AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

AP State Syllabus AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

AP State Syllabus 9th Class Telugu Important Questions 5th Lesson పద్యరత్నాలు

9th Class Telugu 5th Lesson పద్యరత్నాలు Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

క్రింది అపరిచిత పద్యాలను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. జన్మభూమి కంటే స్వర్గంబు వేరేది?
మాతృభాష కంటె మధురమేది?
కన్నతల్లి కంటె ఘనదైవమింకేది?
తెలియుమయ్య నీవు తెలుగు బిడ్డ !
ప్రశ్నలు:
1. మనిషికి స్వర్గం ఏది?
2. మాతృభాష ఎలాంటిది?
3. మనిషికి దైవం ఏది?
4. ‘తెలుగు’ ప్రకృతి పదం?
జవాబులు :
1. జన్మభూమి
2. మధురమైనది
3. కన్నతల్లి
4. త్రిలింగ

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

2. అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున దా
నెక్కిన బారని గుఱ్ఱము
గ్రక్కున విడువంగ వలయు గదా సుమతీ !
ప్రశ్నలు:
1. ‘అక్కర’ అంటే ఏమిటి?
2. ఎటువంటి వేల్పును విడిచి పెట్టాలి?
3. సుమతీ శతకం వ్రాసినదెవరు?
4. ఇంకా వేటిని విడవాలని ఈ పద్యం చెబుతోంది?
జవాబులు :
1. అవసరం
2. మొక్కినా వరం ఇవ్వని
3. బద్దెన
4. అవసరానికి ఉపయోగపడని చుట్టాన్ని, ఇష్టంతో ఎక్కినా నడవని గుఱ్ఱాన్ని,

3. ఈ కింది పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
గుడ్లగూబ పెద్ద గుడ్లున్నదైనను
సుంతయైన వెలుగు చూడలేదు
విద్యలున్న నేమి విజ్ఞత లేకున్న
వాస్తవమ్ము నార్ల వారి మాట
ప్రశ్నలు:
1. వెలుగు చూడలేని పక్షి ఏది?
2. మనిషికి ఏది ముఖ్యమని పై పద్యంలో చెప్పారు?
3. “సుంతయైన” అనే పదానికి అర్థం ఏమై ఉంటుంది?
4. పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబులు:
1. గుడ్లగూబ
2. విజ్ఞత
3. కొంచమైన
4. పై పద్యంలో మకుటం ఏది?

4. ఈ కింది పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (S.A. II – 2018-19)
అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను
సజనుండు పల్కు చల్లగాను
కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగునా?
విశ్వదాభిరామ వినురవేమ?
ప్రశ్నలు:
1. సజ్జనుడు ఏ విధంగా మాట్లాడుతాడు?
2. అల్పుని పలుకులు ఎలా ఉంటాయి?
3. పై పద్యం ఏ విషయం గురించి చెప్తోంది?
4. పై పద్యానికి తగిన ప్రశ్నను తయారుచేయండి.
జవాబులు:
1. శాంతంగా / మంచిగా
2. ఆడంబరంగా
3. మాటతీరును (మంచివాని మాటతీరు, అల్పుని మాటతీరు)
4. పై పద్యానికి ‘ఓటికుండకు మోత ఎక్కువ’ అన్న సామెత వర్తిస్తుందా?

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

5. ఈ కింది అపరిచిత పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
తలనుండు విషము ఫణికిని
వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్
తల తోక యనక నుండును
ఖలునకు నిలువెల్ల విషముగదరా సుమతీ !
ప్రశ్నలు :
1. పై పద్యంలో దేని గురించి చెప్పారు?
2. పై పద్యం ఏ శతకంలోనిది?
3. తేలుకు విషం ఎక్కడ ఉంటుంది?
4. పై పద్యానికి తగిన ప్రశ్నను తయారుచేయండి.

6. కింది పద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం రాయండి. (S.A. III – 2015-16)
కలిమిగల లోభికన్నను
విలసి తముగ పేద మేలు వితరణి యైనన్
చలిచెలమ మేలుగాదా !
కుల నిధియంబోధి కన్న గువ్వల చెన్నా !
ప్రశ్నలు :
1. లోభిని ఎవరితో పోల్చారు?
2. లోభియైన ధనవంతుని కంటె ఎవరు మేలు?
3. ‘చలి చెలమ’ అంటే మీకేమి తెలిసింది?
4. పై పద్యం ద్వారా అలవరచుకోవలసిన గొప్పగుణమేది?
జవాబులు:
1. సముద్రంతో
2. దానం చేసే బుద్ధి గల పేదవాడు
3. చిన్న నీటిగుంట
4. దానగుణం

7. కింది పద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం రాయండి. (S.A. I – 2017-18)
పూజకన్న నెంచ బుద్ది నిధానంబు
మాటకన్న నెంచ మనసు దృఢము
కులముకన్న నెంచ గుణము ప్రధానంబు
విశ్వదాభిరామ వినురవేమ.
ప్రశ్నలు :
1. పూజకన్నా ముఖ్య మైనది ఏది?
2. మాటకన్నా దృఢమైనది ఏది?
3. విధానము, సుధానము ఇటువంటి పదాలను ప్రాస పదాలు అంటారు. పై పద్యంలో అటువంటి పదాలు ఉన్నాయి. వెతికి రాయండి.
4. పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబులు:
1. బుద్ధి
2. మనసు
3. నిధానంబు – ప్రధానంబు / పూజకన్న – మాటకన్న / రామ – వేమ
4. ఈ పద్యంలోని మకుటం ఏది?
జవాబులు:
1. చెడ్డవాని స్వభావాన్ని గూర్చి చెప్పారు.
2. సుమతీ
3. తోకలో
4. పై పద్యంలోని ప్రాణుల పేర్లు రాసి, వాటి అర్థం

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

8. కింది పద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం రాయండి. (S.A. III – 2016-17)
తగిలినంతమేర దహియించుకొనిపోవు
చెడ్డవాని చెలిమి చిచ్చువోలె
మంచివారి మైత్రి మలయమారుతవీచి
లలిత సుగుణజాల తెలుగుబాల !
ప్రశ్నలు:
1. మలయమారుతంలా ఉండేదేది?
2. ఈ పద్యం ఏ శతకం లోనిది?
3. పై పద్యానికి తగిన శీర్షిక సూచించండి.
4. చెడ్డవాడి చెలిమిని గురించి ఒక ప్రశ్న తయారు చేయండి. రాయండి.
జవాబులు:
1. మంచివాని మైత్రి
2. తెలుగుబాల
3. చెలిమి
4. చెడ్డవాడి చెలిమిని కవి దేనితో పోల్చాడు?

II. స్వీయరచన

అ) క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
కూచిమంచి తిమ్మకవి ‘శ్రీ భర్గ శతకం’ ద్వారా ఏమి చెప్పదలచారు?
జవాబు:
గాజుపూస విలువైన రత్నం ఎప్పటికీ కాలేదు. కాకి హంసగానూ, జోరీగ తేనెటీగ గానూ, దున్నపోతు సింహంగానూ, జిల్లేడు చెట్టు కల్పవృక్షం గానూ ఎప్పటికీ కాలేవు. అట్లే పిసినారి అయిన దుర్జనుడు రాజు కాలేడు – అని చెప్పడం ద్వారా వ్యక్తిత్వం అనేది పుట్టుకతో వస్తుంది గాని మధ్యలో రాదని తెలుస్తోంది.

ప్రశ్న 2.
లోకంలో భగవంతునికి నిజమైన సేవకుడు ఎవరు?
జవాబు:
లోకంలో భగవంతునికి నిజమైన సేవకుడు సత్యవంతుడు. మరియు దురాచారుడు కానివాడు. విచక్షణతో మెలిగేవాడు. దుర్జనులతో స్నేహం చేయనివాడు. భక్తులతో స్నేహంగా ఉండేవాడు. కామాతురుడు కానివాడు. ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళే నిజమైన సేవకులని యథావాక్కుల అన్నమయ్య తెలిపారు.

ప్రశ్న 3.
“స్నానంబుల్ నదులందు …………….” అను పద్యం ద్వారా పోతవ ఏమి తెలియజేస్తున్నాడు?
జవాబు:
బమ్మెర పోతన తన ‘నారాయణ శతక’ పద్యం ద్వారా భక్తిలేని జపతపాలు వృథా అని తెలియజేస్తూ “ఓ నారాయణా ! నీ పేరును తలవనివాడు, నీ మీద భక్తి లేనివాడు ఎన్ని నదుల్లో స్నానం చేసినా అది ఏనుగు స్నానంలా వృథానే ! మౌనంగా మనస్సులో వేద మంత్రాలు చదివినా అది అరణ్యరోదనే. ఎన్ని హోమాలు చేసినా అది బూడదలో వేసిన నెయ్యిలా వ్యర్థమే” – అని నిజమైన భక్తి లేని పూజాదికాలు చేయడం ద్వారా సమయం ఖర్చు అవుతుందేకాని భగవంతునికి దగ్గర కాలేమని ఈ పద్యం ద్వారా పోతన తెలిపారు.

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

ప్రశ్న 4.
‘శతకం’ అంటే ఏమిటి? (S.A. I – 2019-2017)
జవాబు:
శత (నూఱు) పద్యాల సమాహారమే శతకం. నూఱుపద్యాల పైగా గల సాహిత్య ప్రక్రియ శతకం. మకుట నియమం దీనికున్న ఆకర్షణ.

ఏకపద మకుటం, ఏకపాద మకుటం, ద్విపాద మకుటం దీనిలోని భేదాలు. మకుటం అంటే కిరీటం. కిరీటం (తలపాగ) మనిషికి అందాన్ని ఇచ్చినట్లు, పద్యానికి మకుటం కూడా శోభనిస్తుంది. శతక పద్యాలు ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర్య భావాన్ని కలిగి సమాజానికి మార్గదర్శనం చేస్తాయి. ఉదా : సుమతీ, వేమన మొ||.

ప్రశ్న 5.
“భద్రగిరిపై కొలువైన స్వామి” అంటే ఎవరు? ఆయనను కవి ఏమని వర్ణించాడు?
జవాబు:
భద్రుడనే భక్తుడు శ్రీమన్నానారాయణుని కోసం తపస్సు చేశాడు. తనను కొండగా మలచమని, తనపై సీతాలక్ష్మణులతో గూడి శ్రీరామునిగా వెలవమని కవి ఈ విధంగా ప్రార్థించాడు. “భద్రాద్రిపై వెలసిన ఓ స్వామీ ! దశరథుని కుమారుడైన ఓ రామా ! సముద్రమంత దయ గలవాడా ! నీవు యుద్ధంలో శత్రువుల్ని నాశనం చేశావు. గరుత్మంతుణ్ణి వాహనంగా చేసుకున్నావు. కష్టాలనే కారుచీకట్లను తొలగించగల సూర్యుడవు. హృదయమంతా దయతో నింపుకున్నావు. సీతాదేవి హృదయ కమలానికి తుమ్మెద లాంటి వాడవు. రాక్షసులనే కలువల్ని నాశనం చేయగల మదపుటేనుగువు, చక్కని శరీరాకృతి గల వాడవు.”

ప్రశ్న 6.
‘మంచి నడవడికను వదలిపెట్టకు’ అని తెలుసుకున్నారు కదా ! మంచి నడవడికకు కొన్ని ఉదాహరణలు రాయండి.
జవాబు:
ఆరోగ్యాన్ని కలిగించే ఆహారపు అలవాట్లను కలిగిఉండటం, ఇతరులను తక్కువ చేసి చూడకపోవడం, పెద్దలను గౌరవించడం. సత్యాన్నే మాట్లాడటం, పరులకు కీడు చేయకపోవడం, ఇతరులను బాధించకుండా నేర్పుగా తన పనులను సాధించుకోవడం. మర్యాదగా ప్రవర్తించడం, ఇతరుల మనోభావాలను గౌరవించడం.

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

ఆ) క్రింది ప్రశ్నలకు పది లేక పన్నెండు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
శతక పద్యాలు సమాజానికి ఏమి చెప్పదలచాయి?
జవాబు:
నూరు పద్యాలు గల సాహిత్య ప్రక్రియ శతకం. తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక ఒరవడి సృష్టించిన ప్రత్యేకత శతకానిదే. ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావాన్ని కల్గి ఉండి ద్రాక్షగుత్తుల వలె మధురమైనవి శతకపద్యాలు. మనిషికి కిరీటం లాగా పద్యానికి మకుటం శోభను కల్గిస్తుంది.

“సమాజ హితం కోరేది సాహిత్యం ” అని పెద్దల మాట. సూటిగా మంచి విషయాన్ని చెప్పడం కన్న కథ రూపంలోను, పద్య రూపంలోను, కవిత రూపంలోను చెప్పడం వల్ల త్వరగా మనసుకు చేరుతుంది. అదే మన పూర్వులు చేసిన ప్రయత్నం. శతక పద్యాలు ప్రధానంగా ప్రబోధకాలు. కొన్ని భక్తి, వైరాగ్య, శృంగార హాస్య మొ|| అంశాలపై కూడా వచ్చాయి. సమాజంలోని చెడును, అజ్ఞానాన్ని తొలగించడానికి, ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ఆయుధంగా కవుల శతక ప్రక్రియను ఎంచుకున్నారు. పాల్కురికి సోమనాథుని ‘వృషాధిప శతకం’ తొలి శతకంగా పేరు గాంచింది. నాటి నుండి నేటి కాలం వరకు శతక పద్యాలు రానివారు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. చిన్నతనం నుండే శతకపద్యాలు ధారణ చేయడం మనల్ని మనమే సంస్కరించుకోవడం అవుతుంది. “కష్టబెట్టబోకు కన్న తల్లి మనసు, తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు, ఉపకారికి నుపకారము, తనకోపమే తన శత్రువు, పట్టు పట్టరాదు పట్టి విడువరాదు, అల్పుడెపుబల్కు నాడంబరముగాను, చదువది యెంత కల్గిన రసజ్ఞత యించుక చాలకున్ననా” – ఇలాంటి ఆణిముత్యాల వంటి పద్యాలు నేర్చుకోవడం వల్ల మానసిక ఎదుగుదల పెరుగుతుంది. సంబంధం బాంధవ్యాలు పెరుగుతాయి.

పెద్దయిన తర్వాత ప్రత్యేకంగా సైకాలజిస్టులను, మానసిక నిపుణులను కలిసి కౌన్సిలింగ్ తీసుకోవల్సిన పరిస్థితులు మనమే కల్పిస్తున్నాము. కవులు తమ విలువైన సమయాన్ని, జీవితాన్ని భావితరాల వారమైన మనం బాగుండాలని లోకం తీరును కళ్ళకు కట్టినట్లుగా ఉదాహరణలతో సహా రక్తాన్నే సిరాగా చేసి, రచించారు. వారి కష్టాన్ని గుర్తించి మనం మన భావితరాల వారి భవిష్యత్తును దృష్టియందుంచుకొని శతక పద్యాలు ధారణ చేయడం విధిగా భావించాలి.

వ్యక్తీకరణ – సృజనాత్మకత

క్రింది ప్రశ్నకు సమాధానము రాయండి.

ప్రశ్న 1.
నీవు చదివిన ఒక శతకాన్ని గూర్చి మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

తెనాలి,
x x x x

ప్రియమిత్రుడు ప్రవీడు
నేను క్షేమం. నీవు క్షేమమని తలుస్తాను. ఇటీవల మా పాఠశాల గ్రంథాలయంలో ‘భాస్కర శతకం’ పద్యాల పుస్తకం తీసుకొని, శ్రద్ధగా చదివాను. వాటిలో సుమారు 25 పద్యాలు కంఠస్థం చేసాను. వాటిలోని అర్థాలు ఎంత బాగున్నాయో! మొదటి రెండు పాదాలు నీతితో, చివరి రెండు పాదాలు ఉదాహరణతో మారయ(ద) వెంకయ్య బాగా రాసారు.

“దానము సేయ గోరిన వదాన్యుకీయగ శక్తిలేనిచో”, “తెలియని కార్యమెల్లఁగడ తేర్చుట కొక్క వివేకి జేకొనన్”, “చదువది యెంత కల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా”, “పలుమాఱు సజ్జనుండు ప్రియ భాషలె పల్కుగోర వాక్యముల్” – వంటి పద్యాలు నీతిని బోధిస్తాయి. నాకు ప్రేరణనిచ్చాయి. నీవు చదివిన ఏదేని శతకం గూర్చి రాయి.
ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
కె. జశ్వంత్.

చిరునామా:
డి. ప్రవీణ్ కుమార్,
9వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూల్,
బాపట్ల, గుంటూరు జిల్లా.

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

ప్రశ్న 2.
తేలికైన మాటలతో ఒక పద్యాన్ని రాయండి. / కవిత రాయండి.
జవాబు:
నాదియన్న చింత నాదిలో పుట్టెనా
పెరిగి పెద్దదైన తిరిగి పోదు
మొక్కపీకవచ్చు మొద్దును గాదురా
బుద్ధి కలిగినంత సిద్ధి కలుగు !

ప్రశ్న 3.
శతక పద్యాల ద్వారా మీరు గ్రహించిన నైతిక విలువలు పెంపొందే సూక్తులు ఐదింటిని రాయండి.
జవాబు:
శతకం ద్వారా గ్రహించిన నైతిక విలువలు :

  1. ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మాన్ని వీడకూడదు.
  2. ఎల్లప్పుడూ సత్యాన్నే పలకాలి.
  3. ఫలితాన్ని ఆశించక పని చేయాలి.
  4. గురువుల మాటకు ఎదురు చెప్పకూడదు.
  5. చెడు నడతను విడిచిపెట్టాలి.
  6. అందరికీ సాయం చేస్తూ ఆనందంగా బ్రతకాలి.
  7. సమాజానికి హాని చేసే పనులు చేయకూడదు.
  8. పేదవారి పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించకూడదు.

III. భాషాంశాలు (పదజాలం, వ్యాకరణం)

1. పర్యాయపదాలు :

జలధి : సముద్రం, రత్నాకరం, సాగరం
సూర్యుడు : రవి, భాస్కరుడు, దివాకరుడు
చంద్రుడు : శశాంకుడు, సోముడు
జగడం : కలహం, తగాదా, కొట్లాట
వైరి : శత్రువు, రిపు, విరోధి
అటవి : అడవి, అరణ్యం, కాన, విపినం
హోమం : యజ్ఞం, యాగం, యూపం
ఆచార్యుడు : గురువు, ఉపాధ్యాయుడు

2. వ్యుత్పత్త్యర్థాలు :

సత్వం : సత్పురుషులందు పుట్టునది (నిజం)
నరకము : పాపులను తన సమీపమున పొందించునది, పరులు దీనియందు మొఱ పెట్టుదురు (ఒక లోకం)
నారాయణుడు : అవతారములందు నర సంబంధమయిన శరీరాన్ని పొందువాడు/ఉదకము స్థానముగా కలవాడు (పద్మం)
నిశాచరులు : రాత్రియందు సంచరించేవారు (రాక్షసులు)
అమృతం : మరణం లేనిది (సుధ)
జలధి : జలములు దీనిచే ధరింపబడును (సముద్రం)
పంచాస్యం : విస్తీర్ణమైన ముఖములు కలది (సింహం)
గురువు : అంధకార మనెడి అజ్ఞానమును ఛేదించువాడు (ఉపాధ్యాయుడు)
అబ్జము : నీటియందు పుట్టినది (పద్మము)

3. నానార్థాలు :

శైలము : కొండ, రసాంజనం, ఆనకట్ట, సాంబ్రాణి
జలము : నీరు, జడము, ఎఱ్ఱ తామర, ఎఱ్ఱ కలువ
ఈశ్వరుడు : శివుడు, ప్రభువు, పరమాత్మ,
శ్రేష్ఠవాచకం : అపకారం, మాలిన్యం, తగనిది, అశుభం
విభూతి : భస్మం, సంపద
శ్రీ : లక్ష్మి, సాలెపురుగు, విషం

4. ప్రకృతి – వికృతులు :

శ్రీ – సిరి
కుత్సితం – కుచ్చితం
శీత – సీతువు (చల్లని, మంచు)
బిక్ష – బిచ్చము
భక్తుడు – బత్తుడు
సాధువు – సాదువు
ద్రవ్యం – డబ్బు
ఘనము – గనము (అధికం)
రాజు – ఱేడు
దుష్టుడు – తుంటరి
ఈశ్వర – ఈసరుడు
భక్తి – బత్తి
రత్నము – రతనము
పుణ్యం – పున్నెం
కార్యము – కరము
మొల్లము – ముల్లె (ధనం)
రతి – రంతు
భూతి – బూది
అటవి – అడవి
హృదయం – ఎద, ఎడద
భూమి – బూమి
క్రుజ్ – కొంగ
స్నానము – తానము
బూతి – బూడి, భస్మం
తురంగం – తురికి (గుఱ్ఱం)
పుష్పం – పూవు
విషం – విసము

5. గణాలు :
AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు 1

9th Class Telugu 5th Lesson పద్యరత్నాలు 1 Mark Bits

1. స్త్రీలకు విరులు అన్న మక్కువ ఎక్కువ – (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి) (S.A. I – 2018-19)
ఎ) ఆభరణాలు
బి) కేశాలు
సి) వంకీలు
డి) పూవులు
జవాబు:
డి) పూవులు

2. మధువనమంతా మధువ్రతములతో నిండి ఉంది – (గీత గీసిన పదానికి వ్యుత్పత్యర్థాన్ని గుర్తించండి) (A S.A. I – 2018-19)
ఎ) మధువు సేకరించడం వ్రతంగా గలది
బి) మధువు సేకరింపకపోవడం వ్రతంగా గలది
సి) మధువును సేకరించడం వ్రతంగా లేనిది
డి) మధువును సేకరించే వ్రతం కలది
జవాబు:
ఎ) మధువు సేకరించడం వ్రతంగా గలది

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

3. సత్మీర్తి దిగంతము వరకు వ్యాపిస్తుంది – (గీత గీసిన పదానికి సంధి విడదీయుము)
ఎ) దిక్ + అంతము
బి) దిస్ + అంతము
సి) దిగం + తము
డి) ది: + అంతము
జవాబు:
ఎ) దిక్ + అంతము

4. కార్యాలోచనమును ఒంటరిగా చేయరాదు – (గీత గీసిన పదానికి విగ్రహవాక్యం గుర్తించండి) (S.A. I – 2018-19)
ఎ) కార్యము వల్ల ఆలోచనము
బి) కార్యము యొక్క ఆలోచనము
సి) కార్యమును గురించి ఆలోచనము
డి) కార్యమును ఆలోచనమును కలుగుట
జవాబు:
సి) కార్యమును గురించి ఆలోచనము

5. ఓ రాజా ! నీవే కీర్తిమంతుడవు – చంద్రుడే కాంతిమంతుడు (అలంకారాన్ని గుర్తించండి) (S.A. I – 2018-19)
ఎ) ఉపమాలంకారం
బి) రూపక
సి) ఉత్ప్రేక్ష
డి) దృష్టాంత
జవాబు:
డి) దృష్టాంత

6. పంచాస్యం మత్తగజాన్ని బాధించింది. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) పులి
బి) ఎలుగు
సి) చిరుత
డి) సింహం
జవాబు:
డి) సింహం

7. దైవ పూజా సమయంలో విరులు విరివిగా వాడతారు – (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) అగరువత్తులు
బి) దీపాలు
సి) పూలు
డి) ఫలాలు
జవాబు:
సి) పూలు

8. భారమైన జడలు కలిగిన వాడు – (వ్యుత్పత్త్యర్థం గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) భారవి
బి) శైవుడు
సి) వాసవుడు
డి) ధూర్జటి
జవాబు:
డి) ధూర్జటి

9. విద్యాధనం – సర్వధన ప్రధానం – (గీత గీసిన పదానికి విగ్రహవాక్యం గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) విద్యతో ధనం
బి) విద్యను ధనంగా గలది
సి) విద్య అనెడి ధనం
డి) విద్య యొక్క ధనం
జవాబు:
సి) విద్య అనెడి ధనం

10. కన్నులారా హిమాలయాలను దర్శించాలని శారద వాంఛ – (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) వాదన
బి) కోరిక
సి) ఊహ
డి) మనవి
జవాబు:
బి) కోరిక

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

11. మూడు అడుగుల దూరంలో ఏనుగు కనిపించేసరికి భయం వేసింది – గీత గీసిన పదాలకు నానార్థపదం గుర్తించండి. (S.A. II – 2017-18)
ఎ) హస్తి
బి) కపి
సి) గజం
డి) అష్టపది
జవాబు:
సి) గజం

12. కుత్సితముగాని దరి కలిగినది – (వ్యుత్పత్త్యర్థం గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) మేఘం
బి) నది
సి) సరస్సు
డి) అకూపారం
జవాబు:
డి) అకూపారం

13. పంచాస్యం ఏనుగు కుంభస్థలంపైకి దూకింది – (గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యర్థం గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) ఐదైన ముఖాలు కలది
బి) వెడల్పైన ముఖం కలది
సి) పంచముఖాలతో ఉన్నది
డి) కుత్సితమైన అవయవం కలది
జవాబు:
బి) వెడల్పైన ముఖం కలది

14. సృష్టిలో ‘సమస్తాన్ని తనలో ధరించేది’ అనే అర్థాన్ని సూచించే వ్యుత్పత్తి పదం గుర్తించండి. (S.A. III – 2016-17)
ఎ) ధర
బి) పృథ్వి
సి) పుడమి
డి) నేల
జవాబు:
ఎ) ధర

15. ఖగములను వేటాడుట తప్పు. (గీత గీసిన పదానికి వ్యుత్పత్తిని గుర్తించండి.) (S.A. III – 2016-17)
ఎ) ఆకాశంలో సంచరించనిది
బి) ఆకాశంలో సంచరించేది
సి) ఆకాశం నుండి నేలకు రాలేది
డి) ఆకాశంలో సంచరించడం రానిది
జవాబు:
బి) ఆకాశంలో సంచరించేది

16. సజ్జనులు స్నేహం చేయదగినవారు. (సంధి విడదీసిన పదాన్ని గుర్తించండి.) (S.A. III – 2016-17)
ఎ) సద్ + జనులు
బి) సత్ + జనులు
సి) సః + జనులు
డి) స + జనులు
జవాబు:
బి) సత్ + జనులు

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

17. వాక్యాలకు బింబ ప్రతిబింబత్వం ఉంటే – అలంకారం గుర్తించండి. (S.A. II – 2018-19)
ఎ) రూపకం
బి) ఉత్ప్రేక్ష
సి) ఉపమాలంకారం
డి) దృష్టాంతం
జవాబు:
డి) దృష్టాంతం

18. ‘చేతిరాత గుండ్రంగా రాయడం’ అనే విషయాన్ని విధ్యర్థకంగా మార్చండి.( S.A. III – 2016-17)
ఎ) చేతిరాత గుండ్రంగా రాయండి.
బి) దయచేసి చేతిరాత గుండ్రంగా రాయకండి.
సి) చేతిరాత గుండ్రంగా రాయొద్దు
డి) చేతిరాత గుండ్రంగా ఉంటే బాగుంటుంది
జవాబు:
ఎ) చేతిరాత గుండ్రంగా రాయండి.

19. “ఆడుకోవడం” అనే విషయాన్ని అనుమత్యర్థక వాక్యంగా మార్చండి. (S.A. III – 2016-17)
ఎ) ఆడుకోవచ్చు
బి) ఆడుకోకూడదు
సి) ఆడుకుంటారా?
డి) ఆడుకోవద్దు
జవాబు:
ఎ) ఆడుకోవచ్చు

భాషాంశాలు (పదజాలం, వ్యాకరణం)

1. అర్ధాలు :

20. దుష్టుల ఆలోచనలు కుత్సితంగా ఉంటాయి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) అద్భుతం
B) మోసం
C) తెలివి
D) మంచి
జవాబు:
B) మోసం

21. సముద్రం మేర దాటి పొంగుతుంది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) ఇల్లు
B) వీధి
C) హద్దు
D) సునామీ
జవాబు:
C) హద్దు

22. ఉత్తముడు దుర్జనుల గోష్ఠిని పొందడు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) కొలువు
B) కొలుపు
C) మాట
D) పోట్లాట
జవాబు:
A) కొలువు

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

23. జోరీగ మధువ్రతేంద్రమగునా? – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) సీతాకోక చిలుక
B) హంస
C) కందిరీగ
D) తుమ్మెద
జవాబు:
D) తుమ్మెద

24. మంచివారితో జగడం కీడును కలిగించును – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) స్నేహం
B) తగాదా
C) మాట
D) తిరగటం
జవాబు:
B) తగాదా

25. విష్ణువు ఖగరాజును వాహనంగా చేసుకొన్నాడు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) పాము
B) నెమలి
C) పక్షి
D) ఎద్దు
జవాబు:
C) పక్షి

26. నదులన్నీ అకూపారంబులో కలుస్తాయి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి. (S.A. III – 2016-17)
A) నేల
B) ఆకాశం
C) సముద్రం
D) పర్వతం
జవాబు:
C) సముద్రం

27. ‘మంచి నడవడి‘ – అనే అర్థాన్నిచ్చే శబ్దాన్ని గుర్తించండి.
A) దురాచారం
B) ఆచారం
C) నడక
D) నడవండి
జవాబు:
B) ఆచారం

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

28. ‘మంచి బుద్ధి కలవాడు‘ – అనే అర్థాన్ని ఇచ్చే పదం కింది వాటిలో ఏది?
A) బుద్ధి
B) దుర్బుద్ధి
C) బుద్ధిమంతుడు
D) సుమతి
జవాబు:
D) సుమతి

29. పవి పుష్పంబగు – గీత గీసిన పదానికి అర్థము గుర్తించండి.
A) ఇంద్రుడు
B) వజ్రాయుధం
C) వజ్రం
D) కల్పవృక్షం
జవాబు:
B) వజ్రాయుధం

2. పర్యాయపదాలు :

30. సూర్యుడు నళినీబాంధవుడు – గీత గీసిన పదానికి సమానార్థాలు గుర్తించండి.
A) రవి, చంద్రుడు
B) భాస్కరుడు, దినకరుడు
C) ప్రభాకరుడు, సోముడు
D) కుజుడు, శుక్రుడు
జవాబు:
B) భాస్కరుడు, దినకరుడు

31. పున్నమి నాటి చంద్రుడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు రాయండి.
A) చందురుడు, ఇంద్ర
B) చంద్ర, సూర్య
C) సోముడు, శశాంకుడు
D) రవి, గోపి
జవాబు:
C) సోముడు, శశాంకుడు

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

32. రత్నాలకు నిలయం రత్నాకరం – గీత గీసిన పదానికి సమానార్థాలు రాయండి.
A) జలధి, సాగరం
B) సముద్రం, వనం
C) విపినం, సంద్రం
D) గగనం, గహసం
జవాబు:
A) జలధి, సాగరం

33. ధర్మరాజు అజాతశత్రువు – గీత గీసిన పదానికి సమానార్థాలు రాయండి.
A) వైరి, వైరు
B) రిపు, పురి
C) విరోధి, వనధి
D) వైరి, రిపువు
జవాబు:
D) వైరి, రిపువు

34. నారదుడు కలహ భోజనుడు – గీత గీసిన పదానికి సమానార్థాలు రాయండి.
A) జగడం, జడగం
B) తగాదా, కొట్లాట
C) తగాదా, తదాగా
D) పోట్లాట, పోటు
జవాబు:
B) తగాదా, కొట్లాట

35. ఋషులు లోకకళ్యాణం కోసం హోమాలు చేసారు – గీత గీసిన పదానికి సమానార్థాలు రాయండి.
A) యాగం, ఆగం
B) యూపం, పాపం
C) యజ్ఞం, యాగం
D) యజ్ఞం, అజ్ఞం
జవాబు:
C) యజ్ఞం, యాగం

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

36. ఆచార్యుని ఎదిరించక – గీత గీసిన పదానికి సమానార్థాలు రాయండి.
A) గురువు, ఉపాధ్యాయుడు
B) గురువు, వేత్త
C) ఒజ్జ, సజ్జ
D) గురువు, తరువు
జవాబు:
A) గురువు, ఉపాధ్యాయుడు

37. క్రూర భుజంగమున్ గవయ గూడునె – గీత గీసిన పదానికి సమానార్థక పదం గుర్తించండి.
A) కొంగ
B) దుష్టుని
C) సర్పము
D) సింహము
జవాబు:
C) సర్పము

38. జలధుల్మేరల నాక్రమించి ఉప్పొంగినన్ – గీత గీసిన పదానికి సమానార్థక పదం గుర్తించండి.
A) నదులు
B) పర్వతాలు
C) మైదానాలు
D) సముద్రాలు
జవాబు:
D) సముద్రాలు

39. నన్ను పంచాస్యమౌనా? – గీత గీసిన పదానికి సమాననార్ధక పదమును గుర్తించండి.
A) సింహము
B) ఏనుగు
C) తేనెటీగ
D) పులి
జవాబు:
A) సింహము

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

40. శ్రీరాముడు ఖగరాజ తురంగుడు – గీత గీసిన పదానికి సమానార్ధక పదం ఏది?
A) పక్షి
B) రాజు
C) గరుత్మంతుడు
D) దేవేంద్రుడు
జవాబు:
C) గరుత్మంతుడు

41. అకూపారంబు భూమీ స్థలంబవు – గీత గీసిన పదానికి సమానార్థక పదం ఏది?
A) శైలము
B) సముద్రము
C) నది
D) వజ్రాయుధం
జవాబు:
B) సముద్రము

42. ‘జలజాత ప్రియ శీతభానులు యథా సంచారముఱ్ఱప్పినం’ – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) సూర్యుడు, చంద్రుడు
B) చంద్రుడు, సముద్రము
C) చంద్రుడు, చందమామ
D) మిత్రుడు, రవి
జవాబు:
C) చంద్రుడు, చందమామ

43. జలధుల్మేరల నాక్రమించి ఉప్పొంగినన్ – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) సముద్రము, అకూపారము
B) శైలము, సురావనజము
C) మధువ్రతము, భుజంగము
D) ఉదధి, ఏఱు
జవాబు:
A) సముద్రము, అకూపారము

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

44. ‘గజ స్నానంబు చందంబగున్ ?’ – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) పాము, ఏనుగు
B) హస్తి, కరి
C) తేనెటీగ, భృంగము
D) సింహము, ఇభము
జవాబు:
B) హస్తి, కరి

45. అకూపారంబు భూమీ స్థలంబవున్ – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) శైలము, పర్వతం
B) జలధి, సాగరము
C) ఉదధి, భుజంగము
D) సముద్రము, నది
జవాబు:
B) జలధి, సాగరము

46. ‘క్రూర భుజంగమున్ గవయ గూడునె ?’ – గీత గీసిన పదానికి పర్యాయపదాలను గుర్తించండి.
A) పాము, సర్పము
B) నాగము, నగము
C) పంచాస్యము, శార్దూలం
D) దుష్టుడు, దుర్మార్గుడు
జవాబు:
A) పాము, సర్పము

3. వ్యుత్పత్యర్థాలు :

47. సత్పురుషులందు పుట్టినది ఎప్పటికి నిలిచి ఉండును – గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యం గుర్తించండి.
A) బుద్ధి
B) సత్యం
C) మేథ
D) తెలివి
జవాబు:
B) సత్యం

48. “మరణం లేనిది” – దీనికి వ్యుత్పత్యర్థం గుర్తించండి.
A) అమరణం
B) చిరంజీవి
C) అమృతం
D) స్వర్గం
జవాబు:
C) అమృతం

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

49. ‘పాపులను తన సమీపమున పొందించునది’ – దీనికి వ్యుత్పత్త్యం గుర్తించండి.
A) నరకం
B) నకరం
C) స్వర్గం
D) భూవి
జవాబు:
A) నరకం

50. ‘నారాయణుడు’ – వ్యుత్పత్తి పదం ఏది?
A) ఉదకంలో లేనివాడు
B) ఉదకం స్థానంగా కలవాడు
C) పాముపై నిద్రించేవాడు
D) సుదర్శనం కలవాడు
జవాబు:
B) ఉదకం స్థానంగా కలవాడు

51. ‘రాత్రియందు సంచరించేవారు’ – దీనికి వ్యుత్పత్త్యర్థం గుర్తించండి.
A) దయ్యాలు
B) భూతాలు
C) మనుష్యులు
D) రాక్షసులు
జవాబు:
D) రాక్షసులు

52. జలములు దీనిచే ధరింపబడును – దీనికి వ్యుత్పత్త్యర్థం గుర్తించండి.
A) జలాశయం
B) జలధి
C) తటాకం
D) కాలువ
జవాబు:
B) జలధి

53. ‘అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టేవాడు’ – ఈ వ్యుత్పత్తి గల పదం ఏది?
A) సూర్యుడు
B) చంద్రుడు
C) గురువు
D) జ్ఞానము
జవాబు:
C) గురువు

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

54. ‘వెడల్పైన ముఖం కలది’ – అనే వ్యుత్పత్త్యర్థం గుర్తించండి. (S.A. I – 2018-19)
A) దీర్ఘముఖము
B) పంచాస్యము
C) ద్విముఖము
D) సుముఖము
జవాబు:
B) పంచాస్యము

4. నానార్థాలు :

55. శైల పుత్రి పార్వతి – గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి.
A) కొండ, గిరి
B) కొండ, ఆనకట్ట
C) రసాంజనం, రసం
D) సాంబ్రాణి, పన్నీర
జవాబు:
B) కొండ, ఆనకట్ట

56. జల ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు ప్రయాణం ప్రమాదం – గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి.
A) నీరు, పానీయం
B) జడం, గడ
C) నీరు, ఎల్టతామర
D) కలువ, పూలు
జవాబు:
C) నీరు, ఎల్టతామర

57. ఈశ్వరుడు అంతటా కలడు – గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి.
A) శివుడు, ప్రభువు
B) పరమాత్మ, స్వర్గం
C) శ్రేష్ఠవాచకం, వాచకం
D) శివుడు, శంకరుడు
జవాబు:
A) శివుడు, ప్రభువు

58. కీడు చేసిన వానికి మేలు చేయుట ఉత్తముల లక్షణం – గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి.
A) తగనిది, తగిన
B) అపకారం, అశుభం
C) మాలిన్యం, మలినం
D) ఉపకారం, మేలు
జవాబు:
B) అపకారం, అశుభం

59. విభూతి స్వచ్ఛత చంద్రకాంతిని తలపిస్తుంది – గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి.
A) బూడిద, బూతి
B) భస్మం, పొడి
C) సంపద, భస్మం
D) బూడిద, పొడి
జవాబు:
C) సంపద, భస్మం

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

60. స్త్రీలను బాధపెట్టిన ఇంట శ్రీ నిలువదు – గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి.
A) లక్ష్మి, సాలెపురుగు
B) లక్ష్మి, సిరి
C) సంపద, ధనం
D) విషం, విసం
జవాబు:
B) లక్ష్మి, సిరి

61. నీరు, గరళం – అనే నానార్ధములు గల పదాన్ని గుర్తించండి.
A) జలము
B) ఉదకము
C) విషము
D) క్షీరము
జవాబు:
C) విషము

62. గజసైన్యం విజయాన్ని సాధించింది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి. (S.A. I – 2018-19)
A) గజం, అడుగు
B) ఏనుగు, మూడడుగుల కొలత
C) ఎనిమిది, ఐదు
D) హస్తి, గజము
జవాబు:
B) ఏనుగు, మూడడుగుల కొలత

5. ప్రకృతి – వికృతులు :

63. రాట్టులు పోయారు. రాజ్యాలు పోయాయి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) ప్రభువు
B) నాయకుడు
C) భూపతి
D) రేడు
జవాబు:
D) రేడు

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

64. దుష్టుల సహవాసం చెడుకు కారకం – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
A) దుసుట
B) తుంటరి
C) దుష్ట
D) దుసట
జవాబు:
B) తుంటరి

65. బిచ్చమెత్తి బ్రతికేవారిని చులకన చేయవద్దు – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
A) బిక్చ
B) భిక్ష
C) భిక్ష
D) అర్థి
జవాబు:
C) భిక్ష

66. పాప పుణ్యాలు కర్మను బట్టి ప్రాప్తిస్తాయి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) పున్నెం
B) పున్నం
C) పుషైం
D) పున్యం
జవాబు:
A) పున్నెం

67. సిరి లేనివాడు ఎందుకు కొరగాడు – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
A) ధనం
B) లక్ష్మీ
C) శ్రీ
D) ద్రవ్యం
జవాబు:
C) శ్రీ

68. శుచిగా స్నానమాచరించనివాడు చర్మరోగి కాగలడు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) సానం
B) తానం
C) స్థానం
D) పానం
జవాబు:
B) తానం

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

69. ఘనమైన కార్యాలు ఘనులే చేయగలరు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) కారం
B) కర్యం
C) కర్ణం
D) కార్టం
జవాబు:
C) కర్ణం

70. కొల్లేరు సరస్సు కొంగవంటి పక్షి జాతులకు విడిది ప్రాంతం – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
A) కొక్కొర
B) క్రుజ్
C) కొక్కెర
D) బకం
జవాబు:
B) క్రుజ్

71. రాయంచలు మానస సరోవరంలో క్రీడిస్తున్నాయి – గీత గీసిన పదానికి ప్రకృతి పదాన్ని గుర్తించండి.
A) హంస
B) రాజహంస
C) రాజు
D) భుజంగము
జవాబు:
B) రాజహంస

72. మీ ఇంట్లో పూవులు లేవా? – గీత గీసిన పదానికి ప్రకృతి ఏది?
A) పుష్పము
B) సుమము
C) కుసుమం
D) విరి
జవాబు:
A) పుష్పము

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

73. మీది గజస్నానము వలె వ్యర్థము – గీత గీసిన పదానికి
వికృతిని గుర్తించండి.
A) సానము
B) తానము
C) స్తనం
D) నానము
జవాబు:
B) తానము

6. సంధులు :

74. సవర్ణదీర్ఘ సంధికి ఉదాహరణను కింది వాటిలో గుర్తించండి.
A) పంచాస్యం
B) సర్వేశ్వరా
C) ప్రాప్తమగు
D) నామోక్తి
జవాబు:
A) పంచాస్యం

75. ఉత్తునకు సంధి నిత్యం – ఇది ఏ సూత్రమో కింద గుర్తించండి.
A) గుణసంధి
B) త్రికసంధి
C) ఉత్వసంధి
D) ఇత్వసంధి
జవాబు:
C) ఉత్వసంధి

76. ‘సద్భక్తి’ – విడదీయుము.
A) సదా + భక్తి
B) సత్ + భక్తి
C) సత్ + బక్తి
D) సద + భక్తి
జవాబు:
B) సత్ + భక్తి

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

77. జశ్త్వసంధికి ఉదాహరణను గుర్తించండి.
A) రాజౌనా
B) సర్వేశ్వరా
C) పదాబ్దం
D) వాగీశుడు
జవాబు:
D) వాగీశుడు

78. ‘శ్రీకాళహస్తీశ్వరా’ – సంధి పేరేమిటి?
A) వృద్ధి
B) గుణ
C) సవర్ణదీర్ఘ
D) త్రిక
జవాబు:
C) సవర్ణదీర్ఘ

79. ‘నామో!’ సంధి పేరేమిటి?
A) యణాదేశ
B) గుణ
C) యడాగమ
D) ఆమేడ్రితం
జవాబు:
B) గుణ

80. క, చ, ట, త, ప, ఫ, ఛ, ఠ, ఢ, ఫ, శ, ష, స వర్ణాలకు జరిగే సంధి ఏది?
A) జశ్త్వసంధి
B) త్రికసంధి
C) శ్చుత్వసంధి
D) గసడదవాదేశ సంధి
జవాబు:
A) జశ్త్వసంధి

81. కింది వాటిలో గుణసంధి సూత్రం కిందివాటిలో ఏదో గుర్తించండి.
AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు 2
జవాబు:
D)

82. “మధుప్రతేంద్రం” – అనే పదాన్ని విడదీయండి. (S.A. II – 2017-18)
A) మధు + ప్రతేంద్రం
B) మధువ్ర + తేంద్రం
C) మధువ్రత + ఇంద్రం
D) మధువ్రత + ఏంద్రం
జవాబు:
C) మధువ్రత + ఇంద్రం

83. ‘నింద సేయబోకు’ – అనే పదాన్ని విడదీసి, సంధి పేర్కొనండి.
A) నింద + చేయబోకు – గసడదవాదేశ సంధి
B) నింద సేయన్ + బోకు – సరళాదేశ సంధి
C) నింద సేయ + బోకు – యణాదేశ సంధి
D) నింద + సేయబోకు – యడాగమ సంధి
జవాబు:
A) నింద + చేయబోకు – గసడదవాదేశ సంధి

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

84. సర్వేశ్వరా ! – గీత గీసిన పదం ఏ సంధి?
A) సవర్ణదీర్ఘ సంధి
B) గుణసంధి
C) యణాదేశ సంధి
D) వృద్ధి సంధి
జవాబు:
B) గుణసంధి

85. ‘ జోరీగ’ విడదీయండి.
A) జోరు + ఈగ
B) జోర + ఈగ
C) జోరి + ఇగ
D) జో + రీగ
జవాబు:
A) జోరు + ఈగ

86. ‘ధరాత్మజ’ ఈ పదంలో గల సంధి ఏది?
A) సవర్ణదీర్ఘ సంధి
B) గుణసంధి
C) యణాదేశ సంధి
D) గసడదవాదేశ సంధి
జవాబు:
A) సవర్ణదీర్ఘ సంధి

7. సమాసాలు :

87. చల్లగా నూఱేండ్లు జీవించండని పెద్దలు దీవిస్తారు – గీత గీసిన పదానికి సమాసం పేరేమిటి?
A) ద్వంద్వం
B) ద్విగువు
C) బహుజొహి
D) రూపకం
జవాబు:
B) ద్విగువు

88. గురువుల నుండి శిష్యులు అమృత వాక్కులు పొందాలి – గీత గీసిన పదానికి సమాసం పేరేమిటి?
A) నజ్
B) అవ్యయీభావ
C) రూపకం
D) ప్రథమా
జవాబు:
C) రూపకం

89. ‘అరవిందం వంటి ముఖం’ సమాసపదంగా మార్చండి.
A) అరవింద ముఖం
B) ముఖ అరవిందం
C) పద్మముఖం
D) ముఖారవిందం
జవాబు:
D) ముఖారవిందం

90. ‘కాంతామణి’ విగ్రహవాక్యం గుర్తించండి.
A) మణి వంటి కాంత
B) మణే కొంత ఐ
C) కాంత వంటి మణి
D) మణి గల కాంత
జవాబు:
A) మణి వంటి కాంత

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

91. ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసానికి ఉదాహరణను గుర్తించండి.
A) చిగురుకేలు
B) తేనెమాట
C) తనూలత
D) జుంటిమోవి
జవాబు:
C) తనూలత

92. రూపక సమాసానికి ఉదాహరణను గుర్తించండి.
A) సుధామధురం
B) జ్ఞానజ్యోతి
C) కరకమలం
D) కాంతామణి
జవాబు:
B) జ్ఞానజ్యోతి

93. ‘దుష్టచిత్తుడు’ – సమాసం పేరేమిటి?
A) ద్విగువు
B) ద్వంద్వ
C) రూపకం
D) బహువ్రీహి
జవాబు:
D) బహుజ్జీవీ

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

94. ధనాఢ్యుడైన వాడు దాత అనిపించుకోవాలి – గీత గీసిన పదం ఏ సమాసం? (S.A. II – 2017-18)
A) ప్రథమా
B) తృతీయా
C) బహువ్రీహి
D) ద్వితీయా
జవాబు:
B) తృతీయా

95. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణను గుర్తించండి.
A) కార్యాలోచనం
B) ఫణాగ్రభాగం
C) అనర్హరత్నాలు
D) అజ్ఞాన తిమిరం
జవాబు:
C) అనర్హరత్నాలు

96. ‘కార్యము యొక్క ఆలోచనము’ సమాస పదంగా కూర్చండి.
A) కార్యపు ఆలోచన
B) కార్యాలోచనము
C) కార్య లోచనలు
D) కార్య ఆలోచన
జవాబు:
B) కార్యాలోచనము

97. ‘నూఱేండ్లు’ పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
A) నూఱు సంవత్సరాలు గలది
B) నూటైన ఏండ్లు
C) నూఱును, ఏండ్లును
D) నూఱు ఏండ్లు కలది
జవాబు:
B) నూటైన ఏండ్లు

98. ‘మధువ్రతము’ – ఇది ఏ సమాసమో పేర్కొనండి.
A) బహువ్రీహి
B) ద్విగు
C) తత్పురుషము
D) అవ్యయీభావము
జవాబు:
A) బహువ్రీహి

99. ‘ముఖారవిందం’ సమాసానికి విగ్రహవాక్యాన్ని గుర్తించండి.
A) ఉపమాలంకారం
B) రూపకాలంకారం
C) దృష్టాంతం
D) స్వభావోక్తి
జవాబు:
C) దృష్టాంతం

100. ‘జ్ఞాన జ్యోతి’ – ఈ సమాస నామాన్ని గుర్తించండి.
A) ఉపమాన పూర్వపద కర్మధారయం
B) రూపక సమాసం
C) ద్విగు సమాసం
D) ఉపమాన ఉత్తరపద కర్మధారయం
జవాబు:
B) రూపక సమాసం

8. గణాలు :

101. ‘స – భ – ర – న – మ – య-వ’ – ఇవి ఏ పద్య గణాలు?
A) శార్దూలం
B) మత్తేభం
C) ఉత్పలమాల
D) చంపకమాల
జవాబు:
B) మత్తేభం

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

102. ‘అవనీ’ గురులఘువులు గుర్తించండి.
A) III
B) UUU
C) IIU
D) UII
జవాబు:
C) IIU

103. ‘UII’ దీనికి సరి అయిన పదాన్ని గుర్తించండి.
A) భువనం
B) మండపం
C) శ్రీకాళ
D) మండలి
జవాబు:
D) మండలి

104. మత్తేభ వృత్తానికి యతిస్థానం గుర్తించండి.
A) 14
B) 10
C) 11
D) 13
జవాబు:
A) 14

105. భ,ర,న,భ,భ,ర,వ గణాలు గల పద్యం ఏ వృత్తానికి చెందినది?
A) ఉత్పలమాల
B) చంపకమాల
C) శార్దూలము
D) కందము
జవాబు:
A) ఉత్పలమాల

106. స,భ,ర,న,మ,య,వ గణాలు గల పద్యం ఏ వృత్తానికి చెందినది?
A) శార్దూలం
B) ఉత్పలమాల
C) మత్తేభం
D) చంపకమాల
జవాబు:
C) మత్తేభం

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

107. ‘కుమారా’ అనేది ఏ గణము?
A) భ గణం
B) యగణము
C) న గణం
D) ర గణం
జవాబు:
B) యగణము

9. అలంకారాలు :

108. వాక్యాలకు బింబ ప్రతిబింబత్వం ఉన్నట్లయితే, అది ఏ అలంకారం? (S.A. III – 2016-17 S.A.II – 2018-19)
A) ముఖం వంటి అరవిందం
B) అరవిందం వంటి ముఖం కలది
C) అరవిందము వంటి ముఖం
D) ముఖమును, అరవిందమును
జవాబు:
C) అరవిందము వంటి ముఖం

109. ‘స్నానంబుల్ నదులందు జేయుట గజస్నానంబు చందంబగున్’ ఈ వాక్యంలోని అలంకారమేది?
A) రూపకము
B) ఉత్ప్రేక్ష
C) అర్థాంతరన్యాస
D) ఉపమాలంకారం
జవాబు:
D) ఉపమాలంకారం

110. ‘రంగ దరాతి భంగ ఖగరజ తురంగ విపత్పరం పరోత్తుంగ తమః పతంగ‘ – ఈ వాక్యంలో గల అలంకారమేది?
A) వృత్త్యనుప్రాస
B) అంత్యానుప్రాస
C) యమకము
D) ఛేకానుప్రాస
జవాబు:
B) అంత్యానుప్రాస

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

111. ‘నానా హోమము లెల్ల బూడిదలలోన న్వేల్చు నెయ్యె చను’ ఈ వాక్యంలో గల అలంకారాన్ని గుర్తించండి.
A) రూపకము
B) ఉత్ప్రేక్ష
C) ఉపమ
D) యమకం
జవాబు:
C) ఉపమ

10. వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించడం:

112. గాజు పూస విలువైన రత్నం కాదు – వ్యతిరేక వాక్యం గుర్తించండి.
A) గాజు పూస విలువైన రత్నమా
B) గాజు పూస విలువైన రత్నము
C) గాజు పూస విలువైన నగ
D) రత్నం విలువలేని గాజు పూస
జవాబు:
B) గాజు పూస విలువైన రత్నము

113. పిసినారియైన దుర్మార్గుడు, రాజు కాలేడు – వ్యతిరేక వాక్యం గుర్తించండి.
A) పిసినారి రాజు కాగలడు
B) దుర్మార్గుడు రాజు కాగలడు
C) పిసినారియైన దుర్మార్గుడు, రాజు కాగలడు
D) రాజు దుర్మార్గుడు పిసినారి
జవాబు:
C) పిసినారియైన దుర్మార్గుడు, రాజు కాగలడు

AP Board 9th Class Telugu Important Questions Chapter 5 పద్యరత్నాలు

114. మంచివారితో తగవు హాని చేయదు – వ్యతిరేక వాక్యం గుర్తించండి.
A) తగవు హాని చేస్తుంది
B) తగవు హాని చేయదు
C) చెడ్డవారితో తగవు హాని చేయదు
D) మంచివారితో తగవు హాని చేస్తుంది
జవాబు:
D) మంచివారితో తగవు హాని చేస్తుంది

11. ప్రక్రియలను గుర్తించడం:

115. పేదలను నిందిస్తే, కీడు జరుగుతుంది – గీత గీసిన పదం ఏ ప్రక్రియకు చెందినది?
A) ఆశ్చర్యార్థకం
B) ఉక్తార్థం
C) చేదర్థకం
D) విధి
జవాబు:
C) చేదర్థకం

116. మంచివాడు నీతిమార్గాన్ని తప్పి సంచరించడు – గీత గీసిన పదం ఏ ప్రక్రియకు చెందినది?
A) అనంతర్యార్థకం
B) తుమున్నర్థకం
C) క్వార్థకం
D) ప్రేరణార్థకం
జవాబు:
C) క్వార్థకం

AP Board 9th Class Telugu Important Questions Chapter 4 ప్రేరణ

AP State Syllabus AP Board 9th Class Telugu Important Questions Chapter 4 ప్రేరణ

AP State Syllabus 9th Class Telugu Important Questions 4th Lesson ప్రేరణ

9th Class Telugu 4th Lesson ప్రేరణ Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

1. ఈ క్రింది గద్యాన్ని చదివి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

నేను రామనాథపురంలో ఉన్న కాలంలో మా అనుబంధం గురుశిష్య సంబంధాన్ని దాటి వికసించింది. ఆయన సాహచర్యంలో ఒకరి జీవిత గమనాన్ని ఎవరైనా ఏ మేరకు ప్రభావితం చేయగలరో తెలుసుకున్నాను. ఇయదురై సోలోమోన్ అంటుండేవారు. జీవితంలో విజయం పొందడానికి, ఫలితాలు సాధించడానికి నువ్వు మూడు అంశాలు మీద పట్టు సాధించాల్సి ఉంటుంది – అవి “కోరిక”, “నమ్మకం”, “ఆశపెట్టుకోవడమూ”ను.
ప్రశ్నలు:
1. పై పేరాలో గురువు ఎవరు?
2. ఆయన ఏ అంశాలపై పట్టు సాధించాలని చెప్పారు?
3. దేనికోసం అంశాలపై పట్టు సాధించాలి?
4. ‘గురుశిష్యులు’ ఏ సమాసం?
జవాబులు:
1. ఇయదురై సోలోమోన్
2. “కోరిక, నమ్మకం, ఆశపెట్టుకోవడం”
3. జీవితంలో విజయం పొందడానికీ, ఫలితలు సాధించడానికీ
4. ద్వంద్వ సమాసం

AP Board 9th Class Telugu Important Questions Chapter 4 ప్రేరణ

2. ఈ క్రింది గద్యాన్ని చదివి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (S.A. I – 2018-19)

కలాం రామనాథపురంలో హైస్కూల్లో స్థిరపడగానే ఆయనలోని పదిహేనేళ్ళ జిజ్ఞాసువు మేల్కొన్నాడు. కలాం తన ముందు పరచుకుని ఉన్న జీవితావకాశాల గురించి ప్రత్యామ్నాయాల గురించి ఇదమిత్థంగా ఏమి తెలుసుకోలేని ఒక నవ ఔత్సాహికుడైన ఆయనకు ఉపాధ్యాయుడు ఇయదురై సోలోమన్ ఆదర్శపథ నిర్దేశకుడయ్యాడు. ఉదార విశాల దృక్పథంతో ఆయన తన తరగతి గదిలోని విద్యార్థుల్ని ఉత్సాహపరచేవాడు. మందబుద్ధి శిష్యుడు ఉత్తమ గురువు నుంచి నేర్చుకోగలిగే దానికన్నా ఉత్తమ విద్యార్థి చెడ్డ ఉపాధ్యాయుడి నుంచి కూడా ఎక్కువ నేర్చుకోగలడనేవాడు కలాం.
ప్రశ్నలు:
1. కలామ్ గారు తనకు మార్గదర్శిగా ఎవరిని భావించారు?
2. ఉత్తమ విద్యార్థి లక్షణమేమిటి?
3. కలామ్ ఏ విషయం గూర్చి సందిగ్ధంలో ఉన్నారు?
4. పై పేరాననుసరించి ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబులు:
1. ఉపాధ్యాయుడు ఇయదురై సోలోమన్
2. చెడ్డ ఉపాధ్యాయుడి నుంచి ఎక్కువ నేర్చుకోగలగడం
3. జీవితావకాశాల గురించి, ప్రత్యామ్నాయాల గురించి
4. విద్యార్థిలో ఏ లక్షణం ఉండకుండా ఉంటే మంచిది?

3. కింది పేరా చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

సమాజ అభివృద్ధిలో శ్రమకు భాగం ఉంటుంది. ఒకరు మరొకరికోసం శ్రమిస్తారు. పిల్లల బాగుకోసం తల్లిదండ్రులు శ్రమిస్తారు. పంట పండించడానికి రైతు శ్రమిస్తాడు. విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయుడు శ్రమిస్తాడు. దేశాన్ని శత్రువుల నుండి రక్షించడానికి సైనికుడు పడే శ్రమ అద్వితీయం. సమాజం నుంచి నువ్వు పొందుతున్నదంతా ఎవరో ఒకరు విశ్రాంతి లేకుండా కష్టపడితే వచ్చిందే. వారి శ్రమను గుర్తించి, వారిని గౌరవించి వారి పట్ల కృతజ్ఞతతో ఉండు. వారికి ఏది తిరిగి ఇవ్వగలవో ఆలోచించు. సమాజం సృష్టించిన సంపదలను పాడుచేసే హక్కు ఎవరికీ లేదు. దానిని మరింత పెంచడమే నీకు నాకు కర్తవ్యం.
ప్రశ్నలు – జవాబులు:
1. మన కర్తవ్యమేమిటి ?
జవాబు:
సమాజం సృష్టించిన సంపదలను పెంచడం.

2. ఎవరి పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి?
జవాబు:
శ్రమించేవారి పట్ల

3. సైనికుడు ఏమి చేస్తాడు?
జవాబు:
దేశాన్ని సృష్టించిన సంపదలను పెంచడం.

4. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
పంట పండించడానికి ఎవరు శ్రమిస్తారు?

AP Board 9th Class Telugu Important Questions Chapter 4 ప్రేరణ

4. కింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.

నేను రామనాథపురంలో హైస్కూల్లో స్థిరపడగానే నాలోని పదిహేనేళ్ళ జిజ్ఞాసి మేల్కొన్నాడు. తనముందు పరచుకొని ఉన్న జీవితావకాశాల గురించి ప్రత్యామ్నాయాల గురించి ఇతమిద్ధంగా ఏమీ తెలుసుకోలేని ఒక నవ ఔత్సాహికుడికి నా ఉపాధ్యాయుడు ఇయదురై సోలోమోన్ ఆదర్శపథనిర్దేశకుడయ్యాడు. తన ఉదార విశాల దృక్పథంతో ఆయన తన తరగతి గదిలోని విద్యార్థుల్ని ఉత్సాహపరిచేవాడు. ‘మందబుద్ధి’ శిష్యుడు ఉత్తమ గురువు నుంచి నేర్చుకోగలిగిన దానికన్న ఉత్తమ విద్యార్థి చెడ్డ ఉపాధ్యాయుని నుంచి కూడా ఎక్కువ నేర్చుకోగలడు అనేవాడాయన.
ప్రశ్నలు – జవాబులు:
1. జిజ్ఞాసువు అంటే ఎవరు?
జవాబు:
తెలియని దానిని తెలుసుకోవాలనే ఇచ్ఛ కలవాడు.

2. కలాంకు మార్గదర్శకుడెవరు?
జవాబు:
ఉపాధ్యాయుడు ఇయదురై సోలోమోన్.

3. పై పేరా ప్రకారం నేర్చుకోవడం అనేది ఎవరిపై ఆధారపడి ఉంటుంది?
జవాబు:
విద్యార్థి

4. పై పేరాను చదివి ఒక ప్రశ్నను తయారు చేయండి.
జవాబు:
కలాం పూర్తి పేరు ఏమిటి?

5. కింది పేరా చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (S.A. III – 2015-16)

భారతదేశంలో 8.7 కోట్ల మంది బాలలు పాఠశాలలకు వెళ్ళడం లేదని, వీరంతా ఇళ్ళలోను, కర్మాగారాల్లోను, పొలాల్లోను పనిచేస్తున్నారని ‘గ్లోబల్ మార్చ్ ఎగనెస్ట్ చైల్డ్ లేబర్’ అనే అంతర్జాతీయ సంస్థ పేర్కొంది. కాబట్టి బాలకార్మికుల కోసం ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పాలి. వాళ్ళు చదువుకొనే అవకాశం కల్పించాలి. మనరాష్ట్రంలో 16 లక్షల మంది బాలకార్మికులు ఉన్నారు. బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా రూపు మాపేందుకు ప్రభుత్వం తగుచర్యలు తీసుకొంటున్నది.
ప్రశ్నలు – జవాబులు:
1. బాలకార్మికుల స్థితిగతులపై పరిశోధన చేసిన సంస్థ ఏది?
జవాబు:
గ్లోబల్ మార్చ్ ఎగనెస్ట్ చైల్డ్ లేబర్ అనే అంతర్జాతీయ సంస్థ.

2. బాలకార్మికులు పనిలోకి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏమిటి?
జవాబు:
ఆర్థిక సమస్యలు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట లేని స్థితి వలన.

3. పై పేరాను ఆధారం చేసుకుని రెండు ప్రశ్నలను తయారు చేయండి.
జవాబు:
1) బాలకార్మిక వ్యవస్థ రూపుమాపడానికి ఏం చేయాలి?
2) మన రాష్ట్రంలో ఎంతమంది బాలకార్మికులున్నారు?

AP Board 9th Class Telugu Important Questions Chapter 4 ప్రేరణ

6. కింది పేరా చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (S.A. II – 2017-18)

మోతీలాల్ నెహ్రూ భార్య పేరు స్వరూపరాణి. మంచి సుగుణవతి. ఈ దంపతులకు 1889వ సంవత్సరం నవంబరు 14న ఒక పుత్రుడు జన్మించాడు. జవహర్ అని పేరు పెట్టారు. జవహర్ అంటే రత్నం లేక మణి అని అర్థం. ఆయనే శాంతిదూతయై, భారతరత్నమై భారతదేశానికి విలువైన సేవల్ని అందించాడు. మొదటి ప్రధానిగా దేశాన్ని అభివృద్ధి పధంలోకి నడిపించాడు.
ప్రశ్నలు – జవాబులు:
1. మొదటి భారత ప్రధాని ఎవరు?
జవాబు:
జవహర్‌లాల్ నెహ్రూ

2. జవహర్ అంటే అర్థం ఏమిటి?
జవాబు:
రత్నం / మణి

3. నవంబరు 14ను ఏ దినంగా జరుపుకుంటాం?
జవాబు:
బాలల దినోత్సవం

4. ఈ పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
జవహర్ తల్లి పేరేమి?

7. సజ్జన సహవాసం సత్యవాక్యాలనే పలికింపజేస్తుంది. బుద్ధిమాంద్యాన్ని పోగొడుతుంది. గౌరవాన్ని కలిగిస్తుంది. పాపాలను దూరం చేస్తుంది. కీర్తిని వ్యాపింపజేస్తుంది. మనో వికాసాన్ని కలిగింపజేస్తుంది. సజ్జన సహవాసం సమస్త ప్రయోజనాలనూ సాధిస్తుంది.
ప్రశ్నలు – జవాబులు :
1. పాపాలను దూరం చేసేది ఏది?
జవాబు:
సజ్జన సహవాసం

2. ‘కీర్తి’ వ్యతిరేకపదం ఏది?
జవాబు:
అపకీర్తి

3. ‘గౌరవం’ వికృతి పదం ఏది?
జవాబు:
గారవం

4. ‘సజ్జనులు’ విడదీయము.
జవాబు:
సత్ + జనులు

AP Board 9th Class Telugu Important Questions Chapter 4 ప్రేరణ

8. సంపదకు, సౌజన్యం, పరాక్రమానికి వాక్సంయమం, విద్యకు వినయం, మంచి జ్ఞానానికి శాంతి, అధిక ధనానికి దానం, శక్తికి ఓర్పు, ధర్మాచరణకు దంభం లేకపోవడం అలంకారాలు. ఈ అలంకారాలన్నింటి కన్నా శీలమే మేలైన అలంకారం.
ప్రశ్నలు – జవాబులు:
1. పరాక్రమానికి అలంకారం ఏది?
జవాబు:
వాక్సంయమం

2. శాంతి దేనికి అలంకారం ఏది?
జవాబు:
మంచిజ్ఞానం

3. శక్తికి అలంకారం ఏది?
జవాబు:
ఓర్పు

4. అన్నిటికన్న మేలైన అలంకారం?
జవాబు:
శీలం

9. ఈ కింది పేరా చదవండి. చదివి ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (S.A. I – 2018-19)

ముగ్గురు మిత్రులు సముద్రం దగ్గర ఉన్న ఎత్తైన ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడొక వ్యక్తి నిలబడి ఉండటం చూశారు. మొదటి మిత్రుడు “బహుశా అతని పెంపుడు జంతువు తప్పిపోతే వెతుకుతున్నాడేమో” అన్నాడు. రెండవ మిత్రుడు “అదేం కాదు. ఎవరో స్నేహితుడు వస్తానని ఉంటాడు. అతనికోసం వచ్చినట్లున్నాడు” అన్నాడు. మూడవ మిత్రుడు “వేసవి కాలం కదా ! చల్లగాలి కోసం వచ్చినట్లున్నాడు” అన్నాడు. ముగ్గురూ వెళ్ళి” ఇక్కడికి ఎందుకు వచ్చారు ? అని అతనిని అడిగారు. అతను “ఊరికినే రావాలనిపించింది – వచ్చాను. నిలబడాలనిపించింది. నిలబడ్డాను” అన్నాడు. ముగ్గురు మిత్రులూ అవాక్కయ్యారు.

ఎదుటివారి గురించి ఏ ఆధారమూ లేకుండా ఏదేదో ఊహించుకోవడం పొరపాటు అని వారికి అర్థమైంది.
ప్రశ్నలు:
1) ఈ కథలో సందేశం ఏమిటి?
2) ఈ కథకు ఒక పేరు పెట్టండి.
3) “అవాక్కవడం” అంటే ఏమిటి?
4) పై గద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచెయ్యండి.
జవాబులు:
1) ఎదుట వారి గురించి ఏ ఆధారము లేకుండా ఏదేదో ఊహించుకోవడం పొరపాటు అని చెప్పడం.
2) కాలక్షేపానీకొక మాట
3) మాటరాకపోవడం
4) పై పేరాలో కాలాన్ని తెలిపే పదం గుర్తించండి.

II. స్వీయరచన

అ) క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘ఆత్మకథ’ ప్రక్రియ గురించి రాయండి.
జవాబు:
ఒక వ్యక్తి తన జీవిత విశేషాల్ని తానే గ్రంథస్థం చేసుకుంటే అది అత్మకథ. దీనినే ‘స్వీయచరిత్ర’ అని కూడా అంటారు. ఇందులో సమకాలీన విశేషాలు ప్రతిబింబిస్తాయి. రచయిత అనుభవాలేకాక, ఆ కాలం నాటి సాంఘిక, ఆర్థిక రాజకీయ పరిస్థితులు తెలుస్తాయి. ఆత్మకథ ఇతరులకు ప్రేరణ కలిగిస్తుంది. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది.

ప్రశ్న 2.
‘ప్రేరణ’ పాఠ్యభాగ రచయిత గురించి రాయండి.
జవాబు:
‘ప్రేరణ’ పాఠ్యభాగాన్ని రచించినది డా|| అవుల్ ఫకీర్ జైనులాబీన్ అబ్దుల్ కలాం (ఏ.పి.జె. అబ్దుల్ కలాం)
జననం : 15-10-1931

మరణం : 27-07-2015

జన్మస్థలం : ధనుష్కోటి (తమిళనాడు)

రచనలు : ఒక విజేత ఆత్మకథ, ఇగ్నైటెడ్ మైండ్స్, ద వింగ్స్ ఆఫ్ ఫైర్, యాన్ ఆటోబయోగ్రఫి.

బిరుదులు : పద్మభూషణ్, పద్మవిభూషణ్, గౌరవ డాక్టరేట్లు, భారతరత్న.

ఆ) క్రింది ప్రశ్నలకు పది లేక పన్నెండు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘పెద్దలమాట చద్దిమూట’ అన్నారు పెద్దలు. కలాం విషయంలో తండ్రి, గురువుల పలుకులు ఏ మేరకు ఆయన కృతకృత్యుణ్ణి చేసాయి?
జవాబు:
ఒక సామాన్య కుటుంబంలో జన్మించి, అత్యున్నత శిఖరాలను అధిరోహించిన మహనీయుని జీవితం ఎందరికో ప్రేరణ. ఆయనెవరో కాదు డా|| అవుల్ ఫకీర్ జైనులాల్దీన్ అబ్దుల్ కలామ్. ఏ.పి.జె. అబ్దుల్ కలాంగా ప్రసిద్ధులైన వీరి జీవితం అంత సాఫీగా ఏమీ సాగలేదు. అడుగడుగునా పరీక్షలతో, ఒత్తిళ్ళతో గడిచినా చివరకు విజయం సొంతం చేసుకున్నాడు. ఆయన విజయ సోపానాలకు ఆధారం గురువుల, తండ్రి మాటలే. కలాం గురువులలో ప్రథమంగా చెప్పుకోవల్సిన వ్యక్తి ఇయదురై సోలోమోన్. జీవితంలో పట్టు సాధించాల్సి ఉంటుంది. అవి “కోరిక, నమ్మకం, ఆశపెట్టుకోవడమూ” అని కలాంకి ఆదర్శపథ నిర్దేశకుడయ్యాడు. అంతేకాక “విశ్వాసంతో నువ్వు నీ విధిని కూడా తిరిగి రాయగలవు” అని ఆత్మగౌరవాన్ని మేల్కొల్పాడు.

లక్ష్యాన్ని చేరే సమయంలో వివిధ రకాల వ్యక్తులతో పరిచయాలు, వైఫల్యాలు, ఆశాభంగాలు, దారితప్పిన ప్రతివేళా కలాం తండ్రి మాటలు కలాంను మళ్ళీ సరిగా నిలబెట్టేవి. ఆ ఉత్తేజకరమైన మాటలు “ఇతరుల్ని అర్థం చేసుకున్నవాడు విజ్ఞాని. కానీ తన్ను తాను తెలుసుకున్న వాడే వివేకి. వివేకం లేని విజ్ఞానం, ప్రయోజన శూన్యం” అలాగే ప్రొఫెసర్ స్పాండర్, “నీ పరిశ్రమ నీ ఉపాధ్యాయులకి భవిష్యత్తులో మంచిపేరు తేవడానికి ఉపకరిస్తుంది. దేవుడే ఆశా, ఆశ్రయమూ, మార్గదర్శి కాగలడు. భవిష్యత్ లో నీ ప్రయాణానికి ఆయనే దారిచూపే దీపం కాగలడు” అన్న ఆ మహామేధావి మాటలు కలాం ఉన్నతికి దోహదపడ్డాయి.

AP Board 9th Class Telugu Important Questions Chapter 4 ప్రేరణ

ప్రశ్న 2.
మీరా అనే విద్యార్థిని శాస్త్రవేత్త కావాలని కోరుకుంది. ఆమె తన పాఠశాలకు వచ్చిన ఒక శాస్త్రవేత్తను ఏయే విషయాలను గురించి ప్రశ్నలను అడగ దలచినదో ఊహించి 10 ప్రశ్నలు రాయండి.
జవాబు:
మీరా : నమస్కారమండి.

  1. మీరు శాస్త్రవేత్త కావాలనే కోరిక ఏ వయసులో కలిగింది?
  2. శాస్త్రవేత్త అవడానికి గల కారణాలేమిటి?
  3. శాస్త్రవేత్త అవడానికి ప్రేరణ ఇచ్చిన ఉపాధ్యాయులు ఎవరు?
  4. మీ తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల సహకారం ఎంత ఉంది?
  5. మీ స్నేహితులు ఎలా సపోర్టు చేశారు?
  6. ఆర్థికంగా ఏవైనా ఇబ్బందులు ఏర్పడ్డాయా?
  7. ఎటువంటి అభ్యాసం చేశారు?
  8. ఆరోగ్య సమస్యలు ఏమైనా వచ్చాయా?
  9. మిమ్మల్ని ముందుకు నడిపించిన మార్గదర్శకులు ఎవరు?
  10. మాలాంటి వారికి మీరిచ్చే సూచనలు ఏమిటి?

ప్రశ్న 3.
కింది వివరాల ఆధారంగా “ఏ.పి.జె. అబ్దుల్ కలాం” జీవిత విశేషాలను వర్ణనాత్మకంగా ఒక క్రమపద్ధతిలో రాయండి.
* పూర్తి పేరు : అవుల్ ఫకీర్ జైనులాథీన్ అబ్దుల్ కలామ్
* జననం : 15 అక్టోబర్, 1931
* జన్మస్థలం : రామేశ్వరం, మద్రాస్ ప్రెసిడెన్సీ (గతంలో) ధనుష్కోటి రామనాథపురం, తమిళనాడు (ఇప్పుడు)
* భారత రాష్ట్రపతి : 2002 – 2007.
* విద్య : మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (1955-1960)
* అవార్డులు : భారతరత్న, పద్మభూషణ్, పద్మ విభూషణ్, హూవర్ మెడల్
* మరణం : 27 జూలై, 2015, షిల్లాంగ్, మేఘాలయ
* రచనలు : వింగ్స్ ఆఫ్ ఫైర్
జవాబు:
అందరూ ఏ.పి.జె అబ్దుల్ కలాంగా పిలిచే డాక్టర్ అబ్దుల్ ఫకీర్ జైనుల్ ఆబిదీన్ అబ్దుల్ కలాం 1931 అక్టోబరు 15న తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ధనుష్కోటి (మద్రాస్ ప్రెసిడెన్సీ (గతంలో) రామనాథపురం, తమిళనాడు (ఇప్పుడు)లో జన్మించారు. సామాన్య కుటుంబంలో పుట్టిన ఆయన పట్టుదల, క్రమశిక్షణ, జ్ఞాన జిజ్ఞాసతో మద్రాసు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో (1955-60) విద్య నభ్యసించారు. అనతికాలంలోనే ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా (2002-2007) తమ సేవలను ఈ జాతికి అందించారు.

‘ఒక విజేత ఆత్మకథ’ (ఇగ్నేటెడ్ మైండ్స్ ద వింగ్స్ ఆఫ్ ఫైర్ – యాన్ – ఆటోబయోగ్రఫీ) వంటి రచనలు చేశారు.

శాస్త్ర రంగంలో విశేష కృషి చేసినందుకు గాను పద్మభూషణ్, పద్మవిభూషణ్ తో పాటు దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నతోను భారత ప్రభుత్వం సత్కరించింది. దేశవిదేశాల్లోని విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లతో, హూవర్ మెడల్ తో ఆయనను గౌరవించాయి.

భారతదేశానికి ఒక శాస్త్రవేత్త రాష్ట్రపతి అయ్యాడని ప్రపంచమంతా ఇండియా వైపు తలయెత్తి చూసింది. అంత ఘనత నిచ్చిన ఆ మహనీయుడు జులై 27, 2015లో మేఘాలయ లోని షిల్లాంగ్ లో మరణించారు.

III. భాషాంశాలు (పదజాలం, వ్యాకరణం)

1. పర్యాయపదాలు :

స్పృహ : ఇచ్ఛ, కోరిక
వ్యతాసం : భేదం, తేడా

2. వ్యుత్పత్త్యర్థాలు :

ఉపాధ్యాయుడు : వేదమును చదివించువాడు, చదువు చెప్పువాడు (గురువు)

AP Board 9th Class Telugu Important Questions Chapter 4 ప్రేరణ

3. నానార్థాలు :

వ్యవధి = మేర, ఎడమ
నిర్దేశం = ఉపదేశం, చూపుట
చైతన్యం = తెలివి, ప్రాణం

4. ప్రకృతి – వికృతులు :

శిష్యుడు – సిసువడు
కష్టం – కసటు, కస్తి
లక్ష్యం – లేక్క
శక్తి – సత్తి
ఆశా – ఆస
త్యాగం – చాగం
శూన్యం – సున్న
భూమి బూమి
ఆసక్తి – ఆసత్తి
శాస్త్రం – చట్టం
రేఖా – రేక

5. సంధులు :

అమిత + ఆసక్తి – అమితాసక్తి – సవర్ణదీర్ఘ సంధి
విద్యా + అర్థి – విద్యార్థి – సవర్ణదీర్ఘ సంధి
రామ + ఈశ్వరం – రామేశ్వరం – గుణసంధి
తల్లి + తండ్రి – తల్లిదండ్రులు – గసడదవాదేశ సంధి
కష్ట + ఆర్జితం – కష్టార్జితం – సవర్ణదీర్ఘ సంధి
గ్రంథము + లు – గ్రంథాలు – లులనల సంధి
ఏక + ఏక – ఏకైక – వృద్ధి సంధి
ప్రతి + ఏక – ప్రత్యేక – యణాదేశ సంధి
వాక్ + దానం – వాగ్దానం – అనునాసిక సంధి

6. సమాసాలు :

గురుశిష్యులు – గురువు మరియు శిష్యుడు – ద్వంద్వ సమాసం
జీవిత గమనం – జీవితం యొక్క గమనం – షష్ఠీ తత్పురుష సమాసం
అమితాసక్తి – అమితమైన ఆసక్తి – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
దృఢ సంకల్పం – దృఢమైన సంకల్పం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
అదృశ్యం – దృశ్యము కానిది – నఞ్ తత్పురుష సమాసం
తాగ్య నిరతి – త్యాగము నందు ఆసక్తి – సప్తమీ తత్పురుష సమాసం
జ్ఞానతృష్ణ – జ్ఞాన సంపాదనమందు ఆసక్తి – సప్తమీ తత్పురుష సమాసం
నిశిత బోధన – నిశితమైన బోధన – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

9th Class Telugu 4th Lesson ప్రేరణ 1 Mark Bits

1. సురేఖకు అందరూ బాగుండాలని ఆకాంక్ష – (గీత గీసిన పదానికి అర్ధం గుర్తించండి) (S.A. I – 2018-19)
ఎ) ఆంక్ష
బి) కోరిక
సి) ఆశయం
డి) కోరకం
జవాబు:
బి) కోరిక

2. దేవతలు సముద్రం మధించగా, పయోధి నుంచి అమృతం సిద్ధించింది. (గీత గీసిన పదాలకు సరియగు పర్యాయ పదం గుర్తించండి) (S.A. I – 2018-19)
ఎ) సరోవరం
బి) కాసారం
సి) అకూపారం
డి) కాపారం
జవాబు:
సి) అకూపారం

AP Board 9th Class Telugu Important Questions Chapter 4 ప్రేరణ

3. పెద్దలపట్ల గారవమును ప్రదర్శించుట మంచిది – (ప్రకృతి పదం గుర్తించండి) (S.A. I – 2018-19)
ఎ) గర్వము
బి) గరువము
సి) గౌరవం
డి) గార్వం
జవాబు:
సి) గౌరవం

4. భూమి మీద ఎన్నో నిక్షేపాలున్నాయి – (గీత గీసిన పదానికి పర్యాయ పదం గుర్తించండి)(S.A. II . 2018-19)
ఎ) వసుధ – అవని
బి) వసుధ – సుధ
సి) వసుధ – ఆమని
డి) వసుధ – నింగి
జవాబు:
ఎ) వసుధ – అవని

5. మంచి వాని పథంలో పయనించాలి. ఆ దారి పదుగురికి మార్గదర్శకమవుతుంది. (గీత గీసిన పదాలకు సరియగు పర్యాయ పదం గుర్తించండి) (S.A. I – 2017-18)
ఎ) పదవి
బి) మార్గం
సి) మార్దవం
డి) మాలోకం
జవాబు:
బి) మార్గం

6. ధనం కంటే విద్య మిన్నయైనది. (అర్థం గుర్తించండి) (S.A. III – 2016-17)
ఎ) అనువు
బి) మనస్సు
సి) ఎక్కువ
డి) హృదయం
జవాబు:
సి) ఎక్కువ

7. చాలా మంచి కథలు నాన్నచేత చెప్పబడ్డాయి. (కర్తరి వాక్యాన్ని గుర్తించండి) (S.A. I – 2018-19)
ఎ) చాలా మంచి కథలు ఎవరో చెప్పారు.
బి) నాన్న చాలా మంచి కథలు చెప్పబడ్డాయి.
సి) నాన్న చాలా మంచి కథలు చెప్పాడు.
డి) మంచి కథలు ఎవరు చెప్పినా వినాలి.
జవాబు:
సి) నాన్న చాలా మంచి కథలు చెప్పాడు.

AP Board 9th Class Telugu Important Questions Chapter 4 ప్రేరణ

8. రమేష్ భారతాన్ని చదివాడు. (కర్మణి వాక్యాన్ని గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) రమేష్ చేత భారతం చదువబడింది.
బి) రమేష్ చేత భారతం అనువదించబడింది.
సి) రమేష్ చేత భారతం చదువబడలేదు.
డి) రమేష్ చేత భారతం విడువబడింది.
జవాబు:
ఎ) రమేష్ చేత భారతం చదువబడింది.

9. నా చేత ఎన్నో పుస్తకాలు వ్రాయబడ్డాయి. (కర్తరి వాక్యాన్ని గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) ఎన్నో పుస్తకాలు నాచేత వ్రాయబడ్డాయి.
బి) ఎన్నో పుస్తకాలను వ్రాశాను.
సి) ఎన్నో పుస్తకాలే వ్రాశాను.
డి) నేను ఎన్నో పుస్తకాలను వ్రాశాను.
జవాబు:
డి) నేను ఎన్నో పుస్తకాలను వ్రాశాను.

10. శ్రీనివాసన్ కలాంను ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. (ఈ కర్తరి వాక్యానికి కర్మణి వాక్యాన్ని గుర్తించండి.)(S.A. III – 2016-17)
ఎ) శ్రీనివాసన్ చేత కలాం ఆప్యాయంగా కౌగిలించుకోబడ్డాడు.
బి) శ్రీనివాసన్, కలాం ఒకరినొకరు కౌగిలించుకున్నారు.
సి) శ్రీనివాసన్, కలాం ఆప్యాయంగా కౌగిలించుకోబడలేదు.
డి) శ్రీనివాసన్, కలాం కౌగిలించుకోలేదు.
జవాబు:
ఎ) శ్రీనివాసన్ చేత కలాం ఆప్యాయంగా కౌగిలించుకోబడ్డాడు.

11. తమ విమానాన్ని తామే తయారు చేసుకుంటాం అని కలాం అన్నారు. (ప్రత్యక్ష కథనం గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) “మా విమానాన్ని మేము తయారు చేయమ”ని కలాం అన్నారు.
బి) “మా విమానాన్ని మేమే తయారు చేసుకుంటాం” అని కలాం అన్నారు.
సి) “మా విమానాన్ని వేరే వారు తయారు చేస్తారు” అని కలాం అన్నారు.
డి) “మేమెప్పటికీ విమానం తయారు చేయం” అన్నారు కలాం.
జవాబు:
బి) “మా విమానాన్ని మేమే తయారు చేసుకుంటాం” అని కలాం అన్నారు.

12. గోపాల్ ఏ పనినైనా చేయగలడు. (ఏ రకమైన వాక్యమో గుర్తించండి) (S.A. II – 2018-19 S.A. II – 2017-18)
ఎ) ఆశ్చర్యార్థకం
బి) వ్యతిరేకార్థకం
సి) సామర్థ్యార్థకం
డి) అభ్యర్థకం
జవాబు:
సి) సామర్థ్యార్థకం

13. మీరు బయటకు వెళ్ళవచ్చును. (ఏ రకమైన వాక్యమో గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) అనుమత్యర్థకం
బి) ప్రశ్నార్థకం
సి) నిశ్చయార్థకం
డి) శత్రర్థకం
జవాబు:
ఎ) అనుమత్యర్థకం

14. ‘లోపలికి రావడం’ (అనుమత్యర్థకం గుర్తించండి) (S.A. II – 2017-18) (ఎ)
ఎ) లోపలికి రావచ్చు
బి) లోపలికి రా
సి) లోపలికి రావద్దు
డి) లోపలికి రాగలడు
జవాబు:
ఎ) లోపలికి రావచ్చు

AP Board 9th Class Telugu Important Questions Chapter 4 ప్రేరణ

15. ఏదో ఓ కొత్త విషయం చెప్పాలి. (వాక్యానికి వ్యతిరేకార్థం వచ్చే వాక్యాన్ని గుర్తించండి.) (S.A. III – 2016-17)
ఎ) ఏదో ఓ కొత్త విషయం చెప్పకూడదు.
బి) ఏదో ఓ కొత్త విషయం చెప్పేశాడు.
సి) ఏదో ఓ కొత్త విషయం చెప్పను.
డి) ఏదో ఓ కొత్త విషయం చెప్పలేదు.
జవాబు:
ఎ) ఏదో ఓ కొత్త విషయం చెప్పకూడదు.

భాషాంశాలు (పదజాలం, వ్యాకరణం)

1. అర్థాలు :

16. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యంతో చదవాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) పంతం
B) గురి
C) సరదా
D) నిర్లక్ష్యం
జవాబు:
A) పంతం

17. ప్రతిభ ఉంటే గుర్తింపు అదే వస్తుంది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) నేర్పు
B) బద్దకం
C) తెలివి
D) వినయం
జవాబు:
C) తెలివి

AP Board 9th Class Telugu Important Questions Chapter 4 ప్రేరణ

18. చైతన్యం లేకపోతే పశువుకి, మనిషికి తేడా ఏమిటి? – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) జ్ఞానం
B) కదలిక
C) మాట
D) నిద్ర
జవాబు:
A) జ్ఞానం

19. స్వార్థం విడిచి, దేశ ప్రగతికోసం అందరూ ప్రయత్నించాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) కులం
B) మతం
C) ప్రాంతం
D) అభివృద్ధి
జవాబు:
D) అభివృద్ధి

20. ఉత్తములైన పెద్దల ఆధ్వర్యంలో ముందుకు నడవాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) ఆశీస్సు
B) పెత్తనం
C) ఇష్టం
D) మాట
జవాబు:
B) పెత్తనం

21. నాలోని పదిహేనేళ్ళ జిజ్ఞాస మేల్కొంది – గీత గీసిన పదానికి అర్థం ఏమిటి?
A) జ్ఞానము
B) అజ్ఞానము
C) తెలుసుకోవాలనే కోరిక
D) విజ్ఞానం
జవాబు:
C) తెలుసుకోవాలనే కోరిక

AP Board 9th Class Telugu Important Questions Chapter 4 ప్రేరణ

22. మా ఉపాధ్యాయుడు విద్యార్థులందరిలో ఏదో ఒక విలువ గురించి స్మృహని మేల్కొల్పేవాడు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) జానం
B) కోరిక
C) ప్రేమ
D) వైరాగ్యం
జవాబు:
B) కోరిక

2. పర్యాయపదాలు :

23. సామాజిక స్పృహతో ప్రతి ఒక్కరు మసలుకోవాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) ఇచ్ఛ, ఆకలి
B) కోరిక, క్షామం
C) ఇచ్ఛ, కోరిక
D) కాంక్ష, ఒత్తిడి
జవాబు:
C) ఇచ్ఛ, కోరిక

24. ధనిక, పేద అనే వ్యత్యాసం తొలగినపుడే సమాజం బాగుంటుంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి
A) భేదం, ప్రబోధం
B) తేడా, భేదం
C) తేడా, కలయిక
D) కూడిక, తేడా
జవాబు:
B) తేడా, భేదం

25. వారు తమ నిశిత బోధనల వల్ల నాలో తృష్ణని జాగరితం చేశారు – గీత గీసిన పదానికి సమానార్థక పదం ఏది?
A) మేల్కొల్పడం
B) పెంచడం
C) తగ్గించడం
D) అధికం
జవాబు:
A) మేల్కొల్పడం

26. అపరిచితుల గుంపులో నీ పాతమిత్రుడిని పసిగట్టడం వంటిది – గీత గీసిన పదానికి సమానార్థాన్ని గుర్తించండి.
A) తెలియడం
B) వెదకడం
C) సూచనగా తెలిసికోవడం
D) గుర్తింపకపోవడం
జవాబు:
C) సూచనగా తెలిసికోవడం

27. అది నా తండ్రికి తలకు మించిన ఖర్చు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) తాత, అత్త
B) జనకుడు, అయ్య
C) నాన్న, అమ్మ
D) ఆర్య, పిత
జవాబు:
B) జనకుడు, అయ్య

AP Board 9th Class Telugu Important Questions Chapter 4 ప్రేరణ

28. ఉపాధ్యాయుడు సోలోమాన్ మాకు మార్గనిర్దేశకుడు గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) ఆచార్యుడు, పూజారి
B) గురువు, ఛాత్రుడు
C) అధ్యాపకుడు, ఒజ్జ
D) ఒజ్జ, మిత్రుడు

29. విశ్వాసంతో నీవు, నీ విధిని తిరిగి రాయగలవు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు ఏవి?
A) కర్మం, ధర్మం
B) అదృష్టం, దురదృష్టం
C) బ్రహ్మ, చతురాననుడు
D) తలరాత, విధాత
జవాబు:
C) బ్రహ్మ, చతురాననుడు

3. వ్యుత్పత్తరాలు :

30. వేదమును చదివించువాడు – అనే వ్యుత్పత్తి గల పదాన్ని గుర్తించండి.
A) గురువు
B) వేదవ్యాసుడు
C) ఉపాధ్యాయుడు
D) వేదజ్ఞుడు
జవాబు:
C) ఉపాధ్యాయుడు

31. ‘గురువు‘ గారు ఇటురారు – గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యర్థం గుర్తించండి.
A) జ్ఞానం ఇచ్చేవాడు
B) అంధకారమనే అజ్ఞానాన్ని ఛేదించేవాడు
C) చీకటి పోగొట్టేవాడు
D) వెలుగును ప్రసాదించేవాడు
జవాబు:
B) అంధకారమనే అజ్ఞానాన్ని ఛేదించేవాడు

4. నానార్థాలు :

32. ప్రతి ఒక్కరు చదువు ద్వారా చైతన్యవంతులు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) జ్ఞానం, అజ్ఞానం
B) తెలివి, ప్రాణం
C) ప్రాణం, నీరు
D) తెలివి, స్పర్శ
జవాబు:
B) తెలివి, ప్రాణం

33. పెద్దలు నిర్దేశించిన పనులనే పిల్లలు చేయాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) ఉపదేశం, ఆదేశం
B) చూపుట, ఆజ్ఞ
C) ఉపదేశం, చూపుట
D) మాట, పాట
జవాబు:
C) ఉపదేశం, చూపుట

34. వ్యవధులు దాటితే అవరోధాలు ఎదురవుతాయి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) మేర, ఎడమ
B) హద్దు, పొద్దు
C) దారి, తెన్ను
D) కాలం, మాట
జవాబు:
A) మేర, ఎడమ

AP Board 9th Class Telugu Important Questions Chapter 4 ప్రేరణ

35. నమ్మకం, ఆశ పెట్టుకోవాలి – గీత గీసిన పదానికి నానార్థాలు ఏవి?
A) కోరిక, వాంఛ
B) ఆకాంక్ష, అపనమ్మకం
C) కోరిక, దిక్కు
D) విశ్వాసం, ప్రేమ
జవాబు:
C) కోరిక, దిక్కు

36. విధి నీతో ఆటలాడుకుంటోంది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి. –
A) బ్రహ్మ, భాగ్యం
B) కర్తవ్యం , దేవుడు
C) దైవం, పరమాత్మ
D) కాలం, కర్మం
జవాబు:
A) బ్రహ్మ, భాగ్యం

5. ప్రకృతి – వికృతులు :

37. గురు శిష్య సంబంధం లోకంలో అత్యున్నతమైనది -గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) శిశువు
B) సిసువుడు
C) చట్టు
D) సిశువు
జవాబు:
B) సిసువుడు

38. ఆశకు లోనై మనిషి పతనమౌతున్నాడు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) అస
B) ఆసా
C) ఆస
D) అసా
జవాబు:
C) ఆస

39. చదువుపట్ల ఆసక్తి ఉండాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) ఆసత్తి
B) ఇష్టం
C) అసత్తి
D) ఆస
జవాబు:
A) ఆసత్తి

40. ‘కష్టేఫలి‘ అన్నారు పెద్దలు – గీత గీసిన పదానికి వికృతి
A) కస్టం
B) కాస్తి
C) కషటు
D) కసటు
జవాబు:
D) కసటు

41. ఎందరో వీరుల త్యాగఫలం మననేటి స్వేచ్చకు మూలధనం – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) తాగం
B) చాగం
C) దానం
D) కష్టం
జవాబు:
B) చాగం

AP Board 9th Class Telugu Important Questions Chapter 4 ప్రేరణ

42. పెద్దలమాట లక్ష్యం లేనపుడు పతనానికి దారితీస్తుంది – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) అశ్రద్ధ
B) శ్రద్ధ
C) లెక్క
D) పెడచెవి
జవాబు:
C) లెక్క

43. శూన్యం నిన్ను ప్రశ్నిస్తుంది. నీలో ఏముందని – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) సున్నం
B) ఆకాశం
C) చదువు
D) సున్న
జవాబు:
D) సున్న

44. జ్ఞానం ఉన్నవారే మరొకరికి పంచగలరు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) నాన
B) గ్యానం
C) సిగ్గు
D) బుద్ధి
జవాబు:
A) నాన

45. మహాత్ముల గూర్చి రేఖా మాత్రంగా తలచుకున్న మంచి జరుగుతుంది – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) ఏ
B) తక్కువ
C) రేక
D) కొద్ది
జవాబు:
C) రేక

46. సత్తి లేనపుడు కష్టమైన పనులకు పూనుకోకూడదు – గీత గీసిన పదానికి వికృతి పదం గురించండి.
A) బలం
B) శక్తి
C) సత్తువ
D) సామర్థ్యం
జవాబు:
B) శక్తి

47. నీవు ఎక్కడికి ప్రయాణం అయ్యావు? – గీత గీసిన పదానికి వికృతి ఏది?
A) పయాణం
B) యానం
C) పయనం
D) పాయనం
జవాబు:
C) పయనం

48. బంగారు గాజులు కనబడడం లేదు – గీత గీసిన పదానికి ప్రకృతిని గుర్తించండి.
A) కనకము
B) స్వర్ణము
C) భృంగారము
D) పైడి పదం గుర్తించండి.
జవాబు:
C) భృంగారము

49. శంఖము ఊదినా, వినబడడం లేదు – గీత గీసిన పదానికి వికృతి ఏది?
A) సంకు
B) సంఖం
C) జంకు
D) సన్నాయి
జవాబు:
A) సంకు

6. సంధులు:

50. ‘విద్యార్థి’ విడదీయుము.
A) విద్యా + అర్థి
B) విద్దె + అర్థి
C) విద్య + అర్థి
D) విద + అర్థ
జవాబు:
A) విద్యా + అర్థి

51. సవర్ణదీర్ఘ సంధికి ఉదాహరణ రాయండి.
A) కష్టార్జితం
B) గ్రంథాలు
C) రామేశ్వరం
D) ప్రత్యేకం
జవాబు:
A) కష్టార్జితం

52. ‘తల్లి + తండ్రి’ – సంధి చేయండి.
A) తల్లిదండ్రి
B) తల్లితండ్రులు
C) తల్లిదండ్రులు
D) తల్లితండ్రి
జవాబు:
C) తల్లిదండ్రులు

AP Board 9th Class Telugu Important Questions Chapter 4 ప్రేరణ

53. ‘ఏకెక’ సంధి పేరు రాయండి.
A) ఆమ్రేడిత సంధి
B) వృద్ధి సంధి
C) గుణసంధి
D) యణాదేశ సంధి
జవాబు:
B) వృద్ధి సంధి

54. కింది వానిలో అనునాసిక సంధికి ఉదాహరణ ఏది?
A) రామేశ్వరం
B) అమితాసక్తి
C) గ్రంథాలు
D) వాజ్మయం
జవాబు:
D) వాజ్మయం

55. ‘ప్రతి + ఏకం’ – పదాలను కలపండి.
A) ప్రతేకం
B) ప్రతిఏకం
C) ప్రత్యేకం
D) ప్రత్యేకం
జవాబు:
C) ప్రత్యేకం

56. ‘గ్రంథాలు’ విడదీయుము.
A) గ్రంథ + ఆలు
B) గ్రంథము + లు
C) గ్రంథి + ఆలు
D) గ్రంథము + ఆలు
జవాబు:
B) గ్రంథము + లు

57. అకారానికి ఇ, ఉ, ఋ లు పరమైన క్రమంగా ఏ, ఓ, అర్లు వచ్చును. ఇది ఏ సంధి సూత్రమో గుర్తించండి.
A) సవర్ణదీర్ఘ సంధి
B) వృద్ధి సంధి
C) యణాదేశ సంధి
D) గుణసంధి
జవాబు:
D) గుణసంధి

58. ‘బలోపేతం’ పదాన్ని విడదీయండి.
A) బలో + పేతం
B) బలా + ఉపేతం
C) బల + అపేతం
D) బల + ఉపేతం
జవాబు:
D) బల + ఉపేతం

59. విద్యాభ్యాసము బాగా జరుగుతోంది – గీత గీసిన పదం ఉదాహరణను గుర్తించండి.
A) యణాదేశ సంధి
B) సవర్ణదీర్ఘ సంధి
C) వృద్ధి సంధి
D) అత్వ సంధి
జవాబు:
B) సవర్ణదీర్ఘ సంధి

60. ‘సముద్రము + గువ్వలు’ సంధి జరిగిన పిమ్మట ఏర్పడే పదం ఏది?
A) సముద్ర గువ్వలు
B) సముద్రం గువ్వలు
C) సముద్రపు గువ్వలు
D) సముద్రంలో గువ్వలు
జవాబు:
C) సముద్రపు గువ్వలు

7. సమాసాలు :

61. త్యాగనిరతి యందు తరువులే గురువులు – గీత గీసిన పదానికి సమాసం పేరు గుర్తించండి.
A) ద్వంద్వ
B) షబ్న్
C) సప్తమీ
D) ద్విగు
జవాబు:
C) సప్తమీ

62. “జ్ఞాన సంపాదనమందు ఆసక్తి” ఈ విగ్రహవాక్యాన్ని సమాసపదంగా మార్చండి.
A) జ్ఞానాసక్తి
B) జ్ఞానతృష్ణ
C) జ్ఞాన సంపాదనాసక్తి
D) జ్ఞాన సంపాదన తృష్ణ
జవాబు:
B) జ్ఞానతృష్ణ

AP Board 9th Class Telugu Important Questions Chapter 4 ప్రేరణ

63. “దృశ్యము కానిది” – సమాసం పేరు గుర్తించండి.
A) నణ్
B) అవ్యయీభావ
C) భ్రాంతి
D) రూపకం
జవాబు:
A) నణ్

64. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి ఏ సంధి?
A) జ్ఞానతృష్ణ
B) జీవిత గమనం
C) గురుశిష్యులు
D) నిశిత బోధన
జవాబు:
D) నిశిత బోధన

65. గురుశిష్యుల అనుబంధం ఎంతో గొప్పది – గీత గీసిన పదానికి సమాసం పేరు గుర్తించండి.
A) ద్విగువు
B) ద్వంద్వ
C) రూపకం
D) బహుజొహి
జవాబు:
B) ద్వంద్వ

66. ‘కష్టముతో ఆర్జితము’ సమాస పదంగా మార్చండి.
A) కష్టార్జితము
B) కష్ట ఆర్జితము
C) కష్టపు ఆర్జితము
D) కష్టంపు ఆర్జితం
జవాబు:
A) కష్టార్జితము

67. ‘త్యాగనిరతి’ – ఏ సమాసం?
A) సప్తమీ తత్పురుష
B) ద్వితీయా తత్పురుష
C) బహుబ్లిహి
D) ఉపమాన పూర్వపద కర్మధారయం
జవాబు:
A) సప్తమీ తత్పురుష

AP Board 9th Class Telugu Important Questions Chapter 4 ప్రేరణ

68. ‘విద్యాభ్యాసము’ పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
A) విద్య కొఱకు అభ్యాసము
B) విద్య యొక్క అభ్యాసము
C) విద్యను అభ్యసించడం
D) విద్యల యందు అభ్యాసము
జవాబు:
B) విద్య యొక్క అభ్యాసము

8. ఆధునిక వచనాన్ని గుర్తించడం :

69. ‘ఆచార్యున కెదిరించకు’ – ఈ వాక్యానికి ఆధునిక వచనాన్ని గుర్తించండి.
A) ఆచార్యున కెదిరించు
B) ఆచార్యుని పొగడు
C) గురువును ఎదిరించకు
D) టీచర్ని కాదనకు
జవాబు:
C) గురువును ఎదిరించకు

9. కర్తరి, కర్మణి వాక్యాలను గుర్తించడం:

70. ‘నేనెన్నో పుస్తకాలు రాశాను’ – దీనికి కర్మణి వాక్యాన్న గుర్తించండి. (S.A. I – 2018-19)
A) నేను ఎన్నో పుస్తకాలు రాశా.
B) నా చేత ఎన్నో పుస్తకాలు రాయబడ్డాయి.
C) నా చేత పుస్తకాలు వ్రాయబడినవి.
D) పుస్తకాలు వ్రాసిన వారు నేనే.
జవాబు:
B) నా చేత ఎన్నో పుస్తకాలు రాయబడ్డాయి.

71. ‘జిడ్డు కృష్ణమూర్తి గారు ఎన్నో విషయాలను చెప్పారు’ – ఈ వాక్యం యొక్క కర్మణి వాక్యాన్ని గుర్తించండి. (S.A. II – 2017-18)
A) ఎన్నో విషయాలు జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పారు.
B) జిడ్డు కృష్ణమూర్తి గారిచే ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి.
C) జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పే విషయాలు వినాలి.
D) జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పే విషయాలు ఎన్నో.
జవాబు:
B) జిడ్డు కృష్ణమూర్తి గారిచే ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి.

10. ప్రత్యక్ష, పరోక్ష కథనంలోకి మార్చడం :

72. ‘రా నాతో పాటు ముందు కూర్చో’ చెప్పారు ప్రొఫెసరు – దీనికి పరోక్ష కథనాన్ని గుర్తించండి.
A) రమ్మనీ, తనతో పాటు ముందు కూర్చోమనీ ప్రొఫెసరు చెప్పారు.
B) రా నాతో కూర్చో అని ప్రొఫెసరు అన్నారు.
C) వచ్చి నాతో కూర్చో అన్నారు ప్రొఫెసరు.
D) ప్రొఫెసరు రమ్మని, కూర్చోమని అన్నారు.
జవాబు:
A) రమ్మనీ, తనతో పాటు ముందు కూర్చోమనీ ప్రొఫెసరు చెప్పారు.

11. వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించడం :

73. ‘నా మాతృభూమి విస్తృతి ఎంతో గుర్తించాను’ – క్రియను మార్చిన వ్యతిరేక వాక్యాన్ని గుర్తించండి.
A) నా మాతృభూమి విస్తృతి ఎంతో గుర్తించగలను.
B) నా మాతృభూమి విస్తృతి ఎంతో గుర్తించలేదు.
C) నా మాతృభూమి విస్తృతి గుర్తింపలేదు.
D) నా మాతృభూమి విస్తృతి గుర్తించావా?
జవాబు:
B) నా మాతృభూమి విస్తృతి ఎంతో గుర్తించలేదు.

12. వాక్యరకాలను గుర్తించడం :

74. “నీ పరిశ్రమ నీ ఉపాధ్యాయులకి భవిష్యత్తులో మంచిపేరు తేవడానికి ఉపకరిస్తుంది” ఇది ఏ రకమైన వాక్యం?
A) ఆశ్చర్యార్థకం
B) అనుమత్యర్థకం
C) ప్రశంసా వాక్యం
D) ప్రశ్నార్థక వాక్యం
జవాబు:
C) ప్రశంసా వాక్యం

AP Board 9th Class Telugu Important Questions Chapter 4 ప్రేరణ

75. “దేవుడే నీ ఆశా, ఆశ్రయమూ, మార్గదర్శి కాగలడు” – ఇది ఏ రకమైన వాక్యం
A) సామర్థ్యార్థకం
B) ఆశ్చర్యార్థకం
C) ప్రశంసా వాక్యం
D) నిషేధకం
జవాబు:
A) సామర్థ్యార్థకం

76. ‘ఆంగ్లేయ గ్రంథము లెన్నియో వ్రాయుచున్నారు. ఆంగ్లేయ ఉపన్యాసము లెన్నియో ఇచ్చుచున్నారు’ – ఈ సామాన్య వాక్యాలతో ఏర్పడిన సంక్లిష్ట వాక్యాన్ని గుర్తించండి.
A) ఆంగ్లేయ గ్రంథాలు ఎన్నో వ్రాస్తున్నారు. ఉపన్యాసా లిస్తున్నారు.
B) ఆంగ్లేయ గ్రంథోపన్యాసకులు ఇస్తున్నారు.
C) ఆంగ్లేయ గ్రంథము లెన్నియో వ్రాసి, ఉపన్యాసము లెన్నియో ఇచ్చుచున్నారు.
D) గ్రంథములు వ్రాసి ఉపన్యాసాలిచ్చుచున్నారు.
జవాబు:
C) ఆంగ్లేయ గ్రంథము లెన్నియో వ్రాసి, ఉపన్యాసము లెన్నియో ఇచ్చుచున్నారు.

13. ప్రక్రియలను గుర్తించడం :

77. ‘రంగయ్యకు రెక్కాడితే కాని డొక్కాడదు’ – గీత గీసిన పదం ఏ ప్రక్రియకు చెందినది?
A) క్వార్థకం
B) అనంతర్యార్థకం
C) చేదర్థకం
D) అభ్యర్థకం
జవాబు:
C) చేదర్థకం

AP Board 9th Class Telugu Important Questions Chapter 4 ప్రేరణ

78. కవిత గ్రంథాలయానికి వెళ్ళి పుస్తకాలు తెచ్చింది – గీత గీసిన పదం ఏ ప్రక్రియకు చెందినది?
A) క్వార్థకం
B) చేదర్థకం
C) శత్రర్థకం
D) అనంతర్యార్థకం
జవాబు:
A) క్వార్థకం

AP 9th Class Maths Important Questions and Answers

Andhra Pradesh SCERT AP State Board Syllabus 9th Class Maths Chapter Wise Important Questions and Answers in English Medium and Telugu Medium are part of AP Board 9th Class Textbook Solutions.

Students can also read AP Board 9th Class Maths Solutions for exam preparation.

AP State Board 9th Class Maths Important Questions and Answers

AP Board 9th Class Telugu Important Questions Chapter 3 శివతాండవం

AP State Syllabus AP Board 9th Class Telugu Important Questions Chapter 3 శివతాండవం.

AP State Syllabus 9th Class Telugu Important Questions 3rd Lesson శివతాండవం

9th Class Telugu 3rd Lesson శివతాండవం Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

క్రింది అపరిచిత పద్యాలను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. భాష రాదు, వట్టిపాలు మాత్రమె త్రాగు
నిద్రవోవు, లేచి నిలువ లేడు
ఎవరెఱుంగరితనిదే దేశమో కాని,
మొన్న, మొన్న నిలకు మొలచినాఁడు.
ప్రశ్నలు:
1. ఈ పద్యం ఎవరి గురించి ప్రస్తావిస్తోంది (చెబుతోంది)?
2. ఇతనికి ఏమేమి రావు?
3. ‘మొలచినాడు’ అంటే అర్థం?
4. ఎవరూ ఎఱుగనది ఏది?
జవాబులు :
1. పసిబాలుడు (శిశువు)
2. భాష రాదు, లేచి నిలబడటం రాదు.
3. పుట్టినవాడు
4. ఇతని దేశం (ఎక్కడివాడో)

AP Board 9th Class Telugu Important Questions Chapter 3 శివతాండవం

2. పట్టమేలే రాజు పోయెను
మట్టి కలిసెను కోటపేటలు
పదం పద్యం పట్టి నిలిచెను
కీర్తులపకీర్తుల్
ప్రశ్నలు:
1. నేలలో కలిసినవేవి?
2. లోకంలో నిలిచేవేవి?
3. ‘రాజు ‘ వికృతి?
4. ‘పద్దెము’ ప్రకృతి?
జవాబులు:
1. కోటపేటలు
2. కీర్తి – అపకీర్తి
3. జేడు
4. పద్యము

3. ఈ కింది అపరిచిత గద్యాన్ని చదివి ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (S.A. II – 2018-19)
మానవ మనుగడకు నీరు ప్రాణాధారం. నీరు అనేక విధాలుగా లభ్యం అవుతుంది. ముఖ్యంగా నదుల నుండి లభించే నీరు మానవకోటి బ్రతకడానికే కాదు పాడిపంటలు సమృద్ధిగా పండటానికి దోహదం చేస్తుంది. నదుల వల్ల దేశంలోని పంటపొలాలు సస్యశ్యామలమై విరాజిల్లుతున్నాయి. నదుల వల్ల డెల్టాలు ఏర్పడుతున్నాయి. నదులు సారవంతమైన ఒండ్రు మట్టిని తమతో కొట్టుకొని తెచ్చి మేట వేస్తాయి. ఈ విధంగా పుట్టినవే కృష్ణా, గోదావరి డెల్టాలు, నదుల వల్ల పంటలు పండడమే కాదు పారిశ్రామికాభివృద్ధి కూడా జరుగుతుంది.
ప్రశ్నలు:
1. నదుల వలన ఏర్పడిన డెల్టాలు ఏవి?
2. మానవ మనుగడకు ప్రాణాధారమేమి?
3. నదుల వలన మానవులకు కలిగే ఒక ప్రయోజనం రాయండి.
4. పై గద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచెయ్యండి.
జవాబులు:
1. కృష్ణా, గోదావరి డెల్టాలు
2. నీరు
3. మానవులు బ్రతకడానికి / పాడిపంటలు సమృద్ధిగా పండటానికి
4. నదులు సారవంతమైన ఒండ్రుమట్టిని మేట వేయడాన్ని ఏమంటారు?

II. స్వీయరచన

1. క్రింది ప్రశ్నకు నాలుగైదు వాక్యాలలో సమాధానం రాయండి.

ప్రశ్న 1.
‘శివతాండవం’ ప్రక్రియను గూర్చి రాయండి.
జవాబు:
పుట్టపర్తి నారాయణాచార్యులు రచించిన శివతాండవం ‘గేయ కవిత’ ప్రక్రియకు చెందినది. గేయం అంటే పాట. గేయకవిత పాడుకోవడానికి అనువైనది. పద్యాలలో లాగే దీనిలోనూ మాత్రాఛందస్సు ఉంటుంది. లయాత్మకంగా ఉండి అంత్యప్రాసలూ, యతులూ కూడా ఉండవచ్చు.

ప్రశ్న 2.
సంగీత సాహిత్య సమ్మిళితమైన శివతాండవాన్ని ఆవిష్కరించిన కవిని గూర్చి రాయండి. (S.A. I – 2018-19)
సత్వరజస్తమో గుణాలనావిష్కరిస్తూ శివతాండవాన్ని వర్ణించిన కవి పరిచయం చేయండి. (S.A. II – 2018-19)
జవాబు:
పుట్టపర్తి నారాయణాచార్యులు (1914 – 1990) స్వస్థలం అనంతపురం జిల్లా చియ్యేడు గ్రామం. 14 భాషల్లో ప్రవీణులు. 8 భాషల్లో కవిత్వం చెప్పగల దిట్ట. సంగీత, నాట్య శాస్త్రాల్లో సంపూర్ణ పాండిత్యం కలవారు. “సరస్వతీ పుత్ర” వీరి బిరుదు. శివతాండవం, మేఘదూతం, షాజీ, కావ్యమాల, జనప్రియ రామాయణం, పండరీ భాగవతం, సాక్షాత్కారం మొదలైన రచనలు చేశారు. ‘లీవ్స్ ఇన్ ద విండ్’ అనే ఆంగ్ల కావ్యం కూడా వీరి రచనే. వీరు రాసిన శివతాండవం సంగీత సాహిత్య నాట్య సంకేతాల సమ్మేళనం. పుట్టపర్తి రచనల్లో దేశభక్తి, సాంస్కృతిక విలువలు, జాతీయభావాలు, మానవీయ విలువలు తొణికిసలాడతాయి.

వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) క్రింది ప్రశ్నకు సమాధానము రాయండి.

ప్రశ్న 1.
మీ ఊరిలో జరిగే నాట్య ప్రదర్శనకు అందరికీ ఆహ్వానం పలుకుతూ ఒక ‘కరపత్రాన్ని రాయండి.
జవాబు:
నాట్య ప్రదర్శన కంచిభొట్ల సాహితీ సమితివారి ఆధ్వర్యంలో నాట్యమయూరి స్రవంతి గారిచే నాట్య ప్రదర్శన. ది. x x x x x న సా|| 7 గం||లకు మన గ్రామంలోని త్రివిక్రమ స్వామి వారి దేవస్థాన ప్రాంగణమున ప్రదర్శన జరుగును. హైదరాబాద్, బెంగళూరు, గుంటూరు, మద్రాస్, విశాఖపట్టణం, విజయవాడ, తెనాలి మున్నగు ప్రాంతాలలో ఎన్నో ప్రదర్శనలిచ్చి, ఘనమైన సన్మానాలు, బంగారు కంకణాలు బహుమతులు పొందిన కుమారి స్రవంతి మన గ్రామంలో ప్రదర్శన ఇవ్వడానికి వస్తున్నది. ప్రజలంతా తప్పక విచ్చేసి, నాట్యమయూరి కుమారి స్రవంతి గారి నాట్య ప్రదర్శన చూసి, ఆశీర్వదించవలసినదిగా కోరుతున్నాం. కుమారి స్రవంతికి నాట్యాన్ని నేర్పిన శ్రీమతి శశిశ్రీగారి దివ్య సముఖంలో ఈ ప్రదర్శన జరగడం విశేషం. ఈ ప్రదర్శనకు వాద్య సహకారం హార్మోనియం : శ్రీ జస్వంత్ సమీర్, డోలక్ : శ్రీ సాయిశ్రీ ప్రసాద్, ఆర్గనైజర్ : శ్రీ సాయి భరద్వాజ్. ప్రతి ఒక్కరికీ పేరు పేరున ఇదే మా ఆహ్వానం. తప్పక విచ్చేయండి.

ఇట్లు,
కంచిభొట్ల సాహితీ సమితి సభ్యులు,
చెరుకూరు.

AP Board 9th Class Telugu Important Questions Chapter 3 శివతాండవం

ప్రశ్న 2.
మీరు చూసిన నృత్య ప్రదర్శన గూర్చి మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

బాపట్ల,
x x x x

ప్రియమిత్రుడు నాగలక్ష్మణు
ఉభయ కుశలోపరి. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్య విషయం – ఇటీవల మా ఊరిలో కుమారి గౌరి నృత్య ప్రదర్శన జరిగింది. చాలా బాగుంది. సహజమైన అభినయంతో అందరి ప్రశంసలు పొందింది. శాస్త్రీయ నృత్యంతో పాటు, సినిమాల్లోని భక్తి పాటలు కొన్నింటికి కూడా నృత్యం చేసింది. జనం కూడా బాగా ఆనందించారు. అభినందించారు. మా తల్లిదండ్రులతో కలిసి నేనూ ఆ ప్రదర్శన చూసాను. నీవు ఏదైన నాట్య ప్రదర్శన చూసి ఉంటే ఉత్తరం రాయి.

ఇట్లు,
నీ మిత్రుడు,
కె. ఫణిరామ్.

చిరునామా:
యస్. నాగలక్ష్మణ్,
9వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూల్,
ఒంగోలు, ప్రకాశం జిల్లా.

ప్రశ్న 3.
‘శివతాండవం’ పాఠంలో ప్రకృతి వర్ణనను చూశారు కదా ! ఏదేని ప్రకృతి అంశం (పూలు, పండ్లు, పక్షులు ……. మీతో మాట్లాడుతున్నట్లు సంభాషణ రూపంలో రాయండి.
జవాబు:
పుష్పవిలాపం
బాలుడు : (పూలు కోస్తూ) ఆహా ! ఈ పూలు ఎంత అందంగా ఉన్నాయో.

పూవు : ఓ అబ్బాయీ ! నన్నెందుకు హింసిస్తున్నావు?

బాలుడు : అయ్యో ! లేదు లేదు. నా కోసం నిన్ను కోయడం లేదు. అర్చనకై నిన్ను ఉపయోగిస్తున్నాను.

పూవు : తోటి ప్రాణులను హింసించకూడదన్న సంగతి తెలిసి కూడా ఎందుకు నీ పూజలు?

బాలుడు : నిజమే. కానీ ! ………..

పూవు : నీవు గమనించావో లేదో. చెట్టుతల్లి ఒడిలో హాయిగా ఆడుకునే మమ్మల్ని త్రుంచి, ఎందుకు తల్లీ బిడ్డలను వేరు చేస్తారు మీ దయలేని మనుష్యులు?

బాలుడు : అయ్యో పాపం ! నిజమే.

పూవు : పేరుకు మాత్రమే మానవత్వం కల్గిన మానవులు మీరు. బుద్ధుని మీ ప్రతినిధిగా చెపుతారు. రాక్షసంగా ప్రవర్తిస్తారు.

బాలుడు : లేదు. లేదు. మేం మనుష్యులమే.

పూవు : హాయిగా తల్లి ఒడిలో ఆడుకుని, ఆమె పాదాల చెంతనే రాలిపోయే మమ్మల్ని, మీ గొప్పలకోసం మెడలో వేసుకుంటారు. కాళ్ళకింద నలిపేస్తారు. అలా చేయడం మాకు ఇష్టం లేదు.

బాలుడు : అవును. అది తప్పే.

పూవు : మరి ఈ సంగతి విను. దారాలతో మెడలకు ఉరి బిగించేవారు, సూదులతో మా గుండెలలో గ్రుచ్చేవారు ఇలా మా ప్రాణాలు తీసే మీ జాతి మానవత్వం లేని జాతి. ఛీ, ఛీ. అయ్యో తెల్లవారిందే.

బాలుడు : కాదు, కాదు, మాకూ మానవత్వం ఉంది, ఉంది. (ఏమిట్రా కలవరిస్తున్నావ్ – తెల్లవారింది లే అన్న అమ్మ పిలుపుతో మెలకువ వచ్చి) ఇదంతా కలా. ఇంకెప్పుడూ పూలు కోయను.

III. భాషాంతాలు (పదజాలం, వ్యాకరణం)

1. పర్యాయపదాలు :

బూది : విభూతి, విబూది, భస్మం
హిమగిరి : చలికొండ, మంచుకొండ
అల : కెరటం, తరంగం
దిక్కు : దిశ, దెస
శివుడు : శంకరుడు, భవుడు, ఈశ్వరుడు
గజ్జె : గజ్జియ, కింకిణి, చిరుగంట
మబ్బు : మేఘం, జీమూతం, మొయిలు
తుమ్మెద : భ్రమరం, ద్విరేఫం, భృంగము
తెలుపు : శుక్లం, శ్వేతం, ధవళం
నలుపు : శ్యామం, నల్ల, కటి, కృష్ణం
ఎఱుపు : రోహితం, లోహితం, తొగరు
తాండవం : నృత్యం, నాట్యం గజ్జియ, కింకిణి, చిరుగంట
నెమలి : మయూరం, కేకి, నెమ్మి, నీలకంఠం, శిఖి

AP Board 9th Class Telugu Important Questions Chapter 3 శివతాండవం

2. వ్యుత్పత్త్యర్థాలు:

సుకృతం : లెస్సగా చేయబడినది (పుణ్యం, ధర్మం)
శివుడు : సాధుల హృదయమున శయనించువాడు, మంగళప్రదుడు (ఈశ్వరుడు)
అమృతం : మరణమును పొందింపనిది (సుధ)
ఘనసారం : శీతల మగుటచే ఘనము వంటి సారము కలది (కప్పురం)

3. నానార్థాలు :

అమృతం = సుధ, నేయి, పాలు,నీరు
విభూతి = భస్మం, సంపద, ఒక వృత్తం
తమము = చీకటి, దుఃఖం, తమోగుణం
రక్తం = నెత్తురు, ఎఱుపు, కుంకుమ
కమ్మ = పత్రిక, చెవి ఆభరణం, కులవిశేషం, ఒక రుచి, ప్రియమైనది

4. ప్రకృతి – వికృతులు :

కస్తూరి – కస్తురి
దిశ – దెస, దిక్కు
చిత్రము – చిత్తరువు
భాగ్యం – బాగెం
తామరస – తామర, తమ్మి
చిహ్నము – చిన్నె
శాస్త్రం – చట్టం
పుష్పం – పూవు

5. సంధులు :

నీలము + కండ్ల – నీలపు గండ్ల – పుంప్వాదేశ సంధి
అబ్బురము + నీలము – అబ్బురపు నీలము – పుంప్వాదేశ సంధి

6. సమాసాలు:

మబ్బుగములు – మేఘాల యొక్క సమూహాలు – షష్ఠీ తత్పురుష సమాసం
సుకృత రూపము – మంగళప్రదమైన రూపము – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

7. అలంకారాలు :

ఉపమాలంకారం : ఉపమాన ఉపమేయములకు మనోహరమైన పోలిక చెప్పుట ఉపమాలంకారం. దీనిలో
ఉపమానం : పోలిక వస్తువు
ఉపమేయం : ఉన్న వస్తువు
ఉపమావాచకం : వలె, పోలె, లాగ
సమాన ధర్మం : రెండు వస్తువులోని ధర్మం
అనే నాలుగు (కొన్నిట్లో ఉపమావాచకం ఉండదు) అంశాలు ఉంటాయి.
ఉదా :
కర్పూరం వెన్నెల వలె చల్లదనాన్ని కలిగిస్తుంది.
ఇక్కడ ఉపమేయం : కర్పూరం
ఉపమానం : వెన్నెల
ఉపమావాచకం : వలె
సమాన ధర్మం : చల్లదనం

9th Class Telugu 3rd Lesson శివతాండవం 1 Mark Bits

1. ఉపమాలంకారం లక్షణం గుర్తించండి. (S.A. I – 2018-19)
ఎ) ఉపమేయమునందు ఉపమాన ధర్మం ఆరోపించడం
బి) ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పుట.
సి) ఉపమేయ ఉపమానములకు మనోహరమైన సాదృశ్యం చెప్పడం
డి) ఉపమాన ఉపమేయాలకు భేదం చెప్పుట
జవాబు:
సి) ఉపమేయ ఉపమానములకు మనోహరమైన సాదృశ్యం చెప్పడం

2. వెన్నెల విరగకాస్తే హాయిగా ఉంటుంది – (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి) – (S.A. II – 2017-18)
ఎ) కౌముది – కైరవం
బి) కౌముది – చంద్రుడు
సి) చంద్రిక – కౌముది
డి) కౌముది – కౌమారం
జవాబు:
సి) చంద్రిక – కౌముది

AP Board 9th Class Telugu Important Questions Chapter 3 శివతాండవం

3. పాఠశాలకు వెళ్ళునపుడు పుస్తకాలు మరువరాదు (సంధి పేరు గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) ఉత్వసంధి
బి) సవర్ణదీర్ఘ సంధి
సి) లు,ల,న,ల సంధి
డి) లుత్వసంధి
జవాబు:
సి) లు,ల,న,ల సంధి

4. గరుడుడు అమృతమును తీసుకొచ్చి మాతృదాస్యాన్ని తొలగించారు. (పర్యాయపదాలు గుర్తించండి.) (S.A. III – 2016-17)
ఎ) క్షుధ, సుధ
బి) సుధ, పీయూషం
సి) సుధ, వ్యధ
డి) సుధ, ధరా
జవాబు:
బి) సుధ, పీయూషం

5. ‘కర్మధారయంబులందు ఉత్తునకచ్చు పరంబగునప్పుడు టుగాగమంబగు’ అనే సంధి సూత్రానికి ఉదాహరణను గుర్తించండి. (S.A. III – 2016-17)
ఎ) ఉద్భటుడు
బి) వాగ్భటుడు
సి) చిట్టెలుక
డి) తూగుటుయ్యాల
జవాబు:
డి) తూగుటుయ్యాల

6. చిరుగాలి పొరలు లేచినయట్లు శివుని నాట్యం ఆహ్లాదకరంగా ఉంది. (పై వాక్యంలోని అలంకారాన్ని గుర్తించండి.) (S.A. III – 2016-17)
ఎ) అర్థాంతరన్యాస
బి) ఉపమాలంకారం
సి) స్వభావోక్తి
డి) శ్లేష
జవాబు:
బి) ఉపమాలంకారం

భాషాంశాలు (పదజాలం, వ్యాకరణం)

1. అర్థాలు :

7. చలికొండపై శివపార్వతులు కొలువు చేసారు – గీత గీసిన పదానికి అర్థమేమిటి?
A) వింధ్య
B) హిమాలయం
C) ఆరావళి
D) సాత్పురా
జవాబు:
B) హిమాలయం

8. ముఖముపై హాసపు రేఖ ఉండాలి – గీత గీసిన పదానికి అర్థమేమిటి?
A) అందం
B) హాయి
C) నవ్వు
D) విచారం
జవాబు:
C) నవ్వు

9. బంగారానికి తావి అబ్బినట్లు – గీత గీసిన పదానికి అర్థమేమిటి?
A) వజ్రం
B) మణి
C) ఇత్తడి
D) సువాసన
జవాబు:
D) సువాసన

10. పౌర్ణమినాడు సముద్రంలో తరగలు ఎక్కువైతాయి – గీత గీసిన పదానికి అర్థమేమిటి?
A) అలలు
B) చేపలు
C) పర్యాటకులు
D) సందర్శకులు
జవాబు:
A) అలలు

11. ‘ఘనసారమును దెచ్చి కలయ జల్లు విధాన’ – గీత గీసిన పదానికి అర్థం ఏమిటి?
A) ఉప్పు
B) కర్పూరం
C) మంచు
D) ఆకు
జవాబు:
B) కర్పూరం

AP Board 9th Class Telugu Important Questions Chapter 3 శివతాండవం

12. ‘తమ్ములై, ఘటిత మోదమ్ములై’ – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) తమ్ముళ్ళు
B) సోదరులు
C) పద్మములు – పద్మములు
D) పూలు
జవాబు:
C) పద్మములు – పద్మములు

13. వసంత ఋతువులో వృక్షాలు నవకోరకములతో శోభాయమానంగా ఉంటాయి – గీత గీసిన పదానికి అర్థం ఏది?
A) చిగురు
B) పుష్పము
C) మొగ్గ
D) పండు
జవాబు:
C) మొగ్గ

14. శివుని నేత్రములు రక్త కిసలములవలె ఉన్నాయి – గీత గీసిన పదానికి అర్థము ఏది?
A) చిగురుటాకు
B) మొగ్గు
C) పుష్పము
D) పద్మము
జవాబు:
A) చిగురుటాకు

2. పర్యాయపదాలు :

15. శివుడు భస్మధారుడు – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
A) విబూది, దూది
B) విభూతి, బూతి
C) బూడిద, గుమ్మడి
D) ఏదీకాదు
జవాబు:
B) విభూతి, బూతి

16. మా చెల్లి గజ్జె కట్టి ఆడితే ఎంతో బాగుంటుంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) కింకిణి, చిరుగంట
B) కింకిణి, తాళం
C) గజ్జయ, గొలుసు
D) ఏదీకాదు
జవాబు:
A) కింకిణి, చిరుగంట

17. మంగళప్రదుడు శివుడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) భవుడు, దేవుడు
B) ఈశ్వరుడు, దేవా
C) శంకరుడు, భవుడు
D) రుద్రుడు, రుద్రాణి
జవాబు:
C) శంకరుడు, భవుడు

18. పూల మకరందాలకై తుమ్మెదలు దండెత్తాయి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) భ్రమరం, భ్రమ
B) ద్విరేఫం, ఏకం
C) భృంగం, భంగం
D) భ్రమరం, భృంగం
జవాబు:
D) భ్రమరం, భృంగం

19. విబూది ధరించిన శివుడు శుక్లపక్షం చంద్రునివలె ఉన్నాడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) తెలుపు, చెప్పు
B) శ్వేతం, సౌధం
C) ధవళం, శ్వేతం
D) తెలుపు, తలుపు
జవాబు:
C) ధవళం, శ్వేతం

AP Board 9th Class Telugu Important Questions Chapter 3 శివతాండవం

20. తాండవ కృష్ణ తారంగం – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) నాట్యం, నాటకం
B) నృత్యం, నాట్యం
C) నృత్యం, సంగీతం
D) నడక, పాట
జవాబు:
B) నృత్యం, నాట్యం

21. నెమలి పురివిప్పి నాట్యమాడుతుంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) కేకి, కాకి
B) నెమ్మి, నిమ్మ
C) శిఖి, శాఖి
D) మయూరం, నీలకంఠం
జవాబు:
D) మయూరం, నీలకంఠం

22. రక్తపు రంగు ఎఱుపు – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
A) రోహితం, తొగరు
B) లోహితం, లోహం
C) సూర్యుడు, పగలు
D) ఏదీకాదు
జవాబు:
A) రోహితం, తొగరు

23. ఆహా ! ఏమి తావి. బహుశా పరిమళం గులాబీది కాబోలు-గీత గీసిన పదానికి పర్యాయపదం గుర్తించండి. (S.A. II – 2018-19)
A) సౌరభం
B) ఆమని
C) మధువు
D) పాలు
జవాబు:
A) సౌరభం

24. ‘సూర్యుడు అస్తమించగానే అంధకారం అలుముకుంది. ఆ చీకటి భయం కలిగిస్తుంది – గీత గీసిన పదానికి పర్యాయపదం గుర్తించండి.
A) తమస్సు
B) రజస్సు
C) ప్రభాతము
D) సంధ్య
జవాబు:
A) తమస్సు

25. సముద్రంలో తరగలు విపరీతంగా వస్తున్నాయి – గీత గీసిన పదానికి పర్యాయపదాలను గుర్తించండి.
A) కెరటములు, అలలు
B) నురుగు, హోరు
C) తరంగాలు, నాచు
D) కెరటాలు, ముత్యపు చిప్పలు
జవాబు:
A) కెరటములు, అలలు

26. చిరుగాలిలో తమ్మి విరులు కదిలాయి – గీత గీసిన పదానికి గల పర్యాయపదాలు ఏవి?
A) పద్మములు, కలువలు
B) మల్లెలు, మొల్లలు
C) పూలు, కుసుమములు
D) సుమములు, కిసలయములు
జవాబు:
C) పూలు, కుసుమములు

3. వ్యుత్పత్యర్థాలు :

27. మరణం పొందింపనిది – వ్యుత్పత్తి పదం ఏది?
A) పాలు
B) నీరు
C) అమృతం
D) నెయ్యి
జవాబు:
C) అమృతం

28. శీతల మగుటచే ఘనము వంటి సారం కలది – వ్యుత్పత్తి పదం గుర్తించండి.
A) కర్పూరం
B) ఘన పదార్థం
C) ఘనసారం
D) ఉప్పు
జవాబు:
B) ఘన పదార్థం

29. సాధుల హృదయాన శయనించువాడు – వ్యుత్పత్తి పదం గుర్తించండి.
A) ఋషి
B) మౌని
C) విష్ణువుడు
D) శివుడు
జవాబు:
D) శివుడు

30. ‘సుకృతం’ – వ్యుత్పత్తి గుర్తించండి.
A) లెస్సగా చేయబడింది
B) బాగా చేశారు
C) బాగా చేశావు
D) లెస్సగా తయారు చేసింది
జవాబు:
A) లెస్సగా చేయబడింది

AP Board 9th Class Telugu Important Questions Chapter 3 శివతాండవం

31. ‘మరణము లేనిది’ – అనే వ్యుత్పత్తి గల పదాన్ని గుర్తించండి.
A) అమరణం
B) అమృతము
C) సంజీవని
D) అమృత్యువు
జవాబు:
B) అమృతము

4. నానార్థాలు :

32. అమృతం పంచేవారు అమ్మానాన్నలు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) సుధ, సాధు
B) నేయి, వెయ్యి
C) పాలు, నీరు
D) నీరు, మీరు
జవాబు:
C) పాలు, నీరు

5. ప్రకృతి – వికృతులు :

33. ‘ఈ తమం‘ కన్నులుండీ గుడ్డిని చేస్తున్నది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) చీకటి, వెలుగు
B) దు:ఖం, చీకటి
C) దుఃఖం, సంతోషం
D) తమోగుణం, రజోగుణం
జవాబు:
B) దు:ఖం, చీకటి

34. కృష్ణుడు గీతలో విభూతి యోగం గూర్చి చెప్పాడు- గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) భస్మం, బూది
B) సంపద, ధనం
C) ఒక వృత్తం, కందం
D) భస్మం, ఐశ్వర్యం
జవాబు:
D) భస్మం, ఐశ్వర్యం

35. స్వాతంత్ర్యం కోసం ఎందరో భారతీయులు తమ రక్తం చిందించారు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) ఎఱుపు, కుంకుమ
B) నెత్తురు, రక్తం
C) కుంకుమ, పసుపు
D) ఎఱుపు, పచ్చ
జవాబు:
A) ఎఱుపు, కుంకుమ

36. చెవి కమ్మలు పెట్టుకొని తిరుగుతున్న నా చెల్లి ఎంతో బాగుంది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) పత్రిక, పుత్రిక
B) రుచి, వాసన
C) చెవి ఆభరణం, కుల విశేషం
D) ప్రియం, అప్రియం
జవాబు:
C) చెవి ఆభరణం, కుల విశేషం

37. కస్తూరి యట చూడ కాంతి నల్లగనుండు – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
A) కసూరి
B) కస్తురి
C) కస్తి
D) కసిరి
జవాబు:
B) కస్తురి

38. కొలనులోని తామరలు అందంగా ఉన్నాయి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది ?
A) తమ్మి
B) కలువ
C) తామరస
D) పద్మం
జవాబు:
C) తామరస

39. ఆ చిన్నది వన్నె చిన్నెలు ఒలకబోస్తున్నది – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
A) చిహ్నం
B) అందం
C) సిగ్గు
D) ఒయ్యారం
జవాబు:
A) చిహ్నం

40. పురివిప్పి నాట్యమాడే నెమలిని చూసి నేను ‘చిత్రం‘ వలె నిల్చున్నాను – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది ?
A) చితరం
B) చిత్ర
C) బొమ్మ
D) చిత్తరువు
జవాబు:
D) చిత్తరువు

41. శాస్త్రము తెలిసినవాడు పండితుడు – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
A) శాసతరం
B) చట్టం
C) శాసనం
D) బుద్ధి
జవాబు:
B) చట్టం

AP Board 9th Class Telugu Important Questions Chapter 3 శివతాండవం

42. సంక్రాంతి పండుగ భోగభాగ్యాలు ఇంట కురిపిస్తుంది – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
A) భాగం
B) బాగం
C) బాగెం
D) సంపద
జవాబు:
C) బాగెం

43. పూలు తమను కోయవద్దని కోరాయి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
A) పువ్వు
B) విరి
C) సుమం
D) పుష్పం
జవాబు:
D) పుష్పం

44. ‘అపూర్వం’ పదానికి వికృతిని గుర్తించండి.
A) పూర్వం
B) అప్పురము
C) అపురూపము
D) అబ్రము
జవాబు:
C) అపురూపము

45. ముత్యము – దీని ప్రకృతి పదాన్ని గుర్తించండి.
A) ముత్తియము
B) ముత్తెం
C) మౌక్తికం
D) ముత్తెము
జవాబు:
C) మౌక్తికం

6. సంధులు :

46. ‘నీలపుగండ్ల’ – పదాన్ని విడదీయండి.
A) నీలము + గండ్ల
B) నీలం + కండ్ల
C) నీలము + కండ్ల
D) నీలపు + కండ్ల
జవాబు:
C) నీలము + కండ్ల

47. ‘అబ్బురపు నీలము’ – సంధి పేరేమిటి?
A) పడ్వాది సంధి
B) పుంప్వాదేశ సంధి
C) ఆమ్రేడిత సంధి
D) టుగాగమ సంధి
జవాబు:
B) పుంప్వాదేశ సంధి

48. ఉత్వసంధికి ఉదాహరణ రాయండి.
A) జారినయట్లు
B) కదిలినట్లు
C) తేనెటీగ
D) దిక్కులెల్ల
జవాబు:
D) దిక్కులెల్ల

49. కన్ + కొనల – పదాన్ని కలపండి.
A) కన్కొనల
B) కల్గొనల
C) కనుగొనల
D) కనగొనల
జవాబు:
B) కల్గొనల

50. ‘వగలు + పోయిన’ – సంధి పేరేమిటి?
A) గసడదవాదేశ సంధి
B) అత్వసంధి
C) ఉత్వసంధి
D) యడాగమసంధి
జవాబు:
A) గసడదవాదేశ సంధి

AP Board 9th Class Telugu Important Questions Chapter 3 శివతాండవం

51. ‘పల్లె + ఊరు’ – సంధి పేరేమిటి?
A) టుగాగమ సంధి
B) ద్విరుక్తటకారాదేశ సంధి
C) అత్వసంధి
D) ఉత్వసంధి
జవాబు:
A) టుగాగమ సంధి

52. ‘దేశాల’ విడదీయండి.
A) దేశ + అల
B) దేశ + ఆల
C) దేశము + ల
D) దేశా + ల
జవాబు:
C) దేశము + ల

53. ‘చుట్టాలు’ – సంధి పేరేమిటి?
A) అత్త్వసంధి
B) లు,ల,నల సంధి
C) ఉత్వసంధి
D) ఇత్వసంధి
జవాబు:
B) లు,ల,నల సంధి

54. ‘అబ్బురపు నీలము’ – సంధి విడదీయండి.
A) అబ్బురపు + నీలము
B) అబ్బు + రపు నీలము
C) అబ్బురము + నీలము
D) అబ్బుర + నీలము
జవాబు:
C) అబ్బురము + నీలము

55. ‘నిలువుటద్దం’లో గల సంధి
A) టుగాగమ సంధి
B) ఆమ్రేడిత సంధి
C) లులన సంధి
D) ద్విరుక్తటకారాదేశ సంధి
జవాబు:
A) టుగాగమ సంధి

56. ‘కఱకుటమ్ము’ విడదీసి సంధి పేర్కొనండి.
A) కఱకుట + అమ్ము (అత్వ సంధి)
B) కఱకు + అమ్ము (టుగాగమ సంధి)
C) కఱకు + టమ్ము (ఉత్వ సంధి)
D) కఱకుట్ + అమ్ము (హల్సంధి)
జవాబు:
B) కఱకు + అమ్ము (టుగాగమ సంధి)

57. భారతదేశ రాష్ట్రాలలో అల్లర్లు జరుగుతున్నాయి – గీత గీసిన పదంలో గల సంధి ఏది?
A) అత్వసంధి
B) లులనల సంధి
C) ఆమ్రేడిత సంధి
D) టుగాగమ సంధి
జవాబు:
B) లులనల సంధి

7. సమాసాలు :

58. ‘మేఘాల యొక్క సమూహం’ సమాస పదంగా మార్చండి.
A) మేఘాల వరుస
B) మబ్బుగములు
C) మబ్బు వరుస
D) మెయిలు పంక్తి
జవాబు:
B) మబ్బుగములు

59. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణ రాయండి.
A) గంగానది
B) శివతాండవం
C) సుకృత రూపం
D) జడధారి
జవాబు:
C) సుకృత రూపం

60. ‘తిరుపతి అనే పేరుగల పట్టణము’ సమాసపదంగా కూర్చండి.
A) తిరుపతి పట్టణము
B) తిరుపతి నగరం
C) తిరుపతి క్షేత్రము
D) తిరుపతి
జవాబు:
A) తిరుపతి పట్టణము

61. ‘తమ్మివిరులు’ అనేది ఏ సమాసమో గుర్తించండి.
A) ద్వంద్వ
B) బహువ్రీహి
C) సంభావనా పూర్వపద కర్మధారయం
D) ద్విగు
జవాబు:
C) సంభావనా పూర్వపద కర్మధారయం

8. అలంకారాలు :

62. ‘కర్పూరం వెన్నెల వలె చల్లదనాన్ని కలిగిస్తుంది’ – ఈ వాక్యంలో గల అలంకారం
A) ఉపమా
B) రూపకం
C) ఉపేక్ష
D) అతిశయోక్తి
జవాబు:
A) ఉపమా

AP Board 9th Class Telugu Important Questions Chapter 3 శివతాండవం

63. ‘తరితీపు వెన్నెలలు విరిసికొన్న విధాన కళ్ళల్లో కాంతులు మెరిసేలా శివుడు నాట్యమాడాడు.
A) ఉపమ
B) రూపకము
C) ఉత్ప్రేక్ష
D) శ్లేష
జవాబు:
A) ఉపమ

64. ‘భ,ర,న,భ,భ,ర,వ’ గణాలు ఏ వృత్తానికి చెందినవి?
A) ఉత్పలమాల
B) చంపకమాల
C) మత్తేభము
D) శార్దూలము
జవాబు:
A) ఉత్పలమాల

65. ‘పింఛము’ – ఇది ఏ గణమో గుర్తించండి.
A) భ గణము
B) త గణము
C) ర గణము
D) న గణము
జవాబు:
A) భ గణము

66. ‘భాగవతమున భక్తి, భారతమ్మున యుక్తి, రామకథయే రక్తి’ – ఈ గేయ పంక్తుల్లో గల అలంకారాన్ని గుర్తించండి.
A) స్వభావోక్తి
B) అంత్యానుప్రాస
C) వృత్త్యనుప్రాస
D) యమకము
జవాబు:
B) అంత్యానుప్రాస

9. ఆధునిక వచనాన్ని గుర్తించడం :

67. నల్ల కలువలు దిక్కులెల్ల విచ్చు విధాన – ఈ వాక్యాన్ని ఆధునిక వచనంలోకి మార్చండి.
A) నల్ల కలువలు దిక్కులంతా విచ్చుకున్నాయి.
B) నల్ల కలువలు దిక్కులంతటా విప్పారాయి.
C) నల్ల కలువలు దిక్కులంతా విచ్చుకున్నట్లుగా.
D) నల్ల కలువలు అన్ని దిక్కులా వ్యాపించాయి.
జవాబు:
C) నల్ల కలువలు దిక్కులంతా విచ్చుకున్నట్లుగా.

68. చిగురుటాకులు గాలి వగలు వోయిన యట్లు – ఈ వాక్యాన్ని ఆధునిక వచనంలోకి మార్చండి.
A) చిగురాకులు గాలికి వయ్యారాలు పోయాయి.
B) చిగురాకులు గాలికి ఒయ్యారాలు పోయినట్లు.
C) లేతాకులు గాలికి ఒయ్యారాలు పోతున్నట్లు.
D) లేతాకులు గాలివల్ల వయ్యారాలు పోయాయి.
జవాబు:
B) చిగురాకులు గాలికి ఒయ్యారాలు పోయినట్లు.

10. వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించడం :

69. శివుడు పాడుతున్నాడు – వ్యతిరేక వాక్యం రాయండి.
A) శివుడు ఆడుతున్నాడు
B) శివుడు పాడుతూ ఉన్నాడు
C) పాడడు
D) శివుడు పాడటం లేదు
జవాబు:
D) శివుడు పాడటం లేదు

AP Board 9th Class Telugu Important Questions Chapter 3 శివతాండవం

70. శివతాండవంలో ప్రకృతి ప్రతిబింబించింది – వ్యతిరేక వాక్యం రాయండి.
A) శివతాండవంలో వికృతి ప్రతిబింబించింది
B) శివతాండవంలో ప్రకృతి ప్రతిబింబించలేదు
C) శివతాండవంలో ప్రకృతి లేదు
D) శివతాండవంలో వికృతి ఉంది
జవాబు:
B) శివతాండవంలో ప్రకృతి ప్రతిబింబించలేదు

11. వాక్యరకాలను గుర్తించడం :

71. శివుడు ఆడుతున్నాడు మఱియు పాడుతున్నాడు – ఇది ఏ రకమైన వాక్యం?
A) సంక్లిష్ట
B) సామాన్య
C) సంయుక్త
D) మహాకావ్యం సూక్తి – సౌందర్యం, సత్యం – వీటి రసవత్సమ్మేళనమే కళ – ఠాగూర్
జవాబు:
C) సంయుక్త

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

AP State Syllabus AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష.

AP State Syllabus 9th Class Telugu Important Questions 2nd Lesson స్వభాష

9th Class Telugu 2nd Lesson స్వభాష Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

క్రింది పరిచిత గద్యాలను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రశ్న 1.
పరభాషాపదములకర్థము తెలిసినంత మాత్రమున బరభాషా పాండిత్యము లభించినదని భ్రమపడకుడు. భాషలోని కళను బ్రాణమును తత్త్వము నాత్మను గనిపట్టవలయును. అది మీకసాధ్యము. తుదకిన్ని యీనాముల నమ్మి యమ్మ మెడలోని పుపూసలమ్మి – వంట యింటి పాత్రల నమ్మి – దైన్య పడి – వారములు చేసికొని – ముష్టియెత్తి సంపాదించిన – యాంగ్లేయభాషలోని పాండిత్యపుఁబస యీ రంగులోనికి దిగినది. ఈ విధముగా బ్రద్దలైనది.
ప్రశ్నలు:
1. భాషలోని వేనిని తెలుసుకోవాలి?
2. ‘ఈనాములు’ అనగానేమి?
3. ‘పాండిత్యపుఁబస’ విడదీయుము.
4. ‘అసాధ్యము’ విగ్రహవాక్యము రాయుము.
జవాబులు:
1. కళ, ప్రాణం, తత్త్వం , ఆత్మ
3. పాండిత్యము + పస
2. బహుమతిగా ఇచ్చిన భూమి
4. సాధ్యము కానిది

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

ప్రశ్న 2.
ఆంధ్రభాష బొత్తిగ రానివాడతోడనే కాని మీరాంధేయమున నెన్నఁడు మాటాడవలదు. మీరు మీ మిత్రులకుత్తరము వ్రాయునప్పుడు ‘డియర్ క్రైండ్’తో నారంభించి ‘యువర్సుట్రూలీ’ తోఁ బూర్తి చేయక ‘బ్రహ్మశ్రీ’ తోడనో? ‘మహారాజశ్రీ ‘ తోడనోయారంభించి, ‘చిత్తగింపవలయును’తో బూర్తి చేయవలయును. ఆంధ్రభాష వచ్చినవాని కాంగ్లేయ భాషలో నుత్తరమెన్నఁడును వ్రాయఁకుడు. ఈ నియమములను మీరు చేసికోఁగలరా ? (అభ్యంతరమేమి యను కేకలు) నూతనముగా నచ్చుపడుచున్న యాంధ్ర గ్రంథము లెల్లను విమర్శనబుద్ధితోఁజదువుఁడు. తొందరపడి యధిక్షేపింపకుఁడు. శనివారాది వారములందు రాత్రి తప్పకుండ రెండు గంటలు పురాణ పఠనమునఁ గాలక్షేపము చేయుఁడు. స్వభాషా పత్రికలను జూడకుండ నావలఁ బాఱవేయకుఁడు. ఆంగ్లేయ భాషా గ్రంథములు మీరు చదువుచున్నప్పుడు వానిలో ‘మనభాష కక్కఱకు వచ్చు నంశము లేమియా’ యని తదేక దృష్టితోఁ జూచుచు వానిని మొదటిలోఁబదిలిపటపుఁడు.
ప్రశ్నలు:
1. తెలుగులో ఉత్తరములు రాయునపుడు మొదట వేనితో ప్రారంభించాలి?
2. ముగింపుగా ఏమి రాయాలి?
3. గ్రంథ పఠనము చేయునపుడు ఎలా చదవాలి?
4. ఏయే వారాలలో పురాణ పఠనం చేయమన్నారు?
జవాబులు:
1. బ్రహ్మశ్రీ / మహారాజశ్రీ
3. విమర్శన బుద్ధితో
2. చిత్తగింపవలయును
4. శనివారం, ఆదివారం

ప్రశ్న 3.
క్రింది అపరిచిత గద్యాలను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి. | సమాజంలో ఈనాడు కావాల్సినవి నైతిక విలువలు, అందుకు సమాజంలో సత్యానికి ప్రాధాన్యం ఇవ్వడం అవసరం. సత్యాన్ని మించిన దైవమే లేదన్న విశిష్ట సంస్కృతి మనది. జాతిపిత గాంధీజీ జీవితానికి స్ఫూర్తినిచ్చిన ఇతివృత్తం హరిశ్చంద్రది. హరిశ్చంద్ర నాటకాన్ని బలిజేపల్లి లక్ష్మీకాంతంగారు ఉప్పు సత్యాగ్రహం జరుగుతున్న కాలంలో, జైలులో ఉండి రచించారు. మేనత్త సరస్వతమ్మ ద్వారా భారత, భాగవత, రామాయణాలను అర్థాలతో సహా తెలుసుకున్నారు. శివానందలహరి, బ్రహ్మరథం, మణిమంజూష మొ|| నవలలు, బుద్ధిమతి విలాసం, సత్యహరిశ్చంద్రీయం, ఉత్తర రాఘవీయం నాటకాలు బలిజేపల్లి వారి అమృతలేఖిని నుండి జాలు వారాయి. ‘కవితా కళానిధి’, ‘పుంభావ సరస్వతి’ అనే బిరుదులు వీరి పేరు పక్కన చేరి కొత్త సొబగులు సంతరించుకొన్నాయి.
ప్రశ్నలు:
1. నేటి సమాజానికి కావల్సినవి?
2. గాంధీజీ జీవితానికి స్ఫూర్తినిచ్చిన ఇతివృత్తం?
3. బలిజేపల్లి వారి మేనత్త?
4. వీరి నవలలు ఏవి?
జవాబులు:
1. నైతిక విలువలు
2. సత్యహరిశ్చంద్రీయం
3. సరస్వతమ్మ
4. శివానందలహరి, బ్రహ్మరథం, మణిమంజూష

ప్రశ్న 4.
సామెత అంటే అనుభవం నేర్పిన పాఠమే. సామెతలు ఉపయోగించుట ఒక కళ. సందర్భోచితంగా సామెతలు వాడుతూ, మాట్లాడుతుంటే – మాట్లాడేవారికి సంతోషం – వినేవారికి తృప్తి కలుగుతాయి. “సామెతల మాట – విందు వినోదాల పొందు” అందుకే సామెత లేని మాట – ఆమెత లేని యిల్లు’ అనే సామెత పుట్టింది. అనుభవజ్ఞుల నోటి నుండి మంచి ముత్యాల వానలా జారిపడిన ఈ సామెతలు ప్రజల మనసు లోతుల్ని తాకీ, ఆలోచనా స్రవంతిని కదలించి చైతన్యవంతుల్నిగా చేసే విజ్ఞాన భాండాగారాలు.
ప్రశ్నలు:
1. సామెత అనగానేమి?
2. సామెతల మాట …………… (ఖాళీ నింపండి.)
3. సామెతలు ఎక్కడ నుండి జారిపడ్డాయి?
4. సామెతలు ప్రజలను చైతన్యవంతుల్ని చేసే …….
జవాబులు:
1. అనుభవం నేర్పిన పాఠం
2. విందు వినోదాల పొందు
3. అనుభవజ్ఞుల నోటినుండి
4. విజ్ఞాన భాండాగారాలు.

II. స్వీయరచన

అ) క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
మాతృభాష పట్ల అభిమానంతో జంఘాల శాస్త్రి పాత్ర సృష్టించి స్వభాషా ప్రాముఖ్యాన్ని వివరించిన రచయిత గూర్చి రాయండి.
జవాబు:
పానుగంటి లక్ష్మీ నరసింహారావుగారు 11.2.1865లో రాజమండ్రి – సీతానగరంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు రత్నమాంబ, వేంకటరమణయ్య. ఉన్నతవిద్య వరకూ రాజమండ్రిలోనే విద్యాభ్యాసం చేశారు. బళ్ళారి జిల్లాలోని ఆనెగొంది సంస్థానంలో దివానుగా కొంతకాలం చేసి, తరువాత పిఠాపురం సంస్థానంలో ఆస్థానకవిగా స్థిరపడ్డారు. సారంగధర, ప్రచండ చాణక్యము, విప్రనారాయణ, కంఠాభరణం, పూర్ణిమ, సరస్వతి, సరోజని, సాక్షి మొ||వి వీరి ప్రసిద్ధ రచనలు. వీరి శైలి అద్భుతమైన గ్రాంథిక భాషా ప్రవాహంతో సున్నితమైన వ్యంగ్యంతో, చురుక్కుమనే హాస్యంతో అలరారుతుంది. సమకాలీన సమస్యలపై తీవ్రంగా స్పందించి, సంఘ సంస్కరణకు నడుం కట్టి, తన రచనల ద్వారా ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించిన పానుగంటివారు చిరస్మరణీయులు. వారి రచనలు ఈనాటి పరిస్థితులకు కూడా అద్దం పడుతున్నాయి. వీరు 1-1-1940 న పరమపదించారు.

ప్రశ్న 2.
“వినక ఏమి చెవులు చిల్లులు పడినవా?” అని జంఘాలశాస్త్రి ఎందుకన్నాడు? ఈ మాటలను ఇంకా ఏయే సందర్భాలలో ఉపయోగిస్తారు?
జవాబు:
సభాధ్యక్షుడు తనకు తెలుగురాదని, ఇష్టమైతే ఆంగ్లభాషలో మాట్లాడుతానని చెప్పాడు. అతని ప్రసంగం ముగిసిన పిదప జంఘాలశాస్త్రి తన ఉపన్యాసాన్ని ఆరంభించి ఇలా అన్నాడు- ఆ మాటలు తాను నిజంగా విన్నాడా ? లేక భ్రమపడ్డాడా? అని కాసేపు సందేహించినా తాను వాటిని విన్నాడనే నిశ్చయానికి వచ్చాడు. చెప్పేవాడు ఏ మాత్రం సిగ్గుపడకుండా చెప్పినా తాము మాత్రం సిగ్గుపడేలా విన్నామని, గుండెలు పగిలేలా, మనస్సు మండేలా విన్నామని చెప్పాడు.

ఇష్టంలేని వాటిని ఎదుటివాళ్ళు చెప్పినప్పుడు ఈ మాటల్ని ఉపయోగిస్తాం. ప్రమాదం కలిగించే మాటల్ని విన్నప్పుడు వాటిని ఉపయోగిస్తాం. ఒళ్ళుమండి కోపం తారాస్థాయికి చేరినప్పుడు వాటిని వాడతాం. ఎదుటివారు అవాకులు చవాకులు పేలినప్పుడు అంటాం.

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

ప్రశ్న 3.
‘అధిక్షేప వ్యాసం’ ప్రక్రియ గురించి రాయండి. (S.A. III – 2016-17)
జవాబు:
విషయ ప్రాధాన్యం ఉండి, ఒక క్రమంలో సమగ్రంగా వివరించిన దాన్ని వ్యాసం అంటారు. అధిక్షేపం అంటే ఎత్తి పొడుపు. ఇది వివిధ విషయాలపట్ల విమర్శదృష్టితో వ్యంగ్య, హాస్య ధోరణిలో వ్యాఖ్యానిస్తూ, పరిష్కార మార్గాన్ని సూచిస్తూ సాగే సాహిత్య ప్రక్రియ.

ప్రశ్న 4.
స్వభాష పాఠం నేపథ్యం వివరించుము.
(లేదా )
పరభాషా వ్యా మోహంతో స్వభాష ప్రాముఖ్యాన్ని మరచిన వానిని విమర్శిస్తూ వ్రాసిన “స్వభాష” – నేపథ్యం గూర్చి రాయండి. (S.A. II – 2017-18)
జవాబు:
ఒక పాఠశాల విద్యార్థులు తెలుగువాడైన ఒక పెద్దమనిషి వద్దకు వెళ్ళి, వార్షికోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా కోరారు. ఆయన న్యాయవాదవృత్తి చేస్తూ పేరు గడించినవాడు. ‘నేను వస్తానుగాని, తెలుగులో మాట్లాడలేను. ఇంగ్లీషులో మాట్లాడతా’నన్నాడు. పిల్లలు సరే అనక తప్పలేదు. సమావేశానికి వచ్చిన ఆ పెద్దమనిషి ఆంగ్లంలో ‘దేహసాధన’ గురించి పావుగంట మాట్లాడి ‘విల్ ఎనీ జెంటిల్మన్ కమ్ ఫార్వర్డు టు స్పీక్’ అని ముగించాడు. అప్పుడా సభలోనున్న జంఘాలశాస్త్రి లేచి ఈ విధంగా ఉపన్యసించాడు.

ప్రశ్న 5.
ఆహాహా ! యేమని యేమని? మన యధ్యక్ష భగవానుని యాలాపకలాపమేమి? – అంటూ ప్రవాహంలా సాగే జంఘాలశాస్త్రి మాటకారితనాన్ని విశదీకరించుము. (S.A. III – 2015-16)
జవాబు:
జంఘాలశాస్త్రికి మాతృభాషపై మక్కువ ఎక్కువ. తెలుగులో మాట్లాడితే తక్కువ అనే భావంలో సభాధ్యక్షుడు ఆంగ్లంలో మాట్లాడతాడు. ఇంకేముంది జంఘాలశాస్త్రికి కోపం నషాళానికి అంటింది. ప్రవాహంలా సాగే తన మాటలతో సూటిగా, స్పష్టంగా చెప్పదలచిన విషయాన్ని, తన తెలుగు భాషా అభిమానాన్ని చెప్పాడు. ప్రాచీనతను ఆధునికతతో మేళవించి వ్యవహార దక్షతను చూపాడు. శ్రోతలను మంత్రముగ్ధులను చేయగల వాగ్దాటిని ప్రదర్శించాడు. యువతకు చక్కని మార్గదర్శనం చేశాడు. గొప్ప వక్తకు ఉండాల్సిన మాటకారితనాన్ని ప్రదర్శించి విద్యార్థులకు మార్గదర్శి అయ్యాడు.

ఆ) క్రింది ప్రశ్నలకు పది పన్నెండు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘స్వభాష’ పాఠ్యభాగ రచయితను పరిచయం చేయండి.
జవాబు:
‘స్వభాష’ పాఠ్యభాగ రచయిత శ్రీ పానుగంటి లక్ష్మీనరసింహారావుగారు.

జననం : 11-02-1865 సీతానగరం (రాజమండ్రి)

మరణం : 1-1-1940

తల్లిదండ్రులు : రత్నమాంబ, వేంకటరమణయ్య

రచనలు : సారంగధర, ప్రచండ చాణక్యము, విప్రనారాయణ, కంఠాభరణం, పూర్ణిమ, సరస్వతి, సరోజని, సాక్షి మొదలైనవి.

విశేషాలు : బళ్ళారి జిల్లా ఆనెగొంది సంస్థాన దివానుగా కొంతకాలం చేసి, తరువాత పిఠాపురం సంస్థాన ఆస్థానకవిగా స్థిరపడ్డారు.

శైలి : అద్భుతమైన గ్రాంథిక భాషా ప్రవాహంతో, సున్నితమైన వ్యంగ్యంతో, చురుక్కుమనే హాస్యంతో అలరారుతుంది.

ప్రత్యేకత : సమకాలీన సమస్యలపై తీవ్రంగా స్పందించి, సంఘసంస్కరణకు నడుం కట్టి, తన రచనల ద్వారా ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించారు.

బిరుదులు : అభినవ కాళిదాసు, ఆంధ్రా ఎడిసన్, ఆంధ్ర షేక్ స్పియర్.

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

ప్రశ్న 2.
జంఘాలశాస్త్రి స్వభాష విషయంలో విద్యార్థులను ఏయే విషయాలను పాటించమని చెప్పాడో వివరించండి. (S.A. II – 2018-19)
జవాబు:
పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు సంఘసంస్కరణాభిలాషతో ‘సాక్షి’ పేరుతో అనేక వ్యాసాలను రాశారు. అందులో భాగంగా మన భాష గొప్పతనాన్ని గూర్చి “జంఘాల శాస్త్రి” అనే పాత్ర ఉపన్యాసం ద్వారా తెలియజేశారు. జంఘాలశాస్త్రి స్వభాష విషయంలో విద్యార్థులకు సూచనగా నాయనలారా ! ఆంధ్రభాష బొత్తిగా రానివానితో తప్ప మీరు ఆంగ్లంలో మాట్లాడవద్దు. మీరు మీ మిత్రులకు ఉత్తరం రాయునపుడు ‘డియర్ ఫ్రెండ్’ అని ప్రారంభించి, ‘యువర్స్ ట్రూలి’తో పూర్తిచేయక, ‘బ్రహ్మశ్రీ’ లేదా ‘మహారాజశ్రీ’తో ఆరంభించి, ‘చిత్తగింపవలెను’ తో పూర్తి చేయండి. తెలుగుభాష వచ్చిన వారికి ఆంగ్లభాషలో ఉత్తరం ఎప్పుడూ రాయవద్దు. ఈ నియమం మీరు తప్పకూడదు. తెలుగులో వస్తున్న కొత్త గ్రంథాలను విమర్శనగా చదవండి. తొందరపడి విమర్శించకండి. శని, ఆది వారాలందు రాత్రి తప్పకుండా రెండు గంటలు పురాణ పఠన కాలక్షేపం చేయండి. తెలుగు పత్రికలను చూడండి. ఇంగ్లీషు భాషా గ్రంథాలను చదువుతున్నప్పుడు వానిలో “మన భాషకు పనికి వచ్చే అంశాలే”వని తదేక దృష్టితో చూసి, గుర్తుంచుకోండి. మీరీ నియమాలు ఏర్పాటు చేసుకొని పట్టుదలతో పాటించి, పుట్టుక చేతనే కాక, బుద్ధి చేత, స్వభావం చేత, యోగ్యత చేత ఆంధ్రులని పించుకోండి ! అంటూ సందేశమిచ్చారు.

వ్యక్తీకరణ – సృజనాత్మకత

క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
నీకు నచ్చిన ఒక పుస్తకం గురించి నీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

తెనాలి,
x x x x x

ప్రియమైన మిత్రునికి,

నేనిక్కడ క్షేమం. నీవు అక్కడ క్షేమమని తలుస్తాను. మొన్న జరిగిన నా పుట్టినరోజు వేడుకకు నీవు రాలేదు. నాకు బాధగా ఉంది. కారణం లేకుండా నీవు మానవని సరిపెట్టుకున్నాను. ఇక… ఫంక్షన్ బాగా జరిగింది. బోలెడు కానుకలు, స్వీట్స్ అందరూ ఇచ్చారు. వాటిలో ఒక పుస్తకం నాకు బాగా నచ్చింది. అది మా నాన్నగారు ఇచ్చారు. ఆ పుస్తకం పేరు ‘బొమ్మల పంచతంత్రం’. రకరకాల పక్షులు, జంతువులు, మనుష్యుల పాత్రల ద్వారా మనుష్యులు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో దానిలో ఉంది. ఆపదలు వచ్చినప్పుడు ఉపాయంతో ఎలా తప్పించుకోవాలో వివరంగా, ఆసక్తికరంగా. అందులోని కథలు సాగుతాయి. నీవు కూడా ఇలాంటి పుస్తకం కొని చదువు. మీ పెద్దలకు నా నమస్కారాలు తెలియజేయి.

ఇట్లు,
నీ మిత్రుడు,
కె. ఫణిరామ్,
9 వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
తెనాలి, గుంటూరు జిల్లా,

చిరునామా :
యస్. నాగలక్ష్మణ శర్మ,
S/o. పూర్ణాచంద్రశాస్త్రి,
ఒంగోలు,
ప్రకాశం జిల్లా.

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

ప్రశ్న 2.
తెలుగు భాషా ప్రాముఖ్యతను తెలుపుతూ విదేశీ మిత్రునికి లేఖ రాయండి. (S.A. I -2018-19)
జవాబు:

చెరుకూరు,
x x x x x

ప్రియమైన మిత్రుడు బాలు,

నేను క్షేమం, నీవు అక్కడ క్షేమమని తలుస్తాను. చిన్నప్పటి నుండి స్నేహితులమైన మనం ఈనాడు మీ నాన్నగారు విదేశాలలో స్థిరపడాలనే కోరికతో దూరం అయ్యాం. కానీ మనం ఒకరిమీద మరొకరి అవ్యాజమైన స్నేహబంధం వల్ల ఇలా ఉత్తరాల ద్వారా మాట్లాడుకొంటున్నాం. నీవు అక్కడి ఆంగ్లం మోజులో పడి తెలుగును మరువద్దు. తెలుగు సాహిత్య కార్యక్రమాలు ఎక్కడ జరిగినా నీవు వెళ్ళడానికి ప్రయత్నించు. తెలుగు లేని జీవితం, వెలుగు లేని ఇల్లు లాంటిది. తెలుగును ‘ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్’ అన్నారని నీకు తెలుసు కదా ! అక్కడున్న నీతోటి పిల్లలందరికి నీవు నేర్చుకున్న తెలుగు పద్యాలను నేర్పు. మీ అమ్మా నాన్నలకు నా నమస్కారాలు. తిరిగి జాబు రాయి.

ఇట్లు,
నీ మిత్రుడు,
కె. ఫణిరామ్.

చిరునామా :
యస్. బాలసుబ్రహ్మణ్యం, 9వ తరగతి
S/o పూర్ణచంద్రశాస్త్రి,
న్యూ వాషింగ్టన్, అమెరికా.

III. భాషాంశాలు (పదజాలం, వ్యాకరణం)

1. వ్యుత్పత్త్యర్థాలు :

1. అక్షరం = నాశనము పొందనిది – వర్ణం
2. శివుడు = సాధుల హృదయమున శయనించి యుండువాడు, మంగళప్రదుడు – ఈశ్వరుడు
3. పండితుడు = శాస్త్రమందు మంచి బుద్ధి కలవాడు (పండ = బుద్ధి) – విద్వాంసుడు

2. సంధులు :

1. అమూల్యాలంకారాలు : అమూల్య + అలంకారాలు = సవర్ణదీర్ఘ సంధి
2. అగ్రాసనాధిపతి = అగ్ర + ఆసన + అధిపతి = సవర్ణదీర్ఘ సంధి
3. శిలాక్షరం = శిల + అక్షరం = సవర్ణదీర్ఘ సంధి
4. యథార్థం = యథా + అర్థం = సవర్ణదీర్ఘ సంధి
5. తాత్కాలికోన్మాదం = తాత్కాలిక + ఉన్మాదం = గుణసంధి
6. భాషోచ్చారణ = భాష + ఉచ్ఛా రణ = గుణసంధి
7. కంఠోక్తి = కంఠ + ఉక్తి = గుణసంధి
8. తదేక = తత్ + ఏక = జశ్త్వసంధి
9. నిస్సందేహము = నిః + సందేహము = విసర్గ సంధి
10. వాగోరణి = వాక్ + ధోరణి = జశ్త్వసంధి
11. దైన్యపడి = దైన్యము + పడి = పడ్వాది సంధి
12. శతాబ్దము = శత + అబ్దము = సవర్ణదీర్ఘ సంధి
13. రవంత = రవ + అంత = అత్త్వసంధి
14. వాగ్వాహినీ = వాక్ + వాహినీ = జశ్త్వసంధి
15. పండితాగ్రణులు = పండిత + అగ్రణులు = సవర్ణదీర్ఘ సంధి

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

3. సమాసాలు:

మాతాపితలు = మాతయు, పితయు – ద్వంద్వ సమాసం
పండితాగ్రణులు = పండితులలో శ్రేష్ఠుడు – షష్ఠీ తత్పురుష సమాసం
శ్రీసూక్తి = మంగళకరమైన నీతివాక్యం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
మాతృభాష = తల్లి యొక్క భాష – షష్ఠీ తత్పురుష సమాసం
అనర్హం = అర్హము కానిది – నఞ్ తత్పురుష సమాసం
అనుచితం = ఉచితం కానిది – నఞ్ తత్పురుష సమాసం
నిస్సందేహం = సందేహం లేనిది – నఞ్ తత్పురుష సమాసం
వాగౌరణులు = మాట యొక్క తీరులు – షష్ఠీ తత్పురుష సమాసం
ఏబది సంవత్సరాలు = ఏబది సంఖ్య గల సంవత్సరాలు – ద్విగు సమాసం (అర్ధ శతాబ్దం)

9th Class Telugu 2nd Lesson స్వభాష 1 Mark Bits

1. నీవు చెప్పిన మాటలు ఆశ్చర్యము కలిగించాయి – (గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి) (S.A. I – 2018-19)
ఎ) అచ్చెరువు
బి) ఆచెరువు
సి) అచెరువు
డి) అస్చెరువు
జవాబు:
ఎ) అచ్చెరువు

2. అక్షరం జిహ్వ కిక్షురసం వంటిది – (గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యర్థం గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) నాశన మగునది
బి) నాశనము పొందినది
సి) నాశనం కలిగినది
డి) నాశనం లేనిది
జవాబు:
డి) నాశనం లేనిది

3. ప్రయత్నిస్తే ఏదీ అసాధ్యం కాదు. (గీత గీసిన పదానికి సమాసం గుర్తించండి.) (S.A. III – 2016-17)
ఎ) ప్రథమ తత్పురుష సమాసం
బి) ద్వితీయ తత్పురుష సమాసం
సి) చతుర్డీ తత్పురుష సమాసం
డి) నఞ్ తత్పురుష సమాసం
జవాబు:
డి) నఞ్ తత్పురుష సమాసం

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

4. ఆయన నడుస్తూ పాటలు వింటున్నాడు. (ఇది ఏ రకమైన వాక్యం) (S.A. I – 2018-19)
ఎ) ప్రశ్నార్థక వాక్యం
బి) క్వార్థక వాక్యం
సి) చేదర్థక వాక్యం
డి) శత్రర్థక వాక్యం
జవాబు:
సి) చేదర్థక వాక్యం

5. కింది వాటిలో క్వార్థక క్రియ గుర్తించండి.
ఎ) వేడుకొన్నది
బి) పాల్గొన్నది
సి) చూసి
డి) వెళ్తూ
జవాబు:
సి) చూసి

6. మీ సభా కార్యక్రమము నంతయు జెడగొట్టితిని. (ఆధునిక వచనాన్ని గుర్తించండి.) (S.A. II – 2018-19)
ఎ) మా సభా కార్యక్రమాన్నంతా చెడకొట్టలేదు.
బి) మీ సభా కార్యక్రమాన్నంతా చెడకొట్టాను.
సి) మీ సభా కార్యక్రమాన్నంతా చెడకొట్టకూడదు.
డి) మీ సభా కార్యక్రమం అంతా చెడకొట్టబడింది.
జవాబు:
బి) మీ సభా కార్యక్రమాన్నంతా చెడకొట్టాను.

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

7. “నేనొక్కడినే అదృష్ట వంతుడినా”? అన్నాడు జంఘాలశాస్త్రి (పరోక్ష కథనాన్ని గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) తానొక్కడినే దురదృష్ట వంతుడినా ! అని అన్నాడు జంఘాలశాస్త్రి
బి) జంఘాల శాస్త్రి తానొక్కడినే అదృష్టవంతుడినా అని అన్నాడు.
సి) తానొక్కడినే అదృష్టవంతుడినా అని జంఘాలశాస్త్రి అనలేదు.
డి) జంఘాల శాస్త్రి తనకు తాను అదృష్టవంతుడనని ప్రకటించుకున్నాడు.
జవాబు:
బి) జంఘాల శాస్త్రి తానొక్కడినే అదృష్టవంతుడినా అని అన్నాడు.

8. శృతి సంగీతము విని, ఆనందించినది. (ఏ రకపు వాక్యమో గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) శత్రర్థకము
బి) క్వార్థకము
సి) చేదర్థకము
డి) అభ్యర్థకము
జవాబు:
బి) క్వార్థకము

9. పాఠాలు చదివితే, విషయం అర్థమౌతుంది (ఏ రకమైన వాక్యమో గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) తుమున్నరకము
బి) వ్యతిరేకార్థకము
సి) భావార్థకము
డి) చేదర్థకము
జవాబు:
డి) చేదర్థకము

10. ఈ విధముగా బ్రద్దలైనది. (ఆధునిక వచనాన్ని గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) ఈ విధంగా బద్దలైంది
బి) ఈ విధమ్ముగా బద్దలైనది
సి) ఈ విధంబుగా బ్రద్దలైంది
డి) ఈ విధమ్ముగా బ్రద్దలుఐనది
జవాబు:
ఎ) ఈ విధంగా బద్దలైంది

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

11. నరేశ్ తాను రానని రఘుతో అన్నాడు. (ప్రత్యక్ష కథనం గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) “నరేశ్ రాడు”, అని అన్నాడు రఘు.
బి) “తాను రాడు”, అని నరేశ్ రఘుతో అన్నాడు.
సి) “నేను రాను”, అని నరేశ్ రఘుతో అన్నాడు.
డి) “తాను రాను”, అని నరేశ్ రఘుతో అన్నాడు.
జవాబు:
సి) “నేను రాను”, అని నరేశ్ రఘుతో అన్నాడు.

12. కవిత గ్రంథాలయానికి వెళ్లి పుస్తకాలు తెచ్చుకొంది. (ఏ రకపు వాక్యమో గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) సంయుక్తం
బి) ఆశీర్వార్థకం
సి) ప్రశ్నార్థకం
డి) సంక్లిష్టం
జవాబు:
డి) సంక్లిష్టం

13. వానలు వస్తే పంటలు పండుతాయి. (ఏ రకమైన వాక్యమో గుర్తించండి.) (S.A. II – 2017-18)
ఎ) చేదర్థకం
బి) తమున్నర్థకం
సి) భావార్థకం
డి) వ్యతిరేకార్థకం
జవాబు:
ఎ) చేదర్థకం

14. అనుచితమనుమాట నిస్సందేహము (ఆధునిక వచనంలోకి మార్చిన వాక్యం గుర్తించండి.) (S.A. III – 2016-17)
ఎ) అనుచితమనుమాట నిస్సందియము.
బి) అనుచితమనెడిమాటయు నిస్సందేహము.
సి) అనుచితం అనేమాట నిస్సందేహం.
డి) అనుచితం అనేమాట సందేహం.
జవాబు:
సి) అనుచితం అనేమాట నిస్సందేహం.

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

15. వర్షాలు కురుస్తాయి. పంటలు పండుతాయి. (ఈ రెండు వాక్యాలను చేదర్థక వాక్యంగా మార్చినది గుర్తించండి.) (S.A. III – 2016-17)
ఎ) వర్షాలు కురిసి పంటలు పండుతాయి.
బి) వర్షాలు కురిస్తే పంటలు పండుతాయి.
సి) వర్షాలు కురవక పంటలు పండుతాయి.
డి) వర్షాలు కురవక పంటలు పండలేదు.
జవాబు:
బి) వర్షాలు కురిస్తే పంటలు పండుతాయి.

భాషాంశాలు (పదజాలం, వ్యాకరణం)

1. అర్థాలు :

16. సామెత లేని మాట. ఆమెత లేని ఇల్లు ఉండవు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) గోడలు
B) కిటికీలు
C) విందు
D) గది
జవాబు:
C) విందు

17. అధిక్షేపము ఒక ప్రక్రియ – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) ఎత్తిపొడుపు
B) పొత్తికడుపు
C) నత్తిమాట
D) పొగడ్త
జవాబు:
A) ఎత్తిపొడుపు

18. రాజులు పండితులకు ఈనాములిచ్చారు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) మాన్యం
B) సామాన్యం
C) అన్యం
D) వస్త్రం
జవాబు:
A) మాన్యం

19. తొందరపడి ఎవరినీ ‘అధిక్షేపించకూడదు’ – గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.
A) ఆక్షేపించు
B) మెచ్చుకొను
C) స్తుతించు
D) కొట్టు
జవాబు:
A) ఆక్షేపించు

20. తెలుగు నేర్చుకోడానికి ఇంగ్లీషు భాషాభ్యాసమునకు పడే శ్రమలో పదవ వంతు అక్కఱ లేదు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) కఱ్ఱ
B) ధనము
C) కష్టము
D) శ్రమ
జవాబు:
C) కష్టము

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

21. నీవు నిస్సందేహముగా ఈ పని చేయగలవు – గీత గీసిన పదానికి అర్థము ఏది?
A) సందేహము
B) నిశ్శంకము
C) నిక్కచ్చి
D) తప్పక
జవాబు:
B) నిశ్శంకము

2. పర్యాయపదాలు :

22. సూక్తి చెప్పేవాడి కన్నా, ఆచరించి చెప్పేవాడు మిన్న – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) మంచిమాట, ఆట
B) మంచిమాట, నీతి వాక్యం
C) నీతివాక్యం, తిట్టు
D) ఆట, పాట
జవాబు:
B) మంచిమాట, నీతి వాక్యం

23. తల్లి గర్భం నుండి పుట్టి చివరకు గర్భశోకం మిగిల్చేవారు పశుప్రాయులు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి
A) జన్మించి, ఏడిపించి
B) ఉద్భవించి, నవ్వించి
C) జన్మించి, అవతరించి
D) బాధించి, జనించి
జవాబు:
C) జన్మించి, అవతరించి

24. దేశభాషలు ఉపాధ్యాయుడు అక్కఱ లేకయే, నేర్చుకొన గలము- గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) గురువు, పండితుడు
B) ఆచార్యుడు, బుధుడు
C) ఒజ్జ, గురువు
D) అధ్యాపకుడు, ఆచారి
జవాబు:
C) ఒజ్జ, గురువు

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

25. శివరాత్రినాడు గుడిలో శంభో, హర, హరా అనే నాదాలు మిన్నుముట్టాయి – గీత గీసిన పదాలకు పర్యాయపదం గుర్తించండి.
A) బ్రహ్మ
B) విష్ణువు
C) ఇంద్రుడు
D) శివుడు
జవాబు:
D) శివుడు

26. నీ ఆస్యగహ్వరము నుంచి వచ్చిన మాట అసమంజ సముగా ఉంది – గీత గీసిన పదానికి, సమానార్థకపదం ఏది?
A) ముఖము
B) గుహ
C) కంఠము
D) నోరు
జవాబు:
B) గుహ

3. వ్యుత్పత్యర్థాలు :

27. నాశనము పొందనిది – వ్యుత్పత్త్యర్ధం గల పదం గుర్తించండి.
A) వినాశనం
B) అక్షరం
C) సంపద
D) జీవం
జవాబు:
B) అక్షరం

28. ‘శివుడు’ – వ్యుత్పత్తిని గుర్తించండి.
A) మంగళప్రదుడు
B) విషం మింగినవాడు
C) అర్ధనారీశ్వరుడు
D) చంద్రుని తలపై ఉన్నవాడు
జవాబు:
A) మంగళప్రదుడు

29. ‘శాస్త్రమందు మంచిబుద్ధి కలవాడు’ – వ్యుత్పత్త్యర్థం గల పదం ఏది?
A) వివేకి
B) మేధావి
C) పండితుడు
D) బుద్ధిశాలి
జవాబు:
C) పండితుడు

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

30. ‘భక్తుల పీడను హరించేవాడు’ – అనే వ్యుత్పత్త్యర్థం గల పదమేది?
A) శంభుడు
B) శివుడు
C) ముక్కంటి
D) హరుడు
జవాబు:
D) హరుడు

31. ‘పక్షి’ అనే దాని వ్యుత్పత్తిని గుర్తించండి.
A) పలికేది
B) పక్షములు గలది
C) టెక్కలు గలది
D) టెక్కలతో ఎగిరేది
జవాబు:
B) పక్షములు గలది

4. నానార్థాలు :

32. శ్రీలు ఒలికించు చిఱునవ్వు స్త్రీలకు దివ్యాభరణమే ! – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) లక్ష్మి, జ్యేష్ఠ
B) ఐశ్వర్యం, అలంకారం
C) శోభ, వింత
D) విషం, పాము
జవాబు:
B) ఐశ్వర్యం, అలంకారం

33. అర్ధము లేనిదే వ్యర్థము – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) సంపద, ధనం
B) శబ్దార్థం, శతాబ్దం
C) శబ్దాది విషయం, ధనం
D) న్యాయం, శాంతి
జవాబు:
C) శబ్దాది విషయం, ధనం

34. నీవు నీ మిత్రుడికి ఉత్తరము తెలుగులోనే రాయి – గీత గీసిన పదానికి నానార్ధములు గుర్తించండి.
A) స్నేహితుడు, హితుడు
B) సూర్యుడు, స్నేహితుడు
C) బ్రహ్మ, నేస్తము
D) విష్ణువు, హితుడు
జవాబు:
B) సూర్యుడు, స్నేహితుడు

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

5. ప్రకృతి – వికృతులు :

35. భ్రాంతిమయ జీవితంలో ఎన్నటికి సుఖము ఉండదు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) బ్రాతి
B) బాంతి
C) బ్రాంతి
D) బాతి
జవాబు:
A) బ్రాతి

36. సుద్దులు ఎన్నెనా ఏమి బుద్దులు సరిలేనప్పుడు – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
A) శుభ్రత
B) శుభం
C) సూక్తులు
D) పనులు
జవాబు:
C) సూక్తులు

37. ‘అక్షరము’ అనే పదానికి వికృతిని గుర్తించండి.
A) అక్కరము
B) అక్కలు
C) ఆకరము
D) అంకె
జవాబు:
A) అక్కరము

38. నీవు చెప్పే సూక్తి శ్రుతపూర్వమే – గీత గీసిన పదానికి వికృతి ఏది?
A) సుక్కి
B) సుద్ది
C) శ్రుతి
D) సూక్తము
జవాబు:
B) సుద్ది

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

39. మీ ఒజ్జలు మహాపండితులు – గీత గీసిన పదానికి ప్రకృతి ఏది?
A) అధ్యాపకుడు
B) ఉపాధ్యాయుడు
C) గురువు
D) ఆచార్యుడు
జవాబు:
B) ఉపాధ్యాయుడు

6. సంధులు :

40. గుణసంధికి చెందినదేది?
AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష 1
జవాబు:
B)

41. ‘యథార్థం’ విడదీయండి.
A) యథా + అర్థం
B) యథ + అర్థం
C) యాథా + అర్థం
D) యథా + ఆర్థం
జవాబు:
A) యథా + అర్థం

42. ‘తదేక’ విడదీయండి.
A) తద + ఏక
B) తత్ + దేక
C) తత్ + ఏక
D) తదా + ఏక
జవాబు:
C) తత్ + ఏక

43. ‘వాగౌరణి’ – సంధి పేరేమిటి?
A) శ్చుత్వసంధి
B) గుణసంధి
C) వృద్ధిసంధి
D) జశ్త్వసంధి
జవాబు:
D) జశ్త్వసంధి

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

44. సవర్ణదీర్ఘ సంధికి ఉదాహరణ రాయండి.
A) కంఠోక్తి
B) తదేక
C) శతాబ్దం
D) వజ్రాలు
జవాబు:
C) శతాబ్దం

45. ‘దైన్యపడి’ విడదీయండి.
A) దైన్యము + పడి
B) దైన్యము + వడి
C) దైన్య + వడి
D) దైన్య + పడి
జవాబు:
A) దైన్యము + పడి

46. ‘నిః + సందేహం’ కలిపి రాయండి.
A) నీ దేహం
B) నిస్సందేహం
C) నిసందేహం
D) నీస్సందేహం
జవాబు:
B) నిస్సందేహం

47. ‘రవంత’ – సంధి పేరేమిటి?
A) ఉత్వసంధి
B) సవర్ణదీర్ఘ సంధి
C) ఇత్వసంధి
D) అత్వసంధి
జవాబు:
B) సవర్ణదీర్ఘ సంధి

48. ‘కంఠోక్తి’ పదాన్ని విడదీయండి.
A) కంఠ + ఓక్తి
B) కంఠ + ఊక్తి
C) కంఠ + ఉక్తి
D) కం + రోక్తి
జవాబు:
C) కంఠ + ఉక్తి

49. ‘పాండిత్యపుఁబస’ విడదీసి చూపండి.
A) పాండిత్యపు + బస
B) పాండిత్యము + పస
C) పాండిత్యం + బస
D) పాండిత్యపు + పస
జవాబు:
B) పాండిత్యము + పస

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

50. ‘భాషాభిమానము’ – ఏ సంధి?
A) అత్వసంధి
B) సవర్ణదీర్ఘ సంధి
C) గుణసంధి
D) వృద్ధి సంధి
జవాబు:
B) సవర్ణదీర్ఘ సంధి

51. ‘అయ్యయ్యో’ పదంలో గల సంధి ఏది?
A) ప్రాతాది సంధి
B) ఆమ్రేడిత సంధి
C) యడాగమ సంధి
D) యణాదేశ సంధి
జవాబు:
B) ఆమ్రేడిత సంధి

7. సమాసాలు :

52. మాతాపితలు దైవసమానులు – గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి.
A) ద్విగు
B) రూపకం
C) ద్వంద్వం
D) బహువ్రీహి
జవాబు:
C) ద్వంద్వం

53. మాతృభాష మరువకూడదు – గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి.
A) ద్వంద్వ
B) షష్ఠీ
C) తృతీయా
D) రూపకం
జవాబు:
B) షష్ఠీ

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

54. అనుచితమైన పనులు చేయకు – గీత గీసిన పదం ఏ – విగ్రహవాక్యమో గుర్తించండి.
A) ఉచితం
B) చిత్రమైనది
C) అమూల్యం
D) ఉచితం కానిది
జవాబు:
D) ఉచితం కానిది

55. ‘ఏబది సంఖ్యగల సంవత్సరాలు’ – సమాసపదం ఏది?
A) ఏబది సంవత్సరాలు
B) యాభై
C) ఏబది వసంతాలు
D) యాభైయేళ్ళు
జవాబు:
A) ఏబది సంవత్సరాలు

56. ‘మంగళకరమైన నీతివాక్యం’ – సమాసపదం ఏది?
A) మంగళవాక్యం
B) శ్రీ సూక్తి
C) మంగళ శ్రీ
D) శ్రీవాక్యం
జవాబు:
B) శ్రీ సూక్తి

57. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణ రాయండి.
A) అనర్హం
B) మాతాపితలు
C) శ్రీసూక్తి
D) మాటతీరు
జవాబు:
C) శ్రీసూక్తి

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

58. ‘మాతాపితలు’ – ఈ సమాసానికి విగ్రహవాక్యం ఏది?
A) మాతయు, పితయు
B) అమ్మానాన్నలు
C) తండ్రి, తల్లి
D) మాతయు, పితృడును
జవాబు:
A) మాతయు, పితయు

59. ‘రక్తమును, మాంసమును’ దీన్ని సమాస పదంగా కూర్చండి.
A) రక్తా మాంసాలు
B) రక్త మాంసము
C) రక్తమాంసములు
D) మాంసరళములు
జవాబు:
C) రక్తమాంసములు

60. ‘భాషయందభిమానము’ దీన్ని సమాస పదంగా కూర్చండి.
A) భాష అభిమానము
B) భాషాభిమానము
C) అభిమాన భాష
D) భాషలయభిమానం
జవాబు:
B) భాషాభిమానము

61. ‘వాగ్వాహిని’ ఇది ఏ సమాసం?
A) నఞ్ తత్పురుష
B) ద్విగు
C) బహువ్రీహి
D) రూపకము
జవాబు:
D) రూపకము

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

8. గణాలు :

62. ‘స, భ, ర, న, మ, య, వ’ గణాలు ఏ వృత్తానికి చెందినవి?
A) ఉత్పలమాల
B) చంపకమాల
C) శార్దూలం
D) మత్తేభం
జవాబు:
D) మత్తేభం

63. ‘సౌలభ్యం’ గురులఘువులు గుర్తించండి.
A) UIU
B) UII
C) UUU
D) IUU
జవాబు:
C) UUU

64. III ఏ గణమో చెప్పండి.
A) స గణం
B) న గణం
C) మ గణం
D) భ గణం
జవాబు:
B) న గణం

9. ఆధునిక వచనాన్ని గుర్తించడం :

65. భాషలోని కళను బ్రాణమును తత్త్వము నాత్మను గనిపట్టవలయును – ఈ వాక్యాన్ని ఆధునిక వచనంలోకి మార్చండి. (S.A. I – 2018-19)
A) భాష ద్వారా కళ, ప్రాణం, తత్త్వం , ఆత్మ తెలుసు కోవాలి.
B) భాషలోని కళని, ప్రాణాన్ని, తత్వాన్ని, ఆత్మని కనిపెట్టాలి.
C) భాష యొక్క కళ, ప్రాణాన్ని, తత్త్వం , ఆత్మను కనిపించాలి.
D) భాషతో కళను ప్రాణంతో తత్త్వం ఆత్మతో కనిపెట్టాలి.
జవాబు:
B) భాషలోని కళని, ప్రాణాన్ని, తత్వాన్ని, ఆత్మని కనిపెట్టాలి.

66. స్వభాషను మీరు నేర్చుకొనుటకేమంత శ్రమమున్నది – ఈ వాక్యాన్ని ఆధునిక వచనంలోకి మార్చండి.
A) మీ భాష మీరు తెల్సుకోడానికి శ్రమలేదు.
B) మీ భాష మేము నేర్చుకోడానికి ఏం శ్రమున్నది.
C) స్వభాషను మీరు నేర్చుకోడానికి ఏం శ్రముంది.
D) స్వభాషను మేము నేర్చుకోడానికి శ్రమమేముంది.
జవాబు:
C) స్వభాషను మీరు నేర్చుకోడానికి ఏం శ్రముంది.

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

67. ఆంధ్రభాష బొత్తిగ రానివానితోడనే కాని మీరాంధేయము ననెన్నడు మాటాడవలదు – ఈ వాక్యాన్ని ఆధునిక వచనంలోకి మార్చండి.
A) తెలుగు అసలు రానివానితో తప్ప (ఇతరులతో) మీరు ఆంగ్లేయంలో ఎప్పుడు మాట్లాడవద్దు.
B) తెలుగు రానివారితో తప్ప ఇంగ్లీషులో మాట్లాడవద్దు.
C) తెలుగు వారితో ఇంగ్లీషులో మాట్లాడవద్దు.
D) తెలుగు రానివారితో ఇంగ్లీషులో మాట్లాడు.
జవాబు:
A) తెలుగు అసలు రానివానితో తప్ప (ఇతరులతో) మీరు ఆంగ్లేయంలో ఎప్పుడు మాట్లాడవద్దు.

68. “నేనొక్కడను మాత్రమే యదృష్టవంతుడనా ?” – దీన్నిఆధునిక వచనంగా మార్చండి.
A) నేను ఒక్కడ్లో అదృష్టవంతుడను కాను.
B) నేనొక్కణ్ణి మాత్రమే అదృష్టవంతుణా !
C) నేను అదృష్టవంతుణ్ణి మాత్రమే కాదు.
D) నేను అదృష్టవంతుడిని కానేకాను.
జవాబు:
B) నేనొక్కణ్ణి మాత్రమే అదృష్టవంతుణా !

69. కోతిని మీరెచ్చటనైనా జూచితిరా – ఆధునిక వచనంగా మార్చండి.
A) కోతిని మీరెక్కడైనా చూశారా?
B) కోతిని మీరు ఎక్కడా చూడలేదు
C) కోతిని మీరెక్కడా చూడరు
D) కోతిని మీరెచ్చటా చూడరు.
జవాబు:
A) కోతిని మీరెక్కడైనా చూశారా?

10. కర్తరి, కర్మణి వాక్యాలను గుర్తించడం:

70. ప్రతి విషయం పరిశీలించబడుతుంది – దీన్ని కర్తరి వాక్యంగా రాయండి.
A) ప్రతి విషయమును పరిశీలిస్తారు.
B) ప్రతి విషయం పరిశీలింపగలరు.
C) ప్రతి విషయాన్ని పరిశీలించండి.
D) ప్రతి విషయమును పరిశీలింపబడుతుంది.
జవాబు:
A) ప్రతి విషయమును పరిశీలిస్తారు.

11. ప్రత్యక్ష, పరోక్ష కథనంలోకి మార్చడం :

71. ‘నేను బడికి రాను’ సీత చెప్పింది – ఈ ప్రత్యక్ష కథనానికి పరోక్షకథనాన్ని గుర్తించండి.
A) నేను బడికి రానని సీత చెప్పింది.
B) తాను బడికి రానని సీత చెప్పింది.
C) తాను బడికి వెళ్ళనని సీత అంది.
D) వాడు బడికి రాడని సీత చెప్పింది.
జవాబు:
B) తాను బడికి రానని సీత చెప్పింది.

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

72. వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించడం :
8. మా భాష మాకు రాదు – వ్యతిరేక వాక్యం గుర్తించండి.
A) మా భాష మాకు వచ్చు
B) మా భాష మాకు తెలుసు
C) మీ భాష మాకు వచ్చు
D) మీ భాష మాకు తెలియదు
జవాబు:
A) మా భాష మాకు వచ్చు

73. మాధవి ఉద్యోగం చేస్తున్నది – వ్యతిరేక వాక్యం గుర్తించండి.
A) మాధవి ఉద్యోగం చేయట్లేదు
B) మాధవి ఉద్యోగం చేస్తుంది
C) మాధవి ఉద్యోగం చేయబోతుంది
D) మాధవి ఉద్యోగం చేయట్లేదు
జవాబు:
A) మాధవి ఉద్యోగం చేయట్లేదు

12. వాక్యరకాలను గుర్తించడం :

74. మోహన కూచిపూడి నృత్యం మరియు భావన భరత నాట్యం నేర్చుకొన్నారు – ఇది ఏ రకమైన వాక్యం?
A) సంక్లిష్ట వాక్యం
B) సామాన్య వాక్యం
C) సంయుక్త వాక్యం
D) మహావాక్యం
జవాబు:
C) సంయుక్త వాక్యం

75. నన్ను మీరు క్షమించి, మరెప్పుడైన ఈ సభను తిరిగి చేసుకోండి – ఇది ఏ రకమైన వాక్యం?
A) మహా వాక్యం
B) సంక్లిష్ట వాక్యం
C) సామాన్య వాక్యం
D) సంయుక్త వాక్యం
జవాబు:
B) సంక్లిష్ట వాక్యం

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

76. ఎ) మోహిని కూచిపూడి నృత్యం నేర్చుకుంది.
బి) భావన భరత నాట్యం నేర్చుకుంది – వీటిని సంయుక్త వాక్యంగా మార్చండి.
A) మోహిని కూచిపూడి నృత్యం, భావన భరతనాట్యం నేర్చుకున్నారు.
B) మోహిని, భావనలు నృత్య నాట్యాలు నేర్చారు.
C) మోహిని నృత్యం నేర్చుకోగా భావన భరతనాట్యం నేర్చుకుంది.
D) మోహిని, భావనలు నృత్య నాట్యాలు నేర్చారు.
జవాబు:
A) మోహిని కూచిపూడి నృత్యం, భావన భరతనాట్యం నేర్చుకున్నారు.

13. ప్రక్రియలను గుర్తించడం :

77. భూతకాలిక అసమాపక క్రియకు ఉదాహరణను
గుర్తించండి.
A) కురిస్తే
B) తింటూ
C) వెళ్ళి
D) చూసాడు
జవాబు:
C) వెళ్ళి

78. ‘పడితే’ – ఇది ఏ ప్రక్రియకు చెందినది?
A) క్వార్థకం
B) శత్రర్థకం
C) చుతుబర్ధకం
D) చేదర్థకం
జవాబు:
D) చేదర్థకం

79. భూతకాల అసమాపక క్రియను ఇలా పిలుస్తారు.
A) చేదర్థకం
B) క్త్వార్థకం
C) హేత్వర్థకం
D) శత్రర్థకం
జవాబు:
B) క్త్వార్థకం

80. మందు వాడితే జబ్బు తగ్గుతుంది – ‘గీత గీసిన పదం’ ఏ అసమాపక క్రియకు చెందినదో తెల్పండి.
A) అప్యర్థకం
B) క్వార్థకం
C) చేదర్థకం
D) శత్రర్థకం
జవాబు:
C) చేదర్థకం

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

81. వర్తమాన అసమాపక క్రియను ఏమంటారు? (S.A. III – 2016-17)
A) శత్రర్థకం
B) చేదర్థకం
C) క్త్వార్థకం
D) ఆశ్చర్యార్థకం
జవాబు:
A) శత్రర్థకం

82. చుట్టుముట్టడం : సమస్యలెన్ని చుట్టిముట్టినా ధైర్యంతో ముందడుగు వేయాలి.

83. అయోమయం : అర్థంకాని విషయం / పరిస్థితిని తెలిపే సందర్భంలో ఉపయోగిస్తారు.

AP Board 9th Class Telugu Important Questions Chapter 1 శాంతికాంక్ష

AP State Syllabus AP Board 9th Class Telugu Important Questions Chapter 1 శాంతికాంక్ష.

AP State Syllabus 9th Class Telugu Important Questions 1st Lesson శాంతికాంక్ష

9th Class Telugu 1st Lesson శాంతికాంక్ష Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

అపరిచిత పద్యం

“విద్య యొసగును వినయంబు వినయమునను
బడయు బాత్రత, పాత్రత వలన ధనము
ధనము వలనను ధర్మంబు దానివలన
ఐహికాముష్మిక సుఖంబులందు నరుడు.”
ప్రశ్నలు :
1. విద్య ఏది యొసగును?
2. పాత్రత వలన కలిగేదేది?
3. ధర్మము వలన ఏది కలుగును?
4. మనిషి ఏవేవి సాధించాలని పై పద్యం తెలియజేస్తోంది?
జవాబులు:
1. వినయం
2. ధనము
3. సుఖము
4. వినయం (Humility), పాత్రత (అర్హత, యోగ్యత /Eligibility), ధర్మం (దాతృత్వం -charity), సుఖం (కీర్తి ప్రతిష్ఠలు/credibility)

II. స్వీయరచన

అ) క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
ధర్మరాజు శాంతి కాముకుడు అని ఎలా చెప్పగలవు?
జవాబు:
“శాంతము లేక సౌఖ్యమూ లేదు” అన్నారు త్యాగరాజు. విద్య, వినయం గల ధర్మరాజు శాంతినే ఎప్పుడూ కోరుకున్నాడు. శ్రీకృష్ణునితో ధర్మరాజు అన్న ఈ మాటలు గమనించండి. “సక్రమంగా మాకు అర్ధరాజ్యం పంచి ఇవ్వడానికి మా తండ్రి మనస్సొప్పకపోతే మేము తలదాచుకోవడానికి ఐదూళ్ళిచ్చినా చాలు” అని సంజయునితో చెప్పానన్నాడు. దీనిద్వారా పంతానికి పోయి తన రాజ్యం తనకు ఇమ్మని కాకుండా కుదిరితే అర్థరాజ్యం లేకపోతే ఐదూళ్ళెనా అనడంలో అతని శాంతి కాముకత ప్రస్ఫుటమౌతుంది.

ప్రశ్న 2.
పాండవులు కోరిన ఐదూళ్ళేవి?
జవాబు:
పాండవులు కోరిన ఐదూళ్ళ పేర్లను సంస్కృత మహాభారత కర్త వ్యాసుడు – “ఇంద్రప్రస్థం, కుశస్థం, వాసంతి, వృకస్థలం, వారణావతం” – అని పేర్కొన్నాడు. తెలుగు మహాభారత కర్తలలో ఒకరైన తిక్కన “అవిఫలం, వృక(కుశ) స్థలం, మాకంది (వాసంతి), వారణావతంతో మరొక ఊరేదైనా అని పేర్కొన్నాడు.

ప్రశ్న 3.
‘ఇతిహాసం’ ప్రక్రియ గురించి రాయండి.
జవాబు:
ఇతిహాసం అనగా (‘ఇతి + హ + అసీత్’ – ఇతిహాసము) ఇట్లు జరిగెనని చెప్పెడు పూర్వజుల చరిత్రము కలది. దీనినే తొల్లిటికథ అని అంటారు. ఇతిహాసంలోని ఇతివృత్తం (కథ) వాస్తవంగా జరిగినదై ఉంటుంది. రామాయణ మహాభారతాలు మన ఇతిహాసాలు.

AP Board 9th Class Telugu Important Questions Chapter 1 శాంతికాంక్ష

ప్రశ్న 4.
తిక్కన రచనా శైలిని గురించి రాయండి.
(లేదా)
శాంతిని కోరుతూ సందేశమిచ్చిన కవిని గూర్చి రాయండి. (S.A. III – 2016-17)
జవాబు:
మహా భారతాన్ని తెలుగులో కవిత్రయం వారు రచించారు. వారిలో రెండోవారు తిక్కన సోమయాజి. 13వ శతాబ్దబ్దికి చెందిన ఈయన నెల్లూరును పాలించిన మనుమసిద్ధికి మంత్రిగా, ఆస్థానకవిగా ఉన్నారు. నిర్వచనోత్తర రామాయణం, మహాభారతంలో విరాటపర్వం నుండి స్వర్గారోహణ పర్వం (15 పర్వాలు) రచించారు.

తిక్కన రచనలో తెలుగు పదాలెక్కువ. పాత్రల మనోభావాలను వెల్లడించటంలో ఈయన ప్రజ్ఞాశాలి. తిక్కన రచన ‘అర్థగౌరవం’ కలది. చిన్న చిన్న పదాలలో అనల్పమైన భావము ఇమిడేటట్లు రచించుటలో తిక్కన సిద్ధహస్తుడు. శ్రీనాథుడు ఇతని రచన ‘రసాభ్యుచితబంధమ’ని పొగిడాడు. ఆధునికులు ఆంధ్ర సాహిత్య ఆకాశంలో తిక్కన సూర్యుని వంటివాడని భావిస్తారు. వివిధ సన్నివేశాలను కళ్ళకు కట్టినట్లు ‘నాటకీయం’గా చిత్రించుటలో తిక్కన సాటిలేనివాడు. సంస్కృతాంధ్ర భాషలలో కవిత్వం రాయగల ప్రతిభాశాలి కాబట్టి ‘ఉభయ కవి మిత్రుడు” అనీ, కేతనాది కవులకు ప్రేరణ కలిగించి మార్గదర్శకులుగా నిలిచినందుకు ‘కవిబ్రహ్మ’ అనీ బిరుదులు పొందారు.

ఆ) క్రింది ప్రశ్నలకు పది లేక పన్నెండు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
ధర్మరాజు శ్రీకృష్ణునితో మాట్లాడిన మాటలు మీకు ఎంతవరకు అర్థమయ్యాయి? ధర్మరాజు లాగా మనం ప్రవర్తించగలమా?
జవాబు:
ధర్మరాజు శ్రీకృష్ణునితో మాట్లాడిన మాటలు సర్వకాల సర్వావస్థల యందు అందరికీ వర్తిస్తాయి. ధర్మరాజు ధర్మానికి ప్రతీక. ఇతని అసలు పేరు యుధిష్ఠరుడు. ధర్మరాజు చెప్పిన మాటల్లో ప్రధానంగా – ‘సక్రమంగా ఇవ్వాల్సిన అర్థరాజ్యమైనా లేదా తలదాచుకోవడానికి ఐదూళ్ళిచ్చినా చాలు’ అనేవి అతనిలో సర్దుకుపోయే తత్వాన్ని తెలుపుతోంది. ఈ ఐదూళ్ళూ కూడా నన్ను ఆశ్రయించుకొని ఉన్న నా బంధు జనులకు కూటికీ, గుడ్డకూ దైన్యం ఏర్పడకుండా ఉండటానికే అని చెప్పడం అతనిలోని నిరాడంబరతను తెలియజేస్తుంది.

రాజ్యం కోసం ఎదుటవారిని ఎందుకు చంపాలి. వారిలోను బంధువులు, మిత్రులు ఉన్నారు అన్న ధర్మరాజు మాటల్లో శాంతికాముకత, స్నేహశీలం చక్కగా కనబడుతున్నాయి. అందరినీ చంపుకుంటూపోతే చివరికి మట్టే మిగిలేది. పాపమే చుట్టుకొనేది అన్న భావం వ్యక్తమైంది. జీవితానికి శాంతి లేనప్పుడు ఆ జీవనమే వృథా. అలాగే ఎవరితోనూ దీర్ఘకాల విరోధం పనికిరాదన్న అతని మాటలు అక్షర సత్యమని నేను భావిస్తున్నాను.

ఆవేశం, పగ మనిషి పతనానికి దారితీసేవి. కాబట్టి కలత లేక నిమ్మళంగా ఉండటమే మంచిది అన్న ధర్మరాజు మాటలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేసేవిగా ఉన్నాయి. మనం మాట్లాడే మాట తేటగా పెద్దల మనస్సును ఆకట్టుకొనే విధంగా ఉండాలే గాని తూటాల్లాగా ఉండకూడదనే భావాన్ని ధర్మరాజు చెప్పాడు.

విద్యార్థి దశ నుండి ప్రతి ఒక్కరు పుస్తకాలు ఎక్కువగా చదివి జ్ఞాన సముపార్జన చేసి, దానిలోని సారాన్ని గ్రహించినపుడు మనం మహనీయుల అడుగు జాడల్లో నడువగలం. వారిలాగే ప్రవర్తించగలం.

AP Board 9th Class Telugu Important Questions Chapter 1 శాంతికాంక్ష

ప్రశ్న 2.
మీరే ధర్మరాజు అయితే ‘శాంతి’ గురించి విద్యార్థులకు ఏం చెబుతారో సందేశాత్మకంగా రాయండి. (S.A. I – 2018-19)
జవాబు:
ధర్మానికి ప్రతీకగా నిల్చిన యుధిష్ఠరుని లోకమంతా ధర్మరాజు అని కీర్తించింది. నేనే ధర్మరాజు అయితే శాంతినే కోరుకుంటాను. రాజ్యం కోసం ఎదుటవారిని ఎందుకు చంపాలి. వారిలోను బంధువులు, మిత్రులు ఉన్నారనే ధర్మరాజు మాటలతో నేనూ ఏకీభవిస్తాను. అందరినీ చంపుకుంటూపోతే చివరికి మట్టే మిగిలేది. పాపమేగా చుట్టుకొనేది. జీవితానికి శాంతి లేనపుడు ఆ జీవనమే వృథా. అలాగే ఎవరితోను దీర్ఘకాల విరోధం పనికి రాదన్న ధర్మరాజు మాటలు అక్షరసత్యాలు.

ఆవేశం, పగ మనిషి పతనానికి దారితీసేవి. కనుక కలత లేక నిదానంగా ఉండటమే మంచిది అన్న ధర్మరాజు మాటలు మనల్ని ఆలోచింపచేస్తాయి. ‘మాట తూటా వంటిది’ అన్నాడో కవి. కనుక నీ మాటలు ఎవరినీ, ఎప్పుడూ గాయపరచకుండా ఉండేలా చూసుకోవాలి. ‘శాంతము లేక సౌఖ్యము లేదు’ అన్న త్యాగరాజు మాటల్లోని భావాన్ని మనం గ్రహించాలి. శాంతి, సహజీవనం, సామరస్యం ఉన్న ఏ దేశమూ నాశనం కాదు. ‘అంధ విశ్వాసం, పేరాశ, భయంలేని జీవితమే వ్యక్తి నిరంతర ఆనందానికి మూలం, పునాది. అదే విశ్వశాంతి సౌఖ్యాలకు ఆధారం’ అన్న జిడ్డు కృష్ణమూర్తి (తత్త్వవేత్త) మాటలను మనం గుర్తుంచుకోవాలి. నీకు శాంతి ఇవ్వగలిగింది నీవు ఒక్కడవే. ఈ భూమి అంతటా శాంతి వర్ధిల్లాలి. అది నాతోనే ప్రారంభం కానిద్దాం అని అందరూ అనుకున్నప్పుడు ‘శాంతి’ అక్షరరూపం కాక, క్రియారూపం దాలుస్తుంది.

III. భాషాంశాలు (పదజాలం , వ్యాకరణం)

1. పర్యాయపదాలు :

యుద్ధం = రణం, సంగ్రామం, సంగరం, పోరు
ధరిత్రి = భూమి, నేల, ధరణి
పగలు = విరోధులు, శత్రువులు, వైరులు
శుభం = మేలు, క్షేమం, మంచి
శ్రీ = సిరి, సంపద, సొమ్ము
భూపతి = రాజు, జేడు, భూభర్త, ప్రభువు
కొడుకు = కుమారుడు, సుతుడు, తనూజుడు, పుత్రుడు

2. వ్యుత్పత్త్యర్థాలు :

1. కౌరవులు : కురువంశమున పుట్టినవారు = దుర్యోధనాదులు
2. పాండవులు – పాండురాజు కుమారులు = ధర్మరాజాదులు
3. దుర్యోధనుడు = సుఖముగా యుద్ధము చేయుటకు వీలుపడినవాడు = సుయోధనుడు
4. బంధువు రక్త సంబంధముచే బంధించువాడు = చుట్టము
5. కృష్ణుడు కృష్ణ (నలుపు) వర్ణము కలవాడు, భక్తుల హృదయాలను ఆకర్షించువాడు = విష్ణుని అవతార విశేషము
6. శ్రీ = విష్ణువును ఆశ్రయించునది = లక్ష్మి
7. ధర్మరాజు = సత్యం, అహింస మున్నగు ధర్మములకు రాజు = పాండుపుత్రుడు
8. మిత్రుడు = సర్వభూతములయందు స్నేహయుక్తుడు = స్నేహితుడు

AP Board 9th Class Telugu Important Questions Chapter 1 శాంతికాంక్ష

3. నానార్థాలు :

మిత్రుడు = హితుడు, సూర్యుడు
కృష్ణుడు = విష్ణువు, వసుదేవుని పుత్రుడు, వ్యాసుడు, అర్జునుడు
ఊరు = గ్రామం, లోపలి నుండి ద్రవం పైకివచ్చు, వృద్ధినొందు
దిక్కు = దిశ, శరణు, వైపు

4. ప్రకృతి – వికృతులు :

కాంక్ష – కచ్చు
బంధు – బందుగు (చుట్టము)
గ్రాసము – గాసము (ఆహారం)
దోషం – దోసం
బుద్ధి – బుద్ధి
ధర్మము – దమ్మము, దరమము
శ్రీ – సిరి
దిక్ – దెస (దిక్కు)
కార్యము – కర్జము
భూ – బువి

5. సంధులు :

సమయము + ఇది – సమయమిది – ఉత్వసంధి
అంశము + అగు – అంశమగు – ఉత్వసంధి
పగలు + ఐనన్ – పగటైనన్ – ఉత్వసంధి
దూఱు + ఎక్కుట – దూరెక్కుట – ఉత్వసంధి
అయిదు + ఊళ్ళు – అయిదూళ్ళు – ఉత్వసంధి
దోషము + అందుట – దోషమందుట – ఉత్వసంధి
పాము + ఉన్న – పామున్న – ఉత్వసంధి
ఉన్న + అట్లు – ఉన్నట్లు – అత్వసంధి
సత్ + జనులు – సజ్జనులు – శ్చుత్వసంధి
సుహృత్ + జనంబులు – సుహృజనంబులు – శ్చుత్వసంధి

6. సమాసాలు :

అన్నదమ్ములు – అన్నయును, తమ్ముడుయును – ద్వంద్వ సమాసం
ఐదు గ్రామాలు – ఐదు అను సంఖ్యగల గ్రామాలు – ద్విగు సమాసం
రాజ్యసంపద – రాజ్య మనెడి సంపద – రూపక సమాసం
బంధుమిత్రులు – బంధువులు మరియు మిత్రులు – ద్వంద్వ సమాసం
గొప్ప సాహసం – గొప్పదైన సాహసం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
వంశనాశనం – వంశము యొక్క నాశనం – షష్ఠీ తత్పురుష సమాసం
నీతివర్తనం – నీతితో కూడిన వర్తనం – తృతీయా తత్పురుష సమాసం
సజ్జనులు – మంచివారైన జనులు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
భూపతులు – భూమికి పతులు – షష్ఠీ తత్పురుష సమాసం
కౌరవపాండవులు – కౌరవులు, పాండవులు – ద్వంద్వ సమాసం

7. గణాలు :
AP Board 9th Class Telugu Important Questions Chapter 1 శాంతికాంక్ష 1
పద్య లక్షణాన్ని తెలిపేది ఛందస్సు. పద్యపాదం ఏ ఛందస్సుకు చెందినదో తెలియడానికి గురులఘువులతో గుర్తిస్తాము. గురువు – U, లఘువు – 1.

గురువు :
దీర్ఘాక్షరాలన్నీ గురువులు. సున్న (0) విసర్గలతో (8) కూడిన అక్షరాలు (కం, కఃమొ||) గురువులు, పొల్లుహల్లుతో కూడినవి (నన్,లన్) గురువులు. సంయుక్త, ద్విత్వాక్షరాలకు ముందున్నవి గురువులు. ఐ, ఔలతో కూడినవి కై, కౌ మొ||) గురువులు.

లఘువు :
గురువు కానిది లఘువు.

8. అలంకారాలు :

“మమ్మెఱుఁగు, దెదిరి నెఱుఁగుదు నెమ్మి యెఱుఁగుదు’. ఈ వాక్యమును ‘జ,గ,ద’ అను హల్లులు మరల మరల ఆవృతమైనవి. ఇది వృత్త్యనుప్రాస.

9th Class Telugu 1st Lesson శాంతికాంక్ష 1 Mark Bits

1. ధరిత్రి పుత్రిక సీత – (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి) (SA. I – 2018-19)
ఎ) అవని – ఆవని
బి) ధరణి – ధర
సి) భూమి – భారం
డి) నింగి – నేల
జవాబు:
బి) ధరణి – ధర

2. సూర్యుడు ఉదయించగానే స్నేహితుడు మా ఇంటికి వచ్చాడు. (గీత గీసిన పదాలకు నానార్థపదం గుర్తించండి) (S.A. I – 2018-19)
ఎ) భానుడు
బి) భాస్కరుడు
సి) మిత్రుడు
డి) చెలికాడు
జవాబు:
సి) మిత్రుడు

AP Board 9th Class Telugu Important Questions Chapter 1 శాంతికాంక్ష

3. పగయడగించు కొని యుండుట చాలా మంచిది – (గీత గీసిన పదానికి సంధి పేరు గుర్తించండి) (S.A. I – 2018-19)
ఎ) యణాదేశ సంధి
బి) అత్వ సంధి
సి) ఉత్వ సంధి
డి) యడాగమ సంధి
జవాబు:
డి) యడాగమ సంధి

4. నా దేశం పుణ్యభూమి గా పేరొందినది – (గీతగీసిన పదానికి సమాసం గుర్తించండి) (S.A. I – 2018-19)
ఎ) ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం
బి) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
సి) విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం
డి) ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం
జవాబు:
బి) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

5. మ, స, జ, స, త, త, గ అనే గణాలు గల పద్య మేది? (S.A. I – 2018-19 S.A. III – 2016-17)
ఎ) మత్తేభం
బి) ఉత్పలమాల
సి) చంపకమాల
డి) శార్దూలం
జవాబు:
డి) శార్దూలం

6. 11వ అక్షరం యతిస్థానంగా గల పద్యం (S.A. I – 2018-19)
ఎ) ఉత్పలమాల
బి) చంపకమాల
సి) తేటగీతి
డి) మత్తేభం
జవాబు:
బి) చంపకమాల

7. వాగ్దేవిని ఆరాధించడం నా అభిమతం – (గీత గీసిన పదానికి గణం గుర్తించండి) / (S.A. I – 2018-19)
ఎ) మ గణం
బి) స గణం
సి) త గణం
డి) భ గణం
జవాబు:
సి) త గణం

8. శ్రీకృష్ణా ! నీవే మాకు దిక్కు (గీత గీసిన పదం ఏ గణమో గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) ర
బి) త
సి) మ
డి) య
జవాబు:
సి) మ

9. శార్దూల పద్యం యతి స్థానం గుర్తించండి. (S.A. II – 2018-19)
ఎ) 11వ అక్షరం
బి) 10వ అక్షరం
సి) 13వ అక్షరం
డి) 12వ అక్షరం
జవాబు:
సి) 13వ అక్షరం

10. త్రిపురసుందరి కడవతో వడి వడి గ తడబడని అడుగులతో గడపను దాటింది – ఏ అలంకారం? (S.A. II – 2018-19)
ఎ) వృత్యానుప్రాస
బి) అంత్యానుప్రాస
సి) లాటానుప్రాస
డి) ఛేకానుప్రాస
జవాబు:
ఎ) వృత్యానుప్రాస

AP Board 9th Class Telugu Important Questions Chapter 1 శాంతికాంక్ష

11. కావున శాంతి బొందుటయ కర్జము దానది యట్టులుండె శ్రీ – నందలి ఛందస్సు గుర్తించండి. (S.A. II – 2017-18)
ఎ) మత్తేభం
బి) శార్దూలం
సి) చంపకమాల
డి) ఉత్పలమాల
జవాబు:
డి) ఉత్పలమాల

12. త్రిపుర సుందరి దయామయ హృదయం గలది – (గీత గీసిన పదానికి గణం గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) న
బి) భ
సి) స
డి) య
జవాబు:
ఎ) న

13. ఉపమాలంకార లక్షణం గుర్తించండి. (S.A. II – 2017-18)
ఎ) ఉపమానమునందు ఉపమానధర్మం ఆరోపించడం
బి) ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పడం
సి) ఉపమాన ఉపమేయాలకు భేదం చెప్పడం
డి) ఉపమాన ఉపమేయాలకు మనోహరమైన సాదృశ్యం చెప్పడం
జవాబు:
డి) ఉపమాన ఉపమేయాలకు మనోహరమైన సాదృశ్యం చెప్పడం

14. కింది వానిలో ఛేకానుప్రాసాలంకారమును గుర్తించండి. (S.A. III – 2016-17)
ఎ) పేదలకు చేయు సేవ
బి) చక్కని చుక్క మా అక్క
సి) భారతములో యుక్తి, భాగవతమున భక్తి, రామకథయే రక్తి
డి) నీకు వంద వందనాలు
జవాబు:
డి) నీకు వంద వందనాలు

15. పగవాడిచేత స్నేహం చెడగొట్టబడుతుంది. (ఈ కర్మణి వాక్యానికి కర్తరి వాక్యాన్ని గుర్తించండి.) (S.A. III – 2016-17)
ఎ) పగవానిచే స్నేహం చెడగొట్టును.
బి) పగవాని వలన స్నేహం చెడదు.
సి) స్నేహం చేత పగవాడు చెడగొట్టబడతాడు.
డి) పగవాడు స్నేహాన్ని చెడగొడతాడు.
జవాబు:
డి) పగవాడు స్నేహాన్ని చెడగొడతాడు.

భాషాంశాలు (పదజాలం, వ్యాకరణం)

1. అర్థాలు :

16. శత్రుత్వము ఏర్పడితే సర్పము ఉన్న ఇంటిలో ఉన్నట్లే – గీత గీసిన పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి.
A) విరోధి
B) పులి
C) పాము
D) దయ్యం
జవాబు:
C) పాము

17. యుద్ధం వల్ల కుల క్షయం కలుగుతుంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) వృద్ధి
B) నాశనం
C) సమం
D) ఎదుగుదల
జవాబు:
B) నాశనం

18. సజ్జనుల మనస్సులకు తగినట్లుగా మాట్లాడాలి – గీత గీసిన పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి.
A) మంచివారు
B) పిల్లలు
C) స్త్రీలు
D) చెడ్డవారు
జవాబు:
A) మంచివారు

19. నీకు బుద్ధులు చెప్పడానికి నేనే మాత్రం వాడిని? – గీత గీసిన పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి.
A) చాడీలు
B) పొగడ్తలు
C) ఆజ్ఞలు
D) ఉపాయాలు
జవాబు:
D) ఉపాయాలు

20. మా మనము నిశ్చింతగా చేయుము – గీత గీసిన పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి.
A) అందరం
B) మనస్సు
C) మీరు
D) మేము
జవాబు:
B) మనస్సు

21. దేవుని దయవల మాకు ఏ విధమైన పొచ్చెమును లేదు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) అపకీర్తి
B) కొఱత
C) చెడు
D) చెడ్డపేరు
జవాబు:
B) కొఱత

AP Board 9th Class Telugu Important Questions Chapter 1 శాంతికాంక్ష

22. శ్రీకృష్ణుడు అన్ని విషయాలు ఎఱుక గలవాడు – గీత గీసిన పదానికి అర్థమును గుర్తించండి.
A) తెలివి
B) జ్ఞాపకము
C) గుర్తు
D) ప్రీతి
జవాబు:
B) జ్ఞాపకము

2. పర్యాయపదాలు :

23. యుద్ధం వల్ల సంపద నశిస్తుంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) సిరి, గిరి
B) సొమ్ము, పొమ్ము
C) సిరి, సొమ్ము
D ) శ్రీ, వరి
జవాబు:
C) సిరి, సొమ్ము

24. మాకు శుభము కలుగునట్లు చేయుము – గీత గీసిన పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి.
A) మేలు, కీడు
B) క్షేమం, మేలు
C) మంచి, చెడు
D) మంచి, మర్యాద
జవాబు:
B) క్షేమం, మేలు

25. ధృతరాష్ట్రుని కుమారుడు సుయోధనుడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) పుత్రుడు, అల్లుడు
B) సుతుడు, తమ్ముడు
C) కొడుకు, తనూజుడు
D) అన్న, కొడుకు
జవాబు:
C) కొడుకు, తనూజుడు

26. మనిషి ఎదిగే కొద్ది శత్రువులు తగ్గాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) పగలు, వైరులు
B) విరోధులు, మిత్రులు
C) స్నేహితులు, వైరులు
D) విరోధులు, హితులు
జవాబు:
A) పగలు, వైరులు

27. ధర్మానికి రాజు ధర్మరాజు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) భూభర్త, భూపతి
B) లేడు, చంద్రుడు
C) ఇంద్రుడు, ప్రభువు
D) భటుడు, సైనికుడు
జవాబు:
A) భూభర్త, భూపతి

28. ‘మిత్రుల మధ్య పోరితము అనర్థాలకు మూలము’ – గీత గీసిన పదానికి సమానార్థక పదం గుర్తించండి.
A) వంశనాశనము
B) ద్వేషము
C) ఈర్ష్య
D) యుద్ధము
జవాబు:
D) యుద్ధము

29. శ్రీకృష్ణుడు నెమ్మిపింఛం ధరిస్తాడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) ప్రేమ, కోరిక
B) నెమలి, మయూరం
C) విరోధం, కలహము
D) హంస, నెమలి
జవాబు:
B) నెమలి, మయూరం

30. ‘విరోధులతో పోరితము లేకుండా పొందు కలిగించు’ – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) తగవు, దెబ్బలాట
B) సమరం, సంగ్రామం
C) సంధి, తగవు
D) కయ్యం, నెయ్యం
జవాబు:
B) సమరం, సంగ్రామం

31. కర్ణుడు, దుర్యోధనునకు మంచి మిత్రుడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు ఏవి?
A) స్నేహితుడు, నేస్తము
B) హితుడు, అహితుడు
C) అరి, విరోధి
D) సూర్యుడు, ఆప్తుడు
జవాబు:
A) స్నేహితుడు, నేస్తము

3. వ్యుత్పత్యర్థాలు :

32. కురువంశానికి చెందినవారు – అనే వ్యుత్పత్తి గల పదం ఏది?
A) పాండవులు
B) కౌరవులు
C) కుమారులు
D) కొమరులు
జవాబు:
A) పాండవులు

33. పాండురాజు కుమారులు – అనే వ్యుతుతి గల పదం ఏది?
A) పాండాలు
B) పాండురులు
C) పాండవులు
D) కౌంతేయులు
జవాబు:
C) పాండవులు

34. సుఖముగా యుద్ధం చేయ వీలుపడనివాడు – అనే వ్యుత్పత్తి గల పదం ఏది?
A) ధర్మరాజు
B) అర్జునుడు
C) కర్ణుడు
D) దుర్యోధనుడు
జవాబు:
D) దుర్యోధనుడు

35. రక్త సంబంధముచే బంధించువాడు – అనే వ్యుత్పత్తి గల పదం ఏది?
A) బంధువు
B) మిత్రుడు
C) శత్రువు
D) పొరుగువాడు
జవాబు:
A) బంధువు

36. నలుపు వర్ణం కలవాడు — అనే వ్యుత్పత్తి గల పదం ఏది?
A) శివుడు
B) కృష్ణుడు
C) ఇంద్రుడు
D) చంద్రుడు
జవాబు:
B) కృష్ణుడు

AP Board 9th Class Telugu Important Questions Chapter 1 శాంతికాంక్ష

37. విష్ణువును ఆశ్రయించునది – అనే వ్యుత్పత్తి గల పదం ఏది?
A) సంపద
B) భక్తి
C) శ్రీ
D) మనసు
జవాబు:
C) శ్రీ

38. సత్యం, అహింస మున్నగు ధర్మాలకు రాజు – అనే వ్యుత్పత్తి గల పదం ఏది?
A) ధర్మరాజు
B) రారాజు
C) యువరాజు
D) మహారాజు
జవాబు:
A) ధర్మరాజు

39. సర్వ భూతములందు స్నేహయుక్తుడు – అనే వ్యుత్పత్తి గల పదం ఏది?
A) మనిషి
B) పక్షి
C) సన్నిహితుడు
D) మిత్రుడు
జవాబు:
D) మిత్రుడు

40. ‘జనార్దనుడు’ శబ్దానికి వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి.
A) జనులను అర్థించేవాడు
B) జనులచే పురుషార్థములకై కోరబడువాడు
C) జనులకు శత్రువు
D) జనాలను బాధించేవాడు
జవాబు:
B) జనులచే పురుషార్థములకై కోరబడువాడు

41. సులువుగా యుద్ధం చేయడానికి శక్యం కాని వాడు – అనే వ్యుత్పత్తి గల పదం ఏది?
A) దుర్యోధనుడు
B) సుయోధనుడు
C) కౌరవుడు
D) కితవుడు
జవాబు:
A) దుర్యోధనుడు

4. నానార్థాలు :

42. పుస్తకమే మనకు మంచి మిత్రుడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) హితుడు, సూర్యుడు
B) చంద్రుడు, మిత్రుడు
C) రాజు, తెలివి
D) బుద్ధి, ఆలోచన
జవాబు:
A) హితుడు, సూర్యుడు

43. శ్రీకృష్ణుడు జగన్నాటక సూత్రధారి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) విష్ణువు, శివుడు
B) విష్ణువు, వ్యాసుడు
C) అర్జునుడు, భీముడు
D) వాసుదేవుడు, ధర్మరాజు
జవాబు:
B) విష్ణువు, వ్యాసుడు

44. బావిలో నీరు ఊరుచున్నది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) వృద్ధి, తగ్గు
B) గ్రామం, సమం
C) వృద్ధి, గ్రామం
D) ద్రవం పైకి వచ్చు, లోనికిపోవు
జవాబు:
C) వృద్ధి, గ్రామం

45. ద్రౌపది తనకు శ్రీకృష్ణుడే దిక్కు అని ప్రార్థించింది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) ఆధారం, రక్షణ
B) దిశ, బంధువు
C) దిశ, శరణు
D) రక్షకుడు, బంధువు
జవాబు:
C) దిశ, శరణు

46. కృష్ణా ! నీకు నెమ్మి తెలుసు – గీత గీసిన పదానికి నానార్థాలు ఏవి?
A) ప్రేమ, సర్వము
B) ప్రేమ, నెమలి
C) రహస్యము, రక్షణ
D) విరోధి , పగ
జవాబు:
B) ప్రేమ, నెమలి

47. నీవు నా పక్షములో ఉండి నన్ను కాపాడాలి – గీత గీసిన పదానికి నానార్థాలు ఏవి?
A) ప్రక్క, టెక్క
B) 15 రోజులు, దిక్కు
C) వైపు, ఆశ్రయము
D) ఎదుట, ముందు
జవాబు:
A) ప్రక్క, టెక్క

48. నీవు తప్పక సమయమునకు రావాలి – గీత గీసిన పదానికి నానార్థాలు ఏవి?
A) కాలము, శపథము
B) మాట, చెల్లుబడి
C) అదును, వీలు
D) వేళ, యుక్తము ఇతూ
జవాబు:
A) కాలము, శపథము

5. ప్రకృతి – వికృతులు :

49. కాంక్ష నిస్వార్థంగా ఉండాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) కాంచ
B) కంచ
C) కచ్చు
D) కచు
జవాబు:
C) కచ్చు

50. దమ్మము తప్పి నడువకూడదు – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
A) దమం
B) ధర్మం
C) ధరమం
D) ధైర్యం
జవాబు:
B) ధర్మం

AP Board 9th Class Telugu Important Questions Chapter 1 శాంతికాంక్ష

51. సంపదలున్నప్పుడే బంధువులు వస్తారు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) చుట్టం
B) నేస్తం
C) బందు
D) బందుగు
జవాబు:
D) బందుగు

52. శ్రీలు పొంగు పల్లెలందు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) సిరి
B) శిరి
C) స్త్రీ
D) స్రీ
జవాబు:
A) సిరి

53. గ్రాస వాసాదులకై ప్రతి ఒక్కరు పోటీపడుతారు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) ఆహారం
B) గాసం
C) గాసు
D) అన్నం
జవాబు:
B) గాసం

54. దిక్ అంతాలకు కీర్తి వ్యాపించాలి – గీత గీసిన పదానికి వికృతిపదం గుర్తించండి.
A) దిగు
B) దేస
C) వైపు
D) శరణు
జవాబు:
B) దేస

55. సాధనమున కర్జములు సమకూరు ధరలోన – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
A) కార్జం
B) కర్య
C) కార్యం
D) కర్మ
జవాబు:
C) కార్యం

56. బుద్ధి లేనివారే తెలివితక్కువవారు – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
A) బుది
B) బుద్ధి
C) ఒద్ధి
D) బుద్ధి
జవాబు:
D) బుద్ధి

57. భూలోకంలో ప్రాణికోటి మనుగడ సాగిస్తోంది – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) బువి
B) బూ
C) బూవి
D) బూమి
జవాబు:
A) బువి

6. సంధులు :

58. ఉతునకు సంధి నిత్యము – ఇది ఏ సంధి సూత్రం?
A) నుగాగమసంధి
B) టుగాగమ సంధి
C) అత్వసంధి
D) ఉత్వసంధి
జవాబు:
D) ఉత్వసంధి

59. ‘సమయమిది’ – విడదీయండి.
A) సమయ + ఇది
B) సమయము + ఇది
C) సమయం + ఇది
D) సమ + మిది
జవాబు:
B) సమయము + ఇది

60. ‘అయిదు + ఊళ్ళు’ – సంధి చేయండి.
A) అయిదు యూళ్ళు
B) అయిదు నూళ్ళు
C) అయిదూళ్ళు
D) ఐదూళ్ళు
జవాబు:
C) అయిదూళ్ళు

AP Board 9th Class Telugu Important Questions Chapter 1 శాంతికాంక్ష

61. ఉత్వసంధికి ఉదాహరణను గుర్తించండి.
A) పామున్న
B) ఏమేమి
C) రాలేను
D) గురూపదేశం
జవాబు:
A) పామున్న

62. ‘ఉన్నట్లు’ – సంధి పేరేమిటి?
A) ఇత్వ సంధి
B) ఉత్వసంధి
C) ఉకారసంధి
D) అత్వసంధి
జవాబు:
D) అత్వసంధి

63. ‘సత్ + జనులు’ – కలిపి రాయండి.
A) సద్దనులు
B) సర్జనులు
C) సజ్జనులు
D) సర్టనులు
జవాబు:
C) సజ్జనులు

64. ‘సుహృజ్జనంబులు’ – సంధి పేరేమిటి?
A) జస్వసంధి
B) శ్చుత్వసంధి
C) లు,ల,న ల సంధి
D) గసడదవాదేశ సంధి
జవాబు:
B) శ్చుత్వసంధి

65. ‘అయిదూళ్ళు’ పదములోని సంధిని విడదీయండి.
A) అయి + దూళ్ళు
B) అయిదు + ఊళ్ళు
C) అయిదూ + ఊళ్ళు
D) అయిదు + ఉళ్ళు
జవాబు:
B) అయిదు + ఊళ్ళు

66. ‘తెంపుసేయు’ ఈ సంధి పదంలో గల సంధి ఏది?
A) సరళాదేశ సంధి
B) యడాగమ సంధి
C) గసడదవాదేశ సంధి
D) రుగాగమ సంధి
జవాబు:
C) గసడదవాదేశ సంధి

7. సమాసాలు:

67. అన్నదమ్ములంటే రామలక్ష్మణులే – గీత గీసిన పదం యొక్క సమాసం పేరేమిటి?
A) ద్విగువు
B) ద్వంద్వ
C) రూపకం
D) బహుబ్లిహి
జవాబు:
B) ద్వంద్వ

68. పాండవులు ఐదూళ్ళెనా ఇమ్మని అడిగారు – సమాసం పేరు ఏమిటి?
A) ద్వంద్వ
B) రూపకం
C) ద్విగువు
D) షష్ఠీ తత్పురుషం
జవాబు:
C) ద్విగువు

69. రూపక సమాసానికి ఉదాహరణ రాయండి.
A) సజ్జనులు
B) భూపతులు
C) రాజ్యసంపద
D) నీతివర్తనం
జవాబు:
C) రాజ్యసంపద

AP Board 9th Class Telugu Important Questions Chapter 1 శాంతికాంక్ష

70. ‘మంచివారైన జనులు’ – సమాసం చేయండి.
A) సజ్జనులు
B) మంచివాళ్ళు
C) మంచి ప్రజలు
D) దుర్జనులు
జవాబు:
A) సజ్జనులు

71. ‘నీతితో కూడిన వర్తనం’ – సమాసం పేరేమిటి?
A) చతుర్దీ తత్పురుషం
B) రూపకం
C) షష్ఠీ తత్పురుషం
D) తృతీయా తత్పురుషం
జవాబు:
D) తృతీయా తత్పురుషం

72. ‘కౌరవపాండవులు’ – సమాసం పేరేమిటి?
A) ద్విగువు
B) ద్వంద్వ
C) షష్ఠీ తత్పురుషం
D) రూపకం
జవాబు:
B) ద్వంద్వ

73. ‘తమ్ముకుఱ్ఱలు’ – సమాసానికి విగ్రహవాక్యం ఏది?
A) తమ్ముళ్ళు కుఱ్ఱలు
B) కుఱ్ఱవారైన తమ్ముళ్ళు
C) మసజసతతగ
D) సభరనమయవ
జవాబు:
B) కుఱ్ఱవారైన తమ్ముళ్ళు

74. ‘మామిడి గున్న’ అనేది ఏ సమాసం?
A) విశేషణ పూర్వపద కర్మధారయము
B) ఉపమాన పూర్వపద కర్మదారయం
C) విశేషణ ఉత్తరపద కర్మధారయం
D) బహుప్రీహి సమాసం
జవాబు:
C) విశేషణ ఉత్తరపద కర్మధారయం

75. ‘పుణ్యమైన భూమి’ – దీన్ని సమాసపదంగా కూర్చండి.
A) పుణ్యభూమి
B) భూమి పుణ్యం
C) పుణ్యపు భూమి
D) పుణ్యాల భూమి
జవాబు:
A) పుణ్యభూమి

8. గణాలు :

76. ‘పక్షము’ అనేది ఏ గణం?
A) న గణం
B) స గణం
C) భ గణం
D) మ గణం
జవాబు:
C) భ గణం

77. ‘జ్ఞానం’ గురులఘువులు గుర్తించండి.
A) UI
B) UU
C) IU
D) ILL
జవాబు:
B) UU

78. ‘న, జ, భ, జ, జ, జ, ర’ అను గణాలుండు పద్య మేది?
A) చంపకమాల
B) ఉత్పలమాల
C) కందం
D) సీసం
జవాబు:
A) చంపకమాల

79. ‘UTU’ దీనిని బట్టి మాటను గుర్తించండి.
A) కాలము
B) శుభంబు
C) చుట్టాలు
D) కేశవా
జవాబు:
D) కేశవా

80. ‘ఏ గతినైనఁ జక్కబడు టెంతయు నొప్పుజుమీ జనార్దనా’ – ఈ పద్యపాదము ఏ వృత్తములోనిది?
A) చంపకమాల
B) మత్తేభము
C) తేటగీతి
D) ఉత్పలమాల
జవాబు:
D) ఉత్పలమాల

AP Board 9th Class Telugu Important Questions Chapter 1 శాంతికాంక్ష

81. చంపకమాల వృత్తములో ఉండే గణాలు ఏవి?
A) భరనభభరవ
B) నజభజజజర
C) తమ్ముళ్ళైన కుఱ్ఱలు
D) తమ్ములును, కుఱ్ఱలును
జవాబు:
B) నజభజజజర

82. ‘ఆదుర్యో’ పదం ఏ గణానికి చెందింది?
A) మ గణము
B) త గణము
C) ర గణం
D) స గణం
జవాబు:
A) మ గణము

9. అలంకారాలు :

83. ఉపమాన, ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పుట – ఇది ఏ అలంకారం?
A) ఉపమాలంకారం
B) ఉత్ప్రేక్ష
C) రూపకం
D) అతిశయోక్తి
జవాబు:
A) ఉపమాలంకారం

84. “మమ్మెఱుఁగు, దెదిరి నెఱుఁగుదు నెమ్మి యెఱుఁగుదు” – ఇది ఏ అలంకారం?
A) లాటానుప్రాస
B) వృత్త్యనుప్రాస
C) రూపకం
D) అతిశయోక్తి
జవాబు:
B) వృత్త్యనుప్రాస

85. ‘పగయ కలిగెనేని పామున్న యింటిలో నున్న యట్లు’ఈ వాక్యంలో గల అలంకారమేది?
A) రూపకాలంకారము
B) స్వభావోక్తి
C) ఉపమాలంకారము
D) శ్లేషాలంకారము
జవాబు:
C) ఉపమాలంకారము

86. వాక్యాలకు బింబ ప్రతిబింబత్వం ఉంటే అది ఈ అలంకారం
A) ఉపమాలంకారం
B) స్వభావోక్తి
C) దృష్టాంతము
D) శ్లేష
జవాబు:
C) దృష్టాంతము

10. ఆధునిక వచనాన్ని గుర్తించడం :

87. లాతులైనఁ బగజైనను జంపన కోరనేల? – ఈ వాక్యానికి ఆధునిక వచనం గుర్తించండి.
A) పరాయివారైనా, విరోధులైనా చంపాలనే ఎందుకు కోరాలి?
B) పరులు, విరోధులు ఎందుకు చావాలి?
C) పరులు, విరోధులు ఎందుకు చంపాలి?
D) పరులైనా విరోధులను చంపాలి
జవాబు:
A) పరాయివారైనా, విరోధులైనా చంపాలనే ఎందుకు కోరాలి?

88. పగయ కలిగెనేనిఁ బామున్న యింటిలో నున్న యట్ల కాక ! – ఈ వాక్యానికి ఆధునిక వచనం గుర్తించండి.
A) పగ లేకపోతే పామున్న ఇంటిలో ఉన్నట్లే.
B) పగే కలిగితే పామున్న ఇంటిలో ఉన్నట్లే.
C) పగ ఉంటే పామున్న ఇంట్లో లేనట్టే.
D) పగ కదా పాముతో ఇంట్లో ఉన్నట్లుంటుంది.
జవాబు:
B) పగే కలిగితే పామున్న ఇంటిలో ఉన్నట్లే.

89. ‘వలవదధిక దీర్ఘ వైరవృత్తి’ – ఈ వాక్యానికి ఆధునిక
A) ఎక్కువగా దీర్ఘ వైరం పనికి రాదు
B) దీర్ఘ విరోధం వద్దు
C) వద్దు దీర్ఘ క్రోధం
D) వైరం మంచిది కాదు
జవాబు:
A) ఎక్కువగా దీర్ఘ వైరం పనికి రాదు

AP Board 9th Class Telugu Important Questions Chapter 1 శాంతికాంక్ష

11. కర్తరి, కర్మణి వాక్యాలను గుర్తించడం :

90. క్రియచే కర్త చెప్పబడిన అది కర్తరి ప్రయోగం దీనికి ఉదాహరణ గుర్తించండి.
A) రామునిచే రావణుడు చంపబడ్డాడు.
B) రాముడే రావణుని చంపాడు.
C) రాముడు రావణుని చంపెను.
D) రాముడు చంపాడు రావణుని.
జవాబు:
C) రాముడు రావణుని చంపెను.

12. వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించడం :

91. మా వంతు రాజ్యాన్ని మేము అనుభవిస్తాము – వ్యతిరేక వాక్యం గుర్తించండి.
A) మా వంతు రాజ్యాన్ని మేము అనుభవించము.
B) మా వంతు రాజ్యాన్ని వాళ్ళు అనుభవిస్తారు.
C) వాళ్ళవంతు రాజ్యాన్ని ఎవరో అనుభవిస్తారు.
D) మా వంతు రాజ్యాన్ని మేము అనుభవించాలా !
జవాబు:
A) మా వంతు రాజ్యాన్ని మేము అనుభవించము.

92. పగతో పగ సమసిపోదు – వ్యతిరేక వాక్యం గుర్తించండి.
A) పగతో పగ పెరుగుతుంది
B) పగతో పగ సమసిపోతుంది
C) పగతో పగ సమసిపోదా
D) పగతో పగ సమస్యే
జవాబు:
B) పగతో పగ సమసిపోతుంది

13. వాక్యరకాలను గుర్తించడం :

93. పరాయివారైనా, విరోధులైనా చంపాలనే ఎందుకు కోరాలి? – ఇది ఏ రకమైన వాక్యం?
A) నిషేధార్థకం
B) ఆశ్చర్యార్థకం
C) ప్రశ్నార్థకం
D) అనుమత్యర్థకం
జవాబు:
C) ప్రశ్నార్థకం

94. హస్తినాపురానికి వెళ్ళిరా – ఇది ఏ రకమైన వాక్యం?
A) ప్రార్థనాద్యర్థకం
B) ప్రేరణార్థకం
C) సామర్థ్యార్థకం
D) ఆశ్చర్యార్థకం
జవాబు:
A) ప్రార్థనాద్యర్థకం

95. చెప్పవలసినవి చెప్పి, నీదే భారం అన్నాడు – ఇది ఏ రకమైన వాక్యం?
A) సంయుక్త వాక్యం
B) సంక్లిష్ట వాక్యం
C) సామాన్య వాక్యం
D) మహావాక్యం
జవాబు:
B) సంక్లిష్ట వాక్యం

96. వానరులచే సేతువు కట్టబడెను – ఇది ఏ రకమైన వాక్యం?
A) కర్మణి
B) కర్తరి
C) సంయుక్త
D) సంక్లిష్ట
జవాబు:
A) కర్మణి

AP Board 9th Class Telugu Important Questions Chapter 1 శాంతికాంక్ష

14. ప్రక్రియలను గుర్తించడం :

97. పాండురాజు కుమారులు పాండవులు – ఇది ఏ ప్రక్రియకు చెందినదో గుర్తించండి.
A) ఆప్యత్యార్థకం
B) నిశ్చయార్థకం
C) ప్రశ్నార్థకం
D) క్త్యార్థకం
జవాబు:
A) ఆప్యత్యార్థకం

98. సంపద కావాలని యుద్ధం వద్దని కోరుతున్నాం – ఇది ఏ ప్రక్రియకు చెందినదో గుర్తించండి.
A) ప్రశ్నార్థకం
B) ప్రార్థనాద్యర్థకం
C) చేదర్థకం
D) నిషేధార్థకం
జవాబు:
B) ప్రార్థనాద్యర్థకం

99. “వర్తమాన కాలంలోని అసమాపక క్రియ”ను ఏమంటారు? – ఇది ఏ ప్రక్రియకు చెందినదో గుర్తించండి. (S.A. III – 2016-17)
A) క్యార్థకం
B) చేదర్థకం
C) శత్రర్థకం
D) ప్రశ్నార్థకం
జవాబు:
C) శత్రర్థకం

AP Board 9th Class Telugu Grammar

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions 9th Class Telugu Grammar Notes, Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Grammar

తెలుగు సంధులు

నా చిన్నప్పుడు చేసిన పనులు గుర్తుకు వచ్చాయి.

గమనిక :
పై వాక్యంలో “చిన్నప్పుడు” అనే పదం, చిన్న + అప్పుడు అనే రెండు పదాలు కలవడం వల్ల వచ్చింది. దీనినే “సంధి పదం” అంటారు. ఉచ్చరించడంలో సౌలభ్యం కోసం, రెండు పదాలను వెంట వెంటనే కలిపి మాట్లాడవలసినప్పుడు,

లేదా రాయవలసినప్పుడు, “సంధి పదం” ఏర్పడుతుంది.

తెలుగు సంధులు :
రెండు తెలుగుపదాల మధ్య జరిగే సంధులను “తెలుగు సంధులు” అంటారు.

సంధి :
వ్యాకరణ పరిభాషలో రెండు స్వరాల (అచ్చుల) కలయికను “సంధి” అని పిలుస్తారు.

సంధి కార్యం :
రెండు అచ్చుల మధ్య జరిగే మార్పును “సంధి కార్యం” అని పిలుస్తారు.

పూర్వ స్వరం :
సంధి జరిగే మొదటి పదం చివరి అక్షరంలోని అచ్చును, (స్వరాన్ని) “పూర్వ స్వరం” అని పిలుస్తారు.

పర స్వరం :
సంధి జరిగే రెండవ పదము మొదటి అక్షరములోని అచ్చును (స్వరాన్ని) “పర స్వరం” అని పిలుస్తారు.
ఉదా :
రామ + అయ్య : ‘మ’ లో ‘అ’, పూర్వ స్వరం; ‘అయ్య’ లోని ‘అ’ పర స్వరం.

1. అత్వ సంధి
సూత్రం : అత్తునకు సంధి బహుళము.

ఈ కింది పదాలను విడదీయండి.
ఉదా :
మేనల్లుడు = మేన + అల్లుడు = (న్ +) అ + అ = అ = (అత్వ సంధి)
1) ఒకప్పుడు = ఒక + అప్పుడు = (అ + అ = అ) = (అత్వ సంధి)
2) వచ్చినందుకు = వచ్చిన + అందుకు = (అ + అ = అ) = (అత్వ సంధి)
3) రాకుంటే = రాక + ఉంటే = (అ + ఉ = ఉ) = (అత్వ సంధి)
4) లేకేమి = లేక + ఏమి = (అ + ఏ = ఏ) = (అత్వ సంధి)
5) పోవుటెట్లు = పోవుట + ఎట్లు = (అ + ఎ = ఎ) = (అత్వ సంధి)

గమనిక :
పై సంధి పదాలలోని పూర్వ స్వరం ‘అ’. అది పర స్వరంలోని అచ్చుతో కలిస్తే పూర్వ స్వరం ‘అ’ లోపిస్తుంది. ‘అ’ లోపించింది కాబట్టి ‘అత్వ సంధి’.

అత్వసంధి లేక ‘అకారసంధి’ అంటారు. పొట్టి ‘అ’ అనే అక్షరానికి అచ్చు పరమైతే ‘అత్వ సంధి’ వస్తుంది.

* అత్వ సంధి (అకార సంధి) సూత్రం :అత్తునకు సంధి బహుళము.

2. ఇత్వ సంధి
సూత్రం :ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగానగు.
ఈ కింది పదాలను విడదీయండి.
ఉదా :
అ) ఏమంటివి = ఏమి + అంటివి = (ఇ + అ = అ) = (ఇత్వ సంధి)
సంధి జరుగనప్పుడు “య కారం” ఆగమంగా వస్తుంది. దానినే ‘యడాగమం’ అని పిలుస్తారు.

ఆ) ఏమియంటివి = ఏమి + య్ + అంటివి = (ఇ + అ = య) : (ఇకారసంధి రాని యడాగమరూపం)

గమనిక :
ప్రథమ, ఉత్తమ పురుష బహువచన క్రియల ఇకారమునకు సంధి వైకల్పికంగా జరుగుతుంది.
వచ్చిరిపుడు = వచ్చిరి + ఇపుడు – (ఇ + ఇ + ఇ) – (ఇత్వ సంధి)
వచ్చిరియిపుడు = వచ్చిరి + య్ + ఇపుడు – (ఇ + ఇ + యి) (యడాగమం వచ్చిన రూపం)

గమనిక :
పై ఉదాహరణములలో హ్రస్వ ఇకారానికి అచ్చు కలిసినపుడు సంధి జరిగింది. దీనిని “ఇత్వసంధి” అంటారు. ఇత్వ సంధి తప్పక జరుగాలన్న నియమం లేదు.

వైకల్పికం :
ఇత్వ సంధి జరుగవచ్చు లేక జరుగకపోవచ్చు. వ్యాకరణంలో ఈ పరిస్థితిని “వైకల్పికం” అని పిలుస్తారు.
అభ్యాసము :
ఉదా :
1) ఏమంటివి = ఏమి + అంటివి = (మ్ + ఇ + అ = మ)
2) పైకెత్తినారు = పైకి + ఎత్తినారు – (ఇ + ఎ = ఎ) = ఇత్వ సంధి
3) మనిషన్నవాడు = మనిషి + అన్నవాడు = (ఇ + అ = అ) = ఇత్వ సంధి

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

3. ఉత్వ సంధి
ఉకారసంధి సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధి నిత్యం.

ఈ కింది పదాలను విడదీయండి.
ఉదా :
రాముడతడు = రాముడు + అతడు = (డ్ + ఉ + అ = డ) = (ఉత్వ సంధి)
1) అతడెక్కడ = అతడు + ఎక్కడ = (ఉ + ఎ = ఎ) = (ఉత్వ సంధి)
2) మనమున్నాము = మనము + ఉన్నాము = (ఉ + ఉ = ఉ) = (ఉత్వ సంధి)
3) మనసైన = మనసు + ఐన = (ఉ + ఐ = ఐ) = (ఉత్వ సంధి)

గమనిక :
హ్రస్వ ఉకారానికి, అనగా ఉత్తుకు, అచ్చు కలిసినప్పుడు, పూర్వ స్వరం ఉకారం లోపించి, పర స్వరం కనిపిస్తుంది. లోపించిన పూర్వ స్వరం ‘ఉ’ కాబట్టి, ఇది “ఉత్వ సంధి” అని పిలువబడుతుంది.

ఉత్వ సంధి సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి నిత్యం.
నిత్యం : నిత్యం అంటే, తప్పక సంధికార్యం జరుగుతుందని అర్థం

4. యడాగమం సంధి
సూత్రం : సంధి లేనిచోట అచ్చుల మధ్య “య్” వచ్చి చేరడాన్ని “యడాగమం” అని పిలుస్తారు.

ఈ కింది పదాలను విడదీయండి.
ఉదా :
అ) మాయమ్మ = మా + అమ్మ = మాయమ్మ
ఆ) మాయిల్లు = మా + ఇల్లు = మాయిల్లు
ఇ) హరియతడు = హరి + అతడు = హరియతడు

గమనిక :
పై ఉదాహరణలలో సంధి జరుగలేదు. కాని కొత్తగా ‘య్’ వచ్చి చేరింది. అలా చేరడం వల్ల ఈ కింది విధంగా మార్పు జరిగింది.
అ)మా + య్ + అమ్మ = మా ‘య’ మ్మ
ఆ)మా + య్ + ఇల్లు = మా ‘ఋ’ ల్లు
ఇ) హరి + య్ + అతడు = హరి ‘య’ తడు

యడాగమం :
సంధి లేనిచోట అచ్చుల మధ్య “య్” వచ్చి చేరడాన్ని “యడాగమం” అంటారు.

5. ఆమ్రేడిత సంధి
సూత్రం : అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరుచుగా వస్తుంది.

ఆమ్రేడితం :
మొదట పలికిన పదమునే తిరిగి పలుకుతాము. అలా రెండవమారు పలికిన పదాన్ని ‘ఆమ్రేడితం’ అంటాము.
ఉదా :
1) ‘ఆహా + ఆహా ఆహా అనే పదం రెండుసార్లు వచ్చింది. అందులో రెండవ ఆహా అనే దాన్ని ఆమ్రేడితం అని పిలవాలి.
2) అరెరె – అరె + అరె : రెండవసారి వచ్చిన ‘అరె’ ఆమ్రేడితం.
3) ఔరౌర = ఔర + ఔర – రెండవసారి వచ్చిన ‘ఔర’ ఆమ్రేడితం.

గమనిక :
పై ఉదాహరణములలో ఒక్కొక్క పదం రెండుసార్లు వచ్చింది. రెండవసారి వచ్చిన పదాన్ని ‘ఆమ్రేడితం’ అంటారు.
ఆమ్రేడిత సంధికి ఉదాహరణములు :
ఔర + ఔర = ఔర్ + అ
ఆహా + ఆహా ఆహ్ + ఆ
ఓహో + ఓహో = ఓహ్ + ఓ

గమనిక :
పై ఉదాహరణములలో పూర్వ పదం అనగా మొదటి పదం చివర, అ, ఆ, ఓ వంటి అచ్చులున్నాయి. ఈ అచ్చులకు ఆమ్రేడితం పరమైతే, సంధి వస్తుంది.
ఔర + ఔర = ఔరౌర = (అ + ఔ = ఔ)
ఆహా + ఆహా ఆహాహా – (ఆ + ఆ = ఆ)
ఓహో + ఓహో : ఓహోహో = (ఓ + ఓ = ఓ)
ఏమి + ఏమి = ఏమేమి = (ఇ + ఏ = ఏ)
ఎట్లు + ఎట్లు : ఎట్లెట్లు = (ఉ + ఎ = ఎ)
ఏమిటి + ఏమిటి = ఏమిటేమిటి = (ఇ + ఏ = ఏ)
అరె అరె . . అరెరె : (ఎ + అ = అ)
పై విషయాలను గమనిస్తే ఆమ్రేడిత సంధి సూత్రాన్ని ఇలా తయారుచేయవచ్చు.

ఆమ్రేడిత సంధి సూత్రం :
అచ్చునకు ఆమ్రేడితం పరమైతే, సంధి తరుచుగా అవుతుంది.

గమనిక :
అమ్రేడిత సంధి, కింది ఉదాహరణములలో వికల్పంగా జరుగుతుంది. ఈ కింది ఉదాహరణలను గమనిస్తే, సంధి జరిగిన రూపం, సంధిరాని రూపమూ కనబడతాయి.
ఉదా :
ఏమి + ఏమి = ఏమేమి, ఏమియేమి (సంధి వైకల్పికం)
ఎట్లు + ఎట్లు = ఎట్లెట్లు, ఎట్లు, ఎట్లు (సంధి వైకల్పికం)
ఎంత + ఎంత = ఎంతెంత, ఎంతయెంత (సంధి వైకల్పికం)

6. ఆమ్రేడిత ద్విరుక్తటకారాదేశ సంధి
సూత్రం :ఆమ్రేడితం పరమగునపుడు, కడాదుల, తొలి యచ్చు మీది వర్ణముల కెల్ల అదంతంబగు ద్విరుక్తటకారంబగు.
కింది ఉదాహరణలను గమనించండి.
1) పగలు + పగలు = పట్టపగలు
2) చివర + చివర = చిట్టచివర
3) కడ + కడ = కట్టకడ

గమనిక :
1) పగలు + పగలు : పట్టపగలు అవుతోంది. అంటే ‘ప’ తర్వాత ఉన్న ‘గలు’ అన్న అక్షరాలకు బదులుగా, ‘ట్ట’ వచ్చింది. ‘ట్ట’ వచ్చి, ‘పట్టపగలు’ అయింది.

2) చివర + చివర అన్నప్పుడు ‘చి’ తర్వాత రెండక్షరాల మీద ‘మీ’ వచ్చి, ‘చిట్టచివర’ అయింది.
3) కడ + కడ అన్నప్పుడు ‘డ’ స్థానంలో ‘మీ’ వచ్చి ‘కట్టకడ’ అయింది. ఇప్పుడు కిందివాటిని కలిపి రాయండి.
ఎదురు + ఎదురు = ఎట్ట యెదురు
కొన + కొన = కొట్టకొను
మొదట + మొదట = మొట్టమొదట
బయలు + బయలు = బట్ట బయలు
తుద + తుద = తుట్టతుద

గమనిక :
ఆమ్రేడితం పరంగా ఉంటే, కడ మొదలైన శబ్దాల, మొదటి అచ్చు మీద అన్ని అక్షరాలకు ‘ట్ట’ వస్తుండడం గమనించాము.

సూత్రం :
ఆమ్రేడితం పరమగునపుడు, కడాదుల, తొలి యచ్చు మీది వర్ణముల కెల్ల అదంతంబగు ద్విరుక్తటకారంబగు.

7. ద్రుతప్రకృతిక సంధి
సరళాదేశ సంధి : ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు.

ఈ కింది పదాలు చదివి పదంలోని చివర అక్షరం కింద గీత గీయండి. 1) పూచెను 2) చూచెన్ 3) తినెను 4) చూచెన్ 5) ఉండెన్

గమనిక :
పై పదాలను గమనిస్తే పదాల చివర, ను, చ్ లు కనిపిస్తాయి. అంటే పదాల చివర నకారం ఉంది. ఈ నకారాన్ని ‘ద్రుతం’ అంటారు. ద్రుతము చివరన గల పదాలను, “ద్రుత ప్రకృతికములు” అంటారు.

గమనిక :
పూచెను, చూచెన్, తినెను, చూచెన్, ఉండెన్ – అనేవి ద్రుత ప్రకృతికములు.
కింది ఉదాహరణములను గమనించండి.
ఉదా :
అ) పూచెన్ + కలువలు = పూచెన్ + గలువలు
ఆ) దెసన్ + చూచి = దెసన్ + జూచి
ఇ) చేసెన్ + టక్కు = చేసెన్ + డక్కు
ఈ) పాటిన్ + తప్ప = పాటిన్ + దప్ప
ఉ) వడిన్ + పట్టి = వడిన్ + బట్టి
ఊ) చేసెను + తల్లీ : చేసెను + దల్లీ
ఋ) దెసను + చూసి = దెసను + జూసి

గమనిక :
ద్రుత ప్రకృతానికి ‘క’ పరమైతే ‘గ’, ‘చ’ పరమైతే ‘జ’, ‘ఓ’ పరమైతే ‘డ’, ‘త’ పరమైతే ‘ద’, ‘ప’ పరమైతే ‘బ’ ఆదేశంగా వస్తాయి.
1) క – ‘గ’ గా,
2) చ – ‘జ’ గా
3) ట – ‘డ’ గా
4) త – ‘ద’ గా
5) ప – ‘బ’ గా మార్పు వచ్చింది.

ఇందులో ‘క చట తప’ లకు, ‘పరుషములు’ అని పేరు, ‘గ జ డ ద బ’ లకు, ‘సరళములు’ అని పేరు. దీనిని బట్టి సరళాదేశ సంధి సూత్రం ఇలా ఉంటుంది.

సూత్రం :
ద్రుత ప్రకృతికము మీది పరుషములకు, సరళములగు.

గమనిక :
ఇప్పుడు పై ఉదాహరణలలో మార్పు గమనించండి.
ఉదా :
పూచెఁ గలువలు ; (ద్రుతం అరసున్నగా మారింది)
పూచెను + కలువలు (పూచెం గలువలు (ద్రుతం సున్నగా మారింది) పూచెనలువలు (ద్రుతం మీద హల్లుతో కలిసి సంశ్లేష రూపం అయ్యింది) పూచెను గలువలు. ద్రుతము మార్పు చెందలేదు) దీనికి సూత్రం చెపితే సూత్రం ఇలా ఉంటుంది.

2వ సూత్రం : ఆదేశ సరళానికి ముందున్న ద్రుతానికి, బిందు, సంశ్లేషలు విభాషగా వస్తాయి.
గమనిక :
అంటే ఒక్కోసారి బిందువు వస్తుంది. ఒక్కోసారి సంశ్లేష వస్తుంది.

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

8. గసడదవాదేశ సంధి
సూత్రం : ప్రథమ మీది పరుషములకు గసడదవలు బహుళంబుగానగు.

కింది పదాలను ఎలా విడదీశారో గమనించండి.
1) గొప్పవాడు గదా = గొప్పవాడు + కదా (డు + క)
2) కొలువు సేసి = కొలువు + చేసి (వు + చే)
3) వాడు డక్కరి = వాడు + టక్కరి (డు + ట)
4) నిజము దెలిసి = నిజము + తెలిసి (ము + 3)
5) పాలువోయక = పాలు + పోయక (లు + పో)

గమనిక :
పై ఉదాహరణలలో పూర్వపదం చివర ప్రథమా విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి. పరపదం మొదట క, చ, ట, త, ప లు ఉన్నాయి. ఈ విధంగా ప్రథమావిభక్తి మీద, ప్రత్యయాలు క, చ, ట, త, ప లు పరమైతే, వాటి స్థానంలో గ, స, డ, ద, వ, లు ఆదేశంగా వస్తాయి. అంటే
1) క – గ – గా మారుతుంది
2) త – ద – గా మారుతుంది
3) చ – స గా మారుతుంది
4) ప – వ గా మారుతుంది
5) ట – డ గా మారుతుంది.

అంటే క, చ, ట, త, ప లకు, గ, స, డ, ద, వ లు ఆదేశంగా వస్తాయి.

గసడదవాదేశ సంధి సూత్రం :
ప్రథమ మీది పరుషములకు గ స డ ద వ లు బహుళంబుగానగు

ద్వంద్వ సమాసంలో : గ స డ ద వా దేశ సంధి.

కింది పదాలను గమనించండి
కూరగాయలు = కూర + కాయ + లు
కాలుసేతులు = కాలు + చేయి + లు
టక్కుడెక్కులు = టక్కు + టెక్కు + లు
తల్లి దండ్రులు = తల్లి + తండ్రి + లు
ఊరువల్లెలు = ఊరు + పల్లె + లు

గమనిక :
పై ఉదాహరణలు ద్వంద్వ సమాసపదాలు. పై ఉదాహరణలలో కూడా క చ ట త ప లకు గ స డ ద వ లు వచ్చాయి.
దీన్నే గ స డ ద వా దేశం అంటారు.

గసడదవాదేశ సంధి సూత్రం :
ద్వంద్వ సమాసంలో మొదటి పదంమీద ఉన్న క చ ట త ప లకు, గ స డ ద వలు క్రమంగా వస్తాయి.
కింది పదాలను కలపండి.
1) అక్క చెల్లి = అక్కాసెల్లెండ్లు
2) అన్న + తమ్ముడు – అన్నదమ్ములు

9. టుగాగమ సంధి
సూత్రం : కర్మధారయంబులందు ఉత్తునకు అచ్చుపరమగునపుడు టుగాగమంబగు.

ఈ కింది పదాలను పరిశీలించండి.
నిలువు + అద్దం = నిలువుటద్దం
తేనె + ఈగ = తేనెటీగ
పల్లె + ఊరు = పల్లెటూరు

గమనిక :
వీటిలో సంధి జరిగినపుడు ‘ట్’ అదనంగా చేరింది. ఇలా ‘ట్’ వర్ణం వచ్చే సంధిని ‘టుగాగమ సంధి’ అంటారు.
అలాగే కింది పదాలు కూడా గమనించండి.
1) చిగురు + ఆకు = చిగురుటాకు / చిగురాకు
2) పొదరు + ఇల్లు : పొదరుటిల్లు / పొదరిల్లు

గమనిక :
వీటిలో ‘ట్’ అనే వర్ణం, సంధి జరిగినపుడు రావచ్చు. ‘ట్’ వస్తే “టుగాగమం” అవుతుంది. ‘ట్’ రాకుంటే ‘ఉత్వ సంధి’ అవుతుంది.

టుగాగమ సంధి సూత్రం :
కర్మధారయములందు, ఉత్తునకు అచ్చు పరమైతే టుగాగమంబగు.

2) టుగాగమ సంధి (వికల్పం) :
కర్మధారయంబు నందు పేర్వాది శబ్దములకు అచ్చు పరమగునపుడు టుగాగమంబు విభాషనగు.
ఉదా :
1) పేరు + ఉరము = పేరు టురము / పేరురము
2) చిగురు + ఆకు = చిగురుటాకు / చిగురాకు
3) పొదరు + ఇల్లు = పొదరుటిల్లు / పొదరిల్లు

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

10. లులన సంధి
సూత్రం : లులనలు పరమైనపుడు ఒక్కొక్కప్పుడు ముగాగమానికి లోపం, దాని పూర్వ స్వరానికి దీర్ఘం వస్తాయి.
ఈ కింది ఉదాహరణములు గమనించండి.
1) పుస్తకములు – పుస్తకాలు
2) దేశముల – దేశాల
3) జీవితమున – జీవితాన
4) గ్రంథములు – గ్రంథాలు
5) రాష్ట్రముల – రాష్ట్రాల
6) వృక్షమున – వృక్షాన

పై పదాల్లో మార్పును గమనించండి.
పుస్తకములు, గ్రంథములు, దేశములు, రాష్ట్రములు, జీవితమున, వృక్షమున – వీటినే మనం పుస్తకాలు, గ్రంథాలు, దేశాలు, రాష్ట్రాలు, జీవితాన, వృక్షాన అని కూడా అంటాం.

గమనిక :
ఈ మార్పులో లు, ల, న అనే అక్షరాల ముందున్న ‘ము’ పోయింది. ‘ము’ కంటే ముందున్న అక్షరానికి దీర్ఘం వచ్చింది.

లులన సంధి సూత్రం :
లు, ల, న లు పరమైనప్పుడు, ఒక్కొక్కప్పుడు మువర్ణానికి లోపము, దాని పూర్వ స్వరానికి దీర్ఘమూ వస్తాయి.

11. పడ్వాది సంధి
సూత్రం : పడ్వాదులు పరమగునపుడు ‘ము’ వర్ణకానికి లోపమూ, పూర్ణ బిందువూ (0) విభాషగా అవుతాయి.
ఈ కింది ఉదాహరణములు గమనించండి.
1) భయము + పడు = భయంపడు, భయపడు

విడదీసిన పదాలకూ, కలిపిన పదాలకూ తేడా గమనించండి. కలిపిన పదంలో ‘ము’ కు బదులుగా సున్న(0) వచ్చింది. మరో దానిలో ‘ము’ లోపించింది.

పడ్వాది సంధి సూత్రం :
పడ్వాదులు పరమగునపుడు ‘ము’ వర్ణకానికి లోపమూ, పూర్ణబిందువూ (0) విభాషగా అవుతాయి.

గమనిక :
పడ్వాదులు = పడు , పట్టె, పాటు అనేవి.

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

12. త్రికసంధి సూత్రం :
త్రికము మీది అసంయుక్త హల్లుకు ద్విత్వం బహుళంగా వస్తుంది.
ఈ కింది ఉదాహరణ చూడండి
అక్కొమరుండు = ఆ + కొమరుండు
ఆ + కొమరుడు = అనే దానిలో ‘ఆ’, త్రికంలో ఒకటి. ఇది ‘అ’ గా మారింది. సంయుక్తాక్షరం కాని హల్లు ‘కొ’ ద్విత్వంగా ‘క్కొ’ గా మారింది.

అలాగే ఈ, ఏలు అనే త్రికములు కూడా, ఇ, ఎలుగా మారుతాయి.
ఉదా :
ఈ + కాలము = ఇక్కాలము
ఏ + వాడు : ఎవ్వాడు

త్రికసంధి సూత్రం :
త్రికము మీది అసంయుక్త హల్లుకు ద్విత్వం బహుళంగా వస్తుంది.
ఉదా :
ఈ + క్కాలము
ఏ + వ్వాడు.

సూత్రం 2 : ద్విరుక్తమైన హల్లు పరమైనపుడు ఆచ్ఛిక దీర్ఘానికి హ్రస్వం అవుతుంది.
ఉదా :
1) ఇక్కాలము
2) ఎవ్వాడు

13. రుగాగమ సంధి
సూత్రం : పేదాది శబ్దాలకు ‘ఆలు’ శబ్దము పరమైతే కర్మధారయంలో రుగాగమం వస్తుంది.
ఉదా :
పేద + ఆలు = పేద + ర్ + ఆలు = పేదరాలు

పై రెండు పదాలకు మధ్య ” అనేది వచ్చి, ప్రక్కనున్న ‘ఆ’ అనే అచ్చుతో కలిస్తే ‘రా’ అయింది. అదెలా వస్తుందంటే, పేద, బీద, బాలింత ఇలాంటి పదాలకు ‘ఆలు’ అనే శబ్దం పరమైతే, ఇలా ‘రుగాగమం” అంటే ‘5’ వస్తుంది.

ఆగమం :
రెండు పదాలలో ఏ అక్షరాన్ని కొట్టివేయకుండా, కొత్తగా అక్షరం వస్తే “ఆగమం” అంటారు.

రుగాగమ సంధి సూత్రం (1) :
పేదాది శబ్దములకు ‘ఆలు’ శబ్దంపరమైతే, కర్మధారయంలో రుగాగమం వస్తుంది.
పేద (విశేషణం) – ఆలు (స్త్రీ) నామము
విశేషణం = నామం మనుమ + ఆలు = మనుమరాలు బాలింత + ఆలు = బాలింతరాలు

రుగాగమ సంధి సూత్రం (2) :
కర్మధారయంలో తత్సమ పదాలకు, ఆలు శబ్దం పరమైతే, పూర్వ పదం చివరనున్న అత్వానికి ఉత్వమూ, రుగాగమం వస్తాయి.
ఉదా :
ధీరురాలు = ధీర + ఆలు
గుణవంతురాలు = గుణవంత + ఆలు
విద్యావంతురాలు = విద్యావంత + ఆలు

సంస్కృత సంధులు

1. సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ అనే వర్ణాలకు అవే వర్ణాలు సవర్ణాలు కలిసినప్పుడు, దీర్ఘం తప్పనిసరిగా వస్తుంది.
గమనిక :
‘అ’ వర్ణానికి – ‘అ’, ఆ – లు సవర్ణాలు
‘ఇ’ వర్ణానికి – ‘ఇ, ఈ లు’ – సవర్ణాలు
‘ఉ’ వర్ణానికి – ‘ఉ, ఊ లు’ – సవర్ణాలు
‘ఋ’ వర్ణానికి – ‘ఋ, ౠ లు’ – సవర్ణాలు

ఉదా :
1) రామానుజుడు = రామ + అనుజుడు = (అ + అ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
2) రామాలయం = రామ + ఆలయం = అ + ఆ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
3) కవీంద్రుడు = కవి + ఇంద్రుడు = (ఇ + ఇ = ఈ) = సవర్ణదీర్ఘ సంధి
4) భానూదయం = భాను + ఉదయం = (ఉ + ఉ = ఊ) = సవర్ణదీర్ఘ సంధి
5) వధూపేతుడు = వధూ + ఉపేతుడు : (ఊ + ఉ = ఊ) = సవర్ణదీర్ఘ సంధి
6) పిత్రణం = పితృ + ఋణం = (ఋ + ఋ = ౠ) = సవర్ణదీర్ఘ సంధి
7) మాతౄణం = మాతృ + ఋణం = (ఋ + ఋ = ౠ) = సవర్ణదీర్ఘ సంధి

2. గుణ సంధి
సూత్రం : అకారానికి ఇ, ఉ, ఋ లు పరమైతే ఏ, ఓ, అర్ లు ఏకాదేశంగా వస్తాయి.
1. ఉదా :
రాజేంద్రుడు = రాజ + ఇంద్రుడు = (అ + ఇ = గుణ సంధి
మహేంద్రుడు = మహా + ఇంద్రుడు – (ఆ + ఇ = ఏ) = గుణ సంధి
నరేంద్రుడు : నర + ఇంద్రుడు = (అ + ఇ = ఏ) = గుణ సంధి

2. ఉదా :
పరోపకారం = పర + ఉపకారం = గుణ సంధి
మహోన్నతి = మహా + ఉన్నతి – (ఆ + ఉ + ఓ) గుణ సంధి
దేశోన్నతి = దేశ + ఉన్నతి = (ఆ + ఉ + ఓ) = గుణ సంధి
గృహోపకరణం = గృహ + ఉపకరణం = (అ + ఉ = ఓ) = గుణ సంధి

3. ఉదా :
రాజర్షి = రాజ + ఋషి – (అ + ఋ = అర్) – గుణ సంధి
మహర్షి = మహా + ఋషి – (ఆ + ఋ = అర్) – గుణ సంధి

గమనిక :
1) అ, ఆ లకు, ఇ, ఈ లు కలిసి ‘ఏ’ గా మారడం
2) అ, ఆ లకు, ఉ, ఊ లు కలిసి ‘ఓ’ గా మారడం
3) అ, ఆ లకు, ఋ, ౠ లు కలిసి ‘అర్’ గా మారడం.

పై మూడు సందర్భాల్లోనూ, పూర్వ స్వరం అంటే, సంధి విడదీసినపుడు, మొదటి పదం చివరి అచ్చు, అ, ఆ లుగా ఉంది. పర స్వరం, అంటే విడదీసిన రెండవ పదంలో మొదటి అచ్చులు ఇ, ఉ, ఋ – లుగా ఉన్నాయి.
గమనిక :
1) అ, ఆ లకు – ‘ఇ’ కలిస్తే ‘ఏ’ గా మారుతుంది.
2) అ, ఆ లకు – ‘ఉ’ కలిస్తే ‘ఓ’ గా మారుతుంది.
3) అ, ఆ లకు – ‘ఋ’ కలిస్తే ‘అర్’ గా మారుతుంది.

గమనిక :
ఏ, ఓ, అర్ అనే వాటిని గుణాలు అంటారు. ఇలా గుణాలు వచ్చే సంధిని “గుణ సంధి” అంటారు.

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

3. యణాదేశ సంధి
సూత్రం : ఇ, ఉ, ఋ, లకు, అసవర్ణాచ్చులు పరమైతే య, వ, ర లు ఆదేశంగా వస్తాయి.
ఈ కింది పదాలను విడదీయండి. మార్పును గమనించండి.
ఉదా :
అ) అత్యానందం. = అతి + ఆనందం = (త్ + ఇ + ఆ = యా) = యణాదేశ సంధి
1) అత్యంతం = అతి + అంతం = (అత్ + ఇ + అ + య) = యణాదేశ సంధి

ఉదా :
ఆ) అణ్వస్త్రం = అస్త్రం = (ణ్ + ఉ + అ = వ) = యణాదేశ సంధి
2) గుర్వాజ్ఞ = గురు + ఆజ్ఞ . : (ర్ + ఉ + ఆ = వ) = యణాదేశ సంధి

ఉదా :
ఇ) పిత్రాజ్ఞ = పితృ + ఆజ్ఞ = (ఋు + ఆ = రా) = యణాదేశ సంధి
3) మాత్రంశ = మాతృ + అంశ = (ఋ + అ = 6). = యణాదేశ సంధి

గమనిక :
ఇ, ఉ, ఋ లకు అసవర్ణాచ్చులు (వేరే అచ్చులు) పక్కన వచ్చినపుడు, క్రమంగా వాటికి య – వ – ర లు వచ్చాయి. యవరలను ‘యణులు’ అంటారు. యజ్ఞులు చేరితే వచ్చే సంధిని, యణాదేశ సంధి, అంటారు. యణాదేశ సంధిలో, ‘ఇ’ కి బదులుగా “య్”, ‘ఉ’ కి బదులుగా ‘ఏ’, ‘ఋ’ కి బదులుగా ‘5’ వచ్చాయి.

యణాదేశ సంధి సూత్రం : ఇ, ఉ, ఋ లకు, అసవర్ణాచ్చులు పరమైతే, య, వ, ర లు ఆదేశంగా వస్తాయి.

4. వృద్ధి సంధి
సూత్రం : అకారానికి ఏ, ఐలు పరమైతే ‘ఐ’ కారమూ, ఓ, ఔ లు పరమైతే ‘ఔ’ కారము వస్తాయి.

ఈ కింది పదాలను విడదీయండి.
1. ఉదా :
వసుధైక = వసుధా + ఏక = (ఆ + ఏ = ఐ) = వృద్ధి సంధి
అ) రసైక = రస + ఏక = (అ + ఏ = ఐ) = వృద్ధి సంధి
ఆ) సురైక ఏక = (అ + ఏ = ఐ) = వృద్ధి సంధి

2. సమైక్యం = సమ + ఐక్యం = (అ + ఐ = ఐ) = వృద్ధి సంధి
ఇ) అష్టైశ్వర్యం = అష్ట + ఐశ్వర్యం = (అ + ఐ = ఐ) = వృద్ధి సంధి
ఈ) దేవైశ్వర్యం = ఐశ్వర్యం = (అ + ఐ = ఐ) = వృద్ధి సంధి

3. పాపౌఘము = ఓఘము = (అ + ఓ = ఔ) = వృద్ధి సంధి
ఉ) వనౌకసులు = ఓకసులు = (అ + ఓ = ఔ) = వృద్ధి సంధి
ఊ) వనౌషధి = వన ఓషధి = (అ + ఓ = ఔ) = వృద్ధి సంధి

4. రసౌచిత్యం = రస + ఔచిత్యం = (అ + ఔ = ఔ) = వృద్ధి సంధి
ఋ) దివ్యాషధం = దివ్య + ఔషధం = (అ + ఔ = ఔ) = వృద్ధి సంధి
ఋ) దేశాన్నత్యం = దేశ + ఔన్నత్యం = (అ + ఔ = ఔ) = వృద్ధి సంధి

గమనిక :
పైన పేర్కొన్న పదాలను విడదీసినపుడు మీరు గమనింపదగిన విషయం ఇది.
1. వృద్ధి సంధి ఏర్పడేటప్పుడు, ప్రతిసారీ పూర్వ స్వరంగా ‘అ’ వచ్చింది.
2. పర స్వరం స్థానంలో వరుసగా “ఏ, ఐ, ఓ, ఔ” లు ఉన్నాయి.
3. అకారానికి ఏ, ఐ లు కలిపినపుడు ‘ఐ’ వచ్చింది.
4. అకారానికి ఓ, ఔ లు కలిపినపుడు ‘ఔ’ వచ్చింది.

వృద్ధి సంధి సూత్రం :
అకారానికి ఏ, ఐ లు పరమైనపుడు ఐకారమూ, ఓ, ఔ లు పరమైతే ఔ కారమూ వస్తాయి.
వృద్ధులు = ఐ, ఔ లను ‘వృద్ధులు’ అంటారు.

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

5. జశ్వ సంధి
సూత్రం : “పరుషములకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు, శ ష స లు తప్ప, మిగిలిన హల్లులు కానీ, అచ్చులు కానీ పరమైతే వరుసగా సరళాలు ఆదేశమవుతాయి.
ఉదా :
సత్ + భక్తులు = సద్ + భక్తులు = సద్భక్తులు
పై సంధి పదాలను పరిశీలించండి. మొదట విడదీసిన పదాలలోని ‘త’ కార స్థానములో ‘ద’ కారం ఆదేశంగా వచ్చి, ‘సద్భక్తులు’ అనే రూపం వచ్చింది.

గమనిక :
ఈ విధంగా మొదటి పదం చివర, క, చ, ట, త, ప (పరుషాలు) లలో ఏదైనా ఒక అక్షరం ఉండి, రెండవ పదం మొదట క ఖ, చ ఛ, ట ఠ, త థ, ప ఫ, లు మరియు శ ష స లు తప్ప, మిగిలిన హల్లులూ, అచ్చులలో ఏ అక్షరం ఉన్నా ‘గ, జ, డ, ద, బ’ లు వరుసగా ఆదేశం అవుతాయి.

కింది పదాలను విడదీయండి.
1) దిగంతము = దిక్ + అంతము = జశ్వ సంధి
2) మృదటము = మృత్ + ఘటము = జశ్వ సంధి
3) ఉదంచద్భక్తి = ఉదంచత్ + భక్తి = జశ్వ సంధి
4) వాగీశుడు = వాక్ + ఈశుడు = జశ్వ సంధి
5) వాగ్యుద్ధం = వాక్ + యుద్ధం = జ్వ సంధి
6) వాగ్వాదం = వాక్ + వాదం = జశ్వ సంధి
7) తద్విధం = తత్ + విధం = జశ్వ సంధి

జశ్వసంధి సూత్రం :
పరుషములకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు, శష స లు తప్ప, మిగిలిన హల్లులు కానీ, అచ్చులు కానీ పరమైతే వరుసగా సరళాలు ఆదేశమవుతాయి.

సమాసాలు

సమాసం :
వేరు వేరు అర్థాలు కల రెండు పదాలు కలసి, ఏకపదంగా ఏర్పడితే దాన్ని ‘సమాసం’ అంటారు.

గమనిక :
అర్థవంతమైన రెండు పదాలు కలిసి, క్రొత్త పదం ఏర్పడడాన్ని సమాసం అంటారు. సమాసంలో మొదటి పదాన్ని పూర్వ పదం అంటారు. రెండవ పదాన్ని “ఉత్తరపదం” అంటారు.
ఉదా :
‘రామ బాణము’ అనే సమాసంలో, ‘రామ’ అనేది పూర్వపదము. ‘బాణము’ అనేది ఉత్తరపదము.

ద్వంద్వ సమాసం :
రెండు కాని, అంతకంటే ఎక్కువ కాని, నామవాచకాల మధ్య ఏర్పడే సమాసాన్ని “ద్వంద్వ సమాసం” అంటారు. (సమాసంలోని రెండు పదముల అర్థానికి ప్రాధాన్యం కల సమాసము ద్వంద్వ సమాసము.)

ఈ కింది వాక్యాల్లోని ద్వంద్వ సమాస పదాలను గుర్తించి రాయండి.

1) ఈ అన్నదమ్ములు ఎంతో మంచివాళ్ళు.
జవాబు:
అన్నదమ్ములు

2) నేను మార్కెట్ కు వెళ్ళి కూరగాయలు తెచ్చాను.
జవాబు:
కూరగాయలు.

3) ప్రమాదంలో నా కాలుసేతులకు గాయాలయ్యాయి.
జవాబు:
కాలుసేతులు

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

I. ఈ కింది ద్వంద్వ సమాసాలను వివరించండి. విగ్రహవాక్యం రాయండి.

సమాస పదాలువిగ్రహవాక్యాలు
1) ఎండవానలుఎండా, వానా
2) తల్లిదండ్రులుతల్లి, తండ్రి
3) గంగా యమునలుగంగ, యమున

II. ఈ కింది విగ్రహవాక్యాలను సమాస పదాలుగా మార్చండి.

విగ్రహవాక్యంసమాసపదం
1) కుజనుడూ, సజ్జనుడూకుజన జనులు
2) మంచి, చెడూమంచిచెడులు
3) కష్టమూ, సుఖమూకష్టసుఖములు

2. ద్విగు సమాసం: సమాసంలో మొదటి (పూర్వ) పదంలో సంఖ్య గల సమాసాలను ద్విగు సమాసాలు అంటారు.
అభ్యాసం :
కింది సమాస పదాలను ఉదాహరణలలో చూపిన విధంగా వివరించండి.
ఉదా :
నవరసాలు – నవ (9) సంఖ్య గల రసాలు
1) రెండు జడలు – రెండు (2) సంఖ్య గల జడలు
2) దశావతారాలు — దశ (10) సంఖ్య గల అవతారాలు
3) ఏడురోజులు – ఏడు (7) సంఖ్య గల రోజులు
4) నాలుగువేదాలు – నాలుగు (4) సంఖ్య గల వేదాలు

గమనిక :
పైన పేర్కొన్న సమాసాలలో సంఖ్యావాచకం పూర్వ పదంగా ఉండటాన్ని గమనించండి. ఇలా మొదటి పదంలో సంఖ్య గల సమాసాలు “ద్విగు సమాసాలు”.

3. తత్పురుష సమాసం :
విభక్తి ప్రత్యయాలు విగ్రహవాక్యంలో ఉపయోగించే సమాసాలు తత్పురుష సమాసాలు.

అభ్యాసం :
కింది పదాలను చదివి, విగ్రహ వాక్యాలు రాయండి.

సమాసంవిగ్రహవాక్యం
1) రాజభటుడురాజు యొక్క భటుడు
2) తిండి గింజలుతిండి కొఱకు గింజలు
3) పాపభీతిపాపము వల్ల భీతి

గమనిక :
‘రాజ భటుడు’ అనే సమాసంలో ‘రాజు’ పూర్వ పదం. ‘భటుడు’ అనే పదం ఉత్తర పదం. ‘రాజభటుడు’ కు విగ్రహవాక్యం రాస్తే, ‘రాజు యొక్క భటుడు’ అవుతుంది. దీంట్లో యొక్క అనేది షష్ఠీవిభక్తి ప్రత్యయం. భటుడు, రాజుకు చెందినవాడు అని చెప్పడానికి ష విభక్తి ప్రత్యయాన్ని వాడారు. ఈ విధంగా ప్రత్యయాలు విగ్రహవాక్యంలో ఉపయోగించే సమాసాలు “తత్పురుష సమాసాలు”.

గమనిక :
పూర్వ పదం చివర ఉండే విభక్తిని బట్టి తత్పురుష సమాసాలు వస్తాయి.

తత్పురుష సమాసం రకాలువిభక్తులుఉదాహరణ, విగ్రహవాక్యం
1) ప్రథమా తత్పురుష సమాసండు, ము, వు, లుమధ్యాహ్నము – అహ్నము యొక్క మధ్య
2) ద్వితీయా తత్పురుష సమాసంని, ను, ల, కూర్చి, గురించిజలధరం – జలమును ధరించినది
3) తృతీయా తత్పురుష సమాసంచేత, చే, తోడ, తోబుద్ధిహీనుడు – బుద్ధిచేత హీనుడు
4) చతుర్థి తత్పురుష సమాసంకొఱకు, కైవంట కట్టెలు – వంట కొఱకు కట్టెలు
5) పంచమీ తత్పురుష సమాసంవలన, (వల్ల) కంటె, పట్టిదొంగభయం – దొంగ వల్ల భయం
6) షష్ఠీ తత్పురుష సమాసంకి, కు, యొక్క లో, లోపలరామబాణం – రాముని యొక్క బాణం
7) సప్తమీ తత్పురుష సమాసంఅందు, నదేశభక్తి – దేశము నందు భక్తి
8) నఞ్ తత్పురుష సమాసంనఞ్ అంటే వ్యతిరేకముఅసత్యం – సత్యం కానిది

అభ్యాసం : కింది సమాసాలు చదివి, విగ్రహవాక్యాలు రాయండి. అవి ఏ తత్పురుష సమాసాలో తెలపండి.

సమాసంవిగ్రహవాక్యంసమాసం పేరు
అ) రాజ పూజితుడురాజుచే పూజితుడుతృతీయా తత్పురుషము
ఆ) ధనాశధనము నందు ఆశసప్తమీ తత్పురుషము
ఇ) పురజనులుపురమందు జనులుసప్తమీ తత్పురుషము
ఈ) జటాధారిజడలను ధరించినవాడుద్వితీయా తత్పురుషము
ఉ) భుజబలంభుజముల యొక్క బలంషష్ఠీ తత్పురుషము
ఊ) అగ్నిభయంఅగ్ని వల్ల భయంపంచమీ తత్పురుషము
ఋ) అన్యాయంన్యాయం కానిదినఞ్ తత్పురుష సమాసం

తత్పురుష సమాసాలు :
విభక్తులు ఆధారంగా ఏర్పడే తత్పురుష సమాసాలను గూర్చి తెలిసికొన్నారు. కింది వాటిని కూడా పరిశీలించండి.
1) మధ్యాహ్నము – అహ్నము యొక్క మధ్యము (మధ్య భాగము)
2) పూర్వకాలము – కాలము యొక్క పూర్వము (పూర్వ భాగము)

గమనిక :
పై వాటిలో మొదటి పదాలైన మధ్య, పూర్వ అనే పదాలకు ‘ము’ అనే ప్రథమా విభక్తి ప్రత్యయం చేరడం వల్ల ‘మధ్యము’, ‘పూర్వము’గా మారతాయి. ఇలా పూర్వపదానికి ప్రథమా విభక్తి ప్రత్యయం రావడాన్ని ‘ప్రథమా తత్పురుష సమాసం’ అంటాము.

కింది వాటిని పరిశీలించండి.
1) నఞ్ + సత్యం = అసత్యం – సత్యం కానిది
2) నఞ్ + భయం = అభయం – భయం కానిది
3) నఞ్ + అంతము = అనంతము – అంతము కానిది
4) నఞ్ + ఉచితం = అనుచితం – ఉచితము కానిది

గమనిక :
సంస్కృతంలో ‘నః’ అనే అవ్యయం వ్యతిరేకార్థక బోధకము. దీనికి బదులు తెలుగులో అ, అన్, అనే ప్రత్యయాలు వాడతారు. పై ఉదాహరణల్లో వాడిన ‘నఞ్’ అనే అవ్యయాన్ని బట్టి, దీన్ని “నఞ్ తత్పురుష సమాసం” అంటారు. అభ్యాసము : కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాస నామము పేర్కొనండి.

సమాసంవిగ్రహవాక్యంసమాసం పేరు
అ) అర్ధ రాత్రిరాత్రి యొక్క అర్ధముప్రథమా తత్పురుషము
ఆ) అనూహ్యముఊహ్యము కానిదినఞ్ తత్పురుషము
ఇ) అక్రమంక్రమము కానిదినఞ్ తత్పురుషము
ఈ) అవినయంవినయం కానిదినఞ్ తత్పురుషము

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

4. కర్మధారయ సమాసం :
‘నల్లకలువ’ అనే సమాస పదంలో ‘నల్ల’, ‘కలువ’ అనే రెండు పదాలున్నాయి. మొదటి పదం ‘నల్ల’ అనేది, “విశేషణం”. రెండో పదం ‘కలువ’ అనేది, “నామవాచకం”; ఇలా విశేషణానికీ, నామవాచకానికీ (విశేష్యానికీ) సమాసం జరిగితే, దాన్ని కర్మధారయ సమాసం అంటారు.

4. అ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం :
విశేషణం పూర్వపదంగా (మొదటి పదంగా) ఉంటే, ఆ సమాసాన్ని ‘విశ్లేషణ పూర్వపద కర్మధారయ సమాసం’ అంటారు.
ఉదా :
1) తెల్ల గుర్రం – తెల్లదైన గుర్రం.
తెలుపు (విశేషణం) (పూర్వపదం) – (మొదటి పదం) గుర్రం – నామవాచకం (ఉత్తరపదం) – రెండవ పదం

4. ఆ) విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం :
‘మామిడి గున్న’ అనే సమాసంలో, మామిడి, గున్న అనే రెండు పదాలున్నాయి. మొదటి పదం (పూర్వపదం) ‘మామిడి’ నామవాచకం, రెండో పదం (ఉత్తరపదం) గున్న అనేది విశేషణం. ఇందులో విశేషణమైన ‘గున్న’ అనే పదం ఉత్తరపదంగా – అంటే రెండో పదంగా ఉండడం వల్ల, దీన్ని ‘విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం’ అంటారు.

అభ్యాసం :
కింది పదాలను చదివి, విగ్రహ వాక్యాలు రాసి, ఏ సమాసమో రాయండి.
1) పుణ్యభూమి – పుణ్యమైన భూమి – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
2) మంచిరాజు – మంచి వాడైన రాజు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
3) కొత్త పుస్తకం – కొత్తదైన పుస్తకం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
4) పురుషోత్తముడు – ఉత్తముడైన పురుషుడు – విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం

4.ఇ) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం :
‘తమ్మివిరులు’ అనే సమాసంలో, మొదటి పదమైన ‘తమ్మి’, ఏ రకం విరులో తెలియజేస్తుంది. ఇలా పూర్వపదం, నదులు, వృక్షములు, ప్రాంతాలు, మొదలైన వాటి పేర్లను సూచిస్తే దాన్ని ‘సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం’ అంటారు.
ఉదా :
మఱ్ఱి చెట్టు – మట్టి అనే పేరుగల చెట్టు – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
గంగానది – గంగ యనే పేరుగల నది – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
భారతదేశం – ‘భారతము’ అనే పేరుగల దేశం – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం

4.ఈ) ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం:
‘కలువ కనులు’ అనే సమాసంలో కలువ, కనులు అనే రెండు పదాలున్నాయి. దీనికి ‘కలువల వంటి కన్నులు’ అని అర్థం. అంటే కన్నులను కలువలతో పోల్చడం జరిగింది. సమాసంలోని మొదటి పదం
(పూర్వపదం) ఇక్కడ ‘ఉపమానం’ కాబట్టి దీన్ని “ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం” అంటారు.

4.ఉ) ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం :
‘పదాబ్జము’ అనే సమాసంలో పద (పాదం) మరియు, అబ్జము (పద్మం) అనే రెండు పదాలున్నాయి. వీటి అర్థం పద్మము వంటి పాదము అని. ఇక్కడ పాదాన్ని పద్మం (తామరపూవు)తో పోల్చడం జరిగింది. కాబట్టి పాదం ఉపమేయం. పద్మం ఉపమానం. ఉపమానమైన అబ్జము అనే పదం, ఉత్తరపదంగా (రెండవపదం) గా ఉండడం వల్ల దీన్ని “ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం” అంటారు.

అభ్యాసము :
కింది సమాసములకు విగ్రహవాక్యాలు రాసి, సమాస నామములు పేర్కొనండి.

సమాసంవిగ్రహవాక్యంసమాసం పేరు
1) తేనెమాటతేనె వంటి మాట
తేనె – ఉపమానం; మాట – ఉపమేయం
ఉపమాన పూర్వపద కర్మధారయం
2) తనూలతలత వంటి తనువు
తనువు – ఉపమేయం; లత – ఉపమానం
ఉపమాన ఉత్తరపద కర్మధారయం
3) చిగురుకేలుచిగురు వంటి కేలు
చిగురు – ఉపమానం; కేలు – ఉపమేయం
ఉపమాన పూర్వపద కర్మధారయం
4) కరకమలములుకమలముల వంటి కరములు
కరములు – ఉపమేయం
కమలములు – ఉపమానం
ఉపమాన ఉత్తరపద కర్మధారయం

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

5. రూపక సమాసం :
‘విద్యాధనం’ – అనే సమాసంలో విద్య, ధనం అనే రెండు పదాలున్నాయి. పూర్వపదమైన విద్య, ధనంతో పోల్చబడింది. కాని ‘విద్య అనెడి ధనం’ అని దీని అర్థం కనుక, ఉపమాన, ఉపమేయాలకు భేదం లేనంత గొప్పగా చెప్పబడింది. ఈ విధంగా ఉపమాన, ఉపమేయాలకు భేదం లేనట్లు చెబితే అది ‘రూపక సమాసం’.
ఉదా :
1) హృదయ సారసం – హృదయం అనెడి సారసం
2) సంసార సాగరం – సంసారం అనెడి సాగరం
3) జ్ఞాన జ్యోతి – జ్ఞానము అనెడి జ్యోతి
4) అజ్ఞాన తిమిరం – అజ్ఞానము అనెడి తిమిరం

6. బహుప్రీహి సమాసం : అన్య పదార్థ ప్రాధాన్యం కలది.

కింది ఉదాహరణను గమనించండి.
చక్రపాణి – చక్రము పాణియందు (చేతిలో) కలవాడు. ‘విష్ణువు’ అని దీని అర్థము. దీంట్లో సమాసంలోని రెండు పదాలకు అనగా “చక్రానికి” కాని “పాణికి” కాని ప్రాధాన్యం లేకుండా, ఆ రెండూ మరో అర్థం ద్వారా “విష్ణువును” సూచిస్తున్నాయి. ఇలా సమాసంలో ఉన్న పదాల అర్థానికి ప్రాధాన్యం లేకుండా, అన్యపదముల అర్థాన్ని స్ఫూరింప జేసే దాన్ని బహుప్రీహి సమాసం అంటారు. అన్య పదార్థ ప్రాధాన్యం కలది. ‘బహుబ్లిహి సమాసం’.

అభ్యాసం :
కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసం పేరు రాయండి.
1) నీలవేణి – నల్లని వేణి కలది – బహుప్రీహి సమాసం
2) నీలాంబరి – నల్లని అంబరము కలది – బహుప్రీహి సమాసం
3) ముక్కంటి – మూడు కన్నులు గలవాడు – బహుప్రీహి సమాసం
4) గరుడవాహనుడు – గరుత్మంతుడు వాహనంగా గలవాడు – బహుప్రీహి సమాసం
5) దయాంతరంగుడు – దయతో కూడిన అంతరంగము కలవాడు – బహుప్రీహి సమాసం
6) చతుర్ముఖుడు – నాలుగు ముఖములు గలవాడు – బహుబ్రీహి సమాసం

సమాపక – అసమాపక క్రియలు

ఈ కింది వాక్యాలలోని క్రియలను గమనించండి.
1) ఉదయ్ భోజనం చేసి సినిమాకు వెళ్ళాడు.
2) వైష్ణవి పుస్తకం చదివి నిద్రపోయింది.
3) అరుణ్ చిత్రాలు గీసి ప్రదర్శనకు పెట్టాడు.

అ) సమాపక క్రియలు :
పై వాక్యాలలో ప్రతివాక్యం చివరన ఉన్న వెళ్ళాడు, పెట్టాడు వంటి క్రియలు పని పూర్తి అయ్యిందని తెలుపుతున్నాయి. వీటిని సమాపక క్రియలు అంటారు.

ఆ) అసమాపక క్రియలు :
వాక్యం మధ్యలో ఉన్న ‘చేసి’ ‘గీసి’ ‘చదివి’ – అన్న క్రియలు పని పూర్తికాలేదని తెలుపుతున్నాయి. వీటిని అసమాపక క్రియలు అంటారు.

ఇ) అసమాపక క్రియా – భేదములు

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

1) క్వార్ధకం : (భూతకాలిక అసమాపక క్రియ)
భాస్కర్ ఆట ఆడి, అలసిపోయి ఇంటికివచ్చాడు. ఈ వాక్యంలో భాస్కర్ ‘కర్త’. ‘వచ్చాడు’ అనేది కర్త్య. వాచకానికి చెందిన ప్రధాన క్రియ.

ఆడి, అలసి అనేవి కర్బవాచక పదానికి చెందిన ఇతరక్రియలు. ఆడి, అలసి అనే పదాలు క్రియలే కాని, వాటితో పూర్తి భావం తెలియడం లేదు. ఆడి, అలసిపోయి అనే క్రియల తర్వాత, ఏం చేస్తాడు ? అనే ప్రశ్న వస్తోంది. ఆడి, అలసిపోయి అనే క్రియలు, భూతకాలంలోని పనిని సూచిస్తున్నాయి. వీటిని భూతకాలిక అసమాపక క్రియలని, ‘క్వార్థకం’ అని పిలుస్తారు.

ఈ క్రియలన్నీ ‘ఇ’ కారంతో అంతమవుతాయి. అంటే చివరి – ‘ఇ’ అనే ప్రత్యయం చేరిన క్రియారూపం ‘క్వార్థం’.

ఉదాహరణలు :
పుష్ప అన్నం తిని నిద్రపోయింది. ఇందులో ‘తిని’ అనేది క్త్వార్థం (అసమాపక క్రియ).

2) శత్రర్థకం : (వర్తమాన అసమాపక క్రియ)
అఖిలేశ్ మధుకర్ తో ‘మాట్లాడుతూ’ నడుస్తున్నాడు. ఈ వాక్యంలో ‘నడుస్తున్నాడు’ అనే ప్రధానక్రియకు, ‘మాట్లాడుతూ అనే ఉపక్రియ వర్తమాన కాలంలో ఉండి, అసమాపక క్రియను సూచిస్తుంది.

ఈ విధంగా ‘మాట్లాడు’ అనే ధాతువుకు ‘తూ’ అనే ప్రత్యయం చేరుతున్నది. ఇలా చేరడం వల్ల వర్తమాన అసమాపక క్రియగా మారుతుంది. వర్తమాన అసమాపక క్రియను ‘శత్రర్థకం’ అంటారు.
ఉదా :
1) జ్యోతిర్మయి కంప్యూటర్ లో ఏదో చదువుతూ ముఖ్యాంశాలు రాసుకుంది.
2) మాధవి ఆలోచిస్తూ పుస్తకం చదువుతున్నది.

గమనిక :
పై వాక్యాలలో 1) చదువుతూ 2) ఆలోచిస్తూ అనేవి శత్రర్థకములు.

3) చేదర్థకం : (ధాతువుకు తే, ఐతే అనే ప్రత్యయాలు చేరతాయి.)
కింది వాక్యం చదవండి.
“కష్టపడి పనిచేస్తే ఫలితం దానంతట అదే వస్తుంది.”
పై వాక్యంలో ప్రధాన క్రియ ‘వస్తుంది’ – ఇది ఫలితాన్ని సూచిస్తుంది. ఈ ఫలితం రావాలంటే షరతును విధించడానికి చేర్చే అసమాపక క్రియ చేస్తే ఇది కారణం. అది కార్యం . ఈ విధంగా సంక్లిష్ట వాక్యాల్లో ప్రధాన క్రియ సూచించే పని జరగటానికి షరతును సూచించే క్రియ ‘చేదర్థకం’ అంటారు. చేత్ అర్థాన్ని ఇచ్చేది – చేదర్థకం. వీటిలో ధాతువుకు తే, ఐతే అనే ప్రత్యయాలు చేరతాయి.
ఉదా :
మొక్కలు నాటితే అవి పర్యావరణానికి మేలు చేస్తాయి.

అభ్యాసం :
ఈ కింది వాక్యంలోని అసమాపక క్రియలను రాయండి.
1) రమ రోడ్డు మీద ఉన్న ఒక కాగితం ముక్కను తీసి దగ్గరలో ఉన్న చెత్తకుండీలో వేసి మళ్ళీ సైకిలెక్కి వెళ్ళిపోయింది.
జవాబు:
తీసి, వేసి, ఎక్కి అనేవి ‘క్వార్థం’ అనే అసమాపక క్రియలు.

తధర్మ క్రియలు :
ఒక వస్తువు స్వభావాన్నీ, ధర్మాన్ని తెలిపే క్రియలనూ, నిత్య సత్యాలను తెలిపే వాటినీ, ‘తద్దర్మ క్రియలు’ అంటారు.
ఉదా :
1) సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు.
2) సూర్యుడు పడమట అస్తమిస్తాడు.
3) పక్షి ఆకాశంలో ఎగురుతుంది.

ప్రశ్నా వాక్యాలు :
ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎవరు, ఏమిటి అనే పదాలను ఉపయోగించి, ప్రశ్నార్థక వాక్యాలు తయారుచేయవచ్చునని మీకు తెలుసు. వాక్యం చివరలో ‘ఆ’ అనే ప్రత్యయాన్ని చేర్చి కూడా ప్రశ్నా వాక్యంగా మార్చవచ్చు.
ఉదా :
1) మీరు బడికి వెళతారా?
2) దైన్య స్థితిని చూస్తారా?

అభ్యాసం :
కింది వాటిని జతపరచండి.

1) వాటిని ఇనప్పెట్టెలో పెట్టి తాళాలు వేసిఅ) చేదర్థకం
2) కాపలా కాస్తూ హాయిగా తిని కూర్చోఆ) శత్రర్థకం
3) మానసికంగా ఎదిగినట్లైతేఇ) ప్రశ్నార్థకం
4) నిర్భయంగా జీవించాలని ఆశించడం తప్పాఈ) క్వార్ధకం

జవాబు:

1) వాటిని ఇనప్పెట్టెలో పెట్టి తాళాలు వేసిఈ) క్వార్ధకం
2) కాపలా కాస్తూ హాయిగా తిని కూర్చోఆ) శత్రర్థకం
3) మానసికంగా ఎదిగినట్లైతేఅ) చేదర్థకం
4) నిర్భయంగా జీవించాలని ఆశించడం తప్పాఇ) ప్రశ్నార్థకం

వాక్య భేదములు

వాక్యాలు మూడు రకములు.
1) సామాన్య వాక్యం 2) సంక్లిష్ట వాక్యం 3) సంయుక్త వాక్యం
1) ఉష పాఠం చదువుతున్నది.
2) మురళి మంచి బాలుడు.

1) సామాన్య వాక్యం :
గమనిక :
మొదటి వాక్యంలో క్రియ ఉంది. రెండో వాక్యంలో క్రియలేదు. ఈ విధంగా క్రియ ఉన్నా, లేకున్నా ఒకే ఒక్క భావాన్ని ప్రకటించే వాక్యాలను సామాన్య వాక్యాలు అంటారు.

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

2) సంక్లిష్ట వాక్యం :
ఈ కింది సామాన్య వాక్యాలను కలిపి రాయండి.
ఉదా :
1) శ్రీకాంత్ అన్నం తిన్నాడు.
2) శ్రీకాంత్ బడికి వచ్చాడు.
జవాబు:
శ్రీకాంత్ అన్నం తిని, బడికి వచ్చాడు. (సంక్లిష్ట వాక్యం)

గమనిక :
పై వాక్యాలను కలిపినపుడు ఒక సమాపక క్రియ, ఒకటిగాని అంతకంటే ఎక్కువగాని అసమాపక క్రియలు ఉంటాయి. ఇటువంటి వాక్యాలను ‘సంక్లిష్ట వాక్యాలు’ అంటారు.

3) సంయుక్త వాక్యం :
సమ ప్రాధాన్యం కల వాక్యాలను కలపడం వల్ల ఏర్పడే వాక్యాలను ‘సంయుక్త వాక్యాలు’ అంటారు.
ఉదా :
1) సీత చదువుతుంది, పాడుతుంది.
2) అతడు నటుడు, రచయిత.
3) అశ్విని, జ్యోతి అక్కా చెల్లెండ్రు.

సామాన్య వాక్యాలు :
అ) రాజు అన్నం తిన్నాడు
ఆ) గోపి పరీక్ష రాశాడు
ఇ) గీత బడికి వెళ్ళింది

గమనిక :
పై వాక్యాల్లో తిన్నాడు, రాశాడు, వెళ్ళింది అనే క్రియలు సమాపక క్రియలు. ప్రతి వాక్యంలో ఒకే సమాపక క్రియ ఉంది. ఇలా ఒకే సమాపక క్రియ ఉంటే, ఆ వాక్యాలను ‘సామాన్య వాక్యాలు’ అంటారు.

కొన్ని సామాన్య వాక్యాలు క్రియ లేకుండా కూడా ఉంటాయి.
ఉదా :
హైదరాబాదు మన రాష్ట్ర రాజధాని.

సంక్లిష్ట వాక్యాలు :
గీత బజారుకు వెళ్ళింది. గీత కూరగాయలు కొన్నది.

గమనిక :
పై సామాన్య వాక్యాలలో రెంటిలోనూ ‘గీత’ అనే నామవాచకం ఉంది. ఈ విధంగా తిరిగి చెప్పబడిన నామవాచకాన్ని తొలగించి, మొదటి వాక్యంలోని క్రియ ‘వెళ్ళింది’ లోని క్రియ ‘వెళ్ళింది’ అనే దాన్ని ‘వెళ్ళి’ అనే అసమాపక క్రియగా మార్చి రాస్తే సంక్లిష్ట వాక్యం ఏర్పడుతుంది.
ఉదా :
గీత బజారుకు వెళ్ళి, కూరగాయలు కొన్నది. (సంక్లిష్ట వాక్యం)

అభ్యాసం :
కింది సామాన్య వాక్యాల్ని సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.
అ) 1) విమల వంట చేస్తుంది. విమల పాటలు వింటుంది.
జవాబు:
విమల వంట చేస్తూ, పాటలు వింటుంది (సంక్లిష్ట వాక్యం)

ఆ) అమ్మ నిద్ర లేచింది. అమ్మ ముఖం కడుక్కుంది.
జవాబు:
అమ్మ నిద్రలేచి, ముఖం కడుక్కుంది. (సంక్లిష్ట వాక్యం)

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

అభ్యాసం :
కింది సంక్లిష్ట వాక్యాలను, సామాన్య వాక్యాలుగా మార్చి రాయండి.
1) తాత భారతం చదివి, నిద్రపోయాడు. (సంక్లిష్ట వాక్యం)
జవాబు:
తాత భారతం చదివాడు. తాత నిద్రపోయాడు. (సామాన్య వాక్యాలు)

2) చెట్లు పూత పూస్తే, కాయలు కాస్తాయి. (సంక్లిష్ట వాక్యం)
జవాబు:
చెట్లు పూత పూయాలి. చెట్లు కాయలు కాయాలి. (సామాన్య వాక్యాలు)

3). రాముడు నడుచుకుంటూ వెళ్ళి తన ఊరు చేరాడు. (సంక్లిష్ట వాక్యం)
జవాబు:
రాముడు నడుచుకుంటూ వెళ్ళాడు. రాముడు తన ఊరు చేరాడు. (సామాన్య వాక్యాలు)

అభ్యాసం :
కింది సామాన్య వాక్యాలను, సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.
ఉదా :
1) శర్వాణి పాఠం చదివింది. శర్వాణి నిద్రపోయింది. (సామాన్య వాక్యాలు)
జవాబు:
శర్వాణి పాఠం చదివి, నిద్రపోయింది. (సంక్లిష్ట వాక్యం)

2) మహతి ఆట ఆడింది. మహతి అన్నం తిన్నది. (సామాన్య వాక్యాలు)
జవాబు:
మహతి ఆట ఆడి, అన్నం తిన్నది. (సంక్లిష్ట వాక్యం)

3) నారాయణ అన్నం తింటాడు. నారాయణ నీళ్ళు తాగుతాడు. (సామాన్య వాక్యాలు)
జవాబు:
నారాయణ అన్నం తింటూ నీళ్లు తాగుతాడు. (సంక్లిష్ట వాక్యం)

అభ్యాసం :
కింది సంక్లిష్ట వాక్యాలను, సామాన్య వాక్యాలుగా మార్చి రాయండి.
ఉదా :
1) శరత్ ఇంటికి వచ్చి, అన్నం తిన్నాడు. (సంక్లిష్ట వాక్యం)
జవాబు:
శరత్ ఇంటికి వచ్చాడు. శరత్ అన్నం తిన్నాడు. (సామాన్య వాక్యాలు)

2) రజియా పాటపాడుతూ ఆడుకుంటున్నది. (సంక్లిష్ట వాక్యం)
జవాబు:
రజియా పాట పాడుతుంది. రజియా ఆడుకుంటున్నది. (సామాన్య వాక్యాలు)

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

సంయుక్త వాక్యం :
కింది వాక్యాలను గమనించండి.
విమల తెలివైనది. విమల అందమైనది – విమల తెలివైనది, అందమైనది.

ఇలా రెండు సామాన్య వాక్యాలు కలిసి, ఒకే వాక్యంగా ఏర్పడటాన్ని సంయుక్త వాక్యం అంటారు.
సంయుక్త వాక్యాలుగా మారేటప్పుడు వచ్చే మార్పులు :
అ) వనజ చురుకైనది. వనజ అందమైనది
వనజ చురుకైనది, అందమైనది (రెండు నామపదాల్లో ఒకటి లోపించడం)

ఆ) అజిత అక్క. శైలజ చెల్లెలు.
అజిత, శైలజ అక్కా చెల్లెళ్ళు. (రెండు నామపదాలు ఒకచోట చేరి చివర బహువచనం చేరింది)

ఇ) ఆయన డాక్టరా? ఆయన ప్రొఫెసరా?
ఆయన డాక్టరా? ప్రొఫెసరా? (రెండు సర్వనామాల్లో ఒకటి లోపించింది)

అభ్యాసం :
కింది సామాన్య వాక్యాల్ని సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.
1) ఆయన ఆంధ్రుడు. ఆయన కృష్ణాతీరమున పుట్టినవాడు (సామాన్య వాక్యాలు)
జవాబు:
ఆయన ఆంధ్రుడు, కృష్ణా తీరమున పుట్టినవాడు. (సంయుక్త వాక్యం)

2) మోహన కూచిపూడి నృత్యం. నేర్చుకొంది. భావన భరతనాట్యం నేర్చుకుంది. (సామాన్య వాక్యాలు)
జవాబు:
మోహన కూచిపూడి నృత్యం, భావన భరతనాట్యం నేర్చుకున్నారు. (సంయుక్త వాక్యం)

అభ్యాసం :
కింది సామాన్య వాక్యాలను, సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.
1) చుక్క పొడుపుతో సీత లేచింది. సీత గడపను పూజించింది. (సామాన్య వాక్యాలు)
జవాబు:
సీత చుక్క పొడుపుతో లేచి, గడపను పూజించింది. (సంక్లిష్ట వాక్యం)

2) బంధుమిత్రులంతా వచ్చేశారు. కావలసిన సంభారాలు ఏర్పాటు చేసుకున్నారు. (సామాన్య వాక్యాలు)
జవాబు:
బంధుమిత్రులంతా వచ్చి, ‘కావలసిన సంభారాలు ఏర్పాటు చేసుకున్నారు. (సంక్లిష్ట వాక్యం)

అభ్యాసం :
కింది సామాన్య వాక్యాలను, సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.
1) సీతక్క నిశ్చితార్థం జరిగింది. నాగయ్య సంబరపడ్డాడు. (సామాన్య వాక్యాలు)
జవాబు:
సీతక్క నిశ్చితార్థం జరిగింది, కాబట్టి నాగయ్య సంబరపడ్డాడు. (సంయుక్త వాక్యం)

2) సీతక్క పెళ్ళికి ఏర్పాటుచేశారు. సీతమ్మ పెండ్లి పెటాకులయింది. (సామాన్య వాక్యాలు)
జవాబు:
సీతక్క పెళ్ళికి ఏర్పాటుచేశారు, కాని పెండ్లి పెటాకులయ్యింది. (సంయుక్త వాక్యం)

అభ్యాసం :
కింది వాటిని సంయుక్త వాక్యాలుగా రాయండి.
1) బుద్ధదేవుడు వటవృక్షచ్ఛాయకు వచ్చాడు. వెంటనే అష్టాంగ ధర్మప్రవచనం ప్రారంభమైంది.
జవాబు:
బుద్ధదేవుడు వటవృక్షచ్ఛాయకు వచ్చిన వెంటనే అష్టాంగ ధర్మప్రవచనం ప్రారంభమైంది. (సంయుక్త వాక్యం)

2) లేగ మూలంగా నందగోపునికి అదృష్టం కలిగింది. లేగదూడను నందగోపుడు ముద్దు పెట్టుకున్నాడు.
జవాబు:
లేగ మూలంగా నందగోపునికి అదృష్టం కలిగింది కాబట్టి లేగదూడను నందగోపుడు ముద్దు పెట్టుకున్నాడు. (సంయుక్త వాక్యం)

(అ) రెండు గాని, అంతకంటే ఎక్కువగాని వాక్యాలలోని సమాపక క్రియలను అసమాపక క్రియలుగా మార్చి, ఆ వాక్యాలను ఒకే వాక్యంగా రాస్తే దాన్ని, సంక్లిష్ట వాక్యం అంటారని మీరు తెలుసుకున్నారు.

అభ్యాసం :
కింది సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.
1) ఆంగ్లేయ గ్రంథము లెన్నియో వ్రాయుచున్నారు. ఆంగ్లేయ ఉపన్యాసములెన్నియో ఇచ్చుచున్నారు. (సామాన్య వాక్యం)
జవాబు:
ఆంగ్లేయ గ్రంథములెన్నియో వ్రాస్తూ ఆంగ్లేయ ఉపన్యాసము లెన్నియో ఇచ్చుచున్నారు. (సంక్లిష్ట వాక్యం)

2) నన్ను మీరు క్షమించవలయును. మఱియెప్పుడైన ఈ సభ తిరుగఁజేసి కొనుడు.
జవాబు:
నన్ను మీరు క్షమించి మటియెప్పుడైన ఈ సభ తిరుగజేసికొనుడు (సంక్లిష్ట వాక్యం)

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

అభ్యాసం :
కింది వాక్యాన్ని పరిశీలించి, అది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. క్రియా భేదాలను కూడా గుర్తించండి.
1) రమ రోడ్డు మీద ఉన్న కాగితం ముక్కను తీసి, దగ్గరలోనున్న చెత్తకుండీలో వేసి మళ్ళీ సైకిలెక్కి వెళ్ళిపోయింది. (ఇ)
అ) సామాన్య
ఆ) సంయుక్త
ఇ) సంక్లిష్ట
పై వాక్యంలో ఉన్న అసమాపక క్రియలను రాయండి.
జవాబు:
1) తీసి
2) వేసి
3) ఎక్కి

2. ప్రశ్నార్థక వాక్యం : ఎక్కడ? ఎప్పుడు? ఎందుకు? ఎవరు? ఏమిటి? అనే పదాలను ఉపయోగించి, ప్రశ్నార్థక వాక్యాలు తయారు చేయవచ్చునని మీకు తెలుసు. వాక్యం చివరలో ‘ఆ’ అనే ప్రత్యయాన్ని చేర్చి కూడా ప్రశ్నార్థకంగా మార్చవచ్చు. ఇలాంటి ప్రశ్నావాక్యాలను రకానికి ఒకటి చొప్పున మీ పాఠ్యపుస్తకం నుంచి ఉదాహరణలు వెతికి రాయండి.
ఉదా :
దైన్యస్థితిని చూస్తారు + ఆ = దైన్యస్థితిని చూస్తారా?
జవాబు:
1) మీరెప్పుడైనా గమనించారా? (గమనించారు + ఆ)
2) మీరు గమనిస్తారా? (గమనిస్తారు + ఆ)
3) వీటిని మీరు చూపిస్తారా? (చూపిస్తారు + ఆ)
4) నిజంగా మీరు చూస్తుంటారా? (చూస్తుంటారు + ఆ)
5) శ్రద్ధ చూపడం అంటే ఏమిటో మీకు తెలుసా? (తెలుసు + ఆ)
6) ఇంట్లకెట్ల ఆ పిల్లగాడు వొచ్చిండో? (వొచ్చిండు + ఓ)
7) అట్టి ప్రసిద్ధములైన కార్యముల జేయగలిగెడి వారేనా? (వారేను + ఆ)

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

I. క్రియను మార్చి వ్యతిరేకార్థక వాక్యాలు రాయండి.
1) పుస్తక రచనను పూర్తి చేయడానికి ఒకనెల రోజుల వ్యవధి కావాలి.
జవాబు:
పుస్తక రచనను పూర్తి చేయడానికి ఒక నెల రోజుల వ్యవధి అక్కర్లేదు. (వ్యతిరేక వాక్యం )

2) నా మాతృభూమి విస్తృతి ఎంతో తెలుసుకోలేకపోయాను.
జవాబు:
నా మాతృభూమి విస్తృతి ఎంతో తెలుసుకోగలిగాను. (వ్యతిరేకార్థక వాక్యం)

II. కింది వానికి వ్యతిరేకార్థక వాక్యాలు రాయండి.
1) ఒకే ఒక్క ఆవు తిరిగి రాలేదు.
జవాబు:
ఒకే ఒక్క ఆవు తిరిగి వచ్చింది. (వ్యతిరేకార్థక వాక్యం)

2) రాత్రి తెల్లవార్లూ నందగోపుడు ఆరాటపడ్డాడు.
జవాబు:
రాత్రి తెల్లవార్లూ నందగోపుడు ఆరాటపడలేదు. (వ్యతిరేకార్థక వాక్యం)

3) నందుడతనికి తన ప్రయాణ కారణం తెలియజేశాడు.
జవాబు:
నందుడతనికి తన ప్రయాణ కారణం తెలియజేయలేదు. (వ్యతిరేకార్థక వాక్యం)

4) ఒక్క పలుకైనా ఆయన నోటి నుండి వెలువడలేదు.
జవాబు:
ఒక్క పలుకైనా ఆయన నోటి నుండి వెలువడింది. (వ్యతిరేకార్థక వాక్యం)

కర్తరి వాక్యాలు – కర్మణి వాక్యాలు

1) కింది వాక్యాలను పరిశీలించి మార్పులను గమనించండి.
అ) సంఘ సంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు.
ఆ) సంఘ సంస్కర్తల చేత దురాచారాలు నిర్మూలించబడ్డాయి.

గమనిక :
పై రెండు వాక్యాల అర్థం ఒక్కటే. కాని వాక్య నిర్మాణంలో తేడా ఉంది. ఈ రెండు వాక్యాల మధ్య భేదం ఇది.
1) “సంఘ సంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు”.

1) కర్తరి వాక్యం :
ఈ మొదటి వాక్యంలో కర్తకు ప్రాధాన్యం ఉంది. అంటే క్రియ, కర్తను సూచిస్తుంది. కర్మకు, ద్వితీయా విభక్తి చేరి ఉంది. ఇలాంటి వాక్యాన్ని ‘కర్తరి వాక్యం ‘ అంటారు.

2) సంఘసంస్కర్తల చేత దురాచారాలు నిర్మూలించబడ్డాయి. అనే రెండవ వాక్యంలో 1) కర్తకు తృతీయా విభక్తి ఉంది.
2) క్రియకు ‘బడు’ అనే ధాతువు చేరింది 3) క్రియ – కర్మ ప్రధానంగా ఉంది.

2) కర్మణి వాక్యం :
వాక్యంలో క్రియకు ‘బడు’ ధాతువు చేరి, కర్తకు తృతీయా విభక్తి చేరే వాక్యాన్ని ‘కర్మణి వాక్యం’ అంటారు.

అభ్యాసం – 1 : కింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా రాయండి.
అ) వాల్మీకి రామాయణాన్ని రచించాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
వాల్మీకిచే రామాయణం రచింపబడింది. (కర్మణి వాక్యం)

ఆ) ప్రజలు శాంతిని కోరుతున్నారు. (కర్తరి వాక్యం)
జవాబు:
ప్రజలచే శాంతి కోరబడుతోంది. (కర్మణి వాక్యం)

అభ్యాసం – 2 : కింది కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగా రాయండి.
అ) లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకం నా చేత చదువబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకం నేను చదివాను. (కర్తరి వాక్యం)

ఆ) నాచే రచింపబడిన గ్రంథం, నేతాజీ చరిత్ర. (కర్మణి వాక్యం)
జవాబు:
నేను రచించిన గ్రంథం, నేతాజీ చరిత్ర. (కర్తరి వాక్యం)

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

అభ్యాసం – 3 : కింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా రాయండి.
ఉదా :
ఆళ్వారు స్వామి చిన్నప్పుడే కథ రాశారు. (కర్తరి)
జవాబు:
చిన్నప్పుడే ఆళ్వారు స్వామిచే కథ రాయబడింది. (కర్మణి)

అ) లింగయ్య ఉసిరికాయ తీసి నాయకునికి ఇచ్చాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
ఉసిరికాయ తీసి, లింగయ్య చేత నాయకునికి ఇవ్వబడింది. (కర్మణి వాక్యం)

ఆ) నాయకులు పిల్లలతో అరగంట కాలం గడిపారు. (కర్తరి వాక్యం)
జవాబు:
పిల్లలతో నాయకులచేత అరగంట కాలం గడుపబడింది. (కర్మణి వాక్యం)

ఇ) వాద్యాల చప్పుడు విన్నారు. (కర్తరి వాక్యం)
జవాబు:
వాద్యాల చప్పుడు వినబడింది. (కర్మణి వాక్యం)

అభ్యాసం – 4 : కింది కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగా రాయండి.
అ) గ్రామీణులచే నాయకులు ఎదుర్కొని తీసుకుపోబడ్డారు. (కర్మణి వాక్యం)
జవాబు:
గ్రామీణులు నాయకులను ఎదుర్కొని తీసుకుపోయారు. (కర్తరి వాక్యం)

ఆ) కాయలన్నీ అతని ముందర పోయబడ్డాయి. (కర్మణి వాక్యం)
జవాబు:
కాయలు అతని ముందర పోశారు. (కర్తరి వాక్యం)

ఇ) బాలురచే సెలవు తీసికోబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
బాలురు సెలవు తీసికొన్నారు. (కర్తరి వాక్యం)

కర్తరి, కర్మణి వాక్యాలు

కర్తరి వాక్యం :
జిడ్డు కృష్ణమూర్తి గారు ఎన్నో మంచి విషయాలు చెప్పారు.

కర్మణి వాక్యం :
ఎన్నో మంచి విషయాలు జిడ్డు కృష్ణమూర్తి గారి చేత చెప్పబడ్డాయి.

గమనిక :
పై రెండు వాక్యాలలో కర్తరి వాక్యం మనకు సూటిగా అర్థం అవుతుంది. ఇది సహజంగా ఉంటుంది. కర్మణి వాక్యం చుట్టు తిప్పినట్లు ఉంటుంది. మన తెలుగు భాషలో వాడుకలో ప్రధానంగా కర్తరి వాక్యమే ఉంటుంది.

కర్మణి వాక్యప్రయోగాలు సంస్కృత భాషా ప్రభావం వల్ల తెలుగులోకి వచ్చాయి. ఇంగ్లీషు వాక్య పద్ధతి ఇలాగే ఉంటుంది.
1) కర్తరి వాక్యమును ఇంగ్లీషులో (Active voice) అంటారు.
2) కర్మణి వాక్యమును. ఇంగ్లీషులో (Passive voice) అంటారు.

అభ్యాసం :
కింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా మార్చి రాయండి.
1) రమేష్ భారతాన్ని చదివాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
రమేష్ చే భారతం చదువబడింది. (కర్మణి వాక్యం )

2) నేనెన్నో పుస్తకాలు రాశాను. (కర్తరి వాక్యం)
జవాబు:
ఎన్నో పుస్తకాలు నాచేత రాయబడ్డాయి. (కర్మణి వాక్యం )

ప్రత్యక్ష, పరోక్ష కథనాలు

అభ్యాసం :
కింది కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగా మార్చండి.
1) ఈ పురంలోని హిందూ సమాజం వారి యాజమాన్యంలో పై సభ జరుపబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
ఈ పురంలోని హిందూ సమాజం వారి యాజమాన్యం, పై సభను జరిపింది. (కర్తరి వాక్యం)

2) తిరువాన్కూరులో ఒక స్త్రీ మంత్రిణిగా నియమింపబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
తిరువాన్కూరులో ఒక స్త్రీని మంత్రిణిగా నియమించారు. (కర్తరి వాక్యం)

3) విద్యా సంఘాలలో స్త్రీలు సభ్యురాండ్రుగా నియమింపబడ్డారు. (కర్మణి వాక్యం)
జవాబు:
విద్యా సంఘాలలో స్త్రీలను సభ్యురాండ్రుగా నియమించారు. (కర్తరి వాక్యం)

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

ప్రత్యక్ష కథనం :
కింది వాక్యాలు చదవండి.
1. “నన్ను ఉపన్యాసరంగము నొద్దకు దీసికొనిపోయిరి.”
2. “నేనిట్లు ఉపన్యసించితిని.”
3. “నాయనలారా ! నేను మీ సభా కార్యక్రమమునంతయు జెడగొట్టితిని.”
4. “నన్ను మీరు క్షమింపవలయును.”
పై వాక్యాలన్నీ జంఘాల శాస్త్రి నేరుగా చెబుతున్నట్లు ఉన్నాయి కదా !

నేను, మేము, …… ఇలా ఉండే వాక్యాలు అనగా ఉత్తమ పురుషలోని వాక్యాలు సాధారణంగా ప్రత్యక్షంగా చెబుతున్నట్లుగా ఉంటాయి.

అట్లే కింది వాక్యాలను చదవండి.
1) “నేనొక్కడినే అదృష్టవంతుడినా?” అన్నాడు జంఘాల శాస్త్రి.
2) “నేను రాను” అని నరేశ్ రఘుతో అన్నాడు.
(లేదా)
“నేను రా”నని నరేశ్ రఘుతో అన్నాడు. పై వాక్యాలలో గీత గీసిన మాటలను ఎవరు అన్నారు?

మొదటి దాంట్లో జంఘాలశాస్త్రి అన్న మాటలను, రెండవదాంట్లో నరేశ్ అన్న మాటలను “ఉద్ధరణ చిహ్నాలు” (ఇన్వర్టర్ కామాలు) ఉంచి చెప్పారు కదా ! ఇలా నేరుగా చెప్పదల్చుకున్న అంశాలను ఉద్ధరణ చిహ్నాలు ఉంచి చెప్పినపుడు వారే ప్రత్యక్షంగా చెప్పినట్లుగా ఉంటుంది.
ఈ విధంగా చెప్పడాన్ని ప్రత్యక్ష కథనం అంటారు.

అభ్యాసం – 1 : పరోక్ష కథనంలోకి మార్చండి.
1) “ఇది అంతర్జాతీయ సమస్యగా మారుతుంది. జాగ్రత్త” అని అతడినే బెదరించింది మెల్లీ. (ప్రత్యక్ష కథనం)
జవాబు:
మెల్లీ అది అంతర్జాతీయ సమస్యగా మారుతుందని అతడినే బెదరించింది. (పరోక్ష కథనం)

2) “చిన్నప్పటి నుండి నాకు బోటనీ విషయం అభిమాన విషయం” అన్నాడు రచయిత. (ప్రత్యక్ష కథనం)
జవాబు:
రచయిత చిన్నప్పటి నుండి తనకు బోటనీ విషయం అభిమాన విషయమని అన్నాడు. (పరోక్ష కథనం)

అభ్యాసం – 2 : పరోక్ష కథనంలోకి మార్చండి.
1) “మా అన్నయ్య ముస్తఫా కమల్ కి స్టేషన్ రోడ్ లో ఒక కిరాణా దుకాణం ఉండేది” అన్నారు కలామ్. (ప్రత్యక్ష కథనం)
జవాబు:
తన అన్నయ్య ముస్తఫా కమల్ కి స్టేషన్ రోడ్ లో ఒక కిరాణా దుకాణం ఉండేదని కలామ్ అన్నారు. (పరోక్ష కథనం)

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

పరోక్ష కథనం :
కింది వాక్యాలు చదవండి.
1. నరేశ్ తాను రానని రఘుతో అన్నాడు.
2. ప్రధానోపాధ్యాయుడు చెప్పినట్లుగా చేస్తామని పిల్లలు అన్నారు.
3. తనను క్షమించమని రాజు తన మిత్రుడితో అన్నాను.

పై వాక్యాలను చదివారు కదా ! ఇవి నేరుగా చెబుతున్నట్లుగా ఉన్నాయా?
ఉత్తమ పురుషలో కాకుండా, ఇంకొకరు చెబుతున్నట్లుగా ఉన్నాయా?
ఇలాంటి వాక్యాలను పరోక్ష కథనం అంటారు. వీటిలో ఉద్ధరణ చిహ్నాలు ఉపయోగించాల్సిన అవసరం లేదు.

ప్రత్యక్ష కథనంలో ఉన్న వాటిని పరోక్ష కథనంలోకి మార్చడం. కింది వాక్యాలను చదవండి. ఏం మార్పు జరిగిందో చెప్పండి.
1. “నేనొక్కడినే అదృష్టవంతుడినా?” అన్నాడు జంఘాల శాస్త్రి.
2. తానొక్కడే అదృష్టవంతుడా అని జంఘాల శాస్త్రి అన్నాడు.

మొదటి వాక్యంలో జంఘాలశాస్త్రి మాట్లాడిన మాటలను ఉద్ధరణ చిహ్నాలు ఉంచి రాశారు. రెండో వాక్యంలో జంఘాల శాస్త్రి అన్నమాటలను ఇంకొకరు చెప్పినట్లుగా రాశారు. ఇందుకోసం ఉద్ధరణ చిహ్నాలు తీసివేసి “అని” చేర్చి వాక్యాన్ని రాసారు. కాబట్టి మొదటి వాక్యం ప్రత్యక్ష కథనంలో ఉంటే, రెండవ వాక్యం పరోక్ష కథనంలోకి మారింది. ప్రత్యక్ష కథనంలోని వాక్యాలు పరోక్ష కథనంలోకి మారేటపుడు కింది మార్పులు చోటు చేసుకుంటాయి.

మాటలు / వాక్యంలోని భావాన్ని స్వీకరిస్తారు. ఉద్ధరణ చిహ్నాలు తొలగించి ‘అని’ చేరుస్తారు. ఉత్తమ పురుషపదాలు అనగా నేను, మేము వంటివి, ప్రథమ పురుషలోకి అనగా తను, తమ, తాను, తాములాగా మారుతాయి.
1. పాఠంలోని ప్రత్యక్ష కథనంలోని వాక్యాలను గుర్తించండి. వాటిని పరోక్ష కథనంలోకి మార్చి రాయండి.
2. మీరే మరికొన్ని ప్రత్యక్ష కథనంలోని వాక్యాలు రాయండి. వాటిని పరోక్ష కథనంలోకి మార్చండి.

అలంకారాలు

అలంకారం : చెప్పదలచిన విషయాన్ని అందంగా మలిచేది.

అలంకారాలు రెండు రకాలు :
అ) శబ్దాలంకారాలు
ఆ) అర్థాలంకారాలు

అ) శబ్ద చమత్కారంతో పాఠకునికి ఆనందాన్ని కల్గించేవి “శబ్దాలంకారాలు”.
కింది గేయాన్ని గమనించండి. “అది గదిగో మేడ
మేడకున్నది గోడ
గోడ పక్కని నీడ
నీడలో కోడె దూడ
దూడ వేసింది పేడ

పై కవితలో ప్రతివాక్యం చివర ‘డ’ అనే అక్షరం, మళ్ళీ మళ్ళీ వచ్చింది. (అంటే పునరావృతమయ్యింది) ఇది ఆ కవితకు అందం తెచ్చింది. వినడానికి సొంపుగా తయారయ్యింది. ఈ అందం వినసొంపు, ‘డ’ అనే శబ్దం మళ్ళీ మళ్ళీ ప్రయోగించడం వల్ల వచ్చింది. కాబట్టి దీనిని “శబ్దాలంకారం” అంటారు.

1) అంత్యానుప్రాసాలంకారం :
ఒకే అక్షరం లేదా రెండు మూడు అక్షరాలు, వాక్యం చివర మాటి మాటికి వస్తే దాన్ని ‘అంత్యానుప్రాస’ అలంకారం అంటారు.
ఉదా :
1) భాగవతమున భక్తి
భారతమున యుక్తి రామకథయే రక్తి
ఓ కూనలమ్మ”

గమనిక :
పై కవితలో ప్రతివాక్యం చివర ‘కీ’ అనే అక్షరం తిరిగి తిరిగి వచ్చింది. కాబట్టి ఈ కవితలో ‘అంత్యానుప్రాస’ అనే శబ్దాలంకారం ఉంది.

2) ‘గుండెలో శూలమ్ము గొంతులో శల్యమ్ము పై కవితలో ‘మ్ము’ అనే అక్షరం ప్రతిపాదం చివరా వచ్చింది. కాబట్టి దీనిలో ‘అంత్యానుప్రాస’ అనే శబ్దాలంకారం ఉంది.

1. అంత్యాను ప్రాసాలంకారం : (లక్షణం) :
పాదాంతంలో, లేదా పంక్తి చివరలో, ఒకే ఉచ్చారణతో ముగిసే పదాలు, లేదా అక్షరాలు ఉంటే, దాన్ని ‘అంత్యానుప్రాసాలంకారం’ అంటారు.

కింది గేయాలు గమనించండి :
1) “వేదశాఖలు వెలసె నిచ్చట
ఆదికావ్యం బలరె నిచ్చట

గమనిక :
ఈ గేయంలోని మొదటి పంక్తి చివర, ‘ఇచ్చట’ అనీ, అలాగే రెండవ పాదం చివర కూడా ‘ఇచ్చట’ అనీ, ఉంది. కాబట్టి అంత్యానుప్రాసాలంకారం దీనిలో ఉంది. ‘తలుపు గొళ్ళెం హారతి పళ్ళెం గుర్రపు కళ్ళెం పై మూడు పాదాల్లోనూ చివర ‘ళ్ళెం’ అనే అక్షరం వచ్చింది కాబట్టి దీనిలో కూడా ‘అంత్యానుప్రాసాలంకారం’ ఉంది.

2. వృత్త్యను ప్రాసాలంకారం :
అక్షరం అనేకసార్లు తిరిగి రావడాన్ని ‘వృత్త్యనుప్రాసాలంకారం’ అంటారు. ‘వృత్తి’ అంటే ఆవృత్తి అని అర్థం. ఆవృత్తి అంటే, మళ్ళీ మళ్ళీ రావడం.
ఉదా :
నాయనా ! నేను నిన్నే మన్నా అన్నానా ? నీవు నన్నే మన్నా అన్నావా?

గమనిక :
పై వాక్యంలో ‘న’ అనే అక్షరం, అనేకమార్లు వచ్చింది. కాబట్టి ఇది ‘వృత్త్యనుప్రాస’ అనే శబ్దాలంకారం.
అభ్యాసము :
1) కా కి కో కి ల కాదు కదా !
2) లచ్చి పుచ్చకాయలు తెచ్చి ఇచ్చింది.

గమనిక :
మొదటి వాక్యంలో ‘క’, రెండో వాక్యంలో ‘చ్చ’ అనే అక్షరం ఆవృత్తి అయ్యింది. కాబట్టి ‘వృత్త్యనుప్రాసాలంకారం.

ఈ కింది వాక్యాలు చూడండి.
1) ఆమె కడవతో వడి వడి అడుగులతో గడపను దాటింది.
2) చిట పట చినుకులు ట ప ట ప మని పడుతున్నవేళ

గమనిక :
మొదటి వాక్యంలో ‘డ’ అనే హల్లు, రెండవ వాక్యంలో ‘ట’ అనే హల్లు చాలాసార్లు వచ్చాయి. ఈ ఉదాహరణలు కూడా చూడండి.

అ) బాబు జిలేబి పట్టుకొని డాబా పైకి ఎక్కాడు
ఆ) గట్టు మీది చెట్టు కింద కిట్టు రొట్టెను లొట్టలేస్తూ తింటున్నాడు.
ఇ) లక్ష భక్ష్యాలు తినేవాడికి, ఒక భక్ష్యం లక్ష్యమా.
గమనిక :
ఈ విధంగా ఒక హల్లు గాని, రెండు మూడు హల్లులు గాని, వేరుగా ఐనా, కలిసి ఐనా, మళ్ళీ మళ్ళీ వచ్చినట్లయితే,
దాన్ని ‘వృత్త్యనుప్రాస అలంకారం’ అంటారు.

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

3. ఛేకాను ప్రాసాలంకారం : కింది వాక్యం చదవండి.
ఉదా :
“నీకు వంద వందనాలు”.
పై వాక్యంలో వంద అనే హల్లుల జంట, వెంట వెంటనే అర్థ భేదంతో వచ్చింది. ఇక్కడ మొదట వచ్చిన ‘వంద’ నూరుసంఖ్యను తెలుపుతుంది. రెండోసారి వచ్చిన ‘వంద’, వందనాలు అంటే నమస్కారాలు అని తెలుపుతోంది.

ఛేకాను ప్రాస (లక్షణం) :
హల్లుల జంట, అర్థభేదంతో వెంట వెంటనే వస్తే, దానిని ‘ఛేకానుప్రాస అలంకారం అంటారు.
ఛేకానుప్రాసకు మరికొన్ని ఉదాహరణములు :
1) పాప సంహరుడు హరుడు
అర్థాలంకారాలు :
1. ఉపమాలంకారం :
1) ఆమె ముఖం అందంగా ఉంది.
2) ఆమె ముఖం, చంద్రబింబంలాగ అందంగా ఉన్నది.

గమనిక :
పై వాక్యాలలోని తేడాను గమనించండి. ఆమె ముఖం చంద్రబింబంలాగా అందంగా ఉంది. అనే వాక్యం మనలను ఆకట్టుకుంది. ఈ విధంగా ఒక విషయాన్ని ఆకట్టుకొనేలా చెప్పడానికి, అందమైన పోలికను చెప్పడాన్ని ‘ఉపమాలంకారం’ అంటారు.
ఉదా :
సోముడు భీముడివలె బలవంతుడు. గమనిక : ఈ వాక్యంలో సోముణ్ణి భీముడితో పోల్చారు. ఇలా చెప్పినపుడు వాక్యంలో ఉండే పదాలను, కొన్ని ప్రత్యేకమైన పేర్లతో పిలుస్తాము.
1) సోముడు – ఉపమేయం – (అంటే ఎవరిని గురించి చెప్పుతున్నామో ఆ పదం)
2) భీముడు – ఉపమానం – (ఎవరితో పోలుస్తున్నామో ఆ పదం)
3) బలవంతుడు – సమానధర్మం (పోల్చడానికి వీలయిన సమాన గుణం)
4) వలె – ఉపమావాచకం – (ఉపమానాన్ని సమానధర్మంతో కలపడానికి వాడే పదం)

* ఉపమాలంకారం (లక్షణం) :
ఉపమానోపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే ‘ఉపమాలంకారం’.

2. ఉత్ప్రేక్షాలంకారం : ఉపమేయాన్ని మరొక దానిలా ఊహించి చెప్పడం, “ఉత్ప్రేక్షాలంకారం”.
ఉదా :
ఆమె ఇంటి ముందున్న పెద్ద కుక్కను చూసి, సింహం ఏమో అని భయపడ్డాను.

గమనిక :
పై వాక్యంలో ఒక దాన్ని చూసి మరొకటి అనుకోవడం లేదా ఊహించుకోవడం జరిగింది. ఇలా అనుకోవడం లేదా ఊహించుకోవడం కూడా అలంకారమే. ఇలా ఉన్నదాన్ని లేనట్లుగా, లేనిదాన్ని ఉన్నట్లుగా, ఊహించి చెప్పడాన్ని ‘ఉత్ప్రేక్షాలంకారం’ అంటారు.
ఉదా :
1) ఆ మేడలు ఆకాశాన్ని ముద్దాడుతున్నాయో అన్నట్లు ఉన్నవి.
2) ఆ ఏనుగు నడగొండా అన్నట్లు ఉంది.

పై వాక్యంలో 1) ఉపమేయం – ఏనుగు
2) ఉపమానం – నడకొండ (నడిచే కొండ)

అంటే ఏనుగును, నడిచే కొండలా ఊహించాము కాబట్టి “ఉత్ప్రేక్షాలంకారము”.

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

3. రూపకాలంకారం (లక్షణం) :
ఉపమాన ధర్మాన్ని ఉపమేయంలో ఆరోపించి, వీటి రెంటికీ అభేదాన్ని (భేదం లేదని) చెప్పడమే, రూపకాలంకారం అంటారు.

ఉదా :
‘ఆయన మాట కఠినమైనా మనసు వెన్న’ ఇందులో
1) ‘మనస్సు’ – అనేది ఉపమేయం.
2) వెన్న – ఉపమానం (పోల్చినది)

ఉపమానమైన ‘వెన్న’ లక్షణాలను, ఉపమేయమైన ‘మనస్సు’తో భేదం లేకుండా పోల్చడం జరిగింది. అంటే వెన్నకూ, మనస్సుకూ భేదం లేదు. రెండూ ఒకటే అనే భావాన్ని ఇస్తోంది.

అభ్యాసం :
కింది వాక్యాలను పరిశీలించి అలంకారాన్ని గుర్తించండి.
1) మా అన్న చేసే వంట నలభీమపాకం
2) కుటుంబానికి తండ్రి హిమగిరి శిఖరం

గమనిక :
మొదటి వాక్యంలో అన్న చేసే వంటకూ, నలభీమపాకానికి భేదం లేనట్లు చెప్పబడింది. అలాగే రెండవ వాక్యంలో కుటుంబంలోని తండ్రికీ, హిమగిరి శిఖరానికీ భేదం లేనట్లు చెప్పబడింది. కాబట్టి పై రెండు వాక్యాలలో ‘రూపకాలంకారాలు’ ఉన్నాయి. ఈ కింది ఉదాహరణలు కూడా చూడండి.
1) లతా లలనలు రాజుపై కుసుమాక్షతలు చల్లారు.
2) రుద్రమ్మ చండీశ్వరీ దేవి జల జలా పారించె శాత్రవుల రక్తమ్ము.
3) ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే.
3) మా నాన్నగారి మాటలే వేదమంత్రాలు.
4) మౌనిక తేనె పలుకులు అందరికీ ఇష్టమే.

గమనిక :
పై పాదాల్లో రూపకాలంకారాలు ఉన్నాయి.

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

4. దృష్టాంతాలంకారం :
వాక్యాలకు బింబ ప్రతిబింబత్వం ఒక భావం అర్థం గావటానికి మరో భావం అద్దంలో చూపించినట్లు ఉంటే దాన్ని ‘దృష్టాంతాలంకారం’ అంటారు.
ఉదా :
“ఓ రాజా ! నీవే కీర్తిమంతుడవు. చంద్రుడే కాంతి మంతుడు”.

5. అతిశయోక్తి అలంకారం :
గోరంత విషయాన్ని కొండంతలుగా చేసి చెప్పడాన్ని ‘అతిశయోక్తి’ అలంకారం అంటారు.
కింది వాక్యాన్ని గమనించండి.
ఉదా :
ఆ పట్టణంలోని భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. భవనాలు ఎంత ఎత్తుగా ఉన్నా, ఆకాశాన్ని తాకడం అసంభవం. అంటే మామూలు విషయాన్ని అతిగా చేసి చెప్పడం పై వాక్యంలో గమనిస్తున్నాము.

5. అతిశయోక్తి అలంకారం : (లక్షణం) :
గోరంత విషయాన్ని కొండంతలుగా చేసి చెప్పటం.

6. స్వభావోక్తి అలంకారం :
ఏదైనా విషయాన్ని ఉన్నదున్నట్లుగా వర్ణిస్తే దాన్ని ‘స్వభావోక్తి’ అలంకారం అంటారు.
ఉదా :
జింకలు బిత్తరిచూపులు చూస్తూ, చెవులు నిగిడ్చి చెంగు చెంగున గెంతుతున్నాయి.

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

స్వభావోక్తికి మరియొక ఉదాహరణము :
1) ఆ లేళ్ళు బెదురుచూపులతో నిక్కపొడుచుకున్న చెవులతో భయభ్రాంత చిత్తములతో అటూ ఇటూ చూస్తున్నాయి.

సమన్వయం :
ఇక్కడ లేళ్ళ యొక్క సహజగుణాన్ని ఉన్నది, ఉన్నట్లుగా, కళ్ళకు కట్టినట్లుగా వర్ణించడం వల్ల ఇది ‘స్వభావోక్తి’ అలంకారము.

“మునుమును బుట్టె నాకు నొక ముద్దుల పట్టి, యతండు పుట్టి యే
డెనిమిది నాళ్ళపాటి గలఁడింతియ, పూరియు మేయనేరడేఁ
జని, కడుపారఁ జన్లుడిపి చయ్యన వచ్చెద, నన్నుఁ బోయి ర
మ్మని సుకృతంబు గట్టికొనవన్న! దయాగుణ ముల్లసిల్లఁగన్”

గమనిక :
పై పద్యంలో గోవు యొక్క కొడుకు మొన్నమొన్ననే పుట్టాడని, ముద్దుముద్దుగా ఉంటాడని, ఏడెనిమిది రోజుల వయస్సు కలవాడని, కొద్దిగా కూడా గడ్డిని తినలేడని ఉన్నది ఉన్నట్లుగా చక్కని పదజాలంతో వర్ణించారు. కనుక ఇక్కడ ‘స్వభావోక్తి’ అలంకారం ఉంది.

ఛందస్సు

కవులు పద్యాలను, గేయాలను కొన్ని నియమములకు లోబడి రాస్తారు. అందువల్లనే అవి రాగంతో పాడుకోడానికి వీలుగా ఉంటాయి.

1) లఘువు :
రెప్పపాటు కాలంలో లేదా చిటికె వేసే కాలంలో ఉచ్చరించే అక్షరాలు “లఘువులు”. హ్రస్వాక్షరాలుగా మనం పిలుచుకొనే అక్షరాలు.

2) గురువు :
లఘువు ఉచ్చరించే సమయం కంటె ఎక్కువ సమయం అవసరమయ్యే అక్షరాలు “గురువులు”.

గురులఘువుల గుర్తులు

లఘువు అని తెలుపడానికి గుర్తు : I
గురువు అని తెలుపడానికి గుర్తు : U

గురులఘువుల నిర్ణయము
ఎ) గురువుల లక్షణాలు – వాటిని గుర్తించే విధము.
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 1 AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 2

బి) లఘువుల లక్షణాలు – వాటిని గుర్తించే విధం :
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 3

గమనిక :
గురువులు కాని, అక్షరాలన్నీ లఘువులు :
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 4

గణ విభజన

1) ఒకే అక్షరం గణాలు :
ఒకే అక్షరం గణంగా ఏర్పడితే, అది ఏకాక్షర గణం. ఈ గణంలో ఒక గురువు లేదా ఒక లఘువు ఒక్కొక్కటే గణంగా ఉంటాయి.
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 7

2) రెండక్షరాల గణాలు :
రెండేసి అక్షరాలు కలిసి గణాలుగా ఏర్పడతాయి. వీటిలోనూ గురువులు, లఘువులు ఉంటాయి. ఇవి నాలుగు రకాలు.

అ) ఒక గురువు ఒక లఘువు కలిసి గణంగా ఏర్పడితే ఆ గణాన్ని ‘గలం’ లేదా ‘హ’ గణం అని అంటారు.
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 8

ఆ) ఒక లఘువు, ఒక గురువు కలిపి గణంగా ఏర్పడితే అది ‘లగం’, లేదా ‘వ’ గణం అని అంటారు.
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 9

ఇ) రెండూ గురువులే గల గణాన్ని – ‘గగము’ అంటారు.
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 10

ఈ) రెండూ లఘువులే గల గణాన్ని – ‘లలము’ అంటారు.
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 11

అభ్యాసం :
రెండక్షరాల గణాలు నాలుగు రకాలు ఉన్నాయి కదా ! ఒక్కొక్క దానికి 4 పదాల చొప్పున రాయండి.

మూడక్షరాల గణాలు

మూడక్షరాల గణములు మొత్తం ఎనిమిది (8).
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 12 AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 13

అ) మూడక్షరాల గణములను గుర్తించే సులభ మార్గం :
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 14

య, మా, తా, రా, జ, భా, న, స అనే సూత్రాన్ని కంఠస్థం చేసి, పై విధంగా ఒక చక్రం గీయండి. మీకు కావలసిన గణముపేరు గల మొదటి అక్షరం ఎక్కడ ఉందో గుర్తించండి. ఆ అక్షరాన్నుండి కుడిగా ఉన్న మూడక్షరాలలోనూ, గురు లఘువులు ఏ క్రమంగా ఉన్నాయో, మీకు కావలసిన గణానికి గురు లఘువులు ఆ క్రమంలో ఉంటాయి.
ఉదా :
మీకు య గణము యొక్క గురు లఘువుల క్రమం కావాలి అనుకోండి. అపుడు ‘య’ నుండి కుడివైపుగా ‘యమాతా’ అనే మూడక్షరాలను వేరుగా వ్రాయండి.
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 15

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

ఆ) మూడక్షరాల గణముల నిర్ణయంలో మరో పద్ధతి :
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 16

అని వ్రాసుకొని, దానికి గురు లఘువులు గుర్తించండి. మీకు కావలసిన గణము పేరు గల అక్షరంతో, ప్రక్క రెండు అక్షరాలూ కలిపి, దానిలోని గురు లఘువులు ఎలా ఉన్నాయో గమనిస్తే, ఏ గణానికి ఏ అక్షరాలు ఉంటాయో తెలుస్తుంది.
ఉదా :
1) య గణము = యమాతా = IUU = ఆది లఘువు
2) మ గణము మాతారా = UUU = సర్వ గురువు
3) త గణము తారాజ = UUI = అంత్య లఘువు
4) ర గణము = రాజభా = UIU = మధ్య లఘువు
5) జ గణము = జభాన = IUI = మధ్య గురువు
6) భ గణము = భానస = UII = ఆది గురువు
7) న గణము : నసల = III = సర్వ లఘువులు
8) లగము (లేక ‘వ’ గణము = I U = లఘువు, గురువు)

నాలుగు అక్షరాల గణాలు
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 17

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 18

2) ఇంద్ర గణాలు : ఇవి ఆఱు రకములు : నల, నగ, సల, భ, ర, త – అనేవి ఇంద్ర గణములు.
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 19
యతి – ప్రాసలు

I. గమనిక : పద్యానికి సౌందర్యాన్ని చేకూర్చేవి యతి, ప్రాసలు.
1. యతి :
పద్యపాదములోని మొదటి అక్షరాన్ని ‘యతి’ అంటారు.

2. ప్రాస :
పద్యపాదములోని రెండవ అక్షరాన్ని ‘ప్రాస’ అంటారు.

II. గమనిక : నియమము చెప్పినచోట ‘యతి’, ‘ప్రాస’లు ప్రయోగించడం వల్ల చదవడానికి, వినడానికీ, జ్ఞాపకం పెట్టుకోడానికీ సౌకర్యం కలుగుతుంది.
3. యతి మైత్రి :
పద్యపాదము యొక్క మొదటి అక్షరంతో, ఆ పద్యములో నిర్ణయింపబడిన స్థానమందలి అక్షరము మైత్రి కలిగి ఉండడాన్ని, యతిమైత్రి అంటారు. యతిమైత్రి యతిస్థానంలోని హల్లుకేకాక, అచ్చుతో కూడా మైత్రి ఉండాలి.

1. ఉత్పలమాల
కింది పద్య పాదాన్ని పరిశీలించండి.
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 20
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 21

గమనిక :
పై పాదాల్లో ‘భ, ర, న, భ, భ, ర, వ’ అనే గణాలు వరుసగా వచ్చాయి. ఇలా పద్యంలో నాలుగు పాదాల్లోనూ ఒకే రకమైన గణాలు ఒకే వరుసలో ఉన్న పద్యాన్ని ‘వృత్త పద్యం’ అంటారు.

యతి :
పద్య పాదంలో మొదటి అక్షరాన్ని ‘యతి’ అంటారు. ఈ యతి అక్షరం గానీ, దాని వర్ణమైత్రి అక్షరం గాని ఆ పాదంలో మరొకచోట రావడాన్ని ‘యతి మైత్రి’ లేదా యతి స్థానం అంటారు.

పై పద్యపాదాల్లో పదవ అక్షరం (ఆ – న; జే – సి) యతి.

ప్రాస :
పై పద్యపాదాల్లో రెండవ అక్షరంగా నాలుగు పాదాల్లోనూ ‘య’ అనే అక్షరం వచ్చింది. ఈ పద్యాలలో రెండవ అక్షరంగా ఒకే గుణింతాక్షరం రావడాన్ని ‘ప్రాస’ నియమం అంటారు. పై లక్షణాలు గల పద్యాన్ని ‘ఉత్పలమాల’ పద్యం అంటారు.

ఉత్పలమాల పద్యం లక్షణాలు :

  1. ఇది వృత్త పద్యం.
  2. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదంలోనూ భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలుంటాయి.
  4. ప్రాస నియమం ఉంటుంది.
  5. ప్రతి పాదంలోనూ 20 అక్షరాలుంటాయి.

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

2. చంపకమాల
కింది పద్య పాదాన్ని పరిశీలించండి.
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 22

చంపకమాల పద్య లక్షణాలు :

  1. ఇది వృత్త పద్యం.
  2. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదంలో ‘న, జ, భ, జ, జ, జ, ర’ అనే గణాలుంటాయి.
  4. ప్రతి పాదంలో 11వ అక్షరం యతిస్థానం (అ – య).
  5. ప్రాస నియమం ఉంటుంది.
  6. ప్రతి పాదంలోనూ 21 అక్షరాలుంటాయి.

3. శార్దూలం
కింది పద్య పాదాన్ని పరిశీలించండి.
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 23

శార్దూల పద్య లక్షణాలు :

  1. ఇది వృత్తపద్యం.
  2. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదంలోనూ ‘మ, స, జ, స, త, త, గ’ అనే గణాలుంటాయి.
  4. ప్రతి పాదంలో 13వ అక్షరం యతిస్థానం (ఆ – యం).
  5. ప్రాస నియమం ఉంటుంది.
  6. ప్రతి పాదంలోనూ 19 అక్షరాలుంటాయి.

4. మత్తేభం
కింది పద్య పాదాన్ని పరిశీలించండి.
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 24

మత్తేభ పద్య లక్షణాలు :

  1. ఇది వృత్త పద్యం.
  2. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదంలోనూ ‘స, భ, ర, న, మ, య, వ’ అనే గణాలుంటాయి.
  4. ప్రతి పాదంలో 14వ అక్షరం యతిస్థానం (ప – పా).
  5. ప్రాస నియమం ఉంటుంది.
  6. ప్రతి పాదంలోనూ 20 అక్షరాలుంటాయి.

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

5. ఛందస్సు – తేటగీతి
తేటగీతి పద్య లక్షణం :

  1. ఇది ‘ఉపజాతి’ పద్యం.
  2. ఈ పద్యానికి నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదానికి ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు వరుసగా ఉంటాయి.
  4. నాలుగో గణం మొదటి అక్షరం యతి స్థానం.
  5. ప్రాస యతి చెల్లుతుంది.
  6. ప్రాస నియమం లేదు.

ఉదా :
AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు 25
పై పద్యంలో 1 సూర్యగణం, 2 ఇంద్ర గణాలు, 2 సూర్య గణాలు వరుసగా వచ్చాయి కాబట్టి ఇది తేటగీతి పద్యపాదం. ఇక్కడ ‘ప్రాసయతి’ వాడబడింది.

AP Board 9th Class Telugu Important Questions and Answers

Andhra Pradesh SCERT AP State Board Syllabus 9th Class Telugu Important Questions and Answers are part of AP Board 9th Class Textbook Solutions.

Students can also read AP Board 9th Class Telugu Solutions for exam preparation.

AP State Board Syllabus 9th Class Telugu Important Questions and Answers

AP Board 9th Class Telugu వ్యాసాలు

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions 9th Class Telugu వ్యాసాలు Notes, Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu వ్యాసాలు

1. వాతావరణ కాలుష్యం

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు పెద్దలు. వాతావరణం పరిశుభ్రంగా ఉండి, చక్కటి ఆరోగ్యకరంగా ఉంటే మానవుని జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. మానవునికి హానికరమైన పదార్థాలు వాతావరణంలో కలిసి ఉంటే దానిని వాతావరణ కాలుష్యం అంటారు.

వివిధ కర్మాగారాలు, పరిశ్రమలు, లెక్కలేనన్ని మోటారు వాహనాలు, మురికినీరు మొదలైనవి వాతావరణ కాలుష్యానికి కారణాలు. కర్మాగారాల వల్ల నదులన్నీ మురికినీటితో నిండిపోయి జలకాలుష్యం ఏర్పడుతోంది. పరిశ్రమలవల్ల గాలి కలుషితమవుతోంది. మోటారు వాహనాల వల్ల నగరాలలోను, పట్టణాలలోను ధ్వని కాలుష్యం ఎక్కువవుతోంది.

వాతావరణ కాలుష్యం చాలా భయంకరంగా తయారయింది. పారిశ్రామికీకరణ వల్ల ఈ సమస్య మరీ ఘోరంగా తయారయింది. వాతావరణ కాలుష్యం మానవుని మనుగడకే పెద్ద సవాలుగా పరిణమించింది. దీనివల్ల ఉదరకోశవ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, కేన్సర్, గుండెజబ్బుల వంటి వ్యాధులు పెరిగిపోతున్నాయి.

వాతావరణ కాలుష్య నివారణకు ప్రభుత్వం ప్రత్యేకమైన ప్రణాళికలు తయారుచేసి అమలు చేయాలి. పరిశ్రమలు, కర్మాగారాలు మానవుల నివాసాలకు దూరంగా నెలకొల్పాలి. ప్రతి వ్యక్తి తన ఇంటినీ, పరిసరాలనూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అవకాశం ఉన్నచోట మొక్కలను విరివిగా పెంచాలి. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థలు పరిశోధనలు చేసి వాతావరణ కాలుష్య నివారణకు తగు సూచనలు చేశాయి. వాటిని మనం విధిగా పాటించాలి.

2. బాలకార్మికులు

నిరక్షరాస్యత, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, కరవు కాటకాల కారణంగా లక్షలాది పిల్లలు చిన్న వయస్సులోనే కార్మికులుగా చేరుతున్నారని అంతర్జాతీయ కార్మిక నిర్వహణ సంస్థ (ఐ.ఎల్.ఒ.) తన సర్వేలో వెల్లడించింది.

ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతగా భారతదేశంలో బాలకార్మిక వ్యవస్థ ఉందని ఐ.ఎల్.ఒ. నిర్వహించిన సర్వేలో తెలియజేసింది. దేశంలో ఆంధ్రప్రదేశ్ లోనే అత్యధికంగా బాలకార్మికులు ఉన్నారని ఆ నివేదికలో పేర్కొన్నారు.

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పలు సందర్భాలలో చేస్తున్న ప్రకటనలు కేవలం ప్రకటనలుగానే మిగిలిపోతున్నాయి. కాబట్టి నిర్దిష్టమైన ప్రణాళికను ఏర్పాటు చేసి అది అమలు జరిగేటట్లు చూడాలి. ప్రభుత్వం రూపొందించిన బాలకార్మిక నియంత్రణ చట్టం సరిగా అమలు అయ్యేటట్లు చూడాలి.

భారతదేశంలో 8.7 కోట్ల మంది బాలలు పాఠశాలలకు వెళ్ళడం లేదని, వీరంతా ఇళ్ళలోను, కర్మాగారాల్లోను, పొలాల్లోను పని చేస్తున్నారని ‘గ్లోబల్ మార్చ్ ఎగనెస్ట్ చైల్డ్ లేబర్’ అనే అంతర్జాతీయ సంస్థ పేర్కొంది. కాబట్టి బాలకార్మికుల కోసం ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పాలి. వాళ్ళు చదువుకొనే అవకాశం కల్పించాలి.

మన రాష్ట్రంలో 16 లక్షల మంది బాలకార్మికులు ఉన్నారు. బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా రూపుమాపేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్నది.

బాలకార్మికులను కూలివారుగానే చూస్తే వారు కార్మికులుగానే మిగిలిపోతారు. వారిలో ఉన్న యోగ్యతను, ప్రతిభను వెలికి తీసేందుకు సహకారం అందజేస్తే భవిష్యత్తులో ఒక మంచి నిపుణుడిని అందించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

AP Board 9th Class Telugu వ్యాసాలు

3. కరవు – నివారణోపాయాలు

అనావృష్టి వల్ల కరవు వస్తుంది. వరుసగా కొన్నేండ్లు కరువు వస్తే క్షామం ఏర్పడుతంది. సామాన్య వర్షపాతంలో 75% కన్నా తక్కువ వర్షపాతం ఉండే స్థితిని ‘కరవు’గాను, 50% కన్నా తక్కువ వర్షపాతం ఉండే స్థితిని ‘తీవ్రమైన కరవు’ గాను భారత వాతావరణ శాఖ నిర్వచించింది.

ఋతుపవనాల నియమరహిత స్వభావం వల్ల దేశంలో ఏదో ఒకచోట ప్రతి సంవత్సరం తరచుగా కరవులు సంభవిస్తున్నాయి. ఎక్కువగా వాయవ్య భారతదేశం, ఆ తరువాత దక్షిణ మరియు మధ్య భారతదేశంలో తరచుగా కరవులు సంభవిస్తున్నాయి. రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడులు అతిగా కరవులు సంభవించే రాష్ట్రాలు.

నివారణోపాయాలు :

  1. కరవు పీడిత ప్రాంతాలలో భూమిశిస్తు పూర్తిగా తొలగించడం గానీ, తగ్గించడం గానీ చేయాలి.
  2. క్షామపీడిత ప్రాంతాలలో ప్రజలు తిరిగి వ్యవసాయం చేసుకొనేందుకు వీలుగా ఆర్థిక సహాయం అందించడం, నీటిపారుదల సౌకర్యాలు కలిగించడం వంటివి చేయాలి.
  3. ఆయా ప్రాంతాలను బట్టి ఏయే పంటలు వేస్తే బాగా పండుతాయో వ్యవసాయదారులకు సూచనలివ్వాలి.
  4. పండిన పంటలకు మార్కెటింగ్ సౌకర్యం కలిగించాలి.
  5. తుపానులు వచ్చినపుడు తట్టుకొని, నిలబడి పంటనిచ్చే కొత్త రకాలను శాస్త్రజ్ఞులు కనిపెట్టాలి.
  6. వాతావరణ సమతౌల్యాన్ని కాపాడాలి.

కరవు నష్టాలను తగ్గించేందుకు భారత ప్రభుత్వం “కరవుకు గురయ్యే ప్రాంతాల ప్రణాళిక” (Drought prone area programme) ప్రవేశపెట్టింది. ఈ ప్రణాళికలో నీటిపారుదల, మృత్తికా పరిరక్షణ, వనీకరణ మొదలగు పథకాలున్నాయి. ప్రభుత్వమేకాకుండా ప్రజలు కూడా మానవతా దృష్టితో కరవుపీడిత ప్రాంతీయులను ఆదుకోవడం తమ కర్తవ్యంగా భావించాలి.

4. పర్యావరణ సంరక్షణ

భూమి, నీరు, గాలి మొదలైన వాటితో మనిషికి ఉండే అవినాభావ సంబంధమే పర్యావరణం. కాబట్టి పర్యావరణం అంటే పరిసరాల వాతావరణం అని అర్థం. పరిసరాల వాతావరణం కలుషితం కాకుండా కాపాడుకోవడమే పర్యావరణ సంరక్షణ అనబడుతుంది.

ప్రాణులు నివసించేది నేలపైన గదా ! ఆ నేలతల్లిని సరిగా చూసుకోవాలి. భూమిపై చెత్తా, చెదారమే కాదు ఓషధులుంటాయి. చెట్లుంటాయి. జంతువులుంటాయి. మనం జీవించటానికి ఆహారం లభించేది భూమి వల్లనే గదా ! రసాయనిక ఎరువుల వాడకం వల్ల భూమి నిస్సారమైపోతోంది. భూమిని ఆరోగ్యంగా ఉంచాలి. భూమి సమతౌల్యాన్ని పోషించాలి.

జలకాలుష్యం మిక్కిలి భయంకరమైనది. రసాయనిక పదార్థాలు, పరిశ్రమల వల్ల విడుదలయ్యే ద్రవపదార్థాలు సాగునీటిని, త్రాగే నీటిని కాలుష్యపరుస్తాయి. మురుగునీరు, త్రాగే నీరు అనే భేదం లేకుండా పోతోంది. డ్రైనేజీ వ్యవస్థ అరకొరగా ఉంది. దీనివల్ల కలరా, మలేరియా ఫ్లోరోసిస్, విషజ్వరం, టైఫాయిడ్ వంటివేకాక వైద్యులకి అంతుపట్టని కొత్త రోగాలు కూడా బయలుదేరాయి.

ఇక వాయు కాలుష్యం, గాలివల్లనే మనం జీవిస్తున్నాం. అటువంటి గాలి స్వచ్ఛంగా ఉండాలి. కానీ ఆధునిక పారిశ్రామికత పేరుతో గాలి కూడా కలుషితమైపోతోంది. విషపూరితమైన గాలి పీల్చటం వలన ఊపిరితిత్తులు, జీర్ణకోశం, గుండెకాయ, కళ్ళు అనారోగ్యానికి గురై ప్రమాదాలు సంభవిస్తున్నాయి. జీవితం రోగాలమయం అవుతోంది.

యంత్రాలవల్ల, వాహనాల వల్ల ధ్వనికాలుష్యం వ్యాపిస్తోంది. అణుశక్తి పరీక్షల వల్ల కూడా వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది. 1970లో అమెరికాలో పర్యావరణ పరిరక్షణ ఉద్యమం బయలుదేరింది. వాటి నుంచి శాస్త్రజ్ఞులు పర్యావరణ కాలుష్య నివారణకు విశేషమైన కృషి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీని పర్యావరణ దినోత్సవంగా పాటిస్తున్నారు. పర్యావరణ వ్యవస్థలోని సమతౌల్యాన్ని కాపాడుకోవటానికి అందరూ కృషి చేయాలి.

5. విద్యార్థులు – క్రమశిక్షణ

విద్యను అర్థించేవారు విద్యార్థులు. క్రమశిక్షణ అంటే సక్రమమైన ప్రవర్తనని కలిగి ఉండటం. నిజానికి క్రమశిక్షణ అన్ని వర్గాలవాళ్ళకీ, అన్ని వయస్సుల వాళ్ళకీ అవసరమే. అయితే విద్యార్థులు భావిభారత పౌరులు! జాతి భవిష్యత్తు వాళ్ళమీదే ఆధారపడి ఉంది. “మొక్కే వంగనిదే మానై వంగునా !” అన్నారు. చిన్నప్పుడే క్రమశిక్షణ అలవడటం సాధ్యం. పెద్దయిన తర్వాత మనిషి మారటం చాలా కష్టం. అందుకని విద్యార్థుల్లో క్రమశిక్షణ ఉండాలి.

అయితే విద్యార్థుల్లో క్రమశిక్షణ ఎందుకు లోపిస్తోంది ? అనే అంశాన్ని లోతుగా పరిశీలించవలసి ఉంది. అందుకు కొన్ని

కారణాలు:

  1. కావలసిన కోర్సులో సీటు దొరకకపోవడం – కావలసిన రంగంలో ఉద్యోగం దొరకకపోవడం.
  2. రాజకీయ పార్టీల, నాయకుల ప్రభావం, జోక్యం.
  3. విద్యాలయాల్లో అవినీతి, అవకతవకల పరంపరలు !
  4. ప్రభుత్వం విద్యను వ్యాపారంగా చేయడం.
  5. తల్లిదండ్రుల అశ్రద్ధ, అలసత్వం.

ఇన్ని కారణాలతో పాటు పేర్కొనవలసిన మరొక రెండు ముఖ్యమైన అంశాలున్నాయి – ఒకటి సినిమా, రెండు టీ.వీ ! ఈ రెండూ మానసిక వికాసానికి, జ్ఞానాభివృద్ధికి ఉద్దేశించబడ్డాయి. కానీ పాశ్చాత్య విషసంస్కృతి ప్రభావంచే ఈ రెండు ప్రసార సాధనాలూ యువకులపై, విద్యార్థులపై “స్లోపాయిజన్” లా పనిచేస్తున్నాయి.

విద్యార్థుల్లో క్రమశిక్షణ అలవడాలంటే ముందుగా

  1. విద్యను వ్యాపారంగా మార్చే ధోరణులపై కఠిన వైఖరి అవలంభించాలి.
  2. విద్యారంగంలోని అవకతవకల్ని, అవినీతిని (లీకేజీ, మాస్ కాపీయింగ్ సంప్రదాయాల్ని) అరికట్టాలి.
  3. ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో, ఆదర్శవంతంగా ప్రవర్తిస్తూ బోధనకి అంకితమవ్వాలి.
  4. రాజకీయ పార్టీల నీడ కూడా విద్యాలయాలపై పడకూడదు.
  5. విద్యాభ్యాసం తర్వాత ఉద్యోగం వస్తుందన్న గ్యారంటీ ఉండాలి.
  6. విద్యార్థుల్లో దేశభక్తి, సచ్ఛీలత, సహనం అలవడేలా తగిన చర్యలు తీసుకోవాలి.

క్రమశిక్షణ ఇతరులు బలవంతంగా రుద్దినట్లు ఉండకూడదు. ఆత్మగౌరవానికి సంబంధించినదిగా, ఆత్మశక్తికి సంబంధించినదిగా, జీవితధ్యేయంగా క్రమశిక్షణను అలవరచుకోవాలి. అప్పుడు విద్యార్థులతో పాటు దేశం కూడా అక్షరజ్యోతిగా వెలిగి అభివృద్ధి బాటలో పయనిస్తుంది.

AP Board 9th Class Telugu వ్యాసాలు

6. దూరదర్శన్

విజ్ఞానశాస్త్ర ప్రగతికి, మానవుడి ప్రతిభకి నిదర్శనం టెలివిజన్ దృశ్యతరంగాలను గాలిలో ప్రసారం చేయటం ద్వారా దృశ్యాలు చూడగలుగుతున్నాం. శబ్దతరంగాల ద్వారా శబ్దం వింటున్నాం. టెలివిజన్ ను మానవుడి ప్రతిసృష్టిగా పేర్కొనాలి. ఇది బ్రిటన్లో 1936లో మొదట వ్యాప్తిలోకి వచ్చింది. దీనిని స్కాట్ దేశపు ఇంజనీర్ జాన్ లాగ్ బర్డ్ 1928లో కనిపెట్టాడు.

టెలివిజన్ ఈనాడు ప్రపంచమంతటా వ్యాప్తి చెందింది. టీ.వీ.లు లేని ఊరులేదు. ఇది కేవలం ప్రచార సాధనమో, వినోద సాధనమో కాదు. టీ.వీ.ల ద్వారా ప్రభుత్వం, వాణిజ్య సంస్థలు ప్రచారం చేసుకోవచ్చు. మన సంస్కృతిని, కళలను కాపాడుకోవచ్చు. మనం చూడలేని ప్రదేశాలు చూడవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచాన్ని మన ముందు నిలబెట్టేది టెలివిజన్. విద్యారంగంలో, వైద్యరంగంలో, వాణిజ్యరంగంలో, విజ్ఞానశాస్త్ర రంగంలో నేడు టెలివిజన్ కు తిరుగులేని స్థానం ఉంది. “వీడియో” పరిజ్ఞానానికి టీ.వీ. మూలకారణం. నిరక్షరాస్యత నిర్మూలనలో టెలివిజన్ కీలకపాత్ర వహిస్తోంది. ప్రజల్ని అన్ని రంగాలలోనూ చైతన్యవంతం చేస్తున్న శక్తివంతమైన సాధనం టెలివిజన్.

విదేశీ ఛానల్స్ ప్రసారం వల్ల యువత నిర్వీర్యమవుతోంది. మన సంస్కృతిని విస్మరిస్తున్నారు. సినిమాల వ్యా మోహం, సెక్స్ వ్యామోహం ఎక్కువై పెడదారి పడుతున్నారు. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం పిల్లలపై టీ.వీ.లు దుష్ప్రభావం చూపిస్తున్నాయని వెల్లడైంది. కాబట్టి టెలివిజన్న మంచికి ఉపయోగించుకొనేలా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిది. ప్రైవేట్ ఛానలను నియంత్రించి వాటిపై సెన్సారు అధికారాన్ని కలిగి ఉండాలి. అప్పుడే టీ.వీ. వల్ల సత్రయోజనాలుంటాయి. .

7. గ్రంథాలయాలు

“చిరిగిన చొక్కా అయినా తొడుక్కో – కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో” అన్నది సూక్తి. ఇటువంటి సూక్తులెన్నో పుస్తకాల ప్రాముఖ్యాన్ని, ప్రాశస్త్యాన్ని వివరించేవి ఉన్నాయి. తరతరాల విజ్ఞాన సంపదను అందించేవి గ్రంథాలు.. అటువంటి గ్రంథాలు గల నివాసాన్ని గ్రంథాలయం (Library) అంటారు.

అయ్యంకి వెంకట రమణయ్య, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, నాళం కృష్ణారావు మొదలైన వాళ్ళు మన రాష్ట్రంలో గ్రంథాలయోద్యమాన్ని చేపట్టి గ్రంథాలయాలను స్థాపించారు. గ్రంథాలయ మహాసభలు నిర్వహించి పుస్తకాలను సేకరించి భద్రపరిచారు.

ప్రపంచంలో గొప్ప గొప్ప గ్రంథాలయాలున్నాయి. అమెరికాలో గల ‘కాంగ్రెసు లైబ్రరీ’, రోము నగరంలోని ‘వాటికన్ లైబ్రరీ’, ‘బ్రిటిష్ లైబ్రరీ’ మొదలైనవి ప్రపంచంలో పేరొందాయి. మన దేశంలో చెన్నైలోని “కన్నెమరా” గ్రంథాలయం, తంజావూరులోని “సరస్వతీ మహలు”, వేటపాలెంలోని “సారస్వత నికేతనం”, హైదరాబాదులోగల “శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం” మొదలైనవి చెప్పుకోదగ్గవి చాలా ఉన్నాయి. కడపలో సి.పి. బ్రౌన్ స్మారక గ్రంథాలయం కూడా నెలకొల్పబడింది.

గ్రంథాలయాలలో చాలా రకాలున్నాయి. ప్రభుత్వ గ్రంథాలయాలు, స్వచ్ఛంద సంస్థల గ్రంథాలయాలు ఉన్నాయి.

గ్రంథాలయాల వల్ల చాలా లాభాలున్నాయి :

  1. గ్రంథాలయాలు మనిషిని మనిషిగా మారుస్తాయి.
  2. మహామేధావులు తరతరాలుగా సంపాదించిన అనుభవాలు, ఆలోచనలు గ్రంథాలలో భద్రపరచబడతాయి.
  3. దేశాభ్యుదయానికి, సమాజవికాసానికి మూలస్తంభాలు గ్రంథాలయాలు.
  4. గ్రంథపఠనమనే మంచి అలవాటు అలవడుతుంది.
  5. గ్రంథాలు తండ్రివలె ఆదేశిస్తాయి. తల్లివలె లాలిస్తాయి. మిత్రుని వలె ఆదుకుంటాయి. గురువువలె ప్రబోధిస్తాయి.

గ్రంథాలయాధికారులు పుస్తకాలు కొనేటప్పుడు అత్యంత శ్రద్ధ వహించాలి. డబ్బును దుర్వినియోగం చెయ్యకుండా మంచి పుస్తకాలనే కొనాలి. హాని కలిగించే పుస్తకాలను నిర్మొహమాటంగా తిరస్కరించాలి. పోటీ పరీక్షలకి, ఉద్యోగ పరీక్షలకి, చదువుకి కావలసిన పాఠ్య గ్రంథాలు, క్విజ్ పుస్తకాల వంటివాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రభుత్వం గ్రంథాలయోద్యమాన్ని నీరుకార్చకుండా తగిన శ్రద్ధవహిస్తే సమాజం అభ్యుదయ పథంలో పయనిస్తుంది.

8. కంప్యూటర్

కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పరికరం. కంప్యూటర్ లో ‘డేటా’ (Data) ను నిల్వ చేయవచ్చు. దాన్ని మళ్ళీ ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు. అంతేకాకుండా కంప్యూటర్ చాలా కచ్ఛితంగా, త్వరగా ఫలితాన్ని ఇస్తుంది. ఇటువంటి అద్భుత సాధనమైన కంప్యూటర్ ను కనిపెట్టినవాడు ఛార్లెస్ బాబ్బేజి.

కంప్యూటర్ గురించి మాట్లాడినప్పుడు మనం తరచుగా హార్డువేర్, సాఫ్ట్ వేర్ అనే పదాలను వింటూ ఉంటాం. హార్డువేర్ అంటే కంప్యూటర్ పరికరాలు. సాఫ్ట్ వేర్ అంటే కంప్యూటర్ పనిచేయడానికి కావలసిన పద్ధతిని తెలిపేది.

కంప్యూటర్లను ఉపయోగించి ప్రస్తుతం పరిశోధనలు చేస్తున్నారు. కూడికలు, తీసివేతలు, గుణకారాలు (హెచ్చవేతలు), భాగహారాలు వంటి లెక్కలు చాలా వేగంగా చేయడానికి కంప్యూటర్ బాగా పనికివస్తుంది. కంప్యూటర్ల ద్వారా వాతావరణ పరిస్థితిని తెలుసుకోవచ్చు. విమానాలు, బస్సులు, రైళ్ళు మొదలైనవాటి టెక్కెట్ల రిజర్వేషన్లకు కంప్యూటర్లను ఉపయోగిస్తారు. పెద్ద పెద్ద కర్మాగారాల్లో, కార్యాలయాల్లో, బ్యాంకుల్లో ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. విద్య, వైద్య, వ్యాపార, వ్యవసాయ, సమాచార, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఈ కంప్యూటర్లు ప్రముఖపాత్ర వహిస్తున్నాయి. కంప్యూటర్‌ను ఉపయోగించి ఇంటర్నెట్ అనే సౌకర్యం ద్వారా ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నింటినీ మన ఇంట్లోని కంప్యూటర్ ముందు కూర్చొని తెలుసుకోవచ్చు.

అయితే కంప్యూటర్లని వాడటం వల్ల ఉద్యోగాలకు నష్టం వాటిల్లుతుందనీ, నిరుద్యోగ సమస్య పెరుగుతుందని కొందరి వాదన. ఇది కొంతవరకు నిజమే.. ఆ మాత్రంచేతనే ఆధునిక విజ్ఞానాన్ని త్రోసిరాజనడం న్యాయం కాదు. కాబట్టి భావిభారత పౌరులైన విద్యార్థులు కంప్యూటర్ విద్య ఆవశ్యకతను గుర్తించి తప్పక దాన్ని అభ్యసించాలి.

AP Board 9th Class Telugu వ్యాసాలు

9. జాతీయ సమైక్యత

ఒక దేశంలో పుట్టి పెరిగిన వారంతా ఒక జాతి వారని చెప్పవచ్చు. మనది భారత జాతి. భాష, మతం, సంస్కృతి, ఆచార వ్యవహారాలు ఒక్కటైనా, కాకున్నా ఒకే ప్రభుత్వం కిందనున్న ప్రజలంతా ఒకే జాతి అని చెప్పవచ్చు. మతాలు వేరయినా, భాషలు, రాష్ట్రాలు వేరయినా జాతి అంతా కలసి ఉండటమే జాతీయ సమైక్యత అంటారు.

మన భారతీయులలో కనిపించే దౌర్బల్యం అనైక్యత. మతం పేరిటనో, అధికారాన్ని ఆశించో మన రాజులొకరితో ఒకరు కయ్యాలాడుకొని విదేశీయుల పాలనలో దేశాన్ని పడవేశారు. నేటికీ మన దేశాన్నత్యాన్ని సహింపలేని విదేశాలున్నాయి. ఆ దేశాలతో మన జాతి సమైక్యతకు భంగం కలిగించే కొన్ని శక్తులు, మన దేశంలోనే ఉండి పొత్తు పెట్టుకొంటున్నవి. అట్టి అవాంఛనీయ శక్తులను తుదముట్టించి మన జాతినంతా ఒకే తాటిపై నిలపాలి. మనం ఏ రాష్ట్రం వారమైనా, ఏ భాషను మాట్లాడే వారమైనా మనమందరం భారతీయులమనే మాట మరువరాదు.

కొందరు మత కలహాలు పెంచి వారిలో భేదాలు రెచ్చగొట్టి హత్యలకు, లూటీలకు, గృహదహనాలకు సిద్ధపడుతున్నారు. దీనివల్ల ప్రజలలో ఇతర మతంవారిపై ద్వేషం పెరుగుతుంది. కొందరికి ప్రాంతీయ దురభిమానం, మరికొందరికి తమ భాషలపై మోజు ఎక్కువ. స్వభాషాభిమానం ఉండటం మంచిదే. కానీ పరభాషపై ద్వేషం ఉండకూడదు. భాషా రాష్ట్రాలుగా విభజించిన తరువాత ప్రాంతీయ దురభిమానాలు పెరిగి నదీ జలాల కొరకు, తమ ప్రాంతాల అభివృద్ధి కొరకు పరస్పరం కలహించుకొంటున్నారు.

మన జాతిలో అనైక్యతను పోగొట్టి ఐక్యపరచటానికి ప్రభుత్వం జాతీయ సమైక్యతా మండలిని స్థాపించింది. భారత జాతి అంతా ఒక్కటే అని బోధిస్తున్నది. జాతీయ సమైక్యతవల్ల దేశం అన్నిరంగాలలో అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా విదేశాలలో భారతజాతి కీర్తిపతాకలు రెపరెపలాడతాయి.

10. మతసామరస్యం

భారతీయ సమాజంలోని వ్యక్తులకు మతం అనేది పుట్టుక నుండి సంక్రమిస్తుంది. అదే విధంగా మతము యొక్క ప్రభావం వ్యక్తిపై పుట్టుక నుండి మరణించే వరకు ఉంటుంది. ప్రపంచంలో అధిక ప్రభావం కలిగిన ముఖ్యమైన మతాలన్నీ భారతదేశంలో ఉన్నాయి. ఎవరికి వారు వారి మతం గొప్పదిగా భావించడం జరుగుతుంది. ఒకనాటి సమాజాన్ని క్రమబద్ధం చేయడానికి, ఆనాటి సమాజంలో శాంతిభద్రతలు కాపాడుకోవడానికి మతాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. భారతదేశంలో ఉన్న మతాలను ఏడు రకాలుగా విభజించవచ్చు.

  1. హిందూమతం,
  2. ముస్లింమతం,
  3. క్రైస్తవమతం,
  4. బౌద్ధమతం,
  5. జైనమతం,
  6. సిక్కుమతం,
  7. పార్సీ, యూదుమతం.

భారతీయ సమాజంలో హిందూమతం వారే ఎక్కువగా ఉన్నప్పటికీ అనేక కారణాలవల్ల మతాల మధ్య వ్యత్యాసాలు, సంఘర్షణలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ విధమైన మతతత్వానికి అనేక కారణాలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి :

  1. ప్రజలలో స్వార్థబుద్ధి,
  2. మహమ్మదీయులలో ఆర్థిక బలహీనతల కారణంగా మైనార్టీలకు ఎక్కువ సౌకర్యాలను కలిగించాలనే వారి వాదన,
  3. ప్రాంతీయతత్త్వం మొదలైన కారణాలవల్ల భారతీయ సమాజంలో మతతత్త్వం వెర్రితలలు వేస్తోంది. మతతత్వానికి మరొక ముఖ్యకారణం మతంతో రాజకీయాలు మిళితమై ఉండటం.

మతాన్ని రాజకీయాల్లో చేర్చటంవల్ల భారత్ నుండి పాకిస్థాన్ విడిపోయింది. నేడు సిక్కుమతం వారు భారత్ నుండి విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడతామని అనేక సంవత్సరాలుగా ఉద్యమిస్తూనే ఉన్నారు. మరో ప్రక్క ‘రామజన్మభూమి – బాబ్రీ మసీదు’ వివాదం మతసమస్యగా తయారయింది. భారతదేశంలో మతకలహాలు తరచూ సంభవిస్తూనే ఉన్నాయి. అల్ప

సంఖ్యాకులకు, అధిక సంఖ్యాకులకు మధ్య పరస్పర విశ్వాసం, సామరస్యం లోపించడంతో ఈ భయానక వాతావరణం ఏర్పడి అల్లర్లు, అలజడులు, ఆస్తినష్టం, ప్రాణనష్టం తరచు ఏర్పడుతూనే ఉన్నాయి. వివిధ రాజకీయ పక్షాలు పాక్షిక ప్రయోజనాల సాధనకోసం మతకలహాలను ఒక ఆయుధంగా ఉపయోగించుకొంటున్నాయి.

ఈ విధమైన పరిస్థితులను చక్కదిద్దాలంటే ప్రజలు చైతన్యవంతులై రాజకీయ నాయకుల బూటకపు మాటలకు మోసపోక పరమత సహనం కలిగి ఉండాలి. మత సామరస్యంతో అందరూ కలిసిమెలసి జీవించడం నేర్చుకోవాలి.

AP Board 9th Class Telugu వ్యాసాలు

11. జనాభా సమస్య కుటుంబ నియంత్రణ

జనాభా ఎక్కువగుట వలన సమస్య ఏర్పడటాన్ని జనాభా సమస్య అంటారు.

“అమెరికాలో డాలర్లు పండును
ఇండియాలో సంతానం పండును”

అని తెలుగులో బాలగంగాధరతిలక్ అనే కవి వ్యంగ్యంగా భారతీయులకి సంతానంపై గల మక్కువ తెలిపాడు. జనాభా సమస్య ఏర్పడటానికి ఈ క్రింది కారణాలు ముఖ్యం

  1. సంతానం ఎక్కువగా ఉండటం గొప్పదనంగా భావించడం.
  2. ఆడపిల్లలు లేదా మగపిల్లలు కావాలనే కోరికలు.
  3. చిన్నప్పుడే వివాహాలు చెయ్యటం.
  4. నిరక్షరాస్యత.
  5. మత విశ్వాసాలు.

ఇన్ని కారణాల వల్ల రాను రాను జనాభా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతోంది. జనాభా సమస్యను పరిష్కరించటానికి ప్రభుత్వం పటిష్టమైన ప్రణాళికా విధానం రూపొందించింది. జనాభా సమస్య నిర్మూలనకు తీసుకోవలసిన చర్యలు :

  1. ‘కుటుంబ నియంత్రణ’ ను అన్ని మతాల ప్రజలు పాటించేలా చర్యలు తీసుకోవాలి.
  2. జనాభా సమస్య వల్ల ఏర్పడే నష్టాలను ప్రజలకు తేటతెల్లం చెయ్యాలి.
  3. స్త్రీల కంటే పురుషులు కుటుంబ నియంత్రణ చికిత్స చేసుకోవటం తేలిక అని చెప్పాలి.
  4. కుటుంబ నియంత్రణకి ప్రోత్సాహం కలిగించే సదుపాయాలు, సౌకర్యాలు కల్పించాలి.
  5. ఆడయినా, మగయినా ఒకటేనన్న భావాన్ని కలిగించాలి.
  6. కుటుంబ నియంత్రణ పాటించడం పాపమనే భావనని తొలగించాలి.

అప్పుడు మాత్రమే జనాభా పెరుగుదలను అరికట్టడం సాధ్యమవుతుంది. జనాభా సమస్య వల్ల నష్టాలు ఇవి –

  1. జనాభా పెరుగుదల వల్ల ఆహార సమస్య, నిరుద్యోగ సమస్య, కాలుష్య సమస్యల వంటివి ఎక్కువవుతాయి.
  2. విద్యాలయాలలో సీట్లు లభించక విద్యావకాశాలు తగ్గిపోతాయి.
  3. దేశ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమవుతుంది.
  4. “అందరికీ ఆరోగ్యం ” అనేది సాధ్యం కానేరదు.
  5. సంతానం ఎక్కువగా ఉంటే తల్లిదండ్రులపై భారం ఎక్కువై పిల్లల్ని సక్రమంగా పెంచి పోషించలేరు.
  6. జనాభా ఇదే విధంగా పెరుగుతూవుంటే బట్టకీ, ఇంటికీ కూడా కరవు తప్పదు.

అందువల్ల ప్రభుత్వం జనాభా సమస్య నిర్మూలనకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ‘చిన్న కుటుంబమే చింతలు లేని కుటుంబం’ అని బోధించడమే కాదు. నాయకులు, అధికారులు తాము కూడా పాటించాలి. కుటుంబ నియంత్రణ పాటించని వారిని శిక్షించే చట్టం రూపొందించాలి. అప్పుడే దేశం ప్రగతి మార్గంలో పయనిస్తుంది.

AP Board 9th Class Telugu వ్యాసాలు

12. విజ్ఞానయాత్రలు

విజ్ఞానయాత్రలు లోకజ్ఞానాన్ని కలిగించేవి. అయినా ఇవి వినోదయాత్రలుగా, విహారయాత్రలుగా వ్యవహారంలో ఉన్నాయి. అంటే కొన్ని ప్రత్యేక స్థలాలకి ప్రయాణం చేయటం వల్ల విజ్ఞానం సంపాదించవచ్చు. విజ్ఞానమే కాకుండా వినోదం కూడా లభిస్తుంది.

పుస్తక పఠనం వల్ల పుస్తక జ్ఞానం మాత్రమే లభిస్తుంది. లోకానుభవం, ప్రజల ఆచారవ్యవహారాలు, మన సంస్కృతి తెలుసుకోవాలంటే పర్యటనలు తప్పనిసరి. పుస్తకాలలో ఉన్న విషయాలను పూర్తిగా ఆకళింపు చేసుకోవాలంటే యాత్రలు చేయవలసి ఉంది. ఉదాహరణకు నీటి నుంచి విద్యుత్ ఎలా లభిస్తోందో పుస్తకాలలో వివరంగా ఉంటుంది. అది చదివితే కొంతమాత్రమే తెలుస్తుంది. అది కేవలం “Bookish knowledge”. జలవిద్యుత్ కేంద్రానికి వెళ్ళి, అది పనిచేసే విధానాన్ని పరిశీలించినప్పుడు సంపూర్ణ జ్ఞానం లభిస్తుంది. ముఖ్యంగా చరిత్ర, సైన్సు వంటి విషయాల అవగాహనకు యాత్రలు ఎంతో అవసరం.

విజ్ఞానయాత్రల వల్ల ముఖ్యమైన ప్రయోజనాలు –

  1. లోకజ్ఞానం అలవడుతుంది.
  2. మానసిక విశ్రాంతి లభిస్తుంది.
  3. విభిన్న సంస్కృతుల్ని, భాషల్ని, జీవన విధానాల్ని తెలుసుకోవచ్చు.
  4. పదిమందితో ఏవిధంగా మెలగాలో అనుభవం వస్తుంది.
  5. స్నేహితులను పొందే అవకాశం లభిస్తుంది.
  6. జాతి సమైక్యత, దేశ సమైక్యతకి దోహదం చేస్తాయి.
  7. కవులకి, చిత్రకారులకి, మానసిక రోగులకి స్ఫూర్తిని, ఉల్లాసాన్ని కలిగిస్తాయి.

ఇటువంటి విజ్ఞాన యాత్రల్లో చాలా రకాలున్నాయి-

  1. ప్రకృతికి సంబంధించినవి – ఊటీ, హిమాలయాలు, జోగ్ జలపాతం మొదలగునవి.
  2. చారిత్రక సంబంధమైనవి-ఎల్లోరా, రామప్పగుడి, చార్ మినార్ మొదలగునవి.
  3. శాస్త్ర సంబంధమైనవి-బిర్లా ప్లానిటోరియం, పరిశ్రమలు, అణుకేంద్రాలు మొదలగునవి.
  4. ఈ యాత్రల పట్ల విద్యార్థి దశనుండే ఉత్సాహం ఏర్పడేలా చూడాలి. విద్యార్థిగా ఉన్నప్పుడే లోకజ్ఞానం అలవడితే జీవితం సంపన్నమవుతుంది – అర్థవంతమవుతుంది. ఉపాధ్యాయుల, విద్యార్థుల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి. ఉపాధ్యాయుల వల్ల ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. విద్యార్థులలో ఐకమత్యానికి కూడా ఈ యాత్రలు తోడ్పడతాయి.

విజ్ఞానయాత్రలు లేదా విహారయాత్రలు కేవలం యువకులకో లేదా విద్యార్థులకో, కళాకారులకో అనుకోవటం సరికాదు. అన్ని వయస్సులవాళ్ళకీ, అన్ని వృత్తులవాళ్ళకీ అవసరమే. కూపస్థమండూకం లాగా జీవించటం మానవుడి నైజం కాదు కాబట్టి విజ్ఞానయాత్రలు అత్యంతావశ్యకాలు.

13. విద్యార్థులు – సంఘసేవ

విద్యార్థుల ప్రప్రథమ కర్తవ్యం విద్యాభ్యాసం అనటంలో సందేహం లేదు. కానీ విద్యార్థులు కూడా ఈ దేశపు పౌరులే. వాళ్ళూ సంఘజీవులే. సంఘంలో భాగస్వాములే. కాబట్టి సంఘసేవలో వాళ్ళకీ బాధ్యత ఉంది. విద్యాభ్యాసానికి ఆటంకం లేకుండానే సంఘసేవ చేసే అవకాశాలున్నాయి.

“చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష” అని స్వార్థంగా జీవించటం సంఘజీవి లక్షణం కాదు. గురజాడ అన్నట్టు

“సొంతలాభం కొంత మానుకు
పొరుగువాడికి తోడుపడవోయ్”

అన్న భావనైనా కనీసం ఉండాలి. ఇతరులకి మనం తోడ్పడితే ఇతరులు మనకి తోడ్పడతారు. అదే సంఘీభావం అంటే. సంఘసేవ ఎలా చెయ్యాలి ? ఏ పనులు చేస్తే సంఘసేవ అవుతుంది ? విద్యార్థులు చేయదగిన కార్యక్రమాలు ఏవి ? అంటే

  1. ప్రమాదాల బారినుండి కాపాడటం,
  2. వృద్ధులకి, అంగవికలురకి చేయూతనివ్వటం,
  3. ఆపదలో ఉన్నవారికి సహకారమందించటం,
  4. విద్యాదానం చేయటం,
  5. మురికివాడల్ని పరిశుభ్రం చెయ్యటం మొదలగునవి.

ఇవి ఏ విద్యార్థి అయినా చేయదగిన కనీస కార్యక్రమాలు. సంఘసేవకి పదవులు అక్కరలేదు. ధనమూ అంతగా అవసరం లేదు. సేవాతత్పరత ఉంటే చాలు. మానవతా దృక్పథం ఉంటే చాలు. కొందరు కీర్తికోసం, ప్రచారం కోసం సేవచేస్తున్నట్టు నటిస్తారు. అది స్వార్థపూరితమైన ప్రవర్తన అవుతుంది. విద్యార్థులు అటువంటివారు కారు. నిజంగా తలచుకుంటే విద్యార్థులు చేయలేనిది ఏమీ ఉండదు. ఉత్సాహం, బలం, ఆసక్తి గల విద్యార్థులే అసలైన సంఘసేవా పరాయణులుగా ఉంటారు. అందుకనే జాతీయ సేవా పథకం (National Service Scheme – NSF) విద్యాలయాలలో ప్రవేశపెట్టారు.

ప్రతి కళాశాలలోనూ ఈ జాతీయ సేవా పథకంలో చాలామంది విద్యార్థులు చేరి సంఘసేవ చేస్తున్నారు. హైస్కూల్సులో ఎన్‌సిసి, స్కౌట్స్ లో కూడా చేరి సంఘసేవ చేస్తున్నారు. ఒక విధంగా ప్రభుత్వ సంస్థలు, దేశ సేవకులనిపించుకొనే నాయకులు చేయని, చేయలేని పనులు విద్యార్థులు చేసి చూపించడం ప్రశంసనీయం.

విద్యార్థులు ఈ విధంగా సంఘసేవ చెయ్యటంలో వారికొక ఆత్మసంతృప్తి కలుగుతుంది. ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. తమ దేశభక్తిని ప్రకటించుకొనే సువర్ణావకాశం సంఘసేవ. కార్యదీక్షా దక్షతలు అలవడతాయి. కాబట్టి విద్యార్థుల్ని సత్పౌరులుగా తీర్చిదిద్దే సంఘసేవా కార్యక్రమాలకి ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాలి.

AP Board 9th Class Telugu వ్యాసాలు

14. నిరుద్యోగ సమస్య

ఉద్యోగం లేకపోవడమే నిరుద్యోగం. ఉద్యోగాలు చేయగలవారందరికీ ఉద్యోగాలు చూపించలేకపోవడాన్నే నిరుద్యోగ సమస్య అంటారు. పూర్వకాలంలో అందరూ కులవృత్తులకే ప్రాధాన్యమిచ్చేవారు. కానీ నేడు అందరూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎగబ్రాకుట వల్ల నిరుద్యోగ సమస్య తీవ్రరూపం దాల్చింది.

మనకు స్వాతంత్ర్యం లభించిన తరువాత ప్రభుత్వం అనేక పాఠశాలలను, కళాశాలలను స్థాపించింది. వాటిలో చదివి ఉత్తీర్ణులైన అందరికీ ఉద్యోగాలు చూపించడం ఒక చిక్కు సమస్యగా తయారైంది. ఉద్యోగం లభించకపోవడంతో యువకులకు చదువులపై నిరాశానిస్పృహలు కలుగుతున్నాయి. అటు కులవృత్తి చేయలేక, ఇటు ఉద్యోగం లభింపక ఉభయభ్రష్టులవుతున్నారు.

నిరుద్యోగ సమస్య తీరాలంటే ప్రభుత్వం విద్యావిధానంలో విప్లవాత్మకమైన మార్పులు తేవాలి. వృత్తి విద్యల కెక్కువ ప్రోత్సాహమివ్వాలి. ఇంటికొక ఉద్యోగమిచ్చే పథకం ప్రవేశపెట్టాలి. పరిశ్రమలు విరివిగా స్థాపించాలి. స్వయం ఉపాధి పథకాలను ప్రవేశపెట్టి, బ్యాంకుల ద్వారా ఋణాలు ఇప్పించాలి.

యువతీయువకులు నిరాశా నిస్పృహలకు లోనుకాకుండా, ధైర్యంగా ఏదో ఒక వృత్తిని చేపట్టి స్వతంత్రంగా జీవించడం అలవరచుకోవాలి.

15. నదులు – ఉపయోగాలు

నదులు పర్వతాలలో పుడతాయి. అన్ని ఖండాలలో, అన్ని దేశాలలో ఇంచుమించు నదులు ఉంటాయి. అందులో కొన్ని జీవనదులు మరికొన్ని వర్షాధార నదులు.

మన దేశంలోని నదులను రెండు విధాలుగా విభజించవచ్చు. 1) హిమాలయాల గుంపు 2) దక్కను గుంపు. హిమాలయపు నదులు, దక్కను నదుల కంటే తక్కువ వయస్సు కలవి.

హిమాలయపు నదులు మంచు కరగడం వల్ల, వర్షాల వల్ల సంవత్సరం పొడవునా ప్రవహిస్తూనే ఉంటాయి. అందుచేత వీటిని శాశ్వతనదులు అంటారు. హిమాలయపు గుంపులో సింధు, గంగ, బ్రహ్మపుత్ర ముఖ్యమైనవి.

దక్కను నదులు అనేక వేల సంవత్సరాల నుండి ప్రవహిస్తున్నాయి. ఈ నదులలో ముఖ్యమైనవి గోదావరి, కృష్ణ, కావేరి, పెన్న, మహానది, నర్మద, తపతి మొదలైనవి. ఈ నదులు పూర్తిగా వర్షంపై ఆధారపడినట్టివి. అందువల్లనే వేసవికాలం వచ్చేటప్పటికి నదులు సన్నబడిపోయి చిన్న ప్రవాహాలలాగా ఉంటాయి.

నదుల వల్ల అనేక లాభాలు ఉన్నాయి. నదులకు వంతెనలు కట్టి రిజర్వాయర్లు నిర్మించుకోవచ్చు. కాలువల ద్వారా లక్షలాది ఎకరాలకు నీటి పారుదల సౌకర్యాలను కలిగించి, పంటలు బాగా పండించుకోవచ్చు. నదిలోని నీటి ద్వారా విద్యుదుత్పాదక శక్తి కలిగించుకొనే థర్మల్ పవర్ స్టేషన్లు ఏర్పాటు చేసుకోవచ్చు. నదులను రవాణా సౌకర్యాలకి ఉపయోగించుకోవచ్చు. ఇతర ప్రాంత ప్రజలకు తాగునీటిని సరఫరా చేయవచ్చు.

16. వారాపత్రికలు

వార్తలను అందించే పత్రికలను “వార్తా పత్రికలు” (News papers) అంటారు. వార్తలను ఇంగ్లీషులో NEWS ఆంటారు గదా! ఆ అక్షరాలను బట్టి కొందరు ఈ విధమైన వివరణ ఇస్తారు – N అంటే North, E అంటే East, W అంటే West, S అంటే South. కాబట్టి ప్రపంచం నలుమూలలా జరిగే సంఘటనలను అందించేవి వార్తా పత్రికలు అనే వివరణ సమంజసంగానే కనిపిస్తుంది.

ప్రాచీనకాలంలో వార్తలను చేరవేయటానికి మనుషుల్ని, జంతువుల్ని, పక్షుల్ని వాడేవారు. “వార్తాహరులు”, “రాయబారులు” ఉండేవారు. కానీ విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందిన తర్వాత ముద్రణాయంత్రాలు వెలువడ్డాయి. అప్పటి నుంచి ‘అచ్చు’కి ప్రాముఖ్యం లభించి వార్తా పత్రికల వ్యాప్తి జరిగింది.

ప్రపంచంలో మొట్టమొదటగా వెనిస్ నగరంలో వార్తాపత్రిక ప్రారంభించబడిందని చెప్తారు. సుమారు క్రీ.శ. 1620 నాటికి వార్తా పత్రికలు వచ్చినట్టు తెలుస్తోంది. భారతదేశంలో మొదటి వార్తాపత్రికగా “ఇండియా గెజిట్”అని కొందరు, “బెంగాల్ గెజిట్”అని మరికొందరు పేర్కొంటున్నారు. క్రీ.శ. 1850 నుంచి మన దేశంలో పత్రికల ప్రచురణ అధికమైంది. కాశీనాథుని నాగేశ్వరరావు, ముట్నూరి కృష్ణారావు, ఖాసా సుబ్బారావు, సి.వై. చింతామణి, గోరా, నార్ల వెంకటేశ్వరరావు, నండూరి రామమోహనరావు, పొత్తూరి వెంకటేశ్వరరావు, ఎ.బి.కె. ప్రసాద్ మొదలైనవారు సంపాదకులుగా తెలుగువార్తా పత్రికల ప్రాచుర్యానికి ఎంతో కృషి చేశారు.

ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఆంధ్రభూమి, వార్త అనే దినపత్రికలు తెలుగునాట విశేష ఆదరణ పొందాయి.

వార్తా పత్రికల వల్ల లాభాలు చాలా ఉన్నాయి. అవి :

  1. మానవుడి మేధ వికసిస్తుంది.
  2. ఆర్థిక, రాజకీయ, విద్య, క్రీడ, వ్యవసాయ, సాహిత్యాదిరంగాలలోని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు.
  3. సమాజంలో అట్టడుగున పడి కనిపించని వాస్తవాలెన్నో పత్రికల ద్వారా తెలుస్తాయి.
  4. రచయితలకు, యువతకు, కళాకారులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, వ్యాపారవేత్తలకు, రైతులకు ఇంకా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకూ వార్తా పత్రికలు కరదీపికలు.
  5. జాతీయాభివృద్ధికి, జాతి సమైక్యతకి దోహదపడతాయి.
  6. ప్రభుత్వానికీ, ప్రజలకీ మధ్య వారధి వలె తోడ్పడతాయి. అంటే ప్రభుత్వ పథకాలూ, లోపాలూ ప్రజలకి తెలియజేస్తాయి. ప్రజల కష్టనష్టాలూ, సమస్యలూ, అభిప్రాయాలూ ప్రభుత్వానికి తెలియజేస్తాయి.

కొన్ని పత్రికలు నిష్పాక్షికంగా ఉండి అధికారుల అవినీతిని, అక్రమాలని బహిరంగపరుస్తున్నాయి. మరికొన్ని అశ్లీలానికీ, నీతిబాహ్యమైన అంశాలకీ ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛని కాపాడాలి. సంపాదకులు, పత్రికా నిర్వాహకులు పత్రికా స్వేచ్ఛను దుర్వినియోగం చెయ్యకుండా నైతిక బాధ్యత కలిగి ఉండాలి.

AP Board 9th Class Telugu వ్యాసాలు

17. ‘స్వచ్చభారత్ కార్యక్రమం’ అంశంపై ఒక వ్యాసం మీ మాటల్లో రాయండి.
జవాబు:
‘స్వచ్ఛభారత్’ అంటే భారతదేశాన్ని పరిశుభ్రంగా చెత్తచెదారము లేకుండా ఉంచడం. స్వచ్ఛమైన, మాలిన్యంలేని ప్రాంతంలో తిరిగే వారికి, మంచి ఆరోగ్యము ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యము. మనము అశ్రద్ధ చేయడం వల్ల, గ్రామాలు, నగరాలు, కార్యాలయాలు, వైద్యశాలలు చెత్తాచెదారాలతో నిండిపోయాయి. దీన్ని గుర్తించి మన భారత ప్రధాని నరేంద్రమోడీ గారు, భారతీయులకు స్వచ్ఛభారత్ కు పిలుపునిచ్చారు.

ఈ పిలుపును అందుకొని, ఎందరో పెద్దలు తమ నగరాలను, గ్రామాలను, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచడంలో పోటీపడుతున్నారు. ముఖ్యంగా మన విద్యార్థినీ, విద్యార్థులు, నిత్యమూ తమ బడినీ, ఇంటినీ, పుస్తకాలను శుభ్రంగా ఉంచుకోవాలి.

అలాగే ప్రతి కార్యాలయం వారు వారానికి ఒకసారైనా తమ కార్యాలయాలను శుభ్రంగా తీర్చిదిద్దాలి. ముఖ్యంగా ప్రభుత్వ వైద్యశాలలను నిర్మలంగా ఉంచాలి. అందుకు వైద్యులు, రోగులు సహకరించాలి. కాలువలు, నదులు, చెరువులు మొదలయిన చోట్ల నీటిని కలుషితం చేయకుండా పరిశుభ్రంగా ఉంచాలి. రోడ్లపై తుక్కు పోయరాదు. చెత్తకుండీలలోనే తుక్కు వేయాలి.

మన ప్రధాని ఈ కార్యక్రమం కోసం ఎంతో ధనాన్ని ఖర్చు చేస్తున్నారు. ఇంటింటికీ మరుగుదొడ్డి సదుపాయం సమకూరుస్తున్నారు. మలమూత్ర విసర్జనలు, బహిరంగ ప్రదేశాల్లో చేయరాదు. మనదేశాన్ని మనమే శుభ్రంగా ఉంచే బాధ్యత తీసికోవాలి. భారతదేశం స్వచ్ఛమైనదని పేరు వచ్చేలా ప్రతి భారతీయుడు కృషి చేయాలి.

18. “మాతృభాషలో విద్యాబోధన ఆవశ్యకత” గురించి వ్యాసం రాయండి.
జవాబు:
మాతృభాష అంటే తల్లి భాష అని అర్థం. మనం పుట్టిన చోట జనవ్యవహారంలో ఉండే భాష మాతృభాష. మానవుడు పుట్టింది మొదలు గిట్టేవరకు మాతృభాషలోనే ఎక్కువగా మాట్లాడటం జరుగుతుంది. మనం ఏ భాషలో మాట్లాడతామో, ఏ భాషలో కలలు కంటామో ఆ భాషలోనే విద్యను నేర్చుకోవడం ఎంతైనా అవసరం.

పరాయి భాషలో విద్యాభ్యాసం చేస్తే చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముందుగా పరాయి భాషను అర్థం చేసుకోవడానికి చాలా ప్రయాస పడాల్సివస్తుంది. అందులో తగినంత పరిజ్ఞానం అలవడనిదే విషయ గ్రహణంగానీ, విషయ వ్యక్తీకరణగానీ సాధ్యపడదు. మాతృభాషలో విద్యాభ్యాసం వల్ల విద్యార్థి ఉపాధ్యాయులు చెప్పిన విషయాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. గుర్తుంచుకొని పరీక్షలు బాగా వ్రాయవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ విజ్ఞానాన్ని పొందవచ్చు.

మాతృభాషలో విద్యను నేర్చుకోవడం తల్లిపాలు త్రాగి పెరగడం వంటిది. పరభాషలో విద్యను నేర్చుకోవడం దాది పాలు త్రాగడం వంటిది. ఆంగ్లం వంటి పరాయిభాషలో విద్యార్థికి సరైన పరిజ్ఞానం లేనందువల్ల విద్యార్థికి ఆ భాషరాక బట్టీపట్టి ఏదోవిధంగా కృతార్థుడవుతున్నాడు. ఉపాధ్యాయులు చెప్పేది అర్థంకాక గైడ్సు (Guides) వెంట పడుతున్నాడు. కాబట్టి కనీసం సెకండరీ విద్యాస్థాయి వరకు మాతృభాషలోనే విద్యను బోధించడం, విద్యను నేర్చుకోవడం అవసరం.

AP Board 9th Class Telugu వ్యాసాలు

19. ఈ రోజులలో కాలుష్యం, ఇతర కారణాల వలన కొన్ని జంతువులు, పక్షులు కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. వాటిని కాపాడుకోవల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ఒక వ్యాసం రాయండి.
జవాబు:
ఈ రోజులలో కాలుష్యం, ఇతర కారణాల వలన కొన్ని జంతువులు, పక్షులు కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. వాటిని కాపాడుకోవల్సిన ఆవశ్యకత మనందరి మీద ఉంది.

మనం ఎక్కువగా క్రిమి సంహారక మందులను పంటపొలాల్లో, పెరట్లోని మొక్కల పై, ఇంట్లో వస్తువులపై చల్లడం వల్ల, అలాగే మనం చల్లే ఎండ్రిన్ వల్ల భూమిని సారవంతం చేసే, గుల్ల బార్చే వానపాములు ఎన్నో ఇలా చస్తున్నాయి. అంతేకాక మామూలు పాములు, ఎలుకలు, పక్షులు, పురుగులు వగైరా ఎన్నో ప్రాణులు మన వల్లే మనుగడ సాగించలేకపోతున్నాయి. ఈ ప్రాణులు మన పంటలకు చేసే మేలును మనం కోల్పోతున్నాము. జంతువులు, పక్షులే కాదు మనకూ ప్రమాదమే. ఎలా అంటే క్రిమిసంహారక మందుల అవశేషాలు మిగిలిన పంట గింజలను మనం తినడంతో కేన్సర్, టి. బి, గుండె జబ్బులు వస్తున్నాయి.

ప్రకృతి సహజంగా మనకు ఇచ్చిన రక్షణ కవచం ఈ పురుగులూ, జంతువులు. అవి ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవిస్తాయి. అందువల్ల మన పంటలు హాయిగా పెరుగుతాయి. మనం భగవంతుడు మనకిచ్చిన సహజ ప్రకృతిని కాపాడుకుందాం. ఆరోగ్యంగా జీవిద్దాం. మన చుట్టూ ఉన్న పక్షులను, జంతువులను రక్షించుకుందాం.

టెక్నాలజీ పేరుతో వృద్ధి సాధిస్తున్నామనే భ్రమలో బుద్ధిని కోల్పోతున్నాం మనం. టి.వి.లు, సెల్ ఫోన్లు మన ఆరోగ్యాన్ని ఎంతగా పాడుచేస్తున్నాయో కదా ! తెలిసికూడా వాటిని మనం విడిచి పెట్టలేకపోతున్నాం. సెల్ ఫోన్ టవర్లు వంటివి కొన్ని రకాల పక్షుల జాతి అంతరించిపోవడానికి కారణమౌతున్నాయి. కానీ ఇవేమి మనకు పట్టదు. “పచ్చని చెట్టు ప్రగతికి మెట్టన్న పెద్దల మాట పెడచెవిన పెట్టకూడదు. తోటి ప్రాణుల పట్ల కారుణ్య భావంతో మెలగాలి. అప్పుడే ప్రకృతి సమంగా నడవడానికి అవకాశం ఉంటుంది. మన విపరీత ధోరణుల వల్లే ప్రకృతి కూడా వికృతంగా నడుస్తోంది.

ఈ సమస్య ఏ ఒక్కరిదో కాదు మనందరిది. చిన్న ప్రాణుల పట్ల నిర్లక్ష్యం వద్దు. అవే మనల్ని ఆపదల పాలు కాకుండా కాపాడతాయి. కనుక మనందరం నేటి నుంచి జీవకారుణ్య భావంతో మెలుగుదామని ప్రతిజ్ఞ చేద్దాం.

AP Board 9th Class Telugu లేఖలు

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions 9th Class Telugu లేఖలు Notes, Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu లేఖలు

ప్రశ్న 1.
పగ ప్రతీకారం మంచిది కాదనీ, శాంతియుత జీవనం గొప్పదనీ మీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

గుంటూరు,
x x x x

మిత్రుడు రవికుమార్‌,

మిత్రమా ! నీకు స్నేహపూర్వక అభినందనలు. ఈ మధ్య నీకూ నీ ప్రక్క ఇంటి మోహనకూ తగవు వచ్చిందనీ, దానితో నీ మనస్సు బాగోలేదనీ రాశావు. నేను నీ ఉత్తరం అంతా చదివాను.

నాకు మీ తగవుకు, గట్టి కారణం ఉందని అనిపించలేదు. పగ, విరోధము, కలహము అన్న మాటలు అసలు మంచివి కావు. పగ పెంచుకొన్న కొద్దీ మన మనస్సులు పాడవుతాయి. అశాంతి పెరిగిపోతుంది. సుఖం ఉండదు.

మనం భారతం చదివితే, అన్నదమ్ముల మధ్య అకారణ విరోధం వల్ల, కౌరవ వంశం సమూలంగా నాశనమయ్యిందని తెలుస్తుంది. ఇక పాండవుల్లో కేవలం ఆ అయిదుగురూ, ద్రౌపదీ మిగిలారు. రాముడితో విరోధం పెట్టుకొన్న రావణుడు, బంధుమిత్ర పరివారంతో మరణించాడు.

ప్రస్తుత కాలంలో చూసినా, దేశాలు యుద్ధాలవల్ల సర్వనాశనం అవుతున్నాయి. గ్రామాల్లో తగవుల వల్ల కొన్ని కుటుంబాలు చితికిపోతున్నాయి.

కాబట్టి నీవు నీ ప్రక్క ఇంటి మోహతో విరోధం మానివెయ్యి. స్నేహంగా ఉండు. నీ మనస్సు సుఖంగా ఉంటుంది. మనది, శాంతికాముకులయిన గాంధీ, బుద్ధుడు పుట్టిన దేశం. మరువవద్దు. ప్రక్కవారితో స్నేహంవల్ల మనకు ఎంతో మేలు కలుగుతుంది.

ఇట్లు,
నీ మిత్రుడు,
పి.వెంకటేశ్వరరావు,
9వ తరగతి,
రవి పబ్లిక్ స్కూలు,
విజయవాడ.

చిరునామా :
కె.రవికుమార్,
S/O కె.ప్రసన్నకుమార్,
తేరు వీధి, తిరుపతి, చిత్తూరు జిల్లా,
ఆంధ్రప్రదేశ్.

ప్రశ్న 2.
అబ్దుల్ కలాంగారి గూర్చి మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

విశాఖపట్నం,
x x x x x

ప్రియమైన ప్రభాకర్ కు,

మిత్రమా ! మన రాష్ట్రపతిగా పనిచేసిన ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలామ్ గారి గూర్చి ఈ లేఖలో తెలియజేస్తున్నాను. అబ్దుల్ కలాంగారు సామాన్య కుటుంబంలో పుట్టి అత్యున్నత శిఖరాలను, అధిరోహించిన మహనీయుడు. చిన్నతనం నుండి ఆయనలో పట్టుదల, క్రమశిక్షణ, జ్ఞాన జిజ్ఞాస ఎక్కువ. అవే ఆయన ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా ఎదగడానికి కారణమయ్యాయి.

అబ్దుల్ కలాంగారు అతి సామాన్య కుటుంబంలో పుట్టి, పరిశోధన సంస్థలకు ప్రాణం పోసి, ‘భారతరత్న’ పురస్కారం అందుకొన్న గొప్ప వ్యక్తి, ఆయన భారత రాష్ట్రపతిగా భారతజాతికి అందించిన సేవలు ఎనలేనివి. ఆయన మన విద్యార్థిలోకానికి స్ఫూర్తి ప్రధాతగా భావిస్తున్నాను.

ఇట్లు,
నీ మిత్రుడు,
పి. సుధాకర్.

చిరునామా :
కె. ప్రభాకర్, 9వ తరగతి,
ప్రభుత్వ ఉన్నత పాఠశాల,
శ్రీకాకుళం.

AP Board 9th Class Telugu లేఖలు

ప్రశ్న 3.
ఉపాధ్యాయురాలి ప్రోత్సాహంతో పదో తరగతి చదివి, 9.7 పాయింట్స్ సాధించి, కలెక్టరు గారి నుండి బహుమతిని అందుకున్న ‘రాణి’ని ప్రశంసిస్తూ లేఖ రాయండి.
జవాబు:

ప్రశంసా లేఖ

గుంటూరు,
x x x x x

ప్రియమైన మిత్రురాలు రాణికి !

నీ స్నేహితురాలు కల్పన రాయునది. ఎవరీ కల్పన అని ఆలోచిస్తున్నావా ? అట్టే శ్రమపడకు, నేను నీకు తెలియదు కాని నీ గురించి దిన పత్రికల్లో చదివి, ఆనందం ఆపుకోలేక నా ప్రశంసలు నీకు తెలియజేయాలని ఈ లేఖ రాస్తున్నాను.

మన రాష్ట్రంలో చాలామంది బాలికలు పేదరికం కారణంగా థమికస్థాయిలోనే చదువు ఆపేస్తున్నారు. అందరిలా నీవు కూడా ఏడవ తరగతితోనే చదువు ఆపి ఉంటే అది పెద్దవార్త అయ్యేదిగాదు. కాని నీ అదృష్టం కొద్దీ నీ ఉపాధ్యాయురాలు పాఠశాల మానిన నన్ను కస్తూర్బా పాఠశాలలో చేర్పించింది. ఉచిత విద్యతోపాటు నివాసం, వస్త్రాలు, పుస్తకాలు, భోజన సౌకర్యాలు ఉచితంగా ఆడపిల్లలకు కల్పిస్తూ వారి కోసమే ప్రభుత్వం కస్తూర్బా పాఠశాలలను ఏర్పరచింది. ఈ పాఠశాలలు అందుబాటులో ఉన్నా ఎంతోమంది బాలికలు విద్యకు దూరమవుతున్నారు. వీటి గురించిన అవగాహన వారికి లేకపోవడమే ఇందుకు కారణం.

పాఠశాలలో చేరిన నువ్వు విద్యపైనే శ్రద్ధ పెట్టి బాగా చదవడం పదవతరగతి పబ్లిక్ పరీక్షలో 9.7 పాయింట్లు సాధించడం నిజంగా గొప్ప విషయం. చదువే లోకంగా ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. ఒక తపస్సులా విద్యాభ్యాసం సాగించిన నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. నువ్వు నా తోటి విద్యార్థినులకే గాక నాలా వార్తాపత్రికల ద్వారా, దూరదర్శన్ వంటి ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న అమ్మాయిలకు చాలామందికి ఆదర్శంగా నిలిచావు.

కలెక్టర్ గారు నిన్ను అభినందిస్తున్న దృశ్యం దూరదర్శన్ లో చూస్తుంటే నా ఒళ్ళు పులకరించి పోయిందనుకో. నాతో పాటు చదువుతూ, మధ్యలోనే చదువుమానేసిన నా స్నేహితురాళ్ళకు నీ గురించి చెప్పాను. ప్రముఖులందరూ నిన్ను ప్రశంసిస్తున్న దృశ్యాలను చూపాను. వారు కూడా ఎంతో సంతోషించారు. నువ్వు మా సోదరివైతే ఎంత బాగుణ్ణు అని ఎవరికి వారే అనుకున్నాం. ఇప్పుడైనా నువ్వు మా సోదరివే. నీ నుండి మేమెంతో స్ఫూర్తి పొందాం. పేదరికం విద్యకు అడ్డంకి కాలేదని నీవు నిరూపించాలని మన స్ఫూర్తిగా కోరుతున్నాను.

ధన్యవాదాలు

ఇట్లు,
నీ మిత్రురాలు,
ఎ. కల్పన,
9వ తరగతి,
తెలుగు మాధ్యమం,
క్రమసంఖ్య – 18,
శారదానికేతన్ – బాలికోన్నత పాఠశాల,

చిరునామా:
పి. రాణి,
వెంకటేష్ నాయక్ గారి కుమార్తె,
రేగులగడ్డ గ్రామం,
మాచవరం మండలం.

ప్రశ్న 4.
వ్యవసాయం చేసే రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువులు, సాగుకు అవసరమైన ప్రత్యేక ఋణసౌకర్యం సకాలంలో అందించే బాధ్యత చేపట్టాలని వ్యవసాయాధికారికి లేఖ రాయండి.
జవాబు:

మండపేట,
x x x x

జిల్లా వ్యవసాయాధికారి గార్కి,

ఆర్యా,

విషయం :
రైతుల అవసరాలను తీర్చే బాధ్యత తీసుకోవాలని కోరిక. – మా మండపేట భూములలో ఏటా రెండు పంటలు పండుతాయి. మా తాత ముత్తాతల నుండి మేము వ్యవసాయాన్నే నమ్ముకొని జీవిస్తున్నాము. క్రమక్రమంగా మా రైతుల జీవితం దుఃఖనిలయం అవుతోంది.

మాకు కావలసిన ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు సక్రమమైన ధరలకు దొరకట్లేదు. స్థానిక వర్తకులు వాటిని దాచి, కృత్రిమంగా కొరతను సృష్టిస్తున్నారు. పండించిన ధాన్యాన్ని ఎవరూ కొనడం లేదు. ఇప్పుడు రెండవ పంటకు పెట్టుబడి దొరకడం లేదు. బ్యాంకులకు ఎన్నిసార్లు వెళ్ళినా మేము ఉత్త చేతులతో తిరిగి రావలసి వస్తోంది. విద్యుచ్ఛక్తి కనీసం మూడు గంటలయినా రావడంలేదు.

మేము పంటలు పండించకపోతే ప్రజలు పస్తులు ఉండాలి. ప్రజలకు చేతిలో ఎంత డబ్బు ఉన్నా తిండి గింజలే తింటారు కదా. మీరు శ్రద్ధ చూపించి, మాకు అప్పులు దొరికేలా, ఎరువులు, విత్తనాలు సరయిన ధరలకు దొరికేలా చర్యలు వెంటనే చేపట్టండి. వ్యవసాయాన్ని బ్రతికించండి. సెలవు.

నమస్కారములు.

ఇట్లు,
మీ విశ్వసనీయుడు,
ఎన్. శ్రీకాంత్,
మండపేట,
తూర్పుగోదావరి జిల్లా.

చిరునామా :
జిల్లా వ్యవసాయశాఖాధికారిగార్కి,
కాకినాడ,
తూ|| గో|| జిల్లా.

ప్రశ్న 5.
మీ జిల్లాలో ఒక విద్యార్థి వ్యర్థంగా పారవేసిన వస్తువులతో అద్భుతంగా కళా ఖండాలు తయారుచేశాడు. ఆ వార్తను మీరు పత్రికలో చూశారు. అతణ్ణి ప్రశంసిస్తూ పత్రికకు లేఖ రాయండి.
జవాబు:

వాకాడు,
x x x x

కె. రాజా రవివర్మ,
9వ తరగతి,
వాకాడు జిల్లా పరిషత్ హైస్కూలు,
నెల్లూరు జిల్లా,

ఈనాడు పత్రికా సంపాదకులకు,
సోమాజీగూడ, హైదరాబాదు.

ఆర్యా,

ఈ రోజు మీ పత్రికలో మా నెల్లూరు జిల్లా గూడూరు విద్యార్థి కె. రవిరాజు, వీధుల్లో పారవేసే ప్లాస్టిక్ కాగితాలు, బాటరీలు, అగ్గిపెట్టెలు వగైరా వ్యర్థ పదార్థాలతో చార్మినార్, తాజ్ మహల్ వంటి కళాఖండాల నమూనాలను అద్భుతంగా తయారు చేశాడని చదివాను. ఆ కళాఖండాలను చూసి, మా జిల్లా విద్యాశాఖాధికారి గారు, మా కలెక్టరు గారు, స్థానిక మంత్రిగారు ఆ విద్యార్థిని ప్రశంసించినట్లు చదివాను.

రవిరాజులోని కళాతృష్ణనూ, కళాచాతుర్యాన్ని నేను మనసారా ప్రశంసిస్తున్నాను. మా నెల్లూరు జిల్లా విద్యార్థి యొక్క కళాపిపాసనూ, అతనిలోని సృజనాత్మక శక్తినీ నేను మనసారా మెచ్చుకుంటున్నాను. మీ పత్రిక ద్వారా నా అభినందనలను, మా సోదరుడు రవిరాజుకు అందజేయండి. భవిష్యత్తులో అతడు ఉత్తమ కళాకారుడు కావాలని నేను కోరుకుంటున్నాను.

ఇట్లు,
కె. రాజా రవివర్మ,
జిల్లా పరిషత్ హైస్కూలు,
వాకాడు.

చిరునామా :
సంపాదకులు,
ఈనాడు దినపత్రిక,
సోమాజీగూడ, హైదరాబాదు.

AP Board 9th Class Telugu లేఖలు

ప్రశ్న 6.
మీ పాఠశాలలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలను వివరిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

వాకాడు,
x x x x x

ప్రియమైన మిత్రుడు కిరణకు,

ఉభయకుశలోపరి. ఇటీవల మా పాఠశాలలో 70వ గణతంత్ర దినోత్సవాన్ని వేడుకగా జరిపారు. మా ఊరి సర్పంచ్, కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి వచ్చారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో మేమంతా అంబేద్కర్, బాబూ రాజేంద్రప్రసాద్, నెహ్రూ, మహాత్మాగాంధీ, పింగళి వెంకయ్య మొదలైన మహనీయుల గురించి మాట్లాడాము. మా సోషల్ టీచర్ భారతుల ఫణిగారు మాకు మాట్లాడటంలో శిక్షణ ఇచ్చారు. మమ్మల్ని అందరూ మెచ్చుకున్నారు. మీ పాఠశాలలో జరిగిన విశేషాలను తెలియజేయి. ఇంతే సంగతులు.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
కె. ఫణిరామ్.

చిరునామా :
కె. కిరణ్ కుమార్,
9వ తరగతి,
ప్రభుత్వ ఉన్నత పాఠశాల,
రేటూరు, గుంటూరు జిల్లా.

ప్రశ్న 7.
మీ పాఠశాలలో జరిగిన “అమ్మకు వందనం” కార్యక్రమం గూర్చి వివరిస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

చెరుకూరు,
x x x x x

ప్రియమైన మిత్రుడు కార్తీక్ కు,

నేను క్షేమం. నీవు క్షేమమని భావిస్తున్నాను. నేను బాగా చదువుతున్నాను. నీవెలా చదువుతున్నావు. ఇటీవల మా పాఠశాలలో ‘అమ్మకు వందనం’ కార్యక్రమం బాగా జరిగింది. దానిలో భాగంగా ప్రతి విద్యార్థి తల్లిని ఆహ్వానించారు. ఆ అమ్మలకు వారి పిల్లల చేత పాదపూజ చేయించారు. మేము అలా చేసి అమ్మ ఆశీస్సులు పొందాం. నేను, మరికొంతమంది పిల్లల అమ్మ గొప్పదనం, మా అమ్మ గొప్పతనాన్ని గొప్పగా చెప్పాము. ఆ సమయంలో మా అమ్మ కళ్ళలో నా మీద ప్రేమ తొణికిసలాడింది. ఆమె నా కోసం పడ్డ కష్టాన్ని వృధా పోనీయక బాగా చదివి మంచి స్థాయికి వెళ్ళి అమ్మను ఇంకా బాగా సంతోషించేటట్లు చేయాలని నిర్ణయించుకున్నాను. మీ స్కూలులో ఈ కార్యక్రమం ఎలా జరిగిందో ఉత్తరం రాయి.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
కె. లీలాకృష్ణ సాయిశ్రీ ప్రసాదు.

చిరునామా :
ఎస్. కార్తీక్,
S/o బాలు,
9వ తరగతి ఎ-సెక్షన్,
ప్రభుత్వ పాఠశాల, ఒంగోలు,
ప్రకాశం జిల్లా.

ప్రశ్న 8.
మీ గ్రామంలో జరుగుతున్న స్వచ్ఛభారత్ కార్యక్రమాల గురించి వివరిస్తూ నీ మిత్రునకు లేఖ వ్రాయుము.
జవాబు:

మిత్రునికి లేఖ

అప్పాపురం,
x x x x x

ప్రియ మిత్రుడు ఫణిరామ్ కు,
ఉభయకుశలోపరి. నేను బాగా చదువుతున్నాను. నీవెలా చదువుతున్నావు ? నీకు నేను ఇటీవల రెండు ఉత్తరాలు రాశాను. జవాబులేదు. చదువు ధ్యాసలో పడి నన్ను మరచిపోవద్దు. మొన్నీ మధ్యన మా గ్రామంలో “స్వచ్ఛభారత్” కార్యక్రమాలు నిర్వహించారు. మనం అశ్రద్ధ చేయడం వల్ల, గ్రామాలు, నగరాలు, కార్యాలయాలు, వైద్యశాలలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఇలా అన్నీ చెత్తా చెదారాలతో నిండిపోయాయి. దీన్ని గుర్తించి మన భారత ప్రధాని నరేంద్రమోడీగారు, భారతీయులకు ‘స్వచ్ఛభారత్’ పిలుపునిచ్చారు. ఆరోగ్యమే మహాభాగ్యం కదా !

ఆ పిలుపునందుకొని ఎందరో పెద్దలు తమ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో పోటీపడుతున్నారు. ఆ క్రమంలో మా గ్రామంలో కూడా స్వచ్ఛభారత్ నిర్వహించారు. చెరువులు శుభ్రం చేశారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న తుమ్మచెట్లు వగైరా తొలగించారు. మురుగునీరు తొలగించి, బ్లీచింగ్ పౌడర్ చల్లారు. త్రాగునీరు పరిశుభ్రంగా ఉండేట్లు చేశారు. మల, మూత్ర విసర్జన బహిరంగ ప్రదేశంలో చేయకూడదని చాటింపు వేశారు. ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించకూడదని నిర్ణయించారు. అలాగే ‘ప్పారాగ్, గుట్కా పొగాకు’ వంటి వాటి జోలికి పోకూడదని, ఎవరూ అమ్మకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఇది ఏ ఒక్కరితో సాధ్యపడేది కాదు. అందరి సహకారం కావాలి. మరి మీ ఊరిలో స్వచ్ఛభారత్ నిర్వహించారా ? మరి ఆ విశేషాలు లేఖ ద్వారా తెలియజేయి.

ఇట్లు,
నీ మిత్రుడు,
కె. కిరణ్ కుమార్.

చిరునామా:
కె. ఫణిరామ్,
9వ తరగతి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల,
చెరుకూరు,
ప్రకాశం జిల్లా.

ప్రశ్న 9.
ప్రపంచ శాంతి ఆవశ్యకతను తెలుపుతూ మిత్రునికి లేఖ రాయండి. మితునికి లేఖ
జవాబు:

పూళ్ళ,
x x x x x

ప్రియమైన మిత్రుడు కార్తీక్ కు,

నేను క్షేమం, నీవు క్షేమమని భావిస్తాను. బాగా చదువుతున్నావా? ఇటీవల మా పాఠశాలలో వ్యాసరచన పోటీలు పెట్టారు. మాకు ‘ప్రపంచశాంతి’ అంశం ఇచ్చారు. ఆ పోటీలో నేనే ప్రథమస్థానం పొందాను. నేను రాసిన పాయింట్స్ బాగున్నాయని మా మాస్టార్లు అన్నారు.

శాంతిని మనమే చంపి, గోరీలు కూడా కట్టామాయె. ఇప్పుడు పరితపిస్తే మాత్రం ఎలా వస్తుంది? ఉన్నప్పుడు స్వార్థంతో, మతోన్మాదంతో ఊపిరి సలపనీయకుండా చేశామాయె. ఇప్పుడు రమ్మంటే ఎక్కడి నుండి వస్తుంది? ఎలాగ వస్తుంది? ఎప్పుడైతే మనం పరమత సహనం కల్గి ఉంటామో, ఎప్పుడైతే సోదర భావంతో అందరితో మెలుగుతామో అప్పుడు ‘శాంతి’ తన ఉనికిని చాటుకుంటుంది. అని రాశాను. మీ పాఠశాలలో జరిగిన విశేషాలను రాస్తావు కదూ !

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
కె. లీలాకృష్ణ

చిరునామా:
S. కార్తీక్,
S/o బాలసుబ్రహ్మణ్యం,
9వ తరగతి, ప్రభుత్వ పాఠశాల,
ఒంగోలు.

9th Class Telugu కరపత్రాలు

ప్రశ్న 1.
“స్వచ్చభారత్” ఆవశ్యకతను తెలుపుచూ ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:

ప్రియమైన పర్యావరణ పరిరక్షకులారా !

ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దల మాట. మనం అశ్రద్ధ చేయడం వల్ల గ్రామాలు, నగరాలు, కార్యాలయాలు, వైద్యశాలలు చెత్తాచెదారాలతో నిండిపోయాయి. దీనిని గుర్తించి మన భారత ప్రధాని నరేంద్రమోడీగారు, భారతీయులకు స్వచ్ఛభారత్ కోసం పిలుపునిచ్చారు.

ఈ పిలుపును అందుకొని ఎందరో పెద్దలు తమ నగరాలను, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో పోటీ పడుతున్నారు. ముఖ్యంగా మన పిల్లలు ప్రతిరోజూ ఇంటిని, అలాగే బడిని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో తల్లిదండ్రులుగా మీరంతా వారికి సహకరించాలి.

ప్రభుత్వ వైద్యశాలలను పరిశుభ్రంగా ఉంచడంలో సిబ్బందికి, రోగులు, ప్రజలు సహకరించాలి. రోడ్లపై తుక్కు పోయకుండా, చెత్తకుండీలలోనే వేయాలి. మలమూత్ర విసర్జనలు బహిరంగ ప్రదేశాల్లో చేయకూడదు. చెరువులు, బావులు, కాలువలను కలుషితం చేయకుండా పరిశుభ్రంగా ఉంచాలి.

మనదేశాన్ని మనమే శుభ్రంగా ఉంచే బాధ్యత తీసుకోవాలి. మనదేశం స్వచ్ఛమైనదని పేరు వచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటున్నాం.

మనం శుభ్రంగా ఉందాం.

దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుదాం.
ఇట్లు,
పర్యావరణ పరిరక్షణ బృందం.

AP Board 9th Class Telugu లేఖలు

ప్రశ్న 2.
పగ, ప్రతీకారం మంచిదికాదనీ, శాంతియుత జీవనం గొప్పదని తెలియజేస్తూ ‘కరపత్రం’ రూపొందించండి.
జవాబు:

కరపత్రం

ప్రియమైన మిత్రులారా !
పగ, ప్రతీకారం మంచిదికాదు, శాంతియుత జీవనం గొప్పదన్న సంగతి తెలుసుకోండి. అలనాడు రావణాసురుడు, దుర్యోధనుడు, కర్ణుడు మొదలుకొని నేటి పాక్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ వరకు అందరూ పగతో రగిలినవారే. చివరకు ఏం జరిగిందో, ఏమి జరుగుతుందో మనందరికీ తెలుసు. పగ ఉంటే పాము ఉన్న ఇంట్లో ఉన్నట్టే. కాలుతున్న కట్టే ఇంకొక కట్టెను కాల్చగలదు. అంటే పగ, ప్రతీకారంతో రగులుతున్న వ్యక్తి ముందు తాను నశిస్తూ, ఇంకొకరిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు. దీనివల్ల వారు ఏం సాధిస్తారు. అందరూ ఉంటేనే కదా సమాజం. ఎవరూ లేకపోతే అది స్మశానమే.

పెద్దలు ఎప్పుడూ ఒకమాట చెబుతారు. ఏమిటంటే ‘నీ కష్టంలో నీ వెంట వచ్చే నలుగురిని సంపాదించుకో’ అని. అంటే నలుగురితో మంచిగా ఉండమని కదా ! గౌతమ బుద్ధుడు, మహాత్మాగాంధీ వంటి మహనీయుల వారసులుగా మనం సాధించేది ఇదేనా ? సరిహద్దుల్లో శత్రువులను పారద్రోలడానికి సైనికులున్నారు. సంఘంలోని చెడ్డవారిని ఆపడానికి పోలీసులున్నారు. మరి నీలోని శత్రువులను రూపుమాపడానికి ఎవరున్నారు ? ముందు మనం మారాలి. మన మనసును మన ఆధీనంలో ఉంచుకున్నప్పుడు అంతా సంతోషమే. మనమే బాగుండాలి అన్నది స్వార్థం. ‘అందరూ బాగుండాలి ఆ అందరిలో నేనుండాలి’ అనుకోవడం పరమార్థం. శాంతిని స్థాపిద్దాం. సుఖైక జీవనం సాగిద్దాం. “శాంతి నీ ఆయుధమైతే; పగ, ప్రతీకారం నీ బానిసలు అవుతాయి.” అశాంతీ, అగ్గిపుల్లా ఒకటే. అవి కాలుతూ ఇంకొకరిని కాల్చడానికి ప్రయత్నిస్తాయి.

లోకా సమస్తా సుజనోభవన్తు
సర్వేసుజనా సుఖినోభవన్తు

ప్రశ్న 3.
ప్రభుత్వ పాఠశాలల్లోని సౌకర్యాలను వివరిస్తూ కరపత్రాన్ని తయారు చేయండి.
జవాబు:

ప్రభుత్వ పాఠశాల – సౌకర్యాలు

తల్లిదండ్రులందరికీ మా విన్నపము. నేడు మన ప్రభుత్వ పాఠశాలలు, విద్యార్థులకు కావలసిన అన్ని సౌకర్యాలతో హాయిగా ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు కావలసినది, చక్కని శిక్షణ పొందిన ఉపాధ్యాయులు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులంతా పోటీ పరీక్షల్లో నెగ్గిన రత్నాల వంటివారు. వారికి మంచి విద్యార్హతలు, మెరిట్ ఉంది. వారికి మంచి జీతాలు సక్రమంగా వస్తాయి. వారు మంచిగా బోధిస్తారు.

ఇక ప్రభుత్వ పాఠశాలలకు చక్కని భవనములు, ఆటస్థలాలు, ప్రయోగశాలలు ఉన్నాయి. ఆటలు ఆడించే వ్యాయామ ఉపాధ్యాయులు, అనుభవజ్ఞులయిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉన్నారు. మంచినీటి సదుపాయము, విద్యుచ్ఛక్తి, ఫోను, మరుగుదొడ్లు ఉన్నాయి.

ఇక్కడ పిల్లలందరికి ఉచితంగా చదువు చెపుతారు. ఉచితంగా పుస్తకాలు ఇస్తారు. మధ్యాహ్నం భోజనాలు ఉంటాయి. అర్హులయిన వారికి హాస్టలు సదుపాయం ఉంటుంది. హాస్టల్ విద్యార్థులకు ప్రయివేటుగా శిక్షణ చెప్పే ఉపాధ్యాయులు ఉంటారు. కాబట్టి మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్చండి. కాన్వెంట్ల కోసం అధిక ధన వ్యయం చేసుకోకండి. బాగా ఆలోచించి, మంచి నిర్ణయం తీసికోండి. గొప్ప గొప్ప విద్యావేత్తలంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివారని మరచిపోకండి.

నమస్కారములు.

ఇట్లు,
ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయ సంఘం,
కాకినాడ.

దివి x x x x x

ప్రశ్న 4.
ఈ రోజుల్లో కాలుష్యం, ఇతర కారణాల వల్ల కొన్ని పక్షులు, జంతువులు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. వీటిని కాపాడుకోవలసిన ఆవశ్యకతను వివరిస్తూ కరపత్రం తయారుచేయండి.
జవాబు:
ఈ రోజుల్లో మనం ఎక్కువగా క్రిమిసంహారక మందులను పంట పొలాల్లో, పెరట్లోని మొక్కల పై, ఇంట్లో వస్తువులపై చల్లుతున్నాము. ముఖ్యంగా పుష్పాలు పూసి ఫలదీకరణ చెందాలంటే సీతాకోక చిలుకల వంటి పక్షులు ఒక పరాగాన్ని పుష్పానుండి మరొక పుష్పానికి తమ రెక్కలతో చేర్చాలి. పురుగులను కొన్ని పక్షులు తమ ముక్కులతో పొడిచి చంపాలి.

అలాగే మనం చల్లే ఎండ్రిన్ వల్ల భూమిని సారవంతం చేసే, గుల్లబార్చే వానపాములు ఎన్నో చస్తున్నాయి. మామూలు పాములు, ఎలుకలు వగైరా ఎన్నో జంతువులు చస్తున్నాయి. ఆ జంతువులూ, పక్షులూ మన పంటలకు చేసే మేలును మనం కోల్పోతున్నాం. అదీగాక పురుగు మందుల అవశేషాలు పంటలపై మిగిలిపోవడంతో వాటికి ధరలు పలకటం లేదు. క్రిమి సంహారక మందుల అవశేషాలు మిగిలిన పంట గింజలను మనం తినడంతో కేన్సర్, టి.బి., గుండె జబ్బులు వస్తున్నాయి.

ప్రకృతి సహజంగా మనకు ఇచ్చిన రక్షణ కవచం ఈ పురుగులూ, జంతువులు. అవి ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవిస్తాయి. అందువల్ల మన పంటలు హాయిగా పెరుగుతాయి. మనం భగవంతుడు మనకిచ్చిన సహజ ప్రకృతిని కాపాడుకుందాం. ఆరోగ్యంగా జీవిద్దాం. మన చుట్టూ ఉన్న పక్షులను, జంతువులను రక్షిద్దాం.

ప్రశ్న 5.
ధనవంతులు సమాజానికి ఉపయోగపడాలి. అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు, బీదలకు విరాళాలు ప్రకటించమని ధనవంతులకు, వృద్ధాశ్రమాలకు కరపత్రం ద్వారా విజ్ఞప్తి చేయండి.
జవాబు:
అన్నదానాన్ని మించిన దానం లేదు
దాతను మించిన చిరంజీవి లేడు

దానం చేయడమే ధనార్జనకు సార్థకత. దాచుకోవడం కాదని భారతీయ ధర్మం బోధిస్తుంది. పుట్టడంతోనే తల్లిదండ్రులకు దూరమయ్యే అభాగ్యులు, చిన్న వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయి, అయిన వారిచే నిరాదరణకు లోనైన అదృష్టహీను లెందరో ఈ దేశంలో ఉన్నారు. వారు సమాజంపై ద్వేషాన్ని పెంచుకొని సంఘవిద్రోహులుగా మారుతున్నారు. అలానే అనేక కష్టాలను, నష్టాలను భరించి, అపురూపంగా పెంచుకున్న తమ పిల్లలే ముసలితనంలో తమని వీధుల్లో విడిచి పెడితే ఏం చేయాలో తోచని అమాయక వృద్ధులు ఎందరో బిచ్చగాళ్ళ రూపంలో మనకు దర్శనమిస్తుంటారు. వీరేగాక రెక్కాడితే గాని డొక్కాడని ఎందరో నిరుపేదలు ఉన్నారు. వందల ఎకరాల పొలం గల వ్యక్తి ఉన్న ఊరిలోనే ఒక సెంటు భూమి కూడా లేనివారు జీవిస్తున్నారు. పెద్ద పెద్ద బంగళాలు గల ప్రాంతంలోనే రోడ్ల ప్రక్కన ప్రమాదకర స్థలాల్లో పూరిగుడిసెలలో జనాలు జీవిస్తున్నారు. కొందరు తిండి ఎక్కువై జీర్ణంకాక ఇబ్బంది పడుతుంటే, మరికొందరు తినడానికి ఏమీలేక బాధపడుతున్నారు.

ఇలాంటి విచిత్ర పరిస్థితుల్ని మనం నిత్యజీవితంలో దాదాపు రోజూ చూస్తూనే ఉంటాం. ఈ అసమానతలు ఇలా కొనసాగాల్సిందేనా ? వీటిని సరిచేయలేమా ? అని ఆలోచిస్తాం. మన పనుల్లో పడి మర్చిపోతుంటాం. తీరికలేని పనుల్లో పడి సామాజిక బాధ్యతల్ని విస్మరిస్తాం.

మిత్రులారా ! మనకందరికి సమాజసేవ చేయాలనే కోరిక ఉన్నా తీరికలేక చేయలేకపోతున్నాం. మనం స్వయంగా సేవచేయలేకపోయినా సమాజసేవలో మనవంతు కృషిచేసే అదృష్టం మన కందుబాటులోనే ఉంది. అదెలా అంటే మనం మన దగ్గర ఉన్న ధనాన్ని అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు విరాళంగా ఇవ్వవచ్చు. ఆ ఆశ్రమాల నిర్వాహకులు ఆ ధనాన్ని సద్వినియోగపరుస్తారు. అలానే మనవద్ద అదనంగా ఉన్న వస్త్రాలను, బియ్యం వంటి ధాన్యాలను, ఇతర ఆహార పదార్థాలను సేకరించి బీదలుండే ప్రాంతాలలో పంచి పెట్టే ఎన్నో సేవాసంస్థలు అందుబాటులోకి వచ్చాయి. మనం చేయాల్సిందల్లా ఆయా సేవాసంస్థలకు మనవద్ద ఉన్నవి అందివ్వడమే. అంతర్జాలంలో సేవాసంస్థల చిరునామాలు ఉంటాయి. డబ్బును కూడా ఉన్నచోటు నుండి కదలకుండా ఆయా సంస్థల బ్యాంకు కాతాలకు పంపించే సౌకర్యాలు ఉన్నాయి. వాళ్ళకు ఫోన్ చేస్తే వారే వాహనాలతో వచ్చి మనవద్ద ఉన్న ధాన్యం, వస్త్రాలు మొదలైన వాటిని తీసుకొని వెళ్తారు.

సోదరులారా ! మనకు ఎక్కువైన వాటితోనే కొన్ని కుటుంబాలు ఒకపూటైనా చక్కని భోజనాన్ని, మంచి వస్త్రాన్ని పొందగలుగుతాయి. కాబట్టి మనకున్న ఈ సౌకర్యాన్ని వినియోగిద్దాం. మన సహృదయతను పెద్ద మొత్తాలలో విరాళాలు ప్రకటించడం ద్వారా, ధాన్యవస్త్రాలను ఇవ్వడం ద్వారా చాటుకొందాం. దేశంలో పేదరికాన్ని నిర్మూలించడంలో మన వంతు సాయాన్ని అందిద్దాం.

పేదలకు సాయం చేద్దాం
గుంటూరు జిల్లా,

పేదరికాన్ని రూపుమాపుదాం
బ్రాడీపేట 2/14, గుంటూరు.

AP Board 9th Class Telugu లేఖలు

ప్రశ్న 6.
దోమల నివారణకు ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలను తెలుపుతూ కరపత్రం తయారుచేయండి.
జవాబు:
దోమలపై దండయాత్ర దోమలపై దండయాత్ర యువతీ యువకులారా ! ఆలోచించండి ! ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన ఆలోచనలు వస్తాయి. అనారోగ్యానికి ప్రధాన కారణాలలో దోమకాటు ప్రధానమైనది. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలంటే దోమలను నివారించాలి. మురుగునీరు దోమలకు నిలయం. మురుగునీరు నిల్వ ఉండకుండా చూద్దాం. నీటిలో కుళ్ళిన ఆకులు, చెత్తా చెదారం వలన దోమలు వృద్ధి అవుతాయి. రోగాలు వ్యాపిస్తాయి. మలేరియా, డెంగ్యూ వంటివి దోమల వల్లే వ్యాపిస్తాయి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే ఈ సమస్యకు పరిష్కారం. దోమలు వ్యాపించకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లుకోవాలి. వాకిళ్ళు, కిటికీలకు దోమతెరలు బిగించాలి. జెట్ కాయిల్స్ వంటి వాటితో కూడా దోమలబాధ తగ్గుతుంది. కానీ మనకు శ్వాసకోశ ఇబ్బందులుంటాయి కాబట్టి సహజంగా దొరికే సాంబ్రాణి పొగ వేయడం, ఎండిన వేపాకు పొగవేయడం వంటివి దోమలను నివారిస్తాయి. పొడుగు దుస్తులు ధరించడం కూడా మేలే. దోమలను నివారిద్దాం – ఆరోగ్యాన్ని కాపాడుదాం.

ఇట్లు,
జిల్లా ఆరోగ్య పరిరక్షణ బృందం.

ప్రశ్న 7.
మీ పాఠశాలలో ‘ప్రపంచ శాంతి’ అనే అంశంపై మండలస్థాయి వ్యాసరచన పోటీ నిర్వహించాలని అనుకున్నారు. విద్యార్థులను ఆహ్వానిస్తూ కరపత్రం తయారు చేయండి.
జవాబు:

వ్యాసరచన పోటీ

కొవ్వూరు మండల విద్యార్థులకు ఒక శుభవార్త. దివి X X X X X వ తేదీ సోమవారం, కొవ్వూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో “ప్రపంచశాంతి” అనే విషయమై వ్యాసరచన పోటీ నిర్వహిస్తున్నాము. ఈ పోటీలో కొవ్వూరు మండలంలోని ప్రభుత్వ గుర్తింపు గల ఉన్నత పాఠశాలల విద్యార్థులందరూ పాల్గొనవచ్చును. పోటీలో పాల్గొనే విద్యార్థులు తమ ప్రధానోపాధ్యాయుని వద్ద నుండి గుర్తింపు పత్రం తీసుకురావాలి.

వ్యాసరచనకు సమయం 30 నిమిషాలు ఇవ్వబడుతుంది. వ్యాసాలు రాయడానికి కాగితాలు ఇవ్వబడతాయి. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇవ్వబడతాయి. ఈ పోటీ కొవ్వూరు మండల డెవలప్ మెంట్ ఆఫీసరు గారి పర్యవేక్షణలో సాగుతాయి.

వ్యాసరచన విషయం : “ప్రపంచశాంతి”

ఎక్కువమంది విద్యార్థినీ విద్యార్థులు ఈ పోటీలో పాల్గొని జయప్రదం చేయగోరిక. ప్రధానోపాధ్యాయులు అందరూ ఈ పోటీని జయప్రదం చేయడానికి సహకారం అందించగోరుతున్నాను.

దివి X XX XX.

మండల డెవలప్ మెంటు ఆఫీసర్,
కొవ్వూరు,
పశ్చిమ గోదావరి జిల్లా,

9th Class Telugu అభినందన పత్రాలు

ప్రశ్న 1.
మీ స్నేహితులలో కేవలం తెలుగులోనే ఒక రోజంతా మాట్లాడగలిగే వారెవరో గుర్తించి, వారిని అభినందిస్తూ కేవలం తెలుగు పదాలతో ఒక అభినందన పత్రం రాయండి.
జవాబు:

అభినందన పత్రం

మిత్రమా ! రాఘవా ! నీవు తెలుగు భాషాభిమానివి. నీవు చక్కని తెలుగును పరభాషా పదాలు లేకుండా మాట్లాడగలవు. అందుకుగాను నిన్ను తప్పక అభినందించాలి. మన మిత్రబృందంలో నీలాగా తెలుగు ఉచ్చారణ, దోషాలు లేకుండా స్వచ్ఛంగా మాట్లాడగలిగినవారు లేరు. నీవు మొన్న “భౌతికశాస్త్రము – ఉపయోగాలు” అన్న అంశం మీద వక్తృత్వం పోటీలో మాట్లాడిన విధం నన్ను బాగా ఆకట్టుకుంది. శాస్త్రవిషయిక అన్యభాషా పదాలను చక్కని పారిభాషిక పదాలతో తెలుగులో బోధించడం, మాట్లాడడం, నేడు ఉపాధ్యాయులకు సైతం కష్టంగా ఉంది. అలాంటిది నీవు అనర్గళంగా తెలుగులో ఒక్క పరభాషా పదం కూడా లేకుండా మాట్లాడావంటే అభినందించాల్సిన విషయమే. నిన్ను చూసి మేమూ అలాగే మాట్లాడాలని ప్రేరణ పొందాం. ఇదే విధంగా నీవు నీ తెలుగు భాషా జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ, మరింత ప్రతిభతో ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ … ఇవే నా హార్దిక అభినందనలు.

విజయవాడ,
x x x x x

ఇట్లు,
శ్రీరామ్.

AP Board 9th Class Telugu లేఖలు

ప్రశ్న 2.
మీ పాఠశాలలో ఒక విద్యార్థి రాష్ట్రస్థాయి స్కౌట్స్ అండ్ గైడ్స్ జంభోరీలో పాల్గొని ముఖ్యమంత్రి చేతుల మీదుగా బహుమతిని అందుకున్నాడు. అతణ్ణి అభినందిస్తూ పది వాక్యాలు రాయండి.
జవాబు:

అభినందన పత్రం

మిత్రుడు రవికాంత్ కు,
నీవు రాష్ట్రస్థాయి స్కౌట్స్ అండ్ గైడ్స్ జంభోరీలో పాల్గొని, మన ముఖ్యమంత్రి గారి చేతులమీదుగా ఉత్తమ స్కౌటుగా మొదటి బహుమతిని అందుకున్నావని తెలిసింది. ఇది మన పాఠశాల విద్యార్థులందరికీ గర్వకారణము. మన పాఠశాల పేరును నీవు రాష్ట్రస్థాయిలో నిలబెట్టావు. నీకు మన విద్యార్థులందరి తరఫునా, నా శుభాకాంక్షలు, అభినందనలు.

నీవు మొదటి నుండి చదువులోనూ, ఆటపాటలలోనూ ఉత్తమ విద్యార్థిగా పేరుతెచ్చుకుంటున్నావు. ఈ రోజు ఇంత ఉన్నతమైన బహుమతిని అందుకున్నావు. నీవు మన పాఠశాల విద్యార్థులందరికీ ఆదర్శప్రాయుడవు. నీవు సాధించిన ఈ విజయాన్ని మన విద్యార్థినీ విద్యార్థులంతా, హార్దికంగా అభినందిస్తున్నారు. నీకు మా అందరి జేజేలు.

ఉంటా,

ఇట్లు,
కె. శ్రీకాంత్ రవివర్మ,

 

ప్రశ్న 3.
రామయ్య ఆదర్శరైతు. ఆధునిక పద్ధతులతో, సేంద్రియ ఎరువులతోనే అధిక దిగుబడిని సాధించాడు. వ్యవసాయ శాఖ తరఫున ఆయన్ను అభినందిస్తూ అభినందన పత్రాన్ని తయారు చేయండి.
జవాబు:

అభినందన పత్రం

అభ్యుదయ రైతురాజు రామయ్య మహాశయా!
మీకు అభినందన మందారాలు. భారతదేశ సౌభాగ్యం పల్లెలపై ఆధారపడియుంది. పల్లెల్లో రైతులు పండించే పంటలపైనే మన వర్తక పరిశ్రమలు ఆధారపడియున్నాయి. మేం కడుపునిండా అన్నం తింటున్నామంటే అది మీ వంటి కర్షకోత్తముల హస్తవాసి అనే చెప్పాలి.

కర్షకోత్తమా !
మీరు మన ప్రభుత్వ వ్యవసాయశాఖ వారు సూచించిన సూచనలను అందిపుచ్చుకొని, మీ పొలాల్లో ఈ సంవత్సరం ఎకరానికి 60 బస్తాల ధాన్యం పండించారు. చేల గట్లపై కంది మొక్కలు పాతి 20 బస్తాల కందులు పండించారు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల జోలికి పోకుండా, మీ తోటలో 10 గేదెలను పెంచి, పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తూ, ఆ పశువుల పేడతో సేంద్రియ ఎరువుల్ని తయారు చేసి వాటినే ఉపయోగించి మంచి పంటలు పండించారు. మీ కృషికి ప్రభుత్వ పక్షాన అభినందనలు అందిస్తున్నాము. రైతురత్న రామయ్య గారూ!

నమస్కారం. ప్రభుత్వం మీకు ‘రైతురత్న’ అనే బిరుదునిచ్చి సత్కరిస్తోంది. మీరే ఈ జిల్లాలో రైతులకు ఆదర్శం. మీరు వ్యవసాయంలో మరిన్ని నూతన పద్ధతులు పాటించి, మన జిల్లాలో, రాష్ట్రంలో రైతులకు ఆదర్శంగా నిలవాలని కోరుతున్నాము. ఈ సందర్భంగా మీకు మన ముఖ్యమంత్రిగారి తరఫున రూ. 25,000లు బహుమతి ఇస్తున్నాము. మీకు మా శుభాకాంక్షలు. మా నమస్సులు.

అభినందనములు.

ఇట్లు,
జిల్లా వ్యవసాయాధికారి,

AP Board 9th Class Telugu లేఖలు

ప్రశ్న 4.
మీ తొమ్మిదో తరగతి తెలుగు దివ్వెలు – I పాఠ్యపుస్తకం గురించి పుస్తక పరిచయ నివేదికను; మీ అభిప్రాయాలను రాయండి.
జవాబు:
మా తొమ్మిదో తరగతి తెలుగు పుస్తకం పేరు, ‘తెలుగు దివ్వెలు’ – I అంటే తెలుగు దీపాలు అని అర్థం. ఈ పుస్తకంలో ఐదు పద్యభాగాలు, ఆఱు గద్యభాగాలు ఉన్నాయి. ఆరు ఉపవాచక వ్యాసాలు ఉన్నాయి.

పద్యభాగంలో కవి బ్రహ్మ తిక్కన గారి పద్యాలు, భారతం నుండి ఇవ్వబడ్డాయి. తిక్కన గారి తెలుగు పలుకుబడి, ఈ పద్యాల్లో కనబడుతుంది. ఇక వివిధ శతక కవుల పద్యాలు, ప్రాచీన కవిత్వానికీ, భక్తి, నీతి, ప్రబోధానికి ఉదాహరణలు. ఆడినమాట పద్యాలు, భోజరాజీయము అనే కథా కావ్యంలోనివి. దువ్వూరి రామిరెడ్డి గారి పద్యాలు, ఆధునిక పద్యానికి ఉదాహరణలు. ఆ పద్యాలు, రైతుకు వారు అందించిన నీరాజనాలు.

ఇక వచన పాఠాలలో పానుగంటి వారి సాక్షివ్యాసం, గ్రాంధిక భాషకు ఉదాహరణం. వచన పాఠములలో వివిధ వచన ప్రక్రియలను పరిచయం చేశారు. ఒక కథను, ఆత్మ కథను, లేఖను, వ్యాసాన్ని, పుస్తక పరిచయాన్ని పరిచయం చేశారు. మొత్తం పై మా తొమ్మిదో తరగతి తెలుగు పుస్తకం, తెలుగు సాహిత్యానికి ప్రతిరూపంగా ఉంది.

ఇక ఉపవాచక వ్యాసాలు, ఆరుగురు మహాత్ముల జీవితచరిత్రలను పరిచయం చేస్తున్నాయి. అవి మా విద్యార్థినీ విద్యార్థులకు, మంచి స్ఫూర్తి ప్రదాయకంగా ఉన్నాయి. మా తొమ్మిదో తరగతి పాఠ్య నిర్ణాయక సంఘం వారికి, నా కృతజ్ఞతలు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 ధృవతారలు

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions ఉపవాచకం Chapter 6 ధృవతారలు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions ఉపవాచకం 6th Lesson ధృవతారలు

9th Class Telugu ఉపవాచకం 6th Lesson ధృవతారలు Textbook Questions and Answers

కింది ప్రశ్నలకు పదిహేను వాక్యాలకు మించని సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
వైద్యరంగంలో డా॥ నోరి దత్తాత్రేయుడు గారు చేసిన కృషిని గురించి రాయండి.
జవాబు:
ప్రపంచస్థాయి వైద్యునిగా గుర్తింపు పొందిన డా|| నోరి దత్తాత్రేయుడు మన తెలుగువాడు కావడం మన అదృష్టం. సరైన వైద్యం లేకపోవడం వలనే తండ్రిని కోల్పోయామని తల్లి ద్వారా తెలుసుకొన్న నోరి ప్రభావితుడై వైద్యుడు అవ్వాలని చిన్నతనంలోనే నిర్ణయించుకున్నాడు.

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న రేడియం ఇనిస్టిట్యూట్ అండ్ కాన్సర్ హాస్పటల్ లో రెసిడెంట్ వైద్యునిగా సేవలందించారు. వ్యాధి సరైన సమయంలో గుర్తించలేకపోవడం, వైద్యం చాలా భారమైనదిగా ఉండడం, మందులు అందుబాటులో లేకపోవడం మొదలైన కారణాల వల్ల ఎందరో వ్యాధిగ్రస్తులు మరణం తప్ప మరొక శరణ్యం లేదని కుమిలిపోవడం ఆయనను ఎంతగానో కలచివేసింది. క్యాన్సర్ పై పరిశోధనలకు కంకణం కట్టుకున్నారు. 1977వ సం||లో కాన్సర్ పై పరిశోధన చేయడానికి అమెరికా వెళ్ళారు.

పరిశోధనల్లో ఎన్నో వైఫల్యాలు ఎదుర్కొన్నాడు. ఎక్కడా నిరాశ చెందలేదు. తాననుకున్నది సాధించే వరకు నిరంతరం కృషి చేస్తూ విజయాన్ని చేజిక్కించుకున్నాడు. ముఖ్యంగా మహిళలకు వచ్చే కాన్సర్ వ్యాధుల్ని నివారించటం కొరకు విశేషమైన కృషి చేసాడు. 1979 నుండి బ్రాకి థెరపి అనే వైద్య ప్రక్రియలో పరిశోధనలు జరిపి అత్యంత నైపుణ్యం గల వైద్యుడిగా అనేక వేల మంది కాన్సర్ రోగులకు నయం చేశారు. వైద్యవృత్తిలో అడుగుపెట్టి భయంకరమైన క్యాన్సర్ పై పరిశోధనలు చేస్తూ వ్యాధిగ్రస్తుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ప్రపంచ ప్రసిద్ధ రేడియో అంకాలజిస్ట్ డా|| నోరి దత్తాత్రేయుడు గారు “వైద్యోనారాయణా హరిః” అన్న మాటకు నిలువుటద్దం. నిజమైన ధృవతార.

ప్రశ్న 2.
డా|| నోరి దత్తాత్రేయుడు ఆంధ్రప్రదేశ్ లో వైద్య సేవలందించడానికి కారణాలు ఏమిటి?
జవాబు:
వైద్యవృత్తిలో కాలుమోపి భయంకరమైన క్యాన్సర్ పై పరిశోధనలు చేస్తూ వ్యాధిగ్రస్తుల జీవితాలలో వెలుగులు నింపిన నోరి దత్తాత్రేయుడు నిజమైన ధృవతార. చిన్నతనంలోనే వైద్యుడవ్వాలని నిర్ణయించుకొని అనతి కాలంలోనే మంచి విద్యార్థిగా పేరుపొందారు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎం.డి.లో ఉత్తీర్ణత పొందాడు. కాన్సర్ వ్యాధిగ్రస్తుల బాధలను చూసి చలించి 1977లో క్యాన్సర్ పై పరిశోధన చేయడానికి అమెరికా వెళ్ళారు. బ్రాక్ థెరపి వైద్య ప్రక్రియలో పరిశోధనలు చేసి వేలమంది క్యాన్సర్ రోగులకు నయం చేసాడు.

అమెరికాలోని మెమోరియల్ స్టోన్ కేటరింగ్ ఆసుపత్రిలో క్యాన్సర్ విభాగానికి అధిపతిగా పనిచేస్తున్నప్పుడు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి యన్.టి. రామారావు గారి సతీమణి బసవతారకం గారికి క్యాన్సర్ వ్యాధికి చికిత్స చేశారు. ఆ సందర్భంలో యన్.టి. రామారావుగారు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆంధ్రప్రదేశ్ లో క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించమని డా|| నోరికి ఒక విజ్ఞాపన చేశారు. అప్పుడు డా|| నోరి తనకూ సొంతగడ్డపై కాన్సర్ హాస్పిటల్ నిర్మించి సేవలందించాలనే తలంపు ఉన్నట్లు మనసులో మాట వెల్లడించారు. వెంటనే ముఖ్యమంత్రి ఏడెకరాల భూమిని క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించడం కోసం కేటాయించారు. ఈ విధంగా యన్.టి.రామారావుగారి కోరిక మేరకు, తన నేలతల్లిపై గల మమకారం వల్ల డా|| నోరి దత్తాత్రేయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చారు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 ధృవతారలు

ప్రశ్న 3.
సర్దేశాయి తిరుమలరావు జీవితం సైన్స్ కూ, సాహిత్యానికీ మధ్య గల సంబంధాన్ని ఎలా తెలియజేస్తుందో రాయండి.
జవాబు:
సైను, సాహిత్యాన్ని సమపాళ్ళలో రంగరించి జీవితాన్ని సుసంపన్నం చేసుకున్న అసలు సిసలు తెలుగు శాస్త్రవేత్త, భాషావేత్త సర్దేశాయి తిరుమలరావుగారు. సైన్స్ కూ, సాహిత్యానికి అగాథం పూడ్చాలని ఆయన పదేపదే చెప్పేవారు. ఆయన తన రచనలలో సైనూ, సాహిత్యానికి ఉండే తేడాను, అనుబంధాన్ని బాగా విశ్లేషించేవారు. ఇవి రెండూ కూడా సమాజ హితాన్ని కోరేవిగా ఉండాలని ఆయన భావించేవారు.

మనిషిని స్వావలంబునిగా, సమాజ శ్రేయస్సు కోరి పనిచేసే వ్యక్తిగా ప్రేరేపించగలిగే ఉదాత్త భావమే కవిత్వమని ఆయన ఉద్దేశ్యం. ఆసక్తులను శక్తులుగా మార్చగలిగేదే కవిత్వం అని ఆయన చెప్పేవారు. కవిత్వం ఒక స్ప్రింగ్ బోర్డు వంటిది. దానిమీద నిలబడి మనిషి ప్రగతి పథానికి ఎగురగల్గి ఉండాలి అని ఆయన చెప్పేవారు.

కవిత్వాన్ని రసాయన ప్రక్రియ లాగా ఎలా విశ్లేషించారో చూడండి – “పెద్దబండలో అనవసరమైన రాతి పదార్థాన్ని చెక్కి పారవేసి శిల్పి చక్కని విగ్రహాన్ని తయారుచేస్తాడు. రసాయన శాస్త్రవేత్త వంటి కవి వస్తు భావాలకు ప్రతిభా పాండిత్యాలని, రసాయన ప్రేరకాలని చేర్చి, మేధస్సు’ అనే క్రియా కలశంలో చర్య జరిపి, ఫలితాలను విచక్షణ అనే జల్లెడలో వడబోసి, వచ్చిన కవితా సారాన్ని మనకు అందిస్తాడు” అని చెప్పేవారు. ఋషితుల్యుడైన ఆయన ఆలోచనలు ఏక కాలంలో సంక్లిష్టములు, సరళములు.

9th Class Telugu ఉపవాచకం 6th Lesson ధృవతారలు Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

ఈ క్రింది వాక్యాలను సంఘటనలు ఆధారంగా వరుసక్రమంలో అమర్చి రాయండి.

ప్రశ్న 1.
అ) తైల సాంకేతిక పరిశోధనా సంస్థలో రీసర్చి కెమిస్టుగా చేరి, వివిధ హోదాల్లో పనిచేసి ఆ సంస్థ డైరెక్టరుగా 1989లో పదవీ విరమణ చేశారు.
ఆ) అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో బి.ఎస్సీ . చేశారు.
ఇ) డా|| సర్దేశాయి తిరుమలరావు 1928లో కర్నూలు జిల్లా జోరాపురంలో జన్మించారు.
ఈ) రాజస్థాన్ లోని బిట్స్ పిలానిలో ఎం.ఎస్సీ. రసాయన శాస్త్రం చదివారు.
జవాబు:
ఇ) డా|| సర్దేశాయి తిరుమలరావు 1928లో కర్నూలు జిల్లా జోరాపురంలో జన్మించారు.
ఆ) అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో బి. ఎస్సీ, చేశారు.
ఈ) రాజస్థాన్ లోని బిట్స్ పిలానిలో ఎం. ఎస్సీ, రసాయన శాస్త్రం చదివారు.
అ) తైల సాంకేతిక పరిశోధనా సంస్థలో రీసర్చి కెమిస్టుగా చేరి, వివిధ హోదాల్లో పనిచేసి ఆ సంస్థ డైరెక్టరుగా 1989లో పదవీ విరమణ చేశారు.

ప్రశ్న 2.
అ) పిలానీలో చదివేటప్పుడు గాంధీజీకి నిరాహార దీక్ష సరిపోయినపుడు, పొట్టి శ్రీరాములుకు ఎందుకు సరిపోదని హిందూస్థాన్ టైమ్సుకు లేఖ రాశారు.
ఆ) సర్దేశాయి తిరుమల రావుగారు 1928 నవంబరు 28న ఛత్రపతి శివాజీ పుట్టిన రోజునాడు జన్మించారు.
ఇ) అనంతపురంలో ఒక సంవత్సరం ఉపాధ్యాయుడుగా పనిచేశారు.
ఈ) అనంతపురం ఓ.టీ.ఆర్.ఐ (తైల సాంకేతిక పరిశోధనా సంస్థ)లో చేరి, ఆ సంస్థ డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు.
జవాబు:
ఆ) సర్దేశాయి తిరుమల రావుగారు 1928 నవంబరు 28న ఛత్రపతి శివాజీ పుట్టిన రోజునాడు జన్మించారు.
అ) పిలానీలో చదివేటప్పుడు గాంధీజీకి నిరాహార దీక్ష సరిపోయినపుడు, పొట్టి శ్రీరాములుకు ఎందుకు సరిపోదని హిందూస్థాన్ టైమ్సుకు లేఖ రాశారు.
ఇ) అనంతపురంలో ఒక సంవత్సరం ఉపాధ్యాయుడుగా పనిచేశారు.
ఈ) అనంతపురం ఓ.టీ.ఆర్.ఐ (తైల సాంకేతిక పరిశోధనా సంస్థ)లో చేరి, ఆ సంస్థ డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 ధృవతారలు

ప్రశ్న 3.
అ) సర్దేశాయి తిరుమల రావుగారు 1994 మే 10వ తేదీన గతించారు.
ఆ) ఆదోని, అనంతపురంలలో తిరుమలరావుగారి హైస్కూలు చదువు సాగింది.
ఇ) 1991లో జే.జే కాణీ పురస్కారం అందుకున్నారు.
ఈ) అనంతపురంలోని తైల పరిశోధనా సంస్థ డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు.
జవాబు:
ఆ) ఆదోని, అనంతపురంలలో తిరుమలరావుగారి హైస్కూలు చదువు సాగింది.
ఈ) అనంతపురంలోని తైల పరిశోధనా సంస్థ డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు.
ఇ) 1991లో జే.జే కాణ్ పురస్కారం అందుకున్నారు.
అ) సర్దేశాయి తిరుమల రావుగారు 1994 మే 10వ తేదీన గతించారు.

ప్రశ్న 4.
అ) 1977వ సంవత్సరంలో క్యాన్సర్ పై పరిశోధన చేయడానికి అమెరికాకు వెళ్లారు.
ఆ) భారత ప్రభుత్వం 2015వ సంవత్సరంలో ‘పద్మశ్రీ’ బిరుదుతో సత్కరించింది.
ఇ) కృష్ణాజిల్లా ‘మంటాడ’ గ్రామంలో నోరి సత్యనారాయణ, కనకదుర్గ దంపతులకు దత్తాత్రేయుడు జన్మించాడు.
ఈ) కర్నూలు వైద్యకళాశాలలో ఎమ్.బి.బి.యస్ లో చేరారు.
జవాబు:
ఇ) కృష్ణాజిల్లా ‘మంటాడ’ గ్రామంలో నోరి సత్యనారాయణ, కనకదుర్గ దంపతులకు దత్తాత్రేయుడు జన్మించాడు.
ఈ) కర్నూలు వైద్యకళాశాలలో ఎమ్. బి. బి.యస్ లో చేరారు.
అ) 1977వ సంవత్సరంలో క్యాన్సర్ పై పరిశోధన చేయడానికి అమెరికాకు వెళ్లారు.
ఆ) భారత ప్రభుత్వం 2015వ సంవత్సరంలో ‘పద్మశ్రీ’ బిరుదుతో సత్కరించింది.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
డా॥ నోరి చిన్నతనంలోనే వైద్యుడవ్వాలని ఎందుకు నిర్ణయించుకొన్నారు?
జవాబు:
కృష్ణాజిల్లా ‘మంటాడ’ గ్రామంలో నోరి సత్యనారాయణ, కనకదుర్గ దంపతుల పదవ సంతానం దత్తాత్రేయుడు. ఈయన ఐదవ యేటనే తండ్రి మరణించాడు. సరైన వైద్య సదుపాయం లేకపోవడం వలన, వైద్యం ఖరీదైనది కావడం వల్లనే తండ్రి మరణించాడని ఇలాగ ఎందరో జీవితాలను కోల్పోతున్నారని తల్లి తరచుగా చెబుతుండేది. ఈ మాటలు దత్తాత్రేయ మీద ఎంతగానో ప్రభావితం చూపాయి. అందుచేత చిన్నతనంలోనే వైద్యుడవ్వాలని నిర్ణయించుకున్నారు.

ప్రశ్న 2.
డా॥ నోరి విద్యాభ్యాసం గూర్చి రాయండి.
జవాబు:
1947 అక్టోబరు 21న కృష్ణాజిల్లా ‘మంటాడ’ గ్రామంలో దత్తాత్రేయుడు జన్మించారు. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో ‘ తల్లి పెంపకంలో పెరిగాడు. బందరులోని ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను పూర్తి చేశాడు. తర్వాత పి.యు.సి., బి.యస్సీ డిగ్రీని బందరు జాతీయ కళాశాలలో చదివి ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. వీరి పెద్దమ్మ జొన్నలగడ్డ సుందరమ్మ అతడి చదువుకు కావలసిన సహాయసహకారాలందించింది. కర్నూలు వైద్యకళాశాలలో యం.బి.బి.యస్ చదివి ప్రథముడిగా (1971లో) ఉత్తీర్ణులయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి యమ్.డి.లో ఉత్తీర్ణత సాధించారు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 ధృవతారలు

ప్రశ్న 3.
డా॥ నోరి అందుకున్న అవార్డులు, పొందిన గౌరవాలు తెల్పండి.
జవాబు:
విద్యార్థి దశలో ప్రతి తరగతిలోనూ ప్రథముడిగా నిలిచి ఉపకార వేతనాలు, బహుమతులు అందుకున్న డా|| నోరి వైద్యునిగా చేస్తున్న విశేషమైన సేవలకు గుర్తింపుగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలు పొందారు. 1984లో అమెరికన్ క్యాన్సర్ సొసైటీవారు క్లినికల్ ఫెలోషిప్ ఫ్యాక్టరీ అవార్డు ఇచ్చారు. 1990లో అమెరికన్ కాలేజీ ఆఫ్ రేడియేషన్ ఫెలోషిప్ కు ఎంపికయ్యారు. 1994లో అలుమిని సొసైటీ, మెమోరియల్ ప్లాన్, కేటరింగ్ క్యాన్సర్ సెంటర్ డిస్టింగ్విఫ్ట్ అలుమినస్ అవార్డు అందుకున్నారు. 1995లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గోల్డ్ మెడల్ అందుకున్నారు. 2003లో అమెరికన్ కాలేజీ ఆఫ్ రేడియేషన్ అంకాలజీ ఫెలోషిప్ అందుకున్నాడు. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ “ట్రిబ్యూట్ టు లైఫ్” గౌరవాన్ని బహుకరించింది. భారత ప్రభుత్వం 2015 సం||లో డా|| నోరిని “పద్మశ్రీ ” బిరుదుతో సత్కరించింది.

ప్రశ్న 4.
డా॥ నోరి ప్రస్తుతం నిర్వర్తిస్తున్న పదవులేవి?
జవాబు:
తల్లి మాటలతో ప్రభావితుడై వైద్యవృత్తిని ఎంచుకొని, దానిలో తనకంటూ ఒక స్థానం పొందారు డా|| నోరి దత్తాత్రేయుడు. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వైద్య సలహామండలి సభ్యులుగా కొనసాగుతున్నారు. హైదరాబాద్ లోని “బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్” నిర్వహణ బాధ్యతల్ని చేపట్టి వైద్య సేవలందిస్తున్నారు. క్యాన్సర్ వ్యాధి గురించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలూ నిర్వహిస్తున్నారు.

సైనూ సాహిత్యానికి వారధి సర్దేశాయి తిరుమలరావు

ప్రశ్న 1.
……… నేను ఇప్పటికీ స్వచ్చమైన పరిశోధకుడినే !” అని సర్దేశాయి గారి మాటల్లో ఉద్దేశ్యం ఏమిటి?
జవాబు:
1991 సెప్టెంబరులో జే.జే. కాణ్ పురస్కారం అందుకున్న సందర్భంలో చేసిన స్మారక ప్రసంగంలో అన్న మాటలివి. నేను ఇప్పటికీ స్వచ్ఛమైన పరిశోధకుడినే ! కలుషితం కాలేదు. పరిశోధన, పరిశోధకుడు అంటే గిరి గీసుకొని దానిలోనే తిరుగుతూ, వెతుకుతూ ఉండడం కాదు. సహజమైన ఆసక్తి, ఇష్టం చేసే ప్రతి పనీ ఒక పరిశోధనే. అలాంటివాడు పరిశోధకుడే అని వారి భావన అయి ఉండవచ్చు.

ప్రశ్న 2.
సర్దేశాయిగారి వ్యక్తిత్వం ఎటువంటిది?
జవాబు:
“ఎవరూ రాకపోయినా, ఒక్కడవే, ఒక్కడవే, పదవోయి” అనే ఠాగూర్ గీతం స్ఫూర్తితో చివరికంటా ఒంటరి పోరాటం చేసిన మహోన్నతుడు సర్దేశాయి. మొహమాటం, కపటం, ఆయనకు తెలియవు. ముక్కుసూటి మనిషి. అందువల్లనే ఆయన పరిశోధన తీక్షణంగా ఉంటుంది. విమర్శ తీవ్రంగా ఉంటుంది. ఎలాంటి మొహమాటాలు లేవు కనుకనే ఆయన మాట కటువుగా ఉంటుంది. సంగీతం అంటే మక్కువ. వారి వద్ద అపురూపమైన గ్రంథాలయం ఉంది. వ్యక్తిగా ఎందరికో స్ఫూర్తినిచ్చారు. సంస్థలో ఎంత చిన్నస్థానంలో పనిచేసే వ్యక్తినైనా ఉత్తేజితుని చేసేవారు. విద్యావేత్తలతో, వ్యవసాయదారులతో, పారిశ్రామిక వేత్తలతోను ఒకే విధమైన మాట తీరుతో మాట్లాడేవారు.

ప్రశ్న 3.
మామిడి టెంకలపై సర్దేశాయి పరిశోధనను గూర్చి రాయండి.
జవాబు:
ఒకసారి అనంతపురంలో రోడ్డు మీద నడచి వెళుతూ, తిని పడవేసిన మామిడి టెంకలు విపరీతంగా ఉండటం గమనించారు సర్దేశాయి. వీటిమీద ఆలోచన మొదలైంది. ప్రపంచంలో తొలిసారిగా వీటిమీద పరిశోధనలు చేసారు. గొప్ప ఫలితాలు సాధించారు. ఇపుడు మామిడిటెంక నుండి తీసిన పదార్థం నుండి తయారుచేసిన నూనెను పాశ్చాత్య దేశాల్లో మేలురకం చాక్ లెట్లలో వాడతారు. ఫలితంగా ఇపుడు మనకు విదేశీమారక ద్రవ్యం లభిస్తోంది. అదీ సర్దేశాయి పరిశోధనాంశాన్ని ఎంచుకునే విధానం.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 ధృవతారలు

ప్రశ్న 3.
సర్దేశాయి విద్యాభ్యాసం, ఉద్యోగం గూర్చి రాయండి.
జవాబు:
1928 నవంబరు 28 కర్నూలు జిల్లా, ఆలూరు తాలుకా, జోరాపురంలో జన్మించారు సర్దేశాయి తిరుమలరావు. వీరి మాతృభాష కన్నడం. అయినా సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు భాషలలో మంచి దిట్ట. అనంతపురంలో హైస్కూల్ చదువు, బి.ఎస్సీ. పూర్తి చేశారు. రాజస్థాన్ లోని బిట్స్ – పిలానిలో ఎం.ఎస్సీ. రసాయన శాస్త్రం చదివారు. తర్వాత అనంతపురంలో ఒక సంవత్సరం ఉపాధ్యాయుడుగా పనిచేశారు. 1954లో అనంతపురంలోని తైల సాంకేతిక పరిశోధనా సంస్థలో రీసెర్చి కెమిస్టుగా చేరి, వివిధ హోదాల్లో పనిచేశారు. 1989లో ఆ సంస్థ డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు.

ప్రశ్న 5.
తిరుమలరావు పరిశోధనాంశాలు ఏవి?
జవాబు:
డా|| తిరుమలరావు గారి పరిశోధనాంశాలు పరిశీలిస్తే ‘కాదేది పరిశోధనకు అనర్హం’ అని వ్యాఖ్యానించాలనిపిస్తుంది. బియ్యపు పొట్టు, కొబ్బరి, పట్టు పురుగు గుడ్డు, వాడిన కాఫీ పొడి, పత్తి విత్తనాలు, ఆముదాలు, వేరుశనగ గింజలు, పొగాకు విత్తనాలు, వేపగింజలు, మిరప విత్తనాలు, సీతాఫలం గింజలు, సూర్యకాంతి విత్తనాలు, జీడిమామిడి, మిల్క్ డైరీ అవక్షేపం, అరటితొక్కలు, నారింజ తొక్కలు, టమోట విత్తనాలు, దవనం, పుదీనా, మరువం, రోసాగడ్డి – ఇలా ఆయన దృష్టి పడని అంశం లేదు అనిపిస్తుంది. ఇంకా నువ్వులు, మొక్కజొన్నలు, కుసుములు, ఇప్పపువ్వు ఇలా ఎన్నింటి నుండో నూనె తీయవచ్చునని పరిశోధించారు.

ప్రశ్న 6.
డా|| తిరుమలరావు గారిలోని సాహిత్య కోణాన్ని గమనించండి.
జవాబు:
కావ్యాలలో ‘శివభారతం’, నాటకాలలో ‘కన్యాశుల్కం’, ‘నవలల్లో’, ‘మాలపల్లి’ చాలా గొప్పవని డా|| తిరుమలరావు తరచు చెప్పేవారు. ‘సాహిత్య తత్వం – శివభారత – దర్శనం’, ‘కన్యాశుల్కం – నాటక కళ’ అనే పేరుతో విమర్శనాత్మక గ్రంథాలు రాసారు. మేఘసందేశంలోని మేఘుని మార్గము, భౌగోళిక వాతావరణ విశేషాలు, అలెగ్జాండర్ పోపు – వేమన, ప్రపంచాన్ని మార్చిన శాస్త్రీయ సంఘటనలు మొదలైన గ్రంథాలు రచించారు. అలాగే సాహిత్య విమర్శలు, పరిశోధనా పత్రాలు అనేకం వీరి అమృత లేఖిని నుండి జాలువారాయి.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 5 ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions ఉపవాచకం Chapter 5 ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions ఉపవాచకం 5th Lesson ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి

9th Class Telugu ఉపవాచకం 5th Lesson ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి Textbook Questions and Answers

కింది ప్రశ్నలకు పదిహేను వాక్యాలకు మించని సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
భద్రిరాజు కృష్ణమూర్తి గారు నిర్వహించిన బాధ్యతలు పేర్కొనండి.
జవాబు:
భాషా క్షేత్రంలో చెరగని మైలురాళ్ళను నిలిపి, తరగని కీర్తిని ఆర్జించినవారు శ్రీ ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి. ఎందరో కాకలు తీరిన భాషా యోధులకు సర్వ సైన్యాధ్యక్షుడి లాంటి గురువు ఈయన. గత శతాబ్దిలో అంతర్జాతీయ స్థాయిలో గొప్ప భాషా శాస్త్రవేత్తల్లో భారతదేశానికి చెందిన ఇద్దరిలో ఒకరు ఈయన.

మొదట ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ట్యూటర్ గా పనిచేసిన కృష్ణమూర్తిగారు తర్వాత ఉస్మానియా, వేంకటేశ్వర విశ్వ విద్యాలయాల్లో ఆచార్యులుగా సేవలందించి, చివరన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా (వైస్ ఛాన్సలర్) పదవీ బాధ్యతలు నిర్వహించారు. సందర్శకాచార్యులు (విజిటింగ్ ప్రొఫెసర్) గా మిచిగాన్, కార్నెల్ టోక్యో, హవాలీ, టెక్సాస్ వంటి ప్రసిద్ధిగాంచిన విదేశీ విశ్వవిద్యాలయాల్లో భాషాశాస్త్రాన్ని వివిధ దేశాల విద్యార్థులకు బోధించారు. గిడుగు రామమూర్తి పంతులు ప్రవేశపెట్టిన వ్యవహార భాషోద్యమ స్రవంతి ఆగిపోకుండా, కుంటు పడకుండా, మరింత ఉధృతంగా ముందుకు నడిపించే బాధ్యతను తన భుజాలకెత్తుకొని విజయవంతంగా నిర్వహించారు.

ప్రశ్న 2.
భద్రిరాజు కృష్ణమూర్తిగారు గొప్ప పరిశోధకులు; ఆచార్యులు; దీక్షాదక్షులు; పరిపాలకులు – అని సమర్థించండి.
జవాబు:
దక్షిణాసియా దేశాలన్నిటిలోనూ, మనదేశంలో, మనరాష్ట్రంలో మొట్టమొదటి వృత్తి పదకోశాన్ని తయారు చేసినవారు కృష్ణమూర్తిగారు. విద్యాబోధనలో వాడుకభాష వినియోగం గురించి గిడుగు, గురజాడల తర్వాత అంతటి కృషిచేసిన మహనీయుడు భద్రిరాజు కృష్ణమూర్తి.

వర్ణనాత్మక, చారిత్రాత్మక, తులనాత్మక భాషాధ్యయనశీలిగా; నిబద్ధత, నిశిత పరిశీలన, మొక్కవోని దీక్ష గల్గిన సుప్రసిద్ధ పరిశోధకుడిగా, శిష్యుల పట్ల అపార వాత్సల్యాదులు కల్గిన ఉత్తమ ఆచార్యుడిగా; ఏ నిర్ణయానికైనా వెరవని పాలనాదక్షుడిగా, నిరంతర శోధన, ఆదర్శవంతమైన బోధన, అగాధమైన విజ్ఞానం, సహృదయత మూర్తీభవించిన మహోన్నత వ్యక్తిగా అంతర్జాతీయ కీర్తి గడించిన మన తెలుగు తేజం ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తిగారు.

సంప్రదాయ వ్యాకరణం నేర్చుకున్న కృష్ణమూర్తిగారు ఆధునిక భాషా, వ్యాకరణాంశాల మీద దృష్టి సారించడం తెలుగువాళ్ళ అదృష్టం. అనేక జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో ట్యూటర్ గా, ఆచార్యులుగా, ఉపకులపతిగా, సందర్శకాచార్యులుగా భాషా శాస్త్రాన్ని విద్యార్థులకు బోధించారు.

గిడుగు రామమూర్తి పంతులుగారు ప్రవేశపెట్టిన వ్యవహారిక భాషా ఉద్యమాన్ని ముందుకు నడిపించే బాధ్యతను తీసుకొని, భాషకు మాండలిక ఆవశ్యకతను గుర్తించి, వృత్తి పదకోశాల నిర్మాణాన్ని తన శిష్యుల సహకారంతో విజయవంతంగా నిర్వహించారు. తొలి ప్రయత్నంగా వ్యవసాయ, చేనేత వృత్తి పదకోశాలను అందించారు.

కృష్ణమూర్తిగారి భాషా పరిశోధన ఫలాలు తెలుగువాళ్ళకు మాత్రమే పరిమితం కావు. వారి ఆంగ్ల రచనలు ఇతర భాషల వాళ్ళు చేయవలసిన కృషికి ప్రేరణనిచ్చేవి, ఒరవడి పెట్టేవి. కాలిఫోర్నియాలో ఎం.బి.ఎమినో గారి శిష్యరికంలో ధ్వని, పదాంశ, వాక్యశాఖల్లో లోతైన పరిశోధనలు చేశారు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 5 ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి

ప్రశ్న 3.
భాషా పరిశోధనకు ఉద్యమించక మునుపు భద్రిరాజు కృష్ణమూర్తి జీవితం ఎలా సాగిందో వివరించండి.
జవాబు:
తిక్కన, శ్రీనాథుల సంప్రదాయ కవిత్వాన్ని ఆరాధించి, వాళ్ళకు దీటుగా ఛందోబద్ధ కవితా రచనతో సాహితీరంగంలో ప్రవేశించారు భద్రిరాజు కృష్ణమూర్తి. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన ఈయన ‘చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడె….’ శ్రీనాథుని ప్రౌఢశైలిని తలపిస్తూ క్విట్ ఇండియా ఉద్యమ నేపథ్యంగా రచన చేసిన పెద్దల మన్ననలను పొందారు. ప్రౌఢత, ప్రసాదగుణం కలిగిన పద్యాలు అలవోకగా, రాయడమే గాక కృష్ణమూర్తి అవధానం కూడా చేసేవారు.

శ్రీగంటి జోగి సోమయాజులు గారి వద్ద సంప్రదాయ వ్యాకరణం నేర్చుకున్నారు ఈయన. ఆంధ్ర, ఉస్మానియా, వేంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో ట్యూటర్ గా, ఆచార్యులుగా, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా పనిచేసారు. ప్రసిద్ధిగాంచిన విదేశీ విశ్వవిద్యాలయాల్లో సందర్శకాచార్యులుగా ఉన్నారు. తాను స్వయంగా రచించినవీ, సంపాదకత్వం వహించినవీ ఎన్నో గ్రంథాలు వెలుగులోనికి వచ్చాయి.

భాషా పరిశోధనకు ఉద్యమించక మునుపు భద్రిరాజు కృష్ణమూర్తిగారు ప్రొడత, ఆర్ధత కల్గిన కవిగా, అవధానిగా, సంప్రదాయ వ్యాకరణ అభ్యాసకునిగా, ట్యూటర్ గా, ఆచార్యునిగా, ఉపకులపతిగా, సందర్శకాచార్యులుగా, సంపాదకుడిగా ఇలా భిన్న పార్శ్వా లలో దర్శనమిస్తారు.

ప్రశ్న 4.
భద్రిరాజు కృష్ణమూర్తి భాషాసేవను గురించి రాయండి.
జవాబు:
భాషాక్షేత్రంలో చెరగని మైలురాళ్ళను, తరగని కీర్తి శిఖరాలను నిలిపారు భద్రిరాజు కృష్ణమూర్తిగారు. భాషా శాస్త్రాన్ని, భాషా చరిత్రనూ విశ్వవేదిక మీద నిలబడి నినదించి, తెలుగుజాతి కీర్తి కిరీటాన్ని రెపరెపలాడించిన వారు కృష్ణమూర్తిగారు. అంతేకాదు తెలుగు పుట్టు పూర్వోత్తరాల గురించి నిర్దుష్ట సమాచారాన్నందించిన వారు ఈయన. దక్షిణాసియా దేశాలన్నింటిలోనూ ప్రప్రథమంగా వృత్తి పదకోశాన్ని తయారుచేసినవారు భద్రిరాజు కృష్ణమూర్తి. గత శతాబ్దిలో అంతర్జాతీయ స్థాయిలో గొప్ప భాషా శాస్త్రవేత్తలలో భారతదేశానికి చెందిన ఇద్దరిలో కృష్ణమూర్తిగారొకరు.

భాషకు మాండలిక ఆవశ్యకతను గుర్తించి, వృత్తి పదకోశాల నిర్మాణాన్ని తన శిష్యుల సహకారంతో నిర్వహించారు. తొలి ప్రయత్నంగా వ్యవసాయ, చేనేత వృత్తి పదకోశాలను అందించారు. వీరి పరిశోధన తెలుగులోనే కాక “ద్రవిడియన్ లాంగ్వేజ్, కంపేరిటివ్ ద్రవిడియన్ లింగ్విస్టిక్ ……” వంటి రచనల ద్వారా ఇతర భాషలవాళ్ళు చేయవలసిన కృషికి ప్రేరణగా నిలిచాయి.

వయోజన విద్యావ్యాప్తి కోసం ‘జనవాచకం’, ‘తేలిక’ తెలుగువాచకం ఈయన రచించారు. శ్రీ పి. శివానందశర్మతో కలిసి ఇంగ్లీష్ ద్వారా తెలుగు నేర్చుకొనే వారికోసం ‘ఏ బేసిక్ కోర్స్ ఇన్ మోడ్రన్ తెలుగు’ రచించారు. ధ్వని, పదాంశ, వాక్యశాఖల్లో లోతైన పరిశోధనలు చేశారు. తన సిద్ధాంత గ్రంథం “తెలుగు వెర్బల్ బేసెస్’, ‘ద్రవిడ భాషల తులనాత్మక అధ్యయనం’ గ్రంథాల ద్వారా విశేష ఖ్యాతిని పొందారు. ఈ విధంగా భాష, భాషోత్పత్తి, లిపి, ప్రాచీనత, వైవిధ్యత, రూప పరిణామ క్రమం తదితర అనేకానేక అంశాలను విస్తృతంగా పరిశోధించి, ప్రామాణిక రచనలను ప్రకటించి ప్రపంచ భాషాభిమానుల, పరిశోధకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు భద్రిరాజు కృష్ణమూర్తి.

9th Class Telugu ఉపవాచకం 5th Lesson ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

ఈ క్రింది వాక్యాలను సంఘటనలు ఆధారంగా వరుసక్రమంలో అమర్చి రాయండి.

ప్రశ్న 1.
అ) శ్రీ గంటి జోగి సోమయాజులు గారి వద్ద సంప్రదాయ వ్యాకరణం నేర్చుకున్నారు.
ఆ) ప్రకాశం జిల్లా ఒంగోలులో కృష్ణమూర్తి గారు 1928 జూన్ 19న జన్మించారు.
ఇ) 2012 ఆగస్టు 11న స్వల్ప అస్వస్థతతో దేహయాత్ర చాలించారు.
ఈ) ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కృష్ణమూర్తి గారు ట్యూటర్‌గా పనిచేశారు.
జవాబు:
ఆ) ప్రకాశం జిల్లా ఒంగోలులో కృష్ణమూర్తి గారు 1928 జూన్ 19న జన్మించారు.
అ) శ్రీ గంటి జోగి సోమయాజులు గారి వద్ద సంప్రదాయ వ్యాకరణం నేర్చుకున్నారు.
ఈ) ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కృష్ణమూర్తి గారు ట్యూటర్ గా పనిచేశారు.
ఇ) 2012 ఆగస్టు 11న స్వల్ప అస్వస్థతతో దేహయాత్ర చాలించారు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 5 ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి

ప్రశ్న 2.
అ) వ్యవసాయ చేనేత వృత్తి పదకోశాలను అందించారు.
ఆ) 300 వృత్త పద్యాల్లో ‘మాతృ సందేశం’ అనే కావ్యం రచించి పెద్దల మన్ననలు పొందారు.
ఇ) హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా పదవీ బాధ్యతలు నిర్వహించారు.
ఈ) కాలిఫోర్నియాలో ఎం.బి.ఎ.మినో గారి శిష్యరికంలో ధ్వని, పదాంశ, వాక్యశాఖల్లో పరిశోధనలు చేశారు.
జవాబు:
ఆ) 300 వృత్త పద్యాల్లో ‘మాతృ సందేశం’ అనే కావ్యం రచించి పెద్దల మన్ననలు పొందారు.
అ) వ్యవసాయ చేనేత వృత్తి పదకోశాలను అందించారు. ఈ) కాలిఫోర్నియాలో ఎం.బి.ఎ.మినో గారి శిష్యరికంలో ధ్వని, పదాంశ, వాక్యశాఖల్లో పరిశోధనలు చేశారు.
ఇ) హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా పదవీ బాధ్యతలు నిర్వహించారు.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
తెలుగుభాషకు వివిధ అంశాలలో సేవలు చేసిన మీకు తెలిసిన మహనీయుల పేర్లను రాయండి.
జవాబు:
భాషాశాస్త్రంలో దేశవిదేశాల్లో పేరెన్నికగన్నవారు చేకూరి రామారావుగారు. పాఠ్యగ్రంథ రచనల్లో బాగా పేరుగాంచిన రచయిత – ఆచార్య కె.కె. రంగనాధాచార్యులు. తెలుగు లిపి గురించి, పదప్రయోగాల గురించి అనేక అంశాలు సమగ్రంగా రచించినవారు – డా|| బూదరాజు రాధాకృష్ణగారు. తెలుగు అక్షర నిర్మాణం గురించి, ప్రత్యయాదుల ఉత్పాదకత గురించి ప్రయత్నించినవారు – డా|| ఉమామహేశ్వరరావు. మన రాష్ట్ర మాండలికాల్లో మధ్యమండలం కాక, మిగతా మూడు మాండలికాల్లో నవలా రచన చేసినవారు డా|| పోరంకి దక్షిణామూర్తిగారు. వీరంతా కాకలు తీరిన భాషా యోధులు.

ప్రశ్న 2.
భద్రిరాజు కృష్ణమూర్తిగారు విశిష్ట వ్యక్తి అని తెలుసుకున్నాం కదా ! క్లుప్తంగా వారి గురించి రాయండి.
జవాబు:
సంప్రదాయ కవిత్వంతో పాటు ఆధునిక ప్రామాణిక భాషా విషయంలో తెలుగుభాషకు అనన్య సామాన్యమైన సేవలందించిన విశిష్ట వ్యక్తి భద్రిరాజు కృష్ణమూర్తి. ఈయన గురించి – భాషాశాస్త్రాన్ని, భాషా చరిత్రనూ విశ్వ వేదిక మీద నిలబడి నినదించారు. తెలుగుజాతి కీర్తి కిరీటాన్ని రెపరెపలాడించారు. ద్రవిడ భాషల తీరు తెన్నుల గురించి తులనాత్మకంగా చర్చించి, భాషా పరిశోధకులకు కరదీపికగా నిలచారు. తెలుగు పుట్టుపూర్వోత్తరాల గురించి నిర్దుష్ట సమాచారాన్ని అందించినారు. వృత్తి పదకోశాన్ని అందించిన దక్షిణాసియా దేశాల్లో ప్రప్రథముడు. గత శతాబ్దిలో అంతర్జాతీయ స్థాయిలో గొప్ప భాషాశాస్త్రవేత్తలలో మనదేశానికి చెందిన ఇద్దరిలో ఒకరు. విద్యాబోధనలో వాడుకభాష వినియోగం గూర్చి గిడుగు, గురజాడల తర్వాత అంతటి కృషి చేసిన మహనీయులు. ఇలా ఎన్నో అంశాలు స్పృశించి, తెలుగువారి గుండెలలో సుస్థిర స్థానం పొందారు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 5 ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి

ప్రశ్న 3.
భద్రిరాజు కృష్ణమూర్తిగారి వ్యక్తిత్వాన్ని క్లుప్తంగా రాయండి.
జవాబు:
తిక్కన, శ్రీనాథుల సంప్రదాయ కవిత్వాన్ని ఆరాధించి, వాళ్ళకు దీటుగా ఛందోబద్ధ కవితా రచన చేసారు కృష్ణమూర్తిగారు. నిబద్ధత, నిశిత పరిశీలన, మొక్కవోని దీక్ష ఆయనను సుప్రసిద్ధ పరిశోధకునిగా నిలబెట్టాయి. శిష్యుల పట్ల అపార వాత్యల్యాదరాలు చూపే ఉత్తమ ఆచార్యుడాయన. ఏ నిర్ణయానికైనా వెరవని పాలనాదక్షుడు. నిండైన ఆత్మవిశ్వాసం, ఆదర్శవంతమైన బోధన ఆయనకున్న రెండు కళ్ళు. అందరినీ ప్రేమించే సహృదయత మూర్తీభవించిన మహోన్నత వ్యక్తి భద్రిరాజు కృష్ణమూర్తిగారు.

ప్రశ్న 4.
భద్రిరాజు కృష్ణమూర్తిగారి రచనల పేర్లు రాయండి.
జవాబు:
‘చిన్నారి పొన్నారి చిరుత కూకటి నా……..’ శ్రీనాథుని ప్రొడశైలిని తలపిస్తూ ‘మాతృసందేశం’ 300 వృత్త పద్యాల్లో క్విట్ ఇండియా ఉద్యమ నేపథ్యంగా రచించి పెద్దల మన్ననలు పొందారు. ‘పితృస్మృతి’ వారి మరో గ్రంథం. మాండలిక వృత్తి పదకోశాలు, ద్రవిడియన్ లాంగ్వేజెస్, కం పేరిటివ్ ద్రవిడియన్ లింగ్విస్టిక్స్, కరెంట్ పర్స్ పెక్టివ్స్, లాంగ్వేజ్ – ఎడ్యుకేషన్ అండ్ సొసైటీ అనునవి ఇతర రచనలు. వీరి సిద్ధాంత గ్రంథం ‘తెలుగు వెర్బల్ బేసెస్’ ప్రపంచ ఖ్యాతినార్జించి పెట్టింది. ‘ద్రవిడ భాషల తులనాత్మక అధ్యయనం’ కాల్వెల్డ్ రచనకు దీటైనది.