన ఉపకళా కణజాలములేవి?
జవాబు:

  1. చర్మం ఒక రకమైన ఉపకళా కణజాలం
  2. చర్మం నుండి గోర్లు, రోమాలు, గిట్టలు, కొమ్ముల వంటి నిర్మాణాలు తయారవుతాయి.
  3. సరీసృపాలలో పొలుసులు, పక్షులు, ఈకలు కూడా ఉపకళా కణజాలం నుండి తయారవుతాయి.

ప్రశ్న 4.
మానవులలో గల వివిధ రకాల రక్త వర్గాలు ఏవి? రక్త వర్గాలను కనుగొనినవారు ఎవరు?
జవాబు:

  1. మానవులలో గల రక్త వర్గాలు 4. అవి : ‘A’ (ఎ), ‘B’ (బి), ‘AB’ (ఎబి) మరియు ‘O’ (ఓ) రక్త వర్గాలు.
  2. రక్త వర్గాలను కార్ల్ లాండ్ స్టీనర్ కనుగొనెను.

AP 9th Class Biology Important Questions 3rd Lesson జంతు కణజాలం

ప్రశ్న 5.
సార్వత్రిక గ్రహీతలు ఎవరు ? సార్వత్రిక దాతలు ఎవరు?
జవాబు:

  1. 1ఎబి రక్తవర్గం కలిగిన వాళ్ళు ఎవరినుండైనా రక్తాన్ని తీసుకోగలరు.
  2. కావున ఎబి రక్తవర్గం కలిగిన వాళ్ళని సార్వత్రిక గ్రహీతలు అంటారు.
  3. ‘ఓ’ రక్తవర్గం కలిగినవారు ఎవరికైనా రక్తదానం చేయవచ్చు. కాబట్టి ఈ వర్గీయులను సార్వత్రిక దాతలు అంటారు.

9th Class Biology 3rd Lesson జంతు కణజాలం 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
సంయోజక కణజాలము అనగానేమి? సంయోజక కణజాలమునందలి రకములు ఏవి? వాటి యొక్క విధులేవి?
జవాబు:

  1. అవయవాలను కలుపుతూ అంతరమాత్రికలో దూరం దూరంగా విస్తరించినట్లు ఉండే కణజాలాన్ని సంయోజక కణజాలం అంటారు.
  2. సంయోజక కణజాలమునందలి రకములు : వాయుగత కణజాలము, ఎడిపోజ్ కణజాలము, ఎముక, మృదులాష్టి, సంధి బంధనము మరియు స్నాయుబంధనం.

సంయోజక కణజాలాల విధులు :
1) వాయుగత కణజాలం : a) వివిధ కణజాలములను కలపటం
b) తద్వారా శరీరంలోని అంతర్భాగాలను వాటి వాటి స్థానాల్లో ఉండేటట్లు చేయడం

2) ఎముక : a) అస్థిపంజరం నిర్మాణంలో ముఖ్య పదార్థం
b) శరీరానికి ఆకారాన్నిస్తుంది.

3) ఎడిపోజ్ కణజాలం : క్రొవ్వును నిల్వచేస్తుంది.

4) సంధి బంధనము : ఎముకలను సంధి తలాలలో కలుపుతుంది.

5) స్నాయు బంధనం : కండరాలను ఎముకతో కలిపే సంధి తలాలలో, కీళ్ళనందు ఉంటాయి.

6) మృదులాస్థి : ఎముకలు కలిసే ప్రదేశాలు, పక్కటెముకల చివర, నాశికాగ్రము, చెవిదొప్ప, వాయునాళంను ఏర్పరచును.

ప్రశ్న 2.
ఎముక అనగానేమి? ఎముక నిర్మాణమును, విధులను వివరించుము.
AP 9th Class Biology Important Questions 3rd Lesson జంతు కణజాలం 1
జవాబు:

  1. ఎముక ఒక రకమైన సంయోజక కణజాలము.
  2. ఎముక కాల్షియం ఫాస్పేటు, కాల్షియం కార్బనేట్లతో ఏర్పడింది.
  3. ఈ లవణాలను ఎముకను దలి ఆస్తియో సైట్ కణములు స్రవిస్తాయి.
  4. ఆస్టియో సైట్ కణములు ఎముక మధ్య ఖాళీ ప్రాంతంలోని అస్థిమజ్జలో ఉంటాయి.
  5. ఎముక శరీరానికి ఆకారాన్నివ్వడంలో సహాయపడుతుంది.
  6. అనేక సకశేరుకాలలో (సొరచేప వంటి కొన్ని చేపలు తప్ప) ఇది అంతర అస్థిపంజర నిర్మాణంలో ఒక ముఖ్య పదార్ధంగా ఉంటుంది.

ప్రశ్న 3.
మృదులాస్థి గురించి పట సహాయముతో లఘుటీక రాయుము.
AP 9th Class Biology Important Questions 3rd Lesson జంతు కణజాలం 2
జవాబు:

  1. సంయోజక కణజాల రకమునకు చెందిన మృదులాస్థి ఎముకలు కలిసే ప్రదేశాలలోను, పక్కటెముకల చివర, నాశికాగ్రము, చెవిదొప్ప, వాయునాళంలోనూ ఉండే పలుచని కణజాలము.
  2. అనేక సకశేరుక జీవుల పిండదశలో ఎముకలు ఉండవు. వీటిలో మృదులాస్లి కణజాలం మాత్రమే ఉంటుంది.
  3. సొరచేప వంటి చేపలలో మొత్తం అంతర అస్థిపంజరము మృదులాస్థితో నిర్మితమై ఉంటుంది.
  4. మృదులాస్థి దృఢంగా ఉన్నప్పటికి ఎముక అంత దృఢంగా ఉండదు.

ప్రశ్న 4.
సంధి బంధనము (లిగమెంట్) గురించి క్లుప్తంగా పట సహాయముతో వివరించండి.
AP 9th Class Biology Important Questions 3rd Lesson జంతు కణజాలం 3
జవాబు:

  1. ఇది ఒక రకమైన సంయోజక కణజాలము. ఎముకలను సంధి తలాలలో కలిపి ఉంచుతుంది.
  2. ఎక్కువ సంఖ్యలో తంతువులను కలిగి ఉంటుంది.
  3. ఈ తంతువులు కొల్లాజెన్ అను ప్రోటీనుతో చేయబడి ఉంటాయి.
  4. ఈ తంతువులు స్థితిస్థాపక గుణాన్ని కలిగి ఉంటాయి.

ప్రశ్న 5.
పట సహాయముతో వాయుగత కణజాలము (ఏరియోలార్ కణజాలము) ను వివరించుము.
AP 9th Class Biology Important Questions 3rd Lesson జంతు కణజాలం 4
జవాబు:

  1. వాయుగత కణజాలము సంయోజక కణజాలమునందలి ఒక రకము.
  2. కణజాలాలను కలిపి ఉంచి, శరీరంలోని అంతర్భాగాలను వాటి వాటి స్థానాల్లో ఉండేటట్లు చేస్తుంది.
  3. వాయుగత కణజాలంలో ఫైబ్రోబ్లాస్టులు అనే ముఖ్యమైన నిర్మాణాలు ఉన్నాయి.
  4. ఫైబ్రోబ్లాస్టులు తంతుయుత పదార్థాన్ని స్రవించి కణజాలాన్ని స్థిరంగా నిలిపి ఉంచుతాయి.
  5. అంతేకాక ఇవి దెబ్బతిన్న ఇతర కణజాలాలను బాగుచేస్తుంది.
  6. మన శరీరంలోని కండరము వాయుగత కణజాలం ద్వారా చర్మానికి మరియు ఎముకకు కలిపి ఉంటుంది.
  7. వాయుగత కణజాలము రక్తనాళాల చుట్టూ మరియు నాడుల చుట్టూ ఉంటుంది.
  8. ఏరియోలార్ కణజాలంలో అనేక పెద్ద పెద్ద ఖాళీ ప్రదేశాలు ఉంటాయి. వీటిని ఏరియోల్స్ అంటారు.
  9. ఏరియోలార్ కణజాలంలో తంతువులు మరియు ప్రత్యేకమైన కణాలు ఉంటాయి. వీటిని ఫైబ్రోబ్లాస్ట్ అంటారు.
  10. ఈ కణాలు పోషకాల రవాణాలో మరియు కదలికలో తోడ్పడతాయి.

ప్రశ్న 6.
పట సహాయముతో ఎడిపోజ్ కణజాలమును వర్ణించండి.
AP 9th Class Biology Important Questions 3rd Lesson జంతు కణజాలం 5
జవాబు:

  1. కొవ్వు పదార్థాన్ని నిలువచేసి ఉంచడానికి చర్మం క్రింద ఒక రకమైన సంయోజక కణజాలం ఉంటుంది. దీనిని ఎడిపోజ్ కణజాలాలు అంటారు.
  2. ఈ కణజాలము కొవ్వు కణాలతో నిండి ఉంటుంది.
  3. ఈ ఎడిపోజ్ కణజాలంలోని కణాలు శరీరం నుండి వేడి బయటకు పోకుండా ఆపుతాయి. ఉష్ణ నిరోధకంలా పనిచేస్తాయి.

ప్రశ్న 7.
పట సహాయంతో రేఖిత కండరముల గురించి రాయండి.
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 4
జవాబు:

  1. రేఖిత కండరములను అప్లికండర కణజాలమని మరియు నియంత్రిత లేక సంకల్పిత కండరాలు అని అంటారు.
  2. రేఖిత కండరాలను మనం అవసరమైనప్పుడు కదిలించవచ్చు. అవసరం లేకపోయినపుడు కదలికలను ఆపివేయవచ్చు. (ఉదా : చేతులు, కాళ్ళను కదపటం) అందువలన వీటిని నియంత్రిత లేక సంకల్పిత కండరాలు అంటారు.
  3. రేఖిత కండరాలు ఎక్కువగా ఎముకలతో జతచేయబడి ఉండుటవలన, కదలికలకు కారణము అవుటవలన వీటిని అస్థికండర కణజాలమని అంటారు.
  4. ఈ కండరము పొడవుగా, అనేక అడ్డుచారలు కలిగి ఉంటుంది. కనుక దీనిని రేఖిత కండరమని పిలుస్తారు.
  5. ప్రతి కండరం అనేక పొడవైన సన్నటి శాఖారహితమైన తంతువులను పోలిన కణాలను కలిగి ఉంటుంది. ప్రతి కణము కండరమంత పొడవు కలిగి స్తూపాకారంగా ఉంటూ అనేక కేంద్రకాలను కలిగి ఉంటుంది.

ప్రశ్న 8.
పట సహాయముతో అనియంత్రిత కండరములను క్లుప్తంగా వివరించండి.
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 5
జవాబు:

  1. అనియంత్రిత కండరములను అరేఖిత కండరములు లేదా మృదు కండరాలు అని కూడా అంటారు.
  2. అన్నవాహికలో ఆహారం కదలిక, రక్తనాళాల కండరాల సంకోచ వ్యాకోచాలు మన అధీనంలో ఉండవు.
  3. వీటి కదలికలను మనం మన ఇష్టానుసారం ప్రారంభించలేము, ఆపివేయలేము. అందువలన వీటిని అనియంత్రిత కండరాలు అంటారు.
  4. అనియంత్రిత కండరం ఐరిస్ (కనుపాప), గర్భాశయం మరియు వాయునాళాల్లో కూడా ఉంటుంది.
  5. ఇవి పొడవుగా సాగదీయబడి, కుదురు ఆకారంలో ఉంటాయి.
  6. అనియంత్రిత కండరముల నందు అడ్డుచారలు ఉండవు. అందువలన వీటిని అరేఖిత కండరాలు అంటారు.
  7. అరేఖిత కండర కణాలలో కేవలం ఒకే ఒక్క కేంద్రకం మాత్రమే ఉంటుంది.

ప్రశ్న 9.
పట సహాయంతో హృదయ కండరం గురించి లఘుటీక రాయండి.
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 6
జవాబు:

  1. హృదయంలోని కండరాలు రక్తప్రసరణకు సహాయపడతాయి
  2. ఈ కణాలు పొడవుగా, శాఖలు కలిగి ఉంటాయి. వీటిలో కేంద్రకం ఉంటుంది.
  3. కణాల చివరి భాగాలు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి.
  4. హృదయ కండరంలోని కణాలన్నీ చారలతో ఉంటాయి.
  5. నిర్మాణంలో ఇది చారల కండరాన్ని పోలి ఉండి, అనియంత్రిత చర్యలను చూపిస్తుంది.

ప్రశ్న 10.
నాడీ కణము అనగానేమి? నాడీకణము బొమ్మను గీచి, భాగములను వివరించుము.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 8

  1. నాడీకణము, నాడీ కణజాలము యొక్క నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణము.
  2. నాడీకణాలు సమాచారాన్ని గ్రహించి, విశ్లేషించి, పంపించటానికి ప్రత్యేకించిన కణాలు.
  3. నాడీ కణాన్ని మూడు భాగాలుగా విభజింపవచ్చు. a) కణదేహం b) ఆక్ట్రాన్ c) డెండ్రైటులు
  4. నాడీ కణదేహంలో ఉన్న జీవద్రవంలో ఒక కేంద్రకం ఉంటుంది.
  5. జీవ ద్రవంలో కొన్ని గ్రంథిరూప కణాలు ఉంటాయి. వీటిని నిస్సల్ కణికలు అంటారు.
  6. కణదేహం నుండి బయటకు వచ్చు నిర్మాణాలను డెండైటులు అంటారు.
  7. కణదేహం నుండి బయలుదేరే ఒకే ఒక్క పొడవాటి నిర్మాణమును ‘ఆక్జాన్’ అంటారు.
  8. ఆక్టా లో కొంత భాగం ఒక పొరతో కప్పబడి ఉంటుంది. ఆ త్వచమును ‘మెయిలిన్ త్వచం’ అంటారు.
  9. ఆక్టాన్ ఉండే కణజాలాల వంటి భాగాన్నే ‘రాన్వాయర్ సంధులు’ అంటారు.
  10. ప్రతి నాడీకణం ఆక్జాన్ తమ సమీపంలో ఉన్న మరొక నాడీకణం డెండ్రైట్లతో కలిసి ఒక వల వంటి నిర్మాణమును ఏర్పరుస్తుంది.

ప్రశ్న 11.
రక్తము యొక్క విధులేవి?
జవాబు:

  1. రక్తము హార్మోనులను, పోషక పదార్ధములను మరియు విటమినులను కణజాలములకు రవాణా చేస్తుంది.
  2. కణజాలముల నుండి వ్యర్థ పదార్థాలను విసర్జక అవయవములకు సరఫరా చేస్తుంది.
  3. రక్తములోని ఎర్రరక్త కణములందలి హిమోగ్లోబిన్ ఆక్సీజన్, కార్బన్ డై ఆక్సెలను రవాణా చేస్తుంది.
  4. తెల్లరక్త కణములు శరీరానికి రక్షణ ఇస్తాయి. ఇవి శరీరములోనికి ప్రవేశించిన సూక్ష్మజీవులను భక్షిస్తాయి లేదా అవి విడుదల చేసిన విషపదార్థములను తటస్థీకరణం చేస్తాయి.
  5. రక్త ఫలకికలు రక్తాన్ని గడ్డ కట్టే విధంగా చేస్తాయి. తద్వారా గాయపడిన వ్యక్తి నుండి రక్త నష్టమును నివారిస్తాయి.

AP 9th Class Biology Important Questions 3rd Lesson జంతు కణజాలం

ప్రశ్న 12.
ఎర్ర రక్తకణములను గురించి క్లుప్తంగా రాయండి.
జవాబు:

  1. ఎర్ర రక్త కణములను ఎరిత్రోసైట్లని అంటారు.
  2. ఎర్రరక్త కణములందు హిమోగ్లోబిన్ వంటి ఎరుపురంగు ప్రోటీను ఉండుట వలన ఇవి ఎర్రగా ఉంటాయి.
  3. హిమోగ్లోబిన్ ఆక్సిజన్ మరియు కార్బన్ డై ఆక్సెట్ రవాణాకు తోడ్పడుతుంది.
  4. ఒక మిల్లీలీటరు మానవరక్తంలో దాదాపు 5 మిలియన్లల ఎర్ర రక్తకణాలు ఉంటాయి. వీటి జీవనకాలం 120 రోజులు.
  5. శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు రక్తకణాలు కాలేయం మరియు పిత్తాశయంలో తయారవుతాయి. ప్రౌఢమానవునిలో పొడవుగా ఉన్న ఎముకలలో ఉండే అస్థిమజ్జలో ఇవి తయారవుతాయి.
  6. ఒంటె, ఉలాము తప్ప మిగతా క్షీరదాల ఎర్రరక్త కణాలలో కేంద్రకం ఉంటుంది.

ప్రశ్న 13.
తెల్ల రక్తకణములను గురించి రాయండి.
జవాబు:

  1. తెల్లరక్తకణములను ల్యూకోసైటులు అంటారు. వీటిలో హిమోగ్లోబిన్ ఉండకపోవటం వలన ఇవి తెల్లగా ఉంటాయి.
  2. ఎర్ర రక్తకణాల సంఖ్యచే పోల్చిన ఇవి తక్కువ సంఖ్యలో ఉంటాయి.
  3. తెల్లరక్త కణాలు రెండు రకాలు. అవి : 1) కణికాభ కణాలు 2) కణికరహిత కణాలు.
  4. కణికాభ కణాలలో న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్ మరియు ఇసినోఫిల్స్ అని మూడు రకాలున్నాయి.
  5. ఇవి రక్తములోనికి ప్రవేశించిన సూక్ష్మజీవులను ఎదుర్కొని నాశనము చేస్తాయి.
  6. కణిక రహిత కణాలు లింఫోసైట్స్ మరియు మోనోసైట్స్ అని రెండు రకాలు.
  7. లింఫోసైట్స్ రక్తంలోకి వచ్చిన బాహ్య పదార్థములను ఎదుర్కొనే ప్రతిదేహాలను తయారుచేస్తాయి. అందువల్ల వీటిని సూక్ష్మ రక్షకభటులంటారు.
  8. మోనోసైట్లు కణికాభ కణాలతో పాటు రక్తంలో అమీబా మాదిరిగా కదులుతూ బాహ్య పదార్థాలను ఎదుర్కొని, భక్షించి నాశనం చేస్తాయి. మోనోసైట్లను పారిశుధ్య కార్మికులు అంటారు.

ప్రశ్న 14.
రక్తములోని ప్లాస్మానందు ఉండు అంశములు ఏవి?
జవాబు:

  1. రక్తంలో ఒక అంశ అయిన ప్లాస్మాలో ఎక్కువ శాతం నీరు ఉంటుంది.
  2. నీటితో పాటు గ్లూకోజు, ఎమినోయాసిడ్ వంటి రకరకాల పోషకాలు కూడా ఉంటాయి. విటమిన్లు, హార్మోనులు కూడా రక్తంలో ఉంటాయి.
  3. ఇది శరీరానికి శక్తినిచ్చుటకు సహాయపడడంతో బాటు విసర్జక పదార్థాలైన లాక్టిక్ ఏసిడ్, యూరియా, ఇతర లవణాలను కూడా కలిగి ఉంటుంది.
  4. రక్తం గడ్డకట్టడానికి కావలసిన అనేక కారకాలు కూడా ప్లాస్మాలో ఉంటాయి.
  5. రక్తనాళాలలో రక్తం గడ్డకట్టకుండా ‘హిపారిన్’ అనే పదార్థం ఉపయోగపడుతుంది.

ప్రశ్న 15.
జంతుకణజాలములకు సంబంధించి ప్రవాహపటము (ఫ్లోచార్ట్) ను గీయుము.
జవాబు:
AP 9th Class Biology Important Questions 3rd Lesson జంతు కణజాలం 6

ప్రశ్న 16.
వయస్సులో ఉన్న వాళ్ళ కంటే ముసలివాళ్ళు శీతాకాలంలో చలికి ఎందుకు వణకుతారు?
జవాబు:

  1. ఎడిపోజ్ కణజాలము శరీరము నుండి ఉష్ణ నష్టాన్ని నివారిస్తుంది.
  2. వయస్సులో ఉన్నవారితో పోల్చినపుడు ముసలివాళ్ళ చర్మము క్రింద తక్కువ మొత్తాలలో ఎడిపోజ్ కణజాలము ఉంటుంది.
  3. అందువలన ముసలివాళ్ళ శరీరము నుండి ఎక్కువ మొత్తంలో ఉష్ణ నష్టం జరుగుతుంది.
  4. ఉష్ణ నష్టాన్ని నివారణ చేసుకొనుటకు ముసలివాళ్ళు శరీరమును వణికిస్తారు.
  5. శరీరమును వణికించుట ద్వారా ఉష్ణము (వేడి) ఉత్పత్తి అవుతుంది. ఈ వేడి చలి నుండి తమ శరీరాన్ని కాపాడుకోవటానికి ఉపయోగపడుతుంది.
  6. అందువలన వయస్సులో ఉన్నవాళ్ళ కంటే ముసలివాళ్ళు శీతాకాలంలో చలికి వణుకుతారు.

ప్రశ్న 17.
కౌశిక్ రక్తం O+ve, ప్రణవిది AB+ve వీరు ఏ వర్గం వారికి రక్తదానం చేయవచ్చు? ఎందుకు?
జవాబు:

  1. ‘O’ రక్తవర్గం గల వ్యక్తులను విశ్వదాతలు అంటారు.
  2. ‘O’ రక్తవర్గం గల వ్యక్తుల ఎర్రరక్త కణముల మీద ప్రతిజనకము లేకపోవడం వలన ఈ రక్తమును గ్రహించిన వ్యక్తులలో ఎర్రరక్త కణముల గుచ్ఛకరణము జరగదు.
  3. అందువలన O+ve రక్తం కలిగిన కౌశిక్ ఏ రక్త గ్రూపు కలవారికైనా రక్తమును దానము చేయవచ్చు.
  4. AB+ve రక్తవర్గం కలిగిన ప్రణవి ‘B’ మరియు ‘AB’ రక్తగ్రూపులవారికి రక్తమును దానము చేయవచ్చు.
  5. AB రక్తవర్గం నందు ప్లాస్మాలో ప్రతిరక్షకములు లేవు. కావున వారు ఎవరి నుండైనా రక్తాన్ని గ్రహించవచ్చు. అందుచే వారిని ‘విశ్వగ్రహీతలు’ అంటారు.
  6. కానీ AB గ్రూపువారు కేవలం అదేగ్రూపు (AB) వారికి మాత్రమే రక్తదానం చేయగలరు.

9th Class Biology 3rd Lesson జంతు కణజాలం Important Questions and Answers

ప్రశ్న 1.
కమలాకర్ అనే జీవశాస్త్ర ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు రక్త కణాలను ప్రయోగశాలలో మైక్రోస్కోప్లో చూపించాడు. ఈ ప్రయోగంలో వాడబడిన పరికరాలు ఏమిటి?
జవాబు:
మైక్రోస్కోప్, స్లెడ్, రక్త నమూనా, సిరంజి, దూది

AP 9th Class Biology Important Questions 3rd Lesson జంతు కణజాలం

ప్రశ్న 2.
ఉపకళా కణజాలాలను సోదాహరణంగా వివరించండి.
జవాబు:

  1. జంతుకణజాలాలలో ఉపకళా కణజాలం చాలా ముఖ్యమైన కణజాలం.
  2. జంతువుల అవయవాలను, బయట ఉండే భాగాలను ఉపకళా కణజాలం కప్పి ఉంచుతుంది.
  3. పొలుసుల ఉపకళ : a) ఇది బల్లపరుపుగా, పలుచని పొర కలిగియున్న కణజాలం.

b) జీర్ణవ్యవస్థలో ఉండే అన్నవాహిక, నోటిలోపలి పొరలు, రక్తనాళాలు, ఊపిరితిత్తులలో ఉండే వాయుగోణులలో ఈ కణజాలం ఉంటుంది.

c) విచక్షణాత్వచం ద్వారా పదార్థాల రవాణా జరిగే అవయవాల్లో ఇవి తప్పక ఉంటాయి.

d) చర్మంలో ఒకదానిపై మరొకటి పొరలుగా ఏర్పడ్డ ఉపకళా కణజాలాన్ని సంతకణజాలం అని అంటారు.

e) ఘనాకార ఉపకళా కణజాలం : ఇవి మూత్ర నాళాలలో కనిపిస్తాయి. లాలాజల గ్రంధులకు యాంత్రిక శక్తిని ఇవ్వడంలో సహాయపడతాయి.

f) స్తంభాకార ఉపకళా కణజాలం : ఈ కణజాలం చిన్న కేశాల వంటి నిర్మాణాలను కలిగి ఉన్నది. ఇవి కణాలు స్రవించే చోట, శోషణ జరిగే చోట ఉంటాయి.
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 10AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 11AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 13

ప్రశ్న 3.
కింది పేరాను చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయంది.
సంయోజక కణజాలం ఇతర కణజాలాలను, అంగాలను కలిపి వుంచుతుంది. శరీరంలోని ఇతర అంతర్భాగాలకు దృఢంగా, చట్రంలా నిలిచి కావలసిన ఆధారాన్ని సమకూరుస్తుంది. ఇది అవయవాలను కప్పి, అవయవాలను వాటి వాటి స్థానాలలో వుంచుతుంది. కొవ్వులను నిల్వచేసే ఎడిపోజ్ కణజాలం చర్మం కింద, అంతరంగాల మధ్య వుంటుంది. ఎముక, మృదులాస్థి అస్థి పంజరాన్ని ఏర్పరచి, శరీరానికి ఆధారాన్నిస్తాయి. లిగమెంట్ లేదా సంధి బంధనం ఎముకలను సంధి తలాలతో కలిపి వుంచుతుంది. స్నాయు బంధనం లేదా టెండాన్ కండరాలను ఎముకలతో కలిపి వుంచుతుంది.
ఎ) అవయవాలను కప్పి వుంచే సంయోజక కణజాలం ఏది?
బి) కండరాలను ఎముకలతో కలిపివుంచే సంయోజక కణజాలం ఏది?
సి) అస్థిపంజరం ప్రధానంగా వేటితో ఏర్పడుతుంది?
డి) శరీరంలో ఎడిపోజ్ కణజాలం ఎక్కడ వుంటుంది?
జవాబు:
ఎ) అరియోలార్ కణజాలము
బి) టెండాన్
సి) ఎముక మృదులాస్థి
డి) చర్మం క్రింద, అంతరంగాల మధ్య ఉంటుంది.

ప్రశ్న 4.
నాడీకణం పటం గీచి భాగాలు గుర్తించండి. నాడీ కణంలోని మైలీన్ తొదుగు యొక్క విధి ఏమిటి?
జవాబు:
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 8
మైలీన్ తొడుగు యొక్క విధి :
ఏక్సాన్లో కొంత భాగాన్ని కప్పి ఉంచే పొర మైలీన్ త్వచం. మైలీన్ తొడుగులో ఉండే రవీర్ కణుపులు నాడీ ప్రచోదన వేగాన్ని పెంచుతాయి.

ప్రశ్న 5.
క్రింద ఇచ్చిన వాటి పేర్లను రాయండి.
ఎ) మన శరీరంలో కొవ్వును నిల్వచేసే కణాలు
బి) జంతువులలో ఆహారాన్ని రవాణా చేసే కణాలు
జవాబు:
ఎ) ఎడిపోజ్ కణజాలం
బి) రక్తం

ప్రశ్న 6.
క్షితిజను పరీక్షించిన డాక్టరు రక్తంలో హీమోగ్లోబిన్ తక్కువగా ఉందని చెప్పాడు. హీమోగ్లోబిన్ తక్కువగా ఉంటే జరిగే పరిణామాలను తెలుసుకోవడానికి నీవు డాక్టరును ఎలాంటి ప్రశ్నలు అడుగుతావు?
జవాబు:
1) రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువైతే శరీరంలో వచ్చే మార్పులు ఏమిటి?
2) రక్తంలో హి మోగ్లోబిన్ తగ్గడానికి కారణాలు ఏమిటి?
3) రక్తంలో హి మోగ్లోబిన్ పెరగడానికి మనం ఏమి చేయాలి?
4) హిమోగ్లోబిన్ తగ్గడం వలన మనకు వచ్చే వ్యాధి ఏమిటి?

9th Class Biology 3rd Lesson జంతు కణజాలం 1 Mark Bits Questions and Answers

లక్ష్యా త్మ క ని యోజనము

1. జంతువుల లోపలి అవయవాలను, బయట భాగాలను కప్పి ఉంచే కణజాలం
A) ఉపకళా కణజాలం
B) సంయోజక కణజాలం
C) కండర కణజాలం
D) నాడీ కణజాలం
జవాబు:
A) ఉపకళా కణజాలం

2. అవయవాలను కలిపే కణజాలం
A) ఉపకళా కణజాలం
B) సంయోజక కణజాలం
C) కండర కణజాలం
D) నాడీ కణజాలం
జవాబు:
B) సంయోజక కణజాలం

3. శరీర కదలికలకు తోడ్పడే కణజాలం
A) ఉపకళా కణజాలం
B) సంయోజక కణజాలం
C) కండర కణజాలం
D) నాడీ కణజాలం
జవాబు:
C) కండర కణజాలం

4. బాహ్య, అంతర ఉద్దీపనలకు ప్రతిచర్యలు చూపే కణజాలం
A) ఉపకళా కణజాలం
B) సంయోజక కణజాలం
C) కండర కణజాలం
D) నాడీ కణజాలం
జవాబు:
D) నాడీ కణజాలం

5. బహుకణ గ్రంథులను ఏర్పరచే కణజాలము
A) సంయోజక కణజాలం
B) ఉపకళా కణజాలం
C) వాయుగత కణజాలం
D) ఎడిపోజ్ కణజాలం
జవాబు:
B) ఉపకళా కణజాలం

AP 9th Class Biology Important Questions 3rd Lesson జంతు కణజాలం

6. సరీసృపాలలో పొలుసులు, పక్షుల ఈకలను తయారు చేయు కణజాలం
A) ఉపకళా కణజాలం
B) సంయోజక కణజాలం
C) వాయుగత కణజాలం
D) ఫైబ్రోబ్లాస్టులు
జవాబు:
A) ఉపకళా కణజాలం

7. ఫైబ్రోబ్లాస్టులు ఉండు కణజాలం
A) మృదులాస్థి
B) ఎముక
C) వాయుగత కణజాలం
D) సంధి బంధనం
జవాబు:
C) వాయుగత కణజాలం

8. ఎముక ఈ లవణాలతో తయారవుతుంది.
A) కాల్షియం ఫాస్పేట్
B) కాల్షియం కార్బొనేట్
C) A & B
D) సోడియమ్ కార్బొనేట్
జవాబు:
C) A & B

9. ఎముకలు కలిసేచోట, పక్కటెముకల చివర, నాశికాగ్రము, చెవిదొప్ప, వాయునాళంలోను ఉండే కణజాలం
A) మృదులాస్థి
B) ఎముక
C) వాయుగత కణజాలం
D) సంధి బంధనము
జవాబు:
A) మృదులాస్థి

10. ఎముకలను సంధి తలాలలో కలిపి ఉంచేది.
A) స్నాయుబంధనం
B) సంధి బంధనం
C) మృదులాస్థి
D) ఎడిపోజ్ కణజాలం
జవాబు:
B) సంధి బంధనం

11. సంధి బంధనం తంతువులు ఈ ప్రోటీనుతో తయారవుతాయి.
A) ప్రోత్రాంబిన్
B) ఫైబ్రినోజన్
C) హిపారిన్
D) కొల్లాజెన్
జవాబు:
D) కొల్లాజెన్

12. బొద్దింక నందు రక్తము ఈ రంగులో ఉంటుంది.
A) ఎరుపు
B) తెలుపు
C) నీలం
D) ఆకుపచ్చ
జవాబు:
B) తెలుపు

13. నీలం రంగు రక్తం గల జంతువు
A) కప్ప
B) తిమింగలం
C) వానపాము
D) నత్త
జవాబు:
D) నత్త

14. ప్రొడ మానవునిలో ఉండే రక్త పరిమాణం.
A) 5 లీటర్లు
B) 4 లీటర్లు
C) 3 లీటరు
D) 6 లీటర్లు
జవాబు:
A) 5 లీటర్లు

15. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా నివారించేది
A) ప్రోత్రాంబిన్
B) ఫైబ్రినోజన్
C) హిపారిన్
D) రక్త ఫలకికలు
జవాబు:
C) హిపారిన్

16. ఎర్ర రక్తకణములు ఎర్రగా ఉండుటకు కారణము
A) హిమోగ్లోబిన్
B) ఫైబ్రినోజన్
C) ప్రోత్రాంబిన్
D) ప్లాస్మా
జవాబు:
A) హిమోగ్లోబిన్

17. ఎర్రరక్త కణముల జీవిత కాలం
A) 130 రోజులు
B) 120 రోజులు
C) 12-13 రోజులు
D) 115 రోజులు
జవాబు:
B) 120 రోజులు

18. రక్త వర్గాలను కనుగొనినది
A) కారల్ లాండ్ స్టీనర్
B) కారల్ ఎరికె
C) మాల్పీజి
D) రాబర్ట్ ఏంజెస్
జవాబు:
A) కారల్ లాండ్ స్టీనర్

AP 9th Class Biology Important Questions 3rd Lesson జంతు కణజాలం

19. ఎర్ర రక్తకణములను ఉత్పత్తి చేసేది
A) ఎడిపోసైట్స్
B) హిపారిన్
C) క్లోమము
D) పొడవు ఎముకలనందలి అస్థిమజ్జ
జవాబు:
D) పొడవు ఎముకలనందలి అస్థిమజ్జ

20. ఎర్ర రక్తకణము నందు కేంద్రకము గల జీవులు
A) ఒంటె
B) ఉలాము
C) A & B
D) ఏనుగు
జవాబు:
C) A & B

21. క్రింది వాటిలో కణికాభ కణము
A) న్యూట్రోఫిల్స్
B) మోనోసైట్స్
C) లింఫోసైట్స్
D) ఆస్టియోసైట్స్
జవాబు:
A) న్యూట్రోఫిల్స్

22. ‘చీము’ను ఏర్పరచేవి
A) ఎర్ర రక్తకణములు
B) తెల్ల రక్తకణములు
C) ఎడిపోసైట్స్
D) ఆస్టియోసైట్స్
జవాబు:
B) తెల్ల రక్తకణములు

23. సూక్ష్మ రక్షకభటులు అని వీటిని అంటారు.
A) లింఫోసైట్స్
B) మోనోసైట్స్
C) న్యూట్రోఫిల్స్
D) బేసోఫిల్స్
జవాబు:
A) లింఫోసైట్స్

24. పారిశుద్ధ్య కార్మికులు అని వీటిని అంటారు.
A) లింఫోసైట్స్
B) బేసోఫిల్స్
C) మోనోసైట్స్
D) న్యూట్రోఫిల్స్
జవాబు:
C) మోనోసైట్స్

25. రక్తము గడ్డకట్టుటలో సహాయపడు కణాలు
A) హిపారిన్
B) రక్త ఫలకికలు
C) ఇసినోఫిల్స్
D) బేసోఫిల్స్
జవాబు:
B) రక్త ఫలకికలు

26. “విశ్వ దాతలు” ఈ రక్త వర్గం కలవారు.
A) ‘AB’ రక్తవర్గం
B) ‘B’ రక్తవర్గం
C) ‘O’ రక్తవర్గం
D) ‘A’ రక్తవర్గం
జవాబు:
C) ‘O’ రక్తవర్గం

AP 9th Class Biology Important Questions 3rd Lesson జంతు కణజాలం

27. రక్తనాళ వ్యాసాన్ని తగ్గించడానికి లేదా పెంచడానికి ఉపయోగపడే కణజాలం
A) సంయోజక కణజాలం
B) ఉపకళా కణజాలం
C) కండర కణజాలం
D) రక్త కణజాలం
జవాబు:
C) కండర కణజాలం

28. హృదయ కండరాలు గల అవయవం
A) గుండె
B) ఊపిరితిత్తులు
C) ఆహారవాహిక
D) బుగ్గ లోపలి పొర
జవాబు:
A) గుండె

29. మృదు కండరాలు లేదా అనియంత్రిత కండరాలు నియంత్రించునది
A) ఆహారవాహికలో ఆహారం కదలిక
B) రక్తనాళాల కండరాల సంకోచాలు
C) రక్తనాళాల కండరాల వ్యాకోచాలు
D) పైవి అన్నియు
జవాబు:
D) పైవి అన్నియు

30. నియంత్రిత లేదా సంకల్పిత కండరాలకు గల మరియొక పేరు
A) అస్థికండర కణజాలం
B) అరేఖిత కండరాలు
C) నునుపు కండరాలు
D) పైవి అన్నియు
జవాబు:
A) అస్థికండర కణజాలం

31. నాడీకణము నందలి భాగమును గుర్తించుము.
A) కణదేహం
B) ఏక్సాన్
C) డెండ్రైట్
D) పైవి అన్నియు
జవాబు:
D) పైవి అన్నియు

32. నిస్సల్ కణికలు గల నాడీకణ భాగం
A) కణదేహం
B) ఏక్సాన్
C) డెండైటు
D)మెయిలిన్ త్వచం
జవాబు:
A) కణదేహం

33. తెల్లరక్త కణములకు గల మరియొక పేరు
A) ల్యూకోసైట్స్
B) ఎరిత్రోసైట్స్
C) ఆస్టియోసైట్స్
D) ఎడిపోసైట్స్
జవాబు:
A) ల్యూకోసైట్స్

34. ఒక మి.లీ. రక్తంలో ఉండు ఎర్రరక్తకణాల సంఖ్య
A) 6 మిలియన్లు
B) 5 మిలియన్లు
C) 4 మిలియన్లు
D) 3 మిలియన్లు
జవాబు:
B) 5 మిలియన్లు

35. మూత్రపిండ వృక్కనాళాలలో విస్తరించియున్న కణజాలం
A) స్తంభాకార ఉపకళా కణజాలం
B) సూచి ఆకార ఉపకళా కణజాలం
C) ఘనాకార ఉపకళా కణజాలం
D) అండాకార ఉపకళా కణజాలం
జవాబు:
C) ఘనాకార ఉపకళా కణజాలం

36. వాయుగోణులలో, నోటిలోపలి పొరలలో రక్తనాళాలపైన ఉండే కణజాలం
A) పొలుసుల ఉపకళ
B) సరిత ఉపకళ
C) ఘనాకార ఉపకళ
D) స్తంభాకార ఉపకళ
జవాబు:
A) పొలుసుల ఉపకళ

37. చర్మంపైన ఉండే ఉపకళా కణజాలం
A) పొలుసుల ఉపకళ
B) స్తరిత ఉపకళ
C) ఘనాకార ఉపకళ
D) స్తంభాకార ఉపకళ
జవాబు:
B) స్తరిత ఉపకళ

38. మూత్రనాళాలలో, లాలాజల గ్రంథులలో ఉండే కణజాలం
A) పొలుసుల ఉపకళ
B) స్తరిత ఉపకళ
C) ఘనాకార ఉపకళ
D) స్తంభాకార ఉపకళ
జవాబు:
C) ఘనాకార ఉపకళ

39. స్రవించే భాగాలలో, శోషణ జరిగే భాగాలలో ఉండే కణజాలం
A) పొలుసుల ఉపకళ
B) స్తరిత ఉపకళ
C) ఘనాకార ఉపకళ
D) స్తంభాకార ఉపకళ
జవాబు:
D) స్తంభాకార ఉపకళ

AP 9th Class Biology Important Questions 3rd Lesson జంతు కణజాలం

40. ఈ క్రింది వానిలో చర్మం నుండి తయారు అయ్యేది
A) గోర్లు
B) పొలుసులు
C) ఈకలు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

41. రోమాలు, గిట్టలు, కొమ్ములు ఇవన్నీ ఏ కణజాలం నుండి రూపాంతరం చెందుతాయి?
A) ఉపకళా కణజాలం
B) సంయోజక కణజాలం
C) కండర కణజాలం
D) నాడీ కణజాలం
జవాబు:
A) ఉపకళా కణజాలం

42. ఈ క్రింది వానిలో సంయోజక కణజాలానికి సంబంధించిన అసత్య వాక్యం
A) సంయోజక కణజాలం ఇతర కణజాలాలను, అంగాలను కలిపి ఉంచుతుంది.
B) అంతర్భాగాలకు ఆధారాన్ని సమకూరుస్తుంది.
C) శరీర కదలికలకు తోడ్పడుతుంది.
D) శరీర రక్షణ కొవ్వు పదార్థాల నిల్వకు ఉపయోగ పడుతుంది.
జవాబు:
C) శరీర కదలికలకు తోడ్పడుతుంది.

43. ఫెబ్లాస్ట్ కణాలు దీనిలో ఉంటాయి.
A) ఏరియోలార్ కణజాలం
B) ఎడిపోజ్ కణజాలం
C) మృదులాస్థి
D) రక్తం
జవాబు:
A) ఏరియోలార్ కణజాలం

44. కొవ్వులు ఇక్కడ నిల్వ ఉంటాయి.
A) ఏరియోలార్ కణజాలం
B) ఎడిపోజ్ కణజాలం
C) మృదులాస్థి
D) రక్తం
జవాబు:
B) ఎడిపోజ్ కణజాలం

45. ఎముకను స్రవించే కణాలు,
A) ఫైబ్రోబ్లాస్ట్ కణాలు
B) ఆస్టియోసైట్లు
C) ల్యూకోసైటులు
D) మోనోసైటులు
జవాబు:
B) ఆస్టియోసైట్లు

46. ఎముకలో ఉండే లవణాలు
A) కాల్షియం ఫాస్పేట్
B) కాల్షియం కార్బొనేట్
C) పై రెండూ
D) కాల్షియం సల్ఫేట్
జవాబు:
C) పై రెండూ

47. మృదులాస్థి ఇందులో ఉండదు.
A) సకశేరుకాల అస్థిపంజరం
B) సకశేరుకాల పిండం
C) వాయునాళం
D) సొరచేప అస్తిపంజరం
జవాబు:
A) సకశేరుకాల అస్థిపంజరం

48. రెండు ఎముకలను కలిపే నిర్మాణం
A) టెండాన్
B) లిగమెంట్
C) కండరం
D) మృదులాస్థి
జవాబు:
B) లిగమెంట్

49. ఎముకను, కండరాన్ని కలిపే నిర్మాణం
A) టెండాన్
B) లిగమెంట్
C) కండరం
D) మృదులాస్థి
జవాబు:
A) టెండాన్

50. క్రింది వానిలో రక్తానికి సంబంధించిన అసత్య వాక్యం
A) ద్రవరూప సంయోజక కణజాలం
B) తంతువులు లేని సంధాయక కణజాలం
C) కణాలన్నీ ఒకే నిర్దిష్టమైన పనిని నిర్వర్తిస్తాయి.
D) కణాలన్నీ ప్లాస్మాలో తేలియాడుతూ ఉంటాయి.
జవాబు:
C) కణాలన్నీ ఒకే నిర్దిష్టమైన పనిని నిర్వర్తిస్తాయి.

51. మన యొక్క అనారోగ్యాన్ని గుర్తించడానికి ఉపయోగపడే కణజాలం
A) మృదులాస్థి
B) ఎడిపోజ్ కణజాలం
C) రక్తం
D) ఏరియోలార్ కణజాలం
జవాబు:
C) రక్తం

AP 9th Class Biology Important Questions 3rd Lesson జంతు కణజాలం

52. గుండె 24 గంటల్లో పంపు చేసే రక్తం
A) 28 వేల లీటర్లు
B) 32 వేల లీటర్లు
C) 36 వేల లీటర్లు
D) 38 వేల లీటర్లు
జవాబు:
C) 36 వేల లీటర్లు

53. గుండె 24 గంటల్లో రకాన్ని పంపు చేసే దూరం
A) 10,000 కి.మీ.
B) 20,000 కి.మీ.
C) 30,000 కి.మీ.
D) 40,000 కి.మీ.
జవాబు:
B) 20,000 కి.మీ.

54. ప్రౌఢ మానవుని శరీరంలో ఉండే మొత్తం రక్తం
A) 5 లీటర్లు
B) 6 లీటర్లు
C) 7 వీటర్లు
D) 8 లీటర్లు
జవాబు:
A) 5 లీటర్లు

55. ఏ జీవి రకం నీలిరంగులో ఉంటుంది?
A) బొద్దింక
B) నత్త
C) గబ్బిలం
D) తిమింగలం.
జవాబు:
B) నత్త

56. ఏ జీవి రక్తం తెలుపురంగులో ఉంటుంది?
A) బొద్దింక
B) నత్త
C) గబ్బిలం
D) తిమింగలం
జవాబు:
A) బొద్దింక

57. రక్తనాళాలలో రక్తం గడ్డకట్టకుండా చేసే పదార్థం
A) హైరోడీన్
B) ప్రోత్రాంబిన్
C) హెపారిన్
D) త్రాంబిన్
జవాబు:
C) హెపారిన్

58. రక్తంలో ఉండేవి
A) నీరు
B) గ్లూకోజ్, ఎమైనో యాసిడ్లు
C) యూరియా, లాక్టిక్ యాసిడ్
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

59. మానవుని ఒక మిల్లీ లీటరు రక్తంలోని ఎర్రరక్త కణాలసంఖ్య
A) 3 మిలియన్లు
B) 5 మిలియన్లు
C) 7 మిలియన్లు
D) 9 మిలియన్లు
జవాబు:
B) 5 మిలియన్లు

60. తల్లి గర్భంలోని శిశువులో ఎర్రరక్త కణాలు ఇక్కడ ఉంటాయి.
A) అస్థిమజ్జ
B) కాలేయం
C) ప్లీహం
D) B మరియు C
జవాబు:
D) B మరియు C

61. వీని ఎర్రరక్త కణాలలో కేంద్రకం ఉంటుంది.
A) తిమింగలం
B) ఒంటె
C) ఇలామా
D) B మరియు C
జవాబు:
D) B మరియు C

62. కేంద్రకం వీనిలో ఉండదు.
A) ఎర్రరక్త కణాలు
B) రక్తఫలకికలు
C) A మరియు B
D) పైవేవీ కాదు
జవాబు:
C) A మరియు B

63. మానవునిలో రక్త వర్గాల సంఖ్య
A) 1
B) 2
C) 3
D) 4
జవాబు:
D) 4

AP 9th Class Biology Important Questions 3rd Lesson జంతు కణజాలం

64. ఈ క్రింది వానిలో మానవునిలో రక్తవర్గం కానిది
A) A
B) B
C) C
D) O
జవాబు:
C) C

65. విశ్వగ్రహీతలు అని ఏ రక్త వర్గం వారిని అంటారు?
A) A
B) B
C) AB
D) O
జవాబు:
C) AB

66. అస్థిపంజరంలోని ఎముకలకు అతికి ఉండి కదలికలకు కారణం అయ్యేవి
B) రేఖిత కండరం
A) అస్థి కండరం
C) సంకల్పిత కండరం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

67. అరేఖిత కండరాలు ఉండని ప్రదేశం
A) రక్తనాళాలు
B) గర్భాశయం
C) కాళ్ళు
D) వాయునాళాలు
జవాబు:
C) కాళ్ళు

68. ఈ క్రింది కణాలకు పునరుత్పత్తి శక్తి లేదు.
A) అస్థి కణాలు
B) నాడీ కణాలు
C) కండర కణాలు
D) చర్మ కణాలు
జవాబు:
B) నాడీ కణాలు

69. నాడి కణాలకు సంబంధించి అసత్య వాక్యం
A) నిస్పల్ కణికలు కలిగి ఉంటాయి.
B) మైలిన్ త్వచంచే ఆవిరించబడి ఉంటాయి.
C) పునరుత్పత్తి చేస్తాయి.
D) సమాచార ప్రసారానికి ఉపయోగపడతాయి.
జవాబు:
C) పునరుత్పత్తి చేస్తాయి.

70. కొల్లాజెన్తో తయారుచేయబడినవి
A) ఎముక
B) లిగమెంట్
C) స్నాయుబంధనం
D) B మరియు C
జవాబు:
D) B మరియు C

71. అమీబా వలె కదులుతూ బాహ్య పదార్థాలను ఎదుర్కొని భక్షించి నశింపచేసేవి
A) మోనోసైట్స్
B) లింఫోసైట్స్
C) నూట్రోఫిల్స్
D) బేసోఫిల్స్
జవాబు:
A) మోనోసైట్స్

72. క్రింది వానిలో సరిగా జతపరచబడని జత ఏది?
1) స్నాయు బంధము – కండరాలను ఎముకతో కలిపే సంధి
2) కొల్లాజన్ – లిగమెంట్
3) కణికాభ కణాలు – న్యూట్రోఫిల్స్
A) 1, 3
B) 2, 3
C) 3 మాత్రమే
D) 1 మాత్రమే
జవాబు:
C) 3 మాత్రమే

73. క్రింది ప్రవచనాలను చదవండి.
a) న్యూట్రోఫిలను సూక్ష్మ రక్షకభటులు అంటారు.
b) మోనోసైట్లను పారిశుద్ధ్య కార్మికులు అంటారు.
A) a సరియైనది b సరియైనది కాదు
B) b సరియైనది a సరియైనది కాదు
C) a మరియు b లు రెండూ సరియైనవి కావు
D) a మరియు b లు రెండూ సరియైనవి
జవాబు:
C) a మరియు b లు రెండూ సరియైనవి కావు

AP 9th Class Biology Important Questions 3rd Lesson జంతు కణజాలం

74. మీ రక్తవర్గాలను కనుగొనడంలో కావలసిన పరికరాలలో అవసరములేనిది
A) దూది
B) డిడ్పేసబుల్ సూది
C) బాండేజ్
D) 70% ఆల్కహాల్
జవాబు:
C) బాండేజ్

75. చిత్రాన్ని పరిశీలించి సరైన వాక్యాన్ని ఎన్నుకోండి.
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 3
A) ద్రవాభిసరణాన్ని కనుగొనే ప్రయోగ అమరిక
B) పాక్షిక పారగమ్యత్వచాన్ని తయారుచేయడం
C) వ్యాపనాన్ని కనుగొనే ప్రయోగ అమరిక
D) రక్తవర్గాలను గుర్తించుట
జవాబు:
D) రక్తవర్గాలను గుర్తించుట

క్రింది పట్టికను పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు సరియైన జవాబును గుర్తించండి.

రక్త కణాలు అల్ప, అధిక విలువలు
తెల్ల రక్త కణాలు 5.0 – 10.0 × 103 cells/ ul
ఎర్ర రక్త కణాలు 3.5 – 5.5 × 106 cells/ ul
HgB మగ 12 – 16 g/dL; ఆడ 9.9 – 13g/dL
రక్తఫలకికలు 1.0 – 3.0 × 105 cells/ul
న్యూట్రోఫిల్స్ 40 – 75%
లింఫోసైట్స్ 20  – 45%
ఇసినోఫిల్స్ 1 – 6%
బేసోఫిల్స్ 0 – 1%
మోనోసైట్ 0 – 3%

76. ఈ క్రింది వానిలో రక్తంలో అధికంగా ఉన్నది ఏది?
A) మోనోసైట్స్
B) బేసోఫిల్స్
C) ఇసినోఫిల్స్
D) లింఫోసైట్స్
జవాబు:
D) లింఫోసైట్స్

77. ఈ క్రింది వానిలో రక్తంలో తక్కువగా ఉన్నది ఏది?
A) న్యూట్రోఫిల్స్
B) మోనోసైట్స్
C) బేసోఫిల్స్
D) ఇసినోఫిల్స్
జవాబు:
A) న్యూట్రోఫిల్స్

78. చిత్రంలో ఉన్న ఉపకళా కణజాలం ఏది?
AP 9th Class Biology Important Questions 3rd Lesson జంతు కణజాలం 8
A) ఘనాకార ఉపకళా కణజాలం
B) పొలుసుల ఉపకళా కణజాలం
C) స్తంభాకార ఉపకళా కణజాలం
D) సిలియేటెడ్ ఉపకళా కణజాలం
జవాబు:
D) సిలియేటెడ్ ఉపకళా కణజాలం

AP 9th Class Biology Important Questions 3rd Lesson జంతు కణజాలం

79. చిత్రంలో ఉన్న కణజాలాన్ని గుర్తించండి.
AP 9th Class Biology Important Questions 3rd Lesson జంతు కణజాలం 9
A) ఎముక
B) ఏరియోలర్ కణజాలం
C) ఎడిపోజ్ కణజాలం
D) మృదులాస్థి కణజాలం
జవాబు:
B) ఏరియోలర్ కణజాలం

80. చిత్రంలో గుర్తించిన భాగం పేరు రాయండి.
AP 9th Class Biology Important Questions 3rd Lesson జంతు కణజాలం 10
A) ఆక్టాన్
B) డెండ్రైట్
C) మయలీన్ త్వచం
D) నిస్సల్ కణికలు
జవాబు:
A) ఆక్టాన్

81. ఇవ్వబడిన చిత్రంలోని కండర కణజాలం ఏది?
AP 9th Class Biology Important Questions 3rd Lesson జంతు కణజాలం 11
A) రేఖిత కండరాలు
B) అరేఖిత కండరాలు
C) హృదయ కండరాలు
D) పైవేవీకావు
జవాబు:
C) హృదయ కండరాలు

82. హిమోగ్లోబిన్ లోపము వలన వచ్చే వ్యాధులలో క్రింది వానిలో సరియైనది కానిది ఏది?
A) రక్తహీనత
B) గుండె సమస్యలు
C) రక్తం గడ్డకట్టటం
D) వేడి శ్వాస
జవాబు:
C) రక్తం గడ్డకట్టటం

83. అ) ప్రకాష్ రక్తం – anti A ప్రతి రక్షకాలతో గుచ్చకరణం జరపలేదు
ఆ) హాసిత్ రక్తం – anti A ప్రతి రక్షకాలతో మాత్రమే గుచ్చకరణ జరిపింది.
ఇ) ఇద్దరి రక్త నమూనాలు Rh సీరమ్ తో గుచ్చకరణం జరిపాయి. ప్రకాష్, హాసిత్ రక్తవర్గాలు వరుసగా
A) ఇద్దరూ Rh+Ve
B) ఇద్దరూ A+Ve
C) ఇద్దరూ Rh-Ve
D) ప్రకాష్ B+Ve, హాసిత్ A+Ve
జవాబు:
D) ప్రకాష్ B+Ve, హాసిత్ A+Ve

AP 9th Class Biology Important Questions 3rd Lesson జంతు కణజాలం

84. పారిశుద్ధ్య కార్మికులు అని ఏ రక్త కణాలను అంటారు?
A) ఇసినోఫిల్స్
B) బేసోఫిల్స్
C) మోనోసైట్స్
D) లింఫోసైట్స్
జవాబు:
C) మోనోసైట్స్

85. అడు చారలను కలిగి వుండే కండరాలు
A) రేఖిత, హృదయ కండరాలు
B) అరేఖిత, హృదయ కండరాలు
C) రేఖిత, అరేఖిత కండరాలు
D) రేఖిత, అరేఖిత, హృదయ కండరాలు
జవాబు:
A) రేఖిత, హృదయ కండరాలు

86. సార్వత్రిక రక్తగ్రహీతలు ఎవరు?
A) రక్తవర్గం – A
B) రక్తవర్గం – AB
C) రక్తవర్గం – O
D) రక్తవర్గం – B
జవాబు:
D) రక్తవర్గం – B

పునరాలోచన

AP 9th Class Biology Important Questions 3rd Lesson జంతు కణజాలం 7

AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం

These AP 9th Biology Important Questions and Answers 2nd Lesson వృక్ష కణజాలం will help students prepare well for the exams.

AP Board 9th Class Biology 2nd Lesson Important Questions and Answers వృక్ష కణజాలం

9th Class Biology 2nd Lesson వృక్ష కణజాలం 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
కణజాలాలు అనగానేమి?
జవాబు:
ఒకే విధమైన నిర్మాణం కలిగి ఒకే విధమైన విధుల్ని నిర్వర్తించే కణాల సమూహాలను కణజాలాలు అంటారు.

ప్రశ్న 2.
మొక్కలలో కణజాలాలు ఎన్ని రకాలు? అవి ఏవి?
జవాబు:
మొక్కలలో కణజాలాలు నాలుగు రకాలు. అవి : 1. విభాజ్య కణజాలాలు 2. త్వచ కణజాలాలు 3. సంధాయక కణజాలాలు 4. ప్రసరణ కణజాలాలు

ప్రశ్న 3.
విభాజ్య కణజాలం మొక్కలలో ఏయే ప్రదేశాలలో ఉంటుంది?
జవాబు:
కాండం కొనభాగాల్లోను, పార్శ్వ భాగాల్లోను, ఇతర కణజాలాల పొరల మధ్యలోను విభాజ్య కణజాలం ఉంటుంది.

ప్రశ్న 4.
అగ్ర విభాజ్య కణజాలాలు అనగానేమి?
జవాబు:
మొక్కలలో పెరుగుదలను కలిగించే విభాజ్య కణజాలాలను అగ్ర విభాజ్య కణజాలాలు అంటారు.

ప్రశ్న 5.
పార్శ్వ విభాజ్య కణజాలాలు అనగానేమి?
జవాబు:
కాండంలో పార్శ్వపు అంచుల చుట్టూ వర్తులంగా పెరుగుదలను కలిగించే కణజాలాన్ని పార్శ్వ విభాజ్య కణజాలాలు అంటారు.

ప్రశ్న 6.
మధ్యస్థ విభాజ్య కణజాలం మొక్కలో ఎక్కడ ఉంటుంది?
జవాబు:
కాండం మీద శాఖలు ఏర్పడేచోట, ఆకులు, పుష్ప వృంతం పెరిగేచోట మధ్యస్థ విభాజ్య కణజాలం ఉంటుంది.

AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం

ప్రశ్న 7.
విభాజ్య కణజాలంలోని కణాలు ఏ విధంగా ఉంటాయి?
జవాబు:
కణాలు చిన్నవిగా పలుచని కణ కవచమును, స్పష్టమైన కేంద్రకమును, కణముల మధ్య ఖాళీ లేకుండా ఉంటాయి.

ప్రశ్న 8.
మొక్క దేహ ఉపరితలమంతా ఉండే కణజాలం?
జవాబు:
త్వచ కణజాలం

ప్రశ్న 9.
త్వచ కణజాలం ఎన్ని రకాలు? అవి ఏవి?
జవాబు:
త్వచ కణజాలంలోని కణాల విధులను బట్టి మరియు స్థానాన్ని బట్టి త్వచ కణజాలం మూడు రకాలు. అవి :

  1. బాహ్యచర్మం లేక బహిస్త్వచం
  2. మధ్యస్వచం లేక మధ్యపొర
  3. అంతస్త్వచం లేక లోపలిపొర

ప్రశ్న 10.
ఎడారి మొక్కల్లో త్వచ కణజాలపు కణాలు ఏవిధంగా ఉంటాయి?
జవాబు:
ఎడారి మొక్కల్లో త్వచ కణజాలపు కణాలు బాగా దళసరిగా ఉండి మైనపు పూతను కలిగి ఉంటాయి.

ప్రశ్న 11.
వేరులో పొడవైన వెంట్రుక వంటి మూలకేశాలు ఏ కణజాలం నుండి ఏర్పడతాయి?
జవాబు:
వేరులో పొడవైన వెంట్రుక వంటి మూలకేశాలు త్వచ కణజాలం నుండి ఏర్పడతాయి.

ప్రశ్న 12.
చెట్ల నుండి జిగురు ఏ విధంగా స్రవించబడుతుంది?
జవాబు:
జిగురునిచ్చే చెట్ల యొక్క త్వచ కణజాలం నుండి జిగురు స్రవించబడుతుంది. ఉదా : తుమ్మ, వేప

ప్రశ్న 13.
త్వచ కణజాలము విధి ఏది?
జవాబు:
నీటి ఎద్దడి, కొమ్మలు విరగడం, చీలడం వంటి యాంత్రికంగా కలిగే నష్టాలు, పరాన్నజీవులు, రోగకారక జీవుల దాడి మొదలైన వాటి నుండి మొక్కలను త్వచ కణజాలం కాపాడుతుంది.

ప్రశ్న 14.
బెరడు అనగానేమి?
జవాబు:
పెద్ద చెట్లలో త్వచ కణజాలం బాహ్య చర్మంపైన అనేక పొరలను ఏర్పరుస్తుంది. దానిని బెరడు అంటారు.

ప్రశ్న 15.
త్వచ కణజాలం నుండి ఏర్పడేవి?
జవాబు:
త్వచ కణజాలం నుండి ఏర్పడేవి పత్రరంధ్రాలు మరియు మూలకేశాలు.

ప్రశ్న 16.
మొక్క దేహంలో ఎక్కువ భాగం ఏ కణజాలంతో ఏర్పడుతుంది?
జవాబు:
మొక్క దేహంలో ఎక్కువ భాగం సంధాయక కణజాలంతో ఏర్పడుతుంది.

ప్రశ్న 17.
సంధాయక కణజాలం ఉపయోగం ఏమిటి?
జవాబు:
ఆహారం నిల్వచేయడానికి, మొక్కకు యాంత్రికంగా బలాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది.

AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం

ప్రశ్న 18.
సంధాయక కణజాలంలోని రకాలు ఏవి?
జవాబు:
సంధాయక కణజాలంలో ముఖ్యంగా మూడు రకాలు కలవు. అవి :

  1. మృదు కణజాలం
  2. స్థూలకోణ కణజాలం
  3. దృఢ కణజాలం

ప్రశ్న 19.
మృదు కణముల నిర్మాణం వివరించండి.
జవాబు:
మృదు కణజాలంలోని కణాలు మృదువుగా, పలుచని గోడలు కలిగి వదులుగా సంధించబడి ఉంటాయి.

ప్రశ్న 20.
మృదు కణజాలము నందలి రకములు ఏవి?
జవాబు:
మృదు కణజాలము నందలి రకములు హరిత కణజాలం, వాయుగత కణజాలం మరియు నిల్వచేసే కణజాలం.

ప్రశ్న 21.
దవ్వ భాగానికి మృదు కణజాలమని పేరు పెట్టినవాడు?
జవాబు:
దవ్వ భాగానికి మృదు కణజాలమని పేరు పెట్టినవాడు నెహేమియా గ్రూ.

ప్రశ్న 22.
“అనాటమీ ఆఫ్ ప్లాంట్స్” గ్రంథాన్ని ప్రచురించినవాడు?
జవాబు:
“అనాటమీ ఆఫ్ ప్లాంట్స్” గ్రంథాన్ని ప్రచురించినవాడు నెహేమియా గ్రూ (1682).

ప్రశ్న 23.
కణాల మధ్య ఖాళీలు లేకుండా దగ్గర దగ్గరగా అమరి ఉండు కణజాలం?
జవాబు:
కణాల మధ్య ఖాళీలు లేకుండా దగ్గర దగ్గరగా అమరి ఉండు కణజాలం దృఢ కణజాలం.

ప్రశ్న 24.
ప్రసరణ కణజాలాలు అని వేటిని అంటారు?
జవాబు:
ప్రసరణ కణజాలాలు అని దారువు, పోషక కణజాలములను అంటారు.

ప్రశ్న 25.
వేర్ల నుండి సేకరించిన నీరు, పోషక పదార్థాలు వేటి ద్వారా మొక్క భాగాలకు సరఫరా అవుతాయి?
జవాబు:
వేర్ల నుండి సేకరించిన నీరు, పోషక పదార్థాలు దారువు ద్వారా మొక్క భాగాలకు సరఫరా అవుతాయి.

ప్రశ్న 26.
ఆకులో తయారయిన ఆహారపదార్థములను మొక్క ఇతర భాగాలకు సరఫరా చేసే కణజాలం ఏది?
జవాబు:
ఆకులో తయారయిన ఆహారపదార్ధములను మొక్క ఇతర భాగాలకు సరఫరా చేసే కణజాలం పోషక కణజాలం.

ప్రశ్న 27.
దారువు, ప్రసరణ కణజాలాలను రెండింటిని కలిపి ఏమంటారు?
జవాబు:
దారువు, ప్రసరణ కణజాలాలను రెండింటిని కలిపి నాళికాపుంజాలు అంటారు.

ప్రశ్న 28.
దారువు నందలి వివిధ రకముల కణములను వ్రాయుము.
జవాబు:
దారువు నందలి వివిధ రకముల కణములు : దారుకణాలు, దారునాళాలు, తంతువులు, మృదు కణజాలం

ప్రశ్న 29.
పోషక కణజాలము నందలి వివిధ రకముల కణములను వ్రాయుము.
జవాబు:
పోషక కణజాలము నందలి వివిధ రకముల కణములు: చాలనీ నాళాలు, చాలనీ కణాలు, సహకణాలు, తంతువులు, మృదు కణజాలం

ప్రశ్న 30.
యూకలిప్టస్ చెట్లలో దారువు ఎన్ని అడుగుల ఎత్తు వరకు నీటిని సరఫరా చేస్తుంది?
జవాబు:
యూకలిప్టస్ చెట్లలో దారువు 200 అడుగులు ఎత్తు వరకు నీటిని సరఫరా చేస్తుంది.

ప్రశ్న 31.
రెడ్ వుడ్ చెట్లలో దారువు ఎన్ని అడుగుల ఎత్తు వరకు నీటిని సరఫరా చేస్తుంది?
జవాబు:
రెడ్ వుడ్ చెట్లలో దారువు 330 అడుగులు ఎత్తు వరకు నీటిని సరఫరా చేస్తుంది.

ప్రశ్న 32.
సాధారణంగా త్వచ కణజాలం ఎన్ని పొరలుగా అమరి యుంటుంది?
జవాబు:
సాధారణంగా త్వచ కణజాలం ఒక వరుస కణాలను కలిగి ఉంటుంది.

AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం

ప్రశ్న 33.
ఆకు బాహ్య చర్మంలో కన్పించే చిన్న రంధ్రాలను ఏమంటారు?
జవాబు:
ఆకు బాహ్య చర్మంలో కన్పించే చిన్న రంధ్రాలను పత్ర రంధ్రాలు అంటారు.

ప్రశ్న 34.
పత్రరంధ్రాలు మరియు మూలకేశాల ఉపయోగం ఏమిటి?
జవాబు:
పత్రరంధ్రాలు వాయు మార్పిడికి మరియు బాష్పోత్సేకానికి, నేల నుండి నీరు లవణాల సంగ్రహణకు మూలకేశాలు ఉపయోగపడతాయి.

ప్రశ్న 35.
హరితరేణువుల్ని కలిగి ఉండే మృదు కణజాలం?
జవాబు:
హరితరేణువుల్ని కలిగి ఉండే మృదు కణజాలం హరిత కణజాలం.

ప్రశ్న 36.
పెద్ద గాలి గదుల్ని కలిగి ఉండే మృదు కణజాలం?
జవాబు:
పెద్ద గాలి గదుల్ని కలిగి ఉండే మృదు కణజాలం వాతయుత కణజాలం.

ప్రశ్న 37.
నీరు, ఆహారం, వ్యర్థ పదార్థాలను నిల్వ చేసే మృదు కణజాలం?
జవాబు:
నీరు, ఆహారం, వ్యర్థ పదార్థాలను నిల్వ చేసే మృదు కణజాలం నిల్వచేసే కణజాలం.

ప్రశ్న 38.
నెహేమియా గ్రూ ప్రకారం మొక్కలోని ప్రతి భాగం కలిగి ఉండే రెండు రకాల విభాగాలు?
జవాబు:
నెహేమియా గ్రూ ప్రకారం మొక్కలోని ప్రతి భాగం కలిగి ఉండే రెండు రకాల విభాగాలు 1. దవ్వ 2. గట్టిభాగం

ప్రశ్న 39.
మొక్కలలో హరిత కణజాలం యొక్క పాత్రను ఏ విధంగా అభినందిస్తావు?
జవాబు:
హరితరేణువులను కలిగి ఉండే హరితకణజాలం ఆకులలో ఉండుట వలన మొక్కలు ఆహారపదార్థములను తయారు చేయగలుగుతున్నాయి.

ప్రశ్న 40.
మొక్కలలో ఉండే వాతయుత కణజాలము యొక్క పాత్రను ఏ విధంగా అభినందిస్తావు?
జవాబు:
మొక్కలు నీటిలో తేలియాడుటకు గాలి గదులు కలిగిన వాతయుత కణజాలం సహాయపడుతుంది.

ప్రశ్న 41.
మొక్కలలో ఆహారపదార్ధములను నిల్వయుంచుటలో పాత్ర వహించు మృదు కణజాలం?
జవాబు:
మొక్కలలో ఆహారపదార్ధములను నిల్వయుంచుటలో పాత్ర వహించు మృదు కణజాలం నిల్వచేసే కణజాలం.

ప్రశ్న 42.
రెడ్ వుడ్, యూకలిప్టస్ చెట్లలో ఎక్కువ ఎత్తు వరకు నీటిని సరఫరా చేయుటలో ఏ కణజాలం పాత్రను నీవు అభినందిస్తావు?
జవాబు:
రెడ్ వుడ్, యూకలిప్టస్ చెట్లలో ఎక్కువ ఎత్తు వరకు నీటిని సరఫరా చేయుటలో దారువు కణజాలం పాత్రను నేను అభినందిస్తాను.

ప్రశ్న 43.
ఆకులలో తయారయ్యే ఆహారపదార్థాలు మొక్కలోని ఇతర భాగాలకు రవాణా చేయుటలో ఏ కణజాలం పాత్రని నీవు అభినందిస్తావు?
జవాబు:
ఆకులలో తయారయ్యే ఆహారపదార్థాలు మొక్కలోని ఇతర భాగాలకు రవాణా చేయుటలో పోషక కణజాలము పాత్రను నేను అభినందిస్తాను.

ప్రశ్న 44.
యాంత్రికంగా కలిగే నష్టాలు, పరాన్న జీవులు, రోగ కారక జీవుల దాడి నుండి మొక్కలను రక్షించడంలో ఏ కణజాలపు పాత్రను నీవు అభినందిస్తావు?
జవాబు:
యాంత్రికంగా కలిగే నష్టాలు, పరాన్న జీవులు, రోగ కారక జీవుల దాడి నుండి మొక్కలను రక్షించడంలో త్వచ కణజాలము పాత్రను నేను అభినందిస్తాను.

ప్రశ్న 45.
మధ్యస్థ విభాజ్య కణజాలాన్ని మొక్కలో నీవు ఎక్కడ గమనిస్తావు?
జవాబు:
కాండం మీద శాఖలు ఏర్పడే చోట, ఆకులు, పుష్పవృంతం పెరిగేచోట మధ్యస్థ విభాజ్య కణజాలం ఉంటుంది.

ప్రశ్న 46.
మొక్క దేహ ఉపరితలమంతా మనకు కనబడే కణజాలం?
జవాబు:
మొక్క దేహ ఉపరితలమంతా మనకు కనబడే కణజాలం త్వచ కణజాలం.

AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం

ప్రశ్న 47.
త్వచ కణజాలం నుండి విడుదలయ్యే స్రావము ఏమిటి?
జవాబు:
త్వచ కణజాలం నుండి విడుదలయ్యే స్రావము జిగురు.

ప్రశ్న 48.
మొక్కలలో వైవిధ్యమైన కణజాలాలు ఉండడానికి కారణమేమిటి?
జవాబు:
ఒక్కొక్క రకమైన కణజాలం ఒక ప్రత్యేకమైన పనిని నిర్వహించడానికి అనువుగా నిర్మితమై ఉంటుంది.

ప్రశ్న 49.
మొక్కలలో బాష్పోత్సేకానికి ఉపయోగపడే త్వచ కణజాలపు నిర్మాణాలు ఏవి?
జవాబు:
మొక్కలలో బాష్పోత్సేకానికి ఉపయోగపడే త్వచ కణజాలపు నిర్మాణాలు పత్రరంధ్రాలు.

ప్రశ్న 50.
చెట్ల యొక్క బెరడు భాగము ఏ విధముగా ఉపయోగపడుతుంది?
జవాబు:
చెట్ల యొక్క బెరడు భాగము ఆహార పదార్థముగాను, మందుల తయారీలోను ఉపయోగపడుతుంది.

9th Class Biology 2nd Lesson వృక్ష కణజాలం 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
సరళ కణజాలంనకు మరియు సంక్లిష్ట కణజాలంనకు గల భేదములు ఏవి?
జవాబు:
1) నిర్మాణంలోనూ, విధులలోనూ ఒకే రకంగా ఉన్న కణాల సమూహమును సరళ కణజాలం అంటారు.
ఉదా : మృదు కణజాలం, స్థూలకోణ కణజాలం మరియు దృఢ కణజాలం.

2) ఒక విశిష్టమైన పనిని నిర్వహించడం కోసం భిన్న రకాలకు చెందిన కణాలు సమూహంగా ఏర్పడిన నిర్మాణాన్ని సంక్లిష్ట కణజాలం అంటారు.
ఉదా : దారువు, పోషక కణజాలం.

ప్రశ్న 2.
విభాజ్య కణజాలం నందలి కణముల లక్షణములేవి?
జవాబు:
విభాజ్య కణజాలంలోని కణాలు :

  1. కణాలు చిన్నవిగా ఉంటాయి. పలుచటి కణకవచాన్ని కలిగి ఉంటాయి.
  2. ఇవి స్పష్టమైన కేంద్రకాన్ని తగినంత జీవపదారమును కలిగి ఉండే కణజాలం.
  3. కణాల మధ్య ఖాళీ ప్రదేశాలు లేకుండా దగ్గరగా అమరి ఉంటాయి.
  4. ఎప్పుడూ విభజన చెందగలిగే శక్తి కలిగి ఉంటాయి.

ప్రశ్న 3.
కణకవచము ఆధారముగా మృదు కణజాలం, స్థూలకోణ కణజాలం మరియు దృఢ కణజాలాల మధ్య గల భేదమేది?
జవాబు:

మృదు కణజాలం స్థూలకోణ కణజాలం దృఢ కణజాలం
కణకవచములు పలుచగా ఉండి సెల్యులోజ్ తో నిర్మితమై ఉంటాయి. కణకవచముల గోడలందు పెక్టిన్ మరియు సెల్యులోజ్ లు అక్కడక్కడ అవక్షేపితం కావడం వల్ల మందంగా ఉంటాయి. కణకవచపు గోడలందు పెక్టిన్ ఉండుట వలన మందంగా ఉంటాయి.

ప్రశ్న 4.
పత్రరంధ్రము యొక్క విధులేవి?
జవాబు:

  1. వాతావరణములో వాయువుల మార్పిడికి పత్రరంధ్రములు అవసరం.
  2. బాష్పోత్సేక ప్రక్రియనందు నీరు నీటి ఆవిరి రూపంలో బయటకు పోవడానికి పత్రరంధ్రములు అవసరం.

AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం

ప్రశ్న 5.
దారువు ఎన్ని అంశముల కలయికచే ఏర్పడింది?
జవాబు:
దారువు నాలుగు అంశముల కలయికచే ఏర్పడింది. అవి :

  1. దారు కణములు
  2. దారు నాళాలు
  3. దారు మృదుకణజాలం
  4. దారు నారలు.

ప్రశ్న 6.
పోషక కణజాలం నందలి అంశములేవి?
జవాబు:
పోషక కణజాలం ఐదు రకముల అంశముల కలయికచే ఏర్పడింది. అవి చాలనీ కణములు, చాలనీ నాళములు, సహ ‘ కణములు, పోషక కణజాల నారలు మరియు పోషక కణజాల మృదు కణజాలం.

9th Class Biology 2nd Lesson వృక్ష కణజాలం 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
దారువునందలి వివిధ అంశముల పేర్లను తెలుపుము. అంశములు చేయు పనుల గురించిన సమాచారమును సేకరించుము.
జవాబు:
దారువు నందు ఉండే అంశములు :

  1. దారుకణములు, దారునాళములు, దారు మృదుకణజాలం మరియు దారునారలు.
  2. దారు కణములు, దాగునాళములు పొడవుగా ఉండే కండె లేదా స్థూపాకార కణములు. అందువలన ఇవి నీటిని పోషక పదార్థములను నిలువుగా ప్రసరణ చేయగలవు.
  3. దారు మృదు కణజాలం ఆహారమును నిల్వ చేస్తుంది మరియు పార్శ్వభాగాలకు నీటిని సరఫరా చేస్తుంది.
  4. దారునారలు, నాళికాపుంజానికి యాంత్రిక బలాన్ని ఇస్తాయి.

ప్రశ్న 2.
మొక్క కణజాలములకు సంబంధించి ప్రవాహపటము (ఫ్లోచార్టు) ను గీయుము.
జవాబు:
AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం 1

ప్రశ్న 3.
మృదు కణజాలం, స్థూలకోణ కణజాలం మరల దృఢ కణజాలం బొమ్మలను గీయుము.
జవాబు:
AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం 2 AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం 3 AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం 4

ప్రశ్న 4.
విభాజ్య కణజాలం అనగానేమి? విభాజ్య కణజాలం రకములను తెలుపుము.
జవాబు:

  1. మొక్క భాగాలన్నింటిలో పెరుగుదలను, మరమ్మతులను నిర్వహించే కణజాలమును విభాజ్య కణజాలం అంటారు.
  2. విభాజ్య కణజాలాలు మూడు రకములు. అవి :
    1) అగ్రవిభాజ్య కణజాలం,
    2) పార్శ్వ విభాజ్య కణజాలం,
    3) మధ్యస్థ విభాజ్య కణజాలం.
  3. వేరు, కాండపు కొనల వద్ద ఉండే పెరుగుదలను కలిగించే కణజాలము అగ్రవిభాజ్య కణజాలం.
  4. కాండంలో పార్శ్వపు అంచుల చుట్టూ వర్తులంగా పెరుగుదలను కలిగించే కణజాలం పార్శ్వ విభాజ్య కణజాలం.
  5. కాండం మీద శాఖలు ఏర్పడేచోట, ఆకులు, పుష్పవృంతం పెరిగే చోట ఉండే కణజాలం మధ్యస్థ విభాజ్య కణజాలం.

ప్రశ్న 5.
మొక్క కణజాలములు, జంతు కణజాలముల మధ్య గల భేదాలేవి?
జవాబు:

మొక్క కణజాలాలు జంతు కణజాలాలు
1) మొక్క కణజాలాలు ఎక్కువగా నిర్జీవమైనవి. 1) జంతు కణజాలాలు ఎక్కువగా సజీవమైనవి.
2) మొక్కల జీవక్రియ నిర్వహణకు తక్కువ శక్తి అవసరము. 2) జంతువుల జీవక్రియ నిర్వహణకు ఎక్కువశక్తి అవసరం.
3) కణజాలాల వ్యవస్థీకరణ స్థిర నివాసమునకు ఆధారాన్నిస్తుంది. 3) కణజాల వ్యవస్థీకరణ జీవి కదలడానికి సహాయపడుతుంది.

AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం

ప్రశ్న 6.
పట సహాయముతో మృదు కణజాలంను, స్థూలకోణ కణజాలంను, దృఢ కణజాలంను వివరింపుము.
జవాబు:
AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం 2
1. మృదు కణజాలం :

  1. మృదు కణజాలంలోని కణాలు మృదువుగా పలుచని గోడలు గలిగి, వదులుగా అమరి ఉంటాయి.
  2. ఇందులో మూడురకాల కణజాలాలున్నాయి. హరిత కణజాలం, వాయుగత కణజాలం, నిల్వచేసే కణజాలం, మృదు కణజాలం

AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం 3
2. స్థూలకోణ కణజాలం :

  1. స్థూలకోణ కణజాలంలోని కణాలు దళసరి గోడలను కలిగి కొంచెం పొడవైన కణాలుగా ఉంటాయి.
  2. మొక్కకు ఆధారాన్ని, యాంత్రిక బలాన్ని ఇస్తుంది.
  3. కణాల మధ్య ఖాళీ ప్రదేశాలు ఉంటాయి.

AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం 4
3. దృఢ కణజాలం :

  1. దృఢ కణజాలంలోని కణాలు దళసరి గోడలు కలిగి ఉంటాయి.
  2. కణాల మధ్య ఖాళీ లేకుండా దగ్గర దగ్గరగా అమరియుంటాయి.
  3. మొక్కకు యాంత్రికబలాన్ని ఇస్తుంది.

9th Class Biology 2nd Lesson వృక్ష కణజాలం Important Questions and Answers

ప్రశ్న 1.
దారువు, పోషకా కణజాలాల్లో వుండే వివిధ రకాల కణాల పటాలను గీయండి.
జవాబు:
AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం 6

ప్రశ్న 2.
మొక్కలలో వుండే సంధాయక కణజాలంలోని రకాలను తెలపండి.
జవాబు:
మృదుకణజాలము, స్థూలకోణ కణజాలము, ధృడకణజాలము.

ప్రశ్న 3.
క్రింది వాటికి కారణాలు రాయండి.
a) దారువు ప్రసరణ కణజాలంగా పనిచేస్తుంది
b) క్రొవ్వు కణాలు ఉష్ణనిరోధకంగా పనిచేస్తాయి
c) హృదయకండరం నిరంతరం పనిచేస్తుంది
d) బాహ్యచర్మం రక్షణనిస్తుంది
జవాబు:
a) 1) దారువు వేర్ల నుండి నీటిని పోషక పదార్ధములను మొక్క అగ్రభాగాలకు సరఫరా చేస్తుంది.
2) వేర్ల నుండి పదార్ధములను దూరభాగములకు రవాణా చేస్తుంది. 3) వేర్ల నుండి మొక్క అగ్రభాగాలకు నీటి సరఫరా ఏకమార్గములో జరుగుతుంది.

b) క్రొవ్వు మనశరీరంలో చర్మం క్రింద ఉండే ఎడిపోజ్ కణజాలంలో నిల్వ ఉంచబడుతుంది. ఈ ఎడిపోజ్ కణజాలం చర్మం క్రింద మందంగా ఉండి ఉష్ణనిరోధకంగా పనిచేస్తాయి. అందుకనే స్థూలకాయులను చలికాలంలో చలి అంతగా బాధించదు.

c) హృదయకండరం హృదయాన్ని ఆవరించి ఉండి, హృదయ సంకోచ వ్యాకోచాలను నిరంతరం జరుపుతాయి. ఈ కండరాలు అన్నీ చారలను కలిగి ఉండి శాఖలుగా ఉంటాయి. వీటి చర్యలు మన ఆధీనంలో ఉండవు. ఇది అనియంత్రిత చర్యలను చూపిస్తుంది.

d) 1) బాహ్యచర్మము నందలి కణములు సాధారణముగా ఒక పొరయందు ఉంటాయి.
2) బాహ్యచర్మము నందలి కణముల గోడలు దళసరిగా ఉంటాయి.
3) నీటి ఎద్దడి, కొమ్మలు విరగడం, చీలడం వంటి యాంత్రికంగా కలిగే నష్టాలు పరాన్న జీవులు, రోగకారక జీవులు దాడి మొదలైన వాటి నుండి మొక్కలను బాహ్యచర్మం రక్షిస్తుంది.

4. a) వృక్షకణం బొమ్మను గీచి, భాగాలను గుర్తించండి.
b) అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క విధులను తెల్పండి.
జవాబు:
a)
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 2

b) 1) కణంలో ఒక భాగం నుండి మరియొక భాగానికి పదార్థాల రవాణా,
2) జీవ రసాయనిక చర్యలకు వేదిక
3) అనేక విషపదార్థాలను నిర్వీర్యం చేస్తుంది.
4) ప్రోటీన్లు, లిపిడ్ల సంశ్లేషణకు తోడ్పడుతుంది.

9th Class Biology 2nd Lesson వృక్ష కణజాలం 1 Mark Bits Questions and Answers

లక్ష్యాత్మక నియోజనము

1. మొక్క భాగాలన్నింటిలో పెరుగుదలను, మరమ్మతులను నిర్వహించే కణజాలం
A) విభాజ్య కణజాలం
B) త్వచ కణజాలం
C) సంధాయక కణజాలం
D) ప్రసరణ కణజాలం
జవాబు:
A) విభాజ్య కణజాలం

2. మొక్క బయటి పై పొరలను ఏర్పరచే కణజాలం
A) విభాజ్య కణజాలం
B) త్వచ కణజాలం
C) సంధాయక కణజాలం
D) ప్రసరణ కణజాలం
జవాబు:
B) త్వచ కణజాలం

AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం

3. వృక్ష దేహాన్ని ఏర్పాటు చేస్తూ ఇతర కణజాలాలు సరియైన స్థితిలో ఉండేలా చేసే కణజాలం
A) విభాజ్య కణజాలం
B) త్వచ కణజాలం
C) అంతస్త్వచం
D) పైవి అన్నియు
జవాబు:
C) అంతస్త్వచం

4. పదార్థాల రవాణాకు సహాయపడే కణజాలం
A) విభాజ్య కణజాలం
B) త్వచ కణజాలం
C) సంధాయక కణజాలం
D) ప్రసరణ కణజాలం
జవాబు:
D) ప్రసరణ కణజాలం

5. పెరుగుదల చూపించు కాండం, వేరు కొనభాగాల్లో ఉండే విభాజ్య కణజాలం
A) అగ్ర విభాజ్య కణజాలం
B) పార్శ్వ విభాజ్య కణజాలం
C) మధ్యస్థ విభాజ్య కణజాలం
D) త్వచ కణజాలం
జవాబు:
A) అగ్ర విభాజ్య కణజాలం

6. త్వచ కణజాలం ఏర్పరచేది.
A) బాహ్యస్త్వచం
B) మధ్యస్త్వచం
C) సంధాయక కణజాలం
D) ప్రసరణ కణజాలం
జవాబు:
D) ప్రసరణ కణజాలం

7. పత్రరంధ్రములు ఈ పొరనందు ఉంటాయి.
A) బాహ్యస్వచం
B) మధ్యస్వచం
C) అంతస్త్వచం
D) పైవి అన్నియు
జవాబు:
A) బాహ్యస్వచం

8. పత్రరంధ్రము ఈ కణములచే ఆవరించబడి ఉంటుంది.
A) దారు కణాలు
B) సహ కణాలు
C) గ్రంథి కణాలు
D) మృదు కణాలు
జవాబు:
B) సహ కణాలు

9. జిగురును స్రవించునది
A) త్వచ కణజాలం
B) విభాజ్య కణజాలం
C) దారువు
D) పోషక కణజాలం
జవాబు:
A) త్వచ కణజాలం

10. పత్రరంధ్రాలు మరియు మూలకేశాలు దీనికి సహాయపడతాయి.
A) వాయువుల మార్పిడి
B) బాష్పోత్సేకము
C) నీరు, లవణాల సంగ్రహణ
D) పైవి అన్నియు
జవాబు:
D) పైవి అన్నియు

11. దవ్వభాగానికి మృదుకణజాలమని పేరు పెట్టినవాడు
A) బిచాట్
B) నెహేమియా గ్రూ
C) రాబర్ట్ బ్రౌన్
D) అరిస్టాటిల్
జవాబు:
B) నెహేమియా గ్రూ

AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం

12. ప్రసరణ కణజాలంను గుర్తించండి.
A) దారువు
B) పోషక కణజాలం
C) దారువు మరియు పోషక కణజాలం
D) దృఢ కణజాలం
జవాబు:
C) దారువు మరియు పోషక కణజాలం

13. దారువు కలిగియుండు అంశములు
A) దారుకణాలు, దారు నాళాలు
B) దారునాళాలు
C) దారు మృదుకణజాలం
D) పైవి అన్నియు
జవాబు:
D) పైవి అన్నియు

14. పోషక కణజాలము నందు ఉండు అంశములు
A) చాలనీ కణాలు, చాలనీ నాళాలు
B) పోషక మృదుకణజాలం
C) సహ కణాలు, పోషక కణజాలం, మృదుకణజాలం
D) పైవి అన్నియు
జవాబు:
D) పైవి అన్నియు

15. రోజ్ వుడ్ వృక్షమునందు దారువు ఎన్ని అడుగుల ఎత్తు వరకు నీటిని మోస్తుంది?
A) 220 అడుగులు
B) 230 అడుగులు
C) 330 అడుగులు
D) 430 అడుగులు
జవాబు:
C) 330 అడుగులు

16. హరితరేణువులు కలిగిన మృదు కణజాలం పేరు
A) హరిత కణజాలం
B) వాయుగత కణజాలం
C) నిల్వచేసే కణజాలం
D) దృఢ కణజాలం
జవాబు:
A) హరిత కణజాలం

17. వీటి పెరుగుదల కొనభాగాలలో విభాజ్య కణజాలం ఉంటుంది.
A) వేరు
B) కాండం
C) వేరు మరియు కాండం
D) పార్శ్వ విభాజ్య కణజాలం
జవాబు:
C) వేరు మరియు కాండం

18. దారువు నందలి అంశములను గుర్తించుము.
A)దారు కణాలు
B) చాలనీ కణాలు
C) చాలనీ నాళాలు
D) సహ కణాలు
జవాబు:
A)దారు కణాలు

19. పోషక కణజాలంనందలి అంశములను గుర్తించుము.
A) స్రావ కణాలు
B) రక్షణ కణాలు
C) చాలనీ కణాలు
D) సహ కణాలు, చాలనీ కణాలు
జవాబు:
D) సహ కణాలు, చాలనీ కణాలు

AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం

20. కణజాలం అనగా ఈ కణాల సమూహం.
A) ఒకే నిర్మాణం కలిగి ఒకే విధమైన విధుల్ని నిర్వర్తిస్తాయి.
B) ఒకే నిర్మాణం కలిగి వేరు వేరు విధుల్ని నిర్వర్తిస్తాయి.
C) వేరు వేరు నిర్మాణం కలిగి ఒకే విధులను నిర్వర్తిస్తాయి.
D) వేరు వేరు నిర్మాణం కలిగి వేరు వేరు విధులను నిర్వర్తిస్తాయి.
జవాబు:
A) ఒకే నిర్మాణం కలిగి ఒకే విధమైన విధుల్ని నిర్వర్తిస్తాయి.

21. కాండం కొన భాగంలో ఉండి పెరుగుదలకు కారణమయ్యేది
A) త్వచ కణజాలం
B) విభాజ్య కణజాలం
C) సంధాయక కణజాలం
D) ప్రసరణ కణజాలం
జవాబు:
B) విభాజ్య కణజాలం

22. కాండం లావుగా పెరగటానికి కారణం
A) అగ్ర విభాజ్య కణజాలం
B) పార్శ్వ విభాజ్య కణజాలం
C) మధ్యస్థ విభాజ్య కణజాలం
D) సంధాయక కణజాలం
జవాబు:
B) పార్శ్వ విభాజ్య కణజాలం

23. పత్ర రంధ్రాన్ని ఆవరించి ఉండే రక్షక కణాల సంఖ్య
A) 1
B) 2
C) 3
D) 5
జవాబు:
B) 2

24. ఈ క్రింది వానిలో త్వచ కణజాలానికి సంబంధించినది
A) జిగురు
B) బెరడు
C) మూలకేశాలు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

25. మొక్క దేహంలో ఎక్కువ భాగం దీనితో నిర్మించబడి ఉంటుంది.
A) త్వచ కణజాలం
B) సంధాయక కణజాలం
C) ప్రసరణ కణజాలం
D) విభాజ్య కణజాలం
జవాబు:
B) సంధాయక కణజాలం

26. నిల్వచేసే కణజాలం దీనిని నిల్వ చేయదు.
A) నీరు
B) గాలి
C) ఆహారం
D) వ్యర్థ పదార్థాలు
జవాబు:
B) గాలి

27. గాలి నిల్వ ఉండే కణజాలం
A) హరిత మృదు కణజాలం
B) నిల్వచేసే కణజాలం
C) వాతయుత కణజాలం
D) దృఢ కణజాలం
జవాబు:
C) వాతయుత కణజాలం

28. నీటి మొక్కలు కలి ఉండే కణజాలం
A) స్థూలకోణ కణజాలం
B) హరిత కణజాలం
C) వాతయుత కణజాలం
D) నిల్వచేసే కణజాలం
జవాబు:
C) వాతయుత కణజాలం

29. “అనాటమీ ఆఫ్ ప్లాంట్స్” అనే గ్రంథాన్ని రచించిన శాస్త్రవేత్త
A) రాబర్ట్ హుక్
B) మార్సెల్లో మాల్ఫీజి
C) నెహేమియా గ్రూ
D) రుడాల్ఫ్ విర్కోవ్
జవాబు:
C) నెహేమియా గ్రూ

AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం

30. నెహేమియా గ్రూ మొక్కలోని ఏ భాగానికి మృదు కణజాలం అని పేరు పెట్టారు?
A) దారువు
B) దవ్వ
C) పోషక కణజాలం
D) నాళికాపుంజం
జవాబు:
B) దవ్వ

31. నీరు, పోషక పదార్థాలు దీని ద్వారా సరఫరా అవుతాయి.
A) దారువు
B) పోషక కణజాలం
C) పై రెండూ
D) స్థూలకోణ కణజాలం
జవాబు:
A) దారువు

32. పోషక కణజాలం ద్వారా సరఫరా అయ్యేది
A) నీరు
B) పోషక పదార్థాలు
C) ఆహార పదార్థాలు
D) గాలి
జవాబు:
C) ఆహార పదార్థాలు

33. దారువులోను, పోషక కణజాలంలోను రెండింటిలో ఉండే కణాలు
A) తంతువులు
B) మృదు కణజాలం
C) పై రెండూ
D) సహకణాలు
జవాబు:
C) పై రెండూ

34. రెడ్ ఉడ్ చెట్లలో ప్రసరణ కణజాలం ఎంత ఎత్తుకు పోషకాలను సరఫరా చేస్తాయి?
A) 220 అడుగులు
B) 330 అడుగులు
C) 250 అడుగులు
D) 350 అడుగులు
జవాబు:
B) 330 అడుగులు

35. మొక్క దేహానికి రక్షణనిచ్చే కణజాలం
A) త్వచ కణజాలం
B) సంధాయక కణజాలం
C) దృఢ కణజాలం
D) మృదు కణజాలం
జవాబు:
A) త్వచ కణజాలం

36. మొక్క భాగాలన్నింటిలో పెరుగుదలను, మరమ్మతులను నిర్వహించే కణజాలం
A) విభాజ్య కణజాలం
B) త్వచ కణజాలం
C) సంధాయక కణజాలం
D) ప్రసరణ కణజాలం
జవాబు:
A) విభాజ్య కణజాలం

37. ఈ క్రింది వానిలో సంక్లిష్ట కణజాలం
A) మృదు కణజాలం
B) స్థూలకోణ కణజాలం
C) దృఢ కణజాలం
D) దారువు
జవాబు:
D) దారువు

38. ఈ క్రిందివానిలో నిర్జీవ కణజాలం
A) మృదు కణజాలం
B) స్థూలకోణ కణజాలం
C) దృఢ కణజాలం
D) పోషక కణజాలం
జవాబు:
C) దృఢ కణజాలం

39. మొక్కల యొక్క వంగగలిగే భాగాలలో ఉండే కణజాలం
A) మృదు కణజాలం
B) స్తూలకోణ కణజాలం
C) దృఢ కణజాలం
D) పోషక కణజాలం
జవాబు:
B) స్తూలకోణ కణజాలం

AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం

40. సజీవ, నిర్జీవ రెండు రకాల కణాలను కలిగి ఉండేది
A) దారువు
B) పోషక కణజాలం
C) మృదు కణజాలం
D) స్థూలకోణ కణజాలం
జవాబు:
A) దారువు

41. క్రింది వాక్యాలను చదవండి.
a) వేరుకొన అగ్రభాగంలో విభాజ్య కణజాలం ఉంటుంది.
b) కొబ్బరి టెంకలలో దృఢ కణజాలం ఉంటుంది.
A) a మరియు b లు రెండూ సరైనవి కావు
B) a సరైనది, b సరైనది కాదు
C) b సరైనది, a సరైనది కాదు
D) a మరియు b లు రెండూ సరైనవి
జవాబు:
D) a మరియు b లు రెండూ సరైనవి

42. ఒక మొక్క కొమ్మలు విరగడం, చీలడం వంటి యాంత్రికంగా కలిగే నష్టాల నుండి రక్షించు కోలేకపోతుంది. ఇందుకు కారణాలు ఏమై ఉండవచ్చు?
i) మొక్కలో విభాజ్య కణజాలం నశించి ఉండవచ్చు
ii) మొక్కలో త్వచ కణజాలం నశించి ఉండవచ్చు
iii) మొక్కలో సంధాయక కణజాలం నశించి ఉండవచ్చు
iv)మొక్కలో బహిస్త్వచం ఏర్పడకపోయి ఉండవచ్చు
పై వాటిలో సరైన కారణాలు
A) i, iv
B) i, iii, iv
C) i, ii
D) పైవన్నియూ
జవాబు:
A) i, iv

43. ఉల్లిపొర కణాలను మైక్రోస్కోపు క్రింద పరీక్షించునపుడు ఈ క్రింది వానిలో అసత్యమైనది
A) అన్ని కణాలు ఒకే ఆకారంలో ఉన్నాయి.
B) కణాలు వృత్తాకారంగా అమరి ఉన్నాయి.
C) కణాంతర్గత ఖాళీలు ఉన్నాయి.
D) ప్రతి కణము కణకవచాన్ని కలిగి ఉంది.
జవాబు:
B) కణాలు వృత్తాకారంగా అమరి ఉన్నాయి.

44. ఉల్లిపొర కణాలను, బుగ్గ కణాలను మైక్రోస్కోపు క్రింద పరీక్షించునపుడు ఈ క్రింది వానిలో సత్యమైన ప్రవచనం ఏది?
A) ఉల్లి కణాలు కణకవచాన్ని, కణత్వచాన్ని కలిగి ఉన్నాయి.
B) బుగ్గ కణాలు కణకవచాన్ని, కణత్వచాన్ని కలిగి ఉన్నాయి.
C) ఉల్లి కణాలు కణత్వచాన్ని మాత్రమే కలిగి ఉన్నాయి.
D) బుగ్గ కణాలు కణత్వచాన్ని మాత్రమే కలిగి ఉన్నాయి.
జవాబు:
A) ఉల్లి కణాలు కణకవచాన్ని, కణత్వచాన్ని కలిగి ఉన్నాయి.

→ క్రింది పేరాను చదివి ఇవ్వబడిన ప్రశ్నలకు సరియైన సమాధానాన్ని గుర్తించండి.

సాధారణంగా త్వచ కణజాలం ఒక వరుస కణాలను కలిగి ఉండి, కణాల విభిన్నత చూపిస్తుంది. వాటి విధుల్ని బట్టి స్థానాన్ని బట్టి ఈ కణజాలం మూడు రకాలుగా విభజించబడింది. అవి – బాహ్యచర్మం లేక బహిత్వచం (వెలుపలి పొర) (Epidermis), మధ్యత్వచం (మధ్యపొర) (Mesodermis), అంతఃత్వచం (లోపలి పొర) (Endodermis).

ఆకు బాహ్యచర్మంలో చిన్న రంధ్రాలు కన్పిస్తాయి. వాటిని పత్రరంధ్రాలు (Stomata) అంటారు. వేరులో అయితే బాహ్యచర్మం కణాలు పొడవైన వెంట్రుకల వంటి మూలకేశాలను కలిగి ఉంటాయి.

45. పత్రరంధ్రాలు మనకు ఎక్కడ కనపడతాయి?
A) వృక్షాల త్వచ కణజాలాలలో
B) జిగురునిచ్చే చెట్ల బాహ్యచర్మం లేక బాహ్యత్వచంలో
C) ఆకు యొక్క బాహ్యచర్మం లేక బాహ్యత్వచంలో
D) కాండ కణాల బాహ్యచర్మం లేదా బాహ్యత్వచంలో
జవాబు:
C) ఆకు యొక్క బాహ్యచర్మం లేక బాహ్యత్వచంలో

46. ఈ క్రింది వానిలో సరిగా జతపరచబడని జత ఏది?
a) మధ్యత్వచం – వెలుపలి పొర
b) బాహ్యత్వచం – మధ్య పొర
c) అంతఃత్వచం – లోపలి పొర
A) a, b, c
B) a, b
C) a, c
D) b, c
జవాబు:
B) a, b

AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం

47. ప్రసరణ కణజాలంలో ఈ భాగాన్ని గుర్తించండి.
AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం 7
A) తంతువు
B) దారుకణం
C) దారునాళం
D) చాలనీ కణాలు
జవాబు:
B) దారుకణం

48. ప్రసరణ కణజాలంలో ఈ భాగాన్ని గుర్తించండి.
AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం 8
A) చాలనీ నాళాలు
B) దారుకణం
C) దారునాళం
D) ఏదీకాదు
జవాబు:
C) దారునాళం

49. ప్రసరణ కణజాలంలో ఈ భాగాన్ని గుర్తించండి.
AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం 9
A) సహకణాలు
B) దారునాళాలు
C) దారుకణాలు
D) చాలనీ కణాలు
జవాబు:
D) చాలనీ కణాలు

50. ఈ క్రింది స్లో చార్టును సరియైన క్రమంలో అమర్చండి.
AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం 10
A) 3, 4, 2, 1, 5
B) 1, 2, 3, 4, 5
C) 3, 4, 5, 2, 1
D) 3, 4, 1, 2, 5
జవాబు:
D) 3, 4, 1, 2, 5

51. పత్ర రంధ్రాలను కలిగి వుండునది
A) ప్రసరణ కణజాలం
B) విభాజ్య కణజాలం
C) సంధాయక కణజాలం
D) త్వచకణజాలం
జవాబు:
D) త్వచకణజాలం

52. మొక్క భాగాలన్నింటిలో పెరుగుదలను, మరమ్మత్తులను నిర్వహించే కణజాలం
A) విభాజ్య కణజాలం
B) త్వచ కణజాలం
C) సంధాయక కణజాలం
D) ప్రసరణ కణజాలం
జవాబు:
A) విభాజ్య కణజాలం

53. నీటి మొక్కలు తేలుటకు కారణమైనది.
A) మృధుకణజాలం
B) వాయుగత కణజాలం
C) స్థూలకోణ కణజాలం
D) దృఢ కణజాలం
జవాబు:
B) వాయుగత కణజాలం

54. కింది i, ii వాక్యాలను చూడండి.
i) ప్రసరణ కణజాలం కేవలం దారువుతో ఏర్పడుతుంది.
ii) నాళికాపుంజం, దారువు ప్రసరణ కణజాలంను ఏర్పరుస్తాయి.
A) i, ii సత్యాలు
B) i సత్యం, ii అసత్యం
C) i అసత్యం, ii సత్యం
D) i, ii అసత్యాలు
జవాబు:
C) i అసత్యం, ii సత్యం

మీకు తెలుసా?

విసర్జక పదార్థాలు, అధికంగా ఉన్న ఆహారపదార్థాలు, స్రావక పదార్థాలు వంటి కొన్ని రకాల పదార్థాలను విభిన్న రూపాలలో నిల్వచేసుకోగలిగే సామర్థ్యం మొక్కలకు ఉంది. జిగురునిచ్చే చెట్ల యొక్క త్వచకణజాలం నుండి జిగురు స్రవించబడుతుంది.

AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం 11
నెహేమియా గ్రూ (Nehemiah Grew) (1641-1712) ఒక వైద్యుడు. లండన్లోని రాయల్ సొసైటీకి కార్యదర్శిగా పనిచేశాడు. 1664వ సంవత్సరంలో మొక్కల అంతర్నిర్మాణం మీద అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు.

మొక్కలోని ప్రతి భాగం రెండు రకాల విభాగాలను కలిగి ఉంటుంది. అవి ఒకటి దవ్వ (Pith) మరొకటి గట్టి భాగం (Ligneous part) అని అతడు భావించాడు. ఇది అతని ప్రాథమిక భావన.
దవ్వ భాగానికి ‘గ్రూ’ మృదుకణజాలం అని పేరుపెట్టాడు. ‘గ్రూ’ మొక్కల దేహాల్లోని కణజాలాలపై అధ్యయనం చేసి, 1682వ సంవత్సరంలో “అనాటమీ ఆఫ్ ప్లాంట్స్” అనే గ్రంథాన్ని ప్రచురించాడు.

పునరాలోచన

AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం 5

అనుబంధం

మీరు ప్రయోగశాలలో వివిధ వృక్ష కణజాలాలు పరిశీలించాలంటే వాటి స్లెడులను తయారుచేయడం నిపుణత సాధించడం అవసరం.

  • పరిచ్ఛేదాలను (సెక్షన్స్) పొందడానికి బెండును ఆధారంగా తీసుకోవాలి. బెండులో నిలువుగా ఒక చీలికను చేయాలి. పరిచ్ఛేదం తీయవలసిన పదార్థాన్ని (వేరు లేక కాండం లేక ఆకు లేక మొగ్గ) ఆ చీలికలోకి చొప్పించాలి.
  • నిలువుకోత కావాలంటే పదార్థాన్ని బెండులో అడ్డంగా చొప్పించాలి.
  • అడుకోత కావాలంటే పదార్థాన్ని బెండులో నిలువుగా చొప్పించాలి.
  • బ్లేడును ఉపయోగించి పలుచని పరిచ్ఛేదాలను ఉంచాలి.
  • వాచ్ గ్లాస్ లో ఉన్న నీటిలో పరిచ్ఛేదాలను ఉంచాలి.
  • ఒక పలుచటి పరిచ్చేదాన్ని ఎంపికచేసుకొని, చిన్న బ్రష్ సహాయంతో గాజు పలక పైన ఉంచాలి.
  • దానిపై ఒక చుక్క గ్లిజరిన్ వేయాలి.
  • ఒకచుక్క శాస్రనితో దానిని రంజనం చేయాలి.
  • నీడిల్ ను ఉపయోగించి, కవర్ స్లిప్ తో జాగ్రత్తగా మూయాలి.
  • అధికంగా ఉన్న నీటిని లేక గ్లిజరినను లేక వర్ణద్రవ్యాన్ని అద్దుడు కాగితంతో తొలగించాలి.
  • అప్పుడు సూక్ష్మదర్శినితో పరిశీలించాలి.

AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు

These AP 9th Biology Important Questions and Answers 1st Lesson కణ నిర్మాణం – విధులు will help students prepare well for the exams.

AP Board 9th Class Biology 1st Lesson Important Questions and Answers కణ నిర్మాణం – విధులు

9th Class Biology 1st Lesson కణ నిర్మాణం – విధులు 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
ఉల్లిపొరలో కణాల ఆకారం?
జవాబు:
ఉల్లిపొరలో కణాల ఆకారం దీర్ఘచతురస్రాకారం.

ప్రశ్న 2.
మానవుల బుగ్గనందలి కణముల ఆకారం?
జవాబు:
మానవుల బుగ్గనందలి కణముల ఆకారం గుండ్రం.

ప్రశ్న 3.
శాస్త్ర పరిశోధన తొలినాళ్ళలో కణాన్ని అధ్యయనం చేయడానికి ఉపయోగించిన సూక్ష్మదర్శిని?
జవాబు:
శాస్త్ర పరిశోధన తొలినాళ్ళలో కణాన్ని అధ్యయనం చేయడానికి ఉపయోగించిన సూక్ష్మదర్శిని సరళ సూక్ష్మదర్శిని.

ప్రశ్న 4.
వృక్ష నమూనా కణంలో తప్పనిసరిగా చూపించవలసిన కణాంగం?
జవాబు:
వృక్ష నమూనా కణంలో తప్పనిసరిగా చూపించవలసిన కణాంగం హరితరేణువు.

ప్రశ్న 5.
వృక్ష కణంలో కణత్వచమునకు బయట ఉండే పొర?
జవాబు:
వృక్ష కణంలో కణత్వచమునకు బయట ఉండే పొర కణకవచము.

AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు

ప్రశ్న 6.
హరిత రేణువులు ఉండే మొక్క భాగాలు?
జవాబు:
హరిత రేణువులు ఉండే మొక్క భాగాలు పత్రాలు, లేత కాండాలు.

ప్రశ్న 7.
ప్లాస్మాపొర దేనితో నిర్మితమయినది?
జవాబు:
ప్లాస్మాపొర ప్రొటీన్లు, లిపిడ్లతో నిర్మితమయినది.

ప్రశ్న 8.
కణంలోని కణద్రవ్యాన్ని బాహ్య పరిసరాలతో వేరు చేసేది?
జవాబు:
కణంలోని కణద్రవ్యాన్ని బాహ్య పరిసరాలతో వేరు చేసేది ప్లాస్మాపొర.

ప్రశ్న 9.
కణం లోపల సమతాస్థితి నిర్వహణలో ప్రధాన పాత్ర వహించేది?
జవాబు:
కణం లోపల సమతాస్థితి నిర్వహణలో ప్రధాన పాత్ర వహించేది ప్లాస్నాపొర లేదా కణత్వచం.

ప్రశ్న 10.
ప్లాస్మాపొర యొక్క ప్రత్యేక లక్షణం?
జవాబు:
అన్ని పదార్థాలను తన గుండా ప్రసరింపనీయకపోవడం.

ప్రశ్న 11.
ప్లాస్మాపొరని విచక్షణ త్వచం అని ఎందుకు అంటారు?
జవాబు:
కొన్ని ప్రత్యేకమైన పదార్థాల వినిమయం మాత్రమే ప్లాస్మాపొర ద్వారా జరుగుతుంది. కాబట్టి ప్లాస్మా పొరను విచక్షణ త్వచం అంటారు.

ప్రశ్న 12.
వృక్ష కణాలలో మాత్రమే కనబడే ప్రత్యేకమైన భాగం?
జవాబు:
వృక్ష కణాలలో మాత్రమే కనబడే ప్రత్యేకమైన భాగం కణకవచం.

ప్రశ్న 13.
కణకవచం ఏ పదార్థంతో తయారవుతుంది?
జవాబు:
కణకవచం సెల్యులోజ్ అనే పదార్థంతో తయారవుతుంది.

ప్రశ్న 14.
కణంలో పెరుగుదల మరియు అభివృద్ధి జరిగేటప్పుడు ఇతర కణాలకు నిరంతరంగా సమాచార మార్పిడి చేసేది?
జవాబు:
కణంలో పెరుగుదల మరియు అభివృద్ధి జరిగేటప్పుడు ఇతర కణాలకు నిరంతరంగా సమాచార మార్పిడి చేసేది కణకవచం.

ప్రశ్న 15.
వృక్ష కణాలలో కణకవచం యొక్క ఆవశ్యకత ఏమిటి?
జవాబు:
కణరసం ద్వారా ఏర్పడే బాహ్యపీడనాన్ని నిరోధించడానికి కణకవచం అంతర పీడనాన్ని కలుగచేస్తుంది.

ప్రశ్న 16.
కేంద్రకాన్ని ఎవరు, ఎప్పుడు కనుగొన్నారు?
జవాబు:
కేంద్రకాన్ని 1831లో రాబర్ట్ బ్రౌన్ కనుగొన్నారు.

ప్రశ్న 17.
కేంద్రకమునకు గల మరియొక పేరు?
జవాబు:
కేంద్రకమునకు గల మరియొక పేరు కణనియంత్రణ గది.

AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు

ప్రశ్న 18.
కణాంగాలలో అన్నింటికంటే పెద్ద కణాంగం?
జవాబు:
కణాంగాలలో అన్నింటికంటే పెద్ద కణాంగం కేంద్రకం.

ప్రశ్న 19.
కొత్త కణాలు కేంద్రకం నుండి ఉద్భవిస్తాయని భావించి ఫ్రీడన్ కేంద్రకమును ఏమని పిలిచాడు?
జవాబు:
కొత్త కణాలు కేంద్రకం నుండి ఉద్భవిస్తాయని భావించి ప్లీడన్ కేంద్రకమును సైటోబ్లాస్ట్ అని పిలిచాడు.

ప్రశ్న 20.
కణంలో కేంద్రకం ఉందని జీవులు?
జవాబు:
కణంలో కేంద్రకం ఉండని జీవులు క్షీరదాల ఎర్రరక్త కణాలు మరియు పోషక కణజాలంలోని చాలనీ నాళాలు.

ప్రశ్న 21.
కేంద్రకం నిర్వహించు విధులు?
జవాబు:
కణ విధులన్నింటిని నియంత్రించడం, జన్యు సమాచారం కలిగి, జీవుల లక్షణాలను నిర్ధారించడం, కణవిభజనలో కూడా కేంద్రకం ప్రధాన పాత్ర వహిస్తుంది.

ప్రశ్న 22.
కేంద్రకమును ఆవరించి యుండే పొర పేరు?
జవాబు:
కేంద్రకమును ఆవరించి యుండే పొర పేరు కేంద్రక త్వచం.

ప్రశ్న 23.
కేంద్రక త్వచం ఆధారంగా కణములు ఎన్ని రకాలు? అవి ఏవి?
జవాబు:
కేంద్రక త్వచం ఆధారంగా కణాలు రెండు రకాలు. అవి – కేంద్రకపూర్వకణం మరియు నిజకేంద్రక కణం.

ప్రశ్న 24.
కేంద్రక పూర్వకణాలు అనగానేమి?
జవాబు:
కేంద్రక త్వచం లేని కణాలను కేంద్రక పూర్వకణాలు అంటారు.
ఉదా : బాక్టీరియా, సయానోబాక్టీరియా

ప్రశ్న 25.
కణద్రవ్యము అనగానేమి?
జవాబు:
కణద్రవ్యము అనగా ప్లాస్మా పొరచే ఆవరించియున్న జిగురు పదార్థము.

ప్రశ్న 26.
కేంద్రకంలోని పదార్ధమును ఏమంటారు?
జవాబు:
కేంద్రకంలోని పదార్ధమును కేంద్రక రసం లేదా కేంద్రక ద్రవ్యం అంటారు.

ప్రశ్న 27.
కణంలోని ముఖ్యమైన కణాంగాలేవి?
జవాబు:
కణంలోని ముఖ్యమైన కణాంగాలు :
అంతర్జీవ ద్రవ్యజాలం, గాల్టి సంక్లిష్టాలు, లైసోజోములు, మైటోకాండ్రియా, ప్లాస్టిడ్లు మరియు రిక్తికలు కణంలోని ముఖ్య కణాంగాలు.

ప్రశ్న 28.
అంతర్జీవ ద్రవ్యజాలము ఉపయోగమేమి?
జవాబు:
అంతర్జీవ ద్రవ్యజాలము ద్వారా కణంలో ఒక భాగం నుండి మరియొక భాగానికి ప్రోటీన్లు మరియు కొన్ని పదార్థాల రవాణా జరుగుతుంది మరియు కణంలో జరిగే కొన్ని జీవరసాయన చర్యలకు వేదికగా పనిచేస్తుంది.

ప్రశ్న 29.
అంతర్జీవ ద్రవ్యజాలం ఉపరితలంపై రేణువుల వంటి నిర్మాణాలను ఏమంటారు?
జవాబు:
అంతర్జీవ ద్రవ్యజాలం ఉపరితలంపై రేణువుల వంటి నిర్మాణాలను రైబోజోములు అంటారు.

ప్రశ్న 30.
గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము అనగానేమి?
జవాబు:
రైబోజోములు కలిగిన అంతర్జీవ ద్రవ్యజాలంను గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అంటారు.

ప్రశ్న 31.
నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము అనగానేమి?
జవాబు:
రైబోజోములు లేని అంతర్జీవ ద్రవ్యజాలం నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము.

ప్రశ్న 32.
గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం ఉపయోగం?
జవాబు:
గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం ప్రోటీన్లను సంశ్లేషణ చేస్తుంది.

ప్రశ్న 38.
నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము ఉపయోగం?
జవాబు:
నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము లిపిడ్ల సంశ్లేషణ చేస్తుంది.

ప్రశ్న 34.
సకశేరుక కాలేయ కణాలలోని నునుపుతల అంతర్జీవ ద్రవ్యజాలం విధి?
జవాబు:
అనేక విష పదార్థాలు, మత్తు పదార్థాలను నిర్వీర్యం చేస్తుంది.

AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు

ప్రశ్న 35.
1898 వ సంవత్సరంలో కణము నందు గాల్టి సంక్లిష్టాన్ని పరిశీలించినవాడు?
జవాబు:
1898 వ సంవత్సరంలో కణము నందు గాలి సంక్లిష్టాన్ని పరిశీలించినవాడు కామిల్లో గాల్లి.

ప్రశ్న 36.
గాల్జిసంక్లిష్టం విధి ఏమిటి?
జవాబు:
గాల్జి సంక్లిష్టాలు వివిధ రకాల పదార్థాలను కణంలోని ఇతర భాగాలకు రవాణా చేసే ముందు తమలో నిల్వ చేసుకొని కొంత మార్పు చెందిస్తాయి.

ప్రశ్న 37.
గాల్జి సంక్లిష్టాలు ఎక్కువ సంఖ్యలో ఉండే కణాలు?
జవాబు:
గాల్జి సంక్లిష్టాలు ఎక్కువ సంఖ్యలో ఉండే కణాలు ఎంజైమ్ లేదా హార్మోన్లను స్రవించే కణాలు.

ప్రశ్న 38.
లైసోజోమ్ లను స్వయం విచ్ఛిత్తి సంచులు అని ఎందుకు అంటారు?
జవాబు:
వినాశనం కావలసిన పదార్థాలు లైసోజోమ్స్ కు రవాణా చేయబడతాయి. లైసోజోమ్స్ పగిలి అందులోని ఎంజైమ్స్ విడుదలై వాటిని నాశనం చేస్తాయి. అందువలన లైసోజోమ్ లను స్వయం విచ్చిత్తి సంచులు అంటారు.

ప్రశ్న 39.
జానస్ గ్రీన్-బి ద్రావణంతో రంజనం చేసినపుదు కనబడే కణాంగం?
జవాబు:
జానస్ గ్రీన్-బి ద్రావణంతో రంజనం చేసినపుడు కనబడే కణాంగం మైటోకాండ్రియా.

ప్రశ్న 40.
మైటోకాండ్రియా పొడవు, వ్యాసం ఎంత ఉంటాయి?
జవాబు:
మైటోకాండ్రియా పొడవు 2-8 మైక్రాన్లు మరియు 0.5 మైక్రాన్ల వ్యాసం కలిగి ఉంటాయి.

ప్రశ్న 41.
కేంద్రకం కంటే 150 రెట్లు చిన్నదైన కణాంగం?
జవాబు:
కేంద్రకం కంటే 150 రెట్లు చిన్నదైన కణాంగం మైటోకాండ్రియా.

ప్రశ్న 42.
ప్రతి కణంలో ఉండే మైటోకాండ్రియాల సంఖ్య?
జవాబు:
ప్రతి కణంలో 100-150 మైటోకాండ్రియాలు ఉంటాయి.

ప్రశ్న 43.
క్రిస్టే అనగానేమి?
జవాబు:
మైటోకాండ్రియా అంతరత్వచం లోపలికి చొచ్చుకొని ముడతలు పడిన నిర్మాణాలను ఏర్పరుస్తుంది. ఈ నిర్మాణాలను క్రిస్టే అంటారు.

ప్రశ్న 44.
మైటోకాండ్రియా క్రిస్టే మధ్య గల ఖాళీ ప్రదేశాన్ని ఏమంటారు?
జవాబు:
మైటోకాండ్రియా క్రిస్టే మధ్య గల ఖాళీ ప్రదేశాన్ని మాత్రిక అంటారు.

ప్రశ్న 45.
మైటోకాండ్రియాలను కణ శక్త్యాగారాలు అని ఎందుకు అంటారు?
జవాబు:
కణానికి కావల్సిన శక్తిని ఉత్పత్తి చేసే కణ శ్వాసక్రియ మైటోకాండ్రియాలో జరుగుతుంది. కాబట్టి మైటోకాండ్రియాలను ‘కణ శక్త్యాగారాలు’ అంటారు.

ప్రశ్న 46.
హరితరేణువులు ఆకుపచ్చగా ఎందుకు ఉంటాయి?
జవాబు:
పత్రహరితం ఉండుట వలన హరితరేణువులు ఆకుపచ్చగా ఉంటాయి.

ప్రశ్న 47.
ప్లాస్టిడ్లు ఎన్ని రకాలు? అవి ఏవి?
జవాబు:
ప్లాస్టిడ్లు రెండు రకాలు. అవి : 1. క్రోమోప్లాన్లు మరియు 2. ల్యూకోప్లాస్టు

ప్రశ్న 48.
మొక్కలలో హరితరేణువుల వ్యాసం ఎంత?
జవాబు:
మొక్కలలో హరితరేణువుల వ్యాసం 4-10 మైక్రాన్లు.

ప్రశ్న 49.
క్లోరోప్లాస్ట్ ముఖ్యమైన విధి ఏది?
జవాబు:
కిరణజన్య సంయోగక్రియలో సూర్యకాంతిలోని సౌరశక్తిని గ్రహించి రసాయనిక శక్తిగా క్లోరోప్లాస్ట్ మార్చుతుంది.

ప్రశ్న 50.
కిరణజన్య సంయోగక్రియలో పాల్గొనే కణాలలో క్లోరోప్లాన్ల సంఖ్య?
జవాబు:
కిరణజన్య సంయోగక్రియలో పాల్గొనే కణాలలో క్లోరోప్లాస్ట సంఖ్య 50-200.

ప్రశ్న 51.
కణసిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు?
జవాబు:
కణసిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు మాధియస్ జాకబ్ ప్లీడన్ మరియు థియోడర్ ష్వాన్.

ప్రశ్న 52.
కణాలు విభజన చెంది కొత్త కణాలు ఏర్పడతాయని 1855వ సంవత్సరంలో వివరించినవాడు?
జవాబు:
కణాలు విభజన చెంది కొత్త కణాలు ఏర్పడతాయని 1855వ సంవత్సరంలో వివరించినవాడు రోడాల్ఫ్ విర్కో

ప్రశ్న 53.
ఆధునీకరించిన కణసిద్ధాంతంలోని అంశాలు?
జవాబు:
ఆధునీకరించిన కణసిద్ధాంతంలోని అంశాలు :
1. జీవరాసులన్నీ కణాలు, వాటి ఉత్పన్నాలతో నిర్మించబడి ఉంటాయి.
2. కణాలన్నీ ముందుతరం కణాల నుండి ఏర్పడతాయి.

ప్రశ్న 54.
కణవ్యవస్థీకరణను ఎలా అభినందిస్తావు?
జవాబు:
జీవులలో కణము చక్కగా వ్యవస్థీకృతమైనది. కణము కణజాలముగాను, కణజాలములు అవయవముగాను, అవయవములు కలిసి అవయవ వ్యవస్థలుగాను, అవయవ వ్యవస్థలు జీవిగాను రూపొందినాయి.

ప్రశ్న 55.
భౌతిక మరియు రసాయనిక చర్యల వలన కణ వ్యవస్థీకరణం నాశనమైతే ఏమి జరుగుతుంది?
జవాబు:
భౌతిక మరియు రసాయనిక చర్యల వలన కణ వ్యవస్థ నాశనమైతే జీవక్రియల నిర్వహణ అనగా శ్వాసక్రియ, పోషణ, విసర్జన మొదలగు క్రియల నిర్వహణకు కణ సామర్థ్యము సక్రమముగా ఉండదు.

ప్రశ్న 56.
అతి సూక్ష్మకణం విధిని అతి పెద్దగా ఉండే జీవిలో ఏ విధంగా అభినందిస్తావు?
జవాబు:
జీవి యొక్క జీవక్రియలు ఆ జీవిలోని కణములు నిర్వహించే విధుల మీద ఆధారపడి ఉంటాయి. కనుక అతిపెద్ద జీవి సక్రమముగా విధులను నిర్వహించుటకు కారణము ఆ జీవిలోని అతిచిన్న కణములు సక్రమముగా విధులు నిర్వహించడమే.

ప్రశ్న 57.
మొక్క కణము నందు ఉండే హరితరేణువు యొక్క పాత్రను ఏ విధంగా అభినందిస్తావు?
జవాబు:
హరితరేణువు లేకపోతే మొక్క ఆకులలో ఆహారము తయారు కాదు. తద్వారా సమస్త జీవులకు ఆహారం లభ్యమయ్యేది కాదు.

ప్రశ్న 58.
కొత్త కణాలు పాత కణాల నుండి ఏర్పడతాయన్న భావననను నీకు ఏ విధంగా అన్వయించుకుంటావు?
జవాబు:
కొత్త కణాలు పాత కణాల నుండి ఏర్పడడం వలనే పెరుగుదల, అభివృద్ధి జరుగుతుంది.

AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు

ప్రశ్న 59.
రంగు రంగుల పండ్లు, పూలకు కారణము ఏమిటి?
జవాబు:
రంగు రంగుల పండ్లు, పూలకు మొక్కలలో మాత్రమే ఉండు క్రోమోప్లాస్టులు కారణం.

ప్రశ్న 60.
కణము నందు లైసోజోములు లేకపోయినట్లయితే ఏమి జరుగును?
జవాబు:
వ్యర్థ పదార్థములు కణమునందు ఎక్కువ మొత్తంలో నిల్వ ఉంటాయి. కణము నందు లైసోజోములు లేకపోయినట్లయితే తద్వారా కణము తన విధిని సక్రమముగా నిర్వహించలేదు.

9th Class Biology 1st Lesson కణ నిర్మాణం – విధులు 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
టమాటాలో కింది రంగు మారడానికి కారణము ఏమనుకుంటున్నారు?
పచ్చని రంగు – తెలుపు – పసుపు – ఎరుపు
జవాబు:

  1. టమాటా నందు రంగు మారటానికి ప్లాస్టిడ్లు కారణం.
  2. ప్లాస్టిడ్లు ప్రధానంగా రెండు రకాలు. అవి : 1) క్రోమోప్లాస్టులు (రంగు గలవి) 2) ల్యూకోప్లాస్టులు (రంగులేనివి).
  3. క్లోరోప్లాస్టులు ఆకుపచ్చ రంగు గల క్రోమోప్లాస్టులు.
  4. క్రోమోప్లాస్టులు, క్లోరోప్లాస్టులు, ల్యూకోప్లాస్టులు ఒక రంగు నుండి మరియొక రంగునకు మారగల శక్తి కలిగి ఉంటాయి.
  5. లేత టమాటా పరిపక్వం చెందే క్రమంలో మనము ఆకుపచ్చ, తెలుపు, పసుపుపచ్చ మరియు ఎరుపురంగు గల టమాటాలను చూస్తాము.

ప్రశ్న 2.
సూక్ష్మదర్శిని సహాయముతో కింద ఇవ్వబడిన సైడులను పరిశీలించి బొమ్మలు గీయండి. వాటిలో గల వివిధ కణాంగములను రాయండి.
జవాబు:
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 1
A) పారమీసియమ్ నందుగల కణాంగములు :
పూర్వ మరియు పర సంకోచ రిక్తికలు, సూక్ష్మ కేంద్రకము, స్థూలకేంద్రకము, సైటోసోమ్, సైటో పైజ్, ఆహారరిక్తిక మొదలగునవి.

B) అమీబాలోని కణాంగములు :
కేంద్రకము, సంకోచరిక్తికలు, ఆహారరిక్తికలు.

C) యూగ్లీనాలోని కణాంగములు :
కేంద్రకము, క్లోరోప్లాస్టులు, సంకోచరిక్తికలు, రిజర్వాయర్, పారప్లాజెల్లార్ దేహము, ఎండోసోమ్ మొదలగునవి.

ప్రశ్న 3.
నమూనా వృక్ష కణం పటము గీచి, భాగములను గుర్తించుము.
జవాబు:
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 2

ప్రశ్న 4.
రైబోజోమ్స్ గురించి రాయండి.
జవాబు:

  1. కణంలోని కణద్రవ్యంలో చిన్నవిగా రేణువుల రూపంలో కనబడే నిర్మాణాలను రైబోజోమ్స్ అంటారు.
  2. ఇవి ఆర్.ఎన్.ఎ. మరియు ప్రోటీన్లతో ఏర్పడతాయి.
  3. ఇవి రెండు రకాలు. కొన్ని కణద్రవ్యంలో స్వేచ్ఛగా చలించే రేణువుల రూపంలో ఉంటాయి.
  4. రైబోజోములలో ప్రోటీన్ సంశ్లేషణ జరుగుతుంది.

9th Class Biology 1st Lesson కణ నిర్మాణం – విధులు 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
కణజీవశాస్త్ర అభివృద్ధికి కృషి చేసిన శాస్త్రవేత్తల చిత్రములను సేకరించుము. వారిని గురించి సంక్షిప్తముగా వివరింపుము.
జవాబు:
1) ఆ వాన్ లీవెన్‌హక్ 2) రాబర్ట్ హుక్ 3) రాబర్ట్ బ్రౌన్ 4) రుడాల్ఫ్ విర్కొన్ 5) బ్లేడన్ 6) ష్వాన్ 7) ఎర్నెస్ట్ రుస్కా 8) వాట్సన్ మరియు క్రిక్ 9) లిన్ మారులిస్ 10) ఆల్బర్ట్ క్లాడె
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 3

  1. 1632-1723. ఆస్టవాన్ లీవెన్‌హక్ సాధారణ సూక్ష్మదర్శినిని నిర్మించి దాని సహాయముతో నీటిలో ఉండే ప్రోటోజోవా, వర్టిసెల్లా మరియు నోటిలో ఉండే బాక్టీరియా బొమ్మలను గీచెను.
  2. 1665-ప్రాథమిక సంయుక్త సూక్ష్మదర్శినిని ఉపయోగించి బెండు ముక్కనందు సజీవ మొక్క కణజాలమునందలి కణములను కనుగొనెను.
  3. 1831-రాబర్ట్ బ్రౌన్ కేంద్రకమును కనుగొనెను.
  4. 1838-39-థియొడర్ ష్వాన్ మరియు M.J. ఫ్రీడన్ కణసిద్ధాంతమును ప్రతిపాదించిరి.
  5. 1885 రుడాల్స్ విర్కొవ్ కణవిభజనను కనుగొనెను.
  6. 1931-ఎర్నెస్ రుస్కా మొట్టమొదటి ఎలక్ట్రాను మైక్రోస్కోపును నిర్మించెను.
  7. 1953-వాట్సన్ మరియు క్రిస్టు DNA ద్వికుండలి నిర్మాణమును ప్రకటించెను.
  8. 1974-కణజీవశాస్త్ర పితామహుడైన ఆల్బర్ట్ క్లాడెనకు శరీర ధర్మశాస్త్రము (మెడిసిన్) నందు నోబెల్ బహుమతి వచ్చినది.
  9. 1981- కణపరిణామము నందు ఎండోసింబయాటిక్ సిద్ధాంతమును లిన్ మారులిస్ ప్రచురించెను.

ప్రశ్న 2.
ప్లాస్టిడ్ల గురించి రాయండి.
జవాబు:

  1. ప్లాస్టిడ్లు మొక్క కణములలో మాత్రమే ఉంటాయి.
  2. ప్లాస్టిడ్లు ప్రధానంగా రెండు రకములు. 1) క్రోమోప్లాస్టులు (రంగు గలవి) మరియు 2) ల్యూకోప్లాస్టులు (రంగులేనివి).
  3. హరిత రేణువులు (క్లోరోప్లాస్టులు) ఒక రకమైన ఆకుపచ్చ రంగులో ఉండే ప్లాస్టిడ్లు.
  4. కిరణజన్య సంయోగక్రియలో సూర్యకాంతిలోని సౌరశక్తిని గ్రహించి రసాయనశక్తిగా మార్చడమే క్లోరోప్లాస్టుల ముఖ్య విధి
  5. క్రోమోప్లాస్టులు రకరకాల పూలు మరియు పండ్ల రంగులకు కారణము.
  6. ల్యూకోప్లాస్టులు పిండిపదార్థాలను, నూనెలను మరియు ప్రోటీనులను నిల్వ చేస్తాయి.

ప్రశ్న 3.
అంతర్జీవ ద్రవ్యజాలము గురించి వివరించండి.
జవాబు:

  1. కణద్రవ్యంలో వ్యాపించి ఉన్న వల వంటి నిర్మాణము అంతర్జీవ ద్రవ్యజాలము.
  2. దీని ద్వారా కణములో ఒక భాగం నుండి మరియొక భాగానికి పదార్థాల రవాణా జరుగుతుంది.
  3. అంతర్జీవ ద్రవ్యజాలం రెండు రకములు.
    1) గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం 2) నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం.
  4. రైబోజోములు కలిగిన గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం ప్రోటీనుల సంశ్లేషణకు సహాయపడుతుంది.
  5. రైబోజోములు లేని నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం లిపిడ్ల సంశ్లేషణకు ఉపయోగపడుతుంది.
  6. కణంలో జరిగే కొన్ని జీవ రసాయన చర్యలకు అంతర్జీవ ద్రవ్యజాలం వేదికగా పనిచేస్తుంది.

ప్రశ్న 4.
ప్లాస్మాపొరకు, కణత్వచమునకు మధ్యగల భేదాలు రాయండి.
జవాబు:

ప్లాస్మా పొర కణత్వచము
1. ప్రోటీనులు మరియు లిపితో తయారయినది. 1. సెల్యులోజ్ తో తయారయినది.
2. సజీవమైనది. 2. నిర్జీవమైనది.
3. మొక్క మరియు జంతు కణములలో ఉండును. 3. కేవలం మొక్క కణములలో ఉంటుంది.
4. విచక్షణ త్వచంగా పనిచేస్తుంది. 4. విచక్షణ త్వచంగా పనిచేయదు.

5. ఈ క్రింది పటములు గీచి, భాగములను గుర్తించండి.
1) కేంద్రకం :
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 4
2) అంతర్జీవ ద్రవ్యజాలం :
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 5
3) మైటోకాండ్రియా :
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 6
4) హరితరేణువు :
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 7

9th Class Biology 1st Lesson కణ నిర్మాణం – విధులు Important Questions and Answers

ప్రశ్న 1.
నిజకేంద్రక కణాలలో మైటోకాండ్రియా లేకపోతే ఏమవుతుంది?
జవాబు:
కణంలో జరిగే జీవక్రియలకు కావలసిన శక్తి విడుదల జరగదు. అందువల్ల జీవక్రియలు ఆగిపోతాయి కణం మరణిస్తుంది.

ప్రశ్న 2.
జీవపదార్థం, కణ ద్రవ్యముల మధ్య భేదం ఏమిటి?
జవాబు:
చాలాకాలం వరకు కణంలో ఉండే ద్రవ్యం జీవాన్ని కలిగి ఉంటుందని నమ్మేవారు తరువాత జీవపదార్థం అనేది ఒక మాధ్యమం అని దానిలో కణాంగాలు, రేణువులు ఉంటాయని కనుగొన్నారు.

కేంద్రకత్వచం బయట ఉన్న జీవ పదార్థాన్ని కణద్రవ్యం అని, కేంద్రకంలోని జీవపదార్థాన్ని కేంద్రక రసం లేక ద్రవ్యమని అంటున్నారు.

ప్రశ్న 3.
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 9
ఎ) పై పటంను గుర్తించి భాగమలు రాయుము.
బి) పై పటంను గురించి క్లుప్తంగా వివరించుము.
జవాబు:
ఎ) 1) మాత్రిక,
2) క్రిస్టే,
3) లోపలిపొర,
4) బయటి పొర

బి) 1) పై పటం చూపబడిన కణాంగము మైటోకాండ్రియా
2) ఇది కణశ్వాసక్రియలోను నిర్వహించి శక్తి విడుదలకు తోడ్పడుతుంది.
3) వీటిని కణశక్యాగారాలు అంటారు.
4) ఇది వెలుపలి త్వచం మరియు లోపలి త్వచయులచే కప్పబడి ఉంటుంది. లోపల అనేక ముడుతలతో కూడిన నిర్మాణం ఉంటుంది. దీనిని మాత్రిక అంటారు. మాత్రికలో వేళ్ళ వంటి నిర్మాణాలు ఉంటాయి. వాటిని క్రిస్టే అంటారు.

ప్రశ్న 4.
కింది కణాంగాలు నిర్వహించే విధులు రాయండి.
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 10
జవాబు:

  1. మైటోకాండ్రియా – కణ శ్వాసక్రియలో పాల్గొంటుంది. శక్తి విడుదలకు తోడ్పడుతుంది.
  2. హరితరేణువు – సూర్యకాంతిని గ్రహించి కిరణజన్యసంయోగక్రియ జరిపి మొక్కలలో ఆహారాన్ని తయారుచేస్తుంది.

9th Class Biology 1st Lesson కణ నిర్మాణం – విధులు 1 Mark Bits Questions and Answers

లక్ష్యాత్మక నియోజనము

1. కణములను ప్రథమముగా దీనితో పరిశీలిస్తారు.
A) ఆప్టికల్ మైక్రోస్కోపు
B) సంయుక్త సూక్ష్మదర్శిని
C) ఎలక్ట్రాను మైక్రోస్కోపు
D) ఏదీకాదు
జవాబు:
A) ఆప్టికల్ మైక్రోస్కోపు

2. జంతుకణము వెలుపల ఉన్న పొర
A) కణకవచము
B) కణత్వచం
C) కేంద్రకత్వచము
D) కేంద్రకాంశత్వచము
జవాబు:
B) కణత్వచం

AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు

3. ప్లాస్మాపొర లేదా కణత్వచం దేనితో నిర్మితమైంది?
A) లిపిడ్లు
B) ప్రోటీనులు
C) లిపిడ్లు మరియు ప్రోటీనులు
D) సెల్యులోజ్
జవాబు:
C) లిపిడ్లు మరియు ప్రోటీనులు

4. విచక్షణ త్వచంను గుర్తించండి.
A) కణకవచము
B) కణత్వచము
C) టోనోప్లాస్ట్
D) కేంద్రక త్వచము
జవాబు:
B) కణత్వచము

5. కణకవచము వీటిలో ఉంటుంది.
A) జంతువులు
B) మనుష్యులు
C) మొక్కలు
D) జంతుప్లవకాలు
జవాబు:
C) మొక్కలు

6. న్యూక్లియసను కనుగొన్నది
A) రాబర్ట్ హుక్
B) రాబర్ట్ బ్రౌన్
C) రుడాల్ఫ్ విర్కొవ్
D) ష్వాన్
జవాబు:
B) రాబర్ట్ బ్రౌన్

7. కణము నియంత్రణ గదిగా పనిచేయునది
A) కణత్వచము
B) కేంద్రకము
C) మైటోకాండ్రియా
D) కేంద్రకాంశము
జవాబు:
B) కేంద్రకము

8. కణములో ఈ భాగము జన్యుసమాచారము కలిగి ఉంటుంది.
A) కేంద్రకము
B) కేంద్రకాంశము
C) రైబోజోములు
D) గాల్టీ సంక్లిష్టము
జవాబు:
A) కేంద్రకము

9. కేంద్రక పూర్వ కణమును గుర్తించుము.
A) బాక్టీరియమ్
B) సయానో బాక్టీరియా
C) పారమీసియమ్
D) బాక్టీరియమ్ మరియు సయానో బాక్టీరియా
జవాబు:
A) బాక్టీరియమ్

10. కణాంతర రవాణాలో పాల్గొనునది
A) అంతర్జీవ ద్రవ్యజాలం
B) లైసోజోమ్ లు
C) గాల్జీ సంక్లిష్టము
D) రైబోజోములు
జవాబు:
A) అంతర్జీవ ద్రవ్యజాలం

11. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము వీటి తయారీకి సహాయపడుతుంది.
A) ప్రోటీనులు
B) లిపిడ్లు
C) పిండిపదార్థములు
D) విటమినులు
జవాబు:
B) లిపిడ్లు

12. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము వీటి తయారీకి సహాయపడుతుంది.
A) ప్రోటీనులు
B) పిండిపదార్థాలు
C) లిపిడ్లు
D) విటమినులు
జవాబు:
C) లిపిడ్లు

13. సకశేరుక కాలేయ కణములందు విషములను మరియు మందులను విషరహితముగా చేయు కణాంగము
A) నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము
B) గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము
C) లైసోజోములు
D) రిక్తికలు
జవాబు:
A) నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము

14. స్వయం విచ్ఛిత్తి సంచులని వీటిని అంటారు.
A) లైసోజోములు
B) రైబోజోములు
C) న్యూక్లియోజోమ్
D) గాల్టీ సంక్లిష్టము
జవాబు:
A) లైసోజోములు

15. ప్రతి కణమునందు ఉండు మైటోకాండ్రియాల సంఖ్య
A) 100 – 200
B) 150 – 300
C) 100 – 150
D) 100 – 300
జవాబు:
C) 100 – 150

16. కణ శక్త్యాగారాలు అని వీటిని అంటారు.
A) లెసోజోములు
B) మెటోకాండియా
C) రైబోజోములు
D) రిక్తికలు
జవాబు:
B) మెటోకాండియా

17. క్లోరోప్లాస్టులు పాల్గొను జీవక్రియ
A) శ్వాసక్రియ
B) కిరణజన్య సంయోగక్రియ
C) పోషణ
D) రవాణా
జవాబు:
B) కిరణజన్య సంయోగక్రియ

18. కణసిద్ధాంతమును ప్రతిపాదించినవారు
A) ప్లీడన్
B) ష్వాన్
C) ప్లీడన్ మరియు ష్వాన్
D) రుడాల్ఫ్ విర్కొవ్
జవాబు:
C) ప్లీడన్ మరియు ష్వాన్

19. కణవిభజనను మొదటగా గుర్తించినవాడు
A) రుడాల్ఫ్ విర్కొవ్
B) రాబర్ట్ హుక్
C) హూగో డివైస్
D) రాబర్ట్ బ్రౌన్
జవాబు:
A) రుడాల్ఫ్ విర్కొవ్

20. కేంద్రకము లోపల ఉన్న ద్రవపదార్ధము
A) కేంద్రకాంశ పదార్థము
B) కణద్రవ్యము
C) జీవపదార్ధము
D) జర్మ్ ప్లాన్స్
జవాబు:
A) కేంద్రకాంశ పదార్థము

21. జంతు కణంలో కనిపించే కణాంగం
A) హరితరేణువులు
B) రిక్తికలు
C) కణకవచం
D) మైటోకాండ్రియా
జవాబు:
D) మైటోకాండ్రియా

22. కణం యొక్క సమతాస్థితి నిర్వహణలో ప్రధాన పాత్ర నిర్వహించునది
A) కణకవచం
B) ప్లాస్మాపొర
C) కణద్రవ్యం
D) కేంద్రకం
జవాబు:
B) ప్లాస్మాపొర

23. ప్లాస్మాపొర ద్వారా
A) అన్ని పదార్థాల ప్రసరణ జరుగుతుంది.
B) ద్రవ పదార్థాల ప్రసరణ మాత్రమే జరుగుతుంది.
C) కొన్ని పదార్థాల ప్రసరణ మాత్రమే జరుగుతుంది.
D) గ్లూకోజ్ ప్రసరణ మాత్రమే జరుగుతుంది.
జవాబు:
C) కొన్ని పదార్థాల ప్రసరణ మాత్రమే జరుగుతుంది.

24. ప్లాస్మాపొర ………..
A) ఒక విచక్షణా త్వచం
B) భేదక పారగమ్య త్వచం
C) పారగమ్య త్వచం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

25. కణకవచం కల్గించే పీడనం
A) బాహ్యపీడనం
B) అంతరపీడనం
C) స్ఫీతపీడనం
D) పైవేవీ కావు
జవాబు:
B) అంతరపీడనం

26. కేంద్రకాన్ని కనుగొన్నది
A) రాబర్ట్ హుక్
B) రాబర్ట్ బ్రౌన్
C) ప్లీడన్
D) ష్వాన్
జవాబు:
B) రాబర్ట్ బ్రౌన్

27. ప్లీషన్ కేంద్రకానికి ఈ విధంగా పేరు పెట్టాడు.
A) సైటోబ్లాస్ట్
B) ఫైటోబ్లాస్ట్
C) క్లోరోప్లాస్ట్
D) న్యూక్లియోబ్లాస్ట్
జవాబు:
A) సైటోబ్లాస్ట్

AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు

28. అభివృద్ధి చెందిన ఈ కణాలలో కేంద్రకం ఉండదు.
A) చాలనీకణాలు
B) చాలనీనాళాలు
C) సహకణాలు
D) తంతువులు
జవాబు:
B) చాలనీనాళాలు

29. క్షీరదాలలో ఈ కణాలలో కేంద్రకం కనిపించదు.
A) కండరకణం
B) నాడీకణం
C) తెల్లరక్త కణం
D) ఎర్రరక్త కణం
జవాబు:
D) ఎర్రరక్త కణం

30. కణాలను దేనిని ఆధారం చేసుకుని విభజించారు?
A) కణకవచం
B) కణత్వచం
C) కేంద్రకత్వచం
D) మైటోకాండ్రియా
జవాబు:
C) కేంద్రకత్వచం

31. ఈ క్రింది వానిలో కేంద్రక పూర్వ కణం
A) రక్తకణం
B) బాక్టీరియాకణం
C) సయానోబాక్టీరియా
D) B & C
జవాబు:
D) B & C

32. కేంద్రక పూర్వ కణంలో
A) కేంద్రకం ఉండదు
B) కేంద్రకత్వచం ఉండదు
C) త్వచం కల్గిన కణాంగాలుండవు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

33. రైబోజోమ్ లు ఎక్కడ ఉంటాయి?
A) గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం
B) నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం
C) గాల్జీ సంక్లిష్టం
D) మైటోకాండ్రియా
జవాబు:
A) గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం

34. ఈ క్రింది వానిలో అసత్య వాక్యం
A) గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం కార్బోహైడ్రేట్లను సంశ్లేషణం చేస్తుంది.
B) నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం లిపిడ్లను సంశ్లేషణం చేస్తుంది.
C) అంతర్జీవ ద్రవ్యజాలం రవాణా మార్గంగా పనిచేస్తుంది.
D) సకశేరుకాల కాలేయ కణాల నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అనేక విషపదార్థాలను నిర్వీర్యం చేస్తుంది.
జవాబు:
A) గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం కార్బోహైడ్రేట్లను సంశ్లేషణం చేస్తుంది.

35. ఈ క్రింది వానిలో గాల్జీ సంక్లిష్టానికి సంబంధించిన అసత్య వాక్యం
A) 1898వ సం||లో కెమిల్లో గాల్టీ గాల్టీ సంక్లిష్టాన్ని కనుగొన్నాడు.
B) ఈ కణాంగాలు త్వచాలతో నిర్మితమవుతాయి.
C) పదార్థాలను రవాణా చేసేముందు తమలో నిల్వ చేసుకుంటాయి.
D) ఎంజైము, హార్మోనులను స్రవించే కణాలలో ఇవి తక్కువ సంఖ్యలో ఉంటాయి.
జవాబు:
D) ఎంజైము, హార్మోనులను స్రవించే కణాలలో ఇవి తక్కువ సంఖ్యలో ఉంటాయి.

AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు

36. ఈ క్రింది వానిలో రెండు త్వచాలు కల్గిన కణాంగం
A) గాల్జీ సంక్లిష్టం
B) అంతర్జీవ ద్రవ్యజాలం
C) మైటోకాండ్రియా
D) లైసోజోమ్ లు
జవాబు:
C) మైటోకాండ్రియా

37. ఈ క్రింది వానిలో త్వచం లేని కణాంగం
A) రైబోజోమ్ లు
B) లైసోజోమ్ లు
C) అంతర్జీవ ద్రవ్యజాలం
D) గాల్జీ సంక్లిష్టం
జవాబు:
A) రైబోజోమ్ లు

38. ఈ క్రింది వానిలో DNAను కల్గి ఉండునది
A) కేంద్రకం
B) హరితరేణువులు
C) మైటోకాండ్రియా
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

39. ఈ క్రింది వానిలో ఒకే త్వచం కల్గిన కణాంగం
A) లైసోజోమ్ లు
B) అంతర్జీవ ద్రవ్యజాలం
C) గాల్జీ సంక్లిష్టం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

40. మైటోకాండ్రియాలో మధ్యగల ఖాళీ ప్రదేశాన్నేమంటారు?
A) కణాంతర ప్రదేశం
B) కణ మధ్య ప్రదేశం
C) క్రిస్టే
D) మాత్రిక
జవాబు:
D) మాత్రిక

41. రైబోజోములు వీటితో నిర్మించబడతాయి.
A) RNA మరియు ప్రోటీన్లు
B) DNA మరియు ప్రోటీన్లు
C) RNA మరియు DNA
D) ప్రోటీన్లు మరియు లిపిడ్లు
జవాబు:
A) RNA మరియు ప్రోటీన్లు

42. పూలల్లో ఇవి ఉంటాయి.
A) క్లోరోప్లాస్టు
B) ల్యూకోప్లాస్టు
C) క్రోమోప్లాన్లు
D) అల్యూరో ప్లాస్టు
జవాబు:
C) క్రోమోప్లాన్లు

49. ఈ క్రింది వానిలో సౌరశక్తిని గ్రహించి రసాయన శక్తిగా మార్చేది
A) మైటోకాండ్రియా
B) హరితరేణువు
C) గాల్టీ సంక్లిష్టం
D) రైబోజోమ్ లు
జవాబు:
B) హరితరేణువు

44. కిరణజన్య సంయోగక్రియ జరిగే కణాలలో క్లోరోప్లాస్ట్‌ల సంఖ్య సుమారు
A) 50 – 100
B) 50 – 150
C) 50 – 200
D) 50 – 250
జవాబు:
C) 50 – 200

45. కణంలో కుడ్యపీడనాన్ని నియంత్రించి వ్యర్థాలను బయటకు పంపే నిర్మాణాలు
A) ప్లాస్టిడ్లు
B) లైసోజోమ్ లు
C) గాల్జీ సంక్లిష్టం
D) రిక్తిక
జవాబు:
D) రిక్తిక

46. టోనోప్లాస్ట్ దీనిని కప్పి ఉంచే పొర.
A) కేంద్రకం
B) రైబోజోమ్ లు
C) రిక్తిక
D) మైటోకాండ్రియా
జవాబు:
C) రిక్తిక

47. కణాన్ని మొట్ట మొదటిసారిగా పరిశీలించినది
A) రాబర్ట్ హుక్
B) రాబర్ట్ బ్రౌన్
C) రుడాల్ఫ్ విర్కోవ్
D) మార్సెల్లో మాల్ఫీజి
జవాబు:
A) రాబర్ట్ హుక్

48. దీనిని జీవుల యొక్క క్రియాత్మక, నిర్మాణాత్మక ప్రమాణమంటారు.
A) కణజాలం
B) కణం
C) కండరం
D) ఎముక
జవాబు:
B) కణం

AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు

49. ఈ క్రింది ప్రవచనాలను చదవండి.
a) ప్లాస్టిర్లు వృక్షములలో మాత్రమే ఉంటాయి.
b) లైసోజోమ్స్ లో వినాశకరంకాని ఎంజైమ్స్ ఉంటాయి.
A) a మరియు b లు రెండూ సత్యమే
B) a సత్యము మరియు b అసత్యము
C) b సత్యము మరియు a అసత్యము
D) a మరియు b లు రెండూ అసత్యమే
జవాబు:
A) a మరియు b లు రెండూ సత్యమే

50. క్రింది ప్రవచనాలను చదవండి.
a) గరుకుతలం గల అంతర్జీవ ద్రవ్యజాలం ప్రోటీన్ల సంశ్లేషణకు తోడ్పడుతుంది.
b) రాబర్ట్ బ్రౌన్ 1835లో కేంద్రకాన్ని కనుగొన్నాడు.
A) a మరియు b లు రెండూ సత్యమే
B) a సత్యము మరియు b అసత్యము
C) b సత్యము మరియు a అసత్యము
D) a మరియు bలు రెండూ అసత్యమే
జవాబు:
B) a సత్యము మరియు b అసత్యము

51. సరిగా జతపరచబడిన జతను కనుగొనండి.
a) పత్రరంధ్రాలు – వాయువుల మార్పిడి
b) ల్యూకోప్లాస్టు – పిండి పదార్థాల నిల్వ
c) గాల్జీ సంక్లిష్ట పదార్థం – ప్రొటీన్ల నిల్వ
A) a మరియు b
B) b మరియు c
C) a మాత్రమే
D) b మాత్రమే
జవాబు:
D) b మాత్రమే

52. క్రింది ప్రవచనాలను చదవండి.
a) కణ కవచము సెల్యులోజ్ తో నిర్మితమై, నిష్క్రియాత్మకంగా ఉంటుంది.
b) ప్లాస్మాపొర ప్రొటీన్లు, లిపిడ్లతో నిర్మితమై యుండి, క్రియాత్మకంగా ఉంటుంది.
A) a, bలు రెండూ సత్యమే
B) a, b లు రెండూ అసత్యము
C) a అసత్యము b సత్యము
D) b అసత్యము a సత్యము
జవాబు:
C) a అసత్యము b సత్యము

53. క్లోరోప్లాస్లు ఎక్కువగా కలిగిన మొక్కలు
A) ఆల్గే
B) ఫంగి
C) బాక్టీరియా
D) ఏదీకాదు
జవాబు:
A) ఆల్గే

54. రియోపత్రంలోని కణాల అమరిక
A) వృత్తాకారంగా
B) వరుసలలో
C) క్రమరహితంగా
D) లంబాకారంగా
జవాబు:
A) వృత్తాకారంగా

55. బుగ్గ కణాల మధ్య భాగంలో కనబడే భాగం
A) మైటోకాండ్రియా
B) గాల్టీ
C) కేంద్రకం
D) రైబోజోములు
జవాబు:
C) కేంద్రకం

56. బుగ్గ కణాలలో కేంద్రకాన్ని పరిశీలించడానికి ఉపయోగించే రంజకము
A) సాఫనిన్
B) మిథైల్ బ్లూ
C) నల్ల రంజకం
D) పైవన్నియూ
జవాబు:
D) పైవన్నియూ

AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు

57. మైటోకాండ్రియాను, సూక్ష్మదర్శిని క్రింద పరిశీలించునపుడు ఉపయోగించే ద్రావణం
A) జానస్ గ్రీన్-బి
B) సాఫ్రనిన్
C) గ్లిజరిన్
D) మిథైల్ బ్లూ
జవాబు:
A) జానస్ గ్రీన్-బి

58. కేంద్రకాన్ని పరిశీలించడానికి మీ తరగతి గదిలో వాడేరంజకము
A) ఫినాఫ్తలీన్
B) మిథైల్ బ్లూ
C) ఆల్కహాల్
D) గ్లిజరిన్
జవాబు:
B) మిథైల్ బ్లూ

59. ఎర్ర రక్తకణాల జీవిత కాలం తక్కువగా ఉండటానికి గల కారణం
A) హిమోగ్లోబిన్ ఉండటం వలన
B) కేంద్రకం ఉండటం వలన
C) కేంద్రకం లేకపోవటం వలన
D) కేంద్రకాంశం ఉండటం వలన
D) పైవేవీ కావు
జవాబు:
C) కేంద్రకం లేకపోవటం వలన

60. వివిధ రకాల పదార్థాలు కణం యొక్క ఈ భాగంలో నిల్వ ఉంటాయి.
A) కేంద్రకం
B) మైటోకాండ్రియా
C) గాల్జీ సంక్లిష్టం
D) ప్లాస్టిట్లు
జవాబు:
C) గాల్జీ సంక్లిష్టం

61. శక్తిని ఉత్పత్తి చేసి, నిల్వచేసే కణాంగము
A) గాల్టీ సంక్లిష్టం
B) మైటోకాండ్రియా
C) కేంద్రకం
D) ప్లాస్టిడ్లు
జవాబు:
B) మైటోకాండ్రియా

62. టమోటాలలో రంగు మార్పులకు (ఆకుపచ్చ – తెలుపు – పసుపు – ఎరుపు) కారణమైనది
A) అంతర్జీవ ద్రవ్యజాలం
B) ప్లాస్టిడ్లు
C) కేంద్రకము
D) కణత్వచము
జవాబు:
B) ప్లాస్టిడ్లు

63. కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు
a) మాథియస్ జాకబ్ ప్లీడన్
b) థియోడర్ ష్వాన్
c) రూడాల్ఫ్ విర్కోవ్
A) a మరియు b
B) b మరియు c
C) a మరియు c
D) a, b మరియు c
జవాబు:
A) a మరియు b

64. పటంలో గుర్తించిన భాగం
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 11
A) హరితరేణువు
B) రంధ్రము
C) కేంద్రకము
D) రక్షక కణం
జవాబు:
D) రక్షక కణం

65. ఇచ్చిన చిత్రం పేరు
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 12
A) జంతు కణం
B) వృక్ష కణం
C) హరితరేణువు
D) అంతర్జీవ ద్రవ్యజాలం
జవాబు:
A) జంతు కణం

66. పటంలో సూచించిన కణాంగము పేరు
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 13
A) మైటోకాండ్రియా
B) కేంద్రకం
C) గాల్టీ
D) హరితరేణువు
జవాబు:
D) హరితరేణువు

67. చిత్రంలో గుర్తించిన భాగం
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 14
A) కేంద్రకం
B) కేంద్రకాంశం
C) DNA
D) RNA
జవాబు:
B) కేంద్రకాంశం

68. పటంలో సూచించిన కణాంగం పేరు
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 15
A) హరితరేణువు
B) గాల్జీ సంక్లిష్టం
C) అంతర్జీవ ద్రవ్యజాలం
D) మైటోకాండ్రియా
జవాబు:
D) మైటోకాండ్రియా

69. ఈ కణాంగాన్ని గుర్తించండి.
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 16
A) గాల్జీ సంక్లిష్టం
B) అంతర్జీవ ద్రవ్యజాలం
C) లైసోసోమ్లు
D) కేంద్రకం
జవాబు:
A) గాల్జీ సంక్లిష్టం

70. ఈ కణాంగాన్ని గుర్తించండి.
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 17
A) గాలీ సంక్లిష్టం
B) అంతర్జీవ ద్రవ్యజాలం
C) లైసోసోమ్లు
D) కేంద్రకం
జవాబు:
B) అంతర్జీవ ద్రవ్యజాలం

71. సరియైన క్రమంలో అమర్చండి.
A) కణజాలం – జీవులు – అవయవము – అవయవ వ్యవస్థ – కణములు
B) జీవులు – అవయవము – అవయవ వ్యవస్థ – కణజాలం – కణములు
C) కణములు – కణజాలం – అవయవాలు – అవయవ వ్యవస్థ – జీవులు
D) పైవేవీ కావు
జవాబు:
C) కణములు – కణజాలం – అవయవాలు – అవయవ వ్యవస్థ – జీవులు

AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు

72. జీవులలో కణం ఒక
A) క్రియాత్మక ప్రమాణం
B) నిర్మాణాత్మక ప్రమాణం
C) స్వతంత్రంగా పనిచేసే నిర్మాణం
D) పైవన్నియూ
జవాబు:
D) పైవన్నియూ

73. నేను పత్రరంధ్రాలను అభినందిస్తాను. ఎందుకంటే అవి ఈ క్రియకు సహాయపడతాయి.
A) కిరణజన్య సంయోగక్రియ
B) శ్వాసక్రియ
C) బాష్పోత్సేకం
D) పైవన్నియూ
జవాబు:
D) పైవన్నియూ

74. వృక్షాలలో కణకవచం యొక్క విధి
A) క్రియాత్మకంగా ఉంటుంది
B) రక్షిస్తుంది
C) పీడనాన్ని కలిగిస్తుంది.
D) B మరియు C
జవాబు:
D) B మరియు C

75. శక్తిని విడుదల చేయు కణాంగం
A) లైసోజోమ్ లు
B) గాల్జి సంక్లిష్టం
C) అంతర్జీవ ద్రవ్యజాలకం
D) మైటోకాండ్రియా
జవాబు:
D) మైటోకాండ్రియా

76. మైక్రోస్కోప్ ని ఉపయోగించి వృక్ష కణంలో రిక్తికను పరిశీలించాలంటే నీవు చేసే పనులు క్రమాన్ని గుర్తించండి.
1) గాజు స్లెడ్ పై వుంచుట
2) రసభరితమైన మొక్క కాండమును సేకరించుట
3) సజల సాఫ్టనిస్ ద్రావణంతో రంజనం చేయుట
4) సన్నని పొరలుగా చేయుట
A) 2, 4, 3, 1
B) 1, 2, 3, 4
C) 2, 3, 4, 1
D) 4, 3, 1, 2
జవాబు:
A) 2, 4, 3, 1

77. కింది వాటిలో ఏ కణాంగంపై, జీవులన్నీ ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఆహారం కొరకు ఆధారపడుతాయి.
A) లైసోజోమ్స్
B) మైటోకాండ్రియా
C) రైబోజోమ్స్
D) హరితరేణువులు
జవాబు:
D) హరితరేణువులు

78. క్రింది వానిలో తప్పును గుర్తించండి.
i) ప్రతికణం అదే కణం నుంచి ఏర్పడును.
ii) రిక్తికలు కణశక్త్యాగారాలు
iii) కేంద్రక పూర్వక కణాలలో కేంద్రక త్వచం ఉంటుంది.
A) i, ii
B) ii, iii
C) i, ii, iii
D) i, iii
జవాబు:
B) ii, iii

79. స్వయంపోషకాల విషయంలో సరియైనది
A) సూర్యకాంతిని ఉపయోగించి యాంత్రిక శక్తిని పొందుతాయి
B) ఇతర జీవులలోని గ్లెకోజనను పోషకంగా తీసుకుంటాయి
C) సూర్యకాంతిని రసాయన శక్తిగా మార్చి ఆహారం పొందుతాయి
D) అన్నీ సరైనవే
జవాబు:
C) సూర్యకాంతిని రసాయన శక్తిగా మార్చి ఆహారం పొందుతాయి

AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు

80. మైటోకాండ్రియా పరిశీలనకు వాడే రంజకం పేరు
A) సఫ్రానిన్
B) జానస్ గ్రీన్-బి
C) జానస్ గ్రీన్-ఎ
D) క్రిస్టల్ వైలెట్
జవాబు:
B) జానస్ గ్రీన్-బి

మీకు తెలుసా?

కణాలలో కొన్ని కణాంగాలు అధిక సంఖ్యలో ఉంటాయి. ఉదాహరణకి కిరణజన్య సంయోగక్రియలో పాల్గొనే కణాలలో 50-200 క్లోరోప్లాస్ట్‌లు ఉంటాయి.

పునరాలోచన
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 8

AP Board 9th Class Biology Solutions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు

SCERT AP 9th Class Biology Study Material Pdf Download 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Biology 11th Lesson Questions and Answers జీవ భౌగోళిక రసాయనిక వలయాలు

9th Class Biology 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
ప్రకృతిలో వివిధ జీవ భౌగోళిక రసాయనిక వలయాల ప్రాధాన్యత ఏమిటి?
జవాబు:

  1. ఒక ఆవరణము నుండి మరియొక ఆవరణ వ్యవస్థకి పదార్థాల మార్పిడికి జీవ భౌగోళిక రసాయనిక వలయాలు ఉపయోగపడతాయి.
  2. ఒక ప్రదేశము నుండి మరియొక ప్రదేశమునకు అణువుల మార్పిడికి జీవభౌగోళిక రసాయనిక వలయాలు దోహదపడతాయి.
  3. వాతావరణములో అధిక గాఢతలో ఉన్న నైట్రోజనను నత్రజని వలయము ద్వారా నేలలో ఉండే బాక్టీరియాచే నేలలోకి చేర్చబడుతుంది.
  4. జీవ భౌగోళిక రసాయనిక వలయాలు మూలకములను నిల్వచేయుటకు ఉపయోగపడతాయి.
  5. ఆవరణ వ్యవస్థ పనిచేయుటకు జీవ భౌగోళిక రసాయనిక వలయాలు సహాయపడతాయి.
  6. జీవ భౌగోళిక రసాయనిక వలయాలు సజీవులను సజీవులతోను, సజీవులను నిర్జీవులతోను మరియు నిర్జీవులను నిర్జీవులతోను కలుపుతాయి.
  7. పదార్థముల ప్రసారమును జీవ భౌగోళిక రసాయనిక వలయాలు నియంత్రిస్తాయి.

ప్రశ్న 2.
ఓజోన్ పొర తగ్గిపోవటానికి కారణమైన మానవ కార్యకలాపాలేవి? స్ట్రాటోస్పియర్ లో మానవ ప్రమేయం వలన ఓజోన్ పొర తగ్గడాన్ని నివారించడానికి అనుసరించవలసిన ప్రధాన సోపానాలేవి?
జవాబు:

  1. కొన్ని పరిశ్రమలు పాటిస్తున్న విధానాలు మరియు ఉత్పాదకాల వలన ఓజోను పొరను తగ్గించే పదార్థాలు వాతావరణంలోనికి విడుదల అవుతున్నాయి.
  2. ఈ పదార్థాలు బ్రోమిన్, క్లోరిన్ పరమాణువులను స్ట్రాటోస్పియర్‌లోకి చేరవేస్తున్నాయి.
  3. ఇవి అక్కడ జరిపే రసాయన చర్యల వలన ఓజోన్ పొరను నాశనం చేస్తున్నాయి.
  4. ఇందుకు ముఖ్యమైన ఉదాహరణ రిఫ్రిజిరేటర్లలో మరియు ఎయిర్ కండిషన్ వ్యవస్థలో వాడే క్లోరోఫ్లోరో కార్బనులు.
  5. క్లోరోఫ్లోరో కార్బన్స్ వాటి ఉత్పన్నాల వంటి ఓజోన్ పొరను తగ్గించే పదార్థాల ఉత్పత్తి మరియు సరఫరాను నియంత్రించినట్లయితే ఓజోన్ పొర తగ్గిపోవడాన్ని నివారించవచ్చు.

AP Board 9th Class Biology Solutions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు

ప్రశ్న 3.
జీవ భౌగోళిక రసాయనిక వలయాలు సమతాస్థితిలో ఉన్నాయని ఎలా చెప్పగలం?
జవాబు:

  1. నేల, నీరు మరియు వాతావరణములో వివిధ వాయువుల శాతం స్థిరంగా ఉండుట వలన మనం జీవ భౌగోళిక రసాయనిక వలయాలు సమతాస్థితిలో ఉన్నాయని చెప్పగలం.
  2. జీవ భౌగోళిక రసాయనిక వలయ పదార్థములు ఒక ఆవరణ వ్యవస్థ నుండి మరియొక ఆవరణ వ్యవస్థలోనికి మారినప్పటికి, అవి ఉండవలసిన పరిమాణము మారదు. ఇందువలన జీవ భౌగోళిక రసాయనిక వలయాలు సమతాస్థితిలో ఉన్నాయని చెప్పగలం.

ప్రశ్న 4.
జీవ భౌగోళిక రసాయనిక వలయాల సమతాస్థితిని మానవ కార్యకలాపాలు ఎలా ప్రభావితం చేస్తున్నాయి?
జవాబు:

  1. భూమి వాతావరణ పరిస్థితులను నిర్ణయించే జీవ భౌగోళిక రసాయనిక వలయాలను మానవ కార్యకలాపాలు ప్రభావితం చేస్తున్నాయి.
  2. ఎరువుల వాడకం ఫాస్పరస్ మరియు నత్రజని వలయాలను ప్రభావితం చేశాయి.
  3. రైతులు ఉపయోగించిన ఫాస్ఫేటు ఎరువులు మొత్తం మొక్కలచే గ్రహించబడవు. ఎక్కువ మొత్తం వర్షపు నీటి ద్వారా నేల మరియు నీటి వనరులలోనికి చేరతాయి. నీటి వనరులు కాలుష్యం అవుతాయి.
  4. మానవుడు భూమి అంతర్భాగము నందు గల శిలాజ ఇంధనాలను వెలికితీయుట ద్వారా కార్బన్ వలయాన్ని ఆటంకపరిచాడు.
  5. వన నిర్మూలన ద్వారా మానవుడు వాతావరణములో CO2 పెరుగుదలకు కారణమయ్యాడు.
  6. పరిశ్రమల నుంచి సల్ఫర్ డై ఆక్సైడ్ ను విడుదల చేయడం ద్వారా ‘సల్ఫర్ వలయం ప్రభావానికి గురి అయినది.
  7. సల్ఫర్ డై ఆక్సైడ్ ఆక్సీకరణం వలన నేలలోనికి చేరటం, క్షయకరణం ద్వారా వాతావరణంలోనికి చేరటం మరియు వాతావరణంలో సల్ఫేట్ నుండి సల్ఫ్యూరిక్ ఆమ్లము ఏర్పడుతుంది.
  8. ఎక్కువగా చిక్కుడు వంశ పంటలు పెంచడం, రసాయనిక ఎరువులను ఉత్పత్తి చేయడం, పరిశ్రమలు మరియు వాహనాల నుండి కాలుష్య కారకాలు వెదజల్లబడడం వలన మానవులు ఒక సంవత్సరంలో లభ్యమయ్యే నత్రజనిని రెండింతలు చేయడం జరిగింది.

ప్రశ్న 5.
మొక్కల జీవన విధానంలో CO2 పాత్ర గురించి మీ అభిప్రాయం ఏమిటి?
జవాబు:

  1. జీవ సంబంధ కార్బన్ వలయంలో నిరీంద్రియ వాతావరణ కార్బన్ ను జీవసంబంధ రూపంలో మార్చడం మొదటి మెట్టు.
  2. మొక్కలలోనూ ఇతర జీవులైన ఉత్పత్తిదారులలోనూ కిరణజన్య సంయోగక్రియ ద్వారా జీవరూపంలో కార్బన్ స్థాపన చేయబడుతుంది.
  3. కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ డై ఆక్సైడ్, నీరు సంయోగం చెంది సరళమైన చక్కెర అణువులైన గ్లూకోజ్ (C6H12O6) ఏర్పడడానికి కాంతి శక్తి సహాయపడుతుంది.
  4. అన్ని మొక్కలకు, జంతువులకు కార్బోహైడ్రేట్లు శక్తినిచ్చే వనరులుగా మారతాయి.
  5. మొక్కలలో కొంత కార్బన్ తాత్కాలిక శక్తిని ఇవ్వడానికి అనువుగా సరళ గ్లూకోజ్ గా ఉండిపోతుంది.
  6. మిగిలిన కార్బన్ శాశ్వతంగా వాడడానికి అనువుగా సంక్లిష్ట అణువులతో కూడిన పిండి పదార్థం రూపంలో నిల్వ చేయబడుతుంది.

ప్రశ్న 6.
కొలనులో మొక్కలన్నీ చనిపోయాయనుకోండి, వాటి ప్రభావం జంతువులపై ఎలా ఉంటుంది?
జవాబు:

  1. కొలనులో మొక్కలన్నీ చనిపోతే వాటిపై ఆధారపడి జీవించే జంతువులపై తీవ్ర ప్రభావం ఉంటుంది.
  2. ఎందుకంటే జంతువులు తమ ఆహార అవసరాల కోసం మొక్కలపై ఆధారపడతాయి.
  3. మొక్కలు చనిపోవుట వలన ఆహారం దొరకక మొక్కలపై ఆధారపడి జీవించే జంతువులన్నీ చనిపోతాయి.

AP Board 9th Class Biology Solutions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు

ప్రశ్న 7.
ఉష్ణోగ్రతపై గ్రీన్ హౌజ్ ప్రభావం ఎలా ఉంటుందో ప్రయోగపూర్వకంగా నిరూపించండి.
జవాబు:
ఉద్దేశం : ఉష్ణోగ్రత పై గ్రీన్‌హౌజ్ ప్రభావాన్ని పరీక్షించుట.

కావాల్సిన పరికరాలు : ప్లాస్టిక్ సీసా, (ఇనుప సీల), రెండు థర్మామీటర్లు, నోట్‌బుక్, పెన్సిల్.

విధానం :

  1. ఇనుప సీలతో ప్లాస్టిక్ సీసా పైభాగాన రంధ్రం చేయాలి.
  2. మొదటి థర్మామీటర్ ను రంధ్రంలో గుచ్చాలి.
  3. సీసా పక్కన రెండవ థర్మామీటరు ఉంచాలి.
  4. రెండు థర్మామీటర్లకు సమానంగా సూర్యరశ్మి సోకే విధంగా చూడాలి.
  5. 10 నిమిషాల తరువాత రెండు ధర్మామీటర్లలోని ఉష్ణోగ్రతలను నమోదు చేయాలి.
  6. ఉష్ణోగ్రత వివరాలను నోటు పుస్తకంలో నమోదు చేయాలి.
  7. పది నిమిషాల తరువాత మరియొకసారి ఉష్ణోగ్రతను నమోదుచేయాలి. ఇలా 2-3 సార్లు చేయాలి.

పరిశీలన :
సీసాలో ఉంచిన ధర్మామీటరులో అధిక ఉష్ణోగ్రత నమోదు అయింది.

వివరణ :
వేడెక్కిన సీసా లోపలి గాలి ప్రక్కలకు విస్తరించకుండా ప్లాస్టిక్ బాటిల్ నిరోధించింది. అందువలన ప్లాస్టిక్ బాటిల్ ఉష్ణోగ్రత పెరిగింది. ప్లాస్టిక్ బాటిల్ వలె, భూమిచుట్టూ గ్రీన్‌హౌజ్ వాయువులు ఉష్ణోగ్రతను బంధించుట వలన భూమి ఉష్ణోగ్రత పెరుగుతున్నది.

నిరూపణ :
గ్రీన్‌హౌజ్ వాయువుల వలన భూ ఉష్ణోగ్రత పెరుగుతుందని నిరూపించడమైంది.

ప్రశ్న 8.
మీకు దగ్గరలో ఉన్న ఒక నీటి గుంటలోని జీవులను పరిశీలించండి. ఆ నీటిలో కలుస్తున్న కాలుష్య కారక పదార్థాలను గుర్తించండి. వాటి జాబితా రాయండి. అవి నీటిలోని జీవులపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయో పరిశీలించండి. మీ పరిశీలనలపై నివేదిక తయారు చేయండి.
జవాబు:
నీటిలో కలుస్తున్న కాలుష్యకారక పదార్థములు :
కాగితములు, మొక్కలు, ఆకులు, శాఖలు, పేపరు, పేడ, చెత్త, మురికినీరు మొదలైనవి.

కాలుష్య కారక పదార్ధములు నీటిలో నివసించే జీవులపై చూపే ప్రభావం :

  1. ఎక్కువ మొత్తంలో నేలలో కలసిపోయే చెత్త పదార్థాలు తక్కువ నీటి స్థలంలో వేసినట్లయితే అనేక పర్యవసానాలు కలుగుతాయి.
  2. చిన్న నీటి గుంటలో ఎక్కువ మొత్తంలో కలసిపోయే చెత్త వేసినట్లయితే అది నీటిలో ఆక్సిజన్ సమస్య ఏర్పడుటకు కారణమవుతుంది.
  3. జీవ సంబంధమైన వ్యర్థ పదార్థాలను విచ్ఛిన్నం చేసే ప్రక్రియలో భాగంగా సూక్ష్మజీవులు ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ను వినియోగిస్తాయి.
  4. నీటి గుంటలో నివసించే జీవులకు తగినంత ఆక్సిజన్ లభించకపోవడం వలన ముఖ్యంగా చేపలు మరణిస్తాయి.
  5. ఈ విధముగా నేలలో కలసిపోయే చెత్త నీటి కాలుష్యానికి కారణమవుతుంది.

ప్రశ్న 9.
నత్రజని వలయాన్ని ఉదాహరణగా తీసుకొని సజీవ మరియు నిర్జీవ అంశాలు ఒకదానితో మరొకటి పరస్పరంగా ఎలా ఆధారపడతాయో వివరించండి.
జవాబు:
సజీవ, నిర్జీవ అంశాలు నత్రజని వలయంలో ఒకదానిపై ఒకటి ఆధారపడడం:
AP Board 9th Class Biology Solutions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు 1

  1. వాతావరణంలో ప్రాథమికంగా జడస్థితిలో ఉన్న నైట్రోజన్ ఉంటుంది. ఇది నిర్జీవ అంశము.
  2. నిర్జీవ అంశమైన వాతావరణం నుండి నేలలో ఉండే సజీవ అంశమైన నత్రజని స్థాపన బాక్టీరియా నత్రజనిని స్థాపించి తన శరీర కణములందు నిల్వ చేస్తుంది.
  3. నేలలోని వినత్రీకరణ బాక్టీరియా నైట్రేటులను అమ్మోనియాగా మారుస్తాయి.
  4. నిర్జీవ అంశమైన నేల నుండి సజీవ అంశాలైన మొక్కలు నైట్రేటులను మరియు అమ్మోనియం అయానులను గ్రహించి వాటిని ప్రోటీనులు మరియు కేంద్రకామ్లములుగా మారుస్తాయి.
  5. మొక్కలు మరియు జంతువులు మరణించినపుడు వాటి సేంద్రీయ పదార్థములో ఉన్న నత్రజని తిరిగి నేలకు, నీటిలోనికి చేరుతుంది.
  6. డీ నైట్రిఫైయింగ్ బాక్టీరియా అమ్మోనియంను నేల మరియు నీటిలోనికి విడుదల చేస్తాయి.
  7. నిర్జీవ అంశమైన నేల నుండి సజీవ అంశమైన వాతావరణంలోనికి ప్రవేశిస్తుంది. ఇది డీనైట్రిఫికేషన్ వలన జరుగుతుంది. దీని ద్వారా ఘనరూప నైట్రేట్ వాయురూప నత్రజనిగా మారుతుంది.

ప్రశ్న 10.
ఆక్సిజన్ వలయం, నైట్రోజన్ వలయం, జలచక్రం తెలిపే ఫ్లోచార్టు గీయండి.
జవాబు:
1. ఆక్సిజన్ వలయం
AP Board 9th Class Biology Solutions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు 2
2. నైట్రోజన్ వలయం
AP Board 9th Class Biology Solutions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు 1
3. జలచక్రం
AP Board 9th Class Biology Solutions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు 3

ప్రశ్న 11.
ఓజోన్ పొర గురించి మీరేమి అవగాహన చేసుకున్నారు ? ఓజోన్ పొర యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ వక్తృత్వ పోటీకి, వ్యాసం రాయండి.
జవాబు:

  1. భూమిపైన వాతావరణం వివిధ పొరలుగా విభజింపబడింది.
  2. స్ట్రాటోస్ఫియర్ లో ఎక్కువ మొత్తం ఓజోన్‌ పూరిత వాతావరణం ఉంటుంది.
  3. ఇది భూమి ఉపరితలం నుండి 15-30 కి.మీ. దూరంలో వ్యాపించి ఉంటుంది.
  4. మూడు ఆక్సిజన్ పరమాణువులతో ఓజోన్ అణువు ఏర్పడుతుంది.
  5. ఓజోన్ నీలిరంగులో ఉంటుంది, మరియు ఘాటైన వాసన కలిగి ఉంటుంది.

ఓజోన్ పొర ప్రాముఖ్యత :

  1. ఓజోన్ తక్కువ పరిమాణంలో ఉన్నప్పటికీ వాతావరణంలో ప్రధాన పాత్ర వహిస్తుంది.
  2. సూర్యుని నుండి వచ్చే ప్రభావవంతమైన, శక్తివంతమైన వికిరణం కొంత భాగాన్ని శోషించుకుంటుంది.
  3. తద్వారా అది భూమిపై చేరకుండా కాపాడుతుంది.
  4. ఓజోన్ పొర ప్రధానంగా సూర్యకాంతిలోని అతినీలలోహిత కిరణాలను శోషిస్తుంది.
  5. అతినీలలోహిత కిరణాలు జీవరాశులపై అనేక హానికరమైన ప్రభావాలను కలుగజేస్తాయి. అందులో ముఖ్యమైనది వివిధ రకాల చర్మ క్యాన్సర్.
  6. ఇంకా ఈ కిరణాల వలన పంటలకు, కొన్ని రకాల సముద్ర జీవులకు నష్టం వాటిల్లుతుంది.

AP Board 9th Class Biology Solutions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు

ప్రశ్న 12.
మానవ కార్యకలాపాలు పర్యావరణ ప్రమాదం అనే అంశంపై మీ జిల్లాలోని పిల్లల పత్రికకు పంపడానికి ఒక వ్యాసం తయారుచేయండి.
జవాబు:
భూమి చుట్టూ ఆవరించి ఉన్న గాలి పొరను వాతావరణం అంటారు. మానవులు కూడా పర్యావరణంలో ఒక భాగమై ఉన్నారు. అయినప్పటికీ పర్యావరణానికి అనుకూలంగా తమ కార్యకలాపాలను మార్చుకోలేకపోతున్నారు. మానవుడు చేసే హానికరమైన కార్యకలాపాల వల్ల పర్యావరణం పరిస్థితి దిగజారిపోతూ ఉన్నది.

మానవుడు నేల, నదులు, సముద్రాలు మరియు మహాసముద్రాలను తన యొక్క కార్యకలాపాల వలన కాలుష్యం చేస్తున్నాడు. దీని వలన అవి నేల పంటలు పండించడానికి, నీటి వనరుల వినియోగానికి పనికి రాకుండా పోతున్నాయి.

వన నిర్మూలన వలన అనేక జీవరాసులు ఆవాసం కోల్పోతున్నాయి. ఈ భూగోళం నుండి అనేక జీవజాతులు అంతరించిపోతున్నాయి. ఆనకట్టలు కట్టడం, పరిశ్రమలు స్థాపించడం, అటవీ భూములు గృహ నిర్మాణానికి వినియోగించడం కారణంగా అనేక మొక్క జంతుజాతులు అంతరించిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి.

ఇతర ప్రదేశాల నుండి స్థానిక పరిసరాలలో కొత్త జీవజాతులు ప్రవేశపెట్టడం వలన అవి అనేక వ్యాధులు కలుగజేస్తుండడంతో స్థానిక జీవజాతులు నశించిపోతున్నాయి. సహజంగా ప్రవహించే నీటి వనరుల మార్గాలను మళ్ళించుట వలన వరదలు సంభవిస్తున్నాయి. సహజ వనరులను ఎక్కువ మొత్తంలో వినియోగిస్తున్నందున తక్కువ కాలంలో నిల్వలు తరిగిపోతున్నాయి. శిలాజ ఇంధనాలను మండించడం ఫలితంగా వాతావరణంలోకి వాయువులు విడుదల కావడంవల్ల పర్యావరణం కలుషితమవుతున్నది.

మానవుని కార్యకలాపాల వలన విడుదలయ్యే CO2 గ్రీన్‌హౌజ్ ఎఫెక్టుకు కారణమవుతుంది. ఎక్కువ మొత్తంలో గ్రీన్‌హౌజ్ వాయువులు విడుదల కావడం వలన భూగోళం వేడెక్కుతుంది. భూగోళం వేడెక్కుట వలన వరదలు, కరవు కాటకాలు, తీవ్ర వర్షాభావ పరిస్థితులు కలుగుతున్నాయి. భూగోళం వేడెక్కుట వలన సముద్రమట్టాలు పెరిగి పల్లపు ప్రాంతాలు మునిగిపోతాయి.

విపరీతమైన వ్యవసాయ విధానాలు, గనుల తవ్వకం కారణంగా నేల క్రమక్షయానికి గురవుతుంది. గనుల తవ్వకం వలన వృక్షసముదాయం నశించడమే కాకుండా, నేలలో అస్థిర పరిస్థితులు కలుగుతాయి.

అందువలన మనమందరమూ పర్యావరణమును రక్షించుకోవాలి. మొక్కలు నాటడం, సక్రమమైన వ్యవసాయ విధానాలు పాటించడం ద్వారా మనం మన భూగోళాన్ని కాపాడుకోవచ్చు. మానవుని కార్యకలాపాలు సక్రమమైన మార్గంలో ఉన్నప్పుడు మాత్రమే మనం పర్యావరణానికి మిత్రులుగా ఉంటాం.

ప్రశ్న 13.
పాఠశాల అసెంబ్లీ సమావేశంలో చదివి వినిపించడానికి గ్రీన్‌హౌజ్ ఎఫెక్ట్ పై నినాదాలను తయారుచేయండి.
జవాబు:

  1. పచ్చదనం గురించి ఆలోచించండి. కానీ పచ్చగృహం కాదు.
  2. కాలుష్యాన్ని ఆపండి – భూగోళాన్ని కాపాడండి.
  3. మొక్కలు నాటండి – భూమిని కాపాడండి.
  4. గ్రీన్‌హౌజ్ వాయువులు మొక్కలకు మంచివి, కాని జంతు సముదాయమునకు కాదు.
  5. పచ్చగా ఉంచండి – భూమికి వాయువును చేర్చకండి. 6) పచ్చదనం గురించి ఆలోచించండి – చల్లగా ఉండండి.
  6. ప్రకృతిని కాపాడండి – అది మనలను కాపాడుతుంది.

ప్రశ్న 14.
ఇంధనాల దహనం శాస్త్రవేత్తలకు మరియు పర్యావరణవేత్తలకు ఎందుకు ఆందోళన కలుగచేస్తుంది?
జవాబు:

  1. ఇప్పుడు వాడుతున్న స్థాయిలో శిలాజ ఇంధనాలు దహనం చేస్తుంటే రాబోయే 50 నుండి 100 సంవత్సరాల కాలంలోపు అవి పూర్తిగా తరిగిపోతాయి.
  2. అది జరిగిన నాడు ప్రపంచంలో ఇంధనాలు ఎక్కడా దొరకక మానవ కార్యకలాపాలన్నీ స్తంభించిపోతాయి.
  3. శిలాజ ఇంధనాలను మండించినపుడు వాయురూపంలో వాతావరణంలోకి సల్ఫర్ డై ఆక్సైడ్, సల్ఫర్ ట్రై ఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్ మరియు నైట్రోజన్ డై ఆక్సైడ్లు విడుదల అవుతాయి.
  4. ఇవి వర్షపు నీటిలో గాని, వాతావరణంలో ఉండే తేమలో గాని కరిగి, ఆమ్లాలని ఏర్పరుస్తాయి.
  5. ఈ ఆమ్లాలు వర్షం ద్వారా భూమిని చేరతాయి. వీటిని ఆమ్లవర్షం అంటారు.
  6. ఇంధనాలు మండించినపుడు అధిక మొత్తంలో వెలువడే కార్బన్ డై ఆక్సైడ్ ఎక్కువ మొత్తంలో పరారుణ కిరణాలను గ్రహించుట వలన భూగోళం వేడెక్కుతుంది. దీనిని గ్లోబల్ వార్మింగ్ అంటారు.
  7. తద్వారా భూ ఉష్ణోగ్రతలు అధికమై సముద్రమట్టాలు పెరగడంతో పల్లపు ప్రాంతాలు మునిగిపోతాయి.
  8. గ్లోబల్ వార్మింగ్ వలన అతివృష్టి, అనావృష్టి కలిగి కరువు కాటకాలు సంభవిస్తాయి.

AP Board 9th Class Biology Solutions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు

ప్రశ్న 15.
జల సంచలన వలయాన్ని మనుషులుగా మనం ఎలా ప్రభావితం చేస్తున్నామో వివరించండి.
జవాబు:

  1. మనకు అందుబాటులో ఉన్న నీటి వనరులు మారకపోవచ్చు కాని మనము జల సంచలన వలయాన్ని మార్చవచ్చు. జనాభా పెరుగుట వలన మరియు జీవనస్థాయిలు పెరగడం వలన మనకు కావలసిన నీటి లభ్యత పెరగవచ్చు.
  2. నదులు, వాగులు, జలాశయములను కాలుష్యానికి గురిచేయుట ద్వారా మానవుడు జల సంచలన వలయాన్ని ప్రభావితం చేస్తున్నాడు.
  3. రసాయనిక పదార్థములను, అసహ్యకరమైన పదార్థములను నీటికి చేర్చుట ద్వారా నీటిని కలుషితం చేస్తున్నాము. సాంకేతికంగా మనం జల సంచలన వలయాన్ని మార్చలేము. .కానీ దానికి వ్యర్థ పదార్థములను చేర్చుట ద్వారా తారుమారు చేయగలం.

9th Class Biology 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు Textbook InText Questions and Answers

9th Class Biology Textbook Page No. 185

ప్రశ్న 1.
గ్లోబల్ వార్మింగ్ వలన కలిగే ఉపద్రవాలను గురించి రాయండి.
జవాబు:

  1. వాతావరణంలో అధిక మొత్తంలో కార్బన్ డై ఆక్సైడ్ మరియు ఇతర గ్రీన్ హౌజ్ వాయువులు ఎక్కువగా విడుదల కావటం వలన అవి ఎక్కువ వేడిని నిల్వ చేస్తాయి.
  2. దీని ఫలితంగా భూమిపైన ఉష్ణోగ్రత పెరుగుతుంది. తద్వారా భూమి వెచ్చబడటం జరుగుతుంది. దీనిని గ్లోబల్ వార్మింగ్ అంటారు.
  3. గ్లోబల్ వార్మింగ్ అంటే అధిక మొత్తంలో భూమి, సముద్రాల ఉష్ణోగ్రత నమోదు కావటం.
  4. గ్లోబల్ వార్మింగ్ భూమిపై వాతావరణ మార్పును, శీతోష్ణస్థితి మార్పును కలుగచేయటం వలన సముద్ర నీటిమట్టం పెరగటం, అధిక వర్షపాతం, వరదలు, కరవు కాటకాలు సంభవిస్తాయి.

9th Class Biology Textbook Page No. 185

ప్రశ్న 2.
శీతోష్ణస్థితిలో మార్పు సంభవించినపుడు మానవులు మరియు జంతువులపై ఎటువంటి ప్రభావం ఉంటుంది? చర్చించి మీ నోటుబుక్ లో రాయండి.
జవాబు:

  1. శీతోష్ణస్థితిలో మార్పు మానవులు మరియు జంతువులపై ప్రభావం చూపుతుంది.
  2. వాతావరణం మారినపుడు, ఆ మార్పునకు తట్టుకోలేక చాలా జీవులు మరణిస్తాయి.
  3. మరికొన్ని జీవులు సురక్షిత ప్రాంతాలకు వలసపోతాయి.
  4. ఇంకొన్ని జీవులు సుప్తావస్థ వంటి అనుకూలనాలను ప్రదర్శిస్తాయి.
  5. శీతోష్ణస్థితి మార్పులకు మానవుడు అనారోగ్యం పాలౌతాడు.
  6. శీతోష్ణస్థితి మార్పులకు ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉంది.

AP Board 9th Class Biology Solutions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు

9th Class Biology Textbook Page No. 186

ప్రశ్న 3.
మురికి కాలువల దగ్గర వాసన రావటానికి కారణాలు ఏమిటి?
జవాబు:

  1. మురికి నీటిలో ఆక్సిజన్ పరిమాణం తక్కువగా ఉంటుంది.
  2. ఆక్సిజన్ దొరకనపుడు వాయుసహిత బాక్టీరియాలు మరణిస్తాయి.
  3. అప్పుడు అవాయు బాక్టీరియాలు వ్యర్థ పదార్థాలను హైడ్రోజన్ సల్ఫేడ్ (H2O) మరియు ఇతర విషపదార్థాలుగా మార్చుతాయి.
  4. ఈ పదార్థాలు దుర్గంధమైన వాసనను కలిగిస్తాయి.
  5. అందువలన మురికి కాలువల దగ్గర వాసన వస్తుంది.

9th Class Biology 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు Textbook Activities (కృత్యములు)

ప్రయోగశాల కృత్యము

ఉద్దేశం : ఉష్ణోగ్రతపై గ్రీన్ హౌజ్ ప్రభావాన్ని పరీక్షించుట.

కావాల్సిన పరికరాలు :
ప్లాస్టిక్ సీసా, (ఇనుప సీల), రెండు థర్మామీటర్లు, నోట్ బుక్, పెన్సిల్.

విధానం :

  1. ఇనుప సీలతో ప్లాస్టిక్ సీసా పైభాగాన రంధ్రం చేయాలి.
  2. మొదటి థర్మామీటరు రంధ్రంలో గుచ్చాలి.
  3. సీసా పక్కన రెండవ థర్మామీటర్‌ను ఉంచాలి.
  4. రెండు థర్మామీటర్లకు సమానంగా సూర్యరశ్మి సోకే విధంగా చూడాలి.
  5. 10 నిమిషాల తరువాత రెండు థర్మామీటర్లలోని ఉష్ణోగ్రతను నమోదు చేయాలి.
  6. ఉష్ణోగ్రత వివరాలను నోటు పుస్తకంలో నమోదు చేయాలి.
  7. పది నిమిషాల తరువాత మరియొకసారి ఉష్ణోగ్రతను నమోదుచేయాలి. ఇలా 2-3 సార్లు చేయాలి.

ఈ కింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి.
1) రెండు ‘ థర్మామీటర్లు ఒకే ఉష్ణోగ్రతను నమోదు చేశాయా? లేకపోతే ఏ థర్మామీటరు అధిక ఉష్ణోగ్రతను నమోదు చేసింది?
జవాబు:
సీసాలో గుచ్చిన థర్మామీటరు ఎక్కువ ఉష్ణోగ్రతను నమోదు చేసింది.

2) రెండు ఉష్ణోగ్రతలు సమానంగా ఉండకపోవటానికి కారణాలు ఏమిటి?
జవాబు:
ఎ) ప్లాస్టిక్ సీసా సూర్యరశ్మిని గ్రహించి నిల్వ చేయడం వలన వేడి బయటకు పోకుండా ఆపుతుంది.
బి) లోపలంతా వెచ్చగా ఉంటుంది.
సి) అందువలన సీసా నందు ఉంచిన థర్మామీటరు, సీసా బయట ఉంచిన థర్మామీటరు కంటే ఎక్కువ ఉష్ణోగ్రతను నమోదు చేస్తుంది.

AP Board 9th Class Biology Solutions 10th Lesson నేల కాలుష్యం

SCERT AP 9th Class Biology Guide Pdf Download 10th Lesson నేల కాలుష్యం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Biology 10th Lesson Questions and Answers నేల కాలుష్యం

9th Class Biology 10th Lesson నేల కాలుష్యం Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
నేల కాలుష్యం అంటే ఏమిటి? (AS 1)
జవాబు:
నేల కాలుష్యం :
నేల కాలుష్యం అనగా నేల సారం లేదా నాణ్యతపై ప్రతికూల ప్రభావం చూపే పదార్థాల చేరిక అని అర్ధం.

ప్రశ్న 2.
రసాయనిక ఎరువులు పంటలకు ఉపయోగకరం. కానీ అవి పర్యావరణ కాలుష్యానికి ఏ విధంగా కారణమవుతాయి? (AS 1)
జవాబు:

  1. నేలలో ఎరువులు వేసినప్పుడు ఎరువుల తయారీలో ఉపయోగించే ముడిపదార్థాల నుంచి వచ్చే కలుషితాల వల్ల నేల కలుషితం అవుతుంది.
  2. ఎక్కువగా భాస్వరపు ఎరువులు ఉపయోగించడం వల్ల లోహాలు అయిన ఆర్సినిక్, లెడ్ మరియు కాడ్మియం నేలలో మోతాదుకు మించి చేరి విషతుల్యం అవుతున్నాయి.
  3. ఎక్కువ మొత్తంలో రసాయనిక ఎరువులు ఉపయోగించటం వలన అవి సరస్సులు, నదులు, చెరువులను కాలుష్యానికి గురి చేస్తున్నాయి.
  4. అవి ఎక్కువ మొత్తంలో శైవలాల పెరుగుదలకు కారణమవుతున్నాయి. దీనిని యూటోఫికేషన్ అంటారు.
  5. ఎక్కువ మొత్తంలో పెరిగే శైవలాలు నీటి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయి. మరియు నీటిలో ఆక్సిజన్ శాతాన్ని తగ్గిస్తాయి.
  6. నీటిలో నివసించే ఇతర జీవులకు ఆక్సిజన్ లభ్యం కాకపోవటం వలన అవి చనిపోతాయి.
  7. నత్రజని ఎరువుల నుండి విడుదలయ్యే అమ్మోనియా మరియు నైట్రోజన్ ఆక్సెడుల వలన గాలి కాలుష్యం అవుతుంది.
  8. వీటి వలన ఆమ్ల వర్చాలు ఏర్పడటమే కాకుండా పొగతో కూడిన పొగమంచును నగరాలలో ఏర్పరుస్తాయి.
  9. దీనివలన పర్యావరణ మరియు ఆరోగ్య సమస్యలైన శ్వాససంబంధ వ్యాధులు కలుగుతాయి.

AP Board 9th Class Biology Solutions 10th Lesson నేల కాలుష్యం

ప్రశ్న 3.
మానవ, పశువుల వ్యర్థాలను పర్యావరణానికి మేలు చేసే విధంగా పారవేసే పద్ధతుల గురించి రాయండి. (AS 1)
జవాబు:

  1. ఈ మధ్య కాలంలో పశువుల వ్యర్థాలే కాకుండా మానవుని విసర్జిత పదార్థాలు ప్రత్యామ్నాయ మరియు శ్రేష్టమైన పద్ధతిలో ఇంధనం తయారీలో ఉపయోగించవచ్చు.
  2. వ్యర్థ పదార్థాల నుండి వాయు రహిత కిణ్వనము ద్వారా వాయువు ఉత్పత్తి అవుతుంది. ఆ వాయువును ఇంధనముగా వాడతారు.
  3. ఈ వాయువు జీవ వ్యర్థాల నుండి తయారయినది కాబట్టి దీనిని బయోగ్యాస్ అంటారు.
  4. బయోగ్యాస్ నందు మిథేన్, కార్బన్ డయాక్సెడ్ ఇంకా అతి తక్కువ ప్రమాణంలో హైడ్రోజన్, నైట్రోజన్, హైడ్రోజన్ సల్ఫేట్లు ఉంటాయి.

ప్రశ్న 4.
పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థాల వలన కలిగే నేల కాలుష్యాన్ని తగ్గించడానికి ఏమేమి చర్యలు చేపట్టాలి? (AS 1)
జవాబు:

  1. పరిశ్రమల నుండి విడుదలయ్యే వ్యర్థాలను భౌతికంగా, రసాయనికంగా మరియు జీవ శాస్త్రీయంగా ప్రమాదకరంకాని పదార్థాలుగా వాటిని తయారు చేయాలి.
  2. ఆమ్ల మరియు క్షార వ్యర్థాలను ముందుగా తటస్థీకరించాలి.
  3. నీటిలో కరగని పదార్థములయితే అవి నేలలో కలిసిపోయే పదార్ధములయితే వాటిని సహజ పరిస్థితులలో నేలలో కలసిపోయే విధంగా చేయాలి.
  4. కర్మాగారాల నుండి విడుదలయ్యే పొగలో రేణురూప కలుషితాలను తగ్గించటం కోసం, స్థిర విద్యుత్తు అవక్షేపాల పద్ధతిని ఉపయోగించాలి.

ప్రశ్న 5.
వైద్య సంబంధ వ్యర్థాలు అంటే ఏమిటి? ఎందుకు వీటిని హానికరమైన వ్యర్థాలుగా పరిగణిస్తారు? ప్రమాదకరం కాకుండా వీటిని తొలగించుకొనే పద్ధతులు ఏమి? (AS 1)
జవాబు:

  1. ఆసుపత్రులందు తయారయిన వ్యర్థ పదార్థములను వైద్య సంబంధ వ్యర్థ పదార్థాలు అంటారు.
  2. ఆసుపత్రిలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాల వల్ల అనేక రకాల వ్యాధులు కలుగుతాయి. అందువలన వీటిని హానికరమైన వ్యర్థాలుగా పరిగణిస్తారు.
  3. సిరంజిలు, సూదులు, శస్త్ర చికిత్స పరికరాలు, ఆపరేషన్ థియేటర్ వ్యర్థాలు, మిగిలిన మందులు, బాండేజి గుడ్డలు, మానవ విసర్జితాలు మొదలైనవి వైద్య సంబంధ వ్యర్థాలకు ఉదాహరణలు.
  4. వైద్య సంబంధ వ్యర్థాలు ప్రమాదకరం కాకుండా వీటిని నివాస ప్రాంతాలకు దూరంగా నేలలో గోతులను తీసి పూడ్చివేయాలి.

ప్రశ్న 6.
ఎలాంటి వ్యవసాయ విధానాలు నేల కాలుష్యానికి కారణమవుతాయి? ఇవి ఏ విధమైన ప్రభావాన్ని చూపుతాయి? (AS 1)
జవాబు:

  1. విచక్షణారహితంగా ఎరువులు, శిలీంధ్ర నాశకాలు, కీటక సంహారకాలు, గుల్మనాశకాలు వాడడం, దున్ని వ్యవసాయం చేయడం, పంట మార్పిడి పద్ధతులు అవలంబించకపోవడమనేవి నేల కాలుష్యానికి కారణమవుతాయి.
  2. ఈ విధమైన వ్యవసాయ విధానాలు నేల మీద వ్యతిరేక ప్రభావాలు చూపిస్తాయి.
  3. రసాయనిక ఎరువులు వాడడం వల్ల మనం 20 – 30 సంవత్సరాల వరకే అధికోత్పత్తి సాధించగలం.
  4. ఆ తర్వాత నేల మొక్కలు మొలవడానికి కూడా పనికిరాకుండా పోతుంది.
  5. ఎక్కువ మొత్తంలో శిలీంధ్రనాశకాలు, క్రిమిసంహారకాలు, గుల్మనాశకాలు వినియోగించినట్లయితే నేల లవణీయత పెరిగిపోతుంది. మరియు పంటలు పండించడానికి ఆ నేల ఉపయోగపడదు.
  6. నేలకు ఎలాంటి అంతరాయం కలిగించకుండా పంటలు పండింఛడం, నేలను దున్నకుండా వ్యవసాయం చేయడం.
  7. నేలలో ఎరువులు వేయడానికి చాళ్ళను దున్నడం పనికి వస్తున్నప్పటికీ దీని వలన నేలలో ఉండే సూక్ష్మజీవులు
    చనిపోతాయి. అందువలన నత్రజని స్థాపన తగ్గిపోతుంది.
  8. ఒక రకం పంటను అన్ని కాలాలలో పండించడం వలన నేల కాలుష్యమవుతున్నది. తద్వారా పంట దిగుబడి తగ్గుతుంది.

AP Board 9th Class Biology Solutions 10th Lesson నేల కాలుష్యం

ప్రశ్న 7.
మీ పరిసరాలలో కాలుష్యం కలిగించకుండా అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలను గుర్తించి క్రమంలో రాయంది. (AS 1)
జవాబు:

  1. సేంద్రియ ఎరువులు వినియోగం
  2. సేంద్రియ పురుగు మందులు వినియోగం
  3. సేంద్రియ కలుపు మందులు వినియోగం
  4. పరభక్షక కీటకాల వినియోగం
  5. దున్నకుండా వ్యవసాయం చేయడం
  6. నేలలో సరియైన pH విలువ ఉండేలా చూడటం
  7. పంట మార్పిడి పద్ధతి
  8. క్షారత్వ నిర్వహణ
  9. నేలలోని జీవులు

ప్రశ్న 8.
నేలకు ఉండే మూడు ప్రధాన ధర్మాలను తెలిపి అవి ఏ విధంగా మొక్కల మీద ప్రభావం చూపిస్తాయో రాయండి. (AS 1)
జవాబు:
1) నేలకు ఉండే మూడు ప్రధాన ధర్మాలు :
1. భౌతిక ధర్మాలు, 2. రసాయనిక ధర్మాలు, 3. జీవసంబంధ ధర్మాలు.

2) భౌతిక ధర్మాలు – మొక్కల మీద ప్రభావం :
a) నేలలో ఉన్న అసంఖ్యాకమైన సూక్ష్మజీవులు జైవిక పదార్థాలను మొక్కలకు ఉపయోగపడే పోషకాలుగా మారుస్తాయి.
b) నేలను వ్యవసాయానికి అనుకూలంగా మారుస్తాయి.

3) రసాయనిక ధర్మాలు – మొక్కల మీద ప్రభావం :
a) మొక్కకు కావలసిన పోషకాల అందుబాటు నేల యొక్క pH విలువపై ఆధారపడి ఉంటుంది.
b) నేలలో pH విలువ తగ్గే కొద్దీ మొక్కకు కావలసిన పోషకాలైన సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం మరియు సల్ఫర్ అందుబాటు తగ్గుతుంది.

4) జీవసంబంధ ధర్మాలు – మొక్కల మీద ప్రభావం :
a) నేలలో ఉన్న జీవరాశులు వృక్ష సంబంధ వ్యర్థాల మీద ఆధారపడి జీవిస్తూ నేలలోకి గాలి చొరబడడానికి నీరు నేలలోకి ఇంకేలా చేయడానికి తోడ్పడతాయి.
b) నేలలో ఉండే సూక్ష్మజీవులు జీవ సంబంధములను అనగా సేంద్రియ స్థితిలో ఉన్న వాటిని నిరింద్రియ పదార్థాలుగా మార్చి మొక్కలకు అందిస్తాయి.

ప్రశ్న 9.
ఉదజని సూచిక (pH) అంటే ఏమిటి? నేల ఉదజని సూచిక విలువ చాలా ఎక్కువగా ఉండటం లేదా చాలా తక్కువగా ఉండటం వలన కలిగే ఫలితాలు ఏమిటి? (AS 1)
జవాబు:

  1. నేలల ఆమ్ల మరియు క్లార స్వభావాలను తెలపడానికి pH ప్రమాణాలను ఉపయోగిస్తారు.
  2. మంచి నేలల pH విలువలు 5.5 నుండి 7.5 వరకు ఉంటాయి.
  3. pH విలువ 7 కన్నా తక్కువ కలిగిన నేలలను ఆమ్ల స్వభావం కలిగిన నేలలు అని, pH విలువ 7 కన్నా ఎక్కువ కలిగిన నేలలను క్షార స్వభావం కలిగిన నేలలు అని అంటారు.

ఉదజని సూచిక తక్కువగా ఉండడం వలన కలిగే ఫలితాలు :

  1. నీటిలో కరిగే లోహాలు అల్యూమినియం మరియు మాంగనీసు విషపదార్థాలుగా మారతాయి.
  2. కాల్షియం కొరత ఏర్పడవచ్చు.
  3. మొక్కలకు పోషకాలను అందించే సూక్ష్మజీవుల సంఖ్య తగ్గుతుంది.
  4. చిక్కుడు జాతి మొక్కలలో సహజీవన నత్రజని స్థాపన తీవ్ర ప్రభావానికి లోనవుతుంది.
  5. నేలలో తక్కువ సేంద్రియ పదార్థం ఉంటుంది.
  6. మొక్కలకు అందుబాటులో ఉండే పోషకాల సంఖ్య తగ్గుతుంది.

ఉదజని సూచిక ఎక్కువగా ఉండడం వలన కలిగే ఫలితాలు :

  1. మొక్కలు పోషకాలను గ్రహించడం మరియు సూక్ష్మజీవుల చర్యలు తగ్గిపోతాయి. తద్వారా మొక్కలకు అవి విషపదార్థాలుగా మారతాయి.
  2. ఉదజని సూచిక ఎక్కువగా ఉండుట వలన ఎక్కువ మొక్కలలో కణత్వచపు పొరలు మూయటం లేదా తెరవడం జరుగుతుంది.
  3. ఇది మొక్కల నిర్మాణం పైనా మరియు పోషకాలను పైకి గ్రహించే విధానం పైనా ప్రభావం చూపుతుంది.
  4. ఎక్కువ ఉదజని సూచిక వలన పోషకాలు అత్యధికంగా లభ్యమవడం లేదా అసలు లభ్యం కాకపోవడం జరుగుతుంది.

AP Board 9th Class Biology Solutions 10th Lesson నేల కాలుష్యం

ప్రశ్న 10.
నేల సారవంతత అంటే ఏమిటి? నేలసారం పెంచుకోవడానికి మార్గాలేవి? (AS 1)
జవాబు:

  1. నేల సారవంతత నేల ధర్మాల మీద ఆధారపడి ఉంటుంది.
  2. ముఖ్యంగా నేలకు గల నీటిని నిలిపి ఉంచుకునే శక్తి, మొక్కలకు కావలసిన పోషకాలను కలిగి ఉండి అవసరమైన పరిమాణంలో నేరుగా అందించగలగడం అనే ధర్మాలు నేల సారవంతతను తెలియచేస్తాయి.
  3. సూక్ష్మజీవులు నేలలోని జైవిక పదార్థాన్ని తయారు చేయటంలో, పోషకాలను మెండుగా కలిగి ఉండే హ్యూమస్ తయారీలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి.
  4. నేలలో ఉండే పోషకాలు మట్టి కణాలతో బంధింపబడి ఉండకపోతే అవి మొక్కలకు అందుబాటులోకి రావు.
  5. సారవంతమైన నేల సూక్ష్మజీవులు జీవించడానికి అనుకూలంగా ఉంటుంది.
  6. నేల సారవంతతను పెంచడానికి సేంద్రియ ఎరువులు వినియోగిస్తారు.
  7. శిలీంధ్ర తంతువులు మొక్కల వేళ్ళు చొచ్చుకుపోలేని సూక్ష్మ ప్రదేశాలలోకి వెళ్ళి పోషకాలను సిద్ధం చేస్తాయి.
  8. నేల pH, ఆమ్ల, క్షార స్వభావాలు కూడా పోషకాలను మొక్కలకు అందుబాటులోకి తీసుకురావడానికి తోడ్పడతాయి.
  9. వృక్ష మరియు జంతువుల వ్యర్థాలు కుళ్ళిపోయినపుడు నేలలోనికి పోషకాలు విడుదల అవుతాయి.

ప్రశ్న 11.
జీవ సంబంధ పదార్థం అంటే ఏమిటి? ఇది మొక్కలకు ఎందుకు ముఖ్యమైనది? (AS 1)
జవాబు:

  1. జీవ సంబంధ పదార్థాలలో కుళ్ళిన జంతు, వృక్ష కళేబరాలు, వాటి విసర్జితాలు ఉంటాయి.
  2. సేంద్రియ పదార్థాలలో మొక్కల పెరుగుదలకు అవసరమయ్యే పనికివచ్చే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం మొదలైన పోషకాలు ఉంటాయి.
  3. నేలలో 30 శాతం లేదా అంతకన్నా ఎక్కువ జీవ సంబంధ పదార్థాలను కలిగి ఉండే దానిని జైవిక నేల అంటారు.
  4. నేలలో ఉన్న జీవ సంబంధ పదార్థాలు నేలలో నీరు ఇంకడాన్నీ, నీటిని నిలువ ఉంచుకునే శక్తిని వృద్ధి చేస్తాయి.
  5. నేల నుండి తేమ ఆవిరి కాకుండా నిరోధిస్తాయి. 6) ఇలాంటి నేలలలో ఉండే అసంఖ్యాకమైన సూక్ష్మజీవులు జైవిక పదార్థాలను మొక్కలకు ఉపయోగపడే పోషకాలుగా మారుస్తాయి.

ప్రశ్న 12.
నేలలో జీవ సంబంధ పదార్థ స్థాయిపై ప్రభావితం చేసే కారకాలు ఏవి? నేలలో వీటిని ఎలా పెంచవచ్చు? (AS 1)
జవాబు:
1) నేలలో జీవ సంబంధ పదార్ధ స్థాయిపై ప్రభావం చూపే కారకాలు :
ఉష్ణోగ్రత, వర్షపాతం, సహజంగా పెరిగే చెట్లు, నేల స్వరూపం, నీటి పారుదల, పంటలు పండించడం, నేల దున్నడం మరియు పంట మార్పిడి పద్ధతులు.

2) ఉష్ణోగ్రత :
సేంద్రియ పదార్థం కుళ్ళిపోయే వేగం ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కంటే తక్కువగా ఉన్నప్పుడు జరుగుతుంది.

3) ప్రతి 10°C ఉష్ణోగ్రత తగ్గుదలకు రెండు నుండి మూడు రెట్ల సేంద్రియ పదార్థం మరియు పోషకాలు నేలకు చేర్చబడతాయి.

4) వర్షపాతము :
వర్షపాతము పెరిగే కొద్ది ఏర్పడే సేంద్రియ పదార్థము పెరుగుతుంది.

5) నేల స్వభావం :
అతి నాణ్యమైన స్వరూపం గల నేలలో ఎక్కువ సేంద్రియ పదార్థం ఉంటుంది.

6) సహజంగా పెరిగే చెట్లు :
గడ్డి మైదానాలలో ఉండే నేలలలో ఎక్కువ మొత్తంలో సేంద్రియ పదార్థం ఉంటుంది.

7) నీటి పారుదల :
నీటి పారుదల సక్రమంగా లేని నేలలందు తేమ ఎక్కువగా ఉంటుంది. గాలి చొరబాటు తక్కువ. అందువలన సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉంటుంది.

8) పంటలు పండించడం మరియు దున్నడం :
పంటలు పండే నేలలందు చాలా తక్కువ మొత్తంలో సేంద్రియ పదార్థం. పోషక పదార్థాలు ఉంటాయి.

9) పంట మార్పిడి :
ప్రధాన ధాన్యపు పంట పండించిన తరువాత చిక్కుడు జాతికి చెందిన పంటలు పండిస్తే నేలలో ఎక్కువ మొత్తం సేంద్రియ పదార్థం ఉంటుంది.

AP Board 9th Class Biology Solutions 10th Lesson నేల కాలుష్యం

ప్రశ్న 13.
జైవిక సవరణీకరణ (Bio-Remediation) అంటే ఏమిటి? ఇది నేల కాలుష్యాన్ని నియంత్రించడంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది? (AS 1)
జవాబు:

  1. జీవ సంబంధ పద్ధతుల ద్వారా కాలుష్య కారకాలను తొలగించడాన్ని జైవిక సవరణీకరణ అంటారు.
  2. అవక్షేపాలు, నేల, నీరు మొదలైన వాటిలో ఏర్పడే పర్యావరణ సమస్యలను తొలగించుకోవడానికి సాధారణంగా సూక్ష్మజీవులను ఉపయోగిస్తారు.
  3. జైవిక సవరణీకరణంలో సూక్ష్మజీవులతోపాటు మొక్కలను కూడా ఉపయోగిస్తారు. దీనిని ఫైటోరిమిడియేషన్ అంటారు.
  4. లోహాల వంటి అకర్బన పదార్థాలు, తక్కువ స్థాయిలో గల రేడియోధార్మిక పదార్థాలు వంటి వాటి ద్వారా కలిగే కాలుష్యాన్ని తొలగించడానికి జైవిక పద్ధతులను ఉపయోగిస్తారు.

ప్రశ్న 14.
నేల స్వరూప స్వభావాలు నేలలో ఉండే పోషకాల మీద ప్రభావం చూపిస్తాయి. ఇవి వ్యవసాయం మీద ఎలాంటి ప్రభావం కలిగిస్తాయి? (AS 2)
జవాబు:

  1. వదులుగా, సూక్ష్మరంధ్రాలు కలిగిన నేల ఎక్కువ నీటిని గ్రహిస్తుంది. మరియు వేర్ల విస్తరణకు తోడ్పడుతుంది. వదులుగా ఉన్న నేల పోషకాలను మొక్కలు గ్రహించడంలో ఉపయోగపడుతుంది.
  2. సూక్ష్మమైన రేణువులు కలిగిన మట్టి, నేల యొక్క ఉపరితలమును పెంచుతుంది. తద్వారా పోషకాలను తనలో ఉంచుకోగలుగుతుంది.
  3. ఎక్కువ రంధ్రాలు కలిగిన నేల అనగా ఇసుకనేల తనగుండా ఎక్కువ మొత్తంలో పోషకాలను తనగుండా పోనిస్తుంది. తక్కువ మొత్తంలో పోషకాలు మొక్కలకు అందుబాటులో ఉంటాయి.
  4. సాధారణముగా వదులుగా ఉన్న, గాలి గలిగిన నేల నిర్మాణము మొక్కల పెరుగుదలకు అనుకూలము. పంట దిగుబడి ఎక్కువ వచ్చును.
  5. నేలను దున్నడం ద్వారా చిన్న మరియు పెద్ద మట్టి రేణువులు కలవడం అనేది దున్నడం ద్వారా చేయవచ్చు. ఎరువును దున్నడం ద్వారా నేలలో కలిసే విధంగా చేయవచ్చు.

ప్రశ్న 15.
నేలల సంరక్షణ ముఖ్యమైన అంశము. దీని గురించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే ఏమి జరుగుతుంది? (AS 2)
జవాబు:

  1. నేల అనేక జీవులు, మొక్కలకు ఆవాసం కనుక నేల సంరక్షణ మనకు అతి ముఖ్యమైన అంశము. ఎందువలనంటే నేల మానవులకు, జంతువులకు ఆహార వనరు.
  2. నేల పైభాగము క్రమక్షయమునకు గురి అయినట్లయితే అతి ముఖ్యమైన పోషక పదార్థాలను కోల్పోవటం వల్ల పంట దిగుబడి తగ్గుతుంది. అందువలన ఒక ఎకరాకు వచ్చే ఆహార దిగుబడి తగ్గుతుంది. కనుక నేలను సంరక్షించాలి.
  3. మొక్కల పెరుగుదలకు కావలసిన సేంద్రియ పదార్థం నేలలో ఉన్నది కనుక మనము నేలను సంరక్షించాలి.
  4. నేల సంరక్షణ చర్యలు చేపట్టకపోయినట్లయితే మృత్తికా క్రమక్షయము జరుగుతుంది.
  5. నేల నందు ఎక్కువగా పంటలు పండించినపుడు వాడే ఎరువుల వలన నేల లవణీయత పెరిగి, పంట పండించడానికి అనుకూలముగా ఉండదు. అందువలన నేలను సంరక్షించాలి.
  6. నేలను సంరక్షించకపోయినట్లయితే నేలలోని పోషకాలు తగ్గిపోతాయి.

ప్రశ్న 16.
నేలలో జీవించే ఏవైనా పది జీవుల పేర్లు రాయండి. ఇవి నేల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తున్నాయో రాయండి. (AS 4)
జవాబు:

  1. అతి సూక్ష్మమైన వైరస్లు, ఎలుకలు, నేల ఉడుతలు, బాక్టీరియా, శైవలాలు, శిలీంధ్రాలు, ప్రోటోజోవన్లు, పేడ పురుగులు, వానపాములు వివిధ రకాలయిన పురుగులు ఉంటాయి.
  2. నేలలో నివసించే జీవులు వృక్ష సంబంధ వ్యర్థాల మీద జీవిస్తూ నేలలోకి, గాలి చొరబడడానికి, నీరు నేలలోకి ఇంకేలా చేయడానికి తోడ్పడతాయి.
  3. నేలలో ఉండే సూక్ష్మజీవులు జీవ సంబంధ మూలకాలను అనగా సేంద్రియ స్థితిలో ఉన్న వాటిని నిరింద్రియ పదార్థాలుగా మారుస్తాయి.
  4. నేలలో నిరింద్రియ పదార్థాలు పోగుపడకుండా వివిధ రకాలైన సూక్ష్మజీవులు నియంత్రిస్తూ ఉంటాయి.
  5. సూక్ష్మజీవులు జరిపే వివిధ జీవ, భౌతిక, రసాయనిక చర్యల వల్ల నేలను వ్యవసాయానికి, ఇతర ప్రయోజనాలకు నేల తోడ్పడేలా చేస్తాయి.

AP Board 9th Class Biology Solutions 10th Lesson నేల కాలుష్యం

ప్రశ్న 17.
నేల కాలుష్యం కలిగించే కారకాలను, వాటిని తొలగించే పద్ధతులను వివరించే ఫ్లోచార్టను తయారు చేయండి. (AS 5)
జవాబు:
AP Board 9th Class Biology Solutions 10th Lesson నేల కాలుష్యం 1

ప్రశ్న 18.
మీ పరిసరాలలో కాలుష్యం కలిగించే చర్యలను గుర్తించండి. వాటిని ఎలా నివారించాలో సూచించే ఫ్లో చార్టును లేదా పట్టికను రూపొందించండి. (AS 5)
జవాబు:
మా పరిసరాలలో కాలుష్యం కలిగించే చర్యలు :
పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాలు, రసాయనిక పదార్థాలు, వ్యవసాయ క్రిమిసంహారకాలు, ఎరువులు మరియు కీటక సంహారకాలు, ఘనరూప వ్యర్థాలు.
AP Board 9th Class Biology Solutions 10th Lesson నేల కాలుష్యం 2

ప్రశ్న 19.
కింది గుర్తును చూసి దీనికి అర్థం ఏమిటో చెప్పండి. (AS 5)
AP Board 9th Class Biology Solutions 10th Lesson నేల కాలుష్యం 3
జవాబు:

  1. ఇది జైవిక సవరణీకరణకు సంబంధించిన గుర్తు.
  2. మొక్కలు జైవిక సవరణీకరణకు ఉపయోగపడతాయని అర్థం.

ప్రశ్న 20.
ప్లాస్టిక్ సంచులు పర్యావరణానికి ఆటంకం కలిగిస్తున్నాయంటారు ఎందుకు? (AS 6)
జవాబు:

  1. ప్లాస్టిక్ వినియోగం అత్యధికంగా ఉండటం వల్ల పర్యావరణంపై దాని యొక్క ప్రభావం అధికంగా ఉన్నది.
  2. ప్లాస్టిక్ సంచుల వినియోగం వలన నీటి ప్రవాహాలకు ఆటంకం ఏర్పడటం, నేలలోని సూక్ష్మరంధ్రాలను మూసివేయటం మురియు భూగర్భజల సేకరణకు ఆటంకం మొదలైనవి ఏర్పడుతున్నాయి.
  3. నేలలో ఉన్న సూక్ష్మజీవుల క్రియాత్మకతపై ప్లాస్టిక్ సంచులు ప్రభావం చూపిస్తాయి.
  4. ప్లాస్టిక్ సంచులను తిన్న జంతువులు చనిపోవడం జరుగుతుంది.
  5. ప్లాస్టిక్ సంచుల నుండి విడుదలయ్యే విషపూరిత రంగులు ఆహార పదార్ధములను కలుషితం చేస్తాయి.
  6. ప్లాస్టిక్ సంచులు నేలపై వెదజల్లబడతాయి లేదా సరియైన యాజమాన్య నిర్వహణలేని చెత్తకుప్పలందు పేరుకొని ఉంటాయి. ఇవి నేలలో కలసిపోవడానికి వందల సంవత్సరాల సమయం పడుతుంది.
  7. పేరుకొనిపోయిన ప్లాస్టిక్ సంచుల వలన పర్యావరణానికి హాని కలుగుతుంది.

ప్రశ్న 21.
నేల ఆరోగ్యం ఎంతో ముఖ్యమైన అంశం అని రాము చెప్పాడు. నీవు అతనిని ఎలా సమర్థిస్తావు? (AS 6)
జవాబు:

  1. నేల ఆరోగ్యం ఎంతో ముఖ్యమైన అంశం అని రాము చెప్పిన మాటను నేను సమర్ధిస్తాను.
  2. ఎందుకంటే ఆరోగ్యవంతమైన నేల ద్వారా వచ్చే ఆహార ఉత్పత్తులను తిన్న ప్రాణులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.
  3. నేలలో ఉండవలసిన అంశాలు సమపాళ్ళలో ఉన్నప్పుడు ఆ నేల అధిక దిగుబడి కూడా ఇస్తుంది.

ప్రశ్న 22.
మీ గ్రామంలో మీరు ఏ ఏ నేల కాలుష్య సమస్యలను గుర్తించారు? వాటికి కారణాలను, అవి తొలగించడానికి సూచనలను రాయండి. (AS 7)
జవాబు:
మా ఊరిలో నేను గుర్తించిన నేల కాలుష్య సమస్యలు :

నేల కాలుష్య సమస్య కారణం తొలగించడానికి సూచనలు
1. మురికి కాలువల్లో చెత్త పేరుకొనిపోవడం నీటి ప్రవాహంలో ఘనరూప పదార్థాలు అడ్డుపడడం 1. కాలువలలో ఘనరూప వ్యర్థాలు వేయకుండా చూడాలి.
2. ఎప్పటికప్పుడు కాలువలో పూడిక తీయాలి.
2. దుర్వా సన ఒకే ప్రదేశంలో వ్యర్థాలు పారవేయడం నివాస ప్రదేశాలకు దూరంగా వ్యర్థాలను పారవేయాలి.
3. ఆసుపత్రి వ్యర్థాల వలన నేల కాలుష్యం జనావాస ప్రదేశాలలో ఆసుపత్రి వ్యర్థాలు వేయడం సుదూర ప్రాంతాలలో నేలలో గోతులు తీసి పూడ్చాలి.
4. మల విసర్జన వల్ల కాలుష్యం, దుర్వాసన రోడ్లకు ఇరువైపులా మల విసర్జన పాయఖానాలను మల విసర్జనకు వినియోగించాలి.
5. నేల లవణీయత పెరుగుదల ఎక్కువ మొత్తంలో రసాయనిక ఎరువులు వాడడం సేంద్రియ ఎరువులను వినియోగించాలి.

AP Board 9th Class Biology Solutions 10th Lesson నేల కాలుష్యం

ప్రశ్న 23.
ఘనరూప వ్యర్థాలు అంటే ఏమిటి? ఘనరూప వ్యర్థాల యాజమాన్యానికి సరైన పద్ధతులను సూచించండి. (AS 7)
జవాబు:

  1. వివిధ చర్యల ద్వారా సమాజం చేత ఒకసారి వాడుకొని పారేయబడిన కర్బన, అకర్బన పదార్థాలు వ్యర్థాలు అన్నింటిని ఘనరూప వ్యర్థాలు అంటారు.
    ఘనరూప వ్యర్థాల యాజమాన్యానికి సరైన పద్ధతులు :
  2. తగ్గించడం (Reduce), తిరిగి ఉపయోగించడం (Reuse), మరల వాడుకునేందుకు వీలుగా మార్చడం (Recycle), తిరిగి చేయడం (Recover) (4R system) అనే పద్ధతుల ద్వారా ఘనరూప వ్యర్థాలను తగ్గించవచ్చు.
  3. కాగితం, గాజు, కొన్ని రకాల ప్లాస్టిక్ వస్తువులను తిరిగి ఉపయోగించుకునే విధంగా తయారుచేయడం.
  4. ఘనరూప వ్యర్థాల యాజమాన్యంలో వ్యర్థాల సేకరణ, అనుకూలమైన ప్రదేశాలకు రవాణా చేయడం, పర్యావరణానికి విఘాతం కలిగించని పద్ధతుల ద్వారా తొలగించడం అనే దశలు పాటించాలి.
  5. ఘనరూప వ్యర్థాల యాజమాన్యంలో వీటిని నివాస ప్రాంతాలకు దూరంగా నేలలో గోతులను తీసి పూడ్చడమనేది అందరికి తెలిసిన పద్ధతి.
  6. ఘనరూప వ్యర్థాలను ఎరువుగా మార్చడం, అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద మండించడం కూడా చేయవచ్చు.

9th Class Biology 10th Lesson నేల కాలుష్యం Textbook InText Questions and Answers

9th Class Biology Textbook Page No. 159

ప్రశ్న 1.
మనం ఎక్కడ పడితే అక్కడ వ్యర్థాలను పడేస్తూపోతే ఏమవుతుంది?
జవాబు:

  1. మనం ఎక్కడపడితే అక్కడ వ్యర్థాలను పడేస్తూపోతే అవి పరిసరాలను కాలుష్యపరుస్తాయి.
  2. నేల కాలుష్యానికి గురి చేస్తాయి. దుర్వాసన వెదజల్లుతాయి.
  3. ఒక్కొక్కసారి వ్యాధులను వ్యాప్తి చేయడంలో కారకమవుతాయి.
  4. మనుష్యుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి.

9th Class Biology Textbook Page No. 161

ప్రశ్న 2.
ఈ రోజు మీ పాఠశాల / ఇంట్లో ఉత్పత్తి అయిన వ్యర్థాలు ఏవి? వాటిలో కుళ్ళిపోని వ్యర్థాలు ఏవి? ఇవి ఏ విధంగా నేల కాలుష్యానికి కారణమవుతున్నాయి?
జవాబు:
ఈ రోజు మా పాఠశాల / ఇంట్లో ఉత్పత్తి అయిన వ్యర్థాలు :
వంటింటి చెత్త, పండ్ల తొక్కలు, మిగిలిన అన్నం, మినుముల పొట్టు, గాజు ముక్కలు, పెన్నులు, పాలిథీన్ కవర్లు, కార్డుబోర్డు, పేపరు, రబ్బరు, టీ గ్లాసులు, బిస్కెట్లు, చాక్లెట్ల కవర్లు, ఐస్ క్రీం పుల్లలు మొదలగునవి.

కుళ్లిపోని వ్యర్థాలు :
గాజు ముక్కలు, పాలిథీన్ కవర్లు, రబ్బరు, టీ గ్లాజులు (ప్లాస్టిక్), ఇవి ఎక్కువ కాలం నేలలో కలిసిపోకుండా ఉంటాయి. నేలలోనికి విష పదార్థాలను విడుదల చేస్తాయి. నీటి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయి.

9th Class Biology Textbook Page No. 156

ప్రశ్న 3.
నేలల ఆమ్ల లేదా క్షార స్వభావం ఎక్కువైతే ఏం జరుగుతుంది?
జవాబు:

  1. నేలలందు ఆమ్ల లేదా క్షార స్వభావం ఎక్కువైతే మొక్కలకు లభ్యమయ్యే పోషకాలు తగ్గిపోతాయి.
  2. తద్వారా పంట దిగుబడి గణనీయంగా తగ్గుతుంది.

AP Board 9th Class Biology Solutions 10th Lesson నేల కాలుష్యం

9th Class Biology Textbook Page No. 157

ప్రశ్న 4.
ఒక నేల సారవంతమైనది ఎలా చెప్పగలవు? జట్లతో చర్చించి మీ అభిప్రాయం రాయండి.
జవాబు:
నేల సారవంతమైన ధర్మాలపై ఆధారపడి ఉంటుంది. అవి :

  1. సారవంతమైన నేల మంచి దిగుబడిని ఇస్తుంది.
  2. సారవంతమైన నేల మంచి పోషకాలను కలిగి ఉంటుంది.
  3. ఈ నేలకు నీటిని నిలుపుకొనే సామర్ధ్యం అధికం.
  4. మొక్కలకు పోషకాలను నేరుగా అందిస్తుంది.
  5. సూక్ష్మజీవులు జీవించటానికి అనుకూలంగా ఉంటుంది.
  6. వేర్ల పెరుగుదలకు సౌకర్యంగా ఉంటుంది.
  7. సారవంతమైన నేల మంచి ఆవాసంగా ఉంటుంది.

9th Class Biology 10th Lesson నేల కాలుష్యం Textbook Activities (కృత్యములు)

కృత్యం – 1

1. కింది సూచనల ఆధారంగా పట్టిక నింపండి.
1) పాఠశాల విరామ సమయంలో వేణు ఒక పండు తింటున్నాడు.
2) పండ్ల తొక్కను వరండాలో మూలకు పడేశాడు.
3) అతని మిత్రుడు రాము అలా చేయడం తప్పు అన్నాడు. మనం వ్యర్థాలను వరండాలో వేయరాదు. తరగతి గదిలో ఉన్న చెత్తబుట్టలో వేయాలి అన్నాడు.
4) ఏయే వ్యర్థాలను ఎక్కడ వేయాలో కింది పట్టికలో రాయండి.

తడి చెత్త పొడి చెత్త
1. కూరగాయల చెత్త బిస్కట్ కవర్లు
2. అరటి తొక్కలు పాలిథీన్ కవర్లు
3. ఆహార పదార్థాలు వాడిన కాగితాలు
4. పండ్ల తొక్కలు ప్లాస్టిక్ వస్తువులు
5. పేడ గాజు వస్తువులు
6. చొప్ప అట్ట ముక్కలు

పేడ, చొప్ప వంటి తడి చెత్తను నిర్దేశిత ప్రదేశంలో వేయాలి. మిగిలిన తడి చెత్తలను ఒక చెత్త బుట్టలోనూ, పొడి చెత్తలను మరొక చెత్త బుట్టలోనూ వేయాలి.

కృత్యం – 2

2. పై పట్టికలో మీరు రాసిన వాటిలో ఒక రోజులో మీరు పారవేసే తడి చెత్త బరువును కొలవండి.
జవాబు:
1) మీ ఇంటిలో గల సభ్యుల సంఖ్యతో ఆ బరువును భాగించండి.

2) ఉదాహరణకు ఒక ఇంటిలో గల సభ్యుల సంఖ్య 4. వారు ఒక రోజు పడవేసే తడి చెత్త బరువు సుమారు 400 గ్రా.
ఆ ఇంటి తలసరి తడి చెత్త = 400 ÷ 4 = 100 గ్రా.
ఒక సంవత్సరానికి తయారయ్యే తలసరి చెత్త = 100 గ్రా. × 365
= 36500 గ్రా. = 36.5 కి.గ్రా.

AP Board 9th Class Biology Solutions 10th Lesson నేల కాలుష్యం

కృత్యం – 3

3. చెత్తను కుళ్ళింపజేయడం

  1. పాలిథీన్ సంచి లేదా ప్లాస్టిక్ బకెట్ లేదా ఏదైనా ఒక డ్రమ్ము వంటి పాత్రను తీసుకోవాలి.
  2. దానిని సగం వరకు మట్టితో నింపాలి.
  3. దీనిలో తడి చెత్త మరియు ఇతర చెత్తలను వేయండి.
  4. ఈ చెత్తలో కచ్చితంగా కూరగాయల తొక్కలు, రబ్బరు, ప్లాస్టిక్ వంటి పదార్థాలుండాలి.
  5. దీనికి మరికొంత మట్టిని జత చేయాలి.
  6. దీనిపై నీళ్ళను క్రమం తప్పకుండా రోజూ చల్లుతూ ఉండండి.
  7. ప్రతి 15 రోజులకు ఒక్కసారి దాని లోపల తవ్వి చూడాలి. ఇలా చేసేటప్పుడు చేతి తొడుగులు ధరించాలి.
  8. పని పూర్తయిన తరువాత చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.

కింద ఇచ్చిన పట్టికలో పరిశోధనలు నమోదు చేయాలి.
AP Board 9th Class Biology Solutions 10th Lesson నేల కాలుష్యం 4

AP Board 9th Class Biology Solutions 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు

SCERT AP 9th Class Biology Study Material Pdf Download 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Biology 9th Lesson Questions and Answers వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు

9th Class Biology 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
జీవులలో అనుకూలనాలు అంటే ఏమిటి? అనుకూలన యొక్క ఆవశ్యకత ఏమిటి? (AS 1)
జవాబు:

  1. వివిధ పరిస్థితులలో జీవించే జీవులు కొంతకాలం తరువాత వాటికి అనుకూలంగా మారతాయి లేదా అభివృద్ధి చెందుతాయి. వీటినే జీవులలోని అనుకూలనాలు అంటారు.
  2. అనుకూలనాలు ఒక జనాభాలో కనపడే సాధారణ లక్షణం. ఎందుకంటే ఇవి జీవులకు మనుగడ సాగించడానికి పురోగతి చూపుతాయి.
  3. ఆవరణ వ్యవస్థలలో జరిగే ప్రస్ఫుట, వైవిధ్య మార్పులకు అనుగుణంగా జీవులు జీవించడానికి వివిధ రకాల అనుకూలనాలు చూపాలి.

ప్రశ్న 2.
రెందు ఉదాహరణలిస్తూ జీవులు ఆవరణ వ్యవస్థలో అనుకూలనాలు ఎలా ఏర్పరచుకున్నాయో వివరించండి. (AS 1)
జవాబు:

  1. మడ అడవులు తడి మరియు లవణీయత అధికంగా ఉన్న ప్రదేశాలలో పెరుగుతాయి.
  2. వీటి వేర్ల నుండి శ్వాసరంధ్రాలు అనే వింతైన భాగాలు అభివృద్ధి చెందుతాయి.
  3. ఈ భాగాలు ఉపరితలం దగ్గర పెరిగే పార్శ్వ వేర్ల నుండి, నేల నుండి బయటకు పొడుచుకుని వస్తాయి. ఇవి దాదాపుగా 12 అంగుళాల పొడవు ఉంటాయి.
  4. నీటి పరిసరాలలో పెరిగే ఈ మొక్కలు వేర్ల ద్వారా శ్వాసక్రియ జరుపుతాయి.
  5. మరియొక ఉదాహరణ కలబంద మొక్కల్లో పత్రాలు ముండ్లుగా మార్పు చెందుటవలన బాష్పోత్సేకం ద్వారా నీరు వృథా కాదు.
  6. కాండంలోని కణజాలం నీటిని నిలువ చేసి రసభరితంగా ఉంటాయి.
  7. ఈ మార్పు ద్వారా నీటి కొరత పరిస్థితులు ఏర్పడినపుడు మొక్కలు వాటిని తట్టుకొని జీవించగలవు.
  8. ఇలాంటి పరిస్థితులు ఎడారి ప్రాంతాలలో కనబడతాయి.

AP Board 9th Class Biology Solutions 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు

ప్రశ్న 3.
క్రింది జీవులలో కనిపించే ప్రత్యేక అనుకూలనాలు ఏవి? (AS 1)
ఎ. మడ అడవుల చెట్లు బి. ఒంటె సి. చేప ది. డాల్సిన్ ఇ. ఫ్లవకాలు
జవాబు:
ఎ. మడ అడవుల చెట్లు:
AP Board 9th Class Biology Solutions 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు 1

  1. మడ అడవులు తడి, ఉప్పు నీటి సమస్యను ఎదుర్కొనడానికి చిత్రమైన మార్గాలు అవలంబిస్తాయి.
  2. వీటి పార్శ్వపు వేర్లనుండి శ్వాసరంధ్రాలు అనే భాగాలు అభివృద్ధి చెందుతాయి.
  3. ఈ భాగాలు నేల నుండి దాదాపుగా 12 అంగుళాలు పొడవు ఉంటాయి.
  4. నీటి పరిసరాలలో పెరిగే ఈ మొక్కలు వేర్ల ద్వారా శ్వాసక్రియ జరుగుటకు మడ అడవుల చెట్లు తోడ్పడతాయని భావిస్తారు.

బి. ఒంటె:
AP Board 9th Class Biology Solutions 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు 2

  1. ఒంటె మోపురం కొవ్వును తదుపరి అవసరాల కోసం నిల్వచేస్తుంది.
  2. పొడవైన కనుబొమ్మలు కంటిని ఇసుక, దుమ్ము నుండి రక్షిస్తాయి.
  3. నాశికారంధ్రాలు స్వేచ్చాయుతంగా మూసుకోవటం వలన వీచే ఇసుక నుండి రక్షణ పొందుతుంది.
  4. పొడవైన కాళ్ళు వేడెక్కిన ఇసుకనేల నుండి శరీరాన్ని దూరంగా ఉంచుతాయి.

సి. చేప :
AP Board 9th Class Biology Solutions 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు 3

  1. చేప శరీరం పొలుసులచే కప్పబడి ఉంటుంది.
  2. చేపలు నీటిలో ఈదడానికి తెడ్ల వంటి వాజాలు అనే ప్రత్యేక నిర్మాణాలు కలిగి ఉంటాయి.
  3. చేపలలో ఫోటర్స్ అనే గాలితిత్తులు ఉండడం వలన నీటిలోని వివిధ స్థాయిలలో నివసించగలుగుతున్నాయి.
  4. మొప్పల ద్వారా చేపలు శ్వాసిస్తాయి.

డి. డాల్ఫిన్ :
AP Board 9th Class Biology Solutions 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు 4

  1. చర్మం క్రింద మందపాటి కొవ్వుపొర, చలి నుండి రక్షిస్తుంది.
  2. ఈదటానికి ఈత తిత్తి తోడ్పడుతుంది.
  3. ఫ్లోటర్స్ అనే గాలితిత్తుల వలన నీటిలోని వివిధ స్థాయిలలో నివసించగల్గును.

ఇ. ప్లవకాలు :

  1. నీటిపై తేలియాడే మొక్కలు ప్లవకాలు. ఇవి అతి సూక్ష్మమైనవి.
  2. కిరణజన్య సంయోగక్రియ జరిపే ప్లవకాలు కణాలలో ఉండే నూనె బిందువుల సహాయంతో నీటిపై తేలతాయి.

AP Board 9th Class Biology Solutions 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు 5

ప్రశ్న 4.
యూఫోటిక్ మండలంలోని జీవి అబైసల్ మండలంలో జీవించాలంటే కావలసిన అనుకూలనాలు ఏవి? (AS 1)
జవాబు:
అబైసల్ మండలంలో జీవించడానికి కావలసిన అనుకూలనాలు :

  1. భక్షించబోయే జంతువులు తప్పించుకోకుండా ఉండేందుకు పెద్ద జంతువులకు విశాలమైన నోరు, పెద్దగా వంకర తిరిగిన పళ్ళు ఉండాలి.
  2. అస్థిపంజరం ఉండకుండా, బల్లపరుపు శరీరాలు ఉండాలి.
  3. పొట్ట కింద, కళ్ళ చుట్టూ మరియు శరీర పార్శ్వభాగాలలో కాంతిని ఉత్పత్తి చేసే ప్రత్యేక అవయవాలు ఉండాలి.
  4. జీవులు చీకటిలో కూడా ప్రకాశవంతంగా కనబడాలి.

ప్రశ్న 5.
సముద్ర నీటి చేపలు మంచినీటి చేపల కన్నా ఎక్కువగా నీరు తీసుకుంటాయి. దీనిని మీరు అంగీకరిస్తారా? ఎందుకు? (AS 1)
జవాబు:

  1. అవును. సముద్రపు నీటి చేపలు మంచినీటి చేపల కన్నా ఎక్కువగా నీరు తీసుకుంటాయి.
  2. సముద్రంలోని చేపల శరీరంలోని లవణీయత సముద్ర నీటి సాంద్రత కంటే తక్కువ ఉంటుంది.
  3. కావున ద్రవాభిసరణం ద్వారా కోల్పోయిన నీటి కొరతను పూరించడానికి అధిక పరిమాణంలో నీరు గ్రహిస్తాయి.
  4. నీటిలోని లవణాలను మూత్రపిండాలు మరియు మొప్పలలోని ప్రత్యేక కణాల ద్వారా విసర్జిస్తాయి.

ప్రశ్న 6.
కొలను/ సరస్సులోని జీవులపై ఉష్ణోగ్రత ప్రభావాన్ని, వాటి అనుకూలనాలను పట్టికలో వివరించండి. (AS 1)
జవాబు:

  1. వేసవిలో లోతైన సరస్సు, కొలనులలో ఉపరితల నీటి భాగం వేడెక్కుతుంది. లోతైన భాగాలు చల్లగా ఉంటాయి.
  2. అందువలన జీవులు పగటిపూట నీటి లోతునకు,రాత్రి నందు నీటి ఉపరితలానికి వస్తాయి.
  3. ఉష్ణమండల ప్రాంతాలలో వేసవిలో నీరు వేడెక్కి ఆవిరి అవుతుంది. తద్వారా నీటి యొక్క లవణీయత పెరుగుతుంది.
  4. ఆక్సిజన్ సాంద్రత మరియు లభ్యమయ్యే ఆహార పరిమాణం తగ్గుతుంది.
  5. శీతల ప్రాంతాలలో నీటి ఉపరితలం గడ్డకట్టుకుపోతుంది. ఈ కాలంలో జంతువులు సరస్సు నందు నీరు గడ్డకట్టని ప్రదేశంలో జీవిస్తాయి.
  6. శీతాకాలంలో కొలను మొత్తం గడ్డకట్టుకుపోతుంది. తద్వారా దానిలో ఉండే జీవులన్నీ మరణిస్తాయి.
  7. నీటిలో నివసించే జీవులు అధిక ఉష్ణోగ్రతను మరియు అధిక శీతలాన్ని తట్టుకోవడానికి గ్రీష్మకాల సుప్తావస్థ మరియు శీతాకాల సుప్తావస్థను అవలంబిస్తాయి.

AP Board 9th Class Biology Solutions 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు

ప్రశ్న 7.
మడ అడవుల ఆవరణ వ్యవస్థ మీరు చదివిన సముద్ర ఆవరణ వ్యవస్థ కంటే భిన్నంగా ఎందుకు ఉంటుంది? (AS 1)
జవాబు:

  1. మన దేశం మడ అడవుల పరిమాణంలో కోరింగ మడ ఆవరణ వ్యవస్థ రెండవ స్థానంలో ఉంది.
  2. కాకినాడకు 20 కి.మీ. దూరంలో ఉన్న మడ అడవుల ఆవరణ వ్యవస్థ అనేక రకాల మొక్కలకు మరియు జంతువులకు ప్రసిద్ధమైనది.
  3. మడ అడవులు నివసించే ప్రదేశపు పరిస్థితులకు అనుకూలనాలు చూపిస్తాయి.
  4. లవణీయతను తట్టుకొని నిలబడగలిగే అనేకమైన మొక్క జాతులు అనగా రైజోపొర, అవిసీనియా, సొన్నరేట ఏజిసిరాకు నిలయం కోరింగ మడ అడవులు.
  5. అనేకమైన పొదలు మరియు గుల్మములు మడ అడవుల ఆవరణ వ్యవస్థలో ఉంటాయి.
  6. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు సముద్రతీర ప్రాంతములలో విస్తారమైన మరియు అధిక ఉత్పత్తిని ఇచ్చే అడవులను మడ అడవులు ఏర్పరుస్తాయి.
  7. ఏ ఇతర ప్రదేశాల్లో నివసించలేని మొక్కలు మరియు జంతు జాతులు మడ అడవులలో ఉంటాయి.
  8. ఉష్ణమండల మరియు సమశీతోష్ణ మండలములలో లవణీయతను తట్టుకొని నిలబడగలిగే అడవులు మడఅడవులు.

ప్రశ్న 8.
అత్యల్ప చలి, అధిక వేడి నుండి కప్ప ఎలా రక్షించుకుంటుంది? (AS 1)
జవాబు:

  1. కప్ప లాంటి ఉభయచరాలు కాలాన్ని బట్టి అనుకూలనాలు చూపిస్తాయి.
  2. అత్యుష్ఠ, అతిశీతల పరిస్థితుల నుండి రక్షించుకోవడానికి నేలలో లోతైన బొరియలు చేసుకొని వాటిలో గడుపుతాయి.
  3. అనుకూల పరిస్థితులు ఏర్పడే వరకు కదలక నిశ్చలంగా అందులోనే ఉంటాయి.
  4. ఈ కాలంలో జీవక్రియల రేటు తగ్గి జంతువు దాదాపుగా స్పృహలేని నిద్రావస్థకు చేరుకుంటుంది.
  5. దీనినే శీతాకాల సుప్తావస్థ లేదా గ్రీష్మకాల సుప్తావస్థ అంటారు.

ప్రశ్న 9.
కొర్రమట్ట (మరల్) మరియు రొహూ చేపలు నదుల్లో ఉంటాయి. అవి కోరింగ ఆవరణ వ్యవస్థలో జీవించగలవా? ఎందుకో ఊహించండి. (AS 2)
జవాబు:

  1. అవును. కొర్రమట్ట మరియు రొహూ చేపలు కోరింగ ఆవరణ వ్యవస్థలో జీవించగలవు.
  2. ఎందువల్లనంటే కోరింగ ఆవరణ వ్యవస్థలోనికి కోరింగ, గాచేరు మరియు గౌతమి, గోదావరి ఉపనదులు ప్రవహిస్తాయి.
  3. కోరింగ ఆవరణ వ్యవస్థలో లవణీయత పెరిగినట్లయితే మంచినీటి చేప శరీరములోనికి నీరు ప్రవేశిస్తుంది.
  4. చేప శరీరములోనికి ప్రవేశించిన నీటిని మూత్రము ద్వారా విసర్జించవచ్చు.
  5. కానీ శరీరములో లవణ సమతుల్యతను ఉంచడానికి మంచినీటి చేప మూత్రపిండాలు మరియు మొప్పలలో ఉండే లవణగ్రాహక కణాలచే లవణాలను తిరిగి గ్రహిస్తుంది.

ప్రశ్న 10.
కొన్ని నీటి మొక్కలను సేకరించి వాటి కాండాలు, ఆకులు స్లెదు తయారు చేసి సూక్ష్మదర్శినిలో పరిశీలించి మీ పరిశీలనలు నమోదు చేయండి. (ఉదా : గాలి గదులు ఉన్నాయి/లేవు మొదలైనవి) ఇప్పుడు కింది ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి. (AS 3)
ఎ) అవి నీటిపై ఎందుకు తేలుతాయి?
బి) అవి తేలడానికి ఏవి సహాయపడతాయి?
సి) సూక్ష్మదర్శినిలో గమనించిన భాగాల పటాలు గీయండి. (AS 5)
జవాబు:
ఎ) శరీర భాగాల్లో గాలి గదులు ఉండుట వలన
బి) తేలడానికి గాలితో నిండిన గాలిగదులు సహాయపడతాయి.
సి) సూక్ష్మదర్శినిలో గమనించిన భాగాల పటాలు
AP Board 9th Class Biology Solutions 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు 6

ప్రశ్న 11.
సమీపంలోని చెరువు కుంటను సందర్శించి మీరు గమనించిన జీవులు, వాటిలోని అనుకూలనాల జాబితాను తయారు చేయండి. (AS 4)
జవాబు:

  1. చెరువు ఒడ్డున తక్కువ లోతుగల భాగాన్ని లిటోరల్ మండలం అంటారు.
  2. చెరువు ఒడున వెచ్చగా ఉండే పై భాగంలో నత్తలు, చేపలు, ఉభయచరాలు, తూనీగ గుడ్లు, లార్వాలు ఉన్నాయి.
  3. తాబేళ్ళు, పాములు, బాతులు భక్షకాలుగా జీవిస్తాయి. నాచు, బురద తామర, వాలిస్ నేరియా, హైడ్రిల్లా ఉన్నాయి.
  4. ఈ మండలంలో అనేక జీవులు అభివృద్ధి చెందిన దృష్టిజ్ఞానం కలిగి ఉంటాయి.
  5. ఈ మండలంలో వేగంగా ఈదగలిగే జీవులు, తక్కువ రంగు గల బూడిద వర్గం శరీరం గల జీవులు ఉన్నాయి.
  6. లిమ్నెటిక్ మండలంలో డాప్సియా, సైక్లాప్స్, చిన్ని ప్రింప్ చేపలు ఉన్నాయి. అంతర తామర, గుర్రపుడెక్క, బుడగ తామర, శైవలాలు ఉన్నాయి.
  7. చేపలు పరిసరాలలో కలసిపోయే విధంగా ప్రకాశవంతంగా ఉండే బూడిద వర్ణం, వెండి – నలుపు రంగు కలిగిన పొలుసులు ఉంటాయి.
  8. మొక్కలలో గాలి గదులు, ఆకుల పైన మైనం పూత ఉంటుంది.
  9. ప్రొఫండల్ మండలంలో రొయ్యలు, పీతలు, ఇసుక దొండులు, నత్తలు, తాబేళ్ళు ఉన్నాయి.
  10. ఇవి నీటి అడుగు భాగానికి చేరే మృత జంతువులను భక్షించడానికి అనువుగా పెద్దనోరు, వాడియైన దంతాలను కలిగి ఉంటాయి.

AP Board 9th Class Biology Solutions 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు

ప్రశ్న 12.
ఇంటర్నెట్ నుండి ఒక సరస్సు యొక్క సమాచారాన్ని సేకరించి వివిధ మండలాల్లోని జీవులు, వాటిలో కనబడే అనుకూలనాల పట్టికను తయారుచేయండి. (AS 4)
జవాబు:

మండలం మండలంలోని జీవులు అనుకూలనాలు
లిటోరల్ మండలం నత్తలు, రొయ్యలు, చేపలు, ఉభయచరాలు, నాచులు, బురద తామరలు,వాలి నేరియా, హైడ్రిల్లా మొక్కలు.
భక్షకాలు అయిన తాబేళ్లు, పాములు, బాతులు ఉంటాయి.
అభివృద్ధి చెందిన దృష్టి జ్ఞానం కలవి. వేగంగా ఈదుతాయి. మొక్కలలో గాలిగదులు, ఆకులపై మైనంపూత ఉంటాయి. నేలమీద నీటిలో నివసించగలిగిన జంతువులు ఉంటాయి.
లిమ్నెటిక్ మండలం మంచినీటి చేపలు, దాప్నియా, సైక్లాప్స్, చిన్ని ఫ్రింప్ చేపలు, నీటిపై తేలే గుర్రపు డెక్క, అంతర తామర, బుడగ తామర, శైవలాలు. నీటిలో ఈదడానికి తెడ్ల వంటి వాజాలు , నీటిలో వివిధ స్థాయిలలో తేలడానికి ఫోటర్స్ అనే గాలితిత్తులు, గాలిగదులు, ఆకులపై మైనం పూత.
ప్రొఫండల్ మండలం రొయ్యలు, పీతలు, ఈల్ వంటి చేపలు, ఇసుక దొండులు, నత్తలు, తాబేళ్ళు. మృత జంతువులను భక్షించుటకు వీలుగా అనుకూలనాలు కలిగి ఉంటాయి.

ప్రశ్న 13.
బంగాళాఖాతంలోని కోరింగ ఆవరణ వ్యవస్థలో ఏవైనా నదులు కలుస్తున్నాయా? వాటి సమాచారం సేకరించండి. (AS 4)
జవాబు:
కోరింగ ఆవరణ వ్యవస్థలోనికి కోరింగ నది, గాదేరు నది మరియు గౌతమి, గోదావరి నదుల ఉపనదులు కలుస్తున్నాయి.

ప్రశ్న 14.
సరస్సు పటం గీచి, వివిధ మండలాలను గుర్తించండి. ఆ మండలాలను అలా ఎందుకు పిలుస్తారో తెల్పండి. (AS 5)
జవాబు:
AP Board 9th Class Biology Solutions 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు 7
సరస్సు ఆవరణ వ్యవస్థ మండలాలు :
1. లిట్టోరల్ మండలం 2. లిమ్నెటిక్ మండలం 3. ప్రొఫండల్ మండలం

లిటోరల్ మండలం :
సరస్సు ఒడ్డున తక్కువ లోతుగల భాగం. కిరణజన్య సంయోగక్రియ ఎక్కువ జరిగే భాగం.

లిమ్నెటిక్ మండలం :
సరస్సు నీటి పై భాగం (ఉపరితలం) లో బయటకు కనిపించే భాగం. ఎక్కువ కాంతిని స్వీకరిస్తుంది.

ప్రొఫండల్ మండలం :
తక్కువ వెలుతురు కలిగి చల్లగా ఉండే ప్రదేశం. ఎక్కువ లోతుగల సరస్సు అడుగుభాగం.

ప్రశ్న 15.
భూమిపై గల అద్భుతమైన జీవులు ఉభయచరాలు. వాటి అనుకూలనాలను మీరు ఎలా ప్రశంసిస్తారు? (AS 6)
జవాబు:

  1. మెడలేని, నడుము చిన్నదిగా ఉన్న ఉభయచర జీవి శరీర ఆకారం ఈదడానికి అనుకూలమైనది.
  2. తడిగా ఉన్న పలుచని చర్మము, చర్మ శ్వాసక్రియనందు వాయువుల మార్పిడికి ఎంతో అనుకూలమైనది.
  3. ముందరి కాళ్ళు శరీరపు ముందు భాగమును, నేలను తాకకుండా చేస్తాయి.
  4. వెనుకకాళ్ళు ఎక్కువ దూరం గెంతడానికి, దిశ మార్చుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి.
  5. తల పై భాగం మీద కళ్ళు అమరియుండుటవలన తన ముందు ఎక్కువ ప్రదేశమును చూడగలుగుట ద్వారా శత్రువు గమనమును అంచనా వేయవచ్చు.
  6. నోరు వెడల్పుగా, పెద్దదిగా ఉండుట వలన ఆహారమును పట్టుకోవడానికి, తినడానికి అనుకూలం.
  7. నోటి ముందటి భాగములో నాలుక ఉండుట వలన దాడికి గురైన ఆహారము అతుక్కుంటుంది.
  8. కప్ప డిపోల్ లార్వాగా నీటిలో జీవనం గడుపుతుంది. మొప్పల సహాయంతో గాలి పీలుస్తుంది.
  9. లార్వా పెద్దదై కప్పగా మారినప్పుడు మొప్పల స్థానంలో ఊపిరితిత్తులు ఏర్పడి నేలమీద కూడా శ్వాసించడానికి వీలవుతుంది.
  10. ఈ విధముగా కప్ప యొక్క శరీరము నేల మరియు నీటిలో జీవించడానికి అనువుగా ఉంది. ఉభయచర జీవులకు ఉన్న జీవన సౌలభ్యము మరి ఏ ఇతర జీవులలో మనము చూడము.

ప్రశ్న 16.
‘గులకరాళ్ళ మొక్కలు’ శత్రువుల బారి నుండి తమను తాము రక్షించుకునే విధానాన్ని నీవు ఎలా ప్రశంసిస్తావు? (AS 6)
జవాబు:

  1. గులకరాళ్ళ మొక్కలు శత్రువుల బారి నుండి అద్భుతమైన అనుకూలనాలతో తమను తాము రక్షించుకుంటాయి.
  2. వీటిని జీవం గల రాళ్ళు అంటారు. వాస్తవానికి ఇవి రాళ్ళు కావు.
  3. ఉబ్బిన ఆకులు ఎడారి పరిస్థితులకు అనుకూలంగా నీటి నష్టాన్ని తగ్గించి నీటిని నిలువ చేస్తాయి.
  4. వాస్తవానికి ప్రతి గులకరాయి ఒక పత్రం. సూర్యరశ్మి పత్రంలోనికి ప్రవేశించడానికి వీలుగా కోసిన కిటికీలాంటి భాగాన్ని కలిగి ఉంటుంది.
  5. రాతిలా కనబడడం వలన జంతువులు మోసపోయి వాటిని తినకుండా వదిలేస్తాయి.
  6. ఇలా మొక్క రక్షించబడుతుంది. గులకరాళ్ళ మొక్కలు తమను తాము రక్షించుకునే విధము అభినందనీయము.

ప్రశ్న 17.
కొన్ని మొక్కలు, జంతువులు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే జీవిస్తాయి. ఈ రోజుల్లో మానవ చర్యల మూలంగా ఈ పరిస్థితులు నాశనం అవుతున్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? (AS 7)
జవాబు:

  1. మానవ కార్యకలాపాల వలన మొక్కలు, జంతువులు నాశనం కావటం వాస్తవం.
  2. మానవుడు చేసే వివిధ కార్యకలాపాలు అనగా అడవులను నరకడం, పశువులను మేపడం, అటవీ భూములను వ్యవసాయ భూములుగా మార్చడం, వేటాడటం, విచక్షణా రహితంగా జంతు పదార్థాల కోసం జంతువులను చంపటం మరియు కాలుష్యము వలన మొక్కల మరియు జంతువుల యొక్క మనుగడ కష్టసాధ్యమవుతున్నది.
  3. సరియైన నివారణ చర్యలు చేపట్టకపోయినట్లయితే భూగోళం నుండి మొక్కలు మరియు జంతువులు అదృశ్యం కావచ్చు.

9th Class Biology 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు Textbook InText Questions and Answers

9th Class Biology Textbook Page No. 137

ప్రశ్న 1.
రసభరిత పత్రాలు గల మొక్కలకు ఉదాహరణలు ఇవ్వండి. ఇవి ఎందుకు ఇలా ఉంటాయి?
జవాబు:

  1. బయోఫిల్లమ్, కిత్తనారలు, రసభరిత పత్రాలు గల మొక్కలకు ఉదాహరణలు.
  2. ఈ మొక్కలు వర్షాకాలంలో చాలా నీటిని శోషించి, నీటిని జిగురు పదార్థ రూపంలో మొక్క భాగాలలో నిలువ చేస్తాయి.
  3. దాని ఫలితంగా వీటి కాండం, పత్రాలు, వేళ్ళు కండరయుతంగా, రసభరితంగా ఉంటాయి.
  4. ఈ విధంగా నిలువచేసిన నీటిని నీరు దొరకని సమయంలో పొదుపుగా వాడుకుంటాయి.

ప్రశ్న 2.
ఎడారి మొక్కలకు వెడల్పైన ఆకులు ఉండవు ఎందుకు?
జవాబు:

  1. ఎడారి మొక్కలు నీటి కొరత బాగా ఉన్న ప్రదేశాలలో పెరుగుతాయి.
  2. వెడల్పైన ఆకులు ఉంటే బాష్పోత్సేకము ద్వారా ఎక్కువ మొత్తంలో నీటి నష్టం జరుగుతుంది.
  3. నీటి నష్టాన్ని నివారించడానికి ఎడారి మొక్కలలో ఆకులు చిన్నవిగా ఉంటాయి.

ప్రశ్న 3.
మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో కిత్తనార అనే ఎడారి మొక్కలు పొలాల గట్ల మీద కంచె మాదిరిగా పెంచుతారు. నిజానికి ఈ ప్రాంతాలు ఎదారులు కావు. మరి ఈ మొక్కలు అక్కడ ఎలా పెరుగుతాయి?
జవాబు:

  1. ఎడారులు కానప్పటికీ పొలాల గట్ల మీద వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కిత్తనార అనుకూలనాలు చూపిస్తుంది.
  2. ఎడారులు కానప్పటికీ ఈ రోజులలో కిత్తనార మన పరిసరాలలో కూడా పెరుగుతుంటాయి.
  3. ప్రకృతిలోని కిత్తనార వంటి మొక్కలు తమ అవసరాలను బట్టి తమ చుట్టూ అనుకూల పరిస్థితులు ఏర్పరచుకుంటాయి.

9th Class Biology Textbook Page No. 138

ప్రశ్న 4.
ఎడారి పరిస్థితుల్లో జీవించే జంతువులన్నీ అనుకూలనాలు కలిగి ఉంటాయా?
జవాబు:
అవును. ఎడారి పరిస్థితుల్లో జీవించే జంతువులన్నీ అనుకూలనాలు కలిగి ఉంటాయి.

9th Class Biology Textbook Page No. 138

ప్రశ్న 5.
కొన్ని జంతువుల శరీరాలపై పొలుసులు ఎందుకు ఉంటాయి?
జవాబు:

  1. పొలుసులు వాతావరణం నుండి జంతువులను కాపాడతాయి.
  2. ఎడారి జంతువులలో చర్మం ద్వారా నీటి నష్టం జరగకుండా ఉండడానికి పొలుసులు ఉపయోగపడతాయి.
  3. పొలుసుల వలన నీటి నష్టం జరుగదు. తద్వారా జంతువుకు తక్కువ నీరు అవసరం అవుతుంది.

9th Class Biology Textbook Page No. 138

ప్రశ్న 6.
బొరియల్లో నివసించే జంతువులు సాధారణంగా రాత్రివేళల్లో ఎందుకు సంచరిస్తాయి?
జవాబు:

  1. పగటిపూట ఉండే అత్యధిక వేడిమి నుండి రక్షించుకోవడానికి బొరియల్లో నివసించే జంతువులు సాధారణంగా రాత్రి వేళల్లో తిరుగుతాయి.
  2. సాధారణంగా ఇవి నిశాచర జీవులు.

9th Class Biology Textbook Page No. 145

ప్రశ్న 7.
జెల్లి చేపలు, విచ్ఛిన్నకారులు ఈ రెండింటిలో యూఫోటిక్ మండలంలో ఉండే జీవి ఏది?
జవాబు:
జెల్లి చేపలు.

9th Class Biology Textbook Page No. 145

ప్రశ్న 8.
యూఫోటిక్ జోన్ జీవులలో ఎలాంటి అనుకూలనాలు కనిపిస్తాయి?
జవాబు:

  1. యూఫోటిక్ జోన్లో నివసించే జీవులు చాలా వరకు తేలేవి, ఈదేవి.
  2. ఈ మండల జీవులు మెరిసే శరీరాలు కలిగి ఉంటాయి.
  3. ఇవి కాంతిని పరావర్తనం చెందించి ప్రకాశవంతంగా ఉన్న నీటి ఉపరితలంలో కలిసిపోయే విధంగా చేస్తాయి లేదా పారదర్శకంగా ఉంటాయి.
  4. స్పష్టమైన దృష్టి కలిగి ఉంటాయి.

AP Board 9th Class Biology Solutions 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు

9th Class Biology Textbook Page No. 145

ప్రశ్న 9.
అబైసల్ జోన్ జీవులలో కనిపించే అనుకూలనాలు ఏవి?
జవాబు:

  1. భక్షించబోయే జంతువులు తప్పించుకోకుండా ఉండేందుకు పెద్ద జంతువులకు విశాలమైన నోరు, పెద్దగా వంకర తిరిగిన పళ్ళు ఉంటాయి.
  2. ఈ జీవులలో అస్థిపంజరం ఉండక, బల్లపరుపు శరీరాలు ఉంటాయి.
  3. ఈ జీవులకు పొట్ట కింద, కళ్ళ చుట్టూ మరియు శరీర పార్శ్వభాగంలో కాంతిని ఉత్పత్తి చేసే ప్రత్యేక అవయవాలు ఉంటాయి.
  4. కళ్ళు పనిచేయవు. మరికొన్ని జీవులకు చీకటిలో కూడా ప్రకాశవంతంగా కనిపిస్తాయి.

9th Class Biology Textbook Page No. 145

ప్రశ్న 10.
బెథియల్ జోన్ జీవులను యుఫోటిక్ (వెలుతురు గల) మరియు అబైసల్ (చీకటి) జోన్ జీవులతో పోల్చినపుడు కనపడే భేదాలేవి?
జవాబు:

  1. బెధియల్ మండలంలో ఎరుపు మరియు గోధుమ వర్ణపు గడ్డిజాతి మొక్కలు, సముద్రపు కలుపు స్పంజికలు ప్రవాళబిత్తికలు ఉంటాయి.
  2. స్థూపాకార నిర్మాణం గల స్క్విడ్లు, తిమింగలాలు వంటి జంతువులు ఉంటాయి.
  3. కొన్ని రకాల జంతువుల శరీరాలు బల్లపరుపుగా ఉంటాయి.
  4. కొన్నింటికి తక్కువ వెలుతురులో చూడడానికి వీలుగా సున్నితంగా ఉండే విశాలమైన పెద్ద కళ్ళు ఉంటాయి.

9th Class Biology Textbook Page No. 145

ప్రశ్న 11.
సముద్ర ఆవరణ వ్యవస్థలో జీవులు ఎందుకు అనుకూలనాలు కలిగి ఉంటాయి?
జవాబు:

  1. సముద్రములో ఒక నిర్ణీత స్థలంలో ఉండే లవణీయత, ఉష్ణోగ్రత, వెలుతురు లాంటి మార్పులకు అనుగుణంగా జీవులు అనుకూలనాలు కలిగి ఉంటాయి.
  2. సముద్రములో లోతు పెరిగే కొద్ది ఉత్పన్నమయ్యే పీడనాన్ని తట్టుకోవడానికి జీవులు అనుకూలనాలు కలిగి ఉంటాయి. ఊపిరితిత్తులను కుంచింపచేస్తాయి.
  3. సముద్రచరాలు వాటి శరీరంలో జరిగే మంచినీటి, ఉప్పునీటి ప్రతిచర్యలను తప్పక నియంత్రించాలి. వీటికొరకు ప్రత్యేకంగా అభివృద్ధి చెందిన మూత్రపిండాలు, మొప్పులు వంటి అవయవాలు సహాయపడతాయి.
  4. సముద్ర ఉపరితల, సముద్ర అడుగున ఉన్న నేలలోని ఉష్ణోగ్రత వ్యత్యాసాలను తట్టుకోవడానికి అనుకూలనాలను ప్రదర్శిస్తాయి.
  5. సముద్రలోతుల్లో నివసించే జీవులు అధిక పీడనం, చలి, చీకటి, తక్కువ పోషకాల లభ్యత వంటి పరిస్థితులలో జీవించడానికి రకరకాల అనుకూలనాలు చూపుతాయి.
  6. జీవులు సముద్ర అలల తాకిడికి, కొట్టుకొనిపోకుండా మరియు ఎక్కువ దూరం ప్రయాణించడానికి, వైవిధ్యమైన వాతావరణంలో జీవించడానికి అనుకూలనాలు కలిగి ఉంటాయి.

9th Class Biology Textbook Page No. 136

ప్రశ్న 12.
మనం ఆవాసం అని దేనిని అంటాం?
జవాబు:
జీవులు నివసించే ప్రదేశమును ఆవాసం అంటాం.

ప్రశ్న 13.
చెట్టు కేవలం కాకులకు మాత్రమే ఒక ఆవాసమా?
జవాబు:
కాదు, చెట్టు రకరకాలయిన పక్షులు, కీటకాలకు ఆవాసం.

9th Class Biology Textbook Page No. 136

ప్రశ్న 14.
ఆవాసం, ఆవరణ వ్యవస్థల మధ్య గల తేడా ఏమిటి? జీవులు ఆవాసంలో నివసిస్తాయా ? ఆవరణ వ్యవస్థలో నివసిస్తాయ?
జవాబు:
ఒక జీవి నివసించే ప్రదేశం ఆవాసం. దగ్గర సంబంధం కలిగిన రకరకాల జీవులు, నిర్జీవులు ఉండే ప్రదేశం ఆవరణ వ్యవస్థ. జీవులు ఆవరణ వ్యవస్థలో భాగమైన ఆవాసంలో జీవిస్తాయి.

9th Class Biology Textbook Page No. 137

ప్రశ్న 15.
అనుకూలనం అంటే ఏమిటి? మీ అభిప్రాయాన్ని వివరించండి.
జవాబు:

  1. వివిధ పరిస్థితులలో జీవించే జీవులు కొంతకాలం తరువాత వాటికి అనుకూలంగా మారతాయి లేదా అభివృద్ధి చెందుతాయి. వీటినే జీవులలోని అనుకూలనాలు అంటారు.
  2. ప్రకృతిలోని జీవులు తమ అవసరాలను బట్టి తమ చుట్టూ అనుకూల పరిస్థితులను ఏర్పరచుకుంటాయి.

9th Class Biology Textbook Page No. 140

ప్రశ్న 16.
నీటిలో నివసించే కొన్ని జంతువులు మీకు తెలిసే ఉంటాయి. కొన్నింటిని మీరు రోజూ చూస్తూనే ఉంటారు. వాటికి నీటిలో నివసించడానికి ఏమైనా అనుకూల లక్షణాలు ఉంటాయా?
జవాబు:

  1. నీటిలో నివసించే జీవులు నీటిలో నివసించడానికి కావలసిన అనుకూల లక్షణాలు కలిగి ఉంటాయి.
  2. నీటిలో తేలియాడడానికి జీవుల శరీరంలో గాలి గదులు ఉంటాయి. ఇవి ఈదడానికి కూడా ఉపకరిస్తాయి.
  3. తాబేళ్ళు, చేపలు నీటిలో ఈదడానికి తెడ్ల వంటి వాజాలు అనే ప్రత్యేక నిర్మాణాలు కలిగి ఉన్నాయి.
  4. చేపలు, తాబేళ్ళ శరీరాల్లో ఫ్లోటర్స్ అనే గాలితిత్తులు ఉండడం వలన నీటిలోని వివిధ స్థాయిలలో నివసించగలుగుతున్నాయి.
  5. ప్లవకాలు వంటి సూక్ష్మజీవులు శరీరాలలోని కణాలలో ఉండే నూనె బిందువుల సహాయంతో నీటిపై తేలుతాయి.

9th Class Biology Textbook Page No. 140

ప్రశ్న 17.
నీటి మొక్కలలో ఉండే మృదువైన కాండాలు వాటికి ఎలా ఉపయోగపడతాయి?
జవాబు:

  1. నీటి మొక్కలలో ఉండే మృదువైన కాండాలలో వాయుపూరిత మృదు కణజాలం ఉంటుంది.
  2. ఈ కణాల మధ్యలో వాయుగదులుంటాయి.
  3. ఇవి మొక్క నీటి మీద తేలడానికి ఉపయోగపడతాయి.

9th Class Biology Textbook Page No. 142

ప్రశ్న 18.
సహజీవనం, కోమోఫ్లాలను వివరించండి.
జవాబు:
సహజీవనం :

  1. రెండు వివిధ వర్గాల జీవులు కలిసి జీవిస్తూ పోషకాలను పరస్పరం మార్పిడి చేసుకుంటూ పరస్పరం లాభం చెందే విధానంను సహజీవన పోషణ అంటారు.
  2. ఇందులో ఒక జీవి తన సహజీవియైన మరియొక జీవికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.
  3. రెండవ జీవి తన సహజీవికి నివాసాన్ని లేక పోషకాలని లేక రెండింటినీ అందిస్తుంది.
    ఉదా : లెగ్యుమినేసి (చిక్కుడు జాతి) మొక్కల వేర్ల మీది బుడిపెలు.
  4. ఇందులో మొక్కలు బాక్టీరియాకు ఆవాసాన్ని ఇస్తాయి. బాక్టీరియా వాతావరణంలోని నత్రజనిని మొక్కలకు అందచేస్తాయి.
  5. సహజీవనంలో రెండు జీవులు లాభం పొందవచ్చు లేదా ఏదో ఒక జీవి మాత్రమే లాభం పొందవచ్చు.

కోమోఫ్లాజ్:

  1. పర్యావరణములోని మార్పులకు అనుగుణంగా జంతువులు వాటి యొక్క శరీరపు రంగును, ఆకారమును మార్చుకొనుటను కోమోప్లాజ్ అంటారు.
  2. సాధారణంగా భక్షక జీవి నుండి రక్షణ పొందుటకు జంతువులు శరీరపు రంగు, ఆకారమును మార్చుకుంటాయి.
    ఉదా : ఊసరవెల్లి.

9th Class Biology Textbook Page No. 143

ప్రశ్న 19.
సముద్ర ఆవరణ వ్యవస్థలో ఉన్న వివిధ మండలములను పేర్కొనండి. దానిలోని నిర్జీవ అంశాలను, ఉండే వివిధ రకాల జీవులను రాయండి. పట్టిక ఆధారంగా కింద ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP Board 9th Class Biology Solutions 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు 8
ఎ) పటంలో కాంతి ప్రసారాన్ని బట్టి ఎన్ని మండలాలను చూడవచ్చు?
జవాబు:
మూడు మండలాలు.

బి) పట్టికలోని వివరాలను బట్టి ఎన్ని రకాల నిర్ణీవాంశాలను గురించి తెలుసుకోవచ్చు?
జవాబు:
మూడు నిర్జీవ అంశాలను గురించి తెలుసుకోవచ్చు.

సి) పటంలో చూపిన పరిస్థితులేగాక ఇంకేవైనా సముద్ర జీవుల అనుకూలనాలపై ప్రభావం చూపుతాయా?
జవాబు:
లవణీయత, ఆక్సిజన్, వర్షపాతం, గాలి, నేల, అలల వేగం, పి. హెచ్, పోషక పదార్థాలు, ఆర్థత మొదలైన అంశాలు ప్రభావం చూపుతాయి.

డి) లోతు పెరిగిన కొద్దీ ఉష్ణోగ్రత మరియు పీడనాల ప్రభావం ఎలా ఉంటుంది?
జవాబు:
లోతు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. పీడనం పెరుగుతుంది.

ఇ) ఏ జోనులో ఎక్కువ జంతువులున్నాయి? ఎందుకో ఊహించండి.
జవాబు:
బెథియల్ మండలంలో ఎక్కువ జంతువులు ఉన్నాయి.

9th Class Biology Textbook Page No. 145

ప్రశ్న 20.
మన రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో గల పులికాట్ సరస్సు మంచినీటి ఆవరణ వ్యవస్థకు చెందినదా? అవునో కాదో కారణాలు తెలపండి.
జవాబు:

  1. నెల్లూరు జిల్లాలో గల పులికాట్ సరస్సు ఉప్పునీటి ఆవరణ వ్యవస్థకు చెందినది.
  2. సరస్సునందలి నీటి లవణీయత ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా సోడియమ్, పొటాషియంకు చెందిన లవణాలు అధిక మొత్తంలో ఉంటాయి.

9th Class Biology Textbook Page No. 147

ప్రశ్న 21.
కొలనుల సమీపంలో చుట్టూ నివసించే పక్షులకు కాళ్ళు, వేళ్ళ మధ్య ఒక పలుచని చర్మం ఎందుకు ఉంటుంది?
జవాబు:
కాలి వేళ్ళ మధ్య చర్మం ఉండడం వలన కొలనుల సమీపంలో నివసించే పక్షులు ఈదడానికి, నేలపై నడవడానికి సహాయపడుతుంది.

AP Board 9th Class Biology Solutions 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు

9th Class Biology Textbook Page No. 147

ప్రశ్న 22.
కొంగలకు పొడవైన కాళ్ళు మరియు పొడవైన ముక్కు ఎందుకుంటాయి?
జవాబు:

  1. నీటిలో నడిచే కొంగజాతి పక్షులు తమ సన్నని పొడవైన కాళ్ళతో లోతు తక్కువ గల కొలను మట్టిలో కీటకాల కోసం వెదుకుతూ జీవిస్తాయి.
  2. పొడవైన ముక్కు మట్టిని పెకిలించడానికి ఉపయోగపడుతుంది.

9th Class Biology Textbook Page No. 148

ప్రశ్న 23.
సముద్ర ఆవరణ వ్యవస్థలు మంచినీటి ఆవరణ వ్యవస్థల కంటే ఏ విధంగా భిన్నంగా ఉంటాయి?
జవాబు:

  1. సముద్ర ఆవరణ వ్యవస్థలందు నీటి లవణీయత 3.5% గా ఉంటుంది.
  2. సముద్ర ఆవరణ వ్యవస్థలు అతి పెద్దవిగా ఉంటాయి. భూఉపరితలం మీద మూడింట నాలుగు వంతులు ఆక్రమించి ఉంటాయి.
  3. మంచినీటి ఆవరణ వ్యవస్థల కంటే సముద్ర నీటి ఆవరణ వ్యవస్థలలో నివసించే జీవుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటాయి.

9th Class Biology Textbook Page No. 148

ప్రశ్న 24.
సముద్ర ఆవరణ వ్యవస్థ కంటే భిన్నంగా ఉన్న మంచినీటి ఆవరణ వ్యవస్థలో కనిపించే రెండు అనుకూలనాల గురించి చెప్పండి.
జవాబు:

  1. మంచినీటి లవణీయత ఉప్పునీటి లవణీయత కంటే చాలా తక్కువగా ఉంటుంది.
  2. మంచినీటి ఆవరణ వ్యవస్థ ద్వారా సకల జీవకోటికి త్రాగటానికి కావలసిన నీరు దొరుకుతుంది.

9th Class Biology Textbook Page No. 148

ప్రశ్న 25.
కాంతి ప్రసారం ఆధారంగా, మంచి నీటి మరియు సముద్ర ఆవరణ వ్యవస్థలో కనబడే పోలికలేమిటి?
జవాబు:
1) కాంతి ప్రసారం ఆధారంగా సముద్ర ఆవరణ వ్యవస్థను మూడు మండలాలుగా విభజించారు. అవి

  1. యుఫోటిక్ మండలం
  2. బెథియల్ మండలం
  3. అబైసల్ మండలం.

2) కాంతి ప్రసారం ఆధారంగా మంచినీటి ఆవరణ వ్యవస్థను మూడు మండలాలుగా విభజించారు. అవి

  1. లిటోరల్ మండలం
  2. లిమ్నెటిక్ మండలం
  3. ప్రొఫండల్ మండలం.

9th Class Biology Textbook Page No. 148

ప్రశ్న 26.
సముద్ర ఆవరణ వ్యవస్థతో పోల్చినపుడు మంచినీటి ఆవరణ వ్యవస్థలో కనిపించని మండలం ఏది?
జవాబు:
బెథియల్ మండలం సముద్ర ఆవరణ వ్యవస్థలో ఉంటుంది. మంచినీటి ఆవరణ వ్యవస్థలో ఉండదు.

ప్రశ్న 27.
సముద్ర, మంచినీటి ఆవరణ వ్యవస్థలలో వివిధ రకాల అనుకూలనాలకు దారితీసే ప్రధాన కారకాలేవి?
జవాబు:
కాంతి, లవణీయత, ఆహారం, ఆక్సిజన్, లోతు, ఉష్ణోగ్రత, పీడనం మొదలైనవి సముద్ర, మంచినీటి ఆవరణ వ్యవస్థలలో వివిధ రకాల అనుకూలనాలకు దారితీసే ప్రధాన కారకాలు.

ప్రశ్న 28.
ప్రపంచమంతటా మొక్కలన్నీ ఒకే సమయంలో ఆకులు రాల్చుతాయా?
జవాబు:

  1. ప్రపంచమంతటా మొక్కలన్నీ ఒకే సమయంలో ఆకులు రాల్చవు.
  2. సమశీతోష్ణ ప్రాంతంలోని మొక్కలు శీతాకాలం ప్రారంభం కాకముందే ఆకులు రాల్చుతాయి.
  3. ఉష్ణమండలాల్లోని కొన్ని మొక్కలు వేసవి మొదలు కాకముందే ఆకులు రాల్చుతాయి.

9th Class Biology Textbook Page No. 149

ప్రశ్న 29.
ముళ్ళు గల పత్రాలు కూడా ఉష్ణోగ్రతలకు అనుకూలనాలేనా?
జవాబు:
కాదు. తమను భక్షించే జీవుల నుండి రక్షణ కొరకు ఎడారి మొక్కలు పత్రాలపై ముళ్ళను ఏర్పరచుకుంటాయి.

ప్రశ్న 30.
మంచు కురిసే సమయంలో వృక్షాలకు వెడల్పైన ఆకులుంటే ఏమవుతుంది?
జవాబు:
మంచు కురిసే సమయంలో వృక్షాలకు వెడల్పైన ఆకులుంటే ఆకులమీద మంచు పేరుకుపోయి ఆకులు, కొన్నిసార్లు శాఖలు కూడా విరుగుతాయి.

ప్రశ్న 31.
ధృవపు ఎలుగు శరీరంపై దళసరిగా బొచ్చు ఎందుకు ఉంటుంది?
జవాబు:

  1. శీతల ప్రాంతాలలో నివసించే జీవులు దళసరి బొచ్చుతో శరీరాలను కప్పి ఉంచుతాయి.
  2. బొచ్చు ఉష్ణబంధకంగా పనిచేస్తూ తమ శరీరాల నుండి ఉష్ణం కోల్పోకుండా నిరోధిస్తుంది.

9th Class Biology Textbook Page No. 149

ప్రశ్న 32.
సీల్ జంతువులకు దళసరి కొవ్వు ఉండే చర్మం శీతల వాతావరణం నుండి రక్షించడానికి ఏ విధంగా తోడ్పడుతుంది?
జవాబు:

  1. సీల్ జంతువులు చర్మాల కింద దళసరి కొవ్వు పొరను నిలువ చేసుకుంటాయి.
  2. కొవ్వుపొర శరీరానికి ఉష్ణ బంధకంలా సహాయపడుతూ ఉష్ణం, శక్తిని ఉత్పత్తి చేయడంలో తోడ్పడుతుంది.

AP Board 9th Class Biology Solutions 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు

9th Class Biology Textbook Page No. 150

ప్రశ్న 33.
వేసవి మరియు శీతాకాలపు సుప్తావస్థకు చెందిన సమాచారం సేకరించండి.
జవాబు:
వేసవికాల సుప్తావస్థ :
బాగా వేడిగా, పొడిగా ఉండే ప్రాంతాలలోని జీవులు అధిక ఉష్టాన్ని తప్పించుకోవటానికి నేలలో బొరియలు చేసుకొని జీవక్రియలను తగ్గించుకొని దీర్ఘకాలంపాటు నిద్రపోతాయి. దీనినే వేసవి నిద్ర లేదా వేసవి సుప్తావస్థ అంటారు.
ఉదా : కప్ప, నత్త.

శీతాకాల సుప్తావస్థ :
బాగా చలిగా ఉండే శీతల పరిస్థితులను తప్పించుకోవటానికి శీతల ప్రాంత జీవులు బొరియలు చేసుకొని దీరకాలంగా నిద్రపోతాయి. దీనినే శీతాకాల సుప్తావస్థ అంటారు. ఈ దశలో జీవక్రియలు కనిష్టస్థాయికి చేరుకుంటాయి. పరిసరాలు అనుకూలించినప్పుడు ఈ జీవులు సుప్తావస్ల నుండి మేల్కొంటాయి.
ఉదా : ధృవపు ఎలుగుబంటి, హెహగ్.

9th Class Biology 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు Textbook Activities (కృత్యములు)

కృత్యం – 1

1. 1) కలబంద, లింగాక్షి మొక్కలను రెండు వేర్వేరు కుండీలలో తీసుకోవాలి.
2) ఒక్కో మొక్కకు 2 చెమ్చాల నీరు పోయాలి.
3) తరువాత రెండు రోజుల వరకు నీరు పోయకూడదు.
4) వారం రోజుల తరువాత మొక్కల పరిస్థితిని పరిశీలించాలి.
AP Board 9th Class Biology Solutions 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు 9

పరిశీలనలు
1) పెరుగుదల చూపిన మొక్క ఏది?
కలబంద పెరుగుదల చూపినది.

2. ముందుగా వాడిపోయిన మొక్క వీది? ఎందుకని?
ముందుగా వాడిపోయిన మొక్క లింగాక్షి. కొన్ని రకాల మొక్కలు నీరు లేకపోతే త్వరగా వాడిపోతాయి.

కృత్యం – 2

2. 1) నీటి కుంటలలో పెరిగే ఒక మొక్కను సేకరించాలి. (ఉదా : హైడ్రిల్లా, వాలిస్ నేరియా, డక్ వీడ్)
2) ఇంటికి తీసుకునిపోయి మట్టిలో నాటి నీరు పోయాలి.

పరిశీలనలు :

  1. మొక్క పెరుగుదలను చూపదు.
  2. పరిసరాలలోని పరిస్థితులకు అనుగుణంగా నీటి అవసరాలను బట్టి ఒక్కొక్కరకం అనుకూలనాలు చూపుతాయి.
  3. మొక్కలు ఒక్కొక్క ప్రాంతంలో జీవిస్తూ అక్కడి పరిస్థితులకు అనువుగా మారతాయి.

AP Board 9th Class Biology Solutions 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు

కృత్యం – 3

3. కొలను సమీపంలో మరియు చుట్టూ ఎన్నో జంతువులు నివసిస్తాయి. వాటిని వీలైతే దగ్గరగా పరిశీలించి శరీరం, కాళ్ళ లక్షణాల వివరాలు తెలిపే ఒక జాబితా తయారు చేయండి.
కొలను సమీపంలో నివసించే జంతువుల జాబితా :

కీటకాలు : దోమలు, డ్రాగన్ ఫ్రై, డామ్ సిప్లై, మేఫిక్స్, స్టోన్ ఫ్రై, డాబ్సోప్లై, కాడిస్ ప్లై, క్రేన్ ఫై, పేడపురుగు మొదలైనవి.
క్రస్టేషియనులు : కేఫిష్, స్కడ్స్, రొయ్యలు
మొలస్కా జీవులు : నత్తలు
అనెలిడ జీవులు : జలగలు
చేపలు : బ్లుగిల్, బాస్, కేట్ ఫిష్, స్కల్ఫిన్, విన్నో
సరీసృపాలు : పాములు, తాబేళ్లు
ఉభయజీవులు : కప్ప, పక్షులు, బాతులు, కొంగలు

కొలను చుట్టూ సమీపంలో నివసించే కొన్ని జంతువుల శరీర మరియు కాళ్ళ లక్షణాలు :
1. దోమ :
శరీరం ఖండితమైనది. 3 జతల కాళ్ళు కలిగినది.

2. రొయ్యలు :
కొలను అడుగు భాగంలో నివసించేవి. రొమ్ము భాగమున 5 జతల కాళ్లు, ఉదర భాగమున 5 జతల కాళ్ళు ఈదుటకు ఉంటాయి. శరీరము ఖండితమైనది మరియు బాహ్య అస్థిపంజరము కలది.

3. నత్త :
మెత్తని శరీరము చుట్టూ గట్టిదైన రక్షణ కవచము గలది. చదునైన పాదము సహాయంతో నత్త పాకుతుంది.

4. బాతులు :
రెండు కాళ్ళు గలిగిన పక్షులు, కాలివేళ్ళ మధ్య చర్మం ఉండటం వలన ఈ జీవులు ఈదడానికి, నేలపై నడవడానికి సహాయపడతాయి.

5. కేఫిష్ :
నాలుగు కాళ్ళు కలిగిన మంచినీటి క్రస్టేషియన్. శరీరం ఖండితమైనది. తల, రొమ్ము భాగం కలిసి ఉంటుంది. దీనినుండి నాలుగు జతల కాళ్ళు ఏర్పడతాయి. ఉదర భాగమునకు నాలుగు జతల ఉపాంగాలు అతుక్కుని ఉంటాయి.

6. డ్రాగన్ ఫ్రై :
రెండు జతల పారదర్శక రెక్కలు ఉంటాయి. సాగదీయబడిన శరీరము గలది. మూడు జతల కాళ్ళు గలవు.

7. వానపాము :
ఖండితమైన శరీరము గలది. పొడవైన మెత్తటి శరీరము కలది. కాళ్ళులేని జీవి.

8. చేప :
మంచినీటి కొలనులో జీవించేది. మొప్పల సహాయంతో శ్వాసిస్తుంది. వాజాల సహాయంతో ఈదుతుంది.

9. గోల్డ్ ఫిష్ (గండు చేప) :
మంచినీటిలో నివసించే చేప. మొప్పల సహాయంతో శ్వాసిస్తుంది. ఎక్వేరియంలో ఉంచబడే చేప. వాజాల సహాయంతో ఈదుతుంది.

10. గోదురు కప్ప :
చర్మం పొడిగా ఉంటుంది. కాళ్లు పొట్టిగా ఉంటాయి. కాలివ్రేళ్ల మధ్య చర్మం ఉండుట వలన ఈదడానికి, నేలపై నడవడానికి సహాయపడతాయి. ఉభయచర జీవి.

11. జలగ :
శరీరం ఖండితమైనది. సక్కర్ల సహాయంతో రక్తాన్ని పీల్చుతుంది.

AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

SCERT AP 9th Class Biology Guide Pdf Download 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Biology 8th Lesson Questions and Answers వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

9th Class Biology 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
మన దేశంలో ధాన్యం ఉత్పత్తిలో పెంపుదల సాధించాలంటే ఏమి చేయాలో సూచించండి. (AS 1)
(లేదా)
ఒక పక్క జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. కాని పంటలు పండే భూమి మాత్రం తగ్గిపోతుంది. మరి పెరుగుతున్న జనాభాకు సరిపడేలా ఆహారోత్పత్తి పెంచాలంటే చేపట్టాల్సిన పరిష్కార మార్గాలు సూచించండి.
జవాబు:

  1. సాగుభూమి విస్తీర్ణాన్ని పెంచడం.
  2. ప్రస్తుతం సాగుచేస్తున్న భూమినందు ఉత్పత్తిని పెంచడం.
  3. ఎక్కువ దిగుబడినిచ్చే వరి సంకర జాతులను అభివృద్ధి చేయడం.
  4. వివిధ వాతావరణ పరిస్థితులలో పెరిగే నూతన రకములను ఉత్పత్తి చేయడానికి వరి మొక్క జన్యు వైవిధ్యమును పరిరక్షించడం.
  5. మంచి నీటిపారుదల పద్ధతులు, సరియైన యాజమాన్య పద్ధతులను పాటించాలి.
  6. పోషక పదార్థములను సక్రమముగా వినియోగించడానికి వరి పంట.యాజమాన్య పద్ధతులను అవలంబించాలి.
  7. సేంద్రియ ఎరువులను ఉపయోగించాలి.
  8. పంటమార్పిడి, మిశ్రమ పంటల పద్ధతులను అవలంబించాలి.

ప్రశ్న 2.
రసాయన ఎరువుల కంటే జీవ ఎరువులు ఏ విధంగా మెరుగైనవి? (AS 1)
జవాబు:

  1. జీవ ఎరువులు సహజ పోషకాలను నేలకు అందిస్తాయి.
  2. నేల నిర్మాణాన్ని మరియు నేల సేంద్రియ పదార్థాన్ని జీవ ఎరువులు పెంచుతాయి.
  3. జీవ ఎరువులు నీటి నిల్వ సామర్థ్యాన్ని మరియు నేల గట్టిపడే సమస్యలను తగ్గిస్తాయి.
  4. నేల మరియు నీటి కోరివేతను జీవ ఎరువులు తగ్గిస్తాయి.
  5. పంట యొక్క ఉత్పత్తిని జీవ ఎరువులు పెంచుతాయి.
  6. జీవ ఎరువుల వాడకం ద్వారా నేలలో హ్యూమస్ శాతం పెరిగి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.

ప్రశ్న 3.
అ) అధిక దిగుబడినిచ్చే పంటలు పండించడానికి, రసాయన ఎరువులు ఎక్కువ వాడడం వలన కలిగే దుష్ఫలితాలు ఏమిటి? (AS 1)
జవాబు:

  1. రసాయనిక ఎరువులు సరస్సులు, నదులు మరియు వాగులను కలుషితం చేస్తాయి.
  2. నేలలో జీవించే వానపాములతో సహా ఇతర జీవులను నాశనం చేస్తాయి.
  3. రసాయనిక ఎరువులను వినియోగించుట ద్వారా కేవలం 20 నుండి 30 సంవత్సరాలు మాత్రమే అధిక ఉత్పత్తిని సాధించగలం.
  4. ఆ తరువాత నేల మొక్కల పెరుగుదలకు అనుకూలించదు.
  5. నేల సారాన్ని రసాయన ఎరువులు పాడు చేస్తాయి.
  6. రసాయన ఎరువుల వాడకం వలన పంటలు వ్యాధులకు గురి అవుతాయి.
  7. కొన్ని మొక్కలు పోషక పదార్థాలను గ్రహించడాన్ని నిరోధిస్తాయి.
  8. రసాయన ఎరువులు ఉపయోగించి పండించిన ఆహార పదార్థాలు అంత రుచికరంగా ఉండవు.

ఆ) అధిక దిగుబడినిచ్చే వంగడాలను రసాయన ఎరువులు లేకుండా పెంచవచ్చా? ఎలా? (AS 1)
జవాబు:

  1. అవును. అధిక దిగుబడినిచ్చే వంగడాలను రసాయన ఎరువులు లేకుండా పెంచవచ్చును.
  2. రసాయన ఎరువులు మరియు కృత్రిమంగా తయారయిన కీటక నాశనులకు బదులుగా జీవ ఎరువులను ఉపయోగించుట ద్వారా మనము అధికోత్పత్తిని పొందవచ్చు.

AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

ప్రశ్న 4.
విత్తనాలు విత్తడానికి ముందు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి? (AS 1)
జవాబు:

  1. విత్తనాలు విత్తే ముందు నేలను సిద్ధపరచాలి.
  2. నేలను వదులుగా చేయడానికి, గట్టిగా ఉన్న మట్టి గడ్డలను పగలగొట్టడానికి నేలను దున్నాలి.
  3. విత్తనాలు చల్లే ముందు నీళ్ళు పెట్టాలి. .
  4. నేలలో పుట్టే లేదా విత్తనముల ద్వారా వచ్చే వ్యాధులను అరికట్టడానికి విత్తన శుద్ధి చేయాలి.

ప్రశ్న 5.
వర్షాభావ పరిస్థితులు అధికంగా ఉండే ప్రదేశంలో మీ పొలం ఉంటే దానిలో ఏ రకమైన పంటలు పండిస్తావు? ఎలా పండిస్తావు? (AS 1)
జవాబు:

  1. జొన్న, సజ్జ, కంది, పెసలు, ఉలవలు మొదలగు పంటలను వర్షాభావ పరిస్థితులు గల మా పొలంలో పండిస్తాను.
  2. వర్షపు నీటిని సంరక్షించడం, చెక్ డ్యాంలను నిర్మించడం, డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి, వాటర్ షెడ్ పథకము మరియు నేల మరియు నీటి సంరక్షణ పద్ధతుల ద్వారా పై పంటలను పండిస్తాను.

ప్రశ్న 6.
కాలానుగుణంగా ఆశించే కీటకాలు పంట పొలాన్ని నాశనం చేయకుండా ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుంటారు? (AS 1)
జవాబు:

  1. సాధారణంగా రైతులు కృత్రిమంగా తయారుచేసిన ఎరువులు, కీటకనాశనులు ఉపయోగించి పంటలపై వచ్చే కీటకాలను అదుపులో ఉంచుతారు.
  2. కొందరు కీటకాలను చేతితో ఏరివేయడం ద్వారా కీటకాల బారి నుండి పంట పొలాన్ని రక్షిస్తారు.
  3. కీటకాలకు హాని కలిగించే పరభక్షక కీటకాలను ఉపయోగించి పంట పొలం నాశనం కాకుండా చూస్తారు.
  4. చేతితో కీటకాలను ఏరి వేసే పద్ధతిలో పంటపొలం మధ్యలో దీపపుతెరలు ఉంచడంవల్ల కీటకాలన్నీ దాని ఆకరణకు లోనై ఒకే చోటికి చేరతాయి. ఇలా చేయడం వల్ల వాటిని ఏరివేయడం సులభం.
  5. కీటకనాశనులను అవసరమైన సందర్భాలలో వినియోగించడం వల్ల కూడా పంటపొలాన్ని కీటకాలు నాశనం చేయకుండా చూడవచ్చు.

ప్రశ్న 7.
ఒక రైతు తన పొలంలో చాలా కాలంగా ఒకే క్రిమిసంహారక మందును ఉపయోగిస్తున్నాడు. అయితే కింది వాటిపై దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది? (AS 2)
అ) కీటకాల జనాభా
ఆ) నేల ఆవరణ వ్యవస్థ
జవాబు:
అ) కీటకాల జనాభా :

  1. రైతు క్రిమిసంహారక మందును ఎక్కువకాలం ఉపయోగించడం వలన కీటకాలు వ్యాధి నిరోధకతను పెంచుకుంటాయి.
  2. అందువలన కీటకాల జనాభా పెరుగుతుంది.

ఆ) నేల ఆవరణ వ్యవస్థ :

  1. క్రిమి సంహారకాలను ఎక్కువకాలం ఉపయోగించడం వల్ల ఆ మందులు నేలలోనే ఉండిపోతాయి.
  2. ఆ మందులు నేలలోని పురుగులను చంపివేస్తాయి. తద్వారా పంట దిగుబడి తగ్గుతుంది.
  3. నేలలో లవణాల శాతం పెరిగి నేల ఆవరణ వ్యవస్థ దెబ్బ తింటుంది.

ప్రశ్న 8.
రామయ్య తన పొలానికి భూసార పరీక్ష చేయించాడు. పోషకాల నిష్పత్తి 34-20-45గా ఉంది. ఈ నిష్పత్తి చెరకు పండించడానికి అనుకూలమేనా? ఏ రకమైన పంటలు పండించడానికి ఈ పొలం అనుకూలమని భావిస్తావు? (AS 2)
జవాబు:

  1. రామయ్య పొలము చెరకు పంట పండించడానికి అనుకూలం కాదు.
  2. ఎందుకంటే చెరకు పంట పండించడానికి నేలలో 90% నత్రజని ఉండాలి, కాని రామయ్య పొలంలో కేవలం 34% నత్రజని మాత్రమే ఉంది.
  3. భాస్వరము 20% ఉండడం వలన మొక్కజొన్నను, పొటాషియం 45% ఉండడం వలన వేరుశనగ పంటను పండించవచ్చు.

ప్రశ్న 9.
మీ సమీపంలోని పొలానికి వెళ్ళి రైతులు కలుపు నివారణకు పాటిస్తున్న పద్ధతులు గురించిన సమాచారం సేకరించి నివేదిక రాయండి. (AS 3)
జవాబు:
కలుపు నివారణకు పాటిస్తున్న పద్ధతులు :

రైతు పేరు నివారణ పద్ధతి
1. రామారావు కూలీలతో చేతితో ఏరివేయిస్తున్నాడు.
2. వెంకటయ్య ఈ రైతుది మెట్ట పొలం అయినందున గుంటక వంటి పరికరాలు వాడి నివారణ చేస్తున్నాడు.
3. సోమేశం కలుపు నాశకాలను చల్లి నివారణ చేస్తున్నాడు.
4. శ్రీనివాసరావు దుక్కిలోనే కలుపు వినాశకాలను వాడి, దున్ని కలుపును రాకుండా నివారిస్తున్నాడు.

ఈ నాలుగు పద్ధతులను చాలా మంది రైతులు పాటించుటను గమనించాను.

AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

ప్రశ్న 10.
మీ ప్రాంతంలోని ప్రధానమైన కలుపు మొక్కల జాబితా తయారుచేయండి. వాటిలో వేర్వేరు పంటలలో పెరిగే కలుపు మొక్కలను కింది పట్టికలో నమోదు చేయండి. (AS 4)
జవాబు:
ప్రధానమైన కలుపు మొక్కల జాబితా :
సైనోడాన్ డాక్టలాన్ (గరిక), సైపరస్ రొటండస్ (తుంగ), డిజిటారియా లాంగిఫోలియా, డాక్టలో క్లీనియమ్ కలోనమ్, సెటేరియా గ్లూకా, సైపరస్ డిఫార్మిస్, ఐకోర్నియా క్రాసిప్స్ (బుడగ తమ్మ), సాల్వీనియా మొలస్టా, ఆల్టర్ నాంతిర సెసైలిస్ (పొన్నగంటి), సెలోషియా అర్జెన్షియా (గురంగుర) లూకాస్ ఏస్పిరా (తుమ్మి), పోర్చు లేక ఒలరేషియా (పావలికూర), క్లియోమ్ విస్కోసా (కుక్కవామింట), సొలానమ్ నైగ్రమ్ (బ్లాక్ నైట్ షేడ్), అర్జిమోన్ మెక్సికానా (బాలరక్కొస), ఎబుటిలాన్ ఇండికమ్ (తుత్తురి బెండ), యూఫోర్బియా హిరా (పచ్చబొట్లు), వెర్నోనియా సిన్నోరా, ఇఖ్ నోక్లోవా కొలోనమ్ (ఉడలు), కొమ్మెలైనా బెంగాలెన్సిస్ (వెన్నవెదురు), అవినాఫాట్యువ (అడవియవలు), ఇళ్ల నోక్లోవా క్రస్ గల్లి (నీటిగడ్డి), ఎల్యు సైన్ ఇండికా (గూ గ్రాస్), ఎభిరాంథిస్ ఏస్పిరా (ఉత్తరేణి), ఇక్లిష్టా ప్రోస్టేట (గుంట కలగర లేదా) భృంగరాజ మొదలగునవి.

పంట రకం పంటపై పెరిగే కలుపు మొక్కలు
వరి గరిక, తుంగ, బుడగ తమ్మ, పొన్నగంటి
వేరుశనగ గురంగుర, గరిక, తుంగ, తుత్తురి బెండ, వెన్న వెదురు, కుక్కవామింట, తుమ్మి, పావలికూర, బాలరక్కిస.
మినుములు గరిక, తుంగ, తుత్తురి బెండ, వెన్న వెదురు, సాల్వీనియా మొలస్టా, పచ్చబొట్లు, బంగారు తీగ.
మొక్కజొన్న పచ్చబొట్లు, సొలానమ్ నైగ్రమ్, గరిక, తుంగ
పెసలు ఉడలు, గరిక, తుంగ, బాలరక్కొస, పావలికూర

ప్రశ్న 11.
మీ గ్రామ పటం గీచి, నీటివనరులను గుర్తించండి. నీవు ఒక మంచి రైతుగా వాటిని ఎలా ఉపయోగిస్తావు? ఏ ఏ వ్యవసాయ పద్ధతులను పాటిస్తావు? (AS 5)
జవాబు:
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 1
నేను ఒక మంచి రైతుగా ఆ నీటి వనరులను సక్రమ పద్ధతిలో ఉపయోగిస్తాను. నీటివనరులు తక్కువగా ఉంటే బిందుసేద్యం పద్ధతిని ఉపయోగిస్తాను.

ప్రశ్న 12.
రసాయన ఎరువులు శిలీంధ్రనాశకాలు, కీటకనాశకాలు, కలుపు మందులు అధిక మోతాదులో వినియోగిస్తే పర్యావరణంపై కలిగే పరిణామాలు ఏమిటి? (AS 6)
జవాబు:

  1. మనం కీటకనాశనులు, శిలీంధ్రనాశకాలను, కలుపు మందులను అధిక మొత్తంలో వాడడం వలన ఈ మందులు నేలలోనే మిగిలిపోతాయి.
  2. వర్షాలు పడినప్పుడు నేల నుండి నీటిలో కరిగి నీటి వనరులను కూడా కలుషితం చేస్తాయి.
  3. నేల పొరలోకి దిగి నేలను కలుషితం చేసాయి.
  4. ఈ మందులను పొలంలో చల్లే రైతులు తరచుగా వీటి ప్రభావానికి గురి అయ్యి ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయి. కొన్నిసార్లు మరణం కూడా సంభవించవచ్చు.
  5. కీటకనాశనులు ఉపయోగపడే కీటకాలతో సహా మొత్తం కీటకాలను నాశనం చేస్తాయి.
  6. అధిక మొత్తంలో రసాయన ఎరువులు, కీటక నాశనులు, కలుపు ందులను వాడడం వలన కొంత కాలానికి నేల పంట పండించడానికి ఉపయోగపడదు.

ప్రశ్న 13.
“జీవ వైవిధ్యానికి సేంద్రియ ఎరువులు సహాయపడతాయి”. దీనిని నీవెలా సమర్థిస్తావు? (AS 6)
జవాబు:

  1. నేల మరియు నేలలో ఉండే జీవులపై జరిగిన జీవశాస్త్ర అధ్యయనము సేంద్రియ సేద్యమునకు అనుకూలమని నిరూపించబడినది.
  2. రసాయన పదార్థాలను, వృక్ష మరియు జంతు సంబంధమైన వ్యర్థాల నుండి బాక్టీరియా మరియు శిలీంధ్రాలు నేల పోషక పదార్థములను విడగొడతాయి.
  3. అంతేకాకుండా బాక్టీరియా మరియు శిలీంధ్రాలు ఆరోగ్యకరమైన దిగుబడిని ఇవ్వడానికి మరియు భవిష్యత్తుల్లో పండించబోయే పంటలకు అనుకూలమైన నేలను అందిస్తాయి.

ప్రశ్న 14.
“ఎక్కువ మోతాదులో శిలీంధ్రనాశకాలు వాడితే జీవవైవిధ్యం, పంట దిగుబడిపై తీవ్రమైన ప్రమాదం కలుగుతుంది”. దీనిని నీవెలా సమర్థిస్తావు? (AS 6)
జవాబు:

  1. ఎక్కువ మోతాదులో శిలీంధ్రనాశకాలు వాడితే అవి ఎక్కువ భాగం మృత్తికలలో చేరి మృత్తికలోని జీవులను నాశనం చేస్తాయి.
  2. వర్షము కురిసినప్పుడు మృత్తిక నుండి వర్షపు నీటి ద్వారా చెరువులు, నదులలోని నీటిలోకి చేరి జలజీవులకు హాని కలుగచేస్తాయి.
  3. ఈ మందులను పొలంలో చల్లే రైతులు తరుచుగా వీటి ప్రభావానికి గురి కావడం జరుగుతుంది. కొన్ని రసాయనిక పదార్థాలు శరీరంలోకి ప్రవేశించి, కొన్నిసార్లు ప్రాణాపాయం కలుగుతుంది.
  4. క్రిమి సంహారక మందులను పంటలపై చల్లినప్పుడు అవి పరాగ సంపర్కానికి ఉపయోగపడే కీటకాలను కూడా చంపివేస్తాయి.

AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

ప్రశ్న 15.
అధిక దిగుబడినిచ్చే వంగడాలను ఉపయోగించడం వలన కలిగే ప్రతికూల ప్రభావం ఏమిటి? (AS 7)
జవాబు:
అధిక దిగుబడినిచ్చే వంగడాలను ఉపయోగించడం వలన
i) అవి ఎక్కువ మొత్తంలో నేల నుండి పోషకాలను వినియోగించుకుంటాయి.
ii) నిరంతరం ఉపయోగించడం వలన నేల సారాన్ని కోల్పోతుంది.
iii) సారాన్ని పెంచటానికి రసాయన ఎరువులు వాడాల్సి ఉంటుంది.
iv) ఇది వ్యవసాయ ఖర్చును పెంచుతుంది.

ప్రశ్న 16.
రసాయన ఎరువులు ఉపయోగిస్తున్న రైతుకు సేంద్రియ ఎరువులు ఉపయోగించే విధంగా ఏ రకంగా వివరించి ఒప్పిస్తావు? (AS 7)
జవాబు:

  1. పోషక పదార్థాలు తిరిగి నేలలో కలిసే విధంగా మరియు మట్టిగడ్డలు చిన్నవిగా చేయడానికి జీవ ఎరువులు తోడ్పడతాయి.
  2. నేలలో ఉండే జీవుల మనుగడను జీవ ఎరువులు ఎక్కువ చేస్తాయి.
  3. సేంద్రీయ ఎరువులు పంట దిగుబడి ఎక్కువ వచ్చే విధంగా చేస్తాయి.
  4. నేల యొక్క సహజ సమతౌల్యాన్ని కాపాడతాయి.
  5. కొన్ని పంటలకు వ్యాధులు సోకకుండా నివారిస్తాయి.
  6. పర్యావరణానికి హాని చేయని మిత్రులుగా సేంద్రియ ఎరువులు ఉంటాయి.

పైన పేర్కొన్న సేంద్రియ ఎరువుల యొక్క ఉపయోగాలను రైతుకు స్పష్టంగా వివరించి, వాటినే ఉపయోగించేలా ఆ రైతును ఒప్పిస్తాను.

ప్రశ్న 17.
వెంకటాపురం అనే గ్రామం తీవ్ర వర్షాభావ పరిస్థితులున్న ప్రాంతం. సోమయ్య తన పొలంలో చెరకును పండించాలనుకుంటున్నాడు. ఇది లాభదాయకమా? కాదా? వివరించండి. (AS 7)
జవాబు:

  1. సోమయ్య తన పొలంలో చెరకును పండించాలనుకోవడం లాభదాయకం కాదు.
  2. ఎక్కువ నీటి లభ్యత కలిగిన ప్రదేశాలలో మాత్రమే చెరకు పండుతుంది.
  3. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రదేశాలలో ఆరుతడి పంటలు పండించడం లాభదాయకం.

ప్రశ్న 18.
“సహజ కీటకనాశన పద్ధతులు జీవ వైవిధ్యానికి దోహదం చేస్తాయి”. వ్యాఖ్యానించండి. (AS 7)
జవాబు:

  1. కొన్ని రకాల కీటకాలు మనకు హాని కలిగించే, నష్టం కలిగించే కీటకాలను అదుపులో ఉంచుతాయి. వీటిని మిత్ర కీటకాలు అంటారు.
    ఉదా : సాలెపురుగు, డ్రాగన్ ప్లే, క్రిసోపా మొదలగునవి.
  2. ట్రైకో డెర్మా బాక్టీరియం కాండం తొలిచే పురుగు గుడ్లలో నివసిస్తుంది.
  3. పొగాకును తినే గొంగళి పురుగు, ధాన్యాన్ని తినే గొంగళిపురుగు వంటి వాటిని గ్రుడ్ల దశలోనే బాక్టీరియాతో నాశనం చేయవచ్చు.
  4. బాసిల్లస్ తురంజనిసిన్ వంటి కొన్ని రకాల బాక్టీరియాలు కీటకాలను నాశనం చేస్తాయి.
  5. కొన్ని రకాల మిశ్రమ పంటలు కీటకాలను, వ్యాధులను అదుపులో ఉంచుతాయి.
  6. అందువలన సహజ కీటక నాశన పద్దతులు జీవ వైవిధ్యానికి దోహదం చేస్తాయి. దీని ద్వారా కేవలం హానికరమైన కీటకాలు మాత్రమే చనిపోతాయి.

9th Class Biology 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు Textbook InText Questions and Answers

9th Class Biology Textbook Page No. 115

ప్రశ్న 1.
బిందుసేద్యం వంటి నీటి సరఫరా పద్ధతి, పంటలకు, రైతులకు ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించండి.
జవాబు:

  1. నీటి వృథాను అరికట్టడానికి బిందుసేద్యం (Drip Irrigation) అత్యంత ప్రయోజనకరమైన పద్ధతి.
  2. బిందుసేద్యం పద్ధతిలో నీరు చిన్న చిన్న గొట్టాల గుండా సరఫరా అవుతుంది.
  3. ఈ గొట్టాలకు అక్కడక్కడ సన్నటి రంధ్రాలుంటాయి.
  4. ఈ రంధ్రాల గుండా నీరు చుక్కలు చుక్కలుగా పడుతుంది.
  5. ఈ పద్ధతి ద్వారా ఎరువులను వృథా కాకుండా మొక్కలకు అందించవచ్చును.

9th Class Biology Textbook Page No. 115

ప్రశ్న 2.
వాటర్ షెడ్ పథకం భూగర్భజలాలను పెంచడానికి ఎంతగానో తోడ్పడుతుంది. దీనిని నీవు ఎట్లా సమర్థిస్తావు?
జవాబు:

  1. వాటర్ షెడ్ తో పంటలకి కావల్సిన నీళ్ళు ఇవ్వడమే కాకుండా చుట్టూ ఉన్న జంతువులకి, పశువులకి, పక్షులకి నీళ్ళందించవచ్చు.
  2. నేలలో తేమ శాతాన్ని పెంచవచ్చు.
  3. నేలపై మట్టి కొట్టుకుపోకుండా ఆపడానికి కూడా పాటర్ షెడ్ ఉపయోగపడుతుంది.
  4. కొండవాలు ప్రాంతాల్లో, ఎత్తైన గుట్టల్లో పడ్డ వాన నీళ్ళని సద్వినియోగం చేసుకొని, చుట్టూ ఉన్న ఆవాసంలో అన్ని అవసరాలకి నీళ్ళని అందించే ఏకైక మార్గం వాటర్‌షెడ్.

AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

9th Class Biology Textbook Page No. 121

ప్రశ్న 3.
వర్మీ కంపోస్టు ఎరువు రసాయనిక ఎరువుల కంటే ఎలా మేలైనది?
జవాబు:

  1. రసాయనిక ఎరువుల వలన నేలకలుషితం, వాతావరణ కలుషితం జరుగుతుంది.
  2. రసాయనిక ఎరువులు వాడిన ఆహార పదార్థాలు తినడం వలన మానవుల ఆరోగ్యం పాడవుతుంది.
  3. కాని వర్మీ కంపోస్టు వాడడం వలన ఎలాంటి కాలుష్య లేదా ఆరోగ్య సమస్యలు ఏర్పడవు. అందువలన వర్మీ కంపోస్టు ఎరువు రసాయనిక ఎరువులకంటే చాలా మేలైనది.

9th Class Biology Textbook Page No. 109

ప్రశ్న 4.
a) నెలకు ఎంత ధాన్యం మీ ఇంట్లో అవసరం అవుతుందో అంచనా వేయటానికి ప్రయత్నించండి.
జవాబు:
నెలకు మా ఇంట్లో సుమారుగా 50 కి.గ్రా. ధాన్యం ఖర్చు అవుతుంది. సంవత్సరానికి 600 కి.గ్రా. ధాన్యం అవసరమవుతుంది.

b) ఆ ధాన్యం పండటానికి ఎంత నేల అవసరమో ఊహించంది.
జవాబు:
600 కి.గ్రా. ధాన్యం పండటానికి సుమారు 1.4 చ.కి.మీ. నేల అవసరమవుతుంది.

9th Class Biology Textbook Page No. 109

ప్రశ్న 5.
ఈ క్రింది పట్టికను పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 2
a) ఏ దశాబ్దంలో జనాభా పెరుగుదల అధికంగా ఉంది?
జవాబు:
1961-1971 దశాబ్దంలో జనాభా పెరుగుదల అధికంగా ఉంది.

b) ఏ దశాబ్దంలో ఆహారధాన్యాల ఉత్పత్తి అధికంగా ఉంది?
జవాబు:
1981-1991 దశాబ్దంలో ఆహారధాన్యాల ఉత్పత్తి అధికంగా ఉంది.

c) పై పట్టికలో ఏయే తేడాలు మీరు గమనించారు?
జవాబు:
జనాభా పెరుగుదలతో సమానంగా ఆహారధాన్యాల ఉత్పత్తి పెరగటం లేదు.

d) పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహారధాన్యాల ఉత్పత్తి జరుగుతున్నదా?
జవాబు:
లేదు, జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఆహారధాన్యాల ఉత్పత్తి జరగటం లేదు.

e) ఏ దశాబ్దంలో జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఆహారధాన్యాల ఉత్పత్తి సంతృప్తికరంగా లేదు?
జవాబు:
1991-2001 దశాబ్దంలో జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఆహారధాన్యాల ఉత్పత్తి జరగలేదు. పెరుగుదల రేటు కేవలం 0.56 మాత్రమే.

f) తగినంత ఆహారధాన్యాల ఉత్పత్తి జరగకపోతే ఏమి జరుగుతుంది?
జవాబు:
తగినంత ఆహారధాన్యాల ఉత్పత్తి జరగకపోతే, దేశంలో తీవ్ర ఆహార కొరత ఏర్పడుతుంది.

g) 1991-2001 దశాబ్దంలో జనాభాని పోల్చితే సగమే ఆహారధాన్యాల, ఉత్పత్తి జరిగింది. ఫలితంగా ఆ దశాబ్దంలో ఏం జరిగి ఉంటుందని నీవు భావిస్తున్నావు?
జవాబు:
1991-2001 దశాబ్దంలో జనాభా పెరుగుదలకు సమానంగా ఆహారధాన్యాల ఉత్పత్తి జరుగలేదు. దానివలన దేశంలో తీవ్ర కరువు పరిస్థితి నెలకొని ఉండి ఉంటుంది. ప్రజలు ఆహార కొరతను ఎదుర్కొని ఉంటారు.

9th Class Biology Textbook Page No. 110

ప్రశ్న 6.
ఆహారధాన్యాల ఉత్పత్తిలో పెంపుదలకు మీరిచ్చే సూచనలు రాయండి.
జవాబు:

  1. మంచి నాణ్యమైన వ్యాధి నిరోధకత కలిగిన వంగడాలు పంటకు ఎన్నుకోవాలి.
  2. నీటి వనరుల ఆధారంగా నేల స్వభావం పరిశీలించి సరైన పంటను ఎన్నుకోవాలి.
  3. సహజ ఎరువులకు ప్రాధాన్యమివ్వాలి.
  4. వ్యాధుల నివారణకు సహజ నియంత్రణ పద్ధతులు పాటించాలి.
  5. పంట మార్పిడి, అంతర పంటలకు ప్రాధాన్యమివ్వాలి.
  6. యంత్రాలు, ఆధునిక సాంకేతికతను వాడటం వలన అధిక దిగుబడి సాధించవచ్చు.

9th Class Biology Textbook Page No. 111

ప్రశ్న 7.
అధిక ఆహార ఉత్పత్తి సాధించటానికి కొన్ని పరిష్కార మార్గాలు చూపండి.
జవాబు:

  1. సాగునేల విస్తీర్ణాన్ని పెంచడం.
  2. ప్రస్తుతం సాగులో ఉన్న నేలలోనే అధిక దిగుబడి సాథించడం.
  3. అధిక దిగుబడిని ఇచ్చే వంగడాలను అభివృద్ధి చేయడం.
  4. పంట మార్పిడి చేయడం.
  5. మిశ్రమ పంటలు పండించడం.
  6. స్వల్పకాలిక పంటలు పండించడం.

ఎ) పై వాటిలో ఏది ప్రయోజనకరమో చర్చించండి.
జవాబు:

  1. సాగునేల విస్తీర్ణాన్ని పెంచటం వలన అడవులను నరికివేయాల్సి వస్తుంది. కావున సరైన చర్యకాదు.
  2. ప్రస్తుతం సాగులో ఉన్న నేలలోనే అధిక దిగుబడి సాధించటం ప్రయోజనకర పద్దతి..
  3. ఈ పద్ధతిలోది, వంగడాల అభివృద్ధి, పంటమార్పిడి, మిశ్రమ పంటలు వంటి అన్ని పద్ధతులూ ఇమిడి ఉంటాయి.

9th Class Biology Textbook Page No. 112

ప్రశ్న 8.
ఈ క్రింది గ్రాఫ్ ను పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 3
a) పై గ్రాఫ్ ఆధారంగా పంట దిగుబడిలో నీటిపారుదల ప్రాముఖ్యతను వివరించండి.
జవాబు:

  1. నీటిపారుదల పంటకు అత్యంత అవసరము.
  2. నీటిపారుదల సక్రమంగా ఉన్నప్పుడు పంట దిగుబడి బాగా ఉంది.
  3. సరిపడినంత ఎరువులు అందించినప్పటికి, నీటిపారుదల సక్రమంగా లేకుంటే మంచి దిగుబడి పొందలేము.

b) ఒకే పరిమాణంలో నత్రజని అందించినప్పటికీ నీటిపారుదల కల్పించిన పొలంలో, నీటిపారుదల కల్పించని పొలంలో పంట దిగుబడిలో తేడాలున్నాయా? ఉంటే అవి ఏమిటి?
జవాబు:

  1. తేడాలు ఉన్నాయి. ఒకే పరిమాణంలో నత్రజని అందించినప్పటికీ సరైన నీటిపారుదల ఉన్న పంటలు అధిక దిగుబడిని ఇచ్చాయి.
  2. నీటిపారుదల సక్రమంగా లేని పంటలు, ఎరువులు అందించినప్పటికీ సరైన దిగుబడిని ఇవ్వలేదు.

9th Class Biology Textbook Page No. 113

ప్రశ్న 9.
ఈ క్రింది గ్రాఫ్ ను పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 4
a) పై గ్రాఫ్ లో ఏ నెలల్లో మొక్కలు అధిక నీటిని ఆవిరి రూపంలో విడుదల చేస్తున్నాయో గుర్తించండి.
జవాబు:
మే మరియు జూన్ నెలల్లో మొక్కల నుండి నీరు ఆవిరి రూపంలో అధికంగా కోల్పోతున్నాయి.

b) కొన్ని నెలలలో వర్షాలు అధికంగా ఉన్నప్పటికీ మొక్కలు విడుదలచేసే నీటి ఆవిరి పరిమాణం ఒకే విధంగా ఉంటుందా?
జవాబు:
వర్షాలు ఉన్నప్పుడు పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. అందువలన మొక్కలు విడుదల చేసే నీటి ఆవిరి పరిమాణం తక్కువగా ఉంటుంది.

c) నీరు అధికంగా లభిస్తే మొక్కలపై నీటి ప్రభావం ఏవిధంగా ఉంటుంది?
జవాబు:

  1. నీరు అధికంగా లభించినపుడు మొక్కలు వేగంగా పెరుగుతాయి.
  2. భూమి నుండి పోషకాలను బాగా గ్రహించగలుగుతాయి.

AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

9th Class Biology Textbook Page No. 114

ప్రశ్న 10.
a) వాతావరణం వేడిగా ఉన్నప్పుడు పత్ర రంధ్రాలు మూసుకొని పోతాయనుకున్నాం కదా ! మరి ఇది కార్బన్ డై ఆక్సైడ్ శోషణపై ఏ ప్రభావాన్ని చూపుతుంది?
జవాబు:

  1. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు పత్ర రంధ్రాలు మూసుకొనిపోతాయి.
  2. అందువలన CO2 శోషణ మొక్కలలో తగ్గుతుంది.

b) కార్బన్ డై ఆక్సైడ్ శోషణ రేటులో మార్పు మొక్కలపై ఏ విధమైన ప్రభావం చూపుతుంది?
జవాబు:
కార్బన్ డై ఆక్సైడ్ శోషణ రేటు తగ్గటం వలన మొక్కలలో ఆహారోత్పత్తి తగ్గుతుంది. దీనివలన మొక్కల పెరుగుదల తగ్గుతుంది. కొత్త కొమ్మలు, ఆకులు ఏర్పడవు.

c) ఇలాంటి సమయంలో మొక్కలకు నీళ్ళు లేకపోతే ఏమౌతుంది?
జవాబు:
ఇలాంటి సమయంలో మొక్కలకు నీళ్ళు లేకపోతే మొక్కల ఆరోగ్యం పాడైపోతుంది. పంట దిగుబడి తీవ్రంగా తగ్గుతుంది.

9th Class Biology Textbook Page No. 114

ప్రశ్న 11.
వ్యవసాయానికి నీరు ప్రధాన అవసరం. మీ గ్రామంలో వ్యవసాయం కోసం ఉన్న ముఖ్యమైన నీటి వనరులు ఏమున్నాయి? రైతులు వాటిని ఎలా ఉపయోగించుకుంటున్నారు?
జవాబు:

  1. మా గ్రామంలో వ్యవసాయం కొరకు కాలువలు, చెరువులు ఉన్నాయి.
  2. వర్షపునీరు చెరువును చేరి నిల్వ చేయబడుతుంది.
  3. ఈ నీటిని పంటకాలువల ద్వారా పంట పొలాలకు మళ్ళించి వ్యవసాయం చేస్తారు.
  4. మా గ్రామంలో కొంత ప్రాంతం సాగర్ కాలువ కింద సాగుబడిలో ఉంది.

9th Class Biology Textbook Page No. 114

ప్రశ్న 12.
వరి పండించటానికి అధిక పరిమాణంలో నీరు అవసరం. ఇలా నీరు ఎక్కువగా అవసరమయ్యే పంటల పేర్లు చెప్పగలరా?
జవాబు:
వరితోపాటుగా గోధుమ, చెరకు వంటి పంటలకు అధిక నీరు అవసరమౌతుంది.

9th Class Biology Textbook Page No. 115

ప్రశ్న 13.
తక్కువ నీరు కావలసిన పంటల పేర్ల జాబితా రాయండి.
జవాబు:
ప్రత్తి, జనపనార, సజ్జలు, మొక్కజొన్న, కొబ్బరి, మినుములు, పెసలు, వేరుశనగలకు తక్కువ నీరు అవసరం.

9th Class Biology Textbook Page No. 116

ప్రశ్న 14.
a) ఒక పొలంలో చాలా సంవత్సరాల పాటు ఒకే పంట సాగుచేస్తూ ఉంటే, నేలలోని పోషకాలు ఏమౌతాయి?
జవాబు:
ఒక పొలంలో చాలా సంవత్సరాల పాటు ఒకే పంట సాగుచేస్తే ఒకే విధమైన పోషకాలు శోషించబడి, నేలలో పోషకాల కొరత ఏర్పడుతుంది. అందువలన పంట దిగుబడి విపరీతంగా తగ్గుతుంది.

b) కోల్పోయిన పోషకపదార్థాలను నేల తిరిగి ఎలా పొందుతుంది?
జవాబు:
నేల కోల్పోయిన పోషకపదార్థాలను వృక్ష, జంతు వ్యర్థాలు కుళ్ళటం వలన హ్యూమస్ రూపంలో తిరిగి పొందుతుంది. కానీ ఇది చాలా నెమ్మదైన ప్రక్రియ. అందువలన రైతులు రసాయన ఎరువులు వాడుతున్నారు. ఇవి ఖర్చుతో కూడుకొని నేల ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి.

9th Class Biology Textbook Page No. 116

ప్రశ్న 15.
ఒక రైతు తన పొలంలో గత 5 సంవత్సరాల నుండి చెరకు పంటను పండిస్తున్నాడు. మరో రైతు మొదటి సంవత్సరం చెరకు పంట, రెండవ సంవత్సరం సోయా చిక్కుళ్ళు, మూడవ సంవత్సరం తిరిగి చెరకు పంట పండించాడు. ఏ పొలంలో పోషకపదార్థాలు నశిస్తాయి? ఎందుకు?
జవాబు:
వరుసగా ఐదు సంవత్సరాలు చెరకు పండించిన రైతు పొలంలో పోషకాలు లోపిస్తాయి. చెరకు ఒకే విధమైన పోషకాలను ప్రతి సంవత్సరం నేల నుండి గ్రహిస్తుంది. కావున నేలలో ఆ పోషకాలు తగ్గిపోయి, పోషకాల కొరత ఏర్పడుతుంది.

పంట మార్పిడి పాటించటం వలన నేలలోని పోషకాల వినియోగం మారి, పోషకాలు పునరుద్ధరింపబడతాయి. పంట మార్పిడి విధానంలో లెగ్యూమినేసి పంటలు మంచి ఫలితాలను ఇస్తాయి.

AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

9th Class Biology Textbook Page No. 118

ప్రశ్న 16.
తమలపాకులను మిశ్రమపంటలుగా మాత్రమే పండిస్తారు. ఎందుకు?
జవాబు:

  1. తమలపాకు మొక్క తీగవలె ఉండి ఎత్తు మొక్కలకు అల్లుకొంటుంది.
  2. నేల అంతా ఖాళీగా ఉండుట వలన అంతర పంటకు అనుకూలంగా ఉంటుంది.
  3. అందువలన తమలపాకుతో పాటు పెసర, మినుము వంటి మిశ్రమపంటలు పండిస్తారు.
  4. దీనివలన రైతుకు రెండు పంటలు పండి ఆర్థికలాభం చేకూరుతుంది.
  5. నేలలో పోషకాలు పునరుద్ధరింపబడతాయి.

9th Class Biology Textbook Page No. 118

ప్రశ్న 17.
లెగ్యూమినేసి జాతికి చెందిన పంటల పేర్లు కొన్నింటిని చెప్పండి.
జవాబు:
చిక్కుడు, మినుము, పెసర, వేరుశనగ, పిల్లి పెసర వంటి పంటలు లెగ్యూమినేసి జాతికి చెందుతాయి. ఇవి నేలలో నత్రజనిని స్థాపించి పోషక విలువలను పెంచుతాయి.

9th Class Biology Textbook Page No. 118

ప్రశ్న 18.
నత్రజని స్థాపన చేసే బాక్టీరియాల పేర్లను తెలుసుకోండి.
జవాబు:
రైజోబియం, అజటో బాక్టర్, నైట్రోమోనాస్, సూడోమోనాస్ వంటి బాక్టీరియాలు నత్రజని స్థాపనకు తోడ్పడుతాయి. ఇవి వాతావరణంలోని నత్రజనిని నైట్రేట్లుగా మార్చి మొక్కలకు అందిస్తాయి.

9th Class Biology Textbook Page No. 122

ప్రశ్న 19.
ఈ క్రింది పట్టిక పరిశీలించి, ప్రశ్నలకు సమాధానాలు రాయంది.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 5

a) పై పట్టిక నుండి మీరు ఏం గ్రహించారు?
జవాబు:
నత్రజని స్థాపనలో బాక్టీరియాతో పాటు, శైవలాలు కూడా పాల్గొంటున్నాయి. మరికొన్ని బాక్టీరియాలు, శైవలాలు, శిలీంధ్రాలు, ఫాస్పరస్ ను మొక్కలకు అందిస్తున్నాయి.

b) ఏ మూలకాలు అధికంగా సంశ్లేషణ చేయబడతాయి?
జవాబు:
నత్రజని నేలలో అధికంగా సంశ్లేషణ చేయబడుతుంది.

9th Class Biology Textbook Page No. 123

ప్రశ్న 20.
ఈ క్రింది పట్టికను పరిశీలించి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 6
a) పై పట్టిక ఆధారంగా చూస్తే మనం 50 కి.గ్రా.ల యూరియాను నేలకు అందిస్తే 23 కి.గ్రా. నత్రజని (466) నేలలోకి పునరుద్ధరింపబడుతుంది. అంతే పరిమాణంలో నత్రజని పొందాలంటే ఎంత అమ్మోనియం సల్ఫేట్ నేలలో కలపాలి?
జవాబు:
అంతే పరిమాణంలో (23 కి.గ్రా. ) నత్రజని పొందాలంటే సుమారు 100 కి.గ్రా. అమ్మోనియం సల్ఫేట్ (యూరియా)ను నేలలో కలపాలి.

b) 50 కి.గ్రా.ల సూపర్ ఫాస్ఫేట్ నేలలో కలిపితే ఎంత ఫాస్పేట్ నేలలోకి చేరుతుంది?
జవాబు:
50 కి.గ్రా. ల సూపర్ ఫాస్ఫేట్ నేలలో కలిపితే, 4 నుండి 4.5 కి.గ్రా. ఫాస్పేట్ నేలలోకి చేరుతుంది.

AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

9th Class Biology Textbook Page No. 123

ప్రశ్న 21.
స్థానిక వరి రకం (బంగారు తీగ) మరియు హైబ్రిడ్ వరి రకం (IR – 3) పై నత్రజని ఎరువులను చల్లడం వల్ల కలిగే ప్రభావాన్ని కింది స్లో చూడండి.
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 7
a) నత్రజని ఎరువుల ప్రభావం బంగారు తీగ మరియు IR- 8 వరి రకాలపై చూపే ప్రభావంలో తేడా ఏమిటి?
జవాబు:

  1. నత్రజని ఎరువుల ప్రభావం, స్థానిక వరి రకం బంగారు తీగపై వ్యతిరేక ప్రభావం చూపింది.
  2. ఎరువు మోతాదు పెరిగేకొలది పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది.
  3. వరి రకం IR – 8 మీద నత్రజని ప్రభావం సానుకూలంగా ఉంది.
  4. నత్రజని ఎరువు మోతాదు పెరిగే కొలది హైబ్రిడ్ రకం IR-8 లో దిగుబడి కూడా పెరుగుతూ వచ్చింది.

9th Class Biology Textbook Page No. 125

ప్రశ్న 22.
మనుషుల ఆరోగ్యంపై క్రిమిసంహారులు, కలుపు నాశకాలు ఏ విధమైన ప్రభావాన్ని చూపుతాయి?
జవాబు:

  1. మనుషుల ఆరోగ్యంపై క్రిమిసంహారులు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.
  2. క్రిమిసంహారులను పిచికారి చేసే సమయంలో ఊపిరితిత్తులు తీవ్ర విష ప్రభావానికి లోనవుతాయి.
  3. వీటి వలన అనేక చర్మవ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు ఏర్పడుతున్నాయి.
  4. కొన్ని హానికర రసాయనాలు నాడీవ్యవస్థను, రక్తప్రసరణ వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి.

9th Class Biology Textbook Page No. 126

ప్రశ్న 23.
ఈ మధ్యకాలంలో పొద్దుతిరుగుడు పంటలో రైతులు చేతిగుడ్డతో పుష్పాలను అద్దుతూ పోతున్నారు. ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడిందో చెప్పగలరా?
జవాబు:

  1. రైతులు విచక్షణారహితంగా కీటకనాశనులు వాడటం వలన ఉపయోగకర కీటకాలు కూడా మరణించాయి.
  2. అందువలన మొక్కలలో పరాగసంపర్కం జరుగక పంట దిగుబడి తగ్గిపోయింది.
  3. దీనిని అధిగమించటానికి రైతులు పొద్దుతిరుగుడు పంటలలో చేతిగుడ్డతో పుష్పాలను అద్ది కృత్రిమ పరాగసంపర్కం చేయాల్సి వచ్చింది.

9th Class Biology Textbook Page No. 126

ప్రశ్న 24.
పంట పొలంలో కీటక నిర్మూలన గురించి స్నేహితులతో చర్చించండి. ప్రత్యామ్నాయాలు సూచించండి.
జవాబు:

  1. కీటక నిర్మూలన కొరకు కీటక నాశకాలు వాడటం వలన అవి పంట ఉత్పత్తులు, పర్యావరణంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.
  2. దీనిని అధిగమించటానికి రైతులు సహజ నియంత్రణ పద్ధతులు పాటించాలి.
  3. వెల్లుల్లి రసం, N.P.U ద్రావణం వంటి బయో పెస్టిసైడ్స్ వాడాలి.
  4. వ్యాధి క్రిములను తినే మిత్ర కీటకాలను ప్రోత్సహించాలి.
  5. పంట మార్పిడి విధానం, విత్తనశుద్ధి పద్ధతులలో వ్యాధులను ఎదుర్కొనవచ్చు.
  6. ఆకర్షక పంటలు వేసి కీటకాల తాకిడి తగ్గించవచ్చు.

AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

9th Class Biology Textbook Page No. 127

ప్రశ్న 25.
పత్తి పొలాలలో జనుము మరియు బంతిపూలను ఎందుకు పండిస్తారో మీరు చెప్పగలరా?
జవాబు:

  1. పత్తి పొలాలలో జనుమును మరియు బంతిపూలను ఆకర్షక పంటగా పండిస్తారు.
  2. ఇవి కీటకాలను సులభంగా ఆకర్షిస్తాయి.
  3. అందువలన ప్రధానపంటలు కీటకాల నుండి రక్షింపబడతాయి.
  4. కీటకాలను ఎదుర్కొనటానికి ఇదొక సహజ నియంత్రణ పద్ధతి.

9th Class Biology 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు Textbook Activities (కృత్యములు)

కృత్యం – 1

1. బాష్పోత్సేకము
1) ఒక పాలిథిన్ సంచిని తీసుకోవాలి.
2) ఆరోగ్యంగా ఉన్న మొక్క ఆకులను సంచిలో కప్పి ఉంచి దారంతో కట్టాలి.
3) 4-5 గంటలపాటు దానిని పరిశీలిస్తూ ఉండాలి.
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 8

పరిశీలనలు :

  1. ఆకులను పాలిథిన్ సంచితో కప్పి ఉంచినప్పుడు మొక్క ఎంత మొత్తంలో నీటిని నీటి ఆవిరి రూపంలో గాలిలోనికి విడుదల చేస్తుందో చూడవచ్చు.
  2. పిండి పదార్థాలను తయారుచేయడానికి మొక్క తాను పీల్చుకున్న నీటిలో 0.1 శాతం నీటిని మాత్రమే వినియోగించుకుంటుంది.
  3. బాష్పోత్సేకము రేటు రాత్రి కంటే పగలు ఎక్కువగా ఉంటుంది.

కృత్యం – 2

2. a) మీ గ్రామ చిత్రపటాన్ని గీసి, గ్రామంలోని ముఖ్యమైన నీటి వనరులను గుర్తించండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 9

b) ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల పటంలో నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువ మార్గాలను చూపండి. ఏ ఏ జిల్లాలకు నీటి వసతి లభిస్తుందో గుర్తించండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 10

కృత్యం – 3

3. మీ ప్రాంతంలో పంట పొలాల్లో కల్పించే ప్రముఖమైన కలుపు మొక్కల జాబితా తయారుచేయండి. అవి ఏ పంటతో పాటు పెరుగుతాయో రాయండి.
జవాబు:
కలుపు మొక్కల జాబితా :
సైనోడాన్ డాక్టలాన్, సైపరస్ రొటండస్ (తుంగ), డిజిటారియా లాంగిఫోలిమా, డాక్టలోనియమ్ కలోనమ్, సెటేరియా గ్లూకా, సైపరస్ డిఫార్మిస్, ఐకోర్నియా క్రాసిప్స్ (బుడగతమ్మ), సాల్వీనియా మొలస్టా, ఆల్టర్ నాంతిర సెసైలిస్ (పొన్నగంటి), సెలోషియా అర్జెన్షియా (గురంగుర), లూకాస్ ఏస్పిరా (తుమ్మి), పోర్చులేక ఒలరేషియా (పావలికూర), క్లియోమి విస్కోసా (కుక్కవామింటా), సొలానమ్ నైగ్రమ్ (బ్లాక్ నైట్ షేడ్), అర్జిమోన్ మెక్సికానా (బాలరక్కొస) ఎబుటిలాన్ ఇండికమ్ (తుత్తురి బెండ), యూఫోర్బియా హిరా (పచ్చబొట్లు), వెర్నోనియా సిన్నోరా, ఇఖనోక్లోవ కొలానమ్ (ఉడలు), కొమ్మలైనా బెంగా లెన్సిస్ (వెన్నవెదురు), అవినా ఫాట్యువ (అడవియవలు), ఇఖనోక్లోవ క్రస్ గల్లి (నీటి గడ్డి), ఎల్యుసైన్ ఇండికా (గూ గ్రాస్), ఎకిరాంథిస్ ఏస్పిరా (ఉత్తరేణి), ఇక్లిష్టా ప్రోస్టేట (గుంటకలగర లేదా బృంగరాజ) మొదలగునవి.

పంట రకం పంటపై పెరిగే కలుపు మొక్కలు
వరి గరిక, తుంగ, బుడగ తమ్మ, పొన్నగంటి
వేరుశనగ గురంగుర, గరిక, తుంగ, తుత్తురి బెండ, వెన్న వెదురు, కుక్కవామింట, తుమ్మి, పావలికూర, బాలరక్కిస.
మినుములు గరిక, తుంగ, తుత్తురి బెండ, వెన్న వెదురు, సాల్వీనియా మొలస్టా, పచ్చబొట్లు, బంగారు తీగ.
మొక్కజొన్న పచ్చబొట్లు, సొలానమ్ నైగ్రమ్, గరిక, తుంగ
పెసలు ఉడలు, గరిక, తుంగ, బాలరక్కొస, పావలికూర

ప్రయోగ కృత్యములు.

ప్రయోగశాల కృత్యము – 1

1. 1) తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు, కూరగాయలు పండ్లలో ప్రతిదానికి ఉదాహరణ తీసుకోండి.
2) ముందుగా వాటిలో ఉన్న లక్షణాలను రాయండి.
3) ఆ పంటలలో ఏ మార్పులు మీరు కోరుకుంటున్నారో రాయండి. మీరు కోరుకుంటున్న మార్పులకు తగిన కారణాలు రాయండి.
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 11

2. సొంత హైబ్రిడ్ పుష్పాలను ఉత్పత్తి చేయటం:
జవాబు:

  1. 5 లేక 6 ఎరుపు రంగు పుష్పాల (చంద్రకాంత) మొక్కలను ఎంపిక చేసుకోవాలి.
  2. మిగిలిన పుష్పాలన్నింటిని తెంచివేయాలి.
  3. ప్రతి పుష్పానికి ఉండే కేసరావళిని తొలగించాలి.
  4. పసుపు రంగు పుష్పాన్ని తీసుకొని, ఎరుపురంగు పుష్పంలో ఉండే కీలాగ్రంపై రుద్ది పరాగ సంపర్కం జరపాలి. (సాయంత్రం వేళల్లో చేయాలి)
  5. సంకరణం చేసిన మొక్కలను గుర్తించడానికి ఆ పుష్పాలుండే కాండాలకు తాడు కాని, దారం కాని గుర్తుగా కట్టాలి. ఎందుకంటే కొద్ది రోజుల్లో ఆ పుష్పాల నుండి ఏర్పడే గింజలను సేకరించాల్సి ఉంటుంది.
  6. ఒక వారం రోజుల్లో నల్లని విత్తనాలు ఏర్పడతాయి.
  7. విత్తనాలను రెండు వారాలపాటు ఎండనిచ్చి వేరొక కుండలో నింపాలి.
  8. కొత్త మొక్క పెరిగి పుష్పించే వరకు జాగ్రత్తగా సంరక్షించాలి.
  9. ఆ మొక్క నుండి ఏర్పడే పుష్పాలను పరిశీలించాలి.

పరిశీలనలు :
మొక్క నుండి ఏర్పడే పుష్పాలు నారింజ రంగులో ఉంటాయి. ఎరుపు మరియు పసుపు రంగు పుష్పాల కలయికతో నారింజ రంగు పుష్పాలు ఏర్పడతాయి.