AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 5 ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions ఉపవాచకం Chapter 5 ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions ఉపవాచకం 5th Lesson ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి

9th Class Telugu ఉపవాచకం 5th Lesson ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి Textbook Questions and Answers

కింది ప్రశ్నలకు పదిహేను వాక్యాలకు మించని సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
భద్రిరాజు కృష్ణమూర్తి గారు నిర్వహించిన బాధ్యతలు పేర్కొనండి.
జవాబు:
భాషా క్షేత్రంలో చెరగని మైలురాళ్ళను నిలిపి, తరగని కీర్తిని ఆర్జించినవారు శ్రీ ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి. ఎందరో కాకలు తీరిన భాషా యోధులకు సర్వ సైన్యాధ్యక్షుడి లాంటి గురువు ఈయన. గత శతాబ్దిలో అంతర్జాతీయ స్థాయిలో గొప్ప భాషా శాస్త్రవేత్తల్లో భారతదేశానికి చెందిన ఇద్దరిలో ఒకరు ఈయన.

మొదట ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ట్యూటర్ గా పనిచేసిన కృష్ణమూర్తిగారు తర్వాత ఉస్మానియా, వేంకటేశ్వర విశ్వ విద్యాలయాల్లో ఆచార్యులుగా సేవలందించి, చివరన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా (వైస్ ఛాన్సలర్) పదవీ బాధ్యతలు నిర్వహించారు. సందర్శకాచార్యులు (విజిటింగ్ ప్రొఫెసర్) గా మిచిగాన్, కార్నెల్ టోక్యో, హవాలీ, టెక్సాస్ వంటి ప్రసిద్ధిగాంచిన విదేశీ విశ్వవిద్యాలయాల్లో భాషాశాస్త్రాన్ని వివిధ దేశాల విద్యార్థులకు బోధించారు. గిడుగు రామమూర్తి పంతులు ప్రవేశపెట్టిన వ్యవహార భాషోద్యమ స్రవంతి ఆగిపోకుండా, కుంటు పడకుండా, మరింత ఉధృతంగా ముందుకు నడిపించే బాధ్యతను తన భుజాలకెత్తుకొని విజయవంతంగా నిర్వహించారు.

ప్రశ్న 2.
భద్రిరాజు కృష్ణమూర్తిగారు గొప్ప పరిశోధకులు; ఆచార్యులు; దీక్షాదక్షులు; పరిపాలకులు – అని సమర్థించండి.
జవాబు:
దక్షిణాసియా దేశాలన్నిటిలోనూ, మనదేశంలో, మనరాష్ట్రంలో మొట్టమొదటి వృత్తి పదకోశాన్ని తయారు చేసినవారు కృష్ణమూర్తిగారు. విద్యాబోధనలో వాడుకభాష వినియోగం గురించి గిడుగు, గురజాడల తర్వాత అంతటి కృషిచేసిన మహనీయుడు భద్రిరాజు కృష్ణమూర్తి.

వర్ణనాత్మక, చారిత్రాత్మక, తులనాత్మక భాషాధ్యయనశీలిగా; నిబద్ధత, నిశిత పరిశీలన, మొక్కవోని దీక్ష గల్గిన సుప్రసిద్ధ పరిశోధకుడిగా, శిష్యుల పట్ల అపార వాత్సల్యాదులు కల్గిన ఉత్తమ ఆచార్యుడిగా; ఏ నిర్ణయానికైనా వెరవని పాలనాదక్షుడిగా, నిరంతర శోధన, ఆదర్శవంతమైన బోధన, అగాధమైన విజ్ఞానం, సహృదయత మూర్తీభవించిన మహోన్నత వ్యక్తిగా అంతర్జాతీయ కీర్తి గడించిన మన తెలుగు తేజం ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తిగారు.

సంప్రదాయ వ్యాకరణం నేర్చుకున్న కృష్ణమూర్తిగారు ఆధునిక భాషా, వ్యాకరణాంశాల మీద దృష్టి సారించడం తెలుగువాళ్ళ అదృష్టం. అనేక జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో ట్యూటర్ గా, ఆచార్యులుగా, ఉపకులపతిగా, సందర్శకాచార్యులుగా భాషా శాస్త్రాన్ని విద్యార్థులకు బోధించారు.

గిడుగు రామమూర్తి పంతులుగారు ప్రవేశపెట్టిన వ్యవహారిక భాషా ఉద్యమాన్ని ముందుకు నడిపించే బాధ్యతను తీసుకొని, భాషకు మాండలిక ఆవశ్యకతను గుర్తించి, వృత్తి పదకోశాల నిర్మాణాన్ని తన శిష్యుల సహకారంతో విజయవంతంగా నిర్వహించారు. తొలి ప్రయత్నంగా వ్యవసాయ, చేనేత వృత్తి పదకోశాలను అందించారు.

కృష్ణమూర్తిగారి భాషా పరిశోధన ఫలాలు తెలుగువాళ్ళకు మాత్రమే పరిమితం కావు. వారి ఆంగ్ల రచనలు ఇతర భాషల వాళ్ళు చేయవలసిన కృషికి ప్రేరణనిచ్చేవి, ఒరవడి పెట్టేవి. కాలిఫోర్నియాలో ఎం.బి.ఎమినో గారి శిష్యరికంలో ధ్వని, పదాంశ, వాక్యశాఖల్లో లోతైన పరిశోధనలు చేశారు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 5 ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి

ప్రశ్న 3.
భాషా పరిశోధనకు ఉద్యమించక మునుపు భద్రిరాజు కృష్ణమూర్తి జీవితం ఎలా సాగిందో వివరించండి.
జవాబు:
తిక్కన, శ్రీనాథుల సంప్రదాయ కవిత్వాన్ని ఆరాధించి, వాళ్ళకు దీటుగా ఛందోబద్ధ కవితా రచనతో సాహితీరంగంలో ప్రవేశించారు భద్రిరాజు కృష్ణమూర్తి. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన ఈయన ‘చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడె….’ శ్రీనాథుని ప్రౌఢశైలిని తలపిస్తూ క్విట్ ఇండియా ఉద్యమ నేపథ్యంగా రచన చేసిన పెద్దల మన్ననలను పొందారు. ప్రౌఢత, ప్రసాదగుణం కలిగిన పద్యాలు అలవోకగా, రాయడమే గాక కృష్ణమూర్తి అవధానం కూడా చేసేవారు.

శ్రీగంటి జోగి సోమయాజులు గారి వద్ద సంప్రదాయ వ్యాకరణం నేర్చుకున్నారు ఈయన. ఆంధ్ర, ఉస్మానియా, వేంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో ట్యూటర్ గా, ఆచార్యులుగా, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా పనిచేసారు. ప్రసిద్ధిగాంచిన విదేశీ విశ్వవిద్యాలయాల్లో సందర్శకాచార్యులుగా ఉన్నారు. తాను స్వయంగా రచించినవీ, సంపాదకత్వం వహించినవీ ఎన్నో గ్రంథాలు వెలుగులోనికి వచ్చాయి.

భాషా పరిశోధనకు ఉద్యమించక మునుపు భద్రిరాజు కృష్ణమూర్తిగారు ప్రొడత, ఆర్ధత కల్గిన కవిగా, అవధానిగా, సంప్రదాయ వ్యాకరణ అభ్యాసకునిగా, ట్యూటర్ గా, ఆచార్యునిగా, ఉపకులపతిగా, సందర్శకాచార్యులుగా, సంపాదకుడిగా ఇలా భిన్న పార్శ్వా లలో దర్శనమిస్తారు.

ప్రశ్న 4.
భద్రిరాజు కృష్ణమూర్తి భాషాసేవను గురించి రాయండి.
జవాబు:
భాషాక్షేత్రంలో చెరగని మైలురాళ్ళను, తరగని కీర్తి శిఖరాలను నిలిపారు భద్రిరాజు కృష్ణమూర్తిగారు. భాషా శాస్త్రాన్ని, భాషా చరిత్రనూ విశ్వవేదిక మీద నిలబడి నినదించి, తెలుగుజాతి కీర్తి కిరీటాన్ని రెపరెపలాడించిన వారు కృష్ణమూర్తిగారు. అంతేకాదు తెలుగు పుట్టు పూర్వోత్తరాల గురించి నిర్దుష్ట సమాచారాన్నందించిన వారు ఈయన. దక్షిణాసియా దేశాలన్నింటిలోనూ ప్రప్రథమంగా వృత్తి పదకోశాన్ని తయారుచేసినవారు భద్రిరాజు కృష్ణమూర్తి. గత శతాబ్దిలో అంతర్జాతీయ స్థాయిలో గొప్ప భాషా శాస్త్రవేత్తలలో భారతదేశానికి చెందిన ఇద్దరిలో కృష్ణమూర్తిగారొకరు.

భాషకు మాండలిక ఆవశ్యకతను గుర్తించి, వృత్తి పదకోశాల నిర్మాణాన్ని తన శిష్యుల సహకారంతో నిర్వహించారు. తొలి ప్రయత్నంగా వ్యవసాయ, చేనేత వృత్తి పదకోశాలను అందించారు. వీరి పరిశోధన తెలుగులోనే కాక “ద్రవిడియన్ లాంగ్వేజ్, కంపేరిటివ్ ద్రవిడియన్ లింగ్విస్టిక్ ……” వంటి రచనల ద్వారా ఇతర భాషలవాళ్ళు చేయవలసిన కృషికి ప్రేరణగా నిలిచాయి.

వయోజన విద్యావ్యాప్తి కోసం ‘జనవాచకం’, ‘తేలిక’ తెలుగువాచకం ఈయన రచించారు. శ్రీ పి. శివానందశర్మతో కలిసి ఇంగ్లీష్ ద్వారా తెలుగు నేర్చుకొనే వారికోసం ‘ఏ బేసిక్ కోర్స్ ఇన్ మోడ్రన్ తెలుగు’ రచించారు. ధ్వని, పదాంశ, వాక్యశాఖల్లో లోతైన పరిశోధనలు చేశారు. తన సిద్ధాంత గ్రంథం “తెలుగు వెర్బల్ బేసెస్’, ‘ద్రవిడ భాషల తులనాత్మక అధ్యయనం’ గ్రంథాల ద్వారా విశేష ఖ్యాతిని పొందారు. ఈ విధంగా భాష, భాషోత్పత్తి, లిపి, ప్రాచీనత, వైవిధ్యత, రూప పరిణామ క్రమం తదితర అనేకానేక అంశాలను విస్తృతంగా పరిశోధించి, ప్రామాణిక రచనలను ప్రకటించి ప్రపంచ భాషాభిమానుల, పరిశోధకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు భద్రిరాజు కృష్ణమూర్తి.

9th Class Telugu ఉపవాచకం 5th Lesson ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

ఈ క్రింది వాక్యాలను సంఘటనలు ఆధారంగా వరుసక్రమంలో అమర్చి రాయండి.

ప్రశ్న 1.
అ) శ్రీ గంటి జోగి సోమయాజులు గారి వద్ద సంప్రదాయ వ్యాకరణం నేర్చుకున్నారు.
ఆ) ప్రకాశం జిల్లా ఒంగోలులో కృష్ణమూర్తి గారు 1928 జూన్ 19న జన్మించారు.
ఇ) 2012 ఆగస్టు 11న స్వల్ప అస్వస్థతతో దేహయాత్ర చాలించారు.
ఈ) ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కృష్ణమూర్తి గారు ట్యూటర్‌గా పనిచేశారు.
జవాబు:
ఆ) ప్రకాశం జిల్లా ఒంగోలులో కృష్ణమూర్తి గారు 1928 జూన్ 19న జన్మించారు.
అ) శ్రీ గంటి జోగి సోమయాజులు గారి వద్ద సంప్రదాయ వ్యాకరణం నేర్చుకున్నారు.
ఈ) ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కృష్ణమూర్తి గారు ట్యూటర్ గా పనిచేశారు.
ఇ) 2012 ఆగస్టు 11న స్వల్ప అస్వస్థతతో దేహయాత్ర చాలించారు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 5 ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి

ప్రశ్న 2.
అ) వ్యవసాయ చేనేత వృత్తి పదకోశాలను అందించారు.
ఆ) 300 వృత్త పద్యాల్లో ‘మాతృ సందేశం’ అనే కావ్యం రచించి పెద్దల మన్ననలు పొందారు.
ఇ) హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా పదవీ బాధ్యతలు నిర్వహించారు.
ఈ) కాలిఫోర్నియాలో ఎం.బి.ఎ.మినో గారి శిష్యరికంలో ధ్వని, పదాంశ, వాక్యశాఖల్లో పరిశోధనలు చేశారు.
జవాబు:
ఆ) 300 వృత్త పద్యాల్లో ‘మాతృ సందేశం’ అనే కావ్యం రచించి పెద్దల మన్ననలు పొందారు.
అ) వ్యవసాయ చేనేత వృత్తి పదకోశాలను అందించారు. ఈ) కాలిఫోర్నియాలో ఎం.బి.ఎ.మినో గారి శిష్యరికంలో ధ్వని, పదాంశ, వాక్యశాఖల్లో పరిశోధనలు చేశారు.
ఇ) హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా పదవీ బాధ్యతలు నిర్వహించారు.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
తెలుగుభాషకు వివిధ అంశాలలో సేవలు చేసిన మీకు తెలిసిన మహనీయుల పేర్లను రాయండి.
జవాబు:
భాషాశాస్త్రంలో దేశవిదేశాల్లో పేరెన్నికగన్నవారు చేకూరి రామారావుగారు. పాఠ్యగ్రంథ రచనల్లో బాగా పేరుగాంచిన రచయిత – ఆచార్య కె.కె. రంగనాధాచార్యులు. తెలుగు లిపి గురించి, పదప్రయోగాల గురించి అనేక అంశాలు సమగ్రంగా రచించినవారు – డా|| బూదరాజు రాధాకృష్ణగారు. తెలుగు అక్షర నిర్మాణం గురించి, ప్రత్యయాదుల ఉత్పాదకత గురించి ప్రయత్నించినవారు – డా|| ఉమామహేశ్వరరావు. మన రాష్ట్ర మాండలికాల్లో మధ్యమండలం కాక, మిగతా మూడు మాండలికాల్లో నవలా రచన చేసినవారు డా|| పోరంకి దక్షిణామూర్తిగారు. వీరంతా కాకలు తీరిన భాషా యోధులు.

ప్రశ్న 2.
భద్రిరాజు కృష్ణమూర్తిగారు విశిష్ట వ్యక్తి అని తెలుసుకున్నాం కదా ! క్లుప్తంగా వారి గురించి రాయండి.
జవాబు:
సంప్రదాయ కవిత్వంతో పాటు ఆధునిక ప్రామాణిక భాషా విషయంలో తెలుగుభాషకు అనన్య సామాన్యమైన సేవలందించిన విశిష్ట వ్యక్తి భద్రిరాజు కృష్ణమూర్తి. ఈయన గురించి – భాషాశాస్త్రాన్ని, భాషా చరిత్రనూ విశ్వ వేదిక మీద నిలబడి నినదించారు. తెలుగుజాతి కీర్తి కిరీటాన్ని రెపరెపలాడించారు. ద్రవిడ భాషల తీరు తెన్నుల గురించి తులనాత్మకంగా చర్చించి, భాషా పరిశోధకులకు కరదీపికగా నిలచారు. తెలుగు పుట్టుపూర్వోత్తరాల గురించి నిర్దుష్ట సమాచారాన్ని అందించినారు. వృత్తి పదకోశాన్ని అందించిన దక్షిణాసియా దేశాల్లో ప్రప్రథముడు. గత శతాబ్దిలో అంతర్జాతీయ స్థాయిలో గొప్ప భాషాశాస్త్రవేత్తలలో మనదేశానికి చెందిన ఇద్దరిలో ఒకరు. విద్యాబోధనలో వాడుకభాష వినియోగం గూర్చి గిడుగు, గురజాడల తర్వాత అంతటి కృషి చేసిన మహనీయులు. ఇలా ఎన్నో అంశాలు స్పృశించి, తెలుగువారి గుండెలలో సుస్థిర స్థానం పొందారు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 5 ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి

ప్రశ్న 3.
భద్రిరాజు కృష్ణమూర్తిగారి వ్యక్తిత్వాన్ని క్లుప్తంగా రాయండి.
జవాబు:
తిక్కన, శ్రీనాథుల సంప్రదాయ కవిత్వాన్ని ఆరాధించి, వాళ్ళకు దీటుగా ఛందోబద్ధ కవితా రచన చేసారు కృష్ణమూర్తిగారు. నిబద్ధత, నిశిత పరిశీలన, మొక్కవోని దీక్ష ఆయనను సుప్రసిద్ధ పరిశోధకునిగా నిలబెట్టాయి. శిష్యుల పట్ల అపార వాత్యల్యాదరాలు చూపే ఉత్తమ ఆచార్యుడాయన. ఏ నిర్ణయానికైనా వెరవని పాలనాదక్షుడు. నిండైన ఆత్మవిశ్వాసం, ఆదర్శవంతమైన బోధన ఆయనకున్న రెండు కళ్ళు. అందరినీ ప్రేమించే సహృదయత మూర్తీభవించిన మహోన్నత వ్యక్తి భద్రిరాజు కృష్ణమూర్తిగారు.

ప్రశ్న 4.
భద్రిరాజు కృష్ణమూర్తిగారి రచనల పేర్లు రాయండి.
జవాబు:
‘చిన్నారి పొన్నారి చిరుత కూకటి నా……..’ శ్రీనాథుని ప్రొడశైలిని తలపిస్తూ ‘మాతృసందేశం’ 300 వృత్త పద్యాల్లో క్విట్ ఇండియా ఉద్యమ నేపథ్యంగా రచించి పెద్దల మన్ననలు పొందారు. ‘పితృస్మృతి’ వారి మరో గ్రంథం. మాండలిక వృత్తి పదకోశాలు, ద్రవిడియన్ లాంగ్వేజెస్, కం పేరిటివ్ ద్రవిడియన్ లింగ్విస్టిక్స్, కరెంట్ పర్స్ పెక్టివ్స్, లాంగ్వేజ్ – ఎడ్యుకేషన్ అండ్ సొసైటీ అనునవి ఇతర రచనలు. వీరి సిద్ధాంత గ్రంథం ‘తెలుగు వెర్బల్ బేసెస్’ ప్రపంచ ఖ్యాతినార్జించి పెట్టింది. ‘ద్రవిడ భాషల తులనాత్మక అధ్యయనం’ కాల్వెల్డ్ రచనకు దీటైనది.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 గిడుగు వెంకట రామమూర్తి

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions ఉపవాచకం Chapter 4 గిడుగు వెంకట రామమూర్తి Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions ఉపవాచకం 4th Lesson గిడుగు వెంకట రామమూర్తి

9th Class Telugu ఉపవాచకం 4th Lesson గిడుగు వెంకట రామమూర్తి Textbook Questions and Answers

కింది ప్రశ్నలకు పదిహేను వాక్యాలకు మించని సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
గిడుగు వెంకట రామమూర్తి గారి జీవిత విశేషాలను సంక్షిప్తంగా రాయండి.
(లేదా)
వ్యావహారిక భాష కోసం ఉద్యమం చేపట్టి సవరభాషకు ఎంతో సేవ చేసిన గిడుగు రామమూర్తి పంతులు గారి జీవిత విశేషాలను వివరించండి.
జవాబు:
గిడుగు వెంకట రామమూర్తిగారు వీర్రాజు, వెంకమాంబ పుణ్య దంపతులకు 29-8-1863న జన్మించారు. విజయ నగరం జిల్లా పర్వతాలపేటలో వీరి పాఠశాల విద్య సాగింది. వారణాసి గున్నయ్యశాస్త్రిగారు ఈయనకు రాయడం, చదవడం నేర్పారు. తండ్రిగారు భారత, భాగవత పద్యాలు నేర్పారు.

ఈయన మెట్రిక్ లో పాసై, పర్లాకిమిడిరాజా వారి మిడిల్ స్కూలు టీచరుగా చేరారు. ఎఫ్.ఎ అయ్యాక హైస్కూలు టీచరు అయ్యారు. రామమూర్తి గారికి 16వ ఏట అన్నపూర్ణతో వివాహం అయ్యింది. రామమూర్తి గార్కి 1885లో పుత్రుడు సీతాపతిగారు పుట్టారు.

ఈయన ముఖ్య స్నేహితుడు గురజాడ వెంకట అప్పారావుగారు. ఈయన 1892లో సవర భాష నేర్చుకున్నారు. సవరలకు బడులు పెట్టించడానికి కృషి చేశారు.

తెలుగు – సవర నిఘంటువులు రచించారు. సొంత ధనంతో సవరల కోసం బడి పెట్టించి, 30 సంవత్సరాలు కృషి చేశారు. వీరిని 1913లో ‘రావుసాహెబ్’ బిరుదుతోను 1934లో కైజర్-ఇ-హిందీ అనే సువర్ణ పతాకంతోను బ్రిటిష్ ప్రభుత్వం గౌరవించింది.

విద్యార్థులకు శిష్ట వ్యావహారికమే బోధనా భాషగా ఉండాలని ఈయన జయప్రదమైన ఉద్యమం చేశారు. 1930లో సవర భాషకు వర్ణనాత్మక వ్యాకరణం రచించారు. 1940 జనవరి 22వ తేదీన మరణించారు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 గిడుగు వెంకట రామమూర్తి

ప్రశ్న 2.
రామమూర్తి పంతులు గారి రచనలను గురించి తెల్పండి.
జవాబు:
రామమూర్తి పంతులుగారు సవరభాషపై కృషి చేసి, “తెలుగు – సవర నిఘంటువు”ను రచించారు. సవరపాటలూ, సవర కథలూ కొన్ని సవర భాషలోనే రాసి పెట్టుకున్నారు. సవర భాషకు వ్యాకరణం రచించడానికి కృషి చేశారు. ఈ పనిలో ఈయనకు “మామిడల్లం కుమారస్వామి పంతులుగారు” సహకరించారు.

రామమూర్తిగారు పర్లాకిమిడిలో తెలుగు పత్రికను ఒక సంవత్సరం పాటు నిర్వహించారు. 1930లో సవర భాషకు వర్ణనాత్మక వ్యాకరణం రచించారు. ఇది అంతర్జాతీయ ధ్వని లిపితో రాయబడిన మొదటి వ్యాకరణం అని (ప్రొఫెసర్ డేవిడ్ సొంపే తెలిపారు. 1913లో ఈయన ప్రకటించిన A Memorandum on Modern Telugu అనే ఆంగ్ల రచన ద్వారా, నాటి భాషా స్థితి పైనా, విద్యా విధానం పైనా రామమూర్తి గారి దృష్టి మనకు స్పష్టమౌతుంది.

పాఠశాల పుస్తకాల్లోనే కాకుండా ప్రభుత్వం ప్రజలతో జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలలో కూడా వాడుక భాషే వాడాలని రామమూర్తి గారు సూచించారు. రామమూర్తిగారు గొప్ప గ్రంథ పరిష్కర్త. పత్రికా రచయిత. విద్యావేత్త.

ప్రశ్న 3.
రామమూర్తిగారు బహుముఖ ప్రజ్ఞాశాలి’ అనే వాక్యాన్ని మీరెలా సమర్థిస్తారు?
(లేదా)
‘గిడుగు రామ్మూర్తి పంతులుగారు బహుముఖ ప్రజ్ఞాశాలి’ సమర్థించండి.
జవాబు:
గిడుగు రామమూర్తిగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. వీరిది మహోన్నత వ్యక్తిత్వం. ఈయనకు సాటిలేని మానవతా దృష్టి ఉంది. ఈయన చరిత్ర భావితరాలకు మార్గదర్శనం చేస్తుంది. ఈయన. గొప్ప అంతర్జాతీయ భాషా శాస్త్రవేత్త. ఈయన డేనియల్ జోన్స్ వంటి బ్రిటిష్ ధ్వని శాస్త్రవేత్తలతో చర్చలూ, ఒట్టోజెన్ పర్సన్ వంటి వ్యాసకర్తలతో ఉత్తర ప్రత్యుత్తరాలూ జరిపిన గొప్ప అంతర్జాతీయ భాషా శాస్త్రవేత్త.

ఈయన గొప్ప కావ్య భాషా పరిశోధకుడు. శాస్త్ర పరిశోధకుడు. ఈయన థర్స్టన్ రచించిన సంపుటాలలో సవర జాతికి చెందిన అంశాలపై పరిశోధక రచనలు చేసిన శాస్త్రవేత్త.

1930లో సవర భాషకు వర్ణనాత్మక వ్యాకరణం రచించాడు. ఇది అంతర్జాతీయ ధ్వని లిపితో రాయబడిన మొదటి వ్యాకరణం అని, ప్రొఫెసర్ డేవిడ్ స్టాంపే తెలిపాడు. సవర భాష నేర్చుకొని, వారికి తన సొంత ధనంతో బడిపెట్టి 30 సంవత్సరాల పాటు నిర్వహించారు.

1913లో ఈయన ప్రకటించిన A Memorandum on Modern Telugu అనే ఆంగ్ల రచన ద్వారా నాటి భాషా స్థితి పైన, విద్యా విధానంపైన వీరి దృక్పథం వెల్లడవుతుంది. పాఠశాల పుస్తకాల్లోనే కాకుండా, ప్రభుత్వం ప్రజలతో జరిపే • ఉత్తర ప్రత్యుత్తరాల్లో కూడా వాడుక భాషే వాడాలని ఈయన సూచించారు.

వ్యావహారిక భాషోద్యమాన్ని విజయవంతంగా నిర్వహించిన బహుముఖ ప్రజ్ఞాశాలి రామమూర్తిగారు.

ప్రశ్న 4.
వ్యావహారిక భాషావాదం వల్ల విద్యార్థులకు మేలే జరుగుతుందని మీరనుకుంటున్నారా? కారణాలు రాయండి.
జవాబు:
వ్యావహారిక భాషావాదం వల్ల విద్యార్థులకు మంచి మేలు జరిగింది. వాళ్ళు తాము మాట్లాడే భాషలోనే జవాబులు రాయగలుగుతున్నారు. గ్రాంథిక భాష అయితే అరసున్నాలు, శకట రేఫములు రాయాలి. వ్యాకరణ యుక్తంగా రాయాలి. మాట్లాడే భాష ఒకటి. వాళ్ళు రాసే భాష ఒకటి కావడంతో వాళ్ళు చిక్కులు ఎదుర్కొనేవారు.

వ్యావహారిక భాష అయితే వాళ్ళు పేపర్లలో చదివే భాషలోనే జవాబులూ, వ్యాసాలు రాయవచ్చు. గ్రాంథిక భాష కృత్రిమ భాష. వ్యావహారిక భాష, వారు చిన్ననాటి నుండి, తల్లిదండ్రుల నుండి నేర్చుకొన్న భాష. ప్రక్కవారితో మాట్లాడే భాష. కాబట్టి విద్యార్థులకు సులభంగా ఉంటుంది.

ఈ వ్యావహారిక భాషావాదం వల్లనే 1969లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు అకాడమీని స్థాపించింది. పాఠ్యపుస్తకాలు వ్యావహారిక భాషలో ప్రచురిస్తున్నారు. పి. హెచ్.డి విద్యార్థులు సైతం తమ పరిశోధనా వ్యాసాలను, వ్యావహారికంలో రాయడానికి, మొదట్లో వేంకటేశ్వర విశ్వవిద్యాలయము అంగీకరించింది. ఆంధ్రా విశ్వవిద్యాలయం 1973 నుండి వ్యావహారికంలో పరిశోధక వ్యాసాలు రాయడానికి అనుమతిస్తోంది.

నేడు క్రమంగా అన్నిచోట్లా వ్యావహారిక భాష చెలామణీ అవుతోంది. అందువల్ల విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతోంది.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 గిడుగు వెంకట రామమూర్తి

ప్రశ్న 5.
గురజాడ అప్పారావు గారిని గురించి రాయండి.
జవాబు:
గురజాడ అప్పారావు గారు గిడుగు వెంకటరామమూర్తిగారూ మంచి మిత్రులు. వారిద్దరూ ఒకే ఏడాది ఒకే బడిలో చదువుకున్నారు.

శ్రీ గురజాడ అప్పారావు గారు మెట్రిక్యులేషన్ పరీక్షల్లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. ఆయన అప్పటికే కవిత్వం రాయడం ప్రారంభించారు. అప్పారావు గారి తొలికథ ‘దిద్దుబాటు’ సాటిలేని మేటి కథ. ఇది 1910లో “ఆంధ్రభారతి” మాసపత్రికలో తొలిసారిగా అచ్చయ్యింది. ఆ కథను చదివి రసికులు పరవశులయ్యారు.

గురజాడ రచనల్లో కన్యాశుల్కం, కొండుభట్టీయం, బిల్హణీయం, నాటకాలు, వారికి మంచి కీర్తిని తెచ్చిపెట్టాయి. అప్పారావు గారి మార్గం నవీనము. ఆయన ప్రతిభ సాటిలేనిది. ఆయన భాష సజీవమైనది. ఈయన భావాలు సంచలనం.

అందుకే మహాకవి శ్రీశ్రీ “ఆది కాలంలో తిక్కన, మధ్య కాలంలో వేమన, ఆధునిక కాలంలో గురజాడ, మహాకవులు” అని చెప్పారు. గురజాడ రాసిన గేయాలు సుమారు ఇరవై ఉంటాయి. ఆ గేయాలే గురజాడను మహాకవిని చేశాయి.

‘గురజాడ వారి “ముత్యాల సరాలు”, ప్రభావం, అన్గండర కవుల మీద బాగ్హా ప్రసరించింది.

9th Class Telugu ఉపవాచకం 4th Lesson గిడుగు వెంకట రామమూర్తి Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

అ) ఈ క్రింది వాక్యాలను సంఘటనలు ఆధారంగా వరుసక్రమంలో అమర్చి రాయండి.

ప్రశ్న 1.
అ) 1940 జనవరి 22వ తేదీన, గిడుగు రామమూర్తి పంతులుగారు కోట్లాది తెలుగు ప్రజల నుండి శాశ్వతంగా దూరమయ్యారు.
ఆ) గిడుగు రామమూర్తి పంతులుగారికి 1913లో బ్రిటిష్ ప్రభుత్వం రావుసాహెబ్ బిరుదును ఇచ్చింది.
ఇ) గిడుగువారికి 16వ యేట అన్నపూర్ణతో వివాహం జరిగింది.
ఈ) గిడుగు వీర్రాజు, వెంకమాంబ పుణ్యదంపతులకు రామమూర్తిగారు జన్మించారు.
జవాబు:
ఈ) గిడుగు వీర్రాజు, వెంకమాంబ పుణ్యదంపతులకు రామమూర్తిగారు జన్మించారు.
ఇ) గిడుగువారికి 16వ యేట అన్నపూర్ణతో వివాహం జరిగింది.
ఆ) గిడుగు రామమూర్తి పంతులుగారికి 1913లో బ్రిటిష్ ప్రభుత్వం రావుసాహెబ్ బిరుదును ఇచ్చింది.
అ) 1940 జనవరి 22వ తేదీన, గిడుగు రామమూర్తి పంతులుగారు కోట్లాది తెలుగు ప్రజల నుండి శాశ్వతంగా దూరమయ్యారు.

ప్రశ్న 2.
అ) 1934లో కైజర్ – ఇ – హింద్ సువర్ణ పతకాన్ని బ్రిటిష్ ప్రభుత్వం, రామమూర్తిగారికి బహుమతిగా ఇచ్చింది.
ఆ) ఇందుకోసం 1892లో రామమూర్తిగారు సవరభాష నేర్చుకోడం ప్రారంభించారు.
ఇ) కొండ కోనల్లో సవర భాషా, సవర పాటలు నేర్చుకుందామని తిరగడంతో, రామమూర్తిగారికి మలేరియా జ్వరం వచ్చింది.
ఈ) సవర భాషపై కృషి చేసి, తెలుగు – సవర నిఘంటువును రచించారు.
జవాబు:
ఆ) ఇందుకోసం 1892లో రామమూర్తిగారు సవరభాష నేర్చుకోడం ప్రారంభించారు.
ఇ) కొండ కోనల్లో సవర భాషా, సవర పాటలు నేర్చుకుందామని తిరగడంతో, రామమూర్తిగారికి మలేరియా జ్వరం వచ్చింది.
ఈ) సవర భాషపై కృషి చేసి, తెలుగు – సవర నిఘంటువును రచించారు.
అ) 1934లో కైజర్ – ఇ – హింద్ సువర్ణ పతకాన్ని బ్రిటిష్ ప్రభుత్వం, రామమూర్తిగారికి బహుమతిగా ఇచ్చింది.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 గిడుగు వెంకట రామమూర్తి

ప్రశ్న 3.
అ) 1907 నుండి 1910 వరకు జరిగిన సమావేశాల్లో, పాఠశాలల్లో, బోధనా భాషగా శిష్ట వ్యావహారికమే ఉండాలని, రామమూర్తిగారు ప్రసంగించేవారు.
ఆ) 1969లో వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, 1973లో ఆంధ్ర విశ్వవిద్యాలయం, పి.హెచ్.డి విద్యార్థులు వ్యావహారికంలో తమ పరిశోధనా వ్యాసాలు రాయడానికి ఆమోదించాయి.
ఇ) 1933లో అభినవాంధ్ర కవి పండిత సభ కూడా ఆధునిక వ్యావహారికమే, బోధనా భాషగా ఉండాలని తీర్మానించింది.
ఈ) విశ్వవిద్యాలయము వాడుక భాషను ఆమోదించడం ఆలస్యమైనా, పత్రికలు, రేడియోలు, సినిమాలు వ్యావహారిక భాషను ముందే ఆమోదించాయి.
జవాబు:
అ) 1907 నుండి 1910 వరకు జరిగిన సమావేశాల్లో, పాఠశాలల్లో, బోధనా భాషగా శిష్ట వ్యావహారికమే ఉండాలని, రామమూర్తిగారు ప్రసంగించేవారు.
ఇ) 1933లో అభినవాంధ్ర కవి పండిత సభ కూడా ఆధునిక వ్యావహారికమే, బోధనా భాషగా ఉండాలని తీర్మానించింది.
ఈ) విశ్వవిద్యాలయము వాడుక భాషను ఆమోదించడం ఆలస్యమైనా, పత్రికలు, రేడియోలు, సినిమాలు వ్యావహారిక భాషను ముందే ఆమోదించాయి.
ఆ) 1969లో వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, 1973లో ఆంధ్ర విశ్వవిద్యాలయం, పి. హెచ్.డి విద్యార్థు వ్యావహారికంలో తమ పరిశోధనా వ్యాసాలు రాయడానికి ఆమోదించాయి.

ప్రశ్న 4.
అ) 1940 జనవరి 22వ తేదీన రామమూర్తి పంతులుగారు, తెలుగు ప్రజల నుండి శాశ్వతంగా దూరమయ్యారు.
ఆ) రామమూర్తి గారి తండ్రి వీర్రాజుగారు, 1830 లోనే ఉద్యోగం కోసం విజయనగరం వలస వెళ్ళారు.
ఇ) రామమూర్తి పంతులు గారికి పుత్రుడు జన్మించాడు. ఆయన పేరు వెంకట సీతాపతి.
ఈ) కందికొండ రామదాసు పంతులు గారి కుమార్తె అన్నపూర్ణతో రామమూర్తిగారికి వివాహం జరిగింది.
జవాబు:
ఆ) రామమూర్తి గారి తండ్రి వీర్రాజు గారు, 1830 లోనే ఉద్యోగం కోసం విజయనగరం వలస వెళ్ళారు.
ఈ) కందికొండ రామదాసు పంతులు గారి కుమార్తె అన్నపూర్ణతో రామమూర్తిగారికి వివాహం జరిగింది.
ఇ) రామమూర్తి పంతులు గారికి పుత్రుడు జన్మించాడు. ఆయన పేరు వెంకట సీతాపతి.
అ) 1940 జనవరి 22వ తేదీన రామమూర్తి పంతులుగారు, తెలుగు ప్రజల నుండి శాశ్వతంగా దూరమయ్యారు.

ప్రశ్న 5.
అ) 1940 జనవరి 22వ తేదిన శ్రీ గిడుగు రామమూర్తిగారు పరమపదించారు.
ఆ) శ్రీ గిడుగు రామమూర్తిగారు 1936 వరకు పర్లాకిమిడిలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు.
ఇ) శ్రీ వీర్రాజు వెంకమాంబ పుణ్య దంపతులకు ది. 09.08.1863న రామమూర్తిగారు జన్మించారు.
ఈ) 1879లో శ్రీరామమూర్తి గారికి 16వ ఏట వివాహం జరిగింది.
జవాబు:
ఇ) శ్రీ వీర్రాజు వెంకమాంబ పుణ్య దంపతులకు ది. 09.08. 1863న రామమూర్తిగారు జన్మించారు.
ఈ)1879లో శ్రీరామమూర్తి గారికి 16వ ఏట వివాహం జరిగింది.
ఆ) శ్రీ గిడుగు రామమూర్తిగారు 1936 వరకు పర్లాకిమిడిలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు.
అ) 1940 జనవరి 22వ తేదిన శ్రీ గిడుగు రామమూర్తిగారు పరమపదించారు.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
సవరల అభివృద్ధికై గిడుగువారి కృషిని తెల్పండి.
జవాబు:
ఆదివాసీల అక్షర శిల్పి గిడుగు రామమూర్తి. ఆదిమ సవర జాతి గిరిజనుల భాషకు లిపిని, నిఘంటువును రూపొందించిన మహనీయుడు గిడుగు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలోని కొండ ప్రాంతాల్లో అనేకమంది సవరలు నివసిస్తున్నారు. వారు ఆదిమ నివాసులు. అక్షర జ్ఞానం, బాహ్య సమాజం అంటే తెలియని అమాయకులు. గతంలో ఎంతో ఉన్నతంగా విలువలతో జీవించిన సవరలు ఆధునిక సమాజంలో వెనుకబడి ఉండటం రామమూర్తిని బాధించింది. వీరికి చదువు చెప్పి విజ్ఞానవంతులను చేయగలిగితే వారి బతుకులు బాగుపడతాయని గిడుగు సవర భాషను నేర్చుకున్నారు. వాచకాలు, కథలు, పాటలు పుస్తకాలు, తెలుగు – సవర, సవర – తెలుగు నిఘంటువులను తయారు చేసారు. 1930లో సవరభాషలో “ఎ మాన్యువల్ ఆఫ్ సవర లాంగ్వేజ్” అనే వర్ణనాత్మక వ్యాకరణాన్ని రాశారు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 గిడుగు వెంకట రామమూర్తి

ప్రశ్న 2.
వ్యావహారిక భాషోద్యమం – ‘గిడుగు’ అడుగు రాయండి.
జవాబు:
‘గిడుగు పిడుగు’. తెలుగు భాషాబోధనలో, వ్యాసాలూ, వార్తల రచనల్లో కథా కథనంలో గ్రాంథికం గాక, వాడుకలో ఉన్న పదాలతో ఎలా సామాన్యంగా మాట్లాడతామో అలా తెలుగు వాక్యాలను వ్రాయాలని ప్రతిపాదించి, ప్రయోగించి, ఉద్యమించి వాడుక తెలుగుభాషకు మాన్యతను తెచ్చిన ధీరుడు, పండితుడు కీ.శే. గిడుగు రామమూర్తి పంతులుగారు. వాడుక భాషను వ్యతిరేకించిన పండితుల రచనలలోని వ్యాకరణ విరుద్ధ ప్రయోగాలను ఎత్తి చూపుతూ 1911-12 మధ్య “ఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేషజం” అనే గ్రంథం రాసారు.

1919లో గిడుగు ‘తెలుగు’ మాసపత్రికను స్థాపించి తన శాస్త్రీయ వ్యాసాలతో, ఉపన్యాస పాఠాలతో అవిశ్రాంతంగా పోరాటం సాగించారు. వీరేశలింగం అధ్యక్షులుగా గిడుగు కార్యదర్శిగా “వర్తమానాంధ్ర భాషా ప్రవర్తక సమాజం” స్థాపించారు. వ్యావహారిక భాషను ప్రతిష్ఠించడంలో విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వం వెనుకంజ వేసినా పత్రికలు మాత్రం గిడుగు వారి వాదానికి పూర్తి సహకారం ఇచ్చాయి. గిడుగు వారిచేత ఉత్తేజితులైన పలువురు రచయితలు వాడుక భాషలో గ్రంథాలు రచించి వాడుక భాష గొప్పదనాన్ని ఋజువు చేశారు. “గ్రాంథిక భాషను ఎవ్వరూ చదువకూడదా ? అని ప్రశ్న వేస్తే, “నేను గ్రాంథిక భాషకు వ్యతిరేకిని కాదు. ప్రజలకు ఉపయోగపడే గ్రంథాలను కృతక భాషలో రచించి భేషజాన్ని ప్రదర్శించవద్దంటాను” అని గిడుగువారు అంటారు. 1911లో రామమూర్తి పంతులు గారు ప్రారంభించిన ఈ ఉద్యమం 1973 నాటికి గాని విజయవంతం కాలేదు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 నేనెరిగిన బూర్గుల

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions ఉపవాచకం Chapter 3 నేనెరిగిన బూర్గుల Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions ఉపవాచకం 3rd Lesson నేనెరిగిన బూర్గుల

9th Class Telugu ఉపవాచకం 3rd Lesson నేనెరిగిన బూర్గుల Textbook Questions and Answers

కింది ప్రశ్నలకు పదిహేను వాక్యాలకు మించని సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
డా. రామకృష్ణారావుగారు అవసరం వచ్చినప్పుడు వామనమూర్తివలే ముల్లోకాలు ఆక్రమించి విరాడ్రూపాన్ని ప్రదర్శించేవారు అని పి.వి. నరసింహారావుగారు ఎందుకు అన్నారు?
(లేదా)
అవసరమైతే విరాడ్రూపాన్ని ప్రదర్శించే వారని బూర్గుల వారి గురించి పి.వి. గారు ఎందుకు అన్నారో వివరించండి.
జవాబు:
డా|| రామకృష్ణారావు అవసరం వచ్చినపుడు వామన మూర్తివలే ముల్లోకాలు ఆక్రమించి విరాడ్రూపాన్ని ప్రదర్శించేవారు అని పి.వి. నరసింహారావుగారు అనడంలో నూటికి నూరుపాళ్ళు నిజముంది. రామకృష్ణారావు గారి పొట్టితనం కొంతవరకు వారిని మరుగుపరుస్తూ ఉండేదని అప్పట్లో కొందరి భావన. నిజానికి ఒడ్డూ, పొడుగూ ఉన్న చాలామంది కంటే కూడా వారు అతి చక్కగా గుర్తింపబడుతూ ఉండేవారు. చిన్నమూర్తిలో ఇమిడి ఉన్న వారి బహుముఖ ప్రతిభాయుత మూర్తిమత్త్వం అవసరం వచ్చినప్పుడు తమ మహోన్నత రూపంలో ప్రదర్శితం కావడం, అవసరం తీరగానే తిరిగి స్వస్వరూపంలో ఇమిడిపోవడం అనేది వారి స్వభావంలోనే ఉంది.

న్యాయవాద వృత్తిలో డా|| రామకృష్ణారావుగారు సునిశిత మేథా సంపత్తిని ప్రదర్శించేవారు. కాని వారి వద్దకు వచ్చే క్లయింట్లలో చాలామందికి ఒక రకమైన మిశ్రమభావం ఉండేది. న్యాయవాదిగా వారి శక్తి సామర్థ్యాలపై సంపూర్ణ విశ్వాసమున్నప్పటికీ రాజకీయ వ్యగ్రత (తొందరపాటు, కంగారు) వలన కేసుపై ధ్యాస ఉంచలేరేమో అని క్లయింట్స్ మనస్సులో ఉండేది.

నిజానికి రామకృష్ణారావుగారికి కేసును క్షుణ్ణంగా చదివి తయారవడానికి అవకాశమే ఉండేది కాదు. కేసు చేపట్టేటప్పుడు వారు విషయమంతా శ్రద్ధగా విని ఆ కేసు తాలూకు ఫైలు వెనుక అస్పష్టమైన నోటులను కొన్ని రేఖా మాత్రంగా వ్రాసి పెట్టుకొనేవారు. నిజానికి వాటిని కేసుకు తయారీ అనడానికి వీలు లేదు. కాని కోర్టులో ఆ రేఖా మాత్రపు నోట్సే డా. రామకృష్ణారావుగారి జాజ్జ్వల్యమానమైన ప్రతిభా విశేషతతో ఎదుటి న్యాయవాదుల వాదనా ఘాతములకు దుర్భేద్యమైన కంచుగోడలుగా నిలవడం పి.వి.గారు ప్రత్యక్షంగా చూసారు. అందుకే వారిని వామన మూర్తివలే ముల్లోకాలు ఆక్రమించి విరాట్ రూపాన్ని ప్రదర్శించారని అన్నారు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 2.
సామ్యవాద వ్యవస్థ కోసం డా. రామకృష్ణారావుగారు చేసిన కృషి ఏమిటి?
(లేదా)
చెప్పడం తేలిక, చెయ్యడం కష్టం. డా|| రామకృష్ణారావుగారు కౌలుదారీ చట్టాన్ని తయారుచేసి సామ్యవాద వ్యవస్థకు మార్గదర్శకులయ్యారు. దీని గురించి వివరించండి.
జవాబు:
రాజకీయాలలో డా. రామకృష్ణారావుగారి సమ్యక్ దృష్టికోణం సంకుచిత సైద్ధాంతిక అరలకు తావివ్వలేదు. ఆయన పుట్టింది జాగీర్ దారీ కుటుంబంలో అయినప్పటికీ పూర్వపు హైదరాబాద్ సంస్థానంలో తరతరాల నుండీ వస్తున్న జాగీర్దారీ వ్యవస్థను రూపుమాపడానికి వెనుకాడలేదు. వారి స్నేహ కోటిలో పెద్ద పెద్ద భూస్వాములు చాలామంది ఉండేవారు. అయినప్పటికీ వారు పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలో దున్నేవానికి భూమి హక్కు నిచ్చే కౌలుదారీ చట్టాన్ని తయారు చేసి, దేశంలో సామ్యవాద వ్యవస్థకు మార్గదర్శకులైనారు. ఆ చట్టాన్ని అమలు పరచడానికి వారు ఎంపిక చేసిన జిల్లాల్లో ఎక్కువగా నష్టపోయింది వారి బంధువులూ, రాజకీయ సహచరులే.

పూర్వపు హైదరాబాద్ సంస్థాన విచ్ఛిత్తి తన రాజకీయ ప్రాబల్యానికి స్వస్తి వాచకం పలుకుతుందని వారికి ముందే తెలుసు. అయినప్పటికీ తనకు నష్టం, ఇతరులకు మేలు చేకూర్చే నిర్ణయాలు తీసుకొంటూ తన రాజకీయ జీవితాన్నంతా ఆత్మ పరిత్యాగానికి, చివరకు సక్రియ రాజకీయాల నుండి తన నిష్క్రమణకు దారితీసే పరిస్థితులకు, సామ్యవాద వ్యవస్థకోసం అన్నింటిని వీరివలె అంకితం చేసుకొనే రాజనీతి విశారదులు బహు అరుదు.

ప్రశ్న 3.
డా.రామకృష్ణారావుగారు నిర్వహించిన పదవులు ఏవి?
(లేదా)
బహుభాషావేత్తగా, పేరు పొందిన డా.రామకృష్ణారావు గారు నిర్వహించిన పదవులు ఏవి?
(లేదా)
స్థిత ప్రజ్ఞుడుగా పేరు పొందిన డా॥ రామకృష్ణారావుగారు నిర్వహించిన పదవులేవి?
జవాబు:
తెలుగుజాతి సగర్వంగా చెప్పుకోగలిగిన మహాపురుషులలో బూర్గుల రామకృష్ణారావుగారు అగ్రేసరులు. ఒక హైస్కూలులో పర్షియన్ బోధించే ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆంధ్రుడు బహుశా ఈయన ఒక్కరేనేమో. 1923లో హైదరాబాదు నగరంలో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1929లో ఏర్పడ్డ పౌరహక్కుల పరిరక్షణ సంఘానికి రామకృష్ణారావు అధ్యక్షులుగా పనిచేసారు. రెండవ ఆంధ్ర మహాసభకు (1931లో) ఈయన అధ్యక్షత వహించారు. 1950 జూన్ 12న మంత్రిగా పదవి చేపట్టారు. 1952 మార్చి 6న హైదరాబాదు ముఖ్యమంత్రిగా బూర్గులవారు పదవీ స్వీకారం చేశారు. ఆయన హైదరాబాదు రాష్ట్రానికి ప్రజాప్రతినిధులచే ఎన్నోకోబడిన తొలి ముఖ్యమంత్రి, పర్షియన్ ట్యూటర్ గా, న్యాయవాదిగా, స్టేట్ కాంగ్రెస్ నాయకులుగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేరళ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గవర్నరుగా, రాజ్యసభ సభ్యులుగా ఇలా ఎన్నో పదవులు చేపట్టి, స్థితప్రజ్ఞతను ప్రదర్శించారు.

ప్రశ్న 4.
జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కోవడానికి డా.రామకృష్ణారావుగారు అనుసరించిన పద్ధతి ఏమిటి?
(లేదా)
జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ధైర్యంగా ఎదుర్కొన్న బూర్గుల రామకృష్ణారావుగారి స్వభావాన్ని వివరించండి.
జవాబు:
డా|| రామకృష్ణారావు గారిది పెద్ద కుటుంబం. ఆ కుటుంబానికి వారొక ఆత్మీయులైన తండ్రి. ఆ కుటుంబానికే కాదు, … ప్రతిచోటా ఆత్మీయుడైన తండ్రిగానే ఉంటూ ఉండేవారు. వారి ఉదార ప్రవృత్తి వల్ల న్యాయముగా ఎక్కువ ధ్యానముంచవలసిన పనులకంటే. శక్తిని. సమయాన్ని వ్యక్తపరిచే పనులకు అప్పుడప్పుడు వారు ప్రాధాన్యమివ్వడం జరుగుతుండేది.

వారి సామాజిక యాత్ర ఎప్పుడూ సాఫీగా జరుగులేదు. రకరకాలైన ఒడిదుడుకులను వారు ఎదుర్కొనవలసివచ్చేది. చాలా సందర్భాలలో విపత్కర పరిస్థితులు సేనావాహినిలా వచ్చి చుట్టుముట్టేవి. అయినప్పటికీ వారు చలించేవారు కాదు. మన సైర్యాన్ని, సమచిత్తతను వారు ఎన్నడూ విడనాడేవారు కాదు. విజయాలు లభించినపుడు సంతోషంతో ఉప్పొంగనూ లేదు, కష్టాలు సంభవించినపుడు అధైర్యంతో క్రుంగిపోనూ లేదు. స్నేహితులు ద్రోహం తలపెట్టినపుడుకాని, ప్రత్యర్థులు దూషించినపుడు వారనేదల్లా ఒకటే – “సరే – అవన్నీ ఆటలో ఉండేవేగా” అని.

జీవితంలో ఒడిదుడుకులు సహజం. వాటిని చూసి భయపడటం, పారిపోవడం, ఇంకా ఏవేవో చేయడం మనలోని అసమర్థతను తెలుపుతాయి. బూర్గుల వారిలో స్థితప్రజ్ఞత అనుసరణీయం.

9th Class Telugu ఉపవాచకం 3rd Lesson నేనెరిగిన బూర్గుల Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

ఈ క్రింది వాక్యాలను సంఘటనలు ఆధారంగా వరుసక్రమంలో అమర్చి రాయండి.

ప్రశ్న 1.
అ) నేను వారివద్ద అందరికంటే జూనియర్ న్యాయవాదిగా ఉండేవాడిని.
ఆ) నేను నాకు కావలసిన కేసులను – ముఖ్యంగా జూనియర్లకు కొరుకుడు పడని చిక్కు కేసులను స్వయంగా ఏరుకొని చదువుతూ ఉండేవాడిని.
ఇ) ఒకసారి డా|| రామకృష్ణారావు గారు దానిని గమనించి తమ ఆమోదముద్ర వెయ్యడంతో ఆ కారాల మిరియాల ప్రకరణం ముగిసింది.
ఈ) నా ఈ చొరవ వారి సీనియర్ గుమస్తాకు కోపకారణమై ఆయన నా మీద కారాలు మిరియాలు నూరుతూ ఉండేవాడు.
జవాబు:
అ) నేను వారివద్ద అందరికంటె జూనియర్ న్యాయవాదిగా ఉండేవాడిని.
ఆ) నేను నాకు కావలసిన కేసులను – ముఖ్యంగా జూనియర్లకు కొరుకుడు పడని చిక్కు కేసులను స్వయంగా ఏరుకొని చదువుతూ ఉండేవాడిని.
ఈ) నా ఈ చొరవ, వారి సీనియర్ గుమస్తాకు కోపకారణమై ఆయన నా మీద కారాలు మిరియాలు నూరుతూ ఉండేవాడు.
ఇ) ఒకసారి డా|| రామకృష్ణారావు గారు దానిని గమనించి తమ ఆమోదముద్ర వెయ్యడంతో ఆ కారాల మిరియాల ప్రకరణం ముగిసింది.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 2.
అ) వారు రాగానే “సోదర సోదరీమణులారా !” నేను అలవాటు ప్రకారం నేడు కూడా ఆలస్యంగానే వచ్చాను.
ఆ) రామకృష్ణారావుగారిది పెద్ద కుటుంబం. ఆ కుటుంబానికే కాదు ఆయన ప్రతిచోటా ఆత్మీయుడైన తండ్రిగానే ఉంటూ ఉండేవారు.
ఇ) దారిలో వారిని ఎవరైనా, ఎక్కడైనా ఆపి కష్టసుఖాలు చెప్పుకోవచ్చు.
ఈ) అందుచేత వారు ప్రతిదానికీ ఆలస్యంగా రావడానికి పేరుపడ్డారు. అయినా మిత్రులు, సహచరులు ఎంతో ఓర్పుతో గంటల తరబడి వారి కోసం వేచి ఉండేవారు.
జవాబు:
ఆ) రామకృష్ణారావుగారిది పెద్ద కుటుంబం. ఆ కుటుంబానికే కాదు ఆయన ప్రతిచోటా ఆత్మీయుడైన తండ్రిగానే ఉంటూ ఉండేవారు.
ఇ) దారిలో వారిని ఎవరైనా, ఎక్కడైనా ఆపి కష్టసుఖాలు చెప్పుకోవచ్చు.
ఈ) అందుచేత వారు ప్రతిదానికీ ఆలస్యంగా రావడానికి పేరుపడ్డారు. అయినా మిత్రులు, సహచరులు ఎంతో ఓర్పుతో గంటల తరబడి వారి కోసం వేచి ఉండేవారు.
అ) వారు రాగానే “సోదర సోదరీమణులారా !” నేను అలవాటు ప్రకారం నేడు కూడా ఆలస్యంగానే వచ్చాను.

ప్రశ్న 3.
అ) ఆ చట్టాన్ని అమలు పరచడానికి వారు ఎంపిక చేసిన జిల్లాల్లో ఎక్కువగా నష్టపోయినవారు వారి బంధువులూ, రాజకీయ సహచరులే.
ఆ) వారు పుట్టింది జాగీర్దారీ కుటుంబంలో అయినా, జాగీర్ దారీ వ్యవస్థను రూపుమాపడానికి వెనుకాడలేదు.
ఇ) అయినా వారు పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలో దున్నేవానికి భూమిహక్కు నిచ్చే కౌలుదారీ చట్టాన్ని తయారుచేసి, సామ్యవాద వ్యవస్థకు మార్గదర్శకులైనారు.
ఈ) వారి స్నేహ కోటిలో పెద్ద పెద్ద భూస్వాములు చాలామంది ఉండేవారు.
జవాబు:
ఆ) వారు పుట్టింది జాగీర్ దారీ కుటుంబంలో అయినా, జాగీర్ దారీ వ్యవస్థను రూపుమాపడానికి వెనుకాడలేదు.
ఈ) వారి స్నేహ కోటిలో పెద్ద పెద్ద భూస్వాములు చాలామంది ఉండేవారు.
ఇ) అయినా వారు పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలో దున్నేవానికి భూమిహక్కునిచ్చే కౌలుదారీ చట్టాన్ని తయారుచేసి, సామ్యవాద వ్యవస్థకు మార్గదర్శకులైనారు.
అ) ఆ చట్టాన్ని అమలు పరచడానికి వారు ఎంపిక చేసిన జిల్లాల్లో ఎక్కువగా నష్టపోయినవారు వారి బంధువులూ, రాజకీయ సహచరులే.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
“డా.రామకృష్ణారావు గారి విశేష నైపుణ్యానికి నేను ఎల్లప్పుడూ జోహారులర్పిస్తూనే ఉంటాను” – అని పి.వి.గారు అనడంలోని ఆంతర్యాన్ని తెల్పండి.
జవాబు:
సీనియర్ న్యాయవాదిగా బూర్గుల వారిదొక ప్రత్యేక తరహా. వారివద్ద అనేకమంది జూనియర్లు ఉండేవారు. తల్లికి తన కడగొట్టు బిడ్డపై ఎటువంటి విశేష మమకారం ఉంటుందో అటువంటి మమకారమే డా.రామకృష్ణారావుగారికి పి.వి. గారి మీద ఉండేది. చొరవగా, నిరాఘాటంగా తిరగడం, కొరుకుడుపడని చిక్కు కేసులను స్వయంగా ఏరుకొని చదివే పి.విగారిని చూసి, అక్కడున్న సీనియర్ గుమాస్తాకు కోపకారణమైంది. దానిని గమనించిన బూర్గులవారు నా చేష్టపై ఆమోదముద్ర వేసి, వారిరువురి మధ్య దూరం తగ్గి నిష్కాపట్యంతో కూడిన సమాన స్థాయి చర్చా సంబంధం ప్రారంభమైంది. పి.వి. లోని శక్తి సామర్థ్యాలను వెలికి తీసి, అతనిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు. తనను తాను నిరూపించుకొనేందుకు డా. రామకృష్ణారావుగారి విశేష నైపుణ్యానికి పి.వి. ఎల్లప్పుడూ జోహారులర్పిస్తూనే ఉంటాను అనడంలోని ఆంతర్యం ఇదే.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 2.
“బూర్గుల వారు సౌజన్యానికి మారుపేరు” వివరించండి.
జవాబు:
మత దురభిమానాన్ని పెంపొందిస్తూ రాజ్యమేలుతున్న ఆనాటి నిజాంకు బద్ధ వ్యతిరేకి బూర్గులవారు. కానీ అక్కడి ముస్లింలందరికీ మిక్కిలి ఆప్తులు. అతి నిరాడంబరంగా వారు మతాతీత స్థితిని పాటించేవారు. వారి డ్రాయింగ్ రూమ్ లో ఆనాటి హైదరాబాద్ ప్రభుత్వ పెద్దలు, మౌల్వీలు, ముల్లాలు, పండితులు, మహా మహోపాధ్యాయులు, గాంధీ టోపీలవారు, ఖద్దరుదారులు, అధునాతన టెరిలిన్ యువకులు ఒక్క మాటలో చెప్పాలంటే డా. రామకృష్ణారావుగారు మూడు విభిన్న తరాల చివరి వారిధిలా కన్పించేవారు. అవసరమైనపుడు ఆయన ప్రత్యర్థులను చీల్చి చెండాడేవారు. కాని అలా చేయడంలో ప్రత్యర్థుల కంటి నుండి ఒక్క కన్నీటి బొట్టు పడటం కాని, వారి హృదయాలకు రవ్వంత నొప్పి తగలడం కాని జరిగేది కాదు.

ఇలా ఎన్నో విషయాలు ఆయన సౌజన్యానికి ప్రతీకలుగా నిలిచేవి.

ప్రశ్న 3.
‘బూర్గుల బహుభాషావేత్త’ అని ఎలా చెప్పగలవు?
జవాబు:
బూర్గుల వారు చాలా ప్రతిభావంతులైన భాషావేత్తలనే విషయం అందరికీ తెలిసినది. వారు చదువుకున్న చాలా భాషలు వాటి యందలి అభిరుచులచే ప్రయివేటుగా చదువుకొన్నవే. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు, హిందీ, సంస్కృత భాషలలో రచనలు చేసారు. 1919 – 20 ప్రాంతంలో “కన్నె కన్నులు” అనే ఖండ కృతి రచించారు. మరియు కృష్ణ శతకం, సంస్కృతంలో శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, శ్రీకృష్ణాష్టకం, ఉమర్‌య్యూం రుబాయీలను ఫారసీ భాష నుంచే 101 రుబాయీలను తెలుగు పద్యాలుగా అనువదించారు. శంకరాచార్యులవారి సౌందర్యలహరిని వీరు 1962లో తెనిగించారు. అలాగే కనకధారాస్తవాన్ని ఆంధ్రానువాదం (1964) చేసారు. “సారస్వత వ్యాసముక్తావళి” అనే పేరుతో పరిశీలనాత్మక సాహిత్య వ్యాసాలు (1926) వ్రాసారు. ఈ వ్యాసాలు మహాకవి శ్రీశ్రీనే ఆకట్టుకొన్నాయంటే వాటి విలువ ఏమని చెప్పాలి. దాశరథి గారి ‘గాలిబ్ గీతాలు’ వంటి అనేక పుస్తకాలకు పీఠికలు వ్రాసారు. ఈయన అన్ని భాషలలో రచనలు చేయకుండా, ఏ ఒక్క భాషలోనో కృషి చేసి ఉంటే ఆ భాషా రంగంలో జాతిరత్నం వలె ప్రకాశించేవారేమో!

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 నేనెరిగిన బూర్గుల

ఆ) కింది ప్రశ్నలకు పదిలేక పన్నెండు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
డా. రామకృష్ణారావు గారిని గూర్చి పి.వి. నరసింహారావుగారు ఏమి చెప్పారో రేఖామాత్రంగా రాయండి.
(లేదా)
“బూర్గుల వారిని పూర్ణ పురుషులు” అని పి.వి. అన్నారు కదా ! వివరించండి.
జవాబు:
సమాజంలో కొద్దిమందే ప్రభావశక్తి సంపన్నులు ఉంటారు. వీరి సాంగత్యం పొందినా, వీరి గురించి తెలుసుకొన్నా స్ఫూర్తి కలుగుతుంది. మంచిమార్గంలో నడవడానికి అవకాశం కలుగుతుంది. ఇలా స్ఫూర్తిదాయకమైన వారిలో ఒకరు కీ.శే. బూర్గుల రామకృష్ణారావు గారు. వీరి గురించి మరొక మహోన్నత వ్యక్తి, బహుఖ ప్రజ్ఞాశాలి కీ.శే. పి.వి. నరసింహారావు గారు బూర్గులవారి మహోన్నత వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించేలా ఈ వ్యాసాన్ని రాసారు.

బూర్గుల వారి గురించి ఎప్పుడు, ఎక్కడ పుట్టారు, విద్యాభ్యాసం, మంత్రి, ముఖ్యమంత్రి ఇలా అనేక అంశాలను స్పృశించినంత మాత్రాన వారి వ్యక్తిత్వం తెలియదంటారు పి.వి. ప్రతి వ్యక్తిలోను సామాన్యంగా ఉన్నదానికంటే ఎక్కువ తన గురించి అనుకొనే స్వభావం ఉంటుంది. తాను ఇతరులకంటే గొప్పవాడనిపించుకోవాలనే కోరిక ఒకరినొకరు కించపరుచుకుంటూ, తమ శక్తిని, సమయాన్ని వృధా చేసుకుంటారు. కాని ఇందుకు భిన్నంగా ఉండే బూర్గుల వారిని గూర్చి ఎంత చెప్పినా తకు నే అవుతుంది. వారి బహుముఖ ప్రతి నియుత మూర్తిమత్త్వం అవసరం వచ్చినప్పుడు తమ మహోన్నత రూపంలో ప్రదర్శితం కావడం, అవసరం తీరగానే “రిగి పూర్వ రూపంలో ఇమిడిపోవడం అనేది వారి స్వభావంలోనే ఉందని పి.వి. అంటారు.

క్లయింట్లు చెప్పే విషయాన్ని శ్రద్ధగా విని ఆ కేసు తాలుకు ఫైలు వెనుక నోటులను రేఖామాత్రంగా రాసి, కోర్టులో తన ప్రతి విశేషతతో ఎదుటి న్యాయవాదులకు కొరకరాని కొయ్యగా మారేవారు. ఆయన వద్ద జూనియర్ గా చేరిన సి వి.గారిని తాను సీనియర్ ని అనిగాక, నిష్కాపట్యంతో కూడిన సమానస్థాయిని ప్రదర్శించేవారు. తాను పుట్టింది జాగీర్ దార్ కుటుంబంలో అయినప్పటికీ పూర్వం నుంచి వస్తున్న జాగీర్ దారీ వ్యవస్థను రూపుమాపడానికి వెనుకాడలేదు. బూర్గులవారు ఏ నిర్ణయం తీసుకొన్నా దానిని అన్ని విధాలైన జాగ్రత్తలతోను, వ్యవహార దక్షతతోను తీసుకొనేవారు.

సౌజన్యానికి మారుపేరు రామకృష్ణారావుగారు. నిజాం నవాబుకు బద్ధ వ్యతిరేకి అయినప్పటికీ అక్కడి ముస్లింలందరికీ మిక్కిలి ఆప్తులు. ఆయనను గూర్చి ఒక్కమాట చెప్పాలంటే మూడు విభిన్న తరాల చివరి వారధిలా కన్పించేవారి పి.వి. తెలిపారు. ఆనాటి శాసనసభా నాయకులుగా ఉండి అవసరమైనపుడు ప్రత్యర్థులను చీల్చి చెండాడేవారు. కాని అలా చేయడంలో వారి హృదయాలకు రవ్వంత నొప్పి తగిలేది కాదు. ముఖ్యమంత్రి అయిన రోజుల్లో బూర్గులవారు ప్రతిరోజూ అర్థరాత్రి వరకు ఆఫీసు ఫైళ్ళు చూసుకొని, ఆ కర్వాత నమ్మశక్యం గాని ఉత్సాహంతో తెలుగు, సంస్కృత, ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ ఇలా అనేక గ్రంథాలను చదివేవారు.

బూర్గుల వారి సామాజిక యాత్ర ఎప్పుడూ సాఫీగా సాగలేదు. అనేక ఒడిదుడుకులను వారు ఎదుర్కొన్నారు విజయాలకు పొంగలేదు. కష్టాలకు కుంగనూలేదు. ప్రత్యర్థులు దూషించినా “సరే – ఇవన్నీ ఆటలో ఉండేవేగా” అని అనేవారు. ఆయన గురించి ఒక్కమాటలో చెప్పాలంటే వారు పూర్ణపురుషులు” అని పి.వి. గుర్తు చారు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 నేనూ సావిత్రీబాయిని

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions ఉపవాచకం Chapter 2 నేనూ సావిత్రీబాయిని Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions ఉపవాచకం 2nd Lesson నేనూ సావిత్రీబాయిని

9th Class Telugu ఉపవాచకం 2nd Lesson నేనూ సావిత్రీబాయిని Textbook Questions and Answers

కింది ప్రశ్నలకు పదిహేను వాక్యాలకు మించని సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
సావిత్రీబాయి కాలంలో స్త్రీల పరిస్థితులు ఎలా ఉండేవి?
జవాబు:
సావిత్రీబాయి కాలంలో ఆడవాళ్ళు గడప దాటకూడదు. ఆడదంటే వంటింటికీ, వంటింట్లో పొయ్యికి కట్టుబడి ఉండాలి. ఆడపిల్ల నియమాలను ఎంతమాత్రం దాటరాదు.

ఆ రోజుల్లో పొయ్యిలో కర్రలూ, పొయ్యి ఊదే గొట్టం ఆడపిల్ల చేతిలో ఎప్పుడూ ఉండాల్సిందే. ఆడపిల్ల ఆ గొట్టంతో పొయ్యిని ఊదుతూ ఉండాల్సిందే. ఆడపిల్ల భర్తనూ, అత్తమామల్ని సేవించుకోవాలి. ఇప్పుడు రెండవతరగతి చదివే వయస్సులోనే ఆనాడు ఆడపిల్లలు అత్తవారింట్లో ఉండేవారు. అత్తవారి ఇల్లే ఆడపిల్ల అసలు ఇల్లని ఆ రోజుల్లో ఆడపిల్లలకు తల్లిదండ్రులు నొక్కి చెప్పేవారు.

ఆ రోజుల్లో ఆడపిల్లలకు చదువు పనికిరాదు. చదువుకున్న ఆడది చెడిపోతుందని, బుద్ధిలేనిది అవుతుందని అప్పటివారు నమ్మేవారు. ఆనాడు సావిత్రి ఆడపిల్లలకు చదువు చెప్పడానికి బడికి పోతూంటే, జనం కిటికీల వెనుక నిలబడి తిట్టేవారు. శాపనార్థాలు పెట్టేవారు. నీచమైన మాటలు అనేవారు.

ప్రశ్న 2.
సేజ్ అంటే ఎవరు? ఆయన వ్యక్తిత్వాన్ని గురించి వివరించండి.
జవాబు:
పేజీ అంటే సావిత్రీబాయి భర్త “జ్యోతీరావ్ ఫూలే”. ఫూలే సేజ్, పూనాలో ఉండే ఫూలే కుటుంబంలో పుట్టాడు. సేజీకి ఎప్పుడూ బడి, పుస్తకాలు, చదువు అంటే ఇష్టం. సావిత్రీబాయి, జ్యోతీరావ్ ఫూలేని సేజ్ అనే పిలిచేది.

మనిషి మంచివాడయితే, అతడు మనదేశం వాడయినా, విదేశీయుడయినా సరే, ఆయన జీవితం, వ్యక్తిత్వం విలువలూ అన్నీ తెలుసుకోవాలి అనేవాడు సేజ్. శివాజీ, వాషింగ్టన్ వంటి వారి జీవిత చరిత్రలు అన్నీ ఆయన చదివాడు. థామస్ పెన్ రాసిన “మానవుని హక్కులు” పుస్తకం చదివి మనిషికి ఉన్న హక్కులూ, బాధ్యతలూ చక్కగా తెలిసికొన్నాడు.

మన కులవ్యవస్థ, మన సమాజాన్ని నాశనం చేస్తోందని పేర్జీ చెప్పేవాడు. ఒకప్పుడు మంచిగా ఉన్న మన మతం మూర్ఖపు ఆచారాల్లో చిక్కుకుందనీ, వాటిని రూపుమాపాలనీ అనేవాడు. సేజ్, కబీర్, తుకారాం వంటి భక్తుల సాహిత్యాన్ని, మత సంస్కర్తల రచనల్నీ చదివాడు. ఆ కాలంలోని శూద్ర, అతిశూద్ర కులాల గొడవలు, విద్య వల్లే పోతాయనీ, విద్యే మన ధ్యేయం కావాలనీ సేజ్ చెప్పేవాడు. సేజ్, విద్య అనే తపన వహించిన మహావృక్షం వంటివాడు.

ఆడమనిషి చదువుకుంటేనే కుటుంబం బాగుపడుతుందని, భార్య సావిత్రికి చదువు చెప్పి, ఆమెను మొదటి పంతులమ్మగా చేశాడు. తక్కువ కులాల ఆడపిల్లల కోసం సొంత ధనంతో బడి పెట్టాడు.

మానవులందరూ పుట్టుకతో సమానులనీ, వాళ్ళు ఒకరినొకరు సమానులుగా చూసుకోవాలనీ సేజ్ చెప్పేవాడు. ఆడపిల్లలకు చదువు చెపుతున్నందుకు కోపంతో కొందరు సేజీని చంపబోయారు. బీదవాళ్ళకు సాయం చెయ్యడమే తన జీవితాశయం అనీ, వాళ్ళ చేతుల్లో చావటానికి కూడా తాను సిద్ధం అని చెప్పి, హంతకుల మనస్సును సేర్ జీ మార్చాడు.

శిశు హత్యలకు వ్యతిరేకంగా మొదటి ఆశ్రమం స్థాపించాడు. “దేవుడు ఒక్కడే. మనందరం ఆయన పిల్లలం. మనిషిని గొప్పవాడిగా చేసేది అతని గుణమే కాని, కులంకాదు.” అనే సిద్ధాంతాలతో “సత్యశోధక సమాజాన్ని” స్థాపించాడు.

సేజ్ అంటే జ్యోతీరావ్ ఫూలే. ఈయన స్త్రీ విద్యకూ, కులరహిత సమాజానికి కృషిచేసిన మహనీయుడు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 నేనూ... సావితీబాయిని

ప్రశ్న 3.
జ్యోతీరావ్ ఫూలేని చంపడానికి వచ్చిన వాళ్ళు పరివర్తన చెందిన సంఘటనను తెలపండి.
(లేదా)
మంచితనంతో మూర్ఖుల మనసుకూడా మార్చవచ్చు అని నిరూపించారు సేజ్. జ్యోతీరావ్ పూలేని చంపడానికి వచ్చిన వాళ్ళు పరివర్తన చెందిన సంఘటన గురించి రాయండి.
జవాబు:
జ్యోతీరావ్ ఫూలే తక్కువ కులాల ఆడపిల్లల చదువులకై బడి పెట్టాడు. ఇది గిట్టని సంఘంలో కొందరు పెద్దమనుషులు ఫూలేని చంపమని దోండిరామ్, కుంబార్ రోడే అనే హంతకులను నియమించారు.

ఒకరోజు రాత్రి భోజనాలయ్యాక ఫూలే నిద్రపోడానికి సిద్ధమయ్యాడు. ఇంతలో ఫూలే పెరటి గుమ్మం తీసుకొని ఇద్దరు హంతకులు గొడ్డళ్ళతో నిశ్శబ్దంగా లోపలకు వచ్చారు. వాళ్ళ ముఖాలు భయంకరంగా ఉన్నాయి. వాళ్ళు ఫూలే భార్య సావిత్రికీ, ఫూలేకీ ముందు నిలబడి, ఫూలేని చంపడానికి గొడ్డళ్ళు పైకెతారు. వెంటనే ఫూలే భార్య “అన్నల్లారా ! ఆగండి. దయచేసి వెళ్ళిపొండి” అని బ్రతిమాలింది. ఎందుకు వచ్చారని ఫూలే వాళ్ళను అడిగాడు.

ఫూలే బడులు నడపడం ఇష్టంలేని కొందరు పెద్దలు, ఆయనను చంపడానికి తమకు కాంట్రాక్టు ఇచ్చారని, వాళ్ళు ఫూలేకు చెప్పారు.

అప్పుడు ఫూలే వాళ్ళతో – “నా చావు మీకు లాభం అయితే, నన్ను చంపండి. బీదవాళ్ళకు సాయం చెయ్యడమే, నా జీవితాశయం – బీదవారి చేతిలో చావడంలో తప్పులేదు. నన్ను చంపండి” అని మెడవంచి శాంతంగా చావుకు సిద్ధమయ్యాడు.

వెంటనే దోండిరామ్, కుంబార్ రోడేలు గొడ్డళ్ళు కిందపడేశారు. ఫూలే కాళ్ళమీద పడ్డారు. “మేము మిమ్మల్ని చంపం. మీరు మా తండ్రి వంటివారు. ఇప్పుడే వెళ్ళి మమ్మల్ని ఇక్కడకు పంపిన వాళ్ళను చంపుతాం” అన్నారు ఫూలే వాళ్ళను ఆపాడు. వారి ఆలోచన మారేదాకా వారితో మాట్లాడాడు.

వాళ్ళిద్దరూ ఫూలే రాత్రి బడిలో చేరారు. కుంబార్ రోడే ఫూలేకు బాడీగార్డుగా తయారయ్యాడు. కుంబార్ రోడే “వేదాచార్” అనే పుస్తకం రాసి, ఫూలే పనికి సాయం చేశాడు.

ప్రశ్న 4.
సావిత్రిబాయి ఫూలే పాత్రను ఏకపాత్రాభినయం చేయండి.
జవాబు:
“సావిత్రిబాయి ఫూలే” ఏకపాత్రాభినయం ; నేను సావిత్రిని.

ఈ రోజు మీతో మాట్లాడదామని మీ ముందుకు వచ్చా. మీరు, మేం మా కాలంలో ఎక్కడున్నామో అక్కడే నిలిచిపోయారా ? అని నాకు అనిపిస్తోంది. నేను మహారాష్ట్రలో సతారా జిల్లా, ఖండాలా తాలూకాలో నైగావ్ గ్రామంలో పాటిల్ గారి మొదటి సంతానంగా పుట్టా. చిన్నప్పుడు బాగా అల్లరి చేసేదాన్ని. చెట్లు ఎక్కి సీమ చింతకాయలు కోసుకు తినేదాన్ని.

నాకు ఏడవ సంవత్సరంలో పూనాలోని ఫూలే కుటుంబీకుడు జ్యోతిరావ్తో పెండ్లి జరిగింది. మా మామగారు మంచివారు. నా భర్తను నేను సేజ్ అని పిలిచేదాన్ని. సే జీకి చదువు అంటే ఇష్టం. నాకు ఆయన అన్నీ చదివి చెప్పేవారు. సేన్ జీ సాగర్ వెళ్ళారు. ఆడది చదువుకుంటేనే కుటుంబం బాగుపడుతుందని అక్కడ ఒక తెల్లజాతి మనిషి సేజీకి చెప్పింది.

సేజ్ నాకు చదువు చెప్పడం ప్రారంభించారు. మా మామగారు చదువుకుంటే ఆడది చెడిపోతుందని సేజీకి సలహా చెప్పారు. అయినా సేజ్ ఆ మాట వినలేదు. నా భర్త తక్కువ కులాల ఆడపిల్లల చదువులకు రెండు బడులు పెట్టారు. ఇంతలో ఆ స్కూలు నడిపే బడిపంతులు మానివేశాడు. దానితో ఫూలే బలవంతంపై, నేనే ఆ పిల్లలకు పంతులమ్మనయి, స్త్రీలకు చదువు చెప్పాను. ఆ పని చేయడం ఇష్టం లేని జనం నన్ను తిట్టేవారు. కిటికీలు మూసి నేను వారికి పాఠాలు చెప్పాను.

ఒక రోజున నేనూ, పేజీ నిద్రపోవడానికి సిద్ధంగా ఉండగా ఇద్దరు హంతకులు సేజీని చంపడానికి మా ఇంటికి వచ్చారు. సేజ్ తన్ను చంపండని తలవంచారు. హంతకుల మనస్సులు మారిపోయాయి. మేం ఓ పిల్లవాణ్ణి పెంచుకున్నాం. మా సొంతబిడ్డలాగే వాడిని చూసుకున్నాం. నేనే మొదటి పంతులమ్మను. శిశుహత్యలకు వ్యతిరేకంగా మేము ఒక ఆశ్రమం స్థాపించాము.

సత్యశోధక సమాజాన్ని స్థాపించాము. మేం సాధించిన విజయాలను, మా తర్వాత వచ్చిన ప్రజలు ముందుకు తీసుకెళ్ళాలి. పక్షవాతంతో సేర్జీ మరణించారు. 1897లో పూనాలో ప్లేగువ్యాధి వచ్చింది. ప్లేగు వ్యాధితో బాధపడే పసిపిల్లలను నేను చేరదీశాను. నేను కూడా ప్లేగు వ్యాధితోనే కన్నుమూశాను. మా ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళండి. సెలవు.

9th Class Telugu ఉపవాచకం 2nd Lesson నేనూ… సావితీబాయిని Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

ఈ క్రింది వాక్యాలను సంఘటనలు ఆధారంగా వరుసక్రమంలో అమర్చి రాయండి.

ప్రశ్న 1.
అ) నేను ఆడపిల్లను కాదమ్మా ! ఇదిగో చూడు. ఈ సీమచింతకాయ ఎంత తియ్యగా ఉందో !
ఆ) నాన్న కిందకు దించాడు. అమ్మ మాత్రం ఆపలేదు.
ఇ) అమ్మా ! నా సీమ చింతకాయలు నేను, పడిపోతున్నా, కొమ్మ విరిగింది.
ఈ) చూడండి. మీ ముద్దుల కూతురు ఏంచేసిందో !
జవాబు:
ఇ) అమ్మా ! నా సీమచింతకాయలు, నేను, పడిపోతున్నా. కొమ్మ విరిగింది.
ఈ) చూడండి. మీ ముద్దుల కూతురు ఏంచేసిందో !
ఆ) నాన్న కిందకు దించాడు. అమ్మ మాత్రం ఆపలేదు.
అ) నేను ఆడపిల్లను కాదమ్మా ! ఇదిగో చూడు. ఈ సీమచింతకాయ ఎంత తియ్యగా ఉందో !

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 నేనూ... సావితీబాయిని

ప్రశ్న 2.
అ) నా పుస్తకాల నేం చేస్తున్నావు ? పేజీలు పోగొడతావ్ జాగ్రత్త !
ఆ) ‘మీరు మీ ఆడవాళ్ళకు చదువు చెప్పించక పోవడం అన్యాయం’ అని ఆ తెల్లమనిషి సేజీతో అంది.
ఇ) జ్యోతి ! – సావిత్రి కెందుకు చదువు నేర్పుతున్నావు?
ఈ) ఈ సేజ్ ఎల్లా ఉంటాడబ్బా అనుకొనే దాన్ని. చింత చెట్లు ఎక్కుతాడా?
జవాబు:
ఈ) ఈ పేజీ ఎల్లా ఉంటాడబ్బా అనుకొనే దాన్ని. చింత చెట్లు ఎక్కుతాడా ?
అ) నా పుస్తకాల నేం చేస్తున్నావు ? పేజీలు పోగొడతావ్ జాగ్రత్త !
ఆ) ‘మీరు మీ ఆడవాళ్ళకు చదువు చెప్పించక పోవడం అన్యాయం’ అని ఆ తెల్లమనిషి సేజీతో అంది.
ఇ) జ్యోతి ! – సావిత్రి కెందుకు చదువు నేర్పుతున్నావు?

ప్రశ్న 3.
అ) నువ్వు చెప్తారు. అంతే ఎట్లా చెప్పాలో నేను నేర్పిస్తా.
ఆ) ఒక రోజు సాయంత్రం సేణీ ముఖం వేలాడేసుకొని వచ్చాడు.
ఇ) స్కూలు నడిపే పంతులుగారు బడిమానివేశారు. ఇప్పుడేం చెయ్యాలి?
ఈ) “నేను చదువు చెప్పటమా ? నా వల్లకాదు” నేను చెప్పేది వినకుండా సే జ్, భవాల్కర్ తో మాట్లాడడానికి వెళ్ళాడు.
జవాబు:
ఆ) ఒక రోజు సాయంత్రం సే జీ ముఖం వేలాడేసుకొని వచ్చాడు.
ఇ) స్కూలు నడిపే పంతులుగారు బడిమానివేశారు. ఇప్పుడేం చెయ్యాలి?
ఈ) “నేను చదువు చెప్పటమా? నా వల్లకాదు” నేను చెప్పేది వినకుండా సేజ్, భవాల్కర్ తో మాట్లాడడానికి వెళ్ళాడు.
అ) నువ్వు చెప్తావు. అంతే ఎట్లా చెప్పాలో నేను నేర్పిస్తా.

ప్రశ్న 4.
అ) “ఇప్పుడే వెళ్ళి మమ్మల్ని పంపినవాళ్ళని చంపి వస్తాం”.
ఆ) అన్నలారా – ఆపండి. దయచేసి వెళ్ళిపొండి. భయంతో వారిని ప్రార్థించాను.
ఇ) ‘కొందరు పెద్దలు నిన్ను చంపే కాంట్రాక్టు మాకిచ్చారు’.
ఈ) ‘అయితే మీరిక్కడికి యెందుకొచ్చారు ?” అని సేర్ జీ వారిని అడిగాడు.
జవాబు:
ఆ) అన్నలారా – ఆపండి. దయచేసి వెళ్ళిపొండి. భయంతో వారిని ప్రార్థించాను.
ఈ) ‘అయితే మీరిక్కడికి యెందుకొచ్చారు ?’ అని సేజ్ వారిని అడిగాడు.
ఇ) ‘కొందరు పెద్దలు నిన్ను చంపే కాంట్రాక్టు మాకిచ్చారు’.
అ) “ఇప్పుడే వెళ్ళి మమ్మల్ని పంపినవాళ్ళని చంపి వస్తాం”.

ప్రశ్న 5.
అ) నిప్పుల కుండను పట్టుకొని ‘సత్యమేవ జయతే’ అనుకుంటూ, ఆయన అంతిమయాత్రను నేనే నడిపించాను.
ఆ) సేర్జీ తన చుట్టూ జనాన్ని ఏడవొద్దని సైగచేసి, మమ్మల్ని అఖండ్ పాడమని సైగ చేశాడు.
ఇ) ‘మరీ అలసిపోవద్దు’ అని నేనంటే, సావిత్రీ ! చేయాల్సిందెంతో ఉంది. నేను వూరికే ఎట్లా కూర్చోను? అని సమాధానం వచ్చేది.
ఈ) ఆయన్ని చూడటానికి జనప్రవాహం ఎడతెగకుండా వచ్చేది.
జవాబు:
ఇ) ‘మరీ అలసిపోవద్దు’ అని నేనంటే, సావిత్రీ ! చేయాల్సిందెంతో ఉంది. నేను వూరికే ఎట్లా కూర్చోను? అని సమాధానం వచ్చేది.
ఈ) ఆయన్ని చూడటానికి జనప్రవాహం ఎడతెగకుండా వచ్చేది.
ఆ) సేజ్ తన చుట్టూ జనాన్ని ఏడవొద్దని సైగచేసి, మమ్మల్ని అఖండ్ పాడమని సైగ చేశాడు.
అ) నిప్పుల కుండను పట్టుకొని ‘సత్యమేవ జయతే’ అనుకుంటూ, ఆయన అంతిమయాత్రను నేనే నడిపించాను.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 నేనూ... సావితీబాయిని

ప్రశ్న 6.
అ) సావిత్రీబాయికి వాళ్ళ నాన్న పెళ్ళి ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
ఆ) రేపట్నుంచి నువ్వు బడికొచ్చి పిల్లలకు చదువు చెప్పాలి అని అన్నాడు సేర్ జీ.
ఇ) సేత్ జీని చంపడానికి వచ్చిన ఆ ఇద్దరు మనుషులు గొడ్డళ్ళు కింద పారేశారు.
ఈ) సావిత్రీబాయి ఎక్కిన సీమచింత చెట్టు కొమ్మ విరిగింది.
జవాబు:
ఈ) సావిత్రీబాయి ఎక్కిన సీమచింత చెట్టు కొమ్మ విరిగింది.
అ) సావిత్రీబాయికి వాళ్ళ నాన్న పెళ్ళి ప్రయత్నాలు మొదలు పెట్టాడు.
ఆ) రేపట్నుంచి నువ్వు బడికొచ్చి పిల్లలకు చదువు చెప్పాలి అని అన్నాడు సేర్ జీ.
ఇ) సేర్ జీని చంపడానికి వచ్చిన ఆ ఇద్దరు మనుషులు గొడ్డళ్ళు కింద పారేశారు.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘సావిత్రీబాయి’ పాత్ర స్వభావం రాయండి.
జవాబు:
ఆధునిక భారతదేశంలో తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే. అంటరాని వాడల్లోని బాలికలకు చదువు చెప్పడమే కాక భర్త జ్యోతిబా ఫూలేతో కలిసి సామాజిక చైతన్యోద్యమానికి ఊపిరి పోసింది. అంటరాని పిల్లలకు చదువు చెప్పడానికి వెళుతున్నప్పుడు జనాల శాపనార్థాలకు, భర్తను చంపడానికి కిరాయి మనుష్యులు వచ్చిన సందర్భంలోను భయపడని ధీరురాలు సావిత్రీబాయి. ప్రాణాంతకమైన అంటువ్యాధి ‘ప్లేగు’తో బాధపడుతున్న పసిగుడ్డును రక్షించడానికి ప్రయత్నించిన కరుణామూర్తి సావిత్రీబాయి.

ప్రశ్న 2.
సావిత్రీబాయి వంటి స్త్రీలు సమాజానికి ఎంతవరకు అవసరం?
జవాబు:
ప్రతి వ్యక్తికి పుట్టింది మొదలు చచ్చేవరకు తోడు ఉండేది, బాధపడేది స్త్రీ మూర్తె. తల్లిగా, అక్కగా, చెల్లిగా, భార్యగా, కుమార్తెగా ఇలా అనేక రూపాలుగా ప్రతివ్యక్తి జీవితంలో తోడు ఉంటుంది. అటువంటి స్త్రీ ఎదుగుదలను కోరుకోవటం కృతజ్ఞత. ఎదగనీయకపోవటం కృతఘ్నత. నేటి సమాజంలో అక్షరాస్యత ఉంది. అంటరానితనం కూడా కొంత తొలగింది. అది సంపూర్ణత్వం సాధించడానికి సావిత్రీబాయి వంటి స్త్రీ మూర్తుల అవసరం ఎంతో ఉంది. నేటికాలంలో ప్రధానంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కూడా మహిళల సాధికారత ఎంతో అవసరం.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 నేనూ... సావితీబాయిని

ప్రశ్న 3.
సావిత్రీబాయి చదువు, నేర్చుకునే విషయంలో మామగారి నుండి వచ్చిన విమర్శ ఏమిటి?
జవాబు:
జ్యోతిబాఫూలే ఫరార్ అనే ఆమె మాట ప్రకారం తన భార్య సావిత్రీబాయికి చదువు నేర్పుతున్నాడు. సావిత్రీబాయి మెల్లగా అచ్చులు, హల్లులు, మాటలు, వాక్యాలు నేర్చుకోసాగింది. ఆ సమయంలో జ్యోతిబాఫూలేను ఆయన తండ్రి, “సావిత్రి కెందుకు చదువు నేర్పుతున్నావు? అసలు మన కులం వాళ్ళమే చదువుకోకూడదు. అయినా నిన్ను చదివించాను. ఇప్పుడు నీవు నీ భార్యకు చదువు చెబుతున్నావు. ఆడదానికి చదువు పనికిరాదు. చదువుకున్న ఆడది చెడిపోతుంది. బుద్ధి లేనిదవుతుంది” అని అన్నారు. “నాన్నా ! సావిత్రి చదువుకుని ఆ మాటలు అబద్దాలని నిరూపిస్తుంది” అన్న జ్యోతిబాఫూలే మాటలకు ఏమీ చెప్పలేక అక్కడ నుండి ఆయన వెళ్ళిపోయారు.

ప్రశ్న 4.
సావిత్రీబాయి చేత మా ‘సేజ్ అని పిలిపించుకొన్న ‘సేజ్ వ్యక్తిత్వం వివరించండి.
జవాబు:
సావిత్రీబాయి భర్త పేరు మహాత్మ జ్యోతిరావ్ పూలే. సావిత్రి ఈయన్ని సేజ్ అని పిలిచేది. సావిత్రీబాయి దృష్టిలో భర్త అంటే “ఎప్పుడు బడి, పుస్తకాలు, చదువు ఇదే ప్రపంచం ఆయనకు” అంటుంది. సేజ్ కులాల గొడవలు విద్య వల్లే పోతాయనీ, విద్యే మన ధ్యేయం కావాలని చెప్పేవాడు.

సేర్ జీ విద్య అనే తపన వహించిన మహావృక్షం వంటివాడు. ఆడమనిషి చదువుకుంటేనే కుటుంబం బాగుపడుతుందని భార్యకు చదువు చెప్పించాడు. తక్కువ కులాల ఆడపిల్లల కోసం సొంతధనంతో బడి పెట్టాడు. మానవులంతా సమానులనీ, బీదలకు సాయం చేయడమే తన జీవితాశయమనీ చెప్పాడు. శిశుహత్యలకు వ్యతిరేకంగా మొదటి ఆశ్రమం స్థాపించాడు. ‘కులం కన్నా గుణం మిన్న’ అనే సిద్ధాంతంతో ‘సత్యశోధక సమాజాన్ని’ స్థాపించాడు. ఈయన స్త్రీ విద్యకూ, కుల రహిత సమాజానికి కృషి చేసిన మహనీయుడు.

ఆ) క్రింది ప్రశ్నలకు పదిలేక పన్నెండు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
సావిత్రీబాయి పాత్ర స్వభావం రాయండి.
జవాబు:
సావిత్రీబాయి గొప్ప సంఘసేవకురాలు. ఈమె మహారాష్ట్రలో సతారా జిల్లాలో ఖండాలా తాలూకాలో నైగావ్ గ్రామంలో పాటిల్ గారింట్లో పెద్దకూతురిగా పుట్టింది. వెర్రిగా చేలల్లో పడి, పరిగెత్తేది. ముళ్ళూ గిళ్ళూ లెక్కచేసేది కాదు. చింతకాయలు కొట్టుకు తినడం, రేగుపళ్ళు కోసుకు తినడంలో సావిత్రీబాయిని మించినవారు లేరు. ఈమెకు చిన్నప్పుడే జ్యోతీరావ్ తో పెండ్లి అయ్యింది. అక్కడ భర్తనూ, అత్తమామల్నీ సేవిస్తూ వంట వండి పెట్టేది.

సావిత్రీబాయికి, ఆమె భర్త జ్యోతీరావు ఎన్నో విషయాలు చదివి చెప్పేవాడు. సావిత్రీబాయికి భర్త చదువు చెప్పాడు. భర్త నడిపే స్కూలులో పంతులుగారు మానివేస్తే, సావిత్రీబాయి అక్కడ పంతులమ్మగా పనిచేసింది. సావిత్రీబాయి పంతులమ్మ కావడం ఇష్టం లేని ప్రజలు సావిత్రీబాయిని తిట్టేవారు. శాపనార్ధాలు పెట్టారు. అయిన సావిత్రీబాయి బడి కిటికీ తలుపులు మూసి, పిల్లలకు పాఠాలు చెప్పింది. సావిత్రీబాయి భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది. భర్తతో పాటు సత్యశోధక సమాజాన్ని స్థాపించింది. సావిత్రీబాయి ఆదర్శ స్త్రీ. భర్త పోయాక, ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవచేసింది. చివరకు ఆ ప్లేగు వ్యాధి సోకడంతో సావిత్రీబాయి కన్ను మూసింది.

ప్రశ్న 2.
బీదవాళ్ళకు సహాయం చెయ్యటమే నా జీవితాశయం – వాళ్ళచేతుల్లో చావటంలో తప్పేముంది? ‘చంపండి – రండి చంపండి’ అన్న పేజీ మాటలను బట్టి మీరు ఏమి గ్రహించారు?
జవాబు:
పేజీ తన జీవితాన్ని బీదవారికి సాయం చేయడానికే అంకితం చేశాడు. సే జీ తక్కువ కులాల ఆడపిల్లలకు బడులు పెట్టి చదువు చెప్పించాడు. భార్యకు తానే చదువు చెప్పి, ఆ బడిలో ఆమెను పంతులమ్మను చేశాడు.

అలాచేస్తే సంఘం పాడవుతుందని, కొందరు పెద్దలు సేజీని చంపమని ఇద్దరు హంతకులకు కాంట్రాక్టు ఇచ్చారు. ఆ వచ్చినవాళ్ళు తాము సేజీని చంపడానికి గల కారణాన్ని చెప్పారు.

బీదవాళ్ళ చేతుల్లో చావడం తనకు ఇష్టమే అని సేజ్ మెడవంచి నిలబడ్డాడు. దానితో ఆ హంతకులు మనసు మార్చుకొని, తమకు కాంట్రాక్టు ఇచ్చిన వారినే చంపడానికి సిద్ధపడ్డారు. దీనిని బట్టి సేజ్ త్యాగమూర్తి అని, భయం లేనివాడని, హంతకుల మనస్సును కూడా మార్చగల ఉత్తమ శీలం కలవాడని నేను అర్థం చేసుకున్నాను.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 నేనూ... సావితీబాయిని

ప్రశ్న 3.
‘అల్లరి చేయుట పిల్లల వంతు’ అన్నాడు ఒక కవి. సావిత్రీబాయి బాల్యం కూడా అల్లరి పనులతోనే గడిచింది. దానికి సంబంధించి ఒక సంఘటనను వివరించండి.
జవాబు:
అల్లరి చేయుట పిల్లలవంతు అన్న కవి మాటలు సావిత్రీబాయి బాల్యానికి సరితూగుతాయి. సావిత్రీబాయి మహారాష్ట్రలోని నైగావ్ లో పుట్టింది. చిన్నప్పటి నుండి అల్లరి పిల్లే. ఒకసారి సీమ చింతకాయలు చెట్టెక్కి కోస్తుంటే కొమ్మ విరిగి వ్రేలాడుతూ ఉంది. అప్పుడు ‘అమ్మా నా సీమచింతకాయలు, నేను పడిపోతున్నా, కొమ్మ విరిగింది, నేను పడిపోతున్నా’ అంటూ అరిచింది. వాళ్ళ నాన్న వచ్చి కిందికి దింపాడు. అమ్మ అరుస్తోంది. కాలో చెయ్యో విరిగితే ఎవరు చేసుకుంటారని. అమ్మతో ‘నేను ఆడపిల్లను కాదమ్మా’ అంటూ తల్లికి సీమచింతకాయ ఇచ్చి అక్కణ్ణుంచి పరుగుతీసింది.

ప్రశ్న 4.
‘ఇదిగో ఈ సీమ చింతకాయ చూడు ఎంత తియ్యగా ఉందో’ అని నోట్లో కుక్కుకుంటూ అమ్మకు ఒకటిచ్చి మళ్ళీ పరుగుతీసిన బాల సావిత్రీబాయి బాల్యం వివరించండి.
జవాబు:
పైగావ్ గ్రామంలో పాటిల్ గారి పెద్ద కూతురుగా పుట్టిన సావిత్రిబాయి బాల్యంలో చేలలోపడి పరిగెత్తుతూ, గులకరాళ్ళను, దుమ్మునూ తన్నుకుంటూ, కాళ్ళలో ముళ్ళు గుచ్చుకున్నా లెక్కచేయక, విరబోసుకున్న జుట్టుతో వెర్రిగా పరుగులు తీసేది. చింతకాయలు కొట్టుకు తినడం, రేగిపళ్ళు కోసుకుతినడం దినచర్య సావిత్రికి. ఒక రోజు సీమచింతకాయలు కోస్తూ కొమ్మ విరిగి కిందకు వేలాడుతూ దించమని అమ్మను పిలిస్తే ఆమె చివాట్లు పెట్టింది. తండ్రి వచ్చి కిందికి దించుతాడు. ఈ పిల్లకు తొందరగా పెళ్ళి చేయాలి. కాలో చెయ్యో విరిగితే ఎవరు చేసుకుంటారన్న తల్లి మాటలకు ‘నేను ఆడపిల్లను కాదమ్మా’ ఇదిగో ఈ సీమ చింతకాయ చూడు ఎంత తియ్యగా ఉందో అని నోట్లో కుక్కుకుంటూ అమ్మకు ఒకటిచ్చి మళ్ళీ పరుగుతీసింది గడుగ్గాయి సావిత్రి.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 స్వామి వివేకానంద

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions ఉపవాచకం Chapter 1 స్వామి వివేకానంద Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions ఉపవాచకం 1st Lesson స్వామి వివేకానంద

9th Class Telugu ఉపవాచకం 1st Lesson స్వామి వివేకానంద Textbook Questions and Answers

కింది ప్రశ్నలకు పదిహేను వాక్యాలకు మించని సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
నరేంద్రుని బాల్యం, విద్యాభ్యాసం గురించి రాయండి.
జవాబు:
నరేంద్రుడు ఆరవ ఏట విద్యాభ్యాసం మొదలుపెట్టాడు. మొదట్లో ఇంట్లోనే తల్లిదండ్రులు నియమించిన గురువు వద్ద చదువుకున్నాడు. గురువు ఒకసారి చెప్పగానే నేర్చుకొని, అప్పచెప్పగలిగేవాడు.

ఏడవ ఏట ఈశ్వరచంద్ర విద్యాసాగర్ స్థాపించిన మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూషన్లో చేరాడు. నరేన్ తెలివితో, చురుకుతో తోటి బాలురందరికీ నాయకుడయ్యాడు. నరేన్ కు ఆటలంటే ప్రాణం.

నరేనకు ఇష్టమైన ఆట “రాజు – దర్బారు”. ఇంటిలోనే సొంతంగా ఒక వ్యాయామశాల ఏర్పాటుచేశాడు. తర్వాత వ్యాయామశాలలో చేరి కర్రసాము, కత్తిసాము, గుర్రపుస్వారీ నేర్చాడు.

నరేను క్రమంగా పుస్తకాలు చదవడంపై ఆసక్తి పెరిగింది. తండ్రిగారు బదిలీ కావడంతో, రాయపూర్ వెళ్ళి తిరిగి కలకత్తా వచ్చి మూడేళ్ళ చదువు ఒక్క సంవత్సరంలోనే పూర్తి చేశాడు. ఆ పరీక్ష మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ పాఠశాలలో ఆ శ్రేణిలో పాసైన ఏకైక విద్యార్థి నరేన్ ఒక్కడే.

తరువాత ప్రెసిడెన్సీ కాలేజీలోను, మరుసటి సంవత్సరం ఇప్పుడు స్కాటిష్ చర్చ్ అని పిలువబడే కళాశాలలోనూ చేరాడు. ప్రిన్సిపాలూ, గురువులూ నరేన్ ప్రతిభాపాటవాలకు ఆశ్చర్యపోయేవారు. నరేంద్రుడు ఎన్నో గ్రంథాలు చదివాడు. 1884లో బి.ఏ. పాసయ్యాడు.

ప్రశ్న 2.
వివేకానందుని అమెరికా పర్యటన విశేషాలు తెల్పండి.
(లేదా)
నరేంద్రుని అమెరికా పర్యటన విశేషాలను సొంతమాటల్లో రాయండి.
జవాబు:
స్వామీజీయైన నరేంద్రుడు అమెరికాలో జరుగబోయే సకల మతముల మహాసభకు వెళ్ళి, భారతదేశ ధర్మాన్ని ప్రపంచానికి తెలియపరుద్దామనుకున్నాడు. మద్రాసులో యువకులు అందుకు సహాయం చేశారు. ఖేత్రీ మహారాజు నరేంద్రునికి కెనడా వెళ్ళే ఓ ఓడలో టిక్కెట్టుకొని ఇచ్చాడు. నరేంద్రుడుని “వివేకానంద” అనే నామాన్ని స్వీకరింపమన్నాడు.

వివేకానందుడు 1893 మే 31న అమెరికాకు బయలుదేరాడు. ఓడ కెనడా దేశంలోని ‘వాంకోవర్’లో ఆగింది. అక్కడ నుండి రైలులో “షికాగో” నగరానికి వివేకానంద వెళ్ళాడు. రైల్లో ‘సాన్ బోర్న్’ అనే మహిళతో పరిచయం అయ్యింది. ఆమె వివేకానందుడు ‘బోస్టన్’ నగరానికి వచ్చినపుడు తన ఇంటికి రమ్మంది.

షికాగో ధనవంతుల నగరం. విశ్వమత మహాసభలకు ఇంకా రెండు నెలల వ్యవధి ఉంది. అదీగాక, ఆ సభలో మాట్లాడేందుకు వివేకానందుని వద్ద ధ్రువపత్రాలు లేవు. దానితో వివేకానందుడు ‘బోస్టన్’లో సాన్ బోర్న్ ఇంటికి వెళ్ళాడు. అక్కడ హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జే. హెచ్.రైట్ తో పరిచయమైంది. రైట్, వివేకానందుని విశ్వమత మహాసభలో హైందవ ధర్మం గురించి మాట్లాడమన్నాడు. తనవద్ద ధ్రువపత్రాలు లేవని వివేకానందుడు చెప్పాడు.

ఆ ప్రొఫెసర్ విశ్వమత మహాసభల అధ్యక్షుడికి వివేకానందుని గూర్చి అమెరికాలోని పండితులందరి కంటే వివేకానందుడు గొప్పవాడని రాశాడు. వివేకానందుడిని ఆ ప్రొఫెసర్ చికాగోకు పంపాడు. కానీ రైట్ ఇచ్చిన కాగితం కనబడలేదు. వివేకానందుడు చికాగోలో భిక్షాటన చేశాడు. చెట్టు కింద పడుకున్నాడు. జార్జ్. డబ్ల్యూ. హేల్ అనే ఆమె వివేకానందుడిని చూసి, విశ్వమత మహాసభలకు వచ్చిన భారతీయ సన్యాసి అని గౌరవించింది. ఆమె సాయంవల్లనే వివేకానందుడు విశ్వమత మహాసభలో మాట్లాడాడు.

సభలో వివేకానందుడు “నా అమెరికా దేశ సోదర సోదరీమణులారా ! అంటూ తన ఉపన్యాసం ప్రారంభించాడు. ఆ కమ్మని పిలుపుకు సభ్యులు ఆనందించి మూడు నిమిషాలపాటు లేచి చప్పట్లు కొట్టారు. వివేకానంద ఆ సభలో అన్ని ధర్మాల తరపునా మాట్లాడి, సర్వమత సామరస్యాన్ని చూపాడు. వివేకానందుని ఖ్యాతి దేశదేశాలకూ పాకింది.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 స్వామి వివేకానంద

ప్రశ్న 3.
వివేకానందుడు జాతికిచ్చిన సందేశమేమి?
జవాబు:
వివేకానందుని సందేశము :
“మన భారతదేశం పుణ్యభూమి. సంపద, అధికారం మన భారత జాతికి ఎప్పుడూ ఆదర్శాలు కాలేదు. భారతీయుడు ఎవరైనా సరే, జాతిమత తారతమ్యం లేకుండా, పేద, గొప్ప వివాదం లేకుండా, కుల వివక్షతను దగ్గరకు రానీయకుండా, అందరూ నా సహోదరులే అని చాటాలి. భారతదేశానికి అంతటికీ ఏది హితమో, అదే తనకు కూడా హితము అని ప్రకటించాలి.

భారతదేశానికి మంచి జరగాలంటే, స్త్రీ జనోద్దరణ, జన చైతన్యం ప్రధానంగా సంభవించాలి. పేద జనానికి ఆహారం ఇవ్వాలి. విద్యావ్యాప్తి సక్రమంగా జరగాలి. సర్వజనులకూ తగినంత ఆహారం, జీవనోపాధి అవకాశాలు కల్పించాలి.

వ్యావహారిక భాషలోనే కళాత్మకంగా, సహజంగా శాస్త్ర పాండిత్యం సాధించాలి. పరిశోధనలను కూడా వాడుక భాషలోనే నిర్వహించాలి. విద్య సమస్త సమస్యలను పరిష్కరించే మార్గం కావాలి.
వివేకానంద యువకులకు ఇలా సందేశం ఇచ్చారు – “మీకు ప్రేమ, నిజాయితీ, సహనం కావాలి. నిరుపేదలను, అమాయక ప్రజలను, అణగదొక్కబడిన వారిని ప్రేమించండి. వారి కొరకు పరితపించండి. పిరికితనాన్ని విడచి, ధైర్యంగా సమస్యలను ఎదుర్కోండి. దీనజనులను ఉద్ధరించండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. ఓర్పుతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు వస్తాయని మరువకండి. లేవండి ! మేల్కొనండి ! శ్రేష్ఠులైన ఆచార్యుల బోధనలు అనుసరించండి !”

ప్రశ్న 4.
వివేకానందుని సందేశాలు ఆధారంగా ఏకపాత్రాభినయం చేయండి.
జవాబు:
ఏకపాత్రాభినయం “వివేకానంద” :

నా భారతీయ సహోదరులారా !
మన భారతదేశం ఒక్కటే అసలైన పుణ్యభూమి, మన భారతజాతి శతాబ్దాలుగా శక్తిమంతమైన జాతి. ఐనా అది ఇతర రాజ్యా లపై దండయాత్ర చేయలేదు. మన భారతీయుడు ఎవరైనా సరే, జాతిమత భేదం, పేద – గొప్ప తేడా, కుల భేదం లేకుండా అందరూ నా సోదరులే అని చాటాలి. భారతీయ సమాజం నా బాల్యడోలిక, నా యౌవన ఉద్యానం, నా వార్ధక్యంలో వారణాసి. భారతీయ సమాజం నాకు స్వర్గతుల్యం.

మన భారతదేశానికి మంచి జరగాలంటే, స్త్రీ జనోద్దరణ, జనచైతన్యం ప్రధానంగా సంభవించాలి. నాకు ఈ లోకంలో సరిపడ తిండిని ప్రసాదించలేక, స్వర్గంలో ఆనందాన్నిచ్చే భగవంతుని నేను విశ్వసించలేను. ముందు కడుపునిండా తిండి. తర్వాతనే మతం.

మనం వ్యావహారిక భాషలోనే శాస్త్ర పాండిత్యం సాధించాలి. మన పరిశోధనలు వ్యావహారిక భాషలోనే నిర్వహించాలి.

సాహసం గల యువకులారా ! మీకు ప్రేమ, నిజాయితీ, సహనం కావాలి. నిరుపేదలను, అమాయకులను, అణగదొక్కబడిన వారిని ప్రేమించండి. దీనుల కోసం శ్రమించండి.

“ఉత్తిష్ఠత ! జాగ్రత ! ప్రాప్య వరాన్ నిబోధత !” లేవండి ! మేల్కొనండి ! శ్రేష్ఠులైన ఆచార్యుల బోధనలను అనుసరించండి!

ప్రశ్న 5.
‘శివా శివా’ అంటూ నెత్తిమీద చల్లనీళ్లు పోస్తే మాత్రం అల్లరంతా క్షణంలో తగ్గిపోయే నరేంద్రుడి బాల్యం గురించి రాయండి.
జవాబు:
విశ్వవిఖ్యాతి నొంది సింహసదృశమైన మనోబలానికి ప్రతిరూపమై భారతదేశ యువజనులందరికీ ఆదర్శమై నిలిచిన శ్రీ వివేకానంద చిన్నప్పుడు బాగా అల్లరివాడు. ఈ గడుగ్గాయిని పట్టుకోవడం తల్లియైన భువనేశ్వరిదేవికి గగనమైపోయేది. అల్లరి బాగా మితిమీరిపోయినపుడు ‘శివశివా’ అంటూ నెత్తిమీద చల్లని నీళ్ళు పోస్తే మాత్రం అల్లరంతా క్షణంలో తగ్గిపోయి శాంతపడిపోయేవాడు. బాలనరేంద్రుడు తన తల్లి వద్ద ఎన్నో విషయాలు (రామాయణ, భారత, భాగవతాలు) నేర్చుకున్నాడు. ముఖ్యంగా శ్రీరాముడి కథంటే నరేంద్రుడికి పంచప్రాణాలు. మట్టితో చేసిన సీతారాముల విగ్రహాన్ని తెచ్చి రకరకాల పూలతో పూజించేవాడు. రామ నామ జపం చేసే ఆంజనేయుడు అరటితోటల్లో ఉంటాడని ఎవరో చెప్పగా, ఆ మహావీరుణ్ణి చూడడానికై అక్కడి తోటల్లో వెతికేవాడు.

9th Class Telugu ఉపవాచకం 1st Lesson స్వామి వివేకానంద Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

అ) ఈ క్రింది వాక్యాలను సంఘటనలు ఆధారంగా వాక్యాలను వరుసక్రమంలో అమర్చి రాయండి. 4 మార్కులు

ప్రశ్న 1.
అ) నరేంద్రుడు బి.ఎ. పట్టా పొందాడు.
ఆ) ఏడేళ్ళ వయస్సులో నరేనను మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూషన్లో చేర్పించారు.
ఇ) 1897 మే నుండి 1898 జనవరి వరకు వివేకానందస్వామి ఉత్తర భారతదేశంలోని ఎన్నో నగరాలకు వెళ్ళారు.
ఈ) వివేకానందస్వామి చికాగోలో ప్రసంగించాడు.
జవాబు:
ఆ) ఏడేళ్ళ వయస్సులో నరేనను మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూషన్లో చేర్పించారు.
అ) నరేంద్రుడు బి.ఎ. పట్టా పొందాడు.
ఈ) వివేకానందస్వామి చికాగోలో ప్రసంగించాడు.
ఇ) 1897 మే నుండి 1898 జనవరి వరకు వివేకానందస్వామి ఉత్తర భారతదేశంలోని ఎన్నో నగరాలకు వెళ్ళారు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 స్వామి వివేకానంద

ప్రశ్న 2.
అ) ఆరేళ్ళ వయస్సులో నరేంద్రుడు తన విద్యాభ్యాసం మొదలుపెట్టాడు.
ఆ) స్వామీజీ 1888లో కాశీకి ప్రయాణమయ్యారు.
ఇ) స్వామీజీ ఇక శాశ్వతంగా ఆ శరీరాన్ని వదిలేశారు.
ఈ) అయ్యా ! తమరు భగవంతుణ్ని చూశారా ! అని నరేంద్రుడు శ్రీరామకృష్ణులను అడిగారు.
జవాబు:
అ) ఆరేళ్ళ వయస్సులో నరేంద్రుడు తన విద్యాభ్యాసం మొదలు పెట్టాడు.
ఈ) అయ్యా ! తమరు భగవంతుణ్ని చూశారా ! అని నరేంద్రుడు శ్రీరామకృష్ణులను అడిగారు.
ఆ) స్వామీజీ 1888లో కాశీకి ప్రయాణమయ్యారు.
ఇ) స్వామీజీ ఇక శాశ్వతంగా ఆ శరీరాన్ని వదిలేశారు.

ప్రశ్న 3.
అ) ఆవిడ అతడికి ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకున్నది.
ఆ) బండిని గుర్రం తన బలమంతా ఉపయోగించి వెఢవేగంతో లాక్కెళ్ళుతోంది.
ఇ) బాలుడు బండిలోకి ఎక్కి పరుగెడుతున్న ఆ గుఱ్ఱపు కళ్ళెం చేజిక్కించుకొని, గుజ్రాన్ని శాంతపరచి ఆగిపోయేటట్లు చేశాడు.
ఈ) బండిలో పాపం ఒక మహిళ కూడా ఉంది. బండిని గట్టిగా పట్టుకుని ఆమె పడిపోకుండా ఉండడానికి ప్రయత్నిస్తోంది.
జవాబు:
ఆ) బండిని గుర్రం తన బలమంతా ఉపయోగించి వెట్టి వేగంతో లాక్కెళ్ళుతోంది.
ఈ) బండిలో పాపం ఒక మహిళ కూడా ఉంది. బండిని గట్టిగా పట్టుకొని ఆమె పడిపోకుండా ఉండడానికి ప్రయత్నిస్తోంది.
ఇ) బాలుడు బండిలోకి ఎక్కి పరుగెడుతున్న ఆ గుఱ్ఱపు కళ్ళెం చేజిక్కించుకొని, గుజ్రాన్ని శాంతపఱచి ఆగిపోయేటట్లు చేశాడు.
అ) ఆవిడ అతడికి ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకున్నది.

ప్రశ్న 4.
అ) ఎవరైనా సరే భగవంతుడి కోసం తీవ్ర వ్యాకులతతో విలపిస్తే ఆయన వారికి తప్పక దర్శనమిస్తాడు. ఇది నిజం. నా అనుభవం.
ఆ) ‘అయ్యా ! తమరు భగవంతుణ్ణి చూశారా?’ అని నరేన్ రామకృష్ణుడిని అడిగాడు.
ఇ) ‘ధన సంపాదన కోసం కడవల కొద్దీ కన్నీరు కారుస్తారు. భగవంతుడి కోసం ఎవరు విలపిస్తారు?’ రామకృష్ణుడు అన్నాడు.
ఈ) “ఓ చూశాను. కావాలంటే నీకు కూడా చూపించగలను’. రామకృష్ణుడు చెప్పాడు.
జవాబు:
ఆ) ‘అయ్యా ! తమరు భగవంతుణ్ణి చూశారా?’ అని నరేన్ రామకృష్ణుడిని అడిగాడు.
ఈ) ‘ఓ చూశాను. కావాలంటే నీకు కూడా చూపించగలను’. రామకృష్ణుడు చెప్పాడు.
ఇ) ‘ధన సంపాదన కోసం కడవల కొద్దీ కన్నీరు కారుస్తారు. భగవంతుడి కోసం ఎవరు విలపిస్తారు?’ రామకృష్ణుడు అన్నాడు.
అ) ఎవరైనా సరే భగవంతుడి కోసం తీవ్ర వ్యాకులతతో విలపిస్తే ఆయన వారికి తప్పక దర్శనమిస్తాడు. ఇది నిజం. నా అనుభవం.

ప్రశ్న 5.
అ) స్వామీజీ రెండు మూడడుగులు వేసి భయపెట్టగానే అవి పరుగులంకించుకున్నాయి.
ఆ) దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళి వస్తూ ఉంటే, ఒక కోతుల గుంపు కనిపించింది. అవి ఆయన వైపు తిరిగి పరుగెత్తసాగాయి.
ఇ) ఒక సన్యాసి గమనించి “ఆగు ! వెనుదిరిగి ఆ జంతువుల నెదుర్కో అని గట్టిగా అరిచాడు”.
ఈ) అవి కరుస్తాయనే తలంపుతో స్వామీజీ వెనుదిరిగి చిన్నగా పరుగెత్తనారంభించాడు.
జవాబు:
ఆ) దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళి వస్తూ ఉంటే, ఒక కోతుల గుంపు కనిపించింది. అవి ఆయన వైపు తిరిగి పరుగెత్తసాగాయి.
ఈ) అవి కరుస్తాయనే తలంపుతో స్వామీజీ వెనుదిరిగి చిన్నగా పరుగెత్తనారంభించాడు.
ఇ) ఒక సన్యాసి గమనించి “ఆగు ! వెనుదిరిగి ఆ జంతువుల నేదుర్కో అని గట్టిగా అరిచాడు”.
అ) స్వామీజీ రెండు మూడడుగులు వేసి భయపెట్టగానే అవి పరుగులంకించుకున్నాయి.

ప్రశ్న 6.
అ) జూలై నెల మధ్యలో స్వామీజీ షికాగో చేరుకున్నారు. అక్కడి భవంతులు, సాంకేతిక పరిజ్ఞానం చూసి, స్వామీజీ విస్తుపోయారు.
ఆ) ఖేత్రీ మహారాజు స్వామివారిని ఆహ్వానించి, కెనడా వెళ్ళే ఓడలో ప్రథమశ్రేణి టిక్కెట్టు కొని ఇచ్చారు.
ఇ) రైల్లో సాన్బోర్న్ “స్వామీజీ ! మీరెప్పుడైనా బోస్టన్ నగరానికి వస్తే దయచేసి మా ఇంటికి అతిథిగా వచ్చి మమ్మానందింప చేయండి” అని కోరింది.
ఈ) ఓడ కెనడా దేశంలోని వాంకోవర్ లో ఆగింది. స్వామీజీ అక్కడి నుండి షికాగోకి రైల్లో వెళ్ళారు.
జవాబు:
ఆ) ఖేత్రీ మహారాజు స్వామివారిని ఆహ్వానించి, కెనడా వెళ్ళే ఓడలో ప్రథమశ్రేణి టిక్కెట్టు కొని ఇచ్చారు.
ఈ) ఓడ కెనడా దేశంలోని వాంకోవర్ లో ఆగింది. స్వామీజీ అక్కడి నుండి షికాగోకి రైల్లో వెళ్ళారు.
ఇ) రైల్లో సాన్‌బోర్న్ “స్వామీజీ ! మీరెప్పుడైనా బోస్టన్ నగరానికి వస్తే దయచేసి మా ఇంటికి అతిథిగా వచ్చి మమ్మానందింప చేయండి” అని కోరింది.
అ) జూలై నెల మధ్యలో స్వామీజీ షికాగో చేరుకున్నారు. అక్కడి భవంతులు, సాంకేతిక పరిజ్ఞానం చూసి, స్వామీజీ విస్తుపోయారు.

ప్రశ్న 7.
అ) రాత్రికి రాత్రి స్వామీజీ ఖ్యాతి దేశమంతటా వ్యాపించింది. భారతీయ పత్రికలు కూడా ఈ వార్తను బాగా ప్రచురించాయి.
ఆ) సరస్వతీ దేవిని తలచుకొని, శ్రావ్యమైన కంఠంతో ” నా అమెరికా దేశ సోదర సోదరీమణులారా !” అని స్వామి మొదలు పెట్టారు.
ఇ) జన సముద్రమంతా లేచి నుంచొని పులకించిపోయి కరతాళ ధ్వనుల వర్షం కురిపించారు.
ఈ) నా మతమే గొప్పది. నా మతమే నిలవాలి అనుకొనేవారు బావిలో కప్ప వంటివారని స్వామీజీ తెలిపారు.
జవాబు:
ఆ) సరస్వతీ దేవిని తలచుకొని, శ్రావ్యమైన కంఠంతో “ నా అమెరికా దేశ సోదర సోదరీమణులారా !” అని స్వామి మొదలుపెట్టారు.
ఇ) జన సముద్రమంతా లేచి నుంచొని పులకించిపోయి కరతాళ ధ్వనుల వర్షం కురిపించారు.
ఈ) నా మతమే గొప్పది. నా మతమే నిలవాలి అనుకొనేవారు బావిలో కప్ప వంటివారని స్వామీజీ తెలిపారు.
అ) రాత్రికి రాత్రి స్వామీజీ ఖ్యాతి దేశమంతటా వ్యాపించింది. భారతీయ పత్రికలు కూడా ఈ వార్తను బాగా ప్రచురించాయి.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 స్వామి వివేకానంద

ప్రశ్న 8.
అ) స్వామీజీకి సపరివారంగా సాష్టాంగ నమస్కారం చేసి స్వయంగా తన రథంలో కూర్చుండపెట్టారు.
ఆ) తన పవిత్ర భారత భూమిపై కాలు పెట్టగలుగుతున్నానని స్వామీజీ మనస్సు పొంగిపోయింది.
ఇ) రామనాడుకి రాజైన భాస్కర సేతుపతి, స్వామీజీకి ఎదురుగా వెళ్ళి తన తలపై కాలుమోపి, దిగమని తలవంచి ప్రార్థించారు.
ఈ) స్వామీజీని స్వాగతించడానికి స్వాగత కమిటీలు ఏర్పడ్డాయి.
జవాబు:
ఆ) తన పవిత్ర భారత భూమిపై కాలు పెట్టగలుగుతున్నానని స్వామీజీ మనస్సు పొంగిపోయింది.
ఈ) స్వామీజీని స్వాగతించడానికి స్వాగత కమిటీలు ఏర్పడ్డాయి.
ఇ) రామనాడుకి రాజైన భాస్కర సేతుపతి, స్వామీజీకి ఎదురుగా వెళ్ళి తన తలపై కాలుమోపి, దిగమని తలవంచి ప్రార్థించారు.
అ) స్వామీజీకి సపరివారంగా సాష్టాంగ నమస్కారం చేసి స్వయంగా తన రథంలో కూర్చుండపెట్టారు.

ప్రశ్న 9.
ఈ కింది వాక్యాలను సంఘటనల ఆధారంగా వరుసక్రమంలో అమర్చి రాయండి.
అ) వివేకానంద స్వామి వారి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది.
ఆ) జూలై నెల మధ్యలో స్వామీజీ షికాగో చేరుకొన్నారు.
ఇ) ఆరేళ్ళ వయసులో నరేంద్రుడు తన విద్యాభ్యాసం మొదలుపెట్టాడు.
ఈ) శ్రీరామకృష్ణులను కలిస్తే తనకు సమాధానం దొరుకుతుందేమోననే ఆశతో నరేంద్రుడు ఇద్దరు ముగ్గురు స్నేహితులతో కలిసి ఆయన వద్దకు వెళ్లాడు.
జవాబు:
ఇ) ఆరేళ్ళ వయసులో నరేంద్రుడు తన విద్యాభ్యాసం మొదలు పెట్టాడు.
ఈ) శ్రీరామకృష్ణులను కలిస్తే తనకు సమాధానం దొరుకుతుందేమోననే ఆశతో నరేంద్రుడు ఇద్దరు ముగ్గురు స్నేహితులతో కలిసి ఆయన వద్దకు వెళ్లాడు.
ఆ) జూలై నెల మధ్యలో స్వామీజీ షికాగో చేరుకొన్నారు.
అ) వివేకానంద స్వామి వారి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది.

ప్రశ్న 10.
ఈ కింది వాక్యాలను సంఘటనల ఆధారంగా వరుసక్రమంలో అమర్చి రాయండి.
అ) తన పవిత్ర భారతభూమిపై కాలుమోపుతున్నానని స్వామీజీ పొంగిపోయాడు.
ఆ) తండ్రి మరణంతో నరేంద్రుని జీవితం తెగిన గాలిపటమైంది.
ఇ) ‘నా అమెరికా దేశ సోదర, సోదరీ మణులారా …..’ అని స్వామీజీ ఉపన్యాసం ప్రారంభించాడు.
ఈ) నరేన్ బాల్యంలో పరుగు పెడుతున్న గుర్రాన్ని అదుపు చేసి ఒక స్త్రీని రక్షించాడు.
జవాబు:
ఈ) నరేన్ బాల్యంలో పరుగు పెడుతున్న గుర్రాన్ని అదుపు చేసి ఒక స్త్రీని రక్షించాడు.
ఆ) తండ్రి మరణంతో నరేంద్రుని జీవితం తెగిన గాలిపటమైంది.
ఇ) ‘నా అమెరికా దేశ సోదర, సోదరీ మణులారా ……’ అని స్వామీజీ ఉపన్యాసం ప్రారంభించాడు.
అ) తన పవిత్ర భారతభూమిపై కాలుమోపుతున్నానని స్వామీజీ పొంగిపోయాడు.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
వివేకానందుడు ఎప్పుడు, ఎక్కడ జన్మించాడు? తల్లిదండ్రులెవరు?
జవాబు:
నరేన్ అని, నరేంద్రనాథ్ దత్తా అని పూర్వాశ్రమంలో పేర్కొనబడిన వివేకానంద స్వామి కలకత్తాలో 1863 జనవరి 12వ తేదీన భువనేశ్వరీ దేవి, విశ్వనాథ దత్తా దంపతులకు జన్మించారు. విశ్వనాథ దత్తా మంచి పేరున్న వకీలు. భువనేశ్వరీ దేవి రూపంలోను, ప్రవర్తనలోను ఒక రాణి వలె ఉండేది.

ప్రశ్న 2.
వివేకానందుడు తనకు తాను పెట్టుకొన్న నియమాలేవి?
జవాబు:
స్వామీజీ ఎన్నోసార్లు తనకోసం తాను కొన్ని నియమాలు పెట్టుకునేవారు. ఎవరైనా పిలిచి ఆపితే తప్ప ఆగకుండా యాత్ర సాగిస్తూనే ఉండాలని, ఎవరైనా పిలిచి భిక్ష ఇస్తే తప్ప ఆహారం తీసుకోకూడదని ఇలాంటి కఠిన నియామాలెన్నో పాటించేవారు.

ప్రశ్న 3.
వివేకానంద స్వామి కల ఏమిటి?
జవాబు:
అమెరికా, భారతదేశాల మధ్య ప్రాక్పశ్చిమ సంబంధాలు పెరిగి, భారతదేశం పశ్చిమ దేశాలకు ధర్మము, ఆధ్యాత్మికతను బోధించాలని, వాళ్ళు భారతీయులకు సైన్సు, సాంకేతికత సంస్థలుగా కలిసి ఒకటిగా పనిచేయడం వంటివి నేర్పించాలనేది ఆయన కల.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 స్వామి వివేకానంద

ప్రశ్న 4.
వివేకానందుని గురువైన శ్రీరామకృష్ణుల స్వభావాన్ని గురించి రాయండి. . .
జవాబు:
వివేకానందుని గురువైన శ్రీ రామకృష్ణులు మహాశక్తి సంపన్నులే కాదు, ఆయన జీవితం పవిత్రతకు ప్రతిరూపం. ఆయన ఏమి ఆలోచించేవారో అదే చెప్పేవారు, ఏం చెప్పేవారో అదే చేసేవారు. వీటన్నింటికీ మించి నరేంద్రుని అతని తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా ప్రేమించేవారు.

ప్రశ్న 5.
‘ఈ వ్యక్తి మేధస్సూ, పాండిత్యం మనదేశంలో గొప్ప గొప్ప పండితులందరి పాండిత్యాన్ని కలిపితే వచ్చే పాండిత్యం కన్న గొప్పది’ అని నరేంద్రుని గురించి ప్రొఫెసర్ జెహెచ్.రైట్ చెప్పిన విషయాన్ని బట్టి మీరేం గ్రహించారు?
జవాబు:
బోస్టన్లోని సాన్ బోర్న్ ఇంట్లో హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసరైన జె. హెచ్. రైట్ తో వివేకానందకు పరిచయమైంది. శాస్త్రీయమైన, తాత్త్వికమైన విషయాలెన్నో చర్చించుకున్నారు. వారిరువురు. షికాగో విశ్వమత మహాసభల అధ్యక్షుడికి వివేకానంద గూర్చి సిఫార్సు చేస్తూ “ఈ వ్యక్తి మేధస్సూ, పాండిత్యం మనదేశంలో గొప్ప గొప్ప పండితులందరి పాండిత్యాన్ని కలిపితే వచ్చే పాండిత్యం కన్న గొప్పది” అని రాశారు. ఈ మాటలను బట్టి వివేకానందుని పాండిత్య ప్రతిభ ప్రకటితం అవుతోంది. వివేకానంద శాస్త్రీయ, తాత్త్విక విషయ పరిజ్ఞానం గొప్పదని తెలుస్తోంది. ఇంకా ప్రొఫెసర్ రైట్ గొప్ప వ్యక్తిత్వం కూడా తెలుస్తోంది.

ఆ) క్రింది ప్రశ్నలకు పది లేక పన్నెండు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
వివేకానందుడు, రామకృష్ణుల మధ్య జరిగిన తొలి సంభాషణను రాయండి.
జవాబు:
నరేంద్రునికి ఆధ్యాత్మికత ఇష్టం. మతం బోధించే చాలా విషయాల్లో అతడికి ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో స్పష్టంగా తెలియడం లేదు. స్నేహితుల సలహాతో శ్రీరామకృష్ణ పరమహంసను కలిశారు. తన సంశయాన్ని ప్రశ్నరూపంలో “అయ్యా! తమరు భగవంతుణ్ణి చూశారా?” అని అడిగాడు. దానికి సమాధానంగా “ఓ చూశాను. నిన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నానో అంతకంటే స్పష్టంగా చూశాను. కావాలంటే నీకు కూడా చూపించగలను. కానీ, నాయనా ! భగవంతుడు కావాలని ఎవరు ఆరాటపడతారు ? భార్యాపిల్లలకోసం, ధన సంపాదన కోసం కడవల కొద్దీ కన్నీరు కారుస్తారు. భగవంతుడి కోసం ఎవరు విలపిస్తారు? ఎవరైనా సరే భగవంతుడి కోసం తీవ్ర వ్యాకులతతో విలపిస్తే ఆయన వారికి తప్పక దర్శనమిస్తాడు. ఇది నిజం. నా అనుభవం” – అని గుండె పై చేయి వేసుకొని శ్రీరామకృష్ణులు సమాధానమిచ్చారు. ఇలా వారి తొలి సంభాషణ జరిగింది.

ప్రశ్న 2.
షికాగో విశ్వమత మహాసభల్లో స్వామి వివేకానంద చేసిన తొలి ప్రసంగం గూర్చి రాయండి.
జవాబు:
1893 సెప్టెంబరు 11వ తేదీన విశ్వమత మహాసభలు మొదలైనాయి. కొలంబస్ హాల్ అనే పెద్ద భవనంలో అవి జరిగాయి. వివేకానంద స్వామి ఇతర వ్యక్తులతో పాటు వేదికపై ముందు వరుసలో కూర్చున్నారు. స్వామివారిని పిలిచేసరికి లేచారు. సరస్వతీ దేవిని తలచుకొని, శ్రావ్యమైన ఆయన కంఠంతోను, అంతకంటే మధురమూ, పరమ పవిత్రమూ అయిన ఆయన హృదయాంతరాళాలలో నుండి వచ్చిన విశ్వమాన సౌభ్రాత్ర భావనతోను “నా అమెరికా దేశ సోదర సోదరీమణులారా ……..” అని మొదలుపెట్టాడు. దాంతో ఆ జనసముద్రమంతా ఒక్కసారిగా లేచి నుంచొని కమ్మని ఆ పిలుపుకీ, ఇంద్రియగ్రహణము కాకపోయినా తమముందు మూర్తీభవించిన ఆ పవిత్రతకూ, ఏ నాగరికత పరిపూర్ణతకైనా చిహ్నమైన ఆ సన్యాస స్ఫూర్తికీ తమకు తెలియకనే పులకించిపోయి కరతాళ ధ్వనుల వర్షం కురిపించారు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 స్వామి వివేకానంద

ప్రశ్న 3.
షికాగో నగరంలో ప్రముఖులు, ధనవంతులు స్వామీజీకి ఆతిథ్యం ఇచ్చిన సందర్భంలో ఆయన మానసిక స్థితిని రాయండి.
జవాబు:
షికాగో నగరంలో వివేకానంద స్వామీజీకి ఇచ్చిన వసతులు ఆయనకు తృప్తినివ్వకపోగా గుండెను ఎవరో రంపంతో కోసినట్లయింది. “అయ్యో ! నా భారతదేశ ప్రజల్లో అధికభాగం తినడానికి తిండిలేక, కట్టుకోడానికి బట్టలేక అలమటిస్తూంటే ఇక్కడ వీళ్ళు డబ్బుల్ని నీళ్ళలా ఖర్చు పెడుతున్నారే ! వీరికి ఉన్న సదుపాయాల్లో కొన్నైనా నా వారికి లేవే! అటువంటప్పుడు నాకెందుకీ హంసతూలికా తల్పాలు? ఎవరిక్కావాలి ఈ ధనం, కీర్తి ప్రతిష్ఠ? అమ్మా జగజ్జననీ, నేనివేవీ అడగలేదే ? వాకివేవీ వద్దు. నా దేశ ప్రజల అన్నార్తినీ, జ్ఞానార్తినీ తీర్చు. వారిని మేల్కొలుపు. వారిని మనుష్యులను చేసి తమ కాళ్ళపై తాము నిలబడి తామూ ఏదైనా సాధించగలమనే విశ్వాసాన్ని కలుగజేయి అంటూ రోదిస్తూ నేలకు వాలి అక్కడే శయనించారు.

ప్రశ్న 4.
స్వామి వివేకానంద పాత్ర స్వభావాన్ని రాయండి.
జవాబు:
వివేకానందుడికి బాల్యంలో నరేంద్రుడు అని పేరు ఉండేది. వివేకానందుడు సాహసవంతుడైన బాలుడు. పరుగు పెడుతున్న బండిలోకి ఎక్కి ఒకసారి బండిలోని స్త్రీని రక్షించాడు. నరేంద్రుడు అల్లరి పిల్లవాడు. ‘శివశివా అంటూ నెత్తిపై నీళ్ళు పోస్తే శాంతించేవాడు.’

బాల్యంలో తల్లి నుండి భారత భాగవత రామాయణ కథలు విన్నాడు. రాముడన్నా, రామాయణమన్నా నరేంద్రుడికి ఎంతో ప్రేమ. ఆటలంటే బాగా ఇష్టం. మంచి జ్ఞాపకశక్తి కలవాడు. ‘రాజు – దర్బారు’ ఆట అంటే బాగా ఇష్టం. రామకృష్ణ పరమహంసను గురువుగా స్వీకరించి, సన్యాసం స్వీకరించాడు. భారతదేశమంతా పర్యటించాడు. వివేకానంద అనే పేరుతో అమెరికాలోని విశ్వమత మహాసభలో పాల్గొని, భారతీయ ధర్మం అన్ని మతాల్ని అంగీకరిస్తుందన్నారు.

వివేకానందుడి ఖ్యాతి ప్రపంచం అంతా వ్యాపించింది. విదేశాల నుండి తిరిగి వచ్చిన స్వామికి భారతదేశం బ్రహ్మరథం పట్టింది. వివేకానంద స్వామి యువకులకు సందేశం ఇచ్చాడు. యువకులకు ప్రేమ, నిజాయితీ, సహనం ముఖ్యమన్నారు.

లేవండి! మేల్కొనండి! శ్రేష్ఠులైన ఆచార్యుల బోధనలను అనుసరించండని వివేకానంద యువకులకు సందేశం ఇచ్చారు.

ప్రశ్న 5.
లేవండి ! మేల్కొనండి ! అంటూ జాతిని జాగృతం చేసిన వివేకానంద యువతకు ఇచ్చిన సందేశం ఏమిటి?
జవాబు:
ఇప్పటి యువకుల మీద, వారి ఆధునికత పైన పరిపూర్ణమైన విశ్వాసం ఉంది అంటూ వివేకానంద యువకులకు ఇలా సందేశం ఇచ్చారు. సాహసికులైన యువకులారా ! మీకు కావల్సినవి మూడే విషయాలు. అవి ప్రేమ, నిజాయితీ, సహనం. ప్రేమించలేని మానవుడు జీవన్మృతుని కింద పరిగణింపబడతాడు. నిరుపేదలను, అమాయక ప్రజలను, అణగదొక్కబడిన వారిని ప్రేమించండి. వారికొరకు వేదన చెందండి. పరితపించండి. పిరికితనాన్ని విడనాడండి. ధైర్యంగా సమస్యలను ఎదుర్కోండి. దీనజనుల కోసం శ్రమించండి. వారిని ఉద్దరించండి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోండి. సహనంతో వ్యవహరించడమే సత్ఫలితాలను సాధిస్తుందని మరవకండి. లేవండి ! మేల్కొనండి ! శ్రేష్ఠులైన ఆచార్యుల బోధనలననుసరించండి.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 స్వామి వివేకానంద

ప్రశ్న 6.
వివేకానందుడు జాతికిచ్చిన సందేశాన్ని బట్టి మీరేం గ్రహించారు?
జవాబు:
“భారతీయ ధర్మం అన్ని మతాల్ని అంగీకరిస్తుంది, గౌరవిస్తుంది. అన్ని మతాలూ సత్యాలే, అవన్నీ భగవంతుని చేరుకోవడానికి మార్గాలు” అని స్వామీజీ చెప్పిన మాటలు అమెరికా ప్రజలనే కాదు యావత్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాయి. ఎవరూ మతం మార్చుకోనవసరం లేదనీ, నా మతం గొప్పది, నా మతమే నిలవాలి అనుకునేవారు బావిలో కప్ప వంటి వారనీ స్వామీజీ చెప్పిన మాటలు అక్షరసత్యాలు. మతం తల్లి లాంటిది. తల్లి మనసే అర్థం కానప్పుడు మనం మనుగడ ఎలా సాగిస్తాం ? ఇదేమి స్వార్ధ రాజకీయం కాదుగా ? కప్పలాగా అటూ ఇటూ గెంతడానికి.

సభలోని మిగతా వక్తలు తమతమ మతాలకు ప్రాతినిధ్యం వహిస్తే, స్వామీజీ మాత్రం అన్ని ధర్మాల తరుఫునా మాట్లాడి నిజమైన మత సామరస్యాన్ని చూపారు. సదస్యులందరికి స్వామీజీ ప్రసంగమే నచ్చింది. ఎక్కడైనా నలుగురి గురించి ఆలోచించేవారే మన్నన పొందుతారు అనడానికి ఇదే నిదర్శనం.

జాతి, మత తారతమ్యం కూడదనీ, ధనిక, పేద వివాదం లేకుండా అందరూ నా సహోదరులేనని చాటాలి, ప్రతి ఒక్కరూ తనకోసం కాక, దేశం గూర్చి ఆలోచించాలన్నారు. స్త్రీ జనోద్ధరణ, విద్యావ్యాప్తి సక్రమంగా సాగాలన్నారు. పరిశోధనలు కూడా వాడుకభాషలో నిర్వహించాలన్నారు. యువతకు ‘ప్రేమ, నిజాయితీ, సహనం’ కావాలన్నారు. పిరికితనం విడిచి ధైర్యంగా సమస్యలను ఎదుర్కోండి. దీన జనులను ఉద్దరించండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. ఓర్పుతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు వస్తాయని మరువకండి. శ్రేష్ఠులైన ఆచార్యుల బోధనలు అనుసరించండి” అంటూ ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని కల్గించే వివేకానందుని స్ఫూర్తిదాయకమైన మాటలు అప్పటికే కాదు ఇప్పటికీ ప్రేరణ కల్గించేవని నేను గ్రహించాను.

AP Board 9th Class Telugu Solutions Chapter 11 ధర్మదీక్ష

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions Chapter 11 ధర్మదీక్ష Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions 11th Lesson ధర్మదీక్ష

9th Class Telugu 11th Lesson ధర్మదీక్ష Textbook Questions and Answers

చదవండి-ఆలోచించండి-చెప్పండి

వారణాసిని బ్రహ్మదత్తుడు పరిపాలిస్తున్నప్పుడు బోధిసత్వుడు ఐదువందల మంది శిష్యులతో హిమాలయాల్లో ఉండేవాడు. ఒకసారి ఎండలు బాగా కాసి అన్ని చోట్లా నీరు ఎండిపోయింది. జంతువులు నీళ్ళు దొరక్క అల్లాడిపోయాయి. శిష్యులలో ఒకడు వాటి దప్పిక తీర్చడంకోసం ఒక తొట్టి తయారుచేసి, దూరంగా ఉన్న నీళ్ళను తెచ్చి ఆ తొట్టెలో పోసేవాడు. జంతువులు గుంపులు గుంపులుగా వచ్చి ఆ నీరు తాగుతుండటంతో శిష్యుడికి పండ్లు తెచ్చుకోవడానికి గూడా తీరిక చిక్కలేదు. తనేమీ తినకుండానే ఆ జంతువులకు నీళ్ళు పోసేవాడు. ఇది చూసి జంతువులన్నీ మోయగలిగినన్ని పళ్ళు తెచ్చి ఇతనికివ్వాలని నిర్ణయించుకుంటాయి. అవన్నీ కలిపితే రెండువందల యాభై బండ్లు నిండాయి. వాటిని అక్కడి ఐదువందలమంది శిష్యులు తృప్తిగా తినేవాళ్ళు.

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
జంతువులు ఎందుకు అల్లాడిపోయాయి?
జవాబు:
ఎండలు బాగా కాసి అన్నిచోట్లా నీరు ఎండిపోయింది. జంతువులు నీళ్ళు దొరక్క అల్లాడిపోయాయి.

ప్రశ్న 2.
వాటి బాధ ఎలా తీరింది?
జవాబు:
బోధిసత్వుని శిష్యులలో ఒకడు, జంతువుల దప్పిక తీర్చడం కోసం ఒక తొట్టి తయారుచేసి, దూరంగా ఉన్న నీళ్ళను తెచ్చి ఆ తొట్టిలో పోసేవాడు. జంతువులు వచ్చి ఆ నీటిని త్రాగుతూ ఉండేవి. ఆ విధంగా వాటి దాహ బాధ తీరింది.

ప్రశ్న 3.
ఈ కథ ద్వారా మీరు గ్రహించిందేమిటి?
జవాబు:
మనం తోటి ప్రాణులకు సహాయం చేస్తే, ఆ ప్రాణులు తిరిగి మనకు సహాయం చేస్తాయి. మనం తోటి మానవులకే కాక పరిసరాల్లో ఉన్న జంతువులకు సహితం సాయం చేయాలి. వాటిపై దయ చూపాలి. మనం సాయం చేస్తే జంతువులు సహితం మనకు సాయం చేస్తాయని ఈ కథ ద్వారా మనం గ్రహించగలం. మన పని మనం చేస్తే, మంచి ఫలితాలు దానంతట అవే వస్తాయని ఈ కథ తెలుపుతుంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 11 ధర్మదీక్ష

ప్రశ్న 4.
జీవకారుణ్యం అంటే ఏమిటి?
జవాబు:
‘జీవకారుణ్యం’ అంటే ప్రాణులపై దయ అని అర్థం. తోటి మనుష్యుల పైననే కాకుండా, ప్రాణం గల జంతువులన్నింటి మీద కూడా దయ గలిగి ఉండాలి. దానినే ‘జీవకారుణ్యం’ అంటారు.

ప్రశ్న 5.
‘కర్తవ్య నిర్వహణ’ అంటే మీరేమని భావిస్తున్నారు?
జవాబు:
‘కర్తవ్యం’ అంటే ‘ప్రతి జీవి పాటించి తీరవలసిన నిష్ఠ’ అని అర్థం. ప్రతి వ్యక్తికి తాను చేయవలసిన ముఖ్యమైన పనులు ఉంటాయి. చేయవలసిన పనిని వదలకుండా ఆ పనిని చేయడాన్ని ‘కర్తవ్య నిర్వహణ’ అంటారని నేను భావిస్తున్నాను.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది అంశాల గురించి తెలపండి.

ప్రశ్న 1.
ఈ కథను మీ సొంతమాటల్లో చెప్పండి.
జవాబు:
“ధర్మదీక్ష”

ఆళవీ గ్రామంలో నందగోపాలుడు అనే ఆవులను పెంచే గోపాలకుడు ఉండేవాడు. ఒకరోజు సాయంత్రం ఆవులు అన్నీ మేతమేసి, ఇంటికి తిరిగి వచ్చాయి. ఒక్క ఆవు రాలేదు. దాని దూడ దాని తల్లి కోసం అంబా అంటూ అరుస్తోంది. నందగోపుడికి ఆ ఆవు పులివాత పడిందేమో అని భయం వేసింది.

మరునాడు తెల్లవారకుండానే అతడు ఆవును వెదకడానికి బయలుదేరాడు. నందగోపుడు అడవిలోని ఆవును వెదకడానికి వెడుతున్నాడు. పొరుగూరి జనం అంతా తీర్థ ప్రజలా ఆళవీ గ్రామానికి వస్తున్నారు. కారణం ఏమిటని నందగోపాలుడు అడిగితే ఆ రోజు గౌతమ బుద్ధుడు ఆళవీ గ్రామానికి వస్తున్నాడనీ, మధ్యాహ్నభిక్ష తరువాత శ్రావస్తీ నగరానికి ఆయన వెడతాడనీ ఒక ముసలితాత నందగోపుడికి చెప్పాడు.

నందగోపుడు తాను తప్పిపోయిన ఆవును వెదకడానికి వెడుతున్నానని అతనితో చెప్పాడు. ఆవు కోసం వెతుకుతూ ఉంటే, బుద్ధుని దర్శనం తనకు కాదేమో అని నందుడికి భయం పట్టుకుంది. వెనకడుగు వేశాడు. కానీ అతనికి ఆవు దూడ అరచినట్లనిపించింది. నందుడు మధ్యాహ్నం వరకూ అడవిలో ఆవుకోసం వెదికాడు. ఇంతలో మిట్టమధ్యాహ్నవేళలో ఆవు ఆర్తనాదం వినిపించింది. అతి కష్టంపై ఆవును పట్టుకొని నందగోపుడు అన్నపానాలకు అలమటిస్తూనే ఆళవీ గ్రామానికి బయలుదేరాడు.

ఆళవీ గ్రామానికి బుద్ధుడు భిక్షువులతో వచ్చి గ్రామస్థుల విందును ఆరగించాడు. పొరుగూరి జనం ఎందరో బుద్ధుని ధర్మబోధలు విందామని వచ్చారు. మధ్యాహ్నం 3 గంటలు కాబోతోంది. బుద్ధుడు ఇంకా బోధలు మొదలు పెట్టలేదు. ఎవరికోసమో ఆయన తలఎత్తి చూస్తున్నాడు. ఇంతలో ఆలస్యమయిపోతోందని నందగోపాలుడు సరాసరి బుద్ధుడు విడిది చేసిన వటవృక్షం దగ్గరకు ఆవుతో వెళ్ళాడు. బుద్ధునికి నమస్కరించాడు. తనకు బుద్ధ దర్శనం అయ్యిందని నందుడు సంతోషించాడు.

బుద్దుడు లేచి, నందగోపాలుడికి దగ్గరుండి భోజనం పెట్టించాడు. అతని ఆవు దగ్గరకు దాని దూడ వచ్చి పాలు తాగుతోందని, దానికోసం బెంగ పెట్టుకోవద్దనీ నందుణ్ణి బుద్ధుడు ఊరడించాడు. నందుడి దగ్గర గోసాముద్రిక రహస్యాలను బుద్ధుడు తెలుసుకొన్నాడు.

తరువాత బుద్ధుడు అష్టాంగ ధర్మాన్ని బోధించాడు. ప్రజలంతా ఆనందంలో మునిగితేలారు. నందగోపుడికి బుద్ధుడు ధర్మదీక్ష ఇచ్చాడు. భిక్షువులంతా బుద్ధుడు నందగోపాలునిపై చూపిస్తున్న ఆదరానికి ఆశ్చర్యపడ్డారు. బుద్ధుడు వారికి తాను నందగోపాలుని కోసమే, ఆళవీ గ్రామానికి వచ్చానని తెలియ చెప్పాడు. అది విన్న భిక్షువులు, నందగోపాలుని గౌరవభావంతో చూశారు. నందగోపాలుడు మాత్రం ఆ లేగ దూడవల్లే తనకు బుద్ధుని దర్శనం లభించిందని, దూడను ముద్దు పెట్టుకున్నాడు.

ప్రశ్న 2.
ఈ పాఠానికి ‘ధర్మదీక్ష’ అనే పేరు సరైందేనా? ఎందుకు?
జవాబు:
ఈ పాఠమునకు ధర్మదీక్ష అని పేరు పెట్టారు. ఈ పేరు కొంతవరకు సరిపోతుంది. గోవులను పోషిస్తూ జీవించే నందగోపాలుడికి గౌతమ బుద్ధుడు ధర్మదీక్షను అనుగ్రహించాడు. కాబట్టి ధర్మదీక్ష అనే పేరు సరయినదే. అయితే ఈ పాఠంలో నందగోపాలుడి గోవాత్సల్యం సంపూర్తిగా కనిపిస్తుంది. అతడు బుద్ధుడి ధర్మ బోధనను వినాలనుకున్నా, దానికంటే ముందుగా తనకు గల గోవాత్సల్యానికే ప్రాధాన్యం ఇచ్చాడు. నందగోపాలుడు ఆకలి దప్పులను లెక్కచేయక ఆకలితో నకనకలాడుతూనే గోవును వెదకి పట్టుకున్నాడు. బుద్ధ దర్శనం కాదేమో అనే భయంతో నేరుగా బుద్ధుడు విడిది చేసిన వటవృక్షం వద్దకు వచ్చాడు. ఎందరో భక్తులు, బుద్ధుడు అనుగ్రహించే ధర్మదీక్ష కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అటువంటి ధర్మదీక్షను స్వయంగా బుద్ధుడే నందగోపుడికి అనుగ్రహించాడు.

కాబట్టి ధర్మదీక్ష అనే పేరు ఈ పాఠానికి సరిపోతుంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 11 ధర్మదీక్ష

ఆ) కింది మాటలు ఎవరు ఎవరితో అన్నారు? ఎందుకన్నారు?

ప్రశ్న 1.
ఆళవికి పోతున్నాను బాబూ!
జవాబు:
ఆవును వెతకడానికి నందగోపాలుడు అడవికి పోతున్నాడు. ఆళవీ గ్రామానికి బుద్ధ బోధనలు వినడానికి ఎందరో
వస్తున్నారు. అందులో ఒక ముసలివాడితో, “ఎక్కడికి తాత ! ఈ ప్రయాణం !” అని నందగోపుడడిగాడు. ఆ ప్రశ్నకు జవాబుగా ముసలి తాత నందగోపుడితో “ఆళవికి పోతున్నాను బాబూ” అన్నాడు.

ప్రశ్న 2.
నీకింకా తెలియదా?
జవాబు:
“ఎక్కడికి తాతా! ఈ ప్రయాణం!” అని నందగోపుడు ఆళవీ గ్రామానికి బుద్ధ బోధనలు వినడానికి వస్తున్న తాతను అడిగాడు. ఆళవికి వెడుతున్నానని తాత చెప్పాడు. అప్పుడు ఆ తాత, నందగోపాలుణ్ణి బుద్ధుడు వస్తున్నాడని “నీకింకా తెలియదా?” అని ప్రశ్నించాడు.

ప్రశ్న 3.
ఇంకా భోజన పదార్థాలేమైనా మిగిలి ఉన్నాయా?
జవాబు:
నందగోపుడు తప్పిపోయిన ఆవును పట్టుకొని ఎలాగో శ్రమపడి మధ్యాహ్నం మూడుగంటల సమయంలో బుద్ధుని వద్దకు వచ్చి నమస్కరించాడు. అప్పుడు బుద్ధుడు లేచి నిలబడి అక్కడ ఉన్న తన శిష్యులతో “ఇంకా భోజన పదార్ధములు ఏమైనా మిగిలి ఉన్నాయా” అని ప్రశ్నించాడు.

ప్రశ్న 4.
ఆనందగోపాలుని కోసమే !
జవాబు:
బుద్ధుడు తన వద్దకు వచ్చిన నందగోపాలునికి భోజనం పెట్టించి, ఆదరంతో చూసి ధర్మబోధచేసి, ధర్మదీక్షను అనుగ్రహించాడు. బుద్ధుడు నందగోపాలునిపై చూపిస్తున్న ఆదరాభిమానాలను చూచి మిగిలిన భిక్షువులు గుసగుసలు మాట్లాడుకున్నారు. బుద్ధదేవుడు నందగోపాలుని గోవాత్సల్యాన్ని మెచ్చుకొని, కేవలం నందగోపాలుణ్ణి చూడడం కోసమే తాను ఆళవీ గ్రామానికి వచ్చానని శిష్యులతో అన్నాడు.

ప్రశ్న 5.
బాబూ నేనేమీ ఎరగని వట్టి అమాయకుణ్ణి.
జవాబు:
బుద్ధుడు నందగోపాలకుడి కోసమే, తాను ఆళవీ గ్రామానికి వచ్చానని చెప్పాడు. బౌద్ధ భిక్షువులు నందగోపాలుని గౌరవించి నిలబడ్డారు. అప్పుడు నందగోపాలుడు లేచి నిలబడి, “బాబూ నేనేమీ ఎరగని వట్టి అమాయకుణ్ణి అని, భిక్షువులతో అమాయకంగా మాట్లాడాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 11 ధర్మదీక్ష

ఇ) కింది పేరా చదవండి. ఖాళీలు వివరించండి.

‘కర్తవ్యం. ………… ప్రతి జీవీ పాటించి తీరవలసిన నిష్ఠ. ఒక వానపాము ఎంత అల్పజీవి! మట్టిలో పుడుతుంది. మట్టి తింటుంది. మట్టిల్ మరణిస్తుంది. మరెందుకు అది జన్మ తీసుకుంటుంది. విచిత్రమైన విషయం ఏమిటంటే మట్టేదాని జీవనాధారమూ, జీవితమూ అయినా మట్టికీ దాని అవసరం ఉంది. అది మట్టిని తలకిందులు చేస్తుంది. గుల్లగుల్ల చేస్తుంది. గునపాలు చేయలేని ఆ సున్నితమైన వ్యవసాయాన్ని, సుకుమారమైన శరీరంతో శ్రద్ధగా అదే దాని జీవిత లక్ష్యం అన్నంత కర్తవ్యనిష్ఠతో చేస్తుంది. మనిషి మాత్రం అల్పజీవుల అవసరం ఏమిటన్న తేలికభావంతో ఉదాసీనత ప్రదర్శిస్తున్నాడు.
1. కర్తవ్యం అంటే ప్రతి జీవీ పాటించవలసిన నిష్ఠ.
2. వానపాము జీవనాధారం మట్టి.
3. మనిషి ఉదాసీనత చూపించేది అల్పజీవులయందు.
4. పై పేరాకు శీర్షిక ‘కర్తవ్య నిష్ఠ’.
5. పై పేరాలోని ముఖ్యమైన ఐదు పదాలు : 1) కర్తవ్యం 2) అల్పజీవి 3) జీవనాధారము 4) ఉదాసీనత 5) కర్తవ్య నిష్ఠ

ఈ) పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రశ్న 1.
నందగోపుడు ఆరాటపడడానికి కారణం ఏమిటి?
జవాబు:
నందగోపుడి గోవులన్నీ సాయంత్రం తిరిగి వచ్చాయి. ఒక్క ఆవు మాత్రం రాలేదు. ఆ ఆవు దూడ ‘అంబా’ ‘అంబా’ అంటూ అరుస్తోంది. ఆ దూడ పుట్టినప్పటి నుండి నందగోపాలుని ఇల్లంతా పాడిపంటలతో కళకళలాడింది. అందుకే ఆ ఆవన్నా, ఆ దూడన్నా నందగోపాలుడికి ఎంతో ఇష్టం. దూడ తల్లి కోసం అదే పనిగా అరుస్తూ ఉండటంతో నందగోపుడికి అన్నం సయించలేదు. రాత్రి తెల్లవార్లూ, నందగోపుడు ఆవు ఏమైపోయిందో అని ఆరాటపడుతూనే ఉన్నాడు.

ప్రశ్న 2.
నందగోపునికి ఆ ఆవంటే ఎందుకంత ఇష్టం?
జవాబు:
ఆ ఆవు నందగోపాలుడి ఇంట్లోనే పుట్టి అతని పాపలతో పాటు పెరిగి పెద్దదయ్యింది. అతని పాపలందరూ ఆ ఆవు పాలు తాగి క్రమంగా పెరిగి పెద్దవారయ్యారు. నందుడు కూడా వారితో బాటే ఆ ఆవు పాలు తాగి పెద్దవాడయ్యాడు.

ఈ మధ్యనే దానికి ఒక కోడె దూడ పుట్టింది. కోడె పుట్టిన వేళ మంచిది. ఆనాటి నుండీ, నందగోపుని ఇల్లంతా పసిపాప నవ్వులతో కళకళలాడింది. అందుకే ఆ ఆవు అంటే నందగోపాలునికి బాగా ఇష్టం.

ప్రశ్న 3.
గ్రామస్థులు బౌద్ధ భిక్షువులకు ఏయే ఏర్పాట్లు చేశారు?
జవాబు:
ఆళవీ గ్రామస్థులు బౌద్ధ భిక్షువులకు ఎదురేగి, అతిథి సత్కారాలతో ఎంతో ఆప్యాయంగా ఆదరించారు. విశాలమైన మఱ్ఱిచెట్టు నీడలో వారికి విడుదులు ఏర్పాటు చేశారు.

తరువాత తాము ప్రత్యేకంగా భిక్షువులకు విందు చేస్తామనీ, విందు ఆరగించవలసిందనీ వారిని బ్రతిమాలారు. ఈ విధంగా బౌద్ధ భిక్షువులకూ, బుద్ధునికీ గ్రామస్థులు విందు ఏర్పాట్లు చేశారు.

ప్రశ్న 4.
గౌతమ బుద్ధుడు నందగోపుణ్ణి ఏమేం అడిగాడు?
జవాబు:
గౌతమ బుద్ధుడు నందుణ్ణి గోవును గురించీ, కోడె దూడను గురించి ఎన్నో కుశల ప్రశ్నలు వేశాడు. నందగోపుడు, తను కోడె దూడ నుదుటిపై నల్లని మచ్చలను గురించి, ఒంటిమీద సుడులను గురించి, ఎవరికీ తెలియని రహస్య సాముద్రిక విషయాలను చెప్పాడు. తాను వంశపారంపర్యముగా గ్రహించిన కొన్ని గోసాముద్రిక రహస్యాలను నందగోపుడు బుద్ధునికి తెలిపాడు. గౌతమబుద్ధుడు అడిగిన కొన్ని కొన్ని చిన్న సందేహాలను నందగోపుడు గౌతమునకు తెలిపాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 11 ధర్మదీక్ష

ప్రశ్న 5.
నందగోపుడు తన ధర్మాన్ని నిర్వర్తించాడని ఎలా చెప్పగలవు?
జవాబు:
నందగోపుడు సరళవర్తనం, సాధు స్వభావం కలవాడు. అతన్ని ఎంతగా ఆకలిమంట బాధించినా, అతడు తన గోపాలక ధర్మాన్ని మరువలేదు. అతనికి గోవులపై గల వాత్సల్యం అపారము. ముప్ఫై క్రోశాల దూరం నడిచి, ఎంతో శ్రమపడి అందుకే బుద్ధుడు నందగోపుణ్ణి చూడటానికి ఆళవీ గ్రామానికి వచ్చాడు.

ఆవు తప్పిపోయిందని తెలియగానే నందగోపుడు ఎంతో ఆరాటపడ్డాడు. అతనికి అన్నం సహించలేదు. మర్నాడు మిట్ట మధ్యాహ్నం దాటిపోయే వరకు తనను ఆకలి దహించి వేస్తున్నా, తనకు దాహం వేస్తున్నా ఆవును అతడు వెతికి పట్టుకున్నాడు. ఈ సంఘటన నందగోపునికి గల గోవాత్సల్యాన్నీ, అతని ధర్మ నిర్వహణనూ తెలియపరుస్తుంది.

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘గోధూళివేళ అంటే ఏ సమయం? ఆ సమయంలో గ్రామంలో వాతావరణం ఎలా ఉంటుంది?
జవాబు:
గోధూళి వేళ అంటే సాయం సమయం, అది ఆవులు మేతకు వెళ్ళి, ఇంటికి తిరిగి వచ్చే సమయం. ఆవులు మెడలో కట్టిన గంటలు చప్పుడు చేస్తూ, ఇంటి ముఖం పడతాయి. వాతావరణం చల్లగా ఉంటుంది. సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు. ఆకాశంలో ఎఱ్ఱగా కుంకుమ ఆరపోసినట్లుగా ఉంటుంది. కొందరు ఆవులను త్రాళ్ళకు కట్టివేస్తూ ఉంటారు. కొందరు చుంద్ చుంయ్ అంటూ పాలు పితుకుతూ ఉంటారు. సాయంత్రం పైరుగాలి వీస్తూ ఉంటుంది. ఆవుల కాపరులు ఆవులను వేగంగా ఇళ్ళకు తోలుకు వస్తూ ఉంటారు. ఆవులు, గేదెలు ఆనందంగా గంతులు వేస్తూ ఇళ్ళకు వస్తూ ఉంటాయి.

ప్రశ్న 2.
“ప్రజానీకం ముఖాలన్నీ అరుణోదయకాంతులతో, నూతనానందావేశాలతో కలకలలాడుతున్నాయి”. ఈ వాక్యాన్ని మీ సొంతమాటలలో వివరించండి.
జవాబు:
ప్రజల ముఖాలు సంతోషంతో నిండిపోయాయి. వారందరిలో ఆనందం పొంగుకు వచ్చింది. ముఖాలు మిలమిలా మెరిసిపోతున్నాయి. వారు సంతోషంతో కేరింతలు కొడుతున్నారు. ఉత్సాహం వారిలో ఉరకలు వేస్తోంది. అప్పుడే సూర్యుడు ఉదయించినట్లుగా, వారి ముఖాలు ఎర్రగా కళకళలాడుతున్నాయి. బుద్ధునికీ, భిక్షువులకూ ఎదురేగి, వారు జయజయధ్వానాలు చేస్తూ ఊరేగింపుగా బుద్ధుణ్ణి గ్రామంలోకి తీసుకువచ్చారు.

ప్రశ్న 3.
జిజ్ఞాస రేకెత్తడమంటే ఏమిటి? ఏ అంశాల పట్ల మీకు జిజ్ఞాస ఉంటుంది?
జవాబు:
జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే కోరిక. జిజ్ఞాస రేకెత్తించడం అంటే, తెలుసుకోవాలనే కోరిక కలిగించడం. పిల్లలకు కొత్త కథలు, వింతలు, ఇంద్రజాల విద్యలు వగైరా చిత్రాలను గూర్చి తెలుసుకోవాలని ఉంటుంది. సినిమా కథలను తెలుసుకోవాలని ఉంటుంది. ప్రక్క విద్యార్థులు ఏవైనా ప్రయోగాలు చేసి నూతన విషయాలను కనుక్కొంటే తాను కూడా వాటిని తెలుసుకోవాలని పిల్లలకు కుతూహలం ఉంటుంది. ఆకాశంలో పక్షులు ఎలా ఎగురుతున్నాయో, తూనీగలు ఎలా ఎగురుతున్నాయో, రైలు ఎలా నడుస్తోందో, యంత్రాలు ఎలా తిరుగుతున్నాయో వగైరా విషయాలను తెలుసుకోవాలనే కోరిక పిల్లలకు ఉంటుంది.

ప్రశ్న 4.
ఎదురేగి అతిథి సత్కారాలతో ఎవరెవరిని ఆప్యాయంగా పలకరిస్తారు?
జవాబు:
సన్యాసులను, మఠాధిపతులను ఎదురేగి, అతిథి సత్కారాలు చేసి గౌరవిస్తారు. గురువులను, పూజ్యులను, అతిథులను ఎదురేగి సత్కరిస్తారు. లోనికి రండని, స్వాగతం చెప్పి వారిని లోపలకు తీసుకువస్తారు. మంత్రులనూ, గౌరవనీయులనూ ఎదురేగి స్వాగత సత్కారాలు చేసి ఆహ్వానిస్తారు.

దేవాలయాలకు ట్రస్టీలనూ, చైర్మన్లనూ నియమించినపుడు వారిని ప్రజలు గౌరవంతో ఎదురేగి స్వాగతం చెప్పి ఆహ్వానిస్తారు. తల్లిదండ్రులను, తాత ముతాతలను, పెద్దలను వారు మన ఇంటికి వచ్చినపుడు గౌరవంగా ఎదురేగి సత్కరించి ఆహ్వానించాలి. మగ పెళ్ళివారికి ఆడపెళ్ళివారు ఎదురేగి అతిథి సత్కారాలతో ఆహ్వానించాలి.

ప్రశ్న 5.
బుద్ధుని ఆప్యాయతను చూసేసరికి నందగోపాలుడి హృదయం ద్రవించి నీరైపోయింది. “హృదయం ద్రవించి నీరైపోవడం ” అంటే ఏమిటి? దీన్ని ఇంకా ఏయే సందర్భాలలో వాడతారు?
జవాబు:
హృదయం ద్రవించి నీరైపోవడం అంటే, మనస్సు ప్రేమతో తడిసి ముద్దవడం అని అర్థం. జాలి, కరుణ, ఆర్ధత అనే గుణాలు మనస్సులో నిండడం. మనస్సు జాలితో, కరుణతో నిండిపోవడం అని అర్థం.

ఎవరైనా ఆపదలో ఉంటే, ఆ సంఘటనను చూసి జాలితో మనస్సు కరిగిపోతుంది. ఏదైనా బస్సు, ఆటో వంటి వాటికి ప్రమాదం సంభవించినపుడు, అందులోని ప్రయాణికుల కాళ్ళూచేతులు తెగితే, లేక గాయాలయితే, వారి రక్తం రోడ్డుపై ప్రవహిస్తే, అవయవాలు దెబ్బ తింటే ఆ సంఘటనను చూస్తే మనస్సు కరిగి ప్రవహిస్తుంది. మనశక్తి కొద్దీ, వారికి సాయం చేద్దామనుకుంటాం.

అగ్ని ప్రమాదాలు సంభవించినపుడు, ప్రకృతి బీభత్సాలు సంభవించినపుడు బాధలు పడ్డ ప్రజలను చూస్తే మనస్సులు అలాగే ద్రవిస్తాయి.

AP Board 9th Class Telugu Solutions Chapter 11 ధర్మదీక్ష

ప్రశ్న 6.
ఏ సమయాన్ని గోధూళివేళ యంటారు? అలా అనడానికి కారణమేమిటి?
జవాబు:
గోధూళి వేళ అంటే సాయం సమయం. ఇది ఆవులు మేతకు వెళ్ళి, ఇంటికి తిరిగి వచ్చే సమయం. పొద్దుగుంకే సమయం. అని నిఘంటువు అర్థం. ఉదయం మేతకై వెళ్ళిన ఆవులమంద, కడుపునిండినవై, బిడ్డల కడుపు నింపడానికి సంతోషంగా ఇంటికి వస్తున్నప్పుడు గోవుల కాళ్ళతో రేగిన దుమ్ము ఇక్కడ గోధూళిగా చెప్పవచ్చు. గోవులు ఇంటికి వచ్చే సమయం గోధూళి వేళగా ‘రూఢి’ అయింది. (ఉదయం బిడ్డలను విడిచి వెళ్ళే గోవులు మందగమనంతో ఉంటాయి. సాయంత్రం బిడ్డలను చూడాలనే ఆతురతతో గోమాతలు నడుస్తాయి. అందువల్ల దుమ్ము రేగుతుంది.

ఆ) కింది ప్రశ్నలకు పదిహేనేసి వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
నందగోపాలుడి గుణగణాలను వర్ణించండి.
జవాబు:
నందగోపాలుడు ఆవులను మేపుతాడు. తనకిష్టమైన ఆవు రాత్రి ఇంటికి రాకపోతే నందగోపాలుడికి అన్నం సయించలేదు. రాత్రంతా ఆవుకు ఏమవుతుందో అని ఆరాటపడుతూనే ఉన్నాడు. ఆవుపై ప్రేమతో మరునాడుదయమే నందుడు దాన్ని వెతకడానికి అడవికి వెళ్ళాడు. ఆకలి దహించి వేస్తున్నా, నాలుక పిడచగట్టుకు పోతూ ఉన్నా, నందుడు పట్టువిడవకుండా, ఆవును వెతికి పట్టుకున్నాడు.

బుద్ధుడు తన గ్రామానికి వస్తున్నాడని తెలిసి, ఆయన ధర్మబోధ వినలేకపోయినా, ఆయన దర్శనం చేసుకుందామని నందుడు ఆవును తీసుకొని సరాసరి బుద్ధుడు ఉన్న మజ్జి చెట్టు దగ్గరకు వచ్చి బుద్ధునకు నమస్కరించాడు.

నందగోపాలుడి ధర్మకార్యనిర్వహణకు తృప్తిపడిన గౌతమ బుద్ధుడు నందగోపాలునికి దగ్గరుండి భోజనం పెట్టించాడు. నందగోపాలుడికి, గోసాముద్రిక రహస్యాలు, కోడె దూడల లక్షణాలు, వంశపారంపర్యంగా తెలుసు. బుద్ధుడికి, నందుడు ఆ రహస్యాలను చెప్పాడు. నందుడు వచ్చిన తర్వాత కాని ఆనాడు బుద్ధుడు ధర్మబోధ ప్రారంభించలేదు. బుద్ధుడు స్వయంగా నందగోపాలునికి ధర్మదీక్షను ఇచ్చాడు.

నందగోపాలుడు బుద్దుని అనుగ్రహాన్ని పొందిన భక్తుడు. నందగోపాలుడిని చూడడానికే తాను ఆళవీ గ్రామానికి వచ్చానని బుద్ధుడు శిష్యులకు చెప్పిన మాట గుర్తు పెట్టుకోదగినది.

గౌతమ బుదుడు చెప్పినట్లు నందగోపాలుని సరళవర్తనం, సాధు స్వభావం ప్రసిద్ధమైనవి. ఎంత ఆకలి మంట అతణ్ణి వేధిస్తున్నా, అతడు తన గోపాలక ధర్మాన్ని విడిచిపెట్టలేదు. బౌద్ధభిక్షువులందరూ నందుని గౌరవభావంతో నిలబడి చూశారు. తాను వట్టి అమాయకుణ్ణని, నందగోపాలుడు అమాయకంగా వినయంతో వారికి చెప్పాడు. నందగోపాలుడు, సజ్జనుడైన ఆలకాపరి.

ప్రశ్న 2.
గౌతమబుద్ధుడు నందగోపాలుడిపై వాత్సల్యాన్ని ఎలా చూపించాడు? దానికి కారణాలు ఏమిటి?
జవాబు:
నందగోపాలుడి ధర్మ నిర్వహణ పట్ల, కర్తవ్యం పట్ల, అతనికి గల గోవాత్సల్యం పట్ల కరుణామూర్తియైన బుద్ధుడు ఆనందించాడు. నందగోపాలుడిని చూడాలని శిష్యులతో 30 క్రోశాల దూరం నడచి, నందగోపాలుడి ఆళవీ గ్రామానికి వచ్చాడు. నందగోపాలుడు వచ్చే వరకూ బుద్ధుడు తన ధర్మ ప్రసంగాన్ని ప్రారంభించలేదు.

నందగోపాలుడు మధ్యాహ్నము 3 గంటలకు తన ఆవుతో సహా బుద్దుడి వద్దకు వచ్చాడు. ఇంతలో ఆవు దూడ అరుపు గుర్తుకు వచ్చి అతడు ఇంటికి బయలుదేరబోయాడు. దూడ తాడు ట్రెంపుకొని తల్లి వద్ద పాలు తాగుతోందని, స్వయంగా బుద్దుడు నందుడికి చెప్పి, నందుడికి దగ్గరుండి కడుపు నిండా భోజనం పెట్టించాడు.

నందగోపాలుడి భోజనం పూర్తి అయ్యాక బుద్దుడు నందుణ్ణి తనతో తీసుకొని వెళ్ళి ధర్మబోధ ప్రారంభించాడు. బుద్ధుని ధర్మబోధ కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నా బుద్ధుడు నందుడు వచ్చేవరకూ బోధ ప్రారంభించలేదు.

మధ్యాహ్నమే శ్రావస్తీ నగరానికి వెళ్ళవలసియున్నా నందగోపాలుడు వచ్చే వరకూ బుద్ధుడు తన ప్రయాణాన్ని ఆపుకున్నాడు. నందగోపాలుడికి తాను ప్రక్కన కూర్చుండి కడుపునిండా భోజనం పెట్టించాడు. నందుడికి ధర్మదీక్షను ఇచ్చాడు. నందుడు సరళవర్తనం, సాధు స్వభావం కలవాడనీ, గోపాలక ధర్మాన్ని నిర్వర్తించిన సజ్జనుడనీ శిష్యులకు బుద్దుడు చెప్పి నందగోపాలకుని మెచ్చుకున్నాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 11 ధర్మదీక్ష

ప్రశ్న 3.
మానవులుగా పుట్టినందుకు మనం ఎవరిపట్ల, వేటిపట్ల మన కర్తవ్యాన్ని నిర్వహించాలి? ఎందుకని?
జవాబు:
మానవులుగా పుట్టినందుకు తోడి ప్రాణులపట్ల జాలి, దయ, సానుభూతి, అనుకంపలను మనం చూపించాలి. మానవులం కాబట్టి మనలో దానవత్వం ఉండరాదు. తోడి మానవుల యందు, ప్రకృతిలోని పశుపక్ష్యాదులయందు, కరుణ చూపించాలి. జీవహింస చేయరాదు.

మనకు ముల్లు గుచ్చుకుంటే మనం బాధపడతాము. అలాగే జంతువులు కూడా తమకు బాధ కలిగితే అవి సహించలేవు. ఏడుస్తాయి. మనము దయతో ఆ జంతువులకు కావలసిన ఆహారము, నీరు అందించాలి. కొందరు సత్పురుషులు పశు అశ పక్ష్యాదుల తిండికి, నీరు త్రాగడానికి ఏర్పాట్లు చేస్తారు. తాను అన్నం తినే ముందు, ఒకటి రెండు ముద్దలు కాకులకో, కుక్కలకో, జంతువులకో పెడతారు. అదే జీవకారుణ్యము. కొన్ని ప్రాంతాల్లో జీవకారుణ్య సంఘాలు ఉంటాయి.

తోటి ప్రాణులను, నీ ప్రాణం లాగే చూడాలి. సర్వప్రాణి సమానత్వం ఉండాలి. అల్ప ప్రాణులయిన సీతాకోక చిలుక, మిడత, దోమ, నల్లి వంటి వాటిని కూడా చంపరాదు. సర్వజీవ సమానత్వం మనందరం అలవరచుకోవలసిన మంచిగుణం. అది ముఖ్య కర్తవ్యం.

ఇ) సృజనాత్మకంగా రాయండి.

* ఇది ఎందుకూ పనికిరాదు. దీన్ని కబేళాకు తీసుకొనిపోండి – అన్న యజమాని మాటలకు ఆ ఎద్దు గుండె గుభేలుమంది. తన గంతులేసే బాల్యం, అప్పటి నుండి తన యజమానికి చేసిన సేవ గుర్తుకు వచ్చాయి. బాధగా మూలిగింది – ఇలాంటి ఎద్దు ఆత్మకథను ఊహించి రాయండి.
జవాబు:
అవును. నేను ఇప్పుడు ముసలిదాన్నయ్యాను. నన్ను కర్కశంగా చంపి తినేయడానికి కబేళాకు అమ్మేస్తారా ? ఎంత దారుణం!

నేను ఎంత బాగా పెరిగాను | మా అమ్మ, రోజూ నాకు తన పొదుగులో దాచి, అర్థశేరు పాలు ఇచ్చేది. అవి తాగి, లేత పచ్చి గడ్డి తిని ఎంతో బాగా గంతులు వేసేదాన్ని. నా మెడలో గంటలు కట్టి నన్ను పరుగు పెట్టించి, పిల్లలు నా వెనుక పరుగుపెట్టేవారు. ఆ రోజులే రోజులు !

నేను పెద్దయ్యాక, మా యజమాని నాగలిని ఎన్నోసార్లు లాగాను. పొలాలు దున్నాను. నా తోడి ఎదు రాముడుతోపాటు మా యజమాని బండి లాగాను. ఎంత బరువు వేసినా కాదనలేదు. ఇంతే కాదు. అందాల ఎద్దుల పోటీలో నేను నాలుసార్లు మొదటి బహుమతులు తెచ్చి మా యజమానికి ఇచ్చాను. ఎడ్ల పందేలలో మా యజమానికి మూడుసార్లు గెలుపు సాధించి పెట్టాను. బండ చాకిరీ చేశాను. ఇప్పుడు నేను పనికిరాని దాననయ్యాను.

ఈ మానవులకు జాలి లేదు. నాకు పెట్టే తిండి తగ్గించేశారు. చివరకు నన్ను కబేళాకు అమ్మేస్తున్నారు. ఇంత కృతఘ్నతా? ఈ విషయంలో మనుషుల కంటె, మా జంతువులే నయమేమో ! సరే అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు. ఏం చేస్తాము ? మా యజమాని బహుశః వాళ్ళ అమ్మా నాన్నలనూ రేపో మాపో కబేళాకు తోలేస్తాడేమో ! భగవాన్ ! మా యజమానికి కొంచెం కరుణా బుద్ధి ప్రసాదించు.

(లేదా )

* ఈ రోజుల్లో కాలుష్యం, ఇతర కారణాల వల్ల కొన్ని పక్షులు, జంతువులు, కనుమరుగయే ప్రమాదం ఏర్పడింది. వీటిని కాపాడుకోవలసిన ఆవశ్యకతను వివరిస్తూ కింది వాటిలో ఒకదాన్ని తయారుచేయండి.
i) పోస్టర్ ii) కరపత్రం iii) ప్రసంగ పాఠం
జవాబు:
ii) జంతు రక్షణ చర్యలు (కరపత్రం) :
ఈ రోజుల్లో మనం ఎక్కువగా క్రిమిసంహారక మందులను పంట పొలాల్లో, పెరట్లోని మొక్కల పై, ఇంట్లో వస్తువులపై చల్లుతున్నాము. ముఖ్యంగా పుష్పాలు పూసి ఫలదీకరణ చెందాలంటే సీతాకోక చిలుకల వంటి పక్షులు ఒక పరాగాన్ని పుష్పానుండి మరొక పుష్పానికి తమ రెక్కలతో చేర్చాలి. పురుగులను కొన్ని పక్షులు తమ ముక్కులతో పొడిచి చంపాలి.

అలాగే మనం చల్లే ఎండ్రిన్ వల్ల భూమిని సారవంతం చేసే, గుల్లబార్చే వానపాములు ఎన్నో చస్తున్నాయి. మామూలు పాములు, ఎలుకలు వగైరా ఎన్నో జంతువులు చస్తున్నాయి. ఆ జంతువులు, పక్షులూ మన పంటలకు చేసే మేలును మనం కోల్పోతున్నాం. అదీగాక పురుగు మందుల అవశేషాలు పంటలపై మిగిలిపోవడంతో వాటికి ధరలు పలకటం లేదు. క్రిమి సంహారక మందుల అవశేషాలు మిగిలిన పంట గింజలను మనం తినడంతో కేన్సర్, టి.బి., గుండె జబ్బులు వస్తున్నాయి.

ప్రకృతి సహజంగా మనకు ఇచ్చిన రక్షణ కవచం ఈ పురుగులు, జంతువులు. “అవి ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవిస్తాయి. అందువల్ల మన పంటలు హాయిగా పెరుగుతాయి. మనం భగవంతుడు మనకిచ్చిన సహజ ప్రకృతిని కాపాడుకుందాం. ఆరోగ్యంగా జీవిద్దాం. మన చుట్టూ ఉన్న పక్షులను, జంతువులను రక్షిద్దాం.

AP Board 9th Class Telugu Solutions Chapter 11 ధర్మదీక్ష

ఈ) ప్రశంసాత్మకంగా రాయండి.

* సామ్య తొమ్మిదో తరగతి చదువుతున్నది. ఆమెకు పిచ్చుకలంటే మహా ప్రేమ. వాటికోసం అపార్టుమెంటు బాల్కనీలోనే కుండీల్లో చెట్లు పెంచింది. కొన్నాళ్ళకు ఆ పూలచెట్ల మధ్యే పిచ్చుకలు గూళ్ళు కట్టుకున్నాయి. గుడ్లు పెట్టాయి. పొదిగాయి. సౌమ్య గింజలు చల్లి, నీళ్లు పెట్టి వాటి ఆలనాపాలనా చూస్తుండేది.
ఆమె ప్రయత్నాన్ని అభినందిస్తూ పదివాక్యాలు రాయండి.
జవాబు:
స్నేహశీలి సౌమ్యకు శుభాభినందనలు.

ఈ రోజుల్లో జంతు ప్రేమికులు ఎక్కువగా ఉన్నారు. నీకు పిచ్చుకలంటే ఇష్టమనీ, నీకు పెద్దగా సావకాశం లేకపోయినా, మీ బాల్కనీ కుండీల్లో పెరిగిన మొక్కల మధ్య పిచ్చుకలను పెంచుతున్నావని తెలిసింది. చాలా సంతోషం.

నిజానికి పిచ్చుకలు చాలా అందంగా, ముద్దు వస్తుంటాయి. నీవు వాటిని రోజూ ఏమి వేసి పెంచుతున్నావు? మనతోటి జంతువులను ప్రేమించి, రక్షించడం మంచి అలవాటు. నాకు కూడా కుక్కలంటే ఇష్టం. మా ఇంట్లో నాలుగు రకాల జాతుల కుక్కల్ని పెంచుతున్నాను. సోనియాగాంధీ తోడి కోడలికి కూడా జంతువులంటే గొప్ప ఇష్టం. నీ పక్షి ప్రేమకు, నా మనఃపూర్వక అభినందనచందనం. నాకు కూడా చిలుకల్ని పెంచాలని ఉంది. పక్షుల పెంపకంలో నీ సలహాలు నాకు చాలా అవసరం. – ఉంటా. బై.బై.

IV. ప్రాజెక్టు పని

* మీ పాఠ్యాంశంలోని జాతీయాలను సేకరించండి. వాటితోపాటు మరికొన్ని జాతీయాలను సేకరించండి. వివరించండి. ప్రదర్శించండి.
జవాబు:
విద్యార్థి కృత్యం.

III. భాషాంశాలు

పదజాలం

అ) పేరా చదివి గీత గీసిన పదాలను ఏ అర్థంలో వాడారో రాయండి.
నందగోపునికి అన్నం కంటపడగానే పంచప్రాణాలూ లేచి వచ్చాయి. గతరాత్రినించి ఆ క్షణం వరకూ అతడాకటితో నకనకలాడుతున్నాడు. ఆకలితో నవనాడులు కుంగిపోతున్నాయి.

1. పంచప్రాణాలూ లేచి రావడం
జవాబు:
శరీరంలో తిరిగి సత్తువ రావడం

2. ఆకలితో నకనకలాడటం
జవాబు:
ఆకలితో నీరసపడడం

3. నవనాడులు కుంగిపోవడం
జవాబు:
బాగా దిగాలు పడడం

ఆ) కింది పదాలకు సమానార్థకాలు రాయండి.
1) గోధూళి వేళ = సాయం సమయం (ఆవులు ఇళ్ళకు తిరిగి వచ్చే సమయం)
2) ఆలమంద = ఆవుల గుంపు
3) తీర్థప్రజ = తీర్థమునకు వచ్చిన జనం
4) గాలించు = వెదుకు
5) విడిది = అతిథుల వసతి గృహం
6) ఉవ్విళ్లూరు = బాగా కోరుకొను
7) అనతిదూరం = కొద్ది దూరం

ఇ) వాక్యాన్ని చదివి, జాతీయాల అర్థాన్ని ఊహించి రాయండి.

1) మీ ఆప్యాయతకు నా హృదయం కరిగిపోయింది.
జవాబు:
హృదయం కరిగిపోయింది = ద్రవించింది

2) మేధావులందరూ చర్చలలో తలమునకలయ్యారు.
జవాబు:
తలమునకలయ్యారు = మునిగిపోవు

3) ఆవు అరుపు విన్నాక నందగోపాలుడికి బుద్ధుడి దగ్గరకు వెళ్ళడానికి కాలుసాగలేదు.
జవాబు:
కాలుసాగలేదు = ముందడుగు పడలేదు.

వ్యాకరణం

అ) కింది వానికి వ్యతిరేకార్థక వాక్యాలు రాయండి.
1. ఒకే ఒక్క ఆవు తిరిగి రాలేదు. .
జవాబు:
ఒకే ఒక్క ఆవు తిరిగి వచ్చింది.

2. రాత్రి తెల్లవార్లూ నందగోపుడు ఆరాటపడ్డాడు.
జవాబు:
రాత్రి తెల్లవార్లూ నందగోపుడు ఆరాటపడలేదు.

3. నందుడతనికి తన ప్రయాణ కారణం తెలియజేశాడు.
జవాబు:
నందుడతనికి తన ప్రయాణ కారణం తెలియజేయలేదు.

4. ఒక్క పలుకైనా ఆయన నోటినుండి వెలువడలేదు.
జవాబు:
ఒక్క పలుకైనా ఆయన నోటినుండి వెలువడింది.

AP Board 9th Class Telugu Solutions Chapter 11 ధర్మదీక్ష

ఆ) కింది వాటిని సంయుక్త వాక్యాలుగా రాయండి.

1. బుద్ధదేవుడు, వటవృక్షచ్ఛాయకు వచ్చాడు. వెంటనే అష్టాంగ ధర్మప్రవచనం ప్రారంభమైంది.
జవాబు:
బుద్ధదేవుడు వటవృక్షచ్ఛాయకు వచ్చిన వెంటనే అష్టాంగ ధర్మప్రవచనం ప్రారంభమైంది. (సంయుక్త వాక్యం)

2. లేగ మూలంగా నందగోపునికి అదృష్టం కలిగింది. లేగదూడను నందగోపుడు ముద్దుపెట్టుకొన్నాడు.
జవాబు:
లేగ మూలంగా నందగోపునికి అదృష్టం కలిగింది కాన లేగదూడను నందగోపుడు ముద్దు పెట్టుకొన్నాడు. (సంయుక్త వాక్యం)

ఇ) విరామ చిహ్నాలు గుర్తించండి.
నాయనా నందగోపాలకుని సరళ వర్తనం సాధుస్వభావం మీరెరుగరు ఎంతగా ఆకటి చిచ్చు వేధించినా అతడు తన గోపాలక ధర్మం విస్మరించలేదు అతని గోవాత్సల్యం అపారం ముప్పయి క్రోశాల దూరం నడిచి ఇంతగా శ్రమపడి ఈ ఆళవీ గ్రామానికెందుకు వచ్చానో మీరెవరైనా ఎరుగుదురా
జవాబు:
“నాయనా! నందగోపాలుని సరళవర్తనం, సాధుస్వభావం మీరెరుగరు. ఎంతగా ఆకటి చిచ్చు వేధించినా, అతడు తన గోపాలక ధర్మం విస్మరించలేదు ! అతని గోవాత్సల్యం అపారం ! ముప్పయి క్రోశాల దూరం నడిచి, ఇంతగా శ్రమపడి ఈ ఆళవీ గ్రామానికెందుకు వచ్చానో మీరెవరైనా ఎరుగుదురా?”

ఈ) పాఠంలోని పది సమాస పదాలను రాయండి. వాటికి విగ్రహవాక్యాలు రాయండి. ఏ సమాసమో తెలపండి.
1) భాను బింబం = భానుని యొక్క బింబం – షష్ఠీ తత్పురుష సమాసం
2) ధర్మబోధ = ధర్మము యొక్క బోధ షష్ఠీ తత్పురుష సమాసం
3) విశాలనేత్రాలు = విశాలమైన నేత్రాలు విశేషణ పూర్వపద కర్మధారయం
4) వృక్షచ్ఛాయ = వృక్షము యొక్క ఛాయ షష్ఠీ తత్పురుష సమాసం
5) పంచప్రాణాలు = పంచ సంఖ్య గల ప్రాణాలు ద్విగు సమాసం
6) నవనాడులు = నవ సంఖ్య గల నాడులు – ద్విగు సమాసం
7) అన్నపానాలు = అన్నమును, పానమును ద్వంద్వ సమాసం
8) ముప్పయి క్రోశాలు = ముప్పది సంఖ్యగల క్రోశాలు – ద్విగు సమాసం
9) ఆనంద తరంగాలు = ఆనందము అనెడి తరంగాలు – రూపక సమాసం
10) ప్రశాంత స్వరం = ప్రశాంతమైన స్వరం – విశేషణ పూర్వపద కర్మధారయం
11) క్షుధార్తుడు = క్షుధతో ఆర్తుడు – తృతీయా తత్పురుషం

AP Board 9th Class Telugu Solutions Chapter 11 ధర్మదీక్ష

ఉ) మీరు తెలుసుకున్న అలంకారాలు ఏవి? ఈ పాతంలో వాటికి సంబంధించిన ఉదాహరణలు ఉన్నాయా? వాటిని రాయండి. లేని వాటికి మీరే సొంతంగా రాయండి.

1) ఉపమాలంకారం :
ఉపమానోపమేయాలకు చక్కని పోలిక చెప్పడం.
పాఠంలోని ఉదాహరణ :
1) గౌతమదేవుని ముఖ జ్యోతి అప్పుడప్పుడే ఉదయిస్తున్న భాను బింబంలా మెరిసింది.
2) వారి మనస్సు అప్పుడే తీసిన వెన్నపూస లాంటిది. అతంతు

2) రూపకాలంకారం :
ఉపమాన, ఉపమేయాలకు అభేదం చెప్పడం.
పాఠంలో ఉదాహరణ:
1) ముఖజ్యోతి (ముఖం అనెడి జ్యోతి) (రూపకాలంకారము)
2) ఆనంద తరంగాలలో తలమునకలైనారు (రూపకాలంకారము)

3) దృష్టాంతాలంకారం :
ఉపమానోపమేయాలు వేరైనా బింబ ప్రతిబింబ భావంతో నిర్దేశించడం,
ఉదాహరణ :
ఓ రాజా ! నీవే కీర్తిమంతుడవు. చంద్రుడే కాంతిమంతుడు.

4) స్వభావోక్తి అలంకారం :
ఉన్నది ఉన్నట్లు రమణీయంగా వర్ణించడం.
ఉదాహరణ :
లేళ్ళు బిత్తరి చూపులు చూస్తూ, చెవులు రిక్కించి ఎగిరి ఎగిరి గంతులు వేస్తున్నాయి.

5) ఉత్ప్రేక్షాలంకారం :
ఉపమేయాన్ని చూసి ఉపమానంగా ఊహించడం.
ఉదాహరణ :
మా ఇంటి ముందు ఉన్న పెద్ద కుక్కను చూసి, సింహమేమో అని భయపడ్డాను.

6) వృత్త్యనుప్రాస అలంకారం :
ఒకే అక్షరం, అనేకసార్లు రావడాన్ని వృత్త్యనుప్రాస అంటారు.
ఉదాహరణ :
నాయనా ! నేను నిన్నేమన్నా అన్నానా? నీవు నన్నేమన్నా అన్నావా?

7) అంత్యాను ప్రాసాలంకారం :
ఒక అక్షరం, లేదా రెండుమూడు అక్షరాలు, వాక్యం చివర మాటిమాటికీ వస్తే దాన్ని అంత్యానుప్రాసాలంకారం అంటారు.
ఉదాహరణ :
భాగవతమున భక్తి
భారతములో యుక్తి
రామకథలో రక్తి – ఓ కూనలమ్మా !

8) లాటాను ప్రాసాలంకారం :
అర్థభేదము లేకపోయినా, తాత్పర్యభేదం కల పదాలు ఒకదానివెంట మరొకటి రావడం.
ఉదాహరణ :
కమలాక్షునర్చించు కరములు కరములు.

9) ఛేకానుప్రాసాలంకారం :
అర్థభేదం గల జంటపదాలు వెంటవెంటనే రావడం ఛేకానుప్రాసాలంకారం,
ఉదాహరణ :
వందవందనాలు.

9th Class Telugu 11th Lesson ధర్మదీక్ష కవి పరిచయం

పిలకా గణపతిశాస్త్రి 1911 ఫిబ్రవరి 24న జన్మించారు. తూర్పుగోదావరి జిల్లాలోని కట్టుంగ వీరి స్వస్థలం. విజయనగరంలో విద్యనభ్యసించారు. సాహిత్య విద్యా ప్రవీణ, ఉభయభాషా ప్రవీణ పూర్తిచేశారు. రత్నాపహారం వీరి తొలిరచన. మణిదీపిక, ప్రాచీన గాథాలహరి, విశాలనేత్రాలు, కాశ్మీర పట్టమహిషి, నాగమల్లిక, అందని చందమామ వీరి ఇతర రచనలు. సంస్కృతం, బెంగాలీ భాషల నుంచి అనేక అనువాదాలు చేశారు. సరళమైన అలంకారిక శైలిలో వీరి రచన సాగింది.

కలిన పదాలకు అర్థాలు

గోధూళి వేళ = సాయం సమయం ; ఆవులు ఇళ్ళకు తిరిగి వచ్చే సమయం
ఆలమంద = ఆవుల గుంపు
గోవత్సాలు = ఆవు దూడలు
కుడుచుకుంటున్నాయి = చప్పరించుచున్నాయి (త్రాగుచున్నాయి)
కలకలలాడింది = ఆనందంగా ఉంది
సయించలేదు = ఇష్టం కాలేదు
ఆరాటపడు = ఆత్రపడు
= సంతాపము నొందు
అరుణోదయ కాంతులు (అరుణ +ఉదయ కాంతులు) = సూర్యోదయ కాంతులు
నూతనానందావేశాలు (నూతన+ఆనంద+ఆవేశాలు) = కొత్త ఆనందము యొక్క ఉద్రేకాలు
హృదయాంతరాళం (హృదయ+అంతరాళం) = హృదయం మధ్య చోటు
సందర్శనభాగ్యం = చూచే అదృష్టం
నిట్టూర్పు = దీర్ఘ నిశ్వాసము
వాలకం = రూపు
పులివాత = పులినోట్లో
ఆరాటం = ఆవుల పాక
తథాగతుడు = బుద్ధుడు
పాపలు = చిన్న పిల్లలు
కోడెదూడ = మగ ఆవుదూడ
పెయ్యదూడ = ఆడ దూడ

AP Board 9th Class Telugu Solutions Chapter 11 ధర్మదీక్ష

గౌతమదేవుడు = బుద్ధుడు
అధమ పక్షం = (మిక్కిలి చెడ్డ పక్షం) కనీసం
అంగలు = చాచివేసిన రెండు అడుగులు చోటులు
మిట్ట మధ్యాహ్నం = మధ్యాహ్న కాలము
దహించి వేయు = కాల్చు
పిడచగట్టుకుపోవు = నోరు ఎండిపోవు
స్పురించింది = తోచింది
ఆర్తనాదం = బాధతో అరిచే అరుపు
పెన్నిధి = పెద్ద నిధి
తికమకలు = బాధలు (తొట్రుపాటులు)
పొలిమేర = సరిహద్దు
సంకల్పం = ఉద్దేశ్యం
అధమం = కనీసం
మహామహుడు = గొప్పవాడు
ఉవ్విళ్ళూరిపోవు = బాగా కోరుకొను
శిష్యగణం = శిష్యుల సమూహం
విశ్రమించిన = ఆయాసం తీర్చుకొనిన
వటవృక్షం = మజ్జిచెట్టు
కాషాయాంబరధారులు = కాషాయ వస్త్రాన్ని ధరించినవారు.
భిక్షుకులు = సన్యాసులు
ముఖజ్యోతి = ముఖ ప్రకాశము
భాను బింబము = సూర్య బింబము
విడుదులు = అతిథుల వసతి గృహాలు
ఆసన్నము+అగు = సమీపించడం ; దగ్గరికి రావడం
వంశపారంపర్యత: = వంశములో ఒకరి తరువాత ఒకరుగా
అనుమతించలేదు = అంగీకరించలేదు
ప్రాధేయపడ్డారు = వేడుకున్నారు
విసర్జించు = విడుచు
అనుజ్ఞ = అంగీకారము
శ్రమణకులు = బౌద్ధ ధర్మాన్ని పాటిస్తూ బుద్ధుడి శిష్యులుగా ఉండేవారు.
వట తరుచ్ఛాయ = మట్టిచెట్టు నీడ
సమాసీనులు = చక్కగా కూర్చున్నవారు
యామాలకాలం = జాముల కాలం ; యామము అంటే 3 గంటలు
సుఖాసనం (సుఖ +ఆసనం) = సుఖమైన ఆసనం
అవలోకిస్తున్నాడు = చూస్తున్నాడు
ఆలకించు = విను
ఉత్కంఠ = ఇష్టవస్తు ప్రాప్తికై వేగిరపాటు
తహతహలాడిపోవు = వేగిరపడు
పలుకు = మాట
నేత్రాలు = కన్నులు
నిరీక్షించు = ఎదురుచూచు
స్ఫురిస్తున్నాయి = తోస్తున్నాయి
నిరీక్షణ = ఎదురుచూపు
అవగాహన = తెలిసికొనడం
అనతిదూరం = కొద్ది దూరం
పరికిస్తున్నాయి = పరీక్షిస్తున్నాయి
ఆత్రంగా = తొందరగా
ఆగమనము = రాక
సాగిలపడ్డాడు = సాష్టాంగ నమస్కారం చేశాడు
దోసిలి ఒగ్గి = చేతులు జోడించి
ఆత్రం = తొందర
పంచప్రాణాలు = ఐదు ప్రాణాలు 1) ప్రాణము 2) అపానము 3) వ్యానము 4) ఉదానము 5) సమానము
నవనాడులు = తొమ్మిది నాడులు (నాడులు అన్నీ)
నకనకలాడు = ఆకలిచే బాధపడు
పలుపు = పశువుల మెడకు కట్టు త్రాడు
ఆప్యాయత = ప్రేమ ప్రత్యక్షము = ఎదుట ఉన్నది
ద్రవించి = కరగి
కుశల ప్రశ్నలు = క్షేమ సమాచారాలను గూర్చి ప్రశ్నలు
సాముద్రిక విషయాలు = హస్తరేఖాది లక్షణాలను బట్టి శుభా శుభాలు తెలిపే శాస్త్ర విషయాలు
ఆచార్యదేవుడు = గురువు
సందేహాలు = అనుమానాలు
అభ్యర్థించారు = కోరారు
చనువు = ప్రేమ
ఉపదేశించు = బోధించు
ప్రసంగాలు = ఉపన్యాసాలు
విడ్డూరము = ఆశ్చర్యము
అష్టాంగ ధర్మ ప్రవచనం = ఎనిమిది అంగములైన ధర్మాలు చెప్పడం: 1) సమ్యక్ దృష్టి 2) సమ్యక్ వాక్కు 3) సమ్యక్ కర్మ 4) సమ్యక్ సంకల్పం లక్ష్యం 5) సమ్యక్ చేతన, మనస్తత్వం 6) సమ్యక్ జీవనం 7) సమ్యక్ వ్యాయామం 8) సమ్యక్ భావన

AP Board 9th Class Telugu Solutions Chapter 11 ధర్మదీక్ష

ఆనందతరంగాలు = సంతోషపు కెరటాలు
తలమునకలగు = ఎక్కువగు
అలవోకగా = అప్రయత్నముగా ; (లీలగా)
ప్రవచనం = చక్కగా మాట్లాడడం
నిగ్రహం = సంయమనం
శ్రమణకులు = బౌద్ధ భిక్షువులు
గుసగుసలు = రహస్యం మాటలు
ఉపేక్షించి = అశ్రద్ధ చేసి
పక్షపాతం = ఒకదానియందభిమానం
సమ్యక్ సంబుద్ధుడు = బుద్ధుడు
స్వరం = ధ్వని
క్షుధార్తుడు = ఆకలితో బాధపడేవాడు
క్షుధ = ఆకలి
దుస్సహము = సహింపరానిది
యాతన = తీవ్రవేదన
సమ్యగుృద్ధి (సమ్యక్ + బుద్ధి) = సరియైన బుద్ధి
నిర్వాణం = మోక్షం
కరతలామలకం (కరతల+ ఆమలకం) – బాగా తెలిసినది (అరచేతిలో ఉసిరిక)
పశ్చాత్తప్తులు = తాముచేసింది తప్పని తెలిసి, అలా చేశామే అని బాధపడేవారు
ఆకటిచిచ్చు = ఆకలి మంట
గోవాత్సల్యం = ఆవుపై ప్రేమ
అపారం = అంతులేనిది
గో, గోవత్సాలు = ఆవు, ఆవు దూడలు
మంద = ఆవులు మొదలైన పశువుల గుంపు
అన్నపానాలు = అన్నము, పానము (తిండి, నీరు)
తాండవించాయి. = కదలియాడాయి
మురిసిపోయాడు = సంతోషించాడు
కుడుచుకొని = చప్పరించి, త్రాగి

AP Board 9th Class Telugu Solutions Chapter 10 బతుకు పుస్తకం

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions Chapter 10 బతుకు పుస్తకం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions 10th Lesson బతుకు పుస్తకం

9th Class Telugu 10th Lesson బతుకు పుస్తకం Textbook Questions and Answers

చదవండి-ఆలోచించండి-చెప్పండి

పుస్తకాలకు రెక్కలుండవు. కాని వాటిని చదివితే మనకు ఎన్నెన్నో రెక్కలు మొలచినట్లుగా ఉంటుంది. ఆ రెక్కలు జ్ఞానాన్ని, ఆలోచనా శక్తిని, సృజనాత్మకతా నైపుణ్యాన్ని, లోకపరిశీలనా దృష్టిని కలిగిస్తాయి. ఏది మంచి పుస్తకం, ఏ పుస్తకాన్ని చదవాలనే ఎంపికలో పుస్తక పరిచయ వాక్యాలు మార్గదర్శనం చేస్తాయి.

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
ఈ పేరా ఏ విషయాన్ని తెలుపుతుంది?
జవాబు:
ఈ పేరా పుస్తకపఠనం, దాని ప్రయోజనాలను గూర్చి తెలుపుతుంది.

ప్రశ్న 2.
పుస్తకాలు చదవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
జవాబు:
పుస్తకాలు చదివితే రెక్కలు మొలచినట్లుగా ఉంటుంది. ఆ రెక్కలు జ్ఞానాన్ని, ఆలోచనా శక్తిని, సృజనాత్మకతా నైపుణ్యాన్ని, లోకపరిశీలనా దృష్టిని కలిగిస్తాయి.

ప్రశ్న 3.
‘ఏదైనా పుస్తకాన్ని చదవాలి’ అనే ఆసక్తిని కలిగించే అంశమేది?
జవాబు:
‘ఏదైనా పుస్తకాన్ని చదవాలి’ అనే ఆసక్తిని కలిగించే అంశం, ఆ పుస్తకానికి సంబంధించిన ముందుమాట, పరిచయ వాక్యాలు, అభిప్రాయాలు, పుస్తక పరిచయాలు అనేవి.

AP Board 9th Class Telugu Solutions Chapter 10 బతుకు పుస్తకం

ప్రశ్న 4.
మీరు ఏ పుస్తకాన్ని ఐనా చదవడానికి ముందు ఏం చేస్తారు?
జవాబు:
నేను పుస్తకాన్ని చదవడానికి ముందు, ఆ పుస్తకం గురించి రచయిత రాసిన తొలిపలుకు, ఆ రచనను గురించి ఇతరుల అభిప్రాయాల్ని చదువుతాను.

ప్రశ్న 5.
ఏదైనా పుస్తకాన్ని చదవాలనే కోరిక మీకు ఎలా కలుగుతుంది?
జవాబు:
ఏదైనా పుస్తకాన్ని చదవాలనే కోరిక, ఆ పుస్తక పరిచయ వాక్యాల ద్వారా కలుగుతుంది. ఏ పుస్తకాన్ని చదవాలనే ఎంపికలో ఆ పుస్తక పరిచయ వాక్యాలు మనకు దారిని చూపిస్తాయి. ఆ పుస్తకాన్ని చదివిన పుస్తక పరిచయ రచయితల వాక్యాల ద్వారా, ఆ పుస్తకాన్ని చదవాలనే కోరిక కలుగుతుంది.

ఇవి చేయండి

1. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది అంశాల ఆధారంగా మాట్లాడండి.

ప్రశ్న 1.
ఉప్పల లక్ష్మణరావుగారు రాసిన మరో పుస్తకం ఏది? ఆ పుస్తకంపై సమీక్షకురాలి స్పందన ఏమిటి?
జవాబు:
ఉప్పల లక్ష్మణరావు గారు రాసిన మరో పుస్తకం, “అతడు – ఆమె” అనే నవల. “అతడు – ఆమె” చదివినప్పుడు దశాబ్దాల తరబడి తనలో పేరుకుపోయిన నీరసం, పటాపంచలైపోయిందనీ, ఎక్కడలేని ఉత్సాహమూ పుట్టుకొచ్చిందనీ రచయిత్రి రాసింది. తనతో సమంగా ప్రతి ఒక్కడూ జీవించాలనే మంచి ఆశయం గల వ్యక్తి తప్పించి, మరొకరు ఆ గ్రంథం రాయలేరని తనకు అనిపించిందని రచయిత్రి రాసింది.

ప్రశ్న 2.
కవులు, రచయితలు రాసిన పుస్తకాలను అందరికీ పరిచయం చేయడానికి పుస్తకావిష్కరణ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఏం చేస్తారో చెప్పండి.
జవాబు:
పుస్తకావిష్కరణ సభకు ఒకరు అధ్యక్షులుగా ఉంటారు. కొత్త పుస్తకాన్ని పేపరులో చుట్టి ఉంచుతారు. ఒకరు ఆ పేపరు విప్పి, సభలోని వారికి ఆ పుస్తకాన్ని చూపిస్తారు. దాన్నే “ఆవిష్కరణ” అంటారు. ఆ పుస్తకంలో ఉన్న విషయాన్ని గూర్చి ఒకరు సమీక్ష చేస్తారు. దానిని “కావ్య సమీక్ష” అంటారు. సభలో ఉన్నవారికి ఆ పుస్తకంలోని విషయాలను సమీక్షకులు వివరించి చెపుతారు. రచయిత తన గ్రంథాన్ని గూర్చి చెపుతాడు. రచయితకు సన్మానం చేస్తారు. అధ్యక్షులు ప్రారంభంలోను, చివరలోనూ తమ అభిప్రాయాన్ని చెప్పి, రచయితను అభినందిస్తారు. పుస్తకాలను సభలో అందరికీ ఉచితంగా కానీ, తక్కువ ధరకు కానీ ఇస్తారు.

AP Board 9th Class Telugu Solutions Chapter 10 బతుకు పుస్తకం

ఆ) పాఠ్యాంశం ఆధారంగా కింది మాటలను ఏ సందర్భంలో ఎవరు అన్నారో రాయండి.

ప్రశ్న 1.
“అదీ శిశువుముందు శిరసొగ్గే నిరహంకారమంటే!”
జవాబు:
ఉప్పల లక్ష్మణరావు గారి తాతగార్ని గూర్చి, ఈ పాఠ్యరచయిత్రి సావిత్రి గారు చెప్పిన మాట ఇది. లక్ష్మణరావు గారి తాతగార్ని వారి మనుమడు “తాతగారూ ! మీరసలు దేవుణ్ణి చూశారా?” అని అడిగాడట. ఆ ప్రశ్నకు జవాబుగా ఆయన తాతగారు, తాను దేవుణ్ణి చూడలేదనీ, ఉన్నాడో లేడో తాను చెప్పలేననీ, కష్టాలు పంచుకొనేవాడు ఒకడున్నాడంటే బావుంటుంది కదా ! అందుకే ప్రార్థిస్తున్నాననీ జవాబు చెప్పారట.

లక్ష్మణరావుగారి తాతగారి ఆ నిజాయితీని రచయిత్రి మెచ్చుకొని, ఆ తాతగారిది, శిశువు ముందు శిరసొగ్గే నిరహంకారమని ప్రశంసించిన సందర్భంలోనిది.

ప్రశ్న 2.
“దేశపు తిండి గింజల సమస్య తీర్చని పరిశోధనలెందుకు ?”
జవాబు:
ఉప్పల లక్ష్మణరావు గారు, గ్రిప్సువాలు యూనివర్సిటీలో ఆయనకు ఇష్టమైన బోటనీలో పరిశోధనలు చేసేవారు. కొంతకాలం అయ్యాక, లక్ష్మణరావుగారికి, తన పరిశోధనలు మనదేశంలోని తిండిగింజల సమస్యను తీర్చలేవనీ, ఒకవేళ ఉపయోగించినా, ఆ ఫలితాలను వినియోగించుకొనేందుకు విస్తీర్ణమైన పొలాలు మనదేశంలో లభించవనీ, అనిపించింది. దానితో తాను చేసే పరిశోధనలు మానివేసి, మన దేశానికి తిరిగివచ్చి అనువాదక వృత్తిని చేపట్టారు. దేశం తిండిగింజల సమస్య తీర్చని పరిశోధనలు ఎందుకని లక్ష్మణరావుగారు తనలో తాను తర్కించుకొన్న సందర్భంలోని మాట ఇది.

ప్రశ్న 3.
“ఇది అంతర్జాతీయ సమస్యగా మారుతుంది. జాగ్రత్త!”
జవాబు:
లక్ష్మణరావు గారి భార్య ‘మెల్లీ’ తూర్పుగోదావరి జిల్లా పోలీసు సూపరింటెండెంటు ఆలీఖానును, ఈ విధంగా బెదిరించింది. మెల్లీ ఖాదీ ప్రదర్శనలో పాల్గొంటోంది. అలా పాల్గొనడం నిషిద్ధమని జి.వో. లేదు. ఆలీఖాను మెల్లీని ఖాదీ ప్రదర్శనలో పాల్గొనవద్దని బెదిరించాడు. అలా నిషిద్ధం కాని పనిని, వద్దని నిషేధిస్తే, తాను స్విట్జర్లాండ్ దేశస్థురాలు కాబట్టి, తాను ఆ విషయాన్ని ఆ దేశపు రాయబారికి ఫిర్యాదు చేస్తాననీ, అది అంతర్జాతీయ సమస్యగా మారుతుందనీ, మెల్లీ ఆలీఖానను బెదిరించిన సందర్భంలోనిది.

AP Board 9th Class Telugu Solutions Chapter 10 బతుకు పుస్తకం

ఇ) పాఠం ఆధారంగా కింది పట్టికను పూరించండి.
AP Board 9th Class Telugu Solutions Chapter 10 బతుకు పుస్తకం 1

ఈ) పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రశ్న 1.
రచయిత్రి ఈ పాఠం ద్వారా ఏ పుస్తకం గురించి పరిచయం చేసింది?
జవాబు:
రచయిత్రి సావిత్రిగారు, ఈ పాఠం ద్వారా, ఉప్పల లక్ష్మణరావుగారు రచించిన “బతుకు పుస్తకం” అనే, వారి జీవిత చరిత్రను గూర్చి పరిచయం చేసింది.

ప్రశ్న 2.
మెల్లీ దుందుడుకు స్వభావానికి చెందిన సంఘటనలు తెలపండి.
జవాబు:
1) మెల్లీ సాహసానికి మరో పేరు. ఈమె తనవంటి వారికి అవమానము జరిగినా, ఒక మంచిపనికి అవరోధం జరిగినా, సహించేది కాదు. ఒకసారి రాజోలు నుండి నర్సాపురం వెళ్ళే లాంచి ఎవరో పెద్ద అధికారి కోసం ఆపేశారట. వెంటనే మెల్లీ ఆ చీకట్లో ఈత దుస్తులు వేసుకొని, గోదావరిలోకి దూకి, ఐదు గంటలలో ఆ 16 మైళ్ళ దూరాన్ని, దుస్సాహసంతో ఈదింది.

2) ఒకసారి తూర్పు గోదావరి జిల్లా పోలీసు సూపరింటెండెంటు ఆలీఖాన్ మెల్లీని, ఖాదీ ప్రదర్శనలో పాల్గొనవద్దని హెచ్చరించాడు. అయితే అటువంటి ప్రదర్శన చేయడం నిషిద్ధమనే జి.వో. ఏమీలేదు. అప్పుడు మెల్లీ తనను ప్రదర్శనలో పాల్గొనకుండా నిషేధిస్తే, తాను స్విట్జర్లాండ్ దేశస్థురాలు కాబట్టి, తాను ఆ విషయాన్ని వారి రాయబారికి ఫిర్యాదు చేస్తాననీ, అది అంతర్జాతీయ సమస్యగా మారుతుందనీ ఆలీఖానను బెదిరించింది.

3) గాంధీజీ సబర్మతి ఆశ్రమంలో స్త్రీలకు గస్తీని నిషేధించగా, ఈమె సత్యాగ్రహం చేసి, స్త్రీలు కూడా గస్తీకి అర్హులేనని అంగీకరించేలా చేసింది.

ప్రశ్న 3.
గ్రంథాలు, పుస్తకాలు ఎలా ఉండాలని రచయిత్రి తెలియజేసింది?
జవాబు:
గ్రంథాలు నిరుత్యాహికి ఉత్సాహాన్నీ, రికామీకి బాధ్యతనూ, అజ్ఞానికైనా, జిజ్ఞాసువుకైనా విజ్ఞానాన్నీ, తగిన ఆర్ధతనూ తప్పక అందించగలగాలి. అదేదో మహాగ్రంథమని, తమకు అర్థం కాదనీ అనిపించకూడదు. ఆ గ్రంథం ఒక డైరీలా, స్నేహితుని లేఖలా, దగ్గరగా ఉండాలి. పాఠకుడు ఓపిక తెచ్చుకొని చదవాలి అనిపించాలి. రచయిత తన మనస్సులోని బాధను కప్పి పుచ్చకుండా తెలపాలి. ఇతని బాధను విందాం, అనిపించేటట్లు నిరహంకారంగా, ఆత్మీయంగా ఉండాలి. చదువుతున్నంత సేపూ హాయి కలగాలి. ఇన్నాళ్ళకైనా ఇంత మంచిపుస్తకం చదవగలిగాను కదా అని అనిపించాలి. వివరణ స్పష్టంగా ఉండాలి. ఏదో కొత్త విషయం చెప్పాలి. ఎంతో కొంత కార్యశీలత రేపాలి. కదపాలి. కుదపాలి. మంచిదారిని చూపించి, మనశ్శాంతిని కలిగించాలి.

ప్రశ్న 4.
లక్ష్మణరావుగారు పరిశోధనరంగం నుంచి రచనారంగం వైపు ఎందుకు మారారు?
జవాబు:
లక్ష్మణరావుగారు, చెప్సువాలు యూనివర్సిటీలో తనకు ఇష్టమైన బోటనీలో పరిశోధనలు చేసేవారు. కొన్నివేలు ఖర్చుచేసి జరిపిన తన పరిశోధన, దేశానికి ఉపయోగంగా ఉంటుందని లక్ష్మణరావుగారికి నమ్మకం కలుగలేదు. దేశం తిండిగింజల సమస్యను తీర్చని ఆ పరిశోధనలు ఎందుకు ? అని ఆయనకు అనిపించింది. ఒకవేళ ఆ పరిశోధనలు ఉపయోగపడినా, ఆ ఫలితాల్ని వినియోగించేందుకు విస్తీర్ణమైన పొలాలు మనకు లభించవని ఆయన గుర్తించారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఆ పరిశోధనలు, ధనిక రైతులకే గాని, సామాన్యునికి ఉపకరించవని ఆయన గ్రహించారు. అందువల్ల తనలో తాను బాగా తర్కించుకొని, తనకు బాగా ప్రాణప్రదమైన బోటనీ పరిశోధనలు మానివేసి, ప్రగతి ప్రచురణాలయంలో అనువాదక వృత్తిని వారు చేపట్టారు.

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

అ) క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
సమాజానికి ఎటువంటి రచయితల అవసరం ఉంది?
జవాబు:
సమాజానికి లక్ష్మణరావుగారి వంటి నిజాయితీ గల సాహితీమూర్తుల ఆవిర్భావం, ఒక చారిత్రక అవసరం. నిరుత్సాహికి, ఉత్సాహాన్నీ, రికామీకి బాధ్యతనీ, అజ్ఞానికైనా, జిజ్ఞాసువుకైనా విజ్ఞానాన్ని తగుమాత్రపు ఆర్ధతనూ అందించగలిగిన పుస్తకాలను రచించే రచయిత అవసరం. రచయిత ఎంతో కొంత కార్యశీలత రేపాలి. పాఠకుని కదపాలి, కుదపాలి, మంచిదారిని చూపాలి. మనశ్శాంతిని కలిగించాలి.

AP Board 9th Class Telugu Solutions Chapter 10 బతుకు పుస్తకం

ప్రశ్న 2.
“లక్ష్మణరావుగారి విజ్ఞత, ప్రపంచం పట్ల ఆయన చూపిన బాధ్యత ఎప్పటికీ విస్మరింపరానిది” అని సావిత్రిగారు అనడం సరైందేనని మీరు భావిస్తున్నారా ? ఎందుకు?
జవాబు:
లక్ష్మణరావుగారి విజ్ఞత, ప్రపంచం పట్ల ఆయన చూపిన బాధ్యత, మరువరానిదని సావిత్రిగారు చెప్పిన మాట, సరయినదే అని చెప్పాలి. మనం చేసే పనులు మనకే కాక, ప్రపంచానికి కూడా మేలు చేయాలన్న లక్ష్మణరావు గారి సంకల్పం, ఉత్తమమైనది. లక్ష్మణరావుగారు జర్మనీలో బోటనీ పరిశోధనలు చేస్తుండేవారు. కొన్ని వేలు ఖర్చుపెట్టి జరిపిన ఆ పరిశోధన, మన దేశానికి ఉపయోగకరంగా ఉంటుందనే నమ్మకం ఆయనకు కలుగలేదు. మన దేశానికి తిండి గింజల సమస్య తీర్చని ఆ పరిశోధనలు, ఎందుకని లక్ష్మణరావు గారు జర్మనీలో పరిశోధనకు స్వస్తిచెప్పి, భారతదేశానికి వచ్చి ఒక ప్రచురణాలయంలో అనువాదకుడిగా చేరారు. దీనిని బట్టి లక్ష్మణరావు గారి విజ్ఞత, ఆయన ప్రపంచం పట్ల చూపిన బాధ్యత, ఎప్పటికీ మరువరానిది అన్నది సత్యం.

ప్రశ్న 3.
హేతువాదులు ప్రశ్నించే విషయాలు ఎలాంటివై ఉంటాయి?
జవాబు:
హేతువాదులు దేవుణ్ణి చూశారా ? అని అడుగుతారు. దేవుడు కనబడడు కాబట్టి, దేవుడు లేడని వారు వాదిస్తారు. ప్రతిదాన్ని ప్రత్యక్షంగా చూస్తేనే, దాన్ని వారు నమ్ముతారు. సాధువులు, సన్యాసులు, బాబాలను వారు నమ్మరు. వారు చూపించే మహిమలు అన్నీ, గారడీలు అని హేతువాదులంటారు. విగ్రహారాధన పనికిరాదని వారు వాదిస్తారు. రాళ్ళను, రప్పలను పూజించరాదంటారు. హేతువు అంటే కారణము. ప్రతిదానికి ఏదో ఒక కారణం ఉంటుందంటారు.

ప్రశ్న 4.
కరుణ గల విజ్ఞానం అంటే ఏమిటి? కరుణ కలిగిన వారు చేసే పనులు ఏమై ఉంటాయి?
జవాబు:
‘విజ్ఞానం’ అంటే విశేషమైన జ్ఞానం. అంటే నేటి సైన్సు, ఇంజనీరింగు, డాక్టరు మొదలయిన వృత్తుల వారు ఎంత జ్ఞానం కలవారైనా, తోటి మానవులపై వారికి ‘కరుణ’ అంటే జాలి లేక దయ ఉండాలి. లక్ష్మణరావు గారి భార్య ‘మెల్లీ’ కరుణ గల విజ్ఞాని. ఆమె డాక్టరుగా ఎంతో విజ్ఞానం గడించింది. ఒకసారి పెంటబండిని ఈడ్వలేకపోతున్న ముసలివాడి కష్టాలు సహింపలేక తాను ఆ బండిని వెనుక నుంచి తోసి, అతనికి సహాయపడింది. అపుడు మెల్లి తెల్లని ఫ్రాక్ వేసుకొని, ఒక విందుకు వెడుతూ ఉంది. మెల్లీ ఆ పెంటబండిని తోసి, తన బట్టలపై పడ్డ నల్లని మరకలతోనే ఆ విందుకు వెళ్ళింది. కరుణ గల విజ్ఞానులు పైన చెప్పినటువంటి పనులు చేస్తారు.

ప్రశ్న 5.
పరిశోధనలు ఎందుకు చేస్తారు ? దీనివల్ల ఎవరికి మేలు జరగాలి? ఏఏ పరిశోధనలు సమాజానికి మేలు చేస్తాయి?
జవాబు:
పరిశోధనలు దేశానికి ఉపయోగకరంగా ఉండాలి. పరిశోధనా ఫలితాలు వినియోగించుకొనేందుకు వీలుగా ఉండాలి. పరిశోధనలు సామాన్యునికి ఉపయోగించాలి. సాంకేతిక పరిశోధనల వల్ల కలిగే లాభం, సమాజానికీ, పేద ప్రజలకీ ఉపకరించాలి. వ్యవసాయంలో చేసే పరిశోధనలు, రైతులు పంటలు ఎక్కువగా పండించడానికి ఉపయోగించాలి. అణుశాస్త్రంలో పరిశోధనలు, విద్యుచ్ఛక్తి ఉత్పత్తికి ఉపయోగించాలి. వస్తువులను చౌకగా, విరివిగా తయారు చేసేందుకు పరిశోధనలు ఉపయోగించాలి. సమ సమాజ స్థాపనలో, సమాజానికి పరిశోధనలు ఉపయోగించాలి.

AP Board 9th Class Telugu Solutions Chapter 10 బతుకు పుస్తకం

ఆ) కింది ప్రశ్నలకు పదిహేనేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
ఈ పాఠం ఆధారంగా “బతుకు పుస్తకం”లోని అంశాలను పదివాక్యాల్లో రాయండి.
జవాబు:
ఉప్పల లక్ష్మణరావుగారి తాతగారు కాలేజీ కమిటీతో పోరాడి, మనవరాలిని బడిలో చేర్పించారు. లక్ష్మణరావుగారి తాతగారిని, వారి మనవడు “దేవుణ్ణి చూశారా? తాతగారూ?” అని అడిగాడట. తాను దేవుణ్ణి చూడలేదని లక్ష్మణరావు గారి తాత, నిజాయితీగా ఒప్పుకున్నారట.

లక్ష్మణరావుగారి భార్య మెల్లీ, తెల్లని ఫ్రాకు ధరించి విందుకు వెడుతూ, దారిలో పెంటబండిని ఈడ్వలేకపోతున్న వృద్ధుని బండిని తోసి సాయంచేసిందట. మెల్లీ, లక్ష్మణరావుగారులు షరతులు విధించుకొని, వివాహం చేసికొన్నారట. లక్ష్మణరావుగారు జర్మనీలో బోటనీ పరిశోధనలు మానివేసి, మనదేశంలో అనువాదకుడిగా చేరారట.

మెల్లీ రాజోలు నుండి నర్సాపురం వరకూ స్విమ్మింగ్ డ్రెస్ లో 15 మైళ్ళు ఈదిందట. సబర్మతి ఆశ్రమంలో మెల్లీ తాను కూడా గస్తీ తిరగడానికి అనుమతినిమ్మని సత్యాగ్రహం చేసిందట. మెల్లీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ తో, తనను ఖాదీ ప్రదర్శనలో పాల్గొనడానికి ఆయన నిరోధిస్తే, దానిని అంతర్జాతీయ సమస్యగా తాను మారుస్తానందట. లక్ష్మణరావుగారు తెచ్చి ఇచ్చిన కాగితాన్ని సిమెంటు కంపెనీ డైరెక్టరు క్రిందపడవేస్తే, దాన్ని బల్లమీద డైరక్టరు తిరిగి పెట్టకపోతే, తాను ఉద్యోగానికి రాజీనామా చేస్తానని డైరక్టర్నీ బెదిరించారట.

ప్రశ్న 2.
“బతుకు పుస్తకంలో కరుణ గల విజ్ఞానానికి సంబంధించిన సంఘటనలు ఉన్నాయి కదా !” వాటిలోంచి ఏదైనా ఒక సంఘటనను విశ్లేషించండి.
జవాబు:
లక్ష్మణరావుగారు ప్రేమించిన అమ్మాయి స్విట్జర్లాండు దేశస్థురాలు ‘మెల్లీ’. లక్ష్మణరావుగారు మెల్లీని కరుణ గల విజ్ఞానిగానే ఈ చూసి ప్రేమించారు. ఒకసారి మెల్లీ పాలమీగడ లాంటి తెల్లని ఫ్రాకు ధరించి, విందుకు వెడుతోంది. అప్పుడు ఆమెకు 24 ఏళ్ళు. దారిలో ఒక ముసలివాడు వెంటబండిని ఈడ్చుకు వెడుతున్నాడు. అతడు ఆ బండిని లాగలేక అవస్థపడుతున్నాడు. అప్పుడు మెల్లి దృష్టి ఆ వృద్ధుని మీద పడింది. ఆమెకు ఆ వృద్ధుని పై జాలి వేసింది. మెల్లీ తాను తెల్లని బట్టలు వేసుకున్నానని కానీ, విందుకు వెడుతున్నానని కానీ చూడలేదు. వెంటనే ఆ వృద్ధుని బండిని వెనక నుండి తోసి సాయం చేసింది. ఈ విధంగా మెల్లీ ఆ ముసలివాడికి సాయపడింది. ఆ సంఘటనను చూసిన లక్ష్మణరావు గారి మనస్సు ద్రవించింది. మెల్లీ కరుణగల విజ్ఞాని అని గ్రహించారు. మెల్లీని లక్ష్మణరావుగారు పెండ్లాడారు.

మెల్లీ, ఆ మురికి బట్టలతోనే విందుకు వెళ్ళింది. ప్రక్కవారు ఏమనుకుంటారో అని, మెల్లీ అనుకోలేదు. ఒక వృద్ధునికి సాయం చేశాననే సంతృప్తితో ఆమె గుండెలు నిండాయి.

దీనిని బట్టి మెల్లీ కరుణ గల విజ్ఞాని అని తెలుస్తోంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 10 బతుకు పుస్తకం

ప్రశ్న 3.
సావిత్రి గారి ‘బతుకు పుస్తకం’ గురించి పరిచయం చేసిన విధానం ఏ విధంగా ఉంది?
జవాబు:
‘బతుకు పుస్తకం’ రచయిత లక్ష్మణరావుగారు నిజాయితీ గల సాహితీమూర్తి అని. రచయిత్రి నమ్మకం. బతుకు పుస్తకం చదవడానికి ముందే లక్ష్మణరావుగారు రచించిన ‘అతడు – ఆమె’ పుస్తకాన్ని రచయిత్రి చదివిందట. లక్ష్మణరావుగారి మీదా, ఆయన జీవితభాగస్వామి మెల్లీ మీదా రచయిత్రికి మంచి అభిమానం ఉంది. లక్ష్మణరావుగారు మంచి సహృదయుడైన రచయిత అనడానికి ఉదాహరణలు ఇచ్చింది. మెల్లీ కరుణ గల విజ్ఞాని అని, మహా సాహసి అని, పట్టుపట్టి తాను అనుకున్నది సాధించే గుణం కలదని, అనడానికి సబర్మతి జైలులో ఆమె చేసిన సత్యాగ్రహం సంఘటనను పేర్కొంది.

లక్ష్మణరావుగారు కరుణ గల విజ్ఞాని అని, ఆయన చూపిన విజ్ఞత, ప్రపంచం పట్ల ఆయన చూపిన బాధ్యత మరచిపోరానివని గుర్తు చేసింది. మన దేశానికి ఉపయోగించని పరిశోధనలు అనవసరం అని పరిశోధనలకు స్వస్తి చెప్పి అనువాదక వృత్తిని ఆయన చేపట్టిన విషయాన్ని రచయిత్రి గుర్తు చేసింది.

మొత్తముపై లక్ష్మణరావుగారి జీవితంలోని ముఖ్య సంఘటనలను, బతుకు పుస్తకం నుండి రచయిత్రి ఎత్తి చూపింది.

IV. ప్రాజెక్టు పని

* మీ పాఠశాల గ్రంథాలయంలోని రెండు మూడు పుస్తకాల్లోని ముందుమాటలు చదవండి. ఆ పుస్తకాల గురించి మీరు తెలుసుకున్న విషయాలను రాసి ప్రదర్శించండి.
జవాబు:
ముందుమాట

ప్రశ్న 1.
అల్లసాని పెద్దనామత్యుని ‘మనుచరిత్రము’ – కవి సమ్రాట్ కమనీయ పీఠిక
ఈ పీఠిక ద్వారా అల్లసాని పెద్దన శ్రీకృష్ణదేవరాయ అష్టదిగ్గజ కవులలో ప్రథముడిగా ప్రధానమైనవాడని తెలిసింది. మనుచరిత్రను రాయలకే అంకితమిచ్చాడు పెద్దన. తెలుగువారి తొలి స్వతంత్ర్య కావ్యం మనుచరిత్ర. తెలుగు పంచ కావ్యాలలో మొదటిది మనుచరిత్ర. ఈ గ్రంథానికే స్వారోచిషమనుసంభవం అను నామాతరం కలదు. స్వారోచిష మనువు యొక్క కథే ఈ మనుచరిత్ర. అరుణాస్పదపురం – ప్రవరుడు కథతో ప్రారంభమై, హిమాలయ వర్ణన, వరూధిని, గంధర్వుని ఎత్తుగడ – స్వరోచి పుట్టుక – మనోరమ వృత్తాంతం – ఇందీవరాక్షుని వేడుకోలు – స్వరోచి పెండ్లి – దశావతరా స్తోత్రము – ఇంత వివరణగా పీఠిక రాసి, కావ్యమంతా తేలికగా అర్థము చేసుకొనుటకు వీలు కల్పించారు విశ్వనాథవారు.

ప్రశ్న 2.
పప్పురి రామాచార్యుల ‘వదరుబోతు’ – రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ పీఠిక.
ఈ పీఠిక ద్వారా 1932లో ప్రచురితమైన ‘వదరుబోతు’ గ్రంథ రచయితలెవరో స్పష్టంగా తెలియదు కాని పప్పురి రామాచార్యుల పేరొకటి మాత్రం వినబడుతోందని తెలిసింది. వదరుబోతు వ్యాసాలు సంఘ సంస్కరణకి ఉద్దేశించినవి. రాజకీయ స్వాతంత్ర్యం కన్న ప్రజల్లో నీతి, మత ధర్మాల పట్ల ఆసక్తిని కలిగించి, వారిని నిస్వార్థ పరులుగా చేయటమే ఈ వ్యాసాల ఆదర్శమని తెలుసుకున్నాను. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో అనంతపుర పట్టణంలో కొందరిలో కలిగిన నూతన ఆలోచన ఫలితమే వదరుబోతు వ్యాసాలు వెలువడ్డాయి. ఎడిసన్ – స్పెక్టేటర్, స్టీల్ టాటర్ ఇంగ్లీషులోని ఉపన్యాస వ్యాసాలు. స్పెక్టేటర్ ఆధారంగా తెలుగులో సాక్షి వ్యాసాలు పానుగంటివారు రాశారు. సాక్షి వ్యాసాల కన్నా వదరుబోతు వ్యాసాలు మృదు స్వభావం కలవి. సుమారు 50 వ్యాసాలు రాసినా, దొరికనా 22 వ్యాసాలతో ‘వదరుబోతు’ ముద్రించారు. ఈ విషయాలన్నీ ఈ పీఠిక ద్వారా తెలుసుకున్నాను.
(లేదా)
సావిత్రి ‘బందిపోట్లు’ కవితను సేకరించండి. దీనిపై మీ అభిప్రాయం రాసి ప్రదర్శించండి.
జవాబు:
పుస్తకం లభ్యమైన తరువాత చదివి నా అభిప్రాయాన్ని రాస్తాను.

III. భాషాంశాలు

పదజాలం

అ) పాఠం ఆధారంగా ఈ కింది ఖాళీలను పూరించండి.

1. ఉప్పల లక్ష్మణరావు బతుకు పుస్తకం కంటే ముందుగా సావిత్రి చదివిన పుస్తకం ‘అతడు – ఆమె’.
2. లక్ష్మణరావు తల్లిగారి విమర్శను దృష్టిలో వుంచుకొని నవల తిరిగి రాశారట.
3. ఆనాటి స్త్రీల పత్రికలు నిజంగా పాటుపడేవారి చేతులు మీదుగా వెలువడేవి.
4. మెల్లీ సబర్మతిలో సత్యాగ్రహం ప్రారంభించిందట.
5. లక్ష్మణరావుగారు జర్మనీ నుంచి తన పరిశోధనావకాశాలు శాశ్వతంగా వదలి వేసుకొని రచనారంగం వైపు మారారు.

ఆ) గీత గీసిన పదాలకు అర్థాలను గుర్తించండి. ఆ అర్థంతో మరొక కొత్త వాక్యం రాయండి.

1. నాలో పేరుకుపోయిన నీరసం పటాపంచలై పోయింది.
ఎ) ఎక్కువ
బి) తక్కువ
సి) చెల్లాచెదరు
డి) ముక్కలు ముక్కలు
అర్థం : పటాపంచలు = చెల్లాచెదరు
వాక్యప్రయోగం : నేను కళాశాలలో చేరగానే, నాకున్న సిగ్గు పటాపంచలు అయ్యింది.

2. మనదేశ చరిత్రకు అద్దం పట్టిన పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాలి.
ఎ) పొగిడిన
బి) గొప్పదనాన్ని
సి) ప్రతిబింబించిన
డి) సంక్షిప్తం చేసిన
అర్థం : అద్దం పట్టిన = ప్రతిబింబించిన
వాక్యప్రయోగం : అద్దంపట్టిన – నీలోని సద్గుణాలు, మా నాన్నగార్కి అద్దం పట్టినట్టున్నాయి.

3. నిరుత్సాహికి ఉత్సాహాన్ని, రికామికి బాధ్యతనీ అందించగలగాలి పుస్తకం
ఎ) చురుకైన
బి) పనిలేనివాడు
సి) తెలివైనవాడు
డి) అజ్ఞాని
అర్థం : రికానికి = పనిలేనివాడు
వాక్యప్రయోగం : రికామీగా తిరిగే గోపాల్ కు, ఒక మంచిపని అప్పగించబడింది.

AP Board 9th Class Telugu Solutions Chapter 10 బతుకు పుస్తకం

ఇ) కింది పదాలను వివరించండి. సొంతవాక్యాలు రాయండి.
1) పఠించతగిన = __చదువదగిన
వాక్య ప్రయోగం : భగవద్గీత అందరూ పఠించతగిన గ్రంథము.

2) గొప్ప నిదర్శనం = గొప్ప ఉదాహరణ
వాక్య ప్రయోగం : రాముడు పితృవాక్య పరిపాలనకు గొప్ప నిదర్శనము.

3) అకుంఠితమైన దీక్ష = మొక్కవోని పట్టుదల
వాక్య ప్రయోగం : హనుమంతుడు అకుంఠిత దీక్షతో లంకను గాలించి సీతమ్మ జాడను తెలిసికొన్నాడు.

వ్యాకరణం

అ) కింది వాటిని జతపరచండి.
1) వాటిని ఇనప్పెట్టెలో పెట్టి తాళాలు వేసి (ఈ) అ) చేదర్థకం
2) కాపలా కాస్తూ హాయిగా తిని కూర్చో (ఆ) ఆ) శత్రర్థకం
3) మానసికంగా ఎదిగినట్లైతే (అ) ఇ) ప్రశ్నార్థకం
4) నిర్భయంగా జీవించాలని ఆశించడం తప్పా? (ఇ) ఈ) క్వార్థకం

ఆ) పరోక్ష కథనంలోకి మార్చండి.

1) “ఇది అంతర్జాతీయ సమస్యగా మారుతుంది. జాగ్రత్త !” అని అతన్నే బెదిరించింది మెల్లీ. (ప్రత్యక్ష కథనం)
జవాబు:
అది అంతర్జాతీయ సమస్యగా మారుతుందని, జాగ్రత్త అని మెల్లీ అతడినే బెదిరించింది. (పరోక్ష కథనం)

2) “చిన్నప్పటి నుండి నాకు బోటనీ అభిమాన విషయం” అన్నాడు రచయిత. (ప్రత్యక్ష కథనం)
జవాబు:
చిన్నప్పటి నుండి తనకు బోటనీ అభిమాన విషయమని రచయిత అన్నాడు. (పరోక్ష కథనం)

9th Class Telugu 10th Lesson బతుకు పుస్తకం రచయిత్రి పరిచయం

సావిత్రి గారు రాజమండ్రి దగ్గర ఉండేశ్వరపురంలో 18.05. 1949 లో జన్మించారు. డిగ్రీ మొదటి సంవత్సరంలో చదువు అర్ధాంతరంగా ఆగిపోయినా సాహిత్య పఠనాభిలాషను కొనసాగించి అనేక కవితలు, కథలు, వ్యాసాలు, సమీక్షలు రాసి స్త్రీవాద సాహిత్యంలో తనదైన స్థానం సంపాదించుకున్నారు. 1991లో వీరి మరణానంతరం ఆమె రచనలన్నీ అరణ్యకృష్ణ సంపాదకత్వంలో “సావిత్రి” పేరుతో వెలువడ్డాయి. వీరి “బందిపోట్లు” కవిత ప్రసిద్ధమైంది. ప్రగతిశీల దృక్పథం, రాజీలేని పోరాటమనస్తత్వం పదునైన భావావేశం ఈ రచయిత్రి ప్రత్యేకత.

కఠిన పదాలకు అర్థాలు

విశిష్ట, వ్యక్తిత్వము = మిక్కిలి శ్రేష్ఠమైన, వ్యక్తితత్వము
సమాజము = సంఘము
సాహితీమూర్తి = సాహిత్యము రూపుదాల్చిన వ్యక్తి
ఆవిర్భావం = పుట్టుక
చారిత్రక అవసరం = చరిత్రకు అవసరం
దశాబ్దాలు = పదుల సంవత్సరాలు
పటాపంచలు = చెల్లాచెదరు
సదాశయం (సత్ + ఆశయం ) = మంచిమనస్సు
వ్యక్తి = జాతికి వేటై, ఆ జాతికి
హుందా = దర్జా
మహిళ = స్త్రీ
జీవిత భాగస్వామి = జీవితంలో పాలు పంచుకొనే స్త్రీ (భార్య)
ఇల్లాలు = భార్య
దాస్య శృంఖలాలు = బానిసత్వం అనే సంకెళ్ళు
స్వాతంత్రోద్యమకారిణి (స్వాతంత్ర + ఉద్యమకారిణి) = స్వాతంత్ర్యం కోసం ప్రయత్నం చేసిన స్త్రీ
చిత్రించింది = వ్రాసింది (వర్ణించింది)
నిర్నిబంధం = బంధములు లేనిది
పఠిత = పాఠకుడు (చదివేవాడు)
జడము = తెలివిలేనిది
హాస్యము = నవ్వు
ఉన్మాదపు ఉత్సాహము = పిచ్చి ఉత్సాహము
చిర్రెత్తించే = కోపం కలిగించే
(చిఱ్ఱ + ఎత్తించు)
(చిఱ్ఱు + ఎత్తించు)
రీడబులిటీ (Readability) = చదువదగినది ఆశ్రయమైన రూపము
రికామీ = పనిలేనివాడు
అజ్ఞాని = తెలివిలేనివాడు
జిజ్ఞాసువు = తెలిసికొనగోరువాడు
ఆర్థత = మెత్తదనము
డైరీ (Diary) = దినచర్య
నేస్తం = స్నేహితుడు
సన్నిహితం = చేరువ, సమీపం

AP Board 9th Class Telugu Solutions Chapter 10 బతుకు పుస్తకం

నిరహంకారం = అహంకారం లేకుండుట
ఆత్మీయం = ఆత్మవంటిది (కావలసినది)
నయం = మేలు
క్లిష్టము = కఠినము
కార్యశీలత = పనిచేసే స్వభావమును కలిగి
కుదుపాలి = కదల్చా లి
విమర్శకురాలు = విమర్శ చేయు స్త్రీ
పెదవి విరిచేయు = నిరాశను సూచించు తర్కించుకొని
కీచులాట = కలహము
మహాసంగ్రామం = గొప్ప యుద్ధం
పూర్వరంగం = ముందు విషయం
మలచి = వంచి
ఏకీభవించు = ఒక్కటియగు; కలిసిపోవు
నిష్పక్షపాతం = పక్షపాతం లేనిది
సహృదయుడు = మంచిమనస్సు కలవాడు (విద్వాంసుడు)
హోరా హోరీ = ఎడతెగకుండా (నిర్విరామంగా)
అభ్యంతరం = అడ్డు
ఆస్తికులు = భగవంతుడున్నాడని నమ్మువారు
హేతువాదము = ప్రత్యక్ష ప్రమాణము చూపిస్తేనే నమ్ముతాను అనే మాట
ఫేషన్ (Fashion) = సొగసుకాడు; సొగసుదనం
విరివిగా = అధికంగా
సౌజన్యాన్ని = మంచితనాన్ని
కసరకుండా = కోప్పడకుండా
శిరసొగ్గే = తలవంచే
కరుణ = దయ, జాలి
వెల్లివిరుస్తుంది = ప్రవహిస్తుంది
ఫ్రాకు ‘(Frock) = వదులుగా ఉండే పెద్ద గౌను
వృద్ధుడు = ముసలివాడు
అగచాట్లు = ఆపదలు
నిదర్శనం = దృష్టాంతము; ఉదాహరణ
పరిశోధనావకాశాలు = పరిశోధన చేసే అవకాశాలు
క్షుణ్ణంగా = సంపూర్తిగా యుండుట
పఠించదగ్గవి = చదువదగినవి
వినియోగించుకొను = ఉపయోగించుకొను
సోషలిస్టు సమాజస్థాపన = సమ సమాజమును స్థాపించుట
తర్కించుకొని = ఊహించుకొని
స్వస్తిచెప్పి = చాలించి; ముగించి
నిశ్శబ్దం = ధ్వనిలేమి
అనువాదకవృత్తి = అనువాదం చేసేపని (Translation)
ఆవేదన = బాధ
ఆవేశపడిపోవు = కోపము వహించు
అకుంఠితమైన = అడ్డులేనట్టి
విస్మరింపరానిది = మరువరానిది
అవరోధము = అడ్డగింత
క్షణం = అత్యల్పకాలము
ఓర్వదు = సహింపదు
మంకుపట్టు = మొండి పట్టు
స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్ (Swimming costumes) = ఈత దుస్తులు
గస్తీ = కావలి (కాపలా)
స్టాకిస్టు (Stockist) = స్టాకు చేసేవాడు
దుందుడుకు = మిక్కిలి తొందర
నిదానం = తొందరపడకుండా విచారించడం
పురోగమం = ముందు నడవడం
తాదాత్మం = ఒకదానిలో కలసిపోవడం
నిరాహారదీక్ష = ఆహారం తినకుండా దీక్ష
నిషిద్ధము = నిషేధింపబడినది
జి.వో. (Government order) = ప్రభుత్వ ఆదేశం
అంతర్జాతీయ సమస్య = దేశాల మధ్య సమస్య

AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions Chapter 9 భూమి పుత్రుడు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions 9th Lesson భూమి పుత్రుడు

9th Class Telugu 9th Lesson భూమి పుత్రుడు Textbook Questions and Answers

చదవండి-ఆలోచించండి-చెప్పండి

మనిషి జీవించడానికి ముఖ్యంగా కావలసినవి తినడానికి తిండి, కట్టుకోడానికి బట్ట, నివసించడానికి ఇల్లు – ఈ మూడు అవసరాలు తీరాలంటే ప్రకృతిలోని మొక్కలు, చెట్లే ఆధారం. అవి ఎక్కడెక్కడో చెల్లాచెదురుగా ఉంటే వాటి నుంచి తమ అవసరాలు తీర్చుకొనేవాడు ఆదిమానవుడు. కాలక్రమేణ మానవ అవసరాలు ఎక్కువ కావడంతో, ఆయా మొక్కలను, చెట్లను ప్రత్యేకంగా పెంచడం మొదలుపెట్టాడు. దానికి వ్యవసాయం అని పేరు పెట్టాడు. రాను రాను ఆ వ్యవసాయం ప్రధాన వృత్తిగా మారింది. దాని ఆధారంగా మానవుడి నాగరికత కూడా పెరిగింది.

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
మనిషికి కావలసిన ముఖ్యావసరాలు ఏవి?
జవాబు:
మనిషికి ముఖ్యంగా కావలసినవి మూడు :

  1. తినడానికి తిండి
  2. కట్టుకోవడానికి బట్ట
  3. నివసించడానికి ఇల్లు.

ప్రశ్న 2.
ఆదిమానవుడు మొదట్లో తన అవసరాలను ఎలా తీర్చుకొనేవాడు?
జవాబు:
ప్రకృతిలో ఎక్కడెక్కడో చెల్లాచెదురుగా ఉండే మొక్కలు, చెట్ల నుండి ఆదిమానవుడు తన అవసరాలను తీర్చుకొనేవాడు.

ప్రశ్న 3.
వ్యవసాయం ఎలా మొదలయింది?
జవాబు:
మానవ అవసరాలు ఎక్కువ కావడంతో మానవుడు ఆయా చెట్లనూ, మొక్కలనూ ప్రత్యేకంగా పెంచడం మొదలుపెట్టాడు. దానికి ‘వ్యవసాయం’ అని పేరు పెట్టాడు. వ్యవసాయం ఆ విధంగా మొదలయ్యింది.

ప్రశ్న 4.
వ్యవసాయం వలన ఏమి పెరిగింది?
జవాబు:
వ్యవసాయం వలన మానవుడి ‘నాగరికత’ కూడా పెరిగింది.

AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు

ప్రశ్న 5.
వ్యవసాయం చేసేవారిని ఏమని పిలుస్తారు?
జవాబు:
వ్యవసాయం చేసేవారిని కర్షకులు, రైతులు, సేద్యగాండ్రు అని పిలుస్తారు.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది అంశాలను గురించి మాట్లాడండి.

ప్రశ్న 1.
పద్యాలను భావయుక్తంగా పాడండి.
జవాబు:
మీ గురువుల సాయంతో రాగయుక్తంగా, భావం తెలిసేటట్లు చదవడం నేర్చుకోండి.

ప్రశ్న 2.
ఈ పాఠానికి ‘భూమి పుత్రుడు’ అనే శీర్షిక తగినట్లు ఉన్నదా? ఎందుకు? చర్చించండి.
జవాబు:
సామాన్యంగా రచనలోని విషయాన్ని కొంతవరకు ఊహించగలిగిన విధంగా, వివరించగలిగిన దానిగా, ‘శీర్షిక’ ఉండాలి. శీర్షిక అంటే పాఠం పేరు. ఈ పాఠంలో రామిరెడ్డిగారు రైతును గురించి, అతడు భూమిని దున్ని చేసే వ్యవసాయం గురించి చర్చించారు. పుత్రుడు తండ్రి ఆస్తిని అనుభవించడానికి పూర్తి హక్కు కలిగి ఉంటాడు. భూమి పుత్రుడు అంటే కర్షకుడు లేక రైతు. భూమిని పూర్తిగా అనుభవించే అర్హత గలవాడు. రైతు పంటలు పండించి, సమాజంలోని ఇతర సోదరులు అందరికీ తిండి పెడుతున్నాడు కాబట్టి రైతులను గురించి చెప్పిన ఈ పాఠానికి “భూమి పుత్రుడు” అనే పేరు సరిపోతుంది.

ఆ) కింది ప్రశ్నలకు పాఠం ఆధారంగా ఐదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
తన పంచన చేరిన అతిథిని రైతు ఎలా ఆదరిస్తున్నాడు?
జవాబు:
రైతు తాను తిన్నా తినకపోయినా, తన పంచకు ఆకలితో వచ్చిన అతిథికి కడుపునిండా తిండి పెట్టి, త్రాగడానికి నీరు ఇస్తాడు. ఏ ఒక్క అతిథినీ రైతు నిరాశపరచడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు

ప్రశ్న 2.
కవి రైతును ఏమి తెలుసుకోమంటున్నాడు?
జవాబు:
రైతు ఎప్పుడూ కష్టాల కన్నీళ్ళలో కూరుకుపోవాలని ఎవరూ శాసించలేరనీ, రైతుకు ఏమీ లోటు లేదనీ, రైతు గొప్పదనాన్ని రైతు తెలుసుకోవాలని రామిరెడ్డి గారు చెప్పారు. రైతు తన గొప్పదనాన్ని తాను తెలుసుకోవాలని చెప్పారు.

ప్రశ్న 3.
ఈ పాఠంలోని జాతీయాలను, సామెతలను గుర్తించి వివరించండి.
జవాబు:
ఈ పాఠంలో కింది జాతీయాలు, సామెతలు ఉన్నాయి.
1) పిండికొద్ది రొట్టె:
మనం చేసిన కృషికి తగిన విధంగానే ఫలితం ఉంటుందని భావం. మనం ఎక్కువ పిండి వేస్తే పెద్ద రొట్టె తయారవుతుంది. కొద్ది పిండి వేస్తే చిన్న రొట్టె తయారవుతుందని అర్థం.

2) బోడితలకు, మోకాళ్ళకు ముడులు పెట్టు :
ఏదో సంబంధం లేని మాటలు చెప్పడం అని అర్థం. వారు చెప్పే మాటల్లో పొంతన, అతుకు లేదని అర్థం. మోకాళ్ళమీద, బోడి తలమీద వెంట్రుకలు ఉండవు. నున్నని గుండుకూ, మోకాలికీ ముడివేయడం జరిగే పని కాదని అర్థం. అసంబద్ధమైన మాటలని సారాంశం.

3) చిటికెల పందిళ్ళు పన్ను :
ఇంత చేస్తాము అంత చేస్తాము అని అతిడంబపు మాటలు మాట్లాడడం అని అర్థం. తాము చిటికె చప్పుడు చేసే పని అయిపోతుందని గొప్పలు చెప్పడం అని భావం. మాటలతో మభ్యపెట్టడం అని అర్థం.

4) నేల నూతులకు ఉగ్గాలు నిలుపుట :
కొన్ని ప్రాంతాల్లో దిగుడు బావులు ఉంటాయి. దానిలోకి ప్రక్కనున్న మెట్ల ద్వారా దిగి, నీరు పైకి తెచ్చుకోవాలి. నేలనూతుల నుండి మామూలు నూతులలోకి వలె చేదకు త్రాడుకట్టి తోడుకోవడం సాధ్యం కాదు. కానీ కొందరు అసాధ్యమైన కార్యములు చేస్తామని గొప్పలు చెపుతారు. అలాంటి వారిని గూర్చి ఈ మాట అంటారు.

5) ఉత్తయాసలకన్న మేలుద్యమంబు :
అది కావాలి ఇది కావాలి అని కేవలం కోరుకుంటూ కూర్చోడం కన్న, ఆ కావలసిన వాటి కోసం, ‘ఉద్యమంబు’ అంటే ప్రయత్నం చేయడం మంచిదని భావం.

6) సిరియె భోగోపలకి ‘జీవగట్టి’ :
‘జీవగట్టు’ అన్నది జాతీయము. జీవన ఔషధం అని భావం. ‘అతిముఖ్యం’ అని సారాంశము. భోగాలు పొందాలంటే సిరిసలఎదలు ముఖ్యంగా కావాలని భావం.

AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు

ప్రశ్న 4.
పాఠం ఆధారంగా రైతు గుణగణాలను రామిరెడ్డి గారు ఏయే విశేషణాలతో వర్ణించారో రాయండి.
జవాబు:
“రైతు”

  1. భారత క్ష్మాతల ఆత్మగౌరవ పవిత్రమూర్తి.
  2. శూరమణి
  3. ప్రొద్దుపొడిచినది మొదలుకొని ప్రొద్దు క్రుంకు వఱకూ కష్టిస్తాడు.
  4. ఇరుగు పొరుగు వారి సంపదకై ఈర్ష్య చెందడు
  5. పరుల కష్టార్జితానికి ఆశపడడు.
  6. తాను తిన్నా తినకున్నా, అతిథులకు లేదనకుండా తృప్తిగా పెడతాడు.
  7. సాంఘిక ఉత్కృష్ట సౌభాగ్య సౌఖ్యాలకు రైతు కారకుండు.
  8. తన కష్టాన్ని గుర్తించని కృతఘ్నులను రైతు పట్టించుకోడు.
  9. తన కాయకష్టాన్నే నమ్ముకొని, తన శరీర శ్రమతో లభించిన పట్టెడన్నాన్నే తింటాడు.

ఇ) పాఠం ఆధారంగా కింది పట్టికను పూరించండి.

అంశం చేపట్టిన పని / ఫలితం
సమాజ నిర్మాణం, సంక్షేమం కోసం వ్యవసాయ వృత్తిని చేపట్టడం. “లోకహితం” దాని  ఫలితం.
శ్రమ చేయడం వల్ల ఫలములు సిద్ధిస్తాయి.
పరిశ్రమలకు ప్రధాన వనరు “వ్యవసాయం”.
విజయం సాధించాలంటే శౌర్యము, విద్య, బుద్ధి, సత్యసంధత, ఆత్మ విశ్వాసం విడువరాదు.

ఈ) కింది పేరాను చదవండి. కారణాలు రాయండి.

“ఏటి కేతంపట్టి ఎయి పుట్లు పండించి ఎన్నడూ మెతుకెరుగరన్నా ! నేను గంజిలో మెతుకెరుగనన్నా!” అని ఒక కవి పాట రూపంలో రైతు దుస్థితిని తెలియజేశాడు. వ్యవసాయానికి కావలసిన ముఖ్యమైన వనరులు భూమి, నీరు, దానితోపాటు ఎరువులు, వాతావరణ పరిస్థితులు అనుకూలించడం కూడా అవసరమే. జనాభా పెరగకముందు పై వనరులన్నీ పుష్కలంగా ఉండేవి. రానురాను జనాభా పెరిగిపోయింది. మానవుడి అవసరాలూ పెరిగిపోయాయి. వీటన్నిటికీ భూమే ఆధారం. ఇతర అవసరాలకోసం భూమి వినియోగం ఎక్కువ కావడం లాంటి పరిస్థితులవల్లనే వ్యవసాయరంగానికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రైతులు ఎన్నో ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ రంగానికి ఉన్న వనరుల కొరత, ఇబ్బందుల వల్ల దిగుబడి ఆశాజనకంగా లేదు.

1. కవి పాట రాయడానికి కారణం : రైతు దుస్థితిని తెలియజేయడానికి.
2. వ్యవసాయ వనరులు తగ్గడానికి కారణం : జనాభా పెరిగిపోవడం.
3. వ్యవసాయ రంగానికి ఇబ్బందులకు కారణం : ఇతర అవసరాల కోసం భూమి వినియోగం ఎక్కువ కావడం.
4. దిగుబడి తగ్గడానికి కారణం : వ్యవసాయ రంగానికి ఉన్న వనరుల కొరత. ఇబ్బందులు.

II. వ్యక్తీకరణ సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో సొంతమాటల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘సుఖాల కన్నిటికీ ధనమే మూలం’ అని కవి ఎందుకన్నాడు?
జవాబు:
సుఖాలు పొందాలంటే ధనం ఉండాలని కవి చెప్పాడు. ‘సిరియె భోగోపలబ్దికి జీవగట్టు’ అన్నాడు. నిజమే ‘ధనమూలమ్ ఇదం జగత్’ – అని పెద్దలు చెప్పారు. ఈ లోకమంతా డబ్బుమూలంగానే నడుస్తుంది. మన దగ్గర ధనం ఉంటేనే కావలసిన టి.వి, ఫ్రిజ్, పట్టుబట్టలు, కారు, మోటారు సైకిలు వగైరా కొనుక్కుని సుఖంగా జీవించగలం. కావలసిన వస్తువులు కొని తినగలం. కాబట్టి కవి చెప్పినట్లు సుఖాలు పొందాలంటే ధనం అవసరం అన్నది సత్యం.

ప్రశ్న 2.
“పిండికొద్దీ రొట్టె” అనడంలో కవి ఉద్దేశమేమి?
జవాబు:
పిండి వాడిన దానిని బట్టి రొట్టె పరిమాణం ఉంటుంది. ఎక్కువ పిండి వేసి కాలిస్తే పెద్ద రొట్టె తయారవుతుంది. కొంచెమే పిండి వేస్తే చిన్న రొట్టె తయారవుతుంది. అలాగే, మనం పడిన శ్రమను బట్టి ఫలితాలు ఉంటాయి. శ్రమలు లేకుండా ఫలములు రావు. కష్టపడితే సుఖం కలుగుతుంది. మనం పడిన శ్రమను బట్టే మనకు వచ్చే ఫలితం ఆధారపడి ఉంటుంది అని భావం.

AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు

ప్రశ్న 3.
‘రైతు హృదయం నిర్మలమైనది’ దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
జవాబు:
రైతు కేవలం తన నిత్యావసరాలు గడచిపోతే చాలని చూస్తాడు. అతడు తన ఊహలనూ, ఆలోచనలనూ, నైపుణ్యాన్ని అన్నింటినీ పంటలు పండించడానికే వినియోగిస్తాడు. రైతు రోజంతా కష్టపడతాడు – ప్రక్కవారి సంపదలను గూర్చి ఆశపడడు. రైతు తాను తిన్నా, తినకపోయినా తన ఇంటికి వచ్చిన అతిథికి కడుపునిండా తృప్తిగా పెడతాడు. పైన చెప్పిన రైతు గుణగణాలను చూస్తే అతడి హృదయం నిర్మలమైనదని నా అభిప్రాయం.

ప్రశ్న 4.
‘పాలనాదండం’ కంటే ‘హలం’ గొప్పదని కవి ఎందుకన్నాడు?
జవాబు:
దేశాన్ని పాలించే రాజు చేతిలో పాలనా దండం ఉంటుంది. భూమిని దున్ని పంటలు పండించే రైతు చేతిలో ‘హలం’ ‘అనగా ‘నాగలి’ ఉంటుంది. రాజు తన పాలనా దండంతో తప్పు చేసిన వారిని దండిస్తాడు. రైతు తన చేతిలోని నాగలితో పంటలు పండిస్తాడు. దేశ ప్రజలందరికీ రైతు తిండి పెడతాడు. కాబట్టి రాజు ప్రజలను శిక్షించడానికి ఉపయోగించే పాలనా దండము కన్నా, రైతు పంటలు పండించి పదిమందికీ కడుపు నింపేందుకు ఉపయోగించే హలం గొప్పది అని కవి అన్నాడు.

ఆ) కింది ప్రశ్నలకు పదిహేనేసి వాక్యాల్లో సొంతమాటల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
కర్షకుని గొప్పతనాన్ని గురించి కవి ఏమని చెప్పాడు?
జవాబు:
వ్యవసాయ వృత్తి వృత్తులన్నిటిలో గొప్పది. కర్షకుడు భారతదేశ ఆత్మగౌరవాన్ని ప్రకటించే పవిత్రమూర్తి. రాజదండం కన్నా, రైతు చేతి హలం గొప్పది. కర్షకుడు నిత్యావసరాలు గడచిపోతే చాలని చూస్తాడు. అంతకు మించి ఆశలు పెట్టుకోడు. కర్షకుడు తన ఊహలనూ, ఆలోచనలనూ, నైపుణ్యాన్ని పంటలను పండించడానికే వినియోగిస్తాడు.

కర్షకుడు రోజంతా కష్టపడతాడే గాని, ప్రక్క వారి సంపదలను గూర్చి అసూయపడడు. కర్షకుని మనస్సు నిర్మలమైనది. తాను తిన్నా తినకున్నా ఇతరుల కష్టార్జితానికై ఆశపడడు. ఆకలితో తన ఇంటికి వచ్చిన అతిథికి కడుపునిండా పెడతాడు.

కర్షకుడు చేపట్టిన వ్యవసాయమే పరిశ్రమలన్నిటికీ మూలం. పరిశ్రమల వల్లనే సంపదలూ, సంపదల వల్లనే సుఖం లభిస్తుంది. సమాజం సుఖసంతోషాలతో ఉండడానికి కర్షకుడే కారణం.

కర్షకుని కష్టఫలితాన్ని ఇతరులు అనుభవించి సుఖపడుతున్నారు. కర్షకుడు తాను చేసిన మేలును మరచిన కృతఘ్నులను పట్టించుకోడు. వ్యవసాయం చేయడంలో తన శరీరం ఎముకల గూడుగా మారినా, వానలు ముంచెత్తినా, కరవులు వచ్చినా అతడు లెక్కచేయడు. తన కాయకష్టాన్నే నమ్ముకొంటాడు. అతడు తన శరీరశ్రమతో లభించిన పట్టెడన్నం తిని, తృప్తిపడతాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు

ప్రశ్న 2.
పాఠ్యభాగ సారాంశాన్ని రాయండి.
(లేదా)
భూమి పుత్రుడైన రైతు సుఖదుఃఖాలను కవి ఏ విధంగా విశ్లేషించారో మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
వ్యవసాయము వృత్తులలోకెల్లా ఉత్తమమైనది. ప్రపంచానికి మేలు చేయడం కోసం, కర్షకులు వ్యవసాయం చేస్తున్నారు. కర్షకులకు ఎవరూ సాటిరారు. హాలికుడు భారతదేశం ఆత్మ గౌరవాన్ని తెలిపే పవిత్రుడు. రాజదండం కన్నా రైతు నాగలి గొప్పది. రైతు ఎక్కువగా ఆశించడు. రోజూ ఖర్చులు వెళ్ళిపోతే చాలు అనుకుంటాడు. కర్షకుడు ప్రక్కవారి సంపదలకు అసూయపడడు. రైతు మనస్సు స్వచ్ఛమైనది.

కర్షకుడు తాను తిన్నా తినకపోయినా, అతిథులకు తప్పక పెడతాడు. వ్యవసాయం వల్లనే, సంపదలు లభిస్తాయి. సమాజ సుఖసంతోషాలకు హాలికుడే కారణం. హాలికుని కష్ట ఫలితాన్ని ఇతరులు అనుభవిస్తున్నారు. రైతుకు మాత్రం తిండికీ, బట్టకూ ఎప్పుడూ కఱవే.

రైతు కష్టంతో భోగాలు అనుభవించే వారు రైతును కన్నెత్తియైనా చూడరు. కర్షకుడు అటువంటి కృతఘ్నులను పట్టించుకోడు. వ్యవసాయం చేయడంలో తన శరీరం ఎముకల గూడుగా మారినా, వర్షాలు వచ్చినా, కఱవు వచ్చినా పట్టించుకోడు. రైతు తన కాయకషాన్నే నమ్ముకొని, తన శరీర శ్రమతో లభించిన పట్టెడన్నాన్నే తింటాడు.

అందుకే కవి “ఓ కర్మకా! నీ గూర్చి నీవు తెలిసికోవాలి. శ్రమను నమ్ముకొన్నవాడు, ఎన్ని ఆటంకాలనైనా దాటుతాడు. జీవిత యుద్ధంలో విజయానికి శక్తి, తెలివి, చదువు, సత్యము, ఆత్మవిశ్వాసము అనే ఆయుధాలు ధరించి ముందుకు నడు” అని బోధిస్తున్నాడు.

ఇ) సృజనాత్మకంగా సమాధానం రాయండి.

*నేడు గ్రామాలలో వ్యవసాయం చేసేవారు తగ్గుతున్నారు. భవిష్యత్తులో పంటలు పండించేవారు కరువైతే, ఆహారం దొరకడం గగనమవుతుంది. కోటీశ్వరుడైనా ఆకలికి అన్నమే తింటాడు కాని బంగారాన్ని తినడు కదా ! కాబట్టి వ్యవసాయం చేసే రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువులు, సాగుకవసరమైన ప్రత్యేక ఋణ సౌకర్యం సకాలంలో అందించే బాధ్యత చేపట్టాలని వ్యవసాయాధికారికి లేఖ రాయండి.
జవాబు:

మండపేట,
x x x x

జిల్లా వ్యవసాయాధికారి గార్కి,
ఆర్యా,

విషయం : రైతుల అవసరాలను తీర్చే బాధ్యత తీసుకోవాలని కోరిక.

మా మండపేట భూములలో ఏటా రెండు పంటలు పండుతాయి. మా తాత ముత్తాల నుండి మేము వ్యవసాయాన్నే నమ్ముకొని జీవిస్తున్నాము. క్రమక్రమంగా మా రైతుల జీవితం దుఃఖనిలయం అవుతోంది.

మాకు కావలసిన ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు సక్రమమైన ధరలకు దొరకట్లేదు. స్థానిక వర్తకులు వాటిని దాచి, కృత్రిమంగా కొరతను సృష్టిస్తున్నారు. పండించిన ధాన్యాన్ని ఎవరూ కొనడం లేదు. ఇప్పుడు రెండవ పంటకు పెట్టుబడి దొరకడం లేదు. బ్యాంకులకు ఎన్నిసార్లు వెళ్ళినా మేము ఉత్త చేతులతో తిరిగి రావలసి వస్తోంది. విద్యుచ్ఛక్తి కనీసం మూడు గంటలయినా రావడంలేదు.

మేము పంటలు పండించకపోతే ప్రజలు పస్తులు ఉండాలి. ప్రజలకు చేతిలో ఎంత డబ్బు ఉన్నా తిండి గింజలే తింటారు కదా. మీరు శ్రద్ధ చూపించి, మాకు అప్పులు దొరికేలా, ఎరువులు, విత్తనాలు సరయిన ధరలకు దొరికేలా చర్యలు వెంటనే చేపట్టండి. వ్యవసాయాన్ని బ్రతికించండి. సెలవు.

నమస్కారములు.

ఇట్లు,
మీ విశ్వసనీయుడు,
ఎన్. శ్రీకాంత్,
మండపేట,
తూర్పుగోదావరి జిల్లా.

చిరునామా:
జిల్లా వ్యవసాయశాఖాధికారిగార్కి,
కాకినాడ,
తూ॥గో॥ జిల్లా.

AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు

ఈ) ప్రశంసాపూర్వకంగా సమాధానం రాయండి.

రైతు కృషి వల్లనే మనకు ఆహారం లభిస్తున్నది కదా! రామయ్య ఆదర్శరైతు. ఆధునిక పద్ధతులతో, సేంద్రియ ఎరువులతోనే అధిక దిగుబడిని సాధించాడు. వ్యవసాయశాఖ తరఫున ఆయన్ను అభినందించాలనుకున్నారు. ఈ అభినందన సభ కోసం రామయ్యగారిని ప్రశంసిస్తూ అభినందన పత్రాన్ని తయారు చేయండి.
(లేదా)
ఆదర్శరైతు రామయ్యను ప్రశంసిస్తూ అభినందన పత్రం రాయండి.
జవాబు:

అభినందన పత్రం

అభ్యుదయ రైతురాజు రామయ్య మహాశయా!

మీకు అభినందన మందారాలు. భారతదేశ సౌభాగ్యం పల్లెలపై ఆధారపడియుంది. పల్లెల్లో రైతులు పండించే పంటలపైనే మన వర్తక పరిశ్రమలు ఆధారపడియున్నాయి. మేం కడుపునిండా అన్నం తింటున్నామంటే అది మీ వంటి కర్షకోత్తముల హస్తవాసి అనే చెప్పాలి.

కర్షకోత్తమా !
మీరు మన ప్రభుత్వ వ్యవసాయశాఖ వారు సూచించిన సూచనలను అందిపుచ్చుకొని, మీ పొలాల్లో ఈ సంవత్సరం ఎకరానికి 60 బస్తాల ధాన్యం పండించారు. చేల గట్లపై కంది మొక్కలు పాతి 20 పాల కందులు పండించారు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల జోలికి పోకుండా, మీ తోటలో 10 గేదెలను పెంచి, పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తూ, ఆ పశువుల పేడతో సేంద్రియ ఎరువుల్ని తయారు చేసి వాటినే ఉపయోగించి మంచి పంటలు పండించారు. మీ కృషికి ప్రభుత్వ పక్షాన అభినందనలు అందిస్తున్నాము.

రైతురత్న రామయ్య గారూ!
నమస్కారం. ప్రభుత్వం మీకు ‘రైతురత్న’ అనే బిరుదునిచ్చి సత్కరిస్తోంది. మీరే ఈ జిల్లాలో రైతులకు ఆదర్శం. మీరు వ్యవసాయంలో మరిన్ని నూతన పద్ధతులు పాటించి, మన జిల్లాలో, రాష్ట్రంలో రైతులకు ఆదర్శంగా నిలవాలని కోరుతున్నాము. ఈ సందర్భంగా మీకు మన ముఖ్యమంత్రిగారి తరఫున రూ. 25,000లు బహుమతి ఇస్తున్నాము. మీకు మా శుభాకాంక్షలు. మా నమస్సులు.
అభినందనములు.

ఇట్లు,
జిల్లా వ్యవసాయాధికారి,
ఏలూరు, పూగో॥ జిల్లా,

IV. ప్రాజెక్టు పని

మీ గ్రామంలోని మీకు తెలిసిన ఒక ఆదర్శరైతు వద్దకు లేదా వ్యవసాయ అధికారి వద్దకు వెళ్ళి ఆధునిక పద్ధతుల ద్వారా అధికోత్పత్తిని ఎలా సాధింపవచ్చో వివరాలు సేకరించండి. వివరాలు తరగతి గదిలో చదివి ప్రదర్శించండి.
జవాబు:
మీ గురువుల పర్యవేక్షణలో పై ప్రాజెక్టు పనిని నిర్వహించండి.

III. భాషాంశాలు

పదజాలం

అ) కింది ప్రకృతి వికృతులను జతపరచండి.

1. ఈర్ష్య అ) కర్జం
2. విజ్ఞానం ఆ) సత్తు
3. సుఖం ఇ) ఆన
4. కార్యం ఈ) ఈసు
5. ఆజ్ఞ ఉ) సుగం
6. సత్యము ఊ) విన్నాణం

జవాబు:

1. ఈర్ష్య ఈ) ఈసు
2. విజ్ఞానం ఊ) విన్నాణం
3. సుఖం ఉ) సుగం
4. కార్యం అ) కర్జం
5. ఆజ్ఞ ఇ) ఆన
6. సత్యము ఆ) సత్తు

ఆ) కింది వాక్యాలను అవగాహన చేసుకొని గీత గీసిన పదాలకు నానార్థాలు రాయండి.

1. ఉచితం కదా ! అని దేన్నీ వృథా చేయడం ఉచితం కాదు.
ఉచితం : (నానార్థాలు) 1) రుసుము లేనిది 2) తగినది

2. పండించిన ఫలానికి ధర ఉన్నప్పుడే రైతు ఫలం పొందగలడు.
ఫలం: (నానార్థాలు) 1) పండు 2) లాభం

3. నేడు ధరకు విపరీతంగా ధర పెరిగిపోయింది.
ధర : (నానార్థాలు ) 1) నేల 2) వెల.

4. ఆధునిక కాలంలో కృష్ణ చేయడానికి ఎవరూ కృష్ణ చేయడం లేదు.
కృషి : (నానార్థాలు) 1) వ్యవసాయం 2) ప్రయత్నము

5. వర్మం లేక ఈ వర్మం జలాశయాలు నిండలేదు.
వర్షం : (నానార్థాలు) 1) వాన 2) సంవత్సరము

AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు

ఇ) కింది పదాలకు సమానార్థక పదాలను రాయండి. వాటిని సొంతవాక్యాలలో ఉపయోగించండి.
ఉదా: మహిళ = స్త్రీ, ఉవిద, నారి

వాక్య ప్రయోగం : ఉవిద తన హక్కుల కోసం పోరాటంలో భాగంగా నార్తీలోకాన్ని చైతన్యపరచి మహిళ అంటే ఏమిటో నిరూపించుకుంటున్నది.

1. హలం : 1) నాగలి, 2) సీరము
వాక్య ప్రయోగం : సీరము గుర్తుతో, నాగలిని భుజాన ధరించి రామయ్య పోటీ చేశాడు.

2. హాలికుడు : 1) రైతు 2) కర్పకుడు 4) సైరికుడు
వాక్య ప్రయోగం : రైతు బాంధవుడైన వ్యక్తిని కర్షకులు తమ నాయకుడిగా ఎన్నుకొంటే సైరికుల క్షేమానికి అతడు కృషి చేస్తాడు.

3. పొద్దు : 1) సూర్యుడు 2) దినము 3) వేళ
వాక్య ప్రయోగం : ఈ దినము సూర్యుడు మబ్బులలో మునిగి, భోజనం వేళ దాటాక కనబడ్డాడు.

4. వృక్షం : 1) చెట్టు 2) తరువు
వాక్య ప్రయోగం : ఈ తరువుకు కొమ్మలు లేవు కాని, వృక్షం నిండా పళ్ళు ఉండడం వల్ల చెట్టు మీద కోతులు చాలా ఉన్నాయి.

5. సత్యం : 1) నిజం 2) యథార్ధము
వాక్య ప్రయోగం : సత్యం కదా అని, నిజం చెపితే, యథార్థంగా వాడు చిక్కులలో పడతాడు.

6. సంగ్రామం : 1) యుద్ధము 2) రణము
వాక్య ప్రయోగం : యుద్ధములో పాల్గొన్న సైనికుడు, సంగ్రామంలో ఉత్సాహం చూపితే రణములో విజయం సిద్ధిస్తుంది.

7. అతిథి : 1) ఆవేశికుడు 2) ఆగంతువు
వాక్య ప్రయోగం : ఆవేశికుడైన మహర్షి. ఊరివారందరికీ అతిథిగా ఉంటూనే, ఆగంతువులా సన్మానం పొందాడు.

8. సౌఖ్యం : 1) సుఖం 2) హాయి
వాక్య ప్రయోగం : సౌఖ్యంగా ఉంటుందని హాయిగా షికారుకు వెడితే అక్కడ చలిగాలితో సుఖం మాయమయ్యింది.

9. నుయ్యి : 1) కూపం 2) బావి
వాక్య ప్రయోగం : నుయ్యి కన్నా బావి గొప్పదంటారు కానీ, కూపం మరింత గొప్పది.

వ్యాకరణం

అ) కింది సంధులకు ఉదాహరణలు రాసి, సూత్రాలు కూడా రాయండి.

1. వృద్ధి సంధి – సూత్రం :
అకారానికి ఏ, ఐ లు పరమైతే ఐకారమూ; ఓ, ఔలు పరమైతే ఔకారమూ ఏకాదేశంగా వస్తాయి.
ఉదా :
1) జీవనైకపరిపాలన – జీవన + ఏకపరిపాలన – వృద్ధి సంధి
2) మహైశ్వర్యము = మహా + ఐశ్వర్యము – వృద్ధి సంధి
3) వనౌషధి = వన + ఓషధి – వృద్ధి సంధి

2. త్రిక సంధి సూత్రం :
1) ఆ, ఈ, ఏ అనే సర్వనామాలు త్రికమనబడును.
2) త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగానగు.
3) ద్విరుక్తంబగు హల్లు పరమగునపుడు ఆచ్ఛిక దీర్ఘంబునకు హ్రస్వంబగు.
ఉదా :
1) ఎక్కాలము = ఏ + కాలము – త్రికసంధి
2) ఎవ్వారు = ఏ + వారు – త్రికసంధి
3) ఇమ్మహర్షి = ఈ + మహర్షి – త్రికసంధి
4) అమ్మధురత్వము = ఆ + మధురత్వము – త్రికసంధి

3. గుణసంధి – సూత్రం:
అకారానికి ఇ, ఉ, ఋలు పరమైనపుడు క్రమంగా ఏ, ఓ, అర్లు ఏకాదేశంబగు.
ఉదా :
1) భోగోపలబ్ధి = భోగ + ఉపలబ్ది – గుణసంధి
2) సాంఘికోత్కృష్ట = సాంఘిక + ఉత్కృష్ట – గుణసంధి
3) కష్టోత్కటము = కష్ట + ఉత్కటము – గుణసంధి
4) మహర్షి = మహా + ఋషి – గుణసంధి
5) మదేభము = మద + ఇభము – గుణసంధి

4. అత్వసంధి – సూత్రం:
అత్తునకు సంధి బహుళంబుగానగు.
ఉదా :
1) రామయ్య = రామ + అయ్య – అకారసంధి
2) పుట్టినిల్లు = పుట్టిన + ఇల్లు – అకారసంధి
3) సీతమ్మ = సీత + అమ్మ – అకార సంధి
4) మేనల్లుడు = మేన + అల్లుడు – అకారసంధి

5. ఇత్వసంధి – సూత్రం :
ఏమ్యాదుల ఇకారానికి సంధి వైకల్పికముగానగు.
ఉదా :
1) పొడిచినదాదిగా = పొడిచినది + ఆదిగా – ఇకార సంధి
2) ఆకలెత్తగ = ఆకలి + ఎత్తగ – ఇకారసంధి
3) అదేమి = అది + ఏమి – ఇకార సంధి
4) ఇదేమి = ఇది + ఏమి – ఇకార సంధి

AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు

ఆ) కింది వాటికి విగ్రహవాక్యాలు రాసి, సమాసాలను గుర్తించండి.

సమాస పదాలు విగ్రహవాక్యం సమాసం పేరు
1) అమాంద్యం మాంద్యము కానిది నఞ్ తత్పురుష సమాసం
2) సచ్ఛీలురు మంచి శీలము కలవారు బహుబ్లి హి సమాసం
3) చిటికెల పందిళ్ళు చిటికెలతో పందిళ్ళు తృతీయా తత్పురుష సమాసం
4) భారత క్ష్మాతలం భారతము అనే భూభాగం సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
5) హృదయకళిక హృదయము అనే కళిక రూపక సమాసం

ఛందస్సు

I. తేటగీతి
1) నాలుగు పాదాలుంటాయి.
2) ప్రతి పాదానికి ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలూ, రెండు సూర్యగణాలూ వరసగా ఉంటాయి.
3) నాలుగో గణం మొదటి అక్షరం యతిస్థానం. ప్రాసయతి చెల్లుతుంది.
4) ప్రాస నియమము లేదు.
1. AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు 1
అభ్యాసం :
అలాగే మీరు ఈ పద్యానికి సంబంధించిన మిగతా పాదాలకు గణవిభజన చేయండి.
గణవిభజన (2వ పద్యం, 2వ పాదం)
AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు 2

1) ఈ పాదంలో 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వరుసగా వచ్చాయి. ఇది తేటగీతి పద్యపాదం, యతి నాల్గవ గణం మొదటి అక్షరం.
గణ విభజన (2వ పద్యం, 3వ పాదం)
AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు 3
1) ఈ పాదంలో 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలున్నాయి. కావున తేటగీతి. యతి 4వ గణం మొదటి అక్షరం.
గణ విభజన (2వ పద్యం, 4వ పాదం)
AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు 4

1) ఈ పాదంలో 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలున్నాయి. కావున తేటగీతి. యతి 4వ గణం మొదటి అక్షరం.

9th Class Telugu 9th Lesson భూమి పుత్రుడు కవి పరిచయం

శ్రీ దువ్వూరి రామిరెడ్డిగారు 09.11.1895న నెల్లూరు జిల్లాలో జన్మించారు. ఈయన 19వ ఏట సాహిత్యరంగంలో ప్రవేశించి నలజారమ్మ, వనకుమారి, కృషీవలుడు, జలదాంగన, యువకస్వప్నము, కడపటి వీడ్కోలు, పానశాల-కావ్యాలను, నక్షత్రశాల-నైవేద్యము, భగ్నహృదయము, పరిశిష్టము, ప్రథమకవిత్వము అనే ఖండకావ్యాలను రచించారు. సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు, ఫ్రెంచి, లాటిన్, జర్మన్, బెంగాలీ, పర్షియన్, ఉర్దూ, దువ్వూరి తమిళభాషలలో పండితులు. ఈయన 11.09. 1947 నాడు కన్నుమూశారు. వీరికి ‘కవికోకిల’ రామిరెడ్డి అను బిరుదు కలదు.

దువ్వూరివారి రచనాశైలి సరళసుందరంగా వుంటుంది. పాతకొత్తల, ప్రాక్పశ్చిమాల కలయికతో అందాన్ని సంతరించుకున్నది. విశ్వశాంతి, దేశభక్తి, మానవతావాదం, అభ్యుదయం ఈయన రచనలలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ మనకు మేలుకొలుపు పాడుతూ ఉంటాయి.

పద్యాలు – ప్రతిపదార్థాలు-భావాలు

1వ పద్యం : కంఠస్థ పద్యం
*చం! మనుజసమాజనిర్మితి సమంబుగ నీకొక ముఖ్యమైన వృ
త్తి నియత, మట్టి ధార్మికవిధిం జిరకాలము గౌరవంబుతో
మనిచిరి నీ పితామహుల మాంద్యసుశీలురు సర్వవృత్తిపా
వన కృషి జీవనైక పరిపాలన లోకహితార్థకాంక్షులై.
ప్రతిపదార్థం :
మనుజసమాజనిర్మితి సమంబుగన్;
మనుజ = మానవుల యొక్క
సమాజ = సమాజాన్ని (సంఘాన్ని)
నిర్మితి = నిర్మాణంలో
సమంబుగన్ = సమత్వము కలిగేలా
నీకున్ = నీకు
ఒక = ఒక
ముఖ్య మైన = ప్రధానమైన
వృత్తి = వృత్తి
నియతము = నిర్ణయింపబడింది (నియమించబడింది.)
అట్టి = అటువంటి
ధార్మిక విధిన్ = ధర్మబద్ధమైన పనిని
చిరకాలము = చాలాకాలము
అమాంద్య సుశీలురు; అమాంద్య = సోమరితనంలేని
సుశీలురు = గొప్ప శీలవంతులు అయిన
నీ పితామహులు = నీ తండ్రి తాతలు
సర్వవృత్తి ……. లోకహితార్థకాంక్షులై;
సర్వవృత్తి = అన్ని వృత్తులలో
పావన = పవిత్రమైన
కృషి = వ్యవసాయాన్నే
జీవన + ఏక = ముఖ్య జీవనంగా
పరిపాలన = చక్కగా కాపాడుతూ
లోకహిత + అర్థ, కాంక్షులు + ఐ = ప్రపంచానికి మేలు చేయాలనే కోరిక కలవారై
గౌరవంబుతోన్ = గౌరవంగా
మనిచిరి నిర్మితి = రక్షించారు; పోషించారు.

భావం :
మానవ సమాజ నిర్మాణంలో భాగంగా, నీకొక ముఖ్యమైన వృత్తిని అప్పగించడం జరిగింది. అది వ్యవసాయ వృత్తి. ఇది వృత్తులలోకెల్లా పవిత్రమైనది. ప్రపంచానికి మేలు చేకూర్చాలనే కోరికతో, నీ పూర్వికులు ధర్మబుద్ధితో చాలాకాలంగా గౌరవంతో, వ్యవసాయ వృత్తిని నిర్వహిస్తూ వస్తున్నారు.

AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు

2వ పద్యం :
తే॥ శ్రమలు లేకయె ఫలములు దుముకబోవు
పిండికొలదియె రొట్టె; యోపిన విధాన
కష్టపడుము కృషీవలా, కలుగు సుఖము
ఉత్తయాసలకన్న మే లుద్యమంబు
ప్రతిపదార్థం :
కృషీవలా – ఓ కర్షకుడా!
శ్రమలు లేకయె = శ్రమపడకుండా
ఫలములు = ఫలితాలు
దుముకబోవు = ఉట్టిపడవు (తమంతట తాముగా రావు)
పిండికొలది + ఎ = పిండిమేరకే
రొట్టె = రొట్టె తయారవుతుంది
ఓపిన విధాన = శక్తికి తగ్గట్టుగా (శక్తివంచన లేకుండా)
కష్టపడుము = కష్టపడు
సుఖము, కలుగున్ = నీకు సుఖం కలుగుతుంది
ఉత్త + ఆసలకన్నన్ = కేవలమూ ఆశలతో జీవించడం కన్నా
ఉద్యమంబు = ప్రయత్నం చేయడం
మేలు = మంచిది

భావం :
కృషీవలా! శ్రమ చేయకుండా, ఫలితాలు రావు. పిండి కొద్దీ రొట్టె కదా! శక్తివంచన లేకుండా కష్టపడు. నీకు సుఖం కలుగుతుంది. కేవలం ఉత్త ఆశలతో జీవించడం కన్నా, ప్రయత్నం చేయడం మంచిది.

3వ పద్యం
తే॥ వేలనూతుల కుగాలు నిలుపువారు,
బోడితలకు మోకాళ్ళకు ముడులువెట్టు
వారు, చిటికెల పందిళ్ళు పన్నువారు
నిన్నుఁ బోలరు, తమ్ముడా, యెన్నడైన
ప్రతిపదార్థం :
నేల నూతులకున్ = బావులకు (లోతుగా ఉండే దిగుడు బావులకు)
ఉగ్గాలు = చేదలు (చిన్న చెంబులు)
నిలుపువారు = ఏర్పాటు చేసేవారు
బోడితలకున్ = వెండ్రుకలు లేని తలకూ
మోకాళ్ళకున్ = మోకాళ్ళకూ
ముడులువెట్టువారు = ముళ్ళు వేసేవారు
చిటికెల పందిళ్ళు పన్నువారు = మాటలతో మభ్య పెట్టేవారు (ఇంత చేస్తాము, అంత చేస్తాము అని అతిడంబములు పలికి నమ్మించేవారు.)
తమ్ముడా = సోదరా !
ఎన్నడైనన్ = ఎప్పుడూ కూడా
పోలరు (నీకు) = సాటిరారు

భావం :
తమ్ముడా ! లోకంలో కొందరు చిత్రంగా ఉంటారు. వీరిలో కొంతమంది చిన్నతాడు కట్టిన చెంబుతో నేలనూతిలోని నీళ్ళుతోడుతారు. మరికొందరు గుండుకూ మోకాలికీ ముడి పెడతారు. ఇంకొందరు చిటికెలతో పందిళ్ళు వేస్తారు. చేతలతో సమాజసేవ చేస్తున్న నీకు, వారు ఎప్పుడూ సాటిరారు. (పైన చెప్పిన వారంతా కేవలం మాటల చమత్కారంతో, అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తారు.)

4వ పద్యం :
తే|| సైరికా, నీవు భారతజ్మా తలాత్మ
గౌరవ పవిత్రమూర్తివి! శూరమణివి!
ధారుణీపతి పాలనదండ మెపుడు
నీహలంబు కన్నను బ్రార్థనీయమగునె?
ప్రతిపదార్థం :
సైరికా = సేద్యకాడా! (ఓ రైతా!)
భారత క్ష్మాతల = భారతదేశం యొక్క (భారత భూమండలం యొక్క)
ఆత్మగౌరవ = ఆత్మగౌరవాన్ని ప్రకటించే
పవిత్రమూర్తివి = పవిత్ర రూపుడవు
శూరమణివి = శూరులలో శ్రేష్ఠుడివి
ధారుణీపతి = భూమిని పాలించే రాజు యొక్క
పాలన దండము = పాలించే ధర్మదండము
ఎపుడున్ = ఎప్పుడునూ
నీ హలంబుకన్నను = నీ నాగలికంటె
ప్రార్థనీయము + అగునె = కోరదగినది అవుతుందా? (కాదు) (రాజు చేతిలోని ధర్మదండం కన్నా, నీ చేతి నాగలి గొప్పది అని భావము)

భావం :
హాలికుడా ! నీవు భారతదేశ ఆత్మగౌరవాన్ని తెలిపే పవిత్ర స్వరూపానివి. శూరులలో శ్రేష్ఠుడివి. రాజు చేతిలోని ధర్మదండం కన్నా, నీ చేతిలోని నాగలి గొప్పది. (రాజదండంలో దండించే గుణం ఉంది. నీ నాగలిలో పండించే గుణం ఉంది.)

AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు

5వ పద్యం :
తే॥ దైనికావశ్యకమ్ముల దాటిపోవ
వెగుర టెక్కలురాని నీ యిచ్ఛలెపుడు;
పైరుపచ్చలె యవధిగా (బ్రాకుచుండు
నీ విచారము, సహయు, నిపుణతయును
ప్రతిపదార్థం :
ఎగురన్ = ఎగరడానికి
ఱెక్కలురాని = రెక్కలు లేని
నీ + ఇచ్చలు = నీ కోరికలు
ఎపుడు = ఎప్పుడూ
దైనిక + ఆవశ్యకములన్ = రోజురోజూ అవసరములయిన నిత్యావసర వస్తువులను
దాటిపోవవు = అతిక్రమింపవు
నీ విచారమున్ = నీ ఆలోచనయూ
ఊహయున్ = ఊహయూ
నిపుణతయును = నేర్పునూ
పైరుపచ్చలు + ఎ – పైరుపంటలే (పైరు పంటల్ని బాగా పెంచడం మీదే)
అవధిగాన్ = హద్దుగా
ప్రాకుచుండున్ = అల్లుకుంటాయి

భావం :
నీవు నిత్యావసరాలు గడచిపోతే చాలని చూస్తావు తప్ప, నీకు అంతకు మించిన కోరికలు లేవు. నీ ఊహలనూ, ఆలోచనలనూ, నైపుణ్యాలనూ అన్నింటినీ, పైరు పంటలను పండించడానికే వినియోగిస్తావు. (నీకు రోజు ఎలాగో గడచిపోతే చాలు. అది ఇది కావాలనీ, ఏదో సంపాదించేద్దామనీ నీవు కోరవు. నీ తెలివితేటలు అన్నింటినీ పైరుపంటలను బాగా పెంచడం మీద పెడతావు.)

6వ పద్యం :
తే॥ ప్రొద్దువొడిచిన దాదిగా ప్రొద్దుగ్రుంకు
వజకు కష్టింతువేగాని యిరుగుపొరుగు
వారి సంపదకై యీసు గూరబోవ
వెంత నిర్మలమోయి, నీ హృదయకళిక!
ప్రతిపదార్థం :
ప్రొద్దు + పొడిచినది = సూర్యుడు ఉదయించినది
ఆదిగా = మొదలుగా (తెల్లవారినప్పటి నుండి)
ప్రొద్దు + క్రుంకు వఱకు = సూర్యుడు అస్తమించే వజకూ
కష్టింతువే + కాని = కష్టపడతావే కానీ
ఇరుగుపొరుగు వారి = ప్రక్కన, దగ్గరగానూ ఉన్న వారి
సంపదకై = ఐశ్వర్యానికై
ఈసు + కూరబోవవు = అసూయ పొందవు
నీ హృదయ కళిక = నీ హృదయము అనే మొగ్గ
ఎంత నిర్మలము + ఓయి = ఎంత పవిత్రమైనదో కదా!

భావం :
తెల్లవారినప్పటి నుండి సాయంత్రం అయ్యే వఱకూ కష్టపడతావు. అంతేకాని ఇరుగు పొరుగు వారి సంపదలను గూర్చి అసూయపడవు. నీ మనస్సు ఎంతో స్వచ్ఛమైనది.

7వ పద్యం :
తే॥ ఉండి తిన్నను లేక పస్తున్న గాని
యాసచేయవు పరుల కష్టార్జితంబు!
నాకలెత్తగ నీ పంచ కరుగు నతిథి
తినక, త్రావకపోయిన దినములేదు
ప్రతిపదార్థం :
ఉండి = నీకు తినడానికి తిండి ఉండి
తిన్నను = నీవు తినినా
లేక = నీకు తినడానికి లేక
పస్తున్నగాని (పస్తు + ఉన్న + కాని) = ఉపవాసము ఉన్నా కాని
పరుల = ఇతరుల
కష్టార్జితంబున్ (కష్ట + ఆర్జితంబు) = కష్టించి సంపాదించిన దానిని
ఆసచేయవు = ఆశించవు
ఆకలి + ఎత్తగన్ = ఆకలివేయగా
నీ పంచకున్ = నీ ఇంటి దగ్గరకు
అరుగు = వెళ్ళే (వెళ్ళిన)
అతిథి = అతిథి (అతిథి, అభ్యాగతి మొదలయిన వారు)
తినక = కడుపు నిండా తినకుండా
త్రావక = కావలసిన మంచినీరు, మజ్జిగ మొదలయినవి త్రాగి దాహం తీర్చుకోకుండా
పోయిన = వెళ్ళిపోయిన
దినము లేదు = రోజు లేదు

భావం :
నీవు తిన్నా, తినకపోయినా ఇతరులు సంపాదించుకున్న సంపదలకు ఎప్పుడూ ఆశపడవు. ఆకలితో నీ ఇంటికి వచ్చిన అతిథి కడుపు నిండా తిని, తృప్తిగా తాగి వెడతాడు. (అంటే రైతు అతిథి అభ్యాగతులకు తిండి పెట్టి వారి దాహం తీరుస్తాడని భావం)

AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు

8వ పద్యం :
తే॥ కృషి సకల పరిశ్రమలకు కీలుచీల ;
సత్పరిశ్రమ వాణిజ్య సాధనంబు,
అఖిల వాణిజ్యములు సిరికాటపట్లు
సిరియె గోపలబ్దికి జీవగఱ్ఱ
ప్రతిపదార్ధం :
కృషి = వ్యవసాయమే
సకల పరిశ్రమలకున్ = అన్ని పరిశ్రమలకూ
కీలుచీల = ముఖ్యమైన సీల (మూలము)
సత్పరిశ్రమ = మంచి పరిశ్రమయే
వాణిజ్య సాధనంబు = వ్యాపారానికి సాధనము
అఖిల వాణిజ్యములు= అన్ని వ్యాపారాలూ
సిరికి = సంపదకు
ఆటపట్లు = వాసస్థానము (నివసించే చోటు)
సిరియె = సంపదయే
భోగోపలబ్ధికిన్ (భోగ + ఉపలబ్ధికి) = సుఖాలను పొందడానికి
జీవగఱ్ఱ (జీవ + కఱ్ఱ) = బ్రతికించు మందు

భావం :
వ్యవసాయమే పరిశ్రమలన్నింటికీ మూలం. పరిశ్రమలు వ్యాపారానికి సహాయపడతాయి. వ్యాపారం వల్ల సంపద కలుగుతుంది. సంపద వల్ల సుఖం లభిస్తుంది.

9వ పద్యం :
తే|| కావున కృషీవలా, నీవె కారణమవు
సాంఘికోత్కృష్ట సౌభాగ్య సౌఖ్యములకు;
ఫల మనుభవించువారలు పరులు; నీకుఁ
గట్టఁ గుడువను కజవె యెక్కాలమందు !
ప్రతిపదార్థం :
కృషీవలా – ఓ హాలికా!
నుతులన్ = పొగడ్తలతో
సాంఘికోత్కృష్ట సౌభాగ్య సౌఖ్యములకు; సాంఘిక = సంఘమునకు సంబంధించిన (సమాజానికి చెందిన)
ఉత్కృష్ట = ఉప్పొంగిన
సౌభాగ్య = వైభవానికి
సౌఖ్యములకు = సుఖాలకు
నీవె (నీవు + ఎ) = నీవె
కారణమవు = కారకుడవు
తలపరు = జ్ఞప్తికి తెచ్చుకోరు
ఫలము + అనుభవించు వారలు = ఫలాన్ని అనుభవించేవారు
పరులు = ఇతరులు
నీకు = నీకు మాత్రం
కట్టన్ = కట్టుకొనే బట్టకూ
భుజించుచున్ = అనుభవిస్తూ
కుడువను = తినడానికీ (తిండికీ)
నినున్ = నిన్ను ఎక్కాలమందు
(ఏ + కాలమందు) = ఎప్పుడునూ
కఱవె (కఱవు + ఎ) = లోటే

భావం:
ఓ హాలికుడా ! సమాజం సుఖసంతోషాలతో ఉండడానికి నీవే కారణం. నీ కష్టఫలితాన్ని ఇతరులు అనుభవించి సుఖపడుతున్నారు. నీకు మాత్రం తిండికీ, బట్టకూ ఎప్పుడూ కొరతే (లోటే).

AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు

10వ పద్యం : కంఠస్థ పద్యం
*మ|| ఫలము ల్మెక్కెడివారు తత్ఫల రసాస్వాద క్రియాలోలురై
పలుమాజమ్మధురత్వమున్నుతుల సంభావింతురేగాని, త
త్ఫల హేతుక్రమవృక్షముం దలపరెవ్వారైన, వట్లే రమా
కలితు ల్బోగములన్ భుజించుచు విమం గన్నెత్తియుం జూతురే?
ప్రతిపదార్థం :
ఫలముల్ = పండ్లను
మెక్కెడి వారు = తినేవారు
తత్ఫల రసాస్వాదక్రియాలోలురై ; తత్ + ఫల = ఆ పండ్ల యొక్క
రస = రసాన్ని
ఆస్వాదక్రియా = అనుభవించే పనిలో
లోలురు + ఐ = అత్యాసక్తి కలవారై
పలుమాఱు = చాలాసార్లు
అమ్మధురత్వమున్ (ఆ + మధురత్వమున్) = ఆ తీపిదనాన్ని
సంభావింతురేకాని = గౌరవిస్తారే కాని
తత్ఫలహేతుక్రమవృక్షముం; తత్ + ఫల = ఆ పండు రావడానికి
హేతుక్రమ = కారణభూతమైన
వృక్షముం = చెట్టును గూర్చి
ఎవ్వా రైన = ఎవ్వరునూ
అట్లే = ఆ విధముగానే
రమా కలితుల్ = లక్ష్మీ సంపన్నులు (ధనంతో కూడినవారు)
భోగములన్ = సుఖాలను
కన్నెత్తియున్ + చూతురే = కన్ను పైకెత్తి చూడరు. (పట్టించుకోరు)

భావం :
పండ్లను తినేవారు వాటి తియ్యదనాన్ని పొగడుతూ తింటారే కాని, ఆ పండ్లను ఇచ్చిన చెట్టును గూర్చి ఎప్పుడైనా ఆలోచిస్తారా ? అలాగే నీ కష్టంతో భోగభాగ్యాలను అనుభవించే లక్ష్మీ సంపన్నులు నిన్ను కన్నెత్తి కూడా చూడరు కదా !

11వ పద్యం :
ఉ॥ అట్టి కృతఘ్నులన్ మనమునందుఁ దలంపక సేద్యనాద్యఫున్
ఘట్టన వస్థిపంజరముగా తమవెండినగాని, వరముల్
నీవు పట్టినగాని, క్షామములు వచ్చినగాని శరీరసత్వమే
పట్టుగ స్వశ్రమార్జితము పట్టెడు నన్నము దిందు ఎప్పుడున్!
ప్రతిపదార్థం :
అట్టి = అటువంటి
కృతఘ్నులన్ = చేసిన మేలు మరచిపోయిన వారిని
మనమునందున్ = (నీ) మనస్సు నందు
తలంపక = పట్టించుకోక (భావింపక)
సేద్యనాద్యపుం ఘట్టనన్ ; సేద్యనాద్యము = వ్యవసాయ సంబంధమైన
ఘట్టనన్ = రాపిడితో (సేద్యంలో పడే కష్టంతో)
అస్థిపంజరముగా = ఎముకల గూడుగా
తనువు = (నీ) శరీరము
ఎండినగాని = ఎండిపోయినా
వర్షముల్ = వర్షాలు (అతివృష్టి
పట్టిన + కాని = వచ్చినా
క్షామములు = కఱవులు (అనావృష్టి వల్ల)
వచ్చిన + కాని = వచ్చినా
శరీరసత్త్వము + ఏ = (నీ) శరీరంలోని శక్తియే
పట్టుగ = ఊతగా (అవలంబముగా) స్వశ్రమ + ఆర్జితము = (నీ) శరీర శ్రమతో లభించిన
పట్టెడు + అన్నమున్ (పట్టు + ఎడు) = గుప్పెడు అన్నాన్ని
ఎప్పుడున్ = ఎప్పుడునూ
తిందువు = తింటావు

భావం :
చేసిన మేలును మరచిపోయేవారిని నీవు అసలు పట్టించుకోవు. వ్యవసాయాన్ని చేయడంలో నీ శరీరం ఎముకల గూడుగా మారినా, వానలు ముంచెత్తినా, కరవు పీడించినా వాటిని లెక్క చేయవు. నీ శరీర కష్టాన్నే నమ్ముకొని, నీ శరీర శ్రమతో లభించిన పట్టెడన్నమైనా సరే దాన్నే తింటావు.

AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు

12వ పద్యం :
తే॥ ఓ కృషీవల ! నీవు కష్టోత్కటంపు
దుర్భరావస్థ యందె తోదోపువడగ
నెవరు శాసించువారు, నీకేమి కొదవ ?
ఆత్మవిజ్ఞానమయముగా నలవరింపు
ప్రతిపదార్థం :
ఓ కృషీవల = ఓ కర్షకుడా !
నీవు = నీవు
కష్టోత్కటంపు దుర్భరావస్థ + అందె; కష్ట + ఉత్కటము = పెద్ద కష్టంతో కూడిన
దుర్భర + అవస్థయందె = భరింపరాని స్థితియందే
తోదోపు + పడగన్ (తోపు + తోపు) = ఎక్కువగా రాపిడి పొందాలని
ఎవరు = ఎవరు
శాసించువారు = (నిన్ను) ఆజ్ఞాపిస్తారు
నీకున్ = నీకు
కొదవ = లోటు
ఏమి = ఏముంది?
ఆత్మ విజ్ఞానమయముగా = నిన్ను నీవు తెలిసికొనడం
అలవరింపు = నేర్చుకో

భావం :
ఓ కృషీవలా! నీవు పెద్ద కష్టాలలో కూరుకుపోవాలని నిన్ను శాసించేవారు ఎవరు ? నీకేమి తక్కువ ? నీ గొప్పతనాన్ని నీవు తెలుసుకో.

13వ పద్యం :
జీవనస్పర్థ సామాన్య చేష్టమైన
కాలమున వ్యక్తివాద మగ్రత వహించు
సత్యవిరహితు డన్యభోజ్యత నశించు
నరజీవియె యంతరాయముల దాటు
ప్రతిపదార్థం :
జీవన స్పర్ధ = బ్రతకడం విషయంలో పోటీ
సామాన్యచేష్ట = సహజమైన కార్యము
ఐన కాలమున = అయిన నేటి రోజుల్లో
వ్యక్తివాదము = ఆయా వ్యక్తుల తత్త్వము (వ్యక్తి యొక్క కృషి)
అగ్రత వహించు = ప్రాధాన్యాన్ని పొందుతుంది
సత్త్వ విరహితుడు = సత్తువ లేనివాడు
అన్యభోజ్యతన్ = ఇతరులు పెట్టే తిండిపై ఆధారపడడంతో
నశించు = నాశనం అవుతాడు
అర్హజీవి + ఎ = అర్హత గలవాడే
అంతరాయములన్ = విఘ్నములను
దాటున్ = దాటుతాడు

భావం :
బ్రతకడం కోసం పోటీతత్వం సహజమైన కాలం ఇది. ఈ పరిస్థితులలో వ్యక్తివాదం ప్రాధాన్యం వహిస్తుంది. ఏ ప్రయత్నమూ, ఏ పనీ చేయనివాడు ఇతరులపై ఆధారపడి జీవిస్తూ నాశనం అవుతాడు. కానీ శ్రమను నమ్ముకున్నవాడు, ఎలాంటి అడ్డంకులనయినా దాటగలడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 9 భూమి పుత్రుడు

14వ పద్యం :
తే॥ కావ జీవనసంగ్రామ కార్యమందు
విజయి వగుటకు శౌర్యంబు, విద్య, బుద్ధి,
సత్యసంధత, యాత్మవిశ్వాస మనెడు
నాయుధంబుల విడవకు హలికవర్య
ప్రతిపదార్థం :
హలికవర్య = శ్రేష్ఠుఁడవైన ఓ రైతూ !
కానన్ = కాబట్టి
జీవన సంగ్రామ కార్యమందు జీవన = జీవితము అనే
సంగ్రామ కార్యమందు = యుద్ధంలో
విజయివి + అగుటకు = విజయం పొందడానికి
శౌర్యంబు = శక్తి
విద్య = చదువు
బుద్ధి = తెలివి
సత్యసంధత = సత్యవాక్కు
ఆత్మవిశ్వాసము = నీపై నీకు నమ్మకము
అనెడు = అనే
ఆయుధంబులన్ = ఆయుధాలను
విడవకు = విడిచిపెట్టవద్దు

భావం :
కాబట్టి – ఓ రైతు శ్రేష్ఠుడా! జీవితము అనే యుద్ధంలో విజయం పొందడానికి ‘శక్తి, చదువు, తెలివి, సత్యము, నీపై నీకు నమ్మకము’ అనే ఆయుధాలను విడువక ముందుకు నడువు.

AP Board 9th Class Telugu Solutions Chapter 8 చూడడమనే కళ

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions Chapter 8 చూడడమనే కళ Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions 8th Lesson చూడడమనే కళ

9th Class Telugu 8th Lesson చూడడమనే కళ Textbook Questions and Answers

చదవండి-ఆలోచించండి-చెప్పండి

పూర్వం ఒక రాజుగారికి ఇద్దరు మంత్రులు ఉండేవారు. రాజు అన్ని విషయాల్లో పెద్దమంత్రినే సలహా అడిగేవాడు. అది చిన్నమంత్రికి నచ్చేది కాదు. అతనికి పెద్దమంత్రి గొప్పదనాన్ని తెలియజెప్పాలనుకున్నాడు. మక ఒకరోజు తన ఇంటి వెనుక హడావుడి ఏమిటో చూసి రమ్మని చిన్నమంత్రితో రాజు అన్నాడు. చూసివచ్చి ‘కుక్క ఈనిందన్నాడు చిన్నమంత్రి పిల్లలెన్ని’ అన్నాడు రాజు. మళ్ళీ వెళ్ళివచ్చి ‘నాలుగు’ అన్నాడు. ఏ రంగులో ఉన్నాయన్నాడు రాజు. మళ్ళీ వెళ్ళివచ్చి రెండు నలుపూ, రెండు గోధుమరంగు’లో ఉన్నాయన్నాడు. ఇంతలో పెద్దమంత్రి వచ్చాడు. అతన్ని కూడా అడిగితే ఒకేసారి చూసి వచ్చి, రాజు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానమిచ్చాడు. పెద్దమంత్రి గొప్పతనం అర్థమైన చిన్నమంత్రి సిగ్గుపడ్డాడు.

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
చిన్నమంత్రి ఒక్కొక్కసారి ఒక సమాధానాన్నే ఎందుకు చెప్పాడు?
జవాబు:
చిన్నమంత్రి విషయాన్ని పూర్తిగా పరిశీలించి చూడడం, వినడం అనే కళ తెలిసినవాడు కాడు. కేవలము, రాజు తనను అడిగిన విషయాన్ని మాత్రమే చూచి వచ్చి, ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రశ్నకే సమాధానాన్ని చెప్పగలిగాడు.

ప్రశ్న 2.
పెద్దమంత్రి ఒకేసారి అన్ని విషయాలు చెప్పడానికి కారణమేమిటి?
జవాబు:
పెద్దమంత్రి దగ్గర పరిశీలనగా విషయాన్ని సంపూర్తిగా వినడం, చూడడమనే కళ ఉంది. కాబట్టి రాజు తనను చూచి రమ్మన్నపుడు విషయాన్ని అంతా పరిశీలించి వచ్చి, అన్ని విషయాలు చెప్పగలిగాడు.

ప్రశ్న 3.
ఇద్దరిలో పరిశీలనా శక్తి ఎవరికి ఎక్కువగా ఉంది?
జవాబు:
మంత్రులు ఇద్దరిలో పెద్దమంత్రికి పరిశీలనా శక్తి ఎక్కువగా ఉంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 8 చూడడమనే కళ

ప్రశ్న 4.
మనం వేటి వేటిని జాగ్రత్తగా పరిశీలించాలి? ఎందుకు?
జవాబు:
మనం జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా చూడాలి. జాగ్రత్తగా పరిశీలించాలి. శ్రద్ధ చూపాలి. మనం చూసిన దాన్ని గురించి ఎవరు ఏమడిగినా దాన్ని గూర్చి చెప్పగలగాలి.

ఇవి చేయండి

1. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది అంశాల ఆధారంగా మాట్లాడండి.

ప్రశ్న 1.
సూర్యోదయ సమయంలో మీ చుట్టూ ఉన్న ప్రకృతి ఎలా ఉంటుంది?
జవాబు:
సూర్యోదయ సమయంలో పక్షులు కిలకిల ధ్వనులు చేస్తూ ఉంటాయి. ఆవులూ, దూడలూ అంబా అని అరుస్తూ ఉంటాయి. పూలు వికసించి పరిమళిస్తూ ఉంటాయి. నిద్ర నుండి మనుషులు లేచి తమ తమ పనులకోసం సిద్ధం అవుతూ ఉంటారు. కాలకృత్యాలు తీర్చుకుంటూ ఉంటారు. రైతులు పొలాలకు వెడుతూ ఉంటారు. జంతువులు నిద్ర నుండి లేస్తాయి. మంచు తెరలు తెరలుగా విడిపోతుంది. సూర్యకిరణాలు వెచ్చవెచ్చగా వ్యాపిస్తాయి.

ప్రశ్న 2.
శ్రద్ధ చూపడం అంటే ఏమిటి?
జవాబు:
శ్రద్ధ చూపడం అంటే మనుషుల పట్ల, జంతువుల పట్ల, మొక్కల పట్ల, వస్తువుల పట్ల స్పందన ఉండటం. శ్రద్ధ అంటే, ప్రేమ అనే దానిలో ఒక లోతైన భాగం. చిన్న చిన్న విషయాల పట్ల శ్రద్ధ చూపడంతో ఇది ప్రారంభం అవుతుంది. శ్రద్ధ చూపడం అంటే పెంపుడు జంతువును బాగా చూడడం, బట్టల్ని శుభ్రంగా ఉంచుకోవడం, శుభ్రంగా స్నానం చేసి మిమ్మల్ని మీరు పరిశుభ్రంగా ఉంచుకోవడం, మీరు పాతిన మొక్కకు నీరు పోసి, ఎరువు వేసి చక్కగా పెంచడం, మీరు పెంచుకొనే కుక్కకు సరైన ఆహారాన్ని ఇచ్చి, దాన్ని ఆరోగ్యంగా పెంచడం వంటి పనులు.

AP Board 9th Class Telugu Solutions Chapter 8 చూడడమనే కళ

ప్రశ్న 3.
ఎలా వినాలి? ఎలా మాట్లాడాలి?
జవాబు:
పరిశీలించడం, వినడం అన్న పనులు రెండూ, నిజానికి ఒకటే. ఇదంతా ఒకే పని కాబట్టి మనచుట్టూ ఉన్నవాటిని గురించి తెలిసికోవాలి. ఆ పని మనల్ని సున్నితంగా చేస్తుంది. మనం పరిశీలిస్తే, వింటే, అప్పుడు తక్షణమే క్రియ జరుగుతుంది. పరిశీలించినప్పుడే, విన్నప్పుడే చర్య తీసుకుంటారు. వినడం ఎలాగో తెలిస్తే, ఉన్నదాన్నంతటినీ మీరు గ్రహిస్తారు. ” ఎలా చూడాలో, ఎలా వినాలో, ఎలా మాట్లాడాలో తెలిస్తే, అదంతా మీ కళ్ళలోనే, చెవులలోనే, మీ నాలుకమీదనే ఉన్నదని అర్థం అవుతుంది. వినడంపై స్పష్టమైన అవగాహన ఉండాలి.

ఆ) కింది వాక్యాలు పాఠ్యాంశంలో ఎక్కడ వచ్చాయో గుర్తించి వాటి భావం రాయండి.

ప్రశ్న 1.
బిడ్డను ప్రేమించడం అంటే ఆ బాబు, పాప సరయిన విద్యను పొందేటట్లు చూడడం.
జవాబు:
ఈ వాక్యం, మా పాఠ్యాంశంలో ఎక్కడా లేదు.

ప్రశ్న 2.
పరిశీలించకపోతే మీరు ‘ప్రజ్ఞావంతంగా’ ఉండలేరు.
జవాబు:
మనం, మన చుట్టూ ఉన్న పక్షుల్నీ, చెట్లనూ, బీదవారినీ, మురికి రోడ్లనూ, ఆశ్రయం లేని ఆవులనూ, ఆకలితో, జబ్బుతో ఉన్న కుక్కల్ని పరిశీలించాలనీ, లేకపోతే మనం ప్రజ్ఞావంతంగా అంటే తెలివిగలవారుగా ఉండలేమని రచయిత చెప్పిన సందర్భంలోనిది.

ప్రశ్న 3.
ప్రతిదాన్నీ ఉన్నది ఉన్నట్లుగా చూడడం ఒక కళ.
జవాబు:
లెక్కలు, చరిత్ర, భూగోళశాస్త్రం నేర్చుకోవడం ఎంత కష్టమో, ఉన్నవాటిని ఉన్నట్లుగా చూడడం కూడా అంతే కష్టం అని, ప్రతి వస్తువునూ ఉన్నదానిని ఉన్నట్లుగా చూడడం అనేది ఒక విద్య అని, రచయిత జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పిన సందర్భంలోనిది.

ప్రశ్న 4.
“నా అంతట నేనే తెలుసుకోబోతున్నాను” అని చెప్పే సమయం మీకుండదు.
జవాబు:
మనం ఎవరో ఒకరు చెప్పింది వినడానికి అలవాటు పడిపోయాము. మనకు తల్లిదండ్రులూ, గురువులూ, పత్రికలూ, రేడియోలూ, టీవీలు చెపుతూ ఉంటాయి. అలా ఇతరులు చెప్పింది వినడమే కాని, మనంతట మనం తెలుసుకోబోతున్నామని చెప్పే సమయం మనకు ఉండదని రచయిత చెప్పిన సందర్భంలోని వాక్యమిది.

ప్రశ్న 5.
ఆ చిన్నపాపకు అలా చేయమని ఎవరూ చెప్పలేదు.
జవాబు:
స్విట్జర్లాండులో ఒక అమ్మాయి తాను సైకిలు మీద వెడుతూ, అకస్మాత్తుగా సైకిలు దిగి, రోడ్డుమీద ఉన్న కాగితం ముక్కను తీసి దగ్గరగా ఉన్న చెత్తకుండీలో వేసిందనీ, ఆ చిన్నపాపకు అలా చేయమని ఎవరూ చెప్పలేదనీ, రచయిత స్విట్జర్లాండులో మిత్రునితో పాటు కారులో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు జరిగిన ఆ సంఘటనను గూర్చి చెప్పిన సందర్భంలోనిది.

AP Board 9th Class Telugu Solutions Chapter 8 చూడడమనే కళ

ఇ) కింది పేరాను చదవండి. సమాధానాలు రాయండి.

“సర్ జగదీశ్ చంద్రబోస్” బెంగాల్ లోని విక్రంపూర్ అనే గ్రామంలో 1858 నవంబరు 30న జన్మించారు. మొక్కలమీదా, జంతువులమీదా గాఢమైన ఆసక్తిని పెంచుకున్నారు. భౌతికశాస్త్రం అభ్యసించినప్పటికీ జీవశాస్త్రం అంటే ఆసక్తి ఎక్కువ. సొంతంగా ప్రయోగశాలను ఏర్పాటు చేసుకొని అనేక పరిశోధనలు చేశారు. మొక్కలను, జంతువులను నిశితంగా పరిశీలించారు. మొక్కలకు కూడా ప్రాణం ఉందని కనుక్కొన్నారు. చెట్లు అర్థరాత్రి నిద్రిస్తాయని, ఉదయం 8 గంటల ప్రాంతంలో నిద్రలేస్తాయని చెప్పారు. మత్తుపదార్థాల ప్రభావం చెట్లపై కూడా ఉంటుందని నిర్ధారించారు.

ప్రశ్న 1.
జగదీశ్ చంద్రబోస్ ఎప్పుడు, ఎక్కడ జన్మించారు?
జవాబు:
జగదీశ్ చంద్రబోస్ బెంగాల్ లోని విక్రంపూర్ అనే గ్రామంలో 1858 నవంబరు 30న జన్మించారు.

ప్రశ్న 2.
జగదీశ్ చంద్రబోసు జీవశాస్త్రం అంటే ఎందుకు ఆసక్తి ?
జవాబు:
జగదీశ్ చంద్రబోస్ మొక్కలు, జంతువులపై గాఢమైన ఆసక్తి పెంచుకున్నారు. ఆయన భౌతికశాస్త్రం నేర్చుకొన్నప్పటికీ, జీవశాస్త్రం అంటే ఎక్కువ ఆసక్తిని పెంచుకున్నారు.

ప్రశ్న 3.
చంద్రబోస్ తన పరిశోధనలో ఏమి కనుక్కొన్నారు?
జవాబు:
చంద్రబోస్ తన పరిశోధనలలో మొక్కలకు కూడా ప్రాణం ఉందని కనుక్కొన్నారు.

ప్రశ్న 4.
చెట్లమీద పరిశోధన చేసి నిర్ధారించిన విషయమేమిటి?
జవాబు:
చెట్లకు ప్రాణం ఉంటుంది. అవి ఉదయం 8 గంటల ప్రాంతంలో నిద్రలేస్తాయి. మత్తు పదార్థాల ప్రభావం చెట్లపై ఉంటుందని నిర్ధారించారు.

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

అ) క్రింది ప్రశ్నలకు ఐదేసివాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
“ఎవరయినా దేన్నయినా నిజంగా పట్టించుకుంటున్నారో, ఏదో తెచ్చిపెట్టుకున్న మర్యాద ప్రదర్శిస్తున్నారో మనం చూస్తూ తెలుసుకోవచ్చు” అని జిడ్డు కృష్ణమూర్తిగారు, అన్నారు. తెచ్చిపెట్టుకున్న మర్యాద అంటే ఏమిటి?
జవాబు:
తెచ్చిపెట్టుకున్న మర్యాద అంటే కృత్రిమ మర్యాద. మనస్సు లోపల ఎదుటివారి పై గౌరవం లేకపోయినా, పైకి చిరునవ్వు చిందిస్తూ, ఎదుటివారిని గౌరవించడం, వారికి మర్యాదచేయడం వంటి పనులను ‘తెచ్చి పెట్టుకున్న మర్యాద’ అని అంటారు. సాధువులూ, సన్యాసులూ వంటి వారికి మంత్రులు స్వాగత సత్కారాలు చేయడం, మగ పెళ్ళి ‘వారికి ఆడ పెళ్ళివారు చేసే మర్యాదలూ తెచ్చి పెట్టుకొన్న మర్యాదలే. అత్తగారిపై మనస్సులో ప్రేమ, గౌరవాలు లేకపోయినా, ఉన్నట్లు నటించడాన్ని తెచ్చిపెట్టుకొన్న మర్యాద అంటారు.

AP Board 9th Class Telugu Solutions Chapter 8 చూడడమనే కళ

ప్రశ్న 2.
పరిశీలనకు, ప్రజ్ఞకు గల సంబంధాన్ని తెలపండి. (లేదా) పరిశీలన, ప్రజ్ఞ ఒకదానికొకటి విడదీయలేనివనే విషయం వివరించండి.
జవాబు:
మన చుట్టూ ఉన్న ప్రతిదాన్నీ అంటే పక్షుల్నీ, చెట్లనూ, పేదవారినీ, మురికి రోడ్లనూ, ఆశ్రయంలేని ఆవులనూ, ఆకలితో, జబ్బుతో ఉన్న కుక్కల్నీ. బాగా పరిశీలించాలి. అలా పరిశీలించకపోతే, ప్రజ్ఞ కలవారిగా ఉండలేము. అలా చుట్టూ ఉన్నవాటిని పరిశీలించకపోతే, హృదయంలో ప్రేమ లేకుండా పెరుగుతారు.

జీవితంలో ప్రతిదాన్నీ ఊరకే గమనించాలి. గమనింపులో నుండి ప్రజ్ఞ ఉదయిస్తుంది. గమనించడం ఎలాగో తెలిస్తే తత్వం , మతం వంటివాటికి సంబంధించిన గ్రంథాలు చదవనవసరం లేదు. ఎలా చూడాలో, ఎలా వినాలో, ఎలా మాట్లాడాలో తెలిస్తే, అదంతా మీ కళ్ళలోనే, చెవులలోనే, మీ నాలుక మీదనే ఉన్నదని అర్థం అవుతుంది.

ప్రశ్న 3.
‘వల్లించడం’ అంటే ఏమిటి? అది విద్యార్థికి ఉపయోగపడుతుందా, కాదా? ఎందువల్ల?
జవాబు:
‘వల్లించడం’ అంటే నోటికి వచ్చేలా, వేదాలు మొదలయిన వాటిని మరలా మరలా చదవడం. విద్యార్థులు చిన్నతనంలో పద్యాలనూ, గేయాలనూ, ఎక్కాలనూ, ముఖ్యమైన లెక్కలు, సైన్సు సూత్రాలనూ వల్లిస్తారు. ఆ వల్లించే విషయానికి వారికి అర్థం తెలియదు. అయినా వల్లెవేస్తారు. ఆ పద్యాలూ, ఆ ఎక్కాలూ వగైరా వారికి పెద్ద అయ్యాక సులభంగా జ్ఞప్తికి వస్తాయి. క్రమంగా వారికి అర్థజ్ఞానం కలుగుతుంది.

అందుకే సుమతీ శతకం, కృష్ణశతకం, దాశరథి శతకం వంటి శతకాలలోని పద్యాలను పిల్లలు వల్లిస్తారు. అవి వారికి జీవితాంతం గుర్తుంటాయి. అవి విద్యార్థికి ఉపయోగిస్తాయి.

కాని విద్యార్థి పెద్దవాడు అయ్యాక వల్లించడం మంచి పద్దతి కాదు. విషయం గ్రహించి సొంతంగా రాయగలగాలి. వల్లించిన మాటలు చిలుక పలుకులులా ఉంటాయి. పెద్దవారయిన విద్యార్థులకు వల్లించడం ఉపయోగకరం కాదు.

AP Board 9th Class Telugu Solutions Chapter 8 చూడడమనే కళ

ప్రశ్న 4.
ప్రవర్తన అంటే ఏమిటి? అది ఎలా ఉండాలి?
జవాబు:
ప్రవర్తన అంటే నడవడి. పరిశుభ్రతకు ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని గడపాలి. ఎదుటివారిని విమర్శించరాదు. విమర్శించకుండా, అంచనా వేయకుండా ఊరకనే గమనించాలి. మరింత జాగ్రత్తగా ఉండాలి. అశుభ్రతను, అశ్రద్ధను తగ్గించుకోవాలి. సహజమైన క్రమశిక్షణలో ఉండాలి. క్రమశిక్షణ, సున్నితత్వం కలసి ఉంటాయి. పరిశీలిస్తూ వింటూ ఉంటే, స్వతస్సిద్ధంగా, ఒత్తిడి లేకుండా అక్కడ ఒక క్రమత, సమన్వయత, క్రమశిక్షణ సంభవిస్తుంది.

ప్రశ్న 5.
శ్రద్ద చూపడం అంటే ఏమిటి? విద్యార్థులు వాటి పట్ల శ్రద్ధ చూపాలి?
జవాబు:
శ్రద్ధ చూపడం అంటే ఇతరులను బాగా చూసుకోవడం. దయగా ఉండడం, వారిపట్ల క్రూరంగా ప్రవర్తించకుండా చూసుకోవడం.

విద్యార్థులు తమ పాఠ్యగ్రంథములలోని విషయాల పట్ల శ్రద్ధ చూపాలి. గురువులను, తల్లిదండ్రులను గౌరవ భావంతో చూడాలి. తాము చదవవలసిన విషయాలపై లక్ష్యం ఉండాలి. సోదర విద్యార్థులను దయతో చూడాలి. తల్లిదండ్రులను, గురువులను ప్రేమగా చూడాలి. వారిపట్ల క్రూరంగా ఉండరాదు. గురువులు చెప్పిన దానిని సరిగా వినాలి. సరిగా పరిశీలించాలి.

విద్యార్థులు రోడ్డుపై నడిచి వెళ్ళేటప్పుడు పేదల అశుభ్రతనూ, రోడ్డు మీది బురదనూ, జబ్బుచేసిన జంతువులనూ ప్రేమతో శ్రద్ధగా చూడాలి.

ఆ) క్రింది ప్రశ్నలకు పదిహేనేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
జీవితంలో క్రమశిక్షణ అవసరం. ఎందుకో వివరించండి.
(లేదా)
క్రమశిక్షణ గురించి జిడ్డు కృష్ణమూర్తిగారి అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా? వివరించండి.
(లేదా)
క్రమశిక్షణ లేని జీవితం చుక్కాని లేని నావ వంటిది. ఈ అంశాన్ని సమర్థిస్తూ క్రమశిక్షణ ఆవశ్యకతను విశ్లేషిస్తూ రాయండి.
జవాబు:
క్రమశిక్షణ గురించి జిడ్డు కృష్ణమూర్తి గారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను.

‘క్రమశిక్షణ’ అంటే ప్రతి పనినీ, సక్రమమయిన పద్దతిలో సకాలంలో నెరవేర్చడం. పెద్దల పట్ల, గురువుల పట్ల, గౌరవనీయుల పట్ల వినయ విధేయతలు కలిగియుండడం. జీవితంలో ఉదయం లేచినప్పటి నుండి నిద్రించే వరకూ చేయవలసిన పనులను, వేళతప్పకుండా చేయడం క్రమశిక్షణ. మన శరీరానికి అవసరమయిన పోషకపదార్థాలను అందించే ఆహార పదార్థాలను సరయిన రీతిలో తినడం కూడా క్రమశిక్షణయే.

క్రమశిక్షణ లేని జీవితము చుక్కాని లేని పడవ వంటిది. క్రమశిక్షణ అనే పేరుతో బలవంతంగా పనులు చేయరాదు. స్వతస్సిద్ధంగా ఒత్తిడి లేకుండా పనులు చేయాలి. అప్పుడే ఒక క్రమత, సమన్వయత, ఒక క్రమశిక్షణ సంభవిస్తుంది.

జీవితంలో క్రమశిక్షణగా పాఠాలు చదవాలి. ఇంటిపని పూర్తిచేయాలి. ఏ వృత్తిలో ఉన్నవారయినా సరే, క్రమశిక్షణగా వారి వృత్తిధర్మాలను పూర్తిచేయాలి. అప్పుడే జీవితంలో మంచి ఫలితాలు సాధింపవచ్చు. క్రమశిక్షణగా వ్యాయామం చేస్తే ఆరోగ్యం లభిస్తుంది. ఆటలు ఆడితే శరీరానికి పుష్టి చేకూరుతుంది. ఏ రోజు పాఠాలు ఆ రోజు చదివితే విద్యార్థులు విజయం సాధిస్తారు. క్రమశిక్షణగా పొదుపు చేస్తే వారు ధనవంతులవుతారు. వారికి డబ్బు చిక్కులు రావు.

జీవితంలో క్రమశిక్షణ పాటించిన వారు ఉన్నత స్థానాన్ని అందుకుంటారు. క్రమశిక్షణతో విద్యాభ్యాసం కొనసాగిస్తే చక్కని విజయాన్ని సొంతం చేసుకుంటారు.

ప్రశ్న 2.
ప్రపంచంలో శాంతి’ ఉండాలంటే ఏం చేయాలి? మీ అభిప్రాయం రాయండి.
జవాబు:
ప్రపంచంలో శాంతి ఉండాలంటే, ప్రజలు తమలో తాము శాంతిగా ఉండాలి. మనది పోటీ ప్రపంచం. ఈ పోటీ ప్రపంచంలో ఆనందంగా జీవించడం కోసం, ముందు మనలో మనం పోటీపడడం ఆపాలి. మన పనిని మనం ప్రేమిస్తూ చేయాలి. మన పనిని మనం ప్రేమిస్తూ ఉంటే, మన కంటే ముందుకు ఎవరు వెళ్ళారో, వెనుక ఎవరు ఉన్నారో మనం పట్టించుకోము. మన సామర్థ్యాన్ని అంతా, అంటే మన మనస్సునూ, మన శరీరాన్నీ, మన హృదయాన్ని అంతా వెచ్చించి పనిచేస్తాము. హృదయం లోపల, మనిషిలో సమూలమైన పరివర్తన కలిగితే శాంతి వర్ధిల్లుతుంది.

ప్రపంచంలో ఇప్పటికి రెండు ప్రపంచయుద్ధాలు జరిగాయి. దీనికి కారణం, దేశాల మధ్య పోటీ మనస్తత్వం. ఒకరి కంటే ఒకరు ఆయుధ సంపత్తిని పెంచుకోవాలని పోటీ పడుతున్నారు. ఒకరి కంటే ఒకరు ఆర్థికంగా, బలమైన దేశంగా ఉండాలని పోటీ పడుతున్నారు. అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా వంటి దేశాలు నేటికీ తమలో తాము పోటీ పడుతున్నాయి. ఆయుధాలను భారీగా పోగుచేస్తున్నాయి. ఇందువల్లనే యుద్దాలు సంభవిస్తున్నాయి.

అలాగే మతం కూడా కొన్ని దేశాల మధ్య యుద్ధానికి కారణం అవుతున్నది. కాబట్టి మత సామరస్యం ఉండాలి. ఒక దేశానికి మరోదేశం సహకారం అందించాలి. మిత్రరాజ్య సమితిని మరింత శక్తి సంపన్నంగా చేయాలి. అగ్రరాజ్యాలవారు, బీద దేశాల వ్యవహారాలలో తలదూర్చరాదు. వారు ఆయుధాలను అమ్మి, దేశాల మధ్య పోటీ పెంచరాదు. మనిషిలో సమూలమైన మార్పు రావాలి. ప్రపంచదేశాల మధ్య మరింత సమన్వయం అవసరం. శాంతి తత్త్వాన్ని, ప్రేమ తత్త్వాన్ని ” ప్రజలలో పెంచి పోషించాలి. విశ్వమానవ సౌభ్రాతృత్వము ప్రజలలో వెల్లివిరిస్తే, ప్రపంచ శాంతి పుష్పం నిండుగా వికసిస్తుంది. ప్రపంచ ప్రజలు పరస్పరం ప్రేమాభిమానాలు పెంపొందించుకోవాలి.

ప్రశ్న 3.
చిన్నతనంలో ఉన్న ఊహాశక్తి, పెద్దవారవుతున్న కొద్దీ ఎందుకు పోతుంది? ఆలోచించి రాయండి.
జవాబు:
చిన్నతనంలో మానవులలో అసాధారణమైన ఊహాశక్తి ఉంటుంది. మనిషి పెరుగుతున్న కొద్దీ ఆ శక్తి పోతుంది. చిన్నతనంలో నదిని చూస్తూ ఉంటే ఆ నదిలోని పడవలో మనం ఉన్నట్లూ, భయంకర తుఫానుల మధ్య చిక్కుకున్నట్లు ఊహిస్తాము. మేఘాన్ని మనం చూస్తే, మనకు అది మేడలా కన్పిస్తుంది. ఆ మేడలో మనం ఉన్నట్లు భావిస్తాము. గాలి శబ్దం వింటే సంగీతాన్ని విన్నట్లు భావిస్తాము. ఒక పెద్ద పక్షిని చూస్తే, మనం దానివీపుపై ఎక్కి ప్రపంచాన్ని చుట్టి వచ్చినట్లు తలపోస్తాము.

అలాగే మనకు బాగా డబ్బు ఉన్నట్లూ, మంచి పేరు ఉన్నట్లూ, అందరూ మెచ్చుకొనే అద్భుతమైన వ్యక్తి మనం అన్నట్లు మనం భావిస్తాము. మనం ఏదైనా చరిత్ర చదివితే, దాన్ని గూర్చి ఆలోచించేటప్పుడు ఏవేవో కల్పించుకొని ఊహిస్తాము.

పెద్దవారయిన కొద్దీ మన కలలూ, ఊహలూ ఆవిరి అవుతాయి. జీవిత యధార్థ దృశ్యం మన కన్నుల ముందు సాక్షాత్కరిస్తుంది. చిన్నప్పుడు మనం మహారాజు కావాలనీ, అయినట్లూ ఊహిస్తాము. కానీ చదువు రాక, ఉద్యోగం లేక, నిరుద్యోగిగా మిగిలినప్పుడు ఇంక ఊహలు ఉండవు. విద్యార్థి దశలో శిష్యులకు ఎన్నో సందేహాలూ, ఎన్నో ప్రశ్నలూ ఉంటాయి. సామాన్యంగా గురువులు వాటిని తీర్చకుండా, వారిపై కోపపడి వారి జిజ్ఞాసపై నీళ్ళు చల్లుతారు. తల్లిదండ్రులు పిల్లల ప్రశ్నలకు ఓపికగా జవాబులు చెప్పరు. క్రమంగా పిల్లల్లో తెలిసికోవాలనే కోరిక అడుగంటుతుంది. జీవితంలో స్థిరత్వం వచ్చాక, తాను దేవేంద్రలోకంలో అప్సరసల మధ్య ఉన్నట్లు కలలు కనడు – తన నిజ స్థితిని తాను గుర్తిస్తాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 8 చూడడమనే కళ

ఇ) సృజనాత్మకంగా స్పందించండి.

ప్రశ్న 1.
పాఠంలోని మొదటిపేరా ఆధారంగా చిత్రాన్ని గీయండి. దాని గురించి వర్ణించండి.
జవాబు:
విద్యార్థి కృత్యం.
(లేదా )

ప్రశ్న 2.
మీ పాఠశాలలో ‘ప్రపంచశాంతి’ అనే అంశంపై మండలస్థాయి వ్యాసరచన పోటీ నిర్వహించాలని అనుకున్నారు. విద్యార్థులను ఆహ్వానిస్తూ కరపత్రం తయారుచేయండి.
జవాబు:

(వ్యాసరచన పోటీ)

కొవ్వూరు మండల విద్యార్థులకు ఒక శుభవార్త. దివి x x x x వ తేదీ సోమవారం, కొవ్వూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో “ప్రపంచశాంతి” అనే విషయమై వ్యాసరచన పోటీ నిర్వహిస్తున్నాము. ఈ పోటీలో కొవ్వూరు మండలంలోని . ప్రభుత్వ గుర్తింపు గల ఉన్నత పాఠశాలల విద్యార్థులందరూ పాల్గొనవచ్చును. పోటీలో పాల్గొనే విద్యార్థులు తమ ప్రధానోపాధ్యాయుని వద్ద నుండి గుర్తింపు పత్రం తీసుకురావాలి.

వ్యాసరచనకు సమయం 30 నిమిషాలు ఇవ్వబడుతుంది. వ్యాసాలు రాయడానికి కాగితాలు ఇవ్వబడతాయి. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇవ్వబడతాయి. ఈ పోటీ కొవ్వూరు మండల డెవలప్ మెంట్ ఆఫీసరు గారి పర్యవేక్షణలో సాగుతాయి.

వ్యాసరచన విషయం : “ప్రపంచశాంతి”

ఎక్కువమంది విద్యార్థినీ విద్యార్థులు ఈ పోటీలో పాల్గొని జయప్రదం చేయగోరిక. ప్రధానోపాధ్యాయులు అందరూ ఈ పోటీని జయప్రదం చేయడానికి సహకారం అందించగోరుతున్నాను.
దివి x x x x x.

మండల డెవలప్ మెంటు ఆఫీసర్,
కొవ్వూరు,
పశ్చిమ గోదావరి జిల్లా,

ఈ) ప్రశంసాత్మకంగా రాయండి.

మీ పాఠశాలలో ఒక విద్యార్థి రాష్ట్రస్థాయి స్కౌట్స్ అండ్ గైడ్స్ జంబోరీలో పాల్గొని, ముఖ్యమంత్రి చేతులమీదుగా బహుమతినందుకున్నాడు. అతణ్ణి అభినందిస్తూ పదివాక్యాలు రాయండి.
జవాబు:

అభినందన పత్రం

మిత్రుడు రవికాంత్ కు,
నీవు రాష్ట్రస్థాయి స్కౌట్స్ అండ్ గైడ్స్ జంభోరీలో పాల్గొని, మన ముఖ్యమంత్రి గారి చేతులమీదుగా ఉత్తమ స్కౌటుగా మొదటి బహుమతిని అందుకున్నావని తెలిసింది. ఇది మన పాఠశాల విద్యార్థులందరికీ గర్వకారణము. మన పాఠశాల పేరును నీవు రాష్ట్రస్థాయిలో నిలబెట్టావు. నీకు మన విద్యార్థులందరి తరఫునా నా శుభాకాంక్షలు, అభినందనలు.

నీవు మొదటి నుండి చదువులోనూ, ఆటపాటలలోనూ ఉత్తమ విద్యార్థిగా పేరు తెచ్చుకుంటున్నావు. ఈ రోజు ఇంత ఉన్నతమైన బహుమతిని అందుకున్నావు. నీవు మన పాఠశాల విద్యార్థులందరికీ ఆదర్శప్రాయుడవు. నీవు సాధించిన ఈ విజయాన్ని మన విద్యార్థినీ విద్యార్థులంతా హార్దికంగా అభినందిస్తున్నారు. నీకు మా అందరి జేజేలు.
ఉంటా.

ఇట్లు,
కె. శ్రీకాంత్ రవివర్మ,
9వ తరగతి,
మునిసిపల్ హైస్కూలు,
కాకినాడ.

(లేదా)
మీ జిల్లాలో ఒక విద్యార్థి వ్యర్థంగా పారవేసిన వస్తువులతో అద్భుతంగా కళాఖండాలు తయారుచేశాడు. ఆ వార్తను మీరు పత్రికల్లో చూశారు. అతణ్ణి ప్రశంసిస్తూ పత్రికకు లేఖ రాయండి.
జవాబు:

వాకాడు,
x x x x

కె. రాజా రవివర్మ,
9వ తరగతి,
వాకాడు జిల్లా పరిషత్ హైస్కూలు,
నెల్లూరు జిల్లా,

ఈనాడు పత్రికా సంపాదకులకు,
సోమాజీగూడ, హైదరాబాదు.

ఆర్యా,
ఈ రోజు మీ పత్రికలో మా నెల్లూరు జిల్లా గూడూరు విద్యార్థి కె. రవిరాజు, వీధుల్లో పారవేసే ప్లాస్టిక్ కాగితాలు, బాటరీలు, అగ్గిపెట్టెలు వగైరా వ్యర్థ పదార్థాలతో చార్మినార్, తాజ్ షుహల్ వంటి కళాఖండాల నమూనాలను అద్భుతంగా తయారు చేశాడని చదివాను. ఆ కళాఖండాలను చూసి మా జిల్లా విద్యాశాఖాధికారి గారు, మా కలెక్టరు గారు, స్థానిక మంత్రిగారు ఆ విద్యార్థిని ప్రశంసించినట్లు చదివాను.

రవిరాజులోని కళాతృష్ణనూ, కళాచాతుర్యాన్ని నేను మనసారా ప్రశంసిస్తున్నాను. మా నెల్లూరు జిల్లా విద్యార్థి యొక్క కళాపిపాసనూ, అతనిలోని సృజనాత్మక శక్తినీ నేను మనసారా మెచ్చుకుంటున్నాను. మీ పత్రిక ద్వారా నా అభినందనలను మా సోదరుడు రవిరాజుకు అందజేయండి. భవిష్యత్తులో అతడు ఉత్తమ కళాకారుడు కావాలని నేను కోరుకుంటున్నాను.

ఇట్లు,
కె. రాజా రవివర్మ,
జిల్లా పరిషత్ హైస్కూలు,
వాకాడు.

చిరునామా :
సంపాదకులు,
ఈనాడు దినపత్రిక,
సోమాజీగూడ,
హైదరాబాదు.

IV. ప్రాజెక్టు పని

* మనచుట్టూ ఉండే ప్రతి ప్రాణిలో ఏదో ఒక గొప్పదనం ఉంటుంది. మీరు చూసిన పక్షులు, జంతువుల లక్షణాలను, ప్రత్యేకతలను పట్టిక రూపంలో రాసి ప్రదర్శించండి.

పక్షులు/జంతువులు లక్షణాలు ప్రత్యేకత
కుక్క వాసన పసిగట్టడం విశ్వాసము కలది
కోడి గుడ్లు పెట్టుట కోడికూత
ఆవు సాధు జంతువు మచ్చిక చేసిన పాలు ఇస్తుంది.
సింహం క్రూరమైనది మృగరాజు
ఏనుగు ఎత్తైనది బరువులు ఎత్తుట
పావురం పెంపుడు పక్షి సమాచారం చేరవేయుట

III. భాషాంశాలు

పదజాలం

అ) ఇచ్చిన వాక్యాలు ఆధారంగా కింద గీత గీసిన పదాలకు అర్థాలను గ్రహించి, మరో వాక్యం రాయండి.

1. ఇంద్రధనుస్సులో రంగులను చూస్తే, విస్మయం కలుగుతుంది.
అర్థాలు : ఇంద్రధనుస్సు = హరివిల్లు; విస్మయం = ఆశ్చర్యం
వాక్యప్రయోగం : హరివిల్లు ఆకాశంలో కనబడితే, పిల్లలకు ఆశ్చర్యము కలుగుతుంది.

2. మనం ప్రతిరోజు ప్రాతఃకాలంలో నిద్రలేవాలి.
అర్థం : ప్రాతఃకాలము = తెల్లవారే సమయము.
వాక్యప్రయోగం : పక్షులు తెల్లవారే సమయములో కిలకిలారావములు చేస్తాయి.

3. వెన్నను చేతితో తాకితే మృదువుగా ఉంటుంది.
అర్థం : మృదువు = మెత్తనిది
వాక్యప్రయోగం : పూలు మెత్తగా, సున్నితంగా ఉంటాయి.

4. ప్రవర్తన సరిగా లేనివారు జీవితంలో కష్టాల్లో పడతారు.
అర్థం : ప్రవర్తన = నడవడి
వాక్యప్రయోగం : మనిషి జీవితాన్ని వారి నడవడి నిర్ణయిస్తుంది.

5. ఆదర్శానికి, ఆచరణకు సమన్వయం ఉండడం వాంఛనీయం.
అర్థం : సమన్వయం = సరియైన క్రమము
వాక్యప్రయోగం : ధర్మార్థములకు సరియైన క్రమము అవసరము.

AP Board 9th Class Telugu Solutions Chapter 8 చూడడమనే కళ

ఆ) కింది వాటిలో ఆత్మవిశ్వాసం ప్రకటించడానికి ఉపయోగపడే పదాలున్నాయి. వాటిని వేరుచేసి వాక్యాలు రాయండి.
తనంతట తాను, దురదృష్టం, కాఠిన్యం, తెలుసుకోడం, క్లిష్టం. నిజం చెప్పడం, పలు అసాధారణం, పనిని ఇష్టపడడం, స్వతస్సిద్ధం.
జవాబు:
ఆత్మవిశ్వాసం ప్రకటించడానికి ఉపయోగపడే పదాలు

  1. తనంతట తాను
  2. స్వతస్సిద్ధం
  3. నిజం చెప్పడం
  4. తెలుసుకోడం
  5. పనిని ఇష్టపడడం

వాక్య ప్రయోగాలు :

  1. తనంతట తాను . ఇతరుల సాయం లేకుండానే రవిబాబు తనంతట తానుగా ఆ కార్యం నెరవేర్చాడు.
  2. స్వతస్సిద్ధం గోపాల్ బాబు స్వతస్సిద్ధంగా గొప్ప కార్యసాధకుడు.
  3. నిజం చెప్పడం . ఏమైనా సరే, నిజం చెప్పడం మనిషి కర్తవ్యం అని బాబు నమ్ముతాడు.
  4. తెలుసుకోడం : తన శక్తిని తాను తెలుసుకోడం, కార్యసాధకుని మొదటి లక్షణం.
  5. పనిని ఇష్టపడడం : పనిని ఇష్టపడడం అన్నది యోగ్యుని లక్షణం అని చెప్పాలి.

ఇ) కింది వాక్యాలలో ప్రకృతి పదాలను గుర్తించండి. వాటి ఎదురుగా వికృతులను ఎంపిక చేసుకొని రాయండి.
1) ఆకాశంలో మబ్బులను చూశారా?
జవాబు:
ఆకాశం

2) సరైన ఆహారాన్ని తీసుకోవాలి.
జవాబు:
ఆహారం

3) నెమలి జాతీయ పక్షి.
జవాబు:
పక్షి

4) ఉపాధ్యాయుడు బడిలో పాఠాలతో పాటు క్రమశిక్షణ నేర్పుతాడు.
జవాబు:
ఉపాధ్యాయుడు

AP Board 9th Class Telugu Solutions Chapter 8 చూడడమనే కళ

వికృతి పదాలు : ఓగిరం, సంద్రం, పక్కి, దెస, ఒజ్జ, గారవం, ఆకసం, బాస, సాకిరి
జవాబు:
ప్రకృతి – వికృతి
1) ఆకాశం – ఆకసం
2) ఆహారం – ఓగిరం
3) పక్షి – పక్కి
4) ఉపాధ్యాయుడు – ఒజ్జ

వ్యాకరణం

ఈ) కింది వాక్యాన్ని పరిశీలించి, అది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. క్రియా భేదాలను కూడా గుర్తించండి.
1) రమ రోడ్డుమీద ఉన్న ఒక కాగితం ముక్కను తీసి, దగ్గరలో నున్న చెత్తకుండీలో వేసి, మళ్ళీ సైకిలెక్కి వెళ్ళిపోయింది.
అ) సామాన్య
ఆ) సంయుక్త
ఇ) సంక్లిష్ట
జవాబు:
సంక్లిష్ట వాక్యం

పై వాక్యంలో ఉన్న అసమాపక క్రియలను రాయండి.
అసమాపక క్రియలు : 1) తీసి 2) వేసి 3) ఎక్కి అనేవి. ఇవి క్వార్థకములు అనే అసమాపక క్రియలు.

2) ఎక్కడ? ఎప్పుడు? ఎందుకు? ఎవరు? ఏమిటి? అనే పదాలను ఉపయోగించి, ప్రశ్నార్థక వాక్యాలు తయారుచేయవచ్చునని మీకు తెలుసు. వాక్యం చివరలో ‘ఆ’ అనే ప్రత్యయాన్ని చేర్చి కూడా ప్రశ్నవాక్యంగా మార్చవచ్చు. ఇలాంటి ప్రశ్నావాక్యాలను రకానికి ఒకటి చొప్పున, మీ పాఠ్యపుస్తకం నుంచి ఉదాహరణలు వెతికి రాయండి.
ఉదా : దైన్యస్థితిని చూస్తారు + ఆ = దైన్యస్థితిని చూస్తారా?
జవాబు:
ప్రశ్నార్థక వాక్యాలు :

  1. మీరెప్పుడయినా గమనించారా? (గమనించారు + ఆ)
  2. మీరు గమనిస్తారా? (గమనిస్తారు + ఆ)
  3. వీటిని మీరు చూస్తారా? (చూస్తారు + ఆ)
  4. నిజంగా మీరు చూస్తుంటారా? (చూస్తుంటారు + ఆ)
  5. శ్రద్ధ చూపడం అంటే ఏమిటో మీకు తెలుసా? (తెలుసు + ఆ)
  6. పెద్దవారయిన కొద్దీ పోతుంది. ఎందువల్ల?
  7. పెరుగుతున్నప్పుడు ఎందుకు పోగొట్టుకుంటారు?
  8. ఇంట్ల కెట్ల ఆ పిల్లగాడు వొచ్చిండో? (వొచ్చిండు + ఓ)
  9. పిరికిదనం గల్గియున్నచో నట్టి ప్రసిద్ధములైన కార్యముల జేయగలిగెడి వారేనా? (వారేను + ఆ)

3) ఒక వస్తువు స్వభావాన్ని / ధర్మాన్ని తెలిపే క్రియలను, నిత్య సత్యాలను తెలిపే వాటిని “తద్ధర్మ” క్రియలు అంటారు.
ఉదయిస్తాడు, అస్తమిస్తాడు, ఎగురుతుంది మొదలైనవి. ఇలాంటి క్రియలను మీ పాఠంలో వెతికి రాయండి.
జవాబు:
నడుస్తారు, ఉదయిస్తుంది, పారిపోతారు, చూస్తారు, ఊహిస్తారు, గ్రహిస్తారు, చదువుతారు, చేస్తారు మొ||నవి.

ఉ) రుగాగమ సంధి :
పేద + ఆలు = పేద + ర్ + ఆలు = పేదరాలు.

గమనిక :
పై రెండు పదాలకు మధ్య ‘5’ అనేది వచ్చి, ప్రక్కనున్న ‘ఆ’ అనే అచ్చుతో కలిస్తే ‘రా’ అయింది. పై రెండు పదాలకు మధ్య ‘5’ అనేది వచ్చి ప్రక్కనున్న ‘ఆ’ అనే శబ్దం పరమైతే అదెలా వస్తుందంటే, పేద, బీద, బాలింత ఇలాంటి పదాలకు ‘ఆలు’ అనే శబ్దం పరమైతే ఇలా రుగాగమం ‘5’ వస్తుంది. రెండు పదాలలో ఏ అక్షరాన్ని కొట్టివేయకుండా, కొత్తగా అక్షరం వస్తే ‘ఆగమం’ అంటారు.

సూత్రం 1 :
పేదాది శబ్దాలకు ‘ఆలు’ శబ్దం పరమైతే కర్మధారయంలో రుగాగమం వస్తుంది.
పేద (విశేషణం) – ఆలు (స్త్రీ) (నామము)
విశేషణం – నామం
మనుమ + ఆలు = మనుమరాలు
బాలింత + ఆలు = బాలింతరాలు

సూత్రం 2 :
కర్మధారయంలో తత్సమపదాలకు ఆలు శబ్దం పరమైతే, పూర్వపదం చివర ఉన్న అత్వానికి ఉత్వమూ, రుగాగమమూ వస్తాయి.
ఉదా :
ధీరురాలు = ధీర . + ఆలు
(ధీర + ఉ + ర్ + ఆలు) = ధీరురాలు
గుణవంత + ఆలు = గుణవంత + ఉ + ర్ + ఆలు = గుణవంతురాలు

మరికొన్ని ఉదాహరణలు రాయండి.
1) విద్యావంతురాలు : విద్యావంత + ఉ + ర్ + ఆలు = విద్యావంతురాలు
2) అసాధ్యురాలు : అసాధ్య + ఉ + ర్ + ఆలు = అసాధ్యురాలు
3) పవిత్రురాలు – పవిత్ర + ఉ + ర్ + ఆలు = పవిత్రురాలు
4) ధైర్యవంతురాలు : ధైర్యవంత + ఉ + ర్ + ఆలు = ధైర్యవంతురాలు

9th Class Telugu 8th Lesson చూడడమనే కళ రచయిత పరిచయం

జిడ్డు కృష్ణమూర్తిగారు మే 12, 1895న ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో – జన్మించారు. వీరు ఆంగ్లములో ధ్యానం, స్వేచ్ఛ, నీవే ప్రపంచం, గరుడయానం మొదలైన రచనలు | చేశారు. కృష్ణమూర్తిగారు ప్రపంచ ప్రఖ్యాత తత్త్వవేత్త.

మనిషి తనంతట తానుగా భయం, కట్టుబాట్లు, అధికారం, మూఢవిశ్వాసాల నుండి విముక్తి చెందాలని బోధించారు. అసలైన విప్లవం రావలసినది హృదయపు లోతులలో.

ఆ మనిషిలో సమూలమైన పరివర్తన కలగకపోతే ఈ యుద్ధాలు, ఈ హింసాకాండ, ఈ జిడ్డు కృష్ణమూర్తి విధ్వంసం ఇట్లాగే కొనసాగుతూ ఉంటాయి. తనను తాను పూర్తిగా అవగాహన చేసుకుంటూ హృదయంతో స్పందిస్తూ జీవించటంలోనే పరివర్తన సాధ్యమౌతుంది అని తన రచనల ద్వారా, ప్రవర్తన ద్వారా నిరూపించారు.

AP Board 9th Class Telugu Solutions Chapter 8 చూడడమనే కళ

కఠిన పదాలకు అర్థాలు

సూర్యోదయము (సూర్య + ఉదయము) = సూర్యుడు ఉదయించడం
సూర్యాస్తమయము (సూర్య + అస్తమయము) = సూర్యుడు అస్తమించడం
విస్మయపరచు = ఆశ్చర్యము కలుగజేయు
గమనించు = గ్రహించు
ప్రతిబింబించు= ప్రతిఫలించు
ప్రాతఃకాల భానుడు = ఉదయకాల సూర్యుడు
వెండితునక = వెండి ముక్క
మాలిన్యాన్ని = మురికిని
హీనస్థితి = దారిద్ర్య స్థితి
మన్నన = గౌరవము
కాఠిన్యం = కఠినత్వము
మృదుస్వభావం = మెత్తని స్వభావము
స్పందన = కదలిక
ఆరంభము = ప్రారంభము (మొదలు)
ఆశ్రయము = ఆధారము
ప్రజ్ఞావంతముగా = తెలివి కలవారుగా
హృదయం = మనస్సు
చింత = ఆలోచన
అంతరంగం = హృదయము
నిరుత్సాహం = ఉత్సాహం లేకపోవడం
ప్రతిస్పందించు = తిరిగి కదలడం
గమనించు = గ్రహించడం
క్లిష్టమైన = కఠినమైన
అసాధారణం = విశేషము
ప్రజ్ఞ = తెలివి, అప్పటికప్పుడు పుట్టే ప్రతిభ
ఆప్యాయత = ప్రీతి
లక్ష్యపెట్టు = పట్టించుకొను
లక్ష్యం = శ్రద్ధ (గురి)
సాక్షులు = కంటితో చూచినవారు
అశుభ్రత = శుభ్రత లేకపోవడం
దైన్యాన్ని = దీనత్వాన్ని
చర్య = నడవడి, అనుష్ఠానము
సంఘర్షణ = ఒరపిడి
మిత్రునితో = స్నేహితునితో
ప్రాధాన్యత = ప్రాముఖ్యము
అస్తిత్వం = ఉండడం
స్వతస్సిద్ధంగా = తనంతట తానుగా సిద్ధించినది (సహజంగా)
శ్రవణానందము (శ్రవణ + ఆనందము) = చెవులకు ఆనందము
నిరపేక్ష = అపేక్ష లేకపోవడం (కోరికలేమి)
బెస్తవారు = పడవలను నడిపే, చేపలు పట్టుకొనే వారు
విమర్శ = తఱచి మంచిచెడ్డలను చెప్పడం

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ఆడినమాట

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions Chapter 7 ఆడినమాట Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions 7th Lesson ఆడినమాట

9th Class Telugu 7th Lesson ఆడినమాట Textbook Questions and Answers

చదవండి-ఆలోచించండి-చెప్పండి

ఒక అడవిలో వేటగాడు వేటకోసం వచ్చి చెట్లను, పొదలను తొ! శిస్తున్నాడు. ఆ పొదల్లోంచి ఒక పాము బయటకు వచ్చి చెట్లను నరకవద్దు నీకు సహాయం చేస్తానని చెప్పి ఒక రత్నం ఇచ్చింది. దాన్ని అతడు ఎక్కువ ధరకు అమ్మి ధనవంతుడయ్యాడు. చేసిన మేలు మరచి అతడు పాముకు ఇన్ని మణులెక్కడివని ఆలోచించి పుట్టను కనుక్కొని అందులో ఎండు గడ్డి వేసి మంటపెట్టాడు. ఆ మంటలకు పాము చనిపోయింది. మణుల కోసం పుట్టను తవ్వుతుండగా మిగతా పాములు కరచి అతడు చనిపోయాడు. ‘కృతజ్ఞత’ లేని నరుడు క్రూరమైనవాడు కదా !

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
చెట్లను నరక వద్దని పాము అనడానికి కారణమేమిటి?
జవాబు:
ఆ చెట్ల మధ్య, పొదల మధ్య ఆ పాము పెట్టిన పుట్ట ఉంది. ఆ పాము, ఆ పుట్టలో నివసిస్తోంది. తనక. నివసించడానికి పుట్ట లేకుండా పోతుందనే భయంతో పాము వేటగాడిని చెట్లను నరక వద్దని చెప్పింది.

ప్రశ్న 2.
వేటగాడు పామును ఎందుకు చంపాడు?
జవాబు:
వేటగాడికి పాము ఒక రత్నాన్ని ఇచ్చింది. దాన్ని అమ్మి వేటగాడు ధనవంతుడయ్యాడు. పాము పుట్టలో ఇంకా మరెన్నో రత్నాలు ఉంటాయని వేటగాడు ఆశించాడు. అందుకే వేటగాడు పుట్టను కనిపెట్టి ఎండుగడ్డితో దానిపై మంట వేసి పామును చంపాడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

ప్రశ్న 3.
వేటగాడి స్వభావం ఎలాంటిది? ఇలాంటిదే మరో కథ తెలుసా మీకు?
జవాబు:
వేటగాడు, చేసిన మేలు మరచిపోయే స్వభావం కలవాడు. అనగా కృతజ్ఞత లేనివాడు. దురాశాపరుడు. పాము తనకు చేసిన మేలును మరచి, ఆ పాము పుట్టనే మంట పెట్టి ఆ పామును చంపాడు. ఈ వేటగాడు కృతఘ్నుడు. ఇలాంటి కథ మరొకటి నాకు తెలుసు.

కృతఘ్నతగల మరో జంతువు (పులి) కథ :
పూర్వము ఒక పులి, అడవిదున్నపోతును చంపి తింది. అప్పుడు పులి దవడలో ఒక ఎముక గ్రుచ్చుకుంది. పులి ఎంత విదల్చినా ఆ ఎముక ఊడి రాలేదు. పులి బాధతో విలవిలలాడింది. అప్పుడు ఆ పులి ఒక సూచీ ముఖ పక్షి దగ్గరకు వెళ్ళి, తన నోట్లో దిగిన ఎముకను లాగి తనకు సాయం చేయమని కోరింది. ఆ పక్షి, పులి మాటలు నమ్మి ఆ ఎముకను తన ముక్కుతో లాగింది. పులి బాధ తీరిపోయింది. తరువాత పులి, ఆ పక్షి స్నేహం కొనసాగించాయి. అప్పుడప్పుడు ఆ పక్షి, పులి నోట్లో గుచ్చుకున్న ఎముకలను లాగి ఉపకారం చేస్తూ ఉండేది. ఒక రోజున ఆ పులికి ఆహారం ఎక్కడా దొరకలేదు. పులి, పక్షి దగ్గరకు వెళ్ళి, తన నోట్లో దిగిన ఎముకను లాగమని చెప్పింది. పక్షి పులిమాటలు నమ్మి, పులి నోట్లో దూరి ఎముకను లాగుదామని చూస్తుండగా పులి ఆ పక్షిని కఱచి చంపింది. ఆ పులికి కృతజ్ఞత లేదు.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది అంశాల ఆధారంగా మాట్లాడండి.

ప్రశ్న 1.
పాఠంలో ఆవు మాట్లాడిన విషయాన్నీ, పద్యాలనూ రాగయుక్తంగా పాడండి. వాటి భావం చెప్పండి.
జవాబు:
ఆవు మాట్లాడిన పద్యములు ఇవి. 1, 2, 4, 9, 10 వీటి భావాలను “పద్యాలు – ప్రతిపదార్థాలు – భావాలు”లో చూడండి.

ప్రశ్న 2.
అట్లాగే పులి మాట్లాడిన విషయాలున్న పద్యాలను రాగంతో పాడండి. వాటి భావం చెప్పండి.
జవాబు:
పులి మాట్లాడిన పద్యములు : 3, 13, 14
ఈ పద్యాల భావాలు “ప్రతిపదార్థాలు – భావాలు” వద్ద చూడండి.

ప్రశ్న 3.
క్రింది వాటిలో ఏదైనా ఒకదాన్ని సమర్థిస్తూ సరైన కారణాలతో మాట్లాడండి.
అ) “ఆడినమాట తప్పని ఆవు చాలా గొప్పది” – ఎందుకంటే …….
జవాబు:
ఆవు, పులికి మాట ఇచ్చిన విధంగా తన పుత్రునికి పాలిచ్చి, తనను తినివేయమని పులి వద్దకు తిరిగి వచ్చింది. అందుకే ఆవు గొప్పది.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

ఆ) స్వభావరీత్యా పులి క్రూరమైన జంతువు. అయినా ఇచ్చిన మాట ప్రకారం వచ్చిన ఆవును చూసి, మారిన పులి ఇంకా గొప్పది. ఎందుకంటే ………
జవాబు:
పులి సహజంగా మాంసం తినే జంతువు. అయినా ఆడినమాట తప్పని ఆవును చంపలేదు. ఆవు వంటి మహాత్ముణ్ణి చంపితే తనకు అంతులేని పాపం వస్తుందని పులి చెప్పింది. ఆవును తిరిగి తన దూడవద్దకు పంపించింది. కాబట్టి పులి ఇంకా గొప్పది.

ఇ) ‘ఆడిన మాట ప్రకారం వచ్చిన ఆవు, మారిన పులి రెండూ గొప్పవే’. ఎందుకంటే ……….
జవాబు:
ఆవు ఆడిన మాటను నిలబెట్టుకుంది. కనుక ఆవు గొప్పది. పులి హింసా ధర్మాన్ని మాని, ఆడిన మాట తప్పని ఆవును చంపకుండా దయతో విడిచి పెట్టింది. కాబట్టి పులి గొప్పది.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

ఆ) కింది మాటలు ఎవరు ఎవరితో అన్నారు?

అ) చెప్పేవారు చెప్పినా, వినేవారికి వివేకముండాలి.
జవాబు:
“చెప్పెడువారు చెప్పినన్ వినియెడువారి కించుక వివేకము పుట్టదె?” ఈ మాటలను పులి, ఆవుతో అంది.

ఆ) నా మనసు అసలే మెత్తనిది. దాన్నింకా పరీక్షించాలనుకోకు.
జవాబు:
“మెత్తని మనసే నాయది యెత్తి యిటులు చూడనేల”? ఈ మాటలను ఆవు తనను తినమని, పులిని బ్రతిమలాడుతూ చెప్పినది.

ఇ) నీవు ధర్మం తెలిసినదానివి. నీకెవ్వరూ సాటిలేరు.
జవాబు:
నీవు ధర్మవిదురాలవు. నీకెన యెవ్వరు? ఈ మాటలను పులి, ఆవును ప్రశంసిస్తూ చెప్పింది.

ఈ) నిన్ను కన్నందుకు ఋణవశాన ఇన్ని రోజులు సాకి పాలు ఇచ్చాను.
జవాబు:
“నిన్ను గని యిన్ని దినములు చన్నిచ్చితి ఋణవశంబున” ఈ మాటలను గోవు తన దూడతో అంది.

ఉ) ఇంతమాత్రానికే నా, ప్రాణాలు పోతాయా?
జవాబు:
“ప్రాణములింతనె పోవుచున్నవే?” ఈ మాటలను పులి, ఆవుతో చెప్పింది.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

ఇ) పాఠం ఆధారంగా కింద ప్రశ్నలకు జవాబులు రాయండి.

అ) పులిని ఆవు ఏమని వేడుకున్నది? ఎందుకు?
జవాబు:
పులిని ఆవు తనకు ఏడెనిమిది రోజుల క్రితమే పుట్టిన కుమారునకు పాలు ఇచ్చి వస్తానని వేడుకున్నది. తనకు కుమారుడు జన్మించి ఏడెనిమిది రోజులు మాత్రమే అయినది వానికి ఇంకా గడ్డి మేయుట చేతకాదని కావున వానికి పాలిచ్చి తగు జాగ్రత్తలు చెప్పిరావడానికి పులిని వేడుకున్నది. ఈ

ఆ) ఆవు మాటలు విన్న పులి ఏమన్నది? ఏం చేసింది?
జవాబు:
ఆవు మాటలు విన్న పులి, ఆవును అపహాస్యం చేసి ‘ఓ గోవా ! నీవు మాట్లాడుతున్నదేమిటి? నన్ను అమాయకుణ్ణి చేసి, నీ కొడుకు దగ్గరికి వెళ్ళి వస్తానంటున్నావు. ఇది సమంజసమేనా? చెప్పేవాడు చెప్పినా, వినేవాడికి వివేకం ఉండవద్దా? అన్నది.

ఇ) ఆవు తన కొడుకుకు ఏమని బుద్దులు చెప్పింది?
జవాబు:
ఎప్పుడూ అబద్దాలు మాట్లాడకు. అక్కరకు రాని వారితో కలిసి ఉండకు. ఇతరులెవరైనా నీకు కీడు కలిగించే మాటలు మాట్లాడితే భయపడకు. వినీ విననట్లుగా ఉండి ఎదురు జవాబు చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపో అని బుద్ధులు చెప్పింది.

ఈ) తిరిగి వచ్చిన ఆవును చూసి పులి ఏమన్నది?
జవాబు:
నీ వంటి మహాత్ములను చంపి, పాపాన్ని మూటకట్టుకోలేను. కావాలంటే నాకు మాంసం ఎక్కడైనా దొరుకుతుంది. ఈ పులి జాతిలో నన్ను పుట్టించిన ఆ దైవం నా చేత గడ్డి తినిపించునా? (పాపాన్ని ఎందుకు చేయిస్తాడు?) ఇంత మాత్రానికే ప్రాణాలు పోతాయా ఏం”? అని పులి తిరిగి వచ్చిన ఆవుతో పలికింది.

ఉ) తినడానికి నిరాకరించిన పులితో ఆవు ఏమన్నది?
జవాబు:
“ఓ పుణ్యాత్ముడా ! ఈ కథలన్నీ ఎందుకు ? నా మనసు అసలే మెత్తనిది. దాన్నింకా పరీక్షించాలనుకోకు. నేనీ శరీరాన్ని నీకు ఇస్తానని వాగ్దానం చేశాను కదా” అని తనను తినడానికి నిరాకరించిన పులితో ఆవు పలికింది.”

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

అ) ఈ కింది ప్రశ్నలకు ఆలోచించి ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
ఆకలితో ఉన్న పులిని ఆవు తన ఇంటికి వెళ్ళి రావడానికి ఒప్పించింది కదా ! పులి ఆవును నమ్మడానికి గల కారణాలు ఏమిటి?
(లేదా)
పులిని ఆవు ఏ మాటలతో నమ్మించింది?
జవాబు:
తాను తిరిగిరాకపోతే – అబద్ధాలు మాట్లాడి పెద్దలకు బాధ కలిగించేవాడు, తండ్రికి, తల్లికి ఎదురుమాట్లాడేవాడు, ఆకలితో గట్ల వెంబడి గడ్డిని మేయుచున్న ఆవును వెళ్ళగొట్టేవాడు ఏ నరకాల్లో పడతారో, తిరిగి రాకుంటే తాను కూడా అదే నరకాలలో పడతానని శపథం (ప్రమాణం) చేస్తుంది. కావున ఆవు మాటలను పులి నమ్మినది.

ప్రశ్న 2.
ఆవు తాను తిరిగి అడవికి వెళ్ళేముందు అబద్దమాడకు, పనికిరానివాళ్లతో తిరగకు అని బుద్ధులు చెప్పింది కదా ! ఆవు తన బిడ్డకు ఇంకా ఏమేమి బుద్దులు చెప్పి ఉండవచ్చు?
జవాబు:

  1. పక్క వారితో విరోధాలు పెట్టుకోకు
  2. అందరితో స్నేహం చెయ్యి
  3. వేళకు మేత తిను
  4. మేత తిని చక్కగా కడుపు
    నిండా నీళ్లు తాగి హాయిగా పడుకో వంటి నీతులు ఆవు దూడకు చెప్పవచ్చు.

ప్రశ్న 3.
ఇతరులు ఎవరైనా కీడును కలిగించే మాటలు మాట్లాడితే భయపడకు. వినీ విననట్లు ఉండి, వెళ్ళమని ఆవు తన కొడుకుతో చెప్పింది కదా ! అలా అనడానికి కారణాలు ఏమై ఉంటాయి?
జవాబు:
ఇతరులు కీడు కలిగించే మాటలు, పొగరుబోతుతనంతో మాట్లాడవచ్చు. ఆ మాటలకు భయపడి కూర్చుంటే మనం సంఘంలో ఏమీ చేయలేము. ఎవరికీ భయపడరాదు. ధైర్యంగా ఉండాలి. ఇతరులు నిందిస్తే తిరిగి వారిని నిందించరాదు. అలా ఎదురు మాటలు మాట్లాడితే తగవులు వస్తాయి. అందుకే ఆవు “ఎవరు ఏమి అన్నా భయపడకు. వారి మాటలు
పట్టించుకోకు” అని తన కొడుకుకు చెప్పింది.

ప్రశ్న 4.
“ఈ కథలన్నీ ఎందుకు” ? అని ఆవు అన్నది కదా ! ఈ మాటలనే ఇప్పుడు కూడా వాడుతుంటారు. ఏ ఏ సందర్భాల్లో వాడుతుంటారు?
జవాబు:

  1. మనం ఎవరినైనా ఎక్కడకైనా ఏదో పనిమీద పంపిస్తే, వాడు ఆ పని చేయకుండా ఎక్కడో తిరిగి వస్తాడు. పని ఏమయిందిరా అని అడిగితే ఏవో కథలు చెపుతాడు.
  2. పరీక్షలో ఎందుకు మంచి మార్కులు రాలేదంటే ఏవేవో కారణాలు చెపుతాడు. అప్పుడు పెద్దలు వాడితో “ఏవేవో కథలు చెప్పకు” అంటారు.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

ఆ) కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
“ఆవు-పులి” వంటి స్వభావం ఉన్నవాళ్ళు సమాజంలో ఉంటారు కదా ! వీరి స్వభావం ఎలా ఉంటుంది?
జవాబు:
ఆవు వంటి స్వభావం ఉన్నవాళ్ళు మన సమాజంలో ఉంటారు. వారు ఇతరులకు కష్టం వస్తే చూసి సహించలేరు. తనకు కష్టం కలిగినా, ఇతరులకు మేలు చేయాలనే చూస్తారు. తనకు కడుపునిండా తిండి లేకపోయినా, ఇతరులు కషాల్లో ఉన్నప్పుడు తనకు ఉన్నదంతా ధారపోసి ఎదుటివారిని ఆదుకుంటారు. సమాజంలో ఉన్నవారినందరినీ తనలాగే చూస్తారు. తనకు కష్టం వస్తే ఎలాగుంటుందో, ఇతరులకూ అలాగే ఉంటుందని వారు అనుకుంటారు.

ఆవు వంటి స్వభావం కలవారు ఎన్నడూ అబద్ధం మాట్లాడరు. ఆడినమాట కోసం తమ ప్రాణాలనైనా ధారపోస్తారు.

పులి వంటి స్వభావం కలవాళ్ళు తమ స్వార్థం కోసం ఇతరులకు హాని చేస్తారు. ఇతరులు ఎంత నష్టపోయినా వీరు పట్టించుకోరు. తమకోసం, తమవారి కోసం ఎదుటివారిని కష్టపెట్టి తమ ప్రయోజనాన్ని సాధించుకుంటారు.

పులి వంటి స్వభావం కలవారు అసత్యాలు మాట్లాడుతారు. అధర్మంగా నడచుకుంటారు. ఇతరులకు హాని చేస్తారు. పక్కవారి మంచిచెడ్డలను పట్టించుకోరు. పులి వంటి స్వభావం కలవారు అవసరమైతే ఇతరులను హత్యలు చేస్తారు. చేయిస్తారు, హింసిస్తారు, దుర్మార్గంగా నడుస్తారు.

ప్రశ్న 2.
“ఆవు” గుణగణాలను గురించి రాయండి.
జవాబు:
ఆవు ఆడినమాట తప్పని గోమాత. తన చిన్న బిడ్డకు పాలిచ్చి వస్తానని, వెళ్ళిరావడానికి తనకు అనుమతి ఇమ్మని పులిని బ్రతిమాలింది. తన బిడ్డకు గుమ్మెడు పాలు చాలునని, పులికి తన మాంసం అంతా తింటే కాని ఆకలి తీరదని, కాబట్టి ముందు తన పిల్లవాడికి పాలివ్వడం ధర్మమని నచ్చచెప్పింది. తాను అబద్ధం ఆడనని శపథాలు కూడా మాట్లాడి పులిని నమ్మించింది.

ఇంటికి వెళ్ళి ప్రేమతో కుమారుడికి పాలిచ్చి బుద్దులు చెప్పింది. ఆవు చెప్పిన బుద్ధులను బట్టి ఆవు స్వభావం చాలా మంచిదని తెలుస్తుంది. జరిగింది చెప్పి, కొడుకును ఓదార్చి పులి వద్దకు తిరిగి వచ్చింది. తన మనస్సు అసలే మెత్తనిదనీ ఇంకా పరీక్షించవద్దనీ పులికి చెప్పి, తనను తినమని పులిని బ్రతిమాలింది. దేవతలు సైతం ఆవు సత్యవాక్యశుద్ధిని మెచ్చుకున్నారు.

ప్రశ్న 3.
కథలో ఆవు గొప్పదనాన్ని తెలిపే సంఘటన ఏది? అట్లాగే పులి గొప్పదనాన్ని తెలిపే సన్నివేశం ఏది?
జవాబు:
ఆవు గొప్పదనం :
ఆవు తిరిగి వచ్చి పులిని తనను తిని కడుపు నింపుకోమంది. పులి, ఆవును చంపితే తనకు పాపం వస్తుందని చెప్పింది. అప్పుడు ఆవు పులితో “తనది అసలే మెత్తని మనస్సు అనీ, తనను ఇంకా పరీక్షించవద్దని చెప్పింది. అలాగే దూడకు బుద్ధులు చెప్పిన సంఘటన కూడా ఆవు గొప్పదనాన్ని తెలుపుతుంది.

పులి గొప్పదనం :
ఆవు చేసిన శపథములు విని, ఆవు ధర్మాత్మురాలని మెచ్చుకొని ఆవును నమ్మి ఇంటికి పంపిన ఘట్టంలో పులి గొప్పదనం తెలుస్తుంది. తిరిగివచ్చిన ఆవును తింటే తనకు దోషమనీ, తనకు మాంసం ఎక్కడైనా దొరకుతుందనీ, తనను పుట్టించిన దేవుడే తనకు ఆహారం చూపిస్తాడనీ, పులి చెప్పిన మాటలు – పులి గొప్పదనాన్ని తెలుపుతాయి.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

ఇ) సృజనాత్మకంగా రాయండి. .
“ఆవు – పులి” పాత్రల సంభాషణలు రాయండి. నాటకీకరణ చేయండి.
(లేదా)
క్రూర స్వభావం గల పులి, సాధు స్వభావం గల ఆవుల మధ్య జరిగిన సంభాషణను రాయండి.
(ఆవు-పులి)
జవాబు:
పులి : ఆగు ! ఆగు ! ఈ రోజు నువ్వు నాకు ఆహారం కావలసిందే.

ఆవు : పులిరాజా ! నేను చేసిన అపరాధమేమిటి?

పులి : (ఆవును పట్టుకొని) నాకు ఆకలిగా ఉంది. నిన్ను చంపి తింటాను.

ఆవు : అయ్యా ! పులిరాజా ! నాకు ఈ మధ్యే దూడ పుట్టింది. దానికి ఏడెనిమిది రోజులు ఉంటాయి. అది గడ్డి కూడా తినలేదు. దానికి పాలిచ్చి నీ దగ్గరికి వస్తా. నన్ను విడిచి పెట్టు.

పులి : అదేం కుదరదు. నీ మాటలు నేను నమ్మను.

ఆవు : వ్యాఘ్ర కులభూషణా ! నా మాట నమ్ము. నా బిడ్డకు గుమ్మెడు పాలతో కడుపు నిండుతుంది. నీకు నా మాంసం అంతా తింటే కాని తృప్తి తీరదు. ఈ రెండు పనుల్లో ఏది ముందు చేయాలో నీకు తెలుసు. నాకు అనుమతి ఇయ్యి. తొందరగా తిరిగి వస్తా.

పులి : (అపహాస్యంగా నవ్వి) ఓ గోవా ! ఇలా మాట్లాడుతున్నావేమిటి? నన్ను మోసపుచ్చి నీ కొడుకు దగ్గరికి వెళ్ళి , వస్తానంటున్నావు. ఇది సమంజసంగా ఉందా? ఎవరైనా నీ మాటలు నమ్ముతారా?

ఆవు : అయితే శపథం చేస్తా. అబద్దాలాడే వాడు, తల్లిదండ్రులకు ఎదురు చెప్పేవాడు, మేస్తోన్న ఆవును వెళ్ళగొట్టేవాడు ఏ దుర్గతికి పోతారో, నేను తిరిగి రాకపోతే అదే దుర్గతికి పోతా. నన్ను నమ్ము.

పులి : సరే. నేను నమ్మాను. వెళ్ళి త్వరగా రా.

ఆవు : (దూడకు పాలిచ్చి తిరిగి ఆవు పులి దగ్గరకు వచ్చి) పులిరాజా ! క్షమించు. నన్ను తిని నీ ఆకలి తీర్చుకో.

పులి : శభాష్ ! మాట నిలబెట్టుకున్నావు. నీవు ధర్మాత్మురాలవు. పాపం మూటకట్టుకోలేను. నాకు మాంసం ఎక్కడైనా దొరకుతుంది. నీవు వెళ్ళిరా.

ఆవు : పులిరాజా ! నా మనస్సు అసలే మెత్తనిది. దాన్ని ఇంకా పరీక్షించాలని అనుకోకు. నా శరీరాన్ని నీకు ముందే వాగ్దానం చేశాను. నా రక్త మాంసాలతో నీ ఆకలి తీర్చుకో.

పులి : వద్దు వద్దు. నిన్ను నేను తినలేను. నీవు సత్యమూర్తివి. నీ ధర్మం నిన్ను కాపాడింది. వెళ్ళిరా !

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

(లేదా)
“ఆవు – పులి” రెండింటినీ ఒక కుందేలు చూసింది. ఆ కుందేలు వీటిని చూసి గొప్పగా గౌరవభావంతో పొగిడింది. ఆ కుందేలు ఆవును ఏమని పొగిడి ఉంటుంది? అట్లాగే పులిని ఏమని పొగిడి ఉంటుంది? ఊహించి రాయండి.
జవాబు:
కుందేలు ఆవును పొగడడం :
శభాష్ గోవా ! నీ వంటి ధర్మాత్మురాలిని నేను ఎక్కడా చూడలేదు. నీవు ఆడినమాటను నిలబెట్టుకున్నావు. నీ చిన్ని బిడ్డపై నీకు ఎంతో ప్రేమ ఉన్నా, దానిని విడిచిపెట్టి, ఇచ్చిన మాటకోసం పులికి ఆహారం కావడానికి సిద్ధపడ్డావు. సత్యవాక్యపాలనలో నీవు సత్యహరిశ్చంద్రుణ్ణి, బలిచక్రవర్తినీ, కర్ణుడినీ మించిపోయావు. నీవు లేదు మహాత్ముడివి. నిజానికి నీవు ధర్మమూర్తివి. నీ ధర్మమే నిన్ను కాపాడింది. నీ సత్యవాక్యశుద్ధిని, మనుష్యులూ, జంతువులూ, దేవతలూ సహితం మెచ్చుకుంటారు. భేష్.

కుందేలు పులిని మెచ్చుకోవడం :
శభాష్ పులిరాజా ! నీవు నిజంగా వ్యాఘ్రకుల భూషణుడవు. ఆవు పలికిన శపథాలు విని, దానిని నమ్మి, అది తన దూడకు పాలు ఇచ్చి రావడానికి, దానిని విడిచి పెట్టావు. అంతేకాదు అన్నమాట ప్రకారం తిరిగి వచ్చిన గోవును మెచ్చుకొని దాన్ని చంపకుండా విడిచిపెట్టావు. నీవు దయామూర్తివి. కరుణా సముద్రుడివి. దేవతలు సహితం నిన్ను పొగడకుండా ఉండలేరు.

ఈ) ప్రశంసాత్మకంగా రాయండి.
ఆవు తన కొడుక్కి మంచి బుద్ధులు చెప్పింది కదా ! అట్లాగే పిల్లలకు తల్లి చెప్పే బుద్ధులు ఏవి? ఉపాధ్యాయుడు చెప్పే మంచి బుద్ధులేవో రాయండి.
జవాబు:
పిల్లలకు తల్లి చెప్పే మంచి బుద్ధులు :

  1. తోటి పిల్లలతో దెబ్బలాడవద్దు
  2. పక్క పిల్లలతో స్నేహంగా ఉండు
  3. బట్టలు మాపుకోకు
  4. పుస్తకాలు జాగ్రత్తగా చూసుకో
  5. ఉపాధ్యాయులు చెప్పేది విని శ్రద్ధగా రాసుకో
  6. అసత్యం మాట్లాడకు
  7. మధ్యాహ్నం భోజనం చెయ్యి
  8. చెడ్డవారితో స్నేహం చెయ్యకు – మొ||నవి.

ఉపాధ్యాయుడు చెప్పే మంచి బుద్ధులు :

  1. ఏ రోజు పాఠం ఆ రోజే చదువు
  2. ఇంటిపని శ్రద్ధగా పూర్తిచెయ్యి
  3. చదువుపై శ్రద్ధ పెట్టు
  4. ఆటలు ఆడుకో
  5. వ్యాయామానికై శ్రద్ధ పెట్టు
  6. తల్లిదండ్రులను, గురువులను గౌరవించు
  7. అసత్యం మాట్లాడకు
  8. తోటి బాలబాలికలను అన్నా చెల్లెళ్ళవలె ప్రేమగా గౌరవించు – మొ||నవి. “
ఆచరించాల్సినవి ఆచరించాలని అనుకొన్నవి నెల తరువాత
ఆడిన మాట తప్పకపోవడం ఆడిన మాట తప్పకపోవడం లేదు
అబద్ధం ఆడకుండా ఉండడం అబద్దం ఆడకుండా ఉండడం అవును
సమయపాలన పాటించడం భయపడకుండా ఉండడం లేదు
ఎవరైనా మనను సహాయం కోరితే సహాయం చేయడం ఏ రోజు పాఠాలు ఆ రోజు చదవడం అవును
భయపడకుండా ఉండడం నిత్యం ఉదయం నడవడం లేదు
ఇంకేమైనా ఆటలలో పాల్గొనడం అవును

IV. ప్రాజెక్టు పని

1. “ఆడినమాట తప్పరాదు!”, “సత్యవాక్కు” …… ఇలాంటి నీతికథలను మరికొన్నింటిని సేకరించండి. వాటిని రాసి ప్రదర్శించండి.
జవాబు:
“బలిచక్రవర్తి – వామనుడి కథ” శ్రీమహావిష్ణువు వామనుడిగా పుట్టి, బలిచక్రవర్తి వద్దకు వచ్చి మూడు అడుగుల నేలను దానంగా అడిగాడు. ఇస్తానని బలి మాట ఇచ్చాడు. ఇంతలో బలి చక్రవర్తి గురువు శుక్రాచార్యుడు, వామనుడు శ్రీమహా విష్ణువని, బలిని మోసం చేయడానికే వచ్చాడని, దానం ఇయ్యవద్దని అడ్డు పెట్టాడు. ఆడినమాట తప్పని బలి, వామనుడికి మూడు అడుగుల నేలను దానం చేశాడు. వామనుడు రెండు అడుగులతో భూమినీ, ఆకాశాన్ని కొలిచి, మూడవ అడుగు బలి తలపై పెట్టి అతణ్ణి పాతాళంలోకి తొక్కాడు. ఈ విధంగా బలి ఆడిన మాట తప్పలేదు.
(లేదా)
2. ఈ పాఠ్యపుస్తకంలోని పాఠాలు ఏఏకవులు/ఏఏరచయితలు రాసినవి? వాటి వివరాలు చార్టు మీద రాసి ప్రదర్శించండి.
జవాబు:
AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా 3 AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా 4

III. భాషాంశాలు

పదజాలం

అ) కింది పదాలకు అర్థాలు రాసి సొంతవాక్యాలలో రాయండి.

అ. కడుపార (కడుపునిండుగా) : పసిపిల్లలు కడుపునిండుగా పాలు తాగితే ఏడవకుండా నిద్రపోతారు.
ఆ. సుకృతం (పుణ్యం) : మన గతజన్మ సుకృతమే నేడు మనము అనుభవించేది.
ఇ. బడబాగ్ని (సముద్ర జలములోని అగ్ని) : పేదల హృదయాలలో ఆకలి మంట, బడబాగ్నిలా విజృంభిస్తోంది.
ఈ. అపహాస్యం (ఎగతాళి) : పెద్దల హితవచనాలను ఎన్నడూ అపహాస్యం చేయరాదు.
ఉ. మెత్తని మనసు (మెత్తని గుండె) . : పేదలకు నా మిత్రుడు తన మెత్తని మనస్సుతో ఎప్పుడూ సాయం చేస్తూ ఉంటాడు.
ఊ. ప్రసన్నులైరి (సంతోషించారు) : మహర్షుల తపస్సులకు మెచ్చి దేవతలు ప్రసన్నులయ్యారు.
ఎ. గగనవీధి (ఆకాశవీధి) : హనుమ గగనవీధి గుండా ఎగిరి లంకకు చేరాడు.
ఏ. దుర్గతి (హీనదశ) : నేటి పేదల దుర్గతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

అ) కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి.
అ) పూరి : గడ్డి, తృణం
ఆ) అగ్ని : శుచి, చిచ్చు, అగ్గి, మంట
ఇ) ప్రల్లదము : పరుషవాక్యం, కఠినపు మాట
ఈ) కొడుకు : కుమారుడు, సుతుడు, పుత్రుడు మజుడు
ఉ) సత్యం : నిజం, ఒట్టు
ఊ) సత్వరం : వెంటనే, త్వరితం, చయ్యన, త్వరగా
ఎ) పులి : శార్దూలం, వ్యాఘ్రం, పుండరీకం
ఏ) ఆవు : గోవు, ధేనువు, మొదవు

ఇ) కింది వాక్యాలలో భావాన్ని బట్టి గీత గీసిన పదాలకు గల వేరువేరు అర్థాలను గుర్తించి రాయండి.

1. అరణ్యంలో పుండరీకం గాండ్రించగానే చిన్న జంతువులు కకావికలం అయ్యాయి.
సూర్యరశ్మి సోకగానే సరస్సులో పుండరీకం వికసిస్తుంది.
జవాబు:
పుండరీకం = పులి, పద్మం

2. సీత గుణములు చెవిసోకగానే శివధనస్సుకు రాముడు గుణమును బిగించుటకు ప్రయత్నించాడు.
జవాబు:
గుణము – స్వభావం, అల్లెత్రాడు

3. అందమైన తమ కులములో తమ కులము వృద్ధి చెందాలని కోరుకుంటారు.
జవాబు:
కులము = ఊరు, వంశము, తెగ, ఇల్లు, శరీరం

4. కొందరు పలుకులు మిఠాయి పలుకులుగా ఉంటాయి.
జవాబు:
పలుకు = మాట, ముక్క

5. రమణీరత్నము తన ఉంగరములో రత్నమును ధరించింది.
జవాబు:
రత్నము = శ్రేష్ఠము, మణి

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

ఈ) ఈ క్రింది పట్టికలోని వాక్యాలకు సంబంధించిన వ్యుత్పత్తిపదాలను రాయండి.
వ్యుత్పత్తిపదాలు : వ్యాఘ్రము, ప్రదక్షిణ, ప్రాణం, ధర్మం, రక్తం

1. శరీరాన్ని నిలిపే వాయువు = ప్రాణం
2. జనులచేత పూనబడునది = ధర్మం
3. పొడలచేత నానావర్ణాలతో శరీరం కలది = వ్యాఘ్రం
4. ఎఱ్ఱని వర్ణము కలది = రక్తం
5. దేవతాదులనుద్దేశించి మూడుసార్లు కుడివైపుగా తిరగడం = ప్రదక్షిణ

వ్యాకరణం

అ) కింది సంధులకు సంబంధించిన ఉదాహరణలను పాఠంలో వెతికి రాయండి. సూత్రాలు కూడా రాయండి.

1. ఉత్త్వసంధి : ఉత్తునకు సంధి నిత్యము
ఉదా :
ఇట్లు + అని = ఇట్లని
నేను + ఇట్లు = నేనిట్లు
నీవు + ఎన్నడు = నీవెన్నెడు

2. జశ్వసంది :
పరుషములకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు – శ, ష, స లు తప్ప మిగిలిన హల్లులు కానీ, అచ్చులు కానీ పరమైతే వరుసగా సరళాలు ఆదేశంగా వస్తాయి.
ఉదా :
మత్ + రక్తమాంసములు = మద్రక్తమాంసములు
వాక్ + దత్తము = వాగ్దత్తము

3. గసడదవాదేశ సంధి :
ప్రథమము మీది పరుషములకు గసడదవలగు
ఉదా :
అడుగు + తిరుగక = అడుగుదిరుకగ
అన్యచిత్త + కాక = అన్యచిత్తగాక
సక్తమ్ము + చేసి = సక్తమ్ము సేసి

4. ఇత్వసంధి :
ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగానగు.
ఉదా :
అంటివి + ఇది = అంటివిది, అంటివియిది
వారికి + ఇంచుక = వారికించుక, వారికి యించుక

5. యడాగమ సంధి :
సంధి లేని చోట స్వరంబు కంటె పరంబైన స్వరంబునకు యడాగమంబగు.
ఉదా :
నీ + ఉదరాగ్ని = నీ యుదరాగ్ని
నా + అది = నాయది
హింస + ఒనర్చి = హింస యొనర్చి

త్రికసంధి

ఆ) ఆ, ఇ, ఏ అను సర్వనామాలను త్రికం అంటారు. క్రింది ఉదాహరణలను గమనించండి.
అప్పులి = ఆ + పులి

1. దీనిలో ‘ఆ’ అనేది ‘త్రికము’లలో ఒకటి. ఇది దీర్ఘాక్షరం.
2. అటువంటి త్రికమైన ‘ఆ’ మీద ఉన్న అసంయుక్త హల్లు అయిన ‘పు’ అనే అక్షరానికి ద్విత్వం వచ్చి ‘ప్పు’ అయింది. అప్పుడు ఆ + ప్పులి అయినది.
3. ద్విత్వమైన ‘ప్పు’ పరమైనందువల్ల అచ్చతెనుగు ‘ఆ’ ఇపుడు ‘అ’ అయినది.. అప్పుడు ‘అప్పులి’ అయినది.

సూత్రములు :
1. ఆ, ఈ, ఏలు త్రికమనబడును.
2. త్రికంబుమీది అంసయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగానగు.
3. ద్విరుక్తంబగు హల్లు పరమగునపుడు ఆచ్ఛికమగు దీర్ఘమునకు హ్రస్వంబగు.

కింది మాటలను విడదీసి రాయండి.
1. ఇచ్చోట – ఈ + చోట
2. అక్కడ – ఆ + కడ
3. ఎక్కడ – ఏ + కడ

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

ఇ) పాఠంలోని సమాస పదాల ఆధారంగా కింది పట్టికలోని ఖాళీ గళ్ళను పూరించండి.

సమాసం విగ్రహవాక్యం సమాసం పేరు
1. నా సుతుడు నా యొక్క సుతుడు షష్ఠీ తత్పురుష సమాసం
2. ధేనురత్నము రత్నము వంటి ధేనువు రూపక సమాసం
3. ధర్మవిదుడు ధర్మమును తెలిసినవాడు ద్వితీయ తత్పురుష సమాసం
4. గంభీరరవము గంభీరమైన రవము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
5. నాలుగు చన్నులు నాలుగు సంఖ్యగల చన్నులు ద్విగు సమాసము
6. అసత్యము సత్యము కానిది నఞ్ తత్పురుష సమాసం
7. తల్లిదండ్రులు తల్లి, తండ్రి ద్వంద్వ సమాసం

ఈ) బహుబ్లిహీ సమాసం

కింది ఉదాహరణను గమనించండి.
చక్రపాణి – చక్రం పాణియందు (చేతిలో) కలవాడు – విష్ణువు అని అర్థం. దీంట్లో సమాసంలోని రెండు పదాలకు (చక్రానికి గాని పాణికి గాని) ప్రాధాన్యం లేకుండా ఆ రెండూ మరో అర్థం ద్వారా విష్ణువును సూచిస్తున్నాయి. ఇలా సమాసంలో ఉన్న పదాల అర్థానికి ప్రాధాన్యం లేకుండా అన్యపద అర్థాన్ని స్ఫురింపజేస్తే దాన్ని బహుప్రీహి సమాసం అంటారు. అన్యపదార్థ ప్రాధాన్యం కలది బహుజొహి సమాసం.

కింది పదాలకు విగ్రహవాక్యాలు రాయండి.
1. ముక్కంటి : మూడు కన్నుల కలవాడు (శివుడు)
2. శోభనాంగి : చక్కని అవయవములు కలది (స్త్రీ)
3. మహాత్ముడు : గొప్ప ఆత్మకలవాడు (మహానుభావుడు)
4. అన్యచిత్త : వేరు ఆలోచన కలది / కలవాడు
5. చతుర్ముఖుడు : నాలుగు ముఖములు కలవాడు (బ్రహ్మ)
6. నీలాంబరి : నల్లని వస్త్రాలు ధరించినది

ఓ) ఛందస్సు

కింది పద్య పాదాలకు గణవిభజన చేసి లక్షణాలు రాయండి.

1. ఇట్టి మహానుభావులకు హింసయొనర్చి దురంత దోషముల్
జవాబు:
AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా 1
పద్యం : ఉత్పలమాల
యతిస్థానం : 1, 10 అక్షరాలు
ప్రాస : 2వ అక్షరం
గణాలు : భ, ర, న, భ, భ, ర, వ

2. పులికి ప్రదక్షిణించి తలపుం బలుకున్ సదృశంబుగాగన (స్థలిత)
జవాబు:
AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా 2
పద్యం : చంపకమాల
యతిస్థానం : 1, 10 అక్షరాలు
ప్రాస : 2వ అక్షరం
గణాలు : న, జ, భ, జ, జ, జ, ర

ఊ) అలంకారాలు

7వ పద్యంలోని అలంకారాన్ని కనుక్కొని పేరు రాసి లక్షణాలతో సరిపోల్చండి.

రూపకాలంకారం : పాషాణ ధేనువు
ఇచట ఉపమేయమైన ధేనువును, ఉపమానమైన పాషాణానికే అభేదం చెప్పబడింది. కనుక ఇది రూపకాలంకారము. ఉపమాన ఉపమేయములకు అభేదము చెప్పుట రూపకాలంకారం.

ఋ) స్వభావోక్తి

“మునుమునుబుట్టె ………………… దయాగుణముల్లసిల్లగన్”
పద్యంలో గోవు యొక్క కొడుకు మొన్నమొన్ననే పుట్టాడని, ముద్దుముద్దుగా ఉంటాడని, ఏడెనిమిది రోజుల వయస్సు కలవాడని, కొద్దిగా గడ్డిని కూడా తినలేడని – ఉన్నది ఉన్నట్లుగా చక్కని పదజాలంతో వర్ణించారు. కనుక ఇది స్వభావోక్తి అలంకారం. ఇలా ఏదైనా విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణిస్తే దానిని స్వభావోక్తి అలంకారం అంటారు.
ఉదా :
జింకలు బిత్తర చూపులు చూస్తూ చెవులు నిగిడ్చి చెంగుచెంగున గెంతుతున్నాయి.

స్వభావోక్తి అలంకారానికి రెండు ఉదాహరణలు రాయండి.

  1. ఆ తోటలోని చిలుకలు పచ్చని రెక్కలతో, ఎఱ్ఱని ముక్కుతో పండు తినుచున్నది.
  2. ఆమె ముఖము కాటుక కళ్ళతో, చిరునగవు పెదవులతో చూపురులను ఆకర్షిస్తున్నది.

9th Class Telugu 7th Lesson ఆడినమాట కవి పరిచయం

కవిపేరు : అనంతామాత్యుడు (అనంతుడు)
కాలం : 15వ శతాబ్దం
జన్మస్థలం : శ్రీకాకుళక్షేత్ర సమీపంలోని పెనుమకూరు
రచనలు : భోజరాజీయం – 2092 పద్యాల ప్రబంధ గ్రంథం. ఛందోదర్పణం – ఛందశ్శాస్త్ర గ్రంథము (నాలుగు ఆశ్వాసాల గ్రంథం) రసాభరణం – అలంకారశాస్త్ర గ్రంథము (నాలుగు ఆశ్వాసాలతో 344 గద్య పద్యాలు కలవు.)
కవితాదృక్పథం : ప్రతికథలోను నైతికత, సత్యం, త్యాగం అను సుగుణాలు ఉంటాయి.

పద్యాలు – ప్రతి పదార్థాలు-భావాలు

1వ పద్యం : కంఠస్థ పద్యం
*చ. మునుమును బుట్టె నాకు నొక ముద్దులపట్టి, యతండు పుట్టి యే
డెనిమిది నాళ్లపాటి గలఁడింతియ, పూరియు మేయనేరఁ డేఁ
జని, కడుపారం జన్గుడిపి చయ్యన వచ్చెద, నన్నుఁ బోయి ర
మ్మని సుకృతంబు గట్టికొనవన్న ! దయాగుణ ముల్లసిల్లఁగన్.
ప్రతిపదార్థం :
నాకున = నాకు
మునుమును = ముందుగా (తొలి సంతానంగా)
ఒక ముద్దుల పట్టి = ఒక ముద్దు బిడ్డ
పుట్టెన్ = పుట్టాడు
అతండు, పుట్టి = ఆ బిడ్డ పుట్టి
ఏడు + ఎనిమిది నాళ్లపాటి
గలడు = ఎనిమిది రోజులయింది
ఇంతియ = ఇంకా
పూరియున్ = గడ్డి కూడా
మేయనేరడు = తినడం చేతకాదు
ఏన్ + చని = నేను వెళ్ళి
కడుపారన్ = బిడ్డకు కడుపునిండా
చనుడిపి = పాలిచ్చి
చయ్యనన్ = వెంటనే
వచ్చెదన్ = తిరిగివస్తాను
దయాగుణము + ఉల్లసిల్లగన్ = దయాగుణం వెల్లడి అయ్యేటట్లు
నన్నున్ = నన్ను
పోయిరమ్ము + అని = వెళ్ళి రమ్మని చెప్పి
సుకృతంబు = పుణ్యము
కట్టికొనవన్న (కట్టికొనుము + అన్న) = కూడగట్టుకోవయ్యా!

భావం :
అయ్యా ! నాకు తొలి సంతానంగా పుట్టిన ముద్దుల బిడ్డ వయస్సు డెనిమిది రోజులు మాత్రమే. వాడికింకా గడ్డి మేయడం కూడా రాదు. వాడికి కడుపు నిండా పాలిచ్చి వెంటనే వస్తాను. దయతో నేను వెళ్ళిరావడానికి అంగీకరించి పుణ్యం కట్టుకో అని ఆవు పులితో చెప్పింది.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

2వ పద్యం :
ఉ. గుమ్మెడు పాల నా సుతునకుం బరితృప్తి జనించుఁగాని, మాం
సమ్ము సమస్తముం గొనక చాలదు నీ యుదరాగ్ని కైన, ని
కుమ్ముగ నిందులోఁబ్రథమ కార్య వినిర్గతి నీ వెఱుంగవే,
పొమ్మన వన్న ! వ్యాసకులభూషణ! చయ్యనఁ బోయి వచ్చెదన్.
ప్రతిపదార్థం :
నా సుతునకున్ = నా బిడ్డకు
గుమ్మెడు పాలన్
(గుమ్మ + ఎడు = గుమ్మెడు) = ఒక పాలధారతో
పరితృప్తి = సంతృప్తి
జనించున్ = కలుగుతుంది
కాని = కానీ
నీ + ఉదర + అగ్నికిన్ + ఐనన్ = (నీయుదరాగ్నికైనన్) = నీ కడుపు మంటకు అయితే
మాంసమ్ము సమస్తమున్ = నా మాంసాన్ని అంతా
కొనక = తినక
చాలదు = సరిపోదు
నిక్కమ్ముగ = నిజంగా
ఇందులోన్ = ఈ విషయంలో
ప్రథమ కార్య వినిరతి = ముందుగా చేయవలసిన పని
నీవు + ఎరుంగవే = నీకు తెలియదా?
వ్యాఘ్రకుల భూషణ – పులుల వంశంలో శ్రేష్ఠుడా!
పొమ్మనవన్న = (పొమ్మనుము + అన్న) వెళ్ళు అని చెప్పవయ్యా!
చయ్యనన్ = వెంటనే
పోయి వచ్చెదన్ = వెళ్ళి తిరిగివస్తాను.

భావం :
ఓ పులివంశంలో శ్రేష్ఠుడా ! గుమ్మెడు పాలతో నా కుమారునకు తృప్తి కలుగుతుంది. నా మాంసము అంతా తింటే కాని నీ ఆకలి మంట చల్లారదు. అయినా నిజంగా దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో నీకు తెలియదా? నాకు అనుమతి ఇయ్యి. తొందరగా వెళ్ళివస్తాను.

3వ పద్యం :
చ. అనవుడు పుండరీక మపహాస్యముచేసి ‘యిదేమి గోవ! యి
ట్లనియెదు, నన్ను బేల్పఱచి యాత్మజుఁ దున్నెడ కేగి సత్వరం|
బునఁ జనుదెంతు నంటి విది పోలునె, చెప్పెడువారు చెప్పినన్
వినియెదువారి కించుక వివేకము పుట్టదె, యింత యేటికిన్.
ప్రతిపదార్థం :
అనవుడు = (ఆవు) అట్లనగా
పుండరీకము = పెద్దపులి
అపహాస్యము చేసి = ఎగతాళి చేసి
గోవ = ఓ ఆవా !
ఇదేమి = ఇది + ఏమి ఇదేమిటి?
ఇట్లు + అనియెదు = ఇలా అంటున్నావు
నన్నున్ = నన్ను
బేల్పఱచి = అమాయకుని చేసి
ఆత్మజుడు = నీ కొడుకు
ఉన్నెడకున్ (ఉన్న+ఎడకున్) = ఉన్న చోటుకు
ఏగి = వెళ్ళి
సత్వరంబునన్ = త్వరగా
చనుదెంతున్ = తిరిగి వస్తాను
అంటివి = అన్నావు
ఇది, పోలునె = ఇది తగినదా? (ఇలా అనడం బాగుందా?)
చెప్పెడువారు = చెప్పేవారు
చెప్పినన్ = చెప్పినా
వినియెడువారికిన్ = వినే వారికి
ఇంచుక = కొంచెము
వివేకము = ఆలోచన (తెలివి)
పుట్టదె (పుట్టదు + ఎ) = పుట్టవద్దా
ఇంత + ఏటికిన్ = ఇదంతా ఎందుకు?

భావం :
ఆవు అట్లా అనగానే పులి అపహాస్యం చేసి, ‘ఓ గోవా ! ఇదేమిటి? ఇలా మాట్లాడుతున్నావు? నన్ను అమాయకుణ్ణి చేసి, నీ కొడుకు దగ్గరికి వెళ్ళి వస్తానంటున్నావు. ఇది బాగుందా? చెప్పేవాడు చెప్పినా వినేవాడికి కొంచెం వివేకం ఉండవద్దా ! ఇదంతా ఎందుకు?’ అన్నది.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

4వ పద్యం : కంఠస్థ పద్యం
ఉ. ప్రల్లదమాడి పెద్దలకు బాధ యొనర్చునతండు, తండ్రికిం
దల్లికి మాజుపల్కెడు నతండును, నాఁకొని వచ్చి మొడ్లచే
సుల్ల మెలర్ప మేయఁజనుచున్న వృషంబు నదల్చునాతఁడు
ద్రెళ్ళాడు నట్టిదుర్గతులఁ దెళ్ళుదు నేనిటు రాక తక్కినన్.
ప్రతిపదార్థం :
ప్రల్లదము + ఆడి = కఠినమైన మాట మాట్లాడి
పెద్దలకు = పెద్దవారికి
బాధ + ఒనర్చు + అతండు = బాధ కలిగించేవాడూ
తండ్రికిన్ = తండ్రికిని
తల్లికిన్ = తల్లికి
మాఱు పల్కెడు + అతండును = ఎదురు తిరిగి మాట్లాడేవాడునూ
ఆ కొని వచ్చి = ఆకలితో వచ్చి
ఒడ్ల (ఒడ్డుల) = గట్లపై గల
చేను = సస్యము
ఉల్లము + ఎలర్బన్ = మనస్సునకు సంతోషము కలిగేటట్లు
మేయన్ = మేయడానికి
చను చున్న (చనుచున్ + ఉన్న) = వెళుతున్న
వృషంబున్ = ఎద్దును
అదల్చునాతడున్ (అదల్చు + ఆతడున్) = బెదరించేవాడునూ
త్రెళ్ళెడునట్టి = పడేటటువంటి
దుర్గతులన్ = నరకాలలో
నేను = నేను
ఇటురాక = తిరిగి ఇటువైపురాక
తక్కినన్ = మానేస్తే
తెళ్ళుదున్ = పడతాను

భావం :
కఠినమైన మాటలు మాట్లాడి పెద్దలకు బాధ కలిగించేవాడూ, తండ్రికీ, తల్లికీ ఎదురు మాట్లాడే వాడూ, ఆకలితో గట్ల వెంబడి గడ్డిని మేస్తున్న పశువును (ఎద్దును) వెళ్ళగొట్టేవాడూ, ఏ నరకాలలో పడతారో, తిరిగి నేను నీ దగ్గరికి రాకపోతే నేను ఆ నరకాలలో పడతాను.

5వ పద్యం :
క. అని శపథంబులు పలికిన
విని వ్యాఘ్రము – “నీవు ధర్మవిదురాలవు నీ
కెన యెవ్వరు, ధేనువ ! యే
నిను నమ్మితిఁ బోయి రమ్మ” నినఁ బటుబుద్దిన్,
ప్రతిపదార్థం :
అని = అట్లని
శపథంబులు పలికినన్ = శపథాలు మాట్లాడగా, (ఒట్లు పెట్టగా)
వ్యాఘ్రము = పులి
విని = విని
నీవు = నీవు
ధర్మవిదురాలవు = ధర్మం తెలిసిన దానవు
నీకున్ = నీకు
ఎవ్వరు = ఎవరు
ఎన = సాటి వస్తారు
ధేనువ = ఓ గోవా !
ఏన్ = నేను
నినున్ = నిన్ను
నమ్మితిన్ = నమ్మాను
పోయి రమ్ము =
అనినన్ = అని పులి అనగా
పటు బుద్దిన్ = (ఆవు) మంచి బుద్ధితో

భావం :
అని ఆవు పలికిన శపథాలు విన్న ఓ గోవా ! నీవు ధర్మం తెలిసిన దానవు. నీకెవ్వరూ సాటిరారు. నేను నిన్ను నమ్మాను. నీవు వెళ్ళిరా” అని చెప్పింది. ఆవు అప్పుడు చక్కని బుద్ధితో.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

6వ పద్యం :
చ. పులికిఁ బ్రదక్షిణించి తలఁపుంబలుకున్ సదృశంబు గాఁగ, న
సలిత విలాసయాన మెసంగం బురికేఁగెఁ జతుస్తనంబులుం
బలసి పొదుంగు బ్రేఁగుపఱుపంగ గభీర రవంబుతోడ వీ
థుల నడయాడు బాలకులు దోరపు భీతిఁ దొలంగి పాఱఁగన్
ప్రతిపదార్థం :
పులికిన్ = పులికి
ప్రదక్షిణించి = ప్రదక్షిణము చేసి
తలపున్ = ఆలోచనయూ
పలుకున్ = మాటయూ
సదృశంబు = సమానము
కాగన్ = కాగా
చతుస్తనంబులున్ = నాలుగు చన్నులునూ
బలసి = పుష్టిపొంది
పొదుంగు = పొదుగు
త్రేగు పఱుపంగన్ = చేపగా
అస్ఖలిత = తొట్రుపాటు లేని
విలాసయానము = విలాసపు నడక
ఎసగన్ = అతిశయింపగా
గంభీరవంబుతోడన్ = గంభీరమైన ధ్వనితో
వీథులన్ = వీధులలో
నడయాడు = సంచరించే
బాలకులు = పిల్లలు
తోరపు భీతిన్ (తోరము + భీతిన్) = పెద్ద భయంతో
తొలంగి = ప్రక్కకు తప్పుకొని
పాఱగన్ = పరుగెత్తగా
పురికేగెన్ (పురికిన్ + ఏగెన్) = తన నివాస స్థలానికి వెళ్ళింది

భావం :
ఆవు, పులికి ప్రదక్షిణము చేసింది. తన బిడ్డకు సంబంధించిన ఆలోచనలూ, మాటలూ ఏకమయ్యాయి. స్తనములు లావెక్కి పొదుగు చేపుకు వచ్చింది. ఆవు గంభీర ధ్వని చేసింది. వీధులలో తిరిగే పిల్లలు పెద్ద భయంతో ప్రక్కకు తప్పుకొని పారిపోతుండగా ఆవు విలాసంగా నడుస్తూ, తన నివాసానికి వెళ్ళింది.
పురాతన

7వ పద్యం :
చ. కొడుకు చనుగ్రోలుచున్నంత దదవుఁ దల్లి
యడుగు దిరుగక కదలక యన్యచిత్త
గాక పై నీఁగ సోఁకినఁ గదలకుండా
నెమ్మిఁ బాషాణధేనువు నిలిపినట్లు.
ప్రతిపదార్థం :
కొడుకు = తన దూడ
చనుగ్రోలు చున్న = పాలు త్రాగుచున్న
అంతతడవు = అంత సేపూ
తల్లి = తల్లియైన ఆ ఆవు
అడుగు + తిరుగక = (తన) కాలు మరలింపక
కదలక = కదలకుండా
అన్యచిత్త + కాక = వేరు ఆలోచన లేక
పైన్ = తనపైన
ఈగ సోకినన్ = ఈగ వాలినా
పాషాణ ధేనువున్ = రాతి ఆవును
నిలిపినట్లు = నిలబెట్టినట్లు
నెమ్మి = దూడపై ప్రేమతో
కదలకుండె (కదలక + ఉండె) = కదలకుండా నిలబడింది.

భావం :
కొడుకు పాలు తాగుతున్నంత సేపూ ఒక్క అడుగు కూడా కదల్చకుండా, తన ఆలోచనంతా బిడ్డపైనే ఉంచి, తన మీద ఈగ వాలినా కూడా కదలకుండా, ప్రేమతో రాతి ప్రతిమలా ఆవు నిలిచి ఉంది.

8వ వచనం:
వ. అయ్యవసరంబున
(ఆ + అవసరంబున) = ఆసమయంలో
తా॥ ఆ సమయంలో

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

9వ పద్యం :
క. ‘నిన్నుఁ గని యిన్ని దినములు
చన్నిచ్చితి నేను ఋణవశంబున. నిఁక నీ
వెన్నఁడు నన్నుఁ దలంపకు ,
మన్న ! మమత్వంబు విడువు మన్న, మనమునన్’
ప్రతిపదార్థం :
నిన్నున్ + కని = నిన్ను నా పుత్రునిగా కని;
ఋణవశమునన్ = ఋణానుబంధం వల్ల
ఇన్ని దినములు = ఇన్ని రోజులూ
చన్నిచ్చితి (చన్ను + ఇచ్చితి) = పాలు ఇచ్చాను
అన్న = నాయనా
ఇఁకన్ = ఇంకముందు
నీవు = నీవు
ఎన్నడున్ = ఎప్పుడూ
నన్నున్ = నన్ను గూర్చి
తలంపకుము = ఆలోచించకు
అన్న = నాయనా
మనమునన్ = మనస్సులో
మమత్వంబు మమకారము (నా తల్లియనే అభిమానము)
విడువుము = విడిచిపెట్టు.

భావం :
నిన్ను కన్నాను. నీకూ నాకూ మధ్య ఉన్న ఋణానుబంధం చేత ఇన్ని రోజులూ నీకు పాలు ఇచ్చాను. ఇంక నీవు నన్ను ఎప్పుడూ తలంపవద్దు. నీ మనస్సులో ఇంక అమ్మ అనే భావాన్ని రానీయకు.

10వ పద్యం :
క. ఆడకు మసత్యభాషలు
కూడకు గొఱగానివాని గొంకక యొరు లె
గాడిన నెదు రుత్తరమీల
జూడకు విని విననివాని చొప్పునఁ జనుమీ.
ప్రతిపదార్థం :
అసత్య భాషలు = అబద్దపు మాటలు
ఆడకుము = మాట్లడకుము
కొఱగాని వానిన్ = పనికి మాలినవాడిని
కూడకు = చేరకు (పొందుచేయకు)
ఒరులు = ఇతరులు
ఎగ్గాడినన్ (ఎగు. + ఆడినన్) = నిందించినా
కొంకక = జంకక
ఎదురు + ఉత్తరము = ఎదురు జవాబు (తిరిగి సమాధానము)
ఈఁజూడకు (ఈన్ + చూడకు) = ఇయ్యాలని చూడవద్దు
విని = అవతలి వారి మాటలు విని కూడా
విననివాని చొప్పునన్ = విననట్టి వాడివలె
చనుమీ = వెళ్ళు

భావం :
అసత్యపు మాటలు మాట్లాడకు. అక్కరకు రాని వారితో కలసి ఉండకు. ఇతరులు ఎవరైనా నీకు కీడు కలిగించే మాటలు మాట్లాడితే, తిరిగి ఎదురు జవాబు చెప్పకు. విని కూడా వినని వాడివలె అక్కడి నుండి వెళ్ళిపో.

11వ పద్యం :
కం. చులుకన జలరుహతంతువు
చులుకన తృణకణము దూది చుల్కనసుమ్మీ !
యిలనెగయు ధూళిచులను
చులకనమరి తల్లిలేని సుతుడు కుమారా!
ప్రతిపదార్థం :
కుమారా ! = ఓ కుమారా ! (గోవత్సమా !)
ఇలనే = ఈ భూమిపై
జలరుహతంతువు = తామరతూడు
చులకన = లోకువ
తృణకణము = గడ్డిపరక
చులకన = లోకువ
దూది = ప్రత్తి
చుల్కన = తేలిక
ఎగయు = ఎగురుతున్న
ధూళి = దుమ్ముకూడా
చులకన = తేలిక
మఱి = అదేవిధంగా
తల్లిలేని = తల్లి లేని అనాధ ఐన
సుతుడు = కుమారుడు కూడా
చులకన సుమ్మీ = లోకువగా చూడబడతాడు కదా!

భావం :
ఈ లోకంలో తామరతూడు, గడ్డి పరక, ప్రత్తి, దుమ్ములను తేలికభావంతో చూస్తారు కదా ! అలాగే తల్లి లేని పిల్లలను కూడా అందరూ లోకువగా చూస్తారు. అని ఆవు తన కుమారునికి చెప్పింది.

12వ వచనం :
వ. అని గడుపాఱఁ బాలు కుడిచి తనిసిన కొడుకునకుం గడచిన
వృత్తాంతం బంతయు నెఱింగించి, పెద్దగా నేడ్చు కొడుకు నెట్టకేల
కోదార్చి, తగ బుద్ధి చెప్పి యా మొదవు పులియున్న వనంబునకు
మగిడి వచ్చిన …..
ప్రతిపదారం :
అని = అని ఆవు దూడకు చెప్పి
మును = ముందు
పుట్టగన్ + చేసిన + అట్టి = పుట్టించినట్టి
దైవము = భగవంతుడు
ఈ పట్టునన్ = ఈ సమయములో
పూరిన్ = గడ్డిని
మేపెడినే = (నాచే) తినిపిస్తాడా?
ప్రాణములు = నా ప్రాణాలు
ఇంతనె = నీ మాంసము మాత్రము చేత
పోవుచున్నవే = పోతాయా?

భావం :
అని ఆవు బుద్దులు చెప్పి, తనివి తీరా పాలు త్రాగిన కొడుకును చూసి జరిగిన సంగతి అంతా చెప్పింది. అది విని గట్టిగా ఏడుస్తున్న కొడుకును ఎట్లో ఓదార్చి, తగిన బుద్ధులు చెప్పి, ఆవు తిరిగి ఆ పులి ఉన్న అడవికి తిరిగి వచ్చింది. అప్పుడు పులి ఆవుతో ఇలా అంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

13వ పద్యం : కంఠసపద్యం
*ఉ. ఇట్టి మహానుభావులకు హింస యొనర్చి దురంత దోషముల్
గట్టికొనంగఁజాల, మటి కల్గవె మాంసము లొండుచోట, నీ
పుట్టువునందు నన్ను మును పుట్టఁగఁ జేసినయట్టి దైవ మీ
పట్టునఁ బూరి మేపెడినే ! ప్రాణములింతనె పోవుచున్నవే !
ప్రతిపదార్థం :
ఇట్టి మహానుభావులకున్ = ఇంత గొప్ప ఔదార్య బుద్దిగల నీ వంటి వారికి
హింస + ఒనర్చి = హింసించి (చంపి)
దురంత దోషముల్ = అంతులేని పాపములను
కట్టికొనంగన్ + చాలన్ = మూట కట్టుకోలేను
ఒండు చోటన్ = మరోచోట
మాంసములు = మాంసములు
కల్గవె = లభింపవా!
ఈ పుట్టువునందు = ఈ జన్మమునందు
నన్నున్ = నన్ను
కడుపాఱన్ = కడుపు నిండా
పాలుకుడిచి = పాలు త్రాగి
తనిసిన = తృప్తి పడిన
కొడుకునకున్ = తన పుత్రునకు
కడచిన వృత్తాంతంబు + అంతయున్ = జరిగిన సంగతినంతా
ఎఱింగించి = తెలిపి
పెద్దగాన్ + ఏడ్చు, కొడుకున్ = పెద్దగా ఏడుస్తున్న పుత్రుని
ఎట్టకేలకున్ + ఓదార్చి = చిట్టచివరకు ఓదార్చి
తగన్ = తగు విధంగా
బుద్ధి చెప్పి = బుద్ధులు చెప్పి
ఆ మొదవు = ఆ ఆవు
పులి = పులి
ఉన్న వనంబునకున్ = ఉన్న అడవికి
మగిడి = తిరిగి
వచ్చినన్ = రాగా

భావం :
ఇటువంటి మహాత్ములను హింసించి అంతులేని పాపాల్ని మూటకట్టుకోలేను. మాంసాలు నాకు మరొక చోట దొరకవా ! ఈ పులి జాతిలో నన్ను పుట్టించిన ఆ దైవం, నాచే గడ్డి తినిపిస్తాడా? ఇంత మాత్రానికే నా ప్రాణాలు పోతాయా?” అని పులి ఆవుతో అన్నది.

14వ పద్యం : కంఠస్థ పద్యం
మ. అని యా ధేనువుఁ జూచి-నీ విమల సత్య ప్రొధికిన్ మెచ్చు వ
చ్చె, నినుం జంపఁగఁ జాల, నీదు తలగాచెన్ ధర్మ మీ ప్రొద్దు, పొ
మ్ము నిజావాసము చేర, నీ సఖులు సమ్మోదంబునుం బొంద నీ
తనయుం డత్యనురాగముం బొరయఁ జిత్త ప్రీతిమై నొందఁగన్
ప్రతిపదార్థం :
అని = పులి ఆ విధంగా ఆవుతో అని
ఆ ధేనువున్ = ఆ ఆవును
చూచి = చూచి
నీ = నీ యొక్క
విమల = నిర్మలమైన
సత్యప్రౌఢికిన్ = సత్యము యొక్క గొప్పతనానికి
మెచ్చు = ప్రీతి (సంతోషము)
వచ్చెన్ = కల్గింది
నినున్ = నిన్ను
చంపగన్ + చాలన్ = చంపజాలను
ఈ ప్రొద్దు = ఈ వేళ
ధర్మము = నీ ధర్మగుణము
నీదు = నీయొక్క
తల + కాచెన్ = తలను రక్షించింది
నీ సఖులు = నీ తోడి గోవులు
సమ్మోదంబునున్ + పొందన్ = మిక్కిలి సంతోషాన్ని పొందేటట్లు
నీ తనయుండు = నీ కుమారుడు
అత్యనురాగమున్ = మిక్కిలి ప్రేమను
పొరయన్ = అనుభవించేటట్లు
చిత్తప్రీతి = (నీ) మనస్సులో సంతోషము
మైనొందగన్ = కలిగేటట్లుగా
నిజావాసము (నిజ + ఆవాసము) = నీ యొక్క నివాస స్థానమును
చేరన్ + పొమ్ము = చేరడానికి వెళ్ళు. (సమీపించుము)

భావం :
పులి ఆవుతో అట్లు చెప్పి, ఆ ఆవును చూచి “నీవు మాట నిలబెట్టినందుకు నాకు సంతోషము కలిగింది. నిన్ను నేను చంపలేను. నీ ధర్మము ఈ రోజు నిన్ను రక్షించింది. నీ తోడివారు సంతోషించేటట్లు, నీ కొడుకు నీ ప్రేమను పొందేటట్లు, నీ మనస్సుకు ప్రీతి కలిగేటట్లు, నీ ఇంటికి నీవు వెళ్ళు” అని చెప్పింది.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

15వ వచనం :
వ. అనిన నప్పులికి న మ్మొద విట్లనియె
ప్రతిపదార్థం :
అనినన్ = పులి అట్లనగా
అప్పులికిన్ = (ఆ + పులికిన్) ఆ పులితో
అమ్మొదవ = (ఆ + మొదవు) ఆ ఆవు
ఇట్లనియె = (ఇట్లు + అనియె) ఇలా అంది

భావం :
పులి చెప్పిన మాటలు విని, ఆవు పులితో ఇలా చెప్పింది.

16వ పద్యం :
క. ‘మెత్తని మనసే నాయది
యెత్తి యిటులు చూడనేల ? యో పుణ్యుడ ! నే’
నిత్తనువు నీకు మును వా
గ్దత్తము చేసినది కాదె ! కథ లేమిటికిన్.
ప్రతిపదార్థం :
ఓ పుణ్యుడా = ఓ పుణ్యాత్ముడా ! (ఓ పులి రాజా !)
కథలు + ఏమిటికిన్ = ఈ కథలు అన్నీ ఇప్పుడు ఎందుకు?
నా + అది = నాయది; (కాపాడింది)
మెత్తని మనసు + ఏ = అసలే మెత్తని మనస్సు
ఒత్తి = గట్టిగా నొక్కి
ఇటులు = ఈ విధంగా
చూడన్ + ఏల = పరీక్షించి చూడడం ఎందుకు?
నేను = నేను
ఇతనువు (ఈ + తనువు) = ఈ శరీరం
నీకున్ = నీకు
మును = ముందుగానే
వాగ్దత్తము (వాక్ + దత్తము) = మాటతో ఇచ్చినది
కాదె = కాదా?

భావం :
ఓ పుణ్యాత్ముడా ! “ఈ కథలన్నీ ఎందుకు? నా మనసు అసలే మెత్తనిది. దాన్ని ఇంకా పరీక్షించాలని అనుకోవద్దు. నేను నా శరీరాన్ని ఇస్తానని నీకు ముందే వాగ్దానం చేశాను కదా”.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

17వ వచనం :
వ. కావున పగలించి యుపవాసభారం బంతయుఁ
బోవునట్లు మద్రక్తమాంసములతో సక్తమ్ము సేసి
నాకుఁ బుణ్యమ్ము ప్రసాదింపుము.
ప్రతిపదార్థం :
కావున = కాబట్టి
పగలించి = చీల్చి
ఉపవాస భారంబు = నీ ఉపవాస భారాన్ని; (తిండి లేకుండా ఉన్న నీ కష్టమును)
అంతయున్ = అంతా
పోవునట్లు = పోయేటట్లు
మద్రక్త మాంసమ్ములతోన్ మత్ = నా యొక్క
రక్తమాంసములతోన్ = రక్తంతో, మాంసంతో
సక్తమ్ము + చేసి = ఆరగించి
నాకున్ = నాకు
పుణ్యమ్ము = పుణ్యమును
ప్రసాదింపుము = అనుగ్రహింపుము

భావం :
“కాబట్టి నన్ను చీల్చి, నీ ఉపవాస భారము అంతా పోయేటట్లు, నా రక్తమాంసాలు ఆరగించి, నాకు పుణ్యం ప్రసాదించు.

18వ పద్యం :
క. అని గంగడోలు బిగియఁగఁ
దన మెడ యెత్తుకొని కపిల దగ్గఱఁ జనుదెం
చినఁ జూచి పుండరీకము
వెనువెనుకకె పోవు గాని విజువదు దానిన్.
ప్రతిపదార్థం :
అని = అట్లని
కపిల = ఆ కపిల ధేనువు
గంగడోలు = తన మెడ కింద ఉండే తోలు
బిగియగన్ = బిగించి
తనమెడ = తన మెడ
ఎత్తుకొని = పైకి ఎత్తి
దగ్గఱన్ = (పులికి) దగ్గరగా
చనుదెంచినన్ = రాగా
చూచి = ఆవును చూచి
పుండరీకము = పులి
వెనువెనుక = వెనుకకు వెనుకకే
పోవున్ + కాని – పోతోంది కానీ
దానిన్ = ఆవును
విఱువదు = (పైనబడి) చీల్చదు.

భావం :
అని చెప్పి ఆవు తన గంగడోలు బిగించి, తన మెడ ఎత్తి, పులి దగ్గరకు వెళ్ళగా, ఆ పులి వెనుక వెనుకకే వెడుతోంది. కానీ ఆవును చంపడానికి ముందుకు రాలేదు.

AP Board 9th Class Telugu Solutions Chapter 7 ససేమిరా

19వ పద్యం :
సీ. ‘కుడువంగ ర’ మ్మని తొడరి చుట్టముఁ బిల్వ
నాఁకలి గా దొల్ల ననుచుఁ బెనఁగు
నతఁడును బోలె నాతతశోభనాంగియై
తనరు నా ధేనురత్నంబు దన్ను
భక్షింపు మని పట్టుపటుప, సద్యోజ్ఞాన
శాలియై పరగు శార్దూలవిభుఁడు
దా నొల్ల నని పల్కఁ దమలోన నొక కొంత
దడవు ముహుర్భాషితంబు లిట్లు
ఆ. జరుగుచుండ గోవుసత్యవాక్శుద్ధికిఁ,
బులి కృపాసమగ్రబుద్ధికిని బ్ర
సన్ను లైరి సురలు; సాధువాదము లుల్ల
సిల్లె గగనవీథి నెల్లయెడల.
ప్రతిపదార్థం :
కుడువంగన్ = తినడానికి
రమ్మని = రమ్మని
తొడరి = పూనుకొని
చుట్టమున్ = బంధువును
పిల్వన్ = పిలువగా
ఆకలి + కాదు = ఆకలిగా లేదు
ఒల్లన్ + అనుచున్ = ఇష్టము లేదని (వద్దని)
పెనుగు+అతడును+పోలెన్ = పెంకితనము చేసే వాడిలా (మొరాయించే వాడిలా)
ఆతత శోభ నాంగియై ఆతత = విస్తృతమైన (అధికమైన)
శోభన+అంగి+ఐ = చక్కని అవయవములు గలదై
తనరు = ఒప్పునట్టి
ఆ ధేనురత్నంబు = ఆ రత్నము వంటి ఆవు
తన్నున్ = తనను
భక్షింపుము + అని = తినుమని
పట్టు పఱుపన్ = పులిని లొంగ దీయు చుండగా (బ్రతిమాలుచుండగా)
సద్యోజ్ఞానశాలియై = అప్పుడే కలిగిన జ్ఞానముతో కూడినదై
పరగు = ఒప్పునట్టి
శార్దూల విభుడు = పులిరాజు
తాను = తాను
ఒల్లను + అని = అంగీకరించనని (తిననని)
పల్కన్ = చెప్పగా
తమలోనన్ = ఆ పులికీ, ఆవుకూ మధ్య
ఒక కొంత తడవు = ఒక కొంచెం సేపు
ముహుః + భాషితంబులు = మాటి మాటికీ అవసరం లేక పోయినా మాట్లాడే మాటలు
ఇట్లు = ఈ విధంగా
జరుగుచుండన్ = సాగుచుండగా
గోవు సత్యవాక్శుద్ధికిన్ = ఆవు యొక్క సత్య వాక్యము యొక్క పవిత్రతకూ
పులి = పులి యొక్క
కృపా సమగ్ర బుద్ధికిని; కృపా = దయతో
సమగ్ర = నిండిన
బుద్ధికిని = బుద్ధికీ
సురలు = దేవతలు
ప్రసన్నులు + ఐరి = సంతుష్టులైరి
గగన వీధిన్ = ఆకాశ వీధిలో
ఎల్లయెడలన్ = అన్ని చోట్ల
సాధువాదములు = భళీ బాగు, సాధు అనే మాటలు
ఉల్లసిల్లెన్ = కలిగాయి. (పుట్టాయి, వినిపించాయి)

భావం :
తినడానికి రమ్మని బంధువును పిలిస్తే ఆకలిగా లేదు వద్దని పేచీ పెట్టే వాడిలా, చక్కని అవయవములతో ఒప్పిన ఆ శ్రేష్ఠమైన ఆవు తనను తినమని పులిని బ్రతిమాలంగా, జ్ఞానము కల్గిన ఆ పులిరాజు తాను తిననని చెప్పాడు. ఇలా వారు మాటిమాటికీ మాట్లాడుతున్నారు. అప్పుడు దేవతలు గోవు యొక్క సత్యవాక్య పవిత్రతకూ, పులి యొక్క దయతో నిండిన బుద్ధికీ సంతోషించారు. ఆకాశ వీధిలో అన్ని దిక్కులలో భళీ, బాగు అనే మాటలు వినిపించాయి.

కఠిన పదాలకు అర్థాలు

గుమ్మ = పాలు పితికేటప్పుడు వచ్చేధార
సుతుడు = కుమారుడు
పరితృప్తి = సంతోషం
ఉదరాగ్ని = కడుపులో మంట, ఆకలిమంట
వినిర్గతం = బయలు వెడలినది
వ్యాఘ్రము = పెద్దపులి
కులభూషణుడు = కులం మొత్తానికి అలంకారం వంటి వాడు, గొప్పవాడు
ఆత్మజుడు = కొడుకు
సత్వరం = వెంటనే
పాషాణము = రాయి
అసత్యభాషలు = అబద్దాలు
శార్దూలము = పెద్దపులి

AP Board 9th Class Telugu Solutions Chapter 6 ప్రబోధం

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions Chapter 6 ప్రబోధం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions 6th Lesson ప్రబోధం

9th Class Telugu 6th Lesson ప్రబోధం Textbook Questions and Answers

చదవండి-ఆలోచించండి-చెప్పండి

గాంధీజీ ఒక సభలో ఇలా సందేశమిచ్చారు. ‘స్వరాజ్య సాధన స్త్రీల చేతుల్లోనే ఉంది. మీమీ పనుల్లో మీరు నిష్ణాతులు కండి. స్త్రీలు పిరికివారు, బలహీనులు అనే సామాన్యుల వాదాలు మిథ్య అని రుజువు చేయండి. స్త్రీలకు సామాజిక స్పృహ ఉండాలి. వారికున్న నైతికబలం సామాన్యమైంది కాదు. ఈ ‘అంతశ్శక్తి’ పై ఆధారపడ్డప్పుడు ప్రపంచంలో ఏ శక్తీ కూడా ఆమెను ఓడించలేదు”.

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
‘స్వరాజ్య సాధన’ ఎందుకు అవసరం?
జవాబు:
భారతదేశం స్వతంత్ర్యాభివృద్ధిని సాధించడం కోసం ‘స్వరాజ్య సాధన’ అవసరం.

ప్రశ్న 2.
సామాన్యుల మిథ్యావాదం ఏమిటి?
జవాబు:
స్త్రీలు పిరికివారు, బలహీనులు అనేది సామాన్యుల మిథ్యావాదం.

ప్రశ్న 3.
స్త్రీలలో ఉన్న “అంతశ్శక్తి” ఏది?
జవాబు:
వారి నైతికతే వారి “అంతశ్శక్త.”

AP Board 9th Class Telugu Solutions Chapter 6 ప్రబోధం

ప్రశ్న 4.
స్త్రీల గురించి గాంధీజీ కి ఉన్న అభిప్రాయాలు ఏమిటి?
జవాబు:
స్వరాజ్య సాధన స్త్రీల చేతుల్లోనే ఉంది. వారి పనుల్లో వారు నిష్ణాతులు కావాలి.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది అంశాల ఆధారంగా మాట్లాడండి.

ప్రశ్న 1.
‘స్త్రీల విద్యాభివృద్ధికి బాల్య వివాహాలు ప్రతిబంధకములు’ దీనిపై మీ అభిప్రాయం తెలపండి.
జవాబు:
చిన్న వయస్సులోనే వివాహం చేయటం వల్ల స్త్రీల విద్యాభివృద్ధి కుంటుపడుతుంది. పెళ్ళైన పిల్లల్ని పాఠశాలకు పంపడానికి పెద్దలు ఇష్టపడేవారు కాదు. పెళ్ళి కుదిరిన తరువాత ఆడపిల్లలు చదువుకు స్వస్తి పలికేవారు.

ప్రశ్న 2.
“స్వశక్తిచేత” ఏ పనులనైనా సాధించవచ్చు? నిజమా ? కాదా ? వివరించండి.
జవాబు:
స్వశక్తితో ఏ పనులనైనా సాధించవచ్చు. ఇది నిజమే ఇతరులపై ఆధారపడితే వారికి అవకాశం ఉన్నప్పుడే మన పనుల్ని చేసుకోగలం.

ఆ) పాఠం ఆధారంగా కింది వాటికి సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘లేఖ’ ను ఎవరు రాశారు? ఎవరికి రాశారు?
జవాబు:
లేఖను ‘శారద’ అనే పేరుతో కనుపర్తి వరలక్ష్మమ్మ గారు రాశారు. కల్పలత అనే ఆమెకు రాస్తున్నట్లుగా ‘గృహలక్ష్మి’ పత్రికకు రాశారు.

ప్రశ్న 2.
సభలో ఉపన్యసించిన వారెవరు? సభకు అధ్యక్షురాలు ఎవరు?
జవాబు:
సభలో ఉపన్యసించినది శ్రీమతి సరోజినీ దేవిగారు. సభకు అధ్యక్షురాలుగా నెమలి పట్టాభి రామారావు పంతులుగారి కుమార్తె శ్రీమతి పద్మావతిదేవి గారు.

AP Board 9th Class Telugu Solutions Chapter 6 ప్రబోధం

ప్రశ్న 3.
ఢిల్లీ మహిళాసభవారు చేసిన తీర్మానాలు ఏవి?
జవాబు:
ఢిల్లీ మహిళాసభవారు స్త్రీలకు సంబంధించిన పెక్కు తీర్మానాలు చేశారు. వాటిలో కొన్ని బాలబాలికలకు విధిగా విద్య నేర్పించాలి. స్త్రీలకు నియోజక, నియోజిత స్వాతంత్ర్యము సాధించుట. అతి బాల్య వివాహము అనర్థకమని ప్రచారం చేయుట.

ప్రశ్న 4.
స్త్రీలకు ఎన్నిక హక్కులు లభించడం వల్ల కలిగిన ఫలితాలేవి?
జవాబు:
స్త్రీలకు ఎన్నిక హక్కులు లభించడం వల్ల మదరాసు రాష్ట్ర శాసనసభకు ఒక స్త్రీ డిప్యూటీ ప్రెసిడెంటుగా ఎన్నుకొనబడింది. తిరువాన్కూరులో ఒక స్త్రీ మంత్రిణిగా నియమింపబడింది. సమర్థురాలుగా పేరుపొందింది. ఇంకా చాలా స్థానిక సభల్లో, విద్యా సంఘాల్లో స్త్రీలు సభ్యులుగా నియమించబడుతున్నారు.

ప్రశ్న 5.
తనువే పుణ్యక్షేత్రముగా చేసుకొనవచ్చునని సరోజినీదేవి చెప్పిన అంశాలేవి?
జవాబు:
భూతదయ కలిగిఉండటం. చేసిన తప్పుకు పశ్చాత్తాపపడటం. జాతిమత భేదాలు పాటించక విశ్వ మానవులందరిని సోదరులుగా భావించడం, అకల్మషమైన హృదయాన్ని కలిగి ఉండటం. వీటి వల్ల మన శరీరాన్నే పుణ్యక్షేత్రంగా చేసుకోవచ్చు. నిజానికి జీవితమే ఒక యాత్ర. సంస్కరించబడని మనస్సుతో ఎన్ని యాత్రలు చేసినా ఫలితం ఉండదు.

ఇ) కింది పేరాను చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

మలాలా యూసుఫ్ జాయ్ ఈ తరం బాలికల నూతన స్ఫూర్తికి ప్రతినిధి. మలాలా పాకిస్థాన్ లోని స్వాత్ లోయ మింగోరా పట్టణంలో 12 జులై, 1997లో జన్మించింది.

చిన్నప్పటి నుంచి చదువంటే చాలా ఆసక్తిగల మలాలా తమ ప్రాంతంలోని ప్రతికూల పరిస్థితులకు ఎదురు నిలిచి పోరాడింది. అక్కడి ప్రభుత్వంపై ఆధిపత్యం వహిస్తున్న తాలిబాన్ ఛాందసవాదులు బాలికలు పాఠశాలకు వెళ్ళడం, చదువుకోవడంపై నిషేధం విధించారు. మలాలా ఏ మాత్రం భయపడకుండా చదువుకొంటూనే తన తోటి బాలికలకు చదువుపై ఆసక్తిని పెంచి పాఠశాలకు వెళ్ళేటట్లుగా ప్రోత్సహించింది. దీంతో ఆగ్రహించిన తాలిబాన్లు మలాలాపై 9 అక్టోబర్ 2012న కాల్పులు జరిపారు. ఆమె తీవ్రంగా గాయపడింది. ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయింది. ప్రపంచవ్యాప్తంగా మలాలాపై సానుభూతి వెల్లువెత్తింది. అందరూ ఆమె కోలుకోవాలని కోరుకున్నారు.

ఆమె ప్రాణాపాయ స్థితి నుండి బయటికి వచ్చింది. మలాలా చైతన్యానికి, సాహసానికి, ఆత్మ సైర్యానికి ముగ్ధులైన ఐక్యరాజ్య సమితి ఆమె జన్మదినాన్ని (జూలై 12ను) ‘మలాలా రోజు’ (Malala Day) గా జరుపుకోవాలని ప్రకటించింది. ప్రతీ బాలిక చదువుకోవడం ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించింది. మలాలాను ‘ఇంటర్నేషనల్ చిల్డ్రన్ పీస్ ప్రైజ్’కు నామినీగా స్వీకరించింది.

AP Board 9th Class Telugu Solutions Chapter 6 ప్రబోధం

అ) మలాలా జన్మించిన ప్రాంతంలోని పరిస్థితులు ఏమిటి?
జవాబు:
చిన్నప్పటి నుండి చదువంటే ఆసక్తిగల మలాలాకు తన ప్రాంతంలో బాలికల చదువుకు వ్యతిరేక పరిస్థితులున్నాయి.

ఆ) తాలిబాన్ ఛాందసవాదులు దేన్ని నిషేధించారు?
జవాబు:
తాలిబాన్ ఛాందసవాదులు బాలికలు పాఠశాలకు వెళ్ళడం, చదువుకోవడంపై నిషేధం విధించారు.

ఇ) మలాలా బాలికలను ఏ విధంగా ప్రోత్సహించింది?
జవాబు:
మలాలా తాలిబాన్లకు ఏమాత్రం భయపడకుండా చదువుకొంటూనే తన తోటి బాలికలకు చదువుపై ఆసక్తిని పెంచింది. వారు కూడా పాఠశాలలకు వెళ్ళేటట్లుగా ప్రోత్సహించింది.

ఈ) మలాలా ప్రాణాపాయ స్థితిలోకి ఎందుకు వెళ్ళింది?
జవాబు:
తాలిబాన్లు మలాలాపై 9-అక్టోబర్-2012న కాల్పులు జరిపారు. దాంతో ఆమె తీవ్రంగా గాయపడి, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళింది.

ఉ) ఐక్యరాజ్య సమితి మలాలాను ఏ విధంగా గౌరవించింది?
జవాబు:
మాలాలాను ‘ఇంటర్నేషనల్ చిల్డ్రన్ పీస్ ప్రైజ్’ కు నామినీగా తీసుకొంది. నవంబర్ 10వ తేదీన ‘మలాలా రోజు’గా ప్రకటించి ఆమెను గౌరవించింది.

ఈ) కింది వాక్యాలు పాఠంలో ఎక్కడ వచ్చాయో గుర్తించి వాటి సందర్భాన్ని బట్టి భావం రాయండి.

అ) నియోజిత, నియోజక స్వాతంత్ర్యం మన స్త్రీలకు శీఘ్రంగా లభించినది.
జవాబు:
భారతీయ స్త్రీలు తమకు తాము స్వతంత్రంగా ఎన్నికలలో పాల్గొనే హక్కును, తమకు నచ్చిన వారిని ఎన్నికలలో ఎన్నుకొనే హక్కును పొందారు. పాశ్చాత్య దేశాలలోని స్త్రీలు ఈ హక్కులను పొందడానికి ప్రత్యేకంగా పరిశ్రమ చేయాల్సి వచ్చింది. వారితో పోలిస్తే భారతీయ స్త్రీలు వీటిని చాలా త్వరగా పొందినట్లే అని సరోజినీదేవి చెప్పారు.

ఆ) మన తనువే పుణ్యక్షేత్రముగా చేసుకొనవచ్చును.
జవాబు:
మనం కాశీ – రామేశ్వరాది పుణ్యయాత్రలు చేయాలనుకుంటాం కాని భూతదయను కలిగిఉండటం, చేసిన తప్పులకు పశ్చాత్తాపపడటం, జాతి, మత భేదాలు లేకుండా అందరిని సోదరులలాగా చూడడం, అమలిన హృదయంతో ఉండటం వీటి ద్వారా మన శరీరాన్నే పుణ్యక్షేత్రంగా చేసుకోవచ్చు.

ఇ) చిత్త సంస్కారము లేని యాత్రల వలన ఫలము లేదు.
జవాబు:
నిజానికి జీవితమే తీర్థయాత్ర అన్నింటికి మనస్సే మూలం. మనసు సంస్కరించబడకుండా ఎన్ని యాత్రలు చేసినా ఫలితం ఉండదు.

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

అ) కింది వాటికి ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
ఇరుగుపొరుగు వారితో ఎలా ఉండాలో తెలపండి.
జవాబు:
సాధారణంగా తల్లి తన బిడ్డకు ఏదైనా ప్రమాదం వస్తే తన ప్రాణాలనైనా పణంగా పెట్టి బిడ్డను కాపాడుకోవడానికి సాహసిస్తుంది. అలాంటే ప్రేమను ఇరుగు పొరుగు వారిపై కూడా చూపాలి. ఇంకా, సర్వమతాల వారిపై చూపాలి. సర్వమానవుల్ని సొంతవారిగా భావించగలగాలి. అన్ని ప్రాణుల్ని సొంతబిడ్డలా ప్రేమించగలగాలి.

AP Board 9th Class Telugu Solutions Chapter 6 ప్రబోధం

ప్రశ్న 2.
మనిషికి నిజమైన సౌందర్యం ఏమిటి?
జవాబు:
మనిషి విలువైన ఆభరణాలు ధరిస్తే సౌందర్యం పెరుగుతుందని మనం భావిస్తాం. అది నిజం కాదు. నిర్మలమైన హృదయాన్ని కలిగి ఉండటం, కరుణతో ప్రవర్తించడం నిజమైన సౌందర్యం. అందరితో ప్రేమను పంచుకోవడమే సౌందర్యం. కాబట్టి సుగుణాలు కలిగి ఉండటమే సౌందర్యం. విలువైన ఆభరణాలు ధరించడం సౌందర్య హేతువు కాదని గ్రహించాలి.

ప్రశ్న 3.
‘స్త్రీ శక్తి స్వరూపం’ ఈ మాటను సమర్థిస్తూ రాయండి.
జవాబు:
స్త్రీ శక్తి స్వరూపం. ప్రధాన దేవతలైన సరస్వతి – లక్ష్మి – పార్వతులు స్త్రీలే. తమ సొంతశక్తితో విద్యను, సంపదలను పొందవచ్చు. పిరికితనాన్ని, బిడియాన్ని విడిచి పెట్టడం ద్వారా సాహస కార్యాల్ని చేయవచ్చు. వేదకాలం నాటి స్త్రీలు యజ్ఞయాగాల్ని నిర్వహించినట్టు, శాస్త్ర చర్చలలో పురుషులతో పోటీ పడినట్టు మన చరిత్ర చెపుతుంది. సంపదలను సాధించడంలో కూడా స్త్రీలు నైపుణ్యాన్ని ప్రదర్శించినట్టు తెలుస్తుంది. మహారాణి రుద్రమ, వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి వంటి సాహసం నేటికీ మరుపురానివే, స్త్రీలు తమ పని శక్తిస్వరూపాన్ని గుర్తించి, వెలికితీయడం ద్వారా ఉన్నత స్థితిని త్వరగా పొందవచ్చు.

ప్రశ్న 4.
ప్రతిబంధకాలు అంటే ఏమిటి? వాటిని ఎలా అధిగమించాలి?
జవాబు:
అభివృద్ధికి అడ్డంకి కలిగించే వాటిని ప్రతి బంధకాలు అంటారు. ప్రతి కార్యానికి ప్రతిబంధకాలు కలుగుతాయి. వాటిని అధిగమిస్తేనే కోరుకున్నదాన్ని సాధించగలం. అడ్డంకులు ఏర్పడగానే కంగారు పడిపోకూడదు. జాగ్రత్తగా ఆలోచించుకొని సమస్యను అధిగమించాలి. ఉద్రేకానికి లోను కాకూడదు. అవసరమైతే పెద్దవారి సలహాలను, స్నేహితుల సహకారాన్ని తీసుకోవాలి. తెలివిగా సమస్యలను సాధించుకోవడం నేర్చుకోవాలి.

ప్రశ్న 5.
‘సరస్వతీ ప్రసన్నత’ అంటే ఏమిటి? అది ఎప్పుడు లభిస్తుంది?
జవాబు:
‘సరస్వతీ ప్రసన్నత’ – అంటే ఉన్నత విద్యలను అభ్యసించగలగడం. ప్రాథమిక విద్యలను అభ్యసించకుండా, ఉన్నత విద్యలను అభ్యసించడం కుదరదు కాబట్టి ప్రాథమిక విద్యలను ముందు అభ్యసించి, అంతటితో ఆగిపోకూడదు. ఎన్ని ఇబ్బందులెదురైనా ఉన్నత విద్యలను అభ్యసించాలి. కష్టాలను ఎదిరించి ఇష్టతతో చదివేవారికి తప్పక సరస్వతీ ప్రసన్నత కలుగుతుంది. దానివల్ల సులువుగా ఉన్నత విద్యలను అభ్యసించగలుగుతాము.

ప్రశ్న 6.
బాలబాలికలకు విధిగా విద్య నేర్పాలని సరోజినీదేవి ఎందుకన్నది?
జవాబు:
దేశ భవిష్యత్తు బాలల పైనే ఆధారపడి ఉంటుంది. అందుకే “నేటి బాలలే రేపటి పౌరులు” అనే నానుడి ఏర్పడింది. బాలలందరూ విద్యావంతులైనప్పుడే సమాజం విద్యావంతమవుతుంది. విద్యావంతమైన సమాజం వల్లే దేశం పురోభివృద్ధిని సాధిస్తుంది. దేశం సర్వతోముఖాభివృద్ధిని త్వరగా సాధించాలంటే పౌరులందరూ ఉన్నత విద్యావంతులు కావాలి. కాబట్టే బాలబాలికలందరూ విధిగా విద్యనేర్చుకోవాలని సరోజినీదేవి కోరింది.

ఆ) కింది వాటికి పదిహేనేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
సరోజినీదేవి ఉపన్యాసంలోని ముఖ్యాంశాలను సంక్షిప్తంగా రాయండి.
(లేదా)
స్త్రీ సమాజాభివృద్ధికై సరోజినీదేవి చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలేవి?
(లేదా)
సరోజినీదేవి స్త్రీలనుద్దేశించి చెప్పిన సందేశపు సారాంశాన్ని మీ మాటల్లో రాయండి.
(లేదా)
బాలబాలికలకు విధిగా విద్య నేర్వవలెను. అతిబాల్య వివాహాలు అనర్థదాయకాలు – అని సరోజనీ దేవిగారు స్త్రీ సామాజికాంశాలపై ఏ విధంగా స్పందించారో వివరించండి. ఆ
జవాబు:
శ్రీమతి సరోజినీదేవి గారి ఉపస్యౌసం మదనపల్లి యందు హిందూ సమాజం వారి యాజమాన్యంలో నిర్వహించబడింది. శ్రీమతి పద్మావతీదేవి గారు ఈ సభకు అధ్యక్షత వహించిరి. శ్రీమతి సరోజినీదేవి గారి ఉపన్యాస సారాంశం ఇట్లున్నది.

ఢిల్లీ మహిళా సభవారు స్త్రీలకు సంబంధించిన చాలా విషయాల్ని చర్చించారు. బాలలందరకూ తప్పక విద్య నేర్పించాలని అన్నారు. స్త్రీలకు నియోజక, నియోజిత స్వాతంత్ర్యం కావాలన్నారు. చిన్నవయస్సులోనే వివాహాలు చేయకూడదన్నారు. ఇతర దేశాల్లో స్త్రీలు ఎక్కువ కష్టం సాధించిన ఎన్నిక హక్కులు మనదేశంలోని స్త్రీలు పెద్దగా కష్టపడకుండానే సాధించారు. మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఒక స్త్రీ డిఫ్యూటీ ప్రెసిడెంటుగా ఎన్నిక అయింది. తిరువాన్కూరులో ఒక స్త్రీ మంత్రి పదవిని పొందింది. ఇంకా చాలామంది మహిళలు స్థానిక సభల్లోను, విద్యాసంఘాల్లోను సభ్యులయ్యారు. ఈ స్వాతంత్ర్యపు హక్కుల్ని సమర్థతతో నిర్వహించాలంటే స్త్రీలు విద్యావంతులు కావాలి. కాని మన దేశంలో స్త్రీల విద్యాభివృద్ధికి బాల్య వివాహాలు అడ్డంకి అయ్యాయి. వాటిని రూపుమాపాలి.

స్త్రీ శక్తి స్వరూపం. ప్రధాన దేవతలైన సరస్వతి – లక్ష్మి – పార్వతులు స్త్రీలే. తమ సొంత శక్తితో విద్యను, సంపదలను పొందవచ్చు. పిరికితనాన్ని, బిడియాన్ని విడిచిపెట్టడం ద్వారా సాహసకార్యాల్ని చేయవచ్చు. కాని అట్టి శక్తి నేటి మహిళలలో స్తంభించిపోయింది. చాలామంది కాశీ రామేశ్వరాది పుణ్య యాత్రల్ని చేయాలనుకుంటారు. కాని సకల ప్రాణుల్ని ప్రేమించడం, చేసిన తప్పులకు పశ్చాత్తాపడటం, జాతి మత భేదాలు పాటించక విశ్వమానవులందరినీ సోదరులుగా భావించడం ద్వారా మన శరీరాన్నే పుణ్యక్షేత్రంగా చేసుకోవచ్చు. నిజానికి జీవితమే ఒక యాత్ర. సంస్కరింపబడని మనస్సుతో ఎన్ని యాత్రలు చేసినా ఫలితం ఉండదు. తోటివారిని అంటరాని వారిగా చూడడం తప్పు. స్త్రీలకు సౌందర్యం వెలలేని ఆభరణాలను ధరించడంలో లేదు. నిర్మలమైన ప్రేమను, కరుణను ఇరుగు పొరుగు వారిపై కలిగి ఉండాలి.

AP Board 9th Class Telugu Solutions Chapter 6 ప్రబోధం

ప్రశ్న 2.
‘స్త్రీ విద్య’ ఆవశ్యకతను వివరించండి.
జవాబు:
విద్యావంతురాలైన గృహిణి వలన ఎన్నో ప్రయోజనాలున్నాయి. గృహకార్యాలనే కాక బయటకు వెళ్ళి చేసుకోవలసిన పనులను కూడా చక్కగా నిర్వహించుకోగలదు. తన పిల్లలను చదివించడంలోను, వారికి వచ్చే సందేహాలను తీర్చడంలోనూ, విద్యావంతురాలే సమర్థురాలు. మూఢనమ్మకాలకు, మోసపు మాటలకు లొంగిపోకుండా వైజ్ఞానికంగా ఆలోచించగలగాలంటే గృహిణులు తప్పక విద్యావంతులు కావాలి ఒక్క ఇల్లాలు విద్యావంతురాలైతే ఆ ఇంటిని అనేక ఆపదల నుంచి రక్షిస్తుంది. కొబట్టే “ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు” అనే సామెత ఏర్పడింది. పిల్లలచే ఉన్నత విద్యలను అభ్యసింపజేయడంలో చదువుకున్న ఇల్లాలే చక్కని నిర్ణయాలు తీసుకోగలదు.

ఆడపిల్లల చదువు వల్ల చాలా అనర్థాలు దూరమవుతాయి. సమాజం విద్యావంతమవుతుంది. ఉత్తమ సమాజం వల్ల ఉత్తమ దేశం ఏర్పడుతుంది. మూఢవిశ్వాసాలు నశిస్తాయి. వైజ్ఞానిక దృక్పథం ఏర్పడుతుంది.

ప్రశ్న 3.
స్త్రీల చైతన్యానికి మహిళా సంఘాలు చేస్తున్న కృషిని వివరించండి.
జవాబు:
బాలికలు పాఠశాలలకు వెళ్ళి విద్యాభ్యాసం చేయడానికి మహిళా సంఘాలు పరిశ్రమించాయి. వయోజనులు, గృహిణులైన స్త్రీల కోసం వయోజన విద్యా సంఘాలను ఏర్పాటుచేశాయి. సమాజంలో స్త్రీల అణచివేతను అనేక ఉద్యమాలతో ఎదుర్కొన్నాయి చదువుకొనే ప్రదేశాల్లో, పనిచేసే చోట్ల మహిళలకు ఎదురయ్యే లైంగిక వేధింపులు, ఇతర సమస్యలను సమర్థవంతంగా తిప్పికొట్టడానికి మహిళా సంఘాలు కృషిచేస్తున్నాయి.

వివిధ రాష్ట్రాల మహిళా సంఘాల ఐక్య ఉద్యమాల ఫలితంగానే మహిళలకు ఓటు హక్కు, ఎన్నికలలో పాల్గొనే హక్కు లభించాయి. ఉన్నత కుటుంబాలలోని .ఆడపిల్లలు పాఠశాలలకు వచ్చి చదువుకోగలుగుతున్నారు. పరదాలమాటున, ఘోషాల చాటున మగ్గిన మహిళలు నేడు స్వేచ్ఛగా బయటికి వచ్చి తమ పనులు నిర్వహించుకోగలుగుతున్నారంటే వీటి వెనుక మహిళా సంఘాల కృషి ఎంతో ఉంది. నేటి సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వరకట్న సమస్యలను, యాసిడ్ దాడులను దూరం చేయడంలో మహిళా సంఘాలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. మహిళలకు అనుకూలంగా అనేక చట్టాలను తీసుకురావడంలో మహిళా సంఘాలు విజయాన్ని సాధించాయి. మహిళలపై లైంగిక దాడులకు వ్యతిరేకంగా ‘నిర్భయ్’ వంటి రక్షణను పొందడం (ఇందులో కొన్ని).

ఇ) కింద ఇచ్చిన వివరాలను విశ్లేషిస్తూ పది వాక్యాలు రాయండి.

అక్షరాస్యత – 2011 సం|| జాతీయస్థాయి రాష్ట్రస్థాయి
పురుషుల అక్షరాస్యత 82.14% 75.56%
స్త్రీల అక్షరాస్యత 70.04% 59.74%
మొత్తం 65.46% 67.61%

జవాబు:

  1. భారతదేశంలో ప్రతి పది సంవత్సరాలకొకసారి జనాభాను లెక్కిస్తారు.
  2. ఈ మధ్యకాలంలో స్త్రీ – పురుష, చిన్న – పెద్ద తేడాలతో మాత్రమేగాక వివిధ కులాల, వర్గాల ప్రాతిపదికగా జనాభాను లెక్కించారు.
  3. 2001 వ సంవత్సరంలో జనాభాను లెక్కించాక తిరిగి పదేళ్ళ తర్వాత 2011వ సంవత్సరంలో జనాభా లెక్కలను భారత ప్రభుత్వం ప్రకటించింది.
  4. 2011 జనాభా లెక్కల ప్రకారం జాతీయస్థాయిలో పురుషుల అక్షరాస్యత 82.14%గా ఉంది.
  5. స్త్రీల అక్షరాస్యత 70.04% గా ఉంది.
  6. ఈ రెండింటి మధ్య తేడా 12.10. దీని ద్వారా పురుషుల కంటే స్త్రీల అక్షరాస్యతా సంఖ్య తక్కువ
  7. రాష్ట్రస్థాయిలో చూస్తే పురుషుల అక్షరాస్యతా శాతం 75.56% గా ఉంది.
  8. మహిళల అక్షరాస్యత 59.74% గా ఉంది.
  9. ఈ రెండింటి మధ్య తేడా 15.82%
  10. మన రాష్ట్రంలో మహిళల అక్షరాస్యతా శాతం ఇంకా పెరగాల్సి ఉంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 6 ప్రబోధం

ఈ) సృజనాత్మకంగా రాయండి.

ప్రశ్న 1.
సునీతా విలియమ్స్ భారత సంతతికి చెందిన అమెరికా అంతరిక్ష పరిశోధకురాలు. ఆమెకు సంబంధించిన వివరాలు కింద ఉన్నాయి. వాటి ఆధారంగా ఆమె జీవిత విశేషాలను వర్ణనాత్మకంగా రాయండి. – పూర్తి పేరు సునీతా పాండ్యకృష్ణ – జననం 19 సెప్టెంబరు, 1965.
– అమెరికా అంతరిక్ష పరిశోధకురాలు
– అంతరిక్షంలో అత్యధిక సమయం నడిచిన తొలి మహిళ.
– ఎక్కువసార్లు అంతరిక్షయాత్ర చేసిన మహిళ
– 1998లో NASA చేత ఎంపిక.
– 2007లో భారత పర్యటన.
– గుజరాత్ లో స్వగ్రామం (జులాసన్), సబర్మతి సందర్శన
– విశ్వప్రతిభ అవార్డ్, ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియన్ డీసెంట్ అవార్డు.
– 4 అక్టోబర్ 2007లో “అమెరికన్ ఎంబసీ” లో ప్రసంగం.
– భారత ప్రధానితో సమావేశం.
– NASA లో డిప్యూటీ చీఫ్ గా 2008లో బాధ్యత.
జవాబు:
ప్రాచీన కాలపు భారతదేశ చరిత్రలో మహిళలు పురుషులతో పోటీపడటమే గాక, వారినధిగమించి తమ సత్తా చాటుకొన్న సందర్భాలు కోకొల్లలు. స్త్రీలు యజ్ఞ నిర్వాహకులుగా ఉన్నట్లు వేదమంత్రాల ద్వారా తెలుస్తుంది. గార్గియనే మహిళా శిరోమణి వేదవేదాంగాలలోను నిష్ణాతురాలు. తనను శాస్త్రవాదనలో ఓడించినవానినే వివాహం చేసుకుంటానని కఠోర ప్రతిజ్ఞ చేసింది. ఎందరో మహాపండితులను శాస్త్ర వాదనలో ఓడించింది. చివరకు యాజ్ఞవల్క్య మహర్షితో జరిగిన శాస్త్ర చర్చలో ఓడిపోయి, ఆ మహానుభావుణ్ణి వివాహం చేసుకొంది. తదనంతర కాలంలో భర్త ద్వారా బ్రహ్మవిద్యను పొంది మహా ప్రజ్ఞావంతురాలిగా పేరొందింది. తదనంతర కాలంలో మహిళలు తమ సామర్థ్యాన్ని విస్మరించి కష్టాల కడలిలో మునిగిపోయారు. కాని ఆధునిక కాలంలో మహిళలు ప్రతికార్యంలోనూ పురుషులతో పోటీపడుతున్నారు. తమ శక్తియుక్తులకు పదును పెడుతున్నారు. ఈ మధ్యకాలంలోనే భారతీయ మహిళ “కల్పనా చావ్లా” మొట్టమొదటిసారిగా అంతరిక్షంలో ప్రవేశించింది. మహిళల గొప్పదనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటింది. కాని అంతటితో సంతృప్తి పడక స్వర్గలోకానికి కూడా ఆ కీర్తిని చాటాలని సంకల్పించి స్వర్గ సోపానాలను (మెట్లను) అధిరోహించింది.

కల్పనాచావ్లా లేని లోటును తాను భర్తీ చేస్తానని భారతీయులను ఊరడించింది శ్రీమతి సునీతా విలియమ్స్. సునీతా భారత సంతతికి చెందిన అమెరికా అంతరిక్ష పరిశోధకురాలు. ఈమె పూర్తి పేరు సునీతా పాండ్యకృష్ణ, ఈమె 19-9-1965న జన్మించింది. ప్రపంచవ్యాప్తంగా మహిళలందరూ గర్వించేలా అంతరిక్షంలో అత్యధిక సమయం నడిచిన తొలి మహిళగా గుర్తింపు పొందింది. 1998వ సంవత్సరంలో NASA చేత ఎంపిక చేయబడి అంతరిక్షయానం చేసింది. తన అనుభవాలను, అనుభూతులను భారతీయులతో పంచుకోదలచి 2007వ సంత్సరంలో భారతదేశంలో పర్యటించింది. గుజరాత్ రాష్ట్రంలో తన స్వగ్రామమైన జులాసనను, సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించింది. భారతీయుల ఆత్మీయతను, ఆప్యాయతను చవిచూసింది. వారు ప్రేమతో ఇచ్చిన ‘విశ్వ ప్రతిభ అవార్డు’ను, “ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియన్ డీసెంట్ అవార్డు’ను స్వీకరించి, గర్వంగా భావించింది. 4-10-2007వ తేదీన “అమెరికన్ ఎంబసీ’లో ప్రసగించింది. తర్వాత భారత ప్రధానితో సమావేశమై కృతజ్ఞతలు తెలిపింది. 2008వ సంవత్సరంలో NASA లో డిప్యూటీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించింది. ఒక మహిళ అందులోను భారతీయ సంతతి అలాంటి ఉన్నతపదవిని పొందడం అదే ప్రథమం.

AP Board 9th Class Telugu Solutions Chapter 6 ప్రబోధం

ఉ) ప్రశంసాత్మకంగా రాయండి. రాణి కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవటం వల్ల 7వ తరగతి వరకు చదివి బడి మానేసింది. ఉపాధ్యాయురాలి ప్రోత్సాహంతో కస్తూర్బా పాఠశాలలో చేరి పదోతరగతి వరకు చదివి, పదోతరగతి పబ్లిక్ పరీక్షలో 9.7 పాయింట్స్ సాధించి కలెక్టర్ గారి చేతుల మీదుగా బహుమతినందుకున్నది. ఆమెను ప్రశంసిస్తూ లేఖ రాయండి.
జవాబు:

ప్రశంసా లేఖ

గుంటూరు,
x x x x

ప్రియమైన మిత్రురాలు రాణికి !

నీ స్నేహితురాలు కల్పన రాయునది. ఎవరీ కల్పన అని ఆలోచిస్తున్నావా? అట్టే శ్రమపడకు, నేను నీకు తెలియదు కాని నీ గురించి దిన పత్రికల్లో చదివి, ఆనందం ఆపుకోలేక నా ప్రశంసలు నీకు తెలియజేయాలని ఈ లేఖ రాస్తున్నాను.

మన రాష్ట్రంలో చాలామంది బాలికలు పేదరికం కారణంగా ప్రాథమిక స్థాయిలోనే చదువు ఆపేస్తున్నారు. అందరిలా నీవు కూడా ఏడవ తరగతితోనే చదువు ఆపి ఉంటే అది పెద్దవార్త అయ్యేదిగాదు. కాని నీ అదృష్టం కొద్దీ నీ ఉపాధ్యాయురాలు పాఠశాల మానిన నిన్ను కస్తూర్బా పాఠశాలలో చేర్పించింది. ఉచిత విద్యతోపాటు నివాసం, వస్త్రాలు, పుస్తకాలు, భోజన సౌకర్యాలు ఉచితంగా ఆడపిల్లలకు కల్పిస్తూ వారి కోసమే ప్రభుత్వం కస్తూర్బా పాఠశాలలను ఏర్పరచింది. ఈ పాఠశాలలు అందుబాటులో ఉన్నా ఎంతోమంది బాలికలు విద్యకు దూరమవుతున్నారు. వీటి గురించిన అవగాహన వారికి లేకపోవడమే ఇందుకు కారణం.

పాఠశాలలో చేరిన నువ్వు విద్యపైనే శ్రద్ధ పెట్టి బాగా చదవడం పదవతరగతి పబ్లిక్ పరీక్షలో 9.7 పాయింట్లు సాధించడం నిజంగా గొప్ప విషయం. చదువే లోకంగా ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. ఒక తపస్సులా విద్యాభ్యాసం సాగించిన నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. నువ్వు నా తోటి విద్యార్థినులకే గాక నాలా వార్తాపత్రికల ద్వారా, దూరదర్శన్ వంటి ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న అమ్మాయిలకు చాలామందికి ఆదర్శంగా నిలిచావు.

కలెక్టర్ గారు నిన్ను అభినందిస్తున్న దృశ్యం దూరదర్శన్ లో చూస్తుంటే నా ఒళ్ళు పులకరించి పోయిందనుకో. నాతో పాటు చదువుతూ, మధ్యలోనే చదువు మానేసిన నా స్నేహితురాళ్ళకు నీ గురించి చెప్పాను. ప్రముఖులందరూ నిన్ను ప్రశంసిస్తున్న దృశ్యాలను చూపాను. వారు కూడా ఎంతో సంతోషించారు. నువ్వు మా సోదరివైతే ఎంత బాగుణ్ణు అని ఎవరికి వారే అనుకున్నాం. ఇప్పుడైనా నువ్వు మా సోదరివే. నీ నుండి మేమెంతో స్ఫూర్తి పొందాం. పేదరికం విద్యకు అడ్డంకి కాలేదని నీవు నిరూపించాలని మన స్ఫూర్తిగా కోరుతున్నాను.
ధన్యవాదాల

ఇట్లు,
నీ మిత్రురాలు,
ఎ. కల్పన,
9వ తరగతి,
తెలుగుమాధ్యమం,
క్రమసంఖ్య – 18,
శారదానికేతన్ – బాలికోన్నత పాఠశాల,
బ్రాడీపేట 2/14, గుంటూరు.

చిరునామా :
పి. రాణి,
వెంకటేష్ నాయక్ గారి కుమార్తె,
రేగులగడ్డ గ్రామం,
మాచవరం మండలం,
గుంటూరు జిల్లా.

IV. ప్రాజెక్టు పని

వివిధ రంగాలలో ప్రసిద్ధులైన స్త్రీల పేర్లు సేకరించి వారు ఏ రంగంలో పేరు పొందారో పట్టికను రాసి ప్రదర్శించండి.
ఉదా :
క్రీడలకు సంబంధించిన వారు, రచయిత్రులు – మొదలయిన వారు.

పేరు ప్రసిద్ధిగాంచిన రంగం
1. మొల్ల కవయిత్రి
2. రంగాజమ్మ కవయిత్రి
3. ఇందిరాగాంధీ రాజకీయం
4. పి.టి. ఉష క్రీడలు
5. అశ్వని నాచప్ప క్రీడలు
6. కల్పనాచావ్లా వ్యోమగామి
7. సునీతా విలియమ్స్ వ్యోమగామి
8. కిరణ్ బేడి రక్షణ విభాగం
9. మదర్ థెరిస్సా దీనజనసేన
10. డొక్కా సీతమ్మ అన్నదాత
11. శారదామాత ఆధ్మాత్మిక రంగం
12. శకుంతలాదేవి గణితశాస్త్రం
13. యద్దనపూడి సులోచన రాణి నవలా రచయిత్రి
14. ఐశ్వర్యారాయ్ చలనచిత్రం
15. అరుంధతీరాయ్ ఆంగ్ల సాహిత్య రచయిత్రి
16. శోభానాయుడు నాట్యకారిణి
17. యమ్.యస్. సుబ్బులక్ష్మి సంగీతం
18. కిరణ్ మజుందార్ షా వాణిజ్యం

III. భాషాంశాలు

పదజాలం

అ) కింది పట్టికలో సమానార్థక పదాలున్నాయి. వాటి నుండి పట్టిక కింద ఇచ్చిన పదాలకు పర్యాయపదాలు వెతికి రాయండి.
AP Board 9th Class Telugu Solutions Chapter 6 ప్రబోధం 1
1) వనిత, 2) లక్ష్మి, 3) కరుణ, 4) నెచ్చెలి, 5) శీఘ్రం, 6) అనిశం, 7) భ్రాత. 8) విక్రమం , 9) విదుషి
జవాబు:
1) వనిత : స్త్రీ, పడతి
2) లక్ష్మి : శ్రీ, రమ
3) కరుణ : దయ, జాలి
4) నెచ్చెలి : స్నేహితురాలు, ప్రాణసఖి
5) శీఘ్రం : వేగం, తొందర
6) అనిశం : ఎల్లప్పుడు, సదా
7) భ్రాత : సోదరుడు, సహోదరుడు
8) విక్రమం : పరాక్రమం, శౌర్యం
9) విదుషి : విద్వాంసురాలు, పండితురాలు

AP Board 9th Class Telugu Solutions Chapter 6 ప్రబోధం

ఆ) కింది వాటిలో ప్రకృతి, వికృతులు కలగలిసి ఉన్నాయి. వాటిని వేరుచేసి, ఎదురెదురుగా రాయండి.
ఫలము, లచ్చి, విద్దె, కృష్ణుడు, ఇంతి, లక్ష్మి, పండు, స్త్రీ, కన్నయ్య, విద్య, శక్తి,
జవాబు:
ప్రకృతి – వికృతి
ఫలము – పండు
లక్ష్మి – లచ్చి
విద్య – విద్దె
కృష్ణుడు – కన్నయ్య
స్త్రీ – ఇంతి
శక్తి – సత్తు

ఇ) కింది పదాలకు అర్థాలను గుర్తించి కింద గీత గీయండి. ఆ అర్థాన్ని ఉపయోగించి వాక్యాలు రాయండి.
ఉదా :
అనిశం = ఎల్లప్పుడు, అన్నము, గాలి
వాక్యం : సూర్యుడు ఎల్లప్పుడు తూర్పున ఉదయిస్తాడు.

1. విదుషీమణి అను విద్యావంతురాలు, నాయకురాలు, పండితురాలు.
వాక్యం : సరోజినీ నాయుడు ఆంగ్లభాషలో గొప్ప పండితురాలు.

2. నిర్మలం : స్వేచ్ఛ, స్వచ్ఛమైనది, భిన్నం కానిది.
వాక్యం : ఈ కొలను చాలా స్వచ్చమైనది.

3. కల్మషం : కలశం, కమలం, పాపం
వాక్యం : ఏ పాపం చేయని వారే తప్పు చేసిన వారిని శిక్షిం’ ‘లని ఏసుక్రీస్తు ప్రబోధించాడు.

4. ప్రతిబంధకం = ఎదిరించేది, అడ్డగించేది, తిరిగి బంధించేది.
వాక్యం : ముస్లిం స్త్రీల విద్యకు బురఖా పద్ధతి అడ్డంకిగా తయారయ్యింది.

ఈ) కింది పదాలకు ఎదురుగా వాటి నానార్థాలున్నాయి. వాటినుపయోగించి వాక్యాలు రాయండి.
ఉదా :
ఫలం (పండు) : నేను తిన్న ఫలం తీయగా ఉలు.
ప్రయోజనం : లక్ష్యం లేకుండా పనిచేస్తే ఫలం లభించదు.

1. పురము (పట్టణం) : గుంటూరు పురము విద్యలకు నెలవు.
(ఇల్లు) : మా పురము పేరు సౌదామిని.

2. నారి (స్త్రీ : బ్రిటిష్ అధికారులను ఎదిరించిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి.
(వింటితాడు) : అర్జునుడి నారి ధ్వనికే శత్రువులు భయపడిపోయేవారు.

వ్యాకరణం

అ) కింది కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగా మార్చండి.

1. కర్మణి వాక్యం : ఈ పురంలోని హిందూ సమాజంచారి యాజమాన్యంలో పై సభ జరుపబడింది.
కర్తరి వాక్యం : ఈ పురంలోని హిందూ సమాజం వారి యాజమాన్యంలో పై సభను జరిపారు.

2. కర్మణి వాక్యం : తిరువాన్కూరులో ఒక స్త్రీ మంత్రిణిగా నియమించబడింది.
కర్తరి వాక్యం : తిరువాన్కూరులో ఒక స్త్రీని మంత్రిణిగా నియమించారు.

3. కర్మణి వాక్యం : విద్యాసంఘాలలో స్త్రీలు సభ్యురాండ్రుగా నియమింపబడ్డారు.
కర్తరి వాక్యం : విద్యాసంఘాలలో స్త్రీలను సభ్యురాండ్రుగా నియమించారు.

ఆ) పడ్వాది సంధి :
భయము + పడు – భయపడు (మువర్ణానికి లోపం)
భయము + పడు – భయంపడు (బిందువు రావడం)

విడదీసిన పగాలకు, కలిపిన పదాలకు తేడా గమనించండి. కలిపిన పదంలో ‘ము’కు బదులుగా (0) వచ్చింది. ‘ము’ లోపించింది.

సూత్రం :
పడ్వాదులు పరమగునప్పుడు ‘ము’ వర్ణకానికి లోపమూ, పూర్ణబిందువూ (0) విభాషగా అవుతాయి.

పడ్వాదులు :
పడు, పట్టె, పాటు, పఱచు, పెట్టు మొదలగునవి.

AP Board 9th Class Telugu Solutions Chapter 6 ప్రబోధం

ఇ) కింది వాటిని గమనించండి :
1. తృప్తిగంటిని – తృప్తి పొందాను.
2. ఉపన్యసించిరి – ఉపన్యసించారు.
3. తీర్మానములు గావించియున్నారు – తీర్మానాలు చేశారు.
4. లభించినవి – లంచాయి.
5. చేయుదురు – చేస్తారు.

గమనిక :
మార్పు దాదాపు చివరి రెండు మూడు అక్షరాలలోనే రావడం గమనించండి. గ్రాంథిక భాషా పదాలు వ్యవహారభాషలోకి మార్చాలంటే – నిత్యం మనం మాట్లాడే భాషను బాగా పరిశీలించాలి.

కింది పదాలను వ్యవహారభాషలోకి మార్చండి.

గ్రాంథికము వ్యవహారభాష
1) చూడుడు 1) చూడండి
2) సాహసించును 2) సాహసిస్తుంది/సాహసిస్తాడు
3) కలిగియుండవలెను 3) కలిగి ఉండాలి

9th Class Telugu 6th Lesson ప్రబోధం రచయిత్రి పరిచయం

కనుపర్తి వరలక్ష్మమ్మ గుంటూరు జిల్లా బాపట్లలో 6. 10. 1896న జన్మించారు. ఆమె భర్త కనుపర్తి హనుమంతరావు ప్రోత్సాహంతో సుమారు 50 కథలు, రెండు నవలలు రచించారు. భారతి, గృహలక్ష్మి, అనసూయ, వినోదవాణి, ఆనందవాణి మొదలయిన పత్రికలలో రచనలు చేశారు. గృహలక్ష్మి పత్రికలో సుమారు ఆరు సంవత్సరాలపాటు శారదలేఖలు ప్రచురణ అయ్యాయి. ‘లీలావతి’ అనే కలం పేరుతో ఆంధ్రపత్రికలో ‘మా చెట్టునీడ ముచ్చట్లు’ శీర్షికతో రచనలు చేశారు. ‘గాంధీ దండకం’ రచించారు. దేశభక్తిని, దైవభక్తిని ప్రబోధిస్తూ అనేక పాటలు, పద్యాలు, కనుపర్తి వరలక్ష్మమ్మ నాటికలు రచించారు.

ధర్మము నా జీవము, నీతి నా మతము, సతీశ్రేయము నా లక్ష్యం అని ప్రకటించి, కలముపట్టి రచనలు చేసిన ‘విదుషీమణి’ కనుపర్తి వరలక్ష్మమ్మ. వీరి సాహిత్యకృషికి గుర్తింపుగా 1930లో గృహలక్ష్మి స్వర్ణపతకం, 1934లో ‘స్వర్ణకంకణం’ అందుకున్నారు. 1967లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి ఉత్తమ రచయిత్రి పురస్కారాన్ని అందించింది. గుడివాడలో జరిగిన సప్తతి మహోత్సవ సన్మానసభలో ‘కవితా ప్రవీణ’ బిరుదును పొందారు. 1975లో ప్రథమ ప్రపంచ తెలుగుమహాసభల స్వర్ణఫలకం, తామ్రపత్ర బహుమతి నందుకున్నారు.

కఠిన పదాలకు అర్థాలు

సౌభాగ్యవతి = ముత్తైదువ (శ్రీమతి)
నెచ్చెలి (నెఱు + చెలి) = ప్రాణ స్నేహితురాలు
శుభ, సమాచారము = మంచి, ముచ్చట
వనితామణి = స్త్రీ రత్నము
గంభీరోపన్యాసము = గంభీరమైన ఉపన్యాసము
ఆలింపవలెనని = వినాలని
స్తంభించిపోయినది = మొద్దువారినది
ఎల్లరు = అందరు
అనిశము = ఎల్లప్పుడు
ఉత్కంఠపడు = ఇష్టమైన వస్తువును పొంద డానికి తొందరపడు
కవయిత్రి = కవిత్వం అల్లే స్త్రీ
విదుషీమణి = గొప్ప విద్వాంసురాలు
నారీరత్నము = స్త్రీ రత్నము
మహత్తరోపన్యాసము = గొప్ప ఉపన్యాసము
లేఖామూలముగా = ఉత్తరం ద్వారా
కొమార్తె = కూతురు
అగ్రాసనాధిపురాలు = అధ్యక్షురాలు
ఆంగ్లభాష = ఇంగ్లీషుభాష
మహనీయుడు = గొప్పవాడు
సారాంశము = తాత్పర్యము
మహిళాసభ = స్త్రీ సభ
బాల్యవివాహము = చిన్నవారికి వివాహము
పడయజాలక = పొందలేక
తత్పలితము = దాని ఫలితము
మంత్రిణి = మంత్రిగా ఉన్న స్త్రీ
నిర్వహింపుచున్నది = నెరవేర్చుతుంది
సభ్యురాండ్రు = సభలోని స్త్రీలు
ప్రతిబంధకము = అడ్డగించునది
రూపుమాపవలెను = నశింపజేయాలి
లక్ష్మీప్రసన్నత = ధనము కలుగుట
సరస్వతీప్రసన్నత = చదువువచ్చుట
బిడియము = సిగ్గు
అశక్తలు = శక్తిలేని వారు
విదుషీమణులు = శ్రేష్ఠమైన విద్వాంసురాండ్రు
పశ్చాత్తాపము = తాను చేసింది తప్పు అని తెలిసినపుడు, అలా చేశానే అని తరువాత చింతించుట
విశ్వమానవ భ్రాతృత్వము = ప్రపంచ మానవ సోదరత్వము
అకల్మష హృదయము = పాపము లేని మనసు
తనువు = శరీరము
చిత్త సంస్కారము = మనస్సు శుద్ధి
అస్పృశ్యులు = అంటరానివారు
అర్పించుట = ఇచ్చుట
నిర్మలము = స్వచ్ఛము
కరుణాభరితము = దయతో కూడినది
ప్రేమ పూర్ణము = ప్రేమతో నిండినది
పడయగోరు = పొందగోరు
ముఖ్యాంశములు (ముఖ్య + అంశములు) = ముఖ్య విషయాలు

AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions Chapter 5 పద్యరత్నాలు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions 5th Lesson పద్యరత్నాలు

9th Class Telugu 5th Lesson పద్యరత్నాలు Textbook Questions and Answers

చదవండి-ఆలోచించండి-చెప్పండి

వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
కని కల్ల నిజము తెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ! – బద్దెన

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
పద్యం భావం చెప్పండి.
జవాబు:
భావం:
ఓ వేమనా! ఎవరు చెప్పినా వినాలి. విన్న తరువాత తొందర పడకుండా ఆలోచించాలి. అది నిజమో, అబద్దమో తెలుసుకోవాలి. అలా తెలుసుకొన్న వాడినే లోకంలో నీతిపరుడు అంటారు.

ప్రశ్న 2.
ఇలాంటి పద్యాలను ఏమంటారు?
జవాబు:
నీతి పద్యాలు లేక సుభాషితాలు అని అంటారు.

AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు

ప్రశ్న 3.
మీకు తెలిసిన ఇతర శతక పద్యాలు చెప్పండి.

1) కం|| అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున దా
నెక్కిన బారని గుఱ్ఱము
గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ ! – సుమతీ శతకం

2) కం|| కలకొలది ధర్మముండిన
గలిగిన సిరి కదలకుండు కాసారమునన్
గల జలము మడువు లేమిని
గొల గొల గట్టుతెగిపోదె గువ్వలచెన్నా ! – గువ్వలచెన్న శతకం

3) ఆ||వే|| పరుల కొఱకే నదులు ప్రవహించు గోవులు
పాలనిచ్చు చెట్లు పూలుపూచు
పరహితమ్ము కంటె పరమార్థమున్నదా ?
లలిత సుగుణజాల తెలుగుబాల ! – తెలుగుబాల శతకం

4) ఆ||వే|| జన్మభూమి కంటే స్వర్గంబు వేరేది?
మాతృభాష కంటె మధురమేది?
కన్నతల్లి కంటే ఘనదైవమింకేది?
తెలియుమయ్య నీవు తెలుగుబిడ్డ ! – తెలుగుబిడ్డ శతకం

5) తే॥॥ విద్యచే భూషితుండయి వెలయుచున్న
దొడరి వర్జింపనగుఁ జుమీ దుర్జనుండు
చారు మాణిక్యభూషిత శస్తమస్త
కంబయిన పన్నగము భయంకరముగాదె ! – భర్తృహరి సుభాషితం

6) ఉ॥ పండితులైనవారు దిగువం దగ నుండగ నల్పు డొక్కడు
దండత పీఠమెక్కిన బుధప్రకరంబుల కేమి యెగ్గగున్
కొండొక కోతి చెట్టు కొనకొమ్మలనుండగ క్రింద గండభే
రుండ మదేభ సింహనికురుంబములుండవె చేరి భాస్కరా! – భాస్కర శతకం

7) ||వే|| మేడిపండు చూడ మేలిమై యుండును
పొట్ట విచ్చిచూడ పురుగులుండు
పిరికివాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ! – వేమన శతకం

8) ఆ॥వె॥ పుస్తకముల నీవు పూవు వోలెను చూడు
చింపఁబోకు మురికి చేయబోకు
పరుల పుస్తకముల ఎరువు తెచ్చితివేని
తిరిగి యిమ్ము వేగ తెలుగు బిడ్డ ! – తెలుగుపూలు శతకం

ప్రశ్న 4.
ఇలాంటి పద్యాలను కవులు ఎందుకు రాసి ఉంటారు?
జవాబు:
నీతిని బోధించడానికి, సమాజాన్ని సంస్కరించడానికి రాసి ఉంటారు.

ప్రశ్న 5.
వీటి వల్ల సమాజానికి ఏం మేలు జరుగుతుంది?
జవాబు:
వీటి వల్ల సమాజానికి ఏది నీతో, ఏది అవినీతో తెలుస్తుంది. ఉత్తమ సమాజం ఏర్పడటానికి ఇది దోహదం చేస్తుంది.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ఆ) కింది అంశాల గురించి మాట్లాడండి.

ప్రశ్న 1.
పాఠంలోని పద్యాలను రాగంతో భావయుక్తంగా పాడండి. భావాలు చెప్పండి.
జవాబు:
ఉపాధ్యాయుల సహాయంతో పద్యాలు చదవండి.
భావాలు :
1) శుభాలనిచ్చే రాజశేఖరుడా ! అల్పుడు, దుర్మార్గుడు, మోసకారిని ధనవంతుడు కదా అని కోరి చేరితే, కోరికలు నెరవేరకపోగా హాని కలుగుతుంది. విలువైన మణితో ఉంది కదా అని క్రూరమైన పాముతో కలిసి ఉండటానికి ఇష్టపడరు గదా !

2) ఓ సర్వేశ్వరా ! కుల పర్వతాలన్నీ చెల్లాచెదురై, నాశనమైపోయినా, సముద్రాలు తమ హద్దుల్ని దాటి పొంగుకు వచ్చినా; సూర్యచంద్రులు తమ గతుల్ని తప్పినా ; నీ భక్తుడు మాత్రం చలించడు, గర్వంతో వీడిపోడు. నీతిని, భక్తి మార్గాన్ని వీడిపోడు.

3) ఓ సర్వేశ్వరా ! సత్యవంతుడు, దురాచారుడు కానివాడు, విచక్షణతో మెలిగేవాడు, దుర్జనులతో స్నేహం చేయనివాడు, భక్తులతో స్నేహంగా ఉండేవాడు, కామాతురుడు గానివాడే ఈ మూడు లోకాల్లో నీకు నిజమైన సేవకుడు.

4) ఓ శివా ! పార్వతీపతీ ! గాజుపూస విలువైన రత్నం ఎప్పటికీ కాలేదు. కాకి హంసగాను, జోరీగ తేనెటీగ గాను, దున్నపోతు సింహంగాను, జిల్లేడు చెట్టు కల్పవృక్షంగాను ఎప్పటికి కాలేవు. అట్లే పిసినారి దుర్జనుడు రాజు కాలేడు.

5) ఆభరణాలతో ప్రకాశించేవాడా ! ధర్మపురి అనే గ్రామంలో వెలసినవాడా ! దుష్టులను చంపేవాడా ! పాపాలను దూరం చేసేవాడా ! ఓ నరసింహస్వామీ ! సాధువులతోను, మంచివారితోను తగాదా పెట్టుకుంటే కీడు కలుగుతుంది. కవులతో గొడవ పెట్టుకున్నా, దీనులను పట్టుకొని హింసించినా, బిచ్చగాళ్ళకు కష్టం కలిగించినా, నిరుపేదలను నిందించినా కీడు కలుగుతుంది. ఇంకా పుణ్యాత్ములను తిట్టినా, భక్తులను తిరస్కరించినా, గురువుల ధనాన్ని దోచుకున్నా హాని కలుగుతుంది.
6) ఓ నారాయణా ! నీ పేరును తలవనివాడు, నీ మీద భక్తి లేనివాడు ఎన్ని నదుల్లో స్నానం చేసినా అది ఏనుగు స్నానంలా వృథానే ! మౌనంగా మనస్సులో వేద మంత్రాలను చదివినా అది అరణ్యరోదనే. ఎన్ని హోమాలు చేసినా అది బూడిదలోన వేసిన నెయ్యి మాత్రమే అవుతుంది.

7) భద్రాదిపై వెలసిన ఓ స్వామీ ! దశరథుని కుమారుడైన ఓ రామా ! సముద్రమంత దయగలవాడా ! నీవు యుద్ధంలో శత్రువుల్ని నాశనం చేశావు. గరుత్మంతుణ్ణి వాహనంగా చేసుకున్నావు. కష్టాలనే కారుచీకట్లను తొలగించగల సూర్యుడవు. హృదయమంతా దయతో నింపుకున్నావు. సీతాదేవి హృదయ కమలానికి తుమ్మెదలాంటివాడవు. రాక్షసులనే కలువలను నాశనం చేయగల మదపుటేనుగువు. చక్కని శరీరం గల వాడవు.

8) శ్రీకాళహస్తి క్షేత్రంలో కొలువైన ఈశ్వరా ! నీ పేరును తలచుకోవడం వల్ల అన్నీ సాధ్యమవుతాయి. ఈ భూమిపై “శివ ! శివ !” అని ఉత్సాహంతో పలికేవాడికి వజ్రాయుధం పువ్వు అవుతుంది. నిప్పు మంచు అవుతుంది. సముద్రం కూడ గట్టినేలలా మారుతుంది. శత్రువు మంచి మిత్రుడవుతాడు. విషం అమృతమవుతుంది.

9) ఓ కుమారా ! చదువు చెప్పే గురువును ఎదిరించకు. పోషించే యజమానిని తిట్టకు. ఒక్కడివే పనికి సంబంధించిన ఆలోచనలను చేయవద్దు. మంచి నడవడికను విడవవద్దు.

10) ఓ సుమతీ ! ఉడుము వందేళ్ళు బతుకుతుంది. పాము వెయ్యేళ్ళు ఉంటుంది. చెరువుల దగ్గర కొంగ చాలాకాలం ఉంటుంది. వీటిలో ఎక్కువకాలం ఉండటం వలన ఉపయోగం లేదు. మంచి చేయాలనే ఆలోచనతోను, ధర్మార్థ కామ మోక్షాలను సాధించగలిగినవాడే ఉత్తముడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు

ప్రశ్న 2.
పాఠంలోని పద్యాలు ఆధారంగా కింది అంశాలను చరించండి.
జవాబు:
i) నడవడిక :
లోకం పట్ల మన ప్రవర్తననే నడవడిక అంటారు. లోకానికి అపకారం చేయకుండా మంచిగా ఉంటూ జీవితాన్ని గడపాలి. లేకుంటే మన వద్దకు ఎవరూ రారు. పాము తన తలపై ఎంత విలువైన మణిని కలిగి ఉన్నా దాని దగ్గరకు ఎవరూ వెళ్ళరు కదా ! ఎక్కడైనా, ఎన్నడైనా గాజుపూస విలువైన రత్నం కాలేదు. అట్లే కాకి హంసగాను, జోరీగ తేనెటీగ గాను, దున్నపోతు సింహంగాను మారలేదు. అలాగే పిసినారి రాజు కాలేడు. అంటే దానగుణం కలవాడు, సత్ప్రవర్తన కలవాడే లోకంలో ఎప్పటికైనా ఉన్నత స్థితిని పొందగలడు.

ii) గుణగణాలు :
కుల పర్వతాలన్నీ చెదురుమదురైనా, సముద్రాలు తమ ఎల్లలను దాటి పొంగుకు వచ్చినా, సూర్యచంద్రులు గతి తప్పినా భగవద్భక్తుడు మాత్రం చలించడు. గర్వించడు. నీతి మార్గాన్ని వీడడు. ఎందుకంటే తనను భగవంతుడు రక్షిస్తాడనే ధైర్యం. భగవంతుడు ధర్మాన్ని, ధర్మం ఆచరించేవారిని తప్పక కాపాడతాడు. తాను తన ధర్మాన్ని పాటిస్తున్నాడు గనుక భగవంతుడు తప్పక రక్షిస్తాడని భక్తుని విశ్వాసం.

సత్యాన్ని పాటించడం, మంచి నడవడిక కలిగి ఉండటం, దుష్టులతో స్నేహం వీడడం, భక్తులతో స్నేహం చేయడం, సంసారమోహంలో చిక్కుకోకపోవడం భగవంతుని సేవకుడి లక్షణాలు.

భక్తులు కాకపోయినా లోకంలో చాలామంది మంచి లక్షణాలను కలిగి ఉండవచ్చు. కానీ వాళ్ళు ఏదో ఒక సందర్భంలో లోభం వల్లగాని, భయం వల్లగాని, ప్రలోభాలకు లొంగికాని చెడుమార్గంలో ప్రవేశించడానికి అవకాశాలున్నాయి. భగవద్భక్తులు తమని భగవంతుడు రక్షిస్తాడని భావించడం వల్ల ధర్మానికి తప్ప వేటికీ భయపడరు. కాబట్టి జీవితాంతం సద్గుణాలతో శోభిస్తారు.

iii) మార్గదర్శకం :
లోకంలో మంచిని పాటించేవారు, చెడుని ఆచరించేవారు కోకొల్లలుగా ఉంటారు. అయితే మంచి కోసం ప్రాణం విడిచేవారు, ధర్మానికి కట్టుబడినవారు మిగతావారికి మార్గదర్శకులై నిలుస్తారు. కొన్ని సందర్భాల్లో చెడ్డవారిని చూసి ఎలా ఉండకూడదో కూడా లోకం తెలుసుకుంటుంది. ఉడుము వందేళ్ళు జీవిస్తుంది. పాము వెయ్యేళ్ళు వృథాగా పడి ఉంటుంది. కొంగ కూడా చెరువుల వద్ద వ్యర్థంగా కాలం గడుపుతుంది. ఇవి ఇలా ఎంతకాలం ఉన్నా లోకానికేమీ ప్రయోజనం ఉండదు. వీటిని చూసి మనం అందరికీ మంచిని చేయాలనే ఆలోచనను, ధర్మార్థ కామ
మోక్షాలను సాధించాలనే పట్టుదలను పెంచుకోవాలి. అలా చేయగలిగినవాడే ఉత్తముడు. అతడే మార్గదర్శి.

iv) నైతిక విలువలు :
నీతికి సంబంధించిన విషయం నైతికం. మానవులు పాటించాల్సిన కనీస ధర్మాలను విలువలంటారు. నీతికి సంబంధించి కనీసం పాటించాల్సిన విషయాలను నైతిక విలువలంటారు.

గురువులను ధిక్కరించకూడదు. వారి మాటలకు ఎదురు చెప్పకూడదు. అలానే తనను పోషిస్తున్న యాజమానిని తిట్టకూడదు. ఒక్కడే చాలా విషయాలు గురించి ఆలోచించకూడదు. పెద్దలు, అనుభవం గలవారి సలహాలనూ, సూచనలనూ తీసుకోవాలి.

ప్రశ్న 3.
పాఠంలో మీకు నచ్చిన పద్యాలేవి? ఎందుకో చెప్పండి.
జవాబు:
పాఠంలో నాకు నచ్చిన పద్యాలు
కం|| ఉడుముండదె నూడేండ్లునుఁ
ప్రోచినదొర నింద సేయఁ బోకుము కార్యా
లోచనము లొంటిఁ జేయకు
కడునిల( బురుషార్థపరుడు గావలె సుమతీ !

కం॥ ఆచార్యున కెదిరింపకు
బడియుండదె పేర్మిఁ బాము పదినూడేండ్లున్
మడువునఁ గొక్కెర యుండదె
మాచారము విడువఁ బోకుమయ్య కుమారా !

నేటి సమాజంలో కొందరిలో నీతిగా జీవించడం తగ్గిపోగా, చాలామందిలో నీతిమంతమైన జీవనమే లోపించింది. అందుకనే అవినీతిపరుల గురించి వార్తలు పత్రికల్లో తరచుగా కన్పిస్తున్నాయి. కుమారశతకంలోని పద్యంలో నైతిక విలువలు చెప్పబడ్డాయి. సుమతీ శతకంలోని పద్యంలో ‘ఎంతకాలం బతికామనే దానికన్నా ఏమి సాధించామనే దానికే ప్రాధాన్యమ’నే నీతి చక్కగా నిరూపించబడింది. అందుకనే నాకు ఈ రెండు పద్యాలంటే చాలా ఇష్టం.

ఆ) 3, 4, 8 పద్యాలకు ప్రతిపదార్థం రాయండి.
జవాబు:
ఈ పాఠంలో ఇచ్చిన 3, 4, 8 పద్యాల ప్రతిపదార్థాలు చూడండి.

ఇ) పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రశ్న 1.
దుర్గుణాలు గల ధనవంతునితో చేరితే ఏమవుతుంది?
జవాబు:
దుర్గుణాలు గల ధనవంతునితో చేరితే కోరికలు తీరకపోగా, ఆపదలు కలుగుతాయి. విలువైన మణి పడగపైన . ఉన్నప్పటికీ కూడా ఎవరూ పాముతో కలిసి ఉండటానికి ఇష్టపడరు గదా !

ప్రశ్న 2.
‘కులశైలంబులు’ అనే పద్యంలో అన్నమయ్య ఏం చెప్పాడో రాయండి.
జవాబు:
ఓ సర్వేశ్వరా ! కుల పర్వతాలన్నీ చెల్లా చెదురై , నాశనమైపోయినా, సముద్రాలు తమ ఎల్లలను దాటి పొంగుకు వచ్చినా, సూర్యచంద్రులు తమ గతులు తప్పినా భక్తుడు మాత్రం చలించడు. గర్వించడు. నీతి మార్గాన్ని విడచిపోడు కూడా.

AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు

ప్రశ్న 3.
ఎలాంటి జీవనం నిష్ప్రయోజనమని బద్దెన అంటున్నాడు?
జవాబు:
ఉడుము వందేళ్ళు వ్యర్థంగా గడుపుతుంది. పాము అవమానాలను సహిస్తూ వెయ్యేళ్ళు జీవిస్తుంది. కొంగ చెరువుల వద్ద తన జీవితాన్ని వృథాగా గడుపుతుంది. అలాగే మానవుడు స్వార్థంతో జీవితాన్ని వ్యర్థంగా గడిపితే ప్రయోజనం ఉండదు. అలాగాక ధర్మాన్నీ, అర్థాన్నీ, కోరికల్ని, మోక్షాన్ని సాధించగలిగినపుడే మానవ జీవితం ప్రయోజనవంతమవుతుందని బద్దెన బోధించాడు.

ప్రశ్న 4.
ధూర్జటి అభిప్రాయం ప్రకారం అన్నీ సులభసాధ్యమయ్యేలా చేసేది ఏది?
జవాబు:
ఈ లోకంలో “శివ ! శివ ! ” అని ఉత్సాహంగా పలికేవాడికి వజ్రాయుధం పువ్వు అవుతుంది. నిప్పు మంచు అవుతుంది.
సముద్రం కూడా గట్టి నేలలా మారుతుంది. శత్రువు మంచి మిత్రుడవుతాడు. విషం కూడా అమృతంగా పరిణమిస్తుంది. కాబట్టే ఈశ్వరుని పేరు తలచుకోవడం వల్ల అన్నీ సులభసాధ్యాలవుతాయి. 5. భగవంతుని సేవకుని లక్షణాలను తెలపండి. జ. కులపర్వతాలన్నీ చెదురుమదురైనా, సముద్రాలు తమ ఎల్లలు దాటి పొంగుకు వచ్చినా, సూర్యచంద్రులు తమ గతుల్ని
తప్పినా భగవంతుని భక్తుడు చలించడు. నీతిమార్గాన్ని వీడిపోడు. ఇంకా సత్యాన్ని పాటించడం, మంచి నడవడిక కలిగి ఉండడం, దుష్టులతో స్నేహం వీడడం, భక్తులతో స్నేహం చేయడం, సంసారమోహంలో చిక్కుకోకపోవడం భగవంతుని
సేవకుడి లక్షణాలు.

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘లోభియైనవాడు రాజుగా తగడు’ ఇది సమర్ధనీయమేనా ?ఎందుకు ? (లేదా) “పిసినారియైన వాడు రాజుగా తగడు” అనే విషయం సమర్థించ తగినదేనా పద్యరత్నము ఆధారంగా వివరించండి.
జవాబు:
పిసినారి రాజుగా ఉండటానికి తగడు. ఎందుకంటే రాజువద్దకు పేదవారు, దరిద్రులు ఇంకా ధనం అవసరమైన వారు
సహాయార్థులై వస్తారు. రాజు సహృదయతతో వారి కష్టాల్ని, బాధల్ని విని తగిన సహాయం చేయాలి. పిసినారి ఆ పని చేయలేడు.
దానితో వచ్చిన వారు రాజు పై ద్వేషంతో సంఘ విద్రోహులుగా, దొంగలుగా మారే ప్రమాదం ఉంది. కాలం ఎప్పుడూ అనుకూలంగానే ఉండదు. ఒక్కొక్కసారి అతివృష్టి వలన గాని, అనావృష్టి వలన గాని రాజ్యంలో పంటలు దెబ్బతినడం గాని, సరిగా పండకపోవడం గాని జరగవచ్చు. అలాంటి సమయంలో రాజు ప్రజలకు అండగా నిలచి పన్నులను రద్దు చేయాలి. కాని లోభి ధన వ్యామోహంతో ప్రజలకు పన్ను మినహాయింపులివ్వక
బాధిస్తాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోను లోభి రాజుగా తగడు.

ప్రశ్న 2.
నరసింహ శతకపద్యంలో గల విషయాలు నేటి సమాజానికి ఎంతవరకు అవసరమో వివరించండి.
జవాబు:
నరసింహ శతక పద్యంలో గల విషయాలు నేటి సమాజానికి బాగా ఉపయోగపడతాయి. మంచివారితో తగవు పెట్టుకుంటే హాని కలుగుతుంది. కవులతో శత్రుత్వం పెట్టుకొంటే, దీనులయిన వారిని పట్టుకొని కొడితే, ముష్టివారిని ఏడిపిస్తే, పేదలను నిందిస్తే కీడు జరుగుతుంది. పుణ్యాత్ములను తిడితే, మంచి భక్తులను తిరస్కరిస్తే, గురువుగారి సొమ్మును దోచుకుంటే కీడు జరుగుతుంది. ఈ విధంగా చెడుపనులు చేసే వారికి నరకం తప్పదు. వీరికి నరకం భద్రంగా కట్టుకొన్న మూటే.

AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు

ప్రశ్న 3.
‘ధనంపై కోరికతో అల్పుని దగ్గరికి చేరితే హాని కలుగుతుంది’ దీనికి సంబంధించి మీకు తెలిసిన సంఘటనను వివరించండి.
జవాబు:
మా వీధి చివరలో ఒక ధనవంతుడు ఉన్నాడు. అతడికి భార్యాబిడ్డలు లేరు. అతనికి బీదవాళ్ళంటే తేలిక భావం. ఎవరైనా బీదవాళ్ళు డబ్బు కావాలని అతని వద్దకు వెడితే అతడు వారికి సహాయం చేయడు. వారిని అవమానిస్తాడు. అత్యవసరంగా డబ్బు కావాలని ఎవరైనా అతణ్ణి అడిగితే మంగళ సూత్రాలూ, చెవి దుద్దులూ వగైరా తాకట్టు పెట్టుకుంటాడు. తిరిగి వారు డబ్బు ఈయలేకపోతే, ఆ నగలను తానే సొంతం చేసుకుంటాడు. వారికి ఉన్న చిన్న ఇంటిని లేక పాకను బాకీలు పేరు చెప్పి స్వాధీనం చేసుకుంటాడు. – కనుక అల్పబుద్ధి గల ధనవంతులను ధనం కోరి చేరితే హాని కలుగుతుందని తెలుస్తోంది.

ప్రశ్న 4.
‘పవి పుష్పంబగు’ పద్యభావాన్ని సొంతమాటల్లో రాయండి.
జవాబు:
శ్రీకాళహస్తి క్షేత్రంలో కొలువైన ఈశ్వరా ! నీ పేరును తలచుకోవడం వల్ల అన్నీ సాధ్యమవుతాయి. ఈ భూమిపై “శివ ! శివ !” అని ఉత్సాహంతో పలికేవాడికి వజ్రాయుధం పువ్వు అవుతుంది. నిప్పు మంచవుతుంది. సముద్రం కూడా గట్టినేలలా మారుతుంది. శత్రువు మంచి మిత్రుడవుతాడు. విషం అమృతమవుతుంది.

ప్రశ్న 5.
‘అరణ్యరోదనం’ అంటే ఏమిటి? దీన్ని ఏఏ సందర్భాల్లో వాడతారు?
జవాబు:
అడవి మధ్యలో ఉండి ఏడిస్తే ఆదుకొనేవారు, ఓదార్చేవారు ఎవరూ ఉండరు. ఏడ్చినా ఎవరూ పట్టించుకోకపోతే ఆ ఏడుపు వృథానే. వ్యర్థంగా ఏడిచే ఏడుపునే ‘అరణ్యరోదనం’ అంటారు. మనసులోని బాధను ఎన్ని రకాలుగా చెప్పినా ఎవరూ పట్టించుకోకపోయినప్పుడు, బాధను తీర్చేవారు ఎవరూలేని సందర్భాల్లో దీన్ని వాడతారు.

ఆ) కింది ప్రశ్నలకు పదిహేనేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
నిజమైన భక్తునికి ఉండదగిన లక్షణాలను గురించి రాయండి.
జవాబు:
భక్తులకు ఇంద్రియ నిగ్రహం, సర్వజీవుల హితం కోరే గుణం ఉండాలి. ఏ ప్రాణినీ ద్వేషించకూడదు. అన్ని ప్రాణులను ప్రేమించాలి. సుఖదుఃఖాలకు చలించకుండా స్థిరంగా ఉండగలగాలి. మమతను, అహంకారాన్ని వీడాలి. క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. భగవంతుని యందు దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఎవరినీ ఉద్రేకపరిచేలా ప్రవర్తించకూడదు. తాను కూడా ఎవరి చేష్టలకూ ఉద్రేకపడకూడదు. ఏమాత్రం కోరిక లేకుండా చేసే పనులన్నీ భగవంతుని పూజలా భావించి శ్రద్ధగా చేయాలి. శుచిగా ఉండాలి. పక్షపాత ధోరణిని వీడాలి. శత్రువుల యెడ, మిత్రుల యెడ సమభావంతో ఉండాలి. నిందకు కుంగిపోకుండా, పొగడ్తకు పొంగిపోకుండా ఉండగలగాలి. ఫలితాన్ని ఆశించకుండా పనులను చేయగలగాలి.

ప్రశ్న 2.
మంచి విద్యార్థికి ఉండాల్సిన లక్షణాలు, ఉండకూడని లక్షణాలను సొంతమాటల్లో రాయండి.
జవాబు:
మంచి విద్యార్థికి ఉండాల్సిన లక్షణాలు :
మంచి విద్యార్థికి గురువులను గౌరవించే లక్షణం ఉండాలి. ప్రతి విషయాన్నీ తెలుసుకోవాలనే ఆసక్తి ఉండాలి. క్రమశిక్షణతో మెలగాలి. విద్యలలోనే పోటీతత్త్వం ఉండాలి కాని ఇతర విషయాలలో పోటీ పడకూడదు. తోటి విద్యార్థులు స్నేహంగా ప్రవర్తించాలి. అందరితోనూ కలసిపోయే గుణం పెంచుకోవాలి. జ్ఞానార్జనకు సన్నద్ధులై ఉండాలి. మందమతులైన విద్యార్థులకు విద్యాభ్యాసంలో సహకరించాలి. తల్లిదండ్రులను గౌరవించాలి. దురలవాట్లకు దూరంగా ఉండాలి.

మంచి విద్యార్థికి ఉండకూడని లక్షణాలు :
విద్యార్థులకు అసూయాద్వేషాలు పనికిరావు. అంగవైకల్యం గల విద్యార్థులను పరిహసించకూడదు. మందమతులైన విద్యార్థులను హేళన చేయకూడదు. గురువుల మాటలకు ఎదురు చెప్పకూడదు. అహంకారంతో ప్రవర్తించకూడదు, చెడు ప్రవర్తన కలిగి ఉండకూడదు.

AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు

ఇ) సృజనాత్మకంగా రాయండి.

ధనమున్నవాళ్ళు తమధనాన్ని దానం చేయడం ద్వారా సమాజానికి ఉపయోగపడాలని ఈ పాఠంలో చదువుకున్నాం కదా!ఈ భావం వచ్చేటట్లు అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు, బీదలకు విరాళాలు ప్రకటించమని ధనవంతులకు, వదాన్యులకు ఒక ‘కరపత్రం’ ద్వారా విజ్ఞప్తి చేయండి.
అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు, బీదలకు విరాళాలు ఇవ్వమని ధనవంతులను కోరుతూ కరపత్రం తయారు చేయండి.
జవాబు:
కరపత్రం
అన్నదానాన్ని మించిన దానం లేదు
దాతను మించిన చిరంజీవి లేడు
దానం చేయడమే ధనార్జనకు సార్థకత. దాచుకోవడం కాదని భారతీయ ధర్మం బోధిస్తుంది. పుట్టడంతోనే తల్లిదండ్రులకు దూరమయ్యే అభాగ్యులు, చిన్న వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయి, అయిన వారిచే నిరాదరణకు లోనైన అదృష్టహీను లెందరో ఈ దేశంలో ఉన్నారు. వారు సమాజంపై ద్వేషాన్ని పెంచుకొని సంఘ విద్రోహులుగా మారుతున్నారు. అలానే అనేక కష్టాలను, నష్టాలను భరించి, అపురూపంగా పెంచుకున్న తమ పిల్లలే ముసలితనంలో తమని వీధుల్లో విడిచి పెడితే ఏం చేయాలో తోచని అమాయక వృద్ధులు ఎందరో బిచ్చగాళ్ళ రూపంలో మనకు దర్శనమిస్తుంటారు. వీరేగాక రెక్కాడితే గాని డొక్కాడని ఎందరో నిరుపేదలు ఉన్నారు. వందల ఎకరాల పొలం గల వ్యక్తి ఉన్న ఊరిలోనే ఒక సెంటు భూమి కూడా లేనివారు జీవిస్తున్నారు. పెద్ద పెద్ద బంగళాలు గల ప్రాంతంలోనే రోడ్ల ప్రక్కన ప్రమాదకర స్థలాల్లో పూరిగుడిసెలలో జనాలు జీవిస్తున్నారు. కొందరు తిండి ఎక్కువై జీర్ణంకాక ఇబ్బంది పడుతుంటే, మరికొందరు తినడానికి ఏమీలేక బాధపడుతున్నారు.

ఇలాంటి విచిత్ర పరిస్థితుల్ని మనం నిత్యజీవితంలో దాదాపు రోజూ చూస్తూనే ఉంటాం. ఈ అసమానతలు ఇలా కొనసాగాల్సిందేనా ? వీటిని సరిచేయలేమా? అని ఆలోచిస్తాం. మన పనుల్లో పడి మర్చిపోతుంటాం. తీరికలేని పనుల్లో పడి సామాజిక బాధ్యతల్ని విస్మరిస్తాం.

మిత్రులారా ! మనకందరికి సమాజసేవ చేయాలనే కోరిక ఉన్నా తీరికలేక చేయలేకపోతున్నాం. మనం స్వయంగా సేవ చేయలేకపోయినా సమాజసేవలో మనవంతు కృషిచేసే అదృష్టం మనకందుబాటులోనే ఉంది. అదెలా అంటే మనం మన దగ్గర ఉన్న ధనాన్ని అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు విరాళంగా ఇవ్వవచ్చు. ఆ ఆశ్రమాల నిర్వాహకులు ఆ ధనాన్ని సద్వినియోగపరుస్తారు. అలానే మనవద్ద అదనంగా ఉన్న వస్త్రాలను, బియ్యం వంటి ధాన్యాలను, ఇతర ఆహార పదార్థాలను సేకరించి బీదలుండే ప్రాంతాలలో పంచిపెట్టే ఎన్నో సేవాసంస్థలు అందుబాటులోకి వచ్చాయి. మనం చేయాల్సిందల్లా ఆయా సేవాసంస్థలకు మనవద్ద ఉన్నవి అందివ్వడమే. అంతర్జాలంలో సేవాసంస్థల చిరునామాలు ఉంటాయి. డబ్బును కూడా ఉన్నచోటు నుండి కదలకుండా ఆయా సంస్థల బ్యాంకు ఖాతాలకు పంపించే సౌకర్యాలు ఉన్నాయి. వాళ్ళకు ఫోన్ చేస్తే వారే వాహనాలతో వచ్చి మనవద్ద ఉన్న ధాన్యం, వస్త్రాలు మొదలైన వాటిని తీసుకొని వెళ్తారు.

సోదరులారా ! మనకు ఎక్కువైన వాటితోనే కొన్ని కుటుంబాలు ఒకపూటైనా చక్కని, భోజనాన్ని, మంచి వస్త్రాన్ని పొందగలుగుతాయి. కాబట్టి మనకున్న ఈ సౌకర్యాన్ని వినియోగిద్దాం. మన సహృదయతను పెద్ద మొత్తాలలో విరాళాలు ప్రకటించడం ద్వారా, ధాన్య వస్త్రాలను ఇవ్వడం ద్వారా చాటుకొందాం. దేశంలో పేదరికాన్ని నిర్మూలించడంలో మన వంతు సాయాన్ని అందిద్దాం.
పేదలకు సాయం చేద్దాం
పేదరికాన్ని రూపుమాపుదాం
(లేదా)
మీ పాఠం ఆధారంగా కవుల భావాలను నీతివాక్యాల రూపంలో రాయండి.
(లేదా)
పద్యరత్నాలు పొఠం ఆధారంగా కొన్ని నీతివాక్యాలు రాయండి.
జవాబు:

  1. దుర్గుణాలు గల ధనవంతునితో చేరిక ; మణిగల నాగుపాముతో కలయిక.
  2. ప్రకృతి ప్రకోపించినా వేయకు వెనుకడుగు ; దేవుని చేరడానికి వేయి ధర్మపథాన ముందడుగు.
  3. గుణవంతుడు, కాంక్షారహితుడు, సత్యవంతుడు కాగలడు భగవద్భక్తుడు.
  4. పిసినారి కాలేడు ఎన్నటికీ ఉన్నతాధికారి ; విలువలేనివి చేరి పొందవుగా ఉన్నతి మరి.
  5. చేస్తే సమాజానికి హాని ; పడతాడు దేవుడు నీ పని.
  6. చేయకుండా భగవంతుని స్మరణం ; చేసిన పనులన్నీ అవుతాయి (శూన్యం) వ్యర్థం.
  7. నిరంతరం భగవంతుని స్మరణం ; అనవరతం కష్ట కార్యహరణం.
  8. గురువుల మాటకు ఎదురు చెప్పకు’ ; పోషించే యజమానిని నిందించకు.
  9. ఒక్కడివే కార్యాలోచన చేయవద్దు ; మంచి నడవడికను ఎన్నడు వీడవద్దు.
  10. ఎంతకాలం బతికామన్నది కాదు ముఖ్యం ; ఎంతమందికి మంచి చేశామన్నది ముఖ్యం.

(లేదా)
పాఠంలో మీకు నచ్చిన ఏదైనా పద్యానికి తగిన గేయాన్ని గాని, కవితను గానీ రాయండి.
జవాబు:
భగవంతునిపై భక్తి
పెంచుతుందెంతో ధీశక్తి
సమాజ సేవలపై కలిగిస్తుంది ఆసక్తి
చెడు స్నేహాల నుండి కల్పిస్తుంది విముక్తి
మంచి కార్యాలపై పెంచుతుంది అనురక్తి
దురలవాట్లపై కలిగిస్తుంది విరక్తి
సర్వానర్థాల నుండి కలుగుతుంది ముక్తి.

AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు

ఈ) ప్రశంసాత్మకంగా రాయండి.
“మంచి గుణాలు గల వ్యక్తికి రూపం, ధనం లేకపోయినప్పటికీ, వాణ్ణి బుద్ధిమంతులు చక్కగా గౌరవిస్తారు.” అని చదువుకున్నాం కదా ! అటువంటి వ్యక్తులెవరైనా మీకు తెలిసిన వారున్నారా? వారి గురించి తెలపండి.
జవాబు:
ఆంగ్ల సాహిత్యంలో “జార్జ్ బెర్నార్డ్ షా” సుప్రసిద్ధుడు. కానీ ఆయన అందవికారి. అయితే అతని అందవికారం అతనికి మహాకవిగా, గొప్ప విమర్శకునిగా కీర్తి రావటంతో ఏమాత్రం అడ్డంకి కాలేదు. అతనికి మంచి రూపం లేకపోయినప్పటికి బుద్ధిమంతులతని సాహిత్యాన్ని, విమర్శలను గొప్పవిగా గుర్తించి, గౌరవించారు. కాబట్టి రూపం ఎప్పుడూ మంచిగుణాలు గల వారికి అడ్డంకి కాలేదు.

మన తెలుగు సాహిత్యంలో మహాకవులుగాను ప్రసిద్ధులైన వారిలో చాలామంది పేదరికాన్ని అనుభవించారు. ఉదాహరణకు శ్రీశ్రీ గా ప్రసిద్ధుడైన “శ్రీరంగం శ్రీనివాసరావు”. ఈ మహాకవి “ఈ యుగం నాది” అని సగర్వంగా చాటుకొన్నాడు. ఇంతటి మహాకవి కటిక దారిద్ర్యాన్ని అనుభవించాడు. గుప్పెడు మెతుకుల కోసం చిన్న చిన్న ఉద్యోగాలెన్నో చేశాడు. డబ్బు లేక ప్రపంచాన్ని చుట్టివచ్చే అనేక అవకాశాలను వదులుకున్నాడు. ఎన్నో రోజులు ఆహారం లేకుండా గడిపాడు. అతిసామాన్యుల కష్టాలను బాగా దగ్గరగా పరిశీలించాడు. కాబట్టే ఆయన కవిత్వంలో పీడితులు, బాధితులు, కార్మికులు, కర్షకులు ప్రధానమయ్యారు. ఆయన కవిత్వాన్ని దేశవ్యాప్తంగానే గాక, ప్రపంచవ్యాప్త మేధావులు చదివి మెచ్చుకున్నారు. ఆయన విశ్వనరునిగా ఎదగడానికి ఆయన దారిద్ర్యం ఏమీ అడ్డం కాలేదు.

జరుక్ శాస్త్రిగా సుప్రసిద్ధుడైన “జలసూత్రం రుక్మినాథశాస్త్రి” తెలుగు సాహిత్యంలో ‘పేరడీ’ ప్రక్రియకు ఆద్యుడు. ఈయన కూడా భయంకరమైన దారిద్ర్యాన్ని అనుభవించాడు. కష్టాలను, బాధలను హాస్యంగా మలచి తన ‘పేరడీ’లలో ఆంధ్రులందరినీ కడుపుబ్బ నవ్వించాడు. నవ్వుతోపాటు కన్నీటి చుక్కల్ని కూడా తెప్పించగలిగిన మహామేధావి, కవీశ్వరుడు. ఆయన ఆరంభించిన ‘పేరడీ’ తర్వాత ఆంధ్రసాహిత్యంలో ఒక ప్రక్రియగా ఏర్పడి, నేటికీ అందరిచే ఆదరించబడుతున్నది. బాధని నవ్వుగా మలచగలిగిన బుద్ధిశాలి జరుక్ శాస్త్రి.

(లేదా)
ఈ పాఠంలో చెప్పిన గుణాల్లో ఏయే మంచి గుణాలను మీరు అలవరచుకోవాలనుకుంటున్నారో పట్టిక తయారు చేయండి.
జవాబు:
నేను అలవాటు చేసుకోవాలనుకుంటున్న మంచిగుణాలు :

  1. ధనవంతులైనా, కాకపోయినా చెడ్డవారిని ఆశ్రయించకూడదనే మంచి అలవాటు అలవర్చుకోవాలనుకుంటున్నాను.
  2. ఎన్ని కష్టాలెదురైనా ధర్మమార్గాన్ని వీడను.
  3. ఎల్లప్పుడూ సత్యాన్నే పలకాలని నిశ్చయించుకున్నాను.
  4. ఏ పనినైనా ఫలితాన్ని ఆశించకుండా చేయాలనుకుంటున్నాను.
  5. పిసినారితనాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాను.
  6. సమాజానికి హాని కలిగించే పనుల్ని చేయకూడదని నిర్ణయించుకున్నాను.
  7. గురువుల మాటకు ఎదురుచెప్పకూడదని అనుకుంటున్నాను.
  8. నాకు ఉద్యోగాన్ని ఇచ్చి, జీవనోపాధి కల్పించిన యాజమానిని/సంస్థను నిందించకూడదని అనుకుంటున్నాను.
  9. చెడు నడతను విడిచి పెట్టాలనుకుంటున్నాను.
  10. కార్యాలోచన ఒక్కడ్లే చేయకుండా ఆత్మీయుల, మిత్రుల సలహా, సూచనలతో చేయాలనుకుంటున్నాను.
  11. మంచి నడవడికను ఎప్పుడూ విడిచిపెట్టకూడదని నిశ్చయించుకున్నాను.
  12. అందరికీ సహాయం చేస్తూ ఆనందంగా బతకాలని నిర్ణయించుకున్నాను.

IV. ప్రాజెక్టు పని

ఒకటో తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు అన్ని తెలుగు పాఠ్యపుస్తకాల్లోని నీతి పద్యాలను సేకరించి, ఒక పుస్తకంలా తయారుచేయండి. మీ తరగతిలో ప్రదర్శించండి.
జవాబు:
విద్యార్థి కృత్యం.

III. భాషాంశాలు

పదజాలం

అ) కింద పదాలకు అర్థాలను పాఠ్యపుస్తకం చివర ఉన్న ‘పద విజ్ఞానం’లో వెతికి వాటిని ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
ఉదా :
మడువు = కొలను, మడుగు
కొంగ మడువులోని చేపలను తినాలని చూసింది.

1. అవని = భూమి
అవనిపై పచ్చదనం తగ్గిపోతుందీ మధ్య.

2. కొక్కెర = కొంగ
కొక్కెర నేర్పుగా చేపలను పడుతుంది.

3. భృంగం = తుమ్మెద
పద్మాలపై భృంగం అందంగా తిరుగుతుంది.

4. అనర్ఘం = వెలకట్టలేనిది
మంచి పౌరులు సమాజానికి అనర్ఘ రత్నాల వంటివారు.

5. పవి = వజ్రాయుధం, పిడుగు
1) ఇంద్రునికి ఇష్టమైన ఆయుధం పవి.
2) ఈ సంవత్సరం పవి పతనాల (పిడుగుపాటు) వల్ల మరణాల సంఖ్య పెరిగింది.

6. తురంగం = గుఱ్ఱము
మోటారు వాహనాలు లేని రోజుల్లో తురంగం ప్రయాణాలకు ఉపయోగపడేది.

7. పంచాస్యం – సింహము
వేటగాని దాడివల్ల పంచాస్యం మరణించింది.

8. దురాచారుడు = చెడు ఆచారాలు గలవాడు
దురాచారునితో స్నేహం ఎప్పటికైనా ప్రమాదాన్నే కలిగిస్తుంది.

9. దివ్యాహారం = అమృతము దేవతలు,
దానవులు పాలసముద్రాన్ని మధించినపుడు దివ్యాహారం పుట్టింది.

ఆ) కింది పదాలకు పదపట్టికలో పర్యాయపదాలు వెతికి వాటితో వాక్యాలు రాయండి.
ఉదా :
ఈప్సితం = కోరిక, వాంఛ

అ) కళ్ళారా హిమాలయాలను చూడాలని రవికి చిరకాల వాంఛ.
ఆ) ఎన్నోసార్లు తన కోరికను తల్లిదండ్రుల ముందు బయటపెట్టాడు.
ఇ) మొత్తానికి తన ఈప్సితం తీరేటట్లు తల్లిదండ్రులు అనుమతి ఇచ్చారు.

అవని :
1) భూమి
2) ధరణి

అ) భూమిని రక్షించుకోవడం అందరి బాధ్యత.
ఆ) ఓజోన్ పొర తొలగిపోవటం వల్ల అవనికి ప్రమాదం ఏర్పడింది.
ఇ) సూర్యుని నుండి అతినీలలోహిత కిరణాలు వస్తూండడం వల్ల ధరణి వేడెక్కిపోతున్నది.

2. విపత్తు :
1) ఇడుము
2) ఆపద
అ) ఆడవారికీ మధ్యకాలంలో ఆపదలు పెరిగాయి.
ఆ) ఎటు నుండి విపత్తులు వస్తాయో అని ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడుతున్నారు.
ఇ) ప్రభుత్వం ఆడవారికి రక్షణ కల్పించడం ద్వారా ఇడుములు దూరం చేయడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నది.

3. ఏనుగు :
1) కరి
2) మత్తేభం ,
అ) ఏనుగులు చెఱకుతోటలపై దాడిచేస్తాయి.
ఆ) కరుల సమూహాన్ని దూరంగా పంపడం కష్టంతో కూడిన పని.
ఇ) కొన్నిసార్లు మత్తేభాల కాళ్ళు కిందపడి జనాలు మరణిస్తూ ఉంటారు.

4. భుజంగం :
1) వాతాశనం
2) సర్పం
అ) సర్పాలలో విషం కలిగినవి కొన్నే. కాని మనం వాతాశనాన్ని చూడగానే చంపుతాం.
ఆ) కాబట్టే భుజంగాల సంఖ్య బాగా తగ్గిపోయిందీ మధ్యకాలంలో,

5. తురంగం :
1) అశ్వం
2) వాజి
అ) జంతువులలో బాగా వేగంగా పరుగెత్తగలవి అశ్వాలు.
ఆ) తురంగాల కాళ్ళు ఇసుకలో కూరుకుపోవు.
ఇ) కాబట్టే వాజులను ఎడారులలో ప్రయాణించడానికి వినియోగించేవారు పూర్వకాలంలో.

6. సత్యం :
1) నిజం
2) ఋతం
అ) పిల్లలు నిజం పలికేలా చూడాలి.
ఆ) సత్యం చెప్పడం వల్ల మంచి జరుగుతుందని వారికి నచ్చచెప్పాలి.
ఇ) ఋతాన్ని పలకడం వల్ల కలిగే ప్రయోజనాలను వారికి వివరించాలి.

AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు

ఇ) కింది పదాలకు వ్యుత్పత్త్యర్థాలు రాయండి.

1. దాశరథి : దశరథుని కుమారుడు (రాముడు)
2. గురువు : అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టేవాడు
3. జలజాతం : నీటి నుండి పుట్టినది
4. పంచాస్యం : విస్తరించిన ముఖం గలది (సింహం)
5. మధువ్రతం : తేనె సేకరించడమే వ్రతంగా గలది (తుమ్మెద)
6. అబ్దం : నీటి నుండి పుట్టినది (అప్ అంటే నీరని అర్థం)
7. ధూర్జటి : పెద్ద జడలు కలిగినవాడు (శివుడు)
8. ధర : అన్నింటినీ ధరించునది (భూమి)

ఈ) పాఠార్యశం ఆధారంగా కింది నానార్థాలకు సంబంధించిన మూలపదాలను వెతికి రాయండి.
1. నీరు, గరళం, తామరతూడు = విషం
2. చీకటి, తమోగుణం, దుఃఖం = తమం
3. ఏనుగు, మూడడుగుల కొలత, ఎనిమిది అనే అంకె = గజం
4. అవయవం, ఒక దేశం, భాగం = అంగం

ఉ) కింది జాతీయాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
1. గజస్నానం : వ్యర్థమైన స్నానం
చిన్న పిల్లలకు స్నానం చేయించినా అది గజస్నానమే.

2. అరణ్యరోదనం : ఏడుపు వల్ల ప్రయోజనం లేకపోవడం.
నగరాలు విస్తరిస్తున్న నేటి కాలంలో ప్రకృతి ప్రేమికుల అరపులు అరణ్యరోదనలే అవుతున్నాయి.

3. బూడిదలో పోసిన నెయ్యి : వ్యర్థమైపోవడం
మా అన్నయ్య ఇంజనీరింగ్ లో తప్పడంతో అమ్మానాన్నల శ్రమ అంతా బూడిదలో పోసిన నెయ్యి అయింది.

వ్యాకరణం

అ) కింది పదాలను విడదీసి, సంధి పేరు రాయండి.
ఉదా:
ఫణాగ్రము – ఫణ + అగ్రము : సవర్ణదీర్ఘ సంధి

పదం విసంధి రూపం సంధి పేరు
1. పరమాన్నం పరమ + అన్నం సవర్ణదీర్ఘ సంధి
2. పంచాస్యం పంచ + ఆస్యం సవర్ణదీర్ఘ సంధి
3. పదాబ్దం పద + అబ్దం సవర్ణదీర్ఘ సంధి
4. ధనాఢ్యుడు ధన + ఆఢ్యుడు సవర్ణదీర్ఘ సంధి
5. మధువ్రతేంద్రం మధువ్రత + ఇంద్రం గుణసంధి
6. సర్వేశ్వరా సర్వ + ఈశ్వరా గుణసంధి

ఆ) కింది పదాలను కలిపి, ఏ సంధులో గుర్తించండి.
ఉదా:
పలాయనంబు + అగుట = పలాయనంబగుట = ఉకారసంధి

విసంధి రూపం పదం సంధి పేరు
1. అభోజ్యములు + ఔట అభోజ్యములౌట ఉకారసంధి
2. కోపంబు . + ఎక్కువ కోపంబెక్కువ ఉకారసంధి
3. భృత్యుండు + అతడు భృత్యుండతడు ఉకారసంధి
4. ప్రాప్తము + అగు ప్రాప్తమగు ఉకారసంధి
5. రాజు + ఔనా రాజానా ఉకారసంధి

ఇ) పాఠం చదివి, కింది సంధులకు సంబంధించిన ఉదాహరణలను వెతికి రాయండి. ఆ సంధి పదాలను విడదీసి, సూత్రాలను నోటుబుక్కులో రాయండి.

1. యణాదేశ సంధి :
య్, వ్, ర్ – అనే వర్ణాలకు యణ్ వర్ణాలని పేరు. సంధిలో యణ్ వర్ణాలు ఆదేశంగా వస్తాయి. గనుక ఇది యణాదేశ సంధి.
సూత్రం :
ఇ, ఉ, ఋ లకు అసవర్ణమైన అచ్చులు పరమైతే వాటి స్థానంలో క్రమంగా య, వ, ర లు ఆదేశంగా వస్తాయి.

ఇతి + ఆభాషణ = ఇత్యాభాషణ = యణాదేశ సంధి
AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు 1

2. గుణసంధి :
ఏ, ఓ, అర్ అనే వర్ణాలకు గుణవర్ణాలని పేరు. సంధిలో గుణవర్ణాలు ఏకాదేశంగా వస్తాయి గనుక ఇది గుణసంధి.

సూత్రం :
అకారమునకు ఇ, ఈ లు పరమైతే ఏ కారం, ఉ, ఊ లు పరమైతే ఓ కారం ; ఋ, ౠలు పరమైతే ‘అర్’ అనేవి ఏకాదేశంగా వస్తాయి.
AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు 2

1) సర్వ + ఈశ్వరా = సర్వేశ్వరా = గుణసంధి
2) శివ + ఇతి = శివేతి = గుణసంధి
3) ఆభాషణ + ఉల్లాసికిన్ = ఆభాషణోల్లాసికిన్ = గుణసంధి
4) మధువ్రత + ఇంద్రం = మధువ్రతేంద్రం = గుణసంధి
5) పరంపర + ఉత్తుంగ = పరంపరోత్తుంగ = గుణసంధి
6) నామ + ఉక్తి = నామోక్తి = గుణసంధి

3. సవర్ణదీర్ఘ సంధి :
అ, ఆ అనే అచ్చులు ఒకేచోట పుట్టి, ఒకే ప్రయత్నంతో పలకబడతాయి. ఇలా ఒకేచోట పుట్టి, ఒకే ప్రయత్నంతో పలకబడే వర్ణాలను సవర్ణాలు అంటారు. సవర్ణాలకు సంధిలో దీర్ఘం వస్తుంది గనుక ఇది సవర్ణదీర్ఘ సంధి.

సూత్రం :
అకార – ఇకార – ఉకారములకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి.

ఉదాహరణలు :
1) ధన + ఆఢ్యుడు = ధనాఢ్యుడు = సవర్ణదీర్ఘ సంధి
2) ఫణ + అగ్రభాగము = ఫణాగ్రభాగము = సవర్ణదీర్ఘ సంధి
3) పంచ + ఆస్యము = పంచాస్యము = సవర్ణదీర్ఘ సంధి
4) సుర + అవనీజము = సురావనీజము = సవర్ణదీర్ఘ సంధి
5) పద + అబ్ద = పదాబ్ద = సవర్ణదీర్ఘ సంధి
6) దయ + అంతరంగ = దయాంతరంగ = సవర్ణదీర్ఘ సంధి
7) ధరా + ఆత్మజ = ధరాత్మజ = సవర్ణదీర్ఘ సంధి
8) నిశాచర = అబ్జ = నిశాచరాబ్జ = సవర్ణదీర్ఘ సంధి
9) శుభ + అంగ = శుభాంగ = సవర్ణదీర్ఘ సంధి
10) దివ్య + ఆహారము = దివ్యాహారము = సవర్ణదీర్ఘ సంధి
11) శ్రీకాళహస్తి + ఈశ్వరా = శ్రీకాళహస్తీశ్వరా = సవర్ణదీర్ఘ సంధి
12) కార్య + ఆలోచనము = కార్యాలోచనము = సవర్ణదీర్ఘ సంధి
13) పురుష + అర్థపరుడు = పురుషార్థపరుడు = సవర్ణదీర్ఘ సంధి

AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు

4. ఉత్వ సంధి :
హ్రస్వమైన ఉకారానికి జరిగే సంధిని ఉత్వసంధి అంటారు. .

సూత్రం :
హ్రస్వమైన ఉకారానికి అచ్చు పరమైతే సంధి తప్పక జరుగుతుంది.
ఉదాహరణలు :
1) వారలు + ఈప్సితము = వారలీప్సితము
2) కాంతురు + ఆ = కాంతురా
3) తలకండు + ఉబ్బడు = తలకండుబ్బడు
4) సత్యంబు + ఎప్పుడు = సత్యంబెప్పుడు
5) తప్పడు + ఏనియు = తప్పడేనియు
6) కాడు + పని = కాడేని
7) ఔచిత్యంబు + ఏమరడు = ఔచిత్యంబేమరడు
8) పొందడు + ఏ = పొందడే
9) సాంగత్యంబు + ఆదట = సాంగత్యంబాదట
10) పాయడు + ఏని = పాయడేని
11) భృత్యుండు + ఆతడు = భృత్యుండాతడు
12) రత్నము + అగునా = రత్నమగునా
13) జోరు + ఈగ = జోరీగ
14) మధువ్రతేంద్రము + అగునా = మధుప్రతేంద్రమగునా
15) పంచాస్యము + ఔనా = పంచాస్యమౌనా
16) అవనీజము + అగునా = అవనీజమగునా
17) రాజు + ఔనా = రాజౌనా
18) కార్యములు + ఒనరించు = కార్యములొనరించు
19) ఘనతరంబు + ఐన = ఘనతరంబైన
20) చందంబు + అగున్ = చందంబగున్
21) మౌనంబు + ఒప్పన్ = మౌనంబొప్పన్
22) వేదము + అటవీ మధ్యంబులో = వేదమటవీ మధ్యంబులో
23) ఏడ్పు + అగున్ = ఏడుగున్
24) హోమములు + ఎಲ್ಲ = హోమములెల్ల
25) విడువబోకుము + అయ్య = విడువబోకుమయ్య
26) పుష్పంబు + అగు = పుష్పంబగు
27) మంచు + అగు = మంచగు
28) స్థలంబు + అవు = స్థలంబవు
29) శత్రుండు + అతి = శత్రుండతి
30) మిత్రుడు + ఔ = మిత్రుడా
31) దివ్యాహారము + ఔ = దివ్యాహారమౌ
32) సర్వవశ్యకరము + ఔ = సర్వవశ్యకరమౌ
33) ఆచార్యునకు + ఎదురు = ఆచార్యునకెదురు
34) చేయకుము + ఆచారము = చేయకుమాచారము
35) పోకుము + అయ్యా = పోకుమయ్య
36) ఉండుము + ఉండదె = ఉండుముండదె
37) నూఱు + ఏండ్లు = నూడేండ్లు
38) ఉండదు + ఏ = ఉండదే

ఈ) నూతన పరిచయం :
జశ్వ సంధి :
జశ్ వరాలకు (క, చ, ట, త, ప, ఖ, ఛ, ఠ, థ, ఫ, శ, ష, స) జరిగే సంధి కాబట్టి ఇది జశ్వ సంధి. ఉదాహరణలు :
1) సత్ + భక్తి = సద్భక్తి
2) దిక్ + అంతము = దిగంతము
3) సముత్ + అంచత్ + సముదంచత్
4) మృత్ + ఘటము = మృద్దటము
5) వాక్ + ఈశుడు = వాగీశుడు
6) వాక్ + యుద్ధం = వాగ్యుద్ధం
7) వాక్ + వాదం = వాగ్వాదం
8) తత్ + విధం = తద్విధం

జశ్వసంధి సూత్రం :
పరుషములకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు – శ, ష, స లు తప్ప మిగిలిన హల్లులు కానీ, అచ్చులు కానీ పరమైతే వరుసగా సరళాలు ఆదేశంగా వస్తాయి.

4) సమాసాలు – ఖాళీలను పూరించండి.

సమాసపదం విగ్రహవాక్యం సమాసం పేరు
1. సాధుసజ్జనులు సాధువులైన సజ్జనులు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
2. ధనాఢ్యుడు ధనము చేత ఆడ్యుడు తృతీయా తత్పురుష సమాసం
3. నూడేండ్లు నూటైన సంఖ్య గల ఏండ్లు ద్విగు సమాసం
4. దుష్టచిత్తుడు దుష్టమైన చిత్తము గలవాడు బహుబీహి సమాసం
5. క్రూర భుజంగం క్రూరమైన భుజంగం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
6. కార్యాలోచనము కార్యమును గూర్చి ఆలోచనము ద్వితీయా తత్పురుష సమాసం
7. ఫణాగ్రభాగము ఫణము యొక్క అగ్రభాగము షష్ఠీ తత్పురుష సమాసం
8. అనర్ఘ రత్నాలు అనర్హమైన రత్నాలు విశేషణ పూర్వపద కర్మధారయం

ఊ) కర్మధారయ సమాసాలు
కర్మధారయ సమాసం : విశేషణానికి విశేష్యం (నామవాచకం) తో చేసే సమాసాన్ని కర్మధారయ సమాసం అంటారు.
ఉదా : కృష్ణ సర్పం.

‘కృష్ణ’ అనేది విశేషణం. ‘సర్పం’ అనేది విశేష్యం.

I. ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం:
పోలిక చెప్పడానికి ఉపయోగించేదాన్ని ‘ఉపమానం’ అంటారు. కర్మధారయ సమాసంలో మొదటి పదం ఉపమానం అయితే దాన్ని ‘ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం’ అంటారు.
ఉదా :
కలువ కనులు.

కలువ వంటి కన్నులు అనే అర్థంలో కర్మధారయ సమాసంలో కన్నులను కలువలతో పోల్చారు. కాబట్టి ‘కలువ’ ఉపమానం. ఉపమానం మొదటి పదంగా ఉంది కాబట్టి ఇది ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం.

II. ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం :
కర్మధారయ సమాసంలో ఉపమానం ఉత్తరపదంగా ఉంటే దాన్ని ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం అంటారు.
ఉదా :
పదాబ్దము

పద్మం వంటి పదం (పాదం) అనే అర్థంలో కర్మధారయ సమాసం చేయగా పదశబ్దం మొదటి పదంగా నిలిచింది. ఉపమానమైన అబ్దం (పద్మం) రెండవ పదంగా ఉంది కాబట్టి ఇది ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం.

సమాసపదం విగ్రహవాక్యం సమాసం పేరు
1. తేనెమాట తేనెవంటి మాట
(తేనె – ఉపమానం; మాట-ఉపమేయం)
ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం
2. తనూలత లత వంటి తనువు
(తనువు-ఉపమేయం; లత-ఉపమానం)
ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం
3. చిగురుకేలు చిగురు వంటి కేలు
(చిగురు-ఉపమానం; కేలు-ఉపమేయం)
ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం
4. కరకమలములు కమలముల వంటి కరములు
కరములు-ఉపమేయం: కమలములు-ఉపమానం
ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం

కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసం పేరు రాయండి.

1) సుధామధురం
2) జుంటిమోవి
3) ముఖారవిందం
4) కాంతామణి
జవాబు:

సమాసపదం విగ్రహవాక్యం సమాసం పేరు
1. సుధామధురం సుధలా మధురమైనది
(సుధ = అమృతం)
ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం
2. జుంటిమోవి జున్ను వంటి మోవి ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం
3. ముఖారవిందం అరవిందం (పద్మం) వంటి ముఖం ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం
4. కాంతామణి మణి వంటి కాంత ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం

AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు

ఋ) రూపక సమాసం:
“విద్యాధనం” దీనిలో విద్య, ధనం అనే రెండు పదాలు ఉన్నాయి. పూర్వపదమైన విద్య, ధనంతో పోల్చబడింది. కాని ‘విద్య అనెడి ధనం’ అని దీని అర్థం. కనుక, ఈ విధంగా ఉపమాన ధర్మాన్ని ఉపమేయం మీద ఆరోపించడాన్ని – రూపక సమాసం అంటారు. విగ్రహవాక్యంలో ‘అనెడి’ అనే మాట చేరుతుంది.
ఉదా :
1) హృదయసారసం – హృదయమనెడి సారసం (సరస్సు) .
2) సంసారసాగరం – సంసారమనెడి సాగరం

కింది పదాలకు విగ్రహవాక్యాలు రాయండి.
1) జానజ్యోతి -జ్ఞానమనెడి జ్యోతి – రూపక సమాసం
2) అజ్ఞానతిమిరం అజ్ఞానమనెడి తిమిరం – రూపక సమాసం
3) వచనామృతం — అమృతమనెడి వచనం – రూపక సమాసం

ఋ) ఛందస్సు – మత్తేభం :
1) ఈ పద్యానికి నాలుగు పాదాలుంటాయి.
2) ప్రతి పాదానికి స. భ, ర, న, మ, య, వ అనే గణాలుంటాయి.
3) ప్రాసనియమం ఉంది.
4) 14 వ అక్షరం యతిస్థానం.
5) ప్రతి పాదానికి 20 అక్షరాలు ఉంటాయి.
AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు 3
యతి : ప – పా.

మీరు కూడా పాఠంలోని పై పద్యంలో మిగిలిన మూడు పాదాలకూ, గణవిభజన చేసి, పై మత్తేభ పద్య లక్షణాలు సరిపోయాయో లేదో చూడండి.
AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు 4
యతి : ప – ఆ.
AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు 5
యతి : అ – ఆ.
AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు 6
య యతి : శి – శ్రీ.

ఎ) అలంకారాలు :
గతంలో మీరు నేర్చుకున్న రూపక, ఉపమాలంకారాలు 6, 7 పద్యాల్లో ఉన్నాయి. ఏ పద్యంలో ఏ అలంకారం ఉందో గుర్తించి, లక్ష్య లక్షణ సమన్వయం చేయండి.
గమనిక (1):
6వ పద్యంలో ‘ఉపమాలంకారాలు’ ఉన్నాయి పరిశీలించండి.

1. స్నానంబుల్ నదులందు జేయుట గజ స్నానంబు చందంబగున్”
ఇందులో ఉపమాలంకారం ఉంది.

లక్షణము : దీనిలో 1) ఉపమానం 2) ఉపమేయం 3) ఉపమావాచకం 4) సమానధర్మం ఉంటాయి.
సమన్వయము :
1) గజస్నానంబు – ఉపమానం
2) నదులందుచేయుట – ఉపమేయం
3) చందంబు – ఉపమావాచకం
4) అగున్ – సమానధర్మం

2. మౌనంబొప్ప జపించు వేద ‘మటవీ మధ్యంబులో నేడ్పగున్’
ఇందులో ఉపమాలంకారం ఉంది.
లక్షణము :
దీనిలో 1) ఉపమానం 2) ఉపమేయం 3) ఉపమావాచకం 4) సమానధర్మం ఉంటాయి.
సమన్వయము :
1) అటవీ మధ్యంలో ఏడుపు – ఉపమానం
2) మౌనంతో వేదం జపించడం – ఉపమేయం
3) (లోపించింది) – ఉపమావాచకం
4) అగున్ – సమానధర్మం

3. ‘నానాసూమములెల్ల బూడిదలలోన న్వేల్చు నెయ్యె చనున్’
ఈ పాదంలో ఉపమాలంకారము ఉంది.

లక్షణము :
దీనిలో 1) ఉపమానం 2) ఉపమేయం 3) ఉపమావాచకం 4) సమానధర్మం ఉంటాయి.
సమన్వయము :
1) బూడిదలలోవేల్చు నెయ్యి – ఉపమానం
2) నానా హోమములు – ఉపమేయం
3) (లోపము) – ఉపమావాచకం
4) చనున్ – సమానధర్మం

గమనిక (2) :
ఏడవ పద్యంలో ‘రూపకాలంకారాలు’ ఉన్నాయి. పరిశీలించండి.

1. ‘విపత్పరంపరోత్తుంగ తమః పతంగ’
ఈ వాక్యంలో రూపకాలంకారము ఉంది.
భావం :
కష్టాలు అనే కారుచీకట్లను తొలగించే సూర్యుడు అని భావం.

రూపకాలంకార లక్షణం :
ఉపమాన ఉపమేయాలకు అభేదాన్ని చెప్పడం రూపకాలంకారం.
సమన్వయము :
1) తమము (తమస్సు) – ఉపమానం
2) విపత్పరంపరలు – ఉపమేయం
ఉపమానమైన చీకటికీ, ఉపమేయమైన విపత్తులకూ భేదం ఉన్నా లేనట్లు చెప్పబడింది. కాబట్టి ‘రూపకాలంకారం’.

2. ‘ధరాత్మజాహృదయసారసభృంగ’
ఈ వాక్యంలో ‘రూపకాలంకారం’ ఉంది.
భావం :
సీతాదేవి హృదయం అనే పద్మానికి తుమ్మెద వంటివాడవు. రూపకాలంకార

లక్షణం :
ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పడం రూపకాలంకారం.
సమన్వయం:
1) సారసము (పద్మము) – ఉపమానం
2) హృదయము – ఉపమేయం
ఉపమానమైన సారసమునకూ, ఉపమేయం అయిన హృదయమునకూ భేదం ఉన్నా, లేనట్లు చెప్పడం జరిగింది. కాబట్టి ‘రూపకాలంకారం’.

3. ‘నిశాచరాప్తమాతంగ’
ఈ వాక్యంలో రూపకాలంకారము ఉంది.
భావం :
రాక్షసులు అనే కలువలను నాశనం చేసే ఏనుగువంటివాడు.

రూపకాలంకార లక్షణం :
ఉపమాన – ఉపమేయములకు అభేదం చెప్పడం, లేక ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపించడం రూపకాలంకారం.
సమన్వయం:
1) అబ్జము (కలువ) – ఉపమానం
2) నిశాచరులు – ఉపమేయం
ఉపమానమైన అబ్దమునకూ, ఉపమేయం అయిన నిశాచరులకూ భేదం ఉన్నా లేనట్లు చెప్పబడింది. కా.ట్ట ‘రూపకాలంకారం’ ఉంది.

AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు

ఏ) దృష్టాంతాలంకారం :

లక్షణం :
ఉపమేయ వాక్యానికి, ఉపమాన వాక్యానికి బింబ ప్రతిబింబ భావం వర్ణించబడితే దాన్ని దృష్టాంతాలంకారం అంటారు.

లక్ష్యం (ఉదాహరణ) :
ఓ రాజా నీవే కీర్తిమంతుడవు. చంద్రుడే కాంతిమంతుడు.

సమన్వయం :
ఇందు రాజు ఉపమేయం. చంద్రుడు ఉపమానం. ఉపమేయ వాక్యానికి, ఉపమాన వాక్యానికి బింబ ప్రతిబింబ భావం చెప్పబడింది గనుక ఇది దృష్టాంతాలంకారం. దృష్టాంతాలంకారానికి రెండు ఉదాహరణలు రాయండి.
1) రాజే ధర్మపరుడు, బుద్ధుడే అహింసాపరుడు.
2) బాబా ఆమేనే విజ్ఞాని, రమణ మహర్షియే జ్ఞాని.

9th Class Telugu 5th Lesson పద్యరత్నాలు కవుల పరిచయం

ఈ పాఠంలోని ప్రతి పద్యమూ ఒక విలువైన రత్నమే. ఈ పద్యాలన్నీ వేర్వేరు కవులు రాసిన శతకాల్లోనివి. ఆయా కవుల వివరాలు చదవండి.

1. ‘శ్రీకర రాజశేఖరా !’ అనే మకుటంతో ఉన్న పద్యం ‘రాజశేఖర శతకం’ లోనిది. దీని కర్త ‘సత్యవోలు సుందరకవి.” 20వ శతాబ్దానికి చెందినవారు. భక్తిభావం ఉట్టిపడేటట్లు సులభ శైలిలో శతకాన్ని రచించారు.

2,3. ‘సర్వేశ్వరా ! అనే మకుటంతో ఉన్న పద్యాలు ‘సర్వేశ్వర శతకం’లోనివి. వీటిని ‘యథావాక్కుల అన్నమయ్య’ రచించారు. ఇతడు 12వ శతాబ్దానికి చెందిన శివకవి. భక్తిభావబంధురమైన కవిత్వం చెప్పగల దిట్ట.

4. ‘భర్గా ! పార్వతీ వల్లభా !’ అనే మకుటంతో ఉన్న పద్యం ‘కూచిమంచి తిమ్మకవి’ రచించిన ‘శ్రీ భర్గశతకం’ లోనిది. ఈయన 17వ శతాబ్దానికి చెందిన వారు. ‘నీలాసుందరీ పరిణయం’ అనే ప్రబంధాన్ని కూడా రచించారు.

5. ‘భూషణ వికాస శ్రీధర్మ పురనివాస ! దుష్టసంహార ! నరసింహ ! దురితదూర !’ అనే మకుటంతో ఉన్న పద్యం ‘కాకుత్సం శేషప్ప కవి’ రాసిన ‘నరసింహ శతకం’లోనిది. వీరు 18వ శతాబ్దానికి చెందినవారు. గోదావరీ తీరంలో కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి గ్రామంలో వెలసిన నరసింహస్వామిని ప్రస్తుతిస్తూ రాసిన శతకం ఇది.

6. ‘నారాయణా !’ అన్న మకుటంతో ఉన్న పద్యం నారాయణ శతకం లోనిది. రాసింది బమ్మెర పోతన. 15వ ఆ శతాబ్దానికి చెందిన భక్త కవి. మనస్సుకు ఆహ్లాదకరమైన, అందమైన పద్యాలు చెప్పిన సహజపండితులు.

7. ‘దాశరథీ ! కరుణాపయోనిధీ !’ అనే మకుటంతో ఉన్న పద్యం దాశరథి శతకం లోనిది. దీన్ని రచించిన కవి కంచర్ల గోపన్న. 17వ శతాబ్దానికి చెందినవారు. ఈయనకే రామదాసు అనే పేరుంది.

8. ‘శ్రీకాళహస్తీశ్వరా !’ అనే మకుటంతో ఉన్న పద్యం ‘ధూర్జటీ’ కవి రచించిన ‘శ్రీకాళహస్తీశ్వర శతకం’లోనిది. వీరు 17వ శతాబ్దానికి చెందినవారు.

9. ‘కుమారా !’ అనే మకుటంతో ఉన్న పద్యం ‘కుమార శతకం’ లోనిది. కవి ‘పక్కి అప్పలనర్సయ్య’. వీరు 16వ శతాబ్దానికి చెందినవారు.

10. ‘సుమతీ !’ అన్న మకుటంతో ఉన్న పద్యం ‘సుమతీ శతకం’ లోనిది. కవి బద్దెన. వీరు 13వ శతాబ్దానికి ! చెందినవారు.

పద్యాలు – ప్రతిపదార్థాలు-భావాలు

1వ పద్యం : – కంఠస పదం
*ఉ॥ కోరికతో ధనాఢ్యుఁడని కుత్సితు నల్పుని దుష్టచిత్తునిన్
జేరినవార లీప్సితముఁ జెంది సుఖింపరు హానిఁ గాంతు రా
చారు ఫణాగ్రభాగ విలసన్మణిరాజము గల్గి వెళ్లినన్
గ్రూర భుజంగమున్ గవయఁ గూడునె శ్రీకర రాజశేఖరా !
ప్రతిపదార్థం:
శ్రీకర = శుభాన్ని కలిగించే
రాజశేఖరా = చంద్రుని శిరస్సున ధరించే ఈశ్వరా !
కోరికతోన్ = కోరుకొని
ధనాఢ్యుడు + అని = అధిక ధనవంతుడని
కుత్సితున్ = మోసకారియైన
అల్పునిన్ = తక్కువవాడైన
దుష్టచిత్తునిన్ = చెడ్డబుద్ధికలవాణ్ణి
చేరినవారలు = చేరినవారు (ఆశ్రయించినవారు)
ఈప్సితమున్ = కోరిన కోరికను
చెంది = పొంది
సుఖింపరు = సుఖపడరు
హానిన్ = కీడును
కాంతురు = పొందుతారు
చారు ఫణాగ్రభాగ విలసన్మణిరాజము ; చారు = అందమైన
అగ్రభాగ = పై భాగము నందు
ఫణ = పడగయొక్క
విలసత్ = ప్రకాశించే
మణిరాజము = శ్రేష్ఠమైన మణిని
కల్గి = కలిగియుండి
వెల్గినన్ = ప్రకాశించినప్పటికీ (ఒప్పియున్నా)
క్రూర భుజంగమున్ = క్రూరమైన సర్పాన్ని
కవయఁగూడును + ఎ = కలిసి ఉండవచ్చా? (కలిసి ఉండరాదు)

భావం :
శుభాన్ని కల్గించే రాజశేఖరా ! మోసకారియైన ధనవంతుణ్ణి కోరి చేరితే, కోరికలు తీరకపోగా కీడు కూడా కలుగుతుంది. పడగ మీద విలువగల మణి ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ, భయంకరమైన పాముతో కలిసి యుండరు కదా !

2వ పద్యం: కంఠస్థ పద్యం
* మ॥ కుల శైలంబులు పొదు పెల్లగిలి దిక్కూలంబునం గూలినం
జలధు ల్మేరల నాక్రమించి సముదంచదృంగి నుప్పొంగినన్
జలజాతప్రియ శీతభానులు యథా సంచారముఱ్ఱప్పినం
దలకం డుబ్బడు చొప్పుదప్పడు భవద్భక్తుండు సర్వేశ్వరా !
ప్రతిపదార్థం:
సర్వేశ్వరా = ఓ సర్వేశ్వర స్వామి !
కుల శైలంబులు = కుల పర్వతాల
పాదు = మూలం (ఆలవాలం)
పెల్లగిలి = నశించి, ఊడిపోయి
దిక్కూలంబునన్ = దిక్కుల దగ్గర
(దిక్ + కూలంబునన్) (దిగంతముల వద్ద)
కూలినన్ = కూలిపోయినప్పటికీ
జలధుల్ = సముద్రాలు
మేరలన్ = సరిహద్దులను
ఆక్రమించి = దాటి (చేరి)
సముదంచత్ + భంగిన్ = మిక్కిలి చెలరేగిన విధంగా
ఉప్పొంగినన్ = పైకి పొంగినా
జలజాతప్రియ, శీతభానులు; జలజాతప్రియ = పద్మ బాంధవుడైన సూర్యుడూ,
శీతభానులు = చల్లని కిరణములు గల చంద్రుడూ
యథాసంచారముల్ = వారు నిత్యం తిరిగే దారిలో తిరగడం
తప్పి నన్ = తప్పిపోయినా (ప్రక్కదారిలో తిరుగుతున్నా)
భవద్భక్తుండు (భవత్ + భక్తుండు) = నీ యొక్క భక్తుడు
తలకండు = చలింపడు
ఉబ్బడు = గర్వపడడు
చొప్పు = నీతిమార్గాన్ని
తప్పడు = విడువడు (తప్పి సంచరింపడు)

భావం : సర్వేశ్వరా ! కుల పర్వతాలన్నీ చెల్లాచెదురై దిగంతాలలో కూలినా, సముద్రాలు హద్దులను దాటి ఉప్పొంగినా, సూర్య చంద్రులు గతులు తప్పి చరించినా, నీ భక్తుడు అణుమాత్రం గర్వపడడు. నీతిమార్గాన్ని తప్పి సంచరింపడు.

AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు

3వ పద్యం: కంఠస్థ పద్యంగా
* శా॥ సత్యం బెప్పుడు దప్పుడేనియు దురాచారుండు ‘గాడేని యౌ
చిత్యం బేమరడేని దుర్జనుల గోష్ఠిం బొందడే భక్తి సాం
గత్యం బాదట బాయడేని, మదనగ్రస్తుండు గాడేని నీ
భృత్యుండాతడు మూడు లోకములలోఁ బెంపొందు సర్వేశ్వరా !
ప్రతిపదార్థం :
సర్వేశ్వరా = ఓ సర్వేశ్వరా !
సత్యంబు = సత్యాన్ని
ఎప్పుడు = అన్నివేళలా
తప్పుడు + ఏనియున్ = తప్పకుండా ఉన్నట్లయితే
దురాచారుండు = చెడు నడతగలవాడు
కాడు + ఏనిన్ = కాకుండా ఉన్నట్లయతే
ఔచిత్యంబు = తగిన విధాన్ని (ఉచితత్వము)
ఏమరడు + ఏనిన్ = మరువనట్లయితే ఆ
దుర్జనులు = దుష్టుల (చెడ్డవారి యొక్క)
గోష్ఠిన్ : = కొలువును (సంఘమును)
పొందడు + ఏన్ – చేరనట్లయితే
భక్తిసాంగత్యంబు = భక్తులతో చెలియన
ఆదటన్ = వదలక
పాయడు + ఏని = విడువడేని
మదనగ్రస్తుండు = మన్మథీమోహాంలో చిక్కుకొన్నవాడు
కాడెనిన్ = కానివాడయితే
ఆతడు = అతడు
నీ భృత్యుండు = నీకు సేవకుడు అవుతాడు
మూడు లోకములలోన్ = ముల్లోకాలలోనూ
పెంపొందున్ = అభివృద్ధి పొందుతాడు.

భావం :
ఓ సర్వేశ్వరా ! ఈ మూడు లోకాల్లోనూ సత్యము తప్పనివాడు, చెడు నడతలేనివాడు, తగిన విధంగా మెలిగేవాడు, చెడ్డవాళ్ళతో చేరనివాడు, భక్తుల సాంగత్యాన్ని విడిచిపెట్టనివాడు, సంసారమోహంలో చిక్కుకోనివాడూ ఎవడున్నాడో అతడే నీ సేవకుడు.

4వ పద్యం : కంఠస్థ పద్యం
* శా॥ గాజుంబూస యనర్ఘ రత్న మగునా ? కాకంబు రాయంచ’
నా ? జోరీగ మధువ్రతేంద్ర మగునా ? నట్టెన్ము పంచాస్యమౌ
నా ? జిల్లేడు సురావనిజమగునా ? నానాదిగంతంబులన్ ,
రాజౌనా ఘనలోభి దుర్జనుడు ? భర్గా ! పార్వతీ వల్లభా!
ప్రతిపదార్థం :
పార్వతీవల్లభా = పార్వతీపతీ !
భర్గా = ఓ ఈశ్వరా !
నానా దిగంతంబులన్ = అన్ని దిక్కుల చివరలలోనూ (ప్రపంచంలో ఎక్కడయినా)
గాజుంబూస (గాజున్ + పూస) = గాజుపూస
అనర్ఘ = వెలకట్టలేని
రత్నము = రత్నం
అగునా = అవుతుందా? (కాలేదు)
కాకంబు = కాకి
రాయంచ = రాజహంస
ఔనా ? = అవుతుందా ? (కాలేదు)
జోరీగ = పశువుల రక్తాన్ని త్రాగే ఒక జాతి ఈగ
మధువ్రతేంద్రము (మధువ్రత + ఇంద్రము) = శ్రేష్ఠమైన తుమ్మెద
అగునా = అవుతుందా ? (కాలేదు)
నట్టెను = దున్నపోతు
పంచాస్యమ = సింహం
ఔనా = అవుతుందా ? (కాలేదు)
జిల్లేడు = జిల్లేడు చెట్టు
సుర + అవనీజము = దేవతల వృక్షమైన కల్పవృక్షం
అగునా = అవుతుందా ? (కాదు)
ఘనలోబి = గొప్ప పిసినారి అయిన
దుర్జనుడు = దుర్మార్గుడు
రాజు + ఔనా = రాజు అవుతాడా ? (కాలేడు)

భావం :
భర్గా ! పార్వతీపతీ ! ప్రపంచంలో ఎక్కడైనా, ఎప్పటికీ గాజుపూస విలువైన రత్నం కాజాలదు. కాకి రాజహంస కాజాలదు. జోరీగ తేనెటీగ కాజాలదు. దున్నపోతు సింహం కాజాలదు. జిల్లేడు చెట్టు కల్పవృక్షం కాజాలదు. అలాగే పిసినారి యైన దుర్మార్గుడు రాజు కాలేడు.

5వ పద్యం :
సీ॥ సాధు సజ్జనులతో జగడమాడినఁ గీడు
కవులతో వైరంబు గాంచఁగీడు,
పరమదీనులఁ జిక్కఁబట్టి కొట్టినఁ గీడు,
భిక్షగాండ్రను దుఃఖపెట్టఁగీడు ”
నిరుపేదలను చూచి నిందఁ జేసినఁగీడు
పుణ్యవంతులఁ దిట్టఁ బొసగుఁగేడు
సద్భక్తులను దిరస్కారమాడివఁ గీడు,
గురుని ద్రవ్యము దోఁచుకొనినఁ గీడు

తే॥గీ॥ దుష్టకార్యము లొనరించు దురమలకు
ఘనతరంబైన నరకంబు గట్టిముల్లె
భూషణ వికాస ! శ్రీధర్మపుర నివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర!
ప్రతిపదార్థం :
భూషణ = అలంకారాల చేత
వికాస = శోభిల్లేవాడా !
శ్రీధర్మపుర = ధర్మపురి అనే గ్రామంలో
నివాస = నివసించేవాడా ! (వెలసినవాడా !)
దుష్టసంహార = దుష్టులను సంహరించేవాడా!
దురితదూర = పాపాలను పోగొట్టేవాడా !
నరసింహ = ఓ నరసింహస్వామీ !
సాధుసజ్జనులతోన్ = మంచివారితో
జగడము + ఆడినన్ = కలహం పెట్టుకొంటే
కీడు = హాని (చెడుపు
కవులతోన్ = కవులతో
వైరంబు = శత్రుత్వం
కాంచన్ = పొందగా
కీడు = హాని
పరమదీనులన్ = మిక్కిలి దీమలను
(చిక్కఁబట్టి) చిక్కన్ + పట్టి = కట్టివైచి
కొట్టినన్ = కొడితే
కీడు = హాని
భిక్షగాండ్రను = ముష్టివారిని
దుఃఖ పెట్టన్ = ఏడ్పిస్తే
నిరుపేదలను = మిక్కిలి పేడవారిని
చూచి = చూచి
నిందన్ + చేసినన్ = తిట్టితే (నిందిస్తే)
కీడు = హాని
పుణ్యవంతులన్ = పుణ్యాత్ములను
తిట్టన్ = తిడితే
కీడు = హాని
పొసగున్ = సంభవిస్తుంది (సత్ + భక్తులను) = మంచి భక్తులయినవారిని
తిరస్కారము + ఆడినన్ = తిరస్కరిస్తే
కీడు = హాని
గురుని = గురువుగారి యొక్క
ద్రవ్యమున్ = సొమ్మును
దోచుకొనినన్ = దొంగిలిస్తే
కీడు = హాని
దుష్టకార్యములు = చెడ్డపనులు
ఒనరించు = చేసే
దుర్జనులకు = దుష్టులకు
ఘనతరంబు + ఐన = గొప్పదైన
నరకంబు = నరకలోకం
గట్టి ముల్లె = భద్రముగా కట్టుకొన్న మూట

భావం :
అలంకారాలచేత శోభించేవాడా ! ధర్మపురి గ్రామంలో వెలసినవాడా ! దుష్టులను సంహరించేవాడా ! పాపాలను పోగొట్టేవాడా ! నరసింహా ! మంచివారితో తగవు పెట్టుకుంటే హాని కలుగుతుంది. కవులతో శత్రుత్వం పెట్టుకొంటే, వారిని పట్టుకొని కొడితే, ముష్టివారిని ఏడిపిస్తే, పేదలను నిందిస్తే కీడు జరుగుతుంది. పుణ్యాత్ములను తిడితే, మంచి భక్తులను తిరస్కరిస్తే, గురువుగారి సొమ్మును దోచుకుంటే కీడు జరుగుతుంది. ఈ విధంగా చెడు పనులు చేసేవారికి నరకం తప్పదు. (వారికి నరకం, భద్రంగా కట్టుకొన్న మూట వంటిది.)

AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు

6వ పద్యం : కంఠస్త పద్యం
* శా॥ స్నానంబుల్ వదులందుఁ జేయుట గజ స్నానంబు చందంబగున్
మౌనంబొప్ప జపించు వేద మటవీ మధ్యంబులో నేడుగున్
నానాహోమములెల్ల బూడిదలలోన న్వేల్చు నెయ్యి చను
న్నీ నామోక్తియు నీ పదాబ్దరతియున్ లేకున్న వారాయణా !
ప్రతిపదార్థం :
నారాయణా = ఓ విష్ణుమూర్తీ ! నారాయణా!
నీ = నీ యొక్క
నామోక్తియున్ కీడు (నామ + ఉక్తియున్) = నామాన్ని స్మరించుటయు
నీ = నీ యొక్క
పదాబ్జ (పద + అల్ల) = పద్మముల వంటి పాదాల యందు
రతియున్ = ఆసక్తియును (అనురాగమును)
లేకున్నన్ (లేక + ఉన్నన్) = లేకుంటే (లేకపోతే)
నదులందున్ = నదులలో (గంగ, గోదావరి వంటి పుణ్యనదులలో)
స్నానంబుల్ = స్నానములు
చేయుట = చేయడం
గజస్నానంబు = ఏనుగు చేసే స్నానం
చందంబు = వంటిది (పోలినది)
అగున్ = అవుతుంది.
మౌనంబు +ఒప్పన్ = పైకి ధ్వని వినబడకుండా
జపించు = జపించే
వేదము = వేదపారాయణం
అటవీ మధ్యంబులోన్ = అడవి మధ్యభాగంలో
ఏడ్పు + అగున్ = ఏడుపు వంటిది అవుతుంది.
నానాహోమములు = అనేక రకాలైన పుణ్యహోమాలు
ఎల్లన్ = అన్నియును
బూడిదలలోనన్ = బూడిద రాశులలో
వేల్చు = హోమం చేసే
నెయ్యె – (నెయ్యి + ఐ) = నేయివలె
చనున్ = పోతుంది (వ్యర్థం అవుతుంది)

భావం :
నారాయణా ! నీ నామం స్మరింపనివాడు, నీ పాదపద్మాలపై భక్తిలేనివాడు ఎన్ని నదులలో స్నానం చేసినా అది ఏనుగు స్నానం వంటిదే అవుతుంది. అతడు మంత్రాలను మౌనంగా జపించినా, అది అరణ్యరోదనమే అవుతుంది. ఎన్ని హోమాలు చేసినా, అది బూడిదలో పోసిన నెయ్యే అవుతుంది.

1) గజస్నానము :
గజస్నానము అంటే ఏనుగు స్నానం. ఏనుగు శుభ్రంగా నదులలో, మడుగులలో స్నానం చేసిన రంగ తరువాత గట్టుపైకి వచ్చి అక్కడ ఉన్న మట్టిని తొండంతో పీల్చి శరీరంపై చల్లుకుంటుంది. అంటే అది స్నానం చేసినా శుద్ధ దండుగ అని భావము.

2) అరణ్యరోదనం :
అరణ్యరోదనం అంటే అడవి మధ్యలో కూర్చుండి ఏడవడం. అడవిలో ఏడిస్తే ఎవరికీ వినబడదు. అందువల్ల ఎవరూ వచ్చి ఓదార్చరు. సాయం చేయరు. అదే జనులు ఉండే పల్లెలోనో, నగరంలోనో ఏడిస్తే ఎవరో ఒకరు వచ్చి ఓదారుస్తారు. అంటే అడవిలో ఏడవడం దండుగ అని భావం.

3) బూడిదలో నేయి హోమం :
సామాన్యంగా దేవతల ప్రీతికై అగ్నిజ్వాలల్లో నేతిని హోమం చేస్తారు. హోమం చేసేటప్పుడు, మంట మండేటప్పుడే హోమం చేయాలి. నిప్పులలో హోమం చేయరాదు. బూడిదలో హోమం చెయ్యడం శుద్ధ దండుగ అని భావం.

4) విష్ణుభక్తి లేనివాడు పుణ్యనదులలో స్నానం చేసినా, మౌనంగా వేదమంత్రాలు పారాయణ చేసినా, బూడిదలో నేతిని హోమం చేసినా దండుగ అని సారాంశం.

విశేషం :
‘జపం’ మూడు విధాలుగా ఉంటుంది.
1) మనస్సులో చేసే జపం ‘మానసికం’
2) పెదవులు కదుపుతూ చేసే జపం ‘ఉపాంశువు’
3) ఇతరులకు వినబడేటట్లు చేసే జపం ‘వాచికం’
ఈ పద్యంలో ‘మానసిక జపం’ గూర్చి చెప్పారు. ఇది జపాలన్నింటిలో ఉత్తమం.

7వ పద్యం : కంఠస్థ పద్యం
* ఉ॥ రంగదరాతి భంగ, ఖగ రాజతురంగ, విపత్పరంపరో
త్తుంగ తమః పతంగ, పరితోషితరంగ, దయాతరంగ, స
త్సంగ, ధరాత్మజాహృదయసారసభృంగ, నిశాచరాబ్జమా
తంగ, శుభాంగ, భద్రగిరి దాశరథీ ! కరుణాపయోనిధీ!
ప్రతిపదార్థం :
రంగత్ = ప్రకాశించుచున్న
అరాతి = శత్రువులను
భంగ = భంజించువాడా ! (సంహరించేవాడా !)
ఖగరాజ = పక్షిరాజయిన గరుత్మంతుడు అనెడి
తురంగ = గుఱ్ఱము కలవాడా !
విపత్ = ఆపదల యొక్క
పరంపరా = ఎడతెగని వరుస అనెడి
ఉత్తుంగ = మిక్కిలి అధికమైన
తమః = చీకటికి
పతంగ = సూర్యుడయినవాడా !
పరితోషిత = సంతోష పెట్టబడిన
రంగ = రంగస్వామి కలవాడా ! (రంగనాథస్వామి)
దయాంతరంగ (దయ + అంతరంగ) = దయగల మనస్సు కలవాడా!
సత్సంగ = సజ్జనులతో కూడిక కలవాడా!
ధరాత్మజా (ధర + ఆత్మజా) = భూదేవి కూతురైన సీతాదేవి యొక్క
హృదయ = మనస్సు అనెడి
సారస = పద్మమునకు
భృంగ = తుమ్మెద అయినవాడా !
నిశాచర = రాక్షసులనెడి
అబ్జ = తామరలకు
మాతంగ = ఏనుగు అయినవాడా !
శుభ + అంగ (శుభాంగ) = మంగళప్రదమైన
అవయవాలు కలవాడా !
భద్రగిరి = భద్రాచలంలో వెలసిన
దాశరథి = దశరథ పుత్రుడవయిన రామా!
కరుణాపయోనిధీ = దయా సముద్రుడా !

భావం :
భద్రగిరిపై కొలువున్న స్వామీ ! దశరథుని పుత్రుడా! సముద్రమంతటి దయగలవాడా ! నీవు యుద్ధరంగంలో శత్రువులను నాశనం చేసినవాడవు. గరుత్మంతుడినే వాహనంగా కలవాడవు. కష్టాలు అనే కారుచీకట్లను తొలగించే సూర్యుడవు. సంతోష పెట్టబడిన రంగనాథుడు కలవాడవు. దయగల హృదయం కలవాడవు. సీతాదేవి హృదయం అనే పద్మానికి తుమ్మెదవంటివాడవు. రాక్షసులనే పద్మాలను నాశనం చేసే ఏనుగువంటి వాడవు. మంగళప్రదమైన దేహం కలిగినవాడవు.

గమనిక : ఈ పద్యంలో “పరితోషితరంగ దయాంతరంగ” అనే సమాసాన్ని ఏకసమాసంగా తీసుకొని Text లో సంతోషము అనే అలలతో నిండిన దయగల హృదయం గలవాడవు అని భావం రాశారు – కాని ‘పరితోషితరంగ’ అనగా సంతోష పెట్టబడిన రంగనాథుడు కలవాడా అని పూర్వవ్యాఖ్యలలో రాయబడింది.

‘Text లో ఇచ్చినట్లు భావం రాయాలంటే పరితోష తరంగ’ అని ఉండాలి. కాని ఇక్కడ ‘పరితోషితరంగ’ అని ఉంది. కాబట్టి ‘పరితోషతరంగ’ అని దిద్దుకోవాలి. (లేదా) Text లో ఉన్నట్లే ‘పరితోషిత’ అని ఉంటే, పూర్వ వ్యాఖ్యలలో వలె, సంతోషపెట్టబడిన రంగనాథుడు కలవాడని అర్థం చెప్పాలి.

8వ పద్యం : కంఠస్థ పద్యం
*మ|| పవి పుష్పంబగు, నగ్నిమంచగు, నకూపారంబు భూమీస్థలం
బవు, శత్రుం డతిమిత్రుడౌ, విషము దివ్యాహారమౌ నెన్నఁగా
నవనీమండలి లోపలన్ శివశివే త్యాభాషణోల్లాసికిన్
శివ ! నీ నామము సర్వవశ్యకరమౌ ! శ్రీకాళహస్తీశ్వరా !
ప్రతిపదార్థం :
శ్రీకాళహస్తీశ్వరా (శ్రీకాళహస్తి + ఈశ్వరా) = శ్రీకాళహస్తీశ్వరా !
శివ = ఓ శివా !
అవనీమండలి లోపలన్ = భూమండలంలో
శివశివేతి (శివశివ + ఇతి) = శివ శివ అని
ఆభాషణోల్లాసికిన్ ఆభాషణ + ఉల్లాసికిన్ = స్మరిస్తూ ఆనందించే వాడికి
పవి = వజ్రాయుధము
పుష్పంబు + అగున్ = పుష్పం అవుతుంది
అగ్ని = కాల్చెడి అగ్ని
మంచు + అగున్ = చల్లని మంచు అవుతుంది
అకూపారంబు = సముద్రము
భూమీస్తలంబు + అవు = నేల అవుతుంది
శత్రుండు = శత్రువు
అతిమిత్రు డౌ (అతిమిత్రుడు + ఔ) : మంచి స్నేహితుడు అవుతాడు
విషము = విషము
దివ్య + ఆహారము = అమృతము
ఔన్ = అవుతుంది
ఎన్నగాన్ = ఎంచి చూడగా
నీ నామము = నీ నామోచ్చారణము
సర్వవశ్యకరము + ఔ = అన్నింటినీ సులభసాధ్యములుగా చేస్తుంది.

భావం :
శ్రీకాళహస్తి క్షేత్రంలో వెలసిన ఓ పరమేశ్వరా! నీ నామస్మరణం వల్ల అన్నీ సాధ్యం అవుతాయి. ఈ భూలోకంలో శివ ! శివ ! అని ఉత్సాహంతో పలికే వానికి వజ్రాయుధం – పుష్పంలా, నిప్పు – మంచులా, సముద్రం – నేలలా, పగవాడు – స్నేహితునిలా, విషం – అమృతంలా సులభసాధ్యాలుగా మారతాయి.

9వ పద్యం :
కం|| ఆచార్యున కెదిరింపకు
ప్రోచినదొర నింద సేయఁ బోకుము కార్యా
లోచనము లొంటిఁ జేయకు
మాచారము విడువఁ బోకుమయ్య కుమారా !
ప్రతిపదార్థం :
అయ్య, కుమారా = ఓ నాయనా ! కుమారా !
ఆచార్యునకున్ , = చదువు చెప్పే గురువు మాటకు
ఎదిరింపకు = ఎదురు చెప్పవద్దు
ప్రోచిన = నిన్ను పోషించిన
దొర = యజమానిని
నింద + చేయన్ + పోకుము = నిందింపవద్దు
కార్యాలోచనములు (కార్య + ఆలోచనములు) = పనిని గూర్చి ఆలోచనలు
ఒంటిన్ + చేయకు = ఒంటరిగా చేయవద్దు.
ఆచారము = మంచి నడవడికను
విడువఁబోకుము (విడువన్ + పోకుము) = వదలిపెట్టవద్దు.

భావం :
ఓ కుమారా ! చదువు చెప్పే గురువుమాటకు ఎదురు చెప్పవద్దు. నిన్ను పోషించే యజమానిని . నిందించవద్దు. ఒంటరిగా కార్యమును గూర్చి ఆలోచింపవద్దు. మంచి నడవడికను వదలి పెట్టవద్దు. (ఇలా చేయడం వల్ల నీకు ఎంతో మేలు కలుగుతుంది. అందరూ నిన్ను అనుసరిస్తారు.

AP Board 9th Class Telugu Solutions Chapter 5 పద్యరత్నాలు

10వ పద్యం :
కం|| ఉడుముండదె నూటేండ్లునుఁ
బడియుండదె పేర్మిఁ బాము పదినూడేండ్లున్
జీవించియుండదా? మడువునఁ గొక్కెర యుండదె
కడునిలఁ బురుషార్థపరుడు గావలె సుమతీ! |
ప్రతిపదార్థం :
సుమతీ = మంచిబుద్ధి కలవాడా !
ఉడుము = ఉడుము
నూఱేండ్లునున్ (నూఱు + ఏండ్లునువ్) – వంద సంవత్సరాలపాటు
ఉండదె = జీవించియుండదా ?
పేర్మిన్ = అభివృద్ధితో
పాము = పాము
పదినూటేండ్లున్ = వేయి సంవత్సరాలపాటు
పడియుండదె = (పడి + ఉండదు + ఎ) = ఉంటుంది కదా !
మడువునన్ = చెఱువులో
కొక్కెర = కొంగ
ఉండదె (ఉండదు + ఎ) = చాలాకాలం
ఇలన్ = భూమిపై
కడున్ = మిక్కిలి
పురుషార్థపరుడు (పురుష + అర్ధపరుడు) – ధర్మార్థ కామ మోక్షములు అనే పురుషార్థములను సాధించేవాడు
కావలెన్ = కావాలి

భావం :
సుమతీ ! వంద సంవత్సరాలు జీవించే ఉడుము, వేయి సంవత్సరాలు జీవించే పాము, చెఱువు నందు చాలాకాలం బతికే కొంగ – ఎన్ని సంవత్సరాలు బతికినా ప్రయోజనం ఉండదు. మంచి చేయాలనే ఆలోచన కలిగి, ధర్మార్థ కామ మోక్షాలను సాధించేవాడే ఉత్తముడు.