AP State Syllabus AP Board 9th Class Telugu Important Questions Chapter 3 శివతాండవం.

AP State Syllabus 9th Class Telugu Important Questions 3rd Lesson శివతాండవం

9th Class Telugu 3rd Lesson శివతాండవం Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

క్రింది అపరిచిత పద్యాలను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. భాష రాదు, వట్టిపాలు మాత్రమె త్రాగు
నిద్రవోవు, లేచి నిలువ లేడు
ఎవరెఱుంగరితనిదే దేశమో కాని,
మొన్న, మొన్న నిలకు మొలచినాఁడు.
ప్రశ్నలు:
1. ఈ పద్యం ఎవరి గురించి ప్రస్తావిస్తోంది (చెబుతోంది)?
2. ఇతనికి ఏమేమి రావు?
3. ‘మొలచినాడు’ అంటే అర్థం?
4. ఎవరూ ఎఱుగనది ఏది?
జవాబులు :
1. పసిబాలుడు (శిశువు)
2. భాష రాదు, లేచి నిలబడటం రాదు.
3. పుట్టినవాడు
4. ఇతని దేశం (ఎక్కడివాడో)

AP Board 9th Class Telugu Important Questions Chapter 3 శివతాండవం

2. పట్టమేలే రాజు పోయెను
మట్టి కలిసెను కోటపేటలు
పదం పద్యం పట్టి నిలిచెను
కీర్తులపకీర్తుల్
ప్రశ్నలు:
1. నేలలో కలిసినవేవి?
2. లోకంలో నిలిచేవేవి?
3. ‘రాజు ‘ వికృతి?
4. ‘పద్దెము’ ప్రకృతి?
జవాబులు:
1. కోటపేటలు
2. కీర్తి – అపకీర్తి
3. జేడు
4. పద్యము

3. ఈ కింది అపరిచిత గద్యాన్ని చదివి ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (S.A. II – 2018-19)
మానవ మనుగడకు నీరు ప్రాణాధారం. నీరు అనేక విధాలుగా లభ్యం అవుతుంది. ముఖ్యంగా నదుల నుండి లభించే నీరు మానవకోటి బ్రతకడానికే కాదు పాడిపంటలు సమృద్ధిగా పండటానికి దోహదం చేస్తుంది. నదుల వల్ల దేశంలోని పంటపొలాలు సస్యశ్యామలమై విరాజిల్లుతున్నాయి. నదుల వల్ల డెల్టాలు ఏర్పడుతున్నాయి. నదులు సారవంతమైన ఒండ్రు మట్టిని తమతో కొట్టుకొని తెచ్చి మేట వేస్తాయి. ఈ విధంగా పుట్టినవే కృష్ణా, గోదావరి డెల్టాలు, నదుల వల్ల పంటలు పండడమే కాదు పారిశ్రామికాభివృద్ధి కూడా జరుగుతుంది.
ప్రశ్నలు:
1. నదుల వలన ఏర్పడిన డెల్టాలు ఏవి?
2. మానవ మనుగడకు ప్రాణాధారమేమి?
3. నదుల వలన మానవులకు కలిగే ఒక ప్రయోజనం రాయండి.
4. పై గద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచెయ్యండి.
జవాబులు:
1. కృష్ణా, గోదావరి డెల్టాలు
2. నీరు
3. మానవులు బ్రతకడానికి / పాడిపంటలు సమృద్ధిగా పండటానికి
4. నదులు సారవంతమైన ఒండ్రుమట్టిని మేట వేయడాన్ని ఏమంటారు?

II. స్వీయరచన

1. క్రింది ప్రశ్నకు నాలుగైదు వాక్యాలలో సమాధానం రాయండి.

ప్రశ్న 1.
‘శివతాండవం’ ప్రక్రియను గూర్చి రాయండి.
జవాబు:
పుట్టపర్తి నారాయణాచార్యులు రచించిన శివతాండవం ‘గేయ కవిత’ ప్రక్రియకు చెందినది. గేయం అంటే పాట. గేయకవిత పాడుకోవడానికి అనువైనది. పద్యాలలో లాగే దీనిలోనూ మాత్రాఛందస్సు ఉంటుంది. లయాత్మకంగా ఉండి అంత్యప్రాసలూ, యతులూ కూడా ఉండవచ్చు.

ప్రశ్న 2.
సంగీత సాహిత్య సమ్మిళితమైన శివతాండవాన్ని ఆవిష్కరించిన కవిని గూర్చి రాయండి. (S.A. I – 2018-19)
సత్వరజస్తమో గుణాలనావిష్కరిస్తూ శివతాండవాన్ని వర్ణించిన కవి పరిచయం చేయండి. (S.A. II – 2018-19)
జవాబు:
పుట్టపర్తి నారాయణాచార్యులు (1914 – 1990) స్వస్థలం అనంతపురం జిల్లా చియ్యేడు గ్రామం. 14 భాషల్లో ప్రవీణులు. 8 భాషల్లో కవిత్వం చెప్పగల దిట్ట. సంగీత, నాట్య శాస్త్రాల్లో సంపూర్ణ పాండిత్యం కలవారు. “సరస్వతీ పుత్ర” వీరి బిరుదు. శివతాండవం, మేఘదూతం, షాజీ, కావ్యమాల, జనప్రియ రామాయణం, పండరీ భాగవతం, సాక్షాత్కారం మొదలైన రచనలు చేశారు. ‘లీవ్స్ ఇన్ ద విండ్’ అనే ఆంగ్ల కావ్యం కూడా వీరి రచనే. వీరు రాసిన శివతాండవం సంగీత సాహిత్య నాట్య సంకేతాల సమ్మేళనం. పుట్టపర్తి రచనల్లో దేశభక్తి, సాంస్కృతిక విలువలు, జాతీయభావాలు, మానవీయ విలువలు తొణికిసలాడతాయి.

వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) క్రింది ప్రశ్నకు సమాధానము రాయండి.

ప్రశ్న 1.
మీ ఊరిలో జరిగే నాట్య ప్రదర్శనకు అందరికీ ఆహ్వానం పలుకుతూ ఒక ‘కరపత్రాన్ని రాయండి.
జవాబు:
నాట్య ప్రదర్శన కంచిభొట్ల సాహితీ సమితివారి ఆధ్వర్యంలో నాట్యమయూరి స్రవంతి గారిచే నాట్య ప్రదర్శన. ది. x x x x x న సా|| 7 గం||లకు మన గ్రామంలోని త్రివిక్రమ స్వామి వారి దేవస్థాన ప్రాంగణమున ప్రదర్శన జరుగును. హైదరాబాద్, బెంగళూరు, గుంటూరు, మద్రాస్, విశాఖపట్టణం, విజయవాడ, తెనాలి మున్నగు ప్రాంతాలలో ఎన్నో ప్రదర్శనలిచ్చి, ఘనమైన సన్మానాలు, బంగారు కంకణాలు బహుమతులు పొందిన కుమారి స్రవంతి మన గ్రామంలో ప్రదర్శన ఇవ్వడానికి వస్తున్నది. ప్రజలంతా తప్పక విచ్చేసి, నాట్యమయూరి కుమారి స్రవంతి గారి నాట్య ప్రదర్శన చూసి, ఆశీర్వదించవలసినదిగా కోరుతున్నాం. కుమారి స్రవంతికి నాట్యాన్ని నేర్పిన శ్రీమతి శశిశ్రీగారి దివ్య సముఖంలో ఈ ప్రదర్శన జరగడం విశేషం. ఈ ప్రదర్శనకు వాద్య సహకారం హార్మోనియం : శ్రీ జస్వంత్ సమీర్, డోలక్ : శ్రీ సాయిశ్రీ ప్రసాద్, ఆర్గనైజర్ : శ్రీ సాయి భరద్వాజ్. ప్రతి ఒక్కరికీ పేరు పేరున ఇదే మా ఆహ్వానం. తప్పక విచ్చేయండి.

ఇట్లు,
కంచిభొట్ల సాహితీ సమితి సభ్యులు,
చెరుకూరు.

AP Board 9th Class Telugu Important Questions Chapter 3 శివతాండవం

ప్రశ్న 2.
మీరు చూసిన నృత్య ప్రదర్శన గూర్చి మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

బాపట్ల,
x x x x

ప్రియమిత్రుడు నాగలక్ష్మణు
ఉభయ కుశలోపరి. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్య విషయం – ఇటీవల మా ఊరిలో కుమారి గౌరి నృత్య ప్రదర్శన జరిగింది. చాలా బాగుంది. సహజమైన అభినయంతో అందరి ప్రశంసలు పొందింది. శాస్త్రీయ నృత్యంతో పాటు, సినిమాల్లోని భక్తి పాటలు కొన్నింటికి కూడా నృత్యం చేసింది. జనం కూడా బాగా ఆనందించారు. అభినందించారు. మా తల్లిదండ్రులతో కలిసి నేనూ ఆ ప్రదర్శన చూసాను. నీవు ఏదైన నాట్య ప్రదర్శన చూసి ఉంటే ఉత్తరం రాయి.

ఇట్లు,
నీ మిత్రుడు,
కె. ఫణిరామ్.

చిరునామా:
యస్. నాగలక్ష్మణ్,
9వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూల్,
ఒంగోలు, ప్రకాశం జిల్లా.

ప్రశ్న 3.
‘శివతాండవం’ పాఠంలో ప్రకృతి వర్ణనను చూశారు కదా ! ఏదేని ప్రకృతి అంశం (పూలు, పండ్లు, పక్షులు ……. మీతో మాట్లాడుతున్నట్లు సంభాషణ రూపంలో రాయండి.
జవాబు:
పుష్పవిలాపం
బాలుడు : (పూలు కోస్తూ) ఆహా ! ఈ పూలు ఎంత అందంగా ఉన్నాయో.

పూవు : ఓ అబ్బాయీ ! నన్నెందుకు హింసిస్తున్నావు?

బాలుడు : అయ్యో ! లేదు లేదు. నా కోసం నిన్ను కోయడం లేదు. అర్చనకై నిన్ను ఉపయోగిస్తున్నాను.

పూవు : తోటి ప్రాణులను హింసించకూడదన్న సంగతి తెలిసి కూడా ఎందుకు నీ పూజలు?

బాలుడు : నిజమే. కానీ ! ………..

పూవు : నీవు గమనించావో లేదో. చెట్టుతల్లి ఒడిలో హాయిగా ఆడుకునే మమ్మల్ని త్రుంచి, ఎందుకు తల్లీ బిడ్డలను వేరు చేస్తారు మీ దయలేని మనుష్యులు?

బాలుడు : అయ్యో పాపం ! నిజమే.

పూవు : పేరుకు మాత్రమే మానవత్వం కల్గిన మానవులు మీరు. బుద్ధుని మీ ప్రతినిధిగా చెపుతారు. రాక్షసంగా ప్రవర్తిస్తారు.

బాలుడు : లేదు. లేదు. మేం మనుష్యులమే.

పూవు : హాయిగా తల్లి ఒడిలో ఆడుకుని, ఆమె పాదాల చెంతనే రాలిపోయే మమ్మల్ని, మీ గొప్పలకోసం మెడలో వేసుకుంటారు. కాళ్ళకింద నలిపేస్తారు. అలా చేయడం మాకు ఇష్టం లేదు.

బాలుడు : అవును. అది తప్పే.

పూవు : మరి ఈ సంగతి విను. దారాలతో మెడలకు ఉరి బిగించేవారు, సూదులతో మా గుండెలలో గ్రుచ్చేవారు ఇలా మా ప్రాణాలు తీసే మీ జాతి మానవత్వం లేని జాతి. ఛీ, ఛీ. అయ్యో తెల్లవారిందే.

బాలుడు : కాదు, కాదు, మాకూ మానవత్వం ఉంది, ఉంది. (ఏమిట్రా కలవరిస్తున్నావ్ – తెల్లవారింది లే అన్న అమ్మ పిలుపుతో మెలకువ వచ్చి) ఇదంతా కలా. ఇంకెప్పుడూ పూలు కోయను.

III. భాషాంతాలు (పదజాలం, వ్యాకరణం)

1. పర్యాయపదాలు :

బూది : విభూతి, విబూది, భస్మం
హిమగిరి : చలికొండ, మంచుకొండ
అల : కెరటం, తరంగం
దిక్కు : దిశ, దెస
శివుడు : శంకరుడు, భవుడు, ఈశ్వరుడు
గజ్జె : గజ్జియ, కింకిణి, చిరుగంట
మబ్బు : మేఘం, జీమూతం, మొయిలు
తుమ్మెద : భ్రమరం, ద్విరేఫం, భృంగము
తెలుపు : శుక్లం, శ్వేతం, ధవళం
నలుపు : శ్యామం, నల్ల, కటి, కృష్ణం
ఎఱుపు : రోహితం, లోహితం, తొగరు
తాండవం : నృత్యం, నాట్యం గజ్జియ, కింకిణి, చిరుగంట
నెమలి : మయూరం, కేకి, నెమ్మి, నీలకంఠం, శిఖి

AP Board 9th Class Telugu Important Questions Chapter 3 శివతాండవం

2. వ్యుత్పత్త్యర్థాలు:

సుకృతం : లెస్సగా చేయబడినది (పుణ్యం, ధర్మం)
శివుడు : సాధుల హృదయమున శయనించువాడు, మంగళప్రదుడు (ఈశ్వరుడు)
అమృతం : మరణమును పొందింపనిది (సుధ)
ఘనసారం : శీతల మగుటచే ఘనము వంటి సారము కలది (కప్పురం)

3. నానార్థాలు :

అమృతం = సుధ, నేయి, పాలు,నీరు
విభూతి = భస్మం, సంపద, ఒక వృత్తం
తమము = చీకటి, దుఃఖం, తమోగుణం
రక్తం = నెత్తురు, ఎఱుపు, కుంకుమ
కమ్మ = పత్రిక, చెవి ఆభరణం, కులవిశేషం, ఒక రుచి, ప్రియమైనది

4. ప్రకృతి – వికృతులు :

కస్తూరి – కస్తురి
దిశ – దెస, దిక్కు
చిత్రము – చిత్తరువు
భాగ్యం – బాగెం
తామరస – తామర, తమ్మి
చిహ్నము – చిన్నె
శాస్త్రం – చట్టం
పుష్పం – పూవు

5. సంధులు :

నీలము + కండ్ల – నీలపు గండ్ల – పుంప్వాదేశ సంధి
అబ్బురము + నీలము – అబ్బురపు నీలము – పుంప్వాదేశ సంధి

6. సమాసాలు:

మబ్బుగములు – మేఘాల యొక్క సమూహాలు – షష్ఠీ తత్పురుష సమాసం
సుకృత రూపము – మంగళప్రదమైన రూపము – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

7. అలంకారాలు :

ఉపమాలంకారం : ఉపమాన ఉపమేయములకు మనోహరమైన పోలిక చెప్పుట ఉపమాలంకారం. దీనిలో
ఉపమానం : పోలిక వస్తువు
ఉపమేయం : ఉన్న వస్తువు
ఉపమావాచకం : వలె, పోలె, లాగ
సమాన ధర్మం : రెండు వస్తువులోని ధర్మం
అనే నాలుగు (కొన్నిట్లో ఉపమావాచకం ఉండదు) అంశాలు ఉంటాయి.
ఉదా :
కర్పూరం వెన్నెల వలె చల్లదనాన్ని కలిగిస్తుంది.
ఇక్కడ ఉపమేయం : కర్పూరం
ఉపమానం : వెన్నెల
ఉపమావాచకం : వలె
సమాన ధర్మం : చల్లదనం

9th Class Telugu 3rd Lesson శివతాండవం 1 Mark Bits

1. ఉపమాలంకారం లక్షణం గుర్తించండి. (S.A. I – 2018-19)
ఎ) ఉపమేయమునందు ఉపమాన ధర్మం ఆరోపించడం
బి) ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పుట.
సి) ఉపమేయ ఉపమానములకు మనోహరమైన సాదృశ్యం చెప్పడం
డి) ఉపమాన ఉపమేయాలకు భేదం చెప్పుట
జవాబు:
సి) ఉపమేయ ఉపమానములకు మనోహరమైన సాదృశ్యం చెప్పడం

2. వెన్నెల విరగకాస్తే హాయిగా ఉంటుంది – (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి) – (S.A. II – 2017-18)
ఎ) కౌముది – కైరవం
బి) కౌముది – చంద్రుడు
సి) చంద్రిక – కౌముది
డి) కౌముది – కౌమారం
జవాబు:
సి) చంద్రిక – కౌముది

AP Board 9th Class Telugu Important Questions Chapter 3 శివతాండవం

3. పాఠశాలకు వెళ్ళునపుడు పుస్తకాలు మరువరాదు (సంధి పేరు గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) ఉత్వసంధి
బి) సవర్ణదీర్ఘ సంధి
సి) లు,ల,న,ల సంధి
డి) లుత్వసంధి
జవాబు:
సి) లు,ల,న,ల సంధి

4. గరుడుడు అమృతమును తీసుకొచ్చి మాతృదాస్యాన్ని తొలగించారు. (పర్యాయపదాలు గుర్తించండి.) (S.A. III – 2016-17)
ఎ) క్షుధ, సుధ
బి) సుధ, పీయూషం
సి) సుధ, వ్యధ
డి) సుధ, ధరా
జవాబు:
బి) సుధ, పీయూషం

5. ‘కర్మధారయంబులందు ఉత్తునకచ్చు పరంబగునప్పుడు టుగాగమంబగు’ అనే సంధి సూత్రానికి ఉదాహరణను గుర్తించండి. (S.A. III – 2016-17)
ఎ) ఉద్భటుడు
బి) వాగ్భటుడు
సి) చిట్టెలుక
డి) తూగుటుయ్యాల
జవాబు:
డి) తూగుటుయ్యాల

6. చిరుగాలి పొరలు లేచినయట్లు శివుని నాట్యం ఆహ్లాదకరంగా ఉంది. (పై వాక్యంలోని అలంకారాన్ని గుర్తించండి.) (S.A. III – 2016-17)
ఎ) అర్థాంతరన్యాస
బి) ఉపమాలంకారం
సి) స్వభావోక్తి
డి) శ్లేష
జవాబు:
బి) ఉపమాలంకారం

భాషాంశాలు (పదజాలం, వ్యాకరణం)

1. అర్థాలు :

7. చలికొండపై శివపార్వతులు కొలువు చేసారు – గీత గీసిన పదానికి అర్థమేమిటి?
A) వింధ్య
B) హిమాలయం
C) ఆరావళి
D) సాత్పురా
జవాబు:
B) హిమాలయం

8. ముఖముపై హాసపు రేఖ ఉండాలి – గీత గీసిన పదానికి అర్థమేమిటి?
A) అందం
B) హాయి
C) నవ్వు
D) విచారం
జవాబు:
C) నవ్వు

9. బంగారానికి తావి అబ్బినట్లు – గీత గీసిన పదానికి అర్థమేమిటి?
A) వజ్రం
B) మణి
C) ఇత్తడి
D) సువాసన
జవాబు:
D) సువాసన

10. పౌర్ణమినాడు సముద్రంలో తరగలు ఎక్కువైతాయి – గీత గీసిన పదానికి అర్థమేమిటి?
A) అలలు
B) చేపలు
C) పర్యాటకులు
D) సందర్శకులు
జవాబు:
A) అలలు

11. ‘ఘనసారమును దెచ్చి కలయ జల్లు విధాన’ – గీత గీసిన పదానికి అర్థం ఏమిటి?
A) ఉప్పు
B) కర్పూరం
C) మంచు
D) ఆకు
జవాబు:
B) కర్పూరం

AP Board 9th Class Telugu Important Questions Chapter 3 శివతాండవం

12. ‘తమ్ములై, ఘటిత మోదమ్ములై’ – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) తమ్ముళ్ళు
B) సోదరులు
C) పద్మములు – పద్మములు
D) పూలు
జవాబు:
C) పద్మములు – పద్మములు

13. వసంత ఋతువులో వృక్షాలు నవకోరకములతో శోభాయమానంగా ఉంటాయి – గీత గీసిన పదానికి అర్థం ఏది?
A) చిగురు
B) పుష్పము
C) మొగ్గ
D) పండు
జవాబు:
C) మొగ్గ

14. శివుని నేత్రములు రక్త కిసలములవలె ఉన్నాయి – గీత గీసిన పదానికి అర్థము ఏది?
A) చిగురుటాకు
B) మొగ్గు
C) పుష్పము
D) పద్మము
జవాబు:
A) చిగురుటాకు

2. పర్యాయపదాలు :

15. శివుడు భస్మధారుడు – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
A) విబూది, దూది
B) విభూతి, బూతి
C) బూడిద, గుమ్మడి
D) ఏదీకాదు
జవాబు:
B) విభూతి, బూతి

16. మా చెల్లి గజ్జె కట్టి ఆడితే ఎంతో బాగుంటుంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) కింకిణి, చిరుగంట
B) కింకిణి, తాళం
C) గజ్జయ, గొలుసు
D) ఏదీకాదు
జవాబు:
A) కింకిణి, చిరుగంట

17. మంగళప్రదుడు శివుడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) భవుడు, దేవుడు
B) ఈశ్వరుడు, దేవా
C) శంకరుడు, భవుడు
D) రుద్రుడు, రుద్రాణి
జవాబు:
C) శంకరుడు, భవుడు

18. పూల మకరందాలకై తుమ్మెదలు దండెత్తాయి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) భ్రమరం, భ్రమ
B) ద్విరేఫం, ఏకం
C) భృంగం, భంగం
D) భ్రమరం, భృంగం
జవాబు:
D) భ్రమరం, భృంగం

19. విబూది ధరించిన శివుడు శుక్లపక్షం చంద్రునివలె ఉన్నాడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) తెలుపు, చెప్పు
B) శ్వేతం, సౌధం
C) ధవళం, శ్వేతం
D) తెలుపు, తలుపు
జవాబు:
C) ధవళం, శ్వేతం

AP Board 9th Class Telugu Important Questions Chapter 3 శివతాండవం

20. తాండవ కృష్ణ తారంగం – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) నాట్యం, నాటకం
B) నృత్యం, నాట్యం
C) నృత్యం, సంగీతం
D) నడక, పాట
జవాబు:
B) నృత్యం, నాట్యం

21. నెమలి పురివిప్పి నాట్యమాడుతుంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) కేకి, కాకి
B) నెమ్మి, నిమ్మ
C) శిఖి, శాఖి
D) మయూరం, నీలకంఠం
జవాబు:
D) మయూరం, నీలకంఠం

22. రక్తపు రంగు ఎఱుపు – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
A) రోహితం, తొగరు
B) లోహితం, లోహం
C) సూర్యుడు, పగలు
D) ఏదీకాదు
జవాబు:
A) రోహితం, తొగరు

23. ఆహా ! ఏమి తావి. బహుశా పరిమళం గులాబీది కాబోలు-గీత గీసిన పదానికి పర్యాయపదం గుర్తించండి. (S.A. II – 2018-19)
A) సౌరభం
B) ఆమని
C) మధువు
D) పాలు
జవాబు:
A) సౌరభం

24. ‘సూర్యుడు అస్తమించగానే అంధకారం అలుముకుంది. ఆ చీకటి భయం కలిగిస్తుంది – గీత గీసిన పదానికి పర్యాయపదం గుర్తించండి.
A) తమస్సు
B) రజస్సు
C) ప్రభాతము
D) సంధ్య
జవాబు:
A) తమస్సు

25. సముద్రంలో తరగలు విపరీతంగా వస్తున్నాయి – గీత గీసిన పదానికి పర్యాయపదాలను గుర్తించండి.
A) కెరటములు, అలలు
B) నురుగు, హోరు
C) తరంగాలు, నాచు
D) కెరటాలు, ముత్యపు చిప్పలు
జవాబు:
A) కెరటములు, అలలు

26. చిరుగాలిలో తమ్మి విరులు కదిలాయి – గీత గీసిన పదానికి గల పర్యాయపదాలు ఏవి?
A) పద్మములు, కలువలు
B) మల్లెలు, మొల్లలు
C) పూలు, కుసుమములు
D) సుమములు, కిసలయములు
జవాబు:
C) పూలు, కుసుమములు

3. వ్యుత్పత్యర్థాలు :

27. మరణం పొందింపనిది – వ్యుత్పత్తి పదం ఏది?
A) పాలు
B) నీరు
C) అమృతం
D) నెయ్యి
జవాబు:
C) అమృతం

28. శీతల మగుటచే ఘనము వంటి సారం కలది – వ్యుత్పత్తి పదం గుర్తించండి.
A) కర్పూరం
B) ఘన పదార్థం
C) ఘనసారం
D) ఉప్పు
జవాబు:
B) ఘన పదార్థం

29. సాధుల హృదయాన శయనించువాడు – వ్యుత్పత్తి పదం గుర్తించండి.
A) ఋషి
B) మౌని
C) విష్ణువుడు
D) శివుడు
జవాబు:
D) శివుడు

30. ‘సుకృతం’ – వ్యుత్పత్తి గుర్తించండి.
A) లెస్సగా చేయబడింది
B) బాగా చేశారు
C) బాగా చేశావు
D) లెస్సగా తయారు చేసింది
జవాబు:
A) లెస్సగా చేయబడింది

AP Board 9th Class Telugu Important Questions Chapter 3 శివతాండవం

31. ‘మరణము లేనిది’ – అనే వ్యుత్పత్తి గల పదాన్ని గుర్తించండి.
A) అమరణం
B) అమృతము
C) సంజీవని
D) అమృత్యువు
జవాబు:
B) అమృతము

4. నానార్థాలు :

32. అమృతం పంచేవారు అమ్మానాన్నలు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) సుధ, సాధు
B) నేయి, వెయ్యి
C) పాలు, నీరు
D) నీరు, మీరు
జవాబు:
C) పాలు, నీరు

5. ప్రకృతి – వికృతులు :

33. ‘ఈ తమం‘ కన్నులుండీ గుడ్డిని చేస్తున్నది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) చీకటి, వెలుగు
B) దు:ఖం, చీకటి
C) దుఃఖం, సంతోషం
D) తమోగుణం, రజోగుణం
జవాబు:
B) దు:ఖం, చీకటి

34. కృష్ణుడు గీతలో విభూతి యోగం గూర్చి చెప్పాడు- గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) భస్మం, బూది
B) సంపద, ధనం
C) ఒక వృత్తం, కందం
D) భస్మం, ఐశ్వర్యం
జవాబు:
D) భస్మం, ఐశ్వర్యం

35. స్వాతంత్ర్యం కోసం ఎందరో భారతీయులు తమ రక్తం చిందించారు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) ఎఱుపు, కుంకుమ
B) నెత్తురు, రక్తం
C) కుంకుమ, పసుపు
D) ఎఱుపు, పచ్చ
జవాబు:
A) ఎఱుపు, కుంకుమ

36. చెవి కమ్మలు పెట్టుకొని తిరుగుతున్న నా చెల్లి ఎంతో బాగుంది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) పత్రిక, పుత్రిక
B) రుచి, వాసన
C) చెవి ఆభరణం, కుల విశేషం
D) ప్రియం, అప్రియం
జవాబు:
C) చెవి ఆభరణం, కుల విశేషం

37. కస్తూరి యట చూడ కాంతి నల్లగనుండు – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
A) కసూరి
B) కస్తురి
C) కస్తి
D) కసిరి
జవాబు:
B) కస్తురి

38. కొలనులోని తామరలు అందంగా ఉన్నాయి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది ?
A) తమ్మి
B) కలువ
C) తామరస
D) పద్మం
జవాబు:
C) తామరస

39. ఆ చిన్నది వన్నె చిన్నెలు ఒలకబోస్తున్నది – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
A) చిహ్నం
B) అందం
C) సిగ్గు
D) ఒయ్యారం
జవాబు:
A) చిహ్నం

40. పురివిప్పి నాట్యమాడే నెమలిని చూసి నేను ‘చిత్రం‘ వలె నిల్చున్నాను – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది ?
A) చితరం
B) చిత్ర
C) బొమ్మ
D) చిత్తరువు
జవాబు:
D) చిత్తరువు

41. శాస్త్రము తెలిసినవాడు పండితుడు – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
A) శాసతరం
B) చట్టం
C) శాసనం
D) బుద్ధి
జవాబు:
B) చట్టం

AP Board 9th Class Telugu Important Questions Chapter 3 శివతాండవం

42. సంక్రాంతి పండుగ భోగభాగ్యాలు ఇంట కురిపిస్తుంది – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
A) భాగం
B) బాగం
C) బాగెం
D) సంపద
జవాబు:
C) బాగెం

43. పూలు తమను కోయవద్దని కోరాయి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
A) పువ్వు
B) విరి
C) సుమం
D) పుష్పం
జవాబు:
D) పుష్పం

44. ‘అపూర్వం’ పదానికి వికృతిని గుర్తించండి.
A) పూర్వం
B) అప్పురము
C) అపురూపము
D) అబ్రము
జవాబు:
C) అపురూపము

45. ముత్యము – దీని ప్రకృతి పదాన్ని గుర్తించండి.
A) ముత్తియము
B) ముత్తెం
C) మౌక్తికం
D) ముత్తెము
జవాబు:
C) మౌక్తికం

6. సంధులు :

46. ‘నీలపుగండ్ల’ – పదాన్ని విడదీయండి.
A) నీలము + గండ్ల
B) నీలం + కండ్ల
C) నీలము + కండ్ల
D) నీలపు + కండ్ల
జవాబు:
C) నీలము + కండ్ల

47. ‘అబ్బురపు నీలము’ – సంధి పేరేమిటి?
A) పడ్వాది సంధి
B) పుంప్వాదేశ సంధి
C) ఆమ్రేడిత సంధి
D) టుగాగమ సంధి
జవాబు:
B) పుంప్వాదేశ సంధి

48. ఉత్వసంధికి ఉదాహరణ రాయండి.
A) జారినయట్లు
B) కదిలినట్లు
C) తేనెటీగ
D) దిక్కులెల్ల
జవాబు:
D) దిక్కులెల్ల

49. కన్ + కొనల – పదాన్ని కలపండి.
A) కన్కొనల
B) కల్గొనల
C) కనుగొనల
D) కనగొనల
జవాబు:
B) కల్గొనల

50. ‘వగలు + పోయిన’ – సంధి పేరేమిటి?
A) గసడదవాదేశ సంధి
B) అత్వసంధి
C) ఉత్వసంధి
D) యడాగమసంధి
జవాబు:
A) గసడదవాదేశ సంధి

AP Board 9th Class Telugu Important Questions Chapter 3 శివతాండవం

51. ‘పల్లె + ఊరు’ – సంధి పేరేమిటి?
A) టుగాగమ సంధి
B) ద్విరుక్తటకారాదేశ సంధి
C) అత్వసంధి
D) ఉత్వసంధి
జవాబు:
A) టుగాగమ సంధి

52. ‘దేశాల’ విడదీయండి.
A) దేశ + అల
B) దేశ + ఆల
C) దేశము + ల
D) దేశా + ల
జవాబు:
C) దేశము + ల

53. ‘చుట్టాలు’ – సంధి పేరేమిటి?
A) అత్త్వసంధి
B) లు,ల,నల సంధి
C) ఉత్వసంధి
D) ఇత్వసంధి
జవాబు:
B) లు,ల,నల సంధి

54. ‘అబ్బురపు నీలము’ – సంధి విడదీయండి.
A) అబ్బురపు + నీలము
B) అబ్బు + రపు నీలము
C) అబ్బురము + నీలము
D) అబ్బుర + నీలము
జవాబు:
C) అబ్బురము + నీలము

55. ‘నిలువుటద్దం’లో గల సంధి
A) టుగాగమ సంధి
B) ఆమ్రేడిత సంధి
C) లులన సంధి
D) ద్విరుక్తటకారాదేశ సంధి
జవాబు:
A) టుగాగమ సంధి

56. ‘కఱకుటమ్ము’ విడదీసి సంధి పేర్కొనండి.
A) కఱకుట + అమ్ము (అత్వ సంధి)
B) కఱకు + అమ్ము (టుగాగమ సంధి)
C) కఱకు + టమ్ము (ఉత్వ సంధి)
D) కఱకుట్ + అమ్ము (హల్సంధి)
జవాబు:
B) కఱకు + అమ్ము (టుగాగమ సంధి)

57. భారతదేశ రాష్ట్రాలలో అల్లర్లు జరుగుతున్నాయి – గీత గీసిన పదంలో గల సంధి ఏది?
A) అత్వసంధి
B) లులనల సంధి
C) ఆమ్రేడిత సంధి
D) టుగాగమ సంధి
జవాబు:
B) లులనల సంధి

7. సమాసాలు :

58. ‘మేఘాల యొక్క సమూహం’ సమాస పదంగా మార్చండి.
A) మేఘాల వరుస
B) మబ్బుగములు
C) మబ్బు వరుస
D) మెయిలు పంక్తి
జవాబు:
B) మబ్బుగములు

59. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణ రాయండి.
A) గంగానది
B) శివతాండవం
C) సుకృత రూపం
D) జడధారి
జవాబు:
C) సుకృత రూపం

60. ‘తిరుపతి అనే పేరుగల పట్టణము’ సమాసపదంగా కూర్చండి.
A) తిరుపతి పట్టణము
B) తిరుపతి నగరం
C) తిరుపతి క్షేత్రము
D) తిరుపతి
జవాబు:
A) తిరుపతి పట్టణము

61. ‘తమ్మివిరులు’ అనేది ఏ సమాసమో గుర్తించండి.
A) ద్వంద్వ
B) బహువ్రీహి
C) సంభావనా పూర్వపద కర్మధారయం
D) ద్విగు
జవాబు:
C) సంభావనా పూర్వపద కర్మధారయం

8. అలంకారాలు :

62. ‘కర్పూరం వెన్నెల వలె చల్లదనాన్ని కలిగిస్తుంది’ – ఈ వాక్యంలో గల అలంకారం
A) ఉపమా
B) రూపకం
C) ఉపేక్ష
D) అతిశయోక్తి
జవాబు:
A) ఉపమా

AP Board 9th Class Telugu Important Questions Chapter 3 శివతాండవం

63. ‘తరితీపు వెన్నెలలు విరిసికొన్న విధాన కళ్ళల్లో కాంతులు మెరిసేలా శివుడు నాట్యమాడాడు.
A) ఉపమ
B) రూపకము
C) ఉత్ప్రేక్ష
D) శ్లేష
జవాబు:
A) ఉపమ

64. ‘భ,ర,న,భ,భ,ర,వ’ గణాలు ఏ వృత్తానికి చెందినవి?
A) ఉత్పలమాల
B) చంపకమాల
C) మత్తేభము
D) శార్దూలము
జవాబు:
A) ఉత్పలమాల

65. ‘పింఛము’ – ఇది ఏ గణమో గుర్తించండి.
A) భ గణము
B) త గణము
C) ర గణము
D) న గణము
జవాబు:
A) భ గణము

66. ‘భాగవతమున భక్తి, భారతమ్మున యుక్తి, రామకథయే రక్తి’ – ఈ గేయ పంక్తుల్లో గల అలంకారాన్ని గుర్తించండి.
A) స్వభావోక్తి
B) అంత్యానుప్రాస
C) వృత్త్యనుప్రాస
D) యమకము
జవాబు:
B) అంత్యానుప్రాస

9. ఆధునిక వచనాన్ని గుర్తించడం :

67. నల్ల కలువలు దిక్కులెల్ల విచ్చు విధాన – ఈ వాక్యాన్ని ఆధునిక వచనంలోకి మార్చండి.
A) నల్ల కలువలు దిక్కులంతా విచ్చుకున్నాయి.
B) నల్ల కలువలు దిక్కులంతటా విప్పారాయి.
C) నల్ల కలువలు దిక్కులంతా విచ్చుకున్నట్లుగా.
D) నల్ల కలువలు అన్ని దిక్కులా వ్యాపించాయి.
జవాబు:
C) నల్ల కలువలు దిక్కులంతా విచ్చుకున్నట్లుగా.

68. చిగురుటాకులు గాలి వగలు వోయిన యట్లు – ఈ వాక్యాన్ని ఆధునిక వచనంలోకి మార్చండి.
A) చిగురాకులు గాలికి వయ్యారాలు పోయాయి.
B) చిగురాకులు గాలికి ఒయ్యారాలు పోయినట్లు.
C) లేతాకులు గాలికి ఒయ్యారాలు పోతున్నట్లు.
D) లేతాకులు గాలివల్ల వయ్యారాలు పోయాయి.
జవాబు:
B) చిగురాకులు గాలికి ఒయ్యారాలు పోయినట్లు.

10. వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించడం :

69. శివుడు పాడుతున్నాడు – వ్యతిరేక వాక్యం రాయండి.
A) శివుడు ఆడుతున్నాడు
B) శివుడు పాడుతూ ఉన్నాడు
C) పాడడు
D) శివుడు పాడటం లేదు
జవాబు:
D) శివుడు పాడటం లేదు

AP Board 9th Class Telugu Important Questions Chapter 3 శివతాండవం

70. శివతాండవంలో ప్రకృతి ప్రతిబింబించింది – వ్యతిరేక వాక్యం రాయండి.
A) శివతాండవంలో వికృతి ప్రతిబింబించింది
B) శివతాండవంలో ప్రకృతి ప్రతిబింబించలేదు
C) శివతాండవంలో ప్రకృతి లేదు
D) శివతాండవంలో వికృతి ఉంది
జవాబు:
B) శివతాండవంలో ప్రకృతి ప్రతిబింబించలేదు

11. వాక్యరకాలను గుర్తించడం :

71. శివుడు ఆడుతున్నాడు మఱియు పాడుతున్నాడు – ఇది ఏ రకమైన వాక్యం?
A) సంక్లిష్ట
B) సామాన్య
C) సంయుక్త
D) మహాకావ్యం సూక్తి – సౌందర్యం, సత్యం – వీటి రసవత్సమ్మేళనమే కళ – ఠాగూర్
జవాబు:
C) సంయుక్త